Activities calendar

18 May 2018

21:30 - May 18, 2018

హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీలో బల నిరూపణ...యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా కొనసాగుతారా ? తగిన సంఖ్యా బలం లేకున్నా సీఎంగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప బల నిరూపణలో ఎలా నెగ్గుతారు ? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోని ఆయా హోటల్ లో బస చేశారు. ఎమ్మెల్యేలను వల వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తాజ్ కృష్ణాలో మరోసారి సీఎల్పీ భేటీ జరిగింది. జేడీఎస్ తో కలిసి పనిచేయడాన్ని ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యతిరేకించినట్లు సమాచారం. వీరిని తాజ్ కృష్ణాలోనే ఉంచి శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు తీసుకెళ్లనున్నట్లు సమాచారం. లింగాయత్ ల అంశంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం. ఇతర కాంగ్రెస్..జేడీఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరుకు వెళ్లనున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

సమస్యలపై నిరంతర పోరాటం - పవన్...

విశాఖపట్టణం : ప్రజా సమస్యల పై నిరంతర పోరాటానికి తాను సిద్దంగా ఉన్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ చెప్పారు. ఇవాళ విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలంలోని మత్స్యకారుల గ్రామం.. గంగవరంలో పర్యటించిన జనసేనాని.. స్థానిక సమస్యలగురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. 

21:20 - May 18, 2018

హైదరాబాద్ : ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం ఉందని జేడీఎస్ నేత కుమార స్వామి పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ కు చేరుకుని శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు... తగిన బలం లేకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని కర్ణాటక గవర్నర్ ఆహ్వానించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సంచలానాత్మక తీర్పును వెలువరించిందన్నారు. విపక్ష ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బెంగళూరుకు వెళుతారన్నారు. శనివారం శాసనసభలో బలనిరూపణలో పాల్గొంటామన్నారు.

రాత్రికి బెంగళూరుకు జేడీఎస్..కాంగ్రెస్ ఎమ్మెల్యేలు...

హైదరాబాద్ : నగరంలో బస చేసిన జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం రాత్రికి బెంగళూరుకు పయనం కానున్నట్లు సమాచారం. డిన్నర్ అనంతరం వీరు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

29వ తేదీనే రుతు పవనాలు...

ఢిల్లీ : ఈనెల 29వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది భారత్ లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని గత నెలలోనే వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. 

19:56 - May 18, 2018

తల్లి సూడుండ్రి కోడి తన పిల్లలను గద్ద ఎత్కపోకుంట కాపాడుకునెతందుకు ఎట్ల దాశిపెట్టుకుంటది తన రెక్కల కింద.. రైతు బంధు పత్కం ఇయ్యాళ గూడ రణరంగం తీర్గనే గనిపిస్తున్నది ఓ వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు.. నీ అయ్యజాగీరనుకుంటున్నవా వేములవాడ నియోజకవర్గంలున్న భూములు...అప్పుల తెలంగాణ ఆరాధ్య దైవం శ్రీ గుణాత్మక గురువయ్యగారికి తల్కాయ నొప్పి సుర్వైనట్టే అనిపిస్తున్నది తెలంగాణ రాష్ట్రంల.జనసేనా పార్టీ జర్రంత ఎక్వ జనంలకు వొయ్యెతందుకు రెడీ అయితున్నది ఆంధ్రల...చంద్రబాబుగారు.. నీతోని గాదు తుందుర్రు ఆక్వా బాధితులను ఆదుకునుడుగని...తెలంగాణలున్న బీసీ ప్రజలారా.. మిమ్ములను ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మళ్లొకపారి పిచ్చోళ్లను జేయవోతున్నయ్...రైతు బందు పత్కం.. దేశంలనే ఏ నాయకునికి రాని ఆలోచన మా నాయినకొచ్చిందని గప్పాలు గొడ్తాఉంటడు ఆ పోరడు.. గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి...

తెలంగాణ ఈఆర్సీ కమిషన్ నియామకం...

హైదరాబాద్ : ఈఆర్సీ కమిషన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ సీఆర్ బిశ్వాల్ ఛైర్మన్ గా కమిటీ నియమితులైంది. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్లు ఉమా మహేశ్వరరావు, మహ్మద్ ఆలీ, మూడు నెలల్లోగా ఈఆర్సీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 

నల్లజర్లలో వైఎస్ జగన్ భేటీ...

పశ్చిమగోదావరి : నల్లజర్లలో వైఎస్ జగన్ బహిరంగసభ నిర్వహించారు. పోలవరం నిర్మాణం మొత్తం అవినీతిమయమైందని, పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రోజుకి 22 క్యూ.మీ జరుగుతుంటే పోలవరంలో 3 క్యూ.మి. పని కూడా జరగడం లేదన్నారు. 

శనివారం తెలంగాణ ఎంసెట్ ఫలితాలు...

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ ఫ‌లితాలను శనివారం విడుద‌ల చేయ‌నున్నారు. సాయంత్రం 4 గంట‌ల‌కు స‌చివాల‌యంలో ఉప‌ ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రి ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.  

సిద్ధరామయ్యతో జానా..నేతల భేటీ..

హైదరాబాద్ : తాజ్‌కృష్ణ హోటల్‌లో కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కుమార స్వామి, ఇతర నేతలతో టి.కాంగ్రెస్ నేత జానారెడ్డి, ఇతర నేతలు సమావేశమయ్యారు.

బీజేపీకి మరో షాక్...

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో శనివారం బలపరీక్ష చేసుకోనున్న బీజేపీకి మరో షాక్ తగిలింది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి ప్రలోభపెడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

రసకందాయంలో కర్ణాటక రాజకీయాలు...

హైదరాబాద్ : కర్ణాటక రాజకీయాలు రసకందాయంలో పడిపోయాయి. రాత్రి పది గంటలకు ప్రత్యేక విమానంలో ఎమ్మెల్యేలను తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుమతి లభించకుంటే తక్షణమే బస్సుల్లో తరలించాలని కాంగ్రెస్, జేడీఎస్ అధిష్టానాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక సరిహద్దుల వరకు తెలంగాణ ఎస్కార్ట్ కల్పించనుంది. ఉదయం 10గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించనున్నారు. సాయంత్రం 4గంటలకు యడ్యూరప్ప బల నిరూపణకు సిద్ధం కానున్నారు. విపక్ష ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకత్వం వల వేస్తోంది. 

గంగవరం పోర్టు బాధితులకు అండ – పవన్...

ఢిల్లీ : గంగవరం పోర్టు బాధితులకు అండగా ఉంటానని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం అంతకంటే ముఖ్యమని, ప్రజల సమస్యలు అర్థం చేసుకున్నాకే ముఖ్యమంత్రిని అవుతానని తెలిపారు. 

జనసేన ప్రధాన కార్యదర్శిగా తోట చంద్రశేఖర్...

హైదరాబాద్ : జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా శ్రీ తోట చంద్రశేఖర్ నియమితులైనట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారుర. పార్టీ శ్రేణులు సహాయ సహాకారాలు అందించాలని సూచించారు. 

19:12 - May 18, 2018

కర్ణాటక అసెంబ్లీ సమావేశం రేపు జరగనుంది.ఈ క్రమంలో యడ్యూరప్ప బలం నిరూపించుకోవాల్సి వుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాలకు హైదరాబాద్ వేదిగా మారింది. తాజ్ కృష్ణ హోటల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే, నోవాటెల్ హోటల్ లో జేడీఎస్ ఎమ్మెల్యేలకు ఆయా పార్టీల నేతలు అధినేతలు దిశానిర్ధేశం చేస్తున్నారు. ఇరు పార్టీలు క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు కర్ణాటకలో ఏం జరగనుంది? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే అంశంపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈ చర్చలో బీజేపీ అధికార ప్రతినిథి ప్రకాశ్ రెడ్డి,సీపీఎం నేత కృష్ణ,కాంగ్రెస్ అధికార ప్రతినిథి బెల్లయ్య నాయక్ పాల్గొన్నారు.   

18:29 - May 18, 2018

హైదరాబాద్ : కన్నడ రాజకీయం హైదరాబాద్ వేదికగా పలు వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేసిన తాజ్ కృష్ణ హోటల్ కు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కూడా తాజ్ హొటల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. డీమానిటేషన్ డబ్బులు బీజేపీ వద్ద లక్షలాది కోట్లు వున్నాయనీ..దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ తాపత్రాయపడుతోందన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్ధులను కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరిని రెండు వందల కోట్లు ఇచ్చినా తక్కువేనన్నారు వీహెచ్. భారతదేశంలోని ప్రతీ పౌరుడు సుప్రీంకోర్టు తీర్పుని హర్షిస్తున్నారని తెలిపారు. రేపు అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందని వీహెచ్ ఆశాభావం వ్యక్తం చేశారు.గోవా, మణిపూర్, మేఘాలల్లో కాంగ్రెస్ కు మెజారిటీ వున్నాగానీ..కాంగ్రెస్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్లు అనుమతించలేదనీ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విమర్శించారు. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ గా వున్న బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్దపడ్డారన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీని ఫామ్ చేసుకునేందుకు బీజేపీ కుట్రపన్నుతోందన్నారు. దీనికోసం గవర్నర్ రాజుభాయ్ వాలాను పావుగా ఉపయోగించుకున్నారని విమర్శించారు. కాగా కొన్ని సందర్భాలలో న్యాయవ్యవస్థలో అనుమానం ఉండేదనీ..కానీ యడ్యూరప్ప బలపరీక్షకు రెండువారాలు గడువిచ్చారనీ..కానీ సుప్రీంకోర్టు నిర్ణయం చారిత్రాత్మకమని వీహెచ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నోవాటెల్ హోటల్ కు కుమారస్వామి చేరుకుని రేపు జరగాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ నియామకంపై కాంగ్రెస్ మండిపడుతోంది. జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో బస్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కన్నడ పార్టీ నేతలతో పాటు జాతీయ పార్టీ కాంగ్రెస్ నేతలకు కూడా నగరంలో తమ అభ్యర్థులను కాపాడుకుంటునే వారిని రేపటి వ్యూహంపై దిశానిర్ధేశం చేస్తున్నారు. 

పెద్దిబొట్ల సుబ్బరాయశర్మ మృతి..

విజయవాడ : ప్రసిద్ధ కథా రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య తన 82వ ఏట  శుక్రవారం కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దిభొట్ల.. ఇవాళ మృతిచెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్దిభొట్ల మృతిపట్ల రచయితలు, కవులు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆంధ్ర లయోలా కాలేజీలో 40 ఏళ్ల పాటు సుబ్బరామయ్య అధ్యాపకుడిగా పని చేశారు. 200లకు పైగా కథలు రాశారు. తొలిసారి చక్రనేమి కథ రాసిన పెద్దిభొట్ల.. కథా రచనల్లో వివిధ అవార్డులు అందుకున్నారు.

17:22 - May 18, 2018

హైదరాబాద్ : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైదరాబాద్ కు చేరుకోకున్నారు. సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ తో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేకు కూడా వెంటవచ్చారు. కాసేపట్లో తాజ్ కృష్ణ హోటల్ లో కర్నాటక సీఎల్పీ భేటీ కానుంది. రేపు కన్నడ అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షపై ఎమ్మెల్యేలకు సిద్ధు, ఆజాద్ దిశానిర్ధేశం చేయనున్నారు. మరోపక్క జేడీఎస్ ఎమ్మెల్యేలు నోవాటెల్ హోటల్ లో క్యాంప్ వేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో యడ్యూరప్ప ప్రభుత్వం బలపరీక్షలో ఏం జరగనుంది అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు నోవాటెల్ హొటల్ కు జేడీఎస్ అధినేత కుమారస్వామి, సోదరుడు రేవణ్ణ కూడా చేరుకోనున్నట్లుగా తెలుస్తోంది. కాగా జేడీఎస్ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తమతో వున్నారనీ..కాబట్టి బలపరీక్షలో తాము నెగ్గుతమనే ధీమాను జేడీఎస్, కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ పాత్ర కీలకంగా మారనుంది. అధికారం కోసం బీజేపీ అనురిస్తున్న అనైతిక పద్ధతుల నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే బోపయ్యను నియమించటంలో తన ఉనికిని, అనైతికతను చాటుకుంటున్నట్లుగా ప్రతక్ష్యంగా కనిపిస్తోందని విమర్శకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

బలపరీక్షలో కీలకంగా 'ప్రొటెం' స్పీకర్ పాత్ర..
కర్ణాటక
: సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప రేపు జరగబోయే బలపరీక్షలో నెగ్గుతారా? లేక ఓడిపోతారా? అనే మీమాంసలో బీజేపీ వుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తన అనైతిక వ్యవహాన్ని మరోసారి నిరూపించుకుంది. శాసనసభ ప్రొటెం స్పీకర్ గా విద్యార్ధి దశ నుండి సంఘపరివార్ నేతగా..అనతరం బీజేపీ నేతగా కరడుగట్టిన భావాలున్న బోపయ్య ప్రొటెం స్పీకర్ పాత్ర బలపరీక్షలు కీలకం కానున్నది. కర్ణాటక అసెంబ్లీకి 8 సార్లు ఎన్నికైన ఆర్‌వీ దేశ్‌పాండేను.. ప్రొటెం స్పీకర్‌గా అసెంబ్లీ సెక్రటేరియట్ సిఫార్సు చేసింది. దేశ్‌పాండే కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడంతో.. ప్రస్తుతం ప్రొటెం స్పీకర్ పాత్ర రేపటి బలపరీక్షలో కీలకంగా మారనుందని సీనియర్ రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

స్పీకర్ గా జేడీఎస్ అభ్యర్ధి గెలిస్తే..
ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ మేజిక్ ఫిగర్ ను చేరుకోవాలంటే మరో 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందడంతో స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం లేదు. ఒక వేళ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తే కాంగ్రెస్ జేడీఎస్ తమ అభ్యర్థిని స్పీకర్ పదవికి నిలబెడుతాయి. ఈ సమయంలో కాంగ్రెస్ జేడీఎస్ అభ్యర్థి గెలిస్తే.. బలపరీక్ష కంటే ముందే బీజేపీ ఓడినట్లు అవుతుంది. యడ్యూరప్ప వైదొలగక తప్పదు.

స్పీకర్ కుండే అన్నిఅధికారాలు ప్రొటెం స్పీకర్ కు..
ఈ ఇబ్బందికర పరిస్థితులను బీజేపీ అధిగమించాలంటే.. ప్రొటెం స్పీకర్‌తోనే బలపరీక్ష నిర్వహించుకోవాలి. రాజ్యాంగపరంగా ఇతర స్పీకర్లకు ఉన్నట్లే ప్రొటెం స్పీకర్‌కు అన్ని అధికారాలు ఉంటాయి. అయితే బలపరీక్ష సమయంలో ఎమ్మెల్యేలు ఎవరైనా ఫిరాయింపులకు పాల్పడితే.. తక్షణమే కాంగ్రెస్, జేడీఎస్ కలిసి స్పీకర్‌కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ప్రొటెం స్పీకర్ ఆ వెంటనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేసే అవకాశం ఉంటుంది. అదే జరిగితే.. బీజేపీ బలనిరూ

17:02 - May 18, 2018

కర్నాటక రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. శనివారం సాయంత్రం 4గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో బీజేపీ ఇరకాటంలో పడిపోయింది. ఇదిలా ఉంటే ఆయా పార్టీల సంఖ్యాబలాలు ఈ విధంగా ఉన్నాయి. బీజేపీ -104, కాంగ్రెస్ - 78, జేడీఎస్ - 37, బీఎస్పీ -1, ఇతరులు -2గా ఉన్నాయి. 222 స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. సాధారణ మెజార్టీ 112గా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు..కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నాగేశ్వర్ విశ్లేషించారు.

బలపరీక్షను శనివారం నాలుగు గంటల్లోపు పూర్తి చేయాలని, స్పీకర్ ఎన్నిక అవసరం లేదని తెలిపిందన్నారు. ప్రొటెం స్పీకర్ (తాత్కాలిక) స్పీకర్ ను సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేను ఎంపిక చేయాలని, రూల్స్ కు అనుగుణంగా అతను పని చేయాలని, అంతకంటే ముందు ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందన్నారు. అనంతరం ఫిరాయింపు నిరోధక చట్టం మొదలు కానుందని, పార్టీ విప్ ను అనుసరించాల్సి ఉంటుందన్నారు.

బల నిరూపణకు బీజేపీ పార్టీకి 15 రోజుల సమయం గవర్నర్ ఇచ్చారని, ఈ సమయాన్ని ఒక విధంగా సుప్రీం తప్పుబట్టినట్లేనన్నారు. కానీ కోర్టులో వారం రోజుల గడువు ఇవ్వాలని బీజేపీ తరపు న్యాయవాది కోరడం జరిగిందని దీనిని సుప్రీంకోర్టు నిరాకరించిందన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికే గవర్నర్ అవకాశం ఇచ్చినట్లుగా ఉందన్నారు. కర్నాటక గవర్నర్ కు భిన్నంగా గోవా గవర్నర్ వ్యవహరించారని తెలిపారు. న్యాయవ్యవస్థపై గౌరవం లేదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కానీయకుండా ఉండడం...గవర్నర్ దురుద్దేశ్యపూర్వకంగా ఇచ్చారనే దానికి సుప్రీం తీర్పు బలం చేకూర్చినట్లైందన్నారు.

మెజార్టీ ఎమ్మెల్యేల బలం ఉందని యడ్యూరప్ప పేర్కొంటున్నారని, కానీ ఆయన ఇచ్చిన నివేదికలో కేవలం 104 మంది ఎమ్మెల్యేల వివరాలు ఉన్నాయన్నారు. అదే కాంగ్రెస్..జేడీఎస్ పార్టీలు 117 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన నివేదికను ఇచ్చిందన్నారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ బద్ధమని చెప్పలేదని, రాజ్యాంగబద్ధతను తరువాత పరిశీలిస్తామని..అంతకంటే ముందు బల పరీక్ష తేల్చుదామని సుప్రీం పేర్కొనడం జరిగిందన్నారు. అంటే రాజ్యంగబద్ధమైన కేసు కొనసాగుతుందని, గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం చెబితే యడ్యూరప్ప ఉండరన్నారు. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:00 - May 18, 2018

కర్ణాటక : అధికారం చేజిక్కించుకోవడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. సంఖ్యాబలం లేకున్నా సీఎంగా బీజేపీ నేత యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. బల నిరూపణ చేసుకోవడానికి అక్కడి రాష్ట్ర గవర్నర్ యడ్యూరప్పకు 15 రోజుల గడువునిచ్చింది. ఈ గడువులో సభ్యుల సంఖ్యను పెంచుకోవచ్చని బీజేపీ భావించింది. కానీ సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పుతో బీజేపీ ఖంగుతింది. శనివారం సాయంత్రం బల నిరూపణకు సిద్ధం కావాలని సుప్రీం పేర్కొంది. దీనితో ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు అన్ని అడ్డదారులు తొక్కుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ప్రొటెం స్పీకర్ గా బోపయ్యను గవర్నర్ నియమించారు. ఇతని నియామకంపై కాంగ్రెస్ మండిపడుతోంది.

ఆపరేషన్ 'కమల' పేరిట జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వల వేసేందుకు ప్లాన్స్ రచిస్తోంది. అందులో భాగంగా లింగాయత మఠాధీశులు రంగ ప్రవేశం చేశారు. వీరితో యడ్యూరప్ప చర్చలు జరిపారు. కాంగ్రెస్..జేడీఎస్ లో ఉన్న వీరశైవ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి యడ్యూరప్ప చేస్తున్న చర్యలకు ఎంత మంది ఎమ్మెల్యేలు ఆకర్షితులవుతారనేది చూడాల్సి ఉంది. 

కార్ణాటకీయంలోకి లింగాయత్ మఠాధీశులు..

కర్ణాటక : రాష్ట్ర రాజకీయ రంగంలో మరో కీలక అంశం సీన్ లోకి వచ్చింది. సీఎం పీఠం కోసం, అధికార దాహంతో రగిలిపోతున్న బీజేపీ అనైతిక దారులు ఎనైతే ఉన్నాయో అన్నింటి ఉపయోగించుకుంటోంది. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలలోవున్న లింగాయత్ వీరశైవ ఎమ్మెల్యేలను ఆకట్టుకునేందుకు లింగాయత్ మఠాధీశులకు బీజేపీ రంగంలోకి దింపింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప లింగాయత్ మఠాధీశులతో చర్చలు జరిపారు.జేడీఎస్, కాంగ్రెస్ వీరశైవ ఎమ్మెల్యేలపై మఠాధీశుల వల వేసేందుకు యడ్యూరప్ప మంత్రాంగాన్ని చేపట్టారు.  

భాగ్యనగరంలో కర్నాటక సీఎల్పీ భేటీ..

హైదరాబాద్ : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైదరాబాద్ కు చేరుకోకున్నారు. సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ తో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేకు కూడా వెంటవాచ్చరు. కాసేపట్లో తాజ్ కృష్ణ హోటల్ లో కర్నాటక సీఎల్పీ భేటీ కానుంది. రేపు కన్నడ అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షపై ఎమ్మెల్యేలకు సిద్ధు, ఆజాద్ దిశానిర్ధేశం చేయనున్నారు. మరోపక్క జేడీఎస్ ఎమ్మెల్యేలు నోవాటెల్ హోటల్ లో క్యాంప్ వేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో యడ్యూరప్ప ప్రభుత్వం బలపరీక్షలో ఏం జరగనుంది అనే అంశంపై ఉత్కంట కొనసాగుతోంది.

 

బలపరీక్షలో కీలకంగా 'ప్రొటెం' స్పీకర్ పాత్ర..

కర్ణాటక : సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప రేపు జరగబోయే బలపరీక్షలో నెగ్గుతారా? లేక ఓడిపోతారా? అనే మీమాంసలో బీజేపీ వుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తన అనైతిక వ్యవహాన్ని మరోసారి నిరూపించుకుంది. శాసనసభ ప్రొటెం స్పీకర్ గా విద్యార్ధి దశ నుండి సంఘపరివార్ నేతగా..అనతరం బీజేపీ నేతగా కరడుగట్టిన భావాలున్న బోపయ్య ప్రొటెం స్పీకర్ పాత్ర బలపరీక్షలు కీలకం కానున్నది. కర్ణాటక అసెంబ్లీకి 8 సార్లు ఎన్నికైన ఆర్‌వీ దేశ్‌పాండేను.. ప్రొటెం స్పీకర్‌గా అసెంబ్లీ సెక్రటేరియట్ సిఫార్సు చేసింది. దేశ్‌పాండే కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడంతో..

బలపరీక్షలో కీలకంగా 'ప్రొటెం' స్పీకర్ పాత్ర..

కర్ణాటక : సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప రేపు జరగబోయే బలపరీక్షలో నెగ్గుతారా? లేక ఓడిపోతారా? అనే మీమాంసలో బీజేపీ వుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తన అనైతిక వ్యవహాన్ని మరోసారి నిరూపించుకుంది. శాసనసభ ప్రొటెం స్పీకర్ గా విద్యార్ధి దశ నుండి సంఘపరివార్ నేతగా..అనతరం బీజేపీ నేతగా కరడుగట్టిన భావాలున్న బోపయ్య ప్రొటెం స్పీకర్ పాత్ర బలపరీక్షలు కీలకం కానున్నది. కర్ణాటక అసెంబ్లీకి 8 సార్లు ఎన్నికైన ఆర్‌వీ దేశ్‌పాండేను.. ప్రొటెం స్పీకర్‌గా అసెంబ్లీ సెక్రటేరియట్ సిఫార్సు చేసింది. దేశ్‌పాండే కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడంతో..

బలం వుంటే గడువుఎందుకు : ఆజాద్

కర్ణాటక : కర్ణాటక రాజకీయాలపై సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, రేపు బలపరీక్షలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. నిజంగా బలం ఉంటే సుప్రీంలో మరింత గడువు కావాలని బీజేపీ ఎందుకు కోరిందని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిందని అన్నారు. మణిపూర్, గోవా, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ న్యాయసూత్రాలను పాటించలేదని విమర్శించారు. కర్ణాటకలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదని, చట్టాలకు విరుద్ధంగా బీజేపీకి గవర్నర్ అవకాశమిచ్చారని విమర్శించారు.

సీనియర్ కాకుండా బోపయ్యకేమిటి : కాంగ్రెస్

కర్ణాటక : కన్నడ నాట రాజకీయాలు ఎన్నికలు అయినా..ఫలితాలువ వచ్చినా నేటికి ఉత్కంఠభరితంగానే కొనసాగుతున్నాయి. అధికార పీఠం కోసం మూడు ప్రధాన పార్టీలు ఎత్తులపై ఎత్తులు వేస్తునే వున్నాయి. ఈ నేపథ్యంలో రేపు యడ్యూరప్పను అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని సుప్రీం తీర్పుతో కాంగ్రెస్, జేడీఎస్ లు హర్షం వ్యక్తంచేయగా..బీజేపీ మాత్రం మరో ఎత్తు వేసిన వారికంటే ముందున్నానంటోంది. ఈ క్రమంలో బీజేపీ నేత బోపయ్యను ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ నియమించారు. బోపయ్య కంటే సీనియార్టీ ఉన్న తమ ఎమ్మెల్యే దేశ్ పాండేను నియమించకుండా బోపయ్యను ఎలా నియమిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ప్రొటెమ్ స్పీకర్ గా బోపయ్య..మండిపడుతున్న కాంగ్రెస్..

కర్ణాటక : అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్ గా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కేజే బోపయ్యను గవర్నర్ బాజూభాయ్ వాలా నియమించారు. కాగా న్యాయ నిపుణులతో చర్చించిన అనతరం గవర్నర్ వాజూభాయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం ప్రొటెం స్పీకర్ గా బోపయ్యను నియమిస్తూ గవర్నర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కాసేపట్లో ప్రొటెం స్పీకర్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా గతంలో అసెంబ్లీ స్పీకర్ గా బోపయ్య పనిచేశారు. తాజా ఎన్నికల్లో కూడా విరాజ్ పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇదిలా ఉండగా, ప్రొటెం స్పీకర్ గా బోపయ్యను నియమించడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు : సిద్దరామయ్య

కర్ణాటక : రేపు సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ బలపరీక్షను ఎదుర్కోవాలంటూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నిచ్చిందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య హర్షం వ్యక్తం చేశారు. కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఈ సంద్భంగా ఆయన కోరారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన గవర్నర్ బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని, తాము ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించినప్పటికీ ఆయన పట్టించుకోలేదని విమర్శించారు.

16:05 - May 18, 2018

కర్ణాటక : రాష్ట్రంలో రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి. సంఖ్యాబలం లేని బీజేపీ నేత యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. శనివారం సాయంత్రం బలనిరూపణ చేసుకోవాలని శుక్రవారం సుప్రీం పేర్కొనడంతో బీజేపీ హతాశురాలైంది. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ గా బోపయ్యను గవర్నర్ వాజుబాయ్ ను నియమించారు. బోపయ్య నియామకంపై కాంగ్రెస్ మండిపడుతోంది. సభకు ఎన్నికైన వ్యక్తుల్లో అత్యంత సీనియర్ వ్యక్తిని నియమించాలని సుప్రీం పేర్కొంది. కానీ బోపయ్య అత్యంత సీనియర్ కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

2011 సంవత్సరం పరిణామాలను గుర్తు చేస్తోంది. అప్పట్లో యడ్యూరప్పపై 11 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా స్పీకర్ గా ఉన్న బోపయ్య ప్రకటించారు. దీనితో ఏకపక్ష చర్యతో బీజేపీ సర్కార్ అస్థిత్వం నిలుపుకున్నట్లైంది. బోపయ్య విద్యార్థి దశ నుండి సంఘ్ పరివార్ లో కొనసాగుతున్నారు. యడ్యూరప్ప పదవిని కాపాడేందుకు బీజేపీ అనైతిక విధానాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ మండిపడుతోంది. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

రైతుబంధు ద్వారా తిరిగి స్వదేశానికి : కేటీఆర్

హైదరాబాద్ : సాగునీరు, రైతుబంధు వల్ల పొట్టచేత పట్టుకుని గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన వారు తిరిగి స్వదేశానికి చేరుకుని స్వగ్రామాలలో వ్యవసాయం చేసుకుంటున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పదేళ్లలో రైతుబంధుకు మించిన సంతృప్తి ఏ పథకం ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమవుతుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రెండో హరిత విప్లవానికి తెలంగాణ కేంద్ర బిందువు అవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.  

కౌలురైతులకు సాయంపై కేటీఆర్..

హైదరాబాద్ : రైతుబంధు పథకం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో కౌలురైతులకు కూడా సాయం చేయాలని వాదనలు, డిమాండ్స్ వినిపిస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. కౌలురైతులకు సాయం చేస్తే వారు భూమిపై హక్కులు కోరే అవకాశముందని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు ప్రయోజనం కౌలురైతులకు కూడా పరోక్షంగా అందుతుందన్నారు. హరిత విప్లవం, నీలి విప్లవం, మాంసం శుద్ధితో గులాబీ విప్లవం తీసుకువస్తామన్నారు. నవంబర్‌లో మరింత సాధికారికంగా రైతుబంధు సాయం అందుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

కౌలురైతులకు సాయంపై కేటీఆర్..

హైదరాబాద్ : రైతుబంధు పథకం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో కౌలురైతులకు కూడా సాయం చేయాలని వాదనలు, డిమాండ్స్ వినిపిస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. కౌలురైతులకు సాయం చేస్తే వారు భూమిపై హక్కులు కోరే అవకాశముందని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు ప్రయోజనం కౌలురైతులకు కూడా పరోక్షంగా అందుతుందన్నారు. హరిత విప్లవం, నీలి విప్లవం, మాంసం శుద్ధితో గులాబీ విప్లవం తీసుకువస్తామన్నారు. నవంబర్‌లో మరింత సాధికారికంగా రైతుబంధు సాయం అందుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

15:54 - May 18, 2018

నెగ్గుతామనే ధీమాలో జేడీఎస్...

హైదరాబాద్ : కర్ణాటక రాజకీయాలు హైదరాబాద్ కు మారాయి. ప్రముఖ హోటల్ లో జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేశారు. శనివారం సాయంత్రం బలపరీక్షకు సిద్ధం కావాలని బీజేపీకి సుప్రీం సూచించిన సంగతి తెలిసిందే. దీనిపై జీటీ దేవెగౌడ టెన్ టివితో మాట్లాడారు. బలపరీక్షలో నెగ్గుతామనే ధీమా ఉందన్నారు. కాంగ్రెస్..జేడీఎస్ కు భారీ మెజార్టీ ఉందని, చాముండేశ్వరీ నియోజకవర్గంలో సిద్ధరామయ్యను జి.టి.దేవెగౌడ ఓడించారు. సంపూర్ణ మెజార్టీ ఉంటుందని వెల్లడించారు. బస చేసిన ఎమ్మెల్యేలంతా శుక్రవారం రాత్రికి బెంగళూరుకు వెళ్లనున్నారు. 

సీఎం కావాలనే కోరిక లేదు : కేటీఆర్

హైదరాబాద్ : 2019 ఎన్నికల్లో కేటీఆర్ సీఎం అనే వార్తలు గత కొంతకాలంలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలలో మంత్రి కేటీఆర్ తొలిసారిగా స్పందించారు. సీఎం కావాలనే కోరిక, అత్యాశ తనకు లేదని కేటీఆర్ పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల్లో వుండనని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఒంటిరిగానే పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. మరో 15 సంవత్సరాలు కేసీఆర్ సీఎం అని జోస్యం చెప్పారు. 

15:39 - May 18, 2018

ఢిల్లీ : కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు నాటకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సీఎంగా బీజేపీ నేత యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రంకోర్టు శుక్రవారం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. శనివారం సాయంత్రం 4గంటలకు బలనిరూపణకు సిద్ధం కావాలని పేర్కొనడంతో బీజేపీ ఇరకాటలో పడింది. దీనిపై శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ మీడియాతో మాట్లాడారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని, తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. సుప్రీం వెలువరించిన తీర్పుతో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిందన్నారు.

ఢిల్లీ : కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుపై సుప్రీం వెలువరించిన తీర్పుపై నేతలు స్పందిస్తున్నారు. సుప్రీం వెలువరించిన తీర్పును బీజేపీ గౌరవిస్తుందని ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనైతికంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయని, సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఆహ్వానించాలని మాజీ రాష్ట్రపతి కే.ఆర్ నారాయణన్ ను వెల్లడించడం జరిగిందన్నారు. శనివారం నాడు జరిగే బలనిరూపణలో యడ్యూరప్ప ప్రభుత్వం నెగ్గుతుందని తెలిపారు. 

బెంగళూరు టూ భాగ్యనగరం కన్నాటకం..

హైదరాబాద్ : బెంగళూరు టూ భాగ్యనగరం వేదికగా కన్నడ రాజకీయం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో వున్న సంగతి తెలిసిందే. యడ్యూరప్ప బలపరీక్షకు రేపు సాయంత్రం 4 గంటల వరకూ సుప్రీంకోర్టు గడువునిచ్చింది. ఈ క్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భాగ్యనగరానికి రానున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రేపటి బలపరీక్షపై చర్చ తాజ్ కృష్ణ హోటల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమాలోచనలు కొనసాగుతున్నాయి. నోవాటెల్ లో రేపు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు కొనసాగుతన్నాయి. ఈ క్రమంలో ఈరోజు రాత్రికి అందరు బెంగళూరుకి తిరుగు ప్రయాణం కానున్నారు. 

పాదయాత్రలో జగన్ కు వింత అనుభవం..

పశ్చిమగోదావరి : వైసీపీ అధినేత జగన్ కు వింత అనుభవం ఎదురయ్యింది. జగన్ పాదయాత్రలో చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలుచేస్తున్నారంటు నినాదాలు చేశారు. టీడీపీ బ్యానర్లు,ఫెక్సీలతో నినాదాలు చేశారు. అబద్దాలుచెప్పేందుకు వచ్చారంటూ టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తంచేశారు. నల్లజర్ల మండలం మారంపాలెంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో వైసీపీ కార్యకర్తలతో పాటు జగన్ కు విస్తుపోయారు.

లారీ, బైక్ ఢీ..ముగ్గురు మృతి

సంగారెడ్డి : అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.  

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : నాగన్ గౌడ్

హైదరాబాద్ : సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని జేడీఎస్ ఎమ్మెల్యే నాగన్ గౌడ్ పేర్కొన్నారు. రేపు కర్ణాటక అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.ఈరోజు సాయంత్రానికి కుమారస్వామి హైదరాబాద్ చేరుకుంటారనీ..అనంతరం అందరం కలిసి బెంగళూరు చేరుకుంటామని నాగన్ గౌడ్ తెలిపారు. కాగా జేడీఎస్,కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైజాక్ అవ్వకుండా కర్ణాటక నుండి ఈరోజు ఉదయం హైదరాబాద్ నగరానికి ఎమ్మెల్యేలను తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్ంయలో బీజేపీ అసెంబ్లీలో రేపు సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష నిరూపించుకుని తీరాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

గంగవరం పోర్టు నిర్వాశితులతో జనసేనాని..

విశాఖపట్నం : గంగవరం పోర్టు నిర్వాశితులతో జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. బీజేపీ, టీడీపీ పార్టీలు ప్రజలకు మంచి చేస్తాయనే ఉద్ధేశ్యంతోను గతంలో తాను మద్దతునిచ్చానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కానీ బీజేపీ పార్టీ ఏపీ ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించే పార్టీని ప్రజలు వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని సూచించారు.  

సుప్రీం తీర్పు బీజేపీకి చెంపపెట్టు : భట్టి

హైదరాబాద్ : కర్ణాటక రాజకీయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామనీ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి చెంపపెట్టులాంటిదన్నారు. ఈ తీర్పు ప్రజాస్వావ్య పరిరక్షణకు ఉపయోగపడుతుందన్నారు. బీజేపీ అనైతిక పద్ధతులను కట్టడిచేస్తామన్నారు. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణలో ఓటమి తప్పదని భట్టి జోస్యం చెప్పారు. బీజేపీ రహస్య ఓటింగ్ అడగటం సిగ్గుచేటన్నారు. 

మా ఎమ్మెల్యేలంతా మాతోనే : మధుయాష్కి

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ నేత మధు యాష్కీ తప్పుబట్టారు. అమిత్ షా వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమనీ..తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని కాంగ్రెస్ నేత మధుయాష్కి తెలిపారు. మెజార్టీ లేని బీజేపీ ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. బలపరీక్షలో యడ్యూరప్ప ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తంబచేశారు. కాగా రేపు సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బలప

13:59 - May 18, 2018

బెంగళూరు : కర్నాటక రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బలపరీక్షకు ముందే బీజేపీకి మరో షాక్ తగిలింది. బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ జే గౌడ జేడీఎస్ గూటికి చేరారు. మరో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా జేడీఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో వేర్వేరుగా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రేపటి బలపరీక్షపై చర్చిస్తున్నారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఆపాయింట్ మెంట్ కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

13:50 - May 18, 2018

హైదరాబాద్ : కర్నాటక కాబోయే సీఎం కుమారస్వామి అని జేడీఎస్ ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. బలపరీక్షలో యడ్యూరప్ప ప్రభుత్వం నెగ్గదని...కాంగ్రెస్, జేడీఎస్ అలయెన్స్ లో కుమారస్వామి సీఎం అవుతారని స్పష్టం చేశారు. 104 సీట్లు వచ్చిన బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు ఎలా చేరుకుంటుందని ప్రశ్నించారు. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యా బలం ఉందన్నారు. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాత్రమేనని ప్రభుత్నాన్ని ఏర్పాటు చేసేందుకు మెజారిటీ సీట్లు లభించలేదన్నారు. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అక్కడి గవర్నర్ ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. 

 

13:48 - May 18, 2018

బెంగళూరు : కర్నాటక రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. కర్నాటక రాజకీయాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేపే కర్నాటక అసెంబ్లీలో బలపరీక్ష జరుగనుంది. యడ్యూరప్ప ప్రభుత్వం బల నిరూపణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎట్టిపరిస్థితుల్లో రేపు సాయంత్రం 4 గంటలకు యడ్యూరప్ప బలనిరూపణ చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికిప్పుడు బలపరీక్షకు సిద్ధంగా లేమని..గడువు ఇవ్వాలని బీజేపీ లాయర్ ముకుల్ రోహత్గీ కోరారు. అయితే బీజేపీ తరపు లాయర్ కోరిన గడువును కోర్టు తిరస్కరించింది. ప్రొటెం స్పీకర్ బల పరీక్ష వ్యవహారాన్ని నిర్వహిస్తారని కోర్టు తెలిపింది. ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని యడ్యూరప్పను ఆదేశించింది. ఎమ్మెల్యేల భద్రతను డీజీపీ పర్యవేక్షించాలని సూచించింది. ఆంగ్లో..ఇండియన్ సభ్యుడి ఎన్నికచేపట్టవద్దని తెలిపింది. రహస్య బ్యాలెట్ కు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రొటెం స్పీకర్ గా కాంగ్రెస్ ఆర్ వి. దేశ్ పాండే వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అంతకముందు యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఏజీ వేణుగోపాల్, కాంగ్రెస్, జేడీఎస్ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. యడ్యూరప్ప గవర్నర్ కు ఇచ్చిన లేఖలను ఏజీ వేణగోపాల్ ధర్మాసనానికి సమర్పించారు. 

 

13:23 - May 18, 2018

బెంగళూరు : కర్నాటక రాజకీయం రసవత్తరంగా మారింది. కర్నాటక రాజకీయం హైదరాబాద్ కు చేరింది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల క్యాంపు హైదరాబాద్ కు మారాయి. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్, జేడీఎస్ నానా తంటాలు పడుతున్నాయి. ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మూడు బస్సుల్లో కర్నాటక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మేల్యేలు హైదరాబాద్ కు చేరుకున్నారు. తాజ్ కృష్ణ, గోల్కొండ హోటల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నోవా హోటల్ లో జేడీఎస్ ఎమ్మెల్యేలు మకాం వేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకున్నారు. 

 

రైతు ఆత్మహత్యల రాష్ట్రం తెలంగాణ : అరుణ

గద్వాల : 90శాతం భూ రికార్డులను ప్రక్షాళన చేశామని చెబుతున్న ప్రభుత్వం రైతులందరికీ పాస్‌పుస్తకాలను ఎప్పటి వరకు అందిస్తుందో స్పష్టం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్‌ చేశారు. దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఆత్మహత్య లు చేసుకున్న రాష్ట్రం తెలంగాణనే అనే విషయాన్ని ప్ర భుత్వం గుర్తించుకోవాలన్నారు. రైతు రుణమాఫీని నాలుగు వాయిదాలుగా చెల్లించి, ముప్పు తిప్పలు పెట్టిన కేసీ ఆర్‌.. రైతు ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందన్న భయం తోనే రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అరుణ విమర్శనాస్త్రాలు సంధించారు.

మైనార్టీల ఓట్ల కోసం జిమ్మిక్కులు : డీకే అరుణ

గద్వాల : తాను నాలుగేళ్లక్రితం మంత్రిగా శంకుస్థాపన చేసిన ఈద్గా మైదానానికి ఉపముఖ్య మంత్రి మహిమూద్‌అలి చేత మరోసారి శంకుస్థాపనకు సిద్ధపడడం హాస్యాస్పదమని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఎద్దేవా చేశారు. తాను శంకుస్థాపన చేసే సమయం నాటి అంచనాల ప్రకారం రూ.60 లక్షలు తొలి విడతగా మంజూరు చేశామని అరుణ తెలిపారు. నాలుగేళ్ల నుంచి ఈద్గా గురించి పట్టించుకోని టీఆర్‌ఎస్‌ నాయకులు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మైనార్టీల ముందు కొత్త జిమ్మిక్కు చేస్తున్నారని అరుణ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.

13:12 - May 18, 2018

ఢిల్లీ : యడ్యూరప్ప బలనిరూపణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. రేపు సాయంత్రం 4 గంటలకు ఎట్టిపరిస్థితుల్లో బలనిరూపణ చేసుకోవాలని తేల్చిచెప్పింది. రేపు బలపరీక్షకు తాము సిద్ధమని యడ్యూరప్ప తెలిపారు. మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన ఎమ్మెల్యేల బలం తమకు ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. రేపు అసెంబ్లీ అత్యవసర సమావేశానికి గవర్నర్ ఆదేశించారు.

 

కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగిని ఆత్మహత్య..

కర్నూలు : కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలులో చోటుచేసుకుంది. కలెక్టర్ కార్యాలయం పై నుండి దూకి ఐసీడీఎస్ సూపర్ వైజర్ గా విధులు నిర్వహించే శోభారాణి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కాగా శోభారాణి ఆళ్లగడ్డలో సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తోంది. సమాచారం మేరకు ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శోభారాణి కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఉద్యోగపరమైన సమస్యలతోనా? అనే కోణంలో పోలీసులు దర్యాపు చేస్తున్నారు.  

13:08 - May 18, 2018

స్విమింగ్ పూల్ లో పడి ఇద్దరు చిన్నారులు మృతి..

మహబూబ్ నగర్ : జాలిహిల్స్ హోటల్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులు స్మిమింగ్ పూల్ లో పడి మృతి చెందిన ఘటన హోటల్ లో చోటుచేసుకుంది. కాగా ఈ విషయంపై మరింత సమాచారం అందాల్సివుంది.

13:02 - May 18, 2018

ఢిల్లీ : రేపే కర్నాటక అసెంబ్లీలో బలపరీక్ష జరుగనుంది. యడ్యూరప్ప బలనిరూపణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. యడ్యూరప్ప బలనిరూపణ చేసుకోవాలని కోర్టు తుదితీర్పు వెలువరించింది. రేపు సాయంత్రం 4 గంటలకు ఎట్టిపరిస్థితుల్లో బలనిరూపణ చేసుకోవాలని తేల్చిచెప్పింది. ప్రొటెం స్పీకర్ బల పరీక్ష వ్యవహారాన్ని నిర్వహిస్తారని కోర్టు తెలిపింది. ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని యడ్యూరప్పను ఆదేశించింది. ఎమ్మెల్యేల భద్రతను డీజీపీ పర్యవేక్షించాలని సూచించింది. ఆంగ్లో..ఇండియన్ సభ్యుడి ఎన్నికచేపట్టవద్దని తెలిపింది. రహస్య బ్యాలెట్ కు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటికిప్పుడు బలపరీక్షకు సిద్ధంగా లేమని..గడువు ఇవ్వాలని బీజేపీ లాయర్ ముకుల్ రోహత్గీ కోరారు. అయితే బీజేపీ తరపు లాయర్ కోరిన గడువును కోర్టు తిరస్కరించింది. అంతకముందు యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఏజీ వేణుగోపాల్, కాంగ్రెస్, జేడీఎస్ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. యడ్యూరప్ప గవర్నర్ కు ఇచ్చిన లేఖలను ఏజీ వేణగోపాల్ ధర్మాసనానికి సమర్పించారు. 

 

ప్రభుత్వం రైతుబంధు పేరుతో డ్రామా : డీకే అరుణ

గద్వాల : ఎన్నికలు దగ్గరపడుతున్నాయనే తొందరలో ప్రభుత్వం రైతులకు రైతుబంధు పథకంతో ఆకట్టుకుంటోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడి సహాయం పేరుతో చెక్కుల డ్రామాకు తెరతీసిందని ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. రైతుబంధు చెక్కుల గురించి మాత్రమే మాట్లాడుతున్న మంత్రులు, నాయకులు ఇప్పటికే వేలాది మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందకున్నా.. నోరు మెదపడం లేదు ఎందుకని ప్రశ్నించారు. 

కుయుక్తులతో ప్రజాతీర్పును దోచుకోనున్నారు: రాహుల్

ఢిల్లీ : కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం, అనంతరం బలనిరూపణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వాగతించారు. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని తాము పేర్కొన్న విషయాన్నే సుప్రీంకోర్టు తీర్పుతో నిరూపితమైందనీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సంఖ్యాబలం లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్న బీజేపీ వైఖరిని కోర్టు తప్పు బట్టిందన్నారు. చట్టపరంగా బ్రేక్ పడిందని, వారిక ధన, కండబలంతో ప్రజాతీర్పును దోచుకోవటానికి ప్రయత్నిస్తారని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

సుప్రీం తీర్పుని శిరసా వహిస్తాం : యడ్యూరప్ప

కర్ణాటక : రేపు సాయత్రం బలం నిరూపించుకోవాలని యడ్యూరప్పకు సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన యడ్యూరప్ప సుప్రీంకోర్టును తీర్పును శిరసా వహిస్తామనీ..పూర్తి మెజారిటీ సాధిస్తామనే నమ్మకం వుందని పేర్కొన్నారు. రేపు జరిగే బలపరీక్షలో తప్పకుండా నెగ్గుతామని యడ్యూరప్ప ధీమాగా చెప్పారు.

బలాన్ని నిరూపించుకుంటాం,వారి ఆశీర్వాదం మాకుంది : బీజేపీ

కర్ణాటక : సభలో బలం నిరూపించుకునే విషయంలో బీజేపీ కర్ణాటక విభాగం పూర్తి నమ్మకాన్ని వ్యక్తంచేసింది. రేపటిలోగా మెజారిటీ నిరూపించుకోవాలని బీజేపీ నేత యడ్యూరప్పను సుప్రీంకోర్టు ఆదేశిస్తూ ఈ రోజు సంచలన తీర్పు వెలువరించిన విషయం విదితమే. దీనిపై బీజేపీ కర్ణాటక విభాగం ట్విట్టర్లో స్పందించింది. బలపరీక్షలో నెగ్గుతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. తమకు తగిన సంఖ్యా బలం ఉందని ప్రకటించింది. మా బలంపై సందేహం ఉన్న వారికి రేపు సమాధానం దొరుకుతుందని దీనికోసం 'వేచి చూడండని' సోషల్ మీడియా పోస్ట్ లో బీజేపీ పేర్కొంది. ఆరు కోట్ల మంది కన్నడిగుల ఆశీర్వచనాలు తమకు ఉన్నాయంది.

యడ్యూరప్ప బలనిరూపణలో సుప్రీం నిర్భంధాలు..

ఢిల్లీ : యడ్యూరప్ప ఎట్టి పరిస్థితుల్లోను రేపు సాయంత్రం 4గంటలకు బలనిరూపణ చేయాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో యడ్యూరప్ప ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని ఆదేశించింది. ఎమ్మెల్యేల భద్రతా వ్యవహారాన్ని డీజేపీ పర్యవేక్షించాలనీ..దానికి తగిన భద్రతా చర్యలు తీసుకోవాలనీ..ఆదేశించింది. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఎన్నిక చేపట్టవద్దని సుప్రీంకోర్టు ని పోలీసు శాఖకు సూచించింది. రహస్య పద్ధతిలో ఓటింగ్ జరగాలన్న అటార్నీ జనరల్ విజ్పప్తిని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో బీజేపీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారయ్యింది.

12:22 - May 18, 2018

ఢిల్లీ : బీజేపీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగలింది. కర్నాటక రాజకీయాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేపే కర్నాటకలో బలనిరూపణ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇప్పటికిప్పుడు బలపరీక్షకు సిద్ధంగా లేమని..గడువు ఇవ్వాలని బీజేపీ లాయర్ ముకుల్ రోహత్గీ కోరారు. అయితే బీజేపీ తరపు లాయర్ కోరిన గడువును కోర్టు తిరస్కరించింది. రేపు యడ్యూరప్ప బలనిరూపణ చేసుకోవాలని  ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. కర్నాటకలో రేపు సాయంత్రం 4 గంటలకు బీజేపీ బలపరీక్ష జరుగనుంది. అంతకముందు యడ్యూరప్ప ప్రమాణస్వీకారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఏజీ వేణుగోపాల్, కాంగ్రెస్, జేడీఎస్ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. యడ్యూరప్ప గవర్నర్ కు ఇచ్చిన లేఖలను ఏజీ వేణగోపాల్ ధర్మాసనానికి సమర్పించారు. 

 

బలపరీక్షలో మేమే నెగ్గుతాం : అశ్వని కుమార్

కర్ణాటక : అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి యడ్యూరప్పకు గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది. రేపు సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవాలని స్పష్టమైన ఆదేశాలను వెలువరించింది. సుప్రీం తీర్పు పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేలా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిందని కాంగ్రెస్ నేత అశ్వని కుమార్ తెలిపారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సుప్రీంకోర్టు మరోసారి నిలబెట్టుకుందని చెప్పారు.

బీజేపీకి సుప్రీం డబుల్ ఝలక్స్? సీక్రెట్ బ్యాలెట్ కు 'నో'

ఢిల్లీ : కన్నడ రాకీయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యడ్యూరప్ప ప్రభుత్వం రేపే బలనిరూపణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీలో యడ్యూరప్ప బలనిరూపణ చేసుకోవాల్సిందిగా ఆదేశించింది. దీనిపై బీజేపీ లాయర్ ముకుల్ రోహల్గీ వారం రోజులు గడువు కోరారు. దీన్ని సుప్రీం తిరస్కరించింది. అనంతరం సీక్రెట్ ఓటింగ్ కు అనుమతి కోరగా..ఆ విన్నపాన్ని కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం తోచిపుచ్చింది. బహిరంగ ఓటింగ్ తోనే బలనిరూపణ చేయాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో బీజేపీకి అగమ్యగోచరంలో పడిపోయింది.

బీజేపీకి సుప్రీం డబుల్ ఝలక్స్? సీక్రెట్ బ్యాలెట్ కు 'నో'

ఢిల్లీ : కన్నడ రాకీయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యడ్యూరప్ప ప్రభుత్వం రేపే బలనిరూపణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీలో యడ్యూరప్ప బలనిరూపణ చేసుకోవాల్సిందిగా ఆదేశించింది. దీనిపై బీజేపీ లాయర్ ముకుల్ రోహల్గీ వారం రోజులు గడువు కోరారు. దీన్ని సుప్రీం తిరస్కరించింది. అనంతరం సీక్రెట్ ఓటింగ్ కు అనుమతి కోరగా..ఆ విన్నపాన్ని కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం తోచిపుచ్చింది. బహిరంగ ఓటింగ్ తోనే బలనిరూపణ చేయాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో బీజేపీకి అగమ్యగోచరంలో పడిపోయింది.

దేవగౌడను క్షమాపణ కోరిన రాహుల్ గాంధీ..

ఢిల్లీ : జేడీఎస్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడకు 85వ పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షల అనంతరం గేదెగౌడను క్షమించాలని వేడుకున్నారు. ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా జేడీఎస్ పార్టీపై, దేవెగౌడపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు చేయడాన్ని క్షమించాలని కోరారు. జేడీఎస్ ను బీజేపీ బి టీమ్ అనీ..జనతాదళ్ సంఘ్ పరివార్ అని రాహుల్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆరోపించారు.

బీజేపీకి సుప్రీంకోర్టు ఝలక్!!బలనిరూపణకు ఆదేశం!!

ఢిల్లీ : కన్నడ రాకీయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యడ్యూరప్ప ప్రభుత్వం రేపే బలనిరూపణ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. రేపు బలనిరూపణకు యడ్యూరప్ప సిద్ధంగా వున్నారా? అని ప్రశ్నించింది. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చెల్లుబాటు అవుతుందా? లేదా. అని విషయాన్ని పరిశీలించాలా? అని బీజేపీ, కేంద్రం తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఇప్పటికిప్పుడు బలనిరూపణకు సిద్ధంగా లేమని బీజేపీ లాయర్ ముకుల రోహత్గీ న్యాయస్థానానికి తెలిపారు. అనంతరం సుప్రీంకోర్టును బీజేపీ లాయర్ గడువు కోరగా సుప్రీంకోర్టు గడువుకు నిరాకరించింది.

11:41 - May 18, 2018

కూరగాయాల్లో రాజా వంకాయ. పండ్లల్లో రాజా మామిడిపండు. మరి పువ్వుల్లో రాజా(ణీ) ఎవరు అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఆ పువ్వే. ఎన్నో రకాల రంగులు. ఆ పువ్వును చూడగానే మనసు పవరశిస్తుంది. ప్రేమికులకు ఆరాధ్యం ఆ పువ్వే. తమ ప్రేమను తెలపాలన్నా..తన స్నేహానికి గుర్తుగా ఇవ్వాలన్నా..పరిచయాలకు..ఆహ్వానాలకు ప్రధమస్థానంలో వుండేది ఆ పువ్వే..ఆదేనండీ రోజా పువ్వు. పువ్వుల్లో రోజా సొగసుకు, రాజసానికి, నిండుతనానికి,తాజాదనానికి మారుపేరుగా కనిపించే రోజా కేవలం అందంలోనే కాదు ఔషధగుణాల్లో కూడా రాజా అని నిపుణులు చెబుతున్నారు. అందంలోనే కాదు ఆరోగ్యానికి కూడా రోజా రాజాలాంటిదంటున్నారు వైద్యులు..సాధారణంగా చాలామంది రోజా పువ్వు రేకులను తింటుంటారు. అదేమంటే మంచిద! అంటుంటారు. ఇంకా శరీరం మంచిరంగు కూడా వస్తుందట! అంటుంటారు. మరి ఆ మంచి ఏమిటో..ఆ ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం...

టీజేజర్లకు రోజా..
టీనేజ్ లో కలిగే హార్మోన్ల ప్రభావంతో యువతకు మొహంపై మొటిమలు, తద్వారా ఏర్పడే నల్లమచ్చలను పోగొట్టడంలో రోజా రేకులు సమర్థవంతంగా పనిచేసాటయట.అదెలాగో చూద్దాం..రేకులను వేడినీటిలో బాగా మరిగించి..రేకులను బైటకు తీసి ముద్దగా నూరి..దానికి ముల్తానీ మట్టి కలిపి మిశ్రమంగా చేసుకుని వారంలో ఒక్కసారి మొహంపై రాసుకుంటే ముఖం నిగారింపుగా మారుతుంది. మెటిమల వల్ల ఏర్పడే నల్లమచ్చలు క్రమేపీ తగ్గిపోతాయి. రోజా రేకులతో తయారు చేసే కషాయం ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. మార్కెట్లలో లభించే ఔషధాల కంటే కూడా ఇది మేలు కలిగిస్తుంది. చర్మానికి మెరుపునివ్వటమే మంచి నిగారింపును కూడా ఇస్తుంది.

మనసిక ప్రశాంతతకు రోజా..
శాస్త్రీయ పరిశోధనల రీత్యా చూస్తే రోజూ రోజా రేకులను గుప్పెడు తింటే శరీరంలోని దోషాలను పోగొట్టి తద్వారా రక్తశుద్ధి జరుగుతుందని తెలుస్తోంది. రోజా పూల నుండి వచ్చే సువాసనను ఆస్వాదిస్తే..శారీరకంగానే కాదు మనసుకు కూడా ప్రశాంతత చేకూరుతుంది. ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. వేడి నీటిలో రోజా రేకులతో పాటు కొంత బాత్ సాల్ట్‌ని కలిపి పీల్చితే ఒత్తిడి నుండి రిలీఫ్ కలగటమేకాక మనస్సు, శరీరం చురుగ్గా తయారవుతుంది.

నాజూకు రోజా..శరీరానికి తాజా..
రోజా రేకుల్లో ఉండే పదార్థాలు శరీరానికి నాజూకుతనం ఇవ్వటంతో పాటు ఉత్సాహాన్ని కూడా కలిగిస్తాయి. రోజా రేకులతో కాచిన కషాయాన్ని తాగితే రోజా రేకులు జీవక్రియను మెరుగుపరచటంతో..శరీరంలో పేరుకున్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి మీరు రోజా పువ్వును కేవలం తలలోకి..అలంకణలోకే కాక ఆరోగ్యానికి కూడా ఉపయోగించి అందంతోపాటు ఆరోగ్యం కూడా పెంపొందించుకునే సదుపాయాన్ని ప్రకృతి మనకు రోజా పువ్వులను ఇచ్చింది. మరి ప్రకృతి కల్పించి ఈ అవకాశాన్ని అందరం ఉపయోగించుకుని అందంతోపాటు ఆరోగ్యాన్ని, ఉల్లాసాన్ని,ఉత్సాహాన్ని పెంపొందించుకుని ఒత్తిడిని దూరం చేసుకుని మానసిక, శారరక ఆనందాన్ని పొందాలని ఆశిద్దాం..


 

11:31 - May 18, 2018

ఢిల్లీ : కర్నాటక రాజకీయాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేపే కర్నాటకలో బలనిరూపణ చేయాలని సుప్రీంకోర్టు సూచింది. రేపు బలనిరూపణకు సిద్ధమా...? లేక యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చెల్లుబాటు అవుతుందా లేదా ? అని పరిశీలించాలని సుప్రీంకోర్టు తెలిపింది. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఏజీ వేణుగోపాల్, కాంగ్రెస్, జేడీఎస్ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. యడ్యూరప్ప గవర్నర్ కు ఇచ్చిన లేఖలను ఏజీ వేణగోపాల్ ధర్మాసనానికి సమర్పించారు. 

సెల్ టవర్ ఎక్కిన మహిళలు..

పశ్చిమగోదావరి : భీమవరం మండలం తుందుర్రులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్వాఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా ముగ్గురు మహిళలు సెల్ టవర్ ఎక్కి ఆందోళన తెలుపుతున్నారు. ఆక్వాఫుడ్ పార్క్ ఫ్యాక్టరీ పైప్ లైన్ నిర్మాణాన్ని సీపీఎం నాయకులు, ఆక్వాఫుడ్ పార్క్ వ్యతిరేక సమితి నాయకులు అడ్డుకున్నారు. పొలాల నుండి పైప్ లైన నిర్మాణం చేపట్టటంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్వాఫుడ్ పార్క్ వ్యతిరేక సమితి నాయకుడు వాసు, సీపీఎం నేతలు గోపాలన్, త్రిమూర్తులు సహా పలువురు అరెస్ట్ అయ్యారు. 

11:21 - May 18, 2018

హైదరాబాద్ : కర్నాటక రాజకీయం హైదరాబాద్ కు చేరింది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల క్యాంపు హైదరాబాద్ కు మారాయి. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్, జేడీఎస్ నానా తంటాలు పడుతున్నాయి. ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మూడు బస్సుల్లో కర్నాటక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మేల్యేలు హైదరాబాద్ కు చేరుకున్నారు. తాజ్ కృష్ణ, గోల్కొండ హోటల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నోవా హోటల్ లో జేడీఎస్ ఎమ్మెల్యేలు మకాం వేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకున్నారు. ఇదిలావుంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకు వంద కోట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ఏ ఆఫర్ కోరుకుంటే అది ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం సుప్రీంకోర్టులో వాదనలు జరుగనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

11:05 - May 18, 2018

ఢిల్లీ : కర్నాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగనున్నాయి. త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపించనున్నారు. జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఏజీ వేణుగోపాల్, కాంగ్రెస్, జేడీఎస్ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. యడ్యూరప్ప గవర్నర్ కు ఇచ్చిన లేఖలను ఏజీ వేణగోపాల్ ధర్మాసనానికి సమర్పించనున్నారు. కర్నాటక గవర్నర్ నిర్ణయంపై సుప్రీంలో విచారణ జరుగనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

30,31తేదీల్లో అగ్రిగోల్డ్ ఆత్మఘోష యాత్ర: నారాయణ

గుంటూరు: గుంటూరు నుంచి అమరావతి వరకు ఈనెల 30, 31 తేదీల్లో అగ్రిగోల్డ్‌ బాధితుల ఆత్మఘోష పేరుతో యాత్రను నిర్వహిస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఈ యాత్రకు అగ్రిగోల్డ్‌ బాధితులు, ఏజెంట్లు మద్దతు తెలపాలని సీపీఐ నారాయణ కోరారు. ఈనెల 22 నుంచి సీపీఐ ఆధ్వర్యంలో ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి కోసం 22న దీక్షలు నిర్వహిస్తామని, ఇళ్లస్థలాల కోసం 23న విజయవాడలో ర్యాలీ చేస్తామన్నారు. 

కన్నడ ఎమ్మెల్యేల వద్దకు ఉత్తమ్..

హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కూడా తాజ్‌కృష్ణకు చేరుకున్నారు. మొత్తం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, గోల్కొండ, నోవాటెల్ హోటల్స్ లో జేడీఎస్ ఎమ్మెల్యేలను వుంచినట్లుగా సమాచారం. కాగా మిస్స్ అయ్యాకునుకుంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఆసుపత్రిలో ఉన్నట్లు పేర్కొన్నారు. తర్వలో వారు కూడా హైదరాబాద్‌ చేరుకుంటారని వెల్లడించారు. జేడీఎస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు నగరంలోని మరో హోటల్‌కు చేరుకుంటారని తెలిసింది.

తాజ్ కృష్ణాలో కన్నడ ఎమ్మెల్యేలు..భారీగా భద్రత..

హైదరాబాద్ : కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యేలు బంజారాహిల్స్‌లో తాజ్‌ కృష్ణా హోటల్‌లో బస చేయనున్నారు. కర్ణాటక శాసనసభలో విశ్వాసపరీక్ష వరకూ వారు ఇక్కడే బస చేస్తారని తెలిసింది. 

10:44 - May 18, 2018

హైదరాబాద్ : కర్నాటక రాజకీయం హైదరాబాద్ కు చేరింది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల క్యాంపు హైదరాబాద్ కు మారాయి. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్, జేడీఎస్ నానా తంటాలు పడుతున్నాయి. ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మూడు బస్సుల్లో కర్నాటక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మేల్యేలు హైదరాబాద్ కు చేరుకున్నారు. తాజ్ కృష్ణ, గోల్కొండ హోటల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నోవా హోటల్ లో జేడీఎస్ ఎమ్మెల్యేలు మకాం వేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకున్నారు.

 

లారీ, బస్ ఢీ, ఇద్దరు మృతి..

జగిత్యాల : వివిధ కారణాలతో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెట్‌పల్లి మండలం ఆరపేట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న లారీ,బస్సు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెట్‌పెల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సహాయక చర్యలు చేపట్టారు.

10:38 - May 18, 2018
10:37 - May 18, 2018

బెంగళూరు : కర్నాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది. కర్నాటక రాజకీయం హైదరాబాద్ కు చేరింది. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్, జేడీఎస్ తంటాలు పడుతున్నారు. ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఎమ్మెల్యేల తరలింపును చివరి నిముషం వరకు కాంగ్రెస్, జేడీఎస్ లు రహస్యంగా ఉంచారు. ప్రత్యేక విమానానికి కర్నాటక ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో కార్లు, బస్సుల్లో ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. కాంగ్రెస్ బృందానికి డీకే శివకుమార్ నేతృత్వం వహిస్తున్నారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెడుతోందని జేడీఎస్, కాంగ్రెస్ ఆరోపిస్తున్నారు. లింగాయాత్ ఎమ్మెల్యేలను కమలదళం ఆకర్షిస్తోంది. లింగాయత్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ వ్యూహం పన్నుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

రేపే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు..

హైదరాబాద్ : రేపు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలకానున్నాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కళాశాలల్లో సీట్ల భర్తీకోసం ఈ నెల 2 నుంచి 7 వరకు నిర్వహించిన ఆన్‌లైన్ ఎంసెట్ ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్లుగా ఎంసెట్ కమిటీ తెలిపింది. 

టీవీ నటిపై కిడ్నాప్ కేసు..మరో ట్విస్ట్..

హైదరాబాద్ : టీవీ నటి అంజలిపై కిడ్నాప్ కేసు నమోదు అయ్యింది. అంజలి సోదరుడి కోసం టీవీ నటి అంజలి తమ కుమార్తెను కిడ్నాప్ చేసిందంటూ దివ్య అనే యువతి తల్లిదండ్రులు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటనలో ఇది కొత్త ట్విస్ట్. పోలీసుల ముందు దివ్యతో సహా హాజరైన అంజలి, వెంకటేశ్ లు తాము మేజర్లమని, ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని వెల్లడించారు. పోలీస్ స్టేషన్ కు అంజలితో కలసి వచ్చిన ఈ జంట, తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని రాతపూర్వకంగా రాసిచ్చారు.

మావో ఆర్కే కోసం గాలిస్తున్న పోలీసులు..

విశాఖపట్నం: ఏవోబీలో పోలీసుల కూంబింగ్ గురువారం నుండి కొనసాగుతూనేవుంది. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఉన్నారన్న సమాచారంతో ఏవోబీ వద్ద కాల్పులకు దిగిన పోలీసులకు, మావోయిస్టులకు మధ్య పెద్ద ఎత్తును కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మావోయిస్టు సీనియర్ నేత ఆర్కే తప్పింపచుకున్నాడు. ఆర్కే కోసం పోలీసులు పెద్ద ఎత్తున బలగాల తరలించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పనసపొదర్‌ అటవీప్రాంతంలో మరోసారి పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందినట్టు సమాచారం. అలాగే ఘటనాస్థలిలో ఓ రైఫిల్‌, ఎస్‌ఎల్‌ఆర్‌ లభ్యమయ్యాయి.

సుప్రీంలో యూడ్యూరప్ప ప్రమాణస్వీకారం పిటీషన్ వాదనలు..

కర్నాటక : కర్ణాటక సీఎం యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. శుక్రవారం ఉదయం 10.30లకకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం జస్టిస్ సిక్రి, జస్టిస్ భూషణ్, జస్టిస్ బాడ్డేతో కూడిన ధర్మాసనం వాదనలను విననుంది. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం అనంతరం తుది తీర్పునకు లోబడి ఉంటుందని ధర్నాసనం పేర్కొంది. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం నిలిపివేయాలని కాంగ్రెస్, జేడీఎస్ లు పిటీషన్ వేశాయి.

10:16 - May 18, 2018

బెంగళూరు : కర్నాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది. కర్నాటక రాజకీయం హైదరాబాద్ కు చేరింది. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్, జేడీఎస్ తంటాలు పడుతున్నారు. ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఎమ్మెల్యేల తరలింపును చివరి నిముషం వరకు కాంగ్రెస్, జేడీఎస్ లు రహస్యంగా ఉంచారు. ప్రత్యేక విమానానికి కర్నాటక ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో కార్లు, బస్సుల్లో ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. కాంగ్రెస్ బృందానికి డీకే శివకుమార్ నేతృత్వం వహిస్తున్నారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెడుతోందని జేడీఎస్, కాంగ్రెస్ ఆరోపిస్తున్నారు. లింగాయాత్ ఎమ్మెల్యేలను కమలదళం ఆకర్షిస్తోంది. లింగాయత్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ వ్యూహం పన్నుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

భాగ్యనగరానికి చేరిన కన్నడ రాజకీయం..

కర్ణాటక : అటు తిరిగి ఇటు తిరిగి కన్నడ రాజకీయం భాగ్యనగరానికి చేరుకుంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే ఉద్ధేశ్యంతో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ కు తమ ఎమ్మెల్యేలను చేర్చేందుకు తమ ఎమ్మెల్యేలను బస్సులలో తరలిస్తున్నారు. ప్రత్యేక విమానానికి అనుమతి లేనందుకు బస్సులో ఎమ్మెల్యేలను బస్సులలో తరలిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందానికి కాంగ్రెస్ సీనియర్ నేత శిమకుమార్ నేతృత్వం వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళుతున్నారనే విషయంలో చివరి నిమిషం వరకూ గోప్యతను పాటిస్తున్నారు.

నేడు కర్నాటక గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ : నేడు కర్నాటక గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. సుప్రీం ధర్మాసనం తీర్పుపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. 

10:09 - May 18, 2018

ఢిల్లీ : మద్దతిచ్చే ఎమ్మెల్యేల లిస్ట్ ను యడ్యూరప్ప నేడు సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు. మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టులో యడ్యూరప్ప సర్కార్ కు మొదటి పరీక్ష ఎదురుకానుంది. 10.30 గంటలకు సుప్రీంకోర్టు ధర్మాసనం యడ్యూరప్ప ప్రభుత్వంపై విచారణ చేపట్టనుంది. నేడు కర్నాటక గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. సుప్రీం ధర్మాసనం తీర్పుపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతోందని కాంగ్రెస్, జేడీఎస్ ఆరోపించారు. ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రత తొలగించడంతో కాంగ్రెస్ ప్లాన్ మార్చింది. ఎమ్మెల్యేలను కాంగ్రెస్, జేడీఎస్ లు హైదరాబాద్ కు తరలిస్తున్నారు. 15 రోజులకు ముందే బలం నిరూపించుకుంటామని యడ్యూరప్ప తెలిపారు. బీజేపీకి బలం లేదని కాంగ్రెస్, జేడీఎస్ అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

మద్దతిచ్చే ఎమ్మెల్యేల లిస్ట్ ను నేడు కోర్టుకు సమర్పించనున్న యడ్యూరప్ప

ఢిల్లీ : మద్దతిచ్చే ఎమ్మెల్యేల లిస్ట్ ను యడ్యూరప్ప నేడు కోర్టుకు సమర్పించనున్నారు. మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టులో యడ్యూరప్ప సర్కార్ కు మొదటి పరీక్ష ఎదురుకానుంది. 10.30 గంటలకు సుప్రీంకోర్టు ధర్మాసనం యడ్యూరప్ప ప్రభుత్వంపై విచారణ చేపట్టనుంది. నేడు కర్నాటక గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. సుప్రీం ధర్మాసనం తీర్పుపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. 

ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్

బెంగళూరు : కర్నాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్, జేడీఎస్ తంటాలు పడుతున్నారు. ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఎమ్మెల్యేల తరలింపును చివరి నిముషం వరకు కాంగ్రెస్, జేడీఎస్ లు రహస్యంగా ఉంచారు. ప్రత్యేక విమానానికి అనుమతి నిరాకరణతో కార్లు, బస్సుల్లో ఎమ్మెల్యేలను తరలిస్తున్నారు. జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెడుతోందని జేడీఎస్, కాంగ్రెస్ ఆరోపిస్తున్నారు. 

నేడు నిజామాబాద్ జిల్లాలో మంత్రి పోచారం పర్యటన

  నిజామాబాద్ : నేడు జిల్లాలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. రైతు బంధు కార్యక్రమంలో పోచారం పాల్గొననున్నారు.  

నేడు పావులూరివారిగూడెంలో జగన్ పాదయాత్ర ప్రారంభం

ప.గో : నేడు ద్వారకాతిరుమల మండలం పావులూరివారిగూడెంలో జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. 

09:31 - May 18, 2018

కర్నాటకలో బీజేపీ అనైతిక చర్యకు పాల్పడిందని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్, విశ్లేషకులు ఎస్.వీరయ్య, కాంగ్రెస్ నేత క్రిశాంక్, బీజేపీ నేత కోటేశ్వరరావు పాల్గొని, మాట్లాడారు. కర్నాటకలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. మ్యాజిక్ ఫిగర్ రాకున్నా యడ్యూరప్ప సీఎంగా ప్రమాణీస్వకారం చేయడం సరికాదన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షాలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:46 - May 18, 2018

రోజు రోజుకి మైనర్లపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి... ఒక గుంటూరు జిల్లాలోనే నెల రోజుల్లో వెలుగు చూసిన అనేక సంఘటనలు పరిశీలిస్తే పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతున్నాయి. ఒక పక్క కేంద్ర ప్రభత్వం కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నా .. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లలపై చేయి వేస్తే ఉరుకోమని హెచ్చరిస్తున్నా... అఘాయిత్యాలు అగడం లేదు. చిన్న పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్ర ప్రజలను కలిచివేస్తున్నాయి. ఇవి పెరగటానికి గల కారణాలు ఏంటి ? ఇవి అగాలంటే తీసుకోవలసిన చర్యలపై ఇవాళ్టి జనపథం కార్యక్రమంలో ఐద్వా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:43 - May 18, 2018

హైదరాబాద్ : ప్లే ఆఫ్స్‌ పరుగులో రాయల్‌ చాలెంజర్స్‌ కీలక విజయాన్ని అందుకుంది. హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌పై 14 పరుగుల తేడాతో గెలుపొందింది.  టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన రాయల్‌ ఛాలెంజర్స్ డివిలియర్స్‌, మొయిన్‌ అలీల మెరుపు ఇన్నింగ్స్‌లతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218  పరుగులు చేసింది. అనంతరం కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, మనీశ్‌ పాండేలు చివరి వరకు పోరాడినా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 3 వికెట్లు కోల్పోయి 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో బెంగళూరు  సనరైజర్స్‌పై  విజయం సాధించింది. సన్‌రైజర్స్‌పై విజయంతో బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరువగా వచ్చింది. అయితే తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో బెంగళూర్ గెలిచినా..  ఇతర జట్ల గెలుపు, ఓటములపై  ప్లే ఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. బెంగళూర్‌ ఇన్నింగ్స్‌లో అద్భుతంగా  బ్యాంటింగ్‌ చేయడంతో పాటు మ్యాచ్‌లో చక్కటి క్యాచ్‌ను అందుకున్న ఏబీ డివిలర్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్ లభించింది.  

 

నేడు కర్నాటకలో చలో రాజ్ భవన్ కు కాంగ్రెస్ పిలుపు

కర్నాటక : నేడు కాంగ్రెస్ చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చింది. ర్యాలీలో ఆజాద్, మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు.

08:18 - May 18, 2018

తూర్పుగోదావరి : వరుస ప్రమాదాలతో గోదావరి తీరం ఉలికిపాటుకి గురవుతుంది. రోడ్డు రవాణా లేకపోవడం, తప్పని పరిస్థితుల్లో నదిపైనే రాకపోకలు సాగించడం.. ప్రమాదాల బారిన పడటం పరిపాటిగా మారింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కమంటూ తీరాలను దాటాల్సిన పరిస్థితి. నది తీరాలపై నెలకొన్న ప్రమాదకర పరిస్థితులపై 10 టీవీ స్పెషల్ స్టోరీ.
నదీ ప్రయాణాలతో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న గిరిజనులు
మనిషికి నీరే ప్రాణధారం.. ఆ నీటిపై ప్రయాణమంటే అదో అనుభూతి. నదీ విహారం అంటే ఆస్వాదించడానికి ఎవ్వరూ వెనకాడారు. కానీ  నదిపై జీవనం సాగిస్తున్న గిరిజనులది ఆ నదిపైనే జీవన ప్రయాణం. గిరిజన ప్రాంతాల్లో రహదారులు లేకపోవటంతో  నదీ ప్రయాణం ద్వారానే అన్ని సమకూర్చుకుంటారు. ఒక విధంగా నది దాటకపోతే ప్రాణం పోతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నది ప్రయాణం వల్లే గిరిజనులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరి నిర్లక్ష్యం కారణంగా జలసమాధి అయిపోతున్నారు. ఈ మధ్య జరిగిన వాడపల్లి తీరంలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు 19 నీటిలో మునిగిపోయారు. దీంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. గొందూరులో 7  మంది  ప్రాణాలు కోల్పోయారు. 
గిరిజనులను బలిగొంటున్న బోటు అగ్ని ప్రమాదాలు
బోటు ప్రమాదాలకు తోడు బోటు అగ్నిప్రమాదాలు కూడ గిరిజన ప్రాణాలను బలిగొంటున్నాయి. అధికారుల, యజమానుల నిర్లక్ష్యం కారణంగా బోటు అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. దేవీపట్నం మండలం వీరవరం లంక సమీపంలో ఓ బోటు నిలువునా దగ్ధం కావడం గమనిస్తే ఆపరేటర్ల అలసత్వం కొట్టోచ్చినట్లు కనిపిస్తోంది. అయితే సకాలంలో స్పందించి 120 మంది తమ ప్రాణాలను కాపాడుగకోగలిగారు. ఈ ప్రమాదం మరువకముందే మరో ఘోర దుర్ఘటన చూడాల్సి వచ్చింది. ఈ దుర్ఘటనలో గిరిజనులు తమ ప్రాణాలను వదిలారు. ఈ ప్రమాదం వ్యవస్థీకృత లోపాలను ఎలుగెత్తి చాటింది. 
బోటు ఫిట్‌నెస్‌ విషయంలో ఇరిగేషన్‌ అధికారులదే ప్రధానపాత్ర
నిబంధనల ప్రకారం బోటు ఫిట్‌నెస్ వ్యవహారాన్ని పరిశీలించడంలో ఇరిగేషన్‌ అధికారులదే ప్రధాన పాత్ర. రెవెన్యూ, పోలీసు, టూరిజం  అధికారులతో కలిసి సమన్వయంతో నియంత్రణ, పర్యవేక్షణ సాగించాల్సి ఉంటుంది. కానీ అలా పర్యవేక్షించడానికి ఎలాంటి అధికారి ఉండరు. ప్రభుత్వం సిబ్బందిని పెంచకపోవడం, ఉన్న వారిపై కఠినంగా వ్యవహరించకపోవడం వల్ల తరుచు బోటు ప్రమాదాలు జరుగుతున్నాయి. బోటు ప్రమాదాలు జరిగినప్పుడు ఎదో ఆర్భాటానికి కొన్ని చర్యలు తీసుకుంటారే తప్ప, బోటు ప్రమాదాలు నివారణకు ఎలాంటి చర్యలు ఉండవు. దీంతో గిరిజనులతో పాటు బోటు ప్రయాణం చేయాలంటే సామాన్య ప్రజలు కూడ భయపడుతున్నారు.
ప్రభుత్వం అధికారులుపై చర్యలు తీసుకుంటుందా..?
ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి అధికారులుపై చర్యలు తీసుకుంటుందా..? అధికారుల కొరతను తీర్చి మరోసారి ఇలాంటి ప్రమాదాలను జరగకుండ చూస్తోందా.  జనాల్లో ప్రమాదాల భయాన్ని పోగొట్టి ఇప్పటికైన బోటు చర్యలు తీసుకుంటుందా లేదో చూడాలి.

 

08:11 - May 18, 2018

తూర్పుగోదావరి : గోదావరి లాంచీ ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం నుంచి ఇప్పటి వరకు 19 మృత దేహాలు వెలికితీశారు. వీరిలో 11 మంది మహిళలు, నలుగురు పిల్లలు, మరో నలుగురు పురుషులు ఉన్నారు. మరొకరు గల్లంతయ్యారు. 17 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. వీరిలో నలుగురు బోటు సిబ్బంది కూడా ఉన్నారు.
19 మృత దేహాలు వెలికితీత
తూర్పుగోదావరి జిల్లా మంటూరు వద్ద గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతంతంకు పెరుగుతోంది. ఇంతవరకు 19 మృత దేహాలను వెలికితీసి శవపరీక్ష నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి గురైన లాంచీలో అప్పర్‌ డెక్‌పై కూర్చుకున్న 17 మంది.. గోదావరిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మిడిల్‌ డెక్‌లో కూర్చుని లోపల గడియ పెట్టుకున్నవారు బయటకురాలేక ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలం నుంచి వెలికి తీసిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. 
గల్లంతైన ఏసుబాబు కోసం గాలింపు
గల్లంతైన ఏసుబాబు కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలిస్తున్నాయి. మృతుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు పడవ ప్రమాదంపై తక్షణం స్పందించి, సహాయ చర్యలు చేపట్టిన తమను కాదని, ఈ పనినంతా తామే చేశామని అధికారులు, రాజకీయల నాయకులు ప్రకటించుకోడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. 
ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత 
పడవ ప్రమాద ఘటన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంటూరు నుంచి కొండమొదలు వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్నారు. సమాచారవ్యవస్థ మెరుగుపరిచేందుకు 47 రిలయన్స్‌ జియో టవర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అన్ని మేజర్‌ పంచాయతీలకు ఆప్టికల్‌ ఫైబర్‌ కనెక్షన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

 

08:04 - May 18, 2018

సంగారెడ్డి : జిల్లాలోని వట్‌పల్లి మండలం ఖాదిరాబాద్‌లో రైతుబంధు చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే బాబుమోహన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ చేసి మాట్లాడిన తర్వాత తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని సర్పంచ్‌ రమేష్ జోషి నిదీశారు. దీంతో ఎమ్మెల్యేకు, సర్పంచ్‌కు మాటల యుద్ధం మొదలయింది. అక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు సర్పంచ్‌ రమేష్ జోషిపై దాడి యత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్తితి నెలకొంది. పోలీసులు సర్పంచ్‌ను అరెస్ట్‌ చేసి, స్టేషన్‌కు తరలించారు.   

 

08:01 - May 18, 2018

రాజన్నసిరిసిల్ల : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ తన ఇంటి స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని వేములవాడకు చెందిన బొల్లినేని వేంకటేశ్వర్‌రావు మున్సిపల్‌ కార్యలయంలో ధర్నాకు దిగారు.  తన భూమి ఎల్‌ఆర్ఎస్‌ ప్రొసిడింగ్‌ పత్రాలను ఇవ్వకుండా ఎమ్మెల్యే మున్సిపల్‌ అధికారులపై ఒత్తిడి తెస్తున్నాడని ఆరోపించారు. కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇంటి స్థలాన్నికొనుగోలు చేస్తే ఎమ్మెల్యే తన ఇంటి రహదారి కోసం భూమిని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాడని వేంకటేశ్వర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపల్‌ కార్యాలయంలో ధర్నాకు దిగిన బొల్లినేని వేంకటేశ్వర్‌రావు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన బొల్లినేని వేంకటేశ్వర్‌రావు అనే వ్యక్తి మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. మున్సిపల్‌ అధికారులు తన ఇంటి ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసిడింగ్‌ పత్రాలను ఇవ్వటం లేదని ఆందోళన చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేపట్టారు.  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌  తన నివాస ఇంటి పక్కన ఉన్న భూమిని కబ్జా చేసేందుక ప్రయత్నిస్తున్నారిని ఆయన ఆరోపించారు. సర్వే నెంబర్‌ 1380,1381, 1382, 1384లలో తనకు  6 గుంటల భూమి ఉందన్నారు. ఆ భూమిని ఎమ్మెల్యే  తన ఇంటికి రోడ్డుగా మార్చుకోవడానికి   వెంకటేశ్వర్‌రావు మండిపడుతున్నారు. తన భూమికి సంబంధించిన ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసిడింగ్‌ పత్రాలను ఇవ్వకుండా.. ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నాడని ఆయన ఆరోపించారు. 
ఇంటి స్థలాన్ని నా భార్య లావణ్య పేరున రిజిస్టేషన్‌ చేయించా : వెంకటేశ్వర్‌రావు
ఇంటి స్థలాన్ని 5 సంవత్సరాల క్రితం.. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసినట్టు బాధితుడు తెలిపారు. ఈ భూమిని తన  భార్య లావణ్య పేర రిజిస్టేషన్ చెయించానని వెంకటేశ్వర్‌రావు చెప్పారు. లేఅవుట్ రెగ్యూలరైజేషన్‌ ప్రొసిడింగ్‌.. అలాగే ఎల్‌ఆర్‌ఎస్ రెగ్యులరైజేషన్‌ల కోసం మున్సిపాల్టీకి లక్ష 15 వేలు చెల్లించానని తెలిపారు. మున్సిపల్‌ అధికారులు ఎల్‌ఆర్‌ఎస్ కాగితాలను తయారు చేసి.. తనకు ఇచ్చే సమయంలో ఎమ్యేల్యే రమేష్ బాబు అడ్డుపుల్ల వేశారని ఆయన ఆరోపిస్తున్నారు.  మున్సిపల్‌ అధికారులు కుంటి సాకులు చెపుతూ.. కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని వాపోయారు.  అధికారుల తీరుతో విసుగు చెందే.. కుటుంబంతో కలిసి ధర్నాకు దిగనని వెంకటేశ్వర్‌రావు స్పష్టం చేశారు. మున్సిపల్‌ చైర్మన్ నామాల ఉమ భర్త లక్ష్మిరాజం తనకు ఫోన్‌ చేసి 5 లక్షలు ఇస్తే ప్రొసిడింగ్‌ కాగితాలు ఇస్తానని... లేకపోతే కాగితాలు రాకుండా చేస్తానని బెదిరించాడని ఆయన ఆరోపించారు. 
ఎల్‌ఆర్‌ఎస్‌ కాగితాలు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా: బాధితుడు
వేంకటేశ్వర్‌రావు ఆందోళనకు దిగడంతో పోలీసులు అరెస్ట్‌ చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో మీడియా అక్కడికి చేరుకోవడంతో పోలీసులు అరెస్ట్‌ ప్రయత్నాన్ని  విరమించుకున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పత్రాలు ఇస్తేనే ఆందోళన విరమిస్తానని పోలీసులకు స్పష్టం చేశారు.  తనకు ఎల్‌ఆర్‌ఎస్‌  పత్రాలు ఇవ్వకుంటే మున్సిపల్‌ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు హెచ్చరించారు. ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ను వివరణ కోరగా.. ఎస్‌ఆర్ఎస్‌ ప్రొసిడింగ్‌ ఇవ్వడానికి అన్ని లీగల్‌ కాగితాలు ఉన్నాయని.. కేవలం ఎమ్మెల్యే  ఇవ్వవద్దని ఒత్తిడి చేయడంతోనే ఆపామని స్పష్టం చేశారు.  అయితే ఈ మాటలను కమిషనర్ మీడియా ముందు చెప్పాడానికి ఇష్టపడలేదు. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 

07:48 - May 18, 2018

హైదరాబాద్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు గడువు ముగిసేలోపు పూర్తవుతాయా ? ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలపై ఏమనుకుంటోంది? పంచాయతీ ఎన్నికలపై గులాబీ నేతల అభిప్రాయం ఏంటి? సార్వత్రిక ఎన్నికలకు ముందు పంచాయతీ సమరానికి వెళ్లడం టీఆర్‌ఎస్‌కు లాభమా..? ఇంతకూ గులాబీబాస్‌ పంచాయతీ ఎన్నికలపై రచిస్తున్న వ్యూహమేంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ.
రెండు నెలల్లో ముగియనున్న సర్పంచ్‌ల పదవీకాలం
తెలంగాణలో మరో రెండు నెలల్లోపే గ్రామ పంచాయతీల సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుంది. దీంతో షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరిపేందుకు అధికారయంత్రాంగం సిద్ధం అవుతోంది. గడువు ముగిసేలోగా ఎన్నికలు జరిపితే జూలై  మొదటికానీ... లేదంటే రెండో వారంలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఎన్నికలు నిర్వహిస్తామని కేసీఆర్‌ పదేపదే చెబుతున్నా.. అధికారపార్టీలో జరుగుతున్న చర్చతో అసలు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
పంచాయతీ ఎన్నికలకు వెనకడుగు వేస్తున్న టీఆర్‌ఎస్ నాయకత్వం
ప్రభుత్వం ఈ మధ్య ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంలో గ్రామాల్లో వాతావరణం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారిందన్న భావన టీఆర్‌ఎస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఇప్పుడే ఎన్నికలు జరిపితే ఫలితాలు పూర్తిగా ఏకపక్షంగా వస్తాయన్న అంచనాను పార్టీ ముఖ్యనేతలు వేస్తున్నారు. ఇటీవలే 4300 తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రభుత్వం మార్చింది. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా ఉన్న డిమాండ్‌ను కేసీఆర్‌ నెరవేర్చడంతో అక్కడ కూడా అనుకూల ఫలితాలే వస్తాయన్న ధీమా గులాబీ నేతల్లో కనిపిస్తోంది. ఇదే మూడ్‌లో పంచాయతీ ఎన్నికలు జరిపితే టీఆర్‌ఎస్‌కు తిరుగుండదని గులాబీబాస్‌ కూడా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలకు గులాబీబాస్‌ సిద్ధంగా ఉన్నా.... ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలు వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. రైతుబంధు పథకంతో క్షేత్రస్థాయిలో క్రియేట్‌ అయిన మూడ్‌ను సార్వత్రిక ఎన్నికల వరకు కొనసాగించాలంటే.. పంచాయతీ ఎన్నికలకు తొందరపడవద్దనే అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది. పంచాయతీ ఎన్నికలకు వెళ్తే గ్రామాల్లో గ్రూపు రాజకీయాలు పెరిగి.... అవి పార్టీకి లాభం కంటే నష్టాన్నే తీరుకొస్తాయని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కొంతమంది నేతలు ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
పంచాయతీ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
పంచాయతీ ఎన్నికలు పూర్తయితే... ఆ వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు వెళ్లకుంటేనే మంచిదన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది.  రైతుబంధు కార్యక్రమం ముగిసిన తర్వాత.. కేసీర్‌ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 

 

కర్నాటకలో బీజేపీ తీరును వ్యతిరేకిస్తూ నేడు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిరసనలు

హైదరాబాద్ : కర్నాటకలో బీజేపీ తీరును వ్యతిరేకిస్తూ నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు తెలపనుంది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

కర్నాటకలో బీజేపీ తీరును వ్యతిరేకిస్తూ నేడు కాంగ్రెస్ నిరసనలు

ఢిల్లీ : కర్నాటకలో బీజేపీ తీరును వ్యతిరేకిస్తూ  నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు తెలపనుంది. 

కాంగ్రెస్, జేడీఎస్ అలయెన్స్ పై నేడు సుప్రీంకోర్టులో అఫిడవిట్

ఢిల్లీ : కాంగ్రెస్, జేడీఎస్  అలయెన్స్ పై నేడు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు కానుంది. కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్ అఫిడవిట్ దాఖలు చేయనున్నారు.

 

Don't Miss