Activities calendar

06 May 2018

పాక్ హోం మంత్రిపై కాల్పులు...

ఇస్లామాబాద్ : పాక్ హోం మంత్రి ఇక్బాల్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీనితో ఆయన చేతికి గాయమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

10న రైతు బంధు చెక్కులు..పట్టాదారు పాసు పుస్తకాలు...

హైదరాబాద్ : ఈనెల 10న రైతు బంధు చెక్కులు..పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరుగనుంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఉదయం 11గంటలకు సీఎం కేసీఆర్ అధికారికంగా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 

ఇద్దరు టిటిడి ఉద్యోగుల సస్పెండ్...

చిత్తూరు : తిరుమలలో ఇద్దరు ఉద్యోగులను టిటిడి సస్పెండ్ చేసింది. విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని గురుమూర్తి, కృష్ణమూర్తిలను టిటిడి ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో విధులు  నిర్వహించేవారు. 

మే 8న ఏపీలో రాస్తారోకోలు - సీపీఎం...

విజయవాడ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మే 8వ తేదీన రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు వెల్లడించారు. రాస్తారోకో కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 

ఓయూలో మేధావుల మహాసభ...

హైదరాబాద్ : ఓయూలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పరిరక్షించుకోవాలని మేధావుల మహాసభ జరిగింది. మందకృష్ణ మాదిగ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బాలకృష్ణన్ లు హాజరయ్యారు. 

ముంబై ఇండియన్స్ విజయం...

ఢిల్లీ : ఐపీఎల్ 11లో భాగంగా కోల్ కతా జట్టుపై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 13 పరుగుల తేడాతో గెలుపొందింది. ముంబై 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేయగా కోల్ కతా జట్టు 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

18:44 - May 6, 2018

నల్గొండ : జిల్లాలో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు..భారీ ఈదురుగాలులకు వేలాదిగా నిమ్మచెట్లు నేలకూలాయి. ఇప్పుడిప్పుడే నిమ్మ ధర స్థిరంగా ఉండడంతో పదేళ్ల కష్టానికి ప్రతిఫలం వస్తుందని ఆశించామని కానీ తీరని నష్టం కలిగిందని రైతులు లబోదిబోమంటున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టి కన్నబిడ్డల్లా సాకుతున్న తోట కళ్ల ఎదుట పెకిలించుకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:39 - May 6, 2018

కరీంనగర్ : జిల్లాలో హుజురాబాద్ లో ఈనెల పదో తేదీన జరిగే రైతు బందు చెక్కుల పంపిణీ చేసే సభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆదివారం జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి ఈటెల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...9వ తేదీన సీఎం కేసీఆర్ జిల్లాకు చేరుకుని పదో తేదీన ఉదయం 11గంటలకు సభకు హాజరౌతారని తెలిపారు. సభకు లక్ష మంది హాజరౌతారని అంచనా వేస్తున్నట్లు, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రైతు బంధు పథకం ద్వారా రెండు పంటలకు కలిపి ఎకరాకు రూ. 8000 వేలు ఇస్తామని, రాష్ట్రంలో రూ. 12వేల కోట్లను రైతులకు ఇన్వెస్ట్ మెంట్ సపోర్టు ఇస్తున్నట్లు వెల్లడించారు. 

18:33 - May 6, 2018

ప్రకాశం : రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తోందని ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఎన్డీయే నుండి టిడిపి బైటకొచ్చినా బిజెపితో చంద్రబాబుకు సంబంధాలున్నాయని, రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వారంలో రోజులుగా కురుస్తున్న అకాలవర్షాలకు నష్టపోయిన రైతులు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

ప్రాణత్యాగానికైనా సిద్ధమన్న ఎంపీ అవంతి...

విశాఖపట్టణం : రైల్వే స్టేషన్ దగ్గర ఎంపీ అవంతి శ్రీనివాస్ చేపట్టిన దీక్ష కాసేపటి క్రితం ముగిసింది. తక్షణమే విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలని డిఆర్ఎంకు వినతిపత్రం ఇచ్చారు. కేంద్రం అనుసరిస్తున్న నాన్చుడు ధోరణిని ఇంక సహించేది లేదని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని వెల్లడించారు. 

జోధ్ పూర్ కు సల్మాన్...

జోధ్‌పూర్: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ జోధ్ పూర్ కు చేరుకున్నారు. కృష్ణ జింక వేట కేసుకు సంబంధించి జోధ్‌పూర్ కోర్టులో సోమవారం వాదనలు జరుగనున్నాయి. రెండు రోజుల పాటు జైలులో గడిపిన సల్మాన్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. 

పెద్దాపురం బ్యాంకు కాలనీలో అగ్నిప్రమాదం...

తూర్పుగోదావరి : పెద్దాపురం బ్యాంకు కాలనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా గోదాంలో జరిగిన ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. 

11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం...

విజయవాడ : ఏపీ సచివాలయంలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం రేపు జరగనుంది. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలపై ఆర్థిక మంత్రులు చర్చించనున్నారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. 

17:22 - May 6, 2018

భద్రాది కొత్తగూడెం : జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడులో వివాహ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. జెండాలపాడుకు చెందిన శ్రీను కుమార్తె వివాహనికి మణుగూరు మండలం శివలింగాపురంకు చెందిన కుంజ లక్ష్మన్, లింగంపల్లికి చెందిన జయరాజ్ హాజరైయ్యారు. మద్యం మత్తులో ఇద్దర ఘర్షణ పడుతుండగా.. అడ్డుకోబోయిన సోమమ్మ అనే మహిళపై లక్ష్మణ్‌ దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కేడ మృతి చెందింది.

 

17:19 - May 6, 2018

శ్రీకాకుళం : రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో రెండున్నర నెలలు పర్యటించిన అనంతరం తన భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తన తొలి పర్యటనను లక్ష్మీనారాయణ ముగించుకున్నారు. క్షేత్ర స్థాయిలో జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల స్థితిగతులు, వాటి పరిష్కారానికి ఉన్న మార్గాలను చర్చించామన్నారు. తనను రాజకీయ శక్తులు నడిపిస్తున్నాయన్న వార్తలను లక్ష్మీనారాయణ ఖండించారు.

17:14 - May 6, 2018

తూర్పుగోదావరి : జిల్లాలో చిన్న వివాదం రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఒకరిపై ఒకరు కర్రలతో..రాళ్లతో దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓ ఫంక్షన్ లో మహిళపై జరిగిన దాడి వెంకటనగరం - తొర్రేడు గ్రామాల మధ్య వివాదం నెలకొంది. తొర్రేడు గ్రామానికి చెందిన మహిళ వెంకటానగరంలో జరుగుతున్న ఫంక్షన్ కు వెళ్లింది. అక్కడ గొడవ జరగడంతో..మహిళపై దాడి జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తొర్రేడు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వెంకటనగరం గ్రామస్తులపైకి యువకులు దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. లాఠీఛార్జీ చేయడానికి ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీనితో తోపులాటలో రాజానగరం ఎస్ఐ, కానిస్టేబుల్ లు కిందపడిపోయి సృహ తప్పారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. 

16:46 - May 6, 2018

మంచిర్యాల : ఆమె స్వప్నాన్ని ఆర్థిక సమస్యలు చిదిమేస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన కిక్‌బాక్సర్‌.. మరో అంతర్జాతీయ పతకాన్ని సాధించే క్రమంలో ఆర్థిక సమస్యతో తల్లడిల్లుతోంది. రష్యాలో జరిగే అంతర్జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ధనం కోసం అభ్యర్థిస్తోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లింగపూర్ గ్రామానికి చెందిన కందుల మౌనిక కరాటే, కిక్ బాక్సింగ్ క్రీడాకారిణి. నిరుపేద కుటుంబంలో పుట్టిన మౌనిక చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తితో.. బెల్లంపల్లికి చెందిన కరాటే గురువు భరత్ వద్ద శిక్షణ తీసుకుంది. మంచిర్యాలలో ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతూనే తనకు ఇష్టమైన కిక్‌ బాక్సింగ్‌లో ప్రతిభను చాటుతూ వస్తోంది.

ఇష్టపడి నేర్చుకున్న కిక్ బాక్సింగ్‌లో.. మౌనిక, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటింది. ప్రస్తుతం రష్యా దేశంలోని అనపలో మే 30 నుంచి జూన్‌ 4 వరకు జరగనున్న అంతర్జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీకి అర్హత సాధించింది. తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ నుంచి పాల్గొననున్న ఏకైక క్రీడాకారిణి మౌనిక కావడం గమనార్హం. అయితే అక్కడికి వెళ్లడానికి దాదాపు రెండు లక్షల వరకు ఖర్చవుతోంది. అయితే.. దాన్ని భరించే స్థోమత తనకు లేదని మౌనిక తల్లడిల్లుతోంది.

మౌనిక ఇప్పటి వరకు ఇరవైసార్లు రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో పాల్గొంది. 18 బంగారు పతకాలు, 2 రజత‌‌ పతకాలు గెలుచుకుంది. 7 సార్లు మహిళల విభాగంలో గ్రాండ్ ఛాంపియన్‌ షిప్‌ సాధించింది. కిక్ బాక్సింగ్‌ పోటీల్లో రెండు సార్లు రాష్ట్రస్థాయి పోటీలకు హాజరైంది. ఇందులో రెండు బంగారు పతకాలు గెలుచుకుంది. గతేడాది ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో రెండు ఈవెంట్లలో పాల్గొని బంగారు, రజత‌ పతకాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది మౌనిక. అయితే ఆర్థిక సమస్యలు ఆమెను కుంగదీస్తున్నాయి.

రష్యాలో జరగనున్న అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు వెళ్లడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటున్న మౌనిక... దాతల సహకారం కోసం ఎదురుచూస్తోంది. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆకెనపల్లి శాఖలోని తన ఖాతా నెంబర్‌ 62314564711 కు.. విరాళాలు పంపాలని కోరుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆశయం నీరు గారిపోకుండా క్రీడాకారిణిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

16:41 - May 6, 2018

అనంతపురం : జిల్లా గార్లదిన్నె లోలూరు క్రాస్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుండి వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఆర్డీటీ సీఈవో అరుణ, అసిస్టెంట్‌ రామాంజనేయులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతదేహాలను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

16:38 - May 6, 2018

విజయవాడ : ఏళ్లు గడిచేకొద్దీ మార్క్స్‌ సిద్దాంతాలకు ఆదరణ పెరుగుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్క్స్‌ సిద్ధాంతాలపై నేడు ఆసక్తికర చర్చ జరుగుతోందన్నారు. మార్క్స్‌ ద్విశతజయంతి సభను పురస్కరించుకుని విజయవాడలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుల్లో పాల్గొన్న ఆయన.... యువత ఈ మధ్య మార్క్సిజంపై ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. పెట్టుబడిదారి వ్యవస్థను వ్యతిరేకించేందుకు మార్క్సిజంలో దారులు వెతుకుతున్నారని తెలిపారు. ఇదే సదస్సుల్లో పాల్గొన్న సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు.. రానున్న రోజుల్లో వామపక్షాలకు మంచిరోజులు వస్తాయన్నారు. రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమాలు బలంగా ఉన్నాయని... పెట్టుబడిదారి విధానాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

16:36 - May 6, 2018

నల్గొండ : అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ వృధాకావని... వారి ఆశయసాధన కోసం ఎర్రజెండా నీడన పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని పాములపాడ్‌లో కామ్రేడ్‌ నంద్యాల లింగయ్య స్మారకస్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. నిజాం నిరంకుశత్వం, దొరలు- రజాకార్ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ఘనత ఎర్రజెండాదేనన్నారు. నాటి వీరతెలంగాణ సాయుధ పోరాటంలో నంద్యాల లింగయ్య పోషించిన పాత్ర మరువలేనిదన్నారు. 

అనుదీప్ ను భోజనానికి ఆహ్వానించిన కేసీఆర్...

హైదరాబాద్ : సివిల్స్ టాపర్ గా తెలంగాణ బిడ్డ నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అనుదీప్, ఆయన తల్లిదండ్రులను సోమవారం భోజనానికి రావాలని ఆహ్వానించారు. 

15:29 - May 6, 2018

ఖమ్మం : పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని పలువురు నిరూపిస్తున్నారు. తాజాగా సివిల్స్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివిన శ్రీహర్ష తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ ను సాధించాడు. సివిల్స్ లో ఆరో ర్యాంకును సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలియచేస్తున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి శ్రీహర్ష, తల్లిదండ్రులతో ముచ్చటించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని, పట్టుదల ఉంటే ఏదేనా సాధ్యమేనని శ్రీహర్ష పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

వైసీపీపై బుద్ధా విమర్శలు...

విజయవాడ : దాచేపల్లి ఘటనను వైసీపీ అధ్యక్షుడు జగన్ రాజకీయం చేసే ప్రయత్నం చేశారని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. అయేషా కేసులో వైసీపీ ఆరోపణలు చేసిన రోజా ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. 

వైసీపీపై బుద్ధా విమర్శలు...

విజయవాడ : దాచేపల్లి ఘటనను వైసీపీ అధ్యక్షుడు జగన్ రాజకీయం చేసే ప్రయత్నం చేశారని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. అయేషా కేసులో వైసీపీ ఆరోపణలు చేసిన రోజా ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. 

బెంగళూరులో రాజ్ నాథ్ సింగ్...

బెంగళూరు : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ బెంగళూరులో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితం చంపకదామ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. రాష్ట్రంలో సంపూర్ణ మెజార్టీతో బీజేపీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. 

14:30 - May 6, 2018

బెంగళూరు : కర్నాటకలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశం సెగలు పుట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ఏపీపై కేంద్రం వ్యవహరించిన తీరు..హోదా ఇవ్వలేని బిజెపిని ఓడించాలంటూ కాంగ్రెస్..ఇతర పార్టీల నేతలు పిలుపునిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం ఏపీ పోరాట సమితి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ తెలుగు రాష్ట్రాల ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా సమావేశాల తీరు..ఎన్నికల ప్రచారం..తదితర వివరాలను తెలుసుకొనేందుకు సమితి నేతలతో టెన్ టివి ముచ్చటించింది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:15 - May 6, 2018

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తంగా 21 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

 • విజయనగరం కలెక్టర్ : హరిజవహర్ లాల్.
 • విజయనగరం సంయుక్త కలెక్టర్ : కె.వెంకట రమణారెడ్డి.
 • కడప జిల్లా కలెక్టర్ : చేవూరు హరికిరణ్.
 • కడప జిల్లా సంయుక్త కలెక్టర్ : టి.నాగరాణి.
 • అనంతపురం సంయుక్త కలెక్టర్ : దిల్లీరావు.
 • పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ : ఎం.వేణుగోపాల్ రెడ్డి.
 • జీఏడీ ముఖ్య కార్యదర్శి : కె.ప్రవీణ్ కుమార్.
 • మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి : రామ్ గోపాల్.
 • విద్యాశాఖ ఉప కార్యదర్శి : హర్షవర్ధన్.
 • వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ : మురళీధర్ రెడ్డి.
 • వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి : టి.కె.రమామణి.
 • సీసీఎల్ఏ కార్యదర్శి : జీఎస్ఆర్కే ఆర్ విజయ్ కుమార్.
 • సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శి : ఎన్.ప్రభాకర్ రెడ్డి.
 • ఏపీపీఎస్సీ కార్యదర్శి : పి.కోటేశ్వర్.
 • రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ : సుమిత్ కుమార్.
 • హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ : ఎం.వెంకటేశ్వర్లు.
 • తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ వైస్ ఛైర్మన్ : విజయరామరాజు.
 • స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ : మురళీధర్ రెడ్డి.
 • ఎస్సీ సహకార, ఆర్థిక కార్పొరేషన్ ఎండీ : వివేక్ యాదవ్.
 • బిసి సహకార, ఆర్థిక కార్పొరేషన్ ఎండీ : బి.రామారావు.
 • గిరిజన సహకార కార్పొరేషన్ ఎండీ : బాబూరావు నాయుడు. 
13:36 - May 6, 2018

తూర్పుగోదావరి : రాజమండ్రిలో హ్యాపీ సండేలో బుల్లెట్ బైక్ ల ర్యాలీ నిర్వహించారు. తలస్సేమియా వ్యాధిపై అవగాహన కోసం జైన్ సేవా సమితి ర్యాలీ చేపట్టింది. సుమారు 100 బుల్లెట్లతో భారీ ర్యాలీ చేపట్టారు. 

బంజారాహిల్స్ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. డిక్యూ నెట్ వర్క్ లో మంటలు చెలరేగాయి. మూడు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. 

 

ఏపీలో 21 మంది ఐఏఎస్ ల బదిలీ

హైదరాబాద్ : ఏపీలో 21 మంది ఐఏఎస్ ల బదిలీ అయ్యారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా కె.ప్రవీణ్ కుమార్, మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీగా కె.రాంగోపాల్, ఫైనాన్స్ సెక్రటరీగా పీయూష్ కుమార్, సీసీఎల్ ఏ సెక్రటరీగా జీఎస్ ఆర్కే ఆర్ విజయ్ కుమార్, విద్యాశాఖ డిప్యూటీ సెక్రటరీగా కె.హర్షవర్దన్ నియమించారు.   

బెంగళూరులో రెండు తెలుగు సంఘాల మధ్య వివాదం

బెంగళూరు : ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మీటింగ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బెంగళూరులో ఏపీ పోరాట సమితి సమావేశం నిర్వహించారు. ఇతర తెలుగు సంఘాలు సమావేశాన్ని అడ్డుకున్నాయి. బెంగళూరులో తెలుగు సంఘాలు రెండుగా చీలాయి. రెండు తెలుగు సంఘాల మధ్య వివాదం నెలకొంది. 

 

13:14 - May 6, 2018

బెంగళూరు : కర్నాటకలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మీటింగ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బెంగళూరులో ఏపీ పోరాట సమితి సమావేశం నిర్వహించారు. ఇతర తెలుగు సంఘాలు సమావేశాన్ని అడ్డుకున్నాయి. బెంగళూరులో తెలుగు సంఘాలు రెండుగా చీలాయి. రెండు తెలుగు సంఘాల మధ్య వివాదం నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

13:00 - May 6, 2018

ఖమ్మం : సివిల్స్ 6వ ర్యాంకును శ్రీహర్ష కైవసం చేసుకున్నారు. తొలిప్రయత్నంలోనే శ్రీహర్ష ఐఏఎస్ సాధించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ ఘనత దక్కిందని చెప్పారు. 

12:48 - May 6, 2018

మహబూబాబాద్ : షార్ట్ సర్క్యూట్ తో మిర్చీ గోదాంలో మంటలు చెలరేగాయి. మిర్చీ, పత్తి పంట అగ్నికి ఆహుతైంది. కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లింది. రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

షార్ట్ సర్క్యూట్ తో మిర్చీ గోదాంలో మంటలు

మహబూబాబాద్ : షార్ట్ సర్క్యూట్ తో మిర్చీ గోదాంలో మంటలు చెలరేగాయి. మిర్చీ, పత్తి పంట అగ్నికి ఆహుతైంది. కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లింది. 

12:43 - May 6, 2018

బెంగళూరు : కర్నాటకలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికారం కోసం కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. తెలుగు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నాకటలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీకాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీపై వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. జీఎస్టీ, నోట్ల రద్దు అంశాలపై ప్రజలు బీజేపీపై మండిపతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

12:39 - May 6, 2018

కృష్ణా : విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఇప్పటికే ఉన్న 400 కోట్ల రుణభారం ఉన్నా మరో వందకోట్ల అప్పుకోసం నివేదికలను సిద్ధం చేస్తున్నారు కార్పొరేషన్‌ పాలకులు.  పాలకులు, అధికారుల దుబారా ఖర్చులతో కార్పొరేషన్‌ ఆర్థిక జవసత్వాలు కుంగిపోతున్నాయని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 
వీఎస్ సీకి గడ్డు పరిస్థితులు 
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు గడ్డు పరిస్థితులు తలెత్తుతున్నాయి. గత అప్పుల నుంచి బయటపడకపోగా, ప్రస్తుతం మరో రూ.100 కోట్లపైబడి అప్పులకు సిద్ధపడటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అప్పులు వద్దంటూ  విపక్షాలు అభ్యంతరం చెబుతున్నా.. పాలకపక్షం మాంత్రం  అప్పు చేసే తీరతామంటోంది. కార్పొరేషన్‌ వైఖరిపై  సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. 
వీఎంసీని కుంగదీస్తున్న అధికారులు, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఆర్భాటాలు
అసలే అప్పులు ఊబిలో ఉన్న వీఎంసీని అధికారులు, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఆర్భాటాలు మరింతగా కుంగదీస్తున్నాయి. ఇప్పటికే  400 కోట్ల అప్పు పెరుకుపోగా, కొత్తగా మరో రూ.100 కోట్లు అప్పు చేయటానికి కార్పొరేషన్ సిద్ధపడింది.హడ్కో బ్యాంక్ రుణం, అసలు, వడ్డీ కలిపి  75కోట్ల 76లక్షలుగా ఉంది. ఇక యూనియన్ బ్యాంక్, ఇతర బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం 123.35 కోట్లు. పుష్కరాలు, జనరల్ ఫండ్ పనులు, జేఎన్ఎన్యూఆర్ఎం నిమిత్తం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన వర్కులు, సీ బిల్లులు కలిపితే మరో  రూ.20 కోట్లు.  ఇక మరణించిన, ఉద్యోగ విరమణ పొందిన  వారికి  చెల్లించాల్సిన బెనిఫిట్ 11 కోట్లు రూపాయలు. అలాగే పుష్కరాలకు సంబంధించి సప్లయ్ దారులకు చెల్లించాల్సిన  50 కోట్ల బాకాయి అలాగే ఉంది.  ఏపీ ఎస్.సి.హెచ్.ఎల్ సంస్థకు 58 కోట్లు, ఏపీయూఎఫ్ డీఐసీకి చెల్లించాల్సిన మొత్తం బకాయి రూ.25 కోట్లు. ఇక నగరపాలక సంస్థలో అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రయాణాలు, ఇతర రవాణాకు మూడు నెలల్లో రూ.45 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు తయారు చేశారు. ఇలా  ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారే తప్ప..  నగరాభివృద్ధి చేస్తుందేమిటని  విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 
కార్పొరేషన్‌ను కుంగదీసే చర్యలను మానుకోవాలి..
ఉన్న అప్పలతోనే సతమతమవుతున్న కార్పొరేషన్‌ను మరింతగా కుంగదీసే చర్యలను మానుకోవాలని విపక్ష కార్పొరేటర్లు కోరుతున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్‌ అధికారులు, పాలకులు దుబారా ఖర్చును మానుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని విజయవాడ ప్రజలు కోరుతున్నారు. 

 

భద్రతాదళాలు, ఉగ్రవాదులు మధ్య కాల్పులు

జమ్మూకాశ్మీర్ : సోపియాన్ జిల్లా బడిగాం వద్ద భద్రతా దళాలు, ఉగ్రవాదులు మధ్య కాల్పులు జరిగాయి. భద్రతాదళాల కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. 

 

11:52 - May 6, 2018

ఖమ్మం : దేశవ్యాప్తంగా జరగుతోన్న నీట్‌ పరీక్షా విధానంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సీబీఎస్సీ విధానంలో పరీక్ష నిర్వహిండంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. స్టేట్ సిలబస్‌తో పరీక్ష రాసే విద్యార్థులకు ఈ పరీక్ష కఠినంగా మారిందంటున్నారు. నీట్‌ పరీక్ష పట్ల తల్లిదండ్రుల ఆందోళనపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

11:45 - May 6, 2018

హైదరాబాద్ : ఎంఎల్ ఏల స‌భ్యత్వ ర‌ద్దు అంశంపై హ‌స్తం పార్టీలో ర‌గ‌డ మొదలైందా..? న్యాయపోరాటం చేస్తున్న  కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌కు సొంతపార్టీలోనే ఆధరణ కరువయిందా..? పార్టీ అధిష్ఠానం నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్‌ రావడంలేదని ఆ ఇద్దరూ భావిస్తున్నారా..? టీపీసీసీకి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు మధ్య చిటపటలు మొదలయ్యాయా..? ఇపుడు దీనిపైనే రాజకీయవర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. 
చిచ్చు రాజేస్తోన్న ఎంఎల్ ఏల స‌భ్యత్వ ర‌ద్దు  
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ఎంఎల్ ఏల స‌భ్యత్వ ర‌ద్దు అంశం చిచ్చు రాజేస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లు పార్టీ నుంచి తమకు అనుకున్న స్థాయిలో సహకారం లభించడంలేదని గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. సభ్యరద్దు నిర్ణయం జరిగి నెలరోజులు గడిచినా టీపీసీసీ అంటీ ముట్టనట్టే వ్యవహరిస్తోందని పార్టీ సీనియర్‌నేతల వద్ద ఇద్దరు ఎమ్మెల్యేలు వాపోతున్నట్టు సమాచారం.  
న్యాయపోరాటం చేయడంలో టీపీసీపీ విఫలం : కాంగ్రెస్ నేతల అంతర్గత విమర్శలు 
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైకూడా న్యాయపోరాటం చేయడంలో టీపీసీపీ విఫలమయిందని హస్తంనేతల్లో అంతర్గత విమర్శలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై స్పీకర్‌ తీరును న్యాయస్థానం ప్రశ్నించినా.. ఇదే అంశాన్ని ప్రజల్లో ప్రచారం చేసి పార్టీకి మైలేజి తీసుకురావడంలోకూడా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విఫలం అయ్యారని కోమటిరెడ్డి, సంపత్‌లు పార్టీనేతల వద్ద బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం.  ఇదే విషయాన్ని సీఎల్‌పీ భేటీలో సీనియర్‌ నేత జానారెడ్డి వద్ద కోమటిరెడ్డి, సంపత్‌లు ఏకరువుపెట్టినట్టు సమాచారం. రాష్ట్ర ప్రజల్లో టీఆర్‌ఎస్‌ కుట్రరాజకీయాన్ని ఎండగట్టకుండా.. సభ్యయత్వరద్దు అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తే ప్రయోజనం ఏంటని హస్తంనేతుల కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి 2019 ఎన్నిక‌ల్లే టార్గెట్ గా  టి.పి.సిసి ముందుకు  వెళ్లుతున్న స‌మ‌యంలో ఇద్దరు ఎమ్మెల్యేల స‌భ్యత్వ ర‌ద్దు అంశం పార్టీ నేత‌ల మ‌ధ్య చిటపటలు రాజేస్తోంది. 
 

 

11:25 - May 6, 2018

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ప్రారంభం అయింది. ఎంబీబీఎస్, బీడీస్ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నీట్ పరీక్ష జరుగుతోంది. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం అయింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష కొనసాగనుంది. ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు మాత్రమే ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించారు. దేశవ్యాప్తంగా 13లక్షల 26 వేల మంది నీట్ పరీక్ష రాస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలోని విజయనగరం, విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరంలో ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఒక్క నిమిషం నిబంధన విద్యార్థుల కొంపముంచింది. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించకపోవడంతో పలువురు విద్యార్థులు వెనుదిరిగారు. ఒక్క నిమిషం ఆలస్యం కావడంతో విద్యార్థులు వెనుదిరిగారు. పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించకపోవడంతో విద్యార్థులు విలపించారు. లోపలికి అనుమతించాలని ఎంత వేడుకున్నా అంగీకరించకపోవడంతో చేసేదేమీ లేక తీవ్ర ఆవేదనతో పరీక్ష కేంద్రాల నుంచి వెళ్లి పోయారు.  

దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు 13లక్షల 26 వేల మంది హాజరు

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ప్రారంభం అయింది. ఎంబీబీఎస్, బీడీస్ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నీట్ పరీక్ష జరుగుతోంది. దేశవ్యాప్తంగా 13లక్షల 26 వేల మంది నీట్ పరీక్ష రాస్తున్నారు. 

కొనసాగుతున్న నీట్ ఎగ్జామ్

ఢిల్లీ : దేశవ్యాప్తంగా జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) కొనసాగుతోంది. ఎంబీబీఎస్, బీడీస్ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నీట్ పరీక్ష జరుగుతోంది. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం అయింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష కొనసాగనుంది.

 

 

10:52 - May 6, 2018

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ప్రారంభం అయింది. ఎంబీబీఎస్, బీడీస్ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నీట్ పరీక్ష జరుగుతోంది. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం అయింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష కొనసాగనుంది. ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు మాత్రమే ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా 13లక్షల 26 వేల మంది నీట్ పరీక్ష రాస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలోని విజయనగరం, విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరంలో  ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. 
ఎండలో విద్యార్థులు 
కృష్ణా జిల్లాలో నీట్ ఎగ్జామ్ ప్రారంభం అయింది. జిల్లా వ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 17,536 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 7.30 నుండి విద్యార్థులను అధికారులు ఎండలో నిలబెట్టారు. గంటలేటుగా పరీక్ష హాల్ లోకి విద్యార్థులను అధికారులు అనుమతించారు. విద్యార్థులను ఎండలో నిల్చోబెట్టడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ప్రారంభం

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ప్రారంభం అయింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగనుంది. 

09:28 - May 6, 2018

టీటీడీకి కేంద్ర పురావాస్తు శాఖ లేఖపై వక్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు, హిందూ మాజీ ఎడిటర్ నగేష్, టీడీపీ అధికార ప్రతినిధి శ్రీరాములు, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, వైసీపీ బీసీసెల్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి పాల్గొని, మాట్లాడారు. దాచేపల్లి ఘటన, అవార్డుల ప్రకటన అంశాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

కర్నాటకలో ఎన్నికల ప్రచార జోరు

బెంగళూరు : కర్నాటకలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నేడు చిత్రదుర్గ, రాయచూర్, జామకండి, హుబ్లీ బహిరంగ సభల్లో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. పలు నియోజకవర్గాల్లో అమిత్ షా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. నేడు జేడీఎస్ తరపున మాయావతి ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

నేటి నుంచి ఉపరాష్ట్రపతి వెంకయ్య విదేశీ పర్యటన

ఢిల్లీ : నేటి నుంచి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విదేశీ పర్యటన చేయనున్నారు. గ్యాటెమాల, పనామా, పేరు దేశాలలో ఈనెల 11వరకు పర్యటించనున్నారు. 

08:24 - May 6, 2018

హైదరాబాద్‌ : సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ రెచ్చిపోయారు. ఢిల్లీ డెర్ డేవిల్స్ పై ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో163 పరుగులు చేసింది. ఢిల్లీ ఓపెనర్‌ పృథ్వీషా బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు. పృథ్వీషా 36బంతుల్లో 6ఫోర్లు, 3సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 36బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లతో 44 రన్స్‌  చేశాడు. ఢిల్లీ యువ బ్యాట్స్‌మన్‌ జోరుకు  సన్ రైజర్స్ బౌలర్లు కళ్లెంవేశారు. మ్యాచ్‌ కీలక సమయంలో ఒత్తిడికి గురైన ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ వరుసగా పెవిలియ్‌ చేరారు. దీంతో  డేర్‌డెవిల్స్‌ స్కోరు 163 పరుగులకే పరిమితమైంది. అనంతరం బ్యాంటింగ్‌ దిగిన సన్‌రైజర్స్‌ 19.5ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు.  ఓపెనర్లు అలెక్స్ 45, శిఖర్ ధావన్, 33 పరుగులతో  మంచి ఆరంభాన్ని అందించారు.  అయితే మధ్యలో వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ నెలకొంది. చివర్లో వచ్చిన యూసఫ్ పఠాన్ 12 బంతుల్లో  2 ఫోర్లు  2 సిక్స్‌లు బాదేసి జట్టుకు విజయాన్నందించాడు. 

 

08:21 - May 6, 2018

ఢిల్లీ : ప్లే ఆఫ్‌ బరిలో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బోల్తా పడింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 128 పరుగుల లక్ష్యాన్ని 12 బంతులు ఉండాగానే ధోనీసేన ఛేదించింది. రాయుడు, సురేశ్‌ రైనా, ధోనీ రాణించడంతో చెన్నై విజయాన్ని అందుకుంది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంనేందుకు ప్రయత్నించిన బెంగళూరు ఫీల్డింగ్‌ తప్పిదాలతో బయట పడలేకపోయింది. ఈ ఓటమితో బెంగళూరు ఫ్లే ఆఫ్ ఆశలు దాదాపు ఆవిరైనట్టే. మిగతా మ్యాచ్‌లు మెరుగైన రన్‌రేట్‌తో గెలిస్తే తప్ప బెంగళూరుకు ఫ్లే ఆఫ్ చేరే అవకాశాలు లేవు.

08:20 - May 6, 2018

జర్మనీ : జర్మనీలో కార్ల్‌ మార్క్స్‌ రెండో శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చైనా ప్రభుత్వం బహుకరించిన పదిహేడు అడుగుల మార్క్స్‌ కాంస్య విగ్రహాన్ని ఈ వేడుకల సందర్భంగా ఆవిష్కరించారు. మార్క్స్‌ జయంతి వేడుకల్ని చూసేందుకు దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు చేరుకున్నారు. 

 

08:14 - May 6, 2018

వాషింగ్టన్ : అమెరికాలో భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కూచిభొట్ల శ్రీనివాస్‌ హత్య కేసులో ఫెడరల్‌ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. నిందితుడు ఆడమ్‌ పూరింటన్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. పురింటన్‌ జాత్యహంకారంతోనే శ్రీనివాస్‌పై కాల్పులు జరిపి హత్య చేసినట్లు కోర్టు నిర్ధారించింది. కోర్టు తీర్పు ప్రకారం 52 ఏళ్ల పూరింటన్‌ జైలులోనే జీవితం గడపాల్సి ఉంటుంది. 50 ఏళ్ల జైలుశిక్ష తర్వాతే అతనికి పెరోల్‌ లభిస్తుంది. ఫిబ్రవరి 22, 2017లో శ్రీనివాస్‌, అతని స్నేహితుడు అలోక్ కెన్సాస్‌లోని ఓ బార్‌లో ఉండగా పురింటన్‌ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్‌ అక్కడికక్కడే మృతి చెందగా అలోక్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆడమ్‌ను అడ్డుకోబోయిన లాన్‌ గిలోట్‌ కూడా గాయపడ్డ విషయం తెలిసిందే.

 

08:08 - May 6, 2018

మెదక్ : ఈనెల 9న మెదక్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. ఇందుకోసం మంత్రి హరీష్‌రావు జిల్లాలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో హెలిప్యాడ్‌కు ఏర్పాటు చేస్తున్నారు. భూమిపూజ అనంతరం భారీ బహిరంగ ఉంటుందని హరీష్‌రావు తెలిపారు. 

 

08:02 - May 6, 2018

హైదరాబాద్ : కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కుమార్‌ శాసనసభ్యత్వ రద్దు అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని తెలంగాణ సీఎల్‌పీ నిర్ణయించింది. దీనిలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, గవర్నర్‌ నరసింహన్‌కు వినతిపత్రాలు సమర్పించాలని ప్రతిపాదించారు. వీరి సభ్యత్వం పునరుద్ధరించే విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయాలని జానారెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్‌పీ సమావేశం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. 
తెలంగాణ సీఎల్‌పీ భేటీ
జానారెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ సీఎల్‌పీ భేటీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలతోపాటు అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల సమస్యలపై చర్చించారు. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ్యత్వం పునరుద్ధరించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిపై సమీక్షించారు. ఈ వ్యవహారంపై అరగంటకు పైగా వాడీవేడి చర్చ జరిగింది.
రాష్ట్రపతి, గవర్నర్‌ లకు వినతిపత్రాలు అందజేయాలని తీర్మానం 
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ్యత్వం పునరుద్ధరణపై హైకోర్టు తీర్పును గౌరవించకుండా నిర్లక్ష్యం చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యవహారాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎల్‌పీ నిర్ణయించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి దీనిపై వినతిపత్రాలు అందజేయాలని తీర్మానించారు. హైకోర్టు తీర్పును అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందన్న అంశంపై చర్చించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ శాసససభ్యత్వం పునరుద్ధరణపై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ స్పీకర్‌, కార్యదర్శి, ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లకుండా 12 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో పిటిషన్‌ వేయించడాన్ని సీఎల్‌పీ తప్పుపట్టింది.
సొంత పార్టీ నేతలు సహాయ నిరాకరణ చేస్తున్నారన్న సంపత్‌కుమార్‌.. 
అయితే శాసనసభ్యత్వం రద్దుపై న్యాయపోరాటం చేస్తుంటే.. సొంత పార్టీ నేతలు సహాయ నిరాకరణ చేస్తున్నారని సంపత్‌కుమార్‌.. కాంగ్రెస్ నేతల తీరుపై విరుచుకుపడినట్టు సమాచారం.  దీంతో జానారెడ్డి జోక్యం చేసుకుని, ఈ విషయాన్ని రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లామని సంపత్‌కు సర్దిచెప్పినట్టు సీఎల్‌పీ వర్గాల్లో వినిపిస్తోంది. 
రైతులకు పూర్తి పరిహారం చెల్లించాలి  
మరోవైపు అకాల వర్షాలతో రైతులకు జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయి పర్యటనల్లో అంచనావేసి, అన్ని వివరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ శ్రేణులకు సీఎల్‌పీ విజ్ఞప్తి చేసింది. అన్నదాతలకు పరిహారం చెల్లించే విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించింది. పంట నష్టపోయిన రైతులకు పూర్తి పరిహారం చెల్లించాలని  సీఎల్‌పీ డిమాండ్‌ చేసింది.

 

07:51 - May 6, 2018

ఢిల్లీ : దేశంలోని వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి సీబీఎస్‌ఈ నిర్వహించే  నీట్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ జరిగే  ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 13 లక్షల 26 వేల  మంది విద్యార్ధులు హాజరవుతున్నారు.  తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మందికి పైగా విద్యార్థులు నీట్‌కు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. విద్యార్థులు ఉదయం తొమ్మిదిన్నర గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఆ తర్వాత అనుమతించబోమని సీబీఎస్‌ఈ  స్పష్టం చేసింది. 
పరీక్షకు సర్వం సిద్ధం
ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశానికి సీబీఎస్‌ఈ నిర్వహించే జాతీయ ప్రవేశార్హత పరీక్షకు సర్వం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో పది, తెలంగాణలో మూడు కేంద్రాల్లో నీట్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. నీట్‌కు ఈసారి రికార్డు సంఖ్యలో విద్యార్థులు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా 13లక్షల 26వేల మంది విద్యార్ధులు ఈ పరీక్ష రాయనున్నారు. 2016 నుంచి నీట్ పరీక్ష నిర్వహిస్తున్నప్పటికీ అప్పట్లో  అన్ని రాష్ట్రాలు నీట్ లోకి చేరలేదు. అయితే ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు చేరడంతో నీట్‌ రాసే విద్యార్థుల సంఖ్య పెరిగింది.  2016 లో 7లక్షల 50వేల మంది విద్యార్థులు నీట్ రాయగా.. 2017 లో 11లక్షల 50వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో 2016 తో పోలిస్తే ఈసారి 40శాతం ఎక్కువ మంది విద్యార్ధులు నీట్‌కు హాజరవుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మందికిపైగా విద్యార్థులు నీట్‌ రాస్తున్నారు. ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో నీట్‌ నిర్వహిస్తున్నారు. 
నీట్‌ నిబంధనలు కఠినతరం   
ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ చేసేందుకు నీట్ తప్పనిసరి చేయడంతో విద్యార్ధుల ఈసారి విద్యార్థులు సంఖ్య పెరిగింది. దేశంలో ఏ ప్రవేశ పరీక్షకు లేనివిధంగా నీట్‌కు  నిబంధనలు కఠినతరం చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు.  నీట్‌ రాసే విద్యార్థులు ఉదయం 9.30 లోపే  పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎవరినీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. విద్యార్థులు లేత రంగు దుస్తులు మాత్రమే ధరించి పరీక్షకు రావాల్సి వుంటుంది. వాటికి పెద్ద పిన్నులు, బ్యాడ్జీలు, పువ్వులు, పెద్ద బటన్లు  ఉండకూడదు. బుర్ఖా వంటి సాంప్రదాయ దుస్తులు ధరించేవారు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్న నిబంధన విధించారు.  హాఫ్‌ హ్యాండ్స్‌ షర్ట్‌లు మాత్రమే వేసుకోవాలి.  బూట్లు, హై హీల్స్ చెప్పులు వేసుకోకూడదు. శాండిల్స్‌, స్లిప్పర్స్‌తోనే పరీక్షా కేంద్రాలకు రావాలి. మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్, బ్లూ టూత్,  గ్యాడ్జెడ్లను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. వీటిని భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు లేవని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది.
బాలికలకు కొన్ని ప్రత్యేక నిబంధనలు 
బాలికలకు కొన్ని ప్రత్యేక నిబంధనలు విధించారు. ముక్కుపుడకలు, చైన్లు, చెవి రింగులు, దుద్దులు వంటి అభరణాలు ధరించి  పరీక్షకు హాజరుకాకూడదు. నీళ్ల సీసాలు, తినుబండారాలను అనుమతించరు. హ్యాండ్ బ్యాగ్‌లు, జ్యామెట్రీ బాక్సులతో పాటు బెల్టు, టోపీ, ప్యాడ్, చేతి గడియారం వంటి ఏ వస్తువులను అనుమతించరు. వీటితో పాటుగా పెన్, పెన్సిళ్లను కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. వీటిని పరీక్షా హాల్లోనే అందిస్తారు. విద్యార్థులు కేవలం అడ్మిట్ కార్డ్, రెండు ఫొటోలను తీసురావాలని అధికారులు సూచించారు. గతంలో ఇలాంటి నిబంధనలపై  విద్యార్థులతోపాటు  తల్లిదండ్రుల నుంచి  తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ.. మాస్ కాపీయింగ్‌ను అరికట్టే ఉద్దేశంతో సీబీఎస్‌ఈ  కఠిన నిబంధనలు విధించిందని అధికారులు చెబుతున్నారు. 

 

07:46 - May 6, 2018

గుంటూరు : దాచేపల్లిలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నా సీఎం చంద్రబాబు. గుంటూరులోని అత్యాచార బాధిత బాలికను పరమార్శించిన ఆయన.. బాలిక భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు తాను  చొరవ తీకుంటానన్నారు.  మరోవైపు టీడీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో మహిళలకు రక్షణలేకండా పోయిందని ప్రజాసంఘాలు, వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టాయి. 
బాలిక కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటాం : ఏపీ సీఎం 
గుంటూరు జిల్లా దాచేపల్లి అత్యాచార బాధిత బాలిక కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గుంటూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను సీఎంతోపాటు, శాసనసభా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కూడా పరమార్శించారు. దాచేపల్లి అత్యాచార బాధిత బాలికను అన్ని విధాలా ఆదుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బాలిక పేరు మీద 5 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తామన్నారు. ఆమె చదువుకు అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. బాలిక తల్లిదండ్రులకు రెండెకరాల భూమితోపాటు.... సొంత ఇల్లును నిర్మించి ఇస్తామన్నారు. రాష్ట్రలో అత్యాచార సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా  అఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణం పోతుందన్న భయం రావాలన్నారు.  దాచేపల్లి లాంటి ఘటనలను సభ్యసమాజం ఖండించాలని శాసనసభా స్పీకర్‌ కోడెల శిప్రస్తాద్‌ అన్నారు.నిందితులకు కఠినంగా శిక్షలుపడేలా చట్టాలను అమలు చేయాలన్నారు.  
చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత వల్లే మహిళలు, బాలికలకు రక్షణ లేదు : ఎమ్మెల్యే రోజా  
చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. రాష్ట్రంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నా పట్టించుకోలేని చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. టీడీపీ నేతలకు కాపలాకాయడానికి మాత్రమే పోలీసులు ఉన్నారు గాని ప్రజలకు రక్షణగా ఉండేందుకు కాదని ఆమె  ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ చేసిన తప్పులను వైసీపీ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. 
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు : చినరాజప్ప 
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. యూ ట్యూబ్‌ లాంటి సామాజిక మాధ్యమాల వల్ల చిన్నపిల్లలు కూడా చెడిపోతున్నారని అన్నారు. ఇలాంటి చెడు ప్రభావాలతో మహిళలపై అఘాయిత్యాలు ఇటీవల పెరిగిపోయాయన్నారు హోం మంత్రి అన్నారు. ఇలాంటి సంఘటనల్లో నిందితులు ఎంతటి వారైనా.. ఏపార్టీ వారైనా వదిలిపెట్టేది లేదన్నారు.
అత్యాచారాలను అరికట్టాలి : మహిళా సంఘాలు 
మరోవైపు దేశంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కర్నూలులో  ఐద్వా సంఘం ఆధ్వర్యంలో  మహిళలు మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు అధికారం చేపట్టాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలు, బాలికల రక్షణకు  చర్యలు తీసుకోవాలని మహిళాసంఘాలు, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే  పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.  

07:38 - May 6, 2018

చిత్తూరు : టీటీడీకి  కేంద్ర పురావస్తుశాఖ రాసిన లేఖ దుమారం రేపింది. తిరుమల క్షేత్రం పరిధిలోని ఆలయాలను కేంద్రం తన అజమాయిషీలో తీసుకుంటోందన్న ప్రచారం  మొదలైంది. దీనిపై  భక్తుల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. రాష్ట్ర ఆలయాలపై కేంద్రం పెత్తనం ఏంటని  పలువురు నేతలు విమర్శలు మొదలు పెట్టారు. చివరికి టీటీడీ ఈవో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 
కేంద్రం పెత్తనం..? 
తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆలయాలను పరిశీలించడానికి అనుమతివ్వాలని కోరుతూ పురావస్తుశాఖ టీటీడీకీ ఈవోకు రాసిన లేఖపై దుమారం రేగింది. తిరుమల ఆలయాలను కేంద్రం అజమాయిషిలోకి తీసుకుంటుందని ప్రచారంతో.. భక్తుల్లో విస్మయం వ్యక్తం అవుతోంది.  
టీటీడీని హస్తగతం చేసుకోవాలని కేంద్రం కుట్ర : బోండా ఉమా
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని హస్తగతం చేసుకోవాలని కేంద్రం కుట్రపన్నుతోందని టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. టీటీడీ పరిధిలోని ఆలయాల పరిశీలనకు అనుమతివ్వాలని పురావస్తుశాఖ లేఖ రాయడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీఎం చంద్రబాబుపై కక్ష సాధింపులో భాగంగానే  మోదీ ప్రభుత్వం ఈతరహా చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యంపై బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బోండా ఉమ వెల్లడించారు. 
బీజేపీ ఎదురు దాడి
అయితే రాజకీయదురుద్దేశంతోనే అబద్ధపు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎదురు దాడికి దిగింది. టీటీడీ ఆలయాలను కేంద్రం పరిధిలోకి తీసుకునే అవకాశమే లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు స్పష్టం చేశారు. ఈ విషయంపై కేంద్ర సాంస్కృతిక శాఖా అధికారులతో కూడా  తాము మాట్లాడామన్నారు. 
వెనక్కు తగ్గిన కేంద్రం  
మరోవైపు పురావస్తుశాఖ లేఖరాయడంపై టీటీడీ బోర్డు సభ్యుల నుంచే వ్యతిరేకత రావడంతో కేంద్రం వెనక్కు తగ్గింది. టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ దీనిపై వివరణ ఇచ్చి పరిస్థితిని చల్లబరిచే ప్రయత్నం చేశారు.  ఢిల్లీ నుంచి విజయవాడ కార్యాలయానికి పంపిన లేఖను కేంద్ర పురావస్తు శాఖ వెనక్కు తీసుకోనుందని అయన వెల్లడింఆచరు. లేఖను వెనక్కు తీసుకుంటున్నట్టు పురావస్తు శాఖ నుంచి తనకు  తమకు సమాచారం వచ్చినట్లు ఈవో అంటున్నారు. 
తిరుమల ఆలయాల భద్రతపై ఫిర్యాదులు అందిన తర్వాతే లేఖ : పురావస్తుశాఖ 
అయితే తిరుమల ఆలయాల భద్రతపై తమకు పలు ఫిర్యాదులు అందిన తర్వాతే టీటీడీకి లేఖ పంపామని పురావస్తుశాఖ వెల్లడించింది. తిరుమలలో పురాతన కట్టడాలను తొలగించి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని, భక్తులు ఇచ్చిన విలువైన కానుకలు సరిగ్గా భద్రపరచట్లేదని ఫిర్యాదులు అందాయని తెలిపింది. దాంతోపాటు  పూర్వకాలంలో రాజులు ఇచ్చిన ఆభరణాలు భద్రతకు నోచుకోవట్లేదని కూడా పలు  ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించిన అనంతరంమే టీటీడీకి లేఖ పంపామని పురావస్తుశాఖ వెల్లడించినట్టు తెలుస్తోంది. మొత్తానికి పురావస్తుశాఖ లేఖ పొలిటికల్‌ యాంగిల్‌ తీసుకోవడంతో.. కేంద్రం వెనక్కు తగ్గినట్టు సమాచారం. రాష్ట్రం నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో టీటీడీ ఈవోనే స్వయంగా వివరణ ఇచ్చారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

 

నేడు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్

హైదరాబాద్ : నేడు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ జరుగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగనుంది. ఉదయం 7.30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9.30 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతి నిరాకరించనున్నారు.  

Don't Miss