Activities calendar

05 May 2018

22:10 - May 5, 2018

జర్మన్ శాస్త్రవేత్త, తత్త్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు కార్ల్ మార్క్స్ . ప్రపంచ ఆర్థిక విధానానికి ఆయనే దిక్సూచి. ఆయన జన్మించి నేటికి సరిగ్గా 200ల సంవ్సరాలైంది. ఎంతో మంది ఎన్నో ఆర్థిక విధానాలకు కనిపెట్టినా కార్ల్ మార్క్స్ ఆర్థిక విధానమే ఎందుకు అంతగా ప్రాచత్యం పొందింది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక విధానానికి మార్క్స్ థీరీ సూచిస్తున్న సూచనలేమిటి? వంటి పలు కీలక అంశాలపై ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవిగారి విశ్లేషన్ మానవాళికి మార్గదర్శకం మార్క్సిజం అనే అంశం..

21:58 - May 5, 2018

జర్మనీ : జర్మన్ శాస్త్రవేత్త, తత్త్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు. కార్ల్ మార్క్స్ ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. రాజకీయ ఆర్థికశాస్త్రం, హెగెలియన్ తత్త్వశాస్త్రాన్ని అవపోసన పట్టిన మేధావి కార్ల్ మార్క్స్. యుక్తవయస్సులోనే ఏ దేశపు పౌరసత్వం లేని స్థితిలో లండన్లో జీవితాన్ని కొనసాగించాడు. లండన్లోనే మరో జర్మన్ ఆలోచనాపరుడైన ఫ్రెడెరిక్ ఏంగెల్స్ తో కలిసి మెలిసి ఎన్నో విషయాలపట్ల చర్చించేవాడు. ఈ క్రమంలో ఆయన పలు పుస్తకాలు ప్రచురించాడు.

సుప్రసిద్ధమైన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో
1848 నాటి కరపత్రమైన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వాటన్నిటిలోకీ సుప్రసిద్ధమైంది. తదుపరి కాలపు మేధో, ఆర్థిక, రాజకీయ చరిత్రను అతని రచన ప్రభావితం చేసింది. సమాజం, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు వంటివాటిపై మార్క్స్ సిద్ధాంతాలను కలగలిపి మార్క్సిజంగా పిలవబడేస్థాయికి ఆయన చేరుకున్నారు. పరాయీకరణ, విలువ, వస్తు పూజ, మిగులు విలువ వంటి తన సిద్ధాంతాల ద్వారా మార్క్స్ పెట్టుబడిదారి వ్యవస్థ వినియోగదారి మనసత్తత్వం అభివృద్ధి చేయడం, సామాజిక అంతరాలు, శ్రమశక్తిని దోపిడీ చేయడం ద్వారా సామాజిక సంబంధాలు, విలువలను ఏర్పరుస్తోందని వాదించాడు. చారిత్రిక భౌతికవాదం అనే విమర్శనాత్మక దృక్పథాన్ని ఉపయోగించి, మార్క్స్ పునాది, పైనిర్మాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సమాజంలోని సాంస్కృతిక, రాజకీయ స్థితిగతులను, అలానే వాటి మానవ స్వభావపు భావనలను ప్రధానంగా నిగూఢమైన ఆర్థిక పునాదులే నిర్ధారిస్తాయని ఈ సిద్ధాంతం చెప్తోంది. ఈ ఆర్థిక విమర్శలు 1867 నుంచి 1894 వరకూ మూడు భాగాలుగా ప్రచురితమైన ప్రభావశీలమైన దాస్ కేపిటల్లో పొందుపరిచారు.

పెట్టుబడిదారీ వ్యవస్థలోని అంతర్గత సమస్యలు వినాశనానికి దారితీస్తాయన్న మార్క్స్
గత సామాజిక ఆర్థిక వ్యవస్థల్లాగానే పెట్టుబడిదారీ వ్యవస్థలోని అంతర్గత సమస్యలు స్వయం వినాశనానికి దారితీసి, దాని స్థానంలో కొత్త వ్యవస్థ ఐన సామ్యవాదం ఏర్పడుతుందని ఊహించారు. మార్క్స్ కార్మిక వర్గం పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసి, సామాజిక ఆర్థిక విముక్తి తీసుకువచ్చేందుకు సంఘటిత విప్లవ చర్య చేపట్టాలని వాదిస్తూ క్రియాశీలకంగా దాని ఆచరణ కోసం పోరాడారు. కార్ల్ మార్క్స్ మానవ చరిత్రలోకెల్లా అత్యంత ప్రభావశీలమైన వ్యక్తుల్లో ఒకరిగా పేరొందారు, ఆయన కృషి, సిద్ధాంతం అటు ప్రశంసలు, ఇటు విమర్శలు కూడా విస్తృతంగా పొందాయి. ఆర్థిక శాస్త్రంలో ఆయన కృషి శ్రమ గురించి, దానికీ పెట్టుబడికీ ఉన్న సంబంధం గురించి ప్రస్తుత అవగాహనకీ, తత్ సంబంధితమైన ఆర్థిక ఆలోచనకీ చాలావరకూ పునాదిగా నిలుస్తోంది. మార్క్స్ ని సామాన్యంగా ఆధునిక సామాజికశాస్త్ర నిర్మాతల్లో ఒకరిగా పేర్కొంటారు. మార్క్స్ మరణించేంతవరకూ ఆయన భావాలు ప్రధానంగా వ్యాప్తి చెందకపోయినా, ఆయన మరణానంతరం వాటి ప్రభావం విస్తరించింది. రష్యన్ విప్లవం మొదలుకొని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక విప్లవాలు మార్క్సిజం సిద్ధాంతం పునాదిగా చేసినట్టు ప్రకటించుకున్నాయి. 20వ శతాబ్దిలో అనేక దేశాలు మార్క్సిస్టు దేశాలుగా తమను ప్రకటించుకున్నాయి. వ్లాదిమిర్ లెనిన్, మావో జెడాంగ్, ఫిడెల్ కాస్ట్రో, సాల్వడార్ అలెండె, జోసిప్ బ్రొజ్ టిటో, క్వామె క్రుమా సహా ఎందరో 20వ శతాబ్దికి చెందిన ప్రముఖ ప్రపంచ నాయకులు మార్క్స్ తమపై గాఢ ప్రభావం చూపాడని పేర్కొన్నారు.

జర్మనీలో మార్క్స్ జయంతోత్సవాలు
కార్ల్‌ మార్క్స్‌ రెండో శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చైనా ప్రభుత్వం బహుకరించిన పదిహేడు అడుగుల మార్క్స్‌ కాంస్య విగ్రహాన్ని ఈ వేడుకల సందర్భంగా ఆవిష్కరించారు. మార్క్స్‌ జయంతి వేడుకల్ని చూసేందుకు దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు చేరుకున్నారు.

 

21:42 - May 5, 2018

జార్ఖండ్‌ : చత్రా జిల్లా కెందువా గ్రామంలో జరిగిన గ్యాంగ్‌రేప్‌ మర్డర్ ఆలస్యంగా వెలుగుచూసింది. 16 ఏళ్ల మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం జరిపి సజీవ దహనానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటనలో 14 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. మే 3న నలుగురు యువకులు రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్‌ బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాధితురాలి తండ్రి గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. పంచాయితీ పెట్టిన పెద్దలు 50 వేలు జరిమానా విధించి వంద గుంజీలు తీయాలని నిందితుడిని ఆదేశించారు. పంచాయితీ విధించిన శిక్షపై అవమానంగా భావించిన ప్రధాన నిందితుడు శుక్రవారం రాత్రి బాధితురాలి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను చితకబాదాడు. బాధితురాలిపై కిరోసిన్‌ పోసి తగలబెట్టాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. పంచాయితీ పెద్దలను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

21:38 - May 5, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడుకు ఉపయుక్తంగా ఉండే విధంగా ఇంద్రావతి నదిపై కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖ రూపకల్పన చేసింది. ఏటా సముద్రం పాలవుతున్న మూడు వేల టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకొనేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఇందుకు 50 వేల కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేసినట్టు హైదరాబాద్‌ పర్యటనలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు.
హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌-నర్సాపూర్‌ రెండు వరుసల రోడ్డు
కేంద్ర జలవనరులు, రోడ్లు, రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ హైదరాబాద్‌లో పర్యటించారు. నగరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫ్లై ఓవర్లు, స్కైవేస్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ నుంచి మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ను కలిసే రెండు వరుసల రహదారికి శంకుస్థాపన చేశారు. అలాగే ఆరాంఘర్‌-శంషాబాద్‌ ఆరు వరుసల రోడ్డు, అంబర్‌పేట చౌరాస్తా వద్ద ఫ్లై ఓవర్‌, ఉప్పల్‌ జంక్షన్‌ నుంచి వరంగల్‌ రోడ్డులోని సీపీఆర్‌ఐ వరకు ఆరువరుసల స్కైవే నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చాం -గడ్కరీ
ఈ సందర్భంగా గడ్కరీ నదీ జలాల సద్వినియోగం గురించి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అనుమతు ఇచ్చిన విషయాన్ని గుర్తి చేసిన గడ్కరీ, మరోసారి హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఈ పథకాన్ని సందర్శిస్తానని చెప్పారు. ఏటా సముద్రం పాలవుతున్న మూడు వేల టీఎంసీల గోదావరి జలాల సద్వినియోగానికి ఇంద్రావతిపై కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. తెలంగాణ, ఏపీతోపాటు తమిళనాడుకు ఉపయోగపడే విధంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దీనికి 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. దీనికి కార్యరూపం ఇచ్చే విధంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని గడ్కరీ చెప్పారు.

సికింద్రాబాద్‌ జేబీఎస్‌-శామీర్‌పేట ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే -కేటీఆర్‌
జంటనగరాలతోపాటు, తెలంగాణలో రోడ్డ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మున్సిపల్‌ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్‌ వివరించారు. రాజీవ్‌ రహదారిపై సికింద్రాబాద్‌ జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట వరకు నిర్మించే ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌వే, సికింద్రాబాద్‌ కంటోన్మెండ్‌ పార్క్‌ నుంచి సుచిత్ర జంక్షన్‌ వరకు చేపట్టే స్కైవే నిర్మాణాకి అవసరమైన వంద ఎకరాల భూమి ఇవ్వకుండా రక్షణ శాఖ ఇబ్బందులు పెడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ భూమికి బదులుగా అంతే విలువ ఉన్న ఆరు వందల ఎకరాల భూమి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన నిధులు మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. నాలుగు రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన నితిన్‌ గడ్కరీకి మున్సిపల్‌ పరిపాలనా శాఖ మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

21:34 - May 5, 2018

ఢిల్లీ : టీటీడీని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతోందంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు స్పదించారు. టీటీడీ సహా ఏ దేవాలయం కానీ, మసీదును కానీ కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోదని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ తనకు స్పష్టం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పుడు మాత్రమే కేంద్రం జోక్యం చేసుకొంటుందన్నారు. ఈ విషయంలో స్వార్థరాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని జీవీఎల్‌ నరసింహారావు విజ్ఞప్తి చేశారు. 

21:26 - May 5, 2018

తిరుమల : టీటీడీ పరిధిలోని ఆలయాలు, కట్టడాలను రక్షిత కట్టడాలుగా కేంద్ర పురావస్తు శాఖ ప్రకటించింది. ఆలయాలు, చరిత్రను పరిశీలించిన తర్వాత పురావస్తు శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది. ఆలయాలు, భవనాల వివరాలన్నీ అందించాలని టీటీడీ ఈవోకు కేంద్ర పురవాస్తుశాఖ లేఖ రాయడంపై దుమారం చెలరేగింది. టీటీడీ పరిధిలోని దేవాలయాలను సందర్శించి ఫొటోలు తీసుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు సహకరించాని రాష్ట్రాన్ని కేంద్రం కోరింది. ఈ లేఖను విజయవాడలోని అమరావతి సర్కిల్‌కు లేఖ అందింది. దీనిపై ఇప్పుడు రాష్ట్రంలో ప్రకంపనలు మొదలయ్యాయి. టీటీడీ పరిధిలోని దేవాలయాను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తుందనే వివాదం తలెత్తడంతో... టీటీడీ ఈవో స్పందించారు. టీటీడీ ఆలయాలను పురావస్తు శాఖకు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

వెనక్కి తగ్గిన పురావస్తు శాఖ..
తిరుమలలో కట్టడాలకు రక్షణ కరువైందని, టీటీడీ అధికారులు ఇష్టమొచ్చిన రీతిలో పురాతన కట్టడాలు తొలగిస్తున్నారని కేంద్ర పురావస్తుశాఖకు అనేక ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విలువైన కానుకలు, ఆభరణాలు కూడా భద్రతకు నోచుకోవడం లేదని పీఎం కార్యాలయానికి, పురావస్తు శాఖ అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత పురావస్తుశాఖ నిర్ణయం తీసుకుంది. 

రెండు బస్సులు ఢీ,6గురు మృతి..

రంగారెడ్డి : కందుకూరు మండలం దెబ్బడగూడలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

చంద్రబాబు అంటే గౌరవం : దియామీర్జా

ముంబై : గుంటూరు జిల్లాలోని దాచేపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఇచ్చిన హామీలపై బాలివుడ్ నటి దియా మీర్జా ప్రశంసలు కురిపించారు. దాచేపల్లి బాధితురాలికి వ్యక్తిగతంగా చదువుకు అయ్యే ఖర్చులను నేను భరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తను ఉన్నత స్థానాన్ని చేరుకునే వరకు ఆమె బాధ్యతలు చేసుకుంటానని చంద్రబాబు ఇచ్చిన హామీ వార్తపై నటి దియా మీర్జా ట్వీట్‌ చేస్తూ.. చంద్రబాబంటే తనకు చాలా గౌరవం. ఆయన చాలా మంచి వ్యక్తి’ అని పోస్ట్‌ చేశారు. బాధితురాలికి ‘వ్యక్తిగతంగా చదువుకు అయ్యే ఖర్చులను నేను భరిస్తాను.

చంద్రబాబుపై బాలీవుడ్ హీరోయిన్ ప్రశంసలు..

ముంబై : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని బాలీవుడ్ నటి దియా మీర్జా ప్రశంసించారు. ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా కఠినంగా చట్టాలు రూపొందిస్తున్నట్లు చంద్రబాబు తాజాగా చెప్పారు. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణాలు పోతాయన్న భయం ప్రతి ఒక్కరిలోనూ కలగాలని స్పష్టం చేశారు. దాచేపల్లి దుర్ఘటన మానవత్వానికే మాయని మచ్చని అన్నారు. దీన్ని ఓ ఆంగ్లపత్రిక ప్రచురించింది. 

20:22 - May 5, 2018

అయ్యా జగన్ బాబు, జనసేనా బాబు.. ఇంటిరా ముచ్చట.. రాబోయే రెండువేల పందొమ్మిది ఎన్నికలళ్ల.. ఆంధ్రరాష్ట్రంలున్న అన్ని అసెంబ్లీ సీట్లు.. అన్నిఎంపీసీట్లు అన్ని కార్పొరేషన్ సీట్లు మేమే గెల్చుకోబోతున్నం.. అని చంద్రాలు సారు బ్రహ్మంగారు రాయంగ ఇడ్సిపెట్టిన కాలజ్ఞానం రాశి సద్విండు.. చంద్రాలు మాటలు ఇని మీరు గుండెవల్గేరు సుమా.. ఎట్లెట్ల చంద్రాలు..?

తెలంగాణ రాష్ట్రమొస్తె కేసీఆర్ జెప్పినట్టు నిజంగనే మా బత్కులు బంగారమైతయేమో అనుకున్నంగని.. అమ్మో ఇంతఆగమైతది మా బత్కు.. ఇంక నమ్ముతాము మేము అంటున్నరు.. కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. ఒక్క పెన్నుపోటుతోని మమ్ములను రెగ్కులరైజ్ జేస్తాన్న సారువారు ఏడవన్నడు ఇయ్యాల అని తీరొక్క తిట్టు తిడ్తున్నరు..

ఆర్మూరు బంగారం దొంగతనం కేసుల.. నిందితులు టీఆర్ఎస్ పార్టోళ్లు గాకుంట వేరేటోళ్లు ఉంటే.. ఈ పోలీసోళ్లు ఊకుంటుండెనా..? వాళ్ల ఇండ్ల మీదికి వొయ్యి గొర్ర గొర్ర గుంజుకొచ్చి స్టేషన్ల వడేశి నాల్గు సప్పరిచ్చి జైలుకు వంపకపోతుండే.. అధికార పార్టీ లీడర్లే దొంగలు అయ్యిండ్రన్న ఆరోపణ ఉన్నది గావట్టి వాళ్లను కనీసం అరెస్టు జేశే ధమ్ముగూడ లేదాయే మనోళ్లకు..

ఇప్పుడు గన్క టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మార్కెట్ల పొంట వోతె జనం గెదిమికొట్టెతట్టున్నరు.. ఎందుకంటె వడగండ్ల వానకు మార్కెట్ల పొంట ధాన్యం గొట్కపాయేగదా..? తెచ్చినయ్ తెచ్చినట్టు గొనకుంట తమాష జేశ్న సర్కారోళ్ల మీద మంటమీదున్నరు రైతులు.. నిన్న బోనగిరి మార్కెట్ కాడ.. కమిటీ చైర్మన్ను గెద్మినంత పనిజేశిండ్రు..

హరే నీయక ఎటువోతున్నది ఈలోకం ఏం కథ..? నిన్నమొన్న మనం ఎన్ని ముచ్చట్లు జెప్పుకున్నం చిన్నతనం పెండ్లీలు జేస్తే ఎంత ఆగమైతది అని..? అనంతపురం జిల్లా రాయదుర్గం కాడున్న ఒక గుడిలె దేవునికి.. చిన్నపిల్లకు పెండ్లి జేశిండ్రు అయ్యగార్లు.. భక్తజనమంతగల్చి.. బాల్యవివాహ వ్యతిరేక చట్టాలు దేవునికి వర్తించయా ఎట్ల..?

ప్రజలారా ఒక్క ముచ్చట మనం ఓపెన్గ మాట్లాడుకోవాలె.. నిజంగ దేవుడు అనేటాయిననే ఉంటే.. ఆయనకు ప్రజల మీద ప్రేమ అభిమానం.. వాళ్ల కష్టాలు తీర్చాలె అన్న కోరిక ఉంటే.. ఆ శక్తి యుక్తులే ఉంటే.. మిమ్ములను గుడిదాక రప్పిచ్చుకోడు.. చర్చిదాక గుంజుకరాడు మసీదు దాక రావాల్సిందే అని చెప్పడు.. ఆయననే మీ ఇంటికొస్తడుగదా.?? ఈ ముచ్చట ఎందుకంటె.. సూడుండ్రి..

డిగ్రీలు పట్టా సర్టిఫికేట్ గావాల్నా మీకు..? మీరు పుస్తకాలతోని కుస్తి వడి సద్వవల్చిన పనిలేదు.. క్లాసులకు రాకున్నా పర్వాలేదు.. ఖాళీ ఎగ్జాం ఫీజు గడ్తె సాలు మిమ్ములను ఫస్టు క్లాసుల ఫాసు జేపిచ్చె బాధ్యత మాది అంటున్నరు యాదాద్రి జిల్లా మోత్కురు కాడ ఓపెన్ డిగ్రీ పరీక్షల సెంటర్ నిర్వాహకులు.. ఒక పెన్ను పరీక్షకు మూడు వందల రూపాలిస్తె సాలు పేజీలు నిండెదాక రాస్కో.. ఇది కథ..

అబ్బా ఈ జనాలు గూడ ఎంత ఎడ్డోళ్లుగ తయ్యారైండ్రంటే.. గొర్రె కసాయోన్ని నమ్ముతదన్నట్టు.. వీళ్లు గూడ మోసం జేశేటోళ్లనే నమ్ముతుంటరు.. మీరు నాల్గు నాల్గు లక్షల రూపాలు గట్టుండ్రి మీకు సర్కారు నౌకర్లు ఇప్పిస్తాని చెప్పంగనే ఆడీడ అప్పుజేశి తెచ్చి ఆ సుప్పనాతి చేతుల వోశిండ్రు.. అది అందరి పైసలు మూటగట్టుకోని రాత్రికి రాత్రే జంపైంది.. ఇప్పుడు మొత్తుకుంటున్నరు ఇండ్ల తప్పెవ్వల్ది చెప్పుండ్రి..?

శ్రీవారి భక్తులు ఆందోళన పడవద్దు: టీటీడీ ఈవో

తిరుమల : కేంద్ర ప్రభుత్వ యోచన పట్ల తిరుమల శ్రీవారి భక్తుల్లో భయాందోళనలు వద్దని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్ అన్నారు. తిరుమల ఆలయాలన్నీ పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకోవాలని కేంద్ర సర్కారు యోచిస్తోన్న నేపథ్యంలో టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడుతూ... పురావస్తు శాఖ డైరెక్టర్‌ జనరల్ తమకు ఫోన్‌ చేశారని అన్నారు.తిరుమల ఆలయాలను తమ అధీనంలోకి తీసుకునే ఆలోచన లేదని ఢిల్లీ నుంచి ఫోన్‌ చేసి ఆ శాఖ డీజీ చెప్పారని అనిల్‌ కుమార్‌ సింఘాల్ ప్రకటించారు. ఆలయాల అంశంలో జరుగుతోన్న అంశంపై ఆందోళన వద్దని, పురావస్తు శాఖ రాసిన లేఖను ఉపసంహరించుకుందని చెప్పారు.

ఆ వార్తలు అవాస్తవం : జీవీఎల్

ఢిల్లీ : టీటీడీ పరిధిలోకి ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ అధీనంలోకి తీసుకుంటున్నట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు విజ్నప్తి చేస్తేనే కేంద్రం జోక్యం చేసుకుంటుందన్నారు. కాగా టీటీడీ ఆలయాల విషయంలో అన్ని వివరాలను తెలపాలంటు కేంద్ర పురావస్తు శాఖ టీటీడీకి లేఖ రాసిన విషయంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు వివరణ ఇచ్చారు. 

పురావస్తు శాఖ లేఖపై అనుమానాలు : కేఈ

అమరావతి : టీటీడీని తమ అధీనంలోకి తీసుకోవాలన్న కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయం పలు అనుమానాలకు తావిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అనుమానాలు వ్యక్తంచేశారు. తిరుమలకు సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవుసరముందని పేర్కొన్నారు. పురావస్తు శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేఈ తెలిపారు. టీటీడీతో పాటు ఉప ఆలయాలను పరిరక్షించుకునే సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వానికి వుందని డిప్యూటీ సీఎం కేఈ స్పష్టం చేశారు. కాగా టీటీడీకి చెందిన ఆలయాల వివరాలను తెలపాలని కేంద్ర పురావస్తు శాఖ లేఖ రాసిన విషయం తెలిసిందే. 

పురావస్తు శాఖ లేఖపై అనుమానాలు : కేఈ

అమరావతి : టీటీడీని తమ అధీనంలోకి తీసుకోవాలన్న కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయం పలు అనుమానాలకు తావిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అనుమానాలు వ్యక్తంచేశారు. తిరుమలకు సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవుసరముందని పేర్కొన్నారు. పురావస్తు శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేఈ తెలిపారు. టీటీడీతో పాటు ఉప ఆలయాలను పరిరక్షించుకునే సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వానికి వుందని డిప్యూటీ సీఎం కేఈ స్పష్టం చేశారు. కాగా టీటీడీకి చెందిన ఆలయాల వివరాలను తెలపాలని కేంద్ర పురావస్తు శాఖ లేఖ రాసిన విషయం తెలిసిందే. 

టీటీడీకి లేఖపై వెనక్కి తగ్గిన పురావస్తు శాఖ!!

ఢిల్లీ తిరుమల చారిత్రక కట్టడాలపై కేంద్ర పురావస్తు శాఖ వెనక్కి తగ్గింది. సమాచార లోపంతోను టీటీడీకి లేఖ పంపామని ఈవో అనికుమార్ సింఘాల్ కు పురావస్తు శాఖ వివరణ ఇచ్చింది. దీంతో టీటీడీకి ఇచ్చిన ఉత్తర్వులపై వెనక్కి తగ్గింది. కాగా టీటీడీకి చెందిన ఆలయాలు, భవనాల వివరాలన్నీ అందించాలని టీటీడీ ఈవోకు లేఖ రాసింది.

19:28 - May 5, 2018

హైదరాబాద్ : నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల మధ్య ర్యాంకుల యుద్ధం చిలికి చిలికి గాలివానలా మారింది. ఎంసెట్, జేఈఈ ర్యాంకులు సాధించిన శ్రీచైతన్య విద్యార్థుల ర్యాంకులను నారాయణ కాలేజీకి వచ్చిన ర్యాంకులుగా పేపర్‌లో ప్రకటనలు ఇచ్చారని శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బిఎస్‌ రావు ఆరోపించారు. ఇప్పటి వరకు స్టాఫ్‌ని, విద్యార్ధులను తీసుకెళుతున్నా సైలెంట్‌గా వున్నామని.. చివరికి ఫలితాలను కూడా తమ కోటాలో వేసుకుని మీడియాలో చూపించడం దారుణమని శ్రీచైతన్య డైరెక్టర్ సుష్మా మండిపడ్డారు. మరోసారి ఇలా వ్యవహరిస్తే.. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనేపథ్యంలో నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు రెండు పరస్పర విమర్శలు చేసుకుంటు వీధిన పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏంటీ కార్పొరేట్ ర్యాంకుల గోలపై చర్చ. ఈ చర్చలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ టి. మధుసూధన్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీ కోట రమేశ్, ప్రయివేట్ కాలేజ్ అధినేత పార్ధసారధి పాల్గొన్నారు.

 

19:15 - May 5, 2018

కర్ణాటక : ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్‌ ఇందిరాగాంధీ హయాం నుంచి పేదరికం జపం చేస్తోందని ప్రధాని నరేంద్రమోది విమర్శించారు. కర్ణాటకలోని తుముకురు ఎన్నికల సభలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్‌పై విరుచుకు పడ్డారు. రైతులు, పేదలంటే కాంగ్రెస్‌ పట్టింపేలేదని మోది మండిపడ్డారు. గరీబ్‌...గరీబ్‌...గరీబ్‌ అని కాంగ్రెస్‌ చెబుతున్నా...భారత్‌లోని పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. పేదరిక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాక కాంగ్రెస్‌ పేదరికం గురించి మాట్లాడడం మానేసిందని పేర్కొన్నారు. 

19:13 - May 5, 2018

జమ్ముకశ్మీర్‌ : జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ ఛత్తాబల్ ప్రాంతంలో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు ఉదయం కూంబింగ్ నిర్వహించాయి. ఓ ఇంట్లో తలదాచుకున్న ముగ్గురు ఉగ్రవాదులు.. భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డాడు. ముందు జాగ్రత్తగా ఛత్తాబల్ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఎన్‌కౌంటర్‌ జరుగుతున్న ప్రాంతంలో ఓ పౌరుడు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు.

19:00 - May 5, 2018

హైదరాబాద్‌ : ఘరానా మోసానికి పాల్పడుతున్న ముఠాను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉప్పరపల్లి, అత్తాపూర్‌లో హైక్‌ కన్సల్టెన్సీ పేరుతో ఆర్మీ, ఐటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసే.. ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఉద్యోగాల పేరిట బాధితులు ఒక్కొక్కరి నుండి రెండున్నర లక్షలు వసూలు చేశారు. అంతే కాకుండా ఈ ముఠా నకిలీ కరెన్సీని కూడా ముద్రిస్తుందని.. సుమారు 25 లక్షల రూపాయల ఒరిజనల్‌ కరెన్సీకి.. కోటి రూపాయలు నకిలీ కరెన్సీ ఇవ్వడానికి మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారని పోలీసులు తెలిపారు.

18:57 - May 5, 2018

హైదరాబాద్ : పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని.. హైదరాబాద్‌ మహానగరంలో నాలుగు రహదారులను నిర్మిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్‌. అంబర్‌పేట, మెదక్‌, ఆరాంఘర్‌, శంషాబాద్‌ రోడ్డు పనుల విస్తరణ పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతు.. దశాబ్దాల పాటు సమస్యగా ఉన్న ఉప్పల్ క్రాస్ రోడ్స్‌లో స్కైవే, ఎలివేటెడ్‌ కారిడోర్‌తో పాటు.. అంబర్‌పేట్‌లో ఛే నెంబర్‌ వద్ద ఉన్న ఫ్లైఓవర్‌, నర్సపూర్ కూడళ్లలో ఉన్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే పూర్తి చేస్తాయన్నారు కేటీఆర్‌. 

18:53 - May 5, 2018

హైదరాబాద్ : తెలంగాణ సుసంపన్న రాష్ట్రమని, అభివృద్ధి దిశగా వెళ్తోందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరి అన్నారు. అంబర్‌పేట, మెదక్‌, ఆరాంఘర్‌, శంషాబాద్‌ రోడ్డు పనుల విస్తరణ పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు. నీరు, విద్యుత్‌, రవాణా, కమ్యునికేషన్‌ వంటి మౌలిక సదుపాయాలుంటేనే పరిశ్రమలు వస్తాయని...దీంతో పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణలో 36 లక్షల ఎకరాల భూములు సాగునీరు అందుతుందని మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలమవుతుందని గడ్కరి తెలిపారు. 

18:48 - May 5, 2018

ఢిల్లీ : జర్మనీలో కార్ల్‌ మార్క్స్‌ రెండో శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చైనా ప్రభుత్వం బహుకరించిన పదిహేడు అడుగుల మార్క్స్‌ కాంస్య విగ్రహాన్ని ఈ వేడుకల సందర్భంగా ఆవిష్కరించనున్నారు. మార్క్స్‌ జయంతి వేడుకల్ని చూసేందుకు దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు చేరుకుంటున్నారు. కాసేపట్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నారు. 

18:44 - May 5, 2018

ఆదిలాబాద్‌ : గుడిహత్నుర్‌ మండలం గోపాల్‌పూర్‌లో.. క్యాంపు ఆఫీస్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న సుధాకర్‌ పెళ్లి వేడుకలో జిల్లా కలెక్టర్ దివ్య పాల్గొన్నారు. ఈ పెళ్లిలో కలెక్టర్ గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో అటెండర్‌, తోటమాలిగా పనిచేస్తున్న నైతం సుధాకర్‌.. తన పెళ్లికి రావాలని కలెక్టర్‌కు ఆహ్వాన పత్రిక ఇవ్వడంతో కలెక్టర్ దివ్య హాజరయ్యారు. కలెక్టర్ పెళ్లికి రావడంతో గోపాల్‌పూర్‌ ప్రజలు, వధూవరులు, బంధువులు ఆనందంలో మునిగిపోయారు. కలెక్టర్‌ గిరిజనులతో కలిసి భోజనం చేసి, గిరిజనుల సాంప్రదాయ నృత్యం థింసా డాన్స్‌లో మహిళలతో కలిసి ఆడిపాడింది. 

18:42 - May 5, 2018

హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యానికి వెళ్ళిన మహిళపై లైంగిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌ హీరానగర్‌కు చెందిన ముప్పై ఐదేళ్ళ మహిళ భర్త తో గొడవ పడి.. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్ ఫిర్యాదు చేసింది. అనంతంరం చికిత్సకోసం ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళగా..సుమారు తెల్లవారు జామున మూడుగంటల సమయంలో వార్డ్‌ బాయ్‌ నాగరాజు అత్యాచారం చేసినట్లు బాధితురాలి ఫిర్యాదు చేసింది. అఫ్జల్‌ఘంజ్‌ పోలీస్‌ ఔట్‌ పోస్ట్‌లోని హోమ్‌ గార్డ్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో... బాధితురాలి ఇంటికెళ్ళిపోయింది. ఆ తర్వాత నాలుగో తేదీనాడు బంజారా హిల్స్‌ పోలీసులతో కలిసి అఫ్జల్‌ గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడు నాగరాజును అరెస్ట్‌ చేశారు. విధుల్లో నిర్లక్షంగా వ్యవహరించిన హోమ్‌ గార్డ్‌ను కూడా నిందితునిగా నమోదు చేసినట్లు సుల్తాన్‌ బజార్‌ ఏసీపీ చేతన తెలిపారు.

18:40 - May 5, 2018

నల్లగొండ : దోపిడీ సమాజం పోయి.. అసమానతలు లేని సమసమాజం ఏర్పడే దాకా కమ్యూనిజం అజేయంగా ముందుకు సాగుతూనే ఉంటుందన్నారు సీపీఎం రాష్ట కమిటీ సభ్యులు.. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సీపీఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్ల్ మార్క్స్ రెండో శత జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్ల్‌ మార్క్ల్‌ను ప్రపంచమంతా చీడపురుగాలా చూసినా... తినడానికి తిండి లేకపోయినా... చివరిదాకా తన భావాలను వీడలేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడీదారులు ఏకమై అనుసరిస్తున్న వ్యూహాలతో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా అంతిమ విజయం మాత్రం కమ్యూనిజానిదే అన్నారు. 

18:38 - May 5, 2018

ఢిల్లీ : ఫిక్కీ మహిళా విభాగం.. గోల్డెన్ గర్ల్స్ ఆఫ్ బాడ్మింటన్ పేరుతో సైనా నెహ్వాల్, పీవీ సింధూను ఘనంగా సన్మానించింది. ఆణిముత్యాల్లాంటి క్రీడాకారిణులను తయారు చేశారని పుల్లెల గోపీచంద్‌ను కూడా ఫిక్కీ సన్మానించింది. జీవితంలో విజయం సాధించిన మహిళలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరముందని.. అందుకే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఫిక్కీ అధ్యక్షులు పింకీ రెడ్డి తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్‌లో మెడల్ వచ్చిందని.. రానున్న ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధిస్తానని పీవీ సింధూ చెప్పారు. పీవీ సింధూ హార్డ్ వర్కరని... సైనా హార్మోన్ లెవెల్స్, ఎనర్జీ అమోఘమని పుల్లెల గోపీచంద్ అన్నారు.

ఉప్పల్ ట్రాఫిక్ సమస్యలు తీరతాయి : కేటీర్

హైదరాబాద్ : కేంద్రమంత్రి గడ్కరి చేతుల మీదుగా రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేసిన అనతరం సభలో కేటీఆర్ మాట్లాడుతు..ఉప్పల్ కారిడార్ తో ట్రాఫిక్ సమస్యలు తీరిపోతాయన్నారు. 54 జంక్షన్లతో ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నామనీ, రూ.23వేల కోట్లతో స్కైవేలు, ఫ్లైఓవర్లు నిర్మాణాలను చేపట్టామని కేటీఆర్ తెలిపారు. ఎన్ ఆర్డీపీకి కేంద్రం సాయం చేయాలని మంత్రిని కేటీఆర్ కోరారు. కేంద్ర సహాయం చేస్తే ఎన్ఆర్డీపీ త్వరగా పూర్తి చేస్తామన్నారు. మల్టీ మోడల్ లాజిస్టిక్స్, ట్రాన్స్ పోర్టేషన్ తో అభివృద్ది సాధ్యమవుతుందని, నగరంలో మరో 2 ఎలివేటెడ్ కారిడార్ లను నిర్మిస్తామని తెలిపారు.  

నితిన్ గడ్కరికి ధన్యవాదాలు : కేటీఆర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి సహకరిస్తున్న కేంద్రమంత్రికి తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రజలందరిని తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు కేంద్రమంత్రి గడ్కరి చేతుల మీదుగా రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేసిన అనతరం సభలో కేటీఆర్ మాట్లాడుతు..నితిన్ గడ్కరి కార్యదక్షతను కేసీఆర్ పలుమార్లు కొనియాడారని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గడ్కరి మద్దతు లభించిందన్నారు.  

18:14 - May 5, 2018

కడప : అభిమానుల ప్రేమాభిమానాలే తనకు ఆశీస్సులని ప్రముఖ సినీనటి తమన్నా అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సందడి చేశారు. ఓ మొబైల్‌ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తమన్నాను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా తమన్నా విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రొద్దుటూరుకు తాను మొదటిసారిగా వచ్చానని.. ఇక్కడి ప్రజల అభిమానం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. అనంతరం షోరూం నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసి వారిని మరింత ఉత్సాహపరిచారు. మొబైల్‌ షోరూం లక్కీడ్రాలో గెలుపొందిన విజేతలకు ఆమె బహుమతులు అందజేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలిరావడంతో సుమారు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

17:54 - May 5, 2018

హైదరాబాద్ : నగరంలో ట్రాఫిక్ జామ్‌కి చెక్‌ చెప్పేందుకు విస్తృతంగా పనులు జరుగుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లో పలు చోట్ల అండర్ పాస్‌లు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాగా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా రహదారుల విస్తరణ, స్కై వేల పనులకు శంకుస్థాపనలు జరిగాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్, ఉప్పల్ ఫ్లై ఓవర్లకు అలాగే ఆరాంఘర్-మెదక్ రోడ్ల విస్తరణ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, ఎంపీ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం మహ్మమ్మూద్ అలీ, ఎమ్మెల్యేలు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 

టీటీడీకి కేంద్ర పురావస్తు శాఖ లేఖ..

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకు కేంద్ర పురావస్తు శాఖ లేఖ జారీ చేసింది. టీటీడీకి చెందిన ఆలయాలు, భవనాల వివరాలన్నీ అందించాలని టీటీడీ ఈవోకు లేఖ రాసింది. తిరుమలలో కట్టడాలకు రక్షణ కరువైందనీ., టీటీడీ అధికారులు ఇష్టమొచ్చిన రీతిలో పురాతన కట్టడాలను తొలగిస్తున్నారని కేంద్ర పురావస్తుశాఖకు అనేక ఫిర్యాదులు అందటంతో స్పందిన పురావస్తు శాఖ తాజాగా టీడీపీ ఈవో ఏకే సింఘాల్ కు లేఖ రాసింది. 

17:44 - May 5, 2018

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకు కేంద్ర పురావస్తు శాఖ లేఖ జారీ చేసింది. టీటీడీకి చెందిన ఆలయాలు, భవనాల వివరాలన్నీ అందించాలని టీటీడీ ఈవోకు లేఖ రాసింది. తిరుమలలో కట్టడాలకు రక్షణ కరువైందనీ., టీటీడీ అధికారులు ఇష్టమొచ్చిన రీతిలో పురాతన కట్టడాలను తొలగిస్తున్నారని కేంద్ర పురావస్తుశాఖకు అనేక ఫిర్యాదులు అందటంతో స్పందిన పురావస్తు శాఖ తాజాగా టీడీపీ ఈవో ఏకే సింఘాల్ కు లేఖ రాసింది. టీటీడీ పరిధిలోని ఆలయాలు, కట్టడాలకు సంబంధించిన చరిత్రను పరిశీలించిన అనంతరం ఆయా కట్టడాలను రక్షిత కట్టడాలుగా కేంద్ర పురావస్తుశాఖ గతంలో ప్రకటించింది. విలువైన కానుకలు, ఆభరణాలు కూడా భద్రతకు నోచుకోవటం లేదని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రపురావస్తు శాఖ లేఖను రాయటంపై టీటీడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ట్రాఫిక్ సమస్యల చెక్..

హైదరాబాద్ : నగరంలో ట్రాఫిక్ జామ్‌కి చెక్‌ చెప్పేందుకు విస్తృతంగా పనులు జరుగుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లో పలు చోట్ల అండర్ పాస్‌లు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా రహదారుల విస్తరణ, స్కై వేల పనులకు శంకుస్థాపనలు జరిగాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్, ఉప్పల్ ఫ్లై ఓవర్లకు అలాగే ఆరాంఘర్-మెదక్ రోడ్ల విస్తరణ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు.

ర్యాలీని విజయవంతంగా చేయండి : చంద్రబాబు

అమరావతి : దాచేపల్లి ఘటనను నిరసిస్తు చేస్తున్న 'ఆడబిడ్డలకు రక్షణగా కదులుదాం' ర్యాలీని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సోమవారం నాడు జరిగే అందరూ పాల్గొని విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. చట్టాలను కఠినంగా రూపొందిస్తున్నామని, నిందితులు ఎవరైనా సహించేది లేదని పేర్కొన్నారు. కాగా గుంటూరు జిల్లా దాచేపల్లిలోని తొమ్మిదేళ్ల చిన్నారిపై 50ఏళ్ల వృద్దుడు సుబ్బయ్య అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా ప్రభుత్వం ర్యాలీని చేపట్టింది. 

ఆడవారి జోలికి వస్తే ఆశలు వదులుకోవాల్సిందే : బాబు

అమరావతి : దాచేపల్లిలో అత్యాచార ఘటన సమాజానికే మాయని మచ్చ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇలాంటి ఘటనలు ఇకపై రాష్ట్రంలో జరగకుండా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే తాజగా సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. ఆడవారి జోలికెళ్తే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందేనన్న భయం కలగాలని సీఎ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు. జీవితం చాలా విలువైందని... నైతిక విలువలను పెంచుకోవడం, నిశ్శబ్దాన్ని ఛేదించడం ద్వారా ఎయిడ్స్‌ను నియంత్రించామని పేర్కొన్నారు.

16:42 - May 5, 2018

కర్నూలు : దేశంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ కర్నూలులో మహిళలు రోడ్డెక్కారు. నగరంలోని రాజ్‌ విహార్‌ సెంటర్‌లో ఐద్వా సంఘం నేతలు, మహిళలు మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు అధికారం చేపట్టాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. బాలికలపై అఘాయిత్యాలు చేస్తున్న వారిని వెంటనే శిక్షించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 

16:38 - May 5, 2018

తూర్పుగోదావరి : మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. కాకినాడ రూరల్‌లో ఏపీఎస్‌పీలో సివిల్‌ కానిస్టేబుల్‌ పాసింగ్‌ పెరేడ్‌లో పాల్గొన్న అనంతరం హోం మంత్రి మీడియాతో మాట్లాడారు. యూ ట్యూబ్‌ వల్ల చిన్నపిల్లలు కూడా చెడిపోతున్నారని అన్నారు. ఇలాంటి చెడు ప్రభావాలతో మహిళలపై అఘాయిత్యాలు ఇటీవల పెరిగిపోయాయన్నారు హోం మంత్రి. ఇలాంటి సంఘటనల్లో నిందితులు ఎంతటి వారైనా.. ఏపార్టీ వారైనా వదిలిపెట్టమన్నారు.

16:35 - May 5, 2018

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ ప్రతిపక్షాన్ని తొక్కేయాలని చూస్తున్నారని తీవ్రంగా విమర్శించారు సీఎల్పీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్. సీఎల్పీ సమావేశంలో చర్చించిన పలువిషయాలను ఆయన మీడియా ముందు వివరించారు.. హైకోర్టు తీర్పును ప్రభుత్వం, అసెంబ్లీ స్పీకర్‌ గౌరవిస్తూ వెంటనే అమలు చేయాలన్నారు ఉత్తమ్‌కుమార్‌. వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. 

16:30 - May 5, 2018

అమరావతి : పదిహేనవ ఆర్థిక సంఘం నిబంధనలు గురించి చర్చించేందుకు ఈనెల 7న విజయవాడలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జరుగునుంది. ఈ భేటీకి ఏపీ, కేరళ, పుదచ్చేరి, పంజాబ్‌, ఢిల్లీ ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. మరికొన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరవడానికి ఒప్పుకున్నా... కేంద్రం ఒత్తిడి కారణంగా రాలేని పరిస్థితి ఏర్పడిందని ఏపీ ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఈవిధంగా చేయడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం నిబంధనలను వ్యతిరేకిస్తున్నట్టు కుటుంబరావు ప్రకటించారు. రాష్ట్రాల ఆర్థిక లోటును భర్తీ చేయకుండా చూసే విధంగా 15వ ఆర్థిక సంఘానికి నిబంధన విధించడాన్ని తప్పు పట్టారు. 

16:19 - May 5, 2018

హైదరాబాద్ : తమ సమస్యలపట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. దాదాపు 54 ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నేతలు ఇవాళ సెక్రటేరియట్‌లో మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 34 డిమాండ్లపై చర్చ జరిగింది. సీపీఎస్‌ రద్దు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చర్చల్లో పాల్గొన్న మంత్రులు ఉపాధ్యాయ నేతలకు హామీనిచ్చారు. పదోన్నతులు, బదిలీలు చేపట్టేందుకు ఎదురవుతున్న న్యాయపరమైన చిక్కులను తొలగించి... షెడ్యూల్‌ విడుదల చేయాలని ఉపాధ్యాయ నేతలు కోరారు. ఇందుకు మంత్రులు సానుకూలంగా స్పందించారు. పీఆర్‌సీని వీలైనంత త్వరగా వేయడానికి మంత్రివర్గ ఉపసంఘం హామీనిచ్చింది. 

సీఎల్పీలో వాడి వేడీ చర్చ..

హైదరాబాద్ : సీఎల్సీ సమావేశంలో చర్చలు వాడీ వేడీగా కొనసాగుతున్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేలు సభ్వత్యం కోల్పోతే..కాపాడుకోలేకపోయారని..పార్టీ ఎమ్మెల్యేలనే కాపాడుకోలేనివారు ప్రజలకు భరోసా ఎలా ఇస్తారని సీఎల్పీలో ఎమ్మెల్యే సంపత్ ప్రశ్నించారు. ఈ క్రమంలో జానారెడ్డి కల్పించుకుని సభ్వత్వం రద్దుపై పార్టీ పట్టించుకోవటంలేదనటం సరికాదని సంపత్ కు సర్ధిచెప్పారు. పార్టీ అభిషేక్ సింఘ్విని హైకోర్టుకు పంపిందని జానారెడ్డి తెలిపారు. 

బుల్లితెరకు నంది అవార్డులు..

హైదరాబాద్ : బుల్లితెరకు నంది అవార్డుల ప్రకటన వెలువడింది. 2014,2015,2016 సంవత్సరాలకు గాను నంది అవార్డుల ప్రకటన వెలువడింది. 2014లో 3 కేటగిరిల్లో 70 అవార్డులు. 2015లో 8 కేటగిరిల్లో 82 అవార్డులు, 2016లో 6 కేటగిరిల్లో 102 అవార్డులు వచ్చినట్లుగా ప్రకటన వెలువడింది. బెస్ట్ టెలీఫిలింగా మహిమాన్వితుడు, ఉత్తమ టీవీ డాక్యుమెంటరీగా మార్గదర్శి, రెండో ఉత్తమ టెలీఫిలింగా గుర్తుందా, ఉత్తమ టీవీ ఫీచర్ టెలీఫిలింగా లక్ష్యం, ఉత్తమ స్క్రీప్లేగా సీతామహాలక్ష్మీ, ఉత్తమ మెగా సీరియల్ మోగి వేమన, ఉత్తమ ఫిమేల్ యాంకర్ గా ఢీ జూనియర్స్ గా నిహారికా లకు నంది అవార్డుల ప్రకటించారు.  

రోగిపై ఆసుపత్రిలో సామూహిక అత్యాచారం..

హైదరాబాద్ : ఆఫ్జల్ గంజ్ ఉస్మానియాలో దారుణం చోటుచేసుకుంది. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన యువతిపై వార్డ్ బోయ్, హోమ్ గార్డు, అంబులెన్స్ డ్రైవర్ రు కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.  

చికెన్ షాపులో దారుణం..

హైదరాబాద్ : వనస్థలిపురం పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పనామా చికెన్ షాపులో ఓ వ్యక్తిని గిరి అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. అనతరం గిరి పరారాయ్యాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

భూసేకరణకు తగిన పరిహారం ఇవ్వాలి : మధు

విజయవాడ : ప్రెస్ క్లబ్ లో వ్యవసాయ కార్మికులు, రైతు సంఘాల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతు..రైతుల నుండి ప్రభుత్వం 4 లక్షల ఎకరాలకు పైగా సేకరించిందనీ కానీ 2013 భూసేకరణ చట్టంకింద ద్వారా వచ్చే పరిహారం మాత్రం చెల్లించలేదని ఆరోపించారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించిందనీ..కోర్టు ఆదేశాన్ని పాటించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మధు హెచ్చరించారు. 

న్యాయవాదులకు ఆరోగ్య బీమా : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్ : న్యాయవాదులకు ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. న్యాయవాదుల సంక్షేమ పథకాల అమలుపై ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదులకు ఆరోగ్య, ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం, బార్ అసోసియేషన్లకు మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించినట్లు తెలిపారు. న్యాయవాదితో పాటు ఆయన జీవిత భాగస్వామికి రూ. 2 లక్షల వరకు ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నారు. మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు ప్రమాద బీమా పథకం కింద రూ. 10 లక్షలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. 

ఏసీబీ వలలో డిప్యూటీ తహశీల్దార్..

మహబూబ్‌నగర్ : ఏసీబీ వలకు డిప్యూటీ తహశీల్దార్ రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. రేషన్ డీలర్ నుంచి రూ. లక్ష తీసుకుంటుండగా కృష్ణమోహన్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పద్మావతి కాలనీలోనే కృష్ణమోహన నివాసంలోనే ఈ ఘటన జరిగింది. అనంతరం తహశీల్దార్ నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. 

బరితెగించిన మహిళ రోజా : యరపతినేని

గుంటూరు : దాచేపల్లి ఘటన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మహిళా మంత్రులు, పోలీసులపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు ఖండించారు. రోజాను మహిళ అని చెప్పడానికి కూడా సిగ్గుచేటనీ..ఆమె ఒక బరితెగించిన మహిళ అని తీవ్రంగా విమర్శించారు. ఒక శాసనసభ్యురాలై ఉండి.. అసెంబ్లీ సాక్షిగా ఆమె మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు చేసిన మనిషిని మహిళ అంటారా? అని ప్రశ్నించారు. వైసీపీకి గానీ, రోజాకు గానీ ఏ సంఘటన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. దాచేపల్లి సంఘటనలో ముందుగా బాధిత బాలికకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి.

భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి..

జమ్మూకశ్మీర్ : శ్రీనగర్ చట్టాబాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో బలగాలు అక్కడ కూంబింగ్ నిర్వహించాయి. దీంతో ఓ ఇంట్లో తలదాచుకున్న ముగ్గురు ఉగ్రవాదులు.. భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు కూడా కాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఎదురుకాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డాడు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. ముందు జాగ్రత్తగా చట్టాబాల్ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు పోలీసులు.

బాబుకు 'స్టంట్' వేయాలా? వద్దా?..

విజయవాడ : సైకిల్ యాత్ర సందర్భంగా టీడీపీ ఎంపీ మాగంటి బాబు గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను విజయవాడలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రమేష్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ రమేష్ తెలిపారు. మరో రెండు రోజులు చికిత్స కొనసాగించిన తర్వాత స్టంట్ వేయాలా? వద్దా? అనే విషయాన్ని నిర్ణయిస్తామని చెప్పారు. మరో 48 గంటల పాటు మాగంటి బాబుకు పూర్తి విశ్రాంతి అవసరమని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి నాయకులు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

14:53 - May 5, 2018

హైదరాబాద్‌ : గ్యాంగ్ స్టర్ నయీం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నయీం కేసులో విచారణ కొనసాగుతునే వుంది. ఈ నేపథ్యంలో మరోసారి నయీం అనుచరులు, బంధువులు బెదిరింపులకు పాల్పడుతున్నారనే సమచారంతో ఈ కేసులో కీలకంగా వున్న నయీం కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు. నయీం కోడలితో పాటు అల్లుడు ఫాయీమ్, మరో అనుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి వంటి పలు జిల్లాలో గ్యాంగ్ స్టర్ నయీం చేసిన భూదందాలు, అరాచకాలు, అక్రమాలకు అంతులేదు. ఈ క్రమంలో పాత పరిచయస్తులకు కలిసేందుకు వచ్చిన నయీంను పక్కా సమాచారంతో ప్రణాళిక వేసిన పోలీసులు పట్టుకునేందుకు యత్నించగా నయీం గ్యాంగ్ కాల్పులకు యత్నించటంలో పోలీసులు కూడా కాల్పులు జరిపిన ఘటనలో నయీంతోపాటు పలువురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో నయీం సంబంధించిన ఇన్విస్టిగేషన్ కు సిట్ ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీంతో నయీం అక్రమాలకు బలైపోయిన వందలాదిమంది వెలుగులోకి వచ్చి ఫిర్యాదులు చేశారు. కాగా 2016లో గ్యాంగ్ స్టర్ నయీంను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. నయీం ఎన్ కౌంటర్ అనంతరం కోట్లకొద్ది నగదు, వేలాది ఎకరాల డాక్యుమెంట్స్ తో పాటు కోట్లాది విలువ చేసే ఆస్తులను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నవిషయం తెలిసిందే. 

నయూం కోడలు అరెస్ట్..

హైదరాబాద్‌ : గ్యాంగ్ స్టర్ నయీం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నయీం కేసులో విచారణ కొనసాగుతునే వుంది. ఈ నేపథ్యంలో మరోసారి నయీం అనుచరులు, బంధువులు బెదిరింపులకు పాల్పడుతున్నారనే సమచారంతో ఈ కేసులో కీలకంగా వున్న నయీం కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు. నయీం కోడలితో పాటు అల్లుడు ఫాయీమ్, మరో అనుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఆంబోతులు : రోజా

విజయవాడ : దాచేపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని...నిందితులను పట్టుకోలేకపోయారని విమర్శించారు. చంద్రబాబుకు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. దాచేపల్లిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్య టీడీపీ పార్టీ సభ్యుడు అని తెలిపారు. ఈ నిజాలకు యరపతినేని, నన్నపనేని ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. తమ పోరాటం వల్లే టీడీపీ నేతలు బాధిత బాలికను పరామర్శించారు. టీడీపీ నేతలు నీళ్లులేని బావిలో దూకాలన్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఆంబోతులు అని మండిపడ్డారు. 

14:11 - May 5, 2018

విజయవాడ : దాచేపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని...నిందితులను పట్టుకోలేకపోయారని విమర్శించారు. చంద్రబాబుకు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. దాచేపల్లిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్య టీడీపీ పార్టీ సభ్యుడు అని తెలిపారు. ఈ నిజాలకు యరపతినేని, నన్నపనేని ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. తమ పోరాటం వల్లే టీడీపీ నేతలు బాధిత బాలికను పరామర్శించారు. టీడీపీ నేతలు నీళ్లులేని బావిలో దూకాలన్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఆంబోతులు అని మండిపడ్డారు. ఏడీఆర్ ఇచ్చిన రిపోర్టులో అచ్చెన్నాయడు, దేవినేని ఉమా పేర్లు ఉన్నాయన్నారు. 'నీవు ప్రతిపక్షంలో ఉండి చేస్తే పోరాటాలా.. మేము చేస్తే రాజకీయాలా అని చంద్రబాబును రోజా ప్రశ్నించారు. రాజకీయం చేస్తుంది తాము కాదని.. మీరని టీడీపీ నేతలు ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు పోలీసు శాఖ రక్షణ ఇవ్వలేకపోతుందని విమర్శించారు. టీడీపీ నేతలు మహిళలను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. తమ పోరాటం వల్లే చంద్రబాబు స్పందించారని చెప్పారు. ఐపీఎస్ ఆఫీసర్ బాలసుబ్రమణ్యంపై దాడి కేసులో సీఎం సెటిల్మెంట్ చేశారని అన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. 

13:52 - May 5, 2018

హైదరాబాద్‌ : ఎంబీభవన్‌లో కార్ల్‌మార్క్స్‌ ద్విశత జయంతి వేడుకలను సీపీఎం నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్క్స్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మార్క్స్‌ సిద్ధాంతాలను సీపీఎం నేతలు గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో కొనసాగుతోన్న అణచివేతకు వ్యతిరేకంగా సీపీఎం చేస్తున్న కృషిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతిజ్ఞ తీసుకున్నామన్నారు. 20వ శతబ్దాన్ని ఒక కుదుపు కుదిపి, మరో మార్గం పట్టించి ప్రపంచం స్వరూపాన్ని మార్చేసిన ఘనత మార్క్సిజందే అని సీపీఎం పోలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు కొనియాడారు. 

 

13:44 - May 5, 2018

మహబూబ్ నగర్ : ఒక వ్యక్తి నుండి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు మహబూబ్‌నగర్‌ జిల్లా మద్దూరు.... దామరగిద్ద గండీడ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసిల్దార్‌ కృష్ణ మోహన్‌. రేషన్‌ బియ్యం పంపిణీలో అవకతవకలు జరుగుతున్నట్లు రిపోర్ట్స్‌ తయారు చేస్తానని డీలర్స్‌ను బెదిరించాడు కృష్ణమోహన్‌. రిపోర్ట్‌ తయారు చేయకుండా ఉండాలంటే లంచం ఇవ్వాంటూ డీలర్లను డిమాండ్ చేశాడు. దీంతో డీలర్లు ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో ఇవాళ ఉదయం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

 

13:41 - May 5, 2018

హైదరాబాద్ : తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా  పాల్గొన్న  నేతలకు ఇప్పుడు  టెన్షన్ పట్టుకుంది.  ఉద్యమ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై కోర్టు ఓ  యువనేతకు శిక్ష విధించడం  అధికార పార్టీ నేతలను కలవరపెడుతోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసులు ఎత్తి వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో... ఉద్యమ నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. 
ఉద్యమ సమయంలో కార్యకర్తలపై కేసులు 
టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు, నేతలకు  కేసుల భయం పట్టుకుంది.  రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమ సంమయంలో ఎంతో మంది గులాబి పార్టీ కార్యకర్తలపై పోలీసు కేసులు నమోదయ్యాయి. తెలంగాణా వ్యాప్తంగా జరిగిన వివిధ ఆందోళనల్లో  వారు ప్రత్యక్షంగా పాల్గొనడంతో పోలీసులు అప్పట్లో కేసులు నమోదు చేశారు.  ఉద్యమ ఆకాంక్ష నెరవేరింది. ఉద్యమాన్ని ముందుండి నడిపించిన గులాబి పార్టీకి తెలంగాణాలో అధికార పగ్గాలు దక్కాయి. కాని ఉద్యమకారులపై ఉన్న కేసులు మాత్రం ఇంకా  కొలిక్కి రాలేదు. 
అమలుకు నోచుకోని కేసుల ఎత్తివేత నిర్ణయం 
అప్పట్లో నమోదైన కేసులను పూర్తిగా ఎత్తి వేయాలన్న ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నా అది ఇంకా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకో లేదు. కొంత మందిపై ఉన్న కేసులు  మాత్రమే  నిబంధనల ప్రకారం ఎత్తి వేసేందుకు పోలీసులు, న్యాయశాఖ చొరవ చూపాయి. ఇంకా వందలాది మంది గులాబి పార్టీ కార్యకర్తలు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.   మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విద్యార్థి విభాగం నేత మున్నూరు రవికి కోర్టు ఇటీవల ఆరు నెలల జైలు శిక్ష, జరిమానా విధించింది. దీంతో  కేసులు ఎదుర్కొంటున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో మరోసారి  టెన్షన్  మొదలైంది.  రాష్ట్ర ఆకాంక్ష నెరవేరినా....రాష్ట్ర సాధన కోసం తాము చేసిన  పోరాటంలో దోషులుగా నిర్ధారణ కావడంతో  జీవితాంతం తాము నేరగాళ్లుగా ముద్రవేసుకున్నట్లు అవుతుందన్న ఆందోళన ఉద్యమ నేతలను వెంటాడుతోంది. 
4ఏళ్లయినా కొలిక్కిరాని కేసులు 
టీఆర్‌ఎస్‌ అధికార పగ్గాలు చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతున్నా...  ఉద్యమ కారుల కేసులు కొలిక్కి రాకపోవడం వెనుక పార్టీలో  ఉన్న గ్రూపు రాజకీయాలు కూడా  ఓ కారణమన్న వాదన వినిపిస్తోంది. గులాబిపార్టీలో చేరిన బయటి నేతలు .. ఉద్యమ కారులపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ప్రభుత్వ పరంగా జరుగుతున్న జాప్యం , పోలీసు శాఖ వ్యవహరిస్తున్న తీరుతో  ఉద్యమ నేతలపై ఉన్న కేసుల వ్యవహారం  అధికార పార్టీలో మరోసారి  చర్చనీయంశంగా మారింది.

 

13:35 - May 5, 2018

గుంటూరు : దాచేపల్లి ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. బాలిక తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమన్నారు. జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాలికను సీఎం పరామర్శించారు. బాలికకు మనోధైర్యం చెప్పారు. దాచేపల్లి అత్యాచార ఘటనపై వెంటనే స్పందించామని తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. తప్పు చేసినవాడు తప్పించుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే వారికి అదే అఖరిరోజు అవుతుందన్నారు. అఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణాలు పోతాయన్న భయం రావాలన్నారు. బాధితురాలికి సంఘీభావంగా సోమవారం ప్రతి మండలంలో ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిస్తున్నామన్నారు. 

 

13:17 - May 5, 2018

కర్నాటక : సినిమాలోనే కాదు... రియల్ లైఫ్ లోనూ మంచి పొలిటీషియన్ అనిపించుకుంటానని హీరో, బీజేపీ అభ్యర్థి సాయికుమార్ అన్నారు. బాగేపల్లిని భాగ్యనగరంగా మార్చడమే తన సంకల్పం అన్నారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని తెలిపారు. రాజ్యాంగాన్ని రంచించిన అంబేద్కర్ తనకు స్ఫూర్తి మంచి కోసం సిద్ధాంతపరంగా పోరాడుతానని చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సినీరంగంలోకి వచ్చానని తెలిపారు.

 

13:00 - May 5, 2018

బద్వేలులో యువతిపై అత్యాచారం

కడప : బద్వేలులోని సుందరయ్య కాలనీలో దారుణం జరిగింది. 17 ఏళ్ల యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కూచిబొట్ల హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

అమెరికా : హైదరాబాదీ టెకీ శ్రీనివాస్ కూచిబొట్ల హత్య కేసులో నిందితుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గతేడాది మిడ్ వెస్ట్రన్ ప్రాంతంలో జాతి వివక్షతో ప్యూరింటన్ కాల్పులకు పాల్పడ్డాడు.  

ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం

హైదరాబాద్ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం అయ్యారు. ఉపాధ్యాయుల సమస్యలపై చర్చిస్తున్నారు. 

 

కారల్ మార్క్స్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బివి.రాఘవులు

హైదరాబాద్ : మానవ పరిణామ క్రమంలో శ్రమ పాత్ర కీలకమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. ఎంబీ భవన్ లో నిర్వహించిన కారల్ మార్క్స్ 200వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. భావాల్లో సంఘర్షణ జరుగుతుందని ఎగెల్ చెబితే.. భౌతిక పరిస్థితుల్లో సంఘర్షణ జరుగుతుందని కారల్ మార్క్స్ తెలిపారని చెప్పారు. శ్రమ వల్లే మానవులు అభివృద్ధి సాధించారని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో శ్రమ అంటే హేయభావం ఉందన్నారు.

 

11:54 - May 5, 2018

కృష్ణా : విజయవాడలో పదేళ్ల క్రితం జరిగిన విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు ఎప్పటికి తేలుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. హైకోర్టు ఆదేశాలతో.. రంగంలోకి దిగిన సిట్ బృందం విచారణ ప్రారంభించింది. అయితే.. ఇప్పటివరకూ విచారణ ముందుకు సాగడమే లేదు. దశాబ్ద కాలంగా వివిధ మలుపులు తిరుగుతోన్న ఈ కేసులో నిందితులెవరో తేలుతుందా..? బాధితులకు న్యాయం జరుగుతుందా..?  
పదేళ్ళ క్రితం అయేషామీరా హత్య
పదేళ్ళ క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అయేషా మీరా హత్య రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం కలిగించింది. 2007 డిసెంబర్ 26న రాత్రి ఇబ్రహీంపట్నంలోని హాస్టల్‌లో.. గుర్తు తెలియని నిందితులు.. ఆయేషా మీరాపై అత్యాచారం చేసి.. హత్య చేశారు. రోకలి బండతో తలపై మోది దారుణంగా హతమార్చారు. ఘటన స్థలంలో  సేకరించిన వీర్యం సత్యంబాబుదే అని విచారణ జరిపిన పోలీసులు నిర్ధరించారు. ఆమేరకు సత్యంబాబుకు శిక్షకూడా పడింది. అయితే.. హైకోర్టుకు అప్పీలుకు వెళ్లడంతో.. సత్యంబాబు నిర్దోషిగా విడుదలయ్యాడు. ఈ కేసు దర్యాప్తు వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో.. కేసును మళ్లీ మొదటి నుంచీ దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీకాంత్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది.
హాస్టల్‌లోని కొందరి సహకారంతోనే అఘాయిత్యం : అయేషా తల్లి ఆరోపణ
ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ బృందం.. 2018 ఫిబ్రవరి 6న హాస్టల్‌ పరిసరాలను, గదులను పరిశీలించింది. ఆ తర్వాత విచారణలో ఎలాంటి పురోగతీ కనిపించలేదు. హాస్టల్‌లోని కొందరి సహకారంతోనే తమ కూతురిపై అఘాయత్నం చేశారని అయేషా తల్లి గతంలోనే ఆరోపించారు. నిజానికి ఈ కేసు విచారణలో.. పోలీసుల తీరు పలు ప్రశ్నలను రేకెత్తించింది. ఆయేషాపై అత్యాచారం చేసి, హతమార్చేటప్పుడు ఆమె అసలు అరవలేదా..? ఆమె అరుపులు.. కేకలు హాస్టల్‌లోని ఇతరులకు వినబడవా అన్న ప్రశ్నే పోలీసుల ఊహల్లో మెదలలేదు. రెండో అంతస్తు వరండాలోని గ్రిల్‌కు తాళం వేసినా.. నిందితులు పైకి ఎలా వచ్చారన్నది కూడా పోలీసులు తేల్చలేదు. కేసులో కీలక నిందితుడిగా పోలీసులు అభియోగం మోపిన సత్యంబాబు తన సొంత ఊరిలో సామూహిక ప్రార్థనలో పాల్గొన్నట్టు సాక్ష్యాలున్నా.. నందిగామ నుంచి ఇబ్రహీంపట్నం వచ్చి నేరం చేసినట్లు పోలీసులు నిర్ధరించుకున్నారు. సత్యంబాబు అరెస్టైన  సమయంలోనే నందిగామకు చెందిన కానిస్టేబుల్‌కు ఏఎస్సైగా పదోన్నతి వచ్చింది. దీంతో గతంలో ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులు, సిబ్బంది పాత్రపైనా  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  
2018 ఏప్రిల్ 28 లోపు దర్యాప్తు పూర్తి చేయాలన్న కోర్టు
2018 ఏప్రిల్ 28 లోపు దర్యాప్తు పూర్తి చేయాలని సిట్‌ అధికారులకు కోర్టు డెడ్ లైన్ విధించింది. 2018 ఫిబ్రవరి 6 నుంచి కేసుపై దృష్టిసారించిన సిట్‌ బృందం.. గడువు దాటినా దర్యాప్తులో ఎలాంటి పురోగతినీ సాధించ లేదు. సిట్‌ కూడా పాతపద్ధతినే అనుసరిస్తోందన్నఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒత్తిళ్ళకు తలొగ్గకుండా  దోషులకు శిక్షపడేలా చూడాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. ఆయేషా కుటుంబానికి న్యాయం జరిగే దాకా అండగా ఉంటామని ఏపీ మహిళా కమిషన్ కూడా ప్రకటించింది. 
నాకు జరిగిన నష్టానికి పరిహారమే అందించలేదన్న సత్యంబాబు
మరోవైపు, ఈ కేసులో, చేయని నేరానికి శిక్ష విధించి.. కోర్టు మొట్టికాయలు వేయడంతో.. తనను నిర్దోషిగా విడుదల చేసిన ప్రభుత్వం.. తనకు జరిగిన నష్టానికి పరిహారమే అందించలేదని సత్యంబాబు అంటున్నాడు. తాను దళితుడిని కాబట్టే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సత్యం బాబు ఆవేదన చెందుతున్నాడు. ఈ కేసులో దోషులను గుర్తించి, ఆయేషా కుటుంబానికి  న్యాయం చేయాలని సత్యంబాబు కోరుతున్నాడు.. ఆయేషా కేసులో న్యాయం చేయకుంటే.. మళ్లీ రోడ్డెక్కి ఉద్యమిస్తామని మహిళా సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. 

 

11:41 - May 5, 2018

హైదరాబాద్ : మానవ పరిణామ క్రమంలో శ్రమ పాత్ర కీలకమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. ఎంబీ భవన్ లో నిర్వహించిన కారల్ మార్క్స్ 200వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. భావాల్లో సంఘర్షణ జరుగుతుందని ఎగెల్ చెబితే.. భౌతిక పరిస్థితుల్లో సంఘర్షణ జరుగుతుందని కారల్ మార్క్స్ తెలిపారని చెప్పారు. శ్రమ వల్లే మానవులు అభివృద్ధి సాధించారని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో శ్రమ అంటే హేయభావం ఉందన్నారు.

 

జీజీహెచ్ లో అత్యాచార బాలికను పరామర్శించిన సీఎం చంద్రబాబు

గుంటూరు : దాచేపల్లి అత్యాచార బాలికను సీఎం చంద్రబాబు పరామర్శించారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను సీఎం పరామర్శించారు. బాలికకు, ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. 

11:30 - May 5, 2018

గుంటూరు : దాచేపల్లి అత్యాచార బాలికను సీఎం చంద్రబాబు పరామర్శించారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను సీఎం పరామర్శించారు. బాలికకు, ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరిగితే నిందితులను కఠినంగా శిక్షించాల్సిందేనని హెచ్చరించారు. ఇప్పటికే నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు.

 

11:13 - May 5, 2018

హైదరాబాద్ : సీపీపీ ప్రాజెక్టు పనులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. చార్మినార్‌ పెడెస్టేరియన్‌ ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. లాడ్‌ బజార్‌, ముర్గిచౌక్‌, చార్‌కమాన్‌, క్లాక్‌టవర్‌, మొజంజాహి మార్కెట్‌ పునర్‌నిర్మాణ పనులను సీఎస్‌కు వివరించారు ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌. గడువులోగా చార్మినార్‌ ప్రాజెక్టు పనులను పూర్తిచేయాలని సీఎస్‌ అధికారులకు ఆదేశించారు. సీఎస్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

11:07 - May 5, 2018

హైదరాబాద్ : సనత్ నగర్ ఆర్ ఎస్ బ్రదర్స్ గోడౌన్ లో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

 

కాసేపట్లో దాచేపల్లి అత్యాచార బాలికను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు

గుంటూరు : దాచేపల్లి అత్యాచార బాలికను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. కాసేపట్లో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి సీఎం చేరుకోనున్నారు. జీజీహెచ్ లో బాలిక చికిత్స పొందుతోంది. బాలికను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. ఇప్పటికే నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. 

10:47 - May 5, 2018

గుంటూరు : దాచేపల్లి అత్యాచార బాలికను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. కాసేపట్లో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి సీఎం చేరుకోనున్నారు. జీజీహెచ్ లో బాలిక చికిత్స పొందుతోంది. బాలికను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. ఇప్పటికే నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు శోభరాణి మాట్లాడుతూ ప్రధాని మోడీ అత్యాచార నిందితులను రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మోడీ ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలోనే కాదు..దేశ వ్యాప్తంగా అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. దాచేపల్లి అత్యాచార నిందితుడు తనకు తానుగా శిక్ష వేసుకోవడం చారిత్రక ఘట్టమన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా 420 అని ఘాటుగా వ్యాఖ్యానించారు. వైసీపీలోని వారందరూ అక్రమాస్తుల కేసులో నిందితులని.. నిందితులందరూ కలిసి పార్టీ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రోజాను తప్ప మరే మహిళ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయలేదన్నారు. వైసీపీ నేతలు శాంతిని విచ్ఛిన్నం చేస్తూ క్యాండిల్ ర్యాలీలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉండి ఏపీలోని సమస్యల గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదన్నారు. చట్టాలు బాగున్నాయి..వాటిని అమలు చేసేవారు ఫెయిల్ అవుతున్నారని పేర్కొన్నారు. 

 

10:01 - May 5, 2018

శ్రీకాకుళం : ఆముదాలవలసలో మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ పర్యటించారు. రైతు సమస్యలను అధ్యయనం చేస్తున్నారు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీ రైతులతో లక్ష్మీనారాయణ సమావేశం అయ్యారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. 

09:14 - May 5, 2018

గుంటూరు : దాచేపల్లి అత్యాచార బాలికను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. కాసేపట్లో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి సీఎం చేరుకోనున్నారు. జీజీహెచ్ లో బాలిక చికిత్స పొందుతోంది. బాలికను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. ఇప్పటికే నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు.

08:58 - May 5, 2018

గుంటూరు : పట్టణంలోని ఒమెగా హాస్పిటల్‌ అండాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళకు అరుదైన ఆపరేషన్‌ చేశారు. గుంటూరుకు చెందిన మహిళకు అండాశయ క్యాన్సర్‌ సోకడంతో.. రెండుసార్లు కీమోథెరపీతో పాటు ఆపరేషన్‌ చేయించుకుంది. అయినా మళ్లీ వ్యాధి తిరగబెట్టడంతో.. ఒమెగా హాస్పటిల్‌ సర్జికల్‌ అంకాలజిస్ట్‌ డాక్టర్‌ నాగకిశోర్‌ ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు చేసి.. ఆపరేషన్‌ చేశారు. అమెరికా నుండి తెప్పించిన బెల్మెంతో కంపెనీకి చెందిన పరికరాలతో సర్జరీ విజయవంతంగా చేశామని.. అత్యంత వైద్య విధాన పరికరాలతోనే సర్జరీ సాధ్యమైందన్నారు. క్యాన్సర్‌ చికిత్సలో అత్యాధునికి వైద్య విధానాలు అందించడంలో ఒమెగా హాస్పిటల్‌ ముందుంటుందని నాగకిశోర్‌ అన్నారు. 

08:54 - May 5, 2018

నల్గొండ : అధికారుల ఆలసత్వం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల రైతులకు సబ్సిడీ పై అందాలిసిన యూరియా నీటిపాలైంది. ముంబై నుంచి గూడ్స్ రైలులో 2600 టన్నుల ఆర్ సీఎఫ్ యూరియా మిర్యాలగూడ రైల్వేస్టేషన్ కు చేరుకుంది. వాస్తవానికి జడ్చర్లకు కేటాయించిన ఈ యూరియా అక్కడ గోదాములో స్థలం లేక పోవడం, హమాలీల కొరత వల్ల మిర్యాలగూడకు తరలించారు. ఇక్కడ కూడా లారీల కొరత ఉండడంతో 15 వందల టన్నుల యూరియాను మాత్రమే గోదాములకు తరలించారు. మిగతా 1000 టన్నుల యూరియా ను ఆరుబయటే ఉంచారు. దీంతో రెండు రోజులగా పడిని   అకాల వర్షంతో టన్నుల కొద్ది యూరియా  నీటపాలైంది. 

 

08:52 - May 5, 2018

కరీంనగర్ : జిల్లాలో టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. పట్టణంలోని హోల్‌సేల్‌ పండ్ల దుకాణాలు, రెస్టారెంట్లపై దాడులు చేశారు. చైనాకు చెందిన ఆర్గానిక్ కెమికల్స్ సాయంతో పండ్లను మగ్గబెడుతున్నట్లు గుర్తించిన అధికారులు పలు దుకాణాలను సీజ్ చేశారు.  దాంతోపాటు ముకరపురలో నూతనంగా వెలిసిన క్లాసిక్ రెస్టారెంట్‌లోనూ సోదాలు చేశారు. కుళ్లిపోయిన మాంసం నిల్వలను అధికారులు గుర్తించి సీచ్‌ చేశారు. ఈ దాడుల్లో  టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు సానిటేషన్, ఫుడ్ ఇన్స్ పెక్టర్లు కూడా పాల్గొన్నారు.

 

08:50 - May 5, 2018

హైదరాబాద్ : పోలీసులు ఎంత కట్టడి చేసినా, కేసులు పెట్టినా మందుబాబుల్లో మార్పు రావడంలేదు. వీకెండ్‌లో పూటుగా మందుకొట్టి రోడ్లపైకి వచ్చేస్తున్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రోడ్‌నంబర్‌ 45లో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో జంట్స్‌ తోపాటు లేడీస్‌కూడా పట్టుబడ్డారు. మందుకొట్టి వాహనం నడుపుతూ దొరికిపోయారు. ఈ తనిఖీల్లో 40కార్లు, 51 బైక్‌లును పోలీసులు సీజ్‌ చేశారు. 

 

ఉగ్రవాదులు, భద్రతాదళాలకు మధ్య ఎదురు కాల్పులు

జమ్మూకాశ్మీర్ : శ్రీనగర్ చట్టాబాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతాదళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

వినాయక్ నగర్ లో పోలీసులు కార్డెన్ సర్చ్

హైదరాబాద్ : నేరెడ్ మెట్ పీఎస్ పరిధిలోని వినాయక్ నగర్ లో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. 170 మంది పోలీసులతో తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు రౌడీషీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 55 బైకులు, ఆటో, కారు, 4 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. 

08:18 - May 5, 2018

తెలంగాణలో టీడీపీ బలహీనపడిందని వక్తలు అభిప్రాయపడ్డారు. టీటీడీపీ విస్తృతస్థాయి సమావేశం..సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..ఎన్నికల పొత్తులు.. అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు వినయ్ కుమార్, టీకాంగ్రెస్ నేత ఇందిరా శోభన్, టీడీపీ నేత శ్రీరాములు పాల్గొని, మాట్లాడారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

సనత్ నగర్ ఆర్ ఎస్ బ్రదర్స్ గోదాంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : సనత్ నగర్ ఆర్ ఎస్ బ్రదర్స్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

07:49 - May 5, 2018

మొహాలీ : మొహాలీ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టు సమయంలో సత్తా చాటింది. పంజాబ్‌ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 175 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆ జట్టు 19 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 57,  కృనాల్‌ పాండ్య  31 పరుగులు చేసి ముంబై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు    క్రిస్‌ గేల్‌ 50,  స్టాయినిస్‌ 29 పరుగులతో రాణిచడంతో పంజాబ్‌ కింగ్స జట్టు 20ఓవర్లలో  6 వికెట్లకు 174 పరుగులు చేసింది. టార్గెట్‌ ఛేదనలో ముంబైకి సూర్యకుమార్‌ మంచి ఆరంభాన్నిచ్చాడు. పది పరుగులతో  లూయిస్‌ ఔట్‌ అయినా  సూర్యకుమార్‌ వెనక్కు తగ్గలేదు. ఫోర్లు, సిక్క్‌లు బాదేస్తు 57 రన్స్ చేశాడు. ఇషాన్‌ కిషన్‌ 25 పరుగులు చేసి అలరించాడు. స్టాయినిస్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ ఔటయ్యాడు .  తర్వాత   ఇషాన్‌ను ముజీబ్‌ రెహ్మాన్‌ పెవిలియన్‌కు పంపాడు. ఈసమయంలో  ముంబైజట్టుపై ఒత్తడి పెరిగింది. 4 ఓవర్లలో 50 పరుగులు చేయాల్సి  రావడంతో ఉత్కంఠ నెలకొంది.  ఐతే కృనాల్‌ పాండ్య ..పంజాబ్‌ బౌలర్లను ఓ  ఆట ఆడుకున్నాడు. వరుసగా బౌండరీలు బాదేస్తూ ముంబయికి సునాయాస విజయాన్నందించాడు. సూర్యకుమార్‌కు మాన్యా ఆఫ్‌ ద మ్యాచ్‌ లభించింది. ఈ విజయంతో   ప్లేఆఫ్‌ ఆశలను ముంబైఇండియన్స్  సజీవంగా నిలుపున్నారు.  

 

07:45 - May 5, 2018

ఢిల్లీ : ఈనెల 7 తర్వాత దక్షిణాదిలో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్‌ కెజే రమేష్‌ అన్నారు. పెంకుటిళ్లలో, పూరి గుడిసెల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని కెజే రమేష్ తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడే 24 గంటల ముందు కలర్‌ కోడ్‌తో రాష్ట్రాలను అప్రమత్తం చేస్తామని చెప్పారు. క్యూములోనింబస్ మేఘాలతో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నందున ఏపీ తెలంగాణలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని అంటున్న కెజే రమేష్‌తో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్ నిర్వహించింది. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

07:41 - May 5, 2018

విశాఖ : పేరుకే స్మార్ట్‌ సిటీ.. చినుకు పడిందంటే అంతే సంగతులు. బాధ్యతలేని జనం.. నిర్లక్ష్యం నిద్రలో అధికారలు.. ఇక చెప్పేదేముంది.. నగరం అంతా అస్తవ్యస్థం.. ఆగమాగం. పారిశుద్ద్యలోపంతో విశాఖనగరంలో జనం నరకం చూస్తున్నారు. వర్షం పడిందంటే అంగుళం కదలని పరిస్థితి నెలకొంది. 
చెరువును తలపిస్తోన్న స్మార్ట్ సిటి 
విశాఖ స్మార్ట్‌సిటీ, సన్ రైజ్ సిటి... అని నాయకులు, అధికారులు గొప్పలుచెప్పుకుంటారు. కాని.. వర్షం వస్తే అసలు విషయం బయటపడుతోంది.  కొద్దిపాటి వర్షం పడినా స్మార్ట్ సిటి చెరువును తలపిస్తోంది. వర్షంనీటరు పోటెత్తడంతో ట్రాఫిక్‌ ఆంగుళం కదలని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇళ్లలోకి నీరుచేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత కొద్ది రోజులుగా కురిసిన అకాల వర్షాలకు విశాఖ నగరం సాగరాన్ని తలిస్తోంది. 
నీటిమీద రాతలుగా మారిన నాయకులు, అధికారుల మాటలు 
గతానుభవాల నుంచి జీవీఎంసీ పాఠాలు నేర్చుకోవటం లేదు. భారీగా వర్షపాతం నమోదైనపుడు ఎలా స్పందించాలో మార్గ దిక్చూచీ అసలే లేదు. ఆకర్షణీయ ప్రాజెక్టు కింద విపత్తు నివారణ చర్యలకు భారీఎత్తున ప్రణాళికలు రూపొందించి.. కోట్లు రూపాయలు ఖర్చు పెట్టేస్తామన్న నాయకులు, అధికారుల మాటలు నీటిమీద రాతలుగా మారిపోయి.  శుక్రవారం కురిసిన వర్షానికి నగరంలోని  కాన్వెంట్‌ కూడలిలో  వర్షపునీరు పోటెత్తింది. అండర్‌బ్రిడ్జి దగ్గర వాహనాలు అంగుళం కదలని పరిస్థితి నెలకొంది.  ప్రయాణికులు  సుమారు 4 గంటలపాటు నీటిలో నిలిచిన బస్సుల్లోనే ఉండిపోవాల్పి వచ్చింది. 
జీవీఎంసీ యంత్రాంగం నిర్లక్ష్యం
వర్షపునీరు గంగులగడ్డ, ఎర్రిగడ్డ కాల్వల ద్వారా పోర్టు నుంచి సముద్రంలో కలవాలి. ఇది తప్ప వేరే మార్గం లేదు. చెత్తచెదారంతో పాటు.. జీవీఎంసీ యంత్రాంగం నిర్లక్ష్యంగా వదిలేసిన పూడిక కుప్పలుతెప్పలుగా పేరుకుపోయింది. అసలు పోర్టు ప్రాంతంలో డ్రెయిన్‌  ఉందన్న ఆనవాలుకూడా లేకుండా పోయాయి. చెత్తాచెదారం పేరుకుపోవడంతో వర్షపునీరు మొత్తం నగరంలో పోటెత్తుతోంది. కార్మికులకు జీతాలు సరిగా ఇవ్వని పరిస్థితుల్లో నగరంలో పారిశుద్ధ్యం పడకేసింది. సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ కింద జీవీఎంసీ పొక్లయినర్ల డీజిల్‌ కోసం రూ. 7 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. వీటితో గెడ్డల్లో పూడిక తీసినట్టు చూపిస్తున్నారు. ఈ పనుల్లో కూడా భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి.  2008-09లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నిధులతో గెడ్డల్ని రూ. 350 కోట్లతో ఆధునికీకరించారు. అయినా పరిస్థితిలో మాత్రం మార్పురాలేదు.
కొద్దిపాటి వర్షనికే కష్టాలు 
ఇక  కెజిహెచ్ పరిసర ప్రాంతాల్లోని కాలనిల్లో కొద్దిపాటి వర్షనికే కష్టాలు ఎదురవుతున్నాయి. మెకాళ్లు లోతు నీళ్లు ఇళ్ళలోకి చేరినా పట్టించుకునే వారే లేదరని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు నగరంలో పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే వర్షా కాలంలో పరిస్థితి మరింత దిగజారుతుందని విశాఖ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

 

07:34 - May 5, 2018

హైదరాబాద్ : హైదరాబాదీలకు ట్రాఫిక్‌ కష్టాల నుంచి ఉపశమనం లభించనుంది. సిగ్నల్ ఫ్రీ జంక్షన్లకోసం ఇప్పటికే పలు అండర్ పాసులు, ప్లైఓవర్లు నిర్మాణాలు సాగుతుండగా .. అదనంగా మరో నాలుగు ఎలివేటెడ్‌ ఫ్లైఓవర్లు నిర్మాణం కానుకున్నాయి. వీటికి ఇవాళ కేంద్ర ఉపరితల రవాణాశాఖా మంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. సిటీ నుంచి బయటికి, బయటి ప్రాంతాల నుంచి సిటీలోకి ఇక ఈజీగా రాకపోకలు సాగించవచ్చని అధికారులు చెబుతున్నారు.  
ఈజ్‌ఆఫ్‌ లివింగ్‌ సిటీగా హైదరాబాద్ 
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ను ఈజ్‌ఆఫ్‌ లివింగ్‌ సిటీగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ట్రాఫిక్‌ అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్‌ ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపడుతున్నారు. తాజాగా మరో  నాలుగు ఎలివేటెడ్‌ ఫ్లైఓవర్ల నిర్మాణానికి   కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. 
రూ. అంబ‌ర్‌పేటలో 467 కోట్ల‌తో  ఫ్లైఓవ‌ర్ 
అంబ‌ర్‌పేటలో 467 కోట్ల‌తో  ఫ్లైఓవ‌ర్ నిర్మాణం చేపడుతున్నారు. 1.60 కిలో మీట‌ర్లు పొడ‌వు, 18 మీట‌ర్ల వెడ‌ల్పులో ఈ ఫ్లైఓవ‌ర్‌ను నిర్మాణం చేయనున్నారు.  దీనికోసం  226  కోట్లు కేంద్ర ప్రభుత్వం అందిస్తుండ‌గా, 240 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ ప్లైఓవర్  నిర్మాణానికి 281 ఆస్తులు, 4.63 ఎక‌రాల భూమిని సేక‌రించాల్సి ఉండగా ..  ఇప్పటికే  మూడో వంతూ భూసేకరణ పూర్తి చేశామని జీహెచ్ఎంసీ అధికారులంటున్నారు. భూసేకరణ కోసం అవసరమైన 317కోట్లరూపాయల్లో  76 కోట్లు కేంద్ర భరిస్తుంటే ....., రాష్ట్ర సర్కార్ 150 కోట్లను ఖర్చుచేస్తోంది. 
రూ . 1395 కోట్లతో నారపల్లి ఎలివేటెడ్ కారిడార్
మరో  ముఖ్యమైన ప్రాజెక్టు ఉప్పల్- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్. 1395 కోట్లతో ఉప్పల్ కారిడార్ నిర్మాణం చేపడుతున్నారు.   దీనికోసం 626  కోట్లను భార‌త ప్రభుత్వం అందిస్తుండ‌గా, 768  కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీలు భరించనున్నాయి.  దీనిలో  జీహెచ్ఎంసీ ప‌రిధిలో భూసేక‌ర‌ణ‌కు 379కోట్లు అవుతుండ‌గా, జీహెచ్ఎంసీ వెలుప‌ల‌ భూసేక‌ర‌ణ‌కు  40  కోట్లు కేటాయించారు.  కేవ‌లం ఉప్పల్ నుంచి  నార‌ప‌ల్లి వ‌ర‌కు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి   311 కోట్లు వ్యయం అవుతుండ‌గా... ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ఖ‌ర్చును  కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. 
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు రూట్‌ను 6లేన్లకు పెంపు 
శంషాబాద్ ఎయిర్ పోర్టు రూట్‌లో ట్రాఫిక్ కష్టాలను దూరం చేయడానికి ఇప్పటికే ఉన్న నాలుగు లైన్ల రోడ్డును ఆరు లేన్లకు పెంచుతున్నారు. ఇది ఆరాంఘ‌ర్‌-శంషాబాద్‌ వరకు కొనసాగనుంది. ఇందు కోసం  283 కోట్ల వ్యయం చేయనున్నారు.  పదిన్నర  కిలోమీట‌ర్ల మేర ఈ రోడ్డు విస్తర‌ణ జ‌రుగనుంది.  మరోవైపు  ఔట‌ర్ రింగ్ రోడ్ నుంచి మెద‌క్ వ‌ర‌కు నాలుగు లేన్ల రోడ్డును  అభివృద్ది చేయనున్నారు.  దీనికోసం 426 కోట్ల 52 లక్షల రూపాయలతో   ప‌నులు చేపట్టనున్నారు. 
ప్లైఓవర్లు...ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణం
ఇప్పటికే నగరంలో పలు ప్లైఓవర్ల నిర్మాణం జరుగుతుండగా ఇప్పుడు నగర శివారు ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ కష్టాలు దూరం చేసేందుకు ప్లైఓవర్లు...ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చే వారికి ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయని జెహెచ్‌ఎంసీ అధికారులు అంటున్నారు.
 

 

07:27 - May 5, 2018

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో... నేతలు ఇంత మెతకగా ఉంటే కుదరదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మహానాడులోపు పార్టీ కమిటీలు, ఇన్‌చార్జ్‌ల నియామకాన్ని పూర్తి చేసి ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని బాబు ఆదేశించారు. 
రాష్ట్ర కమిటీ తీరుపై బాబుకు కార్యకర్తలు ఫిర్యాదు 
తెలంగాణ టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. రాష్ట్ర కమిటీ తీరుపై కార్యకర్తలు బాబుకు ఫిర్యాదు చేశారు. ముఖ్యనేతలు క్రియాశీల రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించకపోతే పార్టీ మరింత బలహీనపడుతుందన్నారు. జిల్లాల్లో కమిటీలు వేయకుండా కాలయాపన చేస్తున్నారని కార్యకర్తలు వాపోయారు. తెలంగాణవ్యాప్తంగా 31 జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలను సమీక్షించిన బాబు.. పార్టీ కార్యక్రమాలు రూపొందించడంతో రాష్ట్ర నాయకత్వం పూర్తిస్థాయి దృష్టి సారించాలని బాబు సూచించారు
ముఖ్య నేతలపై చంద్రబాబు మండిపాటు 
ఇక ఈ సమావేశంలో ముఖ్య నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. కార్యక్రమాల రూపకల్పనలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ఎల్‌.రమణను ప్రశ్నించారు. రాజకీయ నాయకుడు ప్రజాక్షేత్రంలో ఉండకపోతే సరైన గుర్తింపు ఉండదని హితవు పలికారు. తెలంగాణ మహానాడు నిర్వహణలోపు అన్ని జిల్లాల కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించారు. మహానాడు తర్వాత తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని, వీలైతే ఆ సభలకు తాను కూడా హాజరవుతానని బాబు తెలిపారు. సాధారణ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ బలపడితేనే తెలంగాణలో ఇతర పార్టీలు మనవైపు చూస్తాయని.. లేకపోతే పార్టీ ఇబ్బందులు తప్పవని పరోక్షంగా నేతలను హెచ్చరించారు. నాయకుల మధ్య నెలకొన్న విభేదాలను పక్కనపెట్టి పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పొత్తుల గురించి ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదని... సమయం, సందర్భం వచ్చినపడు వెరితో కలిసి ముందుకు వెళ్లాలనే అంశంపై స్పష్టత ఉంటుందని తేల్చి చెప్పారు. తెలంగాణాలో  స్థానిక సంస్థల ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా.. నేత‌లు సిద్దంగా ఉండాల‌ని బాబు సూచించారు. ఈ నెల 24 న  నిర్వహించే మ‌హానాడుకు చంద్రబాబు హాజ‌రుకానున్నార‌ని పార్టీ వ‌ర్గాలు వెల్లడించాయి. 

 

నేడు ఉపాధ్యాయ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు

హైదరాబాద్ : నేడు ఉపాధ్యాయ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు జరుపనుంది. ఉద్యోగుల డిమాండ్లపై కేసీఆర్ కు మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. 

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లలో పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్

హైదరాబాద్ : జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లలో పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. 48 కార్లు, 81 బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

నేడు హైదరాబాద్ లో పర్యటించనున్న నితిన్ గడ్కరీ

హైదరాబాద్ : నేడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అంబర్ పేట.రామంతాపూర్ ఫ్లైవోవర్, ఉప్పల్..నాంపల్లి ఫ్లైవోవర్ బ్రిడ్జీకి గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు.

 

అత్యాచారాలకు నిరసనగా నేడు వైసీపీ క్యాండిల్ ర్యాలీ

హైదరాబాద్ : అత్యాచారాలకు నిరసనగా నేడు వైసీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. 

నేడు ఉపాధ్యాయ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు

హైదరాబాద్ : నేడు ఉపాధ్యాయ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు జరుపనుంది. ఉద్యోగుల డిమాండ్లపై కేసీఆర్ కు మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది.

 

Don't Miss