Activities calendar

25 April 2018

22:22 - April 25, 2018

గుంటూరు : నవ్యాంధ్ర రాజధానికి ఆదాయం ఎలా..? అమరావతిలో ప్రభుత్వం ఎలాంటి ఆదాయం తీసుకోవచ్చు...? దానికి ఉన్న అవకాశాలేంటి..? ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై పన్నుల రూపంలో ఎంత మేరకు వసూలు చేయవచ్చు..? ఇదే అంశంపై సీఆర్‌డీఏ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధాని ఏరియాలో ప్రజల అవసరాలకోసం ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్న దానిపై కూడా అధికారులకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. 

అమరాతిలో ప్రభుత్వానికి ఉన్న ఆదాయ అవకాశాలపై  సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పురపాలకశాఖా మంత్రి పి.నారాయణ, ఇతర అధికారులతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రభుత్వానికి పన్నుల రూపంలో రాగల ఆదాయంపై దృష్టిపెట్టాలని సూచించారు. రాజధానిలో ఇప్పటికే నిర్మాణం అయిన పైప్‌లైన్‌ డక్ట్‌లు, గ్యాస్‌,పెట్రో స్టేషన్లు లాంటి మౌలిక సదుపాయాల నుంచి ఆదాయం రాబట్టుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మౌలిక సౌకర్యాలను వాడుకునే వాణిజ్యసంస్థల నుంచి యూజర్‌ చార్జీలను వసూలు చేసి, ఆదాయం పెంచుకోవచ్చని సీఆర్‌డీఏ అధికారులు ముఖ్యమంత్రికి సూచించారు. దాంతోపాటు రాజధాని ఏరియాలో  నిర్మాణం చేయనున్న  మురుగునీరు, తాగునీటిపైపులు,  విద్యుత్‌లైన్లతో పాటు ఇతర సమాచార వ్యవస్థలను ఉపయోగించుకునే  సంస్థల నుంచి ఎలాంటి పన్నులు వసూలు చేయవచ్చన్న దానిపైకూడా అధికారులు పలు సూచనలు చేశారు.  అంతేకాదు.. గ్యాస్‌, పెట్రోల్‌, జల మార్గాల ద్వారా కూడా కొంత ఆదాయం సమకూర్చుకునే వీలుంది సీఆర్‌డీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. 

అమరావతిలో నిర్మించనున్న ప్రధాన పరిపాలనా నగరానికి ప్రత్యేక ఆర్థిక ప్రణాళిక రూపొందించాలన్న సీఎం ఆదేశాన్ని అనుసరించి తాజా ప్రతిపాదనలను అధికారులు  సిద్ధం చేశారు. మరో ఏడాదన్నరలో ప్రధాన పరిపాలనా నగరం ఏరియాలో 38వేల కుంటుంబాల వరకు తరలి వస్తాయని  అంచనా వేశారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు సరిపోయేలా 10ఎకరాల్లో  భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ షాపింగ్‌ మాల్‌లో  థీయేటర్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టులు, రిటైల్‌షాప్‌లు లాంటి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరోవైపు రాజధాని ఏరియాలో ప్రస్తుత అవసరాల మేరకు ప్రధాన రహదారుల వెంట కంటైనర్‌ హోటళ్ల ఏర్పాటుకు కూడా అనుమతించనున్నారు. ఇక కొత్త నగరంలో ఘనవ్యర్థాల నిర్వహణకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు 166 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. 

ఆదాయాన్ని పెంచడం ద్వారా రాజధాని ప్రాంతాన్ని ప్రభుత్వానికి అతిపెద్ద ఆస్తిగా మార్చాల్సి ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆదాయం పెంచుకునే మార్గాలను ఏ ఒక్కటీ జారవిడుచుకోకుండా సమగ్ర ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. దాంతోపాటు బాండ్లను జారీ చేయడం ద్వారా ఎన్‌ఆర్‌ఐలను రాజధాని నిర్మాణంలో భాగస్వాములను చేయాలన్న ప్రతిపాదనలపై కూడా సమావేశంలో చర్చించారు. 

మరోవైపు రాష్ట్రంలో అన్నక్యాంటీన్ల ఏర్పాటుపై కూడా పురపాలక శాఖ అధికారులతో  ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా   203 అన్నక్యాంటీన్లను మంజూరు చేయగా... వాటి ఏర్పాటుకు ఏజెన్సీలు ఏమేరకు సిద్ధంగా ఉన్నాయన్న దానిపైకూడా సీఎం చర్చించారు. మరోవైపు రాష్ట్రంలో మహిళల్లో కేన్సర్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా చేపట్టాలని నిర్ణయించారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టే అంశంపై సీఎం పలు సూచనలు చేశారు.  

22:19 - April 25, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీ పర్యటన అర్థాంతరంగా ముగిసింది. రెండు రోజుల పర్యటనకు మంగళవారం ఢిల్లీ వచ్చిన నరసింహన్‌.. బుధవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ప్రధాని మోదీతో భేటీ కావాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా గవర్నర్ తన పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ తిరిగి వెళ్లడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఏపీ, తెలంగాణ ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీ పర్యటనలో ఆద్యతం అనూహ్య పరిణామాలు చోటుచేసుకొన్నాయి. మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం ఢిల్లీ చేరుకున్న నరసింహన్‌ బుధవారం తన టూర్‌ను అర్థాంతరంగా ముగించుకుని హైదరాబాద్‌ తిరిగి వెళ్లడం రాజకీయంగా పెద్ద చర్చకు తావిస్తోంది. 
  
తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ, శాంతిభద్రతల పరిస్థితులపై కేంద్రానికి నివేదిక ఇచ్చేందుకు నరసింహన్‌ ఢిల్లీ వచ్చారని ప్రచారం జరిగింది. కొద్దిరోలుజుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈనెల 20న విజయవాడలో ధర్మ పోరాట దీక్ష నుంచి కేంద్రంపై దూకుడు మరింత పెంచారు.  ఈ పరిణామాల తర్వాత  గవర్నర్‌ నరసింహన్‌ చంద్రబాబును విజయవాడలో కలిసి చర్చించారు. మరోవైపు ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా నరసింహన్‌తో భేటీ అయ్యారు. 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఇటీవల తిరువనంతపురంలో దక్షిణాది  రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది.  కమిషన్‌కు ఇచ్చిన గైడ్‌ లైన్స్‌తో దక్షిణాది రాష్ట్రాలకు 80 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేశారు. దీనిపై వచ్చే నెలలో విజయవాడలో ఆర్థిక మంత్రులు మరోసారి భేటీ కానున్నారు. ఈ పరిస్థితులన్నింటిపై కేంద్రానికి నివేదించేందుకు నరసింహన్‌ ఢిల్లీ వచ్చారని ప్రచారం జరిగింది. 

అయితే అకస్మాత్తుగా బుధవారం ఉదయం... గవర్నర్‌ నరసింహన్‌ తన పర్యటనను ముగించుకొని హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పెద్దలను కలిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతోనే ఈ భేటీలు రద్దు చేసుకున్నట్లు  విశ్లేషకులు భావిస్తున్నారు

22:02 - April 25, 2018

16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఆశారాంబాపుకు జీవిత ఖైదు విధిస్తూ జోధ్ పూర్ కోర్టు తీర్పు చెప్పింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి బాబాల సంఖ్య పెరిగిపోతోంది. దీనికి కారణాలేంటీ ? ఎలాంటి సమాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు కారణంగా కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ అందించారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...
'భారతదేశంలో ఎకనామిక్ గ్రోత్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ఎంప్లాయింట్ మెంట్ గ్రోత్ మరీ తక్కువగా ఉంటుంది. ఎక్స్ పోర్టు గ్రోత్ రేట్ చాలా నత్తనడకన ఉంది. కానీ గామ్ మెన్ గ్రోత్ రేట్ మాత్రం చాలా వేగంగా ఉంది. మతవాద అస్థితత్వం, మత మౌఢ్యం, మూర్ఖత్వం రాజ్యమేలడం మొదలపెట్టిన నుంచి బాబాల ఊపు ఎక్కువగా పెరిగింది.  దీనికి అనేక కారణాలున్నాయి. అవి.. భారతదేశ సొసైటీలో ఉండే మతపరమైన ఆలోచనలో ఉండే అంశాలు, భారత ప్రజాస్వామిక లైకిక రాజ్యాంగం అమలులో ఉన్న లోపాలు, ఆర్థిక అభివృద్ధి క్రమంలో వస్తున్న ఇబ్బందులు. ప్రజల్లో అసమానతలున్నాయి. అణగారిన కులాల వారికి చెందిన మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతాయి. అణగారిన కులాల వారికి చెందిన బాలికపై అశారాం బాపు అత్యాచారం చేశాడు. బాబాలకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంటుంది. మతంలో రాజకీయాలు కాంప్రమైజ్ అవుతున్నాయి'. అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

21:31 - April 25, 2018

బీజేపీ చెవ్వుల నాగం సారు పువ్వు, మోసం ప్రాజెక్టు గట్టుడు వాళ్లతోనేడైతది..?, ఈనెల ఇర్వై తొమ్మిదినాడు కోదండ సభ, కద్లకుంట బ్రేక్ డ్యాన్సు జేశిన నాయిని సార్.. అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

21:02 - April 25, 2018

ఢిల్లీ : 16ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆధ్యాత్మిక గురువు ఆశారాంకు జీవిత ఖైదు పడింది. ఈ కేసులో మరో ఇద్దరికి 20ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ జోద్‌పూర్‌ కోర్టు తీర్పు చెప్పింది. మధ్యప్రదేశ్‌ చింద్యారాలో యువతిపై అత్యాచారం చేసిన కేసులో ఆశారాం బాపు దోషిగా ఉన్నారు. ఆశారాం బాపుకు జీవిత ఖైదు విధిస్తూ జోద్‌పూర్‌ కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షులు రమేష్, ఆదిశంకరాచార్య బంగారయ్య శర్మ, పీవోడబ్ల్యు నేత సంధ్య, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, ఆదిశంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు శ్రీనివాసబంగారయ్య శర్మ పాల్గొని, మాట్లాడారు. మోసపూరిత బాబాలను నమ్మవద్దన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

20:48 - April 25, 2018

హైదరాబాద్ : ఎన్టీఆర్ బయోపిక్ మూవీ నుంచి డైరెక్టర్ తేజ తప్పుకున్నారు. ఇటీవలే అట్టహాసంగా మూవీ ప్రారంభం అయింది. మూవీలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తున్నారు.

కౌలురైతు ఆత్మహత్య

కరీంనగర్‌ : జిల్లాలో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తిమ్మాపూర్‌ మండలం మొగిలిపాలెంలో కౌలురైతు మల్లారెడ్డి.. 20ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న వేశారు. అయితే మొక్కజొన్న పంటలో పూర్తిగా నష్టపోవడంతో అప్పులపాలైన మల్లారెడ్డి.. పురుగల మందుతాగి ప్రాణం తీసుకున్నాడు. 

20:05 - April 25, 2018

హైదరాబాద్ : బీజేపీని వీడిన సీనియర్‌ నాయకులు నాగం జనార్దన్‌రెడ్డి, ఆది శ్రీనివాస్‌ కాంగ్రెస్‌లో చేశారు. అలాగే ప్రజా గాయకుడు గద్దర్‌ కుమారుడు సూర్య కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో వీరంతా  పార్టీలో చేరారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్‌కు కొత్త ఊపు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
కాంగ్రెస్‌లో చేరిన నాగం జనార్దన్‌రెడ్డి
మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీతో విభేదించిన నాగం, ఆ పార్టీకి రాజీనామాచేసి, బీజేపీలో తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌  ప్రభుత్వం సాగునీటి నీటి ప్రాజెక్టుల డిజైన్ల మార్పులో అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ హైకోర్టులో కేసు వేశారు. అలాంటి నాగం.. కొంతకాలంగా బీజేపీకి దూరంగా ఉంటూ, ఇటీవల  ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాహుల్‌గాంధీ... నాగంకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
కాంగ్రెస్ లోకి ఆది శ్రీనివాస్‌, గద్దర్‌ కుమారుడు సూర్య
వేములవాడ బీజేపీ ఇన్‌చార్జ్‌ పదవికి రాజీనామాచేసి, రాహల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఆది శ్రీనివాస్‌, ప్రజా గాయకుడు గద్దర్‌ కుమారుడు సూర్యతోపాటు  ఇతర నాయకులకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రామచంద్ర కుంతియా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
కుంతియా ఆహ్వానం
వివిధ కారణాలతో కాంగ్రెస్‌ను వీడినవారంతా తిరిగి పార్టీలోకి రావాలని ఈ సందర్భంగా కుంతియా ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో చేరే వారికి తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. నాగం, ఆది శ్రీనివాస్‌, సూర్య కిరణ్‌ కాంగ్రెస్‌లో చేరడం మంచి పరిణామంగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భావిస్తున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామిక పాలనకు అంతం పలికి, కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరినట్టు నాగం చెప్పారు. 
కాంగ్రెస్‌ విధానాల పట్ల ఆకర్షితమై పార్టీలో చేరా : సూర్య
వేములవాడకు చెందిన ఆది శ్రీనివాస్‌.. 2011లో కాంగ్రెస్‌ను వీడి, బీజేపీలో చేశారు. 2014 ఎన్నికల్లో వేములవాడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి సల్వ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు కమలదళంలో ఇమడలేక తిరిగి సొంత గూటికి చేరారు. రాహుల్‌గాంధీ నాయకత్వం, కాంగ్రెస్‌ విధానాల పట్ల ఆకర్షితమై పార్టీలో చేరినట్టు గద్దర్‌ కుమారుడు సూర్య చెప్పారు. టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న నేతలు మరికొందరు... కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని హస్తం నేతలు భావిస్తున్నారు. 

 

19:38 - April 25, 2018

సూర్యాపేట : జిల్లా మునగాల మండలం కలుకోవ సర్పంచ్‌ చిర్రా శ్రీనివాస్‌ అవినీతికి వ్యతిరేకంగా గ్రామస్థులు తిరుగుబాటు చేశారు. లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డ సర్పంచ్‌ని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో  కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. సర్పంచ్‌పై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. కలుకోవలో పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి సరఫరా పథకానికి నీటి సరఫరా నిలిపివేసిన సర్పంచ్‌ శ్రీనివాస్‌ చర్యను ప్రజలు తప్పు పట్టారు. ఈ విషయాలను ప్రశ్నించిన సీపీఎం నాయకులపై సర్పంచ్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి సొమ్మును సర్పంచ్‌ నుంచి రికవరీ చేసి, పుచ్చలపల్లి సుందరయ్య వాటర్‌ ప్లాంట్‌కు వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. 

 

19:34 - April 25, 2018

రాజన్నసిరిసిల్ల : జిల్లాలోని నేరెళ్ల బాధితులకు న్యాయం చేయడంతో మంత్రి కేటీఆర్‌ విఫలమయ్యారని కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ విమర్శించారు. ఇసుక మాఫియా, పోలీసులు ఆగడాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న నేరెళ్ల బాధితులను వీహెచ్‌ పరామర్శించారు. మంత్రి కేటీఆర్‌.. బలహీనవర్గాలను అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. 

 

19:31 - April 25, 2018

పెద్దపల్లి : టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఇసుక మాఫియాకు అండగా ఉంటోందని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. సర్కార్ అండతో... తెలంగాణలో ఇసుక మాఫియాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందన్నారు. అతివేగంతో నడిచే ఇసుక లారీలు ఢీకొన్న ఘటనలో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నా.. ప్రభుత్వానికి పట్టనట్లు ఉందని ఆయన ఆరోపించారు. ఇసుకమాఫియాను అడ్డుకునేందుకు ప్రజలతో కలిసి.. పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు. 

 

19:23 - April 25, 2018

తూర్పుగోదావరి : ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్‌ వ్యవస్థను వ్యతిరేకించడాన్ని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తప్పుపట్టారు. గవర్నర్‌ నరసింహన్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ వ్యవస్థలపై చంద్రబాబుకు నమ్మకం లేదా ? అని ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసే అలవాటు చంద్రబాబుకు ఉందా ? అని సోము  వీర్రాజు ప్రశ్నించారు. 

 

19:20 - April 25, 2018

నిజామాబాద్‌ : ఎంపీ కవిత ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రతిపక్షాలు వారి చరిత్రను మరచిపోయి విమర్శలకు దిగుతున్నారని ఎంపీ దుయ్యబట్టారు. నిజామాబాద్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కవిత... జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్‌ హయాంలో నిజామాబాద్‌ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని కవిత చెప్పారు. 

 

18:58 - April 25, 2018

ఢిల్లీ : మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో ఆధ్మాత్మిక గురువు ఆశారాం బాపును జోధ్‌పూర్‌ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆయనతో పాటు మరో ముగ్గురిని కూడా దోషిగా తేల్చింది. ఆశారాంకు జీవిత ఖైదు శిక్ష విధించగా...మరో ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.
ఆశారాంకు జీవిత ఖైదు 
16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఆధ్మాత్మిక గురువు ఆశారాం బాపును రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ప్రత్యేక కోర్టు దోషిగా ఖరారు చేసింది. జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో ఈ కేసు విచారణ జరిగింది. ఆశారాంతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను దోషులుగా తేల్చుతూ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ మధుసూదన్‌ శర్మ తీర్పు వెల్లడించారు. కోర్టు ఆశారాంకు జీవిత ఖైదు శిక్ష విధించగా...మరో ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.
కోర్టు తీర్పుపై బాధితురాలి తండ్రి హర్షం 
కోర్టు తీర్పుపై బాధితురాలి తండ్రి హర్షం వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు.  ఈ కేసులో తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో హత్య, కిడ్నాప్‌కు గురైన సాక్షులకు కూడా న్యాయం జరిగిందని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆశారాంకు కఠినమైన శిక్ష పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబం ఆశారాంను దేవుడిగా కొలిచేది. అత్యాచారం ఘటనతో ఆశారాంపై విరక్తి ఏర్పడింది.
జోధ్‌పూర్‌ జైలు ప్రాంగణంలో విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశం 
గుర్మీత్‌ బాబాపై తీర్పు నేపథ్యంలో చోటుచేసుకున్న అల్లర్లను దృష్టిలో ఉంచుకొని విచారణను జోధ్‌పూర్‌ జైలు ప్రాంగణంలో చేపట్టాలని రాజస్థాన్‌ హైకోర్టు ఆదేశించింది. తీర్పు నేపథ్యంలో జోధ్‌పూర్‌ జైలులో పటిష్టమైన భద్రత చేపట్టారు. రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణా రాష్ట్రాల్లోనూ హై అలర్ట్‌ ప్రకటించారు. బాధితురాలి ఇంటివద్ద ఏడుగురు పోలీసులతో రక్షణ కల్పించారు.
నాపై బలత్కారం చేశారని 16 ఏళ్ల బాలిక ఆరోపణ 
2013లో జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆశారాం తనపై బలత్కారం చేశారని ఉత్తరప్రదేశ్‌లోని షాహజాన్‌పుర్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2013 సెప్టెంబర్‌1న ఆశారాంను ఇండోర్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి జుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. గత నాలుగేళ్లుగా జోధ్‌పూర్‌ సెంట్రల్ జైలులోనే ఉన్నారు. బెయిలు కోసం ఆశారాం 12 సార్లు ప్రయత్నించినా కోర్టు నిరాకరించింది.
కోర్టు తీర్పు చారిత్రాత్మకం : అజయ్‌పాల్‌ లంబా 
కోర్టు తీర్పు చారిత్రాత్మకమని ఆశారాం కేసులో విచారణ జరిపిన పోలీసు సీనియర్‌ అధికారి అజయ్‌పాల్‌ లంబా తెలిపారు. ఈ కేసులో తనకు 2 వేల బెదిరింపు ఉత్తరాలు, వందలాది కాల్స్‌ వచ్చాయని చెప్పారు. ఈ కేసు విచారణ సమయంలో తన కూతుర్ని స్కూలుకు పంపలేదని, భార్యను ఇంటి నుంచి బయటకు వెళ్లనిచ్చే వాడిని కాదని పేర్కొన్నారు. ఈ కేసులో ముగ్గురు సాక్షులు హత్యకు గురవ్వడం తనని బాధించిందన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్‌ 7న వాదనలు పూర్తి చేసిన జోధ్‌పూర్‌ కోర్టు... ఏప్రిల్‌ 25న తీర్పును వెల్లడించింది. ఈ కేసుతో పాటు సూరత్‌కు చెందిన మరో మహిళను రేప్ చేసిన కేసులో ఆశారాం కోర్టు కేసును ఎదుర్కొంటున్నారు. 

 

18:40 - April 25, 2018

కరీంనగర్‌ : జిల్లాలో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తిమ్మాపూర్‌ మండలం మొగిలిపాలెంలో కౌలురైతు మల్లారెడ్డి.. 20ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న వేశారు. అయితే మొక్కజొన్న పంటలో పూర్తిగా నష్టపోవడంతో అప్పులపాలైన మల్లారెడ్డి.. పురుగల మందుతాగి ప్రాణం తీసుకున్నాడు. ప్రభుత్వం న్యాయం చేయాలంటూ అలుగునూరు చౌరస్తాలో మృతదేహంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో హైదరాబాద్‌...వరంగల్‌ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ అయింది. భారీగా వాహనాలు నిలిచపోయాయి.  

18:32 - April 25, 2018

విశాఖ : విశాఖపట్టణం అచ్యుతాపురం పోలీసు స్టేషన్‌లో ఓ హత్యకేసు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రామునాయుడు అనే నిందితుడు పోలీస్‌ స్టేషన్ బాత్‌రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో సమాచారం అందుకున్న మృతుని బంధువులు పీఎస్‌ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసుల వేధింపుల వల్లే చనిపోయారని ఆరోపించారు. ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు... ఆత్మహత్యపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.

 

18:30 - April 25, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడానికే టీజేఎస్‌ను స్థాపించామన్నారు ఆ పార్టీ వ్యవస్థాపకులు ప్రొఫెసర్‌ కోదండరామ్‌. తెలంగాణ ప్రజలు రాజకీయ మార్పుకోసం ప్రయత్నిస్తున్నారని కోదండరామ్‌ అన్నారు. మల్లాపూర్‌లోఉప్పల్‌ నియోజకవర్గ నేత కొత్తమల్లారెడ్డి ఆధ్వర్యంలో కోదండరామ్‌... టీజేఎస్‌ జెండా ఆవిష్కరించారు. ఈనెల 29న సరూర్‌నగర్ ఇండోర్‌ స్టేడియంలో జరిగే ఆవిర్భావసభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు. 

 

17:39 - April 25, 2018

అనంతపురం : పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అనంతపురం నగరంలోని పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్ల్యే బి.కె.పార్థసారథి కుమార్తె వివాహంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం.. నగరంలోని రాంనగర్ లో ఉన్న పెట్రోల్ బంకును తనిఖీ చేసి పెట్రోల్ కొలతలను పరిశీలించారు. వినియోగదారుల సక్షమంలో  పెట్రోల్ కొలతలను పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నాయన్నారు.  నాణ్యత, కొలతల్లో తేడాలు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హెచ్చరించామన్నారు. 

17:34 - April 25, 2018

హైద‌రాబాద్ : నగరం చుట్టుపక్కల భూముల ధ‌ర‌లకు హెచ్ ఎండీఏ నయా ట్రెండ్ సెట్ చేసింది. చాలా కాలంగా మంద‌కొడిగి ఉన్న గ్రేట‌ర్ భూముల ధరలు భారీగా ధ‌ర ప‌లికాయి. హెచ్ఎండిఏ చేసిన ఈ-వేలంలో అత్యధికంగా గజం ధర లక్షా 50వేల రూపాయలు పలికింది. ఫ‌స్ట్ టైం ఈ వేలం నిర్వహించిన హెచ్ ఎండీఏ.. 210 పాట్లు విక్రయించి 370కోట్లు సమీకరించింది. రానున్న రోజుల్లో ట్రాన్‌ఫరెన్సీ ఉండేలా మ‌రిన్ని భూముల‌ను ఈ వేలం ద్వారా అమ్మి వ‌చ్చిన ఆదాయాన్ని మౌలిక ప్రాజెక్టుల‌కోసం ఖ‌ర్చుచేస్తామంటున్న హెచ్ ఎండీఏ క‌మిష‌న‌ర్ చిరంజీవులుతో టెన్ టివి ఫేస్ టు పేస్ నిర్వహించింది. మౌలిక ప్రాజెక్టుల‌ను వేగవంతం చేస్తామని క‌మిష‌న‌ర్ అన్నారు.

17:28 - April 25, 2018

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన బీజేపీ, జేడీఎస్‌ను కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆ రాష్ట్ర ఓటర్లకు పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కూడా ఇదే పిలుపు ఇవ్వాలని కోరారు. కర్నాటకలో బీజేపీ ఓడితే 2019కి ముందే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. 

17:23 - April 25, 2018

హైదరాబాద్ : హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసుపై విచారణ జరిగింది. గత విచారణలో ఆస్తుల కొనుగోలుకు వెనక్కి తగ్గిన జీఎస్సెల్ గ్రూప్... విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసిందని.. ఆ సంస్థపై ఫెనాల్టీ వేయాలని పిటిషనర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే జీఎస్సెల్ గ్రూప్‌కు చివరి అవకాశం ఇచ్చిన హైకోర్టు... జూన్ 5 వరకు 1000కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో 100 కోట్ల ధర ఉన్న 10 ఆస్తులను గుర్తించి... వేలం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. 

 

17:17 - April 25, 2018

గుంటూరు : అమరావతిలో ప్రైవేటు వ్యక్తుల కోసం వేయి అపార్ట్‌మెంట్లు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ సీఆర్డీఏ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజధానిలో ఉంటే ప్రైవేటు వ్యక్తుల కోసం వేయి అపార్టుమెంట్లు నిర్మించాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం 494కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటితో పాటు 10 ఎకరాల్లో మాల్ ఏర్పాటు చేయాలని కూడా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో థియేటర్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, షాపింగ్‌ సదుపాయాలు కల్పించాలని సూచించారు. వీటితో పాటు అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 71 మున్సిపాలిటీల్లో 203 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.

 

17:01 - April 25, 2018

కరీంనగర్‌ : జిల్లా పరిషత్‌ సమావేశంలో సభ్యుల ఆందోళన గందరగోళానికి దారితీసింది. తమ మండలాలకు నిధులు ఇవ్వడం లేదని మహిళా జడ్పీటీసీలు ఆందోళనకు దిగారు. పోడియం ముందు నేలపై కూర్చుని నిరసన తెలిపారు. తమ మండలాలకు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రాయకల్‌, మల్యాల, సారంగపూర్‌ మండలాల జడ్పీటీసీల నిరసనతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

16:56 - April 25, 2018

గుంటూరు : తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ కేంద్రానికి తాబేదారుగా  వ్యవహరిస్తున్నారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. కేంద్రంతో కలిసి రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా కేంద్రానికి నివేదికలు ఇస్తూ.. గవర్నర్‌ వ్యవస్థకు కళంకం తెస్తున్నారని వ్యాఖ్యానించారు. నరసింహన్‌ గుళ్లు, గోపురాలు తిరగడానికే బడ్జెట్‌ అంతా ఖర్చు అవుతుందన్నారు. 

16:54 - April 25, 2018

ఢిల్లీ : 16ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆధ్యాత్మిక గురువు ఆశారాంకు జీవిత ఖైదు పడింది. ఈ కేసులో మరో ఇద్దరికి 20ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ జోద్‌పూర్‌ కోర్టు తీర్పు చెప్పింది. మధ్యప్రదేశ్‌ చింద్యారాలో యువతిపై అత్యాచారం చేసిన కేసులో ఆశారాం బాపు దోషిగా ఉన్నారు. అత్యాచారం కేసులో 2013లో ఆశారాం బాపు అరెస్ట్‌ అయ్యారు. అప్పటి నుంచి  జైలులోనే ఉన్నారు. ఈ కేసులో జోధ్‌పూర్‌ ట్రయల్‌ కోర్టు ఈ నెల 7న వాదనలు ముగించింది. తీర్పు వెలువడిన నేపథ్యంలో జోధ్‌పూర్‌లో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.  

 

16:38 - April 25, 2018

పోక్సో చట్ట సవరణ అనే అంశంపై నిర్వహించిన చర్చా మానవి మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లారు. 2012లో పోక్సో చట్టం వచ్చిందన్నారు. పోక్సో చట్ట సవరణ ఏం చెబుతోంది...? అసలు ఈ చట్టం తేవడానికి కారణాలేంటీ ? అనే అంశాలపై ఆమె మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

అన్ని చర్చిస్తాం : ఈటల

మేడ్చల్: టీఆర్‌ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ అన్ని అంశాలపై చర్చిస్తారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కొంపల్లిలో టీఆర్‌ఎస్ ప్లీనరీ ప్రాంగణాన్ని ఇవాళ మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఎన్నో అవమానాలు భరించి గమ్యాన్ని ముద్దాడిన పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ అన్నారు. కేసీఆర్ దీక్షా దక్షతలను గుర్తించే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారన్నారు. అనుభవమున్న పార్టీల కంటే తెలంగాణలో టీఆర్‌ఎస్ పాలన బాగుందన్నారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.

మౌలిక ప్రాజెక్టులను వేగవంతం చేస్తాం : హెచ్ఎండీఏ కమిషనర్

హైదరాబాద్ : నగరం చుట్టుపక్కల భూముల ధరలకు హెచ్ఎండీఏ ట్రెండ్ సెట్ చేసింది. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ ప్రభుత్వ భూములను వేలం వేసింది. అత్యధికంగా గజం భూమికి లక్షా 50వేల రూపాయలకు విక్రయించింది. 210 పాట్లను విక్రయించగా 370 కోట్లు హెచ్ఎండీఏ సమీకరించింది. ఈ మొత్తంతో మౌలిక ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తెలిపారు. 

16:27 - April 25, 2018

ఢిల్లీ : ప్రజా గాయకుడు గద్దర్‌ తనయుడు సూర్యకిరణ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కుటుంబసభ్యుల సహకారంతోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరానని ప్రజా గాయకుడు గద్దర్‌ తనయుడు సూర్యకిరణ్‌ తెలిపారు. భావి పౌరులకు రాజ్యాంగాన్ని అందించాలనే ఉద్దేశంతో రాహుల్‌ గాంధీ చేపట్టిన పోరాటంలో భాగస్వామ్యం అయ్యేందుకే కాంగ్రెస్‌లో చేరానన్నారు. పార్టీ ఎలాంటి పని అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటున్న సూర్యకిరణ్‌తో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

ఈ వేలంలో గ్రేటర్ భూములకు రెక్కలు..

హైదరాబాద్ : భాగ్యనగరంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. సెంటు భూమి కొనాలంటే సామాన్యుడు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ ప్రభుత్వ భూములను వేలం వేసింది. దీంతో హెచ్ఎండీయేకు భారీగా నగదు వచ్చి పడుతోంది. 210 పాట్లను విక్రయించగా 370 కోట్లు హెచ్ఎండీఏ సమీకరించింది.  

16:24 - April 25, 2018

ఢిల్లీ : బీజేపీ నుండి ఆది శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తెలంగాణలో తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకే మళ్లీ కాంగ్రెస్‌లో చేరామని ఆది శ్రీనివాస్‌ అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకే పార్టీ మారామన్నారు. అవకాశవాదం కోసం పార్టీలోకి చేరలేదంటున్న ఆది శ్రీనివాస్‌తో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

డేర్ డెవిల్స్ కెపెన్సీ నుండి తప్పుకున్న గంభీర్?!..

ఢిల్లీ: ఐపీఎల్ టీమ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు గౌతమ్ గంభీర్. ఐపీఎల్ పదకొండో సీజన్‌ను ఢిల్లీ టీమ్ మరీ దారుణంగా ప్రారంభించింది. ఆడిన 6 మ్యాచుల్లో ఐదింట్లో ఓడింది. గంభీర్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను టీమ్ కెప్టెన్‌గా నియమించింది. ఐపీఎల్ టేబుల్లో అట్టడుగున ఉంది ఢిల్లీ డేర్‌డెవిల్స్. కెప్టెన్‌గానే కాదు బ్యాట్స్‌మన్‌గా కూడా గంభీర్ విఫలమయ్యాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో కెప్టెన్‌గా, ప్లేయర్‌గా సక్సెసైన గంభీర్.. అదే ఫామ్‌ను ఢిల్లీ టీమ్‌తో కొనసాగించలేకపోయాడు. ఆరు మ్యాచుల్లో గంభీర్ 85 రన్స్ మాత్రమే చేశాడు.

వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి అనుమతులు..

హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో 432 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. శాఖపరమైన ఎంపిక కమిటీ ద్వారా 108 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, టీఎస్‌పీఎస్‌సీ ద్వారా 216 స్టాఫ్‌నర్స్, 54 ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

విశాఖ మన్యంలో ఆంత్రాక్స్..

విశాఖ : మన్యంలో మరో నలుగురికి ఆంత్రాక్స్‌ కలకలం రేగింది. చింతపల్లి మండలం కొమ్మంగి పంచాయతీ గెంజిగెడ్డలో నలుగురికి లక్షణాలు బయటపడ్డాయి. చేతులకు పుళ్లు పడటంతో వైద్య సిబ్బంది హుటాహుటిన చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. ఓ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంత్రాక్స్‌పై సమీక్ష నిర్వహిస్తుండగానే ఈ విషయం బయటపడటంతో అధికారుల్లో హడావుడి మొదలైంది. కాగా మలేరియా, ఆంత్రాక్ విషయంలో అప్రమత్తంగా వుండాలని గిరిజన తండాలలో, ప్రాంతాలలోను మరింత జాగ్రత్తగా వుండాలని దీనికి తగిన చర్యలుతీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 

జేడీ రాజీనామా ఆమోదం..

ఢిల్లీ : సీబీఐ మాజీ జేడీ, మహారాష్ట్ర అదనపు డీజీపీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవలే ఆయన వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చేందుకే లక్ష్మీనారాయణ వీఆర్ఎస్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. తన రాజీనామా ఆమోదం పొందిన తర్వాతే తాను తన భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడతానని ఆయన ఇంతకు ముందే చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఆయన రాజకీయ రంగప్రవేశం చేస్తారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆయన నుండి అధికారికంగా ఒక్క ప్రకటన కూడా రాకపోవటం విశేషం.

అమరావతిలో సుబ్బారెడ్డి,ఆళ్లగడ్డలో అఖిలప్రియ..

అమరావతి : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై కొంతమంది రాళ్లదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఏపీ మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రమ్మన్నారు. దీంతో ఇప్పటికే ఏవీ సుబ్బారెడ్డి అమరావతి చేరుకున్నారు. ఆళ్లగడ్డ రాళ్లదాడి ఘటనపై టీడీపీ అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ సమావేశానికి సంబంధించి తనకు సమాచారం అందలేదని మంత్రి అఖిల ప్రియ ఆళ్లగడ్డలోనే ఉండిపోయారు. కాగా, ఈ భేటీ నిన్న నిర్వహించాలని చూడగా..

15:48 - April 25, 2018

నెల్లూరు : టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతితో నెల్లూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నెల్లూరులోని ఆయన స్వగృహానికి కార్యకర్తలు, రాజకీయ నాయకులు చేరుకున్నారు. ఆనం వివేకానంద లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆనం నివాసం వద్ద పరిస్థితిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

 

15:46 - April 25, 2018

హైదరాబాద్ : టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆనం హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. 1950 డిసెంబర్‌ 25న నెల్లూరులో ఆనం జన్మించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999, 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాల్లో విలక్షణ నేతగా ఆనంకు పేరుంది. ఆనం మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆనం మృతికి సంతాపం సీఎం చంద్రబాబు తెలిపారు. రేపు నెల్లూరులో ఆనం అంత్యక్రియలు జరగనున్నాయి. 

 

15:30 - April 25, 2018

ఢిల్లీ : అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారాం బాపును జోధ్‌పూర్‌ కోర్టు దోషిగా తేల్చింది. ఆశారాంతో పాటు ముగ్గురిని కోర్టు దోషులుగా తేల్చింది. మధ్యప్రదేశ్‌ చింద్యారాలో యువతిపై అత్యాచారం చేసినట్లు ఆశారాంపై ఆరోపణలు ఉన్నాయి. అత్యాచారం కేసులో 2013లో ఆశారాం బాపు అరెస్ట్‌ అయ్యారు. అప్పటి నుండి జైలులోనే ఉన్నారు. ఈ కేసులో జోధ్‌పూర్‌ ట్రయల్‌ కోర్టు ఈ నెల 7న వాదనలు ముగించింది. జోధ్‌పూర్‌లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.

 

పార్టీ మారే యోచనలో కొండా సురేఖ దంపతులు..

వరంగల్ : దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ రాష్ట్ర విభజన అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ గులాబీ పార్టీలో ఆమెకు తగినంత గౌరవం దక్కలేదనే అసంతృప్తి వున్నారు. ఈ నేపథ్యంలో గత మూడు సంవత్సరాలుగా ఆమె మంత్రి పదవికోసం ఎదురుచూశారు. వచ్చే ఎన్నికల్లో అసలు టికెటైనా వస్తుందా అని కొంత మంది, ఉన్న సీటైనా దక్కుతుందా అనే ఆందోళనలో వున్న కొండా దంపతులు తమ కుమార్తె సీటు కోసం కూడా యత్నిస్తున్నారు.

గవర్నర్ పై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు..

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ నరసింహన్‌పై టీడీపీ మంత్రి నక్కా ఆనందబాబు విరుచుకుపడ్డారు. అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నక్కా ఆనంద బాబు గవర్నర్ వ్యవస్థకు నరసింహన్‌ కళంకం తెస్తున్నారనీ.. కేంద్రానికి తాబేదారుగా గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని విమర్శించారు. ఏపీకి వ్యతిరేకంగా కేంద్రానికి నివేదిక ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. గవర్నర్ బడ్జెట్ అంతా ఆయన గుళ్లు, గోపురాలు తిరగటానికే అంతా ఖర్చు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఆశారాం బాపు శిక్షను స్వాగతించిన బాలిక తండ్రి..

రాజస్థాన్ : ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం పేర్కొంటోంది. కాసేపటి క్రితం జోధ్ పూర్ ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది. ఆశారం బాపు దోషి అంటూ కోర్టు నిర్ధారించింది. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు, ఇప్పటికైనా తమకు న్యాయం జరిగిందని బాలిక తండ్రి పేర్కొన్నారు. 16ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో 2013 ఆగస్టులో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని చింద్యాలలో ఓ బాలికపై అత్యాచారం చేసిన కేసులో బాధితులరాలు ఇచ్చిన వాంగ్మూలంతో ఆశారాంను జోధ్‌పూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఆశారాం బాపుకు జీవిత ఖైదు..

ఢిల్లీ : అత్యాచారం కేసులో ఆశారం బాపును జోధ్ పూర్ కోర్టు దోషిగా తేల్చింది. ఆశారం బాపుకి జీవిత ఖైదు విధించింది. ఆశారాంతో పాటు మరో ముగ్గురిని కూడా కోర్టు దోషిగా నిర్ధారించింది. అత్యాచారం కేసులో 2013లో ఆశారం అరెస్టయిన సంగతి తెలిసిందే. జోధ్ పూర్ ట్రయల్ కోర్టులో ఈనెల 7వ తేదీన వాదనలు ముగిశాయి. జోధ్ పూర్ లో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. 

ఆశారాం నన్ను బెదిరిస్తు 2వేల ఉత్తరాలు రాశారు : అజల్ పాల్

రాజస్థాన్ : స్వయం ప్రకటిత బాబా ఆశారాం బాపు అత్యాచార కేసు విచారణలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఎట్టకేలకు ఈరోజు ఆయనను జోధ్‌పూర్‌ కోర్టు దోషిగా ప్రకటించింది. కాగా ఈ కేసు విచారణ జరిపిన సీనియర్‌ పోలీసు అధికారి అజయ్‌ పాల్‌ లంబాకు విచారణ సమయంలో ఎదురైన అనుభవాలను గుర్తుతెచ్చుకున్నారు. ఆయనకు దాదాపు 2వేల బెదిరింపు ఉత్తరాలు వచ్చాయని, వందల కొద్దీ బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వచ్చేవని లంబా తెలిపారు. నేటి తీర్పు చరిత్రాత్మకమని..న్యాయం గెలిచిందని లంబా ఆనందం వ్యక్తంచేశారు.

14:52 - April 25, 2018

ఆడవారిని ఆకాశంలో సగం, అవనిలో సగం అంటారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో తమదైన స్థానాన్ని సృష్టించుకుంటున్నారు,నిలుపుకుంటున్నారు. కృషి, పట్టుదల.. కఠోరదీక్షలే మహిళలను శిఖరసమానులను చేస్తున్నాయి. ఈనేపథ్యంలో మహిళలు వచ్చిన అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. సమర్థతను చాటిచెబుతున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదుర్కొచ్చినా అదరక, బెదరక తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవటంతో పాటు తమ ముద్రను చాటిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాయు సేన చరిత్రలో అద్భుత ఘట్టంలో తన ప్రతిభను చాటి చెప్పింది పేరులోనే అవనిని ప్రతిబింభించిన అవనీ చతుర్వేది. దేశంలో ‘మిగ్‌ 21 బైసన్‌ ’యుద్ధవిమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.

మిగ్‌ 21 బైసన్‌ ’యుద్ధవిమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళ..
దేశంలో ‘మిగ్‌ 21 బైసన్‌ ’యుద్ధవిమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళ అవనీ చతుర్వేది. అవని మధ్యప్రదేశ్ కు చెందిన షాడోల్ జిల్లాలోని డియోల్యాండ్ అనే చిన్న పట్టణంలో చదువుకుంది. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ స్క్వాడ్రన్‌లో తొలి మహిళా పైలట్‌ బ్యాచ్‌లో ఎంపికయ్యింది. హైదరాబాద్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ పొందింది.

బహుముఖ ప్రజ్నాశాలి అవని..
ఎవరికైనా ఒకదానిపై ఆసక్తి వుంటే దానిపైనే దృష్టి పెడతారు. మరి దేనిపైనా ఆసక్తిని పెంచుకోరు. కానీ అవిని అలా కాదు. ఆమె బహుముఖ ప్రజ్నాశాలి. టేబుల్‌ టెన్నిస్‌, చెస్‌ లాంటివాటిపై ఆసక్తే కాదు, చిత్రలేఖనంలో కూడా తన ప్రతిభను కనబరిచింది. సోదరుడు ఆర్మీ ఆఫీసర్‌ కావడంతో దానిని స్ఫూర్తిగా తీసుకున్న అవని చిన్నవయసు నుంచీ ఆర్మీలో ఉద్యోగం చేయాలని ఆశలు పెంచుకుంది. విమానం నడపాలనే ఆసక్తి పెరగటంతో కాలేజీ రోజుల్లో ఫ్లైయింగ్‌ క్లబ్‌లో చేరింది. ఆ అనుభవంతోనే యుద్ధవిమానాలను నడిపితే ఎలా ఉంటుందని అనుకుంది. అలాంటి అవకాశాన్ని అందుకోవాలనుకుంది. అలా శిక్షణ వైపు వెళ్లింది. మహిళలకు ఇటువంటి ఉద్యోగం ఒకవిధంగా సాహసమే అయినా ఓ సవాలుగా తీసుకున్నానని తెలిపింది అవని. కానీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ..తనను తాను మెరుగుపరచుకోవాలనే ఆసక్తి అవని సొంతం. దేశరక్షణలో తాను కూడా ఒక భాగం కావడం తను గర్వకారణంగా భావిస్తుంది అవని. ఇంతటి సాహసోపేతమైన రంగంలోకి రావాలనుకునే ఎందరో మహిళలకు అవని ఓ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.


 

203 అన్న క్యాంటీన్లు మంజూరు : సీఎం చంద్రబాబు

అమరావతి: 203 అన్న క్యాంటీన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 187 అన్న క్యాంటీన్లకు స్థలాలు గుర్తించినట్లు సీఎం తెలిపారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఏజెన్సీల నుంచి వివరాలు తెలుసుకున్నామని, నిర్ణీత గడువులోగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు చంద్రబాబు తెలిపారు.

13:43 - April 25, 2018

ఈ భారతదేశం ఖర్మభూమి, వేదభూమి అని అంటుంటారు. కానీ భారతదేశంలో బస్తీకో బాబా, గల్లీకో స్వామీజీ, కాషాయం కడితే చాలు కాళ్లు మొక్కేవారికేమీ కొదువ లేదు. ప్రజల బలహీనతలను ఆసరాచేసుకుని బాబాల అవతారం ఎత్తేసి కోట్లకు పడగలెత్తేస్తుంటారు. భారతదేశంలో గురువులకు ఏమాత్రం తక్కువలేదు. ఫకీరులు, భిక్షగాళ్లు,కనీస అక్షర జ్నానం లేకుండా రోడ్లమ్మటా తిరుగుతు రాత్రికి రాత్రే గురువులు అవతారం ఎత్తేసి అంతకంటే స్పీడ్ గా కోట్లకు పడగలెత్తేస్తుంటారు. వేల ఎకరాలకు వారసులైపోతుంటారు. హైటెక్ ఆశ్రమాలను నిర్మించేసి కలియుగ దైవాలుగా అవతారాలు ఎత్తేసి కోట్లకు కోట్లు కొల్లగొట్టేస్తుంటారు. వారికి ఆయా ప్రభుత్వాలు వత్తాసు పలుకుతు కాపలాకుక్కల్లా వ్యవహరిస్తుంటాయి. వీరి బండారం బైటపెడతామనీ..ప్రజలకు చైతన్య వంతులను చేద్దామనుకునే సామాజిక కార్యకర్తలు..విద్యావంతులపై దాడులకు పాల్పడటం..వారి ప్రాణాలు తీసి ఆశ్రమాలలోనే సమాధి చేసిన వైనాలకు లెక్కేలేదు. ఈ నేథ్యంలో ఆధ్యాత్మిక గురువుగా చెలామణీ అవుతు బాలికలపై అఘాయిత్యాలకు, అత్యాచారాలను పాల్పడి ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న తరుణంలో ఆశారాం బాపుకు న్యాయం స్థానం ఎట్టకేలకు శిక్షను ఖరారు చేసింది. కాగా డేరా బాబా రాసలీలలు బైటపడి ఊచలు లెక్కిస్తున్నాడు.

పాకిస్థాన్ ప్రాంతం నుండి వలస వచ్చిన ఆశారాం..
ఆశారాం బాపు అసలు పేరు అసుమల్ అని అజ్మీర్ వాసులు చెబుతున్నారు. వీరి కుటుంబం దేశ విభజనకు ముందు ప్రస్తుత పాకిస్థాన్ లోని సింధీ ప్రాంతం నుంచి వలస వచ్చిన అనంతరం గుజరాత్ లో సెటిల్ అయింది. అక్కడి నుంచి అజ్మీర్ కు ఆశారాంబాపు వలస వచ్చాడని సీనియర్ లాయర్ చరణ్ జిత్ సింగ్ తెలిపారు. ఆశారం చిన్నప్పుడు గుర్రపుబగ్గీ నడిపేవాడని టాంగా యూనియన్ సభ్యుడు పన్నాఉస్తాద్ వెల్లడించాడు. అజ్మీర్ రైల్వే స్టేషన్ నుంచి దర్గాకు భక్తులను తీసుకొచ్చేవాడని తెలిపాడు. తన పేద కుటుంబాన్ని ఆదుకునేందుకు గుర్రపుబగ్గీ నడుపుతూ, కష్టపడేవాడని చెప్పాడు ఆ తర్వాత గురువుగా మారి, దైవ బోధనలు చేస్తూ ఆశ్రమాలు నెలకొల్పాడని తెలిపాడు.
దోషిగా నిర్ధారించిన జోధ్ పూర్ కోర్ట్..
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువురు ఆశారాం బాపూ దోషి అంటూ జోధ్ పూర్ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు కూడా దోషులేనని తేల్చింది. కాసేపట్లో ఆశారాంకు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ఆయన ఇప్పటికే జైలులో మగ్గుతున్న సంగతి తెలిసిందే. ఓ బాలికను ఆశారాం బాపూఐ రేప్ చేశాడన్న అభియోగాలతో 2013లో అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. అప్పటి నుండి ఆయన జైలులో ఉన్నాడు. బెయిల్ ఇవ్వాలంటూ పలుమార్లు పిటిషన్ దాఖలు చేశారు. ఐదు రాష్ట్రాల్లో ఆశారాంకి బలమైన నెట్ వర్క్ ఉంది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. బాధిత బాలిక ఇంటి వద్ద కూడా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

13:20 - April 25, 2018

ఢిల్లీ : తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు తాను కాంగ్రెస్ లో చేరడం జరిగిందని నాగం జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఈసందర్భంగా ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. పార్టీలో గుర్తింపు కోసం చేరలేదని పేర్కొన్నారు. ప్రాజెక్టులన్నీ టిడిపి..కాంగ్రెస్ హాయాంలో చేసినవేనని, కొత్తగా ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు. ఏ ప్రాజెక్టులో చూసినా అవినీతే కనిపిస్తోందని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు తాము కృషి చేయడం జరుగుతుందన్నారు. 

రచ్చగా మారిన రాళ్లదాడి..

కర్నూలు : ఆళ్లగడ్డ రాళ్ళదాడి ఘటన అధిష్టానానికి లేని పోని తలనొప్పులను తెచ్చి పెట్టింది. దీంతో ఆగ్రహంతో వున్న చంద్రబాబు నాయుడు మంత్రి అఖిలప్రియను, ఏవీ సుబ్బారెడ్డిలను అమరావతికి రమ్మని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు. దీంతో ఈరోజు మధ్యాహ్నాం చంద్రబాబును ఇరువురు కలవనున్నారు. కాగా గత కొంతకాంలో  అఖిలప్రియ, సుబ్బారెడ్డిల మధ్య వున్న విభేదాలు సైకిల్ యాత్రలో మరింతగా బైటపడ్డాయి.

సుప్రీంపై అసంతృప్తి, ప్రధానికి జడ్జీల లేఖ..

ఢిల్లీ: సుప్రీంకోర్టు పరిపాలన తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో పూర్తి కోర్టును సమావేశపరుచాలని ఇద్దరు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. జడ్జిలు గగోయ్, లోకుర్‌లు ఆ లేఖను సీజేఐకు పంపారు. కొలీజియంలో సభ్యులైన ఆ ఇద్దరు న్యాయమూర్తులు తమ లేఖలో ఈ డిమాండ్ చేశారు. న్యాయపరంగా సుప్రీం వ్యవస్థలో సమస్యలు ఉన్నాయని, కోర్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పూర్తి కోర్టును సమావేశపరుచాలని లేఖలో కోరారు. నాలుగు రోజుల క్రితం సీజేఐ దీపక్ మిశ్రాను అభిశంసించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ఏడు విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.

12:44 - April 25, 2018

కళ్లు ఎన్నో భావాలను పలికించగలవు..మరెన్నో తణుకులను ఒలిగించగలవు..ఆడవారి కళ్లపై కవులు ఎన్నో పాటలు, కవిత్వాలను రాశారు. నిలువవే వాలు కనులదానా అంటు..సోగకళ్ల అందాలు చూడతరమా అంటు ఇలా ఎన్నో పాటలు ఆడవారి కళ్లపై అలా అలా జాలువారిపోయాయి. చారడేసి కళ్ళున్న వారి అందం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే, అందరి కళ్ళు పెద్దవిగా ఉండవు. అయితే, చిన్న కళ్ళు ఉన్నవారు కూడా తమ లుక్ ను మెరుగుపరచుకోవచ్చు. మేకప్ తో కళ్ళను పెద్దవిగా కనిపించేలా మార్చుకోవచ్చు. కంటికి కాటుక పెట్టుకుంటే ఆ కళ్ల అందం మరింతగా ఇనుమడిస్తుంది. కానీ గ్లామర్ రంగంలో వున్నవారు ఎక్కువగా కాస్మెటిక్స్ తోనే అందాన్ని ఇనుమడించుకుంటారు. ముఖ్యంగా మేకప్ లో హైలెట్ అయ్యేవి కళ్లు..ఆ కళ్లకు మరింత వన్నె తెచ్చేందుకు మెరుపులు తెచ్చేందుకు ఐ షాడో వినియోగిస్తుంటారు. మరి మెరుపుల వెనుక ఎందరి జీవితాలు మసకబారిపోతున్నాయో? ఎంతమంది జీవితాలు సజీవ సమాధి అయిపోతున్నాయో? ఎంతమంది చిన్నారుల జీవితాలు ఘనుల్లో మగ్గిపోతున్నాయో ఎప్పుడైనా? ఎవ్వరైనా ఆలోచించారా? కనీసం ఊహించారా? ఆ కంటి మెరుపుల వెనుక మసిమారిపోతున్న..చితికిపోతున్న జీవితాల గురించి తెలుసుకుందాం..
జీవితాలను మసకబారుస్తున్న మేకప్‌ ఫౌండేషన్‌..
మేకప్‌ ఫౌండేషన్‌ గురించి చాలామందికి తెలుసు! కానీ ఆ మెరుపులకు పునాది ఏమిటో మీకు తెలుసా? ఐ షాడో అందాలు చూసి అంతా మురిసిపోతారు. కానీ ఆ వెలుగుల వెనుక పసిపిల్లల అరణ్యరోదన ఎంతమందికి తెలుసు? కాస్మెటిక్‌ జిలుగుల వెనుక కన్నీటి చారికలు ఎంతమంది చూశారు? సౌందర్య సాధనాల్లో వాడే మైకా కోసం బాల్యం సమాధి అవుతున్న వైనం కలచివేస్తున్న వైనం..

మైకా తవ్వకాల్లో సమాధి అయిపోతున్న బాల్యం..
మేకప్‌ ఫౌండేషన్‌ చాటున కన్నీటి వేదన.. మైకా తవ్వకాల్లో బాల్యం సమాధి అయిపోతున్న దుస్థితి. నెలకు 10మంది పిల్లలను మింగుతున్న అక్రమ గనులు.. జార్ఖండ్‌, బీహార్‌లలో 20వేలమంది బాలకార్మికులు పనిచేస్తున్నారు. కాదు కాదు వారి జీవితాలను పణంగా పెడుతున్నారు.

డబ్బు మైకానికి ఛిద్రమైపోతున్న బాల్యం ..
2017 సంవత్సరంలో ఒక్క జూన్‌లోనే ఇరవైమంది పిల్లలు మైకా తవ్వకాల్లో ప్రాణాలు విడిచారని నోబెల్‌ పురస్కార విజేత కైలాస్‌ సత్యార్థి నేతృత్వంలో నడుస్తున్న ‘సేవ్‌ ద చైల్డ్‌హుడ్‌ మూవ్‌మెంట్‌’ రికార్డులు చెబుతున్నాయి. జార్ఖండ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. నెలకు కనీసం పదిమంది పిల్లలు మైకా అక్రమ గనుల్లో సమాధి అవుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. డబ్బు మైకం పట్టిన మైనింగ్‌ కంపెనీలు చిన్నారుల జీవితాలను పణంగా పెడుతున్నాయని అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

జార్ఖండ్ లో 20వేల మంది బాలకార్మికులు..
ఒక్క జార్ఖండ్‌, బిహార్‌లలోనే 20వేలమంది బాలకార్మికులు మైకా గనుల్లో మగ్గిపోతున్నారని ‘సోమో’ అనే డచ్‌ స్వచ్ఛంద సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. రాజస్థాన్‌లోని భిల్వారా ప్రాంతంలో పెద్ద సంఖ్యలో బాలికలు ప్రమాదకర గనుల్లో పనిచేస్తున్నారని వెల్లడించాయి. దేశంలో జరుగుతున్న మైకా మైనింగ్‌లో 70శాతం అక్రమమే అని స్పష్టం చేస్తున్నాయి. పిల్లలే కాదు పెద్దలు కూడా అక్రమ గనుల్లో మరణిస్తున్నారు. పేదరికంతో మగ్గుతున్న కార్మికులు రోజుకు 150 రూపాయల కోసం.. చీకటి గనుల్లో ప్రాణాలను పణంగా పెడుతున్నారు.

సహజసిద్ధంగా లభించే మైకా..కృత్రిమ సౌందర్య సాధనాల్లో కీలకపాత్ర..
మేకప్‌ ఫౌండేషన్‌లో మైకా వాడతారు. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే మైకా.. కృత్రిమ సౌందర్య సాధనాల్లో చాలా కీలకమైనది. ఆ అభ్రకం మెరుపుల కోసం కాస్మెటిక్‌ కంపెనీలు ఆరాటపడుతూ ఉంటాయి. ప్రపంచంలో 60శాతం మైకా నిల్వలు భారత్‌లోనే ఉన్నాయి. బిహార్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌లలో మైకా గనులున్నాయి. ఈ గనుల్లో వేలాదిమంది బాల కార్మికులు పనిచేస్తున్నారు. ఐదేళ్లు నిండకుండానే అక్రమ తవ్వకాలకు బలవుతున్నారు. కడుపు నింపుకోవడానికి గనుల్లో వెట్టి చాకిరీ చేస్తున్నారు. చివరకు ఎంతోమంది చిన్నారులు కూలిలుగానే మరణిస్తున్నారు.

ప్రభుత్వాలను శాంసించే స్థాయికి మైకా మాఫియా..
కాస్మెటిక్స్‌, ఆటోమొబైల్స్‌, కన్‌స్ట్రక్షన్‌ రంగాల్లో మైకా వాడకం చాలా ఎక్కువ! ప్రపంచంలోని బడా కంపెనీలు కూడా జార్ఖండ్‌, బీహార్‌లలోని అక్రమ మైనింగ్‌పై ఆధారపడి సౌందర్య సాధనాలను తయారుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలను మైకా మాఫియా శాసించే స్థాయికి ఎదిగింది. బాలకార్మికులు పనిచేసే గనుల నుంచి మైకా సేకరించబోమని బడా కంపెనీలు చెబుతున్నా.. అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. అక్రమ మైకా మైనింగ్‌కు చట్టబద్ధత కల్పించే ప్రక్రియను కూడా ప్రభుత్వాలు ఇటీవల మొదలుపెట్టాయి. మైకా అక్రమ గనుల్లో చిన్నారులు సజీవ సమాధి అవుతున్న వాస్తవాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. కానీ ఇది ఎప్పటికి సాధ్యమయ్యేను?ఈలోగా ఎంతమంది జీవితాలు సజీవ సమాధులుగా మారిపోయేను? అసలు ఇదంతా జరుగుతుందా? చిన్నారులు వారి బాల్యాన్ని ఆస్వాదించే బంగారు రోజులు వచ్చేనా? అనే ప్రశ్న తలెత్తక మానదు. బాలల దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని గప్పాలు కొట్టే ప్రభుత్వాలు బాలకార్మికులకు ఎటువంటి సమాధానం చెప్పేను? దీనికి చర్యలు తీసుకునే చిత్తశుద్ధి నేటి ప్రభుత్వాలకు వుందా? మసకబారిపోతున్న బాలకార్మికుల జీవితాలకు వెలుగు వచ్చేనా?

12:37 - April 25, 2018

విశాఖపట్టణం : హౌరా హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో జబర్దస్త్ టీం హల్ చల్ చేసింది. విజయనగరం నుండి విశాఖ వరకు జనరల్ టికెట్ కొనుగోలు చేసి థర్డ్ క్లాస్ ఏసీలో జబర్దస్త్ సభ్యులు ప్రయాణం చేశారు. అయితే టీసీ వీరికి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైల్వే డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేయడంతో విశాఖ రైల్వే స్టేషన్ లో రైల్వే సిబ్బంది..జబర్దస్త్ టీంకు మధ్య వాగ్వాదం జరిగింది. 

12:07 - April 25, 2018

అగ్రహీరోలతో నటించటమేకాదు..తమకంటు ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని వివాహానంతరం కొంతమంది..వేరే కారణాలతో మరికొంతమంది సినిమా పరిశ్రమకు దూరమైన అనంతరం కొంత విరామం తరువాత మళ్లీ సినిమాలలోకి రావటం మామూలే. కొంతమంది రీ ఎంట్రీతో మళ్లీ సక్సెస్ బాటలో వుంటే ఇంకొందరు వచ్చిన పాత్రలతో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మరో స్టార్ హీరోయిన్ రీఎంట్రీ ఇస్తానంటే సంకేతాలు ఇస్తోంది.

తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన నిన్నటి తరం కథానాయికలలో అంజలా జవేరి ఒకరు. చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ ల సరసన కథానాయికగా చేసిన ఆమె .. చక్కటి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత వివాహం చేసుకున్న అంజలా జవేరీ సినిమాలకు దూరం వున్నారు. విరామం అనంతరం ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇస్తానని అంటున్నారు.

తెలుగులో నిన్నటి తరం కథానాయికలుగా ఒక వెలుగు వెలిగిన నదియా .. భూమిక .. సిమ్రాన్ .. ఖుష్బూ .. మీనా రీ ఎంట్రీ ఇచ్చారు. భారీ పారితోషికాన్ని అందుకోవడంతో పాటు, మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. మరి వారిని చూసి స్ఫూర్తిని పొందిందో ఏమో తెలియదు గానీ, మంచి కథతో .. అవార్డులు తెచ్చిపెట్టే పాత్రలతో వస్తే చేయడానికి తాను సిద్ధంగా వున్నానని అంజలా జవేరి చెప్పుకొచ్చారు. వెంకటేశ్,చిరంజీవి వంటి అగ్రహీరోలతో చేసిన మంచి నటిగా పేరు తెచ్చుకున్న అంజలా జవేరీ రీ ఎంట్రీ ఎలా వుండనుందో వేచి చూడాలి. 

ఆనం భౌతిక కాయం కాసేపట్లో నెల్లూరుకు..

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానందరెడ్డి భౌతికకాయాన్ని కాసేపట్లో నెల్లూరుకు తరలించనున్నారు. ప్రస్తుతం ఆయన మృతదేహం కిమ్స్ ఆసుపత్రి ఆవరణలోనే ఉంది. ఆయన భౌతికకాయాన్ని నెల్లూరుకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెల్లూరులో రేపు ఆనం వివేకా అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు ఆనం ఇకలేరు అనే వార్తతో నెల్లూరు ప్రజలు షాక్ కు గురయ్యారు. ఆయన మరణం పట్ల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆనం అంత్యక్రియలకు పలువురు రాజకీయ నేతలు హజరయ్యే అవకాశం ఉంది. 

నిఫ్ట్ లో రీసెర్చ్ అసోసియేట్ గా వున్న సూర్యం..

ఢిల్లీ : ప్రజాగాయడు కుమారుడు సూర్యకిరణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో సూర్యకిరణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం సూర్యకిరణ్ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో రీసెర్చ్‌ అసోసియేట్‌ గా పని చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ఆయన ఆశిస్తున్నట్టు సమాచారం.

11:46 - April 25, 2018

విజయవాడ : దివంగ‌త ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అనుచ‌రుడు, టీడీపీ సీనియ‌ర్ నేత ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి కుమార్తె, మంత్రి అఖిల ప్రియ మ‌ధ్య పచ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ఉంది. కొంత కాలం నుంచి క‌ర్నూలులో రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం వీరిరువురి మ‌ధ్య అంత‌ర్గ‌త రాజ‌కీయ యుద్ధం జరుగుతోంది. బ‌హిరంగంగా ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించుకున్నారు. వీరి ఆధిపత్య పోరుతో టిడిపికి తలనొప్పిగా మారింది. గ‌త ఆదివారం ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ యాత్ర చేస్తున్న స‌మ‌యంలో.. మంత్రి అఖిల ప్రియ వ‌ర్గీయులు రాళ్ల‌దాడి చేసిన విష‌యం తెలిసిందే. రాజ‌కీయ ఎదుగుద‌ల‌ను చూసి ఓర్వ‌లేకే అఖిల ప్రియ తాను చేస్తున్న సైకిల్ యాత్ర‌ను అడ్డుకునేందుకు త‌న వ‌ర్గీయులతో రాళ్ల‌తో దాడి చేయించింద‌ని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ అమరావతికి రావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీనితో బుధవారం ఇరువురు అమరావతికి రానున్నారు. ఈ భేటీతో ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు పోతాయా ? లేదా ? అనేది చూడాలి. 

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నాగం, సూర్యం

ఢిల్లీ : మాజీ మంత్రి, మాజీ టీడీపీ నేత, మహబూబ్ నగర్ జిల్లాలో మంచి పట్టున్న నేత నాగం జనార్దన్ రెడ్డి ఈ ఉదయం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగంతో పాటు ప్రజా గాయకుడు గద్దర్ కుమారుడు జీవీ సూర్యకిరణ్ వేములవాడకు చెందిన ఆది శ్రీనివాస్ తదితరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ వీరిని ఆహ్వానించి కాంగ్రెస్ కండువాలను కప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి కృషి చేయాలని సూచించారు. 

శ్రీకాకుళంలో జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన..

శ్రీకాకుళం : మంత్రి నారా లోకేష్ ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆమదాలవలస, బూర్జ, సీతంపేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

11:32 - April 25, 2018

హైదరాబాద్ : ఎన్నికలకు ఇంకా సంవత్సరం ఉంది. ఇప్పటి నుండే ఆయా పార్టీలు వలసలపై దృష్టి పెట్టాయి. పలువురు పార్టీ నేతలు ఆయా పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. కాసేపటి క్రితం నాగం జనార్ధన్ రెడ్డి, గద్దర్ తనయుడు సూర్య లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. న్యూఢిల్లీలో పార్టీ పెద్దలు, టిపిసిసి చీఫ్ ఉత్తమ్ సమక్షంలో వారు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. నాగం జనార్ధన్ రెడ్డి టిడిపిలో పార్టీలో మంత్రిగా పనిచేశారు. అనంతరం బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆయన అలుక వహించి బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీలో చేరిన సందర్భంగా నాగం మాట్లాడుతూ..కాంగ్రెస్ లోకి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు, సోనియా గాంధీ ఆంధ్రాలో పార్టీ నష్టపోతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ప్రశంసనీయమని..ఈ ఘనత సోనియా గాంధీకే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేదరికం లేని..ఉద్యోగాలు రావాలని..మద్దతు ధర రావాలని రైతులు..కూడు..నీడ..గుడ్డ..కావాలని..విద్య..వైద్యం అందుతుందని ప్రజలు భావించారని, కానీ అలాంటివి ఏమీ అమలు కావడం లేదన్నారు. దోపిడే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ తుద ముట్టించేందుకు తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వెల్లడించారు. అంతకంటే ముందు టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ మాట్లాడుతూ...2019లో దేశంలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి మెజార్టీతో అధికారంలోకి వస్తుందని తెలిపారు. 

ఆంత్రాక్స్, మలేరియాలపై అప్రమత్తంగా వుండాలి : చంద్రబాబు

విశాఖ : విశాఖ జిల్లాలో ఆంత్రాక్స్, మలేరియాపై సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఆంత్రాక్స్ వ్యాధి కారణాలను పరిశీలించి వ్యాధి ప్రబలకుండా గట్టి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే పశుసంవర్ధక శాఖ సిబ్బంది గిరిజన ప్రాంతాల్లో మరింత అప్రమత్తమై వ్యాధికి కారణాలను గుర్తించి స్థానికంగా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక మలేరియా వ్యాధి కూడా ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తం వహించి యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాలని చంద్రబాబు అన్నారు.

ఉత్సాహవంతమైన నాయకుడిని కోల్పోయాం : నారాయణ

అమరావతి: నెల్లూరు ప్రజలకు ఆనం వివేకా ఎంతో సేవలు ఎనలేవనివని మంత్రి నారాయణ పేర్కొన్నారు. మంచి ఉత్సాహవంతమైన నేతను కోల్పోయామనీ..వివేకాతో తనకు మంచి అనుబంధం ఉందని, ఆయన మృతి చెందడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ఒక మంచి నాయకుడుని కోల్పోయిందని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థినట్లు నారాయణ తెలిపారు. ఆనం కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని మంత్రి తెలియజేశారు.

అర్ధాంతరంగా ముగిసిన గవర్నర్ ఢిల్లీ పర్యటన..

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ దిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగిసింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం దిల్లీకి చేరుకున్న గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ కావాల్సి ఉంది. ఉదయం 9.30 గంటలకు రాజ్‌నాథ్‌సింగ్‌తో.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానితో సమావేశమయ్యేందుకు ఆయన అపాయింట్‌మెంట్‌ కూడా తీసుకున్నారు. అయితే ఈరోజు ఉదయం తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని గవర్నర్‌ హైదరాబాద్‌ పయనమయ్యారు. అయితే దీనికి కారణాలు మాత్రం తెలియరాలేదు.

వివేకా మృతితో చిన్నబోయిన సింహపురి..

నెల్లూరు: ఆనం వివేకానందరెడ్డి మృతితో సింహపురి చిన్నబోయింది. సుమారు రెండు నెలలకు పైగా మృత్యువుతో పోరాడిన ఆయన ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు ప్రజలు విషాదంలో మునిగిపోయారు. రాజకీయాల్లో విలక్షణ నేతగా గుర్తింపు తెచ్చుకున్న వివేకానందరెడ్డి.. ప్రజల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆనం వివేకానందరెడ్డి ఏ విషయంపై అయినా ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడేవారు. నెల్లూరులో ధర్నా చేయాలన్నా, ప్రతి పక్షాలపై ఎదురుదాడి చేయాలన్నా ఆయన తర్వాతే అనే పేరుంది. వైఎస్సార్ హయాంలో ఓ వెలుగు వెలిగారు.

11:15 - April 25, 2018

ఢిల్లీ : ఉత్కంఠ వీడింది..గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న కేసులో కోర్టు తుదితీర్పును వెలువరించింది. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువురు ఆశారాం బాపూ దోషి అంటూ జోధ్ పూర్ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు కూడా దోషులేనని తేల్చింది. కాసేపట్లో ఆశారాంకు శిక్షను ఖరారు చేయనుంది. ఈ కేసులో ఆయన ఇప్పటికే జైలులో మగ్గుతున్న సంగతి తెలిసిందే. ఓ బాలికను ఆశారాం బాపూఐ రేప్ చేశాడన్న అభియోగాలతో 2013లో అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. అప్పటి నుండి ఆయన జైలులో ఉన్నాడు. బెయిల్ ఇవ్వాలంటూ పలుమార్లు పిటిషన్ దాఖలు చేశారు. ఐదు రాష్ట్రాల్లో ఇతనికి బలమైన నెట్ వర్క్ ఉంది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. బాధిత బాలిక ఇంటి వద్ద కూడా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

2012లో జోధ్‌పూర్‌ సమీపంలోని ఆశ్రమంలో మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డట్లు ఆశారాం బాపుపై కేసు నమోదైంది. పోస్కో చట్టం, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఆశారాం 2013 ఆగస్టు 31 నుంచి జోథ్‌పూర్ జైలులోనే ఉన్నారు. అత్యాచారం కేసులో ఆయన దోషిగా తేలితే గరిష్టంగా 10 ఏళ్ల జైలుశిక్ష పడుతుంది.

'ఆశారాన్ని కఠినంగా శిక్షించాలి'...

ఢిల్లీ : ఆశారాం బాపును కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం పేర్కొంటోంది. కాసేపటి క్రితం జోధ్ పూర్ ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది. ఆశారం బాపు దోషి అంటూ కోర్టు నిర్ధారించింది. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు, ఇప్పటికైనా తమకు న్యాయం జరిగిందని బాలిక తండ్రి పేర్కొన్నారు. 

ఆశారాం బాపు దోషి...

ఢిల్లీ : అత్యాచారం కేసులో ఆశారం బాపును జోధ్ పూర్ కోర్టు దోషిగా తేల్చింది. ఆశారంతో పాటు ముగ్గురిని దోషిగా కోర్టు నిర్ధారించింది. అత్యాచారం కేసులో 2013లో ఆశారం అరెస్టయిన సంగతి తెలిసిందే. జోధ్ పూర్ ట్రయల్ కోర్టులో ఈనెల 7వ తేదీన వాదనలు ముగిశాయి. జోధ్ పూర్ లో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. 

ఆనం వివేకా మృతిపై బాబు సంతాపం...

విజయవాడ : టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలియచేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆనం వివేకా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

10:37 - April 25, 2018

ఢిల్లీ : రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. వివాదాస్పద ఆధ్యాత్మక గురువు ఆశారాంపై ఉన్న అత్యాచారం అభియోగం కేసులో జోధ్‌పూర్‌ ప్రత్యేక కోర్టు కీలకమైన తీర్పు వెలువరించనుంది. తీర్పు అనంతరం హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు ఆయా రాష్ట్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జోధ్‌పూర్‌ పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఆశారాంపై ఫిర్యాదు చేసిన బాధితురాలి నివాసం వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.

2012లో జోధ్‌పూర్‌ సమీపంలోని ఆశ్రమంలో మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డట్లు ఆశారాం బాపుపై కేసు నమోదైంది. పోస్కో చట్టం, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఆశారాం 2013 ఆగస్టు 31 నుంచి జోథ్‌పూర్ జైలులోనే ఉన్నారు. అత్యాచారం కేసులో ఆయన దోషిగా తేలితే గరిష్టంగా 10 ఏళ్ల జైలుశిక్ష పడుతుంది.

కాసేపట్లో ఆశారం బాపు కేసుపై తీర్పు...

ఢిల్లీ : అత్యాచారం కేసులో ఆశారం బాపుపై నేడు జోధ్ పూర్ కోర్టు తీర్పును వెలువరించనుంది. 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆశారాంపై అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 2013లో జోధ్ పూర్ లోని మనాయ్ ఆశ్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీర్పు నేపథ్యంలో జోధ్ పూర్ లో హింస చెలరేగే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బాధితురాలి నివాసం వద్ద కూడా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 

కాసేపట్లో ఆశారం బాపు కేసుపై తీర్పు...

ఢిల్లీ : అత్యాచారం కేసులో ఆశారం బాపుపై నేడు జోధ్ పూర్ కోర్టు తీర్పును వెలువరించనుంది. 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆశారాంపై అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 2013లో జోధ్ పూర్ లోని మనాయ్ ఆశ్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీర్పు నేపథ్యంలో జోధ్ పూర్ లో హింస చెలరేగే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బాధితురాలి నివాసం వద్ద కూడా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 

జగన్ 145వ రోజు

కృష్ణా: వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. 145వ రోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం దావాజీగూడెం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. 

10:20 - April 25, 2018

హైదరాబాద్ : ఆయనదో విలక్షణమైన వ్యక్తిత్వం...మాటతీరు అంతే...వేషధారణతో ఇట్టే ఆకట్టుకుంటారు. నెల్లూరు జిల్లాలో సీనియర్ పొలిటీషియన్‌గా పేరొందిన ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. ఆయనే 'ఆనం వివేకానందరెడ్డి'. నెల్లూరు జిల్లా సొగ్గాడుగా పేరొందిన 'ఆనం వివేకానందరెడ్డి' కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పని చేసిన ఆయన గత ఎన్నికల అనంతరం సోదరుడితోపాటు హస్తం పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్న సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. దీనితో టిడిపి సభ్యులు..కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతిపై పలువురు సంతాపం తెలియచేశారు.

ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందిస్తున్నామని చంద్రబాబుకు కిమ్స్‌ వైద్యులు వివరించారు. వెంటిలేటర్‌పై జీవిస్తున్న ఆయన ఆరోగ్యం ఇటీవలే మరింతగా క్షీణించింది. ఆయన భౌతికకాయాన్ని నెల్లూరు జిల్లాకు తరలించనున్నారు. గురువారం అంత్యక్రియలు జరిపే అవకాశం ఉంది.

ఆనం వివేకానందరెడ్డి 1950 డిసెంబర్ 25వ తేదీన జన్మించారు. ఇతనికి ఇద్దరు కుమారులున్నారు. 199, 2004, 2009లో ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకంటే ముందు మున్సిపల్ ఛైర్మన్ గా వ్యవహరించారు. మున్సిపల్ ఛాంబర్ గా కూడా పనిచేసిన ఆనం వివేకా ప్రభుత్వంతో పోరాడి సమస్యలను పరిష్కరించే విధంగా చూశారు. 

09:33 - April 25, 2018

విజయవాడ : బీజేపీకి రాజీనామా చేసిన వైసీపీలో చేరాలని భావించిన కన్నా లక్ష్మీ నారాయణ అస్వస్థతకు గురయ్యారు. హై బీపీతో బాధ పడుతున్న ఆయన్ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీనితో వైసీపీలో చేరిక తాత్కాలికంగా బ్రేక్ పడింది. కొంతకాలంగా బీజేపీ కోర్ కమిటీగా పనిచేశారు. బీజేపీలో ప్రాధాన్యత లేదని భావిస్తూ ఆయన వైసీపీలో చేరాలని భావించినట్లు తెలుస్తోంది. 

గవర్నర్ హైదరాబాద్ పయనం...

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీ నుండి తిరిగి రానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రులను కలువకుండానే ఆయన హైదరాబాద్ కు పయనమవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ప్రభుత్వ అనుమతి లేకుండానే బోర్ల తవ్వకాలు...

హైదరాబాద్ : బోడుప్పల్ పరిధిలోని చెంగిచెర్లలో ప్రైవేటు లే అవుట్ లో అక్రమంగా బోర్ల తవ్వకాలు బయటపడ్డాయి. ప్రభుత్వ అనుమతి లేకుండానే అర్ధరాత్రి తవ్వకాలు జరుపుతున్నారు. 20 బోరు బావుల తవ్వకాలు చేస్తుండడం రెవెన్యూ అధికారులు గుర్తించారు. వాహనాలను స్వాధీనం చేసి మేడిపల్లి ఠాణా పీఎస్ కు తరలించారు.

 

రైలులో దూకిన విద్యార్థిని...

గుంటూరు : తెనాలి రైల్వే స్టేషన్ లో రప్తి సాగర్ ఎక్స్ ప్రెస్ నుండి విద్యార్థిని సమిత కిందకు దూకింది. తెనాలిలో దిగేందుకు స్టాప్ లేకపోవడంతో కిందకు దూకింది. నెల్లూరులో విద్యార్థిని సమితి ఎక్కింది. 

ఆశారం..కీలక తీర్పు...

రాజస్థాన్ : వివాదాస్పద ఆధ్యాత్మక గురువు ఆశారాంపై ఉన్న అత్యాచారం అభియోగం కేసులో జోధ్‌పూర్‌ ప్రత్యేక కోర్టు కీలకమైన తీర్పు వెలువరించనుంది. తీర్పు నేపథ్యంలో ఎలాంటి ఘటన జరగకుండా రాజస్థాన్, గుజరాత్, హర్యానాలో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. జోధ్‌పూర్‌ పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉంది.

08:12 - April 25, 2018

యాదాద్రి : తెలుగు రాష్ట్రాల్లో రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఏడు మంది దుర్మరణం చెందారు. అతి వేగంతో వెళ్లవద్దని..డ్రైవింగ్ లో నిర్లక్ష్యం వద్దని చెబుతున్నా డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనితో నిండు జీవితాలు మధ్యలో గాలిలో కలిసిపోతున్నాయి. భువనగిరి బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుఫాన్ వాహనం లారీని ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతి చెందిన వారు అడ్డగూడురు (మం) గట్టు సింగారానికి చెందిన సోమయ్య, యాదగిరి, సైదులుగా గుర్తించారు. ఎదురుగా వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేయబోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం.

అనంతపురం జిల్లా ఓడీసీ (మం) రాజులకుంటపల్లిలో మరో రోడ్డు ప్రమాదం చేసుకుంది. పెళ్లి బృందంతో వెళుతున్న ట్రాక్టర్ ను సిమెంట్ లారీ ఢీకొంది. నలుగురి మృతి చెందగా పది మందికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో లక్ష్మమ్మతో పాటు ముగ్గురు చిన్నారులున్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లు రఘునాథ్ రెడ్డి ఘటనా ప్రదేశాన్ని సందర్శించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సొంతంగా రూ. 50వేలు సహాయం అందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు. 

07:53 - April 25, 2018

గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్ధితులను తెలుసుకునేందుకు... కేంద్ర హోంశాఖ గవర్నర్‌ను ఢిల్లీకి రావాలని ఆదేశించింది. ఈ పర్యటనలో ఆయన నిన్న కేంద్ర హోంమంత్రితో సమావేశమై.. ఇరు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై నివేదిక అందజేశారు. ప్రధాని, రాష్ట్రపతితో భేటీ అయ్యే అవకాశముంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో లక్ష్మీనారాయణ (విశ్లేషకులు), లక్ష్మీ పార్వతి (వైసీపీ), శ్రీరాములు (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:47 - April 25, 2018

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణాలేంటి? రోడ్డు సేఫ్టీ విషయంలో తీసుకోవాల్సిన కర్తవ్యాలు ఏంటి? ఈ విషయంలో ప్రభుత్వాల వైఫల్యాలు ఎలా ఉన్నాయి. ప్రస్తుతం పాలకుల ముందున్న బాధ్యత ఏంటి ? ఈ అంశాలపై ఆల్‌ ఇండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ నెల రోజుల పాటు క్యాంపెన్‌ చేయనుంది. ఈ క్యాంపెయిన్‌ యొక్క ఉద్ధేశం ఏంటి అనే అంశంపై టెన్ టివి జనపథంంలో ఆల్‌ ఇండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ నాయకులు లక్ష్మయ్య విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

07:46 - April 25, 2018

ఢిల్లీ : హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబై ఇండియన్స్‌పై 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై ఏ దశలోనూ కనీస పోరాటాన్ని కనబర్చలేక ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 18.5 ఓవర్లలోనే 87 పరుగులకు ముంబై ఆలౌట్‌ అయ్యింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 118 పరుగులు చేసింది. అయినా ముంబై మాత్రం ఎటువంటి పోటీ ఇవ్వకుండానే చతికిలపడింది. ముంబైకి ఇది ఐదో ఓటమికాగా.. సన్‌రైజర్స్‌కు నాలుగో విజయం..

07:45 - April 25, 2018

నల్గొండ : జిల్లా మిర్యాలగూడ టూటౌన్‌ పీఎస్‌లో సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్‌పై కానిస్టేబుల్‌ రాజ్‌కుమార్‌ అనేక ఆరోపణలు చేశారు. తాను విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్రమ ఇసుక, కిరోసిన్‌ తరలింపును అడ్డుకున్నందుకు సీఐ కక్ష కట్టారని ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. సీఐకి చెందిన నెలవారీ మమూళ్లు అడ్డుకున్నందుకే తనపై కక్ష కట్టారని... డ్యూటీకి వచ్చినా ఆబ్సెంట్‌ వేసి వేధిస్తున్నారని రాజ్‌కుమార్‌ అంటున్నాడు. వీటికి సంబంధించిన వివరాలన్నింటినీ రాజ్‌కుమార్‌ సేకరించాడు. అయితే కానిస్టేబుల్ రాజ్‌కుమార్‌ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని సీఐ సాయి ఈశ్వర్‌ అన్నారు. ఎక్కడా మామూళ్లు తీసుకోవడం లేదని... అక్రమ దందాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు సీఐ ఈశ్వర్‌గౌడ్‌పై ఎస్పీ సీరియస్‌ అయినట్టు తెలుస్తోంది. తన దగ్గరికి పిలిపించుకుని క్లాస్‌ పీకినట్టు సమాచారం. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించినట్టు తెలుస్తోంది. 

07:43 - April 25, 2018

విజయవాడ : వైసీపీలోకి వలసల జోష్‌ పెరిగింది. సామాజిక వర్గాల వారీగా పేరున్న నేతలు... వైసీపీ వైపు చూస్తున్నారు. మరోవైపు ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేసుకోవాలని వైసీపీ అధినేత జగన్‌ భావిస్తున్నారు. రానున్న రోజుల్లో బలమైన నాయకులకు రెడ్‌కార్పెట్‌ పరచాలని వైసీపీ డిసైడ్‌ అయ్యింది. రానున్న రోజుల్లో వైసీపీలోకి నేతలు భారీగా వలస వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇతర పార్టీల్లోని పలువురు కీలక నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు. కృష్ణా జిల్లాలో జగన్‌ పాదయాత్ర ముసిగేలోగా... వైసీపీ కండువా కప్పుకోవాలని యోచిస్తున్నారు. గుంటూరు జిల్లాలో బలమైన నేత కన్నా లక్ష్మీనారాయణ. ప్రస్తుతం ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. గతంలో కాంగ్రెస్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. బీజేపీలో రాష్ట్ర అధ్యక్షపదవి వస్తుందని కన్నా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయనకు ఆ పదవి దక్కే అవకాశాలు కనిపించడం లేదు. బీజేపీలో ఆయనకు నిరాశ ఎదురుకావడంతో వైసీపీలో చేరాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇవాళ గుడివాడలో జగన్‌ సమక్షంలో ఆయన వైసీపీ చేరనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

కర్నూలు జిల్లాకు చెందిన కాటసాని రాంభూపాల్‌రెడ్డి కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. గతంలో పాణ్యం ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అయితే బీజేపీ నేతలు తమను కలుపుకుపోవడం లేదని కాటసాని కొన్నాళ్లుగా నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. అధిష్టానంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఆయన బీజేపీకి గుడ్‌బై చెప్పాలని డిసైడ్‌ అయ్యారు. ఈనెల 29న జగన్‌ను కలిసి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వైసీపీలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నదానిపై స్పష్టత రాలేదు. ఇక మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్‌ కూడా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 27న గుడివాడలో జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కృష్ణ ప్రసాద్‌కు వైసీపీ అధినేత జగన్‌... మైలవరం సీటు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలోని టీడీపీ కీలక నేత ఒకరు త్వరలో వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. వైసీపీలోని సీనియర్లు ఆయనతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వీళ్లేకాదు... రానున్న రోజుల్లో మరికొంతమంది వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

07:29 - April 25, 2018

హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారమే ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఉన్నాతాధికారులందరూ తమ తమ విభాగాలకు చెందిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలి. అధికారులు స్పందించని అన్ని సమస్యలపై నేరుగా ఆదేశాలు జారీ చెయ్యాలి. కానీ అవేవీ ఇక్కడ జరగడం లేదు. జీహెచ్‌ఎంసీలో దారితప్పుతున్న ప్రజావాణిపై 10టీవీ కథనం...జీహెచ్‌ఎంసీలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అన్ని విభాగాల ఉన్నాతాధికారులందరూ ఈ కార్యక్రమంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. అందుకోసమే 2012లో ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమానికి రూపకల్పన చేసింది. అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.

పాలనలో పారదర్శకత ఉండటంతో పాటు.. అధికారుల్లో జవాబుదారీతనం పెంచడానికి రూపొందించిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రారంభంలో సత్ఫలితాలిచ్చిన ప్రజావాణి.. ప్రస్తుతం ప్రజలను ఆవేదనకు గురి చేస్తోంది. అధికారుల చుట్టూ నిత్యం కాళ్లరిగేలా తిరుగుతున్నా.. సిటిజన్స్‌ సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. ఏదో విధంగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ టెక్నాలజీకి పెద్ద పీఠవేస్తున్నందున ప్రజలు తమ కార్యాలయం దగ్గరకు రావాల్సిన అవసరం లేదని జీహెచ్‌ఎంసీ అధికారులు అంటున్నారు. మై జీహెచ్‌ఎంసీ యాప్‌.. స్వచ్ఛతా యాప్‌తో పాటు ట్విట్టర్‌ ఖాతాలను జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేయవచ్చని అధికారులు చెపుతున్నారు. ఆన్‌లైన్‌ ఫిర్యాదులను సంబంధిత అధికారులకు తెలియజేయడంతో పాటు, వాటి పరిష్కారానికి నిత్యం మానిటరింగ్‌ చేస్తున్నామని వారు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో సమస్యలు పరిష్కారానికి నోచుకోక పోవడంతోనే ప్రజావాణికి వస్తున్నామని ప్రజలు అంటున్నారు. అయితే ప్రజావాణికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ హాజరు కాకపోవడం వల్లే సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రజావాణిపై దృష్టిసారించి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు.

07:18 - April 25, 2018

హైదరాబాద్ : వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. హైదరాబాద్‌ శివారులో ఒకేరోజు మూడు భారీ అగ్నిప్రమాదాలు జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఓవైపు ఎండలు, మరోవైపు అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్నారు. పటాన్‌చెరులోని రబ్బర్‌ఫ్యాక్టరీలో ఎగిసిన మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది 12 గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. హైదరాబాద్‌ శివారులో మూడు భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామికవాడలో అగర్వాల్‌ రబ్బర్‌ ఫ్యాక్టరీలోని గోడౌన్‌లో రియాక్టర్‌లో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. గోడౌన్‌లో టైర్లు అన్నీ అంటుకుని మంటలు ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. సమాచారమందుకున్న ఫైర్‌ సిబ్బంది రంగంలోకి దిగిన మూడు ఫైరింజన్లతో మంటలార్పేందుకు యత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అధికారులు మరో రెండు ఫైరింజన్లను రప్పించి మంటలార్పారు.

ఇదే అగర్వాల్‌ గోడౌన్‌లో జనవరిలోనూ అగ్నిప్రమాదం జరిగింది. అప్పుడు 30 కోట్ల రూపాయల మేర ఆస్తినష్టం సంభవించింది. దీంతో చైర్మన్‌ గుండెపోటుతో మరణించాడు. తాజాగా మళ్లీ అగ్నిప్రమాదం జరగడంతో.. రెండు కిలోమీటర్ల మేర దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇక ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని కంపెనీ నిర్వాహకులంటుండగా... పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇక ప్రమాదఘటనాస్థలాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాలుగైదు నెలల్లోనే రెండుసార్లు ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. కంపెనీలో తిరిగి ప్రొడక్షన్‌ మొదలయ్యే విధంగా అన్ని రకాలుగా సహకారమందిస్తామన్నారు. మరోవైపు బాలానగర్‌లోని టిబ్‌కాన్‌ కంపెనీలో ప్రమాదం జరిగింది. కెపాసిటర్‌ పేలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో స్పందన అనే యువతి మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాల పాలైంది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదిలావుంటే సుభాష్‌నగర్‌లో కూడా భారీ అగ్నిప్రమాదం జరిగింది. కెమికల్‌ గోడౌన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. కెమికల్‌ డ్రమ్ములు పేలడంతో.. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పారు. భారీ ఎత్తున ఆస్తినష్టం జరిగినా.. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నేతలంటున్నారు. ప్రాణనష్టం జరిగితే బాధ్యులు ఎవరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ఎండలు మండుతుండగా... ఇలాంటి అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సమ్మర్‌లో అగ్నిప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉండడంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

07:17 - April 25, 2018

కుమ్రం భీమ్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆసిఫాబాద్‌ మండలం చోప్పల్లి గ్రామానికి చెందిన బాపు అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. సాగు చేసిన పంట చేతికి అందక పోవడంతో అప్పు చెల్లించలేక పోయాడు. అప్పుకింద రుణదాత భూమి స్వాధీనం చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాపు... పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

06:56 - April 25, 2018

యాదాద్రి : భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణాపురం మండల కేంద్రంలో ఈదుర గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈదూరు గాలులకు మండలంలోని పలు ఇండ్లపై కప్పులు కొట్టుకుపోయాయి. బలమైన గాలులు రావడంతో చెట్లు విరిగి విద్యుత్‌ స్తంభాలపైన పడడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గాలికి వేప చెట్టు కూలి చెట్టుకు కట్టేసిన గేదెపై పడడంతో చనిపోయింది. గాలులకు మామిడి కాయలు రాలిపోయాయి. చాలా చెట్లు నేలకొరిగాయి. ఇండ్ల పైకప్పు కొట్టుకుపోయిన కుటుంబాలు, రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

06:53 - April 25, 2018

ఖమ్మం : జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. సంచుల కొరత కారణంగా తెచ్చిన పంటను కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు మధిరా రోడ్డుపై రాస్తారోకో చేశారు. సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో సంచుల కొరతతో పది రోజుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం పడితే ధాన్యం తడవడం వల్ల తాము నష్ట పోతామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైన బస్తాల కొరత తీర్చాలని రైతులు సివిల్‌ సప్లై అధికారులను కోరారు.

06:52 - April 25, 2018

హైదరాబాద్ : తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలే మారిపోయాయన్నారు. వైద్యం కోసం ఏ ఒక్కరూ ఇబ్బందిపడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌ నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రిలో నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్‌ నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రిలో 4.86 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఎమర్జెన్సీ వార్డు, లైబ్రరీ, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన మెడికల్‌ స్టోర్‌, ఆడిటోరియం భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన.. తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక.. ప్రాథమిక కేంద్రం నుంచి పెద్దాసుపత్రి వరకు ప్రతి ఆస్పత్రిలోనూ అత్యాధునిక పరికరాలతో వైద్య సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలే మారుస్తున్నామన్నారు. వైద్యం అందకుండా ఏ ఒక్కరూ ఇబ్బందిపడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అందరికీ కంటి పరీక్షల కార్యక్రమాన్ని చేపడుతున్నామని వెల్లడించారు.ఇదే కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి... ఫీవర్‌ ఆస్పత్రి కోసం మాస్టర్‌ ప్లాన్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నూతన భవనాలు నిర్మించడం హర్షణీయమని... వాటితోపాటో ఓపీ భవనాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

మరోవైపు ఫీవర్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ , ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు వేతనాల కోసం మంత్రి లక్ష్మారెడ్డిని నిలదీశారు. తమకు నెలానెలా సక్రమంగా వేతనాలు అందడం లేదని... అవికూడా చాలా తక్కువగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేతనాలు పెంచాలని కోరుతూ మంత్రికి ఓ వినతిపత్రం అందజేశారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా తమకు కేవలం 8వేలే ఇస్తున్నారని.. దాంతో కుటుంబం గడవడం కష్టంగా మారిందన్నారు. మంత్రి చొరవ తీసుకుని వేతనాలు పెంచేందుకు కృషి చేయాలని కోరారు.

06:50 - April 25, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు, కొందరు ప్రముఖులపై ఆరోపణలు.. నిరసనలు.. తెలుగు చిత్రసీమను కుదిపేస్తున్న అంశాలపై చర్చించేందుకు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో దాదాపు 18 మంది హీరోలు.. ఇతర సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. మెగస్టార్‌ చిరంజీవి చొరవ తీసుకుని ఈ సమావేశం ఏర్పాటు చేశారు. టీవీ చానళ్లు కేవలం సినిమాల మీదే ఆధారపడి బతుకుతున్నాయని.. వాటికి కంటెంట్‌, ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ప్రతిపాదన వచ్చింది. అంతేకాదు.. టీవీ చానల్స్‌ను ప్రోత్సహించకూడదని, వాటిని సినీ పరిశ్రమ బ్యాన్‌ చేయాలని ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. సమస్యలేవైనా వస్తే ఐక్యంగా మాట్లాడాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. శ్రీరెడ్డిని మొదట్లోనే పిలిచి మాట్లాడి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదని కొంతమంది అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మళ్లీ 4రోజుల తర్వాత కలిసి చర్చించాలని డిసైడ్‌ అయ్యారు. 

పెళ్లింట్లో విషాదం...

అనంతపురం : ఓడీసీ (మం) రాజులకుంటపల్లిలో రోడ్డు ప్రమాదం చేసుకుంది. పెళ్లి బృందంతో వెళుతున్న ట్రాక్టర్ ను సిమెంట్ లారీ ఢీకొంది. నలుగురి మృతి చెందగా పది మందికి గాయాలయ్యాయి. 

భువనగిరి బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం...

యాదాద్రి : భువనగిరి బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుఫాన్ వాహనం లారీని ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతి చెందిన వారు అడ్డగూడురు (మం) గట్టు సింగారానికి చెందిన సోమయ్య, యాదగిరి, సైదులుగా గుర్తించారు. 

మున్సిపల్ కార్మికుల సమ్మె...

హైదరాబాద్ : నేటి నుండి మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టనున్నారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె చేపట్టనున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రారంభం కానుంది. 

కాంగ్రెస్ లో గద్దర్ కుమారుడు...

ఢిల్లీ : ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ తనయుడు సూర్యం కాంగ్రెస్ లో చేరనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో 11.30గంటలకు ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 

వైసీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ...

విజయవాడ : నేడు కన్నా లక్ష్మీ నారాయణ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. 

Don't Miss