Activities calendar

20 May 2018

21:29 - May 20, 2018

కుమార స్వామి హస్తినకు...

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధినాయకులు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీని ఆహ్వానించడంతో పాటు మంత్రివర్గం కూర్పుపై చర్చించేందుకు కుమారస్వామి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకు సాగే విధంగా కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు  సమాలోచనలు జరుపుతున్నారు. కుమారస్వామి సోమవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీ, సోనియాగాంధీతో జరిగే భేటీలో వీటన్నింటిపైనా స్పష్టత వచ్చే అవకాశంవుందని భావిస్తున్నారు. 

21:21 - May 20, 2018

హైదరాబాద్ : జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో తెలంగాణ యూనియన్‌ ఆఫ్ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ సంఘం ఎప్పుడూ ముందుంటుందని తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో వర్కింగ్‌ జర్నలిస్టు ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లం నారాయణ.. తెలంగాణలో జర్నలిస్టుల దీర్ఘకాళిక సమస్యలను టీయూడబ్లూజే మాత్రమే పరిష్కరించగలదని అన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి జర్నలిస్ట్‌లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

వర్కింగ్‌ జర్నలిస్టు ప్రతినిధుల సమావేశం...

హైదరాబాద్ : జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో తెలంగాణ యూనియన్‌ ఆఫ్ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ సంఘం ఎప్పుడూ ముందుంటుందని తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో వర్కింగ్‌ జర్నలిస్టు ప్రతినిధుల సమావేశం జరిగింది. 

21:06 - May 20, 2018

బెంగళూరు : కర్నాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా కుమారస్వామి, మంత్రులు ప్రమాణస్వీకారోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం కుమారస్వామి ప్రమాణం చేయనున్నారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినాయకులు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీని ఆహ్వానించడంతో పాటు మంత్రివర్గం కూర్పుపై చర్చించేందుకు కుమారస్వామి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కర్నాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుతీరేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం బెంగళూరులోకి కంఠీరవ స్టేడియంలో జేడీఎస్‌ అధినేత కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. అదేరోజు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రమాణస్వీకారం చేసిన 24 గంటల్లోనే అసెంబ్లీలో బలం నిరూపించుకొంటానని కుమారస్వామి ప్రకటించారు. సోమవారమే కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నారు. అయితే సోమవారం మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్థంతి ఉండటంతో ప్రమాణస్వీకారోత్సవాన్ని బుధవారానికి వాయిదా వేసుకున్నారు.

మంత్రివర్గం కూర్పుపై రెండు పార్టీల నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 78 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌కు ఉపముఖ్యమంత్రి పదవితోపాటు మంత్రివర్గంలో కీలక శాఖలు అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి పదవికి పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర పేరు వినిపిస్తోంది. ఉపముఖ్యమంత్రితో పాటు కీలకమైన హోం శాఖను కూడా పరమేశ్వర్‌కు అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే క్యాంపు రాజకీయాల్లో ఆరితేరిన డీకే శివకుమార్‌ కూడా ఉపముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు. శివకుమార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే విషయంలో అటు కుమారస్వామితోపాటు ఇటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా సుముఖంగా లేనట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖను తనవద్దే ఉంచుకోవాలని కుమారస్వామి భావిస్తున్నట్టు జేడీఎస్‌ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి సహా 24 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. జేడీఎస్‌కు 8, కాంగ్రెస్‌కు 14 మంత్రి పదవులు దక్కే చాన్స్‌ ఉంది. జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం సజావుగా నడవాలంటే సమన్వయ కమిటీ ఉండాలని రెండు పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఈ దిశగా చర్చలు సాగుతున్నాయి. అలాగే కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకు సాగే విధంగా కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. కుమారస్వామి సోమవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీ, సోనియాగాంధీతో జరిగే భేటీలో వీటన్నింటిపైనా స్పష్టత వచ్చే అవకాశంవుందని భావిస్తున్నారు. 

21:03 - May 20, 2018

శ్రీకాకుళం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 2019 ఎన్నికల సమర శంఖం పూరించారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉత్తరాంధ్ర నుంచి పోరాట యాత్ర ప్రారంభించారు. ప్రజల అండదండలతో 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని... చంద్రబాబు సర్కారుకు చరమగీత పాడాలని పవన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతోనే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని ఇచ్ఛాపురం బహిరంగ సభలో మండిపడ్డారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి పోరాట యాత్ర ప్రారంభించారు. తొలిదశ పోరాట యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. పోరాట యాత్ర కోసం ఇచ్ఛాపురం చేరుకొన్న పవన్‌ కల్యాణ్‌... కవిటి మండలం కపసకుర్తి సముద్రతీరంలో గంగ పూజలు చేశారు. అక్కడ నుంచి పోరాట యాత్రకు శ్రీకారం చుట్టారు. యాత్ర చేస్తూ ఇచ్ఛాపురంలో స్వేచ్ఛావతి ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. ఇచ్ఛాపురం బహిరంగ సభలో ప్రసంగించిన జనసేనాని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు ప్రతిపక్ష నేత జగన్‌, ఇంకోవైపు ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు.

పోరాట యాత్రతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన పవన్‌ కల్యాణ్‌... చంద్రబాబు ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుపోయిందని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి భయపడుతూ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. నాలుగేళ్లపాటు అడుగడగునా ప్రజలను మభ్యపెట్టి, మోసం చేసిందని మండిపడ్డారు. ప్రజల మద్దతులో 2019లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏ తప్పూ చేయకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు భయపడాలని ఇచ్ఛాపురం సభలో పవన్‌ కల్యాణ్‌ నిలదీశారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందని తెలిసినా.. నాలుగేళ్ల పాటు చంద్రబాబు నోరు మూసుకుని... ఇప్పుడు ధర్మపోరాటం పేరుతో రోడ్డెక్కుతున్నారని పవన్‌ మండిపడ్డారు. చంద్రబాబు చేసేది ధర్మపోరాటమా ? లేక అధర్మ పోరాటమా? అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా జగన్‌ ఘోరంగా విఫలమయ్యారని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చినందుకు క్షమాపణలు కోరారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్‌ సమస్యను పరిష్కరిస్తుందని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. జనసేన పార్టీలపై ప్రజలు విశ్వాసం ఉంచాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం కంచిలి, సోంపేట మండలాల మీదుగా పలాస నియోజవర్గంలోకి పవన్‌ కల్యాణ్‌ పోరాట యాత్ర ప్రవేశిస్తుంది. 

కుమార స్వామి ప్రమాణానికి బాబు హాజరు ?

విజయవాడ : కర్ణాటక సీఎంగా కుమార స్వామి చేసే ప్రమాణ స్వీకార మహోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై మంత్రులతో టెలికాన్ఫరెన్స్ లో బాబు చర్చించారు. హాజరు కావాలని మంత్రులు ఏకగ్రీవంగా సూచించారు. దేవెగౌడతో సాన్నిహిత్యం..కుమార స్వామి ఫోన్ చేయడం..జేడీఎస్ తో టిడిపికి సాన్నిహిత్యం ఉండడం..దేవెగౌడ ప్రధాని కావడంలో చంద్రబాబు పాత్ర ఉందని...అందువల్ల ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని మంత్రులు సూచించారు. ప్రమాణ స్వీకారానికి వెళితే దేశానికి సరైన సంకేతం వెళుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ప్రమాదవశాత్తు చెరువులో పడి...

సంగారెడ్డి : తాళ్లపల్లిలో విషాదంలో చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు..మహిళ ఉంది. 

19:35 - May 20, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా ధమ్మపేట మండలం మందలపల్లిలో పోలీసులకు గ్రామస్థులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. సొసైటీ భూముల్లో షెడ్డులు వేశారని.. రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో షెడ్డులను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో బాధితులు రెవెన్యూ అధికారులతో, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితులకు అండగా నిలిచిన సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తాము పేదవారిమని, కావాలనే రాత్రి సమయంలో ఆకస్మికంగా వచ్చి షెడ్డులను తొలగిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

19:33 - May 20, 2018

చిత్తూరు : తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని టీటీడీ ఈవో ఏకే సింఘాల్‌ చెప్పారు. ఆభరణాలు మాయమవుతున్నాయని, స్వామి వారిని పస్తు పెడుతున్నారని మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై సింఘాల్‌ వివరణ ఇచ్చారు. శ్రీవారి నగలకు సంబంధించి 1952 నుంచి పక్కాగా లెక్కలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ఏటా శ్రీవారి ఆభరణాలను భక్తుల కోసం ప్రదర్శించేందుకు ఎలాంటి అభ్యతరం లేదన్నారు. స్వామి వారి నివేదనలు, కైంకర్యాలన్నీ ఆగమశాస్త్రయుక్తంగానే జరుగుతున్నాయని ఈవో సింఘాల్‌ చెప్పారు. 

19:31 - May 20, 2018

రంగారెడ్డి : రైతుబంధు పథకం నిజమైన రైతులకు కాకుండా భూస్వాములకు ప్రయోజనకరంగా ఉందన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఎల్‌ఎఫ్‌ నియోకవర్గ స్థాయి సమావేశానికి హాజరైన తమ్మినేని... రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించనంత కాలం ఎన్ని పథకాలు చేపట్టినా ప్రయోజనం ఉండదన్నారు. బలహీన వర్గాల బతుకులు మార్చడమే బీఎల్ఎఫ్‌ ముఖ్య లక్ష్యమన్నారు తమ్మినేని. 

19:28 - May 20, 2018

వరంగల్ : దేశంలోనే రైతు బంధు పథకం కొత్తదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వరంగల్‌ జిల్లా వర్దన్నపేట రైతుబంధు కార్యక్రమంలో పాల్గొన్న నేతలు.... లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటికే రైతులు 4,500 కోట్ల రూపాయలు రైతుబంధు పథకం ద్వారా డ్రా చేసుకున్నారన్నారు. రైతుల గురించి నిజంగా ఆలోచించే ప్రభుత్వం తమదేనని కడియం, పోచారం అన్నారు. 

19:26 - May 20, 2018

గుంటూరు : రాష్ట్రంలో జగన్ చేస్తున్నది పాదయాత్ర కాదని..విహార యాత్రలాగా ఉందన్నారు మంత్రి నక్కా ఆనందబాబు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన నక్కా ఆనంద్‌బాబు... గిరిజనుల గురించి కనీసం అవగాహన లేని వ్యక్తి... వారి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పడవ ప్రమాదంలో 20 మంది మృతి చెందితే కనీసం పరామర్శించని నేత జగన్‌ అని విమర్శించారు. గిరిజనుల సంక్షేమంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని... దమ్ముంటే చర్చకు రావాలని జగన్‌కు మంత్రి నక్కా ఆనంద్‌బాబు సవాల్‌ విసిరారు.

19:24 - May 20, 2018

శ్రీకాకుళం : 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చినందుకు తనను క్షమించాలని ప్రజలను కోరారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం..విభజన హామీలు..ప్రత్యేక హోదా కోరుతూ ఆయన శ్రీకాకుళం జిల్లా నుండి పోరుయాత్ర మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజావారి మైదానంలో భారీ బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదాపై 40 రకాలుగా మాటలు మార్చారన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదన్న చంద్రబాబే.. మళ్లీ ప్రత్యేక హోదా కావాలనడంతో ప్రజల్లో నమ్మకం కోల్పోయారన్నారు. ఇచ్చిన మాటకు బీజేపీ కట్టుబడిలేకపోవడం బాధాకరమన్నారు పవన్‌ కళ్యాణ్. బీజేపీకి లొంగిపోతోంది టిడిపి..చంద్రబాబు నాయుడేనని, ఎందుకు భయపడుతున్నారో తెలియడం లేదన్నారు. 

19:22 - May 20, 2018

శ్రీకాకుళం : అధికారంలోకి వస్తే.. ప్రజాధనం తనకు అవసరం లేదని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ప్రభుత్వ సంస్థలను కాపాడుతానన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం..విభజన హామీలు..ప్రత్యేక హోదా కోరుతూ ఆయన శ్రీకాకుళం జిల్లా నుండి పోరుయాత్ర మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజావారి మైదానంలో భారీ బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. విజయా డెయిరీని ముంచి హెరిటేజ్‌ను అభివృద్ధి చేసుకున్నారని పవన్‌ మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను పని చేస్తానని పవన్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలను కాపాడుతానని..ప్రజా సొమ్ము తనకు అవసరం లేదని...తాను మాములుగా బతికే వ్యక్తి అని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలతో తాను రెండు రోజలు పాటు పర్యటిస్తానని తెలిపారు.

19:19 - May 20, 2018

శ్రీకాకుళం : 2019లో జనసేన అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఆమరణ నిరహార దీక్షకైనా సిద్ధమని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అవినీతితో నిండిపోయిందని పవన్‌ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందన్నారు. దోపిడీని తగ్గించడానికే పాలిటిక్స్‌లోకి వచ్చానన్న పవన్‌...ప్రజలకు మేలు చేస్తారనే టీడీపీకి మద్దతిచ్చానని కానీ ప్రజలకు మేలు చేయడం లేదన్నారు. ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వస్తామని పవన్‌ అన్నారు. కొత్త సామాజిక మార్పు కోసం..సమ సమాజ నిర్మాణం కోసం..కృషి చేస్తామన్నారు. ప్రజలకు మేలు చేయాలని తాను గతంలో చంద్రబాబు నాయుడిని కోరడం జరిగిందని, సిక్కోలులో మత్స్యకార్మికులకు సమస్యలు రాకుండా..తాగునీరందించాలని..ఉద్దాన్నం సమస్యలు తీర్చాలని కోరడం జరిగిందన్నారు. కానీ విదేశాలకు వెళ్లడం..భారీగా ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. 

18:52 - May 20, 2018

చెన్నై : కర్ణాటకలో అడ్దదారిన అధికారంలోకి రావాలని అనుకున్న బీజేపీకి ఆ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు ఆ పార్టీకి చెంప పెట్టు అని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పేర్కొన్నారు. ఆదివారం మక్కల్ మండ్రం మహిళా ప్రతినిధులతో రజనీ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు...సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విజయం సాధించిందన్నారు. బల నిరూపణకు యడ్యూరప్పకు 15 రోజుల గడువు ఇవ్వడం తప్పని, గవర్నర్ వాజుభాయ్ వాలా చర్య రాజ్యాంగ విరుద్ధమన్నారు. పాలకులందరూ కర్ణాటక పరిణామాలను గుర్తించుకోవాలని, రాజ్యాంగం అంటే ప్రజాస్వామ్య విలువలు కాపాడమేనని రజనీ తెలిపారు. 

గుట్టూరులో విషాదం...

అనంతపురం : జిల్లాలోని పెనుకొండ (మం) గుట్టూరులో విషాదం చోటు చేసుకుంది. ఏడుగురు పిల్లలకు విషమిచ్చిన తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు వీరిని ఆసుపత్రికి తరలించారు. వీరి ప్రాణాలకు ఎలాంటి అపాయం లేదని వైద్యులు వెల్లడించారు. 

18:40 - May 20, 2018

శ్రీకాకుళం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీలో నిలబడుతామని, 175 స్థానాల్లో పోటీ చేస్తామని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని..ఉన్న డబ్బులు ఖర్చు పెట్టడానికి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం..విభజన హామీలు..ప్రత్యేక హోదా కోరుతూ ఆయన శ్రీకాకుళం జిల్లా నుండి పోరుయాత్ర మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వరకు పవన్ నిరసన కవాతు నిర్వహించారు. ఈ కవాతులో జనసేన కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అనంతరం రాజావారి మైదానంలో భారీ బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో ఆయన టిడిపి, బిజెపి పార్టీలపై పలు విమర్శలు గుప్పించారు. టిడిపి చంద్రబాబు నాయుడిపై కూడా విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

జనసేనకు ఓ ఆర్గనైజేషన్ లేదని చాలా మంది మాట్లాడారని..కానీ విమర్శించే విధంగా ఆర్గనైజేషన్ చేయనని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పార్టీని స్థాపించలేదని...ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత...ఆయన స్థాపించిన పార్టీలో ప్రధాన కార్యదర్శి చేరి ముందుకు తీసుకెళ్లారని..కానీ పవన్ కు అలాంటిది స్థితి లేదన్నారు. అంతేగాకుండా తనకు హెరిటేజ్ లాంటి సంస్థ లేదని పరోక్షంగా బాబునుద్ధేశించి విమర్శించారు.

తాను ముఖ్యమంత్రి కావడానికి రాలేదని..ముందు ప్రజల కష్టాలు తెలుసుకుంటానని పేర్కొన్నారు. డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని..ఉన్న డబ్బును వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను గతంలో టిడిపి..బిజెపి పార్టీలకు మద్దతినిచ్చినప్పుడు పదవి కోరుకోలేదని..ఏ కాంట్రాక్టర్ అవసరం లేదన్నారు. 600 పైకి ఎక్కువగా హామీలు టిడిపి మెనిఫెస్టోలో ఉన్నాయని..ఈ విషయాన్ని తాను ప్రశ్నించానని..తనను నమ్మాలని బాబు చెప్పడం జరిగిందన్నారు. అందుకే తాను నమ్మడం జరిగిందన్నారు. పార్లమెంట్ హాల్ లోకి వెళ్లేముందు మెట్లు మొక్కిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీ ఆశలను..ఆశయాలను నెరవేరుస్తానని నమ్మకం కలిగిందన్నారు. కానీ ఆ నమ్మకం ఇప్పుడు కలగడం లేదన్నారు.

టిడిపి ఇచ్చిన హామీల విషయాలపై తాను గతంలో ప్రశ్నించడం జరిగిందని, దీనికి కాలయాపన చేశారని తెలిపారు. రెండు సంవత్సరాల తరువాత వారు మోసం చేస్తారని గ్రహించినట్లు తెలిపారు. సపోర్టు చేస్తే బానిసల్లాగా ఉండాలా ? ఇది ప్రజాస్వామ్యం అని పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చిన వారు అభివృద్ధి చేస్తే సిక్కోలు ఇంకా వెనుకబడి ఉంది ఎందుకు ? అని ప్రశ్నించారు. ఇలాంటి సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చిన జనసేన సైనికులకు ఇబ్బంది కలుగ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అలాగే వ్యవహరిస్తే మాత్రం కెరటాల ఉవ్వెత్తున ఎగుస్తామన్నారు. జనసేన సైనికులపై దాడి చేయవద్దని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అధికారాన్ని ఇష్టారాజ్యంగా వాడుకుంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఎలా డబ్బులు వస్తాయి ? అని ప్రశ్నించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని..కొన్ని కుటుంబాల వారికేనా అభివృద్ధి ? అని సూటిగా ప్రశ్నించారు. జనసేన అనేది అభివృద్ధి అందరికీ కావాలని కోరుకొనే పార్టీ అని, తిరుపతిలో జనసైనికుడిని చంపేశారని..చంపేసే ముందు జై జనసేన అని చనిపోయాడన్నారు.
అందిరిలాగా తాను ప్రజలను మోసం చేయనని..నిజాయితిగా ఉంటానని..వెనుకంజ వేయనని తెలిపారు. అధికారం మీద జనసేనకు ఆశ ఉందని..2019లో ప్రజల సహాయ..సహకారాలతో సరికొత్త ప్రభుత్వం వస్తుందని చెప్పాలన్నారు. ఇసుక మాఫియా..కిడ్నీ వ్యాధులను నివారించే గల ప్రభుత్వం వస్తుందన్నారు.

గతంలో ప్రత్యేక హోదా ప్యాకేజీ ప్రకటన అనంతరం సన్మానాలు చేసింది ఎవరు ? జనసేన చేసిందా ? అని ప్రశ్నించారు. ప్రజలను వంచించే అనుభవం మాత్రం ఉందని పరోక్షంగా బాబునుద్దేశించి విమర్శించారు. తనకు ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీని స్థంభించి సిక్కోలు ఉద్దాన్నం సమస్య తీర్చే వాడినన్నారు. ప్రతిపక్షం ఈ విషయంలో విఫలం చెందిందన్నారు. తమ వెనుక ఎవరు ఏం చేస్తున్నారో తమకు తెలుసని, రాజకీయాలు తమకు తెలుసన్నారు. మూడు లక్షల మంది మత్స్యకార్మికుల సమస్యలు ఆగమ్యగోచరంగా ఉన్నాయన్నారు.

కొన్ని విషయాల్లో టిడిపి ప్రభుత్వం బిజెపికి ఎందుకు లొంగిపోతోంది ? ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. బాబు నిర్వహించే ధర్మపోరాటం ఏంటో అర్థం కావడం లేదని..పోరాటాలు నిర్వహించాలంటే రోడ్డు మీదకు రావాలని సవాల్ విసిరారు. విభజన హోదా..విభజన హామీల కోసం ప్రజక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. తాము 2019లో ఖచ్చితంగా 175 స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. బిజేపి రాజ్యాంగాన్ని విస్మరిస్తోందని విమర్శించారు. పూర్తి ప్రసంగానికి వీడియో క్లిక్ చేయండి. 

18:31 - May 20, 2018

సీఎం కావడానికి రాలేదు - పవన్...

శ్రీకాకుళం : తాను ముఖ్యమంత్రి కావడానికి రాలేదని..ముందు ప్రజల కష్టాలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని..ఉన్న డబ్బును వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానన్నారు. టిడిపి..బిజెపి పార్టీలకు మద్దతిచ్చిన సమయంలో తాను పదవి కోరుకోలేదన్నారు. 

 

బాబు పార్టీని స్థాపించలేదు - పవన్...

శ్రీకాకుళం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీని స్థాపించలేదని...ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత...ఆయన స్థాపించిన పార్టీలో ప్రధాన కార్యదర్శి చేరి ముందుకు తీసుకెళ్లారని జనసేన అధినేత పవన్ తెలిపారు. కానీ పవన్ కు అలాంటిది స్థితి లేదన్నారు.

బహిరంగసభలో మాట్లాడుతున్న పవన్....

శ్రీకాకుళం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర మొదలు పెట్టారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం..విభజన హామీలు..ప్రత్యేక హోదా కోరుతూ ఆయన శ్రీకాకుళం జిల్లా నుండి పోరుయాత్ర మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వరకు పవన్ నిరసన కవాతు నిర్వహించారు. ఈ కవాతులో జనసేన కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అనంతరం రాజావారి మైదానంలో భారీ బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. 

సభ ప్రాంగణంలో పవన్...

శ్రీకాకుళం : విభజన హామీలు..ప్రత్యేక హోదా కోరుతూ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ వద్దకు పవన్ చేరుకున్నారు. 

'జనసేన' బహిరంగసభ..

శ్రీకాకుళం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరు యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరు యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 

16:38 - May 20, 2018

కన్నకూతురిపై తండ్రి...

చిత్తూరు : చంద్రగిరి (మం) కొంగరవారిపల్లెలో కన్నకూతురిపై మూడేళ్లుగా తండ్చి అత్యారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం తెలిసినా తల్లి పట్టించుకోకపోవడంతో చంద్రగిరి పీఎస్ లో బాధిత యువతి ఫిర్యాదు చేసింది. యువతి డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అశోక్ నగర్ లో దారుణం...

హైదరాబాద్ : అశోక్ నగర్ లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు నాలాలో పడేశారు. శిశువు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి...

గుంటూరు : తాడేపల్లి (మం) నులకపేట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక టిప్పర్ - బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. దంపతులు శ్రీకాంత్ (29), సరిత (25), కూతురు అక్షర (3) మృతి చెందారు. 

అధికారులపై సీపీఎం నేత ఆగ్రహం...

కృష్ణా : అధికారుల తీరుపై సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి రఘు ఆగ్రహం వ్యక్తం చేశారు. నందివాడ మండలంలో అక్రమ చేపల చెరువుల తవ్వకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలుగు చేస్తున్న ఈ చెరువుపై మరోసారి ఉద్యమిస్తామన్నారు. అంకన్నగూడెంలో సోమవారం పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామన్నారు. 

15:33 - May 20, 2018

మక్కల్ మండ్రం మహిళా ప్రతినిధులతో రజనీ భేటీ...

చెన్నై : మక్కల్ మండ్రం మహిళా ప్రతినిధులతో సినీ నటుడు రజనీకాంత్ సమావేశమయ్యారు. తమ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని, మహిళలు ఎక్కడుంటే అక్కడే విజయం తథ్యమని రజనీ తెలిపారు. కర్ణాటకలో సుప్రీం సాయంతో ప్రజాస్వామ్యం గెలిచిందని, బలనిరూపణకు గవర్నర్ 15 రోజుల గడువు ఇవ్వడం తప్పన్నారు. అఖిలపక్ష భేటీకి రావాలని కమల్ తనను ఆహ్వానించారని, ఇంకా రాజకీయ పార్టీ ప్రారంభించనందున సమావేశానికి వెళ్లలేదని వివరణనిచ్చారు. 

14:53 - May 20, 2018

పశ్చిమగోదావరి : జిల్లా తాడేపల్లి గూడెం శ్రీ రామ నర్సింగ్‌ హోం ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత నెలకొంది. కూనపాముల సౌజన్య అనే బాలింత చికిత్స పొందుతూ మృతి చెందడంతో డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. సౌజన్య గర్భవతి కావడంతో శ్రీరామ నర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో చేరి...మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున సౌజన్యకు అధికంగా ఆయాసం రావడంతో, పరిస్థితి విషమంగా ఉందని తణుకు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా వైద్యురాలు రమాదేవి సూచించారు. తణుకు తీసుకొని వెళ్లి ఆక్సిజన్‌ పెట్టె లోగా సౌజన్య మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో సౌజన్య మృతికి రమాదేవే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. రమాదేవి పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

14:52 - May 20, 2018

అనంతపురం : జిల్లా గుత్తిలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా పలు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. గుత్తి- పత్తికొండ ప్రధాన రహదారి ప్రక్కన నివాసం ఉండే ప్రతాప్ రెడ్డి, నీలావతి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న 8 తులాల బంగారం, 30 వేల నగదును దోచుకెళ్లారు. బసినేపల్లి గ్రామంలోని గుత్తి ఎంపీపీ వీరభద్రయ్య ఇంట్లోనూ 2 తులాల బంగారం, 20 తులాల వెండి , పూజ సామగ్రిని అపహరించుకుపోయారు. ఇక ఆర్ఎస్‌లోని మెయిన్ రోడ్డు పక్కన ఉన్న లోకేష్ ఇంట్లో సుమారు 24 తులాల బంగారం, 2 లక్షల నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. వరుస చోరీలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

14:51 - May 20, 2018

చత్తీస్‌గడ్‌ : దంతెవాడలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చోల్నార్‌ గ్రామంలో పోలీసుల వాహనం వెళ్తున్న సమయంలో రోడ్డుపై పాతిపెట్టిన ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో ఐదు మంది జవాన్లు మృతి చెందారు. చత్తీస్‌గడ్‌ ఆర్మ్‌ఫోర్స్‌కు చెందిన ముగ్గురు జవాన్లు, డీస్ట్రీక్ట్‌ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎల్ఈడీ బాంబు పేలడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

14:50 - May 20, 2018

హైదరాబాద్ : విప్లవ నటుడు, ప్రముఖ నిర్మాతైన మాదాల రంగారావు అస్వస్థతకు గురయ్యారు. నిన్న సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్‌లోని స్టార్‌ ఆస్పత్రికి తరలించారు. కొంత కాలంగా ఆయన శ్వాసకోస సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు రంగారావు కుమారుడు మాదాల రవి తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందన్నారు. 

14:32 - May 20, 2018

చిత్తూరు : తిరుమలలో అర్చకుల రిటైర్మెంట్‌పై రమణదీక్షితుల వ్యాఖ్యలను టీటీడీ ఈవో అనిల్‌ కుమార్ సింఘాల్‌ ఖండించారు. 65 ఏళ్ల రిటైర్మెంట్‌ అనేది 2012లోనే అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. సర్వీస్‌ ప్రకారం టీటీడీలో సేవలందించిన సీనియర్‌ను ప్రధాన అర్చకులుగా నియమించామన్నారు. ఆలయంలో శ్రీవారి పూజలు శాస్త్రోక్తంగానే జరుగుతున్నాయని తెలిపారు. శ్రీవారి నగలన్నీ భద్రంగానే ఉన్నాయని ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనిల్‌ కుమార్ సింఘాల్‌ చెప్పారు. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు అవాస్తవాలు అంటూ మీడియాను (కెమెరాలు లేకుండా) పోటులో ఏమి జరుగుతోంది ? తదితర విషయాలను వివరించే ప్రయత్నం చేశారు.

గత కొన్ని రోజులుగా రమణ దీక్షితులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం కూడా హైదరాబాద్ లో తీవ్ర విమర్శలు గుప్పించారు. టిటిడిలో అధికారుల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. శ్రీవారికి ఉన్న నగల్లో ఒక హారంలో పింక్ డైమండ్ ఉంటుందని, 2001లో బ్రహ్మోత్సవాల్లో పింక్ డైమండ్ విరిగిపోయిందని...కానీ ఓ దేశంలో నిర్వహించిన వేలంలో పింక్ డైమండ్ వేలానికి వచ్చిందని..ఈ డైమండ్..ఈ డైమండ్ ఒక్కటేనని ఆరోపించారు. పోటులో కూడా మరమ్మత్తులు చేశారని, నిధుల పేరిట తవ్వకాలు జరిపారని తీవ్ర ఆరోపణలు చేశారు.

13:41 - May 20, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నర్సాపురం 5వార్డు భూపతివారి వీధిలో బొడ్డు సుధ అనే మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులకు తాళలేకే ఆత్మహత్మకు పాల్పడినట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే సుధ తల్లిదండ్రులు, బంధువులు మాత్రం భర్త బొడ్డు రామకృష్ణనే హత్య చేసి ఉంటాడని ఆరోపింస్తున్నారు. 2012లో సుధకు రామకృష్ణతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యపై అనుమానంతో రామకృష్ణ తరుచూ వేధించేవాడని బంధువులు అంటున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

13:40 - May 20, 2018

విజయవాడ : ఏపీలో జలరవాణా పనులు ముందుకు సాగడం లేదు. సాగరమాల ప్రాజెక్టు కింద కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు అంతర్గత జలరవాణా మార్గం ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాజెక్టు పురోగతి ప్రశ్నార్థకంగా మారింది.

నత్తనడకను తలపిస్తున్న జలరవాణా ప్రాజెక్టు..
జలరవాణా అందుబాటులోకి వస్తే.. రవాణా సౌకర్యాలు మెరుగవడంతోపాటు.. రవాణా వ్యయం కూడా తగ్గుతుందంటూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రచారం చేశాయి. కానీ జలరవాణా ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగడంలేదు. ఏపీలో జలరవాణా పనుల వేగవంతానికి నాలుగేళ్ల క్రితం విజయవాడలో ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కృష్ణానదిలో జలరవాణా కోసం తొలిదశలో నూటా యాభై కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది.. ఈ నిధులతో నావిగేషన్ ఛానెల్, కార్గో, ప్యాసింజర్ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. కాగా.. ఈ పనుల్లో పురోగతి మాత్రం నత్తనడకను తలపిస్తోంది..

కేంద్ర నిధులతో 82 కి.మీ. ఛానల్స్ ఏర్పాటు చేయాలి..
కేంద్రం మంజూరు చేసిన నిధులతో కృష్ణానదిలో సుమారు ఎనభై రెండు కిలోమీటర్ల మేర జలరవాణాకు ఛానల్స్ ఏర్పాటు చేయాలి. హరిచంద్రపురం నుంచి ముక్త్యాల వరకు నావిగేషన్ ఛానెల్ ఏర్పాటు చేయాలి. ఈ పనుల్ని కోస్టల్ కన్సాలిడేటెడ్, స్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, ఇంటర్నేషనల్ మెరైన్ సర్వీసెస్ లిమిటెడ్‌కు అప్పగించారు. కానీ.. ఇప్పటి వరకూ చానెల్స్ నిర్మాణ పనులే పూర్తి కాలేదు. ఇవికాకుండా నలభై మూడు కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ముక్త్యాల, ఇబ్రహీంపట్నం, హరిశ్చంద్రపురంలో కార్గో టెర్మినల్స్ ను, విజయవాడలోని దుర్గాఘాట్, భవానీద్వీపం, వేదాద్రి, గుంటూరు జిల్లా అమరావతిలో పాసింజర్ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది.

కోటి రూపాయలతో రాష్ర్ట ప్రభుత్వం సర్వే..
రెండో దశలో కాకినాడ నుంచి విజయవాడ వరకూ కాకినాడ, ఏలూరు కాల్వల జలరవాణా పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు వెచ్చించి సర్వే కూడా చేయించింది. పదిహేడు వందలా ముప్పై తొమ్మిది ఎకరాల భూమిని సేకరించి... రెండు వేల మూడు వందల పందొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనాలు సిద్ధం చేశారు. ఈ నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కాగా ఇప్పటికే విడుదలైన నూటా యాభై కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసిన లెక్కలతోపాటు రెండో దశలో చేపట్టబోయే పనులపై సమగ్ర ప్రణాళికా నివేదికను ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. వీటిలో కేంద్ర ప్రభుత్వ వాటాతోపాటు... రాష్ట్ర ప్రభుత్వ వాటా వివరాలను సమగ్రంగా అందించాలని సూచించింది. జలరవాణా ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా భరించే స్థితిలో లేకపోవడంతో ఈ ప్రాజెక్టు పరిస్థితి అయోమయంగా మారిందన్న వాదన వినిపిస్తోంది.

13:35 - May 20, 2018

కర్ణాటక : కీలక పరిణామాల మధ్య ఎట్టకేలకూ జేడీఎస్, కాంగ్రెస్ కూటవి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. బుధవారం నాడు అంటే మే 23తేదీన కుమారస్వామి ప్రమాణస్వీకారానికి అతిరథ మహారధులతో రెండు లక్షల మంది ఇరు పార్టీల కార్యకర్తలతో అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ లోగానే ఇరు పార్టీల మధ్య పదవుల కొట్లాట ప్రారంభమయ్యింది. రెండున్నరేళ్ళపాటు సీఎం పదవి తమకు కావాలని కాంగ్రెస్ పెట్టిన మెలికకు కుమారస్వామి అంగీకరించటం లేదు. డిప్యూటీ సీఎం పదవికోసం కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర, డీకే శివకుమార్ పోటీ పడుతున్నారు. శివకుమార్ కు డిప్యూటీ పదవి ఇచ్చేందుకు కుమారస్వామి ససేమిరా అంటున్నారు. అలాగే కాంగ్రెస్ కు హోంమంత్రి పదవికి కూడా కుమారస్వామి ఒప్పుకోవటంలేదు. కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య పదవుల కొట్లాట మరింతగా ఉత్కంఠ రేపుతోంది. దీంతో కథ మళ్లీ మొదలుకి వచ్చి ఉత్కంఠ మళ్లీ ప్రారంభమైనట్లుగా వాతావరణం హాట్ హాట్ గా మారింది.

మెలిక పెట్టిన కాంగ్రెస్..ఒప్పుకోని జేడీఎస్..
కన్నడనాట ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండానే కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పదవుల పంపకంలో తగాదాలు వచ్చాయి. ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న విషయమై ఇరు పార్టీ నేతల మధ్యా చర్చలు ఈ ఉదయం ప్రారంభం కాగా, రెండున్నరేళ్ల పాటు తమకు సీఎం పదవి ఇవ్వాలని కాంగ్రెస్ మెలిక పెట్టింది. దాంతోపాటు కీలకమైన హోమ్, రెవెన్యూ తదితర శాఖలను కాంగ్రెస్ డిమాండ్ చేయగా, దానికి కుమారస్వామి ససేమిరా అన్నట్టు తెలుస్తోంది.

డిప్యూటీ సీఎం కోసం పరమేశ్వర్..శివకుమార్ పోటీ..
ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన శివకుమార్ తో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ డిప్యూటీ సీఎం పదవి కోసం పోటీపడుతుండగా, శివకుమార్ కు ఆ పదవి ఇవ్వబోనని కుమారస్వామి పేర్కొన్నట్టు సమాచారం. ఈ పదవుల కేటాయింపు ఇరు పార్టీలకూ తలనొప్పిగా మారగా, ఢిల్లీ వెళ్లి, రాహుల్, సోనియా సమక్షంలోనే తేల్చుకోవాలని కుమారస్వామి నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు ఆయన ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారని జేడీఎస్ పేర్కొంది.ఈనేపథ్యంలో కన్నడ నాట రాజకీయంలో మరోసారి ఉత్కంఠమారాయి. వీరి కూటమి కొనసాగుతుందా? లేదా వీరి ఇరువురి మధ్య తలెత్తిన విభేదాలను బీజేపీ తనకుఅనుకూలంగా మార్చుకుంటుందా? అనే పలు ప్రశ్నలకు తావిస్తున్నాయి. వీటికిసమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

పేలిన మందుపాతర 5గురు జవాన్లు మృతి..
ఛత్తీస్ ఘడ్
: దంతెబాడలో మరోసారి మావోయిస్టులు అరాచకం సృష్టించారు. మావోయిస్టు ఓ మందుపాతరను పేల్చివేశారు. ఈ ఘటనలో ఆర్మ్‌డ్ ఫోర్స్‌కు చెందిన ఐదుగురు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఐఈడీ బాంబు పేలడంతో.. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

13:33 - May 20, 2018

విజయవాడ : కనకదుర్గమ్మ భక్తులపై అధికారులు భారాలు మోపుతూనే ఉన్నారు. భక్తులకు సౌకర్యాలు, వసతులు కల్పించే విషయంలో లేని శ్రద్ద... దుర్గమ్మ పూజా, ఇతర కైంకర్యాల విషయాల్లో మాత్రం ధరలను భారీగా పెంచారు. సామాన్య భక్తునికి అమ్మవారి సేవను దూరం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

దర్శనం, ఇతర కైంకర్య సేవల టిక్కెట్ల ధరల పెంపు
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి తరలివస్తుంటారు. అయితే వచ్చిన భక్తులకు అమ్మవారి సేవలను దూరం చేస్తోంది పాలకవర్గం. కాసులుంటేనే అమ్మదర్శనం అన్న రీతిన టిక్కెట్టు ధరలను పెంచేస్తున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తుల సంఖ్య తగ్గిపోయింది. ఓ వైపు దుర్గగుడి వద్ద ప్లై ఓవర్‌ పనులతో కొంతమేర భక్తుల రాకపోకల సంఖ్య తగ్గగా.. ఇంకోవైపు ధరల భారాన్ని తట్టుకోలేని భక్తులు అమ్మ సన్నిధికి రావాలంటేనే బెదిరిపోతున్నారు.

ఇంద్రకీలాద్రిలో పాలకమండలిని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
గతంలో ఇంద్రకీలాద్రిపై రాష్ట్ర ప్రభుత్వం పాలకమండలిని నియమించింది. అటునుంచి ఐఏఎస్‌ అధికారిణిలను ఈవోలుగా నియమిస్తూ వచ్చింది. అయితే భక్తులకు ధరల భారం లేకుండా చూడటం, ఆలయ వైభవాన్ని మరింత ఇనుమడింప చేయటం, భక్తుల సంఖ్యను పెంచడం వంటి వాటిపై దృష్టిసారించకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడంతో... దుర్గ గుడికి భక్తులను దూరం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా శాంతి కళ్యాణ టికెట్‌ ధరను పెంచారు పాలక మండలి సభ్యులు. 2018 మే 16న మాడపాటి గెస్ట్‌ హౌస్‌లో ఆలయ చైర్మన్‌ యలమంచిలి గౌరంగబాబు, ఈవో పద్మల సమక్షంలో పాలకమండలి సమావేశాన్ని నిర్వహించి శాంతి కళ్యాణం టికెట్‌ ధరను రూ. 500 నుంచి రూ. 1000 కి పెంచామని వెల్లడించారు. గతంలో శాంతి కళ్యాణం చేయించుకున్న భక్తులకు రూ. 100 టికెట్‌ లైన్‌లో దుర్గమ్మ దర్శనానికి అనుమతించారు. ఇప్పుడు అంతరాలయం దర్శనానికి రూ. 300 టికెట్‌తో అనుమతిస్తున్నామని చెబుతున్నారు. ఈవో ఈ నిర్ణయం తీసుకోవడంతో భక్తులకు ఇబ్బందికరంగా మారింది.

భక్తులకు భారంగా మారిన అమ్మవారి దర్శనం
అధికారుల అనాలోచిత నిర్ణయాలు దుర్గమ్మ ఆలయానికి భక్తుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఆలయంపై వచ్చే ఆదాయంపైన ఎక్కువగా దృష్టి సారించిన అధికారులు.. భక్తుల సంఖ్య పెంచడం పై ఎందుకు దృష్టి నిలపడం లేదని ప్రశ్నిస్తున్నారు.

గొల్లపూడిలో జీ+4 కాటేజీలను రూ. 13.70 కోట్లు
మరోవైపు గొల్లపూడిలో దేవస్థానంకు చెందిన స్థలంలో జీ+4 కాటేజీలను 13.70 కోట్ల రూపాయలతో నిర్మించాలని నిర్ణయించారు. ఈ నిధులను కూడా దాతల నుంచి సేకరించాలని చూస్తున్నారు. పది లక్షల రూపాయలు చెల్లించిన దాత పేరున ఒక గదికి, పదిహేను లక్షలు ఇచ్చిన దాత పేరున ఒక సూట్‌కు కేటాయించాలని నిర్ణయాలు తీసుకున్నారు. దాతలకు ఏడాదికి 30 రోజుల పాటు రూమ్‌ లేదా కాటేజ్‌ను ఉచితంగా వాడుకోవచ్చని, మిగిలిన రోజుల్లో భక్తులకు అద్దెలకు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఆలయంలో పాశుపతాస్త్రాలయం పునఃనిర్మించేందుకు ఓ కన్సల్టెంట్‌ను నియమించేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. అంతేకాకుండా దుర్గమ్మకు భక్తులు కానుకల రూపంలో సమర్పించే బంగారు అభరణాలను భద్రపరిచి తిరిగి అమ్మవారికి, ఉపాలయాల్లోని దేవతామూర్తులకు వెండి, బంగారు ఆభరణాలు తయారు చేయించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వెండిని విక్రయించగా వచ్చిన నగదును బంగారం బాండ్లుగా మార్చనున్నామని ఆలయ అధికారులు చెబుతున్నారు.

ధరలను పెంచటంతో మండిపడుతున్న భక్తులు..
ఇవన్నీ ఇలా ఉంటే ఆలయ అభివృద్ధి.. భక్తులపై ధరల భారాన్ని తగ్గించేందుకు ఎటువంటి నిర్ణయాలను తీసుకుంటున్నారో మాత్రం పాలకమండలి వెల్లడించలేదు. భక్తుల నుంచి ధరల రూపంలో వచ్చే ఆదాయంపైన, దుర్గమ్మకు భక్తులు సమర్పించే కానుకలు, నగదును గురించి దృష్టిసారించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శాంతి కళ్యాణం టికెట్‌ ధరను 500 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచడాన్ని భక్తులు వ్యతిరేకిస్తున్నారు. ధరలను తగ్గించి సౌకర్యంగా మార్చాలని భక్తులు కోరుతున్నారు. భక్తులు రాకుండా చేసి ఆలయ ప్రతిష్టతను దిగజార్చొద్దని కోరుతున్నారు

పేలిన మందుపాతర 5గురు జవాన్లు మృతి..

ఛత్తీస్ ఘడ్ : దంతెబాడలో మరోసారి మావోయిస్టులు అరాచకం సృష్టించారు. మావోయిస్టు ఓ మందుపాతరను పేల్చివేశారు. ఈ ఘటనలో ఆర్మ్‌డ్ ఫోర్స్‌కు చెందిన ఐదుగురు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఐఈడీ బాంబు పేలడంతో.. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

నటుడు,దర్శకుడు మాదాల రంగారావుకి అస్వస్థత..

హైదరాబాద్: ఎర్ర సినిమాల దర్శకుడిగా నటుడిగా పేరొందిని మాదాల రంగారావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. శనివారం గుండెపోటుకు గురవ్వడంతో రంగారావుని హాస్పిటల్‌లో చేర్పించినట్టు తెలిపారు కుటుంబ సభ్యులు. ఆయన కుమారుడు డా మాదాల రవి మాట్లాడుతూ... తన తండ్రికి గతేడాది గుండె ఆపరేషన్ జరిగిందని.. అప్పటి నుంచి డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. అయితే శనివారం మరోసారి గుండెపోటు రావడంతో హాస్పిటల్‌లో జాయిన్ చేశామని తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పినట్టు తెలిపారు.

అర్చకుల రిటైర్డ్ వివాదం 2012లోనే : టీటీడీ ఈవో

తిరుమల : అర్చకుల 65ఏళ్ల రిటైర్మెంట్ వివాదంపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు, పూజలు.. శాస్త్రోక్తంగా జరుగుతున్నాయని వివరించారు. శ్రీవారి నగలన్నీ భద్రంగా ఉన్నాయని ఆయన అన్నారు. 2012లోనే అర్చకులకు 65 ఏళ్ల వయోపరిమితి అమలులోకి వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలోనే ముగ్గురు అర్చకులు రిటైర్ అయ్యారని సింఘాల్ తెలిపారు. రిటైర్‌ అయిన అర్చకులు కోర్టుకెళ్లారని, వారి విజ్ఞాపనను కోర్టు తిరస్కరించి౦దని, జీతభత్యాలు లేకుండా అర్చకులుగా కొనసాగవచ్చని కోర్టు ఆదేశించిందన్నారు.

మా ప్రభుత్వం వస్తే వలసలు ఆపుతాం : పవన్

శ్రీకాకుళం : ప్రజల ఆశీస్సులు వుంటే 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేనదే అధికారమని జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు వుంటే సీఎం నవుతానన్నారు. ఒకసారి వచ్చి వెళ్లిపోవటానికి తాను యాత్ర ప్రారంభించలేదన్నారు. జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే శ్రీకాకుళంలో వలసలు ఆపే బాధ్యతను తీసుకుంటాననీ హామీ ఇచ్చారు. పర్యటన సందర్భంగా పలువురు అభిమానులు పవన్ తో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు.

12:30 - May 20, 2018

శ్రీకాకుళం : జనసేన అధినేత జిల్లాలో పర్యటన ప్రారంభమయ్యింది.ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆశీస్సులు వుంటే 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేనదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు వుంటే సీఎం నవుతానన్నారు. ఒకసారి వచ్చి వెళ్లిపోవటానికి తాను యాత్ర ప్రారంభించలేదన్నారు. జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే శ్రీకాకుళంలో వలసలు ఆపే బాధ్యతను తీసుకుంటాననీ హామీ ఇచ్చారు. పర్యటన సందర్భంగా పలువురు అభిమానులు పవన్ తో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో సెల్ఫీలు ఇస్తే సీఎంను అవ్వననీ..కష్టపడి పనరిచేస్తేనే అది సాధ్యమవుతుందన్నారు.మిగిలిన పార్టీలకు జనసేనకు చాలా వ్యత్యాసం వుందనీ..కులాలు అన్ని సమిష్టిగా పనిచేసేలా చేఆలన్నదే జనసేన నినాదని పవన్ తెలిపారు. కాగా పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. ఈరోజు యాత్రలో భాగంగా మ.3గంటలకు బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు.

పోలీస్ అధికారులతో కుమారస్వామీ భేటీ..

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న కుమారస్వామి పోలీస్ ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు. అయితే కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బుధవారం వరకు క్యాంపుల్లోనే కొనసాగనున్నారు. వారిని కేరళకు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే కేబినెట్ కూర్పుపై ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కుమారస్వామి తన ప్రమాణస్వీకారానికి సోనియా, రాహుల్‌ను ఆహ్వానించేందుకు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. అలాగే ప్రముఖ ఆలయాలను ఈ మూడు రోజుల్లో దర్శించుకోనున్నట్లు కుమారస్వామి వెల్లడించారు.

మీ అభిమానం వుంటే సీఎంనవుతా : పవన్

శ్రీకాకుళం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతు..ప్రజ సమస్యలు తెలుసుకునేందుకే యాత్రను ప్రారంభించానన్నారు. ప్రజల అభిమానం వుంటే వచ్చేఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని పవన్ పేర్కొన్నారు. జిల్లాలో వున్న కిడ్నీ సమస్యలపై కదలిక వచ్చినా హార్డ్వర్డ్ వర్శిటీని ప్రభుత్వం ఎందుకు ఉపయోగించుకోలేకపోతోందని తెలపాని డిమాండ్ చేశారు. కాగా ఈ బస్సు యాత్రలో ప్రధానంగా స్థానిక ప్రజా సమస్యలు తెలుసుకోవడం, వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని పవన్ నిర్ణయించారు.

11:52 - May 20, 2018

శ్రీకాకుళం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభమయ్యింది. మరికాసేపట్లో అభిమానులు, కార్యకర్తలతో కలిసి పవన్ కవాతు చేయనున్నారు. కవిటి మండలం కపాసుకుద్ది తీరపాత్రం వద్ద ఇచ్ఛాపురంలో సముద్రస్నానం ఆచరించి గంగమ్మకు పూజలు నిర్వహించి పనవ్ యాత్రను ప్రారంభించారు. ఈసందర్భంగా పవన్ మాట్లాడుతు..తాను హామీలు ఇచ్చేందుకు రాలేదనీ.. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకే యాత్ర చేపట్టానని పవన్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో వున్న కిడ్నీ సమస్యలపై కదలికి మొదలైనప్పటికీ హార్బర్డ్స్ వర్శిటీ సహాయాన్ని ప్రభుత్వం ఎందుకు ఉపయోగించుకోవటంలేదో వివరణ ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. ప్రజల ఆశీస్సులు వుంటేనే ప్రజల సమస్యలపై జనసేన కృషి చేస్తుందన్నారు. వారి ఆశీస్సులు వుంటే వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందన్నారు. 

11:15 - May 20, 2018

చిత్తూరు : ఏఆర్ కానిస్టేబుల్ రాజశేఖర్ మృతిపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. నిజాయితీపరుడిగా, మంచివాడుగా పేరున్న రాజశేఖర్ మృతి పట్ల తోటి ఉద్యోగులంతా విచారం వ్యక్తంచేస్తున్నారు. ఎస్పీ క్యాంప్ లో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ తుపాకీతో కాల్చుకుని రాజశేఖర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఎస్పీ ఎస్పీ రాజశేఖర్ బాబు స్పందించారు. చాతీలో బుల్లెట్ దిగటం వల్లనే రాజశేఖర్ మృతి చెందాడని ఈ మృతిపై విచారణ జరుపుతున్నామనీ తెలిపారు. మృతిరోజు ముందురోజే సెలవు కోసం దరఖాస్తు పెట్టుకున్న రాజశేఖర్ ఇంతలోనే మృతి చెందటం పట్ల పలు అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఎస్పీ విచారణ చేపట్టారు. కాగా పోస్ట్ మార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని ఎస్పీ రాజశేఖర్ తెలిపారు. 

10:26 - May 20, 2018

చిత్తూరు : నిద్రమత్తులో వాహనం నడిపితే జరిగే ప్రమాదాలు, అనర్ధాలు మరోసారి నిదర్శనం రేణిగుంట మండలం మామండూరు వద్ద కనిపించింది. తిరుమల శ్రీవారిని దర్శించుకుందామని బయలుదేరిన తిరుమల భక్తుల జీవితాలు తెల్లవారిపోయాయి. మద్యం మత్తు, నిద్రమత్తు ఎందరి జీవితాలలోను, కుటుంబాలలోను విషాదాలను నింపుతోంది. ఈ నేపథ్యంలో నిద్రమత్తులో బొలెరో ఓ మినీలారీ ఢీకొంది. ఈ ఘటన ఐదురు ప్రాణాలను బలయ్యాయి. రేణిగుంట మండలం మామండూరులో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులతో పాటు ఓ చిన్నారి కూడా ప్రాణాలను కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా వుంది. గాయపడినివారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. సమాచారం మేరకు సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దార్యాప్తు చేపట్టారు. కాగా మృతులు కర్నూలు జిల్లా నంద్యాల వాసులుగా పోలీసులు గుర్తించారు. 

10:01 - May 20, 2018

కరీంనగర్ : జిల్లాలో పోలీసులు ఒకే రోజు ఐదుగురు దొంగలను పట్టుకున్నారు. ఇందులో ఇద్దరు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవారు కాగా.. మరో ముగ్గురు బైక్‌ దొంగతనాలకు పాల్పడేవారు ఉన్నారు. అంతర్‌ జిల్లా దొంగలు సంచరిస్తున్నారన్న సమాచారంతో విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఒకే రోజు ఐదుగురు దొంగలు పట్టుబడటంతో కరీంనగర్‌జిల్లా ఉలిక్కిపడింది.కరీంనగర్ జిల్లాలో వేరు వేరు దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లాలో దొంగతనాలు పెరిగాయి అనే అనుమానంతో విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఇళ్లలో అలాగే బైక్‌ దొంగతనాలు చేసే వారు చిక్కారు. సులభంగా డబ్బులు సంపాదించడం ఎలా అని అనుకున్న ఇద్దరు స్నేహితులు దొంగలుగా మారారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌కి చెందిన మల్యాల దేవేందర్‌ అలాగే మహబూబ్‌నగర్‌ జిల్లా కోజ్గీ గ్రామానికి చెందిన నీలి రమేష్‌లు హైదరాబాద్‌లో స్నేహితులయ్యారు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా వీరు దొంగతనాలకు పాల్పడేవారు. వీరిద్దరు కలిసి 2016 జూన్‌ నుంచి 2017 నవంబర్‌ వరకు 22 దొంగతనాలు చేశారు. దేవేందర్‌ను, రమేష్‌లను విచారించిన పోలీసులు.. వారి నుంచి 21 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం దేవేందర్‌, రమేష్‌లను రిమాండ్‌కు తరలించినట్లు కరీంనగర్‌ కమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు.

ఒకవైపు ఇళ్లల్లో మరోవైపు బైక్ ల దొంగతనాలు..
ఓవైపు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకున్న పోలీసులు మరోవైపు బైక్‌ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గుర అంతర్ జిల్లా దొంగల ముఠాను కూడా అరెస్ట్‌ చేశారు. మొత్తం ఐదుగురు ఉన్న ముఠాలో ముగ్గురు అన్నదమ్ములను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి స్నేహితులైన రాజు, అరవింద్‌లు పరారీలో ఉన్నారు. శనివారం హుజురాబాద్‌ పట్టణం.. సైదాపూర్‌ ఎక్స్‌రోడ్‌లో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ముగ్గుర అన్నదమ్ములు ఒక బైక్‌పై వస్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో వీరిని వెంటాడిన పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు అన్నదమ్ములను విచారించిన పోలీసులు.. వీరి నుంచి 7 మోటర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు విస్తృతంగా తనిఖీలు..
కరీంనగర్‌ జిల్లాలో దొంగతనాలు ఎక్కువయ్యాయి అనే అనుమానంతో ఇటీవలీ కాలంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఒకే రోజు 5 గురు దొంగలను పోలీసులను పట్టుకోవడంతో జిల్లా ఉలిక్కిపడింది. దీంతో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దొంగల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని.. ఎవరైన అనుమానంగా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.

09:53 - May 20, 2018

కర్ణాటక : కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. ఈనెల 23న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కుమారస్వామి తన మంత్రివర్గంపై కసరత్తు ప్రారంభించారు. 30 మందితో కేబినెట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇందులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు 20వరకు మంత్రిపదవులు దక్కే అవకాశముంది. కన్నడ కాంగ్రెస్‌ నేతలు కూడా అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నారు. ఇవాళ ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో వారు సమావేశంకానున్నారు.

కుమారస్వామీ ప్రమాణస్వీకారానికి అతిరథ మహారధులు..
బుధవారం నాడు బెంగళూరు నడిబొడ్డులన వున్న కంఠీరవ స్టేడియంలో దాదాపు 2 లక్షలమంది ప్రజల మధ్య జరిగే కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సం జరుగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నేతలతో పాటు కార్యకర్తలు,అభిమానులు పెద్ద సంఖ్యలో రానున్నారు. బుధరవారం మ.12.30లకు కుమారస్వామి ప్రమాణస్వీకారం జరుగనుంది. దీనికోసం దేశవ్యాప్తంగా వున్న పలువురు ముఖ్యమంత్రులను కుమారస్వామి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ లకు కుమారస్వామి స్వయంగా ఫోన్ చేసిన ఆహ్వానించారు. తాము బయలుదేరి వస్తున్నట్టు కేసీఆర్, చంద్రబాబులు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలనందరినీ కుమారస్వామి బెంగళూరుకు ఆహ్వానించారు. వీరిలో కేరళ సీఎం పినరయి విజయన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తదితరులనూ కుమారస్వామి స్వయంగా ఆహ్వానించారు. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమం వీవీఐపీలు, వీఐపీలతో నిండిపోనుందని తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి ఇంకా మూడు రోజుల సమయం ఉండటంతో ఈలోగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవాలని కుమారస్వామి నిర్ణయించుకున్నారు. నేడు ఢిల్లీకి బయలుదేరే ఆయన, సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలసి మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

 

09:41 - May 20, 2018

శ్రీకాకుళం : ఇవ్వాళ్టి నుండి జనసేన అధినేత ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. 45 రోజుల పాటు జరగనున్న ఈ యాత్రను శ్రీకాకుళం జిల్లా నుండి ప్రారంభించనున్నారు. ఇచ్చాపురంలో గంగమ్మకు పూజలు నిర్వహించిన అనంతరం యాత్ర ప్రారంభిస్తారు. అనంతరం అభిమానులు, కార్యకర్తలతో కలిసి పవన్‌ కవాతు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. కాపసుద్ధిలో మత్స్యకారులతో కలసి పవన్‌ గంగమ్మ పూజలో పాల్గొన్న తర్వాత తిరిగి ఇచ్చాపురం చేరుకుంటారు. ఇచ్ఛాపురంలోని స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాజావారి మైదానం వరకు అభిమానులు, కార్యకర్తలతో కలసి కవాతులో పాల్గొంటారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు బస్సుయాత్రను ప్రారంభించి ఇచ్చాపురం మండలం లోని లొద్దపుట్టి, ఇన్నేసుపేట, ధర్మపురం, కొఠారి, ఈదుపురం మీదుగా కవిటి, కంచిలి, సోంపేట మండలాల మీదుగా తొలిరోజు బస్సు యాత్రను పూర్తి చేస్తారు.  

కానిస్టేబుల్ ఆత్మహత్య..

చిత్తూరు : ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్పీ క్యాంప్ లో కార్యాలయంలో తుపాకీతో కాల్చుకుని రాజశేఖర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. 

బొలెరో,డీసీఎం ఢీ.ఐదుగురు మృతి..

చిత్తూరు : రేణిగుంట మండలం మామండూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనాన్ని డీసీఎం ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతులంతా కర్నూలు జిల్లా గడిమేముల వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు వున్నారు.  

09:05 - May 20, 2018

శ్రీకాకుళం : జనసేనాని జనంబాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడానికి రెడీ అయ్యారు. తొలుత శ్రీకాకుళం జిల్లా నుంచి యాత్రను ప్రారంభింస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా కవాతు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించిన పవన్‌కల్యాణ్‌ .. ఇవాళ ఇచ్ఛాపురంలో వేలాది మంది అభిమానులతో కలిసి కవాతు నిర్వహిస్తారు.

స్వేచ్చావతి అమ్మవారు ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇవాళ్టి నుంచి శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. శనివారం రాత్రి ఇచ్చాపురం లోనే బసచేసిన పవన్‌ .. ఇవాళ ఉదయం కవిటి మండలం కాపసుకుద్ది మత్స్యకార గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలోని గంగమ్మ పూజ చేసి తర్వాత ఇచ్చాపురం స్వేచ్చావతి అమ్మవారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. పూజల అనంతరం తన పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు జనసేనాని .

పవన్ యాత్ర షెడ్యూల్..
కాపసుద్ధిలో మత్స్యకారులతో కలసి పవన్‌ గంగమ్మ పూజలో పాల్గొన్న తర్వాత తిరిగి ఇచ్చాపురం చేరుకుంటారు. ఇచ్ఛాపురంలోని స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాజావారి మైదానం వరకు అభిమానులు, కార్యకర్తలతో కలసి కవాతులో పాల్గొంటారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు బస్సుయాత్రను ప్రారంభించి ఇచ్చాపురం మండలం లోని లొద్దపుట్టి, ఇన్నేసుపేట, ధర్మపురం, కొఠారి, ఈదుపురం మీదుగా కవిటి, కంచిలి, సోంపేట మండలాల మీదుగా తొలిరోజు బస్సు యాత్రను పూర్తి చేస్తారు.

పవన్‌ పర్యటన సందర్భంగా విస్తృత ఏర్పాట్లు
పవన్‌ పర్యటన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా జనసేనపార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్‌తో కలిసి ప్రత్యేక హోదా కవాతులో పాల్గొనడానికి కార్యకర్తలు, అభిమానలు ఇచ్చాపురానికి భారీగా చేరుకుంటున్నారు. 

ప్రమాదంలో ప్రముఖ నటి మృతి..

ఉత్తరప్రదేశ్‌ : బలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భోజ్‌పురి నటి మనీషా రాయ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఓ షూటింగ్‌లో పాల్గొనేందుకు మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఆమెను వెనక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే డ్రైవర్‌ను పట్టుకుంటామని ఎస్పీ ఎస్‌పీ గంగూలీ తెలిపారు. మనీషాతోపాటు ప్రయాణిస్తున్న సంజీవ్ మిశ్రా తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.

30మంది మంత్రులతో కుమారస్వామీ ప్రమాణస్వీకారం..

కర్ణాటక : సినిమాను తలపించేవిధంగా రాజకీయాలను నడిపిన కుమారస్వామి ఎట్టకేలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 30 మంది మంత్రులతో కలసి కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా సమాచారం. అనంతరం మంత్రివర్గాన్ని విస్తరించాలన్న యోచనలో ఉన్నట్టు జేడీఎస్ వర్గాలు వెల్లడించాయి. తమకు మద్దతుగా నిలిచిన ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలని కుమారస్వామి భావిస్తున్నారని తెలిపాయి.

మంత్రి వర్గ కేటాయింపులో కుమారస్వామి బిజీ..

కర్ణాటక : సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన తరువాత, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధంగా ఉన్న జేడీఎస్ నేత కుమారస్వామి, ప్రస్తుతం మంత్రివర్గ కూర్పులో బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు 20 మంత్రి పదవులను ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత జీ పరమేశ్వర్ కు ఉప ముఖ్యమంత్రి పదవిని కుమారస్వామి ఆఫర్ చేయనున్నట్టు సమాచారం.

డ్రంక్ అండ్ డ్రైవ్..70వాహనాలు సీజ్..

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఐదు చోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా.. మద్యం సేవించి వాహనాలు నడిపిన 70 మందిపై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో 70 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

08:25 - May 20, 2018

హైదరాబాద్: నగరంలో నేరాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్ లు వంటి పలు నేరాలకు అడ్డాగా హైదరాబాద్ నగరం మారిపోతోంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్‌లో బీజేఆర్ నగర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నేరాలను నమ్ముకుని జీవించేవారు నేరాల నేపథ్యంలోనే అంతమవుతారనే సామెత నేడు హైదరాబాద్ లో మారోసారి నిరూపిమయ్యింది.శివకుమార్ అనే వ్యక్తిని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. డ్యూటీలో వున్న స్నేహితుడు కోసం ఎదురు చూస్తు రోడ్డుమీద నిల్చున్న శివకుమార్ ను అతని శతృవులు మాటు వేసిన దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడు కర్నూలు జిల్లా నందికొట్కూరు వాసిగా పోలీసులు గుర్తించారు. కర్నూలు జిల్లా వాసి అయిన శివకుమార్ తన స్నేహితుడు రమేశ్ ను కలిసేందుకు నగరంలోని ఖైరతాబాద్ చేరుకున్న నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న అతని పాతకక్షదారులు మాటు వేసి దారుణంగా హత్య చేసినట్లుగా తెలుస్తోంది. మెడ, కడుపు వంటి భాగాలలో దారుణంగా కత్తులతో పొడవటంతో శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా శివకుమార్ 2014లోజరిగిన ఓ హత్య కేసులోను, యువతుల అక్రమ రవాణా కేసుల్లోను నిందితుడని డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే శతృవులు హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

నేడు జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష..

ఢిల్లీ : నేడు జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షను తొలిసారిగా ఆన్ లైన్ లో నిర్వహించనున్నారు. జేఈఈ అడ్డాన్స్ డ్ పరీక్షకు 1.64.822 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9 గంటల నుండి మ.12గంటల వరకూ పేపర్ 1, మ.2 నుండి సా.5 వరకూ పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఏపీలో విశాఖ,కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు,తిరుపతి,కర్నూలు, అనంతపురంలలో పరీక్ష కేంద్రాలలో ఈ పరీక్ష జరగనుంది. ఇక తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్,ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్,వరంగల్ నగరాలలో పరీక్ష జరగనుంది.  

ప్రారంభమైన వైటథాన్..

హైదరాబాద్: నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో వైటథాన్ పరుగు కార్యక్రమం ప్రారంభమైంది. వైటథాన్ పరుగును పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు. రెటీనా బ్లాసోమాపై అవగాహన కోసం 10కే, 5కే, 3కే విభాగాల్లో ఈ పరుగును నిర్వహిస్తున్నారు. ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో పరుగు కార్యక్రమం కొనసాగుతోంది.

బోరబండ వాసి దారుణ హత్య!..

హైదరాబాద్: నగరంలో నేరాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్ లు వంటి పలు నేరాలకు అడ్డాగా హైదరాబాద్ నగరం మారిపోతోంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్‌లో ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. బీజేఆర్ నగర్ లో శివకుమార్ అనే వ్యక్తిని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శివకుమార్ బోరబండ వాసిగా పోలీసులు గుర్తించారు. హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

07:43 - May 20, 2018

కర్నాటక పీఠాన్ని దక్కించుకోవడం ద్వారా.. దక్షిణాదిలోనూ జైత్రయాత్ర కొనసాగించాలని భావించిన బీజేపీకి.. గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దొడ్డిదారిలో కన్నడనాట అధికారాన్ని దక్కించుకోవాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. రాజ్‌భవన్‌ను ఉపయోగించుకొని.. ప్రొటెం స్పీకర్‌ ద్వారా.. మూజువాణీ ఓటుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. బలపరీక్షకు నిలవకుండానే యడ్యూరప్ప రాజీనామా చేయక తప్పలేదు. బీజేపీ తమ ఎమ్మెల్యేలకు కొనుగోలు చేసేందుకు శతవిధాల యత్నించినా వారి చేతికి చిక్కకుండా కాంగ్రెస్,జేడీఎస్ కూటమి పార్టీలు ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించిన పలు నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు జేడీఎస్,కాంగ్రెస్ కూటములు కలిసి ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ తనను ఆహ్వానించారనీ జేడీఎస్ అధినేత కుమారస్వామి తెలిపారు. ఈ అంశంపై మీడియా ముఖంగా కుమారస్వామి తెలిపారు. ఈ క్రమంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కుమార స్వామి ప్రకటించారు. పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులను కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనున్నట్లు కుమారస్వామి తెలిపారు. సినిమాటిగ్ గాసాగి కన్నడ రాజకీయాలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. కాగా రాజీవ్ గాంధీ వర్థంతి నేపథ్యంలో కుమారస్వామి ప్రమాణస్వీకారం సోమవారానికి బదులుగా బుధవారానికి వాయిదా పడింది. కాగా రాజకీయాల్లోకి రాకముందు సినిమా నిర్మాతగా వున్న కుమారస్వామి నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

సీఎం పదవి యోగ్యత లేని యడ్యూరప్ప..

కర్ణాటక : సీఎం పీఠం అనేది యడ్యూరప్పకు ఏమాత్రం కలిసిరావటంలేదు. ఇలా సీఎం అయి అలా దిగిపోతున్నారు. ఇలా మూడుసార్లు కొనసాగింది. అధికార పీఠాన్ని ఎక్కి, అలా దిగిపోయిన వారి జాబితాలో యడ్యూరప్ప మూడోసారి చేరిపోయారు. మూడు రోజుల పాటు ఉత్కంఠంగా సాగిన కన్నడ రాజకీయాలు యడ్డీ రాజీనామాతో తాత్కాలికంగా ముగిశాయి. 17వ తేదీన కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప, నిన్న అసెంబ్లీ సమావేశం అనంతరం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పదవి మూన్నాళ్ల ముచ్చటగా మిగిలింది. ఈ నేపథ్యంలో అతి తక్కువ రోజులు సీఎంగా యడ్యూరప్ప మిగిలిపోయినవారిలో చేరిపోయారు.

07:13 - May 20, 2018

హైదరాబాద్ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేఆఫ్‌కు చేరింది. సన్‌రైజర్స్‌తో జరిగిన తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ విజయం సాధించి ప్లేఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకుంది. హైదరాబాద్‌, చెన్నైల తర్వాత ప్లేఆఫ్‌కు చేరిన మూడో జట్టుగా కోల్‌కతా నిలిచింది. హైదరాబాద్‌ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్‌ విజయంలో క్రిస్‌ లిన్‌, రాబిన్‌ ఉతప్పలు కీలక పాత్ర పోషించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, శ్రీవాత్స్‌ గోస్వామి శుభారంభాన్ని అందించిన.. చివరి నాలుగు ఓవర్లలో వరసగా వికెట్లు కోల్పోవటంతో సన్‌రైజర్స్ అనుకున్నంతా రన్స్‌ చేయలేకపోయింది.

07:09 - May 20, 2018

అమెరికా : లండన్ క్వీన్ ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ హ్యారీ-అమెరికా నటి మేఘన్ మెర్కెల్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. లండన్‌లోని విండ్‌సోర్ కేస్టల్‌లోని జార్జ్ చాపెల్‌లో వీరి వివాహం జరిగింది. వివాహానికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, డేవిడ్ బెక్‌హామ్, ఓఫ్రా విన్‌ఫ్రే హాజరయ్యారు. తెలుపు రంగు వెడ్డింగ్ డ్రెస్ ధరించిన మేఘన్ వింటేజ్ రోల్స్ రాయ్స్ కారులో ప్రిన్స్ హ్యారీని పెళ్లాడేందుకు వెళ్లారు. వెడ్డింగ్ డ్రెస్‌ను బ్రిటిష్ డిజైనర్ క్లారీ వెయిట్ కెల్లెర్, ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్‌కు చెందిన ఆర్టిస్టిక్ డైరెక్టర్ గివెంచీ కలిసి రూపొందించారు. ఆరు వందల మంది అతిథుల ఎదుట కొత్తజంట ఉంగరాలు మార్చుకున్నారు. 

07:05 - May 20, 2018

ఢిల్లీ : మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచేందుకు సిద్దమవుతోంది కేంద్రం. ఆయిల్‌ కంపెనీల నష్టాలను భర్తీ చేసేందుకు ప్రజలపై భారం మోపేందుకు రంగం సిద్దమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా పెరగడంతో ప్రజలకు పెట్రో వాత తప్పేటట్లు లేదు.

2017 జూన్‌ నుంచి రోజువారీ ధరల సవరణ..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలకు మళ్లీ రెక్కలు రానున్నాయి. చమురు సంస్థలు 2017 జూన్‌ నుంచి రోజువారీ ధరల సవరణను ప్రవేశపెట్టాయి. అయితే.. గత కొంతకాలంగా పెట్రోలు ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. చివరగా ఏప్రిల్‌ 24 నుంచి స్థిరంగా ధరలు కొనసాగుతున్నాయి. తాజాగా కర్ణాటక ఎన్నికలు ముగియడంతో కేంద్రం పెట్రోలు ధరలు పెంచేందుకు సమాయత్తమవుతున్నాయి.

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.74.80, డీజిల్‌ రూ.66.14..
ప్రస్తుతం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ 74.80 రూపాయలు ఉండగా, డీజిల్‌ 66.14 రూపాయలకు చేరుకుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ఏప్రిల్‌ 24న బ్యారెల్‌ 78.84 డాలర్లు ఉండగా... ఈనెల 14కు 82.98 డాలర్లకు చేరింది. దీంతో చమురు సంస్థలు తమకు భారీ నష్టం వాటిల్లుతున్నట్లు చెబుతున్నాయి. గతంలో కేంద్రం గుజరాత్‌ ఎన్నికల సమయంలో పెట్రోల్‌ ధరలు రూపాయి నుంచి మూడు రూపాయలు తగ్గించి.. ఎన్నికలు పూర్తయిన వెంటనే ధరలు పెంచాయి. తాజాగా కర్ణాటక ఎన్నికలు కూడా ముగియడంతో... కేంద్రం 4 నుంచి ఐదు రూపాయలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా పడిపోవడంతో పెట్రోల్‌ ధరలు ఖచ్చితంగా పెంచుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే ధరలు పెంచేందుకు సిద్దమైన చమురు సంస్థలు..
ఇక ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌లు డీజిల్‌ ధర మూడున్నర నుంచి ఐదు రూపాయల వరకు... పెట్రోల్‌ ధర 4 నుంచి 4.55 రూపాయల వరకు పెంచాలని నిర్ణయించాయి. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తక్కువగా ఉన్నప్పుడు దేశంలో పెట్రో ధరలు తగ్గించని ప్రభుత్వాలు... ఇప్పుడెలా పెంచుతాయని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.

పెట్రో ధరల పెంపుపై ప్రజల ఆవేదన..
ఇలా వారానికోసారి పెట్రో ధరలు పెంచితే ఎలా జీవించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై పునారాలోచన చేయాలని కోరుతున్నారు. లేకపోతే... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. చమురు ధరలు పెరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. తమపై మళ్లీ ఎంత భారం పడుతుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

06:55 - May 20, 2018

కర్ణాటక : యడ్యూరప్పకు ముఖ్యమంత్రి పదవీ యోగం లేదు కాబోలు...మూడోసారి కూడా సిఎం పదవి మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపికి గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చారు. సిఎంగా ప్రమాణం చేసిన యడ్డీ- బల నిరూపణకు ముందే సిఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన 55 గంటలు మాత్రమే సిఎంగా కొనసాగారు. నవంబర్‌ 12, 2007లో తొలిసారి కర్ణాటక సిఎంగా ఎన్నికైన యడ్యూరప్ప కేవలం 8 రోజులకే పదవిని కోల్పోయారు. బిజెపి-జెడిఎస్‌ సిఎం పదవిని సమానంగా పంచుకోవాలని ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందం ప్రకారం కుమారస్వామి 2006లో సిఎం అయ్యారు. 2007లో యడ్యూరప్పకు సిఎం అవకాశం ఇవ్వాల్సి ఉండగా జెడిఎస్ నిరాకరించింది. దీంతో సంకీర్ణానికి బిజెపి మద్దతు ఉపసంహరించుకోవడంతో రాష్ట్రపతి పాలన విధించారు. 2008లో రెండోసారి సిఎంగా యడ్యూరప్ప ఎంపికయ్యారు. 3 సంవత్సరాల రెండు నెలల పాటు పదవిలో కొనసాగారు. మైనింగ్ అక్రమాల కేసులో కర్ణాటక లోకాయుక్త యడ్యూరప్ప పేరును చేర్చడంతో పదవిని కోల్పోయారు. 

అందుకే కుమారస్వామి ప్రమాణస్వీకారం వాయిదా..

కర్ణాటక : సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయగానే కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది. వెంటనే జేడీఎస్ నేత కుమారస్వామి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్‌కు తెలిపారు. వెంటనే గవర్నర్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిని ఆహ్వానించారు. బుధవారం మధ్యాహ్నం 12.30కు కుమారస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని జేడీఎస్ తెలిపింది. సోమవారం అంటే మే 21న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి కాబట్టి ఆ రోజును మార్చినట్లు సమాచారం. 

ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు :కుమారస్వామి

కర్ణాటక : సోమవారం తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కుమార స్వామి ప్రకటించారు. పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులను కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనున్నట్లు కుమారస్వామి మీడియాతో తెలిపారు. కాని.. తాజాగా ప్రమాణ స్వీకారాన్ని సోమవారం కాకుండా బుధవారానికి అంటే మే 23 కు వాయిదా వేస్తున్నట్లు జేడీఎస్ ప్రకటించింది. 

పవన్ బస్ యాత్ర షురూ..

శ్రీకాకుళం : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆదివారం నుంచి బస్సుయాత్ర ప్రారంభిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన బస్సుయాత్ర సాగుతుంది. పవన్‌ ఆదివారం ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం జిల్లా కపాసకుద్ది సముద్రతీరంలో గంగమ్మపూజ చేస్తారు. 8 గంటలకు ఇచ్ఛాపురం స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుంటారు. 9 గంటలకు దేవాలయం నుంచి బహిరంగ సభాస్థలి వరకూ నిరసన కవాతు నిర్వహిస్తారు. 10 గంటలకు సురంగి రాజా వారి మైదానంలో బహిరంగ సభ మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు కవిటి మండలానికి చేరుకుంటారు.

Don't Miss