Activities calendar

15 May 2018

22:06 - May 15, 2018

శ్రీకాకుళం : రాష్ట్రంలో జల సంరక్షణ కార్యక్రమాన్ని మహోద్యమంగా చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన సారవకోటలో జరిగిన నీరు-ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగులకు పెన్షన్లు అక్రమంగా అందుతున్నాయా ? లేదా ? అన్న అంశంపై గ్రామ సభలో ఆరా తీశారు. రేషన్‌ బియ్యం, ఇతర సరకుల పంపిణీని సమీక్షించారు. ఈ సందర్భంగా నీరు-ప్రగతి కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపడుతున్నట్టు చెప్పారు. 

21:57 - May 15, 2018

కర్నాటక : రాజకీయ పరిణామాలు క్షణానికో తీరుగా మారుతున్నాయి. ఏ పార్టీ పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో.. జేడీఎస్‌ కీలకంగా మారింది. ఎలాగైనా బీజేపీ అధికారం చేపట్టకుండా చూడాలన్న లక్ష్యంతో జేడీఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది కాంగ్రెస్‌. గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు.. 118 ఎమ్మెల్యేల మద్దతున్న తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరారు. దీంతో గవర్నర్‌ ఎవరికి అవకాశమిస్తాడోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
రసవత్తరంగా రాజకీయాలు
కర్నాటక రాజకీయం మధ్యాహ్నం నుంచి రసవత్తరంగా మారింది. ఉదయం ఫలితాల సరళిని బట్టి, బీజేపీ ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భావించారు. అయితే.. మధ్యాహ్నానికి ఫలితాలు పూర్తిగా వెలువడ్డాక, బీజేపీ 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా మాత్రమే నిలిచింది. 78 స్థానాలతో కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలవగా, జెడిఎస్‌ కూటమి 38 స్థానాలతో మూడో స్థానంలో నిలిచింది.

హంగ్‌ దిశగా ఫలితాలు
కన్నడనాట, హంగ్‌ దిశగా ఫలితాలు వెలువడగానే.. కాంగ్రెస్‌ అధినాయకత్వం రంగంలోకి దిగింది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, జనతాదళ్‌ (ఎస్‌) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడతో ఫోన్‌లో సంభాషించారు. సెక్యులర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా.. తాము.. బేషరతుగా జెడిఎస్‌కు మద్దతిస్తామని ప్రకటించారు. అంతటితో ఆగకుండా.. అప్పటికే బెంగళూరులో ఉన్న గులాం నబీ ఆజాద్‌ సహా, పార్టీ సీనియర్లను దేవెగౌడ నివాసానికి పంపారు.

కాంగ్రెస్ మద్దతు తీసుకున్న జేడీఎస్
వివిధ ప్రతిపాదనలతో తన వద్దకు వచ్చిన కాంగ్రెస్‌ నాయకులతో.. సంప్రదింపుల అనంతరం, దేవెగౌడ వారి మద్దతు తీసుకునేందుకు అంగీకరించారు. తన తనయుడు కుమారస్వామిని సీఎంగా.. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరమేశ్వరప్పను డిప్యూటీ సీఎంగా కొనసాగించాలని, కాంగ్రెస్‌కు 21 మంత్రి పదవులు, జెడి(ఎస్‌)కు 14 మంత్రి పదవులు పంచుకోవాలని నిర్ణయించారు. ఈ చర్చలు సాగుతున్న క్రమంలోనే, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా దేవెగౌడతో ఫోన్‌లో సంభాషించారు. బీజేపీని అధికారానికి దూరం చేసే దిశగా మారి మంతనాలు సాగాయి. దీంతో.. దేవెగౌడ కాంగ్రెస్‌ మద్దతుతో జెడిఎస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు తీర్మానించారు.

గవర్నర్ అపాయింట్ మెంట్ కోసం
జెడిఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగానే, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వరప్ప, రాజ్‌భవన్‌కు వెళ్లారు. అయితే, ముందస్తు అనుమతి తీసుకోలేదన్న కారణంతో, రాజ్‌భవన్‌ సిబ్బంది ఆయన్ను వెనక్కి తిప్పి పంపింది. దీంతో, హెచ్‌డి కుమారస్వామి, గవర్నర్‌కు లేఖ రాశారు.. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా ఆ లేఖలో కోరారు. ముందుగా తీసుకున్న అనుమతి మేరకు, సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో కాంగ్రెస్‌ నాయకులతో కూడి, గవర్నర్‌ వాజుభాయి వాలాను కలిశారు. జెడిఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. బీజేపీని అధికారంలోకి రానివ్వ కూడదన్న ఏకైక లక్ష్యంతో.. కాంగ్రెస్‌ వేసిన ఎత్తు.. బీజేపీ నాయకుల్లో మొత్తానికి కలవరాన్ని రేపింది. మరోవైపు గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వకపోతే... కోర్టుకు వెళ్లే యోచనలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలున్నట్లు తెలుస్తోంది. 

కాంగ్రెస్, బీజేపీ యత్నాలు..
కాంగ్రెస్‌ నాయకుల ప్రయత్నాలు కొనసాగుతున్న క్రమంలోనే.. బీజేపీ అధినాయకత్వం కూడా.. కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన తమకే ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్‌కు కోరింది.

అతి పెద్ద పార్టీగా బీజేపీ
కర్నాటక ఎన్నికల్లో 104 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. అధికార పీఠానికి ఎనిమిది స్థానాల దూరంలో నిలిచిపోయింది. ఉదయాన్నే ఫలితాల సరళిని బట్టి తామే అధికారంలోకి వస్తామని భావించిన బీజేపీ నాయకులు.. తర్వాత కన్నడ ఓటర్లిచ్చిన తీర్పుతో షాక్‌కు గురయ్యారు. అంతలోనే తేరుకుని.. ప్రభుత్వ ఏర్పాటు యత్నాలను ముమ్మరం చేశారు.

రాజ్ భవన్ కు వెళ్లిన యడ్యూరప్ప
పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పను హుటాహుటిన రాజ్‌భవన్‌కు వెళ్లాలని ఆదేశించిన పార్టీ అధినాయకత్వం.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరాలని సూచించింది. దీంతో యడ్యూరప్ప గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. 2002లో నరేంద్రమోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసి.. ప్రస్తుతం కర్నాటక గవర్నర్‌గా కొనసాగుతున్న గవర్నర్‌ వాజుభాయి వాలా.. అంతకుముందే అపాయింట్‌మెంట్ కోరిన కుమారస్వామిని కాదని, యడ్యూరప్పకే ఫస్ట్‌ అవకాశాన్నిచ్చారు. దీంతో గవర్నర్‌ను కలిసిన యడ్యూరప్ప.. తననే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు .

దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణకు బీజేపీ గాలం
ఓవైపు ఈ ప్రయత్నాలు సాగుతుండగానే.. బీజేపీ అధినాయకత్వం.. రాజకీయ సమీకరణాలను మార్చే పనిలో పడింది. జెడి(ఎస్‌) అధినేత దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణకు గాలం వేసింది. ఆయన వర్గానికి చెందిన 12 మంది ఎమ్మెల్యేలతో తమకు మద్దతిస్తే.. రేవణ్ణకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని ఆఫర్‌ చేసింది. దీంతో దేవెగౌడ శిబిరంలో కలకలం చెలరేగింది. సాయంత్రం ఏడు గంటలకు సమావేశమైన జెడిఎస్‌ శాసనసభా పక్షం.. కాంగ్రెస్‌ ప్రతిపాదనలపై చర్చించింది. కుమారస్వామిని తమ నాయకుడిగా ఎన్నుకుంది. దీంతో.. దళ్‌ శిబిరం ఊపిరి పీల్చుకుంది.

38 సీట్లు సాధించిన జేడీఎస్‌కు 18.7 శాతం ఓట్లు
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విచిత్ర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మెజారిటీ ఓట్లశాతం సాధించిన పార్టీకి తక్కువ సీట్లు.. తక్కువ శాతం ఓట్లు పొందిన పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. 18.7 శాతం ఓట్లు మాత్రమే పొందిన పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కాబోతోంది. look.

78 సీట్లు సాధించిన కాంగ్రెస్‌కు 38 శాతం ఓట్లు
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారానికి దూరమైనా.. అన్ని పార్టీల కంటే ఎక్కువ ఓట్లు సాధించింది. 78 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు మొత్తంగా 38 శాతం ఓట్లు వచ్చాయి. అదే సమయంలో.. 104 స్థానాలు దక్కించుకున్న బీజేపీకి 36.2 శాతం ఓట్లే దక్కాయి. బీజేపీ కన్నా 1.8 శాతం అధిక ఓట్లు పొందిన కాంగ్రెస్‌ పార్టీ.. సీట్ల దగ్గరకు వచ్చేసరికి 78 స్థానాలకే పరిమితమైంది. అంటే, బీజేపీ కంటే కాంగ్రెస్‌కు 26 సీట్లు తక్కువ వచ్చాయి. బీజేపీ తక్కువ ఓట్లు సాధించినా... ఎక్కువ స్థానాలు గెలుపొందింది. 38 సీట్లు దక్కించుకున్న జేడీఎస్‌కు కేవలం 18.7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. తక్కువ ఓట్లు సాధించిన జేడీఎస్‌ ప్రభుత్వం ఏర్పాటులో కీలకం కాబోతోంది. 

21:53 - May 15, 2018

కర్ణాటక : అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీ సాధించలేకపోయింది. కాంగ్రెస్‌ రెండో స్థానంలో, జేడీఎస్‌ మూడో స్థానంలో నిలిచాయి. దీంతో కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది.

ఏ ఒక్కరికి దక్కని మోజారిటీ
కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను 222 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. బిజెపి 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 78 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపొందింది. జనతాదళ్‌ ఎస్‌ 38 స్థానాలను కైవసం చేసుకుంది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సాధారణ మెజారిటీ 112 స్థానాలు ఏ పార్టీకి దక్కక పోవడంతో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడింది.

ఉత్కంట రేపిన ఓట్ల లెక్కింపు
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఉత్కంఠను రేపింది. కాంగ్రెస్‌-బిజెపిల మధ్య నువ్వా...నేనా...అన్నట్లుగా కౌంటింగ్‌ సాగింది. మొదట్లో బిజెపి 117 స్థానాల ఆధిక్యతను కనబరచడంతో కాషాయ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి.

కౌంటింగ్‌లో గంట గంటకు పరిణామాల్లో మార్పు
ఆ తర్వాత కౌంటింగ్‌లో గంట గంటకు పరిణామాల్లో మార్పు చోటు చేసుకుంది. బిజెపి క్రమంగా ఆధిక్యతను కోల్పోయింది. కౌంటింగ్‌ పూర్తయ్యేసరికి 104 స్థానాలతో సంతృప్తి పడాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ సిఎంలు యడ్యూరప్ప, కుమారస్వామి గెలుపొందారు. రెండు చోట్ల పోటీ చేసిన సిద్ధరామయ్య ఒకచోట గెలిచారు. బదామీలో బిజెపి అభ్యర్థి శ్రీరాములుపై 3 వేల ఓట్ల పై చిలుకు ఆధిక్యంతో విజయం సాధించారు. చాముండేశ్వరిలో ఆయన ఓటమి చెందారు.

కాంగ్రెస్ ఆశలు అడియాసలు
లింగాయత్‌లపై కాంగ్రెస్‌ పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తిస్తామని ప్రకటించడం ద్వారా వారి ఓట్లను కొల్లగొట్టవచ్చని సిఎం సిద్ధరామయ్య పన్నిన వ్యూహం బెడిసి కొట్టింది. లింగాయత్‌ల ప్రభావం ఉన్న 36 స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. తమ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్పకే ఓటేసింది.కర్ణాటకలోని తెలుగు ప్రజలున్న ప్రాంతాల్లోనూ బిజెపికే ఎక్కువ సీట్లు వచ్చాయి. సెంట్రల్‌ కర్ణాటక, కోస్టల్‌ కర్ణాటక ప్రాంతాల్లోనూ బిజెపి విజయ దుందుబి మోగించింది. ముంబై కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక, బెంగళూరు నగరంలోనూ బీజేపీ విజయం సాధించింది.

21:48 - May 15, 2018

తూర్పుగోదావరి : దేవిపట్నం మండలం మంటూరు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరిలో విహారానికి వెళ్లిన లాంచీ మునిగిపోయింది. ఈత కొడుతూ ఐదుగురు ఒడ్డుకు చేరుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొండమొదలు నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా మంటూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. లాంచీలో సుమారు 40 మంది పర్యాటకులు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన సాయంత్రం 5గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. లాంచీ నిర్వాహకుడు ఖాజా దేవీపట్నం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మంటూరుకు చెందిన పలువురు గిరిజనులు నాటుపడవలతో ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ లాంచీలో పెళ్లి బృందం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బయల్దేరి వెళ్లాయి. నాలుగు రోజుల క్రితమే గోదావరిలో లాంచీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన ఘటన ఇంకా మరవకముందే అదే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 

21:34 - May 15, 2018

దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటే అమ్మ, నాన్న తమిళ అమ్మాయి, పోకిరి, బిజినెస్‌మెన్‌ లాంటి చిత్రాలు కళ్లముందు కదలాడుతాయి. ఆయన డైలాగ్స్, టేకింగ్ ప్రేక్షకులను మైమరిపిస్తాయి. పూరీ చెప్పిన ప్రేమకథలు విశేషంగా ఆకట్టుకొన్నాయి. తనదైన శైలిలో చిత్రాలను తెరకెక్కించే విలక్షణ దర్శకుడు పూరీని సక్సెస్‌లు పలకరించి చాలా కాలమయ్యింది. ఈ క్రమంలో ఆకాష్ పూరీని హీరోగా, నేహా శర్మ అనే అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ పూరీ రూపొందించిన చిత్రం మెహబూబా. మరి మెహబూబా సినిమా టీమ్ తో 10టీవీ స్పెషల్ చిట్ చాట్..

సరైన వ్యూహం వల్లనే విజయం : మోదీ

కర్ణాటక : సరైన వ్యూహం వల్లనే కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధ్యమయ్యిందని ప్రధాని మోదీ తెలిపారు. వారణాసి ప్రమాదం బాధ కలిగించిందనీ..కన్నడ విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నానన్నారు. కార్యకర్తల కఠోర శ్రమ వల్లనే విజయం సాధించామన్నారు. 

బీజేపీ కావాలనే ఓట్లేశారు : అమిత్ షా

కర్ణాటక : కాంగ్రెస్ రహిత కర్ణాటక రాష్ట్రం కావాలని కోరుకుంటూ ప్రజలు తమకు ఓటు వేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించామని అన్నారు. కాంగ్రెస్ కేబినెట్ లో సగం మంది ఓడిపోయారని, బాదామి నియోజకవర్గంలో కేవలం1,700 ఓట్ల తేడాతో గట్టెక్కిన సిద్ధరామయ్య, చాముండేశ్వర్ నియోజకవర్గంలో 35 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారని విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ పై విమర్శలు గుప్పించారు.

లాంచీ ప్రమాదంపై చంద్రబాబు ఆదేశాలు..

అమరావతి : గోదావరిలో మునిగిపోయిన లాంచీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. కాగా దేవీపట్నం మండలం మంటూరు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. మంటూరు వద్ద ఓ లాంచీ మునిగిపోయింది. ఈ సమయంలో భారీ సంఖ్యంలో ప్రయాణీకులు వున్నట్లుగా తెలుస్తోంది. కాగా లాంచీలో వున్న నలుగురు వ్యక్తులు ఈదుకుంటే ఒడ్డుకు సురక్షితంగా చేరుకున్నారు. ఈ ఘటనపై సహాయక చర్యల్ని తక్షణమే చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 

నిపుణుల సలహాల యోచనలో గవర్నర్ ..

కర్ణాటక : కన్నడ నాట రాజకీయ సమీకరణాలు నిమిష నిమిషానికి మారిపోతున్నాయి. ఏపార్టీకి పూర్తిస్థాయి మోజారిటీ రాకపోవటంతో జేడీఎస్ కీలకంగా మారింది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాకు అవకాశం ఇవ్వాలంటే మాకివ్వాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. మాకు 118మంది ఎమ్మెల్యేల మద్దతు వుందనీ..ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్ధులు తమకే మద్దతునిచ్చారని సిద్దరామయ్య పేర్కొన్నారు. కాబట్టి మాకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని మాజీ సీఎం సిద్ధరామయ్య గవర్నర్ ను కోరుతున్నారు.

ఫ్లై ఓవర్ కూలి 12మంది మృతి..

ఉత్తరప్రదేశ్ : నిర్మాణంలో వున్న ఓ ఫ్లై ఓవర్ కుప్పకూలింది. వారణాసిలోని రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మాణంలో వున్న ఫ్లై ఓవర్ కూలిపోయింది. ఈ ఘటనలో 12మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. మరో 50మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. శిథిలాల కింద మరికొంతమంది వున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితిని డిప్యూటీ సీఎం కేశవప్రసాద్ మౌర్య సమీక్షిస్తున్నారు. ఒక్కసారిగా ఫ్లై ఓవర్ కుప్పకూలిపోవటంతో ఆ మార్గంలో వెళుతున్న ప్రజలు తీవ్రంగా భయాందోళనలకు గురయ్యారు.

19:49 - May 15, 2018

కర్ణాటక : కన్నడ పీఠం పార్టీల మధ్య కాకపుట్టిస్తోంది. అతి పెద్ద పార్టీగా అవతరించామని బీజేపీ గప్పాలు కొట్టుకుంటున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ లేకుండా పోయింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డా ఇంకా రాజకీయ వాతావరణం ఉత్కంఠగానే ఉంది. బీజేపీ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ.. మెజార్టీ రాకపోవడంతో... ప్రభుత్వ ఏర్పాటు అంశం ఆసక్తికరంగా మారింది. బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కకూడదన్న యోచనలో ఉన్న కాంగ్రెస్‌... జేడీఎస్‌కు మద్దతు ప్రకటించింది. కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపడితే బయటనుంచి మద్దతిస్తామని ప్రకటించింది. దీంతో కుమారస్వామి తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని గవర్నర్‌కు లేఖ రాశారు. మరోవైపు బీజేపీ జేడీఎస్‌లో చీలిక తెచ్చేందుకు యత్నిస్తోంది. దేవెగౌడ మరో కుమారుడు రేవణ్ణతో పాటు.. ఆయన వర్గానికి చెందిన 12 మంది ఎమ్మెల్యేల మద్దతులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ యోచిస్తోంది. రేవణ్ణకు డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్‌ చేసింది. ఇక ఇప్పటికే బీజేపీ నేత యడ్యూరప్ప,.. కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు సిద్ధరామయ్య, కుమారస్వామిలు గవర్నర్‌ను కలిశారు. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఎవరికి అవకాశమిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీనిపై రాజ్యాంగనిపుణుల సలహాలు తీసుకునేందుకు గవర్నర్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై సరైన క్లారిటీ కోసం వేచి చూడాల్సిందే.

19:35 - May 15, 2018

కర్ణాటక : కన్నడ నాట రాజకీయ సమీకరణాలు నిమిష నిమిషానికి మారిపోతున్నాయి. ఏపార్టీకి పూర్తిస్థాయి మోజారిటీ రాకపోవటంతో జేడీఎస్ కీలకంగా మారింది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాకు అవకాశం ఇవ్వాలంటే మాకివ్వాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. మాకు 118మంది ఎమ్మెల్యేల మద్దతు వుందనీ..ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్ధులు తమకే మద్దతునిచ్చారని సిద్దరామయ్య పేర్కొన్నారు. కాబట్టి మాకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని మాజీ సీఎం సిద్ధరామయ్య గవర్నర్ ను కోరుతున్నారు. తమకు అవకాశం ఇవ్వకపోతే న్యాయపోరాటం చేస్తామని కాంగ్రెస్ పేర్కొంటోంది. మరోవైపు బీజేపీ తమకు కూడా తగిన మద్దతు వుంది కాబట్టి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తలమునకలైన గవర్నర్ వజ్జూభాయ్ వాలా రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకునే దిశగా యోచిస్తున్నారు. న్యాయపరమైన సలహాల కోసం ఇరు పార్టీలు సంప్రదిస్తున్నారు. బీజేపీ కుటిల యత్నాలను ప్రజల్లోనే ఎండగడతామని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. 

19:17 - May 15, 2018

ఉత్తరప్రదేశ్ : నిర్మాణంలో వున్న ఓ ఫ్లై ఓవర్ కుప్పకూలింది. వారణాసిలోని రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మాణంలో వున్న ఫ్లై ఓవర్ కూలిపోయింది. ఈ ఘటనలో 12మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. మరో 50మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. శిథిలాల కింద మరికొంతమంది వున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితిని డిప్యూటీ సీఎం కేశవప్రసాద్ మౌర్య సమీక్షిస్తున్నారు. ఒక్కసారిగా ఫ్లై ఓవర్ కుప్పకూలిపోవటంతో ఆ మార్గంలో వెళుతున్న ప్రజలు తీవ్రంగా భయాందోళనలకు గురయ్యారు. ఫ్లైఓ వర్ కింద వున్న పదుల సంఖ్యలో వున్న వాహనాలపై కూలిపోవటంతో వాహనాలలో వున్న ప్రయాణీకులు కూడా మృతి చెంది వుంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కన్నడ ఎన్నికలు..ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బిజీ బిజీగా వున్న బీజేపీ నేతలు ప్రస్తుత ప్రమాదంపై ఎటువంటి స్పందనా లేకపోవటం విమర్శనలకు దారితీస్తోంది. 

బీజేపీకి షాక్ ఇచ్చిన తెలుగు ఓటర్లు..

కర్ణాటక : అసెంబ్లీ ఎన్నికల్లో 104 స్థానాల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ, తెలుగు ఓటర్లు మాత్రం ఆ పార్టీకి షాక్ ఇచ్చారనే చెప్పాలి. తెలుగు వారి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో బీజేపీకి సీట్ల సంఖ్య తగ్గింది. దీంతో, మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాయ్ చూర్ జిల్లాలోని 7 సీట్లలో బీజేపీ విజయం సాధించింది కేవలం రెండు స్థానాల్లోనే! కొప్పాల్ లోని 5 సీట్లలో బీజేపీ దక్కించుకుంది 3 స్థానాలే! అదేవిధంగా, బళ్లారిలో 9 స్థానాల్లో మూడు మాత్రమే బీజేపీ ఖాతాలో చేరాయి.

మాకు తగిన మద్దతు వుంది : సిద్దరామయ్య

కర్ణాటక : ప్రభుత్వం ఏర్పాటు చేసుందుకు జేడీఎస్‌-కాంగ్రెస్‌ పార్టీల నేతలు ఈ రోజు గవర్నర్‌కు లేఖ కూడా రాసి అపాయింట్‌మెంట్‌ కోరిన విషయం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం ఇరు పార్టీల నేతలు గవర్నర్‌ను కలిసి కాసేపు చర్చలు జరిపారు. అనంతరం జేడీఎస్‌-కాంగ్రెస్‌ నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ... తమకు 118 మంది సభ్యుల సంఖ్యా బలం ఉందని, ఇరు పార్టీల నేతలం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరామని తెలిపారు.

గోదావరిలో మునిగిన లాంచీ..

తూర్పుగోదావరి : దేవీపట్నం మండలం మంటూరు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. మంటూరు వద్ద ఓ లాంచీ మునిగిపోయింది. ఈ సమయంలో భారీ సంఖ్యంలో ప్రయాణీకులు వున్నట్లుగా తెలుస్తోంది. కాగా లాంచీలో వున్న నలుగురు వ్యక్తులు ఈదుకుంటే ఒడ్డుకు సురక్షితంగా చేరుకున్నారు. 

18:45 - May 15, 2018

కర్ణాటక : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డా ఇంకా రాజకీయ వాతావరణం ఉత్కంఠగానే ఉంది. బీజేపీ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ.. మెజార్టీ రాకపోవడంతో... ప్రభుత్వ ఏర్పాటు అంశం ఆసక్తికరంగా మారింది. బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కకూడదన్న యోచనలో ఉన్న కాంగ్రెస్‌... జేడీఎస్‌కు మద్దతు ప్రకటించింది. కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపడితే బయటనుంచి మద్దతిస్తామని ప్రకటించింది. దీంతో కుమారస్వామి తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని గవర్నర్‌కు లేఖ రాశారు. మరోవైపు బీజేపీ జేడీఎస్‌లో చీలిక తెచ్చేందుకు యత్నిస్తోంది. దేవెగౌడ మరో కుమారుడు రేవణ్ణతో పాటు.. ఆయన వర్గానికి చెందిన 12 మంది ఎమ్మెల్యేల మద్దతులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ యోచిస్తోంది. రేవణ్ణకు డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్‌ చేసింది. ఇక ఇప్పటికే బీజేపీ నేత యడ్యూరప్ప,.. కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు సిద్ధరామయ్య, కుమారస్వామిలు గవర్నర్‌ను కలిశారు. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఎవరికి అవకాశమిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రభుత్వ ఏర్పాటు అంశం పూర్తిగా గవర్నర్‌ వాజు భాయ్ వాలా చేతుల్లోనే ఉంటుందని రాజ్యాంగ నిపుణులంటున్నారు. గతంలో సంప్రదాయాలను అనుసరించి అత్యధిక స్థానాలు సాధించిన పార్టీకే ప్రభుత్వ బాధ్యతలు అప్పగించి.. బలం నిరూపించుకునేందుకు సమయం ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. జేడీఎస్‌-కాంగ్రెస్‌లు కూటమిగా కాకుండా.. విడివిడిగా పోటీ చేయడంతో... జేడీఎస్‌ విజ్ఞప్తిని గవర్నర్‌ పట్టించుకునే అవకాశం లేదంటున్నారు. దీనిని బట్టి చూస్తుంటే బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. 

18:37 - May 15, 2018

అమరావతి : కర్నాటకలో బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు అనేక కుట్రలు పన్నారన్నారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని.. విభజన చట్టంలో 85 శాతం హామీలను అమలు చేస్తామని... మిగిలిన హామీలను కూడా నెరవేరుస్తామన్నారు కన్నా. 

జేడీఎస్ లో చీలికలకు బీజేపీ యత్నం..

కర్ణాటక : జేడీఎస్ చీలికలు తెచ్చేందుకు బీజేపీ యత్నిస్తోంది. దేవగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ గౌడకు డిప్యూటీ సీఎం పదవిని బీజేపీ ఆఫర్ చేసింది. రేవణ్ణ వద్ద 12మంది ఎమ్మెల్యేలు వుండటంతో గవర్నర్ వాజు భౄయ్ వాలా నిర్ణయం కీలకంగా మారింది. ఆయన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. జేడీఎస్, బీజేపీలకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. 

బీజేపీకి వారం రోజులు గడువిచ్చిన గవర్నర్..

కర్ణాటక : బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప గవర్న్ ను కలిసారు. తమకు రేవణ్ణ అండ వుందనీ కాబట్టి తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వమని గవర్నర్ ను యడ్యూరప్ప కోరారు. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కోసం వారంరోజులు గడుడువును గవర్నర్ ఇచ్చారు. కాగా ప్రధాన పార్టీలెవరికీ పూర్తిస్థాయి మెజారిటీ రానుందున ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 

బీజేపీకి వారం రోజులు గడువిచ్చిన గవర్నర్..

కర్ణాటక : బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప గవర్న్ ను కలిసారు. తమకు రేవణ్ణ అండ వుందనీ కాబట్టి తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వమని గవర్నర్ ను యడ్యూరప్ప కోరారు. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కోసం వారంరోజులు గడుడువును గవర్నర్ ఇచ్చారు. కాగా ప్రధాన పార్టీలెవరికీ పూర్తిస్థాయి మెజారిటీ రానుందున ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 

ముగిసిన ఎన్నికల కౌంటింగ్..

కర్ణాటక : రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. అతి పెద్ద పార్టీగా బీజేపీ 104 స్థానాలు, కాంగ్రెస్ 78 స్థానాలు, జేడీఎస్ 38, ఇతరులకు 2 స్థానాలు దక్కాయి. ఏపార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. హంగ్ ఏర్పడినందుకు జేడీఎస్ హంగ్ మేకర్ గా తయారయ్యింది. దీంతో జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటచేయాలని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తీవ్ర యత్నాలు కొనసాగిస్తున్నాయి. 

17:30 - May 15, 2018

కర్ణాటక : కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసే నైతికహక్కు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు లేదని అన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఖండిస్తున్నామని, ప్రజలు తిరస్కరిస్తున్నప్పటికీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పాకులాడుతోందని విమర్శించారు. ప్రజా వ్యతిరేకత వల్ల జేడీఎస్ కు లాభం చేకూరిందని, అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన తమనే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. కన్నడ ప్రజలు మార్పు కోరుతూ తీర్పు చెప్పారని అన్నారు. ప్రజల తీర్పును కాలరాయడానికి కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోందని ఆరోపించారు.

17:25 - May 15, 2018

కర్ణాటక : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పలు రసవత్తంగా కొనసాగాయి. విజయం కోసం కలలు కన్న ప్రధాన పార్టీలకు నిరాశే మిగిలింది. పూర్తిస్థాయిలో ఎవరికి మెజారిటీ రాలేదు. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వమే శరణ్యంగా మారింది. దీంతో రాజకీయ సమీకరణల్లో సమీకరణలు వేగంగా రూపుదిద్దుకున్నాయి. పీఠం దక్కించుకునేందుకు బీజేపీ యత్నించగా..అడ్డుకునేందుకు కాంగ్రెస్ కూడా తీవ్రంగా యత్నించి చివరికి విజయం సాధించింది. కాంగ్రెస్ ఇస్తానన్న మద్దతును స్వీకరించింది. జేడీఎస్ కే సీఎం పదవిని ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ పిలుపు, మంతనాలను జేడీఎస్ అడ్వాటేజ్ గా తీసుకుంది. కింగ్ మేకర్ కాస్తా కింగ్ గా మారిపోయింది.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : కుమారస్వామి
హంగ్ ఏర్పడిన నేపథ్యంలో జేడీఎస్ కింగ్ మేకర్ గా ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్ సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చే మద్దతును జేడీఎస్ స్వీకరించింది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కుమారస్వామి తెలిపారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5.30 నుండి 6.00గంటలకు కుమారస్వామి గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటు గవర్నర్ కు కుమారస్వామి లేఖ రాసారు. దీంతో గవర్నర్ పైనే అందరి దృష్టి వుంది. 

మార్కెట్లకు కన్నడ గాలి..

కర్ణాటక : అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హంగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం ఓట్ల లెక్కింపుకు సంబంధించి తొలి ట్రెండ్స్ లో బీజేపీ దూసుకుపోవడంతో, మార్కెట్లు కూడా అదే రీతిలో దూసుకుపోయాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడింది. అయితే మధ్యాహ్నం నుంచి బీజేపీ ఆధిక్యతలో మార్పు వచ్చింది. చివరకు మ్యాజిక్ ఫిగర్ కంటే దిగువకు వచ్చింది. ఈ క్రమంలో, మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. ఫలితంగా మార్కెట్లు పతనమవుతూ వచ్చాయి. చివరకు ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 13 పాయింట్లు కోల్పోయి 35,544కు పడిపోయింది.

ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కు అర్హత లేదు : యడ్యూరప్ప

కర్ణాటక : ప్రభుత్వం ఏర్పాటు చేసే నైతికహక్కు కాంగ్రెస్, జేడీ (ఎస్) పార్టీలకు లేదని అన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఖండిస్తున్నామని, ప్రజలు తిరస్కరిస్తున్నప్పటికీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పాకులాడుతోందని విమర్శించారు. ప్రజా వ్యతిరేకత వల్ల జేడీఎస్ కు లాభం చేకూరిందని, అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన తమనే గవర్నర్ తొలుత పిలవాలని అన్నారు. తమకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని యడ్యూరప్ప భావిస్తున్నారు. 

గవర్నర్ నిర్ణయం వైపే అందరి దృష్టి..

బెంగళూరు : ఉత్కంఠగా ఎదురుచూసిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ప్రస్తుతం కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారిన పరిస్థితుల్లో ఆ రాష్ట్ర గవర్నర్‌పైనే అందరి దృష్టి ఉంది. గవర్నర్‌ వాజుభాయి వాలా నిర్ణయం కీలకం కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీని ఆహ్వానిస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని నేపథ్యంలో హంగ్‌ దిశగా సాగుతున్న కన్నడ రాజకీయాల్లో 35కుపైగా సీట్లతో జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో జేడీఎస్‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

గవర్నర్ నిర్ణయం వైపే అందరి దృష్టి..

బెంగళూరు : ఉత్కంఠగా ఎదురుచూసిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ప్రస్తుతం కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారిన పరిస్థితుల్లో ఆ రాష్ట్ర గవర్నర్‌పైనే అందరి దృష్టి ఉంది. గవర్నర్‌ వాజుభాయి వాలా నిర్ణయం కీలకం కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీని ఆహ్వానిస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని నేపథ్యంలో హంగ్‌ దిశగా సాగుతున్న కన్నడ రాజకీయాల్లో 35కుపైగా సీట్లతో జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో జేడీఎస్‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

గవర్నర్ కోర్టులో కన్న పీఠం..

కర్ణాటక : కన్నడ పీఠం దక్కించుకునేందుకు బీజేపీ యత్నిస్తోంది. బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కూడా పక్కా ప్లాన్ తో ముందుకెళుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జేడీఎస్ కు మద్ధతునిచ్చేందుకు సమ్మతించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన కాంగ్రెస్ నేతలకు అనుమతి లభించలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వున్న తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని బీజేపీ తీవ్రంగా యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ అతిరథ మహారధులంతా బెంగళూరు బాట పట్టారు. జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్,ప్రకాశ్ జవదేకర్ బెంగళూరు బయల్దేరారు. 

16:24 - May 15, 2018

ఢిల్లీ : కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయాలు నిమిష నిమిషానికి మారిపోతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఉదయం నుండి సంబరాలు జరుపుకున్న బీజేపీకి ఫలితాలు షాక్ ఇచ్చాయి. అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని మాత్రం బీజేపీ (104) ఏర్పాటు చేయలేకపోయింది. కాంగ్రెస్ (78) కూడా ఇదే పరిస్థితి. జేడీఎస్ (38) మద్దతు తీసుకోవాల్సినవసరం ఏర్పడింది. వెంటనే తాము జేడీఎస్ కు మద్దతిస్తామని..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రకటించింది. దేవెగౌడతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఫోన్ లో మంతనాలు జరిపారు. సాయంత్రం జేడీఎస్, కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలువనున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. దీనితో దేవెగౌడ నివాసం రాజకీయ చర్చలకు వేదికగా మారింది. జేడీఎస్ కార్యాకర్తల కోలాహాలం నెలకొంది. దేవెగౌడ నివాసానికి రైల్వే శాఖ మాజీ మంత్రి జాఫర్ షరీఫ్ చేరుకున్నారు.

ఒక్కసారిగా మారిపోయిన రాజకీయాలతో బీజేపీ వ్యూహరచనలో నిమగ్నమైంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను బీజేపీ నేత యడ్యూరప్ప కోరనున్నారు. బీజేపీ కార్యాలయంలో ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలిస్తున్నారు. బీజేపీలోని కీలక నేతలు వెంటనే బెంగళూరుకు పయనమయ్యారు. జేడీఎస్ నేతలు..స్వతంత్రంగా గెలిచిన నేతలతో మంతనాలు జరుపనున్నట్లు సమాచారం.

మరోవైపు ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ నేతలతో కలిసి గవర్నర్ వద్దకు ఆయన వెళ్లారు. కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరారు. మరి ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికి అవకాశం ఇవ్వనున్నారనేది ఉత్కంఠ నెలకొంది. 

కేసీఆర్ ను కలిసిన ఉద్యోగసంఘ నేతలు..

హైదరాబాద్ : మంత్రులు ఈటల, మహేందర్ రెడ్డి నేతృత్వంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కేసీఆర్ ను కలిసారు. ఆర్టీసీ ఉద్యోగులు సమస్యలపై నేతలు చర్చించనున్నారు. 

బీజేపీకి ఆఫర్ ఇస్తున్న దేవగౌడ పెద్ద కుమారుడు..

కర్ణాటక : బీజేపీకి దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ మద్దతిచ్చేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం. తన వెనుక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, మద్దతు ఇచ్చేందుకు తాను సిద్ధమంటూ, తాజాగా హోలెనరసిపూర్ స్థానం నుంచి గెలుపొందిన రేవన్న ఇప్పటికే బీజేపీకి భరోసా ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ ఇదే నిజమైతే... బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమనే చెప్పొచ్చు. హంగ్ ఏర్పడబోతున్న నేపథ్యంలో జేడీఎస్ కింగ్ మేకర్ గా మారింది. ఈ నేపథ్యంలో, కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఎండ్లబండి నుండి దూకేసిన కడియం..

హైదరాబాద్ : డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి తృటిలో ప్రమాదం తప్పింది. పరకాల మండలం వరికోల్ లో రైతుబంధు చెక్కుల పంపిణీ సందర్భంగా ఎడ్లబండ్ల ర్యాలీలో కడియం పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎడ్లు బెదిరాయి. దీంతో ఎండ్ల బండి నుండి కడియం దూకేశారు. కానీ దెబ్బలేమీ తగలకపోవటంతో క్షేమంగా బైటపడ్డారు. 

15:55 - May 15, 2018

కర్ణాటక : ఉదయం నుండి సంబరాలు జరుపుకున్న బీజేపీకి ఎన్నికల ఫలితాలు సాయంత్రం షాక్ ఇచ్చాయి. అధికారం చేజిక్కించుకుందామని అనుకున్న బీజేపీ ఆశలు నెరవేరలేదు. మేజిక్ ఫిగర్ కు కొద్ది దూరంలో నిలిచిపోయింది. అతిపెద్ద పార్టీగా నిలిచినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. కాంగ్రెస్ కూడా ఇదే పరిస్థితి. రెండో స్థానంలో ఈ పార్టీ నిలిచింది. మూడో స్థానంలో నిలిచిన జేడీఎస్ కీలక పాత్ర పోషించనుంది. 

కర్ణాటక ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. 222 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలు సాధించగా కాంగ్రెస్ 78 స్థానాలు..జేడీఎస్ 38 స్థానాలు..ఇతరులు 02 స్థానాలు సాధించాయి. ఇక్కడి ఓటరు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. ఈ ఫలితాలతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. వెంటనే కాంగ్రెస్ అధిష్టానం జేడీఎస్ నేత దేవెగౌడతో ఫోన్ లో మంతనాలు జరిపారు. మద్దతు తెలియచేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని నేతలు వెల్లడించారు. కాంగ్రెస్ కు 20, జేడీఎస్ కు 14 మంత్రి పదవులు పంచుకొనేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

అయితే కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరమేశ్వరప్ప రాజ్ భవన్ కు బయలుదేరారు. ముందస్తు అపాయింట్ మెంట్ లేదని రాజ్ భవన్ సిబ్బంది తిప్పి పంపారు. వెంటనే పద్మనాభనగర్ లోని దేవెగౌడ నివాసానికి ఆయన వెళ్లిపోయారు. సాయంత్రం గవర్నర్ ను జేడీఎస్ కాంగ్రెస్ నాయకులు కలువనున్నారు.

ఇదిలా ఉంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలతో యడ్యూరప్ప గవర్నర్ అపాయింట్ మెంట్ కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ ఏర్పాటు అవకాశం తమకే ఇవ్వాలని గవర్నర్ ను యడ్యూరప్ప కోరనున్నారు. తదుపరి కార్యాచరణకు బీజేపీ అగ్ర నాయకులు బెంగళూరుకు రానున్నారు. ప్రస్తుతం అందరి చూపు గవర్నర్ వైపు నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానిస్తారనేది చూడాలి. 

బీజేపీ పార్లమెంటరీ అత్యవసర సమావేశం..

ఢిల్లీ : సాయంత్రం 6 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. కర్ణాటక ఎన్నికలు, ఫలితాలపై చర్చించనుంది. ఈ సమావేశానికి కన్నడ బీజేపీ సీఎం అభ్యర్థి అయిన యడ్యూరప్ప హాజరుకానున్నారు. 

జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు : సిద్ధరామయ్య

కర్ణాటక : ప్రజల తీర్పుని శిరోధార్యంగా భావిస్తామని జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మాజీ సీఎం సిద్ధరామయ్య తెలిపారు. దేవెగైడ, కుమారస్వామిలతో చర్చలు జరిపామని కాంగ్రెస్ నేత గులాంనబీ అజాత్ తెలిపారు. జేడీఎస్ తరపు నుండి ఎవరు సీఎం అయినా తమ మద్ధతు వుంటుందని ఆజాత్ తెలిపారు. ఇరు పార్టీల నేతలు గవర్నర్ ను కలిసి ఒకరికొకరు మద్దతునిస్తున్నట్లుగా నివేదికనిస్తారని అజాద్ తెలిపారు. 

నిరాశలో యడ్యూరప్ప..

కర్ణాటక : తీవ్ర ఉత్కంఠ రేపిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కక పోవడంతో జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌ అవుతోంది. జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ నేతలు ప్రకటన చేసిన నేపథ్యంలో బీజేపీ నేతలు నిరాశలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతోన్న విషయంపై బీజేపీ కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప స్పందించారు. తాజాగా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ... ఇంకా ఫలితాలు రావాల్సి ఉందని, తాము అన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని తెలిపారు.

నిరాశలో యడ్యూరప్ప..

కర్ణాటక : తీవ్ర ఉత్కంఠ రేపిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కక పోవడంతో జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌ అవుతోంది. జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ నేతలు ప్రకటన చేసిన నేపథ్యంలో బీజేపీ నేతలు నిరాశలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతోన్న విషయంపై బీజేపీ కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప స్పందించారు. తాజాగా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ... ఇంకా ఫలితాలు రావాల్సి ఉందని, తాము అన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని తెలిపారు.

సంకీర్ణ ప్రభుత్వం దిశగా కన్నడ పీఠం..

కర్ణాటక : రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. 104 స్థానాలు గెలిచి అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించగా..78 స్థానాలు గెలిచి కాంగ్రెస్ రెండస్థానంలో వున్నాగానీ 38 స్థానాలు సాధించిన జేడీఎస్ ను కలుపుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదిశగా మంతనాలు జరుపుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్, జేడీఎస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధపడింది. జేడీఎస్ అధినేత కుమారస్వామిని సీఎం పదవికి కాంగ్రెస్ సమ్మతించింది. దీంతో దేవగౌడతో సోనియా, రాహుల్ గాంధీలు మంతనాలు కొనసాగిస్తున్నారు.

15:27 - May 15, 2018

హైదరాబాద్ : కర్ణాటక రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెంప పెట్టు అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించడంపై బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేస్తామని, దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కడుతున్నారని లక్ష్మణ్ తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెడుతుందని, తెలంగాణలోని నాయకత్వానికి ఫలితాలు నూతన ఉత్సాహాన్ని నింపాయని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ తెలిపారు. కులాల మధ్య చిచ్చు పెట్టే కాంగ్రెస్ ను కర్ణాటక ప్రజలు తిప్పి కొట్టారన్నారు. మరింత సమాచారం కోసం వీడియ క్లిక్ చేయండి. 

15:24 - May 15, 2018

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పర్వంలో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన సీఎం సిద్ధరామయ్య ఒక నియోజకవర్గం నుండి ఓటమి పాలవ్వగా..మరో నియోజకవర్గం నుండి గెలుపొందారు. చాముండేశ్వరీ, బాదామి రెండూ నియోజకవర్గాల నుండి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం ఎన్నికల కౌంటింగ్ కొనసాగింది. కానీ చాముండేశ్వరి సెగ్మెంట్ లో సిద్ధరామయ్యను జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ 17 వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. బాదామీలో సిద్ధరామయ్య తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శ్రీరాములుపై మూడువేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. 

జేడీఎస్ కు మద్దతు తెలిపిన కాంగ్రెస్..

కర్ణాటక : జేడీఎస్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. సీఎం పదవిని జేబీఎస్ కు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమయ్యింది. ఈక్రమంలో జేడీఎస్ కు మద్దతు తెలిపింది. దీంతో కాసేపట్లో మాజీ సీఎం సిద్ధరామయ్య గవర్నర్ ను కలవనున్నారు. జేడీఎస్ కు మద్ధతు తెలుపుతున్నట్లుగా గవర్నర్ కు సిద్ధరామయ్య నివేదిక ఇవ్వనున్నారు. మ్యాజిక్ ఫిగర్ కు అతి సమీపంలోకి వచ్చి నిలిచిపోయిన బీజేపీ అందుకోలేకపోయింది. 

జేడీఎస్ కు మద్దతు తెలిపిన కాంగ్రెస్..

కర్ణాటక : జేడీఎస్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. సీఎం పదవిని జేబీఎస్ కు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమయ్యింది. ఈక్రమంలో జేడీఎస్ కు మద్దతు తెలిపింది. దీంతో కాసేపట్లో మాజీ సీఎం సిద్ధరామయ్య గవర్నర్ ను కలవనున్నారు. జేడీఎస్ కు మద్ధతు తెలుపుతున్నట్లుగా గవర్నర్ కు సిద్ధరామయ్య నివేదిక ఇవ్వనున్నారు. మ్యాజిక్ ఫిగర్ కు అతి సమీపంలోకి వచ్చి నిలిచిపోయిన బీజేపీ అందుకోలేకపోయింది. 

15:11 - May 15, 2018

ఢిల్లీ : కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. మొత్తం 222 స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. తొలుత ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారని విడుదలవుతున్న ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమైంది. కానీ రౌండ్ రౌండ్ కు ఫలితాలు తారుమారయ్యాయి. మేజిక్ ఫిగర్ 112కు కొద్ది దూరంలో బీజేపీ నిలువనుంది. బీజేపీ 104 స్థానాలు..కాంగ్రెస్ 78..జేడీఎస్ 38..ఇతరులు 02 స్థానాలు సాధించే అవకాశం ఉంది. దీనితో జేడీఎస్ కు తాము మద్దతిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని..సాయంత్రం సిద్ధరామయ్య గవర్నర్ ను కలుస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేవెగౌడ..కుమారస్వామిలతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫోన్ లో సంభాషణలు జరిపినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వచ్చిన తరువాత మాట్లాడుదామని దేవెగౌడ వెల్లడించినట్లు తెలుస్తోంది. కుమార స్వామికి సీఎం పదవి ఇస్తామని కాంగ్రెస్ హామీనిచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరి 8 స్థానాల వెనుకంజలో ఉన్న బీజేపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది ? ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుందా ? అనేది చూడాలి. 

కాంగ్,జేడీఎస్ కూటమిదిశగా..

కర్ణాటక : రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ అధికారానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి దిశగా రాజకీయ సమీకరణాలు అతి వేగంగామారిపోతున్నాయి. ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వ్యూహాలు, సన్నాహాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా మ్యాజిక్ ఫిగర్ కు అతి సమీపంలో నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా కాంగ్రెస్ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. హంగ్ ఏర్పడితే జేడీఎస్ కు బయట నుండి మద్దతునిచ్చేలా ముందుకు కదులుతోంది. జేడీఎస్ 48 స్థానాల్లో గెలుపు దిశగా పయనిస్తోంది.

విభజన రాజకీయలను ప్రజలు తిప్పికొట్టారు : సీతారామన్

కర్ణాటక : అభివృద్ధికి ఓటు వేసిన కార్ణటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలకు ప్రజలు మద్దతునివ్వలేదనీ..మోదీ ప్రచారం కర్ణాటకలో మంచి ఫలితాలనిచ్చిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారన్నారు. 

దేవగౌడకు రాహుల్ ఫోన్..

కర్ణాటక :దేవగౌడకు రాహుల్ ఫోన్ చేశారు. ఈ క్రమంలో మధ్యస్థంగా వున్న జేడీఎస్ ను చేరదీసి సీఎం అభ్యర్థిగా కుమారస్వామికి పట్టం కట్టేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో దేవగౌడకు రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బీజేపీపీపీలో చర్చించే అవకాశమున్నాట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో యడ్యూరప్ప ఢిల్లీ బయల్దేరారు. 

14:49 - May 15, 2018

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో విచిత్ర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడి ఓటరు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వడం లేదని విడుదలవుతున్న ఫలితాలను బట్టి అర్థమౌతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ ప్రధాన పాత్ర పోషించనుంది. రౌండ్ రౌండ్ కు ఉత్కంఠ రేపుతోంది. తొలుత ప్రారంభంలో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధిస్తుందని ఫలితాలు నిరూపించాయి. కానీ సమయం మారుతున్న కొద్ది సీట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 112 సీట్లు సంపాదించాల్సి ఉంటుంది. కానీ వెల్లడవుతున్న ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ మాత్రం 104 సీట్లు సాధిస్తుందని అంచనా. మరోవైపు కాంగ్రెస్ 70-78 స్థానాలు సాధిస్తుందని..జేడీఎస్ 38-40 సీట్లు సాధిస్తుందని అంచనా. కాంగ్రెస్..జేడీఎస్ లు కలిస్తే ఆ సంఖ్య 112-116 పెరిగే అవకాశం ఉంది. దీనితో కాంగ్రెస్..జేడీఎస్ లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా ? లేదా ? అనేది ఉత్కంఠ నెలకొంది.

ఒక్కసారిగా వెల్లడవుతున్న పరిణామాలతో జాతీయ పార్టీలైన కాంగ్రెస్..బిజెపి వ్యూహాలతో నిమగ్నమయ్యాయి. ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలి ?అనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేవెగౌడకు ఫోన్ చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. కానీ పూర్తి ఫలితాలు వెల్లడయిన తరువాత మాట్లాడుదామని దేవెగౌడ పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు యడ్యూరప్ప ఢిల్లీకి బయలుదేరారు. 

కాంగ్రెస్ కోల్పోతుంటే బీజేపీ గెలుచుకుంటోంది : జవదేకర్

కర్ణాటక : కన్నడ ప్రజలు సుపరిపాలన కోరుకున్నారని అందుకనే బీజేపికి పట్టంకట్టారని కేంద్రమంత్రి జవదేకర్ అన్నారు. కర్ణాటకలో బీజేపీకి ఇది పెద్ద విజయమన్నారు. బీజేపీ ఒక్కో రాష్ట్రంలో విజయం సాధిస్తు వస్తుంటే కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతు వస్తోందన్నారు. 

చంద్రబాబు కుట్రలు ఫలించలేదు : రాంమాధవ్

కర్ణాటక : బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు శతవిధాల యత్నించారనీ..బీజేపీని అడ్డుకోవాలన్న చంద్రబాబు కుట్ర విఫలమయ్యిందని బీజేపీ నేత రాంమాధవ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తెలుగు ఓటర్లున్న హైదరాబాద్ కర్ణాటకలో బీజేపి గెలిచిందన్నారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలను ప్రజలు తిరస్కరించారన్నారు. 

చిత్రదుర్గ చళ్లకెరెలో రఘుమూర్తి గెలుపు

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. చిత్రదుర్గ చళ్లకెరెలో రఘుమూర్తి (కాంగ్రెస్) గెలుపు సాధించారు.

బళ్లారి అర్బన్ లో సోమశేఖరరెడ్డి విజయం

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బళ్లారి అర్బన్ నుండి బీజేపీ అభ్యర్థి సోమశేఖరరెడ్డి విజయం సాధించారు.

 

బాగేపల్లిలో సీపీఎం, కాంగ్రెస్ హోరాహోరి

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బాగేపల్లిలో సీపీఎం, కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు కొసాగుతోంది. 

13:37 - May 15, 2018

కర్ణాటక : రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది ? జేడీఎస్ మద్దతు అవసరం ఉంటుందా ? రాష్ట్ర ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. మంగళవారం ఉదయం 8గంటలకు పోలింగ్ కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రారంభం నుండే బీజేపీ అధిక్యంలో కొనసాగుతూ వస్తోంది. అధికారంలోకి మళ్లీ రావాలని అనుకున్న కాంగ్రెస్ ఆశలపై ఓటర్లు నీళ్లు చల్లారు. జేడీఎస్ మాత్రం బలం పెంచుకొనే దిశగా ముందుకెళుతోంది.

రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని, ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వరని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. కానీ ప్రారంభంలో ఈ పోల్స్ తప్పని ఫలితాలు చూస్తే అర్థమైంది. రౌండ్ రౌండ్ మారిన కొద్ది ఫలితాల్లో మార్పులు కనబడుతున్నాయి. బీజేపీ అధిక్యంలో కొనసాగుతున్న స్థానాలు కాంగ్రెస్, జేడీఎస్ ఖాతాలో వచ్చి పడుతున్నాయి. మేజిక్ ఫిగర్ 112గా ఉన్న సంగతి తెలిసిందే. కానీ బీజేపీ ఈ ఫిగర్ కు రెండు..మూడు స్థానాలు అధికంగా సాధిస్తోంది.

కాసేపటికే ఈ సంఖ్య పెరుగుతుండడం..తగ్గుతుండడం ఉత్కంఠను రేపుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ 61 స్థానాల్లో గెలుపొంది 44 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ 43 స్థానాల్లో గెలుపొంది 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. జేడీఎస్ 19 స్థానాల్లో విజయం 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఫలితాలు పూర్తిగా రావడానికి కొద్దిసేపు వేచి చూడాలి. 

సిరుగుప్పలో బిజెపి అభ్యర్థి సోమ లింగప్ప విజయం

కర్ణాటక : కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. సిరుగుప్పలో సోమ లింగప్ప (బిజెపి) విజయం సాధించారు.

కాంగ్రెస్ 38, బీజేపీ 36.7, జేడీఎస్ 17.7 శాతం ఓట్లు

కర్ణాటక : కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ 38 శాతం, బీజేపీ 36.7 శాతం, జేడీఎస్ 17.7 శాతం ఓట్లు వచ్చాయి.  

13:18 - May 15, 2018

బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులవుతున్నాయి. హంగ్ ఏర్పడుతుందని పోల్స్ చెప్పిన సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఫలితాలు చూపెడుతున్నాయి. ప్రముఖులు సైతం పరాజయం చెందారు. జేడీఎస్ కూడా బలం పెంచుకొంటోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీపడిన సీఎం సిద్ధరామయ్య బదామీలో స్వల్ప తేడాతో గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీ తరఫున పోటీ చేసిన శ్రీరాములుపై 3 వేల ఓట్ల పైచిలుకు ఆధిక్యంలో విజయం సాధించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బీజేపీ పట్టును నిరూపించుకుంది. తెలుగు వారు అధికం ఉన్న ప్రాంతాల్లో బీజేపికి గట్టి ఎదురు దెబ్బ తగులుతుందని అంచనాలు వేశారు. కానీ అవన్నీ ఉట్టివే అని ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమౌతుంది. బాంబే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ఎలాంటి ప్రభావం చూపెట్టలేకపోయింది. బెంగళూరు సిటీలో 26 స్థానాల్లో కాంగ్రెస్ అధిక స్థానాల్లో గెలుపొందింది. గోవా, మణిపూర్ లో అధికారానికి దగ్గరైనట్టే, కర్ణాటకలోనూ ఇదే విధంగా బీజేపీ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

శివమొగ్గలో బీజేపీ అభ్యర్థి ఈశ్వరప్ప

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగతోంది. శివమొగ్గలో బీజేపీ అభ్యర్థి ఈశ్వరప్ప గెలుపొందారు. 

మ్యాజిక్ ఫిగర్ 113 చేరువలో బీజేపీ

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగతోంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 113 చేరువలో ఉంది. కాంగ్రెస్ 60 స్థానాలకు పరిమితమైంది. గతం కంటే జేడీఎస్ పుంజుకుంది.

12:08 - May 15, 2018

కర్ణాటక : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. మళ్లీ అధికారంలోకి వద్దామని అనుకున్న కాంగ్రెస్ ఆశలు అడియాశలయ్యాయి. అనూహ్యంగా కాషాయ దళం పుంజుకుంది. జేడీఎస్ మాత్రం అధిక స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీజేపీ ఒంటిరిగానే ప్రభుత్వ ఏర్పాటు దిశగా వెళుతోంది. మేజిక్ ఫిగర్ 113 చేరువలో బీజేపీ చేరుకొంటుండగా కాంగ్రెస్ మాత్రం 60 స్థానాలకు మాత్రమే పరిమితమవుతోంది. దీనితో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపుతో ఢిల్లీకి యడ్యూరప్ప పయనమయ్యారు. సాయంత్రం 6గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీపీపీ భేటీ కానుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. సాయంత్రం గవర్నర్ కు సిద్ధరామయ్య రాజీనామాను సమర్పించనున్నారు. 

11:52 - May 15, 2018

హైదరాబాద్ : కర్ణాటక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. అధికారంలోకి రావాలని ఉత్సాహం చూపిన కాంగ్రెస్ ఆశలపై ఓటర్లు నీళ్లు చల్లారు. అనూహ్యంగా కాషాయ దళం పుంజుకొంది. ఒంటరిగానే ప్రభుత్వ ఏర్పాటు దిశగా వెళుతోంది. ప్రధానంగా తెలుగు ఓటర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఏపీకి 'ప్రత్యేక హోదా' అంశం ప్రభావం చూపెడుతుందని అంచనా వేశారు. 'హోదా' ఇవ్వని బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఇతర ప్రజా సంఘాలు కూడా ప్రచారం నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం హోదా..విభజన అంశాల హామీలు నెరవేర్చకపోవడంపై స్వయంగా చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో స్థానిక అంశాలు, సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ప్రభావం చూపించాయే కానీ 'హోదా' లాంటి పక్క రాష్ట్రాల అంశాలు ప్రభావం చూపలేదని ఎన్నికలు స్ఫష్టం చేస్తున్నాయి. ముంబై కర్ణాటక రీజియన్ లో బీజేపీ పెను ప్రభావం చూపెట్టింది. దీనిపై తెలుగు రాష్ట్రాల నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. 

11:26 - May 15, 2018

బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకెళుతోంది. కాంగ్రెస్ ఘోరంగా వైపల్యం చెందగా జేడీఎస్ మరింత బలోపేతం దిశగా వెళుతోంది. ఇక బళ్లారీ 9 నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రౌండ్ రౌండ్ కు ఉత్కంఠ రేపుతోంది. రాయ్ చూర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాలున్నాయి. ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ కొనసాగుతుండగా రెండు నియోజకవర్గాల్లో జేడీఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఇక్కడ ఎలాంటి ప్రభావం చూపెట్టలేకపోయింది. తెలుగు వారిని ప్రసన్నం చేసుకొనేందుకు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పవచ్చు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

బీజేపీ 25స్థానాలు కైవసం

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ పోటీపోటీగా దూసుకెళ్తున్నాయి. బీజేపీ 25 స్థానాల్లో గెలుపొందింది. 

 

కాంగ్రెస్ 15 స్థానాలు కైవసం

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ పోటీపోటీగా దూసుకెళ్తున్నాయి. కాంగ్రెస్ 15 స్థానాల్లో గెలుపొందింది. 

మూడబిదిరిలో బీజేపీ అభ్యర్థి రామకాంత్ గెలుపు

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగతోంది. మూడబిదిరిలో బీజేపీ అభ్యర్థి రామకాంత్ గెలుపొందారు. 

16 స్థానాల్లో బీజేపీ గెలుపు

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ పోటీపోటీగా దూసుకెళ్తున్నాయి. బీజేపీ 16 స్థానాల్లో గెలుపొందింది. 

 

11 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ పోటీపోటీగా దూసుకెళ్తున్నాయి. కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలుపొందింది. 

 

కర్నాటక ఫలితాలు..అభ్యర్థుల విజయాలు...

బెంగళూరు : కర్నాటక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తీర్థహళ్లిలో అరగ జ్ఞానేంద్ర (బీజేపీ), మాడబిద్రిలో ఉమానాథ (బీజేపీ), శికారిపుర నియోజకవర్గంలో యడ్యూరప్ప, కొలార్ లో జేడీఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్, రాయచూరు జిల్లా మాన్విలో జేడీఎస్ అభ్యర్థి, కుందాపురాలో హాలాడి శ్రీనివాసశెట్టి (బీజేపీ)లు గెలుపొందారు.  

కర్నాటక ఫలితాలు..అభ్యర్థుల విజయాలు...

బెంగళూరు : కర్నాటక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తీర్థహళ్లిలో అరగ జ్ఞానేంద్ర (బీజేపీ), మాడబిద్రిలో ఉమానాథ (బీజేపీ), రాయచూరు జిల్లా మాన్విలో జేడీఎస్ అభ్యర్థులు గెలుపొందారు. 

10:12 - May 15, 2018
10:12 - May 15, 2018

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా వైఫల్యం చెందడం..కాషాయ పార్టీ ఇక్కడ పాగా వేస్తోందని ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం చూపిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించినా అవి అంత నిజం కాదని తేలుతోంది. మైనింగ్ మాఫియాలాంటి ముద్ర వేసుకున్న వారు..సీబీఐ కేసుల్లో ఇరికిన వారు అనుచరులకు సీట్లు కేటాయించడం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అవినీతి..కాంగ్రెస్ వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ ఎన్నికల్లో మాత్రం అవినీతిని అరికట్టడంలో వైఫల్యం చెందిందని పలువురు పేర్కొంటున్నారు. నల్లధనాన్ని కంట్రోల్ చేయడానికే పెద్ద నోట్ల రద్దు చేశామని పేర్కొన్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున డబ్బు ప్రభావం ఎలా కనిపించిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నల్లధనం అరికట్టడం..అవినీతిని అరికట్టడంలో బీజేపీ ఘోరంగా వైఫల్యం చెందినా కాంగ్రెస్ వ్యతిరేకత వారికి లాభం కలిగించిందనే వార్తలు వెలువడుతున్నాయి.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎంత బలహీనంగా ఉందో ఈ ఎన్నికలను బట్టి చెప్పవచ్చని అంచానాలు వేస్తున్నారు. ప్రతిపక్ష స్థానాన్ని కొనసాగించలేని పరిస్థితిలో ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కావేరీ, నది జలాలకు సంబంధించి బీజేపీకి కొంత సానుకూలత, కాంగ్రెస్ కున్న బలహీనత బీజేపీకి బలంగా కొనసాగడానికి ప్రభావం చూపాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 

బాగేపల్లిలో బీజేపీ అభ్యర్థి సాయికుమార్ వెనుకంజ

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. బాగేపల్లిలో బీజేపీ అభ్యర్థి, సినీనటుడు సాయికుమార్ వెనుకంజలో ఉన్నారు.

 

శృంగేరిలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. శృంగేరిలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. 

రాయిచూర్ లో బీజేపీ అభ్యర్థి వెనుకంజ..

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. రాయిచూర్ లో బీజేపీ అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు.

బంగారుపేటలో కాంగ్రెస్ ముందంజ

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. బంగారుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది.

కనపురలో కాంగ్రెస్ అభ్యర్థి డీకే శివకుమార్ ముందంజ

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. కనపురలో కాంగ్రెస్ అభ్యర్థి డీకే శివకుమార్ ముందంజలో ఉన్నారు.

చిఖ్ మగళూరులో సి.టి.రవి ఆధీక్యత

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. చిఖ్ మగళూరులో బీజేపీ అభ్యర్థి సి.టి.రవి ముందంజలో ఉన్నారు.

చిఖ్ మగళూరులో సి.టి.రవి ఆధీక్యత

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. చిఖ్ మగళూరులో బీజేపీ అభ్యర్థి సి.టి.రవి ముందంజలో ఉన్నారు.

బాదామిలో శ్రీరాములు వెనుకంజ

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. బాదామిలో సిద్ధరామయ్య ముందంజలో ఉన్నారు. బాదామిలో శ్రీరాములు వెనుకంజలో కొనసాగుతున్నారు.

బెంగళూరు సిటీలో కాంగ్రెస్ ఆధిక్యత

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. బెంగళూరు సిటీలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

పోటాపోటీగా దూసుకెళ్తున్న కాంగ్రెస్, బీజేపీ

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. సెంట్రల్, కోస్టల్ కర్ణాటక, ముంబయి కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటకలో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. ఓల్డ్ మైసూర్ లో జేడీఎస్, కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

 

బీటీఏ లేఅవుట్ లో రామలింగారెడ్డి ముందంజ

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. బీటీఏ లేఅవుట్ నియోజకవర్గంలో రామలింగారెడ్డి ముందంజలో ఉన్నారు.

హరిహర నియోజకవర్గంలో కాంగ్రెస్ ముందంజ

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. హరిహర నియోజకవర్గంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. 

చాముండేశ్వరీలో సిద్ధరామయ్య వెనుకంజ

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. బాదామిలో సిద్ధరామయ్య ముందంజలో ఉన్నారు, చాముండేశ్వరీలో వెనుకంజలో ఉన్నారు. 

09:15 - May 15, 2018

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. మొత్తం 222 స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కౌంటింగ్ ప్రారంభం నుండే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. బెంగళూరు టౌన్ లో ఎవరు లీడింగ్ చేస్తారనేది ఉత్కంఠ నెలకొంది. బెంగళూరులో పాగా వేయాలని కాంగ్రెస్, బీజేపీ అధిష్టానం పోటాపోటీగా ప్రచారం నిర్వహించింది. నార్త్ ఇండియన్స్ మనస్సులను చూరగొనాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కౌంటింగ్ ప్రారంభమైన అనంతరం కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కానీ ఇదే ట్రెండ్ కొనసాగుతుందా ? లేదా ? అనేది చూడాలి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

మండ్య జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో జేడీఎస్ ముందంజ

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. మండ్య జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో జేడీఎస్ ముందంజలో ఉంది.   

09:13 - May 15, 2018

ఢిల్లీ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. హోరాహోరీగా ఈ పోరు కొనసాగుతుండడంతో ఉత్కంఠ నెలకొంది. రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై పెను ప్రభావం ఫలితాలు చూడనుంది. దక్షిణాది నుండే ట్రెండ్ కొనసాగించాలని రెండు పార్టీలు యోచిస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకరావాలని రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. ఇక కర్ణాటకలో పాగా వేయాలని కాషాయ దళాలు వ్యూహ రచనలు చేశాయి. ఏకంగా 40 రోజలు పాటు బీజేపీ అధిష్టానం మొత్తం రాష్ట్రంలో మోహరించి ప్రచారం నిర్వహించాయి. ఇక జేడీఎస్ కింగ్ మేకర్ గా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగా ఉదయం 9గంటల వరకు కాంగ్రెస్ 54, బీజేపీ 70, జేడీఎస్ 32, ఇతరులు 03 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికల్లో గెలువాలని పోటీ చేసిన అభ్యర్థులు ఉదయం నుండి పూజల్లో నిమగ్నమయ్యారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

బాదామిలో సిద్ధరామయ్య ముందంజ

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. బాదామిలో సిద్ధరామయ్య ముందంజలో ఉన్నారు. 

వరుణలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర ముందంజ

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. వరుణలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర ముందంజలో ఉన్నారు.

బాదామిలో సిద్ధరామయ్య వెనుకంజ

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. బాదామిలో సిద్ధరామయ్య వెనుకంజలో ఉన్నారు. 

 

రామనగరంలో జేడీఎస్ అభ్యర్థి కుమార్ స్వామి అధీక్యత

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. రామ్ నగర్ లో జేడీఎస్ అభ్యర్థి కుమార్ స్వామి అధీక్యంలో ఉన్నారు. 

08:57 - May 15, 2018

కర్ణాటక : రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. రాజకీయాల్లో వారసత్వం కొనసాగుతూనే ఉంది. ఇందులో ఏ రాష్ట్రం మినహాయింపు కాదని చెప్పవచ్చు. అన్ని పార్టీల్లోనూ వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇక కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈసారి ఎన్నికల బరిలో పలువురు మాజీ సీఎంల తనయులు బరిలో నిలిచారు. వారి వివరాలు..

పార్టీ 

తండ్రి మాజీ సీఎం  

(అభ్యర్థి) వారసుడు 

నియోజకవర్గం

కాంగ్రెస్  సిద్ధరామయ్య డా.యతీంద్ర సిద్ధరామయ్య   వరుణ (మైసూర్ నియోజకవర్గం)
బీజేపీ  బి.ఎస్.యడ్యూరప్ప  బివై విజయేంద్ర  వరుణ
జనతాదళ్ (సెక్యూలర్)    హెచ్.డి.దేవెగౌడ హెచ్.డి. రేవణ్ణ హోలెనరసిపుర
జనతాదళ్ (సెక్యూలర్)స్వామి  హెచ్.డి. దేవెగౌడ   హెచ్.డి. కుమార  రామనగర
బీజేపీ  బంగారప్ప కుమార్  బంగారప్ప  సోరబ
జనతాదళ్ (సెక్యూలర్)  బంగారప్ప  ఎస్.మధు  సారబ్
జనతాదళ్ (యునైటెడ్)  జె.హెచ్.పటేల్  మహిమ పటేల్  చన్నగిరి
కాంగ్రెస్  ధరమ్ సింగ్  అజయ్ సింగ్  జెవర్గీ
బీజేపీ  ఎస్సార్ బొమ్మై  బసవరాజు బొమ్మై  షిగాం

 

 

బాగేపల్లిలో సీపీఎం అభ్యర్థి శ్రీరామ్ రెడ్డి ముందజ

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. బాగేపల్లిలో సీపీఎం అభ్యర్థి శ్రీరామ్ రెడ్డి ముందజలో ఉన్నారు. 

 

కొనసాగుతున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్ 35, బీజేపీ 40, జేడీఎస్ 21, ఇతరులు 1.

08:40 - May 15, 2018

కర్నాటక ఎన్నికల ఫలితాలపై వక్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు, నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:38 - May 15, 2018

కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇవాళ్టి జనపథం చర్చా కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నాయకులు సురేష్, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెండ్ శోభన్ బాబు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

08:35 - May 15, 2018
08:33 - May 15, 2018

‌‌‌హైదరాబాద్ : ఐపీఎల్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 89 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బెంగళూర్‌ 8.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ ఓపెనర్లు విరాట్‌ కోహ్లి, పార్థీవ్‌ పటేల్‌ వికెట్‌ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన కింగ్స్‌ పంజాబ్‌ 15.1 ఓవర్లలో 88 పరుగులకే అలౌటైంది. ఆర్సీబీ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించి.. పంజాబ్‌ను దెబ్బ తీశాడు. ఒకే ఓవర్లో రాహుల్‌, క్రిస్‌ గేల్‌లను జౌట్‌ చేసి పంజాబ్‌ను కష్టాల్లోకి నెట్టాడు. బెంగళూర్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌కు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది.

 

08:31 - May 15, 2018

అమెరికా : అమెరికా తన రాయబార కార్యాలయాన్ని జెరూసలేంలో ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ గాజా.. ఇజ్రాయిల్‌ సరిహద్దులల్లో పాలస్తీనీయులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులను అణిచివేసేందుకు ఇజ్రాయిల్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో 52 మంది మృతి చెందారు. మరో 2400 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో 86 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.  అమెరికా తన రాయబార కార్యాలయాన్ని టెల్‌అవీవ్‌ నుంచి జెరూసలేంకు తరలించింది. దీన్ని నిరసిస్తూ దాదాపు 35వేల మంది పాలస్తీనీయులు ఇజ్రాయిల్‌ - గాజా సరిహద్దులో నిరసనకు దిగారు. వారిపై నిర్దాక్షిణ్యంగా  ఇజ్రాయిల్‌ సైన్యం కాల్పులు జరిపింది.  కంచె తెంచుకుని ఇజ్రాయిల్‌లోకి ప్రవేశించేందుకు యత్నించేవారే లక్ష్యంగా కాల్పులు జరిగాయి.  డ్రోన్ల సాయంతో ఆందోళనకారులపై ఇజ్రాయిల్‌ సైన్యం బాష్ప, వాయుగోళాలను కురిపించింది. అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు కాల్పులు జరిపినట్టు ఇజ్రాయిల్‌ సైన్యం తన చర్యను సమర్ధించుకుంది.

 

08:27 - May 15, 2018

కర్ణాటక : కర్ణాటక ఎన్నికల ఫలితాలు మంగళవారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. మొత్తం 222 స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది.

తాజా వార్తలు...

 • కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఓటరు ఏ ఒక్క పార్టీకి మెజార్టీ ఇవ్వలేదు. మేజిక్ ఫిగర్ ఏ పార్టీ సాధించడం లేదు. బీజేపీ 104 స్థానాలు..కాంగ్రెస్ 70-78 సీట్లు..జేడీఎస్ 38-40 స్థానాలు సంపాదించే అవకాశం ఉంది. 
 • కర్ణాటక..ఓట్ల శాతం వివరాలు : కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయి. ఆయా పార్టీల ఓట్ల శాతం ఇలా ఉన్నాయి : కాంగ్రెస్ 38, బీజేపీ 36.7, జేడీఎస్ 17.7 శాతం. 
 • కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. మేజిక్ ఫిగర్ 112గా ఉండగా బీజేపీ ఒంటిరిగానే మెజార్టీ సాధిస్తుందని మొదట్లో భావించారు. కానీ రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ 54 స్థానాల్లో గెలుపొందగా 51 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 
 • సిరుగుప్పలో సోమ లింగప్ప (బిజెపి) విజయం.
 • హాసన్ ప్రీతం గౌడ్ (బిజెపి) గెలుపు.
 • బి.టిఎం.లేవుట్ లో రామలింగారెడ్డి గెలుపొందారు. 
 • బళ్లారి అర్బన్ నుండి సోమశేఖరరెడ్డి (బిజెపి) విజయం. 
 • వరుణలో సిద్ధరామయ్య కుమారుడు యతేంద్ర గెలుపొందారు.
 • ఉడిపి జిల్లా కాపు నియోజకవర్గంలో లాలాజీ మెండన్ (బీజేపీ) విజయం.
 • చిత్రదుర్గ చళ్లకెరెలో రఘుమూర్తి (కాంగ్రెస్) గెలుపు.
 • మంగళూరులో అబ్దుల్ ఖాదర్ (కాంగ్రెస్) గెలుపొందారు.
 • చిత్రదుర్గ జిల్లా హొళల్కెరెలో చంద్రప్ప (బిజెపి) విజయం సాధించారు.
 • కొళ్లెగాలలో మహేష్ (బీఎస్పీ) గెలుపు.
 • చిక్ మగళూరులో సి.టి.రవి (బిజెపి) విజయం.
 • తీర్థహళ్లిలో అరగ జ్ఞానేంద్ర (బీజేపీ) విజయం సాధించారు.
 • మాడబిద్రిలో ఉమానాథ (బీజేపీ) గెలుపొందారు.
 • శికారిపుర నియోజకవర్గంలో యడ్యూరప్ప ఘన విజయం సాధించారు.
 • కొలార్ లో జేడీఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ విజయం సాధించారు.
 • రాయచూరు జిల్లా మాన్విలో జేడీఎస్ అభ్యర్థి గెలుపొందారు.
 • కుందాపురాలో హాలాడి శ్రీనివాసశెట్టి (బీజేపీ) విజయం సాధించారు. 
 • రామనగర లో 2వేల ఓట్ల ఆధిక్యంలో జేడీఎస్ నేత కుమార స్వామి..
 • షికారిపురాలో 3,800 ఓట్ల ఆధిక్యంలో యడ్యూరప్ప కొనసాగుతున్నారు.
 • కనకాపురాలో డీకే శివకుమార్ ఆధిక్యంలో...
 • చాముండేశ్వరిలో సిద్ధరామయ్యపై జీటీ దేవెగౌడ 13వేల ఓట్ల ఆధిక్యం..
 • బళ్లారిలో గాలి సోమశేఖరరెడ్డి ఆధిక్యం...
 • గుల్బార్గా జిల్లాలో ఐదు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది..
 • బళ్లారి జిల్లాలో మూడు చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి..
 • బెంగళూరు సిటీలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది..
 • దేవనగరి నార్త్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక్ ఖర్గే ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 • బళ్లారిలోని సండూరులో కాంగ్రెస్ అభ్యర్తి తుకారం ఆధిక్యం...
 • తుముకూరులో బీజేపీ అభ్యర్థి ముందంజ...
 • హడగలిలో కాంగ్రెస్ అభ్యర్థి పరమేశ్వర్ ఆధిక్యంలో..
 • భాగేపల్లిలో బీజేపీ అభ్యర్థి, సినీ నటుడు సాయికుమార్ వెనుకంజలో...
 • బళ్లారీ (ఎస్టీ)లో గాలి అనుచరుడు ఫకీరప్ప (బీజేపీ) ఆధిక్యంలో...
 • చాముండేశ్వరిలో సిద్ధరామయ్యపై జేడీఎస్ అభ్యర్థి ఆధిక్యం...
 • వరుణలో సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర ఆధిక్యం...
 • హోళెనరసీపురాలో జేడీఎస్ అభ్యర్థి హెచ్.డి. రేవణ్ణ ఆధిక్యంలో...
 • సెంట్రల్, కోస్టల్ కర్ణాటక, ముంబయి కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటకలో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది.
 • ఓల్డ్ మైసూర్ లో జేడీఎస్, కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
 • బెంగళూరు సిటీలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
 • షికారిపురలో యడ్యూరప్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 • బాదామిలో సిద్ధరామయ్య ముందజ...
 • బాదామిలో శ్రీరాములు వెనుకంజలో కొనసాగుతున్నారు.
 • చాముండేశ్వరిలో సిద్ధరామయ్య వెనుకంజలో కొనసాగుతున్నారు.
 • చిఖ్ మగళూరులో బీజేపీ అభ్యర్థి సి.టి.రవి..
 • వరుణలో సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర (కాంగ్రెస్)..
 • హోలెనరాసిరపురాలో జేడీఎస్ అభ్యర్థి హెచ్ డి రేవణ్ణ..
 • రామనగరలో కుమార స్వామి (జేడీఎస్) ఆధిక్యం..
 • హరపనహళ్లిలో కరుణాకర్ రెడ్డి (బీజేపీ) ఆధిక్యం..
 • గౌరిబిదనూరులో శివశంకర్ రెడ్డి (కాంగ్రెస్)..లో కొనసాగుతున్నారు. 
08:26 - May 15, 2018

కృష్ణా : విజయవాడ నగరపాలక సంస్థకు చెందిన విలువైన స్థలాలను ప్రయివేటుకు ధారాదత్తం చేసేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. ఆర్థిక వనరుల సమీకరణ, అభివృద్ధి ముసుగులో బడాబాబులకు స్థలాలను కారుచౌకగా కట్టబెట్టేందుకు స్కెచ్‌ గీస్తున్నారు.  కౌన్సిల్‌ అజెండాలో చేర్చి.. తీర్మానాన్ని ఆమోదింపచేసుకోవడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. 

విజయవాడ మున్సిపాల్‌ కార్పొరేషన్‌కు చెందిన స్థలాలు, కార్యాలయాలు, ఆస్తులను బడాబాబులకు అప్పగించే చర్యలకు ప్రభుత్వం  శ్రీకారం చుట్టింది. కౌన్సిల్‌ అజెండాలో ఈ ప్రక్రియను చేర్చి ఆమోదించుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. గతంలో నిర్వహించిన మూడు కౌన్సిల్‌ సమావేశాల్లో ఈ అంశం వాయిదా పడుతూ వచ్చింది. మరోసారి కౌన్సిల్‌ సమావేశంలో ఆస్తులను అమ్మే అంశాన్ని చేర్చి ఆమోదించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. 

ప్రభుత్వం ప్రయివేటు భాగస్వామ్యం పద్ధతిలో లేదంటే బిల్డ్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిలో ప్రయివేటు వ్యక్తులకు ఆస్తులను అప్పగించేలా అధికారులు ప్లాన్స్ గీస్తున్నారు. సుమారు 50 కోట్ల ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. ఇందులో 22.45 కోట్ల విలుగల 3,712 చదరపు అడుగుల విస్తీర్ణంలోని అతిథి గృహాన్ని, 9.79 కోట్ల విలుగల 4,453 చదరపు అడుగుల స్థలాన్ని, 8.27కోట్ల విలుగల మున్సిపల్‌ క్వార్టర్లను, 8.85 కోట్ల విలుగల జంధ్యాల దక్షిణామూర్తి పాఠశాల ఆవరణను అన్యాక్రాంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే అధికారుల అంచనాల కంటే మార్కెట్‌ ధర ప్రకారం ఈ ఆస్తులన్నీ వందల కోట్ల రూపాయలు ఉంటాయని విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు.  

మున్సిపల్‌ ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే అంశాన్ని కౌన్సిల్‌లో ఆమోదించేందుకు మూడు సార్లు ప్రవేశపెట్టారు.  అయితే కౌన్సిల్‌ మాత్రం ఈ అంశాన్ని మూకుమ్ముడి వాయిదా వేస్తు వచ్చింది. కార్పొరేషన్ ఆస్తులను రక్షించుకోవాలని, వీఎంసీ ఆధ్వర్యంలో కాంప్లెక్స్‌లు, ఇతర నిర్మాణాలు చేపట్టాలని, ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వవద్దని అన్ని పార్టీల కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. 

మరోసారి ఈ అంశం తెరమీదకు రావడంతో మున్సిపల్‌ కౌన్సిల్‌తో పాటు ప్రజా ప్రతినిధుల్లోనూ చర్చనీయంగా మారింది. ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వస్తున్నా.. మళ్లీ ఈ అంశాన్ని తీర్మానాల్లో పెట్టాలనే వెనుక దాగి ఉన్న ఆంతర్యం ఏమిటని, విపక్షాలు, అధికారపక్షంలోని పలువురు సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

08:25 - May 15, 2018

కర్ణాటక : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది. దేశ వ్యాపితంగా ఈ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి ఉంది. కాంగ్రెస్ పట్టు నిలుపుకుంటుందా ? లేక బీజేపీ పాగా వేస్తుందా ? జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందా ? అనేది ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ హంగ్ ఏర్పడుతుందని ప్రకటించాయి. కానీ తమదే అధికారం అంటూ ప్రధాన పార్టీలు ధీమా ప్రకటించాయి. ఎన్నికల్లో 72.13 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 40 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బెంగళూరు సిటీలో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ జరుగుతున్న కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తాజా వార్తలు...

 • చిఖ్ మగళూరులో బీజేపీ అభ్యర్థి సి.టి.రవి..
 • వరుణలో సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర (కాంగ్రెస్)..
 • హోలెనరాసిరపురాలో జేడీఎస్ అభ్యర్తి హెచ్ డి రేవణ్ణ..
 • రామనగరలో కుమార స్వామి (జేడీఎస్) ఆధిక్యం..
 • హరపనహళ్లిలో కరుణాకర్ రెడ్డి (బీజేపీ) ఆధిక్యం..
 • గౌరిబిదనూరులో శివశంకర్ రెడ్డి (కాంగ్రెస్)..ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

ఆధిక్యంలో అభ్యర్థులు...వివరాలు...

కర్ణాటక : చిఖ్ మగళూరులో బీజేపీ అభ్యర్థి సి.టి.రవి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

 • వరుణలో సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర (కాంగ్రెస్)..
 • హోలెనరాసిరపురాలో జేడీఎస్ అభ్యర్తి హెచ్ డి రేవణ్ణ..
 • రామనగరలో కుమార స్వామి (జేడీఎస్) ఆధిక్యం..
 • హరపనహళ్లిలో కరుణాకర్ రెడ్డి (బీజేపీ) ఆధిక్యం..
 • గౌరిబిదనూరులో శివశంకర్ రెడ్డి (కాంగ్రెస్)..లో కొనసాగుతున్నారు.

 

ఆధిక్యంలో అభ్యర్థులు...

కర్ణాటక : చిక్మగులూరులో బీజేపీ అభ్యర్థి సి.టి.రవి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వరుణలో సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర (కాంగ్రెస్) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హోలెనరాసిరపురాలో జేడీఎస్ అభ్యర్తి హెచ్ డి రేవణ్ణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

కర్ణాటక ఫలితాలు..ఆధిక్యం...

కర్ణాటక : అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది. మొత్తం 222 స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ 01 స్థానం, బీజేపీ 04, జేడీఎస్ 02 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం...

కర్ణాటక : అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది. మొత్తం 222 స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 

08:00 - May 15, 2018

కర్ణాటక : రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 222 స్థానాలకు పోలింగ్ జరిగింది. దేశ వ్యాప్తంగా ఈ ఎన్నికలపై ఆసక్తి రేకేత్తిస్తోంది. ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది సాయంత్రం లోపు తెలిసిపోతోంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందా ? అనే ఉత్కంఠ నెలకొంది.

కర్ణాటక - 222/224

పార్టీ 

ఆధిక్యం గెలుపు

కాంగ్రెస్

02 75

బీజేపీ

01

103

జేడీ (ఎస్)

03

36

ఇతరులు 

00 02
07:56 - May 15, 2018

హైదరాబాద్ : అధికారుల నిర్లక్ష్యానికి రైతుల ప్రాణాలు బలి అవుతూనే ఉన్నాయి. రైతుల కోసం ఎంతో చేస్తున్నామని పాలకులు చెప్పుకుంటున్నా.. రైతుల ఆత్మహత్యలు మాత్రం తగ్గడం లేదు. ఇందుకు నిదర్శనంగా సిద్దిపేట, నల్గొండ జిల్లాలో రైతుల భూముల విషయంలో జరిగిన అవకతవకలు మరో ఇద్దరు రైతులు ఆత్మహత్యప్రయత్నానికి పురిగొల్పాయి. రైతన్నల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామని పాలకులు చెబుతున్నా రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదు. అధికారుల తీరుతో నిత్యం రైతులు అవస్థలు పడుతూనే ఉన్నారు. నిత్యం ఏదో ఒక సమస్యతో రైతన్నలు బలవంతంగా తనువు చాలిస్తున్నారు. 

సిద్దిపేట జిల్లా ఎల్లాయిపల్లిలో తమ భూమిలో ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం చేపడుతుండడంతో మనస్తాపం చెందిన ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నం చేసింది. తమకు చెందిన 8 ఎకరాల భూమి గతంలో ప్రాజెక్ట్‌ కోసం ప్రభుత్వం సేకరించింది. అయితే.. ఆ తర్వాత డిజైన్‌ మార్చడంతో 4 ఎకరాల భూమి మిగిలింది. ఆ భూమి ఆ ఎనిమిది కుటుంబాలకు చెందినవారు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే.. తాజాగా ఆ భూమిలో ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మిస్తోంది. దీంతో ఆగ్రహించిన రైతులు... ఆ నిర్మాణాలను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి చిన్నకోడూరు పీఎస్‌కు తరలించారు. అధికారుల తీరుతో మనస్తాపం చెందిన   భూలక్ష్మీ అనే వృద్ధురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వం మా భూముల్లో బలవంతంగా డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మిస్తుందని.. అందుకే భూలక్ష్మీ ఈ ఘాతుకానికి పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. తమ స్థలం తమకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

మరో వైపు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపింది. తన భూమి పట్టా విషయంలో స్థానిక వీఆర్ వో రికార్డులు మార్పిడి చేయకుండా ఇబ్బందులకు గురి చేయడంతో మనస్థాపం చెందిన లింగయ్య  పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.  లింగయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స చేయించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు తమ అభివృద్ధికి తోడ్పడాలే కానీ... ఉన్న జీవితాలు రోడ్డున పడేయం ఏంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

07:53 - May 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం జోరుగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన లబ్ధిదారులైన రైతులకు  పెట్టుబడి సాయం కింద చెక్కులు అందజేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర  ప్రజాప్రతినిధులు అన్నదాతలకు చెక్కులతోపాటు పట్టాదారు  పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు.  రైతుబంధు పథకం చెక్కులతో రైతులు బీర్లు తాగుతున్నారని బీజీపీ నేతలు అనడాన్ని హరీశ్‌రావు తీవ్రంగా తప్పుపట్టారు. తెలంగాణలో రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. గ్రామ గ్రామన సభలు, సమావేశాలు ఏర్పాటుచేసి చెక్కులు, పాసుపుస్తకాలను రైతులకు పంపిణీ చేస్తున్నారు. 

సంగారెడ్డి జిల్లా మనూరులో జరిగిన రైతుబంధు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఖరీఫ్‌ సాగుకు పెట్టుబడి సాయం కింద ఎరానికి 4 వేల చొప్పున చెక్కులతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. రైతుబంధు పథకం చెక్కులతో రైతులు బీర్లు తాగుతున్నారంటూ బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అనడాన్ని హరీష్‌రావు తీవ్రంగా తప్పుపట్టారు. ఇది అన్నదాతలను అవమానించమేనని ఆయన అన్నారు. 

వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారంలో  నిర్వహించిన రైతుబంధు  పథకం చెక్కుల  పంపిణీ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు. పెట్టుబడి సాయం పథకం దేశానికే ఆదర్శమన్నారు. రైతుబంధు పథకాన్ని బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు అపహాస్యం చేస్తున్నారని కడియం మండిపడ్డారు. 
మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌లో  నిర్వహించిన రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ తదితరలు పాల్గొన్నారు. అద్భుతమైన రైతుబంధు కార్యక్రమాన్ని విపక్షాలు అపహాస్యం చేస్తున్నాయని కేటీఆర్‌ మండిపడ్డారు. 

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజవర్గంలోని పలు గ్రామాల్లో జరిగిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుతోపాటు ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తెలంగాణ రైతుబంధు పథకం గురించి అన్నదాతలు డిమాండ్‌ చేసే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా కవిత చెప్పారు. 

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులో రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. భువనగిరి ఎంపీ బూరనర్సయ్యగౌడ్‌ పాల్గొని రైతులకు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం అద్రాస్‌పల్లిలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం గణపూర్‌పాటి నందిగామ గ్రామంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లిలో జరిగిన రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల పంపణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డిగోవర్ధన్‌తోపాటు ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌ పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం పూసాల గ్రామంలో ఎంపీ బాల్కసుమన్‌, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రైతులకు చెక్కులు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. రైతుబంధు పథకం కింది చెక్కులు అందుకొన్న రైతులు.. వీటిని మార్చుకునేందుకు బ్యాంకుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 
-----------------------------------------------------------------

07:49 - May 15, 2018

గుంటూరు : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటివరకు 54 శాతం పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. కుడి ప్రధాన కాలువ పనులు 90 శాతం, ఎడమ ప్రధాన కాలువ పనులు 60 శాతం పూర్తి అయ్యాయని చెప్పారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయా ఫ్రమ్‌ వాల్ జెట్ గ్రౌటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చంద్రబాబుకు తెలిపారు. జూన్ 11లోపు డయా ఫ్రమ్‌ వాల్‌తో పాటు కాఫర్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన జెట్ గ్రౌటింగ్ పనులు కూడా పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. కాంక్రీటు పనుల్లో వేగం మందగించటంపై నిర్మాణ సంస్థలను చంద్రబాబు ప్రశ్నించారు. అనుకున్న సమయానికి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.

 

07:45 - May 15, 2018

చిత్తూరు : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఇవాళ శ్రీకాళహస్తికి వెళ్లనున్నారు. అక్కడి వాయులింగేశ్వర, గుడిమల్లం పరశురామ ఆలయాలతోపాటు వికృతమాల వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయ సందర్శన తర్వాత పవన్‌ చిత్తూరులో పర్యటిస్తారు. చిత్తూరులోని హైరోడ్డు నిర్వాసితులను పవన్‌ నేడు పరామర్శించనున్నారు.

 

07:44 - May 15, 2018

శ్రీకాకుళం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. సావరకోట మండలంలో బొంతు ఎత్తిపోతల పథకానికి ఆయన ఇవాళ శంకుస్థాపన చేస్తారు. ఇదే మండలంలోని పలు గ్రామాల్లో సీఎం పర్యటించనున్నారు. సీఎం పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
బొంతు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. సావరకోట మండలంలో ఆయన ప్రధానంగా పర్యటిస్తారు. ఏపీ ప్రభుత్వం 180 కోట్ల రూపాయలతో ఈ మండలంలో బొంతు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఈ పథకానికి చంద్రబాబు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు.  అంతేకాదు.. సావరకోట మండలంలోని రంగసాగరం, బురుజువాడ, చిన్నకిట్టలపాడు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.
చిన్న కిట్టలపాడు గ్రామసభలో పాల్గొనున్న చంద్రబాబు
చిన్నకిట్టలపాడు గ్రామసభలో చంద్రబాబు పాల్గొంటారు. ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటారు. నీరు- చెట్టు పథకం కింద రంగసాగరం చెరువు పనులు సీఎం ప్రారంభిస్తారు. అనంతరం రంగసాగరం చెరువు దగ్గర జరిగే బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగిస్తారు.
చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు.  రంగసాగరం చెరువు గర్భంలో జరుగుతున్న సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. వర్షం వచ్చే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంపై దృష్టి సారించాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులను భారీగా మోహరించారు.

 

07:40 - May 15, 2018

బెంగళూరు : మరికొద్ది గంటల్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. అయితే కర్నాటకలో గెలుపు ఎవరిదన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికారంపై కాంగ్రెస్‌, బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.... దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ మాత్రం హంగ్‌వైపే మొగ్గుచూపాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌ ప్రారంభానికి ముందే తెరవెనుక మంతనాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు కౌంటింగ్‌ కోసం భారీ భద్రత ఏర్పాటు చేశారు.
కర్నాటక ఫలితాలపై సర్వత్రా ఆసక్తి
మరికొద్ది గంటల్లో వెలువడనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.  పోలింగ్‌ రికార్డు స్థాయిలో నమోదు కావడంతో గెలుపు ఎవరిదన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. హంగ్‌ ఏర్పడే అవకాశముందని  మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేయడంతో.... అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉత్కంఠ మరింత పెరిగింది. మధ్యాహ్నానికిగానీ ఉత్కంఠకు తెరపడే అవకాశముంది.
తమదే అధికారమంటూ కాంగ్రెస్‌, బీజేపీ ప్రకటనలు
ఒకవైపు కాంగ్రెస్‌, మరోవైపు బీజేపీ అధికారం తమదనే ప్రకటనలు చేస్తున్నాయి. తమకంటే తమకే మెజార్టీ స్థానాలు వస్తాయన్న ధీమాను ఆ పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు. వీరి ధీమాలు, అంచనాలు ఎలా ఉన్నా... హంగ్‌ వస్తే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌, బీజేపీలు బయటకు తమకే ప్రజలు పట్టంగడతారని చెబుతున్నా.... లోలోనమాత్రం హంగ్‌ ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు. 
హంగ్‌ ఏర్పడితే జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌
కర్నాటకలో హంగ్‌ ఏర్పడితే జేడీఎస్‌ కింగ్‌మేకర్‌ అవుతుంది. అందుకే అటు కాంగ్రెస్‌గానీ... ఇటు బీజేపీగానీ.... జేడీఎస్‌కు గాలమేస్తున్నాయి. జేడీఎస్‌ పార్టీ అధ్యక్షుడు , మాజీ సీఎం కుమారస్వామితో ఇరుపార్టీల నేతలు అంతర్గతంగా చర్చలు కొనసాగిస్తున్నారు. కుమారస్వామి ఉన్నపళంగా సింగపూర్‌ వెళ్లడం కన్నడనాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైద్య పరీక్షల కోసమని పార్టీ శ్రేణులు చెబుతున్నా... సింగపూర్‌ నుంచే ఆయన రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఓవైపు సిద్ధరామయ్య జేడీఎస్‌తో పొత్తు విషయంపై సంకేతాలు ఇవ్వగా... మరోవైపు బీజేపీ కూడా దోస్తీకోసం ప్రతిపాదన పంపింది. అయితే గత అనుభాల దృష్ట్యా బీజేపీతో పొత్తు వద్దని కుమారస్వామి తండ్రి దేవేగౌడ ఇదివరకు హెచ్చరించారు. అయితే కుమారస్వామి మాత్రం ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. మరోవైపు ఇరు పార్టీలతో మంతనాలు కొనసాగిస్తున్నారు. నేటి ఫలితాల్లో హంగ్‌ ఏర్పడితే... జేడీఎస్‌ మద్దతు ఎవరికన్నది కీలకంగా మారింది. 
ఓట్ల లెక్కింపునకు భారీ భద్రత
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఈసీ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 38 కౌంటింగ్‌ కేంద్రాల్లో లెక్కింపు జరుగనుంది.  అన్ని జిల్లా కేంద్రాల్లోనూ లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు.  బెంగళూరు నగరంలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.  స్ట్రాంగ్‌రూమ్‌ల దగ్గర పారామిలటరీ బలగాలను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటర్‌ దగ్గర 100 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు. ఉదయం 8 గంటల నుంచే లెక్కింపు మొదలుకానుంది.
చెలరేగిపోతున్న బెట్టింగ్‌ రాయుళ్లు
కర్నాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బెట్టింగ్‌ రాయుళ్లు చెలరేగిపోతున్నారు. మంత్రుల స్థానాలతోపాటు కీలక అసెంబ్లీ స్థానాలపై  బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది.ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది.. ఏ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది.. కీలక నేతల్లో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు.. అనే అంశాలపై పందెం రాయుళ్లు బెట్టింగ్‌లు కడుతున్నారు.  వాహనాలు, నగదు, ఆస్తులు, భూములు ఇలా అన్నింటిపైనా బెట్టింగ్‌లు కాస్తున్నారు. కర్నాటకతోపాటు తెలుగురాష్ట్రాలు, మహారాష్ట్రలో ఈ బెట్టింగ్‌లు వందకోట్లలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు పదుల సంఖ్యలో బెట్టింగ్‌రాయుళ్లను అరెస్ట్‌ చేశారు.

 

నేడు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

బెంగళూరు : నేడు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపులో 11 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేటుళ్లు ఏర్పాటు చేశారు. 224 స్థానాలకుగానూ 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

Don't Miss