Activities calendar

26 April 2018

22:07 - April 26, 2018

హైదరాబాద్ : మామిడి పండ్ల సీజన్ మొదలైంది. అయితే తీయటి మామిడి పండ్లు దొరకడం మాత్రం కష్టంగా మారింది. మార్కెట్లో కార్బైడ్‌, ఇథలిన్‌ వంటి రసాయనాలతో మామిడి కాయలను మగ్గపెడుతున్నారు. రసాయన పర్థాదాలు చల్లి పండించిన పండ్లను తీనండం ద్వారా అనారోగ్యంపాలవుతున్నామని జనం ఆందోళన చెందుతున్నారు.

ఆదాయమే లక్ష్యంగా కార్బైడ్‌ దందా..
వేసవి సీజన్‌లో మామిడి పండ్లలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఎంత ధర ఉన్న ప్రజలు కోనడానికి వెనకాడరు. కాని ఈ సారి మాత్రం ప్రజలు మామిడి పండ్లను కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. మామిడి పండ్ల వ్యాపారులు ఆదాయమే లక్ష్యంగా కార్బైడ్‌ దందాను సాగిస్తున్నారు. పచ్చిమామిడి కాయలపై కార్బైడ్ అనే రసాయనాన్ని చల్లి మగ్గపెడుతున్నారు. దీంతో హైదరాబాద్‌ నగరంలో ఎక్కడ చూసినా కార్బైడ్‌ రసాయనాలతో కలుషితం అయిన పండ్లే అమ్మకానికి పెడుతున్నారు.

మార్కెట్‌లో దొరకని నేచురల్ మామిడి పండ్లు
హైదరాబాద్ కొత్తపేట ప్రూట్స్‌ మార్కెట్ గడ్డిఅన్నారం తదితర మార్కెట్లలో కార్బైడ్‌ పెట్టకుండా నేచురల్‌గా పండించిన పండ్లకోసం దుర్భిణి వేసుకుని వెదకాల్సిన పరిస్థితినెలకొంది. ఒకరో ఇద్దరో తప్పిస్తే చాలా మంది వ్యాపారులు కార్బాయిడ్‌తో మగ్గపెట్టిన పండ్లనే అమ్ముతున్నారు. గతంలో కార్బైడ్‌ను వాడకుండా పలువురు వ్యాపారులకు అధికారులు నోటిసులు జారిచేశారు. కాని అధికారుల ఆదేశాలు పక్కన పెట్టేసిన కొందరు వ్యాపారులు కార్బాయిడ్‌ దందాను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఛాదార్‌ఘాట్, పాతబస్తి, తదితర ప్రాంతాల్లో ఇథలీన్ వాడకాలు జోరుగా సాగుతున్నాయి.

మామిడి పండ్ల రుచులకు దూరం అవుతున్నామన్న వినియోగదారులు..
నల్గొండ, మహాబుబ్ నగర్ జిల్లాలతోపాటు ఏపీ నుంచి రోజుకు 60వేల టన్నుల మామిడి పంట కొత్తపేట ప్రూట్‌మార్కెట్‌కు చేరుకుంటోంది. ఇక్కడి న ఉంచి రోజుకు 300డీసీఎంలలో పండ్లు వేరే ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ఎగుమతి అయిన సరుకంతా కూడా కార్బైతో పాటు, చైనానుంచి దిగుమతి అవుతున్న ఇథలిన్‌ రసాయనాలతో పండిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. రసాయనాలు ఉపయోగిస్తున్నట్టు ఎలాంటి సమాచారం అందింన తమకు దృష్టికి తెవాలని పోలీసులు సూచిస్తున్నారు. మార్కెట్‌లో అన్ని కృత్రిమంగా మగ్గబెట్టిన పండ్లే కావడంలో వాటికి రంగు రూచి ఉండడంలేదు. దళారీలు, టోకు వ్యాపారులు ఇలా నాలుగంచల దళారీల వ్యవస్థ మార్కెట్లో రాజ్యమేలుతోంది. కల్తీ పండ్ల మాయాజాలంలో అసలు సిసలు మామిడి పండ్ల రుచులకు దూరం అవుతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. 

22:01 - April 26, 2018

నెల్లూరు : టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఆనంకు అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆనం మరణించారు. హైదరాబాద్‌ నుంచి నెల్లూరులోని ఆనం నివాసానికి తరలించిన ఆనం పార్థిదేహాన్ని చూసి నెల్లూరు వాసులు కన్నీటిపర్యంతం అయ్యారు. గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన వివేకానందరెడ్డి అంతిమయాత్ర ఆనం సెంటర్‌ మీదుగా బోడిగాడి తోట కైలాసభూమి స్మశానవాటిక వరకు సాగింది. ఆ తర్వాత ఆనం వివేకానందరెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. 

21:59 - April 26, 2018

అమరావతి : బీజేపీ, వైసీపీలపై టీడీపీ సీనియర్‌ నేత, ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ వర్ల రామయ్య మండిపడ్డారు.బీజేపీ నేత అమిత్ షా, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ కుమ్మక్కై.. కుట్ర రాజకీయాలతో టీడీపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ తరహా రాజకీయాలు భారత దేశ చరిత్రలోనే జరగలేదన్నారు. జగన్ చెప్పడంవల్లే కన్నా లక్ష్మీనారాయణ ఆసుపత్రిలో చేరారని... కన్నా అనారోగ్యసమస్య ఓ దొంగనాటకమని విమర్శించారు.

21:57 - April 26, 2018

గుంటూరు : నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల పర్యటనలు వాయిదా వేసుకున్నట్టు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. చిత్తూరు, గుంటూరుజిల్లాల్లో పర్యటించేందుకు ఇంతకు ముందే జనసేన అధినేత కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. అయితే గతంలో కాపు ఉద్యమం సందర్భంగా తునిలో విధ్వంసానికి పాల్పడినట్టే .. పవన్‌ పర్యటనలోనూ అరాచకం సృష్టించాలని కుట్రలు సాగుతున్నాయన్నారు. అయితే ప్రజల్లోకి వెళ్లాలన్న తన సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరని.. టీడీపీ ప్రభుత్వవైఫల్యాలను ఎండగడతానన్నారు పవన్‌ . రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన లక్ష్యంగా ఉద్యమం ఉంటుందని జనసేన అధినేత స్పష్టం చేశారు. నిఘా వర్గాల హెచ్చరికలతో రెండులేదా మూడు వారాల తర్వాతే జిల్లాల పర్యటన ఉంటుందని జనసేన వర్గాలు తెలిపాయి. 

21:53 - April 26, 2018

హైదరాబాద్ : మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, ఆది శ్రీనివాస్‌, సూర్య కాంగ్రెస్‌లో చేరిక ఆ పార్టీలో అసంతృప్తిని రాజేస్తోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పాత నాయకులు తమ సంగతేంటని పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో టీపీసీసీ నాయకత్వంతో అమితుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వానికి తలనొప్పిగా తయారైంది.

పార్టీలో అసంతృప్తి జ్వాలలు
తెలంగాణ కాంగ్రెస్‌ ప్రారంభించిన ఆపరేషన్‌ ఆకర్ష్‌.. ఇప్పుడు పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడేలా చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యతిరేక శక్తుల పునరేకీకరణకు టీపీసీసీ ప్రారంభించిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఇప్పుడు వికటించేలా కనిపిస్తోందన్న భయాందోళనలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. కొత్త వారిని పార్టీలోకి తీసుకురావడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లోని పాత నేతలు టీపీసీసీ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురువేస్తున్నారు.

నాగం కాంగ్రెస్‌లో చేరడంపై ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో వ్యతిరేకత
మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, వేములవాడకు చెందిన బీజేపీ నేత ఆది శ్రీనివాస్‌, ప్రజా గాయకుడు గద్దర్‌ కుమారుడు సూర్య కిరణ్‌.. ఢిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేశారు. నాగం చేరికతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దామోదర్‌రెడ్డితోపాటు మరికొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆది శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడంపై వేములవాడ నియోజకవర్గంపై కన్నేసిన కాంగ్రెస్‌ నేతలు భగ్గుమంటున్నారు. సూర్య కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడంపై సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోతుందన్న చందంగా.. వీరి చేరికతో తమ రాజకీయ భవిష్యత్‌ మసకబారే ప్రమాదం ఉందన్న ఆందోళన ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్‌ నాయకుల్లో కనిపిస్తోంది.

నాగంను చేర్చుకునే ముందు సంప్రదించలేదన్న ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి
నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడాన్ని పార్టీ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను నమ్ముకుని పార్టీలో కొనసాగుతున్న తనను సంప్రదించకుండా నాగంను చేర్చుకోవడాన్ని దామోదర్‌రెడ్డి తప్పుపడుతున్నారు. నాగర్‌కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య అభిప్రాయం కూడా తీసుకోకుండా.. ఏకపక్షంగా నాగంను పార్టీలోకి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగంకు సహకరించే ప్రసక్తేలేదని తెగేసి చెబుతున్నారు. తనను రాకీయంగా దెబ్బతీసేందుకు మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి పన్నిన కుట్రలో భాగంగానే నాగంను కాంగ్రెస్‌లోకి తీసుకున్నారన్న వాదాన్ని దామోదర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.

టీపీసీసీ నాయకత్వంపై మండిపడుతున్న క్రిశాంక్‌
వేములవాడలో కూడా ఇదే తరహా లొల్లి ఉంది. ఆది శ్రీనివాస్‌ చేరికను మనోహర్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. 2011లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరి 2014 ఎన్నికల్లో కమలం అభ్యర్థిగా పోటి చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్‌ను మళ్లీ పార్టీలోకి తీసుకోడాన్ని తప్పుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆది శ్రీనివాస్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ ఇస్తే సహాయ నిరాకరణ తప్పదని హెచరించారు. గద్దర్‌ కుమారు సూర్య కాంగ్రెస్‌లో చేరడంపై కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ నేతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీ ఫారం చేతికి వచ్చి... చివరి క్షణంలో చేజారిపోయిన క్రిశాంక్‌... టీపీసీసీ నాయకత్వం తీరుపై మండిపడుతున్నారు. సూర్య కిరణ్‌కు టికెట్‌ ఇస్తే ఊరుకుబోమని తేగెసి చెబుతున్నారు.

తలనొప్పిగా మారిన అసంతృప్తులు..
టీపీసీసీ నాయకుల బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న మంచి స్పందనతో జోష్‌ మీదున్న కాంగ్రెస్‌ నాయకులకు ఈ అసంతృప్తులు తలనొప్పిగా మారాయి. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పుడు కూడా పార్టీలో ఇంత వ్యతిరేకతరాలేదు. నాగం జనార్దన్‌రెడ్డి, ఆది శ్రీనివాస్‌, సూర్య చేరికతో రగుతున్న అసంతృప్తి జ్వాలలను పార్టీ నాయకులు ఎలా చల్చారుస్తారో చూడాలి.

21:42 - April 26, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి భాగ్యనగరం ముస్తాబైంది. కొంపల్లిలో జరిగే ప్లీనరీకి దారితీసే రోడ్లన్నీ గులాబీ జెండాలతో రెపరెపలాడుతున్నాయి. ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నగరం మొత్తం గులాబీవర్ణంతో శోభాయమానంగా మారింది.

టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తి..
టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు గులాబీ నేతలు సిద్ధమయ్యారు. ఈసారి ప్లీనరీకి గతంలో కంటే భిన్నంగా అలంకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

ప్రత్యేక ఆకర్షణగా కేసీఆర్
కొంపల్లిలో జరిగే ప్లీనరీకి దారితీసే అన్ని రోడ్లను గులాబీ తోరణాలు, జెండాలతో అందంగా అలంకరించారు. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆద్వర్యంలో ఏర్పాటైన అలంకరణ కమిటీ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షించింది. భార్లీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అన్నింటిలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

పథకాలు ప్రతిబింబించేలా భారీ హోర్డింగ్‌లు
నాలుగేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతిబింబించేలా భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. కల్యాణ లక్ష్మీ, సామాజిక పించన్లు, కేసీఆర్‌ కిట్‌, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, కుల వృత్తులకు ప్రభుత్వం చేస్తున్న మేళ్లను వివరిస్తూ అందర్నీ అకర్షించేలా హోర్డింగ్‌లు పెట్టారు. కొంపల్లిలో ప్లీనరీ నిర్వహిస్తున్న ప్రాంగణానికి ప్రగతి ప్రాంగణంగా పేరు పెట్టారు. ఎక్కడ చూసినా కేసీఆర్‌ భారీ కటౌట్లు, వేదిక చుట్టూ ఫెక్లీలను ఆకర్షణీయంగా అలంకరించారు. 

తెలంగాణ రాష్ట్ర స‌మితి 17వ వార్షికోత్సవానికి స‌ర్వం సిద్ధం
తెలంగాణ రాష్ట్ర స‌మితి 17వ వార్షికోత్సవానికి స‌ర్వం సిద్ధం చేసింది. నగ‌ర శివారుల్లోని కొంప‌ల్లిలో ప్రతినిధుల స‌భ‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నిక‌ల ఏడాది కావ‌డంతో అధికార పార్టీ ఈ ప్లీన‌రీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌తో పాటు రాష్ట్రంలో పార్టీ నేత‌లు అనుస‌రించాల్సిన విధానంపై ప్లీన‌రీ ద్వారా కార్యకర్తల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు.

ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభం కానున్న స‌భ‌
గులాబి పార్టీ పండుగ‌కు సర్వం సిద్ధమైంది. 17 వ‌సంతాలు పూర్తి చేసుకుంటున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘ‌నంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నినియోజ‌క‌వ‌ర్గాల నుంచి పార్టీ ప్రతినిధుల‌ను స‌మావేశానికి ఆహ్వానించారు . నియోజ‌క‌వ‌ర్గం నుంచి హాజ‌ర‌య్యే ప్రతినిధుల‌ను ఆయా ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌లే ఆహ్వానించేలా బాధ్యత‌ల‌ను పార్టీ అప్పగించింది. సుమారు 15 వేల మంది వ‌ర‌కు పార్టీ ప్రతినిధులు హాజ‌రుకానున్నారు. పార్టీ అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు జ‌రుపుతున్న ప్లీన‌రీ కావ‌డంతో గులాబి బాస్ ఈ ప్లీన‌రీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

రాబోయే ఏడాదిలో పార్టీ వ్యూహంపై కేసీఆర్‌ దీశానిర్దేశం
గ‌త నాలుగేళ్లుగా ప్రభుత్వ ప‌రంగా అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు....రాబోయే ఏడాది కాలంలో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ నేత‌ల‌కు దిశా నిర్దేశం చేయ‌నున్నారు. అదే విధంగా జాతీయ స్థాయిలో కూడా చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న కేసీఆర్.....జాతీయ రాజ‌కీయాల‌పై ప్లీన‌రీ వేదిక‌గానే మ‌రింత స్పష్టత ఇచ్చే అవ‌కాశం ఉంది. రాష్ట్రంలో ప‌ట్టు నిలుపుకుంటూనే జాతీయ స్థాయిలో పార్టీ వ్యూహంపై నేత‌ల‌కు ప్లీన‌రీలో వివ‌రించనున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ ప‌రంగా మాత్రం రాబోయే ఏడాది కాలం కీల‌కం కావ‌డంతో..... ఏడాదిలో పార్టీ ప‌రంగా కార్యక‌ర్తల‌కు మ‌రిన్ని బాధ్యత‌లను అప్పగించే అవ‌కాశం క‌నిపిస్తోంది. పార్టీ ప్రధాన కార్యద‌ర్శులు, కార్యద‌ర్శులు ఎమ్మెల్యేలతో స‌మ‌న్వయం చేసుకుంటూ అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్న యోచ‌న‌లో గులాబి నేత‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్లీన‌రీలో ఆరు తీర్మానాల‌ను ఆమోదించ‌నుంది. ప్రభుత్వ ప‌రంగా చేపడుతున్న కార్యక్రమాల‌తో పాటు మైనార్టీ పాల‌సీ, జాతీయ రాజ‌కీయాలపై తీర్మానాలు ఆస‌క్తి రేపుతున్నాయి. గ‌తంలో జ‌రిగిన ప్రతినిధుల స‌భ‌కు, ఇప్పుడు నిర్వహిస్తున్న ప్రతినిధుల స‌భ‌కు తేడా స్పష్టంగా ఉంటుంద‌ని అధికార పార్టీ నేత‌లు అంటున్నారు. ప్లీన‌రీకి హాజ‌ర‌య్యే ప్రతినిధుల‌కు ఇబ్బందులు ఎదురు కాకుండా పార్టీ అన్నిముందు జాగ్రత్త చ‌ర్యల‌ను చేప‌ట్టింది. దాదాపు 2 వేల మంది వాలంటీర్లు ప్రతినిధుల‌కు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధుల కోసం ఆ పార్టీ ప్రత్యేక వంటకాలు వడ్డించాలని డిసైడ్‌ అయ్యింది. తెలంగాణ వంటకాలను రుచి చూపించాలని నిర్ణయించింది. తెలంగాణలో ఫేమస్‌ అయిన వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలను ప్రతినిధులకు వడ్డించనున్నారు.

అందంగా ముస్తాబవుతోన్న జీబీఆర్‌ గార్డెన్‌
ఈనెల 27న టీఆర్‌ఎస్‌ ప్లీనరీ జరుగనుంది. హైదరాబాద్‌ శివారు కొంపల్లిలోని జీబీఆర్‌ గార్డెన్‌ ఇందుకు ముస్తాబవుతోంది. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులందరికీ పసందైన వంటకాలు వడ్డించేందుకు మెనూ రెడీ అయ్యింది. అందరికీ నచ్చేలా తెలంగాణ రుచులతో భోజనాలు వడ్డించనున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని మజ్జిగ, అంబలిని ప్రత్యేకంగా ప్రతినిధులకు అందించనున్నారు. పార్టీ ప్లీనరీ సమావేశాలకు 15వేల మంది వరకు హాజరుకానుండడంతో.... అందుకు తగ్గట్టుగా టీఆర్‌ఎస్‌ నాయకత్వం భోజన ఏర్పాట్లు చేస్తోంది.

ప్లీనరీలో వడ్డించే వంటకాల మెనూపై టీఆర్‌ఎస్‌ ప్రత్యక దృష్టి
ప్లీనరీలో వడ్డించే మెనూపై గులాబీ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. అచ్చంగా తెలంగాణ వంటకాలను వడ్డించాలని డిసైడ్‌ అయ్యింది. మటన్‌ బిర్యానీ, ధమ్‌ చికెన్‌ ప్రై, మటన్‌ షారువా, ఫిష్‌ ప్రై, రొయ్యల ప్రై, ఎగ్‌ పులుసు వడ్డించనున్నారు. అంతేకాదు.. తెలంగాణ స్పెషల్‌ నాటుకోడి పులుసు, మటన్‌ దాల్చాను ప్రత్యేకంగా ప్రతినిధులకు వడ్డించనున్నారు.

శాఖాహారుల కోసం ప్రత్యేక వంటకాలు
శాఖాహారుల కోసం వెజ్‌ బగారా రైస్‌, మిర్చి కా సలాన్‌, ఆలు టమాట కర్రీ, గంగవాయిలి పప్పు, గ్రీన్‌ సలాడ్‌, ఆనియన్‌ సలాడ్‌, పప్పుచారు, పచ్చిపులుసుతోపాటు పలు వెజ్‌ ఐటెమ్స్‌ను సర్వ్‌ చేయనున్నారు. పలు స్వీట్‌ను ప్రతినిధులకు అందించనున్నారు.

భారీగా నాన్ వెజ్ వంటకాలు..
ప్లీనరీ కోసం 2500 కిలోల మటన్‌, 3వేల కిలోల చికెన్‌, 5వందల కిలోల నాటుకోళ్లు తెప్పిస్తున్నారు. అంతేకాదు.. 500 కిలోల ఫిష్‌, మరో 500 కిలోల ప్రాన్స్‌, 25వేల గుడ్లు భోజనం కోసం సిద్దం చేస్తున్నారు. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు, మీడియాకు, సెక్యూరిటీ సిబ్బందికి వేర్వేరుగా డైనింగ్‌ హాల్స్‌ ఏర్పాటు చేశారు. వేదిక ప్రాంగణంలో 8 భోజన శాలలు ఏర్పాటు చేసినట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మొత్తానికి ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు పసందైన వంటకాల రుచి చూపించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.

21:38 - April 26, 2018

అమరావతి : భూమా కుటుంబాన్ని వేలెత్తి చూపితే సహించేదిలేదని మంత్రి అఖిలప్రియ సోదరి మౌనిక ఆళ్లగడ్డ టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిని హెచ్చరించారు. రాజకీయంగా ఎదగాలంటే సుబ్బారెడ్డికి సహకరిస్తాం కానీ... భూమా కుటుంబంపై నిందతులు మోపితే మాత్రం సహించబోమన్నారు. భూమా కుటుంబంపై విమర్శలు చేసినా ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మౌనిక హెచ్చరించారు. 

21:35 - April 26, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ర్టస్థాయి బ్యాంకర్లతో సమావేశమయ్యారు. అసలు నగదు కొరత ఎందుకు నెలకొందంటూ బ్యాంకర్లను ప్రశ్నించారు సీఎం. బ్యాంకర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సమావేశంలో పూర్తిగా నగదు కష్టాలపైనే చర్చ సాగింది.

బ్యాంకర్లతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం..
రాష్ర్టంలో నెలకొన్న నగదు కష్టాలపై బ్యాంకర్లతో సమావేశమయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏటీఎంలలో నగదు కొరత లేకుండా చూడాలని సీఎం అన్నారు. నగదు కొరతతో రోజువారీ పనులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. రాష్ర్టస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ప్రధానంగా ఏటీఎంలలో నగదు కొరతపైనే చర్చ జరిగింది. ఎక్కువ రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే చాలా కష్టమని సీఎం అన్నారు.

నగదు సమస్యలు ఎందుకొస్తున్నాయ్ : చంద్రబాబు
ప్రజలు డిజిటల్‌ కరెన్సీ ఉపయోగించడానికి అలవాటు పడుతుండగా.. నగదు సమస్యలు ఎందుకొస్తున్నాయని సీఎం ప్రశ్నించారు. ఎందుకు నగదు అందుబాటులో లేకుండా పోయిందన్నారు. ఆర్బీఐ ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వానికి సహకరించాలని బ్యాంకర్లను కోరారు. ఎలాంటి అవసరమున్నా బ్యాంకులనుంచే డబ్బు కావాలి.. ఒక బ్యాంకు పతనమైతే.. వాళ్ళ డిపాజిట్లు పోతున్నాయి.. ఇది ఒక తప్పుడు సంకేతాన్నిస్తోందన్నారు సీఎం. సూక్ష్మస్థాయిలో లోపాలున్నాయని.. ట్రాన్సాక్షన్‌కు గ్యారెంటీ ఉండాలని సీఎం అన్నారు.

అభివృద్ధిపై అధ్యయనం చేయాలని బ్యాంకర్లకు సీఎం సూచన..
వ్యవసాయ రుణాలను సకాలంలో ఇవ్వడంలేదన్నారు సీఎం. వ్యవసాయంపై ప్రభుత్వం మరింత దృష్టి కేంద్రీకరించిందన్నారు. ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయని.. ఈ నేపథ్యంలో ఆక్వా ఉత్పత్తులకు, చిరుధాన్యాలకు గిరాకీ పెరుగుతోందన్నారు. ఎలాంటి అభివృద్ధి జరుగుతోందో చూడాలని.. అభివృద్ధిపై అధ్యయనం చేయాలని బ్యాంకర్లకు సీఎం సూచించారు.

బ్యాంకర్ల మీట్‌లో తీర్మానం..
రాష్ర్టంలో నగదు కొరత ఇబ్బందులు, పర్యవసానాలపై బ్యాంకర్ల మీట్‌లో తీర్మానం చేశారు. గతంతో పోల్చుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం డబ్బు మాత్రమే బ్యాంకుల్లో చేరుతోందన్నారు ఆర్బీఐ అధికారులు. ప్రజలు పెద్దమొత్తంలో డబ్బు డ్రా చేసుకుంటున్నారని చెప్పారు. డబ్బులేక జనాలు అష్టకష్టాలు పడుతుంటే.. ప్రజల వద్ద ఉన్న డబ్బు సర్క్యులేట్‌ కాకపోవడంతోనే ఇబ్బంది వస్తోందని అధికారులు అంటున్నారు.

వడదెబ్బకు ఇద్దరు మృతి..

భూపాలపల్లి: వేసవి తాపానికి జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వడదెబ్బకు జన హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో వడదెబ్బతో రైతు మృతి చెందిన ఘటన జిల్లాలోని టేకుమట్ల మండలం వెంకట్రావ్‌పల్లి చివారు జోడుపల్లిలో జరిగింది. జిల్లాలోని చిట్యాల మండల కేంద్రానికి చెందిన కోడెల రాజీరు అనే 78 ఏళ్ల వృద్ధుడు వడదెబ్బకు మృతి చెందాడు. 

కన్నా రాజీనామా పెద్ద డ్రామా : అచెన్నాయుడు

అమరావతి : కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా పెద్ద డ్రామా అని, వైసీపీలోకి ఆయనను తీసుకోకుండా జగన్‌ని అమిత్‌ షా వారించాడని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ నెల 30న తిరుపతి తారకరామ మైదానంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగే బహిరంగ సభలో తాము బీజేపీ, వైసీపీ తీరును ప్రజలకు వివరిస్తామని మంత్రి అచ్చెన్నాడు తెలిపారు. 

ముగిసిన ఆనం వివేకా అంత్యక్రియలు..

నెల్లూరు : ప్రోస్టేట్ కేన్సర్ తో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి నిన్న ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. నెల్లూరులోని పెన్నానది ఒడ్డున ఉన్న బోడిగాడి తోట వద్ద అంత్యక్రియలు ముగిశాయి. అశ్రునయనాల మధ్య ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆయనతో గడిపిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.           

పేలిన రియాక్టర్..

హైదరాబాద్ : బాలానగర్ లోని ఓ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. 

20:38 - April 26, 2018

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తీరు వివాదంగా మారింది. గవర్నర్ పై మంత్రులు విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ పదవికే కళంకంగా మారారని ఏపీ మంత్రి ఆనంద బాబు విమర్శించారు. ఏపీ విషయంలో పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనీ..ఏపీపై తప్పుడు నివేదికలను కేంద్రానికి అందజేస్తున్నారని ఆనందబాబు విమర్శించారు. అలాగే గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా టీడీపీ పోరాడుతుందని సీఎం చంద్రబాబు కూడా పేర్కొన్న నేపథ్యంలో వివాదాస్పంగా మారింది. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యవస్థ ఎందుకు వివాదాస్పదమయ్యింది? దీనికి కారణాలేమిటి? అనే అంశంపై మాజీ ఎమ్మెల్సీ,ప్రజాశక్తి దిన పత్రిక చీఫ్ జన్ రల్ మేనేజర్ ఎంవీఎస్ శర్మ 

20:22 - April 26, 2018

భూ నిర్వాశితులను బెదిరించిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్..భూ సేకరణ చట్టం చదువుకుని రావాలని భూ నిర్వాశితులను బెదిరించిన కలక్టర్..బంగారు తెలంగాణలో పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్న రైతన్న మల్లారెడ్డి ..ఇదేమి రాజ్యం ఇదేమీ రాజ్యం అంటే దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అంటు నినాదాలు చేసిస జనాలు..ఖమ్మం జిల్లా రైతులను ఆగం ఆగం చేసిన వాన..ధాన్యం మొత్తం తడిసిపోయిన ధాన్యం. నీటికోసం అల్లాడిపోతున్న అడవిబిడ్డలు..కనబడిని నీరు తాగుతుంటే లేనిపోని రోగాలు పడుతున్న జనాలు. లక్ష రూపాయల నగలు పోగొట్టుకున్న మహిళ..పోలీసు టేసనుకి తీసుకొచ్చి ఇచ్చిన లక్ష రూపాల నగ. మామిడి పండ్లను పొడులేసి పండిస్తున్న గోదామాయన. గిసువంటి మంచి మంచి ముచ్చట్లు గీరోజు మల్లన్న ముచ్చట్లల్ల..

పెద్దనోట్ల రద్దు నాటి పరిస్థితులు : చద్రబాబు

అమరావతి : పెద్ద నోట్ల రద్దు నాటి పరిస్థితులే ప్రస్తుతం నెలకొన్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఒకటో తారీకు వస్తోందంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని, బ్యాంకులు ఇలా వ్యవహరిస్తే సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేయాలి? రాష్ట్రంలో నగదు కొరతకు కారణాలు ఏంటో చెప్పాలి? అని ప్రశ్నించారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో బ్యాంకర్లు ఆలోచించాలని చంద్రబాబు సూచించారు. ఈరోజు బ్యాంకర్లతో సమావేశమయిన సందర్భంగా చంద్రబాబు బ్యాంకర్లకు పలు సూచనలు చేశారు.

19:10 - April 26, 2018

అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు మళ్లీ మొదలుకొచ్చాయి. ఎనిమిది రాష్ట్రాలలో 40లక్షల మంది బాధితులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కాలయాపన చేస్తోందనే విమర్శిలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను పట్టుకోవటంలో సీబీఐ సరైన రీతిలో విచారణ చేపట్టటం లేదని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎస్ఎల్సీ గ్రూపు చేతులెత్తేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంల అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందా? వారి కష్టాలు తీరేనా? వంటి అంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈ చర్చలో సీపీఎం రాష్ట్ర సభ్యులు నేత గఫూర్, టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నేత తిరుపతిరావు పాల్గొన్నారు. 

రైతుల కోసమే రాజీనామా చేసా : లక్ష్మీనారాయణ

గుంటూరు : రైతుల అభివృద్ధికి కృషి చేసే ఉద్యోగం కావాలని తాను మహారాష్ట్ర సర్కారుని కోరానని, అయితే, తాను ఐపీఎస్‌ అయినందున ప్రభుత్వం తనకు ఆ అవకాశం కల్పించలేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. అందుకే తాను ఉద్యోగం వదిలేసి రైతు సేవ చేయడానికి బయటికి వచ్చానని వివరించారు. ఈ రోజు గుంటూరు జిల్లాలోని యాజలి గ్రామంలో లక్ష్మీ నారాయణ రైతులతో మాట్లాడుతూ... తాను ఒకవేళ వ్యవసాయ మంత్రి అయితే ఏమి చేయొచ్చో తెలుసుకోవాలనే ఇక్కడకు వచ్చానని సరదాగా చమత్కరించారు. 

క్యాస్టింగ్ కౌచ్ పై శత్రుఘ్నసిన్హా స్పందన..

ఢిల్లీ : తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి గళం విప్పినప్పటి నుంచి ఈ అంశంపై పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, బీజేపీ ఎంపీ, బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా స్పందించారు. ప్రముఖ కొరియో గ్రాఫర్ సరోజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకాచౌదరి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని అన్నారు.

అమరావతికి అఖిలప్రియ..

అమరావతి : మంత్రి అఖిలప్రియ అమరావతికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో సీఎం చంద్రబాబుతో అఖిలప్రియ భేటీ కానున్నారు. ఆళ్లగడ్డ సైకిల్ ర్యాలీలో ఎమ్మెల్యే సబ్బారెడ్డిపై జరిగిన రాళ్లదాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరిని తనవద్దకు రమ్మని ఆదేశించిన నేపథ్యంలో సుబ్బారెడ్డి చంద్రబాబుని కలిసారు. కానీ అఖిలప్రియ రాలేదు. కాగా ఇప్పుడు అమరావతికి వచ్చిన అఖిలప్రియ చంద్రబాబును కలవనున్నారు. కానీ అఖిలప్రియ తన సోదరి మౌనిక, సోదరుడు బ్రహ్మానందరెడ్డిలతో కలిసివచ్చినట్లుగా తెలుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డితో తమకు వున్న విభేదాలను అఖిల సీఎం కు వివరించనున్నారు.

18:37 - April 26, 2018
18:33 - April 26, 2018

మా అక్కపై విమర్శలు చేస్తే ఊరుకోం: భూమా మౌనిక

కర్నూలు : మా అక్కపై వేలెత్తి విమర్శలు చేస్తే భూమా కుటుంబ సభ్యులు అందరూ తగిన బుద్ధి చెబుతారని నేను నమ్ముతున్నాను. మా తల్లిదండ్రులు రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారు. ఏవీ సుబ్బారెడ్డి కుటుంబం మాపై చాలా వ్యతిరేకత చూపిస్తోంది. భూమా కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని చెప్పారు.. కాబట్టి మేము అక్క వెనుకాల ఉన్నామని ఎమ్మెల్యే సుబ్బారెడ్డిని మౌనిక హెచ్చరించారు. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఇటీవల రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అఖిలప్రియపై కొందరు విమర్శలు చేస్తున్నారని ఆమె సోదరి భూమా మౌనిక అన్నారు. ఈ రోజు తమ కుటుంబ సభ్యులమంతా విజయవాడకు వచ్చామని తెలిపారు.

18:26 - April 26, 2018
18:24 - April 26, 2018

అమరావతి : టీటీడీ బోర్డు నుండి టీడీపీ ఎమ్మెల్యే అనితను అధికారికంగా తొలగించారు. అనితను టీటీడీ బోర్డు నుండి తొలగిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అనిత కులంపై రేగిన వివాదంతో తనను బోర్డు నుండి తొలగించమని సీఎం చంద్రబాబుకు అనిత లేఖ రాశారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు ఆమెను బోర్డు నుండి తొలగిస్తు ఉత్తర్వులు జారీచేశారు. అనిత కులాన్ని ఆధారం చేసుకుని వస్తున్న విమర్శలతో సీఎం చంద్రబాబు ఇబ్బందుల్లో పడకూడదనే ఉద్ధేశ్యంతో అనిత సీఎంచంద్రబాబుకు తనను బోర్డు నుండి తొలగించమని లేఖ రాశారు. అనిత హిందువు కాదనీ, క్రిస్టియన్ అని ఒక క్రిష్టియన్ కు టీటీడీ బోర్డులో మెంబర్ ను ఎలా చేస్తారనే విషయంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో అనిత సీఎంకు లేఖ రాశారు. ఈ క్రమంలో ప్రభుత్వం అనిత సభ్వత్వాన్ని రద్దు చేసినట్లుగా ఉత్తర్వులు జారీచేసింది. 

టీటీడీ నుండి ఎమ్మెల్యే అనిత తొలగింపు..

అమరావతి : టీటీడీ బోర్డు నుండి టీడీపీ ఎమ్మెల్యే అనితను అధికారికంగా తొలగించారు. అనితను టీటీడీ బోర్డు నుండి తొలగిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అనిత కులంపై రేగిన వివాదంతో తనను బోర్డు నుండి తొలగించమని సీఎం చంద్రబాబుకు అనిత లేఖ రాశారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు ఆమెను బోర్డు నుండి తొలగిస్తు ఉత్తర్వులు జారీచేశారు. 

18:04 - April 26, 2018
18:01 - April 26, 2018

నిజామాబాద్ : అది పేరుకే మినరల్‌ వాటర్‌, కానీ తాగి చూస్తే గానీ తెలియదు అదంతా జనరల్‌ వాటర్‌ అని. ఆరు వందలకు పైగా నీటి శుద్ధి కేంద్రాలు ఉన్నా.. పది కూడా ఐఎస్ఐ ప్రమాణాలకు నోచుకోలేదు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నామమాత్రపు దాడులు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న నీటి దందాపై 10టీవీ ప్రత్యేక కథనం.

నిజామాబాద్‌ జిల్లా తాగునీటి దందా
నిజామాబాద్‌ జిల్లాలో తాగునీటి దందా యథేచ్చగా సాగుతోంది. నీటి వ్యాపారం రోజురోజుకు విస్తరిస్తోంది. మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఏమాత్రం నిబంధనలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. నిజామాబాద్‌తో పాటు జిల్లాలోని భోదన్‌, ఆర్మూర్‌, నందిపేట్‌, మాక్లూర్‌, నవీపేట్‌, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, తాడ్వాయి, బిక్నూర్‌ తదితర ప్రాంతాల్లో 500 నుండి 600 వరకు వాటర్‌ ప్లాంట్లు వెలిశాయి.

వాటర్‌ ప్లాంట్లను ప్రోత్సహిస్తున్న అధికారులు
వేసవి కాలం కావటంతో జిల్లాలో తాగునీటికి డిమాండ్‌ పెరిగింది. దీన్ని అదునుగా భావించిన నీటి వ్యాపారులు వాటర్‌ ప్లాంట్లను నెలకొలుపుతున్నారు. తమకు ఇబ్బందులు తప్పుతున్నాయని భావించిన అధికార యంత్రాంగం.. ప్రైవేట్‌ వ్యాపారులను ప్రోత్సహిస్తుంది. అయితే నీటిని శుద్ధి చేసే సమయంలో కనీస జాగ్రత్తలు , ప్రమాణాలు పాటించకుండా కలుషిత జలాలను ఇంటింటికి చేరుస్తున్నారు. మినరల్ ప్లాంటును నిర్వహించాలంటే ఐఎస్‌ఐ నిబంధనలు తప్పకుండా పాటించాలి. కానీ ఈ ప్లాంట్లలో అవి మచ్చుకైనా కనిపించవు. ప్లాంటులో మైక్రో బయోలజిస్టు, కెమిస్టులు ఉండాలి. ఎప్పటికప్పుడు నీటిలోని పీహెచ్‌ను పరీక్షిస్తూ ఉండాలి. కానీ ఎలాంటి నిబంధనలు పాటించకుండా ప్లాంటు యజమానుల తమ వ్యాపారాన్ని యథేచ్చగా కొనసాగిస్తున్నారు. ధనార్జనే లక్ష్యంగా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

వాటర్‌ ప్లాంట్ల తనిఖీల కోసం జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ
జిల్లాలో వాటర్‌ ప్లాంటు తనిఖీల కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో జాయింట్‌ కలెక్టర్‌ చైర్మన్‌గా ఉండగా, ఇండస్ర్టీయల్‌ మేనేజర్‌, పుడ్‌ఇన్‌స్పెక్టర్‌, మున్సిపల్‌ అధికారులు సభ్యులుగా ఉన్నారు. నిబంధనలు పాటించని వాటర్‌ ప్లాంట్లపై నోటిసులు జారీ చేసి, చర్యలు తీసుకోవడం ఈ కమిటీ పని. కానీ కొంత మంది నాయకుల ఒత్తిళ్లుగా తలొగ్గి, మరి కొందరు కాసులకు కక్కుర్తి పడి నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయల గండి పడుతోంది. అధికారులు మాత్రం దాడులు జరిపుతున్నామని చెప్తున్నారు. మరోవైపు వాటర్‌ ప్లాంటు యజమానులు మాత్రం ప్రమాణాలు పాటిస్తామని అన్నారని చెపుతున్నారు.నీటి వ్యాపారం బహిరంగానే జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రజలను నుండి తీవ్ర విమర్శులు ఎదుర్కొంటుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నీటి శుద్ధి కేంద్రాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

17:58 - April 26, 2018

అమరావతి : బ్యాంకులు డిజిటల్‌ లావాదేవీలను ఎక్కువగా ప్రోత్సహించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నగదు రహిత లావాదేవీలతో అవినీతి తగ్గుతుందని అమరావతిలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో చెప్పారు. పెద్దనోట్ల రద్దు సమయంలో నగదు రహిత లావాదేవీలు జరిగిన విధంగా ఇప్పుడు జరగని విషయాన్ని ప్రస్తావించారు. అలాగే రైతులకు విస్తృతంగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించారు. ప్రధాన మంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, జన్‌ధన్‌ పథకాలను ప్రోత్సహించాలని చంద్రబాబు కోరారు. 

17:35 - April 26, 2018

మహిళా న్యాయవాది నేరుగా సుప్రీం జడ్జిగా నియామకం!!..

ఢిల్లీ : దేశ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా న్యాయవాది నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు. మూడు నెలల క్రితం ఐదుగురు సభ్యులు గల కొలీజియం... సీనియర్‌ న్యాయవాది ఇందూ మల్హోత్రా పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానానికి ప్రతిపాదించడంతో అక్కడి నుంచి న్యాయశాఖకు, ఆ తర్వాత ఇంటిలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)కు ఆమె వివరాలు చేరి, చివరకు సర్కారు అందుకు పచ్చజెండా ఊపింది. ఇందూ మల్హోత్రాతో పాటు కొలిజీయం.. ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేఎమ్‌ జోసెఫ్‌ పేరును కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి సూచించగా, ఆయన నియామకంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.   

17:28 - April 26, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ ల శాసన సభ సభ్యత్వ రద్దు కేసులో కోర్టు తీర్పును టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవాల్ చేశారు. కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వ రద్దు కేసులో వారి సభ్వత్వం కొనసాగుతుందని కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవాలు చేస్తు పిటీషన్ వేశారు. 12మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపున వేసిన పిటీషన్ ను కోర్టు విచారించింది. టీఆర్ఎస్ తరపున న్యాయవాది వైద్యనాథన్ తన వాదనలకు వినిపించారు.కోమటిరెడ్డి, సంపత్ ల తరపున న్యాయవాది రవిశంకర్ తన వాదనలు వినిపించగా కేసు విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కారణం లేకుండా సభ్యుడి అసెంబ్లీ సభ్యత్వాన్ని ఎలా రద్దు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం కేసును రేపటికి వాయిదా వేసింది. కాగా అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ లు శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ పై ఇయర్ ఫోన్ విసిరిన నేపథ్యంలో వారిద్దరి సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేలకు అనుగుణంగా తీర్పుకూడా వెలువడింది. ఈ తీర్పును ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవాలు చేస్తు పిటీషన్ దాఖలు చేసారు. 

17:04 - April 26, 2018

శ్రీకాకుళం : ఖండాలను దాటి వస్తాయి మూడు మాసాలు విడిది చేస్తాయి. పొదిగిన పిల్లలు పెగిరే దాకా ఇక్కడే వుండి మళ్లీ విదేశాలకు ఎగిరి పోతాయి ఇవే సైబిరియాకు చెందిన సిలికాన్‌ పక్షులు. శ్రీకాకుళం జిల్లాకు సిలికాన్‌ పక్షులు వలస రావడం శతాబ్దాలుగా ఆనవాయితీలా కొనసాగుతువస్తుంది. ప్రతి ఏటా ఓకే ప్రాంతానికి వలస వచ్చే ఈ విదేశీ విహంగాలు రూటు మార్చాయి ఈ ఏట కొత్త స్థావరాలు ఏర్పరచాయి.

శ్రీకాకుళం జిల్లాలో విదేశీ పక్షుల సందడి
విదేశీ వలస పక్షులు రూటు మార్చాయి. శ్రీకాకుళం జిల్లా గార మండలం బూరవిల్లి గ్రామంలోకి సైబీరియాకు చెందిన సిలికాన్‌ పక్షులు అతిధులుగా వచ్చేశాయి. ప్రతీ ఏటా వలస వచ్చే ఈ పక్షులు సుమారు మూడు నెలల పాటు విడిది చేయనున్నాయి. ఐతే వర్షాకాలానికంటే ముందే వేసవిలోనే ఈ ప్రాంతానికి చేరుకొని కొత్త స్థావరాలు ఏర్పరుచుకోవడం స్థానికులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది.

ప్రతి ఏటా శ్రీకాకుళం జిల్లాకు వలస వస్తున్న సిలికాన్‌ పక్షులు
ప్రతి ఏటా గుడ్లు పొదిగే సమయంలో సిలికాన్‌ పక్షులు శ్రీకాకుళం జిల్లాకు వలస రావడం ఆనవాయితిగా కొనసాగుతొంది. ఓపెన్‌ బిల్డ్‌ స్పార్క్‌ శాస్త్రీయ నామం గల వీటిని నత్తగొట్టు పక్షులుగా పిలుస్తారు. తూర్పు, దక్షిణ ఆసియా ఖండంలో.... ముఖ్యంగా భారతదేశం, శ్రీలంక మొదలుకొని తూర్పు ప్రాంతంలో విస్తారంగా సంచరిస్తుంటాయి. ప్రతి ఏటా శ్రీకాకుళం జిల్లాలోని రెండు ప్రాంతాలైన తేలినీలాపురం, తేలుకుంచి గ్రామాల్లో స్థావరాలు ఏర్పర్చుకునేవి. ఐతే ఈసారి కొత్తగా గార మండలం బూరవిల్లిగ్రామం వంశధార నదీతీరంలో స్థావరాలు ఏర్పర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.

సందడి చేస్తున్న సిలికాన్ పక్షులు.
బూరవిల్లి గ్రామంలోకి వచ్చిన ఈ విదేశీ అతిధులను స్థానికులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చేరువలో ఉన్న ఈ గ్రామానికి జాతీయ రహదారి దగ్గరగా ఉండటం.. దీంతో పాటుగా పర్యాటక ప్రదేశాలైన శాలిహుండం, బౌద్ధారామానికి దగ్గరగా ఉండి అరసవల్లి, శ్రీకూర్మం లాంటి ప్రపంచ ప్రసిద్ధి దేవాలయాలు, కళింగపట్నం, బీచ్‌ లాంటి ప్రదేశాలు వీటి స్థావరాలకు చేరువలో ఉన్నందున దీనిని కొత్త టూరిస్ట్‌ స్పాట్‌లా అభివృద్ధి చేసే వీలుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని ప్రజాప్రతినిధులను ఉన్నతాధికారులను బూరవిల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రతీ ఏడాది సెప్టెంబర్‌ మొదటి వారంలో తిరుగుప్రయాణం అవుతుంటాయి ఈ సిలికాన్‌ పక్షులు. మరి శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా బూరవిల్లి ప్రాంతంలో స్థావరాలు ఎంచుకున్న ఈ విదేశీ విహంగాలు ఎన్ని రోజులు ఉంటాయో చూడాలి. 

16:59 - April 26, 2018

శ్రీకాకుళం : సిక్కోలు ప్రజలను భానుడు వణికిస్తున్నాడు. ఎండల తీవ్రతతో నదులన్నీ ఎడారిలను తలపిస్తున్నాయి. నీటి వనరులు, భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో ప్రజలంతా నీటి తీవ్రతను ఎదుర్కొంటున్నారు. ఎండల దాటికి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

మండిపోతున్న ఎండలు..
శ్రీకాకుళం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి బావులు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి. ఆముదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, కాశీబుగ్గ మున్సిపాలీటిలు, రాజం, పాలకొండ నగరపంచాయతీల్లో నీటి సమస్య తీవ్రమైంది. మూగ జీవాలకు సైతం నీరు దొరకని పరిస్థితి మొదలైంది. ఇచ్ఛాపురం, మందస, భీమిని, పాతపట్నం, బూర్జ, రణస్థలం మండలాల్లో తాగునీటి సమయ్య విపరీతంగా ఉంది. మత్స్యకారులు సైతం చలిమలు తవ్వి గొంతు తుడుపుకుంటున్నారు. పలు కాలనీలకు మాత్రం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి గొంతు తడుపుతున్నారు.

ఎండిన బావులు,కుంటలు,ఎడారులను తలపిస్తున్న నదులు
శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన నీటివనరులైన వంశధార, నాగావళి, మహేంద్రతనయ నదులు ఎడారులను తలపిస్తున్నాయి. హిర మండలంలోని గొట్టా జలశయం, తొటపల్లి, నారాయణపురం లాంటి తాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా ఎండిపోడంతో నీటి సమస్య తీవ్రమైంది.

ఎడారులను తలపిస్తున్న వంశధార, నాగావళి, మహేంద్రతనయ
సిక్కోలు జిల్లా మునుపెన్నడూ లేనంతగా వేడెక్కిపోయింది. గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయు. ఎండ తీవ్రత వల్ల శ్రీకాకుళం వాసులు అడుగు బయట పెట్టాలంటే భయపడిపోతున్నారు.ఇక వృద్ధులు, చిన్న పిల్లలు పరిస్థితిని చెప్పక్కరలేదు. దీనికితోడు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లు కర్ఫ్యూను తలపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక మే నెలలో ఎలా ఉంటుందో అని శ్రీకాకుళం వాసులు హడలిపోతున్నారు. 

16:56 - April 26, 2018

ఢిల్లీ : కేంద్ర జౌళీ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ అధ్యక్షతన అన్ని రాష్ర్టాల జౌళీ శాఖ మంత్రులు ఢిల్లీలో సమావేశమయ్యారు. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల సమన్వయంతో చేనేత, హస్తకళల రంగానికి ఊతమిచ్చేందుకు మంత్రులతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణలో చేనేత పరిశ్రమకోసం చేపట్టిన కార్యక్రమాలను సమావేశంలో కేటీఆర్‌ వివరించారు. చేనేత కార్మికుల కోసం రాష్ర్టంలో చేపట్టిన కార్యక్రమాలను స్మృతీ ఇరానీ అభినందించారని కేటీఆర్‌ తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి కేటీఆర్‌తోపాటు..జౌళీశాఖ డైరెక్టర్‌ శైలజ రామాయ్యర్, అడిషనల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. 

16:49 - April 26, 2018
16:48 - April 26, 2018

బ్యాంకుల్లో నగదు కొరతకు ఇదే కారణం!!..

హైదరాబాద్ : ఐటీ అధికారులు డెకాయ్ ఆపరేషన్ ప్రారంభించారు. బ్యాంకుల్లో నగదు కొరతపై ఐటీ దృష్టి సారించింది. రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో భారీగా నగదు చేతులు మారుతున్నట్లుగా ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. ఎస్ఆర్ నగర్ లోని భాష్యం రియల్ ఎస్టేట్,జూబ్లీ హిల్స్ లోని గిరిధారి ఎస్టేట్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహించింది. రూ.5.50 కోట్లు, కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ప్రభుత్వ ధరకు డీడీలు చెల్లిస్తూ..మిగతా మొత్తాన్ని నగు రూపంలో రియల్ వ్యాపారులు వసూలు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.

కాంగ్రెస్ 'ప్రజాగ్రహా ర్యాలి' : రఘువీరా

ఢిల్లీ : ఏఐసీసీ అధ్య‌క్ష‌డు రాహుల్ గాంధీ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 29న ఢిల్లీలో ‘ప్ర‌జా ఆగ్ర‌హా ర్యాలీ’ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు ఎన్‌.ర‌ఘువీరారెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జాతీయ ప్రజా ఆగ్రహా ర్యాలీ నిర్వహిస్తున్నా మని, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయ‌కులు అభిమానులు, కార్య‌క‌ర్త‌లు ఈ ర్యాలీలో పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపు నిచ్చారు.

ఏ పార్టీలోను చేరే ఉద్ధేశ్యం లేదు : జేడీ లక్ష్మీనారాయణ

గుంటూరు : ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఆలోచన తనకు లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఈరోజు గుంటూరులోని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ రైతుల సమావేశంలో స్పష్టం చేశారు. ప్రజలు, రైతుల సమస్యలు తెలుసుకుని భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తామని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ రైతుల సమావేశంలో తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే యువతకు ఉపాధి లభింస్తుందన్నారు. కాగా తన పదవికి రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ రాజకీయ ప్రవేశం చేస్తారనే వార్తలకు ఆయన తెరదించినట్లు అయింది. కాగా కొన్ని రోజుల క్రితం ఆయన మహారాష్ట్ర అదనపు డీజీపీ పదవికి రాజీనామా చేయగా నిన్న దాన్ని ఆమోదించారు. 

 

రైతులతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..

గుంటూరు : సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ రైతులతో సమావేశమయ్యారు. కర్లపాలెం మండలం యాజలిలో వ్యవసాయ ఉత్పత్తిదారులతో లక్ష్మీనారాయణ సమావేశమయ్యారు. లక్ష్మీనారాయణకు రైతులు ఘనంగా స్వాగతం పలికారు. 

16:05 - April 26, 2018
16:02 - April 26, 2018

నెల్లూరు : నెల్లూరుకు ఒక సింహంగా, ప్రజలకు సేవకుడిగా ప్రజలకు నిరంతం అందుబాటులో వుండే ప్రజా సేవకుడిగా ఆనం వివేకా జీవింంచారని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంట్లో వుండటం కంటే ప్రజల్లో వుండటానికే వివేకా ఇష్టపడే వారన్నారు. తనకు మంచి అనిపించేదే తప్ప పార్టీ చెప్పినట్టుగా వినేవ్యక్తి కాదని ఆయన మృతి తీరని లోటు అని చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆనం వివేకానందరెడ్డి భౌతికకాయన్ని సందర్శించి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఆనం వివేకాను ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారన్నారు. ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉండేందుకే ఆసక్తి కనబరిచేవారన్నారు. ప్రజలకు అన్ని విధాలా మంచి జరగాలనే కోరుకున్న వ్యక్తి వివేకా అన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఓ ప్రత్యేకత కలిగిన వ్యక్తి వివేకా అని అన్నారు చంద్రబాబు. 

16:02 - April 26, 2018

నెల్లూరు : నెల్లూరుకు ఒక సింహంగా, ప్రజలకు సేవకుడిగా ప్రజలకు నిరంతం అందుబాటులో వుండే ప్రజా సేవకుడిగా ఆనం వివేకా జీవింంచారని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంట్లో వుండటం కంటే ప్రజల్లో వుండటానికే వివేకా ఇష్టపడే వారన్నారు. తనకు మంచి అనిపించేదే తప్ప పార్టీ చెప్పినట్టుగా వినేవ్యక్తి కాదని ఆయన మృతి తీరని లోటు అని చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆనం వివేకానందరెడ్డి భౌతికకాయన్ని సందర్శించి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఆనం వివేకాను ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారన్నారు. ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉండేందుకే ఆసక్తి కనబరిచేవారన్నారు. ప్రజలకు అన్ని విధాలా మంచి జరగాలనే కోరుకున్న వ్యక్తి వివేకా అన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఓ ప్రత్యేకత కలిగిన వ్యక్తి వివేకా అని అన్నారు చంద్రబాబు. 

15:55 - April 26, 2018

ఢిల్లీ : స్కూల్‌ వ్యాన్‌ను ఓ ప్రయివేట్‌ పాల ట్యాంకర్‌ ఢీకొన్న ఘటన కన్హయ్యనగర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఏడేళ్ల బాలిక మృతి చెందగా...మరో 10 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. స్కూలు వ్యాన్‌ యూ టర్న్‌ తీసుకుంటున్న సమయంలో వెనకాల నుంచి వేగంగా వచ్చిన పాలట్యాంకర్‌ ఢీకొట్టింది. దీంతో స్కూలు వ్యాను 3 పల్టీలు కొట్టింది. ఈ వ్యానులో మొత్తం 18 మంది విద్యార్థులు ఉన్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన పాల ట్యాంకర్‌ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ వ్యాన్‌లో కేశవపురంకు చెందిన నెంబర్‌ వన్‌ స్కూలు విద్యార్థులతో పాటు కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వ్యానులో ప్రయాణిస్తున్న పిల్లలంతా 15 ఏళ్ల లోపువారే. 

15:48 - April 26, 2018

హైదరాబాద్‌ : నగరంలోని  నారాయణ విద్యాసంస్థలపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మహిళా ప్రిన్సిపాల్ మృతి కేసును సీబీ సీఐడీకి అప్పగించాలని పిటిషన్‌ వేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తెలంగాణ హోంశాఖ, కలెక్టర్‌, ఉప్పల్‌ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మరో 11 మంది ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ప్రిన్సిపాల్‌ మృతిపై ఆడియో టేపు ఆధారాలు ఉన్నా కేసు దర్యాప్తు నీరుగారుస్తున్నారని పిటిషన్ వేసిన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. వేసవిసెలవుల అనంతరం కేసులో తదుపరి విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. 

15:46 - April 26, 2018

హైదరాబాద్ : ఇప్పుడు ప్రజలందరి చూపు స్థిరాస్తుల వైపు మళ్లింది. నోట్ల రద్దు, బ్యాంకు కుంభకోణాలతో తమకు నష్టం వాటిల్లుతుందని భావిస్తున్న ప్రజలు భూములపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో చాలా కాలంగా మందకోడిగా ఉన్న గ్రేటర్ పరిసరాల్లోని భూములకు ఒక్కసారిగా ధరలు పలికాయి. ఇదే ఊపును కొనసాగిస్తూ మరిన్ని భూములు అమ్మేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమవుతోంది హెచ్ఎండీఏ.

భూములు కొనుగోలుకు మొగ్గు చూపుతోన్న ప్రజలు
పెద్ద నోట్ల రద్దు, బ్యాంకు కుంభకోణాలు, ఎఫ్ఆర్డీఏ బిల్లులతో డిపాజిటర్లకు నష్టమని భావిస్తున్న నేపథ్యంలో ప్రజలు స్థిరాస్తివైపు ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకుల కంటే భూములు రూపంలోనే తమ డబ్బు సేఫ్‌గా ఉంటుందని భావిస్తున్నారు ప్రజలు. ఇందుకోసమే భూములు కొనుగోలుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగానే గ్రేటర్‌లో భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయి. అందుకు నిదర్శనం గడిచిన రెండు మూడు రోజులుగా హెచ్ఎండీఏ. నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో ధరలు పలికాయి.

భూములు కొనేందుకు ఆసక్తి చూపుతోన్న ప్రజలు
మహానగరానికి ఎన్నో అనుకూలమైన పరిస్థితులు కూడా ఇందుకు కారణం అవుతున్నాయి. దీంతో స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాలవారు సైతం ఇక్కడి భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఐటీ హబ్‌ మాదాపూర్‌లో గజం ధర లక్షా 52 వేలు పలుకగా, చందానగర్‌లో 70వేలు, శివారు ప్రాంతమైన బాచుపల్లిలో 35వేల 500 పలికింది. ఇలా సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా భూముల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.

పెరుగుతోన్న ఇళ్లు, కార్యాలయం స్థల క్రయ, విక్రయాల వృద్ధిరేటు..
గ్రేటర్‌లో ఇళ్లు, కార్యాలయ స్థలాల క్రయ, విక్రయాల్లో వృద్ధిరేటు క్రమంగా పెరుగుతోందని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నివేదికలు ఇచ్చాయి. భవిష్యత్‌లో పెట్టుబడి అంతా భూములపైనే పెట్టేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నట్లు కూడా ఆ సంస్థలు తెలిపాయి. గ్రేటర్‌ పరిధిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతున్న లావాదేవీలే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ముఖ్యంగా నగరం చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని రిజిస్ట్రార్‌ కార్యాలయాలు నిత్యం రియల్‌ వ్యాపారంలో బిజీగా ఉంటున్నాయి. నోట్ల రద్దుతో దేశంలో నెలకొన్న పరిస్థితులు సైతం రియల్‌ బూమ్‌కు దారి తీస్తున్నాయి. డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడం కన్నా, భూములను కొనుగోలు చేయడమే ఉత్తమమని ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులపై నమ్మకం తగ్గడం, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ ట్యాక్స్‌ విధిస్తుందోనన్న భయంతో ప్రజలు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారంటున్నారు నిపుణులు.

గ్రేటర్‌లో ఆన్‌లైన్‌ వేలానికి అనూహ్య స్పందన..
గ్రేటర్‌లో పుష్కరకాలం తర్వాత నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలానికి అనూహ్య స్పందని లభించింది. మాదాపూర్‌ ఇమేజ్‌ గార్డెన్‌ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో గజానికి 64 వేల ధర నిర్ణయించగా, ఈ వేలంలో లక్షా 52 వేలు పలికింది. ఈ స్థాయిలో గ్రేటర్‌లో భూమి ధర పలకడం ఇప్పడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మొదటిసారి ఈ వేలంలో ప్లాట్లను అమ్మకానికి పెట్టిన హెచ్ఎండీఏ మొదట్లో లక్ష 21 చదరపు గజాలు అమ్మి 250 నుండి 300 కోట్లు ఆర్జించాలనుకుంది. కాని వివిధ కారణాలతో 27 వేల చదరపు అడుగుల భూమిని తగ్గించినప్పటికీ భారీగా ఆదాయం వచ్చినట్లు తెలిపింది హెచ్ఎండీఏ. . రాబోయే రోజుల్లో ట్రాన్స్‌ఫరెన్సీ ఉండేలా మరిన్ని భూములను ఈ వేలం ద్వారా అమ్మి వచ్చిన ఆదాయాన్ని మౌలిక ప్రాజెక్టుల కోసం ఖర్చు చేస్తామంటున్నారు హెచ్ఎండీఏ. కమిషనర్‌ చిరంజీవులు. ఉప్పల్‌ భగాయత్‌ భూములు, కోకాపేట ప్రాంతంలో ఉన్న భూములను కూడా ఇలానే విక్రయిస్తున్నామంటున్నారు కమిషనర్.

తగ్గిపోతున్న సొంతింటి కల నెరవేరే అవకాశాలు..
ఆకాశాన్నంటుతోన్న భూముల ధరలతో సామాన్య ప్రజలు సొంతింటి కల నెరవేరే అవకాశాలు తగ్గిపోతున్నాయి. దీంతో శివారు ప్రాంతాల్లో గ్రూపు హౌసింగ్‌, ప్రభుత్వం ఇచ్చే డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

15:42 - April 26, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ఆరు తీర్మానాలను రంగం సిద్ధం చేసింది. కేసీఆర్‌ సూచనలతో కమిటీ తీర్మానాలను ఖరారు చేసింది. ప్లీనరీలో ఆరు తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలపాలని నిర్ణయించింది. గత నాలుగేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు... ఓ రాజకీయ తీర్మానాన్ని సభ ఆమోదించనుంది.

రాష్ట్రంలో అనేక పథకాలు
రాష్ట్రంలోని అన్ని వర్గాలు, పేద ప్రజల అభ్యున్నతి కోసం టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అనేక సంక్షేమ పథకాలను చేపట్టింది. గర్భంతో ఉన్న మహిళలకు, వృద్ధులకు పలు పథకాలను అమలు చేసింది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, చేనేత, గీత కార్మికులు, బీసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయనే సందేశాన్ని ప్రతినిధుల సభ ఇవ్వనుంది. సంక్షేమ కార్యక్రమాల తీర్మానంపై చర్చ నిర్వహించనున్నారు.

అన్ని వర్గాలు, పేద ప్రజల అభ్యున్నతి కోసం సంక్షేమ పధకాలు
రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తీర్మానాన్ని పార్టీ సిద్ధం చేసింది. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో పాటు.. రైతులకు వ్యవసాయ పెట్టుబడి పథకం, భూరికార్డు ప్రక్షాళన, రైతు సమన్వయ సమితిలతో పాటు.. పశు సంవర్ధకశాఖపై కూడా చర్చ జరగనుంది. ప్రధానంగా ఎన్నికల ఏడాదిలో రైతుబంధు పథకం అమలు చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడంతో ఈ అంశాన్ని కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.

రైతుల అభివృద్ధి కోసం పలు తీర్మానాలు

మౌలిక సదుపాయాల కల్పన విషయంలో మిషన్ భగీరథతో పాటు ఐటీ, పెట్టుబడులు, పరిశ్రమలు, రోడ్డు నిర్మాణం, హైదరాబాద్ నగర అభివృద్ధి, మూసి రివర్ ప్రంట్, కొత్త రైల్వే టర్మినల్ ఏర్పాటు లాంటి ఆంశాలపై చర్చ జరగనుంది. మంత్రి కేటీఆర్‌ నిర్వహిస్తున్న శాఖలు కావడంతో... అన్ని అంశాలపై చర్చించి తీర్మానాన్ని ఆమోదిస్తారు. ఇక రాష్ట్ర పాలనలో తెచ్చిన సంస్కరణలపై మరో తీర్మానాన్ని సభ ఆమోదించనుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు, కొత్త మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటు వంటి నిర్ణయాలతో ప్రజలకు మరింత చేరువయ్యామన్న సంకేతాలను ప్లీనరీ ఇవ్వనుంది. మరోవైపు కీలకంగా భావిస్తున్న ముస్లిం, మైనార్టీల పాలసీలపై కూడా ప్రతినిధుల సభ చర్చించనుంది. మిషన్ భగీరథ, ఐటీ, పెట్టుబడులు, పరిశ్రమలు, రోడ్డు నిర్మాణం, నగర అభివృద్ధి, మూసి రివర్ ప్రంట్, కొత్త రైల్వే టర్మినల్ ఏర్పాటు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, పోలీస్‌ కమిషనరేట్ల, కొత్త మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటు. ఇక రాజకీయ తీర్మానం విషయానికి వస్తే.. కేసీఆర్ జాతీయస్థాయిలో చక్రం తిప్పాలని భావిస్తుండడంతో... ఫెడరల్ ఫ్రంట్‌పై సుదీర్ఘంగా చర్చ జరగనుంది. కేంద్రంలో మోదీ హవా తగ్గిందన్న అంచనాతో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్నామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటుపై కేసీఆర్‌ ఎక్కువ దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా కూడా జాతీయస్థాయిలో అనుసరించాల్సిన విధానంపై సభలో తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. 

15:36 - April 26, 2018

చిత్తూరు : విభజన చట్టంలో పేర్కొన్నట్లు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని మాజీ కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే స్పష్టం చేశారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా షిండే మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని చట్టంలో ఉందని... బిజెపి ఇపుడు ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదని షిండే చెప్పారు. ఏపి ప్రజలు, చంద్రబాబు చేస్తున్న పోరాటం న్యాయబద్దమైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పూర్తిస్థాయి మెజారిటీ సాధిస్తుందన్న ఆశాభావాన్ని షిండే వ్యక్తం చేశారు. 

15:34 - April 26, 2018

నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాల మున్సిపల్ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు నిరవదిక సమ్మె చేపట్టారు. జి.వో నంబర్ 14 ప్రకారం వేతనాలు చెల్లించి, కాంట్రక్ట్ అవుట్ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రెండవ రోజుకు చేరుకున్న సమ్మెలో సుమారు ఎనిమిది వందల మంది కార్మికులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

15:32 - April 26, 2018

హైదరాబాద్ : నాగం జనార్దన్‌ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకున్న విధానం సరిగా లేదన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి. స్థానిక నేతలతో సమన్వయంలేకుండా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నాగంను పార్టీలోకి చేర్చడం సరికాదన్నారు. గతంలో నాగర్‌ కర్నూల్‌ నుండి పోటీ చేసిన నాగం గెలుపు కోసం కాంగ్రెస్‌ నేత జైపాల్‌ రెడ్డి కృషి చేశారని ఆరోపించారు. నాగం పార్టీలోకి వస్తే కాంగ్రెస్‌కు నష్టమే గాని లాభం లేదన్నారు దామోదర్‌రెడ్డి. కాగా టీడీపీ నుండి బీజేపీలోకి వెళ్లి అటు జాతీయ, ఇటు ప్రాంతీయ నేతలను విమర్శించిన నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెప్  జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  

నారాయణ విద్యాసంస్థలపై పిటీషన్..

హైదరాబాద్ : నారాయణ విద్యాసంస్థలపై హైకోర్టులో పిటీషన్ దాఖలయ్యింది. మహిళా ప్రిన్సిపల్ మృతి కేసును సీబీ సీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేస్తు నారాయణ విద్యాసంస్థలపై నరేంద్ర గౌడ్ పిటీషన్ వేశారు. తెలంగాణ హోంశాఖ, కలెక్టర్, ఉప్పల్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

వైసీపీ ఎంపీల భేటీ..

హైదరాబాద్ : వైసీపీ కార్యాలయంలో ఎంపీల సమావేశమయ్యారు. ఈనెల 30న తలపెట్టిన 'వంచన'దినం కార్యక్రమం, రాజీనామాల ఆమోదానికి చేపట్టాల్సిన కార్యాచరణపై ఎంపీలు చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశౄనికి ఎంపీలు మిథున్, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి లతో పాటు పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

దర్శకుడు తేజ సంచలన నిర్ణయం!!..

హైదరాబాద్ : దివంగత నటుడు నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఎన్‌టీఆర్ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల అట్టహాసంగా ప్రారంభమైంది. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి తాను తప్పుకుంటున్నట్లు దర్శకుడు తేజ బుధవారం సంచలన ప్రకటన చేశారు. ఈ సినిమాకు నేను సరైన న్యాయం చేయలేననే భావనతో ఈ చిత్ర బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను అని తేజ ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే తను ఏ కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం వివరించకపోవడం గమనార్హం.

14:40 - April 26, 2018

విశాఖ : అరకులో ఎల్ఎల్ఆర్ అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. రవాణా శాఖ అధికారులు ఎల్ఎల్ఆర్ లు జారీ చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దాదాపు మూడు వేల మంది అభ్యర్ధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ భారీగా స్థంభించింది. బ్రోకర్ల మధ్యవర్తిత్వంతో లైసెన్స్ లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అరకు ఏజెన్సీలోని 13 మండలాలకు చెందిన వాహనదారులు లైసెన్స్ లకు దరఖాస్తు చేసుకోగా రవాణా అధికారులు మంజూరు చేయటం లేదని వాపోయారు. కాగా వీరి ఆందోళనతో రవాణా శాఖ అధికారులు స్పందించారు. డబ్బులు కట్టి వున్నాం కాబట్టి తమకు లైసెన్స్ లను మంజూరు చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధికారులు స్పందించారు. బ్రోకర్లను ఆశ్రయించకుండా నేరుగా తమను సంప్రదిస్తే లైసెన్స్ లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 

ప్లీనరీలో మంచి నిర్ణయాలు : మంత్రి లక్ష్మారెడ్డి

మేడ్చల్: టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. కొంపల్లిలో టీఆర్‌ఎస్ ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి లక్ష్మారెడ్డి , ఎంపీ మల్లారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్లీనరీ ఏర్పాట్లు అద్భుతంగా సాగుతున్నాయన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున మజ్జిగ, అంబలి, వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం కూడా ఉద్యమమేనన్నారు. అన్ని వర్గాల బాగు కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం.

కోహ్లీకి రూ.12లక్షల జరిమానా..

హైదరాబాద్ : నిర్ణీత స‌మ‌యంలోగా ఓవ‌ర్లు పూర్తి చేయ‌క‌పోవ‌డంతో ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి జరిమానా పడింది. బుధవారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా రూ.12లక్షల ఫైన్ వేశారు. 

ఎల్ఎల్ఆర్ అభ్యర్ధుల ఆందోళన..

విశాఖ : అరకులో ఎల్ఎల్ఆర్ అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. రవాణా శాఖ అధికారులు ఎల్ఎల్ఆర్ లు జారీ చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దాదాపు మూడు వేల మంది అభ్యర్ధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ భారీగా స్థంభించింది. 

మంత్రి పదవి వద్దన్న గొప్ప నేత వివేకా : చంద్రబాబు

నెల్లూరు : దివంగత ఆనం వివేకానందరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలతోనే కలిసి ఉండాలనే తపనతో... మంత్రి పదవిని సైతం వద్దనుకున్న గొప్ప నేత వివేకా అని అన్నారు. ఆయన లేని లోటును పూడ్చలేమని, ఒక గొప్ప నేతను కోల్పోయామని చెప్పారు. ఆనం కుటుంబానికి విశిష్టమైనటువంటి రాజకీయ గుర్తింపు ఉందని కొనియాడారు. కాసేపటి క్రితం వివేకా మృతదేహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. అనంతరం వివేకా కుటుంబసభ్యులను పరామర్శించారు. 

జగన్ ఎన్డీయేలో చేరాలి - రాందాస్ అథవాలే...

విజయవాడ : ఎన్డీయే నుండి టిడిపి బయటకు రావడం తొందర పాటు నిర్ణయమని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనం కోసం టిడిపి మళ్లీ ఎన్డీయేలో కలవాలని, లేదంటే జగన్ ఎన్డీయేలో చేరాలని పేర్కొన్నారు. జగన్ పై ఉన్న క కేసులు ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. 

లంచగొండి అసిస్టెంట్ ఇంజినీర్...

అనంతపురం : ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ. 5వేలు లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ ఇంజినీర్ నాగభూషణం చిక్కాడు. 

రాష్ట్రాల జౌళి శాఖ మంత్రుల సమావేశం...

ఢిల్లీ : ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ లో కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల జౌళి శాఖల మంత్రుల సమావేశం జరుగుతోంది. జౌళి శాఖ, హస్తకళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, పనితీరును మంత్రి కేటీఆర్ వివరించనున్నారు. 

కోహ్లీకి భారీగా ఫైన్...

బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీకి జరిమానా పడింది. బుధవారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా రూ.12లక్షల ఫైన్ వేశారు. 

ఆనం వివేకా మరణం తీరని లోటు - బాబు..

నెల్లూరు : ఆనం వివేకానందరెడ్డి మరణం పార్టీకి తీరని లోటు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జిల్లాలో ఆనం వివేకా భౌతికకాయాన్ని సందర్శించిన బాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎప్పుడూ ప్రజలతో ఉంటూ వారి వారి సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్లారని, ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశ్యం ఆనం వివేకాలో కనిపించేదన్నారు. మున్సిపల్ ఛైర్మన్..గా, నాలుగు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారన్నారు. ఆనం కుటుంబానికి ఒక విశిష్టమైన రాజకీయ చరిత్ర ఉందని, ఆనం వివేకకు ఎలాంటి బలహీనతలు లేవని తెలిపారు. సినిమాలు ఎక్కువ చూసేవాడన్నారు.

12:31 - April 26, 2018

కొమరం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఏకంగా 43 డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. వేడి గాలులు వీస్తుండడం..ఉదయం నుండే ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఎండ నుండి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. ఎండ దెబ్బతో 20మంది ఆసుపత్రి పాలయ్యారు. రానున్న రోజుల్లో ఎండలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

కర్నాటక ఎన్నికల పరిశీలకురాలిగా కిల్లి కృపారాణి...

హైదరాబాద్ : కర్నాటక ఎన్నికల ఏఐసీసీ పరిశీలకురాలిగా కిల్లి కృపారాణిని ఎంపిక చేశారు. కన్నడిగులు బీజేపీకి కచ్చితంగా బుద్ధి చెబుతారని, మోడీ వల్ల దేశంలో అత్యంత దురదృష్టకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.

 

రైలు ప్రమాదంపై సీఎం స్పందన...

ఉత్తర్ ప్రదేశ్ : రైలు ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. రైలు ఢీకొనడంతో 13 మంది చిన్నారులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. 13 మంది విద్యార్థులు మృతి చెందారని, 4గురు విద్యార్థులు..బస్సు డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయని సీఎం పేర్కొన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించడం జరిగిందని తెలిపారు. 

హైదరాబాద్ కు జగన్...

కృష్ణా : నందమూరులో పాదయాత్రకు వైఎస్ జగన్ తాత్కాలికంగా నిలిపివేశారు. శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉండడంతో పాదయాత్రకు బ్రేక్ ప్రకటించారు. కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. 

12:16 - April 26, 2018

సంగారెడ్డి : జిల్లాలో రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జిల్లా హెడ్ క్వార్టర్ కావడంతో రోడ్డు విస్తరణ చేయాలని అధికారులు నిర్ణయించారు. ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అందులో భాగంగా రోడ్డుకిరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాలని అధికారులు నిర్ణయించారు. దీనితో గురువారం ఉదయం భారీ బందోబస్తుతో వచ్చిన మున్సిపల్ అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. అందులో చిన్న చిన్న దుకాణాలు..ఇతరత్రా వ్యాపారం చేసుకునే దుకాణాలున్నాయి. విషయం తెలుసుకున్న వ్యాపారులు అక్కడకు చేరుకుని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. దుకాణాలు నమ్ముకుని కొన్ని సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నామని, ఆధారం లేకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో కూల్చివేతలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ బిల్డింగ్ లు మాత్రం కూల్చివేయకుండా తమపై ప్రతాపం చూపుతున్నారని, తమకు ప్రత్యామ్నాయం చూపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

సంగారెడ్డిలో కూల్చివేతలు...

సంగారెడ్డి : జిల్లాలో రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు దుకాణాలను కూల్చివేస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలపై చిరు వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో కూల్చివేతలు చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. 

ఆనం వివేకాకు బాబు నివాళి...

నెల్లూరు : సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. స్థానిక ఏపీ సెంటర్ లోని ఆనం నివాసంలో ఆనం వివేకానందరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి బాబు నివాళులర్పించారు. సాయంత్రం ఆనం వివేకా అంత్యక్రియలు జరుగనున్నాయి.

11:12 - April 26, 2018

ఢిల్లీ : టీఆర్ఎస్ ప్రభుత్వం..కేసీఆర్ పై టి.కాంగ్రెస్ నేత పొన్నం పలు విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ లో రూపాయి బిల్ల వేస్తే కనబడాలని..ట్యాంక్ బండ్ వద్ద ఆకాశ హార్మ్యాలు కడుతామని...ఫ్లై ఓవర్లు నిర్మిస్తామని..125 అడుగుల డా.అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు..చేస్తామని ఇలా ఎన్నో చెప్పారని గుర్తు చేశారు. అంతేగాకుండా యాదాద్రి, వేములవాడ...దేవాలయాలకు శఠగోపాలు పెట్టారని, కేసీఆర్ మాటల గారడి అంటూ ఎద్దేవా చేశారర. విభజన సమయంలో రూ. 60 వేల కోట్ల అప్పు ఉంటే ప్రస్తుతం రూ. 1.70 కోట్ల అప్పు దాటిపోయిందని ఆరోపించారు.

తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడుతుంటే..భూగర్భ జలాలు తక్కువ అవుతున్నా ఆయన ఫెడరల్ ఫ్రంట్ అంటూ రాష్ట్రాలకు వెళుతున్నారని విమర్శించారు. ఒక్కమాటలో చెప్పాలంటే శిఖండి పాత్ర పోషిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక టూరిజం ప్రాజెక్టుగా తయారై పోయిందని విమర్శించారు. 

ఆనంకు పలువురు నివాళులు...

కర్నూలు : జిల్లాకు భారీగా ఆనం అభిమానులు చేరుకుంటున్నారు. స్థానిక ఏపీ సెంటర్ వద్ద ఆనం భౌతికకాయాన్ని సందర్శిస్తూ నివాళులర్పిస్తున్నారు. 

వైసీపీలోకి కాటసాని...

కర్నూలు : బీజేపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 29వ తేదీన వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

10:32 - April 26, 2018

కర్నూలు : వచ్చే సంవత్సరంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి నుండే నేతలు తమ తమ స్థానాలను ఖరారు చేసుకుంటున్నారు. ఆయా పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఏపీలో వలసల తాకిడి ప్రారంభమైంది. ఇతర పార్టీల్లోని నేతలు వైసీపీలోకి చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. బీజేపీ పార్టీకి చెందిన కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన అస్వస్థతకు గురి కావడంతో పార్టీ చేరిక వాయిదా పడింది. ఇదిలా ఉంటే కర్నూలుకు చెందిన బీజేపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 29వ తేదీన వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా కాటసానితో టెన్ టివి మాట్లాడింది. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో నాలుగైదుసార్లు సమావేశమయ్యానని... బీజేపీని వీడి వైసీపీలో చేరాలని సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పాణ్యం నియోజకవర్గాన్ని విడిచే ప్రసక్తే లేదని, ఇక్కడి నియోజకవర్గం నుండే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

10:26 - April 26, 2018

విశాఖపట్టణం : జిల్లాలో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం రేపుతోంది. చింతపల్లి మండలం కొమ్మంగి గంజిగెడ్డలోని గిరిజనులకు ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. నిల్వ ఉంచిన పశుమాంసం వీరు తినడం వల్ల ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు పేర్కొంటున్నట్లు సమాచారం. వ్యాధి సోకిన 13 మందికి చింతపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, వ్యాధి వ్యాపించకుండా అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇదిలా ఉంటే ఆంత్రాక్స్ నిర్ధారణ సెంటర్ లేకపోవడంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సెంటర్ కు నమూనాలను పంపించారు. 

13 మందికి ఆంత్రాక్స్...

విశాఖపట్టణం : జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం సృష్టిస్తోంది. చింతపల్లి (మం) కొమ్మంగి గంజిగెడ్డలో 13 మందికి ఆంత్రాక్స్ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, వ్యాధి వ్యాపించకుండా అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 

10:21 - April 26, 2018

హైదరాబాద్ : పాతబస్తీలో అర్ధరాత్రి వేళ తిరుగుతున్న మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతులను ఆకతాయిలు వేధిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనితో బుధవారం అర్ధరాత్రి సౌత్ జోన్ పోలీసులు ఆపరేషన్ చబుత్ర నిర్వహించారు. అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న 15మంది మైనర్లతో పాటు 188 మందిని అదుపులోకి తీసుకున్నారు. యువతులను వేధిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం పోకిల వేలి ముద్రలను పోలీసులు సేకరించారు. గురువారం ఉదయం తల్లిదండ్రుల సమక్షంలో పోకిరీలకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. 

10:13 - April 26, 2018

నెల్లూరు : జిల్లాలో విషాద వాతావరణం నెలకొంది. టిడిపి పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి బుధవారం మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. రాజకీయాలకు అతీతంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గురువారం సాయంత్రం ఆనం వివేకా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. స్థానిక ఏపీ సెంటర్ లో ఆయన నివాసంలో ఆనం వివేకా భౌతికకాయాన్ని ఉంచారు. జిల్లా నలుమూలల నుండి ఆనం అభిమానులు, కుటుంబసభ్యులు, నాయకులు నివాళులర్పిస్తున్నారు.

ఇదిలా ఉంటే సాయంత్రం జరిగే అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఉదయం 11గంటలకు ఆయన జిల్లాకు రానున్నట్లు సమాచారం. ఇందుకు పోలీసులు తగిన విధంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఆపరేషన్ చబుత్ర...

హైదరాబాద్ : పాతబస్తీలో సౌత్ జోన్ పోలీసులు ఆపరేషన్ చబుత్ర నిర్వహించారు. అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న 15మంది మైనర్లతో పాటు 188 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

రైలు ప్రమాదంపై యూపీ సర్కార్ పరిహారం..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 13 మంది చిన్నారులు మృతి చెందారు. మృతి చెందిన కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారాన్ని ప్రకటించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 

09:21 - April 26, 2018

చిత్తూరు : జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఓ లారీ సృష్టించిన బీభత్సనికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. కడప నుండి పీలేరుకు సిమెంట్ లోడ్ తో వెళుతున్న లారీ గంగ జాతర చూసేందుకు వచ్చిన వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటన పీలేరు మండలం తానావడ్డేపల్లిలో చోటు చేసుకుంది. అక్కడికక్కడనే ముగ్గురు దుర్మరణం చెందారు. ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. 

09:17 - April 26, 2018

ఉత్తర్ ప్రదేశ్ : మరో రైలు ప్రమాదం..కాపలా లేని గేటు వద్ద మరో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. కాపలా లేని గేట్ల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేస్తాం..అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తామంటున్న పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. యూపీలో జరిగిన రైలు ప్రమాదంలో 13 మంది చిన్నారులు మృతి చెందడం రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

డివైన్ పబ్లిక్ స్కూల్ కు చెందిన విద్యార్థులను గురువారం ఉదయం బస్సులో ఎక్కించుకుని డ్రైవర్ వెళుతున్నాడు. ఖుషీనగర్ వద్ద కాపలా లేని గేటు వద్ద బస్సును ముందుకు పోనిచ్చాడు. కానీ అదే సమయంలో రైలు అత్యంత వేగంగా ముందుకు వస్తోంది. దీనిని గమనించని బస్సు డ్రైవర్ ముందుకు పోనివ్వడం..రైలు ఢీకొంటూ దూసుకెళ్లడం రెప్పపాటులో జరిగిపోయాయి. అక్కడికక్కడనే 13 మంది విద్యార్థులు అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గేటు పెట్టాలని ఎన్నోమార్లు వేడుకుంటున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన స్కూల్ విద్యార్థుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియాను అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఘటనపై విచారణ చేపట్టాలని ఘోరక్ పూర్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనా ప్రదేశం బీభత్సంగా మారిపోయింది. ఆర్తనాదాలతో మారుమోగుతోంది. 

08:25 - April 26, 2018

చిత్తూరు : ఓ జాతరకు వచ్చిన వారిని లారీ కబలించిం వేసింది. పీలేరు మండలంలోని తానావడ్డేపల్లిలో లారీ సృష్టించిన బీభత్సానికి ముగ్గురు దుర్మరణం పాలయ్యరు. స్థానికంగా జరుగుతున్న గంగ జాతర చూసేందుకు కొంతమంది వచ్చారు. గురువారం ఉదయం వీరిలో కొంతమంది రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. కడప నుండి పీలేరుకు సిమెంట్ లోడ్ తో అత్యంత వేగంగా వెళుతున్న లారీ రోడ్డు పక్కన నిలుచున్న వారిపైకి దూసుకెళ్లింది. దీనితో అక్కడికక్కడనే ముగ్గురు చనిపోగా మరికొందరికి గాయాలయ్యాయి. 

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర దుర్ఘటన...

యూపీ : రాష్ట్రంలో ఘోర దుర్ఘటన సంభవించింది. ఖుషినగర్ లో స్కూల్ బస్సును రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో 13 మంది విద్యార్థులు మృతి చెందగా 8మందికి గాయాలయ్యాయి. 

08:19 - April 26, 2018

గవర్నర్ వ్యవస్థపై పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గవర్నర్ ను టిడిపి నేతలు వ్యతిరేకిస్తున్నారు. విభజన సమయంలో..విభజన తరువాత గవర్నర్...సరైన విధంగా నిర్ణయాలు తీసుకోలేదని విమర్శలు చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని..తప్పుడు నివేదికలు సమర్పించారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చలో శ్రీరాములు (టిడిపి), విష్ణు (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

 

08:18 - April 26, 2018

గౌతమ్‌ గంభీర్‌ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును 2012,2014లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చాంపియన్‌గా నిలిపిన గంభీర్‌...ఐపీఎల్‌ 11వ సీజన్‌లో మాత్రం ఢిల్లీ కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా విఫలమయ్యాడు.గంభీర్‌ సారధ్యంలో ఢిల్లీ ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించగా....5 మ్యాచ్‌ల్లో ఓడింది.గంభీర్‌ స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టుకు సారధిగా వ్యవహరించనున్నాడు. గౌతమ్‌ గంభీర్‌ కేవలం బ్యాట్స్‌మెన్‌గా డేర్‌డెవిల్స్ జట్టులో కొనసాగనున్నాడు. 

08:14 - April 26, 2018

ఢిల్లీ : చెన్నై సూపర్‌కింగ్స్‌ మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నిన్న బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ, అంబటిరాయుడు చెలరేగడంతో బెంగళూరును ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ప్రత్యర్థి నిర్ధేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ధోనీ 34 బాల్స్‌లో 70 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. 

08:12 - April 26, 2018

ఢిల్లీ : పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్, పీటీఐ నేత ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి కూడా పెటాకులయ్యేలా కనిపిస్తోంది. పెంపుడు కుక్కలు, మొదటి భర్త పిల్లల వ్యవహారాల్లో దంపతుల మధ్య విబేధాల కారణంగా ఇమ్రాన్‌ భార్య బుష్రా పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల ఇమ్రాన్‌ ఆధ్యాత్మిక గురువు బుష్రా మనేకాను 2018 ఫిబ్రవరిలో నిఖా చేసుకున్నారు. బుష్రా మాజీ భర్త ఖవార్‌ ఫరీద్‌ మనేకాల కుమారుడు ఇమ్రాన్ ఇంట్లోనే ఉండడం ఆయనను బాధించినట్లు పాక్‌ మీడియా పేర్కొంది. ఆథ్యాత్మిక కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నాయంటూ ఇమ్రాన్ పెంపుడు కుక్కలను బుష్రా ఇంట్లో నుంచి పంపేశారు. ఇమ్రాన్ మళ్లీ వాటిని ఇంట్లోకి తిరిగి తీసుకురావడంతో గొడవ మరింత ముదిరినట్టు చెబుతున్నారు. సరిగ్గా మూడు నెలలు కూడా తిరక్కముందే విభేదాలు రావడం పట్ల ఇమ్రాన్‌ కుటుంబీకులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. 

07:34 - April 26, 2018

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో కాంగ్రెస్‌ నేత గులాం నబీ పటేల్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ పటేల్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన కన్ను మూశారు. మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో పటేల్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గులాంనబీ పటేల్‌ ఇంతకుముందు పిడిపిలో ఉన్నారు. ఈ దాడిని జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముప్తీ తీవ్రంగా ఖండించారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు సీఎం ట్వీట్‌ చేశారు. కాల్పులు జరిపిన ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. 

07:31 - April 26, 2018

కరీంనగర్‌ : జిల్లాలో భానుడు భగభగ లాడుతూ.. ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ప్రధాన జలవనరులైన ఎల్లంపల్లి, లోయర్‌ మానేర్‌లో నీటి మట్టం గణనీయంగా తగ్గడంతో భవిష్యత్‌పై ఆందోళన కలిగిస్తుంది. ఇక సింగరేణి కోల్‌బెల్ట్‌ ప్రాంతాలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండంతో కార్మకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో జనం బయటి రావడానికే భయపడుతున్నారు. గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండుతున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వచ్చే మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగె అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నీళ్లు లేక చెరువులు ఎండిపోయి మైదానాల్లా మారుతున్నాయి. బోర్లు ,బావుల్లో చుక్క నీరు లేకపోవడంతో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఇక పంట చేతికొచ్చే సమయానికి నీటి సమస్యలు తలెత్తడంతో రైతాంగం నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. వాటర్‌ ట్యాంకర్ల ద్వారా పంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నా రైతులకు ఫలితం లేకుండా పోతుంది. దీంతో ఎండిన పంట పశువులకు మేతగా మారింది.

ఉమ్మడి కరీంనగర్‌కు ప్రధాన జలవనరులుగా ఉన్న ఎల్లంపల్లి, లోయర్‌ మానేర్‌ జలశయాల్లో నీటి మట్టం గణనీయంగా తగ్గి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కరీంనగర్‌లో నీటి అవసరాలకు లోయర్‌ మానేర్‌ ఒక్కటే దిక్కు. దీంతో జలాశయంలో నీరు అడుగంటుతుండటంతో నగరానికి తీవ్రమైన నీటి కష్టాలు మొదలయ్యాయి. 24 టీఎంసీల సామర్థ్యం కలిగిన లోయర్‌ మానేర్‌ డ్యామ్‌లో ప్రస్తుతం 6.35 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 15 రోజులుగా బూస్టర్లకు నీటి ప్రెషర్‌ రాకపోవడంతో.. డ్యామ్‌లో నీటి మోటర్లు పెట్టి ఎత్తిపోసే పరిస్థితి నెలకొందని అధికారుల చెపుతున్నారు. ఇక హైదరాబాద్‌కు నీటిని తరలించే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో సైతం నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. 20.17 టీఎంసీల సామర్థ్యం గల ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 7.52 టీఎంసీల నీరు ఉంది.

సింగరేణి ప్రాంతంలో అత్యధిక డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బొగ్గు గనులు అధికంగా ఉండడంతో ఈ ప్రాంతంలో ప్రతిఏటా 47 నుండి 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే గడిచిన మూడు రోజుల నుండి 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే అధికంగా వేడి ఉండడంతో కార్మికులకు పని చేయడం కష్టంగా మారింది. దీంతో ఉపశమన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.-

పవర్ స్టేషన్ లో ఫైర్ ఆక్సిడెంట్...

ఢిల్లీ : వసంత్ కుంజ్ పవర్ స్టేషన్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

07:20 - April 26, 2018

విజయవాడ : నవ్యాంధ్ర రాజధానికే తలమానికంగా భావిస్తున్న ఎక్స్‌ప్రెస్‌ హైవేకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అనంతపురం నుంచి అమరావతికి తక్కువ సమయంలోనే చేరుకునేలా ప్రభుత్వం రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటి వరకు కార్యాచరణకు నోచుకోకపోవడంతో ఎక్స్‌ప్రెస్‌ హైవేపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏపీ రాజధాని అమరావతికి రాయలసీమ వాసులు ప్రయాణించాలంటే గంటలకొద్దీ ప్రయాణి చేయాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి రూపకల్పన చేసింది. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలను కలుపుతూ ఎక్స్‌ప్రెస్‌ హైవే మాస్టర్‌ప్లాన్‌ తయారైంది. మలుపుల్లేకుండా నాలుగు, ఆరు వరుసలతో దీనికి రూపకల్పన చేశారు. పుణె - ముంబై మధ్యనున్న హైవే తరహాలో రహదారిని నిర్మించేలా ... అనంతపురం నుంచి ఐదారు గంటల్లోనే అమరావతికి చేరుకునేలా మాస్టర్‌ప్లాన్‌ రూపుదిద్దుకుంది.

ఎక్స్‌ప్రెస్‌ హైవేకు ఇప్పటికే భూ సేకరణకు అవసరమైన పెగ్‌ మార్కింగ్‌లు ఏర్పాటు చేశారు. ఏపీలో కేంద్రం నిర్మించే ప్రాజెక్ట్‌లో ఇది ప్రధానమైనదని ప్రచారం కూడా జరిగింది. అయితే రోడ్డు వెడల్పును తగ్గించి ప్రతిపాదనలు పంపాలంటూ కేంద్రం ప్రభుత్వానికి లేఖ రాసింది. కేంద్రం వేసిన కొర్రీలతో ఈ రోడ్డు నిర్మాణం పూర్తికావడంపై సందేహాలు నెలకొన్నాయి.

వాస్తవానికి ఈ రహదారి నిర్మాణానికి 2015లోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రహదారి పొడవు మొత్తం 557 కిలోమీటర్లుగా ప్రతిపాదనల్లో చూపారు. 208 కిలోమీటర్ల మేర ఆరు వరుసల రోడ్డు... 349 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎక్స్‌ప్రెస్‌ హైవేలో మొత్తం 33 వంతెనలు, మరో 7 రైల్వే వంతెనలు ఏర్పాటు చేయాలి. అంతేకాదు.. 21 కిలోమీటర్ల మేర సొరంగాలు ఏర్పాటు చేయాలని ప్రపోజల్స్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి 25వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా.. కేంద్ర నిధులతోనే ఈ రహదారిని నిర్మిస్తామని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ ఆ మేరకు హామీకూడా ఇచ్చారు.

200 మీటర్ల వెడల్పుతో ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవేను నిర్మించాలనుకున్నారు. కానీ వెడల్పు ఎక్కువగా ఉందని... అంత అవసరం లేదని.. దాన్ని 100 మీటర్లకు కుదించి డీపీఆర్‌ను సిద్ధం చేసి పంపాలని కేంద్రం ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తతు రాజకీయ పరిస్థితుల్లో 100 మీటర్ల వెడల్పుతో తయారవుతున్న డీపీఆర్‌ను కేంద్రం ఆమోదిస్తుందో.. లేదోనన్న సందేహాలు నెలకొన్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.

07:18 - April 26, 2018

కృష్ణా : జిల్లా కొండపల్లిలో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసు వేధింపులతో మనస్థాపానికి గురైన దుర్గారావు, నాగమణి దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. టిఫిన్‌ బండి వద్ద జరిగిన ఘర్షణ కేసులో పోలీసులు చిత్రహింసలు పెట్టడంతో.. అవమానంభరించలేక దంపతులు ఉరేసుకున్నారని మృతుల బంధువులు అంటున్నారు. బాధితునిపై దాడిచేసిన వారే కేసు పెట్టి పోలీసులతో కొట్టించారని వారు ఆరోపిస్తున్నారు.

 

07:16 - April 26, 2018

విజయవాడ : దేశంలో స్త్రీలపై సాగుతున్న అకృత్యాలను అరికట్టాల్సిన బీజేపీ ప్రభుత్వం.. అరాచకశక్తులకు మద్దతిచ్చేలా వ్యవహరించడం సరైంది కాదంటూ ధ్వజమెత్తారు ఐద్వా రాష్ట్ర నాయకురాలు రమాదేవి. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడటాన్ని నిరసిస్తూ... విజయవాడలోని ఎంబీవీకే భవన్‌లో మహిళా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు మహిళలు, మహిళా సంఘాల నాయకులు, ఆయా పార్టీల నేతలు పాల్గొన్నారు. స్త్రీలపై ఆకృత్యాలను అరికట్టకుంటే తీవ్రపరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు.  

07:15 - April 26, 2018

నెల్లూరు : స్టైల్‌ఆఫ్‌ సింహపురిగా పేరొందిన ఆనం వివేకానందరెడ్డి మృతి చెందారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ నిన్న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. బోన్‌కేన్సర్‌తో బాధపడుతూ కిమ్స్‌ ఆస్పత్రిలో కొంతకాలంగా చికిత్స తీసుకుంటూ మృతిచెందారు. ఇవాళ నెల్లూరులో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ఆనం వివేకానందరెడ్డి... ఈపేరు వింటే చాలు ఓ విలక్షణ రాజకీయనేత అందరి మదిలో మెదులుతారు. ప్రతిమాటలో చతురత వొలికించడం ఆనంకు మాత్రమే తెలిసిన విద్య. ప్రత్యర్థులపై విమర్శల్లోనూ, ప్రజలను ఆకట్టుకోవడంలోనూ ఈయనదో ప్రత్యేక స్టైల్‌. విచిత్ర వేషధారణల్లో మెరుస్తూ .. ప్రజలను ఆకట్టుకున్న ఆనం మాస్‌లీడర్‌గా పేరొందారు. నెల్లూరులో రాజకీయ దురంధరులను ఎదుర్కొని ప్రజామద్దతు పొందిన నేతగా నిలిచిన వివేకా... తన కుటుంబాన్ని, అభిమానులను శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.

రాజకీయ చతురత కలిగిన నాయకుడిగా ప్రజల మధిలో నిలిచిన ఆనం వివేకానందరెడ్డి.. 1950 డిసెంబర్ 23వ తేదీన జన్మించారు. తొలినాళ్లలో విఆర్ కళాశాలలో విద్యార్ధి సంఘ నేతగా పనిచేసిన వివేకా.. 1982లో తన రాజకీప్రస్థానాన్ని ప్రారంభించారు. అప్పట్లో భూతనఖా బ్యాంకు అధ్యక్షునిగా పనిచేశారు. తర్వాత నెల్లూరు మున్సిపల్‌ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. 1988లో జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా పదివి నిర్వహించారు. మూలాపేటలోని వేణుగోపాల స్వామి ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తగా కూడా కొంతకాలం ఉన్నారు.

తన రాజకీయ జీవితంలో అనేక పదవులను చేపట్టిన వివేకానందరెడ్డి.. రెండు పదవుల్లో మాత్రం మంచిపేరు సంపాదించుకున్నారని నెల్లూరు ప్రజలు అంటారు. 1995లో నెల్లూరు మున్సిపల్ చైర్మన్ గా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.1999, 2004, 2009లోనూ విజయం సాధించి.. వరుసగా మూడుసార్లు గెలిచిన నేతగా ఘనత సాధించారు. ఆనం పొలిటికల్ కెరీర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రారంభమైనా.. 1983లో ఎన్టీఆర్‌ ప్రభజనం మొదలు కావడంతో టీడీపీలోకి వెళ్లారు. తర్వాత 1989లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో టాప్‌లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితులాగా ఆనం బ్రదర్స్‌ మెలిగారు. తన సోదరుడు ఆనం రామనారాయణరెడ్డికి కాంగ్రెస్‌లో మంత్రి పదవి దక్కడంలో వివేకాదే కీలకపాత్ర అని చెబుతారు.
మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన వివేకానందరెడ్డి 2014 ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ పరిస్థితి దిగజారింది. అయినా తన కుమారుడు, సోదరుడుని కాంగ్రెస్‌ తరపున పోటీలో నిలిపారు. వారిద్దరూ ఓటమి పాలవడంతో ఆనం కుటుంబం రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈ పరిస్థితుల్లో ఆనం బ్రదర్స్‌ తమ రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నారు. 2016లో టీడీపీ గూటికి చేరారు.

దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన వివేకానందరెడ్డి మృతి చెందడంతో ఆనం కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో ఉన్న వివేకానందరెడ్డి పార్థివ దేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు, పలువురు కాంగ్రెస్ నేతలు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే బాలకృష్ణ వివేకా మృతికి సంతాపం తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటలకు నెల్లూరులో వివేకానంద రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. నెల్లూరులోని ఏసి నగర్లో ఉన్న వారి సొంత స్థలంలో అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. తమ ప్రియతమ నాయకుడిని కడసారి చూసేందుకు ఇప్పటికే అభిమానులు నెల్లూరుకు చేరుకుంటున్నారు. 

07:13 - April 26, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అందించే ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకం డబుల్‌ ధమాకా సాధించింది. ఈ పథకానిరి రెండు అవార్డులు దక్కాయి. ఇక గ్రేటర్‌ వరంగల్‌, అర్బన్‌ మిషన్‌ భగీరథకు చెరొక అవార్డు లభించింది. హడ్కో 48వ వార్షికోత్సవం సందర్భంగా నిన్న ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్ సింగ్‌పూరి ఈ అవార్డులను ప్రదానం చేశారు. 

07:12 - April 26, 2018

సిద్ధిపేట : రాష్ర్ట ప్రభుత్వం రైతులకు అత్యుత్తమమైన.. నాణ్యతా ప్రమాణాలతో కూడిన సేవలను అందిస్తోందని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ సేవలకు గుర్తింపుగా అంతర్జాతీయ హెవైఎం సంస్థ నుంచి... ఐఎస్‌ఓ 9001-2015 అవార్డ్‌ సిద్దిపేట మార్కెట్‌ యార్డ్‌ దక్కించుకుందన్నారు మంత్రి హరీష్‌రావు. రైతులకు అన్ని వసతులను కల్పిస్తూ .. తెలంగాణలోని అన్ని ప్రాంతాల మార్కెట్‌ యార్డులకు అవార్డులు వచ్చేలా కృషిచేస్తామని మంత్రి తెలిపారు.

06:49 - April 26, 2018

హైదరాబాద్ : నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న 'ఎన్టీఆర్‌' సినిమా నుంచి దర్శకుడు తేజ వైదొలిగారు. బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం షూటింగ్‌ ... ఇటీవల రామకృష్ణ స్టూడియోలో ప్రారంభమైంది. అయితే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నానని తేజ ప్రకటించారు. తాను ఎన్టీఆర్‌కు వీరాభిమానినని.... ఈ సినిమాకు న్యాయం చేయలేనని అనిపిస్తోందని... అందుకే తప్పుకుంటున్నా'నని పేర్కొన్నారు.

06:47 - April 26, 2018

హైదరాబాద్ : తెలంగాణ జన సమితి పార్టీ... ఆవిర్భావ సభను విజయంతం చేసేందుకు జన సమీకరణపై దృష్టి సారించింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలను సభకు తరలించేందుకు ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తోంది. తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ జోష్‌పై 10టీవీ కథనం... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడి నాలుగేళ్లు అవుతోంది. కానీ అభివృద్ధి ఫలాలు మాత్రం అన్ని వర్గాలకు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రస్తుతం ప్రభుత్వం నెరవేర్చడం లేదని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు... ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలంగాణ జన సమితి పార్టీని ఏర్పాటు చేశారు. ఈనెల 29న ఆవిర్భావ నిర్వహించుకుంటోంది. ఆవిర్భావ సభకు టీజేఎస్‌ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.

అనేక అవాంతరాల తర్వాత తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సరూర్‌నగర్‌ స్టేడియంలో సభ నిర్వహణకు ఏర్పాటు జరుగుతున్నాయి. అయితే టీజేఎస్‌ ఆవిర్భావ సభకు జన సమీకరణపై ఫోకస్‌ పెట్టింది. సభను విజయంతం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికే గ్రామగ్రామాన ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తోంది. సభను విజయంతం చేసేందుకు , జనాలను తరలించేందుకు ప్రత్యేక కమిటీలను నియమించింది. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌లాంటి పెద్ద నగరాల్లో జన సమీకరణకు కృషి జరుగుతోంది. విశ్వ విద్యాలయాలు, కాలేజీలు, హాస్టల్స్‌, విద్యాసంస్థల ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అటు సోషల్‌ మీడియాలోనూ ప్రచారం విస్తృతంగా చేస్తోంది టీజేఎస్‌. బహిరంగ సభకు అమరవీరుల కుటుంబ సభ్యులనూ సమీకరించాలని టీజేఎస్‌ నిర్ణయించింది.

ఆవిర్భావ సభ తర్వాత టీజేఎస్‌ శాశ్వత కమిటీలను ఏర్పాటు చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి మాత్రం అందరూ తాత్కాలిక కమిటీ కింద మాత్రమే పనిచేయాలని నిర్ణయించారు. ఆవిర్భావ సభ నుంచి పార్టీ ఏర్పాటుకు దారితీసిన పరిణామాలను కోదండరాం వివరించనున్నారు. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ, పార్టీ నిర్మాణం ఎలా ఉండబోతుందన్న అంశాలను ప్రకటించనున్నారు. -

06:46 - April 26, 2018

హైదరాబాద్ : శుక్రవారం నుండి టీఆర్‌ఎస్‌ 17వ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. ఇప్పటికీ ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్లీనరీలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుతోపాటు... రైతు సమస్యలపైన ప్రధానంగా చర్చించనున్నారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌... జాతీయ రాజకీయాలపై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన గులాబీ పార్టీ.. 17 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 2001 ఏప్రిల్‌ 27వ తేదీన టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక అజెండాగా కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్‌ లక్ష్యం కూడా నెరవేరింది. సుదీర్ఘ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పడింది. అంతేకాదు.. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారపగ్గాలు కూడా చేజిక్కించుకుంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత.. నాలుగేళ్లుగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. బంగారు తెలంగాణ నినాదంతో... అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొత్త పుంతలు తొక్కించారు. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత అంశాలుగా సాగునీటి వనరులే అన్న అభిప్రాయంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలను ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవానికి రెడీ అయ్యింది.

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. నేషనల్‌ పాలిటిక్స్‌లో గుణాత్మక మార్పులు తేవాలన్న అభిప్రాయంతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా అన్ని రాజకీయ పార్టీలను ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నాలను మొదలుపెట్టారు. జాతీయ స్థాయిలో కూడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అమలు చేయాలన్న ఎజెండాను ప్రటించే అవకాశముంది. సాగునీటి వినియోగం విషయంలో ఇప్పటి వరకు జాతీయ పార్టీలకు విధానం లేకపోవడంతోనే నీటి వినియోగం సక్రమంగా చేసుకోవడం లేదన్న వాదనను కేసీఆర్‌ వినిపిస్తున్నారు. జాతీయ అంశాలతో ముడిపడి ఉన్న సమస్యలను ప్లీనరీ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి శుక్రవారం జరుగబోయే గులాబి పార్టీ ప్రతినిధుల సభ జాతీయ రాజకీయాలపై మరింత ఆసక్తి రేపేలా కనిపిస్తోంది.

06:45 - April 26, 2018

విజయవాడ : ఏపీ టూరిజం మంత్రి అఖిలప్రియపై టీడీపీ అధిష్టానం సీరియస్‌ అయ్యింది. ఆళ్లగడ్డ ఫైట్‌పై మాట్లాడేందుకు రావాలని అధిష్టానం ఆదేశించినా మంత్రి సమావేశానికి హాజరుకాలేదు. దీంతో ఇవాళ ఎట్టిపరిస్థితుల్లోనూ సమావేశానికి హాజరుకావాల్సిందేనని హుకుం జారీ చేసింది. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు.. ఇద్దరు నేతలతో ఏం చర్చిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఆళ్లగడ్డలో ఇద్దరు టీడీపీ నేతల మధ్య తలెత్తిన వివాదం ముదురుపాకాన పడింది. మంత్రి అఖిలప్రియ - ఏవీ సుబ్బారెడ్డి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అసలే ఉప్పు - నిప్పులా ఉన్న వర్గపోరు... ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడితో మరింత సీరియస్‌ అయ్యింది. పార్టీ పిలుపులో భాగంగా ఏవీ సుబ్బారెడ్డి సైకిల్‌ ర్యాలీ చేపడుతుండగా ఆయనపై రాళ్లదాడి జరిగింది. మంత్రి అఖిలప్రియ అనుచరులే చేశారన్నది ఏవీ సుబ్బారెడ్డి వాదన. ఇందుకు తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆళ్లగడ్డ ఫైట్‌పై సీరియస్‌ అయ్యింది. నేతల మధ్య తలెత్తిన వివాదాన్ని చక్కదిద్దేందుకు పార్టీ అధినాయకత్వం ఇద్దరినీ బుధవారం అమరావతికి రావాల్సిందిగా ఆదేశించింది.

అధిష్టానం పిలుపుతో ఏవీ సుబ్బారెడ్డి మాత్రం అమరావతికి వచ్చారు. అయితే మంత్రి అఖిలప్రియ మాత్రం హాజరుకాలేదు. శోభానాగిరెడ్డి వర్ధంతి కార్యక్రమ ఉండడంతో రాలేకపోతున్నట్టు అధిష్టానానికి ఆమె సమాచారం ఇచ్చారు. దీంతో సమావేశం గురువారానికి వాయిదా పడింది. మంత్రి అఖిలప్రియ వ్యవహారంపై అధినాయకత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. సమావేశానికి రావాల్సిందిగా ముందుగానే సమాచారం అందించినా... హాజరుకాకపోవడంపై గుర్రుగా ఉంది. చివరి నిముషంలో హాజరుకాలేకపోతున్నానని చెప్పడంపై అధిష్టానం సీరియస్‌గానే మందలించినట్టు తెలుస్తోంది. దీంతో ఇవాళ తాను హాజరవుతానని చెప్పడంతో సమావేశం నేటికి వాయిదా పడింది.

ఇద్దరు నేతలతో ఇవాళ చంద్రబాబు సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో ఏం చర్చిస్తారు.. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డి తనపై జరిగిన రాళ్లదాడికి సంబంధించిన ఆధారాలు అధిష్టానానికి అందజేశారు. అధిష్టానం దీనిపై ఏ నిర్ణయం తీసుకున్నా సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆళ్లగడ్డ ఫైట్‌ విషయంలో ఇద్దరు నేతల మధ్య అధిష్టానం రాజీకుదిర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు హైకమాండ్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఎవ్వరికీ ఇబ్బంది కలుగకుండా చంద్రబాబు సమస్యను ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తి రేపుతోంది.

నెల్లూరుకు బాబు...

నెల్లూరు : జిల్లా సీనియర్ రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. స్థానిక బొడిగాడి తోటలో నాలుగు గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు, టీడీపీ ముఖ్యనేతలు ఈ అంత్యక్రియలకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. 

నెల్లూరులో ఆనం వివేకా అంత్యక్రియలు...

నెల్లూరు : టిడిపి నేత ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలు గురువారం జరుగనున్నాయి. అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

హైదరాబాద్ కు గవర్నర్...

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీ పర్యటనలో ఆద్యతం అనూహ్య పరిణామాలు చోటుచేసుకొన్నాయి. మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం ఢిల్లీ చేరుకున్న నరసింహన్‌ బుధవారం తన టూర్‌ను అర్థాంతరంగా ముగించుకుని హైదరాబాద్‌ తిరిగి వెళ్లడం రాజకీయంగా పెద్ద చర్చకు తావిస్తోంది. 

గులాం నబీ పటేల్ ను కాల్చి చంపిన ఉగ్రవాదులు...

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో కాంగ్రెస్‌ నేత గులాం నబీ పటేల్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ పటేల్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన కన్ను మూశారు. మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో పటేల్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 

ఇమ్రాన్ మూడో పెళ్లి కూడా పెటాకులు ?

ఢిల్లీ : పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్, పీటీఐ నేత ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి కూడా పెటాకులయ్యేలా కనిపిస్తోంది. పెంపుడు కుక్కలు, మొదటి భర్త పిల్లల వ్యవహారాల్లో దంపతుల మధ్య విబేధాల కారణంగా ఇమ్రాన్‌ భార్య బుష్రా పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల ఇమ్రాన్‌ ఆధ్యాత్మిక గురువు బుష్రా మనేకాను 2018 ఫిబ్రవరిలో నిఖా చేసుకున్నారు.

కెప్టెన్సీకి గంభీర్ గుడ్ బై...

ఢిల్లీ : గౌతమ్‌ గంభీర్‌ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును 2012,2014లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చాంపియన్‌గా నిలిపిన గంభీర్‌...ఐపీఎల్‌ 11వ సీజన్‌లో మాత్రం ఢిల్లీ కెప్టెన్‌గా,బ్యాట్స్‌మెన్‌గా విఫలమయ్యాడు.

Don't Miss