Activities calendar

07 May 2018

సైకిల్ తొక్కిన రాహుల్...

ఢిల్లీ : దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైకిల్‌ తొక్కారు. అంతకుముందు కోలార్‌లో నిర్వహించిన రోడ్‌షోలో రాహుల్‌ పాల్గొన్నారు. 

మోడీకి..షాలకు సిద్ధరామయ్య లీగల్ నోటీసులు...

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లీగల్‌ నోటీసులు పంపారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలకు ఎందుకు పరువు నష్టం దావా వేయకూడదో తెలపాలని నోటీసుల్లో ప్రశ్నించారు. 

కర్నాటక ఎన్నికల ప్రచారంలో మన్మోహన్...

ఢిల్లీ : కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీలు మధ్య విమర్శలు తారా స్థాయికి చేరాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్...

ఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై తెచ్చిన అభిశంసన నోటీసును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ఆట కట్టు...

హైదరాబాద్ : క్రికెట్‌ బెట్టింగ్‌ గ్యాంగ్‌ ఆట కట్టించారు హైదరాబాద్‌ పోలీసులు. ముఠాలోని 12 మందిని ఇప్పటికే అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారని ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితులన నుంచి 22 సెల్‌ఫోన్‌లు, 15లక్షల 50వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 

 

ఏపీలో కలెక్టర్ల సదస్సులు...

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళ, బుధవారాల్లో జిల్లాల కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తోంది. ప్రస్తుత ఎన్నికల సంవత్సరంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు.. కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్నారు.

భరోసా సెంటర్‌ కు రెండేళ్లు...

హైదరాబాద్ : మహిళలకు భద్రత కల్పించడంలో హైదరాబాద్‌ పోలీసులు దేశంలోనే ముందున్నారని సినీనటి అక్కినేని అన్నారు. మహిళల భద్రతకోసం భరోసా సెంటర్‌ ఏర్పాటై రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ప్రసాద్‌ల్యాబ్స్‌లో కార్యక్రమం జరిగింది.

21:21 - May 7, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో.. అమాయక బాలికలపై అఘాయిత్యాలు సోమవారం కూడా కొనసాగాయి. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో బాలికలపై అత్యాచార యత్నం జరిగింది. నెల్లూరులో.. స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.

ఆడబిడ్డలకు అండగా కదులుదాం అంటూ.. ప్రభుత్వం చైతన్య ర్యాలీలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే.. సోమవారం మరో రెండు అత్యాచార ఘటనలు వెలుగు చూశాయి. నెల్లూరు జిల్లా, వెంకటేశ్వరపురం గిరిజన కాలనీలో ఏడేళ్ల బాలికపై శివయ్య అనే వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక బహిర్భూమికి వెళుతుండగా.. అటకాయించిన దుండగుడు.. అత్యాచారానికి ప్రయత్నించాడు. అమ్మాయి కేకలతో.. స్థానికులు గుమిగూడి.. విషయం తెలుసుకుని.. శివయ్యను పట్టుకుని దేహశుద్ధి చేశారు. తనను వదిలేస్తే యాభై వేల రూపాయలు ముట్టజెబుతానంటూ నిందితుడు శివయ్య బేరాలకు దిగడంతో.. స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతణ్ణి స్థంభానికి కట్టి మరీ చితకబాదారు. అనంతరం.. పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు శివయ్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అటు గుంటూరు జిల్లాలోనూ సోమవారం ఉదయం ఇలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది. చుండూరు మండలం మోదుకూరులో.. ఏడేళ్ల బాలికపై నాగుల్‌మీరా అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. గుంటూరు జల్లా దాచేపల్లి ఘటన మరువక ముందే.. ఇలా వరుసగా బాలికలపై అత్యాచార ఘటనలు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. 

21:19 - May 7, 2018

విజయవాడ : ఆడబిడ్డలకు రక్షణ కావాలని ఏపీ ప్రజలు నినదించారు. మహిళలు, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడినే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. విజయవాడలో సేవ్‌గాల్‌చైల్డ్‌ ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. దాచేపల్లి లాంటి దారుణాలకు పాల్పడే వారిని కఠినంగా అణచివేస్తామన్నారు. మరోవైపు.. సీఎం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు చైతన్య ర్యాలీలు నిర్వహించారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు ఆడబిడ్డలకు రక్షగా కదులుదాం పేరుతో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఊరూవాడా ర్యాలీలు నిర్వహించారు. ఆడబిడ్డలను కాపాడుకుందామని నినదించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఇందిరాగాంధీ క్రీడా మైదానం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన సీఎం సభలో మాట్లాడారు. మహిళలు, చిన్నారుల రక్షణకోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

బాలికలపై లైంగిక దాడులను నిరసిస్తూ అన్ని జిల్లాల్లోనూ ప్రదర్శనలు జరిగాయి. ఎక్కడికక్కడ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో మంత్రి శిద్ధా రాఘవరావు ర్యాలీలో పాల్గొని.. ఆడపిల్లలపై లైంగిక దాడులను తీవ్రంగా ఖండించారు. అటు పాయకరావు పేట ఎమ్మెల్యే అనిత.. ఆయేషామీరా కేసులో అమాయకుడిని బలిపశువును చేసేందుకు అప్పటి వైఎస్‌ ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు. ఆడపిల్లల రక్షణ కోసం సామాజిక బాధ్యతగా సీఎం చంద్రబాబు ఈ చైతన్య ర్యాలీలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుమేరకు కడప జిల్లా జమ్మలమడుగుల ఐసీడీఎస్‌, డ్వాక్రా మహిళలు, పోలీసులు ఆడబిడ్డలకు రక్షణగా కదులుదాం ర్యాలీలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలోనూ కలెక్టర్‌ సత్యనారాయణ ఆధ్వర్యంలో వివిధ వర్గాల ప్రజలు ఆడబిడ్డలకు రక్షణగా కదులుదాం ప్రదర్శనలో పాల్గొన్నారు. అటు విజయనగరంలోనూ భారీ ర్యాలీ జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖలు, పోలీసుల ఆధ్వర్యంలో సాగిన ప్రదర్శనలో విద్యార్థినులు, మహిళలు, క్రీడాకారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీల్లో పాల్గొన్నారు.

21:16 - May 7, 2018

విజయవాడ : రాష్ట్రాల హక్కులను కాలరాసేలా ఉన్న 15వ ఆర్ధిక సంఘం నిబంధనలపై రాష్ట్రపతికి మెమొరాండం ఇవ్వాలని ఆర్థికశాఖ మంత్రుల సమావేశం నిర్ణయించింది. 15వ ఆర్థిక సంఘం నిబంధనల వల్ల దేశంలోని అన్ని రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆర్థికశాఖ మంత్రులు అభిప్రాయపడ్డారు. 15వ ఆర్థికసంఘం నిబంధనలపై 13 సవరణలు కోరుతూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు. రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినేలా కేంద్ర ప్రభుత్వ తీరు ఉందని, సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా నడుచుకుంటుందని ఆర్థికమంత్రుల సదస్సు అభిప్రాయపడింది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న పెత్తనానికి 15వ ఆర్థికసంఘం విధి విధానాలు అద్దంపడుతున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలపై గత నెల కేరళలో ఆర్థికమంత్రులు సమావేశం జరగగా.. తాజాగా అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమయ్యారు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలపై రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించడమే కాకుండా... 13 సవరణలు చేయాలని తీర్మానం చేశారు.

2011 జనాభా లెక్కల ప్రకారం నిధులు కేటాయిస్తే.. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని... న్యాయం జరిగే వరకు పోరాడుదామన్నారు. 15వ ఆర్ధిక సంఘం విధి విధానాలు మార్చాల్సిందేనన్నారు పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి. ఎక్సైజ్, కమర్షియల్ టాక్సులే పుదుచ్చేరికి ప్రధాన ఆదాయమని.. కానీ వీటిని భర్తీ చేయడానికి కేంద్రం అంగీకరించడం లేదన్నారు. సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేలా 15వ ఆర్థిక సంఘం విధి విధానాలున్నాయని కేరళ ఆర్థికమంత్రి థామస్‌ అన్నారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో ఉన్న రాష్ట్రాల అధికారాలను అణగదొక్కేలా కేంద్రం వ్యవహరిస్తుందని.. FRBMను 1.7 శాతానికి కుదించే యోచనలో కూడా ఉందన్నారు.

కేంద్ర పథకాల గురించి ఆర్థిక సంఘంలో ప్రతిపాదించడం ఇదే తొలిసారి అని.. అసలు కేంద్రం ఏ ఉద్దేశంలో ఇలాంటి ప్రతిపాదనలు చేసిందో అర్ధం కావడం లేదన్నారు పశ్చిమబెంగాల్‌ ఆర్థికమంత్రి మిత్రా. రాష్ట్రాల ఇష్టాలకు వ్యతిరేకంగా ఆర్థిక సంఘం ప్రతిపాదనాలున్నాయన్నారు. ఏ కారణం చేతనైనా కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చలాయించకూడదన్నారు ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా. రాష్ట్రాలకు నష్టం కలిగించే విధంగా ఆర్థిక సంఘం ప్రతిపాదనాలున్నాయన్నారు. తదుపరి సమావేశం ఢిల్లీలో నిర్వహిస్తామన్నారు సిసోడియా. 15వ ఆర్థిక సంఘం విధి విధానాల వల్ల రాష్ట్రాలు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కోల్పోతాయన్నారు ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. ఈ నిర్ణయాల వల్ల దేశంలోని అన్ని రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. మొత్తానికి 15వ ఆర్థిక సంఘం విధి విధానాలపై ఆర్థికమంత్రుల సదస్సు మరో అడుగు ముందుకు వేసింది. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ ఖరారు అయిన తర్వాత కలవాలని నిర్ణయించింది. 

సివిల్ ఏఈఈ నియామక ఫలితాలు విడుదల...

హైదరాబాద్ : నీటిపారుదల, ఆర్‌అండ్‌బీలో సివిల్ ఏఈఈ నియామక ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. సివిల్ ఏఈఈ ఉద్యోగాలకు 293 మందిని టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసింది.

ఆడబిడ్డకు రక్షగా కదులుదాం...

విజయవాడ : 'ఆడపిల్లల జోలికొస్తే ఖబడ్దార్‌' అంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా హెచ్చరించారు. 'ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ అనే నినాదంతో విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు సాగిన ప్రదర్శనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 

21:09 - May 7, 2018

అనుకుంటనే ఉన్న ఎన్నడో ఒకసారి పిల్పొస్తది పిల్పొస్తదని రానే వచ్చింది.. ఐఏఎస్ పరీక్షల ఫస్టుర్యాంకు సాధించిన జగిత్యాల పిలగానికి ముఖ్యమంత్రి ఆఫీసుకెళ్లి పిల్పొచ్చింది..ఒక్కటే నాల్గే ఒక్కటే ముచ్చటను నాల్గు తీర్ల మాట్లాడితే దాన్ని నాల్గె అంటరా తాటి మట్ట అంటరా మీరే జెప్పాలే ఇగ.. మిస్టర్ తీగల క్రిష్ణారెడ్డి మహేశ్వరం ఎమ్మెల్యేగారు.. మీకు రూల్సు గీల్చు ఏముండయా..?ఆ సిద్దిపేట ఆర్డీవో ముత్యం రెడ్డిగారు.. మీరు ఆర్డీవో పోస్టు సూటయ్యెతట్టు లేదు...పంచ భూతాలు పగవట్టినట్టే ఉన్నయ్ తెలంగాణ రైతులను..ఇద్దరాలు మొగలు గొట్లాడుకోని పోరన్ని బాయిలేశినట్టు.. రెండు ఊర్లోళ్లు కొట్లాట వెట్టుకోని ఆపెతందుకొచ్చి పోలీసోళ్లను పొర్క పొర్క గొట్టిండ్రు..ఈ విలేజ్ డౌలప్మెంట్ కమిటీలు యాడంగ దాపురమైనయ్ రో.. హురక ఇదెక్కడి నీట్ ఎగ్జాంరో.. విద్యార్థులను ఎట్లంటె గజదొంగల లెక్క జూస్తున్నరు సర్కారోళ్లు.. గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

21:05 - May 7, 2018
21:03 - May 7, 2018
18:44 - May 7, 2018

మహబూబ్‌నగర్‌ : జిల్లా కానాయపల్లి గ్రామ ప్రజలు ఆందోళన బాట పట్టారు. ప్రాజెక్ట్‌ల కోసం తమ నుంచి ఎలాగైన భూములు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తమను బెదిరించి భూములు స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తూ.. ప్రజాసంఘాలతో కలిసి వనపర్తి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర మరింత సమాచారాన్ని అందిస్తారు.

18:39 - May 7, 2018

హైదరాబాద్ : నిమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖల మంత్రులు లేఖ రాశారని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్ విధివిధానాలను, డీపీఆర్‌ను తయారు చేయాలిన లేఖలో మంత్రులు తెలిపినట్లు చెప్పారు. కేంద్ర ఆరోగ్యశాఖ నిమ్స్‌ కోసం కమిటీని ఏర్పాటు చేసిందని.. త్వరలో కమిటీ సైట్‌ ఇన్‌స్పెక్షన్‌ కోసం వస్తున్నట్లు లేఖ రాసిందని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.

18:36 - May 7, 2018

పెద్దపల్లి : జిల్లా మంథనిలో శివాలయం వేదికగా టీఆర్‌ఎస్‌లో రెండు వర్గాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తుమ్మిచెరువు ఆధునీకరణలో భాగంగా.. కట్టపై ఉన్న పురాతనమైన శివలింగం, నంది విగ్రహాలను తొలగించి మట్టిపోయడంతో వివాదం తలెత్తింది. అయితే ఈ పనిని ఎమ్మెల్యే పుట్టా మధు దగ్గర ఉండి చేయించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా మరోనేత సునీల్‌రెడ్డి ఆ విగ్రహాలపై మట్టిని తొలగించి పాలాభిషేకం చేశాడు. విషయం తెలుసుకున్న పుట్టా మధు గ్రామసభ నిర్వహించి.. సునీల్‌రెడ్డిపై ఫైర్‌ అయ్యాడు. సునీల్‌రెడ్డి వ్యక్తే కాదని ఆరోపించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానికులు, బ్రాహ్మణులు సునీల్‌రెడ్డికి మద్దతుగా నిలవడంతో... పుట్టా మధు వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్రాహ్మణుల సంఖ్య ఎంత ? మీరు ఏం చేస్తారు ? అని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో సీటు రాదనే ఉద్దేశంతోనే పుట్టా మధు ఇలా వివాదాలు సృష్టిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇద్దరి నేతల మధ్య విభేదాలు సరికాదని.. దీనిపై అధిష్టానం దృష్టి సారించాలని స్థానిక నేతలు కోరుతున్నారు. 

18:33 - May 7, 2018

అనంతపురం : పరిటాల రవీంద్ర కీలక అనుచరుడు.. అనంతపురం జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌.. చమన్‌ సాహెబ్‌ గుండెపోటుతో మరణించారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారాక.. చమన్‌ అజ్ఞాతంలోకి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక.. ఆయన బాహ్యప్రపంచంలోకి వచ్చారు. చమన్‌, గతంలో కొంతకాలం పాటు.. పీపుల్స్‌వార్‌ కొండపల్లి సీతారామయ్య వర్గంలో పనిచేశారు. అనంతపురం జిల్లా రాజకీయాల్లో.. పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడిగా పేరొందిన చమన్‌సాహెబ్‌ సోమవారం ఉదయం మృతి చెందారు. ఆదివారంనాడు, పరిటాల సునీత కుమార్తె స్నేహలత వివాహ కార్యక్రమంలో చమన్‌ చురుగ్గా పాల్గొన్నారు.

సోమవారం ఉదయం.. మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురంలో.. మంత్రి, ఇతర ప్రముఖులతో మాట్లాడుతున్న సమయంలో.. చమన్‌ గుండెపోటుకు గురయ్యారు. ఆయన్ను హుటాహుటిన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చమన్‌ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆపత్కాలంలో తమ కుటుంబానికి అండదండగా నిలిచిన చమన్‌ మృతదేహాన్ని చూసి.. మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యులు తట్టుకోలేక పోయారు. దుఃఖంతో ఆసుపత్రిలోనే సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వైద్యులు హుటాహుటిన ఆమెను మరో వార్డుకు తరలించి, చికిత్సను అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పలువురు ప్రముఖులు పరిటాల సునీతను పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.

2004లో టీడీపీ అధికారం కోల్పోయాక.., పార్టీ నేతల వరుస హత్యల నేపథ్యంలో, పరిటాల ముఖ్య అనుచరులతో పాటే.. చమన్‌ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పరిటాల రవీంద్ర హత్యకు గురైనప్పుడు కూడా చమన్‌ అజ్ఞాతంలోనే గడిపారు. 2012లో, అజ్ఞాతం వీడిన చమన్‌, 2014 సంవత్సరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి జెడ్పీటీసీగా గెలిచారు. 2014 నుంచి 2017 వరకూ అనంతపురం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా కొనసాగారు. తెలుగుదేశం పార్టీ క్రియాశీల రాజకీయాల్లోకి రాకుముందు.. చమన్‌, కొంతకాలం పీపుల్స్‌వార్‌ కొండపల్లి సీతారామయ్య వర్గంలో పనిచేశారు. చమన్‌ మృతదేహాన్ని స్వగ్రామం కొత్తపల్లికి తరలించారు. మంగళవారం అంత్యక్రియలు జరుగుతాయి. చమన్‌ మృతి పట్ల.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా.. మంత్రులు సునీత, కాల్వ శ్రీనివాసులు, మండలి చీఫ్‌విప్‌ పయ్యావుల కేశవ్‌, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతాపం ప్రకటించారు. 

18:26 - May 7, 2018

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతోందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు కారణం టిడిపి..బిజెపి పార్టీలేననని, మోడీ అధికారంలోకి వచ్చాక సంఘ్ పరివార్ శక్తులు రెచ్చిపోతున్నాయన్నారు. రాజకీయాల్లో మార్పు రావాల్సి ఉందని..ఇందుకు కొత్త శక్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. 

ఏపీ వ్యాప్తంగా ర్యాలీలు...

విజయవాడ : బాలికలపై దాడులకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా ర్యాలీలు జరుగుతున్నాయి. విజయవాడ ర్యాలీలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 

18:17 - May 7, 2018
18:16 - May 7, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన దీక్షకు రూ. 30 కోట్లు ఖర్చు పెట్టారని, ఏపీలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...టిడిపి కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహిస్తున్నారని, దీనితో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఇక ప్రపంచంలో ఎక్కడా జరగని అవినీతి పోలవరం ప్రాజెక్టులో జరుగుతోందని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై అక్రమ బెట్టింగ్ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. 

ఓటుకు నోటు కేసుపై కేసీఆర్ సమీక్ష...

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ 'ఓటుకు నోటు' కేసుపై సమీక్షిస్తున్నారు. డీజీపీ, ఏసీబీ డీజీ, విశ్రాంత ఐపీఎస్ ఏకే ఖాన్, అధికారులు, న్యాయవాదులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. 

17:32 - May 7, 2018
17:29 - May 7, 2018

హైదరాబాద్ : వనస్థలిపురంలో టిఫిన్ సెంటర్ లో జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు చేధించారు. ఈనెల 3వ తేదీన ఈ హత్య జరిగింది. సీసీ కెమెరా ఫుటేజ్ సహాయంతో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. టిఫిన్ సెంటర్ లో కృష్ణ అనే వ్యక్తి గొంతు కోసిన ఘటనలో నిర్వాహకుడు గిరిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు సహకరించిన మరో వ్యక్తి దయాకర్ ను కూడా అరెస్టు చేశారు. వైన్ షాప్ వ్యవహారంలో గిరి..కృష్ణల మధ్య వివాదం ఉన్నట్లు సమాచారం. 

17:24 - May 7, 2018

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.పెద్దల మాట చద్దిమూట అనేది అనుభవజ్నుల మాట. అంటే పెద్దలు ఏం చెప్పినా భావితరాల కోసమేననే మాటను ప్రతీఒక్కరు గుర్తించుకోవాలి. వారి అనుభంలో నుండి మంచి తీసుకుని, చెడుని వదిలి ఆ సత్యాలను 'నానుడి' భావి తరాలకు అందించిన సూత్రాలు..ఆరోగ్య మూలికలు అన్నమాట. ఆరోగ్యం వుంటేనే ఏదైనా సాధించగలం. ఆరోగ్యం ప్రాణానికి మాత్రమే సంబంధించినది కాదు. అలాగే శరీరానికి మాత్రమే కూడా సంబంధించినది కాదు. ఆరోగ్యం అంటే మానసికంగా..శారీరకంగా, ఆలోచనా పరంగా, సామాజికంగా..చైతన్యవంతంగా దృఢంగా వుండటం..

ఆరోగ్యం కోసం పలు నిబంధనలు..
ఎన్నో నియమ నిబంధనలను మనిషి ఏర్పరచుకున్నది కూడా ఈ ఆరోగ్యం కోసమే. ఉదాహరణకు మనిషి మనిషిని చంపకూడదు..సాటివారికి హాని చేయకూడదు..ఒకరికొకరు సహాయపడాలి. అంటే మానసికంగా..శారీరకంగా..సామాజికంగా ఆరోగ్యంగా వుండాలనే ఉద్ధేశ్యమే ఆరోగ్య దినోత్సవం. మనిషి మానసిక ఆలోచనలు ఆరోగ్యకరంగా వుంటనే శారీరకంగా ఆరోగ్యంగా వుండగలుగుతారు.

ఆరోగ్య దినోతవ్సవానికి 70 సంవత్సరాలు..ప్రత్యేక స్టాంపులు..
ఏప్రిల్ 7న 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం'. ప్రజలు మెరుగైన ఆరోగ్యంతో జీవించాలనేది ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది 'అందరికి ఆరోగ్యం' నినాదంతో 68వ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అయితే... ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకోవడానికి ఓ ప్రత్యేకత ఉంది. 1948లో ఇదేరోజున ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 'ప్రపంచ ఆరోగ్యసంస్థ ఏర్పాటైంది. దీని వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 1950 నుంచి ఏప్రిల్ 7న 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం' నిర్వహిస్తున్నారు. మరో విశేషమేమిటంటే 2018 నాటికి 'వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్' ఏర్పాటై 70 వసంతాలు పూర్తయింది. 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం-2018' సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రత్యేక స్టాంపులను విడుదల చేసింది.

17:21 - May 7, 2018

మెదక్ : రోడ్డు విస్తరణ పనులు కొంతమంది కొంపలు ముంచుతున్నాయి. రామాయంపేట - సిద్ధిపేట రోడ్ల విస్తరణ పనుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోమవారం అధికారులు జేసీబీలు తీసుకొచ్చి విస్తరణకు అడ్డుగా ఉన్న నివాసాలను, దుకాణాలను కూల్చివేశారు. ఈ కూల్చివేతలపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న తమ ఇళ్లను ఎలా కూలుస్తారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. చిన్న చిన్న షాపులు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నామని కొంతమంది పేర్కొన్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఇళ్లు కట్టుకుంటే ఇలా కూల్చివేయడం కరెక్టు కాదని మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

16:54 - May 7, 2018

భారతదేశంలోని యువతీ, యువకులలో అధికశాతం మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచ యువ జనాభాలో ఎక్కువ శాతం భారత్ లోనే వున్నారని ప్రపంచ నివేదిక పేర్కొంది. యువత ఎక్కువగా మానసిక సమస్యలతో నిరాశ, నిస్పృహ, ఒత్తిడికి లోనై కుంగి కృషించి పోతున్నారని తెలిపింది. ప్రపంచ జనాభాలో 32 కోట్ల మంది యంగస్టర్స్ మానసిక ఒత్తిడికి లోనవుతుండగా.. వాళ్లలో 5 కోట్ల మంది భారతీయులు ఉన్నారంటే.. యువత ఎంతలా ఆందోళనకు లోనవుతున్నారో ఊహించుకోవచ్చు..అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ-2015 నివేదికలో ఈ విషయాలను ప్రచురించింది డబ్ల్యుహెచ్వో సంస్థ.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఒత్తిడి..
ఆత్మహత్యల్లో ఎక్కువ శాతం భారత వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే జరుగుతున్నాయని వెల్లడించింది. వీళ్లలో ఎక్కువ మంది ఆగ్నేయాసియా, పశ్చిమ పసిఫిక్‌ ప్రాంత దేశాలవారేనని తెలియజేసింది. ప్రపంచ యువకులలో చోటు చేసుకుంటున్న మానసి రుగ్మతలను 2005 నుంచి 2015 వరకు డబ్ల్యుహెచ్వో అధ్యయనం చేయగా ఆసక్తికర సంఘటనలు బయటపడ్డాయి.

యువతలో 18.4 శాతం పెరిగిన మానసిక రుగ్మతలు..
యువకుల్లో మానసిక రుగ్మతలు 18.4 శాతం పెరిగాయని వెల్లడించింది. దేశ జనాభా అంటే 2015లో 4.5 శాతం కుంగుబాటుకు లోనవగా… 3 శాతం మంది ఆందోళనకు గురయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

ఒత్తిడితో 7.8 శాతం మంది ఆత్మహత్యలు..
దేశంలో ప్రతి పది మందిలో ఒకరు మానసిక సమస్యలతో చిధ్రమవుతున్నారంది వాల్డ్ నివేదిక. ఈ ఏడాది ఒత్తిడి వల్ల 7.8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపింది. ఆత్మహత్య చేసుకున్నవాళ్లలో పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువగా ఉన్నారని తెలియజేసింది.

ఏప్రిల్ 7.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం...
ఏప్రిల్ 7.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.డిప్రెషన్ లెట్స్ టాక్”ను 2017 సంవత్సరం నినాదంగా ప్రకటించింది డబ్ల్యుహెచ్వో. కుంగిపోతున్న యువతను… చైతన్యవంతం చేసే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చింది. నిరాశ, నిస్పృహలను తరిమేయాలని… ఆశావాదంతో డిప్రెషన్ నుంచి బయటపడాలని చెబుతున్నారు వైద్యులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రస్తుతం 300 మిలియన్ల మంది డిప్రెషన్ తో బాధ పడుతున్నారు. అందుకే ఈ ఏడాదిని ”డిప్రెషన్ లెట్స్ టాక్” గా నిర్వహించాలని నిర్ణయించింది.

మారుతున్న జీవనపరిస్థితులే కారణంగా..
నవ్వుతూ పలకరించు.. ప్రేమగా మాట్లాడు.. ఆత్మీయతను పంచు.. డిప్రెషన్ తో బాధపడేవారికి ఇదే మందు అంటున్నారు డాక్టర్లు. మారుతున్న జీవన పరిస్థితుల్లో పక్కవాళ్లతో ప్రేమగా మాట్లాడటం కూడా ఆరోగ్య సందేశంగా మారిపోయింది. ఈ సందేశాన్ని మరింత విస్తృత పరచాల్సిన బాధ్యత అందరిపై ఉంది. తన సైకత శిల్పం ద్వారా ఇదే పని చేస్తున్నారు.. తరణి ప్రసాద్ మిశ్రా. ఏపీ శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదీతీరంలో ఈ సైకతశిల్పి చెక్కిన శిల్పం ద్వారా.. ఈ సందేశాన్నే వినిపిస్తున్నారు.

ఆత్మవిశ్వాసంతోనే గెలుపు..
ఏది ఏమైనా ఆత్మవిశ్వాసం అనేది మనిషిని బతికిస్తుంది. గెలిపిస్తుంది. పోరాడేపటిమను అలవరిస్తుంది. అందుకే మేధావులు, అనుభవజ్నులు చెప్పిన మాటలను వల్లె వేసుకుందాం. ఒత్తిడిని జయిద్దాం..ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుందాం..ఆత్మవిశ్వాసం ఉన్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని, చైతన్యాన్ని వెలికి తీస్తుంది. మీరు దేనినైనా సాధించగలరు. ఒక వ్యక్తి గానీ, జాతి గానీ తనపై తాను విశ్వాసాన్ని కోల్పోతే అది మృత్యువుతో సమానం.

16:50 - May 7, 2018
16:48 - May 7, 2018

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం టీఎంయూ సమ్మె నోటీసు ఇచ్చింది. వేతన సవరణతో పాటుగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది. పే స్కేల్‌ అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను..యాజమాన్య వైఖరిని నిరసిస్తూ కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. దీనితో ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చలో వి.ఎస్ రావు (ఎస్ డబ్ల్యూఎఫ్), కె.రాజిరెడ్డి (ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి), ఎం.థామస్ రెడ్డి (టీఎంయు వర్కింగ్ ప్రెసిడెంట్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

16:21 - May 7, 2018

విజయవాడ : విభజన కారణంగా ఏపీ తీరని విధంగా నష్టపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బీజేపీయేతర రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ఏపీతో పాటు 5 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. 15వ ఆర్థిక సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫెరెన్స్ పై చర్చించారు. రెవెన్యూ లోటుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కేంద్రం రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని తెలిపారు. కేంద్ర సహాయం లేదని పేర్కొన్నారు.

 

16:17 - May 7, 2018

హైదరాబాద్ : టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వ రద్దుపై టి.కాంగ్రెస్ ఇంకా పోరాటం కొనసాగిస్తోంది. దీనిపై కోర్టులో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను టి.కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్, ఇతర నేతలు కలిశారు. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై హైకోర్టు ఆదేశం ప్రభుత్వం అమలు చేసేలా చూడాలని కోరారు. కోర్టు ఆదేశాల కాపీలను గవర్నర్ కు అందచేయడం జరిగిందన్నారు. 

16:14 - May 7, 2018

ఆదివారం వచ్చింది..స్కూలుకెళ్లే చిన్నారుల నుండి ఆఫీసులకెళ్లే ఉద్యోగుల వరకూ ఆనందమే ఆనందం..ఎందుకంటే ఆదివారం సెలవు వారం కాబట్టి. ఆదివారం వచ్చిందంటే చాలు రెక్కలు కట్టుకుని విహారానికి వెళ్లేవారు..ఉగ్యోగినులు అయితే వారం అంతా పెండింగ్ లో వున్న వాటిని క్లియర్ చేసేసుకుంటారు. మరికొందరు రకరకాల వంటకాలు చేసేసుకుని ఆస్వాదిస్తుంటారు. ఏది ఏమైనా 'ఆదివారం' అంటే అందరివారం, విశ్రాంతివారం. మిగతా ఆరు రోజులు పనిదినాలు ఎందుకయ్యాయి? ఆదివారం మాత్రం సెలవు వారం ఎందుకయ్యింది? దీని వెనుక వున్న కారణమేమిటి?

క్రైస్తవుల నమ్మకం ప్రకారం..
క్రైస్తవులు జీసస్ ను నమ్ముతారు. వారి పవిత్ర గ్రంథం బైబిల్. బైబిల్ లో ఆదివారానికి ఓ ప్రత్యేకత వుంది. ఆదివారం వస్తే క్రైస్తవులంతా చర్చిలకు వెళతారు. ప్రార్ధనలు చేస్తారు. బైబిల్ ప్రకారం ఆదివారం సెలవుదినం ఎందుకయ్యిందో చూద్దాం. ఈ సృష్టిని ఆది దేవుడు అంటే యెహోవా సృష్టించాడని క్రైస్తవుల నమ్మకం. ఆ నమ్మకం ప్రకారంగా చూస్తే..ఆరురోజులపాటు ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడట..ఆరోజే ఆదివారం. ఈ సృష్టిని సృష్టించి అందులో మానవుడిని మాత్రం అతి ప్రత్యేకంగా..ఉన్నతంగా సృష్టించిన దేవుడు సమస్త సృష్టిపై మనిషికి ఆధిపత్యాన్ని ఇచ్చాడు. అందుకే ఆదివారం నాడు దేవుడికి క్రైస్తవులంతా ప్రార్థనలు చేసి తమ కృతజ్నతలను తెలుపుకుంటారు. అలాగే క్రైస్తవుల పండుగలు మట్ల ఆదివారం, ఈస్టర్ పండుగలు ఆదివారం రోజునే చేసుకుంటారు.

ఆదివారం హిందువుల నమ్మకం..
ఆదివారం సూర్యదేవుడికి చాలా ప్రత్యేకం. నవగ్రహాధిపతిగా సూర్యుడిని వేదాలు చెబుతాయి. హిందువులు సూర్యదేవుడికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. పూజిస్తారు. ఉదయం నిద్రలేవగానే సూర్యుడి దండం పెట్టుకునే ఆచారం హిందూ సంప్రదాయంలో ఉంది. ఏడు గుర్రాలు నడిపే వాహనం సూర్యుడిది. అంటే.. ఏడు గుర్రాల.. ఏడు రంగుల ఇంధ్రధనస్సుని సూచిస్తుంది. అలాగే శరీరంలోని ఏడు చక్రాలను సూచిస్తుంది. అలాగే నాగదేవతలను, సుబ్రహ్మణ్య స్వామిని పూజించేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తారు. వారు ఆదివారం కొన్ని రకాల ఆహారాలను తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఆహారాలను ఆదివారం తింటే.. మరోవిధంగా చూస్తే హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి వారంలో మొదటి రోజు సూర్యుని రోజుగా అంటే ఆదివారం. అందుకే ఆరోజు సెలవు దినంగా గుర్తించారని భోగట్టా! సూర్యదేవుడి ఆగ్రహానికి గురవుతారని చెబుతున్నాయి. ఇలా ఆదివారం పలు నమ్మకాలతో ముడిపడి వుంది.

అన్ని మతాలకు భిన్నంగా ముస్లింల శుక్రవారం..
హిందువులు, క్రైస్తవులు ఆదివారంతో ముడిపడి వుంటే ముస్లింలు మాత్రం శుక్రవారంతో ముడిపడి వుంటారు. వారు నమాజ్ కోసం దర్గాలకు వెళ్లి ప్రార్ధనలు చేస్తుంటారు. శుక్రవారం ముస్లింలకు చాలా పవిత్రమైన ప్రత్యేకమైన రోజు అందుకే ముస్లిం దేశాలలో శుక్రవారాన్ని ప్రార్థనాదినంగా పాటిస్తారు. అందుకే అక్కడ ఆదివారం బదులు శుక్రవారాన్నిసెలవు దినంగా పరిగణిస్తారు.

ఆదివారం సెలవు దినంగా ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలుసా?..
ఆదివారం సెలవు దినంగా ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలుసా? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అనుసరించి ఆదివారం వారంలో చివరి రోజు. అలాగే కామన్ హాలిడే. దీని వెనుక బ్రిటీషర్స్ అనుసరించిన విధానం కూడా ఉంది. 1843లో బ్రిటీష్ గవర్నర్ జనరల్ ఆదివారం సెలవు అనే విషయంపై ఆదేశాలు జారీచేశారు. దీనిని ముందుగా పాఠశాలల్లో అమలు చేశారు. ముఖ్యంగా చిన్నారులు ఆరోజు ఇంట్లో ఉండి క్రియేటివిటీ వర్క్ చేస్తారనే ఉద్దేశంతో దీనిని అమలు చేశారు. ఆంగ్లేయుల పాలనా కాలంలో భారతదేశంలో కార్మకవర్గానికి ఏడు రోజుల పనివిధానం ఉండేది. అయితే 1857లో కార్మిక నేత మేఘాజీ లోఖండే కార్మిక హక్కుల గురించి గళం ఎత్తారు. అతని కృషి ఫలించి, 1890 జూన్ 10 నుంచి ఆదివారం సెలవుదినంగా ప్రకటించారు.

15:24 - May 7, 2018

కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన సమంతా..

హైదరాబాద్ : గత రెండు నెలలుగా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై వివాదాం తీవ్రస్థాయంలో నెలకొంది. ఈ స్థాయిలో రచ్చ అయిన వివాదం మరొకటి లేదంటే అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో కాస్టింగ్ కౌచ్ పై అక్కినేనివారి కోడలు, హీరోయిన్ సమంత స్పందించింది. కాస్టింగ్ కౌచ్ కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాదని... అన్ని రంగాల్లో ఉందని తెలిపింది. అమ్మాయిల బలహీనతలను వాడుకునే నీచులు ప్రతి చోటా ఉన్నారని చెప్పింది. 

ఉద్యోగుల విభజనపై సుప్రీం విచారణ..

ఢిల్లీ : విద్యుత్ ఉద్యోగుల విభజనపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తు దాఖలైన పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ ఉద్యోగులు సుప్రీంకోర్టును కోరారు. కాగా దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై విడిగా అప్లికేషన్ వేసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ ఉద్యోగులకు సూచించింది. తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది. 

స్పృహ తప్పిన పరిటాల సునీత..

అనంతపురం : టీడీపీ మాజీ ఎమ్మెల్యే పరిటాల రవి ప్రధాన అనుచరుడు, మాజీ జెడ్పీ చైర్మన్ చమన్ మృతి చెండాడు. చమన్ భౌతిక కాయం సందర్శించేందకు ఆసుపత్రికి వచ్చిన మంత్రి పరిటాల సునీత స్పృహ తప్పి పడిపోయారు. కాగా చమన్ కు గుండెపోటు రావటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు చమన్ మృతి చెందాడు. 

13:59 - May 7, 2018

రాజమండ్రి : మే 8 వ తేదీన ప్రపంచ తస్సేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలో 2కె రన్ నిర్వహించారు. జైన్ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక పుష్కర్ ఘాట్ నుంచి రివర్ బే హోటల్ వరకు రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో జైన్ సేవా సంఘం సభ్యులు, యువతీయవకులు, నగర పౌరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రక్తదానం ఆవశ్యకతను తెలియజెప్పేందుకు కార్యక్రమం చేపట్టామని నిర్వహకులు తెలిపారు. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా రక్తదానం చేయాలని కోరారు. 

13:47 - May 7, 2018

మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన 'మ‌హాన‌టి' సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అన్నంతగా సినిమాపై ఆసక్తి నెలకొంది. తెలుగువారికి ఆరాధ్య నటి సావిత్రి నిజ‌జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్క‌డం..సినిమాలో వివిధ భాష‌ల‌కు చెందిన ప్ర‌ముఖ న‌టులు న‌టిస్తుండ‌డం 'మ‌హాన‌టి' జీవితకథను చూడాలనే ఆసక్తి మరోవైపు ఏ ప్రాతలో ఎవరు నటిస్తున్నారు అనే ఆసక్తి వెరసి ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది. ప్రధాన పాత్రలో సావిత్రిగా కీర్తి సురేష్‌, స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మోహ‌న్‌బాబు, సింగీతం శ్రీనివాస‌రావు, డైరెక్ట‌ర్ క్రిష్‌, ప్ర‌కాష్‌రాజ్ వంటి ప్ర‌ముఖ న‌టులు న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాలో మ‌రో టాప్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా న‌టిస్తోందంటూ షాకింగ్ న్యూస్ బ‌య‌టికొచ్చింది. ఈ విష‌యాన్ని `మ‌హాన‌టి` చిత్ర నిర్మాణ సంస్థ వెల్ల‌డించింది. కాజ‌ల్ ఫోటోను కూడా త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.'మ‌హాన‌టి`లో కాజ‌ల్ ఏమి చేస్తోందో తెలుసుకోవాల‌నుకుంటున్నారా? అయితే మే తొమ్మిదో తేదీ వ‌ర‌కు ఆగండి` అంటూ కామెంట్ కూడా పెట్టింది.

13:40 - May 7, 2018

అనంతపురం : ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ధర్మవరంలో చేపట్టిన పది కిలో మీటర్ల సైకిల్ ర్యాలీలో మార్గంమధ్యలోనే వడదెబ్బ తగలడంతో ఎమ్మెల్యే స్పృహ తప్పి పడిపోయారు. కార్యకర్తలు హుటాహుటిన అయన్ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు..12మంది అరెస్ట్..

హైదరాబాద్ : ఆన్‌లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. 12 మంది నుంచి రూ. 15.5 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూ. 7.5 లక్షల నగదు ఉన్న నిందితులకు చెందిన రెండు బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠాపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

కోర్టు తీర్పును అమలు చేయాలని చెప్పండి : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు పై హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేసేలా చూడాలని గవర్నర్ ను కోరారు. కాగా కోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరో పిటీషన్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

13:33 - May 7, 2018

అనంతపురం : జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చమన్ మృతి చెందారు. గుండెపోటులతో ఆయన మృతి మరణించారు. 2014 సం. నుంచి 2017 వరకు జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేశారు. పరిటాల రవికి ముఖ్య అనుచరుడిగా చమన్ పని చేశారు. పరిటాల హత్య తర్వాత 8 సంవత్సరాలు అజ్ఞాతంలోకి ఉన్నారు. చమన్ మృతి పట్ల మంత్రి పరిటాల సునీత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

మోదీ సర్కార్ ఘోర తప్పిదాలు : మన్మోహన్ సింగ్

ఢిల్లీ : నరేంద్రమోదీ సర్కారు రెండు ఘోర తప్పిదాలు చేసిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శించారు. ఒకటి పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని తొందరపాటుగా అమలు చేయడంతో ఆర్థిక వ్యవస్థకు ఎంతో నష్టం వాటిల్లిందని ప్రముఖ ఆర్థిక వేత్త కూడా అయిన మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ తప్పిదాల ఫలితంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలపై ప్రభావం పడటంతో వేలాది ఉద్యోగాలు పోగోట్టుకున్నారన్నారు. మోదీ సర్కారు ఆర్థిక నిర్వహణ తీరు కారణంగా ప్రజల్లో బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం క్రమంగా తుడిచిపెట్టుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

మరో సంచలనం రేపిన నటుడు విశాల్..

కర్ణాటక : పాలకులను ఉద్దేశించి సినీ హీరో, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నీట్ పరీక్షల నేపథ్యంలో అనిత దగ్గర నుంచి కృష్ణసామి వరకు జరిగిన మరణాలకు పాలకులే కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలకులకు ప్రజలు గుణపాఠం చెప్పితీరుతారని అన్నారు. నీట్ పరీక్ష కోసం కస్తూరి అనే విద్యార్థిని కేరళకు తీసుకెళ్లిన అతని తండ్రి కృష్ణసామి గుండెపోటుకు గురై మరణించారు. ఈ నేపథ్యంలోనే విశాల్ ట్విట్టర్ ద్వారా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కృష్ణసామి మరణంతో అనాథగా మిగిలిపోయిన మహాలింగం కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.  

13:23 - May 7, 2018

గుంటూరు : దాచేపల్లిలో బాలికపై అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. దాచేపల్లి ఘటన మరువకముందే తాజాగా జిల్లాలో మరో దారుణం జరిగింది. బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చుండూరు మండలం మోదుకూరులో ఏడేళ్ల బాలికపై నాగుల్ మీరా అనే యువకుడు అత్యాచారం చేశాడు. చికిత్స నిమిత్తం బాలికను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాగుల్ మీరా కోసం గాలిస్తున్నారు.  

జెడ్పీ మాజీ చైర్మన్ చమన్ మృతి..

అనంతపురం : జెడ్పీ మాజీ చైర్మన్, పరిటాల రవి ప్రధాన అనుచరుడు చమన్ మృతి చెందారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతు చమన్ మృతి చెందారు.  

విభజన హామీలపై కేంద్రానికి సుప్రీం ఆదేశాలు..

ఢిల్లీ : ఏపీ పుర్విభజన చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ విభజన హామీలను నెరవేర్చిన వివరాలను తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్ని వివరాలు కోర్టుకు సమర్పించేందుకు కేంద్రం కోర్టును నాలుగు వారాల గడువును కోరింది. దీంతో విచారణను నాలుగు వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

 

చిన్నారిపై మృగాడి ఘాతుకం..

గుంటూరు : మరోబాలిక లైంగికదాడికి గురయ్యింది. దాచేపల్లి ఘటన మరవకముందే మరో బాలిక ఓ మృగాడి ఘాతుకానికి బలయ్యింది. చుందూరు మండలం మోదుకూరులో తాపీ మేస్త్రిగా పరిచేస్తున్న నాగుల్ మీరా అనే యువకుడు ఏడేళ్ళ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికను తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనపై బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడికోసం గాలిస్తున్నారు.

శిక్షణ పూర్తి చేసుకున్న జాగిలాలు..

విజయవాడ : మంగళగిర 6వ బెటాలియన్ లో ఐదు జాతులకు చెందిన 30 జాగిలాలు శిక్షణ పూర్తి చేసుకున్నాయి. శిక్షణ అనంతరం జాగిలాల డెమో ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శనను డీజీపీ మాలకొండయ్య, ఇంటెలిజెన్స ఐజీ వెంకటేశ్వరరావు తిలకించారు. రాష్ట్ర విభజన అనంతరం సరైన శిక్షణా కేంద్రం లేక ఏడాదిపాటు కీలక కేసులను ఛేదించటంలో డాగ్ స్వ్కాడ్ కీలక పాత్ర పోషించాయని డీజీపీ మాలకొండయ్య తెలిపారు. శిక్షణ పొందిన జాగిలాలలో మూడు మాత్రం ఇంటిలిజెన్స్ విభాగంలో వినియోగిస్తామని..మిగిలినవాటిని నేర పరిశోధనలో వినియోగిస్తామని తెలిపారు.  

సైకిల్ యాత్రలో స్పృహ తప్పి పడిపోయిన ఎమ్మెల్యే..

అనంతపురం : సైకిల్ యాత్రలో అనేక అపశృతులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సైకిల్ యాత్ర చేపట్టిన ఎమ్మెల్యే సూర్యనారాయణ వడదెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయారు. పోతుగుంట నుండి ధర్మవరం వరకూ సైకిల్ యాత్ర చేపట్టిన ఎమ్మెల్యే సూర్యనారాయణ వడదెబ్బ తగిలి పడిపోయారు. దీంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

12:53 - May 7, 2018

విశాఖపట్నం : విశాఖ జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలని సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.నర్సింగరావు అన్నారు. నేడు అల్లూరి సీతారామరాజు 94వ వర్థంతి సందర్భంగా అల్లూరికి ఆయన ఘన నివాళులు అర్పించారు. 

 

12:43 - May 7, 2018

విజయనగరం : జిల్లాలో 'ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం' పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ పాల్ రాజు ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు. 

12:33 - May 7, 2018

నిర్మల్ : కడెం మండలం అల్లంపల్లిలో విషాదం నెలకొంది. వాగు వద్ద ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మడుగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. చిన్నారులిద్దరు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కావడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు సాయి (5), సిద్దు(7)గా గుర్తించారు.  

అంతిమ లక్ష్యం పేదరిక నిర్మూలనే : చంద్రబాబు

అమరావతి : ఈరోజు అమరావతిలో ఆర్థిక మంత్రుల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..అంతిమ లక్ష్యం పేదరిక నిర్మూలనేనన్నారు. పేదరిక నిర్మూలన కోసం అనేక విధానాలకు తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. జనాభా నియంత్రణలో కేరళ రాష్ట్రం ముందు భాగంలో వుందని సీఎం చంద్రబాబు తెలిపారు. జనాభా నియంత్రణ అనేది ఒకేసారి సాధ్యంకాదన్నారు. విభజన నేపథ్యంలో లోటు బడ్జెట్ తో వున్న ఏపీకి కేంద్రం పట్టించుకోవటంలేదనీ..విభజన చట్టంలో వున్న అంశాలకే కోరుతున్నామనీ న్నారు. రాష్ట్ర విభజన వల్ల రెవెన్యూలోటుతో పలు ఇబ్బందులు పడుతున్నామని చంద్రబాబు తెలిపారు. 

12:21 - May 7, 2018

గుంటూరు : జనాభా నియంత్రణలో కేరళ రాష్ట్రం ముందుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో జరుగుతున్న విపక్ష రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశంలో చంద్రబాబు పాల్గొని, మాట్లాడారు. జనాభా నియంత్రణ ఒకేసారి సాధ్యం కాదన్నారు.  అందరి అంతిమ లక్ష్యం పేదరిక నిర్మూళనేనని పేర్కొన్నారు. పేదరిక నిర్మూళన కోసం అనేక విధానాలు తీసుకొచ్చామని తెలిపారు. ఏపీని కేంద్రం ప్రత్యేకంగా చూడటం లేదని వాపోయారు. విభజనతో నష్టపోయిన ఏపీకి కేంద్రం సాయం చేయడం లేదని విమర్శించారు. 

11:36 - May 7, 2018

ప్రయోగాల చిత్రాలలో విభిన్నంగా కనిపిస్తున్న నాగార్జున ఇప్పుడు మలయాల చిత్రంలో కూడా నటించనున్నట్లుగా సమాచారం. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగులో జనతాగ్యారేజ్ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో దర్శకుడు ప్రియదర్శన్ డైరెక్షన్ లో మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న 'మరక్కార్' పిరీడ్ మూవీలో నాగర్జున ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్లుగా సమాచారం. అంతేకాదు ఈ సినిమాకు మరో విశేషం వుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.

న్యూయార్క్ లో సవ్యసాచితో చైతు బిజీ బిజీ..

"కార్తికేయ, ప్రేమమ్" వంటి సూపర్ హిట్ మూవీలను చిత్రీకరించిన దర్శకుడు 'చందు మొండేటి' తో 'చైతు' నటిస్తున్న మూవీ "సవ్యసాచి".ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను అమెరికాలోని న్యూయార్క్ లో ప్లాన్ చేశారు.ఈ క్రమంలో చైతు న్యూయార్క్ లో 'సవ్యసాచి'తో బిజీ బిజీగా వున్నాడు.

చైతూ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో, నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో, తమిళ స్టార్ హీరో మాధవన్ ఒక కీలకమైన పాత్రను చేస్తున్నారు. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ తెరకెక్కించనున్నారు. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో చైతూ వున్నాడు.ఈ సినిమాతో పాటు ఆయన మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' చేస్తోన్న సంగతి తెలిసిందే.

11:32 - May 7, 2018

గుంటూరు : అమరావతిలో విపక్ష రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశం ప్రారంభం అయింది. ఏపీ సీఎం చంద్రబాబు, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీతోపాటు 5 రాష్ట్రాలకు చెందిన ఆర్థికమంత్రులు పాల్గొన్నారు. ఏపీ, కేరళ, పుదుచ్చేరి, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. 15వ ఆర్థిక సంఘం నియమనిబంధనలపై చర్చిస్తున్నారు. 

 

11:25 - May 7, 2018

నిజామాబాద్ : ధర్పల్లి మండలం దుబ్బాకలో విషాదం నెలకొంది. పల్లె చెరువు తండాలో కొడుకును చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అత్త, ఆడపడుచులే హత్య చేశారంటూ మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులు అత్త ఇంటిపై దాడి చేసి, గుడిసెకు నిప్పుపెట్టారు. భారీగా పోలీసులు మోహరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఏపీ డిమాండ్లలో నిజాయితీ వుంది : కేరళ ఆర్థిక మంత్రి థామస్

అమరావతి : రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చాలంటు ఏపీ చేస్తున్న డిమాండ్లు నిజాయతీతో కూడుకున్నవని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ పేర్కొన్రాఉ. అమరావతిలో ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొన్నా ఆయన మాట్లాడుతు.. ఏపీ ఆర్థికలోటు భర్తీ చేస్తామంటూ ఇతర రాష్ట్రాలకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఈ సమావేశం తర్వాత రాష్ట్రపతికి ఓ వినతిపత్రం పంపుతామని అన్నారు. చెరకు రైతులపై ప్రేమ చూపించిన విధంగానే రబ్బర్, కాటన్ రైతులపైనా ఎందుకు ప్రేమ చూపించడం లేదని ప్రశ్నించారు. పొలిటికల్ మైలేజ్ కోసం కేంద్రం ఇదంతా చేస్తోందని ఆరోపించారు. 

కేంద్రప్రభుత్వంపై కేరళ ఆర్థిక మంత్రి మండిపాటు..

అమరావతి : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను బిచ్చగాళ్లలా మార్చే ప్రయత్నం చేస్తోందంటూ కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ మండిపడ్డారు.ఏపీ సచివాలయంలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ఈరోజు ప్రారంభమైంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు థామస్ ఇసాక్ పాల్గొన్న సందర్భంగా థామస్ ఇసాక్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రం ఇదంతా చేస్తోందని, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తే ఏపీకి రూ.8 వేల కోట్లు, తమిళనాడుకు రూ.10 వేల కోట్ల నష్టం వస్తుందని థామస్ పేర్కొన్నారు. 

ప్రారంభమైన ఆర్థిక మంత్రుల సమావేశం..

అమరావతి : ఏపీ రాజధానిలో ఆర్థిక మంత్రుల సమావేశం ప్రారంభయ్యింది. ఈ సమావేశానికి సంజాబ్, పాండిచ్చేరి, పశ్చిమబెంగాల్, కేరళ ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో పాటు ఐదు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి కూడా పాల్గొన్నారు. 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలపై ఆర్థిక మంత్రులు చర్చించనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల గైర్హాజరయ్యారు.

జనాభా ప్రాతిపదిక నిధులివ్వాలి : కుటుంబరావు

అమరావతి : వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సమావేశం ప్రారంభమయ్యింది. ఈ సమావేశానికి సంజాబ్, పాండిచ్చేరి, పశ్చిమబెంగాల్, కేరళ ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన తీసుకుని రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వాలని ప్రణాళిక సంఘం మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు డిమాండ్ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిబంధనలు రాష్ట్రాలకు నష్టందాయకంగా వున్నాయని కుటుంబరావు తెలిపారు. జనాభా నియంత్రణలో వైఫల్యం చెందిన ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు అవార్డులివ్వటంతో జనాభి నియంత్రించిన రాష్ట్రాలకు దెబ్బకొట్టినట్లుగా వుందన్నారు.

యువకుడి దారుణ హత్య..

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లిలో దారుణ హత్య చోటుచేసుకుంది. ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బండరాయితో మోది పెట్రోలు పోసి తగులబెట్టినట్లుగా తెలుస్తోంది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం సంఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడు ఆరుట్ల వాసిగా గుర్తించారు. కాగా ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులు ఎవరు? ఎందుకు చేశారు? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

10:41 - May 7, 2018

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం మంగల్‌పల్లిలో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు. బండరాయితో మోది హత్య చేశారు. అనంతరం దుండగులు పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. మృతుడు ఆరుట్ల గ్రామానికి చెందిన రమేష్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే యువకుడికి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా అని అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

శిశువు మృతదేహాన్ని పీక్కుతిన్న పందులు..

ప్రకాశం : మార్కాపురంలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును పందులు పీక్కుతిన్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుండీలో పడవేసారు. దీంతో ఆ శిశువును పందులు పీక్కుతిన్న ఘటన అసలు మానవత్వం అనేది వుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రాణం వుండగానే పడవేశారా? లేదా ప్రాణం వుండగానే చెత్తకుండీలో పడవేశారా? అనే అనుమానంగా వున్నట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు. 

10:38 - May 7, 2018

హైదరాబాద్ : డిమాండ్ల సాధనకోసం నేడు ఆర్టీసీ కార్మికులు బస్‌భవన్ ముట్టడి చేపట్టారు. కార్మికులు చలో బస్‌భవన్‌ను విరమించుకోవాలని ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. కార్మికులు డిమాండ్ చేసిన పే స్కేల్‌ అమలు డిమాండ్‌ను ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. కార్మికులకు న్యాయం చేసే విధంగా చర్చలు జరుగుతాయని తెలిపారు. 

 

10:34 - May 7, 2018

ముంబై : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట మరో పెళ్లి భాజా మోగనుంది. ముఖేశ్‌ కుమార్తె ఇషా అంబాని.... వ్యాపారవేత్త ఆనంద్‌ పిరమాల్‌కు వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇషా, ఆనంద్‌లు ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. అయితే వీరిద్దరి నిశ్చితార్థం మాత్రం ఇషా సోదరుడు ఆకాశ్‌ అంబాని పెళ్లికి ముందే ఉంటుందని సమాచారం. ఆకాశ్‌ అంబానీ, మొహతాల వివాహం డిసెంబర్‌లో జరగనుంది.

జోథ్ పూర్ కోర్టుకు హాజరుకానున్న సల్మాన్..

రాజస్థాన్ : బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఈరోజు జోథ్పూర్ కోర్టుకు హాజరుకానున్నారు. ఏప్రిల్ 5న కేసులో తీర్పునిస్తూ, సల్మాన్ కు 5 సంవత్సరాల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆపై రెండు రోజుల్లో ఆయన బెయిల్ పై బయటకు వచ్చాడు. అలాగే, ఆ కేసు తీర్పును సవాల్ చేస్తూ సల్మాన్ జోధ్ పూర్ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశాడు. అది ఈ రోజు విచారణకు వస్తుండడంతో, సల్మాన్ కోర్టుకి హాజరు కావలసి వుంది.

10:31 - May 7, 2018

శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్‌లో భద్రతా బలగాలు ఆదివారం భారీ విజయాన్ని సాధించాయి. నిషేధిత హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కొత్తగా ఉగ్రవాదంలో చేరిన కశ్మిర్‌ వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మహ్మద్‌ రఫీభట్‌తో పాటు కమాండర్‌ సద్దాం పాడర్‌ కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. మరో ముగ్గురు ఉగ్రవాదులు దక్షిణ కష్మిర్‌కు చెందినవారుగా గుర్తించారు. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. ముగ్గురు భద్రతా బలగాలకు స్వల్పంగా గాయాలయ్యాయి. 

 

10:29 - May 7, 2018

గుంటూరు : మహిళలు, బాలికలపై జరుగుతోన్న లైంగిక దాడులను అరికట్టేందుకు ఆడబిడ్డకు రక్షగా కదులుదాం పేరుతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య ర్యాలీలు నిర్వహించనుంది ప్రభుత్వం. గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగిన అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో ఈ తరహా ఘటనలు ఎక్కడా జరగకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ ర్యాలీ చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. విజయవాడలో నిర్వహించే ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ర్యాలీని ప్రారంభించి ఇందిరాగాంధీ క్రీడా మైదానంకు చేరుకుంటారు. అనంతరం నిర్వహించే సభలో సీఎం ప్రసంగిస్తారు. 

 

10:25 - May 7, 2018

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. తమకు ప్రభుత్వం, యాజమాన్యం గతంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, టీఆర్‌సీ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌తో వారు పోరు బాట పట్టారు. పలు దఫాలుగా ఆందోళన నిర్వహిస్తున్నవాళ్లు అవసరమైతే సమ్మెకు కూడా సిద్ధం అని చెపుతున్నారు. ఆర్టీసీలో ఆందోళనలకు గల కారణాలు ప్రభుత్వం, యాజమాన్యాల వైఖరిపై స్టాఫ్‌ అండ్‌ వర్కర్‌ ఫ్రెడెరేషన్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్‌.రావు మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం... 

చంద్రబాబుని ప్రశంసించిన కైలాష్ సత్యార్థి..

అమరావతి: సీఎం చంద్రబాబును నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి కొనియాడారు. 'ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం' కార్యక్రమం చేపట్టడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్టు సత్యార్థి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల కార్యకర్తలు పాల్గొంటారని..తాను కూడా హాజరవుతానని సీఎంకు సత్యార్థి తెలిపారు. మహిళలు, పిల్లలపై లైంగిక నేరాలకు వ్యతిరేకంగా ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్త ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని ప్రభుత్వమే పిలుపునిచ్చింది.

10:22 - May 7, 2018

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఆ రాష్ట్ర ఓటర్లకు పిలుపు ఇచ్చారు. ఓటు ద్వారా బీజేపీకి గుణపాఠం నేర్పితే, మోదీ ఇజానికి చెక్‌ పెట్టొచ్చంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ప్రధాని మోదీ మోసం చేశారంటున్న అశోక్‌బాబుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఏపీకి నష్టం కలిగించేలా ప్రధాని నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. కర్నాటక ఎన్నికల్లో మోడీ ఇజాన్ని ఓడించాలని అశోక్‌బాబు పిలుపునిచ్చారు. మోదీ నిర్ణయాలు ప్రజలకు నష్టం కలిగిస్తున్నాయన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లుతో బ్యాంకు ఖాతాదారులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. 

ప్రొఫెసర్ ను చితకబాదిన విద్యార్థిని..

పంజాబ్ : పాఠాలు చెప్పే గురువును చితకబాదింది ఓ విద్యార్థిని. విద్యాబుద్ధులు చెప్పాల్సి గురువు అసభ్యపు మెసేజ్ లు పంపుతున్న ప్రొఫెసర్ని ఉతికి ఆరేసింది ఓ విద్యార్థిని. తనకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపి వేధిస్తున్న ప్రొఫెసర్ ను రోడ్డుపైకి లాక్కొచ్చి ఉతికి ఆరేసిందో విద్యార్థిని. పంజాబ్ లోని పాటియాలాలో ఉన్న ప్రభుత్వ మహిళా కళాశాలలో జరిగిందీ ఘటన. ప్రొఫెసర వేధింపులతో సహనం కోల్పోయిన బాధితురాలు, సదరు ప్రొఫెసర్ ను సహ విద్యార్థులు, మరో ప్రొఫెసర్, మహిళా లెక్చరర్లతో కలసి నిలదీసింది. ఈ ఘటన దృశ్యాలు మీడియాకు చిక్కాయి. అతని నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసిందా విద్యార్థిని.

విద్యుత్ పథకాన్ని దెబ్బతీసే కుట్ర: చంద్రబాబు

అమరావతి: అన్నదాతలను ఆదుకునేందుకు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌ పథకాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాల్లో పేర్కొన్న ‘జనాకర్షక పథకాలపై సమీక్ష’ అనే అంశం అభ్యంతరకరమని ఆయన లేఖలో పేర్కొన్నారు. విద్యుత్‌ చట్టం- 2003కు సవరణ ప్రతిపాదించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కూడా రాష్ట్రాలు ఉచిత విద్యుత్‌ ఇవ్వకుండా కేంద్రం ఒత్తిడి చేసేలా ఉందని అభిప్రాయపడ్డారు.

బీబీ తండాలో భారీగా పోలీసులు..

నిజామాబాద్ : దర్పల్లి మండలం బీబీ తండాలో విషాదం చోటుచేసుకుంది. రెండు సంవత్సరాల కుమారుడితో సహా తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తండాలో విషాదాన్ని నింపింది. కాగా అత్తా ఆడపడులే హత్య చేసారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. అత్తా ఆడపడుచులే తమ బిడ్డను హత్య చేసారని మృతురాలి బంధువులు గుడిసెకు నిప్పు పెట్టారు. సమాచారం మేరకు సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. అనంతరం ఆందోళన చేపట్టిన ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. కుటుంబ తగాదాలతోనే మృతురాలు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.  

10:14 - May 7, 2018

ఖమ్మం : నగరంలో ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని ఘనంగా జరిగింది. సంకల్ప స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్‌ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంబించారు. తలసేమియా వ్యాధి చికిత్సకోసం సంకల్ప స్వచ్చంద సంస్థ కృషి చేస్తోందన్నారు ఎమ్మెల్యే అజయ్‌కుమార్. మమత ఆసుపత్రిలో  ఇరవై పడకల వార్డును తలసేమియా వ్యాధి గ్రస్తులకు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

10:12 - May 7, 2018

ఖమ్మం : నగరంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వీరు అమాయకంగా ఉన్న వ్యక్తులను ఆటోలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి బంగారం, డబ్బును దోచుకుంటున్నారని  పోలీస్ కమీషనర్ తాప్సిర్ ఇక్బాల్‌ తెలిపారు. ఖమ్మం అర్బన్ మండలం దానవాయిగూడెంకి చెందిన బండి వెంకటేశ్వర్లు, బండి వీరబాబుతో పాటు ఓమైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై పిడియాక్టును పెడుతున్నట్లు తెలిపారు.

 

కాసేపట్లో ఆర్థిక మంత్రుల భేటీ..

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆర్థిక మంత్రులు భేటీ కానున్నారు. రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలపై చర్చిస్తారు. లోటు బడ్జెట్‌ భర్తీకి నిధులు ఇవ్వరాదని, రుణమాఫీ వంటి పథకాలను చెక్‌ పెట్టాలని 15వ ఆర్థిక సంఘం టర్మ్స్‌ ఆఫ్‌ రిపరెన్స్‌లో ఉంది. అలాగే నిధుల కేటాయించేందుకు 1971 జనాభా లెక్కలను కాకుండా 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలన్న నిబంధన విధించారు. 15 వ ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నియమ, నిబంధనలు విధించడాన్ని విపక్షపాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వ్యతిరేకిస్తున్నారు.

10:09 - May 7, 2018

శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఐఏఎస్‌లను భారీగా బదిలీ చేసింది. ఏకంగా 21 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కడప, విజయనగరం కలెక్టరతోపాటు... తుడా, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.
21మంది ఐఏఎస్‌ల బదిలీ
ఆంధ్రప్రదేశ్‌లో భారీస్థాయిలో ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు.  21 మంది అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పలువురు కలెక్టర్లతోపాటు... పలుశాఖల అధికారులనూ ప్రభుత్వం బదిలీ చేసింది. విజయనగరం కలెక్టర్‌గా హరిజవహర్‌లాల్‌ను , విజయనగరం జాయింట్‌ కలెక్టర్‌గా కె. వెంకటరమణారెడ్డిని నియమించింది. కడప జిల్లా కలెక్టర్‌గా చేవూరు హరికిరణ్‌, జేసీగా టి. నాగరాణిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జాయింట్‌ కలెక్టర్‌గా దిల్లీరావు, పశ్చిమ గోదావరి జిల్లా జేసీగా ఎం. వేణుగోపాల్‌రెడ్డి నియమితులయ్యారు. ఇక తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్‌గా విజయరామరాజు, రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌గా సమిత్‌కుమార్‌ను నియమించింది.
జీఏడీ ముఖ్య కార్యదర్శిగా కె.ప్రవీణ్‌కుమార్‌ నియామకం
జీఏడీ ముఖ్య కార్యదర్శిగా కె. ప్రవీణ్‌కుమార్‌ను నియమించింది. మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా రామ్‌గోపాల్‌ను... ఆర్థికశాఖ కార్యదర్శిగా పీయూష్‌కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ  ఉప కార్యదర్శిగా వర్షవర్దన్‌ను, వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌గా మురళీధర్‌రెడ్డి, వాణిజ్యపన్నుల శాఖ కార్యదర్శిగా టి. కె. రమామణిని నియమించింది.సీసీఎల్‌ఏ కార్యదర్శిగా జీఎస్‌ఆర్కేఆర్‌ విజయ్‌కుమార్‌, సీపీఎల్‌ఏ జాయింట్‌ సెక్రెటరీగా ఎన్‌. ప్రభాకర్‌రెడ్డి, ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పి. కోటేశ్వర్‌ నియమితులయ్యారు. 
గిరిజన సహకార కార్పొరేషన్‌ ఎండీగా బాబూరావు నాయుడు 
గిరిజన సహకార కార్పొరేషన్‌ ఎండీగా ప్రభుత్వం బాబూరావు నాయుడిని నియమించింది. బీసీ సహకార, ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీగా బి. రామారావు, ఎస్సీ సహకార, ఆర్థిక కార్పొరేషన్‌ ఎండీగా వివేక్‌యాదవ్‌, స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ ఎండీగా మురళీధర్‌రెడ్డిని నియమించింది.  హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీగా ఎం. వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఏఎస్‌పీఎస్‌ రవిప్రకాశ్‌కు జీఏడీకి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.

 

09:34 - May 7, 2018

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం మంగల్‌పల్లిలో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు. బండరాయితో మోది హత్య చేశారు. అనంతరం దుండగులు పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. మృతుడు ఆరుట్ల గ్రామానికి చెందిన రమేష్‌గా గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

ఇబ్రహీంపట్నం మంగల్‌పల్లిలో దారుణం

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం మంగల్‌పల్లిలో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు. బండరాయితో మోది హత్య చేశారు. 

09:33 - May 7, 2018

హైదరాబాద్‌ : నగరంలోని కుల్సుంపురలో పహిల్వాన్‌ కొడుకులు రెచ్చిపోయారు. లడ్డు పహిల్వాన్‌ కొడుకులు, అతని అనుచరులు ఓ ఇంటిపై దాడికి దిగారు. అడ్డువచ్చిన మహిళపైనా దాడి చేశారు. దీంతో మహిళ బంధువులు కుల్సుంపుర పీఎస్‌ ముందు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

సచివాలయం సీబ్లాక్ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : సచివాలయం సీబ్లాక్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఏసీ ప్లాంట్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. 

09:21 - May 7, 2018

శ్రీకాకుళం : గొప్ప ఆశయంతో.. డెబ్బై ఏళ్ల క్రితం ఏర్పాటైన విత్తనాభివృద్ధి సంస్థ నిష్ప్రయోజనంగా పడి ఉంది.. లక్షలాదిమంది రైతులకు ఉపయోగపడాల్సిన ఏపీ సీడ్స్ ఫామ్‌.. నిర్లక్ష్యపు నీడలో నిరుపయోగంగా మారింది. ఫలితంగా.. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన అరవై కోట్ల రూపాయల విలువైన.. నూటా యాభై ఎకరాల భూమి పక్కదారి పడుతోంది. శ్రీకాకుళం జిల్లాతో పాటు.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు నాణ్యమైన విత్తనాలు అందించాల్సిన ఏపీ సీడ్స్ ఫామ్‌ పాలకుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది.
1950లో ఏపీ సీడ్స్‌ ఫామ్‌ ఏర్పాటు 
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పెద్దపేట గ్రామపంచాయితీ పరిధిలోని ఏపీ సీడ్స్‌ ఫామ్‌ ఇది. 1950లో రైతులకు విత్తనాలు, కొత్త రకం వరి వంగడాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. వ్యవసాయ విద్యలో పట్టభద్రులైన వారితో పాటు.. పలువురు శాస్త్రవేత్తలను నియమించినా.. ప్రయోజనం లేదు. అప్పట్లో బూర్జ మండలం లోని పెద్దపేట పరిసర గ్రామాల రైతులు ఈ క్షేత్రానికి స్వచ్చంధంగా  భూములు అప్పగించారు.  కానీ.. నేడు తమ పూర్వీకుల త్యాగం వృధా అవుతోందని..  స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిరుపయోగంగా విత్తనాభివృద్ధి క్షేత్రంలో భూములు 
రైతులకు ఉపయోగపడాల్సిన విత్తనాభివృద్ధి క్షేత్రంలో భూములు నిరుపయోగంగా మారాయి. భవనాలు, యంత్రాలు శిథిలావస్థకు చేరుకుని.. దిక్కూ మొక్కూ లేకుండా పడిఉంది. కేవలం ఒక్క వాచ్ మెన్ తోనే కాలం వెళ్లదీస్తోంది. దీని  పరిసరాల్లోని భూముల్లో ఎకరాకు ముప్పై బస్తాలు పండుతుంటే.. ఈ క్షేత్రంలో మాత్రం ఎకరాకు అయిదారు బస్తాలకు మించి దిగుబడి రావడం లేదు.ఈ విత్తనాభివృద్ధి క్షేత్రాన్ని వ్యవసాయ శ్వవిద్యాలయం, లేదా ఉద్యానవన యూనివర్సిటీగా తీర్చిదిద్దితే  రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మేరకు సీఎంకు విన్నవించామని స్థానిక నేతలు అంటున్నారు.
భూములపై కబ్జారాయుల కన్ను 
ఏపీ సీడ్స్‌ను అభివృద్ధి చేయడం ప్రభుత్వానికి చేతకాకుంటే... నిస్వార్థంగా తమ పూర్వీకులు అందించిన భూములను తమకు ఇచ్చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎకరా దాదాపు నలభై లక్షల రూపాయలు పలికే ఈ భూములపై కబ్జారాయుల కన్ను పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. 

 

08:50 - May 7, 2018

హైదరాబాద్ : ఎన్నికలొస్తే.. తప్ప ప్రజలూ, ప్రజల కష్టాలు రాజకీయ నాయకులకు గుర్తు రావు.. ఇప్పుడు ఎలక్షన్లు సమీపిస్తుండడంతో.. అభివృద్ధి పనులు మేము చేశామంటే.. మేము చేశామంటూ పోటీ ప్రచారానికి దిగుతున్నాయి రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు... చేపడుతున్న ఫ్లై ఓవర్ల నిర్మాణాలకు నిధులు మేమిచ్చామంటే.. కాదు మేమిచ్చామంటూ రాష్ర్టంలోని టీఆర్ఎస్‌ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం క్రెడిట్‌ కోసం పాకులాడుతున్నాయి. ఇన్నాళ్ళూ తమ బాధలు పట్టించుకోని రాజకీయ నాయకుల ఆరాటం చూసి ప్రజలు విస్తుపోతున్నారు..
అభివృద్ధి పథకాల్లో టీఆర్ ఎస్, బీజేపీ పోటీ ప్రచారం 
ఏనాడూ.. ప్రజలను పట్టించుకోని రాజకీయ పార్టీలు.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. అభివృద్ధి పథకాలు చేపట్టింది మేమంటే.. మేమంటూ పోటీ ప్రచారానికి దిగుతున్నాయి. హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ పద్మ వ్యూహాన్ని తలపిస్తుంది. ఇక వరంగల్‌ నుంచి ఉప్పల్‌ వరకూ రావడం ఓ ఎత్తైతే.. అక్కడి నుంచి సిటీలోకి చేరుకోవడం మరో ఎత్తు. ఈ సమస్య పరిష్కారానికి ఫ్లై ఓవర్ల నిర్మాణాలను చేపట్టారు. అది కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. 
కరపత్రాల పంపిణీతో వివాదం 
బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహించే అంబర్‌ పేట ప్రాంతంలో మతపరమైన నిర్మాణాలు, సమాధులు ఎక్కువగా ఉన్నాయి. వాటిజోలికి పోకుండా ట్రాఫిక్‌ సమస్య తీర్చాలంటే.  ఫ్లైఓవర్ల నిర్మాణాలే సరైందని నిర్ణయించారు. ఈ నిర్మాణాల్లో భూములు, ఇళ్ళు కోల్పోయిన వారికి.. ష్టపరిహారాన్ని జీహెచ్ఎంసీ నుంచి ఇస్తున్నారు. కానీ..  బీజేపీ నాయకులు మాత్రం కేంద్రమే నిధులు ఇస్తోందంటూ.. కరపత్రాల పంపిణీతో వివాదానికి తెరలేపారు... దీంతో  రంగంలోకి దిగిన రాష్ర్ట ప్రభుత్వం బీజేపీకి పోటీగా కరపత్రాలు పంచుతూ..  మా వల్లే ఈ ప్రాజెక్టు వచ్చిందంటూ.. ప్రచారం చేస్తోంది.
అంబర్‌పేట ఫ్లై ఓవర్‌పై ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రచారం 
అంబర్‌పేట ఫ్లై ఓవర్‌పై ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రచారం చేస్తుంటే.. అదే రోడ్డు నుంచి వెళ్ళే.. ఉప్పల్‌ నియోజకవర్గం ఎలివేటెడ్‌ కారిడార్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ ప్రభాకర్‌ ప్రచారం చేస్తున్నారు. దీంతో తాము ఎక్కడెక్కడ... ఎంతెంత  కేటాయించిందీ.. లెక్కలతో సహా వివరించడానికి నగర మేయర్, కార్పొరేటర్లు, కౌంటర్‌ ప్రచారానికి దిగారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ హైదరాబాద్‌ పర్యటన రసవత్తర రాజకీయానికి వేదిక అయ్యింది. ఎన్నడూ.. ప్రజల కష్టాలు పట్టించుకోని రాజకీయ పార్టీలు.. ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తుండడంతో.. అభివృద్ధి పథకాల క్రెడిట్‌ కోసం పాకులాడుతున్నాయి. దీంతో నాయకుల తీరుకు నగర వాసులు విస్తుపోతున్నారు. 

 

08:25 - May 7, 2018

గుంటూరు : ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ప్రజలను మోసం చేశారని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ఆరోపించారు. 2014 ఎన్నికల ప్రచారంలో హోదాపై  హామీ ఇచ్చిన మోదీ, అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని విమర్శించారు. అమరావతిలో జరిగే దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన నారాయణస్వామి... మోదీ ఏపీకి చేసిన అన్యాయంపై విరుచుకుపడ్డారు. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఫైలుపై తొలి సంతకం చేస్తారని నారాయణస్వామి చెప్పారు.  

 

కుల్సుంపురలో ఉద్రిక్తత

హైదరాబాద్ : కుల్సుంపురలో ఉద్రిక్తత నెలకొంది. కుల్సుంపురలో అర్ధరాత్రి లడ్డూ పహిల్యాన్ కొడుకులు, అనుచరులు రెచ్చిపోయారు. ఓ ఇంటిపై లడ్డు పహిల్వాన్ కొడులు, అనుచరులు దాడికి దిగారు. అడ్డు వచ్చిన మహిళపై దాడికి దిగారు. మహిళ బంధువులు పీఎస్ ముందు ఆందోళన చేపట్టారు. 

 

08:14 - May 7, 2018

విశాఖ : రైల్వే జోన్‌ ఉద్యమం పేరుతో విశాఖ జిల్లా తెలుగుదేశం నేతలు కొత్త నాటకానికి తెర తీశారు. ఈ అంశంపై వామపక్షాలు, వైసీపీ, ప్రజా సంఘాల నాయకులు నాలుగేళ్లుగా పోరాటాలు చేస్తుంటే... అధికార టీడీపీ నేతలకు ఎన్నికల ఏడాదిలో ఈ విషయం గుర్తుకొచ్చింది. రైల్వే జోన్‌  సాధన కోసం మంత్రి గంటా శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన నాన్‌ పొలిటికల్‌ జేఏసీపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ చేసిన నిరాహార దీక్ష ఎన్నికల జిమ్మిక్కుగా ప్రజలు భావిస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో విశాఖ తెలుగుదేశం నేతలకు రైల్వే జోన్‌ పోరాటం గుర్తుకొచ్చింది. జోన్‌ సాధనలో విఫలమైన టీడీపీ నేతల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో నాన్‌ పొలిటికల్‌ జేఏసీ, నిరాహార దీక్షలు అంటూ  కొత్త నాటకానికి తెరతీశారన్న విమర్శలు వస్తున్నాయి. 
నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఏర్పాటు 
విశాఖ రైల్వే జోన్‌ సాధన కోసం మంత్రి గంటా శ్రీనివాసరావు  నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఏర్పాటు చేశారు. నాలుగేళ్లుగా వామపక్షాలు, వైసీపీ, ఇతర ప్రజా సంఘాలు ఈ అంశంపై ఉద్యమిస్తుంటే.. తెలుగుదేశం నేతలకు ఎన్నికల ఏడాదిలో రైల్వే జోన్‌ గుర్తుకొచ్చింది. జోన్‌పై ఇప్పుడు హడావుడి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా పుట్టగతులుండవన్నభయంతో  ఈ అంశాన్ని భుజానికి ఎత్తుకున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ప్రకటించిన మంత్రి గంటా శ్రీనివాసరావు రైల్వే జోన్‌ కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమంటున్నారు. 
ఎంపీ అవంతి శ్రీనివాస్‌ దీక్ష 
మరోవైపు విశాఖ రైల్వే జోన్‌ ఇవ్వకపోతే పదివికి రాజీనామా చేస్తానని ఏడాది క్రితం ప్రకటించిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌..విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ వద్ద దీక్ష చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి చేసిన దీక్ష కూడా ఎన్నికల జిమ్కిక్కుగా భావిస్తున్నారు. నాలుగేళ్లుగా సాధించలేని రైల్వే జోన్‌ను ఇప్పుడు సాధిస్తామంటూ ప్రజలకు చెబుతున్నారు. ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు. 
నాన్‌ పొలిటికల్‌ జేఏసీ, అవంతి దీక్షపై వామపక్షాల మండిపాటు 
అయితే రైల్వే జోన్‌ సాధన కోసమంటూ మంత్రి గంటా ఏర్పాటు చేసిన నాన్‌ పొలిటికల్‌ జేఏసీ, అవంతి శ్రీనివాస్‌ చేసిన నిరాహార దీక్షపై వామపక్షాలు మండిపడుతున్నాయి. నాలుగేళ్లుగా ఉద్యమాలు, పోరాటాలకు దూరం ఉంటూ.. ఎన్నికల ఏడాదిలో రైల్వే జోన్‌ పేరులో ఓట్ల రాజకీయానికి తెర తీశారని సీపీఎం విమర్శించింది. రైల్వే జోన్‌ పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారని, ఏ త్యాగానికైనా సిద్ధమంటూ బీరాలు పలుకుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. 

 

07:59 - May 7, 2018

హైదరాబాద్ : రైతు బంధు పథకం అమలును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దీనిని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈనెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. టీఆర్‌ఎస్‌కు  రైతుల మద్దతు కూడగట్టేలా ఈ పథకం పనిచేస్తుందన్న అంచనాతో అధికార పార్టీ నేతలున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల వర్షం కురుపిస్తుందని భావిస్తున్నారు. 
రైతు బంధు పథకం అమలును సీరియస్‌గా రాష్ట్ర ప్రభుత్వం 
రైతు బంధు పథకం అమలును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ఇది వరంగా మారుతుందని టీఆర్‌ఎస్‌ నేతలు ఆశిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించే విధంగా చర్యలు చేపట్టని  ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకం అమలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఏడాది క్రితం  నుంచి ఈ పథకంపై  కసరత్తు చేసిన కేసీఆర్‌...  ఎన్నికల ఏడాది నుంచి అమలు చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈనెల 10 నుంచి రైతలకు బ్యాంకు చెక్‌లు పంపిణీ చేసంఏదుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఎకరానికి  ఏటా ఎనిమిది వేల రుపాయల పెట్టుబడి సహాయాన్ని అందించే పథకానికి ప్రభుత్వం రైతు బంధు పథకానికి రూపకల్పన చేశారు. ఖరీఫ్‌, రబీ సీజన్లలో రెండు విడతులుగా ఈ మొత్తాన్ని రైతులుకు ఇస్తారు.
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్‌ల పంపిణీ
ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా వచ్చే గురువారం నుంచి చెక్‌ల పంపిణీ ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌, జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడను ఆహ్వానించారు.  అయితే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేవెగౌడ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశంలేదని భావిస్తున్నారు.  
రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా : సీఎం కేసీఆర్
జాతీయ రాజకీయల్లో కూడా రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి హాజరయ్యే సభకు భారీ ఎత్తున రైతులను సమీకరించాలని అధికార టీఆర్‌ఎస్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. పథకం ప్రారంభం రోజు నిర్వహించే సభ ద్వారానే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని టిఆర్ఎస్ భావిస్తోంది.

 

07:48 - May 7, 2018

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సమావేశం జరుగనుంది. రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలపై చర్చిస్తారు. లోటు బడ్జెట్‌ భర్తీకి నిధులు ఇవ్వరాదని, రుణమాఫీ వంటి పథకాలను చెక్‌ పెట్టాలని 15వ ఆర్థిక సంఘం టర్మ్స్‌ ఆఫ్‌ రిపరెన్స్‌లో ఉంది. అలాగే నిధుల కేటాయించేందుకు  1971 జనాభా లెక్కలను కాకుండా 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలన్న నిబంధన విధించారు. 15 వ ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి  నియమ, నిబంధనలు విధించడాన్ని విపక్షపాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వ్యతిరేకిస్తున్నారు.
విపక్ష పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సు
ఇవాళ అమరావతిలో విపక్ష పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సు జరుగునుంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. గత నెలలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రి సమావేశం కేళర రాజధాని తిరువనంతపురంలో జరిగింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు అమరావతిలో నిర్వహిస్తున్నారు. 
15వ ఆర్థిక సంఘం నిబంధనలతో దక్షిణాదికి నష్టం 
దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఒడిశా, పంజాబ్‌, ఢిల్లీ, బెంగాల్‌, సిక్కిం, మేఘాలయ, మిజోరం ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ భేటీ జరుగుతుంది. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు, నియమ నిబంధనలతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకొంది.  కేంద్రం ఇచ్చిన విధివిధానాలకు అనుగుణంగా 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు 87 వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రాల లోటు బడ్జెట్‌ను కేంద్రం భర్తీ చేస్తూ వస్తోంది. కానీ 15వ ఆర్థిక సంఘం టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌లో లోటు భర్తీకి చెక్‌ పెట్టాలన్ని నిబంధనను కేంద్రం విధించింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే సంక్షేమ పథకాల్లో కోత విధించేలా 15వ ఆర్థిక సంఘం టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌తో ఉంది. దీనికి అనుగుణంగా ఆర్థిక సంఘం సిఫారసు చేసి, నివేదిక ఇస్తే.. భవిష్యత్‌లో సామాజిక  పెన్షన్లు, రుణమాఫీ వంటి పథకాలకు స్వస్తి పలకాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 
టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌లో 2011 జనాభా లెక్కల ప్రాతిపదిక 
ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న నిధులకు 1971 జనాబా లెక్కలను పరిగణలోకి తీసుకొంటోంది. కానీ 15వ ఆర్థిక సంఘం టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌లో 2011 జనాభాల లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం నిబంధన పెట్టింది. ఈ నిబంధన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం, ఉత్తరాదికి మేలు చేకూర్చే విధంగా ఉందన్న వాదనలు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రల్లో కుటుంబ నియంత్రణ అమలు చేయడంతో 1971-2011 మధ్య జనాభా పెరుగుదల గణనీయంగా తగ్గింది. ఇదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణను అంతగా పట్టించుకోపోడంతో జనాభా పెరిగింది. 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాలకు నిధులు మంజూరు చేయాలని సిఫారసు చేస్తే ఉత్తరాదికి మేలు చేకూరుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ఈ నిబంధనను దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సహకాలు  ఇవ్వాల్సిన కేంద్రం... ఇందుకు విరుద్ధంగా వ్యవస్తోందన్న వాదాన్ని వినిపిస్తున్నాయి. రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో అంతేమొత్తంలో తిరిగి ఇవ్వాలని గుజరాత్‌ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 14వ ఆర్థిక సంఘాన్ని కోరిన మోదీ... ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని దక్షిణాది రాష్ట్రాలు తప్పు పడుతున్నాయి. 

 

నేటి నుంచి మెట్రో రైలులో లేడీస్ కోచ్

హైదరాబాద్ : నేటి నుంచి మెట్రో రైలులో లేడీస్ కోచ్ జరుగనుంది. ప్రతీ మూడు కోచ్ ల తర్వాత మహిళల కోసం ప్రత్యేక బోగి ఉండనుంది.

 

సివిల్స్ టాపర్ అనుదీప్ ను నేడు భోజనానికి ఆహ్వానించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : సివిల్స్ టాపర్ అనుదీప్, ఆయన తల్లిదండ్రులను నేడు భోజనానికి సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.

 

నేడు అమరావతిలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం

అమరావతి : సచివాలయంలో ఉదయం 10 గంటలకు 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జరుగనుంది. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలపై చర్చించునున్నారు. 

Don't Miss