Activities calendar

17 May 2018

పడవ ప్రమాదం..19 మృతదేహాల వెలికితీత...

తూర్పుగోదావరి : జిల్లా మంటూరు వద్ద గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతంతంకు పెరుగుతోంది. ఇంతవరకు 19 మృత దేహాలను వెలికితీసి శవపరీక్ష నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కేంద్రంపై ఆర్థిక మంత్రుల విమర్శలు...

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై రాష్ట్రాలు ఆధారపడేలా... రాష్ట్రాలకు భిక్షం వేసే తీరులో మోదీ సర్కారు వ్యవహరిస్తోందని ఆరు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలపై అభ్యంతరాలు తెలుపుతూ.. వారు... రాష్ట్రపతి కోవింద్‌కు నివేదికను సమర్పించారు. 

21:15 - May 17, 2018

విశాఖపట్టణం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల ఇరవై నుంచి పవన్‌ బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. విభజన హామీలు అమలు.. ప్రత్యేక హోదా.. ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతమే లక్ష్యంగా పవన్‌ ఈ యాత్రను ప్రారంభిచనున్నారు.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ 2019 ఎన్నికలకు గాను ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అన్ని నియోజక వర్గాల్లో పోటీ చేస్తామని పవన్‌ ఇప్పటికే ప్రకటించారు. వైసీపీ అధినేత జగన్‌ ఇప్పటికే పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తుండగా.. పవన్‌ కూడా దీన్నే ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తోంది. ముందుగా వెనుక బడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర నుంచి బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. మరో వైపు పార్టీని బలోపేతం చేయడం పై కూడా పవన్‌ దృష్టి సారించారు.

పవన్‌ యాత్రకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సు యాత్రని సక్సెస్‌ చేయడం ద్వారా క్యాడర్‌లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా పవన్‌ యాత్ర కొనసాగనుందని తెలిపారు. ఆగస్టులో పవన్‌ మ్యానిఫెస్టో ప్రకటిస్తారని వారు ప్రకటించారు. ఇందులో భాగంగా పవన్‌ తనతో పాటు మ్యానిఫెస్టో కమిటీని కూడా యాత్రలో తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ప్రజల సమస్యల ఆధారంగా మేనిఫెస్టో రూపొందించాలని భావిస్తున్నారు. పవన్‌ సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటికి పరిష్కార మార్గాలు కూడా చూపాలని వ్యూహరచన చేస్తున్నారు. మరో వైపు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై 175 నియోజక వర్గాల్లో కవాతు నిర్వహిస్తామని పవన్‌ తెలిపారు. బస్సు యాత్రతో జనసేనకు కొత్త ఊపు తీసుకురావాలని పవన్‌ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

21:12 - May 17, 2018

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదారాబాద్‌లో గాలి వాన బీభత్సం సృష్టించింది. హోరు గాలి.. జోరు వానతో నగరం తడిసి ముద్దైంది. సుమారు అరగంటపాటు కురిసిన వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షానికి జీహెచ్ఎంసీతోపాటు పలు కార్యాలయాల్లోని ఫైళ్ళు తడిసిపోయాయి. ప‌లు ప్రాంతాల్లో చెట్లు, విరిగి పడ్డాయి. విద్యుత్‌ సరఫరాకు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కమ్ముకున్న మేఘాలు ఒక్కసారిగా కుండ‌పోత వ‌ర్షాన్ని కురిపించాయి. నగరం అంతా మ‌బ్బులతో చీక‌టి మ‌యం అయింది. విపరీతమైన గాలి వానకు ప్రజలు బెంబేలెత్తారు. గాలి వానకు పలు చోట్ల భారీ చెట్లు నేలకూలాయి. దీంతో ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌లిగింది.

గాలి వానతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం క‌లిగింది. వెస్ట్ జోన్ నుంచి ఈస్ట్ జోన్ వ‌ర‌కు తీవ్రమైన గాలుల‌తో కూడిన వ‌ర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. అంబ‌ర్ పేట‌లో ఐదు సెంటి మీట‌ర్లు, హిమాయ‌త్ న‌గ‌ర్, నాంప‌ల్లి, ఖైర‌తాబాద్‌ల‌లో నాలుగు సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. మ‌ల్కాజ్ గిరి, గోల్కొండ‌లో మూడు సెంటిమీట‌ర్లకు పైగా వ‌ర్షపాతం న‌మోదైంది. సుమారు అర్దగంట‌ పాటు కురిసిన వానకు... ఐదు సెంటి మీట‌ర్ల వ‌ర్షపాతం న‌మోదైంది.

నాగ‌మ‌య్య కుంట.. అంజ‌నేయ స్వామి టెంపుల్ వ‌ద్ద వందేళ్ల నాటి భారీ రావి వృక్షం విరిగిపడి..నాలుగు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. జీహెచ్ఎంసీ, స‌చివాల‌యం, ఐ ఆండ్ పీఆర్ కార్యాల‌యం వ‌ద్ద ఉన్న చెట్లు కూలి.. వాహ‌నాలు ధ్వంసం అయ్యాయి. విపరీతంగా వీచిన గాలికి జిహెచ్ఎంసీతోపాటు ప‌లు కార్యాల‌యాల్లో అద్దాలు పగిలిపోయాయి. వర్షానికి ఫైళ్ళు తడిసిపోయాయి. సైబర్ సిటీ, హబ్సి గూడా, మేడ్చల్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ జోన్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలి వానకు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది, బల్దియా మాన్ సూన్ రిస్క్యూ టీమ్‌లను రంగంలోకి దింపారు.

21:09 - May 17, 2018

ప్రకాశం : బీజేపీ అనైతిక రాజకీయాలతో కర్నాటకలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మెజారిటీ ఉన్న కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించకపోవడాన్ని బాబు తప్పుపట్టారు. కర్నాటక విషయంలో బీజేపీ అధినాయకత్వం రాజ్యాంగ విరుద్ధంగా, అనైతికంగా వ్యవహరించిందని ప్రకాశం జిల్లా పోకూరు సభలో చంద్రబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. నీరు-ప్రగతి స్కీం కింద.. వలేటివారిపాలెం మండలం పోకూరు చెరువులో జరుగుతున్న పూడికతీత పనులను పర్యవేక్షించారు. పోకూరు సభలో ప్రసంగించిన చంద్రబాబు కర్నాటక రాజకీయ పరిణామాలపై స్పందించారు. ఆ రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ కూటమిగా అవతరించిన కాంగ్రెస్‌, జేడీఎస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించకపోవడాన్ని ముఖ్యమంత్రి తప్పుపట్టారు. బీజేపీ అప్రజాస్వామికంగా, అనైతికంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య కుల, మత, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి, విభజించి పాలించడంలో బీజేపీ నాయకులు బ్రిటీషు పాలకులను మించిపోయారని చంద్రబాబు మండిపడ్డారు.

విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం చేస్తుందని గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకుంటే.. చివరికి మొండిపోయి చూపారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో కలిసి నాటకాలాడుతున్న ప్రతిపక్ష నేత జగన్‌.. గోదావరి లాంచీ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించకపోవడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. నూకవరం ఎస్సీ కాలనీలో చంద్రబాబు... ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఆర్థిక సహాయంలో 11 మంది లబ్దిదారులకు ఇన్నోవా కార్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత బడేవారిపాలెంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అమరావతి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల విరాళం ఇచ్చిన నరసింహంను చంద్రబాబు అభినందించారు.

ప్రకాశం జిల్లాలో రాళ్లపాడు ఎత్తిపోతల ప్రాజెక్టు పెండింగ్‌ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. 

సుప్రీంలో రాంజెఠ్మలాని పిటిషన్...

తమిళనాడు : కర్ణాటక రాజకీయ పోరాటంలో ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలాని కూడా ప్రవేశించారు. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

21:05 - May 17, 2018

ఢిల్లీ : కర్ణాటక రాజకీయ పోరాటంలో ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలాని కూడా ప్రవేశించారు. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. రాజ్యాంగ అధికారాలను గవర్నర్‌ దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. రామ్ జఠ్మలానీ వేసిన పిటీషన్‌పై చీఫ్‌ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టనుంది. 

ప్రభుత్వాన్ని ఖూనీ చేశారు - స్టాలిన్...

ఢిల్లీ : ప్రధాని మోది తమిళనాడులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే...కర్ణాటకలోనూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని డిఎంకే నేత స్టాలిన్‌ ఆరోపించారు. తగిన మెజారిటీ లేకుండా గవర్నర్‌ యడ్యూరప్పతో ప్రమాణం చేయించడంపై ఆయన మండిపడ్డారు.

21:03 - May 17, 2018

ఢిల్లీ : ప్రధాని మోది తమిళనాడులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే...కర్ణాటకలోనూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని డిఎంకే నేత స్టాలిన్‌ ఆరోపించారు. తగిన మెజారిటీ లేకుండా గవర్నర్‌ యడ్యూరప్పతో ప్రమాణం చేయించడంపై ఆయన మండిపడ్డారు. గవర్నర్‌ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో బేరసారాలకు ప్రోత్సహించే విధంగా ఉందన్నారు. గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాన్ని డిఎంకే తీవ్రంగా ఖండిస్తోందని స్టాలిన్‌ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. బిజెపి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

21:02 - May 17, 2018

ఢిల్లీ : కర్ణాటక గవర్నర్‌ తీసుకున్న నిర్ణయంతో గోవా, బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటు అంశాలను కాంగ్రెస్‌, ఆర్జేడి తెరపైకి తెచ్చాయి. గోవా, బిహార్‌లలో అతిపెద్ద పార్టీగా నిలిచిన తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌, ఆర్జేడి డిమాండ్‌ చేశాయి. దీనిపై తాము రేపు గవర్నర్‌ను కలిసి డిమాండ్‌ చేస్తామని ఆర్జేడి నేత తేజస్వి యాదవ్‌ తెలిపారు. 81 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్‌ 17 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం నాలుగు స్థానాల దూరంలో నిలిచింది. 14 స్థానాలు గెలిచిన బిజెపి జిఎఫ్‌పి, ఎంజిపి, ముగ్గురు ఇండిపెండెంట్ల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గోవా గవర్నర్ మృదుల సిన్హా కూడా కర్ణాటక గవర్నర్ బాటలోనే నడవాలని గోవా కాంగ్రెస్ చీఫ్‌ చంద్రకాంత్ కవ్లేకర్ అన్నారు. మణిపూర్‌, మేఘాలయలో కూడా ఇదే పద్ధతి అనుసరించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

21:00 - May 17, 2018

ఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రిగా బిజెపి నేత యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. యడ్డీ ప్రమాణ స్వీకారానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించింది. గవర్నర్‌ బల నిరూపణకు బిజెపికి 15 రోజుల గడువు ఇవ్వడంతో కాంగ్రెస్‌, జెడిఎస్‌లు తమ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డాయి. కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది.

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం గత రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు గవర్నర్‌ తెరదించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. కర్ణాటక రాష్ట్రానికి 25వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ వాజుబాయ్‌ వాలా యడ్డీతో ప్రమాణ స్వీకారం చేయించారు. బల నిరూపణకు యడ్డీకి 15 రోజుల గడువిచ్చారు. తాను అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుంటానన్న విశ్వాసాన్ని యడ్యూరప్ప వ్యక్తం చేశారు.

యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. 1943 ఫిబ్రవరి 27న రైతు కుటుంబంలో జన్మించిన యడ్యూరప్ప ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త. తొలుత గుమాస్తాగా పనిచేసిన ఆయన ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1975లో శికారిపుర పురపాలిక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. మరోవైపు యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట బైఠాయించారు.

కాంగ్రెస్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌, అశోక్‌ గెహ్లాట్‌, మల్లికార్జున్‌ ఖర్గే, వేణుగోపాల్‌, సిద్ధరామయ్య తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ కాంగ్రెస్‌ నేతలకు సంఘీభావం తెలిపారు. బిజెపికి తగిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. కర్ణాటకలో రాజ్యాంగం హత్యకు గురైందని ... బిజెపి-ఆర్‌ఎస్ఎస్‌ రాజ్యాంగ సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయని ధ్వజమెత్తారు.

కర్ణాటకలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిజెపియేతర పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలని జెడిఎస్‌ శాసనసభా పక్ష నేత కుమారస్వామి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలను మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. బిజెపి తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని కుమారస్వామి ఆరోపించారు.

యడ్యూరప్పకు అసెంబ్లీలో బల నిరూపణకు గవర్నర్‌ 15 రోజుల గడువు ఇవ్వడంతో కాంగ్రెస్‌, జెడిఎస్‌లు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డాయి. కాంగ్రెస్‌ తమ ఎమ్మెల్యేలను ఈగల్టన్‌ రిసార్టులో ఉంచింది. 78 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు గాను ముగ్గురు మాయమైనట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి 104, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 38 సీట్లు వచ్చాయి. తన బలాన్ని నిరూపించుకునేందుకు బిజెపికి మరో 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరముంది. ఫ్లోర్‌ టెస్ట్‌కు ముందు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కాంగ్రెస్‌, జెడిఎస్‌లకు సవాల్‌గా మారింది.

20:44 - May 17, 2018

ప్రజాస్వామ్య బద్దంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు జేస్తమంటున్నడు కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి యడ్యూరప్పయ్యగారు..ఒక్కటే దేశం.. ఒక్కటే రాజ్యాంగం.. ఒక్కటే న్యాయ వ్యవస్థ.. ఒక్కడే రాష్ట్రపతి.. ఒక్కడే ప్రధానమంత్రి.. ఒక్కటే చట్టం.. ఒక్కటే తీరు ఓటు.. తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర కార్యాలయం రెడీ అయ్యింది.. రైతు బందు పత్కం బెట్టి కూలిచ్చి ఈపువలగొట్టిచ్చుకున్నట్టే ఉన్నదిగదా సర్కారు పనితనం గూడ..చాచాచా ఎంత పనైపాయే.. గోదావరి నదిల మున్గిపోయిన పడ్వ ముచ్చట్ల ఇప్పటికి పద్దెన్మిది శవాలను బైటికి దీశిండ్రట.. అర్వై ఏండ్లు పరిపాలన జేశి పార్టీలు నల్లగొండ ఫ్లోరైడును ఎందుకు పొడగొట్టలేకపోయిండ్రు.. తిరుమల ఎంకన్న గుడిల పంచాది రాజుకున్నది.. అర్వై ఏండ్లు నిండిన అర్చకులను రిటైర్మెంట్ జేశేస్తం అని ధర్మకర్తల మండలి నిన్న నిర్ణయం జేశింది..జపాన్ దేశంల ఒక రైల్వే స్థంస్థ ప్రయాణికునికి క్షమాపణ జెప్పింది..?

20:40 - May 17, 2018

ఆర్టీసీ కార్మికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేతన సవరణ జరుగుతుందా? సంస్థ అప్పుల్లో ఉంది, నష్టాలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పిన మాటల్లో నిజమెంత? గత వేతన ఒప్పందం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైంది? పీఆర్సీ పట్ల ఆర్టీసీ యాజమాన్యం వైఖరేంటి? అధికార పార్టీకి చెందిన గుర్తింపు సంఘం ఏమంటోంది? ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వీఎస్ రావు (ఎస్ డబ్ల్యూఎఫ్), రాజ్ మోహన్ (టీఆర్ఎస్), అశోక్ (ఎన్ఎంయు ప్రధాన కార్యదర్శి), కె.రాజిరెడ్డి (ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.  

19:40 - May 17, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేతన సవరణ జరుగుతుందా? సంస్థ అప్పుల్లో ఉంది, నష్టాలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పిన మాటల్లో నిజమెంత? గత వేతన ఒప్పందం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైంది? పీఆర్సీ పట్ల ఆర్టీసీ యాజమాన్యం వైఖరేంటి? అధికార పార్టీకి చెందిన గుర్తింపు సంఘం ఏమంటోంది? ఇప్పటికే సమ్మె సైరన్ మోగించిన కార్మిక సంఘాలు ఏమంటున్నాయనే అంశంపై టెన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఆర్టీసీలో వేతన సవరణ గడువు ముగిసి ఏడాది గడిచింది. గత సంవత్సరం ఏప్రిల్‌ లో కొత్త పీఆర్సీ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. పే రివిజన్ కమిటీ వేసినప్పటికీ పీఆర్సీపై ఒక స్పష్టత రాలేదు. పద్నాలుగు నెలలుగా వేతన సవరణలో జాప్యం వల్ల కార్మికుల్లో అసంతృప్తి పెరుగుతుండటంతో ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘమైన టీఎంయూ ఛలోబస్ భవన్ కార్యక్రమం చేపట్టింది. ఇతర కార్మిక సంఘాలు జేఏసీ ఏర్పాటు చేసి పోరాటాలకు దిగడంతో ఒక్క సారిగా వాతావరణం వేడెక్కింది. మంత్రి హరీష్ రావు గౌరవాధ్యక్షుడుగా ఉన్న టీఎంయూ.. ప్రభుత్వంపై, ఆర్టీసీ యాజమాన్యంపై యుద్ధం ప్రకటించింది. ఈ నేపథ్యంలో గుర్తింపు సంఘం సహా అన్ని కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇవ్వడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కార్మిక సంఘాలతో చర్చలు నిర్వహించింది. ఇదే సమయంలో సీఎం చేసిన వ్యాఖ్యలు కార్మికుల ఆశలపై నీళ్లు చల్లాయి.

గత వేతన సవరణ సందర్భంగా ఒక నెల ముందుగానే పీఆర్సీ ఇస్తామని సీఎం కేసిఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. వేతన సవరణ గడువు ముగిసి పద్నాలుగు నెలలయ్యింది. వేతన సవరణ చేయాలని కార్మిక సంఘాలు కోరితే ఇప్పవటికే.. ఆర్టీసీ పీకల్లోతు అప్పుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జీతాలు పెంచాలని కోరడమేంటని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటలకు కార్మిక నేతలు మండిపడ్డారు. ఆర్టీసీ నష్టాలకు కారణాలపై చర్చకు సిద్ధమా అంటూ స్వయంగా గుర్తింపు సంఘం నేత అశ్వత్థామ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఆర్టీసీలో నష్టాలే లేవని నేతలంటున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సుమారు 60 డీపోలు లాభాల్లోకి వచ్చాయన్నారు. ఈ విషయాన్ని రవాణా శాఖా మంత్రి పలు సందర్భాల్లో చెప్పారని వారు గుర్తు చేస్తున్నారు. సంస్థ నష్టాలకు అసలు కారణాలు వేరే ఉన్నాయని వారంటున్నారు.

తెలంగాణలో ఆర్టీసీ నష్టాలకు డీజిల్ భారం ప్రధాన కారణం. టీఎస్ఆర్టీసీ ఏటా 20 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తోంది. డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా ఆర్టీసిపై భారం పడుతూనే ఉంది. ఆర్టీసీకి ఈ నాలుగేళ్లలో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని సీఎం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఆర్టీసీ కొనుగోలు చేసిన డీజిల్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టిన పన్ను రెండు వేల ఆరువందల 90 కోట్లరూపాయలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు డీజిల్ ధరలను పోల్చి చూస్తే లీటర్ కి 18 రూపాయలు పెరిగింది. ఆ భారం ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్టీసీపై పడింది. మొత్తం మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేవలం డీజిల్ పైనే ఆర్టీసి ఖర్చు పెట్టింది.

ఆర్టీసీ కార్మికులు వేతనాలు అడిగితే ఇతర రాష్ట్రాలతో సీఎం పోల్చడం తగదన్నారు. అలా పోల్చినట్టయితే.. కేరళ ప్రభుత్వం బడ్జెట్లో మూడువేల కోట్లు, తమిళనాడు ప్రభుత్వం తాజా బడ్జెట్ లో నాలుగు వేల ఏడు వందల కోట్లు కేటాయించింది. ధనిక రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లలో ఆర్టీసీకి కేటాయించింది 11 వందల కోట్ల రూపాయలు మాత్రమే. ఆర్టీసీకి సాయం చేయక పోగా ఆర్టీసీకి ఇవ్వాల్సిన రీయింబర్స్‌మెంట్ ను కూడా నెలల తరబడి ఇవ్వడం లేదు. ఆర్టీసీ కార్మికలు కష్టపడి పని చేస్తున్నప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహం లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. ఆర్టీసీకి రోజుకు కోటి రూపాయలు నష్టం వస్తోందని సీఎం, రవాణా మంత్రి చేస్తోన్న వ్యాఖ్యలను కూడా నేతలు తప్పుపడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు రోజుకు 12 కోట్ల రూపాయలు ఆదాయం తెస్తున్నారన్నారు. ఇందులో ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో కోటిన్నర రూపాయలు ప్రతీ రోజు చెల్లిస్తున్నారని వారంటున్నారు.

మరోవైపు సిఎం హాట్ కామెంట్స్ చేసిన తరుణంలోనే గుర్తింపు సంఘం నేతలతో మంత్రి వర్గ ఉపసంఘం జరిపిన చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో గుర్తింపు సంఘం గౌరవాధ్యక్షుడు మంత్రి హరీష్ రంగంలోకి దిగి నేతలను చల్లబరిచే కార్యక్రమానికి పూనుకున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో పాటే తమకు కూడా తీపి కబురు అందుతుందని భావించిన టిఎంయూ నేతలకు ఆశాభంగమే మిగిలింది.

మంత్రి వర్గ ఉప సంఘం చర్చలు ఎటూ తేల్చకపోవడం, సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం, గుర్తింపు సంఘం నేతల వేచి చూసే ధోరణి నేపథ్యంలో పది యూనియన్లతో కూడిన జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణకు పిలుపునిచ్చింది. పద్నాలుగు నెలలుగా వేతన సవరణ కోసం ఎదురు చూస్తున్న కార్మికుల ఆగ్రహం సమ్మె బాట పట్టే అవకాశం స్పష్ఠంగా కనిపిస్తోంది.

బషీర్ బాగ్ లో అగ్నిప్రమాదం...

హైదరాబాద్ : బషీర్ బాగ్ 5 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భవనంలోని మహవీర్ హౌస్ లో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

కర్ణాటకలో పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు...

కర్ణాటక : రాష్ట్రంలో పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా అమర్ కుమార్ పాండే, ఇంటెలిజెన్స్ డిప్యూటి డీజీగా సందీప్ పాటిల్, ఏసీబీ ఎస్పీగా గిరీష్, బీదర్ ఎస్పీ దేవరాజ్ లు బదిలీ అయ్యారు. 

18:41 - May 17, 2018
18:38 - May 17, 2018

అనంతపురం : రూ 3వేలు ఇవ్వండి..లక్ష రూపాయలు లోన్ ఇప్పిస్తానంటూ ఓ మహిళ మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. నాగమణి అనే మహిళ పలువురు అమాయికులను మోసం చేసింది. మూడు వేలిస్తే లక్ష రూపాయల లోన్ ఇప్పిస్తానంటే నమ్మి డబ్బులివ్వడం జరిగిందని, ప్రైవేటు బ్యాంకు పేరు చెప్పి లోన్ మంజూరవుతున్నట్లుగా నాటకం ఆడిందని బాధితులు లబోదిబోమంటున్నారు. మొత్తం 30 మంది నుండి డబ్బులు వసూలు చేసిందని పేర్కొంటూ బాధితులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

18:31 - May 17, 2018
18:30 - May 17, 2018

విశాఖపట్టణం : ఇక జనసేనానీ పోరుబాట పట్టనున్నారు. విభజన హామీలు..ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆయన యాత్ర చేపట్టనున్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 'బస్సు యాత్ర' షెడ్యూల్ ను ప్రకటించారు. ఉత్తరాంధ్రలో ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం జిల్లా నుంచి పోరాటం ప్రారంభిస్తున్నాన్నట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీన ఇచ్ఛాపురం నుంచి బస్సుయాత్ర ఉంటుందని, గంగపూజ నిర్వహించి యాత్ర మొదలుపెడుతామన్నారు. మొత్తం 17రోజుల పాటు పర్యటన ఉంటుందని, బస్సు యాత్రలో భాగంగా ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ప్రతి నియోజకవర్గంలో యువత, విద్యార్థులతో కవాతు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతి జిల్లా కేంద్రంలో లక్షమందితో ఈ కవాతు ఉంటుందన్నారు. 

18:24 - May 17, 2018

ప్రకాశం : ఏపీకి ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలపై కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మండిపడ్డారు. కేంద్రంపై పలు విమర్శలు గుప్పించారు. ప్రకాశం జిల్లా పోకూరులో నీరు - ప్రగతి కార్యక్రమంలో పాల్గొని ఏర్పాటు చేసిన సభలో బాబు మాట్లాడారు...
కర్ణాటకలో బీజేపీ అనైతికంగా..అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. ఒక పార్టీకి మెజార్టీ ఇస్తే...రాజ్యాంగపరంగా ముందుకు పోవాలని, ప్రజాస్వామ్యయుతంగా చేయాల్సి ఉంటుందన్నారు. కానీ కర్ణాటకలో కాంగ్రెస్..జేడీఎస్ లు రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే..గవర్నర్ ఆహ్వానించకుండా ఇతర పార్టీకి అవకాశం ఇవ్వడం సబబేనా ? ఆలోచించాలన్నారు. ఇదేనా నీతి ? అంటూ మండిపడ్డారు. అధికారం ఉందని బీజేపీ ఇష్టానుసారంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అన్యాయం చేసిందన్న బీజేపీ ప్రస్తుతం చేసింది ఏంటీ ? ఇది మంచి పద్ధతి కాదన్నారు. 

రాష్ట్రపతిని కలిసిన పలువురు ఆర్థిక మంత్రులు...

ఢిల్లీ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను పలువురు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కలిశారు. 15 ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ పై మెమోరాండంను సమర్పించారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, వెస్ట్ బెంగాల్, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులున్నారు. 

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు...

ఢిల్లీ : కర్ణాటకలో నెలకొన్న పరిణామాలపై కాంగ్రెస్ భగ్గుమంది. దేశ వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. కర్ణాటకలో సంఖ్యా బలం లేకున్నా యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. బల నిరూపణకు ఏకంగా 15 రోజుల గడువును గవర్నర్ ఇచ్చారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యేల బస..రిసార్ట్స్ వద్ద భద్రత...

బెంగళూరు : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్స్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్..జేడీఎస్ పార్టీలు పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. 

18:07 - May 17, 2018

ప్రకాశం : కేంద్ర ప్రభుత్వానికి సహకరించే వ్యక్తులు రాష్ట్ర ద్రోహులుగా గుర్తించాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నీరు -ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రకాశం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రం కోసం కేంద్రంపై ఒక్క మాట మాట్లాడడం లేదని..ఇది బాధాకరమని..ఎండగట్టాలని వైసీపీని ఉద్ధేశించి మాట్లాడారు. పొగాకు రైతుల సమస్యలపై ఈడీ..కలెక్టర్ లకు తగిన విధంగా ఆదేశాలివ్వడం జరిగిందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా తమ ప్రభుత్వం డబ్బులిచ్చడం జరిగిందన్నారు. మద్దతు ధర ఇవ్వకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని..అయినా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గొంట్టివాటి కొండవాటు కాలువ పూర్తి చేసి కందుకూరు ప్రాంతానికి నీళ్లు తీసుకొస్తామన్నారు. 

17:32 - May 17, 2018

హైదరాబాద్ : ఓ యువకుడికి అప్పుడే జీవితంపై విరక్తి చెందిందంట..దీనితో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సరూర్ నగర్ లో చోటు చేసుకుంది. ఘట్ కేసర్ మండలం అన్నోజీగూడానికి చెందిన సాయి కుమార్ గౌడ్ రిలయెన్స్ మార్కెట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి ఇతను ఫ్యాన్ కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. జీవితంపై విరక్తి చెందిన కారణంగానే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కారణాలు తెలియాల్సి ఉంది. 

17:21 - May 17, 2018

కొమరం భీం ఆసిఫాబాద్ : రైతు బంధు కార్యక్రమం రైతులకు ఆనందం..రైతుల ఇంట్లో పండుగ కనపిస్తోందని తెలంగాణ ఎమ్మెల్యే కోనప్ప పేర్కొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ దహేగాంలో జరిగిన రైతు బంధు కార్యక్రమంలో ఆయన పాల్గొని చెక్కులు..పాస్ పుస్తకాలను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. పోడు భూముల విషయంలో కూడా సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారని, విపక్షాలు కేవలం రాజకీయ కోణంలోనే చూస్తున్నాయని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోలని నారంవారిగూడెంలో జరిగిన రైతు బంధు కార్యక్రమంలో ట్రైకార్ ఛైర్మన్ తాటి వెంకటేశ్వరు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:07 - May 17, 2018

హైదరాబాద్ : స్పోర్ట్స్ కోటా..తప్పుడు ధృవపత్రాలతో మెడికల్ సీట్లు...అధికారులు చేతివాటానికి పాల్పడడంతో అర్హులైన విద్యార్థులకు నష్టం కలుగుతుందని టెన్ టివి ప్రసారం చేసిన కథానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన వచ్చింది. ఏకంగా ఏసీబీ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. తప్పుడు ధృవపత్రాలతో స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్లు సంపాదించారని, స్పోర్ట్స్ కోటాను అక్రమంగా దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

భీభత్సంగా భాగ్యనగరం..

హైదరాబాద్ : నగరాన్ని ఒక్కసారిగా భారీవర్షం ముంచెత్తింది. కుండపోతగా కురిసిన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి. పట్టపగలే దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో... మ.4గంటలకే నగరం చీకటిమయంగా మారింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, యూసుఫ్ గూడ, బేగంపేట్, పంజాగుట్ట, సికింద్రాబాద్, కూకట్ పల్లి, వారాసిగూడ, మల్కాజిగిరి, అబిడ్స్, కోఠి, సుల్తాన్ బజార్, బషీర్ బాగ్, ఆల్వాల్, తిరుమలగిరి, అమీర్ పేట్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది.

మరో సెల్ఫీ సూసైడ్..

హైదరాబాద్ : మరో సెల్ఫీ సూసైడ్ వెలుగులోకి వచ్చింది. అనిల్ అనే యువకుడు ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఆత్మహత్యను ఫోన్ ద్వారా సెల్ఫీ వీడియో తీశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. ఓ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న అనిల్ డిప్రెషన్ కి లోనయి సూసైడ్ చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

16:46 - May 17, 2018

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు కార్యక్రమం కొనసాగుతోంది. అర్హులైన రైతులు చెక్కులు అందుకుని వారికి కేటాయించిన బ్యాంకుల వైపు పరుగులు తీస్తున్నారు. దీనితో ఆయా బ్యాంకుల వద్ద చాంతాడంత క్యూలు దర్శనమిస్తున్నాయి. ఎండకాలం కావడం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. సంగారెడ్డిలో రైతులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లోని బ్యాంకులను కాదని ఇతర బ్యాంకుల్లో చెక్కులు మార్పిడి చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. దీనితో కెనరా బ్యాంకు వద్ద రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:34 - May 17, 2018
16:31 - May 17, 2018

జీవిత చరిత్రలను సినిమాలుగా తీసి ప్రేక్షకులను అలరించటం, విమర్శకులను మెప్పించటం అంటే మాటలు కాదు..అందులోను కొందరు సినిమా చరిత్రలో సునామీ సృష్టించి..ఆచంద్రతారార్కం నిలిచిపోయిన కొందరి జీవిత చరిత్రలను తెరకెక్కించటమంటే కత్తిమీద సాము లాంటిదే. వారి గురించి ఎన్నో తెలుసుకోవాలి.వారి అలవాట్లను, హావభావాలను పలికించటం, నటించటం అంటే మాటలు కాదు. అటువంటి గొప్ప నటుడు ఎన్టీఆర్ బయోపిక్ అంటే మాటలు కాదు..ఏ పాత్రకు ఎవరిని తీసుకోవాలి?ఆ పాత్రకు వారు సరిపోతారా? న్యాయం చేయగలరా? అనే కోటి ప్రశ్నలు దర్శకుడి సమర్థతను ప్రతిబింభాస్తాయి. అలా ఎన్టీఆర్ పాత్రకు నటుడు బాలకృష్ణ ఫిక్స్ అయ్యాడు. ఇక ఆయన వియ్యంకుడు, సీఎం, ఎన్టీఆర్ అల్లుడు అయిన నారా చంద్రబాబునాయుడు పాత్రలో ఎవరు నటించనున్నారనే ప్రశ్న రానే వచ్చింది. మరి ఆ పాత్రకు దగ్గుపాటి రానా ఎంపికయినట్లుగా సినీ పరిశ్రమ సమాచారం.

చంద్రబాబు పాత్రలో రానా?..
నందమూరి బాలకృష్ణ తలపెట్టిన మహానేత దివంగత ఎన్టీ రామారావు బయోపిక్ లో రానా కీలక పాత్రను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ అల్లుడు, బాలయ్యకు వియ్యంకుడు, సీఎం అయిన చంద్రబాబునాయుడి పాత్రలో దగ్గుపాటి రానా కనిపిస్తాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. చిత్ర బృందం రానాను సంప్రదించగా, ఆయన అంగీకరించాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

ఎన్టీఆర్ జన్మదినం రోజున ప్రకటన?..
ఈ నెల 28న ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా రానా నటించే పాత్రపై అధికారిక ప్రకటన వస్తుందని కూడా సమాచారం. కాగా, 'లీడర్' చిత్రంలో సీఎంగా కనిపించిన రానా, ఈ సినిమాలోనూ సీఎంగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ విషయమై పూర్తి క్లారిటీ రావాలంటే ఎన్టీఆర్ జయంతి వేడుకల వరకూ వేచిచూడాల్సిందే.

16:31 - May 17, 2018

విజయవాడ : నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టిడిపి ప్రవేశ పెట్టిన తీర్మానంపై రగడ చెలరేగింది. నాలుగేళ్ల తరువాత హోదా కోరుతూ తీర్మానం ఇవ్వడం...ఏంటనీ ప్రతిపక్ష వైసీపీ, బీజేపీ సభ్యులు ప్రశ్నించాయి. చంద్రబాబు డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేసిన వైసీపీ కార్పొరేటర్లు జీబాబ్, జమల పూర్ణమ్మలను మేయర్ సస్పెండ్ చేయడం వివాదానికి తెరలేచింది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:30 - May 17, 2018

ప్రస్తుతం సినిమా పరిశ్రమ బయోపిక్ లతో కోట్లాది రూపాయలను కొల్లగొడుతోంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి బయోపిక్ లు. ప్రస్తుతం 'మహానటి' కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఇంకా బైటకు రాకపోయినా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ఆన్ ద వే లో వుంది. మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ కూడా రూపుదిద్దుకుంటోంది. ఇపుపడు తాజాగా మరో నటుడి బయోపిక్ తెరమీదకు రాబోతోందంటు సిని పరిశ్రమలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. మిల్క్ బోయ్ గా పేరొందిని యువ నటుడు,అంచెలంచెలుగా ఎదిగి..యూత్ లోమంచి క్రేజ్ సంపాదించిన యువ నటుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ రాబోతోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఆత్మహత్య చేసుకుని మరణించిన ఉదయ్ కిరణ్
తెలుగు తెరపై హీరోగా ఉదయ్ కిరణ్ అంచెలంచలుగా ఎదిగాడు. యూత్ లో ఆయనకి మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఆ తరువాత ఆయనకి వరుస పరాజయాలు ఎదురుకావడం .. అవకాశాలు తగ్గడం జరిగాయి. కారణమేదైనా కొంతకాలం క్రితం ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇప్పుడు ఆయన బయోపిక్ ను రూపొందించే దిశగా దర్శకుడు తేజ ప్రయత్నాలు మొదలెట్టాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

తేజా దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ సినిమా..
ఉదయ్ కిరణ్ ను 'చిత్రం' సినిమా ద్వారా హీరోగా పరిచయం చేసింది తేజానే. అందువలన ఈ బయోపిక్ విషయంలో నిజం వుండే అవకాశమే ఎక్కువని చెప్పుకుంటున్నారు. ఉదయ్ కిరణ్ చనిపోయిన తరువాత 'మస్కట్' లో వుండే ఆయన సోదరి శ్రీదేవి ఒక ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆయనకి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవంటూ కొన్ని విషయాలు ప్రస్తావించింది. అవన్నీ కూడా ఈ బయోపిక్ లో ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ప్రముఖ నటుడు, మాజీ సీఎం అయిన ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వ బాధ్యతలు ఒప్పుకుని కొన్ని కారణాలతో ఆ సినిమా నుండి తప్పుకున్న తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్ తీస్తాడనే వార్తల్లో వాస్తవమెంతో వేచి చూడాల్సిందే. 

16:27 - May 17, 2018

ప్రకాశం : జిల్లాను కరవు రహితంగా మారుస్తామని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పేర్కొన్నారు. గురువారం నీరు ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు చేరుకున్నారు. పోకూరు చెరువులో పూడిక తీత పనుల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంచుతామని, రాళ్లపాడు ఎత్తిపోతల ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేస్తామన్నారు. డిసెంబర్ నాటికి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. పోకూరు ఆయుకట్టు రైతులతో బాబు ముఖాముఖి నిర్వహించారు.

ప్రకాశం : జిల్లా వాలెటిపాలెం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నీరు - ప్రగతి కార్యక్రమంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు. 

16:27 - May 17, 2018

'రంగస్థలం' సినిమా రామ్ చరణ్ సినీ కెరీర్ లో చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఈ సినిమా హిట్ అనంతరం రామ్ చరణ్ చాలా చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. రంగస్థలం సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయి. పాటలు,చరణ్ నటనతో పాటు రంగస్థలం గ్రామం సెట్టింగ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సినది. 'రంగస్థలం' సినిమా కోసం హైదరాబాదులో వేసిన విలేజ్ సెట్లో ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం షూటింగ్ చేస్తున్నారు. అక్కడి బంగ్లా సెట్లో చిరంజీవి, తమన్నా తదితరులు పాల్గొనే సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

రెజ్లర్ గా రానా..
రానా దగ్గుబాటి త్వరలో రెజ్లర్ గా నటించనున్నాడు. ప్రముఖ మల్లయుద్ధ వీరుడు కోడి రామ్మూర్తి బయోపిక్ గా రూపొందే చిత్రంలో ఆయన పాత్రను పోషించడానికి రానా ఓకే చెప్పినట్టు సమాచారం.

యోధుడిగా కోడి రామ్ముర్తి చరిత్ర..
తెలుగు దేశంలో ప్రఖ్యాత తెలగ వీర యోధ వంశాలలో కోడి వారి వంశం ఒకటి, ఈ వంశ పరంపరలోని శ్రీ కోడి వెంకన్న నాయుడు కోడి రామ్ముర్తి తండ్రి. 1882లో పుట్టిన కోడి రామ్ముర్తి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు కోడి రామ్ముర్తి. అక్కడ ఒక వ్యాయామశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఇతడు ఛాతిపై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగేవాడటం కోడి రామ్ముర్తి. మద్రాసులో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం శిక్షణ తర్వాత వ్యాయామోపాధ్యాయుడుగా సర్టిఫికేట్ అందుకుని, విజయనగరంలో తాను చదివిన హైస్కూలులో వ్యాయామ శిక్షకుడుగా చేరాడు.

రామ్ముర్తి ప్రదర్శనలకు విశేష స్పందన..
శరీరానికి కట్టిన ఉక్కు గొలుసును కట్టించుకుని ముక్కలుగా తుంచి వేసేంత దేహధారుడ్యం అతని సొంతం. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకుని స్వీడ్ నడిపినాగానీ కార్లను మాత్రం ఏమాత్రం కదలనీయని యోధుడు కోడి రామ్ముర్తి, ఛాతీ పై పెద్ద ఏనుగును ఎక్కించుకునేవాడు. 5 నిమిషాల పాటు, రొమ్ముపై ఏనుగును అలాగే ఉంచుకునేవాడు. తండోపతండాలుగా ప్రజలు వారి ప్రదర్శనలు చూచేవారు. అటువంటి మల్లయోధుడి కథలో దగ్గుపాటి రానా నటించనున్నట్లుగా సినీ పరిశ్రమ సమాచారం. 

16:08 - May 17, 2018

హైదరాబాద్ : నగరంలో గురువారం సాయంత్రం 'వాన' బీభత్సం సృష్టించింది. సాయంత్రం 4గంటలకు చీకట్లు అలుముకున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో జనజీవనం స్థంభించిపోయింది. గాలివానకు పలు చోట్లు కూలిపోయాయి. దీనితో ట్రాఫిక పలు ప్రాంతాల్లో స్తంభించిపోయింది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రోడ్లపై భారీగా నిలిచిపోయింది. వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి...

భాగ్యనగరంలో భారీ వర్షం..

హైదరాబాద్ : భాగ్యనగరంలో అకాలంలో హఠాత్తుగా వర్షం కురిసింది. దీంతో నగరవాసులంతా సేదతీరారు. పలు ప్రాంతాలలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అలాగే పలు ప్రాంతాలలో ట్రాఫిక్ స్థంభించిపోయి వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యానగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, లక్డికపూల్, నారాయణగూడ, బాగ్ లింగంపల్లి, ఖైరతాబాద్, అమీర్ పేట,ఎస్సార్ నగర్, బోరబండ, మోతీనగర్, వంటి పలు ప్రాంతాలలోనే కాక నగర శివారులైన కుషాయిగూడ, నాగారం, మేడ్చల్ వంటి పలు శివారు ప్రాంతాలలో కూడా భారీ వర్షం కురిసింది. 

16:06 - May 17, 2018

ఏ సమస్య వచ్చినా 1100కు ఫోన్ చేయండి : చంద్రబాబు

ప్రకాశం: ప్రజలు ఏ సమస్య వచ్చినా 1100 నెంబర్‌కు ఫోన్ చేసి సలహాలు పొందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. జిల్లాలోని బడేవారిపాలెం గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... గ్రామాలు అభివృద్ధికి పట్టుగొమ్మలుగా ఉండాలన్నారు. అలాగే అధికారులు సక్రమంగా పనిచేయాలని, పశువుల సంరక్షణకు గోకులాలను ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. కాగా... బడేవారిపాలెంలో ఆయా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు.

ఆయేషా మీరా కేసులో కొత్త ట్విస్ట్..

అమరావతి: కృష్ణాజిల్లా విజయవాడలోని ఇంబ్రహీంపట్నం హాస్టల్‌లో 2007 డిసెంబర్‌లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో అనుమానితులకు నార్కో అనాలసిస్‌ టెస్ట్‌పై విచారణ అధికారులు కోర్టులో పిటిషన్‌ వేశారు. నిందితులు లేదా అనుమానితుల అనుమతి లేకుండా నార్కో టెస్ట్ చేయకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు ఉదహరిస్తూ పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణ వచ్చే నెల 4కు వాయిదా వేసింది. ఆయేషా మీరా హత్య కేసు పునర్విచారణకు ఉమ్మడి హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ దర్యాప్తును సిట్‌కు అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

సామాజిక న్యాయం కోసం బీఎల్ఎఫ్ : తమ్మినేని

ఆదిలాబాద్ : బీఎల్ఎఫ్ పార్లమెంటరీ స్థాయి సమావేశాన్ని బీఎల్ఎఫ్ నిర్వహించింది. సామాజిక న్యాయం కోసం బీఎల్ఎఫ్ పనిచేస్తుందని బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం ఉచితంగా అందాలని తమ్మినేడి డిమాండ్ చేశారు. అందుకోసం బీఎల్ఎఫ్ పనిచేస్తుందన్నారు. ప్రజలు పేద,ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా వుందని ఎద్దేవా చేశారు. రైతుబంధు పథకంద్వారా రైతులకు రూ.4వేలు ఇవ్వటం మంచిదే కానీ తాత్కాలిక ఉపశమనాలతోసమస్యలు మాత్రం పరిష్కారం కావన్నారు.

సామాజిక న్యాయం కోసం బీఎల్ఎఫ్ : తమ్మినేని

ఆదిలాబాద్ : బీఎల్ఎఫ్ పార్లమెంటరీ స్థాయి సమావేశాన్ని బీఎల్ఎఫ్ నిర్వహించింది. సామాజిక న్యాయం కోసం బీఎల్ఎఫ్ పనిచేస్తుందని బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం ఉచితంగా అందాలని తమ్మినేడి డిమాండ్ చేశారు. అందుకోసం బీఎల్ఎఫ్ పనిచేస్తుందన్నారు. ప్రజలు పేద,ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా వుందని ఎద్దేవా చేశారు. రైతుబంధు పథకంద్వారా రైతులకు రూ.4వేలు ఇవ్వటం మంచిదే కానీ తాత్కాలిక ఉపశమనాలతోసమస్యలు మాత్రం పరిష్కారం కావన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రానంతకాలం సంక్షోభం నిర్మూలన కాదని తమ్మినేని పేర్కొన్నారు. 

15:33 - May 17, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తును నాన్ స్టాప్‌గా వాడేస్తున్నారు. ఎండల వేడి నుంచి సేద తీరేందుకు ప్రజలు విరామం లేకుండా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను తెగ వాడేస్తున్నారు. గృహాలతోపాటు.. వ్యాపార, ఉద్యోగ సంస్థల విద్యుత్‌ వినియోగంతో.. కోటాను మించిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలాగైతే ట్రాన్స్‌ఫార్మర్లకే ప్రమాదమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ వినియోగం పెరిగిపోయింది. మండుతున్న ఎండల ధాటికి తట్టుకోలేక చల్లదనం కోసం జనం పరితపిస్తున్నారు. దీంతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను విరివిగా వాడుతున్నారు. నగరాల నుంచి పల్లెల వరకూ ప్రజలు వాడుతున్న విద్యుత్‌ వినియోగంతో.. కోటాను మించిపోయే పరిస్థితులు నెలకొన్నాయి..రాష్ర్టంలోని 13 జిల్లాల కంటే.. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాలైన విజయవాడ, గుంటూరు నగరాల్లోనే కరెంటు వాడకం అధికంగా ఉంది.

విజయవాడ టౌన్, గుణదల, విజయవాడ రూరల్ ప్రాంతాల్లో విద్యుత్‌ వినియోగం కోటాకు దగ్గరగా ఉంది. మండే ఎండల ప్రభావం కరెంటు వినియోగంపై పడుతోంది. అన్ని విద్యుత్ డివిజన్లలో కోటాకు మించి వినియోగిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ టౌన్ ముప్పై ఎనిమిది లక్షల యూనిట్లు.. విజయవాడ రూరల్ ఇరవై ఏడు లక్షలు, గుణదల ఇరవై ఎనిమిది లక్షల యూనిట్లకు పైగా విద్యుత్ కోటాగా ఉంది. ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్‌లు, ఫ్యాన్లను నాన్‌స్టాప్‌గా వాడుతున్నారు.. దీనికితోడు విద్యుత్ కనెక్షన్లు కూడా పెరగడంతో విద్యుత్‌ భారం తడిసి మోపెడవుతోంది.

జూన్ వరకూ ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటే.. కరెంటు వాడకం ప్రతి డివిజన్‌కు కేటాయించిన కోటాను దాటిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇలాగైతే.. విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడతాయని అంటున్నారు. ట్రాన్స్ ఫార్మర్లలో సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోతున్నాయని.. వాటిని సరిదిద్దడం తలనొప్పిగా మారిందని అధికారులు అంటున్నారు. ఏసీలు, కూలర్లును ఏకధాటిగా కాకుండా.. విరామం ఇచ్చి వాడుకుంటే మంచిదని సూచిస్తున్నారు. లేదంటే విద్యుత్‌ కోతలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ప్రతి విద్యుత్‌ మీటర్‌కు ఓ సామర్థ్యం ఉంటుంది. మీటర్ బిగించినప్పుడే ఇళ్లల్లో వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల ఆధారంగా ఒకటి నుంచి ఐదు కిలోవాట్ల వరకూ ఒక ఫేజ్ అనుమతిని ఇస్తారు. ఎక్కువ విద్యుత్ వినియోగించాల్సి వస్తే ఐదు నుండి ఇరవై కిలోవాట్లకు త్రీ ఫేజ్ మీటర్ కనెక్షన్ ఇస్తారు. ఈ స్థాయిని కూడా దాటితే ఇరవై నుంచి యాభై ఆరు కిలోవాట్ల వరకూ సీటీ మీటర్ కనెక్షన్‌కు అనుమతి ఇస్తారు. కరెంటును అధికంగా వాడాలనుకునే వారికి విద్యుత్‌ అధికారులు రాయితీలు కల్పిస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి కనెక్షన్లను పునరుద్ధరించుకుంటే.. చెల్లించాల్సిన అదనపు రుసుములో యాభై శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కనెక్షన్ సామర్థ్యం పెంచుకునేందుకు ప్రతి కిలోవాట్ కు పన్నెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉండగా... ప్రస్తుతం సగం కడితే సరిపోతుంది. దీనికి రెండు వందల రూపాయలు ధరావత్తు కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఈ అవకాశానికి మే 31 వరకూ గడువిచ్చారు. విద్యుత్‌ బిల్లుల ఆధారంగా వినియోగదారులు ఎంత లోడ్ వాడుతున్నదీ అధికారులు లెక్కగడతారు. పరిమితిని మించి కరెంటును వాడేవారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 

15:28 - May 17, 2018

కర్నూలు : జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో అధికార పార్టీలో ఆధిపత్యపోరు మరోసారి ప్రత్యక్షపోరుకు దారితీసింది. టీడీపీలోని రెండు వర్గాల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. నియోజకవర్గంలో పెత్తనం కోసం రెండు వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆలూరులో తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరుపై టెన్‌టీవీ స్పెషల్‌ స్టోరీ. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీకి పెద్దగా పట్టు ఏమీలేదు. టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇక్కడ మూడుసార్లు మాత్రమే గెలిచింది. అయినా ఇక్కడ టీడీపీలో వర్గపోరు ఎక్కువ. ఇక్కడి నాయకత్వం టీడీపీని బలోపేతం చేయడంకంటే... పార్టీలో పెత్తనం కోసమే ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి తెలుగు తమ్ముళ్లు మరోసారి రెండు వర్గాలుగా చీలిపోయారు.

ఆలూరు నియోజక వర్గానికి వీరభద్రగౌడ్‌ ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు కూడా. ఇప్పుడు ఈయనో గ్రూప్‌ను మెయింటెన్‌ చేస్తున్నారు. ఇక వైకుంఠం మల్లికార్జున చౌదరి, మసాల పద్మజ కలిసి మరోవర్గంగా ఉన్నారు. ఈ రెండు వర్గాలు నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఆరాట పడుతున్నాయి. నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న వీరభద్రగౌడ్‌ 4 ఏళ్లుగా పార్టీ కార్యాలయాన్ని నిర్వహిస్తుండగా.. వైకుంఠం మల్లికార్జున చౌదరి, మసాల పద్మజ కలిసి పోటీగా మరో కార్యాలయాన్ని ప్రారంభించడంతో వీరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఎవరికి వారే గ్రూపులుకట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల మధ్య లొల్లి అధిష్టానానికి తలబొప్పి కట్టిస్తోంది.

వీరభద్రగౌడ్‌, వైకుంఠం గ్రూపులు మినీ మహానాడులో విడివిడిగా బలప్రదర్శనకు దిగాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్న మినీ మహానాడులో... రెండువర్గాలు పరస్పర ఆరోపణలకు దిగాయి. జిల్లా అధ్యక్షుడి ఎదుటే మాటలయుద్ధానికి దిగారు. 30 ఏళ్లుగా పార్టీలో తగిన ప్రాధాన్యత లేకపోయినా ... టీడీపీ బలోపేతానికి తాము పనిచేస్తున్నామని వైకుంఠం వర్గం చెబుతోంది.

నియోజకవర్గ ఇంచార్జీగా అందరినీ కలుపుకొని పోవడానికే కృషి చేస్తున్నానని వీరభద్రగౌడ్‌ తెలిపారు. వర్గవిభేదాలపై మాత్రం నోరు విప్పడంలేదు. నియోజకవర్గంలో ఎవ్వరినీ నిర్లక్ష్యంచేయడం లేదని.... పార్టీ బలోపేతానికే తామూ పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఆలూరు నియోజకవర్గంలో నేతల మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్కరించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. ఇరువర్గాలు పార్టీ బలోపేతానికి కలిసి పనిచేసేలా జిల్లా అధ్యక్షుడు వారితో మంతనాలు జరుపుతున్నారు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ప్రయత్నిస్తాయో వేచి చూడాలి.

15:24 - May 17, 2018

హైదరాబాద్ : కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు వేగంగా పావులు కదుపుతారని భావించిన కేసీఆర్‌... ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. కర్నాటకలో రెండు జాతీయ పార్టీలే ఎక్కువ సంఖ్యలో స్థానాలు సాధించడంతో కేసీఆర్‌ ప్రయత్నాలు ఫలిస్తాయా? జాతీయ స్థాయిలో ప్రాంతీయపార్టీల హవా కొనసాగుతుందా? ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై కేసీఆర్‌ ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయి? వాచ్‌ దిస్‌ టెన్‌ టీవీ స్పెషల్‌ స్టోరీ..

దేశ వ్యాప్తంగా కర్నాటక ఎన్నికలు ఆసక్తి రేపాయి. యావత్‌ దేశం కర్నాటక ఎన్నికలపై ఆసక్తిగా ఎదురు చూసింది. కానీ ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ మాత్రం రాలేదు. జాతీయ పార్టీలతోపాటు... ప్రాంతీయ పార్టీ హవా కొనసాగింది. జాతీయ పార్టీలకు ఆదరణ తగ్గుతుందన్న వాదనలో బలం లేదని కర్నాటక ఎన్నికలు తేల్చాయి. నేషనల్‌ పార్టీలోపాటు ప్రాంతీయ పార్టీలు సైతం సంబర పడేలా ఫలితాలు రావడం... రాజకీయ వర్గాల్లో భిన్నవాదనలకు తెరలేపుతున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఫ్రంట్‌ ఏర్పాటుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు. కర్నాటక ఎన్నికల్లో వచ్చిన తీర్పుతో కేసీఆర్‌ ఏం చేస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జాతీయ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో మనుగడ ఉండదు. ప్రాంతీయ పార్టీలే కీరోల్‌ ప్లేచేస్తాయని కేసీఆర్‌ చెప్తూ వస్తున్నారు. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల్లో ప్రాంతీయ పార్టీతో పాటు జాతీయ పార్టీలకూ ప్రజల్లో ఆదరణ పెరిగింది. అయితే రెండు జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీపై చివరికి ఆధారపడాల్సిన పరిస్థితిని కల్పించేలా కన్నడ ప్రజలు తీర్పునిచ్చారు. జేడీఎస్‌ అక్కడ కింగ్‌మేకర్‌గా మారింది. ఆపార్టీ ఎవరికి మద్దతిస్తే వారే గద్దెనెక్కుతారు. లేదా తాను మద్దతు తీసుకుని సీఎం కుర్చీపై కూర్చొనే అవకాశముంది.

కర్నాటక ఎన్నికల ఫలితాలను టీఆర్‌ఎస్‌ నేతలు వెరైటీగా విశ్లేషిస్తున్నారు. ఎటొచ్చి ప్రాంతీయ పార్టీ అక్కడ కీరోల్‌గా మారిందని చెబుతున్నారు. కాబట్టి 2019 ఎన్నికల్లో దేశంలోనూ ప్రాంతీయ పార్టీల హవా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. పైగా కేసీఆర్‌ ఫ్రంట్‌లోకి జేడీఎస్‌ వస్తున్నట్టు చెప్తున్నారు. ఒకవేళ కన్నడలో జేడీఎస్‌కు అధికారం దక్కితే.. తమ ఫ్రంట్‌లో తొలి ప్రభుత్వం ఏర్పాటు అయినట్టు అవుతుందని చెబుతున్నారు. తమ నేత కేసీఆర్‌ రెట్టించిన ఉత్సాహంతో ఫ్రంట్‌ ఏర్పాటు చర్యలు ముమ్మ రం చేస్తారని చెబుతున్నారు. మొత్తానికి జాతీయ స్థాయిలో కేసీఆర్‌ ఏర్పాటు చేయనున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ పట్టాలెక్కుతుందా. దేశ రాజకీయాల్లో ముందడుగు వేస్తుందా. లేదా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

15:13 - May 17, 2018

కర్ణాటక : బీజేపీయేతర పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలని జేడీఎస్ శాసనసభా పక్షనేత కుమార స్వామి పిలుపునిచ్చారు. కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని, దీనిని ఎదుర్కొనేందుకు కేసీఆర్, బాబు, మాయావతి, మమత బెనర్జీలు కలిసి రావాలని, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, దీనితో ఎమ్మెల్యేలను కాపాడుకొనే ప్రయత్నంలో ఉన్నామన్నారు. బీజేపీకి మెజార్టీ లేకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారని, గవర్నర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని విమర్శించారు. 

15:12 - May 17, 2018

ఢిల్లీ : కర్ణాటక రాష్ట్రంలో రాజకీయాలు ఉత్కంఠ భరితంగా మారుతున్నాయి. తగిన సంఖ్యా బలం లేకున్నా బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం..యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. దీనితో దేవెగౌడ ముఖ్యమంత్రులు బాబు, కేసీఆర్, మమత బెనర్జీలకు ఫోన్ చేశారు. కేంద్రంపై పోరాటం చేయాలని, దీనిపై ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని కోరారు. రాష్ట్రంలో సంఖ్యా బలం లేని బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారని..దీనిపై కేంద్రంపై పోరాటం చేసేందుకు తమతో కాలిసి రావాలని ఏపీ, పశ్చిమబెంగాల్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చక్కగా ఉపయోగించుకోవాలని నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. 

20 నుండి జనసేన పోరాట యాత్ర: పవన్

విశాఖ : ఈనెల 20 నుండి జనసేన పోరాట యాత్ర చేపట్టనుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుండి పోరాట యాత్ర ప్రారంభమయి 45 రోజుల పాటు పోరాట యాత్ర కొనసాగుతుందని తెలిపారు. జిల్లా పర్యటన ముగింపురోజు లక్షమందితోనిరసన లక్షమందితో కవాతు వుంటుందన్నారు. 

బాబు, కేసీఆర్, మమతలకు దేవగౌడ ఫోన్..

కర్ణాటక : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి, తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీలకు జేడీఎస్ అధినేత దేవగౌడ్ ఫోన్ చేశారు. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేయటానికి నిరసనగా జేడీఎస్,కాంగ్రెస్ కూటమి అసెంబ్లీ భవనం వద్ద వున్న గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ నిరసనకు దక్షిణాది రాష్ట్రాల సీఎంలు మద్దతు పలకాలని ఫోన్ లో తెలిపారు. మరోపక్క జేడీఎస్ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలను చేపట్టారు. ఇప్పటికే బెంగళూరు శివారులోని ఈగల్టన్ రిసార్ట్ లో విపక్ష ఎమ్మెల్యేలను వుంచారు.

ఎన్ కౌంటర్ నుండి ఆర్కే ఎస్కేప్..

విశాఖ : మరో ఎన్ కౌంటర్ నుంచి మావోయిస్టు అగ్రనేత ఆర్కే తప్పించుకున్నట్లుగా సమాచారం. గురువారం ఉదయం ఆంధ్ర-ఒడిశా బోర్డర్ లోని బలిమెల రిజర్వాయర్ పరిధిలో ఉన్న సిమిలిపొదర్ అటవీ ప్రాంతంలో ఏపీ గ్రేహౌండ్స్ దళాలు, ఒడిశా పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు గాయపడినట్టు తెలుస్తోంది. అగ్రనేత ఆర్కే తృటిలో తప్పించుకున్నట్లుగా అధికార సమాచారం. ఘటనా స్థలంలో మావోల కిట్ బ్యాగులను మావోలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 

రమణదీక్షితులు రాజకీయ దీక్ష తీసుకున్నారా?: కేఈ

అమరావతి : శ్రీవారి ప్రధాన అర్చకులు శ్రీవారి ఆలయం వ్యవహారంపై రమణ దీక్షితులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని...రమణదీక్షితులు గతంలో చాలా తప్పులు చేసారనీ వాటిపై కూడా విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని తెలిపారు. రమణ దీక్షితులు అర్చక వృత్తిని మరిచిపోయి, రాజకీయ దీక్షను తీసుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఎవరు మాట్లాడినా, ఉపేక్షించబోమని హెచ్చరించారు.

14:55 - May 17, 2018

పక్కరాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టి విమర్శలా? : కేఈ

అమరావతి : తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుపై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన అర్చకుడిగా ఉంటూ రమణ దీక్షితులు ఎన్నో తప్పులు చేశారని, సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. శ్రీవారి గురించి చెడుగా మాట్లాడిన రాజకీయ నాయకులకు ఎలాంటి గతి పట్టిందో అందరికీ తెలుసన్నారు. స్వామివారి నగలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. ప్రతి యేటా స్వామివారి నగలను అధికారులు పరిశీలిస్తారని చెప్పారు. పక్కరాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టి ఏపీలో వున్న శ్రీవారి ఆలయం గురించి విమర్శలు చేస్తారా? అని మండిపడ్డారు.

14:51 - May 17, 2018

రాజన్న సిరిసిల్ల : డెబ్భై ఏళ్లలో రైతుల కోసం ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు మంత్రి కేటీఆర్‌. ఎన్నికల కోసమే రైతు బంధు అన్న విపక్షాల విమర్శలను తిప్పి కొట్టారు. రైతుబంధు పథకంతో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుంటే కాంగ్రెస్‌ నేతల కళ్లల్లో భయం కనిపిస్తుందని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా రైతుల కోసం ముందుకు వెళదామన్నారు కేటీఆర్‌. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా నామాపురంలో రైతు బంధు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జూన్‌ 2 నుండి దేశం మొత్తం అబ్బురపడేలా రాష్ట్రంలోని రైతులందరికీ 5 లక్షల ఉచిత బీమా కార్యక్రమం చేపడతామని తెలిపారు. రైతులకు చెక్కులు పంపిణీ చేశారు మంత్రి.  

14:49 - May 17, 2018

వరంగల్ : జిల్లా పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చెదు అనుభవం ఎదురైంది. రైతు బంధు చెక్కుల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యేను రైతులు అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. సంగేమ్ మండలం రంగంపేట గ్రామంలో చెరువు మరమ్మతులు చేస్తానని చెప్పి, రైతులకు రబీలో పంటలు వేయకుండా అడ్డుకున్నారని రైతులు నిలదీశారు. ఇప్పుడు పంట పెట్టుబడికి చెక్కులు ఇవ్వడం ఏంటని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకొని రైతులను పంపించారు. 

14:45 - May 17, 2018

ఖమ్మం : జిల్లా రఘునాథపాలెం మండలం పంగిడిలో చేపట్టిన రైతుబంధు కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాసు బుక్కులు చేసి ఇస్తామని రెవెన్యూ అధికారులు గిరిజన రైతుల నుండి కోటి రూపాయలు వసూలు చేశారు. అయినప్పటికీ పట్టా పాసు పుస్తకాలు ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. వీఆర్‌వో రాములు, ఆర్‌ ఐ నర్సింహారావులను గదిలో బంధించారు. 

14:43 - May 17, 2018

హైదరాబాద్ : ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లోని బలిమెల రిజర్వాయర్‌ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల నుంచి మావోయిస్టు అగ్రనేత ఆర్కు తృటిలో తప్పించుకున్నారు. ఉదయం నుంచి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ టార్గెట్‌గానే కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.  

14:41 - May 17, 2018

కర్ణాటక : రాష్ట్రంలో రాజ్యాంగం హత్యకు గురైందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్రంగా విమర్శించారు. రాయ్‌పూర్‌లో జరిగిన ఓ సభలో మాట్లాడిన రాహుల్‌ బిజెపి-ఆర్‌ఎస్ఎస్‌లు రాజ్యాంగ సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో నలువైపులా భయం నెలకొందని, ఇక్కడ పరిస్థితి పాకిస్తాన్‌లా తయారైందని రాహుల్ అన్నారు. మహిళలు, దళితులు, ఆదీవాసీలను బిజెపి ప్రభుత్వం అణగదొక్కుతోందని మండిపడ్డారు. అంతకుముందు బిజెపికి తగిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని రాహుల్‌ ట్విట్టర్‌లో దుయ్యబట్టారు. 

14:40 - May 17, 2018

కర్ణాటక : రాష్ట్ర 23వ సీఎంగా రాజ్‌ భవన్‌లో యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ వాజూభాయి వాలా యడ్యూరప్పతో ప్రమాణం చేయించారు. మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు యడ్యూరప్ప. 2007లో మొదటి సారి, 2008లో రెండవ సారి యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. బల నిరూపణ తర్వాత కేబినేట్‌ ప్రమాణం చేయనుంది. బల నిరూపణ కోసం 15 రోజులు గడువు ఇచ్చారు గవర్నర్‌. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:38 - May 17, 2018

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. పెద్దలు చెప్పిన మాటలన్నీ అనుభవాలనుండి వచ్చినవే. అందుకని ఎంత ఆస్తిపాస్తులున్నా..పేరు ప్రతిష్టలున్నా..ఆరోగ్యం లేకుంటే అవిన్నీ వృథా. అందుకే ప్రజలకు కావాల్సింది ముందుగా ఆరోగ్యం. పాలకులు ప్రజలకు ఇవ్వాల్సింది సంక్షేమపథకాలు కాదు ఆరోగ్యం. ఇప్పుడది చాలా ప్రాముఖ్యమైనది. ఆరోగ్యం మంచిగా వుంటే మనిషి ఏదైనా సాధిస్తాడు. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత పాలకులదే. అదే లేకుంటే రోగాల రాష్ట్రంగా, రోగాల దేశంగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. మనిషికి ఆరోగ్యం జన్మతహ వస్తుంది. అలాకాకుండా నేటి కాలుష్యకాసారంగా, ఒత్తిడిలు జీవితాలుగా మారిపోతున్న క్రమంలో ఎంతటి ఆరోగ్యవంతులైనా పలు దీర్ఘకాలిక రోగాల బారిన పడి నానా అవస్థలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పాలన, సంక్షేమ పథకాలే కాకుండా ఆరోగ్యవంతమైన సుపరిపాలన ప్రజలకు అందించాల్సిన బాద్యత ఆయా రాష్ట్రాల పాలకులదే.

రోగాల్లో కూడా తెలంగాణ ముందే...
పోషకాహార సంస్థ పలు ఆరోగ్యం అంశాలపై సర్వేలు నిర్వహించే విషయం తెలిసందే. ఈ క్రమంలోనే నిర్వహించిన సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ మధుమేహ రోగులతో పాటు రక్తపోటు రోగులు కూడా పెరిగిపోతున్నారని పోషకాహార సంస్థ సర్వేలో వెల్లడయ్యింది. పాలన, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రోగాల విషయంలోనూ అదే స్థానంలో ఉందని జాతీయ పోషకాహార సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇప్పటి వరకు మధుమేహ రోగుల విషయంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ అధిక రక్తపోటు రోగుల విషయంలో ద్వితీయ స్థానంలో ఉందని తెలిపింది. రాజధాని హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా హైబీపీ రోగుల సంఖ్య అధికంగా ఉందని సర్వేలో బయటపడింది.

14కోట్ల మందికి బీపీ..
దేశవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 14 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని, మరో పదేళ్లలో వీరి సంఖ్య 21.4 కోట్లకు చేరుతుందని వైద్యులు చెబుతున్నారు. పురుషుల్లో 39 శాతం, మహిళల్లో 29 శాతం మంది ఈ రోగంతో బాధపడుతున్నారని తెలిపారు. రక్తపోటును అదుపులో ఉంచుకోకపోతే పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, గుండె, కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

14:38 - May 17, 2018

ఢిల్లీ : కర్నాటకలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గవర్నర్‌ తీరుపై కాంగ్రెస్‌, జేడీఎస్‌లు మండిపడుతున్నాయి. దీంతో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే యోచనలో ఉన్నారు జేడీఎస్‌ అధినేత. ఈ మేరకు చందబ్రాబు, కేసీఆర్‌, మమతాబెనర్జీలకు దేవెగౌడ ఫోన్‌ చేశారు. తమ ఆందోళనకు మద్దతుగా కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు.  

14:37 - May 17, 2018

ప్రపంచంలోనే భారతదేశానికి ప్రజాస్వామ్యం దేశమని పేరు. లౌకిక రాజ్యమని ఘనత. ఆ ఘనతను, గొప్పతనాన్ని మనం నిలుపుకుంటున్నామా? వ్యక్తిగతంలో జరిగిన అవమానాలను రాజ్యాంగాన్ని అడ్డంపెట్టుకుని ప్రతీకారాలు తీసుకునే దుస్థితికి, దుర్భలత్వానికి, నిసిగ్గుకు, అనైతికతకు భారతదేశపు ప్రజాస్వామ్యం దిగజారిపోయిందా? పదవిని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యాంగానికి,ప్రజాస్వామ్యానికి అవమానం చేస్తున్నామా? అనే ఇంగితం కూడా మరిచిపోయి వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత పగలు తీర్చుకునేందుకు ప్రజాభిప్రాయాన్ని, రాజ్యాం విలువలను, రాజ్యాంగ నిబంధలను తుంగలో తొక్కుతున్న నేతలను ఏం చేయాలి? వారిని ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందా? అసలు గవర్నర్ అంటే ఏమిటి? వారికుండే అధాకారాలేమిటి? గవర్నర్ విధులేమిటి?

గవర్నర్ అంటే?..
రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ పాత్ర అతిప్రధానమైనది. రాష్ర్టాధినేతగా గవర్నర్ నిర్వహించే విధులు, అధికారాలు అత్యంత విశేషమైనవి. అందువల్ల గవర్నర్ అధికారాలపై, రాజ్యాంగపరంగా గవర్నర్ స్థానంపై ఒక ప్రత్యేకమైన గౌరవభావం వుంటుంది. రాష్ట్రంలో జరిగే పరిస్థితులను సమీక్షిస్తు..రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానంగా గవర్నర్ వ్యవహరిస్తారు.

వివాదాస్పదంగా గవర్నర్ పదవి..అధికారాలు..
ఇటీవలి కాలంలో అత్యంత వివాదాస్పదమైన అంశాల్లో అతిముఖ్యమైనవి గవర్నర్ అధికారాలు. అందులోనూ గవర్నర్ విచక్షణాధికారాల గురించి మరింత లోతుగా చర్చ జరిగింది. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత కొత్త ముఖ్యమంత్రిని నియమించేటప్పుడు ఎవరిని నియమించాలో గవర్నర్ నిర్ణయించాలి. ఆ తరువాత జల్లికట్టు ఉద్యమ సమయంలో కేంద్రానికి, రాష్ర్టానికి మధ్య అనుసంధానకర్తగా గవర్నర్ వ్యవహరించాడు. శశికళ, పన్నీర్ సెల్వానికి మధ్య జరిగిన అధికార కుమ్ములాటలో, చివరికి పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠం ఎక్కినంతవరకు గవర్నర్ పోషించిన పాత్రపై ఎన్నో విమర్శలూ, ఎన్నో వివాదాంశాలూ ఉన్నాయి. ఆ తరువాత పోషించిన పాత్రపై ఎన్నో విమర్శలు, వివాదాంశాలు ఉన్నాయి. అనంతరం పళనిస్వామి ఎంపిక రాజ్యాంగబద్ధంగా లేదని ప్రధానప్రతిపక్షం డీఎంకే గవర్నర్‌కి ఫిర్యాదు చేయడం, ఆ ఎంపికపై గవర్నర్ కేంద్రానికి ఒక నివేదిక పంపడం ఎంతో ఉత్కంఠను సైతం రేకెత్తించాయి.

అరుణాచల్‌ప్రదేశ్‌లో ..
అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు అక్షింతలు వేయడం, గవర్నర్ అధికారాలపై తీవ్ర చర్చ జరిగింది. ఎన్‌డీఏ ప్రభుత్వం రాగానే ఉన్న గవర్నర్లను రాజీనామా చేయమనడం, వారి ఎంపిక, తొలగింపు పై తీవ్రమైన చర్చ కూడా కొనసాగుతోంది.

గవర్నర్ అంటే..
ఒక రాష్ట్ర రాజ్యాంగాధినేత, రాజ్యాంగ పరంగా ఆ రాష్ట్ర పెద్ద ఇతనే. రాష్ర్టానికి మొదటి పౌరుడు. కేంద్రంలో రాష్ట్రపతిలా రాష్ట్రంలో రాజ్యాంగరీత్యా గవర్నర్ కార్యనిర్వాహణ అధిపతి. ప్రకరణ 153 ప్రకారం ప్రతి రాష్ర్టానికి ఒక గవర్నర్ ఉంటారు.

గవర్నర్ అధికారాలు..
ప్రతీ రాష్ట్రానికి వుండే ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత కాగా, గవర్నరు రాష్ట్రాధినేతగా వ్యవహరిస్తారు. గవర్నరు పదవి నామకార్థమైనది. భారత రాష్ట్రపతికి రాష్ట్రంలో ప్రతినిధిగా గవర్నరు వ్యవహరిస్తారు. 5 సంవత్సరాల పదవీకాలానికి గాను గవర్నరును రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే పరిపాలన, నియామకాలు, తొలగింపులు,రాష్ట్ర శాసనసభ, శాసనమండలికి సంబంధించిన అధికారాలు వుంటాయి. విచక్షణను ఉపయోగించగల అధికారాలు గవర్నర్ కు వుంటాయి. అంతేకాదు భారతదేశపు రాష్ట్రపతికి ప్రతినిథిగా ప్రతీరాష్ట్రంలోను గవర్నర్ వుంటారు. కాని అంతిటి ఉన్నతస్థానం వివాదాలకు కేంద్రంగా మారుతోంది. వ్యక్తిగత ఇష్టాలను, భావాజాలాలను, స్వపార్టీల పక్షపాత వైఖరిగా మారుతోంది.

వ్యక్తిగత పగ తీర్చుకునేందుకే బీజేపీకి గవర్నర్ పట్టం?..
గవర్నర్ పదవిలకే కళంగా తెచ్చేలా వ్యవహరిస్తున్న కొందరు తీరు వుంటోంది. ఇప్పటకే పలు సందర్భాలలో అటువంటి సందర్భాలు జరిగాయి. ఇప్పుడు తాజాగా కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ కూటములను కాదని బీజేపీ పార్టీకు గవర్నర్ వాజూభాయ్ వాలా పట్టం కట్టారు.

22 సంవత్సరాల క్రితం జరిగిన అవమానానికి ప్రతీకారం..
దాదాపు 22 సంవత్సరాల క్రితం దేవెగౌడ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో తనకు, తన పార్టీకి జరిగిన అన్యాయానికి ప్రస్తుత కర్ణాటక గవర్నర్ గా ఉన్న వాజూభాయ్ ప్రతీకారం తీర్చుకున్నారు. నాడు తనకు మంత్రి పదవిని దూరం చేసే నిర్ణయం తీసుకున్న దేవెగౌడ కుమారుడికి, ఇప్పుడు సీఎం పీఠం దక్కకుండా చేశారు. 22 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఓసారి తలచుకుందాం. 1996లో దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో గుజరాత్ లో సురేశ్ మెహతా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పడిపోయింది.

వాజూభాయ్ ని పదవీత్యుడిని చేసిన దేవగౌడ..
అప్పటికి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ప్రస్తుత కర్ణాటక గవర్నర్ గా వున్న వాజూభాయ్ కి, మెహతా ప్రభుత్వంలో తొలిసారిగా మంత్రి పదవి దక్కింది. ఇక ఆ సమయంలో బీజేపీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలను విడగొట్టిన శంకర్ సింగ్ వాఘేలా, కాంగ్రెస్ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో గుజరాత్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మకు సిఫార్సు చేసిన దేవెగౌడ, వాజూభాయ్ పదవిని మూన్నాళ్ల ముచ్చటగా మార్చారు.

దేవగౌడపై ప్రతీకారం తీర్చుకున్న గవర్నర్..
అప్పటి గవర్నర్ సైతం మెజారిటీ సీట్లున్న బీజేపీకి బదులు వాఘేలా స్థాపించిన పార్టీ ఆర్జేడీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆ ప్రభుత్వం 1998 వరకూ కొనసాగగా, ఆ తరువాతి కాలంలో వాజూభాయ్ ఎమ్మెల్యేగా గెలిచినా, మంత్రి పదవి దక్కలేదు. నాలుగేళ్ల క్రితం బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తరువాత వాజూభాయ్ ని కర్ణాటక గవర్నర్ గా నియమించగా, నాడు దేవెగౌడ చేసిన పనికి, నేడు ప్రతీకారం తీర్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి : కుమారస్వామి

కర్ణాటక : కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన సమయం ఆసన్నమైందని జేడీఎస్ అధినేత కుమారస్వామి పేర్కొన్నారు. విపక్ష పార్టీలందరు కలిసి ప్రజాస్వామాన్యన్ని పరిరక్షించాలని కుమారస్వామి పిలుపునిచ్చారు. జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందనీ..తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవటమే తమ తక్షణ కర్తవ్యమని కుమారస్వామి పేర్కొన్నారు. బీజేపీకి పూర్తిస్థాయి సంఖ్యాబలం లేకపోవయినా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఎలా ఆహ్వానించారని ప్రశ్నించారు. గవర్నర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. 

రైతురుణ మాఫీకి యడ్యూరప్ప తొలి సంతకం..

కర్ణాటక : బీజేపీ నేత యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం తొలి సంతకం రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లుగా సంతకం చేశారు. దీంతో వేలాదిమంది రైతులు లబ్ది పొందనున్నారు. కాగా ఉత్కంఠ పరిణామాల మధ్య యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ అసెంబ్లీ ముందు వున్న గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షకు పూనుకుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలంతా పాల్గొన్నారు. కాగా కార్ణాటక రాష్ట్రానికి యడ్యూరప్ప 23వ సీఎం కాగా తన వ్యక్తిగతంగా మూడవసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయటం మరో విశేషం. 

బీజేపీపై రాహుల్ గాంధీ విసుర్లు..

ఢిల్లీ : కర్ణాటకలో బీజేపీ అనైతికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శలు విసిరారు. సంఖ్యాబలం లేకున్నా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేసిందన్నారు. గెలిచామని బీజేపీ సంబరాలు చేసుకుంటుంటే మరోవైపు ప్రజాస్వామ్యం ఓడిపోయిందని దేశం విచారంలో మునిగిపోయిందని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా బీజేపీపై విమర్శలు చేశారు.

సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం..

కర్ణాటక : రాష్ట్ర సీఎంగా బీజేపీ ఎమ్మెల్యే యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ యడ్యూరప్పతో ప్రమాణస్వీకారం చేయించారు. కర్ణాకట 26వ సీఎంగా మూడవసారి యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ప్రముఖ నాయకులంతా హాజరయ్యారు. రాజ్ భవన్ వద్ద బీజేపీ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సీఎం కావటానికి కావాల్సిన 112 సీట్లకు గాను బీజేపీకి వచ్చిన సీట్లు 104 మాత్రమే. ఈక్రమంలో పూర్తిస్థాయి బల నిరూపణకు గవర్నర్ యడ్యూరప్పకు వారంరోజులు గడువు ఇచ్చారు. బలనిరూపణ అనంతరం కేబినెట్ విస్తరణ జరుగనుంది.

కన్నడ గవర్నర్ పై రాంజెఠ్మలాని పిటీషన్..

ఢిల్లీ : కన్నడ గవర్నర్ నిర్ణయంపై ప్రముఖ న్యాయనిపుణుడు రాంజెఠ్మలానీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తూ గవర్నర్ వాజుభాయి వాలా తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తిగత హోదాలో ఆయన సవాల్ చేశారు. గవర్నర్ ఆహ్వానం మేరకు బీఎస్ యడ్యూరప్ప ఈ రోజు కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. బలనిరూపణకు గవర్నర్ 15 రోజుల గడువు ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది. అయితే, గవర్నర్ నిర్ణయంపై నిన్న రాత్రే కాంగ్రెస్ సుప్రీంకోర్టు తలుపు తట్టగా, యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వీఆర్వో, ఆర్ఐలను నిర్భందించిన గిరిజనులు..

ఖమ్మం : రఘునాథపాలెం మండలం పంగిడిలో రైతుబంధు చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారిపోయింది. పాస్ పుస్తకాలు ఇస్తామని గిరిజన రైతుల నుండి రెవెన్యూ అధికారులు రూ.కోటి వసూలు చేశారు. అయినా వీఆర్వో రాములు, ఆర్ఐ నర్శింహారావును పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయకపోవటం గిరిజన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వీఆర్వో రాములు, ఆర్ఐ నర్శింహారావులను గదిలో నిర్భంధించారు. తహశీల్దార్ తిరుమలాచారిపై గ్రామస్థులు దాడికి దిగారు. 

ఆర్కే వున్నాడనే సమాచారంతో కాల్పులు..

విశాఖ : ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లోని బలిమెల రిజర్వాయర్ పరిధిలో కూంబింగ్ చేపట్టిన గ్రేహౌండ్స్ దళాలకు కీలక మావోయిస్టు నేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే వున్నాడనే సమాచారంతో పోలీసులు కాల్పులు జరిపారు. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు సంభవించాయి. ఈ ఘటనస్థలంలో మావోయిస్ట్ నేత ఆర్కే వున్నట్లుగా సమాచారం అందటంలో పోలీసులు కాల్పులు చేపట్టారు. ఈ నేపథ్యంలో మావోలు కూడా ఎదురుకాల్పులు జరపటంతో ఇరువురి మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. సిమిలి సొదర్ అడవుల్లో మావోలకు, పోలీసులకు మధ్య ఉదయం నుంచి భారీ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. 

లాంచీ ప్రమాదం..మరో 4 మృతదేహాల వెలికితీత...

తూర్పుగోదావరి : లాంచీ ప్రమాదంలో మరో 4 మృతదేహాలను వెలికి తీశారు. దీనితో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 20కు చేరింది. మిగిలిన మృతదేహాల కోసం గాలిస్తున్నారు. 

అమెరికాలో బీజేపీ నేతకు 'హోదా' సెగ...

ఢిల్లీ : అమెరికాలో బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావుకు ప్రత్యేక హోదా సెగ తగిలింది. తెలుగు ఎన్ఆర్ఐలు నినాదాలు చేశారు. 

కర్ణాటక సీఎంగా...

ఢిల్లీ : కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. ఎలాంటి మెజార్టీ లేకుండానే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. బల నిరూపణకు గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చారు. 

Don't Miss