Activities calendar

01 May 2018

గుత్తాకు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..

హైదరాబాద్ : గుత్తా సుఖేందర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా గుత్తా నియామకంపై బీజేపీ నేత మధుసూదన్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం గుత్తా సుఖేందర్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను వేసవి సెలవులు అనంతరం వాయిదా వేసింది. కాగా కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ ప్రభ్వుంలో చేరిన గుత్తాకు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా గుత్తా నియామించింది. దీనిపై బీజేపీ నేత మధుసూదన్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు.   

హత్య కేసు కోర్టు సంచలన తీర్పు..

గుంటూరు: గురజాల కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హత్య కేసు దోషులకు ఉరిశిక్షతో పాటు జీవితఖైదు విధించింది. అంతేకాదు రూ.10 వేలు జరినామా విధించింది. 2011లో గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడలో ఈ హత్య జరిగింది. ఈ కేసులో దోషులుగా సుబానీ, పెదజాన్, బుజ్జి, అహ్మద్‌ ఉన్నారు. ఆస్తి కేసు వివాదంలో 2011 నవంబర్ 4న షేక్ సైదా అనే వ్యక్తిని సుబానీ, పెదజాన్, బుజ్జి, అహ్మద్‌ హత్య చేశారు. ఏడేళ్లపాటు విచారణ జరిపిన కోర్టు ఐపీసీ 302 ప్రకారం వీరికి ఉరిశిక్షతో పాటు ఐపీసీ 120/34 ప్రకారం జీవిత ఖైదు విధించింది. అయితే హత్యకు గురైన వ్యక్తి..

100శాతం అక్ష్యరాస్యతకు ఏపీ సీఎస్ ఆదేశాలు..

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ని అతి త్వరలో నూరుశాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్య, వైద్య సేవలను సక్రమంగా అందించగలిగితే సమాజం అన్ని విధాలుగా మెరుగైన అభివృద్ధిని సాధిస్తుందని, ఈ విషయంలో మంచి ఫలితాలు సాధిస్తే భవిష్యత్తు తరాలకు తిరుగుండదని అన్నారు. ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులకు మెరుగైన నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించే విధంగా మంచి పునాదిని వేయాలని చెప్పారు.

రైతుబంధు పథకానికి నిధులు సిద్ధం : కేసీఆర్

హైదరాబాద్ : రైతుబంధు, పాసు పుస్తకాల పంపిణీపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతుబంధు పథకానికి అవసరమైన నిధులు సమకూర్చి బ్యాంకుల్లో సిద్ధంగా వుంచామని కేసీఆర్ తెలిపారు. రూ.4114.62 కోట్లు బ్యాంకుల్లో సిద్ధంగా వున్నాయన్నారు. మరో రూ.2వేల కోట్ల నగదు విడుదలకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రైతు నగదును బ్యాంకులు ఇతర అవసరాలకు వాడవద్దనీ..10 నుండి మొదటి విడత డబ్బులు చెక్కుల రూపంలో పంపిణీ చేస్తానమన్నారు. ఆధార్ అనుసంధానం చేసిన వారికి చెక్కులు, పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.  

నెల్లూరు జిల్లాలో భారీ వర్షం..

నెల్లూరు : జిల్లాలో అనుకోకుండా ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. ఆత్మకూరు, మర్రిపాడు, ఏఎస్ పేట, అనంతసాగరం మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో అప్రమత్తంగా వుండాలని అధికారులు ప్రజలకు సూచించారు. 

మద్యం మత్తులో కాల్పులు..పెళ్లిపీటలపై వరుడు మృతి..

ఉత్తరప్రదేశ్ : మద్యం మత్తులో స్నేహితుడు జరిపిన కాల్పుల్లో పెళ్లి పీటలపై వరుడు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలోని రామ్‌పూర్‌లో చోటుచేసుకుంది. పెళ్లి సందర్భంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురి తరఫు బంధువులందరూ గడుపుతోన్న సమయంలో పెళ్లి కొడుకు ఒక్కసారిగా పెళ్లి పీటలపైనే కుప్పకూలిపోవడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా తుపాకీ పేల్చిన యువకుడు పరారీలో ఉన్నాడని నిందితుడి ఆచూకీ కోసంగాలింపు చర్యలు చేపట్టామని అన్నారు.  

అకాల వర్షాలకు 11మంది మృతి..

విజయవాడ : కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కురుస్తోన్న అకాల వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటమే కాక 11మంది మృతి చెందారు. భారీ వర్షాలకు పలు చోట్ల చెట్టుకూలి పడ్డాయి. పిడుగు పాట్లు, చెట్లు విరిగిపడిన ఘటనల్లో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రజలు సురక్షిత మైన భవనాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. మూడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయమేర్పడింది.

20:02 - May 1, 2018

కేంద్ర రాష్ట్ర విభజన నేపథ్యంలోఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రంపై ఎదురు దాడిచేస్తోందనీ..అందుకే కేంద్రం వైఖరికి నిరసనగా సీఎం చంద్రబాబు నాయుడు 'ధర్మ పోరాట'దీక్షను తిరుపతిలో చేపట్టారు. మరోపక్క టీడీపీ వైఖరికి నిరసనగా వైసీపీ వంచన వ్యతిరేక దీక్షను విశాఖలో నిర్వహించింది. కాగా ఇరు పార్టీలు దీక్షలో ఒకరినొకరు విమర్శించుకున్నారే తప్ప ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు..విభజన హామీలను ఎలా నెరవేర్చుకోవాలో మాత్రం ఎవరు చెప్పలేదు. ఈ నేపథ్యంలో వీరి దీక్షలు స్వప్రయోజనాల కోసమే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం అందరినీ కలుపుకుపోతామని చెబుతునే ఎవరికి వారు మరొకరిపై ఆరోపణలు, విమర్శలతోనే దీక్షను సరిపెట్టాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోనాలా? స్వప్రయోజనాలా?..ఎందురు అధికార, ప్రతిపక్షాలు దీక్షలు చేపట్టాయి. దీక్షల ఉద్ధేశ్యమేమిటి? అనుకున్నదేమిటి? జరిగిందేమిటి. అనే అంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ.ఈ చర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ, 

20:01 - May 1, 2018

వనపర్తి : గ్రామీణ ప్రజలలో చైతన్యం వచ్చినప్పుడే అభివృద్ధి చెందుతుందంటున్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. గతంలో వనపర్తి జిల్లా చిన్నమందడి గ్రామాన్ని దత్తత తీసుకున్న లక్ష్మీనారాయణ... తన ఉద్యోగానికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి సందర్శించారు. ప్రజలతో పూర్తి సమయాన్ని కేటాయించేందుకే ఉద్యోగాన్ని రాజీనామా చేశానంటునని లక్ష్మీనారాయణ తెలిపారు. తరగతి గదుల నుండి దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అబ్దుల్ కలాం గారు కూడా అన్నారని అందుకు తాను పాఠశాలలను సందర్శిస్తున్నానని తెలిపారు. తాను పదవికి రాజీనామా చేశారు పలుగ్రామాలను సందర్శించి తన భవిష్యత్ ప్రణాళిక చెబుతానని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

19:54 - May 1, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ గెలవకుంటే గడ్డం తీయమని కాంగ్రెస్ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారనీ..గడ్డం పెంచుకుంటే గబ్బర్ సింగ్ లు అయిపోతారా. అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏన్నో ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌ నేతలు.. రాష్ట్రానికి చేసిందేమీ లేకపోయినా.. తాము చేస్తున్న పనులకు అడుగడుగునా అడ్డుపడుతున్నారన్నారు. మేము మాటలు చెప్పేవాళ్లం కాదని... పనులు చేసి చూపిస్తున్నామన్నారు కేటీఆర్‌. 

19:35 - May 1, 2018

హైదరాబాద్ : కేరళలో జరిగిన సీపీఐ మహాసభలు విజయవంతమయ్యాయన్నారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి. మరోసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత హైదరాబాద్‌ వచ్చిన సురవరానికి సీపీఐ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. వామపక్ష శక్తులను ఏకం చేసి... విశాల వేదికను నిర్మించడం ద్వారా బీజేపీని ఓడించాలని మహాసభల్లో నిర్ణయం తీసుకున్నామని సురవరం తెలిపారు. అమిత్‌షా వ్యాఖ్యలు చూస్తుంటే.. కేసీఆర్‌ ఏర్పాటు చేయబోతున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ బీజేపీకి లాభం చేకూర్చేందుకేనని స్పష్టమైందన్నారు సురవరం.

సినీ పెద్దలతో టీయూడబ్ల్యూజే భేటీ..

హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమ పెద్దలతో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లంనారాయణ, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్, టీయూడబ్ల్యూజే కోశాధికారి మారుతీసాగర్, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌బాబు, అల్లు అరవింద్, డైరెక్టర్లు ఎన్. శంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కేఎల్ నారాయణ పాల్గొన్నారు. 

టీటీడీపై హైకోర్ట్ సీరియస్...

హైదరాబాద్ : టీటీడీపై హైకోర్ట్ సీరియస్ అయ్యింది. జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు ఎందుకు వేయకూడదని ప్రశ్నించింది. అధిక వడ్డీ వస్తుందని ప్రయివేటు బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారా? అని టీటీడీపీ హైకోర్టు ప్రశ్నించింది. భద్రత గురించి పట్టింకోరా అని ప్రశ్నించింది. దీనికి సంబంధించి నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీ బోర్డుకు హైకోర్డు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వేసవి సెలవులు అనంతరం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.

పాలి సెట్ ఫలితాలు విడుదల..

హైదరాబాద్: పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2018 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిత్తల్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం అభ్యర్థులు www.ntnews.com, www.polycetts.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ విభాగాల్లోని పలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్రస్థాయిలో పాలీసెట్ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. టీఎస్ పాలీసెట్ పరీక్షను గడిచిన ఏప్రిల్ 21వ తేదీన నిర్వహించారు.

గొప్ప దృక్పథం ఉన్న నాయకుడు పవన్ : దేవ్

హైదరాబాద్‌ : గొప్ప దృక్పథం ఉన్న నాయకుడు పవన్ కల్యాణ్. ఎన్నికలప్పుడు వచ్చి ముఖం చూపించి వెళ్లిపోయేటటువంటి రాజకీయనాయకుడు కాదు. ఆయనకు ప్రజా సమస్యల పట్ల, సామాజిక అంశాల పట్ల స్పష్టమైన అవగాహన వుందని జనసేన పార్టీ ఎన్నికల వ్యూహకర్త దేవ్ పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో కలిసి పని చేసిన అనుభవం నాకు ఉంది. ఈ రంగంలో దశాబ్ద కాలంగా వున్నాననీ..జనసేన పార్టీకి బలమైన భావజాలాల్ని, సిద్ధాంతాల్ని రూపొందించారు. అందుకు పటిష్టమైన వ్యూహాన్ని జోడిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తామనీ దేవ్ ధీమా వ్యక్తం చేశారు.

17:14 - May 1, 2018
17:12 - May 1, 2018

అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల కసరత్తును షురూ చేశారు. ఏపీలో 175 చోట్ల పోటీ చేయనున్నట్లుగా పవన్ కళ్యాణ ప్రకటించారు. ఎన్నికల కసరత్తు నేపథ్యంలో ఏపీలోని 13 జిల్లాల ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పార్టీ ప్రధాన ఎన్నికల వ్యూహకర్తగా దేవ్ ను నియమించారు. ఈ సందర్భంగా పవన్ మట్లాడుతు..ఏపీలో పక్కా వ్యూహంతో ముందుకెళతామని తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తుందా? లేదా? అనే విషయాన్ని ఆగస్టులో ప్రకటిస్తానన్నారు. ఏపికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం ప్రభుత్వాలను జనసేన నిలదీస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలను తెలియపరిచేలా త్వరలో ప్రజల మధ్యకెళ్తానని పవన్ ప్రకటించారు. 11వ తేదీన రాష్ట్ర పర్యటనకు సంబంధించిన వివరాలను తెలిజేస్తామన్నారు. ప్రకటించిన 48 గంటల్లోనే ప్రజల్లో వుంటానని జనసేన అధినేత ఉత్సాహంగా ప్రటించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యూహకర్త దేవ్‌ను పరిచయం చేశారు. జనసేనకు అనుభవం లేదంటూ ప్రత్యర్థులు చేస్తోన్న వ్యాఖ్యలు అర్థరహితమని, గత రెండు ఎన్నికల్లో పని చేసిన అనుభవం జనసేన కార్యకర్తలది అని పవన్ వ్యాఖ్యానించారు.

175 స్థానాల్లో జనసేన పోటీ..

అమరావతి : వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ ముఖ్య కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పక్కా ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళదామని పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. బూత్‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికబద్ధంగా అడుగులు వేద్దామని అన్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యూహకర్త దేవ్‌ను పరిచయం చేశారు. జనసేనకు అనుభవం లేదంటూ ప్రత్యర్థులు చేస్తోన్న వ్యాఖ్యలు అర్థరహితమని, గత రెండు ఎన్నికల్లో పని చేసిన అనుభవం జనసేన కార్యకర్తలది అని పవన్ వ్యాఖ్యానించారు

17:07 - May 1, 2018

ఢిల్లీ : అనాథ శవాలకు డిఎన్‌ఎ ప్రొఫైలింగ్‌కు సంబంధించి త్వరలో చట్టం తీసుకురానున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అనాథ శవాలకు డిఎన్‌ఎ పరీక్షలు జరపాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కేంద్రం చట్టం తీసుకొస్తున్నందుకు ఇక విచారణ అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. డిఎన్‌ఎ ప్రొఫైలింగ్‌ ద్వారా అనాథ శవాలకు గుర్తించే అవకాశముందని లోక్‌నీతి ఫౌండేషన్‌ అనే స్వచ్చంధ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. డిఎన్‌ఏ ద్వారా గుర్తు తెలియని శవాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించేందుకు సుళువవుతుందని పేర్కొంది. 

17:01 - May 1, 2018

అమరావతి : ఏపీలో రైతులకు రుణమాఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోయేటట్లు ఉంది. మొదటి విడత చెల్లించేందుకు రెండేళ్లు పట్టగా... నాలుగైదు విడతలు ఇంకా చెల్లించాల్సి ఉంది. అయితే... ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ రెండు విడతలను ఒకేసారి చెల్లించాలని సర్కార్‌ భావిస్తోంది. అయితే... వీటికి నిధులు లేవని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. దీంతో రుణమాఫీ జరుగుతుందా ? లేదా ? అనే సందిగ్ధంలో పడ్డారు రైతులు.

రుణమాఫీ చేస్తామని ప్రకటించిన టీడీపీ
కేంద్రం, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. ప్రభుత్వాన్ని అధికారం నుండి దింపాలన్నా ప్రధాన భూమిక రైతులదే. రైతులను ఆదుకునే ప్రభుత్వాలకే రైతులు అధికారం కట్టబెడతారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికల్లో రైతులందరికీ రుణమాఫీ చేస్తానని టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా రైతులకు రుణమాఫీ ఇంకా చేస్తామనే అంటున్నారు చంద్రబాబు. త్వరగా రుణమాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు. అయితే... మరో ఏడాదిలో ఎంతమేరకు రుణమాఫీ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

చివరి విడతల్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు
2019 ఎన్నికల సీజన్ దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు సరికొత్త ఎత్తుగడ వేస్తున్నారన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రైతు రుణమాఫీ నాలుగైదు విడతలు ఈ ఏడాది ఒకేసారి చెల్లిస్తానని రైతులను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఇదివరకే మూడో విడత కోసం విజయబ్యాంక్‌, ఆంధ్రాబ్యాంక్‌ నుంచి రైతు సాధికార సంస్థ పేరు మీద అప్పుతీసుకొని రుణమాఫీకి సర్దుబాటు చేసి రూ. 500 కోట్లు బకాయి పడ్డారు. వీటిని 2018 బడ్జెట్‌ నుంచి సర్దుబాటు చేయాల్సి ఉంది. నాల్గవ విడతకు 2018-2019 బడ్జెట్‌లో రూ. 4,100 కోట్లు ప్రతిపాదించారు. మరోవైపు పాత బకాయి రూ. 500 కోట్లు, నాలుగైదు విడతలకు కలిపి మొత్తం రూ. 8,200 కోట్లుగా ఉన్నాయి... వడ్డీతో కలిపి చివరి రెండు మాఫీ వాయిదాలను ఒకే దఫా రైతులకు చెల్లించాలంటే సుమారు రూ. 9 వేల నుంచి 10 వేల కోట్లు అవసరం కానున్నాయని ఇటు రైతులు, ప్రతి పక్ష నేతలంటున్నారు.

2014 బడ్జెట్‌ రుణమాఫీ కావాల్సిన మొత్తం రూ. 87 వేల కోట్లు
ఇది ఇలా ఉంటే 2014 నాటికి రుణమాఫీ కావాల్సిన మొత్తం రూ. 87 వేల కోట్లుగా ఉంది. పలు ఆంక్షలు, కోతలు, నిబంధనలు విధించి ఐదేళ్లలో 10 శాతం వడ్డీతో కలుపుకొని రూ. 24,500 కోట్లు ఉపశమనం కల్గిస్తామని కేంద్ర పాలకులు తెలిపారు. 2018 ఏడాదిలో ఐదు విడుతల రుణమాఫీ పూర్తికావాల్సి ఉండగా మొదటి విడత మాఫీ ప్రక్రియ రెండేళ్లు సాగింది. దీంతో ఒకేసారి వరుసగా నాలుగు బడ్జెట్‌లు కలుపుకొని రుణమాఫీకి రూ. 16,412 కోట్లు ప్రభుత్వం కేటాయించగా.. మూడు విడతల్లో రూ.14 వేల కోట్లు చెల్లించింది. మిగిలిన నాలుగైదు విడతలకు రూ. 10,500 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. రెండు విడతలు ఒకేసారి చెల్లించినట్లయితే 1500 కోట్ల రూపాయల వడ్డీ తగ్గి.. 9 వేల కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుందని సర్కార్‌ భావిస్తోంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో... నాలుగైదు విడతలు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే... దీనికి నిధులు అందేలా లేవని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. 

16:58 - May 1, 2018

హైదరాబాద్‌ : మహానగరం ఆక్రమనిర్మాణాలకు కేరాఫ్ ఆడ్రాస్ గా మారింది. గ్రేటర్ పరిధిలో వందలాది ఆక్రమనిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి. పాలకులు ఎన్ని మాటలు చెప్పినా ఆక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. నగర శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలకు ఆడ్డూఅదుపులేకుండా పోయింది. బల్దియాఅధికారుల అండదండలతో ఆక్రమార్కులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలొస్తున్నాయి.

అధికారుల అండాతో రెచ్చిపోతున్న అక్రమార్కులు
హైదరాబాద్‌ నగర శివారులో ఆక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గతంలో గ్రామ పంచాయితీలు, పాత మున్సిపాలిటీల పేరుతో నకిలీ ప్రతాలను సృష్టించి అక్రమాలకు తెరలేపుతున్నారు. అధికారుల అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో ఆక్రమంగా నిర్మించిన భవనాలు కూలిపోయిన ఘటనల్లో చాలా మంది కూలీలు ప్రాణాలు కొల్పోయారు. స్పాట్ విజువల్స్..

హౌజింగ్ సోసైటీ పేరుతో అక్రమనిర్మాణాలు
మోహదీపట్నం, బోజగుట్టలో జీహెచ్‌ఎంసీ స్థలాల్లో అక్రమనిర్మాణాలు వెలుస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలను సైతం దిక్కరిస్తూ అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయని ని స్థానికులు అంటున్నారు. 2015 అక్టోబర్ 28 తరువాత ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన కూల్చివేస్తామన్న బల్దియా అధికారులు.. ఇపుడు సైలెంట్‌ అయ్యారు. ఎల్ ఆర్ ఎస్ , బీఆర్ ఎస్ అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదనే నిబంధనలు ఉన్నపటికి వాటిని అమలు చేయడంలో బల్దియా నిర్లక్ష్యం వహిస్తుందనే స్థానికులు మండిపడుతున్నారు.రాజకీయనేతల అండవల్లే నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయనే ఆరోపణలొస్తున్నాయి. పొలిటికల్‌ ఒత్తిడి ఉండటంతో తాము ఏచర్యలు తీసుకోలేక పోతున్నామని జీహెచ్ఎంసీ అధికారులు అంటున్నారు. మొత్తానికి అవినీతి అధికారులు, రాజకీయనేతలవల్ల గ్రేటర్‌లో అక్రమనిర్మాణాలు పెరిగిపోతున్నాయని.. ఇకనైనా అక్రమనిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని హైదరాబాద్‌ పబ్లిక్‌ కోరుతున్నారు.

16:52 - May 1, 2018

హైదరాబాద్‌ : ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని ఎంబీభవన్‌లో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీపీఎం కేంద్ర సభ్యులు, నేతలు జెండాను ఆవిష్కరించారు. కార్మికుల హక్కుల కోసం, ఐక్యత కోసం ఉద్యమంగా పోరాడుదామని పిలుపునిచ్చారు సీపీఎం నేతలు. పెట్టుబడి దారి వ్యవస్థను నిర్మూలించేవరకు ప్రజాస్వామిక శక్తులను ఏకం చేసి కలిసికట్టుగా ముందుకు సాగుదామన్నారు. మోదీ ప్రభుత్వం ప్రైవేటు రంగాలకు భారీ స్థాయిలో రాయితీలు ఇస్తూ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయన్నాయని సీపీఎం నేతలు ఆరోపించారు. 

16:50 - May 1, 2018

హైదరాబాద్ : "మే" డేను పురస్కరించుకుని హైదరాబాద్‌లో పలు కార్మిక సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. సీఐటీయూఆధ్వర్యంలో నారాయణ గూడా చౌరస్తా నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకూ వివిధ రంగాల కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి బాబా పాల్గొన్నారు. పోరాటాల ఫలితంగానే కార్మికులు 8 గంటల పని దినాలను సాధించుకున్నారని చెప్పారు. నేటి పాలకులు కార్పొరేట్‌ శక్తులకు తొత్తులుగా మారి .. కార్మికుల హక్కులను తుంగలో తొక్కుతున్నారంటున్నారు.

16:48 - May 1, 2018

భద్రాద్రి కొత్తగూడెం : ఘనంగా మేడే సంబరాలు జరిగాయి. వీధి వీధిన ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. ఖమ్మంలో నయాబజార్‌ కాలేజీ నుండి గాంధీ చౌక్‌ మీదుగా రెడ్‌ షర్ట్‌ వాలంటీర్లు కదం తొక్కారు. ఈ భారీ ప్రదర్శనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఖమ్మంలో కార్మిక దినోత్సవంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

16:45 - May 1, 2018

ఢిల్లీ : దేశంలో కార్మిక పోరాటాలను తమ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. దేశ ప్రజలంతా కార్మిక, ప్రజా పోరాటాలను బలపర్చాలని కోరారు. దేశంలో ప్రజలకు అనుకూలమైన పాలసీలు ఉండాలన్నారు. దేశానికి నేతల అవసరం లేదని... జనహితార్థం నీతివంతమైన విధానాలు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు హాజరైన ఆయన... ప్రజల ఐక్యతను కాపాడటం కోసం సీపీఎం పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. మోదీ పాలనలో బీజేపీ విధానాలు, సంఘ్‌పరివార్‌ శక్తులతో .. దేశ ఐక్యతకు ప్రమాదం ఏర్పడే ప్రమాదం నెలకొందని పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. మేడే దేశంలోని కార్మికులకు, పీడిత వర్గానికి స్ఫూర్తి కలిగిస్తుందన్నారు. మోదీ పాలనలో కార్మికులకు కనీస వేతనాలు అమలుకావడం లేదని కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్‌. పుణ్యవతి అన్నారు.

16:42 - May 1, 2018

కర్ణాటక : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోది కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని టార్గెట్‌ చేశారు. చామ్‌రాజ్‌నగర్‌ జిల్లాలో జరిగిన బహిరంగసభలో మోది ప్రసంగిస్తూ...బిజెపిని విమర్శించడానికే రాహుల్‌ ప్రాధాన్యతనిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెబితే...మీ తల్లి సోనియా...ఓ అడుగు ముందుకేసి ఇంటింటికి కరెంట్‌ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. 2009 వరకు కూడా ఆ హామీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. 18 వేల గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మోది అన్నారు. దేశంలో ప్రతి ఇంటికి కరెంట్‌ కనెక్షన్‌ ఇవ్వడం తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

విజయవాడలో 4గంటలకే చీకట్లు!..

కృష్ణా : జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. దీంతో విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈదురుగాలులో కూడిన వర్షంతో నాలుగు గంటలకు నగరంలో చీకట్లు అలుముకున్నాయి. నాలుగు ఈదురు గాలులకు విజయవాడలోను పలు హోర్డింగులు, చెట్లు కూలిపోయాయి. ఈ అకాల వర్షంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు.   

నకిలీ పాస్ పోర్ట్ ముఠాలు అరెస్ట్..

హైదరాబాద్ : నగరంలో నకిలీ పాస్ పోర్టులు, క్రెడిట్ కార్డులతో బ్యాంకులకు టోకరా వేస్తున్న 19 మందితో కూడిన ముఠాను వీరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు నాలుగు ముఠాలుగా విడిపోయి మోసాలకు పాల్పడుతున్నారు. వీరి వద్ద నుండి 200ల క్రెడిట్ కార్డులు, 49 పాస్ పోర్టులు, బ్యాంక్ చెక్ బుక్స్, రూ.4 లక్షల నగదు, 7 ల్యాడ్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇప్పటి వరకూ రూ.2.29 కోట్లను మోసం చేసినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. 

16:13 - May 1, 2018

నెల్లూరు : చేసేది అటెంట్ ఉద్యోగం. కూడబెట్టింది కోట్ల రూపాయల ఆస్తులు. రావాణాశాఖలో కేవలం అటెండర్ గా పనిచేస్తున్న వ్యక్తి రూ,80కోట్లు అక్రమాస్తులను కూడగట్టాడు. ప్రమోషన్ వచ్చినా అటెండర్ ఉద్యోగంతోనే వెంపర్లాడుతు భారీగా ఆస్తులు కూడబెట్టాడు. కానీ ఏసీబీ అధికారులకు పక్కాగా దొరికిపోయాడు. అతని ఆస్తులు చూస్తే మాత్రం ఎవరికైనా షాక్‌ తగలాల్సిందే. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 80 కోట్లకుపైగా అక్రమ ఆస్తులు కూడబెట్టాడు. నెల్లూరు జిల్లా ఉప రవాణాశాఖలో పని చేస్తున్న నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నెల్లూరులోని నివాసంతో పాటే.. ఆరు ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు చేశారు. తనిఖీల్లో 80 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. 50 ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు, 18 ప్లాట్లు, రెండి కిలోల బంగారం, ఏడున్నర లక్షల నగదు గుర్తించారు. నరసింహారెడ్డి భార్య పేరుపై కూడా అనేక ఆస్తులున్నట్లు గుర్తించారు. నరసింహారెడ్డికి గత కొంతకాలంగా ప్రమోషన్లు వచ్చినా... వెళ్లకుండా అక్కడే అటెండర్‌గా కొనసాగుతున్నాడు. అయితే.. ఇందులో బినామీ ఆస్తులు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇంకా రెండు లాకర్లు తెరవాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. 

 

 

 

అవినీ అనకొండ ఇంట్లో రూ.80కోట్లు..

నెల్లూరు : చేసేది అటెంట్ ఉద్యోగం. కూడబెట్టింది కోట్ల రూపాయల ఆస్తులు. రావాణాశాఖలో పనిచేస్తున్న అటెండర్ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాలలో దాదాపు రూ.80 కోట్ల విలువ చేసే ఆస్తులు బైటపడ్డాయి. లంచాలకు అలవాటు పడిన ఈ లంచావతారు ప్రమోషన్ల వచ్చినా వెళ్లకుండా అటెండర్ గానే ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారం మేరకు ఏసీబీ అధికారులు నరసింహారెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. 

పోస్టుల భర్తీకి సర్కార్ ఉత్తర్వులు..

హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 113 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో 74 పోస్టులు,ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుల పరిధిలో 30 పోస్టులు,చక్కెర సంచాలకుల పరిధిలో 6 పోస్టులు, సహకార కమిషనర్ పరిధిలో 3 జూనియర్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులన్నింటినీ టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.

లక్షల కొద్దీ అరుదైన తాబేళ్లు మృతి!!..

హైదరాబాద్ : కొన్ని లక్షల అరుదైన తాబేళ్లు మృతి చెందిన దుర్ఘటన నెలకొంది. అరుదైన జాతికి చెందిన ఆలివ్ రిడ్లీ జాతి తాబేలు పిల్లలు మృత్యువాత పడ్డాయి. ఒడిశాలోని గహిర్మాత బీచ్ ఒడ్డున ప్రతి ఏటా లక్షల సంఖ్యలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు జన్మిస్తాయి. కొన్ని వేల మైళ్లు ప్రయాణించే తల్లి తాబేళ్లు.. ఇక్కడి బీచ్‌లోనే గుడ్లు పెట్టి వెళ్లిపోతాయి. అవి పొదిగి పిల్ల తాబేళ్లు బయటకు వస్తాయి. అయితే ఈసారి అకాల వర్షాల కారణంగా బీచ్‌లో ఇసుక మొత్తం గట్టిగా మారింది. దీంతో గుడ్లలో నుంచి బయటకు వచ్చిన పిల్ల తాబేళ్లు ఆ ఇసుక నుంచి బయటకు రాలేక చనిపోయాయి. 

వైసీపీకి రాజీనామా చేసిన దుట్టా..

విడజవాడ : వైసీపీ రాష్ట్ర రాజకీయ సలహాదారు దుట్టా రామచంద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. దివంగత ఎన్టీఆర్ జిల్లాలోని నిమ్మకూరు అనే విషయం అనే సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత జగన్ చేపట్టిన యాత్రలో భాగంగా నిమ్మకూరులో పర్యటించిన సందర్భంగా కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటనను ఉపసంహరించుకున్నాకనే వైసీపీకి తిరిగి వస్తానని ఆయన తెలిపారు. ఈ ప్రకటన ఉపసంహరించుకోవాలనీ..లేని పక్షంలో కృష్ణానది పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి, ఉద్యమిస్తామని..నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. 

15:10 - May 1, 2018

కృష్ణా : దివంగత ఎన్టీఆర్ జిల్లాలోని నిమ్మకూరు అనే విషయం అనే సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత జగన్ చేపట్టిన యాత్రలో భాగంగా నిమ్మకూరులో పర్యటించిన సందర్భంగా కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటనపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తోంది. వైసీపీ రాష్ట్ర రాజకీయ సలహాదారు దుట్టా రామచంద్రరావు ... జగన్ ప్రకటనను తప్పుబట్టారు. కృష్ణమ్మ ఎన్నో రాష్ట్రాలు దాటుకుని ఏపీలో ప్రవహిస్తోందని... కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తోందని..ఏ రాష్ట్రంలో కూడా కృష్ణా పేరుతో జిల్లా లేదని... మన రాష్ట్రంలో మాత్రమే ఉందని, అలాంటి మహా తల్లి పేరును మారిస్తే సహించబోమని హెచ్చరించారు. జగన్ తన హామీని వెంటనే ఉపసంహరించుకోవాలని... లేకపోతే పార్టీకి రాజీనామా చేసి, ఆమరణ దీక్ష చేపడతానని అన్నారు. కృష్ణా జిల్లా పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి, ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

ఆర్జేడీ అధినేత లాలూకు అస్వస్థత..

ఢిల్లీ : మాజీ సీఎం, ఆర్డేడీ అధినేత లలూ ప్రసాద్‌ యాదవ్‌ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. హృద్రోగ, మూత్ర పిండ సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. చికిత్సన నిమిత్రత లలూను ఎయిమ్స్ లోని కొనసాగిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో ఆయన్ని రాంచీకి తరలిస్తున్న సమయంలో మళ్లీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. లాలూకు బీపీ, షుగర్‌ స్థాయిలు పెరగడంతో ఇద్దరు వైద్యులు ఆయనకు చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డా.లాల్‌ మాంఝీ తెలిపారు.

వైసీపీలో వివాదం..

కృష్ణా : దివంగత ఎన్టీఆర్ జిల్లాలోని నిమ్మకూరు అనే విషయం అనే సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత జగన్ చేపట్టిన యాత్రలో భాగంగా నిమ్మకూరులో పర్యటించిన సందర్భంగా కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటనపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తోంది. వైసీపీ రాష్ట్ర రాజకీయ సలహాదారు దుట్టా రామచంద్రరావు ... జగన్ ప్రకటనను తప్పుబట్టారు. కృష్ణమ్మ ఎన్నో రాష్ట్రాలు దాటుకుని ఏపీలో ప్రవహిస్తోందని... కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తోందని..ఏ రాష్ట్రంలో కూడా కృష్ణా పేరుతో జిల్లా లేదని...

వ్యక్తిని ఢీకొన్న ఎంపీ మల్లారెడ్డి వాహనం..

హైదరాబాద్‌ : రామాంతపూర్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉప్పల్‌ నుంచి రామాంతపూర్‌ వైపుగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అందులోని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి వాహనం ఢీ కొని ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో గాయాలపాలైన వ్యక్తిని వెంటనే ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి అందించి చికిత్స అందిస్తున్నారు.

నాణ్యమైన కరెంట్ ఇస్తాం : సీఎం చంద్రబాబు

విజయవాడ : రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు, ఒక్క ఓటు రాదని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. విజయవాడలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన ప్రసంగించారు. భవిష్యత్ లో కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తామని తెలిపారు. ఇన్నోవేషన్, సమర్థతతో ముందుకు పోవాలన్నారు. కార్మికుల్లో నైపుణ్యాన్ని పెంచితే డబుల్ లాభం వస్తుందన్నారు. ఏపీని నాలెడ్జ్ స్టేట్ గా తయారు చేస్తామని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సంపద సృష్టించకుండా పేదరికం పోవాలంటే సాధ్యం కాదన్నారు. ఫ్యాకర్టీ లేకపోతే కార్మికులు లేరని..అలాగే కార్మికులు లేకపోతే ఫ్యాక్టరీలు లేవన్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు

విశాఖ : ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పిడుగులు పడే అవకాశముందని రాష్ర్ట విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. మరోవైపు వేడుగాలులతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వానలు కాస్త ఊరటనిచ్చాయి.
 

13:58 - May 1, 2018

మహబుబ్‌ నగర్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కార్మిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని మహబుబ్‌ నగర్ జిల్లా కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. కార్మికుల కోసం పెట్టిన చట్టాలను వెంటనే చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రాములు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ వద్ద హమాలీ సంఘం ఆద్వర్యంలో మే ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీయం నాయకులు, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.   

 

13:55 - May 1, 2018

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని నవతెలంగాణ ఎడిటర్‌ ఎస్‌. వీరయ్య అన్నారు. ప్రపంచ బ్యాంకుకు తలొగ్గి పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేయని ప్రభుత్వం కేంద్రంలో రావాలన్నారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుడే ప్రభుత్వాలను ప్రజలు ఇంటికి పంపించాలన్నారు. కార్మికులకు, కర్షకులకు అనుగుణంగా విధానాలు రూపొందించే ప్రభుత్వాల రావాలని అన్నారు. అప్పుడే దేశ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని... నవతెలంగాణ, టెన్‌టీవీ దగ్గర అరుణపతాకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరయ్య... మంచి రాజకీయాల కోసం... సమాజంలో  మార్పుకోసం జర్నలిస్టులు కృషి చేయాలన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న  టీన్‌ టీవీ ఎండీ వేణుగోపాల్‌... మీడియా కార్పొరేట్‌ శక్తులకు తలొగ్గుతోందన్నారు. కార్మికులు, కర్షకుల పోరాటాలకు మీడియాలో ప్రాధాన్యత పెరగాలని సూచించారు. 

 

13:53 - May 1, 2018

సంగారెడ్డి : జిల్లాలో మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పటాన్‌ చెరు, పాశమైలారం, జిన్నారం పారిశ్రామికవాడల్లో కార్మికులు బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. సంగారెడ్డిలో నిర్వహించిన బైక్‌ ర్యాలీలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలను నిర్వహిస్తామంటున్న చుక్కారాములతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

13:49 - May 1, 2018

విశాఖ : ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పిడుగులు పడే అవకాశముందని రాష్ర్ట విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. మరోవైపు వేడుగాలులతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వానలు కాస్త ఊరటనిచ్చాయి.
శ్రీకాకుళం 
శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం ఇచ్ఛాపురం, పలాస, నరసన్నపేట నియోజకవర్గ ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అలాగే శ్రీకాకుళం, ఆమదాలవలసల్లో ఉరుములుతో కూడిన భారీ వర్షం పడుతోంది. జిల్లా అంతటా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని తేలికపాటి వాన కురుస్తోంది. వేసవి వేడిగాలులతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వానలు ఊరటనిస్తున్నాయి.
విజయనగరం 
విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం , కురుపాం, కొమరాడ, బొబ్బిలి, మక్కువ, విజయనగరంలో ఉరుములతో కూడిన జల్లులు పడ్డాయి. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సూచనలు చేసింది.

 

13:47 - May 1, 2018

విజయవాడ : రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు, ఒక్క ఓటు రాదని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. విజయవాడలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన ప్రసంగించారు. భవిష్యత్ లో కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తామని తెలిపారు. ఇన్నోవేషన్, సమర్థతతో ముందుకు పోవాలన్నారు. కార్మికుల్లో నైపుణ్యాన్ని పెంచితే డబుల్ లాభం వస్తుందన్నారు. ఏపీని నాలెడ్జ్ స్టేట్ గా తయారు చేస్తామని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సంపద సృష్టించకుండా పేదరికం పోవాలంటే సాధ్యం కాదన్నారు. ఫ్యాకర్టీ లేకపోతే కార్మికులు లేరని..అలాగే కార్మికులు లేకపోతే ఫ్యాక్టరీలు లేవన్నారు. ఇద్దరి మధ్య సమన్వయం ఉండాలన్నారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వాలన్నారు. కార్మికుల శ్రమ దేశ ప్రగతికి మారు రూపమన్నారు. 

13:42 - May 1, 2018

హైదరాబాద్ : నగరంలో ఘనంగా మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఆర్ బీఐ, ఎల్ ఐసీ ఆల్ వర్కర్స్ యూనియన్, ఇండియా ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా మారుతున్నారని వాపోయారు. పబ్లిక్ సెక్టార్ లో ప్రజల సొమ్ముకు భద్రత ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి హానీ కలుగుతుందున్నారు. ప్రజల సొమ్ము దోపిడీ జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ రంగాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగాలను ప్రయివేటీకరిస్తే మేడే స్ఫూర్తితో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

 

13:36 - May 1, 2018

కర్నూలు : పట్టణంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎర్ర జెండాను ఎగురవేసి కార్మికులు సంబరాలు జరుపుకుంటున్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించవద్దంటూ కార్మికనేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

13:34 - May 1, 2018

కడప : జిల్లాలో సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదానం చేసి కర్మికులు ఐక్యతను చాటుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల వివక్షను చూపుతున్నాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. 

13:33 - May 1, 2018

మేడ్చల్‌ : జిల్లాలోని జవహర్‌ నగర్‌ డపింగ్‌ యార్డ్‌ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో "మే" డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డీజీ నరసింహరావు హాజరయ్యారు.  అరుణపతాకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాల రాస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. హక్కుల సాధనకు కార్మికులను ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

13:23 - May 1, 2018

ప్రకాశం : జిల్లాలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా కార్మికులు మేడే వేడుకల్లో పాల్గొన్నారు. ఒంగోలులోని సుందరయ్య భవన్‌లో సీపీఎం నేతలు జెండాను ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లాలో మేడే వేడుకలపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం... 

 

13:22 - May 1, 2018

మేడ్చల్‌ : రాష్ట్రంలో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతుందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. జిల్లాలోని కండ్లకోయ దగ్గర ఔటర్‌ రింగ్‌రోడ్డు ఇంటర్‌ చేంజ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రెండు స్కైవేలు నిర్మిస్తే నగరంలో ట్రాఫిక్ తగ్గుతుందన్నారు. అందుకు వంద ఎకరాల రక్షణ శాఖ స్థలం కావాలని 
కేంద్రాన్ని అడిగితే వాటికి తగిన భూమి ఇవ్వాలని కోరగా ఆరు వందల ఎకరాలు ఇస్తామని చెప్పామన్నారు. అయినా స్థలం ఇవ్వకుండా కేంద్రం మోకాలడ్డుతుందన్నారు. ఔటర్ రింగు రోడ్డులోపల ఉండే గ్రామాలు మున్సిపాలిటీగా మారాయని అన్నారు. హైదరాబాద్ నగరానికి గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటిని తీసుకొస్తున్నామని చెప్పారు. కేశవాపురం వద్ద పది టీఎంసీల వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఎస్ ఆర్ డీపీ పేరిట
ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. 

13:05 - May 1, 2018

విశాఖ : ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పిడుగులు పడే అవకాశముందని రాష్ర్ట విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. మరోవైపు వేడుగాలులతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వానలు కాస్త ఊరటనిచ్చాయి.

బీజేపీ ప్రభుత్వంపై మధు ఫైర్

విజయవాడ : బీజేపీ కార్మిక హక్కులను హరిస్తుందని సీపీఎం రాష్ట్రకార్యదర్శి పి.మధు విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మేడే వేడుకల్లో పాల్గొని, ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. కార్మిక వర్గంపై ద్రవ్యపెట్టుబడి తీవ్రమైన దాడి చేస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సరళీకరణ, ఆర్ధిక విధానాలను తిప్పికొట్టే పోరాటం తీవ్రతరం అయిందన్నారు. ఈ సం.మేడే దినోత్సవానికి చాలా ప్రాధాన్యత ఉందన్నారు. సెప్టెంబర్ 5న దేశవ్యాప్త కార్యక్రమానికి పిలునిచ్చామని తెలిపారు. ధరలు పెరుగుతుంటే వేతనాలు తగ్గుతున్నాయని అన్నారు.

13:01 - May 1, 2018

విజయవాడ : బీజేపీ కార్మిక హక్కులను హరిస్తుందని సీపీఎం రాష్ట్రకార్యదర్శి పి.మధు విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మేడే వేడుకల్లో పాల్గొని, ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. కార్మిక వర్గంపై ద్రవ్యపెట్టుబడి తీవ్రమైన దాడి చేస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సరళీకరణ, ఆర్ధిక విధానాలను తిప్పికొట్టే పోరాటం తీవ్రతరం అయిందన్నారు. ఈ సం.మేడే దినోత్సవానికి చాలా ప్రాధాన్యత ఉందన్నారు. సెప్టెంబర్ 5న దేశవ్యాప్త కార్యక్రమానికి పిలునిచ్చామని తెలిపారు. ధరలు పెరుగుతుంటే వేతనాలు తగ్గుతున్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్ పై పన్నులను తగ్గించాలని ఈనెల 8న ఆందోళన చేపడతామని చెప్పారు. 

 

12:55 - May 1, 2018

పెద్దపల్లి : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రైస్‌ మిల్లు ఆపరేటర్స్‌కు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో కార్మికులు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని 350 మంది కార్మికులు ఆందోళ చేపట్టారు. కార్మికుల సమ్మెతో రైస్‌ మిల్లుల్లో పనులు నిలిచిపోయినా.. యజమాన్యాలు మాత్రం సమ్మె వైపు చూడడం లేదు. 

 

12:53 - May 1, 2018

ఆదిలాబాద్‌ : జిల్లాలో కార్మికులు మేడే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పలుచోట్ల ఎర్రజెండాలను ఎగురవేశారు. సింగరేణి ప్రాంతంలో బొగ్గుగని కార్మికులు జెండాలు ఎగురవేసి సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న హక్కులను... ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు.  కార్మిక హక్కులను కాపాడుకోవడానికి కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.

12:51 - May 1, 2018

చిత్తూరు : తిరుపతిలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో కార్మికులు జెండా ఎగురవేశారు. కార్మికుల ఐక్యత వర్థిల్లాలంటూ నినాదాలు  చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని నేతలు విమర్శించారు. కార్పొరేట్‌శక్తులకు రెడ్‌కార్పెట్‌ పర్చుతూ.... కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తున్నాయన్నారు.

 

12:50 - May 1, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి.  సీపీఎం పార్టీ కార్యాలయంలో ఎర్రజెండా ఎగురవేసి మేడే వేడుకలు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

12:48 - May 1, 2018

హైదరాబాద్ : ఆర్థిక విధానాల్లో కాంగ్రెస్ , బిజెపి సేమ్ టూ సేమ్ .. కార్పొరేట్లకు మరింత లబ్ది చేకూర్చేందుకు సంస్కరణల పేరుతో కాంగ్రెస్‌ అమలు జరపడానికి ప్రయత్నించిన వాటిని బిజెపి ఆచరించేందుకు పూనుకుంది. దీన్ని ప్రశ్నించే దెవరు. కార్మిక రంగం ముందున్న తాజా సవాళ్లేంటీ ...
కార్మిక చట్టాల సవరణ ప్రయోగశాలగా బిజెపి పాలిత రాజస్ధాన్‌
బిజెపి పాలిత రాజస్ధాన్‌ కార్మిక చట్టాల సవరణ ప్రయోగశాలగా తయారైంది. అక్కడి పారిశ్రామిక వివాదాల చట్ట సవరణ ప్రకారం మూడు వందలలోపు సిబ్బంది పనిచేసే చోట ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా యజమానులు ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్మికులను తొలగించవచ్చు. కార్మిక సంఘాలను ఏర్పాటు చేయాలంటే కనీసం 30శాతం మంది సిబ్బంది ఆమోదం వుంటేనే అనుమతిస్తారు. గో స్లో అంటే ఉత్పత్తి నెమ్మదించటం అనే పదానికి నిర్వచనాన్ని విస్తృతపరిచారు. ఏ కారణంతో ఉత్పత్తి తగ్గినా.. దానికి బాధ్యత కార్మికులదే అని యజమానులు ఆరోపించి చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పించారు.
యజమానులకు అనుకూలంగా చట్టాల్లో మార్పులు
అంటే సూటిగా చెప్పాలంటే ఏ చట్టాలు లేనపుడు యజమానుల దయాదాక్షిణ్యాలపై కార్మికులు వున్నట్లే గతంలో సాధించుకున్న హక్కులను హరించి తిరిగి పూర్వ పరిస్ధితిలోకి నెట్టడం.. ఫ్యాక్టరీ చట్టం వర్తించాలంటే విద్యుత్‌ అవసరం లేని చోట పని చేసే కార్మికుల సంఖ్యను 20 నుంచి 40కి, అవసరం వున్నచోట 10 నుంచి 20కి పెంచారు. ఏ యజమాని అయినా చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా కోర్టులు వాటిని పరిగణనలోకి తీసుకోకూడదనే సవరణ కూడా చేశారు. చట్టాలను ఉల్లంఘించిన ఉదంతాలలో వేయాల్సిన శిక్షలను కూడా ఎంతో సరళతరం చేశారు. యజమానులకు అనుకూలంగా చట్టాల్లో మార్పులు తెచ్చారు..
రాజస్థాన్‌లో చట్టాల పరిధిలోకి రాని ఫ్యాక్టరీలు 7252
2014 ఆగస్టు ఒకటిన తీవ్ర కార్మిక నిరసనల మధ్య ఫ్యాక్టరీలు మరియు కాంట్రాక్టు లేబర్‌.. క్రమబద్దీకరణ, రద్దు.. చట్టాన్ని కార్మిక వ్యతిరేక అంశాలతో సవరించి ఒకే రోజు ప్రవేశపెట్టి అదే రోజు ఆమోదింపచేయించిన ఘనత బిజెపి ఖాతాలో చేరింది. ఇది ఖచ్చితంగా ఉత్పత్తి రంగంపై ఆధారపడ్డ అసంఘటిత దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల వ్యతిరేక చర్య, చట్టాల దుర్వినియోగం గాక మరేమిటి? బిజెపి కార్మిక సంస్కరణల పర్యవసానంగా చట్టాల పరిధిలోకి వచ్చే అవకాశం లేదని వెల్లడైంది. యాంత్రీకరణ, రోబోల వినియోగం మరింతగా పెరుగుతున్న ఈ తరుణంలో ఇలాంటి సవరణలు చేయటం అంటే అత్యధిక ఫ్యాక్టరీలు, సంస్ధలను కార్మిక చట్టాల పరిధి నుంచి తొలగించటమే. అలాంటపుడు కనీసవేతనాలను సవరించినా ఉపయోగం ఏముంది? ప్రభుత్వం యజమానులు ఏం చేయాలనుకుంటే అందుకు వారికి అనుమతిచ్చే చర్యలకు ముద్దుగా 'సంస్కరణలు' అని పేరు పెట్టింది.
కాంట్రాక్ట్‌ కార్మికులకు వర్తించని చట్టాలు
ప్రభుత్వ రంగ సంస్ధలలో 50, ప్రయివేటు రంగంలో 70శాతం పైగా కార్మికులు చట్టాలు పెద్దగా వర్తించని కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగులుగా ఉన్నారు. .పన్నెండు గంటల పని సర్వసాధారణమైంది. ఓవర్‌ టైమ్‌ లేదు, చేయించుకొనే ఓవర్‌ టైమ్‌కు కొందరు సాధారణ సెలవులు ఇస్తారు లేదా ఓవర్‌ టైమ్‌ రెట్టింపు కంటే తక్కువగా వుంటాయి. నేడు కార్మికులు-యజమానుల మధ్య తలెత్తుతున్న వివాదాలలో అత్యధికం కార్మిక చట్టాల ఉల్లంఘనలపైనే అన్నది స్పష్టం. చివరికి కార్మిక సంఘాల నమోదు కూడా దుర్లభం అవుతోంది. నమోదు ప్రక్రియ పూర్తిగాక ముందే సంఘం పెట్టుకున్న కార్మికుల ఉద్యోగాలు పోతున్నాయి. ఇటువంటి పరిస్ధితిని అన్ని రాష్ట్రాలలో రుద్దాలని చూస్తున్నారు. లేదా ఉన్న చట్టాలను అమలు జరపకుండా ఉపేక్షిస్తున్నారు. కార్మికవర్గానికి ఇదొక సవాల్‌.
పర్మినెంట్‌ కార్మికుల స్థానంలో చట్టాల పరిధిలో లేని కార్మికులు
ప్రపంచవ్యాపితంగా ధనిక దేశాలన్నింటా అప్రెంటిస్‌షిప్‌ అంటే నైపుణ్య శిక్షణ పేరుతో పెద్ద ఎత్తున పర్మనెంటు కార్మికుల స్ధానంలో కార్మిక చట్టాల పరిధిలో లేని కార్మికులను నియమిస్తున్నారు. వారికి తక్కువ వేతనాలు, అలవెన్సులు చెల్లించేందుకు ఇదొక దొంగదారి అన్నది తెలిసిందే. మన దేశంలో కూడా అప్రెంటిస్‌షిప్‌ చట్టాన్ని సవరించి శిక్షణలో వున్న వారు చేయకూడని పనులను కూడా వారితో చేయించేందుకు, పెద్ద ఎత్తున నియామకానికి తెరతీశారు. శిక్షణా కాలంలో అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించేవిధంగా పధకాలు సిద్దం చేశారు. ఇది యజమానులకు మరొక అదనపు రాయితీ.
మేడే లాంగ్‌ లివ్‌
మన సమాజాన్ని వెనక్కు నడపాలని చూస్తున్న మనువాదుల దృష్టిలో మేడే పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. నిజమే ! మనం చెప్పుకుంటున్న ప్రజాస్వామిక వ్యవస్ధ, భావజాలం సైతం పశ్చిమ దేశాల నుంచి అనుకరించింది కాదేమిటి? అంతెందుకు మన నిత్య జీవితంలో ఇతర దేశాల నుంచి అనుకరిస్తున్నవి, వినియోగిస్తున్నవి ఎన్ని వున్నాయో ఎవరికి వారు ఆలోచించుకోండి. ప్రపంచ మానవుడు ఎక్కడ మంచి వుంటే దాన్ని, ఎవరు జీవనాన్ని సుఖమయం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తే దానిని స్వంతం చేసుకోలేదా ? ఒక దేశం నుంచి ఖండం నుంచి మన దేశం ప్రపంచానికి నాగరికత అంటే ఏమిటో నేర్పిందని కొంత మంది చెబుతారు. మన దాన్ని ఇతరులు అనుసరించినపుడు మే డే వంటి వాటిని దాని వెనుక వున్న పురోగామి భావజాలాన్ని విదేశీ అంటూ మనకు పనికి రాదని పక్కన పెట్టమంటున్నారంటే అర్ధం ఏమిటి? ఏ పదజాలం వెనుక ఏ అర్ధం దాగుందో తెలుసుకోనంత కాలం జనం మోసపోతూనే ఉంటారని మార్క్సిజాన్ని తొలిసారిగా తమ దేశానికి అన్వయించి తొలి శ్రామికవర్గ రాజ్య స్ధాపనకు నాయకత్వం వహించిన లెనిన్‌ చేసిన హెచ్చరికను తీసుకోవటానికి ఆయన విదేశీయత అడ్డం వస్తుందా ? ప్రపంచ కార్మికదినం రోజున తమ బతుకులు బాగు చేసుకొనేందుకు అవసరమైతే వీరుల స్ఫూర్తితో పోరాటాలకు దిగుతామని దీక్ష పూనాల్సిన రోజు. అది కార్మికవర్గ చైతన్యానికి గీటు రాయి. మేడే లాంగ్‌ లివ్‌, ప్రపంచ కార్మికులారా ఏకం కండి !

 

12:42 - May 1, 2018

హైదరాబాద్ : కార్మికుల పోరాటాల వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి... కార్మిక వర్గం ఎలాంటి పాఠాలు నేర్చుకొంది... పాత అనుభవాలు మనకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నాయి.. 
అసోంలో 1839లో తొలి తేయాకు కంపెనీ
మన దేశంలో పారిశ్రామికీకరణ పందొమ్మిదవ శతాబ్ది మధ్యలో ప్రారంభమైంది. అసోంలో 1839లో తొలి తేయాకు కంపెనీ, 1843లో బెంగాల్‌ బొగ్గు కంపెనీ, 1854లో బొంబాయిలో తొలి బట్టల మిల్లు, కొలకత్తాలో తొలి జూట్‌మిల్లు ప్రారంభమైంది. ఆ తరువాతే ముడి సరకుల రవాణాకు రైలు మార్గాలను వేశారు. 1890నాటికి వివిధ దేశాలలో పని చేసేందుకు బ్రిటీష్‌ పాలకులు పంపిన భారతీయ కార్మికుల సంఖ్య ఐదులక్షలు కాగా దేశంలో పారిశ్రామిక కార్మికుల సంఖ్య మూడులక్షలు మాత్రమే... అయితే పోరాటాలు ఏం నేర్పాయి.. ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి... 
19, 20వ శతాబ్దంలో కార్మికవర్గానికి పాఠాలు
పందొమ్మిదవ శతాబ్ది, ఇరవయ్యవ శతాబ్దం ప్రపంచ కార్మికవర్గానికి అనేక పాఠాలు నేర్పింది.  దుర్భర పరిస్ధితుల నుంచి బయటపడేందుకు కార్మికవర్గం చేసిన పోరాటాల ఫలితమే సాధించుకున్న హక్కులు, చట్టాలు. తొలి చట్టాలు అమలులోకివచ్చి వందసంవత్సరాలు కూడా గడవక ముందే సంస్కరణల పేరుతో వాటికి చెల్లుచీటీ ఇవ్వటం ప్రారంభమైంది.
150 ఏళ్ల క్రితం 12 గంటల పని 
ఫలితంగా నూటయాభై సంవత్సరాల నాటి దుర్భరపరిస్ధితులైన పన్నెండు గంటల పని, తక్కువ వేతనాలు, యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలివేయటం పునరావృతం అవుతున్నాయి. ఇదంతా స్వేచ్చావాణిజ్యం, ప్రపంచీకరణపేరుతో జరుగుతోంది. వీటినే నయా ఉదారవాద విధానాలు అని కూడా అంటున్నారు. సరిహద్దులు, కరెన్సీ,మిలిటరీ, పోలీసు వంటి అంశాలు తప్ప మిగిలిన అన్నింటినీ ప్రయివేటు రంగాలకు అప్పచెబితే ఆ రంగం నుంచి వచ్చే ఫలితాలు దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థ, సమాజ తిరోగమనానికి కారణమవుతోంది. 
కార్మికులకు దక్కిన లబ్ధి 44 శాతం
గత మూడున్నర దశాబ్దాల ఈ విధానాల ప్రభావం ఎలా ఉందంటే ..  కేంద్ర ప్రభుత్వ సమాచారం, గణాంకాల ప్రకారం 1980-81లో ఒక వస్తువు తయారీ లేదా సేవ విలువ లో వేతనాలు, అలవెన్సులు తదితర రూపాలలో సగటున కార్మికులకు దక్కిన లబ్ది 44శాతం. అది 2012-13 నాటికి 23.6 శాతానికి కి పడిపోయింది. ఇదే సమయంలో వడ్డీ చెల్లింపులు 19.8 నుంచి 13.7శాతానికి తగ్గాయి. మరి లాభాల వాటా 15.7 నుంచి 44.1శాతానికి పెరిగింది. 2012 జిడిపి ఆధారంగా గుణిస్తే మన దేశంలో ఒక శ్రామికుడు గంటలో చేసిన ఉత్పత్తి విలువ రెండు వందల యాభై రూపాయలు అదే రోజుకు రెండువేలు. వివిధ పరిశ్రమలు, రంగాలలో వున్న కనీస వేతనాల మొత్తాలను చూస్తే కార్మికులు ఎంత దోపిడీకి గురవుతున్నారో చెప్పనవసరం లేదు. అ తక్కువ మొత్తాలను కూడా దశాబ్దాల తరబడి సవరించని ప్రభుత్వాలున్నాయి. ఇవి చట్టాలను నీరుగార్చటమే. అవసరాల మేరకు పెంపుదల సంగతిపక్కన పెడితే అసలు ఏదో ఒక సవరణ కోసం కూడా ఉద్యమించాల్సిన రోజులివి.

12:16 - May 1, 2018

హైదరాబాద్ : అసలు మనదేశంలో కార్మిక ఉద్యమం ఎప్పుడు మొదలైంది.. ఆద్యులెవరు.. మనదేశంలో కార్మిక ఉద్యమ స్పూర్తికి, కార్మిక సంఘాల సంఘటిత ఐక్యతకు దారి తీసిన పరిస్థితులేంటీ హేవ్ ఏ లుక్ లుక్ 
కమ్యూనిస్ట్‌ పార్టీలు పుట్టకముందే దోపీడీ వ్యవస్థ
ప్రపంచంలో కమ్యూనిస్టులు, పార్టీలు పుట్టక ముందే కార్మికులు, వారిని దోపిడీ చేసే వ్యవస్ధ ఉనికిలోకి వచ్చింది. అందువలన ఇది కేవలం కమ్యూనిస్టుల వ్యవహారం కాదు. ఒక్కసారి అవలోకిస్తే కార్మిక సమస్యల మీద మన దేశంలో స్పందించిందీ, వారిని సంఘటిత పరచేందుకు ముందుగా ప్రయత్నించింది కమ్యూనిస్టులు కాదంటే అనేక మంది నోరెళ్లబెడతారు. మేడే అంటే కార్మికుల దినోత్సవం.. ఉత్పత్తికి కార్మికులే ఆధారం.. ఉత్పత్తి మీదే మార్కెట్ , ఆర్థిక వ్యవస్థ, దేశ పురోగతి ఆధారపడి ఉంటాయి.. అందుకే  వారికి శ్రామిక శ్రమకు గుర్తింపు మే 1 న కార్మిక దినోత్సవం జరుపుకుంటారు.. 
కమ్యూనిస్ట్‌ మేనిఫెస్టో విడుదల కాకముందే కార్మిక సంఘాల ఏర్పాటు 
మన దేశంలో కార్మిక ఉద్యమం పుట్టుక, తీరు తెన్నులు చూస్తే.. దేశంలో కార్మికోద్యమ ఆద్యుడు 1880లో మహాత్మా జ్యోతిరావు పూలే సహచరుడు నారాయణ మేఘాజీ లోఖాండే అని చరిత్ర చెబుతోంది. ఆయనేమీ కమ్యూనిస్టు నేత కాదు. అసలు శాస్త్రీయ సోషలిజం భావన వునికిలోకి రాక ముందే అంటే 1848లో కమ్యూనిస్టు మేనిఫెస్టో విడుదల కాక ముందు, కమ్యూనిస్టు పార్టీల నిర్మాణం గాక ముందే ప్రపంచంలో కార్మిక చట్టాలు, ప్రాధమిక రూపంలో కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. మన దేశంలో 1920 అక్టోబరు 31న అంటే కమ్యూనిస్టు పార్టీ ఏర్పడక ముందే  తొలి జాతీయ కార్మిక సంఘ ఏఐటియుసిని ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌ నాయకులే. దాని తొలి అధ్యక్షుడు లాలా లజపతిరాయ్‌. తరువాతే కమ్యూనిస్టులు దానిలో చురుకుగా పనిచేసి, మిలిటెంట్‌ కార్మిక పోరాటాలను నిర్వహించారు గనుక తరువాత కమ్యూనిస్టులు నాయకత్వ స్ధానాలలోకి వచ్చారు. 
1870లో శశిపాద బెనర్జీ కార్మిక క్లబ్‌
స్వాతంత్య్రం తరువాత రాజకీయ పార్టీలు తమ భావజాలానికి అనుగుణంగా జాతీయ కార్మిక సంఘాలను ఏర్పాటు చేశారు. తొలిసారిగా 1870లో శశిపాద బెనర్జీ కార్మిక క్లబ్బు స్ధాపించి, భారత శ్రమజీవి అనే పత్రికను కూడా ఏర్పాటు చేశారు. సొరాబ్జీ షాపూర్జీ బెంగాలీ చొరవతో 1878లో కార్మికుల పని పరిస్ధితుల మెరుగుదలకు బొంబాయి శాసన మండలి ఒక చట్టాన్ని ఆమోదించింది. 1880లో నారాయణ్‌ మేఘాజీ లోఖాండే దీన బంధు అనే పత్రికతో పాటు బంబే మిల్‌ అండ్‌ మిల్‌హాండ్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు.1899లో ముంబైలో తొలి రైల్వే కార్మిక సమ్మె జరిగింది. దానికి బాలగంగాధర తిలక్‌ వంటి వారు తమ పత్రికల ద్వారా మద్దతు ప్రకటించారు. 
1917లో రష్యాలో తొలి శ్రామికరాజ్యం
మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ధరలు విపరీతంగా పెరిగి కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి తలెత్తింది. అదే సమయంలో 1917లో రష్యాలో తొలి శ్రామికరాజ్యం ఏర్పడి కార్మికవర్గాన్ని ఎంతగానో ఉత్తేజపరచి వుద్యమాలకు పురికొల్పింది.  ఈ పూర్వరంగంలో స్వాతంత్య్ర ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం జాతీయ స్ధాయిలో ప్రజాసంఘాలను నిర్మించటం అవసరమని భావించింది. దాని పర్యవసానమే 1920అక్టోబరు 31 ఆలిండియా ట్రేడ్‌యూనియన్‌ కాంగ్రెస్‌(ఎఐటియుసి) ఏర్పాటుకు దారి తీసింది.  ఆ తరువాతే పెద్ద ఎత్తున చెలరేగిన పోరాటాలను అణచివేసేందుకు, ఆంక్షలు విధించేందుకు వీలుగా 1926లో ట్రేడ్‌యూనియన్‌ తరువాత, ఇతర అనేక చట్టాలను తెచ్చారు. వాటన్నింటికి పరాకాష్టగా మీరట్‌, కాన్పూరు కుట్రకేసులను బనాయించి కమ్యూనిస్టులుగా అనుమానం వున్నవారందరినీ వాటిలో ఇరికించి విచారణ జరిపారు.
దోపిడీకి గురైన కార్మికవర్గం
మన దేశ కార్మికవర్గ చరిత్రను చూసినపుడు రైల్వేకార్మికుల పోరాట పటిమ చెప్పుకోదగినది. అలాగే దాని అనుబంధ పరిశ్రమలతో పాటు బొగ్గు, పత్తి, జనపనార పరిశ్రమలతో కార్మికులు విస్తరించారు. పారిశ్రామిక విప్లవం జరిగిన ఐరోపాలోగానీ, విస్తరించిన భారత్‌ వంటి దేశాలలోగానీ దుర్భరపరిస్ధితులు, దోపిడీలో ఎలాంటి తేడా లేదు. మన కార్మికవర్గం  సామ్రాజ్యవాద పాలన కింద మగ్గటంతో పాటు అటు విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులదోపిడీకీ గురైంది అయింది. అందువలన దోపిడీతో పాటు సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయపోరాటంలో కూడా భాగస్వామి అయింది. అందువలన  జాతీయవాదులు, ఉదారవాదులే తొలి కార్మికోద్యమ నిర్మాతలుగా వుండటం ఒక సహజపరిణామం.
1802లో పారిశ్రామిక కార్మికుల చట్టం 
ఈ పరిస్థితుల్లో కార్మిక చట్టాలను గనుక అమలు జరిపితే భారతీయ యజమానుల ఆధ్వర్యంలోని ఫ్యాక్టరీల పోటీని బ్రిటిష్ కంపెనీలు తట్టుకోలేవని భావించారు.ఈ కారణంగానే 1881, 1891లో తెచ్చిన ఫ్యాక్టరీ చట్టాలను కొందరు జాతీయ వాదులు, యజమానులు వ్యతిరేకించారు. వర్గ అవగాహనతో కార్మికులను విడదీయవద్దని చెప్పారు. దయాదాక్షిణ్యాలతో కార్మికుల ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరచాలని చూశారు.  బ్రిటన్‌లో తొలిసారిగా 1802లో పారిశ్రామిక కార్మికుల చట్టాన్ని తెచ్చారు. ఫ్యాక్టరీల్లో పిల్లలతో ఎన్నిగంటలు, ఎలాంటి పని చేయించాలి, ఏ తరహా సంస్ధలలో ఎలాంటి పరిస్ధితులు వుండాలో దాన్లో పేర్కొన్నారు. ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘించితే రెండు నుంచి ఐదు పౌండ్ల జరిమానా విధించాలని కూడా పేర్కొన్నారు. తరువాత ఆ చట్టాన్ని 1819లో సవరించారు.1833లో ఫ్యాక్టరీల తనిఖీ వ్యవస్ధను ప్రవేశపెట్టారు.
1874లో మొదలైన విక్టోరియ రాణి  పాలన 
1874లో బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీపాలన రద్దయి విక్టోరియా రాణి పాలన మొదలైంది. 1875లో కార్మికుల పని పరిస్ధితులపై అధ్యయనానికి ఒక కమిటీని వేసి దాని నివేదిక ఆధారంగా వంద అంతకంటే ఎక్కువ మంది పని చేసే ఫ్యాక్టరీలలో అమలు చేసే విధంగా 1881లో తొలి ఫ్యాక్టరీ చట్టం వచ్చింది. అధ్యయన కమిటీ విషయం తెలిసిన కొందరు 1879డిసెంబరులో రఘబా సుఖరామ్‌ అనే కార్మికుడి నాయకత్వంలో సమావేశమై రాతపూర్వకంగా తమ స్ధితిగతులను వివరించారు. దానిపై 578 మంది సంతకాలు చేశారు. తొలి ఫ్యాక్టరీ చట్టంపై నాటి మీడియాలో కొన్ని సమర్ధించగా మరికొన్ని తీవ్రంగా విమర్శించాయి. బ్రిటీష్‌ పాలకులకు విన్నపాలు చేయటం ఏమిటి, మన పని మనం చేసుకుందాం అంటూ కొందరు జాతీయవాదులు పత్రికల్లో రాశారు. 
1881 మార్చి 31న తిలక్‌ పత్రికలో వార్తలు 
బాలగంగాధర తిలక్‌ 1881 మార్చి 13న తన మరాఠా పత్రికలో ఇండియా పాలన ఇండియా కొరకు గాక ఇంగ్లండు ప్రయోజనాలకొరకు జరుగుతోంది.మనది పరాజిత దేశం,  ఒక పరాజిత దేశంగానే పరిపాలించబడతామని దేశీయులు తెలుసుకోవాలి' అని రాశారు. ఇప్పుడు కొందరు అంబేద్కరిస్టులు కార్మిక చట్టాలను రాజ్యాంగ నిర్మాత బిఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో ప్రవేశపెట్టినట్లుగా ప్రచారం చేయటం సత్యదూరం.

11:58 - May 1, 2018

హైదరాబాద్ : మే డే  ప్రపంచ వ్యాపితంగా కార్మికులు తమ గురించి తాము ఆలోచించుకొనే రోజు. దీన్ని కొందరు ఉత్సవంగా జరుపుకుంటున్నారు, కొందరు దీక్షా దినంగా పాటిస్తున్నారు.. అసలు మేడే అంటే.. అసలు మేడే ఎందుకు జరుపుకొవాలి. 
తొలిసారి బ్రిటన్‌లో యాంత్రీకరణపై ప్రతిఘటన
పారిశ్రామిక విప్లవంలో పెరిగిన వస్తూత్పత్తిని అమ్ముకొనేందుకు యజమానులు ఇతర దేశాల మార్కెట్ల వేట సాగిస్తే వారి కంపెనీల్లో యంత్రాలపై పని చేసే కార్మికులు దిగజారిన తమ బతుకులను బాగుచేసుకొనేందుకు బతుకుపోరు మొదలెట్టారు.  పారిశ్రామికీకరణతో ఉపాధి కోల్పోయిన చేనేత వృత్తిదారుల నుంచి బ్రిటన్‌లో తొలిసారిగా యాంత్రీకరణ పై  ప్రతిఘటన మొదలైంది.  మార్కెట్ల కోసం యజమానుల అనాలోచిత, అవాంఛనీయ పోటీ రాను రాను.. యుద్ధాలు, వలసలు, ప్రపంచీకరణ, అంతులేని దోపిడీకి దారితీశాయి. ఈ పరిణామాలన్నీ కమ్యూనిజం పుట్టక ముందే కమ్యూనిస్టులు పోరాటాలు మొదలెట్టక ముందే సంభవించాయి. అయినా చాలా మంది ఇప్పటికీ మే డే కార్మిక దినం అంటే అదేదో కమ్యూనిస్టుల వ్యవహారం అనుకుంటారు. 
కార్మికులు అంటే ఎవరు ? 
అసలు మేడే కార్మికుల దినోత్సవం అంటాం కదా.. అసలు కార్మికులంటే ఎవరు అనేక మంది తాము కార్మికులం కాదనుకుంటున్నారు.  కనీస సౌకర్యాలు కూడా లేక చెమటోడుస్తూ శారీరక శ్రమను పణంగా పెడుతున్న వారు, ఆధునాతన భవనాలలోని ఎసి గదుల్లో ఆధునిక కంప్యూటర్లపై పని చేస్తూ మేధోశక్తిని అమ్ముకుంటూ పెద్దమొత్తంలో ఒక యజమాని దగ్గర వేతనం తీసుకొని పని చేసే మేనేజరుతో సహా ఐటి ఇంజనీరు, కార్యాలయ బంట్రోతు, ప్రభుత్వ ఉద్యోగి, కార్మికుడు, గుమస్తా ఇలా ఎవరైనా   వారందరూ కార్మికులే.. కేవలం కార్మికులంటే నాల్గవతరగతి, దిగువ తరగతి ఉద్యోగులు, ఖాకీ యూనిఫాం వేసుకునే వాళ్లు మాత్రమే కాదు.. 
1886 ఏప్రిల్‌లో అనేక చోట్ల సమ్మెలు 
అసలు మేడే ఎలా వచ్చిందో తెలుసుకుందాం... రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు జరపాలని కోరుతూ అమెరికాలోని కార్మికవర్గం  అనేక ఆందోళనలు చేసింది. వాటిలో భాగంగా 1886 ఏప్రిల్‌లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి. వాటి కొనసాగింపుగా మే ఒకటవ తేదీన అమెరికా అంతటా ఒక రోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో ప్రభుత్వం సమ్మెను అణచివేసేందుకు పూనుకుంది. దాంతో చికాగో నగరంలో మే మూడవ తేదీన నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల పోలీసులు కార్మికులపై విరుచుకుపడ్డారు. అనేక మంది గాయపడ్డారు, కొంత మంది మరణించారు. దాంతో మరింతగా ఆగ్రహించిన కార్మికులు నాలుగవ తేదీన హే మార్కెట్‌ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు.
1887 నవంబర్‌ 1న కార్మికుడు జైలులో ఆత్మహత్య 
పోలీసు ఉన్నతాధికారుల కుట్రలో భాగంగా అక్కడకు వచ్చిన సామాన్య పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించాడు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది కార్మికులు మరణించారు. రక్తం ఏరులై పారింది. బాంబు పేలుడుపై ఎనిమిది మంది కార్మికులను ఇరికించి ఒక తప్పుడు కేసు పెట్టారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. పై కోర్టులలో అప్పీలులో శిక్షలను ఖరారు చేశారు. 1987 నవంబరు పదిన ఒక కార్మికుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు నలుగుర్ని ఉరితీశారు. తరువాత ఆరు సంవత్సరాలకు మిగిలిన ఇద్దరికి ఇల్లినాయిస్‌ గవర్నర్‌ క్షమాభిక్షతో ఉరిశిక్షను రద్దు చేశారు.
1890లో మే 1న అంతర్జాతీయంగా ప్రదన్శలకు పిలుపు
1889 జూలైలో పారిస్‌లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్టు, కార్మిక పార్టీల ప్రతినిధులు చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీని కార్మికుల దీక్షా దినంగా పాటించాలని ప్రతిపాదించి ఆ మేరకు 1890లో మే ఒకటిన అంతర్జాతీయంగా ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు. మరుసటి ఏడాది సమావేశమైన రెండవ ఇంటర్నేషనల్‌ వార్షిక సమావేశం మే ఒకటవ తేదీని ఖరారు చేస్తూ ప్రతి ఏడాదీ మేడే జరపాలని పిలుపు నిచ్చింది.....  అమెరికా, కెనడా వంటి దేశాలలో సెప్టెంబరులో వచ్చే తొలి సోమవారాన్ని కార్మిక దినంగా పాటిస్తారు. మన దేశంలో విశ్వకర్మ జయంతి పేరుతో సెప్టెంబరు 17న మనువాదులు కార్మిక దినాన్ని రుద్దేందుకు చూస్తున్నారు. ఇలాగే అనేక దేశాలలో మే ఒకటవ తేదీ నుంచి కార్మికులను దూరం చేసే యత్నాలు ఎన్నో ఎన్నెన్నో !

11:53 - May 1, 2018

హైదరాబాద్ : గులాబీపార్టీ ప్రజాక్షేత్రంలో దూకుడు పెంచింది. ఎన్నికల ఏడాది కావడంతో ప్రతిపక్షాలపై విమర్శల దాడిని పెంచారు. ప్రతిపక్ష పార్టీలపై ఓ వైపు  విమర్శలు  గుప్పిస్తూనే....మరోవైపు  కేసిఆర్ పిలుపుతో యువ నేతలు  రంగంలోకి దిగి ఆందోళనలు చేపడుతున్నారు. 

ఎన్నికల ఏడాది కావడంతో రాజకీయ పార్టీలు క్రమంగా విమర్శల దాడిని పెంచుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణల పర్వానికి తెరతీయడంతో....అందుకు గులాబి నేతలు కూడా అంతే సీరియస్ గా  కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.   ఇటీవల జరిగిన పార్టీ ప్రతినిధుల సభలో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతిపక్ష పార్టీలకు ధీటైన సమాధానం ఇవ్వాలన్న పిలుపుతో గులాబి నేతలు  మరింత ఉత్సాహంగా రంగంలోకి దిగుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీనే  ప్రధాన శత్రువుగా భావిస్తున్నామని టీఆర్‌ఎస్‌ లీడర్లు అంటున్నారు. అధికాపార్టీ నేతల తీరు చూస్తోంటే .. హస్తం పార్టీపై మానసికంగా వత్తిడి పెంచేలా  వ్యూహాలను  అమలు చేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నాయన్న విమర్శలను గులాబీపార్టీ యువనేతలు  మరోసారి ఎక్కుపెడుతున్నారు.  ఈ వ్యూహలోం భాగంగానే పిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దిష్టి బొమ్మలను తగులబెట్టారని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక మంత్రులు మరో అడుగు ముందుకు వేసి దమ్ముంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైనా రాజీనామా చేసి  ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రి తలసానిలాంటి వాళ్లు సవాళ్లు విసురు తున్నారు. 

అటు  నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు.  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడున్న స్థానాలను కూడా నిలబెట్టుకోలేరన్నారు.  ఇపుడున్నవాటికంటే ఎక్కువ స్థానాలు హస్తంపార్టీకి  వస్తే .. తాను అసెంబ్లీలో అడుగు కూడా పెట్టనని జగదీశ్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీ నేతలను టార్గెట్‌ చేశారు. 

ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీ విమర్శలను ఎదుర్కోడానికి గులాబీనేతలు దూకుడు పెంచడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. అయితే హస్తంపార్టీ విమర్శలకు ప్రతివిమర్శలు చేసే క్రమంలో టీఆర్‌ఎస్‌ నేతలు  అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. కేసీఆర్‌ చెప్పారుకదా అని కొందరు నేతలు నోటికి ఏదొస్తే అదే మాట్లాడేస్తున్నారన్న గులాబీపార్టీలోనే గుసగులసలు వినిపిస్తున్నాయి. 

కార్మికుల కనీస వేతనాల చట్టం నిర్వీర్యం : మధు

విజయవాడ : ప్రతిఘటన పోరాటాలకు మేడే నాంది పలుకుతుందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. విజయవాడలో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాల చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. కార్మిక శాఖ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేశారని చెప్పారు. కనీస వేతనాల చట్టాన్ని పూర్తిగా అమలు పరచడం లేదన్నారు. 

 

09:50 - May 1, 2018

విజయవాడ : ప్రతిఘటన పోరాటాలకు మేడే నాంది పలుకుతుందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. విజయవాడలో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాల చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. కార్మిక శాఖ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేశారని చెప్పారు. కనీస వేతనాలు, ఆదివారం సెలవులు, సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదన్నారు. కనీస వేతనాల చట్టాన్ని పూర్తిగా అమలు పరచడం లేదన్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. కార్మిక చట్టాలకున్న అనేక నిబంధనలను కేంద్రం పూర్తిగా నీరు గార్చిందన్నారు. మేడే దినోత్సవం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక కావాలన్నారు. కార్మికులు, రైతులు ఏకోన్ముఖంగా పోరాటాలు పాగించాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా సరళీకరణ, ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ప్రతిఘటన, పోరాటాలకు సిద్ధమవుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం, రైతాంగం తిరగబడుతుందన్నారు. కార్మిక చట్టాలకు సవరణలు తీసుకొచ్చి..వాటిని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.

 

శ్రీకాకుళం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం

శ్రీకాకుళం : జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. శ్రీకాకుళం, పలాసతోపాటు పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

కేశవపట్నంలో పెళ్లింట విషాదం

కరీంనగర్ : కేశవపట్నంలో పెళ్లింట విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో భర్త తిరుపతి, భార్య ధనలక్ష్మీని గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం తాను పురుగుల మంతు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

09:05 - May 1, 2018

హైదరాబాద్ : వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రోగ్రాంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఐటీ కారిడార్‌లో రెండు అండర్‌పాస్‌లు ప్రారంభం కాగా ఇవాళ చింతల్‌కుంట అండర్‌పాస్‌ ప్రారంభం కానుంది. 12.70 కోట్లతో నిర్మించిన ఈ అండర్‌పాస్‌ను మంత్రి కేటీఆర్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌లు ప్రారంభించనున్నారు. జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న ఎల్‌బీనగర్, చింతల్‌కుంట వద్ద ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ అండర్‌పాస్‌ నిర్మాణం చేపట్టింది.

 

150 వ రోజుకు చేరుకున్న జగన్ ప్రజా సంకల్పయాత్ర

కృష్ణా : జగన్ ప్రజా సంకల్పయాత్ర 150 వ రోజుకు చేరుకుంది. పామర్రు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర కొనసాగుతుంది.

నేడు కండ్లకోయ జంక్షన్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : నేడు కండ్లకోయ జంక్షన్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

 

08:26 - May 1, 2018

ప్రత్యేకహోదా...ఏపీ రాజకీయాలపై వక్తలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి, బీజేపీ ఏపీ నేత విష్ణు, కాంగ్రెస్ ఏపీ నేత రామకృష్ణ, వైసీపీ నేత విజయ్ కుమార్, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని, మాట్లాడారు.  ప్రత్యేకహోదా కోసం టీడీపీ, వైసీపీ దీక్షలను స్వాగతించాల్సిందేనని అన్నారు. అయితే టీడీపీ, వైసీపీ పరస్పర విమర్శలు చేసుకోవడం మానుకోవాలన్నారు. రాజకీయాల్లో గజిబిజిని సృష్టిస్తున్నారని చెప్పారు.  
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:16 - May 1, 2018

మే 1.. ప్రపంచ చరిత్రలో ఈ రోజుకు చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది. ప్రపంచ పెట్టుబడిదారీ పెద్దన్నగా చెప్పబడే అమెరికాకు కార్మిక లోకం శక్తి ఏంటో తెలిసిన రోజు. ఈ రోజు సాధించిబడి, అమలు చేయబడుతున్న అనే హక్కుల సాధనకు జరిగిన పోరాటాలకు స్ఫూర్తినిచ్చిన రోజు. 1886లో కార్మికులంతా ఏకమై పని గంటలు, కనీస వేతనాల కోసం ఉద్యమించి, తమ ప్రాణాలను సైతం అర్పించి హక్కులు సాధించుకోవడం  నిజానికి ఆ పోరాటం తర్వాతే ప్రపంచం కార్మికుల హక్కులను గుర్తించింది. మరి ఆ పోరాట స్ఫూర్తి నుంచి నేడు తీసుకోల్సిన స్ఫూర్తి ఏంటి.. కార్మికుల పట్ల మన పాలకులు విధానాలు ఎలా ఉన్నాయి... మే డేని ఘనంగా నిర్వహిస్తున్న పాలకులు.. కార్మికుల పట్ల అనుసరిస్తున్న వైఖరి ఏంటి.. అనే అంశంపై సీఐటీయూ నాయకులు సాయిబాబు  
మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:12 - May 1, 2018

మహారాష్ట్ర : పుణేమ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయాన్ని సాధించింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 13 పరుగుల తేడాతో ధోనీ గ్యాంగ్ విక్టరీ కొట్టింది. చెన్నై నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో చివరి దాకా పోరాడినా  ఢిల్లీకి ఓటమి తప్పలేదు. సొంతమైదానం పుణెలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చిచ్చురపిడుగులా చెలరేగిపోయింది. ప్రత్యర్థులకు ఓపెనర్లు ముచ్చెమటలు పట్టించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై బ్యాట్స్‌మెన్లు దిల్లీ బౌలర్లకు ఊచకోత కోశారు. షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. చెన్నై సూపర్‌కింగ్స్‌ ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌ 40 బంతుల్లో 4 ఫోర్లు,  7 సిక్స్‌లతో   78 పరుగులు చేయగా.. 33 బంతుల్లో 3ఫోర్లు, 1×సిక్స్‌ బాదిన డుప్లెసిస్‌  33 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్‌  ఎంఎస్‌ ధోనీ 22 బంతుల్లో నే 51 రన్స్‌ బాదగా, అంబటిరాయుడు 24 బంతుల్లో 41 పరుగులతో టాప్‌లేపాడు. దీంతో నిర్ణీత 20ఓవర్లలో చెన్నై టీం 4వికెట్లు నష్టపోయి 211 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాళ్లు తడబడ్డారు. 20ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 198 మాత్రమే చేయగలిగారు. దీంతో చెన్నైటీం పాయింట్ల పట్టికలో మరోసారి టాప్‌ప్లేస్‌కు చేరుకుంది. 

 

08:04 - May 1, 2018

రాజస్థాన్ : ఉత్తరాది రాష్ట్రాల్లో దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పెళ్లిరోజు గుర్రంపై ఊరేగాడని ఓ దళితుడిని చితకబాదిన ఘటన రాజస్థాన్‌ భిల్వారా జిల్లా గోవర్ధన్‌పుర గ్రామంలో చోటుచేసుకుంది. పెళ్లికొడుకు గుర్రంపై ఊరేగడం అగ్రవర్ణాలకే పరిమితం. తమ సంప్రదాయాన్ని  హైజాక్‌ చేశాడన్న కోపంతో దళితుడిని గుర్రంపై నుంచి కిందకు దించి దారుణంగా కొట్టారు. ఈ ఘటనపై ఎస్‌సి/ఎస్‌టి చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. దాడిలో గాయపడ్డ పెళ్లికొడుకును ఆసుపత్రిలో చేర్చారు. గత నెల మార్చిలో గుజరాత్‌ భావనగర్‌ జిల్లాలో కూడా గుర్రంపై ఊరేగిన ఓ దళితుడిని అగ్రవర్ణాలకు చెందిన కొందరు కొట్టి చంపారు. 
 
 

08:02 - May 1, 2018

హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జలజం సత్యనారాయణ రచించిన కబీర్‌గీత పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిధిలుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహిత ఎన్ గోపి హాజరయ్యారు. శాస్త్రవిజ్ఞానం అందుబాటులో ఉన్నా... సమాజంలో ముఢానమ్మాకాలను విశ్వసించే వారు ఎక్కువయ్యారని తమ్మినేని అన్నారు. పాలకులు కూడా ఈ ముఢానమ్మకాలను పెంచడానికి పరోక్షంగా దోహదం చేస్తున్నారని వక్తలు అభిప్రాయపడ్డారు.  

 

07:58 - May 1, 2018

విశాఖ : విభజన హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత విధానాలను నిరసిస్తూ విశాఖలో వైసీపీ వంచన వ్యతిరేక దీక్షకు దిగింది. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ముఖ్యనేతలంతా ఈ దీక్షలో కూర్చున్నారు. నల్ల దుస్తులను ధరించి దీక్షలో కూర్చుని నిరసన తెలియజేశారు. 

తిరుపతిలో టీడీపీ నిర్వహిస్తున్న ధర్మపోరాట సభ వంచన సభ అని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు దీక్షకు నిరసనగా వంచన వ్యతిరేక దీక్ష నిర్వహించిన వైసీపీ నల్లజెండాలు చేతపట్టి నిరసన తెలిపింది. 
       
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రజలను మభ్యపెట్టేందుకే  ధర్మదీక్ష అంటు సభలు నిర్వహిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. ప్రత్యేక హోదా తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 5 కోట్ల ప్రజలను మోసం చేశారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. బీజేపీతో కలిసి వంచనకు పాల్పడిన సీఎం   చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.  

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  ఎన్నికల కోసం చంద్రబాబు దీక్షల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రత్యేకహోదాపై ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలతో రాజీనామా చేస్తే కేంద్రం ప్రత్యేకహోదా ఇస్తుందని చెప్పారు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా వెంటనే తమ ఎంపీలతో రాజీనామా చేయించాలని ఆమె డిమాండ్‌ చేశారు. 

తిరుపతిలో చంద్రబాబు దీక్షకు నిరసనగా విశాఖలో   వంచన వ్యతిరేక దీక్ష నిర్వహించిన వైసీపీనేతలు  ఎప్పటికైనా రాష్ట్రానికి  హోదా సాధించేంది  తామేనంటున్నారు. మొత్తానికి ప్రత్యేకహోదా పోరును పోటాపోటీగా నడిపిస్తున్న టీడీపీ, వైసీపీలు.. రాష్ట్ర రాజకీయాలను రసవత్తరంగా మార్చాయి. 

07:58 - May 1, 2018

విశాఖ : విభజన హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత విధానాలను నిరసిస్తూ విశాఖలో వైసీపీ వంచన వ్యతిరేక దీక్షకు దిగింది. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ముఖ్యనేతలంతా ఈ దీక్షలో కూర్చున్నారు. నల్ల దుస్తులను ధరించి దీక్షలో కూర్చుని నిరసన తెలియజేశారు. 

తిరుపతిలో టీడీపీ నిర్వహిస్తున్న ధర్మపోరాట సభ వంచన సభ అని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు దీక్షకు నిరసనగా వంచన వ్యతిరేక దీక్ష నిర్వహించిన వైసీపీ నల్లజెండాలు చేతపట్టి నిరసన తెలిపింది. 
       
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రజలను మభ్యపెట్టేందుకే  ధర్మదీక్ష అంటు సభలు నిర్వహిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. ప్రత్యేక హోదా తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 5 కోట్ల ప్రజలను మోసం చేశారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. బీజేపీతో కలిసి వంచనకు పాల్పడిన సీఎం   చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.  

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  ఎన్నికల కోసం చంద్రబాబు దీక్షల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రత్యేకహోదాపై ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలతో రాజీనామా చేస్తే కేంద్రం ప్రత్యేకహోదా ఇస్తుందని చెప్పారు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా వెంటనే తమ ఎంపీలతో రాజీనామా చేయించాలని ఆమె డిమాండ్‌ చేశారు. 

తిరుపతిలో చంద్రబాబు దీక్షకు నిరసనగా విశాఖలో   వంచన వ్యతిరేక దీక్ష నిర్వహించిన వైసీపీనేతలు  ఎప్పటికైనా రాష్ట్రానికి  హోదా సాధించేంది  తామేనంటున్నారు. మొత్తానికి ప్రత్యేకహోదా పోరును పోటాపోటీగా నడిపిస్తున్న టీడీపీ, వైసీపీలు.. రాష్ట్ర రాజకీయాలను రసవత్తరంగా మార్చాయి. 

07:54 - May 1, 2018

చిత్తూరు : తిరుపతిలో జరిగిన ధర్మపోరాట సభలో బీజేపీ, వైసీపీలపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. నమ్మకద్రోహం-కుట్రరాజకీయాలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం అనేది తిరుమల వెంకన్నసాక్షిగా  తేల్చుకుందామని బీజేపీ, వైసీపీలకు సవాల్‌ విసిరారు. 
అంతిమ విజయం మాదే : చంద్రబాబు
ప్రత్యేకహోదా సాధన కోసం టీడీపీ చేపట్టిన ధర్మపోరాటంలో అంతిమ విజయం తమదే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత ఎన్నికల్లో   ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ హామీ ఇచ్చి మాటతప్పారని చంద్రబాబు విమర్శించారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ఎన్డీయేలో చేరామన్నారు. మోదీ ప్రభుత్వం నమ్మద్రోహం.. రాష్ట్రంలో వైసీపీ కుట్రరాజకీయాలపై ధర్మపోరాటం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ప్రధాని మాయమాటల్ని మరోసారి గుర్తుచేసేందుకే తిరుపతిలో సభపెట్టామన్నారు. 
ఏపీకి కేవలం 2500 కోట్లు ఇచ్చారు : చంద్రబాబు 
గుజరాత్‌లో ఓ విగ్రహానికి 1500 కోట్లు ఇచ్చిన మోదీ ప్రభుత్వం .. విభజనతో పూర్తిగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం కేవలం 2500 కోట్లు ఇచ్చారని చంద్రబాబు అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాపై ఎన్నికల కుముందు తిరుపతిలోనూ, తర్వాత  ప్రధాని హోదాలో  అమరావతికి వచ్చిన సందర్భంలోనూ హామీ ఇచ్చిన సంగతి మర్చిపోయారా అని మోదీని ప్రశ్నించారు. అమరావతికి మట్టీ-నీరు తీసుకువచ్చి హైదరాబాద్‌ కంటే బ్రహ్మాండమైన నగరం నిర్మిస్తామన్నారు.. కానిఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారని చంద్రబాబు దుయ్యబట్టారు. 
ప్రధాని మోదీని నిలదీసే ధైర్యం జగన్‌కు లేదన్న నారా లోకేష్  
ప్రధాని మోదీని నిలదీసే ధైర్యం జగన్‌కు లేదన్నారు మంత్రి నారాలోకేశ్‌. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి వైసీపీ మద్దతిస్తోందని లోకేశ్‌ ఎద్దేవాచేశారు. 
ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలి : బాలకృష్ణ 
ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ప్రత్యేక హోదాపై పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు బాలకృష్ణ. ఏపీ ప్రజలంటే కేంద్రానికి ఎందుకు చిన్నచూపు అని బాలకృష్ణ ప్రశ్నించారు. 
నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలను ఎండగడతాం : చంద్రబాబు 
నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలను ఎండగడతామన్న చంద్రబాబు.. కుట్రలో భాగస్వాములైన పార్టీలను కూడా  చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మొత్తానికి తిరుపతి సభ నుంచి సీఎం చంద్రబాబు రాబోయే ఎన్నికలకోసం శంఖారావం పూరించారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. 

 

07:48 - May 1, 2018

హైదరాబాద్ : నేడు మేడే... కష్టజీవుల పండుగ రోజు.. శ్రమదోపిడీపై కార్మికవర్గం నినదించిన రోజు..  చెమటచుక్కలు నిప్పురవ్వల్లా ఎగిసిన రోజు.. బండచాకిరికి వ్యతిరేకంగా శ్రామికలోకం పిడికెళ్లిత్తిన రోజు.. కండలు కరిగించడంలోనే జీవన సౌందర్యాన్ని చూసే కష్టజీవులు.. దోపిడీ వర్గంపై తిరగబడి హక్కులు సాధించుకున్న రోజు.  మేడే సందర్భంగా శ్రామిక లోకానికి టెన్‌టీవీ శుభాకాంక్షలు చెబుతోంది. 
శ్రామిక దినోత్సవం... 
శ్రామిక దినోత్సవం... ప్రపంచకార్మికుల పోరాటానికి నిలువెత్తు సాక్ష్యం మేడే... శ్రమజీవుల నెత్తుటి ధారల్లోనుంచి ఎగిసిన స్వేచ్ఛాపతాకం మేడే .. పెట్టుబడిదారీ ప్రపంచానికి పుట్టినిల్లైన అమెరికాలో దాదాపు 132 ఏళ్ల క్రితం శ్రమ దోపిడీపై కార్మికులు ఉద్యమించారు. తరతరాల దోపిడీపై తిరుగుబాటు చేశారు. నాటి పెట్టుబడీదారీ వర్గం సాగించిన దమకాండలో చిందిన కార్మికుల వెచ్చని నెత్తురే కేతనమై ఎగిసింది. 
1886లో దుర్భర పరిస్థితుల్లో కార్మికులు 
అది 1886.. అమెరికాలోని కార్మికులు దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్న రోజులవి. కార్మికులు రోజుకి 18..-20 గంటలు పనిచేస్తున్న దోపిడీ కాలమది. పారిశ్రామిక విప్లవం ప్రారంభదినాల్లో శ్రామికులు బానిసల్లా శ్రమించే వారు. పారిశ్రామికవేత్తలు అధిక లాభాలకోసం ఆరేడేళ్ల పిల్లలతోనూ, మహిళలతోనూ ఫ్యాక్టరీల్లో, గనుల్లో పనిచేయించారు. పెట్టుబడీదారులు దమనకాండను ప్రశ్నించేవారే లేని కాలం అది.   
1886 మే 1న కార్మికుల ఉద్యమం
పెట్టుబడీదారి దోపిడీపై శ్రమజీవుల్లో అగ్గిరాజుకుంది. కార్మికవర్గ చైతన్యం వెల్లివిరిసింది. రోజుకి ఎనిమిది గంటల పని విధానం కోసం కార్మికలోకం కదిలింది. 1886 మే 1 న అమెరికాలోని  చికాగో నగర వీధుల్లో కార్మికుల కదం తొక్కారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులపై  పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు కార్మికులు నేలకొరిగారు. ఈ దారుణ హత్యాకాండకు నిరసనగా మే 4న హే మార్కెట్‌లో కార్మికులు సభ నిర్వహించారు. ప్రశాంతంగా సాగుతున్న సభ మీద పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ గొడవలో ఒక పోలీసు సార్జెంట్‌ చనిపోయాడు. అది సాకుగా తీసుకుని నిరాయుధులైన కార్మికులపై పోలీసులు తుపాకులతో స్వైర విహారం చేశారు. ఈ సంఘర్షణలో  నలుగురు కార్మికులు నేలకొరిగారు. మరెందరో గాయపడ్డారు. హే మార్కెట్‌ ప్రాంతం కార్మికుల రక్తంతో తడిసిపోయింది.  శ్రమజీవుల నెత్తుడి ధారల్లోనుంచి పురుడు పోసుకున్న అరుణపాతక ..ప్రపంచ కార్మికుల స్వేచ్ఛాగీతమై నిలిచింది. ఆ రోజే  మేడే గా ప్రసిద్ధి కెక్కింది. 
సమాజ పురోగతికి చోదక శక్తి కార్మికవర్గమే 
ఏ దేశంలోనైనా సమాజ పురోగతికి చోదక శక్తి కార్మికవర్గమే. భారత్‌లాంటి  దేశాల్లో కార్మికుల పట్ల ప్రభుత్వాలు  మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. పేదరికానికి కుంగిపోకుండా..  కష్టాలను పంటిబిగువున భరించే కార్మికుడు పిడికిలి బిగించిన రోజు మేడే. ఈ మేడే స్ఫూర్తితో శ్రమదోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తూనే.. దేశపురోగతిలో శ్రామికుడు ముందుకు సాగాలన్నదే మేడే సందేశం.

 

ఢిల్లీ డేర్ డెవిల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం

ఐపీఎల్ 11 : ఢిల్లీ డేర్ డెవిల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 13 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది.
 

Don't Miss