Activities calendar

10 May 2018

22:09 - May 10, 2018

ఢిల్లీ : మార్క్సిజం అంటే అభివృద్ధికి మూలసూత్రం... మార్క్సిజం అంటే పోరాట ఆలోచనా విధానం.. మార్క్సిజం అంటే  క్యాపిటలిజం వెనుక ఉన్న అసత్యాన్ని నిలదీస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 'ఆసియాఖండం- భారత్‌లో మార్క్సిజం అవసరం ' అనే అంశంపై ఢిల్లీలో జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. అస్ట్రో ఫిజిక్స్‌ నుంచి నానో టెక్నాలజీ వరకు ప్రపంచం సాధిస్తున్న అభివృద్ధి వెనుక మార్క్సిజం ఇమిడి ఉందన్నారు.  ఒకప్పుడు ఆసియా జబ్బుమనిషిగా పేరుపడి.. అత్యంత వెనుకబడిన దేశంగా ఉన్న చైనా.. మార్క్సిజం బాటలో నడిచి నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించిందన్నారు.

 

22:05 - May 10, 2018
22:03 - May 10, 2018

బెంగళూరు : కర్ణాటకలో హోరా హోరీగా సాగిన ఎన్నికల ప్రచార హోరు ముగిసింది. చివరి రోజున ప్రధాన పార్టీలు బిజెపి, కాంగ్రెస్‌, జెడిఎస్‌లు ఉధృతంగా ప్రచారం చేశాయి. ఈ ఎన్నికల్లో విజయం తమదేనంటూ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలు ధీమా వ్యక్తం చేశాయి. ఈ నెల 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు గత నెలరోజుల పాటు హోరా హోరీగా సాగిన ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. చివరిరోజున గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ, బిజెపితో పాటు జెడిఎస్‌ పోటా పోటీగా ప్రచారాన్ని సాగించాయి. రోడ్‌షోలు, మీడియా సమావేశాలతో బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు హోరెత్తించాయి. 

కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను 223 సీట్లకు మే 12న పోలింగ్‌ జరగనుంది. బిజెపి అభ్యర్థి మృతితో ఓ స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. మే 15న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 

ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కర్ణాటకలో 4 కోట్ల 96 లక్షల ఓటర్లున్నారు. ఇందుకోసం 56 వేల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళలకు 600 కేంద్రాలు... దివ్యాంగులు, ఇతరులకు 28 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి సంజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో వీవీపాట్‌ యంత్రాలతో పాటు ఈవీఎంలను వినియోగించనున్నారు.

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటామన్న ధీమాతో ఉంది. మోది మేజిక్‌తో అధికారం తమనే వరిస్తుందని బిజెపి చెబుతోంది. సర్వేలు మాత్రం కర్ణాటకలో హంగ్‌ తప్పదని జోస్యం చెప్పాయి. కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, ప్రభుత్వ ఏర్పాటులో జెడిఎస్‌ కింగ్‌మేకర్‌గా చక్రం తిప్పుతుందని సర్వేలు వెల్లడించాయి. కొన్ని సర్వేలు మాత్రం బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నాయి. కన్నడ నాట ఏ జెండా ఎగురుతుందో తెలియాలంటే ఈనెల 15వరకు వేచి చూడాల్సిందే మరి.

22:01 - May 10, 2018

కర్నూలు : కాంగ్రెస్‌ అన్యాయం చేసిందని బీజేపీకి సపోర్ట్‌ చేస్తే .. మోదీ  నమ్మించి మోసం చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. నమ్మక ద్రోహానికి ఏపీ ప్రజలు తగిన సమయంలో బుద్ధిచెబుతారని అన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్రం నిలదొక్కుకోడానికి అవిరామంగా కృషిచేస్తున్నామని చంద్రబాబు అన్నారు.  

గత ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకుంటే ఏపీకి అన్యాయం జరిగేది కాదన్నారు సీఎం చంద్రబాబు. కర్నూలులో జరిగిన బహిరంగ సభలో మోదీపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. మోదీ ప్రధాని అయినపుడు అందరికంటే ఎక్కువగా తానే సంతోషపడ్డానన్నారు. దేశం బాగుపడుతుందని ఆశిస్తే.. నష్టపోయిన వారికే అన్యాయం చేశారని మోదీపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. 

కర్నూలు జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతామని  చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా  ఓర్వకల్లు మండలం గుట్టపాడు సమీపంలో జైరాజ్‌ ఇస్పాత్‌ లిమిటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు చంద్రబాబు  శంకుస్థాపన చేశారు. అనంతరం పారిశ్రామిక వేత్తలు, మీడియాతో ముఖాముఖి నిర్వహించారు. రాయలసీమలో ఒకప్పుడు రాళ్లు మాత్రమే ఉండేవని కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఎన్నో పరిశ్రమలను సీమకు తీసుకొచ్చామని సీఎం అన్నారు.  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు ముందుకొస్తున్నాయని, ముఖ్యంగా కర్నూలు జిల్లాకు మరిన్ని సంస్థలు రాబోతున్నాయన్నారు.  కొత్తపరిశ్రమల వల్ల రాబోయే రోజుల్లో 80వేల మందికి ఉద్యోగాలు రానున్నాయని చంద్రబాబు తెలిపారు. విభజనతో రాష్ట్రం కష్టాల్లో ఉంటే.. ప్రభుత్వానికి సహకరించాల్సిన ప్రధాన ప్రతిపక్షం  రాజకీయాలు చేస్తోందని  చంద్రబాబు అన్నారు. కేసుల మాఫీకోసమే  వైసీపీ నేతలు బీజేపీతో లాలూచీ పడుతున్నారని ఆరోపించారు. 

21:58 - May 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు పథకాన్ని.. మంత్రులు ప్రారంభించారు. ప్రపంచంలో ఇలాంటి పథకం ఏ దేశంలోనూ లేదని మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు చెప్పుకొచ్చారు.  రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని మంత్రులు వెల్లడించారు. 

రాష్ట్రవ్యాప్తంగా రైతు బంధు చెక్కుల పంపిణీ ప్రారంభమైంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో పట్టా పాసుబుక్‌లతో పాటు రైతుబంధు చెక్కులను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల జీవితాల్లో ఇది మరుపురాని రోజు అని అన్నారు.  

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దోసపాడులో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రారంభించారు. కార్యక్రమంలో హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అద్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. గత పాలకులు రైతుల నడ్డి విరిస్తే.. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని వారీ సందర్భంగా అన్నారు. 

వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ఆయనీ సందర్భంగా అన్నారు. 

నిర్మల్‌ జిల్లాలోని స్వగ్రామం ఎల్లపెల్లిలో గృహనిర్మాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. అటవీ మంత్రి జోగు రామన్న కూడా తన జిల్లాలో పథకాన్ని ప్రారంభించి చెక్కులు, పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ నియోజకవర్గంలో.. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.. రైతులకు చెక్కులు, పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. లబ్దిదారులకు శాలువాలతో సన్మానించి.. స్వీట్లు పంచి అభినందించారు. తొలిరోజున బోడపల్లి, బొర్లకుంట, గూడెం గ్రామాల్లో చెక్కులు, పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. 

ఆసిఫాబాద్‌ మండలంలోని బురుగూడ గ్రామంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని దిలావర్‌పూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్‌ రైతులకు చెక్కులు, పట్టాపాసు పుస్తకాలు పంపిణీ చేశారు. మేడ్చల్‌ జిల్లా కేంద్రంలో.. ఎంపీ మల్లారెడ్డి, రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. ధనిక రైతుల రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి ధ్యేయమని ఆయనీ సందర్భంగా అన్నారు.

అటు కుత్బుల్లాపూర్‌లోనూ రైతు బంధు పథకాన్ని, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ సుంకరిరాజు ప్రారంభించారు. ముఖ్యమంత్రి దూరదృష్టికి నిదర్శనమే రైతు బంధు పథకమని వారీ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

ఖమ్మం జిల్లాలో ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. రూరల్‌ మండలం ఆరేంపుల గ్రామంలో జరిగిన సభలో.. పెట్టుబడి సాయం చెక్కులను అందించారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలాంటి పథకం అమలు లేదని.. అందరికీ తెలంగాణ ఆదర్శప్రాయంగా నిలిచిందని ఆయనీ సందర్భంగా అన్నారు. 

సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో రైతుబంధు పథకాన్ని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ట్రైకార్‌ చైర్మన్‌ తాటి వెంకటేశ్వర్లు రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు.

జగిత్యాల జిల్లాలో ఎంపీ కవిత రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. వ్యవసాయం పండుగ కావాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమని ఈ సందర్భంగా కవిత చెప్పారు. రైతులు... ఎంపీ కవితను,  ఎద్దులబండిపై ఊరేగిస్తూ సభాస్థలి వద్దకు తీసుకు వెళ్లారు.  రైతుల కోసం ఉచిత విద్యుత్తు, గోదాములు, ప్రాజెక్టుల నిర్మాణాలతో పాటు.. ఎరువులు, విత్తనాల కోసం పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు.

కరీంనగర్‌ జిల్లాలోని కోరుట్ల మండలం మాదాపూర్‌లో ఎమ్మెల్యే విద్యాసాగరరావు రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. 
వనపర్తి జిల్లాలోని పానగల్ మండలం అన్నారంలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పంచాయతీరాజ్, మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. 

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో రైతుబంధు పథకాన్ని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రారంభించారు. ఈ పథకంతో ఇప్పుడు దేశమంతా కేసీఆర్‌వైపు చూస్తోందని ఆమీ సందర్భంగా అన్నారు. 

నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా రైతుబంధు చెక్కులు, పాసు పుస్తకాల పంపిణీ అట్టహాసంగా జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చెక్కులను పంపిణీ చేశౄరు. రైతులను అప్పుల ఊబి ఉంచి బయట పడేసేందుకు ప్రభుత్వం సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకుందని నేతలు కితాబిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు అందుబాటులో లేని ఇతర అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పంటపెట్టుబడి చెక్కులు, పాసుబుక్కులు పంపిణీ చేశారు. 
    

21:53 - May 10, 2018

అమ్మయ్య మొత్తం మీద కర్ణాటక ఎన్నికల కూతలు ఆగిపోయినయ్ ఇయ్యాళటితోని.. దేశప్రధానిని అన్న ముచ్చట మర్శిపోయి మోడీ ఓ ఇర్వైమాట్ల.. రాహుల్ గాంధో ఇర్వైమాట్ల జనం చెవ్వులళ్ల కెళ్లి రక్తాలెల్లెతట్టు లొల్లి వెట్టిండ్రు.. మొత్తం మీద ఇయ్యాళటితోని ప్రచారం కథ ఒడ్సిపోయింది.. ఇగ మిగిలింది మందు.. పైకం బంచుడే.. 

తెలంగాణ రైతులకు ఇయ్యాళటి సంది చెక్కులు ఇచ్చే కార్యం సుర్వు జేశింది తెలంగాణ ప్రభుత్వం.. ఎక్రానికి నాల్గువేల లెక్క ఇస్తున్నరు.. పదిర్వై రోజుల దాక ఇచ్చుడు కార్యం నడుస్తదట.. ఇయ్యాళ తెల్లారంగనే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కాడ బహిరంగ సభ వెట్టి శాంపిల్ కింద ఇద్దరు ముగ్గురికి చెక్కిలిచ్చి కార్యం సుర్వు జేశిండు సారు.. 

అవద్దం జెప్పినా అత్కినట్టుండాలే అంటరు.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారు మీకు గానీ మీ తబలా మద్దెలలకు గానీ.. అవద్దంగూడ సక్కగ జెప్పరాదేంది సారు..? మీరు ఏమంటున్నరు బహిరంగ సభల పొంట కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తీర్తమంటున్నరు.. మరి తెలంగాణల కోటి ఎక్రాల భూమి ఉన్నదా లేదా అన్న సోయి మీ బ్యాచుకు ఎందుకు లేదు మీ అంతల మీరే బైటవెట్టిండ్రు మీ అవద్దాలను సూడుండ్రి..

ఓ కొడ్కగదరా ఇది సంసారమా గడ్డామురో.. నిన్ననే అంతగనం మొత్తుకుంటే ఇర్వైవేల మంది ఇండ్లులేని పేదల పొట్టగొట్టి ఇపరీతంగ అడ్వటైజ్ మెంట్లు ఇస్తున్నడు.. ఇంకో నాల్గొద్దులైతె తెలంగాణ రాష్ట్రాన్ని ఏడనన్నకుదవెట్టవల్సొస్తదని.. ఇగో మళ్ల ఇయ్యాళ ఎన్ని అడ్వటైజ్ మెంట్లు జూడుండ్రి.. సరే తెలంగాణలంటే డబ్బాగొట్టెంతుకు ఇచ్చిండనుకుందాం.. గా రాజస్థాన్ పత్రికకు తెలంగాణ పథకానికి ఏం సంబంధమయ్యా..? 

దిష్టిబొమ్మలు గూడ రకరకాలు తయ్యారు జేస్తున్నరుగదా..? మీరు ఆర్డరిస్తె ఎన్నడ్గుల దిష్టిబొమ్మగావాలే ఏ సైజుల గావాలే.. అని తయ్యారు జేశే సంస్థ ఉన్నట్టుంది యాడనో.. మోడీ దిష్టిబొమ్మను ప్రత్యేక హోదా పాత్రల అహూతి జేస్తందుకు కర్నూలు కాడ ఎంత పెద్ద బొమ్మగాలవెట్టిండ్రో సూడుండ్రి అక్కడి ఎమ్మెల్యే మోహన్ రెడ్డి..

రైతే రాక్షసుడు అయిపోయిండు తెలంగాణల సర్కారు దృష్టిల.. ఆ పెట్టుబడి ఇంట్ల పీనుగెళ్ల అది కల్పుగూళ్లకు గూడ సరిపోని పైకం.. దాంతోని సోకు జేస్తున్నరుగని.. అసలు రైతు బత్కాల్నంటే పండించిన పంట అమ్ముకోవాలె.. మద్దతు ధర సంపాయించుకుంటే బత్కుతడు రైతు.. అంతేనా..? అయితే పంటగొని పైకం ఇస్తలేరట అధికారులు.. వాళ్లను గుంజుకొచ్చిలోపటేశి తాళమేశిండ్రు ఒకతాన..

అందరు కార్మికుల ఐక్యత వర్దిల్లాలె అంటరు.. కని కార్మికుని కష్టాన్ని మాత్రం గుర్తించరు.. పాపం రైసు మిల్లుల పొంట పనిజేసె కార్మికులు ఓ యాళ్ల ఉండది పాళ్ల ఉండది.. ఎప్పుడువడ్తె అప్పుడే పనిజేయాలే.. ఇగ వాళ్లకు జీతాలు గూడ అంతంత మాత్రమే.. వరికోతల సీజనొస్తె వాళ్ల కష్టం వర్ణనాతీతం.. అసొంటోళ్లు మాకు గూడ మంచి జీతాలు గావాలె ఎన్నొద్దులు జేయాలే ఈ ఎట్టి కష్టమంటున్నరు.. 

నాంగు బాము నడ్ముమీద గొడ్తె దానికి దెబ్బదాకింది.. పామును సంపుదామని సూశిండు ఒకాయిన.. అదే పామును ఎట్లన్న జేశి కాపాడాలే అని ఇంకొకాయిన ఇద్దరు నడ్మ కథల.. పాము పశువైద్యశాలకు జేరింది.. మన్సులకు ఆప్రిషన్లు జేసుడే గాదు పాముకు గూడ ఆప్రీషన్ జేశి దాన్ని రక్షిస్తమని డాక్టర్ రామకోటేశ్వర్ రావు రెడీ అయ్యిండట పాండ్రి పాము ఆప్రేషన్ జూద్దాం..

మంత్రి జవహర్ కు మాతృ వియోగం

గుంటూరు : మంత్రి జవహర్ కు మాతృ వియోగం కలిగింది. జవహర్ తల్లి కొత్తపల్లి దానమ్మ గుండెపోటుతో మృతి చెందారు. కొవ్వూరులోని నివాసంలో దానమ్మ మృతి చెందారు. 

ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త

విజయవాడ : ఆర్టీసీ కార్మికులకు శుభవార్త. ఆర్టీసీ కార్మికులకు 2 శాతం కరవుభత్యం పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. 2018 జనవరి నుంచి కొత్త డీఏ అమలు చేయాలని నిర్ణయించారు. 

 

అపోలో ఆస్పత్రి నర్సుపై యాసిడ్ దాడి

హైదరాబాద్ : అపోలో ఆస్పత్రి నర్సుపై యాసిడ్ దాడి జరిగింది. నర్సు నిషాషాజిపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో నర్సుకు గాయాలు అయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు.

విజయవాడలో సినీ నటుడు శివాజీ దీక్ష

కృష్ణా : విజయవాడలో సినీ నటుడు శివాజీ దీక్ష చేపట్టారు. ప్రత్యేకహోదా కోసం ధర్నా చౌక్ లో శివాజీ జాగారం దీక్ష చేపట్టారు. రేపు ఉదయం 7 గంటలకు వరకు జాగారం చేయనున్నారు. శివాజీ దీక్షకు ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా, విద్యార్థి సంఘాలు, న్యాయవాదుల జేఏసీ, ముస్లీం ఐక్య వేదక మద్దతు తెలిపారు.

 

21:19 - May 10, 2018

రూపాయి పతనం ఎందుకవుతుంది..? రూపాయి పతనం వెనుక కారణాలేంటీ..? డాలర్ తో పోల్చితే రూపాయి విలువ తగ్గుతుంది.. ? ఇదే అంశంపై నిర్వహించిన విశ్లేషణ కార్యక్రమంలో ఆర్థిక నిపుణులు శశికుమార్ పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూపాయి పతనం కొత్తగా ప్రారంభం అయింది కాదని...గతం నుంచి ఉందన్నారు. అంతర్జాతీయ పరిణామాలు, ఎగుమతి.. దిగుమతులు, డిమాండ్, సప్లయ్ పై రూపాయి పతనం ఆదారపడి ఉంటుంది. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

21:09 - May 10, 2018

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇవాళ కరీంనగర్‌ జిల్లా హూజూరాబాద్‌లో ప్రారంభించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు, రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి, టీఆర్ ఎస్ సీనియర్ నేత రాజమోహన్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి పాల్గొని, మాట్లాడారు. రైతుబంధు పథకం కొంత మేరకు ఉపయోగకరంగా ఉన్నా సక్రమంగా అమలు కావాలన్నారు. వ్యవసాయ పనులను ఉపాధీ హామీ పథకానికి అనుసంధానం చేయడం తగదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:01 - May 10, 2018

హైదరాబాద్ : వ్యవసాయానికి.. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. కూలీలకు ఇచ్చే డబ్బులో సగం కేంద్ర ప్రభుత్వమే భరించాలని ఆయన సూచించారు. పంట పెట్టుబడి కోసం నేరుగా రైతులకే.. నగదు అందించడం దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయమని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. 
రైతుబంధు పథకం ప్రారంభం 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గురువారం కరీంనగర్‌ జిల్లా హూజూరాబాద్‌లో ప్రారంభించారు. రైతులకు పెట్టుబడి సాయం చేసిన గౌరవం తెలంగాణకే దక్కిందని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం అన్నారు. ఈ పథకం కోసం పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించామని, పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకుని బంగారు పంటలు పండించాలని రైతులను కోరారు. వ్యవసాయానికి, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని ఈసందర్భంగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. 
పెట్టుబడి సాయం కౌలు రైతులకు వర్తించదు : కేసీఆర్ 
భూరికార్డుల ప్రక్షాళన, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు, పంట పెట్టుబడి సాయం.. తదితర విధానాల ద్వారా తెలంగాణ.. యావద్భారతావనికి దిక్సూచిగా నిలిచిందని ముఖ్యమంత్రి అన్నారు. రైతులకు జూన్‌ 2 నుంచి ఐదు లక్షల బీమా అమలు చేయనున్నామని, ఇలా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పుడిస్తున్న పంటల పెట్టుబడి సాయాన్ని కౌలు రైతులకు వర్తించబోమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ తెచ్చిన పార్టీ టీఆర్ఎస్‌ అయితే.. రాష్ట్రాన్ని గోస పెట్టిన పార్టీ కాంగ్రెస్‌ అని విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకుల మాటలు వింటే.. ప్రజలు ఆగమవుతారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు వద్దంటున్నారో కాంగ్రెస్‌ నాయకులు చెప్పాలని సీఎం డిమాండ్‌ చేశారు.
పంట పెట్టుబడి నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి : సీఎం కేసీఆర్  
పంట పెట్టుబడి నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని, పంపిణీలో ఇబ్బందులను రైతు సమన్వయ సమితి సభ్యులు పరిష్కరించాలని సీఎం సూచించారు. అదే విధంగా.. పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్‌బుక్కులు తీసుకో వద్దని ముఖ్యమంత్రి సూచించారు. జూన్‌ రెండో తేదీ నుంచి సరికొత్త రిజిస్ట్రేషన్‌ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పోను.. మిగిలిన 430 మండలాల్లో ఎమ్మార్వోలే రిజిస్ట్రేషన్‌ చేస్తారని సీఎం వెల్లడించారు. రెండు, మూడు నెలల్లో మిషన్‌ భగీరథ పథకం కింది ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని కేసీఆర్‌ చెప్పారు. అగ్రకులాల్లోని పేదలకు కూడా తగిన స్కీములు ప్రకటిస్తామన్నారు. 

 

20:19 - May 10, 2018

విజయవాడ : ప్రభుత్వాలు మారుతున్నా.. కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం ఓడరేవు నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు సాగడంలేదు.. టీడీపీకి హామీలు ఇవ్వడంలో ఉన్న శ్రద్ధ.. వాటిని అమలు చేయడంలో లేదంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.. బందరు పోర్టుపై స్థానికులు పెట్టుకున్న ఆశలు టీడీపీ ప్రభుత్వ హయాంలో తీరేలా లేదంటున్నారు.
బందరుపోర్టుపై ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం
సముద్ర మార్గాలు సమీపంలోనే ఉన్నా.. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ఏపీ పాలకులు విఫలం అవుతున్నారు.. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ, కాకినాడ  ఓడరేవులకు మంచి దేశంలోనే మంచి గుర్తింపు ఉంది. ఈ దశలో మచిలీపట్నం ఓడరేవును కూడా అభివృద్ధి చేస్తే..  రాష్ర్టం మరింతగా    భివృద్ధి చెందడంతోపాటు..  అటు తెలంగాణకు కూడా ఉపయుక్తం కానుంది. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ బందరు పోర్టు అభివృద్ధి, ఇతర నిర్మాణంలో భాగస్వాములం అవుతామని పేర్కొన్నారు. కానీ.. ఏపీ ప్రభుత్వమే బందరు పోర్టు నిర్మాణంపై దృష్టిసారించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
5300 ఎకరాల భూమి  సేకరించాల్సి ఉంది
పోర్టు కోసం  ఐదు వేలా మూడు వందల ఎకరాల భూమిని  సేకరించాల్సి ఉండగా.. వీటిలో ప్రభుత్వ అసైన్డ్ భూములు 3014 ఎకరాలున్నాయి. మిగిలినవి పట్టా భూములున్నాయి. ప్రభుత్వ అసైన్డ్ భూములను ఇప్పటికే కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు అప్పగించారు. ప్రైవేట్ భూములకు సంబంధించి భూ సమీకరణ ద్వారా ఏడు వందలా యాభై ఎకరాలకు రైతుల నుంచి అంగీకారం పొందారు. మిగతా  పదిహేనువందల ఎకరాలకుపైగా భూముల కోసం భూ సమీకరణతోపాటు భూ సేకరణపై దృష్టిసారించారు.
ప్రభుత్వ హామీతో రుణాలిచ్చేందుకు బ్యాంకులు సిద్ధం
ప్రభుత్వ హామీతో రుణాలు ఇచ్చేందుకు కొన్ని బ్యాంకులు ముందుకొచ్చాయి. దీన్ని మంత్రివర్గంలో కూడా ఆమోదింపచేశారు. భూ సేకరణకు అవసరమైన  ఆరు వందల  కోట్లతోపాటు... కంటెయినర్ కార్పొరేషన్‌కు ఇచ్చే  వెయ్యి ఎకరాల భూములకు మూడు వందల కోట్లు పోర్టుకు అనుసంధానించనున్నారు. రోడ్లు, రైల్వేలైన్ల కనెక్టవిటీకి రూ.150 కోట్లు, పోర్టు భూముల గ్రామాల్లో ఆర్.ఆర్.యాక్ట్ అమలుకు  నలభై రెండు  కోట్లు వివిధ బ్యాంకుల నుంచి రుణం పొందే అవకాశాన్ని కేబినెట్ కల్పించనుంది. ఇందుకు మొత్తంగా రూ వెయ్యికోట్లకు పైగా కోట్లు ప్రభుత్వ హామీతో మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ రుణాలు పొందాలని చూస్తున్నారు. 
బందరు వాసులు ఆగ్రహం వ్యక్తం 
తాము అధికారంలోకి రాగానే పోర్టు నిర్మాణంపై దృష్టిసారిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినా అభివృద్ధి మాత్రం జరగకపోవడంతో బందరు వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోర్టు అభివృద్ధి చెందితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఆశిస్తున్నా. అవేవీ ఆచరణకు నోచుకోకపోవడంతో తీరంలోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు మాటకు కట్టుబడి.. ఇచ్చిన హామీల నెరవేర్చాలని అంటున్నారు.  వెంటనే ఓడరేవు నిర్మాణం పూర్తి బందరు ప్రజల్లో ఆనందాన్ని నింపాలని కోరుతున్నారు. 

సినిమా కోఆర్డినేటర్‌పై జూ.ఆర్టిస్ట్‌ రోజా ఫిర్యాదు

హైదరాబాద్ : టాలీవుడ్‌లో కో ఆర్డినేటర్ల ఆగడాలపై జూనియర్‌ ఆర్టిస్ట్‌లు పోలీసులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ సినిమా కోఆర్డినేటర్‌పై బంజారా హిల్స్‌ పీఎస్‌లో జూనియర్‌ ఆర్టిస్ట్‌ రోజా ఫిర్యాదు చేసింది. బాధితురాలికి సంఘీభావంగా సినీనటి శ్రీరెడ్డి కూడా పోలీస్టేషన్‌కు వచ్చారు. సాఫ్ట్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి తనపై అత్యాచారం చేసి.. డబ్బు, నగలు దోచుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసే సమయంలో అక్కడికి వచ్చిన కో ఆర్డినేటర్‌పై బాధిత ఆర్టిస్ట్‌లు చెప్పులతో దాడి చేశారు. 

20:11 - May 10, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌లో కో ఆర్డినేటర్ల ఆగడాలపై జూనియర్‌ ఆర్టిస్ట్‌లు పోలీసులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ సినిమా కోఆర్డినేటర్‌పై బంజారా హిల్స్‌ పీఎస్‌లో జూనియర్‌ ఆర్టిస్ట్‌ రోజా ఫిర్యాదు చేసింది. బాధితురాలికి సంఘీభావంగా సినీనటి శ్రీరెడ్డి కూడా పోలీస్టేషన్‌కు వచ్చారు. సాఫ్ట్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి తనపై అత్యాచారం చేసి.. డబ్బు, నగలు దోచుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసే సమయంలో అక్కడికి వచ్చిన కో ఆర్డినేటర్‌పై బాధిత ఆర్టిస్ట్‌లు చెప్పులతో దాడి చేశారు. 

20:02 - May 10, 2018
20:00 - May 10, 2018

హైదరాబాద్ : రైతుబంధు పథకం ఎన్నికల జిమ్మిక్కేనని టీపీసీపీ చీఫ్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. గత నాలుగేళ్లలో రూ.6 లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టినా రైతు రుణాలు ఏకకాలంలో మాఫీ చేయలేక పోయారని విమర్శించారు. 

19:24 - May 10, 2018

కర్నూలు : ప్రధాని మోడీపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. మోడీ రాష్ట్రానికి న్యాయం చేస్తారనుకుంటే మొండిచేయి చూపించారని విమర్శించారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. మోసం చేసిన వారికి ఏపీ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రావడం వల్లే ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. మోదీ ప్రధాని అయినప్పుడు అందరికంటే తానే ఎక్కువ సంతోషపడ్డానని అన్నారు. 

 

19:08 - May 10, 2018

విజయవాడ : ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి కాలేజీ యాజమాన్యాలు కుస్తీ పడుతున్నాయి.. కాలం మారుతోంది.. విద్యార్థుల ఆలోచనల్లోనూ మార్పు వచ్చింది. కారణాలేవైనా... ఇంజినీరింగ్ లో సీట్లు ఎప్పటికప్పుడు మిగిలిపోతూనే ఉన్నాయి. గత కొంతకాలంగా ఇంజినీరింగ్ చదివే వారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు నిండడమే కష్టంగా మారింది. దీంతో యాజమాన్యాలు  దిక్కుతోచని స్థితిలో పడ్డాయి.
తగ్గిపోతున్న ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య
ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటేనే విద్యార్థులు అమితాసక్తి చూపేవారు.. ఇంజనీరింగ్‌లో అబ్బాయిలకంటే.. అమ్మయిలే పైచేయి సాధిస్తూ వచ్చారు. కాలం మారుతున్న కొద్దీ ఇంజనీరింగ్ అభ్యసించేవారే సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీంతో ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కూడా నిండటం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2017లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి యాజమాన్యాలు నానా తంటాలే పడితే ప్రస్తుతం 2018లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇంజనీరింగ్ లో అర్హత సాధించిన విద్యార్థులు తగ్గుతూ వస్తున్నారు. 
ఇంజనీరింగ్‌లో వెనుకబడ్డ తెలుగు రాష్ర్టాలు
ఇప్పటి వరకూ  ఇంజనీరింగ్‌లో దేశంలోనే ముందు వరుసలో ఉన్న తెలుగు రాష్ర్టాలు.. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి నోచుకోవడంలేదు. ఏపీలో ఎక్కువ సంఖ్యలో ఉన్న  ఇంజనీరింగ్ కళాశాల్లో.. విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ ఏడాదైనా కనీసం సగం సీట్లు కూడా నిండని పరిస్థి నెలకొంది. ఈ రెండు జిల్లాల్లో 70 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వీటిలో 15 వరకూ కనీసం 50 సీట్లు కూడా నిండని పరిస్థితి నెలకొంది. గత నాలుగైదేళ్లుగా ఎదుర్కొంటున్నారు. 100 లోపు సీట్లు నిండేవి మరో 10-15 ఉన్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తం 35 వేల వరకూ ఇంజనీరింగ్ సీట్లుంటే గతేడాది 18 వేల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
ఇంజనీరింగ్‌ అంటేనే ఆమడదూరం పోతున్న విద్యార్థులు
ఇంజనీరింగ్‌ అంటేనే విద్యార్థులు ఆమడ దూరం పోతున్నారు. ఈ నేపథ్యంలో కాలేజీల నిర్వహణ సైతం భారంగా మారే పరిస్థితి నెలకొంది. నాణ్యమైన విద్యను అందించే కొన్ని కాలేజీల్లో సీట్లకు మాత్రం మంచి డిమాండ్ ఉంది.  ఈ ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైన విద్యార్థులు 34,508 మంది ఉన్నారు.  కృష్ణాలో 30, గుంటూరులో 40 కలిపి మొత్తం 70 ఇంజనీరింగ్ కళాశాలు ఉంటే కృష్ణాలో 16 వేల వరకూ సీట్లు ఉన్నాయి. గతేడాది కౌన్సెలింగ్ సీట్లు 8 వేల పైగా మిగిలాయి. గుంటూరు జిల్లాలోనూ 19 వేల వరకూ ఉండగా, 9 వేలకు పైగా మిగిలాయి. ఎంసెట్ లో అర్హత సాధించిన విద్యార్థులు గతేడాది కంటే తగ్గారు. విద్యార్థులు ఐఐటీకి వెళ్లడం, అలాగే జేఈఈ మెయిన్స్ కూడా పూర్తవడంతో కొందరు విద్యార్థులు మంచి కళాశాలల్లో సీట్లను ఉంచుకుని ఐఐటీ రాగానే వెళ్లిపోతున్నారు. వాటిని నింపడం తర్వాత కళాశాలలకు నింపకోవడం తలకుమించిన భారంగా మారుతోంది.     
సీఎస్ఈబ్రాంచ్‌కు తొలిప్రాధాన్యత 
ఎంసెట్ లో ర్యాంకర్లు సీఎస్ఈబ్రాంచ్‌కు తొలిప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పెద్ద పెద్ద కాలేజీల్లో తొలిగా ఈ సీట్లే నిండిపోతున్నాయి. ఓ మోస్తరు, సాధారణ కళాశాలల్లోనూ సీఎస్ఈ సీట్లకు భారీ డిమాండ్ ఉంది. రెండో ప్రాధాన్యంగా ఈసీఈ వైపు చూస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఎస్ఈ బ్రాంచ్ కు పెద్ద కళాశాలల్లో రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ డొనేషన్లను కట్టి మరీ చేరేందుకు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. చిన్న కళాశాలల్లో రూ.లక్ష వరకూ డొనేషన్లు కడుతున్నారు. వీటి తర్వాత వరుసగా ఈసీఈ, సివిల్, మెకానికల్, చివరిగా ఈఈఈ సీట్లు నిండుతున్నాయి. కారణాలు ఏవైనా.,,.కాలేజీల్లో సీట్లు నిండడమే గగనంగా మారిపోతోంది. ఈ పరిస్థితుల్లో కాలేజీ యాజమాన్యాలు సీట్లు నింపడంకోసం కుస్తీలు పడుతున్నారు.

 

19:02 - May 10, 2018
19:02 - May 10, 2018

ఢిల్లీ : ప్రజల పట్ల ఏపీ ప్రభుత్వానికి ధ్యాస తక్కువగా ఉందని బీజేపీ నేత జీవీఎల్.నరసింహారావు విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. పని అంటే ఏపీ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని..కానీ ప్రచారం పట్ల మాత్రం మక్కువగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను, జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుందని ఎద్దేవా చేశారు. తమపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తే..వారిపైనే బురద పడుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్ జీవోలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని పేర్కొన్నారు. 

 

18:56 - May 10, 2018

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మైకులు మూగబోయాయి. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజు ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ టాప్ లీడర్లు పాల్గొన్నారు. సిద్ధరామయ్య నియోజకవర్గం బాదామిలో అమిత్ షా ప్రచారం చేశారు. చివరి రోజు రాహుల్ గాంధీ సుడిగాలి క్యాంపెయిన్ చేశారు. అబద్ధపు ప్రచారంలో బీజేపీ ఓటర్లను మోసం చేస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ లు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొన్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు వరాల జల్లు కురిపించారు. కర్నాటకలో ఆయా పార్టీల టాప్ లీడర్లు మోహరించారు. కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 21 నుంచి 22 మంది వరకు కేంద్రమంత్రులు, ముగ్గురు నుంచి నల్గురి వరకు ముఖ్యమంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 233 స్థానాలకు ఈనెల 12న ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 15న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

18:49 - May 10, 2018

కర్నూలు : అంతిమ విజయం ధర్మానిదేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా పర్యటిన సందర్భంగా ఆయన  మాట్లాడారు. అధర్మంపై పోరాడినప్పుడు కష్టాలుంటాయి..కానీ అంతిమంగా విజయం ధర్మానిదే అని అన్నారు. అధర్మం ఎప్పుడూ విజయం సాధించలేదని తెలిపారు. తిరుపతిలో ఆనాడు మోడీ ఏం మాట్లాడారో ఆయన గుర్తు చేసుకోవాలన్నారు. 

 

18:43 - May 10, 2018

కృష్ణా : 'విజయవాడ ఆటోనగర్‌'లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కానూరు రోడ్డులోని ఓ కూలర్ల కంపెనీలో ఉదయం 11 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు.. పక్కనున్న ఇంజన్‌ ఆయిల్‌ మిక్స్డ్‌ యూనిట్‌కు అంటుకున్నాయి. దీంతో అదుపుచేయలేనంత స్థాయిలో మంటల ఉధృతి పెరిగింది. ప్రమాదం జరిగి మూడు గంటలవుతున్నా మంటలు అదుపులోకి రాలేదు. అగ్ని మాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ రంగంలోకి దిగింది. కలెక్టర్‌తోపాటు పోలీస్‌ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఆయిల్ పరిశ్రమలో 100 పీపాల ఆయిల్ ఉండటంతో మంటల ధాటికి పీపాలు పేలుతున్నాయి. కానూరు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రమాద స్థలంలో దట్టమైన పొగ కమ్మేసింది.

 

18:37 - May 10, 2018

హైదరాబాద్‌ : నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో వైబెండర్స్ ఆఫ్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ జాతీయ పతకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. గిన్నిస్ బుక్ రికార్డు కోసం 22 వేల 326 చదరపు అడుగుల పొడవైన జాతీయ జెండాను తయారు చేశారు. గతంలో ఈ రికార్డు వైబెండర్స్ ఆఫ్ కలాం ఫౌండేషన్ పేరు మీదనే ఉండేది. జనసేన అధినేత పవన్ మాట్లాడుతూ .. జాతీయ జెండా ఎవరి సొత్తూ కాదని..ఎవరైతే దేశం కోసం పని చేస్తారో వారికే సొంతమని అన్నారు. మనమంతా పిడికిలి బిగించి జాతీయ జెండాను ఎత్తాలని అభిమానులకు అయన పిలుపునిచ్చారు.

18:35 - May 10, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌లో కో ఆర్డినేటర్ల ఆగడాలపై జూనియర్‌ ఆర్టిస్ట్‌లు పోలీసులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ సినిమా కోఆర్డినేటర్‌పై బంజారా హిల్స్‌ పీఎస్‌లో జూనియర్‌ ఆర్టిస్ట్‌ రోజా ఫిర్యాదు చేసింది. బాధితురాలికి సంఘీభావంగా సినీనటి శ్రీరెడ్డి కూడా పోలీస్టేషన్‌కు వచ్చారు. సాఫ్ట్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి తనపై అత్యాచారం చేసి.. డబ్బు, నగలు దోచుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

 

18:32 - May 10, 2018

కర్నూలు : జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతామని  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఓర్వకల్లు మండలం గుట్టపాడు సమీపంలో జైరాజ్‌ ఇస్పాత్‌ లిమిటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం పారిశ్రామిక వేత్తలు, మీడియాతో ముఖాముఖి నిర్వహించారు. రాయలసీమలో ఒకప్పుడు రాళ్లు మాత్రమే ఉండేవని కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఎన్నో పరిశ్రమలను సీమకు తీసుకొచ్చామని సీఎం అన్నారు.  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు ముందుకొస్తున్నాయని, ముఖ్యంగా కర్నూలు జిల్లాకు మరిన్ని సంస్థలు రాబోతున్నాయన్నారు.  కొత్తపరిశ్రమల వల్ల రాబోయే రోజుల్లో 80వేల మందికి ఉద్యోగాలు రానున్నాయని చంద్రబాబు తెలిపారు. 

 

18:31 - May 10, 2018

ఢిల్లీ : కశ్మీర్‌కు స్వాతంత్ర్యం అనే కల ఎప్పటికీ సాకారం కాదని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ కశ్మీరీ యువతకు సందేశమిచ్చారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఆర్మీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. ఆజాదీ కోసం పోరాటం చేసేవారు ఆర్మీతో ఎప్పుడూ గెలవలేరని, ఆ మార్గాన్ని మానుకోవాలని హితవు పలికారు. ఆజాదీ కోసం కశ్మీరీ యువతతో తుపాకులు పట్టించడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఆజాదీ పేరిట యువతను తప్పుదోవ పట్టిస్తూ కొందరు రెచ్చగొడుతున్నారని..దీనివల్ల యువతకు ఏమి లభించదన్నారు. ఈ పోరాటంలో ఎంతమంది మిలిటెంట్లు చనిపోయారన్నది తనకు అనవసరమని రావత్‌ పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లో కశ్మీరీ యువత చనిపోవడం తనకు బాధ కలిగిస్తుందని తెలిపారు. కశ్మీరీ యువత ఆగ్రహంతో ఉన్న విషయం తనకూ తెలుసని, అంతమాత్రాన భద్రతా బలగాలపై రాళ్లదాడి సరికాదన్నారు. 

 

18:10 - May 10, 2018

ఢిల్లీ : అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సమీప బంధువును ఏసిబి అరెస్ట్‌ చేసింది. 10 కోట్ల పిడబ్య్లూడీ కుంభకోణానికి సంబంధించి కేజ్రీవాల్‌ మేనల్లుడు వినయ్‌కుమార్‌ బన్సాల్‌ను గురువారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. బన్సాల్‌ ఇంటిపై ఏసిబి జరిపిన దాడుల్లో అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌ బావ సురేందర్‌ బన్సాల్‌ గత ఏడాది మృతి చెందాడు. 2015-16లో ఢిల్లీలో రోడ్లు, పైప్‌లైన్ల నిర్మాణ కాంట్రాక్టు మంజూరులో అక్రమాలు చోటుచేసుకున్నాయని, నకిలీ బిల్లులతో 10 కోట్ల నిధులు పొందినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో పిడబ్ల్యూడీకి చెందిన ఆరుగురు ఇంజనీర్లను మే 13న ఏసీబి ప్రశ్నించింది. రోడ్స్‌ యాంటీ కరప్షన్‌ ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపకులు రాహుల్‌ శర్మ ఫిర్యాదు మేరకు  ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

 

18:02 - May 10, 2018
18:00 - May 10, 2018

విశాఖ : జిల్లా నక్కపల్లి మండలం వెంపాడులో మామిడిపండ్ల గోడౌన్‌పై విజిలెన్స్‌ అధికారులు దాడి చేశారు. రసాయనిక ఎరువులు కలిపి పండ్లను మగ్గబెడుతున్నారన్న సమాచారంతో ఈ దాడులు చేపట్టారు.  గోడౌన్‌లో పెద్దమొత్తంలో లభ్యమైన రసాయనిక ఎరువులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 


 

17:54 - May 10, 2018

కృష్ణా : విజయవాడ కొత్త ఆటోనగర్‌లో ఉన్న కూలర్‌ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. కంపెనీ నుండి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 7 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కానూరు రోడ్డులోని ఓ కూలర్ల కంపెనీలో ఉదయం 11 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు.. పక్కనున్న ఇంజన్‌ ఆయిల్‌ మిక్స్డ్‌ యూనిట్‌కు అంటుకున్నాయి. దీంతో అదుపుచేయలేనంత స్థాయిలో మంటల ఉధృతి పెరిగింది. ప్రస్తుతం పది ఫైరింజన్లలో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదం జరిగి 3 గంటలవుతున్నా మంటలు అదుపులోకి రాలేదు. అగ్ని మాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ రంగంలోకి దిగింది. కలెక్టర్ లక్ష్మీ కాంతం, జాయింట్ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముడి ఆయిల్ పరిశ్రమకు మంటలు వ్యాపించడంతో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ఆయిల్ పరిశ్రమలో 100 పీపాల ఆయిల్ ఉండటంతో పీపాలు పేలుతున్నాయి. కానూరు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రమాద స్థలంలో దట్టమైన పొగ కమ్మేసింది.

 

17:52 - May 10, 2018

సంతానలేమి..దానికి గల కారణాలు అనే అంశంపై నిర్వహించిన మానవి హెల్త్ కేర్ ఆండ్ లైఫ్ స్టైల్ కార్యక్రమంలో డాక్టర్ రమాదేవి పాల్గొని, మాట్లాడారు. ఆరోగ్యం, సంతానం వంటి పలు అంశాలపై సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆమె తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం.... 

17:42 - May 10, 2018

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. మే 12న జరిగే ఎన్నికల కోసం రాజకీయపార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేయడం మొదలుపెట్టాయి. ఎవరికి వారు తమ స్ట్రాటజీ మేరకు పావులు కదుపుతూ.. గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఇక కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ఓటర్లు కీలకంగా మారారు. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాయిచూర్‌ జిల్లా నుంచి మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

17:32 - May 10, 2018

బెంగళూరు : విజన్‌ కర్నాటకపై కాంగ్రెస్‌ మాట్లాడితే బీజేపీ వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని ఆరోపించారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. దేశ వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులపై మోదీ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. పెట్రోల్‌ ఆదాయాన్ని కాంగ్రెస్‌ ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తే మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంక్షేమం కోసం ఖర్చు చేస్తుందని విమార్శించారు. 

 

17:29 - May 10, 2018

కరీంనగర్ : రైతులను కాపాడేందుకే రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చామన్నారు సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా కరీంనగర్‌ జిల్లాలో రైతు బంధు పథకాన్ని సీఎం ప్రారంభించారు. రైతులు భూమిని అమ్మాలన్నా కొనాలన్నా లంచాలు ఇవ్వాల్సి పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితిని తొలగించేందుకు భారతదేశానికి దిక్సూచిలాగా రిజిస్ట్రేషన్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు. జూన్‌ 2 నుండి ఈ విధానాన్ని అమలులోకి తీసుకువస్తామన్నారు సీఎం. రైతు ప్రయోజనాల కోసమే కౌలు రైతులకు పెట్టుబడి ఇవ్వడంలేదన్నారు. 

17:20 - May 10, 2018

కర్నూలు : జిల్లా నంద్యాలో ఎండోమెంట్‌ ఈవో రంపా వీరయ్య ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంతో ఈ దాడులు చేపట్టింది. కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లోని వీరయ్య ఇండ్లల్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది ఏసీబీ.  సుమారు 8 కోట్ల మేర ఆక్రమాస్తులను గుర్తించారు. వీరయ్యకు బినామీగా భార్య, బంధువులు ఉన్నట్లు గుర్తించారు. 


 

ముగిసిన కర్నాటక ఎన్నికల ప్రచారం

బెంగళూరు : ముగిసిన కర్నాటక ఎన్నికల ప్రచారం చేశారు. మైకులు మూగబోయాయి. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ లు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొన్నాయి. 

17:12 - May 10, 2018

నెల్లూరు : ఏసీబీ అధికారులు మరో అవినీతి చేపను వలవేసి పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ సూపరింటెండెంట్ శ్రీనివాసులు తోటి ఉద్యోగి నుంచి 25 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఉద్యోగం రెగ్యులరైజ్‌ చేసేందుకు తోటి ఉద్యోగి మహేష్‌బాబును లంచం అడిగాడు. లంచం తీసుకుంటూ  డీఎం అండ్‌ హెచ్‌ సూపరిండెంట్ శ్రీనివాసులు, సీనియర్‌ అసిస్టెంట్‌ గోపాల్‌  ఏసీబీకి దొరికిపోయారు. 

 

17:09 - May 10, 2018

కృష్ణా : విజయవాడ కొత్త ఆటోనగర్‌లో ఉన్న కూలర్‌ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. కంపెనీ నుండి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 7 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఘటనా స్థలానికి కలెక్టర్‌ చేరుకున్నారు.

 

17:02 - May 10, 2018

బెంగళూరు : మరికాసేపట్లో కర్నాటక ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు కర్నాటక ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. చివరి రోజు ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ టాప్ లీడర్లు పాల్గొన్నారు. సిద్ధరామయ్య నియోజకవర్గం బాదామిలో అమిత్ షా ప్రచారం చేశారు. చివరి రోజు రాహుల్ గాంధీ సుడిగాలి క్యాంపెయిన్ చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు వరాల జల్లు కురిపించారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ లు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొన్నాయి. కర్నాటకలో ఆయా పార్టీల టాప్ లీడర్లు మోహరించారు. కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  అబద్ధపు ప్రచారంలో బీజేపీ ఓటర్లను మోసం చేస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహల్ గాంధీ విమర్శించారు. 233 స్థానాలకు ఈనెల 12న ఎన్నికలు జరుగనున్నాయి.  ఈనెల 15న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

మరికాసేపట్లో ముగియనున్న కర్నాటక ఎన్నికల ప్రచారం

కర్నాటక : మరికాసేపట్లో కర్నాటక ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు కర్నాటక ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. చివరి రోజు ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ టాప్ లీడర్లు పాల్గొన్నారు. సిద్ధరామయ్య నియోజకవర్గం బాదామిలో అమిత్ షా ప్రచారం చేశారు. చివరి రోజు రాహుల్ గాంధీ సుడిగాలి క్యాంపెయిన్ చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు వరాల జల్లు కురిపించారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ లు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొన్నాయి.

16:57 - May 10, 2018

బెంగళూరు : మరికాసేపట్లో కర్నాటక ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు కర్నాటక ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. చివరి రోజు ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ టాప్ లీడర్లు పాల్గొన్నారు. సిద్ధరామయ్య నియోజకవర్గం బాదామిలో అమిత్ షా ప్రచారం చేశారు. చివరి రోజు రాహుల్ గాంధీ సుడిగాలి క్యాంపెయిన్ చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు వరాల జల్లు కురిపించారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ లు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొన్నాయి. కర్నాటకలో ఆయా పార్టీల టాప్ లీడర్లు మోహరించారు. కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  అబద్ధపు ప్రచారంలో బీజేపీ ఓటర్లను మోసం చేస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహల్ గాంధీ విమర్శించారు. 233 స్థానాలకు ఈనెల 12న ఎన్నికలు జరుగనున్నాయి.  ఈనెల 15న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

 

13:30 - May 10, 2018

కరీంనగర్ : కౌలు రైతులకు 'రైతు బంధు' పథకం ఎట్లాంటి పరిస్థితుల్లో అమలు చేయమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరాఖండిగా చెప్పారు. ప్రభుత్వానికి అలాంటి అవసరం లేదని..భూమి ఎవరి పేరు మీద ఉందో అలాంటి రైతుకు మాత్రమే ఈ పెట్టుబడి సహాయం అందచేయడం జరుగుతుందన్నారు. రైతులకు పాసు పుస్తకాలు, పెట్టుబడి సాయం చెక్కులను పంపిణీ కార్యక్రమం హుజురాబాద్ లోని ధర్మరాజు పల్లి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఆకాశమంత ఎగురవేసిన జిల్లా కరీంనగర్ జిల్లా అని, ఇక్కడి నుండే ఉద్యమం ప్రారంభమైందని తెలిపారు. ఇటీవలే నిర్వహించిన సివిల్స్ పరీక్షలో తెలంగాణ విద్యార్థులు ప్రతిభ చూపెట్టారని, నెంబర్ వన్ ర్యాంకు తెలంగాణ రాష్ట్ర విద్యార్థికి రావడం గర్వంగా ఉందన్నారు. 24గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఇచ్చేది దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అని తెలిపారు. అంగన్ వాడీ..వృద్ధులు..వితంతవులు..హోం గార్డులకు అత్యధిక వేతనం..కులాల..మతాలు లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్వహించడం జరుగుతోందన్నారు.

20 శాతం సొంత ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని, 58 లక్షల మంది రైతులకు పాస్ పుస్తకాలు, పెట్టుబడి చెక్కులు అందించడం జరుగుతుందన్నారు. 6వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు అందచేయడం జరిగిందని, రైతులు ఎవరూ వచ్చినా వెంటనే డబ్బులు అందచేసే విధంగా చూడాలని బ్యాంకులను కోరారు. ఈ పథకం కోసం రూ. 12వేల కోట్లు బడ్జెట్ కేటాయించిన ఘనత ప్రభుత్వానిదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని..కేంద్రం అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలని..ఇప్పుడున్న ధరలో నాలుగో వంతు పెంచి మద్దతు ప్రకటించాలని..సభలో తీర్మానాలు చేశారు. కూలీలకు ఇచ్చే డబ్బును సగం ప్రభుత్వం భరించాలి..సగం రైతు భరించాలని సూచించారు.

పాస్‌పుస్తకాల్లో పట్టాదారు పేరే ఉంటుంది కానీ అనుభవదారు పేరుండదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో పాస్‌బుక్కులు తీసుకోవద్దన్నారు. కౌలు రైతులకు డబ్బు ఇవ్వమని సీఎం తెలిపారు. నిధులు దుర్వినియోగం కావొద్దని, డబ్బు రైతుకే అందాలన్నారు. రైతు సమన్వయ సమితి సభ్యులు చెక్కుల పంపిణీలో ఇబ్బందులను పరిష్కరించాలని సీఎం సూచించారు. జూన్ 2 నుంచి రైతులకు 5లక్షల బీమా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. దేశంలో ధనికులైన రైతులున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవాలని సీఎం ఆకాంక్షించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే మూడు పంటలు పండించవచ్చని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే కోటి ఎకరాలకు సాగునీరందుతుందన్నారు.జూన్ 2వ తేదీన మండలంలోనే రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని, ఎమ్మార్వో దీనికి బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ కాగితాలు కొరియర్ లో వస్తాయని, ధరణి అనే వెబ్ సైట్ భూముల వివరాలు కనిపిస్తాయన్నారు. పాస్ పుస్తకాలు కుదువ పెట్టుకుని రుణాలు ఇచ్చే పరిస్థితి ఉందని, ఈ పరిస్థితి ఇక కొనసాగదన్నారు. అగ్రకులాల్లో ఉన్న పేదలకు ఎలాంటి మేలు చేయాలనే దానిపై ఆలోచిస్తామని సభలో వెల్లడించారు. ఇంకా ఏమి మాట్లాడారో వీడియో క్లిక్ చేయండి. 

కౌలు రైతులకు పెట్టుబడి సహాయం లేదన్న కేసీఆర్...

కరీంనగర్ : కౌలు రైతులకు 'రైతు బంధు' పథకం ఎట్లాంటి పరిస్థితుల్లో అమలు చేయమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరాఖండిగా చెప్పారు. ప్రభుత్వానికి అలాంటి అవసరం లేదని..భూమి ఎవరి పేరు మీద ఉందో అలాంటి రైతుకు మాత్రమే ఈ పెట్టుబడి సహాయం అందచేయడం జరుగుతుందన్నారు. 

తెలంగాణ నెంబర్ వన్ - కేసీఆర్...

కరీంనగర్ : 24గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఇచ్చేది దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  తెలిపారు. అంగన్ వాడీ..వృద్ధులు..వితంతవులు..హోం గార్డులకు అత్యధిక వేతనం..కులాల..మతాలు లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్వహించడం జరుగుతోందన్నారు. 20 శాతం సొంత ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని పేర్కొన్నారు. 

 

12:44 - May 10, 2018

కరీంనగర్ : జిల్లా అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతోందని మరింత అభివృద్ధికి రూ. 500 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. రైతులకు పాసు పుస్తకాలు, పెట్టుబడి సాయం చెక్కులను పంపిణీ కార్యక్రమం జిల్లాలోని హుజురాబాద్ నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఈటెల మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి ఈటెల పేర్కొన్నారు. 24గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం జరుగుతోందని, 12వేల కోట్ల రూపాయలు 58 లక్షల రైతాంగానికి అందించడం జరుగుతోందన్నారు. తెలంగాణ ఉద్యమం కరీంనగర్ జిల్లా నుండి ప్రారంభమైందని, రైతు బంధు పథకం కూడా ఇక్కడి నుండే ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. 

రూ. 500 కోట్లు ఇవ్వాలన్న మంత్రి ఈటెల...

కరీంనగర్ :  జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయడం జరుగుతోందని మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. అందులో భాగంగా రూ. 500 కోట్ల నిధులను జిల్లాకు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ను కోరారు. 

సభా ప్రాంగణానికి చేరుకున్న కేసీఆర్...

కరీంనగర్ : జిల్లాలోని హుజూరాబాద్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. రైతు బంధు పథకం ఆయన ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. 

న్యాయవాదుల ఆందోళన..బస్సుకు నిప్పు...

అలహాబాద్ : ఓ ప్రాంతంలో న్యాయవాది హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. ఘటనను నిరసిస్తూ న్యాయవాదులు ఆందోళన చేపడుతున్నారు. బస్సుకు నిప్పు పెట్టారు. 

11:49 - May 10, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు వేర్వేరుగా లేఖలు రాశారు. చమురు ధరల తగ్గింపు, ఉపాధి హామీ వేతనాల చెల్లింపు వ్యత్యాసాలపై లేఖలు రాశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కు రాసిన లేఖలో కోరారు. క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా చమురు ధరలు తగ్గడం లేదని తెలిపారు. ఉపాధి హామీ వేతనాల చెల్లింపులో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై కేంద్ర మంత్రి తోమర్ కు లేఖ రాశారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో తక్కువ వేతనం చెల్లిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా వేతనం చెల్లించాలని కోరారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఎన్టీఆర్ స్టేడియానికి పవన్...

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ భారీగా, అభిమానులు, జనసేన కార్యకర్తలు చేరుకున్నారు. వైబ్రేషన్స్ కలాం పేరిట భారీ జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించనున్నారు. 

అధికారం మాదే - రాహుల్...

బెంగళూరు : కర్నాటక రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్న నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. తమ విజన్ ఏంటో మేనిఫెస్టోలో వివరించడం జరిగిందని, బీజేపీ మేనిఫెస్టోలో కొత్త అంశాలు లేవన్నారు. 

నిర్మాత సురేష్ బాబు తనయుడికి బెదిరింపులు...

హైదరాబాద్ : నిర్మాత సురేష్ బాబు తనయుడికి బెదిరింపులు వచ్చాయి. దగ్గుపాటి అభిరామ్ పొగొట్టుకున్న సెల్ ఫోన్ లో ఫొటోలు, వీడియోలు లీక్ చేయకుండా ఉండాలంటే రూఐ. 1.5 కోట్లు ఇవ్వాలని దుండగులు ఈ మెయిల్ పంపారు. దీనితో నిర్మాతన సురేష్ బాబు సీపీని ఆశ్రయించారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. నాగ వెంకటసాయి, కార్తీక్, రఘురామ్ శర్మ, చంద్రకిషోర్ లు అరెస్టయిన వారిలో ఉన్నారు. 

11:10 - May 10, 2018

బెంగళూరు : మోడీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్న సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో మోడీ కామెడీ షోలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అమిత్ షా, బీజేపీ నాయకులంతా మాటలు చెబుతున్నారు కానీ పాలన గురించి మాట్లాడకుండా రాహుల్ పై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. మోడీ విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తూ తమకు ఓటేస్తారని, తమ ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. తమ కార్యక్రమాలను ప్రజలకు చెప్పడం జరుగుతోందని, అన్ని వర్గాల ప్రజలకు లాభం కలిగేలా తమ పాలన కొనసాగిస్తామన్నారు.

 

11:08 - May 10, 2018

బెంగళూరు : కర్నాటక రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్న నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. తమ విజన్ ఏంటో మేనిఫెస్టోలో వివరించడం జరిగిందని, బీజేపీ మేనిఫెస్టోలో కొత్త అంశాలు లేవన్నారు. తమ మేనిఫెస్టోను కాపీ కొట్టిందని తెలిపారు. సీబీఐని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్ గా మార్చారని, బీజేపేది ఓట్ల రాజకీయమని విమర్శించారు. కర్నాటకు ఏం చేస్తుందో బీజేపీ ఏ మాత్రం చెప్పలేని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని చెప్పారు. అబద్ధపు హామీలతో ప్రజలను బీజేపీ మోసం చేస్తోందని, రాఫెల్ డీల్ తో బీజేపీ నేతలే లాభపడ్డారని ఆరోపించారు. 

10:30 - May 10, 2018

కర్నూలు : ఏపీలో లంచగొండి అధికారులు పెరిగిపోతున్నారు. ఏసీబీ అధికారులు దాడులు చేస్తూ లంచాలు తీసుకుంటున్న...అక్రమ ఆస్తులు కలిగి ఉన్న వారిని కటకటాల్లోకి నెడుతున్నా ఇతరుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఎండోమెంట్ ఈవో నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నంద్యాల ప్రాంతంలో ఎండోమెంట్ ఈవోగా పనిచేస్తున్న వీరయ్య అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. దీనితో గురువారం ఆయన నివాసంపై దాడులు జరిపారు. అంతేగాకుండా ప్రకాశం, కడప జిల్లాలో కూడా దాడులు నిర్వహిస్తున్నారు. భారీగా బంగరాం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సుమారు రూ. 8 కోట్ల మేర ఆస్తులున్నట్లు తెలుస్తోంది. వీరయ్యకు బినామీగా భార్య..బంధువులున్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. 

10:27 - May 10, 2018

విశాఖపట్టణం : పండ్లలో రారాజుగా పిలవబడే మామిడి పండు అంటే ఇష్టపడని వారుండరని చెప్పవచ్చు. ఎండకాలంలో వచ్చే మామిడి పండ్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తుంటారు. కానీ వ్యాపారులు మాత్రం ఈ మామిడి పండ్లు త్వరగా మగ్గాలని విష పూరిత రసాయనాలు ప్రయోగిస్తున్నారు. వీటిని తిన్న వారికి అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా వ్యాపారులు అదే విధంగా చేస్తున్నారు. ఇలాగే చేసిన మామిడిపండ్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పాయకరావు పేట నియోజకవర్గంలో మామిడిపండ్లకు విష రసాయనాలు ప్రయోగించి మగ్గపెడుతున్నారని విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీనితో పాయకరావుపేట నియోజకవర్గంలోని పలు గౌడోన్స్ లపై గురువారం దాడులు నిర్వహించారు. విషపూరిత రసాయనాలు ప్రయోగించి మగ్గబెడుతున్న పది టన్నుల మామిడిపండ్లను స్వాధీనం చేసుకున్నారు. 

మార్కిస్టు మేధావి పొట్లూరి వెంకటేశ్వరరావు కన్నుమూత...

హైదరాబాద్ : సీపీఎం సానుభూతి పరులు, మార్కిస్టు మేధావి పొట్లూరి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఆయన మృతికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదిర్శ తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావులు సంతాపం తెలిపారు. 

నంద్యాలలో ఏసీబీ దాడులు..

కర్నూలు : నంద్యాలలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఈవో వీరయ్య ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణలున్నాయి. 

పిలిస్తే పలకలేదని గొంతు కోశారు...

కర్నూలు : నంద్యాల దేవ్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. రవీంద్ర అనే యువకుడిపై దుండగులు దాడి చేసి గొంతు కోశారు. కేవలం పిలిస్తే పలకలేదని ఈ ఘాతకానికి ఒడిగట్టారు. 

10:12 - May 10, 2018

హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో సందడి నెలకొంది. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడకు రానున్నారు. దీనితో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా చేరుకున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో వైబ్రేషన్స్ కలాం పేరిట భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. ఈ జెండాను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించనున్నారు. గిన్నిస్ బుక్ రికార్డులో భాగంగా జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. 122 అడుగుల పొడవు 183 వెడల్పుతో ఈ జెండా ఉంది. ఈ సందర్భంగా నిర్వాహకులు..ఇతరులతో టెన్ టివి ముచ్చటించింది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

10:11 - May 10, 2018

ఎన్టీఆర్ స్టేడియానికి పవన్...

హైదరాబాద్ : సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ స్టేడియానికి రానున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో వైబ్రేషన్స్ కలాం పేరిట భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. ఈ జెండాను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించనున్నారు.

09:33 - May 10, 2018

బెంగళూరు : కర్నాటక రాష్ట్ర ఎన్నికలు కొద్ది రోజుల్లో జరుగనున్నాయి. రాష్ట్రంలో బాగేపల్లి నియోజకవర్గం ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడి నుండి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాం రెడ్డి బరిలో నిలిచారు. ఇప్పటికే ఈ నియోజకవర్గానికి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. ప్రజల మనిషిగా పేరు గడించిన ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ సందర్భంగా శ్రీరాంరెడ్డితో టెన్ టివి ముచ్చటించింది. ఈసారి ఎన్నికలు జరిగే ఎన్నికలను..రాజకీయాలను వ్యాపారంగా మారుస్తున్న వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఇంకా ఎలాంటి విశేషాలు వెల్లడించారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

09:27 - May 10, 2018

విజయవాడ : 'మహానటి' సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'మహానటి' సినిమాకు అద్భుత రెస్పాన్స్ వస్తోందని నిర్మాత అశ్వినీదత్ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చిత్ర బృందం, సావిత్రి కుమార్తె చాముండేశ్వరీ నాథ్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ లు మాట్లాడారు. 18 నెలలు కష్టపడి సినిమా తీయడం జరిగిందని, ఈ సినిమాకు సావిత్ర కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిదన్నారు. సావిత్రి జీవిత కథను తెరకెక్కించడం తన చిరకాల కోరిక అని తెలిపారు. అమ్మ ఎదిగిన తీరును సినిమాలో చూడడం ఆనందంగా ఉందని, అమ్మ పాత్రలో కీర్తి సురేష్ చాలా చక్కగా నటించిందని చాముండేశ్వరీ మెచ్చుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో సావిత్రి గొప్ప నటి అని మాణిక్య వరప్రసాద్ తెలిపారు. 

09:08 - May 10, 2018

బెంగళూరు : మరోసారి అధికారం చేజిక్కించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు..రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ...ఎక్కువ సీట్లు సాధించాలని జేడీఎస్..ఇదంతా కర్నాటక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు. కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 223 స్థానాలకు జరిగే ఎన్నికలకు 59 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. దీనితో ప్రధాన పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. బీజేపీ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..అమిత్ షా..ఇతర కీలక నేతలు..కాంగ్రెస్ నుండి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రచారం నిర్వహించనున్నారు. గురువారం పది గంటలకు సిద్ధరామయ్యతో కలిసి రాహుల్ ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు.

మరోవైపు కర్నాటక రాష్ట్రంలో జరిగే ఎన్నికలు అత్యంత ఖర్చుతో కూడుకున్నవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనిపై ఈసీ గట్టి నిఘానే వేసింది. మొత్తంగా రూ. 600 కోట్ల నగదును ఈసీ స్వాధీనం చేసుకోవడంతో ఎలాంటి డబ్బు ప్రభావం ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఓటర్లు ఎలాంటి తీర్పునివ్వనున్నారో తెలుసుకోవాంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. 

ఇసుక తుఫాన్ తో 11 మంది మృతి...

ఢిల్లీ : ఇసుక తుఫాన్ కారణంగా 11 మంది మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. ఆగ్రా, మథుర, అలిఘడ్, ఫిరోజాబాద్, కాన్పూర్ రూరల్ జిల్లాలో బుధవారం ఇసుక తుఫాన్ సంభవించిన సంగతి తెలిసిందే. 

08:33 - May 10, 2018

ఢిల్లీ : గవర్నమెంట్‌ బిజినెస్‌ ఆఫ్‌ మెగాసాఫ్ట్‌ లిమిటెడ్‌ సంస్థ హెడ్‌... అనుపం త్రిపాఠీ.. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థలో చేరారు. భారత దేశంలో తొట్టతొలుతగా ప్రారంభించిన వర్చువల్‌ నెట్‌వర్క్‌ ఆపరేషన్స్‌లో తిరుపతి కీలక భాగస్వామి. బిఎస్‌ఎన్‌ఎల్‌తో కలసి ఆయన విఎన్‌ఓ కోసం పనిచేశారు. ఇదే క్రమంలో మెగాసాఫ్ట్‌ సంస్థ కూడా.. నిరుడు, దేశంలోనే తొలి వర్చువల్‌ నెట్‌వర్క్‌ ఆపరేషన్‌ను, యాడ్‌పేతో కలిసి ప్రారంభించింది. అంతేకాదు.. అనుపం త్రిపాఠీ సారథ్యంలో.. మెగాసాఫ్ట్‌ సంస్థ.. బీహార్‌ ప్రభుత్వపు ప్రతిష్టాత్మక ఈ-గవర్నెన్స్‌ క్లౌడ్‌ను దక్కించుకుంది. విఎన్‌ఓలో విశేష అనుభవం ఉన్న త్రిపాఠీ.. మెగాసాఫ్ట్‌ను వీడి, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఎల్‌ఎల్‌పీలో అడ్వైజరీ టీమ్‌ సభ్యుడిగా చేరారు. 

08:07 - May 10, 2018

జగిత్యాల : ధర్మపురిలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో రామగుండంకు చెందిన సత్యనారాయణగౌడ్ మృతి చెందాడు. ఇతను టిపిసిసి ఓబీసీ సెల్ జాయింట్ కన్వీనర్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కమలాపూర్ లో ఎల్లమ్మ పట్నాల కార్యక్రమానికి ఇతను హాజరయ్యారు. ధర్మపురిలోని సత్య వైన్స్ వద్ద మద్యం కొనుగోలు చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. రెండు బుల్లెట్లు శరీరంలోకి దూసుకపోవడంతో సత్యనారాయణ గౌడ్ అక్కడికక్కడనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపు చనిపోయాడు. తనకు ప్రాణహానీ ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ది గంటల్లోనే ఈ హత్య జరిగింది. ముంబైలో జరిగిన గొడవల కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

కొండగట్టులో హనుమాన్ జయంతి...

జగిత్యాల : కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి. 

బాగల్ కోటలో రోడ్డు ప్రమాదం...

కర్నాటక : బాగల్ కోటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసు జీపును లారీ ఢీకొట్టడంతో డీఎస్పీ, సీఐ, డ్రైవర్ మృతి చెందారు. బెంగళూరు నుండి బాగల్ కోటకు ఎన్నికల డ్యూటీ కోసం వెళుతున్నారు. 

నేడు రాహుల్ ప్రెస్ మీట్...

ఢిల్లీ : నేడు ఉదయం 10గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. కర్నాటక ఎన్నికలకు సంబంధించిన వాటిపై మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. 

యాప్ ద్వారా మాట్లాడనున్న మోడీ...

ఢిల్లీ : కర్నాటక ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. అందులో భాగంగా నేడు యాప్ ద్వారా కార్యకర్తలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడనున్నారు. ఆరు రోజుల్లో 21 చోట్ల ర్యాలీలు చేపట్టారు. 

కరీంనగర్ లో ట్రాఫిక్ ఆంక్షలు...

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు రానున్నారు. రైతు బంధు పథకాన్ని ఆయన హుజూరాబాద్ లో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. 

చార్ ధామ్ యాత్ర ప్రారంభం...

డెహ్రాడూన్ : మంచు వర్షం తగ్గిపోవడ...వాతావరణం అనుకూలించడంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. ప్రధానదారులను పునరుద్ధరించారు. యాత్రలో భాగంగా భక్తులు..కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యుమునోత్రి ఆలయాలను సందర్శించనున్నారు. 

కర్నూలులో బాబు పర్యటన...

కర్నూలు : జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం కానున్నారు. బైరాజ్ ఇస్పాత్ ఐరన్ పరిశ్రమకు బాబు శంకుస్థాపన చేయనున్నారు. 

కాంగ్రెస్ లోకి వంటేరు ప్రతాప్ రెడ్డి ?

హైదరాబాద్ : తెలంగాణ టిడిపి నేత వంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

07:19 - May 10, 2018

తెలంగాణలో.. రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించిన రైతు బంధు కార్యక్రమానికి ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టనుంది. దీనికి రాష్ట్రమంతటా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పథకం కింద ఆర్‌.ఓ.ఎఫ్‌.ఆర్‌. పట్టాలున్న సుమారు లక్షమంది రైతులకూ లబ్ది చేకూరనుంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చలో నంద్యాల నర్సింహరెడ్డి (సీపీఎం), పున్నా కైలాష్ (కాంగ్రెస్), మన్నె గోవర్ధన్ రెడ్డి (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:54 - May 10, 2018

అందరికీ ఉచిత విద్య ఇది సాధారణంగా వినిపించే ప్రభుత్వ నినాదం. కానీ ఆచరణలో మాత్రం పాలకులు దీన్ని పట్టించుకునే పాపాన పోరు. ఉచిత విద్య నందించే ప్రభుత్వ విద్యాలయాలు ప్రస్తుతం సమస్యల వలయాలుగా ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభానికి రోజులు దగ్గర పడుతున్న ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు మాత్రం భర్తీ కావడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వ అలసత్వానికి కారణమేమిటి ప్రభుత్వం తన బాధ్యతనుంచి తప్పుకోవడంలో ఆతర్యం ఏమిటి అనే అంశం పై టెన్ టివి జనపథంలో యూటీఎఫ్‌ ఏపీ ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:50 - May 10, 2018

నల్గొండ : ఇటీవల కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులకు నల్లగొండ జిల్లాలో పండ్లతోటలు నేలమట్టం అయ్యాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్ ధర స్థిరంగా ఉంటుండంతో.. ఇన్నాళ్ల తమ కష్టానికి ప్రతిఫలం లభింస్తుందనుకున్న రైతుల ఆశలు అకాలవర్షంతో గల్లంతయ్యాయి.. వేలాది ఎకరాల తోటల్లోని చెట్లు నేలరాలి.. రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. కాపుతో పాటు చెట్లు కూడా నేలపాలు కావడంతో.. రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఐదేళ్ళపాటు పసిపాపలాగా పెంచిన పండ్లతోటలు... ఇటీవల కురిసిన అకాల వర్షాలు.. భారీ ఈదురుగాలులకు నేలమట్టమయ్యాయి. నల్లగొండ జిల్లాలోని వేలాది ఎకరాల్లోని పండ్ల తోటలకు అకాల వర్షాలతో నష్టం వాటిల్లింది. ఎన్నడూ లేని విధంగా ఈదురుగాలులకు చెట్లు వేర్లతో సహా కూలిపోయాయి. దీంతో సుమారు పదేళ్ల తమ శ్రమ.. ఇరవైఏళ్ళ ఏళ్ల భవిష్యత్ కళ్లముందే కుప్పకూలిపోవడంతో విలవిల్లాడిపోతున్నారు అన్నదాతలు.

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు డెబ్బై వేల ఎకరాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయి. బత్తాయి, నిమ్మ, మామిడి తోటల సాగు అరవై ఒక్క వేల ఎకరాలకు పైగా విస్తరించింది. ఇటీవలి అకాల వర్షానికి ఏడువేలా మూడు వందల ఎకరాల్లో పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. అందులో అధికంగా ఐదువేలా ఐదు వందల ఎకరాల్లో నిమ్మతోటలు, పదమూడు వందలా యాభైమూడు ఎకరాల్లో మామిడి, రెండు వందల ఎకరాల్లో బత్తాయికి నష్టం వాటిల్లింది. కట్టంగూరు, నకిరేకల్, క్లస్టర్ లో నిమ్మతోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కో తోటకు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకూ చెట్లు వేర్లతో సహా కుప్పకూలాయి.

ఇరవై ఏళ్ళ భవిష్యత్ ఉన్న చెట్లు నేల కూలడంతో తమ భవిష్యత్తే అంధకారంగా మారిందని రైతాంగం ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ .. సొంత జిల్లాలో సమస్యలపట్ల అయితేనే వేగంగా స్పందిస్తున్నారని.. ఇతర జిల్లాలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. నేలకూలిన చెట్లను లెక్కించి.. ప్రతీ చెట్టుకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కో చెట్టుకు ఐదువేల వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

పలుచోట్ల అకాల వర్షాలకు దెబ్బతిన్న పండ్లతోటలను రైతుసంఘాల నేతలు పరిశీలించారు. రైతాంగానికి తీవ్రంగా నష్టం కలిగిందని రైతుసంఘాల నేతలు అన్నారు. పెట్టుబడితో పాటు.. వాటితో పాటు ఇరవై ఏళ్ల కాపు నష్టపోయారని తెలిపారు. చెట్ల లెక్కన రైతుకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యానశాఖ అదికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి.. వాస్తవ నష్టాన్ని అంచనా వేయాలని రైతుసంఘాల నేతలు కోరుతున్నారు. నిమ్మ, బత్తాయి రైతులకు నష్టం వాటిల్లితే కేవలం ఎకరాల ఆధారంగా నష్ట పరిహారం చెల్లిస్తారని..

జిల్లాలో నిమ్మ, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ సంగీత లక్ష్మీ తెలిపారు. నకిరేకల్ క్లస్టర్ లో నిమ్మతోటల నష్ట తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. మునుగోడు, కనగల్, నల్లగొండ మండలాల పరిధుల్లో మామిడితోటలకు ఎక్కువగా నష్టం వాటిల్లిందన్నారు. విపత్తు నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం పండ్ల తోటలకు ముప్పై మూడు శాతం కంటే ఎక్కువగా నష్టం వాటిల్లితే.. నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎకరాకు ఏడు వేలా రెండు వందల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలన్న నిబంధనలు ఉన్నాయన్నారు. కానీ రైతులు చెట్ల ప్రకారం నష్టపరిహారాన్ని డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వానికి పంపుతామని జిల్లా ఉద్యానశాఖ అధికారి సంగీతలక్ష్మీ తెలిపారు. రైతాంగం అడిగినంత మేర నష్టపరిహారాన్ని ఇవ్వకున్నా.. కనీసం సగం కాపును లెక్కలోకి తీసుకున్నా.. చెట్టును యూనిట్ గా తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.. తాజా డిమాండ్ ను ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు రైతులు.

06:46 - May 10, 2018

కృష్ణా : ప్రభుత్వాలు మారుతున్నా.. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ఓడరేవు  మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు సాగడంలేదు..టీడీపీకి హామీలు ఇవ్వడంలో ఉన్న శ్రద్ధ.. వాటిని అమలు చేయడంలో లేదంటూ స్థానికులు విమర్శిస్తున్నారు.. బందరు పోర్టుపై స్థానికులు పెట్టుకున్న ఆశలు టీడీపీ ప్రభుత్వ హయాంలో తీరేలా లేదంటున్నారు. సముద్ర మార్గాలు సమీపంలోనే ఉన్నా.. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ఏపీ పాలకులు విఫలం అవుతున్నారు.. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ, కాకినాడ ఓడరేవులకు మంచి దేశంలోనే మంచి గుర్తింపు ఉంది. ఈ దశలో మచిలీపట్నం ఓడరేవును కూడా అభివృద్ధి చేస్తే.. రాష్ర్టం మరింతగా అభివృద్ధి చెందడంతోపాటు.. అటు తెలంగాణకు కూడా ఉపయుక్తం కానుంది. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ బందరు పోర్టు అభివృద్ధి, ఇతర నిర్మాణంలో భాగస్వాములం అవుతామని పేర్కొన్నారు. కానీ.. ఏపీ ప్రభుత్వమే బందరు పోర్టు నిర్మాణంపై దృష్టిసారించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పోర్టు కోసం ఐదు వేలా మూడు వందల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా.. వీటిలో ప్రభుత్వ అసైన్డ్ భూములు 3014 ఎకరాలున్నాయి. మిగిలినవి పట్టా భూములున్నాయి. ప్రభుత్వ అసైన్డ్ భూములను ఇప్పటికే కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు అప్పగించారు. ప్రైవేట్ భూములకు సంబంధించి భూ సమీకరణ ద్వారా ఏడు వందలా యాభై ఎకరాలకు రైతుల నుంచి అంగీకారం పొందారు. మిగతా పదిహేనువందల ఎకరాలకుపైగా భూముల కోసం భూ సమీకరణతోపాటు భూ సేకరణపై దృష్టిసారించారు.

ప్రభుత్వ హామీతో రుణాలు ఇచ్చేందుకు కొన్ని బ్యాంకులు ముందుకొచ్చాయి. దీన్ని మంత్రివర్గంలో కూడా ఆమోదింపచేశారు. భూ సేకరణకు అవసరమైన ఆరు వందల కోట్లతో పాటు... కంటెయినర్ కార్పొరేషన్‌కు ఇచ్చే వెయ్యి ఎకరాల భూములకు మూడు వందల కోట్లు పోర్టుకు అనుసంధానించనున్నారు. రోడ్లు, రైల్వేలైన్ల కనెక్టవిటీకి రూ.150 కోట్లు, పోర్టు భూముల గ్రామాల్లో ఆర్.ఆర్.యాక్ట్ అమలుకు నలభై రెండు కోట్లు వివిధ బ్యాంకుల నుంచి రుణం పొందే అవకాశాన్ని కేబినెట్ కల్పించనుంది. ఇందుకు మొత్తంగా రూ వెయ్యికోట్లకు పైగా కోట్లు ప్రభుత్వ హామీతో మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ రుణాలు పొందాలని చూస్తున్నారు.

తాము అధికారంలోకి రాగానే పోర్టు నిర్మాణంపై దృష్టిసారిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినా అభివృద్ధి మాత్రం జరగకపోవడంతో బందరు వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోర్టు అభివృద్ధి చెందితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఆశిస్తున్నా. అవేవీ ఆచరణకు నోచుకోకపోవడంతో తీరంలోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు మాటకు కట్టుబడి.. ఇచ్చిన హామీల నెరవేర్చాలని అంటున్నారు. వెంటనే ఓడరేవు నిర్మాణం పూర్తి బందరు ప్రజల్లో ఆనందాన్ని నింపాలని కోరుతున్నారు. 

06:42 - May 10, 2018

హైదరాబాద్ : అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్మికవర్గాల్లో క్రమంగా పట్టు కోల్పోతున్నట్టు కనిపిస్తోంది. ఆర్టీసీలో టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమైంది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం సమ్మె నోటీసు ఇవ్వడం ద్వారా టీఆర్‌ఎస్‌, టీఎంయూ మధ్య అంతరం పెరిగినట్టు భావిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయంగా పట్టు సాధించిన టీఆర్‌ఎస్‌ కార్మిక సంఘాల్లో కూడా తనదైన ముద్ర వేసుకుంది. బలమైన కార్మికోద్యమంలో పట్టు సాధించి, తన ఆధిపత్యాన్ని నిరూపించుకొంది. RTC లాంటి పెద్ద సంస్థల్లో కూడా సత్తా చాటింది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత క్రమంగా ఆ పట్టు కోల్పోతున్న సంకేతాలు కార్మిక సంఘాల నుంచి వస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఏర్పాటైన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ టీఆర్‌ఎస్‌కు అనుంబంధ కార్మిక సంఘంగా అవతరించింది. ఇప్పుడు టీఎంయూ, టీఆర్‌ఎస్‌ మధ్య అంతరం పెరుగుతోంది. ఉద్యమ సమయంలో గులాబీ దళపతికి అండగా నిలిచిన ఈ సంఘం... ఇప్పుడు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరిస్తోంది. కార్మిక శ్రేయస్సు కోసం తాము పోరాటం చేస్తామని టీఎంయూ ప్రకటించడం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి హరీశ్‌రావు గౌరవాధ్యక్షుడుగా ఉన్న టీఎంయూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.

RTC కార్మికుల డిమాండ్ల సాధనకోసం ఇటీవల నిర్వహించిన బస్ భవన్ ముట్టడి సందర్బంగా చోటు చేసుకున్న పరిణామాలు అధికార పార్టీ నేతలను కలవరానికి గురి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరినా.....ఆ ఫలాలు కార్మికులకు అందలేదన్నది టీఎంయూ నేతలు ఆరోపణ. ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద కార్మికులు ఆధార పడడంలేదని....మీ అవసరం మాకు ఎంతో... మా అవసరం కూడా మీకు అంతే ఉంటుందని టీఎంయూ నేతలు వ్యాఖ్యానించడం ఆలోచించిదగ్గ పరిణామంగా భావిస్తున్నారు. ఉద్యమ నేత కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నా....ఉద్యమకారుల సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతున్నారు. ఈ విషయంలో TMU నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేనికి సంకేతమో అన్న అనుమానాలు వ్యక్తవుతున్నాయి.

మంత్రి హరీశ్‌రావుకు ప్రభుత్వంలో ప్రాధాన్యం తగ్గుతుందన్న ప్రచారం ఊపందుకోవడం.... అదే సమయంలో మరో ఉద్యమ నేత కోదండరామ్ టీజేఎస్‌ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ... ప్రభుత్వంపై తిరుగుబాటుకు పావులు కదపడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వానికి పూర్తి స్థాయి అండదండలు అందించిన కార్మిక సంఘం ఎన్నికలకు ముందు ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచడం రాజకీయంగా టీఆర్‌ఎస్‌కు ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. 

06:39 - May 10, 2018

విజయవాడ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బస్సు యాత్రకు బయలుదేరనున్నారు. 2019 ఎన్నికలకు సిద్ధమవుతున్న జనసేనాని ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచించారు. గ్రామ స్వరాజ్యం పేరుతో ఈనెల 15 నుంచి బస్సు యాత్ర చేయనున్నారు. ఇందుకోసం సకల సౌకర్యాలతో ప్రత్యేక వాహనం సిద్ధమైంది. జనసేనాని బస్సు యాత్ర రూట్‌ను పార్టీ నాయకులు ఖరారు చేసే పనిలో ఉన్నారు. యాత్ర వివరాలను ఈనెల 11న పవన్‌ కల్యాణ్‌ ప్రకటించే అవకాశం ఉంది. మే 15 బస్సు యాత్ర ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిదశలో రాయలసీమ నుంచి ప్రారంభించి గుంటూరు జిల్లా పల్నాడు వరకు కొనసాగించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత మలి విడత పర్యటన ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

బస్సు యాత్ర పర్యవేక్షణ బాధ్యతలను కొందరు నేతలకు అప్పగించారు. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల యాత్రను మారిశెట్టి రాఘవయ్య పర్యవేక్షిస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, ప్రకాశం జిల్లా టూర్‌ పర్యవేక్షణ బాధ్యతలను భానుకు అప్పగించారు. అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లా బస్సు యాత్రను పార్థసారధి పర్యవేక్షిస్తారు. పవన్‌ బస్సు యాత్రకు సకల సౌకర్యాలతో కూడిన ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేశారు. బస్సు యాత్ర సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ గ్రామాల్లో బస చేసే అవకాశాలు ఉన్నాయి. జిల్లాల్లో పర్యటించిన జనసైనికులు ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు అద్యయనం చేసి రూపొందించిన నివేదికలను పవన్‌కు అందించారు. ఇంతకాలంగా గ్రామీణ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి పాలక, ప్రతిపక్షాలు ఎంతవరకు కారణమన్న అంశాన్ని జనసేనాని ప్రజల దృష్టికి తీసుకెళ్తారు. 

06:36 - May 10, 2018

మెదక్ : ఎన్నికల ఏడాదిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నదాతలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. రైతుబంధు పథకం కింది పెట్టుబడి సాయం అందిస్తున్న కేసీఆర్‌.. ఇప్పుడు నీటి తీరువా బకాయిలు రద్దు చేశారు. భవిష్యత్‌లో అన్నదాతల నుంచి నీటి తీరువా వసూళ్లు ఉండవని మెదక్‌ సభలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7 నుంచి 8 వందలకోట్ల రూపాయల నీటి తీరువా బకాయిలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన కేసీఆర్‌.. ఇకపై తెలంగాణలో నీటితీరువా వసూళ్లు ఉండవన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, కాల్వలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పారు.

వచ్చే నెల 2 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ విధానం అమలు చేయనున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. భూములు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ల్యాండ్‌ మ్యుటేషన్‌ కోసం ఏ ఆఫీసుకు వెళ్లాల్సిన పనిలేకుండా ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ పత్రాలు, పట్టాదారు పాస్‌ బుక్‌లు కొరియర్‌ ద్వారా ఇంటికి పంపించే ఏర్పాటు చేసినట్టు కేసీఆర్‌ చెప్పారు.

మరోవైపు దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ మరోసారి చెప్పారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా... ప్రజలకు తాగడానికి నీరులేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజల వెనుకబాటుకు కాంగ్రెస్‌ ,బీజేపీలే కారణమని విమర్శించారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌ కేంద్రంగా కొత్త బస్సు డిపో మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. మిషన్‌ భగీరథ ద్వారా ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి మెదక్‌ జిల్లాలో ఇంటింటికి నల్లా నీరు అందిస్తామని చెప్పారు. మెదక్‌ సభలకు రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు భారీగా తరలివచ్చారు. 

జగిత్యాలలో కాల్పుల కలకలం...

జగిత్యాల : జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించింది. ధర్మపురం వైన్స్ షాపు వద్ద సత్యనారాయణ గౌడ్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అక్కడికక్కడనే సత్యనారాయణ గౌడ్ మృతి చెందాడు. 

ఐపీఎల్ లో ...

ఢిల్లీ : ఐపీఎల్ 11 మ్యాచ్ లో భాగంగా నేడు ఢిల్లీ జట్టుతో హైదరాబాద్ సన్ రైజర్స్ తలపడనుంది. రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

జగ్గయ్యపేటలో రోడ్డు ప్రమాదం...

కృష్ణా : జగ్గయ్యపేట (మం) శేర్ మహ్మద్ పేట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ - కారు ఢీకొంది. ఒకరు మృతి చెందగా ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.  

రైతు బంధు చెక్కుల పంపిణీ...

హైదరాబాద్ : రైతుబంధు చెక్కుల పంపిణీకి సర్వం సిద్ధమైంది. గురువారం కరీంనగర్‌లో సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. 1,40,98,486 ఎకరాలకు పెట్టుబడి సాయం జరుగనుంది. ఎకరాకు రూ.4 వేలు పంపిణీ, యాసంగి పంటలకు మరో నాలుగు వేల రూపాయలు ఇవ్వనుంది. ప్రస్తుతం రూ.5,608 కోట్లు పంపిణీకి సిద్ధం చేశారు. ఈనెల 17 వరకూ రైతుబంధు కార్యక్రమం జరుగనుంది. 

తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ బెట్టింగ్ లు...

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ల జోరు కొనసాగుతోంది. క్రికెట్‌ మ్యాచ్‌లను తలదన్నే రీతిలో కోట్లాది రూపాయలు క్రికెట్‌ బెట్టింగ్‌లో చేతులు మారుతున్నాయి. బెట్టింగ్‌లతో యువత పెడదోవ పట్టడమే కాకుండా తమ విలువైన ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటూ తల్లిదండ్రులకు శోకం మిగులుస్తుండటం కలవరం రేపుతోంది.

ఫ్లిప్ కార్ట్ లో వాల్ మార్ట్...

ఢిల్లీ : అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్ భారత్‌లో అతిపెద్ద ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటా కొనుగోలు చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వాల్‌మార్ట్‌ భారత్‌లో తన రిటైల్ వ్యాపారాన్ని మరింత విస్తరించనుంది.

Don't Miss