Activities calendar

04 May 2018

22:02 - May 4, 2018

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీ విషయంలో ఫైనాన్స్ కమిషన్ కుండాల్సిన రాజ్యాంగ తటస్థ లక్షణాన్ని దెబ్బతీసేలా కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసిందా? జీఎస్టీ ప్రభావాన్ని అంచనా వేయాలనే బాధ్యతను కూడా ఫైనాన్స్ కమిషన్ కు అప్పగించారా? 15వ ఆర్థిక సంఘం నిబంధలపై రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేదు. తమిళనాడు, తెలంగాణ దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి కేరళ ఎందుకు హాజరుకాలేదు? దేశంలో మతపరమైన రాజకీయాలు అంతకంతకు పెరుగతున్నాయి.ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలను మీరెలా చూస్తారు? ఏదైనా మార్పులు కనిపిస్తున్నాయా? కేంద్రంలోని బీజేపీ సారధ్యంలోని ప్రభుత్వం చేపట్టిన ముఖ్య పథకాలకు విధేయత కనబరిచే రాష్ట్రాలకు అధిక ప్రోత్సాహాకాలు ఇచ్చే విధంగా నిబంధనలు దోహదపడుతున్నాయా? రెవెన్యూ లోటును భర్తీ చేసే విషయంలోఫైనాన్స్ కమిషన్ పున: పరిశీలన చేయాలనే షరతు పెట్టటానికి కారణాలేమిటి? వంటి పలు కీలక అంశాలపై కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ తో స్పెషల్ ఇంటర్వ్యూ..

21:45 - May 4, 2018

ఢిల్లీ : దళితుల ఇంటికెళ్లి భోజనం చేసి.. ఫొటోలకు పోజులిచ్చి.. పబ్లిసిటీ చేసుకుంటున్న బీజేపీ నేతలకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చురకలంటించారు. ఇలాంటి డ్రామాలు ఆడే బదులు.. రెగ్యులర్‌గా దళితులను కలుస్తూ, వాళ్లతో మాట్లాడాలని సూచించారు. దళితులకు దగ్గరయ్యేందుకు వాళ్ల ఇళ్లకు వెళ్లాలని ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతకు సూచించారు. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా దళితుల ఇళ్లకు వెళ్లి కాసేపు గడిపారు. ఇతర రాష్ర్టాల్లోనే పలువురు బీజేపీ మంత్రులు, ఎంపీలు ఇలాగే దళితుల ఇళ్లకు వెళ్తున్నారు. అయితే వారితో పాటు మీడియాను తీసుకెళ్లడం మోహన్‌ భగవత్‌ తప్పుబట్టారు. 

21:42 - May 4, 2018

కర్ణాటక : కర్నాటకలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంటోంది. వారం రోజుల్లో పోలింగ్‌ జరగనున్న కన్నడనాట.. అగ్రనేతల పర్యటనలు.. వారి వాగ్యుద్ధాలు.. రాజకీయ వాతావరణాన్ని పతాకస్థాయికి తీసుకు వెళుతున్నాయి. కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ప్రధాని మోదీ.. ఆయన మాటలను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరోవైపు.. సొంత జిల్లా బళ్లారిలో ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా చక్రం తిప్పాలనుకున్న గాలి జనార్దనరెడ్డికి చుక్కెదురైంది.

కర్ణాటకలో ఎన్నికల వేడి
కర్నాటకలో ఎన్నికల వేడి.. మండువేసవిలోని భానుడి భగభగలను మించిపోయింది. ప్రధాని నరేంద్రమోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సిలికాన్‌ వ్యాలీని పాపాల లోయగా మార్చేశారని గార్డెన్‌సిటీని గార్బేజీ సిటీగా మార్చారంటూ ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీనిపై కాంగ్రెస్‌ అధినాయకత్వం మండిపడుతోంది.

మోదీ విమర్శలకు, ట్వీట్ల ద్వారా బదులిచ్చిన రాహుల్‌..
మోదీ విమర్శలకు, ట్వీట్ల ద్వారా బదులిచ్చిన రాహుల్‌.. కర్నాటక నగరాలకు బీజేపీ కన్నా కాంగ్రెస్‌ ప్రభుత్వమే 11 వందల శాతం అధిక నిధులు కేటాయించిందన్నారు. అంతేకాకుండా, కర్నాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నభాగ్య, క్షీరధారె, కృషియంత్రధారె, సూర్యరైత లాంటి పథకాలు రైతులకు ఎంతలా ఉపయోగపడ్డాయో కూడా ట్వీట్లలో వివరించారు. ప్రధాని మోదీకి అబద్ధాలు చెప్పడం సహజంగా అబ్బిన విద్య అంటూ ఎద్దేవా చేశారు.

కీలకంగా మారిన జెడి(యు) అధినేత కుమారస్వామి
కాంగ్రెస్‌, బీజేపీ అగ్రనాయకత్వం వాగ్యుద్ధాలతో వాతావరణాన్ని వేడెక్కిస్తుంటే.. కీలకంగా మారిన జెడి(యు) అధినేత కుమారస్వామి చాపకింద నీరులా ప్రచారాన్ని నిర్వహించుకుంటూ వెళుతున్నారు. రాష్ట్రప్రజలు రెండు జాతీయ పార్టీలపై అసంతృప్తితో ఉన్నారని కుమారస్వామి విశ్వసిస్తున్నారు. ఎన్నికల రణక్షేత్రంలో.. కుమారస్వామి ఇప్పటికే రైతు రుణమాఫీ అస్త్రాన్ని ప్రయోగించారు. మహిళల ఓట్లను ఆకర్షించేందుకు.. స్త్రీశక్తి సంఘాలకు వడ్డీరహిత రుణాలు, ఐదువేల లోపు ఆదాయం ఉన్న కుటుంబాల్లోని ఆడపిల్లలకు నెలనెలా రెండు వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీలు గుప్పిస్తున్నారు.

హామీల తాయిలాలు..
కుమారస్వామి సంధించిన రైతురుణమాఫీ అస్త్రం దెబ్బతో.. బీజేపీ కర్నాటక శాఖ కూడా ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చింది. లక్షరూపాయల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని, పంటలకు సాధారణ ధరకంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా మద్దతు ధర అందిస్తామనీ హామీ ఇచ్చింది. ఈమేరకు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప మేనిఫెస్టోను విడుదల చేశారు. రైతులే కాదు, చేనేత కార్మికుల రుణాలనూ మాఫీ చేస్తామన్నారు. మహిళల ఓట్లను ఆకర్షించేందుకు స్త్రీ ఉన్నతి నిధి పేరిట పదివేల కోట్లతో అతిపెద్ద సహకార సంఘాన్ని ఏర్పాటు చేస్తామనీ బీజేపీ మేనిఫెస్టోలో చేర్చింది. మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్‌లను రూపాయికే అందిస్తామని మేనిఫెస్టోలో తెలిపారు.

ప్రచారానికి వెళ్లేందుకు అనుమతి నిరాకరించిన కోర్టు
మరోవైపు.. ఈసారి ఎన్నికల్లో సొంత జిల్లా బళ్లారిలో ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని ఆశించిన గాలి జనార్దనరెడ్డికి భంగపాటు ఎదురైంది. గనుల అక్రమ తవ్వకాల కేసులో.. ఈయన్ను బళ్లారికి వెళ్లకుండా.. కోర్టు గతంలో ఆంక్షలు విధించింది. బళ్లారిలో తన సోదరుడి తరఫున ప్రచారం నిర్వహించేందుకు అనుమతించాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఇంకోవైపు.. గురువారం నాడు ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా.. వేదికపై గాలి జనార్దనరెడ్డి సోదరుడు సోమశేఖరరెడ్డి కూడా ఉండడంపై.. కర్నాటక సీఎం సిద్దరామయ్య ట్విట్టర్‌లో విమర్శించారు. మైనింగ్‌ మాఫియా సూత్రధారి సోదరుడికి ఓటేయమంటూ.. చెప్పిన ప్రధాని, కాంగ్రెస్‌ పార్టీ బళ్లారిని మకిలి పట్టించిందని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంకోవైపు.. కర్ణాటకలోని జయనగర్‌కు చెందిన బీజేపీ అభ్యర్థి బి.ఎన్‌.విజయ్‌ కుమార్‌.. ప్రచారం చేస్తూ.. గుండెపోటుతో మరణించారు. ఈయన జయనగర నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విజయకుమార్‌ మృతితో జయనగర స్థానానికి ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. 

21:35 - May 4, 2018

గుంటూరు : ఏపీలో సంచలనం రేకెత్తించిన దాచేపల్లి ఘటనలో నిందితుడు సుబ్బయ్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజులనుంచి గాలిస్తున్న పోలీసులకు దైద అమరలింగేశ్వర ఆలయం దగ్గర సుబ్బయ్య మృతదేహం లభ్యమైంది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్న ప్రభుత్వం.. ఐదు లక్షల పరిహారం ప్రకటించింది. మరోవైపు, చిన్నారిపై అత్యాచార ఘటనను విపక్షాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ విపక్ష వైసీపీ డిమాండ్‌ చేసింది.

తప్పుచేశాను ఇక సెలవని ఆత్మహత్య చేసుకున్న సుబ్బయ్య
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దాచేపల్లిలో సంచలనం సృష్టించిన మైనర్‌ బాలికపై అత్యాచారం ఘటనలో నిందితుడు అన్నం సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. అతి కిరాతకంగా దారుణానికి ఒడిగట్టిన అనంతరం పరారైన సుబ్బయ్య మృతదేహమై తేలాడు. గురజాల మండలం దైద అమరలింగేశ్వర ఆలయం దగ్గర సుబ్బయ్య మృతదేహం లభ్యమైంది. అతను చెట్టుకు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి బాలికపై అత్యాచారం జరిపిన అనంతరం సుబ్బయ్య.. ఊరి నుంచి పారిపోయాడు. విషయం తెలిసిన తర్వాత ఒకరు సుబ్బయ్యతో ఫోన్‌లో మాట్లాడారు. అయితే తాను తప్పుచేశానని.. తన ముఖం ఎవరికీ చూపించనని... శవమై కనిపిస్తానని బంధువుకు ఫోన్‌లో చెప్పాడన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు.. అతని ఫోన్‌ను ట్రాక్‌ చేసి కృష్ణానదితో పాటు పరిసర ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో గాలింపు చేపట్టారు. దైద సమీపంలో ఆలయం దగ్గర చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. అనంతరం సుబ్బయ్య మృతదేహాన్ని గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

రూ.5లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
ఇదిలావుంటే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పలువురు పరామర్శించారు. బాధితురాలికి చంద్రబాబు 5 లక్షలు పరిహారం ప్రకటించారని, ఎమ్మెల్యే యరపతినేని 2 లక్షల రూపాయలు పరిహారమిచ్చారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఇలాంటి సమయంలో బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పాల్సిందిపోయి... మనోవేదనకు గురి చేసేలా కొంతమంది రాజకీయం చేస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితిల్లోనూ వదిలిపెట్టబోమని ప్రత్తిపాటి హెచ్చరించారు.

చంద్రబాబుపై విరుచుకుపడ్డ రోజా
అయితే.. బాధితురాలిని పరామర్శించిన వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన రోజాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

సుబ్బయ్య మృతిపై బంధువుల అనుమానాలు

సుబ్బయ్య ఆత్మహత్య చేసుకోవడంపై బాధితురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్బయ్య భయపడి ఉరేసుకుంటే తమకు న్యాయం జరిగినట్టా ? అని ప్రశ్నించారు. తమకు పోలీసులు న్యాయం చేయలేదని... తాము ఆందోళన చేస్తుంటే... పోలీసులు మాయమాటలు చెప్పి తమను మభ్యపెట్టారని ఆరోపించారు. సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడంటే తాము నమ్మలేకపోతున్నామని... పోలీసులే ఏదో చేసి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

మహిళా సంఘాల మండిపాటు
ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష వేయాలని కోరుతున్నారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ శనివారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలని వైసీపీ పిలుపునిచ్చింది. 13 జిల్లాల్లో సాయంత్రం 6.30 గంటల నుంచి 7 గంటల వరకు క్యాండీల్‌ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

దాచేపల్లి ఘటనను ఖండించిన ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి
దాచేపల్లి ఘటనను ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ఖండించారు. ఇలాంటి ఘటనలు జరకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. మహిళలపై దాడులు చేసేవారిపై అవసరాన్ని బట్టి ఒకరిద్దరిని ఎన్‌కౌంటర్‌ చేస్తే.. ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్నారు.

సుబ్బయ్య మృతదేహానికి గురజాల ప్రభుత్వాస్పత్రిలో పోస్ట్‌మార్టం
ఇదిలావుంటే.. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సుబ్బయ్య మృతదేహానికి గురజాల ప్రభుత్వాస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. అయితే భౌతికకాయాన్ని తీసుకెళ్లేందుకు బంధువులెవరూ ముందుకు రాకపోవడంతో గురజాల పంచాయతీకి అప్పగించాలని పోలీసులు నిర్ణయించారు. ఇదిలావుంటే సుబ్బయ్య మృతదేహం తమకు అప్పగించాలని బాధితురాలి బంధువులు దాచేపల్లిలో మరోసారి ఆందోళనకు దిగారు. సుబ్బయ్య మృతదేహాన్ని నడిరోడ్డుపై దహనం చేయాలని డిమాండ్‌ చేస్తూ.. మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. రెండు రోజులుగా ఉద్రిక్తంగా మారిన దాచేపల్లిలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

క్రిస్‌గేల్ బౌండరీల సునామీ..

మధ్యప్రదేశ్ : కరీబియన్ విధ్వంసక వీరుడు క్రిస్‌గేల్ ఇండోర్ స్టేడియంలో బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చాలా సునాయాసంగా ఎలాంటి టెన్షన్ లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. అతడి వీర బాదుడు ఒక బంతి ఏకంగా మైదానం ఆవలపడింది. దీంతో అంపైర్లు ముంబయి బౌలర్లకు కొత్త బంతిని అందించారు. అందరి బౌలింగ్‌లోనూ మైదానం నలువైపులా పరుగులు రాబట్టాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ మొదటి బంతికి సింగిల్ తీసి గేల్(50: 38 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకం పూర్తి చేశాడు. ఐపీఎల్ కెరీర్‌లో గేల్‌కిది 24వ ఆఫ్‌సెంచరీ.

మాకు న్యాయం లభించింది : దాచేపల్లి బాధిత బంధువలు

అమరావతి : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో, జమ్ముకశ్మీర్‌లోని కథువాల్లో ఇటీవల జరిగిన అత్యాచార ఘటనల్లో బాధితులకి లభించని న్యాయం తమకు లభించిందని గుంటూరు జిల్లాలోని దాచేపల్లి అత్యాచార బాధితురాలి బంధువు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నారు. ఈ రోజు చంద్రబాబు నిర్వహించిన మీడియా సమావేశంలో దాచేపల్లి బాధితురాలి బంధువు ఒకరు కాసేపు మాట్లాడాడు. 

వర్షాకాలం నేపథ్యంలో కేటీఆర్ ఆదేశాలు..

హైదరాబాద్ : వర్షకాలం రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఎదురయ్యే అన్ని పరిస్థితులకు సర్వం సన్నద్ధంగా ఉండాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌... జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన సుదీర్ఘ సమీక్షా సమావేశంలో... నిన్నటి భారీ వర్షాల వల్ల ఎదురైన పరిస్థితులు, వాటిని ఎదుర్కొన్న తీరును అధికారులు మంత్రికి వివరాలు అందించారు. ముఖ్యంగా నాలాల్లో ఉన్న అడ్డంకులు, పూడికతీతను తొలగించాలని కేటీఆర్‌ ఆదేశించారు.

ఎంతమంది చేరితే అంత బలం: చంద్రబాబు

అమరావతి : తిరుపతిలో తాను చేసిన ధర్మపోరాట దీక్ష ఆరంభం మాత్రమే నని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్దిని కోరుకునేవారు టీడీపీని బలపరచాలని కోరారు. పార్టీలో ఎంతమంది నేతలు చేరితే అంతబలమనీ..పార్టీలో చేరిన నేతలందరి కలిసి పనిచేయాలనీ బేషజాలకు పోవద్దని చంద్రబాబు నేతలకు సూచించారు. కాగా ఈరోజు బీజేపీ నేత రఘురామ్ కృష్ణరాజు చంద్రబాబు సమయంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. 

దాచేపల్లి చిన్నారిని పరామర్శించనున్న చంద్రబాబు

అమరావతి : సీఎం చంద్రబాబునాయుడు రేపు దాచేపల్లి అత్యాచార బాధితురాలిని పరామర్శించనున్నారు. ఈ విషయాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులతో చంద్రబాబు తెలిపారు. దాచేపల్లి ఘటనకు నిరసనగా ఈనెల 7న ర్యాలీలను నిర్వహిస్తామన్నారు. ఇటువంటి ఘటనలను అడ్డం పెట్టుకుని కొందరు రాజకీయం చేస్తున్నారనీ..ఇది సరైంది కాదన్నారు. రాష్ట్రంలో అత్యాచార ఘటనలకు పాల్పడితే..వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని చంద్రబాబు పేర్కొన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే సహించబోమని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా బాధితురాలి కుటుంబ సభ్యులు సీఎం చద్రబాబు నాయుడి కలిసి తమ ఆవేదనను వ్యక్తంచేశారు.

చంద్రబాబును కలిసిన బాధిత కుటుంబం..

అమరావతి : దాచేపల్లి ఘటన బాధితురాలి కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిసారు. జరిగిన ఘటనపై తట్టుకోలేని సందర్భంలో పోలీస్ కేసు పెట్టాలా? వద్దా? అనే తర్జనభర్జలు పడ్డామని బాధిత కుటుంబం చంద్రబాబుకు తెలిపింది. ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలనీ..జరిగన ఘటనల్లో నిందితులను బహిరంగంగా ఉరితసే చట్టాలు రావాలని వారు చంద్రబాబును కోరారు. 

20:45 - May 4, 2018

కర్ణాటకలో ఎన్నికల ప్రచారం రాజకీయ వర్గాల్లో వేడిని పుట్టిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని మోడీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గెలువు ఎవరిది? కాంగ్రెస్ దా? బీజేపీదా? అనే ప్రశ్న అందరిలోను తలెత్తుతోంది. బీజేపీ గెలుపుకు మోదీకారణం అయితే ఒకవేళ కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే బీజేపీ ఓటమికి కూడా మోదీనే బాధ్యత వహిస్తారా? అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. అసలు ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఇరు పార్టీలు ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి బంధుఉవలకు టికెట ఇస్తు ప్రధాని మోదీ అవినీతి గురించి ఎలా మాట్లాడతారని కూడా విమర్శలు వస్తున్న నేపత్యంలో హాట్ హాట్ గా కన్నడ రాజకీయాల నేపథ్యంలో గెలుపు వరించే అవకాశాలు ఎవరికున్నాయి? కన్నడ పీఠం ఎవరికి దక్కేను? అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ గారి విశ్లేషణ..

20:33 - May 4, 2018

అయ్యో నీ వానలు సల్లగుండగదరా..? ఏం వానలు అవ్వి ఏట్లె వానలు.. వడగండ్ల వానలు జనంతోని మూడో ప్రపంచయుద్దం జేశినట్టే ఉన్నది.. ముఖ్యంగ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పొంటి ఆగమాగం జేశింది వడగండ్ల వాన.. హైద్రావాదుల భూకంపం బుట్టిస్తాని కేసీఆర్ జెప్తె.. భూకంపం బదులు వడగండ్ల వాన మోపైంది.. మొత్తానికి జనం బత్కు సత్రోలైందనే చెప్పవల్సుంటది..

ఊరంత ఒకటుంటే ఊసుగండ్లోనికి ఇంకొకటన్నట్టు.. లోకమంతనేమో వడగండ్ల వానొచ్చి ఆగమైతిమిగదరా అని లొల్లివెడ్తుంటే.. ఒకతాన టీఆర్ఎసోళ్లు, బీజేపోళ్లు ఫ్లెక్సీలు గట్టిండ్రు.. జనాన్ని ఉద్దరిచ్చె ఫ్లెక్సీలు గావు మళ్ల.. వాళ్ల భూములు జాగలు అమ్మి లోకాన్ని ఉద్దరిస్తున్నమన్న కలరింగిచ్చె కటౌట్లు వెట్టిండ్రు పాండ్రి సూపెడ్త దాని యవ్వారమేందో..

ఎన్డీయేకు చంద్రబాబుకు విడాకులు ఎందుకైనయో తెల్సా..? ముఖ్యమంత్రి చంద్రబాబే బీజేపీకి మిత్రద్రోహం జేశిండట.. అందుకే టీడీపీ ఎన్డీయే నుంచి బైటికొచ్చిందట.. ఈమాట ఎవ్వలో బైటి మన్షి అన్నది గాదు.. కుద్దు చంద్రాలు కింద పనిజేస్తున్న మంత్రి ఆదినారాయణ రెడ్డి జెప్పిన మాట.. పొరపాటునో గ్రహపాటునో మొత్తం మీద నిజం గక్కేశిండు మీడియా ముంగట..

కళ్యాణానికి ఒక్కడొస్తె.. కన్నమేస్తందుకు ఇంకొకడొచ్చినట్టు.. పాపం పేదలకు ఎన్కట భూములు వంచి అండ్ల బత్కుండ్రని అప్పటి పాలకులు జెప్తె.. ఇప్పటి పాలకులు ఉన్న భూమిని గద్దల పాలు జేస్తున్నరట.. మంత్రి కల్వకుంట్ల తారకరామారావుగారు ఎమ్మెల్యేగునన్న సిరిసిల్ల నియోజకవర్గం కథ ఇది.. జనం వచ్చి రెండు చేతులు జోడిచ్చి నీకు దండం బెడ్తం మమ్ముల మోసం జేయకుండ్రి అని చెప్తున్నరు..

విజయనగరం జిల్లా పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాల్టీలళ్ల సాఫ్ సఫాయి కార్మికులు బిచ్చమెత్తుకుంటున్నరు.. వీళ్లు బిచ్చమెత్తుకుంటున్నరంటే.. స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ నారా చంద్రాలుగారు , ఆయన మంత్రి నారాయణ వారు శిగ్గుతోని తల్కాయ దించుకోవాలె గదా..? వాళ్లకు ఆపాటి శరం ఏముండదిగని.. మరి వీళ్ల బిచ్చం సంగతేందో సూద్దాం పాండ్రి..

ఇంకో రెండు నెలలళ్ల ప్రతి గుడ్సెకు.. ప్రతి గూడానికి.. ప్రతి పల్లెకు మంచి నీళ్లు తాపియ్యబోతున్నం.. ఇప్పటికే మిషన్ కాకతీయతోని చెర్వులన్ని చెలచెల మెరుస్తున్నయ్.. అని ఒకతాన ముచ్చట జెప్పుకొచ్చింది మెదక్ ఎమ్మెల్యే పద్మమ్మ.. అమ్మగారు అటు ముచ్చట జెప్తుంటే.. ఇంకో దిక్కు తాగునీళ్ల కోసం తక్లీవు వడ్తున్న ఆడోళ్లు బిందెలు వట్కోని రొడ్డెక్కిండ్రు..

అయ్యా కర్నూలు కలెక్టర్ గారు.. మీరు పనిజేస్తున్నరా నిద్రవోతున్నరా..? రైతుకు నష్టపరిహారం ఇయ్యాల్నంటే మీ కింది అధికారులకు లంచం ఇయ్యాల్నంటగదా..? మీ జిల్లాలున్న పాణ్యం మండలం తమ్మరాజు పల్లెకాడ సర్వేయరుగారు యాభైవేల రూపాలు ఇస్తెనే నీకు పరిహారం వచ్చెతట్టు జేస్తాని డిమాండు జేస్తున్నరట.. మరి మీకు గూడ చాలసార్లు చెప్పుకుంటె మీరు పట్టిచ్చుకుంటలేరటగదా..? ఇను రైతు గోస..

నెత్తెంటికెలు బెత్తడు వెర్గితెనే శిటశిటాంటది.. ఎప్పుడు ఉర్కుదామా మంగలాయితానికి ఎప్పుడు కటింగు జేపిచ్చుకుందామా అని సూస్తరు.. కని కొంతమంది ఉంటరు జుట్టు వెంచెటోళ్లు గూడ.. కని గుజరాత్ రాష్ట్రంల నెత్తికి రుమాలు జుట్టుకునుడు బంజేశి.. నెత్తికి ఎంటికెలే సుట్టుకుంటున్నడు ఒక పెద్దమన్షి.. పదిహేను మీటర్ల పొడ్గు సూడుండ్రి..

ఛగన్ భుజబల్ కు బెయిల్ మంజూరు..

మహారాష్ట్ర : ఎన్ సీపీ సీనియర్ నేత ఛగన్ భుజబల్ కు బాంబే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మహారాష్ట్ర సదన్ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో 2016లో మార్చి 14న ఛగన్ భుజబల్ అరెస్ట్ అయ్యాడు. రూ.5లక్షల పూచీకత్తుతో ఛగన్ ను బాంబే కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. 

సంక్షేమ పథకాల తీరుపై చంద్రబాబు సమీక్ష..

అమరావతి: సంక్షేమ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాలతోపాటు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని, సమస్య పరిష్కారం తర్వాత ఫోన్ చేస్తున్నామని సీఎం వివరించారు. కాంప్రెహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం బాగుందని, భూధార్ పనితీరును అంచనా వేస్తున్నామని, భూములన్నీ ప్రభుత్వ నియంత్రణలోకి వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు.

19:44 - May 4, 2018

దేశవ్యాప్తంగా మహిళలపై, యువతులపై, చిన్నారులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆడపుట్టుకకు భద్రత అనేది లేకుండా పోతున్న దుస్ధితి, దుర్మార్గపు పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. చట్టాలు వున్నా నేరాల సంఖ్య మాత్రం తగ్గకపోగా పెరుగుతునే వుంది. ఉన్నావో, కథువా, దాచేపల్లి వంటి ఘటనలు ఆడపుట్టుకకు భద్రత వుందా? అనే భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చర్చను చేపట్టింది 10టీవీ..ఈ చర్చలో అడ్వకేట్ చంద్రగిరి రాధాకుమారి, తరుణి తరంగాలు జన్ రల్ సెక్రరటీ జోత్స్న, టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీత పాల్గొన్నారు. 

19:43 - May 4, 2018

హైదరాబాద్‌ : సీపీఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ కస్టమర్ల, ఏజెంట్స్‌ల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. హైదరాబాద్‌లోనూ అగ్రిగోల్డ్‌ బాధితులు ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు. బాధితులను ఆదుకుంటామని హోంమంత్రి నాయిని నర్సింహ్మ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి 8 రాష్ట్రాల్లో ఉన్న అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. 

19:41 - May 4, 2018

హైదరాబాద్ : నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల మధ్య ర్యాంకుల యుద్ధం చిలికి చిలికి గాలివానలా మారింది. ఎంసెట్, జేఈఈ ర్యాంకులు సాధించిన శ్రీచైతన్య విద్యార్థుల ర్యాంకులను నారాయణ కాలేజీకి వచ్చిన ర్యాంకులుగా పేపర్‌లో ప్రకటనలు ఇచ్చారని శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బిఎస్‌ రావు ఆరోపించారు. ఇప్పటి వరకు స్టాఫ్‌ని, విద్యార్ధులను తీసుకెళుతున్నా సైలెంట్‌గా వున్నామని.. చివరికి ఫలితాలను కూడా తమ కోటాలో వేసుకుని మీడియాలో చూపించడం దారుణమని శ్రీచైతన్య డైరెక్టర్ సుష్మా మండిపడ్డారు. మరోసారి ఇలా వ్యవహరిస్తే.. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

19:39 - May 4, 2018

హైదరాబాద్ : ఉద్యోగ సంఘాల నేతలతో తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఉద్యోగుల బదిలీలు, సీసీఎస్ రద్దు, కొత్త పీఆర్సీపై చర్చించింది. సెక్రటేరియట్‌లో మంత్రి ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఉద్యోగ సంఘాల నేతలతో సబ్‌కమిటీ చర్చలు జరిపింది. సానుకూలంగా చర్చలు జరిగాయని.. మరోసారి టీచర్లతో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు ఈటల తెలిపారు. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల నివేదికను సీఎం కేసీఆర్‌కు అందజేస్తామన్నారు. ఆదివారం సీఎం సమక్షంలో మరోసారి ఉద్యోగ సంఘాలతో భేటీయ అయ్య అవకాశం ఉందన్నారు. సబ్‌ కమిటీకి నాలుగేళ్ల నుంచి తాము ఎదుర్కొంటున్న సమస్యలన్నీ వివరించామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. మొత్తం 18 డిమాండ్లపై భేటీలో చర్చించామని... అన్నింటిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. 

19:36 - May 4, 2018

అమరావతి : మహిళలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం చొరవ చూపాలన్నారు ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి. అవసరమైన సందర్భాల్లో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేస్తే దాచేపల్లిలాంటి ఘటనలు పునరావృతం కావన్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయని.. 29 రాష్ట్రాల్లో ఏపీ ఆరో స్థానంలో ఉండడం గౌరవప్రదం కాదన్నారు. మహిళలపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు రఘువీరారెడ్డి. 

19:34 - May 4, 2018

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు చెబుతున్న ఫెడరల్‌ ఫ్రంట్‌.. దేశ రాజకీయాల్లో కొత్త చర్చను రేకిత్తిస్తోంది. ఇతర పార్టీల అధినేతలతో కేసీఆర్‌ వరుసబెట్టి భేటీలు నిర్వహించి ఈ ఫ్రంట్‌ పై చర్చలు జరుపుతున్నారు. కానీ దీనిపై రాజకీయ పార్టీల్లో, రాజకీయ పరిశీలకుల్లో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఫ్రంట్‌ ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని అందించనుంది.. ఇది కేవలం బీజేపీ, కాంగ్రేస్‌ రాజకీయ వ్యతిరేక కూటమిగానే ఉంటుందా... లేక కాంగ్రెస్‌ బీజేపీ విధానాలకు ప్రత్యామ్నాయ కూటమిగా ఉంటుందా అనే దానిపై రాజకీయ వర్గాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధింఛిన ప్రత్యేక స్టోరీని ఇప్పుడు చూద్దాం...

కేసీఆర్‌ వరుస భేటీలు..
దేశరాజకీయాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చను లేవనెత్తుతున్న కేసీఆర్‌ వరుస భేటీలతో బిజి బిజీగా గడుపుతున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌పై రాజకీయ పార్టీలు, పరిశీలకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం కాంగ్రెస్‌, బీజేపీ వ్యతిరేక కూటమిగా ఉంటే.. పెద్ద ప్రయోజనం ఉండదంటున్న రాజకీయ పరిశీలకులు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకొస్తేనే..అది దేశానికి మంచి చేయగలదని అభిప్రాయ పడుతున్న రాజకీయ పరిశీలకులు.

మరో అత్యాచార ఘటన..

పశ్చిమగోదావరి : చిన్నారులపై రోజురోజుకీ అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలో పెరిగిపోతున్నాయి. దేశాన్ని కదిలించే ఘటనలు కథువా, ఉన్నావోలో జరిగిన విషయం తెలిసిందే. గుంటూరులో తొమ్మిదేళ్ల చిన్నారిపై జరిగిన దారుణాన్ని ఇంకా మరచిపోకముందే మరోచోట ఐదేళ్ల చిన్నారిపై నలుగురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘోర ఘటన చోటుచేసుకుంది. తణుకు మండలం తేతలిలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై నలుగురు మైన్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావటంతో ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

టీడీపీలో చేరిన బీజేపీ నేత

అమరావతి : సీఎం చంద్రబాబు నివాసం చంద్రబాబుతో బీజేపీ నేత రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు. చంద్రబాబు సమక్షంలో రాఘురామ రాజు చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. రఘురామ కృష్ణరాజుకు కండువా కప్పి పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు.  

19:05 - May 4, 2018

తాను చేసే ప్రతి సినిమాలో తాను పోషించే ప్రతీ క్యారక్టర్ కి ప్రాణం పెట్టి పని చేసే అల్లు అర్జన్ నా పేరు సూర్య కోసం మేకోవర్ అయిన విధానంతోనే ఈ సినిమా టాక్ ఆప్ ఇండస్ట్రీగా నిలిచింది. ఆర్మీ బ్యాక్ డ్రాప్, పేట్రియాట్రిక్ టచ్ ఉన్నాయని జరిగిన ప్రచారంతో ఈ సినిమా పై అందరిలో ఆసక్తి విపరీతంగా పెరిగింది. అలా భారీ అంచనాల నడుమ స్టైలీష్ స్టార్ అల్లూ అర్జన్, బ్లాక్ బాస్టర్ స్టోరీ రైటర్ వక్కంతం వంశీల కలయికలో రూపొందిన నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియ. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అంతలా అంచనాలు రేకెత్తించిన అల్లూ అర్జున్ సూర్యగా సూపర్ అనిపించాడా...? వక్కంతం వంశీకి ఇది డ్రీమ్ డెభ్యూ మూవీగా నిలిచిందా..? ప్రొడ్యూసర్స్ కి కాసుల పంట పండించిందా లేదా..లాంటి విషయాలు ఇప్పుడు చూద్దాం..

కథ విషయానికి వస్తే.. ఆర్మీలో సోల్జర్ గా ఉంటూ.. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆర్మీ నుండి సస్పెండ్ అయ్యే పరిస్థితికి వస్తాడు సూర్య.. అయితే మాజీ ఆర్మీ ఆఫీసర్ అయిన తన గాడ్ ఫాదర్... కల్నల్ ను కన్విన్స్ చేయడంతో.. అతను ప్రముఖ సైకియార్టిస్ట్ అయిన రామ కృష్ణ రాజు సర్టిఫికేషన్ తీసుకుని రమ్మంటాడు.. అతడి దగ్గరకి వెళ్ళిన సూర్యాకి రామకృష్ణ రాజు 21 రోజులు టెస్ట్ లు పెడతాడు,ఆ టెస్ట్ ల్లో సూర్యా పాస్ అయ్యాడా లేదా. తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడా లేదా. తిరిగి ఆర్మీలో రీజాయిన్ అవ్వాలని బోర్డర్ కెల్లాలనే తన కల నెరవేరిందా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే..

నటీనటుల విషయానికి వస్తే..ఈ సినిమాకు ది బెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఎసెట్ అల్లు అర్జున్ హీరోగా నటించడం. తాను ఏ క్యారక్టర్ చేసినా, ఆక్యారక్టర్ లో జీవించడం కోసం తనని తాను పూర్తిగా మార్చుకుని ఎంత కష్టానైన ఇస్టంగా భావించే బన్నీ.. సోల్జర్ రోల్ కోసం, తన బాడీ దగ్గర నుండి స్టైలింగ్ వరకు పూర్తిగా ట్రాన్స్ ఫామ్ అయిపోయాడు. కిల్లర్ బేసెప్స్ తో ఆర్మీ కట్టింగ్ తో సోల్జర్ బాడీ లాంగ్వేజ్ తో సినిమాకు మేజర్ ప్లస్ పాంయింట్ గా నిలిచాడు.. సూర్య క్యార్టర్ ను అతను ఓన్ చేసుకున్న విధానం.. ఆశ్చర్యపరుస్తుంది.. ఫైట్స్ లో కూడా చెలరేగిపోయాడు బన్నీ.. కాని బన్నీ నుండి అందరూ ఎక్స్ పెక్ట్ చేసే డాన్స్ ల విషయంలో డిస్సపాయింట్ చేశాడు,, ఇరగా ఇరగా సాంగ్ లో కూడా మమా అనిపించే స్టెప్స్ తో సరిపెట్టాడు.. లవర్ ఆల్ సో.. ఫైటర్ ఆల్ సో సాంగ్ లో క్యాప్ ట్రిక్స్ మాత్రం బాగున్నాయి.. ఎమోషనల్ సీన్స్ లో మెచ్యూరిటీ చూపించిన బన్నీ సీన్ కంటెన్ట్ లో డెప్త్ లేకపోవడంతో అవి అంతలా కనెక్ట్ కాలేదు,, హీరోయిన్ అనూ ఇమ్మాన్యూయెల్ యాక్టింగ్ పరంగా లిమెటెడ్ స్కొప్ ఉన్న క్యారక్టర్ లో నాచ్యూరల్ పర్ఫామెన్స్ ఇచ్చింది.. ఆమె లుక్స్ బాగున్నాయి.. ఇక అల్లు అర్జున్ తరువాత సినిమాకు మరో్ మెయిన్ పిల్లర్ గా నిలిచాడు సీనియర్ అర్జున్. అల్లు అర్జున్ ఫాదర్ క్యారక్టర్ లో.. సైకాలజీ ఫ్రోఫిసర్ గా సటిల్ పర్ఫామెన్స్ తో అలరించాడు. అర్జున్ చేయడం వల్లే ఆ క్యారక్టర్ కి.. సినిమాకు..అంత వెయిట్ వచ్చింది.. ఈ వయస్సులో కూడా స్టైలింగ్ పరంగా స్క్రీన్ ప్రజన్స్ పరంగా చాలా కేర్ తీసుకున్నాడు,, కొన్ని కొన్ని ఎక్స్ ప్రషన్స్ అర్జున్ ఎలాంటి యాక్టరో మరోసారి గుర్తు చేశాయి.. నదియా పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ గాని ఇంపాక్ట్ గాని లేదు.. జస్ట్ స్టార్ కాస్ట్ కోసం యాడ్ చేసినట్టుంది.. ఇక విలన్ క్యారక్టర్ లో కనిపించిన శరత్ కుమార్ చేసిన చల్లా పాత్ర రొటీన్ కమర్షియల్ ఫార్మట్ విలన్ లానే కనిపించింది.. ఆ క్యారక్టర్ వరకూ ఎలాంటి స్పెషాలిటీ లేదు.. వెన్నెల కిషోర్ ఉన్నంత సేపు తన మార్క్ మెనరిజమ్స్ తో.. సింపుల్ పంచ్ డైలాగ్స్ తో ఉన్నంత సేపు నవ్వులు పూయించాడు.. పోసాని, ప్రదీప్ రావత్, రావు రమేష్, బోమన్ ఇరాని, సాయి కుమార్, అనూక్ సింగ్ ఠాకూర్, అంతా కూడా క్యారక్టర్స్ పరిది మేరా.. పర్ఫామెన్స్ ఇస్తూ.. సినిమాకు ప్లస్ అయ్యారు...
 

టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. కిక్, రేసుగుర్రం, టెంపర్ వంటి బ్లక్ బస్టర్ సినిమాలకు కథ అందించిన వక్కంతం వంశీ, ఈసినిమాకు ఎన్నుకున్న యాంగర్ మేనేజ్ మెంట్ అనే సెంట్రల్ పాయింట్ బాగుంది. ఆర్మీ బ్యాగ్ డ్రాప్ ఆడ్ చేస్తూ. దాన్నివిస్తరించిని విధానం కూడా బాగుంది.. కాకపోతే ఆర్మీకి ఉండే రూల్స్ ను కొన్ని లాజిక్స్ ని కమర్షియల్ వైబులిటీ కోసం పూర్తిగా పక్కన పెట్టేశాడు.. ముఖ్యంగా సూర్య పోలీసులను కొట్టడం.. అతను కొన్నిచోట్ల వాడిన వల్గర్ ల్యాంగ్ వేజ్... బోర్డర్ ను లింక్ చేస్తూ నడిపించిన డబుల్ మీనింగ్ డైలాగ్ సీన్ వంటివి.. సినిమా స్థాయిని తగ్గించాయి. మంచి కథకు కొన్ని అనవసరమైన కొనసాగింపులు ఎక్కువ కమర్షియల్ అంశాల టచ్చప్ వల్ల, ఇంపాక్ట్ తగ్గింది.క్లైమాక్స్అయిపోయిన తరువాత కొనసాగింపు గా వచ్చిన అన్వర్ సీన్ఎలివేట్ కాలేదు. డైలాగ్స్ పరంగా తన మార్క్ చూపించ గలిగాడు వంశీ. డైరక్టర్ గా మొదటి సినిమా అయినప్పటికి.. చాలా బాగా హ్యాండిల్ చేశాడు, టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ ఎడిషన్ వంశీకి ప్లస్ అయ్యింది.. మొదటి సినిమా కాబట్టి డైరక్టర్ గా చాలా వరకూ సక్సెస్ అయినట్టే..ఈ సినిమాకు హైలెట్స్ గా నిలిచిన యాక్షన్ కంపోజర్స్ రామ్ లక్ష్మన్ కు స్పెషల్ క్రెడిట్ ఇవ్వాలి ఆ రేంజ్ లో ఫైట్స్ కంపోజ్ చేశారు..ఇక కెమేరా మెన్ రాజీవ్ రవి. ఈ సినిమాలో తన మ్యాజిక్ చూపించాడు. సినిమాలో ప్రతి ఫ్రేమ్ ను రిచ్ గా, ఎట్రాక్టీవ్ గా, మలచడంలో చాలా స్పెషల్ కేర్ తీసుకున్నాడు.. అతను వాడిన కలర్ గ్రేడింగ్ టింట్ మూవీకి.. క్లాస్ లుక్ తెచ్చాయి.. బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్స్ అయిన విశాల్,శేఖర్ ఈ సినిమాలో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వలేదు అనిపిస్తుంది. రెండు పాటలు నాలుగైదు సీన్లు, ఆర్ ఆర్ తప్ప, మిగిలిన మ్యూజిక్ అంతా నార్మల్ స్టాండెడ్స్ లో ఉంది.. సూర్య క్యారక్టర్ కి ఇచ్చిన సిగ్నేచర్ ఆర్ ఆర్ బాగుంది.. గౌతమ్ రాజు ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది.. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమా స్ధాయిని పెంచాయి..

ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే. మచ్ ఎవేటెడ్ మూవీ ఆఫ్ సమ్మర్ గా వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ముందు నుండి చెపుతున్నట్టు.. పేట్రియాట్రిక్ కంటెంట్ తో ఉన్నప్పటికీ మిగితా కమర్షియల్ ఎలిమెంట్స్ గుమ్మరించడం వలన దాని ప్రత్యేకత నిలుపుకోలేక పోయింది. అయితే సెంట్రల్ పాయింట్, అల్లూ అర్జున్ పర్ఫామెన్స్, ఫైట్స్ , డైలాగ్స్ వల్ల అన్నీ సెంటర్స్ లోనూ సర్వేవ్ అయ్యే కంటెంట్ తో థియేటర్స్ లోకి వచ్చింది. కమర్షియల్ గా ఈ సినిమా ఏ స్థాయి విజయం అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే...

ప్లస్ పాయింట్స్

అల్లు అర్జున్ మేకోవర్

సెంట్రల్ స్టోరీ

ఫైట్స్, డైలాగ్స్

సినిమాటోగ్రాఫీ

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్

ఇంపాక్ట్ లేని ఆర్మీ బ్యాక్ డ్రాప్

ఫస్ట్ ఆఫ్ గ్రాఫ్

సెంకండ్ ఆఫ్ లాగ్స్..

ఎలివేట్ కాని ఎమోషన్స్

రెంజ్ తగ్గిన మ్యూజిక్

అరాచక శక్తులతో బీజేపీ కుమ్మక్కు : వర్ల

అమరావతి : అధికారం కోసం బీజేపీ అరాచక శక్తులతో జతకడుతోందని టీడీపీ నేత, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. అవినీతి పరులకు బీజేపీ స్నేహ హస్తం అందిస్తోందన్నారు. సమాజంలో మోసగాళ్లుగా రిజిస్టరైన ముద్దాయిలతో బీజేపీ కుమ్మక్కయి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని వర్ల విమర్శించారు. జనసేన, వైసీపీకి బీజేపీ మద్దతుదారులు, రాజకీయ సలహాదారులేనన్నారు. ఎవరు ఎన్ని చేసిన జగన్ ను కేసుల నుండి తప్పించలేరన్నారు. విజయసాయి వ్యాఖ్యలు విచాక్షణారహితమన్నారు.  

జీఎస్టీ కౌన్సిల్ కు యనమల లేఖ..

అమరావతి : జీఎస్టీ కౌన్సిఃల చైర్మన్ అరుణ్ జైట్లీకి ఏపీ ఆర్థికశాఖా మంత్రి యనమల లేఖ రాశారు. చక్కెరపై కేంద్ర ప్రభుత్వం కేజీకి రూ.3 సెస్ చేయడాన్ని వ్యతిరేకిస్తు యనమల లేఖ రాశారు. చక్కెరపై కేంద్ర ప్రభుత్వం కేజీకి రూ.3 సెస్ వేయటం వల్ల సామాన్యుడిపై భారం పడుతుందని లేఖ తెలిపారు. చక్కెరపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.250 కోట్లు భారం భరిస్తోందనీ..కేంద్ర వేసే సెస్ వల్ల జీఎస్టీ విధానలకు వ్యతిరేకమని లేఖలో యనమల పేర్కొన్నట్లుగా తెలిపారు. 

బీజేపీ నుండి టీడీపీలోకి

అమరావతి : సీఎం చంద్రబాబు నివాసానికి బీజేపీ నేత రఘురామ కృష్ణరాజు చేరుకున్నారు. మరికాసేపట్లో రాఘురామ రాజు చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరనున్నారు. 

ఫిలింఛాంబర్ లో దాసరి విగ్రహావిష్కరణ..

హైదరాబాద్: ఫిలిం ఛాంబర్ లో దర్శకరత్న దాసరి నారాయణ రావు విగ్రహాన్ని సినీ ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దాసరి కుమారుడు దాసరి అరుణ్, మంత్రి తలసాని, అల్లు అరవింద్, సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, టీడీపీ ఎంపీ, నటుడు, నిర్మాత మురళీమోహన్, ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ పలువురు ప్రముఖులు హాజరయ్యారు.  

నష్టాల్లో ఆర్టీసీ : చైర్మన్

హైదరాబాద్ : ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో నడుస్తోందని చైర్మన్ సోమారపు సత్యనారాయణ తెలిపారు. నష్టాల్లో వున్న ఆర్టీసీ ఖర్చులు తగ్గించుకోవటం కోసం కలిసి వచ్చే అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని తెలిపారు. ఆర్టీసీలో 5 మెగా వాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేయడానికి ఎంవోయూతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. అలాగే అన్ని డిపోల్లోను ఎల్ఈడీ బల్బులను వినియోగిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని ఆర్టీసీ డస్ డిపోల్లోను సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

ప్రజలకు సేవ చేసేందుకు కోసమే రాజకీయాల్లోకి : సాయికుమార్

కర్ణాటక : ప్రజలకు సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని నటుడు సాయికుమార్ 10టీవీకి తెలిపారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ తనకు స్ఫూర్తి అన్నారు. తనను గెలిపిస్తే బాగేపల్లిని భాగ్యనగరంగా మారుస్తానని వాగ్ధానం చేశారు. ప్రజలకు మంచి చేయాలన్నదే తన లక్ష్యమనీ..మంచి సేవకుడిగా పేరు తెచ్చుకుంటానని ధీమా వ్యక్తంచేశారు. గతంలో కొన్ని తప్పులు జరిగాయనీ..వాటిని సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారు. రాజకీయాల్లో మాకంటే గొప్ప నటులు వున్నారనీ..రాష్ట్రంలో హంగ్ వచ్చేపరిస్థితి లేదని గెలుపు మాదేనని ధీమా వ్యక్తంచేశారు.

అవినీతి అధికారులకు మెమోలు జారీ..

హైదరాబాద్ : అవినీతి అధికారులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చర్యలకు ఆదేశించారు. ఆరుగురు ఈవోలకు మంత్రి చార్జ్ మెమోలను జారీచేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ సిబ్బంది, అధికారులపై 2 నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. జూన్ 1 నుండి మర్ని ఆలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 

ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం : ఈటల

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగ సంఘాలతో మంత్రి ఈటల ఆధ్వర్యంలో జరిగన ఉపసంఘం భేటీ ముగిసింది. 18 డిమాండ్లపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించిందినట్లుగా సమాచారం. భేటీ అనంతరం మంత్రి ఈటల మాట్లాడుతు..ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి ఉద్యోగులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారన్నారు. ఇప్పటి వరకూ ఉద్యోగులను పూర్తిస్థాయిలో ఆదుకున్నామన్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఉపాధ్యా సంఘాలతో మరోసారి చర్చిస్తామన్నారు. ఉద్యోగ సంఘాల చర్చలపై రేపు సీఎం కేసీఆర్ కు నివేదికను అందిస్తామని మంత్రి తెలిపారు.

ముగిసిన ఉప సంఘం భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగ సంఘాలతో మంత్రి ఈటల ఆధ్వర్యంలో జరిగన ఉపసంఘం భేటీ ముగిసింది. 18 డిమాండ్లపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించిందని ఉగ్యోగ సంఘ నేతలు తెలిపారు.జూన్ 2లోగా ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణ తీసుకురావాలని ఉద్యోగ సంఘాల నేతలు కమిటీని కోరారు. హెల్త్ స్కీమ్ ను కొందరు అధికారులు నిర్లక్ష్యం చేశారనీ...తక్షణం పీఆర్సీ నియమించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశారు. ఈ భేటీలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులతో మంత్రులు ఈటల,కేటీఆర్, జగదీష్ రెడ్డిలు పాల్గొన్నారు. 

పూర్తయిన రేపిస్ట్ సుబ్బయ్య పోస్ట్ మార్టం..

గుంటూరు : రేపిస్ట్ సుబ్బయ్య మృతదేహానికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయ్యింది. కాగా మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సంబంధిత బంధువులెవ్వరు తీసుకునేందుకు ముందుకు రాని కారణంగా గురజాల పంచాయితీ కార్యాలయానికి సుబ్బయ్య మృతదేహాన్ని అప్పగించే యోచనలో వున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బాధితురాలి బంధువులు సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించాలనీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాన్వాయిని అడ్డుకున్నారు. రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై సంతృప్తి చెందని బాధితురాలి బంధువులు ఎక్స్ గ్రేషియాను పెంచాలని హోంమంత్రిని డిమాండ్ చేశారు. 

17:40 - May 4, 2018

నాగర్‌కర్నూల్ : రెండు మతాల మధ్య వివాదంలో పక్షపాత ధోరణితో వ్యవహరించారనే ఆరోపణలపై కల్వకుర్తి సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ రాఘవేంద్ర రెడ్డిని సస్పెండ్‌ చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో మార్చి 27న జరిగిన ఒక సంఘటన రెండు మతాల మధ్య చిచ్చు పెట్టింది. దీనిపై సీఐ, ఎస్‌ఐ మితిమీరి ప్రవర్తించారని, బెయిల్‌ విషయంలో కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించారని పోలీసు ఉన్నతాధికారులకు, హోంశాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయంపై సమగ్రంగా విచారించిన ఉన్నతాధికారులు, సీఐ శ్రీనివాసరావును, ఎస్‌ఐ రాఘవేంద్ర రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.  

17:37 - May 4, 2018

వరంగల్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేశారు. 20 రోజులుగా తిరుగుతున్నా అధికారులు, చైర్మన్‌ పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. 

17:34 - May 4, 2018

గుంటూరు : దాచేపల్లిలో అత్యాచార బాధితురాలిని వైసీపీ ఎమ్మెల్యే రోజా పరామర్శించారు. ఏపీలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. అనంతరం బాధితురాలికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులు రోడ్డుపై బైఠాయించిన రోజాతోపాటు పలువురు వైసీపీ మహిళానేతలు, నాయకులను అరెస్ట్‌ చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.

17:30 - May 4, 2018

యాదాద్రి భువనగిరి: ఎంపీ బూర నరసయ్య గౌడ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిలను రైతులు అడ్డుకున్నారు. యాదాద్రి భువనగిరి మార్కెట్ యార్ట్ లో గత 20 రోజుల నుండి ఆందోళన చేస్తున్న రైతులు ఈరోజు ఎంపీ, ఎమ్మెల్యే మార్కెట్ యార్డ్ కు రాగానే వారిని లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. తడిసినధాన్యాన్ని ప్రభుత్వం తగిన ధరకు కొనాలని రైతులు డిమాండ్ చేశారు. వారంరోజులగా మార్కెట్ కు ధాన్యం వచ్చినా కొనుగోలు చేయటంలేదని వెంటనే ధాన్యాన్ని కొనాలని రైతులు డిమాండ్ చేశారు. కాగా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో రైతులను ఆదుకుంటామని మాట ఇచ్చిన ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని రైతులు ఎంపీ, ఎమ్మెల్యేలను అడ్డుకుని డిమాండ్ చేశారు.

17:21 - May 4, 2018

గుంటూరు : రేపిస్ట్ సుబ్బయ్య మృతదేహానికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయ్యింది. కాగా మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సంబంధిత బంధువులెవ్వరు తీసుకునేందుకు ముందుకు రాని కారణంగా గురజాల పంచాయితీ కార్యాలయానికి సుబ్బయ్య మృతదేహాన్ని అప్పగించే యోచనలో వున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బాధితురాలి బంధువులు సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించాలనీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాన్వాయిని అడ్డుకున్నారు. రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై సంతృప్తి చెందని బాధితురాలి బంధువులు ఎక్స్ గ్రేషియాను పెంచాలని హోంమంత్రిని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ కూడా తన స్వంతంగా రెండు లక్షలు ప్రకటించారు. అయినా ఎక్స్ గ్రేషియాను పెంచాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

సుబ్బయ్య ఆత్మహత్యపై అనుమానాలు..
గురజాల మండలం దైద దగ్గర చెట్టుకు దాచేపల్లి పల్లి రేపిస్ట్ సుబ్బయ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఇది ఆత్మహత్యా? లేక ఎవరైనా చంపి చెట్టుకు ఉరివేశారా? అనే అనుమానాలు తలెత్తున్నాయి. అమరలింగేశ్వర స్వామి ఆలయం వద్ద సుబ్బయ్య మృతదేహాన్ని గుర్తించారు. ఆత్మహత్యకు ముందు చివరిసారిగా బంధువుకి సుబ్బయ్య ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోన్ కాల్ లో నాకు బతకాలని లేదనీ..తన ఖర్మకాలి ఈ పాపపు పనికి ఒడిగట్టానని తాను చేసిన పనికి తన కుమారుడి పరువు పోయిందని వాపోయాడు.పదిమందికి మంచి మాటలు చెప్పి బతికేవాణ్ణని కానీ ఇటువంటిపనికి ఒడిగట్టానని కుమారుడికి చేసిన ఫోన్ లో నిందితుడు సుబ్బయ్య మాట్లాడినట్లుగా తెలుస్తోంది. 

మహిళలు సిగ్గుపడేలా రోజా వ్యవహారం : అనురాధ

అమరావతి : దాచేపల్లి ఘటనలను వైసీపీ రాజకీయం చేస్తోందనీ టీడీపీ అధికార ప్రతినిథి పంచమర్తి అనురాధ విమర్శించారు. రోజా, వాసిరెడ్డి పద్మ నోటి ఏది వస్తే అది మాట్లాడుతున్నారనీ..రోజా వ్యవహారం, మాటతీరు మహిళలు సిగ్గుపడేలా వున్నాయని ఎద్దేవా చేశారు. నిందితుడి తమ్ముడి కుమారుడు వైసీపీకి చెందిన వ్యక్తి అనీ..దీనికి వైసీపీ ఏం సమాధానం చెప్తుందని అనురాధ ప్రశ్నించారు. బాధితురాలి కటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందని అనురాధ తెలిపారు. 

కొండచరియలు విరిగిపడి 14మంది మృతి..

ఢిల్లీ : గనుల తవ్వకాలు జరిగిన ప్రాంతంలో పైభాగంలో ఉన్న కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి చెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. మరికొంతమంది మిస్ అయ్యారు. అదృశ్యమైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయాలైనవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఉత్తర మయన్మార్‌లోని జేడ్ మైనింగ్ ప్రాంతంలో ఈ ఘటనలో చోటుచేసుకుంది

16:46 - May 4, 2018

ప్రేమ పెళ్లిళ్లు అంటే చాలామంది ఇష్టపడరు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. ఆఖరికి స్వంత బిడ్డలను చంపుకునేందుకు కూడా వెనుకాడరు. అది వారి పరువుకు సంబంధించిన విషయంగా భావిస్తారు. లేదా అంతస్థులకు సంబంధించిన విషయంగా భావిస్తారు. కానీ ఓ ఊరు ప్రేమ వివాహాలను నిషేదించేలా నిర్ణయం తీసుకుంది. మరి దానికి కారణమేంటి. అటువంటి పరిస్థితులు ఎందుకొచ్చాయి? అనే విషయాలను తెలుసుకుందాం..

ప్రేమ పెళ్లిళ్లు నిషేధిస్తున్న గ్రామం..
ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే వారిని గ్రామం నుంచి బహిష్కరించేందుకు పంజాబ్‌లోని లుథియానా జిల్లా చాంకోయిన్‌ ఖుర్ద్‌ అనే గ్రామంలో పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న జంటలపై సామాజిక బహిష్కరణ వేటు వేస్తామని, అలాగే వారితో ఎవరూ మాట్లాడకూడదని పంచాయతీ సభ్యుడు ప్రకటన చేశాడు. దీనికి ఊరు మొత్తం కట్టుబడి ఉండాలని నిర్ణయించుకుంది.

ప్రేమ వివాహాల నిషేదానికి కారణమేమిటి?
ఊరిలోని వారు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ బలమైన కారణం ఉంది. గత నెల 29న ఓ జంట కులాంతర వివాహం చేసుకోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు చేసుకుంటోన్న ఘటనలపై గ్రామ పంచాయతీలో చర్చించి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

నిషేధిస్తే చర్యలంటున్న అధికారులు..
ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఇటువంటి చర్యలు సరైనవి కావని, ఒక వేళ ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిని బహిష్కరిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలోనూ పలు గ్రామాల్లో పంచాయతి పెద్దలు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటువంటి నిర్ణయాలు, తీర్పులు చట్టబద్ధంగా చెల్లవని అధికారులు చెబుతున్నారు.

చైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో విభేదాలు..

హైదరాబాద్ : ఎంసెట్ ర్యాంకుల విషయంలో చైతన్య, నారాయణ విద్యాసంస్థల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపత్యంలో ఇకనుండి నారాయణ, చైతన్య విద్యాసంస్థలు కలిసి పనిచేయబోవటంలేదనీ..నారాయణ, శ్రీచైతన్యప్రారంభించిన శార్వాణి గ్రూప్ ఇకపై ఉండదని శ్రీచైతన్య డైరెక్టర్, చైర్మన్ సుష్మ,బీఎస్ రావు తెలిపారు. ఏపీ ఎంసెట్ టాప్ ర్యాంక్ తనదేనని నారాయణ గ్రూపు తప్పుగా ప్రచారం చేస్తోందని దీంతో నారాయణపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. 

రేపిస్ట్ సుబ్బయ్య మృతిపై అనుమానాలు..

గుంటూరు : దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచారం జరిపిన ఘటనలో నిందితుడు రామ సుబ్బయ్య.. గురజాల మండలం దైద అమరలింగేశ్వర ఆలయం వద్ద చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు సుబ్బయ్యేనని హోంమంత్రి చినరాజప్ప ప్రకటన చేశారు. అయితే, సుబ్బయ్య మృతిపై ఆయన బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయనను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అంటున్నారు.

16:10 - May 4, 2018
16:09 - May 4, 2018

యాదాద్రి భువనగిరి : మోత్కూర్‌లో జరుగుతున్న ఓపెన్‌ డిగ్రీ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్ జోరుగా సాగుతుంది. మోత్కూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో విద్యార్థుల నుండి డబ్బులు వసూళ్లు చేస్తూ.. ఇన్విజిలేటర్లు మాస్‌ కాపీయింగ్‌కు సహకరిస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి 2 వేల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. 

16:03 - May 4, 2018

భద్రాద్రి : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చేపల పంపిణీ పథకం అభాసు పాలవుతుంది... మితిమీరిన రాజకీయ జోక్యం.. నేతల స్వార్థ ప్రయోజనాల ఫలితంగా.. మత్స్యకారులు రెండేసి వర్గాలుగా చీలిపోయారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. కోర్టు మెట్లూ ఎక్కడంతో.. చేపల వేట నిలిచిపోయింది. సకాలంలో వేటాడని కారణంగా.. చేపలు నీటిలోనే చనిపోతున్నాయి. దీంతో ప్రభుత్వ పథకం.. ఎవరికీ కొరకాకుండా పోతోంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేప పిల్లల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపపిల్లల పంపిణీ పథకం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అబాసుపాలవుతోంది. రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కారణంగా.. వేట నిలిచి.. చేపలు చనిపోతున్నాయి. దీంతో మత్స్యసంపద సృష్టించి బెస్తలను ధనికులను చేయాలన్న ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్‌ మండలం సింగభూపాలెం ప్రాజెక్టులో.. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్.. సుమారు 7.2 లక్షల చేపపిల్లలను వదిలారు. పాతవి కొత్తవి కలిపి.. చెరువు మొత్తం చేపలతో కళకళలాడాయి. దీంతో.. ఈసారి చేపల వేట ద్వారా భారీగానే డబ్బు సంపాదించవచ్చన్న ఆనందంలో మత్స్యకారులున్నారు. కానీ.. వారి ఆశలపై.. రాజకీయ నాయకుల స్వార్థం నీరుజల్లింది.

ట్రైబల్‌ ఏరియా పేరిట 190 మంది కొత్త వారికి సొసైటీలో చోటు
సింగభూపాలెం చెరువులో 54 సంవత్సరాలుగా సుమారు రెండు వందల మంది మత్స్యకారులు ఒక సొసైటీగా ఏర్పడి చేపలను పెంచేవారు. చేపలు పెంచడానికి అయ్యే ఖర్చునూ సొసైటీయే భరించేది. చేపలు పట్టి అమ్మగా వచ్చిన డబ్బును సొసైటీ సభ్యులందరూ సమంగా పంచుకునేవారు. అయితే ఈ సంవత్సరం.. స్థానిక సర్పంచ్‌, ఎమ్మెల్యే సమకారంతో చేసిన ఓ పని వల్ల.. అసలుకే మోసం వచ్చింది. ట్రైబల్‌ ఏరియా పేరిట 190 మంది సభ్యులను ఈ సొసైటీలోకి చేర్చి.. వారికీ ఈ సంవత్సరం నుంచే చేపల వేటకు అనుమతించారు. దీన్ని పాతసభ్యులు అభ్యంతర పెట్టారు.

ఎండలకు నీరు వేడెక్కి, ఆక్సిజన్‌ కొరతతో వందల సంఖ్యలో చేపలు మృతి
ప్రతి సంవత్సరం మార్చ్‌ నుంచి మే నెల కాలంలో చేపలు పట్టడం ఆనవాయితీ. పాత,కొత్త సభ్యుల మధ్య పోరుతో.. చేపలవేట నిలిచిపోయింది. దీంతో చెరువులో నీరుతగ్గి, ఎండలకు నీరు వేడెక్కి , చేపలకు ఆక్సిజన్‌ అందక ప్రతి రోజు వందల సంఖ్యలో చేపలు చనిపోతున్నాయి. ఎవరికీ ఉపయోగపడకుండా చనిపోతున్న చేపలను చూసి మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. చేపలు వృథాగా చనిపోతుండడాన్ని భరించలేక, తమకు చేపలు పట్టే అనుమతి ఇవ్వాలని, సొసైటీ పాతసభ్యులు అధికారులను కోరారు. అయితే.. వ్యవహారం కోర్టులో ఉండడంతో.. అధికారులు చేపలవేటకు అనుమతించలేదు. మొత్తానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. ప్రభుత్వ ప్రతిష్టాత్మక చేప పిల్లల పంపిణీ పథకం.. ఇలా నీరుగారిపోతోంది. స్వార్థ రాజకీయ నాయకుల కారణంగా.. పథకం ఆశయం దెబ్బతింటోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. ఇందులో మితిమీరిన రాజకీయ జోక్యాన్ని నివారించాలని మత్స్యకారులు కోరుతున్నారు.

 

15:58 - May 4, 2018

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నింటిపైన చర్చించేందుకు ఆర్థికమంత్రి ఈటెల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉప సంఘం ఉద్యోగ సంఘ నేతలతో భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యలపై ఉప సంఘం చర్చిస్తోంది. భేటీ అనంతరం చర్చల సారాంశాన్ని సీఎం కేసీఆర్‌కు మంత్రుల కమిటీ సమర్పించనుంది. 

15:56 - May 4, 2018

నెల్లూరు : బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ నెల్లూరులో మహిళలు రోడ్డెక్కారు. నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఐద్వా సంఘం నేతలు కళ్లకు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. చిన్నారులపై అత్యాచారాలు చేస్తున్న వారిని వెంటనే శిక్షించాలంటూ నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఐద్వా నేతలు మండిపడ్డారు. బాలికలపై అత్యాచారాలు చేస్తున్న వారిని వెంటనే శిక్షించాలని లేదంటే ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 

టీ.టీడీపీ నేతలకు చంద్రబాబు దిశా నిర్ధేశం..

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేత ఎల్, రమణపై సీఎం చంద్రబాబు సీరియస్అయ్యారు. పార్టీ అధ్యక్షుడు మెతకగా వుంటే కుదరదని చంద్రబాబు రమణకు క్లాస్ తీసుకున్నారు. రాష్ట్రంలో వున్న సమస్యలపై ప్రజల్లోకి వెళ్లి పోరాడాలని ఆదేశించారు. ఎన్నికలకు ముందే పార్టీ టిక్కెట్లు ప్రకటిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇవ్వాలో లిస్ట్ తయారు చేసానని తెలిపారు. ఎన్నికల్లోపు పార్టీని బలోపేతనం చేసేందుకు చర్యలు తీసుకోవాలని బాబు దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ నేతలతోను, కార్యకర్తలతో ను చద్రబాబు ప్రత్యక్షంగా మాట్లాడారు.

15:43 - May 4, 2018

కర్ణాటక బీజేపీ మేనిఫెస్టో..

కర్ణాటక : శాసన సభ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం బీజేపీ నేత, కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప విడుదల చేశారు. మేనిఫెస్టో వివరాలు... రైతులకు రూ. లక్ష రుణమాఫీ, మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు, దళిత విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఓపెన్ డిగ్రీ పరీక్షల్లో ఇన్విజిలేటర్ల భోగోతం..

యాదాద్రి : భువనగిరి జిల్లా మోత్కూర్ లో ఎపెన్ డిగ్రీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇన్విజిలేటర్ల భోగోతం బైటపడింది. ఒక్కో విద్యార్ధి వద్ద రూ.2వేలు తీసుకుని ఇన్విజిలేర్లు మాజ్ కాపీయింగ్ కు సహకరిస్తున్న వైన బైటపడింది. 

గాలికి ఎదురుగాలి..

ఢిల్లీ : అక్రమ మైనింగ్ మాఫియా కేసులో జైలుకు వెళ్లిన గాలి జనార్ధన్ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు అనుమతినివ్వాలని గాలి వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రచారం కోసం బెయిల్ పై బైటకు వచ్చిన గాలికి సుప్రీంకోర్టు అనుమతిని నిరాకరించింది. కాగా ఈ నెల 12 ఎన్నికలు ముగిసే వరకు ప్రచారంలో పాల్గొనడానికి వీల్లేదని స్పష్టం చేసింది. బళ్లారిలోకి ప్రవేశించకుండా 2015లో బెయిల్ మంజూరు సమయంలోనే కోర్టు నిషేధం విధించింది.

14:48 - May 4, 2018

పశ్చిమ గోదావరి : చింతల పూడిలో సైకిల్‌ యాత్రలో పాల్గొంటోన్న టీడీపీ ఎంపీ మాగంటి బాబుకు స్వల్పంగా గుండెనొప్పికి గురయ్యారు. వెంటనే ఆయనను ఏలూరులోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం మాగంటి బాబుకి పాథమిక చికిత్స అందించామని, ఆయనకు స్వల్ప గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. కాగా మెరుగైన చికిత్స కోసం అవసరమైతే బాబును విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు టీడీపీ నేతలు తెలిపారు. కాగా ఎండ ఎక్కువగా వుండటం..దాదాపు నాలుగు గంటలకు పైగా సైకిల్ యాత్రలో పాల్గొనటంతో గుండెనొప్పికి గురయినట్లుగా భావిస్తున్నారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు సైకిల్ యాత్ర చేపట్టిన అనంతరం ఆయా నియోజకవర్గాలలో ఆయా ప్రజాప్రతినిధులు సైకిల్ యాత్రలు చేయాలని చంద్రబాబు పిలుపు మేరకు ఆయా ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాలలో యాత్రలు చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సైకిల్ యాత్రలలో అక్కడక్కడా తరుచూ అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం సైకిల్‌ యాత్రలో పాల్గొన్న ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావు గాయాలపాలవ్వగా అనంతరం కొన్ని రోజులకి ఏపీ ప్రభుత్వ చీఫ్ వీప్ పల్లె రఘునాథరెడ్డికి కూడా గాయాలైన విషయం తెలిసిందే.

స్నేహితుడి భార్యపై వైసీపీ నేత అత్యాచార యత్నం..అరెస్ట్..

గుంటూరు : స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించిన గుంటూరు జిల్లా వైసీపీ నాయకుడు, మాచర్ల మాజీ ఎంపీపీ రమావత్ నర్సింగ్ నాయక్ ను పోలీసులు అరెస్టు చేశారు. మాచర్ల మండలం అచ్చమ్మకుంట తండాకు చెందిన రమావత్ నర్సింగ్ నాయక్ గతంలో వైసీపీ తరపున మాచర్ల ఎంపీపీగా పనిచేశారు. అదే గ్రామానికి చెందిన స్నేహితుడి కుటుంబాల మధ్య స్నేహసంబంధాలు ఉన్న నేపథ్యంలో నర్సింగ్ నాయక్ తో కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లింది.

ఎంపీ మాగంటి బాబుకు అస్వస్థత..

పశ్చిమ గోదావరి : చింతల పూడిలో సైకిల్‌ యాత్రలో పాల్గొంటోన్న టీడీపీ ఎంపీ మాగంటి బాబు సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను టీడీపీ కార్యకర్తలు ఏలూరులోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మాగంటి బాబుకి పాథమిక చికిత్స అందించామని, ఆయనకు స్వల్ప గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. కాసేపట్లో మాగంటి బాబును విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు టీడీపీ నేతలు ఏర్పాటు చేస్తున్నారు.

14:23 - May 4, 2018

గుంటూరు : దాచేపల్లి లో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన పరారయిన సుబ్బయ్య అనుమానాస్పదంగా మృతిచెందాడు. గురజాల మండలం దైద దగ్గర చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఇది ఆత్మహత్యా? లేక ఎవరైనా చంపి చెట్టుకు ఉరివేశారా? అనే అనుమానాలు తలెత్తున్నాయి. అమరలింగేశ్వర స్వామి ఆలయం వద్ద సుబ్బయ్య మృతదేహాన్ని గుర్తించారు. ఆత్మహత్యకు ముందు చివరిసారిగా బంధువుకి సుబ్బయ్య ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోన్ కాల్ లో నాకు బతకాలని లేదనీ..తన ఖర్మకాలి ఈ పాపపు పనికి ఒడిగట్టానని తాను చేసిన పనికి తన కుమారుడి పరువు పోయిందని వాపోయాడు.పదిమందికి మంచి మాటలు చెప్పి బతికేవాణ్ణని కానీ ఇటువంటిపనికి ఒడిగట్టానని కుమారుడికి చేసిన ఫోన్ లో నిందితుడు సుబ్బయ్య మాట్లాడినట్లుగా తెలుస్తోంది. కాగా సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్న తీరు అక్కడి పరిస్థితులు గమనిస్తే అది ఆత్మహత్యా? లేక ఎవరైనా చంపి ఉరివేశారా? అనే అనుమానాలకు తావిస్తోంది. 

 

మృతుడు సుబ్బయగా చినరాజప్ప నిర్ధారణ

గుంటూరు : దాచేపల్లిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ సుబ్బయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురజాల మండలం దైద దగ్గరు చెట్టుకు ఉరేసుకుని సుబ్చయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. అమరలింగ్వేశరస్వామి ఆలయం మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడు సుబ్బయ్యగా హోమంంత్రి చినరాజప్ప నిర్ధారించారు. 

 

అత్యాచారానికి గురైన బాలికను పరామర్శించిన రోజా

గుంటూరు : దాచేపల్లిలో అత్యాచారానికి గురైన బాలికను రోజా ఇవాళ పరామర్శించారు. అనంతరం బాధితురాలికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులు రోడ్డుపై బైఠాయించిన రోజాతోపాటు పలువురు వైసీపీ మహిళానేతలు, నాయకులను అరెస్ట్‌ చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.

బాలికపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్యను ఉరి తీయాలి : రోజా

గుంటూరు : జిల్లాలోని దాచేపల్లిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్యను ఉరి తీయాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్‌ చేశారు. ఏపీలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

దాచేపల్లి ఘటన దురదృష్టకరం : రఘువీరారెడ్డి

విశాఖ : రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. దాచేపల్లి ఘటన దురదృష్టకరమన్నారు. వరంగల్ లో యాసిడ్ దాడి జరిగినప్పుడు ఎన్ కౌంటర్ చేసిన సందర్భాలున్నాయని చెప్పారు.

13:28 - May 4, 2018

గుంటూరు : దాచేపల్లిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురజాల మండలం దైద దగ్గర చెట్టుకు ఉరేసుకుని సుబ్చయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. అమరలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం సుబ్బయ్య లేదా వేరొకరిదా అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. హైడ్రామా నడుస్తోంది. సుబ్చయ్య ఆత్మహత్యపై కాసేపట్లో పోలీసులు స్పష్టత ఇవ్వనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

బాలికపై అత్యాచార నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య

గుంటూరు : దాచేపల్లిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురజాల మండలం దైద దగ్గరు చెట్టుకు ఉరేసుకుని సుబ్చయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. 

13:14 - May 4, 2018

విజయవాడ : కెఎల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇంజనీరింగ్‌ కోర్సులలో ప్రవేశానికై నిర్వహించిన ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వర్సిటీ ఉపాధ్యక్షుడు రాజా హరీన్‌ అభినందనలు తెలిపారు. ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో 1 నుండి 20 వరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 100 శాతం స్కాలర్‌షిప్‌లతో పాటు నగదు బహుమతి అందిస్తామన్నారు. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికై  మే 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. 

 

13:00 - May 4, 2018

నెల్లూరు : నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో విషాదం చోటుచేసుకుంది. వాష్‌రూమ్‌కని వెళ్లిన ఏడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ ట్రైన్‌ నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయింది. నెల్లూరు జిల్లా కావలి శ్రీవెంకటేశ్వరపాలెం మధ్య ఈ ఘటన జరిగింది.  రైలు 2 కిలోమీటర్లు ముందుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఈ ప్రమాదాన్ని గుర్తించారు.  వేసవి సెలవులు కావడంతో ఏడేళ్ల చిన్నారి తల్లిదండ్రులతో కలిసి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

12:57 - May 4, 2018

అనంతపురం : జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతుడటంతో పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. అందుకోసం పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు.. నియోజక వర్గ సమన్వయ కర్తలలో మార్పులు చేస్తోంది. దీంతో ఇంతకాలం నియోజక వర్గాలకు సమన్వయ కర్తలుగా పనిచేసిన వారిలో ఆందోళన మొదలైంది.

అనంతపురం జిల్లాలోని వైసీపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ అధినేత జగన్‌.. పార్లమెంట్, అసెంబ్లీ సమన్వయ కర్తలను మారుస్తుడటంతో పార్టీలో కోలాహలం నెలకొంది. ఇంత కాలం అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఉన్న మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డిని అసెంబ్లీ సమన్వయ కర్తగా నియమించారు. ఇన్నాళ్లు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఉన్న నదీం అహమ్మద్‌ను హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమించారు. ఇక  హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయ కర్తగా వ్వవహరిస్తున్న రంగయ్యను అనంతపురం పార్లమెంట్ సమన్వయ కర్తగా నియమించారు.

అనంత వెంకటరామిరెడ్డిని అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్తగా పార్టీ అధినేత జగన్‌ నిర్ణయం తీసుకోవడంతో అనంతపురం వైసీపీ కార్యకర్తలలో ఉత్సాహం నెలకొంది. వెంకటరామిరెడ్డి స్వగృహంలో వైసీపీ నేతలు హడావుడి చేస్తూ.. ఆయనను పూల మాలలతో సత్కరించారు. దీంతో అనంతపురం రాజకీయాల్లో అసలైన ఆట మొదలయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు అనంతపురం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేయడమే కాక రానున్న ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేస్తామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం వెంకటరామిరెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారానికి తెరదించుతూ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

అనంతపురం పార్లమెంట్‌ నియోజక వర్గానికి వైసీపీ తరుపున రంగయ్యను బరిలోకి దింపుతారనే ప్రచారం సాగుతోంది. హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గానికి వైసీపీ సమన్వయ కర్త నదీం అహమ్మద్‌ను నియమించినప్పటికీ టికెట్ల కేటాయింపు సమయానికి బీసీ అభ్యర్థిని బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఇక కదిరి నియోజకవర్గం నుంచి మైనార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని వైసీపీ భావిస్తోంది. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా గెలుపు గుర్రాలనే ఎన్నికల రణక్షేత్రంలోకి పంపాలని వైసీపీ చూస్తోంది.
 
వచ్చే ఎన్నికల్లో తాజాగా నియమించిన సమన్వయకర్తలే పోటే చేస్తారనే ప్రచారం వైసీపీలో ఊపందుకుంది. దీంతో నాలుగేళ్లుగా నియోజకవర్గ సమన్వయ కర్తలుగా పనిచేస్తున్న నాయకుల్లో కలవరం మొదలయింది. ఇంత కాలం పార్టీ కార్యక్రమాలను నిర్వహించిన తమను కాదని కొత్త నేతలను సమన్వయ కర్తలుగా నియమిస్తే తమ పరిస్థితి ఏంటని నేతలు మదనపడుతున్నారు.

12:54 - May 4, 2018

గుంటూరు : జిల్లాలోని దాచేపల్లిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్యను ఉరి తీయాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్‌ చేశారు. ఏపీలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. దాచేపల్లిలో అత్యాచారానికి గురైన బాలికను రోజా ఇవాళ పరామర్శించారు. అనంతరం బాధితురాలికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులు రోడ్డుపై బైఠాయించిన రోజాతోపాటు పలువురు వైసీపీ మహిళానేతలు, నాయకులను అరెస్ట్‌ చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.

 

12:50 - May 4, 2018

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తిరిగి అధికారం దక్కించుకొంటుందని ఆ రాష్ట్ర హోం మంత్రి రామలింగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశంలోనే కర్నాటక అగ్రస్థానంలో ఉందని చెప్పారు. బీజేపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాల భ్రష్టుపట్టుకుపోయిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదంటున్న ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. బీజేపీ దుష్టపాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.

 

12:48 - May 4, 2018

గుంటూరు : దాచేపల్లిలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. 144 సెక్షన్‌ కొనసాగుతోంది. దాచేపల్లిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్యను ఉరి తీయాలని రోజా డిమాండ్‌ చేశారు. ఏపీలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. బాధితురాలికి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. రోజాదాచేపల్లిలో అత్యాచారానికి గురైన బాలికను రోజా ఇవాళ పరామర్శించారు. అనంతరం బాధితురాలికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులు రోడ్డుపై బైఠాయించిన రోజాతోపాటు పలువురు వైసీపీ మహిళానేతలు, నాయకులను అరెస్ట్‌ చేశారు. పోలీసులకు, వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.

 

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నేత ఘాతుకం

తూర్పుగోదావరి : జిల్లాలోని తమ్మయ్యపేటలో టీడీపీ నేత ఘాతుకానికి పాల్పడ్డారు. మద్యంమత్తులో మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేశారు. 

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నేత ఘాతుకం

తూర్పుగోదావరి : జిల్లాలోని తమ్మయ్యపేటలో టీడీపీ నేత ఘాతుకానికి పాల్పడ్డారు. మద్యంమత్తులో మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేశారు. 

12:09 - May 4, 2018

తూర్పుగోదావరి : జిల్లాలోని తమ్మయ్యపేటలో టీడీపీ నేత ఘాతుకానికి పాల్పడ్డారు. మద్యమత్తులో మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేశారు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన వైనం. కత్తిపూడి ఎంపీటీసీ భర్త, టీడీపీ నేత శ్రీనివాసరావు, అతని స్నేహితులు బాలికను గ్రామ సమీపంలోని పొలాలకు లాక్కెళ్లారు. బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. బాలిక కేకలు విని అడ్డుకునేందుకు వెళ్లిన తల్లి, గ్రామస్తులపై శ్రీనివాస్ దౌర్జాన్యానికి దిగారు. శ్రీనివాసరావుతో పాటు అతని స్నేహితులపై కేసు నమోదు చేశారు. నిందితులపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 

11:44 - May 4, 2018

చిత్తూరు : శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టెంపాడులో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ముగ్గురు దుర్మరణం చెందారు. వర్షం రావడంలో చెట్టుకిందకు వెళ్లారు. చెట్టుకింద కూర్చున్న మునేంద్ర, దాసిరెడ్డి, గురువారెడ్డిలపై పిడుగుపడింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

 

11:34 - May 4, 2018

విశాఖ : నగరంలోని నరవా ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది.  మహిళ మృతదేహాన్ని దుండగులు కాల్చి వేశారు. సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. 

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుంటూరు : తంగెడ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. దాచేపల్లిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్య మృతదేహంగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

 

దాచేపల్లిలో 144 సెక్షన్

గుంటూరు : జిల్లాలోని దాచేపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దాచేపల్లి పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు. అత్యాచార నిందితుడు సుబ్బయ్య కోసం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నిందితుడు సుబ్బయ్య కోసం 17 బృందాలు గాలింపు చేపట్టాయి. 

11:13 - May 4, 2018

గుంటూరు : జిల్లాలోని దాచేపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దాచేపల్లి పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు. అత్యాచార నిందితుడు సుబ్బయ్య కోసం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నిందితుడు సుబ్బయ్య కోసం 17 బృందాలు గాలింపు చేపట్టాయి. తంగెడ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో అది సుబ్బయ్య మృతదేహంగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇవాళ మంత్రి చినరాజప్ప, మహిళా కమిషనర్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి బాధితురాలిని పరామర్శించనున్నారు. 

 

11:05 - May 4, 2018

హైదరాబాద్ : పిడుగుపాటుకు హైదరాబాద్‌లో ఓ చిన్నారి మృతి చెందాడు. కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం సమీపంలోని అంజిరెడ్డినగర్ లో నివాసముంటున్న అఖిల్ అనే 7 ఏండ్ల బాలుడు పిడుగుపాటుకు గురై చనిపోయాడు. ఇంద్రావతి, రమేశ్ దంపతులకు చెందిన అఖిల్ ఇంటికి దగ్గర్లో ఉన్న చింతచెట్టుకు ఊయల కట్టుకొని ఊగుతున్నాడు. అదే సమయంలో ఈదురు గాలులు మొదలయ్యాయి.   ఆకాశం అంతా ఉరుములు మెరుపులతో మేఘాలు కమ్ముకున్నాయి.  బాలుడు ఊయల మీద నుంచి దిగేలోపుగానే చింతచెట్టుపై పిడుగు పడింది. క్షణాల్లోనే బాలుడు అఖిల్‌ స్ఫృహ కోల్పోయాడు.  వెంటనే కుటుంబ సభ్యులకు బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 

10:55 - May 4, 2018

వరంగల్ : చత్తీస్‌గఢ్‌..తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. నేడు భారత్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. గడ్చిరోలి అన్నారం ఘటనలను నిరసిస్తూ ఈ బంద్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏటూరునాగారం, కొత్తగూడ ఏజెన్సీల్లో భారీగా మోహరించారు. 

 

10:48 - May 4, 2018

ఢిల్లీ : వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పులతో ఉత్తరాది వణికిపోతుంది. అకాల వర్షాలు, ఈదురు గాలులతో జనజీవనం స్థంభించి పోయింది. భారీ వర్షాలతో ఆరు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 117 మంది మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాలలో ఈదురు గాలులు, ఇసుక తుఫానులతో భయానక వాతారవణం నెలకొంది. అకాల వర్షాలతో భారీగా పంట నష్టం జరిగింది. యూపీ, రాజస్థాన్‌లో 111, ఆగ్రాలో 46 మంది మృతి చెందారు. రాజస్థాన్‌లో అత్యధికంగా భరత్ పూర్‌లో 36 మంది మృతి చెందారు. పంజాబ్, పటియాలాలో ఇద్దరు మృతి చెందారు. వందలాదిమందికి గాయాలయ్యాయి. వేలాది ఎకరాలలో పంట నష్టం వాటిల్లింది. చెట్లు నేలకొరిగాయి. ఇళ్ళు కూలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యూపీ, రాజస్థాన్‌లలో మరో 48 గంటల్లో తుఫాన్ సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాజస్థాన్‌లో ఈదురుగాలుల తీవ్రత పెరుగుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. హర్యానాపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగానే ఇసుక తుఫానులు సంభవించినట్లు తెలిపింది. రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ర్టాలపై తుఫానులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 

 

ఉత్తరాదిలో అకాల వర్షాలు

ఢిల్లీ : వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పులతో ఉత్తరాది వణికిపోతుంది. అకాల వర్షాలు, ఈదురు గాలులతో జనజీవనం స్థంభించి పోయింది. భారీ వర్షాలతో ఆరు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 117 మంది మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాలలో ఈదురు గాలులు, ఇసుక తుఫానులతో భయానక వాతారవణం నెలకొంది. అకాల వర్షాలతో భారీగా పంట నష్టం జరిగింది. యూపీ, రాజస్థాన్‌లలో మరో 48 గంటల్లో తుఫాన్ సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. హర్యానాపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగానే ఇసుక తుఫానులు సంభవించినట్లు తెలిపింది. 

 

10:37 - May 4, 2018

విశాఖ : నగరంలోని నరవా ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది.  మహిళ మృతదేహాన్ని దుండగులు కాల్చి వేశారు. సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు.

 

విశాఖలో మహిళ దారుణ హత్య

విశాఖ : నగరంలోని నరవా ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళ మృతదేహాన్ని దుండగులు కాల్చి వేశారు. సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. 

09:55 - May 4, 2018

మేడ్చల్ : అతివేగం నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన గంగరాజు కతార్ వెళ్లి తిరిగి వస్తున్నాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అతన్ని రిసీవ్ చేసుకునేందుకు అతని భార్య సత్తవ్వ (35), ఇద్దరు పిల్లలు శ్రవణ్ (12), శాలిని (12) కలిసి కారులో వెళ్తున్నారు. మార్గంమధ్యలో మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం తుర్కపల్లి వద్ద ఆగి వున్న లారీని అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితోపాటు కారు డ్రైవర్ రాజు (24)  మృతి చెందారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. 

 

09:24 - May 4, 2018

కర్నాటకలో మోడీ ఎన్నికల ప్రచారంపై వక్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో నవతెలంగాణ ఎడిటర్, విశ్లేషకులు ఎస్.వీరయ్య, టీఆర్ ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి, బీజేపీ నేత ఎన్ వి శుభాష్, కాంగ్రెస్ నేత క్రిషాంక్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:28 - May 4, 2018

ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎన్ని శిక్షలు తెచ్చినా ఆడవారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగటం లేదు. అత్యంత ఆందోళనకరమైన విషయమేంటంటే.. దేశంలో మైనర్‌ బాలికలపైన అత్యాచారాలు పెరుగుతుండటం... ఫోక్స్‌ చట్టానికి అమెండ్‌మెంట్స్‌ తీసుకొచ్చి పదిరోజులు అవుతోందో లేదో... మైనర్‌ బాలికలపైన అత్యాచారాల సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టంలోని గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ళ బాలికపై సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన సంఘటన తెలుగు రాష్ర్టాల్లో అందరినీ ఆందోళనకు గురిచేసింది. అసలు ఈ అత్యాచారాలు ఆగాలంటే.. రావాల్సిన మార్పేంటి... తీసుకోవాల్సిన చర్యలేంటి.. అనే అంశంపై భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య(ఐద్వా) నాయకురాలు ప్రభావతి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:25 - May 4, 2018

కోల్ కతా : ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అదరగొట్టారు. ఈడెన్‌గార్డెన్స్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను చిత్తుచేశారు.  గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో  ఆరు వికెట్ల తేడాతో  కోల్‌కతా సూపర్‌ విక్టరీ కొట్టింది. టాస్‌ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నైఇన్నింగ్స్‌ను షేన్‌ వాట్సన్‌, డు ప్లెసిస్‌లు ధాటిగా ఆరంభించారు. డుప్లెసిస్‌ 27పరుగులు చేసి పెవిలియన్‌ చేరగా..  ఆ తర్వాత వాట్సన్‌కు జత కలిసిన సురేశ్‌ రైనా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 36 పరుగులు చేసిన వాట్సన్‌  రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక రైనా 26 బంతుల్లో 4 ఫోర్లలతో  31 రన్స్‌ చేశాడు. తర్వాత  అంబటి రాయుడు 21,  జడేజా 12 పరుగులు చేసి ఔటయ్యారు. ఇక ఆరో స్థానంలో బరిలోకి దిగిన కెప్టెన్‌ధోని  బ్యాట్‌తో మెరుపులు మెరిపిచాడు. 25 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లు బాదేసి 43రన్స్‌తో నాటౌట్గా నిలిచాడు. దీంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. తర్వాత 178 పరగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా  17.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. కోల్‌కతా ఆటగాళ్లలో శుభ్‌మాన్‌ గిల్‌ 57, దినేశ్‌ కార్తీక్‌ 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.  కేకేఆర్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌, పీయూష్‌ చావ్లాలు తలో రెండు వికెట్లు సాధించగా, కుల్దీప్‌ యాదవ్‌కు ఒకవికెట్‌ దక్కింది. 

 

08:22 - May 4, 2018

అనంతపురం : జిల్లాలో పెత్తందారుల ఆగడాలతో దళితులు తీవ్ర మనోవేదను గురవతున్నారు.  పరిగి మండలం మన్నంపల్లిలో గంగమ్మ- సప్పలమ్మ జాతర సందర్భంగా  దళితులను ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. జాతర సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే పార్థసారథి పూజలు చేసి వెళ్లిపోయాక దళితులను గుళ్లోకి రాకుండా గ్రామపెత్తందారులు అటకాయించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా పెత్తందారులకే వత్తాసు పలుకుతున్నారని దళితులు ఆరోపించారు. అగ్రకుల  దౌర్జన్యంపై  సీపీఎం  ఆధ్వర్యంలో పెనుకొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట దళితులు ధర్నా నిర్వహించారు. మన్నంపల్లి సర్పంచ్‌, మాజీ సర్పంచ్‌తోపాటు దౌర్జన్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని దళితులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

08:17 - May 4, 2018

ప్రకాశం : వాతావరణం అనుకూలించకపోయినా  భయపడలేదు... వరుణుడు కరుణించకపోయినా అధైర్యపడలేదు... అన్నీంటిని తట్టుకుని నిలబడిన అన్నదాతను  మార్కెట్ కష్టాలు కంటతడి పెట్టిస్తున్నాయి. చేతికి అందిన పంటను అమ్ముకోలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో కందిరైతుల కష్టాలపై టెన్‌టీవీ ఫోకస్‌..
అన్నదాలు కష్టాలపాలు 
ప్రభుత్వ ముందుచూపులేమి, అధికారుల నిర్లక్ష్యం.. అన్నదాలను కష్టాలపాలు చేస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పంటను అమ్ముకుందామనే సరికి మార్కెట్‌ గేట్లు మూతపడ్డాయి. ప్రకాశంజిల్లా కనికగిరిలో కందిరైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రకాశం జిల్లాలో 35 వేల మెట్రిక్ టన్నుల మేరకు కందుల సేకరణకు ప్రభుత్వం అలాట్ మెంట్ ఇచ్చింది. 21 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. వీటిలో 50వేల మెట్రిక్ టన్నులు పర్చూరు గోడౌన్ లోను 10 వేల మెట్రిక్ టన్నులు సేకరణ కేంద్రాల్లోనూ, సొసైటీ కేంద్రాల్లోనూ నిల్వ ఉంచింది. గోడౌన్లూ ఖాళీలేవనే పేరుతో 14వేల మెట్రిక్ టన్నులు సేకరించకుండానే కొనుగోళ్లు ఆపేసింది. దీంతో కందిరైతులు పంటను తీసుకొచ్చి గోడౌన్ల ముందు పడిగాపులు పడుతున్నారు. 
కందులను కొనుగోలు చేయాలి : అన్నదాతలు 
కనిగిరి నియోజకవర్గ పరిధిలో 6 మండలాల్లో కందులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పుటికీ ..  ఇప్పటి వరకు 20 శాతం కూడా కొనుగోలు చేయలేకపోయింది. వారం రోజులుగా కనిగిరి మార్కెట్ యార్డ్‌లో 4 వేల టన్నుల కందుల నిల్వలు పోగుపడ్డాయి. కొనుగోళ్లు ఆగిపోవడంతో రైతులు ఇలా గోడౌన్‌ బయటే సరుకును ఉంచేశారు. చేతికి వచ్చి పంట రైతు నోటికి అందకుండా పోయిందని కందిరైతులు ఆవేదన పడుతున్నారు. ఇప్పటికై ప్రభుత్వం, మార్కెటింగ్‌శాఖ అధికారులు కల్పించుకుని కందులను కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.  

 

08:12 - May 4, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షం ప్రజలను బెంబేలెత్తించింది. అకాల వర్షాలకు రహదారులు జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించడంతో.. అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. 
విజయవాడ అతలాకుతలం 
విజయవాడ నగరాన్ని రెండు రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షం అతలాకుతలం చేస్తోంది. గురువారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల పాటు ఏకబిగిన కురిసిన వర్షంతో బెజవాడ రహదారులు జలమయం అయ్యాయి. వాహనదారులు తడిసిముద్దయ్యారు. చాలాచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మండు వేసవిలో.. భానుడి భగభగల నుంచి.. ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
కృష్ణా జిల్లాలో భారీ వర్షం  
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, నూజివీడు, తిరువూరు, పెడనలలో భారీ వర్షం కురిసింది. పెడనలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కృష్ణా జిల్లాలోని మచీలిపట్నం, పెడన, గుడూరు, చల్లపల్లి, గుడ్లవల్లేరు, పామర్రు, మైలవరం, జి.కొండూరు, ఆగిరిపల్లి తదితర మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. 
ఉత్తరాంధ్రలోనూ వర్షాలు 
అటు ఉత్తరాంధ్రలోనూ వర్షాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచే ఈదురుగాలులతో కూడిన వర్షాలతో విజయనగరం జిల్లా అతలాకుతలం అవుతోంది. జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని చాలా గ్రామాల్లోనిపల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయనగరంలో తెల్లవారుజాము నుంచే ఆకాశం మేఘలతో కమ్ముకొని చీకటిని తలపించింది. 
విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు 
విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. భీమిలి, తగరపువలస, పద్మనాభం, ఆనందపురంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాలులకు మొక్కజొన్న, అరటి తోటలు దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం, పాలకొండ, రాజాం, టెక్కలిలో వర్షం పడుతోంది. ఏలూరు, కాకినాడ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. బెంగాల్‌పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. మరో రెండ్రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

 

08:02 - May 4, 2018

హైదరాబాద్ : తెలంగాణలో అకాల వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. హైదరాబాద్‌లో ప్రహారీగోడ కూలి ముగ్గురు మృతి చెందగా.. పిడుగుపాటుకు ఓ బాలుడు చనిపోయాడు. అటు గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్‌ యార్డుల్లో నిల్వ ఉంచిన ధాన్యం ఎక్కడికక్కడ తడిసిపోయింది.  రాష్ట్ర వ్యాప్తంగా  వర్షబీభత్సం ఆందోళనను కలిగించింది. 
ఈదురుగాలులు, భారీ వర్షం 
హైదరాబాద్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిప్పులు కురిపించిన వాతావరణం.. ఈదురుగాలులు, భారీ వర్షంతో ఒక్కసారిగా చల్లబడిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. ఈదురు గాలులతో కూడిన వానలతో చాలాచోట్ల కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనూహ్యంగా కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షంతో పాటు.. ఉరుములు, మెరుపులతో ప్రజలను హడలెత్తించాయి. 
హైదరాబాద్‌లో బీభత్సం
ఈదురుగాలులతో కూడిన వర్షాలు హైదరాబాద్‌లో బీభత్సాన్ని సృష్టించాయి. ఆరాంఘర్‌ ప్రాంతంలో కురిసిన వర్షానికి ప్రహారీగోడ పక్కన నిలుచున్న వారిపై గోడకూలి పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. నగరంలో అక్కడక్కడా చెట్లు విరిగి పడ్డాయి. దీంతో వాహనాలు దెబ్బతిన్నాయి.  జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్‌ పోలీసులు విరిగిపడ్డ చెట్లను తొలగించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మోకాలి లోతు వరకూ వర్షం నీరు చేరింది. 
తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం
హైదరాబాద్‌లోనే కాకుండా.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల మార్కెట్‌యార్డుల్లో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. గాలుల బీభత్సానికి మామిడి నేలరాలింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న తడిసిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పరకాలలో వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయింది. జనగామ జిల్లాలోని నర్మెట్ట, తరిగొప్పులలో వడగండ్ల వానకు వరిచేను దెబ్బతింది. కరీంనగర్‌ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. వర్షానికి తడుస్తున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలూ పడ్డారు. 
మంచిర్యాల జిల్లాలోనూ వర్షం బీభత్సం 
మంచిర్యాల జిల్లాలోనూ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. మంథనిలోని సత్యసాయినగర్‌, పెంచేరుకట్టల్లోని ఇళ్లలోకి మురుగునీరు చేరింది. యాదాద్రి జిల్లాలోని బీబీనగర్‌లోనూ వర్షం బీభత్సం సృష్టించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వాననీటిలో తడిసిపోయింది. ఖమ్మం జిల్లాలోనూ రైతులు యార్డుల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరిశీలించారు. తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
బోధన్‌లో వడగండ్ల వాన
నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో వడగండ్ల వాన కురిసింది. చెట్లు కూలిపోయాయి. దీంతో కూడలిలోని తెలుగు విగ్రహంపై దెబ్బతింది. అటు వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో గాలికి ప్లాట్‌ఫాం రేకులు ఎగిరిపడ్డాయి. ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ అంతటా.. చాలాచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. వర్షబీభత్సానికి వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆయా విభాగాల సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి.. వాహనాల రాకపోకలు, విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. 

 

07:57 - May 4, 2018

హైదరాబాద్ : తెలంగాణాలో తెలుగు త‌మ్ముళ్లు రాజ‌కీయంగా మ‌రింత చురుగ్గా వ్యవ‌హ‌రించేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దిశా నిర్దేశం చేయ‌నున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భ‌వ‌న్‌లో  బాబు తెలంగాణాపార్టీ ముఖ్య నేత‌ల‌తో భేటీ కానున్నారు. ఈ భేటీ లో మ‌హానాడు నిర్వహ‌ణ‌, చేయాల్సిన తీర్మానాల గురించి చ‌ర్చించ‌బోతున్నారు. దాంతోపాటు వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో పొత్తుల అంశం పై కూడా చ‌ర్చించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పార్టీనేతలు చెబుతున్నారు. 
తెలంగాణా నేత‌ల‌కు బాబు దిశా నిర్దేశం 
టీటీడీపీ నేత‌ల‌తో ఆ పార్టీ జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు స‌మావేశం కాబోతున్నారు. పార్టీ వ్యవ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావు జ‌యంతి సంద‌ర్భంగా నిర్వహించే మ‌హానాడు కార్యక్రమ నిర్వహ‌ణపై తెలంగాణా నేత‌ల‌కు బాబు దిశా నిర్దేశం చేయ‌బోతున్నారు. గ‌త సంవ‌త్సరం నిర్వహించిన మ‌హానాడుకు పెద్ద యెత్తున కార్యక‌ర్తలు త‌ర‌లిరాగా.. అంత‌కు మించి ఈ సారి మ‌హానాడును నిర్వహించాల‌ని పార్టీ ముఖ్య నేత‌లు పట్టుదలగా ఉన్నారు. సీనియ‌ర్ నేత‌లు పార్టీని వీడిపోయినా కార్యక్తలు చెక్కు చెదరలేదని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. కార్యకర్తల్లో భ‌రోసా క‌ల్పించడానికి ఈసారి మహానాడును ఉపయోగించుకోవాలని పార్టీ అదిస్టానం వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ నెల 24వ తేదీన హైద‌రాబాద్‌లో నిర్వహించే తెలంగాణా మ‌హానాడు కంటే ముందుగా 17 పార్లమెంట్ నియోజ‌క వ‌ర్గాల్లో మినీ మ‌హానాడులను నిర్వహించడానికి టీడీపీ నేతలు కార్యాచరణ సిద్ధం చేశారు. 
టీటీడీపీలో జ‌వ‌స‌త్వాలు నింపేందుకు చంద్రబాబు దృష్టి 
టీటీడీపీలో జ‌వ‌స‌త్వాలు నింపేందుకు చంద్రబాబు ఇప్పటి నుంచి దృష్టి సారించే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. మ‌హానాడు నిర్వహ‌ణ పేరుతో ఇవాళ నేతలతో భేటీ అవుతున్నా బాబు భ‌విష్యత్ రాజ‌కీయ వ్యూహాల‌పైనా ముఖ్యనేత‌ల‌తో  చ‌ర్చించ‌బోతున్నట్టు స‌మాచారం. క్షేత్ర స్థాయిలో క్యాడ‌ర్ ను కాపాడుకుంటూనే నాయ‌కుల్లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని  తెలంగాణ టీడీపీ నేతలు అంటున్నారు. వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో పార్టీ ఎవ‌రితో క‌లిసి ముందుకు వెళ్తుందో ఈ భేటీలో సూచ‌న ప్రాయంగా తెలిపే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సుమారు రెండు నెల‌ల త‌ర్వాత తెలంగాణా తెలుగుదేశం నేత‌ల‌తో చంద్రబాబు నిర్వహిస్తున్న ఈ స‌మావేశం ప్రాధాన్యత సంత‌రించుకొంది. పార్టీకి అంటి ముట్టన‌ట్లు  ఉంటున్న సీనియ‌ర్ నేత‌లపైనా స‌మావేశంలో నిర్ణయం తీసుకునే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 

07:53 - May 4, 2018

హైదరాబాద్ : జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు  చేసేందుకు ప్రయత్నిస్తున్న గులాబీదళపతికి అవాంతరాలు తప్పడం లేదు. పలు ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నా.. ఆ పార్టీల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దక్కడం లేదని టీఆర్‌ఎస్‌ నేతల్లోనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రాంతీయ పార్టీల నుంచి రాని స్పందన 
దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తానని ప్రకటన చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి ఆ స్థాయిలో సహకార దక్కడం  లేదు.  వచ్చే ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్న కేసిఆర్  ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఆయా పార్టీలకు జాతీయ స్థాయిలో వ్యవహరించాల్సిన రాజకీయ వ్యూహాలను వివరిస్తున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మొదలైన  ఫ్రంట్ ప్రయత్నాలు.. ఝార్ఘండ్, కర్నాటక, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినేతలతో చర్చలు  జరిపారు. 
కేసీఆర్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలపై నీళ్లుచల్లిన మమతా బెనర్జీ
కేసీఆర్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలపై తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆదిలోనే నీళ్లు చల్లారు. బీజేపీతో పాటు కాంగ్రెస్ కూ తనఫ్రంట్‌ దూరమే అని కేసీఆర్‌ చెప్పడం తృణమూల్‌ పార్టీకి నచ్చడంలేదు. కాంగ్రెస్‌ సహకారం లేకుండా బీజేపీని అడ్డుకోవడం సాధ్యంకాని మమతా భావిస్తున్నారు. అందుకే కేసీఆర్‌తో భేటీ తర్వాత ఢిల్లీలో సోనియా గాంధీ  ఏర్పాటు చేసిన విందుకు హాజరై.. కేసీఆర్‌ చెబుతున్న ఫ్రంట్‌పై తన వ్యతిరేకతను చెప్పకనే చెప్పారు మమతాదీది. అటు  ఝార్ఘండ్ మాజీ సిఎం హేమంత్ సోరెన్  కూడా దాదాపు అదే అభిప్రాయంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 
దేవేగౌడ నుంచి రాని స్పష్టత 
కర్నాటకలో జెడిఎస్ అధినేత దేవగౌడ్ తో చర్చలు జరిపినా... అక్కడ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేవగౌడ్ కూడా కేసిఆర్ కు  స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. అటు తమిళనాడులో ప్రధానప్రతిపక్షమైన డిఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్‌తో  భేటీ అయిన కేసిఆర్.. ఫ్రంట్‌ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాని డీఎంకే నుంచి అంత సానుకూల స్పందన రాలేదన్నది ఆపార్టీ ఎంపీల వ్యాఖ్యలతో స్పష్టం అవుతోంది. చర్చల విషయంలో డీఎంకే ఎంపీ కనిమోళి   కొత్త ట్విస్ట్ ఇచ్చారు. జాతీయ స్థాయిలో మూడో కూటమిపై తమ మధ్య అసలు చర్చలే జరుగలేదని, రాష్ట్రాల హక్కుల విషయంలోనే మాత్రమే  కేసీఆర్‌తో చర్చించామని ఎంపీ కనిమోళి ప్రకటించడం.. కేసీఆర్‌ది ఉత్తుత్తి హడావిడే అని రాజకీయవర్గాల నుంచి  కామెంట్లు వస్తున్నాయి.
కేసీఆర్‌...అఖిలేశ్‌ భేటీ విందుకే పరిమితం !  
ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం.. సమాజ్‌వాదీ నేత అఖిలేష్‌యాదవ్‌  హైదరాబాద్‌కే వచ్చి కేసీఆర్‌తో భేటీ కావడం రాజకీయవర్గాల్లో కొంత ఆసక్తి రేకెత్తించిందనే చెప్పాలి. ముఖ్యంగా కేసీఆర్‌ ఏర్పాటు చేయబోయే ఫ్రంట్‌పై జాతీయ మీడియాలో కొంత ఫోకస్‌ కనిపించింది. అయితే కేసీఆర్‌ అభిప్రాయాలను స్వాగతిస్తున్నట్టు  చెప్పిన అఖిలేశ్‌యాదవ్‌.. ఫ్రంట్‌తో కలిసి పనిచేస్తామని మాత్రం ప్రకటన చేయలేదు. దీంతో అఖిలేశ్‌- కేసీఆర్‌ భేటీ విందుకే పరిమితం అయిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. 
నవీన్‌ పట్నాయక్‌తో భేటీపై గులాబీపార్టీ ఉత్తుత్తి ప్రచారం ! 
ఇక ఒడిషా సిఎం నవీన్ పట్నాయక్‌తో కేసీఆర్‌ భేటీకి ముహూర్తం ఖరారైందని గులాబీ నేతలు చేస్తున్న ప్రచారం అంతా ఉత్తుత్తిదే అని ఇప్పటికే తేలిపోయింది.   సీఎం కేసీఆర్‌ పూరి జగన్నాథుడి దర్ననానికి వస్తున్నట్టు మాత్రమే తనకు సమాచారం ఇచ్చారని.. నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించి అసలు విషయాన్ని బయటపెట్టేశారు. మొత్తానికి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నుంచి సానుకూలంగా స్పందన రాకపోవడంపై గులాబీ నేతల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ ,బీజేపీయేతర  ఫ్రంట్‌ అంటూ పార్టీ అధినేత చేస్తున్న హడావిడి ఫలితం ఇస్తుందా అంటే .. గులాబీవర్గాల నుంచి పెదవి విరుపులే వస్తున్నాయి.  

 

ఛత్తీస్ గఢ్..తెలంగాణ సరిహద్దులో కొనసాగుతోన్న కూంబింగ్

వరంగల్ : ఛత్తీస్ గఢ్..తెలంగాణ సరిహద్దులో కూంబింగ్ కొనసాగుతోంది. గడ్చిరోలి...అన్నారం ఘటనలకు నిరసనగా మావోయిస్టులు బంద్ పాటిస్తున్నాయి. పోలీసులు అప్రమత్తమయ్యారు. వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయి. 
ఏటూరునాగారం, కొత్తగూడ ఏజెన్సీల్లో పోలీసులు భారీగా మోహరించారు. 

 

నేడు తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

హైదరాబాద్ : ఎన్ కౌంటర్లకు నిరసనగా నేడు తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చారు. 

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..18 మంది మృతి

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలతో తెలంగాణలో 8 మంది, ఏపీలో 10 మంది మృతి చెందారు.  

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

మేడ్చల్ : శామీర్ పేట మండలం తుర్కపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 

Don't Miss