Activities calendar

27 April 2018

బోర్డర్ లో ఉత్తర, దక్షిణ కొరియా అధ్యక్షులు..

హైదరాబాద్ : ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న శత్రుత్వానికి తెరపడింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌లు ఇరు దేశాలను వేరు చేసే సైనిక విభజన లైన్‌ వద్ద కలుసుకున్నారు. ఇరువురు నేతలు చిరునవ్వుతో కరచాలనం చేసుకున్నారు. కిమ్‌ జోంగ్‌ దక్షిణ కొరియా అధ్యక్షుడిని తమ దేశంలోకి ఆహ్వానించడంతో మొదట మూన్‌ జే ఉత్తర కొరియా భూభాగంలోకి వెళ్లారు. ఆ తర్వాత కిమ్‌ దక్షిణ కొరియాలో అడుగుపెట్టారు. ఉభయ కొరియాల సరిహద్దులోని శాంతి గ్రామం పన్‌ముంజుమ్‌లోని 'పీస్‌ హౌస్‌'లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు.

22:01 - April 27, 2018

సూర్యాపేట : మర్కెట్‌లో ఉద్రిక్తత నెలకొంది. మద్దతుధర దొరకడం లేదంటూ మార్కెట్‌యార్డ్‌ కార్యాలయంపై దాడి చేసి, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. విజయవాడ జాతీయ రాహదారిపై రాస్తారోకో చేపట్టారు. మద్దతు ధర ఇస్తామన్న జాయింట్‌ కలెక్టర్‌ మాట అమలు కాలేదని రైతులు ఆరోపించారు.

సూర్యాపేట మార్కెట్‌ యార్డ్‌ ఉద్రిక్తం..
అన్నదాతల ఆవేశంతో సూర్యాపేట మార్కెట్‌ యార్డ్‌ ఉద్రిక్తంగా మారింది. తమ పంటలకు సరైన ధర చెల్లించాలంటూ రైతులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం నాడు, జాతీయ రహదారి 65 రహదారిపై బస్తాలను వేసి రాస్తారోకో చేపట్టారు. దీంతో రాహదారిపై ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది.

కలెక్టర్‌ సంజీవ రెడ్డి, మాట తప్పాడన్న రైతన్నలు
తమ పంటకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పిన జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సంజీవ రెడ్డి, మాట తప్పాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాల్‌కు 1400 రూపాయలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. మార్కెట్‌ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతోనే సూర్యాపేట మార్కెట్‌లో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆరోపించారు.

నిరసనగా అన్నదాతలు రాస్తారోకో
గురువారం మార్కెట్‌కు రికార్డు స్థాయిలో లక్ష బస్తాల ధాన్యం వచ్చింది. దీంతో ట్రేడర్‌లు ఉద్దేశపూర్వకంగానే ధాన్యం ధరను తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నిరసనగా అన్నదాతలు రాస్తారోకో చేపట్టారు.. అయినా ట్రేడర్‌ల నుంచి ఎటువంటి సహకారం రాకపోవడంతో మార్కెట్‌ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

రైతు సమస్యలను పరిష్కారించాలని డిమాండ్
మరో పక్క వరంగల్ జిల్లా సంగెం మండలం తిగరాజులపల్లి గ్రామ రైతులు వరి, మొక్కజొన్నలను వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. అధికారులు ఎంతో ఆర్భాటంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పోతున్నారు తప్ప ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. రైతు పక్షపాతి అని చెప్పుతున్న ప్రభుత్వం ఇకనైన రైతు సమస్యలను పరిష్కారించాలని స్థానికి నేతలు డిమాండ్ చేశారు. 

21:56 - April 27, 2018

హైదరాబాద్ : అవినీతి ఆరోపణలతో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... ఈ విషయంలో టీఆర్‌ఎస్‌ సర్కారుపై స్వరం మరింత పెంచారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్‌దే అన్న ధీమాతో ఉన్న ఉత్తమ్‌... పవర్‌లోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ కుటుంబం అవినీతిపై విచారణ జరిపిస్తామన్న వాదాన్ని వినిపిస్తున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో రైలు ప్రాజెక్టు పొడిగింపు, కొన్ని ఫార్మా కంపెనీలకు భూకేటాయింపుల్లో వేలకోట్ల అవినీతి జరిందని ఆరోపిస్తున్నారు. అవినీతి ఆరోపణలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎండగడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు... దీనిని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. బస్సుయాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. మీడియా చిట్‌చాట్‌లో కేసీఆర్‌ కుటుంబంపై ఆరోపణల స్వరం పెంచారు.

ఫార్మా కంపెనీలకు భూకేటాయింపుల్లో వేల కోట్ల అవినీతి
కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖల్లో భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందని ఉత్తమ్‌ ఆరోపిస్తున్నారు. మాదాపూర్‌తోపాటు, రంగారెడ్డి జిల్లాలో రెండు ఫార్మా కంపెనీలకు భూకేటాయింపులు జరపడంతో వేల కోట్ల అవినీతి జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. ఆయా కంపెనీలకు వందలాది ఎకరాల భూములు కేటాయించడం, రాయితీలు కల్పించడంలో భారీగా ముడుపులు ముట్టాయన్న వాదాన్ని లేవనెత్తుతున్నారు. దోచుకున్న డబ్బును దాచుకునేందుకు తరచూ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

శంషాబాద్‌ వరకు మెట్రో రైలు ప్రాజెక్టు పొడిగింపులో అవినీతి
కేసీఆర్‌ పాలనలో ప్రజలు అప్పులపాలైతే... ముఖ్యమంత్రి కుటుంబం మాత్రం భారీగా ఆస్తులు కూడబెట్టుకొందన్న వాదాన్ని ఉత్తమ్‌ విపినిస్తున్నారు. శంషాబాద్‌ వరకు మెట్రోరైలు ప్రాజెక్టు పొడిగింపులో వందల కోట్ల అవినీతి జరిగిందన్న రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ కుటుంబం అవినీతిపై విచారణకు ఆదేశిస్తామన్నారు.

బస్సు యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ధీమాతో ఉన్న ఉత్తమ్‌... ఇందుకు పలు సమీకరణలను ప్రస్తావిస్తున్నారు. బస్సు యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నది ఆయన వాదన. దక్షిణ తెలంగాణతోపాటు టీఆర్‌ఎస్‌ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ అనుకూల పవనలు ఉన్నాయని చెబుతున్నారు. కాంగ్రెస్‌ చేయిస్తున్న సర్వేల్లో రోజు రోజుకు పార్టీ బలం పెరుగుతోందని చెబుతున్నారు. ఇప్పకిప్పుడు ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్‌కు 80 సీట్లు తగ్గవన్న గణాంకాలు ఉత్తమ్‌ చూపిస్తున్నారు. పొత్తులపై స్పందిస్తూ.. ఈ విషయంలో ఇంతవరకు ఎవరితో మాట్లాడలేదంటున్న ఉత్తమ్‌... తుది నిర్ణయం మాత్రం అధిష్టానానిదేనని చెబుతున్నారు. మొత్తంమీద వచ్చే ఎన్నికల్లో అధికారంపై ఆశలు పెంచుకున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... కేసీఆర్‌ కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. 

21:44 - April 27, 2018

ఢిల్లీ : సివిల్‌ సర్వీసెస్‌ 2017 ఫలితాల్లో తెలంగాలలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురశెట్టి అనుదీప్‌ అఖిలభారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. అనుకుమారి రెండో ర్యాంకు సాధించగా, సచిన్‌ గుప్తా మూడో ర్యాంకు పొందారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. నీలి సాయితేజ 43వ ర్యాంకు, నారపురెడ్డి మౌర్య 100వ ర్యాంకు సాధించారు. జి.మాధురి 144వ పొందగా, వివేక్‌ జాన్సన్‌ 195వ ర్యాంకు సాధించారు. మొత్తం 990 మంది అభ్యర్థులను ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌, సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌-ఏ, గ్రూప్‌-బీ పోస్టులకు ఎంపికయ్యారు. 

21:41 - April 27, 2018

మేడ్చల్ : టీఆర్‌ఎస్‌ ప్లీనరీ విజయవంతంగా ముగిసింది. సీఎం అధ్యక్షతన జరిగిన ఈ ప్లీనరీలో ఆరు తీర్మానాలను ఆమోదించారు. దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం, ఇంటింటికి సంక్షేమం-ప్రతి ముఖంలో సంతోషం' లాంటి తీర్మానాలు ఇందులో ఉన్నాయి.

ఆరు తీర్మానాలకు ప్లీనరీ ఆమోదం
ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ఆరు తీర్మానాలను ఆమోదించింది. ఉదయం స్వాగతోపన్యాసం తర్వాత తొలి తీర్మానాన్ని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ప్రవేశపెట్టారు. దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కేకే.. తెలంగాణ పునర్నిర్మాణం కోసం టీఆర్ఎస్‌ నిర్విరామంగా కృషి చేస్తుందన్నారు. కేంద్ర నిర్ణయాలు ఏకపక్షంగా ఉండకూడదని... రాష్ట్రాలు, కేంద్రానికి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలన్నారు. దేశంలో భాగమైన రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని.. అందుకే కేసీఆర్‌ నేతృత్వంలోని ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచన చేస్తున్నారని దానికి అందరూ మద్దతివ్వాలన్నారు కేకే.

తృప్తినిస్తున్న సంక్షేమ పథకాలు : బాలకిషన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల బతుకుల్లో సంతృప్తిని ఇస్తున్నాయన్నారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. టీఆర్‌ఎస్ ప్లీనరీలో ఇంటింటికి సంక్షేమం - ప్రతీ ముఖంలో సంతోషం అనే తీర్మానాన్ని ఎమ్మెల్యే రసమయి ప్రతిపాదించగా.. టీఆర్‌ఎస్ నేత గట్టు రామచందర్‌రావు బలపరిచారు.

మైనార్టీల సంక్షేమం తీర్మానం ఆమోదం..
అనంతరం బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌.. సమానాభివృద్ధే ధ్యేయంగా మైనార్టీల సంక్షేమం అనే తీర్మానాన్ని ప్రతిపాదించగా... ఇంతియాజ్‌ అహ్మద్‌ బలపరిచారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం కేసీఆర్‌ చేస్తున్న కృషిని అభినందించారు.

రైతులకు ఎకరాకు 8 వేల రూపాయలు
వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేసీఆర్‌ నడుం బిగించారన్నారు. రైతులకు పంట పెట్టుబడి పథకం దేశానికే ఆదర్శమని... ఈ ఏడాది నుంచి రైతులకు ఎకరాకు 8 వేల రూపాయలు అందిస్తున్నామన్నారు.

మౌలిక సదుపాయాల తీర్మానం ఆమోదం..
సుస్థిర అభివృద్ధి కోసం విస్తృతంగా మౌలిక సదుపాయాల కల్పన అనే తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రతిపాదించగా... ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌ బలపరిచారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు ముఖ్యమని... పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తూ..అవినీతికి తావులేకుండా కొత్త పరిశ్రమలను నెలకొల్పుతున్నామన్నారు. మొత్తానికి దేశ రాజకీయాల్లోకి ప్రవేశంపై దృష్టి సారించడమే కాకుండా... ప్లీనరీలో కూడా దీనికి సంబంధించిన తీర్మానం చేయడంతో... కేసీఆర్‌ ఇకపై దీనిపైనే ఫుల్‌ ఫోకస్‌ పెడతారన్న భావన వ్యక్తమవుతోంది. 

21:35 - April 27, 2018

మేడ్చల్ : దేశ రాజకీయాలపై పార్టీ వైఖరిని స్పష్టం చేశారు గులాబీ దళపతి. జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకం చేసి ఫెడరల్‌ ఫ్రంట్‌ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌ నుంచే భూకంపం సృష్టిస్తానన్న కేసీఆర్‌.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్న తన ప్రకటనతో కాంగ్రెస్‌, బీజేపీ గుండెల్లో దడ పుట్టిందన్నారు.

ఘనంగా టీఆర్‌ఎస్‌ ప్లీనరీ
తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అద్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్‌ పూలమాల వేశారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ.. నివాళులు అర్పించారు.

దేశ రాజకీయాలపై స్పష్టతనిచ్చిన కేసీఆర్‌
దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పోషించే పాత్రపై ప్లీనరీలో స్పష్టతనిచ్చారు సీఎం కేసీఆర్‌. దేశాన్ని ఇప్పటివరకు పాలించిన కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయం అవసరమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తాము చేయాల్సిన పనులు చేయకుండా.. రాష్ట్రాలను మున్సిపాలిటీల కంటే హీనంగా చూస్తున్నాయని విమర్శించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని కేసీఆర్ ఉద్ఘాటించారు. తాను ఫెడరల్ ఫ్రంట్ గురించి చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిందన్నారు. మోదీ ఏజెంట్ కేసీఆర్ అని రాహుల్ గాంధీ అంటుంటే.. ఫ్రంట్‌కు టెంటే లేదని బీజేపీ నేతలు అంటున్నారు.. మరీ టెంటే లేనప్పుడు బీజేపీ నేతలకు భయమెందుకు? అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

దేశం కోసం ఎంతకైనా పోరాడుతా : కేసీఆర్‌
దేశం బాగు కోసం తాను ఎంతకైనా పోరాడుతానని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించానో.. దేశం మంచి కోసం ఆ విధంగా పని చేస్తానన్నారు. దేశానికి ఎంతో కొంత తెలంగాణ నుంచే మేలు జరగాలన్నారు. వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి.. హైదరాబాద్‌ నుంచే భూకంపం సృష్టిస్తానన్నారు. జాతీయ స్థాయిలో 'హర్‌ ఎకర్‌ కో పానీ.. హర్‌ కిసాన్‌కో పానీ' నినాదంతో ముందుకెళ్తామని గులాబీ బాస్‌ స్పష్టం చేశారు.

ఉత్తమ్‌పై నిప్పులు చెరిగిన కేసీఆర్‌
70 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్‌లు దేశానికి చేసిందేమీ లేదన్నారు కేసీఆర్‌. దేశంలో ఎన్నో వనరులున్నా సద్వినియోగం చేసుకోలేదన్నారు. చైనాలాంటి దేశాలతో పోలిస్తే అన్ని రంగాల్లో దేశం వెనకబడే ఉందన్నారు.

టీఆర్ఎస్ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు కేసీఆర్‌...
టీఆర్ఎస్ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు కేసీఆర్‌. పార్టీ స్థాపించిన సమయంలో ఎన్నో హేళనలు, అవమానాలు ఎదుర్కొన్నామని.. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రధాని, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ కూడా అభినందించారన్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శమని నీతిఆయోగ్‌ చెప్పిందన్నారు.

సంక్షేమ ఫలాలను ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారన్న కేసీఆర్..
తెలంగాణలో సంక్షేమ ఫలాలను ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారన్నారు కేసీఆర్‌. కొన్ని పనులు చేయాలంటే సాహసం.. ధైర్యం కావాలి. తండాలను పంచాయతీలుగా మార్చాలని అనేక సంవత్సరాలుగా గిరిజనులు పోరాటం చేస్తే.. గత ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి కూడా నెరవేర్చలేదన్నారు. కానీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన 4 వేల పైచిలుకు గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశామన్నారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై కేసీఆర్‌ నిప్పులు
ఇక టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుంటే అడగడుగునా అడ్డుకునే పనులు చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులను వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రగతి భవన్‌లో 150 గదులు ఉన్నాయన్న ఉత్తమ్‌ నిరూపిస్తే.. ముక్కుకు నేలకు రాస్తానని... సీఎం పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు. లేకపోతే ఉత్తమ్‌ ప్రగతి భవన్‌ ముందు ముక్కుకు నేలకు రాస్తాడా అని కేసీఆర్‌ సవాల్‌ విసిరాడు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు : కేసీఆర్‌
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు కేసీఆర్‌. అన్ని వర్గల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. ఎంబీసీ నాయకులకు ఎమ్మెల్సీలుగా, నామినేటెడ్‌ పదవులిస్తామన్నారు. ఇక త్వరలోనే మిషన్‌ భగీరథ పథకంతో ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లు అందిస్తామన్నారు.ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. తాము తీసుకొస్తున్న సంక్షేమ పథకాలే తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

సివిల్స్ లో జగిత్యాల చిన్నోడికి ఫస్ట్ ర్యాంక్..

ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ 2017 తుది ఫలితాలను ఈరోజు వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ తుది ఫలితాల్లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లివాసి దురిశెట్టి అనుదీప్ మొదటి ర్యాంక్ సాధించాడు. అనుకుమారి రెండో ర్యాంక్ సాధించగా.. సచిన్ గుప్తా మూడో ర్యాంకు సాధించాడు. ఈ సివిల్స్ ఫలితాల్లో ఇరు తెలుగు రాష్ర్టాల నుంచి పలువురు అభ్యర్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. నీలం సాయితేజ 43వ ర్యాంక్, నారపురెడ్డి మౌర్య 100వ ర్యాంక్, జి. మాధురి 144వ ర్యాంక్, వివేక్ జాన్సన్ 195 ర్యాంకు సాధించారు.

ఎన్‌కౌంటర్‌లో 8మంది మావోలు మృతి..

కొత్తగూడెం: తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యంలోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున తూపాకుల మోతలు దద్దరిల్లాయి. మావోయిస్టులకు - పోలీసులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. కాగా నలుగురు గ్రే హౌండ్స్ కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాల పాలయ్యారు. 

ఎన్‌కౌంటర్‌లో 8మంది మావోలు మృతి..

కొత్తగూడెం: తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యంలోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున తూపాకుల మోతలు దద్దరిల్లాయి. మావోయిస్టులకు - పోలీసులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. కాగా నలుగురు గ్రే హౌండ్స్ కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాల పాలయ్యారు. 

సమయం అడిగిన కేంద్రం,తిరస్కరించిన సుప్రీం..

ఢిల్లీ : కావేరీ జల పంపిణీ పథకాన్ని రూపొందించేందుకు రెండు వారాలపాటు గడువు పొడిగించాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కోరింది. వచ్చే నెల 3 నాటికి ఓ పథకాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు గడువు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆదేశాలను సవరించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తిరస్కరించారు. తమ ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. తమ తీర్పు ప్రకారం పథకాన్ని రూపొందించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని దీపక్ మిశ్రా పేర్కొన్నారు.

నేను అలా అనలేదు, నిరూపిస్తా : ఉత్తమ్‌

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ పై సీఎం కేసీఆర్ నిప్పులు కురిపించారు. ప్రగతిభవన్ లో 150 గదులు ఉన్నాయని వ్యాఖ్యలు చేసిన టీపీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతముక్కు నేలకు రాయిస్తానని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఈ విషయంపై స్పందిన ఉత్తమ్ ప్రగతి భవన్ లో 150 గదులు ఉన్నాయని తాను అనలేదని, ప్రజాధనంతో కేసీఆర్ అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మాత్రమే వ్యాఖ్యానించాననీ..ఈ విషయమై తాను చేసిన వ్యాఖ్యలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని ఉత్తమ్ ధీమా వ్యక్తంచేశారు. 

అయోధ్య వివాదంపై విచారణ వాయిదా..

ఢిల్లీ: దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య వివాదం కేసును విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని సున్నీ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలోని త్రిసభ్య బెంచ్‌ విచారణ సందర్భంగా సున్ఫీ వక్ఫ్ బోర్డు తరఫున న్యాయవాది రాజు రామచంద్రన్ ఈ అంశాన్నికోర్టు దృష్టికి తెచ్చారు. ఇది జాతీయ అంశమైనందున విస్తృత ధర్మాసనానికి అయోధ్య కేసును అప్పగించాలని కోరారు. కాగా దీనిపై తదుపరి విచారణను మే 15కు కోర్టు వాయిదా వేసింది.

అది ప్లీనరీ కాదు భజన వేదిక : పొన్నం

హైదరాబాద్ : ‘టీఆర్ఎస్ ప్లీనరీ ప్రగతి ప్రాంగణం కాదు..అధోగతి చేసే ప్రాంగణం, అది అబద్ధాల, భజన వేదిక’ అని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని కేసీఆర్ తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పొన్నం పేర్కొన్నారు.

'కేసీఆర్ అనే నేను'సినిమా తీస్తా: పొన్నం

హైదరాబాద్: ఆయన అబద్ధాలపై ‘కేసీఆర్ అనే నేను’ పేరుతో సినిమా తీస్తామంటూ పొన్నం ప్రభాకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్లీనరీ కోసం పదో తరగతి ఫలితాలు విడుదలు చేసే సమయం మారుస్తారా? అని ప్రశ్నించారు. 

20:37 - April 27, 2018

తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ నేపథ్యంలో మార్కుల గురించి, గ్రేడ్ల గురించి, ర్యాంకుల గురించి విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూశారు. కానీ తక్కువ మార్కులు వచ్చివారి మానసిక పరిస్థితి ఎలా వుంటుంది? ఈపోటీ విద్యావ్యవస్థలో మార్కులు, గ్రేడ్లు, ర్యాంకులే ధ్యేయంగా కొనసాగుతున్న నేపథ్యంలో ర్యాంకులు, మార్కులు, గ్రేడ్లే ధ్యేయమా?..అనే అంశంపై ప్రముఖ మానసిక నిపుణులు వీరేంద్ర ఏమంటున్నారో తెలుసుకుందాం..

ఉన్మాది దాడిలో 7గురు చిన్నారులు మృతి..

హైదరాబాద్ : చైనా రాజధాని బీజింగ్‌లో శుక్రవారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న చిన్నారులపై గుర్తు తెలియని సాయుధుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఏడు మంది చిన్నారులు మృతి చెందగా, మరో 12మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు వారు పేర్కొన్నారు.

20:20 - April 27, 2018

దేనికైనా రెడీ నుంచి సక్సెస్ ఫుల్ కామెడీ కాంబినేషన్ గా ముద్ర పడిన మంచు విష్ను , జి.నాగేశ్వరరెడ్డి కలిసి అందించిన కామెడీ సినిమా..ఆచారి అమెరికా యాత్ర. షూటింగ్ షెడ్యూల్స్ లాగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు దిల్ రాజు బ్యాకప్ తో అతి కష్టం మీద థియేటర్లోకి వచ్చింది. ఇంతకాలంగా నవ్వులవిందు అంటూ ఊరిస్తూ వస్తున్న ఆచారి తన అమెరికా యాత్రలో జనాలకు ఎలాంటి నవ్వులు పంచాడు..? ఎలాంటి ఫలితం అందుకున్నాడు ఇప్పుడు చూద్దాం.

కథ విషయానికొస్తే..అనాధ అయిన కృష్ణమాచారి ..అప్పలాచారి అతని శిష్యులతో కలిసి పెరుగుతాడు. అయితే..వేలకోట్ల ఆస్తి పరుడైన కోటా శ్రీనివాసరావు ఇంట్లో యగ్నం జరిపించడానికి వెళ్లి..అతని మనవరాలైన రేణుక ప్రేమలో పడతాడు. ఆమె కూడా కృష్ణమాచారిని ప్రేమిస్తుంది. కానీ ఆ విషయం చెప్పకుండా.. తనకు ఇష్టంలేని బావను పెళ్లి చేసుకునేందుకు అమెరికా వెళ్లిపోతుంది రేణుక. దాంతో కృష్ణమాచారి తను ప్రేమించిన రేణుక కోసం అమెరికా ఎలా వెళ్లాడు...? ఇష్టంలేని పెళ్లిని రేణుక ఎందుకు ఒప్పుకుంది..? ఆ పెళ్లిని చెడగొట్టి..కృష్ణమాచారి..ఆమెను ఇండియాకు ఎలా తీసుకొచ్చాడు అనేది మిగతా కధ.

నటీనటుల విషయానికొస్తే..కృష్ణమాచారిగా మంచు విష్ను ఎప్పటిలానే తనకు తోచినట్లుగా చేసుకుపోయాడు. పర్ఫామెన్స్ పరంగా జస్ట్ ఓకే..అనిపించినా..లుక్స్ పరంగా కాస్త్ బెటర్ మెంట్ చూపించాడు. అతని స్టైలింగ్ బావుంది. కంచె తర్వాత మరో హిట్ కోసం ఎదురుచూస్తున్ ప్రగ్యా జైస్వాల్ రేణుకగా బాగా సెట్ అయ్యింది. తన అందాల ప్రదర్శన తో ఆడియన్స్ ని కనువిందు చేసింది. ఆమె గ్లామర్ సినిమాకు ఎడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. కమెడియన్ పృధ్వి చాలా కాలం తర్వాత తన పాత్రతో కాసేపు నవ్వించగలిగాడు. ఇక నవ్వుల డాక్టర్ గా పేరున్న బ్రహ్యానందం..అప్పలాచారి పాత్రకు తనవంతు న్యాయం చేసినా..సరైన సీన్స్,, పేలే డైలాగ్స్ లేకపోవడంతో..ఆపాత్ర పూర్తిగా తేలిపోయింది. ఇక ప్రభాస్ శ్రీను, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, విద్యుల్లేఖ వంటి మంచి టైమింగ్ ఉన్న కమెడియన్స్..ఈ సినిమాలో ఉన్నప్పటికీ.. ఇంపాక్ట్ ఫుల్ కామెడీ పండించడంలో విఫలమయ్యారు. ప్రదీప్ రావత్, కోటా శ్రీనివాసరావు, ఠాకూర్ అనూప్ సింగ్, స్క్రీన్ ప్రజెన్స్..సినిమాకు రిచ్ లుక్ ఇచ్చింది. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

టెక్నీషియన్స్ విషయానికొస్తే..దేనికైనా రెడీ, సీమశాస్త్రి, ఆడోరకం..ఈడోరకం లాంటి హిలేరియస్ హిట్స్ అందించిన జి.నాగేశ్వరరెడ్డి..ఈ మధ్య ట్రాక్ తప్పాడు. కనీసం ఈ సినిమా తో అయినా..ఫామ్ లోకి వస్తాడనుకుంటే.. అవుట్ డేటెడ్ కామెడీని నవ్వించడానికి ట్రై చేశాడు. కామెడీ ఆర్టిస్టులుకనిపించారు కానీ..వాళ్ల రేంజ్ కి తగ్గ కామెడీ పండలేదు. కామెడీ సినిమాగా వచ్చిన దీంట్లో .. నవ్వు తెప్పించగలిగిన సీన్స్..వేళ్ల మీద లెక్కబెట్టుకునేలా దీన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. ఇక మల్లాది వెంకటకృష:ణమూర్తి అందించిన కథ కూడా పాత వాసనలతో అస్తవ్యస్తంగా ఉంది. డార్లింగ్ స్వామి మాటలు చాలా నాసిరకంగా ఉన్నాయి. ఉన్నంతలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ , సినిమాటోగ్రాఫర్ సిద్దార్డ్ రామస్వామి తమ అవుట్ పుట్ తో మెప్పించగలిగారు. నిర్మాణ విలువలు ఎక్కడా పేరుపెట్టడానికి లేకుండా చాల రిచ్ గా ఉన్నాయి. అమెరికా అనేక లొకేషన్స్..ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ కనిపించాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే.. నవ్వుల యాత్ర అనే ట్యాగ్ లైన్ తో సమ్మర్ లో ఖచ్చింతంగా రిఫ్రెషింగ్ కామెడీ అందిస్తుందనుకున్న ఆఛారి అమెరికా యాత్ర అంతంత మాత్రంగానే ఉ:ది. ఎ,బి,సి..ఇలా ఏ ఒక్క సెంటర్లో కూడా విజయయాత్ర కొనసాగించే లక్షణాలు లేని ఆఛారి ఈసినిమాను ఎంతవరకూ ఒడ్డుకు చేరుస్తాడో వేచి చూడాల్సిందే.

ప్లస్ లు..

ప్రగ్యా గ్లామర్

నిర్మాణవిలువలు

ఫారిన్ లొకేషన్స్

సినిమాటోగ్రఫీ

…..................

మైనస్

కథ, కథనం

మాటలు, దర్శకత్వం

పేలని కామెడీ

వర్కవుట్ కాని సెంటిమెంట్

 

20:13 - April 27, 2018

మామూల్గ పోలీసోళ్లు జనాన్ని గొడ్తుంటరుగని.. సిద్దిపేట జిల్లా చేర్యాల కాడ.. పోలీసోన్నే పొర్కపొర్క గొట్టింది చేస్కున్న భార్య.. ప్రేమించి పెండ్లి జేస్కోని పదేండ్లు సంసారం జేశి.. ఇప్పుడు ఇంకో ఆమెతోని ఉంటుంటే.. ఊకుంటరా..? వచ్చి కొట్టుడంటే మామూల్గ గొట్టలే.. కాల్లు మొక్కుతనే ఇడ్వే అంటె గూడ ఇడ్వలే.. పోలీసు కాటుకు చీపురు దెబ్బ ఎట్లున్నదో సూడుండ్రి..వారెవ్వ ఇంటిరా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముచ్చట.. గెల్చిన ఫస్టు యాడాది అడ్గితె అగో పశిగుడ్డు ప్రభుత్వమన్నడు.. తర్వాత యాడాది అడ్గితె సంసారం కుదురుకోవద్దా అన్నడు.. మూడో యాడాది అడ్గితె తెలంగాణ ద్రోహులు అన్నడు.. నాల్గో యాడాది కోంపల్లి కాడ అడ్గకముందుకే జెప్పిండు.. మేనిఫెస్టోల జెప్పినయన్ని వందకు వంద శాతం అమలు జేశేశ్నమని.. నోటితోని నవ్వే ముచ్చటనేనా ఇది..? తెలంగాణ రాష్ట్రం గావాలె అని అప్పుడు పోరాటం జేశ్న.. కోటీ కాడ సెల్ టవర్ మీదికి ఎక్కిన.. రాష్ట్రమొస్తె మా బత్కులు మార్తయనుకున్న.. కని ఏం మారలే.. అందుకే ఇగో టీఆర్ఎస్ ప్లీనరీ కటౌట్ మీదికి ఎక్కినా.. ఈ రాష్ట్రంల కేసీఆర్ కుటుంబం బత్కుదెర్వు మారింది గని.. మా అసొంటోళ్లకు ఏంగాలేదని ఒక ఉద్యమకారుడు గీ పనిజేశిండు..ఆ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఆఫీసు బద్దలు బాషింగాలు జేశిండ్రుగదా రైతులు.. రైతులకు కోపమొస్తె ఎవ్వలిని జూడరు.. పదిహేను వందల తొంబై రూపాల మద్దతు ధర అని చెప్పి.. పన్నెండు వందలకు కింటాలు గొంటుంటే రైతులకు కోపంరాదా..? అందుకే మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇలాకాల మార్కెట్ ఆఫీసును అశోకవనం జేశి రోడ్డెక్కిండ్రు.. దొంగలకు సద్దిగట్టే కేంద్రాలుగ మారిపోతున్నయ్ ఎమ్మార్వో ఆఫీసులు.. వాళ్ల లంచాల కోసం మొత్తం ఒక ఊరినే బలిజేశిండ్రు.. గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలెకల్ అనే ఊరు.. నాదే అని ఒకడు కాయిదాలు తయ్యారు జేశి.. అందరికి నోటీసులు వంపిండు.. లక్ష రూపాలన్న ఇయ్యుండ్రి లేకపోతె ఇల్లు గూలగొడ్తాని పేదలను బెదిరిస్తున్నడట..ఆసీఫా అనే ఎన్మిదేండ్ల బుజ్జిని కిరాతకంగ రేప్ జేశి హత్య జేస్తె దాన్ని ఖండిచిండట పాలమూరు జిల్లాల ఒక దళిత బిడ్డ.. కాషాయం కుక్కలు జేశిన కుట్రను నిరసన గూడ తెల్పలే.. ఆఫీఫాకు మద్దతుగా..? ఒక పోస్టును వాట్సప్ల వెట్టినందుకు.. దండదారంగాళ్లంత జమై ఆ దళిత బిడ్డ మీద పంచాది వెట్టి ఊర్లకెళ్లి వెలేశిండ్రట.. ఎక్కడి కథ ఇది.. ఏంది..? రూపాయికి రెండు రూపాలొస్తున్నయంటే ప్రజలకు ఎట్ల ఆశుంటది.. ఇగ ఈ ఆశనే ఆయుధంగ మార్చుకున్నరు కొంతమంది.. ఐదువందల రూపాల నోట్లు.. రెండువేల రూపాల నోట్లు సొంతంగ తయ్యారు జేస్కునె శక్తి సామర్ధ్యాలను ప్రసాదిస్తం మీకని నల్లరంగు కాయిదాలను అంటగట్టి అసలు నోట్లు ఎత్కపోతున్నరనట.. కరీంనగర్ కమీషనర్ కమలాసన్ రెడ్డి సారు జెప్తడు ఇనుండ్రి... తాడిచెట్టు ఎక్కుడంటే యమధర్మరాజుకు ఎదురుంగ వొయ్యినట్టే ఉంటది.. అసొంటి చెట్టుమీదికి ఒక గౌడన్న ఎక్కిండు.. కటమయ్య పండుగున్నది దేవునికి తాటి ముంజలు వెట్టాలే అని ఎక్కిండట.. మీదికి వోంగనే చెమ్టకు ఏస్కున్న మోకు జారిపోయి కిందవడ్డదట ఆయన మీదనే ఉన్నడు.. ఇగ ఎట్లుంటది.. అప్పటికే సగం పాణం గాలిల వొయ్యింది.. ఇగ ఉన్నసగం పాణం కిందికి దిగేతందుకు సూస్తున్నది..

20:07 - April 27, 2018

గుంటూరు : రూరల్ పరిధిలో క్రికెట్ బుకీలను.. రూరల్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా నగదు, బెట్టింగ్ కు ఉపయోగించే కమ్యూనికేటర్ బాక్స్, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, సెల్ పోన్లను స్వాధీనం చేసుకున్నారు. చిలకలూరి పేటలో పదకొండు మంది, సత్తెన పల్లిలో నలుగురు బుకీలను అదుపులోకి తీసుకున్నారు.. హైదరాబాద్‌లో ఉన్న ప్రధాన బుకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని రూరల్ ఎస్పీ అప్పలనాయుడు తెలిపారు.

20:05 - April 27, 2018

నిర్మల్‌ : బైంసా పట్టణంలోని పురాణాబజార్‌లో విషాదంచోటుచేసుకుంది. తండ్రి మందలించాడనే మనస్తాపంతో పదమూడేళ్ళ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తండ్రి మందలించాడని మనస్థాపం చెందిన రాహుల్‌... ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉండగా.. వైద్యం చేయించారు.. ఈ పరిస్థితుల్లోఎండలో తిరగొద్దంటూ బాలుని తండ్రి మందలించాడు.. దీంతో క్షణికావేశానికి లోనైన బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.  

19:59 - April 27, 2018

తూర్పుగోదావరి : ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కవచంలాంటి అట్రాసిటీ చట్టాన్ని సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నాయని మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చట్టాన్ని యథాస్థితికి తేవాలన్న లక్ష్యంతో.. మార్చి 18న మిలీనియం మార్చ్ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అందులో భాగంగానే చేపట్టిన బస్సు యాత్ర.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి.. రాజమండ్రికి చేరుకుందన్నారు. రాష్ట్రంలోని టీడీపీ, వైసీపీ ఈ చట్టం విషయంలో కేంద్ర పై ఒత్తిడి తీసుకురావాలన్నారు. లేదంటే.. ఆ రెండు పార్టీలను తరిమి కొడతామని హర్షకుమార్‌ హెచ్చరించారు..

19:55 - April 27, 2018

అమరావతి : ఆళ్లగడ్డ పంచాయితీకి సీఎం చంద్రబాబు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. మంత్రి అఖిలప్రియ, పార్టీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలును పరిష్కరించి.. ఇద్దరు నేతల మధ్య సయోద్య కుదిర్చారు. విభేదాలను విస్మరించి, పార్టీ పటిష్టత కోసం పనిచేయాలన్న చంద్రబాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని అఖిలప్రియ, ఏవీ సబ్బారెడ్డి ప్రకటించారు. look.

అఖిలప్రియ, సుబ్బారెడ్డిల మధ్య కురిదిన సయోధ్య?..
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రాజకీయ రగడకు తెరపడింది. కొంతకాలంగా కత్తులు దూసుకొంటున్న మంత్రి అఖిలప్రియ, పార్టీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు సయోద్య కుదిర్చారు. రాజకీయ విభేదాలతో రగిలిపోతున్న ఇద్దరి మధ్య రాజీకుదర్చడంతో ఆళ్లగడ్డ పంచాయితీ ముగిసినట్టు అయిందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.

విడివిడిగా కార్యక్రమాల నిర్వహణతో రచ్చకెక్కిన విభేదాలు
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొదట్లో కలిసి పనిచేసిన మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి.. అభిప్రాయబేధాలతో ఆ తర్వాత వేరు కుంపట్లు పెట్టుకున్నారు. విడివిడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంతో ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు రచ్చకెక్కాయి. దీంతో పార్టీ పరువు, ప్రతిష్ఠలకు భంగం కులుగుతోందన్న ఉద్దేశంతో పార్టీ అధినాయకత్వం అప్పట్లో ఇద్దర్నీ పిలిపించి చర్చలు జరిపింది. విభేదాలను విస్మరించి కలిసి పనిచేస్తామని చంద్రబాబు సమక్షంలో ఒప్పుకున్న ఇద్దరు నేతలు, బయటకు వచ్చిన తర్వాత ఎవరికి వారుగానే కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీ పిలుపు మేరకు ఇటీవల ఆళ్లగడ్డలో ఏవీ సుబ్బారెడ్డి నిర్వహించిన సైకిల్‌ యాత్రపై రాళ్లు రువ్విన ఘటన రాజకీయ రచ్చకు దారితీసింది. ఇది మంత్రి అఖిలప్రియ వర్గం పనేనని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపిస్తూ... టీడీపీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధిష్టానం ఇద్దర్నీ కూర్చోబెట్టి సయోద్య కుదర్చాలని ప్రయత్నించినా.. ఏవీ సుబ్బారెడ్డితో కలిసి అధినాయకత్వంతో భేటీకి అఖిల ప్రియ అంగీకరించలేదు. దీంతో ముందుగా వేర్వేరుగా సమావేశమై చర్చించిన చంద్రబాబు... ఆ తర్వాత ఇద్దర్నీ కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చారు.

కలిసి పనిచేస్తామని ఒప్పుకున్న అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి
ఆళ్లగడ్డలో ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా, పార్టీ పటిష్టతకు ఏవీ సుబ్బారెడ్డితో కలిసి పనిచేసేందుకు అఖిలప్రియ అంగీకరించారు. ఏవీ సుబ్బారెడ్డితో కలిసి పనిచేయడానికి ఎలాంటి ఇబ్బందిలేదని నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అధిష్టానం దృష్టికి తెచ్చారు. చంద్రబాబుతో భేటీ తర్వాత కర్నూలు జిల్లా టీడీపీ ఇన్‌చార్జ్‌ వర్ల రామయ్యతో కలిసి అందరూ మీడియా ముందుకు వచ్చారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటానని ముభావంగా చెప్పి ఏవీ సుబ్బారెడ్డి వెళ్లిపోయారు. మొత్తంమీద ఆళ్లగడ్డ టీడీపీలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య రాజకీయ పంచాయితీ సయోధ్యతో ముగిసినా... మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయోనన్న చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. 

19:45 - April 27, 2018

మేడ్చల్ : టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. ఉత్తమ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. ప్రగతి భవన్‌లో 150 గదులు ఉన్నాయని చెప్పుకొచ్చిన ఉత్తమ్‌కు కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. ప్రగతి భవన్‌లో 15 గదుల కంటే ఎక్కువ గదులు ఉంటే తాను ముక్కు నేలకు రాసి సీఎం పదవికి రాజీనామా చేస్తానన్నారు కేసీఆర్‌. 

19:43 - April 27, 2018

మేడ్చల్ : కొంపల్లిలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ముగిసింది. ఈ ప్లీనరీలో ఆరు తీర్మానాలను ఆమోదించారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్యందరికీ టికెట్లు ఇస్తానని ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. ఎంబీసీలకు ఎమ్మెల్సీ స్థానాలు, నామినేటెడ్‌ పదవులిస్తామన్నారు కేసీఆర్‌. హైదరాబాద్‌ కేంద్రంగానే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తానన్నారు సీఎం కేసీఆర్‌. గులాబీ పరిమలాలు భారతదేశ మారుమూల ప్రాంతాలలో వెదజల్లుతామన్నారు. దేశాన్ని కాంగ్రెస్‌ నేతల కబంద హస్తాల నుండి విముక్తి కలిపించి అద్భుతమైన దేశంగా దేశాన్ని తీర్చిదిద్దుతామన్నారు కేసీఆర్‌. 

హెటిరో డ్రగ్స్ కి తక్కువ ధరకే ప్రభుత్వ భూములు..

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని త్వరలోనే బయటపెడతామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హెటిరో డ్రగ్స్ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం పదిహేను ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు కట్టబెట్టిందని ఆరోపించారు. ఖరీదైన ప్రాంతంలో భూమిని అంత తక్కువ ధరకే ‘హెటిరో’కు ఎందుకిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ నేతల భారీ విరాళాలు..

మేడ్చల్ : ఈ రోజు హైదరాబాద్ శివారు కొంపల్లిలో ప్రారంభమైన 17వ ప్లీనరీ సందర్భంగా పలువురు టీఆర్‌ఎస్ నాయకులు తమ పార్టీ కోసం రూ. 20 కోట్ల 41 లక్షల విరాళాలు ప్రకటించారు. ఇప్పటివరకు టీఆర్‌ఎస్ పార్టీ ఫండ్ రూ. 21 కోట్ల 67 లక్షలుగా ఉండేది. కాగా తాజా విరాళాలతో కలిపి రూ. 42 కోట్ల 8 లక్షలకు చేరిందని సీఎం కేసీఆర్ తెలిపారు. త్వరలోనే ఆ వివరాలను ఇన్‌కమ్ ట్యాక్స్, ఎలక్షన్ కమిషన్ కు సమర్పిస్తామని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.

19:24 - April 27, 2018

హైదరాబాద్ :   తెలంగాణ ఎస్‌ఎస్‌సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలు ప్రకటించారు. మొత్తం 5,34,726 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 83.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిమాదిరిగానే బాలికలు పైచేయి సాధించారు. బాలికల్లో 85.14 శాతం, బాలురు 82.46 శాతం మంది పాస్‌ అయ్యారు. ఈసారి 2,125 పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధించాయి. సున్నా శాతం ఫలితాలు నమోదు చేసుకున్న 21 స్కూళ్లలో 11 ప్రైవేటు పాఠశాలు కూడా ఉన్నాయి. ఫలితాల్లో జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలువగా, ఆదిలాబాద్‌ జిల్లా చివరి స్థానంలో ఉంది. పరీక్ష తప్పిన విద్యార్థులను జూన్‌ 4 నుంచి 19 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఫీజు చెల్లించేందుకు వచ్చే నెల 21 వరకు గడువు ఇచ్చారు. బీసీ సంక్షేమ పాఠశాలలు 96.18 శాతం ఫలితాలు సాధించాయి. 

10వ తరగతిలో బాలికలదే పైచేయి..

హైదరాబాద్ : విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ సంవత్సరం కూడా 10వ తరగతిలో బాలికలదే పైచేయిగా నిలిచింది. మొత్తం పరీక్షకు హాజరయిన విద్యార్ధులు 5,34,826 మంది కాగా దీంట్లో 85.14 శాతం మంది బాలికలు, 82.46 శాతం బాలికలు పాస్ అయ్యారు. పాస్ పర్సెంటేజ్ లో జగిత్యాల టాప్ లో నిలవగా ఆదిలాబాద్ జిల్లా లాస్ట్ లో వుందని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..

రంగారెడ్డి: యాచారం మండలం తమ్మలోనిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ-తుపాను వాహనం ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కథువా ఘటనపై సుప్రీం స్టే..

జమ్మూ కశ్మీర్ : కథువా ఘటన కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసుపై తదుపరి విచారణ మే 7కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టరాదని ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణను జమ్మూకశ్మీర్ కోర్టుల్లో చేయవద్దని, చండీగఢ్ కు బదిలీ చేయాలని, సీబీఐకి అప్పగించాలని బాధితురాలి తండ్రి కోర్టుకు విన్నవించుకున్న నేపథ్యంలోనే ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

మరో కథువా ఘటన..మదర్సాలో అత్యాచారం..

ఉత్తరప్రదేశ్ : ఉన్నావో, కథువా ఘటనలకు మరువక ముందే ఉత్తరప్రదేశ్ లో సభ్యసమాజం తలదించుకునేలా మరో దారుణం జరిగింది. ఘజియాబాద్ లో పదేళ్ల బాలికను మదర్సాలోకి తీసుకెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 21వ తేదీన షాపుకు వెళ్లిన బాలిక అదృశ్యమయ్యింది. దీంతో ఆమె తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక వద్ద ఉన్న ఫోన్ ఆధారంగా లొకేషన్ లో పసిగట్టిన పోలీసులు...22వ తేదీన మదర్సాలో బాలిక ఆచూకి దొరికింది. ఓ చాపలో చుట్టి ఉంచిన బాలికను పోలీసులు కనుగొన్నారు.

కోర్టుకు కోమటిరెడ్డి వీడియోలు..

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ల సభ్యత్వ బహిష్కరణ చెల్లదంటు హైకోర్టు ఇచ్చిన తీర్పును టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవాలు చేశారు. ఈ క్రమంలో వారు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అలాగే కోమటిరెడ్డి, సంపత్ ల సంఘటన వీడియోలను కోర్టుకు సమర్పించారు. దీనిపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కాగా అసెంబ్లీ సమావేశాలలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెట్టి వెంకటరెడ్డి మండలి చైర్మన్ స్వామిగౌడ్ పై హెడ్ ఫోన్ విసిరిన విషయం తెలిసిందే. 

ముగిసిన ఆళ్లగడ్డ పంచాయితీ..

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి వద్ద ఆళ్లగడ్డ రాళ్లదాడి పంచాయితీ ముగిసిన విషయం తెలిసిందే. మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలతో చంద్రబాబు.. విడివిడిగా, ఉమ్మడిగానూ చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా అఖిల ప్రియ.. ఏవీ సుబ్బారెడ్డి పోటీ రాజకీయం చేస్తున్నారని, అలాగే ఆయన కుమార్తె కూడా తనపై విమర్శలు చేశారని చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి.. చంద్రబాబు ముందు రాళ్లదాడికి సంబంధించిన ఆధారాలను ఉంచారు. ఈ విషయంపై అఖిలప్రియపై చర్యలు తీసుకోవాలని ఏవీ సుబ్బారెడ్డి అన్నారు.

బ్యాంకులకు నాలుగు రోజుల సెలవులు..

హైదారబాద్ : బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తుండడంతో ఖాతాదారులు ఈ రోజే జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే రేపు నాలుగో శనివారం.. ఎల్లుండి ఆదివారం కావడంతో కొన్ని బ్యాంకులకు ఎప్పటిలాగే సెలవులు ఉండనున్నాయి. అలాగే, ఆ తరువాత సోమవారం బుద్ధపూర్ణిమ, మంగళవారం మే డే కావడంతో బ్యాంకులు తెరచుకోవు.కాగా ఈ వరుస సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఉండే అవకాశం లేదని తెలిసింది. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ ప్రకారం బుద్ధపూర్ణిమ రోజున మాత్రం మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, మధ్య ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, హర్యానాలో బ్యాంకులు తెరచుకోవు అని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. 

14 ఏళ్ల పోరాటంతో తెలంగాణ సాధించుకున్నాం : కేసీఆర్

మేడ్చల్ : 14 ఏళ్ల పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పీసీసీ ముందుకు తెలంగాణ వచ్చిందంటే అది టీఆర్ఎస్ ఘనత అనే విషయం అందరు గుర్తు పెట్టుకోవాల్సివుందని కేసీఆర్ గుర్తు చేశారు. 50 గదులతో ప్రగతి భవన్ నిర్మించారని..ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ కు ప్రగతి భవన్ కు వచ్చి ఆ రూములన చూపించాలని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్ లో 16 రూములు చూపించినా సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాల్ విసిరారు. విమర్శలు చేసే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఉత్తమ్ కుమార్ ను కేసీఆర్ హెచ్చరించారు

దేశ రాజకీయాల్లో మార్పు తీసుకొస్తా - కేసీఆర్...

హైదరాబాద్ : నగరం నడిబొడ్డు నుండే దేశ రాజకీయాల్లో భూకంపం సృష్టిస్తానని..ఒక గుణాత్మకమైన మార్పు తెచ్చేందుకు తాను కృషి చేస్తానని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 

13:19 - April 27, 2018

హైదరాబాద్ : నగరం నడిబొడ్డు నుండే దేశ రాజకీయాల్లో భూకంపం సృష్టిస్తానని..ఒక గుణాత్మకమైన మార్పు తెచ్చేందుకు తాను కృషి చేస్తానని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ 17వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 'దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మకమైన మార్పులకు ఉద్యమం' తీర్మారాన్ని కేకే ప్రవేశ పెట్టగా ఎంపీ వినోద్ బలపర్చారు. దీనిపై నిర్ణయం కేసీఆర్ కు వదిలేస్తున్నట్లు సభ నిర్ణయించింది. ఈసందర్భంగా ఆయన దేశ రాజకీయాలపై మాట్లాడారు. బిజెపి..కాంగ్రెస్ పార్టీలు విమర్శలు గుప్పించారు. ఎన్ని ఏళ్లు పాలించినా దేశం ఇంకా అభివృద్ధి చెందలేదని, ఇతర దేశాలు మాత్రం అభివృద్ధిలో దూసుకెళుతున్నాయన్నారు. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ క్రియాశీల పాత్ర పోషించాలని..ఇందుకు తనను బాధ్యత వహించాల్సిందిగా కోరడం కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. తాను చేసిన ప్రకటన

దేశం బాగు కోసం తాను పోరాటం చేస్తానని..మొక్కవోని దీక్షతో తెలంగాణ రాష్ట్రం ఎలా సాధించామో దేశానికి మంచి దారి చూపిస్తానని కేసీఆర్ తెలిపారు. టూరిజం డిపార్ట్ మెంట్ ను దేశంలో అభివృద్ధి చేయలేదని, దీనితో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇతర దేశాలకు వెళుతున్నారని తెలిపారు. 7500 కిలో మీటర్ల సముద్ర తీరం ఉన్నా కాంగ్రెస్..బిజెపి ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఇదే ప్రభుత్వాలు కొనసాగితే దేశం ఎలా ముందుకెళుతుందని ప్రశ్నించారు.

కాంగ్రెస్ కు కోపం వస్తే బిజెపికి..బిజెపిపై కోపం వస్తే కాంగ్రెస్ కు ఓట్లు వేయడం జరుగుతోందని పేర్కొన్నారు. కావేరీ విషయంలో బిజెపి, కాంగ్రెస్ లు డ్రామాలు ఆడుతున్నాయని, వీరివల్లే నీటి తగాదాలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను మున్సిపాల్టీ కంటే హీనంగా చేశాయని, కేంద్రం వద్ద శాఖలు ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన...అంటూ పేరు పెట్టారని...కానీ గ్రామానికి రోడ్డు వేయడానికి సర్పంచ్..ప్రజాప్రతినిధులు లేరా ? అని ప్రశ్నించారు. నరేగా కూలీ డబ్బులు ఢిల్లీలో పోస్టు చేస్తుంటే ప్రజాస్వామ్యం అందామా ? అని పేర్కొన్నారు. మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడతో తాను భేటీ అవ్వడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలోని పథకాలు ఇక్కడ అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారని తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు కూడా ఇదే విధంగా డిమాండ్ చేస్తున్నారని అక్కడి అధికారులు తెలియచేశారని సభకు తెలిపారు.

ఎవరూ చేయని విధంగా భూ రికార్డుల ప్రక్షాళన...కేవలం వంద రోజుల్లో చేయడం జరిగిందని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి పథకం ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. నియోజకవర్గాల్లో పశు వైద్య ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగిందని, ఎంతో కష్టపడుతున్న ట్రాఫిక్ పోలీసులకు అలవెన్స్ ఇస్తున్న ఘనత తెలంగాణదేనని తెలిపారు.

టి.పిపిసి ఉత్తమ్ కుమార్ పై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఉత్తమ్ సంచులు మోసుకుంటూ ఉండేవానినని తెలిపారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ప్రగతి భవన్ పై ఉత్తమ్ పలు విమర్శలు చేశారని, 15 రూములు చూపెట్టాలని, లేనిపక్షంలో ప్రగతి భవన్ ముందు ముక్కు నేలకు రాయాలని..నిరూపిస్తే తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఉస్మానియా..గాంధీలో పేదలు చనిపోతే ప్రభుత్వ అంబులెన్స్ లు పెట్టి ఉచితంగా మృతదేహాలను తరలించే ఏర్పాటు చేశారా ? రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశారా ? డబుల్ బెడ్ రూం..వెయ్యి రూపాయల పెన్షన్ ఇవన్నీ మొత్తం అబద్దాలేనా ? అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోను వందకు వంద శాతం అమలు చేయడం జరిగిందని, దీనిపై ఎక్కడికైనా చర్చకు సిద్ధమేనన్నారు. ప్రజలు వాస్తవాలు గమనించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

నాలుగు వేల గ్రామ పంచాయతీలు తెచ్చిన ఘనత టీఆర్ఎస్ దేనని తెలిపారు. అనేక జిల్లాలో ప్రజలు అవస్థలు పడ్డారని, పది జిల్లాలున్న రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎవరు ఎన్ని శాపనార్థాలు పెడుతున్నా అభివృద్ధిలో ముందుకు వెళుతున్నామని, నీతిగా..నిజాయితిగా వెళుతున్నామన్నారు. పూర్తి ప్రసంగం వినేందుకు వీడియో క్లిక్ చేయండి. 

12:43 - April 27, 2018

హైదరాబాద్ : 'దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మకమైన మార్పులకు ఉద్యమం'పై రాజ్యసభ సభ్యుడు కేశవరావు తీర్మానం ప్రవేశ పెట్టారు. దీనిని ఎంపీ వినోద్ కుమార్ బలపర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...చిన్న చూపు చూసినా కేసీఆర్ తెగువ..నినాదాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడం జరిగిందని, ఇక్కడ ప్రజలు ఎలా ఆదరించారో అందరికీ తెలిసిందేనన్నారు. చెప్పింది..చేసినమని..ఇదంతా ప్రజలు చూశారని..అందుకే ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యమ కాలంలోనే ఆలోచించిన పథకాలు..ఇతరత్రా వాటివి ప్రస్తుతం అమలు చేస్తున్నారని, ఇవన్నీ దేశ వ్యాప్తంగా ఆకర్షిస్తున్నాయన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఫెడరల్ ఫ్రంట్ పై కేకే తీర్మానం...

హైదరాబాద్ : 'దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మకమైన మార్పులకు ఉద్యమం'పై రాజ్యసభ సభ్యుడు కేశవరావు తీర్మానం ప్రవేశ పెట్టారు. 

ఫెడరల్ ఫ్రంట్ పై కేకే తీర్మానం...

హైదరాబాద్ : 'దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మకమైన మార్పులకు ఉద్యమం'పై రాజ్యసభ సభ్యుడు కేశవరావు తీర్మానం ప్రవేశ పెట్టారు. 

12:27 - April 27, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ 17వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ కీలక నేత కే.కేశవరావు 'దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మకమైన మార్పులకు ఉద్యమం' ఫెడరల్ ఫ్రంట్ పై తీర్మానం ప్రవేశ పెట్టారు. 14 సంవత్సరాలు పోరాటం చేసి నాలుగు సంవత్సరాల్లోనే రాష్ట్రం అగ్రగామిగా నిలపడంలో సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉందన్నారు. నాలుగు సంవత్సర కాలంలో ఇంత అభివృద్ధి చెందుతుంటే 70 సంవత్సరాలుగా భారతదేశం ఎందుకు అభివృద్ధి కాలేదన్న ఆలోచన కేసీఆర్ మదిలో మెలిచిందన్నారు. వ్యవసాయం..ఆరోగ్యం..గ్రామీణాభివృద్ధి తదితర స్థానిక సంస్థలపై కేంద్రం పెత్తనం ఎందుకని కేసీఆర్ నిలదీశారని తెలిపారు. కేంద్రం..రాష్ట్రాల నిర్ణయాలు పొంతన లేకుండా ఉంటున్నాయని, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడాలని..పేర్కొన్నారు. ఇందుకు కేసీఆర్ ముందడుగు వేస్తున్నారని..దీనికి అందరూ సహకరించాలని సూచించారు. దేశంలో గుణాత్మకైన మార్పుకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు తెలియచేయాలని తెలిపారు.

ప్లీనరీకి హాజరైన కేసీఆర్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరీ సమావేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు ఆయరన అభివాదం చేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన కేసీఆర్..అమరవీరులకు నివాళులర్పించారు. టీఆర్ఎస్ నేతల నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది. 

ప్లీనరీకి హాజరైన కేసీఆర్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరీ సమావేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు ఆయరన అభివాదం చేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన కేసీఆర్..అమరవీరులకు నివాళులర్పించారు. టీఆర్ఎస్ నేతల నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది. 

11:26 - April 27, 2018

నల్గొండ : రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం...పంట పెట్టుబడి కింద నగదు అందిస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతులు సమస్యలు మాత్రం తీరడం లేదు. రైతుల ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ఎక్కడో ఒక చోట రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. తమకు మద్దతు ధర కల్పించాలని..ధాన్యం కొనుగోలు చేయాలని ఆయా ప్రాంతాల్లో రైతన్నలు నిరసనలు..ఆందోళనలు చేపడుతున్నారు. శుక్రవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్ కు వరుస సెలవులు ప్రకటించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయంపైకి దాడికి దిగారు. కార్యాలయంలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. మద్దతు ధర కంటే తక్కువగా ప్రకటిస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర చెల్లించే విధంగా చేస్తామని..ధాన్యం కొనుగోలు చేస్తామని గురువారం అధికారులు హామీనిచ్చారు. కానీ శుక్రవారం అదే పరిస్థితి కొనసాగడంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మరి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రైతుల సమస్యలు పరిష్కరిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత...

నల్గొండ : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్ కు వరుస సెలవులు ప్రకటించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయంపైకి దాడికి దిగారు. 

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత...

నల్గొండ : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్ కు వరుస సెలవులు ప్రకటించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయంపైకి దాడికి దిగారు. 

11:12 - April 27, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో బెట్టింగ్‌ హవా కొనసాగుతోంది. క్రికెట్‌ మ్యాచ్‌లు ఏవైనా సరే జోరుగా పందాలు కట్టేస్తున్నారు. ఐపిఎల్‌ టీ 20 మ్యాచ్‌ల ప్రారంభంతో కోట్లలో రూపాయలు చేతులు మారుతున్నాయి. అడపా దడపా పోలీసులు దాడులు చేస్తున్నా చాపకింద నీరులా గుట్టు చప్పుడు కాకుండా తమ బెట్టింగ్‌ వ్యవహరాలు కొనసాగిస్తున్నారు బెట్టింగ్‌ రాయుళ్లు. తాజాగా సైబరాబాద్‌ పరిధిలో హైటెక్‌ టెక్నాలజీ వాడే మూడు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ముఠాలు పట్టుబడ్డాయి. ఐపీఎల్‌ టీ-20 క్రికెట్‌ లీగ్‌ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. దీంతో బెట్టింగ్‌ దందా కూడా పురివిప్పింది. ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా పందాలు జోరుగా సాగుతున్నాయి. బెట్టింగ్‌ కారణంగా ఇల్లు గుళ్లయినా అప్పుల పాలయినా కొందరు మారడంలేదు. గతంలో సంపన్న వర్గాలు, మధ్యతరగతి వారే ఎక్కువగా బెట్టింగ్‌లు కాసేవారు.... మరి ఇప్పుడు ఆటోవాలా నుండి రోజు వారీ కూలీల వరకు బెట్టింగ్‌ కాస్తున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ముఠాలు మాత్రం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తునే ఉన్నాయి.

తాజాగా హైటెక్‌ టెక్నాలజీని వినియోగించి ఐపీఎల్‌ మ్యాచ్‌ల బెట్టింగ్‌కు పాల్పడుతున్న రెండు మాఠాల గుట్టు రట్టు చేశారు సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు. ఈ ముఠాలకు లీడర్‌ అయిన మోహిత్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలో కూడా వీరు వెస్ట్‌ మారేడ్‌ పల్లి కేంద్రంగా బెట్టింగ్‌ నిర్వహిస్తూ పోలీసులకు చిక్కారు. వీరు 2016 నుంచి ఐపీఎల్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు సీపీ తెలిపారు. అంతే కాకుండా వీరిద్దరు మరో ఇద్దరు సహాయకులను నియమించుకుని ఈ ఐపిఎల్‌ సీజన్‌లో పెద్ద ఎత్తున కాటేదాన్‌ కేంద్రంగా గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి మ్యాచ్‌లో బాల్‌, పరుగులకు సంబంధించిన సమాచారం అందిస్తాడని దీని ఆధారంగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారని సీపీ సజ్జనార్‌ తెలిపారు. అంతే కాకుండా మోహిత్‌, అంకిత్‌ సహకారంతో ఇంకో ముఠా ఏర్పాటు చేసి బెట్టింగ్‌లకు పాల్పడుతున్న బహదూర్‌ పురాకు చెందిన ప్రవీణ్‌ అగర్వాల్‌ ను అదుపులోకి తీసుకున్నాట్లు తెలిపారు.

బెట్టింగ్‌ రాయుళ్లు నగరంలోనే కాకుండా జిల్లాలకు కూడా విస్తరించారు. తెలుగు రాష్ట్రాలోని అన్ని జిల్లాల్లో హైటెక్‌ టెక్నాలజీ ఉపయోగించి ఆన్‌ లైన్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కోదాడకు చెందిన నాగం రవికుమార్‌ను బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా అరెస్ట్‌ చేశారు. ఆన్‌లైన్లో బెట్టింగ్‌ నిర్వహించే రవికుమార్‌ తరుచుగా కూకట్‌ పల్లి భాగ్యనగర్‌ కాలనీ, గుంటూరుకు మకాం మార్చి బెట్టింగ్‌ నిర్వహించేవాడని తెలిసింది. అంతే కాకుండా కరీంనగర్‌, తాండూరు పట్టణాల్లో యువకులను నియమించి వీరి ద్వారా 18 మొబైల్‌ ఫోన్లతో కమ్యూనికేటర్‌ పరికరాన్ని వినియోగిస్తూ బెట్టింగ్‌ లకు నడిపేవాడని పోలీసుల విచారణలో తేలింది.

మొన్నటి వరకు హైదరాబాద్‌ వంటి పెద్ద నగరాలకే పరిమితమయిన బెట్టింగ్‌ పర్వం స్మార్ట్‌ ఫోన్ల రాకతో విలేజ్‌లకూ విస్తరించింది. గతంలో ప్రపంచకప్‌ పోటీలు, వన్డేల పై మాత్రమే పందేలు కాసేవారు. కానీ టీ 20 ల రాకతో పరిస్థితి మారిపోయింది. స్మార్ట్‌ ఫోన్లతో వివరాలు సులువుగా తెలస్తుండటంతో పందెం రాయుళ్లు వ్యవహారం అంతా ఫోన్ల ద్వారానే జరిపిస్తున్నారు. యువత , విద్యార్థులే లక్ష్యంగా క్రికెట్‌ బుకీలు పావులు కదుపుతుంటే.... అడపాదడపాగా సబ్‌ బుకీలను మాత్రమే పట్టుకుని మెయిన్‌ బుకీలను పట్టుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

11:12 - April 27, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో బెట్టింగ్‌ హవా కొనసాగుతోంది. క్రికెట్‌ మ్యాచ్‌లు ఏవైనా సరే జోరుగా పందాలు కట్టేస్తున్నారు. ఐపిఎల్‌ టీ 20 మ్యాచ్‌ల ప్రారంభంతో కోట్లలో రూపాయలు చేతులు మారుతున్నాయి. అడపా దడపా పోలీసులు దాడులు చేస్తున్నా చాపకింద నీరులా గుట్టు చప్పుడు కాకుండా తమ బెట్టింగ్‌ వ్యవహరాలు కొనసాగిస్తున్నారు బెట్టింగ్‌ రాయుళ్లు. తాజాగా సైబరాబాద్‌ పరిధిలో హైటెక్‌ టెక్నాలజీ వాడే మూడు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ముఠాలు పట్టుబడ్డాయి. ఐపీఎల్‌ టీ-20 క్రికెట్‌ లీగ్‌ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. దీంతో బెట్టింగ్‌ దందా కూడా పురివిప్పింది. ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా పందాలు జోరుగా సాగుతున్నాయి. బెట్టింగ్‌ కారణంగా ఇల్లు గుళ్లయినా అప్పుల పాలయినా కొందరు మారడంలేదు. గతంలో సంపన్న వర్గాలు, మధ్యతరగతి వారే ఎక్కువగా బెట్టింగ్‌లు కాసేవారు.... మరి ఇప్పుడు ఆటోవాలా నుండి రోజు వారీ కూలీల వరకు బెట్టింగ్‌ కాస్తున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ముఠాలు మాత్రం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తునే ఉన్నాయి.

తాజాగా హైటెక్‌ టెక్నాలజీని వినియోగించి ఐపీఎల్‌ మ్యాచ్‌ల బెట్టింగ్‌కు పాల్పడుతున్న రెండు మాఠాల గుట్టు రట్టు చేశారు సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు. ఈ ముఠాలకు లీడర్‌ అయిన మోహిత్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలో కూడా వీరు వెస్ట్‌ మారేడ్‌ పల్లి కేంద్రంగా బెట్టింగ్‌ నిర్వహిస్తూ పోలీసులకు చిక్కారు. వీరు 2016 నుంచి ఐపీఎల్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు సీపీ తెలిపారు. అంతే కాకుండా వీరిద్దరు మరో ఇద్దరు సహాయకులను నియమించుకుని ఈ ఐపిఎల్‌ సీజన్‌లో పెద్ద ఎత్తున కాటేదాన్‌ కేంద్రంగా గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి మ్యాచ్‌లో బాల్‌, పరుగులకు సంబంధించిన సమాచారం అందిస్తాడని దీని ఆధారంగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారని సీపీ సజ్జనార్‌ తెలిపారు. అంతే కాకుండా మోహిత్‌, అంకిత్‌ సహకారంతో ఇంకో ముఠా ఏర్పాటు చేసి బెట్టింగ్‌లకు పాల్పడుతున్న బహదూర్‌ పురాకు చెందిన ప్రవీణ్‌ అగర్వాల్‌ ను అదుపులోకి తీసుకున్నాట్లు తెలిపారు.

బెట్టింగ్‌ రాయుళ్లు నగరంలోనే కాకుండా జిల్లాలకు కూడా విస్తరించారు. తెలుగు రాష్ట్రాలోని అన్ని జిల్లాల్లో హైటెక్‌ టెక్నాలజీ ఉపయోగించి ఆన్‌ లైన్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కోదాడకు చెందిన నాగం రవికుమార్‌ను బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా అరెస్ట్‌ చేశారు. ఆన్‌లైన్లో బెట్టింగ్‌ నిర్వహించే రవికుమార్‌ తరుచుగా కూకట్‌ పల్లి భాగ్యనగర్‌ కాలనీ, గుంటూరుకు మకాం మార్చి బెట్టింగ్‌ నిర్వహించేవాడని తెలిసింది. అంతే కాకుండా కరీంనగర్‌, తాండూరు పట్టణాల్లో యువకులను నియమించి వీరి ద్వారా 18 మొబైల్‌ ఫోన్లతో కమ్యూనికేటర్‌ పరికరాన్ని వినియోగిస్తూ బెట్టింగ్‌ లకు నడిపేవాడని పోలీసుల విచారణలో తేలింది.

మొన్నటి వరకు హైదరాబాద్‌ వంటి పెద్ద నగరాలకే పరిమితమయిన బెట్టింగ్‌ పర్వం స్మార్ట్‌ ఫోన్ల రాకతో విలేజ్‌లకూ విస్తరించింది. గతంలో ప్రపంచకప్‌ పోటీలు, వన్డేల పై మాత్రమే పందేలు కాసేవారు. కానీ టీ 20 ల రాకతో పరిస్థితి మారిపోయింది. స్మార్ట్‌ ఫోన్లతో వివరాలు సులువుగా తెలస్తుండటంతో పందెం రాయుళ్లు వ్యవహారం అంతా ఫోన్ల ద్వారానే జరిపిస్తున్నారు. యువత , విద్యార్థులే లక్ష్యంగా క్రికెట్‌ బుకీలు పావులు కదుపుతుంటే.... అడపాదడపాగా సబ్‌ బుకీలను మాత్రమే పట్టుకుని మెయిన్‌ బుకీలను పట్టుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

దావూద్ సన్నిహితుడు అరెస్టు...

ముంబై : గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహిం సన్నిహితుడిని పోలీసులు పట్టుకున్నారు. తారీక్ పర్వీన్ ను థానేలో అదుపులోకి తీసుకున్నారు. 

కర్నాటక కాంగ్రెస్ ఎన్నికల మెనిఫెస్టో...

కర్నాటక : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల బహిరంగసభలో పాల్గొన్న ఆయన మేనిఫెస్టో విడుదల చేశారు. 

గునాలో రోడ్డు ప్రమాదం...

మధ్యప్రదేశ్ : గునాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. కారు..ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. 

ప్లీనరీలో సాంస్కృతిక కార్యక్రమాలు...

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీకి ప్రజాప్రతినిధులు తరలివస్తున్నారు. మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు..ప్రజాప్రతినిధులు..నేతలు హాజరవుతున్నారు. అందులో భాగంగా కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

10:22 - April 27, 2018

గుంటూరు : జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక భర్త..కుమారులకు విషం ఇచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళగిరి కొప్పుల రావు కాలనీలో లక్ష్మీనారాయణ...భార్య..ఇద్దరు కుమారులు తేజేశ్వర్, అమరేశ్వర్ లతో నివాసం ఉంటున్నారు. అనారోగ్య కారణాలతో భార్య నెల రోజుల క్రితం చనిపోయింది. దీనితో లక్ష్మీ నారాయణ తీవ్ర మనోవేదానికి గురయ్యారు. భార్య చనిపోవడాన్ని అతను జీర్ణించుకోలేకపోయారు. ఆత్మహత్య శరణ్యం భావించిన ఆయన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను విషం సేవించారు. శుక్రవారం విగతజీవులుగా పడి ఉన్న వారిని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్య లేని జీవితం ఎందుకని భావించి ఉండవచ్చునని, పిల్లలు ఒంటరి అవుతారని భావించే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని స్థానికులు పేర్కొంటున్నారు. 

భార్య మృతిని తట్టుకోలేక...

గుంటూరు : మంగళగిరి కొప్పులరావు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక భర్త లక్ష్మీ నారాయణ..ఇద్దరు కుమారులకు విషం ఇచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

09:37 - April 27, 2018

కాసేపట్లో టీఆర్ఎస్ 17వ వార్షికోత్సవం...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర స‌మితి 17వ వార్షికోత్సవం కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30గంటలకు పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించనున్నారు. 

08:53 - April 27, 2018

పంజాబ్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అద్భుత విజయం సాధించింది. 13 పరుగుల తేడాతో పంజాబ్‌పై విక్టరీ కొట్టింది. మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌... నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. మనీష్‌పాండే హాఫ్‌ సెంచరీ చేశాడు. అనంతరం 133 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు రాహుల్‌, గేల్‌ శుభారంభం ఇచ్చారు. కానీ హైదరాబాద్‌ బౌలర్లు విజృంభించడంతో... పంజాబ్‌ 119 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. దీంతో హైదరాబాద్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

08:18 - April 27, 2018

సిద్ధిపేట : తెలంగాణ పోలీసు శాఖలో అక్రమ సంబంధాల గుట్టు ఒక్కొక్కటిగా రట్టు అవుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన అక్రమ సంబందాలు పెరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. వీరిలోకి పోలీసులు కూడ వస్తుండడం వ్యవస్థ ప్రతిష్టపై మచ్చ పడుతోంది. ఇటీవలే ఓ మహిళా ఎస్పీతో ఓ సీఐ అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో పాటు పలు ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ మరో మహిళతో సహజీవనం చేస్తున్న ఘటన బయటకొచ్చింది. మొదటి భార్య రెడ్ హ్యాడెండ్ గా పట్టుకుంది. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రమేష్ కి మమతతో 2006లో వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా మద్దూరు పీఎస్ కు ట్రాన్స్ ఫర్ అయ్యాడు.

ఇదిలా ఉంటే గాగిలాపూర్ కు చెందిన అనూష భార్య..భర్తల గొడవల విషయంలో రమేష్ ని సంప్రదించింది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడడం..ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారిపోయింది. ఈ తరుణంలో మమత..రమేష్ ల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. గత ఆరు నెలల క్రితం చేర్యాల సీఐ జోక్యం చేసుకుని రమేశ్..మమతలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రశాంత జీవితం గడపాలని సీఐ సూచించారు. కానీ రమేశ్ మాత్రం అనూషతో సహజీవనం కొనసాగించారు. ఈ విషయం తెలుసుకున్న మమత రెడ్ హ్యాండెండ్ గా పట్టుకోవాలని భావించింది. అందులో భాగంగా శుక్రవారం ఉదయం మమత..తల్లిదండ్రులు..ఇతరులతో మహబూబాబాద్ జిల్లాకు చేరుకుంది. రమేష్..అనూషలు ఉంటున్న ఇంటికి చేరుకుని ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వారిద్దరినీ బయటకు ఈడ్చి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో ఇరువురినీ పీఎస్ కు రప్పించారు. ఈ సమస్య ఎలా పరిష్కరిస్తారో చూడాలి. 

మరో కానిస్టేబుల్ రాసలీలలు...

సిద్ధిపేట : చేర్యాలలో కానిస్టేబుల్ రమేశ్ రాసలీలలు బయటపడ్డాయి. మరో మహిళతో ఉండగా రమేశ్ భార్య మమత పట్టుకుంది. మద్దూరు పీఎస్ లో పనిచేస్తున్న రమేశ్ కొంతకాలంగా భార్య మమత, పిల్లలకు దూరంగా ఉంటున్నాడు. మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. 

07:38 - April 27, 2018

తెలంగాణ రాష్ట్ర స‌మితి 17వ వార్షికోత్సవాలు నేడు జరుగనున్నాయి. నగ‌ర శివారుల్లోని కొంప‌ల్లిలో ప్రతినిధుల స‌భ‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ స్థాయిలో కూడా చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న కేసీఆర్.....జాతీయ రాజ‌కీయాల‌పై ప్లీన‌రీ వేదిక‌గానే మ‌రింత స్పష్టత ఇచ్చే అవ‌కాశం ఉంది. రాష్ట్రంలో ప‌ట్టు నిలుపుకుంటూనే జాతీయ స్థాయిలో పార్టీ వ్యూహంపై నేత‌ల‌కు ప్లీన‌రీలో వివ‌రించనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వీరయ్య (టీఆర్ఎస్), ఇందిరా శోభన్ (టి.కాంగ్రెస్), కాశం సత్యనారాయణ గుప్తా (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

నేడు తెలంగాణలో టెన్త్ ఫలితాలు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నేడు టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. రాత్రి ఏడు గంటలకు డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. 

07:06 - April 27, 2018

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం యువతలో పెద్దఎత్తున ఆందోళన నెలకొని ఉంది. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని.. ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేస్తున్నా... అది ఆచరణలో కనబడటంలేదన్న విమర్శ.. విద్యార్థి, యువజన సంఘాలనుంచి వినబడుతోంది... ఇంటికో ఉద్యోగమిస్తామని, ఉద్యోగం ఇప్పించలేని పక్షంలో నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల సమయంలో.. ఇచ్చిన హామీ ఇప్పుడు అమలు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై టెన్ టివి జనపథంలో ఎస్ఎఫ్ఐ ఏపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నూర్‌ మహ్మద్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

06:51 - April 27, 2018

శ్రీకాకుళం : 27వేల ఎకరాలకు సాగునీరు అందించే జలాశయమది. జూన్‌ చివరికల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌ కూడా పెట్టుకుంది. కానీ నిర్మాణ పనులు నేటికి 30శాతమే పూర్తయ్యాయి. నిర్దేశిత గడువు మరో రెండు నెలలే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో నత్తనడకన సాగుతోన్న ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులపై 10టీవీ కథనం.. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలోని ఆఫ్‌షోర్‌ జలాశయ ప్రతిపాదిత ప్రాంతమిది. ఈ రిజర్వాయర్‌ నిర్మాణానికి మొదట్లో 127 కోట్ల వ్యయంగా అంచనా వేశారు. ఇప్పుడు అంచనా వ్యయం నాలుగురెట్లు పెరిగి 460 కోట్లకు చేరింది. ఆఫ్‌షోర్‌ జలాశయం ద్వారా 24,600 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు.. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై గ్రామాలు తాగునీరు అందించాలన్నది ఈ పథకం ముఖ్యోద్దేశ్యం.

ఆఫ్‌షోర్‌ జలాశయాన్ని ఈ ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. జూన్‌కల్లా మూడు మండలాలు, ఒక మున్సిపాలిటీకి సాగు, తాగు నీరు అందించనున్నట్టు అధికారులు తెలిపారు. నిర్దేశిత గడువుకు మరో రెండు నెలలే మిగిలి ఉంది. కానీ ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 30శాతమే పూర్తయ్యాయి. ఇంకా 70శాతం పనులు పూర్తి కాలేదు. హోటింగ్‌ జోన్‌ పనుల కోసం డౌన్‌ లెవల్‌ నుంచి కుడి ప్రధాన కాలువ వరకు ఆఫ్‌స్ట్రీమ్‌ కేసింగ్‌ పనులు, హారిజాంటల్‌ శాండ్‌ ఫిల్టర్‌ పనులు కొంతమే పూర్తయ్యాయి. ఇంకా పదమూడు కిలోమీటర్ల మేర కాలువలు నిర్మించాల్సి ఉంది. కాలువల నిర్మాణానికి స్థలాన్ని సర్వే చేసినప్పటికీ.. రైతుల నుంచి ఇంకా భూసేకరణ చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆఫ్‌షోర్‌ జలాశయం పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సాగు, తాగునీరు కోసం ఎదురు చూస్తున్న ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఆఫ్‌షోర్‌ జలాశయం పనులు వేగంగాసాగడం లేదు. రెండు నెలల కిందట పగలూ -రాత్రి చేపట్టిన పనుల్లో.. ఆ తర్వాత వేగం తగ్గింది. దీంతో నిర్దేశిత గడువు కాదు కదా.. మరో ఏడాదైనా ఈ జలాశయం పూర్తవుతుంతా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. రైతులు మాత్రం ప్రభుత్వం ఈ జలాశయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతోంది.

06:45 - April 27, 2018

విజయవాడ : పవన్‌ కల్యాణ్‌ తనపై చేసిన అవినీతి ఆరోపణలకు ఆధారాలుంటే బయట పెట్టాలని ఏపీ మంత్రి లోకేష్‌ డిమాండ్ చేశారు. తమ కుటుంబ ఆస్తులను ఎనిమిదేళ్లుగా ప్రకటిస్తున్నామన్నారు. అంతకుమించి ఎక్కడైనా ఆస్తులుంటే బయటపెట్టాలని... వాటిని వారికే రాసిస్తానన్నారు. విజయనగరంలో పర్యటించిన ఆయన.. పవన్‌ కల్యాణ్‌ అంటే తనకు వ్యక్తిగతంగా ఎప్పుడూ గౌరవమేనన్నారు. కొందరు పవన్‌ చుట్టూ చేరి తనపై ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు

06:38 - April 27, 2018

కర్నూలు : నేతలు గ్రూపులు కడుతూ పార్టీకి చెడ్డపేరు తీసుకురావొద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆళ్లగడ్డ నేతలకు హితబోధ చేశారు. మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి ఇద్దరి పద్దతి బాగాలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయడంలో పోటీపడాలి తప్ప.. కొట్లాడుకుంటే ప్రజల్లో చులకనైపోతామని హితబోధ చేశారు. ఆళ్లఫైట్‌పై ఇద్దరు నేతలతో మాట్లాడిన చంద్రబాబు... నేతలంతా పార్టీ ఆదేశాల మేరకు నడచుకోవాలని సూచించారు. ఆళ్లగడ పంచాయతీ చంద్రబాబు దగ్గరికి చేరినా ఏమీ తేలలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డితో సమావేశం అయ్యారు. ఇద్దరు నేతల మధ్య తలెత్తిన గొడవపై ఇద్దరి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరికీ క్లాస్‌ పీకారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని... ఎవరైనా గ్రూపులు కడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. క్రమశిక్షణకు భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. ప్రతి నాయకుడు పార్టీ అభివృద్ధికి కష్టపడి పని చేయాలి కానీ...గొడవలకు, భేషజాలకు వెళ్లవద్దని సూచించారు. అది పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తుందన్నారు. నేతలంతా ఒక్కతాటిపై నిలబడి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పదవులకంటే పార్టీ ముఖ్యమని గుర్తించాలన్నారు. ఇవాళ మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.

ఆళ్లగడ్డలో ఓవైపు అఖిలప్రియ. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డి విడివిడిగా రాజకీయాలు చేస్తున్నారు. వీరిద్దరిలో ఎవరిని వదులుకున్నా.. ఎన్నికల ముందు కర్నూలు జిల్లా రాజకీయాల్లో పార్టీకి ఇబ్బంది తలెత్తే వ్యవహారమనే చెప్పాలి. వీరిద్దరి మధ్య సయోధ్యకు పార్టీ అధినాయకత్వం తెగ కసరత్తు చేస్తోంది. వీరిద్దరికి ఆమోదయోగ్యంగా ఉండే రాజీ ఫార్ములాను అన్వేషించే పనిలో పార్టీ హైకమాండ్‌ కసరత్తు చేస్తోంది. తన నియోజకవర్గంలో ఎలాంటి సమాచారం లేకుండా సైకిల్‌ యాత్రను ఏవీ సుబ్బారెడ్డి ఎలా చేపడుతారని అఖిలప్రియ ప్రశ్నిస్తోంది. తనను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా అఖిలప్రియ నియంత్రిస్తోందని ఏవీ సుబ్బారెడ్డి హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తమ తల్లి వర్థంతికి ఏవీ సుబ్బారెడ్డి గైర్హజరుతో తాము బంధం తెంచేసుకున్నామని భూమా మౌనికారెడ్డి తేల్చి చెప్పారు. భూమా కుటుంబాన్ని వేలెత్తి చూపితే సహించేది లేదన్నారు. రాజకీయంగా ఎదగాలంటే సుబ్బారెడ్డికి సహకరిస్తామని.. కానీ తమ కుటుంబంపై నిందలు మోపితే మాత్రం సహించబోమన్నారు.

ఇక ఏవీ సుబ్బారెడ్డి కూతురు జస్వంతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను మనస్తాపానికి గురిచేశాయన్న అఖిలప్రియకు .. జస్వంతి కౌంటర్‌ ఇచ్చారు. తన తండ్రిని గుంటనక్క అంటే తనకెంత బాధగా ఉందో ఆమెకు తెలియదా అని ప్రశ్నించారు. భూమా ప్యామిలీ కోసం తన తండ్రి ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. ఇంత చేసినా తమపట్ల లెక్కలేని తనంతో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆళ్లగడ్డను అఖిలప్రియకు వదిలి.. నంద్యాల నుంచి ఏవీ సుబ్బారెడ్డిని పోటీ చేయించేలా అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో నంద్యాల నుంచి ఏవీ సుబ్బారెడ్డి పోటీ కూడా చేశారు. అయితే వచ్చేఎన్నికల్లో ఈ సీటును వదులుకోవడానికి ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డి అంగీకరించాల్సి ఉంటుంది. అదే స్థానంపై ఆశలు పెంచుకున్న ఇతర నేతలను కూడా బుజ్జగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ సమస్యను చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తి రేపుతోంది.

ఆళ్లగడ్డతోపాటు చింతలపూడిలో ఎమ్మెల్యే పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబు మధ్య ఏర్పడిన విభేదాలపైనా చంద్రబాబు వారితో చర్చించారు. అన్ని స్థాయిల్లోని నేతలు ఐకమత్యంగా కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు. నేతల విభేదాలు పార్టీ అభివృద్ధికి విఘాతాలన్న అంశం అందరూ గుర్తుంచుకోవాలన్నారు. 

06:33 - April 27, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర స‌మితి 17వ వార్షికోత్సవానికి స‌ర్వం సిద్ధం చేసింది. నగ‌ర శివారుల్లోని కొంప‌ల్లిలో ప్రతినిధుల స‌భ‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నిక‌ల ఏడాది కావ‌డంతో అధికార పార్టీ ఈ ప్లీన‌రీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌తో పాటు రాష్ట్రంలో పార్టీ నేత‌లు అనుస‌రించాల్సిన విధానంపై ప్లీన‌రీ ద్వారా కార్యకర్తల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు. గులాబి పార్టీ పండుగ‌కు సర్వం సిద్ధమైంది. 17 వ‌సంతాలు పూర్తి చేసుకుంటున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘ‌నంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నినియోజ‌క‌వ‌ర్గాల నుంచి పార్టీ ప్రతినిధుల‌ను స‌మావేశానికి ఆహ్వానించారు. నియోజ‌క‌వ‌ర్గం నుంచి హాజ‌ర‌య్యే ప్రతినిధుల‌ను ఆయా ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌లే ఆహ్వానించేలా బాధ్యత‌ల‌ను పార్టీ అప్పగించింది. సుమారు 15 వేల మంది వ‌ర‌కు పార్టీ ప్రతినిధులు హాజ‌రుకానున్నారు. పార్టీ అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు జ‌రుపుతున్న ప్లీన‌రీ కావ‌డంతో గులాబి బాస్ ఈ ప్లీన‌రీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

గ‌త నాలుగేళ్లుగా ప్రభుత్వ ప‌రంగా అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు....రాబోయే ఏడాది కాలంలో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ నేత‌ల‌కు దిశా నిర్దేశం చేయ‌నున్నారు. అదే విధంగా జాతీయ స్థాయిలో కూడా చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న కేసీఆర్.....జాతీయ రాజ‌కీయాల‌పై ప్లీన‌రీ వేదిక‌గానే మ‌రింత స్పష్టత ఇచ్చే అవ‌కాశం ఉంది. రాష్ట్రంలో ప‌ట్టు నిలుపుకుంటూనే జాతీయ స్థాయిలో పార్టీ వ్యూహంపై నేత‌ల‌కు ప్లీన‌రీలో వివ‌రించనున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ ప‌రంగా మాత్రం రాబోయే ఏడాది కాలం కీల‌కం కావ‌డంతో..... ఏడాదిలో పార్టీ ప‌రంగా కార్యక‌ర్తల‌కు మ‌రిన్ని బాధ్యత‌లను అప్పగించే అవ‌కాశం క‌నిపిస్తోంది. పార్టీ ప్రధాన కార్యద‌ర్శులు, కార్యద‌ర్శులు ఎమ్మెల్యేలతో స‌మ‌న్వయం చేసుకుంటూ అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్న యోచ‌న‌లో గులాబి నేత‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్లీన‌రీలో ఆరు తీర్మానాల‌ను ఆమోదించ‌నుంది. ప్రభుత్వ ప‌రంగా చేపడుతున్న కార్యక్రమాల‌తో పాటు మైనార్టీ పాల‌సీ, జాతీయ రాజ‌కీయాలపై తీర్మానాలు ఆస‌క్తి రేపుతున్నాయి. గ‌తంలో జ‌రిగిన ప్రతినిధుల స‌భ‌కు, ఇప్పుడు నిర్వహిస్తున్న ప్రతినిధుల స‌భ‌కు తేడా స్పష్టంగా ఉంటుంద‌ని అధికార పార్టీ నేత‌లు అంటున్నారు. ప్లీన‌రీకి హాజ‌ర‌య్యే ప్రతినిధుల‌కు ఇబ్బందులు ఎదురు కాకుండా పార్టీ అన్నిముందు జాగ్రత్త చ‌ర్యల‌ను చేప‌ట్టింది. దాదాపు 2 వేల మంది వాలంటీర్లు ప్రతినిధుల‌కు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ రాష్ట్ర స‌మితి 17వ వార్షికోత్సవం...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర స‌మితి 17వ వార్షికోత్సవానికి స‌ర్వం సిద్ధం చేసింది. నగ‌ర శివారుల్లోని కొంప‌ల్లిలో ప్రతినిధుల స‌భ‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నిక‌ల ఏడాది కావ‌డంతో అధికార పార్టీ ఈ ప్లీన‌రీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌తో పాటు రాష్ట్రంలో పార్టీ నేత‌లు అనుస‌రించాల్సిన విధానంపై ప్లీన‌రీ ద్వారా కార్యకర్తల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు.

స్వేచ్చగా సంచరిస్తున్న నీరవ్ మోదీ...

ఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు 13వేల కోట్లకు కుచ్చుటోపి పెట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని హాంకాంగ్‌ నుంచి భారత్‌కు రప్పించాలన్న ప్రయత్నం విఫలమైంది. నీరవ్ మోదీ హాంకాంగ్‌ను వదిలి న్యూయార్క్‌కు వెళ్లిపోయాడు. రద్దు అయిన భారతీయ పాస్‌పోర్ట్‌తోనే మోది స్వేచ్ఛగా సంచరిస్తున్నాడు. 

జస్టిస్ జోసెఫ్ నియామకం తాత్కాలికంగా నిలిపివేత...

ఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జిగా ఇందు మల్హోత్రా నియామకంపై స్టే విధించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇందు మల్హోత్రాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జస్టిస్‌ జోసెఫ్‌ నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ పిటిషన్‌ వేసింది. ఇందు మల్హోత్రా నియామకాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టును కోరింది.

బిజెపితో కాంగ్రెస్ పొత్తు...

ఢిల్లీ : ఉప్పు-నిప్పుగా ఉండే కాంగ్రెస్‌ పార్టీ-బిజెపిలు మిజోరాం స్థానిక ఎన్నికల్లో మాత్రం చేతులు కలిపాయి. ఎన్నికల్లో ఎవరికి వారే పోటీ చేసినా అధికారాన్ని కాంగ్రెస్‌ బిజెపిలు కలిసి పంచుకోవాలని అక్కడి పార్టీ నేతలు ఓ నిర్ణయానికి రావడం ఆసక్తిగా మారింది. చక్మా జిల్లా స్వతంత్ర పాలక సంస్థకు గత శుక్రవారం ఎన్నికలు జరిగాయి.

స్కూల్ వ్యాన్ ను ఢీకొన్న పాల ట్యాంకర్...

ఢిల్లీ : స్కూల్‌ వ్యాన్‌ను ఓ ప్రయివేట్‌ పాల ట్యాంకర్‌ ఢీకొన్న ఘటన కన్హయ్యనగర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఏడేళ్ల బాలిక మృతి చెందగా...మరో 10 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 

రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు కోహ్లి పేరు...

ఢిల్లీ : క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ పేరును ప్రతిష్ఠాత్మక రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డుకు బీసీసీఐ సిఫారసు చేసింది. అలాగే భారత్‌ అండర్‌-19 జట్టు ప్రపంచ కప్‌ గెలుచుకోవడంతో కీలకపాత్ర పోషించిన మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేరును ద్రోణాచార్య అవార్డుకు, సునీల్‌ గవాస్కర్‌ పేరును ధ్యాన్‌చంద్‌ అవార్డుకు బీసీసీఐ సిఫారసు చేసింది.  

Don't Miss