Activities calendar

11 May 2018

21:47 - May 11, 2018

తూర్పుగోదావరి : జిల్లా ఐ.పొలవరం మండలంలో ఉద్రిక్త పరిస్థతి ఏర్పడింది. కేశనకుర్రు గ్రామంలో గతనెల 18న జరిగిన అంబేద్కర్‌ విగ్రహ ధ్వంసం ఘటన చిలికి చిలికి గాలివానగా మారింది. కొత్త విగ్రహాన్ని.. విగ్రహం ధ్వంసం అయిన ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. స్థానిక దళిత సంఘాలు ఛలో కేశనకుర్రుకు పిలుపునిచ్చాయి. గ్రామంలో భారీగా పోలీసులను మోహరించినప్పటికి, దళితులంతా ఒక్కసారిగా ఘటనాస్థలికి చేరుకోవడంతో.. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులకు, దళితులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు దళిత మహిళలను, యువకులను అరెస్ట్‌ చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

21:44 - May 11, 2018

హైదరాబాద్ : ఇద్దరూ ప్రేమించుకున్నారు... ఐదు సంవత్సరాలు కలిసి తిరిగారు.. ప్రియుడి మదిలో అనుమానపు బీజం పడింది. అంతే.. ప్రియురాలికి మరణశాసనాన్ని రాశాడు. పక్కా ప్రణాళికతో అత్యంత దారుణంగా ఆమెను హతమార్చాడు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రగతి రిసార్ట్స్‌లో డిగ్రీ విద్యార్థిని హత్యకు పూర్వరంగమిది.

శంకరపల్లిలోని ప్రగతి రిసార్ట్స్‌లో.. శిరీష దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలోని ప్రగతి రిసార్ట్స్‌లో.. డిగ్రీ విద్యార్థిని శిరీష దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడే ఆమె పాలిట యముడయ్యాడని తేల్చారు. నిందితుడు సాయిప్రసాద్‌.. శిరీష గతంలో ఒకే కాలేజీలో చదివారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఐదేళ్లుగా ప్రసాద్‌ శిరీషను ప్రేమిస్తున్నాడని, ఆమె పెళ్లికి నిరాకరించడమే కాకుండా.. మరో వ్యక్తితో చనువుగా ఉండడంతో ప్రసాద్‌ కసి పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. అయినా పదే పదే శిరీష వెంట పడుతుండేవాడని, ఈ క్రమంలోనే ఓసారి శిరీష తండ్రి.. ప్రసాద్‌ను మందలించాడని పోలీసు విచారణలో తేలింది. డిగ్రీ పూర్తయ్యాక.. బ్యాంకు పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న శిరీషను.. మాట్లాడాలంటూ బలవంత పెట్టి.. ప్రగతి రిసార్ట్స్‌కు తీసుకు వెళ్లిన ప్రసాద్‌.. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం.. కత్తితో శిరీష గొంతు కోసి చంపాడని.. పోలీసులు వివరించారు. కేసు దర్యాప్తులో భాగంగా.. మూడు బృందాలను రంగంలోకి దింపిన పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం నిందితుడిని అరెస్టు చేశారు. ఐసీపీ సెక్షన్‌ 302, 303 కింద కేసు నమోదు చేసి.. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. 

21:40 - May 11, 2018
21:39 - May 11, 2018

అమరావతి : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ వ్యూహాలకు పదునుపెట్టారు. ఏపీ రాజకీయాల్లోని కీలక నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రాయలసీమ నేతలపై దృష్టి సారించారు. కీలక నాయకులంతా రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కావడంతో పవన్‌ తన ఫోకస్‌ను రాయలసీమపై పెట్టినట్లు తెలుస్తోంది.

పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచిన పవన్‌ కళ్యాణ్
2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా.. ప్రజా సంకల్ప బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్రతో ప్రజల్లోకి వెళుతూనే.. కీలక నేతలను తమ పార్టీలో ఆహ్వానించేందుకు జనసేనాని రంగసిద్ధం చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లోని కీలక నేతలు ఎక్కువగా రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు ఉండడంతో సీమపై పవన్ ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు కూడా సీమ ప్రాంతానికి చెందిన వారు కావడంతో పార్టీని రాయలసీమ నుంచే బలోపేతం చేయడానికి జనసేనాని పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

భారీస్థాయిలో చేరికలు ఉండేటట్లు కార్యచరణ
ప్రజా సంకల్ప బస్సు యాత్రతో.. పార్టీలోకి భారీ సంఖ్యలో చేరికలు ఉండేటట్లు జనసేన పార్టీ కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలతో పవన్‌ ముఖాముఖి చర్చలు జరిపారు. వీరందరిని ప్రజా సంకల్ప బస్సు యాత్రలో పార్టీలో చేర్చుకునేందుకు పవన్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. హస్తం పార్టీలోని ఓ ప్రముఖ సీనియర్‌ నేత జనసేనానితో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన పార్టీ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు ఉన్న నేతలపై దృష్టి సారించినట్టు సమాచారం. 2019 ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టిపోటీ ఇచ్చేందుకు పవన్‌ కళ్యాణ్ వ్యూహాత్మకంగా సమాలోచనలు చేస్తున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో జనసేన పెర్ఫార్మెన్స్‌ ఎలా ఉండబోతుందన్నది ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. 

21:36 - May 11, 2018

కర్ణాటక : అసెంబ్లీ ఎన్నికలకు రేపు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్‌ కేంద్రాలవద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు శనివారం పోలింగ్‌ జరగనుంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను 222 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. జయనగర్ బిజెపి అభ్యర్థి బిఎన్‌.వినయ్‌కుమార్‌ మృతితో ఆ ఒక్క స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. ఫేక్‌ ఓటర్‌ ఐడీ కార్డులు బయటపడడంతో ఆర్‌ ఆర్‌ నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక ఈ నెల 28కి వాయిదా పడింది.

4 కోట్ల 96 లక్షల 82 వేల మంది ఓటర్లు
కర్ణాటకలో 4 కోట్ల 96 లక్షల 82 వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో పురుష ఓటర్లు 2 కోట్ల 52 లక్షల 5 వేల 825 మంది కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 2 కోట్ల 44 లక్షల 71 వేల 480. ఈ ఎన్నికల్లో బిజెపి 223, కాంగ్రెస్‌ 221, జెడిఎస్‌ 200 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. మొత్తం 2,636 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో మహిళా అభ్యర్థులు 217 మంది ఉన్నారు.

56 వేల 696 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు
ఎన్నికల కోసం అధికారులు 56 వేల 696 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళలకు ప్రత్యేకంగా 600 కేంద్రాలు... దివ్యాంగులు, ఇతరులకు 28 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి సంజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో వీవీపాట్‌ యంత్రాలతో పాటు ఈవీఎంలను వినియోగించనున్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత..
రాష్ట్రంలో 20 శాతం పోలింగ్‌ బూతులు సమస్యాత్మకంగా ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 82,157మంది పోలీసులు, 585 కేంద్ర బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం గత నెల రోజులుగా కాంగ్రెస్‌, బిజెపి, జెడిఎస్‌ తదితర పార్టీలు హోరా హోరీగా ప్రచారం నిర్వహించాయి. ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది.

గెలుపుపై కాంగ్రెస్ ధీమా
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటామన్న ధీమాతో ఉంది. మోది మేజిక్‌తో అధికారం తమనే వరిస్తుందని బిజెపి చెబుతోంది. సర్వేలు మాత్రం కర్ణాటకలో హంగ్‌ తప్పదని జోస్యం చెప్పాయి. కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, ప్రభుత్వ ఏర్పాటులో జెడిఎస్‌ కింగ్‌మేకర్‌గా చక్రం తిప్పుతుందని సర్వేలు వెల్లడించాయి. కొన్ని సర్వేలు మాత్రం బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నాయి. ఆయా పార్టీల అభ్యర్థుల జాతకాలు కన్నడ ఓటర్ల చేతిలో నిక్షిప్తమై ఉన్నాయి. ఓటరు ఎవరిని కరుణిస్తారన్నది మే 15న ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి.

21:30 - May 11, 2018

అమరావతి : ప్రత్యేక హోదా , విభజన సమస్యలపై కేంద్రంతో రాజీలేని పోరాటం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అమరావతిలో జరిగిన పార్టీ నేతల సర్వసభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేతలతో పొలిటికల్ స్ట్రాటజీ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేకహోదాపై పోరాటానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకహోదాపై బీజీపీ నేతల మోసాన్ని ప్రజల్లో ప్రచారం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచనలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో కేంద్రం వైఖరిపై విస్తృత ప్రచారానికి నిర్ణయంచారు.  

21:25 - May 11, 2018

చిత్తూరు : బీజేపీ , టీడీపీ మధ్య మాటల యుద్దం తీవ్రతరం అయింది. బీజేపీకి ఓటు వేయొద్దని కర్నాటకలో టీడీపీ ప్రచారం చేయడంపై ఇప్పటికే గుర్రుగా ఉన్న కమలం నేతలు.. అమిత్‌షాపై దాడితో మరింతగా మండిపడుతున్నారు. తిరుపతిలో జరిగిన ఘటనను సీఎం చంద్రబాబు ఖండించినా కమలం నేతలు చల్లబడలేదు. అమిత్‌షాపై దాడి ప్రీప్లాన్డ్‌గానే జరిగిందంటున్నారు.

తిరుమల అలిపిరి వద్ద ఉద్రిక్తత..
తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. అలిపిరి వద్ద నల్లజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని అమిత్‌షా కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు పలువురు టీడీపీ కార్యకర్తలను ఈడ్చిపడేశారు. కార్యకర్తల నినాదాలతో అలిపిరి వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

దాడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ
అమిత్‌షాకాన్వాయిపై దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తించారని మండిపడుతున్నారు. ముందస్తు ప్లాన్‌ ప్రకారం, అమరావతి నుంచి అందిన సూచనలతోనే ఈ దాడి జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. అమిత్‌షా రాష్ట్రానికి వచ్చిన అతిథి అని.. అతిథిని గౌరవించాలన్న తెలుగువారి సంప్రదాయాన్ని కూడా టీడీపీ నేతలు మంటగలిపారని వారు విమర్శించారు.

షా పై దాడిని ఖండించాం : సోమిరెడ్డి
అమిత్‌షా కాన్వాయిపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. నిరసనలు శాంతియుతంగా ఉండాలని .. దాడులకు పాల్పడితే సహించేది లేదని బాబు హెచ్చరించారన్నారు. అయితే బీజేపీ నేతలు రెచ్చగొట్టడం రాళ్లదాడి ఘటన జరిగిందన్నారు మంత్రి సోమిరెడ్డి. పోలీసుల దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారన్నారు. మొత్తానికి టీడీపీ -బీజేపీ మధ్య పోరు.. ఏపీ రాజకీయాలను మరింతగా హీటెక్కించాయి. ఏపీ కి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు పోరాటం ఆపేది లేదని టీడీపీ నేతలు అంటుంటే.. టీడీపీ గూండాయిజాన్ని 2019ఎన్నికల్లో ప్రజలే తేల్చేస్తారని కమలం నేతలు అంటున్నారు. 

ఆర్ఆర్ నగర్ లో ఎన్నిక వాయిదా..

కర్ణాటక: రెండు ఇనుప పెట్టెల్లో భద్రపరిచిన 9,756 నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు బయట పడటం కర్ణాటక ఎన్నికల సంగ్రామంలో కలకలం రేపింది. అయితే ఇప్పటివరకు అక్కడ ఎన్నిక నిర్వహిస్తామని చెప్పిన ఎన్నికల సంఘం‌ ఉన్నట్టుండి దాన్ని కొద్ది రోజులు పాటు వాయిదా వేసింది. ఆర్‌.ఆర్‌ నగర్‌లో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ నియోజకవర్గంలో మే28 ఎన్నిక నిర్వహిస్తామని, మే 31న ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంది.

20:40 - May 11, 2018

భారత్‌-అమెరికా అణు ఒప్పందాన్ని 2005 జులై 18న ప్రకటించారు. ఇప్పటికి పదేళ్ళు గడిచింది. ప్రారంభం నుంచీ సిపిఎం, ఇతర వామపక్షాలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వచ్చాయి. అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అమెరికాతో పెట్టుకోవాలనుకున్న విస్తృత శ్రేణి వ్యూహాత్మక పొత్తులో ఇది కీలక భాగంగా వామపక్షాలు భావించాయి. ఈ ఒప్పందంలోని ప్రతి అంశం పట్ల వామపక్షాలు ప్రదర్శించిన వ్యతిరేకత పదేళ్ళ తర్వాత కూడా వాస్తవమేనని రుజువైంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అణు ఒప్పందం నుండి ట్రంప్ వైదొలగుతున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడు. ఈ పర్యవసానాలు ఏవిధంగా వుండనున్నాయి? ముఖ్యంగా భారత్ పై ఈ ప్రభావం ఎలా వుంటుంది? వంటి తాజా పరిణామాలపై ప్రముఖ విశ్లేషకులు ఎం.కోటేశ్వరావు విశ్లేషణ..

20:28 - May 11, 2018

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. బుర్దల బొర్రిన పందికి పెద్ద తేడా లేదంటున్నడు.. సత్పురుషుడు.. అవినీతి అంటె ఏందో తెల్వనోడు.. నీతికి నిల్వుటద్దం.. వెన్నుపోటంటె ఎట్లుంటదో తెల్వని మహానేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు... నా నల్పై ఏండ్ల రాజకీయ జీవితంల ఎన్నడు గింత మచ్చ అంటలేదు నాకు.. అందుకే నన్ను ఎవ్వలేం జేయలేరనుకొచ్చిండు..

ఏగిలం మోపైందిగదా రైతు బందు చెక్కులు.. బుక్కుల కాడ.. ఒక ఆడామె ఏడ్సుడొక్కటే తక్వున్నది.. పాత పాసు బుక్కుల ఆమెకు రెండు ఎక్రాల భూముంటే.. బంగారు తెలంగాణ సర్కారు ఇచ్చిన బుక్కుల పన్నెండు గుంటల భూమే ఉన్నట్టు సూపెట్టిండ్రట.. ఇగ సూస్కో ఆమె పరేషాన్ అయితున్నది..

గద్వాల జిల్లాల గలాటా గిది..కంట్రోలు బియ్యంతోని పేదల కడ్పునిండుడేమోగని.. దొంగలు దోపిడిగాళ్లకు జేవులు మాత్రం నిండుతున్నయ్.. వాస్తవానికి గూడ ఆ కంట్రోలు బియ్యం నిన్నియాళ్ల జనం తింటనే లేరు.. ఇగ ఇదే బియ్యాన్ని లారీలకు లారీలు దీస్కపోయి పాలీష్ జేశి అమ్ముతున్నరట.. కంట్రోలు బియ్యం ఎత్కపోతున్న లారీలను పోలీసోళ్లు ఖమ్మం జిల్లాల వట్కున్నరు..

మొన్ననే జెప్పలే నేను ఆడివిల్లకు చిన్నతనంల పెండ్లీలు జేయుండ్రి అప్పటిలెక్క లేదు యవ్వారం అధికారులొచ్చి ఆపేస్తరు పెండ్ల.. పెండ్లి ఖర్చులు సుట్టాలు.. బోజనాలు అన్ని ఉత్తయే అయితయ్ తర్వాత బాధపడుండ్రి అని గూడ జెప్తి ఇంటరా జనం.. ఇగో ఎన్మిదో తర్గతి సద్వుతున్న బుజ్జికి పెండ్లి జేయ జూశిండ్రు పెండ్లి ఆగిపోయింది..

పోలీసోళ్లు వైన్సు దుక్నం కాడికి ఎప్పుడు రావాలే..? ఆడేమన్న తాగినోళ్లు తన్నుకుంటుంటె రావాలే.. ఏదన్న న్యూసెన్సు అయితే రావాలే.. లేకపోతె మద్యం షాపు టైం దాటినంక గూడ అమ్మితె రావాలే అంతేనా.? కని ప్రకాశం జిల్లా చీరాల కాడ ఒక సీఐ వానికి నెత్తిల పుర్గుగూడ తిర్గిందో లేకపోతె మద్యం షాపోడు మామూలు ఇస్తలేడనుకున్నడో ఏమో.. వచ్చి హల్ చల్ జేశిపోయిండు జర్రశేపట్ల..

ఉపాయం ఉన్నోడు ఉపాసం ఎన్నడుండడు.. కుక్క పిల్లలను అమ్ముకోని బత్కెడోడు ఎంత పెద్ద ఉపాయం గట్టిండో సూడుండ్రి కడప జిల్లాల పార్థు గ్యాంగు తిర్గుతున్నదని జనం భయపడ్తున్నరుగదా..? అగో ఆ భయాన్ని ఆసర జేస్కోని నిజమే పార్థు గ్యాంగు తిర్గుతున్నది.. కావట్టి మీరు ఇంటికో కుక్కను వెంచుకోండ్రి అని కుక్క పిల్లలు దొర్కే అడ్రసుగూడ వెట్టిండట.. సూడుండ్రి వాని వ్యాపర తెల్వి ఎట్లున్నదో..

సారూ మన ఆఫీసుల పనిజేస్తున్న రజియొద్దిన్ గాడు నన్ను వేధిస్తున్నడు.. బట్టలిప్పి ఉర్కిస్తాంటున్నడు నేను ఆడమన్షిని జర్ర మీరే చర్యలు దీస్కోండ్రి అని ఉన్నతాధికారులకు జెప్పింది వాళ్లు వట్టిచ్చుకోలే.. ఆఖరికి షీటీమ్సును వేడుకున్నది ఆళ్లు వట్టిచ్చుకోలే ఇగ టెన్ టీవీ ఒక్కటే దిక్కు నా గోడు జెప్పుకునెతందుకు అని ఒక సర్కారు ఆఫీసు ఉద్యోగి మన ముంగటికొచ్చింది..

చిర్తపులులు ఇట్ల సచ్చిపోతున్నయెందుకో ఏమో.. గామొన్న తిరుమల కొండలెక్కే తొవ్వల టక్కరై ఒక చిర్తపులి సచ్చిపోయింది.. ఇయ్యాళ నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం తండకాడ ఇంకో చిర్తపులి యాక్సిడెంట్ల జీవిడ్సింది.. ఇంతకు చిర్తలు రోడ్ల మీదికి ఎందుకొస్తున్నయో ఏమో ఈ నడ్మ బాగైతున్నయ్ ఇసొంటియి..

కన్నడ ఎన్నికలకు భారీ ఏర్పాట్లు..

కర్ణాటక : రేపు కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 222 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 5,06,90,538 కాగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల సంఖ్య 2,984 మంది పోటీలో వున్నారు. వీరిలో మహిళా అభ్యర్ధులు 217 మంది వున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటల నుండి సా.6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. ఇప్పటి వరకూ రూ.174 కోట్ల నగదు, 5,78,600 లీటర్ల మద్యం,110 కిలీల బంగారంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నించగా ఈ మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

కన్నడ ఎన్నికలకు భారీ ఏర్పాట్లు..

కర్ణాటక : రేపు కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 222 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 5,06,90,538 కాగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల సంఖ్య 2,984 మంది పోటీలో వున్నారు. వీరిలో మహిళా అభ్యర్ధులు 217 మంది వున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటల నుండి సా.6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. ఇప్పటి వరకూ రూ.174 కోట్ల నగదు, 5,78,600 లీటర్ల మద్యం,110 కిలీల బంగారంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నించగా ఈ మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె..

ఢిల్లీ : మే 30,31 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారు. దీంతో బ్యాంకుల సేవలు రెండు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. వేజ్ బోర్డు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పూనుకుంటున్నట్లుగా తెలిపారు. వేతన పెంపుపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తు బ్యాంక్ ఉద్యోగులు ఈ సమ్మెను చేపట్టనున్నారు.  

19:47 - May 11, 2018

కరీంనగర్‌ : జిల్లాలో ఎమ్మెల్యే రసమయికి చుక్కెదురైంది. గన్నేరువాగు మండల కేంద్రంలో ఓ పెళ్లికి హాజరై వెళ్తున్న రసమయి బాలకిషన్‌ కాన్వాయిను మహిళలు అడ్డుకున్నారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నా తమను పట్టించుకోరా అంటూ నిలదీశారు. ఇదిలావుంటే వీడియో తీస్తున్న విలేకరులపై పోలీసులు దాడి... పలువురి సెల్‌ఫోన్లు లాక్కెళ్లారు.

19:45 - May 11, 2018

నిజామాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశంలోనే ఆదర్శమైన ప్రాజెక్ట్ అన్నారు ఎంపీ కవిత. నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ మండలం మామిడిపల్లిలో రైతు బంధు పథకం కార్యక్రమంలో పాల్గొన్న కవిత.. ఈ పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.. పంట చేతికి వచ్చిన తర్వాత ధర రాకపోతే రెండు లక్షల రుణ సదుపాయం కల్పించామన్నారు కవిత. 

19:43 - May 11, 2018

తిరుమల : సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించడమే తన ఆశయం అని టీటీడీ నూతన చైర్మన్‌ పుట్ట సుధాకర్‌ యాదవ్‌ అన్నారు. భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలో పరిశీలించి అందుకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. భక్తులు సర్వ దర్శనం లైన్‌లో తొందరగా దర్శనం చేసుకునేలా.. కొత్త సిస్టమ్‌ రూపొందించామని.. దానికి అనూహ్యమైన స్పందన వస్తుందన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు తనకెంతో ఆనందంగా ఉందటున్న టీటీడీ చైర్మన్‌ పుట్ట సుధాకర్‌ పేర్కొన్నారు. 

19:38 - May 11, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలపై పురోగతి పడింది. ఇవాళ రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్కే జోషి, దినేశ్‌కుమార్‌ల మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్థిక వివాదాల పరిష్కారానికి రామకృష్ణారావు, ప్రేమ్‌చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. పోలీసు శాఖలోని డీఎస్పీల విభజనను హైకోర్టు ఆదేశాల మేరకు పూర్తి చేయాలని నిర్ణయించారు. 

19:34 - May 11, 2018

కర్నాటక : రాష్ట్రంలో ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. సాయంత్రం 5వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఇప్పటికే పోలింగ్‌ స్టేషన్లకు ఈవీఎంలు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర బలగాలు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతా దళాలు పహరా కాస్తున్నాయి. మద్యం, డబ్బు పంపిణీపై నిఘాను పెట్టారు. గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, సరహద్దు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో చెక్‌పోస్టల వద్ద పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి..

19:32 - May 11, 2018

సంగారెడ్డి : టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు భయం పట్టుకుందని ఇరిగేషన్‌ మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. ప్రజల ఆనందాన్ని చూసి కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో రైతు బంధు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. కంది, సదాశివపేట మండలాల్లో రైతులకు రైతు బంధు చెక్కులను, పట్టాదారు పాస్‌ బుక్‌లను హరీష్‌రావు అందజేశారు. రైతులకు పెట్టుబడి సాయం కింద డబ్బులు చెల్లించే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని హరీష్‌రావు చెప్పారు.

19:29 - May 11, 2018

అమరావతి : అమిత్‌షాపై దాడి.. తెలుగుదేశం పార్టీ గూండాయిజానికి నిదర్శనమన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అతిథులను గౌరవించాలన్న తెలుగువారి సంప్రదాయన్ని టీడీపీ నేతలు మంటగలిపారని విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ దాడి జరిగిందన్నారు. దాడివెనుక టీడీపీ పెద్దల హస్తం ఉందన్న అనుమానం కూడా కలుగుతుందన్నారు విష్ణుకుమార్‌రాజు.

19:27 - May 11, 2018

చిత్తూరు : అమిత్‌షాపై దాడిని ఖండించిన బీజేపీ నేతలు.. చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు కావాలనే అమిత్‌షాపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. కాగా ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే టీడీపీ, బీజేపీ మధ్య మొదలైన మాటల యుద్ధం.. అమిత్‌షా కాన్వాయిపై దాడికితో మరింత ముదిరింది. టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే అమిత్‌షాపై దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు అంటున్నారు.

19:25 - May 11, 2018

ఆన్ లైన్ వ్యాపారంలో ఫ్లిప్ కార్ట్ గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు. ఇంత పెద్ద సంస్థ యొక్క భారీ షేర్లను అంటే 77 శాతం వాటాను వాల్ అమెరికా రీటేల్ దిగ్గజం వాల్ మార్ట్ కొనుగోలు చేసింది. ఇది పెను సంచలనంగా మరింది. ప్రస్తుతం వ్యాపార సంస్థల్లో ఇదే చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచారనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో దీన్ని రెండు కంపెనీల మధ్య కొనసాగుతున్న అంశంగానే చూడాలనే వాదనలు కూడా కొనసాగుతున్నాయి. దీని వల్ల భారత్ కు ఏమన్నా నష్టం జరుగుతుందా? లేక లాభం చేకూరుతుందా? ఈ బిగ్ డీల్ లో ఎటువంటి మార్పులొస్తాయి? భారతదేశపు రీటైల్ రంగంలో వచ్చే మార్పులేమిటి? కోట్లాదిమంది ఈ బిగ్ సంస్థపై ఆధారపడి జీవించే పరిస్థితులకు ఏమన్నా ముప్పు వాటిల్లనుందా? రీటైల్ రంగంపై ఎటువంటి ప్రభావం పడనుంది? ఈ అంశంపై చర్చను చేపట్టింది 10టీవీ.ఈ చర్చలో ప్రముఖ వ్యాపార విశ్లేషకులు పాపారావు, తెలంగాణ బీజేపీ కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు. 

18:58 - May 11, 2018

చంద్రబాబు వల్లే యాదవులకు టీటీడీ చైర్మన్ : పుట్టా

తిరుమల : సీఎం చంద్రబాబునాయుడు ఆశీస్సులతోనే తనకు టీటీడీ చైర్మన్ పదవి లభించిందని పుట్టా సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. సామాన్య భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీటీడీ కొత్తగా ప్రవేశపెట్టిన సర్వదర్శనం టైమ్ స్లాట్ విధానం భక్తులకు ఎంతో ఉపయోగకరంగా వుందని తెలిపారు. పాలక మండలిలో చర్చించి వీఐపీ బ్రేక్ దర్శనం ధరలు పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. యాదవులకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వటంపై సీఎం చంద్రబాబు నాయుడుగారికి సదా రుణపడి వుంటామని పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. 

పోలవరంపై వాదోపవాదనలు..

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరం తెలుపుతు ఒడిషా ప్రభుత్వం వేసిన పిటీషన్ పై దేశ అత్యున్నత ధర్మాసనం నేడు వాదనలను కొనసాగించింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం నిర్మాణం అవ్వడం లేదని ఫిర్యాదులో ఒడిషా వాదిస్తుండగా..దర్యాప్తు అంశాలు సమర్పించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 36 క్యూసెక్కుల వరద వస్తే..ముంపుపై పూర్తి అధ్యయనం చేయాల్సి వుందని తెలంగాణ కంటే ఎక్కువ వరద వస్తే..త్వరలో నివేదిక ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం విన్నవించింది. దీంతో ఏపీ తరపున అడ్వకేట్ ఏకే గంగూలీ తన వాదనలు వినిపించారు.

ముగిసిన ఏపీ, తెలంగాణ సీఎస్ ల భేటీ..

హైదరాబాద్: ఇరు తెలుగు రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం ముగిసింది. భేటీ సందర్భంగా విభజన అంశాలు, పలు సమస్యలపై చర్చించిన తెలంగాణ, ఏపీ సీఎస్‌లు విభజన అంశాల సమస్యలు చూస్తున్న రామకృష్ణారావు, ప్రేమ్ చంద్రారెడ్డి తరచూ సమావేశమై సమీక్షించాలని నిర్ణయించారు. అదేవిధంగా ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన కమిటీ సమావేశమయ్యేలా చూడాలని.. డీఎస్పీల విషయంలో హైకోర్టు అనుమతితో తాత్కాలిక కేటాయింపులు చేసుకోవాలని.. ఉపాధ్యాయుల పరస్పర బదిలీల అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలను అప్పగించాలని తెలంగాణ అధికారులు కోరారు.

రైతులకు చెక్కులు, పుస్తకాలు..

సంగారెడ్డి : కంది మండలం చింద్రుప్పలో రైతుబంధు పథకం కింద రైతులకు చెక్కులు, పాసు పుస్తకాలను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చింతాప్రభాకర్ పాల్గొన్నారు. రైతులు పన్ను కట్టకపోతే రైతుల వీపులపై బండలు పెట్టిన ఘటన నిజాం రాజు చరిత్ర అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రైతులు బ్యాంకులకు అప్పుల కోసం వెళితే తిరిగి తిరిగి తిప్పించుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుల వద్దకే వెళ్లి చెక్కులు ఇచ్చిన ఘనత చరిత్ర ఆరోపించారు. రైతుల పంటలకు పెట్టుబడి నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు.

బస్లాండ్ వద్ద ల్యాండ్ మైన్?..

భద్రాద్రి : చర్ల బస్టాండ్ ఏరియాలో ల్యాండ్ మైన్ వున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ల్యాండ్ మైన్ ను మావోయిస్టులు అమర్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కాంగ్రెస్..

ఢిల్లీ : కాంగ్రెస్ నేతలు కేంద్రం ఎన్నికల సంఘాన్ని కలిసారు. స్ట్రింగ్ ఆపరేషన్ లో జడ్జికి లంచమిస్తు దొరికి పోయిన శ్రీరాములు ఎపిసోడ్ పై కేంద్రం ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో పోటీకి శ్రీరాముల్ని అనర్హుడిగా ప్రకటించాలంటు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఎన్నికలకు కన్నడ సిద్ధం : సంజీవ్ కుమార్

కర్ణాటక : రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కర్ణాటక ఎన్నికల ప్రధాన కార్యదర్శి సంజీవ్ కుమార్ తెలిపారు. ఆర్ఎస్ఎస్ నగర్ లో ఎన్నిక వాయిదా అంశం తమ పరిధిలో లేదన్నారు. ఎన్నికల వాయిదాపై సీఈసీ నిర్ణయం తీసుకోవాల్సి వుందన్నారు. ఓటుహక్కును ప్రజలందరు ఉపయోగించుకోవాలని సూచించారు. ఎవరికి ఓటు వేశామో ఓటరు చూసుకునేలా వీవీ ప్యాడ్ యంత్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయాలని యత్నిస్తే కఠినచర్యలు తీసుకుంటామని సంజీవ్ కుమార్ హెచ్చరించారు. 

గుజరాత్ అల్లర్ల కేసులో సంచలన తీర్పు..

గుజరాత్ : 2002 గుజరాత్ అల్లర్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషులుగా తేలిన మొత్తం 14 మందికి కింది కోర్టు విధించిన జీవిత ఖైదును సమర్ధించింది. మరో నలుగురికి విముక్తి కల్పించింది. ఇదే కేసులో ఇంకో ఐదుగురికి ఏడేళ్ల చొప్పున కారాగార శిక్ష విధించింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఆనంద్ జిల్లాలోని ఒడేలో 23 మందిని అల్లరి మూకలు సజీవ దహనం చేశాయి. స్పెషల్ ట్రయల్ కోర్టు ఈ కేసులో మొత్తం 23 మందిని దోషులుగా గుర్తించింది. గతేడాది ఆగస్టులో జస్టిస్ హర్ష దేవానీ, జస్టిస్ ఏఎస్ సుపెహియాలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ ముగించి, తీర్పును వాయిదా వేసింది.

లల్లూప్రసాద్ కు బెయిల్..

బీహార్ : పశు దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెరోల్ పై బిర్సా ముందా జైల్ నుంచి విడుదలైన విషయం తెలిసిందే. తన తనయుడు తేజ్ ప్రతాప్ వివాహం నిమిత్తం లాలూకు మూడు రోజుల పెరోల్ లభించింది. బిర్సా ముందా జైలు నుంచి నిన్న సాయంత్రం పాట్నా చేరుకున్నారు. తాజాగా, లాలూకు ప్రొవిజినల్ బెయిల్ లభించింది. మెడికల్ గ్రౌండ్స్ కింద ఆరు వారాల బెయిల్ ను లాలూకు మంజూరు చేస్తున్నట్టు జార్ఖండ్ హైకోర్టు ఆదేశించింది. లాలూ ప్రసాద్ యాదవ్ తరపున ఆయన న్యాయవాదులు అభిషేక్ మన్ సింఘ్వీ, ప్రభాత్ కుమార్ జార్ఖండ్ హైకోర్టుకు ఈరోజు హాజరయ్యారు.

16:58 - May 11, 2018

ఢిల్లీ : బాలీవుడ్‌ నటి శ్రీదేవి మృతి కేసులో తాము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రీదేవి అనుమానస్పద మరణంపై విచారణకు ఆదేశించాలని కోరుతూ సునీల్‌సింగ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ శర్మ విచారణ జరిపారు. ఇప్పటికే ఇలాంటి రెండు పిటిషన్లను నిరాకరించామని గుర్తు చేశారు. శ్రీదేవి పేరిట ఒమన్‌లో 240 కోట్లు ఇన్సూరెన్స్‌ ఉందని, ఆమె యూఏఈలోనే చనిపోయిందని తేలితేనే ఆ డబ్బు ఇస్తారని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదించారు. సుప్రీంకోర్టు మాత్రం తాము ఈ కేసులో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. పెళ్లి కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి హోటల్‌ రూమ్‌ బాత్‌టబ్‌లో అనుమానస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.

16:57 - May 11, 2018

బీహార్ : దాణా స్కాం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఝార్ఖండ్‌ హైకోర్టులో ఊరట కలిగింది. మెడికల్‌ గ్రౌండ్‌ కింద 6 వారాల పాటు బెయిలు మంజూరు చేసింది. ఇంతకు ముందు మే 12న జరిగే తన కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ వివాహానికి హాజరయ్యేందుకు లాలూకు కోర్టు షరతులతో కూడిన పెరోల్‌ మంజూరు చేసింది. ఆయన 3 రోజుల పాటు మీడియాతో మాట్లాడకూడదు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనను కలవకూడదని కోర్టు షరతు విధించింది. పెరోల్‌ మంజూరు కావడంతో గురువారం సాయంత్రం లాలు ఇంటికి చేరుకున్నారు. బిహార్‌కు చెందిన మంత్రి చంద్రిక రాయ్‌ కుమార్తె ఐశ్వర్య రాయ్‌ను తేజ్‌ ప్రతాప్‌ పెళ్లాడబోతున్నారు. ఇటీవల వీరిద్దరి నిశ్చితార్థ వేడుకకు లాలూ హాజరుకాలేకపోయారు.

16:56 - May 11, 2018

 

ఉత్తరప్రదేశ్‌ : చెందిన బీజేపీ ఎంపీ సావిత్రిబాయి పూలే మరో వివాదానికి తెర లేపారు. మహ్మద్‌ అలీ జిన్నాను మహాపురుషుడిగా కీర్తించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో జిన్నా ఎనలేని కృషి చేశారని పొగిడారు. ఆయన మహాపురుషుడని...ఆయన త్యాగాలను మరవకూడదని పూలే బిజెపిని ఇరుకున పెట్టారు. బీజేపీ నిర్వహిస్తున్న 'దళితల ఇళ్ల సందర్శన' కార్యక్రమంపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. రాజకీయ నాయకులు దళితుల ఇళ్లకు వెళ్లడమంటే వారిని తీవ్రంగా అవమానించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. సావిత్రి బాయి గత కొన్ని రోజులుగా బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ సొంత పార్టీకి తలనొప్పిగా మారారు. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో పాకిస్తాన్‌ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ అలీ జిన్నా చిత్రపటంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

16:55 - May 11, 2018

మహారాష్ట్ర : మాజీ ఎటిఎస్‌ చీఫ్‌ హిమాన్షు రాయ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. విధి నిర్వహణంలో ఖచ్చితమైన అధికారిగా పేరు తెచ్చుకున్న హిమాన్షురాయ్‌ గత కొంత కాలంగా బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. ఈ తెల్లవారుజామున సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1988 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్ అధికారి అనారోగ్యంతో 2016 నుంచి ఆఫీస్‌కు వెళ్లడం లేదు. క్యాన్సర్‌ కారణంగా హిమాన్షు డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఐపిఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌, దావుద్‌ ఆస్తుల జప్తు, జర్నలిస్ట్‌ జెడె హత్య, లైలా ఖాన్‌ హత్య కేసుల్లో హిమాన్షు కీలక పాత్ర పోషించారు. 

16:52 - May 11, 2018

హైదరాబాద్ : మంచి చెడులు ఆలోచించుకోలేని వయసులోనే ప్రేమలో పడటం..కొంతకాలానికి వేరొకరితో మాట్లాడినా..అనుమానించటం వంటి వాటితోనే ఇటువంటి ఘటనలో జరుగుతున్నాయని శిరీష హత్య కేసును విచారిస్తున్న డీసీపీ పద్మజ పేర్కొంటున్నారు. ప్రేమ, అనుమానం, ఆగ్రహం వంటి పలు ఉద్వేగాలతో హత్యలకు దారితీస్తున్నాయన్నారు. శంకర్‌పల్లిలో శిరీష హత్య కేసులో నిందితుడు సాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మంచీచెడు ఆలోచించుకోలేని పరిస్థితుల్లో యూత్‌ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని పోలీసులంటున్నారు. శంకర్‌పల్లి మర్డర్‌పై శంషాబాద్‌ డీసీపీ పద్మజ తెలిపారు. 

16:49 - May 11, 2018

కర్ణాటక : అమిత్‌షాపై దాడిని ఖండించిన బీజేపీ నేతలు.. చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు కావాలనే అమిత్‌షాపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. హోదా విషయంలో ఇప్పటికే టీడీపీ, బీజేపీ మధ్య మొదలైన యుద్ధం.. అమిత్‌షాపై దాడికి చేయడంతో అది మరింత ముదిరింది. టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే అమిత్‌షాపై దాడికి పాల్పడ్డారంటున్న బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. 

16:48 - May 11, 2018

హైదరాబాద్ : బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకపాలనను నిరసిస్తూ.. ఈనెల 16 నుంచి 22 వరకు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ప్రజా, సామాజిక సంఘాల నాయకులు తెలిపారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా, సామాజిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. 23న దేశ వ్యాప్త నిరసన దినం జరుపుతూ.. కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు జరుపుతామని నేతలు స్పష్టం చేశారు. అలాగే ప్రెస్ క్లబ్‌ నుంచి, ట్యాంక్‌ బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు చెప్పారు. రైతులకు రుణ మాఫీ చేసి, పంట పెట్టుబడిలో 50 శాతం ప్రభుత్వాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

16:45 - May 11, 2018

చిత్తూరు : తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కాన్వాయ్‌పై రాళ్లు రువ్విన ఘటనను తాము ఖండిస్తున్నామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. అయితే బీజేపీ నేతలు రెచ్చగొట్టడం వల్లే రాళ్లరువ్విన ఘటన జరిగిందన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసన తెలుపుతున్న వారిని రెచ్చగొట్టేలా బీజేపీ నేతలు కార్యకర్తలు వ్యవహరించారని సోమిరెడ్డి అన్నారు. ఈ ఘటనలు టీడీపీ కార్యకర్తలకు మాత్రమే దెబ్బలు తగిలాయని.. దాడి ఎవరు చేశారో ప్రజలు అర్థం చేసుకుంటారని సోమిరెడ్డి అన్నారు.

ఈ దాడితో తెలిసిందా?నారాయణ
తిరుపతిలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాపై జరిగిన దాడిని బట్టి.. రాష్ట్రంలో ప్రత్యేక హోదాపై ఎంతటి ఆవేదన ఉందో అర్థం అవుతోందని సీపీఐ సీనియర్‌ నేత నారాయణ అన్నారు. దీన్ని వ్యక్తిగతంగా తీసుకోరాదని, రాజకీయ అంశంగానే బీజేపీ నాయకత్వం పరిగణించాలనీ అన్నారు. 

16:42 - May 11, 2018
16:39 - May 11, 2018

విజయవాడ : జూనియర్ ఇంటర్‌లో ప్రవేశాలకు తాకిడి మొదలైంది... రెండు దశల్లో అడ్మిషన్లు చేపట్టేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు.. తొలివిడత ప్రవేశాలను జూన్‌ 30కి పూర్తి చేయాలని డెడ్‌ లైన్‌ విధించారు.

2 విడతలుగా జూనియర్ ఇంటర్‌లో ప్రవేశాలు
2018-2019 విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్‌ ప్రవేశాలను రెండు దశల్లో చేపట్టేలా ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ఏప్రిల్ 10 నుంచి దరఖాస్తుల విక్రయానికి షెడ్యూల్ రూపొందించిన అధికారులు.. తొలివిడత అడ్మిషన్లను జూన్ 30కి పూర్తి చేయాలని గడువు విధించారు. పదో తరగతిలో వచ్చిన గ్రేడ్ పాయింట్ల ఆధారంగా గ్రూపుల కేటాయింపు ఉంటుంది. దరఖాస్తులు పరిశీలించిన వెంటనే.. ప్రవేశాలు కల్పించేలా నూతన విధానాన్ని ఈ సారి అమలు చేయనున్నారు. విద్యార్థులకు స్పష్టమైన అవగాహన రావాలన్న యోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

షెడ్యూల్ కులాలకు 15%, గిరిజనులకు 6 %...
షెడ్యూల్ కులాల వారికి 15 శాతం, గిరిజనులకు 6 శాతం, వెనకబడిన కులాలకు 29 శాతం, వికలాంగులకు 3 శాతం, ఎన్సీసీ, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి 5 శాతం, సైనికుల కోటాలో 3 శాతం ప్రవేశాల్లో రిజర్వేషన్లు కల్పించారు. ప్రతి సెక్షన్ లోనూ 88 సీట్లకు మించకుండా ప్రవేశాలు చేసుకోవాలని ఇంటర్మీడియెట్‌ బోర్డ్‌ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలను ఆదేశించింది. పరిమితి మించితే అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 500 వరకూ జూనియర్‌ కాలేజీలు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకులాలు, ఆదర్శ కళాశాలలు మొత్తం కలిపి ఐదు వందల వరకు జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో కలిపి లక్షమందికి పైగా విద్యార్థులు పదోతరగతిలో ఉత్తీర్ణులయ్యారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు దరఖాస్తులు విక్రయించాలని బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు ప్రచారం నిర్వహించాలని బోర్డ్‌ ఆదేశించింది. ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకంపై ప్రచారం నిర్వహించి విద్యార్థులను ఆకర్షించాలని సూచించింది.. 

16:36 - May 11, 2018

నిజామాబాద్‌ : కాంగ్రెస్‌ బలోపేతంపై పార్టీ నేతలు దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న టీపీసీసీ నాయకత్వం... కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం సాధించేందుకు కృషి చేస్తోంది. నియోజకవర్గాల వారీగా సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ... కాంగ్రెస్‌ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. l2019 సాధారణ ఎన్నికల్లో గెలుపే పరమావధిగా పెట్టుకని పనిచేస్తున్ టీపీసీసీ నాయకత్వం.. నిజామాబాద్‌ జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసిపనిచేసే విధంగా సమన్వయ సమావేశాలు నిర్వహిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్‌ వచ్చినా కలిసి పనిచేసేలా చర్యలు
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ సమావేశాలు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్‌ వచ్చినా అందరూ సమిష్టిగా పనిచేసే విధంగా సమన్వయం సాధించేందుకు నేతలు, కార్యకర్తలను ఒప్పించారు. వర్గ విభేదాలు విస్మరించి అందరూ ఏకతాటిపైకి వచ్చే ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని హితబోధ చేశారు.

టీఆర్‌ఎస్‌ వ్యతిరేకతను కాంగ్రెస్‌కు అనుకూలంగా మలిచే యత్నం
టీపీసీసీ నాయకుల బస్సు యాత్ర తర్వాత నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితి కొంత మెరుగుపడింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందంటూ, దీనిని కాంగ్రెస్‌కు అకూలంగా మలచుకోవాలని నేతలు చేసిన ఉపదేశాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. నియోజకవర్గాల వారీగా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.. ఈ పోరును మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు.

అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న నేతలు
వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నకాంగ్రెస్‌ నాయకులు కూడా ఎక్కువగానే ఉన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌, బల్కొండ, ఎల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నాయకులు మధ్య టికెట్ల పోటీ ఎక్కువగా ఉంది. బోధన్‌, ఆర్మూర్‌, కామారెడ్డి సెగ్మెంట్లలో పోటీ అంతగా లేకపోయినా.. ఈ స్థానాల్లో సీనియర్లు ఎక్కువ మంది ఉన్నారు. దీంతో ఇతరులు ఈ సీట్లపై దృష్టి పెట్టడంలేదు. కాంగ్రెస్‌ అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న నేతలు ఈ నియోజకవర్గాల్లో ఉండటంతో ఇతరు ఆసక్తిచూపడంలేదు. ఎవరికి టికెట్‌ ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాలన్న టీపీసీసీ నాయకులు హితబోధతో ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తున్నా... భవిష్యత్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. 

16:33 - May 11, 2018

హైదరాబాద్ : సినీనటి శ్రీరెడ్డి, ఆమె అనుచరులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ వేధించాడని ఫిర్యాదు చేయడానికి వచ్చిన శ్రీరెడ్డి అనుచరులు.. పోలీసుల సమక్షంలోనే చెప్పులతో దాడి చేశారు. దీన్ని సీరియస్‌ తీసుకున్న పోలీసులు శ్రీరెడ్డి, ఇతర జూనియర్‌ ఆర్టిస్ట్‌లపై కేసు నమోదు చేశారు.

16:04 - May 11, 2018

అమరావతి : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులకు 24వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని చెప్పారు. అమరావతిలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు... రాష్ట్రాన్ని విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా నిలిపామన్నారు. భవిష్యత్‌లో విద్యుత్‌ చార్జీలు పెంచబోమని ఆయన స్పష్టం చేశారు.

16:02 - May 11, 2018
16:00 - May 11, 2018
15:57 - May 11, 2018

నేపాల్ : ప్రధానమంత్రి నరేంద్రమోది, నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ జనక్‌పురి-అయోధ్య నడుమ బస్సు సేవలను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. రామాయణ్‌ సర్కిట్ భారత్‌-నేపాల్‌ దేశాలకు ఎంతో ప్రశస్తమైనదని ఈ సందర్భంగా మోది అన్నారు. ఈ బస్సు సేవ టూరిజం అభివృద్ధికి ఎంతో దోహద పడుతుందని ప్రధాని పేర్కొన్నారు. నేపాల్‌ జనక్‌పురిలోని సీతాదేవి మందిరంలో ప్రధాని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అక్కడ జరిగిన సభలో మోది మాట్లాడారు. జనక్‌పురిలో జానకిని దర్శించుకోవడం తన అదృష్టమని తెలిపారు. నేపాల్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు మోది చెప్పారు.

15:54 - May 11, 2018

ప్రకాశం : జిల్లా చీరాలలోని ఓ బ్రాందీ షాపులో చీరాల వన్‌టౌన్‌ సీఐ సూర్యనారాయణ హల్‌చల్‌ చేశారు. మద్యం తాగుతున్న వారిపై చేయి చేసుకున్నారు. బ్రాందీ షాపు లైసెన్స్‌ను తనిఖీ చేసి స్టేషన్‌కు రావాల్సిందిగా హెచ్చరించారు. సీఐ హడావిడి చూసిన మందుబాబులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ దృష్యాలన్నీ సీసీ టీవీలో రికార్డవడంతో షాపు నిర్వహకులు ఈ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సీఐ తీరుపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆర్థిక అధికారులతో ఈటల..

హైదరాబాద్ : సచివాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మండలి చీఫ్‌విప్ సుధాకర్‌రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ దేవీప్రసాద్ హాజరయ్యారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్లు, సమస్యలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపిన మంత్రుల కమిటీ.. ఇవాళ రాత్రి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక ఇవ్వనున్నారు. మంత్రుల కమిటీ నివేదిక పరిశీలించిన తర్వాత.. ఈ నెల 14న సీఎం కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై చర్చించనున్నారు.

ఇరు దేశాల సంబంధాలు బలపడాలి : మోదీ

నేపాల్ : జనక్‌పూర్‌కు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడి రాజు జనక్‌, జానకీ మాతను సందర్శించుకోవడం మర్చిపోలేని అనుభూతి. నాకు ఇంతటి ఘనస్వాగతాన్ని అందించిన ఓలీకి ధన్యవాదాలు. ఇక్కడి ప్రకృతి లాగే ప్రజలు కూడా చాలా మంచి వారు. నాకోసం ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. జనక్‌పూర్‌ అయోధ్య బస్సు‌ సర్వీస్‌ చారిత్రకమైంది. సాధారణంగానే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అవి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.’ అని తెలిపారు.

మోదీకి ఓలీ ఘటన స్వాగతం..బస్సు‌ సర్వీస్‌ ప్రారంభం..

నేపాల్‌ : భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌లో పర్యటిస్తున్నారు. శుక్రవారం జనక్‌పూర్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం జానకి ఆలయానికి చేరుకున్న మోదీకి అక్కడ నేపాల్‌ ప్రధాని కేపీ ఓలీ సాదర స్వాగతం పలికారు. తర్వాత ఇద్దరూ కలిసి జానకీ ఆలయాన్ని సందర్శించారు. ఇందులో భాగంగా మోదీ-ఓలీ కలిసి జనక్‌పూర్‌లో జనక్‌పూర్‌-అయోధ్య బస్సు‌ సర్వీస్‌ను ప్రారంభించారు. 

ఎన్నికల హోరు..నగదు జోరు..

కర్ణాటక : శాసన సభ ఎన్నికలకు గురువారం ప్రచారం ముగియగా..అన్ని పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నాయి. కర్ణాటకలో మొత్తం 224 నియోజకవర్గాలు ఉండగా.. బెంగళూరులోని జయనగర అభ్యర్థి విజయకుమార్‌ ఆకస్మిక మరణంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 223 నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్‌ జరగనుండగా ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, మద్యం, ఇతర కానుకలను పంపుతున్నాయి.

బీజేపీ ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు : సోమిరెడ్డి

చిత్తూరు : భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌పై రాళ్లదాడి జరిగిన ఘటన దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్‌ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెళుతోన్న అమిత్ షా కాన్వాయ్‌పై అలిపిరి వద్ద టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సోమిరెడ్డి స్పందించారు. తమ కార్యకర్తలను బీజేపీ నేతలే రెచ్చగొడుతున్నారని అన్నారు. బీజేపీ నేతలు ఏపీపై చేస్తోన్న వ్యాఖ్యలను కర్ణాటక ప్రజలు కూడా గమనిస్తున్నారని, ఆ పార్టీకి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

ఏటీఎస్ మాజీ చీఫ్ హిమాన్షు ఆత్మహత్య..

హైదరాబాద్ : మహారాష్ట్ర ఏటీఎస్ మాజీ చీఫ్ హిమాన్షు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్ తో బాధ పడుతున్న హిమాన్షు గత 18 నెలలుగా మెడికల్ లీవ్ లో వున్నారు. ఈ నేపథ్యంలో హిమాన్షు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

ఏటీఎస్ మాజీ చీఫ్ హిమాన్షు ఆత్మహత్య..

హైదరాబాద్ : మహారాష్ట్ర ఏటీఎస్ మాజీ చీఫ్ హిమాన్షు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్ తో బాధ పడుతున్న హిమాన్షు గత 18 నెలలుగా మెడికల్ లీవ్ లో వున్నారు. ఈ నేపథ్యంలో హిమాన్షు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

14:47 - May 11, 2018

చిత్తూరు : టీడీజీ బీజేపీ పార్టీల మధ్య మరోచిచ్చు రేగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుపతి పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. షా పర్యటనను అడ్డుకునేందుకు యత్రించిన క్రమంలో షా కాన్వాయ్ లోని ఓ కారు అద్దాలు ధ్వంసం చేయటం వంటి పలు ఘటనలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీ క్రమ శిక్షణ గల పార్టీ అని క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణకు అందుకు బద్దులై వ్యవహరించాలని సూచించారు. వాహనం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు చంద్రబాబు సూచించారు ఈ క్రమంలో ముగ్గురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో వున్న బాబుకు ఘటన గురించి సమాచారం అందిన అనంతరం బాబు స్పందించారు. ఘటనపై చంద్రబాబు మండిపడ్డారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు.

బీజేపీ-టీడీపీ/షా పర్యటన..
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో విభేదాలు వచ్చి ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అమిత్ షా తిరుమల పర్యటన మరింత వేడిని రాజేసింది. షా పర్యటనను నిరసిస్తు..టీడీపీ కార్యకర్తలు నల్లజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. అలిపిరి గుండా వెళుతున్న షా కాన్వాయ్ ను టిడిపి నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నించడం..పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో కాన్వాయ్ లోని ఓ వాహనం అద్దం ధ్వంసం చేయడంతో పోలీసులు టిడిపి నేతలను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. డిసిపితో టిడిపి నేతలు వాగ్వాదానికి దిగారు. తోపులాట..ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి తరలించారు. షా పర్యటనను టిడిపి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఘటనలో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. 

13:26 - May 11, 2018

 

బెంగళూరు : కర్నాటక రాష్ట్రంలో శనివారం ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకు సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆయా పార్టీల అభ్యర్థులు అక్రమమార్గాలు ఎంచుకుంటున్నారు. ప్రజలకు డబ్బులు ఎర వేసే పద్ధతిని ప్రయోగిస్తున్నారు. దీనితో ఎన్నికల అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. చిత్రదుర్గం జిల్లా తిప్యాయనట్టి చెక్ పోస్టు వద్ద రేపటి ఎన్నికల కోసం భారీగా నగదును వివిధ పార్టీలు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు లభ్యమౌతోంది. ఏపీ నుండి స్కార్పియోలో తరలిస్తున్న రూ. 2కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాలి అనుచరుడు ఎంపి మొల్కామొరు నియోజకవర్గంలో భారీగా నగదును పట్టుకున్నారు. బీజేపీ అభ్యర్థి శ్రీరాములు వాహనంలో రూ. 2 కోట్ల 15 లక్షలను ఐటీ అధికారులు పట్టుకున్నారు. 

 

13:17 - May 11, 2018

చిత్తూరు : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుపతి పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు - టిడిపి వర్గీయుల మధ్య చిచ్చు రేపినట్లైంది. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు..విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుండడంపై టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన సందర్భంగా నల్లజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. అలిపిరి గుండా వెళుతున్న షా కాన్వాయ్ ను టిడిపి నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నించడం..పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో కాన్వాయ్ లోని ఓ వాహనం అద్దం ధ్వంసం చేయడంతో పోలీసులు టిడిపి నేతలను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. డిసిపితో టిడిపి నేతలు వాగ్వాదానికి దిగారు. తోపులాట..ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి తరలించారు. షా పర్యటనను టిడిపి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఇండో నేపాల్ బస్సు సర్వీసు...

నేపాల్ : ఇండో - నేపాల్ మధ్య బస్సు సర్వీసు ప్రారంభమైంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మలు జెండా ఊపి ప్రారంభించారు. నేపాల్ లోని జనక్ పూర్ నుండి ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య వరకు బస్సు సర్వీసు కొనసాగనుంది. 

12:34 - May 11, 2018

చిత్తూరు : అమిత్ షా గో బ్యాక్..బిజెపి డౌన్ డౌన్..అంటూ అలిపిరి వద్ద టిడిపి నినాదాలతో మారుమోగింది. శ్రీవారి దర్శనార్థం శుక్రవారం అమిత్ షా చేరుకున్నారు. అనంతరం ఆయన అలిపిరి మార్గం గుండా ఆలయానికి వెళ్లారు. అక్కడనే నల్ల జెండాలు మోహరించిన టిడిపి నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ఆయన కాన్వాయ్ ను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు.

అప్పటికే మోహరించిన పోలీసులు వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొంతమంది కార్యకర్తలు వాహనాలపై దాడి చేయడంతో బిజెపి..టిడిపి నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మొత్తానికి షా పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది. 

12:21 - May 11, 2018

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని ప్రగతి రిసార్ట్స్ లో విద్యార్థినిని శిరీష గొంతు కోసిన సాయి ప్రసాద్ ను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. వారు టెన్ టివితో మాట్లాడారు. ఇలాంటి ఘటన ఏ ఆడబిడ్డకు జరుగొద్దని పేర్కొన్నారు. రిసార్ట్స్ కు సంబంధించిన సీసీ టివి ఫుటేజ్ లను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సాయి ప్రసాద్ ఒక్కడే ఈ హత్యలో పాల్గొనలేదని..మరికొందరున్నట్లు తెలుస్తోందన్నారు. చిన్న వారికి రిసార్ట్స్ లోకి ఎలా అనుమతించారని, వెంటనే రిసార్ట్స్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. హత్య చేసిన అనంతరం సాయి ప్రసాద్..అతని స్నేహితుడికి ఫోన్ చేశాడని...శిరీషను చంపేసినట్లు..తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలియచేసినట్లు తెలిపారు. ఆ స్నేహితుడి తండ్రి ఎమ్మార్వో కావడం..శంకర్ పల్లి ఎమ్మార్వోతో మాట్లాడారని..దీనిపై పలు అనుమానాలున్నాయన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:02 - May 11, 2018

తూర్పుగోదావరి : మళ్లీ బోటు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవలే కృష్ణా జిల్లాలో పడవ బోల్తా పడిన ఘటనలో 20 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. బోట్లు సరైన కండీషన్ లో లేకపోవడం..పరిమితికి మించిన సంఖ్యలో ప్రయాణీకులను ఎక్కించుకుంటున్నారనే విమర్శలున్నాయి. దీనితో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. తాజాగా బోటులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోదావరి నది అందాలను, కిన్నరెసానిని తిలకించాలని బయలుదేరిన టూరిస్ట్ బోట్ ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. దాదాపు 80 మంది ప్రయాణీకులతో వెళుతున్న ఈ బోటు దేవీపట్నం మండలం వీరవరపులంక వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ప్రయాణీకులు హాహాకారాలు చేశారు. అనంతరం డ్రైవర్ అప్రమత్తడం కావడం..అధికారులు వేరే బోటు ఏర్పాటు చేయడంతో ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

పాపికొండలకు వెళ్లే బోటులో ప్రమాదం...

తూర్పుగోదావరి : దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. పాపికొండలకు వెళ్లే యాత్రికుల బోటు అగ్నిప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో పడవలో 80మంది ప్రయాణీకులున్నారు. వీరంతా సురక్షితంగా బయటపడ్డారు. 

పాపికొండలకు వెళ్లే బోటులో ప్రమాదం...

తూర్పుగోదావరి : దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. పాపికొండలకు వెళ్లే యాత్రికుల బోటు అగ్నిప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో పడవలో 80మంది ప్రయాణీకులున్నారు. వీరంతా సురక్షితంగా బయటపడ్డారు. 

అలిపిరి వద్ద భారీ బందోబస్తు...

చిత్తూరు : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుమలకు చేరుకున్నారు. కాసేపట్లో ఆయన అలిపిరి మీదుగా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించకపోవడంపై నల్ల జెండాలతో టిడిపి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

11:23 - May 11, 2018

చిత్తూరు : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుపతికి రావడంపై పచ్చతమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆయన శుక్రవారం తిరుపతికి చేరుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం చేసిన మోసాన్ని టిడిపి ఎండగడుతున్న సంగతి తెలిసిందే. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చిన అమిత్ షా కాన్వాయ్ ను అడ్డుకుంటామని టిడిపి నేతలు హెచ్చరిస్తున్నారు. దీనితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలిపిరి వద్ద నల్లజెండాలతో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మోడీ - కేడీ..అమిత్ షా గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

11:15 - May 11, 2018

రంగారెడ్డి : 'వేరే బిడ్డకు ఇలా జరుగకుండా చూడండి..ఏ ఆడబిడ్డకు ఇలా జరుగొద్దు' అంటూ ఓ తండ్రి విలపిస్తూ చెబుతున్నాడు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలో ప్రగతి రిస్టార్స్ లో విద్యార్థిని శిరీషను ప్రేమోన్మాది సాయి ప్రసాద్ చంపేసిన సంగతి తెలిసిందే. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శిరీష కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడారు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో శిరీషకు ఫోన్ చేయగా..అందుబాటులో లేదనే సమాధానం వచ్చిందని పేర్కొన్నారు. కొన్ని సార్లు ప్రయత్నించగా శంకర్ పల్లి సీఐ ఫోన్ లో మాట్లాడారని, శంకర్ పల్లికి రావాలని చెప్పడం జరిగిందన్నారు. గురువారం రాత్రి అక్కడకు చేరుకోగా అక్కడి నుండి ప్రగతి రిసార్ట్స్ కు తీసుకెళ్లారని తెలిపారు. అక్కడ అమ్మాయి మృతదేహం కనిపించిందని విలపిస్తూ చెప్పారు. గదిలో కత్తి ఉందని..గొంతు కోసి చంపేశారని, ఇలాంటి దారుణాలు ఇంకో బిడ్డకు జరుగొద్దని, దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

అమిత్ షా గో బ్యాక్ అన్న టిడిపి నేతలు...

చిత్తూరు : ప్రత్యేక హోదా కోసం అలిపిరి వద్ద నల్లజెండాలతో టిడిపి కార్యకర్తలు నిరసన తెలిపారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీనివ్వాలని డిమాండ్ చేశారు. 

తిరుపతిలో అమిత్ షా...

చిత్తూరు : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాసేపటి క్రితం తిరుమలకు చేరుకున్నారు. ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం కర్నాటకలో ఎన్నికల పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. 

ఎన్నికల కోసం భారీగా నగదు తరలింపు ?

కర్నాటక : రేపటి ఎన్నికల కోసం భారీగా నగదును వివిధ పార్టీలు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు లభ్యమౌతోంది. ఏపీ నుండి స్కార్పియోలో తరలిస్తున్న రూ. 2కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

10:30 - May 11, 2018

కర్నూలు : ఏపీ రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా హెచ్చరికలు చేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఇటీవలే ఓ చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన ప్రభుత్వం స్పందించిన సంగతి తెలిసిందే. కానీ అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకోవడం బాధాకరం.

కోడుమూరు మండలం వర్కూరులో సుంకన్న అనే వ్యక్తి ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అన్నం పెడుతానని చెప్పి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని చిన్నారి కుటుంబసభ్యులను సుంకన్న కుటుంబసభ్యులు బెదిరించారు. ఈ దారుణ ఘటన బయటకు పొక్కడంతో పోలీసులు స్పందించారు. ఈనెల 2న ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం నిందితుడి కుటుంబం పరారీలో ఉన్నట్లు సమాచారం.

జిల్లాలో పెరిగిపోతున్న అత్యాచార ఘటనలతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. ఆళ్లగడ్డ, డోన్, కర్నూలు, అదోని ప్రాంతాల్లో ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం, పోలీసులు సరియైన చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతమౌతున్నాయని విమర్శలు పెల్లుబికుతున్నాయి. ఇలాంటి ఘటనలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే కఠినాతి చర్యలు తీసుకోవాల్సినవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు. 

బాలికపై అత్యాచారం...

కర్నూలు : కోడుమూరు మండలం వర్కూరులో ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 2న ఈ ఘటన చోటు చేసుకుంది. అన్నం పెడుతానంటూ సుంకన్న అనే వ్యక్తి ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

10:13 - May 11, 2018

రంగారెడ్డి : ప్రేమ హత్యలు వెలుగు చూస్తూను ఉన్నాయి. ప్రేమించలేదనే కారణంతో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో శంకర్ పల్లిలో విద్యార్థినిని ప్రేమ పేరిట చంపేశాడు. డిగ్రీ చదువుతున్న విద్యార్థి శిరీష బ్యాంకు పరీక్షల నిమిత్తం దిల్ సుఖ్ నగర్ లో కోచింగ్ తీసుకొంటోంది. ప్రేమ పేరిట శిరీషను సాయి ప్రసాద్ వేధిస్తున్నాడు. కానీ ప్రేమను శిరీష నిరాకరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మాట్లాడుకుందామని బలవంతంగా శంకర్ పల్లిలోని ప్రగతి రిసార్ట్స్ కు తీసుకొచ్చాడు. అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సాయి ప్రసాద్ కత్తితో శిరీష గొంతు కోశాడు. ఈ సమాచారాన్ని పోలీసులు శిరీష తల్లిదండ్రులకు తెలియచేశారు. కూతురు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

విద్యార్థిని గొంతుకోసిన ప్రియుడు...

రంగారెడ్డి : జిల్లా శంకర్ పల్లిలోని ప్రగతి రిసార్ట్స్ లో దారుణం చోటు చేసుకుంది. శిరీష అనే డిగ్రీ విద్యార్థిని సాయి ప్రసాద్ గొంతు కోసి చంపేశాడు. ప్రేమ పేరిట కొంతకాలంగా శిరీషను సాయి ప్రసాద్ వేధిస్తున్నట్లు సమాచారం. 

09:24 - May 11, 2018

విజయవాడ : ఎన్నికలకు ఇంకా సంవత్సరం ఉంది. కానీ అప్పుడే ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల వాతావరణంలోకి వచ్చేశాయి. అందులో భాగంగా టిడిపి రాజకీయంగా దూకుడును ప్రదర్శిస్తోంది. వివిధ జిల్లాలో సభలు..సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసంలో శుక్రవారం టిడిపి విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల పార్టీల అధ్యక్షులు హాజరు కానున్నారు. ఈ సమావేశం సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. మహానాడు నిర్వాహణ, ధర్మపోరాటల సభలపైనా చర్చించనున్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించి ప్రజప్రతినిధుల అభిప్రాయాలను బాబు తెలుసుకోనున్నారు. 

రెచ్చగొడుతున్న పాక్...

జమ్మూ కాశ్మీర్ : మరోసారి పాక్ రెచ్చగొట్టే విధంగా ప్రవరిస్తోంది. పూంచ్ జిల్లాలో సామాన్యులను టార్గెట్ చేస్తూ కాల్పులకు దిగుతోంది. ఈ ఘటనలో 20 సంవత్సరాల యువకుడు మృతి చెందాడు. 

కీల్చిన్ పేటలో వ్యక్తి హత్య...

కర్నూలు : అదోనిలోని కీల్చిన్ పేటలో ఓ వ్యక్తిని స్థానికులు రాళ్లు..కర్రలతో కొట్టి చంపేశారు. ఇతను 'పార్థు' గ్యాంగు సభ్యుడని భావించి చంపేశారని తెలుస్తోంది. చనిపోయిన వ్యక్తి ఎవరన్న దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. 

08:16 - May 11, 2018

కర్నూలు : పుకారు ఒక మనిషి ప్రాణం తీసింది. ఓ వ్యక్తిని గ్రామస్థులు రాళ్లు..కర్రలతో కొట్టి చంపేయడం తీవ్ర కలకలం రేగింది. జిల్లాలో 'పార్థు' గ్యాంగ్ సంచరిస్తోందని..హత్యలు..అత్యాచారాలకు ఆ గ్యాంగ్ పాల్పడుతోందని జిల్లాలో ఇటీవలే పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. దీనితో పలు ప్రాంతాల గ్రామస్తులు గస్తీలు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. అదోనిలోని కీల్చిన్ పేటలో ఓ వ్యక్తిని స్థానికులు రాళ్లు..కర్రలతో కొట్టి చంపేశారు. ఇతను 'పార్థు' గ్యాంగు సభ్యుడని భావించి చంపేశారని తెలుస్తోంది. చనిపోయిన వ్యక్తి ఎవరన్న దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. కానీ ఎలాంటి పార్థు గ్యాంగ్ తిరగడం లేదని..దొంగతనాలు..అత్యాచారాలు జరగడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఎలాంటి పుకార్లు నమ్మవద్దని..ఏదైనా అనుమానాలు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. 

08:14 - May 11, 2018

నల్గొండ : జిల్లాలో రూ. 45 కోట్ల రూపాయలను ట్రాలీలో తరలిస్తుండడం కలకలం రేపింది. ఎలాంటి రక్షణ లేకుండా ఇంత డబ్బులు తరలిస్తుండడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్ బీఐ ప్రధాన శాఖ నుండి రూ. 45 కోట్లను గ్రామీణ వికాస్ బ్యాంకు తరలించేందుకు బ్యాంకు అధికారులు ఓపెన్ ట్రాలీని సిద్ధం చేశారు. అందులో నోట్ల కట్టలను సర్దారు. తరలించాడానికి సిద్ధ పడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఎదైనా ఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు ? అంటూ పోలీసులు బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. సిబ్బంది లేకపోతే పోలీసుల సహకారం తీసుకోవాలని పోలీసు అధికారులు సూచించారు.

రైతు బంధు పథకం కింద డబ్బులు సర్దుబాటు చేయాల్సి ఉందని, నగదు తరలింపు వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ట్రాలీలో తరలిస్తున్నట్లు..బ్యాంకు ఉన్నతాధికారులకు విషయం తెలియచేయడం జరిగిందని బ్యాంకు అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం పకడ్బంది సెక్యూర్టీతో ఆ నగదును గ్రామీణ వికాస్ బ్యాంకుకు తరలించారు. 

నేపాల్ కు మోడీ...

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేపాల్ కు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. దేశాధ్యక్షురాలు విద్యాదేవి భండారీ, ఉపాధ్యక్షుడు నంద బహదూర్ పున్, ప్రధాన మంత్రి కెపి ఓలిలతో ఆయన చర్చలు జరుపనున్నారు. 

నాగర్ కర్నూలులో బీఎల్ఎఫ్ మీటింగ్...

నాగర్ కర్నూలు : నేడు నాగర్ కర్నూలులో బీఎల్ ఎఫ్ మీటింగ్ జరుగనుంది. ఈ సమావేశానికి తమ్మినేని వీరభద్రం పాల్గొననున్నారు. 

నాగర్ కర్నూలులో బీఎల్ఎఫ్ మీటింగ్...

నాగర్ కర్నూలు : నేడు నాగర్ కర్నూలులో బీఎల్ ఎఫ్ మీటింగ్ జరుగనుంది. ఈ సమావేశానికి తమ్మినేని వీరభద్రం పాల్గొననున్నారు. 

07:29 - May 11, 2018

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గురువారం కరీంనగర్‌ జిల్లా హూజూరాబాద్‌లో ప్రారంభించారు. కానీ ఇక్కడ కౌలు రైతులకు మాత్రం 'సాయం' చెయ్యమని ఖరాఖండిగా చెప్పారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వీరయ్య (విశ్లేషకులు), ఎస్ .రాం మోహన్ (టి.కాంగ్రెస్), సత్యనారాయణ గుప్తా (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:12 - May 11, 2018

ఢిల్లీ : IPL-11లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు అదరగొట్టింది. గతరాత్రి ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన డేర్‌డెవిల్స్‌ నిర్దేశిత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్‌ 18.5 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 191 పరుగులు సాధించింది. శిఖర్‌దావన్‌, విలియమ్సన్‌ అదరగొట్టారు. శిఖర్‌ ధావన్‌ 92, విలియమ్సన్‌ 83 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ధావన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. సన్‌రైజర్స్‌ ఇంతవరకు 11 మ్యాచ్‌లు ఆడితే 9 విజయాలను సొంతం చేసుకుంది. 

07:07 - May 11, 2018

నల్గొండ : జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక కుటుంబసభ్యులు వాడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముగ్గుర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కోసం మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. 

07:05 - May 11, 2018

హైదరాబాద్ : లూపస్‌... ఇదో అంతు చిక్కని జబ్బు.. ఎందుకొచ్చింది.. ఎలా వచ్చిందో కూడా తెలుసుకోలేని మాయదారి రోగం. పూర్తిగా నివారణ లేని... ఈ ప్రాణాంతక లూపస్‌ డిసీజ్‌పై టెన్‌టీవీ కథనం..మనిషిలోని వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీసే లూపస్‌ వ్యాధి ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ఇది రోజురోజుకూ విస్తరిస్తోంది. ఒకప్పుడు ఒకరిద్దరిలో మాత్రమే కనిపించిన ఈ వ్యాధి ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. కేవలం ఒక్క నిమ్స్‌ ఆసుపత్రిలోనే సుమారు రెండున్నర వేలకు పైగా లూపస్‌ వ్యాధిగ్రస్తులు వైద్యులను సంప్రదిస్తున్నారంటే.. దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
లూపస్‌ వ్యాధి నేరుగా శరీరంలోని అవయవాలకు హాని చేస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ముఖ్యంగా మూత్ర పిండాలు, ఊపిరితిత్తులు, గుండెపైన ఎక్కువ ప్రభావం చూపుతుందంటున్నారు. 15 నుంచి 35 ఏళ్ల మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాగా మగవారిలో పదిశాతం మాత్రమే వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఈ వ్యాధి లక్షణాలు ఒక్కో వ్యక్తిలో ఒక్కో రకంగా ఉంటాయి. రెండు వారాలకు పైగా విపరీతమైన జ్వరం, నోట్లో పొక్కులు, చర్మంపై ఎర్ర మచ్చలు, చిన్నవయసులోనే కీళ్ళ నొప్పులు రావడం, జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని లూపస్‌ వ్యాధి గుర్తించాలంటున్నారు వైద్యులు. రుమటాలజిస్ట్‌ను కానీ, ఫిజిషియన్‌ కానీను సంప్రదించాలని సూచిస్తున్నారు. లూపస్‌ రావడానికి జెనిటిక్‌ కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కాలుష్యం, ఎక్కువగా ఎండలో ఉండే వారికి కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

07:03 - May 11, 2018

విజయవాడ : జూనియర్ ఇంటర్‌లో ప్రవేశాలకు తాకిడి మొదలైంది... రెండు దశల్లో అడ్మిషన్లు చేపట్టేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు.. తొలివిడత ప్రవేశాలను జూన్‌ 30కి పూర్తి చేయాలని డెడ్‌ లైన్‌ విధించారు. 2018-2019 విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్‌ ప్రవేశాలను రెండు దశల్లో చేపట్టేలా ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ఏప్రిల్ 10 నుంచి దరఖాస్తుల విక్రయానికి షెడ్యూల్ రూపొందించిన అధికారులు.. తొలివిడత అడ్మిషన్లను జూన్ 30కి పూర్తి చేయాలని గడువు విధించారు. పదో తరగతిలో వచ్చిన గ్రేడ్ పాయింట్ల ఆధారంగా గ్రూపుల కేటాయింపు ఉంటుంది. దరఖాస్తులు పరిశీలించిన వెంటనే.. ప్రవేశాలు కల్పించేలా నూతన విధానాన్ని ఈ సారి అమలు చేయనున్నారు. విద్యార్థులకు స్పష్టమైన అవగాహన రావాలన్న యోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

షెడ్యూల్ కులాల వారికి 15 శాతం, గిరిజనులకు 6 శాతం, వెనకబడిన కులాలకు 29 శాతం, వికలాంగులకు 3 శాతం, ఎన్సీసీ, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి 5 శాతం, సైనికుల కోటాలో 3 శాతం ప్రవేశాల్లో రిజర్వేషన్లు కల్పించారు. ప్రతి సెక్షన్ లోనూ 88 సీట్లకు మించకుండా ప్రవేశాలు చేసుకోవాలని ఇంటర్మీడియెట్‌ బోర్డ్‌ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలను ఆదేశించింది. పరిమితి మించితే అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకులాలు, ఆదర్శ కళాశాలలు మొత్తం కలిపి ఐదు వందల వరకు జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో కలిపి లక్షమందికి పైగా విద్యార్థులు పదోతరగతిలో ఉత్తీర్ణులయ్యారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు దరఖాస్తులు విక్రయించాలని బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు ప్రచారం నిర్వహించాలని బోర్డ్‌ ఆదేశించింది. ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకంపై ప్రచారం నిర్వహించి విద్యార్థులను ఆకర్షించాలని సూచించింది..

06:59 - May 11, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు ఆర్టీసి కార్మిక సంఘాల జేఏసీ నేతలు. వెంటనే వేతన సవరణ చేయాలన్న డిమాండ్‌తో ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటిసు ఇచ్చారు. గత ఏడాదిగా వివిధ సంఘాలుగా అనేక ఆందోళనా పోరాటాలు చేపట్టినా.. స్పందించకపోవడంతో.. మరింత ఉధృతంగా పోరాడేందుకు జేఏసీగా ఏర్పడ్డామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు తెలిపారు.. యాజమాన్యం వెంటనే స్పందించకుంటే.. ఈ నెల 24 తర్వాత ఏ క్షణమైనా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసి కార్మికులు కీలక పాత్ర పోషించారని అన్నారు ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవాద్యక్షుడు రవిరాజ్. ఉద్యమంలో ముందున్న కార్మికులకు మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్యానికి సమ్మెనోటీసు ఇచ్చామన్నారు. ఈ నెల 24లోపు వేతన సవరణ చేయకుంటే... సమ్మె చేపడతామని హెచ్చరించారు.

06:35 - May 11, 2018

విజయవాడ : నగర కాంగ్రెస్‌ కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతోంది. ముగ్గురు నాయకులు... ఆరు గ్రూపులు.. అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. నగర కాంగ్రెస్‌లోని సీనియర్లు పార్టీని వీడటంతో పార్టీ పెద్ద దిక్కు కరువైంది. నగరనాయకుల్లో కొందరికి ఏపీసీసీలో స్థానం కల్పించినా.. పార్టీ పటిష్టతపై ఎవరూ దృష్టి పెట్టకపోవడం నాయకత్వానికి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్‌పై ప్రజల్లో ఇంకా కోపం తగ్గలేదు. విభజన సమస్యలన్నింటికీ కాంగ్రెస్సే కారణమయ్య ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం జరుగుతున్న ఉద్యమంలో...కాంగ్రెస్‌ పేరు ఎత్తితేనే ప్రజలు కస్సుబస్సు లాడుతున్నారు. దీంతో ప్రజలకు సమాధానం చెప్పలేనిస్థితిలో కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు. గత ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకుండా చావుదెబ్బతిన్న కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో అయినా కరుణిస్తారా... అంటే పార్టీ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాల పట్ల విముఖత చూపుతున్నారు.

ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉంది. అన్ని పార్టీలు జనంలోకి వెళ్తున్నా... కాంగ్రెస్‌ నాయకులు మాత్రం ఇంకా ఇళ్లకే పరిమితమయ్యారు. నాయకులంతా ప్రజల్లోకి వెళ్లి.. బీజేపీ, టీడీపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రచారం చేయాలని ఏపీసీసీ చీఫ్‌ రఘురారెడ్డి ఆదేశాలను నగర కాంగ్రెస్‌ నాయకులు పెడచెవిన పెడుతున్నారు. దీంతో పీసీసీ అధ్యక్షుడు నగర కాంగ్రెస్‌ నాయకులకు క్లాస్‌ తీసుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్న కాంగ్రెస్‌ పట్ల ప్రజాల్లో సానుకూలత రాకపోవడానికి నేతల వైఖరే కారణమన్నది పీసీసీ నాయకత్వం వాదన. పార్టీ కమిటీల్లో పదవులు పొందేందుకు పెడుతున్న శ్రద్ధాసక్తులు.. పార్టీ బలోపేతంపై ఎందుకు పెట్టడంలేదని రఘువీరారెడ్డి ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పుకోలేని సందిగ్ధ పరిస్థితుల్లో నగర కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు. ఇకనైనా ప్రజల్లోకి వెళ్లకపోతే 2019 ఎన్నికల్లో మరోసారి భంగపాటు తప్పదని పీసీసీ నాయకత్వం హెచ్చరిస్తున్నా.. నాయకుల్లో చలనం కనిపించడంలేదు. నిరంతరం ప్రజల్లో ఉండాలంటున్న ఆదేశాలను పెడచెవిన పెట్టడంపై రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినా.. నగర కాంగ్రెస్‌ నాయకుల్లో మార్పులేదు. పీసీసీ ఆదేశాలపై నగర కాంగ్రెస్‌ ధోరణి మరోలా ఉంది. అటు ప్రజలు నమ్మరు.. ఇటు పీసీసీ నాయకత్వం ఊరుకోదు.. దీంతో తమ పరిస్థితి అడకత్తెరలో పోకచక్క చందంగా, పాము నోట్లో కప్ప మాదిరిగా తయారైందని ఆవేదన వ్యక్తం చేయడం మినహా, ఏమీ చేయలేని అశక్తులుగా మారామని అంతర్మథనం చెందుతున్నారు. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో చూడాలి. 

06:32 - May 11, 2018

విజయనగరం : జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, టీడీపీ నాయకులురాలు శోభా స్వాతిరాణి రాజకీయ భవిష్యత్‌ డోలాయమానంలో పడింది. జెడ్‌పీ చైర్‌పర్సన్‌ పదవీకాలం మరో ఏడాదితో ముగియనుంది. దీంతో రాజకీయంగా ఎటువైపు అడుగులు వేయాలా.. అన్న విషయంలో స్వాతిరాణి ఊగిసలాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలా... చేస్తే ఏ సీటును ఎంచుకోవాలి... అరకు లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగాలా.. అన్న విషయాల్లో తర్జనభర్జన పడుతున్నారు. విజయనగరం జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి రాజకీయ భవితవ్యంపై 10 టీవీ ప్రత్యేక కథనం.

మాజీ ఎమ్మెల్యే అయిన తల్లి శోభా హైమావతి నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న స్వాతిరాణి.. అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల్లో ఏదో ఒకదానికి పోటీ చేయించేందుకు ఆమె భర్త గణేశ్‌ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎస్టీలకు రిజర్వు చేసిన సొంత నియోజకవర్గం ఎస్‌.కోటలో వ్యతిరేక పరిస్థితులు ఉండటంతో ప్రత్యామ్నాయ స్థానం గురించి ఆలోచిస్తున్నారు. స్వాతిరాణి తల్లి హైమావతి గతంలో ఈ స్థానం నుంచే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. దీంతో ఇదే స్థానంలో పాగా వేసేందుకు విస్తృత పర్యటనలతో ప్రయత్నిస్తున్నా... సానుకూల పరిస్థితులు కనిపించడంలేదు. ఎస్‌.కోట ప్రస్తుత ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి.. స్వాతిరాణి ఆశలకు గండికొడుతూ వస్తున్నారు. లలితకుమారి పట్ల నియోజకవర్గ ప్రజల్లో సానుకూలత ఉంది. దీంతో జిల్లాలో పర్యటించిన పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌.. మూడోసారి కూడా కోళ్ల లలితకుమారికే సీట్లు ఇస్తామని ప్రకటించడంతో స్వాతిరాణి కుటుంబం కంగుతింది.

మంత్రి లోకేశ్‌ ప్రకటనతో ఎస్‌.కోటపై ఆశలు ఒదులుకున్న స్వాతిరాణి కుటుంబం.. ఎస్టీలకు రిజర్వు చేసిన సాలూరు అసెంబ్లీ స్థానంపై దృష్టి పెట్టింది. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు సాలూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. పండుగలు, జాతరులు వంటి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వాతిరాణి భర్త గణేశ్‌ది కూడా సాలూరే కావడంతో ఈ స్థానం పైనే దృష్టి పెట్టారు. టీడీపీ టికెట్‌ కోసం ఇప్పటి నుంచి విజయనగరం ఎంపీ ఆశోక్‌గజతిరాజుతో పార్టీ నాయకత్వానికి చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా వీరి ఆశలు నెరవేరే అవకాశాలు కనిపించడంలేదు. సాలూరు టీడీపీలో ఉన్న సీనియర్లు..స్వాతిరాణి కుటుంబం చేస్తున్న ప్రయత్నాలకు చెక్‌ పెడుతున్నారు.

సాలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌... మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌ ఈ స్థానం నుంచి పోటీ చేసే అవకాశలు ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గంపై పూర్తిగా పట్టు ఉండటంతోపాటు ప్రజల్లో సానుకూలత ఉన్న భంజ్‌దేవ్‌ను కాదని టీడీపీ అధినాయకత్వం వేరొకరికి టికెట్‌ ఇచ్చే పరిస్థితిలేదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఎస్‌.కోట, సాలూరు అసెంబ్లీ స్థానాలు కాకపోతే అరకు లోక్‌సభ పోటీ చేసే ఉద్దేశంతో స్వాతిరాణి కుటుంబం ఉంది. దీంతో అరకు లోక్‌సభ సీటు పరిధిలోకి వచ్చే సాలూరు, కురుపాం అసెంబ్లీ నియోజవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకొంటున్నారు.

ఎస్‌.కోట నుంచి ఒకసారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన స్వాతిరాణి తల్లి శోభా హైమావతికి ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ డైరెక్టర్‌ పదవిని టీడీపీ నాయకత్వం కట్టబెట్టింది. దీంతో శోభా హైమావతి దాదాపు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయినట్టుగానే భావిస్తున్నారు. స్వాతిరాణి రాజకీయ భవిష్యత్‌పై ఆందోళనతో ఉన్న భర్త గణేశ్‌, తల్లి శోభా హైమావతి.. అటు అశోక్‌గజపతిరాజు, ఇటు మంత్రి లోకేశ్‌ ప్రసన్నం చేసుకుంటూ.. మంచి మార్కులు కొట్టేసే ప్రయత్నంలో ఉన్నారు. సీట్లైనా, పదవులుపై అశోక్‌ చెప్పినవారికే వస్తాయి. అశోక్‌కు విధేయులుగా ఉంటు అటు సాలూరు, ఇటు ఎస్‌.కోట, ఇంకో వైపు అరకు లోక్‌సభ నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. శోభ కుటుంబం చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. 

06:26 - May 11, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో కాంగ్రెస్‌ బలోపేతంపై పార్టీ నేతలు దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న టీపీసీసీ నాయకత్వం... కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం సాధించేందుకు కృషి చేస్తోంది. నియోజకవర్గాల వారీగా సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ... కాంగ్రెస్‌ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. 2019 సాధారణ ఎన్నికల్లో గెలుపే పరమావధిగా పెట్టుకని పనిచేస్తున్న టీపీసీసీ నాయకత్వం.. నిజామాబాద్‌ జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసిపనిచేసే విధంగా సమన్వయ సమావేశాలు నిర్వహిస్తోంది.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ సమావేశాలు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్‌ వచ్చినా అందరూ సమిష్టిగా పనిచేసే విధంగా సమన్వయం సాధించేందుకు నేతలు, కార్యకర్తలను ఒప్పించారు. వర్గ విభేదాలు విస్మరించి అందరూ ఏకతాటిపైకి వచ్చే ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని హితబోధ చేశారు.
టీపీసీసీ నాయకుల బస్సు యాత్ర తర్వాత నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితి కొంత మెరుగుపడింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందంటూ, దీనిని కాంగ్రెస్‌కు అకూలంగా మలచుకోవాలని నేతలు చేసిన ఉపదేశాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. నియోజకవర్గాల వారీగా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.. ఈ పోరును మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు.

వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నకాంగ్రెస్‌ నాయకులు కూడా ఎక్కువగానే ఉన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌, బల్కొండ, ఎల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నాయకులు మధ్య టికెట్ల పోటీ ఎక్కువగా ఉంది. బోధన్‌, ఆర్మూర్‌, కామారెడ్డి సెగ్మెంట్లలో పోటీ అంతగా లేకపోయినా.. ఈ స్థానాల్లో సీనియర్లు ఎక్కువ మంది ఉన్నారు. దీంతో ఇతరులు ఈ సీట్లపై దృష్టి పెట్టడంలేదు. కాంగ్రెస్‌ అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న నేతలు ఈ నియోజకవర్గాల్లో ఉండటంతో ఇతరు ఆసక్తిచూపడంలేదు. ఎవరికి టికెట్‌ ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాలన్న టీపీసీసీ నాయకులు హితబోధతో ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తున్నా... భవిష్యత్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

కేపీఎస్సీకి అర్హత సాధించిన కూలీ...

కేరళ : ఎర్నాకుళం రైలు జంక్షన్ లో పనిచేసే ఓ రైల్వే కూలి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అర్హత సాధించాడు. రైల్వే స్టేషన్ లో ప్రీ వైఫ్ ని ఉపయోగించి తాను చదువుకోవడం జరిగిందని, ఇందుకు గూగుల్ వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు శ్రీనాథ్ పేర్కొన్నారు. 

జూన్ 8న చేప మందు...

హైదరాబాద్ : జూన్ 8న మృగశిరకార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించే చేప మందు పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చేప మందు పంపిణీపై బత్తిని హరినాథ్ గౌడ్ కుటుంబసభ్యులు గురువారం సచివాలయంలో మంత్రి తలసానిని కలిశారు. 

తెలుగు రాష్ట్రాల సీఎస్ ల భేటీ...

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు శుక్రవారం సమావేశం కానున్నారు. విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై సీఎస్‌లు భేటీలో చర్చించనున్నారు. 11.30 గంటలకు హైదరాబాద్‌లోని మెట్రో రైల్ కార్యాలయంలో సమావేశం జరగనుంది.

'హోదా' కోసం శివాజీ 'జాగారం'...

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హీరో శివాజీ ‘జాగారం’ చేశారు. విజయవాడలోని ధర్నాచౌక్ లో గురువారం రాత్రి ఏడు గంటలకు ఆయన ‘జాగారం’ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు ఈ నిరసన దీక్ష కొనసాగింది. 

సన్ రైజర్స్ విజయం...

ఢిల్లీ : ఐపీఎల్ 11లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ జట్టు 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేయగా సన్ రైజర్స్ జట్టు 1 వికెట్ మాత్రమే కోల్పోయి 191 పరుగులు చేసింది. 

చీఫ్ జస్టిస్ కు జస్టిస్ చలమేశ్వర్ లేఖ...

ఢిల్లీ : కొలీజియం సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు సుప్రీంకోర్టు సీనియర్‌ జడ్జి జస్టిస్‌ చలమేశ్వర్‌ లేఖ రాశారు. ఉత్తరాఖండ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు కేంద్రానికి సిఫారసు చేయాలని లేఖలో కోరారు. 

కేజ్రీవాల్ బంధువును అరెస్టు చేసిన ఏసీబీ...

ఢిల్లీ : అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సమీప బంధువును ఏసిబి అరెస్ట్‌ చేసింది. 10 కోట్ల పిడబ్య్లూడీ కుంభకోణానికి సంబంధించి కేజ్రీవాల్‌ మేనల్లుడు వినయ్‌కుమార్‌ బన్సాల్‌ను గురువారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. బన్సాల్‌ ఇంటిపై ఏసిబి జరిపిన దాడుల్లో అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ఆర్మీతో ఎప్పుడూ గెలవలేరు - బిపిన్ రావత్...

ఢిల్లీ : కశ్మీర్‌కు స్వాతంత్ర్యం అనే కల ఎప్పటికీ సాకారం కాదని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ కశ్మీరీ యువతకు సందేశమిచ్చారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఆర్మీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. ఆజాదీ కోసం పోరాటం చేసేవారు ఆర్మీతో ఎప్పుడూ గెలవలేరని, ఆ మార్గాన్ని మానుకోవాలని హితవు పలికారు. 

Don't Miss