Activities calendar

13 May 2018

ఢిల్లీలో దుమ్మూధూళితో కూడిన బలమైన గాలులు

ఢిల్లీ : హస్తినలో గాలివాన బీభత్సం సృష్టించింది. దుమ్మూధూళితో కూడిన బలమైన గాలులు వీచాయి. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగతంతో గాలులు వీస్తున్నాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. 40 విమానాల దారి మళ్లించారు. వాతావరణ శాఖ 72 గంటలపాటు అలర్ట్ ను ప్రకటించింది. 

శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణం

శ్రీకాకుళం : జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు జిల్లాలోని పలు ప్రాంతాలను ముంచెత్తాయి. ఉరుములు, మెరుపులతో పిడుగులుపడి ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. 

20:10 - May 13, 2018

మెదక్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వేష్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు క్రింద పడి మృతి చెందాడు. మృతుడి ఒంటిపై నిక్కరు ఉంది. కర్ర, ఓ ప్లాస్టిక్ సంచిలో బట్టలు రైలు పట్టాల వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కామారెడ్డి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

17:55 - May 13, 2018

కర్నూలు : జిల్లాలోని వెంకాయపల్లెలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మూడురోజులుగా బాలికను లోబర్చుకుని అత్యాచారం చేశాడు బోయ చంద్రన్న అనే  వృద్దుడు. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని చంద్రన్న అతని కుమారుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్‌ చేశారు. 

కర్నూలు జిల్లా వెంకాయపల్లెలో దారుణం

కర్నూలు : జిల్లాలోని వెంకాయపల్లెలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

17:33 - May 13, 2018

విజయవాడ : నిరుద్యోగ భృతి అంశం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.రానున్న ఎన్నికలకోసం టీడీపీ ఎత్తుగడవేస్తోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.  నిరుద్యోగ భృతి కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం అన్న చందంగా ఉందంటూ వామపక్షాలు మండిపతున్నాయి.
2019 ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ అడుగులు
2019లో ఎన్నికల దృష్ట్యా టీడీపీ గతంలో ఇచ్చిన కీలక హామీలపై దృష్టిసారిస్తోంది. అందులో భాగంగానే నిరుద్యోగ భృతిని మళ్లీ తెరపైకి తెచ్చారు. కానీ.. నిరుద్యోగ భృతిలో పరిమితులు విధిస్తూ ప్రభుత్వం కొందరికి మాత్రమే అందిస్తామనడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ఇచ్చిన మాటమీద నిలబడి నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి కల్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం యోచన 
ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి సాంకేతిక విద్యనభ్యసించిన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించి.. ఉపాధి కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిరుద్యోగ భృతి కోసం ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పరిమితికి మించి దరఖాస్తులు వస్తే ఆ  పలు ప్రభుత్వ ఆర్థిక సంస్థలతో రుణాలు మంజూరు చేయించి.. ఉపాధి కల్పించాలని చూస్తోంది ప్రభుత్వం. 
10 లక్షల మందికి నిరుద్యోగ భృతి : యనమల 
డిగ్రీ తర్వాత ఉన్నత విద్యనభ్యసించే వారిని, ప్రభుత్వ శాఖల్లో ఒప్పంద, పొరుగు సేవల కింద పని చేస్తున్నవారిని, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల్లో పనిచేస్తున్నవారిని నిరుద్యోగ భృతికి అనర్హులుగా గుర్తించాలని ఉప సంఘంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా 10 లక్షల మందికి నిరుద్యోగ భృతిని కల్పించాలని చూస్తున్నామని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణ తెలిపారు. దీన్ని నిత్యం కొనసాగించి, యువతకు ఉపాధి కల్పించేలా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. విధివిధానాలను ఖరారు చేసి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆర్థికమంత్రి చెప్పారు.. 
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే టీడీపీ నిరుద్యోగ భృతన్న విమర్శలు   
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే టీడీపీ నిరుద్యోగ భృతి అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యువత ఓట్లను ఆకర్షించేందుకు నిరుద్యోగ భృతిపై దృష్టిసారించిందని వామపక్షాలు తప్పుబడుతున్నాయి. 2017లోనే  ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది బడ్జెట్ లో  500 కోట్లు, 2018లో  వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు.  ఆ తర్వాత పలు కారణాలతో నిరుద్యోగ భృతి అంశాన్ని అటకెక్కించారు. ఏడాదిలో రానున్న ఎన్నికల్లో నిరుద్యోగుల ఓట్లు కొల్లగొట్టేందుకే టీడీపీ ఎత్తుగడవేస్తోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.  టీడీపీ ఈ విధంగా ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకోవడం సరైంది కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
అందరికీ నిరుద్యోగ భృతి అందివ్వాలి : వామపక్షాలు  
నిరుద్యోగ భృతి కొందరికే అంటూ కొత్తపల్లవి అందుకోవడం సరైందికాదని వామపక్ష నేతలు టీడీపీ వైఖర్ని తూర్పారబడుతున్నారు. టీడీపీ ఇప్పటికైనా ఇచ్చిన హామీల అనుగుణంగా అందరికీ నిరుద్యోగ భృతి అందివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు. 

 

17:24 - May 13, 2018

హైదరాబాద్‌ : నగరంలో ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ నేషనలైజేషన్‌ డే జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కేవీవీఎస్ ఎన్ రాజు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం బీమా రంగ సంస్థల్లో వాటాలను అమ్మే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజలందరూ ప్రభుత్వ రంగానికి చెందిన బీమా కంపెనీలలోనే పాలసీలు తీసుకోవాలని...  దానివల్ల ప్రీమియమ్‌కి భద్రతతో పాటు దేశాభివృద్ధికి తోడ్పాటు జరుగుతుందని రాజు అన్నారు. 

 

16:35 - May 13, 2018

మెదక్ : రైతులను బతికియ్యాలని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలో రైదు బంధు పథకం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఐదు జిల్లాలకు నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. శ్రీరాంసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి మొత్తం 40 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరు అందిస్తామని చెప్పారు. కోమటూరు చెరువును కూడా నింపుతామని తెలిపారు. వచ్చే రెండేళ్లలో కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఎక్కడా చూసిన నీరు ఉన్నట్లు.. ఇక్కడ కూడా నీళ్లు ఉంటాయన్నారు.

 

16:05 - May 13, 2018

శ్రీకాకుళం : మామిడి చెట్టు కొమ్మలకు పూత పూయడం.. కాయలు కాయడం సహజం. ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం.. కానీ ప్రకృతి సహజత్వానికి భిన్నంగా.. చెట్టు మొదలుకే కాయలు కాయడమంటే అదొక వింతే. అలాంటి వింత శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. మొదలుకే కాయలు కాస్తున్న వింత మామిడి చెట్టును చూసేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. 
మొదలుకే కాయలు కాస్తున్న మామిడిచెట్టు.. 
మొదలుకే కాయలు కాస్తున్న మామిడిచెట్టు.. చెట్టుకు ఎక్కడ చూసినా కాయలే.. కాయలు ఏ మామిడి చెట్టుకైనా కొమ్మలకు కాయలు కాయడం సహజం. కానీ... ఈ మామిడి చెట్టుకు ఎక్కడపడితే అక్కడే కాయలు కాస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోష్ట గ్రామంలో.. ఈ మామిడిచెట్టు మెదలుకే కాయలు కాస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వింతను చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. 
కాత లేదని చెట్టు కొమ్మలను నరికేసిన యజమాని
హరి అనే రైతు గతంలో కాపు లేదని మామిడి చెట్టు కొమ్మలన్నీ నరికేశాడు. అంతే చెట్టులో ఏ మార్పు వచ్చిందో తెలియదు గానీ.. చెట్టుకు మామిడికాయలు విరగకాస్తోంది. మామిడి చెట్ల  కొమ్మలకు కాయలు కాయడం సహజం కానీ.. ఈ చెట్టుకు ఎక్కడపడితే అక్కడ కాయలు కాసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓవైపు ప్రకృతి విపత్తులు, చీడపీడల కారణంగా మామిడి దిగుబడులు గణనీయంగా పడిపోతుంటే... ఈ చెట్టు మాత్రం విరగ కాయడంతో రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. మామిడి చెట్టు మొదలుకు కాయలు కాయడంతో ఈ వైరైటీ చెట్టును చూసేందుకు గ్రామస్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతానికి ఈ మ్యాంగో ట్రీ.. కోష్టలో సెంటర్‌ ఆఫ్‌ ది అట్రాక్షన్‌గా మారింది. 

 

15:57 - May 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఏకం చేసేందుకు జేఏసీ ఎంతో కృషి చేసిందని జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. కొత్తగా పార్టీని స్థాపించిన నేపథ్యంలో... టీ.జేఏసీ చైర్మన్‌ పదవికి కోదండరామ్‌ చేసిన రాజీనామాను ఆమోదించారు. జేఏసీలో తనకు ఇన్నాళ్లు సహకరించిన వారందరికీ కోదండరామ్‌ కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా నియామకమైన కమిటీ సభ్యులకు కోదండరామ్‌ అభినందనలు తెలిపారు.

 

15:47 - May 13, 2018

రాజన్నసిరిసిల్ల : గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల కోసం అద్భుతమైన పథకాన్ని ప్రారంభించిందన్నారు మంత్రి కేటీఆర్‌. ఒక రైతు ముఖ్యమంత్రి కావడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులను కాపాడేందుకే ఈ రైతు బంధు కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలంలో రైతు బంధు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. 

 

రౌడీ షీటర్‌ వహీద్‌ ఖాన్‌ ఇంట్లో సోదాలు

హైదరాబాద్‌ : పాతబస్తీలో ముంబయి స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మాదన్నపేట రౌడీ షీటర్‌ వహీద్‌ ఖాన్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ముంబాయిలోని ఓ గ్యాంగ్‌కు అక్రమ ఆయుధాలు అమ్మారన్న సమాచారం మేరకు ముంబయి పోలీసులు తనిఖీలు చేపట్టారు. వహీద్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

15:43 - May 13, 2018

హైదరాబాద్‌ : పాతబస్తీలో ముంబయి స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మాదన్నపేట రౌడీ షీటర్‌ వహీద్‌ ఖాన్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ముంబాయిలోని ఓ గ్యాంగ్‌కు అక్రమ ఆయుధాలు అమ్మారన్న సమాచారం మేరకు ముంబయి పోలీసులు తనిఖీలు చేపట్టారు. వహీద్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

 

పులివెందులలో ఎంపీ అవినాష్ పాదయాత్ర...

కడప : పులివెందులకు కృష్ణా జలాలు వస్తున్నాయంటే దివంగత రాజశేఖరరెడ్డి కారణమని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కడప జిల్లాలో రెండు రోజుల పాటు అవినాష్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. పా

మెట్ పల్లిలో వర్షం..తడిసిన ధాన్యం...

జగిత్యాల : మెట్ పల్లిలో భారీ వర్షం కురిసింది. దీనితో మార్కెట్ కు తీసుకొచ్చిన ధాన్యం నీళ్లపాలైంది. తడిసిన ధాన్యాన్ని చూసిన రైతులు లబోదిబోమంటున్నారు. పలు గ్రామాలకు మెట్ పల్లి యార్డుకు రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సంచుల కొరత...లారీలు లేకపోవడంతో క్వింటాళ్ల ధాన్యం నిలిచిపోయింది. వర్షం పడడంతో 5500 క్వింటాళ్ల ధాన్యం వర్షానికి తడిసిపోయిందని, 

అల్వాల్ లో భారీ చోరీ...

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని అల్వాల్ లెనిన్ నగర్ లో దొంగలు భారీ చోరీ చేశారు. సాఫ్ట్ వేర్ చేస్తున్న వ్యక్తి నివాసంలో దొంగలు చొరబడి 36 తులాల బంగారం, 1.25 వేల నగదును తస్కరించారు. 

12:29 - May 13, 2018

కరీంనగర్ : గతంలో ఉన్న పరిస్థితి ప్రస్తుతం రైతులు ఎదుర్కోవడం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రైతు బంధు కార్యక్రమంలో ఆయన పాల్గొని ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. గతంలో రైతులకు కరెంటు సమస్య..ఎరువుల సమస్యలు ఎదుర్కొనే వారని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అలాంటి సమస్యలు రావడం లేదన్నారు. 4 లక్షల మెట్రిక్ టన్నులకు మాత్రమే వ్యవసాయ గోదాములు కట్టారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 24 లక్షల టన్నుల గోదాములు కట్టడం జరిగిందన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా త్వరలోనే నీళ్లు వస్తాయన్నారు. 

12:07 - May 13, 2018

చిత్తూరు : సంచలనాలకు మారు పేరైన పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకున్నారు. అందరి నేతలు..ప్రముఖల్లా కాకుండా సామాన్య భక్తుడిలా ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం అర్ధరాత్రి తిరుమలకు చేరుకున్న పవన్ ఆదివారం ఉదయం రూ. 300 టికెట్ కొని క్యూ లైన్ లో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శించుకున్న అనంతరం ఆయన బస చేసే ప్రాంతానికి వెళ్లిపోయారు. తిరుపతిలో రాజకీయాలు వద్దు అంటూ మీడియాకు చెబుతూ వెళ్లిపోయారు. సాధువులు ఉండే మఠంలో పవన్ బస చేయనున్నారని, మూడు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారని తెలుస్తోంది. ఈ మూడు రోజుల పాటు సమీక్షలు జరిపి ఏపీ యాత్ర షెడ్యూల్ ను పవన్ ప్రకటించనున్నారు. 

మే 17న ప్రభుత్వ ఏర్పాటు - యడ్యూరప్ప...

కర్ణాటక : మే 17వ తేదీన తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందని బిజెపి నేత బిఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల్లో తాము తప్పకుండా గెలుస్తామని జోస్యం చెప్పారు. 

11:49 - May 13, 2018

'షా దేవుడు..మేము రాక్షసులమా కనబడుతున్నామా'

విజయవాడ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేవుడిలా..తాము రాక్షసుల్లా వైసిపికి కనబడుతోందని మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. తిరుపతిలో స్విచ్ వేస్తే జగన్ దగ్గర లైట్ వెలిగిందని, కర్ణాటకలో విజయసాయిరెడ్డి డబ్బులు పంచుతున్నాడంటే జగన్, విజయసాయిరెడ్డి ఖండించలేదన్నారు. 

శ్రీవారిని దర్శించుకున్న పవన్...

చిత్తూరు : సినీ నటుడు, పవన్ కళ్యాణ్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో బస చేయనున్న పవన్ ఏపీ పర్యటన షెడ్యూల్ ను ప్రకటించనున్నారు. 

10:15 - May 13, 2018

విజయవాడ : బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు..ఎంతో ఉపయోగంగా భావిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు ఇబ్బందిగా ఉన్న విగ్రహాలను ప్రభుత్వం తొలగిస్తోంది. తాజాగా కాకాని వెంకటరత్నం విగ్రహం తొలగింపు వివాదంగా మారిపోయింది. కాంగ్రెస్..వైసిపి నేతలు ఫ్లై ఓవర్ వద్ద ఆందోళన..నిరసన చేపట్టారు. కుట్రలో భాగంగానే ప్రతిపక్షాలకు చెందిన నేతల విగ్రహాలను తొలగిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆందోళన చేస్తున్న నరసింహరావు, యలమంచిలి రవి, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని గన్నవరం పీఎస్ కు తరలించారు. ఇదిలా ఉంటే విగ్రహం తాత్కాలికంగానే తొలగించామని, నిర్మాణం పూర్తయిన అనంతరం విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. కాకాని వెంకటరత్నం సన్నిహితులతో మాట్లాడి విగ్రహాన్ని తొలగించామని తెలిపారు. ఈ వివాదం ఇంతటితో సద్దుమణుగుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

మాట్లాడాకే కాకాని విగ్రహం తొలగింపు - ఎమ్మెల్యే గద్దె...

విజయవాడ : కాకాని వెంకటరత్నం సన్నిహితులతో మాట్లాడి విగ్రహాన్ని తొలగించామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. 

కాకాని విగ్రహం తొలగింపు వివాదం...

విజయవాడ : బెంజ్ సర్కిల్ లో కాకాని వెంకటరత్నం విగ్రహం తొలగింపు వివాదం చోటు చేసుకుంది. ఫ్లై ఓవర్ నిర్మాణం సందర్భంగా విగ్రహాన్ని తొలగిండాన్ని మాజీ ఎమ్మెల్యే రవి అడ్డుకున్నారు. ఇతడిని పోలీసులు అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. 

కాకాని విగ్రహం తొలగింపు వివాదం...

విజయవాడ : బెంజ్ సర్కిల్ లో కాకాని వెంకటరత్నం విగ్రహం తొలగింపు వివాదం చోటు చేసుకుంది. ఫ్లై ఓవర్ నిర్మాణం సందర్భంగా విగ్రహాన్ని తొలగిండాన్ని మాజీ ఎమ్మెల్యే రవి అడ్డుకున్నారు. ఇతడిని పోలీసులు అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. 

10:05 - May 13, 2018

విజయవాడ : వైసీపీ అధ్యక్షుడు జగన్నాటకాలు ఆపాలని మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు జాతిని బిజెపి దెబ్బ తీస్తుంటే వారికి అనుకూలంగా మాట్లాడుతూ సన్నాయినొక్కులుతున్నారని విమర్శించారు. 'షా'పై దాడి చేశారంటూ మాటలు చెబుతున్నారని...ఈ మాటల్లో ఆంతర్యం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. బిజెపి కండువా కప్పుకుని కర్ణాటకలో వైసీపీ నేతలు ప్రచారం నిర్వహించారని తెలిపారు. ఏపీలో మాత్రం ప్రత్యేక హోదా అంటూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 

గోడోన్స్ లలో అగ్నిప్రమాదం...

ఛత్తీస్ గడ్ : రాయ్ పూర్ లోని రెండు గౌడోన్స్ లలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

09:12 - May 13, 2018

ఆదిలాబాద్ : ఎక్కడ వర్షం పడుతుందో...కష్టపడి..చెమటోడ్చి పండిన పంట నీళ్ల పాలవుతుందో..తమకు ఎక్కడ నష్టం వస్తుందో..అని ధాన్యం వద్ద కాపలా ఉన్న రైతుల పాలిట 'పిడుగు' శాపంగా పరిగణించింది. పిడుగు పడి ముగ్గురు రైతులు దుర్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలుకు అధికారులు సరైన చర్యలు తీసుకోకపోతుండడం..పండించిన ధాన్యం నీళ్ల పాలవుతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

తాజాగా మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఆరపల్లిలో ముగ్గురు రైతులు తాము పండించిన ధాన్యానికి కాపలాగా ఉన్నారు. శనివారం రాత్రి వారు ఉన్న ప్రాంతం వద్ద పిడుగుపడింది. దీనితో ముడిపల్లి రాజం, రామటెంకి రాజయ్య, జాడి రమేశ్ లు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మరి మృతి చెందిన రైతుల కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

పిడుగు పడి ముగ్గురు రైతులు...

ఆదిలాబాద్ : మంచిర్యాల జిల్లాలోని భీమారం మండలం ఆరపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడడంతో ముగ్గురు రైతులు మృతి చెందారు. వరి ధాన్యానికి వీరంతా కాపలా ఉన్నారు. 

08:33 - May 13, 2018

హైదరాబాద్ : ఒకవైపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని గాడినపెట్టే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తోంటే.... మరోవైపు ఆయనకు తెలుగు తమ్ముళ్లు రోజుకొకరు షాక్‌ ఇస్తున్నారు. ఎన్నికలకు ముందు పార్టీలో జోరు పెంచాల్సిన నేతలు.. ఒక్కొక్కరు సైకిల్‌ దిగిపోతున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమవుతోందన్న ఆందోళన అధినాయకత్వాన్ని వేధిస్తోంది. తెలంగాణలో టీడీపీ పరిస్థితి రోజురోజుకు ఆందోళన కరంగా మారుతోంది. తెలుగు తమ్ముళ్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. టీడీపీ తెలంగాణ అగ్రనాయకులు ఇతర పార్టీల్లో చేరుతుండడంతో సెకండరీ స్థాయి నేతలు కూడా ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇది గమనించిన చంద్రబాబు ఈ మధ్యే ముఖ్యనేతలతో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నేతలంతా ప్రజాక్షేత్రంలో పనిచేయాలని సూచించారు. ప్రజల్లో పార్టీ బలంగా ఉంటేనే.. ఏదైనా రాజకీయపార్టీ పొత్తు కోసం ఆసక్తి చూపుతుందని స్పష్టం చేశారు. బలహీనపడితే ఏపార్టీలు పట్టించుకునే పరిస్థితి ఉండబోదన్నారు. అందుకే నేతలంతా పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నా... తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అధినేత హామీలు తెలుగు తమ్ముళ్లకు ఏమాత్రం ధీమా ఇవ్వడం లేదు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీకి కోలుకోలేని దెబ్బతగిలింది. నాటి నుంచి నేటి వరకు వరుస షాక్‌లు తెలుగు తమ్ముళ్లు ఇస్తూనే ఉన్నారు. సీనియర్లుగా గుర్తింపు పొందిన నేతలు పార్టీకి గుడ్ బై చెబుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రేవంత్ పార్టీని వీడిన అనంతరం కాంగ్రెస్ లో చేరుతున్న టిటిడిపి నేతల సంఖ్య పెరుగుతూనే ఉంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంత మంది నేతలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోగా....ముఖ్యమంత్రి కేసిఆర్ పై పోరాటం చేస్తున్న నేతగా గుర్తింపు తెచ్చుకున్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి సైతం టిడిపికి గుడ్ బై చెప్పారు. రాబోయే రోజుల్లో మరికొంత మంది అదే దారిలో నడిచే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

పార్టీలో నేతలు నిలబడలేని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమణ కూడా నేతలకు నచ్చచెప్పే ప్రయత్నాలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రమణ వైఖరి ఇదే విధంగా కొనసాగితే పార్టీకి మరింత నష్టం జరుగక తప్పదన్న అభిప్రాయాన్ని సీనియర్లు బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు.

08:16 - May 13, 2018

కరీంనగర్ : పెళ్లి వేడుకలు..అందరూ ఆనందంగా..సంతోషంగా ఉన్నారు. ఒక్కసారిగా ఏడుపులు..అరుపులు..ఆ ప్రాంతం అంతా మారుమోగింది. రక్త మడుగులో పడి ఉన్న ఇద్దరు యువకులతో ఒక్కసారిగా ఆనందం అంతా ఆవిరియై పోయింది. పెళ్లి వేడుకలో జరిగిన ఘర్షణలో ఒక యువకుడు మృతి చెందగా మరొక యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది.

జగిత్యాలలోని బాలాజీ థియేటర్ సమీపంలో ఓ పెళ్లి జరుగుతోంది. శనివారం అర్ధరాత్రి తాగిన మైకంలో ఉన్న యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీనితో కిశోర్ అనే యువకుడు కత్తితో అభిలాష్, కిరణ్ లపైకి దాడికి దిగాడు. దీనితో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా అభిలాష్ మృతి చెందాడు. తీవ్రగాయాలతో కిరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడికి పాల్పడిన కిశోర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. 

08:08 - May 13, 2018

కర్నాటక రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగింది. కాంగ్రెస్ కు ఓటర్లు పట్టం కట్టనున్నారని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఇక్కడ జేడీఎస్ ప్రధాన పాత్ర పోషించనుందని పేర్కొన్నాయి. దీనితో జేడీఎస్ కాంగ్రెస్ కు మద్దతిస్తుందా ? లేక బిజెపికి మద్దతిస్తుందా ? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలు తెలుగు రాష్ట్రాలపై ప్రముఖంగా ఏపీపై ప్రభావం చూపుతుందా ? ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నాగుల మీరా (టిడిపి), బాబురావు (సీపీఎం), రోషయ్య (వైసీపీ) నేతలు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

పలు రాష్ట్రాలకు వర్ష సూచన...

ఢిల్లీ : నేడు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ, ఉత్తరాంధ్ర, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, కేరళ, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయని పేర్కొంది.

 

కొనసాగుతున్న జగన్ పాదయాత్ర...

కృష్ణా : నేడు జిల్లాలో జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగనుంది. కైకలూరు, కాకతీయ నగర్, చింతపాడు మీదుగా యాత్ర జరుగనుంది. ఈ రోజుతో ఆయన కృష్ణా జిల్లాలో పాదయాత్ర పూర్తి కానుంది. 

06:54 - May 13, 2018
06:52 - May 13, 2018

ఢిల్లీ : రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఢిల్లీపై సూపర్‌ విక్టరీ కొట్టింది. ప్లేఆఫ్‌ రేసులో తామూ ఉండాలంటే కచ్చితంగా మిగిలిన నాలుగు మ్యాచ్‌లను నెగ్గాల్సిన దశలో బెంగళూరు ఎదురొడ్డి నిలిచింది. కోహ్లీ, డివిల్లీర్స్‌ చెలరేగి ఆడారు. కోహ్లీ 40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70రన్స్‌ చేయగా... డివిల్లీర్స్‌ 37 బాల్స్‌ను ఎదుర్కొని 4ఫోర్లు, 6 సిక్సర్లతో 72 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఢిల్లీపై బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ... 20 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఢిల్లీ జట్టులో రిషబ్‌, అభిషేక్‌ రాణించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ డివిల్లీర్స్‌కు దక్కింది.

06:50 - May 13, 2018

విజయవాడ : ఎండలు మండుతుండడంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. మండుతున్న వేసవికి కరెంట్‌ కష్టాలు కూడా తోడవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు ప్రారంభమయ్యాయి. సమయం, సందర్భం లేకుండా పవర్‌ సప్లై నిలిచిపోవడంతో... వ్యవసాయరంగానికి ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. ఏపీలో భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఉదయం 9 గంటలకే సూర్యుడు దంచికొడుతుండడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇంట్లో కూలర్లు,ఏసీల కింద జనం సేద తీరుతున్నారు. ఇప్పుడు ప్రజలు కొత్త కష్టాలు మొదలయ్యాయి. కరెంట్‌ కోతలు పెరగడంతో బయటకు వెళ్లలేక.. ఇంట్లో ఉండలేక తల్లడిల్లిపోతున్నారు. వేసవి కారణంగా ఏపీలో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగింది. దీంతో ఒత్తిడి ఎక్కువవ్వడంతో పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతున్నాయి. చిన్నపాటి గాలి దుమారానికి చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ వైర్లు తెగిపోతున్నాయి. దీంతో విద్యుత్‌ కోతలు ప్రారంభమయ్యాయి. ఏపీలోని 13 జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో విద్యుత్‌ కోతలు పెరిగాయి. దీంతో ప్రజలు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్‌ వేళాపాళా లేకుండా పోతుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వేసవిలో కోతలుండవని ప్రభుత్వం చెప్తున్నా.... ప్రజలు కరెంట్‌ కష్టాలు తప్పడం లేవు. ఎప్పుడుపడితే అప్పుడు ఇష్టానుసారంగా... విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో ప్రజలతోపాటు వ్యాపారులు నష్టపోతున్నారు.విద్యుత్‌ కోతలతో ఇంట్లో పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు వర్ణనాతీతం.

మార్చి చివరి నాటికి 165 మిలియన్ యూనిట్ల కరెంట్ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇది 185 మిలియన్ యూనిట్లకు చేరింది. ఏపీ వ్యాప్తంగా 15 లక్షల ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి 7 గంటలపాటు విద్యుత్ అందిస్తే రోజుకు 9 మిలియన్ యూనిట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ రోజుకు 3 మిలియన్ యూనిట్లు మాత్రమే ఇస్తున్నారు. ఉద్యాన, ఇతర పండ్ల తోటలకు వివిధ కేటగిరీల కింద సుమారు 1.50 లక్షల వరకు కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయానికి అందించే చోట కూడా సరఫరాకు ఇబ్బందులు తలెత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వచ్చిపోయే కరెంట్‌తో ప్రజలకైతే ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

06:48 - May 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ జన సమితి పార్టీని బలోపేతం చేయడంపై నాయకత్వం దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో క్యాడర్‌ను పెంచుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అన్ని పార్టీల కంటే భిన్నంగా... క్యాడర్‌ను ఎంచుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. తెలంగాణలో నూతనంగా ఏర్పడిన తెలంగాణ జనసమితి పార్టీ కొత్త రాజకీయాలకు తెరతీసే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ పేరు ప్రకటించిన నాటి నుంచే టీజేఎస్‌లో పెద్ద సంఖ్యలో క్యాడర్‌ చేరుతున్నారు. చేరికలతో పాటు... పార్టీ నిర్మాణంపైనా టీజేఎస్‌ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందుకు కొత్త పంథాలో లోకల్‌ క్యాడర్‌ను ఎంచుకోబోతున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ క్యాడర్‌ను ఎంచుకునేందుకు ఆన్‌లైన్‌ సభ్యత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎవరైనా టీజేఎస్‌లో పనిచేయాలనుకుంటే.. దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే నేతలు పిలుపునిచ్చారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నవారికి జిల్లా వారీగా పిలిచి వారి బ్యాక్‌గ్రౌండ్‌ వాకబుచేసి... పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్లాన్‌ చేస్తోంది టీజేఎస్‌.

తెలంగాణలో మరో రెండు నెలల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు కూడా జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో జనసమితి ఓ వైపు పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తూనే.. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. అయితే పార్టీ విధివిధానాలు వెల్లడించకుండానే... పంచాయతీ ఎన్నికల బరిలో నిలబడితే ప్రయోజనం ఉంటుందా... పార్టీ నిర్మాణంలో పంచాయతీ ఎన్నికలు ఉపయోగపడతాయా... అన్న కోణంలో టీజేఎస్‌ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల బరిలో నిలబడి తన బలమెంత ఉందో నిరూపించుకోవాలనే జనసమితి నిర్ణయించింది.

అందివచ్చిన పంచాయతీ ఎన్నికల్లో తన సత్తా నిరూపించుకుంటూనే.. పార్టీని లోకల్‌బాడీ లెవల్‌లో బలోపేతం చేసే పనిలో పడ్డారు టీజేఎస్‌ నేతలు. మరోవైపు టీజేఏసీలో కోదండరామ్‌తో కలిసి పనిచేసిన వారు చాలా మందే ఉన్నారు. వారిని రాజకీయాల్లో అడుగుపెట్టాలని... నీతిమంతమైన రాజకీయాల కోసం రావాలంటూ ఆహ్వానాలు పంపుతున్నారు. పార్టీ బలోపేతానికి ఇప్పటికే జిల్లాల ఇంచార్జ్‌లను టీజేఎస్‌ ప్రకటించింది. ఇక నియోజవకర్గ స్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేసే యోచనలో టీజేఎస్‌ ఉంది. పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు జోరుగా సాగిస్తోంది.

06:45 - May 13, 2018

విజయవాడ : ఎలాంటి ఎన్నికలైనా సరే సై అంటోంది తెలుగుదేశం పార్టీ.. ఇంతవరకూ ఎన్నికలపై ఆచితూచి స్పందించిన టీడీపీ నేతల స్వరం ఇప్పుడు మారింది. వైసీపీ ఎంపీల రాజీనామా నేపథ్యంలో... ఉపఎన్నికలు, సాధారణ ఎన్నికలు ఏవైనా సరే సిద్దంగా ఉండాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సూచించడంతో.. పార్టీ నేత‌ల్లో స‌మ‌రోత్సాహం క‌నిపిస్తోంది. ఎన్నికలపై టీడీపీ వైఖరిలో మార్పు కనిపిస్తోంది.. ఇంతవరకూ టీడీపీ నేతలు ఎన్నికలపై ఆచితూచి మాట్లాడారు. కానీ.. ఉపఎన్నికలైనా.. సాధారణ ఎన్నికలైనా సరే సిద్ధంగా ఉండాలంటూ చంద్రబాబు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సంకేతాలు ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నిక‌, కాకినాడ కార్పోరేష‌న్ ఎన్నిక ఫ‌లితాలతో టీడీపీలో జోష్‌ పెరిగినా.. త‌ర్వాత ఆ స్పీడ్ క‌నిపించ‌లేదు. దీనికి తోడు చంద్రబాబు తీరు కూడా సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మాత్రమే సిద్ధం అన్నట్లుగా కనిపించింది. ఉప ఎన్నిక‌ల్లో ఏమాత్రం తేడా జ‌రిగినా ఆ ప్రభావం వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌లపై ప‌డుతుంద‌న్నది టీడీపీ అంచ‌నా. రాష్ర్టంలో నడుస్తున్న ప్రత్యేక హోదా ఉద్యమం, బీజేపీతో టీడీపీ తెగ‌దెంపులు, జ‌గ‌న్‌, ప‌వ‌న్ కళ్యాణ్‌ టీడీపీనే టార్గెట్‌ చేయడం వంటి పరిణామాలతో.. టీడీపీ ఎన్నిక‌ల‌ విషయంలో డైలమాలో పడ్డట్టు కనిపించింది.

వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొంది.. ఉప ఎన్నిక‌లు వ‌చ్చినా సరే పోటీకీ సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చెప్పారు. దీంతో మ‌ళ్ళీ ఉప ఎన్నిక‌లు వ‌స్తాయే మోన‌న్నచర్చ టీడీపీలో మొద‌లైంది. అటు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కూడా ఆగ‌స్ట్ 31లోగా పంచాయితీల‌కు ఎన్నిక‌లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెల‌ిపింది. ఈ నేపథ్యంలో అందుకు త‌గ్గట్లుగానే చంద్రబాబు వ్యాఖ్యలు చేశారేమో అని తెలుగు తమ్మళ్ళు భావిస్తున్నారు. ఏదేమైనా ఎన్నిక‌ల ఏడాది కావ‌డంతో.. ఎలాంటి ఎన్నికలొచ్చినా.. రెఢీ అంటున్నాయి టీడీపీ శ్రేణులు.

ఒక వేళ ఉపఎన్నికలు జ‌రిగినా.. మెజార్టీ సీట్లు తామే గెలుస్తామ‌న్న ధీమా టీడీపీలో క‌నిపిస్తోంది. ఆయా స్థానాల్లోని వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడం కూడా టీడీపీకి లాభిస్తుందంటున్నారు. అంతేగాక.. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరివ్వడంతో పార్టీపై ప్రజలకు సానుకూల దృక్పథం ఉందని టీడీపీ చెబుతోంది. దీనికి తోడు చంద్రబాబు నేరుగా మోడీనే టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేస్తుండడంతో.. ప్రజల్లో ప్రభుత్వం, పార్టీపట్ల సానుకూల దృక్పథం వచ్చిందని భావిస్తున్నారు. ఇటీవల చేయించిన ఓ సర్వేలో కూడా ఇదే తేలిందన్న గట్టి నమ్మకం టీడీపీలో కనిపిస్తోంది. ఏది ఏమైనా విసృత‌స్దాయి స‌మావేశం ద్వారా ఎన్నిక‌ల‌కు సిద్దం కావాల‌న్న సంకేతాలను చంద్రబాబు పార్టీ నేత‌ల‌కు ఇచ్చారు. మ‌రి ఉప ఎన్నిక‌లు, పంచాయితీ ఎన్నిక‌లు జ‌రుగుతాయా లేదా అన్నది త్వర‌లోనే తేల‌నుంది. 

06:41 - May 13, 2018

హైదరాబాద్ : గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై అత్యాచారం ఘటన మరువక ముందే.. మరోసారి దాచేపల్లిలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికపై ఓ ప్రజాప్రతినిధి అత్యాచారానికి ఒడిగట్టాడు. మరోవైపు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 7 ఏళ్ల చిన్నారిపై 65 ఏళ్ల వృద్దుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో ట్యూషన్‌ కు వచ్చిన 12 ఏళ్ల బాలికపై ట్యూషన్ మాస్టర్‌ అత్యాచారం చేశాడు. బాలికలపై అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి.

గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవక ముందే మరోసారి అలాంటి ఘోరమే వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల బాలికపై దాచేపల్లి మండల కోఆప్షన్‌ సభ్యుడు మహబూబ్‌ వలీ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 7 ఏళ్ల చిన్నారిపై 65 ఏళ్ల గురుస్వామి అనే వృద్దుడు అత్యాచార యత్నం చేశాడు. చిరుతిళ్లు ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాప నానమ్మ చూసి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి గురుస్వామికి దేహశుద్ధి చేశారు. గురుస్వామిపై చిన్నారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్‌ మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి లెనిన్‌ నగర్‌లో ట్యూషన్‌కు వచ్చిన 12 ఏళ్ల బాలికపై ట్యూషన్ మాస్టర్ అత్యాచారయత్నం చేశాడు. బాలిక అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు బాలికను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా నసూర్లాబాద్‌ మండలం దుర్కి గ్రామంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. గ్రామానికి చెందిన అహ్మద్‌ హుసేన్‌ బాలికపై అత్యాచారం చేశాడు. చేప కూర తినిపిస్తానని చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

దాచేపల్లితో పాటు నాయుడుపేటలో జరిగిన అత్యాచారాలపై పౌర సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం అత్యాచార ఘటనలపై సీరియస్‌గా చర్యలు తీసుకోకపోవడం వల్లే మరోసారి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నాయి. పాలక వర్గాల ఉదాసీన వైఖరి కారణంగానే పదేపదే మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఐద్వా నేతలు విమర్శిస్తున్నారు. ఘటనలకు పాల్పడిన వారు చట్టం నుండి తప్పించుకోకుండా చూడాలని అంటున్నారు. 

06:37 - May 13, 2018

చిత్తూరు : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చిత్తూరు జిల్లా పర్యటన కోసం తిరుమల చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి స్పైస్‌ జెట్‌ విమానంలోరేణిగుంట విమానాశ్రయం చేరుకున్న పవన్‌.... రోడ్డు మార్గాన అలిపిరికి వెళ్ళి.. అక్కడనుంచి కాలినడకన తిరుమల వెళ్ళారు. ఆదివారం శ్రీవారి సేవలో పాల్గొని పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టనున్న బస్సు యాత్ర షెడ్యూల్‌ను విడుదల చేస్తారు..

 

06:35 - May 13, 2018

హైదరాబాద్‌ : పాతబస్తీ చాంద్రాయణ గుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గౌస్‌ నగర్‌, ఇంద్రనగర్‌ ప్రాంతాల్లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సౌత్‌జోన్‌ డీసీపీ వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో 250 మంది పోలీసులతో ఇంటింటికీ వెళ్ళి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని 41 ద్విచక్రవాహనాలను సీజ్‌ చేశారు. ఈ ఫింగర్‌ ప్రింట్‌ఆధారంగా 30 మంది అనుమానుతులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఓ గాజుల పరిశ్రమలో పనిచేస్తున్న బాలకార్మికులకు విముక్తి కల్పించిన పోలీసులు.. గాజుల పరిశ్రమ యజమానిపై 370, 371 సెక్షన్ల కింద కేసునమోదు చేశారు. రసాయనాలతో అల్లంవెల్లుల్లి తయారు చేస్తునన గోదాంపై దాడిచేసి రెండు క్వింటాళ్ళ నకిలీ అల్లంపేస్టుని సీజ్‌ చేశారు. బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న నాలుగుక్వింటాళ్ళ రేషన్ బియ్యం, ఆటో సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు సౌత్‌జోన్‌ డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. 

లాలూ తనయుడి వివాహం...

బీహార్ : ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ వివాహం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

ఆలూరులో రైతు బంధు కార్యక్రమం...

నిజామాబాద్ : నేడు ఆలూరులో రైతు బంధు కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, మంత్రి పోచారం, ఎంపీ కవితలు పాల్గొననున్నారు. 

ఆలూరులో రైతు బంధు కార్యక్రమం...

నిజామాబాద్ : నేడు ఆలూరులో రైతు బంధు కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, మంత్రి పోచారం, ఎంపీ కవితలు పాల్గొననున్నారు. 

శ్రీవారిని దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్...

చిత్తూరు : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు. ఆదివారం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ఏపీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. 

శ్రీవారిని దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్...

చిత్తూరు : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు. ఆదివారం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ఏపీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. 

కలకలం రేపుతున్న బాలికల అత్యాచార ఘటనలు...

హైదరాబాద్ : గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై అత్యాచారం ఘటన మరువక ముందే.. మరోసారి దాచేపల్లిలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికపై ఓ ప్రజాప్రతినిధి అత్యాచారానికి ఒడిగట్టాడు. మరోవైపు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 7 ఏళ్ల చిన్నారిపై 65 ఏళ్ల వృద్దుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో ట్యూషన్‌క వచ్చిన 12 ఏళ్ల బాలికపై ట్యూషన్ మాస్టర్‌ అత్యాచారం చేశాడు. బాలికలపై అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. 

అట్టుడికిన ఔరంగాబాద్...

ఢిల్లీ : రెండు వర్గాల మధ్య ఘర్షణతో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ అట్టుడికింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఘర్షణల్లో విధ్వంసం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందారు, 30 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో 10 మంది పోలీసులు కూడా ఉన్నారు. 

అయోధ్యకు చేరుకున్న నేపాల్ బస్సు...

ఢిల్లీ : నేపాల్‌ జనకపురిలో ప్రధాని నరేంద్రమోది ప్రారంభించిన బస్సు అయోధ్యకు చేరుకుంది. అయోధ్యలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ బస్సుకు స్వాగతం పలికారు. భారత్‌ నేపాల్‌ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల్లో కొత్త అధ్యయనం మొదలైందని ఈ సందర్భంగా యోగి అన్నారు.

ఢిల్లీ డేర్ డెవిల్స్ పరాజయం...

ఢిల్లీ : ఐపీఎల్ 11లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో బెంగళూరు గెలుపొందింది. బెంగళూరు జట్టు 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేయగా ఢిల్లీ జట్టు 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. 

పెళ్లి వేడుకలో విషాదం...

జగిత్యాల : పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. తాగినమైకంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అభి, కిరణ్ యువకులపై కతులతో దాడికి దిగారు. దీనితో అభి అక్కడికక్కడనే మృతి చెందగా కిరణ్ కు తీవ్రగాయాలయ్యాయి. 

Don't Miss