Activities calendar

21 May 2018

సోనియా..రాహుల్ తో కుమార భేటీ...

ఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలను జేడీఎస్ నేత కుమార స్వామి కలిశారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తున్నారు. ఈ నెల 23న ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కుమారస్వామి అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోనున్నారు. ల

కర్ణాటకలో మరోసారి ఎన్నికలు నిర్వహించాలి - షా...

కర్ణాటక : రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకున్న బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. స్పష్టమైన మెజార్టీని ఇవ్వలేదని... ఈ నేపథ్యంలో మరోసారి ఎన్నికలను నిర్వహించాలని అన్నారు. 

ఆ కాల్స్ పై కోర్టుకు వెళుతామన్న ఉగ్రప్ప...

కర్ణాటక : కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో యడ్యూరప్ప, శ్రీరాములు, గాలి జనార్దన్ రెడ్డి తదితరులు మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో టేపుల విషయంలో కాంగ్రెస్ నేత ఉగ్రప్ప స్పందించారు. ఆ ఆడియో టేపులన్నీ ఒరిజినల్ అని, ఫోరెన్సిక్ ల్యాబ్ లో వాటిని టెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై అవసరమైతే కోర్టుకు కూడా వెళతామని చెప్పారు.

17:19 - May 21, 2018

ఒంగోలు : రైతు ఆనందంగా ఉండేందుకు అందరూ కృషి చేయాలని..రైతు ఆనందంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన వివిధ సమస్యలపై అధ్యయనం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన పలు జిల్లాల్లో పర్యటిస్తూ ఆయా రంగాలకు చెందిన సమస్యలను తెలుసుకుంటున్నారు. అందులో భాగంగా సోమవారం ప్రకాశం జిల్లాలో పర్యటించి ఒంగోలులో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. పొగాకు రైతు సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పొగాకు రైతు కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని, పొగాకు కనీస మద్దతు ధర విధానం వర్తింప చేయాలని సూచించారు. 

17:16 - May 21, 2018

విశాఖపట్టణం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు చేశారు. తనవల్లే టిడిపి అధికారంలోకి వచ్చిందని పవన్ చెప్పడం తప్పని, 2014లో ప్రజాబలంతో టిడిపి అధికారంలోకి వచ్చిందన్నారు. బిజెపి చెప్పినట్టు పవన్ ఆడుతున్నారని, బిజెపి, వైసిపి పార్టీలను విమర్శించకుండా చంద్రబాబును విమర్శించడం తప్పని తెలిపారు. ఎవరిని విమర్శించాలంటే వారిని విమర్శించడం..ఎవరితో చెట్టాపట్టాల్ వేసుకోవాలంటే వారితో చెట్టాపట్టాల్ వేసుకోవడం..వంటివి చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. 

రష్యాలో మోడీ...

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. సోచీలో అధ్యక్షుడు పుతిన్ తో మోడీ సమావేశమయ్యారు. భారత్, రష్యా దౌత్య సంబంధాలపై చర్చించారు. 

16:53 - May 21, 2018
16:51 - May 21, 2018

విజయవాడ : ఏపీ ప్రభుత్వంపై మరోసారి ఏపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వంలో కరుడుగట్టిన కులస్వామ్యం నడుస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. బ్రాహ్మణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని, టిటిడి ప్రధాన అర్చకులు రమణదీక్షితులు రిటైర్ మెంట్ ఇవ్వడం తప్పన్నారు. గుంటూరు జిల్లా బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి, వైసీపీ నేత మల్లాది విష్ణులు కూడా ఈ విషయంలో మండిపడ్డారు. 

16:29 - May 21, 2018

అనంతపురం : బీజేపీ నమ్మించి మోసం చేసిందని, తమను తిప్పుకున్నారని..వెంటనే నిరోధం పెట్టుకుంటే ప్రజలు నష్టపోతారని భావించి...ఎక్కువగా వారిని గౌరవించానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జిల్లాలో ఆయన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ...నాలుగు బడ్జెట్ ల వరకు మాయమాటలు చెప్పారని..ఇతర రాష్ట్రాలకు హోదాకు తగ్గట్టు రాయితీలు..డబ్బులు ఇచ్చారన్నారు. ఐదో బడ్జెట్ లో మోసం చేయడంతో చివరకు బయటకు రావడం జరిగిందని, బీజేపీతో తాను పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం చాలా సంతోషంగా ఉందని..

ఇక ఏపీలో రూ. 200 ఫించన్ ఇస్తే టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత రూ. 1000కి పెంచడం జరిగిందన్నారు. ప్రస్తుతం తాము ఎక్కువ ఫించన్ ఇస్తామని ప్రకటిస్తున్నారని తెలిపారు. తాను గతంలో నిర్వహించిన పాదయాత్రలో ఎన్నో సమస్యలు చూడడం జరిగిందని, వీరందరికీ ఒక పెద్ద దిక్కుగా ఉండాలని భావించడం జరిగిందన్నారు. రుణవిముక్తి చేస్తానని ప్రకటించి దేశంలో రూ. 24వేల కోట్ల రూపాయలు రుణవిముక్తి కల్పించిన రాష్ట్రం ఏపీ అని ప్రకటించారు. వడ్డీ లేని రుణాలు ఇప్పించడం జరుగుతోందని, తిండి కొరత ఉండకూడదని ఐదు కిలోల బియ్యం ఇప్పించడం జరుగుతోందని..పండుగలప్పుడు ఆనందంగా ఉండాలనే ఉద్ధేశ్యంతో పేదలకు పలు కానుకలు ఇప్పించడం జరుగుతోందన్నారు. ప్రమాదాల్లో చనిపోయిన వారిని ఆదుకోవాలని ఉద్ధేశ్యంతో చంద్రన్న భీమా కింద రూ. 5 లక్షలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఏపీ సర్కార్ అన్నారు. పేద వారి కుటుంబాల్లో వివాహం ఖర్చు కావద్దొనే ఉద్ధేశ్యంతో పథకం రూపొందించి డబ్బులు ఇవ్వడం జరుగుతోందని, గర్భిణీలకు..ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. 2.50 వేల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సహాయం కింద ఇస్తున్నామని, పేద వారి ఆరోగ్యం మెరుగుపరిచేందుకు ముందుకెళుతున్నట్లు వెల్లడించారు. రాబోయే రెండు..మూడు సంవత్సరాల్లో 15 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇక్కడ కేంద్రం సహకరించడం లేదని తెలిపారు. 

తురకలపట్నం చెరువుకు నీళ్లు...

అనంతపురం : తురకలపట్నం చెరువుకు నీటిని సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జిల్లా అభివృద్ధికి రూ. 10వేల కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, సీమకు 145 టీఎంసీల నీల్లు తెచ్చామన్నారు. 

మాయావతితో కుమార స్వామి...

ఢిల్లీ : జేడీఎస్ శాసనసభా పక్ష నేత, కాబోయే కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపటి క్రితం బీఎస్పీ అధినేత్రి మాయావితో భేటీ అయ్యారు. 

15:23 - May 21, 2018

ఢిల్లీ : కర్ణాటకలో జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందిస్తుందని ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కి పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఇరు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై కుమార స్వామి కాంగ్రెస్ పెద్దలతో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధు యాష్కితో టెన్ టివి ముచ్చటించింది. అందర్నీ సంతృప్తి పరిచేలా మంత్రివర్గ కూర్పు ఉంటుందని, కాంగ్రెస్ కు అత్యధిక మంత్రి పదవులు వస్తాయన్నారు. కర్ణాటకలో సంకీర్ణం దేశ రాజకీయాలపై, 2019 ఎన్నికలపై కర్ణాటక ఫలితాలు ప్రభావం చూపుతాయన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

15:13 - May 21, 2018

పాస్ పుస్తకాల కోసం లంచమడిగిన వీఆర్వో...

పెద్దపల్లి : మొట్లపల్లి వీఆర్వో కొమరయ్య ఏసీబీకి చిక్కాడు. కాల్వశ్రీరాంపూర్ లో పాస్ పుస్తకాల కోసం ఓ రైతు నుండి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

శాశ్వత రాజకీయ నాయకులెవరూ లేరు - కేటీఆర్...

హైదరాబాద్ : దేశంలో శాశ్వత రాజకీయ నాయకులెవరూ లేరని, ప్రజలు ఎన్నుకొంటేనే ఐదేళ్లు కొనసాగుతారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల మనన్సులను గెలిస్తేనే నాయకులు మరోసారి ఎన్నికవుతారన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు ఫౌండేషన్ కోర్సు ఏదీ ఉండదని, తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి..సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. 

తెలంగాణ ఎక్స్ లెన్స్ అవార్డుల ప్రధానం...

హైదరాబాద్ : ఎంసీఆర్ హెచ్ ఆర్ డీలో తెలంగాణ ఎక్స్ లెన్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషిలు పాల్గొన్నారు. విధి నిర్వాహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. 

15:00 - May 21, 2018

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో 'నిర్భయ' ఘటనలు ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట మహిళలు బలై పోతున్నారు. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు తెచ్చినా ఆఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఎటాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మే 1వ తేదీన హాజరా కెనాల్ సమీపంలో ఓ యువతిపై కారులో తిప్పుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నిందితులంతా పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

14:55 - May 21, 2018
14:54 - May 21, 2018

రంగారెడ్డి : జిల్లాలోని నాదర్ గుల్ లో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. చాణక్యపురిలోని 607, 608, 609లో సుమారు వంద ఎకరాల భూమి కబ్జాకు గురయ్యింది. దీనితో భూ యజమానులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. యాదయ్య అనే వ్యక్తి తమ భూములను కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. భూమిని అక్రమంగా కబ్జా చేసి రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేసి ఇతరులకు విక్రయించాడని ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని నిలదీస్తే చంపేస్తానన యాదయ్య బెదిరిస్తున్నాడని యజమానులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎల్ఆర్ఎస్ ఇప్పించాలని కోరుతున్నారు. భూ కబ్జాలకు పాల్పడిన యాదయ్యను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం స్పందిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

14:49 - May 21, 2018

చిత్తూరు : వీడు ఒక తండ్రేనా ? అంటారు మీరు ఈ వార్త చదవి...వావివరసలు మరిచిపోయాడు..కన్నకూతురిపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు..ఇందుకు భార్య కూడా సహకరించడం పాశవికం. గత మూడేండ్లుగా అనాగరికం కొనసాగుతోంది. ఎట్టకేలకే ఆ కామాంధుడి తండ్రికి చెక్ పెట్టిందో ఓ కూతురు. మానవ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చంద్రగిరి సమీపంలో ఓ తండ్రి కన్నకూతురిపై దారుణంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తనలోని 'వాంఛ'ను తీర్చుకుంటున్నాడు. నిత్యం బయటపెట్టి లొంగదీసుకుంటున్నాడు. కేసు పెడితే ఎలా బతుకుతాం..అంటూ ఆ తల్లి కూడా చెప్పడంతో ఆ కూతురి వ్యథ వర్ణానాతీతం. ఇక చావే పరిష్కారమనుకున్న యువతిని బంధువులు కాపాడి కౌన్సెలింగ్ ఇచ్చి పోలీసులను ఆశ్రయించేలా చేశారు. దీనితో ఈ వ్యవహారం బయటపడింది. 

14:42 - May 21, 2018

కరీంనగర్ : ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఎదురించి..వారిని ఒప్పించే విధంగా చేయాల్సిన ఓ ప్రేమ జంట తనువు చాలించు కోవాలని అనుకున్నారు. విషం తాగారు. ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా ప్రియుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మైలారంకు చెందిన అంజలి, లోహిత్ లు ప్రేమించుకున్నారు.

అంజలికి వివాహం చేయాలని పెద్దలు సంబంధాలు వెతుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న లోహిత్, అంజలిలు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు. అనంతరం ఓ గుడి దగ్గర విషం సేవించారు. స్నేహితులు విషయం తెలుసుకుని ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ అంజలి మృతి చెందగా ప్రియుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. దీనితో అంజలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

14:35 - May 21, 2018

మధ్యప్రదేశ్ : ఢిల్లీ - విశాఖ ఏపీ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. హై టెన్షన్ విద్యుత్ వైర్లు ట్రైన్ పై పడిపోయాయి. ఢిల్లీ నుండి విశాఖకు వస్తుండగా బిర్లా నగర్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ట్రైన్ లో 36 మంది ట్రైనీ ఐఏఎస్ లున్నారు. వీరందరూ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. బీ 6, బీ 7, ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:44 - May 21, 2018

మధ్యప్రదేశ్‌ : ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గునాలో ఓ ట్రక్కు - బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. మరో 20 మందికి గాయాలుకాగా... వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈప్రమాదంలో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. అయితే డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. 

13:43 - May 21, 2018

గుజరాత్‌ : రాష్ట్రం రాజ్‌కోట్‌లో దారుణం జరిగింది. ఫ్యాక్టరీలో దొంగతనం చేశాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని కొట్టి చంపారు సిబ్బంది. కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో దెబ్బలకు తాళలేక బాధితుడు ముఖేశ్‌ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్‌ చేశారు. 

13:41 - May 21, 2018

ఢిల్లీ : భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ 27వ వర్థంతి సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీలు రాజీవ్‌ గాంధీ స్మారకస్థూపం వద్ద నివాళులు అర్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా రాజీవ్‌ గాంధీకి నివాళులర్పించారు. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ రాహుల్‌ ఓ ట్వీట్‌ పెట్టారు. రాహుల్‌ గాంధీ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. ద్వేషాన్ని నమ్ముకున్నవారు జైల్లో ఉన్నట్లేనని మా నాన్న చెప్పారు. అందర్నీ ప్రేమించాలని, ప్రతి ఒక్కరిని గౌరవించాలని నాన్న నాకు నేర్పినందుకు ఆయనకు ధన్యవాదాలంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. 1991, మే 21న తమిళనాడులోని పెరంబూరులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాజీవ్‌గాంధీని ఎల్‌టీటీఈ హత్య చేసింది. రాజీవ్‌ గాంధీ వర్థంతి నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ అధినేత కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారానికి వాయిదా పడ్డ విషయం తెలిసిందే.

13:22 - May 21, 2018

మధ్యప్రదేశ్ : ఢిల్లీ నుంచి విశాఖపట్నం వస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. బి6, బి7 ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుండి విశాఖ వస్తుండగా గ్వాలియర్ వద్ద బిర్లా నగర్ రైల్వే స్టేషన్ వద్ద బోగీల్లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా బోగీ అంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగతో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం నుంచి 36 మంది ట్రైనీ ఐఏఎస్‌లు సురక్షితంగా బయటపడ్డారు. కాగా ఈ ఘటనపై రైల్వే శాఖ దృష్టిసారించింది. ప్రయాణీకులను వేరే ట్రైన్స్ లో తరలించారు. గాయపడినవారికి రైల్వే ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. 

ఢిల్లీ, ఏపీ ఎక్స్ ప్రెస్ లో మంటలు..

మధ్యప్రదేశ్ : ఢిల్లీ నుంచి విశాఖపట్నం వస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. బి6, బి7 ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగతో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. 

దొంగలకు అధికారమిస్తే రాష్ట్రాన్నే దోచేస్తారు : మంత్రి పరిటాల

అనంతపురం : వైసీపీ నేత జగన్ పై మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. దొంగలకు అధికారమిస్తే రాష్ట్రాన్ని దోచేయడం ఖాయమని మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మండల కేంద్రమైన గార్లదిన్నెలో ఆదివారం శింగనమల నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పరిటాల సునీత పాల్గొన్న ఆమె అధికార దాహంతో జగన్‌ లేనిపోని హామీలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆ యన మాయమాటలు నమ్మి ఓట్లు వేస్తే పూర్తిగా దోచేస్తారన్నారు.

రోడ్డు ప్రమాదంలో యాంకర్ లోబోకు తీవ్ర గాయాలు..

జనగాం : ప్రముఖ టీవీ యాంకర్ లోబోగా పేరొందిన మొహమ్మద్ కయిమ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. సోమవారం ఉదయం రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ శివారులో లోబో ప్రయాణిస్తున్న కారు- ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లోబోతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని జనగాం ఏరియా ఆసుపత్రి కి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

యుద్ధనపూడి మృతికి కేసీఆర్ సంతాపం..

హైదరాబాద్: యద్దనపూడి సులోచనరాణి మృతి పట్ల సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. సులోచన కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సులోచనారాణి రచనలకు సాహితీ ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆమె సాహిత్యరంగంలో చేసిన కృషిని కేసీఆర్ కొనియాడారు. యద్దనపూడి సులోచనారాణి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా సులోచనారాణి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కాలిఫోర్నియా రాష్ట్రంలోని కుపర్టినో పట్టణంలో ఆకస్మికంగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు కుమార్తె శైలజ తెలిపారు.

12:41 - May 21, 2018

శ్రీకాకుళం : ఎన్నికలప్పుడు హామీలిచ్చి.. పదవిలోకి రాగానే వాటిని తుంగలో తొక్కే నేతలు ఎందరినో చూస్తుంటాం..కానీ పదవులతో, ప్రచారంతో నిమిత్తం లేకుండా.. శ్రీకాకుళం జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే నిస్వార్థ సేవ చేస్తున్నారు. ఉద్దానం ఫౌండేషన్ పేరుతో సేవాకార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌..
మన నేతలకు ఎన్నికలప్పుడు తప్ప మిగతా సమయాల్లో ప్రజలు గుర్తుకు రారు. ఎన్నికల్లో ఇచ్చే హామీలు సైతం పదవిలోకి రాగానే గుర్తుండవు. ఇలాంటి ప్రజా ప్రతినిధులు ఉన్న నేటి కాలంలోనూ... నిస్వార్థంగా.. ఏలాంటి పదవీ ఆశించకుండా ప్రజాసేవకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు.. మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌..

ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉద్దానం ఫౌండేషన్ స్థాపన..
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉద్దానం ఫౌండేషన్ ను స్థాపించి పేదప్రజలకు సేవలు అందిస్తున్నారు పియారా సాయిరాజ్‌ . రాజకీయ నేతగా పరిచయమైన ఓ యువకుడు అతి చిన్న వయస్సులోనే ఎమ్మెల్యే అయ్యాడు. ఆ నాడు చేసిన వాగ్ధానం నేటికీ అమలు పరుస్తూనే ఉన్నాడు. అనుక్షణం ఉద్దానం ప్రాంత ప్రజానీకానికి అండగా నిలుస్తున్నాడు. తన ఒంట్లో ఓపిక.. గొంతులో ఊపిరి ఉన్నంత వరకూ ప్రజా సేవ చేస్తానన్న వాగ్ధానం నేటికీ అమలు చేస్తూనే ఉన్నారు పిరియా సాయిరాజ్‌.

పలు మండలాల్లో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు..
ఉద్దానం ఫౌండేషన్ ద్వారా శ్రీకాకుళం జిల్లా కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం మండలాల్లో మినరల్ వాటర్ ప్లాంటులు ఏర్పాటు చేశారు. ఉచిత అంబులెన్సులను ఏర్పాటు చేశారు. ఉద్దానం కిడ్నీ రోగులకు నెలవారీ ఫించను అందించి ఆదర్శంగా నిలుస్తున్నారు. టెలీమెడిసిన్ ద్వారా రోగులకు సేవ చేస్తున్నారు. సోంపేట నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య నిపుణుల సూచనలు అందేలా చేస్తున్నారు. డ్రోన్ సహాయంతో మందుల సరఫరా, డయాలసిస్ మిషనరీ ఏర్పాటు లాంటి సేవా కార్యక్రమాలు విస్తృతపరిచారు. తన తండ్రి రాజారావు స్ఫూర్తి, భార్య విజయ తోడ్పాటుతోపాటు.. ఉద్దానం ప్రాంతీయుల నమ్మకాలే.. దశాబ్ద కాలంగా సేవా మార్గంలో నడిపిస్తున్నాయని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌.

సాయిరాజ్‌ పై ఉద్దానం ప్రజలు అభినందనలు.
ప్రజాసేవే పరమార్ధంగా నిస్వార్థ సేవలందిస్తున్న సాయిరాజ్‌ పై ఉద్దానం ప్రజలు అభినందనలు కురిపిస్తున్నారు. ఉద్దానం ఫౌండేషన్‌ ద్వారా మరిన్ని సేవలకు ప్రభుత్వం కూడా తోడ్పాటు అందించాలని స్థానికులు కోరుతున్నారు. 

12:36 - May 21, 2018

ప్రకాశం : అబ్బాయిలను అక్రమంగా ముంబై తరలించి.. బలవంతంగా హిజ్రాలుగా మారుస్తున్నారు. పేద మధ్య తరగతి కుటుంబాల మగపిల్లలనే టార్గెట్‌ చేస్తున్నాయి కొన్ని ముఠాలు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఇలాంటి ఉదంతం ఒకటి వెలుగులో వచ్చింది.. నిరుపేద అబ్బాయిలను బలవంతంగా హిజ్రాలుగా మారుస్తున్న దురాగతంపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం..

అక్రమ సంపాదనకోసం తెగిస్తున్న ముఠాలు..
అక్రమ సంపాదనకోసం దుండగులు ఎంతకైనా తెగిస్తున్నారు. పేద కుటుంబాల్లోని అందమైన అబ్బాయిలే లక్ష్యంగా ముఠాల వేట సాగుతోంది. అమాయక అబ్బాయిలను అక్రమంగా రవాణా చేసి.. హిజ్రాలుగా మారుస్తున్నారు. తాజాగా... ప్రకాశం జిల్లా హనుమంతపాడు మండలం వేములపాడు గ్రామంలోనికి చెందిన చిట్టిబాబు ధీన గాథ వెలుగు చూసింది.

స్నేహాన్ని అడ్డుపెట్టుకుని నమ్మక ద్రోహం..
భూతపోటి ప్రసాద్‌ నాల్గవ సంతానం చిట్టిబాబు. ఒంగోలుకు చెందిన దుర్గారావు తనను నమ్మించి నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 2012లో స్కూలు డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లో ఏర్పడిన స్నేహాన్ని అడ్డుపెట్టుకుని నమ్మక ద్రోహం చేశాడని అంటున్నాడు. బాంబేలో ప్రోగ్రామ్‌ ఉందని తీసుకెళ్ళి హిజ్రాలు ఉండే ఏరియాలో అమ్మేశాడని చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ముంబైలో హిజ్రాలు తనను విపరీతంగా కొట్టారని.. అన్నం పెట్టకుండా.. గదిలో బంధించి హింసించారని వాపోతున్నాడు. పంజాబీ డ్రస్‌ తొడిగించి... అడుక్కుని రమ్మని పంపేవారనీ.. అలా తెచ్చిన డబ్బులు మొత్తం లాక్కొనే వాళ్ళని వివరించాడు.

నాలుగేళ్ళ అనంతరం కన్నవారి చెందకు చిట్టిబాబు..
తనను ఎందుకిలా బంధించి హింసిస్తున్నారంటూ ప్రశ్నిస్తే... దుర్గారావు తీసుకెళ్ళిన మూడు లక్షల రూపాయలు ఇస్తే నిన్ను ఊరికి పంపిస్తామన్నారని చిట్టిబాబు వివరించాడు. దాదాపు నాలుగేళ్ళ తర్వాత తన ఊరికి చేరుకున్నానని చెప్పాడు కన్నీటి పర్యంతం అవుతున్నాడు.

ఏ తల్లీకి ఇటువంటి శోకం వద్దు : చిట్టిబాబు తల్లి
తనలాగా ఏతల్లికీ శోకం కలగకూడదని చిట్టిబాబు తల్లి దుఖిస్తోంది. నిరుపేదలమైన తమకుటుంబానికి దుర్గారావు తీరని అన్యాయం చేశాడని చిట్టిబాబు కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

20మందిని విక్రయించిన దుర్గారావు..
ప్రకాశం జిల్లాలో తనలాగే మరో ఇరవై ఐదు మందిని దుర్గారావు అమ్మేశాడని తెలిపింది. సంఘంలో హిజ్రాలకు న్యాయం చేస్తున్నట్లు నటిస్తూ.. కోట్లాదిరూపాలయలు అక్రమంగా సంపాదించిన దుర్గారావు లాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని చిట్టిబాబబుతోపాటు అతని కుటుంబం కోరుతోంది. 

పెట్రోల్ ధరలపై ప్రత్యామ్నాయాలు యోచిస్తున్నాం : మంత్రి ధర్మేంద్ర

ఢిల్లీ : పెరుగుతున్న పెట్రోలు, డీజెల్ ధరలను నిశితంగా గమనిస్తున్నామని, ప్రజలపై భారం పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ విషయంలో అతి త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని అన్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియమ్ ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్ తీసుకున్న నిర్ణయాల కారణంగానే చమురు ఉత్పత్తి తగ్గిందని, అందువల్లే ధరల భారం ప్రజలపై పడిందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇరాన్ పై అమెరికా ఆంక్షలు కూడా క్రూడాయిల్ మార్కెట్ పై ఒత్తిడిని పెంచుతున్నాయని ఆయన అన్నారు.

పెట్రోల్ తగ్గించే యోచనలో కేంద్రం?!..

ఢిల్లీ : ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్న పెట్రోలు, డీజెల్ ధరలను తగ్గించే దిశగా కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం పెట్రోలుపై విధించిన సుంకాలను తగ్గించే ప్రణాళికలు వేస్తున్నట్టు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ విషయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు.

11:57 - May 21, 2018

కర్ణాటక : నిన్నటి వరకూ అధికారం కోసం పలు మలుపులు తిరిగిన కన్నడ రాజకీయాలు అటు తిరిగి ఇటు తిరిగి ఢిల్లీ బాట పట్టాయి. ఎన్నికల అనంతరం ఫలితాలు, వివిధ మలుపుల, యడ్యూరప్ప ప్రమాణస్వీకారం, గవర్నర్ వివాదం, సుప్రీంకోర్టులో జేడీఎస్ కూటమి పిటీషన్, యడ్యూరప్ప రాజీనామా వంటి పలు మలుపులు తిరిగి ఎట్టకేలకు జేడీఎస్ అధినేత కుమారస్వామి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో జేడీఎస్, కాంగ్రెస్ కూటముల మధ్య పదవుల కొట్టాట రాజుకుంది. పలు కీలక పదవులు కావాలని కన్నడ కాంగ్రెస్ నేతలు పట్టుపడుతుంటే కుమారస్వామి తిరస్కరించారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు అంటే 23వ తేదీన కుమారస్వామి ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఆయన హస్తిన బాట పట్టారు. రాహుల్ గాంధీ, సోనియాలను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించనున్నారు. సాయంత్రం 3.30గంటలకు రాహుల్ ని, 4.30గంటలకు సోనియాగాంధీలతో కుమారస్వామి భేటీ కానున్నారు. తిరిగి సాయంత్రం 6.00గంటలకు బెంగళూరు చేరుకోనున్నారు. అదేక్రమంలో కాంగ్రెస్, జేడీఎస్ నేతల్లో ఎవరికి ఏ పదవులు ఇవ్వాలనే విషయమై వారితో చర్చించే అవకాశం వుంది. కాగా, మంత్రివర్గ కూర్పు విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ నేతృత్వంలోని ప్రతినిధులతో కుమారస్వామి బెంగళూరులో గత రెండు రోజులుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుమారస్వామి ఢిల్లీ బాటలో ఏం తేలనుంది? అనే అంశంపై ఉత్కంఠ మళ్లీ ప్రారంభమయ్యింది.

తిరుమల వివాదాలపై బాబుకు మాజీ సీఎస్ లేఖ..

తిరుమల : శ్రీవారి ఆలయంలో జరుగతున్న పరిణామలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలపై సీఎం చంద్రబాబుకు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మరోసారి బహిరంగ లేఖ రాశారు. టీటీడీ పూర్వ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు లేవనెత్తిన అంశాలపై విచారణ అవసరమని, ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పోటు ప్రాంతంలో తవ్వకాలు జరిపై అధికారం ఎవ్వరికీ లేదని, పురావస్తు శాఖ తనిఖీకి, ఈ చర్యకు సంబంధం ఉండొ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. పోటు ప్రాంతంలో తవ్వకంపైనా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు.

పెళ్లన్నాడు..డబ్బుగుంజి,బుక్కయిన ప్రొఫెసర్..

హైదరాబాద్ : విద్యార్ధులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రొఫెసర్ స్థాయి వ్యక్తి నువ్వు నాకు చాలా నచ్చామంటు తన వద్ద రీసెర్చ్ కోసం జాయిన్ అయిన విద్యార్థినిని నమ్మబలికాడు..వెంటపడ్డాడు, వెంట తిప్పించుకున్నాడు. పెండ్లి చేసుకుంటానంటు నమ్మించి లక్షలకొద్దీ డబ్బు గుంజుకున్నాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి నాకు పెళ్లయిందన్నారు. నాకు డబ్బు నాకిచ్చేమంటు విద్యార్థిని అడిగేసరికి హత్య చేయించేందుకు యత్నించిన ప్రొఫెసర్ ఎట్టకేలకు బుక్ అయ్యాడు.

మోసం చేసిన ప్రొఫెసర్..ఫిర్యాదు చేసిన విద్యార్థిని..

డెసిషన్ తీసుకునే టైమ్ వచ్చింది : లక్ష్మీనారాయణ

ప్రకాశం : తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే టైమొచ్చిందని సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. రైతు సమస్యల పరిష్కారానికి చొరవ చూపడమే తన లక్ష్యమని లక్ష్మీనారాయణ వెల్లడించారు. లక్ష్మీ నారాయణకు తమ సమస్యలు ఏకరవు పెట్టిన రైతులు, పంటలను తక్కువ ధరలకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. హోల్ సేల్ వ్యాపారులకు తాము పంటను విక్రయిస్తుంటే, తమకు తక్కువ ధర ఇచ్చి, బహిరంగ మార్కెట్ లో దళారులు అధిక ధరలతో వాటిని ప్రజలకు అమ్ముతున్నారని రైతులు ఆరోపించారు.

11:23 - May 21, 2018

హైదరాబాద్ : ప్రముఖ నవలా రచయిత్రి యుద్దనపూడి సులోచనారాణి కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని తన కుమార్తె ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. యుద్దనపూడి సులోచనారాణి అనేక నవలలు రాశారు. మౌనపోరాటం, ఆగమనం, ఆరాధన, ప్రేమ పీఠం, వెన్నెల్లో మల్లిక లాంటి అనేక నవలలను ఆమె రచించారు. ఆమె రాసిన అనేక నవలలు సినిమాలుగా తెరకెక్కాయి. యుద్దనపూడి నవలల ఆధారంగా గిరిజా కల్యాణం, ఆత్మీయులు, మీన, జీవన తరంగాలు, అగ్నిపూలతోపాటు మరికొన్ని చిత్రాలు తెరకెక్కాయి. కుటుంబ కథనాలు రాయడంలో తనకు తానే సాటిగా యుద్దనపూడి నిలిచారు. నవలా దేశపు రాణిగానూ అమె ప్రసిద్ధి చెందారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ గ్రామంలో 1940లో ఆమె జన్మించారు. సులోచనారాణి మృతితో సాహిత్యలోకంలో విషాదం నెలకొంది.

ఆమె కలం నుండి జాలువారిని పలు రచనలు.. 
ఆగమనం, ఆరాధన,ఆత్మీయులు,అభిజాత,అభిశాపం,అగ్నిపూలు,ఆహుతి,అమర హృదయం,అమృతధార,అనురాగ గంగ,అనురాగ తోరణం,అర్థస్థిత,ఆశల శిఖరాలు,అవ్యక్తం,ఋతువులు నవ్వాయి,కలలకౌగిలి,కీర్తికిరీటాలు,కృష్ణలోహిత,గిరిజా కళ్యాణం,చీకటిలో చిరుదీపం,జీవన సౌరభం,జాహ్నవి,దాంపత్యవనం,నిశాంత,ప్రేమ,ప్రేమదీపిక,ప్రేమపీఠం,బహుమతి, బందీ,బంగారు కలలు,మనోభిరామం,మౌనతరంగాలు,మౌన పోరాటం,మౌనభాష్యం,మోహిత,వెన్నెల్లో మల్లిక,విజేత,శ్వేత గులాబి,సెక్రటరీ,సౌగంధి,సుకుమారి వంటి మరెన్నో నవలలు ఆమె కలం నుండి జాలువారాయి. 

11:09 - May 21, 2018

శ్రీకాకుళం : జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌ ఇవాళ రెండోరోజూ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలాస నియోజకవర్గంలో పవన్‌ పోరాటయాత్ర కొనసాగనుంది. ఇచ్చాపురంలో జనసేన కార్యకర్తలతో భేటీ అయి అక్కడి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం సోంపేట థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ప్రాంతంలోని బీలా భూములను పరిశీలిస్తారు.

ఇచ్చాపురంలో ప్రారంభమైన పవన్ యాత్ర..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభమయి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు, కార్యకర్తలతో కలిసి పవన్ కవాతు చేశారు. అనంతరం కవిటి మండలం కపాసుకుద్ది తీరపాత్రం వద్ద ఇచ్ఛాపురంలో సముద్రస్నానం ఆచరించి గంగమ్మకు పూజలు నిర్వహించి పనవ్ యాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రజల ఆశీస్సులు వుంటేనే ప్రజల సమస్యలపై జనసేన కృషి చేస్తుందన్నారు. వారి ఆశీస్సులు వుంటే వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందన్నారు. రెండవరోజు పలాసలో పర్యటిస్తున్న సందర్భంగా పవన్ ఎటువంటి పలుకులు పలకనున్నారు?అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

11:00 - May 21, 2018

తిరుమల : తిరుమలలో విధుల నుంచి తొలగించబడిన రమణ దీక్షితులు - టీటీడీ మధ్య వివాదం మరింత ముదురుతోంది. శ్రీవారి కైంకర్యాలు, నిత్య నివేదనల్లో అధికారులు, పాలక మండలి జోక్యం పెరిగిపోయిందని రమణదీక్షితులు ఇటీవల ఆరోపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాలకమండలి.. రమణదీక్షితులకు 65 ఏళ్ల వయోపరిమితితో రిటైర్‌మెంట్‌ ఇచ్చింది. దీంతో రమణదీక్షితులు శ్రీనివాసుని ఆభరణాలు, సంపద పక్కదారి పడుతున్నాయని వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా వందల ఏళ్లనాడి రూబీ వజ్రం స్వామివారి ఖజానా నుంచి మాయం అయిందని ఆయన ఆరోపణలు చేస్తున్నారు.

శ్రీనివాసుని ఆభరణాల భద్రతపై ఆందోళనలు
తిరుమల శ్రీనివాసుని ఆభరణాల భద్రతపై మరోసారి ఆందొళనలు వ్యక్తం అవుతున్నాయి. విధుల నుంచి తప్పించిన తర్వాత పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పలు ఆసక్తి కర విషయాలు వెల్లడిస్తున్నారు. టీటీడీ బోర్డుపై తీవ్రస్థాయిలో అరోపణలు చేస్తున్నారు.

రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలంటు డిమాండ్‌
స్వామివారి ఆభరణలు, ఇతర విలువైన సంపద మాయం అవుతోందని రమణ దీక్షితులు ఆరోపిస్తున్నారు. శ్రీవారికి రూబీ వజ్రం కనిపించడం లేదని.. ఇటీవల జెనీవా నగరంలో వేలానికి ఉంచిన గులాబీరంగు వజ్రం అదే కావచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. స్వామివారి సంపద మాయం కావడంపై రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు.

రమణదీక్షితులు ఆరోపణలను ఖండిస్తున్న అర్చకులు..
అయితే 2001 నుంచి రూబీ వజ్రం కనిపించకుండా పోయిందన్న రమణదీక్షితులు ఆరోపణలను మిగత అర్చకులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. వాస్తవానికి 2001లో శ్రీవారి ఆభరణాలను టీటీడీకి అప్పగించింది. రమణదీక్షితులేనని.. రూబీ మాయం కావడం మిగతా వారికంటే ఆయనకే ఎక్కువగా తెలిసి ఉంటుందని అంటున్నారు. మరోవైపు రమణ దీక్షితులు ఆరోపణలను టీటీడీ ఈవో ఏకే సింఘాల్‌ ఖండించారు. శ్రీవారి నగలకు సంబంధించి 1952 నుంచి పక్కాగా లెక్కలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ఏటా శ్రీవారి ఆభరణాలను భక్తుల కోసం ప్రదర్శించేందుకు ఎలాంటి అభ్యతరం లేదన్నారు. స్వామివారి నివేదనలు, కైంకర్యాలన్నీ ఆగమశాస్త్రయుక్తంగానే జరుగుతున్నాయని ఈవో సింఘాల్‌ చెప్పారు.

కట్టడాలను కూల్చివేస్తున్నారంటు రమణదీక్షితులు ఆరోపణలు
మరోవైపు వేల ఏళ్లనాడి కట్టడాలను అనవసరంగా కూల్చివేశారన్న రమణదీక్షితులు ఆరోపణలపై టీటీడీ వివరాలన్నీ బయటపెట్టింది. పోటు మరమ్మతు పనులతోపాటు వెయ్యికాళ్ల మండపం కూల్చివేతకు.. రమణ దీక్షితులు ఆమోదం తెలిపిన పత్రాలను టీటీడీ విడుదల చేసింది. శ్రీవారి ఆలయ౦లోని వకుళామాత పోటులో... ఎటువంటి తవ్వకాలు జరపలేదని.. కేవలం మరమ్మతులను మాత్రమే చేశామని టీటీడీ స్పష్టం చేసింది.

పరిణామాలు బాధాకరం : అర్చకులు వేణుగోపాల దీక్షితులు
కాగా శ్రీవారి ఆలయ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు బాధాకరమన్నారు టీటీడీ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు. తిరుమల శ్రీవారి ప్రతిష్ట దెబ్బతీసేలా రమణదీక్షితులు ఆరోపణలు చేశారని అన్నారు. రమణదీక్షితులపై పలు ఆరోపణలు వస్తున్నాయని, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

10:51 - May 21, 2018

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ కిరణ్‌కుమార్‌పై ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. డిఎస్టెన్స్‌ ఎడ్యకేషన్‌లోని కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో కిరణ్‌కుమార్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అయితే కిరణ్‌.. అదే డిపార్ట్‌మెంట్‌లో స్కాలర్‌గా చేరిన ఓ విద్యార్థినిని పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. తన నుంచి 25 లక్షలు అప్పుగా తీసుకున్నాడని బాధితులు ఆరోపిస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానని మోసగించాడని... అతడికి అప్పటికే పెళ్లైందని చెబుతోంది. డబ్బులు అడిగినందుకు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని పోలీసులకు కంప్లైంట్‌ చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. 

10:42 - May 21, 2018

హైదరాబాద్ : ప్రముఖ నవలా రచయిత్రి యుద్దనపూడి సులోచనారాణి కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని తన కుమార్తె ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. యుద్దనపూడి సులోచనారాణి అనేక నవలలు రాశారు. మౌనపోరాటం, ఆగమనం, ఆరాధన, ప్రేమ పీఠం, వెన్నెల్లో మల్లిక లాంటి అనేక నవలలను ఆమె రచించారు. ఆమె రాసిన అనేక నవలలు సినిమాలుగా తెరకెక్కాయి. యుద్దనపూడి నవలల ఆధారంగా గిరిజా కల్యాణం, ఆత్మీయులు, మీన, జీవన తరంగాలు, అగ్నిపూలతోపాటు మరికొన్ని చిత్రాలు తెరకెక్కాయి. కుటుంబ కథనాలు రాయడంలో తనకు తానే సాటిగా యుద్దనపూడి నిలిచారు. నవలా దేశపు రాణిగానూ అమె ప్రసిద్ధి చెందారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ గ్రామంలో 1940లో ఆమె జన్మించారు. సులోచనారాణి మృతితో సాహిత్యలోకంలో విషాదం నెలకొంది. 
తెలుగు నవలా జగత్తుఓ ధృవతార ..
తెలుగు నవలా జగత్తు నుండి ఓ ధృవతార రాలిపోయింది. యుతుల కలల ప్రపంచంలో విహరించే కథానాయుడిని సృష్టించిన ఓ అద్భుతమైన, వ్యక్తిత్వ పాత్రల సృష్టికర్త, ప్రజల జీవన శైలిని, ఊహాలోకపు ఊయలలో విహరింపజేసిన అద్భుతమైన రచయిత్రి నవలాలోకపు రాణి యుద్ధనపూడి సులోచనాణి మరణించారు. తన రచనల్లో పాత్రలను తన నిజజీవితంలో తనకు తారసపడిన జీవితాలనే వస్తువులుగా తీసుకుని నవలలు రాడం ప్రారంభించిన యద్దనపూడి, ఆపై మారుతున్న ప్రజల జీవన విధానాలను అనుసరించి పాత్రలను సృష్టిస్తూ దూసుకెళ్లారు. ఆమె నవలలు భార్యాభర్తల మధ్య దాంపత్యం, కుటుంబ బాంధవ్యాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మధ్య తరగతి అమ్మాయిల ఆత్మవిశ్వాసం, మాటకారితనంతో నిండి వుంటాయి. డబ్బున్న అబ్బాయి, పేదింటి అమ్మాయి మధ్య నెలకొనే ప్రేమ ఆధారిత నవలల సృష్టిలో యద్దనపూడి స్వంతం. ఆమె రచనలు ఊహలే కావచ్చు..కానీ మనిషికి వుండాల్సిన సామాజిక కోణాలను తన రచనల్లో ప్రతిబింభే గొప్ప రచయిత్రి యుద్ధనపూడి.

యుద్ధనపూడి నవలతోనే వాణిశ్రీ స్టార్ హీరోయిన్ అయ్యింది : తెలకపల్లి
తెలుగు సాహిత్యంలోను, మహిళల యొక్క గౌరవ గొంతుకగా యుద్ధనపూడి తన రచనల్లో ప్రతిబింభించేవారని..నవలా రంగంలో ఆమె ఒక ఒరవడిని సృష్టించారని కొనియాడారు. ప్రముఖ హీరోయిన్ వాణిశ్రీ స్టార్ హీరోయిన్ గా ఎదిగటానికి కారణం యుద్ధనపూడి సులోచనారాణి నవలలే కారణమని తెలకపల్లి తెలిపారు. ఆమె రచించిన ఎన్నో నవలలు చిత్రాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆ చిత్రాలలో వాణిశ్రీనే కథానాయికగా వుండేవారు. అంతేకాదు సులోచనారాణి గొప్ప మానవతావాది అని..ఎందోమందికి ఎన్నో విధాలుగా సహాయం, సహకారాలు అందించిన గొప్ప వ్యక్తి అన్నారు. స్వతహాగా కూడా తన రచనల్లోని వివిధ అంశాలను, గొప్పతనాలను తన జీవితంలో ఆచరించి చూపించారన్నారు. జీవితంలో రాణిస్తున్న మహిళల జీవితాలను ప్రతిబింభేచేవారనీ..స్త్రీలను గౌరవించేలా సమాజం వుండాలని స్త్రీల వ్యక్తిత్వాన్ని తన రచనల్లో చూపించేవారని తెలకపల్లి పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలో ఆమె ఒక స్టార్ అని పేర్కొన్నారు. ఆమెకు సాటి వచ్చే రచనలు ఇప్పటికీ లేవంటే ఆమె రచనల ప్రభావం, శక్తి లేవంటే అతిశయోక్తి కాదన్నారు. ఆమె రచనల ప్రభావం అటు యూత్ లో పలు ప్రభావాలు చూపించేవానీ..అటువవంటి రచనాపటిమ అటువంటిదని తెలకపల్లి పేర్కొన్నారు. సులోచనారాణి ప్రభావంతో పురుషులు కూడా ప్రభావితం అయ్యారన్నారు. అంతేకాకుండా మహిళల శ్రేయస్సుకోసం, వారి అభివృద్ధి కోసం యుద్ధనపూడి ఎంతో కృషి చేశారని..దాని కోసం ఒక సంస్థను కూడా స్థాపించారని తెలకపల్లి రవి తెలిపారు.

ఆమె నలవలు ఒక ప్రభంజనం : లక్ష్మీపార్వతి
ఆమె నవలలు సృష్టించిన ప్రభంజనం అసాధారణమైనది ప్రముఖ రచయిత్రి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఆమె నవలలో కథానాయకుడు ఆరోజుల్లో యువతులపై ప్రభావం చూపించేవారన్నారు. అంత గొప్ప కథానాయకుడు కూడా పేదింటి అమ్మాయిని వివాహం చేసుకునే ఆదర్శం ఆమె రచనల్లో ప్రతిబింభించేవారని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.

 

యుద్ధనపూడి మృతికి చంద్రబాబు సంతాపం..

అమరావతి: ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సులోచనరాణి సోమవారం ఉదయం కాలిఫోర్నియాలో గుండెపోటుతో మృతి చెందారు.

10:00 - May 21, 2018

అనంతపురం : జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రొద్దం మండలం తులకలపట్నం చెరువులో జలహారతి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం, గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లకు భూమి పూజ చేస్తారు. ‘రచ్చబండ’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలతో ముఖాముఖీ మాట్లాడతారు. ఈ సందర్భంగా నిర్వహించే ఓ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు, అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. సీఎం రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి కాల్వ శ్రీనివాసులు.  

09:56 - May 21, 2018

విశాఖపట్నం : ఏపీ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ఎస్ జడ్సీ అధికార ప్రతినిధి జగబందు మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఎన్నికల గారడీలతో రాదని, దీర్ఘకాలిక, సమరశీల పోరాటాల ద్వారా మాత్రమే లభిస్తుందని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. బంద్ కు మావోలు పిలుపునివ్వటంతో ఏవోబీ వద్ద పోలీసులు భారీగా మోహరించి పట్టిష్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. ఎటువంటి అవాంఛనీయం ఘటనలు జరగకుండా పోలీసుయంత్రాంగం పట్టిష్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు. కాగా బంద్ ప్రభావం లేకుండా విశాఖ ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు కూడా ప్రభుత్వం బస్ లను కొనసాగిస్తున్నాట్లుగా తెలుస్తోంది. 

09:45 - May 21, 2018

శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజలకు అండగా వుంటుందనే ఉద్శ్యేంతోనే టీడీపీకి తాను మద్ధతునిచ్చాననీ..అటు కేంద్రంలో కూడా ఏపీకి ప్రజలకు మంచి చేస్తుందనే ఆలోచనతో మోదీ ప్రభుత్వానికి తాను సపోర్ట్ చేశాననీ కానీ ఇద్దరు ప్రజలను మోసం చేసారనీ..ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక ప్యాకేజి విషయంలో కేంద్రం దగా చేసిందనీ..ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయకుండా ప్రజలను దగా చేసిందని విమర్శలు గుప్పించారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిందని... అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతోనే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని ఇచ్ఛాపురం బహిరంగ సభలో పవన్‌ మండిపడ్డారు. ఈ అంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ..ఈ చర్చలో బీజేపీ నేత విష్ణు, టీడీపీ నేత మన్నెవ సుబ్బారావు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామశర్మ,సీఐటీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్షలు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నర్శింగరావు పాల్గొన్నారు. 

09:43 - May 21, 2018

ప్రతిరోజు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రజలను భయపెడుతున్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర 80 రూపాలయలు దాటేసింది. డీజిల్ సైతం 73రూపాయలకు చేరుకుంది. పెట్రోరేట్ల పెరుగుదలతో .. నిత్యావసరాల ధరలు ఎక్కడ పెరుగుతాయోనని సామాన్యుడు ఆందోళన పడుతున్నాడు. ఎన్నో వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్రం పోట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు తీసుకురాలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క చూసుకుంటే భారత్ పొరుగు దేశాలైన పాకిస్థాన్ లో లీటర్ పెట్రోలు 41.15,నేపాల్ 61.35, చైనా64.42,బంగ్లాదేశ్ 69.46 గా వుంటే ఆఫ్గానిస్థాన్ లో 41.15,శ్రీలంక 53.72, భారత్ లో మాత్రం రై.80లుగా ఎందుకుంది? దీంట్లో రాష్ట్ర ప్రభుత్వాల మతలబేమిటి? అటు కేంద్రం, ఇటు రాఊ ప్రభుత్వాల విధానాలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. ఈ అంశంపై చర్చను చేపట్టింది 10టీవీ..ఈ చర్చలో బీజేపీ నేత విష్ణు, టీడీపీ నేత మన్నెవ సుబ్బారావు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామశర్మ,సీఐటీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్షలు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నర్శింగరావు పాల్గొన్నారు. 

09:41 - May 21, 2018

ఒక పక్క మే నెల ముగింపుకొచ్చి ఖరీఫ్‌ సీజన్‌కు రోజులు దగ్గరపడ్డా.. తెలంగాణ ప్రభుత్వం ఖరీఫ్‌ ప్రణాళికను రూపొందించకపోవడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. విత్తనాలు, రుణాలు తదితర విషయాలపై ఒక ప్లానింగ్‌ను ఇప్పటివరకూ రూపొందించకపోవడంతో రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉందని వారు మండిపడుతున్నారు. ఒక పెట్టుబడి సహాయం పనుల్లో ఉంటూ మిగతా పనులను నిర్లక్ష్యం చేయడం సరికాదని వారు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు తెలంగాణా రైతు సంఘం రాష్ర్ట అధ్యక్షుడు జంగారెడ్డి విశ్లేషణ, వివరాలను ఈ నాటి జనపథంలో తెలుసుకుందాం..

09:38 - May 21, 2018

ఢిల్లీ : ప్రతిరోజు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రజలను భయపెడుతున్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర 80 రూపాలయలు దాటేసింది. డీజిల్ సైతం 73రూపాయలకు చేరుకుంది. పెట్రోరేట్ల పెరుగుదలతో .. నిత్యావసరాల ధరలు ఎక్కడ పెరుగుతాయోనని సామాన్యుడు ఆందోళన పడుతున్నాడు.

రికార్డు స్థాయిలో పెట్రో ధరలు..
పెట్రోలు, డీజిల్‌ ధరలు రోజురోజుకి పెరుగుతూ జీవితకాల గరిష్టానికి చేరుకుంటున్నాయి. దేశ రాజధానిలో పెట్రోల్‌ ధర 33 పైసలు పెరిగి రూ.76.24కు చేరింది. రోజువారీ ధరల సమీక్ష విధానాన్ని తీసుకొచ్చిన అనంతరం పెట్రోల్‌ ధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం. మరోవైపు డీజిల్‌ 26 పైసలు పెరిగి జీవితకాల గరిష్టం రూ.67.57కు చేరింది. ఢిల్లీలో 2014 సెప్టెంబర్‌ 14న పెట్రోల్‌ ధర రూ.76.06 ఉంది. ఇప్పుడు ఆ రికార్డును చెరిపేస్తూ 76.24 రూపాయలకు చేరింది.

పెట్రోల్ తో సమానంగా పెరుగుతున్న డీజిల్..
మరోవైపు డీజిల్‌ ధరలు కూడా అదే దారిలో పయనిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల సందర్భంగా 9 రోజుల పాటు ధరలు పెంచని పెట్రోసంస్థలు ఎన్నికల ఫలితాల అనంతరం వాతలు పెట్టడం మొదలు పెట్టాయి. గత ఎనిమిది రోజులుగా వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నాయి. పన్నులను కలుపుకుంటే లీటరు పెట్రోలు ధర ముంబయిలో 84.07రూపాయలు, హైదరాబాద్‌లో 80.76 రూపాయలు, కోల్‌కతాలో 78.91రూపాయలు, చెన్నైలో 79.13 రూపాయలుగా ఉన్నాయి. డీజిల్‌ ధర హైదరాబాద్‌లో 73.45 రూపాయలుగా ఉండగా.. ముంబయిలో 71.94 రూపాయలు, కోల్‌కతాలో 70.12 రూపాయలు, చెన్నైలో 71.32 రూపాయలుగా ఉంది. పెట్రోల్‌ ధర తక్కువగా పనాజీలో 70.26 రూపాయలుగా ఉండగా.. అండమాన్‌ రాజధాని పోర్ట్‌బ్లెయర్‌లో డీజిల్‌ రేటు తక్కువగా 63.35 రూపాయలుగా నమోదైంది.

అనివార్యంగా పెంచాల్సి వస్తోంది : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
పెట్రోల్‌,డీజిల్‌ ధరల పెరుగదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా.. అనివార్యంగా ధరలు పెంచాల్సి వస్తోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. ఒపెక్ దేశాలు ఆయిల్ ఉత్పత్తిని తగ్గించేయడం, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు బాగా పెరిగిపోవడం ఇందుకు కారణం అన్నారు. మరోవైపు పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించే ఆలోచన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని కూడా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మొత్తానికి పెరుగుతున్న ధరలను తగ్గించే ఆలోచనేదీ లేదని, ప్రజలు పెట్రోభారాన్ని మోయాల్సిందేనని కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలతో స్పష్టం చేశారు.

జీవితకాల గరిష్టానికి చేరిన పెట్రోలు, డీజిల్‌ రేట్లు --
పెట్రోలు, డీజిల్‌ ధరలు రోజురోజుకి పెరుగుతూ జీవితకాల గరిష్టానికి చేరుకుంటున్నాయి. దేశ రాజధానిలో పెట్రోల్‌ ధర 33 పైసలు పెరిగి రూ.76.24కు చేరింది. రోజువారీ ధరల సమీక్ష విధానాన్ని తీసుకొచ్చిన అనంతరం పెట్రోల్‌ ధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం. మరోవైపు డీజిల్‌ 26 పైసలు పెరిగి జీవితకాల గరిష్టం రూ.67.57కు చేరింది. ఢిల్లీలో 2014 సెప్టెంబర్‌ 14న పెట్రోల్‌ ధర రూ.76.06 ఉంది. ఇప్పుడు ఆ రికార్డును చెరిపేస్తూ 76.24 రూపాయలకు చేరింది. మరోవైపు డీజిల్‌ ధరలు కూడా అదే దారిలో పయనిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత చమురు సంస్థలు గత ఏడు రోజులుగా వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నాయి. పన్నులను కలుపుకుంటే లీటరు పెట్రోలు ధర ముంబయిలో 84.07రూపాయలు, హైదరాబాద్‌లో 80.76 రూపాయలు, కోల్‌కతాలో 78.91రూపాయలు, చెన్నైలో 79.13 రూపాయలుగా ఉన్నాయి. డీజిల్‌ ధర హైదరాబాద్‌లో 73.45 రూపాయలుగా ఉండగా.. ముంబయిలో 71.94 రూపాయలు, కోల్‌కతాలో 70.12 రూపాయలు, చెన్నైలో 71.32 రూపాయలుగా ఉంది. పెట్రోల్‌ ధర తక్కువగా పనాజీలో 70.26 రూపాయలుగా ఉండగా.. అండమాన్‌ రాజధాని పోర్ట్‌బ్లెయర్‌లో డీజిల్‌ రేటు తక్కువగా 63.35 రూపాయలుగా నమోదైంది.

 

09:37 - May 21, 2018

హైదరాబాద్ : ఎస్వీకేలో వున్న ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో ప్రముఖులు వేసిన అరుదైన చిత్రాలు ఆహుతులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఆర్టిస్ట్ సంతోష్ రాథోడ్‌ గీసిన పెయింటింగ్స్‌ను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రదర్శనకు ఉంచారు. తాను గీసిన చిత్రాలను తొలిసారిగా హైదరాబాద్‌లో ప్రదర్శనకు ఉంచడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో వివిధ రకాల రంగులను ఉపయోగించి చిత్రాలను గీసినట్లు సంతోష్‌ రాథోడ్‌ తెలిపారు.

09:36 - May 21, 2018

పశ్చిమగోదావరి : తణుకు పశు వైద్యాశాలలో నాగుపాముకు అరుదైన శస్త్రచికిత్స చేశారు. తాడేపల్లిగూడెంలో కృష్ణయ్య అనే రైతు పోలంలో నాలుగు రోజులుగా తెల్లతాచుపాము కదల్లేని స్థితిలో ఉండగా రైతులు జంగారెడ్డిగూడెం స్నేక్‌ సేవియల్‌ సంస్థకు సమాచారం అందించారు. దీంతో తణుకులో పశు ఆరోగ్య సంస్థకు తరలించి, వైద్యుల సూచన మేరకు పామును ఎక్స్‌రే తీయగా మెడ భాగం ఎముకలు విరిగినట్లు గుర్తించారు. దీంతో ఆహరం తీసుకోలేక చలనం లేకుండా పడిఉందని వైద్యులు తెలిపారు. పాముకు ఆహారం అందించి... మెడకు చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. పాముకు వారం రోజులు సరిపడ ఆహారం అందిచామని డాక్టర్‌ శ్రీధర్ తెలిపారు.

09:35 - May 21, 2018

నిర్మల్‌ : సారంగాపూర్, మామడ మండలాల్లో రైతుబంధు చెక్కులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు. రైతులు ఆత్మవిశ్వాసంతో దర్జాగా బతకాలనే సదుద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రైతులకు ప్రతీ ఎకరానికీ రెండుపంటలకు కలిపి 8 వేల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో బ్యాంకుల నుండి రుణాలు తీసుకోకుండా పంటలను పండించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

09:34 - May 21, 2018

సంగారెడ్డి : ఓ పక్క ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని పాలకులు అంటుంటే .. వైద్యులు, సిబ్బంది మాత్రం తమ ప్రవర్తన మార్చుకోవడం లేదు. సంగారెడ్డిలోని మాతా శిశు కేంద్రంలో డాక్టర్లు రోగులపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దీనిపై ఆదివారం రాత్రి వైద్యులకు, పేషెంట్లకు మధ్య ఘర్షణ తలెత్తింది. డెలివరీ కోసం వచ్చిన గర్భిణులపై కూడా వైద్యులు దుర్భాషలాడుతున్నారు. పందుల్ని కంటున్నట్లుగా పిల్లల్ని ఎందుకు కంటున్నారంటు ప్రభుత్వ వైద్యులు మాట్లాడుతున్న తీరు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యుల, సిబ్బందుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రులకు వస్తున్న రోగుల పట్ల నిర్లక్ష్యం, అవమానకరంగా మాట్లాడటం ప్రభుత్వ ఆసుపత్రులలో పరిపాటిగా మారిపోతున్నాయి. పేదల కోసం వున్న ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్య కాసారంగా మారుతున్న వైనం తరచు వినిపిస్తునే, కనిపిస్తునే వుంటున్నాయి. ఈ క్రమంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వార్తల్లోకొచ్చింది. రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు నిర్లక్ష్యానికి, అహంకారానికి ప్రతీకలా కనిపిస్తోంది. దీంతో రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి దయనీయంగా మారింది.

రష్యా పర్యటనకు ప్రధాని మోదీ..

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు బయలుదేరారు. భారత్ - రష్యాల భాగస్వామ్యం బలోపేతమే లక్ష్యంగా పర్యటన కొనసాగనుంది. సోచీ వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఉగ్రవాద అంశాలు, సిరియా, అఫ్గాన్‌లలో నెలకొన్న అశాంతి, అంతర్జాతీయ అంశాలు, షాంఘై సహాకార సంస్థల సమావేశం, బ్రిక్స్ సమావేశాలు, ఇరుదేశాల మధ్య రక్షణ సంబంధాల బలోపేతపై చర్చించే అవకాశం ఉంది.

రచయిత్రి యుద్ధనపూడి సులోచనారాణి మృతి..

హైదరాబాద్ : ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న అమెరికాలో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు ఎవ్వరూ సాటిరారని సులోచనారాణి నిరూపించుకున్నారు. ఆమె రాసిన పలు కథలు సినిమాలుగా కూడా తీశారు. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మువ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు.

మహిళ దారుణ హత్య..రైల్వే ట్రాక్ పై పడేశారు..

హైదరాబాద్ : పాతబస్తీలో మహిళను దారుణంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ప్యాక్ చేసి రైల్వేట్రాక్ పక్కన పడేశారు. డబీర్ పూర్ స్టేషన్ కు కొంచెం దూరంలో ఈ మృతదేహాం ఉన్న ప్యాక్ ను ఉంచారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. మహిళను హత్య చేసి.. ఆ శరీరానికి బురఖా వేసి ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచారు. ఆపై ఆ బ్యాగ్ ని బియ్యపు సంచిలో పెట్టారు. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

బీజేపీ ఎమ్మెల్యేను గుర్తుపట్టలేదనీ ఎస్పీపై దౌర్జన్యం..

ఉత్తరప్రదేశ్ : తంతే గానీ పోలీసులకు బుద్ధి రాదని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ బాజ్‌పాయి వివాదాస్పదాస్పదంగా వ్యవహరించారు. అలహాబాద్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ బాజ్‌పాయిని ఎస్పీ గుర్తుపట్టని కారణంగా ప్రవేశ ద్వారం వద్ద ఎస్పీ గంగపార్ సునీల్ సింగ్ అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే ఎస్పీని పట్టుకుని 'మిమ్మల్ని తంతే కానీ బుద్ధి రాదు’ అంటు ఎస్పీపై ఎమ్మెల్యే విరుచుకుపడ్డాడు. ఎస్పీపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో వైరల్ అయింది.

హస్తినకు కుమారస్వామి పయనం..

కర్ణాటక : కాంగ్రెస్-జేడీఎస్ లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామిగౌడ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు నేడు ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్ గాంధీలను కలసి ప్రమాణస్వీకారానికి రావాలని కుమారస్వామి పిలవనున్నారు. అలాగే కాంగ్రెస్, జేడీఎస్ నేతల్లో ఎవరికి ఏ పదవులు ఇవ్వాలనే విషయమై వారితో చర్చించే అవకాశం వుంది.

జవాన్ల వాహనాన్ని పేల్చివేసిన మావోలు,7గురు జవాన్లు మృతి..

ఛత్తీస్ గఢ్ : ఇటీవల జరిగిన వరుస ఘటనల్లో తమ సభ్యులను కోల్పోయిన మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకున్నారు. మరోసారి రెచ్చిపోయారు. మందుపాతర పెట్టి జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చి వేశారు. దంతెవాడ జిల్లాలోని చల్నార్ గ్రామంలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మావోయిస్టులు మందుపాతర పేల్చిన ప్రాంతంలో పెద్దగొయ్యి ఏర్పడింది. పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ముక్కలుముక్కలైంది.

ఏపీ బంద్ కు మావోల పిలుపు..

విజయవాడ : నేడు ఏపీ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తు ఏపీ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. 

అనంతలో సీఎం చంద్రబాబు పర్యటన..

అనంతపురం : జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రొద్దం మండలం తులకలపట్నం చెరువులో జలహారతి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం, గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లకు భూమి పూజ చేస్తారు. ‘రచ్చబండ’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలతో ముఖాముఖీ మాట్లాడతారు. ఈ సందర్భంగా నిర్వహించే ఓ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.

జిల్లాలో లక్ష్మీనారాయణ పర్యటన..

ప్రకాశం : నేడు జిల్లాలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పర్యటించనున్నారు. ఒంగోలులో పొగాకు వేలం కేంద్రాన్ని,చదలవాడలో పశుక్షేత్రాన్ని లక్ష్మీనారాయణ సందర్శించనున్నారు. 

09:25 - May 21, 2018

హైదరాబాద్ : పాతబస్తీలో పాశవిక చర్యకు పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. భార్యను అత్యంత కిరాతకంగా చంపివేశాడు ఓ భర్త చేసిన ఘోరం వెలుగులోకి వచ్చింది. కోటి కలలతో భర్తను నమ్ముకుని అతనివెంటే జీవితాంత జీవించేందుకు కన్నవారిని, అయినవారిని వదిలి కట్టుకున్న భర్తతో కలిసి వచ్చేస్తుంది భార్య. అటువంటి భార్య జబానాను అత్యంత పాశవికంగా కడతేర్చి గోనెసంచిలో కుక్కి రైల్వే ట్రాక్ పై పడవేశాడు పాతబస్తీలోని ఫర్హాన్ నగర్ కు చెందిన అక్బర్ హైదర్ ఖాన్ అలీ అనే దుర్మార్గుడు. కాగా పాతబస్తీలోని ఓ పీఎస్ పరిధిలో గోనెసంచీలో వున్న మహిళ మృతదేహం స్థానికంగా కలకలం సృష్టించింది. తెల్లవారుఝాముల గోనెసంచీలోంచి రక్తం కారటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా జబానా అక్బర్ కు మూడో భార్య అన్నట్లుగా తెలుస్తోంది. క్యూస్ టీమ్ ను రంగంలోకి దింపిన పోలీసులు నిందితుడు మృతురాలి భర్తగా గురించి అరెస్ట్ చేసేందుకు అక్బర్ నివాసానికి వెళ్లగా అప్పటికే తన ఇద్దరు పిల్లలతో దుబాయ్ పరారైనట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా నిందితుడు అప్పటికే రెండు వివాహాలు కాగా ఇద్దరికీ తలాఖ్ ఇచ్చి మూడో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో మూడో భార్యను దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. దీంతో అక్బర్ ను అరెస్ట్ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అక్బర్ నివాసంలోవున్న అతని తల్లిని విచారించగా తనకేమీ తెలీదని చెప్పిందని పోలీసులు పేర్కొంటున్నారు.

Don't Miss