Activities calendar

30 April 2018

21:53 - April 30, 2018

విశాఖ : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేశారని వైసీపీ నాయకులు విమర్శించారు. ఏపీకి  ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు, ప్రధాని మోదీ వైఫల్యాలను ఎండగడుతూ విశాఖలో వైసీపీ నాయకులు వంచన వ్యతిరేక దీక్ష చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 7 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా వైసీపీ నాయకలు చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. ధర్మపోరాటం పేరుతో చంద్రబాబు సరికొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

 

21:47 - April 30, 2018

చిత్తూరు : ప్రత్యేక హోదా సాధించే వరకు తమ పోరాటం ఆగదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మోదీ హామీ ఇచ్చి మోసం చేయడంతో 'నమ్మక ద్రోహం-కుట్ర రాజకీయాలపై' తిరుపతిలో టీడీపీ భారీ సభ నిర్వహించింది. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన బీజేపీకి బుద్ది చెప్పాల్సిన అవసరముందన్నారు చంద్రబాబు. జగన్‌పై చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. ప్రత్యేక హోదాపై వైసీపీ డ్రామాలాడుతూ.. బీజేపీతో లాలూచీ రాజకీయాలు చేస్తుందన్నారు చంద్రబాబు. 

ఏపీలో బీజేపీ బలం లేదన్నారు లోకేశ్‌. 29 సార్లు చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా రాష్ట్రానికి న్యాయం చేయని పార్టీ బీజేపీ అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న బీజేపీ.. మిగతా రాష్ట్రాలకు ఎందుకు ప్రత్యేక హోదా ఇచ్చారని ప్రశ్నించారు లోకేశ్‌. 

ప్రధాని మోదీని నిలదీసే ధైర్యం జగన్‌కు లేదన్నారు మంత్రి లోకేశ్‌. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి వైసీపీ మద్దతిస్తుందన్నారు లోకేశ్‌. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ప్రత్యేక హోదాపై పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు బాలకృష్ణ. ఏపీ ప్రజలంటే కేంద్రానికి ఎందుకు చిన్నచూపు అని బాలకృష్ణ ప్రశ్నించారు. 

21:33 - April 30, 2018

హైదరాబాద్ : తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు జనం ఊహించని విధంగా తరలివచ్చారు. దీంతో సభ విజయవంతమైందని టీజేఎస్‌ నాయకులు పుల్‌ జోష్‌ మీద ఉన్నారు. ఇదే జోష్‌తో 2019 ఎన్నికల్లో కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు వ్యూహా రచన చేస్తున్నారు. ఓ వైపు పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేస్తూనే.. మరోవైపు సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించేందుకు టీజేఎస్‌ నాయకులు పావులు కదుపుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారబోతున్న తెలంగాణ జన సమితి.. ఆవిర్భావ సభ జోష్‌పై 10టివి స్పెషల్‌ స్టోరీ. 

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావ సభ విజయవంతంగా ముగిసింది. తెలంగాణ నలుమూల నుంచి జనం తరలివచ్చి సభను విజయవంతం చేయడంతో టీజేఎస్‌ నాయకులు మంచి జోష్‌ మీదున్నారు. కోదండరామ్ ఏ కార్యం చేపట్టినా.. అధికార టీఆర్‌ఎస్‌ ఏదో ఒక రూపంలో అడ్డుపడుతూ వచ్చింది. అదే విధంగా హైదరాబాద్‌లో తలపెట్టిన జన సమితి ఆవిర్భావ సభకు అనుమతి నిరాకరించింది. తన పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేసింది. కానీ టీజేఎస్‌ నేతలు కోర్టు మెట్లు ఎక్కి ఆవిర్భావ సభకు అనుమతి తెచ్చుకున్నారు.

పార్టీ ఆవిర్భావ సభకు టీజేఎస్‌ నాయకులు ప్రజా సమీకరణ కోసం విస్తృత ప్రచారం చేశారు. ఒక్కో వ్యవసాయ కుటుంబం నుంచి నాగలి కర్రు ముక్క తేవాలని కోదండరామ్‌ పిలుపునివ్వడంతో పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఇక విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున కోదండరాం మొదటి నుంచి పోరాటం చేస్తుడడంతో యవత పెద్ద సంఖ్యలో ఆవిర్భావ సభకు తరలి వచ్చింది. యువత కేరింతలు, నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. 

ఇక పార్టీలో ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్ళెందుకు టీజేఎస్‌.. సభ ద్వారా బాగానే ప్రయత్నాలు చేసింది. అందుకోసం ఒకే వేదికపై వెయ్యిమందిని కూర్చోబెట్టింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు వదిలిన అమరుల కుటుంబాలను, నేరేళ్ల బాధితులను, ఖమ్మంలో సంకెళ్లు వేసిన రైతులను వేదికపై కూర్చోబెట్టి వారి గోడును తెలంగాణ ప్రజల ముందుంచే ప్రయత్నం చేసింది. ఇలా ఆవిర్భావ సభలో అన్ని వర్గాల వారికి సమన్యాయం పాటిస్తూ.. అధికార పార్టీని గద్దెదింపేందుకు టీజేఎస్‌ గర్జించింది. వీటితో పాటు కేసీఆర్‌ రాచరిక పాలనపై రూపొందించిన వీడియో సభికులను ఆకట్టుకుంది. 

మొత్తంగా అనుకున్న దాని కంటే రెట్టింపు సంఖ్యలో ప్రజలు ఆవిర్భావ సభకు తరలిరావడంతో టీజేఎస్‌ నేతలు పుల్‌ ఖుషిలో ఉన్నారు. ఇదే జోష్‌ను కంటిన్యూ చేస్తూ 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్డె దింపాలని టీజేఎస్ ప్రయత్నిస్తోంది. అందుకోసం నూతన కమిటీలను ఏర్పాటు చేసుకుని సర్కార్‌పై దండయాత్ర చేయాలని టీజేఎస్ నాయకులు చూస్తున్నారు. 

21:31 - April 30, 2018

గుంటూరు : వర్షాకాలం వచ్చేలోగా పోలవరం ఎర్త్‌వర్క్‌, కాంక్రీట్‌ పనులను వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మే, జూన్‌  నెలల్లో వీలైనంత ఎక్కువగా పనులు చేయాలని నిర్దేశించారు. లక్ష్యాలకు అనుగుణంగా పనులు సాగినప్పుడే ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందని పోలవరం సమీక్ష సమావేశంలో చంద్రబాబు  దిశా, నిర్దేశం చేశారు. 

ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని సమీక్షించారు. వర్చువల్‌ రివ్యూ ద్వారా జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన..  నిర్మాణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రోన్‌ కెమెరాల ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో పోలవరం పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 

పోలవరం నిర్మాణంలో తొలిసారిగా ఒక నెలలో లక్ష క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులను పూర్తి చేసిన అధికారులను చంద్రబాబు అభినందించారు. ఏప్రిల్‌లో 1,15,658 క్యూబిక్‌ మీటర్ల స్పిల్‌ వే కాంక్రీటు పనులు రికార్డని అధికారులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. మొత్తం ప్రాజెక్టులో 53.02 శాతం పూర్తైన విషయాన్ని ప్రస్తావించారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాల్వలు, స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌, పవర్‌ హౌస్‌, ఎర్త్‌ వర్క్‌, డయాఫ్రం వాల్‌, జెట్‌ గ్రౌటింగ్‌, రేడియల్‌ గేట్లు నిర్మాణ పురోగతిపై చంద్రబాబు సమీక్షించారు.  
పోలవరం నిర్మాణానికి ఇప్పటి వరకు చేసిన వ్యయంపై కూడా చంద్రబాబు సమీక్షించారు. ఇంతవరకు 13,430.84 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 8,294.97 కోట్ల ఖర్చు పెట్టారు. కేంద్రం ఇంతవరకు 5,342.26 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇంకా 2,952.71 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. నీరు-ప్రగతి పనులను కూడా చంద్రబాబు సమీక్షించారు. తర్వలో అన్ని జిల్లాల్లో పర్యటించి.. ఈ పనులను పరిశీలించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 

21:23 - April 30, 2018

హైదరాబాద్‌ : నగరంలో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కి పాల్పడుతున్న ఓ ముఠాను నారాయణగూడ పోలీసులు ఆరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 9వేల నగదు, ఓ ఎల్ఈడీ టీవీ,  ఒక లాప్‌టాప్‌ తో పాటు 3 సెల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్‌ డాట్‌ హ్యాట్చ్‌ అన్‌ లైన్‌ విధానం ద్వారా ఈ మూఠా  బెట్టింగ్‌లకు పాల్పడుతోందని అబిడ్స్ ఏసీపీ బిక్షంరెడ్డి తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ముఠా ఎంత మొత్తంలో ఐపీఎల్‌ బెట్టింగ్‌లకు పాల్పడింది, ఎవరెవరితో టచ్‌లో ఉన్నారన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. 

 

21:18 - April 30, 2018

హైదరాబాద్ : ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన హామీలను అమలు చేయడంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీపీసీసీ విమర్శించింది. ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా సిద్ధమని టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్‌... టీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. బూటకపు వాగ్ధానాలతో ప్రజలను వంచించారని మండిపడ్డారు. ఎన్నికల హామీల అమలును టీఆర్‌ఎస్‌ విస్మరించిందని శ్రవణ్‌ అన్నారు. డబుల్‌ బెడ్‌రూము ఇళ్లు నిర్మాణంలో విఫలమైందని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని.. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయలేదని పేర్కొన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్‌ సాధించలేదని చెప్పారు. మూతపడ్డ సిర్పూర్‌ పేపర్‌ మిల్లును తెరిపించలేదని...నిజాం సుగర్స్‌ను తెరిపించడంలో టీఆర్‌ఎస్‌ విఫలం అయిందని తెలిపారు. 

 

పోలవరం రాష్ట్రానికి జీవనాడి : సీఎం చంద్రబాబు

చిత్తూరు : పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని.. పోలవరం పూర్తి అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. కొంతమంది కావాలని ఆరోపణలు చేస్తూ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. రైతులు 50 వేల కోట్ల విలువ చేసే భూములను ఇస్తే..కేంద్రం 1500 కోట్ల ఇచ్చిందని అన్నారు. ఏపీకి కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వదని నిలదీశారు. మనం పన్నులు కడుతున్నాం.. దేశంలో మనం కూడా భాగస్వాములమే అని అన్నారు. రాష్ట్రంలోని అన్ని నగరాలను సుందరమైన నగరాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రైల్వే జోన్ విశాఖపట్నం హక్కు...దాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. బెయిల్ కోసం లాలూచీ పడి వైసీపీ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతుందన్నారు.

వెంకటేశ్వర యూనివర్సిటీలో నా రాజకీయ జీవితం ఆరంభం : సీఎం చంద్రబాబు

చిత్తూరు : వెంకటేశ్వర యూనివర్సిటీలో తన రాజకీయ జీవితం ఆరంభం అయిందని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో తనపై దాడి జరిగితే వెంకటేశ్వరస్వామి కాపాడాడని అన్నారు. అధికారం కోసం టీడీపీ ఎప్పుడూ ఆరాటపడలేదన్నారు. పరిపాలనలో నూతనమైన వరవడికి శ్రీకారం చట్టామన్నారు. ఐటీని టీడీపీ ప్రభుత్వం ప్రమోట్ చేసిందన్నారు. పది రాష్ట్రాలకు 90:10 చొప్పున స్పెషల్ స్టేటస్ ఇచ్చి... ఏపీకి మాత్రం స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమనడం అన్యాయం అన్నారు. 

 

పట్టిసీమ ద్వారా రెండు నదులు అనుసంధానం : సీఎం చంద్రబాబు

చిత్తూరు  : పట్టిసీమ ద్వారా రెండు నదులను అనుసంధానం చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. గోదావరి, కృష్ణ నదులను అనుసంధానం చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. ఇచ్చిన మాటపై కేంద్రం ఎందుకు నిలబడలేదో చెప్పాలన్నారు. ఎందుకు మాట తప్పుతున్నారని నిలదీశారు. అవినీతిపరులు, నీతి మాలిన పార్టీలకు మోడీ సపోర్టు చేస్తారా అని అన్నారు. హైదరాబాద్ ప్రపంచపటంలో ఉందంటే అది తన చొరవ, కృషి అన్నారు. రాష్ట్రాన్ని హేతు బద్దతలేకుండా, పద్ధతి లేకుండా విభజన చేశారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఏపీకి న్యాయం చేసే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనను మనం కోరుకోలేదని..

పట్టిసీమ ద్వారా రెండు నదులు అనుసంధానం : సీఎం చంద్రబాబు

చిత్తూరు  : పట్టిసీమ ద్వారా రెండు నదులను అనుసంధానం చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. గోదావరి, కృష్ణ నదులను అనుసంధానం చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. ఇచ్చిన మాటపై కేంద్రం ఎందుకు నిలబడలేదో చెప్పాలన్నారు. ఎందుకు మాట తప్పుతున్నారని నిలదీశారు. అవినీతిపరులు, నీతి మాలిన పార్టీలకు మోడీ సపోర్టు చేస్తారా అని అన్నారు. హైదరాబాద్ ప్రపంచపటంలో ఉందంటే అది తన చొరవ, కృషి అన్నారు. రాష్ట్రాన్ని హేతు బద్దతలేకుండా, పద్ధతి లేకుండా విభజన చేశారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఏపీకి న్యాయం చేసే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనను మనం కోరుకోలేదని..

ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వరన్న సీఎం చంద్రబాబు

చిత్తూరు : ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీకి ప్రత్యేక ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని..ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ధర్మ పోరాట దీక్షలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల కంటే ముందు ఇదే రోజు, ఇదే సమయంలో వెంకన్న సాక్షిగా హామీలు ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్ డీఏ లో చేరి, బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని అన్నారు. ధర్మ పోరాటంలో అంతిమ విజయం మనదేనని అన్నారు. మొదటి ధర్మ పోరాటం తిరుపతిలో పెట్టామని తెలిపారు. పోరాటంలో ముందుకు పోతామని అన్నారు. 

 

21:05 - April 30, 2018

చిత్తూరు : ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీకి ప్రత్యేక ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని..ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ధర్మ పోరాట దీక్షలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల కంటే ముందు ఇదే రోజు, ఇదే సమయంలో వెంకన్న సాక్షిగా హామీలు ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్ డీఏ లో చేరి, బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని అన్నారు. ధర్మ పోరాటంలో అంతిమ విజయం మనదేనని అన్నారు. మొదటి ధర్మ పోరాటం తిరుపతిలో పెట్టామని తెలిపారు. పోరాటంలో ముందుకు పోతామని అన్నారు. 
పట్టిసీమ ద్వారా రెండు నదుల అనుసంధానం 
పట్టిసీమ ద్వారా రెండు నదులను అనుసంధానం చేశామని చెప్పారు. గోదావరి, కృష్ణ నదులను అనుసంధానం చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. ఇచ్చిన మాటపై కేంద్రం ఎందుకు నిలబడలేదో చెప్పాలన్నారు. ఎందుకు మాట తప్పుతున్నారని నిలదీశారు. అవినీతిపరులు, నీతి మాలిన పార్టీలకు మోడీ సపోర్టు చేస్తారా అని అన్నారు. హైదరాబాద్ ప్రపంచపటంలో ఉందంటే అది తన చొరవ, కృషి అన్నారు. రాష్ట్రాన్ని హేతు బద్దతలేకుండా, పద్ధతి లేకుండా విభజన చేశారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఏపీకి న్యాయం చేసే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనను మనం కోరుకోలేదని.. ప్రత్యేకహోదా అడ్డుపెట్టి విభజన చట్టం పాస్ చేశారని అన్నారు. కేంద్రం ఏపీకి ఎక్కడా సహకరించిన దాఖలాలు లేవు అని చెప్పారు. ప్రత్యేకహోదా ఇస్తామని కేంద్రం మాయమాటలు చెప్పిందన్నారు. 
వెంకటేశ్వర యూనివర్సిటీలో రాజకీయ జీవితం ఆరంభం 
వెంకటేశ్వర యూనివర్సిటీలో తన రాజకీయ జీవితం ఆరంభం అయిందన్నారు. గతంలో తనపై దాడి జరిగితే వెంకటేశ్వరస్వామి కాపాడాడని అన్నారు. అధికారం కోసం టీడీపీ ఎప్పుడూ ఆరాటపడలేదన్నారు. పరిపాలనలో నూతనమైన వరవడికి శ్రీకారం చట్టామన్నారు. ఐటీని టీడీపీ ప్రభుత్వం ప్రమోట్ చేసిందన్నారు. పది రాష్ట్రాలకు 90:10 చొప్పున స్పెషల్ స్టేటస్ ఇచ్చి... ఏపీకి మాత్రం స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమనడం అన్యాయం అన్నారు. 
పోలవరం రాష్ట్రానికి జీవనాడి... 
పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని.. పోలవరం పూర్తి అవుతుందన్నారు. కొంతమంది కావాలని ఆరోపణలు చేస్తూ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. రైతులు 50 వేల కోట్ల విలువ చేసే భూములను ఇస్తే..కేంద్రం 1500 కోట్ల ఇచ్చిందని అన్నారు. ఏపీకి కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వదని నిలదీశారు. మనం పన్నులు కడుతున్నాం.. దేశంలో మనం కూడా భాగస్వాములమే అని అన్నారు. రాష్ట్రంలోని అన్ని నగరాలను సుందరమైన నగరాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రైల్వే జోన్ విశాఖపట్నం హక్కు...దాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. బెయిల్ కోసం లాలూచీ పడి వైసీపీ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతుందన్నారు. డ్వాక్రా సంఘాలు నా మానస పుత్రికలు అని అన్నారు. ఇన్ టైమ్ లో ఫీజు రియింబర్స్ మెంట్ ఇస్తున్నామని తెలిపారు. 
ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి..
ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు. అనంతపురం జిల్లాను, రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. త్వరలో 200 కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కేంద్రం సహకరించడం లేదని రాష్ట్రంలో అభివృద్ధి ఆగదన్నారు. ప్రజలను ఇబ్బందులు పెట్టడం నాయకుని లక్షణం కాదన్నారు.
బ్యాంకుల్లో డబ్బుల్లేవ్..
బ్యాంకుల్లో డబ్బుల్లేవన్నారు. ప్రజాస్వామ్యంలో డబ్బులు దొరికే పరిస్థితి లేదన్నారు. బ్యాంకులను దోపిడీ చేసి... నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వారు విదేశాలకు పారిపోయారని అన్నారు. కేంద్రం ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తుందన్నారు. కథువాలో బాలికపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన జరిగిందన్నారు. పేదవారిపై కేంద్రం దృష్టి పెడితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. 16 వేల కోట్ల అడిగితే నాలుగు వేలు ఇచ్చారని పేర్కొన్నారు. 

20:41 - April 30, 2018

హైదరాబాద్ : నగరజీవుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు తాము ప్రయత్నిస్తుంటే కేంద్రం మోకాలు అడ్డుతోందని.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తీర్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్న కేటీఆర్‌.. త్వరలోనే ఉప్పల్‌, అంబర్‌పేట, ఆరాంఘర్‌ల వద్ద ఫ్లై ఓవర్లనూ ప్రారంభిస్తామన్నారు. 

గ్రేటర్‌ హైదరాబాద్‌లో చేపట్టిన సిగ్నల్‌ ఫ్రీ రహదారుల వ్యవస్థలో రెండో ప్రాజెక్ట్‌ అందుబాటులోకి వచ్చింది.  హైటెక్‌ సిటీ మైండ్‌ స్పేష్‌ జంక్షన్‌లో నిర్మించిన అండర్‌ పాస్‌ ప్రారంభమైంది. దీన్ని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ అండర్‌ పాస్‌తో సైబర్‌ టవర్స్‌ నుంచి బయోడైవర్సిటీ వైపు ప్రయాణంలో వేగం పెరగనుంది. ఈ మార్గంలో ఇరువైపులా వెళ్ళే ప్రయాణీకులకు దూరం తగ్గడంతో పాటు.. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్య చాలావరకు తగ్గుతుంది.

నగరంలో ట్రాఫిక్‌ సమస్య తగ్గించేందుకు ఇరవై ఐదు కోట్లా డెబ్బై ఎనిమిది లక్షల వ్యయంతో... 2016 ఏప్రిల్‌ 2న మైండ్‌ స్పేష్‌ వద్ద అండర్‌ పాస్‌ నిర్మాణ పనులు ప్రారంభించారు. మొత్తం మూడు వందలా ఐదు మీటర్ల పొడవులో నిర్మించారు. ఇరవై ఎనిమిది మీటర్లకు పైగా వెడల్పు, ఐదున్నర మీటర్ల ఎత్తులో.. ఇరువైపులా ఆరులైన్ల క్యారేజ్‌ వేలతో ఈ మార్గం అందుబాటులోకి వచ్చింది.  ప్రస్తుతం ఈ మార్గంలో గంటకు  పద్నాలుగు వేలా నాలుగు వందల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. 2035 నాటికి ఈ సంఖ్య   ముప్పై ఒక్క వెయ్యికి పైగా పెరగొచ్చని పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేసి ఇక నుంచి రెగ్యులర్‌గా వాటిని అందుబాటులోకి తెస్తామన్నారు మంత్రి కేటీఆర్.

ఉప్పల్‌లో ట్రాఫిక్‌ కష్టాలను అధిగమించేందుకు రూపొందించిన రెండు భారీ ప్రాజెక్టులకు మే 5న శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు అంబర్‌ పేట్ చే నంబర్‌, ఉప్పల్‌ రింగ్‌ రోడ్డుతో పాటు ఆరాంఘర్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకూ నిర్మించనున్న ఫ్లై ఓవర్లను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో కలిసి ప్రారంభిస్తామన్నారు.  మూడు ప్రాజెక్టుల కోసం పదిహేను వందల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.. మరోవైపు జూబ్లీ బస్టాండ్‌ నుంచి తూంకుంట మార్గంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు..  రక్షణశాఖకు చెందిన వంద ఎకరాల స్థలాన్ని తమకు కేటాయిస్తే... దానికి ప్రత్యామ్నాయంగా ఆరు వందల ఎకరాల స్థలాన్ని ఇస్తామన్నా.. రక్షణ శాఖ అర్థరహితంగా అడ్డుపడుతోందన్నారు. 

ఎస్సార్డీ పథకంలో భాగంగా మూడో ప్రాజెక్టును మే1న ప్రారంభిస్తామంటోంది బల్దియా.. ఎల్బీనగర్‌ చింతలకుంట అండర్‌ పాస్‌ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రారంభించిన పనులన్నీ షెడ్యూల్‌ ప్రకారం పూర్తి చేయడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

20:36 - April 30, 2018

పెద్దపల్లి : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రైస్‌ మిల్లు ఆపరేటర్స్‌కు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో కార్మికులు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని 350 మంది కార్మికులు ఆందోళ చేపట్టారు. కార్మికుల సమ్మెతో రైస్‌ మిల్లుల్లో పనులు నిలిచిపోయినా.. యజమాన్యాలు మాత్రం సమ్మె వైపు చూడడం లేదు. యజమాన్యాలు దిగి వచ్చేంత వరకు సమ్మె కొనసాగిస్తామంటున్న కార్మికులతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

ప్రత్యేకహోదా సాధించాలి : ఎంపీ శివప్రసాద్

చిత్తూరు : ప్రధాని మోడీ మెడలు వంచి ఏపీకి ప్రత్యేకహోదా సాధించాలని టీడీపీ ఎంపీ శివప్రసాద్ అన్నారు. టీడీపీ ధర్మ పోరాట దీక్షలో ఆయన ప్రసంగించారు. మోడీ మనసులో మురికి ఉందని విమర్శించారు. స్వచ్ఛ భారత్ కోరుకునే మోడీ...స్వచ్ఛ మోడీగా ఉండాలని సూచించారు. మోడీ.. అందరికీ నీతులు చెబుతాడు.. కానీ ఆయన మాత్రము పాటించడని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తానన్న మాట ఏమైందని మోడీని ప్రశ్నించారు. అజాత శత్రువు జోలికి పోవద్దని హెచ్చరించారు. టీడీపీ ప్రజలను తక్కువగా అంచనా వేస్తున్నావని మోడీని హెచ్చరించారుః. తెలుగువాడి దెబ్బ మరిచిపోవదన్నారు.

స్వలాభం కోసం బీజేపీ నాటకాలు : ఎమ్మెల్యే బాలకృష్ణ

చిత్తూరు : కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలను మరిచిపోయిందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ధర్మ పోరాట దీక్షలో ఆయన మాట్లాడారు. ఇదే వేదికగా మోడీ ఏపీకి అనేక హామీలు ఇచ్చారని..అందులో ప్రత్యేకహోదా అంశం కూడా ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ రాజకీయ స్వప్రయోజనాల కోసం నాటకాలు ఆడుతుందన్నారు. రాజధాని నిర్మానం కోసం కేంద్రం ఇచ్చింది.. 1500 వందల కోట్లు మాత్రమేనని అన్నారు. మోడీకి ఏపీ ప్రజలు అంటే ఎందుకంత లోకువ అని అన్నారు. 'వీరు మనుషులేనా' అని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలనుద్ధేశించి మాట్లాడారు. ఏపీపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఇది అంతం కాదు.. ఆరంభం అని అన్నారు.

స్వలాభం కోసం బీజేపీ నాటకాలు : ఎమ్మెల్యే బాలకృష్ణ

చిత్తూరు : కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలను మరిచిపోయిందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ధర్మ పోరాట దీక్షలో ఆయన మాట్లాడారు. ఇదే వేదికగా మోడీ ఏపీకి అనేక హామీలు ఇచ్చారని..అందులో ప్రత్యేకహోదా అంశం కూడా ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ రాజకీయ స్వప్రయోజనాల కోసం నాటకాలు ఆడుతుందన్నారు. రాజధాని నిర్మానం కోసం కేంద్రం ఇచ్చింది.. 1500 వందల కోట్లు మాత్రమేనని అన్నారు. మోడీకి ఏపీ ప్రజలు అంటే ఎందుకంత లోకువ అని అన్నారు. 'వీరు మనుషులేనా' అని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలనుద్ధేశించి మాట్లాడారు. ఏపీపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఇది అంతం కాదు.. ఆరంభం అని అన్నారు.

బీజేపీకి బలం లేదు : నారా లోకేష్

చిత్తూరు : బీజేపీ నీచవంతమైన రాజకీయాలకు పాల్పడుతోందని ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ధర్మ పోరాట దీక్షలో ఆయన మాట్లాడారు. బీజేపీ దొంగ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీకి బలం లేదన్నారు. జిల్లాలో బీజేపీ పది సర్పంచ్ లు కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. 'మొదటి సం. ప్రత్యేకహోదా ఇస్తామన్నారు.. రెండో సం. ఇదిగో ప్రత్యేకహోదా అన్నారు... మూడో సం. ప్రత్యేకహోదా లేదన్నారు'.. అని అయన అన్నారు. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చి ఏపీకి ఇవ్వలేదని చెప్పారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పడిందన్నారు. జగన్ 420 అని విమర్శించారు.

కేంద్రానిది నమ్మక ద్రోహం : మంత్రి అచ్చెన్నాయుడు

చిత్తూరు : ఏపీని కాంగ్రెస్ నయవంచన చేస్తే..బీజేపీ నిలువునా ముంచిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. మాయ మాటలు చెప్పి...తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు కొండల వెంకన్న సాక్షిగా మోడీ హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. బీజేపీతో కలిస్తే నష్టం జరుగుతుందని తెలుసు..అయినా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో కలిసి పోటీ చేశామని తెలిపారు. వైసీపీ నయవంచన సభ ఏర్పాటు చేసిందన్నారు. జగన్.. మోడీ కాళ్లపై పడి.. ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని కాలరాశారని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించారని అన్నారు. 

20:02 - April 30, 2018

చిత్తూరు : కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలను మరిచిపోయిందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ధర్మ పోరాట దీక్షలో ఆయన మాట్లాడారు. ఇదే వేదికగా మోడీ ఏపీకి అనేక హామీలు ఇచ్చారని..అందులో ప్రత్యేకహోదా అంశం కూడా ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ రాజకీయ స్వప్రయోజనాల కోసం నాటకాలు ఆడుతుందన్నారు. రాజధాని నిర్మానం కోసం కేంద్రం ఇచ్చింది.. 1500 వందల కోట్లు మాత్రమేనని అన్నారు. మోడీకి ఏపీ ప్రజలు అంటే ఎందుకంత లోకువ అని అన్నారు. 'వీరు మనుషులేనా' అని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలనుద్ధేశించి మాట్లాడారు. ఏపీపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఇది అంతం కాదు.. ఆరంభం అని అన్నారు. మన హక్కుల కోసం పోరాడుదాం.. ఢిల్లీ నాయకుల మెండల వంచుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రం విభజనలో బీజేపీ పాపం కూడా ఉందన్నారు.

19:51 - April 30, 2018

చిత్తూరు : బీజేపీ నీచవంతమైన రాజకీయాలకు పాల్పడుతోందని ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ధర్మ పోరాట దీక్షలో ఆయన మాట్లాడారు. బీజేపీ దొంగ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీకి బలం లేదన్నారు. జిల్లాలో బీజేపీ పది సర్పంచ్ లు కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. 'మొదటి సం. ప్రత్యేకహోదా ఇస్తామన్నారు..రెండో సం. ఇదిగో ప్రత్యేకహోదా అన్నారు... మూడో సం. ప్రత్యేకహోదా లేదన్నారు'.. అని అయన అన్నారు. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చి ఏపీకి ఇవ్వలేదని చెప్పారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పడిందన్నారు. జగన్ 420 అని విమర్శించారు. క్విట్ ప్రోకో, లాలూచీ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తనపై అర్ధం, పర్థం లేని ఆరోపణలు చేయొద్దని...ఆధారాలుంటే నిరూపించాలన్నారు. 'తాత ఎన్ టీఆర్, నాన్న చంద్రబాబు గారి లాగా మంచి పేరు వస్తుందో లేదో తెలియదు... కానీ వారికి చెడ్డ పేరు మాత్రం' తేనని అన్నారు. 2019లో టీడీపీ గెలవడం ఖాయమన్నారు. 25 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటామని తెలిపారు. జీఎస్టీతోపాటు కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలకు సహకరించామని..కానీ కేంద్రం ఏపిని మోసం చేశారని వాపోయారు. తెలుగు జాతి అంటే మోడీకి ఎందుకు చిన్నచూపు అని ప్రశ్నించారు. కులం, మతం పేరుతో చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో వరి నాటే రోజులు తిరిగి వచ్చాయని చెప్పారు. చంద్రబాబును మళ్లీ సీఎం చెయ్యాలని పిలుపునిచ్చారు. 

 

19:36 - April 30, 2018

చిత్తూరు : ఏపీని కాంగ్రెస్ నయవంచన చేస్తే..బీజేపీ నిలువునా ముంచిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ ధర్మ పోరాట దీక్షలో ఆయన మాట్లాడారు. నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. మాయ మాటలు చెప్పి...తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు కొండల వెంకన్న సాక్షిగా మోడీ హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. బీజేపీతో కలిస్తే నష్టం జరుగుతుందని తెలుసు..అయినా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో కలిసి పోటీ చేశామని తెలిపారు. వైసీపీ నయవంచన సభ ఏర్పాటు చేసిందన్నారు. జగన్.. మోడీ కాళ్లపై పడి.. ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని కాలరాశారని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించారని అన్నారు. 

 

ఏపీకి రావాల్సిన హక్కులు సాధించి తీరుతాం : ఎంపీ సుజనా చౌదరి

చిత్తూరు : ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహానికి పాల్పడిందని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన టీడీపీ ధర్మపోరాటం దీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు. విశాఖలో వైసీపీ అధర్మ పోరాటానికి కూర్చున్నట్లుగా ఉందని విమర్శించారు. రాజకీయ పార్టీలు వస్తుంటాయి...పోతుంటాయి..కానీ రాజ్యాంగంలో ప్రభుత్వం పర్మినెంట్ గా ఉంటుందన్నారు. మనకు ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు... ఏపీకి రావాల్సిన హక్కులను సాధించి తీరుతామని చెప్పారు. 1999లో వాజ్ పాయి అవిశ్వాస తీర్మానం తీసుకున్నారని గుర్తు చేశారు. 

 

19:03 - April 30, 2018

చిత్తూరు : టీడీపీ చేస్తున్న దీక్ష.. ధర్మ పోరాటం దీక్ష అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ రెడ్డి అన్నారు. టీడీపీ ధర్మ దీక్ష పోరాటంలో ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం చేస్తున్న ధర్మయుద్ధం అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తుందనడానికి ఇది నిదర్శనమన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రజా శ్రేయస్సే.. పార్టీ ముఖ్య ఉద్ధేశమన్నారు. కేంద్ర ప్రభుత్వం నమ్మకం ద్రోహం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు సం.రాలు కేంద్రం సహకరించలేదని.. ఇబ్బందులకు గురి చేసిందన్నారు. చంద్రబాబు బ్రాండ్ తో వేల కోట్ల రూపాయల పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ధర్మ పోరాటానికి అందరి సహకారం కావాలన్నారు. 

 

18:57 - April 30, 2018

చిత్తూరు : ప్రధాని మోడీ మెడలు వంచి ఏపీకి ప్రత్యేకహోదా సాధించాలని టీడీపీ ఎంపీ శివప్రసాద్ అన్నారు. టీడీపీ ధర్మ పోరాట దీక్షలో ఆయన ప్రసంగించారు. మోడీ మనసులో మురికి ఉందని విమర్శించారు. స్వచ్ఛ భారత్ కోరుకునే మోడీ...స్వచ్ఛ మోడీగా ఉండాలని సూచించారు. మోడీ.. అందరికీ నీతులు చెబుతాడు.. కానీ ఆయన మాత్రము పాటించడని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తానన్న మాట ఏమైందని మోడీని ప్రశ్నించారు. అజాత శత్రువు జోలికి పోవద్దని హెచ్చరించారు. టీడీపీ ప్రజలను తక్కువగా అంచనా వేస్తున్నావని మోడీని హెచ్చరించారుః. తెలుగువాడి దెబ్బ మరిచిపోవదన్నారు. విభజన వద్దని చెబితే సోనియా గాంధీ వినలేదని...ఇప్పుడు ఆమె అడ్రస్ లేదన్నారు. మోడీ అబద్ధాల పుట్ట అని మండిపడ్డారు. మోడీ ఎప్పుడైనా ఇండియాలో ఉంటే కదా..ప్రజల బాధలు తెలిసేది అన్నారు. చైనా పర్యటనలో ఉన్న మోడీ..ఆ దేశంలో ఉండే కప్పలు, పాములను తినేసి వస్తాడేమో ఆక్రోశం వెల్లగక్కారు. మోడీ మెడలు వంచి ప్రత్యేకహోదాను తీసుకురావాలన్నారు.

 

18:47 - April 30, 2018

చిత్తూరు : ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహానికి పాల్పడిందని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన టీడీపీ ధర్మపోరాటం దీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు. విశాఖలో వైసీపీ అధర్మ పోరాటానికి కూర్చున్నట్లుగా ఉందని విమర్శించారు. రాజకీయ పార్టీలు వస్తుంటాయి...పోతుంటాయి..కానీ రాజ్యాంగంలో ప్రభుత్వం పర్మినెంట్ గా ఉంటుందన్నారు. మనకు ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు... ఏపీకి రావాల్సిన హక్కులను సాధించి తీరుతామని చెప్పారు. 1999లో వాజ్ పాయి అవిశ్వాస తీర్మానం తీసుకున్నారని గుర్తు చేశారు. 

18:20 - April 30, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు అంశంలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ తరపు న్యాయవాది వాదనలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం వీడియోలు సమర్పించడంలో జాప్యం చేసిందని అభిషేక్ మనుసింఘ్వి అన్నారు. ఎమ్మెల్యేలకు పిటిషన్ వేసే అర్హత లేదని.. ఇది పరిగణనలోకి తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేకి జోక్యం చేసుకునే హక్కు ఉంటుందని సింఘ్వీ తెలిపారు. రాజ్యాంగం ప్రకారం స్పీకర్, కార్యదర్శిలకు మాత్రమే పిటిషన్ వేసే అర్హత ఉందని చెప్పారు. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

17:38 - April 30, 2018

నిజామాబాద్ : పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం నెలకొంది. ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. భార్యాభర్తతోపాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దంపతులు తన ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ లో పెళ్లి వేడుకకు వెళ్లారు. పెళ్లి వేడుక ముగిసిన అనంతరం నలుగురు కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గంమధ్యలో నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి జాతీయ రహదారిపై పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే కారు టైర్ పగిలిపోవడంతో డివైడర్ ను ఢీకొట్టి రోడ్డుకు అవతలివైపుకు వెళ్లగా కారును లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మృతుల్లో దంపతులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబుకు మూడు సంవత్సరాలు, పాపకు ఆరు సంవత్సరాలు ఉన్నట్లు తెలుస్తోంది.

డిచ్ పల్లి హైవేపై రోడ్డుప్రమాదం

నిజామాబాద్ : డిచ్ పల్లి జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు దంపతులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

చిత్తూరు : తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. తిరుమలలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షంలోనే చంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్నారు. 

16:52 - April 30, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌ను ఎయిమ్స్‌ ఆసుపత్రిలో కలిశారు. లాలూకు అందిస్తున్న చికిత్స వివరాలు, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 2019 ఎన్నికలకు సిద్ధమవుతున్న రాహుల్‌కు ఆర్జేడీ నుంచి పూర్తి సహకారం లభిస్తోంది. కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌, గుండె సంబంధింత వ్యాధితో లాలు ఎయిమ్స్‌లో చేరారు. లాలూ ఆరోగ్య పరిస్థితి కుదుటపడటంతో ఆయనను తిరిగి రాంచీ మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రికి తరలించారు. రాంచీ ఆస్పత్రికి తనను పంపవద్దని, అక్కడ తన వ్యాధులకు చికిత్స అందించే పరికరాలు లేవని లాలూ  ఎయిమ్స్‌ యాజమాన్యాన్ని కోరుతూ లేఖ రాశారు. తనకేమైనా జరిగితే అందుకు ఎయిమ్స్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. లాలు ఆరోగ్యం కుదుటపడిందని ప్రయాణం చేయడానికి ఫిట్‌గా ఉన్నారని ఎయిమ్స్‌ వర్గాలు పేర్కొన్నారు. దాణా స్కాంలో జైలుశిక్ష అనుభవిస్తున్న లాలూను అస్వస్థత కారణంగా మార్చి 16న బిర్సా ముండా జైలు నుంచి రాంచీ ఆసుపత్రికి... అక్కడి నుంచి మార్చి 29న ఎయిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. 

16:48 - April 30, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని అశ్వారావుపేటలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వేధింపులు భరించలేక ఓ గిరిజన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బైక్, పశువుల దొంగతనాల కేసులో విచారణ పేరుతో స్టేషన్‌కి పిలిపించి వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు ఆరోపించారు. పోలుసులు కావాలనే కేసులో ఇరికించారని మృతుని బంధువులు ఆరోపిస్తూ.. భద్రాచలం రహదారిపై మృతదేహంతో బైఠాయించి ఆందోళన చెపట్టారు. దీంతో పోలీసులు గ్రామ పెద్దలు నచ్చజెప్పి పంపించారు. 

 

16:44 - April 30, 2018

విశాఖ : అధికారంలోకి రాగానే కృష్ణాజిల్లాకు ఎన్టీరామారావు పేరు పెడతానని జగన్‌ ప్రకటించడం పట్ల లక్ష్మీపార్వతి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి... ఎన్టీఆర్‌ ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు ఏనాడూ చేయని పనిని చేసిన జగన్‌కు లక్ష్మీపార్వతి కృతజ్ఞతలు తెలిపారు. 

తిరుపతిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

చిత్తూరు : తిరుపతిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తారకరామా స్టేడియంలో జరిగే టీడీపీ ధర్మపోరాట దీక్షకు వర్షం అడ్డంకిగా మారింది. ఈదురు గాలికి స్టేడియంలో రెండు ఎల్‌ఈడీ స్క్రీన్‌లు పగిలిపోయాయి. హోర్డింగ్‌లు కూలిపోయాయి. గాలికి కుర్చీలు ఎగిరిపోయాయి.  

 

16:39 - April 30, 2018

చిత్తూరు : తిరుపతిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తారకరామా స్టేడియంలో జరిగే టీడీపీ ధర్మపోరాట దీక్షకు వర్షం అడ్డంకిగా మారింది. ఈదురు గాలికి స్టేడియంలో రెండు ఎల్‌ఈడీ స్క్రీన్‌లు పగిలిపోయాయి. హోర్డింగ్‌లు కూలిపోయాయి. గాలికి కుర్చీలు ఎగిరిపోయాయి.  

 

16:35 - April 30, 2018

చెన్నై : ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెన్నై పర్యటన ముగిసింది. నిన్న స్టాలిన్‌ను కలిసిన కేసీఆర్‌.. ఇవాళ డీఎంకే ఎంపి కనిమొళితో భేటీ అయ్యారు. గంటకుపైగా జరిగి వీరిద్దిని సమావేశంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సమాలోచనలు జరిపారు. రాష్ట్రాల సమ్మిళితమైన మన దేశంలో రాష్ట్రాలు బలంగా ఉంటేనే సమాఖ్య స్ఫూర్తి  పరిడవిల్లుతుందన్న అంశం చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. 2019 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ కంటే ప్రాంతీయ పార్టీలే ఎక్కువ సీట్లు సాధిస్తాయని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలే జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, భూరికార్డుల ప్రక్షాళన, రైతులకు పెట్టుబడి  సాయం  వంటి పథకాలు  గురించి కేసీఆర్‌.. కనిమొళికి వివరించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలను కనిమొళి అభినందించారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలు మరింత ఐక్యం పనిచేయాల్సిన అవసరం ఉందని కనిమొళి చెప్పారు. త్వరలో హైదరాబాద్‌ వచ్చి కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పనులను పరిశీలిస్తానని కనిమొళి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తెచ్చారు. 

 

16:18 - April 30, 2018

హైదరాబాదద్ : కాంగ్రెస్ నేతలు ఊర కక్కులు అంటూ టీఆర్ ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ కంపెనీకి హిస్టీరియా వచ్చిందని ఎద్దేవా చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి ఇష్టానురీతిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సినిమాలో బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్ టీఆర్ లాగా టీఆర్ ఎస్ నేతలు డైలాగ్ లు కొడుతున్నారని.. ఇది రాజకీయమా, సినిమానా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఛాలెంజ్ లు ఉండవు.. చర్చలు ఉంటవని.. దమ్ముంటే చర్చకు రండి సవాల్ విసిరారు. మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని టీఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ఏ హామీని అమలు చేశారో.. చర్చించేందుకు రావాలని సవాల్ విసిరారు. టీఆర్ ఎస్ నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేవలం 1900 మందికి మాత్రమే డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారని అన్నారు.  

 

ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు : వైవీ.సుబ్బారెడ్డి

విశాఖ : ప్రత్యేకహోదా సాధనలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వైసీపీ ఎంపీ వైవీ.సుబ్బారెడ్డి విమర్శించారు. విశాఖలో చేపట్టిన వైసీపీ వంచన వ్యతిరేక దీక్షలో ఆయన మాట్లాడారు. చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధితో తాము కేంద్రంపై పోరాటం సాగించామని తెలిపారు. ఎన్ డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది దేశంలో మొట్టమొదటిసారిగా వైసీపీ అని పేర్కొన్నారు. తాము అవిశ్వాస తీర్మానం ఇస్తే ఎన్ డీఏ ప్రభుత్వం కూలిపోదని తెలుసూ..కానీ ఏపీకి ప్రత్యేకహోదా విషయం దేశ వ్యాప్తంగా తెలుస్తుందని చేశామని తెలిపారు.

16:01 - April 30, 2018

విశాఖ : ప్రత్యేకహోదా సాధనలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వైసీపీ ఎంపీ వైవీ.సుబ్బారెడ్డి విమర్శించారు. విశాఖలో చేపట్టిన వైసీపీ వంచన వ్యతిరేక దీక్షలో ఆయన మాట్లాడారు. చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధితో తాము కేంద్రంపై పోరాటం సాగించామని తెలిపారు. ఎన్ డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది దేశంలో మొట్టమొదటిసారిగా వైసీపీ అని పేర్కొన్నారు. తాము అవిశ్వాస తీర్మానం ఇస్తే ఎన్ డీఏ ప్రభుత్వం కూలిపోదని తెలుసూ..కానీ ఏపీకి ప్రత్యేకహోదా విషయం దేశ వ్యాప్తంగా తెలుస్తుందని చేశామని తెలిపారు. పార్లమెంట్ లో ఏడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వైసీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపాయన్నారు. 13 సార్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చామని తెలిపారు. 

 

15:53 - April 30, 2018

రంగారెడ్డి : జిల్లాలోని మంచాల మండలం ఆరుట్ల.. దండుమైలారం, రాచకొండ అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. రాత్రి వేళ గ్రామాల్లో చిరుత సంచరించి పశువులను చంపి తింటుండటంతో రైతులు కంటిమీద కునుకు లేకుండా  గడుపుతున్నారు. ఇవాళ తెల్లవారుజామున దూడలపై దాడి చేసి తీసుకెళ్తున్న చిరుతను వెంబడించిన రైతులపై కూడా చిరుత దాడి చేసింది. ఆరు నెలలుగా చిరుత గొర్రెలు, పశువులపై దాడి చేసి చంపి తింటున్నా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు.

 

15:28 - April 30, 2018

అనంతపురం : ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురంలో .... 313 వెల్‌ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోదీ,  ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు మాటమార్చరని సొసైటీ నిర్వాహకులు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా సంజీవిని కాదంటూ బీజేపీ కి వత్తాసు పలికారని... రాష్ట్ర ప్రజలను కేంద్రం దగ్గర పణంగా పెట్టారని మండిపడ్డారు.  ఎన్నికల కోసమే ఇప్పుడు ప్రత్యే హోదా కావాలని చంద్రబాబు  మొసలి కన్నీరు కారుస్తున్నారని వారు విమర్శించారు. 

 

14:58 - April 30, 2018

చిత్తూరు : తిరుపతిలో ఇవాళ సాయంత్రం టీడీపీ ధర్మపోరాట సభ జరుగనుంది. ఏపీ సీఎం ఇప్పటికే విజయవాడ నుంచి తిరుపతికి బయలుదేరారు. సాయంత్రం ఆయన ధర్మపోరాట దీక్షలో పాల్గొననున్నారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం.. 

 

14:55 - April 30, 2018

బీహార్‌ : జెహానాబాద్‌లో పట్టపగలు దుశ్శాసన పర్వం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై మైనర్‌ బాలికపై ఆరుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. ఆమె బట్టలూడదీసి  అసభ్యంగా ప్రవర్తించారు. ఇంత దారుణం జరుగుతున్నా ఆమెకు ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. వారి నుంచి తనని తాను రక్షించుకోవడానికి ఆ బాలిక పెనుగులాడిన దృశ్యాలు చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియో వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు నలుగురు యువకులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి నయ్యర్‌ హస్నైన్‌ ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేశారు. యువకులు వినియోగించిన బైక్‌ ద్వారా సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఈ వీడియోను చిత్రీకరించిన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలోని ఇద్దరు యువకులను పట్టుకునేందుకు జెహానాబాద్‌లో ప్రతి ఇంటిలో గాలిస్తున్నారు. ఈ కేసులో నిందితులపై పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు.

జూబ్లీహిల్స్ ఎన్ పబ్ వద్ద గన్ తో వ్యక్తి హల్ చల్

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎన్ పబ్ వద్ద గన్ తో వ్యక్తి హల్ చల్ చేశాడు. గన్ తో పబ్ లోకి వెళ్లేందుకు యత్నించాడు. పాతబస్తీకి చెందిన ఫిరాజుద్దీన్ గన్ తో హల్ చల్ చేశాడు. అతన్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది.

 

14:44 - April 30, 2018

చెన్నై : తెలంగాణ సీఎం కేసీఆర్ చెన్నై పర్యటన ముగిసింది. సీఎం కేసీఆర్ ను డీఎంకే ఎంపీ కనిమొళి కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

ముగిసిన తెలంగాణ సీఎం కేసీఆర్ చెన్నై పర్యటన

చెన్నై : తెలంగాణ సీఎం కేసీఆర్ చెన్నై పర్యటన ముగిసింది. సీఎం కేసీఆర్ ను డీఎంకే ఎంపీ కనిమొళి కలిశారు.

 

13:38 - April 30, 2018

ఢిల్లీ : ఆఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ నగరం‌ మరోసారి నెత్తురోడింది. రెండు చోట్ల జరిగిన ఆత్మాహుతి దాడుల్లో ఓ ఫొటోగ్రాఫర్‌, ముగ్గురు జర్నలిస్టులు సహా 21 మంది మృతి చెందారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 8 గంటలకు షష్టారక్‌ ప్రాంతంలో జరిగిన ఓ పేలుడు ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు పాత్రికేయులు గుమిగూడి ఉన్నసమయంలో ఓ వ్యక్తి వారితో కలిసి పోయి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ప్రముఖ మీడియా సంస్థ ఏఎఫ్‌పీకి చెందిన చీఫ్‌ ఫోటోగ్రాఫర్‌ షా మరై ఉన్నారు. మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది. ఈ పేలుళ్లకు సంబంధించి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. 

13:34 - April 30, 2018

నిజామాబాద్ : తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరు లేక వెల వెలబోతోంది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీనికి తోడు మహరాష్ట్రలో నిర్మించిన పలు ప్రాజెక్టుల కారణంగా ఆ ప్రాజెక్టులోని నీరు చేరడం లేదు. దీంతో సాగు, తాగు నీటికి ఇబ్బందికరంగా మరిందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబధించిన మరింత సమాచారం ఈ వీడియోను క్లిక్ చేయండి.

13:30 - April 30, 2018

అమరావతి : ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో రైతులకు కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ మందకొడిగా సాగుతోంది. ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై రైతులు ఆసక్తి చూపకపోవడం.... పరిష్కారం లేని సమస్యలు, పూలింగ్‌ సమయంలో హామీల ఆచరణలో జాప్యం వంటివి రిజిస్ట్రేషన్‌ జోరుకు బ్రేక్‌లు వేస్తున్నాయి.

ఫిబ్రవరి వరకు జోరుగా సాగిన ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ..
ఆంధ్రప్రదేశ్‌ సీఆర్డీఏ నేతృత్వంలో అమరావతి నిర్మాణానికి పూలింగ్‌ ప్రాతిపదికన భూములిచ్చిన రైతులకు.. బదులుగా ప్రభుత్వం ఇస్తున్న ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిన్న మొన్నటివరకు బాగానే జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలైన ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదట్లో బాగానే సాగింది. ఆ తర్వాత ఈ ప్రక్రియ క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్లాట్ల నిర్మాణంలో లోటుపాట్లు, ఇతరత్రా విషయాలు రిజిస్ట్రేషన్‌ జోరుకు బ్రేక్‌లు వేస్తున్నాయి.

రైతులకు కేటాయించిన ప్లాట్లు 61,074
అయితే.. రాజధానికి భూములిచ్చిన 29 గ్రామాలకు చెందిన రైతులకు మొత్తం 61,074 నివాస, వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. 2017 అక్టోబర్‌ నుండి ఇప్పటివరకు కేవలం 18,886 ప్లాట్లు.. 30.89 శాతం మాత్రమే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. వీటిలో 14560 ప్లాట్లలో భూయజమానులు స్లాట్లు బుక్‌ చేసుకున్నారు. అయితే.. ఇంకా 42,208 ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ జరగాల్సి ఉంది. వీటి రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యే సరికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇదిలావుంటే.. .నాలుగైదు గ్రామాలను కలిపి ఒక రిజిస్ట్రేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులుకోరుతున్నారు.

పూలింగ్‌ హామీలు నిర్వహించడంలో వైఫల్యంమైన రాష్ట్ర ప్రభుత్వం
మరోవైపు లాటరీలో తమకు వచ్చిన ప్లాట్లను రిజిష్టర్‌ చేసుకోవాలని సీఆర్డీఏ అధికారులు రైతులకు సూచించారు. అయితే.. పూలింగ్‌ సమయంలో హామీలు ఇచ్చిన విధంగా నిర్వహించకపోవడం.. దక్షిణ ముఖం, వీధిపోట్లు వంటి ప్లాట్లను మార్చాలని రైతులు చేసిన అభ్యర్థనలు పట్టించుకోకపోవడంతో రిజిస్ట్రేషన్ల పట్ల రైతులకు ఆసక్తి తగ్గింది. ఇవేకాకుండా 2018 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రాజధాని రైతులకు ప్రకటించిన కేపిటల్‌ గెయిన్స్‌ పన్ను మినహాయింపు కాలం పెంచకపోవడం వంటి అంశాలతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగుతుండడంతో రైతుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు అనుకూలంగా లేకపోవడంతో అమరావతికి కేంద్ర ఆర్థిక సహాయంపై అయోమయం నెలకొంది. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు మదుపరులు వెనక్కు తగ్గారు.

కనిమొళితో కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, ఎంపీ కనిమొళితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నైలో భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వీరు చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి కె.కేశవరావు, మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలు కూడా హాజరయ్యారు. నిన్న కరుణానిధి, స్టాలిన్ లతో కేసీఆర్ సమావేశమైన సంగతి తెలిసిందే. రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని కేసీఆర్ ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ కు బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు మంచి మిత్రుడని...

13:13 - April 30, 2018

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం యత్నాలను ముమ్మరం చేశారు. ఈ నేథ్యంలో తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో కేసీఆర రెండవరోజు పర్యటిస్తున్నారు. ఆదివారం నాడు స్టాలిన్ ను కలిసిన కేసీఆర్ ఈరోజు ఎంపీ కనిమొళితో భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ దిశగా సాగుతున్న కేసీఆర్ ఇప్పటికే పశ్చిబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనీ, తమిళనాడు పార్టీ డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, మాజీ ప్రధాని మాజీ ప్రధాని దేవేగౌడ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో చర్చలు జరిపారు. ఇప్పుడు తాజాగా మరో అడుగు ముందుకు వేసిన నిన్న స్టాలిన్ తోను, ఈరోజు కనిమొళితోను కేసీఆర్ భేటీ అయిన దక్షిణాది రాష్ట్రాలలో ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకత విషయంలో చర్చలు జరిపారు.  

రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా : సీఎం చంద్రబాబు

అమరావతి: ఎన్ని సమస్యలు వున్నా రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి ఆగిపోకూడదనీ..తమ హక్కుల కోసం పోరాడాలని అధికారులకు సూచించారు. వ్యవస్థలపై నమ్మకం పోయేలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించరాదన్నారు.. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో పర్యటించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. నీరు-ప్రగతిపై సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలవరంపై ప్రజలను చైతన్యపరచాలని అధికారులకు తెలిపారు. ప్రతి జిల్లా నుంచి పోలవరం డ్యామ్ సైట్‌కు బస్సులు నడపాలన్నారు. రైతులు, విద్యార్థులు, పాత్రికేయులకు పోలవరం పనులను చూపించాలని ఆదేశించారు.

దళిత, బ్రాహ్మణ వాదంపై సరికొత్త వివాదం?!..

ఢిల్లీ: దళిత, బ్రాహ్మణ వాదంపై గుజరాత్ బీజేపీలో కొత్త వివాదానికి దారితీసింది. జ్ఞానంలో అంబేద్కర్, ప్రధాని నరేంద్ర మోదీ ‘‘బ్రాహ్మణులే’’ నంటూ గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీకి నష్టం జరుగుతుందంటు ఆ పార్టీ ఎంపీ ఉదిత్ రాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీనగర్‌లో ‘సమస్త్ గుజరాత్ బ్రహ్మ సమాజ్’ ఆధ్వర్యంలో జరిగిన ఓ జాబ్ ఫెయిర్‌లో త్రివేది మాట్లాడుతూ..అధ్యయం, అభ్యాసం చేసి పైకి వచ్చినవాళ్లంతా బ్రాహ్మణులే. ఇంటి పేరు చూస్తే కూడా అంబేద్కర్ బ్రాహ్మణుడని చెప్పవచ్చని త్రివేదీ వ్యాఖ్యానించారు.

12:38 - April 30, 2018

కృష్ణా : తాను అధికారంలోకి వచ్చాక కృష్ణా జిల్లాలకు ఎన్టీఆర్ పేరు పెడతానని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. జిల్లాలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నిమ్మకూరు చేరుకున్న జగన్ ఈ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్వగ్రామం అయిన నిమ్మకూరుకు జగన్ చేరుకున్నారు. అనంతరం నీరు చెట్టు పథకం కింద జరుగుతున్న చెదువుల తవ్వకాలను పరిశీలించారు. ఈ క్రమంలో నీరు చెట్టు పథకం కింద చెవువులను 50 అడుగుల లోతుకు తవ్వేస్తున్నారనీ ఈ పథకంలో దోపిడీ, అవినీతి గ్రామస్థులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతు..తాను అధికారంలోకి వచ్చాక కృష్ణా జిల్లాలకు ఎన్టీఆర్ పేరు పెడతానని జగన్ ప్రకటించారు.

50 అడవి పందుల కాల్చివేత..

హైదరాబాదు : 50 అడవి పందులను కాల్చివేసిన ఘటన నగర శివారులో చోటుచేసుకుంది. వైమానిక శిక్షణ పొందుతున్న వారిపై ఈ నెల 11న అడవి పందులు దాడి చేశాయి. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో వైమానిక శిక్షణకు, జెట్ విమానాల ల్యాండింగ్ కు ఆటంకం కలిగిస్తున్న అడవి పందులను హైదరాబాదీ షూటర్ నవాబ్ షఫత్ అలీఖాన్ కాల్చి చంపారు. తన బృందంతో పాటు కలసి వచ్చిన ఆయన 50 అడవి పందులను చంపారు. అంతేకాదు, తరచుగా రన్ వే పైకి వచ్చి, జెట్ విమానాల ల్యాండింగ్ కు ఆటంకం కలిగిస్తున్నాయి. దీంతో, తెలంగాణ అటవీశాఖకు ఎయిర్ ఫోర్స్ అధికారులు లేఖ రాశారు.

జంట పేలుళ్లలో ఫోటో గ్రాఫర్ మృతి..

ఢిల్లీ : కాబూల్ లో మరోసారి పేలుళ్లు సంభవించారు. షష్టారల్ ప్రాంతంలో ఈ జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 21మంది మృతి చెందారు. షష్టారల్ ప్రాంతంలో సంభవించినజంట పేలుళ్లలో ఏఎఫ్ పీ ఫోటో గ్రాఫర్ షా మరై మృతి చెందారు. 

11:52 - April 30, 2018

విశాఖపట్నం : వేతనాలు పెంచాలంటూ నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న బ్రాండెక్స్‌ కంపెనీ కార్మికుల ఆందోళనపై ప్రభుత్వం స్పందించింది. కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటన జారీ చేసింది. అయితే నాలుగేళ్లుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం అకస్మాత్తుగా వేతనాలు పెంచడంపై ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల అస్త్రంగా కార్మికులను వాడుకుంటున్నాయని ఆరోపిస్తున్నాయి.
10 సంత్సరాల క్రితం ఏర్పాటైన బ్రాండెక్స్‌ కంపెనీ
కనీస వేతనం 10 వేల రూపాయలు ఇవ్వాలంటూ విశాఖ జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండెక్స్‌ కంపెనీ కార్మికులు నాలుగేళ్లుగా పోరాడుతున్నారు. 10 సంత్సరాల క్రితం ఏర్పాటైన ఈ కంపెనీకి అనుబంధంగా మూడు యూనిట్లు, సీడ్స్‌, క్వాంటమ్‌ సంస్థలలో కలిపి మొత్తం 18వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. కంపెనీ ప్రారంభంలో 2వేల రూపాయల వేతనం మాత్రమే ఇచ్చిన కంపెనీ యాజమాన్యం 10 సంవత్సరాల కాలంలో మరో రెండు వేలు మాత్రమే పెంచింది. దీంతో కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు 2016 ఏప్రిల్‌లో సమ్మెకు దిగారు.

15 రోజుల పాటు సమ్మె చేపట్టిన కార్మికులు
దాదాపు 15 రోజుల పాటు సమ్మె చేపట్టడంతో ఏప్రిల్‌ 30వ తేదీలోగా వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన కంపెనీ యాజమాన్యం కార్మికులపై పోలీసులతో దాడికి దిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉన్న సమయంలోనే కార్మికులపై దాడులు జరిగాయి. కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్న సీఐటీయూ నేతలను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత జగన్‌ కూడా వీరి సమ్మెకు మద్దతు పలికారు. అయితే సమ్మెకు దిగొచ్చిన ప్రభుత్వం కార్మికులకు వెయ్యి రూపాయల వేతనం పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతే ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు కనీసం వేజ్‌ బోర్డు గురించి ప్రస్తావించలేదు ప్రభుత్వం.

27 బ్రాండెక్స్‌ కంపెనీని సందర్శించిన మంత్రి లోకేశ్‌
అయితే తాజాగా ఈ నెల 27న మంత్రి లోకేశ్‌ బ్రాండెక్స్‌ కంపెనీని సందర్శించారు. ప్రస్తుతం కార్మికులకు ఇస్తున్న వేతనానికి అదనంగా 500 వేతనం పెంచాలని కంపెనీ యాజమాన్యాన్ని కోరారు. మరో రెండేళ్లలో 35 వేల ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటుగా కంపెనీ కోరిన మేరకు రోడ్ల వెడల్పుతో పాటుగా ఫ్లైఓవర్‌ను నిర్మిస్తామని, ఈఎస్‌ఐ హాస్పిటల్‌ను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు లోకేశ్‌.

రాజకీయం కోణముందంటు విపక్షాల అనుమానాలు..
అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. బ్రాండెక్స్‌ ప్రారంభ సమయంలో 60వేల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వం కేవలం 18 వేల ఉద్యోగాలు కల్పించి చేతులు దులుపుకుందని ఆరోపిస్తున్నాయి. రాజకీయ కోణంలోనే వేతనాల పెంపు చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. కార్మికుల వేతనాలు పెంచడం మంచి పరినామమే కాని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వేజ్‌ బోర్డును ఎందుకు సమావేశ పరచలేదని ప్రశ్నించాయి. సుప్రీం కోర్టు నిబంధనలకు అనుగుణంగా 18 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి విపక్షాలు. 

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రులు..

చిత్తూరు : తిరుమలలో శ్రీవారిని పలువురు ఏపీ మంత్రులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఏపీకి అన్యాయం చేసిన మోదీకి మంచి బుద్ది ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్టు టీడీపీ మంత్రులు కేఈతో మరో ఇద్దరు మంత్రులు తెలిపారు. ధర్మపోరాట దీక్షకు ఎలాంటి విఘ్నాలు జరుగకుండా విజయంతం జరిగేలా చూడాలని స్వామివారిని మొక్కుకున్నట్టు మంత్రులు తెలిపారు. 

11:48 - April 30, 2018

చిత్తూరు : తిరుమలలో శ్రీవారిని పలువురు ఏపీ మంత్రులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఏపీకి అన్యాయం చేసిన మోదీకి మంచి బుద్ది ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్టు టీడీపీ మంత్రులు కేఈతో మరో ఇద్దరు మంత్రులు తెలిపారు. ధర్మపోరాట దీక్షకు ఎలాంటి విఘ్నాలు జరుగకుండా విజయంతం జరిగేలా చూడాలని స్వామివారిని మొక్కుకున్నట్టు మంత్రులు తెలిపారు. కాగా నేడు తిరుపతిలో జరుగున్న టీడీపీ ధర్మ పోరాట దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వ వంచనపై టీడీపీ గర్జించనుంది. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ధర్మపోరాట దీక్ష జరుగనుంది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు చంద్రబాబు దీక్షలో ప్రసంగిస్తారు. కేంద్రం ఏపీకి చేసిన అన్యాయంపై చంద్రబాబు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. 

11:42 - April 30, 2018

విశాఖపట్నం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల కోసం చంద్రబాబు దీక్షల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రత్యేకహోదాపై ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలతో రాజీనామా చేస్తే కేంద్రం ప్రత్యేకహోదా ఇస్తుందని చెప్పారు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా వెంటనే తమ ఎంపీలతో రాజీనామా చేయించాలని ఆమె డిమాండ్‌ చేశారు. విశాఖలో వైసీపీ చేపట్టిన వంచన వ్యతిరేక దీక్షలో ఆమె పాల్గొన్నారు.

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు : జగన్

కృష్ణా : జిల్లాలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతు..తాను అధికారంలోకి వచ్చాక కృష్ణా జిల్లాలకు ఎన్టీఆర్ పేరు పెడతానని తెలిపారు. నిమ్మకూరులో నీరు చెట్టు కార్యక్రమంలో జరుగుతున్న దోపిడీని, అవినీతిని గ్రామస్తులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. 

11:23 - April 30, 2018

ప్రకాశం : వివిధ కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కొనకమిట్ట మండలం గొట్లగట్టు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ ఓ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. కొనకనమిట్ల మండలం గొట్లగట్టు దగ్గర అతివేగంగా వచ్చిన లారీ.. ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తోన్న ఖాదర్‌, ప్రుకాను, వెంటకరెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఇద్దరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. ఆటోలో బట్టల వ్యాపారం చేసుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు...స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆటోను ఢీకొన్న లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. 

చంద్రబాబును దద్దమ్మ అన్న రోజా..

విశాఖపట్నం : సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం విశాఖపట్నంలో వైకాపా 'వంచన దీక్ష' సభలో రోజా మాట్లాడుతు..నరేంద్ర మోదీ వచ్చి మట్టి, నీరు ఇచ్చిన వేళ, జగన్ అక్కడ లేరని, వాటిని రెండు చేతులతో మహా ప్రసాదంగా తీసుకున్న చంద్రబాబు ఓ దద్దమ్మ అయితే, ఆయన పక్కనే ఉన్న దేవినేని మరో దద్దమ్మని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రాజధానికి శంకుస్థాపన చేస్తున్న వేళ, ప్రతిపక్ష నాయకుడిని పిలవకుండా వాళ్లింటి పేరంటంలా చేసుకుని సిగ్గు లేకుండా ప్రవర్తించిన నాయకులు ఎవరో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. 

10:54 - April 30, 2018

పశ్చిమగోదావరి : జాల్లాలో ఆక్వా మాఫియా ఆగడాలకు అడ్డేలేకుండా పోయింది. బంగారు పంటలు పండే సారవంతమైన భూములను ఉప్పునీటి కయ్యలుగా మర్చేస్తున్నారు. రెండు పంటలు పండే మాగాణి భూములను సైతం బీడుభూములుగా ముద్రవేస్తూ చేపల చెరువులు తవ్వేస్తున్నారు. అన్నపూర్ణగా పేరొందిన బంగరు నేల ఆక్వా సాగుతో కాలుష్య కాసారంగా మారుతోంది.

వరిసాగు ప్రమాదంలో పశ్చిమగోదావరి
అన్నపూర్ణగా పెరొందిన పశ్చిమగోదావరి జిల్లాలో వరిసాగుకు ప్రమాదంలో పడింది. బంగారుపంటలు పండే సారవంతమైన నేలలు.. ఉప్పునీటితో కలుషితం అవుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా పచ్చని పంట భూములు సైతం చేపల చెరువులుగా మార్చేస్తోంది ఈ ఆక్వా మాఫియా...రెండు పంటలు పండే బంగారు భూములను సైతం భీడుభూములుగా ముద్ర వేసి తెగ తవ్వేస్తున్నారు... ఈ చెరువులు తవ్వకం ఆపాలంటూ గ్రామస్దులే ఆందోళనకు దిగినా అధికారుల్లో చలనం లేకుండా పోయింది.

రొయ్యల సాగుకు మారుతున్న భూములు 30వేల ఎకరాలు
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా వరిసాగు నుంచి ఆక్వాసాగుకు మారిన వ్యసాయ భూమి విస్తీర్ణం ఏకంగా 70లక్షల హెక్టార్లు. ఒక్క ఏడాదిలో వరిసాగు నుంచి చేపలు, రొయ్యల సాగుకు మారుతున్న భూములు 30వేల ఎకరాలకు పైమాటే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా జిల్లాలో జరుగుతున్నది మాత్రం యదార్థం. వరి సాగుచేసే రైతులను మభ్యపెట్టి భూములను లీజుల పేరుతో ఆశలు చూపి చేపల సాగు ముసుగులో రొయ్యల సాగు చేస్తూ పచ్చని పంట భూములను చెరువులుగా మార్చేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు
సాధారణంగా సాగుకు నోచుకోని., సారంలేని భూములలో మాత్రమే చేపల చెరువులు తవ్వాలి..కానీ జిల్లా వ్యాప్తంగా ఈ నిబంధనలు ఎక్కడా అమలు జరగడంలేదు. ఆక్వా చెరువులు తవ్వాలంటే ముందు వ్యవసాయ,మత్స్య, ఇరిగేషన్, మైనింగ్,పొల్యూషన్, సహా 11 డిపార్టుమెంట్ల నుంచి అనుమతి తీసుకోవాలి. కాని నిబంధనేలేవీ ఇక్కడ పనిచేయవు. పంటభూములు ఆక్వా మాఫియా హస్తాల్లోకి వెళుతున్నా.. ఒక్క అధికారి కూడా ఇటు వైపు కన్నెత్తి చూడిని పరిస్థితి నెలకొంది.

వరిపంటకు లేని గిట్టుబాటు ధరలు..
వరిపంటకు గిట్టుబాటలు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. దీంతో ధాన్యం రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఆదుకుంటామన్న నాయకులు పట్టించుకోకపోవడంతో అన్నదాతలు తమ పంటభూములను ఆక్వా మాఫియాకు లీజుకు అప్పగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏలూరు రూరల్,దెందులూరు నియోజకవర్గంతోపాటు ఆచంట, గణపవరం,భీమవరం, కాళ్ళ, నిడదవోలు, నరసాపురం, పాలకొల్లు, నిడమర్రు,ఉండి, ఆకివీడు మండలాల్లో ధాన్యంపండే భూములన్నీ ఆక్వా సాగులోకి వెళ్లిపోయాయి. ఉండి, కాళ్ళ మండలాల్లో ఒకేచోట ఏకంగా 800 ఎకరాలు చెరువులు తవ్వేసినా అధికారుల్లో ఉలుకూ పలుకూ లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆక్వా మాఫియా ఆగడాలపై అలసత్వం..
అన్నదాలకు అండగా ఉంటామని ఎన్నికల సమయాల్లో గొంతు చించుకునే నాయకులు.. ఆక్వా మాఫియా ఆగడాలపై మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. వాస్తవానికి ఆక్వా మాఫియాలో చాలా మంది రాజకీయనాయకుల బంధుగణమే ఉండటంతో అధికారులు కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మేల్కొని.. ఆక్వా మాఫియా కబంధ హస్తాల్లోకి వెళుతున్న పంటభూములను కాపాడాలని పశ్చిమగోదావరి ప్రజలు కోరుతున్నారు. 

10:50 - April 30, 2018

నిజామాబాద్ : ఆరుకాలాలు కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు రావడం లేదు. దీనికి తోడు ధాన్యాన్ని మార్కెట్‌ కు తరలించడం మరింత కష్టంగా మారింది. లారీల కొరత ఇతరత్రా కారణాలతో రైతున్నల పరిస్థితి కడు దయనీయంగా మారింది. మార్కెట్‌లోనో గిట్టుబాటు ధర రాక అన్నదాతలు నిలువునా మోసపోతున్నారు.

రబీ సీజన్లో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వ నిర్ణయం
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాల్లో రైతున్నల పరిస్థితి కడు దయనీయంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో రబీ సీజన్లో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని సివిల్‌ సప్లయ్‌ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు నిజామాబాద్‌ జిల్లాలో 259 కొనుగోలు కేంద్రాలు, కామారెడ్డిలో 204 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానన్ని కోరారు. అయితే నిజామాబాద్‌ జిల్లాలో 220 కేంద్రాలు ఏర్పాటు చేసి... వీటి ద్వారా 90 వేల మెట్రిక్‌ టన్నులు, కామారెడ్డిలో 108 కేంద్రాలు ఏర్పాటు చేసి.. 25 వేల 515 మెట్రిక్ టన్నుల దాన్యాన్నిమాత్రమే కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

అన్ని కేంద్రాల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన ధాన్యం
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో వరి కోతలు వేగంగా జరుగుతుండటంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తోంది. అన్ని కేంద్రాల్లో సుమారు రోజుకు 7 వేల నుంచి 9 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుండటంతో కేంద్రాల నుండి ధాన్యాన్ని రవాణా చేయడం సవాలుగా మారింది. ప్రతీ కేంద్రానికి మూడు లారీల చొప్పున జిల్లా వ్యాప్తంగా 350 లారీలు తిరుగుతున్నపట్పటికీ కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించడానికి మరో 500 లారీల కొరత ఏర్పడింది.. రైస్‌ మిలుల్లో అన్‌ లోడింగ్‌ సమస్య కారణంగా ధాన్యాన్ని అమ్మటంలో సమస్య ఏర్పడుతుందని చెబుతున్నారు రైతులు... మరోవైపు అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

నాలుగు మండలాలకు గాను 60 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు
ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యంలో బీ గ్రేడ్‌ ధాన్యం సుమారుగా 40 శాతం వరకు ఉంది. నిజామాబాద్‌ జిల్లాలో కొనుగోలైన ధాన్యంలో వర్ని, కోటగిరి, రుద్రూరు, బోధన్‌ నాలుగు మండలాలకు గాను 60 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కాగా కామారెడ్డి జిల్లాలో ఒక బీర్కురు మండలం నుంచే 18 వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యం కొనుగోలయ్యింది. అయితే బయటి ప్రాంతం నుండి వ్యాపారులు రాకపోవడంతో ఎలాంటి తరుగు లేకుండా ప్రభుత్వ కేంద్రాల్లో కేవలం 1550 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని.. బి గ్రేడ్‌ ధాన్యంగా తీసుకుంటున్నారని రైతులు వాపోయారు.

సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాంటున్న రైతులు
ఉమ్మడి జిల్లాలో మరో వారం రోజుల్లో వరి కోతలు భారీ మొత్తంలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ధాన్యంతో నిండిపోయి మరింత జాప్యం అయ్యేలా ఉంది బయటి నుంచి వ్యాపారులు వచ్చి వుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని స్వయంగా అధికారులే చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వరి అధికంగా ఉత్పత్తయ్యే ప్రాంతాలలో అదనంగా మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయడమే ఈ సమస్యకు పరిష్కారమని ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

09:58 - April 30, 2018

హైదరాబాద్: ఎస్సై అనుమానాస్పద మృతి చెందిన ఘటనలో నగరంలో కలకలం సృష్టించింది. అంబర్ పేట వెంకటరెడ్డి నగర్ లో ఏఎస్‌ఐ హనుమంతప్ప ఈరోపు తెల్లవారుఝామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మూడవ అంతస్థు నుండి కిందకు దూకి మృతి చెందినట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు. రామంతపూర్ వెంకట్‌రెడ్డినగర్‌లోని ఏఎస్‌ఐ ఇంటివద్ద ఈ ఘటనలో చోటుచేసుకుంది. గతంలో చాదర్ ఘాట్ లో విధులు నిర్వహించన హనుమంతప్ప అంబర్ పేటకు ట్రాన్స్ ఫర్ అయ్యారు. కాగా ఆరు నెలల క్రింతం హనుమంతప్పకు మతిస్థితిమితం లేని కారణంగా ఇంట్లో నుండి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం మేరకు సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఎస్సై భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. కాగా పోస్ట్ మార్టం అనంతరం ఈ మృతికి సంబంధించిన అనుమానాలు నివృతి అయ్యే అవకాశముంది. కాగా మతిస్థిమితం లేని హనుమంతప్పను విధులలో కొనసాగించటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తరువాత అన్ని అనుమానాలు నివృతి అయ్యే అకాశముంది.

09:31 - April 30, 2018

గద్వాల : వరుస రోడ్డు ప్రమాదాలతో పలువురు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అతివేగం కారణంగా పలు ప్రమాదాలు సంభవించగా..మద్యం మత్తులో మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యలో జోగులాంబ గద్వాల జిల్లాలో అతివేగానికి ఓ కుటుంబలోని ముగ్గురు ప్రాణాలు పోయిన సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ లో ఓ వివాహానికి హాజరై తిరిగి కర్నూలు వెళుతుండగా ఉండవల్లి స్టేజ్ సమీపంలో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో 54 ఏళ్ల తండ్రి కిరణ్ సింగ్, కుమార్తెలు అక్షయ,శారదలుగా గుర్తించారు. తల్లి విజయలక్ష్మి, కుమారుడు విజయ్ సింగ్ లకు గాయాలవ్వగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

09:23 - April 30, 2018

విశాఖ : టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా రాకుండా పోవటానికి మొదటి ముద్దాయి సీఎం చంద్రబాబు అని రెండవ ముద్దాయి ప్రధాని నరేంద్ర మోదీ అని విశాఖలో వంచన వ్యతిరేక దీక్షలో పాల్గొన్న వైసీపీ నేత భూమా కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాడుతునే వుందనీ..పోరాటంలో భాగంగా ఆందోళన కార్యక్రమాలను టీడీపీ ప్రభుత్వం అడ్డుకుందనీ గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు ప్రత్యేక హోదా క్రెడిట్ జగన్మోన్ రెడ్డికి వస్తుందని ప్రజల్లో జగన్ కు అభిమానం ఏర్పడుతున్నందుకే చంద్రబాబు తాను కూడా దీక్ష చేపట్టారని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్న కేంద్రం ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఒప్పుకుని ఏపీ ప్రజలను మోసం చేసారని వైసీపీ నేత భూమా విమర్శించారు. నాలుగేళ్ళ నుండి ప్రత్యేక హోదా గురించి మాట్లాడని సీఎం చంద్రబాబు ఇప్పుడు ధర్మపోరాట దీక్ష చేపట్టటం రాజకీయ లబ్డి కోసమేనన్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతు..బీజేపీ ఒక సిద్ధాంత పరమైనదని కానీ ఇప్పుడు పచ్చి అబద్దాల కోరుగా బీజేపీ వ్యవహరిస్తోందని అంబటి రాంబాబు విమర్శించారు. 

బీజేపీతో పొత్తు గురించి వివరించనున్న చంద్రబాబు..

చిత్తూరు : ప్రధాని మోదీ మాట్లాడుతూ హోదా, రైల్వేజోన్ అంశాలపై చేసిన ప్రసంగాల వీడియోలను తిరుపతిలో సీఎం చంద్రబాబు చేపట్టిన దీక్షలో చంద్రబాబు ప్రజలకు ప్రదర్శించనున్నట్లుగా సమాచారం. ఏపీపై బీజేపీ వైఖరిని ఎండగడుతూ..ఆ పార్టీతో నాలుగు సంవత్సరాలు ఎందుకు కలిసుండాల్సి వచ్చిందో ప్రజలకు చంద్రబాబే స్వయంగా వెల్లడిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. తిరుపతిలోని తారకరామ మైదానం వేదికగా ఈ బహిరంగ సభ జరగనుంది. ఈ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమలకు వెళ్లే చంద్రబాబు, స్వామివారిని దర్శించుకుని, అక్కడి నుంచి సభాస్థలికి చేరుకుంటారు.

ఏఎస్సై అనుమానాస్పద మృతి?..

హైదరాబాద్: ఎస్సై అనుమానాస్పద మృతి చెందిన ఘటనలో నగరంలో కలకలం సృష్టించింది. అంబర్ పేట వెంకటరెడ్డి నగర్ లో ఏఎస్‌ఐ హనుమంతప్ప అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పినట్లుగా సమాచారం. అంబర్‌పేట వెంకట్‌రెడ్డినగర్‌లోని ఏఎస్‌ఐ ఇంటివద్ద ఈ ఘటనలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం మేరకు సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఎస్సై భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

కారు బోల్తా..ముగ్గురు మృతి..

గద్వాల : ఉండవల్లి స్టేజ్ సమీపంలో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో 54 ఏళ్ల తండ్రి కిరణ్ సింగ్, కుమార్తెలు అక్షయ,శారదలుగా గుర్తించారు. తల్లి విజయలక్ష్మి, కుమారుడు విజయ్ సింగ్ లకు గాయాలవ్వగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

వైసీపీ 'వంచన'దీక్షను ప్రారంభించిన ఎంపీ మేకపాటి..

విశాఖపట్నం : వైసీపీ వంచన దీక్ష ప్రారంభమైంది. హోదా విషయంలో చంద్రబాబు నాలుగేళ్లపాటు ప్రజలను వంచించారన్న ఆరోపణలతో.. విపక్ష వైసీపీ విశాఖపట్నంలో వంచన దీక్షకు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి దీక్షను ప్రారంభించారు. సాయంత్రం 7 గంటల వరకూ ఈ దీక్ష కొనసాగనుంది. కేంద్ర, రాష్ట్ర మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ ఈ దీక్షను చేపట్టింది.ఈ దీక్షకు హాజరయిన వారంతా నల్ల రంగు దుస్తులతోహాజరయ్యారు. ఈ దీక్షకు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు సీనియన నేతలు కూడా హాజరుకానున్నారు. 

08:24 - April 30, 2018

చిత్తూరు : తిరుమల వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల ముందు, ఆతర్వాత ప్రకటించిన మోదీ.. మాట నిలుపుకోలేదంటూ సీఎం చద్రబాబు తిరుపతి తారకరామా స్టేడియంలో టీడీపీ 'ధర్మపోరాట'దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ దీక్షకు రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యేలు, టీడీపీ క్యాడర్ తోపాటు భారీగా ప్రజలు రానున్నారు. తిరుపతిలో చంద్రబాబు దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగనున్నాయి. ఈ సభలో ఏపీకి ప్రధాని మోదీ చేసిన అన్యాయంపై చంద్రబాబు గళమెత్తనున్నారు. ఈ క్రమంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రజలు తెలిపనున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నాం దాదాపు 3.00లకు పద్మావతి విశ్రాంతి గృహానికి చంద్రబాబు చేరుకోనున్నారు.అనంతరం సాయంత్రం 4 నుండి ఈ దీక్ష కొనసాగనుంది. అనంతరం 6 నుండి 7 వరకూ చంద్రబాబు ప్రసంగంచనున్నారు. 

08:16 - April 30, 2018

విశాఖపట్నం : వైసీపీ వంచన దీక్ష ప్రారంభమైంది. హోదా విషయంలో చంద్రబాబు నాలుగేళ్లపాటు ప్రజలను వంచించారన్న ఆరోపణలతో.. విపక్ష వైసీపీ విశాఖపట్నంలో వంచన దీక్షకు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి దీక్షను ప్రారంభించారు. సాయంత్రం 7 గంటల వరకూ ఈ దీక్ష కొనసాగనుంది. కేంద్ర, రాష్ట్ర మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ ఈ దీక్షను చేపట్టింది.ఈ దీక్షకు హాజరయిన వారంతా నల్ల రంగు దుస్తులతోహాజరయ్యారు. ఈ దీక్షకు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు సీనియన నేతలు కూడా హాజరుకానున్నారు. 

ఈయనేం ప్రధాని? : రాహుల్‌ గాంధీ

ఢిల్లీ : ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈయనేం ప్రధాని? అంటు ప్రధాని మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. డోక్లాంలో చైనా హెలీప్యాడ్ నిర్మిస్తుంటే మన ప్రధానేమో చైనా పర్యటనకు వెళ్లొచ్చారని ఆక్షేపించారు. చైనా అధ్యక్షుడితో కలిసి చాయ్ తాగిన ఆయన డోక్లాం విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని రాహుల్ గాంధీ నిలదీశారు. దేశంలో త్వరలో గణనీయమైన మార్పు కనిపించబోతోందనీ..కాంగ్రెస్ ఇక వరుసపెట్టి విజయాలను సొంతం చేసుకుంటుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించి గద్దెనెక్కుతామని కాంగ్రస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.

త్వరలో అమెరికా,ఉ.కొరియా అధ్యక్షుల భేటీ..

ఢిల్లీ : జపాన్‌తో చర్చలకు కిమ్ జాంగ్ సిద్ధంగా ఉన్నారని ఆయన దక్షిణా కొరియా అధ్యక్షుడు మూన్ కార్యాలయం ప్రకటించింది. జపాన్ ప్రధాని షింజో అబేకు మూన్ స్వయంగా ఫోన్ చేసి ఈ విషయం తెలిపినట్లు సమాచారం. అతి త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-కిమ్ కలవనున్నారు. ఈ నేపథ్యంలో నార్త్ కొరియా నుంచి ఒక్కొక్కటిగా సానుకూల ప్రకటనలు వస్తుండడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. తాజా పరిణామాలను నిపుణులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. కాగా వరుస అణు పరీక్షలతో ప్రపంచాన్ని బెంబేలెత్తించిన ఉత్తర కొరియా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

07:44 - April 30, 2018

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల ముందు, ఆతర్వాత ప్రకటించిన మోదీ.. మాట నిలుపుకోలేదంటూ చంద్రబాబు.. తమ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించారు. ఆతర్వాత కొన్ని రోజులకు ఎన్డీయే నుంచీ బయటకు వచ్చారు. కేంద్ర వైఖరికి నిరసనగా.. ఈనెల 20న విజయవాడలో ధర్మ పోరాట దీక్ష చేసిన చంద్రబాబు.. ఇప్పుడు నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం పేరుతో తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మరోవైపు హోదా విషయంలో చంద్రబాబు నాలుగేళ్లపాటు ప్రజలను వంచించారన్న ఆరోపణలతో.. విపక్ష వైసీపీ విశాఖపట్నంలో వంచన దీక్షకు సిద్ధమైంది. ధర్మపోరాట సభ, వంచన దీక్షపై టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం విమర్శించుకొంటున్నారు. టీడీపీ ధర్మాపోరాట సభ దగా అన్నది వైసీపీ ఆరోపణ. టీడీపీ,వైసీపీ పోటా పోటీ దీక్షలతో ఏపీకి 'ప్రత్యేక హోదా' వచ్చేనా? వీరి నిరసన, యుద్ధం ఎవరిపై ఎవరు యుద్ధం చేస్తున్నారు? ఇరు పార్టీల వైఖరితో కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేనా? లేదా ఈ పార్టీల బలహీనతలను ఆసరా చేసుకుని ఏపీలో బీజేపీ పాగా వేసేందుకు చేసే కుటిల యత్నమా? వంటి పలుఅంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ..ఈ చర్చలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, టీడీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు చందు సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉమామహేశ్వరావు, టీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ అంశాలపై మరింత సమచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..సమగ్ర సమాచారాన్ని తెలుసుకోండి.

07:35 - April 30, 2018

తెలంగాణలో త్వరలో వైద్య, ఆరోగ్యశాఖలో సమ్మె సైరన్‌ మోగనుంది. తమ సమస్యలు పరిష్కరించాలని మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి.. జేఏసీగా ఏర్పడి ఉద్యమానికి సిద్ధమయ్యాయి. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ పర్మినెంట్‌ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని.. తమ వేతనాలు పెంచాలని.. ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మే 1 నుంచి దశల వారీగా ఆందోళన చేయనున్నట్టు.. తమ సమస్యలపట్ల ప్రభుత్వ వైఖరిని బట్టి సమ్మెకు కూడా సిద్ధంగా ఉన్నట్టు వారు చెబుతున్నారు. వారి ఆందోళనకు గల కారణమేమిటి? ఎందుకు రెందుకు ఆందోళనబాట పట్టారు? వారి ప్రధాన డిమాండ్స్‌ ఏమిటి? వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న అన్ని విభాగాలు ఏకతాటిపైకి రావలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ సమ్మెలో ఎన్ని విభాగాలు ఆందోళనలో పాల్గొంటున్నాయి? వంటి పలు అంశాలపై ఈరోజు జనపథంలో..వివరాలను తెలిపేందుకు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ జేఏసీ కో-చైర్మన్‌ అశోక్‌ ఏమంటున్నారో తెలుసుకుందాం..

07:28 - April 30, 2018

సంగారెడ్డి : కేంద్రంలో ఎమ్మెన్నార్ మెడికల్ కళాశాల 45వ వర్శికోత్సవ వేడకుల ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా ఎమ్ఎన్ఆర్ ఎడ్యూకేషన్ సోసైటీ ఛైర్మన్ మంతెన నారాయణరాజు తన 80వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు.ఈ వేడుకల్లో మంత్రి హరీష్ రావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఎమ్ఎన్ఆర్ ఛైర్మన్ మంతెన నారాయణరాజుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు. 

07:21 - April 30, 2018

చితూరు : ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. హోదాపై ఇచ్చిన హామీని మోదీ నిలబెట్టుకోలేదనీ అందుకే తిరుమల వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను విస్మరించారనా అందుకే టీడీపీ ధర్మపోరాట సభను నిర్వహిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా టీడీపీపై బీజేపీ నాయకులు ఎదురు దాడికి దిగుతు..బురుద చల్లుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా ఇవాళ తిరుపతిలో జరిగే టీడీపీ ధర్మ పోరాట సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీకి హోదా ఇవ్వడంలో విఫలమైన ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు ఈ సభ నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీ అందిస్తారు.

07:11 - April 30, 2018

హైదరాబాద్ : తెలంగాణ జన సమితి అధికారంలోకి రాగానే.. అవినీతి అధికారులపై విచారణ జరిపిస్తామని ఆపార్టీ అధినేత ప్రొఫెసర్‌ కోదండరామ్ అన్నారు. సరూర్‌నగర్‌ టీజేఎస్‌ ఆవిర్భావ సభలో ప్రసంగించిన కోదండరామ్... ప్రస్తుత పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం కాకుండా.. నేతల మాటలు వినే అవినీతి అధికారులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రాజకీయ నాయకులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మక్కై వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ పరిసరాల్లోని వేలాది ఎకరాల భూములను జప్తు చేస్తే.. నగరంలోని పేద, మధ్యతరగతి ప్రజలతోపాటు.. పాత్రికేయులు, న్యాయవాదులకు ఇళ్లు కట్టించడం అసాధ్యం కాదన్నారు. గల్లీల్లోని గరీబులు సైతం గౌరవంగా బతికే రోజులు రావాలని కోదండరామ్‌ ఆకాంక్షించారు. 

07:09 - April 30, 2018

హైదరాబాద్ : తాము థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తలు మీడియా సృష్టేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. దేశంలోని వివిధ వర్గాలను సమైక్య పరచడమే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ఉద్దేశమని, ఇదింకా చర్చల దశలోనే ఉందని కేసీఆర్‌ అన్నారు. దేశంలో సమాఖ్య వ్యవస్థకు అనుగుణంగా.. ప్రస్తుత పరిస్థితులు లేవని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌ దిశగా కేసీఆర్‌ మరో అడుగు..
ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మరో అడుగు ముందుకు వేశారు. రాజకీయ కురువృద్ధుడు డిఎంకె అధినేత ఎం.కరుణానిధిని కలిశారు. ఉదయం హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న కేసీఆర్‌.. నేరుగా కరుణానిధి నివాసానికి వెళ్లారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా.. కరుణానిధి కొన్ని పుస్తకాలను కేసీఆర్‌కు బహూకరించారు.

కురుణానిధి, స్టాలిన్ లతో కేసీఆర్ భేటీ..
కరుణానిధితో భేటీ అనంతరం.. కేసీఆర్‌, స్టాలిన్‌ నివాసానికి వెళ్లారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఇద్దరు నేతలూ... ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు సమాలోచనలు జరిపారు. మొదటి యూపీఏ ప్రభుత్వంలో తాను డిఎంకెతో కలిసి పనిచేసిన సందర్భాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. భారత రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్న కేసీఆర్‌.. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమాఖ్య వ్యవస్థ ఉండాలని, అయితే.. ప్రస్తుత పరిస్థితులు దేశాభివృద్ధికి సహకరించేలా లేవని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీరు, గ్రామీణ, పట్టణాభివృద్ధి రంగాల్లో కేంద్ర, రాష్ట్రాల వాటాపై స్పష్టత ఉండాలని కేసీఆర్‌ అన్నారు.

వివిధ వర్గాలను సమీకరించడమే యత్నమే : కేసీఆర్
దేశ రాజకీయాల్లో తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. దేశంలోని వివిధ వర్గాలను సమీకరించడమే తన ప్రయత్నమని అన్నారు. తమ చర్చల్లో స్పష్టత వచ్చేందుకు మరో మూడు నెలల కాలం పడుతుందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

దక్షిణాది రాష్ట్రాలు కలసి రావాలి : కేసీఆర్
ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు కలసి రావాలన్న కేసీఆర్‌ పిలుపునకు.. స్టాలిన్‌ సానుకూలంగానే స్పందించారు. అయితే.. తమతో కలసి సాగుతున్న పార్టీలతో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు .

స్టాలిన్ ను హైదరాబాబాద్ రావాలని ఆహ్వానించిన కేసీఆర్..
స్టాలిన్‌తో కలసి.. కేసీఆర్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీతోనూ ఫోన్‌లో మాట్లాడారు. మే 10న ప్రారంభం కానున్న రైతు బంధు పథకం ప్రారంభం రోజున.. స్టాలిన్‌ను తెలంగాణకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానించారు. ఆదివారం రాత్రి చెన్నైలోనే బస చేయనున్న కేసీఆర్‌ సోమవారం మరికొంత మంది నేతలతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో.. కేసీఆర్‌ వెంట ఎంపీలు కేశవరావు, వినోద్‌, మంత్రి ఈటల రాజేందర్‌ తదితరులు ఉన్నారు.

పార్టీ నేతలతో చర్చించాలి : స్టాలిన్
ఇప్పటికే తమిళనాడులో మాతో కొన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఆ పార్టీల నేతలతో నేను చర్చించాలి. అంతేకాదు డిఎంకె కి చెందిన వివిధ విభాగాల నాయకులు ఉన్నారు.. వారితోనూ చర్చించాలి. ఆతర్వాతే మీతో మాట్లాడతాను అని కేసీఆర్‌ గారికి చెప్పాను.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి..

ప్రకాశం : వివిధ కారనాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కొనకమిట్ట మండలం గొట్టగట్టు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటో, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. 

నిలిచిపోయిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్..

నల్లగొండ : అర్థరాత్రి ఆరెంజ్ ట్రావెల్స్ బస్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. సాంకేతిక లోపంతో ఆరెంజ్ ట్రావెల్స్ బస్ నకిరేకల్ వద్ద నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాజమాన్యానికి సమాచారం అందించినా వారు ఏమాత్రం పట్టించుకోవటంలేదని ప్రయాణీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తంచేశారు. 

నిలిచిపోయిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్..

నల్లగొండ : అర్థరాత్రి ఆరెంజ్ ట్రావెల్స్ బస్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. సాంకేతిక లోపంతో ఆరెంజ్ ట్రావెల్స్ బస్ నకిరేకల్ వద్ద నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాజమాన్యానికి సమాచారం అందించినా వారు ఏమాత్రం పట్టించుకోవటంలేదని ప్రయాణీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తంచేశారు. 

మూడోసారి సీపీఐ జాతీయ కార్యదర్శిగా సురవరం..

ఢిల్లీ : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్‌రెడ్డి ముచ్చటగా మూడోసారి ఎన్నికయ్యారు. కేరళలోని కొల్లంలో నిర్వహించిన ఆ పార్టీ 23వ జాతీయ మహాసభల్లో సుధాకర్ రెడ్డిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణకు చెందిన సుధాకర్ రెడ్డి నల్లగొండ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2012లో తొలిసారి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం నియమితులయ్యారు. 126 మందిని జాతీయ కౌన్సిల్ సభ్యులుగా, 11 మంది సెక్రటేరియట్ సభ్యులుగా, 11 మందిని కంట్రోల్ మిషన్ సభ్యులుగా, 13 మందిని క్యాండిడేట్ సభ్యులుగా నియమించారు.

టీడీపీ 'ధర్మపోరాట సభ'..

అమరావతి : ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా ఈరోజు తిరుపతిలో టీడీపీ 'ధర్మపోరాట సభ' నిర్వహించనుంది. తిరుపతిలో ఎన్నికలకు ముందు మోదీ ఇచ్చిన హామీలను వివరిస్తూ కేంద్ర సర్కారు తీరును ఎండగట్టనుంది. రేపు మధ్యాహ్నం శ్రీవారిని దర్శించుకున్న తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభకు హాజరవుతారు. కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా ఇటీవల చంద్రబాబు నాయుడు 12 గంటల నిరాహార దీక్ష కూడా చేసిన విషయం తెలిసిందే.

Don't Miss