Activities calendar

09 May 2018

22:04 - May 9, 2018

అమెరికా : ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన అమెరికా మిత్ర దేశాల్లో ప్రకంపనలు సృష్టించింది. ట్రంప్‌ నిర్ణయం తమకు ఆందోళన కలిగిస్తోందని బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్, జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌ సంయుక్త ప్రకటన చేశారు. ఇరాన్‌తో అణుఒప్పందం భద్రతకు సంబంధించిన అంశమని...దీన్ని కొనసాగించాలన్న మిత్ర దేశాలు చేసిన విజ్ఞప్తిని ట్రంప్‌ పట్టించుకోలేదు. ఈ అంశంలో మిత్ర దేశాలను సంప్రదించామని ట్రంప్‌ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్ వెల్లడించారు. ట్రంప్‌ నిర్ణయాన్ని రష్యా వ్యతిరేకించగా... సౌదీ అరేబియా సమర్థించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో ఇరాన్‌ అణు ఒప్పందం కుదిరింది.

 

22:03 - May 9, 2018

జార్ఖండ్ : దాణా స్కాం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కోర్టు 5 రోజుల పెరోల్‌ మంజూరు చేసింది.  మే 12న తన కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ వివాహాని హాజరయ్యేందుకని 5 రోజుల పెరోల్ మంజూరు చేయాలని లాలు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పెళ్లికి హాజరయ్యేందుకు లాలూకు పెరోల్‌ ఇచ్చినట్లు న్యాయస్థానం వెల్లడించింది. దీంతో లాలు 5 రోజుల పెరోల్‌పై జైలు నుంచి బయటకు రానున్నారు. బిహార్‌కు చెందిన మంత్రి చంద్రిక రాయ్‌ కుమార్తె ఐశ్వర్య రాయ్‌ను తేజ్‌ ప్రతాప్‌ పెళ్లాడబోతున్నారు. ఇటీవల వీరిద్దరి నిశ్చితార్థ  వేడుకకు లాలూ హాజరుకాలేకపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ ప్రస్తుతం ఝార్ఖండ్‌ రాజధాని రాంచిలోని రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

22:00 - May 9, 2018

బెంగళూరు : కర్నాటకలో ప్రచారం చరమాంకానికి చేరింది. ప్రతిష్టాత్మక బాగేపల్లి నియోజకవర్గంలో.. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. అయితే.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే శ్రీరామరెడ్డి.. సాయికుమార్‌ సినీ గ్లామర్‌ను దీటుగా ఎదుర్కొంటున్నారు. 
అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నిక  
కర్నాటక రాష్ట్రం.. చిక్కబళాపూర్‌ జిల్లాలోని బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ ద్విభాషానటుడు సాయికుమార్‌ బీజేపీ తరఫున పోటీ చేస్తుంటే.. ఆయన ప్రత్యర్థిగా.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే శ్రీరామరెడ్డి బరిలో నిలిచారు. ప్రచారం చరమాంకానికి చేరడంతో ఇద్దరు అభ్యర్థులూ.. వీలైనంత మంది ఓటర్లను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. 
బాగేపల్లి నియోజకవర్గం.. కమ్యూనిస్టులకు కంచుకోట
బాగేపల్లి నియోజకవర్గం.. 1978 నుంచీ కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉంది. తొలిదశ నుంచీ బీజేపీకి ఇక్కడ పెద్దగా కేడర్‌ లేదు. నియోజకవర్గంలో ఓ స్థానిక సంస్థలో కూడా పార్టీ ప్రాతినిథ్యం లేదు. అయితే.. అమ్మగారి ఊరు అంటూ సాయికుమార్‌ ఇక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఆ సెంటిమెంట్లు బాగేపల్లిలో పనిచేయవని.. ప్రజలు తమ కోసం అహర్నిశలు కష్టపడే శ్రీరామరెడ్డికే పట్టం కడతారని సీపీఎం నాయకులు ధీమాగా ఉన్నారు. 
2008లో పోటీ చేసి సాయికుమార్‌ పరాజయం 
బీజేపీ అభ్యర్థి సాయికుమార్‌..  2008లో కూడా బాగేపల్లి నియోజకవర్గం నుంచే పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఆయన నియోజకవర్గం వైపు కన్నెత్తయినా చూడలేదు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల వేళ ఓట్ల కోసం రావడాన్ని స్థానిక ఓటర్లు ఎద్దేవా చేస్తున్నారు. 
శ్రీరామరెడ్డిని గెలిపించుకుంటాం.. 
బాగేపల్లి నియోజకవర్గంలో.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో.. ఓటర్లు అభివృద్ధి కాముకులకే పట్టం కడతామంటున్నారు. ప్రజల కోసం కష్టపడే శ్రీరామరెడ్డిని గెలిపించుకుంటామని ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే, బీజేపీ శిబిరం మాత్రం తమకు ఓటర్లు అవకాశం ఇస్తారన్న ఆశతోనే ఉన్నారు. గెలిస్తే నియోజకవర్గానికి ఏమేమి చేయాలని భావిస్తున్నారో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 
శ్రీరామరెడ్డి వైపే... అత్యధిక ఓటర్లు మొగ్గు 
గెలుపోటములతో నిమిత్తం లేకుండా.. నిత్యం ప్రజల మధ్యే ఉండే శ్రీరామరెడ్డి వైపే... అత్యధిక ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గడచిన రెండు ఎన్నికల్లో శ్రీరామరెడ్డిని ఓడించడం వల్ల.. నియోజకవర్గంలో అభివృద్ధి ఆగిపోయిందని.. ఈసారి ఆ పొరపాటు చేయరాదన్న భావన ఓటర్లలో స్పష్టంగా కనిపిస్తోంది. 

 

21:50 - May 9, 2018

గుంటూరు : 2029 కంటే ముందే దేశంలో ఏపీ  నంబర్‌వన్ రాష్ట్రం అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న  ఇన్నోవేటర్స్ ఏపీకి వచ్చేలా  కార్యక్రమాల రూపకల్పన జరగాలన్నారు. ప్రతీ శాఖ వినూత్న ఆవిష్కరణల గురించి ఆలోచించాలన్నారు. ఉండవల్లిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో రెండో రోజూ పాల్గొన్న చంద్రబాబు ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షించారు. 
సమష్టి కృషితో అద్భుతాలు : సీఎం చంద్రబాబు
సమష్టి కృషితో అద్భుతాలు సాధించవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. అధికారులు నాయకులు సమన్వయంతో  పనిచేసి.. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామికగా నిలపాలన్నారు. ఉండవల్లిలో జరగుతున్న కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. వివిధ శాఖల అధికారులపై ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 2029 కన్నా ముందే దేశంలో నంబర్‌వన్ రాష్ట్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.  అధికారులను చూశాక ఆ నమ్మకం మరింత పెరిగిందన్నారు. ప్రపంచంలో కొత్త ఆవిష్కరణలకు ఏపీ వేదిక కవాలన్నారు. ప్రతీ శాఖ వినూత్న ఆవిష్కరణల గురించి ఆలోచించాలన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఈ విషయంలో ముందుందని, గ్రామాలకు సంబంధించి సమస్త సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేయడం అభినందనీయమన్నారు.
కాల్‌సెంటర్‌తో అవినీతిపై యుద్ధం 
కలెక్టర్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పరిష్కార వేదికలు ' కాల్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్లు సమర్థంగా పనిచేసేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తమ సమాచారాన్ని ఆర్టీజీ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తామని.. ఈ సమాచారాన్ని అధికారులు ఉపయోగించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. 
అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం 
గత నాలుగేళ్లుగా రాష్ట్రం సాధించిన అభివృద్ధి ఫలితాల్లో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం ఉందన్న ముఖ్యమంత్రి... విజయం అనేది నిరంతరం శ్రమతో సాధ్యమని, కొద్దిపాటి మనసు పెడితే అద్భుతాలు సాధించవచ్చన్నారు. అమరావతి లాంటి నగరం ప్రపంచంలో మరెక్కడా రాదన్నారు. భారతదేశంలో ఉత్తమ ఫలితాలు సాధించిన టీమ్ తమదేనని.. తాము చేపడుతున్న కార్యక్రమాలు ధనిక రాష్ట్రాలు కూడా అమలు చేయలేకపోతున్నాయన్నారు.  నాలుగేళ్ల విజయాల్లో గ్రామస్థాయి అధికారి నుంచి సీఎంవో అధికారుల వరకు ప్రతి ఒక్కరి పాత్ర ఉందన్నారు. 

 

21:43 - May 9, 2018

హైదరాబాద్ : తెలంగాణలో.. రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించిన రైతు బంధు కార్యక్రమానికి ప్రభుత్వం రేపు శ్రీకారం చుట్టనుంది. దీనికి సంబంధించి రాష్ట్రమంతటా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పథకం కింద ఆర్‌.ఓ.ఎఫ్‌.ఆర్‌. పట్టాలున్న సుమారు లక్షమంది రైతులకూ లబ్ది చేకూరనుంది. సుమారు ఐదువేల కోట్ల రూపాయల మొత్తాన్ని పంపిణీ చేస్తున్న నేపథ్యంలో.. ఎలాంటి అవకతవకలూ జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది.  
ఎకరాకు రూ.4 వేలు పంపిణీ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న రైతుబంధు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం శ్రీకారం చుట్టనున్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం ఇందిరానగర్‌లో పథకాన్ని సీఎం ప్రారంభిస్తారు. రైతుబంధు కింద రాష్ట్రంలోని కోటి 40 లక్షల 98వేల 486 ఎకరాల్లో సేద్యపు పెట్టుబడి కింద ప్రభుత్వం ఎకరాకు నాలుగు వేల రూపాయల చొప్పున అందించనుంది. మరో నాలుగు వేల రూపాయలను యాసంగి పంటకు అందిస్తారు. ప్రస్తుత సీజన్‌లో.. ప్రభుత్వం రైతుబంధు కింద ఐదు వేల ఆరు వందల ఎనిమిది కోట్ల రూపాయలను పంపిణీ చేయనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబంధు కార్యక్రమాన్ని ప్రారంభించిన అరగంట లోపే, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పథకాన్ని ప్రారంభించి.. రైతులకు పాసు పుస్తకాలు, పంటసాయం చెక్కులు అందిస్తారు. నిస్సహాయ రైతుల ఇళ్లకే వెళ్లి చెక్కులు పంపిణీ చేసేలానూ ఏర్పాట్లు చేశారు. 
ఈనెల 17 వరకూ రైతుబంధు కార్యక్రమం
రైతుబంధు కార్యక్రమం ఈనెల 17వ తేదీ వరకూ జరగనుంది. ప్రతిరోజూ ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకూ చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీ కొనసాగుతుంది. ఈ ప్రక్రియ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,761 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు రోజుకు 1546 గ్రామాల్లో చెక్కులు, పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తాయి. రైతులు నేరుగా వచ్చి చెక్కులు, పాసు పుస్తకాలు తీసుకోవాలని, కుటుంబ సభ్యులకు వాటిని ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 
ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు ఉన్న రైతులకూ రైతుబంధు పథకం వర్తింపు 
వివిధ జిల్లాల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు ఉన్న రైతులకూ రైతుబంధు పథకాన్ని వర్తింప చేయనున్నారు. దీని వల్ల సుమారు లక్షకు పైగా గిరిజన, దళిత రైతులకు లబ్ది చేకూరనుంది. అయితే.. వీరికి కొత్తగా ఎలాంటి పాసుపుస్తకాలు అందించబోమని అధికారులు చెబుతున్నారు.  
చెక్కుల పంపిణీ సమాచారం ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌
చెక్కుల పంపిణీ సమాచారం మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేస్తారు. ఇక, రైతులందరూ ఒకేసారి బ్యాంకులకు వెళితే నగదు పంపిణీ కష్టం కాబట్టి.. బ్యాంకులు ప్రత్యేకంగా గ్రామాల వారీగా రైతుల కోసం ప్రత్యేక షెడ్యూలును రూపొందించాయి. నగదు సమస్య తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు బ్యాంకర్లతో సమన్వయం చేసుకుంటారు. మరోవైపు రైతుబంధు కార్యక్రమాన్ని మండువేసవిలో నిర్వహిస్తున్నందున.. అధికారులు చెక్కుల పంపిణీ కేంద్రాల వద్ద అన్ని జాగ్రత్త చర్యలూ తీసుకోనున్నారు. 
రైతు బంధు కార్యక్రమాన్ని విపక్షాలు ఎద్దేవా 
మరోవైపు ప్రభుత్వం తలపెట్టిన రైతు బంధు కార్యక్రమాన్ని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. దళారులకు దోచిపెట్టే పథకమని ఆక్షేపిస్తున్నాయి.  రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఇలాంటి జిమ్మికులు ఎన్ని చేసినా ప్రయోజనం లేదని విమర్శిస్తున్నాయి. 
రైతుబంధు పథకంపై ప్రభుత్వ సర్వే..!
విపక్షాల ఆరోపణలు ఎలా ఉన్నా.. రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కేసీఆర్‌ సర్కార్‌.. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనీ నిర్ణయించింది. దీనికోసం అమెరికా సంస్థ జే-పాల్‌తో ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 132 మండలాల్లో ఈ సంస్థ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది. ప్రతి మండలంలోనూ 300 మంది రైతుల నుంచి అభిప్రాయాన్ని సేకరిస్తారు. ఈ కార్యక్రమంపై ప్రజల ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడమే ఈ సర్వే ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. 

 

21:37 - May 9, 2018

మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు వరాలు ప్రకటించారు. తెలంగాణవ్యాప్తంగా నీటితీరువా బకాయలు రద్దు చేస్తున్నామని మెదక్‌ సభలో ప్రకటించారు. 7 నుంచి 8 వందలకోట్ల రూపాయల బకాయిలు రద్దు చేస్తున్నామన్నారు. అంతేకాదు ఇక నుంచి తెలంగాణలో నీటితీరువా ఉండదని ప్రకటిచారు. నీటి ప్రాజెక్టులు, కాల్వను ప్రభుత్వమే నిర్వహిస్తుందని.. సేద్యానికి పూర్తిగా ఉచితంగా నీరు అందిస్తామన్నారు. 
అభివృద్ధి బాటలో తెలంగాణ : సీఎం కేసీఆర్‌ 
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధి పధంలో సాగుతోందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. మెదక్‌ సభా వేదికగా ప్రభుత్వ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, 31జిల్లాల ఏర్పాటు లాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సామాజిక పెన్షన్లు అందిస్తున్నామని కేసీఆర్‌ తెలిపారు. 
దేశంలో గుణాత్మక మార్పు రావాలి : సీఎం కేసీఆర్‌ 
దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి చెప్పారు. దేశంలో 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా... ప్రజలకు తాగడానికి నీరులేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజల వెనుకబాటుకు కాంగ్రెస్‌ ,బీజేపీలే కారణమన్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్టు కేసీఆర్‌ అన్నారు. 

 

21:02 - May 9, 2018

మహానటి.. ఈ బిరుదుకు అర్హత ఉన్న ఒకే ఒక నటీమని సావిత్రి అని చాటి చెప్పేలా... ఓ సినిమా టీమ్ అంతా కలిసి కన్న ఓ కల, చేసిన ఓ నిజాయితీ గల ప్రయత్నం తెర మీదకు వచ్చింది.. ఆ సినమానే మహానటి... తెలుగులో ఓ ఫుల్ ప్లజ్డ్ బయోపిక్ గా.. ఒక హానెస్ట్ అటెమ్ట్ గా రూపొంది.. కేవలం ప్రోమోస్ తోనే అందరి హృదయాలకు చేరువైన మహానటి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. 
కథ... 
ఈ సినిమా కథ విషయానికి వస్తే..  మహానటి ఓ కథ కాదు.. ఒక చరిత్ర.. ఎక్కడో పల్లెటూరిలో పుట్టి.. నిరుపేద కుటుంబంలో పెరిగి.ఏదైన సాధించగలను అనే ఆత్మవిశ్వాసం తోడుగా నడిచిన ఓ సాధారణ మహిళ.. వెండి తెరను శాసించే స్థాయికి ఎలా ఎదిగింది.. కోట్లాది మంది హృదయాలలో స్థానం ఎలా సంపాధించుకుంది.. మహారాణిలా బ్రతకాల్సిన ఆమె.. చివరికి ఎలాంటి స్థితిలో కన్ను మూసింది అనే విషయాల ప్రస్థానమే ఈ సినిమా కథ.
నటీనటులు...
నటీనటుల విషయానికి వస్తే.. ఈ సినిమా చూసిన తరువాత సావిత్రి మళ్ళీ కీర్తి సురేష్ గా పుట్టిందా అనే రేంజ్ లో సావిత్రి పాత్రలో ఇమిడి పోయి జీవించింది కీర్తి సురేష్. 300 సినిమాలు చేసిన మహానటిని.. పట్టుమని పది సినిమాలు అనుభవం లేని కీర్తి సురేష్.. ఇమిటేట్ చేయకుండా సావిత్రిని తనలో చూపించింది.. సావిత్రి నటన పట్ల ఎంత అంకిత భావం చూపించిందో.కీర్తి సురేష్ సావిత్రి పట్ల. అంతకు పదింతల అంకిత భావం కనపరిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే మహానటిగా కీర్తి సురేష్ అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇక జెమినీ గణేషన్ పాత్రలో. టూ షేుడెడ్ క్యారక్టర్ లో.. దుల్ఖర్ సల్మాన్ అదరగొట్టాడు. అతడు ఎలాంటి నటుడో చెప్పడానికి ఈ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్.. మధుర వాణి పాత్రలో సమంత సినిమాకు మరో ప్రధాన బలంగా నిలిచింది.. ఆమె ఈ సినిమాను ఎంత రెస్పెక్ట్ పుల్ గా, రెస్పాన్స్ బులిటిగా ఫీల్ అయ్యిందో.. ఆమె స్క్రీన్ ప్రజన్స్ తెలియజేసింది. సావిత్రితో మధుర వాణి కన్వర్ జేషన్ సీన్..  సమంత కెరీర్ లో దిబెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన సీన్ గా గుర్తుండి పోతుంది. విజయ్ దేవరకొండ రోల్. ఎంటర్ టైనింగ్ ఫాక్టర్ గా బాగా వర్కౌట్ అయ్యింది. సావిత్రి పెదనాన్న పాత్రలో.. రాజేంద్ర ప్రసాద్.. ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు..  కేవి రెడ్డిగా క్రిష్.. చక్రపాణిగా ప్రకాష్ రాజ్.. ఏఎన్ న్నార్ గా నాగచైతన్య.. ఎల్వీ ప్రసాద్ గా అవసరాల శ్రీనివాస్, తమ డిగ్నిఫైడ్ ప్రజన్స్ తో, లెజండరీ పర్సనాలిటీస్ కి తగిన గౌరవం ఆపాదించారు.. భానుప్రియ.. షాలినీ పాండే.. దివ్యవాణి..జబర్ధస్త్ మహేష్ తదితరులంతా.. లిమిటెడ్ రోల్స్ లో. మంచి పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. అయితే ఈ సినమాలో నటించిన వారి అందరికి కూడా..ఇది ఓ స్పెషల్ మూవీగా నిలుస్థుంది అనేది మాత్రం 100% యాప్ స్టెట్ మెంట్..
టెక్నీషియన్స్.. 
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. సినిమాకు పనిచేసిన 24క్రాఫ్స్ కి.. పేరు గౌరవం తెచ్చిపెట్టే సినిమాలు చాలా అరుదుగా వస్తూఉంటాయి.. అలాంటి ఒక అరుదైన సినిమాగా అహర్నిషలు కష్టపడి, అవుట్ పుట్ కోసం తపన పడి,  మహానటిని అరుదైన సినిమాల సరసన నిలబెట్టే దర్శకుడ నాగ అశ్విన్.. ప్రతి సన్నివేశంలో... ప్రతీ షాట్ లో అతని అంకిత భావం, ప్రతిభతో పాటు, సావిత్రి మీద అతనికి ఉన్న గౌరవం. ఆమె పాత్ర పట్ల ఆమె పెంచుకున్న ఇష్టం కనిపిస్థాయి..అంతగా కష్టపడి ఈ సినిమాను మెస్మరైజింగ్ గా తీర్చి దిద్దాడు దర్శకుడు. ఇక కెమెరా మెన్ డానీ ఫారినర్ అయినప్పటికీ.. డైరక్టర్ తో ప్రోఫిషినల్ గానే కాకుండా.. ఎమోషనల్ గా సింక్ అయి ఈ సినిమాకు పనిచేశాడు... సావిత్రి జీవితంలో వివిధ దశలను బాలెన్స్ చేస్తూ.. మధురవాణి ఎపిసోడ్ కు వేరియోషన్స్ చూపిస్తూ.. మహానటి సినిమాకు తన శక్తివంచన లేకుండా, కావలసిన ఆకర్శనలు అన్నీ జోడించి. వెండి తెరపై మెరిసిపోయేలా చూపించాడు..  కెమెరా మెన్ నుండి డైరక్టర్ కు 100% సపోర్ట్ అందించిన సినిమాల లిస్ట్ లో మహానటిని నిలబెట్టారు ఆ ఇద్దరూ. ఇక బుర్రా సాయిమాధవ్ పొదుపుగా మాటలను వాడినా కూడా. గుండెలను తాకేలా చేశాడు,మహానటి గోప్పతనాన్ని చుట్టుపక్కల వారితో చెప్పించేటప్పుడు, అలాగే ఆమె మనోవేధన హృదయాలకు తాకేట్టు చేయడం లో సాయిమాధవ్ లోని రైటర్ సత్తా.. మరోసారి బయటపడింది.. అతని కెరీర్ లో ఒక ఆణిముత్యం ఈ సినిమా.. ఇప్పటి వరకు ఎన్నో అవార్డ్ విన్నింగ్ మూవీస్ కి సెన్సిబుల్ సంగీతం అందించిన మిక్కీజే మేయర్..మహానటికి తన సంగీతంతో ప్రాణం పోశాడు. సినమా స్ధాయి ఎక్కడా తగ్గకుండా.. ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా.. సంగీతం అందించిన తీరు సింప్లీ సూపర్. నేపధ్య సంగీతంలోకూడా మిక్కీ తపన కనిపిస్ధుంది. ఆర్ట్ డైరక్టర్ మెరిపించిన సెట్స్ అలనాటి లొకేషన్స్ ను కళ్ళ ముందు ఆవిష్కరించాయి.. అనుభవజ్ఞుడైన ఎడిటర్ కొటగిరి వెంకటేశ్వరావ్ తన కత్తెరకు పూర్తిగా పని చెప్పినా..మూడు గంటల అవుట్ పుట్ బయటకు వచ్చింది..ఇక ఈ సినిమా నిర్మాతలు అయిన, స్వప్న దత్.. ప్రియాంక దత్ లకు ఈ సినిమా ఓ లైఫ్ టైం ఎచ్యూవ్ మెంట్ అవార్డ్ లాంటిది.. ఎటువంటి కమర్షియల్ అప్పీల్ లేకుండా చేసిన ప్రయత్నానికి, ఎక్కడా వెనకాడకుండా కావల్సినంత బడ్జెట్ లో కాస్ట్లీ అండ్ వ్యాలిడ్ ప్రొడక్ట్ గా మహానటిని నిలబెట్టారు.. వాళ్లు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు బిగెస్ట్ ఎసెట్..
ఓవర్ ఆల్..
ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే మహానటి సావిత్రి జీవిత గాధను ఓ కథగా, నిజాయితీగా, తెరమీద చూపించగలగటం అద్భుతం.. ఏబీసీ అనే క్లాసిఫికేషన్, మల్టీప్లెక్స్,సింగిల్ స్ర్క్రీన్ అనే వేరియేషన్ చెరిపేస్తూ.. ఆనాటి, ఈనాటి, రేపటి తరాల ఆడియన్స్ కి ఓ మెస్మరైజింగ్ మూవీ ఎక్స్ పీరియన్స్ గా నిలిచిన మహానటి, వసూల్ పరంగా ఎంత కలక్ట్ చేస్తుంది అనేది వేచి చూడాలి.. సినిమా పరంగా మాత్రం.. ఇది సావిత్రమ్మకు రియల్ ట్రీబ్యూట్, టాలీవుడ్ కు చెప్పుకోదగ్గ ఎసెట్.. 
ప్లస్ పాయింట్స్
ప్రొడక్షన్ వాల్యూస్
కీర్తి సురేష్ నటన
డైరక్షన్, డైలాగ్స్
స్టార్ కాస్ట్
మ్యూజిక్, కెమెరా
మైనస్ పాయింట్స్
సహజత్వం లోపించిన కొన్ని సంభాషణలు
లవ్ ట్రాక్ లో తగ్గిన రియాల్టీ
అక్కడక్కడ కన్ఫ్యూజింగ్ ఇంటర్ కట్స్
రేటింగ్
3.5 / 5

 

20:32 - May 9, 2018

కాకుల గొట్టి గద్దలకు వెట్టినట్టే ఉన్నది రైతు బందు పత్క కథ గూడ.. ఎవ్వన్ని ఉద్దరిచ్చెతందుకు ఇస్తున్నరు సారు ఈ నాల్గు నాల్గువేల రూపాల పెట్టుబడి సాయం.. అసలైన రైతులకు మొండిచేయి.. ఎవుసం జేయనోని చేతికి చెక్కులా..? ప్రజలారా నిజంగ కేసీఆర్కు గన్క రైతుల మీద ప్రేముంటె ఏం జేయాలే ఎవ్వలైతె ఎవుసం జేస్తున్నరో వాళ్లకు ఇయ్యాలే.. అంతేనా... ఇది భూస్వాములకు దోశిపెట్టె పథకం తప్ప ఇంకోటిగాదు..

నేను రైతు బందు సాయాన్ని స్వచ్చందంగ ఒదులుకుంటున్న అని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వర్సవెట్టి ప్రకటనలు జేస్తున్నరు.. మా త్యాగం జూడుండ్రి మా గొప్పతనం జూడుండ్రి అన్నట్టు.. అయితె రైతు బందు చెక్కులను వదులుకుంటున్నరు సరేగని.. మీ భూముల లెక్కల సంగతేంది సార్లూ..? ఒక్క సారి ఆధారాలు వట్కొచ్చిన సూపెడ్త సూడుండ్రి ఈ నాయకుల నాటకం.. 

మోడీ ఎట్ల ఆడిస్తుంటే కేసీఆర్ అట్లనే ఆడుతున్నడట.. ఢిల్లీ మోడీ.. తెలంగాణ కేడీ ఇద్దరు గల్సి ప్రతిపక్షాల నాయకులను ఇర్కులళ్ల వడేశి మళ్ల రాజకీయ పబ్బంగడ్పుకునెతందుకు ప్లాన్ ఏశిండ్రట.. ఆ ప్లాన్ల భాగమే ఏసీబీ కేసులు ముంగటేస్కున్నడని తిడ్తున్నడు కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి.. మోడీకి కేసీఆర్కు లోపట లోపట దోస్తానా ఉన్నదా ఏంది అనిపిస్తున్నది ఈసారు మాటలింటుంటే.. ఉండొచ్చు ఎవ్వలికెర్క..

పావుల పనికి బారాణ ప్రచారం.. ఇప్పటిదాక తెలంగాణ ప్రభుత్వం జనానికి ఎల్గవెట్టింది పావల మందం గూడ లేదు కని ప్రచారం మాత్రం బారాణ మందం జేస్కున్నరు.. మంది సొమ్ము మంగళారం అన్నట్టు ఏం అడ్వటైజ్ మెంట్లు అవ్వి ఏం కథ..? కేసీఆర్ సర్కారు టీవీలకు పేపర్లకు ఎంత పైకం అడ్వటైజ్ మెంట్ల కోసం ఇచ్చిందో తెల్సా... సూడుండ్రి లెక్కలు..

దయగల మొగడు తల్పులు దగ్గరేశి కొట్టినట్టు.. మోడీ, కేసీఆర్, చంద్రబాబు జనాన్ని గూడ ఈ తరీఖలనే గొడ్తున్నరు పిట్రోలు డిజీలు ముచ్చట్ల..  డెబ్బై తొమ్మిది రూపాలకు లీటరు పిట్రోలా..? వాస్తవానికి అది మనకు ఎంతకు రావాల్నో తెల్సా.. నల్పై రూపాలకు లీటరు రావాలే అటీటు.. కని మన మోడీ పన్నులు మన చంద్రుళ్ల పన్నులు గల్పి ఎన్బై రూపాలకొస్తున్నది.. 

ఈ పార్థీ గ్యాంగేడంగ మోపైందిరో.. రాత్రి పూట ఒక గ్యాంగు తిర్గుతున్నదట.. వాళ్ల చేతుల కత్తులు కటార్లు.. వాళ్లంత నరరూప రాక్షసులు లేరట.. వాళ్లకు సంపుడంటే గిచ్చినంత అల్కపనట.. జనం పాణాలు చేతుల వెట్కోని కట్టెలు చేతుల వట్కోని బత్కుతున్నరు అనంతపురం జిల్లాల.. నిన్న రాత్రి ఎంత కథ అయ్యిందో సూడుండ్రి..

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల కాడ రైతులు రోడ్డెక్కిండ్రు.. మీ ఒడ్లు గొనాల్నంటే అవ్వి మంచిగ ఎండి గలగల అనాలే అప్పుడు గొంటమని మార్కెటోడు మెల్కె వెట్టిండట.. సరే అని ఎండవోశిండ్రు జనం... అయింత వానొచ్చి ఉన్న ఒడ్లన్ని నీళ్లల్ల తడ్సిపోయినయ్.. ఇప్పుడు మేమేం జేయాలే అంటున్నరు పాపం రైతులు..

దేశం దివాల దిశగ శరవేగంగ దూస్కపోతున్నదని చెప్పెతందుకు మన రూపాయికి ఉన్న విల్వ తెల్సుకుంటె సరిపోతది ఇప్పుడు.. ఒకప్పుడు మన రూపాయికి ఇంత ఇజ్జతుంటుండే.. బైటిదేశం బోతె మనం అర్వై రూపాలిస్తె ఒక డాలరన్నొచ్చేది.. ఇప్పుడు అర్వై ఏడు రూపాలిస్తె ఒక్క డాలారొస్తున్నది.. అంటే మన రూపాయికి దినదినం ఇజ్జత్ తక్వైతున్నదన్నట్టు..

ఇవాళ మెదక్ జిల్లా ప్రజలకు శుభదినం : మంత్రి హరీష్ రావు

మెదక్ : ఇవాళ మెదక్ జిల్లా ప్రజలకు శుభదినమని మంత్రి హరీష్ రావు అన్నారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్ల కాలంలో జరిగిందన్నారు. ఇది కలా నిజమా అని ఊహించనంత అభివృద్ధి జరిగిందని చెప్పారు.

 

ఇవాళ మెదక్ జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరింది : పద్మాదేవేందర్ రెడ్డి

మెదక్ : ఇవాళ మెదక్ జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరిందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. దశాబ్ధాల నుంచి జిల్లా కేంద్రం కోసం కొట్లాడామని..ప్రజల చిరకాల స్వప్నాన్ని సీఎం కేసీఆర్ సాకారం చేశారని చెప్పారు. వందకోట్లతో ఘనపురం అయకట్టు స్థిరీకరణ..మెదక్ జిల్లా చివరి ఆయకట్టుకు సింగూరు జలాలు తీసుకొచ్చామని తెలిపారు. 

 

20:08 - May 9, 2018

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై వక్తలు వాడీవేడి చర్చ చేశారు. కర్నాటక ఎన్నికల ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నగేష్ కుమార్, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబురావు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

19:47 - May 9, 2018

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. గడువు సమీపిస్తుండడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజుల ముందు ఫేక్ ఓటర్‌ ఐడీ కార్డులు కలకలం రేపాయి.
కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసిన ప్రధాని మోది 
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. ప్రచారానికి గురువరాం ఆఖరిరోజు కావడంతో ఉత్కంఠభరితంగా ప్రచారం కొనసాగుతోంది. కాంగ్రెస్‌, బిజెపిలు ప్రచార ర్యాలీలతో హోరెత్తిస్తున్నాయి. చిక్‌మగళూరు, కోలార్‌ తదితర ఎన్నికల సభలలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోది కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేశారు. అధికారం కోసం కాంగ్రెస్ అర్రులు చాస్తోందని మండిపడ్డారు. చిక్‌మగళూరు నుంచి ఇందిరాగాంధీ, బెల్లారీ నుంచి సోనియాగాంధీ పోటీ చేసినప్పటికీ వారు ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో అపార అనుభవం ఉన్న నేతలను పక్కనపెట్టి తాను ప్రధాని పదవిని చేపట్టేందుకు సిద్ధమని ఓ వ్యక్తి ప్రకటించడమంటే ఇంతకు మించి అహంకారం మరొకటి ఉంటుందా అని రాహుల్‌ను ఉద్దేశించి మోది విమర్శలు గుప్పించారు.
బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల తీరును దుయ్యబట్టిన రాహుల్‌
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన ప్రచారంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల తీరును దుయ్యబట్టారు. దమ్ముంటే రాజ్యాంగాన్ని తాకి చూడండంటూ సవాల్‌ విసిరారు. అవినీతి గురించి మాట్లాడే ప్రధాని అవినీతి పరులైన యడ్యూరప్ప, రెడ్డి సోదరులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. బ్యాంకుల్లో దాచుకున్న ప్రజల ధనాన్ని నీరవ్‌ మోది, మెహుల్‌ చోక్సీ జేబుల్లో వేస్తున్నారని  ఆరోపించారు.
ఫేక్ ఓటర్‌ ఐడీ కార్డులు కలకలం 
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు ఫేక్ ఓటర్‌ ఐడీ కార్డులు కలకలం రేపాయి. పక్కా సమాచారం మేరకు బెంగళూరులోని జాలహళ్లిలోగల ఎస్‌ఎల్వీ అపార్డ్‌మెంట్‌పై మంగళవారం రాత్రి అధికారులు దాడి చేశారు. 9, 746 వేల ఓటర్‌ ఐడీకార్డులను స్వాధీనం చేసుకున్నారు. రాజరాజేశ్వరి నగర్‌ నియోజకవర్గానికి చెందిన ఓటర్ల ఐడిలుగా అధికారులు గుర్తించారు. అపార్ట్‌మెంట్‌ యజమాని మంజులా నంజామురి బిజెపి నేత కావడం గమనార్హం. ఆర్‌ ఆర్‌ నగర్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ఇక్కడ ఎన్నికలను రద్దు చేయాలని బిజెపి డిమాండ్‌ చేసింది.
ఎన్నికల్లో ఓటమి భయంతో బిజెపి ఆడుతున్న నాటకం : కాంగ్రెస్‌
ఎన్నికల్లో ఓటమి భయంతో బిజెపి ఆడుతున్న నాటకమని కాంగ్రెస్‌ విమర్శించింది. ఓటర్ల ఐడీలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. ఎన్నికల్లో బిజెపి చేస్తున్న ఖర్చుపై కూడా విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది. కర్ణాటక అసెంబ్లీకి మే 12న ఎన్నికలు జరగనున్నాయి. ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది మే 15 వరకు వేచి చూడాలి.

 

19:30 - May 9, 2018

ఢిల్లీ : ఉత్తరభారతంలో భూకంపం భయాందోళనకు గురిచేసింది. జమ్మూ కశ్మీర్‌, ఢిల్లీ, గుర్‌గావ్‌తోపాటు పలు ప్రాంతాల్లో స్వల్వంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అటు ఆఫ్గానిస్థాన్‌లోని హిందూకుష్‌ పర్వతాల్లో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఆఫ్గాన్‌లోని పలు ప్రాంతాల్లో రిక్టర్‌స్కేలుపై 6.2 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయినట్టు అమెరికా జీయోలాజికల్‌ సర్వే వెల్లడించింది. నష్టం వివరాలు తెలియరాలేదు.  

 

19:25 - May 9, 2018

అనంతపురం : జిల్లాలోని ధర్మవరంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేనేత కార్మిక నేతలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి  ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అభివృద్ధికి పాటు పడేలా ప్రణాళికపై పూర్తి సమాచారం త్వరలో తెలియజేస్తానని ఆయన తెలిపారు. చేనేత వ్యవస్థ కుంటపడకుండా ఉండాలని అందుకు పరిష్కార మార్గాలను రూపొందిస్తానన్నారు. వచ్చే రెండు నెలల్లో 13 జిల్లాలు పర్యటించి అనంతరం తన రాజకీయ భవిష్యత్ కార్యచరణ ప్రణాళికను ప్రకటిస్తానన్నారు.

 

19:22 - May 9, 2018

కడప : జిల్లాలోని లింగాల మండలం ఎగువపల్లెలో దారుణం జరిగింది. పొలంవద్దకు వెళ్లిన వ్యక్తిని దుండగులు అతి దారుణంగా కొట్టి చంపారు. అనంతపురం జిల్లాతాడిమర్రి మండలం చిల్లవారిపల్లి గ్రామానికి చెందిన శివలీల, అదే గ్రామానికిచెందిన సాయిభూషన్ రెడ్డికి 18 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే సాయిభూషన్ రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. అయితే సాయిభూషన్‌ రెడ్డి భార్యకు మరోవ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని.. ఈ నేపథ్యంలోనే భర్తను చంపించి ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో సాయిభూషన్ రెడ్డి పై రెండు సార్లు హత్యయత్నం జరిగిందని.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారని గ్రామస్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.

 

18:49 - May 9, 2018

బెంగుళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజుల ముందు ఫేక్ ఓటర్‌ ఐడీ కార్డులు కలకలం రేపాయి. కొత్త ఓటర్ల ముసుగులో భారీ ఎత్తున చీకటి వ్యవహారం నడుస్తున్నట్లు అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో బెంగళూరులోని జాలహళ్లిలోగల ఎస్‌ఎల్వీ అపార్డ్‌మెంట్‌పై అధికారులు దాడిచేశారు. సుమారు 10 వేల ఓటర్‌ ఓటర్‌ ఐడీకార్డులతో పాటు, అప్లికేషన్లు, ఐదు ల్యాప్‌టాప్‌లు, ఓ ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాజరాజేశ్వరి నగర్‌ నియోజకవర్గానికి చెందిన ఓటర్ల ఐడిలుగా అధికారులు గుర్తించారు. అపార్ట్‌మెంట్‌ యజమాని మంజులా నంజామురి బిజెపి నేత కావడం గమనార్హం. ఓటర్‌ కార్డుల వ్యవహారంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు మిన్నంటాయి. ఆర్‌ ఆర్‌ నగర్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ విమర్శించగా.... ఎన్నికల్లో ఓటమి భయంతో బిజెపి ఆడుతున్న నాటకమని కాంగ్రెస్‌ ఎదురు దాడి చేసింది.

 

18:46 - May 9, 2018
18:45 - May 9, 2018

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్‌లో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోది కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని టార్గెట్‌ చేశారు. 2019 ఎన్నికల్లో రాహుల్‌ తనని తాను ప్రధానిగా ప్రకటించుకోవడంపై మోది విరుచుకు పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీలో అపార అనుభవం ఉన్న నేతలను పక్కనపెట్టి తాను ప్రధాని పదవిని చేపట్టేందుకు సిద్ధమని ఓ వ్యక్తి ప్రకటించడమంటే ఇంతకు మించి అహంకారం మరొకటి ఉంటుందా అని రాహుల్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ కల్చర్‌, మతతత్వం, కులతత్వం, నేరాలు, అవినీతి, కాంట్రాక్టర్‌ వ్యవస్థ అనే ఆరు రోగాలు ఆ పార్టీని పట్టి పీడిస్తున్నాయని విమర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రిమోట్‌ కంట్రోల్‌ టెన్‌ జనపథ్‌లో ఉండేదని... తమ ప్రభుత్వ రిమోట్‌ వంద కోట్ల ప్రజల చేతిలో ఉందని మోది స్పష్టం చేశారు.

 

ఉత్తర భారతంలో భూప్రకంపనలు

ఢిల్లీ : ఉత్తర భారతాన్ని భూప్రకంపనలు భయపెట్టాయి. కశ్మీర్, ఢిల్లీ, గుర్ గావ్ తోపాటు పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. అప్ఘనిస్థాన్ లోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 శాతంగా భూకంప తీవ్రత నమోదు అయింది. అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 

 

18:37 - May 9, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలోని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పశు వైద్యశాలలో మానవత్వం వెల్లువిరిసింది. గాయపడిన త్రాచుపాముకు శస్త్ర చికిత్స చేసి తమ వృత్తి ధర్మాన్ని నిలుపుకున్నారు నిడదవోలుకు  చెందిన పశు వైద్యాధికారి రామకోటేశ్వరరావు. జంగారెడ్డి గూడెం శివారులో ఒక వ్యక్తి త్రాచుపామును చంపడానికి ప్రయత్నించాడు. పాము సమాచారం తెలుసుకున్న స్నేక్‌ సేవియర్‌ సొసైటీ గాయపడిన పామును నిడదవోలు పశువైద్యశాలకు తరలించారు. పామును పరిశీలించిన రామకోటేశ్వరరావు ఆపరేషన్‌ చేసి పామును బ్రతికించారు. 

 

18:35 - May 9, 2018

హైదరాబాద్‌ : అమ్మాయిలపై అకృత్యాలు ఆగడం లేదు. అమ్మాయిలపై అత్యాచార ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ బాలికపై అత్యాచారయత్నం జరిగింది. నగర శివారు జవహర్‌నగర్‌ పరిధిలోని జమ్మిగడ్డలో శివసాయి కాలనీలో నివాసముండే జహంగీర్‌ ఓ బాలికపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. చాక్లెట్లు ఇస్తానని ఆశచూపి 11ఏళ్ల చిన్నారిని ఇంట్లోకి పిలిచాడు. బాలిక రాగానే అత్యాచారయత్నం చేయబోయాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చి జహంగీర్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.

 

18:24 - May 9, 2018

కర్నూలు : జిల్లా కేంద్రంలోఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 6 లక్షల 10 వేల నగదు, 5 సెల్ ఫోన్, 3 పాస్ పోర్టులు స్వాధీనం చేసుకున్నారు.

 

18:21 - May 9, 2018

కరీంనగర్‌ : ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తన భర్త చంద్రశేఖర్‌పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ కార్పొరేటర్‌ శ్రీలత కలెక్టరేట్‌ ముందు నిరహార దీక్షకు దిగారు. గంగుల కమలాకర్‌ అవినీతి, అక్రమాలను బయటపెడతామనే కారణంతోనే అక్రమకేసులు పెట్టి వేధిస్తున్నారంటూ శ్రీలత ఆరోపించింది. వార్డు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామంటే నమ్మి టీఆర్‌ఎస్‌లో చేరామని ఆమె అన్నారు. కేసులు ఎత్తివేయక పోతే అంబేద్కర్ విగ్రహం ఎదుట కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్న కార్పొరేటర్‌ శ్రీలతతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

18:16 - May 9, 2018

విజయవాడ : బీజేపీ నేతల విమర్శలను ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తిప్పికొట్టారు. రాష్ట్ర విభజన సమయంలో తాము సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నపుడు రాని అభ్యంతరం ఇపుడు ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం రాజకీయాలు చేయడానికి తాము సిద్ధమే అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ నాటకాలాడుతోందని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీకి వ్యతిరేకంగా ఇక ముందు కూడా ప్రచారం చేస్తామన్నారు. ఈ పనిలో ఉద్యోగం వదులుకోడానికైనా రెడీ అని అశోక్‌బాబు తేల్చి చెప్పారు. 

 

18:11 - May 9, 2018

హైదరాబాద్ : ఏపీ ఎన్జీవో నేత అశోక్‌బాబుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఓ రాజకీయపార్టీ తరపున ఎన్నికల్లో ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయవద్దని ఇటీవల అశోక్‌బాబు అయన బృందం ప్రచారం చేసిందని.. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. సర్వీస్‌రూల్స్‌కు విరుద్ధంగా అశోక్‌బాబు వ్యవహరిస్తున్నారని.. తగిన చర్యలు తీసుకోవాలని తాము గవర్నర్‌ను కోరామన్నారు. ఏపీ ఎన్జీవో నేతల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశామన్నారు. 

17:58 - May 9, 2018

హైదరాబాద్ : కిడ్నీ మార్పిడి వ్యవహారంలో టీవీ నటుడు బాలాజీపై ఓ మహిళ జూబ్లీహిల్స్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సినీనటి శ్రీరెడ్డితో కలిసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలాజీ భార్య కృష్ణవేణికి రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో .. ఆపరేషన్‌ అత్యవసరమైంది. దీంతో యూసుఫ్‌గూడ సమీపంలోని యాదగిరి నగర్‌లో నివసించే జూనియర్‌ ఆర్టిస్ట్‌  భాగ్యలక్ష్మిని బాలాజీ సంప్రదించగా.. కిడ్నీ ఇవ్వడానికి ఆమె అంగీకరించారు. గతేడాది జూన్‌లో భాగ్యలక్ష్మి కిడ్నీని ఇచ్చారు.  అయితే 20 లక్షలు ఇస్తానని చెప్పి ... అడ్వాన్స్‌గా రూ.3 లక్షలు ఇచ్చారని, మిగిలిన డబ్బు కోసం అడిగితే... తిడుతూ ఫోన్‌ పెట్టేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాగా పోలీస్టేషన్‌కు వచ్చిన బాలాజీ తన దగ్గర ఉన్న ఒప్పంద పత్రాలు, బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలను పోలీసులకు సమర్పించారు. భాగ్యలక్ష్మి నుంచి ఫిర్యాదు స్వీకరించామని, న్యాయపరమైన సలహా తీసుకొని కేసు నమోదు విషయాన్ని పరిశీలిస్తామని జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపారు. 

 

17:56 - May 9, 2018

విశాఖ : జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 2వేల కిలోమీటర్లకు చేరుకుంటున్న సందర్భంగా విశాఖ ఆపార్టీ నేతలు యాత్ర చేపట్టారు. గ్రేటర్‌ విశాఖ ఏరియాలో ఎంపీ విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణతోపాటు ఇతర వైసీపీ నేతలు పాదయాత్ర చేస్తున్నారు. యాత్రపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

అమరావతిలో కొనసాగుతున్న కలెక్టర్ల సమావేశం

గుంటూరు : అమరావతిలో సీఎం చంద్రబాబు.. కలెక్టర్లతో రెండోరోజూ సమావేశమయ్యారు. కలెక్టర్లతో సమావేశం కొనసాగుతుంది.

 

ఆర్టీసీ యాజమాన్యానికి టీజెఎంయూ సమ్మె నోటీసు

హైదరాబాద్ : ఆర్టీసీ యాజమాన్యానికి తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ సమ్మె నోటీసు ఇచ్చింది. ఈనెల 23 నుంచి ఏ క్షణమైనా సమ్మెకు సిద్ధమని టీజెఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు అన్నారు. వేతన సవరణ కోసం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.

ఆప్ఘనిస్తాన్ లో భూకంపం

కాబూల్ : ఆప్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.1 శాతంగా నమోదు అయింది. హిందూకుష్ పర్వతశ్రేణుల్లో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది.

 

నమస్తే తెలంగాణ ప్రభుత్వ కరపత్రిక : దాసోజు శ్రవణ్

హైదరాబాద్ : టీ.ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు పథకం తప్పులతడకగా ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. నమస్తే తెలంగాణ ప్రభుత్వ కరపత్రిక అని ఎద్దేవా చేశారు. నమస్తే తెలంగాణ ప్రతికలో నవంబర్ లో 45 లక్షల మంది రైతులు అని పేర్కొని...ఇప్పుడు 58 లక్షల మంది 
రైతులని రాశారని...అదనంగా 13 లక్షల మంది రైతులు ఎట్లా పుట్టుకొచ్చారో... కేసీఆర్ సృష్టించారా అని ప్రశ్నించారు. 

17:17 - May 9, 2018

హైదరాబాద్ : టీ.ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకం తప్పులతడకగా ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుబంధు పథకంలో వేలకోట్ల రూపాయల నిధులను టీఆర్‌ఎస్‌ నేతలకు పంచే కుట్రకు తెరతీశారని ఆరోపించారు. సమగ్రసర్వే ప్రకారం రాష్ట్రంలో ఉన్న వ్యవసాయభూమి లెక్కలకు.. రైతు బంధు పథకంలో లెక్కలకు భారీ తేడా ఉందన్నారు. అదనంగా 15లక్షల ఎకరాల భూమి ఉన్నట్టు చూపిస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కారు.. ప్రభత్వ సొమ్మును దోచుకోడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. పోడుభూములను సాగు చేసుకునే గిరిజనులకు రైతుబంధు పథకం వర్తించదని చెబుతున్న కేసీఆర్‌ ప్రభుత్వం.. మంత్రులు, గులాబీపార్టీ నేతలు, కాంట్రాక్టర్లలకు మాత్రం లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారని దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు. నమస్తే తెలంగాణ ప్రభుత్వ కరపత్రిక అని ఎద్దేవా చేశారు. నమస్తే తెలంగాణ ప్రతికలో నవంబర్ లో 45 లక్షల మంది రైతులు అని పేర్కొని...ఇప్పుడు 58 లక్షల మంది రైతులని రాశారని...అదనంగా 13 లక్షల మంది రైతులు ఎట్లా పుట్టుకొచ్చారో... కేసీఆర్ సృష్టించారా అని ప్రశ్నించారు. కోటి 24 లక్షల నుంచి కోటి 39 లక్షల ఎకరాలకు ఎలా పెరిగిందని నిలదీశారు. 

 

 

16:24 - May 9, 2018

గుంటూరు : వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. రోజా రాజకీయాలు మానుకుని సినిమాలు చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. రాజకీయాలంటే జబర్దస్తీ సీరియల్‌ కాదని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయాలంటే ఒక ఎంటర్‌టైన్‌ మెంట్‌గానే రోజా భావిస్తున్నారంటున్న ఆదినారాయణ రెడ్డితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. రాజకీయాలకు రోజా తగరని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబుపై నోటికి వచ్చినట్టు రోజా  మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
-

సినిమాలో అవకాశం ఆశచూపి నటుడు బాలాజీ

హైదరాబాద్ : సినిమాలో అవకాశం అంటూ ఆశచూపి.. ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ను దారుణంగా మోసం చేశాడో నటుడు బాలాజీ. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తన భార్యకు చికిత్స చేయించడానికి ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ నుంచి కిడ్నీ కొనడానికి బేరం కుదుర్చుకున్నాడు. కిడ్నీ ఇస్తే 20లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకుని ఆపరేషన్‌ తర్వాత 3లక్షలు మాత్రమే ఇచ్చారని బాధితురాలు వాపోతోంది. శ్రీరెడ్డితో కలిసి జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటికి వచ్చింది.  

 

16:15 - May 9, 2018

హైదరాబాద్ : సినిమాలో అవకాశం అంటూ ఆశచూపి.. ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ను దారుణంగా మోసం చేశాడో నటుడు బాలాజీ. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తన భార్యకు చికిత్స చేయించడానికి ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ నుంచి కిడ్నీ కొనడానికి బేరం కుదుర్చుకున్నాడు. కిడ్నీ ఇస్తే 20లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకుని ఆపరేషన్‌ తర్వాత 3లక్షలు మాత్రమే ఇచ్చారని బాధితురాలు వాపోతోంది. శ్రీరెడ్డితో కలిసి జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటికి వచ్చింది.  

 

15:51 - May 9, 2018

మెదక్ : మరికాసేపట్లో మెదక్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొననున్నారు. అయితే సభ నిర్వహణకు వర్షం ఆటంకంగా మారింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో సభ ప్రాంగణం చిత్తడిగా తయారైంది. నిరవదికంగా కురుస్తున్నవర్షంతో సభ ఏర్పాట్లకు ఇంకా పూర్తి కాలేదు.

మరికాసేపట్లో మెదక్‌ బహిరంగ సభ

మెదక్ : మరికాసేపట్లో మెదక్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొననున్నారు. అయితే సభ నిర్వహణకు వర్షం ఆటంకంగా మారింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో సభ ప్రాంగణం చిత్తడిగా తయారైంది. నిరవదికంగా కురుస్తున్నవర్షంతో సభ ఏర్పాట్లకు ఇంకా పూర్తి కాలేదు.

15:46 - May 9, 2018

పెళ్లిళ్ల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇదే అంశంపై ఇవాళ్టి మానవి మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. యువతీయువకులు వారికి నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు.,  ఎవరి పెళ్లి వారి ఇష్టం, స్వేచ్ఛగా వారి భాగస్వామిని ఎంచుకోవచ్చు' అని కోర్టు తీర్పు వెలువరించిందని ఆమె తెలిపారు. తల్లిదండ్రుల చూడాల్సిన బాధ్యత సంతానంపై ఉంటుందని తెలిపారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

15:38 - May 9, 2018

అనంతపురం : పార్థీ గ్యాంగ్‌...! కరడుగట్టిన నేరగాళ్ల ముఠా..! ఇప్పుడీ గ్యాంగ్‌.. అనంతపురం జిల్లా వాసులను హడలెత్తిస్తోంది. చీకటి పడితే చాలు.. ప్రజలు ముఖ్యంగా గ్రామీణులు గజగజ వణికిపోతున్నారు. కొన్ని చోట్ల.. ప్రజలే వంతులవారీగా కర్రలు, వేటకొడవళ్లు.. కారంపొడి చేతబట్టి.. పహారా కాస్తున్నారు.
అనంత ప్రజల్లో పార్థీ గ్యాంగ్‌ భయం
అనంతపురం జిల్లా వాసులను మూడు నాలుగు రోజులుగా పార్థీ గ్యాంగ్‌ భయం వెంటాడుతోంది. మారణాయుధాలతో సంచరించే ఈ ముఠా.. దొంగతనాలు, అత్యాచారాలు, హత్యల్లో ఆరితేరిన వారని స్థానికులు విశ్వసిస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా.. వేటకొడవళ్లు ధరించిన కొందరి ఫోటోలు జిల్లా అంతటా హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ముఠాలో మహిళలూ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో చీకటి పడితే చాలు జనం వణికిపోతున్నారు.
పామిడి, గుత్తి మండలాల్లో పార్థీగ్యాంగ్‌ సంచారం?
అనంతపురం జిల్లాలోని పామిడి, గుత్తి మండలాల్లో పార్థీ గ్యాంగ్‌ సంచారం విస్తృతంగా ఉందన్న ప్రచారం నేపథ్యంలో.. కొన్ని గ్రామాల్లో.. ప్రజలు సొంతంగానే రక్షణ చర్యలు చేపట్టారు. కర్రలు, కారంపొడి, వేటకొడవళ్లు చేతబట్టి.. వంతులవారీగా గస్తీకి దిగారు.
గౌతమాశ్రమం వైపు పార్థీగ్యాంగ్‌ పలాయనం?
గస్తీ సందర్భంగా.. సోమవారం అర్ధరాత్రి, తమకు పదిమంది సభ్యుల ముఠా కంటబడిందని.. వెంబడిస్తే గౌతమాశ్రమం వైపు పారిపోయారని.. గుత్తి సూరసింగనపల్లి గ్రామస్థులు చెబుతున్నారు. ముఠా సభ్యుడన్న అనుమానంతో ఓ వ్యక్తిని పట్టుకుని స్తంభానికి కట్టేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
ప్రజలు ఆందోళన 
ఇటీవలి వరకూ చిత్తూరు జిల్లాలో హల్‌చల్‌ చేసిన పార్థీ గ్యాంగ్‌ ఇప్పుడు అనంతపురం జిల్లాలో సంచరిస్తోందన్న వార్తలతో.. ఈ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు తక్షణ చర్యలు చేపట్టి.. ప్రజల భయాన్ని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 

15:22 - May 9, 2018

హైదరాబాద్ : హోర్డింగ్‌ల ఏర్పాటు విషయంలో జీహెచ్‌ఎంసీ దనదాహం నగరవాసులకు ప్రాణ సంకటంగా మారింది. యాడ్‌ ఏజెన్నీల లాభపేక్ష పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతతోంది. చిన్న గాలివీచినా  కూలిపోయే హోర్డింగ్‌లతో జనం బెంబేలెత్తున్నారు. ఫ్లెక్సీలు చినిగిపోయి రోడ్లు, విద్యుత్‌ లైన్లపై పడి ప్రమాదకరంగా మారుతున్నాయి. జంటనగరల్లో కొద్దిపాటి గాలికే కుప్పకూలుతున్న హోర్డింగ్‌లపై 10 టీవీ ప్రత్యేక కథనం. 
నాసిరకం హోర్డింగ్‌లు 
జంటనగరాల్లో హోర్డింగ్‌ల ఏర్పాటులో ప్రమాణాలు పాటించడంలేదు. యాడ్‌ ఏజెన్సీలు ఏర్పాటు చేస్తున్న నాసిరకం హోర్డింగ్‌లు ప్రమాదకరంగా మారుతున్నాయి. చిన్న గాలి వీస్తేనే ఒంగిపోతున్నాయి. పెనుగాలుకు కూప్పకూలి జనం మీద పడే ప్రమదకర పరిస్థితులు నెలకొన్నాయి. 
భయపడుతున్న ప్రజలు 
వర్షం వస్తే హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో నడవాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఎప్పుడు హోర్డింగ్‌ కూలిపోతుందో తెలియని పరిస్థితి. హోర్డింగ్‌లు పెట్టే ఆర్చ్‌లు మరీ ప్రమాదకరంగా మారి, జనం గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. ఫ్లెక్సీలు చినిగిపోయి కొన్ని సందర్భాల్లో విద్యుత్‌ లైన్లపై పడుతున్నాయి. 
భారీ సంఖ్యలో అధికార, అనధికార హోర్డింగ్‌లు  
జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికార, అనధికార హోర్డింగ్‌లు భారీ సంఖ్యలో ఉన్నాయి. బల్దియా అనుమతితో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు 2,651 ఉన్నాయి. మరో 333 అక్రమ హోర్డింగ్‌లు ఏర్పాటయ్యాయి. వీటిని ఏర్పాటు చేసిన ఏజెన్సీలు ప్రతి ఏటా హోర్డింగ్‌ పటిష్టతపై జీహెచ్‌ఎంసీకి ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. వెయ్యి హోర్డింగ్‌లకు  ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఇవ్వలేకపోవడంపై విమర్శులు వెల్లువెత్తుతున్నాయి. ఈ హోర్డింగ్‌ల ద్వారా జీహెచ్‌ఎంసీ అంచనా వేసిన విధంగా ఆదాయం రాకపోవడం లేదని చెబుతున్నారు. హోర్డింగ్‌ల పటిష్టతపై జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి, ప్రజల ప్రాణాలకు ముప్పువాటిల్లకుండా చూడాలని కోరుతున్నారు. 

 

15:15 - May 9, 2018

ఢిల్లీ : బద్రినాథ్‌లో చిక్కుకున్న తెలుగువారంతా క్షేమంగా ఉన్నారని ఏపీ భవన్‌ ఓఎస్‌డీ మట్టా రామారావు తెలిపారు. చమోలి ఎస్పీతో మాట్లాడినట్టు చెప్పారు. ప్రస్తుతం బద్రీనాథ్‌లో వాతావారణం బాగానే ఉందని... యాత్రికులంతా జోషిమట్‌ వెళ్లడానికి సిద్ధమైనట్టు తెలిపారు. నిన్న వాతావరణం అనుకూలించకపోవడంతో రాకపోకలు నిలిపివేశారని ఆయన చెప్పారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో యాత్రికులు తిరుగుపయనం అవుతున్నట్టు ఆయన తెలిపారు.

 

15:03 - May 9, 2018

బెంగళూరు : కర్నాటక ఎన్నికల్లో ప్రచారం హోరెత్తుతోంది. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అనంతపురం జిల్లాకు బార్డర్‌లో ఉన్న చిక్‌ బళాపూర్‌ జిల్లా బాగేపల్లి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఇక్కడ సీపీఎం ... మాజీ ఎమ్మెల్యే శ్రీరాంరెడ్డిని బరిలో నిలిపింది. సీపీఎం అభ్యర్థి శ్రీరాంరెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి సీపీఎం అభ్యర్థి శ్రీరాంరెడ్డి గట్టిపోటీ నిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని చెప్తోన్న శ్రీరాంరెడ్డితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని శ్రీరాంరెడ్డి అన్నారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

14:57 - May 9, 2018

కృష్ణా : జిల్లాలోని మైలవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సహకార కేంద్ర బ్యాంక్ ప్రారంభోత్సవంలో ఎంపి కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఘర్షణకు దారి తీశాయి. బ్యాంక్‌ ప్రారంభోత్సవంలోను ఇతర పార్టీలను విమర్శించడం ఏంటని మరో వర్గం వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

 

అక్రమ ఆయుధాల కేసులో భానుకిరణ్ కు ఏడాది జైలు శిక్ష

హైదరాబాద్ : అక్రమ ఆయుధాల కేసులో భానుకిరణ్ కు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. కోర్టు భానుకిరణ్ కు రూ.10 జరిమానా విధించింది. 2009లో భానుకిరణ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మద్దెలచెరువు సూరి హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. 

 

13:32 - May 9, 2018

చిత్తూరు : వారం రోజుల పాటు కొనసాగే గంగమ్మ జాతర ప్రారంభమైంది. తాతయ్యగుంట గంగమ్మదేవత జన్మదినమైన చిత్రినెల చివరి వారంలో గంగమ్మ ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీనివాసుని సోదరిగా పేరుగాంచిన గంగమ్మతల్లికి ఉత్సవాలు నిర్వహించడానికి తిరునగరిలో ప్రజలు సిద్ధమయ్యారు. మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో జాతర ప్రారంభమైంది. రోజుకో వేషంలో దర్శనమిచ్చే అమ్మవారిని చూసేందుకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. రకరకాల వేషాలు ధరించే భక్తులు అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటారు. తిరుపతి గ్రామ దేవతగా కొనియాడే గంగమ్మ,.కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ది గాంచింది. వేషాల్లో తొలిగా ప్రారంభమైంది బైరాగివేషం. శరీరమంతా నాముకొమ్ము రాచుకుని, వేపమండలు చేతధరిస్తుంటారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:22 - May 9, 2018

కరీంనగర్ : విపక్షాలకు ఒక విజన్ అంటూ లేదని..ప్రజా సమస్యలపై అవగాహన లేదని మంత్రి ఈటెల రాజేందర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'రైతు బంధు' కార్యక్రమం హుజురాబాద్ నుండి ప్రారంభం కానుంది. ఇందుకోసం భారీ బహిరంగసభ నిర్వహించనుంది. సభ ఏర్పాట్లు చూసేందుకు మంత్రి ఈటెల రాజేందర్ జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రితో టెన్ టివి మాట్లాడింది. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా 'రైతు బంధు' పథకం చేపట్టినట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి ఇవ్వడమే కాకుండా సాగునీరందిచేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇక విపక్షాల ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఇంకా ఎలాంటి విషయాలు మాట్లాడారో వీడియోలో చూడండి. 

జూబ్లిహిల్స్ లో బాలికపై అత్యాచారం..

హైదరాబాద్ : జూబ్లిహిల్స్ రెహమత్ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలికపై లోకేష్ అనే 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. కేసు పెట్టొద్దని బాలిక తల్లిదండ్రులకు స్తానిక టీఆర్ఎస్ నేత షరీఫ్ బెదిరింపులకు దిగాడు. బాలిక తల్లి..తండ్రి..తమ్ముడిని ఇంట్లో నిర్భంధించి షరీఫ్ అనుచరులు వాతలు పెట్టారు. 

ఉద్యోగాల పేరిట మోసం...

హైదరాబాద్ : ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సీఎం దగ్గర పనిచేస్తున్నామంటూ నకిలీ ఐడీ కార్డులు చూపుతూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని ఎస్ వోటి పోలీసులు అరెస్టు చేశారు. 

ఉద్యోగాల పేరిట మోసం...

హైదరాబాద్ : ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సీఎం దగ్గర పనిచేస్తున్నామంటూ నకిలీ ఐడీ కార్డులు చూపుతూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని ఎస్ వోటి పోలీసులు అరెస్టు చేశారు. 

దివ్యాంగురాలిపై అత్యాచారం...

కర్నూలు : డోన్ (మం) కోచెరువులో దారుణం చోటు చేసుకుంది. దివ్యాంగురాలిపై ఇద్దరు యువకులు ఆత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరూలేని సమయంలో బాలిక ఇంట్లోకి ప్రవేశించిన నిందితులు ఆత్యాచారానికి పాల్పడ్డారు. 

13:11 - May 9, 2018

బెంగళూరు : కర్నాటకలో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరింది. గురువారంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీనితో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్..బిజెపి..జేడీఎస్ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదిలా ఉంటుండగానే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఈసీ పలు ప్రాంతాల్లో తనిఖీలు..సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరులో పదివేలకు పైగా ఓటర్ల కార్డులు బయటపడడం కలకలం రేపింది. ఇవి నకిలీ ఓటర్ల కార్డులని తెలుస్తోంది. కర్నాటకలో పాగా వేసేందుకు బిజెపి వ్యూహాలు రచిస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:35 - May 9, 2018

ధర్మవరంలో లక్ష్మీనారాయణ పర్యటన...

అనంతపురం : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాష్ట్ర పర్యటన కొనసాగుతోంది. బుధవారం ధర్మవరం చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. 

ఓటుకు నోటు..బాబుపై చర్యలేవి - భూమన...

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెండ్ గా దొరికిపోయినా చంద్రబాబుపై చర్యలు లేవని వైసీపీ నేత భూమన మండిపడ్డారు. నిజమైన దోషులను బయటకు తీయాలని, బాబుపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలున్నాయ్నారు. 

ఓటుకు నోటు..బాబుపై చర్యలేవి - భూమన...

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెండ్ గా దొరికిపోయినా చంద్రబాబుపై చర్యలు లేవని వైసీపీ నేత భూమన మండిపడ్డారు. నిజమైన దోషులను బయటకు తీయాలని, బాబుపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలున్నాయ్నారు. 

ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం ?

కర్నాటక : ఎన్నికల ప్రచారం గురువారంతో ముగియనుంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లు హోరాహోరిగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరోవైపు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పలు పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

11:57 - May 9, 2018

కర్ణాటకలో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందా ? బీజేపీకి భంగపాటు తప్పదా ? జేడీఎస్‌ మూడో స్థానంలో సరిపెట్టుకుంటుందా ? ఇప్పటికే 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి కర్ణాటక ఓటర్లు షాకివ్వనున్నారా ? బెంగళూరలోని పాత మైసూర్ ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా అక్కడి స్థానిక నేతలతో టెన్ టివి ముచ్చటించింది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:04 - May 9, 2018

విజయవాడ : ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈ నాలుగేళ్లలో జరిగిందని, సమిష్టి కృషి..అందరి కృషి భాగస్వామ్యంతోనే ఇది జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్లనుద్దేశించి ఆయన మాట్లాడారు. సంక్షోభంంలోనూ సవాళ్లను అధిగమిస్తూ అభివృద్ధి సాధించడం జరిగిందని, ఇదే స్పూర్తిని కొనసాగించాలని బాబు సూచించారు. 

10:48 - May 9, 2018

హైదరాబాద్ : బీటెక్‌ చదువుకుంది.. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది.. అయితే ఆ పెళ్లి ఇష్టం లేదన్న కోపంతో... స్కెచ్‌ వేసి... సుపారీ ఇచ్చి మరీ భర్తను మట్టుబెట్టించింది. చివరకు ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా గురుగుబిల్లి మండలం తోటపల్లి ఐటీడీఏ ఉద్యానవనం దగ్గర్లో సోమవారం జరిగిన నవదంపతులపై దాడి ఘటన ఊహించని మలుపు తిరిగింది. ఇష్టం లేని పెళ్లి చేశారన్న కోపంతో.. భార్య సరస్వతే.. భర్త శంకరరావును హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చిట్టపులివలస గ్రామానికి చెందిన శంకరరావుకు.. ఇదే మండలం కడకెల్ల గ్రామానికి చెందిన సరస్వతితో ఏప్రిల్‌ 28న పెళ్లయింది. అయితే ఆ పెళ్లి ఇష్టం లేని సరస్వతి.. భర్తను కడతేర్చేందుకు స్నేహితుడు శివ సహకారంతో.. రౌడీషీటర్‌ గోపి ముఠాను సంప్రదించింది. సుపారీ అడ్వాన్స్‌గా ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ను ఇచ్చింది. అలా పక్కా పథకంతో భర్తను కడదేర్చింది.

సోమవారం నవదంపతులు.. మోటార్‌బైక్‌ బాగు చేయించుకునేందుకు పార్వతీపురం వచ్చారు. పనిలో పనిగా బంగారు దుకాణంలో నగల లావాదేవీలు ముగించుకున్నారు. రాత్రి ఎనిమిది తర్వాత స్వస్థలం చిట్టపులి వలసకు బయలుదేరారు. ఈ మధ్యలో ఐటీడీఏ పార్క్‌ దాటాక వెనుక నుంచి వచ్చిన దుండగులు శంకరరావు తల వెనుక వైపు నుంచి రాడ్‌తో బలంగా కొట్టారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. సరస్వతి నుంచి బంగారాన్ని తీసుకువెళ్లారు.

మొదట్లో స్వర్ణాభరణాల కోసమే నవదంపతులపై దాడి జరిగిందని పోలీసులు భావించారు. అయితే.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సరస్వతిని అనేక కోణాల్లో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇష్టం లేని పెళ్లి చేశారన్న కోపంతో భర్తనే కడదేర్చే పన్నాగం పన్నిందని వెల్లడైంది. సరస్వతి స్నేహితుడు శివతో పాటు, రౌడీషీటర్‌ గోపి ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉన్నత చదువు చదివి.. విచక్షణ కోల్పోయి భర్తనే హత్యచేయించిన సరస్వతి.. ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తోంది. 

10:23 - May 9, 2018

ఢిల్లీ : ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న శ్రీకాకుళం, విశాఖ యాత్రికులు క్షేమంగా ఉన్నారు. వాతావరణం అనుకూలించడంతో చార్ ధామ్ నుండి యాత్రికుల వాహనాలు బయలుదేరాయి. ఎడతెరిపి లేని మంచు వర్షంతో 104 మంది తెలుగు యాత్రికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. అందులో ఉపాధి హామీ పనులను పరిశీలించడానికి వెళ్లిన శ్రీకాకుళం జడ్పీ ఛైర్మన్ చౌదరి ధనలక్ష్మీ నేతృత్వంలోని 39 మంది సభ్యుల బృందం కూడా చిక్కుకుంది. వీరితో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫోన్ లో మాట్లాడారు. అక్కడ నెలకొన్న పరిస్థితిని ఏపీ అదనపు కమిషనర్, టిడిపి పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టడం..వాతావరణం అనుకూలించడంతో వీరంతా ఏపీకి బయలుదేరారు. 

అద్భుతాలు సృష్టించవచ్చు - బాబు...

విజయవాడ : రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. టూరిజం, ఇండస్ట్రీ, ఐటీ శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. నిరంతర శ్రమతో విజయాలు సాధ్యమని, కాస్త మనస్సు పెడితే అద్భుతాలు సాధించవచ్చన్నారు. దేశంలో ఉత్తమ ఫలితాలు సాధించిన టీమ్ మనదేనన్నారు. ధనిక రాష్ట్రాలు కూడా కార్యక్రమాలు చేయలేకపోయాయన్నారు. 

జనసేనాని మరో యాత్ర...

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోమారు ఏపీ యాత్రకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాలను కలిపేలా యాత్రకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

రెండో రోజు కలెక్టర్ల సదస్సు...

విజయవాడ : అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. సీఎ చంద్రబాబు నాయుడు వివిధ అంశాలపై వారితో చర్చిస్తున్నారు. 

09:15 - May 9, 2018

శ్రీకాకుళం : ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ లో మంచు వర్షంలో చిక్కుకపోయిన తామంతా సేఫ్ గా ఉన్నామని సిక్కోలు జడ్పీ ఛైర్ పర్సన్ ధనలక్ష్మీ పేర్కొన్నారు. ఉపాధి హామీ పనుల నిమిత్తం అక్కడకు వెళ్లిన జడ్పీ బృందం మంచు వర్షంలో చిక్కుపోయిన సంగతి తెలిసిందే. 104 మందిలో 39 మంది సిక్కోలు జడ్పీటీసీలు, అధికారులు సురక్షితంగా ఉన్నారు. మిగతా 65 మంది ఆచూకి తెలియాల్సి ఉన్నట్లు సమాచారం. తామంతా సేఫ్ గా ఉన్నామని సిక్కోలు జడ్పీ ఛైర్ పర్సన్ ధనలక్ష్మీ టెన్ టివితో తెలిపారు. మంచు వర్షం భారీగా కురవడంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యాయమని తెలిపారు. ప్రస్తుతం తామంతా క్షేమంగా ఉన్నామని పేర్కొన్నారు. 

చార్ ధామ్ బాధితులతో మాట్లాడిన ఎంపీ...

విజయవాడ : ఉత్తరాఖండ్ చార్ ధామ్ లో మంచు వర్షంలో శ్రీకాకుళంకు చెందిన 39 మంది జడ్పీటీసీలు, అధికారులు చిక్కుపోయారు. సమాచారం తెలుసుకున్న ఏపీ భవన్ అడిషనల్ కమిషనర్ శ్రీకాంత్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులతో ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. 

నల్గొండలో పెళ్లి బృందానికి ప్రమాదం...

నల్గొండ : నార్కట్ పల్లి - అద్దంకి రహదారిపై వల్లభరావు చెరువు సమీపంలో లారీని పెళ్లి బస్సు ఢీకొంది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒంగోలు నుండి హైదరాబాద్ కు పెళ్లి బస్సు వస్తోంది. 

ఓ ఇంట్లో 9746 ఓటర్ కార్డులు...

కర్నాటక : బెంగళూరులోని ఎస్ఎల్ వి పార్కు వ్యూ అపార్ట్ మెంట్ లోని ఓ ఇంట్లో 9746 ఓటర్ కార్డులు బయటపడడం కలకలం రేపుతోంది. రిటర్నింగ్ అధికారి..ఇతర అధికారులు ఘటనా ప్రదేశానికి వెళ్లారు. 

08:31 - May 9, 2018
08:31 - May 9, 2018

ఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారం ఊపందుకుంది. విజయపురి ఎన్నికల సభలో ప్రసంగించిన యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ- మోదీ పాలనపై ధ్వజమెత్తారు. మోదీకి 'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌' భూతం పట్టుకుందని విమర్శించారు. మోదినీ మంచి వక్తగా పేర్కొన్న సోనియా...ఉపన్యాసాలు కడుపు నింపవన్నారు. ఉపన్యాసాలతో కడుపులు నిండుతాయనుకుంటే మోది మరిన్ని ఉపన్యాసాలివ్వవచ్చని సూచించారు. మోది హయాంలో ధరలు ఆకాశాన్నంటాయని పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగిపోతుండడంపై సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం కృషి చేసిందని చెప్పారు. సోనియాగాంధీ రెండేళ్ల తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

 

08:15 - May 9, 2018

ఢిల్లీ : ఉత్తరాఖండ్ చార్ ధామ్ లో విపరీతమైన మంచు వర్షం కురుస్తోంది. దీనితో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన యాత్రికులు చిక్కుకపోయారు. అందులో ఏపీకి రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన 39 మంది జడ్పీ బృందం చిక్కుకపోయారు. ఉపాధి హామీ పనుల పరిశీలనకు ఈనెల 3న ఉత్తరాఖండ్ కు వీరు వెళ్లారు. జడ్పీ ఛైర్మన్ చౌదరి ధనలక్ష్మీ నేతృత్వంలో బృందం బయలుదేరింది. మంచు వర్షం కారణంగా సీతాపురిలో వీరంతా చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భోజనాలు లేకుండా చలిలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఏపీ భవన్ అడిషనల్ కమిషనర్ శ్రీకాంత్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చార్ ధామ్ బస్టాండ్ దగ్గర బస్ షెల్టర్ లో 65 మంది బస చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

మంచువర్షంలో చిక్కుకున్న సిక్కోలు యాత్రికులు...

ఢిల్లీ : శ్రీకాకుళం జిల్లా నుండి చార్ ధామ్ యాత్రకు వెళ్లిన 104 మంది భక్తులు చిక్కుకున్నారు. మంచు వర్షం పడడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

07:30 - May 9, 2018

కర్ణాటక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గురువారం నాటితో ప్రచారానికి సమాప్త కానుంది. ఈ నేపథ్యంలో అధికార..ప్రతిపక్షాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ప్రజలు ఓడిస్తారని ప్రధాని నరేంద్రమోది అనగా.. విజయపురి ఎన్నికల సభలో ప్రసంగించిన యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ - మోదీ పాలనపై ధ్వజమెత్తారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), ఎన్ వి సుభాష్ (బిజెపి), రామ శర్మ (ఏపీ కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

మెదక్ జిల్లాకు వెళ్లనున్న కేసీఆర్...

హైదరాబాద్ : మెదక్ జిల్లాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. కలెక్టర్ భవన సముదాయానికి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. 

భద్రినాథ్ లో మంచు వర్షం...

ఢిల్లీ : ఉత్తరాఖండ్ భద్రినాథ్ లో ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తోంది. 104 మంది యాత్రికులు చిక్కుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఎక్సైజ్ శాఖ అధికారులపై దాడి...?

చిత్తూరు : గుడిపాల (మం) రాసనపల్లి వద్ద ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారులపై సారా తయారీదారులు ఎదురు దాడి నిర్వహించినట్లు సమాచారం. 

కరీంనగర్ కు కేసీఆర్...

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రోజు ముందు జిల్లాకు రానున్నారు. మెదక్ జిల్లా పర్యటన ముగించుకున్న కరీంనగర్ కు వెళ్లనున్నారు. రాత్రి అక్కడనే బస చేయనున్న కేసీఆర్ గురువారం రోడ్డు మార్గం ద్వారా హుజూరాబాద్ చేరుకుని రైతు బంధు పథకాన్ని ప్రారంభించనున్నారు.

కరీంనగర్ కు కేసీఆర్...

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రోజు ముందు జిల్లాకు రానున్నారు. మెదక్ జిల్లా పర్యటన ముగించుకున్న కరీంనగర్ కు వెళ్లనున్నారు. రాత్రి అక్కడనే బస చేయనున్న కేసీఆర్ గురువారం రోడ్డు మార్గం ద్వారా హుజూరాబాద్ చేరుకుని రైతు బంధు పథకాన్ని ప్రారంభించనున్నారు.

జగన్ 157వ పాదయాత్ర...

కృష్ణా : వైసీపీ అధ్యక్షుడు చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 157వ రోజుకు చేరుకుంది. ముదినేపల్లి నియోజకవర్గం నుండి బుధవారం పాదయాత్ర కొనసాగనుంది. పెయ్యేరు, డాకరాం క్రాస్, కనుకొల్లు, పుట్ల చెరువు క్రాస్ మీదుగా పాదయాత్ర జరుగనుంది. 

07:11 - May 9, 2018

ఆంధ్రప్రదేశ్‌లో వీఆర్‌వోలు ఆందోళన బాట పట్టారు. నిజానికి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తూ.. అనుసంధాన కర్తలుగా వీఆర్‌వోలు చాల కీలక పాత్ర వహిస్తున్నారు. కానీ వారు సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని తమపై పనిభారం పెరిగిందని తాము ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నామని తమకు పదోన్నతలు కల్పించడం లేదని వీఆర్‌వోలు వాపోతున్నారు. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో వీఆర్‌వో సంఘం నాయకులు ఎం.సత్యనారాయణ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:07 - May 9, 2018

కామారెడ్డి : జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. కొందరు నియమ నిబంధనలను తుంగలో తొక్కి.. అక్రమాలకు పాల్పడుతున్నారు. కబ్జా చేసిన భూముల్లో వెంచర్లు వేస్తున్నారు. అధికార పార్టీ నేతలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కుమ్మక్కై మోసాలకు తెగబడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. కామారెడ్డి జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నియమ నిబంధనలను గాలికి వదిలేసి.. అమాయక ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డి చుట్టుపక్కల గ్రామాల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. బిక్కనూరు, సదాశివనగర్, దోమకొండ మండలాల్లో వందలాది ఎకరాల భూముల్లో ప్లాట్లు వేశారు. ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో గత పదేళ్లుగా లెక్కలేనన్ని వెంచర్లు వెలిశాయి. బాన్సువాడలోనూ ఇటీవల రియల్ దందా ఊపందుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి... ఆకర్షణీయమైన బ్రోచర్లతో అమాయక ప్రజలను బుట్టలో వేసుకుంటున్నారు.

రియల్టర్లు ఎక్కువ కమీషన్ ఇస్తామని ఆశపెట్టడంతో.. ఏజెంట్లు పెద్దఎత్తున జనంతో డబ్బు కట్టిస్తున్నారు. కబ్జా చేసిన భూములను ఆకర్షణీయంగా తయారు చేసి మాయ చేస్తున్నారు. బ్రోచర్లలో మాత్రం నియమ బంధనలు, సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నా... ఆచరణలో మాత్రం ఏ ఒక్కటీ పాటించరు. డబ్బు మొత్తం వసూలు చేశాక.. కొందరికి మాత్రమే ప్లాట్లు రిజిస్ర్టేషన్ చేయించి.. మిగతా వారికి మొండి చేయి చూపిస్తున్నారు. పలు వెంచర్లలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా గస్వాములుగా ఉన్నారు. భాగస్వాముల మధ్య ఇటీవల విబేధాలు తలెత్తాయి. వారి లెక్కల పంచాయితీ కోర్టు దాకా వెళ్లింది. దీంతో వందలాది మంది సభ్యులు చిక్కుల్లో పడ్డారు. రియల్టర్ల మోసాల వెనుక అధికార పార్టీనేతల హస్తముందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించి ప్లాటు కొనే స్తోమత లేని మధ్యతరగతి ప్రజలు ఇలాంటి స్కీంలకు ఆకర్షితులౌతున్నారు. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు రియల్టర్లు బరితెగిస్తున్నారు. నెలా నెలా డబ్బు కట్టించుకుని.. తీరా గడువు ముగిశాక ప్లాట్లు ఇవ్వకుండా చేతులెత్తేస్తున్నారు. తమకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా... క్రమం తప్పకుండా డబ్బు చెల్లించిన వారంతా.. తమకు ప్లాట్లు ఇవ్వాలని ఏజెంట్లు, రియల్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజల సొమ్ము దోచుకున్న రియల్టర్లు మాత్రం దర్జాగా ఏసీ కార్లలో తిరుగుతూ.. ఎంజాయ్‌ చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వసూలు చేసిన రియల్టర్లు చేతులేత్తేయడంతో.. బాధితులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 

07:04 - May 9, 2018

కర్నూలు : జిల్లాలో మార్కెట్‌ యార్డ్‌లోని కొనుగోలు కేంద్రాలు అవినీతి కేంద్రాలు మారాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తడిసిన ధాన్యం కొనడానికి వెయ్యీ, రెండువేలూ లంచం అడుగుతున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. నందికొట్కూరులోని మార్కెట్‌ యార్డ్‌లో అధికార పార్టీ సిఫార్సు ఉన్న వారి ధాన్యాన్నే కొంటున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జిల్లాలో మార్కెట్‌ యార్డులు అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నందికొట్కూరు పట్టణంలో ఇటీవల కురిసిన శెనగలు, కందులు తడిసిపోయాయి. ఇక్కడ అధికార పార్టీ నేతలు సిఫార్సు చేసిన రైతుల ధాన్యమే కొంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రేయీ పగలు నిద్రాహారాలు మాని రైతాంగం పడిగాపులు కాస్తుంటే.. అధికార పార్టీకి చెందిన వారి ధాన్యమే కొనుగోలు చేయడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డులో తడిసి మొలకెత్తిన శెనగలు, కందులు మార్కఫెడ్ ద్వారా ప్రభుత్వం తప్పకుండా కొనుగోలు చేయకుంటే.. ఆందోళన చేపడతామని రైతు విభాగం నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ కేవలం అధికార పార్టీ నేతల కోసమే.. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఉందని విమర్శిస్తున్నారు.

నందికొట్కూరులోని కొనుగోలు కేంద్రం అవినీతిలో ముందు వరసలో ఉందన్న ఆరోపణలు వినిస్తున్నాయి. రైతుల వద్ద వెయ్యి, రెండు వేలు రూపాయలు వసూలు చేయడం దారుణమని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోక పోవడం దారుణమన్నారు రాష్ట్ర రైతు విభాగం నాయకులు భరత్ రెడ్డి . నందికొట్కూరు మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంపై విచారణ చేపట్టాలని రాష్ట్ర రైతు విభాగం నాయకులు జగన్నాథం డిమాండ్ చేశారు. కేఈ కృష్ణమూర్తి ఫోన్ చేస్తేనే కొనుగోలు చేస్తున్నారని... ఇలాంటి దారుణం ఎక్కడా చూడలేదన్నారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు జగన్నాధం. అవినీతి కేంద్రాలుగా మారిన కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే.. ఉధృతంగా ఉద్యమిస్తామని రైతులు, ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. 

07:00 - May 9, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా మణుగూరులో జెన్‌కో చైర్మన్‌ ప్రభాకర్‌రావుకు చేదు అనుభవం ఎదురైంది. మణుగూరు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం భూ నిర్వాసితులు ప్రభాకర్‌రావును అడ్డుకున్నారు. పవర్‌ ప్లాంట్‌కు భూములిచ్చిన తమకు పరిహారం సరిగా చెల్లించలేదంటూ నిలదీశారు. ఇదే విషయంలో కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్న మరికొందరు రైతులు.. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొందామని సూచించారు. అయితే జెన్‌కో చైర్మన్‌ పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్మాణంలో ఉన్న భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పనులను జెన్‌కో చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా పవర్‌ ప్లాంట్‌ నిర్వాసితులు పరిహారం చెల్లింపు విషయంలో జరిగిన అన్యాయాన్ని ఆయన దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. భూములు బలవంతంగా లాక్కొని తక్కువ పరిహారం చెల్లించడంతో కొందరు రైతుల కోర్టుకెక్కారు. ఇదే విషయాన్నిసామరస్య పూర్వకంగా పరిష్కరించుకొందామని రైతులు సూచించినా.. జెన్‌కో చైర్మన్‌ పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భద్రాద్రి విద్యుత్‌ ప్లాంట్‌ కోసం బలవంతంగా భూములు లాక్కోవడంతో భుక్తి కోల్పోయామని అన్నదాతలు ఆవేదన వెలిబుచ్చారు. సమస్యలు చెప్పుకొందామని వచ్చిన తమను జెన్‌కో చైర్మన్‌ ప్రభాకర్‌రావు పట్టించుకోలేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెన్‌కో చైర్మన్‌ ప్రభాకర్‌రావు తమను చలకనగా చూశారని భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం భూ నిర్వాసితులు బాధపడ్డారు. మరోవైపు భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయంటూ జెన్‌ కో సీఎండీ ప్రభాకర్‌రావు అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. 

06:57 - May 9, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓటుకు నోటు కేసును తెరపైకి తీసుకురావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాజకీయ ఆధిపత్యం కోసమా... ఎన్నికల వ్యూహమా.. అన్న అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. మూడేళ్లుగా ఈ కేసు విచారణ సాగుతున్నా....ఏసీబీ కేసుల సమీక్షతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. విపక్షాలను తన వ్యూహాలతో ఇరుకున పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో సారి ఓటుకు నోటు కేసును తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోంది. ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువు ఉండడంతో....అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కేసీఆర్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో పాటు....ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇబ్బందులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

నాలుగేళ్ల క్రితం అధికార పగ్గాలు దక్కించుకున్న టీఆర్‌ఎస్‌.. గత కాంగ్రెస్ హయాంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ పథకంలో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో....కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకం అమలు చేసిన సమయంలో.. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గృహనిర్మాణ శాఖ మంత్రిగా వ్యవహరించారు. దీంతో ఇప్పుడు ఈ కేసుకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ రేవంత్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇద్దరు కూడా ఏసీబీ కేసుల విచారణ వేగవంతంతో ఆత్మరక్షణలో పడేలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇది రాజకీయ కక్ష సాధింపు అన్నది కాంగ్రెస్‌ నేతల వాదన. అయితే అధికార టీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం దీనిని తొసిపుచ్చుతున్నారు. రాజకీయంగా ఇది కక్ష సాధింపు కానే కాదని అధికార పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పెండింగ్ కేసులపై జరిగిన సమీక్షలో భాగంగానే ఈ కేసులు తెరపైకి వచ్చాయన్న వాదాన్ని వినిపిస్తున్నారు.

మొత్తం మీద కేసిఆర్ కదిపిన ఏసీబీ కేసుల తేనెతుట్టె తెలుగు రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి పొలిటికల్ వార్ తీవ్రం అయ్యేలా చేసింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తో పాటు ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డికి ఇబ్బందులు తలెత్తే కనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా రాజకీయంగా ఇబ్బందికర పరిణామంగానే భావిస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌కు మరో అస్త్రం తెలంగాణ ప్రభుత్వం అందించినట్లయింది.

కొనసాగనున్న కలెక్టర్ల సదస్సు...

విజయవాడ : అమరావతిలో ఏపీ రాష్ట్ర కలెక్టర్ల సదస్సు రెండో రోజు కొనసాగనుంది. మంగళవారం నాడు సదస్సు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సదస్సుల్లో పలు అంశాలపై చర్చించనున్నారు. 

Don't Miss