Activities calendar

12 May 2018

21:52 - May 12, 2018

కర్నాటక : ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారమని ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేశాయి. మరోసారి కన్నడ పీఠం హస్తం పార్టీదేనని వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 106 నుంచి 118 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించాయి. ఈ ఫలితాల్లో జేడీఎస్‌ సీట్లు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎగ్జిట్‌పోల్స్‌ తమకు అనుకూలంగా ఉండడంతో కాంగ్రెస్‌ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా 120 స్థానాలు గెలుస్తామని ధీమాగా ఉన్నారు. కన్నడ పీఠం దక్కించుకోవాలంటే 113 సీట్లు దక్కించుకోవాల్సి ఉన్న నేపథ్యంలో... కాంగ్రెస్‌, బీజేపీలకు జేడీఎస్‌ మద్దతు తప్పనిసరి అని స్పష్టమవుతుంది. మరి జేడీఎస్‌ ఏ పార్టీకి మద్దతిస్తుంది... ఎగ్జిట్‌పోల్స్‌ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కన్నడ పీఠం ఎవరికి దక్కుతుంది? మారుతున్న రాజకీయ సమీకరణలు ఎవరికి అధికారం దక్కించనున్నాయి? అనే పలు కీలక అంశాలపై ప్రముఖ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ గారి విశ్లేషణలో చూద్దాం..

21:43 - May 12, 2018

హైదరాబాద్ : పంటపెట్టుబడికి సాయంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు చెక్కులు మూడోరోజూ జిల్లాల్లో జోరుగా కొనసాగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రైతులకు చెక్కులను, కొత్త పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు.

చెక్కులు పాస్ పుస్తకాల పంపిణీ..
భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అచ్చుతాపురంలో రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాలను ఉపముఖ్యమంత్రి మహబూబ్‌ అలీ, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అన్నదాతలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. మేడ్చల్‌ జిల్లా షామీర్‌పేట్‌ మండలం కొల్తూరులో రైతుబంధు చెక్కులు పాస్‌పుస్తకాలను పశు సంవర్ధశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి రైతులకు పంపిణీ చేశారు. తెలంగాణలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడం, రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వడం కేసీఆర్‌ ఘనతే అన్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో రైతుబంధు చెక్కుల పంపిణీ..
నిజామాబాద్ నవీపేట్‌ మడలం కమలాపూర్‌ రేంజల్‌ మండల కేంద్రంలో రైతుబంధు పథకంలో ఎంపీ కవిత పాల్గొని రైతులకు పాస్‌ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో రైతుబంధు చెక్కులను ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తాతో కలిసి, రాజ్యసభ్యుడు డి. శ్రీనివాస్‌ ప్రారంభించారు. రైతులకు పెట్టుబడి ఇచ్చే పథకం దేశానికి స్ఫూర్తిదాయకమని చెప్పారు.

వరంగల్ జిల్లాలో ప్రారంభించిన ఆరూరి రమేశ్..
వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పెద్ద మొత్తంలో రుణ మాఫీ చేసి రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తూ గిట్టుబాటు ధర కల్పిస్తున్న ఘనత కేసీఆర్‌దే అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో రైతుబంధు పాస్‌ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యాక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు పాల్గొన్నారు. రైతును రాజు చేయటమే కేసీఆర్‌ లక్ష్యం అన్నారు.

రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం: కడియం..
సంగారెడ్డి పఠాన్‌చెరు నియోజక వర్గంలోని వివిధ గ్రామాల్లో పట్టాదారు పాస్‌ పుస్తకాలను, చెక్కులను మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి పంపిణీ చేశారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం అన్నారు. వరంగల్‌ జిల్లా ఆత్మకూర్‌ మండల కేంద్రంలో రైతుబంధు చెక్కులు పాస్‌ పుస్తకాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పంపిణీ చేశారు.

మెదక్‌ జిల్లా రామాయంపేట ప్రగతి ధర్మారం గ్రామంలో
మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో రైతుబంధు చెక్కులు, పాస్‌బుక్కులను డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి పంపిణీ చేశారు. అంతకు ముందు ఆమెకు ప్రజలు, రైతులు బ్రహ్మ రథం పట్టారు. ఎద్దుల బండిలో కూర్చోబెట్టి ఊరేగించారు. నిర్మాల్‌ జిల్లా లోకేశ్వరం మండలం రాయ్‌పూర్‌ కాండ్లీలో సుమారు 30 మంది రైతులకు పంపిణీ చేసిన చెక్కులు బ్యాంకుకు తీసుకెళ్తే అవి చెల్లలేదు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. బ్యాంక్‌ సిబ్బందితో వాదనకు దిగారు. చివరకు తహశీల్దార్‌ కల్పించుకుని మూడురోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. 

21:37 - May 12, 2018

అమరావతి : టీడీపీపై బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను మంత్రి సోమిరెడ్డి ఖండించారు. ఎన్నికల్లో ఇచ్చిన 90శాతం హామీలను టీడీపీ పూర్తి చేసిందని... కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్విస్‌ బ్యాంకులోని నల్లధనాన్ని తీసుకువస్తానన్న మోదీ హామీ ఏమైందో చెప్పాలన్నారు. పార్లమెంట్‌లో సభనే నడపలేని మోదీ దేశాన్ని ఏం పాలిస్తారన్నారు సోమిరెడ్డి. 

21:35 - May 12, 2018

కర్నాటక : ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారమని ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేశాయి. మరోసారి కన్నడ పీఠం హస్తం పార్టీదేనని వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 106 నుంచి 118 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించాయి. ఈ ఫలితాల్లో జేడీఎస్‌ సీట్లు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎగ్జిట్‌పోల్స్‌ తమకు అనుకూలంగా ఉండడంతో కాంగ్రెస్‌ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా 120 స్థానాలు గెలుస్తామని ధీమాగా ఉన్నారు.

కాంగ్రెస్ కే అధికారమంటున్న ఎగ్జిట్ పోల్స్
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం అని ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి. మరోసారి హస్తం పార్టీదే కన్నడ పీఠం అని స్పష్టం చేశాయి.

ఇండియా టుడే, యాక్సిస్‌ మై ఇండియా : కాంగ్రెస్‌-118
కర్ణాటక ఎన్నికల అనంతరం విడుదల చేసిన ఎగ్జిట్‌పోల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీకి 118 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఇండియా టుడే, యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేసింది. ఇక బీజేపీకి 79 నుంచి 92 స్థానాలు, జేడీఎస్‌కు 22 నుంచి 30 స్థానాలు దక్కే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌పోల్స్‌ కూడా కాంగ్రెస్‌దే అధికారమని స్పష్టం చేసింది. హస్తం పార్టీ 90 నుంచి 103 స్థానాలు దక్కే అవకాశం ఉందని తెలిపింది. బీజేపీకి 80 నుంచి 93 స్థానాలు, జేడీఎస్‌కు 31 నుంచి 39 స్థానాలు దక్కుతాయని వెల్లడించింది.

రిపబ్లిక్‌ టీవీ : బీజేపీ 95-114
ఇదిలావుంటే రిపబ్లిక్‌ టీవీ... బీజేపీకి 95 నుంచి 114 సీట్లు దక్కుతాయని, కాంగ్రెస్‌కు 73 నుంచి 82 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది. మరోవైపు న్యూస్‌ ఎక్స్‌ టీవీ ఎగ్జిట్‌పోల్స్‌ కూడా బీజేపీ 102 నుంచి 110 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. కాంగ్రెస్‌కు 72-78 స్థానాలు మాత్రమే వస్తాయని, జేడీఎస్‌కు 36-39 స్థానాలు దక్కుతాయని వెల్లడించింది. మరో టీవీ.. ఏబీపీ-సీ ఓటర్‌ ఎగ్జిట్‌పోల్స్‌ బీజేపీకి 97 నుంచి 109 స్థానాలు దక్కే అవకాశం ఉందని వెల్లడించింది. కాంగ్రెస్‌కు 87 నుంచి 99 స్థానాలు, జేడీఎస్‌కు 21-30 స్థానాలు దక్కనున్నట్లు తెలిపింది.

రాజీకీయ పరిణామాలు మార్పులపై సర్వత్రా ఆసక్తి..
ఎంతో పోటాపోటీగా సాగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కే పట్టం దక్కుతుందని ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. కన్నడ పీఠం దక్కించుకోవాలంటే 113 సీట్లు దక్కించుకోవాల్సి ఉన్న నేపథ్యంలో... కాంగ్రెస్‌, బీజేపీలకు జేడీఎస్‌ మద్దతు తప్పనిసరి అని స్పష్టమవుతుంది. మరి జేడీఎస్‌ ఏ పార్టీకి మద్దతిస్తుంది... ఎగ్జిట్‌పోల్స్‌ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

21:29 - May 12, 2018

కర్ణాటక : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 70 శాతం పోలింగ్‌ నమోదైంది. రామనగర్‌ జిల్లాలో అత్యధికంగా 85 శాతం పోలింగ్‌ నమోదు కాగా... బెంగుళూరులో అత్యల్పంగా 44 శాతం పోలింగ్‌ నమోదైంది. మే 15న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాన్ని వెల్లడించనున్నారు.

మధ్యహ్నాం నుండి వేగం పుంచుకున్న పోలింగ్..
దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 222 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్‌ ఆ తర్వాత పుంజుకుంది. ఉదయం 11 గంటలకు కేవలం 24 శాతం పోలింగ్‌ నమోదు కాగా....సాయంత్రం 5 గంటలకు 64.5 శాతం పోలింగ్‌ నమోదైంది. రామనగర జిల్లాలో అత్యధికంగా 84శాతం పోలింగ్‌ నమోదు కాగా, బెంగళూరు అర్బన్‌లో అత్యల్పంగా 44 శాతం పోలింగ్‌ నమోదైంది.

450 పింక్ పోలింగ్ కేంద్రాలు..
వృద్ధులు, మహిళలు, యువకులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపారు. కర్ణాటకలో తొలిసారిగా మహిళల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 450 పింక్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో పోలింగ్‌ అధికారులు, పరిశీలకులు, భద్రతా సిబ్బంది, పోలింగ్‌ ఏజెంట్లు కూడా మహిళలే ఉండడం గమనార్హం.

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
ఈ ఎన్నికల్లో ప్రముఖులంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాముండేశ్వరీలో తన ఓటుహక్కును వినియోగించుకోగా... బిజెపి సిఎం అభ్యర్థి యడ్యూరప్ప షికారిపురిలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కేంద్రమంత్రి అనంతకుమార్‌ తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. బెంగళూరులో మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే తన కుటుంబంతో కలిసి వచ్చి ఓటు వేశారు. క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్, కన్నడ నటులు రమేశ్‌ అరవింద్‌, రవిచంద్ర, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ కూడా ఓటు వేశారు.ఓవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుండగానే ఈ నెల 17న ముఖ్యమంత్రిగా తాను ప్రమాణం చేయబోతున్నట్లు బిజెపి సిఎం అభ్యర్థి యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీలో బిజెపి 150 స్థానాల వరకు గెలుచుకుంటుందని అంచనా వేశారు.

యడ్యూరప్ప వ్యాఖ్యలకు సిద్ధరామయ్య కౌంటర్
యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలపై సిఎం సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. యడ్యూరప్పకు మతి భ్రమించిందేమోనని అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో తిరిగి తాము అధికారంలోకి రావడం ఖాయమని...120కి పైగా స్థానాలతో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

మోదీ పర్యటనపై కాంగ్రెస్ అభ్యంతరం
ప్రధానమంత్రి నరేంద్రమోది నేపాల్‌ పర్యటనపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకే మోది నేపాల్‌లోని ఆలయాలను దర్శనం చేసుకుంటున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు. ఇది ఎన్నికల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు.

మే 15న ఎన్నికల ఫలితాలు
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలుండగా... 222 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. జయనగర బిజెపి అభ్యర్థి విజయకుమార్‌ హఠాన్మరణంతో ఆ ఎన్నిక రద్దయ్యింది. నకిలీ ఓటు కార్డులు వెలుగుచూసిన రాజరాజేశ్వరి నగర నియోజకవర్గ ఎన్నికను కూడా అధికారులు వాయిదా వేశారు. ఈ ఎన్నికల్లో ఎవరికి వారు విజయం తమదేనని కాంగ్రెస్‌, బిజెపి, జెడిఎస్‌ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల పోలింగ్‌ పూర్తి కావడంతో ఆయా పార్టీల అభ్యర్థుల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఓటరు ఎవరిని కరుణిస్తారన్నది మే 15న ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వేచి చూడాలి.

20:27 - May 12, 2018

పిల్లవుట్టక ముందుకే కుల్లగుట్టినట్టుంది యడ్యారప్ప యవ్వారం జూస్తుంటే.. ఇంక ఓట్లు పూరాగ వడనేలేదు.. పడ్డ పెట్టెలు స్ట్రాంగురూములనే ఉన్నయ్.. అప్పుడే ఏమంటున్నడు.. ఈనెల పదిహేడు తారీఖు నాడు కర్ణాటక ముఖ్యమంత్రిగ ప్రమాణ స్వీకారం జేయవోతున్న.. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీని.. బీజేపీ అధ్యక్షుడు అమీత్ షాను పిల్చుకుంటాంటున్నడు..

ఆ మొత్తం మీద కర్ణాటకల ఇంకో ఘట్టం గూడ ఒడ్సిపోయింది.. అదే ఓట్లు పెట్టెలళ్ల వడ్డయ్.. ఆడాడ చిన్నచిన్న పంచాదులు ఈవీఎంల సతాయించుడు తప్పితె అంత మంచిగనే అయ్యింది.. ఇగ మిగిలింది ఈ పదిహేను తారీఖు నాడు ఓట్ల లెక్కింపు ఒక్కటే.. ఇన్నొద్దులు మీ పంత నవిలిండ్రుగదా.? పార్టీలోళ్లు ఇప్పుడొస్తరేమో సూడుండ్రి మీ ఊర్లపొంటి మీ ఇండ్లపొంటి..

ఉల్వచేన్ల వొడగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కంది చేన్ల ఎంకులాడుకుంటున్నదా.? రెండువేల పందొమ్మిది ఎన్నికలు తెలంగాణల రైతు కేంద్రంగ జర్గబోతున్నయా..? అవును..? అటు టీఆర్ఎస్ పార్టీకి.. ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి రైతే కేంద్రం.. నాల్గేండ్ల టీఆర్ఎస్ పరిపాలనల రైతులను పెద్దగ వట్టిచ్చుకోని సర్కారు ఏక్ దం చెక్కులు వంచి కాంగ్రెసుకు చెక్కువెట్టే పనిజేశింది.. మరి కాంగ్రెస్ లక్ష్యమేంది..? వాళ్లెట్ల రైతులను మెప్పిస్తరు..?

సర్కారు బడి ఏమన్న కేసీఆర్ అబ్బసొత్తా.? ఇది రాజకీయ పార్టీ కార్యక్రమాలు జేస్తందుకు ఉన్నదా..? లేకపోతె ఇంకేంది..? అని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణా రెడ్డి పంచాదికి దిగింది.. అటు టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ భాస్కరు గూడ కయ్యానికి దిగిండ్రు వీళ్ల మన్సుల పంచాది వేరే ఉన్న ఫ్లెక్సీలు మీదికి మల్పి తిట్టుకుంటున్నరు సూడుండ్రి..

అప్పిచ్చినోడు ఇంటికి రాంగనే.. ఇద్దరాలు మొగలు పంచాది వెట్టుకోని గిన్నెలు గిలాసలు ఎత్తేసుకుంటుంటే అప్పిచ్చినోడు ఉంటడా ఆడ.. ఏ వాళ్ల పంచాదే గట్టిగైతున్నరు అప్పుపైకం అడ్గితె నన్నుగూడ గొట్టగాళ్ల తర్వాతొస్తాని ఎల్లిపోతడు.. వాడువోంగనే మళ్ల భార్యభర్త నిమ్మలంగుంటరు.. అగో సేమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంల బీజేపీ, తెల్గుదేశంది గూడ ఇద్దరాలు మొగల పంచాది అసొంటిదే అన్నట్టు...

తెలంగాణల సర్కారు బడులు ఎట్లున్నయంటే.. అండ్ల అయితున్న ట్రీట్ మెంటుకు రాష్ట్రంలున్న ప్రైవేటు దావఖాండ్లన్ని ఈగెలు జోపుకుంటున్నయ్ రోగులు రాక.. గతపాలకులు ఇంత గొప్పగ సర్కారు దావఖాండ్లను ఏడనన్న తీర్చి దిద్దిండ్రా అని అడ్గుతున్నడు.. నీళ్ల మంత్రి హరీషం సారు.. సంగారెడ్డికాడ కండువాలు మార్చే కార్యం తర్వాత చెక్కుల పంపిణి కాడికొచ్చి ఈ చమత్కారం జెప్పిండు..

జనాభాల యాభై శాతం ఉన్న బీసీలకు చట్టసభలళ్ల రిజర్వేషన్లు గల్పియ్యాలే అని కూడుదినకుంట గూసున్నరు ఒకతాన కొంతమంది బీసీనాయకులు.. నల్గురు గూసోని రాజ్యాధికారం గావాలె అంటున్నరు.. ఎట్లొస్తదే అన్నా రాజ్యాధికారం.. బీసీల శరీరం మాసానికి... మందుకు లొంగిపోతనే ఉండే.. శరీరం తోని గొట్లాడితె బీసీలకు రాజ్యమొస్తాదే.. బుద్దితోని కొట్లాట జేయ్.. అద్దగంటల ఈ రాష్ట్రం నీ చేతులకు రాకపోతె అడ్గు..

కార్డన్ సర్చ్ అని ఒక కథనడుస్తున్నది చానొద్దుల సంది తెలంగాణ రాష్ట్రంల..మరి ఈ కార్డన్ సర్చ్ తోని ఏం బైటవడ్తున్నది ఏ దొంగ దొర్కుతున్న సంగతి మనకు మాత్రం తెల్వదిగని.. పోలీసోళ్లు ఏడైతె చేయాల్నో సర్చింగు ఆడ జేస్తలేరు.. ఏడ జేయొద్దు ఆడ జేస్తున్నరు.. పేదలు బత్కే బస్తీల పొంట సర్చింగులు గాదు పోలీసోళ్లు మీరు జేయవల్సింది నిజంగ మీకు ధమ్ము ధైర్యం ఉంటే ఇగో గీడ జేయుండ్రి...

20:09 - May 12, 2018

కర్ణాటక : ప్రస్తుతం దేశ ప్రజల దృష్టంతా కర్ణాటక ఎన్నికలపైనే ఉంది. అంతగా ఆసక్తిరేపిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఫలితాలు ఈ నెల 15న వెల్లడి కానున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. జేడీఎస్‌ ఈ ఎన్నికల్లో కింగ్‌ మేకర్‌ అవుతుందని ఎన్నికల ముందు పలు సర్వేలు చెప్పిన విషయం తెలిసిందే. కాగా, ఈ పోలింగ్‌కు సంబంధించి ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను పలు సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఈ ఎన్నికలు మొత్తం 222 స్థానాలకు జరిగిన విషయం తెలిసిందే. ఇండియా టుడే-ఆక్సిస్ మై ఇండియా ఫలితాల ప్రకారంగా చూస్తే కాంగ్రెస్: 106-118, బీజేపీ: 79-92,జేడీఎస్‌: 22-30 , ఇతరులు: 1-4, టైమ్స్‌ నౌ-వీఎంఆర్‌ ప్రకారంగా కాంగ్రెస్: 90-103,బీజేపీ: 80-93,జేడీఎస్‌: 31-39,ఇతరులు: 2-4 ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదయ్యాయి. కాగా కర్ణాటకలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ అంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ.ఈ చర్చలో కాంగ్రెస్ నేత మల్లు రవి, ప్రముఖ విశ్లేషకులు, నవ తెలంగాణ దినపత్రిక ఎడిటర్ వీరయ్య, బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణు పాల్గొన్నారు. 

45మంది తాలిబన్లు హతం..

ఆప్ఘనిస్థాన్‌ : కల్లోలిత ఫరా ప్రావిన్స్‌లో తాలిబిన్ తిరుగుబాటుదారులు, ప్రభుత్వ భద్రతా బలగాల మధ్య హోరాహోరీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 45 మంది తాలిబన్ తిరుగుబాటుదారులు హతమయ్యారు. మరో 40 మంది గాయపడ్డారు. ఫరా సిటీని తమ అధీనంలోకి తీసుకునేందుకు తాలిబన్ ఉగ్రవాదాలు ప్రయత్నించడంతో భద్రతా దళాలు వారిని మట్టుబెట్టినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మిలిటెంట్లతో జరిపిన హోరాహోరీలో 16 మంది ఆప్ఘన్ భద్రతా సిబ్బంది కూడా వీరమరణం పొందినట్టు 'టోలో' న్యూస్ వెల్లడించింది.

కర్ణాటక ఎగ్జిట్‌ పోల్ ఫలితాల్లో కాంగ్రెస్ దే పైచేయి..

కర్ణాటక : ప్రస్తుతం దేశ ప్రజల దృష్టంతా కర్ణాటక ఎన్నికలపైనే ఉంది. అంతగా ఆసక్తిరేపిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఫలితాలు ఈ నెల 15న వెల్లడి కానున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. జేడీఎస్‌ ఈ ఎన్నికల్లో కింగ్‌ మేకర్‌ అవుతుందని ఎన్నికల ముందు పలు సర్వేలు చెప్పిన విషయం తెలిసిందే. కాగా, ఈ పోలింగ్‌కు సంబంధించి ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను పలు సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఈ ఎన్నికలు మొత్తం 222 స్థానాలకు జరిగిన విషయం తెలిసిందే.

లొట్లెగుళ్లహళ్లిలో రీపోలింగ్

కర్ణాటక : రాష్ట్రంలో జరిగిన పోలింగ్ లో కొన్ని ప్రాంతాలలో ఈవీఎంలు పనిచేయలేదు. దీంతో ఈవీఎంలు పనిచేయని కారణంగా లొట్లెగుళ్లహళ్లిలో పోలింగ్ బూత్ లో సోమవారం నాడు రీపోలింగ్ ను అధికారులు నిర్వహించనున్నారు. కాగా రామనగర్ జిల్లాలో అత్యధికంగా 84 శాతం పోలింగ్ నమోదు కాగా..బెంగళూరు అర్బన్ లో అత్యల్పంగా 44 శాతం పోలింగ్ నమోదయినట్లుగా అధికారులు తెలిపారు. 

ఆ మృగాడికి ఉరిశిక్ష..

మధ్యప్రదేశ్ : ఆడ పుట్టుకే ఓ శాపంగా మారిపోయిన దుర్భర,భయంకరమైన పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. అప్పుడే పుట్టిన ఆడపిల్ల దగ్గర నుండి వృద్ధ మహిళల వరకూ అత్యాచారాలకు గురవుతున్న మృగ సంస్కృతికి భారతదేశం దిగజారిపోతోంది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల పసిగుడ్డుపై ఓ మృగాడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇండోర్ లో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల పక్కన అమాయకంగా నిద్రిస్తున్న పసిగుడ్డును ఎత్తికెళ్లిన ఓ పశువు ఓ బిల్డింగ్ సెల్లార్ అత్యాచారం చేసి చంపేశాడు. బిల్డింగ్ బేస్‌మెంట్ దగ్గర రక్తపు మడుగులో చిన్నారి డెడ్‌బాడీ దొరికింది.

ముగిసిన కన్నడ పోలింగ్..

కర్ణాటక : రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుండి మధ్యహ్నాం మూడు గంటల వరకూ మందకొడిగా కొనసాగిన పోలింగ్ నాలుగు గంటల నుండి జోరందుకుంది. రాష్ట్రంలో మొత్తం 224 స్థానాలకు గాను 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటలకు 64 శాతం ఓటింగ్ పోల్ అయ్యింది. సాధారణంగా 5 గంటల వరకూ మాత్రమే పోలింగ్ వుంటుంది.కానీ ఓటర్ల కోసం మరో గంటను ఎన్నికల సంఘం పొడిగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సమయం మించిపోయినా గానీ లైన్లలో నిలబడినివారికి మాత్రం ఓటు వేసేందుకు అధికారులు అనుమతినిస్తామన్నారు.

18:21 - May 12, 2018

కర్ణాటక : రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుండి మధ్యహ్నాం మూడు గంటల వరకూ మందకొడిగా కొనసాగిన పోలింగ్ నాలుగు గంటల నుండి జోరందుకుంది. రాష్ట్రంలో మొత్తం 224 స్థానాలకు గాను 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటలకు 64 శాతం ఓటింగ్ పోల్ అయ్యింది. సాధారణంగా 5 గంటల వరకూ మాత్రమే పోలింగ్ వుంటుంది.కానీ ఓటర్ల కోసం మరో గంటను ఎన్నికల సంఘం పొడిగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సమయం మించిపోయినా గానీ లైన్లలో నిలబడినివారికి మాత్రం ఓటు వేసేందుకు అధికారులు అనుమతినిస్తామన్నారు. ఈ నేపథ్యంలో మధ్యహ్నాం నుండి ఊపందుకున్న పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసే సమయానికి 64 శాతం ఓటింగ్ పోల్ అయినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ఈనెల 15న జరుగనుంది. ఈ క్రమంలో జయాపజయాలు ఎవరిని వరించనున్నాయో తెలియాలంటే 15 వరకూ ఎదురు చూడాల్సిందే.

18:10 - May 12, 2018

మహారాష్ట్ర : రెండు వర్గాల మధ్య ఘర్షణతో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ అట్టుడికింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఘర్షణల్లో విధ్వంసం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందారు, 30 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో 10 మంది పోలీసులు కూడా ఉన్నారు. నల్లా కనెక్షన్ తొలగించడంపై ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకుంటూ విధ్వంసానికి పాల్పడ్డారు. షాపులు, కొన్ని వాహనాలను తగులబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అంతేకాక రెండు గ్రూపులపై టీయర్‌ గ్యాస్‌ను వదిలారు. సమస్య మరింత ఉద్రిక్తం కాకుండా ఉండేందుకు పోలీసులు ఔరంగాబాద్‌లో 144 సెక్షన్‌ విధించారు. విధ్వంసానికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

18:08 - May 12, 2018

ఉత్తరప్రదేశ్ : నేపాల్‌ జనకపురిలో ప్రధాని నరేంద్రమోది నిన్న ప్రారంభించిన బస్సు అయోధ్యకు చేరుకుంది. అయోధ్యలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ బస్సుకు స్వాగతం పలికారు. భారత్‌ నేపాల్‌ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల్లో కొత్త అధ్యయనం మొదలైందని ఈ సందర్భంగా యోగి అన్నారు. ప్రధాని మోది, నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ జనక్‌పురి-అయోధ్య నడుమ బస్సు సేవలను శుక్రవారం పచ్చ జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే. రామాయణ్‌ సర్కిట్ భారత్‌-నేపాల్‌ దేశాల మధ్య టూరిజం అభివృద్ధికి ఎంతో దోహద పడుతుందని ప్రధాని మోది అన్నారు. యాత్రీకులు జనక్‌పురిలో సీతాదేవి మందిరం, అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించుకునేందుకు ఈ బస్సును ప్రారంభించారు.

18:06 - May 12, 2018

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోది నేపాల్‌ పర్యటనపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకే మోది నేపాల్‌లోని ఆలయాలను దర్శనం చేసుకుంటున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపుడు ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి విదేశీ పర్యటనలకు వెళ్లడమేంటని ప్రశ్నించారు. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని...మోది నిర్ణయం ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపుతుందని అన్నారు. నేపాల్‌ రెండోరోజు పర్యటనలో ప్రధాని మోది ముక్తినాథ్‌, పశుపతి నాథ్‌ ఆలయాలను సందర్శించారు. ఈ రెండు ఆలయాలు శివుడివి కావడంతో లింగాయత్‌లను ప్రభావితం చేయవచ్చనే ఉద్దేశంతోనే మోది నేపాల్‌ వెళ్లినట్లు కాంగ్రెస్‌ ఆరోపించింది.

18:03 - May 12, 2018

యాదాద్రి భువనగిరి : తెలంగాణలో బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా జూన్‌ 25, 26, 27 తేదీల్లో కలెక్టరేట్లను ముట్టడిస్తామని చెప్పారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో జరిగిన బీఎల్‌ఎఫ్ సమావేశంలో పాల్గొన్న తమ్మినేని పెట్టుబడి సాయం సామాన్య రైతులకు అందడం లేదన్నారు. ప్రభుత్వం పెట్టుబడిసాయం లాంటివి కాకుండా పండిన పంటకు గిట్టుబాటు ధరను అందించాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు.

అప్పుడు దండగ..ఇప్పుడు పండగ : కడియం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం సాధించుకోకముందు వ్యవసాయం దండగలా వుంటే ఇప్పుడు పండగలా వుందని మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. రైతన్నకు సరైన కరెంటులేక, పొలాలు ఎండిపోయేవన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం క్యూలో గంటలు, రోజుల కొద్ది నిలబడాల్సి వచ్చేదన్నారు. రైతుల రుణ మాఫీలు,పంటలకు పెట్టుబడి లేదు...రైతును పట్టించుకునే వారు లేరు... మరి తెలంగాణ వచ్చాక వ్యవసాయం పండగగా మారుతోందని కడియం పేర్కొన్నారు. 

షా కాన్వాయ్ పై రాళ్ళ దాడి జరగలేదు: డీజీపీ

అమరావతి : అలిపిరి ఘటనపై ఏపీ డీజీపీ మాలకొండయ్య స్పందించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై ఎలాంటి రాళ్ల దాడి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. కాన్వాయ్ లోని ఏడో కారు అలిపిరి వద్ద కొద్దిగా స్లోగా వెళ్లిందని... ఈలోగా సుబ్రహ్మణ్యం అనే వక్తి కర్రతో కారు అద్దం పగలగొట్టారని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు అతన్ని పట్టుకున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ఒకర్ని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని చెప్పారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకుంటామని...

తమిళియన్లు మోదీకి నిరసనలు తెలపలేదా?: సోమిరెడ్డి

అమరావతి : ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడుకు వెళ్తే ఆక్కడి ప్రజలు నిరసన తెలిపలేదా? అని మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు. అమిత్ షా వ్యవహారాన్ని రాజకీయం చేయటం తగదన్నారు. దేశంలోని ఇంటెలిజెన్స్ మొత్తం కర్ణాటకలోనే వుందన్నారు. యడ్యూరప్పతో వ్యూహకమిటీలో కూర్చున్న వైసీపీ ఏపీలో బీజేపీతో పోరాటమంటే ఎవరు నమ్మరన్నారు. ఏపీలో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్నారని సోమిరెడ్డి విమర్శించారు. 

కుప్పం నివాసులతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం..

అమరావతి : కుప్పం నియోజక వర్గ ప్రజలతో సీఎం చంద్రబాబు ఆత్మీయ సమావేశం జరుపుకున్నారు. విహార యాత్రలో భాగంగా విజయవాడకు వచ్చిన కుప్పం నియోజకవర్గంలోని వాసనాడు గ్రామస్థుల యోగక్షేమాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని చంద్రబాబు వద్ద అభిలాషను వారు వ్యక్తంచేశారు. వారికోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. చరిత్రలో అపురూపంగా నిలిచిపోయే పోలవరం ప్రాజెక్టును జీవితంలో ఒక్కసారన్నా సందర్శించాలని చంద్రబాబు సూచించారు. దానికి తగిన ఏర్పాట్లు చేసిన చంద్రబాబుకు కుప్పం వాసులు ధన్యవాదాలు తెలిపారు. 

16:40 - May 12, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. లింగపాలెం మండలం ధర్మాజీగూడెం వద్ద ఈ ఘటన జరిగింది. దాదాపు 40మంది చిన్నారులతో వెళుతున్న టాటా వ్యాన్ ను టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో ఒక చిన్నారి మృతి చెందింది. మరో నలుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా వుంది. గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఏలూరులో కోలాటం కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంగపేట నుండి ఏలూరు వెళుతుండగా ఈ ఘటన ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

16:24 - May 12, 2018

విజయవాడ : నిన్న తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌పై దాడి ఘటనను ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. జాతీయ అధ్యక్షుడిపైనే దాడి జరిగితే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు డైరెక్టన్ లోనే దాడి యాక్షన్ జరిగిందని ఆరోపించారు. అమిత్‌ షా కాన్వాయ్‌పై దాడి కేవలం ప్రభుత్వం వైఫల్యం కారణమన్నారు. ప్రత్యేక హోదాకు నిధులు కేటాయిస్తుంటే తీసుకోకుండా ఉద్యమాలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రధాని మోదీపై ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఇంత వరకు ఒక్క కేసు కూడా వేయలేదన్నారు. అలిపిరి ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. నిరసన తెలిపే నైతిక హక్కు టీడీపీ కి లేదనీ..అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే సందేహం వస్తోందన్నారు. ఎన్టీఆర్‌ మీదే చెప్పులు విసిరిన సంస్కృతి టీడీపీదని ఎద్దేవా చేశౄరు. హోదాతో ప్యాకేజీకి మించిన న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నించారు. అలిపిరి ఘటనపై సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. 

16:11 - May 12, 2018

కర్ణాటక : ఎన్నికల్లో పోలింగ్ జోరందుకుంది. ఉదయం నుండి నత్తనడకన కొనసాగిన పోలింగ్ మధ్యాహ్నాం నాలుగు గంటలకు పోలింగ్ కేంద్రాలకు ఓట్లర్లు క్యూ కట్టారు. సాయంత్రం 4 గంటల సమయానికి 58 శాతం పోలింగ్ నమోదయ్యింది. కాగా మరో రెండు గంటల్లో పోలింగ్ ముగియనుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను 222 నియోజకవర్గాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. కాగా జయనగర్ బిజెపి అభ్యర్థి బిఎన్‌.వినయ్‌కుమార్‌ మృతితో ఆ ఒక్క స్థానానికి ఎన్నిక వాయిదా పడగా ఈ నెల 28న జరగనుంది. 

15:58 - May 12, 2018

కర్నాటక : రాష్ర్టంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నత్తనడకన సాగుతోంది. మధ్యాహ్నం రెండు గంటల వకు కూడా పోలింగ్ పుంజుకోలేదు. ఇప్పటివరకు 32 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదయింది. పలు చోట్ల ఇంకా ఈవీఎంలు మొరాయిస్తూనే ఉన్నాయి.కాగా మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను 222 నియోజకవర్గాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. కాగా జయనగర్ బిజెపి అభ్యర్థి బిఎన్‌.వినయ్‌కుమార్‌ మృతితో ఆ ఒక్క స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. ఫేక్‌ ఓటర్‌ ఐడీ కార్డులు బయటపడడంతో ఆర్‌ ఆర్‌ నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక ఈ నెల 28కి వాయిదా పడింది.

4 కోట్ల 96 లక్షల 82 వేల మంది ఓటర్లు
కర్ణాటకలో 4 కోట్ల 96 లక్షల 82 వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో పురుష ఓటర్లు 2 కోట్ల 52 లక్షల 5 వేల 825 మంది కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 2 కోట్ల 44 లక్షల 71 వేల 480. ఈ ఎన్నికల్లో బిజెపి 223, కాంగ్రెస్‌ 221, జెడిఎస్‌ 200 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. మొత్తం 2,636 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో మహిళా అభ్యర్థులు 217 మంది ఉన్నారు. 

15:53 - May 12, 2018

శ్రీకాకుళం : రామునిపాలెంలో ఆకతాయిలకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. మహిళలు స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తున్న నలుగురు యువకులను స్థానికులు పట్టుకొని చెట్టుకట్టేసి చితక్కొట్టారు. లావేరు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

15:51 - May 12, 2018

నెల్లూరు : దారుణం జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు 65 ఏళ్ల వ్యక్తి. చిరుతిళ్లు ఇప్పిస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు 65 ఏళ్ల గురుస్వామి. పాప నానమ్మ చూసి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి గురుస్వామికి దేహశుద్ధి చేశారు. గురుస్వామిపై చిన్నారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను ఆ పని చేయలేదని గురుస్వామి చెబుతున్నాడు. 

రైతుబంధు రైతులకు భరోసా : కర్నె

హైదరాబాద్ : రైతుబంధు పథకం రైతులకు భరోసానిస్తోందని ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. రైతు దగ్గరికే పాస్ పుస్తకాలు, చెక్కులొస్తున్నాయన్నారు. దేశంలోని ఏ రాష్ట్ర రైతుల్లో తెలంగాణ రైతులకున్నంత ఆనందరం లేదన్నారు.జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రైతు బంధు పథకాన్ని హేళన చేయడాన్ని ఖండిస్తున్నామని కర్నే ప్రభాకర్ పేర్కొన్నారు. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అనే చందంగా కాంగ్రెస్, బీజేపీలు వ్యవహరిస్తున్నాయన్నారు. రైతు బంధు పథకం మద్యం వ్యాపారులకే పనికొస్తుందన్నారు.

దాచేపల్లిలో మరో దారుణం..

గుంటూరు: దాచేపల్లిలో మరో ఘోర అకృత్యం వెలుగు చూసింది. బాలికపై ఓ ఎంపీటీసీ భర్త అత్యాచారానికి తెగబడ్డాడు. గత కొంతకాలంగా బాలికను బెదిరించి మాబువలీ అనే వ్యక్తి ఘాతుకానికి పూనుకున్నాడు. విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. చేసేదేమీ లేక బాధితురాలు భయంతో ఉండిపోయింది. మొత్తం మీద ఆ బాలిక స్థానికుల సహకారంతో పోలీసులను ఆశ్రయించడంతో దుర్మార్గుడి దురాగతం బయటపడింది. బాలికను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె 3 నెలల గర్భవతిగా వైద్యులు నిర్థారించారు.

దాచేపల్లిలో మరో దారుణం..

గుంటూరు: దాచేపల్లిలో మరో ఘోర అకృత్యం వెలుగు చూసింది. బాలికపై ఓ ఎంపీటీసీ భర్త అత్యాచారానికి తెగబడ్డాడు. గత కొంతకాలంగా బాలికను బెదిరించి మాబువలీ అనే వ్యక్తి ఘాతుకానికి పూనుకున్నాడు. విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. చేసేదేమీ లేక బాధితురాలు భయంతో ఉండిపోయింది. మొత్తం మీద ఆ బాలిక స్థానికుల సహకారంతో పోలీసులను ఆశ్రయించడంతో దుర్మార్గుడి దురాగతం బయటపడింది. బాలికను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె 3 నెలల గర్భవతిగా వైద్యులు నిర్థారించారు.

తల్లితండ్రుల పట్టించుకోకుంటే శిక్ష తప్పదు..

ఢిల్లీ : వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉండటం లేదా వారిని వేధింపులకు గురిచేసే వారికి విధించే శిక్షను మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం అలాంటి వారికి మూడు నెలల జైలు శిక్ష విధిస్తుండగా.. దాన్ని ఆరు నెలలకు పెంచాలని భావిస్తోంది. ఈ మేరకు సీనియర్‌ అధికారి ఒకరు వివరాలను వెల్లడించారు. అయితే ఇది అందరికీ ఒకేలా కాకుండా.. వారి వారి ఆదాయాలను బట్టి మారేలా నిబంధనలు రూపొందించనుంది.

కాంగ్రెస్, బీజేపీ బాహాబాహీ..

కర్ణాటక : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఊపందుకుంటున్న తరుణంలో తుముకూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. విజయనగర నియోజకవర్గంలో ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బాదామిలో పోలీస్ స్టేషన్ వద్ద ఇరుపార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. గాయపడ్డ కార్యకర్తలను సమీప ఆసుపత్రికి తరలించారు. రెండు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. కాగా, హంపినగర్ లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. తమ మునిసిపల్ కార్పొరేటర్ పై కాంగ్రెస్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారంటూ బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు.

విద్యార్థినిపై టీచర్ అత్యాచార యత్నం..

హైదరాబాద్ : మీర్ పేట పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రాచకొండ కమిషన్ పరిధిలోని మీర్ పేట పీఎస్ పరిధిలోని లెనిన్ నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్యూషన్ చెప్పించుకునేందుకు వచ్చిన స్రవంతి అనే 12 ఏళ్ల బాలికపై మాస్టారు అత్యాచారానికి యత్నించాడు. గోపీ ట్యూషన్ సెంటర్ అనే పేరుతో నర్సరీ నుండి 10వ తరగతి వరకూ ట్యూషన్ పేరుతో ఒక ట్యూషన్ సెంటర్ ను రన్ చేస్తున్న టీచర్ బాలికపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో తీవ్ర రక్తస్రావానికి గురై తీవ్ర అస్వస్థతకు గురవటం గమనించిన బాలిక బంధువులు వెంటనే గాంధీ అసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

14:42 - May 12, 2018

హైదరాబాద్ : మీర్ పేట పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రాచకొండ కమిషన్ పరిధిలోని మీర్ పేట పీఎస్ పరిధిలోని లెనిన్ నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్యూషన్ చెప్పించుకునేందుకు వచ్చిన స్రవంతి అనే 12 ఏళ్ల బాలికపై మాస్టారు అత్యాచారానికి యత్నించాడు. గోపీ ట్యూషన్ సెంటర్ అనే పేరుతో నర్సరీ నుండి 10వ తరగతి వరకూ ట్యూషన్ పేరుతో ఒక ట్యూషన్ సెంటర్ ను రన్ చేస్తున్న టీచర్ బాలికపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో తీవ్ర రక్తస్రావానికి గురై తీవ్ర అస్వస్థతకు గురవటం గమనించిన బాలిక బంధువులు వెంటనే గాంధీ అసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు మీర్ పేట పీఎస్ లో ఫిర్యాదు చేశారు. సదరు టీచర్ ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

14:40 - May 12, 2018

కర్ణాటక: రాష్ట్రంలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో మ.12 గంటలకు 28 శాతం పోలింగ్ నమోదయినట్లుగా తెలుస్తోంది. మ.2.00ల వరకూ పోలింగ్ వేగం పుంజుకోలేదు. దీంతో పాలు పోలింగ్ వెలవెలబోతు పోలింగ్ బూత్ లు కనిపించాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదు అవుతున్నట్లుగా తెలుస్తోంది. 

13:47 - May 12, 2018

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. వేసవి సెలవులతో పాటు శుభకార్యాలు కూడా రావడంతో సొంత గ్రామాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగి హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు రోడ్డు రద్దీగా మారింది. 

 

13:45 - May 12, 2018

హైదరాబాద్‌ : హయత్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ సాయి కుటీర్‌ కాలనీలో నివాసం ఉంటున్న దంపతులు సృజన్‌రెడ్డి, సారికలు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య పరిస్థితులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 

 

13:43 - May 12, 2018

విజయవాడ : ఏపీ ఐసెట్‌ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఎమ్‌బీఏ, ఎమ్‌సీఏలో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలో 52 వేల 216 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 48వేల 635 పరీక్ష రాశారు. ఇందులో మొత్తం 4వేల 537 విద్యార్థులు అర్హత సాధించారు. 92.60 శాతంతో గతేడాది కంటే ఈ సంవత్సరం 6.0 శాతం ఎక్కువ ఉత్తీర్ణత  శాతం నమోదైనట్లు మంత్రి గంటా తెలిపారు. అనుకున్న సమయానికి రికార్డు స్థాయిలో ఫలితాలు విడుదల చేశామన్నారు. 

 

13:27 - May 12, 2018

కర్నూలు : ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం అయింది. మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్ తో అఖిలప్రియ నిశ్చితార్థం అయింది. అగష్టు 29న అఖిలప్రియ, భార్గవ్ ల వివాహం జరుగనుంది.
  

13:20 - May 12, 2018

కర్నాటక : రాయ్ చూర్ జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. రాయ్ చూర్ లో ఏడు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కొన్నిచోట్ల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకు 30 శాతం పోలింగ్ నమోదు అయింది. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

 

13:19 - May 12, 2018

బెంగళూరు : కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతోంది. నెమ్మదిగా పోలింగ్ పుంజుకుంది. ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పింక్ పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 300 వందలకు పైగా పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. బెంగళూరు లో 25కు పైగా పింక్ పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఉద్యోగులు పింక్ కలర్ దుస్తులు ధరించి విధులకు హాజరయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

కర్నాటకలో ప్రశాంతంగా పోలింగ్

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ నెమ్మదిగా పుంజుకుంది. మధ్యాహ్నం 12 గం.ల వరకు 27 శాతం పోలింగ్ నమోదు అయింది. పలు చోట్ల ఈవీఎంలు మోరాయించాయి. ముంబై కర్నాటకలో పోలింగ్ 33 శాతం, సెంట్రల్ కర్నాటకలో 28.5 శాతం పోలింగ్ నమోదు అయింది. 

రాయ్ చూర్ జిల్లాలో కొనసాగుతోన్న ఎన్నికలు

కర్నాటక : రాయ్ చూర్ జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. రాయ్ చూర్ లో ఏడు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు 30 శాతం పోలింగ్ నమోదు అయింది. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

13:00 - May 12, 2018

విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీపై తీవ్రంగా స్పందించారు. చెప్పిన ప్రతి విషయంలోనే బీజేపీ నేతలు మాట తప్పుతున్నారు. అది ప్రజల్లో వచ్చిన స్పాంటేనియస్ రియాక్షన్ తప్ప ఎవరూ ప్లాన్ చేసి చేయడం లేదన్నారు. వెంకన్న పాదాల సాక్షిగా ఢిల్లీ చిన్నబోయే విధంగా అమరావతిని నిర్మాణం చేసుకుందామని మోడీ చెప్పారని గుర్తు చేశారు. రెవెన్యూ లోటు, కడప స్టీల్ ప్లాంట్, దుగ్గరాజుపట్నం పోర్టు, విశాఖపట్నం రైల్వే జోన్, నేషనల్ ఇనిస్టిట్యూట్, పోలవరం ప్రాజెక్టు, రాజధానితో పలు అంశాలపై గురించి మోడీ చెప్పారని పేర్కొన్నారు. వీటిలో ఏ ఒక్కదాన్ని అమలు చేయకుండా ఉద్దేశపూర్వకంగానే ఏపీకి అన్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తే ప్రజల రియక్షన్ ఈ విధంగానే ఉంటుందన్నారు. బీజేపీ ఎంపీలు బాధ్యతారహిత్యంగా మాట్లాడుతుంటే ఆ పార్టీ నేతలు ఖండించడం లేదన్నారు. ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయని ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ నేతలు ఐదు కోట్ల మంది ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. 

12:54 - May 12, 2018

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ నెమ్మదిగా పుంజుకుంది. మధ్యాహ్నం 12 గం.ల వరకు 27 శాతం పోలింగ్ నమోదు అయింది. పలు చోట్ల ఈవీఎంలు మోరాయించాయి. ముంబై కర్నాటకలో పోలింగ్ 33 శాతం, సెంట్రల్ కర్నాటకలో 28.5 శాతం పోలింగ్ నమోదు అయింది. పాతమైసూరు స్థానంలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య బలమైన పోటీ నెలకొంది. ముంబై, బెంగళూరు కర్నాటకల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మొత్తం 224 అసెంబ్లీ సీట్లకు గాను 222 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ అభ్యర్థి మృతితో జయనగర్‌ స్థానానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఫేక్‌ ఓటర్‌ ఐడీ కార్డులు బయట పడటంతో ఆర్‌ ఆర్‌ నగర్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. సాయంత్రం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఆరుగంటల వరకు కొనసాగనుంది. మొదటి సారిగా ఈసీ గంట సమయాన్ని పెంచింది.  ఈ ఎన్నికల్లో బిజెపి 222, కాంగ్రెస్‌ 220, జెడిఎస్‌ 200 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. మొత్తం 2,636 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 15న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

12:38 - May 12, 2018

కర్నాటక : రాయ్ చూర్ జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. రాయ్ చూర్ లో ఏడు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు 30 శాతం పోలింగ్ నమోదు అయింది. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

12:23 - May 12, 2018
12:21 - May 12, 2018

విజయవాడ : టీడీపీ ప్రభుత్వ ఘోరంగా వైఫల్యం చెందిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా కాన్వాయ్ పై రాళ్ల దాడిని త్రీవంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ పార్టీ అధ్యక్షుడికే రక్షణ లేదా అని నిలదీశారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఘటనపై సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు సంవత్సరం ముందు యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. బాలకృష్ణపై ఇంతవరకు ఒక్క కేసు కూడా వేయలేదన్నారు. తన ఇంటిపైకి టీడీపీ కార్యకర్తలను పంపారని ఆరోపించారు. అలిపిరి ఘటనను ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. నిరసన తెలిపే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు. కార్యకర్తలపై, పోలీసులపైనా చర్యలు తీసుకోలేదన్నారు. ప్రత్యేక హోదా కిందా నిధులు ఇస్తామంటే ఉద్యమం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు మనకు రక్షణ ఇస్తారని...ముఖ్యమంత్రిని చేస్తే..ఆయన రక్షణ కావాలంటున్నారని... రక్షణ లేని ప్రజలు ఆయనకు ఎందుకు 2019 లో ఓట్లు వేయాలన్నారు. డబుల్ స్టాండ్ మానుకోవాలని చెప్పారు. సీఎంకు నిజాయితీ ఉంటే ఎస్ పీని సస్పెండ్ చేయాని, టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజూ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. టీడీపీ సైకిల్ యాత్ర ఎందుకు ఫెయిల్ అయిందన్నారు. ఇసుక మాఫియాలో చంద్రబాబుకు నెంబర్ వన్ స్థానం వచ్చిందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ మీదే చెప్పులు విసిరిన సంస్కృతి టీడీపీదని విమర్శించారు. బీజేపీకి ప్రజలు ఇచ్చిన తీర్పుకూడా తప్పేనా...అని అన్నారు. ఎమర్జెన్సీని చంద్రబాబు సమర్థించారని తెలిపారు. 

 

11:51 - May 12, 2018

బెంగళూరు : కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మొదట మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ నెమ్మదిగా పుంజుకుంటోంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 11.5 పోలింగ్ శాతం నమోదు అయింది. అయితే ఫ్రెష్ వాటర్లు... యంగ్ జనరేషన్ ఓటర్లు కనపడడం లేదు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసారి పోలింగ్ ను సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పెంచారు. మొత్తం 224 అసెంబ్లీ సీట్లకు గాను 222 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ అభ్యర్థి మృతితో జయనగర్‌ స్థానానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఫేక్‌ ఓటర్‌ ఐడీ కార్డులు బయట పడటంతో ఆర్‌ ఆర్‌ నగర్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. సాయంత్రం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఆరుగంటల వరకు కొనసాగనుంది. మొదటి సారిగా ఈసీ గంట సమయాన్ని పెంచింది.  ఈ ఎన్నికల్లో బిజెపి 222, కాంగ్రెస్‌ 220, జెడిఎస్‌ 200 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. మొత్తం 2,636 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  ఈ  నెల 15న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 

 

పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి సోమశేఖర్ రెడ్డి ప్రలోభాలు

బెంగళూరు : బళ్లారి బాలభారతి పాఠశాల పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి సోమశేఖర్ రెడ్డి ప్రలోభాలాకు పాల్పడ్డారు. ఓటర్ స్లిప్ తో పాటు బీజేపీకి ఓటేయాలని అభ్యర్థి సోమశేఖర్ రెడ్డి ఫోటోతో స్లిప్ ల పంపిణీ చేశారు. పిరమిడ్ పార్టీ అభ్యర్థి లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే సుగుణమ్మ ధర్నా

చిత్తూరు : టీడీపీ కార్యకర్తల అరెస్ట్‌కు నిరసనగా అలిపిరి పోలీస్‌ స్టేషన్‌ దగ్గర ఎమ్మెల్యే సుగుణమ్మ ధర్నాకు దిగారు.  అర్ధరాత్రి నుంచి ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు. అమిత్‌ షా కాన్వాయ్‌లోని బీజేపీ కార్యకర్త కారుపై దాడి చేశారని కేసు నమోదు చేశారని...అయితే టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన బీజేపీ నేత కోలా ఆనంద్‌, అతని అనుచరులపై కేసు ఎందుకు నమోదు చేయలేదంటూ ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మొదటి రెండు గంటల వరకు 11.5 పోలింగ్ శాతం

బెంగళూరు : కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. మొదలు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ నెమ్మదిగా పుంజుకుంటోంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 11.5 పోలింగ్ శాతం నమోదు అయింది. అయితే ఫ్రెష్ వాటర్లు... యంగ్ జనరేషన్ ఓటర్లు కనపడడం లేదు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసారి పోలింగ్ ను సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పెంచారు. 

10:48 - May 12, 2018

చిత్తూరు : టీడీపీ కార్యకర్తల అరెస్ట్‌కు నిరసనగా అలిపిరి పోలీస్‌ స్టేషన్‌ దగ్గర ఎమ్మెల్యే సుగుణమ్మ ధర్నాకు దిగారు.  అర్ధరాత్రి నుంచి ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు. అమిత్‌ షా కాన్వాయ్‌లోని బీజేపీ కార్యకర్త కారుపై దాడి చేశారని కేసు నమోదు చేశారని...అయితే టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన బీజేపీ నేత కోలా ఆనంద్‌, అతని అనుచరులపై కేసు ఎందుకు నమోదు చేయలేదంటూ ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేస్తున్నారు.

10:46 - May 12, 2018

బెంగళూరు : కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. మొదల మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ నెమ్మదిగా పుంజుకుంటోంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 11.5 పోలింగ్ శాతం నమోదు అయింది. అయితే ఫ్రెష్ వాటర్లు... యంగ్ జనరేషన్ ఓటర్లు కనపడడం లేదు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసారి పోలింగ్ ను సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పెంచారు. మొత్తం 224 అసెంబ్లీ సీట్లకు గాను 222 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ అభ్యర్థి మృతితో జయనగర్‌ స్థానానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఫేక్‌ ఓటర్‌ ఐడీ కార్డులు బయట పడటంతో ఆర్‌ ఆర్‌ నగర్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. సాయంత్రం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఆరుగంటల వరకు కొనసాగనుంది. మొదటి సారిగా ఈసీ గంట సమయాన్ని పెంచింది.  ఈ ఎన్నికల్లో బిజెపి 222, కాంగ్రెస్‌ 220, జెడిఎస్‌ 200 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. మొత్తం 2,636 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  ఈ  నెల 15న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 

 

10:40 - May 12, 2018

బెంగళూరు : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. బళ్లారి జిల్లాలో పోలింగ్‌ మందకొడిగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ఓటు వేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడంలేదు. మధ్యాహ్నం వరకు పోలింగ్‌ సరళిని అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. బళ్లారి జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ లు పోటీలో ఉన్నాయి. కానీ జేడీఎస్ నామమాత్రంగానే పోటీలో ఉందనిచెప్పవచ్చు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:51 - May 12, 2018

బెంగళూరు : కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. 4, 5 చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. అక్కడ అర్ధ గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం అయింది. మిగిలిన చోట్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 80 వేల ఈవీఎంలు ఏర్పాటు చేశారు. 80 వేల ఓటర్ వెరిఫైడ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధులకు 800 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 224 అసెంబ్లీ సీట్లకు గాను 222 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ అభ్యర్థి మృతితో జయనగర్‌ స్థానానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఫేక్‌ ఓటర్‌ ఐడీ కార్డులు బయట పడటంతో ఆర్‌ ఆర్‌ నగర్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆర్‌ ఆర్‌ నగర్‌ స్థానానికి ఈ నెల 28న పోలింగ్‌ జరుగనుంది. మొత్తం 4 కోట్ల 96 లక్షల 82 వేల 357  మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 2,52,5,825 మంది, మహిళా ఓటర్లు 2,44,71,480 ఉన్నారు. ఎన్నికల కోసం 56 వేల 696 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో బిజెపి 222, కాంగ్రెస్‌ 220, జెడిఎస్‌ 200 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. మొత్తం 2,636 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. బాదామి, చాముండేశ్వర స్థానాల నుంచి సీఎం సిద్దరామయ్య పోటీ చేస్తున్నారు. షికారిపుర నుంచి బీజేపీ ఎంపీ, మాజీ సీఎం యడ్యూరప్ప పోటీలో ఉన్నారు. ఈ  నెల 15న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

09:50 - May 12, 2018

బెంగళూరు : కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. 4, 5 చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. అక్కడ అర్ధ గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం అయింది. మిగిలిన చోట్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 80 వేల ఈవీఎంలు ఏర్పాటు చేశారు. 80 వేల ఓటర్ వెరిఫైడ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధులకు 800 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 224 అసెంబ్లీ సీట్లకు గాను 222 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ అభ్యర్థి మృతితో జయనగర్‌ స్థానానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఫేక్‌ ఓటర్‌ ఐడీ కార్డులు బయట పడటంతో ఆర్‌ ఆర్‌ నగర్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆర్‌ ఆర్‌ నగర్‌ స్థానానికి ఈ నెల 28న పోలింగ్‌ జరుగనుంది. మొత్తం 4 కోట్ల 96 లక్షల 82 వేల 357  మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 2,52,5,825 మంది, మహిళా ఓటర్లు 2,44,71,480 ఉన్నారు. ఎన్నికల కోసం 56 వేల 696 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో బిజెపి 222, కాంగ్రెస్‌ 220, జెడిఎస్‌ 200 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. మొత్తం 2,636 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. బాదామి, చాముండేశ్వర స్థానాల నుంచి సీఎం సిద్దరామయ్య పోటీ చేస్తున్నారు. షికారిపుర నుంచి బీజేపీ ఎంపీ, మాజీ సీఎం యడ్యూరప్ప పోటీలో ఉన్నారు. ఈ  నెల 15న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

 

09:49 - May 12, 2018

బెంగళూరు : కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 224 అసెంబ్లీ సీట్లకు గాను 222 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ అభ్యర్థి మృతితో జయనగర్‌ స్థానానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఫేక్‌ ఓటర్‌ ఐడీ కార్డులు బయట పడటంతో ఆర్‌ ఆర్‌ నగర్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆర్‌ ఆర్‌ నగర్‌ స్థానానికి ఈ నెల 28న పోలింగ్‌ జరుగనుంది. మొత్తం 4 కోట్ల 96 లక్షల 82 వేల 357  మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 2,52,5,825 మంది, మహిళా ఓటర్లు 2,44,71,480 ఉన్నారు. ఎన్నికల కోసం 56 వేల 696 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో బిజెపి 222, కాంగ్రెస్‌ 220, జెడిఎస్‌ 200 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. మొత్తం 2,636 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. బాదామి, చాముండేశ్వర స్థానాల నుంచి సీఎం సిద్దరామయ్య పోటీ చేస్తున్నారు. షికారిపుర నుంచి బీజేపీ ఎంపీ, మాజీ సీఎం యడ్యూరప్ప పోటీలో ఉన్నారు. ఈ  నెల 15న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
బళ్లారి జిల్లాలో మందకోడిగా పోలింగ్‌  
కర్నాటకలోని బళ్లారి జిల్లాలో పోలింగ్‌ మందకోడిగా సాగుతోంది. 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ఓటు వేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడంలేదు. మధ్యాహ్నం వరకు పోలింగ్‌ సరళిని అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. బళ్లారిలో పోలింగ్‌పై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

 

09:38 - May 12, 2018

ఏపీ రాజకీయాలపై వక్తలు చర్చించారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి, విశ్లేషకులు వినయ్ కుమార్, టీడీపీ నేత మన్నెం సుబ్బారావు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

09:36 - May 12, 2018
09:35 - May 12, 2018

ఢిల్లీ : చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియం ఇవాళ భేటీ అయింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉత్తరాఖండ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్ పేరును సిఫార్సు చేయాలని మరోసారి నిర్ణయించింది. కేంద్రంతో వ్యవహరించాల్సిన తీరుపై ఏవిధంగా ముందుకెళ్లాలన్న దానిపై చర్చించినట్లు సమాచారం. ఇదివరకే ఆయన పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినా ఏప్రిల్‌లో జోసెఫ్‌ను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో కొలీజియం మరోసారి సమావేశమైంది. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌ సహా కొలీజియంలోని ఐదుగురు సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. కొలీజియం సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు సీనియర్‌ జడ్జి జస్టిస్‌ చలమేశ్వర్‌ గురువారం చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు లేఖ రాసిన విషయం తెలిసిందే.

 

09:23 - May 12, 2018

కృష్ణా : విజయవాడలో కాల్వల సుందరీకరణ కార్యక్రమం కాగితాలకే పరిమితమైంది. నాలుగేళ్ల కిత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఈ ప్రతిపాదన నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో జలకళతో తొనికిసలాడాల్సిన కాల్వలు కాలుష్యకార వ్యర్థాలతో నిండిపోతున్నాయి. దీంతో కాల్వలు ఉన్న అన్ని ప్రాంతాలు దుర్గంధ భూయిస్టంగా మారుతున్నాయి. విజయవాడలో అటకెక్కిన కాల్వ సుందరీకరణ ప్రాజెక్టుపై 10 టీవీ ప్రత్యేక కథనం.. look. 
విజయవాడ నుంచి మూడు కాల్వలు
విజయవాడ నుంచి మూడు కాల్వలు ప్రవహిస్తున్నాయి. నీటి ప్రవాహంతో నిండుకుండలా ఉండాల్సిన రైవస్‌, బందరు, ఏలూరు కాల్వలు గుర్రపుడెక్క, కాలుష్యకారక వ్యర్థాలతో కళావిహీనంగా మారుతున్నాయి. దోమలకు నిలయాలుగా తయారవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్ల క్రితం కాల్వల సుందరీకరణ ప్రతిపాదనలు తీసుకొచ్చారు. దీనిలో భాగంగా పాత వంతెనల స్థానంలో కొత్త బ్రిడ్జిలు నిర్మించాలనుకున్నా.. ఇది కార్యరూపం దాల్చలేదు. రైవస్‌, బందరు, ఏలూరు కాల్పలు నగరంలో 18 కి.మీ. మేర ప్రవహిస్తున్నాయి. వీటి గట్లపై 50 వేల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దాదాపు రెండు లక్షల జనాభా కాల్వ గట్లపైనే నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో వ్యవర్థాలన్నీ కాల్వల్లోనే కలుస్తున్నాయి. 
వ్యర్థాల శుద్ధి  నగరపాలక సంస్థదేనన్న ప్రభుత్వం 
కాల్వగట్ల సుందరీకరణ బాధ్యతలను అమరావతి అభివృద్ధి సంస్థ చేపట్టినా.. వ్యవర్థాల శుద్ధి ప్లాంట్‌ను నగరపాలక సంస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచింది. ఇందుకు 40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్క తేల్చారు. సిబ్బందికి జీతభత్యాలు చెల్లించలేని దుస్థితిలో ఉన్న విజయవాడ నగరపాలక సంస్థ.. ఈ భారం మోయలేమని ప్రకటించడంతో కాల్వల సుందరీకరణ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. కాల్వల సుందరీకరణ చేయాలంటే వీటి గట్లపై ఉన్న ఇళ్లను తొలగించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదన తెచ్చినప్పుడే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వీరికి వామపక్షాలు అండగా నిలిచాయి. ఇళ్లను తొలగించకుండా సుందరీకరణ చేయాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి. దీంతో ఈ ప్రతిపాదన ముందుకు సాగలేదని అధికారులు చెబుతున్నారు. 

 

09:17 - May 12, 2018

శ్రీకాకుళం : రంగు, రుచితో నోరూరించే మధుర ఫలాల్లో... నేడు రంగు మాత్రమే మిగిలి.. మాధుర్యం మాయమైంది.. కృత్రిమ పద్ధతిలో మగ్గిస్తుండడంతో... మామిడి పళ్ళలో రుచికంటే.. అనారోగ్య కారకాలే ఎక్కువగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో నాణ్యత లేక వినియోగదారులు, దిగుబడి లేక రైతులు ఆందోళన చెందుతున్నారు
రసాయనాలతో రుచిలేని మామిడి పళ్ళు
రంగు, రుచిగల.. శ్రీకాకుళం మామిడి పళ్ళకు ఒకప్పుడు మాంచి క్రేజ్ ఉండేది. బంగినపల్లి, చెరుకురసాలు, సువర్ణరేఖ రకాలకు శ్రీకాకుళం జిల్లా మామిడి తోటలు పెట్టింది పేరు. కానీ.. రసాయనాల వాడకంతో రుచిని కోల్పోయిన మామిడిలో రంగు మాత్రమే మిగిలింది. గతంలో వందలాది వాహనాలతో కళకళలాడిన శ్రీకాకుళం మామిడి మార్కెట్‌.. నేడు ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకునే దుస్థితికి చేరుకుంది. ఎంతో పేరున్న శ్రీకాకుళం మామిడి.. రానురాను  ప్రాభవం కోల్పోతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
ఈ ఏడాది 7 వేల హెక్టార్లకే పరిమితమైన మామిడి సాగు
శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతం, గార, హిరమండలం, సీతంపేట, నరసన్నపేట ప్రాంతాల మామిడికి గతంలో చాలా డిమాండ్‌ ఉండేది.  రసాయనా లతో కాయలను మగ్గపెట్టడం, ఎక్కువ దిగుబడి కోసం క్రిమి సంహారక మందులను వినియోగించడం వల్ల  సిక్కోలు మ్యాంగో మార్కెట్ వైభవం  కోల్పోయి వెలవెలబోతోంది. గత ఏడాది శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 9వేల హెక్టార్లలో ఉన్న మామిడి తోటలు.. ఈ సారి 7 వేల హెక్టార్లకు పరిమితమైంది. దీంతో  ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఉందంటున్నారు వ్యాపారులు.
దళారుల వల్ల కష్టాలు 
శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, సోంపేట, ఆముదాలవలస, పాలకొండ పట్టణాలకు రైతులు మామిడిపళ్ళను ఎక్కువగా తెస్తుంటారు. కానీ.. దళారుల వల్ల కష్టాలు తప్పడం లేదు. కాల్షియం కార్భైట్‌తో రాత్రికిరాత్రే కాయ మగ్గినట్లు కనిపిస్తోంది. ఇలాంటి హానికరమైన మామిడి పళ్ళను  అమ్ముతూ వ్యాపారులు కేష్ చేసుకుంటున్నారు. వ్యాపారుల స్వార్థానికి తాము  బలికావాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లా  మామిడికి పూర్వవైభవం తెచ్చే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.హోల్  సేల్ వ్యాపారుల పై దాడులు చేసి కార్భైట్ విని యోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని ప్రజలు కోరుతున్నారు. 

 

09:13 - May 12, 2018

విజయవాడ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు తగ్గినా.. మనదేశంలో మాత్రమే పెరుగుతున్న పెట్రోల్‌ ధరలను ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. అడ్డగోలుగా పెంచుతున్న ధరల వల్ల ఏపీలో  పెట్రోల్ బంకులు మూతపడే దశకు చేరుకుంటున్నాయి.  
ఏపీలో మండుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టినా.. ఏపీలో విపరీతంగా పెంచడంపై ప్రజలు మండిపడుతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం  పెట్రోల్, డీజిల్ రేట్లను అరకొరగానే పెంచితే.. బీజేపీ ప్రభుత్వం  అమాంతంగా పెంచేస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ఉత్పత్తులపై కేంద్రం వేస్తున్న ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలని  ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ కూడా రాశారు.  కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం ముందుగా పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని ప్రజానీకం కోరుతోంది.
కృష్ణాజిల్లాలో సుమారు 250 ఆయిల్ బంకులు
కృష్ణాజిల్లాలో సుమారు 250 పెట్రోల్‌ బంకులు ఉండగా.. ఒక్కో బంకులో రోజుకు 4 వేల లీటర్ల పెట్రోల్, 7 వేల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి. రోజుకు 17 లక్షల లీటర్లకు పైగా డీజిల్, 10 లక్షల లీటర్ల పెట్రోల్ విక్రయాలు జరుగుతాయి. పెరిగిన ధరలతో డీజిల్ వినియోగదారులపై రోజుకు 82 లక్షలా 60వేల రూపాయలు, పెట్రోల్ వినియోగదారులపై 36 లక్షలా 60వేల రూపాయల భారం పడుతోంది.   తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికస్థాయిలో ఉంటున్నాయి.. దీంతో ఏపీలో పెట్రోలియం డీలర్లు బంకులు నడపలేని పరిస్థితి ఏర్పడింది. పెరిగిన ఇంధన ధరలతో ఆర్టీసీ, ఇటు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో అధిక భారం ఎక్కువగా తెలుగు రాష్ట్రాలపైనే  ఉంటోంది. ఇంధనం ధరల పెంపుతో వాహనాలను రోడ్లపై నడపలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు  ఆదాయాన్ని పెంచుకునేందుకు పన్నుల భారాన్ని ప్రజలపై నెడుతున్నాయి. పెరిగిన ఇంధన ధరలు పేద, మధ్యతరగతి ప్రజలను మరింత కుంగదీస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

09:04 - May 12, 2018

కాకినాడ : టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా వైఫల్యం చెందిందని వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌ రావు విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన వైసీపీ  పోలింగ్ బూత్ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమంలో మాజీమంత్రి ధర్మాన పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో 15వందల రహస్య జీవోలు ఎందుకు విడుదల చేశారని టీడీపీని ప్రశ్నించారు. 

09:02 - May 12, 2018

విజయనగరం : నగరంలోని ఎన్‌సీఎస్‌ సినిమా థియేటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. భరత్ అను నేను సినిమా సెకండ్‌ షో ప్రదర్శిస్తున్న సమయంలో. థియేటర్‌ పై భాగంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళకు గురైన ప్రేక్షకులు థియేటర్‌నుంచి పరుగులు తీశారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

 

08:58 - May 12, 2018

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచేందుకు భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీలను ఆదేశించారు. వైసీపీ ఎంపీల రాజీనామాలను లోక్‌సభ స్పీకర్‌ ఆమోదించి, ఉప ఎన్నికలు వస్తే పోటీకి సిద్ధంగా ఉండాలని అమరావతిలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆశావహులను కోరారు. 
కేంద్రం ఏపీకి చేసిన అన్యాయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు 
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీకి హాజరైన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులకు భవిష్యత్‌ కార్యాచరణపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎంపీలు సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం రాజకీయ కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయాన్ని చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించారు. పదిహేనవ ఆర్థిక సంఘం నియమ నిబంధనలు రాష్ట్రానికి నష్టం జరిగేలా ఉన్నాయని చంద్రబాబు విమర్శించారు. 
ధర్మపోరాట సభలు నిర్వహించాలని నిర్ణయం
రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా ధర్మపోరాట సభలను నిర్వహించాలని టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఎమ్మెల్యేలందరూ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ..  మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన సర్వే వివరాలను టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చదివి వినిపించిన చంద్రబాబు.. ఎన్నికల ఏడాదిలో అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. 

 

కొనసాగుతున్న కర్నాటక శాసనసభ ఎన్నికల పోలింగ్

బెంగళూరు : కర్నాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 224 నియోజక వర్గాల్లో 222 ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ అభ్యర్థి మృతితో జయనగర ఎన్నిక వాయిదా పడింది. రాజరాజేశ్వరినగర్ ఎన్నికలు ఈనెల 28 ఎన్నిక వాయిదా పడింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ కొనసాగనుంది. 2,984 మంది అభ్యర్థులు ఎన్నికలో పోటీ చేస్తున్నారు. 

08:28 - May 12, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లు, సమస్యల పరిష్కారం దిశగా మరో ముందడుగు పడింది. ఈ అంశంపై ఏర్పాటైన మంత్రుల కమిటీ తన కసరత్తు పూర్తి చేసి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక అందజేసింది.
మంత్రల కమిటీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో విడివిడిగా చర్చలు  
ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ నేతృత్వంలో మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డితో ఏర్పాటు చేసిన మంత్రల కమిటీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో విడివిడిగా చర్చలు జరిపింది. ఈ వివరాలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేసింది. కేటీఆర్‌ అందుబాటులో లేకపోవడంతో ఈటల, జగదీశ్‌రెడ్డి కేసీఆర్‌ను కలిసి నివేదిక సమర్పించారు. 
మొత్తం 18 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచిన జేఏసీ 
ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రికి అందజేసిన నివేదికలో పలు అంశాలను చేర్చారు. బదిలీలపై నిషేధం ఎత్తివేత, వేతన సవరణ సంఘం ఏర్పాటు, సీపీఎస్‌ ఎత్తివేసి, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ, ఉద్యోగుల కేటాయింపుల్లో భాగంగా ఏపీకి పంపిన తెలంగాణ నాల్గవ తరగతి  నాలుగో తరగతి ఉద్యోగులను ఆంధ్రా నుంచి వెనక్కు తీసుకురావడం సహా మొత్తం 18 డిమాండ్లను ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వం ముందు ఉంచింది. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలతో పాటు మరికొన్నింటిని  ప్రభుత్వం ముందు ఉంచాయి. ఇందులో ఏకీకృత సర్వీసు నిబంధనల అంశం సహా 34 డిమాండ్లు ఉన్నాయి. వీటన్నిటిపై ఆయా సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ చర్చించింది.
పలు డిమాండ్లపై మంత్రుల కమిటీ సానుకూల స్పందన
సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేత, వేతన సవరణ సంఘం ఏర్పాటు సహా పలు డిమాండ్లపై మంత్రుల కమిటీ పూర్తి సానుకూలంగా స్పందించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తిన డిమాండ్లను మంత్రుల కమిటీ మూడు రకాలుగా వర్గీకరించింది. ఎలాంటి ఇబ్బందులూ లేని తక్షణమే పరిష్కరించేందుకు అవకాశం ఉన్న సమస్యలను ఒక కేటగిరీగా గుర్తించారు. న్యాయ వివాదాలతో ముడిపడి ఉన్న అంశాలను మరో రకంగా వర్గీకరించారు. ఇప్పటికిప్పుడు పరిష్కరించలేని డిమాండ్లను మూడో రకంగా వర్గీకరించారు. ఉద్యోగులు కష్టించి పనిచేస్తుండటంతోనే తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోందని  ఆర్థిక మంత్రి ఈటల చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 16న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం  సమావేశమై, నివేదికలోని అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
 

 

చాదర్ ఘాట్ లో దారుణం

హైదరాబాద్ : చాదర్ ఘాట్ లో దారుణం జరిగింది. బాలికపై ఇస్మాయిల్ అనే యువకుడు అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలి కేకలు విని స్థానికులు ఆమెను రక్షించారు. నిందితుడు ఇస్మాయిల్ ఇంటిపై స్థానికులు దాడి చేశారు. 

 

కర్నాటక శాసనసభ ఎన్నికలు ప్రారంభం

బెంగళూరు : కర్నాటక శాసనసభ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ కొనసాగనుంది. 224 నియోజక వర్గాల్లో 222 ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ అభ్యర్థి మృతితో జయనగర ఎన్నిక వాయిదా పడింది. రాజరాజేశ్వరినగర్ ఎన్నికలు ఈనెల 28 ఎన్నిక వాయిదా పడింది. 2,984 మంది అభ్యర్థులు ఎన్నికలో పోటీ చేస్తున్నారు. 

 

07:28 - May 12, 2018

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాసేపట్లో పోలింగ్‌ ప్రారంభంకానుంది. పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
222 నియోజకవర్గాలకు ఎన్నికలు 
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు శనివారం పోలింగ్‌ జరగనుంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను 222 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. జయనగర్ బిజెపి అభ్యర్థి బిఎన్‌.వినయ్‌కుమార్‌ మృతితో ఆ ఒక్క స్థానానికి ఎన్నిక వాయిదా పడింది.  ఫేక్‌ ఓటర్‌ ఐడీ కార్డులు బయటపడడంతో ఆర్‌ ఆర్‌ నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక ఈ నెల 28కి వాయిదా పడింది.
4 కోట్ల 96 లక్షల 82 వేల మంది ఓటర్లు 
కర్ణాటకలో 4 కోట్ల 96 లక్షల 82 వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో పురుష ఓటర్లు 2 కోట్ల 52 లక్షల 5 వేల 825 మంది కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 2 కోట్ల 44 లక్షల 71 వేల 480. ఈ ఎన్నికల్లో బిజెపి 223, కాంగ్రెస్‌ 221, జెడిఎస్‌ 200 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. మొత్తం 2,636 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో మహిళా అభ్యర్థులు 217 మంది ఉన్నారు. 
56 వేల 696 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు 
ఎన్నికల కోసం అధికారులు 56 వేల 696 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళలకు ప్రత్యేకంగా 600 కేంద్రాలు... దివ్యాంగులు, ఇతరులకు 28 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి సంజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో వీవీపాట్‌ యంత్రాలతో పాటు ఈవీఎంలను వినియోగించనున్నారు.
పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు 
రాష్ట్రంలో 20 శాతం పోలింగ్‌ బూతులు సమస్యాత్మకంగా ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 82,157మంది పోలీసులు, 585 కేంద్ర బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు.
మే 15న ఎన్నికల ఫలితాలు 
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం గత నెల రోజులుగా కాంగ్రెస్‌, బిజెపి, జెడిఎస్‌ తదితర పార్టీలు హోరా హోరీగా ప్రచారం నిర్వహించాయి. ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటామన్న ధీమాతో ఉంది. మోది మేజిక్‌తో అధికారం తమనే వరిస్తుందని బిజెపి చెబుతోంది. సర్వేలు మాత్రం కర్ణాటకలో హంగ్‌ తప్పదని జోస్యం చెప్పాయి. కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, ప్రభుత్వ ఏర్పాటులో జెడిఎస్‌ కింగ్‌మేకర్‌గా చక్రం తిప్పుతుందని సర్వేలు వెల్లడించాయి. కొన్ని సర్వేలు మాత్రం బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నాయి. ఆయా పార్టీల అభ్యర్థుల జాతకాలు కన్నడ ఓటర్ల చేతిలో నిక్షిప్తమై ఉన్నాయి. ఓటరు ఎవరిని కరుణిస్తారన్నది మే 15న ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి.

 

నేడు కర్నాటక శాసనసభ ఎన్నికల పోలింగ్

బెంగళూరు : నేడు కర్నాటక శాసనసభ ఎన్నికలు పోలింగ్ జరుగనుంది. 224 నియోజక వర్గాల్లో 222 ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ అభ్యర్థి మృతితో జయనగర ఎన్నిక వాయిదా పడింది. రాజరాజేశ్వరినగర్ ఎన్నికలు ఈనెల 28 ఎన్నిక వాయిదా పడింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ కొనసాగనుంది. 2,600 మంది అభ్యర్థులు ఎన్నికలో పోటీ చేస్తున్నారు.  

 

Don't Miss