Activities calendar

03 May 2018

ఊటీలో పారిశ్రామిక వేత్త అదృశ్యం...

ఢిల్లీ : హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామిక వేత్త భీమరాజు ఊటీలో అదృశ్యమయ్యారు. భీమరాజు వేసవి విడిది కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఊటీకి వెళ్లారు. ఆదివారం ఉదయం మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన 75 ఏళ్ల భీమరాజు ఎంతకీ తిరిగి రాలేదు

శీలానగర్ లో తప్పిన ప్రమాదం...

విశాఖ : గాజువాకలోని శీలానగర్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. ఎగ్జిబిషన్‌లోని జెయింట్‌వీల్‌ రేకులు ఎగిరిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 

కేవీపీఎస్ 25 కి.మీ. పాదయాత్ర...

విజయవాడ : అగ్రవర్ణాల దాష్టీకంపై కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి ఉద్యమ బాట పట్టింది. దళితులపై దాడులకు నిరసనగా.. ఎర్రటి ఎండలను సైతం లెక్కచేయకుండా మహాపాదయాత్ర చేపట్టారు, మునగాలపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. 25 కిలోమీటర్లు సాగింది. సుమారు 20 గ్రామాలను సందర్శిస్తూ చివరగా తిరుపతి చేరింది. 

గాలివాన బీభత్సం..90 మంది మృతి...

ఢిల్లీ : ఉత్తర భారతంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులలో కూడి వర్షం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అకాల వర్షాలకు 90 మందికి పైగా మృతి చెందారు. వంద మందికి పైగా గాయపడ్డారు. వర్షం ధాటికి విద్యుత్‌ స్తంభాలు, వృక్షాలు నేలకూలాయి. ఇళ్లు రోడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

21:14 - May 3, 2018

ఢిల్లీ : ఉత్తర భారతంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులలో కూడి వర్షం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అకాల వర్షాలకు 90 మందికి పైగా మృతి చెందారు. వంద మందికి పైగా గాయపడ్డారు. వర్షం ధాటికి విద్యుత్‌ స్తంభాలు, వృక్షాలు నేలకూలాయి. ఇళ్లు రోడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

ఉత్తరభారతాన్ని అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని 4 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం రాత్రి కురిసిన వర్షపు ధాటికి 64 మంది మృతి చెందారు. వడగళ్ల వర్షానికి ఒక్క ఆగ్రా జిల్లాలోనే 43 మంది మృతి చెందగా...మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. బిజనోర్‌లో ముగ్గురు, కాన్పూర్‌లో ముగ్గురు, సహరన్‌పూర్‌లో ఇద్దరు, బరేలీలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

రాజస్థాన్‌లో బలమైన గాలులు, దుమ్ముతో కూడిన తుపాను ప్రజలను భయాందోళనకు గురిచేసింది. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి రెండు గంటలపాటు కురిసిన వర్షపు ధాటికి 31 మంది ప్రాణాలు కోల్పోయారు. భరత్‌పూర్‌లో 12 మంది, ధోల్‌పూర్‌లో ఆరుగురు, అల్వార్‌లో నలుగురు, ఝున్‌ఝున్‌, బికనేర్‌లో ఒక్కొక్కరు మృతి చెందారు. గాలివాన ధాటికి ఇళ్లు కూలిపోవడం వల్ల చాలామంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షం కురిసింది. కుమావోన్‌ ప్రాంతంలో ఇద్దరు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా ఛార్‌ ధామ్‌ యాత్రకు తీవ్ర అంతరాయం కలిగింది. ఛమోలి, ఉత్తరకాశి జిల్లాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. రహదారులపై కొండచరియలు విరిగిపడడంతో వాటిని తొలగించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బద్రీనాథ్‌ హైవేపై కొండచరియల కూలడం వల్ల వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. వృక్షాలు నేలకొరగడంతో డెహ్రాడూన్‌లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

పంజాబ్‌, హరియాణాల్లోనూ బుధవారం రాత్రి ఈదురుగాలులు, దుమ్ముతో కూడిన తుపాను సంభవించడంతో జన జీవనం స్తంభించింది. ఢిల్లీలో కూడా భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వాతావరణం అనుకూలించకపోవడంతో 15 విమానాలను వేరే ప్రాంతాలకు మళ్లించారు. యూపీ, రాజస్థాన్‌ ప్రభుత్వాలు భారీవర్షాల కారణంగా మృతి చెందిన కుటుంబాలకు 4 లక్షలు, గాయపడ్డవారికి 50 వేల చొప్పున పరిహారం ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో మరో 48 గంటలపాటు వడగళ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

21:12 - May 3, 2018
21:08 - May 3, 2018
21:04 - May 3, 2018

విజయవాడ : రాజధాని అమరావతిలో ప్రభుత్వ సంస్థల నిర్మాణాల వేగాన్ని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. ఐటీ పార్క్‌ నిర్మాణ ఆకృతులను త్వరగా ఖరారు చేసి నిర్మాణం ప్రారంభించాలని కోరారు. నిర్మాణం ఏదైనా.. నవ్యంగా, మకుటాయమానంగా ఉండే విధంగా డిజైన్లు రూపొందించాలని సీఆర్‌డీఏ సమీక్షలో చంద్రబాబు సూచించారు. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు సీఆర్‌డీఏ కార్యకలాపాలపై సమీక్షించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థతోపాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. అమరావతిలో నిర్మాణాల వేగాన్ని పెంచాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

రాజధాని అభివృద్ధిలో మౌలిక సదుపాయలే కీలకమని.. రోడ్లతోపాటు భవన నిర్మాణాల వేగాన్ని పెంచాల్సిన అవసరం గురించి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణాన్ని వర్చువల్‌ పద్ధతిలో ఆర్టీజీ నుంచి పరిశీలించారు. ప్రతి నిర్మాణం కూడా ఆకర్షణీయంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు భూ కేటాయింపులు పొందిన అన్ని సంస్థలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు కూడా నిర్మాణాలు ప్రారంభించేలా చూడాలని సీఆర్‌డీఏ అధికారులకు చంద్రబాబు సూచించారు.

అమరావతిలో ఐటీ టవర్‌ నిర్మాణంపై ప్రజెంటేషన్‌ ఇచ్చిన షాపూర్జీ అండ్‌ పల్లొంజీ సంస్థకు కొన్ని మార్పులు, చేర్పులను చంద్రబాబు సూచించారు. ఆకృతులు సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విస్తరణ, అమృత విశ్యవిద్యాలయం నిర్మాణాలపై చంద్రబాబు సమీక్షించారు. అమృత యూనివర్సిటీ కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అమరావతిలో అన్నీ ఆకర్షణీయ నిర్మాణాలే ఉండాలని స్పష్టం చేసిన చంద్రబాబు... స్మార్ట్‌ గ్యాస్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేయాలని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాజధానిలో ఇండోర్‌ ఎల్పీజీ ప్లాంట్‌ను వచ్చే ఏడాది ఏర్పాటు చేస్తామని ఐవోసీ అధికారులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. మరోవైపు చంద్రబాబును కలిసిన గూగుల్‌ ఇండియా ఉపాధ్యక్షుడు ఎండీ రాజన్‌... సిలికాన్‌వ్యాలీ కన్నా అమరావతిని ఐటీలో అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. 

21:02 - May 3, 2018

గుంటూరు : జిల్లాలోని దాచేపల్లిలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బాధితురాలి బంధువులు, ప్రజా సంఘాల ఆందోళన, రాస్తారోకో, రైల్‌రోకోలతో పల్నాడు ప్రాంతం అట్టుడికింది. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పరారీలో ఉన్న నిందితుడు సుబ్బయ్యను పట్టుకునేందుకు గుంటూరు జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నిందితుణ్ని కఠినంగా శిక్షిస్తామన్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు సుబ్బయ్య అత్యారానికి పాల్పడ్డాడు. అభంశుభం తెలియని బాలికపై దుర్మార్గానికి ఒడిగట్టాడు. తాత వయస్సున్న రిక్షా కార్మికుడు సుబ్బయ్య బిస్కెట్లు, చాకెట్లు ఇస్తానని చెప్పి బాలికను తన ఇంట్లోకి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు తెలియడంతో.. దాచేపల్లితోపాటు పల్నాడు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దాచేపల్లి పోలీసులు, బాలికను చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన బాధితురాలి బంధువులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు కలిసి దాచేపల్లిలో ఆందోళనకు దిగారు. నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులు చేపట్టిన దాచేపల్లిబంద్‌ హింసాత్మకంగా మారింది. అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో కొన్ని కిలో మీటర్ల మేర వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆందోళకారులు టైర్లను రోడ్డులపై వేసి తగులబెట్టారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. నిందితుడి ఇంటిని స్థానికులు ధ్వంసం చేశారు. నడికుడి రైల్వే జంక్షన్‌లో రైల్‌ రోకో నిర్వహించారు. శబరి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి ఆందోళన చేశారు. గుంటూరు రూరల్‌ ఎస్పీ వెంకటప్పలనాయుడు దాచేపల్లి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌, టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సహా పలువురు పరామర్శించారు. బాలికకు మెరుగైన వైద్య సహాయం అందిచాలని ఆదేశించారు. బాధితురాలి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకొంటామని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును హామీ ఇచ్చారు. మరోవైపు నిందితుణ్ని వెంటనే అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద వామపక్ష మహిళా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. నిందితుణ్ని ఉరితీయాలని బాధితురాలి బంధువులు డిమాండ్‌ చేశారు.

దాచేపల్లి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. నిందితుడు సుబ్బయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అరాచకాలు, అకృత్యాలకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. పరారీలో ఉన్న నిందితుణ్ని పట్టిచ్చినవారికి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. దాచేపల్లి ఘటనను ఖండించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.. దీనిని నిరసిస్తూ మహిళా సంఘాలు చేసే ఆందోళనకు పార్టీ మద్దుతు ప్రకటించారు.

తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సబ్బయ్యను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఏపీ మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి హెచ్చరించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల అదుకొంటామని భరోసా ఇచ్చారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దాచేపల్లి ఘటనపై ట్విటర్‌ ద్వారా స్పందించారు. దాచేపల్లి ఘటన మనసును కలిసి వేసిందన్నారు. కథువా నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్న ఇలాంటి ఘటనలను విన్నప్పుడల్లా తీవ్ర వేదనకు గురువుతున్నట్టు పేర్కొన్నారు. అత్యాచారాలకు పాల్పడేవారు భయపడే పరిస్థితి రావాలంటే.. నిందితులను బహిరంగంగా శిక్షించే విధానం రావాలన్న వపన్‌ కల్యాణ్‌.. దాచేపల్లి బాధితురాలితోపాటు ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

20:32 - May 3, 2018

తిరుమలలో భారీ వర్షం...

చిత్తూరు : తిరుమలలో ఉరుములు...మెరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గోవిందరాజస్వామి సత్రాల ఆవరణలోకి వర్షపు నీరు చేరింది. భవానీనగర్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

20:27 - May 3, 2018

నెల్లూరు : నగరంలోని సెట్టిగుంట రోడ్‌లో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని ఓ యువతిపై అత్యాచారానికి ఒడికట్టాడు ఓ మానవమృగం. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి ఆ పిచ్చితల్లిపై దారుణానికి ఒడిగట్టాడు. ఆ యువతి కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి రెండో నగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితున్ని అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. 

20:03 - May 3, 2018

ఏపీలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలోనే అభం..శుభం తెలియని పసిపిల్లలపై అత్యాచారాలు జరగడం కలకలం రేపుతోంది. తాజాగా దాచేపల్లిలో 8ఏళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారం జరపడంపై జనాగ్రహం పెల్లుబికింది. ఎక్కడికక్కడ ఆందోళనలు..నిరసనలు చేపట్టారు. కఠిన చట్టాలున్నా కామాంధులు ఎందుకు రెచ్చిపోతున్నారు ? ఎక్కడుంది లోపం ? దీనిపై టెన్ టివి నిర్వహించిన ప్రత్యేక చర్చలో నన్నపనేని రాజకుమారి (ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ పర్సన్), కొండవీటి సత్యవతి (రచయిత్రి, భూమిక ఎడిటర్ ), గంగా భవానీ(న్యాయవాది), మణి (ఐద్వా), పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

తరగతులు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు...

హైదరాబాద్ : వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న కాలేజీలపై ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 46 కాలేజీల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు విద్యార్థులను బయటకు పంపివేసి కాలేజీలకు తాళాలు వేశారు. ఈ సందర్భంగా పలు కాలేజీలకు నోటీసులు జారీ చేశారు. 

ఉద్యోగుల సమస్యలపై కమిటీ ఏర్పాటు...

హైదరాబాద్ : ఉద్యోగుల సమస్యలపై మంత్రి ఈటెల అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. కమిటీలో సభ్యులుగా మంత్రి కేటీఆర్...జగదీష్ రెడ్డి...టీజీవో, టీఎస్ జీవో నేతలతో రేపు కమిటీ సమావేశం కానుంది. 

దాచేపల్లి ఘటన బాధాకరం - మంత్రి ప్రత్తిపాటి...

విజయవాడ : దాచేపల్లి ఘటన బాధాకరమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, నిందితుడిని పట్టుకుని ఫోక్సో చట్టం అమలు చేస్తామన్నారు.

 

తెలుగు రాష్ట్రాల్లో ఈదురు గాలులు...

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులు తప్పవని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. 

దాచేపల్లి ఘటనపై డీజీపీ స్పందన...

విజయవాడ : దాచేపల్లి ఘటనపై డీజీపీ మాల కొండయ్య స్పందించారు. నిందితుడు సుబ్బయ్యకు రెండు పెళ్లిళ్లు జరిగాయని, సుబ్బయ్య తన ఇద్దరు భార్యలను వదిలేశాడని పేర్కొన్నారు. అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్నాడని తెలిపారు. 

దాచేపల్లి ఘటనను ఖండించిన జగన్...

విజయవాడ : దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరగడం దారుణమని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. ఏపీలో గత కొంతకాలం నుంచి అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. 

18:26 - May 3, 2018

బీహార్ : దేశంలో ప్రమాదాలు..దారుణాలు పెరిగిపోతున్నాయి. యూపీలో కాపలా లేని రైలు గేటు వద్ద జరిగని ఘోర ప్రమాదంలో 13 మంది చిన్నారులు మృత్యు వార్త మరవకముందే బీహార్ లో ఘోరం చోటు చేసుకుంది. బస్సు ప్రమాదంలో 27 మంది సజీవదహనమయ్యారు. ముజఫర్ నగర్ నుండి ఢిల్లీకి బయలుదేరిన బస్సులో మొత్తం 32 మంది ప్రయాణీకులున్నారు. మోతీహరి ప్రాంతం వద్దకు రాగానే అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. బస్సు బోల్తా పడడం..వెంటనే మంటలు అంటుకోవడం జరిగిపోయాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో బస్సులో ఉన్న 27 మంది కాలిపోయారు. మరో 5గురికి తీవ్రగాయాలాయ్యాయి. మృతుల్లో ఎక్కువగా మహిళలు..చిన్నారులున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న సీఎం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. 

18:05 - May 3, 2018

ప్రముఖ కధానాయిక నయనతార,విఘ్నేశ్ శివన్ ప్రేమయాత్రకు హీరో రాజశేఖర్ విలన్ గా మారాడా? గరుడవేగతో హిట్ కొట్టిన డాక్టర్ రాజశేఖర్ రూటు మార్చాడా? ఎన్టీఆర్ కు బై బై చెప్పేసి నాగ్ తో దర్శకుడు తేజ జతకట్టనున్నాడా. ఇత్యాది విశేషాలు మీకోసం..

కాలిఫోర్నియాలో నయన్ ప్రేమయాత్ర..
తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో నిండా ప్రేమలో మునిగిపోయిన కథానాయిక నయనతార, ప్రస్తుతం ప్రియుడితో కలసి ప్రేమయాత్ర చేస్తోందంటు ఇండ్రస్ట్రీ టాక్?. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇద్దరూ కలసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఈ జంట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విలన్ గా మారిని రాజశేఖర్
ఇటీవల 'గరుడవేగ' చిత్రంతో హిట్ కొట్టిన సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఇప్పుడు తన రూటు మారుస్తున్నాడు. యంగ్ హీరోల చిత్రాలలో కీలక పాత్రలు పోషించడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో రామ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో విలన్ గా కీలక పాత్ర పోషించడానికి ఓకే చెప్పాడట.

నాగ్ తో తేజ
ఇటీవల 'ఎన్టీఆర్' బయోపిక్ నుంచి తప్పుకున్న ప్రముఖ దర్శకుడు తేజ తన తదుపరి చిత్రాన్ని నాగార్జునతో చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నాగార్జునకు కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నట్టు సమాచారం.   

17:50 - May 3, 2018

వివాదాస్ప దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నాగ్ కాంబినేషన్ లో వచ్చిన శివ నాగార్జున కెరియర్ కు బిగ్గెస్ట్ టర్నింగ్ ఇచ్చింది. అప్పటి నుండి వారి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్ లో అంతటి హిట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ దర్శక నిర్మాతగా రూపొందించిన 'ఆఫీసర్' అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ టీజర్ భారీ అంచనాలను పెంచేసింది. దాంతో రేపు సాయంత్రం 6 గంటలకు మరో టీజర్ ను వదలడానికి రెడీ అవుతున్నారు. సినిమాపై మరింతగా అంచనాలు పెంచేలా ఈ టీజర్ ఉండేలా వర్మ జాగ్రత్తలు తీసుకున్నాడని అంటున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో తమ కాంబినేషన్లో వచ్చిన 'శివ'ను మించి ఈ సినిమా ఉంటుందని వర్మ చెప్పడంతో, అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది.

నాగ్ సరసన మైరా సరీన్..
నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన మైరా సరీన్ కనిపించనుంది. నాగార్జున పవర్ ఫుల్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమా నుంచి, ఇంతకు ముందు ఒక యాక్షన్ టీజర్ ను వదిలారు. ఆ టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

 

బస్ బోల్తా 12మంది మృతి..

బిహార్‌ : మోతీహరి ప్రాంతంలో ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు సజీవదహనమైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు, రక్షణ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. తీవ్రంగా గాయాలపాలైన వారికి అక్కడే అంబులెన్సుల్లో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స నిమిత్తం వేరే ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

17:20 - May 3, 2018

గుంటూరు : జిల్లాలోని దాచేపల్లిలో బాలికపై అత్యాచార ఘటనపై జనాగ్రహం పెల్లుబికింది. నిందితుడిని పట్టుకోవడంలో విఫలం చెందారంటూ బాలిక కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి నుండి గురువారం వరకు ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం ఈ ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఆర్టీసీ బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. నడికుడి జంక్షన్ వద్ద రైలు పట్టాలపై కూర్చొని ఆందోళన చేపట్టారు. దాచేపల్లి..నడికుడి ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను శాంతింప చేసే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.

8ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటనతో కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 24గంటలు గడిచినా నిందితుడిని పట్టుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలం చెందిందని కుటుంబసభ్యులు..ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వెంటనే జిల్లా మంత్రులు..ఇతరులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించాలని, నిందితుడి ఆచూకి చెబితే బహుమతి ఇస్తామని ప్రకటించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:12 - May 3, 2018

విజయవాడ : దాచేపల్లిలో జరిగిన ఘటన దారుణమని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. దాచేపల్లిలో ఏనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన స్పందించారు. దాచేపల్లి ఘటన అత్యంత దారుణమని, నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఆందోళన చేస్తున్న మహిళా సంఘాలకు సీపీఎం పార్టీ మద్దతిస్తుందన్నారు. అత్యాచార కేసుల్లో జరుగుతున్న జాప్యంతోనే విచ్చలవిడిగా అత్యాచారాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 

ఇటువంటివారిని బహిరంగంగా శిక్షించే విధానాలు రావాలి : పవన్

గుంటూరు : జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాచేపల్లి ఘటన కూడా తన మనసుని కలచివేసిందని, నిస్సహాయతకు గురి చేసిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం అన్యాయానికి గురైన ఆ బిడ్డకి, ఆమె కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకుంటున్నానని అన్నారు. అసలు ఆడబిడ్డపైన ఇలాంటి అరాచకం చేసే వ్యక్తులు భయపడే పరిస్థితి రావాలంటే పబ్లిక్‌గా శిక్షించే విధానాలు రావాలని పవన్ కళ్యాణ్ ఆవేదనతో వవన్ ట్వీటీ చేశారు.

16:41 - May 3, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల వేతన సవరణపై ప్రభుత్వం, యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆర్టీసీ జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 6వ తేదీన అన్ని డిపోల ఎదుట ఆందోళనలు చేపట్టాని ఆర్టీసీ జాక్ కార్మికులకు పిలుపునిచ్చింది. వేతన సవరణతో పాటు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది. వేతనాలు కూడా సకాలంలో చెల్లించాలేని దుస్థితి ఆర్టీసీలో నెలకొందని విమర్శించింది. తాము సమస్యల పరిష్కారానికి పోరాటం చేసినా ఫలితం లేకపోవడంతో ఐక్య పోరాటాల కోసం ఆర్టీసీ జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని నేతలు తెలిపారు. జేఏసీలోకి టీఎంయూ, ఎన్ఎంయూ, టీజేఎంయూ రావాలని ఆర్టీసీ జాక్ కోరింది. 

16:35 - May 3, 2018

అనంతపురం : జిల్లాలోని ధర్మవరంలో పోకిరికి దేహశుద్ధి చేశారు. బ్యాంకు లోన్ మంజూరు చేయాలని...పెళ్లి చేసుకుంటానని ఓ బ్యాంకు ఉద్యోగినిని ఆకతాయి వేధించాడు. ఈ ఘటన అనంత జిల్లాలోని ధర్మవరంలో చోటు చేసుకుంది. ఆంధ్రా ప్రగతి బ్యాంకులో ఓ మహిళ పనిచేస్తోంది. ఈమెను లక్ష్మీనారాయణ అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురి చేశాడు. ఈ విషయాన్ని కుటుంసభ్యులకు మహిళ తెలిపింది. ఇదే క్రమంలో మహిళ ఇంటికి వచ్చిన యువకుడిని పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పచెప్పారు.

 

 

కామాంధులకు బహిష్కరించాలి : నన్నపనేని

గుంటూరు: కామాంధులను గ్రామాల నుంచి బహిష్కరించాలని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి పిలుపునిచ్చారు. దాచేపల్లి ఘటన బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని, బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని రాజకుమారి భరోసా ఇచ్చారు. 9ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ 50 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. ఈ ఘటనపై రాత్రి నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన వెలుగుచూసిన వెంటనే స్థానికులు భగ్గుమన్నారు. అర్థరాత్రి రోడ్లపైకి వచ్చి రాస్తారోకో చేశారు.

16:34 - May 3, 2018

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉభయ గోదావరి, విశాఖ, ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో జనజీవనం స్తంభిస్తోంది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం కావడంతో స్థానికులు, వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో నీరు నిలవడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పులతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తున్నాయి. భారీగా పంట నష్టం వాటిల్లింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఇస్రోలో అగ్నిప్రమాదం..

ఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అగ్నిప్రమాదం సంభవించింది. ఇస్రో క్యాంపస్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. 37వ భవనంలో ఈ దుర్ఘటన జరిగింది. దీనిలో ల్యాబొరేటరీ ఉన్నట్లు తెలుస్తోంది. 20 అగ్నిమాపక శకటాలు విపరీతంగా శ్రమించి, మంటలను అదుపు చేశాయి. 10 అంబులెన్సులు ప్రమాద స్థలానికి చేరుకోవడం కనిపించింది. ఈ ప్రమాదంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ జవాను ఒకరు గాయపడ్డారు. 

16:19 - May 3, 2018

ఢిల్లీ : భూగోళంలో ఎన్నో వింతలు? విచిత్రాలు, అద్భుతాలు,ఆశ్చర్యాలు. ప్రకృతి వింతలను చూడటానికి రెండు కళ్లు చాలవు. ప్రకృతి ప్రళయాన్ని, ప్రకోపాన్ని ఊహించేందుకు మనిషి మేధస్సు చాలదు. ఒకచోట చల్లగా, మరోచోట వెచ్చగా, ఇంకోచోట సమతుల్యంగా, ఒక ప్రాంతోని భూమి సస్యశ్యామలంగా, మరోప్రాంతంలో క్షామంగా. ఒకచోట అందంగా..మరోచోట భయకరంగా ఇలా ప్రకృతిలో వింతలు, విచిత్రాలు. ఈ భూమిపై మనిషి ఊహకు..మేధస్సుకు అందనంత అగమ్యగోచరంగా...అయోమంగా వినిపిస్తుంటాయి. కనిపిస్తుంటాయి. ప్రకృతి మనిషికి ఎప్పుడు సవాల్ విసురుతునే వుంటుంది. దాన్ని ఛేదించేందుకు మనిషి యత్నిస్తునే వుంటాడు. ఈ క్రమంలో బహు మార్పులు చోటుచేసుకుంటుంటాయి. ఇప్పుడు మనకు అందిన సమచారం మేరకు ప్రస్తుతం భారతదేశంలో అదే జరుగుతోంది.

ఒకచోట ఎండలు..మరోచోట వానలు..
మొన్నటి వరకూ ఎండలు మనిషి మాడ్చి పడేశాయి. గచ్చుమీద ఆమ్లెట్ వేసుకుని తినేసేంతగా కాల్చుకుతినేశాయి. మండించేసాయి. ఒకే రోజు ఒకచోట వేడి గాలులు...ఇంకోచోట వడగళ్ల వర్షాలు...ఇంకోచోట ఇసుక తుపానులు.. ఎందుకిలా? ఏమిటా కారణం? అసలు వేసవిలో ఎండలెందుకు పెరుగుతాయో? రోజురోజుకీ మారుతున్న ఉష్ణోగ్రతల్లో తేడాలెందుకో? తెలుసుకుందామా?

ప్రాణి మనుగడకు మూడు కాలాలు..
మనకు కాలాలు మూడు అనే విషయం తెలిసిందే. వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం. ఈ మూడు కాలాలు ప్రాణి మనుగడకు దోహదపడుతుంటాయి. వేసవి ఎండలకు నీరు ఆవిరైపోతుంది. వర్షాకాలం అదే నీరు వర్షంగా మారి ప్రాణికోటికి అవసరమైన స్వచ్ఛమైన వాననీటిని అందిస్తుంది. ఆ వర్షమే ప్రాణికోటికి జీవాధారమవుతుంది. ఇక శీతాకాలం..చలి ఎక్కువగా వుంటంతో గాలిలోని తేమ మంచుగా మరిపోయి ఆయా కాలంలో వచ్చే పంటలకు ఉపయోగపడుతుంది. ఈ మూడు కాలాలు ప్రాణికోటి మనుగడు కారణాలుగా మారి కాపాడుతుంటాయి. కానీ అన్ని జంతువులలోకి తెలివిగల మనిషి మాత్రం తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు. మనిషి జీవితంలోపెను మార్పులకు కారణమైన అనేకనేక కారణాలు ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నాయి. ప్లాస్టిక్ వాడకం, నీటి కాలుష్యం, పర్యావరణ కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఇత్యాది కారణాలన్నీ ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసి అకాల వాతావరణ కారకాలుగా మారి కాలాల గమనంలో పెను మార్పులకు తావిస్తున్నాయి. దీంతో ఎండకాలంలో వర్షాలు, శీతాకాంలో ఎండలు..వానాకాలంలో వర్షాలు లేక కరవు కాటకాలకు కారణభూతాలుగా మారిపోతున్నాయి.

వేసవికాలం దినచర్యల్లో మార్పులు..
వేసవికాలం వచ్చిందంటే చాలు మన దినచర్యల్లో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. మధ్యహ్నాం చేసుకునే పనులు ఉదయాన్నో..లేదా సాయంత్రం చల్లబడిన తరువాతకో పనులను వాయిదా వేసుకుంటుంటాము. తినే ఆహారంలో మార్పులు చేర్పులు చేసేసుకుంటాం. స్కూల్స్ కు సెలవులిచ్చేస్తారు. వేసవి సెలవులు రాగానే చాలామంది చల్లటి ప్రదేశాలకు టూర్స్ వేసేసుకుంటారు. చల్ల చల్లటి వాటిని తినేందుకు ఆసక్తి చూపిస్తుంటాము. ప్రయత్నిస్తుంటాము. ఎందుకంటే ఇప్పటికే మీకు అర్ధం అయిపోయి వుంటుంది. ఈ కాలంలోనే వేడి ఎక్కువ ఎందుకని? భూమి తన చుట్టూ తాను తిరిగే అక్షం కొంచెం వంగడం వల్లే. అంటే భూమి సూర్యుడికేసి కొంచెం వంగుతుందన్నమాట. ఇప్పుడు వంగిన వైపు మన దేశం ఉంది కాబట్టి మనకు ఎండలు కాసే ఎండాకాలం వస్తుంది.

ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా..
పల్లెటూళ్లలో చల్లగా ఉంటుంది. అదే నగరాల్లో ఎక్కువ వేడిగా వుంటుంది. ప్రాంతాల్ని బట్టి ఎండ వేడి వేరువేరుగా ఉంటుంది. నగరాల్లో భవనాలు, ఉపయోగించే యంత్రాలు బోలెడంత వేడిని పుట్టిస్తాయి. భవనాలు, ఎత్తయిన నిర్మాణాలు ఎక్కువగా వేడిని స్టాక్ చేసేస్తాయట. అందుకే మొక్కలు తక్కువగా, భవనాలు ఎక్కువగా ఉంటే వేడి ఎక్కువవుతుందన్నమాట. కొన్ని ప్రాంతాల్లో చెట్లు ఎక్కువగా ఉన్నా... స్థానిక పరిస్థితులు, భవనాలు, జీవనవిధానం వంటి కారణాల వల్ల కూడా వేడి ఎక్కువగా ఉంటుంది.

వేసవిలో వర్షాలేందుకొస్తాయి?!..
ఇటీవల ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు బాగా పడుతున్నాయి. వేసవిలో అసలీ వర్షాలు కురవడం ఏంటంటే....?ఎండ ఎక్కువగా ఉండటం వల్ల భూమి వేడెక్కుతుంది. దానికి దగ్గరగా ఉన్న గాలి మిగిలిన గాలి కన్నా ఎక్కువగా వేడెక్కుతుంది. ఇలా గాలి వేడిగా తయారుకావడంతో అది తేలికై వాతావరణంలో పైకి వెళుతుంది. ఇలా భూమి సమీపంలోని గాలి వాతావరణంలో పైపైకి వెళ్లిపోవడంతో గాలి తక్కువై పోతుందన్నమాట. పైకి వెళుతున్న గాలి వ్యాకోచం చెంది చల్లబడుతుంది. నీటి ఆవిరి... తేమతో కూడిన గాలి ఈ విధంగా చల్లబడటంతో ఒక దశలో అది ద్రవీభవన స్థాయిని చేరుకుంటుంది. అంటే గాలిలోని తేమ చల్లదనానికి నీటి బిందువులుగా మారిపోతాయన్నమాట.దీనివల్ల మేఘాలు ఏర్పడతాయి. ఈ మేఘాలు పెరుగుతూ ఓ దశలో వర్షంగా కురుస్తాయి. ఇలా వేసవిలో కురిసే వర్షాల్ని ‘సంవహన వర్షాలు’ అంటారు. భూమిపై అన్ని చోట్ల ఉండే వాతావరణ పరిస్థితుల ఫలితమేఈ వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటాయన్న మాట..ఈ ప్రక్రియలో స్థానికంగా క్షణక్షణం మారుతూ ఉంటుందన్నమాట.

15:55 - May 3, 2018

నిర్మలా సీతారామన్ కారుపై రాళ్లు,చెప్పులతో దాడి..

కర్ణాటక : రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ వాహనంపై ఆందోళనకారులు రాళ్లు, చెప్పులు విసిరారు. కావేరీ బోర్డు విషయంలో తమిళనాడుకు అన్యాయం చేస్తున్న కేంద్రవైఖరిని నిరసిస్తూ డీఎంకే కార్యకర్తలు నల్ల జెండాలను ప్రదర్శించారు. ఆమె కారును అడ్డుకోడానికి ప్రయత్నించారు. దీంతో నిరసనకారులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

భాగ్యనగరంలో భారీ వర్షం..

హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నాగోల్, మోహన్ నగర్ , కొత్తపేట్ , చైతన్య పురి , దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, కర్మన్ ఘాట్, చంపాపేట్, పాతబస్తీ, అశోక్ నగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఖైరతాబాద్, బషీర్ బాగ్, బహదూర్ పురా, యాకుత్ పురా, చార్మినార్, చాంద్రాయణ గుట్ట, సైదాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఈదురు గాలులతో పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది.

15:27 - May 3, 2018

గుంటూరు : సభ్యసమాజం తలదించుకునేలా.. మానవత్వం మంటగలిసేలా.. మనిషే మృగంలా మారి పసిమొగ్గలపై పైశాచిక దాడులు చేస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు అందరినీ కలవరపెడుతున్నా యి. కాశ్మీరులోని ఖథువాలో ఓ చిన్నారిపై అమానుషంగా ప్రవర్తించి చివరకు హత్యచేసిన ఘటన ఇటీవలే దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఉవ్వెత్తున నిరసనలు ఎగసి పడుతున్నా.. అమానుష ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

దాచేపల్లిలో దాచేపల్లిలో షేక్‌ అఫిపాభాను అనే 9 సంవత్సరాల చిన్నారిపై అన్నం సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారిపై లైంగిక దాడికి నిరసిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. వీరు చేస్తున్న ఆందోళనలకు ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతూ నిరసనలు చేపట్టారు. రోడ్లపై టైర్లు కాల్పివేశారు. నిందితుడు ఇంటిని కూల్చివేశారు. ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొనడం..ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. దాచేపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టిచ్చిన వారికి నగదు బహుమతిని ఇస్తామని ప్రకటించారు. వెంటనే దాచేపల్లికి జిల్లా మంత్రులు, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని సూచించారు.

బుధవారం అర్ధరాత్రి నుండి గురువారం వరకు అద్దంకి - నార్కట్ పల్లి రహదారిపై ఆందోళన నిర్వహించారు. దీనితో 15 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనను నిరసిస్తూ దాచేపల్లిలో స్థానికులు స్వచ్చంద బంద్ పాటిస్తున్నారు. మరోవైపు ఆందోళనకారులతో సత్తెనపల్లి డీఎస్పీ చర్చిస్తున్నారు. కానీ ఆందోళనలు విరమించడానికి ససేమిరా అంటున్నారు. నిందితుడు సుబ్బయ్యను పట్టుకొని ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై ఐద్వా నేత రమ, సామాజిక వేత్త దేవిలు టెన్ టివితో మాట్లాడారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

కర్ణాటక భవితను మార్చేవి ఇవే : మోదీ

కర్ణాటక : రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అన్నిపార్టీలు తమ గళాలను వాడి వేడిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ ఎన్నికలు కర్ణాటక భవిష్యత్తును నిర్ణయిస్తానయని పేర్కొన్నారు. ఇది మహిళల భద్రత, రైతుల అభివృద్ధికి సంబంధించిన అంశమని, కేవలం ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం మాత్రమే కాదని అన్నారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ ప్రభుత్వం మారాలి అని ఇంత బలంగా కోరుకోవడం చూడడం ఇప్పుడేనని మోదీ అన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఖర్గేను సీఎం చేస్తానంది.. కానీ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు.

క్యుములోనింబస్ ప్రభావంతో భారీ వర్షాలు..

విశాఖ: ఒడిశా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్ మేఘాల వల్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. విజయనగరం, డెంకాడలో 8 సెం.మీ..., అమలాపురంలో 7 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. రానున్న 24 గంటల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురస్తాయని అధికారులు పేర్కొన్నారు.

దాచేపల్లి ఘటన..నిందితుడి ఇల్లు కూల్చివేత..

గుంటూరు : దాచేపల్లి లో 9 సంవత్సరాల చిన్నారిపై అత్యాచార ఘటనపై తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ళ చిన్నారిపై 50 సంవత్సరాల వృద్ధుడి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై ఆగ్రహం చెందిన బాధితురాలి బంధువులు నిందితుడు సుబ్బయ్య ఇంటిని కూల్చివేశారు. హైవేపై ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై బాధితురాలి బంధువులు దాడికి దిగారు. ఈ ఘటనలపై ఆందోళనకారులతో సత్తెనపల్లి డీఎస్పీ కాలేషావలి చర్చిస్తున్నారు. 

14:56 - May 3, 2018

ప్రకృతికి అందరూ సమానమే. పేద, గొప్ప, చిన్నా, పెద్దా అనే తేడా వుండదు. సాంకేతికత మోజులో టెక్నాలజీ వెంట పరుగులిడే మనిషి మేధస్సు ఎంత గొప్పదైనా ప్రకృతికి తలవంచాల్సిందే. ఎంత పెద్ద పర్వతమైనా అద్దంముందు మరగుజ్జే అన్నట్లు..ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా..ఎంతపెద్ద హీరో అయినా..ఎంత భారీ రెమ్యూన్ తీసుకుంటున్నా...ఒక్కొక్కసారి సాధారణ ఇంకా చెప్పాలంటే అతి సాధారణ వ్యక్తుల్లా మిన్నకుండిపోవాల్సిందే. టెక్నాలజీని సృష్టించిన మానవుడు ప్రకృతిని అదుపులో వుంచేందుకు పలు ప్రయత్నాలు చేస్తునే వున్నాడు. కానీ అది మాత్రం సాధ్యం కావటంలేదు. ఎందుకంటే మనిషి మేధస్సు కంటే ప్రకృతి శక్తివంతమైనది. అది ఒక్కసారి విశ్వరూపం చూపిందంటే అన్నీ తుడిచిపెట్టుకుపోవాల్సిందే. ఇప్పుడు అదే జరిగింది. మండు వేసవిలో తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాలు అతలా కుతం చేసేస్తున్నాయి. మరోపక్క ఉత్తరప్రదేశ్ లో వడగళ్ల వాన బీభత్సానికి రాజస్థాన్ లో దాదాపు 50 మంది మృతి చెందారు. ఇక ఎడారి అంటేనే గుర్తుకొచ్చే రాష్ట్రం అయిన రాజస్థాన్ లో ఇసుక తుపాను బీభత్సాన్ని సృష్టించటమే కాక పదుల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంది. ఈ నేపథ్యంలో బాలివుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తుపానులో చిక్కుకున్న చిరునావలా అల్లాడిపోయింది.

ఇసుక తుపానులో అనుష్క శర్మ..
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ ఇసుక తూఫాన్ లో చిక్కుకు పోయింది. ఏం చేయాలో తోచక అల్లాడిపోయిందట. ఇసుక తుపాను అనుష్కకు చుక్కలు లేక్క పెట్టిందట. ఏం చేయాలో తోచని విపత్కర పరిస్థితిలో నరకం చూసానటోంది ప్రముఖ క్రికెట్ స్టార్ భార్య బాలివుడ్ హీరోయిన్ అనుష్క శర్మ. రాజస్థాన్‌‌లో జరుగుతన్న ఓ షూటింగ్ కు అటెండ్ అయిన అనుష్కకు ఎదురైన రియల్ స్టొరీ ఇది. అనుష్కశర్మ లేటెస్ట్ మూవీ ‘ఎన్‌హెచ్ 10’. నవదీప్‌సింగ్ డైరెక్షన్ చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ మూవీని సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రం షూటింగ్ రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతంలో జరుగుతోండగా ప్రమాదవశాత్తు హఠాత్తుగా ఇసుక తుపాన్ రావడంతో షూటింగ్‌కు అంతరాయం కలగటమే కాక అనుష్కకు భయమేంటే ఏమిటో రుచి చూపించిందట. అసలే ఎడారి... ఆపై ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్లలేని పరిస్థితి. ఆ సమయంలో ఏం చెయ్యాలో తోచక దాదాపు అర్థగంటపాటు దుమ్ము ధూళిల మధ్య ఈ బ్యూటీ ఉక్కిరిబిక్కి అయ్యాను అంటూ ఆ విషయాన్ని తన ట్విటర్‌లోపెట్టింది. అయితే యూనిట్ సభ్యులతోపాటు అందరూ క్షేమంగా బయటపడ్డామని పోస్ట్ చేసింది. ఇసుక తుపాను వస్తే ఆ క్షణం ఎలా వుంటుందో కళ్లతో చూశానని అనుష్క ఆ సంఘటనలను తరిచి తరిచి గుర్తుకు చేసుకుని నిద్రలో కూడా ఉలిక్కి పడుతోంది అందాల అనుష్క శర్మ..

 

14:37 - May 3, 2018
14:36 - May 3, 2018

ఢిల్లీ : రాజస్థాన్..ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలపై ప్రకృతి కన్నెర్ర చేసింది. రాజస్థాన్ లో ఇసుక తుఫాన్..యూపీలో భారీ గాలులు..పిడుగులతో కూడిన వర్షాలు పడడంతో 77 మంది మృతి చెందారు. ఆయా రాష్ట్రాల్లో బీభత్సంపై ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తామని యూపీ సీఎం ప్రకటించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, పునరావాసా కేంద్రాలకు తరలించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇసుక తుఫాను విపత్తుతో రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే అధికారులను అప్రమత్తం చేశారు. సహాయక చర్యలందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రకృతి విపత్తులో మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం వసుంధరా రాజే ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

రాజస్థాన్ లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. రాజస్థాన్ ఈశాన్య ప్రాంతంలోని అల్వార్, ఢోర్‌పూర్, భరత్‌పూర్ జిల్లాలో ఇసుక తుఫాను ధాటికి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక్క భరత్‌పూర్ జిల్లా నుంచే 12 మంది ఉన్నట్లు సమాచారం. ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన తుఫాను ధాటికి పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇళ్ల పైకప్పులు కూలి నిద్రిస్తున్న వారిపై పడటంతో ప్రాణాలు విడిచారు. భారీ గాలులు వీచడంతో సుమారు వెయ్యికి పైగా విద్యుత్ స్థంభాలు నేలమట్టమయ్యాయి.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. 126 కి.మీటర్ల వేగంతో గాలులు...భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఇళ్లు నేల మట్టం...చెట్లు..విద్యుత్ స్తంభాలు నేల కూలడంతో 45 మంది మృతి చెందారు. ఒక్క ఆగ్రాలోనే 36 మంది దుర్మరణం చెందారు. 

ఇసుక తుపాను బీభత్సం..27మంది మృతి..

రాజస్థాన్ : రాష్ట్రం భరత్ పూర్, ధోల్ పూర్, అల్వార్, శ్రీగంగానగర్ జిల్లాల్లో ఇసుక తుఫాన్ వణికించింది. పెద్ద ఎత్తున ఇసుక ఇళ్లలోకి వచ్చింది. రోడ్లపై వాహనాల్లో వెళ్లే వారికి ముందు..వెనక ఏమీ కనిపించలేదు. గాలులతోపాటు ఇసుక వచ్చి పడుతుండటంతో ప్రమాదాలు జరిగాయి. తీవ్రమైన గాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. ఇసుక తుఫాన్ ధాటికి భరత్ పూర్ ఒక్క జిల్లాలోనే 11 మంది చనిపోయారు. కరెంట్, నీటి సరఫరా కూడా నిలిచిపోవటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అపార్ట్ మెంట్లలోకి కూడా దుమ్ము వచ్చి చేరింది. చిన్న చిన్న ఇళ్లు అయితే మట్టికొట్టుకుపోయాయి.

14:29 - May 3, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు ఆవరణలో శుక్రవారం కలకలం రేగింది..తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ రైతు ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని తమిళనాడు రైతులు డిమాండ్ చేస్తూ సుప్రీంలో ఆందోళన చేపట్టారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడు, కర్నాటక, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదం నడుస్తోంది.

కావేరీ నది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసినా కేంద్రం అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవడం లేదు. ఇందుకు కర్నాటక ఎన్నికలను సాకుగా చూపుతోంది. శుక్రవారం ఉదయం కొంతమంది రైతులు సుప్రీంకోర్టు ఆవరణలో ఆందోళన చేపట్టారు. తమకు సుప్రీంకోర్టు న్యాయం చేయాలని..సుప్రీం చెప్పినా కేంద్రం పట్టించుకోవడం లేదంటూ రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు 4 టీఎంసీల నీటిని ఇంకా కేటాయించడం లేదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిని కేటాయించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓ రైతు చెట్టు ఎక్కి ఉరి వేసుకొనేందుకు ప్రయత్నించాడు. వెంటనే సుప్రీంకోర్టు సిబ్బంది అతనిని శాంతింప చేశారు. రాజకీయాలతో సంబంధం లేదని..వెంటనే ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై వివరణ ఇవ్వాలని సుప్రీం సూచించింది. 

అకాల వర్షాలతో ప్రజల అవస్థలు..

కృష్ణా : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఆ జిల్లాలోని గన్నవరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. మచిలీపట్నం, నూజివీడు, తిరువూరు, పెడనలో మోస్తరు వర్షం పడుతోంది. విజయవాడలో భారీవర్షంతో రహదారులు జలమయమయ్యాయి. రహదారులపై ఎక్కడికక్కడే నిలిపోయిన వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కృష్ణా జిల్లాలో మరోసారి పిడుగులు పడే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. 

13:48 - May 3, 2018

గుంటూరు : ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాస్ విడుదల చేశారు. మొత్తం 7,679 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 7,430 మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్రంలో 39 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. 

 

13:47 - May 3, 2018

వయస్సుతో పాటు నేనున్నానంటు వచ్చేస్తుందది. పెట్టింది ఒకచోట వెతికేది మరోచోట. అబ్బా! అన్నీ అందించలేక ఛస్తున్నాం అంటు విసుగులు..ఎన్నిసార్లు చెప్పాలి సమయానికి మందులు వేసుకోమని అంటు విరుపులు..ఏంటండీ! నన్ను గుర్తు పట్టలేదా? నేనూ..ఫలానా అంటు కొత్తగా పరిచయం చేసుకునే పాత పరిచయస్తులు, బంధువుల, స్నేహితులు. ఇలా ప్రతీదీ వయసుతో పాటు సహజంగా వచ్చే మతిమరుకు కుంటుంబ సభ్యులు, బంధువులు విసుగుతో కూడిన మాటలు, మంచిగా వుండే కుటుంబంలో అయితే ప్రేమతో కూడిన మందలింపులు..సర్వసాధారణంగా వినిపిస్తుండే మాటలు. వయస్సు పైబడిన వారికి సర్వసాధారణంగా వచ్చే అల్జీమర్ కు చెక్ పెట్టేదెలా? మనుమలకు తన చిన్ననాటి ముచ్చట్లు, కథలు, అనుభవాలు, అనుభూతులు చెప్పుకునేదెలా? వయస్సుతో పాటు అన్నీ మరచిపోవాలా? అంటే కాదనేంత సహజమైన చక్కని చిట్కా ఒకటి చెప్పేసుకుందాం..అమ్మమ్మలు, తాతయ్యల అనుభవాలను, అనుభూతుల సంగమంతో కూడిన సందేశాలను, సందర్బాలను, జాగ్రర్తలను విందాం తెలుసుకుందాం..మరి ఈ అల్జీమర్స్ కు చెక్ పెట్టే సాధనమేంటో తెలుసా? ఎర్రగా..కంటికింపుగా..భిన్నమైన బీట్ రూట్ తో పెట్టేద్దాం చెక్..

బీట్‌రూట్‌ స్పెషల్ ..
వయసు పైబడటం అనేది సాధారణమే. వయసుతో పాటు మతిమరుపు రావడం కూడా సాధారణమే. సమస్యలు వచ్చిపడే వేగాన్ని తగ్గించే అవకాశాలు కూడా లేకపోలేదు. కొన్ని సమస్యలు కేవలం మందులకు మాత్రమే తగ్గవు. కానీ ప్రకృతి సహజంగా లభించే కొన్ని పదార్ధాలలో కొన్నింటికి చెక్ పెట్టవచ్చు. ప్రకృతి మనిషికి ఇచ్చిన ఎన్నో అమూల్యమైన పదార్ధాలతో ఆరోగ్యాన్ని పెంపొదించుకోవచ్చు. అలాగే వయస్సుతో పాటు వచ్చే అల్జీమర్స్ కు కూడా చెక్ పెట్టవచ్చంటున్నారు పరిశోధకులు. దీంట్లో ప్రధానమైనది బీట్‌రూట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బీట్‌రూట్‌లో సాధారణ పోషకాలతో పాటు, అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా, వ్యర్థపదార్థాలను శరీరంలోంచి తొలగించడంతో పాటు, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలోనూ ఇది బాగా ఉపయోగపడుతుంది.

మతిమరుపుకు చెక్ పెట్టే బీట్ రూట్ : ఫ్లోరిడా శాస్త్రవేత్తలు
వీటన్నింటికీ మించి మరో విశేష ప్రయోజనం కూడా బీట్‌రూట్‌ వల్ల కలుగుతుందని అమెరికాలోని సౌత్‌ ఫ్లోరిడా యూరివర్సిటీకి చెందిన పరిశోదకులు అధ్యయనంలో కనుగొన్నారు. బీట్‌రూట్‌ వినియోగం వల్ల మతిమరుపు కలిగించే అల్జీమర్‌ వ్యాధి పెరిగే వేగం బాగా తగ్గిపోవడమే ఆ విశేషం. ప్రత్యేకించి మెదడులో తయారై అల్జీమర్‌ వ్యాధిని కలిగించే ఒక ప్రత్యేకమైన ప్రొటీన్‌ చర్యలను బీట్‌రూట్‌ నియంత్రిస్తుందని వీరు కనుగొన్నారు. అలాగే అల్జీమర్‌ వ్యాధి పెరిగేలా చేసే మెదడులోని కొన్ని రసాయన చర్యలను బీట్‌రూట్‌లోని బెటానిన్‌ అనే మూలకం కట్టడి చేస్తుందని పరిశోధకుల్లో ఒకరైన లి-జూన్‌ మింగ్‌ స్పష్టం చేశారు.

13:46 - May 3, 2018

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పులతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తున్నాయి. భారీగా పంట నష్టం వాటిల్లింది. కాకినాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన మూడు రోజులుగా జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. తీవ్రపంట నష్టం వాటిల్లిందని వాతావరణ శాఖ తెలిపింది. 

 

13:44 - May 3, 2018

గుంటూరు : దాచేపల్లిలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్నారులపై అరాచకాలకు పాల్పడే వారిని ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ, ఐజీలను తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. జిల్లా మంత్రులు, మహిళా కమిషన్ చైర్మన్ దాచేపల్లిని సందర్శించాలన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని ఆదేశించారు. నిందితుడిని పట్టించిన వారికి నగదు బహుమతి ఇస్తామని సీఎం ప్రకటించారు. మైనర్ బాలికలపై దౌర్జన్యాలకు పాల్పడితే ఊరుకునేదిలేదని హెచ్చరించారు.
చిన్నారిపై వ్యక్తి అత్యాచారం
జిల్లాలోని దాచేపల్లిలో దాచేపల్లిలో షేక్‌ అఫిపాభాను అనే 9 సంవత్సరాల చిన్నారిపై అన్నం సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిరుతిళ్లు కొనిస్తానని చెప్పి రేకుల గూడెంలో అత్యాచారం చేసినట్లు చిన్నారి బంధువులు దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిన్నారిపై లైంగిక దాడికి నిరసనగా చిన్నారి బంధువుల ఆందోళనకు దిగారు. మాచర్ల సెంటర్‌ రోడ్డుపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 

13:42 - May 3, 2018

శ్రీకాకుళం : ఉత్తరాంధ్ర వినాశనానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయా? అంటే అవుననే అంటున్నారు అక్కడి ప్రజలు. ఒకప్పుడు ప్రాజెక్టును వద్దన్న పాలకులే ఇప్పుడు నిరభ్యంతరంగా కొనసాగిస్తున్నారు. దీంతో అమెరికా, జపాన్‌, ఫ్రాన్స్‌ లాంటి దేశాల్లోనే తిరస్కరణకు గురైన ప్రాజెక్టులను ఉత్తరాంధ్రలో చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  
వణికిపోతోన్న శ్రీకాకుళం 
ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళం ఇప్పుడు వణికిపోతోంది. ప్రమాదకర ప్రాజెక్టులకు ప్రయోగశాలగా తమ జిల్లాలను వాడుకుంటున్నారంటూ ఆవేదన చెందుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ గోడును పట్టించుకోవడంలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాకరాపల్లి, సోంపేట బీల ప్రాంతం ఇప్పుడు కొవ్వాడ.... ఇలా వరుస విధ్వంసకర ప్లాంట్‌లతో తమను నాశనం చేసేందుకు పాలకులు వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కొవ్వాడలో అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటు ప్రక్రియ వేగవంతం 
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతోంది. బీహార్‌, గుజరాత్‌ లాంటి రాష్ట్రాలు పోరాటం చేసి వద్దనుకున్న ప్రాజెక్టు ఇప్పుడు తమ నెత్తిన పడటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర కేంద్ర బిందువుగా సిక్కోలు నాశనానికి కొవ్వాడలో అణు విద్యుత్‌ ప్రాజెక్టులు నెలకొల్పుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల ఆందోళనలు, ప్రజాభిప్రాయ సేకరణలు పక్కన పెట్టి ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం దూకుడు పెంచుతోంది. దీంతో శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతంలో మళ్లీ కలవరం మొదలైంది. 
కొవ్వాడలో ఏర్పాటు ప్రతిపాదన కార్యరూపం 
9,500 మెగా వాట్లు ఉత్పత్తి చేసే అణువిద్యుత్‌ ప్రాజెక్టు కొవ్వాడలో ఏర్పాటు ప్రతిపాదన కార్యరూపం దాల్చనుంది. నాలుగు సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ, మత్స్యవేశం ప్రాంతంలో ఈ భారీ ప్రాజెక్టుకు చర్యలు కొనసాగుతున్నాయి. న్యూక్లియర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో కొవ్వాడ అణు విద్యుత్‌ ప్రాజెక్టుకు అవసరమయ్యే భూ సేకరణ ఇతర సాంకేతిక విషయాలలో పూర్తి స్థాయి సర్వే జరిగింది. అణువిద్యుత్‌ కేంద్రానికి అవసరమయ్యే 3వేల ఎకరాల భూమి కోసం ప్రభుత్వం స్థానికంగా ప్రైవేటుకు చెందిన 2వేల 70 ఎకరాల భూమికి సర్వే చేపట్టారు. ఈ భూసేకరణకు సంబంధించి 42 నెంబర్‌ జీవో విడుదల చేసిన రెవెన్యూ అధికారులు ఈ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. 
స్థానికుల నుండి వ్యతిరేకత 
అధికారుల ప్రయత్నాలకు స్థానికుల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అణు కార్మాగారాల కారణంగా రేడియేషన్‌ ఏర్పడటమే కాకుండా భూకంపాల జోన్‌గా ఉన్న తీర ప్రాంతంలో జీవి మనుగడే కష్టమవుతుందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. సమగ్ర సర్వే పేరుతో రెవెన్యూ అధికారులు రికార్డులు సరి చేస్తామని చెబుతున్నప్పటికీ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సామాజిక సర్వేలను వ్యతిరేకిస్తున్న పంచాయితీలు  
ఇదిలా ఉంటే సామాజిక సర్వేలకు పంచాయితీలు వ్యతిరేకిస్తుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఎక్స్ క్లూజివ్ జోన్ లో గ్రామాల పెంపు, కిలోమీటర్ల వరకు జనావాసాల నిషేధం, చీకటి ఒప్పందాలతో కొవ్వాడ అణుపార్క్ బాధితులు మండిపడుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన అణు విద్యుత్‌ ప్లాంట్‌ను ఉత్తరాంధ్రలో చేపట్టడం సరికాదని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ధ్వజమెత్తింది. జపాన్‌లో పుఖిశిమో, రష్యాలో చేర్నోభిల్‌ లాంటి ఘటనలు చూసికూడా కేంద్రం ఈ విధంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏకపక్ష నిర్ణయంతో కొవ్వాడ అణు విద్యుత్‌ ప్లాంట్‌పై ముందుకెళ్తె పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. 
భావితరాల భవిష్యత్‌ ప్రశ్నార్థకం
అణు విద్యత్‌ కేంద్రాల వల్ల ఎలాంటి ప్రమాదాలు లేవని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ చెర్నోబిల్‌, పుఖోషిమా లాంటి ఘటనలతో అనుభవాలు నేర్వలేదు. 4 రూపాయలకు వచ్చే యూనిట్‌ విద్యుత్‌ స్థానంలో రెండున్నర లక్షల కోట్లు వెచ్చించి 14 రూపాయలతో ఎందుకు ఖరీదైన విద్యుత్‌ ఉత్పత్తి చేసి ప్రజల నెత్తిన అణుబాంబు పెడుతుందో అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా భూకంపాల జోన్‌ అయిన కొవ్వాడలో విధ్వంసకర అణు కర్మాగారం ఏర్పాటు చేస్తే భావితరాల భవిష్యత్‌ ప్రశ్నార్థకమయ్యే పరిస్థతి ఉందని నిపుణులు అంటున్నారు. 

 

13:40 - May 3, 2018

విశాఖ : నగరంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కురిసిన భారీ వర్షానికి ఆర్టీసీ బస్సులు నీటమునిగాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. వర్షపు నీటిలో డ్రైనేజీ వాటర్‌ కలుస్తోంది. జాగ్రత్తలు పాటించాలని అధికారులు అంటున్నారు. తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

 

వడగళ్ల వాన బీభత్సానికి 45మంది బలి..

ఢిల్లీ : వడగళ్లవాన బీభత్సం సృష్టించింది. 45 మంది ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మృతుల్లో ఒక్క ఆగ్రా జిల్లా నుంచే 36 మంది ఉన్నారు. తుఫాను, వడగళ ప్రభావం ఢిల్లీపై ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. రాజస్థాన్, యూపీ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. సంక్షోభంలో ఉన్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టాలని ఆయా రాష్ర్టాలకు దిశానిర్దేశం చేశారు.

దాచేపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..

అమరావతి : గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అరాచకాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టిచ్చినవారికి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. వెంటనే దాచేపల్లికి వెళ్లాలని జిల్లా మంత్రులు, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని సూచించారు.

ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల..

అమరావతి : ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ఎడ్ సెట్ ఫలితాలను విడుదల చేశారు. ఆర్టీజీఎస్ వెబ్ సైట్ లో ఎడ్ సెట్ ఫలితాలను విడుదల చేశారు. 

కర్ణాటక ప్రభుత్వాన్ని తప్పుపట్టిన సుప్రీం..

ఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానం కర్ణాటక ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. కావేరీ నుండి తమిళనాడుకు 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కావేరీ బోర్డు మేనేజ్ మెంట్ బోర్డును కేబినెట్ ఆమోదించలేదని అటార్ని జనరల్ పేర్కొంది. ప్రధాని ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్నారని అటార్ని జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో విచారణ 10 రోజులకు వాయిదా వేయాలని ఏజీ కోరింది. కావేరి డ్రాఫ్ట్ పై పూర్తి వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా సుప్రీంకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. 

రైల్వే టీ వ్యాపారికి రూ.లక్ష జరిమానా..

హైదరాబాద్ : రైల్వే టీ వ్యాపారి రైలు టాయిలెట్ లో నీటిని నింపి టీ క్యాన్లను బయటకు తెస్తున్న వీడియో ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన 2017 డిసెంబర్‌లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వెలుగుచూసింది. ఆహారం నాణ్యత విషయంలో ఉన్నత ప్రమాణాలు పాటించాల్సిన రైలులో..టీ వ్యాపారాలు ఇలా నిర్లక్ష్యం వ్యవహరించడంతో ఉన్నతాధికారులకు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు పాల్పడిన సదరు టీ వర్తకుడికి రూ.లక్ష జరిమానా విధించారు రైల్వే అధికారులు.

విధుల్లో లేని డాక్టర్..మృత శిశువు జననం..

శ్రీకాకుళం : ప్రభుత్వ ఆసుపత్రులంటేనే ప్రజలు హడలిపోయే పరిస్థితు నేటి ఆధునిక కాలంలో కూడా కొనసాగుతున్నాయి. ఆసుపత్రి సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయరనే ఆరోపణలు పలు సందర్భాలలో వాస్తవాలని బైటపడ్డాయి. ఈ క్రమంలో డ్యూటీ డాక్టర్ లేకపోవటంతో ఓ గర్భిణికి కడుపుశోకం మిగిలింది. డ్యూటీ చేయాల్సిన డాక్టర్ అందుబాటులో లేకపోవటంతో నర్సులు గర్భిణికి కాన్పు చేశారు. ఈ క్రమంలో పుట్టిన శిశువు మృతి చెందింది. దీంతో గర్భిణి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. 

12:17 - May 3, 2018

 యాదాద్రి భువనగిరి : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదగిరిగుట్ట మండలం రామాజీపేట స్టేజీ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

11:54 - May 3, 2018

విజయవాడ : పోగొట్టుకున్న చోటే పొందాలని చూస్తోంది.. ప్రతిపక్ష వైసీపీ. టార్గెట్‌ ఉత్తరాంధ్ర పేరుతో... భారీ చేరికలకు స్కెచ్‌ వేస్తోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఉత్తరాంధ్రలో అడుగులేస్తోన్న వైసీపీ వ్యూహమేంటి... అసలు ఉత్తరాంధ్రపై వైసీపీ అధినేత జగన్‌ ఎందుకంత శ్రద్ధ చూపుతున్నారు. వాచ్‌ దిస్‌ స్టోరీ. 
పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళే ప్రయత్నం 
పోయిన చోటే వెతుక్కునే పనిలో పడింది వైసీపీ. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తోంది ఆ పార్టీ. అందులో భాగంగా పార్టీకి పట్టు తక్కువగా ఉన్న ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు వైసీపీ అధినేత జగన్. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో గెలుపే లక్ష్యంగా.. పావులు కదుపుతున్నారు. అందుకోసం ఆ ప్రాంత నేతలతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో 2019 ఎన్నికలకు గెలుపు  గుర్రాల వేటలో పడింది వైసీపీ.
2014లో విశాఖపట్నంలో వైఎస్.విజయమ్మ ఘోర పరాజయం
2014 ఎన్నికల్లో విశాఖపట్నంలో వైఎస్.విజయమ్మ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాబోయే ఎన్నికల్లో ఆ సీన్‌ మళ్ళీ రిపీట్‌ కాకుండా జాగ్రత్త పడుతున్నారు వైసీపీ నేతలు.  అందుకోసం టార్గెట్‌ ఉత్తరాంధ్ర పేరుతో.. పార్టీలోకి భారీగా చేరికలను ప్రోత్సహించాలని భావిస్తున్నారు వైసీపీ నేతలు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో బలమైన నేతలను ఎంపిక చేసే పని... ఆ పార్టీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, ధర్మానకు అప్పగించారు జగన్‌. మరోవైపు పార్టీని బలోపేతం చేయడానికి విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ప్రాంతంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
పాడేరు, ఏజెన్సీ ప్రాంతాల్లో బలమైన నేతలపై వైసీపీ ఫోకస్‌
ఓ వైపు ఆయా ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను చేపడుతూనే... మరోవైపు పాడేరు, ఏజెన్సీ ప్రాంతాల్లో బలమైన నేతలపై  ఫోకస్‌ పెడుతున్నారు కమిటీ సభ్యులు. గత ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల్లో వైసీపీ 25 స్థానాల్లో పోటీ చేయగా... కేవలం తొమ్మిది స్థానాల్లో మాత్రమే గెలిచింది. మిగిలిన స్థానాల్లో కొద్దిపాటి తేడాతో.. ఓడిపోయింది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కనీసం ఆరు ఎంపీ స్థానాలు, ఇరవై అసెంబ్లీ స్థానాలు సాధించేందుకు... ఈ మూడు జిల్లాలను టార్గెట్‌గా పెట్టుకుంది. గతంలో  ఎక్కడైతే పోగొట్టుకుందో... అక్కడే రాబట్టుకోవాలని వైసీపీ పక్కా ప్రణాళికలు రచిస్తోంది. మరి ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రణాళికలు ఎంత వరకూ ఫలిస్తాయో వేచి చూడాలి. 

11:47 - May 3, 2018

పెద్దపల్లి : సింగరేణి, గ్యాస్‌పైపు లైన్‌, విద్యుత్‌లైన్‌ల నిర్మాణాలు ఇవన్నీ ఆ గ్రామానికి శాపంగా మారాయి. అధికారుల అవినీతి సర్వేలతో తీవ్రంగా నష్టపోతున్నామని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్యపల్లి రైతులు అంటున్నారు. భూమికి హక్కు దారులైనప్పటికీ సింగరేణి యాజమాన్యం చేసిన బలవంతపు సేకరణతో వారి భూమి మీద వారికే హక్కులేకుండా పోయింది. పోలీసుల బెదిరింపులతో విలువైన భూముల్లో పైప్‌లైన్ల నిర్మాణం చేస్తుండడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. రామయ్యపల్లెలో జరగుతోన్న దౌర్జన్యపు భూ సేకరణపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

11:42 - May 3, 2018

గుంటూరు : జిల్లాలోని మాచర్ల పట్టణంలో దారుణం జరిగింది. దాచేపల్లిలో దాచేపల్లిలో షేక్‌ అఫిపాభాను అనే 9 సంవత్సరాల చిన్నారిపై అన్నం సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిరుతిళ్లు కొనిస్తానని చెప్పి రేకుల గూడెంలో అత్యాచారం చేసినట్లు చిన్నారి బంధువులు దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిన్నారిపై లైంగిక దాడికి నిరసనగా చిన్నారి బంధువుల ఆందోళనకు దిగారు. మాచర్ల సెంటర్‌ రోడ్డుపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

నేరస్థులకు టిక్కెట్లు ఇచ్చిన బీజేపీ : రామలింగారెడ్డి

కర్ణాటక : జైలుకెళ్లిన 16మందికి టిక్కెట్లు ఇచ్చిన బీజేపీకి నీతి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని 10టీవీతో మాట్లాడుతున్న సందర్భంగా కర్ణాటక హోంమంత్రి రామలింగారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీకి మోసాల చరిత్ర అని విమర్శించారు. లోటు బడ్జెట్ లో వున్న ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి హోదా ఇవ్వకుండా ఏపీని మోసం చేశారనీ హోదా ఇచ్చి తీరాల్సిందేనని రామలింగారెడ్డి డిమాండ్ చేశారు. మోదీ ఒక్క ఏపీనే కాదు మొత్తం దేశాన్నే మోసం చేశారని 10టీవీతో మాట్లాడుతున్న సందర్భంగా కర్ణాటక హోంమంత్రి రామలింగారెడ్డి ఆరోపించారు. 

11:40 - May 3, 2018

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. క్రికెట్‌ బుకీలతో కోటంరెడ్డికి సంబంధాలు ఉన్నట్లు అభియోగాలు నమోదు కావడంతో అధికారులు ఏసీబీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీ మాలకొండయ్య ఏసీబీకి లేఖ రాశారు. విజయవాడలో ఓ హోటల్లో బుకీలతో కోటంరెడ్డి పలుమార్లు భేటీ అయినట్టు పోలీసులు నిర్ధారించారు. డీజీపీకి నెల్లూరు ఎస్పీ సమగ్ర నివేదిక ఇచ్చారు.
 

పొలాల్లో ల్యాండ్ అయిన చాపర్..

తూర్పుగోదావరి : ఓఎన్జీసీ హెలికాప్లర్ కు పెను ప్రమాదం తప్పింది. వాతావరణ సహకరించకపోవటంతో రావులపాలెం పొలాల్లో హెలికాప్టర్ ను పైలట్ ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ హెలికాప్టర్ లో పలువురు ఓఎన్జీసీ అధికారులు వున్నట్లుగా తెలుస్తోంది. పైలట్ చాకచక్యంతో వ్యవహరించటంతో అంతా క్షేమంగా బైటపడ్డారు. 

బీజేపీ రాబరీ గ్యాంగ్ : రామలింగారెడ్డి

కర్ణాటక : కర్ణాటక హోంమంత్రి రామలింగారెడ్డి 10టీవీతో పలు అంశాల గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలో బీజేపీ పార్టీ రాబరీ గ్యాంగ్ అని విమర్శించారు. సీఎం సిద్ధరామయ్య ఇచ్చిన 165 హామీలను నెరవేర్చారనీ 10టీవీతో కర్ణాటక హోంమంత్రి రామలింగారెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధే మా ప్రధాన ఎజెండా అని ఆ ఎజెండాతోనే ఎన్నికలకు వెళతామని రామలింగారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం కర్ణాటకలో హంగ్ కు అవకాశమే లేదని ఆయన స్పష్టంచేశారు. స్పష్టమైన మెజారిటీతో మేమే అధికారంలోకి వస్తామని రామలింగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  

అవార్డుల ప్రధానంపై రాష్ట్రపతి వివాదాస్పద నిర్ణయం..

ఢిల్లీ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఈ సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు జరగనున్నాయి. విజేతలందరికి రాష్ట్రపతి అవార్డులు అందజేయాల్సి వుంది. కాగా ఈ కార్యక్రమానికి కోవింద్ కేవలం గంట సమయం మాత్రమే ఇచ్చారు.ఈ సమయంలో ఆయన 11 మందికి మాత్రమే అవార్డులను అందిస్తారనీ మిగిన 11మందికి కేంద్రమంత్రులు అవార్డులను అందజేస్తారని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. దీంతో అవార్డు విజేతలు చాలామంది తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అవార్డుల వేడుకను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.

11:20 - May 3, 2018

గుంటూరు : జిల్లాలోని మాచర్ల పట్టణంలో దారుణం జరిగింది. దాచేపల్లిలో దాచేపల్లిలో షేక్‌ అఫిపాభాను అనే 9 సంవత్సరాల చిన్నారిపై అన్నం సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిరుతిళ్లు కొనిస్తానని చెప్పి రేకుల గూడెంలో అత్యాచారం చేసినట్లు చిన్నారి బంధువులు దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిన్నారిపై లైంగిక దాడికి నిరసనగా చిన్నారి బంధువుల ఆందోళనకు దిగారు. మాచర్ల సెంటర్‌ రోడ్డుపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 

 

11:17 - May 3, 2018

విశాఖ : ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుండే కుండపోతగా వర్షం కురవడంతో పలు చోట్లు చెట్లు నేలకొరిగాయి. విశాఖలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుండే కుండపోత వర్షం కురుస్తోంది. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. విజయనగరం జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పిడుగులు పడి ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందారు. ఇటు పశ్చిమగోదావరి జిల్లాలోనూ అకాల వర్షాలకు పంట నష్టం వాటిల్లింది. భీమడోలు, ఇరగవరం, తణుకు మండలాల్లో భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

వైసీపీ ఎమ్మెల్యేపై ఏసీబీ కేసు నమోదు..

అమరావతి : వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ యాక్ట కింద ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. క్రికెట్ బుకీలతో కోటంరెడ్డికి సంబంధాలున్నట్లుగా వున్న అభియోగంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. విజయవాడలోని ఓ హోటల్ లో బుకీలతో కోటంరెడ్డి పలుమార్లు భేటీ అయినట్లుగా పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి డీజీపీ మాలకొండయ్య కు జిల్లా ఎస్పీ సమగ్ర నివేదికను అందజేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని మాలకొండయ్య ఏసీబీకి లేఖ రాశారు. 

11:07 - May 3, 2018

రంగారెడ్డి : తనను పట్టించుకోవడం మానేసిందని ప్రియురాలిపై యాసిడ్‌తో దాడికి దిగాడు ఓ ప్రేమికుడు. హయత్‌నగర్‌ నివాసంలో ఉంటున్న ఝాన్సీ, శంకర్‌లు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కొద్ది రోజులుగా ఝాన్సీ తనను పట్టించుకోకపోవడంతో కోపం పెంచుకున్నాడు శంకర్‌. ఝాన్సీ స్నేహితురాలు రమ్య తన గురించి చెడుగా చెప్పడం వల్లనే తనకు దూరంగా ఉంటుందని భావించిన శంకర్‌.... నిన్న రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఝాన్సీ, రమ్యలపై యాసిడ్‌తో దాడి చేశాడు. ఆ యాసిడ్‌ కాన్సెంట్రేటెడ్‌ కాకపోవడంతో వీరికి ప్రమాదం తప్పింది. ఝాన్సీ, రమ్య పెట్రోల్‌ బంక్‌లో పని చేస్తున్నారు. 

నగరంలో ఉన్మాది ఘాతుకం..

హైదరాబాద్ : నగరంలోని హయత్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమించటంలేదని ఓ యువతిపై ఓ ప్రేమోన్మాది యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. గతకొంతకాలంలో స్నేహంగా వుంటున్న ఝూన్సీ అనే యువతిని ప్రేమించమని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి లోనైన సదరు యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. అనంతరం పరారయ్యాడు. యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

క్యాన్సర్ ఆసుపత్రిని పరిశీలించిన గవర్నర్..

నెల్లూరు : జిల్లాలో గవర్నర్ నరసింహన్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొదలకూరులోని రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రిని గవర్నర్ పరిశీలించారు.

పిడుగుపాటుకు ముగ్గురు మృతి..

విజయనగరం: భారీ వర్షంతో విజయనగరం జిల్లా తడిసి ముద్దైంది. గురువారం తెల్లవారుజాము నుంచే జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు, పార్వతీపురం, బొబ్బలి, సాలూరు, గజపతినగరం, చీపురుపల్లి, భోగాపురం, ఎస్.కోట, తదితర ప్రాంతాల్లో 5గంటల నుంచే ఎడతెరపిలేకుండా వర్షం కురసింది. దీంతో మామిడి, అరటి, జీడీ, చెరకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు నిన్న పిడుగులు పడి ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

జీజీహెచ్ లో తప్పిన పెను ప్రమాదం..

గుంటూరు: ప్రభుత్వాస్పత్రి ఐసీయూలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్క్యూట్‌తో ఏసీలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది ఐసీయూలోని రోగులను బయటకు తీసుకెళ్లారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆస్పత్రి సిబ్బంది తక్షనమే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

ఏపీలోని పలు జిల్లాలో వర్ష బీభత్సం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూ.గో జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పంట పొలాలు నీటమునిగాయి. మరోవైపు పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణశాఖ సూచించింది.

జిల్లాలో లక్ష్మీనారాయణ పర్యటన..

శ్రీకాకుళం: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నేటి నుంచి మూడు రోజులు పాటు జిల్లాలో పర్యటించనున్నారు. పాలకొండ, ఆముదాలవలస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో జేడీ పర్యటన కొనసాగనుంది. కిడ్నీ బాధితులు, రైతులు, చేనేత కార్మికుల స్థితిగతులపై లక్ష్మీనారాయణ అధ్యయనం చేయనున్నారు. కాగా ప్రజలకు చేరువగా వుండేందుకే తన పదవికి రాజీనామా చేశారనని లక్ష్మీనారాయణ పేర్కొన్న విషయం తెలిసిందే.

కూలిన మరో మిలటరీ విమానం..

ఢిల్లీ : అమెరికా రక్షణ రంగానికి కార్గో సేవలందిస్తున్న ఓ మిలటరీ విమానం జార్జియాలో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురూ మరణించారని అధికారులు తెలిపారు. సిటీ ఆఫ్ సవన్నా సమీపంలోని విమానాశ్రయం హైవేపై ఈ విమానం కూలిందని, జార్జియా నేషనల్ గార్డ్ ప్రతినిధి డిసిరీ బంబా వెల్లడించారు. కాగా గతంలో రష్యాకు చెందిన మిలటరీ ట్రాన్స్ పోర్ట్ విమానం సిరియాలో కూలిపోయింది. అలాగే అల్జీరియాలో ఓ మిలటరీ విమానం కూలిపోయిన ఘటనలో ఏకంగా 100మందికి పైగా మృతి చెందారు. సూడాన్ లోని రార్త్ కొర్దోఫాన్ రాష్ట్రంలో మిలటరీ విమానం కూలిపోయిన 5గురు మృతి చెందారు.

ఎంపెట్ పాస్..ఇంటర్ ఫెయిల్..

విశాఖపట్నం : విద్యార్దులకు విచిత్రమైన సందర్భం ఎదురయ్యింది. ఒకరికి ఇద్దరికి కాదు ఏకంగా 11,237 మంది ఇంటర్ విద్యార్థులలకు ఇటువంటి సందర్భం ఎదురయ్యింది. ఎంసెట్ ఫలితాల్లో పాస్ అయి ఇంటర్ పరీక్షల్లో విద్యార్ధులు ఫెయిల్ అయ్యారు. దీంతో వీరంతా సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధిస్తేనే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో సీట్లను పొందేందుకు అర్హులవుతారు. ఇంజనీరింగ్ లో 8,569 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగాల్లో 2,668 మంది ఎంసెట్ పాస్ అయ్యి, ఇంటర్ తప్పినవాళ్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు.

అత్యాచార నిందితుడి ఉరితీయాలని డిమాండ్..

గుంటూరు : దాచేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. చిన్నారులపై రోజురోజుకీ లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దాచేపల్లిలోని ఓ చిన్నారిపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన దుర్ఘటన చోటుచేసుకుంది. 9ఏళ్ల చిన్నారిపై సుబ్బయ్య అనే 50ఏళ్ల వృద్దుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దీంతో దాచేపల్లి పీఎస్ లో బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేసారు. అనంతరం నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. 

10:27 - May 3, 2018

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. క్రికెట్‌ బుకీలతో కోటంరెడ్డికి సంబంధాలు ఉన్నట్లు అభియోగాలు నమోదు కావడంతో అధికారులు ఏసీబీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీ మాలకొండయ్య ఏసీబీకి లేఖ రాశారు. 

 

విశాఖలో భారీ వర్షాలు

విశాఖ : నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుండే కుండపోతగా వర్షం కురవడంతో పలు చోట్లు చెట్లు నేలకొరిగాయి. 

విశాఖలో భారీ వర్షాలు

విశాఖ : నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుండే కుండపోతగా వర్షం కురవడంతో పలు చోట్లు చెట్లు నేలకొరిగాయి. 

10:13 - May 3, 2018

విశాఖ : నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుండే కుండపోతగా వర్షం కురవడంతో పలు చోట్లు చెట్లు నేలకొరిగాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పంట పోలాలు నీటి మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తూ.గో, విశాఖ, శ్రీకాకుళ, విజయనగరం జిల్లాల్లో చెదురుముదురు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

09:43 - May 3, 2018

ఉత్తరప్రదేశ్ : బిజెపి నేతలకు దళితులంటే చిన్నచూపే. దళితులను పార్టీకి చేరువ చేసేందుకు ఏర్పాటు చేస్తున్న సహపంక్తి భోజనాలు కూడా వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ మంత్రి సురేష్‌ రాణా అలీఘర్‌లోని లోహగఢ్‌లో ఓ దళితుడి కుటుంబతో  కలిసి విందు ఆరగించారు. అయితే ఆ విందు భోజనం దళిత కుటుంబం స్వయంగా వండి వార్చింది కాదు. సదరు మంత్రి క్యాటరర్‌ నుంచి తెప్పించిన భోజనాన్ని ఆరగించడంతో వివాదం నెలకొంది. ఈ వీడియో క్లిప్‌ వైరల్‌గా మారడంతో మంత్రి రాణా ఇబ్బందుల్లో పడ్డారు. మంత్రి వస్తున్న విషయం చివరి నిముషం వరకు తమకు తెలియదని.. ఆహారం, మంచినీరు, పాత్రలు బయటి నుంచి తెప్పించారని మంత్రికి ఆతిథ్యం ఇచ్చిన దళితుడు రజనీష్‌ కుమార్‌ చెప్పారు.

 

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు అయింది. ఏసీబీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. క్రికెట్ బుకీలతో కోటంరెడ్డికి సంబంధాలున్నట్లు అభియోగం ఉంది. 

09:39 - May 3, 2018

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు అయింది. ఏసీబీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. క్రికెట్ బుకీలతో కోటంరెడ్డికి సంబంధాలున్నట్లు అభియోగం ఉంది. విజయవాడలోని ఓ హోటల్ లో క్రికెట్ బుకీలతో పలుమార్లు భేటీ అయినట్లు పోలీసులు నిర్ధారించారు. డీజీపీకి నెల్లూరు ఎస్పీ కీలక నివేదిక ఇచ్చారు. సమగ్ర విచారణ జరపాలని డీజీపీ మాలకొండయ్య ఏసీబీకి లేఖ రాశారు.

 

09:34 - May 3, 2018

కేసీఆర్ ఏర్పాటు చేయబోయే మూడో ఫ్రంట్ పై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీఆర్ ఎస్ నేత కాసం సత్యనారాయణ గుప్తా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టీకాంగ్రెస్ నేత బెల్లానాయక్ పాల్గొని, మాట్లాడారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ మూడో ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారని వక్తలు అన్నారు. రాజకీయ లబ్ధి కోసం, స్వప్రయోజనాల కోసమే మూడో ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారని వక్తలు ఆరోపించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

09:22 - May 3, 2018

అనుకోకుండా వచ్చిన అకాల వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో చాలా పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దవ్వగా.... వర్షాలకు , గాలి వానలతో... మామిడి, జీడి మామిడి , అరటి తోటలు ధ్వసం అయ్యాయి. పడిన కష్టం నీటి పాలవ్వటంతో రైతులు లబోదిబో మంటున్నారు. వీరిని తక్షనం ఆదుకోవాలని రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇదే అంశంపై ఏపీ రైతుసంఘం రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

09:19 - May 3, 2018

ఢిల్లీ : ఐపీఎల్‌లో ఢిల్లీడేర్‌ డెవిల్స్‌ మరో విజయం సాధించింది. టాస్‌ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీజట్టు 4 పరుగులతో రాజస్థాన్‌పై విక్టరీ కొట్టింది. రిషబ్‌ పంత్‌ 69 , శ్రేయస్‌ అయ్యర్‌ 50,  పృథ్వీషా  47  రన్స్‌తలో  చెలరేగారు. దీంతో 17.1 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయిన ఢిల్లీటీమ్‌..  196 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం రాజస్తాన్‌ లక్ష్యాన్ని 12 ఓవర్లకు 151 పరుగులుగా నిర్ధేశించారు. లక్ష్యఛేదనలో రాజస్తాన్‌  ప్లేయర్లు జోరుగా బ్యాటింగ్‌ ప్రారంభించారు. ఓపెనర్లుగా  వచ్చిన  జోస్‌ బట్లర్‌, డీఆర్కీషార్ట్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. జోస్‌ బట్లర్‌  26 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 67 పరుగులు .. డీఆర్కీషార్ట్‌ 26 బంతుల్లో 2ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 రన్స్‌ చేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్‌లు దూకుడుగా ఆడే క్రమంలో వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. దీంతో నిర్ణీత ఓవర్లలో 12 ఓవర్లలో  రాజస్తాన్‌ రాయల్స్‌ 5వికెట్లు కోల్పోయి 146 పరుగు మాత్రమే  చేసింది. ఢిల్లీ బౌలర్లలో బౌల్ట్‌ రెండు వికెట్లు.. అమిత్‌ మిశ్రా, మ్యాక్స్‌వెల్‌లకు చెరో వికెట్‌ దక్కాయి. బట్లర్‌, డీఆర్కీషార్ట్‌  వీరోచితంగా ఆడినా రాజస్తాన్‌ రాయల్స్‌కు  ఓటమి తప్పలేదు. 

 

09:14 - May 3, 2018

చిత్తూరు : "భరత్‌ అనే నేను " మూవీ ఫేం- కైరా తిరుపతిలో  సందడి చేసింది. ఓ మొబైల్‌షాపు ప్రారంభానికి వచ్చిన ఆమె.. భరత్‌ అనే నేను సినిమాను సక్సెస్‌ చేసినందుకు అభిమానులకు అభినందనలు తెలిపింది. కైరాను చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈసందర్భంగా  అభిమానులతో కలిసి కైరా సెల్ఫీలకు ఫోజులిచ్చి సందడి చేసింది.

 

09:13 - May 3, 2018

నెల్లూరు : ఆ పల్లె మంచం పట్టింది... విషజ్వరాలతో గ్రామస్తులు విలవిల్లాడుతున్నారు. కలుషితమైన నీరు తాగడంవల్లే రోగాలు ప్రభలుతున్నాయని డాక్టర్లు అంటున్నారు. నెల్లూరుజిల్లా ఎఎస్‌పేట మండలం పెదఅబ్బీపురం గ్రామంలో విషజ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
పెద్ద అబ్బీపురంలో 150 మందికిపైగా విషజ్వరాలు
ఇదీ నెల్లూరు జిల్లా ఏఏస్ పేట మండలం పెద్ద అబ్బీపురం గ్రామం.. ఈ ఊరిలో 150 మందికిపైగా విషజ్వరాల బారినపడ్డారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో జిల్లా  వైద్యాధికరాలు గ్రామంలో మెడికల్‌ క్యాంప్ ను  ఏర్పాటుచేశారు. గత నాలుగు రోజులుగా  వైద్యసేవలు అందిస్తున్నారు. అయినా విష జ్వరాలు తగ్గుముఖం పట్టక రోగులు తీవ్ర ఆందోళన గురౌతున్నారు. 
ప్రభుత్వ మెడికల్‌ క్యాంపులో అరకొర వైద్యం
కాస్త ఆర్థికస్తోమత ఉన్నవారు నెల్లూరు,చెన్నై నగరాలకు వెళ్లి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు. కాని పేదవాళ్లు మాత్రం ఇలా చెట్లకిందనే ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్‌ క్యాంపులో అరకొర వైద్యం చేయించుకుంటున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యలోపంతో తాగునీరు కలుషితమైందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
మెరుగైన వైద్యసేవలు అందించాలి : గ్రామస్తులు  
ఇప్పటికైన అధికారులు స్పందించి రోగులకు సురక్షిత ప్రాంతాలకు తరలించి మెరుగైన వైద్యసేవలు అందించాలని గ్రామస్తులు  కోరుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగు పరిచి శుభ్రమైన తాగునీరు అందిచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

09:01 - May 3, 2018

హైదరాబాద్ : ప్రైవేటీకరణ మోజు ఇపుడు రైల్వేష్టేన్లనూ తాకింది.. నిత్యం లక్షలాది మంది ప్రాయాణికులకు సేవలందిస్తూ లాభాల బాటలో సాగుతున్న స్టేషన్లను ప్రైవేటుకు అప్పగించడానికి కేంద్రం రంగంసిద్ధం చేసింది. ఆదాయంలో దేశంలోనే ముందున్న సికింద్రాబాద్, విజవాడ రైల్వేస్టేషన్లు ఇక ప్రైవేటు పరం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే  ఐఆర్‌టీసీ ప్రతిపాదనలు కూడా సిద్ధ చేసినట్టు  తెలుస్తొంది.
రైల్వే సేవలు ఇక మరింత ప్రియం 
రైల్వే సేవలు ఇక మరింత ప్రియం కానున్నాయి. భద్రత, నిర్వహణ, టికెట్ బుకింగ్, మినహా...  స్టేషన్లు, రైల్వే స్థలాలు, ప్రైవేట్ పరంకానున్నాయి. ఆధునిక సౌకర్యాల కల్పన పేరుతో వియవాడ రైల్వేస్టేషన్‌ను  ప్రైవేట్‌ సంస్థల చేతుల్లో పెట్టేందుకు సౌత్‌సెంట్రల్‌ రైల్వే కసరత్తు పూర్తి చేసింది. 
23 రైల్వే స్టేషన్లు ప్రైవేట్‌పరం చేసేందుకు ఎంపిక
దేశం వ్యాప్తంగా మోత్తం 23 రైల్వే స్టేషన్లు ప్రైవేట్‌పరం చేసేందుకు రైల్వేశాఖ ఎంపిక చేసింది. దీనిలో విజయవాడ, సికింద్రాబాద్  స్టేషన్లు తొలిదశలో ఎంపికయ్యాయి. వీటిని రీడెవలప్ మెంట్ కింద ప్రైవేట్ కంపెనీలకు అప్పగించనున్నారు. ఒక్క విజయవాడ జంక్షన్ నుంచే రోజుకు  250 ఎక్స్ ప్రెస్ రైళ్లు, 70 ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. ఏడాదికి 175 కోట్ల పైగా ఆదాయం వస్తున్నా.. ప్రైవేట్‌కు అప్పగించేస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.  
స్టేషన్ల నిర్వహణ, రైల్వే స్థలాలు ప్రైవేట్ పరం
భద్రత, టికెట్ బుకింగ్, మినహా... మిగత అంతా అంటే స్టేషన్ల నిర్వహణ, రైల్వే స్థలాలు అన్నీ ప్రైవేట్ పరంకానున్నాయి.  ఇప్పటికే విజయవాడ స్టేషన్‌కు పలు ప్రైవట్ కంపెనీలు టెండర్లకు కూడా  సిద్ధమనట్టు తెలుస్తోంది.  ఏకంగా 45 నుంచి 99 ఏళ్లపాటు లీజుకివ్వాలంటూ కాంట్రాక్టర్లు  దక్షిణ మధ్య రైల్వేపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. స్టేషన్లన్నీ ఒక్కొక్కటిగా  ప్రైవేట్‌ పరం అవుతుండటంతో  రైల్వే ఉద్యోగులు, సిబ్బంది, కార్మికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. గతేడాదిలోనే  స్టేషన్ రీ డెవలప్ మెంట్ కార్యక్రమాన్ని రైల్వే మంత్రి అమల్లోకి తెచ్చారు.  స్టేషన్లను ప్రైవేట్ కు అప్పగించడం ద్వారా నాన్‌టికెట్ రెవెన్యూ కింద కోట్లు అర్జించేందుకు  ప్రణాళికలు రూపొందిచామని  రైల్వే వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం విజయవాడ రైల్వేస్టేషన్ 22 ఎకరాలకు పైగా ఉంది. తాజా లెక్కల ప్రకారం 200 కోట్లుపై బడి ఉంటుందని అంచవేస్తన్నారు. ఇందులో ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పిస్తామంటూ రైల్వేశాఖ చెబుతోంది. 
బెజవాడ రైల్వే స్టేషన్‌ ప్రైవేట్‌ పరం 
అయితే విజయవాడ స్టేషన్‌ ప్రైవేటికరణకు టెండర్లు ఆహ్వానించనా..  లీజు గడువుపై కాంట్రాక్ సంస్థలు మెలికపెట్టడంతో ఈ ప్రాతిపాదన ప్రస్తుతానికి నిలిచిపోయినట్టు తెలుస్తోంది. మొత్తానికి 120 ఏళ్లకుపైగా  ప్రజలకు సేవలందించిన బెజవాడ రైల్వే స్టేషన్‌.. ఇపుడు ప్రైవేట్‌ పరం చేయడంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. 

08:54 - May 3, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ్యత్వం రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో వాదనలు ముగిశాయి.ఈ కేసులో సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ 12 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డివిజన్‌ బెంచ్‌కి అప్పీల్‌ చేశారు. పిటిషనర్ల తరుపున వైద్యనాథన్‌  వాదనలు వినిపించారు.  కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ తరుపున అభిషేక్‌ మను సింఘ్వి వాదించారు. పిటిషన్‌ వేసిన 12 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది పార్టీ ఫిరాయించిన వారేనని, ఇలాంటి వారు కేసు వేసే అర్హతలేదని సింఘ్వి వాదించారు. అయితే  సభలో సభ్యులకు కేసు వేసే అర్హత ఉందని వైద్యనాథన్‌ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును రిజర్వు చేసింది. 
 

 

08:49 - May 3, 2018

హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు బీఎల్‌ఎఫ్‌ పోటీ చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌ ఎస్వీకేలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కలిసొచ్చే అన్ని పార్టీలను కలుపుకుపోతామన్నారు. సమాజ్‌వాదీపార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ కేసీఆర్‌ నేతృత్వంలోని ఫెడరల్‌ ఫ్రంట్‌లో కలవడం సామాజిక న్యాయానికి అర్థం లేదన్నారు. 
 

 

08:47 - May 3, 2018

విజయవాడ : జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలో సుదీర్ఘ రాజకీయ యాత్రకు సన్నద్ధమవుతున్నారు. పవన్‌ చేపట్టబోయే బస్సు యాత్ర ఎలా ఉండబోతోంది..? 2019 ఎన్నికలకు తొలిదశ ప్రచారంగా ఇది  ఉపయోగ పడుతుందా...?  ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనపై  ప‌వ‌న్ ఎలా స్పందించ‌నున్నారు...? ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న జనసేన అధినేత బ‌స్సు యాత్రపై ప్రత్యేక కథనం..
పవన్‌ పర్యటనకు టూర్ మ్యాప్ ఖరారు 
ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయ యాత్రకు రంగం సిద్ధమైంది. రాష్ర్టవ్యాప్తంగా పవన్‌ పర్యటనకు టూర్ మ్యాప్ ఖరారైంది. బస్సుయాత్ర అన్ని జిల్లాలోనూ కొనసాగేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమ‌య్యే బస్సుయాత్రలో ప్రజ‌ా స‌మ‌స‌్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాల‌ని  నిర్ణయించారు ప‌వ‌న్. 
బస్సుయాత్రకు పవన్ సిద్ధం
అయితే మొద‌ట పాద‌యాత్ర చేయాల‌ని పవన్‌ బావించినా.. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో  బస్సుయాత్రకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. యాత్రలో భాగంగా ప్రతిజిల్లాలో బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. స్థానిక ప్రజా స‌మ‌స్యల‌తోపాటు ప్రత్యేక హాదాపై  గ‌త నాలుగేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుస‌రించిన తీరును ప్రజల్లో ఎండగడతారని జనసేన వర్గాలు అంటున్నాయి.  మెత్తానికి పార్ట్‌టైం రాజకీయవేత్త అని వస్తున్న విమర్శలకు చెక్‌పెడుతూ.. జనసేనాని జనరలోకి అడుగు పెడుతున్నారు.  సుదీర్ఘంగా సాగనున్న బస్సుయాత్రతో 2019 ఎన్నిలకు పవన్‌ శంఖం పూరించనున్నారని జనసేన శ్రేణులు, అభిమానులు ఉత్సహం ప్రకటిస్తున్నారు. 

 

08:43 - May 3, 2018

విజయవాడ : నిరుద్యోగులకు భృతి, బాబు వస్తే జాబు వస్తుందనే టీడీపీ హామీలను గుర్తుచేస్తూ... టెన్‌టీవీలో ప్రసారమైన కథనంతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. నిరుద్యోగ భృతి కల్పించే దిశగా సర్కార్ అడుగులేస్తోంది. ఆ మేరకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 
టెన్‌టీవీ కథనానికి ప్రభుత్వ స్పందన
2014 ఎన్నికలప్పుడు టీడీపీ ఇచ్చిన హామీలు హామీలుగా మిగిలిపోయాయి. బాబొస్తే జాబొస్తుందన్నారు.. లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. కానీ ఏళ్ళు గడుస్తున్నా నిరుద్యోగ భృతిపై యువత  పెట్టుకున్న ఆశలు మాత్రం నెరవేరడం లేదు.  వర్ణనాతీతంగా మారిన నిరుద్యోగుల బాధలను టెన్‌టీవీ ఫోకస్‌ చేసింది.. దీంతో  ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది.. త్వరలో నిరుద్యోగ భృతి అంశాన్ని ఓ కొలిక్కి తేచ్చే దిశగా చర్యలు చేపడుతున్నారు.
నిరుద్యోగుల సంఖ్యను తేల్చేందుకు కమిటీ  
మొదటి నుంచీ ఈ విషయంలో ప్రభుత్వ తీరును ఎండగడుతూనే ఉన్నాయి వామపక్షాలు. నిరుద్యోగుల ఇబ్బందులపై ఇటీవల టెన్‌టీవీ కథనం ప్రసారం చేయడంతో... విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్లింది. దీంతో త్వరితగతిన నిరుద్యోగ భృతి కల్పించి.. వారి ఆశలు నెరవేర్చాలని చూస్తున్నారు. డిగ్రీ, ఆపైన విద్యార్హతలున్న నిరుద్యోగ యువతకు భృతిని పంపిణీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. దేశంలోని పలు రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి అమలు తీరుపై  అధికారులు ఆరా తీస్తున్నారు. వాటి ఆధారంగా ప్రాథమికంగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. నిరుద్యోగుల సంఖ్యను తేల్చేందుకు మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆధ్వర్యంలో మరో కమిటీ కసరత్తు చేసింది. 
పదిలక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు గుర్తింపు
ఉపాధి కల్పనా కార్యాలయం, ప్రజా సాధికార సర్వే వివరాల ఆధారంగా ఇంటర్ ఆపైన విద్యార్థుల్లో పదిలక్షల మంది వరకూ నిరుద్యోగులు ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. వీరిలో ప్రభుత్వం డిగ్రీ ఆపైన విద్యార్హత ఉన్నవారికే ప్రస్తుతం నిరుద్యోగ భృతి ఇవ్వాలన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు డిగ్రీ, ఆపైబడి విద్యార్హతలున్న నిరుద్యోగుల సంఖ్య లెక్క తేల్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. నిరుద్యోగ భృతికి సంబంధించి తుది మార్గదర్శకాలు ఖరారు కావాల్సి ఉంది. ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం.. దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాలకు చెంది ఉండాలి. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకూ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారి పిల్లలకు అవకాశం కల్పించాలా లేదా అనేది నిర్ణయించాల్సి ఉంది.. సొంత వ్యవసాయ భూమి.. తరైతే  రెండున్నర ఎకరాల వరకు, ఖుష్కీ అయితే  గరిష్టంగా 5 ఎకరాల్లోపు ఉన్నవారు అర్హులు. కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వం అందిస్తున్న సామాజిక పింఛన్లను తీసుకుంటున్నప్పటికీ ఆ కుటుంబంలోని నిరుద్యోగి అర్హులే. 
మూడు రకాలుగా విభజించి నిరుద్యోగ భృతి చెల్లింపు 
ప్రభుత్వం ఇతర అర్హతలను పరిగణలోకి తీసుకోనుంది. ముందు పది, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇలా మూడు రకాలుగా విభజించి నిరుద్యోగ భృతి చెల్లించాలని భావించింది.. పదోతరగతి వరకూ ఐతే వెయ్యి, ఇంటర్ అర్హతలున్నవారికి  పదిహేను వందలు, డిగ్రీ, పీజీ వారికి  రెండు వేల రూపాయలు ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం సమావేశాల్లో నిర్ణయించారు. ఇప్పుడు ప్రభుత్వం డిగ్రీ, ఆపైన అర్హత ఉన్నవారికే భృతి చెల్లించాలన్న నిర్ణయానికి వచ్చారు. రెండు వేలు చొప్పున ఇచ్చే అవకాశాలపై దృష్టిపెట్టారు.  ఈ అంశం ప్రస్తుతం రాష్ట్ర యువజన సంక్షేమ శాఖ పరిధిలో ఉంది. నిరుద్యోగుల సంఖ్య, ఇతర వివరాలపై ఈ శాఖ ఆధ్వర్యంలోనే కసరత్తు జరుగుతోంది. ఇప్పుడు నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రత్యేకంగా తీసుకుని దీని అమలు, పర్యవేక్షణ ఎవరికి అప్పగించాలన్న దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఐటీ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్ సైట్ లో నిరుద్యోగుల నమోదు ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నారు. 

08:31 - May 3, 2018

గుంటూరు : సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాజధానిలో స్థలాల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు. బందరుపోర్టుకు రైల్వే కనెక్టివిటీ, భోగాపురం ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టుకు నిధుల కేటాయింపుపై  మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయడంపై కూడా మంత్రి మండలి చర్చిచింది. 
చంద్రబాబు అధ్యక్షతన భేటీ 
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం అమరావతిలో భేటీ అయిన ఏపీ క్యాబెనెట్‌.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఆర్‌డీఏ పరిధిలో వివిధ సంస్థలు, కార్యాలయాలకు 51.92 ఎకరాలను అమరావతిలో కేటాయించేందుకు అంగీకారం తెలిపారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ కార్యాలయంకోసం  2 వేల గజాల స్థలాన్ని కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.  సీబీఐకి మూడున్నర ఎకరాలు, విదేశీ వ్యవహారాల శాఖకు రెండు ఎకరాలస్థలం  ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. దాంతోపాటు ఇగ్నోకు 80 సెంట్లు చొప్పున కేటాయించాలని మంత్రివర్గం  నిర్ణయం తీసుకుంది. 
వేతన బకాయిల చెల్లింపులపై కేబినెట్‌ నిర్ణయం : మంత్రి కాల్వ 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వేతన బకాయిల చెల్లింపులపై కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. 10వ వేతన సంఘం సిఫార్స్‌లకు అనుగుణంగా ఉద్యోగులుకు 3919కోట్ల రూపాయలు  చెల్లించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 
అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవడంపై చర్చించాం : మంత్రులు 
ఏపీ కంప్లసరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజస్ యాక్ట్ 2002కు సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రన్న పెళ్లికానుక పథకం ద్వారా వివిధ వర్గాలకు ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా కానుకలు అందించేందుకు నిర్ణయించారు. దీనికోసం చట్టంలో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తూ ఆర్డినెన్స్‌కు రూపకల్పన చేశారు. అటు అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవడంపై కూడా కేబినెట్‌లో చర్చించామని మంత్రులు తెలిపారు. 
పీపీపీ పద్ధతిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి ఏపీ మంత్రివర్గం  నిర్ణయం తీసుకుంది. అలాగే బందరు పోర్టుకు రైల్వే కనెక్టివిటీ కోసం ఇన్‌క్యాప్‌ సంస్థకు  1092 కోట్ల రుణంపై గ్యారెంటీకి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.   

 

నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాయిని పర్యటన

రాజన్నసిరిసిల్ల : పెద్దపల్లి మండలం రామగిరిలో నేడు హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి పర్యటించనున్నారు. నూతన పోలీస్ స్టేషన్ భవనానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 

 

నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

రాజన్న సిరిసిల్ల : నేడు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. రైతుబంధు పథకం పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. 

 

నేడు బీదర్ లో రాహుల్ గాంధీ ఎన్నిక ప్రచారం

కర్ణాటక : నేడు బీదర్ లో రాహుల్ గాంధీ ఎన్నిక ప్రచారం చేయనున్నారు. మూడు బహిరంగ సభలో రాహుల్ పాల్గొనున్నారు. 

నేడు గుల్బర్గా, బెంగళూరు, బళ్లారిలో మోదీ ఎన్నికల ప్రచారం

కర్ణాటక : నేడు గుల్బర్గా, బెంగళూరు, బళ్లారిలో మోదీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. 

నేటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ పర్యటన

శ్రీకాకుళం : నేటి నుంచి జిల్లాలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పర్యటించనున్నారు. పాలకొండలో రైతులతో లక్ష్మీనారాయణ సమావేశం కానున్నారు. 

నేటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

హైదరాబాద్ : నేటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. నేటి నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. 

నేడు నెల్లూరులో గవర్నర్ నరసింహన్ పర్యటన

నెల్లూరు : నేడు గవర్నర్ నరసింహన్ నెల్లూరులో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

గుంటూరు జిల్లాలో బాలికపై అత్యాచారం

గుంటూరు : దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. పోలీస్ స్టేషన్ ఎదుట బాధితురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించారు.

Don't Miss