Activities calendar

16 May 2018

రేపటి నుండి పవిత్ర రంజాన్..

ఢిల్లీ: ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఆచరించే రంజాన్ మాస ఉపవాస దీక్షలు రేపటి నుంచే ఆరంభం కానున్నాయి. నెలవంక కనిపించిన తర్వాతి రోజు నుంచి రంజాన్‌ను ముస్లింలు జరుపుకుంటారు. ఇవాళ నెలవంక కనిపించడంతో రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్నట్లు రోయత్ హిలాల్ కమిటీ ప్రకటించింది.

ఇకపై 'జైహింద్‌' అన్సాల్సిందే..

ఢిల్లీ : పాఠశాలల్లో హాజరు చెప్పేటప్పుడు ఇకపై ప్రతి ఒక్క విద్యార్థి 'జైహింద్‌' అనాలని ఎస్‌, నో వంటి పదాలు అనకూడదని మధ్యప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా చేస్తే పిల్లల్లో దేశభక్తి పెరుగుతుందని ఆ రాష్ట్ర సర్కారు భావిస్తోంది. అయితే, ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నారు. దేశభక్తిని బలవంతంగా రుద్దలేమని, మొదట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచాలని, పిల్లలకు పాఠాలు చెప్పేందుకు తగినంత మంది ఉపాధ్యాయులు కూడా ఉండట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.

20:41 - May 16, 2018

కార్ణటక : రాష్ట్రంలో రాజకీయాలపై ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు గవర్నర్ తన బీజేపీ వైపే మొగ్గుచూపారు. కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలా బీజేపీ ఎమ్మెల్యే అయిన యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. అధికారికంగా రాజ్‌భవన్ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లుగా తాజా సమాచారం. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప గురువారం ఉదయం 9.30 గంటలకు కొత్త సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా రాజ్ భవన్ లోనే యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా యడ్యూరప్ప ప్రభుత్వం బలనిరూపణకు ఈనెల 26 వరకూ గడువిచ్చారు. అంటే మ్యాజిక్ ఫిగర్ 112 మంది సభ్యులను అసెంబ్లీలో చూపించాలి. అయితే.. ప్రస్తుతం బీజేపీకి 104 సీట్ల బలం మాత్రమే ఉంది. బల నిరూపణ తర్వాతే కేబినేట్ విస్తరణ ఉండనుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ కోర్టుకు వెళ్లే యోచనలో వున్నట్లుగా తెలుస్తోంది. 

యడ్యూరప్పకు గవర్నర్ పిలుపు..రేపు ప్రమాణస్వీకారం..

కర్ణాటక : రాష్ట్ర రాజకీయ నాటకాలకు,కుట్రలకు, కుయుక్తులకు తెరపడింది. కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలా తన నిర్ణయాన్ని ప్రకటించారు. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికైన యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. అధికారికంగా రాజ్‌భవన్ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. యడ్యూరప్ప గురువారం ఉదయం 9.30 గంటలకు కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. యడ్యూరప్ప ప్రభుత్వం బలనిరూపణకు ఈనెల 26 వరకూ గడువిచ్చారు. బల నిరూపణ అనంతరం కేబినెట్ విస్తరణ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ కోర్టుకు వెళ్లే యోచనలో వున్నట్లుగా తెలుస్తోంది.

ప్రముఖ దర్శకుడు మృతి..

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దుర్గా నాగేశ్వరరావు మృతి చెందారు. హైదరాబాద్ లోని రామాంతపూర్‌లోని తన నివాసంలో దుర్గానాగేశ్వరరావు తన 87వ ఏట కన్ను మూశారు. విజయ బాపినీడు నిర్మించిన ‘విజయ’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన ఈయన ‘‘బొట్టు కాటుక ,సుజాత, స్వర్గం,పసుపు-పారాణి’’ వంటి విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు వద్ద పలు చిత్రాలకు ఎక్సిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పని చేసిన దుర్గా నాగేశ్వరరావు ప్రముఖ నటుడు సియస్‌ఆర్‌కు స్వయానా మేనల్లుడు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. 

మాకు 117మంది ఎమ్మెల్యేలు వున్నారు : కుమారస్వామి

కర్ణాటక : గవర్నర్ వజుభాయ్ వాలాను జేడీఎస్ నాయకుడు కుమారస్వామి ఇవాళ సాయంత్రం రాజ్‌భవన్‌లో కలిశారు. కాంగ్రెస్ - జేడీఎస్ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని గవర్నర్‌ను కుమారస్వామి కోరారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతు..117 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉన్నట్లు గవర్నర్‌కు లేఖ సమర్పించామని తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం కాంగ్రెస్, జేడీఎస్‌కు ఉందన్నారు. బలనిరూపణకు అవసరమైన పత్రాలను గవర్నర్ కు సమర్పించామని చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్ ఐక్యంగా ఉన్నట్లు గవర్నర్‌కు స్పష్టం చేశామన్నారు.

కాంగ్ ఎమ్మెల్యేల కోసం బీజేపీ హెలికాప్టర్?!..

కర్ణాటక : ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం 8 ఎమ్మెల్యేలను గెలిపించేకునే క్రమంలో బీజేపీ యంత్రాంగం ఫలించలేదు. ఎలాగైనా సరే అధికారపీఠాన్ని అధిష్టించాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో, ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీసింది. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి వీరు డుమ్మా కొట్టారు. ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో లేరని సమాచారం. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భీమానాయక్, అమెర్ గౌడ నాయక్ లు బీజేపీకి మద్దతు ప్రకటించినట్టు విశ్వసనీయ సమాచారం. వీరి కోసం బీదర్, గుల్బర్గాలకు బీజేపీ అధిష్ఠానం ప్రత్యేక హెలికాప్టర్లను పంపినట్టు తెలుస్తోంది.

జేడీఎస్ లో విభేదాలు, చీలికలు లేవు : రేవణ్ణ

కర్ణాటక : జేడీఎస్ శాసన సభాపక్షనేతగా కుమారస్వామిగౌడను ఎన్నుకున్నామని, తమ పార్టీలో ఎలాంటి చీలిక లేదని రేవణ్ణ స్పష్టం చేశారు. జేడీఎస్ ఎల్పీ నేతగా ఎన్నికైన కుమారస్వామితో కలిసి రేవణ్ణ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జేడీఎస్ నుంచి చీలతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఈ వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. జేడీఎస్ - కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని చెప్పారు. జేడీఎస్ ఎల్పీ నేతగా ఎన్నికైన కుమారస్వామిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

'కేసీఆర్ యాంకరింగ్ చేసుకో' : రేవంత్

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చమక్కులు విసిరారు. కేసీఆర్ ఇక యాంకరింగ్ చేసుకోవాలంటు సూచించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఇక యాంకరింగ్‌ చేసుకోవాల్సిందేనని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు. కర్ణాటకలో బీజేపీ అక్రమ మార్గంలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని అన్నారు. ఇటీవల జేడీఎస్‌కు మద్దతిచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు జేడీఎస్‌ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో చెప్పాలని వ్యాఖ్యానించారు.

ఉత్కంఠ కన్నడ..మార్కెట్లపై ప్రభావం..

కర్ణాటక : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై కొనసాగుతోంది. నిన్న బీజేపీ ఆధిక్యంలో ఉన్నంతసేపు దూసుకుపోయిన మార్కెట్లు... ఆ తర్వాత బీజేపీ మెజార్టీ తగ్గడంతో క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ రోజు కూడా బెంగళూరులో సందిగ్ధ రాజకీయ వాతావరణం కొనసాగడంతో... మార్కెట్లు ఈ రోజు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 156 పాయింట్లు కోల్పోయి 35,388కి పడిపోయింది. నిఫ్టీ 61 పాయింట్లు పతనమై 10,741కి దిగజారింది.

కుమారస్వామిని అడ్డుకున్న రాజ్ భవన్ సిబ్బంది?..

కర్ణాటక : కాంగ్రెస్‌తో కలిసి కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలనుకుంటోన్న జేడీఎస్‌ నేత కుమార స్వామి ఈ రోజు మరోసారి తమ రాష్ట్ర గవర్నర్‌ విజుభాయ్‌ రుడాభాయ్‌ వాలాను కలవడానికి రాజ్‌భవన్‌ వెళ్లారు. అయితే, ఆయనకు అక్కడ షాక్ తగిలింది. కుమారస్వామిని రాజ్‌భవన్‌ సిబ్బంది లోపలికి అనుమతించడం లేదు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు కూడా అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కుమారస్వామి కోరాలనుకుంటున్నారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ మొదట ఎవరికి అనుమతి ఇస్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. 

హీరో శివాజీపై బీజేపీ శ్రేణుల దాడి..

కృష్ణా : గన్నవరం విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ న్యూ ఢిల్లీ నుంచి విమానంలో కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు విమనాశ్రయానికి వెళ్లారు. అయితే, అదే సమయంలో సినీ నటుడు శివాజీ హైదరాబాద్‌ నుంచి గన్నవరం చేరుకున్నారు. ఈనేపథ్యంలో శివాజీని చూసిన బీజేపీ శ్రేణులు తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే విమర్శలు చేస్తావా? అంటూ శివాజీని అడ్డుకున్నారు.

హీరో శివాజీపై బీజేపీ శ్రేణుల దాడి..

కృష్ణా : గన్నవరం విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ న్యూ ఢిల్లీ నుంచి విమానంలో కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు విమనాశ్రయానికి వెళ్లారు. అయితే, అదే సమయంలో సినీ నటుడు శివాజీ హైదరాబాద్‌ నుంచి గన్నవరం చేరుకున్నారు. ఈనేపథ్యంలో శివాజీని చూసిన బీజేపీ శ్రేణులు తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే విమర్శలు చేస్తావా? అంటూ శివాజీని అడ్డుకున్నారు.

గవర్నర్ ను విశ్వసిస్తున్నాం : కుమారస్వామి

కర్ణాటక : రాజ్యాంగబద్ధంగా సరైన నిర్ణయం ప్రకటిస్తారని విశ్వసిస్తున్నామని, ఆయన రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారని నమ్ముతున్నామని కుమారస్వామి వ్యాఖ్యానించారు. కేపీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ... రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామని గవర్నర్‌ హామీ ఇచ్చారని, ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలను పిలిచే క్రమంలో న్యాయ నిపుణులను సంప్రదిస్తామని అన్నారని తెలిపారు. కాగా కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరన్న ఉత్కంఠ కొనసాగుతోంది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విజుభాయ్‌ రుడాభాయ్‌ వాలాను జేడీఎస్‌ నేత కుమారస్వామి, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ కలిశారు.

స్వచ్ఛ నగరాలుగా విజయవాడ, తిరుపతి..

ఢిల్లీ : స్వచ్ఛ సర్వేక్షణ్-2018 అవార్డులను కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ ఈ రోజు ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ దేశంలోనే స్వచ్ఛనగరంగా నిలవగా, ఆ జాబితాలో తరువాతి స్థానాల్లో భోపాల్, చండీగఢ్‌ ఉన్నాయి. 10 లక్షలకు పైగా జనాభా నగరాల జాబితాలో దేశంలోనే స్వచ్ఛమైన నగరంగా విజయవాడ నిలవగా, 1-3 లక్షల లోపు జనాభా గల నగరాల జాబితాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌ మెంట్‌లో తిరుపతి భారత్‌లోనే ఉత్తమ నగరంగా నిలిచింది. స్వచ్ఛ రాజధాని నగరంగా గ్రేటర్ ముంబయి ఉంది. 1-3 లక్షల లోపు జనాభా గల నగరాల జాబితాలో ఉత్తమ స్వచ్ఛ నగరంగా మైసూరు నిలిచింది.

19:36 - May 16, 2018
19:26 - May 16, 2018

చిత్తూరు : ప్రజలకు ఎప్పుడూ జనసేన అండగా ఉంటుందన్నారు పవన్‌కల్యాణ్‌. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న పవన్‌కల్యాణ్‌.. శెట్టిపల్లిలో రైతులు, ప్రజలతో సమావేశమయ్యారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కష్ట సమయంలో రాష్ట్ర అభివృద్ధి కోసం 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చామని... కానీ.. ఇచ్చిన హామీలను నెరవేర్చని ఆ పార్టీ అండగా ఉండకూడదని నిర్ణయించమన్నారు. టీడీపీ రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేసిన పవన్‌కల్యాణ్‌.. ప్రజలకు ఎప్పుడూ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

19:23 - May 16, 2018

ఖమ్మం : కొణిజర్ల మండలం పెద్ద మునగాల గ్రామంలో రైతు బందు పథకం చెక్కుల పంపిణీలో గందరగోళం తలెత్తింది. రెండు వర్గాలుగా మారిన టిఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పోంగులేటి శ్రీ నివాస రెడ్డి, వైరా ఎంఎల్ ఏ మదన్ లాల్ వర్గాల గొడవకు దిగాయి. ఫ్లెక్స్ లో ఎంపి ఫోటో లేదని ఎంపీ అనుచరులు తహాశీల్ధారు ను నిలదీశారు. గొడవ జరుగుతున్నా సమయంలోనే ఎమ్మెల్యే అనుచరులు చెక్కులు పంపిణీ ప్రారంభించడంతో ఎంపీ అనుచరులు దాడికి దిగారు. 

19:20 - May 16, 2018

విజయవాడ : ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాల ప్రైవేటీకరణే ప్రధాన అజెండాగా విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ సమావేశం గురువారం జరుగనుంది. ఈ భేటీకి 36 అంశాలతో అజెండా రూపొందించారు. వీటిని ఆమోదించుకునేందుకు పాలక టీడీపీ ముమ్మరం ప్రయత్నం చేస్తోంది. మరోవైపు వీఎంసీ స్థలాల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశానికి రంగం సిద్ధమైంది. గురువారం జరిగే భేటీలో వీఎంసీ ఆస్తుల ప్రవేటీకరణపై చర్చ జరుగునుంది.

పీపీపీ పద్ధతిలో కార్పొరేషన్‌ స్థలాల ప్రైవేటీకరణ
ఆదాయ మార్గాల అన్వేషణపై దృష్టి పెట్టిన విజయవాడ నరగపాలక సంస్థ అధికారులు.. కార్పొరేషన్‌ స్థలాల ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేశారు. వీఎంసీ స్థలాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో కొర్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు అజెండా రూపొందించారు. ఇప్పటికే ప్రైవేటు వక్య్తుల చేతుల్లోకి వెళ్లిపోయిన స్థలాలకు అటు అద్దెరాక.. ఇటు కోర్టు కేసుల నుంచి విముక్తి లభించక సతమతమవుతున్న నగరపాలక సంస్థ ఇప్పుడు కొత్త స్థలాల ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోంది. లబ్బీపేటలోని బృందావన్‌ అపార్ట్‌మెంట్స్‌, సింగ్‌నగర్‌లోని డిస్నీల్యాండ్‌ వివాదాల్లో చిక్కుకున్నాయి.

కబేళాలో 45,530 చదరపు గజాల స్థలం..
నగరపాలక సంస్థకు విలువైన స్థలాలు ఉన్నాయి. కబేళాలో 45 వేల 530 చదరపు గజాల స్థలంతోపాటు మున్సిపల్‌ గెస్ట్‌ హౌస్‌ ప్రాంతంలో పైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మించేందుకు ఓ కార్పొరేట్‌ సంస్థకు అప్పగిచేందుకు వీఎంసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిపై గురువారం జరిగే సమావేశంలో తీవ్ర దుమారం చెలరేగే అవకాశం ఉంది. ఇంతకు ముందు జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో కూడా దీనిపై రచ్చ జరిగింది. కార్పొరేషన్‌ స్థలాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెడితే ఉద్యమం తప్పదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. నగరపాలక సంస్థ స్థలాలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని కాంగ్రెస్‌ నాయకులు హెచరిస్తున్నారు. పాలకపక్షం ప్రైవేటీకరణ యత్నాలను తిప్పికొడతామంటున్నారు. స్థలాల ప్రైవేటీకరణే ప్రధాన అజెండాగా గురువారం జరిగే నగరపాలక సంస్థ సమావేశంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. 

19:13 - May 16, 2018

విజయవాడ : ఏపీ ఈ-సెట్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో విడుదల చేశారు. ఈ ఫలితాలలో పలు జిల్లాలకు చెందిన విద్యార్థులు వివిధ కోర్సుల్లో ఫస్ట్ ర్యాంకులు సాధించారు. ఈస్ట్ గోదావరికి చెందిన ఉమామహేశ్వరరావు బయోటెక్నాలజీలో ఫస్ట్ సాధించాడు. నెల్లూరు జిల్లాకు చెందిన లోకేష్‌ సెరమిక్‌ టెక్నాలజీలో ఫస్ట్ ర్యాంక్‌ పొందాడు. కెమికల్ ఇంజనీరింగ్‌లో సాయినాథ్, సివిల్ ఇంజనీర్‌లో వరంగల్‌కు చెందిన రాకేష్‌, కంపూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో రంగారెడ్డి జిల్లాకి చెందిన అనిల్‌ కుమార్‌, ఇసిఇలో మహబూబ్‌ నగర్‌ జిల్లాకి చెందిన స్వాతి, వరంగల్‌ కు చెందిన యశ్వంత్‌లు ఫస్ట్ ర్యాంక్‌ సాధించారు. ఈ పరీక్షకు మొత్తం 35 వేల 24 మంది దరఖాస్తు చేసుకోగా, 33 వేల 637 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 98.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 

19:10 - May 16, 2018

హైదరాబాద్ : నరేంద్రమోదీ, అమిత్‌షాపై కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. నైతిక విలువలను పాతాళానికి తొక్కుతున్నారని విమర్శించారు. అఖండ భారతావనిని రక్షించే సైనికులమని చెప్పుకునే కమలనాథులు.. కర్నాటకలో ఎమ్మెల్యేలను కొనే నీఛ సంస్కృతికి ఎందుకు ఒడిగట్టారని మండిపడ్డారు. కాగా కన్నడ రాజకీయాలలో తలెత్తుతున్న ఉత్కంఠభరిత రాజకీయ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ, అధ్యక్షులు అమిత్ షాలపై విరుచుకుపడ్డారు.

19:07 - May 16, 2018

కృష్ణా : గన్నవరం విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ న్యూ ఢిల్లీ నుంచి విమానంలో కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు విమనాశ్రయానికి వెళ్లారు. అయితే, అదే సమయంలో సినీ నటుడు శివాజీ హైదరాబాద్‌ నుంచి గన్నవరం చేరుకున్నారు. ఈనేపథ్యంలో శివాజీని చూసిన బీజేపీ శ్రేణులు తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే విమర్శలు చేస్తావా? అంటూ శివాజీని అడ్డుకున్నారు. తీవ్ర వాగ్వాదం చెలరేగుతుండడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు శివాజీని పోలీసులు కారులో ఎక్కించి పంపించివేశారు. 

19:05 - May 16, 2018

కర్ణాటక : కన్నడ రాజకీయాలు ఇంకా రసవత్తరంగానే ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఏ పార్టీని పిలుస్తారనే సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. గవర్నర్‌ను కలిసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌-జేడీఎస్‌లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రాజ్‌భవన్‌కు 118 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్‌ను కలిసేందుకు కుమారస్వామి, సీఎల్పీ నేత పరమేశ్వర చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కుమారస్వామి గవర్నర్‌ను కోరనున్నారు. అవసరమైతే తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో గవర్నర్‌ ముందు మార్చ్‌ చేయించే యోచనలో కుమారస్వామి ఉన్నారు. మరోవైపు కొంతమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారన్న వార్తలపై పీసీసీ స్పందించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలెవరూ పార్టీని వీడడం లేదని స్పష్టం చేసింది. 

19:03 - May 16, 2018

చిత్తూరు : టీటీడీ నూతన చైర్మన్‌ ఆధ్వర్యంలో జరిగిన పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 65 ఏళ్లకు పైబడిన అర్చకులకు రిటైర్మెంట్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఉద్వాసనకు గురయ్యారు. మరోవైపు రమణ దీక్షితులు చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక టీటీడీ బ్యాంక్‌ డిపాజిట్లపై సబ్‌ కమిటీ వేయాలని నిర్ణయించారు. 

19:01 - May 16, 2018

ఉత్తరప్రదేశ్‌ : వారణాసిలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లై ఓవర్‌ కూలిన ఘటనలో యోగి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫ్లయ్‌ ఓవర్‌ నిర్మిస్తున్న సేతు నిగమ్‌ ఏజెన్సీకి చెందిన నలుగురు అధికారులను సస్పెండ్‌ చేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 18 మంది మృతదేహాలను వెలికి తీశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తీవ్రంగా గాయపడ్డ ఏడుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బ్రిడ్జి కింద చిక్కుకున్న ముగ్గురిని సజీవంగా వెలికి తీశారు. ఫ్లయ్‌ ఓవర్‌ కూలిపోవడంతో 4 కార్లు, 5 ఆటోలు, ఓ సిటీ బస్‌తో పాటు పలు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. ఫ్లయ్‌ ఓవర్‌ కూలిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటి ఏర్పాటు చేసింది. 48 గంటల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, స్థానికులు చేపట్టిన ఆపరేషన్ ముగిసింది. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి 2 లక్షల చొప్పున యూపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

18:59 - May 16, 2018

కర్ణాటక : బీఎస్‌ యడ్యూరప్ప బిజెపి శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన గవర్నర్‌ వజుభాయ్‌ వాలాను కలిసేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా యడ్యూరప్ప గవర్నర్‌ను కోరారు. ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని గడువు కోరినట్లు తెలుస్తోంది. గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను ఆహ్వానించే అవకాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. 222 అసెంబ్లీ స్థానాలకు గాను బిజెపికి 104 స్థానాలు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటు మరో 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. స్వతంత్ర అభ్యర్థి శంకర్‌ బిజెపికి మద్దతు తెలపడంతో ఆ పార్టీ సంఖ్యా బలం 105కి చేరింది.

18:57 - May 16, 2018

కర్నాటక : బీజేపీ ఆడుతున్న మైండ్‌గేమ్‌ను తిప్పికొడతామని ఆ రాష్ట్ర హోంమంత్రి రామలింగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సీఎల్‌పీ భేటీకి గైర్హాజరవ్వడంపై రకరకాలుగా వస్తున్న వందతులను రామలింగారెడ్డి తోసిపుచ్చారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారని వస్తున్న వార్తాలను ఖండించారు. దూరప్రాంతాల ఎమ్మెల్యేలు బెంగళూరు చేరుకోవడంలో ఆలస్యమైందంటున్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌ రాజకీయ పరిణామాలపై ఈ వీడియోను క్లిక్ చేయండి.

18:54 - May 16, 2018

కర్ణాటక : తమ పార్టీ ఎమ్మెల్యేలకు వంద కోట్ల రూపాయలు, మంత్రి పదవి ఇస్తామని బిజెపి ప్రలోభ పెట్టిందని జెడిఎస్‌ చీఫ్‌ కుమారస్వామి చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఖండించారు. ఇది ఊహా జనితమని, కాంగ్రెస్‌-జెడిఎస్‌లు ఇలాంటి రాజకీయాలే చేస్తారని ధ్వజమెత్తారు. కర్ణాటకలో అధికారం కోసం కాంగ్రెస్‌ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కర్ణాటక ప్రజలు బిజెపికే పట్టం కట్టారని, యడ్యూరప్ప నేతృత్వంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జవదేకర్‌ చెప్పారు.

18:53 - May 16, 2018

కర్ణాటక : కుమారస్వామిని జనాతాదళ్‌ సెక్యులర్‌ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. జనతాదళ్‌లో చీలిక వస్తుందన్న ఊహాగానాలకు రేవణ్ణ తెరదింపారు. కుమారస్వామితో కలిసి ఆయన మీడియా ముందు ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. జెడిఎస్‌లో ఎలాంటి చీలిక లేదని, మేమంతా ఒకటేనని రేవణ్ణ తెలిపారు. బిజెపితో కలిసే ప్రసక్తే లేదని కుమారస్వామి స్పష్టం చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడం...సెక్యులర్‌ ఓట్లు చీలడం వల్లే బిజెపి 104 స్థానాలను గెలిచిందన్నారు. 104 సీట్లతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన తెలిపారు. మా పార్టీని చీల్చేందుకు బిజెపి అన్ని ప్రయత్నాలు చేస్తోందని, మా ఎమ్మెల్యేలకు వంద కోట్లు, మంత్రి పదవిని ఆఫర్ చేస్తోందని కుమారస్వామి ఆరోపించారు. ప్రధాని మోది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో లౌకికవాదం నెలకొల్పడం కోసమే కాంగ్రెస్‌తో చేతులు కలిపామని కుమారస్వామి వెల్లడించారు. 

18:51 - May 16, 2018

తిరుమల : తిరుమల శ్రీవారి సేవల నిర్వహణలో పాలకమండలితోపాటు అధికారుల జోక్యం పెరిగిపోయిందని టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖల దర్శనాల కోసం కైంకర్యాలను కుదించమని అర్చకులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా వ్యవహరించమని పాలకమండలి సభ్యులు, అధికారులు చెప్పడం తప్పని చెప్పారు. శ్రీవారి ఆలయం గురించి తెలియని అధికారులను నియమించి ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని రమణదీక్షితులు విమర్శించారు. 

18:49 - May 16, 2018

ఢిల్లీ : ఏపీలో సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ అమోదం తెలిపింది. సెంట్రల్ వర్శిటీ నిధుల విడుదల ప్రక్రియను మానవ వనరుల శాఖ పర్యవేక్షించనుంది. అనంతపురం జిల్లా జంతలూరులో సెంట్రల్ వర్శిటీ నిర్మాణానికి కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి పూర్తిస్థాయి నిర్మాణం పూర్తయ్యేంత వరకూ తాత్కాలిక భవనాల్లో వర్శిటీని కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. 

18:47 - May 16, 2018

హైదరాబాద్ : ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఉద్యోగులు ప్రతిపాదించిన 18 డిమాండ్లపై కేసీఆర్ చర్చిస్తున్నారు. కాగా గతకొద్దిరోజుల క్రితం మంత్రి వర్గ ఉప సంఘంతో భేటీ అయి పలు సమస్యలపై చర్చించి 18 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉద్యోగ సంఘాలు వుంచాయి. పలు చర్చల అనంరం మంత్రివర్గ ఉపసంఘం సీఎం కేసీఆర్ కు నివేదికను అందజేసింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలకు చర్చలకు ఆహ్వానించారు. అనంతరం కేవలం 10మంది ఉద్యోగులను మాత్రమే చర్చలకు కేసీఆర్ అనుమతించారు. 

18:46 - May 16, 2018

కర్ణాటక : కన్నడ రాజకీయాలు ఇంకా రసవత్తరంగానే ఉన్నాయి. గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీని పిలుస్తారనే సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. గవర్నర్‌ను కలిసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌-జేడీఎస్‌లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాసేపట్లో 118 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్‌ను కలిసేందుకు కుమారస్వామి, సీఎల్పీ నేత పరమేశ్వర రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కుమారస్వామి గవర్నర్‌ను కోరనున్నారు. అవసరమైతే తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో గవర్నర్‌ ముందు మార్చ్‌ చేయించే యోచనలో కుమారస్వామి ఉన్నారు. దీంతో తనకు మద్దతిస్తున్న 118 మంది ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారు. మరోవైపు కొంతమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారన్న వార్తలపై పీసీసీ స్పందించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలెవరూ పార్టీని వీడడం లేదని స్పష్టం చేసింది. 

18:43 - May 16, 2018

విజయవాడ : పడవ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన అన్ని శాఖల అధికారులను సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయకచర్యలు కొనసాగుతున్నాయన్నారు కళా వెంకట్రావు. 

18:41 - May 16, 2018

చిత్తూరు : జనసేన అధ్యక్షుడు పవన కళ్యాణ్ తిరుపతిలో పర్యటించారు. మానవతా దృష్టి ప్రభుత్వానికి లేకుంటే ప్రజలు ఇబ్బందు ఎదుర్కొంటారని పవన్‌ అన్నారు. బిందెడు ఆశచూపి మూడు స్పూన్ల నీళ్లు తాగించినట్లుంది రైతు రుణమాఫీ అని ఎద్దెవాచేశారు. ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ విధానంలో మార్పులు తేవాలని అభివృద్ధికి రైతుల భూములే ప్రభుత్వానికి కనిపించాయా అని ఆయన మండిపడ్డారు.

ఉద్యోగ సంఘ నేతలతో కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఉద్యోగులు ప్రతిపాదించిన 18 డిమాండ్లపై కేసీఆర్ చర్చిస్తున్నారు. కాగా గతకొద్దిరోజుల క్రితం మంత్రి వర్గ ఉప సంఘంతో భేటీ అయి పలు సమస్యలపై చర్చించి 18 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉద్యోగ సంఘాలు వుంచాయి. పలు చర్చల అనంరం మంత్రివర్గ ఉపసంఘం సీఎం కేసీఆర్ కు నివేదికను అందజేసింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలకు చర్చలకు ఆహ్వానించారు. అనంతరం కేవలం 10మంది ఉద్యోగులను మాత్రమే చర్చలకు కేసీఆర్ అనుమతించారు. 

టీ.సీఎస్,సింగరేణి కాలరీస్ పై ఎన్టీటీ ఆగ్రహం..

ఢిల్లీ : జయశంకర్ భూపాల జిల్లాలోని కాకతీయ గని 2లో పర్యావరణ అనుమతుల ఉల్లంఘన పిటీషన్ పై జాతీయ హరిత ట్రిబ్యునల్ లో విచారణ కొనసాగుతోంది. రెండుసార్లు గడువు ఇచ్చిన కౌంటర్ దాఖలు చేయకపోవటంపై తెలంగాణ రాష్ట్ర సీఎస్, సింగరేణి కాలరీస్ సంస్థపై ఎన్టీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపటిలోగా కౌంటర్ దాఖలు చేయకపోతే..రూ.లక్ష జరిమానా చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర సీఎస్, సింగరేణి కాలరీస్ సంస్థలకు ఎన్టీటీ ఆదేశాలు జారీ చేసింది. రెండువారాలలకు రాతపూర్వక వాద, ప్రతివాదనలు పూర్తి కావాలని ఆదేశించింది. తదుపరి విచారణ జులై 13కు వాయిదా వేసింది. 

మాకు తగిన సంఖ్యాబలముంది : రామలింగారెడ్డి

కర్ణాటక : మా ఎమ్మెల్యేలు మాతోనేవున్నారనీ వారు దూర ప్రాంతంలో వున్నందుకు సీఎల్పీ సమావేశానికి హాజరుకాలేకపోయారని కర్ణాటక హోంమంత్రి రామలింగారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ ను తిప్పికొడతామన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి పూర్తి సంఖ్యాబలం వుందని స్పష్టం చేశారు. పైగా బీజేపీ ఎమ్మెల్యేకు మాకు టచ్ లో వున్నారని తెలిపారు. సీఎల్పీ నేతగా పరమేశ్వర్ ను ఎన్నుకున్నామనీ..పూర్తి బలమున్న మా కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతినివ్వాలని 10టీవీతో కర్ణాటక హోంమంత్రి రామలింగారెడ్డి తెలిపారు. 

జూన్ 8,9 తేదీల్లో చేపప్రసాదం పంపిణీ..

హైదరాబాద్ : ఆస్తమా రోగులకు ప్రతీ ఏటా చేపట్టే చేప ప్రసాదాల పంపిణీ జూన్ 8,9 తేదీల్లో చేపప్రసాదం పంపిణీ వుంటుందని మంత్రి తలసాని తెలిపారు. చేపప్రసాదం కోసం పలు రాష్ట్రాల నుండి ప్రజలు విస్తారంగా వస్తారన్నారు. అన్ని శాఖల సమన్వయంతో చేప ప్రసాదం పంపిణీ చేపడతామని తలసారి పేర్కొన్నారు. అధికారులంతా వాట్సప్ గ్రూపు ద్వారా కో ఆర్టినేట్ చేసుకోవాలని సూచించారు. చేప ప్రసాదం పంపిణీకు రెండు రోజుల ముందే ఏర్పాట్లు పూర్తి చేస్తామని మంత్రి తలసాని తెలిపారు.

ఏపీలో సెంట్రల్ వర్శిటీకి కేంద్ర ఆమోదం..

ఢిల్లీ : ఏపీలో సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ అమోదం తెలిపింది. సెంట్రల్ వర్శిటీ నిధుల విడుదల ప్రక్రియను మానవ వనరుల శాఖ పర్యవేక్షించనుంది. అనంతపురం జిల్లా జంతలూరులో సెంట్రల్ వర్శిటీ నిర్మాణానికి కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది.

టీటీడీ రమణ దీక్షితులకు ఉద్వాసన..

చిత్తూరు : టీటీడీ పాలక మండలి పూర్తయ్యింది. టీటీడీ ఆలయాల్లో 65 ఏళ్లు పైబడిన అర్చకులకు రిటైర్ మెంట్ ఇవ్వాలని పాలకమండలి నిర్ణయించింది. ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సహా మిగిలిన అర్చకులకూ ఈ నిబంధన వర్తింపజేయాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయించింది. టీటీడీ బ్యాంకు డిపాజిట్లపై సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా పాలకమండలి నిర్ణయించింది. శ్రీవారి ఆలయ ప్రదాన అర్చకులు చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటుపై అర్చకులకు నోటీసులు ఇవ్వాలని ఆలయ ఈవో నిర్ణయించారు.

లాంచీ ప్రమాదంలో 22మంది మృతి..

తూర్పుగోదావరి : గోదావరిలో మునిగిన లాంచీ ప్రమాదంలో 22మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. గోదావరిలో మనిగిపోయిన లాంచీలో నుండి ఇప్పటి వరకూ 12 మంది మృతదేహాలను ఎన్డీఆర్ ఎఫ్ దళాలు వెలికితీశాయి. 

లాంచీ ప్రమాదంలో 22మంది మృతి..

తూర్పుగోదావరి : గోదావరిలో మునిగిన లాంచీ ప్రమాదంలో 22మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. గోదావరిలో మనిగిపోయిన లాంచీలో నుండి ఇప్పటి వరకూ 12 మంది మృతదేహాలను ఎన్డీఆర్ ఎఫ్ దళాలు వెలికితీశాయి. 

బాలికపై యువకుడు అత్యాచారయత్నం

గుంటూరు : నగరంలో మరో దారుణం జరిగింది. పదేళ్ల బాలికపై రాజాసింగ్ అనే యువకుడు అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడి చేరుకుని రాజాసింగ్ కు దేహశుద్ధి చేశారు. నిందితుడు రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. పోలీసు వాహనాలు, ఫైరింజన్ ను ధ్వంసం చేశారు. 

09:54 - May 16, 2018

తూర్పుగోదావరి : దేవీపట్నం ప్రమాదంలో 40 మంది గల్లంతు అయ్యారు. ఇంకా గల్లంతైనవారి లభించలేదు. గల్లంతైన వారిలో మహిళలే అధికంగా ఉన్నారు.గల్లంతైన వారి కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 20 బోట్లలో గాలింపు కొనసాగుతోంది. భారీ ఈదురు గాలులతో బోటు ముంపునకు గరైంది. ప్రమాద సమయంలో లాంచీలో 55 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో 12 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరున్నారు. డోర్లు లాక్ చేసి ఉండటంతో ఈత వచ్చినవారికీ ప్రాణ నష్టం తప్పలేదు. దేవీపట్నం పీఎస్ లో లాంచీ నిర్వహకుడు లొంగిపోయారు. లాంచీ మునక ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం దేవీపట్నం బయల్దేరారు. 

09:52 - May 16, 2018

తూర్పుగోదావరి : దేవీపట్నం ప్రమాదంలో 40 మంది గల్లంతు అయ్యారు. ఇంకా గల్లంతైనవారి లభించలేదు. గల్లంతైన వారిలో మహిళలే అధికంగా ఉన్నారు.గల్లంతైన వారి కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 20 బోట్లలో గాలింపు కొనసాగుతోంది. భారీ ఈదురు గాలులతో బోటు ముంపునకు గరైంది. ప్రమాద సమయంలో లాంచీలో 55 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో 12 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరున్నారు. డోర్లు లాక్ చేసి ఉండటంతో ఈత వచ్చినవారికీ ప్రాణ నష్టం తప్పలేదు. దేవీపట్నం పీఎస్ లో లాంచీ నిర్వహకుడు లొంగిపోయారు. లాంచీ మునక ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఘటనాస్థలికి ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పరిశీలించారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గోదావరిలో 40 అడుగుల లోతులో ప్రమాద లాంచీ ఉంది. 

 

09:48 - May 16, 2018

తూర్పుగోదావరి : దేవీపట్నం ప్రమాదంలో 40 మంది గల్లంతు అయ్యారు. ఇంకా గల్లంతైనవారి లభించలేదు. గల్లంతైన వారిలో మహిళలే అధికంగా ఉన్నారు.గల్లంతైన వారి కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 20 బోట్లలో గాలింపు కొనసాగుతోంది. భారీ ఈదురు గాలులతో బోటు ముంపునకు గరైంది. ప్రమాద సమయంలో లాంచీలో 55 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో 12 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరున్నారు. డోర్లు లాక్ చేసి ఉండటంతో ఈత వచ్చినవారికీ ప్రాణ నష్టం తప్పలేదు. దేవీపట్నం పీఎస్ లో లాంచీ నిర్వహకుడు లొంగిపోయారు. లాంచీ మునక ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ప్రకాశం : అద్దంకి మండలం సింగెరకొండ వద్ద ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. 

 

లాంచీ ప్రమాద ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి

తూర్పుగోదావరి : గోదావరిలో లాంచీ ప్రమాద ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

గోదావరిలో లాంచీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా

తూర్పుగోదావరి : గోదావరిలో లాంచీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

 

09:10 - May 16, 2018

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలపై వక్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, బీజేపీ నేత రాకేష్ రెడ్డి, టీఆర్ ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

09:07 - May 16, 2018

ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, సుప్రీంకోర్టులో ఈ చట్టం అమలుకు సంబంధించి రీ పిటిషన్‌ వేయాలని కోరుతూ దళిత, గిరిజన సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ప్రస్తుతం ఈ చట్టం అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వంగా వ్యవహరిస్తున్నాయని.. దీని వలన తమకు అన్యాయం జరుగుతోందని వారు విమర్శిస్తున్నారు. దేశంలో దళితులపై దాడులు పెరగడానికి కారణం ఈ చట్టం అమల్లో ఉన్న లోపాలేనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలపై జనపథం కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం నాయకులు శోభన్ నాయక్‌ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:58 - May 16, 2018

కోల్ కతా : ఐపీఎల్‌ మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేఆఫ్స్‌ దిశగా అడుగు వేసింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు చేసిన రాజస్తాన్‌ 19 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. స్పీన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ చెలరేగడంతో రాజస్థాన్‌ 142 పరుగులకే పరిమితమయింది. అనంతరం కోల్‌కతా 18 ఓవర్లలో 4 వికెట్లకు 145 పరుగులు చేసింది. క్రిస్‌ లిన్‌, దినేశ్‌ కార్తీక్‌లు కీలక ఇన్నింగ్స్‌ ఆడడంతో నైట్‌రైడర్స్ విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో రాజస్థాన్‌ ప్లే ఆఫ్ అవకాశాలు సక్లిష్టంగా మారాయి. నాలుగు కీలక వికెట్లు తీసి.. కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్‌ యాదవ్..  మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డ్‌ అందుకున్నాడు.

 

08:56 - May 16, 2018

చిత్తూరు : మీ సొంత జిల్లా వాసులకు న్యాయం చెయ్యలేరా అంటూ.. ముఖ్యమంత్రి చంద్రబాబును జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించారు. న్యాయం  జరిగే వరకూ హై రోడ్‌ బాధితుల పక్షాన అండగా నిలుస్తానని చిత్తూరు జిల్లా పర్యటనలో పవన్‌ చెప్పారు. నంద్యాల, విజయనగరం, శ్రీకాళహస్తిలో ఇచ్చిన నష్టపరిహారం చిత్తూరు జిల్లాలో ఎందుకివ్వలేదంటూ ముఖ్యమంత్రిని పవన్‌ ప్రశ్నించారు.

 

08:46 - May 16, 2018

శ్రీకాకుళం : గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలకోసం టీడీపీ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఏ ప్రభుత్వమూ ఇవ్వని విధంగా  ఎస్సీ ఎస్సీలకు 75 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఇకమీదట విద్యుత్‌ ఛార్జీలను పెంచబోమన్నారు... వీలైతే కరెంటు ఛార్జీలను తగ్గించేందుకు ప్రయత్నిస్తామని చంద్రబాబు చెప్పారు.   శ్రీకాకుళం జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ ప్రతి ఆడబిడ్డా ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతోనే మరుగు దొడ్లు కట్టించామన్నారు. 

 

 

08:34 - May 16, 2018

విశాఖపట్నం : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెంపపెట్టని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. కర్నాటకలోని తెలుగు ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేయాలన్న చంద్రబాబు పిలుపును ఓటర్లు బేఖాతరు చేశారన్నారు. ఈ విషయంలో చంద్రబాబు అబాసుపాలయ్యారని విజయసాయిరెడ్డి విమర్శించారు. 

08:25 - May 16, 2018

బెంగళూరు : కర్ణాటక ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా ఏర్పాటయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పార్టీ విజయానికి నిరంతరం కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. 

 

08:20 - May 16, 2018

బెంగళూరు : కర్నాటక పీఠాన్ని.. బీజేపీ సొంతంగా కైవసం చేసుకోక పోవడం వెనుక.. గాలి బ్రదర్స్‌ వైఫల్యం ఎంత..? ఇప్పుడీ ప్రశ్న బళ్లారి జిల్లాలోనే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. ఆఖరు క్షణాల్లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 9 మందికి టికెట్‌ ఇప్పించుకున్న గాలి జనార్దనరెడ్డి.. సానుకూల ఫలితాలు సాధించడంలో.. విఫలం అయ్యాడు. ఇదే ఇప్పుడు బీజేపీకి అధికారాన్ని దూరం చేసిందన్న చర్చ సాగుతోంది. 
బీజేపీ ఆశయాన్ని నీరుగార్చిన ఎన్నికల ఫలితాలు 
కర్నాటక ఎన్నికల్లో.. బీజేపీ 104 సీట్లతో.. అధికారానికి అతి దగ్గరగా వచ్చి నిలిచింది. ఈ ఎన్నికల్లో మరో 9 స్థానాలు వచ్చుంటే.. బీజేపీ ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది. కర్నాటకలో విజయం ద్వారా.. దక్షిణాది రాష్ట్రాల్లో పాతుకు పోవాలన్న బీజేపీ ఆశయాన్ని.. ఎన్నికల ఫలితాలు నీరుగార్చాయి. ఇందులో గాలి జనార్దనరెడ్డి సోదరుల వైఫల్యం కూడా భారీగానే ఉందని.. బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. 
గాలి జనార్దనరెడ్డి వర్గానికి బీజేపీ పెద్దపీట 
గనుల మైనింగ్‌ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సీబీఐ విచారణను ఎదుర్కొంటూ.. జైలు జీవితం కూడా గడిపిన గాలి జనార్దనరెడ్డిని ఆయన సోదరులను.. బీజేపీ చాలాకాలంగా దూరంగా ఉంచింది. 2013లో జరిగిన ఎన్నికల్లో వీరికి సీట్లు కూడా కేటాయించలేదు. ప్రస్తుత ఎన్నికల ప్రారంభంలోనూ గాలి సోదరులకు బీజేపీలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. అయితే.. నామినేషన్ల ఘట్టం ముగింపు సమయంలో.. అనూహ్యంగా గాలి జనార్దనరెడ్డి వర్గానికి బీజేపీ నాయకత్వం పెద్దపీట వేసింది. 
4స్థానాల్లో గాలి అనుయాయులు గెలుపు 
ఈ ఎన్నికల్లో గాలి జనార్దనరెడ్డి సోదరులిద్దరితో పాటు.. ఆయన కీలక అనుయాయులకు ఏడుగురికీ బీజేపీ టికెట్లు కేటాయించింది. బళ్లారి అర్బన్‌, రూరల్‌ నియోజకవర్గాలతో పాటు.. సిరుగుప్ప, హర్పనహళ్లి, హగరిబొమ్మనహళ్లి, మొళకాల్మూరు, కంప్లి, బాగేపల్లి స్థానాల్లో గాలి జనార్దనరెడ్డి మనుషులే బరిలో నిలిచారు. అనూహ్యంగా కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే గాలి అనుయాయులు గెలిచారు. మిగిలిన ఐదు స్థానాల్లోనూ గాలి అనుచరులు ఓడిపోయారు. 
'గాలి' ఎదురుతిరిగింది... 
గాలి జనార్దనరెడ్డి కాస్తంత శ్రద్ధ పెట్టి, తన మనుషులందరినీ గెలిపించి ఉంటే.. ఇండిపెండెంట్లతో కలుపుకుని.. కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేవారమని బీజేపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో ఒడిదుడుకులకు.. గాలి వైఫల్యమూ తోడైందని మొత్తమ్మీద గాలి ఎదురుతిరిగిందని అంటున్నారు. 

08:07 - May 16, 2018

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విచిత్ర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మెజారిటీ ఓట్లశాతం సాధించిన పార్టీకి తక్కువ సీట్లు.. తక్కువ శాతం ఓట్లు పొందిన పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. 18.7 శాతం ఓట్లు మాత్రమే పొందిన పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కాబోతోంది.
కాంగ్రెస్‌కు 38, బీజేపీకి 36.2, జేడీఎస్‌కు కేవలం 18.7 శాతం ఓట్లు    
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌  అధికారానికి దూరమైనా.. అన్ని పార్టీల కంటే ఎక్కువ ఓట్లు సాధించింది. 78 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు మొత్తంగా 38 శాతం ఓట్లు వచ్చాయి. అదే సమయంలో.. 104 స్థానాలు దక్కించుకున్న బీజేపీకి 36.2 శాతం ఓట్లే దక్కాయి. బీజేపీ కన్నా 1.8 శాతం అధిక ఓట్లు పొందిన కాంగ్రెస్‌ పార్టీ.. సీట్ల దగ్గరకు వచ్చేసరికి 78 స్థానాలకే పరిమితమైంది. అంటే, బీజేపీ కంటే కాంగ్రెస్‌కు 26 సీట్లు తక్కువ వచ్చాయి.  బీజేపీ తక్కువ ఓట్లు సాధించినా... ఎక్కువ స్థానాలు గెలుపొందింది. 38 సీట్లు దక్కించుకున్న జేడీఎస్‌కు కేవలం 18.7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. తక్కువ ఓట్లు సాధించిన జేడీఎస్‌ ప్రభుత్వం ఏర్పాటులో కీలకం కాబోతోంది. 

 

07:59 - May 16, 2018

హైదరాబాద్ : నిత్యం ఎంతో కష్టపడి నగరాన్ని శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులు కన్నెర్ర చేశారు. తమకు వేతనాలు చెల్లించాలంటూ బల్దియా ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. నెలంతా కష్టపడ్డా తాము  ప్రతినెలా జీతాల కోసం ఎదురుచూడక తప్పడం లేదని మండిడ్డారు. పని చేయ్యడానికి కనీస సౌకర్యాలు కూడ కల్పించేట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇకనైన తమకు సకాలంలో వేతనాలు అందేలా చూడాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
మున్సిపల్‌ కార్మికులు ఆందోళన 
ఉద్యోగులు, కార్మికులు ఎవరైనా సరే నెల ప్రారంభమైందంటే చాలు.. జీతం కోసం ఆనందంతో ఎదురుచూస్తుంటారు. కానీ గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పని చేసే కార్మికులు నెలంతా జీతాల కోసం ఎదురుచూస్తునే ఉంటారు. కార్మికులే కాదు, అధికారులు కూడా జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఉన్నతాధికారులకు మాత్రం ప్రతినెల 1వ తేదీనే జీతాలు తీసుకుంటున్నారు. కింది స్థాయి కార్మికులకు, ఉద్యోగులకు మాత్రం  అందించేందుకు కాలయాపన చేస్తున్నారు. దీంతో తమకు సకాలంలో జీతాలు చెల్లించాలని బల్దియా కార్యాలయం ముందు మున్సిపల్‌ కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రతి నెల వేతనాలు ఆలస్యం అవుతుడటంతో ఇంటి అద్దెలు, నిత్యవసరాల కొనుగోలుకు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు.
కార్మికులు మండిపాటు
గ్రేటర్‌ హైదరాబాద్‌ అందంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికులు ఎంతో ముఖ్యం. రెండు రోజులు కార్మికులు సమ్మె చేస్తే చాలు రోడ్లపై నడవలేని పరిస్థితి నెలకొంటుంది. అలాంటి కార్మికులకు ప్రతినెలా రోడ్లు శుభ్రం చేసేందుకు చీపుర్లు, ఇతర పనిముట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇలాంటివేవి తమకు సకాలంలో అందటం లేదంటూ కార్మికులు మండిపడుతున్నారు. ఎంత పని చేసినా ప్రభుత్వం తమను గుర్తించటం లేదని ఆందోళన చెందుతున్నారు. పని చేస్తే వేతనాలు ఇవ్వక పోవడం.. పనులు చేయడానికి పనిముట్లు అరకోరగా ఉండటంతో అన్ని విధాల తాము ఇబ్బందులు పడుతున్నామని చెపుతున్నారు. తమకు కేసీఆర్‌ అనేక హామీలు ఇచ్చారని అందులో ఏహామీని అమలు చేయడం లేదని ప్రభుత్వంపై వారు మండిపడ్డారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ప్రత్యేక ఆసుపత్రిలు ఏర్పాటు హామీలు ఎటుపోయాయని నిలదీశారు. తమకు పండుగ సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే పోరాటం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. 

 

07:54 - May 16, 2018

హైదరాబాద్ : ధర్నాచౌక్‌ను ఎత్తివేసి కేసీఆర్‌ సర్కార్‌ ఉద్యమాలు ఆపే ప్రయత్నం చేసిందనీ, కానీ ముఖ్యమంత్రి నిలయం ప్రగతిభవన్‌ కొత్త ధర్నచౌక్‌గా మారిందని పలువురు వక్తలు అన్నారు. ప్రభుత్వం ధర్నా చౌక్‌ను ఆక్యుపై చేసుకుని ఏడాది పూర్తి అయిన సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆక్యుపై ధర్నా చౌక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ ప్రజాగొంతుక ధర్నాచౌక్‌ అనే పుస్తకాన్ని ఆవిష్కరించింది. కేసీఆర్ నిరంకుశ పాలనకు ధర్నాచౌక్‌ను మూసివేడమే నిదర్శనం అన్నారు. సర్కార్ కుట్రలను చేధించి వేలాది మందితో ధర్నాచౌక్‌ను ఆక్రమించినట్టు చాడ వెంకట్‌రెడ్డి గుర్తుచేశారు. అసెంబ్లీ ప్రజాప్రతినిధుల వేదిక అయితే, ధర్నాచౌక్‌ ప్రజల గొంతుకకు వేదికని రచయితల సంఘం నేత వరవరరావు అన్నారు.

 

07:51 - May 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. ప్రగతిభవన్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ సంఘాలతో వారి సమస్యలపై చర్చించనున్నారు. డిమాండ్ల పట్ల ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయనున్నారు. మరోవైపు తమ డిమాండ్లపై కేసీఆర్‌ ఎలా స్పందిస్తారోనని ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఉద్యోగుల డిమాండ్లపై చర్చించనున్న కేసీఆర్‌ 
ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. ఉద్యోగుల డిమాండ్లపై చర్చించనున్నారు. నేరుగా ముఖ్యమంత్రే ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ సంఘాల నేతలతో చర్చలు జరుపుతారు. వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తారు. ఉద్యోగుల సమస్యలపై కేసీఆర్‌ ఇప్పటికే కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇప్పటికే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మిక సంఘాలో చర్చలు జరిపింది. చర్చల సారాంశాన్ని నివేదిక రూపంలో కేసీఆర్‌కు అందజేసింది. 
ప్రభుత్వం ముందు ఉద్యోగుల 18 ప్రధాన డిమాండ్లు
1. పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయడం
2. కొత్త పీఆర్సీని అమలు చేయడం
3. ఉద్యోగుల బదిలీలు చేపట్టడం
4. ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయడం
5. రిటైర్మెంట్‌ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచడం
7. ఉద్యోగులకు శాఖల వారీగా ప్రమోషన్లు చేపట్టడం
8.ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను రప్పించడం
9. కొత్త జిల్లాల్లో ఆర్డర్‌ టూ సర్వ్‌ పేరుతో పని చేస్తున్న వారిని పర్మినెంట్‌ చేసి, హెచ్ ఆర్ ఏ పెంచడం
10.కాంట్రాక్ట్‌ , ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల వేతనాలు  పెంచడం
తమ డిమాండ్లపై సీఎంతో చర్చించనున్న ఉద్యోగులు
ఉద్యోగులు ప్రధానంగా ప్రభుత్వం ముందు 18 ప్రధాన డిమాండ్లు పెడుతున్నారు.  అందులో మొదటిది సీపీఎస్‌ విధానం. పాత పెన్షన్‌ స్కీమ్‌నే అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.  ఇక రెండోది కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయడం. మూడోది ఉద్యోగుల బదిలీలు. ఇక నాలుగోది ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ అంశం. వీటితోపాటు ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచడం... ప్రమోషన్లు, ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను తిరిగిరప్పించడంలాంటి డిమాండ్‌ ఉన్నాయి. అంతేకాదు.. కొత్త జిల్లాలో ఆర్డర్‌ టూ సర్వ్‌ పేరుతో పనిచేస్తున్న వారిని పర్మినెంట్‌ చేసి..వారి  హెచ్‌ఆర్‌ఏ పెంచడం, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల వేతనాలు పెంచడం కూడా వీరి డిమాండ్లలో ప్రధానమైంది.  ప్రభుత్వం తొలగించిన కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తిరిగి తీసుకోవాలనే డిమాండ్‌ను కూడా ఉద్యోగ సంఘాలు లేవనెత్తుతున్నాయి. ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు కూడా తమ డిమాండ్లపై సీఎంతో చర్చించనున్నారు.
నివేదికపై అధికారులతో చర్చించిన సీఎం కేసీఆర్‌
మంత్రివర్గ ఉపసంఘం అందజేసిన నివేదికపై  సీఎం కేసీఆర్‌.. సీఎస్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, జీఏడీ, న్యాయశాఖ అధికారులతో చర్చించారు. ఏఏ సమస్యలను పరిష్కరించగలం, సర్కార్‌పైన ఎంత భారం పడుతుంది, న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై అధికారులతో  చర్చించారు. వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకోని సీఎం సమస్యలపై ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాలు చెపుతున్నాయి.  ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపిన తర్వాత సీఎం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలో చర్చల్లో ప్రభుత్వం ఏం తేల్చుతుందన్న దానిపై ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం ప్రకటన కోసం వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 
 

 

07:47 - May 16, 2018

తూర్పుగోదావరి : గోదావరి నదిలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణీకులతో వెళ్తోన్న లాంచీ ఒకటి ఈదురుగాలుల ధాటికి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణీకులు ఒడ్డుకు ఈదుకురాగా.. మరో 40 మందిపైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 20 బోట్లతో ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై చంద్రబాబు ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 
గోదావరిలో మునిగిన లాంచీ
గోదావరి నదిలో మరో  ఘోర ప్రమాదం సంభవించింది. కొండమొదలు సంత నుంచి ప్రయాణీకులతో బయలుదేరిన లాంచీ మునిగిపోయింది. దేవీపట్నం మండలం మంటూరు దగ్గరికి లాంచీ వచ్చేసరికి భారీ ఈదురు గాలులు వీచాయి. దీంతో నదిలో లాంచీ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడింది. 
గల్లైంతన 40 మంది
లాంచీ ప్రమాదానికిగురైన సమయంలో అందులో 55 నుంచి 60 మంది ప్రయాణీకులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలోనూ మహిళలే ఎక్కువగా ఉన్నారు.  గోదావరిలో లాంచీ మునిగిపోయింది. లాంచీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు కొండమొదలు నుంచి బయలుదేరింది. 5.30 గంటల ప్రాంతంలో లాంచీ మునిగిపోయినట్టు తెలుస్తోంది. అయితే లాంచీలోని 10 నుంచి 15 మంది ప్రయాణీకులు ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చినట్టు తెలుస్తోంది. మిగతావారు గల్లంతయ్యారు. 
రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు
ప్రయాణీకుల హాహాకారాలు విన్న గిరిజనులు నాటుపడవలో వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. మిగతా ప్రయాణీకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.  గల్లైంతైన వారి ఆచూకీ కోసం గోదావరిలో 20 బోట్లతో ముమ్మరంగా చర్యలు చేపట్టారు. రాత్రిపూట కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో అధికారులు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. లాంచీ లక్ష్మీ వెంకటేశ్వర సర్వీస్‌కు చెందినట్టు తెలుస్తోంది. లాంచీ నిర్వాహకుడు దేవీపట్నం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
లాంచీ మునక ఘటనపై చంద్రబాబు ఆరా
గోదావరిలో లాంచీ ముంపునకు గురైన ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి పూర్తి సాయం అందజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మరోవైపు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి లాంచీ మునక ఘటనాస్థలాన్ని పరిశీలించారు. 
గోదావరి లాంచీలో అగ్నిప్రమాదం 
నాలుగు రోజుల క్రితమే గోదావరి లాంచీలో అగ్నిప్రమాదం సంభవించింది. అదే ప్రాంతంలో ఇప్పుడు లాంచీ మునగడం ఆందోళన కలిగిస్తోంది. అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్ని ఘటనలు జరుగుతున్నా అధికారులు ఎందుకు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 

07:42 - May 16, 2018

గుంటూరు : నగరంలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అత్యాచారయత్నానికి గురైన బాలిక తల్లిదండ్రులు, స్థానికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితి లాఠీచార్జీ వరకు వెళ్లింది. ఆందోళనకారులు సైతం పోలీసుల మీద రాళ్లురువ్వడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పీఎస్‌ అద్దాలతోపాటు పోలీసుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. 
ఏపీలో పెరుగుతున్న నేరాలు
ఏపీలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. నిందితులను పట్టుకుని కఠిన శిక్షలు విధించకపోవడంతో అమ్మాయిలు , మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో దాచేపల్లి ఘటన ఇంకా మరువకుండానే.. అదే గుంటూరులో మరో దారుణం వెలుగు చూసింది. మైనర్‌పై రాజాసింగ్‌ అనే వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
బాలికపై రాజాసింగ్‌ అత్యాచారయత్నం
గుంటూరులోని రాజీవ్‌గృహ కల్ప సముదాయంలో రాజాసింగ్‌ అనే యువకుడు నివాసముంటున్నాడు. ఇతడు ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన రాజాసింగ్‌.. అక్కడ ఆడుకుంటున్న పదేళ్ల చిన్నారిని మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. బాలికపై అత్యాచారం చేయబోవడంతో... బిగ్గరగా కేకలు పెట్టింది. దీంతో స్థానికులు అతడిని చితకబాదారు. దొరికవారంతా దొరికినట్టు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితుడు రాజాసింగ్‌ను పోలీసులు పీఎస్‌కు తీసుకెళ్లిన తర్వాత స్థానికులంగా భారీ సంఖ్యలో పీఎస్‌కు చేరుకున్నారు. రాజాసింగ్‌ను తమకు అప్పగించాలంటూ ఆందోళన నిర్వహించారు. నిందితుడిని ఉరితీయాలంటూ వందల సంఖ్యలో వచ్చిన స్థానికులు నినాదాలు చేశారు. 
ఆగ్రహించిన బాలిక బంధువులు, స్థానికులు 
పోలీసులు స్పందించకపోవడంతో ఆగ్రహించిన బాలిక బంధువులు, స్థానికులు పోలీస్‌స్టేషన్‌పై దాళ్లదాడికి తెగబడ్డారు. పోలీస్‌స్టేషన్‌పై రాళ్లు రువ్వారు. ఈ రాళ్లదాడిలో పీఎస్‌ అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలువురు పోలీసులు గాయపడ్డారు. దీంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు.  ఆందోళనకారులను చితకబాదారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న  అర్బన్‌ఎస్పీ విజయరావు పీఎస్‌కు చేరుకుని పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులతో చర్చలు జరిపారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

 

గోదావరిలో మునిగిపోయిన లాంచీ

తూర్పుగోదావరి : దేవీపట్నం మండలం మంటూరు వద్ద గోదావరిలో లాంచీ మునిగిపోయింది. ప్రమాద సమయంలో లాంచీలో 36 మంది ఉన్నట్లు సమాచారం. 10 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. కొండమొదలు నుంచి వస్తుండగా మంటూరు వద్ద లాంచీ నీటిలో మునిగిపోయింది. మంటూరుకు చెందిన గిరిజనులు నాటుపడవలతో ప్రమాదస్థలికి వెళ్లారు. ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు చేపట్టారు. దేవీపట్నం పోలీసుల ఎదుట లాంచీ నిర్వాహకుడు ఖాజా లొంగిపోయాయి. 

 

పాత గుంటూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రికత్త

గుంటూరు : పాత గుంటూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రికత్త నెలకొంది. మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన రాజాసింగ్ అనే వ్యక్తిని శిక్షించాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. గుంటూరులో 144 సెక్షన్ విధించారు. 

 

Don't Miss