Activities calendar

08 May 2018

కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంపై ప్రశంసలు

విజయవాడ : జిల్లా కలెక్టర్ల సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంపై ప్రశంసలు కురిపించారు. పలు అభివృద్ధి రంగాల్లో రాష్ట్రంలో కృష్ణా జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. ప్రజా సమస్యల పరిష్కారం, పౌర సరఫరా, వైద్యం, ఉపాధి హామీ అంశాల్లో కృష్ణా జిల్లాకు మొదటి స్థానం లభించింది. 

22:01 - May 8, 2018

కర్నాటక : బాగేపల్లిలో.. సీపీఎం అభ్యర్థి శ్రీరామరెడ్డి.. అరవై ఆరేళ్ల వయసులోనూ ప్రచారంలో దూసుకు వెళుతున్నారు కర్నాటకలో.. ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. కమ్యూనిస్టులకు పెట్టని కోట బాగేపల్లిలో.. సీపీఎం అభ్యర్థి శ్రీరామరెడ్డి.. అరవై ఆరేళ్ల వయసులోనూ ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. బీజేపీ అభ్యర్థి, సినీనటుడు సాయికుమార్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. 
సీపీఎం అభ్యర్థిగా బరిలో శ్రీరామరెడ్డి
కర్నాటక రాష్ట్రం చిక్కబళాపూర్‌ జిల్లాలోని బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గపు ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. 1978 నుంచీ కమ్యూనిస్టులకు పెట్టని కోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామరెడ్డి అభ్యర్థిగా బరిలో నిలిచారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీరామరెడ్డి.. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం వరుసగా ఇది ఎనిమిదోసారి.
తొమ్మిది ఎన్నికల్లో మూడు సార్లు సీపీఎం జయకేతనం
బాగేపల్లి నియోజకవర్గం ముందు నుంచీ కమ్యూనిస్టులకు పెట్టని కోట. 1978 నుంచీ నియోజకవర్గం చరిత్ర పరిశీలిస్తే.. సీపీఎం అభ్యర్థులు మొత్తం మూడుసార్లు బాగేపల్లిలో జయకేతనం ఎగురవేశారు. 1999, 2004 ఎన్నికల్లో ప్రస్తుత అభ్యర్థి శ్రీరామరెడ్డి విజయం సాధించారు. 2008 ఎన్నికల్లోనూ ఆయన విజయానికి అతి సమీపంలోకి వచ్చి ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి సంపంగి కన్నా.. శ్రీరామరెడ్డికి కేవలం వెయ్యి ఓట్లే తక్కువ వచ్చాయి. 
2013 ఎన్నికల్లో ప్రధాన పార్టీల కుమ్మక్కు
అనంతరం, 2013 ఎన్నికల్లో కూడా శ్రీరామరెడ్డి ప్రధాన పార్టీలను ఊసులో లేకుండా చేశారు. అయితే శ్రీరామరెడ్డిని ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై.. అప్పట్లో ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్న ఎస్‌ఎన్‌ సుబ్బారెడ్డికి.. మద్దతు పలికాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి1084 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థికి 15,491 ఓట్లు, శ్రీరామరెడ్డికి 35 వేల పైచిలుకు ఓట్లు రావడం.. బీజేపీ, కాంగ్రెస్‌ అనైతిక కుమ్మక్కును చాటుతోందని నియోజకవర్గ ఓటర్లు ఇప్పటికీ భావిస్తారు. 
బీజేపీ తరఫున బరిలో సాయికుమార్‌
శ్రీరామరెడ్డి ఈసారి కూడా ఎన్నికల బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. బీజేపీ తరఫున.. బళ్లారి గనుల దొరలు.. గాలి జనార్దనరెడ్డి సోదరుల అండదండలతో.. సినీనటుడు సాయికుమార్‌ బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ తరఫున.. ప్రస్తుత ఇండిపెండెంట్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే ఎస్‌ఎన్‌ సుబ్బారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులూ ధనబలంపైనే ప్రధానంగా ఆధారపడ్డారు. 31 లక్షల ఆస్తి మాత్రమే ఉన్న శ్రీరామరెడ్డి, ప్రస్తుతం 135 కోట్ల ఆస్తిపరుడు సాయికుమార్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. బీజేపీ వంచనపూరిత వాగ్దానాలను ప్రజలు తెలుసుకున్నారని.. ఈసారి వారిని ప్రజలు ఓడించడం తథ్యమనీ శ్రీరామరెడ్డి చెబుతున్నారు. 
సీపీఎం ఎన్నికల ప్రచార సభకు భారీగా జనం
ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీరామరెడ్డి ఏర్పాటు చేసే సభలకు జనం పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఆయన ప్రసంగాలు వినేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ధనబలాన్ని ప్రజలు దరిచేరనీయరని ఎట్టి పరిస్థితుల్లోనూ.. స్థానికంగా ఉంటూ ప్రజల కోసం పాటుపడే వారికే పట్టం కడతారని సీపీఎం నేతలు నమ్ముతున్నారు. 
శ్రీరామరెడ్డి వైపే తెలుగు ఓటర్ల మొగ్గు..!
వ్యక్తిగత ప్రయోజనాల కోసం వచ్చేవారిని దరిచేరనీయకుండా.. నియోజకవర్గం కోసం ఎవరు అడిగినా పని చేయడమే లక్ష్యంగా శ్రీరామరెడ్డి సాగుతుంటారు. అందుకే.. ఆయనంటే ప్రజల్లో అమితమైన అభిమానం. గ్రాసానికే కాదు.. తాగునీటికీ కటకటలాడే బాగేపల్లి నియోజకవర్గంలో ప్రజలు ప్రస్తుతం గుక్కెడు నీరైనా తాగుతున్నారంటే.. పరగోడు ప్రాజెక్టును సాధించిన శ్రీరామరెడ్డి కృషి మరువలేనిదని స్థానికులు అంటారు. పైగా ఈ ప్రాంతంలో తెలుగు వారు కూడా బాగా ఎక్కువ. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి బీజేపీ చేసిన మోసం కారణంగానూ.. ఓటర్లు శ్రీరామరెడ్డి వైపే మొగ్గుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

21:50 - May 8, 2018

విజయవాడ : పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నా... కేంద్రం పట్టించుకోక పోవడాన్ని నిరసిస్తూ.. సీపీఎం శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ నాయకులు ర్యాలీలు, బైఠాయింపులతో నిరసనను వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ద్విచక్ర వాహనాలు, ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసనను తెలిపారు. 
విజయవాడలో 
పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు సీపీఎం, ఐద్వా, సీఐటీయూ కార్యకర్తలు పాల్గొన్నారు.  అయితే.. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీపీఎం నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సీపీఎం నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు.
కర్నూలులో 
పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ.. కర్నూలు జిల్లాలో సీసీఎం శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తోన్న పన్నును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. కొత్తబస్టాండ్‌ దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజల్లోకి తీసుకు వెళ్లి.. తగిన బుద్ధి చెబుతామని నాయకులు హెచ్చరించారు. 
అనంతపురంలో
అనంతపురం జిల్లాలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ సీపీఎం కార్యకర్తలు ఆందోళనలు జరిపారు. పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదల వల్ల.. నిత్యావసర సరకుల ధరలు పెరిగిపోయాయని నాయకులు ఆరోపించారు. అనంతపురం టవర్‌క్లాక్‌ దగ్గర అటువేపుగా వచ్చే ద్విచక్ర వాహనాల్లో.. స్వల్ప పరిమాణంలో పెట్రోల్‌ పట్టిస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. 
తిరుపతిలో
తిరుపతిలోనూ సీపీఎం శ్రేణులు పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. కలెక్టరేట్‌ వద్ద.. బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం ధరలను తగ్గించక పోతే.. ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  విశాఖ జిల్లాలోనూ సీపీఎం శ్రేణులు ఆందోళనలు, రాస్తారోకో నిర్వహించాయి. ఏజెన్సీలోని పదకొండు మండలాలతో పాటు.. జిల్లా వ్యాప్తంగా ధర్నాలు సాగాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ నరసింగరావు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.  
కాకినాడలో 
పెంచిన పెట్రోలు, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడ నగర శాఖ కూడా ఆందోళన నిర్వహించింది. మానవహారంగా తమ నిరసనను వెలిబుచ్చింది. పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంపును నిరసిస్తూ.. రాజమండ్రిలోనూ సీపీఎం శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. సీపీఎం కార్యాలయం నుంచి నందం గనిరాజు జంక్షన్‌ మీదుగా కంబాలు చెర్వు వరకూ ర్యాలీ నిర్వహించారు. మోటార్‌ సైకిళ్లకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన తెలిపారు.
నెల్లూరులో
నెల్లూరులోనూ సీపీఎం శ్రేణులు ఆందోళన చేపట్టాయి. నెల్లూరులోని అయ్యప్పగుడి సెంటర్‌ నుంచి వేదాయపాళెం వరకూ ర్యాలీ నిర్వహంచారు. తోపుడు బండిపై మోటార్‌ బైకును ఎక్కించి నిరసన తెలిపారు. మరోవైపు, ఆటో కార్మికులు తాడు సాయంతో ఆటోలు లాగుతూ.. తమ నిరసనను తెలిపారు. క్రూడాయిల్‌ రేట్లు తగ్గినా.. భారత్‌లో పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెరగడం దారుణమని పార్టీ నాయకులు విమర్శించారు. 
ఒంగోలులో
పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదలకు నిరసనగా.. ఒంగోలులో సీపీఎం శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ఆర్టీసీ డిపో నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ సాగింది. ర్యాలీలో మినీ ఆటోను తాడుతో లాగుతూ.. కార్యకర్తలు నిరసన తెలిపారు. మోదీ ప్రభుత్వం ధరలను అదుపు చేయకపోతే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సీపీఎం నాయకులు హెచ్చరించారు. 
నల్లగొండలో 
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో.. సీపీఎం సైకిల్‌ యాత్ర ద్వారా తమ నిరసనను వ్యక్తం చేసింది. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. మోదీ, తన నాలుగేళ్ల పాలన కాలంలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 35 శాతం మేర పెంచేసి.. ప్రజల నడ్డి విరిచారని ఆయన ఆరోపించారు. సూర్యాపేటలోనూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 
కుత్బుల్లాపూర్‌ లో  
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని జీడిమెట్ల హమాలీ అడ్డా నుంచి షాపూర్‌ వరకూ.. సీపీఎం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ కార్యదర్శి లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పేదలపై పన్నుల రూపంలో వేస్తున్న భారాన్ని తగ్గించుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన జిల్లాల్లోనూ సీపీఎం నాయకులు పెట్రోల్‌ ధరల తగ్గింపు కోరుతూ ఆందోళనలు నిర్వహించారు. 

 

21:42 - May 8, 2018

గుంటూరు : జూన్‌ నెల నుంచి ఏపీలోని నిరుద్యోగులకు.. రెండు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని భావిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో.. చంద్రబాబు ఈ విషయాన్ని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం తీరునూ చంద్రబాబు ఆక్షేపించారు. 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే.. దక్షిణ భారతదేశంలో ఎంపీల సీట్లు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 
అమరావతిలో కలెక్టర్ల సదస్సు 
అమరావతిలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఈ సందర్భంగా వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు.. నిరుద్యోగ భృతి ఇవ్వాలని యోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.  'చంద్రన్న బీమా' పథకం  కింద పరిహారాన్ని సకాలంలో ఇస్తుండటంతో ప్రజల్లో  హర్షం వ్యక్తం అవుతోందన్నారు. ప్రజా సంతృప్తినే  ప్రాతిపధికగా  తీసుకుని పనిచేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. 
15వ ఆర్థిక సంఘం సిఫారసులతో రాష్ట్రానికి తీవ్ర నష్టం : చంద్రబాబు 
15వ ఆర్థిక సంఘం సిఫారసులతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 1971 జనాభా  ప్రాతిపధికగానే కేటాయింపులు జరిపేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. దీనికోసమే విజయవాడలో ఇటీవల సదస్సు నిర్వహించామన్నారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 
మరో 5లక్షల మందికి కొత్తగా పింఛన్లు 
త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరో 5లక్షల మందికి కొత్తగా పింఛన్లు అందిస్తామని... దీంతో రాష్ట్రంలో పించను అందుకుంటున్న వారి సంఖ్య 52 లక్షలకు చేరుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం  అమలు చేస్తున్న పథకాలను  సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టరకు సూచించారు.  గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై కలెక్టర్లు దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి అన్నారు.  గ్రామపంచాయతీ, అంగనవాడీ, పాఠశాలలకు  భవనాలు, ప్రహరీగోడలు నిర్మించాలన్నారు. అక్టోబర్‌ 2 నాటికి రాష్ట్రంలో నూటికి నూరుశాతం ఎల్‌ఈడీల వీధిదీపాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై కూడా దృష్టిపెట్టామన్నారు. దీనికోసం 12వేల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచకపోవడమే ప్రభుత్వం సాధించిన ఘన విజయం అన్నారు. 
11 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో 11 లక్షల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయన్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ సంస్థల ఏర్పాటుకు కృషి జరగాలని కలెక్టర్లకు సూచించారు. మరోవైపు రోజు రోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. కొత్త టెక్నాలజీతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. అయితే టెక్నాలజీ వల్ల  మంచితో పాటు, చెడు ఉందని  టెక్నాలజీ వల్ల యువత చెడిపోయే పరిస్థితి  రాకూడదన్నారు. 

 

డబీర్ పురా పోలీసు స్టేషన్ పరిధిలో కార్డెన్ సర్చ్

హైదరాబాద్ : డబీర్ పురా పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. 250 మంది పోలీసులతో డబీర్ పురా, నాగబౌలీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. 

 

21:14 - May 8, 2018

ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణతో టెన్ టివి ఇంటర్వ్యూ నిర్వహించింది. జనసేనాని పవన్ కళ్యాణ్ బస్సుయాత్రపై మాట్లాడారు. జనసేన వ్యూహకర్తపై పలు ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఇబ్బందుల్లో ఉందన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో కేంద్రం మోసం చేసిందన్నారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ ఎస్ దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

21:03 - May 8, 2018

ఆంధ్రా తెల్గుదేశం లీడర్లకు ఈ నడ్మ కాలం గల్చొస్తలేనట్టుందిగదా..? గామొన్న నెల్లూరు ఆనం వివేకనందరెడ్డి సచ్చిపాయే.. మొన్న మాగంటి బాబుకు గుండెపోటొచ్చే.. నిన్న పరిటాల రవి అణుచరుడు చమాన్ గుండెపోటుతోని సచ్చిపాయే.. ఆయనను సూస్తందుకు వొయ్యి మంత్రి పరిటాల సునితమ్మ గూడ ఆడనే చక్కరొచ్చిపడిపోయింది.. లేటెస్టుగ ఒక తెల్గుదేశం ఎమ్మెల్యే సైకిల్ ర్యాలీల అడ్డంబడ్డడు.. 

దేశంలనే కనీ విని ఎరుగని రాష్ట్రం ఏదన్న ఉన్నదంటే అది మన తెలంగాణ రాష్ట్రమే అంటున్నడు మల్కాజ్ గరి ఎంపీ మల్లారెడ్డి.. అన్ని రాష్ట్రాలళ్ల పథకాలున్నయ్ గని.. మనతాన అమలైనట్టు ఏడ అమలైతలేవు అనుకొచ్చిండు..అమ్మటాళ్ల యాళ్లకు ఇంత తిని ప్రెస్ మీటింగు వెట్టినట్టున్నరు.. తబల మద్దెల లేకుంటనే భజన ఎట్ల జేస్తున్నడో సూడుండ్రి..

తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఎట్లున్నదంటే.. బీడి బిచ్చం కల్లు ఉద్దెర లెక్కనే ఉన్నది.. మీదికి మిగులు రాష్ట్రమంటరు.. నిండ అప్పుల పాలు జేశిండ్రు.. ఆఖరికి అద్దె ఎమ్మార్వో ఆఫీసుకు కిరాయి గట్టె పైకం లేదాయే మన సర్కారు తాన.. కుమురంభీం ఆసీఫాబాద్ జిల్లా సిర్పూరు నియోజకవర్గంలున్న చింతలమానేపల్లి మండలాఫీసు కథ ఇది..

ఏట్లె రాయిదీయనోడు కూట్లె రాయిదీయవోయినట్టు.. ఈన ఇలాక సిరిసిల్ల కాడ జనం దూపకు సస్తుంటే.. నల్లగొండ పట్టనాన్ని వంద కోట్ల తోని అభివృద్ధి జేస్తమని మున్సిపాల్టీ ముర్కి మంత్రిగారు ఉద్దెర ముచ్చట్లు జెప్తున్నడు.. ఈ ముచ్చట ఎట్లున్నదంటే.. అమ్మకు అన్నంబెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు జేపిచ్చినట్టుంది సూడుండ్రిగ మీరే..

అయ్యా కల్వకుంట్ల తారాక రామారావుగారు.. మీ బంగారు తెలంగాణ ఉశ్కె దందకు మళ్లొక మన్షి బలైపోయిండు.. సిరిసిల్ల కాడ మళ్లొక మన్షిని గుద్ది సంపింది ఉశ్కెలారి.. ఇంక ఎంతమంది లారీల కిందవడి సచ్చిపోతె తయ్యారైతదో లెక్కనన్న జెప్పుండ్రి సారు  అంతమందం సచ్చిపోతరు లారీల కిందవడి చీచీచీచీ ఏం దందా అది ఏం పని.. తిట్టినా శిగ్గురాదాయే ప్రభుత్వానికి తనంతట తానన్న తెచ్చుకోదాయే.. పాపం సూడుండ్రి..

అయ్యా ముఖ్యమంత్రిగారు ప్రాజెక్టుల కోసం ముందుగాళ్ల నీ ఫామౌజు భూములు ఇచ్చి... తర్వాత మా భూములు తీస్కో అంటున్నరు కానాయపల్లి ముంపు గ్రామాల జనం.. రెండువేల పదమూడు చట్టం ప్రకారం మాకు పరిహారం ఇస్తాంటెనే మేము భూములిస్తం.. మీరు బెదిరిచ్చి గుంజుకోని జూస్తె మా తడాఖ సూపెడ్తమని వనపర్తి దిక్కు పాదయాత్రతోని కలెక్టర్ ఆఫీసుకు వొయ్యిండ్రు..

మా ప్రభుత్వం మేనిఫెస్టోల జెప్పని పనులు గూడ జేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మమ్మ జెప్తాఉండే గప్పట్ల ఏం జేశిండ్రని జనం ఆలోచనల వడ్డరుగని.. నిజమే మా ప్రభుత్వం అధికారంలకొస్తె పేదల ఇండ్లు గూలగొడ్తమని మేనిఫెస్టోల జెప్పిండ్రా చెప్పలేదు.. కని రామాయంపేట కాడ కూలగొట్టి సూపెడ్తున్నరు.. ఎంత గొప్ప మనసున్న ప్రభుత్వం సూడుండ్రి..

శంకర్ దాదా ఎంబీబీఎస్ సీన్మల హీరో అనుకుంటున్నడో ఏమో ఒంగోలు జిల్లా కణిగిరి సర్కారు దావఖాండ్ల పనిజేస్తున్న డాక్టరు.. వాడు వచ్చినోనికి వైద్యం జేయక.. నాకు తీర్వాట్కం లేదు తర్వాత జేస్తా అని బెదిరిస్తున్నడట.. మన్షి సచ్చిపోతున్నడ్రా అంటే వాడు రాడాయే.. ఇగ మీడియావోళ్లు వోతే మీరెవ్వల్రా వచ్చెతందుకు అని తిడ్తున్నడు వాని బల్పు జూడుండ్రి..

కొండ నాల్కెకు మందేస్తే ఉన్ననాల్కే ఊశిపోయినట్లు.. కడ్పునొస్తున్నదని దావఖానకు వోతె కండ్లు వొడగొట్టిండట ఒక డాక్టరు గాడు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకాడున్న మనోహన్ ఆస్పత్రి డాక్టర్ జేశ్న ఉద్దర్కం ఎట్లున్నదో సూడుండ్రి.. 

అసలైన నేరస్తులను వట్టుకో శాతగాని కొంతమంది ఆడివట్ట పోలీసులు అమాయకులను బలిజేస్తా ఉంటరు.. అనంతపురం జిల్లా కదిరి రూరల్ మండలం చిగురుమాను తండా కాడుండే ఆనంద్ నాయక్ అనే పిలగాడు ఉరేస్కోని సచ్చిపోయిండు.. పోలీసోళ్లు గడ్కోపారి తీస్కపోయి కొడ్తున్నరట ఊకే ఈ దెబ్బలెందుకు వడాలే అని ఆయింత ఒక్కటే పారి జీవి దీస్కున్నడు..

20:38 - May 8, 2018

రాజకీయ ప్రయోజనాల కోసమే మళ్లీ ఓటుకు నోటు కేసును తెరపైకి తీసుకొచ్చారని వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కేసును మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, ఓటు నోటు కేసు నిందితుడు జెరుసలేం మత్తయ్య,  బీజేపీ నేత శ్రీధర్ రెడ్డి, టీఆర్ ఎస్ నేత శ్రీనివాస్, మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో దోషులను శిక్షించాలని....ఈ కేసుకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

20:10 - May 8, 2018

'మహానటి' సినిమా హీరోయిన్ కీర్తి సురేష్ తో టెన్ టివి ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినిమా షూటింగ్ విషయాలు తెలిపారు. తన అనుభవాలను వివరించారు. సినిమాలో నటించేందుకు నో చెప్పానని తెలిపారు. సినిమాలో తనకు నచ్చిన క్యారెక్టర్ శశిరేఖ అన్నారు. మాయాబజార్ సీన్ కు ఎక్కువ టేకులు తీసుకున్నానని తెలిపారు. రాజేంద్రప్రసాద్ ను నాన్న అనడం తనకు చాలా ఎగ్జైట్ మెంట్ గా అనిపించిందన్నారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

20:04 - May 8, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు ప్రకంపనలు కొనసాగుతునే ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సోమవారం ఈ కేసును సమీక్షించడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కేసులో నిందితులతో పాటు.. తెలంగాణ కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ నాయకులు తమదైన శైలిలో కేసీఆర్‌ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. 
మళ్లీ ఓటుకు నోటు కేసు రాజకీయ దుమారం 
మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఓటుకు నోటు కేసు.. మళ్లీ తెలుగురాష్ట్రాల్లో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఈ కేసు పురోగతిని సమీక్షించడం కలకలం సృష్టిస్తోంది. కేసులో ఏ-4 నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొని, కోర్టు ఉత్తర్వులతో నిర్దోషిగా బయటపడ్డ జెరూసలేం మత్తయ్య.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రేమతో అంటూ ఓ పది ప్రశ్నలను సంధించారు. ఓటుకు నోటుతో పాటు.. ఏపీ సీఎం ఫోన్‌ ట్యాప్‌ చేసిన కేసునూ సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. 
నన్ను కోవర్ట్‌గా మలిచేందుకు కేసీఆర్‌ కుట్ర : మత్తయ్య  
ఓటుకు నోటు కేసులో తనను కోవర్ట్‌గా మలిచేందుకు కేసీఆర్‌ కుట్ర జరిపించారని.. దానికి తాను అంగీకరించని కారణంగా.. తన వాళ్లను పోలీసులతో చితకబాదించారని మత్తయ్య ఆరోపించారు. ఏసీబీ అధికారులు కోర్టుకు పంపాల్సిన వీడియోలను మీడియాకు పంపడంలోని ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. తన కుట్రలో భాగంగా కేసీఆర్‌ దళితులు, మైనారిటీలను  అప్రతిష్టపాలు చేస్తున్నారని మత్తయ్య విమర్శించారు.  స్టింగ్‌ ఆపరేషన్‌లో ముఖ్యపాత్రధారి జిమ్మిబాబుకు నోటీసు ఇచ్చికూడా ఎందుకు విచారించలేదని మత్తయ్య ప్రశ్నించారు. 
కేసీఆర్‌ సమీక్షపై రేవంత్‌రెడ్డి విమర్శనాస్త్రాలు 
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కూడా కేసీఆర్‌ సమీక్షపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్‌లోనే.. కేసీఆర్‌ కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు. 
అందుకే కేసీఆర్‌ ఓటుకు నోటు కేసును తెరపైకి తెచ్చారు : వీహెచ్
సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్‌ ఓటుకు నోటు కేసును తెరపైకి తెచ్చారంటూ వి.హనుమంతరావు ఆరోపించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ.. ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్‌ చేసుకుని విమర్శలు గుప్పించింది.  ఈకేసు వల్లే.. చంద్రబాబు హైదరాబాద్‌నుంచి అమరావతికి పారిపోయి వచ్చారని వైసీపీ నాయకులు విమర్శించారు. 
వైసీపీ నేతల విమర్శలను తిప్పికొట్టిన టీడీపీ నేతలు 
మరోవైపు తెలుగుదేశం నాయకులు వైసీపీ నేతల విమర్శలను తిప్పికొట్టారు. తెలంగాణ సీఎం సమీక్షించినంత మాత్రాన ఏమీ కాదని, బాబుపై ఎలాంటి కేసూలేదన్న విషయంపై, మత్తయ్య పిటిషన్‌ సమయంలోనే కోర్టు క్లారిటీ ఇచ్చిందని టీడీపీ నేతలు వివరించారు. మొత్తానికి ఓటుకు నోటు కేసు.. మూడేళ్ల తర్వాత మరోమారు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 

 

19:55 - May 8, 2018

పెద్దపల్లి : జిల్లాలోని గోదావరిఖని మార్కండేయ కాలనీలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు భైఠాయించింది. 'ప్రేమించానని నీతోనే జీవితాంతం ఉంటానని చెప్పి నన్ను సింగారపు సృజన్ పెళ్లి చేసుకుని.. ఇప్పుడు ఇంట్లోలో నుంచి వెళ్లి పోమన్నాడని' బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. 'నీది తక్కువ కులమనే పేరుతో ఇంట్లో వాళ్లు తిడుతున్నారని..నువ్వు నాకు వద్దంటూ ఇంట్లో నుంచి బయటకి పంపాడని' ఆరోపించింది. 'మూడు సంవత్సరాల క్రితం నిన్ను ప్రేమించానని..నీతో కలిసి ఉంటానని చెప్పి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నాడని' బాధితురాలు తెలిపారు. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు భైఠాయించడంతో ప్రియుడు సృజన్ కుటుంబ సభ్యులతో సహా పారిపోయాడు.

 

ఐర్లాండ్ తో టీ20 సిరీస్ కోసం భారతజట్టు ఎంపిక

ఢిల్లీ : ఐర్లాండ్ తో భారత్ రెండు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. డబ్లిన్ వేదికగా జూన్ 27, 29న ఐర్లాండ్ తో భారత్ టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఐర్లాండ్ తో టీ20 సిరీస్ కోసం భారతజట్టు ఎంపిక అయింది. భారతజట్టు కోహ్లీ (కెప్టెన్), ధావన్, రోహిత్, రాహుల్,  రైనా, పాండే, ధోని, కార్తీక్, చాహల్, కుల్దీప్, వాషింగ్టన్, భువనేశ్వర్, బూమ్రా, కౌల్ లను ఎంపిక చేశారు.

 

19:15 - May 8, 2018

గుంటూరు : కర్నాటక ఎన్నికల్లో తెలుగువారి ప్రభావం బీజేపీపై ఉంటుందని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ప్రత్యేకంగా మాట్లాడారు. బీజేపీ ఏపీకి చేసిన అన్యాయాన్ని తెలుగు ప్రజలు మర్చిపోలేదన్నారు. కర్నాటక ఎన్నికల్లో తెలుగువారు బీజేపికి బుద్ధి చెబుతారని చెప్పారు. జగన్ కర్నాటకలో బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారని విమిర్శించారు. 

కావేరీ నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ : కావేరీ నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం కావేరీ బోర్డు ఏర్పాటు చేయకపోవండం, కోర్టు ధిక్కారమవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈనెల 14న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణ మే 14కు వాయిదా పడింది. 

18:12 - May 8, 2018

సంగారెడ్డి : జిల్లాలోని పటాన్‌చెరు మండలం వెలిమలలో గాడియమ్‌ స్కూల్‌లో మట్టిపెల్లలు పడి మృతి చెందిన కార్మికులకు న్యాయం చేయాలని సీఐటీయూ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజయ్య జిల్లా కలెక్టర్‌లను కలిశారు. ఎలాంటి భద్రతా పరిమణాలు పాటించకుండా పాఠశాల యాజమాన్యం కార్మికులతో పని చేయిస్తుందని మండిపడ్డారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబీకులకు 30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. 

 

18:08 - May 8, 2018

కరీంనగర్‌ : జిల్లాలో మంత్రి ఈటల రాజేందర్‌ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.   వేములవాడ, ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం వంటి ప్రముఖ పుణ్య క్షేత్రాలతో.. మంచి టెంపుల్‌టౌన్‌ గా ప్రసిద్ది చెందిన కరీంనగర్‌ జిల్లాను  జలసంపద కల్గిన జిల్లాగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అంతే కాకుండా గుజరాత్‌లోని సబర్మతీ తరహాలో కరీంనగర్‌లో మానేరు రివర్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నామని అలాగే సస్పెన్షన్‌ బ్రిడ్జ్‌, థీమ్‌ పార్కులు కరీంనగర్‌కు ప్రధానకర్షణలుగా నిలుస్తాయని తెలిపారు.

 

18:06 - May 8, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. దీనికోసం ప్రభుత్వ ఉద్యోగులను కూడా వాడుకుంటోందని ఆయన విమర్శించారు. ఒక్కపూట దీక్షకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన చంద్రబాబు .. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మధు ఆరోపించారు. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. మే 20 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని  రామకృష్ణ అన్నారు. ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో  మొదలవుతున్న ఆఖరి పోరాటంలో కలిసి రావాలని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థులు, మహిళలకు నేతలు పిలుపు నిచ్చారు. 

 

మోదీ ఆదేశాల మేరకే ఓటుకు నోటు కేసును ప్రస్తావించిన కేసీఆర్‌ : రేవంత్

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో నాటకానికి తెరతీశారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు. మోదీ ఆదేశాల మేరకే  కేసీఆర్‌ ఓటుకు నోటు కేసును మరోసారి ప్రస్తావించారని విమర్శించారు. తమని బెదిరించో, భయపెట్టో రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని మోదీ - కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు.
 

 

17:45 - May 8, 2018

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో నాటకానికి తెరతీశారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు. మోదీ ఆదేశాల మేరకే  కేసీఆర్‌ ఓటుకు నోటు కేసును మరోసారి ప్రస్తావించారని విమర్శించారు. తమని బెదిరించో, భయపెట్టో రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని మోదీ - కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. కేసీఆర్, ఆయన కుటుంబం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం కేసీఆర్ దృష్టి పెట్టారని తెలిపారు. మోదీ, కేసీఆర్ కలిసి ఆడుతున్న నాటకమే నిన్నటి రివ్యూ అని అన్నారు. ఏసీబీ కేసులను సీఎం కేసీఆర్ సమీక్షించడం సంతోషమే..కేసీఆర్ బంధువులపై కేసులు ఉపసంహరిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడితే కొడుకైనా, కూతరైనా జైల్లో పెడతామని కేసీఆర్ అన్నారని...  లంచం అడిగితే కేటీఆర్ చెప్పుతో కొట్టాలని అన్నారని గుర్తు చేశారు.  

 

17:43 - May 8, 2018

బెంగళూరు : కర్నాటకలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్‌కు రోజులు దగ్గరపడుతుండడంతో  పార్టీల అధినేతలు విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ నుంచి మోదీ, అమిత్‌షా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌, సోనియాగాంధీ ప్రచారం సాగిస్తున్నారు. అటు జేడీఎస్‌ కూడా గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతోంది. దీంతో కర్నాటక ఎవరిదన్న ఆసక్తి నెలకొంది. ఏపార్టీ గెలుస్తుందన్న ఉత్కంఠ ఏర్పడింది. కర్నాటక ఎన్నికల్లో తెలుగువారి ఓట్లూ కీలకమే. బెంగళూరులో ఐటీ ఉద్యోగాలు నిర్వహిస్తున్న తెలుగువారి మనోగతాన్ని వీడియోలో చూద్దాం.... 

ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై విచారణ జరగాల్సిందే : జెరుసలెం మత్తయ్య

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విచారణ జరగాల్సిందేనని జెరుసలెం మత్తయ్య అన్నారు. ట్రాయ్ నిబంధనల ప్రకారం కేసీఆర్, కేటీఆర్, ఇంటలిజెన్స్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ పై కూడా విచారణ జరగాలన్నారు. దోషులుగా తేలితే ఎంతటివారైనా జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు. 

17:28 - May 8, 2018

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో దోషులెవరైనా శిక్షించాల్సిందేనని ఓటుకు నోటు కేసు నిందితుడు జెరుసలేమ్‌ మత్తయ్య అన్నారు. ఓటు కు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు...ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై విచారణ జరిపి, చంద్రబాబు పాత్ర ఉందని తేలితే శిక్షించాల్సిందేనన్నారు. అలాగే అక్రమంగా ఫోన్‌ ట్యాపింగ్‌ కు పాల్పడిన తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రి కేటీఆర్‌, ఇంటలిజెన్స్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాయ్‌ నిబంధలను ఉల్లంఘించినందుకు కేసులు నమోదు చేయాలని మత్తయ్య డిమాండ్‌ చేశారు. ఓటుకు నోటు కేసుప సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేయించాలన్నారు. తన తమ్ముడి బంధువులను కొట్టించడంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.  క్రిస్టియన్ నామినేటెడ్ ఎమ్మెల్యేలను బలిపశువు చేశారని వాపోయారు. స్టింగ్ ఆపరేషన్ వీడియోలు మీడియాకు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. తనను కోవర్టుగా మార్చేందుకు కేటీఆర్ గన్ మెన్ యత్నించారని ఆరోపించారు. దోషులుగా తేలితే ఎంతటివారైనా జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు. 

 

హైదరాబాద్‌ లో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీల ప్రమాదం

హైదరాబాద్‌ : నగరంలో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీల ప్రమాదం పొంచిఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అకాల వర్షాలు, గాలులతో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. చిన్నపాటి గాలులకే హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు కుప్పకూలుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఫ్లెక్సీలు రోడ్లు, విద్యుత్‌ లైన్లపై పడిపోతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. 

 

16:55 - May 8, 2018

హైదరాబాద్‌ : నగరంలో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీల ప్రమాదం పొంచిఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అకాల వర్షాలు, గాలులతో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. చిన్నపాటి గాలులకే హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు కుప్పకూలుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఫ్లెక్సీలు రోడ్లు, విద్యుత్‌ లైన్లపై పడిపోతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. హైదరాబాద్‌లో మొత్తం 2,651 హోర్డింగ్స్‌ ఉన్నాయి. వీటిలో 333 హోర్డింగ్‌లు అక్రమంగా ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ 115 హోర్డింగ్‌లను తొలగించింది. హైదరాబాద్‌ పబ్లిక్‌ను హోర్డింగ్‌లు హడలెత్తిస్తున్నాయి. 

 

16:39 - May 8, 2018

బెంగళూరు : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తొలిసారిగా తన మనసులోని మాటను బయటపెట్టారు. 2019లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే తానే ప్రధాని అవుతానని చెప్పారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రజలు  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని రాహుల్‌ గాంధీ అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యడ్యూరప్పను సిఎం అభ్యర్థిగా ఎందుకు ప్రకటించారని రాహుల్‌ బీజేపీని ప్రశ్నించారు. 35 వేల కోట్ల రూపాయలు దోచుకున్న గాలి జనార్దన్‌రెడ్డి వర్గానికి 8 సీట్లు ఎందుకు ఇచ్చారని నిలదీశారు. ఉద్యోగ కల్పన ఎందుకు జరగడం లేదో యువతకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు.

16:33 - May 8, 2018

చిత్తూరు : తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న ఓ హోటల్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకుగురయ్యాడు. ఓ యువకుడు, యువతి కలిసి భార్యాభర్తలమంటూ హోటల్‌లో రూమ్‌ తీసుకున్నారు. ఏం జరిగిందో తెలియదుకానీ... కొద్దిసేపటికే ఆ యువకుడు హత్యకు గురయ్యాడు. రూమ్‌లో మద్యం బాటిళ్లు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడిని ఢిల్లీ వాసిగా పోలీసులు గుర్తించారు. వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

16:23 - May 8, 2018

కృష్ణా : పెరిగిన పెట్రోల్‌ ధరలపై కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యకర్తలు, మున్సిపల్‌ కార్మికులు ఆందోళన చేపట్టారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని బస్‌స్టేషన్‌ వద్ద మానవహారం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు ప్రజాహితంగా ఉండాలని హెచ్చరించారు.

 

16:19 - May 8, 2018

నెల్లూరు : పెరిగిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ నెల్లూరులో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. నగరంలోని అయ్యప్పగుడి సెంటర్‌ నుండి వేదాయపాళెం వరకు ఈ ర్యాలీ సాగింది. నిరసన కర్తలు తోపుడు బండిపై మోటార్‌ బైకును ఎక్కించి వినూత్న నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రూరల్‌ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఏ దేశంలో  లేని విధంగా భారత దేశంలో పెట్రోల్‌ ధరలు అధికంగా ఉన్నాయని క్రూడాయిల్‌ రేట్లు తగ్గుతున్నప్పటికీ..  భారత దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్‌ ధరలు  తగ్గడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌ పై విధిస్తున్న పన్నులే కారణమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను తగ్గించాలని లేదంటే నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

 

16:02 - May 8, 2018

విజయవాడ : ఈ నెల 27 నుండి మూడు రోజులపాటు మహానాడు నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావ్‌. కానూరు సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మహానాడు నిర్వహణకు 14 కమిటీలను వేసినట్లు కళా వెంకట్రావ్‌ తెలిపారు. ఇందులో రాజకీయ తీర్మానం కూడా ఉంటుందన్నారు. ఢిల్లీ, దేశంలో చోటు చేసుకున్న మార్పులపై మహానాడులో చర్చిస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు వచ్చినా టీడీపీలో చేర్చుకుంటామని తెలిపారు. 

 

16:00 - May 8, 2018

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిష్పక్పాతంగా విచారణ జరిపించాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. రాజకీయ కారణాలతో కేసు విచారణకు ఫుల్‌స్టాప్‌ పెట్టవద్దని కోరారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు... తాను నీతిపరుడినంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకే చంద్రబాబు ప్రత్యేకహోదా నినాదమందుకున్నారని విమర్శించారు. హోదా కోసం నాలుగేళ్లుగా రాజీలేని పోరాటం చేస్తోంది వైసీపీయేనన్నారు.

 

ఈనెల 14న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం

హైదరాబాద్ : ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం కొన్ని రోజులుగా మంత్రి ఈటల నేతృత్వంలో ఏర్పడిన మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలతో భేటీలు నిర్వహించారు. ఉద్యోగ సంఘాలతో చర్చించిన అంశాలను ఈనెల 11న నివేదిక రూపంలో సీఎం కేసీఆర్‌కు సమర్పించనున్నారు. దీంతో ఈనెల 14న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు చేస్తున్న 18 డిమాండ్లపై చర్చించి.. నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

 

15:51 - May 8, 2018

హైదరాబాద్ : ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం కొన్ని రోజులుగా మంత్రి ఈటల నేతృత్వంలో ఏర్పడిన మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలతో భేటీలు నిర్వహించారు. ఉద్యోగ సంఘాలతో చర్చించిన అంశాలను ఈనెల 11న నివేదిక రూపంలో సీఎం కేసీఆర్‌కు సమర్పించనున్నారు. దీంతో ఈనెల 14న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు చేస్తున్న 18 డిమాండ్లపై చర్చించి.. నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

13:36 - May 8, 2018

జగిత్యాల : మల్లాపూర్ (మం) కుస్థాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనులు చేస్తున్న కార్మికులపైకి మట్టిపెళ్లలు విరిగి పడ్డాయి. దీనితో ముత్తమ్మ (50), పోషాని (45), రాజు (55) మృతి చెందిన వారిలో ఉన్నారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిని మెట్ పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం 32 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. ఉపాధి హామీ పనులు చేస్తున్న స్థలం వద్ద రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని విమర్శలు వినిపిస్తున్నాయి. 

13:32 - May 8, 2018

కరీంనగర్ : ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రెడ్డిపై మరో కార్పొరేటర్ పోరుబాట పట్టింది. తన కుటుంబాన్ని వేధిస్తున్నాడంటూ ఏకంగా నిరహార దీక్షకు పూనుకోవడం చర్చనీయాంశమైంది. కరీంనగర్ జిల్లా 12వ డివిజన్ కార్పొరేటర్ శ్రీలత జిల్లా కలెక్టరేట్ వద్ద నిరాహర దీక్ష చేపట్టారు. తన భర్త మెండె చంద్రశేఖర్ పై ఎమ్మెల్యే కమలాకర్ కేసులు పెట్టించి జైలుకు పంపించారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. గత కొంతకాలంగా తన భర్తను అనవసరంగా వేధిస్తున్నాడని, అక్రమంగా కేసులు పెట్టిస్తూ పోలీసుల చేత బెదిరింపులు చేపట్టారని ఆరోపించారు. వేధింపులు మానుకోకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని కార్పొరేటర్ శ్రీలత హెచ్చరించారు. కొద్ది రోజుల్లో సీఎం కేసీఆర్ ను కలిసి వివరాలు అందచేస్తామని కార్పొరేటర్ పేర్కొంటున్నారు. వస్తున్న వివాదాలు..ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించడం లేదని తెలుస్తోంది. 

13:27 - May 8, 2018

కర్నూలు : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీపీఎం సమరశంఖం పూరించింది. దేశ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఆందోళనలు..ప్రదర్శనలు నిర్వహించింది. అందులో భాగంగా జిల్లాలో సీపీఎం నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ టెన్ టివితో మాట్లాడారు. ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్నారని, పెట్రోల్, డీజిల్ లకు జీఎస్టీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తున్నట్లు, పన్నులు తగ్గించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ 14 సార్లు ధరలు పెంచిందని, ధరల తగ్గించేంత వరకు వివిధ దశల వారీగా పోరాటం చేస్తామని గఫూర్ వెల్లడించారు. 

ఉద్యోగులు..ఉపాధ్యాయ డిమాండ్లపై...

హైదరాబాద్ : ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్లపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నారు. 18 డిమాండ్లను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందుంచాయి. 11న సీఎంకు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక అందించనుంది. 14న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. 

ఉపాధి హామీ పనుల్లో ప్రమాదం..ముగ్గురి మృతి...

జగిత్యాల : మల్లాపూర్ (మం) కుస్థాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనుల్లో మట్టిపెళ్లలు విరిగి పడి ముగ్గురు కూలీలు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి. ముత్తమ్మ (50), పోషాని (45), రాజు (55) మృతి చెందిన వారిలో ఉన్నారు. 

13:14 - May 8, 2018

విజయవాడ : వైసీపీపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి వైసీపీ అధ్యక్షుడు జగన్ కు లేదన్నారు. ఆంధ్రా రాష్ట్రానికి వెన్నుపొడిచిన వ్యక్తి జగన్ అని, బీజేపీతో చేతులు కలిపారని పేర్కొన్నారు. కేసులు నుండి బయట పడేందుకు రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రం వద్ద పణంగా పెట్టారని, కర్నాటక రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

13:12 - May 8, 2018

సంగారెడ్డి : జిల్లాలో విషాదం నెలకొంది. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని వెలిమలలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలో నిర్మాణ రంగం ఊపందుకుంది. నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లు ఛత్తీస్ గడ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుండి తక్కువ ధరకు కూలీలను తెప్పించుకుని పనులు చేయించుకుంటున్నట్లు సమాచారం. ఓ స్కూల్ లో పనులు చేపడుతున్న ఓ కాంట్రాక్టర్ ఒడిషా రాష్ట్రం నుండి కూలీలను తెప్పించుకుని పనులు చేపిస్తున్నారు. స్కూల్ లో పైపు పనులు చేపడుతుండగా ప్రమాదవశాత్తు మట్టిపెళ్లలు విరిగిపడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు సమాచారం. ఎలాంటి రక్షణ లేకుండా కూలీలు పని చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

వెలిమలలో విషాదం...

సంగారెడ్డి : పటన్ చెరు మండలంలోని వెలిమలలో విషాదం చోటు చేసుకుంది. ఓ స్కూల్ లో పైపులైన్ పనులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మట్టిపెళ్లలు కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. 

సొంతగూటికి మారెప్ప...

కర్నాటక : బీజేపీకి మాజీ మంత్రి మారెప్ప గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను బీజేపీ అధిష్ఠానానికి పంపారు. మళ్లీ తన సొంతగూటి (కాంగ్రెస్ పార్టీ) కే మారెప్ప చేరారు.

12:45 - May 8, 2018

నెల్లూరు : సినీ నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి తనయుడు భార్గవ్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా పంబలి దగ్గర సముద్రంలో ఆయన మృతదేహం కొట్టుకొచ్చింది. రాయుగుంటపాలెం వద్ద భార్గవ్ హెచరీస్ వద్ద ఆయన ఒంటరిగా నివాసం ఉంటున్నట్లు, ఆయనతో పాటు కొంతకాలంగా పెంచుకున్న కుక్క ఉంటోందని సమాచారం. హేచరీస్ కు సమీపంలోని బీచ్ వద్ద కుక్కతో భార్గవ్ వాకింగ్ చేసి ఉంటాడని, ప్రమాదవశాత్తు కుక్క సముద్రంలో మునిగిపోయి ఉండవచ్చునని కాపాడే ప్రమాదంలో భార్గవ్ మృతి చెంది ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. 

12:44 - May 8, 2018

తూర్పుగోదావరి : తుని రైల్వే స్టేషన్ లో ఓ గోనె సంచి కలకలం రేపింది. గోనె సంచి నుండి రక్త కారుతుండడంతో మృతదేహం ఉంటుందని అక్కడి అధికారులు భావించారు. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేశారు. ఉన్నతాధికారుల సమక్షంలో గోనె సంచి తెరవగా 50 ఏళ్ల వయస్సు గల మహిళ మృతదేహం బయటపడింది. మూడు రోజుల క్రితమే మహిళను హత్య చేసి రైలులో ప్రయాణించి...రిజర్వేషన్ కౌంటర్ దగ్గర నిందితులు వదిలిపెట్టి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. 

ఎమ్మెల్యే కమలాకర్ పై కార్పొరేటర్ ఆరోపణలు...

కరీంనగర్ : కలెక్టరేట్ ఎదుట 12వ డివిజన్ కార్పొరేటర్ శ్రీలత నిరాహర దీక్ష చేపట్టారు. తన భర్త చంద్రశేఖర్ పై ఎమ్మెల్యే కమలాకర్ కేసులు పెట్టించి జైలుకు పంపించారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. 

అభిశంసన వ్యవహారం మరో మలుపు...

ఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిశంసన వ్యవహారంలో మరో మలుపు చోటు చేసుకుంది. కాంగ్రెస్ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు వివరాలను వెల్లడించేందుకు నిరాకరించింది. దీనితో అభిశంసన పిటిషన్ ను కపిల్ సిబల్ విత్ డ్రా చేసుకున్నారు. 

అవినీతి వ్యక్తి ముఖ్యమంత్రి అభ్యర్థి ? - రాహుల్...

కర్నాటక : అవినీతి వ్యక్తిని కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించారో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ ప్రశ్నించారు. రూ. 5వేల కోట్లు దోచుకున్న రెడ్డి వర్గానికి ఎంఉదకు 8 సీట్లు ఇచ్చారని, ఉద్యోగ కల్పన ఎందుకు జరగడం లేదో యువతకు మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

తిరుపతిలో వ్యక్తి హత్య...

చిత్తూరు : తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో హోటల్ లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. దంపతులమని చెప్పి ఓ జంట అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడు ఢిల్లీ వాసిగా గుర్తించారు. 

11:10 - May 8, 2018

విజయవాడ : కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సర్కార్ తో పాటు ప్రతిపక్షాలు పోరుబాట పట్టాయి. కానీ ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటాలు..ఆందోళనలు..నిరసనలపై మాత్రం ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నెల్లూరు రోడ్డులో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, ఇతర సంఘాల నేతలు రాస్తారోకో చేపట్టడానికి పూనుకున్నారు. కానీ అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. బలవంతంగా నేతలను వ్యాన్ లలో వివిధ పీఎస్ లకు తరలించారు. 

సీపీఎం నేతల అరెస్టు...

విజయవాడ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఏలూరు రోడ్డులో సీపీఎం ఆందోళన చేపట్టింది. ఆందోళనలు చేస్తున్న నేతలు, మహిళా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ఇతర నేతలను అరెస్టు చేసి వివిధ పీఎస్ లకు తరలించారు. 

నిర్మాత గోపాల్ తనయుడు మృతి...

నెల్లూరు : సినీ నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి తనయుడు భార్గవ్ విగతజీవుడుగా తేలాడు. వాకాడు (మం) రాయుగుంటపాలెం వద్ద భార్గవ్ హెచరీస్ సమీపంలో మృతదేహం లభించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

10:31 - May 8, 2018

ఢిల్లీ : దేశంలోని ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలు పడుతుండగా ఇతర రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతుండడం..మరికొన్ని రాష్ట్రాల్లో ఇసుక తుఫాన్ లతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రెండు..మూడు రోజుల వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుందని, వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తం ఉండాలని ఐఎన్ డి హెచ్చరించింది.

ఢిల్లీ, చండీఘడ్, పంజాబ్, హర్యానాలో ఇసుక తుఫాన్ ముంచుకొస్తోంది. దేశ రాజధానిలో 70 కి.మీటర్ల వేగంతో దుమ్ము..ధూళితో గాలులు వీస్తున్నాయి. మంగళవారం ఉదయం నగరమంతా నల్లగా మారిపోయింది. సాయంత్రం వేళ్లలో నడిచే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులపై రాష్ట్రాలను కేంద్ర వాతావరణ అప్రమత్తం చేస్తోంది. 

తునిలో గోనెసంచి కలకలం...

తూర్పుగోదావరి : తుని రైల్వే స్టేషన్ లో గోనెసంచి కలకలం సృష్టించింది. రక్తపు మరకలు ఉండడంతో సంచిలో మృతదేహం ఉన్నట్లు అనుమానం వ్యక్తమౌతున్నాయి. 

కానూరు సిద్ధార్థ కాలేజీలో మహానాడు...

విజయవాడ : మహానాడు కోసం కానూరు సిద్ధార్థ కాలేజీ గ్రౌండ్ ను టిడిపి ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పరిశీలించారు. ఈనెల 27 నుండి మూడు రోజుల పాటు మహానాడు జరుగనుంది. అన్నింటికీ అనువైన ప్రదేశంగా ఈ కాలేజీని ఎంచుకోవడం జరిగిందని, ఎన్నికలకు ఏడాది కాబట్టి మహానాడు వేదిక నుండి కార్యకర్తలకు ఒక దిశా నిర్ధేశం ఉంటుందని పేర్కొన్నారు. 

మట్టిపెళ్లలు కూలి...

సంగారెడ్డి : పటన్ చెరు (మం) వెలిమలలో గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో ప్రమాదం చోటు చేసుకుంది. పైపులైన్ పనులు చేస్తుండగా మట్టిపెళ్లలు కూలిపోయాయి. దీనితో ముగ్గురు ఒడిశా కార్మికులు మృతి చెందారు. 

08:36 - May 8, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బిఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే కేరళ తరహా పాలన అందిస్తామని రాష్ట్ర ఛైర్మన్ నల్లా సూర్య ప్రకాష్ పేర్కొన్నారు. బిఎల్ఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ...కేరళలో బిసి సామాజిక తరగతికి చెందిన ముఖ్యమంత్రి విజయన్ నేతృత్వంలో అవినీతి రహిత పాలన..ఆదర్శవంతమైన పాలన జరుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అదే తరహా పాలన అందిస్తుందని, బిసిలకు 65 శాతం సీట్లు కేటాయిస్తామని మరోసారి స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే మద్య నిషేధంతో పాటు నిరుద్యోగులకు రూ. 5వేల నిరుద్యోగ భృతి అందిస్తామని వెల్లడించారు. జూన్ మాసంలో బిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ఆందోళనలు మొదలవుతాయని, ఇందుకోసం కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని బిఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని పిలుపునిచ్చారు. 

కర్నాటకలో మోడీ..సోనియా..రాహుల్ ప్రచారం...

కర్నాటక : కర్నాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్, సోనియా గాంధీలు ప్రచారం చేపట్టనున్నారు. మోడీ బెంగళూరులో ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం నేషనల్ కాలేజీలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా బీజాపూర్ లో నిర్వహించే ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగించనున్నారు. బెంగళూరు అర్బన్ ఓటర్లతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశం అవుతారు. 

08:17 - May 8, 2018

విజయనగరం : భర్తల హత్యకు భార్యలు పథకాలు రచిస్తున్నారు. ఇష్టం లేని కారణంగా..అక్రమ సంబంధం బయటపడిందని..పడుతుందనే..ఇతరత్రా కారణాలతో హత్యలు చేసేస్తున్నారు. ఇటీవలే ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో బయటపడగా తాజాగా ఏపీలో మరో ఇలాంటి హత్య బయటపడడం కలకలం రేపుతోంది. విజయనగరం జిల్లాలో జరిగిన నవదంపతుల దాడిలో భార్య కీలక పాత్ర ఉందని పోలీసులు నిర్ధారించారు. పెళ్లైన పది రోజులకే భర్తను నవ వధువు అడ్డు తొలగించుకుంది. స్నేహితుడు.. కిరాయి రౌడీషీటర్లతో ఈ హత్యను చేయించింది.

గౌరీ శంకర్రావు, సరస్వతికి ఇటీవలే వివాహం జరిగింది. వీరు గరుగుపెల్లి మండలం తోటపల్లి గుండా బైక్ పై వస్తున్నారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తమపై దాడిక పాల్పడి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారని..భర్త చనిపోయాడని పోలీసుల ఎదుట సరస్వతి కట్టు కథ అల్లింది. జిల్లా ఎస్పీ పాలరాజు సరస్వతిని పరామర్శించారు. ఈ విషయంలో పోలీసులు జరిపిన విషయంలో సరస్వతి మర్డర్ కు ప్లాన్ చేసినట్లు నిర్ధారించారు. మానాపురం హైవేపై ఎస్పీకి అనుమానితులు దొరకడంతో హత్యకు జరిగిన కుట్ర బయటపడింది. భార్య సరస్వతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

భార్యే నిందితురాలు...

విజయనగరం : నవ దంపతులపై జరిగిన దాడిలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి కారణంగా స్నేహితుడితో కలిసి భర్త హత్యకు భార్య ప్లాన్ చేసింది. పక్కా ప్లాన్ ప్రకారం గోపి అనే రౌడీషీటర్ గ్యాంగ్ తో శంకర్ రావును హత్య చేశారు. మానాపురం హైవేపై ఎస్పీకి అనుమానితులు దొరకడంతో హత్యకు జరిగిన కుట్ర బయటపడింది. భార్య సరస్వతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

07:56 - May 8, 2018

2015లో తెలుగు రాష్ట్రాల్లో సంచనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కేసు దర్యాప్తు పురోగతిపై నిన్న సమీక్షించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి ఈ కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో మల్లయ్య యాదవ్ (టిడిపి), లక్ష్మీ పార్వతి (వైసిపి), రాజమోహన్ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:42 - May 8, 2018

పెరుగుతున్న పెట్రోల్‌ డీజిల్‌ ధరలపై ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రజాసంఘాలు నిరసన కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయంగా పెరిగిన క్రూడాయిల్‌ ధరల వల్లే వీటి ధరలు పెరుగుతున్నట్లు ఒక వైపు ప్రభుత్వం చెప్పుతుంటే అధికంగా ఉన్న ట్యాక్స్‌ల వల్లే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయని ప్రజాసంఘాల నాయకులు విమర్షిస్తున్నారు. పెరుగుతున్న వీటి ధరలు నిత్యవసరాలమీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయని దీనివల్ల సామాన్యులపై పెను భారం పడుతున్నదని వారు చెబుతున్నారు. ఈ అంశం పై టెన్ టివి 'జనపథం'లో అవాజ్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్‌ విశ్లేషించారు. 

06:39 - May 8, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. వేతనాల సవరణపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం జాప్యంపై మండిపడుతున్న కార్మికులు.. ఈనెల 21 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన నోటీసును కూడా ఆర్టీసీ యాజమాన్యానికి అందించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో.. మళ్లీ వేతన సవరణ రగడ ఉధృతమవుతోంది. కొన్ని నెలల పాటు స్తబ్దుగా ఉన్న కార్మిక సంఘాలు సర్కారుతో సమరానికి సిద్ధమవుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించక పోతే ఈ నెల 21 నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని టిఎంయూ.. ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసు ఇచ్చింది. కొత్త పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఉద్యమిస్తున్న వేళ.. ఆర్టీసీ యూనియన్లు కూడా ఇదే అంశంపై ఆందోళన బాట పట్టాయి. తమ డిమాండ్లను నెరవేర్చడంలోఆర్టీసీ యాజమాన్యం జాప్యానికి నిరసనగా.. టీఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం చలో బస్‌భవన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది కార్మికులు బస్‌భవన్‌ను ముట్టడించారు.

నిరుడు మార్చి 31 నాటికి.. 2013 పీఆర్సీ గడువు ముగిసింది. 2017 ఏప్రిల్‌ ఫస్ట్‌ నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రావాలి. ఈ క్రమంలో.. ఆర్టీసీ యాజమాన్యం కూడా నాలుగు నెలల క్రితమే కొత్త పీఆర్సీ కమిటీని నియమించింది. అయితే ఓ రెండు మొక్కుబడి సమావేశాలు మినహా.. వేతనాలపై కమిటీ ఎటూ తేల్చలేదని కార్మికులు మండిపడుతున్నారు. వేతనాలు 50శాతం మేర పెంచాలంటూ టీఎంయూ పీఆర్సీ కమిటీకి విజ్ఞప్తి చేసింది. స్పందన లేకపోవడంతో కార్మికులు కన్నెర్ర జేస్తున్నారు.

ఆర్టీసీలో ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్టీసీకి ఏటా వెయ్యి కోట్లకు పైగా ఆదాయానికి గండిపెడుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ ఆగడాలను నియంత్రించే నాథుడే లేడని ఆరోపిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ నుంచి ఆర్టీసీకి రావాల్సిన నిధులను ఎందుకు విడుదల చేయరని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. యాజమాన్య వైఖరికి నిరసనగా 21 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్లాలని వారు నిర్ణయించారు. 

06:36 - May 8, 2018

నిజామాబాద్‌ : జిల్లా పల్లెచెరువు తండాలో తల్లీ, కొడుకుల మృతి మిస్టరీగా మారింది. అత్తింటివారే హత్య చేశారంటూ వారి ఇంటిపై మృతురాలి బంధువులు దాడి చేశారు. ఇంటికి నిప్పుపెట్టారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు తండాలో 144 సెక్షన్‌ విధించి పరిస్థితిని చక్కదిద్దారు. ధర్పల్లి మండలం పల్లె చెరువు తండాకు చెందిన మహిపాల్‌కు, మద్దిల తండాకు చెందిన బదావత్‌ లావణ్యకు ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి రెండేళ్ల బాలుడు అఖిల్‌ ఉన్నాడు. బతుకు దెరువు కోసం భర్త మహిపాల్ ఏడాది క్రితం గల్ఫ్‌ వెళ్లగా.. లావణ్య తన కొడుకుతో అత్తింట్లో ఉంటోంది. అయితే గత 6 నెలలుగా లావణ్యను అత్త, తోడికోడలు, బావలు వరకట్నం కోసం వేధిస్తున్నారని మృతురాలి బంధువులు తెలిపారు. రాత్రిఫోన్‌లో మాట్లాడిన లావణ్య.. తెల్లారేసరికి విగత జీవిగా మారడంతో.. మృతురాలి కుటుంబ సభ్యులు తండాలో ఆందోళన చేపట్టారు. మహిపాల్‌ ఇంటితో పాటు గుడిసె, వరికుప్పలకు నిప్పు పెట్టారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో అత్తింటి వారు పరారయ్యారు. తండాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు.

కన్న కొడుకును అల్లారుముద్దుగా చూసుకునే లావణ్య కొడుకుతో కలిసి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుందని మృతురాలి కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు. భర్త గల్ఫ్‌కు వెళ్లినప్పటి నుంచి అత్త, బావలతో పాటు తోడి కోడళ్లు వరకట్నం కోసం వేధింపులకు గురి చేశారని .. వేధింపులు తాళలేక ఒకటి రెండుసార్లు లావణ్య పుట్టింటి వచ్చినట్టు బంధువులు తెలిపారు. తల్లి కొడుకులను కొట్టి చంపారని వారు ఆరోపించారు. మరో వైపు వరకట్న వేధింపులు తాళలేక తల్లి, కొడుకు విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నారా ? లేక అత్తా బావలు బలవంతంగా విష గుళికలు మింగించి హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. తల్లి బిడ్డల మృతికి ఆస్తి తగాదాలు, వరకట్న వేధింపులు కారణమా అనేది తేలాల్సి ఉంది. పోలీసులు తండాలో సాధారణ పరిస్థితి తెచ్చేందుకు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

06:32 - May 8, 2018

హైదరాబాద్ : మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ మహిళల భద్రతకు పెద్దపీట వేసింది. అన్ని మెట్రో రైళ్లలో అతివల కోసం ప్రత్యేక కోచ్‌లను కేటాయించింది. ప్రయాణంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మహిళల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సూచనలను పరిగణలోకి తీసుకున్న మెట్రో రైలు యాజమాన్యం వీరి కోసం ప్రత్యేక కోచ్‌లు అందుబాటులోకి తెచ్చింది. ఒక కోచ్‌లో మూడొంతుల భాగాన్ని ప్రత్యేకంగా మహిళల కోసం కేటాయించారు. భవిష్యత్‌లో పూర్తి కోచ్‌ని కేటాయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

మెట్రో రైళ్లకు ప్రజల నుంచి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. ఉద్యోగినులు, విద్యార్థినులు, గృహిణులు... ఇలా అందరూ ప్రయాణిస్తున్నారు. పురుషులతో కలిసి మహిళలు ప్రయాణించడం వలన కొన్ని సందర్భాల్లో వేధింపులు తప్పడంలేదు. దీంతో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాటి నుంచి మహిళలకు ప్రత్యేకంగా కొన్ని సీట్లు రిజర్వు చేశారు. దీనికి మంచి స్పదన రావడంతో ఇప్పుడు ఒక కోచ్‌లో మూడొంతుల భాగాన్ని మహిళ కోసం ప్రత్యేకంగా కేటాయించారు. భవిష్యత్‌లో పూర్తి కోచ్‌ కేటాయించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మూడు కోచ్‌లతో నడుస్తున్న రైళ్లలో తమకు ప్రత్యేక సౌకర్యం కల్పించడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళలేకాదు.. మెట్రో మహిళా ఉద్యోగులు కూడా ఈ సౌకర్యం ఎంతో బాగుందని చెబుతున్నారు. నాగోలు-అమీర్‌పేట-హైటెక్‌ సిటీ కారిడార్‌ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత మధురానగర్‌ స్టేషన్‌ను ప్రత్యేకంగా మహిళల కోసమే కేటాయించాలని నిర్ణయించారు. మహిళలు ఇక నిర్భయంగా మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చని అధికారులు భరోసా ఇస్తున్నారు. 

06:30 - May 8, 2018

హైదరాబాద్ : 2015లో తెలుగు రాష్ట్రాల్లో సంచనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కేసు దర్యాప్తు పురోగతిపై నిన్న సమీక్షించారు. ఇవాళ కూడా మరోసారి సమీక్షించాలని నిర్ణయించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి ఈ కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్నారు. ఆడియో టేపుల్లోని సంభాషణలపై ఫోరెన్సిక్‌ విభాగం ఇచ్చిన నివేదికపై కేసీఆర్‌ సమీక్షించారు. ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ పూర్ణచంద్రరావు, ఈ కేసు జరిగిన సమయంలో ఏసీబీ డీజీగా పనిచేసిన ఏకే ఖాన్‌, పోలీసు ఉన్నతాధికారులు, న్యాయనిపుణులు సమీక్షలో పాల్గొన్నారు.

2015లో ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచనం సృష్టించింది. రాజకీయ దుమారం రేపింది.ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలంగాణలో నామినేటెడ్‌ ఎమ్మెల్యేను కొనుగోలు చేయబోయినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ ఓటు కోసం రేవంత్‌రెడ్డి 50 లక్షల రూపాయలు ఎరచూపి, అడ్డంగా బుక్‌ అయ్యారు. అరెస్టై జైలుకు వెళ్లి, బెయిల్‌పై విడుదలయ్యారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడినట్టు చెబుతున్న ఆడియో టేపులను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించారు. ఫోరెన్సిక్‌ నిపుణులు ఇచ్చిన నివేదికను ఏసీబీ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు.

2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు కేసీఆర్‌ ఓటుకు నోటు కేసును దర్యాప్తును మరింత వేగవంతం చేయాలి కేసీఆర్‌ నిర్ణయించారు. దీనిపై న్యాయ నిపుణలు అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి తీసుకున్నారు. ఈ కేసులో ఏయే కోర్టుల్లో ఎన్ని కేసులు ఉన్నాయి.. ఎవరెరు పిటిషన్లు వేశారు... వీటి పురోగతి ఏంటి.. అన్న అంశాలపై కేసీఆర్‌ సమీక్షించారు. ఇవాళ మరోసారి క్షణ్ణంగా సమీక్షించాలని నిర్ణయించారు. దీంతో ఈ కేసులో నిందితుల గుండెల్లో గుబులు మొదలైంది.

06:27 - May 8, 2018

హైదరాబాద్ : రైతు బంధు పథకంపై టీఆర్‌ఎస్‌ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాల్చే పథకంగా పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే పథకం ఉద్దేశం మంచిదైనా... నిబంధనలతో సర్కారుకు కొత్త చిక్కులు తప్పవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కౌలు రైతులను విస్మరించడం అధికార పార్టీ నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. రైతు బంధు పథకం అమలును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది. వచ్చే ఎన్నికలకు ఈ పథకం శ్రీరామరక్ష అవుతుందన్న భావన టీఆర్‌ఎస్‌ నేతల్లో ఉంది.

రైతు బంధు పథకం ద్వారా పార్టీకి అన్నదాతల మద్దతు కూడగట్టేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రైతుల సంక్షేమమే పరమావధిగా పెట్టుకుని పనిచేస్తోంది. గతంలో రైతులు ఎదుర్కొన్న ఎరువులు, విత్తనాలు, విద్యుత్ సమస్యలను తాము పరిష్కరించామన్న ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో కూడా అన్నదాతలను తమ దారికి తెచ్చుకునే ప్రయత్నం మొదలు పెట్టింది. రైతు బంధు పథకం అమలు ద్వారా అన్నదాతల అండ తమకే అన్న ధీమాతో టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు.

రైతు బంధు పథకం సమర్ధవంతంగా అమలు చేసే చర్యల్లో భాగంగానే భూ రికార్డులను ప్రక్షాళన చేసింది. అర్హులైన రైతులకు ప్రభుత్వం ఏటా రెండు సార్లు అందించేందుకు నిర్ణయించిన పెట్టుబడి సాయం పథకాన్ని ఈనెల 10 అమలు చేయనుంది. ఎకరానికి 8 వేల రూపాయల పెట్టుబడి సాయం చేస్తారు. ఖరీఫ్‌లో 4 వేల రూపాయలు, రబీలో మరో 4 వేల రూపాయలు అందిస్తారు ఎక్కువ మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

రైతు బంధు పథకం ద్వారా ఎలాంటి వివాదాలు లేని భూములకు మాత్రమే పెట్టుబడి సాయం చెక్కులు అందించాలని నిర్ణయించింది. కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు. భూ యజమానికే సాయం అందిస్తారు. క్షేత్ర స్థాయిలో కైలు రైతులే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీరి ఆగ్రహానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గురయ్యే అవకాశాలు లేకపోలేదన్న భయంతో పార్టీ నేతల్లో ఉంది. ఈ అంశం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సహాయం అందని రైతులు ఐక్యమైతే పరిస్థితి మరోలా ఉంటుందని భావిస్తున్నారు. రైతు సమన్వయ సమితులతో ఇప్పటికే రైతుల్లో వర్గవిభేదాలు తలెత్తగా.. కౌలు రైతుల సమస్యల ఇప్పుడు మరో కొత్త వివాదానికి దారితీసే అకాశంలేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయం చేసే రైతులందరికీ ఈ పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటే ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తం అవుతోంది. సర్కారు ఏం చేస్తుందో చూడాలి. 

145 అంబులెన్స్ లు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 145 అంబులెన్స్ లను నేటి నుండి అందుబాటులోకి తేనుంది. మంగళవారం నిజాం కళాశాల మైదానంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వీటిని ప్రారంభించనున్నారు.

 

దోస్త్ అడ్మిషన్ నోటిఫికేషన్...

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీకి అడ్మిషన్ నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది. 

ఎస్సీ విద్యార్థులకు శిక్షణ ప్రారంభం...

హైదరాబాద్ : ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ అవకాశాలను దక్కని ఎస్సీ విద్యార్థులకు మూడో విడత శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభం కానుంది. రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి ప్రారంభించనున్నారు. 

ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలకు శిక్షణ...

హైదరాబాద్ : కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో 14 రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంగళవారం నుండి శిక్షణ ఇవ్వనున్నారు. రాజేంద్రనగర్ లోనలి ఎన్ఐఆర్డీలో ఈ కార్యక్రమాన్ని శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి ప్రారంభించనున్నారు. 

నేడు ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల...

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఈనెల 2వ తేదీన ప్రారంభమైన ఆన్ లైన్ టిఎస్ ఎంసెట్ పరీక్షలు సోమవారం ముగిశాయి. ప్రాథమిక కీని మంగళవారం నుండి టీఎస్-ఎంసెట్ 18 వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయనున్నారు. ఈనెల 18న ఫలితాలు విడుదల కానున్నాయి. 

మరో రెండు రోజులు మంటలే...

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలకు తోడు వేడిగాలులు వీస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంగళ..బుధవారాల్లోనూ ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

నేడు చమన్ అంత్యక్రియలు...

అనంతపురం : పరిటాల రవీంద్ర కీలక అనుచరుడు.. అనంతపురం జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌.. చమన్‌ సాహెబ్‌ అంత్యక్రియలు మంగళవారం జరుగనున్నాయి. చమన్‌ మృతదేహాన్ని స్వగ్రామం కొత్తపల్లికి తరలించారు. చమన్‌ మృతి పట్ల.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా.. మంత్రులు సునీత, కాల్వ శ్రీనివాసులు, మండలి చీఫ్‌విప్‌ పయ్యావుల కేశవ్‌, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతాపం ప్రకటించారు. 

ఏపీలో రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు...

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళ, బుధవారాల్లో జిల్లాల కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తోంది. ప్రస్తుత ఎన్నికల సంవత్సరంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు.. కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్నారు. వివిధ శాఖాధిపతులు.. తమ విభాగాల్లో పురోభివృద్ధి గురించి, పదేసి నిమిషాల పాటు.. పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించారు. 

Don't Miss