Activities calendar

02 May 2018

తిరుపతిలో 'భరత్ అనే నేను' ఫేం కైరా...

చిత్తూరు : తిరుపతిలో "భరత్‌ అనే నేను " మూవీ ఫేం- కైరా సందడి చేశారు. ఓ మొలైల్‌షాపు ప్రారంభానికి వచ్చిన ఆమె.. తిరుపతి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భరత్‌ అనే నేను సినిమాను సక్సెస్‌ చేసినందుకు అభిమానులకు అభినందనలు తెలిపారు.

ఇద్దరు విద్యార్థులను ప్రాణం తీసిన ఈత...

నెల్లూరు : జిల్లాలో విషాదం నెలకొంది. ఈత సరదా ఇద్దరు విద్యార్థులను బలితీసుకుంది. మనుబోలు మండలం కాగితాలపూరుకు చెందిన అజయ్‌కుమార్‌, వినయ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు అనే విద్యార్థులు గంగచెరువులో ఈతకు వెళ్లారు. అజయ్‌, వినయ్‌ ఇద్దరూ చెరువులో ఈతకు దిగగా... వెంకటేశ్వర్లు మాత్రం గట్టున కూర్చున్నాడు. చెరువులోకి దిగిన ఇద్దరు ప్రమాదవశాత్తూ మునిగిపోయారు.

సుప్రీంలో పోలవరం పిటిషన్ పై విచారణ...

ఢిల్లీ : సుప్రీంకోర్టులో పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై విచారణ జరిగింది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అభ్యంతరం తెలుపుతూ ఒడిషా ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై వాదోపవాదాలు సాగాయి. గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పునకు అనుగుణంగా ప్రాజెక్ట్‌ నిర్మాణం లేదని.. 36 లక్షల క్యూసెక్కుల నీటి కోసం ప్రాజెక్ట్‌ నిర్మాణం జరపాల్సి ఉండగా.. 50 లక్షలకు పైగా నీటి కోసం ప్రాజెక్ట్‌ నిర్మిస్తున్నారని ఒడిషా సర్కార్‌ పిటిషన్‌లో పేర్కొంది.

సభ్యత్వ రద్దు..తీర్పు రిజర్వు...

హైదరాబాద్ : కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ్యత్వం రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో వాదనలు ముగిశాయి.ఈ కేసులో సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ 12 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డివిజన్‌ బెంచ్‌కి అప్పీల్‌ చేశారు. పిటిషనర్ల తరుపున వైద్యనాథన్‌ వాదనలు వినిపించారు. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ తరుపున అభిషేక్‌ మను సింఘ్వి వాదించారు. పిటిషన్‌ వేసిన 12 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది పార్టీ ఫిరాయించిన వారేనని, ఇలాంటి వారు కేసు వేసే అర్హతలేదని సింఘ్వి వాదించారు.

21:04 - May 2, 2018

విజయవాడ : వైసీపీతో లాలూచీపడ్డ బీజేపీ.. జగన్‌పై ఉన్న కేసులను నీరుకార్చే ప్రయత్నం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసిన జగన్‌ సంస్థల ఆస్తులకు సడలింపు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ నయవంచనకు నిదర్శనమని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల వరకు నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మపోరాట సభలను కొనసాగించాలని చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెలాఖరులో విజయవాడలో పార్టీ మహానాడును ఘనంగా నిర్వహించాలని తలపెట్టారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసిన జగన్‌ సంస్థల ఆస్తులకు కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇవ్వడంపై టీడీపీ సమన్వయ కమిటీలో ప్రధానంగా చర్చించారు. అవినీతిపై పోరాడుతున్నామంటున్న బీజేపీ నేతలు.. వైసీపీతో అంటకాగడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. కుడి, ఎడమ అవినీతిపరులను పెట్టుకుని... బీజేపీ నాయకులు ప్రజలకు ఏరకమైన సందేశం ఇస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం గనులను కొల్లగొట్టిన మైనింగ్‌ మాఫీయా గాలి జనార్దన్‌రెడ్డిపై ఉన్న కేసులను కూడా కేంద్ర ప్రభుత్వం తొలగిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. బీజేపీ లాలూచీ రాజకీయాలకు కర్నాటక ఎన్నికలే నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను వంచించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ధర్మపోరాట సభలను కొనసాగించాలని టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. తిరుపతి సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని మిగిలిన 12 జిల్లాల్లో కూడా ధర్మపోరాట సభల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 20న విశాఖలో ధర్మపోరాట సభ నిర్వహించే అంశంపై చర్చించారు. వచ్చే ఏడాది జనవరిలో అమరావతిలో నిర్వహించే భారీ ర్యాలీతో ధర్మపోరాట సభలను ముగించాలని టీడీపీ సమన్వయ కమిటీలో నిర్ణయించారు. ఈ సభలను ఎన్నికల ప్రచారానికి వేదికలుగా ఉపయోగించుకోవాలని టీడీపీ తలపెట్టింది. దళితతేజం, మైనారిటీల సభలపై కూడా చర్చించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం అనుచరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీ గెలిచేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. పార్టీ నాయకులందరూ ఒకే మాటమీద నిలబడి, ఒకే బాటలో నడవాలని సూచించారు. విజయవాడలో టీడీపీ మహానాడు నిర్వహించాలని సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. 

21:01 - May 2, 2018

హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమాజ్‌వాదీ పార్టీ మద్దతు లభించింది. కేసీఆర్‌ ఏర్పాటు చేసే కొత్త రాజకీయ కూటమికి సహకరిస్తానని ఎస్‌పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ హామీ ఇచ్చారు. అఖిలేశ్‌ ఇచ్చిన మద్దతు స్ఫూర్తితో తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. 2019 ఎన్నికల కోసం భావసారూప్యత ఉన్న పార్టీలను ఏకం చేయడమే తన లక్ష్యమని అఖిలేష్‌ యాదవ్‌తో భేటీ తర్వాత కేసీఆర్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించేందుకు యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ హైదరాబాద్‌ వచ్చారు. లక్నో నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్న అఖిలేశ్‌కు ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు అఖిలేశ్‌కు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రగతి భవన్‌ చేరుకున్న అఖిలేశ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాదరంగా ఆహ్వానించి, మధ్యాహ్నం విందు ఇచ్చారు.

విందు తర్వాత కేసీఆర్‌, అఖిలేశ్‌ సమావేశమై దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ అంశాలపై సమాలోచనలు జరిపారు. తాను ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్‌ గురించి కేసీఆర్‌.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ దృష్టికి తెచ్చారు. డెబ్బై ఏళ్ల స్వాతంత్ర్య భారత చరిత్రలో దేశ ప్రజలు సంతోషంగా లేరన్న అంశంపై చర్చలు సాగాయి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం నుంచి నిరుద్యోగం వరకు అన్నిఅంశాలపై సమాలోచనలు జరిపారు. కాంగ్రెస్‌, బీజేపీల మూస రాజకీయాలతో దేశం ఆశించిన అభివృద్ధి సాధించలేదన్నవిషయాన్ని కేసీఆర్‌... అఖిలేశ్‌ దృష్టికి తెచ్చారు. ప్రత్యమ్నాయ రాజకీయ కూటమి ప్రయత్నాలు 2019 ఎన్నికలు, ప్రధాని పదవి కోసం కాదని, అభివృద్ధి అజెండాగా ముందుకు సాగుతున్న విషయాన్ని కేసీఆర్‌ ప్రస్తావించారు. భావసారూపత్య ఉన్న అన్ని పార్టీలు తాను ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిలో చేరేందుకు ముందుకురావొచ్చని కేసీఆర్‌ ఆహ్వానించారు.

ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటుపై కేసీఆర్‌తో జరిపిన చర్చల పట్ల అఖిలేశ్‌ యాదవ్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రయత్నాలకు సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించారు. గత యూపీఏ పాలన, ఇప్పటి ఎన్డీయే పాలనకు పెద్ద తేడాలేదని అఖిలేశ్‌ విమర్శించారు. భవిష్యత్‌లో తరచూ సమావేశమై ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని కేసీఆర్‌, అఖిలేశ్‌ యాదవ్‌ నిర్ణయించారు. 

నెల్లూరులో గవర్నర్...

నెల్లూరు : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. గవర్నర్ కు ఏపీ రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. 

20:45 - May 2, 2018

ఎండలు మండుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు ప్రాణ..ఆస్తి నష్టం సంభవంచింది. అసలు తెలుగు రాష్ట్రాల్లో వింతవాతావరణం ఎందుకు నెలకొంది ? అనే అంశంపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో వాతావరణ నిపుణులు వై.కె.రెడ్డి పాల్గొని విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:43 - May 2, 2018

తెలంగాణ రాష్ట్రంలో జనసమితి నిర్వహించిన సభ సక్సెస్..మాటల వేడిని పుట్టిస్తున్న కోదండరాం...ప్రత్యేక దొంగ కోసం వెతుకులాటుడుతున్న జనం...వైసిపి..బిజెపి..టిడిలోనే దాగున్నడంట..గుణాత్మక మార్పు...యూపీఏని చీల్చే కుట్ర జరుగుతున్నదంట..మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అహంకారం..దళితుడిని ఇంటిని కూల్చివేయిస్తున్నాడంట..భగీరథ పైపులు పేలుతున్నయి..శవాన్ని అరెస్టు చేసిన ఫ్రెండ్లీ పోలీసులు...ఆంధ్రకు ప్రత్యేక హోదా కల్పిలంచాలనే పోరాటంలో హిజ్రాల ఎంట్రీ...గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:33 - May 2, 2018

బెంగళూరు : కర్నాటక ఎన్నికల ఫలితాలతో దేశ రాజకీయాల్లో మార్పులు వస్తాయని టెన్ టివితో మధుయాష్కీ పేర్కొన్నారు. సౌత్ లో పాగా వేసేందుకు బీజేపీ కుట్రలు..కుతంత్రాలు చేస్తోందని విమర్శించారు. కర్నాటకలో హాంగ్ కు అవకాశం లేదని, 130 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తోందని జోస్యం చెప్పారు. దేవేగౌడ, కేసీఆర్ లు బీజేపీ నాణానికి రెండు ముఖాలని, బీజేపీ ఆదేశాల మేరకే కేసీఆర్ జేడీఎస్ కు మద్దతంటున్నారని విమర్శించారు. మోడీ కుట్రలో భాగమే కేసీఆర్ చెబుతున్న థర్డ్ ఫ్రంట్ అని అభివర్ణించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

జాతీయ సంస్థలకు 52 ఎకరాల కేటాయింపు...

విజయవాడ : ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 52 ఎకరాలు జాతీయ సంస్థలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ, ఫోరెన్సిక్ ల్యాబ్ కి రెండెకరాలు, మరో 19 జాతీయ సంస్థలకు భూ కేటాయింపులకు నిర్ణయం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ కార్యాలయం ఏర్పాటుకు రెండు వేల గజాలు కేటాయించింది. 

19:14 - May 2, 2018

ఖమ్మం : ఇచ్చిన హామీలు ఎందుకు పూర్తి చేయలేదంటూ వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ ను గిరిజనులు నిలదీశారు. పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రోడ్డు వేస్తామని ఆయన హామీనిచ్చారు. కానీ నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇచ్చిన హామీ నెరవేర్చలేదని అక్కడి గిరిజనులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం డబుల్ బెడ్ రూం నివాసాలకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న రాంపూర్ తండా వాసులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. మదన్ లాల్ దిష్టిబొమ్మకు చీర కట్టి దగ్ధం చేశారు. గిరిజనులు చేసిన ఈ చర్యను ఎమ్మెల్యే ఖండించారు. ఒక కమ్మ..రెడ్డి కులానికి చెందిన ఎమ్మెల్యే అయితే ఇలా చేస్తారా ? చెట్టు కిందనో..ఇంటి వద్దో కూర్చొబెట్టుకుని సమస్యలను పరిష్కరించుకోవాలి కానీ ఇలా చేస్తారా ? అంటూ ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు.

ఇచ్చిన హామీ అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తుంటే ఎమ్మెల్యే ఇలా అసహనం వ్యక్తం చేయడం ఏంటీ ? అని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే మాట్లాడుతుండడం..ఇతరత్రా దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. తెలుసుకున్న పోలీసులు సెల్ ఫోన్ లు లాక్కొని వీడియోలను డిలీట్ చేశారు. పోలీసుల చర్యను గిరిజనులు ఖండించారు. 

వైరా ఎమ్మెల్యేకు చేదు అనుభవం...

ఖమ్మం : జూలూరు మండలం రాంపురం తండాలో రోడ్డు వేయించాలంటూ ఎమ్మెల్యే మదన్ లాల్ ను గిరిజనులు అడ్డుకున్నారు. మదన్ లాల్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి నిరసన తెలియచేశారు. గిరిజనులపై మదన్ లాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మ..రెడ్డి..ఎమ్మెల్యేలు అయితే ఇలా చేస్తారా ? అంటూ మండిపడ్డారు. ఫోన్ లో వీడియోలు తీస్తుండగా వాటిని పోలీసులు లాక్కొని డిలీట్ చేశారు. 

మోడీ కుట్రలో భాగమే థర్డ్ ఫ్రంట్ - మదు యాష్కీ...

బెంగళూరు : కర్నాటక ఎన్నికల ఫలితాలతో దేశ రాజకీయాల్లో మార్పులు వస్తాయని టెన్ టివితో మధుయాష్కీ పేర్కొన్నారు. సౌత్ లో పాగా వేసేందుకు బీజేపీ కుట్రలు..కుతంత్రాలు చేస్తోందని విమర్శించారు. కర్నాటకలో హాంగ్ కు అవకాశం లేదని, 130 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తోందని జోస్యం చెప్పారు. దేవేగౌడ, కేసీఆర్ లు బీజేపీ నాణానికి రెండు ముఖాలని, బీజేపీ ఆదేశాల మేరకే కేసీఆర్ జేడీఎస్ కు మద్దతంటున్నారని విమర్శించారు. మోడీ కుట్రలో భాగమే కేసీఆర్ చెబుతున్న థర్డ్ ఫ్రంట్ అని అభివర్ణించారు. 

స్కూల్ బస్సుపై దాడి...

శ్రీనగర్: విద్యార్థులు ప్రయాణిస్తున్న ప్రైవేటు స్కూల్ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని సోపియాన్‌లో ఈ ఉదయం చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. బస్సులో మొత్తం 50 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు.

18:48 - May 2, 2018

కరీంనగర్ : మంధనిలో ఓ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేత, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో కాకతీయ ప్రాజెక్టు పనులు చేపడుతున్నారు. మంథనిలోని తమ్మిచెరువు కట్ట ఆధునీకరణ పనులను కాంట్రాక్టర్ చేపడుతున్నాడు. చెరువు కట్టపైనున్న అతి ప్రాచీనమైన శివలింగాన్ని..మహానంది విగ్రహాన్ని తొలగించడంతో కలకలం రేగింది. కాంట్రాక్టర్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాడని, ఎనిమిది శివలింగాల్లో ఈ విగ్రహం పురాతనమైందని టీఆర్ఎస్ నేత సునీల్ రెడ్డి పేర్కొన్నారు. వెంటనే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని, శివలింగాన్ని పునప్రతిష్ట చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. 

18:29 - May 2, 2018
18:28 - May 2, 2018

'దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల క్రియాశీల పాత్ర'

హైదరాబాద్ : జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు క్రియాశీల పాత్ర పోషించాలని ప్రయత్నిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. 2019 ఎన్నికల కోసం పార్టీలను ఏకం చేయడం మాత్రమే కాకుండా, రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సి ఉందని అన్నారు. 

'కేసీఆర్‌ గుణాత్మక మార్పుకు సమాజ్‌వాదీ పార్టీ సపోర్టు'...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లో కేసీఆర్‌తో సమావేశం ముగిసిన తరువాత అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ... కేసీఆర్‌ తలపెట్టిన గుణాత్మక మార్పును సమాజ్‌వాదీ పార్టీ సమర్థిస్తోందని అన్నారు. 

17:42 - May 2, 2018

హైదరాబాద్ : భారతదేశంలో గుణాత్మక మార్పు కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు తెలియచేస్తున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. దేశంలో మార్పు కోసం జరుగుతున్న చర్చలు ఆరంభం మాత్రమేనని..మరిన్ని చర్చలు కొనసాగుతాయన్నారు. కేసీఆర్ తో భేటీ అనంతరం ఇరువురూ మీడియాతో మాట్లాడారు. తనతో కేసీఆర్ ఎన్నోమార్లు సంభాషించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతోందని..ఇక్కడ ప్రజల మనస్సులను చూరగొన్నారని..ప్రజల ఆశయాలు..లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రజల్లో ఒక నమ్మకం కలిగించారని పేర్కొన్నారు. తాగు, సాగునీరు సమస్య ప్రధానంగా ఉందని..ఇంటింటికి తాగునీరందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఆనందంగా లేకపోతే దేశం..రాష్ట్రం అభివృద్ధి చెందదని, దేశంలో గుణాత్మక మార్పు రానున్న కాలంలో చోటు చేసుకుంటుందని,

యువశక్తిని మనం సద్వినియోగం చేసుకోవడం లేదని, ఇతర ప్రాంతాలకు వెళ్లి యువత టాలెంట్ ను నిరూపించుకుంటోందని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలు..నేతలు మాత్రమే బీజేపీని ఎదుర్కొనే శక్తి ఉందని, దేశంలో ఉన్న రాష్ట్రాలకు ఇచ్చిన పలు హామీలు బీజేపీ ఇంకా నెరవేర్చలేదన్నారు. మార్పు కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ముమ్మరంగా సమావేశాలు జరుగుతాయన్నారు. కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు తెలియచేస్తున్నట్లు, హైదరాబాద్ కు సమాజ్ వాదీ పార్టీకి మధ్య సంబంధం ఉందన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:34 - May 2, 2018

హైదరాబాద్ : దేశంలో గుణాత్మక మార్పు అవసరమని..దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్...అంటూ చిల్లర మల్లర రాజకీయాలని...ఇతరత్రా ఏవోవో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారని, కానీ ఇవి అలాంటి రాజకీయాలు కాదని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తాను ఫోన్ లో సమాజ్ వాది పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో సంభాషించడం జరిగిందన్నారు. అందులో భాగంగా అఖిలేష్ నగరానికి వచ్చారని..ఆయనతో తాను సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని పేర్కొన్నారు.

దేశంలో గుణాత్మక మార్పు కోసం అవలంబించాల్సిన వైఖరి..వ్యూహంపై చర్చించినట్లు పేర్కొన్నారు. దేశంలో ఉన్న ప్రజల ఆకాంక్షలు నెరవర్చే ప్రయత్నం జరగలేదని, కాలం గడిచిపోతోందని..కానీ రైతులు..దళితులు..మైనార్టీలు..ఇతర వర్గాలకు చెందిన ప్రజలు సంతృప్తిలో లేరన్నారు. ఈ సమయంలో దేశంలో మార్పు అవసరమని భావించి ప్రయత్నాలు జరుగుతున్నట్లు, థర్డ్ ఫ్రంట్..ఫోర్త్ ఫ్రంట్..ఫిప్త్ ఫ్రంట్..అంటూ ఏమీ లేదని..ఇది కేవలం రాజకీయం కోసం కాదన్నారు. చైనా దేశం ఎంతో అభివృద్ధిలో ముందుకు దూసుకెళుతోందని..ఇతర దేశాలు కూడా అభివృద్ధిలో దూసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని..భారతదేశం ఎందుకు అభివృద్ధిలో ముందుకు వెళ్లకూడదని ప్రశ్నించారు. తాను చేస్తున్న ప్రయత్నాలను అఖిలేష్ ప్రశసించారని పేర్కొన్నారు. 

17:09 - May 2, 2018

ఢిల్లీ : ఉత్తర భారతంలో దళితులపై దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. ఆధునిక సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా...ఆటవిక చర్యలు ఆగడం లేదు. అగ్రకుల దురహంకారంతో కనీసం తోటి మానవుడని కూడా గుర్తించకుండా నీచమైన చర్యలకు పాల్పడుతున్నారు. తమ పంటను కోయడానికి రాలేదన్న కారణంతో కొందరు అగ్ర కులస్తులు ఓ దళితుడితో మూత్రం తాగించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌ జిల్లా అజంపూర్‌ బిసౌరియా గ్రామానికి చెందిన సీతారాం వాల్మికీ తనకున్న కొద్దిపాటి పొలంలో గోధుమ సాగు చేశారు. తన పంట కోతకు రావడంతో ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఊర్లోని అగ్ర కులానికి చెందిన కొందరు రైతులు ముందు తమ పొలంలో పంటను కోయడానికి రావాలని సీతారాంను ఆదేశించారు. దీనికి నిరాకరించడంతో అతడిపై దౌర్జన్యానికి దిగారు. చెప్పులతో దాడి చేశారు. మీసాలను బలంగా లాగుతూ మూత్రం తాగించారని సీతారాం ఆరోపించారు. ఏప్రిల్‌ 24న ఈ ఘటన చోటుచేసుకుంది.

తనపై పాశవికంగా ప్రవర్తించిన వారిపై ఫిర్యాదు చేయడానికి హజరత్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే ఇన్‌స్పెక్టర్‌ కేసు నమోదు చేసేందుకు నిరాకరించాడు. దీంతో బాధితుడు ఎస్పీని ఆశ్రయించాడు. ఎస్పీ ఆదేశంతో స్పందించిన స్థానిక పోలీసులు సీతారాంపై దాడి చేసిన విజయ్‌ సింగ్‌, విక్రమ్‌ సింగ్‌, సోమ్‌పాల్‌ సింగ్‌, పింకు సింగ్‌లను అరెస్ట్‌ చేశారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీస్‌ అధికారి రాజేష్‌ కశ్యప్‌ను పై అధికారులు సస్పెండ్‌ చేశారు.

దళితులు గుర్రంపై ఊరేగడం కూడా నేరమే! రాజస్థాన్‌లో పెళ్లిరోజు గుర్రంపై ఊరేగినందుకు అగ్ర కులస్తులు కొందరు ఓ దళితుడిని చితకబాదారు. భిల్వారా జిల్లా గోవర్ధన్‌పుర గ్రామంలో ఏప్రిల్‌ 29న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ఎస్‌సి/ఎస్‌టి చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. దాడిలో గాయపడ్డ పెళ్లికొడుకును ఆసుపత్రిలో చేర్చారు. గత నెల మార్చిలో గుజరాత్‌ భావనగర్‌ జిల్లాలో కూడా గుర్రంపై ఊరేగిన ఓ దళితుడిని అగ్రవర్ణాలకు చెందిన కొందరు కొట్టి చంపారు. సామాజిక వివక్షను తట్టుకోలేక చాలామంది దళితులు బౌద్ధమతంలో చేరుతున్నారని బిజెపికి చెందిన ఎంపి ఉదిత్‌ రాజ్‌ చెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే దళితులపై దాడులు పెరిగిపోయాయని, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన పేర్కొనడం గమనార్హం. 

16:49 - May 2, 2018

హిమాచల్‌ప్రదేశ్‌ : ఓ మహిళ అధికారి హత్య కేసును సుప్రీంకోర్టు సీరియస్ అంశంగా పేర్కొంది. కసౌలీలోని ఓ హోటల్‌లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న సమయంలో యజమాని విజయ్‌ కుమార్‌ గాల్లో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మహిళా అధికారి శైల్ బాలా మృతి చెందారు. ఓ కార్మికుడికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో 160 మంది పోలీసులు ఉండగా విజయ్‌ సింగ్‌ ఎలా పారిపోయాడని....పోలీసులు అతన్ని ఎందుకు పట్టుకోలేక పోయారని కోర్టు ప్రశ్నించింది. నిందితుడు మహిళా అధికారితో వాగ్వాదానికి దిగడం వీడియోలో స్పష్టంగా ఉందని పేర్కొంది. హోటల్‌లో అక్రమ కట్టడాలను తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఏప్రిల్ 17న ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. తమ ఆదేశాలను ధిక్కరించడమే కాకుండా ప్రజలపై కాల్పులు జరుపుతారా అంటూ నిందితుడిపై కోర్టు మండిపడింది.

16:48 - May 2, 2018

ముంబై : ప్రముఖ జర్నలిస్ట్ జ్యోతిర్మయ్ డే హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌ను ముంబైలోని ఓ కోర్టు దోషిగా తేల్చింది. ఏడేళ్ల కిందటి ఈ హత్య కేసులో కోర్టు తీర్పు వెల్లడించింది. 56 ఏళ్ల జ్యోతిర్మయ్ డే 'దైనిక్‌ మిడ్‌డే'కు ఇన్విస్టిగేషన్‌ రిపోర్టర్‌గా పనిచేసేవారు. జూన్ 11, 2011లో ఆయన ఇంటి దగ్గరే దుండగులు కాల్చి చంపారు. చోటా రాజన్ ఆదేశాల మేరకే ఆయనను కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. 'చింది-రాగ్స్ టు రిచెస్' పేరుతో డే రాయబోయే పుస్తకంలో చోటా రాజన్ గురించి ప్రస్తావించడం గ్యాంగ్‌స్టర్‌కు ఆగ్రహం తెప్పించింది. 20 మంది గ్యాంగ్‌స్టర్ల జీవితచరిత్రలను ఈ పుస్తకంలో ఆయన వివరించారు. ఈ కేసులో అప్పటి 'ది ఏషియన్ ఏజ్‌' పత్రిక డిప్యూటీ బ్యూరో చీఫ్‌గా ఉన్న జిగ్నా వోరాను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. చోటారాజన్‌తో చేతులు కలిపి జ్యోతిర్మయ్ డేను చంపడానికి జిగ్నా ప్లాన్ చేశాడని పోలీసులు ఆరోపించారు. అయితే ఈ హత్యతో అతనికి సంబంధం లేదని కోర్టు తేల్చింది. చోటా రాజన్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు.

16:46 - May 2, 2018

ఢిల్లీ : ఉత్తర భారత దేశంలో పెళ్లి వేడుకలు, ఉత్సవాల్లో కాల్పులు జరపడం సర్వసాధారణమే.. తాజాగా బిహార్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి ఫేర్‌వెల్‌ పార్టీలో అత్యుత్సాహం ప్రదర్శించారు. తనని సిబిఐకి ట్రాన్స్‌ఫర్‌ చేశారన్న ఆనందంలో ఎస్పీ సిద్ధార్థ్‌ మోహన్‌ జైన్ గాల్లోకి పది రౌండ్ల కాల్పులు జరిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రైల్వే గోల్ఫ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఫేర్‌వెల్ పార్టీలో ఓ వ్యక్తి పాట పాడుతుండగా.. పక్కనే ఉన్న జైన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఫైరింగ్‌లో ఎవరూ గాయపడకపోయినా ఓ పోలీస్‌ అధికారి ఇలా నిర్లక్ష్యంగా కాల్పులు జరపడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

16:44 - May 2, 2018

విజయనగరం : మంగళవారం కురిసిన అకాల వర్షంతో విజయనగరం జిల్లాలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది. పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందగా.. భారీ స్థాయిలో పంటలు దెబ్బతిన్నాయి.. ఏడాది పాటు కష్టపడి పండించిన పంట.. మూడు గంటల పాటు కురిసిన వర్షానికి.. కళ్లముందే నీటిపాలైంది. కోలుకోలేని నష్టం జరగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అరటి, మామిడి, జీడి మామిడి, వరి పంటలు దెబ్బతిన్నాయి. పిడుగుపాటుకు ముగ్గురు మరణించారు.  

16:42 - May 2, 2018

నల్గొండ : వ్యవసాయాన్ని పండుగలా చెయ్యాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో యాబై రెండు సబ్సిడీ ట్రాక్టర్లు, హార్వెస్టర్లను రైతులకు పంపిణీ చేసిన మంత్రి... మీడియాతో మాట్లాడుతూ.. అధిక దిగుబడి కోసం రైతులకు కావాల్సిన అవసరాలను గుర్తించి.. సబ్సిడీ పై అందిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు మంత్రి. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రాష్ట అధ్యక్షులు ఎంపీ గుత్త సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌ రావు పాల్గొన్నారు.

16:40 - May 2, 2018

ప్రకాశం : ఓ వైపు దేశం డిజిటల్‌ యుగంగా అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో మూఢాఛారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో కంపకల్లి పేరుతో ఒళ్ళు గగుర్పొరిచేలా సాగే.. సంప్రదాయ వేడుక మూఢ నమ్మకానికి పరాకాష్టగా మారింది. హనుమంతునిపాడు మండలం చిన్న గొల్లపల్లిలో ఈ వింత ఆచారం నేటికీ కొనసాగుతోంది. కంపకల్లి మూఢాఛారంపై టెన్‌టీవీ ప్రత్యక కథనం...టెక్నాలజీపరంగా దూసుకుపోతున్న రోజుల్లోనూ ఆటవిక ఆఛారాలు వేళ్ళూనుకుని ఉండడం సిగ్గు చేటు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం చిన్న గొల్లపల్లి గ్రామంలో నేటికీ మూఢాచారాలు వీరంగం చేస్తున్నాయి. వైశాఖ శుద్ధ దశమి రోజు మొదలయ్యే శ్రీలక్ష్మి నరసింహస్వామి తిరునాలు దీనికి వేదికగా నిలుస్తోంది. ఒళ్ళుగగుర్పొరిచే మూఢనమ్మకాలు, వింత ఆచారాలతో సాగే ఈ వేడుకలకు రాష్ర్టంతోపాటు పలు ప్రాంతాల ప్రజలు హాజరు కావడం గమనార్హం.

ఈ వేడుకల్లో పోతురాజుల వింత విన్యాసాలు ఒళ్ళు గగుర్పాటు కలిగిస్తాయి. మేక లేదా గొర్రె పిల్లను తెచ్చి పూజలు నిర్వహించాక.. పోతురాజులు ఉర్రూతలూగుతూ కర్కశంగా మేక గొంతును కొరికి ప్రాణం తీస్తారు... ఆ మేక తలనే దేవునికి నైవేద్యంగానూ సమర్పిస్తారు. ఆ తర్వాత చక్కావారి పొంగళ్ళలో రక్తం, మాంసం కలిపి ముద్దలుగా చేసి... సంతానం లేని మహిళలకు కొంగుల్లో విసిరేస్తారు. ఈ ముద్దలను అందుకున్న మహిళలు దేవున్ని ప్రార్థిస్తూ.. ఆ పచ్చి మాంసం ముద్దలను ప్రసాదంగా భావించి తింటారు.

ఈ వేడుకల్లో చివరిరోజున కంపల్లి అనే మూఢాచారాన్ని నిర్వహిస్తారు.. తుమ్మ ముళ్ళను పెద్ద ఎత్తున కుప్పగా వేసి.. సాయంత్రం పూట పోతురాజులు ముళ్ళ కంప చుట్టూ తిరుగుతూ వీరంగం సృష్టిస్తారు. అసంఖ్యాక భక్తుల మధ్యన పిల్లలూ, పెద్దలూ ముళ్ళపై దొర్లుతారు.. తాము మొక్కు తీర్చుకుంటున్నామన్న పరవశంలో భక్తులు శరీరంపై రక్తం కారుతున్నా పట్టించుకోరు. పద్నాలు గేళ్ళలోపు పిల్లలను ముళ్ళకంపపై దొర్లించరాదన్న మానవహక్కుల కమిషన్‌ ఆదేశాలను లెక్కచేయకుండా.. ఈ మూఢాచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కంపకల్లి సమయంలో పోలీసులు, మహిళా సంఘాలు అడ్డుకున్నా పెద్దలు మాత్రం ముళ్ళ కంపపై దొర్లి మొక్కులు తీర్చుకుంటున్నారు. పోతురాజుల నృత్యాలు, వీరంగాలు, జంతుబలులు, డప్పు వాయిద్యాలతో ఈ మూఢాఛార తంతు కొనసాగుతూనే ఉంది. డిజిటల్‌ యుగంలోనూ.. ఇలాంటి మూఢాఛారాలు కొనసాగడం సిగ్గుచేటు... దీన్ని అడ్డుకునేందుకు శిశుసంక్షేమ శాఖ తమవంతుగా ప్రతియేడాదీ ప్రయత్నిస్తూనే ఉన్నా.. ఫలితం లేకుండా పోతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి అడ్డుకోవాలని జనవిజ్ఞాన వేదికలాంటి హేతు వాద సంస్థలు కోరుతున్నాయి. 

16:38 - May 2, 2018

చిత్తూరు : వైసీపీ నేత శ్రీనివాసుల రెడ్డి మృతి చెందడంపై వైసీపీ నేతలు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన శ్రీనివాసులకు సరైన వైద్యం అందించలేదని మండిపడ్డారు. రిమ్స్‌ వైద్యుల నిర్లక్ష్యమే శ్రీనివాసుల మృతికి కారణమని ఆరోపించారు. రిమ్స్‌ డైరెక్టర్‌ శశిధర్‌పై వైసీపీ నేత అవినాశ్‌ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా ఆస్పత్రి పని తీరు మార్చుకోకపోతే ఆందోళన చేసేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. 

16:36 - May 2, 2018

ఢిల్లీ : కాలుష్య కాసారంగా భారతదేశం మారిపోతోందా? కాలుష్య ప్రభావంతో ప్రజలు దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారా? అంటే అవుననే గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలోని పలు పట్టణాలు కాలుష్య నగరాలుగా తయారవుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ కాలుష్యానికి పలు అనారోగ్యం సమస్యలకు ప్రజలు గురవ్వటమేకాక వారి ఆయు:పరిమాణం కూడా కోల్పోతున్నారు. భారత నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవటంతో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యం ఉన్న 15 పట్టణాల్లో 14 పట్టణాలు మన దేశానివే చెందినవే ఉన్నాయి. ఇక్కడి గాలిలో కాలుష్యం పీఎం 2.5 ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. పీఎం 2.5 అనేది అతి సూక్ష్మమైన కాలుష్య కణాలు. ఇవి గాలి ద్వారా మన ఊపరితిత్తుల్లోకి వెళ్లి తీవ్ర హాని చేస్తాయి.

భారత్ లో కాలుష్య కాసారంగా మారిన పట్టణాలు..
ఇక ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పట్టణాలు, వాటిలో పీఎం2.5 స్థాయిలను గమనిస్తే... తొలి స్థానంలో కాన్పూర్ ఉంది. ఇక్కడి గాలిలో పీఎం 2.5 అనేది 173 స్థాయిలో ఉండి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 2. ఫరీదాబాద్ (172) 3. వారణాసి (151) 4. గయ (149) 5. పాట్నా (144) 6. ఢిల్లీ (143) 7. లక్నో (138) 8. ఆగ్రా (131) 9. ముజఫర్ పూర్ (120) 10. శ్రీనగర్ (113) 11. గురుగ్రామ్ (113) 12. జైపూర్ (105) 13. పాటియాలా (101) 14. జోధ్ పూర్ (98). ఇక ప్రపంచ కాలుష్య పట్టణాల జాబితాలో 15వ స్థానంలో ఉన్నది కువైట్ లోని అలి సుభా అల్ సలేమ్. ఇక్కడ పీఎం 2.5 94 స్థాయిలో ఉంది. ఇవి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణాంకాలు. 14 కాలుష్య పట్టణాల్లో ఐదు యూపీ నుంచే ఉండడం గమనార్హం.

ప్రజల్లో ప్రాణాంతక వ్యాధులు..
పసి పిల్లల దగ్గర్నుంచి వృద్ధులూ చివరకు ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్నవారితో సహా దిల్లీలోని ప్రతి ఒక్కరూ తమ ప్రమేయం లేకుండా రోజుకి 44 సిగరెట్లు తాగాల్సొచ్చిందని... అదీ గాలి రూపంలో. గతనెల మొదటి వారంలో రాజధాని నగరాన్ని పొగలా కమ్మేసిన కాలుష్యం ప్రమాద హెచ్చరికల్ని దాటి ఎక్కడికో వెళ్లిపోయింది.

పర్టిక్యులేట్‌ మ్యాటర్‌
వాయు కాలుష్యాన్ని పీఎమ్‌ 2.5, పీఎమ్‌10లలో కొలుస్తారు. పీల్చే గాలిలో వెంట్రుక మందం కన్నా 25 నుంచి 100 శాతం చిన్నగా ఉండే కాలుష్య రేణువులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిపే సూచీ పీఎమ్‌ 2.5. దీనికన్నా కాస్త పెద్దగా ఉండేవే పీఎమ్‌10 రేణువులు. వాతావరణంలో సాధారణంగా పీఎమ్‌2.5 క్యూబిక్‌ మీటరుకు 60మైక్రోగ్రాములు ఉంటే సమస్య లేనట్లు. అది మూడువందలకు చేరితే ప్రమాద హెచ్చరికలు జారీ అయినట్లే.

ఢిల్లీలో 205గా నమోదయిన కాలుష్యం..
ఢిల్లీలో నవంబర్‌లో పీఎమ్‌ 2.5 ఏకంగా వెయ్యికి చేరిపోయింది. బర్క్‌లీ ఎర్త్‌ సైన్స్‌ పరిశోధన సంస్థ ప్రకారం ఆ గాలిని పీల్చితే రోజుకి 44 సిగరెట్లు తాగినట్లేనట. అంటే క్యాన్సర్‌ను రెండు చేతులతో ఒంట్లోకి ఆహ్వానించినట్లేగా. అందుకే, వూపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందంటూ వైద్యులు గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. ప్రజలు ఛాతీ నొప్పి అంటూ ఆసుపత్రులకు పరుగులు తీశారు. గాల్లో పేరుకుపోయిన దుమ్ము,ధూళి ఊపిరితిత్తుల్లోకి చేరి వూపిరాడకుండా చేయటం..కురుస్తున్న మంచు కాలుష్య రేణువులను ఎటూ కదలనివ్వలేదు. కమ్మేసిన ఆ కాలుష్యపు పొగ రోడ్లమీద ప్రమాదాలకు దారితీస్తే ఇళ్లలో కూర్చున్నవారు సైతం కళ్ల మంటలూ దగ్గూ గొంతు మంట లాంటి అనారోగ్య సమస్యలతో సతమతమయ్యారు. రైళ్లు ఆగిపోయాయి. పాఠశాలలు మూతపడ్డాయి. మామూలుగానే దిల్లీలో కాలుష్యం సాధారణం కన్నా పదిరెట్లు ఎక్కువ ఉంటుంది.

గర్భిణీ స్త్రీలపై కాలుష్య ప్రభావం..
ఈ అంతులేని కాలుష్యంతో ఎంతోమంది తల్లులు నెలలు నిండని పిల్లలకు జన్మనిస్తున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ఆస్థమా లాంటి శ్వాస సంబంధిత వ్యాధులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్వచ్ఛతలేని రాజధాని నగర గాలిని పీల్చడం వల్ల అక్కడి పిల్లల్లో సగం మంది అంటే దాదాపు 22లక్షల మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారట. ఇక, గతనెల 40 రెట్లు పెరిగిపోయిన అక్కడి కాలుష్యం ముందుముందు ఇంకెన్ని సమస్యలకు దారితీస్తుందో.

కాలుష్యానికి కారణాలు..
మితిమీరిన వాహనాలూ గాలిని కలుషితం చేసేస్తున్నాయి. ఒకప్పుడు జనం బస్సులూ రైళ్ల సౌకర్యాలు లేవని బాధపడేవారు. ఇప్పుడున్నా ఉపయోగించుకోవడం తగ్గిపోయింది. డబ్బుండాలి కానీ ఇంట్లో నలుగురుంటే నలుగురికీ ప్రత్యేకంగా బైక్‌లూ కార్లూ గేటు ముందు ఉంటున్నాయి. దిల్లీ కాలుష్యాన్నే తీసుకుంటే దాన్లో ఇరవై శాతం వాటా వాహనాలదే. అవి విడుదలచేసే హైడ్రోకార్బన్లూ, కార్బన్‌ మోనాక్సైడ్‌, సల్ఫర్‌డయాక్సైడ్‌... లాంటివి మనిషి ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నాయి.

పరిశ్రమల కాలుష్యం..
పరిశ్రమలూ ఇటుకల బట్టీలూ డీజిల్‌ జనరేటర్లూ రోడ్లమీద ఎగసిపడే దుమ్మూ... ఇలాంటి మరెన్నో వాయు కాలుష్యానికి ఆజ్యం పోస్తున్నాయి. నగర జనాభా పెరగడమూ పీల్చే గాలిని తీవ్రంగా కలుషితం చేస్తోంది.

ఎమ్మెల్యే ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి..

జమ్ము కశ్మీర్ : షాపియాన్ ఎమ్మెల్యే ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ఎమ్మెల్యేక మహమ్మద్ యూసఫ్ భట్ ఇంటిపై ఉగ్రవాదులు పెట్రోల్ బాంబుతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు తగిన కారణాలు తెలియరావాల్సివుంది. 

15:42 - May 2, 2018

హైదరాబాద్ : రానున్న రోజుల్లో బిఎల్ఎఫ్ విస్తృతంగా సమావేశాలు..కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లోకి వెళుతుందని కన్వీనర్ తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిఎల్ఎఫ్ జనరల్ బాడీ సమావేశంలో సుదీర్ఘంగా పలు అంశాలపై చర్చించడం జరిగిందని, బిఎల్ఎప్ లో 28 పార్టీలున్నాయని, భావజాలం ఉన్న పార్టీలు కూడా చేరాలని కోరారు. సీపీఐ పార్టీ ఇంకా చేరలేదని వారితో మాట్లాడుతున్నామని, అందులో భాగంగా మంగళవారం సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తుందని కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన కోదండరాం పేర్కొంటున్నారని తెలిపారు. దీనితో బీఎల్ఎఫ్ కు దూరంగా ఉండాల్సినవసరం లేదని..వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. మందకృష్ణ మాదిగ, బీసీ సంఘం నేత కృష్ణయ్య...ఇతర పార్టీల నేతలతో కూడా చర్చలు జరుపుతున్నామన్నారు.

సమాజ్ వాది పార్టీ నేతలతో చర్చలు జరుపుతామని, ఆ పార్టీకి సంబంధించిన జాతీయ నేత అఖిలేష్ యాదవ్ నగరానికి వచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేయదలిచిన ఫెడరల్ ఫ్రంట్ విషయంలో చర్చలు జరుగుతున్నాయని, ఒకవేళ మద్దతు పలికితే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా పనిచేసిన వారవుతారని తెలిపారు.

ఇక బిఎల్ఎఫ్ రాబోయే మూడు నెలల పాటు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ప్రజలతో సమావేశాలు..బహిరంగసభలు..ఏర్పాటు చేస్తామన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు..మండలానికి..గ్రామానికి...బూత్ లకు కమిటీలు వేస్తామన్నారు. 17 పార్లమెంటరీ నియోజకవర్గాలకు కమిటీలు ప్రకటించడం జరిగిందని, రంజాన్ మాసంలో ఇఫ్తార్ పార్టీలు నిర్వహించి ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిస్తామని...వారికి రక్షణ ఇచ్చేది కేవలం బిఎల్ఎఫ్ మాత్రమేనని తెలిపారు.

అన్ని యూనివర్సిటీలతో..కాలేజీలకు చెందిన వారు ప్రతి మండలానికి ప్రతి ఐదుగురు చొప్పున 400 మండలాల్లో బిఎల్ఎఫ్ విధానాలు ప్రచారం చేస్తారని తెలిపారు. తెలంగాణ రచ్చ బండ పేరిట సభలు నిర్వహిస్తామని...జులై ఆఖరి తరువాత అసెంబ్లీ స్థాయిలో పదివేల మందికి తగ్గకుండా బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజలకు తెలియచేయాలంటే మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, ఈ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి చేరువయ్యే విధంగా చేయాలని కోరారు.

పార్టీ నేత జలగం వెంకట్రావు మాట్లాడుతూ...అధికారం ఒక్కటే అడగొద్దు అంటున్నారని..కానీ బిఎల్ఎఫ్ మాత్రం అధికారం కోసం పోరాడుదామని పేర్కొంటోందన్నారు. ఓట్లు మావి..సీట్లు మావే..అని, బహుజన ఓట్లన్నీ పడుతాయనే భావిస్తున్నట్లు, ఓసీల్లో కూడా పేదవారు ఉన్నారని..సామాజిక న్యాయం కావాలని కోరుకొనే వారున్నారని వారందరినీ సమదృష్టితో చూడడం జరుగుతుందన్నారు. 

ముగిసిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీ..

అమరావతి : టీడీపీ సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. విజయవాడలో మహానాడు జరుపుకోవాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. అన్ని జిల్లాలు ధర్మ పోరాటం సభలు నిర్వహించాలని కమిటీ పిలుపునిచ్చింది. జనవరిలో అమరావతిలో పెద్ద ఎత్తున ధర్మ పోరాట సభ నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. 

15 నుండి పవన్ బస్ యాత్ర..

హైదరాబాద్ : ఈ నెల 15 నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రలో భాగంగా నాలుగు జిల్లాలలో భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నారు. ఆగస్టు 15న పార్టీ పూర్తిస్థాయి కార్యాచరణను పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. 

అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా అరెస్ట్..

హైదరాబాద్ : అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తొమ్మిది మందిగల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణ జిల్లాల్లో పలు దొంగతనాలకు ఈ ముఠా పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. దొంగల నుండి భారీగా మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

15:09 - May 2, 2018

హైదరాబాద్ : యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నగరంలో అడుగు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నగరానికి వచ్చిన అఖిలేష్ యాదవ్ కు తెలంగాణ మంత్రులు కేటీఆర్..తలసానిలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రగతి భవన్ కు వెళ్లిన అఖిలేష్..కేసీఆర్ తో కలిసి భోజనం చేశారు. అనంతరం ఇరువురు ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరిపారు. ఈ భేటీలో రాజ్యసభ సభ్యుడు కేశవరావు, మంత్రి కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు. భేటీకి సంబంధించిన వివరాలు కాసేపట్లో తెలియనున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:04 - May 2, 2018
14:59 - May 2, 2018
14:57 - May 2, 2018
14:53 - May 2, 2018

రోజు తినే కూరగాయాలు,ఆకుకూరలు, పండ్లు వంటివాటిలో అత్యంత తక్కువ ధరకు దొరికేది ఏమన్నా వుంది అంటే అది ఖచ్చితంగా ఆకుకూరలే. బలవర్ధకమమైనవి కూడా ఆకుకూరలే. రక్తహీనత వున్నవారికి వైద్యులు చెప్పే సూచన కూడా ఆకుకూరలు తినమనే. అటువంటి ఆకుకూరలు సామాన్యులకు, పేదలకు అందుబాటులో వండేవి ఆకుకూరలు. కానీ ఓ రకం ఆకుకూర మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. దాని ధర వింటే సామాన్యులే కాదు ఓ మాదికి సంపన్నులు కూడా నోరెళ్లబెట్టాల్సిందే. మరి అంత ఖరీదు ఆ ఆకుకూర ఖరీదు!!!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆకుకూర ‘హాప్ సూట్స్
ఎక్కడైనా సరే ఆకుకూరలు అత్యంత చవగ్గా దొరుకుతాయనేది నిత్య సత్యం. వీటి ధరలు కూడా ఎప్పుడూ కాస్త నిలకడగానే కనిపిస్తుంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆకుకూర ‘హాప్ సూట్స్’. ఈ ఆకుకూర ధర కిలో వెయ్యి యూరోలు. అంటే మన కరెన్సీలో రూ. 76,000. తీగజాతి మాదిరిగా కనిపించే ఈ హాప్ సూట్స్‌ను వసంత రుతువులో పండిస్తారు. కాగా పంట వేసిన అతి తక్కువ వ్యవధిలోనే ఈ పంటను కోయాల్సివుంటుంది. లేనిపక్షంలో ఇది తినేందుకు పనికిరాకుండా పోతుందట. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఈ ఆకుకూరకు అత్యంత డిమాండ్ ఉంటుంది. ఈ పంటను మార్చి నుంచి జూన్ మధ్యకాలంలో పండిస్తారు. తేలికపాటి తడివాతావరణంలో ఈ పంట చక్కగా పండుతుంది.

సభ్యత్వ రద్దుపై ముగిసిన వాదనలు..

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై హైకోర్టులో వాదనలు ముగిసాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటీషన్ పై కోర్టులో వాదనలు ముగిసాయి. ఇరు పార్టీల ఎమ్మెల్యేలు వేసిన పిటీషన్ పై విచారణ చేపట్టిన కోర్టు తీర్పును మాత్రం రిజర్వులో పెట్టింది. తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం వాయిదా వేసింది.

కేసీఆర్ తో భేటీ అయిన అఖిలేశ్ యాదవ్..

హైదరాబాద్ : దేశంలో గుణాత్మక మార్పే తన ధ్యేయమంటూ బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. దేశ రాజకీయాలపై వారి మధ్య చర్చలు జరుగుతున్నాయి. అంతకు ముందు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం చేరుకున్న అఖిలేష్‌కు తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రగతి భవన్‌ చేరుకున్న అఖిలేష్‌ యాదవ్‌.. ప్రగతి భవన్‌లో తేనీటి విందులోనూ పాల్గొన్నారు.   

14:24 - May 2, 2018

హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్...సీఎం కేసీఆర్ దూకుడు పెంచుతున్నారు. ఆయా జాతీయ రాజకీయ నేతలతో భేటీ అవుతున్నారు. దేశంలో గుణాత్మక మార్పు కోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కేసీఆర్ పలువురు జాతీయ నాయకులతో భేటీ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ కు వచ్చారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన అఖిలేష్ కు మంత్రులు కేటీఆర్, తలసానిలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నేరుగా అఖిలేష్ ప్రగతి భవన్ కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలు, తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు..ఈ నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ అవశ్యకతలపై చర్చించనున్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత జాతీయ రాజకీయాలలో పెరగాలని ఇందుకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ చెబుతున్న సంగతి తెలిసిందే. కానీ కాంగ్రెస్ తో కొంత సన్నిహితంగా మెలుగుతున్న అఖిలేష్ ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠ నెలకొంది. మరిన్ని విషయాలు తెలియాలంటే కొద్ది సేపు వరకు వేచి చూడాల్సిందే. 

14:22 - May 2, 2018

విజయవాడ : ఎన్నికల సీజన్ కొద్ది రోజుల్లో రాబోతోంది. దీనితో ఏపీ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు వ్యూహ రచనలో మునిగిపోతున్నాయి. ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా.. విభజన హామీల అంశాలపై రాజకీయ వేడి నెలకొంది. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ టిడిపి వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర నిర్వహిస్తున్నారు. మరోవైపు టిడిపి కూడా కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పిస్తూ..బహిరంగసభలు నిర్వహిస్తూ పార్టీ ప్రతిష్ట..ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తెలియచేసే ప్రయత్నం చేస్తున్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమన్వయ కమిటీ భేటీ కాసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో నేతలకు బాబు దిశా నిర్ధేశం చేశారు. చర్చలో ప్రధానంగా మహానాడు ఎలా విజయవంతం చేయాలి ? ప్రజల ఆదరణ ఇంకా పెంపొందించుకోవాలి ? గతంలో నిర్వహించిన మహానాడు..ఈసారి జరిగే మహానాడు మరింత ఘనంగా నిర్వహించాలని బాబు సూచించారు. ఇక తిరుపతిలో నిర్వహించిన ధర్మపోరాటం సభ విజయవంతమైందని, అందరూ ఒకే మాట మీద నిలబడాలని..ఒకే బాటలో నడవాలన్నారు. నేతలు చేసే తప్పులు తన మీద వేసుకోవడానికి సిద్ధంగా లేనని బాబు ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం..నేతలు చేసే ప్రతి చర్యకు ప్రజలు ప్రతి చర్యను అవలింబిస్తారని, ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలవాలని బాబు సూచించారు. సైకిల్ యాత్రలు, తిరుపతి సభపైనా చర్చించినట్లు, హోదా పోరాట భివిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగిందని సమాచారం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.

13:54 - May 2, 2018

గుంటూరు : అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు పోరుపై నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సైకిల్ యాత్రలు, తిరుపతి సభపైనా చర్చిస్తున్నట్లు సమాచారం. హోదా పోరాటంపై భవిష్యత్ కార్యాచరణను టీడీపీ ప్రకటించనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

13:53 - May 2, 2018

హైదరాబాద్ : యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ కు వచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అఖిలేష్ ప్రగతిభవన్ కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తో ఆయన సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఇరువురు చర్చించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

13:49 - May 2, 2018

విశాఖ : ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాస్ విడుదల చేశారు. ఎంసెట్ లో 78.28 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ లో 1,90,022 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 1,38, 017 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్‌ లో 73, 373 మంది పరీక్షకు హాజరు కాగా 63,800 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 131 పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్ జరిగిందని మంత్రి గంటా తెలిపారు. జూన్ 11 నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఈనెల 26 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ లో ఫస్ట్ ర్యాంక్..బోగి సూరజ్ కృష్ణ ( 95.27) శాతం, సెకండ్ ర్యాంక్..గట్టు మైత్రేయ( 94.93 శాతం), థర్డ్ ర్యాంక్..పి.లోకేశ్వర్ రెడ్డి (94.22 శాతం), ఫోర్త్ ర్యాంక్..జివి.నాయక్ శ్రీవర్ధన్ (94.20శాతం ), ఐదో ర్యాంక్..షేక్ వాజిద్ ( 93.78 శాతం), ఆరో ర్యాంక్...బసవరాజు జిష్ణు (93.51 శాతం), ఏడో ర్యాంక్ అయ్యపు వెంకటం, ఎనిమిదో ర్యాంక్ కేవీఆర్ హేమంత్ కుమార్ (92.71 శాతం), తొమ్మిదో ర్యాంక్ యజ్ఞేశ్వర్ (92.67 శాతం), పదో ర్యాంక్ విష్ణు మనోజ్ఞ(92.56శాతం). 
 

13:34 - May 2, 2018

నెల్లూరు : అతను చేసేది అటెండర్ ఉద్యోగం... కూడబెట్టింది కోట్ల రూపాయల ఆస్తులు... రావాణాశాఖలో కేవలం అటెండర్ గా పనిచేస్తున్న వ్యక్తి రూ.80కోట్లు అక్రమాస్తులను కూడగట్టాడు. కానీ ఏసీబీ అధికారులకు పక్కాగా దొరికిపోయాడు. ఇవాళ నెల్లూరులో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. కో..ఆపరేటివ్ బ్యాంకులోని రెండు లాకర్లను అధికారులు తెరిచారు. భారీ మొత్తంలో బంగారం గుర్తింపు, విలువు కోట్లలో ఉంటుందని గుర్తించారు. రవాణా శాఖ అటెండర్ నరసింహారెడ్డి ఇంటిపై నిన్న ఏసీడీ దాడులు చేసింది. అతని ఆస్తులు చూస్తే మాత్రం ఎవరికైనా షాక్‌ తగలాల్సిందే. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 80 కోట్లకుపైగా అక్రమ ఆస్తులు కూడబెట్టాడు. నెల్లూరు జిల్లా ఉప రవాణాశాఖలో పని చేస్తున్న నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నెల్లూరులోని నివాసంతో పాటే.. ఆరు ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు చేశారు. తనిఖీల్లో 80 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. 50 ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు, 18 ప్లాట్లు, రెండి కిలోల బంగారం, ఏడున్నర లక్షల నగదు గుర్తించారు. నరసింహారెడ్డి భార్య పేరుపై కూడా అనేక ఆస్తులున్నట్లు గుర్తించారు. నరసింహారెడ్డికి గత కొంతకాలంగా ప్రమోషన్లు వచ్చినా... వెళ్లకుండా అక్కడే అటెండర్‌గా కొనసాగుతున్నాడు. అయితే.. ఇందులో బినామీ ఆస్తులు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. 

 

కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి..

జనగామ: ఇటీవల కాలంలో కుక్కలు మనుష్యులపైనా, జంతువుల పైనా దాడి చేయటం పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలో ఓ గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన జిల్లాలోని యెల్లముల గ్రామంలో చోటు చేసుకున్నది. అదే గ్రామానికి చెందిన చంద్రయ్యకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. దీంతో 15 గొర్రెలు మృతి చెందాయి. దీంతో చంద్రయ్య లబో దిబో మంటున్నాడు. జీవనోపాధి కోసం గొర్రెలను పెంచుకుంటుంటే కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి చెందటం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాడు. 

13:27 - May 2, 2018

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘మహానటి’ హంగామా సృష్టిస్తోంది. మహానటి సినిమాలో ప్రధాన ప్రాతధారి సావిత్రి పాత్రను కీర్తి సురేష్ అద్భుతంగా పడించిందనే టాక్ వినిపిస్తోంది. 'మూగ మనసులు’ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్ కు టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ అటెండ్ అయ్యారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మహానటి పాత్రలో కీర్తిసురేష్ సావిత్రిని కళ్లముందు నిలిపేలా జీవింజేసిందనే టాక్స్ వినిపిస్తున్నాయి. సీనియర్ నటి ‘సావిత్రి’ పాత్రను పండించటం సాధారణ విషయం కాదు. నటనకే నటన నేర్పిన అద్బుతనమైన అందమైన అరుదైన నటి సావిత్రి, అటువంటి సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ఎంపిక కావటమే ఆమెపై వున్న నమ్మకానికి నిలువెత్తు నిదుర్శనం. మే 9 న రిలీజయే ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

మహానటి పాత్ర ఇచ్చినందుకు ఆనందం వ్యక్తంచేసిన కీర్తి సురేష్..
సంవత్సరకాలంగా ఒక అద్భుతమైన ప్రయాణం సాగింది. అది ఈ రోజు ముగిసింది. ఎమోషనల్‌గా నా మనసుకు ఎంతో బాగా కనెక్ట్ అయిన సినిమా ఇది. నా మీద నమ్మకంతో నాకు ఈ పాత్ర ఇచ్చి దర్శకుడు నాగఅశ్విన్, వైజయంతి మూవీస్ వారికి బిగ్ థాంక్స్. ఈ చిత్రం మేము గర్వపడే సినిమా అవుతుంది. ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్నాను... అని కీర్తి సురేష్ ట్వీట్ చేశారు.

జర్నలిస్టు మధురవాణిగా సమంత
సమంత ఇందులో ఫిల్మ్ జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో కనిపించబోతున్నారు. సావిత్రి మీద జర్నల్ రాసే జర్నలిస్టుగా సమంత నేరేషన్‌తో ‘మహానటి' చిత్రం మొదలవుతుందని టాక్. ఆమె తన జర్నల్ గురించి చెప్పే క్రమంలోనే సినిమా రన్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు.

అందరి సహకారం మరువలేది : కీర్తి
కీర్తి సురేష్, సమంత, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, షాలిని పాండే, మాళవిక నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ వంటి వారితో కలిసి ఈ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించిన నాగచైతన్యకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ప్రియాంక అన్నారు. మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్ ఇచ్చిన సపోర్ట్ మరిచిపోలేనిది అన్నారు. 

13:12 - May 2, 2018

గుంటూరు : జిల్లాలో అకాలవర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడు, తెనాలి, దుగ్గిరాలలో పంటకు తీవ్ర నష్టం కలిగింది. తెనాలి, మంగళగిరి, దుగ్గిరాలల్లో మొక్కజొన్న, మామిడి, సపోటా దెబ్బతిన్నాయి. రాయపూడి, ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెంలో అరటిపంట నేలకొరిగింది. లక్షన్నర బస్తాల్లో ధాన్యం తడిసింది. చేతికొచ్చిన పంట తడిసి ముద్దవ్వడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గుంటూరు సహా పలు పట్టణాల్లో రోడ్లు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

12:56 - May 2, 2018

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అభ్యంతరం తెలుపుతూ ఒడిషా ప్రభుత్వం పిటిషన్ వేసింది. గోదావరి ట్రైబ్యునల్ తీర్పునకు అనుగుణంగా ప్రాజెక్టు నిర్మాణం లేదని ఒడిషా తెలిపింది. 36 లక్షల క్యూసెక్కుల నీటి కోసం ప్రాజెక్టు నిర్మాణం జరపాల్సి ఉండగా 50 లక్షలకు పైగా నీటి కోసం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఆరోపణ చేస్తోంది. అటవీశాఖ అనుమతి లేకుండానే ప్రాజెక్టు నిర్మిస్తున్నారని అభ్యంతరం తెలిపింది. ప్రాజెక్జ్ నిర్మాణంపై స్టే విధించాలని ఒడిషా కోరుతోంది. తదుపరి విచారణ ఈనెల 11వ తేదీకి వాయిదా పడింది. 

12:52 - May 2, 2018

హైదరాబాద్ : యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ కు చేరుకున్నారు. కాసేపట్లో ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో ఆయన సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఇరువురు చర్చించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

హైదరాబాద్ చేరుకున్న అఖిలేష్ యాదవ్

హైదరాబాద్: యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ హైదరబాద్ చేరుకున్నారు. అఖిలేశ్ కు మంత్రులు కేటీఆర్, తలసాని ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పై కేసీఆర్, అఖిలేశ్ చర్చించనున్నారు. 

12:41 - May 2, 2018

హైదరాబాద్ : లోకల్ బాడీ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్ అన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం పార్టీ నిర్మాణం, సభ్యత్వంపైనే దృష్టి సారించామని చెప్పారు. జిల్లాల వారీగా ఇంచార్జీలను నియమించామని పేర్కొన్నారు. జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. 

 

ఏపీ ఎంసెట్ టాప్ ర్యాంకర్స్ వీళ్లే..

విశాఖ : 95.27 శాతంతో బోగి సూరజ్ కృష్ణకు ఫస్ట్ ర్యాంక్ రాగా, 94.93 శాతం మార్కులతో గట్టు మైత్రేయ సెకండ్ ర్యాంక్, 94.22 శాతం మార్కులతో పి.లోకేశ్వర్ రెడ్డి మూడవ ర్యాంక్, 94.20 శాతం మార్కులతో జి.వినాయక్ శ్రీవర్ధన్ నాల్గవ ర్యాంక్, 93.78 శాతం మార్కులతో షేక్ వాజిద్ ఐదవా ర్యాంక్, 93.50 శాతం మార్కులతో బసవరాజు జుష్ణు ఆరవ ర్యాంక్ లను సాధించారు. 

ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల..

విశాఖ : ఏపీ ఎంసెట్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాస్ విడుదల చేశారు. ఇంజనీరింగ్ కు 72.28 శాతం ఉత్తీర్ణత సాధించినట్లుగా మంత్రి తెలిపారు. ఇంజనీరింగ్ పరీక్షలో 1,38,017ల మంది క్వాలిపై అయినట్లుగా మంత్రి తెలిపారు. ఉత్తీర్ణత శాతం72.28గా ఉంది. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 87.06 శాతంమంది ఉత్తీర్ణత సాధించగా..అగ్రికల్చర్ విభాగంలో 63,883 మంది అర్హత సాధించారు. కాగా గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. 

12:29 - May 2, 2018

గుంటూరు : అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు పోరుపై నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సైకిల్ యాత్రలు, తిరుపతి సభపైనా చర్చిస్తున్నట్లు సమాచారం. హోదా పోరాటంపై భవిష్యత్ కార్యాచరణను టీడీపీ ప్రకటించనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

పోలవరంపై స్టే విధించాలన్న ఒడిషా..

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు విచారణను చేపట్టింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి స్టే విధించాలని ఒడిషా న్యాయస్థానాన్ని కోరింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అభ్యంతరం తెలుపుతు కోర్టులో పిటీషన్ వేసిన ఒడిషా ప్రభుత్వం పిటీషన్ మేరకు న్యాయ స్థానం విచారణ చేపట్టింది. అటవీశాఖ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఒడిశా ప్రభుత్వం ఆరోపించింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణంపై స్టే విధించాలని ఒడిషా కోరుతోంది. కాగా తరుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. 

12:24 - May 2, 2018

ఏదైనా దేవాలయానికి వెళితే అక్కడ వుండే రాళ్లను ఏరి రాయిపై రాయిని పేర్చి దణ్ణం పెట్టుకోవటం కొందరికి అలవాటు. అలా చేస్తే స్వంత గృహం లేని వారు ఇల్లు కట్టుకుంటారని విశ్వాసం. అలా చేస్తే ఇంటికి శుభం జరుగుతుందని చాలామంది నమ్మకం. కానీ గులకరాళ్ళను ఉపయోగించి వాటిని గోపురంలాగా పేర్చటం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే అవి నున్నగా పట్టుకుంటేనే జారిపోయేంత నున్నగా వుంటాయి. వాటితో కనీసం రెండు మూడు రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చలేం. కానీ కోకిఐ మికునీ అనే ఓ యువకుడు మాత్రం 'రాక్ యోగా' చేయించేస్తు సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతున్నాడు. మరి ఆ రాళ్ళ గోపురాల సొగసుని మనం కూడా చూసేద్దాం. అలాగే ఆ యువకుడి నేర్పరితనం గురించి తెలుసుకుందాం.

రాక్ యోగాతో ఫేమస్..
అచ్చం అలాగే గులకరాళ్ళ శిల్పాలు చెక్కి సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ 2అయ్యాడు కోకిఐ మికునీ అనే ఓ జపాన్ కుర్రాడు. ఇతరు రాళ్లతో రకరకాల ఆకృతుల్లో మేడలు కట్టేస్తాడు. రాళ్లతో యోగసనాలు చేయించేస్తుంటాడు. పెద్ద రాయిపై చిన్న రాయి పెట్టి..దానిపై ఇంకో పెద్ద రాయిని అవలీలగా పెట్టేస్తాడు. అలా రాయిపైన రాయి పేర్చుకుంటు పోయి ఓ రాళ్ల కోటను నిర్మించేస్తాడు కోకిఐ మికుమి. ఆ ఏమిటి రాయిపై రాయి పేర్చితే వింతేముంది? గొప్పేముంది అంటారా? మరి అక్కడే కోకిఐ మికునీ అసలైన చాకచక్యం.

గులకరాళ్లతో రాక్ యోగా..
కోకిఐ మికునీ చిన్న చిన్న రాళ్లు, పెద్ద రాళ్లు, చకచకా ఏరేస్తాడు. వాటిని ఓ పద్దతి ప్రకాకం గోపురంలా పేర్చేస్తాడు. ఇలా పేర్చిన ఆ రాళ్లు పడిపోకపోవటమే కాక కొన్నిసార్లు రెండు మూడు రోజుల వరకూ అలాగే నిలిచిపోతాయట. వీటిని మొదటిసారి చూసిన వారెవరైనా ఇలా ఎలా నిల్చున్నాయబ్బా!!అంటు ఆశ్చర్యపోవటం వారి వంతు..ఏమిటీ ఇదేమంత గొప్ప అనుకుంటున్నారా? అయితే మీరు ప్రయత్నించి చూడండి..సాధ్యమైతే...ఆహా ఒకవేళ అయితే..మీరు కూడా కోకిఐ మికునీ లా ఫేవస్ అయిపోవచ్చు..మరి ట్రైచేయండి...నిలుస్తాయే లేదో చూద్దాం..ఓకేనా?!!..

11:54 - May 2, 2018

బెంగళూరు : కర్నాటకలో మరోసారి అధికారంలోకి కాంగ్రెస్ వస్తుందని ఆ పార్టీ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కర్నాటకలో ఉన్న తెలుగువారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారని తెలిపారు. అవినీతి ఆరోపణలున్న బీజేపీ నేతలను ప్రజలను నమ్మరని చెప్పారు. జనతాదళ్ (ఎస్) పై ప్రజల్లో నమ్మకం లేదన్నారు. అవినీతి కేసుల్లో ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి కుటుంబానికి బీజేపీ టిక్కెట్లు ఇస్తోందని చెప్పారు.

 

11:44 - May 2, 2018

హైదరాబాద్ : నేడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు బేగంపేట్ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రగతిభవన్ లో కేసీఆర్ తో అఖిలేష్ సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్, అఖిలేష్ చర్చించనున్నారు. మధ్యాహ్నం కేసీఆర్ తో కలిసి అఖిలేష్ భోజనం చేయనున్నారు. ఆ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో తేనేటి విందులో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు అఖిలేష్ యూపీకి తిరుగుప్రయాణం కానున్నారు. 

వర్ల రామయ్య ప్రమాణ స్వీకారం..

అమరావతి : ఆర్టీసీ చైర్మన్ గా వర్ల రామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. వర్ల రామయ్యతో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. డైరెక్టర్లుగా తెంటు లక్ష్మణ నాయుడు, మింటె పార్ధసారధి , ఆర్, సుభాష్ ప్రమాణ స్వీకరాం చేశారు. 

11:40 - May 2, 2018

ప.గో : ఏపీలో అకాల వర్షం బీభత్స సృష్టించింది. పశ్చిమ ఏజెన్సీలో అకాలవర్షం పడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మెరుపులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో కురిసిన వర్షానికి భారీగా పంట నష్ట వాటిల్లింది. జంగారెడ్డి గూడెం, కన్నాపురం, రెడ్డిగూడెం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన మొక్కజొన్న, మామిడి, జీడిపంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతాంగం ఆందోళనలో ఉంది. తమకు ప్రభుత్వమే సాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. నిన్న కురిసిన అకాల వర్షానికి రైతులకు తీవ్ర నష్ట వాటిల్లింది. మామిడి, జీడి మామిడి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొక్కజొన్న రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మొక్కజొన్న నీటిలో పూర్తిగా తడిసిపోయింది. పంట నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రోడ్లపై చెట్లు కూలిపడ్డాయి

 

నిరుపేద రెడ్ల సమరభేరి..

వరంగల్‌ రూరల్‌ : రెడ్డి సామాజిక వర్గంలో 80శాతానికి పైగా నిరుపేదలుగానే ఉన్నారని, వారి భవిష్యత్‌ను పరిరక్షించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ గోపు జైపాల్‌రెడ్డి అన్నారు. దామెర మండలం ఊరుగొండలో ఏర్పాటు చేసిన సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్లలో అధిక భాగం నిరుపేదలే ఉన్నారని, వారంతా నేటికీ దుర్భర జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మే 27న హైదరాబాద్‌లో 10లక్షల మందితో రెడ్ల సమరభేరి నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్ తో భేటీ కానున్న అఖిలేశ్ యాదవ్..

హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్ దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12.30లకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు అఖిలేశ్ చేరుకోనున్నారు. అనంరతం కేసీఆర్ తో అఖిలేశ్ యాదవ్ భేటీ కానున్నారు. అనంతరం ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకతపై ఇరువురు చర్చించనున్నారు. అనంతరం కేసీఆర్ తో కలిసి అఖిలేవ్ లంచ్ చేయనున్నారు. కాగా గత కొంతకాంలో థర్డ్ ఫ్రంట్ దిశగా పయనిస్తున్న కేసీఆర్ దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో వరుసగా భేటీ అయిన వారితో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చిస్తున్న విషయం తెలిసిందే.

11:15 - May 2, 2018

గుంటూరు : టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం అయింది. సీఎం చంద్రబాబు సమక్షంలో భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు పోరుపై నేతలు చర్చించనున్నారు. సైకిల్ యాత్రలు, తిరుపతి సభపైనా చర్చించనున్నారు. హోదా పోరాట భివిష్యత్ కార్యాచరణపై చర్చ జరుపనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

ప్రారంభమైన ఏపీ కేబినెట్..

అమరావతి : ఈరోజు మధ్యాహ్నం సచివాలంలో సీఎం చంద్రబాబు సమక్షంలో  రాష్ట్ర కేబినెట్ భేటీకానుంది. ఈ భేటీలో నిరుద్యోగ భృతి, కొత్త పీఆర్సీ, విభజన హామీల సాధన, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరుగనుంది. ఖరీఫ్ కు సన్నద్ధం, వేసవిలో నష్ట నివారణ చర్యలపై కూడా కేబినెట్ చర్చించనుంది. 

శంషాబాద్ లో గోల్డ్ బిస్కెట్స్ స్వాధీనం..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు 4 బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి 799 గ్రాముల బంగారం బిస్కెట్లు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.25,54,880 లక్షలుంటుందని అధికారులు తెలిపారు.

మణిశర్మకు పితృ వియోగం..

హైదరాబాద్ : ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ తండ్రి యనమండ్ర నాగయజ్ఞశర్మ చెన్నైలో తన 92వ ఏట మంగ‌ళ‌వారం ఉద‌యం 5.50గంట‌ల ప్రాంతంలో కన్న‌ముశారు. ఆ రోజు సాయంత్ర‌మే ఆయ‌న అంత్య‌క్రియ‌లు జ‌రిపించారు కుటుంబ స‌భ్యులు. య‌న‌మండ్ర.. ఘంట‌సాల‌కి తొలి శిష్యుడు కాగా, ఆయ‌న క‌చేరీల‌లో వ‌యోలిన్ వాయించే వారు . ఆ త‌ర్వాత ప్ర‌ఖ్యాత సంగీత ద‌ర్శ‌కులు సాలూరి రాజేశ్వరరావు, పెండ్యాల, సుచర్ల దక్షిణామూర్తి వంటి వారి వద్ద మెయిన్‌ వయొలనిస్ట్‌గా పనిచేశారు. ఆ త‌రం సంగీత ద‌ర్శ‌కులంద‌రితో ప‌ని చేసిన శ‌ర్మ ఎంద‌రో వాగ్గేయ కారులని సంగీత ద‌ర్శ‌కుల‌కి ప‌రిచ‌యం చేశారు.

11:01 - May 2, 2018

బెంగళూరు : కాంగ్రెస్..జేడీఎస్ లు బాయ్ బాయ్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గాలి జనార్ధన్ రెడ్డితో పార్టీకి ఎలాంటి సబంధం లేదని స్పష్టం చేశారు. ప్రజలు బీజేపీని గెలిపించబోతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు తెలుగు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. అన్ని రంగాల్లో సిద్ధరామయ్య ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎన్నికల కోసం లింగాయత్ మతాన్ని తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు.

 

తెలుగువారు డిసైడ్ అయ్యారుః నాదెండ్ల

కర్ణాకట : సిద్ధరామయ్య చేసిన అభివృద్ధి పనులు ప్రజల్లోకి వెళ్లాయని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సిద్ధరామయ్య అందించిన సుపరిపాలనపై ప్రజలు సంతృప్తికంగా వున్నారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీ ప్రజలను ఎలా మోసం చేసారో కర్ణాటకలోని తెలుగువారికి తెలిజేస్తున్నామన్నారు. కర్ణాటకలో వున్న 1.10 కోట్ల తెలుగువారు బీజేపీకి వ్యతిరేకంగా వున్నారని తెలిపారు. బీజేపీకి ఓటు వేయకూడదని తెలుగువారు డిసైడ్ అయ్యారని నాదెండ్ల 10టీవీతో మాట్లాడుతున్న సందర్భంగా తెలిపారు. దీంతో బీజేపీ అయోమయంలో పడిపోయిందన్నారు.

మధ్యాహ్నం 12.30 గం.లకు కేసీఆర్ తో అఖిలేష్ సమావేశం

హైదరాబాద్ : నేడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు బేగంపేట్ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రగతిభవన్ లో కేసీఆర్ తో అఖిలేష్ సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్, అఖిలేష్ చర్చించనున్నారు. మధ్యాహ్నం కేసీఆర్ తో కలిసి అఖిలేష్ భోజనం చేయనున్నారు. ఆ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో తేనేటి విందులో పాల్గొననున్నారు. 
 

10:53 - May 2, 2018

హైదరాబాద్ : నేడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు బేగంపేట్ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రగతిభవన్ లో కేసీఆర్ తో అఖిలేష్ సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్, అఖిలేష్ చర్చించనున్నారు. మధ్యాహ్నం కేసీఆర్ తో కలిసి అఖిలేష్ భోజనం చేయనున్నారు. ఆ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో తేనేటి విందులో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు అఖిలేష్ యూపీకి తిరుగుప్రయాణం కానున్నారు. 

10:42 - May 2, 2018

నల్గొండ : 10 టివి కథనానికి స్పందన వచ్చింది. మిర్యాలగూడ టూటౌన్ సీఐ సాయి ఈశ్వర్ గౌడ్ పై వేటు పడింది. ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తన దందాలను అడ్డుకున్న కానిస్టేబుల్ పై సీఐ చర్యలను సెల్ఫీ వీడియో ద్వారా అధారాలతో సహా బాధిత కానిస్టేబుల్ వివరించారు. కానిస్టేబుల్ సెల్ఫీ వీడియోను 10 టివి వెలుగులోకి తెచ్చింది.  

 

10:36 - May 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ పరీక్ష ప్రారంభం అయింది. నేటి నుంచి 7వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. మొదటిసారి ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పరీక్ష కేంద్రానికి విద్యార్ధులు చేరుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 89 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నిమిషం ఆలస్యం అయినా అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. 

ప్రారంభమైన తెలంగాణ ఎంసెట్ పరీక్ష

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ పరీక్ష ప్రారంభం అయింది. ఇప్పటికే పరీక్ష కేంద్రానికి విద్యార్ధులు చేరుకున్నారు. 83 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నిమిషం ఆలస్యం అయినా అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. 

 

09:52 - May 2, 2018

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ  ఖజానా కళకళలాడుతోంది. ఎర్లీబర్డ్‌ పేరుతో ముందస్తు ట్యాక్స్‌ చెల్లింపులు చేపట్టడం బల్దియాకు కలిసి వచ్చింది.  ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే మూడొంతుల పన్ను వసూళ్లయ్యాయి. రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు జరగడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  
రికార్డుస్థాయిలో పన్నువసూళ్లు
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈసారి రికార్డు స్థాయిలో ప‌న్ను వ‌సూళ్లు  చెసింది.  ఈఆర్థిక సంవత్సరం మొద‌టి నెల‌లో 437కోట్లును   క‌లెక్ట్ చేసింది.  ఎప్రిల్ లో ప‌న్ను చెల్లించిన వారికి ఎర్లీబ‌ర్డ్ పేరుతో 5శాతం ప‌న్ను రాయితీ ఇవ్వడంతో 5ల‌క్షల మంది త‌మ టాక్స్ పే చేశారు.
ఆదాయం వచ్చే ఏ ఒక్క మార్గాన్ని వదలని బల్దియా 
అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్టుల భారంతో బ‌ల్దియా ఖ‌జానా ఎప్పటి క‌ప్పుడు ఖాళీ  అవుతోంది.  దాంతో కార్పొరేషన్‌  ఆదాయ వ‌న‌రుల‌పై ఫొక‌స్ పెట్టిన అధికారులు  ఇన్‌కం వచ్చే  ఏ ఒక్క అవ‌కాశాన్ని వ‌దులు కోవ‌డం లేదు. ఖాళీ స్థలాలు, పూర్తిగా ప‌న్ను చెల్లించ‌ని నిర్మాణాలు, త‌క్కువ ప‌న్ను చెల్లిస్తున్న నిర్మాణాలను ప‌రిశీలించి భారీగా ట్యాక్స్‌ను పెంచారు. క‌మ‌ర్షీయ‌ల్ టాక్స్ వ‌సూళ్లు కూడా భారీగా పెంచారు. 
బల్దియా ఖజానాకు ప్రతినెలా రూ. 60నుంచి 70కోట్లు 
గ‌త ఆర్థిక సంవ‌త్సరంలో  1263 కోట్లరూపాయ‌ల ఆస్తి ప‌న్నును వ‌సూలు చేసింది జిహెచ్ఎంసి. దాదాపు 14ల‌క్షల మంది ఆస్తి ప‌న్ను చెల్లింపు దారులు ఉండ‌గా వారిని నుంచి  15వంద‌ల కోట్ల ఆస్తి ప‌న్ను రావాల్సి ఉంది.  అంతేకాదు బకాయిల‌తో క‌లిపితే అది 22వంద‌ల కోట్లకు పైగా ఉంటుంది. సాధార‌ణంగా అయితే బల్దియా ఖజానాకు ప్రతి నెల 60నుంచి 70కోట్ల వ‌ర‌కు ఆస్తి ప‌న్ను చేరుతుంది. అయితే ఎప్రిల్ నెలలో ట్యాక్స్‌  చెల్లించ‌డం వ‌ల్ల 5శాతం ప‌న్ను మొత్తంలో రాయితీ  వస్తుండ‌టంతో చాలా మంది ప‌న్ను చెల్లించెందుకు ముందుకు వ‌చ్చారు.  దీంతో బల్దియా ఖజానా కళకళలాడుతోంది. 
ఈ ఏడాది టార్గెట్ రూ. 400కోట్లు 
ఈ ఆర్థిక సంవత్సరంలో  4వంద‌ల కోట్ల రూపాయల పన్నులు వసూలు చేయాలని జీహెచ్‌ఎంసీ  టార్గెట్ గా పెట్టుకుంటే.. దానికి  37కోట్లు అదనంగా వ‌చ్చింది. అంతేకాదు  ఎర్లీబ‌ర్డ్ ప‌థ‌కంలో గ‌తేడాది 367కోట్ల రూపాయ‌లు వ‌సూలు కాగా.. ఈ సారి 70కోట్లు ఆద‌నంగా వ‌సూలు అయ్యింది. దీంతో బ‌ల్దియాకు ఏడాదిలో వ‌చ్చే మొత్తం పన్నులో  మూడు వంతుల్లో ఒక వంతు ఏప్రిల్‌ నెల‌లోనే వ‌చ్చి చేరింది.  
రెగ్యులర్‌గా చెల్లించేవారి నుంచే వసూళు 
అయితే రెగ్యులర్‌గా పన్ను చెల్లించేవారు మాత్రమే ముందస్తు చెల్లింపులు చేసినట్టు తెలుస్తోంది. కొందరు మాత్రం పన్ను చెల్లించడంలో కాలయాపన చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి వడ్డీమాఫీ, లేదా పన్నుమాఫీ వచ్చే వరకు వేచి ఉండి తప్పించుకుంటున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. ట్యాక్స్ పే చేయడంలో నిర్లక్ష్యంగా ఉండేవారిపై ఫోకస్‌ పెట్టి, పన్నుబకాయిలను వసూలు చేయాలని హైదరాబాద్‌ పబ్లిక్‌ నుంచి డిమాండ్‌ వస్తోంది. 

 

బీజేపీతో వైసీపీ లోపాయికారి ఒప్పందం : మంత్రి దేవినేని ఉమా

విజయవాడ : బీజేపీతో వైసీపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని ఏపీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. కర్ణాటకలో బీజేపీని ఓడించండని జనగ్ స్టేట్ మెంట్ ఇవ్వగలడా అని ప్రశ్నించారు. మేము కేంద్రాన్ని తిడుతుంటే జగన్ మార్నింగ్, ఈవినింగ్ వాక్ లో చంద్రబాబును తిడుతున్నారని.. కేంద్రాన్ని, మోదీని ప్రశ్నించరని అన్నారు. జగన్ తో నీతులు చెప్పించుకోవాల్సిన అవససరం తమకు లేదన్నారు. జగన్ నయవంచకుడు అని వ్యాఖ్యానించారు.

 

09:31 - May 2, 2018

హైదరాబాద్ : మూడో ప్రత్యామ్నాయం అంటూ హడావిడి చేస్తున్న కేసీఆర్‌.. కర్నాటక ఎన్నికలపై ప్రత్యేక దృష్టిపెట్టారా..?  పొరుగు రాష్ట్రం  ఎన్నికల ఫలితాలతో దేశరాజకీయాల్లో గణనీయమైన మార్పులు వస్తాయని  భావిస్తున్నారా..?  కర్నాటక ఫలితాలను అనుసరించే  ఫెడరల్ ఫ్రంట్ విషయంలో తన వ్యూహాన్ని మార్చుకోనున్నారా..?  ఇదే విషయంపై ఇపుడు గులాబీపార్టీనేతల్లో  జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
జాతీయపార్టీలకు ప్రతిష్టాత్మకంగా కర్నాటక ఎన్నికలు 
జాతీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన కర్నాటక అసెంబ్లీ  ఎన్నికలపై ప్రాంతీయ పార్టీలు సీరియస్ గా దృష్టి పెట్టాయి.  కాంగ్రెస్, బిజెపిలు నువ్వా....నేనా అన్నట్లు తలపడుతున్న కర్నాటకలో ప్రాంతీయ పార్టీ అయిన జెడిఎస్ కూడా తన పట్టు నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు వస్తున్న సర్వే ఫలితాలు  ఏ పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వకపోవడంతో.. ఈ ఎన్నికలు  అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రధానంగా  తెలంగాణాకు పొరుగున ఉన్న రాష్ట్రం కావడంతో....ఆ ఫలితాల ప్రభావం అంతో ఇంతో తెలంగాణాపై కూడా ఉండే అవకాశాలున్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది.
జేడీఎస్‌కు మద్దతు తెలిపిన కేసీఆర్‌
మూడో ప్రత్యామ్నాయం ప్రయత్నాల్లో భాగంగా కర్నాటకలో పర్యటించిన కేసీఆర్‌.. అక్కడ ఎన్నికల్లో  కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్న జెడిఎస్ కు మద్దతు తెలిపారు. అవసరమైతే   కర్నాటకలో ప్రచారంలో కూడా పాల్గొంటానన్నారు.  ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్‌, బీజేపీలకు సంపూర్ణ మెజార్టీ రాకుంటే  తమ వ్యూహం ఫలించినట్లే అని  గులాబీదళపతి భావిస్తున్నారు. జేడీఎస్‌ బలం పెరిగి.. హస్తం, కమలం పార్టీలకు మెజారిటీ రాని పరిస్థితి.. అటు  జాతీయ స్థాయిలో ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని ఉపయోగించుకుని తాను తలపెట్టిన ఫెడరల్‌ ఫ్రంట్‌వైపు మరిన్ని  ప్రాంతీయ పార్టీలను ఆకర్షించవచ్చని కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 
కర్నాటక ఫలితాలను అనుసరించి వ్యూహం మార్చనున్న కేసీఆర్‌ ! 
అయితే తాను ఆశించిన విధంగా కర్నాకటలో ఫలితాలు ఉండకపోతే.. గులాబి దళపతి తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకునేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం మే కేసీఆర్‌  ఫ్రంట్ కు  ఓ రూపు వచ్చే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

 

09:24 - May 2, 2018

కామారెడ్డి : గిరిజనుల  సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గిరిజనుల పోడు భూముల జోలికొస్తే.. కేసీఆర్ అంతు చూస్తామని హస్తం నేతలు  హెచ్చరించారు. కామారెడ్డిలో గిరిజన డిక్లరేషన్ సదస్సులో కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌ సర్కార్‌పై విరుచుకు పడ్డారు. గిరిజనుల రిజర్వేషన్, గిరిజన విశ్వవిద్యాలయం, పోడు భూముల అంశం సహా పలు అంశాలపై టీపీసీసీ డిక్లరేషన్ ప్రకటించింది.
టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు 
కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన సదస్సులో టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌నేతలు విమర్శలతో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనపై దుమ్మెత్తి పోసిన నేతలు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖామన్నారు.  
గులాబీపార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరిక
గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల హామి ఇచ్చిన కేసీఆర్.. ఆ హామిని విస్మరించారని హస్తంపార్టీ నేతలు మండిపడ్డారు. గిరిజనుల పోడు భూముల జోలికొస్తే.. గులాబీపార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే.. ఖమ్మంజిల్లా బయ్యారంలో  స్టీల్ ఫ్యాక్టరీని నిర్మిస్తామన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని, గిరిజన బ్యాక్ లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో  జనాభా ప్రాతిపాదికన  విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తింపచేస్తామని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ గిరిజన డిక్లరేషన్ ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి.. ప్రజలు నిలదీస్తారనే ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ వేదికగా.. రైతు డిక్లరేషన్ సభ ఏర్పాటు చేయగా.. కామారెడ్డి కేంద్రంగా గిరిజన డిక్లరేషన్ ఏర్పాటు చేసింది. గిరిజన డిక్లరేషన్ సభ సక్సెస్ అయిందని  కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహాం నెలకొంది. 

 

09:17 - May 2, 2018

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ ఎంసెట్ పరీక్ష ప్రారంభం కానుంది. మొదటిసారి ఆన్ లైన్ లో ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు ఎంసెట్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. అగ్రికల్చర్‌, మెడికల్ ఫార్మసీ విద్యార్థులు ఎగ్జామ్ రాయనున్నారు. 2లక్షల మంది ఎగ్జామ్ రాయనున్నారు. 83 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కాసేపట్లో తెలంగాణ ఎంసెట్ పరీక్ష ప్రారంభం

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ ఎంసెట్ పరీక్ష ప్రారంభం కానుంది. మొదటిసారి ఆన్ లైన్ లో ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు మధ్యాహ్నం 3 గం.ల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు ఎంసెట్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. అగ్రికల్చర్‌, మెడికల్ ఫార్మసీ విద్యార్థులు ఎగ్జామ్ రాయనున్నారు. 2లక్షల మంది ఎగ్జామ్ రాయనున్నారు. 83 పరీక్ష కంద్రాలను ఏర్పాటు చేశారు.

 

మిర్యాలగూడ టూటౌన్ సీఐ సాయి ఈశ్వర్ గౌడ్ పై వేటు

నల్గొండ : 10 టివి కథనానికి స్పందన వచ్చింది. మిర్యాలగూడ టూటౌన్ సీఐ సాయి ఈశ్వర్ గౌడ్ పై వేటు పడింది. ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తన దందాలను అడ్డుకున్న కానిస్టేబుల్ పై సీఐ చర్యలను సెల్ఫీ వీడియో ద్వారా అధారాలతో సహా బాధిత కానిస్టేబుల్ వివరించారు. కానిస్టేబుల్ సెల్ఫీ వీడియోను 10 టివి వెలుగులోకి తెచ్చింది.  

నేడు హైదరాబాద్ కు యూపీ మాజీ సీఎం అఖిలేష్

హైదరాబాద్ : నేడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ కు రానున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో అఖిలేష్ కు తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో అఖిలేష్ సమావేశం కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు అఖిలేష్ తిరిగి వెళ్లనున్నారు. 
   

08:35 - May 2, 2018

కర్నాటక ఎన్నికలపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత బండారి రవికుమార్, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ యాదవ్, టీఆర్ ఎస్ నేత శేఖర్ రెడ్డి, బీజేపీ నేత టి.ఆచారి పాల్గొని, మాట్లాడారు. కర్నాటక ఎన్నికలపై వాడీవేడీగా చర్చించారు. తెలంగాణలో రైతుబంధు బంధు పథకంపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

08:27 - May 2, 2018

ఉత్తరాంధ్రకు తలమానికంగా.. గత ప్రభుత్వాలు  నిర్మించిన విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ ప్రైవేటు పరం కానుందా...?  ఇటు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు.. అటు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే.. ఇదంతా నిజమే అనిపిస్తోంది.. వడివడిగా విమ్స్‌ను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడానికి చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.  గతంలో విమ్స్‌ను ప్రైవేటు పరం చేసేందుకు, కన్సల్టెన్సీని నియమించేందుకు ప్రయత్నించి భంగపడిన ప్రభుత్వం.. తాజాగా విమ్స్‌లోని ఎనిమిది సూపర్‌ స్పెషాలిటీ విభాగాలను ప్రైవేటు పరం చేస్తూ జీవో నెంబర్ 33ను విడుదల చేసింది. అసలు ఎందుకు విమ్స్‌ను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. అనే విషయంపై సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్‌ నర్సింగరావు మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం... 

08:21 - May 2, 2018

బెంగళూరు : ఐపీఎల్‌లో బెంగళూరు మళ్లీ  గెలుపు బాట పట్టింది. రెండు ఓటముల తర్వాత పుంజుకున్న ఆర్‌సీబీ జట్టు.. చక్కని బౌలింగ్‌తో ముంబయి ఇండియన్స్‌ను చిత్తు చేసింది. మూడో విజయంతో పాయింట్ల పట్టికలో కోహ్లీసేన ఐదో స్థానానికి చేరుకుంది.  ఆరో ఓటమితో  ప్లేఆఫ్‌ అవకాశాలను ముంబైజట్టు  దూరం చేసుకుంది.  చక్కని  బౌలింగ్‌తో ఆకట్టుకున్న  కోహ్లీబ్యాచ్‌ మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌పై విజయం సాధించింది. మనన్‌ వోహ్రా 31 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో 45 రన్స్‌ చేయగా.. బ్రెండన్‌ మెక్కలమ్‌  25 బంతుల్లో 4ఫోర్లు,  2 సిక్స్‌లు బాదేసి 37 పరుగులు చేశాడు. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు టీమ్‌.. నిర్ణీత 20ఓవర్లలో 7వికెట్లకు 167 పరుగులు చేసింది. తర్వాత టార్గెట్‌ ఛేదనలో ముంబై ఇండియన్స్‌ జట్టు తడబడింది. మొదటి నాలుగు ఓవర్లలో 24 రన్స్‌ మాత్రమే చేసి 3వికెట్లు కోల్పోయిన ముంబై కష్టాల్లో పడింది.   ఆర్‌సీబీ బౌలర్లు ఉమేశ్‌ యాదవ్‌ 2, సౌథీ 2, మహ్మద్‌ సిరాజ్‌ 2 వికెట్లు తీశారు. బెంగళూరు కట్టుదిట్టమై బౌలింగ్‌తో రోహిత్‌ సేన  పరుగుల వేటలో వెనుబడింది. 20 ఓవలర్లలో 7 వికెట్లకు 153 పరుగులు మాత్రమే చేయడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ముంబై బ్యాట్స్‌మన్లలో  50 పరుగులు చేసిన హార్దిక్‌ పాండ్య టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

08:18 - May 2, 2018

ఢిల్లీ : చారిత్రక కట్టడం తాజ్‌మహల్ రంగు మారడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తాజమహల్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలరాతి కట్టడమైన తాజ్‌మహల్‌ తెలుపు రంగు నుంచి కాలుష్యం కారణంగా పసుపు రంగులోకి మారింది. తాజాగా గోధుమ, ఆకు పచ్చరంగులోకి మారుతోందని కోర్టు పేర్కొంది.  విదేశాల నుంచి నిపుణులను పిలిపించి తాజ్‌ మహల్‌పై అధ్యయనం చేయాల్సిందిగా కేంద్రానికి సూచించింది. తాజ్‌మహల్‌కు పూర్వ వైభవాన్ని తెప్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని కోర్టు స్పష్టం చేసింది. తాజ్‌మహల్‌ను కాలుష్య కోరల నుంచి కాపాడాలని కోరుతూ పర్యావరణవేత్త మెహతా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తదుపరి విచారణను మే 9కి కోర్టు వాయిదా వేసింది.

 

08:15 - May 2, 2018

ఢిల్లీ : పోక్సో చట్టం కింద నమోదవుతున్న కేసుల విచారణ సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లలకు భద్రత వారికి సత్వర న్యాయం జరిగేందుకు న్యాయమూర్తులతో ప్రత్యేక కమిటీలు నియమించాలని హైకోర్టులను కోరింది. పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా సత్వరమే పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది. అన్ని రాష్ట్రాల డిజిపిలు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కేసుల విచారణ వేగవంతానికి, సాక్షులను సకాలంలో కోర్టు ఎదుట హాజరుపరిచేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని పేర్కొంది. దేశ వ్యాప్తంగా పోక్సో చట్టం కింద నమోదైన లక్షకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.


 

08:11 - May 2, 2018

సంగారెడ్డి : జిల్లాలో జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలో అగ్నిప్రమాదం జరిగింది.  ఎక్సెల్‌ రబ్బర్‌ పరిశ్రమలో  మంటలు చెలరేగాయి. మంటల్లో ముగ్గురు కార్మికులు చిక్కుకున్నట్టు ఆందోళన వ్యక్తం అవుతోంది. విద్యుత్‌ షార్ట్‌సర్యూట్‌తో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. మంటల ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 

 

08:05 - May 2, 2018

సూర్యాపేట : జిల్లాలోని మునగాల మండలం రామసముద్రంలో తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుడు సుంకర బంగారు రామయ్య, నారాయణమ్మల స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. పలువురు సీపీఎం నేతలు హాజరై జోహార్లు అర్పించారు. కమ్యూనిస్ట్‌ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన బంగారు రామయ్యలాంటి వారు కలకలం గుర్తుండిపోతున్నారని పలువురు కొనియాడారు. 

 

08:01 - May 2, 2018

హైదరాబాద్ : తెలంగాణలో మొదటిసారిగా ఆన్‌లైన్‌ ఎంసెట్‌ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి  నుంచి ఈనెల 7వ తేదీ వరకు జరగనున్న ఎంసెట్‌ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. 
మొదటి సారిగా ఆన్‌లైన్‌లో ఎంసెట్‌ పరీక్షలు
తెలంగాణలో బుధవారం నుంచి ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకుగాను.... మొదటి సారిగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు  2 లక్షల 21 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 30 వేల మంది ఉన్నారు.  అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్ష రాసేందుకు 73 వేల మంది, ఇంజనీరింగ్‌కు లక్షా 48 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు
మొదటిసారిగా తెలంగాణలో ఆన్‌లైన్‌ ఎంసెట్‌ పరీక్ష నిర్వహిస్తుండటంతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. అంతే కాకుండా.. హాల్‌టికెట్లను కచ్చితంగా తీసుకురావాలని సూచించారు. వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు పరీక్ష హాల్లోకి తీసుకురాకూడదని తెలిపారు. పరీక్ష ఫలితాలను పదిరోజులోగా విడదల చేస్తామన్నారు. 
సీటీ బయట పరీక్షా కేంద్రాల ఏర్పాటు 
మొదటి సారిగా ఆన్‌లైన్‌లో ఎసెంట్‌ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సీటీ బయట పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలను ముందుగానే తెలుసుకొని సమయానికి రావాలని సూచిస్తున్నారు.

 

07:56 - May 2, 2018

బెంగళూరు : కర్నాటకలో కాంగ్రెస్‌పార్టీ తరపున ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఏపీ ప్రత్యేక హోదా సెగలు కర్నాకట ఎన్నికల్లో కూడా ప్రభావం చూపిస్తాయంటున్న రఘువీరారెడ్డితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నాటకలో ఉన్న తెలుగు వారు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. కర్నాటకలో ఉన్న సెటిలర్స్‌ అందరూ కాంగ్రెస్‌కే ఓటు వేస్తారని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కనీసం 130 సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

 

07:52 - May 2, 2018

సిద్దిపేట : రైతుబంధు పథకంతో సీఎం కేసీఆర్ నవ శకానికి నాంది పలికారన్నారు మంత్రి హరీష్‌రావు. ఈ నెల 10 నుంచి రాష్ట్రంలోని 58 లక్షల మంది రైతులకు చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన మంత్రి... అనేక అభివృద్ధి పనులను ప్రారంభించారు. 
సిద్దిపేటలో మంత్రి హరీష్‌రావు పర్యటన 
సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రతిభ డిగ్రీ కళాశాలలో క్రియేటివ్‌ టీచర్స్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగీష్ శిక్షణ తరగతులు ప్రారంభించారు. అనంతరం కోటి 50లక్షలతో నిర్మించబోతున్న సమీకృత మిషన్‌ భగీరథ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 
ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి అందిస్తుందన్న మంత్రి 
రెడ్డి సంక్షేమ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన రైతుబంధు పథకం పట్టాదారు పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీపై అవగాహన సదస్సులో హరీష్‌రావు పాల్గొన్నారు. రైతుబంధు పథకాన్ని అన్ని వర్గాల వారు ఘనంగా జరుపుకోవాలన్నారు. చరిత్రలో మొట్టమొదటిసారి ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి అందిస్తుందన్నారు. ఈ పథకాన్ని తమకు అందించాలని ఆయా ప్రభుత్వాలను రైతులు డిమాండ్ చేసే పరిస్థితి దేశవ్యాప్తంగా రాబోతోందన్నారు. ఈ రైతుబంధు పథకం దేశానికి నవశకం తీసుకురావడం ఖాయమన్నారు.  
ట్రాన్స్‌కో డివిజనల్‌ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన
బ్యాంకర్లు పాత బకాయిలు పెట్టుకోకుండా చెక్కు ఇవ్వగానే డబ్బులు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. పట్టాదారు పాస్ బుక్కులు, చెక్కులు పంపిణీకి ప్రతి 300 మందికి ఒక్క టీం చొప్పున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం ముస్తాబాద్ సబ్‌ స్టేషన్ వద్ద  కోటి రూపాయలతో నిర్మిస్తున్న ట్రాన్స్‌కో డివిజనల్‌ కార్యాలయం నిర్మాణానికి  హరీష్‌రావు శంకుస్థాపన చేశారు.     

 

07:48 - May 2, 2018

హైదరాబాద్ : ఎల్బీనగర్‌ మెట్రో రైలు మార్గాన్ని రెండు నెలల్లో ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మియాపూర్‌-ఎల్బీనగర్‌ మెట్రో రైలు మార్గాన్ని నాగోల్‌ మార్గంతో కలిపేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. అలాగే ఎల్బీనగర్‌ నుంచి ఫలక్‌నుమా మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో రైలు మార్గాన్ని పొడిగిస్తామని చింతల్‌కుంట అండర్‌పాస్‌ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 
చింతలకుంట చౌరస్తా వద్ద అండర్‌పాస్‌ ప్రారంభం 
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్‌ చింతలకుంట చౌరస్తా వద్ద నిర్మించిన అండర్‌పాస్‌ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. మొత్తం 18.70 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ అండర్‌పాస్‌తో విజయవాడ హైవేపై ట్రాఫిక్‌ ఇబ్బందులు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా అందుబాటులోకి వచ్చిన  మూడో ప్రాజెక్టు ఇది. అండర్‌ పాస్‌ గోడలను ఆకర్షణీయమైన చిత్రాలతో తీర్చిద్దిద్దారు. 
మియాపూర్‌ ఎల్బీనగర్‌ మార్గంలో ఎస్‌ఆర్‌నగర్‌ వరకు మెట్రో రైళ్లు 
ఈ సందర్భంగా కేటీఆర్‌... మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ గురించి ప్రధానంగా ప్రస్తావించారు. మియాపూర్‌-ఎల్బీనగర్‌ మెట్రో మార్గంలో ఇప్పుడు ఎస్‌ఆర్‌నగర్‌ వరకు రైళ్లు నడుస్తున్నాయి. రెండు నెలల్లో ఎస్‌ఆర్‌ నగర్‌-ఎల్బీ నగర్‌ వరకు కూడా మెట్రో మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. అప్పుడు మియాపూర్‌-ఎల్బీ నగర్‌ మార్గం పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్టు అవుతుంది. ఎల్బీనగర్‌ మెట్రో మార్గాన్ని నుంచి నాగోల్‌ మార్గంలో అనుసంధానం చేస్తారు. ఎల్బీ నగర్‌ నుంచి ఫలక్‌నుమా మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో ప్రాజెక్టును పొడిగిస్తామని కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి  ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. 
ఎల్బీనగర్‌ పరిధిలో రూ.450 కోట్లతో ఎఆర్‌డీపీ పనులు 
ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా మూడు వేల కోట్ల రూపాయలతో జంట నగరాల్లో చేపడుతున్న పనులను కేటీఆర్‌ వివరించారు. ఈ మొత్తంలో 450 కోట్ల రూపాయలతో ఎల్బీనగర్‌లోనే పనులు చేపడుతున్నారు. ఎల్బీనగర్‌ ఎడమ వైపు చేపట్టిన అండర్‌పాస్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించాలని ప్రతిపాదించారు. బైరామల్‌గూడ ఫ్లై ఓవర్‌ను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తారు. ఎల్బీనగర్‌లో చేపట్టిన పనులన్నీ 2019 జూన్‌ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. నల్గొండ క్రాస్‌ రోడ్స్‌ నుంచి ఒవైసీ ఆస్పత్రి వరకు ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మిస్తారు. నగరాభివృద్ధిలో కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కేటీఆర్‌ ప్రస్తావించారు.  
చెరువుల సుందరీకరణకు రూ.541 కోట్ల ఖర్చు 
మూసీనది సుందరీకరణలో భాగంగా మూసీపై ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మిస్తామని కేటీఆర్‌ వెల్లడించారు. పర్యావరణ అనుమతులు  లభించగానే ఈ ప్రాజెక్టు చేపడతారు. జంటనగరాల్లో ఉన్న 185 చెరువుల్లో మొదటి దశలో 40 చెరువులను సుందరీకరిస్తారు. ఇందుకు 541 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. మరోవైపు అవుట్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణంగా భాగంగా పూర్తి చేసుకొన్న కండ్లకోయ జంక్షన్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. దీంతో 158 కి.మీ. అవుట్‌ రింగ్‌ రోడ్‌ పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్టు అయింది. ఈ రెండు కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

 

07:40 - May 2, 2018

హైదరాబాద్ : 2019 సార్వత్రిక ఎన్నికల కోసం జనసేన పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో పోటీ అంశంపై ఈ ఏడాది ఆగస్టులో నిర్ణయాన్ని ప్రకటించనుంది. పార్టీ రాజకీయ వ్యూహకర్తగా దేవ్‌ను నియమించినట్టు పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. ఈనెల 11 నాటికి జిల్లాల పర్యటన ఖరారు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 
పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో పవన్‌ భేటీ 
జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఏపీలోని పదమూడు జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యక్తలు హాజరయ్యారు. పార్టీ నిర్మాణం, పటిష్టత, జిల్లాల పర్యటన, ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై చర్చించారు.ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ 
2019 ఎన్నికల వ్యూహానికి పదును పెడుతున్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌... ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించారు. దీంతో జనసేన పరిమిత స్థానాలకు పోటీ చేస్తుందని జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేకపోవడానికి గల కారణాలను పార్టీ నాయకుల దృష్టికి తెచ్చారు. అప్పట్లో 70 నుంచి 80 అసెంబ్లీ సీట్లు, ఎనిమిది లోక్‌సభ స్థానాలకు పోటీ చేయాలనుకున్నా...రాష్ట్రంలో అప్పుడున్న పరిస్థితితుల్లో ఎన్డీఏకి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయాలు  కొన్ని కుటుంబాలు, కొద్ది మంది చేతుల్లోనే కేంద్రకృతమై ఉండటంతో అభివృద్ధి ఫలాలు అందరికీ అందడంలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందరికీ న్యాయం జరగడంలేదన్న విషయాన్ని ప్రస్తావించిన పవన్‌ కల్యాణ్‌...సగటు మనిషి, అణగారిన వర్గాల పక్షాన బలమైన గొంతుక వినిపించేందుకు జనసేన ఆవిర్భవించిందన్న అంశాన్ని గుర్తు చేశారు. జిల్లాల పర్యటనకు సన్నద్ధమవతున్న పవన్‌ కల్యాణ్‌..  ఈనెల 11వ తేదీ నాటికి  టూర్‌ వివరాలు ఖరారు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై ప్రభుత్వం, ప్రతిక్షాలను నిలదీసే విధంగా ప్రజల మధ్యలోకి జనసేనాని వెళ్లనున్నారు. 
కులాల ఐక్యతే జనసేన తొలి సిద్ధాంతం 
జనసేన సిద్ధాంతాలను ఎంతో లోతుగా అధ్యయనం చేసి  రూపొందించిన విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ సమావేశం దృష్టికి తెచ్చారు. సంప్రదాయ రాజకీయాలు నడిపేవారికి జనసేన సిద్ధాంతాలు అర్థంకావన్న వాదాన్ని వినిపించారు. ఎన్నికల్లో పోటీ చేసే ముందు ప్రతి అభ్యర్థికి క్షేత్ర స్థాయి పరిస్థితులు, సమస్యలు, ప్రజల ఇబ్బందులపై అవగాహన ఉండాలని సూచించారు. ఇవేవీ తెలుసుకోకుండా పోటీ చేస్తే, ఎప్పటికీ నేర్చుకునే అవకాశం ఉండదని హితబోధ చేశారు. కులాల  ఐక్యతే జనసేన తొలి సిద్ధాంతమన్న పవన్‌.. ఒక కులానికి మరో కులం పరస్పర ఆధారంగా నిలవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. జనసేన ఏ ఒక్క కులానికో ప్రాతినిధ్యం వహించదని స్పష్టంచేసిన జనసేనాని, కుల భావం ఉంటే టీడీపీకి ఎలా సహకరిస్తామని ప్రశ్నించారు. కులాలకు అతీతంగా ఆలోచిస్తూ... మత సామరస్యమే జనసేనకు ముఖ్యమని పార్టీ నాయకుల దృష్టికి తెచ్చారు. ప్రతిభావంతులు, సుశిక్షతులైన కార్యకర్తలకు నిలయమైన జనసేన... ఒక కుటుంబం, కులానికి పరిమితమైన పార్టీ కాదన్న విషయాన్ని పవన్‌ ప్రస్తావించారు. 
దేవ్‌కు ఎన్నికల ప్రణాళిక రూపకల్పన బాధ్యతలు అప్పగింత 
వచ్చే ఎన్నికల వ్యూహానికి పదును పెడుతున్న పవన్‌ కల్యాణ్‌..  పార్టీ ముఖ్య రాజకీయ వ్యూహకర్తగా దేవ్‌ను నియమించారు. ఎన్నికల ప్రణాళిక రూపొందించే బాధ్యతలను దేవ్‌కు అప్పగించారు. పన్నెండు వందల మందితో పార్టీ ఏర్పాటు చేసిన కామన్‌ మ్యాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌.. దేవ్‌కు సహకరించే ఏర్పాటు చేశారు. వీరిలో 350 మందితో దేవ్‌ తన సొంత బృందాన్ని ఏర్పాటు చేసుకొనే వీలు కల్పిస్తూ పవన్‌ కల్యాణ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు, తర్వాత కూడా దేవ్‌ సేవలను ఉపయోగించుకోవాలని జనసేనాని భావిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పటిష్టపరిచే కమ్రంలో కమిటీల ఏర్పాటుకు జనసేన ప్రణాళికలు రూపొందిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఈ ఏడాది ఆగస్టు రెండో వారంలో నిర్ణయం తీసుకుంటారు. మొత్తం మీద ఏపీలో అన్ని సీట్లకు పోటీ, జిల్లాల పర్యటనపై జనసేనాని తీసుకున్న నిర్ణయంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. 

 

తెలంగాణలో నేటి నుంచి ఈనెల 7 వరకు ఎంసెట్ పరీక్ష

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి ఈనెల 7 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 2.21 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఏపీలోనూ తెలంగాణ ఎంసెట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2, 3 తేదీల్లో అగ్రి, మెడికల్ విభాగంలో ఎంసెంట్ నిర్వహించనున్నారు. 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగంలో ఎంసెట్ నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యం నిబంధన అమలులో ఉంది. 2 గంటల ముందే సెంటర్ కు చేరుకోవాలని సూచన చేశారు. 

 

ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం

అమరావతి : ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

ఇవాళ ఏపీ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

గుంటూరు : ఇవాళ ఏపీ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.

 

Don't Miss