Activities calendar

29 April 2018

హైదరాబాద్ సెంట్రల్ లో బయటపడ్డ సెక్యూరిటీ లోపాలు

హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ లో బయటపడ్డ సెక్యూరిటీ లోపాలు బయటడ్డాయి. పోలీసులు మఫ్టీలో మారణాయుధాలతో లోపలికి వెళ్లారు. సిబ్బంది పట్టించుకోలేదు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

 

దేశంలో ఫాసిజం, రాష్ట్రంలో నియంతృత్వ పాలన : ప్రొ.హరగోపాల్

హైదరాబాద్ : సభలు కూడా పెట్టుకోలేని సమాజంలోకి వచ్చామని స్వేచ్ఛలేని తెలంగాణ ఇది ప్రొ.హరగోపాల్ అన్నారు. దేశంలో ఫాసిజం, రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందన్నారు. ఉద్యమసమయంలోనూ సభలు పెట్టనీయకుండా ఉంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. 

ఇది విజయానికి నాంది : కోదండరాం

హైదరాబాద్ : అందరూ కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. సభ జయప్రదం కావాలనే కోరిక ప్రజల్లో బలంగా ఉందన్నారు. అనేక గ్రామాల నుంచి ప్రజలు సభకు తరలివచ్చారు. సభకు వచ్చిన వారిని చూస్తుంటే పాలపిట్టల గుంపును చూసినట్టుగా ఉందని అభివర్ణించారు. చందాలతోటి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. సభకు భారీ హాజరైన జనాన్ని చూస్తే ఇది విజయానికి నాంది అని పిలుస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకో, వంటా వార్పు, సకల జనుల సమ్మె చేపట్టామని తెలిపారు.

 

ఇది విజయానికి నాంది : కోదండరాం

హైదరాబాద్ : అందరూ కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. సభ జయప్రదం కావాలనే కోరిక ప్రజల్లో బలంగా ఉందన్నారు. అనేక గ్రామాల నుంచి ప్రజలు సభకు తరలివచ్చారు. సభకు వచ్చిన వారిని చూస్తుంటే పాలపిట్టల గుంపును చూసినట్టుగా ఉందని అభివర్ణించారు. చందాలతోటి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. సభకు భారీ హాజరైన జనాన్ని చూస్తే ఇది విజయానికి నాంది అని పిలుస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకో, వంటా వార్పు, సకల జనుల సమ్మె చేపట్టామని తెలిపారు.

 

21:32 - April 29, 2018

హైదరాబాద్ : అందరూ కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభ జరిగింది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా కోదండరాం ఎన్నికయ్యారు. పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ సభ జయప్రదం కావాలనే కోరిక ప్రజల్లో బలంగా ఉందన్నారు. అనేక గ్రామాల నుంచి ప్రజలు సభకు తరలివచ్చారు. సభకు వచ్చిన వారిని చూస్తుంటే పాలపిట్టల గుంపును చూసినట్టుగా ఉందని అభివర్ణించారు. చందాలతోటి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. సభకు భారీ హాజరైన జనాన్ని చూస్తే ఇది విజయానికి నాంది అని పిలుస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకో, వంటా వార్పు, సకల జనుల సమ్మె చేపట్టామని తెలిపారు.

 

తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా కోదండరాం ఎన్నిక

హైదరాబాద్ : సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభ జరిగింది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా కోదండరాం ఎన్నికయ్యారు. పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. 
 

20:58 - April 29, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ నిర్వహించిన జన ఆక్రోష్‌ ర్యాలీ ప్రజలదని, దేశ సమస్యల మీద ప్రజలు పోరాటం చేయడానికి చేపట్టిన ర్యాలీ అని కాంగ్రెస్ నాయకురాలు నేరేళ్ల శారద అన్నారు. మహిళల రక్షణ కోసం పనిచేస్తున్నామన్న మోదీ ప్రభుత్వం.. గత నెల రోజుల నుండి దేశంలో జరుగుతున్న సంఘటనలపై స్పదించడం లేదన్నారు. దేశంలో బ్యాంకులను మోసం చేసి దేశం దాటి వెళ్లపోతున్న వ్యాపారులను తీసుకురాకుండా ప్రభుత్వం వారికి సహకరిస్తోందంటున్న శారదతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 
 

 

20:55 - April 29, 2018
20:52 - April 29, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడితే స్వపరిపాలన సిద్ధిస్తుందని భావించిన ప్రజలకు వారు కోరుకుంటున్న తెలంగాణ నిర్మాణం జరగాలన్నారు జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌. ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి సభ ఆవిర్భావదినోత్సవంలో ఆయన ప్రసంగించారు. అంబేద్కర్‌ ఏ సమసమాజ నిర్మాణం కోసం రాజ్యాంగం రాశాడో ఆ రాజ్యాంగమే మన అవగాహనకు, ఆచరణకు పునాదికావాలన్నారు. ప్రజలు కేంద్రంగా గల ప్రజాస్వామిక విలువలు పునాదికాగల సమసమాజ తెలంగాణ కోసం తెలంగాణ జనసమితి పోరాడుతుందన్నారు. 

20:49 - April 29, 2018

విజయవాడ : ఏపీ ప్రత్యేక హోదా కోసం అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పోటాపోటీ సభలు, దీక్షలకు సిద్ధమయ్యాయి. తిరుపతి వేదికగా టీడీపీ ధర్మపోరాట సభ ఏర్పాటు చేసింది. మరోవైపు దీనికి వ్యతిరేకంగా వైసీపీ విశాఖలో వంచన దీక్ష చేపట్టనుంది.  రెండు ప్రధాన పార్టీల పోరుతో హోదా రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ హోదా ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో  టీడీపీ సోమవారం నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మపోరాట బహిరంగ సభ నిర్వహించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, ప్రజలు హాజరుకానున్నారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల ముందు, ఆతర్వాత ప్రకటించిన మోదీ.. మాట నిలుపుకోలేదంటూ చంద్రబాబు.. తమ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించారు. ఆతర్వాత కొన్ని రోజులకు ఎన్డీయే నుంచీ బయటకు వచ్చారు. కేంద్ర వైఖరికి నిరసనగా.. ఈనెల 20న విజయవాడలో ధర్మ పోరాట దీక్ష చేసిన చంద్రబాబు.. ఇప్పుడు నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం పేరుతో తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

మరోవైపు హోదా విషయంలో చంద్రబాబు నాలుగేళ్లపాటు ప్రజలను వంచించారన్న ఆరోపణలతో.. విపక్ష వైసీపీ విశాఖపట్నంలో వంచన దీక్షకు సిద్ధమైంది. ధర్మపోరాట సభ, వంచన దీక్షపై టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం విమర్శించుకొంటున్నారు. టీడీపీ ధర్మాపోరాట సభ దగా అన్నది వైసీపీ ఆరోపణ. 

వైసీపీ వాదనను టీడీపీ నాయకత్వం తిప్పికొట్టింది. హోదా కోసం తాము చిత్తశుద్ధితో పోరాడుతుంటే.. వైసీపీ అధినేత జగన్‌ బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకొని, ప్రధాని మోదీని వెనుకేసుకొస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. మొత్తంమీద హోదాపై అధికార టీడీపీ తలపెట్టిన ధర్మ పోరాట సభ, ప్రతిపక్ష వైసీపీ చేయనున్నవంచన దీక్షలతో  ఏపీలో హోదా రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి.

20:46 - April 29, 2018

హైదరాబాద్‌ : స్టార్ హీరో అల్లు అర్జున్‌ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించారు. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈవెంట్‌కి ప్రేక్షకులందరికీ ఉచిత ప్రవేశం కల్పించారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, దర్శకుడు వక్కంతం వంశీ, నాగబాబు, హీరో అర్జున్, హరిరామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు.

  

 

20:45 - April 29, 2018
20:43 - April 29, 2018
19:45 - April 29, 2018

హైదరాబాద్‌ : స్టార్ హీరో అల్లు అర్జున్‌ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఇవాళ సాయంత్రం జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా సినీ హీరో రామ్‌ చరణ్ హాజరుకానున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ రోజు జరగనున్న ఈవెంట్‌కి  ప్రేక్షకులందరికీ ఉచిత ప్రవేశం కల్పించారు. 

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కడప : జిల్లా పుల్లంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిది. వ్యాను, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు అనంతపురం జిల్లా గుత్తి వాసులుగా గుర్తించారు.  మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

 

19:36 - April 29, 2018

కడప : జిల్లాలోని పుల్లంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిది. వ్యాను, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు అనంతపురం జిల్లా గుత్తి వాసులుగా గుర్తించారు.  మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

 

19:34 - April 29, 2018

చెన్నై : దేశంలో గుణాత్మక మార్పుకోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పారు. చెన్నైలో డీఎంకే నేత స్టాలిన్‌తో ఫ్రంట్‌పై చర్చించిన తర్వాత ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. దేశంలో విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణ, పట్టణ అభివృద్ధి, మంచినీటి పథకాలపై కేంద్రం శ్రద్ద చూపడం లేదన్నారు.

 

19:26 - April 29, 2018

ఢిల్లీ : రెండు దేశాల ఈ తరహా ఒప్పందం అందరూ కోరుకున్నదే.. అయితే ఇదే తరహా పట్టువిడుపు ధోరణి ప్రదర్శిస్తే.. దేశంలోనే ఉభయ కొరియా దేశాలు కీలక స్థానం దక్కించుకోవడం పెద్ద విషయమేమీ కాదు.. భారత్ తో పాటు ప్రపంచం దేశాలు వీరిద్దరి మధ్య శాంతియుత వాతావరణాన్నే కోరుకుంటున్నాయి.. ఒక్క అమెరికా తప్ప.. ఈ తరహా వాతావరణం రావడానికి ఇరు దేశాల ప్రయత్నాలు శ్లాఘనీయమే.. 
రెండు దేశాల మధ్య కొంత సానుకూల ఆలోచన 
2006లో ఉత్తర కొరియా అణుపరీక్ష జరపడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం మరింత రాజుకుంది. ఈ నేపథ్యలోనే 2015 జనవరి ఒకటిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌ దక్షిణ కొరియాతో ఉన్నత స్ధాయి చర్చలకు సుముఖత వ్యక్తం చేశారు. అదే ఏడాది ఆగస్టులో సరిహద్దులలో సంభవించిన కొన్ని సంఘటనలు ఉద్రిక్తతలను కలిగించినా సర్దుబాటు చేసుకున్నారు. దీంతో రెండు దేశాల మధ్య కొంత సానుకూలంగా ఆలోచించడం మొదలైంది.. 
దక్షిణ కొరియా అధ్యక్షుడు...ఉత్తర కొరియాతో సయోధ్యకు సై 
ఈ ఏడాది మార్చి ఆరున కిమ్‌ దక్షి ణకొరియా రాయబారులతో సమావేశమై సియోల్‌ శీతాకాల ఒలింపిక్స్‌ గురించి చర్చించారు. 2017 మేనెలలో అధికారానికి వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ ఉత్తర    కొరియాతో సయోధ్యకు సై అన్నారు.. 2018 నూతన సంవత్సర సందేశంలో సియోల్ శీతాకాల ఒలింపిక్స్ కు జట్టును పంపేందుకు  కిమ్‌జోంగ్‌ అన్‌ సంసిద్ధత ప్రకటించారు. దీంతో సానుకూల వాతావరణానికి కొంత మార్గం సుగమం అయ్యింది. ఈ పరిస్థితుల్లో రెండు సంవత్సరాల తరువాత ముఖాముఖీ చర్చలకు తెరలేచింది. 
పరేడ్‌లో ఒకటిగానే పాల్గొన్న రెండు ప్రాంతాల క్రీడాకారులు   
సియోల్‌ శీతాకాల ఒలింపిక్స్‌కు ఐస్‌ హాకీలో ఉమ్మడి జట్టును, అధ్లెట్లను పంపటంతో పాటు రెండు ప్రాంతాల క్రీడాకారులు ఒకటిగానే పరేడ్‌లో పాల్గోన్నారు. ఈ పోటీలకు అసాధారణ రీతిలో ఉత్తర కొరియా పార్లమెంట్‌ అధ్యక్షుడి నాయకత్వంలో పెద్ద ప్రతినిధి బృందం తరలి వచ్చింది. ఈ సందర్బంగానే తమ దేశాన్ని సందర్శించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడికి ఆహ్వానం అందచేశారు. ఈ పరిణామం తరువాత ఉభయ దేశాల అధికారులు ఉమ్మడిగా 2021 ఆసియా శీతాకాల క్రీడలనిర్వహణ గురించి ప్రతిపాదనలు చేశారు.
ఉత్తర కొరియా అధ్యక్షుడిని కలసిన దక్షిణకారియా ప్రతినిధి బృందం 
మార్చినెలలో దక్షిణకారియా ప్రతినిధి బృందం పోంగ్‌యాంగ్‌లో ఉత్తర కొరియా అధ్య క్షుడు కిమ్‌ను కలసింది. తరువాత అదే బృందం వాషింగ్టన్‌ వెళ్లి కిమ్‌తో భేటీ కావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఆహ్వానం అందచేసింది. ఏప్రిల్‌ ఒకటవ తేదీన దక్షిణ కారియా పాప్‌ స్టార్స్‌ పోంగ్‌యాంగ్‌ వెళ్లి వసంతం వస్తోందంటూ ఒక సంగీత కచేరి నిర్వహించింది. దానికి కిమ్‌ హాజరయ్యారు. ఈలోగా పరస్పర ప్రచార దాడులు ఆగిపోయాయి. ఏప్రిల్‌ 27న ఉభయ దేశాల నేతల శిఖరాగ్ర సమావేశం జరిగింది, ఒప్పందం కుదిరింది. కొరియా యుద్దం 1953 తరువాత తొలిసారిగా ఉత్తర కొరియా నేత దక్షిణ కొరియాలో అడుగు పెట్టటం ఇదే ప్రధమం. 
ఇరువురిలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని శాంతి ఒప్పందంగా మార్చాలన్న ఆకాంక్ష 
ఎక్కడైతే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందో అక్కడే ఈ భేటీ జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని శాంతి ఒప్పందంగా మార్చాలన్న ఆకాంక్ష ఇరువురిలో వ్యక్తమైంది. ఒంటిచేతితో చప్పట్లు రావు, చేతులు కలపాలి, చేతలు జరగాలి. అలాగే కుదిరిన ఒప్పందాన్ని ఇరు పక్షాలు, వారి వెనుక వున్న మద్దతుదార్లు చిత్తశుద్దితో వుంటేనే ఒప్పంద ఫలాలు ఇరు దేశాలు ఆశ్వాదిస్తాయి.. సమసిపోతున్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎవరు ద్రోహం చేసినా అది ఒక్క కొరియా ద్వీపకల్పానికే కాదు, యావత్తు ప్రపంచానికి నష్టదాయకం.

 

19:11 - April 29, 2018

ఢిల్లీ : మరి విభజన వల్ల రెండు దేశాలకు లాభమేమైనా జరిగిందా.. కొరియన్లు ప్రపంచంలో దూసుకుపోయారా.. వీరిద్దరి మధ్య ఇంత వైషమ్యం, వైరం పెరగడం వల్ల.. అమెరికాకు ఒనగూరే ప్రయోజనం ఏంటీ .. లుక్ 
అనేక కష్ట నష్టాల పాలు 
కొరియా యుద్దం, దేశ విభజన కొరియన్లను అనేక కష్ట నష్టాలపాలు చేసింది. ఏడున్నరలక్షల  మంది తమ కుటుంబ సభ్యులకు దూరమయ్యారు. ఎదురుగా కనిపిస్తున్నా ఒకరి నొకరు కలుసుకోలేని దుస్ధితి. రెండు ప్రాంతాల మధ్య నిత్యం ఉద్రిక్తతలు, ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఆందోళన,భయం వెన్నాడుతూ వుంటుంది. ఉభయ ప్రాంతాలను విడిపోయి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా ఒకే దేశం, ఒకే ప్రజగా ప్రపంచం ముందు తలెత్తుకు నిలబడాలన్న తపన ఇంకా మెజారిటీ జనంలో ఉంది.. ఇది సర్వేలు చెబుతున్న మాట. గత ఐదు దశాబ్దాలలో ఉభయుల మధ్య విబేధాలను పెంచే అనేక ఉదంతాలు జరిగాయి. వాటి వెనుక అమెరికా  హస్తం వుంది.
దక్షిణ కొరియాలో అమెరికా సైనిక తిష్ట 
కొరియా ప్రాంతంలో తిష్ట వేయాలంటే అమెరికన్లకు ఒక దేశం అవసరం. విలీనానికి ఇంకా సమయం రాలేదు, దక్షిణ కొరియన్లలో భయం తొలగలేదంటూ కుంటి సాకులు చెబుతున్నది. నిజానికి రెండు ప్రాంతాలు విలీనమైతే జనాభా రీత్యా చూసుకుంటే రెండున్నర కోట్ల మంది ఉత్తర కొరియన్లతో పోలిస్తే ఐదుకోట్లమందికి పైగా వున్న దక్షిణ కొరియన్లే నిర్ణయాత్మక పాత్ర వహిస్తారు. అందువలన వారు భయపడుతున్నారని చెప్పటంలో అర్ధం లేదు. దక్షిణ కొరియాలో అమెరికా సైనిక తిష్ట ఉత్తర కొరియన్లనే భయపెడుతున్నది. ఎందుకంటే 1950దశకంలో వారిపై దాడి చేసింది అమెరికన్లు, వారి కనుసన్నలలో పనిచేసే దక్షిణ కొరియా మిలిటరీనే...
అమెరికా వైఖరి కారణంగా ఉత్తర కొరియా ఆధునిక క్షిపణులు, అణు కార్యక్రమాలు 
అమెరికా ఈ వైఖరి కారణంగానే ఉత్తర కొరియా తన రక్షణ చర్యల్లో భాగంగా ఆధునిక క్షిపణులు, అణు కార్యక్రమాలను చేపట్టాల్సి వచ్చింది. ప్రపంచంలో అణు రియాక్టర్లను కలిగిన ఏ దేశమైనా అణ్వాయుధాలను తయారు చేయటానికి అవసరమైన ముడి సరకును కలిగి వున్నట్లే. అందువలన దక్షిణ కొరియా అధికారికంగా ప్రకటించలేదు తప్ప దాని దగ్గర అణ్వాయుధాలు లేవని చెప్పలేము. ఉత్తర కొరియా అణుక్షిపణుల కార్యక్రమాన్ని ప్రారంభించటంతో 2003 నుంచి అమెరికా, చైనా,జపాన్‌, రష్యా, దక్షిణ, ఉత్తర కొరియా దేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే 2006లో ఉత్తర కొరియా తొలి అణు పరీక్ష జరిపింది. 

 

19:04 - April 29, 2018

ఢిల్లీ : అసలు ఈ రెండు దేశాల వివాదం ఎక్కడ మొదలైంది.. ఒకే దేశంగా ఉన్న కొరియా ఎందుకు రెండు ముక్కలైంది.. దీని వెనుక కుట్రకోణం, వేరే దేశాల ప్రయోజనాలు ఉన్నాయా... 
కొరియాను 1910లో ఆక్రమించిన జపాన్‌  
వేల సంవత్సరాల పాటు ఒకే దేశంగా కొనసాగిన కొరియాను 1910లో జపాన్‌ ఆక్రమించింది. దానికి వ్యతిరేకంగా కొరియన్లు పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపారు. రెండవ ప్రపంచ యుద్దం ముగిసే సమయంలో 1945 ఆగస్టు తొమ్మిదిన యాల్టా సమావేశంలో కుదిరిన ఒప్పందం మేరకు జపాన్‌పై నాటి సోవియట్‌ యూనియన్‌ యుద్ధం ప్రకటించింది. అయితే  అప్పటికే కొరియా లో కమ్యూనిస్టులు విముక్తి పోరాటాలు బలంగా జరుగుతుండటంతో .. ఒక వేళ విముక్తి జరిగితే కొరియా సోవియట్‌ ప్రభావంలోకి వెళుతుందనే భయంతో 38వ అక్షాంశ రేఖ వరకు మాత్రమే సోవియట్‌ సైన్యాలు పరిమితం కావాలని మిగతా ప్రాంతాన్ని తమకు వదలాలని అమెరికా కోరింది. వారం రోజులలోపే అమెరికా సేనలు ప్రవేశించక ముందే జపాన్‌ చేతులేత్తేసింది. మరో పది రోజుల తరువాత ఎర్ర సైన్యం ఉత్తర కొరియాలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఇరవై రోజులకు అమెరికా సేనలు వచ్చాయి. తమకు అనుకూలంగా ఉండే మిలిటరీ ప్రభుత్వాన్ని దక్షిణ కొరియాలో ఏర్పాటు చేశాయి.
మిత్రరాజ్యాల పర్యవేక్షణలో కొరియాలో పాలన సాగించాలని కొందరు ప్రతిపాదన
జపాన్‌ తప్పుకున్న తరువాత రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల పర్యవేక్షణలో కొంతకాలం కొరియాలో పాలన సాగించాలని కొందరు ప్రతిపాదించారు. అయితే దేశభక్తులు తమకు వెంటనే స్వాతంత్య్రం కావాలని డిమాండ్‌ చేశారు. దీంతో సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్టులను...  పోటీగా స్వాతంత్య్రపోరాట సమయంలో పశ్చిమ దేశాలకు పారిపోయిన, జపాన్‌తో చేతులు కలిపిన ద్రోహులను, కమ్యూనిస్టు వ్యతిరేకులను అమెరికన్లు చేరదీశారు. అమెరికా ప్రోద్బలంతో కొరియాపై తాత్కాలిక కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్యసమితి చేసిన ప్రతిపాదనను సోవియట్‌ యూనియన్‌ తిరస్కరించింది. తరువాత అమెరికన్లు దక్షిణ కొరియాలో ఎన్నికల తతంగం జరిపి మిలిటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారాన్ని దానికి బదలాయించారు. 
ఉత్తర కొరియా ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పాటు 
ఉత్తర కొరియా ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. దాంతో సోవియట్‌ సేనలు అక్కడి నుంచి వెనక్కు వెళ్లిపోయాయి. అయితే దక్షిణ కొరియా మిలిటరీకి శిక్షణ ఇచ్చే నెపంతో అమెరికా సేనలు అక్కడే తిష్టవేశాయి. కొరియాను ఒకే దేశంగా పరిగణిస్తూ రెండు ప్రభుత్వాలు మొత్తం కొరియాకు తామే ప్రతినిధులమని ప్రకటించుకున్నాయి. విభజన తాత్కాలికమే అని రెండు ప్రాంతాల విలీనానికి కట్టుబడి వున్నట్లు పేర్కొన్నాయి. ఎవరికి వారు పైచేయి సాధించి దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొనేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలోనే 1950 జూన్‌ 25న  రెండు ప్రాంతాల మిలిటరీ మధ్య ఘర్షణ తలెత్తింది. దక్షిణ కొరియాలోని ప్రభుత్వానికి రక్షణ కల్పించే పేరుతో భద్రతా మండలిలో అమెరికా ఒక తీర్మానం చేయించటం, ఐక్యరాజ్యసమితి సేనల పేరుతో ఉత్తర కొరియాపై దాడికి దిగాయి. 
ఉత్తర కొరియాకు మద్దతుగా చైనా  
కొద్ది కాలం తరువాత ఉత్తర కొరియాకు మద్దతుగా చైనా రంగంలోకి వచ్చింది. అమెరికా నాయకత్వంలోని సేనలను తరిమి కొట్టింది. చివరకు 1953 జూలై 27న ఉభయ ప్రాంతాల మధ్య పూర్వపు సరిహద్దులను పునరుద్దరిస్తూ 38వ అక్షాంశ రేఖ పరిసరాలను మిలిటరీ రహిత ప్రాంతంగా గుర్తిస్తూ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం కాల్పుల విరమణకే పరిమితమైంది తప్ప తదుపరి శాంతి ఒప్పందం కుదరలేదు.  దాన్ని కూడా  దక్షిణ కొరియా పాలకులు ఆమోదించి సంతకాలు చేయలేదు, చివరకు కట్టుబడి వుంటామని మాత్రమే ప్రకటించారు. మేము కూడా సేమ్ టూ సేమ్ అంటూ ఉత్తర కొరియా ప్రకటించింది.  అందువల్ల ఇప్పటికీ సాంకేతికంగా కాల్పుల విరమణ జరిగింది తప్ప సాంకేతికంగా యుద్ధం ముగిసినట్లు కాదు.

18:57 - April 29, 2018

ఢిల్లీ : అయితే ఇద్దరూ కలవాలని ఎక్కువ మంది కోరుకుంటారు.. కానీ ఆ దేశాల మధ్య ఎప్పుడూ విద్వేష పూరిత వాతావరణం ఉండాలని కోరుకునే దేశాలున్నాయి.. అందులో అమెరికా ముందుంటుంది.. వీరిద్దరు ఇలా కలిశారో లేదో ఓ వర్గం మీడియా అనుమానాలు రేకేత్తించడం మొదలుపెట్టింది.. మరో వైపు కొన్ని ఒత్తిడులు ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం చేసుకోవాలనే ప్రాతిపదికకు దారి తీశాయి..  
ఒప్పందాంశాలపై పశ్చిమ దేశాల మీడియా రచ్చ 
ఇలా ఒప్పందం కుదిరిందో లేదో.. అప్పుడే పశ్చిమ దేశాల మీడియా కుదిరిన ఒప్పందాంశాలపై రచ్చ చేయడం మొదలుపెట్టింది. మరుక్షణం ఉత్తర కొరియా చిత్తశుద్ధిపై రచ్చ ప్రారంభించింది. గతంలో కుదిరిన కొన్ని ఒప్పందాల నుంచి ఉత్తర కొరియా వెనక్కు తగ్గిన మాట వాస్తవం. దానికంటే ముందు మరో ఒప్పంద భాగస్వామి అమెరికా వాగ్దానభంగం చేయటమే కాదు, ఉత్తర కొరియాను రెచ్చగొట్టిన పర్యవసానమే అది. కొరియా ద్వీపకల్పంలో చిచ్చు పెట్టింది, దక్షిణ కొరియాను తన చేతిలో పావుగా చేసుకొని ఉత్తర కొరియాకే కాదు, పక్కనే వున్న సోషలిస్టు చైనాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోంది అమెరికాయే. ఇది కళ్లేదుట కనిపిస్తున్న వాస్తవం..
ఉత్తర కొరియా ఒప్పందానికి ఎందుకు సిద్దమైంది ?
అయితే పశ్చిమ దేశాల కుట్రల కోసం తెలిసి కూడా ఉత్తర కొరియా ఒప్పందానికి ఎందుకు సిద్దమైనట్లు.. ఇదే ప్రశ్న ఇప్పుడు మరికొందరు వైపు నుంచి..  ఒప్పందం పై రెండు దేశాల వెనుక పనిచేసిన ఒత్తిడులేమిటి? ఎవరి ఎత్తుగడలు , ఎవరి ప్రయోజనాలు ఉన్నా.. ఈ ఒప్పందం మాత్రం ఉభయ దేశాలకు చాలా ఆవశ్యం... 
అమెరికా ఆంక్షలతో ఉత్తర కొరియాకు ఇబ్బంది
తాజా ఒప్పందానికి దారితీసిన నేపధ్యాన్ని చూస్తే ఉభయుల మీద పరిస్ధితులు, పర్యవసానాలు ఒత్తిడి తెచ్చాయనే చెప్పాలి. తమ వనరులను మిలిటరీ అవసరాలకు ఖర్చు చేయటం ఉత్తర కొరియాకు ఎల్లవేళలా సాధ్యం కాదు. అది వాంఛనీయం కూడా కాదు. చైనా ఎంతగా సాయం చేసినప్పటికీ అమెరికా విధించిన అధికారిక, అనధికారిక ఆంక్షలు  ఉత్తర కొరియాను ఇబ్బంది పెట్టేవే. అందువలన కాస్త వూపిరి పీల్చుకోవాలంటే దక్షిణ కొరియాతో సామరస్యక పూర్వక ఒప్పందం దానికి కూడా అవసరమే.
ఆమెరికా, జపాన్‌, దక్షిణకొరియాలకు భయాందోళనలు 
అణు పరీక్షలు, అణ్వాయుధాలను మోసుకుపోగల దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగాల ద్వారా అమెరికా, జపాన్లపై తాము బాంబుల వర్షం కురిపించగలమని ఉత్తర కొరియా చేసిన హెచ్చరికలు .. అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా దేశాలను భయాందోళనలకు గురిచేసింది. అమెరికా ఎన్ని బెదిరింపులు చేసినా ఉత్తర కొరియా వెనక్కు తగ్గదని తేలిపోవటంతో ఏదో ఒక విధంగా రాజీ ఒప్పందం చేయించటం ద్వారా తమ జనాల్లో వున్న భయాన్ని పొగొట్టేందుకు అమెరికా, జపాన్‌ పాలకులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ధనిక దేశాలలో పది సంవత్సరాల క్రితం తలెత్తిన ఆర్ధిక సంక్షోభం దక్షిణ కొరియాను కూడా తాకింది. అది అక్కడి కార్మికవర్గంలో అసంతృప్తికి దారితీస్తోంది. ఇలాంటి కారణాలు ఒప్పందానికి దారి తీశాయి..
తీవ్ర ఒత్తిడికి గురవుతున్న దక్షిణ కొరియా 
దీనికి తోడు నిత్యం ఉత్తర కొరియా నుంచి ఎప్పుడు ఎలాంటి దాడి జరుగుతోందో తెలియని స్ధితిలో దక్షిణ కొరియా  తీవ్ర ఒత్తిడి కి గురవుతోంది. ఉత్తర కొరియాకు తోటి సోషలిస్టు దేశంగా ఎన్ని విధాలుగా సాయం చేస్తున్నప్పటికీ అంతర్జాతీయ వేదికల మీద కొన్ని సందర్భాలలో చైనా కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విధంగా కొరియా రాజకీయాలతో ప్రమేయం వున్న అన్ని దేశాలకు అనుకూల, ప్రతికూల ఒత్తిళ్లు వున్నాయి. ఈ కారణంగానే ఉభయ కొరియాల మధ్య ఒప్పందానికి తెరవెనుక వుండి అన్ని దేశాలూ సంతకాలు చేయటానికి సహకరించాయనే చెప్పవచ్చు.

 

18:48 - April 29, 2018

ఢిల్లీ : బద్ద శత్రు దేశాలు.. 65 ఏళ్ల తర్వాత ఒకటవుతున్నాయా.. తాజాగా ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య కుదిరిన చారిత్రక ఒప్పందం ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యింది.. తాజా ఒప్పందంతో రెండు దేశాల మధ్య ఆరోగ్యకర వాతావరణం ఏర్పడబోతోందా... అసలు ఒప్పందంలో ఏముంది...  
రెండు దేశాల మధ్య సయోధ్య వాతావరణం 
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా కలవాలని కోరుకునే వారు ఎందరో.. ప్రపంచంలో వారిద్దరి మధ్య భగ్గుమనే స్థాయిలో విభేదాలు, కొన్ని సందర్బాల్లో యుద్ద వాతావరణాలు.. ప్రపంచం మార్కెట్లను ప్రభావితం చేశాయి.. అలాంటి రెండు దేశాల మధ్య ఇప్పుడిప్పుడే సయోధ్య వాతావరణం పురుడుపోసుకుంటోంది.. దాదాపు 65 ఏళ్ల తర్వాత రెండు దేశాల అధ్యక్షులు శాంతి యుత వాతావరణం కోసం కలవడం ఖచ్చితంగా చరిత్రలో కీలకమైనదే... వీరిద్దరి మధ్య జరిగిన తాజా ఒప్పందం పై రెండు దేశాల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది... 
ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ఏంటి ? 
ఇంతకీ ఆ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ఏమిటి, వివాదాస్పద అంశాలేమిటి? ఇంతకూ అవి నిజంగా రెండు దేశాలా లేక విడదీసిన ఒకే దేశమా ? ఒకే దేశమైతే విడిగా ఎందుకుంటున్నాయి ? ఉత్తర కొరియా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంలో వున్న రెండున్నర కోట్ల జనాభా వున్న దేశం.  దీర్ఘకాలం పాటు సైనిక నియంతల పాలనలో తరువాత సైనికాధికారుల కనుసన్నలలో పనిచేసే పౌర పాలకులతో పని చేస్తున్న ఐదు కోట్లకు పైగా జనాభాతో పెట్టుబడిదారీ వ్యవస్ధలో వున్న దేశం దక్షిణ కొరియా. 
మిలటరీ రహిత ప్రాంతాన్ని పీస్‌ సెంటర్‌గా మార్చాలని ఒప్పందం
అంగీకరించిన అంశాలేమిటో ఇప్పుడు చూద్దాం .. రెండు దేశాలను అణురహితంగా మార్చటం, రెండు దేశాల మధ్య వున్న శత్రుపూరిత కార్యకలపాలకు స్వస్ధి పలకటం, ప్రచార దాడులను నిలిపివేసి రెండు దేశాల మధ్య వున్న మిలిటరీ రహిత ప్రాంతాన్ని పీస్ సెంటర్ గా మార్చాలని ఒప్పందంలో నిర్ణయం తీసుకున్నారు..  అలాగే సరిహద్దు ప్రాంతంలో ఆయుధాల సంఖ్య తగ్గింపు, అమెరికా, చైనాల ప్రమేయంతో చర్చలను  ముందుకు తీసుకుపోవటం, కొరియా యుద్ద సమయంలో విడిపోయిన కుటుంబాలను దగ్గరకు చేర్చటం, సరిహద్దు ప్రాంతంలో రోడ్లు, రైలు మార్గాల నవీకరణ, ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడలతో సహా అన్ని క్రీడలలో సంయుక్త జట్లతో పాల్గనటంపై ఒప్పందం కుదిరింది. ఖచ్చితంగా ఇది ఈ రెండు దేశాల మధ్య సంబంధాల్లో కీలక ముందడుగే..... 
శాంతి నివాసంలో ఒప్పందంపై సంతకాలు 
1953లో ఎక్కడైతే కొరియా యుద్ధ కాల్పుల విరమణ ఒప్పందం కుదరిందో, తాత్కాలిక సరిహద్దుగా గుర్తించిన చోట, దక్షిణ కొరియా వైపున వున్న మిలిటరీ రహిత ప్రాంతమైన పాముంజోమ్‌లోని 'శాంతి నివాసం'లో  ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌, దక్షిణ కొరియా నేత మూన్‌ జె ఇన్‌ భేటీలో ఒప్పందంపై సంతకాలు చేశారు. గతంలో ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు మన దేశంతో సహా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఇప్పుడు ఒప్పందం కుదరగానే సూచీలు కళకళలాడాయి. అంటే ఆ రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలు ఓ కొలిక్కి రావాలని.. ఉభయ కొరియా దేశాల ప్రజలే కాదు.. ప్రపంచ మదుపుదార్లందరూ కోరుకుంటున్నారన్నది స్పష్టం.

18:26 - April 29, 2018

విశాఖ : ఏపీలో పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యా మంత్రి గంటా శ్రీనివాస్ రావు ఫలితాలను విడుదల చేశారు. ఈసారి కూడా బాలికలే పై చేయి సాధించారు. మొత్తం 6 లక్షల 17 వేల 484 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 94.48 శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణత శాతం 94.56, బాలుర ఉత్తీర్ణత శాతం 94.41 శాతమని తెలిపారు. ఈ ఫలితాల్లో 97.93 శాతంతో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో నిలువగా 80.37 శాతంతో నెల్లూరు చివరి స్థానంలో నిలిచిందన్నారు. జూన్‌ 6 నుండి 25 వరకు టెన్త్‌ సప్లమెంటరీ పరీక్షలు ఉంటాయని మంత్రి వెల్లడించారు. 

18:05 - April 29, 2018

విశాఖ : గీతం యూనివర్శటీ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష గ్యాట్‌ ఫలితాలను వైస్‌ ఛాన్సలర్‌ ఎమ్‌.ఎస్‌ ప్రసాదరావు విడుదల చేశారు. మే 16 నుంచి మూడు రాష్ట్రాల్లోని క్యాంపస్‌లలో అడ్మిషన్‌ కౌన్సిలింగ్‌ జరగనుందని తెలిపారు. హైదరాబాద్‌ గీతం క్యాంపస్‌లో ఈ ఏడాది నుంచి కొత్తగా బిఆర్క్‌ కోర్సు ప్రారంభిస్తున్నామని, విశాఖ క్యాంపస్‌లో ఎమ్‌ఆర్క్‌ కోర్సులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. మొదటి పది ర్యాంకర్లకు ఫీజులో పూర్తి రాయితీ.. తరువాతి 90 ర్యాంకర్లకు 50 శాతం ఫీజు రాయితీ ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు దేశంలో 11 యూనివర్శటీలకు మాత్రమే ఉన్న స్వయం ప్రతిపత్తి హోదా ఇప్పుడు గీతంకు రావడం గర్వకారణమని తెలిపారు. దీని ద్వారా సొంత కోర్సుల నిర్వహణ, ఫారెన్‌ ఫ్యాకల్టీని నియమించుకోవడంలో వెసులుబాటు కలుగుతుందని ఎమ్‌.ఎస్ ప్రసాదరావు అన్నారు.

 

17:59 - April 29, 2018

విశాఖ : ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కార్‌ అవినీతి ఊబిలో కూరుకుపోయిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని, ఇప్పుడు హోదా పేరుతో ప్రజలను దగా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్‌ల పాలనలో రాష్ట్ర మంత్రులు నిమిత్తమాత్రులుగా మారిపోయారంటున్న సోము వీర్రాజుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

17:44 - April 29, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ జనాకోశ్‌ ర్యాలీ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. దేశం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో కాంగ్రెస్‌ నాయకత్వంలో కూడా నూతనోత్సాహం కనిపిస్తోంది. ర్యాలీలో ప్రసంగించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సోనియా,మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌... ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ  ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 


 

17:38 - April 29, 2018

చెన్నై : తెలంగాణ సీఎం కేసీఆర్ చెన్నైలో డీఎంకే అధినాయకులు కరుణానిధి, స్టాలిన్‌తో భేటీ అయ్యారు. చెన్నై విమానాశ్రయంలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్  సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి డీఎంకే అధినేత  కరుణానిధి ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. కేసీఆర్ వెంట మంత్రి ఈటల రాజేందర్, ఎంపీలు కేశవరావు,  వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన కేసీఆర్.. ఈ విషయంలో తన ప్రయత్నాల్లో వేగం పెంచారు. ఫెడరల్ ఫ్రంట్‌లో అన్ని రాష్ర్టాలకు ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్న కేసీఆర్‌.. దేశహితం కోసం కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీల నాయకులతో చర్చలు ముమ్మరం చేశారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో చర్చించిన సీఎం.. తదుపరి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ సమాలోచనలు జరిపారు . 
 

ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల..

విశాఖ : ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల అయ్యాయి. బాలికలే పైచేయి సాధించారు. ఏపీ విద్యా మంత్రి గంటా శ్రీనివాస్ రావు ఫలితాలను విడుదల చేశారు.

16:03 - April 29, 2018

నల్గొండ : జిల్లాలోని బంగారిగడ్డ గ్రామంలోని మంజీత్‌ ఫైబర్‌ లిమిటెడ్‌ అనే పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మిల్లు పరిసరాల్లో వున్న వ్యవసాయ భూమిలోని చెత్త తగలపెడుతుండగా నిప్పు రవ్వలు ఎగిసిపడి మిల్లులోని పత్తి అంటుకుందని పోలీసులు తెలిపారు.

 

16:02 - April 29, 2018

మెదక్ : జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం చిరుత కలకలం చెలరేగింది. గజగట్లపల్లి శివారులో పశువులపై చిరుత వరుసగా దాడులు చేస్తోంది. కొన్ని రోజులుగా  లేగదూడలు, మేకలపై దాడిచేసి హతమార్చుతోంది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.  అటు  రామాయంపేట మండలం దంరేపల్లి తండాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.  చిరుత సంచార సమాచారం గ్రామస్తులు అధికారులకు చెప్పడంతో వారు గ్రామాల్లో పర్యటించారు. చిరుతతోపాటు హైనా, తోడేళ్లు దాడులకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. 

15:59 - April 29, 2018

విజయవాడ : ఏపీకి జరిగిన అన్యాయంపై తాము కేంద్రంపై పోరాడుతుంటే.... ప్రతిపక్షనేత జగన్‌ తమపై పోరాటానికి దిగారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంపై ఒంటికాలితో లేస్తున్న జగన్‌... మోదీని ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. ఏపీకి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.  తాము ధర్మపోరాటం దీక్ష చేస్తుంటే... జగన్‌ పోటీ దీక్షలకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. 

 

15:44 - April 29, 2018

చెన్నై : తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెన్నై చేరుకున్నారు. కాసేపట్లో కరుణానిధి, స్టాలిన్‌లతో కేసీఆర్ బృందం సమావేశం కానుంది. కేసీఆర్‌తో పాటు ఎంపీ కేకే టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు చెన్నై చేరుకున్నారు. 

 

రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ జన్ ఆక్రోశ్ ర్యాలీ

ఢిల్లీ : రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ జన్ ఆక్రోశ్ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ నేతృత్వంలో బహిరంగ సభ నిర్వహించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ జాక్రోశ్ ర్యాలీ తలపెట్టారు. 

 

డీఎంకే అధినేత కరుణానిధితో సీఎం కేసీఆర్ సమావేశం

చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధితో సీఎం కేసీఆర్ సమావేశం జరిగింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కరుణానిధితో కేసీఆర్ చర్చించారు. కేసీఆర్ వెంట ఎంపీ కేకే, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. 

13:43 - April 29, 2018

హైదరాబాద్ : పీపుల్స్‌ ప్రోగ్రెస్‌ ట్రస్ట్‌ నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ క్వశ్చన్‌ పేపర్‌ను మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త చుక్కారామయ్య విడుదల చేసారు. గ్రామీణ నిరుపేద బాలబాలికలకు ఉచిత విద్యనందించేందుకు పీపుల్స్‌ ప్రోగ్రెస్‌ ట్రస్టు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు చుక్క రామయ్య. కార్మిక సంఘం నేతలు తమ రిటైర్‌మెంట్‌ డబ్బులతో స్కూల్‌ ఏర్పాటుచేసి ప్రభుత్వ స్కూల్‌కు ధీటుగా విద్యనందించడం ప్రశంసనీయమన్నారు. గత సంవత్సరం 350 మందికి పీపుల్స్‌ ప్రోగ్రెస్‌ ట్రస్టు ద్వారా ఉచిత విద్యనందిచామని.. ఈ సంవత్సరం 300 బాలికలు, 100 బాలురకు విద్యనందిచే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బాబు దీక్షను విజయవంతం చేయాలి - ఆదినారాయణరెడ్డి...

కడప : కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేస్తున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. దీక్షను విజయంతం చేయాలంటూ కడప జిల్లా జమ్మలమడుగులో ఆయన బైక్‌ ర్యాలీ నిర్వహించారు.  

13:41 - April 29, 2018

కడప : కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేస్తున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. దీక్షను విజయంతం చేయాలంటూ కడప జిల్లా జమ్మలమడుగులో ఆయన బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహం నుంచి మొదలైన ఈ ర్యాలీ.. ముద్దనూరు మీదుగా యర్రగంట్ల వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మోడీ సర్కార్ పై రాహుల్ విమర్శలు...

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీది చేతల ప్రభుత్వం కాదని..మాటల ప్రభుత్వవమేనని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ పేర్కొన్నారు. రాంలీలా మైదాన్ లో కాంగ్రెస్ నిర్వహించిన జనాక్రోశ్ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

చెన్నైకి కేసీఆర్..టీం...

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నై పర్యటనకు బయల్దేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో తమిళనాడు బయల్దేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి ఈటల రాజేందర్, ఎంపీలు కేకే, వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. 

13:19 - April 29, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నై పర్యటనకు బయల్దేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో తమిళనాడు బయల్దేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి ఈటల రాజేందర్, ఎంపీలు కేకే, వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.

కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలతో, నాయకులతో చర్చలను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో చర్చించిన సీఎం.. తదుపరి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే.

12:54 - April 29, 2018

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీది చేతల ప్రభుత్వం కాదని..మాటల ప్రభుత్వవమేనని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ పేర్కొన్నారు. రాంలీలా మైదాన్ లో కాంగ్రెస్ నిర్వహించిన జనాక్రోశ్ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వెళ్లిన ప్రతిచోట మోడీ తప్పుడు హామీలలిస్తున్నారని, ప్రజల కళ్లలో మోడీ పట్ల ఆగ్రహాన్ని చూస్తున్నానన్నారు. ప్రధాని మాట్లాతుంటే ప్రజలు నిజాలు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. తాను రాష్ట్రాల్లో పర్యటించే సమయంలో పలువురిని కలవడం జరుగుతూ ఉంటోందని..ఈ సందర్భంగా సంతోషంగా ఉన్నారా ? అని మాట్లాడిస్తే వారు సంతోషంగా లేము..ఇందుకు ప్రభుత్వమే కారణమని వారు పేర్కొంటున్నారని విమర్శించారు. యెడ్యూరప్పను పక్కన పెట్టుకుని మోడీ మాట్లాడడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అవినీతి అంంతం చేస్తానంటూ మోడీ చెప్పేవన్నీ అబద్ధాలేనని, నేరస్తులకు టికెట్ ఇచ్చిన ఘత మోదీనన్నారు. ఇప్పటి వరకు నీరవ్ మోడీపై నోరు మెదపలేదని తెలిపారు. 

12:12 - April 29, 2018

ఢిల్లీ : భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను మార్చేందుకు ప్రతొక్కరూ కృషి చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. రాంలీలా మైదాన్ లో కాంగ్రెస్ నిర్వహించిన జనాక్రోశ్ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల్లో రాకముందు ఇచ్చిన హామీలు ఏది పూర్తి చేయలేదని విమర్శించారు. దేశంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను మార్చేందుకు రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ నేతలు తయారు కావాలని, దేశంలోని యువత తీవ్ర నిరుత్సాహంలో కొట్టుమిట్టాడుతున్నారు. దేశంలో చిన్న పిల్లలు..మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, చమురు ధరలు విపిరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా కేంద్రం అడ్డుకుందని, బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్ జనాక్రోశ్ ర్యాలీ ప్రారంభం...

ఢిల్లీ : ఢిల్లీ రాంలీలా మైదాన్‌ కాంగ్రెస్‌ జనాక్రోశ్‌ ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సోనియా, ఇతర నేతలు హాజరయ్యారు. 

11:41 - April 29, 2018

గుంటూరు : మాస్టర్‌మైండ్స్‌ సంస్థ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది. లివర్‌ సమస్యతో బాధపడుతున్న చిన్నారి రమ్యకు 50వేల ఆర్థికసాయం చేసింది. పిడుగురాళ్లకు చెందిన శ్రీను, రాధిక సంతానమైన 8ఏళ్ల రమ్యకు లివర్‌ పాడైంది. కాలేయం మార్చడానికి ఆపరేషన్‌ కోసం 25 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అయితే సీఎం సహాయనిధి నుంచి కొంత సాయం స్థానిక ఎమ్మెల్యే అందించారు. ఇంకా కొంత డబ్బు అవసరం ఉండగా.... మాస్టర్‌మైండ్స్‌ అధినేత మోహన్‌ స్పందించారు. సంస్థ తరపున 10వేల సాయం చేశారు. విద్యార్థుల నుంచి 40వేలకుపైగా వసూలు చేసి స్థానిక సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. మాస్టర్‌మైండ్స్‌ డైరెక్టర్‌ మోహన్‌ను సీఐ ఈ సందర్భంగా అభినందించారు.

11:40 - April 29, 2018

హైదరాబాద్ : ఫెడరల్‌ ఫ్రంట్‌వైపు కేసీఆర్‌ వేగంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీల ఫ్రంట్‌ ఏర్పాటుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్లో భాగంగా ఇవాళ చెన్నైకు వెళుతున్నారు. డీఎంకే కురువృద్ధుడు కరుణానిధితోపాటు స్టాలిన్‌తోనూ కేసీఆర్‌ చర్చలు జరపనున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవేగౌడ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో చర్చలు జరిపారు. కాగా చెన్నైలో కేసీఆర్‌ రెండు రోజుల పాటు ఉండనున్నారు. కేసీఆర్‌ వెంటపార్టీ సీనియర్‌ నేత కేశవరావు, ఎంపీవినోద్‌ కుమార్‌ తదితరులు చెన్నైకు వెళుతున్నారు. కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన చెన్నైకు బయలు దేరి వెళతారు. 

11:38 - April 29, 2018

ఢిల్లీ : కాసేపట్లో ఢిల్లీ రాంలీలా మైదాన్‌ కాంగ్రెస్‌ జనాక్రోశ్‌ ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ ర్యాలీకి రాహుల్‌గాంధీ, సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ అన్ని రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌ నేతలు హాజరుకానున్నారు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత జరుగుతున్న అతిపెద్ద బహిరంగ నిరసన సభ కారణంగా భారీ ఎత్తున నిర్వహించేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారు.

10:30 - April 29, 2018

ఢిల్లీ : బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధాలను నిరసిస్తూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున నిరసన చేపట్టేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా ఢిల్లీలోని రాంలీలా మైదాన్ లో 'జనాక్రోశ్ ర్యాలీ' పేరిట భారీ నిరసన సభ నిర్వహిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత రాహుల్ కు నిర్వహించే మొదటి సభ కావడం గమనార్హం. ఇక నిరసన సభలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి తరలుతున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొననున్నారు. 

టిడిపి పోరాటాలపై రోజా విమర్శలు...

విజయవాడ : ప్రత్యేక హోదా..విభజన హామీలు అమలు చేయాలంటూ టిడిపి చేస్తున్న పోరాటాలు ఒక్కటైనా ఉపయోగపడుతాయా ? అని వైసీపీ ఎమ్మెల్యే రోజా సూటిగా ప్రశ్నించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన పోరాటాలు ఒక్కటైనా ఉపయోగపడుతాయా ? 12గంటల దీక్ష ఆడియో క్యాసెట్ ఫంక్షన్ జరిగినట్లుగా ఉందన్నారు.

10:23 - April 29, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా..విభజన హామీలు అమలు చేయాలంటూ టిడిపి చేస్తున్న పోరాటాలు ఒక్కటైనా ఉపయోగపడుతాయా ? అని వైసీపీ ఎమ్మెల్యే రోజా సూటిగా ప్రశ్నించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన పోరాటాలు ఒక్కటైనా ఉపయోగపడుతాయా ? 12గంటల దీక్ష ఆడియో క్యాసెట్ ఫంక్షన్ జరిగినట్లుగా ఉందన్నారు. ఏప్రిల్ 30వ తేదీన బహిరంగ సభ పెట్టడానికి టిడిపి నిర్ణయించిందని..ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కానీ ప్రజలు ప్రస్తుతం నమ్మే పరిస్థితి లేరని, నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా..గల్లీ నుండి ఢిల్లీ దాక వైసీపీ పోరాటాలు చేసిందన్నారు. జగన్ చేసిన దీక్షను పోలీసులు అడ్డు తగిలారని, ప్రత్యేక హోదా రాకుండా వైసీపీ చేస్తోందని విమర్శించడానికి సిగ్గు ఉండాలని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలందరూ దీక్షకు కూర్చొన్నారని..ఇదంతా దేశం చూసిందన్నారు. 

కర్నాటకకు తెలుగు రాష్ట్రాల నేతలు...

ఢిల్లీ : కర్నాటక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో తెలుగు రాష్ట్రాల నేతలు పాల్గొననున్నారు. బీజేపీ నుండి మురళీధర్ రావు, కాంగ్రెస్ నుండి మధుయాష్కీ, నాదెండ్ల మనోహర్, కిల్లి కృపారాణిలు పాల్గొననున్నారు. 

జగన్ 148వ రోజు...పాదయాత్ర...

కృష్ణా : వైఎస్‌ జగన్‌ 148వ రోజు ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఉయ్యూరు శివారు నుంచి యాత్ర కొనసాగుతోంది. మంటాడ, తాడంకి, కనుమూరు, కురుమద్దాలి, ఉరుటూరు క్రాస్‌ రోడ్డు మీదుగా పామర్రు వరకు పాదయాత్ర కొనసాగనుంది. 

మళ్లీ గుప్త నిధుల తవ్వకాలు...

కర్నూలు : తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్త నిధులు తవ్వకాలు మొదలయ్యాయి. 85 రోజుల తరువాత గుప్తనిధుల తవ్వకాలు మళ్లీ ప్రారంభించారు. 

09:29 - April 29, 2018

చిత్తూరు : తిరుపతిలో ఎండలు మండుతున్నాయి. భానుడి దెబ్బతో నగర వాసులు విలవిల్లాడిపోతున్నారు. గత 10 రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. స్థానికులతో పాటు శ్రీవారి దర్శనం కోసం వస్తున్న భక్తులు సైతం సూర్యప్రతాపానికి విలవిలలాడుతున్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ఎండలు మండుతున్నాయి. గత పది రోజులుగా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఇదే పరిస్థితి. ఇక మిట్ట మధ్యాహ్నం భానుడు టాప్ గేర్‌లో కాకపుట్టిస్తున్నాడు. దీంతో నగర వీధులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. వేసవి సెలవులు కొనసాగుతుండటంతో తిరుమలకు యాత్రికుల తాకిడి భారీగా పెరిగింది. అయితే ఎండల తీవ్రతతో శ్రీవారి భక్తులు బెంబేలెత్తుతున్నారు. కొండపైకి వెళ్ళడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే...ఇక మే నెల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.

ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంవల్ల తప్పనిసరి అయితే తప్ప ఎండలో తిరగవద్దని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. మంచినీటితోపాటు.. తలమీద టవల్‌, నీడకోసం గొడుగు లాంటివి వాడాలంటున్నారు. జాగ్రత్తలు తీసుకోకుంటే వడదెబ్బతో ఇబ్బందుల పాలవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

09:26 - April 29, 2018

హైదరాబాద్ : పదవులపై ఆశలేదు.. దేశంకోసమే జాతీయ రాజకీయాల్లోకి వెళతానంటూ పదే పదే ప్రకటిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. అయితే గులాబీదళపతిలో ఉన్న ఉత్సాహం పార్టీ క్యాడర్‌లో మాత్రం కనిపించడంలేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నామన్న కేసీఆర్‌ ప్రసంగానికి ప్లీనరీలో పెద్దగా స్పందన కనిపించలేదు. దేశంలో గుణాత్మకంగా మార్పులు రావాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ కొంతకాలంగా పదే పదే చెబుతున్నారు. కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ వేదిక ఏర్పాటుచేసే ప్రయత్నాలు ముమ్మరం చేశామంటున్నారు. కాని.. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల ప్రస్థావన గులాబీ శ్రేణుల్లో మాత్రం ఉత్సహం నింపలేక పోతోంది.

ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఝార్ఘండ్ మాజీ సిఎం హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని.. జెడి ఎస్ అధినేత దేవగౌడ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి లాంటి నేతలతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. జాతీయ కూటమి ఆవశ్యకతపై వివరించారు. ఉద్యమ సమయంలో తెలంగాణాకు మద్దతునిచ్చిన అన్ని పార్టీల మద్దతు మరోసారి కూడగట్టే యోచనలో కేసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై పార్టీప్లీనరీలో ప్రతినిధులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా ప్రసంగించారు. జాతీయ అంశాలకు తన ప్రసంగంలో పెద్దపీఠ వేసి కాంగ్రెస్, బిజెపిలపై తన దైన స్టైల్లో దుయ్యబట్టారు. అయినా.....కార్యకర్తల నుంచి ఆశించిన స్థాయిలో స్పందిన కనింపించలేదు. జాతీయ రాజకీయాలపై టిఆర్ఎస్ నేతలు చూపిస్తున్న ఉత్సాహం కార్యకర్తల్లో కనిపించకపోవడం పార్టీ నేతల్లో చర్చనీయంశంగా మారింది. కేసిఆర్ ప్రసంగానికే స్పందన లేకపోవడం దేనికి సంకేతాలు అని గులాబీ నేతల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

09:06 - April 29, 2018

రంగారెడ్డి : జిల్లాలో పోలీసులు పలుచోట్ల కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఎన్‌టీఆర్‌ కాలనీ, బంజారా కాలనీల్లో నిర్వహించిన తనిఖీల్లో 24 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలులేని 40 ఆటోలు, 26 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇక శంషాబాద్‌లోని హైమద్‌నగర్‌, ఖాజాగల్లి, కోమటిబస్తీల్లోనూ నిర్బంధ తనిఖీలు కొనసాగాయి. 30 మంది అనుమానితులతోపాటు... 100 బైక్‌లు, 20 ఆటోలు, 3 కార్లు, 3 డీసీఎంలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

08:54 - April 29, 2018

చెన్నై : దేశంలో గుణాత్మక రాజకీయ మార్పు కోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్, బెంగళూరు రాష్ట్రాలకు వెళ్లి ప్రజాప్రతినిధులను కలిసి వచ్చిన కేసీఆర్ నేడు చెన్నైకి వెళ్లనున్నారు. దేశం హితం కోసం కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలని యోచిస్తున్నారు. డీఎంకే అధినేత కరుణానిధి, వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిల్ లతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించనున్నారు. 

08:10 - April 29, 2018

చిత్తూరు : శ్రీనివాసపురం వద్ద అర్ధరాత్రి దాటిన తరువాత ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టెంపో - బొలెరో వాహనం ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా పది మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. సేలంకు చెందిన 15 మంది తిరుమల శ్రీవారి దర్శనానికి టెంపోలో బయలుదేరారు. శ్రీనివాసపురం వద్దకు రాగానే చేపల లోడ్ తో కేరళ రాష్ట్రానికి వెళుతున్న బొలెరో వాహనాన్ని టెంపో ఢీకొంది. అత్యంత వేగంగా ఢీకొనడంతో వాహనం నుజ్జునుజ్జైంది. టెంపోలో ఉన్న వారు చెల్లాచెదురుగా పడిపోయారు. వాహనంలో ఉన్న కన్మయి, లోకేష్, వెంకటాచలంలు అక్కడికక్కడనే మృతి చెందారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:08 - April 29, 2018

ఏపీకి ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన అంశాలు కల్పించడంలో ఏపీ రాష్ట్రంపై కేంద్రం నిర్లక్ష్యం చేసిందని..మోసం చేసిందని ఏపీ ప్రభుత్వం పేర్కొంటోంది. అందులో భాగంగా పలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగా తిరుపతి కేంద్రంగా కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని బాబు భావిస్తున్నారు. సోమవారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ అంశాలపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో జరిగిన చర్చా వేదికలో పట్టాభిరామ్ (టిడిపి), బాబురావు (సీపీఎం), మల్లాది విష్ణు (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

శ్రీనివాసపురం వద్ద ఆక్సిడెంట్...

చిత్తూరు : పాకాల (మం) శ్రీనివాసపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో - టెంపో వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. మృతులు తమిళనాడు వాసులుగా గుర్తించారు. 

06:43 - April 29, 2018

నెల్లూరు : మీరు ఆటో నడుపుతారా..? డ్రైవింగ్‌లో ఉన్నపుడు హెల్మెట్‌ పెట్టుకోవడం లేదా.. ? కనీసం బైక్‌ నడిపేటపుడు సీటు బెల్టు కూడా పెట్టుకోవడం లేదా..? ఏంటీ ఈ తిక్క ప్రశ్నలు అనుకుంటున్నారా..! ఇవే ప్రశ్నలతో నెల్లూరులో ఖాకీలు జనానికి చుక్కలు చూపిస్తున్నారు. ఆటో.. బైక్‌.. ఏది కనబడినా సవాలక్ష సాకులు చూపించి ఫైన్లు వేస్తున్నారని వాహనదారులు లబోదిబో మంటున్నారు. నెల్లూరు ట్రాఫిక్‌ పోలీసులు హనదారులకు చుక్కలు చూపెడుతున్నారు. ఆటో డ్రైవర్లకు హెల్మెట్‌ లేదంటూ.. బైక్‌ నడిపిటప్పుడు సీటు బెల్టు పెట్టుకోలేదంటూ వేలకువేల రూపాయల ఫైన్‌లను వేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని ట్రాఫిక్‌ నిబంధనలతో వాహనదారులకు షాక్‌ల మీద షాక్‌లిస్తున్నారు.

సాధారణంగా వాహనదారులకు లైసెన్స్‌ లేదా వాహనానికి సంబంధించి సరైన పత్రాలు లేకపోతే, నిబంధనలను ఉల్లఘించిన ట్రాఫిక్‌ పోలీసులు ఫైన్‌ రాస్తూ, చర్యలు తీసుకుంటారు. దాదాపు ప్రపంచం మొత్తం మీద ఇలాంటి నిబంధలనే చూస్తుంటాం. కానీ నెల్లూరు ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం.. తమ రూటే సెపేరు అంటున్నారు. ఆటో డ్రైవర్లు హెల్మెట్‌ పెట్టుకోలేదని, బైక్‌ నడిపేవారు సీట్‌ బెల్ట్‌ పెట్టుకోలేదని ఫైన్‌ రాసేస్తున్నారు. ఈ విచిత్ర మైన రూల్స్‌తో జనాలు షాక్‌ తింటున్నారు.

టార్గెట్‌లే ధ్యేయంగా పెట్టుకుని ఆటో డ్రైవర్లను, ద్విచక్ర వాహనదారులకు పోలీసులు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. ఆటో డ్రైవర్‌కు హెల్మెట్‌ ఏంది సార్‌... అని ఓ ఆటో డ్రైవర్‌ అడిగితే ఫైన్‌ కట్టాల్సిందే అంటూ ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్న తీరుపై నెల్లూరు జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతేనా బైక్‌పై వెళుతున్న ఓ స్టూడెంట్‌ను ఆపి సీట్‌బెల్టు ఎందుకు పెట్టుకోలేదని నిలిపివేశారు. దీంతో ఆస్టూడెంట్‌కు నోటమారాలేదు. ఇదేం తలతిక్క రూల్స్‌ సార్‌ అంటూ నిలదీసిన తర్వాత ట్రాఫ్‌ ఖాకీలు రూట్‌ మార్చేసి.. రాంగ్‌రూట్‌, ఓవర్‌స్పీడ్‌ అంటూ చలానా చేతిలో పెట్టడంతో ఆ స్టూడెంట్‌ కుర్రాడు బిత్తరపోయాడు. కింద చలానను మార్చి ఇచ్చారు. ఇలా ఇష్టారీతిన చలానాలు రాస్తూ నెల్లూర్‌ ట్రాఫిక్ పోలీసులు తమ జేబులను గుల్ల చేస్తున్నారని వాహనాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టార్గెట్లు పూర్తి చేయడానికిఇష్టం వచ్చిన రీతిగా ఫైన్లు విధించడంపై వాహనాదారులు మండిపడుతున్నారు. దీనిపై ఉన్నదాధికారులు స్పందించి..ట్రాఫిక్‌ పోలీసుల ఆగడాలను అరికట్టాలని నెల్లూరు ప్రజలు కోరుతున్నారు. 

06:42 - April 29, 2018

హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్‌ కార్మికులు సమ్మె విరమించారు. వేతనాల పెంపును ఈ నెలనుంచే అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో.. కార్మికులు సమ్మె వీడారు. దీంతో కార్మికులందరూ తక్షణమే విధులకు హాజరు కావాలని.. మున్సిపల్‌ కార్మికుల జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణ‌లో.. నాలుగు రోజులుగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న స‌మ్మె విజ‌య‌వంతం అయ్యింది. 2015లో రాష్ట్రవ్యాప్తంగా 40వేల మంది కార్మికులు సమ్మె చేయడంతో.. ప్రభుత్వం దిగి వచ్చి.. వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చింది. అయితే.. గడచిన మూడేళ్లుగా చర్చల పేరిట కాలయాపన చేస్తూ వచ్చింది. దీంతో.. నాలుగు రోజులుగా మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. మునిసిపల్‌ ఏరియాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తడంతో.. దిగివచ్చిన ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపింది. జీవో నంబర్‌ 14ను అమలు చేయాలని కార్మికులు పట్టుబట్టారు. ఈ జీవో వల్ల మునిసిపల్‌ కార్మికులకు ప్రతినెలా 12 వేలు, డ్రైవర్‌కు 15వేలు, బిల్‌కలెక్టర్‌ లేదా జూనియర్‌ అసిస్టెంట్లకు పదిహేడున్నర వేలు లభిస్తాయి. ప్రభుత్వం ఈ డిమాండ్‌కు అంగీకరించింది. మిగిలిన సమస్యలపైనా త్వరలోనే చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15వేల మంది మున్సిపల్‌ కార్మికులకు ఈ నెల నుంచే జీతాలు పెరగనున్నాయి. 

06:41 - April 29, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు. యేళ్ళు గడుస్తున్నా నిరుద్యోగ భృతి అమలు కావడంలేదని విమర్శిస్తున్నారు. గత నాలుగేళ్లుగా నిరుద్యోగ భృతి అందని ద్రాక్షగా మారిందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆ పార్టీ నేతలు గత ఎన్నికల ముందు జోరుగా ప్రచారం చేశారు. 'బాబొస్తే జాబు వస్తుందని', .. లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని హామీల వర్షం కురిపించారు. ఈ వాగ్ధానాలను నమ్మిన నిరుద్యోగ యువత ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ... టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందంటూ నిరుద్యోగులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

టీడీపీ అధికారంలోకి రాకముందు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. టీడీపీ అధికారం చేపట్టిన మూడున్నరేళ్ల తర్వాత నిరుద్యోగ భృతి అందిస్తామన్న సీఎం చంద్రబాబు. బడ్జెట్‌లో కేటాయింపులు తప్ప ఆచరణలోకి మాత్రం తేలేకపోయారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. దీనిపై ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చట్ట సభల్లో అడుగుతున్నా.. ప్రభుత్వంలో చలనం లేదని విమర్శిస్తున్నారు.

ఈ ఏడాది బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు. 2017లో ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు. ఇవి ఏ మేరకు ఖర్చు చేశారన్న లెక్క తేలలేదు. నిరుద్యోగ భృతి కోసం... రాష్ట్రంలో కోటీ డెబ్బై లక్షల కుటుంబాలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాయి. కాగా.. 33 లక్షల 88వేల మంది నిరుద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వం నిర్వహించిన సాధికార సర్వేలో తేలింది. గతంలో నిరుద్యోగ భృతికి ప్రభుత్వం వయో పరిమితిని కూడా తెరపైకి తెచ్చింది. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల్లో... కేవలం ఒకరు మాత్రమే నిరుద్యోగ భృతికి అర్హులని ముసాయిదాలో పొందుపరిచారు. ఇన్ని మలుపులు తిరుగుతున్న నిరుద్యోగ భృతి.. తమకు అందుతుందా లేదా... అన్న అనుమానాలు యువతలో వ్యక్తమౌతున్నాయి. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, కేరళ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే నిరుద్యోగ భృతి పథకం అమలవుతుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగ యువత ఆశలపై నీళ్ళు చల్లుతోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగ భృతిని అందించి.. ఇచ్చిన మాట నిలుపుకోవాలని కోరుతున్నారు.

06:39 - April 29, 2018

విజయవాడ : నిరుద్యోగులకు ఏపి ప్రభుత్వం శుభవార్త అందించింది. టెట్, డీఎస్సీ షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మొత్తం 10వేల 351 టీచర్‌ పోస్టులను జులైలో భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. మరో వారం రోజుల్లో సిలబస్‌ను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇక మే 4న టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మే 5 నుంచి 22 వరకూ ఫీజు చెల్లించవచ్చన్నారు. మే 23 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. టెట్‌ అభ్యర్థులకు మే 25 నుంచి మాక్‌టెస్టులు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. టెట్‌ హాల్‌టికెట్లను జూన్‌ 3 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. జూన్‌ 10 నుంచి ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు గంటా తెలిపారు.

అలాగే డీఎస్సీకి సంబంధించిన వివరాలు కూడా మంత్రి వెల్లడించారు. జూలై 6న డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జూలై 6 నుంచి ఆగస్టు 8 వరకు ఫీజు చెల్లించవచ్చాన్నారు. జూలై 7నుంచి ఆగస్టు 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. మొత్తం 10వేల 351 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించనున్నట్లు గంటా తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా డీఎస్సీ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే డీఎస్సీని అన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మరో వారం రోజుల్లో డీఎస్సీకి సంబంధించిన సిలబస్‌ను వెల్లడిస్తామన్నారు.

ఏపీని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు గంటా శ్రీనివాసరావు. అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్‌ ఉన్నా... విద్యకు అధికంగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. 

చెన్నైకి కేసీఆర్...

హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నైకి వెళ్లనున్నారు. ఉదయం 10గంటలకు బేగంపేట నుండి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తో భేటీ కానున్నారు. సీఎం వెంట టీఆర్ఎస్ ముఖ్య నేతలు వెళ్లనున్నారు. 

కాంగ్రెస్ జన్ ఆక్రోశ్ ర్యాలీ...

ఢిల్లీ : నేడు రాంలీలా మైదాన్ లో కాంగ్రెస్ జన్ ఆక్రోశ్ ర్యాలీ జరుగనుంది. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ర్యాలీ నిర్వహించనుంది. అన్ని రాష్ట్రాల నుండి కాంగ్రెస్ శ్రేణులు హాజరు కానున్నారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్...

హైదరాబాద్ : నగరంలో పలు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 137 మందిపై కేసు నమోదు చేశారు. 86 ద్విచక్ర వాహనాలు, 51 కార్లను సీజ్ చేశారు. 

జనసమితి ఆవిర్భావ సభ...

హైదరాబాద్ : ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నేతృత్వంలోని తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావ సభకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభను వినూత్నంగా నిర్వహించాలని టీజేఎస్‌ భావిస్తోంది. ప్రభుత్వం విస్మరించిన అమరవీరుల స్మృతి చిహ్నం ఏర్పాటుకు ఈ సభను వేదికగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది. పార్టీ అధినేత కోదండరామ్‌ వీటికి సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

 

కొనసాగుతున్న ఎయిమ్స్ వైద్యుల ఆందోళన...

ఢిల్లీ : ఎయిమ్స్‌ డాక్టర్ల ఆందోళన రెండోరోజు కూడా కొనసాగింది. సుమారు 2 వేల మంది డాక్టర్లు స్ట్రయిక్‌కు దిగడంతో ఆసుపత్రికి వస్తున్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా ఆపరేషన్లు జరగడం లేదు. ఎమెర్జెన్సీ సేవలకు ఆటంకం కలిగించడం లేదు.

మోడీ అనధికార పర్యటన పూర్తి...

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్రమోది రెండు రోజుల చైనా అనధికార పర్యటన ముగిసింది. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తగ్గించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. భవిష్యత్తులోనూ చర్చలు కొనసాగించాలని నిర్ణయించాయి. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఓ మైలురాయి లాంటిదని చైనా అభివర్ణించింది.

షమీకి మరో షాక్...

ఢిల్లీ : టీమిండియా పేసర్‌ మహమ్మద్‌ షమీకి ఆయన భార్య హసీన్‌ జహాన్‌ మరోసారి షాకిచ్చింది. నకిలీ జనన ధృవ పత్రాలతో షమి బీసీసీఐని, ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని మోసం చేశాడని పేర్కొంది. షమికి చెందిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఫొటో తీసి పోస్ట్‌ చేసింది. ఇందులో షమి పుట్టిన తేదీ 1982 అని ఉంది. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌, క్రికెటర్ల వివరాలు తెలిపే ప్రముఖ వెబ్‌సైట్లలో షమి 1990 మార్చి 9న పుట్టినట్లు చూపిస్తోంది. కాగా.. కొన్ని గంటల్లోనే హసీన్‌ తన పోస్టును తొలగించింది. అప్పటికే ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Don't Miss