Activities calendar

19 May 2018

21:25 - May 19, 2018

కుమార స్వామి ప్రమాణం..పలువురికి ఆహ్వానం...

బెంగళూరు : సీఎంగా తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి దేశంలోని పలువురు నేతలను ఆహ్వానిస్తున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, వెస్ట్‌ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించనున్నట్లు కుమారస్వామి మీడియాకు తెలిపారు. 

ఘనంగా ఎలిజబెత్ మనువడి పెళ్లి...

లండన్ : క్వీన్ ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ హ్యారీ-అమెరికా నటి మేఘన్ మెర్కెల్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. లండన్‌లోని విండ్‌సోర్ కేస్టల్‌లోని జార్జ్ చాపెల్‌లో వీరి వివాహం జరిగింది. 

గుజరాత్ లో 19 మంది మృతి..డ్రైవర్ పరార్...

గుజరాత్‌ :  జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మరణించారు. ఉదయం భావ్‌నగర్- అహ్మదాబాద్ హైవేపై ఓ ట్రక్కు ఉన్నట్టుండి తిరగబడింది. సిమెంట్ లోడుతో వెళుతున్న ట్రక్కు భావ్‌నగర్‌లోని బవల్యాలి గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది.

జోజిలా సొరంగ మార్గానికి శంకుస్థాపన...

ఢిల్లీ : ఆసియాలోనే అతి పెద్దదైన జోజిలా సొరంగ మార్గానికి ప్రధానమంత్రి నరేంద్రమోది శంఖుస్థాపన చేశారు. రెండురోజుల పర్యటనకు వెళ్లిన ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కార్గిల్‌, లేహ్‌లను కలుపుతూ నిర్మిస్తున్న జోజిలా సొరంగ మార్గం అన్ని వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణానికి అనుకూలించే విధంగా ఆధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారు.

21:10 - May 19, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు ఆదేశం.. కర్నాటకలో ప్రజాస్వామ్యాన్ని బతికించింది. రెండు రోజులుగా.. గవర్నర్‌ వాజూభాయి వాలా తీసుకున్న కీలక నిర్ణయాలపైన... న్యాయస్థానం ఆదేశాలు.. జనాభిమతాన్ని ప్రతిబింబించాయి. బీజేపీ నేతల కుట్రలను తిప్పికొట్టేందుకు.. మెజారిటీ సభ్యులున్న పార్టీలే కన్నడ పీఠాన్ని అధిరోహించేందుకు.. సుప్రీం కోర్టు ఆదేశాలు ఎంతగానో దోహదపడ్డాయి. కర్నాటకలో రాజకీయం క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగింది. నిన్నటి మాదిరిగానే.. శనివారం కూడా.. పాలక బీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్‌ నియమించడాన్ని ఆక్షేపిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ నిన్న వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది.

బోపయ్యను మార్చమని గవర్నర్‌ను తాము ఆదేశించలేమని.. పైగా బాగా సీనియర్లు కాని వారు కూడా గతంలో ప్రొటెం స్పీకర్‌లుగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయని సుప్రీంకోర్టు కాంగ్రెస్‌ తరఫు న్యాయవాదికి తెలిపింది. ఓ దశలో.. బోపయ్యను మార్చాలని పట్టుబడితే.. బలనిరూపణ వాయిదా పడుతుంది మీకు ఓకేనా అంటూ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే.. కాంగ్రెస్‌ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. దీంతో హతాశులైన కాంగ్రెస్‌ న్యాయవాది.. బోపయ్య గతంలో వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మూజువాణీ ఓటుతో.. బలనిరూపణ ప్రక్రియను ముగించే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
విపక్ష పార్టీల న్యాయవాది అనుమానాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రొటెం స్పీకర్‌గా బోపయ్యే కొనసాగుతారని, అయితే.. డివిజన్‌ పద్ధతిలో బలనిరూపణ జరపాలని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ను లైవ్‌లో ప్రసారం చేయించాలని ఆదేశించింది. దీంతోపాటే.. కాంగ్రెస్‌ వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. మొత్తానికి రెండు రోజుల్లో న్యాయస్థానం వ్యవహరించిన తీరు.. కర్నాటకలో ప్రజాస్వామ్యాన్ని బతికించిందన్న భావన విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. 

21:08 - May 19, 2018

బెంగళూరు : కర్ణాటకలో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. అసెంబ్లీలో బల నిరూపణకు ముందే ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు. ఈ పూర్తి ఎపిసోడ్‌లో చివరి వరకు కూడా తమ ఎమ్మెల్యేలను బిజెపి ప్రలోభాలకు ఆకర్షితులు కాకుండా కాంగ్రెస్‌-జెడిఎస్‌లు అట్టిపెట్టుకున్నాయి. పకడ్బందీ ప్లాన్‌తో కాంగ్రెస్‌- బిజెపికి చెక్‌ పెట్టింది. కర్ణాటక అసెంబ్లీలో బల నిరూపణ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపించింది. యడ్యూరప్ప రాజీనామా ప్రకటించేవరకు కూడా క్షణ క్షణం ఉత్కంఠభరితంగా సాగింది. బల పరీక్షలో బలం నెగ్గించుకుంటామని మొదటి నుంచి ధీమా వ్యక్తం చేసిన బిజెపి చివరకు చేతులెత్తేసింది. బల నిరూపణకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేశారు.

ఈ ఎపిసోడ్‌లో తమ ఎమ్మెల్యేలను చేజారకుండా కాంగ్రెస్‌-జెడిఎస్‌ పార్టీలు సఫలీకృతమయ్యాయనే చెప్పవచ్చు. బల నిరూపణ కోసం గవర్నర్‌ యడ్యూరప్పకు 15 రోజుల గడువు ఇవ్వడంతో బిజెపి-కాంగ్రెస్‌ పార్టీలు అప్రమత్తమయ్యాయి. బిజెపి ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త పడ్డాయి. రాత్రికి రాత్రే తమ ఎమ్మెల్యేలను బస్సులో హైదరాబాద్‌కు తరలించాయి.

గవర్నర్‌ తీరుని నిరసిస్తూ కాంగ్రెస్‌-జెడిఎస్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టులో బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 24 గంటల్లోనే బిజెపి అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కాంగ్రెస్‌-జెడిఎస్‌ పార్టీల నేతలు తమ ఎమ్మెల్యేలను శుక్రవారం రాత్రే హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు బస్సులో తరలించారు. ఉదయం బెంగళూరులో హిల్టన్‌ హోటల్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మరో ప్రయివేట్‌ హోటల్‌కు జెడిఎస్‌ ఎమ్మెల్యేలు చేరుకున్నారు.

ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రొటెం స్పీకర్ కె.జి బోపయ్య కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రమాణం చేయించారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు ఇది కొనసాగింది. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనంద్‌ సింగ్, ప్రతాప గౌడలు చివరి నిముషం వరకు అసెంబ్లీకి చేరుకోలేకపోవడం ట్విస్టుగా మారింది. బీజేపీ ప్రలోభాలకు ఆకర్షితులైనట్టు భావించినప్పటికీ ఆఖరు నిమిషంలో అసెంబ్లీకి చేరుకుని తమ సొంత గూటిలోకి చేరారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు చీలిపోకుండా ఆ పార్టీ నేత డి.కె.శివకుమార్‌ కీలక పాత్ర పోషించారు. సాయంత్రం 4 గంటలకు బల పరీక్ష నేపథ్యంలో చివరి వరకు కూడా బిజెపి బేరసారాలు నడిపింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బిసి పాటిల్‌తో సిఎం యడ్యూరప్ప నేరుగా బేరసారాలు జరిపిన ఆడియో టేపును కాంగ్రెస్‌ విడుదల చేసింది. పాటిల్‌కు మంత్రి పదవితో పాటు 5 కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టారు. అంతకు ముందు గాలి జనార్ధన్‌ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపిన ఆడియో టేప్స్ బయటకొచ్చిన విషయం తెలిసిందే.

యడ్డీ ఆడియో టేపులు దేశవ్యాప్తంగా అన్ని ఛానళ్లలో ప్రసారం కావడంతో బిజెపి అధిష్టానం ఇరకాటంలో పడింది. బిజెపి ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉండడంతో బల నిరూపణకు వెనక్కి తగ్గింది. తగిన సంఖ్యా బలం లేకపోవడంతో బలపరీక్షకు ముందే తన ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసేశారు. తమకు బలం లేదంటూ చెప్పకనే చెప్పేసి, బలపరీక్షకు వెళ్లకుండానే బయటికి వచ్చేశారు.

21:05 - May 19, 2018

విజయవాడ : కన్నడ రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. యడ్యూరప్ప రాజీనామాతో... ప్రజాస్వామ్యం గెలిచిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో పాటు.. అధికారం కోసం ఎమ్మెల్యేలకు ప్రలోభాలు పెట్టి.. అడ్డదారిలో అధికారం చేపట్టాలని బీజేపీ యత్నించగా.. విపక్షాలు సుప్రీంకోర్టుకు వెళ్లి విజయం సాధించాయన్నారు. మోదీ, అమిత్‌షా అధికారం కోసం ఇలా వ్యవహరిస్తే... భవిష్యత్‌ తరాలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయి అని చంద్రబాబు ప్రశ్నించారు.

బీజేపీకి తగిన శాస్తి జరిగిందన్నారు సీపీఐ జాతీయ నేత నారాయణ. బల నిరూపణకు బీజేపీకి 15 రోజులు గడువు ఇచ్చివుంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేదని... కానీ సుప్రీంకోర్టు కల్పించుకుని వెంటనే బలపరీక్షకు ఆదేశించడంతో... విధిలేని పరిస్థితుల్లో యడ్యూరప్ప రాజీనామా చేశారన్నారు నారాయణ. 

21:03 - May 19, 2018

ఢిల్లీ : ఈ రోజు ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాందీ. విశ్వాస పరీక్షకు ముందే కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం కూలిపోవడంపై స్పందించిన రాహుల్‌గాంధీ.. ఆర్‌ఎస్‌ఎస్‌, మోదీ, అమిత్‌షాలు ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేస్తున్నారన్నారు. అడ్డదారిలో ఎమ్మెల్యేలను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రలోభాలకు గురి చేశారన్నారు. నిత్యం అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే మోదీ... కర్నాటకలో అవినీతి ప్రోత్సహించారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ భ్రష్టు పట్టించిందన్నారు. ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు చేసిన బేరసారాలు బహిర్గతమయ్యాయని... విపక్షాలన్నీ బీజేపీ ఆగడాలను అడ్డుకొని ఓడించాయన్నారు. దేశ ప్రజలు, వ్యవస్థల కంటే ప్రధాని గొప్పవారేం కాదన్నారు రాహుల్‌. ఇక బీజేపీ నేతలు సభలో జాతీయ గీతం ఆలపిస్తుండగానే వెళ్లిపోయారన్నారు రాహుల్‌గాంధీ.

20:54 - May 19, 2018

కర్ణాటక రాష్ట్రం వైపు అందరి చూపు..ఎవరు బలపరీక్ష నెగ్గుతారు ? కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా ? ప్రభుత్వం తమదే ఉంటుందని మొదటి నుండి చెబుతూ వస్తున్న సీఎం యడ్యూరప్ప వెనుకంజ వేశారు. శాసనసభలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఒక్కసారిగా కర్ణాటకలో నెలకొన్న రాజకీయ పరిణామాలు..గవర్నర్ వ్యవస్థపై చర్చ జరుగుతోంది. ఈ అంశంపై టెన్ టివి చర్చా వేదికలో ప్రముఖ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ పాల్గొని విశ్లేషించారు.

అధికారం కోసం బీజేపీ ఏ స్థాయికి దిగ జారుతుందో తెలిసిపోయిందని..అయినా ఇక్కడ బీజేపీ ఓడిపోయిందన్నారు. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసిందని, 104 సంఖ్యాబలం ఉన్న బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించారని గుర్తు చేశారు. కానీ మిగతా ఎమ్మెల్యేలు ఎక్కడి నుండి వస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదని పేర్కొన్నారు. బీజేపీ చివరి వరకు ప్రయత్నం చేసిందన్నారు. యడ్యూరప్ప వారం రోజులు గడువు అడిగితే గవర్నర్ ఏకంగా 15 రోజులు ఇచ్చారని..ఇక్కడ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుందన్నారు. సుప్రీం జోక్యం చేసుకోకపోతే తప్పకుండా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఉండేవారన్నారు. సీక్రెట్ ఓటింగ్ కావాలని...పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించ కూడదని బీజేపీ తరపు న్యాయవాదులు వాదించారన్నారు. స్పీకర్ విషయంలో జోక్యం చేసుకోలేకపోయిందని, తప్పనిసరిస్థితిలో వివాదాస్పద ప్రొటెం స్పీకర్ ను నియమించారన్నారు.

శాసనసభలో మెజార్టీ లేకపోయినా..మెజార్టీ ఉన్నట్లు ప్రకటించే అవకాశం ఉందని భావించి శాసనసభా సమావేశాలను లైవ్ టెలికాస్ట్ చూపించాలని సుప్రీం ఆదేశించిందన్నారు. సుప్రీంకోర్టులో పాగా వేస్తే ఇన్ని సమస్యలు రావని బీజేపీ భావిస్తూ తగిన విధంగా చర్యలు తీసుకొంటోందన్నారు. సుప్రీంలో జరుగుతున్న పరిణామాలపై పలువురు స్పందిస్తున్నారని పేర్కొన్నారు. గవర్నర్..ఎన్నికల కమిషన్..న్యాయ వ్యవస్థ..ఇలాంటి ఎన్నో వ్యవస్థలపై ప్రభావం చూపుతున్నారన్నారు. ఆర్ఎస్ఎస్..ఇతరులను గవర్నర్ లాగా నియమించారని, ఇప్పటికైనా గవర్నర్ వ్యవస్థపై సంపూర్ణ చర్చ జరగాలన్నారు.

గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కాదని..రాజ్యాంగ ప్రతినిధి అని అంబేద్కర్ వివరంగా రాజ్యాంగంలో చెప్పారన్నారు. గతంలో కాంగ్రెస్ చేసిందని బీజేపీ చెబుతూ వస్తోందని..కాంగ్రెస్ చేస్తే తాము చేస్తామని బీజేపీ అంటోందని గుర్తు చేశారు. అధికార దాహం..రాజ్యాంగం దుర్వినియోగం చేయడం వల్ల ప్రతిపక్షాలు ఐక్యమయ్యాయని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంటే..పెత్తందారి వ్యవస్థను తీసుకరావాలని చూస్తే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారో తెలుసుకోవడానికి వీడియో క్లిక్ చేయండి. 

షురూ కానున్న 'జన పోరాట' యాత్ర...

విజయవాడ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్వహించతలపెట్టిన 'జన పోరాట యాత్ర' ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నుంచి మొదలయ్యే ఈ యాత్ర 45 రోజుల పాటు కొనసాగుతుంది.

20:10 - May 19, 2018

అయిపోయింది అందరు అనుకున్నదే అయ్యింది.. కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చి మీదికెళ్లి యడ్యూరప్ప దిగిపోయిండు..తెలంగాణ ప్రజలారా మీరు కేసీఆర్ ఏం జేస్తలేడు ఏం జేస్తలేడు ఎప్పుడు సూశ్నా ప్రగతి భవన్ల తిని ఫామౌజుల వంటడు.. వారెవ్వ ఇంటిరా చంద్రాలు ముచ్చట.. కర్ణాటకల పరిస్థితి జూస్తుంటే సారువారి గుండె చెర్వైతున్నదట.. అక్కినేని నాగార్జున అనే కబ్జాకోరుడు చెర్వు శిఖం భూములు కబ్జావెడ్తె వానిమీద చర్యలుండయ్..మొన్న నీళ్ల మంత్రి హరీషాలు మాట్లాడుకుంట ఒక సభల ఏమన్నడు..దంతాలు లేని పులి.. గోర్లు లేని సింహం.. మూగ బెబ్బులి శ్రీ నందమూరి బాలికాకయ్య ఇయ్యాళ హిందూపురం బొయ్యినట్టుండు.. ఎంత మోసం ఎంత మోసం జూడుండ్రి.. ఉపాధి పనుల కోసం ఊరోళ్లు ధర్నా జేస్తుంటే.. ఆడంగ వోతున్న శ్రీరెడ్డి కారాపి పొయ్యి ఆ ధర్నాల గూసున్నది..గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:03 - May 19, 2018

కర్నాటక పీఠాన్ని దక్కించుకోవడం ద్వారా.. దక్షిణాదిలోనూ జైత్రయాత్ర కొనసాగించాలని భావించిన బీజేపీకి.. గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కన్నడనాట... దొడ్డిదారిలో అధికారాన్ని దక్కించుకోవాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు. కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. జేడీఎస్ శాసనసభాపక్ష నేత కుమార స్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో ఇందిరా శోభన్ (కాంగ్రెస్), లక్ష్మీ నారాయణ (విశ్లేషకులు), ప్రకాష్ రెడ్డి పాల్గొని విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:58 - May 19, 2018

కర్నాటక పీఠాన్ని దక్కించుకోవడం ద్వారా.. దక్షిణాదిలోనూ జైత్రయాత్ర కొనసాగించాలని భావించిన బీజేపీకి.. గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కన్నడనాట... దొడ్డిదారిలో అధికారాన్ని దక్కించుకోవాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. రాజ్‌భవన్‌ను ఉపయోగించుకొని.. ప్రొటెం స్పీకర్‌ ద్వారా.. మూజువాణీ ఓటుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. బలపరీక్షకు నిలవకుండానే యడ్యూరప్ప రాజీనామా చేయక తప్పలేదు.

కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప.. తన పదవికి రాజీనామా చేశారు. కేవలం 55 గంటల పాటు పదవిలో కొనసాగి తీన్‌ దిన్‌ కా సుల్తాన్‌గా మిగిలిపోయారు. అనేక నాటకీయ పరిణామాల అనంతరం.. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో.. బలనిరూపణ వేళ.. కర్నాటక అసెంబ్లీని ఉద్దేశించి యడ్యూరప్ప భావోద్వేగంతో ప్రసంగించారు. కాంగ్రెస్‌, జెడిఎస్‌లకు ప్రజల మద్దతు లేకపోయినా.. వారి రాజకీయ కుట్రలు తనను ఎంతగానో బాధించాయని అన్నారు.

గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల.. బీజేపీకి ప్రజలు 104 స్థానాలు అందించి ఆశీర్వదించారని, కాంగ్రెస్‌, జెడిఎస్‌లు ఎన్నికల్లో ఓడిపోయాయని యడ్యూరప్ప తెలిపారు. అతిపెద్ద పార్టీ కాబట్టే.. బీజేపీని గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని అన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. తమ పార్టీలో సీఎం అభ్యర్థిని ప్రకటించరని, అలాంటిది మోదీ, అమిత్‌షా.. తనను సీఎం అభ్యర్థిగా ఎన్నికల ముందే ప్రకటించారని అన్నారు. ఆమేరకే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని, అయితే అధికారం కోసం కాంగ్రెస్‌, జెడిఎస్‌ సాగించిన తెరచాటు రాజకీయాలు దారుణమని అన్నారు.

గడచిన రెండేళ్లుగా రాష్ట్రమంతటా పర్యటించానని, రైతుల ఇబ్బందులను స్వయంగా చూశానని యడ్యూరప్ప అన్నారు. రైతుల సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేస్తానని.. ఆలమట్టి ఆనకట్ట ఎత్తును 520 మీటర్లకు పెంచడం సహా... రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకూ పునరుజ్జీవనం కల్పించాలన్నదే తన లక్ష్యమని అన్నారు. భావోద్వేగంతో ప్రసంగించిన యడ్యూరప్ప.. విపక్ష ఎమ్మెల్యేలపై ప్రలోభాల వల విసిరిన విషయాన్నీ పరోక్షంగా అంగీకరించారు. తనకు మద్దతు కోసం వారితో సంప్రదింపులు జరిపిన మాట నిజమేనని అన్నారు. విశ్వాస పరీక్ష నేపథ్యంలో.. కాంగ్రెస్‌, బీజేపీ అగ్రనేతలు.. అసెంబ్లీ గ్యాలరీలో కూర్చుని.. అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ను వీక్షించారు. 

కర్ణాటక 21వ సీఎంగా...

కర్ణాటక : గవర్నర్ వాయిబాయ్ వాలాను జేడీఎస్ శాసనసభాపక్ష నేత కుమార స్వామి కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించారని తెలిపారు. 21 సీఎంగా కుమార స్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరు కంఠీరవ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. మంత్రివర్గ కూర్పుపై ఆదివారం కాంగ్రెస్ నేతలు చర్చిస్తామని కుమార స్వామి పేర్కొన్నారు. 

బీజేపీకి ఏపీ శాపం - ఏపీ డిప్యూటి సీఎం...

విజయవాడ : కర్ణాటకలో జరిగిన రాజకీయ పరిణామాలపై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పందించారు. బీజేపీకి ఏపీ శాపం తగిలిందని, ఇప్పటికైనా బీజేపీ అధిష్ఠానం బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. 

జాతీయ గీతాన్ని లెక్కచేయని బిజెపి - రాహుల్...

బెంగళూరు : కర్ణాటక శాసనసభ ముగియగానే జాతీయ గీతం వస్తుంటే ఏమీ పట్టించుకోకుండా బీజేపీ నేతలు, ప్రొటెం స్పీకర్‌ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. అధికారంలో ఉంటే వారు దేన్నీ పట్టించుకోరని దీని ద్వారా తెలుస్తోందని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ లు దేశంలోని అన్ని వ్యవస్థలను అవమానిస్తున్నాయన్నారు. 

18:31 - May 19, 2018

కర్ణాటక సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు. బల నిరూపణ కాకముందే శాసనసభలో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్..జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. జేడీఎస్..కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ అడ్డదారులు తొక్కిందని ఆ పార్టీ నేతలు ఆరోపణలు గుప్చించారు. చివరకు ప్రజాస్వామ్యమే గెలిచిందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెన్ టివి నిర్వహించిన బిగ్ డిబెట్ లో రఘునందన్ రావు (బీజేపీ), గఫూర్ (సీపీఎం), అద్దంకి దయాకర్ (కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరి వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి. 

గవర్నర్ ఆహ్వానం ఎదురు చూస్తున్నాం - కుమార స్వామి...

కర్ణాటక : గవర్నర్ నుంచి ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నామని అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం ఎప్పుడన్నది నిర్ణయిస్తామని జేడీఎస్ శాసనసభా పక్ష నేత కుమార స్వామి పేర్కొన్నారు. సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ అధికారం కోసం ఎలా ప్రయత్నాలు చేసిందో ప్రజలంతా చూశారన్నారు. 

'ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవారందరికి సంతోషం'...

విజయవాడ : ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవారంతా సంతోషంగానే ఉంటారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామాపై ఆయన స్పందించారు. 

నేడు కుమార స్వామికి గవర్నర్ పిలుపు...

బెంగళూరు : కొత్త సీఎంగా జేడీఎస్‌ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రచారం జరగుతోంది. కాసేపటి క్రితం సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర గవర్నర్‌ వజుభాయ్‌ వాలా ఇక కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవనున్నారు. ఈ రోజే ఆయనను గవర్నర్ పిలుస్తారని సమాచారం. 

కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు...

బెంగళూరు : కర్నాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. డెహ్రాడూన్ లోని పార్టీ కార్యాలయం వద్ద నేతలు ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. 

17:23 - May 19, 2018

కర్ణాటక : 'తాను అధికారంలో ఉంటాను..తామే గెలుస్తాం..బల పరీక్షల్లో నెగ్గుతాం'..అంటూ బీరాలు పలికిన కర్ణాటక సీఎం యడ్యూరప్ప బల పరీక్ష కంటే ముందుగానే రాజీనామా చేసేశారు. కర్ణాటక అసెంబ్లీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఉత్కంఠ పరిణామాలకు తెరపడినట్లైంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో బీజేపీ ఆటలు సాగలేదనే చెప్పవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 112 రాదని స్పష్టంగా తేలడంతో యడ్యూరప్ప పదవికి రాజీనామా చేశారు. మొత్తంగా ఆయన 55 గంటల పాటు సీఎం కుర్చీలో ఉన్నట్లైంది.

2007 సంవత్సరంలో యడ్యూరప్ప కేవలం 8 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2008లో 3 ఏళ్ల 2 నెలలు పాటు సీఎం పదవిలో కొనసాగారు. ఇక ప్రస్తుతం అంటే 2018లో 104 సీట్లు సాధించిన బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ని మాత్రం చేరుకోలేకపోయ్యింది. 

117 సంఖ్యా బలం ఉందన్న ఆజాద్...

కర్నాటక : తమకు 117 మంది సభ్యుల బలం ఉందని, బీజేపీకి మెజార్టీ లేకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. 

బీజేపీకి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదన్న యడ్డీ...

కర్నాటక : విపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టామని యడ్యూరప్ప అసెంబ్లీ వేదికగా ఒప్పుకోవడం జరిగిందని కర్ణాటక శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య విమర్శించారు. బీజేపీ నాయకులకు ప్రజాస్వామ్యంపై కించిత్తు గౌరవం లేదని, అబద్ధాల ప్రచారం తప్పితే వారు అభివృద్ధి గురించే మాట్లాడలేదని, న్యాయస్థానం వారి ఆటకట్టించిందన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా తమ ఎమ్మెల్యేలు వారిని తిప్పికొట్టారని ఇందుకు ఎమ్మెల్యేలందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు.

 

చారిత్రక ఘటన - సిద్ధరామయ్య...

బెంగళూరు : ప్రధాన మంత్రి మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలలో ఒకరు హిట్లర్..మరొకరు గోబెల్స్ అని కర్ణాటక శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య విమర్శించారు. శాసనసభలో యడ్యూరప్ప బల నిరూపంలో విఫలం కావడం..అంతకంటే ముందుగానే ఆయన రాజీనామాను సమర్పించిన అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. 

17:09 - May 19, 2018

బెంగళూరు : ప్రధాన మంత్రి మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలలో ఒకరు హిట్లర్..మరొకరు గోబెల్స్ అని కర్ణాటక శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య విమర్శించారు. శాసనసభలో యడ్యూరప్ప బల నిరూపంలో విఫలం కావడం..అంతకంటే ముందుగానే ఆయన రాజీనామాను సమర్పించిన అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు.

చారిత్రక ఘటన..బలం నిరూపించుకోలేక పలాయనం చిత్తగించారని పేర్కొన్నారు. ప్రజా పక్షాల విజయమని, న్యాయం సాధించిన విజయమని అభివర్ణించారు. మోడీ, అమిత్ షాలు గవర్నర్ పై వత్తిడి తెచ్చారని, న్యాయస్థానం తీర్పు విరుద్ధంగా ఉన్నా..యడ్యూరప్పను గవర్నర్ వాలా సీఎం చేశారని విమర్శించారు. ఒక విధంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని, ప్రజలు ఇచ్చిన తీర్పును అందరూ గౌరవించాలన్నారు. కొందరు కేంద్ర మంత్రులు నడుచుకున్న తీరు గర్హనీయమన్నారు.

యడ్యూరప్ప వారం రోజులు గడువు కోరితే గవర్నర్ ఏకంగా 15 రోజులిచ్చారని గుర్తు చేశారు. గవర్నర్ బీజేపీతో అంటకాగారన్నది స్పష్టమవుతోందని తెలిపారు. ఈ వ్యవహారం వెనుక మోడీ ఉన్నారని ఆరోపించారు. తమకు సంఖ్యాబలం లేదని తెలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టామని యడ్యూరప్ప అసెంబ్లీ వేదికగా ఒప్పుకోవడం జరిగిందన్నారు. బీజేపీ నాయకులకు ప్రజాస్వామ్యంపై కించిత్తు గౌరవం లేదని, అబద్ధాల ప్రచారం తప్పితే వారు అభివృద్ధి గురించే మాట్లాడలేదని, న్యాయస్థానం వారి ఆటకట్టించిందన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా తమ ఎమ్మెల్యేలు వారిని తిప్పికొట్టారని ఇందుకు ఎమ్మెల్యేలందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. 

రాజ్ భవన్ లో యడ్యూరప్ప..రాజీనామా...

ఢిల్లీ : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన యడ్యూరప్ప కాసేపటి క్రితం రాజ్ భవన్ కు చేరుకున్నారు. ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. 

ప్రజాస్వామ్యం గెలిచింది - కాంగ్రెస్..జేడీఎస్...

కర్నాటక : న్యాయస్థానాలు, ప్రజల మద్దతుతో ప్రజాస్వామ్యం గెలిచిందని కాంగ్రెస్..జేడీఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. మద్దతు లేదని తేలడంతోనే యడ్యూరప్ప రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు. ఒక్క విధంగా చెప్పాలంటే భారతీయ ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన బీజేపీకి 2019 ఎన్నికల్లోనూ ప్రజలు బుద్ధి చెబుతారని, రెండు పార్టీల సిద్ధాంతాలను కలగలుపుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 

వచ్చే ఎన్నికల్లో 28 ఎంపీ స్థానాలు - యడ్యూరప్ప...

కర్నాటక : వచ్చే ఎన్నికల్లో మొత్తం 28 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల తరువాత వచ్చే ఎన్నికల్లో 150 స్థానాలు గెలుచుకుంటామని జోస్యం చెప్పారు.

16:41 - May 19, 2018

బెంగళూరు : అత్యధిక స్థానాలు సంపాదించిన తమకు ప్రజా సేవ చేసుకొనే అవకాశం దక్కకపోవడం దురదృష్టకరమని సీఎం యడ్యూరప్ప వెల్లడించారు. శనివారం ఆయన అసెంబ్లీలో బల పరీక్ష సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎన్నికల ప్రచారంలో రోజు ఎడెనిమిది నియోజకవర్గాల్లో పర్యటించడం జరిగిందని, తన పర్యటనల్లో ప్రజలు అభిమానాన్ని మరువలేనని సీఎం యడ్యూరప్ప తెలిపారు. ఎన్నికల్లో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించ లేదని, ప్రధాని మోడీ..అమిత్ షాలు తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందన్నారు. ఆ మేరకు తాను సీఎంగా ప్రమాణం చేయడం జరిగిందన్నారు.

అతి పెద్ద పార్టీగా అవతరించిన తమని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగా ప్రజలు 104 సీట్లలో తమను గెలిపించారన్నారు. ప్రజాభిమాతం కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు లభించలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా ? ఎక్కడైనా ఉన్నామా ? అని ప్రజలు ఆలోచించుకున్నారని పేర్కొన్నారు. సాగునీరు, మద్దతు ధర లేకపోవడం లాంటి సమస్యలు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా రైతు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడని సభలో వెల్లడించారు. రైతుల ఆత్మహత్యలు తెలియదేం కాదని, గడిచిన ఇన్నేళ్లలో తాను ఒడిదొడుకులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం 28 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల తరువాత వచ్చే ఎన్నికల్లో 150 స్థానాలు గెలుచుకుంటామని జోస్యం చెప్పారు.

రైతులకు భరోసా ఇవ్వాలని..రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి..రైతులను కాపాడాలని..ఇదే తన ఏకైక లక్ష్యమని పేర్కొన్న యడ్యూరప్ప రైతుల సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేస్తానన్నారు. మోడీ సర్కార్ కు యడ్యూరప్ప సర్కార్ తోడైతే బాగుంటుందని అందరూ భావించడం జరిగిందని పేర్కొన్న ఆయన రాజీనామాను ప్రకటించారు. పూర్తి ప్రసంగం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:21 - May 19, 2018

బెంగళూరు : అనుకొన్నది ఒకటి..అయ్యింది ఒకటి..ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఇలాగే ఉంది. అధికారం కోసం తహతహలాడిన కాషాయ పార్టీ వెనక్కి తగ్గింది. సంఖ్యాబలం లేకున్నా అధికారంలోకి వచ్చి బల నిరూపణకు సిద్ధమైన యడ్యూరప్ప తోకముడిచారు. తాను రాజీనామా చేస్తున్నట్లు కర్ణాటక అసెంబ్లీలో ప్రకటించేశారు. 104 స్థానాలు దక్కించుకున్న బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం..బల నిరూపణకు 15 రోజుల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ అత్యున్నత న్యాయస్థానం ఒక్కటుందనే విషయం మరిచిపోయినట్లున్నారు..కాంగ్రెస్..జేడీఎస్ లు వేసిన పిటిషన్ లపై విచారణ జరిపి శనివారం సాయంత్రం బలపరీక్షకు సిద్ధం కావాలని ఆదేశించింది. దీనితో బీజేపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది.

కాషాయ నేతలు అనుసరించే వ్యూహాలు..మోసాలు తెలిసిపోయిన కాంగ్రెస్..జేడీఎస్ అధిష్టానం జాగ్రత్త వహించాయి. ఎక్కడా ఎమ్మెల్యేలు చేజారిపోకుండా పటిష్ట జాగ్రత్తలు తీసుకున్నాయి. ఏకంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కు తరలించి పలు జాగ్రత్తలు తీసుకుంది. అయినా బీజేపీ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా అడ్డదారులు తొక్కే ప్రయత్నాలు చేసింది. తామే గెలుస్తామని బీజేపీ నేతలు విర్రవీగారు. తమ పార్టీలకు చెందిన నేతలను ఎలా కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన వీడియోలను కాంగ్రెస్ బహిర్గతం చేయడంతో కాషాయ పెద్దలు సైలంట్ అయిపోయారు. 

తగిన సంఖ్యాబలం లేకపోవడంతో రాజీనామా చేయాలని యడ్యూరప్ప నిర్ణయించుకున్నారు. బలనిరూపణకంటే ముందుగానే రాజీనామాను గవర్నర్ కు సమర్పించాలని భావించారు. సాయంత్రం జరిగిన సమావేశంలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి..ప్రసంగించారు. రాజీనామాను చేస్తున్నట్లు ప్రకటించేశారు. ఈ సందర్భంగా విపక్ష నేతలు మీడియాతో మాట్లాడారు. 

ప్రజాస్వామ్యం గెలిచిందన్న విపక్ష నేతలు...
న్యాయస్థానాలు, ప్రజల మద్దతుతో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. మద్దతు లేదని తేలడంతోనే యడ్యూరప్ప రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు. ఒక్క విధంగా చెప్పాలంటే భారతీయ ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన బీజేపీకి 2019 ఎన్నికల్లోనూ ప్రజలు బుద్ధి చెబుతారని, రెండు పార్టీల సిద్ధాంతాలను కలగలుపుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 

కర్ణాటకలో కూలిన బీజేపీ సర్కార్...

బెంగళూరు : కర్ణాటకలో మూణ్ణాళ్ల ముచ్చటగానే యడ్యూరప్ప ప్రభుత్వం ముగిసింది. సాధారణ మెజార్టీ కోసం యడ్యూరప్ప సర్వశక్తులు ఒడ్డారు. జేడీఎస్..కాంగ్రెస్ సభ్యులతో బేరసారాలు ఫలించలేదు. 

ప్రజల అభిమానం మరువను - యడ్యూరప్ప...

బెంగళూరు : రోజు ఎడెనిమిది నియోజకవర్గాల్లో పర్యటించడం జరిగిందని, తన పర్యటనల్లో ప్రజలు అభిమానాన్ని మరువలేనని సీఎం యడ్యూరప్ప తెలిపారు. విశ్వాస పరీక్ష సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. 

యడ్యూరప్ప విశ్వాస పరీక్ష తీర్మానం...

బెంగళూరు : విశ్వాస పరీక్ష తీర్మానాన్ని సీఎం యడ్యూరప్ప ప్రవేశ పెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో శనివారం యడ్యూరప్ప బలపరీక్షను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మ్యాజిక్ నెంబర్ 111 గా ఉండగా బీజేపీకి 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ 36, ఇతరులు 3 ఉన్నారు. 

కర్నాటక అసెంబ్లీలో మాట్లాడుతున్న యడ్యూరప్ప...

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో శనివారం బలపరీక్ష జరుగుతోంది. సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేయనున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

15:39 - May 19, 2018

బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో యడ్యూరప్ప బలపరీక్షకు రంగం సిద్ధమౌతోంది. బలపరీక్షకంటే ముందుగానే యడ్యూరప్ప రాజీనామా చేయనున్నారని, అసెంబ్లీలో ప్రసంగం అనంతరం 13 పేజీల రాజీనామా లేఖను సమర్పించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఎలాగూ సంఖ్యాబలం లేకపోవడం..బలం పెంచుకొనేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో రాజీనామానే శరణ్యమని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. జేడీఎస్..కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని..బలపరీక్షలో నెగ్గుతామని యడ్యూరప్ప మొదట్లో ధీమా ప్రకటించిన సంగతి తెలిసిందే.

కానీ శనివారం ఉదయం నుండి ఒక్కసారిగా రాజకీయాలు మారిపోతున్నాయి. ఎమ్మెల్యేలతో బీజేపీ బెరసారాలు ఎలా సాగించిందో కూడిన వీడియోలను కాంగ్రెస్ బహిర్గతం చేసింది. భయం..ప్రలోభాలతో ఎమ్మెల్యేలను లాక్కొనేందుకు ప్రయత్నించిందని ఆరోపించింది. దీనితో కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వం జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణకూటమి ఏర్పాటు చేయనుందని తెగ ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యేలతో బేరసారాలు...

కర్నాటక : కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు ముమ్మరం చేపట్టింది. దీనికి సంబంధించిన రెండో ఆడియో టేపును కాంగ్రెస్ విడుదల చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఉగ్రప్పకు రెండు ఆఫర్లు ఇచ్చినట్లు...మొదటి ఆఫర్ రూ. 15 కోట్ల నగదు..రెండో ఆఫర్ కింద రూ. 5 కోట్ల నగదు..మంత్రి పదవి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉగ్రప్పతో యడ్యూరప్ప తనయుడు మాట్లాడినట్లు సమాచారం. 

15:37 - May 19, 2018

బెంగళూరు : కర్ణాటకలో ఉత్కంఠ రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. శాసనసభలో యడ్యూరప్ప బలపరీక్ష నెగ్గుతారా ? లేదా ? అనే దానిపై తెగ చర్చ జరుగుతోంది. కాంగ్రెస్..జేడీఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. కానీ బలపరీక్షలో నెగ్గలేమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. కానీ చివరి క్షణం వరకు ప్రయత్నం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు ముమ్మరం చేపట్టింది. దీనికి సంబంధించిన రెండో ఆడియో టేపును కాంగ్రెస్ విడుదల చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఉగ్రప్పకు రెండు ఆఫర్లు ఇచ్చినట్లు...మొదటి ఆఫర్ రూ. 15 కోట్ల నగదు..రెండో ఆఫర్ కింద రూ. 5 కోట్ల నగదు..మంత్రి పదవి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉగ్రప్పతో యడ్యూరప్ప తనయుడు మాట్లాడినట్లు సమాచారం.

మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై తెగ కలకలం రేగింది. నాలుగు రోజుల నుండి దూరంగా ఉన్న వీరు బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తారని ప్రచారం జరిగింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కనుసన్నల్లో వీరు ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ ప్రతాప గౌడ భారీ భద్రత నడుమ అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. సుమారు పది వాహనాల మధ్యలో ఆయన్ను తీసుకొచ్చారు. తామే తీసుకొచ్చామని కాంగ్రెస్ పేర్కొంటోంది.

ప్రారంభమైన కర్నాటక అసెంబ్లీ...

బెంగళూరు : కర్ణాటక సీఎం యడ్యూరప్ప భవితవ్యం కొద్ది గంటల్లో తేలనుంది. నాలుగు గంటలకు ఆయన బలపరీక్షను ఎదుర్కొననున్నారు. కానీ ఈ బలపరీక్షలో నెగ్గలేమని రాష్ట్ర పరిణామాలను పరిశీలిస్తున్న ప్రకాష్ జవదేకర్ భావిస్తున్నట్లు, ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలియచేసినట్లు..కానీ ఆఖరిక్షణం వరకు ప్రయత్నించాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. 

15:36 - May 19, 2018

బెంగళూరు : కర్ణాటక సీఎం యడ్యూరప్ప భవితవ్యం కొద్ది గంటల్లో తేలనుంది. నాలుగు గంటలకు ఆయన బలపరీక్షను ఎదుర్కొననున్నారు. కానీ ఈ బలపరీక్షలో నెగ్గలేమని రాష్ట్ర పరిణామాలను పరిశీలిస్తున్న ప్రకాష్ జవదేకర్ భావిస్తున్నట్లు, ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలియచేసినట్లు..కానీ ఆఖరిక్షణం వరకు ప్రయత్నించాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో బీజేపీ శిబిరంలో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. విశ్వాస పరీక్షల నెగ్గలేమని నిర్ణయానికి వస్తే ముందుగానే యడ్యూరప్ప రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఆడియో టేపులు కలకలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు ముమ్మరం చేపట్టింది. దీనికి సంబంధించిన ఆడియో టేపును కాంగ్రెస్ విడుదల చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఉగ్రప్పకు రెండు ఆఫర్లు ఇచ్చినట్లు...మొదటి ఆఫర్ రూ. 15 కోట్ల నగదు..రెండో ఆఫర్ కింద రూ. 5 కోట్ల నగదు..మంత్రి పదవి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉగ్రప్పతో యడ్యూరప్ప తనయుడు మాట్లాడినట్లు సమాచారం. 

Don't Miss