Activities calendar

28 April 2018

22:15 - April 28, 2018

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోది రెండు రోజుల చైనా అనధికార పర్యటన ముగిసింది. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తగ్గించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. భవిష్యత్తులోనూ చర్చలు కొనసాగించాలని నిర్ణయించాయి. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఓ మైలురాయి లాంటిదని చైనా అభివర్ణించింది.

ముగిసిన ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో రెండో రోజుల పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో రెండో రోజుల పర్యటన ముగిసింది. రెండోరోజు పర్యటనలో భాగంగా వుహాన్‌లోని ఈస్ట్ లేక్ వద్ద చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రధాని మోదీ నదీ తీరాన నడుచుకుంటూ కాసేపు మట్లాడుకున్నారు.ఆ తర్వతా ఇరువురు నేతల మధ్య చాయ్‌పే చర్చ కూడా జరిగింది.

నరేంద్రమోది, జిన్‌పింగ్‌లు డబుల్‌ డెక్కర్‌ పడవలో విహారం
అనంతరం నరేంద్రమోది, జిన్‌పింగ్‌లు డబుల్‌ డెక్కర్‌ పడవలో విహరించారు.దాదాపు గంటసేపు పడవలో ప్రయాణించిన ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు.

అనధికార శిఖరాగ్ర సదస్సులో మోదీ, జిన్ పింగ్
అనధికార శిఖరాగ్ర సదస్సులో భాగంగా వుహాన్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, ప్రధాని మోదిలు 24 గంటల్లో ఆరుసార్లు సమావేశమయ్యారు. వ్యూహాత్మక సైనిక సంబంధాలు, వాణిజ్యం, పర్యాటకం, ఉగ్రవాదం, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. ఆప్ఘనిస్తాన్‌లో సంయుక్తంగా ఆర్ధిక ప్రాజెక్టు చేపట్టేందుకు భారత్-చైనా అంగీకారం తెలిపాయి. ఇది కార్యరూపం దాల్చితే.. అఫ్గానిస్థాన్‌లో భారత్‌, చైనాలు సంయుక్తంగా చేపడుతున్న తొలి ప్రాజెక్టు ఇదే అవుతుంది. ఈ నిర్ణయం తో పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని భావిస్తున్నారు. చైనా-పాక్‌లు కలిసి ప్రారంభించిన ఎకనమిక్‌ కారిడార్‌ను ఆఫ్గనిస్తాన్‌ వరకు పొడింగించనున్నట్లు చైనా ఇదివరకే తెలిపింది.

సంతకాలు లేని పర్యటన
అనధికార పర్యటన కావడంతో ఇరుదేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు జరగలేదు...ప్రకటనలు చేయలేదు. డోక్లాం వివాదం నేపథ్యంలో ఇరుదేశాల సరిహద్దులో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ఇరు దేశాలు అంగీకరించాయి. గత ఏడాది డోక్లాం వద్ద రెండు నెలల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

మోది చైనా పర్యటన సఫలమైంది : విదేశాంగ శాఖ
మోది చైనా పర్యటన సఫలమైందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. మోది, జిన్‌పింగ్‌ మధ్య జరిగిన చర్చలు ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని పేర్కొంది. సరిహద్దులో ఇరుదేశాలు శాంతినే కోరుకుంటున్నాయని...త్వరలోనే ఈ వివాదం పరిష్కారమవుతుందని విదేశాంగ కార్యదర్శి విజయ్‌ గోఖలే వెల్లడించారు. ఇరుదేశాల నేతల మధ్య సమావేశాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని చెప్పారు.

చైనా, భారత్‌ల జనాభా 40 శాతం ఉంది : ప్రధాని మోది
ప్రపంచ జనాభాలో చైనా, భారత్‌ల జనాభా 40 శాతం ఉందని ప్రధాని మోది అన్నారు. ప్రపంచ దేశాల సమస్యలను పరిష్కరించేందుకు ఇరు దేశాలు కలిసి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ప్రపంచంలో స్థిరత్వం, శాంతికి దోహదం చేస్తాయని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు.

22:07 - April 28, 2018

హైదరాబాద్ : సివిల్స్‌లో తెలుగు తేజాలు సత్తా చాటారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయిప్రణీత్‌ ఆల్‌ ఇండియా 196వ ర్యాంక్‌ సాధించారు. తెలంగాణ ఆప్షన్‌గా పరీక్ష రాసిన సాయి ప్రణీత్‌ ఐపీఎస్‌ అవకాశం వస్తుందని ధీమాగా ఉన్నారు. సివిల్‌ సాధనపై సాయి ప్రణీత్‌ ఏమంటున్నారో.. ఈ వీడియోలో చూడండి..

22:01 - April 28, 2018

హైదరాబాద్ : శిక్షల తీవ్రత పెంచినంత మాత్రాన అత్యాచార నేరాలు తగ్గవని జస్టిస్‌ మంగరీ రాజేంద్రన్‌ అభిప్రాయపడ్డారు. విచారణాధికారులు, కోర్టులు నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే ఈ తరహా నేరాలు అదుపులోకి వస్తాయని అన్నారు.

తెలంగాణ, సూర్యాపేట, మార్కెట్ యార్డ్, రైతులు, ఆందోళన, చర్చ
హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో "వర్కింగ్ ఆఫ్ వుమెన్ లాస్, డెత్ ఫెనాల్టీ రెమీడీస్" అన్న అంశంపై.. చర్చాగోష్ఠి జరిగింది. పొత్తూరి భారతి ఫౌండేషన్‌, ఏపీ పౌరహక్కుల సంఘం సంయుక్త నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, మహిళా, శిశు సంక్షేమ అధికారులు, పాత్రికేయులు పాల్గొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు.. వాటి నియంత్రణకు ఉన్న చట్టాలు.. వాటి ఫలితాలు అన్న అంశంపై ఈ గోష్ఠిలో చర్చించారు. అత్యాచార నిందితులకు ఉరిశిక్ష విధించే ఆర్డినెన్స్‌పైనా సమావేశంలో చర్చించారు.

అత్యాచార నిరోధానికి ఎన్నో మార్పులు తేవాలని సూచనలు..
ప్రస్తుత న్యాయ వ్యవస్థలో.. శిక్షలకు, నేరాలకు సంబంధం లేకుండా ఉందని... అందుకే, శిక్షలు విధించడం.. వాటిని అమలు చేయడంలో జాప్యం జరగకుండా చట్టాలు ఉండాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అత్యాచార నిరోధానికి ఎన్నో మార్పులు తేవాలని సూచించారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ కేసులు మాత్రమే కాదు.. అన్ని చట్టాలూ దుర్వినియోగం అవుతున్నాయని గోష్ఠిలో పాల్గొన్న జస్టిస్‌ రాజేంద్రన్‌ అన్నారు. జస్టిస్‌ లోయా మృతి కేసు.. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం లేదని నిరూపిస్తోందన్నారు. శిక్షలు పెంచితే నేరాలు తగ్గవని, పకడ్బందీ విచారణ, కోర్టుల సత్వర తీర్పులు నేరాలను అదుపులోకి తెస్తాయని జస్టిస్‌ రాజేంద్రన్‌ అభిప్రాయపడ్డారు.

చిన్నారులపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి : లక్ష్మీకుమారి
దేశంలో చిన్నారులపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని, కార్యక్రమంలో పాల్గొన్న మహిళా శిశు సంక్షేమ అధికారి లక్ష్మీకుమారి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా నేరాలను అదుపు చేయడంలో... చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేరగాళ్లకు జరిమానాలు మాత్రమే విధించడం, మరణశిక్షల్లో జాప్యం వంటి కారణాల వల్ల.. నేరస్థులు యథేచ్ఛగా తప్పించుకుంటున్నారని ఆమె అన్నారు. నగరంలో ఇటీవల బాల్యవివాహాలూ పెరుగుతున్నాయని, ప్రభుత్వం భరోసా కేంద్రాలు, షీ-టీమ్‌లను మరిన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో మరిందరు వక్తలు ప్రసంగించారు. నేరగాళ్లకు సత్వరమే శిక్ష పడేలా చట్టాలు ఉండాలని, న్యాయవ్యవస్థ కూడా తీర్పులు సత్వరం అమలయ్యేలా చూడాలని వారు సూచించారు.

 

21:57 - April 28, 2018

సూర్యాపేట : సూర్యాపేట మార్కెట్‌యార్డ్‌లో రైతుల ఆందోళన రెండోరోజుకు చేరింది. మద్దతు ధర కోసం అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు విపక్ష నేతలు మద్దతు తెలిపారు. రైతుల సమస్య పరిష్కరించే వరకూ ఉద్యమాన్ని ఆపబోమని హెచ్చరించారు.

రెండురోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు..
రెండు రోజులుగా మద్దతు ధర కోసం సూర్యాపేట మార్కట్ యార్డ్‌లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రైతులకు విపక్షాలు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. మాజీ మంత్రి దామోదర్‌ రెడ్డిచ కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండ రెడ్డి మార్కెట్‌ యార్డ్‌ను సందర్శించారు. రైతులతో సంభాషించాక జిల్లా కలెక్టర్‌ను కలిసి కర్షకుల కష్టాలను ఆయనకి వివరించారు.

విపక్ష కాంగ్రెస్‌ నేతల విమర్శలు
మార్కెట్‌ యార్డ్‌లో ట్రేడర్లు సిండికేట్‌గా మారి.. రైతులకు గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారని విపక్ష కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. రైతులు దోపిడికి గురవుతుంటే పాలక పక్షం నాయకులు ఎవరూ పరామర్శించక పోవడం దారుణమన్నారు. సూర్యాపేట్‌ మార్కెట్‌కు వచ్చిన ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్ చేశారు.

రైతుల కోసం భోజనం తీసుకు వస్తున్న వాహనాన్ని ఆపివేసిన అధికారులు
అటు భువనగిరి మార్కెట్‌ యార్డులో కాంగ్రెస్‌ నేతలు ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రానికి మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ అనుమతి నిరాకరించారు. రైతుల కోసం భోజనం తీసుకు వస్తున్న వాహనాన్ని గేటు బయటే ఆపి.. తాళాలు వేయించారు. దీంతో రైతులు గేటు బయటే కూర్చుని భోజనాలు చేశారు. అనంతరం గేటు తాళాలు తీశాక, కాంగ్రెస్‌ శ్రేణులు మార్కెట్ యార్డ్‌ చైర్మన్‌ గదిలోకి చొరబడి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌కు కాంగ్రెస్‌ కార్యక్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

 

21:54 - April 28, 2018

హైదరాబాద్ : ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నేతృత్వంలోని తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావ సభకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభను వినూత్నంగా నిర్వహించాలని టీజేఎస్‌ భావిస్తోంది. ప్రభుత్వం విస్మరించిన అమరవీరుల స్మృతి చిహ్నం ఏర్పాటుకు ఈ సభను వేదికగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది. పార్టీ అధినేత కోదండరామ్‌ వీటికి సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ఆదివారం టీజేఎస్‌ ఆవిర్భావ సభ
తెలంగాణ జేఏసీ చైర్మన్‌గా ఇన్నాళ్లూ కొనసాగిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌.. సరికొత్త రాజకీయ పార్టీని ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే పార్టీ పేరు, గుర్తును వెల్లడించిన కోదండరామ్‌.. ఆదివారం నాటి ఆవిర్భావ సభలో.. పార్టీ విధివిధానాలు, ఆవిర్భావ ఆవశ్యకతను వివరించనున్నారు. ఆవిర్భావ సభను జయప్రదం చేసి తీరాలని పట్టుదలగా ఉన్న కోదండరామ్‌.. దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ప్రతి ఒక్కరూ వ్యవసాయ పనిముట్లు తీసుకురావాలన్న కోదండరామ్‌
తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభను.. రొటీన్‌కు భిన్నంగా.. ఆలోచింప చేసేలా నిర్వహించాలని కోదండరామ్‌ భావిస్తున్నారు. ఈ క్రమంలో సభాస్థలిలో అమరవీరుల స్పూర్తివన్‌ను నిర్మిస్తున్నారు. దీనికిగాను.. సభకు హాజరయ్యే ప్రజలు.. ఇంటి వద్ద నుంచే వ్యవసాయ పనిముట్ల ముక్కలను తీసుకురావాలని కోదండరామ్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభ నిర్వహణను విభిన్నంగా చేపట్టనున్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సభ ప్రారంభం కానుంది. ఐదు గంటలకు అమరవీరుల స్తూపం వద్ద టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ నివాళి అర్పించి.. ఐదు గంటల పదిహేను నిమిషాలకు పార్టీ ఆవిర్భావ ప్రకటన చేస్తారు. పార్టీ పతాకంతో పాటు... పార్టీ గీతాన్నీ ఆవిష్కరిస్తారు. సాయంత్రం ఆరు వరకు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారు. టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనలో ప్రజలు పడ్డ వెతలతో కూడిన వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. నేరెళ్ల దళితుల వెతలు, ఆత్మహత్యకు పాల్పడ్డ రైతుల కుటుంబాల బాధలు, ప్రభుత్వ వైఫల్యాలు, నిర్బంధాలు, ప్రజా ఉద్యమాలన్నీ ఇందులో ఉంటాయి.

సభా వేదికపై అన్ని రంగాలకూ చెందినవారు
టీజేఎస్‌ ఆవిర్భావ సభా వేదికపై అన్ని రంగాలకూ చెందిన సుమారు రెండు వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంలో ప్రభుత్వం బేడీలు వేయించిన రైతులతో ముఖాముఖి, 2014 ర్వాత ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువత కుటుంబ సభ్యులతో పరిచయాలు, భూ నిర్వాసితులతో ప్రసంగాలు వినిపించి ఈ వేదిక ద్వారా అన్ని వర్గాల ప్రజల వెతలను తెలంగాణ సమాజానికి చాటాలని భావిస్తున్నారు.

పార్టీ విధి విధానాలు, ఆవిర్భావ ఆవశ్యకతను వివరించనున్న కోదండరామ్‌
టీజేఎస్‌ ఏర్పాటుకు దారితీసిన పరిణామాలు, పార్టీ విధివిధానాలను దాదాపు ఏడు గంటల ప్రాంతంలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌ వివరించనున్నారు. సభకు భారీ సంఖ్యలో ప్రజలు వస్తారని అంచనా వేస్తున్న టీజేఎస్‌.. ఆహూతులు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకూ తగిన ఏర్పాట్లూ చేశారు.  

21:47 - April 28, 2018

హైదరాబాద్ : టీ-జేఏసీ చైర్మన్‌ పదవికి ప్రొఫెసర్‌ కోదండరామ్‌ రాజీనామా చేశారు. కొత్తగా తెలంగాణ జనసమితి పార్టీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో... ఆయన టీ-జేఏసీకి రాజీనామా చేశారు. గన్‌పార్క్‌ దగ్గర నివాళులర్పించిన కోదండరామ్‌.. తాను జేఏసీలో లేకపోయినా.. మా పార్టీ సహకారం ఎప్పుడూ అందిస్తానన్నారు. 

21:42 - April 28, 2018

హైదరాబాద్ : ఎన్నికలకు ఇంకా ఏడాది గడువు ఉండగానే తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. అధికార , ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో సీఎం కేసీఆర్‌.. కాంగ్రెస్‌, బీజేపీలపై చేసిన విమర్శలకు ప్రతిపక్ష నేతలు ధీటుగా కౌంటర్‌ ఇస్తున్నారు. దీంతో రాష్ట్రంలో నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

తెలంగాణలో మొదలైన పొలిటికల్‌ హీట్‌
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఏడాది గడువు ఉన్నప్పటికీ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య పరస్పర ఆరోపణలు చేసుకుంటుండగా... తాజాగా టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో సీఎం కేసీఆర్‌.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలపై చేసిన విమర్శలతో ఇంకాస్త వేడి పెరిగింది. ఇదిలావుంటే... కేసీఆర్‌ చేసిన ఆరోపణలపై ప్రతిపక్షాలు ధీటుగా కౌంటరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో తొలి సీఎం గొప్ప స్టేటస్‌మేన్‌గా ఉంటాడనుకుంటే.. చిల్లర వ్యక్తిగా వ్యవహరిస్తున్నారని టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ప్రగతి భవన్‌ను లక్ష చదరపు అడుగుల్లో.. అత్యంత విలాసవంతంగా నిర్మించింది నిజం అవునో.. కాదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు సంచులు పంచుతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.

భూకంపం పుట్టిస్తానన్న కేసీఆర్‌ ఓయూలో అడుగుపెడతాడా అని ప్రశ్న
జాతీయ రాజకీయాల్లో భూకంపం పుట్టిస్తానన్న కేసీఆర్‌.. ధైర్యం ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో కాలు పెట్టాలన్నారు శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ. కాంగ్రెస్‌పై విమర్శలు చేసే ముందు.. తన గత జీవితం ఏంటో చూసుకోవాలన్నారు. 100 శాతం ఎన్నికల హామీలను నెరవేర్చామన్న కేసీఆర్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు టీ-కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క. ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయో ఏ గ్రామంలోనైనా చర్చకు సిద్ధమాని సవాల్‌ విసిరారు.

కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతుందన్న బీజేపీ
రాష్ట్రంలో రేషన్‌కార్డులు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజల్లో ఎండగడతామన్నారు. కేంద్రం నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి 60 లక్షల రూపాయలు నిధులు వస్తున్నా.. ప్రభుత్వం గ్రామాలకు ఇవ్వకుండా కొల్లగొడుతుందని ఆరోపించారు.

మీది కుటుంబ పాలన కాదా : తలసాని
ప్రతిపక్ష నేతల ఆరోపణలపై అధికార పార్టీల నేతలు తిప్పికొట్టారు. కేసీఆర్‌పై ఉత్తమ్‌ చేసిన వ్యాఖ్యలను మంత్రి తలసాని ఖండించారు. ప్రగతిభవన్‌ సీఎం క్యాంప్‌ కార్యాలయమేనని.. టీఆర్‌ఎస్‌ భవన్‌ కాదన్నారు. ప్రతిరోజూ కేసీఆర్‌పై ఆరోపణలు చేయడమే కాంగ్రెస్‌ నేతలు పనిగా పెట్టుకున్నారన్నారు. నెహ్రూ నుంచి రాహుల్‌ గాంధీ వరకు కాంగ్రెస్‌ది కుటుంబ పాలన కాదా అని తలసాని ప్రశ్నించారు. మొత్తానికి రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నేతల మాటలతో ఎన్నికల హీట్‌ మరింత పెరిగింది. 

21:38 - April 28, 2018

హైదరాబద్ : తాను పదవులో.. లేదా ఇంకేదో ఆశించి.. జాతీయ రాజకీయాల ఆలోచన చేయడం లేదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ దేశ పౌరుడిగా.. మార్పు తెచ్చేందుకే తన వంతు ప్రయత్నంగా పని ప్రారంభించానన్నారు. ప్రగతి భవన్‌లో వివిధ దేశాల ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ అభివృద్ధి, జాతీయ రాజకీయాలు, ఎన్‌ఆర్‌ఐల సంక్షేమంపై సీఎం చర్చించారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ వారికోసం యాభై కోట్ల రూపాయల నిధితో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఎన్నారై సెల్‌, కమిటీ ఏర్పాటు, వాటి పని విధానంపై కార్యాచరణ రూపొందించాలని మంత్రి కేటీఆర్, ఎంపీ కవితను సీఎం ఆదేశించారు. ఎన్నారైల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయించిన వందకోట్ల రూపాయల నుంచి ఎన్నారై సెల్‌కు యాభై కోట్లు బదిలీ చేస్తామన్నారు ముఖ్యమంత్రి.

కార్మికులదరికి ఈఎస్ఐ : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : కార్మికుల సంక్షేమంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. రాష్ట్రంలోని కార్మికులందరికీ ఈఎస్‌ఐ వర్తించే విధానం రూపొందించాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు బీమా అమలు చేయాలని తెలిపారు. సంఘటిత, అసంఘటిత కార్మికుల ఆరోగ్యం, సంక్షేమం, బీమా కోసం చర్యలు చేపట్టాలని చెప్పారు. కార్మికుల కోసం ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలపై నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణ కార్మికులకు కూడా ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలన్నారు. కార్మికులందరి ఆధార్ కార్డులను అనుసంధానం చేయాలన్నారు.

భవనంపైనుండి పడి ఇద్దరు కార్మికులు మృతి..

రంగారెడ్డి : రాయదుర్గం లోని చ్రిపురి కాలనీలో విషాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న భవనంపై నుండి ప్రమాదవశాత్తు ఇద్దరు కార్మికులు పడిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కృష్ణా జిల్లాలకు చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు. 

బౌద్ధమతంలోకి భారీగా దళితులు..

హైదరాబాద్ : గుజరాత్‌లోని ఉనా తాలుకా మోటా సందియా గ్రామానికి చెందిన 300 మంది దళితులు బౌద్ధమతం స్వీకరించనున్నాయి. దళిత సమాజికవర్గంపై జరిగే దాడి.. చూపే వివక్షకు వ్యతిరేకంగా బుద్ధపూర్ణిమను పురస్కరించుకుని వీరంతా రేపు బుద్దిజమ్‌ను చేపడుతున్నారు. పోరుబందర్ నుంచి బౌద్ధ మతగురువులు, స్థానిక రాజకీయ నాయకులు కార్యక్రమానికి హాజరౌతున్నారు. 

ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ..

ఢిల్లీ: చైనా పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని రెండు రోజులపాటు చైనాలో పర్యటించిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో మోదీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడం, ఇరు దేశాల మధ్య అధిక సహకారం, ఏదైనా వివాదానికి ముందే పలుమార్లు చర్చించడం, వాణిజ్యంలో సమతూకం, ఉగ్రవాదంపై పోరు వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.

20:23 - April 28, 2018

హురక పదో పతగతి పరీక్షల ఫలితాలు రానేలేదు అప్పుడే పదోతర్గతి బుజ్జికి పెండ్లి వెట్టేశిండ్రు తల్లిదండ్రులు.. అంత పదహారేండ్లు గూడ నిండని బుజ్జికి అప్పుడే పెండ్లి జేశి చేతులు దుల్పుదామనుకుంటున్నరు వాళ్ల తల్లిదండ్రులు ఈ ముచ్చట తెల్చి అధికారులు ఊకుంటరా వచ్చి పెండ్లి ఆపుజేశి పోయిండ్రు..

యాడంగ దాపుమైండ్రో ఏమో మన తెల్గు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఒకాయిననేమో వంద శాతం మేనిఫెస్టోల జెప్పినయన్ని అమలు జేశ్నమని ఇక్కడి చంద్రయ్య జెప్తడు.. నేనేం తక్వనా నేను గూడ తొంబై తొమ్మిదిశాతం అమలు జేశ్నాని అక్కడు చంద్రాలు జెప్తడు.. బాగమోపైండ్రొసు ఆడొకలు ఆడొకలు.. అంటున్నరు సూశినోళ్లు మరి చంద్రాలు కథ ఏందో ఇనుండ్రిగ...

కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ పొన్నం ప్రభాకర్ సారుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద బాగ ప్రేమ వెర్గినట్టుందిగదా..? ఆయన మీద ఒక సీన్మదీస్తడట.. సీన్మటైటిలు గూడ రిలీజ్ జేశిండు.. మొన్న మహేష్ బాబుది శీన్మరాలే.. అదే భరత్ అనే నేను సీన్మ.. అగో సేమ్ అసొంటిదే దీస్తడట.. ఈ సీన్మపేరు కేసీఆర్ అనే నేను అని పేరువెట్టిండు.. మరి చిత్రం ఎట్లుంటదో అర్సుకుందాం పాండ్రి..

కోదండరాం సారధ్యంలొస్తున్న కొత్త పార్టీ తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ ఈ ఐతారం మూడుగంట్లకు సుర్వైతున్నది.. ఇప్పటికే జిల్లాల పొంట ప్రచారాలు గట్టిగ జేశ్న ఆ పార్టోళ్లు లక్షమందిని సభకు వట్కొచ్చె ఏర్పాట్లు జేశిండ్రట.. సరూర్ నగర్ స్టేడియంల పని ఎట్లైతున్నది ఏం కథ మొత్తం అర్సుకున్నడు కోదండరాం సారు ఇయ్యాళ..

మొన్ననే మూడు రోజుల కింద మార్కెట్ల ధాన్యం కొనుగోలు కేంద్రానికి రిబ్బను కట్ జేశి.. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం.. కేసీఆర్ దేవుడు.. ఆయనంత శిపాయి లేడని ప్రెస్ మీటింగు వెట్టి చెప్పిండు వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు.. అప్పటిమందం ధాన్యం జోకినట్టు రెండు పోట్వలకు ఫోజిచ్చిండు.. తర్వాతేమైందో సూడుండ్రి..

సూడుండ్రి తెలంగాణ బిడ్డ ఎంత గొప్ప విజయం సాధించిండో.. భారతదేశంలనే నెంబర్ వన్ ర్యాంకు సాధించి.. ఐఏఎస్ అయ్యిండు.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టపూర్ ఊర్లుండే దూరిశెట్టి మనోహర్ కొడ్కు అనుదీప్ సివిల్స్ ల నెంబర్ వన్ ర్యాంకు గొట్టిండు.. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఫస్టు ఈ పిలగాడే ఇంత పెద్ద ర్యాంకు గొట్టింది... మల్లన్న ముచ్చట్ల తర్పున శుభాకాంక్షలు తమ్మీ నీకు..

నిన్న పోలీసోన్ని భార్య పొర్కపొర్క గొట్టిన ముచ్చట జూశిండ్రుగదా..? చెర్యాల కాడ.. ఇప్పుడు భర్త భార్యను సేమ్ అదే సీన్ల దొర్కిచ్చుకోని కొట్టిండు కాకపోతె.. ఇది చెర్యాలగాదు.. ఆంధ్ర రాష్ట్రంల అయ్యింది.. చేర్యాల కాడ భర్త ఏం జేశిండో.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాడ భార్యగూడ అదే లత్కోర్ పని జేస్కుంట భర్తకు దొర్కింది.. ఇగ కథ జూడుండ్రి..

రూపాయికి రెండు రూపాలొస్తున్నయంటే ప్రజలకు ఎట్ల ఆశుంటది.. ఇగ ఈ ఆశనే ఆయుధంగ మార్చుకున్నరు కొంతమంది.. ఐదువందల రూపాల నోట్లు.. రెండువేల రూపాల నోట్లు సొంతంగ తయ్యారు జేస్కునె శక్తి సామర్ధ్యాలను ప్రసాదిస్తం మీకని నల్లరంగు కాయిదాలను అంటగట్టి అసలు నోట్లు ఎత్కపోతున్నరనట.. కరీంనగర్ కమీషనర్ కమలాసన్ రెడ్డి సారు జెప్తడు ఇనుండ్రి...

కేసీఆర్ ఏ భూకంపాన్ని కోరుతున్నారు : మల్లు రవి

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతు..హైదరాబాద్ కేంద్రంగా భూకంపాన్ని సృష్టిస్తానని అన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మల్లు రవి ప్రశ్నించారు. రైతురుణమాఫీ సరిగ్గా అములచేయటం లేదని విమర్శించారు.రైతుల పాస్ బుక్కులు ఇంకా బ్యాంకుల్లోనే వున్నాయనీ..రైతులకు మద్ధతు ధర కల్పించలేకపోయారనీ..కేసీఆర్ రాజకీయ నిలకడ లేని వ్యక్తి అని మల్లు రవి ఎద్దేవా చేశారు. థర్డ్ ఫ్రంట్ కు కేసీఆర్ రాజు, మంత్రి,బంటు అనీ..పార్టీని వదిలిపెట్టకుండా ఉండేందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇస్తున్నామని కేసీఆర్ ప్రకటించారని విమర్శించారు.

గ్రామగ్రామాన రైతుబంధు పథకం:మంత్రి హరీశ్

సంగారెడ్డి : రైతుబంధు పథకం రైతులకు వరంలాంటిదని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.12వేల కోట్ల చెక్కుల పంపిణీ చేశామని హరీశ్ రావు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణ ఖేడ్ లో రూ.190 కోట్ల పెట్టుబడిని రైతులకు ఇస్తున్నామన్నారు. రైతు బంధు పథకం గ్రామగ్రామాన జరిగే పండుగలాంటిదన్నారు. రాష్ట్రంలో 50లక్షల మంది రైతులకు చెక్కులు అందించామన్నారు. ప్రతి 300ల మంది రైతులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. రైతు సమన్వయ కమిటీ సభ్యులు ప్రతి రైతుకు చెక్కు అందేలా చూడాలని ఆదేశించారు.

డీఎంకే స్టాలిన్ తో భేటీ కానున్న కేసీఆర్..

హైదరాబాద్ : తృతీయ ఫ్రంట్ కోసం కేసీఆర్ మరో అడుగు వేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటన ఖరారయ్యింది. రేపు ఉదయం 10 గంటలకు బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో కేసీఆర్ చెన్నై బయల్దేననున్నారు. చెన్నై చేరిన అనంతరం డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తో కేసీఆర్ భేటీ కానున్నారు. తృతీయ ఫ్రంట్ ఏర్పాటుపై స్టాలిన్ తో కేసీఆర్ చర్చించనున్నారు. కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా చెన్నై వెళ్లనున్నారు. 

టీడీపీలో కాపులకు పెద్దపీట : కళా

అమరావతి : కాంగ్రెస్ లో కాపులకు నామమాత్రపు ప్రాధన్యత వుందనీ కానీ టీడీపీలో కాపులకు పెద్దపీట వేసామని మంత్రి కళా వెంకట్రావు పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తీస్తున్నామన్నారు. 

టీజేఏసీ కన్వీనర్ గా రఘు : కోదండరాం

హైదరాబాద్ : టీజేఏసీ చైర్మన్ పదవి నుండి తప్పుకుంటున్నానని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. టీజేఏసీ కన్వీనర్ గా రఘుకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా కోదండరాం పేర్కొన్నారు. టీజేఏసీ చైర్మన్ పై స్టీరింగ్ కమిటీలో నిర్ణయిస్తామన్నారు. తెలంగాణ జన సమితిలో కీలకంగా పనిచేయాలని నిర్ణయంతోనే టీజేఏసీ చైర్మన్ పదవి నుండి తప్పుకుంటున్నానని కోదండరాం తెలిపారు. 2009 నుండి సహకరించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాను టీజేఏసీలో లేకున్నా జన సమితి పార్టీ సహకారం వుంటుందన్నారు. 

ఎన్నారై ప్రతినిధులతో సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : ఎన్నారై ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఎన్నారైల కోసం రూ.50కోట్ల నిధితో కూడిన సెల్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నట్లుగా కేసీఆర్ తెలిపారు. పలు దేశాలలోని తెలంగాణ ఎన్నారైలతో సెల్ కు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. ఎన్నారైల సంక్షేమం,సమస్యలపై ఈ సెల్ పనిచేస్తుందని తెలిపారు. రాజకీయాల్లో గుణాత్మక మార్పుల కోసం ఎన్నారైలు ప్రచారం కేసీఆర్ సూచించారు. వారికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 

19:20 - April 28, 2018

కృష్ణార్జున యుద్ధం సినిమాలో గ్రామంలో వచ్చే సీన్స్ లో వచ్చే కామెడీ పల్లెటూరులాంటి ప్రశాంతంగా నవ్వుకునేలా వుంది. హీరో నాని స్నేహితులుగా సుదర్శన్, మహేష్ లు పండించిన ప్రేక్షకులను హాస్యం హాయిగా నవ్వుకునేలా చేసింది. ఈ సినిమాలో మంచి కామెడీ, ఎమోషన్అన్నీ వున్నాయి. యంగ్ కమేడియన్స్ హాస్యం అందరినీ కడుపుబ్బ నవ్వించింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా యాసతో కూడిన ఆ హాస్యం ప్రేక్షకులను అలరించింది. చక్కటి హావభావాలతో హాస్య నటులు సుదర్శన్, మహేష్ లు ఆరోగ్యకరమైన హాస్యం పండించారు ఈ నేపథ్యంలో వారిద్దరితో 10టీవీ స్పెషల్ షో మీకోసం..మరి వారు నటులుగా వచ్చిన నేపథ్యం వంటి పలు విశేషాలను చూడండి..

టీటీడీ వివాదాలు, గవర్నర్ కు వీహెచ్పీ లేఖ..

హైదరాబాద్ : తిరుపతి తిరుపతి దేవస్థానం బోర్డుపై తరుచూ వివాదాలు రాజుకుంటున్న నేపథ్యంలో దేవాలయాలకు ధార్మిక మండళ్లు ఏర్పాటు చేయాలని హిందూ సంఘాలు చాలా కాలం నుంచి తమ డిమాండ్ వినిపిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా విశ్వహిందూ పరిషత్ గవర్నర్‌కు ఓ బహిరంగ లేఖ రాసి పలు అంశాలను ఆయన ముందు ఉంచింది. టీటీడీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌, జేఈవోలను శ్రీనివాసరాజును తొలగించాలని, అలాగే టీటీడీ బోర్డును రద్దు చేయాలని అందులో పేర్కొంది. దేవాలయాలకు ధార్మిక మండళ్లు ఏర్పాటు చేయాలని కోరింది.

19:02 - April 28, 2018

ఉత్తరప్రదేశ్‌ : రాష్ట్రంలోని లఖీమ్‌పుర్‌ ఖీరీ జిల్లాలో ఇవాళ తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్కును వేగంగా వస్తున్న టాటా మాజిక్‌ వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. డ్రైవర్‌తో పాటు 9 మంది ఘటనాస్థలంలోనే మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వ్యాన్‌లో 16 మంది ప్రయాణికులు ఉన్నట్లు, పస్‌గావా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 24వ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్పారు. వ్యాన్‌ను డ్రైవర్‌ అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరోవైపు బిహార్‌లోని వైశాలి జిల్లా లాల్‌గంజ్‌ పిఎస్‌ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లికి హాజరైన 8 మంది 4 మోటార్‌ సైకిళ్లపై తిరిగి వస్తుండగా మినీ ట్రక్కు వీరిని ఢీకొట్టింది. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

18:58 - April 28, 2018

హైదరాబాద్ : అమ్మాయి మాధురి సివిల్స్‌లో 144వ ర్యాంకు సాధించి.. తన సత్తా చాటింది. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మాధురి.. మహనీయుల పుస్తకాలు చదివి ఉత్తేజం పొందానంటున్నారు. సమాజంలో మార్పుకోసం కృషి చేయాలన్న లక్ష్యంతో.. సివిల్స్ వైపు వచ్చానంటున్నారు మాధురి. తల్లిదండ్రులు అన్నివిధాలా అందించిన సహాయ, సహకారాలతోనే ఈ ర్యాంక్‌ సాధించానని చెప్పారు. ప్రజా సేవ చేయాలన్న సంకల్పం ఉంటే... ఏవీ అడ్డంకి కావంటున్న మాధురి చెప్పే మరిన్ని విశేషాలను వీడియోలో చూడండి..

మంత్రి ఇంటిపై రాళ్లు, టొమాటోలు..

ఉత్తరప్రదేశ్‌ : మంత్రి ఇంటిపై రాళ్లు, టొమాటోలను విసిసిన ఘటనలో యూపీలో చోటుచేసుకుంది. రాజ్‌పుత్, యాదవ సామాజిక వర్గాలకు ఆగ్రహం తెప్పించేలా వ్యాఖ్యానించారంటూ ఉత్తరప్రదేశ్‌ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌ ఇంటిపై కొందరు ఈ రోజు దాడికి పాల్పడడం కలకలం రేపింది. మంత్రి ఇంటిపై రాళ్లు, టొమాటోలను విసిరేస్తూ వారు ఆందోళన చేశారు.

ఏసీబీ వలలో రైల్వే అధికారి..

హైదరాబాద్ : ఏసీబీ వలలో సికింద్రాబాద్ రైల్వే అధికారి చిక్కాడు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేందుకు రూ.15 లక్షలు లంచం తీసుకుంటు వెంకటేశ్వరరావు ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆర్ఐటీఈఎస్ ప్రాజెక్టు జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు ఏసీబీకి చిక్కాడు. 

18:28 - April 28, 2018

విజయనగరం : ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరాయి. గుర్ల మండలం కోటగండ్రేడులోని చంపావతి నదిలో ఇష్టానుసారంగా ఇసుకు తవ్వకాలు జరుపుతున్నారు. ఉచిత ఇసుక విధానానికి స్థానికనేతలే తూట్లు పొడుస్తున్నారు. మంత్రి జిల్లాలోనే అడ్డూ అదుపు లేకుండా ఇసుక దందా సాగుతోంది.

చంపావతి నదిలో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు
విజయనగరం జిల్లాలోని గుర్లపాడు మండలం కోటగండ్రేడు వద్ద చంపావతి నదిలో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వకాలు జరుగుతున్నాయి. చంపావతి నది పక్కన ఉన్న పట్టా భూముల్లో ఇసుక మేట్లను తొలగించడానికి అనుమతులు తీసుకొని రాత్రిపగలు అనే తేడా లేకుండా ఇసుకను తవ్వేస్తున్నారు. చెట్లను తొలంగించి నది మధ్యలోనే రోడ్డు వేసి ఇసుక రవాణ చేస్తున్నారు. దొంగ పట్టాలతో అధికారులను బురుడీ కొట్టించి మరీ అనుమతులు పొందారు. రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ కృష్ణ రంగారావు సొంత జిల్లాలోనే ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

18:21 - April 28, 2018

విశాఖపట్నం : ఏపీ డీఎస్సీ,టెట్ షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మే 4వ తేదీన టెట్ నోటిఫికేషన్ జారీచేస్తామని తెలిపారు. మే 5 నుండి 22 వరు ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చన్నారు. మే 23న దరఖాస్తు గడువు పూర్తవుతుందన్నారు. జూన్ 3న టెట్ హాల్ టికెట్ల డౌన్ లోడ్ ప్రక్రియ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. జూన్ 10 నుండి ఆన్ లైన్ పరీక్షలు నిర్వహిస్తామనీ..జులై 6న డీఎస్సీ నోటిషికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. దీనికి జులై 6 నుండి ఆగస్టు 8 వరకూ ఫీజు చెల్లింపు గడువు వుంటుందనీ..జులై 7 నుండి 9వరకూ దరఖాస్తులకు గడువు వుంటుందని మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. 

మోదీపై కన్నడ సీఎం కీలక వ్యాఖ్యలు..

ఢిల్లీ : ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు ఉత్తరాదికి చెందినవారని... తాను కన్నడిగుడినని, కన్నడ భూమి పుత్రుడినని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉత్తర, దక్షిణ భారతీయుల మధ్య జరుగుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. తద్వారా తన ప్రచారంలో ప్రాంతీయ భావజాలాన్ని జొప్పించే ప్రయత్నం చేశారు. కర్ణాటకలో బీజేపీకి సరైన నాయకులు కూడా లేరని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా అవినీతికి పాల్పడి, జైలుకి వెళ్లొచ్చిన యెడ్యూరప్ప మరోసారి సీఎం కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

పోలవరం ఏపీకి మోదీ ఇచ్చినవరం : హరిబాబు

విశాఖపట్నం: ఏపీ జీవనాడి అయిన పోలవరం ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చినవరం అని బీజేపీ నేత ఈదర హరిబాబు పేర్కొన్నారు. ప్రధాని కార్యాలయానికి వైసీపీ ఎంపీ వెళితే టీడీపీ విమర్శిస్తోందనీ..సోనియాగాంధీ వద్దకు టీడీపీ ఎంపీలు ఎందుకు వెళ్లారని హరిబాబు ప్రశ్నించారు. 

బీజేపీ బలోపేతం కోసం : హరిబాబు

విశాఖపట్నం : రాష్ట్రంలో బీజేపీని బలోపేతం కోసం కృసి చేస్తున్నామని బీజేపీ నేత ఈదర హరిబాబు తెలిపారు. టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని యోచిస్తోందని హరిబాబు విమర్శించారు. బీజేపీ వైసీపీతో ఒప్పందంచేసుకుందని వ్యాఖ్యానిస్తున్నారనీ..ఎన్నికల వ్యూహంతో బీజేపీ ఇంతవరకూ చర్చలు చేయలేదని హరిబాబు స్పష్టంచేశారు. 

17:42 - April 28, 2018

హైదరాబాద్ : వారసత్వ రాజకీయాల గురించి కాంగ్రెస్‌ నేతలా చెప్పేది? అని మంత్రి తలసాని శ్రీనివాస యదవ్ ప్రశ్నించారు. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు ఉన్న కాంగ్రెస్ చరిత్రను ఒకసారి చూసుకోమని తలసాని సూచించారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేయలేదని తలసాని గుర్తు చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల విద్యుత్‌ సరఫరాను అన్ని రాష్ట్రాల నేతలు కొనియాడుతుంటే తెలంగాణలోని కాంగ్రెస్‌ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌ నేతలకు లేదని తలసాని అన్నారు. కాంగ్రెస్‌లోనే కుటుంబ పాలన కొనసాగుతుందని చెప్పారు. అటువంటి కాంగ్రెస్ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. 

17:39 - April 28, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో కొత్తగా చెప్పిందేమీ లేదని జన సమితి అధ్యక్షులు కోదండరాం ఎద్దేవా చేశారు.తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను కోదండరామ్ పరిశీలించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు..టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో కొత్తగా చెప్పిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో బలగం పెంచుకునేందుకు కేసీఆర్‌ జాతీయ రాజకీయాలఉ చేస్తున్నారే తప్ప మౌలిక మార్పు కోసం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. కాగా వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని జనసమితి అధ్యక్షలు ప్రొ. కోదండరామ్‌ తెలిపారు. అమరవీరుల త్యాగాలకు చిహ్నంగా స్మృతిచిహ్నం నిర్మిస్తామని జనసమితి అధ్యక్షులు ప్రొ.-కోదండరామ్‌ తెలిపారు. ప్రజల సహకారంతో స్మృతిచిహ్నాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆదివారం నాడు సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే సభకు భారీ ఎత్తున ప్రజలు తరలివస్తారని నేతలు ఆశిస్తున్నారు. సభ ఏర్పాట్లను జనసమితి నేతలతో కలిసి ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పరిశీలించారు. 

17:28 - April 28, 2018

హైదరాబాద్ : నిబంధనలకు విరుద్దంగా తరగతులు నడుపుతున్న కళాశాలపై చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఇంటర్‌బోర్డ్‌ కమిషనర్‌ అశోక్‌ కుమార్ తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్‌లో 396 ప్రైవేట్‌, కార్పోరెట్‌ కాలేజీలపై చట్టరీత్యా చర్యలు తీసుకున్నామని అశోక్‌ కుమార్ చెప్పారు. విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా తరగతులు నడిపితే గుర్తిపు రద్దు చేస్తామని హెచ్చరించారు.

17:26 - April 28, 2018

ఖమ్మం : సివిల్స్‌లో మన తెలుగు తేజాలు ప్రతిభను నిరూపించారు.. సాధారణంగా వైద్యవృత్తి అంటే హాయిగా డబ్బులు దండుకుంటు రెండుచేతులా సంపాదించేస్తుంటారు. కానీ వైద్యమే కాదు సివిల్స్ లో కూడా తన సత్తా చాటాలనుకున్నాడో డాక్టర్. దాంతో సివిల్స్ పరీక్షలు రాశాడు. అంతేకాదు 816 ర్యాంక్ ను సాధించి ఔరా అనిపించుకున్నాడు. తనకున్న వృత్తిలో బిజీగా వున్నాగానీ కృషితో ఆ డాక్టర్ చక్కటి ర్యాంక్ సాధించాడు. ఖమ్మం జిల్లా వాసి భార్గవ్‌ శేఖర్ వైద్యునిగా.. వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తూనే... సివిల్స్‌లో 816వ ర్యాంక్‌ సాధించారు. ఇష్టంగా చేస్తే... ఏదైనా సాధించవచ్చంటున్న భార్గవ్ శేఖర్‌ పేర్కొన్నాడు. 

బైక్ పైనుండి జారిపడ్డ పల్లె, గాయాలు..

అనంతపురం : ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి బైక్ పై నుండి జారి పడ్డారు. ఈ ఘటనలో ఆయన ఎడమకాలుకు, చేతికి గాయాలయ్యాయి. అనంతపురం పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ సైకిల్ యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. దొన్నిపేట వద్ద టీడీపీ యాత్రలో బైక్ నడుపుతున్న పల్లె రఘురాథ రెడ్డి జారి పడ్డారు. దీంతో ఆయన ఎడమకాలుకు, చేతికి గాయాలయ్యాయి. 

17:10 - April 28, 2018

అనంతపురం : ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి బైక్ పై నుండి జారి పడ్డారు. ఈ ఘటనలో ఆయన ఎడమకాలుకు, చేతికి గాయాలయ్యాయి. అనంతపురం పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ సైకిల్ యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. దొన్నిపేట వద్ద టీడీపీ యాత్రలో బైక్ నడుపుతున్న పల్లె రఘురాథ రెడ్డి జారి పడ్డారు. దీంతో ఆయన ఎడమకాలుకు, చేతికి గాయాలయ్యాయి. 

పోలీసులకు శిక్ష తప్పదు : మావో జగన్

ఖమ్మం : గత వారంరోజులుగా మహారాష్ట్ర,ఛత్తీస్ ఘడ్ లో జరుగుతున్న కాల్పఉలపై మావోయిస్టు అధికార ప్రతినిథి జగన్ స్పందించారు. ఆడపిల్లను కూడా చూడకుండా గిరిజన అమాయక మహిళలకు కాల్చి చంపుతున్నారనీ..పోరుబిడడ్డలపై పోలీసులు, పాలకులు రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల చేతిలో పోలీసులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. త్వరలో పోలీసులకుతగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అదొక బూటకపు ఎన్ కౌంట్ అని మావోయిస్టు నేత జగన్ పేర్కొన్నారు.

తిరుమలలో 'పోటు' మరో అగ్నిప్రమాదం..

చిత్తూరు : ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీవారి ప్రసాదాలు తయారు చేసే వంటశాల పోటులో ప్రమాదం చోటు చేసుకుంది. గత నెలలో కూడా పోటులో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. పొయ్యిపై మరుగుతున్న నేయిలో నీరు పడిన నేపథ్యంలో మంటలు అంటుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. క్షణాల్లో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. టీటీడీ అధికారులు ఎన్ని చర్యలను తీసుకున్నప్పటికీ... పోటులో అగ్నిప్రమాదాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

వారసత్వ రాజకీయాలపై మీరా మాట్లాడేది? తలసాని

హైదరాబాద్ : వారసత్వ రాజకీయాల గురించి కాంగ్రెస్‌ నేతలా చెప్పేది? అని మంత్రి తలసాని శ్రీనివాస యదవ్ ప్రశ్నించారు. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు ఉన్న కాంగ్రెస్ చరిత్రను ఒకసారి చూసుకోమని తలసాని సూచించారు. కాంగ్రెస్‌ ఓ అవినీతి పార్టీ అనీ..కేసీఆర్‌పై టీపీసీసీ నేతలు చేసిన అవినీతి ఆరోపణల్లో ఒక్కటైనా నిరూపించారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేయలేదని తలసాని గుర్తు చేశారు. అటువంటి కాంగ్రెస్ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

16:27 - April 28, 2018

హైదరాబాద్ : తెలంగాణ సమస్యలు అధిగమించటానికి సీఎం కేసీఆర్ కంకణబద్ధులై వున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బీసీల గురించి ఏనాటు పట్టించుకోని కాంగ్రెస్ ఇప్పుడు బీసీల గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందని తలసాని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సీఎం అయిన తరువాతనే అణగారిన వర్గాలకు సరైన న్యాయం జరుగుతోందన్నారు. అణగారిన వర్గాల పిల్లలకు గురుకుల పాఠశాలలను నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కాంగ్రెస్ నేతలను విమర్శించారు.

16:26 - April 28, 2018

కాసిపేట మండల కేంద్రంలో జరిగిన మండల సర్వ సభ్య సమావేశంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సాక్షిగా ఎంపీపీ శంకరమ్మ బోరున విలపించింది. సర్వ సభ్య సమావేశంలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని ఆరోపించారు. కేవలం దళిత మహిళను అనే కారణంగా నాలుగేండ్లుగా తనను చులకన భావంతో అవహేళన చేస్తున్నారంటూ సభ నుండి వాకౌట్ చేసింది.అధికార పార్టీకి చెందిన ఎంపీపీ సభలో అసంతృప్తిని వెల్లగక్కడంతో సభ సభ్యులంతా ఒక్కసారిగా అవక్కయ్యారు. సమావేషం సందర్బంగా సింగల్ విండో చైర్మన్ వంశీకృష్ణ రావును ఎమ్మెల్యే వేదికపైకి పిలవడమే ఈ వివాదానికి దారి తీసింది.గతంలో కూడా సింగల్ విండో చైర్మన్ వంశీకృష్ణ రావు వేదికపైకి పిలవడంతో తీవ్రంగా ఖండించింది.గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మరోసారి వంశీకృష్ణను వేదికపైకి పిలవడాన్ని నిరసిస్తూ సభ నుండి వాకౌట్ చేసింది.ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఎంపీటీసీ ఎన్నికల్లో తాను గెలిచేందుకు ఐదు లక్షలు ఖర్చు చేసానని..ఎంపీపీ ఎన్నిక కోసం పదిహేను లక్షలు ఇవ్వాల్సి వచ్చిందని ఆమె ఆరోపించారు..దళిత మహిళ ననే తనని హీనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..పార్టీ కార్యక్రమాలతో పాటుగా ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదని ఏడ్చింది.కనీసం మండల పరిషద్ లోనైన తనకు కనీస గౌరవం ఇవ్వకపోవడం వల్లనే సభ నుండి వాకౌట్ చేయాల్సి వచ్చిందన్నారు.. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ ని సభ నుండి పంపించి జరిగిన దానికి ఎమ్మెల్యే క్షమాపణ కోరగా తిరిగి శంకరమ్మ సభకు హాజరయ్యారు...

ప్లీనరీలో మాట్లాడినవన్నీ లబద్దాలే : రావుల

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీలో నేతలు మాట్లాడినవన్నీ పచ్చిఅబద్దాలేనని టీ.టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ విమర్శించారు. టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలోఇచ్చిన హామీలు అములచేయలేదని ఆయన విమర్శించారు. దేశస్థాయిలో రైతుల సమస్యలు పరిష్కరిస్తామంటున్న కేసీఆర్ కు సూర్యాపేటలో రైతుల సమస్యలు కనిపించటంలేదా? అనీ, కృష్ణానదిపై కర్ణాటక ప్రభుత్వం అనుక చెక్క బ్యామ్ లను కట్టి చుక్క నీరు కూడా రాకుండా అడ్డుకుంటుంటే కేసీఆర్ కనిపించటంలేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ శుద్ధిపై కేసీఆర్ మాట ఏమందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదన్నారు.

15:46 - April 28, 2018

ఢిల్లీ: యూపీఎస్సీ 2017 ఫలితాల్లో తెలుగువారు సత్తా చాటారు. ఈ ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా ద్వారాకా తిరుమలకు చెందిన పృధ్వీరాజ్ 24వ ర్యాంక్ సాధించారు. వ్యక్తిగత ఎజెండాతో కాకుండా ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పనిచేస్తానని పృధీరాజ్ తెలిపాడు. సివిల్స్ లో చాలా కాంపిటీష్ వుందనీ అయినా మంచి ర్యాంక్ సాధించాలంటే మంచి గైడెన్స్ వుండాల్సిన అవుసరముందని పృధీ అభిప్రాయపడ్డాడు. సరైన గైడెన్స్ తో ముందుకెళితే ఎవరైనా ర్యాంక్ సాధించవచ్చని పృద్ధి తెలిపాడు. 2016 నవంబర్ నుండి ఢిల్లీలో సివిల్స్ కు ప్రిపేర్ అయిన పృధీతేజ్ తల్లిదండ్రులు, సోదరి ప్రోత్సాహంతో కృషి చేసిన 24వ ర్యాంకును సాధించాడు. 

15:28 - April 28, 2018

ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు అమియాపాత్ర ఇంటిపై దాడికి పాల్పడ్డారు. బంకురాలో సీపీఎం సెంట్రల్ కమిటీ సభ్యుడు అమియాపాత్ర దంపతులపై టీఎంసీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో అమియాకు తీవ్రంగా గాయలవ్వటంతో ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా గత కొంతకాలంలో టీఎంసీ సీపీఎం నేతలపైనా, కార్యాలయాలపైనా దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. సీపీఎం చేస్తున్న ఉద్యమాలంటే గిట్టని తృణముల్ కాంగ్రెస్ సీపీఎం కార్యకర్తలను కూడా హత్య చేసిన ఘటనలు కూడా వున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర కమిటీ సభ్యులు అమియాపాత్ర ఇంటిపై దాడి చేసి దంపతులపై దాడికి పాల్పడటమే కాకుండా ఇంటిని కూడా దోచుకున్నారు. కాగా తృణముల్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకు ఇటువంటి ఘటనలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడిపై టీఎంసీ దాడి..

ఢిల్లీ : తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు అమియాపాత్రకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారి ఇంటిపై దాడిచేసి దోచుకుని బంకురాలో సీపీఎం సెంట్రల్ కమిటీ సభ్యుడు అమియాపాత్ర దంపతులపై టీఎంసీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో అమియాకు తీవ్రంగా గాయలవ్వటంతో ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా గత కొంతకాలంలో టీఎంసీ సీపీఎం నేతలపైనా, కార్యాలయాలపైనా దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. 

జూన్ 30న టెట్ ఫలితాలు : మంత్రి గంటా

అమరావతి : జూన్ 30వ తేదీన టెట్ ఫలితాలను విడుదల చేస్తామని మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. టెట్ అభ్యర్ధులకు మాక్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. ఏపీని ఎడ్యుకేష్ హబ్ గా తయారుచేసేందుకు కృషి చేస్తున్నామనీ..అలాగే అన్ని పాఠశాలల్లోను మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నామని గంటా పేర్కొన్నారు. లోటు బడ్జెట్ లో వున్నా విద్యకు అధికంగా ప్రాధాన్యతనిస్తున్నామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. 

గాడిదకు హాల్ టికెట్ !..

ఢిల్లీ : తహసీల్దార్‌ ఉద్యోగాల కోసం పరీక్ష రాయడానికి ఓ గాడిదకు హాల్‌ టికెట్‌ జారీ చేసిన వింత సంఘటన జమ్ముకశ్మీర్‌లో చోటు చేసుకుంది. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తాజాగా హాల్‌ టిక్కెట్లు పొందగా అందులో ఒకటి గాడిద పేరు, ఫొటోతో ఉంది. ఆ హాల్‌టికెట్‌పై అభ్యర్థి సంతకంతో పాటు జమ్ముకశ్మీర్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు సెక్రటరీ సంతకం సైతం ఉండడం గమనార్హం. అభ్యర్థి పేరు ఉండే చోట గోధుమ వర్ణపు గాడిద అని ఉంది. ఈ హాల్‌టికెట్‌ ఎలా బయటకు వచ్చిందో కానీ, సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది.

సివిల్స్ ర్యాంక్ లో జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు..

ఢిల్లీ : సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కుమారుడు సాయి ప్రణీత్ సివిల్స్ పరీక్షల్లో 196వ ర్యాంకును సాధించారు. తన తండ్రి గైడెన్స్ తోను కృషి చేసి ర్యాంక్ సాధించానని తెలిపారు. తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఒక సిన్సియర్ ఆఫీసర్ గా ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. మరోవైపు లక్ష్మినారాయణ మాట్లాడుతూ, తన కుమారుడు సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నిజాయతీతో, ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తాడని ఆశిస్తున్నానని చెప్పారు. తనకు అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ ఉపయోగించుకుని... సివిల్స్ పరీక్షల్లో ప్రణీత్ విజయం సాధించాడని తెలిపారు.

గాలి ముద్దుకృష్ణమ భార్యకు టిక్కెట్ ఖరారు..

అమరావతి : గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణంతో ఖాళీ అయిన చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. గాలి సతీమణి గాలి సరస్వతమ్మకు టికెట్ ఖరారైంది. ఈ ఉదయం చంద్రబాబును సరస్వతమ్మ, ఇతర కుటుంబసభ్యులు కలుసుకున్నారు. ఎమ్మెల్సీ టికెట్ ను సరస్వతమ్మకు కేటాయించినట్టు వారికి చెప్పారు. వాస్తవానికి ఈ టికెట్ కోసం గాలి కుమారులు ఇద్దరూ పోటీ పడ్డారు. దీంతో, మధ్యే మార్గంగా సరస్వతమ్మకు టికెట్ కేటాయించారు చంద్రబాబు. కాగా సానుభూతి రాజకీయాలకు మరోసారి ఉనికి చాటిందని చెప్పవచ్చు.

టీ,జేఏసీ పదవికి కోదండరాం రాజీనామా..

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో టీజేఏసీ అధ్యక్షుడిగా ప్రజా, ఉద్యోగ సంఘాలను ఏకం చేస్తూ కీలక పాత్ర పోషించిన ఆ కమిటీ ఛైర్మన్‌ ప్రొఫెసర్ కోదండరామ్‌ తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి రాజీనామా చేస్తారు. ఇటీవల ఆయన తెలంగాణ జన సమితి పేరుతో కొత్త పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ మైదానంలో ఆ పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది.

13:10 - April 28, 2018

విశాఖపట్టణం : రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టడం లేదు. రోజు పలువురు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. తాజాగా జిల్లాలో జరిగిన ఓ ప్రమాదంలో 7 నెలల గర్బిణీ మృతి చెందడం స్థానికంగా విషాదం నెలకొంది. తాటిచెట్ల మండలం మసీదు జంక్షన్ వద్ద నివాసం ఉంటున్న మున్న ఏడు నెలల గర్భిణీ. ఆమె భర్త విశాఖ డాక్ యార్డులో పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం మామతో కలిసి బైక్ పై ఆసుపత్రికి వెళుతోంది. కప్పరాడు జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తు బైక్ పై నుండి కిందకు పడిపోయింది. వెనుకాలే భారీ లోడ్ తో వచ్చిన లారీ మున్నపై నుండి దూసుకెళ్లింది. దీనితో అక్కడికక్కడనే మృతి చెందింది. దీనితో మున్నా జంక్షన్ వద్ద తీవ్ర విషాదం నెలకొంది. 

గర్బిణీపై దూసుకెళ్లిన లారీ...

విశాఖపట్టణం : కప్పరాడ జంక్షన్ దగ్గర విషాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై నుండి పడిన 8నెలల గర్భిణీపై లారీ దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడనే మృతి చెందింది. 

గర్బిణీపై దూసుకెళ్లిన లారీ...

విశాఖపట్టణం : కప్పరాడ జంక్షన్ దగ్గర విషాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై నుండి పడిన 8నెలల గర్భిణీపై లారీ దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడనే మృతి చెందింది. 

రూ. 60 కోట్ల ఇల్లు అవసరమా ? - ఉత్తమ్...

హైదరాబాద్ : 500 కోట్ల విలువైన స్థలంలో రూ. 60 కోట్లలో విలువైన ఇళ్లు కట్టుకుంటారా ? అని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. నూతనంగా నిర్మాణం చేసిన క్యాంపు ఆఫీసు..ఇళ్లు ఉంటే కొత్తగా ఇల్లు కట్టుకొవడం ఏందీ ? అని సూటిగా ప్రశ్నించారు. ఇదంతా ప్రజల డబ్బు కాదా ? అని నిలదీశారు.

150 గదులున్నాయని అనలేదు - ఉత్తమ్...

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో 150 గదులున్నాయని తాను అనలేదని...కేసీఆర్ కు తెలివి ఎక్కువుందో తెలియదని..ఆయనలాగా దొంగ తెలివి లేదని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ పేర్కొన్నారు. పిచ్చి మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు. 

కేసీఆర్ పై ఉత్తమ్ నిప్పులు...

హైదరాబాద్ : 'కేసీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు..నీకేనా తెలివి ఉందా ? విమర్శలు చేస్తే ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతవా ? ' అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి ఉత్తమ్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

12:33 - April 28, 2018

హైదరాబాద్ : 'కేసీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు..నీకేనా తెలివి ఉందా ? విమర్శలు చేస్తే ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతవా ? ' అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి ఉత్తమ్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. టి.కాంగ్రెస్..ఉత్తమ్ లపై టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ పలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై ఉత్తమ్ శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమం కోసం త్యాగం చేసినట్లు కేసీఆర్ మాట్లాడారని, అమెరికాలో ఉన్న వారు తెలంగాణ మీద పడి దోచుకుంటున్న విషయం తెలంగాణ ప్రజానీకం చూస్తోందని తెలిపారు. తన భార్య..తాను కేవలం ప్రజల కోసం పనిచేస్తున్నామని..ప్రజా జీవితం కోసం అంకితం చేశామన్నారు. తమకు పిల్లలు..కుటుంబం కూడా లేదని తెలిపారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో చేసిన తప్పిదం వల్ల తెలంగాణ ప్రజలు కష్టాల పాలవుతారని తాము చెబితే ఉత్తమ్ ను జైల్లో పెడుతామని గతంలో పేర్కొన్నారని తెలిపారు. ప్రగతి భవన్ లో 150 గదులున్నాయని తాను అనలేదని...కేసీఆర్ కు తెలివి ఎక్కువుందో తెలియదని..ఆయనలాగా దొంగ తెలివి లేదన్నారు. పిచ్చి మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు.

500 కోట్ల విలువైన స్థలంలో రూ. 60 కోట్లలో విలువైన ఇళ్లు కట్టుకుంటారా ? నూతనంగా నిర్మాణం చేసిన క్యాంపు ఆఫీసు..ఇళ్లు ఉంటే కొత్తగా ఇల్లు కట్టుకొనడం ఏందీ ? అని సూటిగా ప్రశ్నించారు. ఇదంతా ప్రజల డబ్బు కాదా ? అని నిలదీశారు. సొంత జాగీరు..అబ్బ సొత్తు కాదన్నారు. 150 గదులున్నాయని ఎప్పుడూ అనలేదని, ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తూ ఇంత విలాసవంతమైన ఇల్లు కట్టుకోవడం అవసరమా ? అని నిలదీశారు. విలాసవంతమైన కార్లు...ప్రజల సొమ్ముతో ప్రైవేటు జెట్ విమానాలలో ప్రయాణించారని విమర్శించారు.

వందల కోట్ల రూపాయలు ప్రజల డబ్బుతో విలాసవంతమైన ఇల్లు..విలాసవంతమైన కార్లు..ప్రైవేటు జెట్లు ఉపయోగించడం తగదన్నారు. రైతులు చనిపోతే ఎక్స్ గ్రేషియా ఇవ్వడానికి..ఫీజు రీయింబర్స్ మెంట్..డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించడానికి..ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ ఇవ్వడానికి..మూడెకరాల భూమి కోసం పైసలుండవా ? అని ప్రశ్నించారు. 

12:24 - April 28, 2018

విశాఖపట్టణం : ఏపీ రాష్ట్రంలో వలసల జోరు కొనసాగుతోంది. టిడిపి నుండి వైసిపిలోకి..వైసిపి నుండి టిడిపిలోకి పలువురు నేతలు జంప్ అవుతున్నారు. ఎన్నికలకు ఇంకా సంవత్సరం ఉండగానే ఇప్పటి నుండే ఆయా పార్టీలు వలసలకు తెరలేపుతున్నారు. తమకు పార్టీలో ప్రాతినిధ్యం కల్పించడం లేదంటూ..పార్టీలో సీటు రాదని నిర్ణయించుకుంటున్న నేతలు ఇతర పార్టీల్లో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. తాజాగా విశాఖ జిల్లా మాజీ ఎమ్మెల్యే కన్నబాబు టిడిపి వీడి వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. దీనితో టిడిపిలో ఉండాలని పార్టీ సీనియర్ నేతలు కన్నబాబుకు నచ్చచెబుతున్నారు. కానీ ఆయన విముఖంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం విశాఖ జిల్లాకు వచ్చిన మంత్రి గంటా శ్రీనివాసరావు కన్నాబాబుతో భేటీ అయ్యారు. సుమారు గంటన్నరపాటు ఈ భేటీ కొనసాగింది. పార్టీలో తనకు సరియైన గౌరవం దక్కడం లేదని..అందుకే తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు కన్నబాబు పేర్కొన్నట్లు సమాచారం. పార్టీలో తగిన విధంగా గౌరవం దక్కేవిధంగా చూస్తానని మంత్రి గంటా హామీనివ్వడంతో కన్నబాబు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరి ఆయన పార్టీ మారుతారా ? లేదా ? అనేది చూడాలి. 

11:47 - April 28, 2018

కర్నూలు : ఏపీ రాష్ట్రంలో అవినీతి లేదా ? అవినీతి ఉందని ఇటీవలే పలువురు నేతలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ అవినీతి తమ ప్రభుత్వంలో లేదని పాలకులు జబ్బలు చరచుకుంటున్నారు. ఏపీ అవినీతి రహిత రాష్ట్రమని గొప్పలు చెప్పుతున్నారు. కానీ కర్నూలు జిల్లాలో జరిగిన ఘటనపై పాలకులు..అధికారులు..ఏమంటారో ?

జిల్లాలో క్రీడాకారులకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కోడుమూరు మండలం ఈతాండ్రపాడు గ్రామ పరిధిలో రూ. 70 లక్షల వ్యయంతో ఇండోర్ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. స్టేడియం నిర్మిస్తుండడం పట్ల క్రీడాకారులు ఆనందం కూడా వ్యక్తం పరుస్తున్నారు. కానీ వారి ఆనందం కొద్ది రోజుల్లోనే ఆవిరయైపోయింది. ఇటీవలే వీచిన గాలులకు స్టేడియం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో క్రీడాకారులు అందులో లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

ఇండోర్డి స్టేడియం కుప్పకూలిపోవడంపై క్రీడాకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల అవినీతి..అధికారుల లాలూచీ వల్లే ఇది జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి క్రీడకారులతో టెన్ టివి మాట్లాడింది. ఎంపీ టి.జి. వెంకటేష్ రూ. 2కోట్ల వరకు నిధులు విడుదల చేశారని, అవినీతి ఎలా ఉందో ఈ ఘటనను చూస్తే తెలుస్తుందన్నారు. పిల్లర్లు బలంగా ఉండడం కోసం ఉపయోగించాల్సిన ఇనుప రాడ్లు ఉపయోగించకుండా తక్కువ ఎంఎంతో కూడిన రాడ్లను ఉపయోగించారని ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ల లోపమే ప్రధానంగా కనిపిస్తోందని తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:38 - April 28, 2018

విశాఖపట్టణం : ఎన్ పీఎస్ రద్దు..ఓపీఎస్ సాధన కోరుతూ జిల్లాలో అఖిలపక్ష నేతలు పాదయాత్ర చేపట్టారు. ఎన్ఏడీ కొత్త రోడ్డు నుండి జీవీఎంసీ కార్యాలయం వరకు పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో 800 మంది కార్యకర్తలు, ఏపీ గురుకులం విద్యాలయాల ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని, కొత్త పెన్షన్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:35 - April 28, 2018

గుంటూరు : అమరావతి రాజధాని నిర్మాణం..గత కొన్ని సంవత్సరాలుగా నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. రాజధానికి సంబంధించిన రోడ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కానీ ఇదే రోడ్డు నిర్మాణం ముగ్గురు చిన్నారుల ప్రాణాలు తీసింది. ఈ ఘటన దొండపాడులో చోటు చేసుకుంది. దొండపాడులో భారీ క్రేన్ల సహాయంతో గుంతలు తీశారు. తీసిన గుంతను పూడ్చకపోవడంతో అందులో భారీగా నీరు చేరింది.

శనివారం ఉదయం ఇక్కడకు పది మంది చిన్నారులు వచ్చారు. ప్రమాదవశాత్తు ముగ్గురు చిన్నారులు అందులో పడిపోయారు. పైన ఉన్న ఏడుగురు చిన్నారులు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియచేశారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అమల (9), దినేష్ (8), సాత్విక్ (7)లు మృతి చెందిన వారిలో ఉన్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చిన్నారుల మృతి చెందారని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. చిన్నారుల మృతితో ఆయా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. రాజధాని నిర్మాణం కోసం చేస్తున్న పనుల్లో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

దొండపాడులో విషాదం...

గుంటూరు : తుళ్లూరు మండలం దొండపాడులో విషాదం చోటు చేసుకుంది. రాజధానికోసం నిర్మాణం చేస్తున్న రోడ్డు గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఏడుగురు చిన్నారులను స్థానికులు కాపాడారు. అమల (9), దినేష్ (8), సాత్విక్ (7)లు మృతి చెందిన వారిలో ఉన్నారు. 

దొండపాడులో విషాదం...

గుంటూరు : తుళ్లూరు మండలం దొండపాడులో విషాదం చోటు చేసుకుంది. రాజధానికోసం నిర్మాణం చేస్తున్న రోడ్డు గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఏడుగురు చిన్నారులను స్థానికులు కాపాడారు. అమల (9), దినేష్ (8), సాత్విక్ (7)లు మృతి చెందిన వారిలో ఉన్నారు. 

11:22 - April 28, 2018

విజయవాడ : ఏపీ డీఎస్సీ షెడ్యూల్ ను మంత్రి గంటా విడుదల చేశారు. 10,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మే 4వ తేదీన ఏపీ టెట్ నోటిఫికేషన్, జులై 6న డీఎస్సీ నోటిఫికేషన్ లను విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. మే 5 నుండి 22 వరకు టెట్ దరఖాస్తులు, జూన్ 3 నుండి హాల్ టికెట్లు జారీ చేస్తామన్నారు. జూన్ 10 నుండి 21 వరకు ఏపీ టెట్ పరీక్షలు జరుగుతాయన్నారు. టెట్ అభ్యర్థులకు మాక్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

డీఎస్సీ షెడ్యూల్ విడుదల...

విజయవాడ : ఏపీ డీఎస్సీ షెడ్యూల్ ను మంత్రి గంటా విడుదల చేశారు. 10,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మే 4వ తేదీన ఏపీ టెట్ నోటిఫికేషన్, జులై 6న డీఎస్సీ నోటిఫికేషన్ లను విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. మే 5 నుండి 22 వరకు టెట్ దరఖాస్తులు, జూన్ 3 నుండి హాల్ టికెట్లు జారీ చేస్తామన్నారు. జూన్ 10 నుండి 21 వరకు ఏపీ టెట్ పరీక్షలు జరుగుతాయన్నారు. టెట్ అభ్యర్థులకు మాక్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

10:29 - April 28, 2018

హైదరాబాద్ : యూపీఎస్పీ సివిల్స్ తెలుగు తేజం సత్తా చాటాడు. దులిశెట్టి అనుదీప్ మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన అనూదీప్ ప్రజా సేవ చేసి తానేంటో నిరూపించుకుంటానన్నారు. కష్టపడి చదివి ఈ స్థాయికి ఎదిగానని, తన విజయానికి తలిండ్రులు..ప్నేహితులే కారణమన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

చైనాలో మోడీ సెకండ్ డే...

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనా దేశంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో చాయ్ పే చర్చించారు. ఈస్ట్ లేక్ ఒడ్డున నడుచుకుంటూ వారు ముచ్చటించారు. 

సుతుర్ మఠ్ లో రాహుల్...

కర్నాటక : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. శనివారం ఉదయం మైసూరులోని సుతుర్ మఠ్ ను దర్శించిన రాహుల్ శ్రీ శివరాత్రి దీక్షికేంద్ర మహాస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. 

09:10 - April 28, 2018

నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అతివేగం..నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతుండడంతో ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు బైక్ ను ఢీకొని సుమారు ఐదు కిలోమీటర్ల వరకు లాక్కెంది. ఈఘటనలో ఒకరు మృతి చెందారు. జిల్లాలోని మిర్యాలగూడ మండలం కిష్టాపురంలో ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సు బైక్ ను ముందట నుండి ఢీకొంది. దీనితో బైక్ పై వెళుతున్న బనవత్ రూపల్ల బస్సు కింద ఇరుక్కపోయాడు. ఇది గమనించని బస్సు డ్రైవర్ అలాగే పోనిచ్చాడు. సుమారు బైక్ ను 5 కి.మీటర్ల దూరం వరకు డ్రైవర్ ఈడ్చుకెళ్లాడు. బనవత్ రూపల్ల అక్కడికక్కడనే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బస్సు డ్రైవర్ పరారయ్యాడు. 

కిష్టాపురంలో దారుణం...

నల్గొండ : జిల్లాలోని మిర్యాలగూడ మండలం కిష్టాపురంలో దారుణం చోటు చేసుకుంది. బైక్ ను ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. కానీ బస్సును ఆపకుండా బైక్ ను 5 కి.మీటర్ల దూరం వరకు డ్రైవర్ ఈడ్చుకెళ్లాడు.

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బస్సును స్వాధీనం చేసుకున్నారు. 

కిష్టాపురంలో దారుణం...

నల్గొండ : జిల్లాలోని మిర్యాలగూడ మండలం కిష్టాపురంలో దారుణం చోటు చేసుకుంది. బైక్ ను ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. కానీ బస్సును ఆపకుండా బైక్ ను 5 కి.మీటర్ల దూరం వరకు డ్రైవర్ ఈడ్చుకెళ్లాడు.

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బస్సును స్వాధీనం చేసుకున్నారు. 

08:33 - April 28, 2018

ఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలపై సీపీఎం సమరశంఖం పూరించింది. వచ్చే నెల 8న డీజిల్‌, పెట్రోల్‌ ధరల పెరుగులను నిరసిస్తూ దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. పార్టీతోపాటు.. అన్ని అనుబంధ సంఘాలు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని సీపీఎం పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు, బహుళజాతి కంపెనీలకు భారీ రాయితీలనిస్తూ.. సామాన్యులపై భారం మోపుతున్నాయని పొలిట్‌బ్యూరో ఆరోపించింది. చమురు ధరలు పెరగడంతో సామాన్యులకు భారంగా మారిందని అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం స్పందించిన వెంటనే ధరలను నియంత్రించాలని డిమాండ్‌ చేసింది. 

08:09 - April 28, 2018

హైదరాబాద్ : ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూనే ఉన్నారు..మందుబాబులు పట్టుబడుతూనే ఉన్నారు. గత కొన్ని రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ మందుబాబులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కానీ పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతూనే ఉన్నారు. ఈ తనిఖీల్లో పలువురు మహిళలు పట్టుబడుతుండడం గమనార్హం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. 114 మందిపై కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో నలుగురు మహిళలున్నారు. సరైన పత్రాలు లేని 60 వాహనాలను సీజ్ చేశారు. 

08:07 - April 28, 2018

17వ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు ఘనంగా ముగిశాయి. జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకం చేసి ఫెడరల్‌ ఫ్రంట్‌ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌ నుంచే భూకంపం సృష్టిస్తానన్న కేసీఆర్‌.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్న తన ప్రకటనతో కాంగ్రెస్‌, బీజేపీ గుండెల్లో దడ పుట్టిందన్నారు. ఈ అంశంపై టెన్ టివి చర్చా వేదికలో పాల్గొని వినయ్ కుమార్ (విశ్లేషకులు), రాజ్ మోహన్ (టీఆర్ఎస్), పున్నా కైలాష్ (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటన...

హైదరాబాద్ : నగరంలో మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. మైండ్ స్పేస్ అండర్ పాస్ ను ప్రారంభించనున్నారు. ల

బంజారాహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్...

హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. 40 ద్విచక్రవాహనాలు..20 కార్లను సీజ్ చేశారు. 

06:42 - April 28, 2018

ఢిల్లీ : వరుస ఓటములతో తల్లడిల్లుతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చాలా రోజుల తర్వాత ఘన విజయం సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుపై 55 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఢిల్లీ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 93 పరుగులు చేయగా.. పృథ్వీ షా 62 రన్స్‌తో చెలరేగాడు. 220 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగారు. 

06:40 - April 28, 2018

ఢిల్లీ : ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న శతృత్వానికి తెరపడింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌లు ఇరు దేశాలను వేరు చేసే సైనిక విభజన లైన్‌ వద్ద కలుసుకున్నారు. ఇరువురు నేతలు చిరునవ్వుతో కరచాలనం చేసుకున్నారు. కిమ్‌ జోంగ్‌ దక్షిణ కొరియా అధ్యక్షుడిని తమ దేశంలోకి ఆహ్వానించడంతో మొదట మూన్‌ జే ఉత్తర కొరియా భూభాగంలోకి వెళ్లారు. ఆ తర్వాత కిమ్‌ దక్షిణ కొరియాలో అడుగుపెట్టారు. ఉభయ కొరియాల సరిహద్దులోని శాంతి గ్రామం పన్‌ముంజుమ్‌లోని 'పీస్‌ హౌస్‌'లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. వీరి మధ్య చారిత్రక సమావేశం జరిగింది. కొరియా యుద్ధం జరిగిన 65ఏళ్ల తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు దక్షిణ కొరియాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. కొరియా ద్వీపాన్ని అణ్వాయుధ రహితంగా ఉంచేందుకు ఇరు దేశాల నేతలు అంగీకరించారు.

06:38 - April 28, 2018

ఢిల్లీ : రెండు రోజుల పర్యటనకు చైనా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోది ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలిశారు. వుహాన్‌ నగరంలోని హూబెయీ ప్రావిన్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో మోది, జిన్‌పింగ్‌ పాల్గొన్నారు. అనధికార శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఇరువురు నేతల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. త్రీ గోర్జెస్ డ్యామ్, వుహాన్ హాలిడే స్పాట్ లాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. తాను గుజరాత్ సీఎంగా ఉన్నపుడు వుహాన్ నగరంలో పర్యటించే అవకాశమొచ్చిందని ఈ సందర్భంగా మోది పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చైనాలో నిర్మిస్తున్న త్రీ గోర్జెస్ డ్యాం గురించి తాను విన్నానని.. డ్యాంను భారీ ఎత్తున ఎంతో వేగంగా నిర్మించడం తనకు స్ఫూర్తి నిచ్చిందన్నారు. తాను ఇక్కడ ఒకరోజు గడిపినట్లు తెలిపారు. అనధికార భేటి కావడంతో ఒప్పందాలపై ఇరు దేశాల నేతలు సంతకాలు, ప్రకటన చేయరు. డోక్లాం వివాదం సందర్భంగా ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను దూరం చేసుకునేందుకు ఈ భేటి దోహదపడనుందని భావిస్తున్నారు.

06:35 - April 28, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు వ్యవహారంలో.. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వేసిన అప్పీల్‌ పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరపున వాదనలను సుప్రీం కోర్టు న్యాయవాది వైద్యనాథన్ వినిపించారు. కోమటిరెడ్డి, సంపత్‌ వ్యవహారంపై మీడియాలో వచ్చిన నాలుగు వీడియోలను పిటిషనర్‌ కోర్టుకు సమర్పించారు. మరోవైపు ఫిరాయింపు దారులైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పిటిషన్ వేసే అర్హత లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాది జంధ్యాల వాదించారు. వారి సభ్యత్వ కొనసాగింపే.. స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉండగా.. సభాహక్కులు, నిబంధనలు, విలువలపై వారు స్పందించడం బాధాకరమన్నారు అడ్వకేట్ జంధ్యాల. సభ్యుల వివరణ వినిఉంటే.. సభ్యత్వం రద్దు చేసేవారు కాదేమోనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇరువాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. 

06:31 - April 28, 2018

విజయవాడ : భవిష్యత్‌లో బీజేపీ - వైసీపీ కలిసి పోటీ చేస్తాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైసీపీ తోడుందన్న నమ్మకంతోనే కేంద్రం టీడీపీని దూరం చేసుకుందని దుయ్యబట్టారు. కేంద్రంలోని పెద్దలు, వైసీపీ కలిసి రాష్ట్రం మీద కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర చేపట్టి 5ఏళ్లు పూర్తైన సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు స్పష్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో చేపట్టిన వస్తున్నా .. మీకోసం పాదయాత్ర చేపట్టి 5 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా చంద్రబాబు తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. అనేక అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రతిపక్షాల తీరును ఎంగట్టడంతో పాటు.. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు.

బీజేపీ - వైసీపీలపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ - వైసీపీలది మొన్నటి వరకు రహస్య అజెండా అని.. ఇప్పుడు వారి అజెండా బహిర్గతమైందన్నారు. వైసీపీ తోడు ఉంటుందన్న నమ్మకంతోనే కేంద్రం టీడీపీని దూరం చేసుకుందని ధ్వజమెత్తారు. రేపో.. మాపో ఆ రెండు పార్టీలు కలుస్తాయని... వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేసినా ఆశ్చర్య పోనక్కర్లేదని దుయ్యబట్టారు.

వస్తున్నా.. మీకోసం పాదయాత్ర చేపట్టినప్పుడు ప్రజలకు ఏ హామీలు ఇచ్చానో.. వాటికంటే ఎక్కువే చేశానని చంద్రబాబు తెలిపారు. ఏపీకి అన్యాయం చేసిన వారికి కర్నాటకలో తెలుగు ఓటర్ల గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు గెలిపించాలని ప్రజలను కోరుతున్నానని... అలా అయితేనే ప్రధాని ఎవరనేది మనమే నిర్ణయించే అవకాశం వస్తుందని చంద్రబాబు చెప్పారు.

విభజన హామీల సాధనకుగా తాము ఎంతో కృషి చేస్తున్నామని చెప్పారు. ఈనెల 30న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రధాని అభ్యర్థిగా మోదీ ఏ స్థలంలో అయితే హామీలు ఇచ్చారో.. అదే స్థలంలో ఏపీకి చేసిన అన్యాయాన్ని వివరిస్తామన్నారు. తిరుమల వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలపై నిలదీస్తామని చెప్పారు. నమ్మక ద్రోహం - కుట్ర రాజకీయాలు పేరిట తిరుపతి సభ నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. సభను విజయంతం చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

06:26 - April 28, 2018

హైదరాబాద్ : సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వాసి దురిశెట్టి అనుదీప్‌ సివిల్స్‌ టాపర్‌గా నిలిచాడు. మరో 40మందికిపైగా ఉత్తమ ర్యాంకులు సాధించారు. సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో తెలంగాణ సంచలనం సృష్టించింది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్‌ సివిల్స్‌లో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచారు. ఆల్‌ ఇండియా టాపర్‌గా నిలిచారు. సివిల్స్‌ పరీక్షల తుది ఫలితాలను శుక్రవారం ప్రకటించారు. ఈ ఫలితాల్లో అనుదీప్‌ ఆల్‌ ఇండియా టాపర్‌గా నిలిచాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుకున్నారు. టాప్‌ ర్యాంక్‌ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనుదీప్‌ 2013లోనే సివిల్స్‌ ద్వారా ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌ కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌ విభాగంలో పని చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలు సివిల్స్‌లో మొదటి ర్యాంకుతో పాటు అనేక ఉత్తమ ర్యాంకులను సాధించాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన 40కిపైగా అభ్యర్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీహర్ష ఆరో ర్యాంకు సాధించారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ టీచర్లు. ఇక సీబీఐ జేడీ లక్ష్మీనారాయణగా ప్రసిద్ధిగాంచిన మాజీ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ తనయుడు వి.వి.సాయి ప్రణీత్‌ 196వ ర్యాంక్‌ సాధించాడు. మాజీమంత్రి పనబాక లక్ష్మి కుమార్తె.. పనబాక రచన 929వ ర్యాంక్‌ సాధించారు. గడ్డం మాధురి 144 ర్యాంక్‌ సాధించింది. కామారెడ్డి జేసీ కుమారుడైన.. ఎస్‌ ఆదర్శ్‌.. 393వ ర్యాంక్‌ సాధించాడు. అక్షయ్‌.. 624వ ర్యాంక్‌ సాధించి సివిల్స్‌తో తెలుగోడి సత్తా చాటారు. జాతీయ స్థాయిలో పదేళ్ల తర్వాత తెలుగు అభ్యర్థికి మొదటి ర్యాంకు వచ్చింది. 2006లో ముత్యాలరాజు, 2007లో అడపా కార్తీక్‌ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకులు సాధించారు.

బ్యాంకులకు వరుస సెలవులు...

హైదరాబాద్ : బ్యాంకులకు మళ్లీ వరుస సెలవులు రానున్నాయి. నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఏప్రిల్ 28వ తేదీ నాలుగో శనివారం.. ఏప్రిల్ 29 ఆదివారం..ఏప్రిల్ 30 బుద్ధ పౌర్ణమి (తెలుగు రాష్ట్రాలకు సెలవు లేదు)..మే 1 కార్మిక దినోత్సవం..కేరళ..తమిళనాడు..కర్ణాటక..ఆంధ్రప్రదేశ్..తెలంగాణ..మహారాష్ట్ర..గోవా..తదితర రాష్ట్రాల్లో మాత్రం ఏప్రిల్ 30 మినహా మిగతా మూడు రోజులు బ్యాంకులకు సెలవులే. 

ఒక్క రోజులో ముగిసిన టీఆర్ఎస్ ప్లీనరీ...

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్లీనరీ విజయవంతంగా ముగిసింది. సీఎం అధ్యక్షతన జరిగిన ఈ ప్లీనరీలో ఆరు తీర్మానాలను ఆమోదించారు. దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం, ఇంటింటికి సంక్షేమం-ప్రతి ముఖంలో సంతోషం' లాంటి తీర్మానాలు ఇందులో ఉన్నాయి. 

కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం పిటిషన్..విచారణ వాయిదా...

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు వ్యవహారంలో.. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు వేసిన అప్పీల్‌ పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరపున వాదనలను సుప్రీం కోర్టు న్యాయవాది వైద్యనాథన్ వినిపించారు. ఇరువాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. 

కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం పిటిషన్..విచారణ వాయిదా...

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు వ్యవహారంలో.. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు వేసిన అప్పీల్‌ పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరపున వాదనలను సుప్రీం కోర్టు న్యాయవాది వైద్యనాథన్ వినిపించారు. ఇరువాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. 

కథువా రేప్ కేసు..సుప్రీం స్టే...

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌ కథువాలోని 8 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసు విచారణను చండీగఢ్‌కు బదిలీ చేయాలని, సిబిఐకి అప్పగించాలని పిటిషన్లు వస్తున్న నేపథ్యంలో మే 7 వరకు స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

చైనాలో మోడీ...

ఢిల్లీ : రెండు రోజుల పర్యటనకు చైనా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోది ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలిశారు. వుహాన్‌ నగరంలోని హూబెయీ ప్రావిన్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో మోది, జిన్‌పింగ్‌ పాల్గొన్నారు. అనధికార శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఇరువురు నేతల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.  

కిమ్ అండ్ మూన్ జే ఇన్ ల భేటీ..

ఢిల్లీ : ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న శత్రుత్వానికి తెరపడింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌లు ఇరు దేశాలను వేరు చేసే సైనిక విభజన లైన్‌ వద్ద కలుసుకున్నారు. ఇరువురు నేతలు చిరునవ్వుతో కరచాలనం చేసుకున్నారు.  

Don't Miss