Activities calendar

22 May 2018

21:52 - May 22, 2018

తిరుమల : ధార్మిక క్షేత్రం టీటీడీ వివాదాల పుట్టగా మారింది. టీటీడీ ప్రధాన అర్చక పదవి నుంచి ఉద్యాసనకు గురైన రమణదీక్షితులు, అధికారుల పరస్పర ఆరోపణలు, విమర్శలతో ఈ అంశం.. రాజకీయ రంగు పులుముకుంది. శ్రీవారి ఆభరణాలు మాయమయ్యాయని, కైంకర్యాలు ఆగమశాస్త్ర విరుద్ధంగా జరుగుతున్నాయంటూ దీక్షితులు చేసిన ఆరోపణల తర్వాత వివాదం తారా స్థాయికి చేరింది. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండ్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది.

శ్రీవారి దివ్యక్షేత్రం చుట్టూ వివాదాలు
తిరుమల శ్రీవారి దివ్యక్షేత్రం చుట్టూ వివాదాలు ముసురుకొంటున్నాయి. టీటీడీ ప్రధాన అర్చక పదవి నుంచి ఉద్వాసనకు గురైన రక్షమణదీక్షితులు చేసిన ఆరోపణలతో వివాదం రాజుకుంది. శ్రీవారి వంటశాల పోటులో తవ్వకాలు జరిపారని, పోటు మూసివేసి 15 రోజులు పాటు స్వామివారిని పస్తు పెట్టారని రమణ దీక్షితులు ఆరోపించారు. శ్రీవారి నగలు మాయమ్యాయని, భద్రత కరువైందని, వజ్రాలు ఎల్లలుదాటి విదేశాలకు వెళ్లిపోయాయని రమణదీక్షితులు ఆరోపించారు.

స్వామివారి ఆభరణాలన్నీ భద్రం : ఈవో సింఘాల్
రమణదీక్షితులు చేసిన ఈ ఆరోపణపై టీటీడీ ఈవో ఏకే సింఘాలు చాలాసార్లు వివరణ ఇచ్చారు. స్వామివారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని, 1952 నుంచి పక్కా లెక్కలతో రికార్డులు ఉన్నాయని స్పష్టం చేశారు. తొలగించిన దీక్షితులు స్థానంలో టీటీడీలోని నాలుగు మిరాశీ కుటుంబాల నుంచి నలుగుర్ని ప్రధాన అర్చకులుగా నియమించండం, వారు రమణదీక్షితులుకు వ్యతిరేకంగా, అధికారులకు అనుకూలంగా మాట్లాడంతో వివాదం ముదిరి, భక్తుల మనోభావాలు దెబ్బతినే స్థాయికి చేరింది. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకుని టీటీడీ ఈవో ఏకే సింఘాల్‌, చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తిరుమల పవిత్రకు భంగం కలుగుకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వామివారి ఆభరణాలు మాయమయ్యాయన్న ఆరోపణలపై అధికారులు వివరణ ఇచ్చారు.

సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండ్‌
రమణదీక్షితులు చర్యను టీటీడీ చైర్మన్‌ సుధాకర్‌యాదవ్‌ తప్పుపట్టారు. రిటైర్‌మెంట్‌ తర్వాతే తప్పులను ఎందుకు ఎత్తిచూపుతున్నారని ప్రశ్నించారు. మరోవైపు రమణదీక్షితులును శ్రీవారి ప్రధాన అర్చక బాధ్యతల నుంచి తొలగించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీక్షితులు చేసిన ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండ్‌ వస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే పీవీఎన్‌ మాధవ్‌ కూడా ఇదే డిమాండ్‌ చేశారు. టీటీడీ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం పెరగడంతోనే సమస్యలు వస్తున్నాయని విమర్శించారు. టీటీడీలో ఆభరణాలు మాయమయ్యాయంటూ వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది అరుణ్‌ సీబీఐకి ఫిర్యాదు చేశారు. రాజకీయ నాయకులు, ప్రముఖులేకాదు... తిరుపతి ప్రజలు కూడా రమణదీక్షితులు లేవనెత్తిన అంశాలపై విచారణకు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. 

21:43 - May 22, 2018

తమిళనాడు : రాష్ట్రంలోని తూత్తుకుడి.. రక్తసిక్తమైంది. వివాదాస్పద స్టెరిలైట్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళన.. తొమ్మిది మందిని బలిగొంది. పలు వాహనాలు తగులబడిపోయాయి. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన ఉద్యమకారులకు.. పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. పర్యవసానంగా.. తూత్తుకుడి కలెక్టరేట్‌ పరిసరాలు హింసాత్మకమయ్యాయి. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది.

హింసాత్మకంగా మారిన తూత్తుకుడి ఆందోళన
తమిళనాడు రాష్ట్రం.. తూత్తుకుడిలోని స్టెరిలైట్‌ కాపర్‌ ఫ్యాక్టరీని మూసివేయాలంటూ.. స్థానికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకమైంది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో తొమ్మిదిమంది మరణించినట్లు తమిళ మీడియా ప్రసారం చేసింది. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు.. అక్కడే ఉన్న పలు వాహనాలను ధ్వంసం చేశారు. కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు.

తూత్తుకుడిలో 144వ సెక్షన్‌
తూత్తుకుడిలో 144వ సెక్షన్‌ను ఉల్లంఘిస్తూ.. ఆందోళనకారులు కలెక్టరేట్‌ వైపు దూసుకు వచ్చారు. వారిని నిలువరించేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. ప్రతిగా ఆందోళనకారులు.. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు గాయపడ్డారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు.. కలెక్టరేట్‌లోకి చొరబడి నిప్పుపెట్టారు. ఆందోళనకారులను నిలువరించేందుకు సుమారు నాలుగు వేల మంది పోలీసులను మోహరించారు. పరిస్థితి విషమించడంతో.. పోలీసులు కాల్పులు జరిపారు.

22 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆందోళన
తూత్తుకుడిలోని వేదాంత స్టెరిలైట్‌ ఫ్యాక్టరీని మూసివేయాలంటూ స్థానికులు దాదాపు 22 సంవత్సరాలుగా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో.. మంగళవారం కూడా.. స్థానికులు ర్యాలీకి సమాయత్తమయ్యారు. కార్మిక సంఘాల పిలుపు మేరకు తూత్తుకుడిలో షాపులను స్వచ్చందంగా మూసేసి బంద్‌ పాటించారు. ఆందోళనకారుల ర్యాలీని నిలువరించేందుకు జిల్లా యంత్రాంగం పట్టణంలో 144 సెక్షన్‌ విధించింది. కేవలం పాత బస్టాండ్‌ సమీపంలోని మైదానంలో మాత్రమే ఆందోళన జరపాలంటూ కలెక్టర్‌ వేంకటేశన్‌ సూచించారు. ఇదే ఆందోళనకారుల్లో ఆవేశం కట్టలు తెంచుకోవడానికి కారణమైంది.

అన్నా డిఎంకే ప్రభుత్వం విఫలమైంది : స్టాలిన్‌
తూత్తుకుడి ఘటనను నిలువరించడంలో అన్నా డిఎంకే ప్రభుత్వం విఫలమైందని.. డిఎంకె నేత స్టాలిన్‌ ఆరోపించారు. స్టెరిలైట్‌ ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమానికి మద్దతిచ్చిన సినీనటుడు, రాజకీయనాయకుడు కమలహాసన్‌ కూడా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ ఫ్యాక్టరీలో రాగిని కరిగించే ప్రక్రియ కారణంగా.. స్థానికంగా ఆస్తమా తదితర శ్వాసకోశ వ్యాధులు బాగా పెరిగి.. ప్రజల ప్రాణాలను హరిస్తోందన్న స్థానికుల ఆవేదనను ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

21:39 - May 22, 2018

కర్ణాటక : జెడిఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా జెడిఎస్‌ నేత కుమారస్వామి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బిజెపి యేతర రాష్ట్రాల సిఎంలు, ప్రముఖ నేతలు హాజరు కానున్నారు.

కుమారస్వామి ప్రమాణస్వీకారానికి అతిరథ మహారథులు
కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కొలువు దీరనుంది. కాంగ్రెస్‌ మద్దతుతో జేడీఎస్‌ నేత కుమారస్వామి బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులు హాజరు కానున్నారు. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్, బిఎస్‌పి చీఫ్‌ మాయావతి, ఆర్‌ఎల్‌డి చీఫ్ అజిత్‌సింగ్ తదితర బిజెపియేతర పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. వీరితో పాటు కేరళ సిఎం పినరయి విజయన్, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, వెస్ట్‌ బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ కూడా హాజరవుతున్నారు. అత్యవసర సమావేశాలుండడంతో తెలంగాణ సిఎం కేసీఆర్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం లేదు. మంగళవారం నాడే బెంగళూరు వెళ్లి కుమారస్వామిని అభినందించారు. కర్ణాటకలో ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న బిజెపికి భంగపాటు తప్పలేదని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామమని చెప్పారు.

ఇంకా తేలలని పదవుల లెక్కలు..
ప్రభుత్వ ఏర్పాటు, మంత్రి పదవుల కేటాయింపు తదితర అంశాలను కర్ణాటక కాంగ్రెస్‌ నేతలతోనే చర్చించుకోవాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ కుమారస్వామికి సూచించింది. లింగాయత, దళిత నాయకులకు తలా ఒక ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని కాంగ్రెస్‌ ప్రస్తావిస్తోంది. డిప్యూటి సిఎంలు ఇద్దరా...ఒక్కరా...అన్నదానిపై ఇంకా అవగాహన కుదరలేదు. 33 మంత్రి పదవులకు గాను 20 బెర్తులు కాంగ్రెస్‌ ఆశిస్తోంది. జెడిఎస్‌ 13 నుంచి 15 మంత్రి పదవులు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా కాంగ్రెస్‌ సభ్యుడే ఎన్నికయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

21:36 - May 22, 2018

హైదరాబాద్ : జూన్‌ రెండు నాటికి రాష్ట్రమంతటా... రైతుబంధు చెక్కుల పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. దీనికి అనుసరించాల్సిన వ్యూహరచనకు.. బుధవారం మంత్రులు, కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

రైతు బంధుపై కేసీఆర్ సమీక్ష
రైతు బంధు కార్యక్రమం అమలు తీరును ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సమీక్షించారు. దేశంలో ఏ ప్రభుత్వానికీ రాని గొప్ప ప్రజా స్పందన రైతుబంధు ద్వారా లభిస్తున్నందుకు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమానికి మించిన ప్రాధాన్యత తమ ప్రభుత్వానికి లేదన్న కేసీఆర్‌, వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని రివ్యూలో చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు, మరికొన్ని చోట్ల చెక్కులు అందలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సమీక్ష సందర్భంగా గుర్తించారు. ఎదురైన అవరోధాలను అధిగమించి, జూన్‌ 2 నాటికి ప్రతి రైతుకూ పాసుపుస్తకాలు, చెక్కులు అందించాలని అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన వ్యూహం ఖరారుకు.. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ రాకుండానే పలు కార్యక్రమాలు
రైతులకు జీవిత బీమా పథకం, కంటివెలుగు, రాష్ట్ర అవతరణ వేడుకలు, పంచాయతీరాజ్‌ ఎన్నికల ఏర్పాట్లు తదితర అంశాలపైనా బుధవారం నాటి సమావేశంలో చర్చిస్తారు. పంచాయతీరాజ్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే లోపే ఈ కార్యక్రమాలన్నింటినీ వేగవంతం చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి ప్రగతిభవన్‌కు వచ్చి.. రైతుబంధు పథకం విజయవంతం పట్ల సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 

21:32 - May 22, 2018

శ్రీకాకుళం: ప్రజలకు నీతివంతమైన పాలన అందిస్తారని 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పాలన చేస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు భూకబ్జాలకు పాల్పడుతూ ప్రజలను దోచుకుతింటున్నారని మండిపడ్డారు. టీడీపీ దోపిడీ, దౌర్జన్యపాలనను ప్రజలు, జనసైనికులు చూస్తూ ఊరుకోబోరని శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ జససేన కవాతు సభలో పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు.

టీడీపీ భూకబ్జాలు : వపన్
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటార యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. కాశీబుగ్గ జనసేన కవాతులో పవన్‌ పాల్గొన్నారు. శ్రీకాకుళం పోరాటాలను ప్రస్తావించిన జనసేనాని.. తన యాత్రకు ఈ ప్రాంత ప్రజల నుంచి వస్తున్న స్పందనకు వందనాలు తెలిపారు. ప్రజలకు అవినీతిరహిత పాలన అందిస్తారని 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యేలు భూకబ్జాలకు పాల్పడుతూ, ప్రజలను దోచుకుతింటున్నారని పవన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. పలాస ప్రాంతంలో జీఎస్‌టీకి తోడు టీడీపీ ఎమ్మెల్యేలు వసూలు చేస్తున్న అల్లుడు ట్యాక్స్‌ సంగతి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియదా... అన్ని పవన్‌ ప్రశ్నించారు.

అన్ని సీట్లల్లోను పోటీ : వవన్

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ప్రధాని మోదీ పట్ల పవన్‌ మెతక వైఖరి అవలంభిస్తున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేనాని స్పందించారు. టీడీపీ అవినీతి పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు 2019 ఎన్నికల్లో జనసేన రాష్ట్రంలోని అన్ని సీట్లకు పోటీ చేస్తుందని పవన్‌ మరోసారి చెప్పారు. జనబలంతో గెలిచి నీతివంతమైన పాలన అందిస్తామని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. 

21:28 - May 22, 2018

విశాఖపట్నం : ప్రత్యేక హోదా.. తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని, దీనిని సాధించేందుకు కేంద్రంపై ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. బీజేపీని నమ్మి 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే ప్రధాని మోదీ నమ్మకం ద్రోహం చేశారని మండిపడ్డారు. నమ్మకం ద్రోహం చేసిన పార్టీలకు పుట్టగతులుండవని విశాఖ ధర్మపోరాట సభలో చంద్రబాబు హెచ్చరించారు.

బీజేపీ, వైసీపీలపై చంద్రబాబు ఫైర్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ నమ్మకద్రోహం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. విశాఖలో జరిగిన ధర్మపోట సభలో అటు బీజేపీ ఇటు వైసీపీపై విరుచకుపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కేంద్ర ప్రభుత్వంపై ధర్మపోరాటం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది తెలుగు ప్రజల ఆత్మగౌవారికి సంబంధించిన అంశమని, దీనిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన వైసీపీ నాయకులు బీజేపీతో చెట్టపట్టాలేసుకు తిరుగుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఇలాంటి పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని కర్నాటక ఎన్నికలు రుజువు చేశాయన్నారు.

2019లో బీజేపీకి సినిమా చూపిస్తాం : లోకేశ్
శాఖ రైల్వే జోన్‌ ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీకి తగిన శాస్తి తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. మరోవైపు విశాఖ ధర్మపోరాట సభలో ప్రసంగించిన ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ కూడా బీజేపీపై విరుచుకుపడ్డారు. 2019 ఎన్నికల్లో కమలనాథులకు ప్రజలు చుక్కలు చూపిస్తారని అన్నారు. శాఖ ధర్మపోరాట సభకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావడంతో తెలుగుదేశం శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.

 

20:38 - May 22, 2018

టీటీడీ మాజీ అర్చకులు రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. సీఎం చంద్రబాబు టీటీడీ పాలకమండలితో సమావేశమయ్యారు. శ్రీవారి ఆభరణలు,అవినీతి, ఆ ప్రాంతంలోజరుగుతున్న అవకతవకలపై చర్చ జరగాల్సిన అవసరముందని రమణదీక్షితుల వాదన..మరోపక్క ఆభరణాలు సురక్షితంగా వున్నాయనీ..అవినీతి ఏమీ జరగటంలేదని పాలకమండలి స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ కుమారస్వామి రమణదీక్షితులుకి మద్దతు పలకటం గమన్హాం. ఈ క్రమంలో బీజేపీ ప్రభావంతోను రమణదీక్షితులు టీటీడీ వివాదాంశంగా చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ వివాదం ఏం కాబోతోంది? ఎవరిది వాస్తవం? ఎవరిది అవాస్తవం? ప్రముఖ విశ్లేషకులు నగేశ్ విశ్లేషణ..

20:27 - May 22, 2018

హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానంపై మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని హైకోర్టు అడ్వకేట్‌ అరుణ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన.. సీబీఐకి లేఖ రాశారు. స్వామివారి బంగారు ఆభరణాలు, ఆస్తుల లెక్కతేల్చాలంటున్న హైకోర్టు అడ్వకేట్‌ అరుణ్‌ డిమాండ్ చేశారు.

20:22 - May 22, 2018
20:18 - May 22, 2018

ఊర్లపొంటి దొంగలొస్తున్నరట..? మందిని సంపుతున్నరట.. ఇండ్లన్ని దోస్తున్నరట.. పక్కపొంటి ఊరికాడ దొర్కిండ్రట.. ఇట్ల రకరకాల పుకార్లు శికారు జేస్తున్నయ్ సోషల్ మీడియాల.. అటు పోలీసోళ్లు ఎంత మొత్తుకున్నా జనానికి అర్థమైతలేడు.. ఎవ్వడన్న మాశిన బట్టలు పెర్గిన నెత్తితోని గనిపిస్తె వాన్ని వట్కోని సావగొడ్తున్నరు జనం..

ఆంధ్ర రాష్ట్రంల ఎన్నికల వేడి సుర్వైంది.. అసెంబ్లీ ఓట్లకు ఇంకో యాడాది టైమున్నా..? అన్ని పార్టీలు ఒకదాన్ని మించి ఇంకోటి జనంలకు వోతనేఉన్నయ్.. పొయ్యే రూపం వేరున్నా..? అంతిమ లక్ష్యం మాత్రం జనంతానున్న ఓటును గుంజుకునుడే అన్నట్టు.. తెల్గుదేశం గ్రామదర్శిని అంటున్నది.. వైసీపీ పాదయాత్ర జేస్తున్నది.. జనసేనా బస్సుయాత్ర.. జేడీ లక్ష్మీనారాయణ భరోసా యాత్ర, సీపీఎం లెఫ్ట్ పార్టీలు పిట్రోలు యాత్రలు..

నన్ను విమర్శించే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి లేదు అంటున్నడు నీతికి నిల్వుటద్దమైన శ్రీ నారా చంద్రాలు సారు.. మీరు రాష్ట్రపతి ఎన్నికలళ్ల.. ఉపరాష్ట్రపతి ఎన్నికలళ్ల బీజేపీ అభ్యర్ధికి అనుకూలంగ ఓట్లేశి రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు వెట్టినోళ్లు మీరు నన్నా అనేది అని మస్తు గరమైతున్నడు సారు..

ఏతుల పుంజు ఏతుల పుంజు అంటె ఇన్నరుగని.. ఏతుల పుంజు ఎట్లుంటదో సూశిండ్రా మీరు ఎన్నడన్న..? నల్లగొండ నడిగడ్డమీదున్నది ఆ పుంజు.. ఆ పుంజు ఏతులు జూస్తే.. అవద్దాలు ఆత్మహత్య జేస్కుంటయ్.. మమ్ములను మించిన మొనగాడున్నడా ఈ భూమ్మీద అని..? మరి ఆల్చమెందుకు పాండ్రి సూపెడ్త..

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కాడ ఎక్వేం లేదు.. ఐదే ఎక్రాలు కబ్జా వెట్టి పట్టా జేపిచ్చుకున్నరట మన లీడర్లు.. ఎంత శిగ్గుతక్వ ముచ్చట ఒక్కడొక్కడు వందల ఎక్రాలు కబ్జాలు వెట్టుకుంటున్నరు.. వాడెవ్వడో ఐదే ఎక్రాలు వెడ్తడా..? చేశిన దొంగతనమన్న గట్టిగ జేయరాయే.. ఓ యాభై ఎక్రాలు వెడ్తె మన ముఖ్యమంత్రిగారు పర్వునిలవెట్టినోళ్లు అయితరుగని.. చిన్నచిన్నగ జేస్తారు.. ఆయ్..

ఆంచూర్ రైతులు మళ్లొకపారి మోసపోయిండ్రు మార్కెట్ల.. పోయిన యాడాది గూడ ఇసొంటి మోసమే అయ్యింది ఈసారి గూడ రిపీట్ అయ్యింది.. నిజామాబాద్ జిల్లాల ఆంచూర్ రైతులు చాలమందుంటయ్.. అదే అంచూర్ అంటే మామిడి కాడ ఒర్గుదీశి ఎండవెట్టేది.. మద్దతు ధర దొర్కుతదేమో అని మామిడి చెట్టంత ఆశవెట్టుకోని మార్కెటుకోస్తె మళ్ల గదే దళారీగాళ్లు తల్గి ధర తక్వ జేశి కొంటున్నరట..

ఇదే కన్ఫ్యూజన్ మళ్ల.. నిన్నరాత్రి జగిత్యాల జిల్లాకేంద్రంలున్న సర్కారు దావఖానకు ఇద్దరు గర్భిణీ స్త్రీలొచ్చిండ్రట.. డెలివరీ కోసం ఇద్దరికి ఒక్కటే సారి కాన్పు జేశిండ్రు.. ఇద్దరికి మొగపిల్లలే వుట్టిండ్రు.. మరి ఏడ తేడా వచ్చిందో ఏమో.. మా పిలగాన్ని వాళ్లకిచ్చిండ్రు.. వాళ్ల పిలగాన్ని మాకిచ్చిండ్రని కయ్యం లేశింది.. ఇప్పటికి తేలలే పంచాది..

కోతులకు గూడ కోపం బాగనే ఉండెతట్టుందిగదా..? మన్సులకున్నట్టు.. అవ్విటికి గూడ ఒక్కొక్కపారి బీపీ వెర్గెతట్టుంది.. మన్సులను తంతున్నయ్.. ఇయ్యాళ తాజ్ మహాల్ జూస్తందుకు బైటిదేశం మన్సులొచ్చిండ్రట వాళ్ల మీద వడి కర్శినయట ఇద్దరికి గాయాలైనయంటున్నరు.. మరి అవ్వేమనుకున్నయో ఏమో ఈడ మేముండంగ మీరెట్లొస్తరని కోపానికొచ్చినయో ఎట్లనో గని..? కోతుల కథ జూడుండ్రి..

19:53 - May 22, 2018
19:17 - May 22, 2018

తిరుమల కొండపై ఏం జరుగుతోంది? శ్రీవారి ప్రధాన అర్చకులుగా సేవలందిస్తున్న రమణదీక్షితులకు ఎందుకు బలంతంగా పదవీ విరమణ చేయించారు? టీటీడీ అంశంలో సీబీఐ విచారణ చేయించాలనే డిమాండ్ ఎందుకొస్తోంది? ఈనేపథ్యంలో టీటీడీ అర్చకుల భవిష్యత్తు ఏమిటి? ఈ అంశంపై 10టీవీ చర్చ..ఈ చర్చలో బీజేపీ నేత బాబ్జీ, టీటీడీ ఉద్యోక కార్మిక సంఘాల నాయకులు కందారపు మురళి పాల్గొన్నారు. 

19:02 - May 22, 2018

విశాఖపట్నం : రాష్ట్ర విభజన హామీల అములు విషయంలో బీజేపీ ఇచ్చిన వాగ్ధానాలకు విడనాడి..ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరుకు నిరసనగా ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తు టీడీపీ ప్రభుత్వం ధర్మపోరాట దీక్ష చేపట్టిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో  విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో ధర్మ పోరాట బహిరంగ సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతు..భావితరలా భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వంపై 'ధర్మ'పోరాట దీక్ష వెంకన్న పాదాల చెంత ప్రారంభించామనీ సీఎం చంద్రబాబు  తెలిపారు. ఎవరైతే రాష్ట్రానికి అన్యాయం చేయాలనుకునేవారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. విభజన హామీలను అమలు చేస్తామని వాగ్ధానమిచ్చి రాష్ట్రాన్ని దగా చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వేరే రాష్ట్రాలకు ఇచ్చిన హోదా ఏపీకి ఎందుకు ఇవ్వరని సభావేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు. అలాగే విశాఖపట్నం గొప్పతనాన్ని చంద్రబాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు. తెల్లదొరల సింహస్వప్నం అల్లూరి ఘర్జించిన గడ్డ విశాఖ అని..విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించిన నేల అని..అడుగు జాడ గురజాడ జన్మించిన నేల విశాఖ అని..పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం అని పిలుపునిచ్చిన శ్రీశ్రీ వంటి యుగకర్త జన్మించిన చైతన్యపు నేల విశాఖ అని చంద్రబాబు ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించారు. హుదూద్ తుపాను వచ్చి ఛిన్నాభిన్నంచేసినా తుపానునే సవాల్ చేసిన నిలిచి గెలిచిన నేల విశాఖపట్న వాసుల ఘనతన్నారు. రాష్ట్ర అభివృద్దికి ముఖద్వారం విశాఖేనన్నారు. 

మిత్రధర్మానికి బీజేపీ వెన్నుపోటు : లోకేశ్

విశాఖ : రాష్ట్రానికి మేలు జరుగుతుందనే బీజేపీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారని ఏపీ మంత్రి లోకేశ్‌ అన్నారు. ఈ రోజు విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో ధర్మ పోరాట బహిరంగ సభలో మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... మిత్ర ధర్మానికి బీజేపీ నేతలు వెన్నుపోటు పొడిచారని అన్నారు. నాలుగేళ్లు మనం చాలా ఓపిక పట్టామని అన్నారు. మొదటి ఏడాది ప్రత్యేక హోదా ఇస్తామన్నారని, రెండో ఏడాది ఇదిగో ఇస్తున్నాం అన్నారని, విభజన వల్ల ఏపీలో లోటు బడ్జెట్‌ ఉందని, అయినప్పటికీ అన్నింటినీ అధిగమించి చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు.

తూత్తుకుడి ఘటనలో 9మంది మృతి..

తమిళానడు : తూత్తుకుడి ఆందోళన సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో తొమ్మిదిమంది ఆందోళన కారులు మృతి చెందారు. స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమం హింసాత్మక మలుపు తీసుకుంది. తమిళనాడులోని ట్యూటికోరన్‌లో తీవ్ర కాలుష్యానికి కారణమౌతున్న స్టెరిలైట్ రాగి కార్మాగారాన్ని మూసివేయాలని గల కొన్ని నెలలుగా స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. కాగా నేటి నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ వాహనాలు, ఆస్తులపై ఆందోళనకారులు రాళ్లదాడికి పాల్పడ్డారు. కలెక్టరేట్ ముట్టడి ప్రయత్నంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

18:21 - May 22, 2018

విశాఖపట్నం : నగరంలో టీడీపీ ధర్మపోరాట సభ ప్రారంభమయ్యింది. ఈ సభలో మంత్రి గంటా మాట్లాడుతు..స్వయంగా సీఎం చంద్రబాబు గారే ఢిల్లీకి వెళ్లి 29 సార్లు ఫైల్స్ పట్టుకుని వెళ్లి విన్నవించినా కేంద్రప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని దాదాపు నాలుగేళ్లు ఓపికగా ఎదురు చూశామనీ..అయినా ఏమాత్రం పట్టించుకోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓపిక నశించి ధర్మపోరాట దీక్షకు సీఎం చంద్రబాబు చేపట్టారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. జన్మభూమి కోసం తన జన్మదినంరోజున ధర్మపోరాట దీక్ష ప్రారంభించారనీ ఈ దీక్షను, పోరాటాన్ని రాష్ట్ర ప్రజలంతా మద్దతు పలకాలని గంటా శ్రీనివాసరావు కోరారు.

2019లో బీజేపీకి ఆంధ్రా ప్రజలు సినిమా సినిమ చూపించబోతున్నారు : లోకేశ్
ధర్మపోరాటానికి మేము సిద్దంగా వున్నామనీ..మీరు సిద్ధంగా వున్నారా? అని మంత్రి లోకేశ్ ధర్మపోరాట దీక్ష సభలో ప్రజలనుద్ధేశించి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి న్యాయం చేస్తారని కేంద్రంలోని జాతీయ పార్టీ అయిన బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని లోకేశ్ తెలిపారు. మిత్రధర్మానికి మనం కట్టుబడి వుంటే రాష్ట్రంలోని దొంగలపార్టీని చేరదీసి టీడీపీ వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. హోదా ఇస్తామని నమ్మించి ప్యాకేజీతో సరిపెట్టుకోమన్నారనీ అయినా రాష్ట్ర అభివృద్ధి కోసం ఒప్పుకున్నా దానికి కూడా తూట్లు పొడిచారని విమర్శించారు. 16 కేసులున్న జగన్ తో బీజేపీ కుళ్లు రాజకీయాలు చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో కర్ణాటకలో బీజేపీకి తెలుగు ప్రజలు సినిమా చూపించారనీ..2019లో బీజేపీకి ఆంధ్రా ప్రజలు అసలైన సినిమా చూపించబోతున్నారని లోకేశ్ తెలిపారు. 

18:00 - May 22, 2018

సాంకేతిక కారణాలతో చెక్కుల ఇబ్బందులు : కేసీఆర్

హైదరాబాబ్ : సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల కొద్దిమందికి పట్టాదార్ పాస్ పుస్తకాలు రాలేదని, కొన్ని చోట్ల చెక్కులు అందలేదని ప్రభుత్వానికి సమాచారం అందిందని తెలిపారు. సమస్యలేమున్నా పరిష్కరించి అందరికీ పాస్ పుస్తకాలు, చెక్కులు ఇవ్వాలని ఆదేశించారు. జూన్ 2న కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చే నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పంపిణీ కార్యక్రమం పూర్తి కావాలని చెప్పారు. ఎక్కడికీ తిరగకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా భూరికార్డులు సరిచేసి కొత్త పాస్ పుస్తకాలు, పంట పెట్టుబడి సాయం అందించడం పట్ల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.

పోరాటాల నేల నుండి జనసేన పోరాటం : పవన్

శ్రీకాకుళం : తిరుగుబాటు చేసిన నేల మన శ్రీకాకుళమని, రక్తం చిందించడానికి కూడా వెనకాడదని అన్నారు. అలాంటి నేల నుంచి మన పోరాటం ప్రారంభించామని పేర్కొన్నారు. రాజకీయ వ్యవస్థ కుళ్లిపోతోందని, తనకు ఒక్కటే గుర్తు కొస్తోందని, యువతరానికి ఏ సంపద మిగిల్చారని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. యుద్ధాలు, రక్తాలు, కన్నీరు, కలలు, మోసాలు తప్పా ఏం ఇచ్చారని నలదీశారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పలాసలో హరిశంకర్ థియేటర్ నుంచి కాశిబుగ్గ బస్టాండ్ వరకు జరిగిన కవాతులో పాల్గొన్న పవన్ కల్యాణ్‌.. అనంతరం కాశిబుగ్గ బస్టాండ్ వద్ద జరుగుతోన్న బహిరంగ సభలో మాట్లాడారు.

రైతుబంధు వంద శాతం సక్సెస్ : కేసీఆర్

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో ఇవాళ రైతుబంధు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియపై కూడా సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతు..దేశంలో ఏ కార్యక్రమానికి రానంత స్పందన రైతుబంధుకు వస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని వందకు వంద శాతం దిగ్విజయం చేయాలన్నారు. పాస్ బుక్స్, రైతుబంధు చెక్కులు తీసుకోని వారెవరైనా ఉంటే.. తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తీసుకోవాలని సూచించారు. పంట పెట్టుబడి సాయం చేతికందిన తర్వాత రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు.

జూన్ 2లోగా చెక్కులు, పాస్ పుస్తకాలు పంపిణీ : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ఒక్క రైతు కూడా మిగలకుండా ప్రతీ ఒక్కరికీ జూన్ 2లోగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకం, రైతుబంధు చెక్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రగతి భవన్‌లో ఇవాళ రైతుబంధు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియపై కూడా సీఎం సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు మహముద్ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ ఎస్‌కే జోషి, వ్యవసాయ, రెవెన్యూ, ఆర్థిక శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

మసీదులపై జాతీయ జెండాకు ఆదేశాలు..

ఢిల్లీ : దేశంలో ఇస్లాం మతం, ఇస్లాం భావజాలం వ్యాప్తి చెందకుండా చైనా ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. మసీదులు, మత ప్రచారాలపై ఆంక్షలను విధించింది. దేశంలోని ముస్లింలంతా దేశ భక్తిని చాటుకోవాలని, తప్పనిసరిగా మసీదులపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఆదేశించింది. నింగ్సియా, బీజింగ్, జిన్ జియాంగ్, క్వింఘై, గాన్సూ అనే ఐదు ప్రాంతాల్లో మాత్రమే మత ప్రచారాలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా గత వారం రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఈ మేరకు ఆంక్షలు విధించింది. 

17:45 - May 22, 2018

చిత్తూరు : తమిళనాడులోని తూత్తుకుడిలో నిరసననకారుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళన కారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 9మంది ఆందోళనకారులు మృతి చెందారు. కాగా స్టెరిలైట్ కర్మాగారం మూసివేయాలంటూ గ్రామస్తులు మరోసారి ఆందోళనలకు దిగారు. గడిచిన నాలుగేళ్లుగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కంపెనీ నుండి వెలువడుతున్న వ్యర్థాలు..కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. వెంటనే కంపెనీని మూసివేయాలని, కాపర్ ప్లాంట్ కారణంగా తాము శ్వాససంబంధిత ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం..అధికారులు ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోతుండడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గ్రామప్రజలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనకారులను నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జీ, బాష్పవాయు ప్రయోగించారు. ఇందులో కొంతమంది ఆందోళనకారులకు గాయాలైనట్లు సమాచారం. 

17:34 - May 22, 2018

అమరావతి : 2011లో ఆభరణాలు లెక్కించనప్పుడే చాలా ఆభరణాలు మిస్‌ అయ్యాయని పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్‌ చెన్నారెడ్డి అన్నారు. ఆభరణాల విషయంలో ఇప్పటి ప్రభుత్వాలకు కానీ, గత ప్రభుత్వాలకు కానీ ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. రమణ దీక్షితులకు సమస్య వచ్చింది కాబట్టే ఆభరణాలపై ఆయన మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరచాలని..భారతదేశంలోని పలు విలువైన ఆభరణాలు, వజ్రాలు వంటి పలు విలువైన వస్తువుల్లా శ్రీవారి ఆభరణాలు కూడా తరలిపోతాయేమోనని చెన్నారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.ఈ క్రమంలో ఇప్పటికైనా శ్రీవారి ఆభరణాలను భద్రపరచాల్సిన అవరసరముందని చెన్నారెడ్డి అభిప్రాయపడ్డారు.

17:33 - May 22, 2018

శ్రీకాకుళం : జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతు..జరుగుతున్న అన్యాయానికి కడుపు మండి గళమెత్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. పలాసలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూకబ్జాలకు పాల్పడుతున్నారనీ..దీన్ని జనసేన పార్టీ ఎంతమాత్రం సహించదనీ..చొక్కా పట్టుకుని నిలదీస్తామని ఈ విషయంలో జనసేన పార్టీ, జనసేన సైనికులు ఎంతమాత్రం భయపడే ప్రసక్తే లేదని పవన్ స్పష్టం చేశారు. అన్యాయం జరిగితే చూస్తు కూర్చునే జెండా కాదు మన జాతీయ జెండా అని అందుకే మన జాతీయ జెండాకు సదా సలాం చేయాలని పిలుపునిచ్చారు. జనసేన వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీచేస్తుందని పవన్ మరోసారి స్పష్టంచేశారు. ప్రజలకు న్యాయం చేస్తారనే టీడీపీకి అండగా వున్నాననీ..కానీ ఈరోజు సీఎంగా చంద్రబాబు వున్నారంటే జనసేనే కారణమన్నారు. ఉత్తరాంధ్రలో ప్రజలు వెనుకబడ్డారు కానీ నాయకులు మాత్రం కాదన్నారు. స్వాంత్ర్య సమయంలో యువత చేసిన బలిదానాలకు భారతదేశం స్వతంత్ర్యం సాధించిందన్నారు. జిల్లాలోవున్న ఉద్ధానం సమస్య తెలిసి సమస్య కోసం పోరాడానని తెలిపారు. అయినా ప్రభుత్వం తూతూ మంత్రంగా చేసి చేతులు దులిపేసుకుందని విమర్శించారు. ఆమెరికా నుండి వైద్యులను, నిపుణులను తీసుకొచ్చి సీఎం చంద్రబాబుగారికి పరిచయం చేసాననీ..ఉద్ధానం సమస్య కోసం వినియోగించమని కోరానని తెలిపారు. మంత్య్సకారుల సమస్యలు చూసి తనకు చాలా బాధ కలిగిందన్నారు పవన్ కళ్యాణ్. శ్రీకాకుళం వెనకబాటుపై పోరాటం చేయాలని ఉత్సాహపరిచారు. 

17:22 - May 22, 2018

విశాఖ : ధర్మపోరాట సభకు సర్వం సిద్ధమైంది. ఈ సాయంత్రం జరిగే ధర్మపోరాట సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ప్రసంగిస్తారు. ధర్మపోరాట సభ వంచన సభ అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలను విశాఖ జిల్లా పాయకురావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనిత తిప్పికొట్టారు. వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తున్నదంటున్న అనిత విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రం విఫలమయ్యిందనీ అందుకే సీఎం చంద్రబాబు 'ధర్మ'పోరాటాన్ని చేపట్టారన్నారు. ధర్మపోరాట సభను వంచన సభగా వర్ణించే వైసీపీ అధికారం కోసం ఆరాటంతో వైసీపీ ఆరాటయాత్ర చేస్తోందనీ..ఆరాట యాత్ర చేసే వైసీపీకి పొగ పెట్టటం అలవాలేనని ఎమ్మెల్యే అనిత ఎద్దేవా చేశారు. 

17:11 - May 22, 2018

నెల్లూరు : భార్య, భర్తలు దొంగతనం చేసి సీసీ కెమెరాకు చిక్కారు. ఈ నెల 16న నగరంలోని వీబీఎస్‌ కళ్యాణమండపం ఎదురుగా ఉన్న మహబూబ్‌ బాషా అనే కాంట్రాక్టర్‌ ఇంట్లో 3 లక్షల నగదు ఆభరణాలు చోరికి గురయ్యాయి. మహబూబ్‌ బాషా ఇంటి ఎదురుగా వున్న ఓ షాపు ముందు సీసీ కెమెరా వుడటంతో పోలీసులు దాన్ని పరిశీలించారు. దీంట్లో నింధితురాలు హరిక ఎవ్వరు లేని సమయంలో వెళ్లినట్లు కనిపించటంతో పోలీసులు ఆమెను విచారించగా భర్త శ్రీహరితో కలిసి చోరికి పాల్పడినట్టు అంగీకరించింది. పోలీసులు వీరిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి 3 లక్షల విలువ చేసే నగదు, 1.5 లక్షలు విలువ చేసే నగలను స్వాధీనం చేసుకున్నారు.

17:09 - May 22, 2018

విశాఖపట్నం : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టిన గతే 2019లో బీజేపీకి కూడా పడుతుందని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై బీజేపీ ఇచ్చిన హామీలను కాసేపట్లో విశాఖలో జరిగే ధర్మపోరాట సభ ద్వారా కేంద్రానికి గుర్తు చేయబోతున్నామని మంత్రి గంటా శ్రీనివాస్ పేర్కొన్నారు. 

16:38 - May 22, 2018

శ్రీకాకుళం : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ఉత్తరాంధ్రయాత్రలో సెక్యూరిటీ కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని జనసేన ప్రతినిధి శివశంకర్‌ ఆరోపించారు. పోరాట యాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజాసమస్యలను పరిశీలించి వాటి పరిష్కార మార్గాలు అన్వేషించడమేనన్నారు. అశేషప్రజానీకం పవన్‌ యాత్రకు హాజరవుతుంటే... ఓ కానిస్టేబుల్‌ను నియమించడమేంటని ఆయన ప్రశ్నించారు. పవన్‌కు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పవన్‌కు సెక్యూరిటీ కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

వడగాల్పులకు 65మంది మృతి..

పాకిస్థాన్‌ : కరాచీ పట్టణంలో వేడిగాలులు విజృంభిస్తున్నాయి. మూడు రోజుల్లో ఉష్ణతాపానికి కరాచీలో 65 మంది చనిపోయినట్లు మీడియా వెల్లడించింది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిపింది. కరాచీలో నిన్న అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రంజాన్ ఉపవాస దీక్ష సమయం కావడంతో వేడిగాలులతో 114 మంది అస్వస్థతకు లోనయ్యారు. వారిలో 65 మంది చనిపోయారు. 

నీటి కొరత లేకుండా చర్యలు :కేటీఆర్

హైదరాబాద్ : నగరంలో పలు చోట్ల నిర్మించిన మంచినీటి రిజర్వాయర్లను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. అయ్యప్ప సొసైటీ వద్ద రూ. 6.8 కోట్ల వ్యయంతో నిర్మించిన మంచినీటి రిజర్వాయర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతు..రూ.1900కోట్ల వ్యయంతో శివారు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లో 95 శాతం నీటి కొరత తగ్గిందని తెలిపారు.

15:22 - May 22, 2018

విజయవాడ : విజయవాడ లెనిన్ సెంటర్ లో వామపక్షాలు, ప్రత్యేక హోదాసాధన సమితి ఆధ్వర్యంలో ఏపీ ప్రత్యేక హోదా కోసం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలు,సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతు..ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే విషయంలో కేంద్రంలో స్పందన లేకపోవచ్చు కానీ ప్రజల్లో మాత్రం స్పందన అద్భుంతంగా వుందని సీపీఎం నేత బాబురావు పేర్కొన్నారు. కేంద్రం హోదా ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటారనీ..బీజేపీని దెబ్బతీసేంత వరకూ హోదా ఉద్యమం కొనసాగుతుందని బాబూరావు స్పష్టంచేశారు. బీజేపీ మానిఫెస్టోలో పెట్టిన హోదా హామీని, తిరుమల వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన హామీని, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ఏ హామీలను కేంద్రం అమలు చేయలేదని హోదా ఉద్యమంలో పాల్గొన్న నేతలు విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారంతా బీజేపీ హోదా విషయంలో నిలదీస్తున్నారనీ..అమెరికాలో రామ్ మాధవ్ ని, జీవీఎల్ నరసింహారావుని తెలుగువారి నిలదీసారని గుర్తుచేశారు. కన్నడ రాష్ట్రంలో బీజేపీని తెలుగువారు ఓడించారన్నారు. ఈ స్ఫూర్తితో హోదా ఉద్యమాన్ని తెలుగువారు ముందుకు తీసుకెళతారని నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నేతలు పేర్కొన్నారు. 

బాల్యవివాహాల సమాచారంతో తనిఖీలు..

రంగారెడ్డి : కంప్యూటర్ కాలంలో కూడా బాల్యవివాహాలు ఫుల్ స్టాప్ పడటంలేదు. బాల్యవిహాలు జరిపినా..ఆ వివాహాలకు హాజరయినా..కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలున్నా..చట్టాలున్నా చిన్నారి పెళ్లి కూతుళ్లు బలవుతునే వున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని జగద్గిరి గుట్టలో సామూహిక బాల్య వివాహాలు చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారు నిర్వహకులు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఐసీడీఎస్‌, పోలీసు అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో మూడు జంటలను మైనర్లుగా గుర్తించిన అధికారులు, ఇతర యువతీయువకుల వయసుపై ఆరా తీస్తున్నారు.

కుమారస్వామిని అభినందించేందుకు కేసీఆర్

హైదరాబాద్ : కర్ణాటక ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న జేడీఎస్ అధినేత కుమారస్వామిని అభినందించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సాయంత్రం బెంగుళూరుకు వెళ్ళనున్నారు. తరువాత దేవేగౌడతో సమావేశం అయ్యే అకాశమున్నట్లుగా తెలుస్తోంది. బుధవారం కొన్ని అత్యవసర సమావేశాలు ఉన్నందున... కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగేంత వరకు ఆయన బెంగుళూరులో ఉండే అవకాశం లేదు. దీంతో ఈరోజు సాయంత్రమే కేసీఆర్ తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంబలో ఈ సాయంత్రం బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బెంగళూరుకు వెళనున్నారు.

కుమారస్వామి ప్రమాణస్వీకారానికి చంద్రబాబు

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు ఉదయం 9గంటలకు బెంగళూరు వెళ్లనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవనున్నారు. అనంతరం రేపు రాత్రి బెంగళూరు నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి అమరావతికి రానున్నారు.

అన్ని విషయాలలోను చట్టపరంగానే : ఈవో సింఘాల్

అమరావతి : టీటీడీ విషయంలో కొన్ని కొత్త అంశాలు బయటకు వచ్చాయని.. అన్ని అంశాలపై తాము చట్టపరంగానే ముందుకు వెళతామని సీఎం చంద్రబాబుతో సమావేశం అనంతరం ఈవో అనిల్ కుమార్ సింగాల్ మీడియాకు తెలిపారు. దేవాలయ పవిత్రతకు భంగం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాల్సి ఉందని చంద్రబాబు అన్నారని ఆయన అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ముందుకు వెళ్లాలని అన్నారని తెలిపారు. టీటీడీ నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని చెప్పారు.

శ్రీవారి ఆభరణాలన్నీ సురక్షితం : ఈవో సింఘాల్

అమారావతి : శ్రీవారి దేవాలయం వేదికగా కొనసాగుతున్న వివాదాలు, పరిణామాల నేపథ్యంలో ఆలక పాలకమండలితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ క్రమంలో వివాదాలు విషయంగా తలెత్తిన అన్ని విషయాలను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చంద్రబాబుకు వివరించారు. అన్ని విషయాలను చర్చించిన తరువాత ఈవో మీడియా సమావేశంలో మాట్లాడుతు..టీటీడీలోని కొన్ని నగలు మాయమయ్యాయంటూ వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని, 1952 నుంచి దేవస్థానం ఆధ్వర్యంలో ఏయే నగలు ఉన్నాయో అవన్నీ ఇప్పటికీ ఉన్నాయని, రికార్డులో అన్ని వివరాలు ఉన్నాయని ఈవో అన్నారు.

14:34 - May 22, 2018

అమరావతి : ఇటీవల కాలంలో టీటీడీ వేదికగా అనేక వివాదాలకు నెలవుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో టీటీడీని కుదిపేస్తోన్న వివాదాలపై పాలక మండలి అధికారులతో రాష్ట్ర రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. టీటీడీ వ్యవహారాలపై చర్చించిన అనంతరం ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటివరకు జరిగిన పనులతో పాటు పలు విషయాలపై సీఎంకు వివరించామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టీటీడీ విషయంలో కొన్ని కొత్త అంశాలు బయటకు వచ్చాయని వ్యాఖ్యానించారు. అన్ని అంశాలపై తాము చట్టపరంగానే ముందుకు వెళతామని చెప్పారు. దేవాలయ పవిత్రతకు భంగం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాల్సి ఉందని చంద్రబాబు ఆదేశించారనీ..భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ముందుకు వెళ్లాలని చంద్రబాబు సూచించారని సింఘాల్ తెలిపారు. టీటీడీ నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదనీ ఈవో స్పష్టం చేశారు. శ్రీవారి ఆభరణాలలో కొన్ని మాయమయ్యాయంటూ వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని, 1952 నుంచి దేవస్థానం ఆధ్వర్యంలో ఏయే నగలు ఉన్నాయో అవన్నీ ఇప్పటికీ ఉన్నాయని, రికార్డులో అన్ని వివరాలు ఉన్నాయని ఈవో అన్నారు. 1952 నుంచి రికార్డులన్నీ పరిశీలించామని, నగలన్నీ సురక్షితంగా ఉన్నాయని అనిల్ కుమార్ సింఘల్ మరోసారి స్పష్టం చేశారు. అలాగే బూందీపోటులో తవ్వకాలు జరుగతున్నాయని వస్తున్న ఆరోపణల్లో నిజంలేదనీ..ఆలయంలో మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆగమశాస్త్రం ప్రకారమే అన్ని పనులు చేస్తున్నామనీ..శ్రీవారికి అన్ని కైంకర్యాలు ఆగమశాస్త్రం ప్రకారమే కొనసాగిస్తున్నామని తెలిపారు.టీటీడీ నిధులు ఎక్కడా దుర్వినియోగం కావటంలేదని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

కృష్ణదేవరాలు ఇచ్చిన ఆభరణాలను గుర్తించటం కష్టం : ఈవో
శ్రీవారికి శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన ఆభరణాలను గుర్తించటం కష్టమని ఈవో సింఘాల్ పేర్కొన్నారు. అలాగే శ్రీవారికి ఏ ఆభరణం ఎవరిచ్చారో గుర్తించటం కష్టమన్నారు. శ్రీవారి నగలు మాయం అయ్యాయి అనే వార్తలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. 1952 నుండి నగలకు సంబంధించిన అన్ని రికార్డులు భద్రంగా వున్నాయన్నారు. ఆభరణాలన్నీ సురక్షితంగా వున్నాయని స్సష్టంచేశారు. ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వారు మాట్లాడి విషయం గురించి వారే వివరణ ఇవ్వాలన్నారు. టీటీడీ తిరుభరణం రిజిస్టర్ ని మెయిన్ టెన్ చేస్తోందని తెలిపారు.1987లో రమణదీక్షితులు అర్చకులుగా వున్న సమయంలో వెరిఫికేషన్ చేసిన నగలే ఇప్పటికీ వున్నాయన్నారు. ప్రస్తుతం శ్రీవారి నగలను ప్రదర్శించేందుకు సిద్ధంగా వున్నామనీ..అన్ని విషయాలలోను ఆగమశాస్త్రం ప్రకారంగానే అన్ని పనులు గతంలో వలెనే కొనసాగిస్తున్నామని..అలాగే చట్టప్రకారంగానే ముందుకెళుతున్నామని ఈవో సింఘాల్ స్పష్టంచేశారు. 

నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన...

హైదరాబాద్ : శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల పరిధిలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయ్యప్ప సొసైటీ వద్ద జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన రిజర్వాయర్‌, శిల్పా రామం ఎదురుగా నిర్మించిన ఆధునిక ఏసీ బస్ షెల్టర్‌ను ఆయన ప్రారంభించారు.

'కాళేశ్వరం ప్రాజెక్టుతో 37 లక్షల ఎకరాలకు సాగునీరు'

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కృష్ణా పునరుజ్జీవానికి కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఇండియా వాటర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కృష్ణానది పునర్జీవనం అనే అంశంపై జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కాళేశ్వరం ప్రాజెక్టుతో 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని

13:26 - May 22, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కృష్ణా పునరుజ్జీవానికి కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఇండియా వాటర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కృష్ణానది పునర్జీవనం అనే అంశంపై జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కాళేశ్వరం ప్రాజెక్టుతో 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, ఈ ప్రాజెక్టులో 365 రోజుల పాటు నీళ్లు ఉంటాయన్నారు. మహారాష్ట్రలో విద్యుత్ ఉత్పత్తి చేసిన నీటిని ఆరేబియా సముద్రంలోకి వదులుతోందని, ఆ నీటిని కృష్ణా నీటిలోకి వదిలితే ఈ రాష్ట్రంలో ఐదు చోట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చన్నారు. నదులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, వృథాగా సముద్రంలోకి వెళ్లే నీటిని ఉపయోగించుకునేలా కార్యక్రమాలు రూపొందించాలని పిలుపునిచ్చారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్ధరణ చేయడం జరుగుతోందని, కృష్ణా బేసిన్‌లో వర్షపాతం తక్కువగా ఉండటం.. కృష్ణా నీటిని వాడుకోలేకపోవడంతో అక్కడి ప్రజలు గతంలో వలస వెళ్లడం జరిగిందని వివరించారు. 

అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు...

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సును గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, సీఎస్ ఎస్‌కే జోషి, కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎస్‌కే పట్నాయక్, వీసీ ప్రవీణ్‌రావు పాల్గొన్నారు. 

టిటిడి ఈవో, ఛైర్మన్ లతో బాబు...

విజయవాడ : టిటిడి ఈవో, ఛైర్మన్ లతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. టిటిడి అర్చక వివాదం, ఆభరణాల విషయం..రమణ దీక్షితుల ఆరోపణలపై చర్చిస్తున్నారు. ఆయన చేసిన ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. 

బెంగళూరుకు సీఎం కేసీఆర్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సాయంత్రం బెంగళూరుకు వెళ్లనున్నారు. బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కుమార స్వామిని ఆయన అభినందించనున్నారు. రాత్రికి కేసీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. 

13:06 - May 22, 2018

చిత్తూరు : తమిళనాడులోని తూత్తుకుడి స్టెరిలైట్ కర్మాగారం మూసివేయాలంటూ గ్రామస్తులు మళ్లీ ఆందోళనలకు దిగారు. గడిచిన నాలుగేళ్లుగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కంపెనీ నుండి వెలువడుతున్న వ్యర్థాలు..కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. వెంటనే కంపెనీని మూసివేయాలని, కాపర్ ప్లాంట్ కారణంగా తాము శ్వాససంబంధిత ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం..అధికారులు ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోతుండడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గ్రామప్రజలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనకారులను నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జీ, బాష్పవాయు ప్రయోగించారు. ఇందులో కొంతమంది ఆందోళనకారులకు గాయాలైనట్లు సమాచారం. 

సమస్యలు వింటున్న పవన్...

శ్రీకాకుళం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలాసలో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితం ఆయా సమస్యలు వివరించేందుకు వచ్చిన వారితో పవన్ మాట్లాడుతున్నారు. వారు పేర్కొన్న సమస్యలను వింటున్నారు. 

12:25 - May 22, 2018

చిత్తూరు : టిటిడిలో ఏం జరుగుతోంది ? రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు జాతీయస్థాయిలో చర్చకు దారి తీస్తుండడం..భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. మంగళవారం ఉదయం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టిటిడి ఈవో, టిటిడి ఛైర్మన్, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

గత కొన్ని రోజులుగా రమణ దీక్షితులు స్వరాన్ని మరింత పెంచారు. ఆగమశాస్త్రం, వైదికబద్ధంగా జరగడం లేదని..శ్రీవారి నగలకు భద్రత లేదని..స్వామి వారికి కనీసం ప్రసాదం పెట్టడం లేదని..విరామం కూడా ఇవ్వడం లేదన్నారు. 2001లో ఉత్సవ విగ్రహానికి అలంకరించిన పింక్ వజ్రం పగిలిపోయిందని..చాలాకాలం పాటు వినియోగించలేదని..గత ఏడాది జెనివా వజ్రాల వేలం ఇలాంటి పింక్ వజ్రం వేలానికి వచ్చిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు రావడంతోనే అత్యవసరంగా టిటిడి పాలక మండలి సమావేశం కావడం..65 సంవత్సరాల దాటిన అర్చకులు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో రమణ దీక్షితులు రాజీనామా చేశారు. అప్పటి నుండి ప్రభుత్వం వర్సెస్ రమణ దీక్షితులుగా మారిపోయింది.

రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై బీజేపీ నేత మాధవ్ స్పందించారు. వెంటనే శ్రీవారి ఆభరణాలను లెక్కించి ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. టిటిడిలో జరుగుతున్న పరిణామాలపై తక్షణమే విచారణ జరిపించాలన్నారు. టిటిడి పవిత్రకు భంగం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అనాలోచిత నిర్ణయంతో ప్రధాన అర్చకులను తొలగించారని మండిపడ్డారు. 

మళ్లీ భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు...

విజయవాడ : మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. మంగళవారం పెట్రోల్ పై 29-32 పైసలు, డీజిల్ పై 26-28 పైసలను చమురు సంస్థలు పెంచాయి. 

'కృష్ణానది పునర్జీవనం' అనే అంశంపై జాతీయ సమావేశం...

హైదరాబాద్ : 'కృష్ణానది పునర్జీవనం' అనే అంశంపై జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, కాళేశ్వరం ప్రాజెక్టులో 365 రోజుల పాటు నీళ్లు ఉంటాయని తెలిపారు. 

కుమార స్వామి ప్రమాణ స్వీకారంపై సుప్రీంలో పిటిషన్...

ఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనుండడాన్ని అఖిల భారత హిందూ మహాసభ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం రాజ్యంగ విరుద్ధమని, దాన్ని అడ్డుకోవాలని కోరింది. 

పలు నియామకాలు చేసిన రాహుల్...

ఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జీగా రజనీ పాటిల్ ను నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే స్థానంలో రజనీ పాటిల్ ను రాహుల్ గాంధీ నియమించారు. ఏఐసీసీ మైనార్టీ విభాగం ఛైర్మన్ గా నదీమ్ జావేద్, గుజరాత్ రాష్ట్ర వ్యవహారాల కోసం ఏఐసీసీ సెక్రటరీలుగా జితేంద్ర భాగెల్, బిస్వా రంజ్ మెహంతిలను నియమించారు. బీహార్ రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ సెక్రటరీలుగా వీరేంద్ర సింగ్ రాథోడ్, రాజేష్ లిలోథియాలను నియమించింది. 

డాబర్ సంస్థ ఆస్తుల జప్తు...

ఢిల్లీ : డాబర్ సంస్థ డైరెక్టర్ ప్రదీప్ బర్మన్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. బర్మన్ కు చెందిన రూ. 20.87 కోట్లను ఈడీ జప్తు చేసింది. ఫెమా చట్టం కింద కేసును నమోదు చేసింది. 

11:19 - May 22, 2018

తూర్పుగోదావరి : జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడ జగన్నాధపురంలో దారుణం జరిగింది. ఆస్తి కోసం వేధిస్తోన్న కొడుకును తల్లే కొట్టి చంపేసింది. ప్రతాప్‌రెడ్డి, పార్వతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడైన శివరామకృష్ణ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. చెడు వ్యసనాల బారిన పడి.. ఆస్తికోసం తల్లిదండ్రులను కొన్నాళ్లుగా వేధిస్తున్నారు. రాత్రి కూడా తల్లిదండ్రులతో గొడవకు దిగారు. తల్లిపై రాడ్డుతో దాడికి యత్నించగా తల్లి తప్పించుకుంది. అదే రాడ్‌ను అందుకుని కొడుకు తలపై బాదింది. దీంతో తీవ్రగాయాలపాలైన శివరామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి పార్వతి పోలీసులకు లొంగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

11:14 - May 22, 2018

శ్రీకాకుళం : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేపట్టిన జనచైతన్య పోరాట యాత్ర మూడో రోజుకు చేరింది. నేడు పలాసలో నిరసన కవాతులో పవన్‌ పాల్గొననున్నారు. పలాసలోని హరిశంకర్‌ థియేటర్‌ నుంచి..కాశీబుగ్గ బస్టాండ్‌ వరకు కవాతు నిర్వహించిన అనంతరం కాశీబుగ్గ బస్టాండ్‌ వద్ద పవన్‌ బహిరంగ సభలో పాల్గొననున్నారు. భద్రత విషయంలో పవన్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని, భద్రతను పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. 

11:13 - May 22, 2018

విశాఖపట్నం : పోలీసులు కొత్త వ్యక్తుల పై దాడులు చేయవద్దని హెచ్చరిస్తున్నా దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా నర్సీపట్నంలో పోలీస్ స్టేషన్‌ ఎదురుగా రాకేష్‌ పటేల్‌ అనే యువకుడిని స్థానికులు చితకబాధిన ఘటన కలకలం సృష్టించింది. దొంగల గ్యాంగ్‌లు సంచరిస్తున్నాయన్న వదంతుల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. తెల్లవారు జామున వాకింగ్‌కు వెళ్లిన రాకేష్‌ పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న వదంతులకు అనుగుణంగా దాడులు జరగడంతో పోలీసులు చర్యలు తీవ్రతరం చేశారు. 

11:09 - May 22, 2018

సంగారెడ్డి : ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నది ప్రభుత్వ సంకల్పం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్నది ప్రభుత్వ ఆలోచన. కానీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ప్రవర్తన అందుకు భిన్నంగా ఉంది. సంగారెడ్టి మాతా- శిశు ఆసుపత్రిలోని దయనీయ స్థితిపై టెన్‌టీవీ ఫోకస్. సంగారెడ్టి జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన మాతా,శిశు కేంద్రం. ఇటీవలే దీన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కాన్పుల కోసం వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూస్తోందని మంత్రి ఘనంగా ప్రకటించారు. కానీ.. ఈ ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బంది మాత్రం పేషెంట్ల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారు. గతంతో పోలిస్తే.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలు, సౌకర్యాలు కొంచెం మెరుగు కావటంతో... పేషెంట్లు కూడా ఎక్కువ సంఖ్యలోనే వస్తున్నారు. దీంతో ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి పెరగటంతో, సహనం కోల్పోపోయి పేషెంట్లపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.

ఈమె పేరు మంజుల.. పెద్దశంకరంపేటకు చెందిన ఈ మహిళ ఆదివారం ఉదయం పదిగంటలకు ఆసుపత్రికి వస్తే.. పట్టించుకున్న నాథుడే లేరు. మూడో కాన్పు చేసేది లేదని గాయత్రి అనే డ్యూటీ డాక్టర్ తేల్చి చెప్పింది. గర్భం దాల్చిన ఈ మహిళ ఇదే ఆసుపత్రిలో మొదటి నుంచి చికిత్స పొందుతోంది. డెలివరీ డేట్ ఆదివారం ఇచ్చారని చెప్పినా వినిపించుకోకుండా డాక్టరు గాయత్రి నోటికి వచ్చినట్టు పేషెంట్‌ను దూషించింది.

మరోవైపు ప్రసవానికి ఆసుపత్రికి వచ్చిన మంజుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఉదయం నుంచి రాత్రి తొమ్నిది గంటల వరకూ ఆసుపత్రి ముందే పడిగాపులు కాసింది. కానీ... వైద్యులు మాత్రం కనికరించలేదు. ఏమౌతుందోనన్న భయం.. డాక్టర్ గాయత్రిని ఆశ్రయిస్తే నోటికొచ్చినట్లు మాట్లాడింది. మూడో సారి ప్రసవానికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారంటూ ఆసుపత్రి నుంచి బయటకు గెంటేసే ప్రయత్నం చేసిందని మంజుల ఆవేదన వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళే స్థోమత లేక ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తే.. ఇలాంటి దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తోందంటూ.. మంజుల భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఎటుపోవాలో తెలియక, ఏమి చేయాలో అర్థం కాక బాధితులు టెన్‌టీవీని ఆశ్రయించారు. ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్ళిన టెన్‌టీవీ ప్రతినిధికి దయనీయ పరిస్థితి కన్పించింది. అక్కడున్న పేషెంట్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో ధీన గాథ , ఆసుపత్రిని ఆర్భాటంగా ప్రారంభించారే కానీ అక్కడ వసతులు,సిబ్బంది పనితీరును పర్యవేక్షించే వారే లేక పోవడంతో పేషెంట్లు నరకాన్ని చూస్తున్నారు.చివరకు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆసుపత్రికి వచ్చే వారిపై అమర్యాదగా వ్యవహరిస్తున్నారని కొందరు వాపోయారు. ప్రభుత్వ సంకల్పం మంచిదే అయినా ,కింది స్ఢాయి సిబ్బంది పనితీరు ఇలా ఉంటే ప్రజల నుండి నిరసనలు రాక మానవు. ఇప్పటికైనా ఉన్నతాధికారు స్పందించి పరిస్థిని చక్కదిద్దాలని సంగారెడ్డి ప్రజలు కోరుతున్నారు. 

10:28 - May 22, 2018

విజయవాడ : అగ్రీగోల్డ్ మోసం బయటపడినప్పటి నుండి అజ్ఞాతంలో వెళ్లిపోయి తప్పించుకుని తిరుగుతున్న సంస్థ ఉపాధ్యాడు 'అవ్వాస్ సీతారాం'ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో అగ్రీగోల్డ్ ఛైర్మన్ అవ్వాస్ వెంకట రామారావుకు ఈయన స్వయాన సోదరుడు. 2011లో పథకం ప్రకారం బోర్డు నుండి ఇతను తప్పుకున్నాడు. హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో సీతారాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కపిల్ సిబల్ ను న్యాయవాదిగా నియమించుకున్నాడు. ఇతడిని అరెస్టు చేసేందుకు సీఐడీ పలు ప్రయత్నాలు చేసింది. కానీ ఆయన ఆచూకీ మాత్రం తెలియరాలేదు. తాజగా సీతారాం ఢిల్లీలో తలదాచుకున్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు సీఐడీ అధికారులు హస్తినకు వెళ్లారు. అక్కడ సీతారాంను అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల్లో ఆయన్ను విజయవాడకు తీసుకరానున్నారు.

గత కొన్ని రోజులుగా అగ్రీగోల్డ్ వివాదం కొనసాగుతూనే ఉంది. ఏజెంట్లు..బాధితులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది బలవన్మరణాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. సీతారాంపై అగ్రీగోల్డ్ బాధితుల సంఘం పలు ఆరోపణలు గుప్పిస్తోంది. అగ్రీగోల్డ్ ఆస్తులు ఎస్ఎల్ కొనుగోలు చేయకుండా అడ్డుకున్నారని ఆరోపణలున్నాయి. మరి ఇతని అరెస్టుతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

మాదాల రంగారావు పరిస్థితి విషమం ?

హైదరాబాద్ : స్టార్ హాస్పిటల్ లో హృద్రోగ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న విప్లవ నటుడు మాదాల రంగారావు ఆరోగ్య పరిస్థితి మరింత విషమం అయినట్టు తెలుస్తోంది. హీరో గోపీచంద్ స్టార్ హాస్పిటల్ కు వచ్చి ఆయన్ను పరామర్శించారు. 

10:10 - May 22, 2018

కర్ణాటక : రాష్ట్రంలో జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. బుధవారం సీఎంగా కుమార స్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకంటే ముందు మంత్రివర్గ కూర్పు ఎలా ఉండాలి ? తదితర అంశాలపై చర్చించేందుకు కుమార స్వామి హస్తినకు సోమవారం వచ్చారు. సోనియా, రాహుల్ గాంధీలతో ఆయన భేటీ అయి చర్చించారు. మంత్రివర్గ కూర్పు, ఎవరికి మంత్రి పదవులివ్వాలనే దానిపై రాష్ట్ర నేతలతోనే చర్చించాలని..ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని..అందర్నీ సంతృప్తి పరిచే విధంగా చూడాలని సోనియా, రాహుల్ సూచించినట్లు సమాచారం. దీనితో జేడీఎస్, కాంగ్రెస్ నేతల కీలక భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో కుమార స్వామి కూడా పాల్గొననున్నారు.

డిప్యూటి స్పీకర్ పదవితో పాటు 20 మంత్రి పదవులు కావాలని కాంగ్రెస్ కోరుతోంది. సంఖ్యాబలం ఎక్కువ ఉన్నందున పదవులు అడుగుతున్నట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. కానీ జేడీఎస్ నేతలు కూడా పలు మంత్రి పదవువులు కావాలని కోరుతున్నారు. మరి కుమార స్వామి వారికి ఎలా బుజ్జగిస్తారు ? మంత్రివర్గ కూర్పు అందరికీ సంతృప్తినిస్తుందా ? ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావా ? అనేది తెలియాలంటే రానున్న రోజుల్లో తెలుస్తుంది. 

09:48 - May 22, 2018

కర్ణాటక ఎన్నికల అనంతరం ఎన్నో అంశాలపై దేశ వ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్నాయి. ప్రాంతీయ పార్టీలదే హావా కొనసాగుతాయనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్..బీజేపీయేతరలకు అనుగుణంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రాగం అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జేడీఎస్ తో చర్చలు కూడా జరిపారు. కానీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ తో జేడీఎస్ జత కట్టడంతో కేసీఆర్ ఎలాంటి స్పందన వ్యక్తం చేస్తారనేది ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

లోక్ సభ స్పీకర్ ను కలవాలని వైసీపీ ఎంపీలకు సమాచారం...

ఢిల్లీ : లోక్ సభ స్పీకర్ ను కలవాలని వైసీపీ ఎంపీలకు మంగళవారం సమాచారం అందింది. ఈనెల 29వ తేదీ సాయంత్రంలోగా కలవాలని సమాచారం. . ఏపీకి ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామలు అమలు చేయాలంటై వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలు ఏప్రిల్ ఆరో తేదీన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  ఎంపీల రాజీనామాలను ఆమోదించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆరు లోక్ సభ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. 

09:43 - May 22, 2018

ఢిల్లీ : మళ్లీ ఎన్నికలు రానున్నాయా ? ఈసారి మినీ సంగ్రామంగా మారనుందా ? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. లోక్ సభ స్పీకర్ ను కలవాలని వైసీపీ ఎంపీలకు సమాచారం రావడంతో ఎన్నికల వైపు చర్చలు జరుగుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామలు అమలు చేయాలంటై వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలు ఏప్రిల్ ఆరో తేదీన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ ఫార్మాట్ లో బడ్జెట్ సమావేశాల ఆఖరి రోజున రాజీనామాలు సమర్పించి ఆమరణ నిరహార దీక్షకు కూర్చొన్నారు.
ఇదిలా ఉంటే లోక్ సభ స్పీకర్ ను కలవాలని వైసీపీ ఎంపీలకు మంగళవారం సమాచారం అందింది. రాజీనామా విషయంలో స్పీకర్ మరోసారి వివరణ అడిగే అవకాశం ఉంది. రాజీనామా ఎందుకు చేశారు ? ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందనే దానిపై వివరణ అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. భావోద్వేగంతో రాజీనామా చేశారని ఇంతవరకు దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
మరోవైపు దేశ వ్యాప్తంగా ఆరు లోక్ సభ స్థానాలకు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఒకవేళ వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందితే మినీ ఎన్నికల సంగ్రామం మళ్లీ రానుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏపీలో ఎన్నికల వేడి సంవత్సరం కంటే ముందుగానే రగులనుంది. 

09:37 - May 22, 2018

విజయవాడ : టిటిడి...తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మధ్య వివాదం సద్దుమణగడం లేదు. వీరిద్దరి మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ప్రధానంగా టిటిడిని టార్గెట్ చేస్తూ రమణ దీక్షితులు సంచలనాత్మక ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో టిటిడి ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. వివాదం మరింత ముదరకముందే..టిటిడి పరువు..ప్రతిష్టను మరింత దిగజారకముందే చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అందులో భాగంగా మంగళవారం టిటిడిలో జరుగుతున్న దానిపై ఉన్నతస్థాయి సమీక్ష చేయాలని బాబు నిర్ణయించారు. ఈ సమీక్షలో టిటిడి ఛైర్మన్, ఈవో, ఇతర అధికారులు పాల్గొననున్నారు. రమణ దీక్షితుల వివాదం...టిటిడిలో ఏమి జరుగుతోంది ? తదితర అంశాలపై బాబు సుదీర్ఘంగా చర్చించనున్నారని సమాచారం.

రమణ దీక్షితులు వెనుక వైసీపీ, బీజేపీ పార్టీలున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను రమణ దీక్షితులు కలిసినట్లుగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ప్రస్తుతం జరుగుతున్న ఈ వివాదంపై బాబు ఎలాంటి ఫుల్ స్టాప్ పెడుతారో చూడాలి. 

సీతారంరాజ్ నగర్ లో కార్డన్ సెర్చ్...

హైదరాబాద్ : సీతారంరాజ్ నగర్ లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 20 బైక్ లు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 29 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

09:23 - May 22, 2018

జగిత్యాల : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పురిటిలో పిల్లలు తారుమారు కలకలం సృష్టించింది. ఒకరికి పుట్టిన పిల్లలను మరొకరరికి ఇచ్చారంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మేడిపల్లి మండలం కొండాపూర్‌కు చెందిన చామంతి, బుగ్గరం మద్దునూర్‌ గ్రామాని చెందిన రజిత అనే ఇద్దరు గర్భిణిలు ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. అయితే వీరికి పుట్టిన శిశువులను ఆస్పత్రి సిబ్బంది తారుమారు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో శిశువుల తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో మేల్కొన్న ఆస్పత్రి సిబ్బంది శిశువులకు వైద్యపరీక్షలు నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెబుతున్నారు. 

నాగారంలో భారీ అగ్నిప్రమాదం...

మేడ్చల్‌ : జిల్లా కీసరం మండలం నాగారంలోని బాంబే టింబర్‌ డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. 

09:18 - May 22, 2018

హైదరాబాద్‌ : పాతబస్తీలో విషాదం నెలకొంది. గోడకూలి ఓ బాలుడు చనిపోయాడు. టపాచబుత్ర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. టప్పాఛబుత్ర ప్రాంతంలో అలీం, తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇళ్లు శిథిలా వస్థకు చేరిందని.... పలుమార్లు జీహెచ్‌ఎంసీ అధికారులు ఇంటి యజమానిని హెచ్చరించారు. అయితే ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. రాత్రి గోడ ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ గోడకింద పడి అలీం కుమారుడు చనిపోయాడు. దీంతో విషాదం నెలకొంది. 

శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద అగ్నిప్రమాదం...

రంగారెడ్డి : జిల్లా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోదాంలోని బ్యాటరీ స్ర్కాప్‌ కాలి బూడిదైంది. నిలిపి ఉన్న స్ర్కాప్‌ లోడ్‌ లారీలో చెలరేగిన మంటలు గోడౌన్‌కు వ్యాపించడంతో దట్టమైన పొగతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న లారీలు కూడా మంటలు అంటుకున్నాయి.

09:11 - May 22, 2018

మత్య్సకారుల విషయంలో ప్రభుత్వ విధానం సరిగా లేదని వారికి కోసం కేటాయించిన పథకాలు పక్కదారి పడుతున్నాయని తెలంగాణ మత్య్సకార సంఘం విమర్శిస్తోంది. దళారీ వ్యవస్థ దోపిడిని అరికట్టి మత్స్య కారులకు పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను, సబ్సిడీలను అందజేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై టెన్ టివి జనపథంలో తెలంగాణ మత్స్యకారం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:09 - May 22, 2018

కృష్ణా : దుండగుల దాడులతో కృష్ణా జిల్లాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. నందిగామలో గత రెండు రోజులుగా దొంగలు హల్‌చల్‌ చేస్తుండగా.. మరోవైపు పెప్పర్‌ స్ర్పే బ్యాచ్‌ కలకలం సృష్టిస్తోంది. నందిగామలో ఒంటరిగా ఉన్న మహిళపై ఆగంతకులు పెప్పర్‌ స్ర్పేతో దాడి చేశారు. వెనుకవైపు నుంచి కారం కూడా చల్లారని బాధిత మహిళ తెలిపింది. 

09:07 - May 22, 2018

యాదాద్రి భువనగిరి : తెలంగాణలో టీడీపీకి గత వైభవం రావడం ఎంతోదూరంలో లేదని ఆపార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన మినీ మహానాడులో పాల్గొన్న ఆయన... ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. అనంతరం జిల్లాలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒకమాట వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతోందని ఎల్‌ రమణ విమర్శించారు. 

09:06 - May 22, 2018

ఖమ్మం : సర్పంచ్‌ల పదవీ కాలం ముగుస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం వారికి నిధులు విడుదల చేయడంలేదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు బట్టివిక్రమార్కు అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని.... తెలంగాణ ప్రభుత్వం సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చిందన్నారు. జడ్పీటీసీలను జిల్లా పరిషత్‌లను పూర్తిగా నిర్వీర్యం చేశారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వారి హక్కులను కాపాడుకోవడానికి ఉద్యమించాలన్నారు. 

09:05 - May 22, 2018

హైదరాబాద్ : కోదండరాం పార్టీపై అధికారపార్టీ నజర్‌పెట్టిందా..? వచ్చే ఎన్నికల్లో టీజేఎస్‌ ప్రభావంపై గులాబీదళం సర్వేచేసిందా..? పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టిన టీజేఎస్‌కు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందా..? దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి ఇంటలిజెన్స్‌ వర్గాలు రిపోర్టుకూడా ఇచ్చాయా..? ఈప్రశ్నలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వర్గాల్లో అవుననే చర్చలు నడుస్తున్నాయి.

ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణ జన సమితి వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనే అంశంపై అంచనా వేసేందుకు ప్రభుత్వ ఇంటెలిజెన్స్‌ బృందాలు రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతోంది. కోదండరాం పార్టీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటి..? జేఏసీ నుంచి ఆవిర్భవించిన టీజేఎస్‌... రాజకీయంగా నిల దొక్కుకుంటుందా.. ? అధికార టీఆర్‌ఎస్‌కు దీటుగా ఎదిగేందుకు ఆ పార్టీ వద్ద వ్యూహాలు న్నాయా అనే విషయాలపై రహస్య సర్వే నిర్వహించినట్టు తెలుస్తోంది. గత నెల 29న హైదరాబాద్‌లో తెలంగాణ జన సమితి బహిరంగ సభ నిర్వహించి రాజకీయ పార్టీని ఆవిష్కరించుకుంది. అదే రోజు నుంచి రాష్ట్ర ఇంటలిజెన్స్‌ వర్గాలు పొలిటికల్‌ అనాలసిస్‌ జాబితాలో టీజేఎస్‌ను చేర్చినట్టు అధికారపార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

రాజకీయ పార్టీలు, వాటి బలాలు, బలహీనతలపై అధ్యయనం చేయడంతోపాటు సర్వేలు, ప్రజల మనోగతాన్ని ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్‌ వర్గాలు అధికారపార్టీకి చేరవేస్తుంటాయి. దీనిలో భాగంగానే టీజేఎస్‌పై ఐదు ప్రశ్నలతో ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ సర్వే పూర్తి చేసినట్టు సమాచారం. ఉద్యోగ, నిరుద్యోగ, రైతు, యువత, మైనారిటీ వర్గాల్లో కోదండరాం పార్టీ ప్రభావాన్ని అంచానా వేసినట్టు సమాచారం. ప్రతి నియోజకవర్గం నుంచి 500 నుంచి 1,000 మందితో ఈ సర్వే నిర్వహించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణ జన సమితి ఉద్యోగ వర్గాలపై భారీగా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. కేవలం కొంత మంది ఉద్యోగ నేతలకే అధికార పార్టీ గుర్తింపు ఇవ్వడం మిగతా సంఘాల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైనట్లు ఇంటెలిజెన్స్‌ గుర్తించింది. ఇప్పుడు ఆ వ్యతిరేకతను కోదండరాం పార్టీ అందిపుచ్చుకునేందుకు అవకాశాలున్నాయని నిఘా వర్గాలు సర్వేలో పొందుపరిచినట్లు సమాచారం. దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో అత్యధిక శాతం ఎమ్మెల్యే సీట్లను ఉద్యోగ సంఘ నేతలు ఆశించేలా పరిస్థితులున్నాయని నివేదికలో ఇంటలిజెన్స్‌ అధికారులు పొందుపరిచినట్లు ప్రభుత్వ వర్గాలనుంచి సమాచారం వస్తోంది.

ఇంటిజెన్స్‌ సర్వేలో టీజేఎస్‌కు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు, టీఆర్‌ఎస్‌పై ప్రభావం చూపే ప్రాంతాలను ఇంటెలిజెన్స్‌ వర్గాలు స్పష్టంగా గుర్తించినట్లు తెలిసింది. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల పరిధిలో 10 నియోజకవర్గాలు, దక్షిణ తెలంగాణలో 16 నియోజకవర్గాలపై ఓ మేర టీజేఎస్‌ ప్రభావం కనిపిస్తోందని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఆర్థిక పరిపుష్టి, అంగబలం, బూత్‌ మేనేజ్‌మెంట్‌లో టీజేఎస్‌ బలహీనంగా ఉందని, ఈ విషయాల్లో పార్టీకి కొందరు ఎన్‌ఆర్‌ఐలు ఆర్థిక సహాయ సహకారాలు అందించే అవకాశం ఉన్నట్లు కూడా ఇంటెలిజెన్స్‌ తన నివేదికలో పొందుపరిచిందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. మొత్తానికి కోదండరాం పార్టీ ప్రకటన చేసిన క్షణం నుంచే అధికార గులాబీ పార్టీలో కలవరం మొదలైందని రాజకీయవర్గాల్లో అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

09:03 - May 22, 2018

 

విశాఖపట్టణం : ధర్మపోరాట దీక్షకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశాయి జిల్లా టీడీపీ శ్రేణులు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ కేంద్రంగా జరిగే ధర్మ పోరాట దీక్షకు సర్వం సిద్ధం చేశారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా సాధించే అంశాన్ని ఈ సభ ద్వారా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ మైదానంలో టీడీపీ ఆధ్వర్యంలో ఈ నెల 22న.. తలపెట్టిన ధర్మపోరాట సభను తిరుపతిలో కంటే భారీస్థాయిలో నిర్వహించాలని టీడీపీ కృత నిశ్చయంతో ఉంది. దాదాపు ఒక లక్ష మందిని ఈ సభకు తరలించాలన్నది టీడీపీ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. జనసమీకరణ బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించింది ఆ పార్టీ నాయకత్వం.

రాష్ర్టంపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ కోసం ఆ పార్టీ సిద్ధమైంది. ముఖ్యంగా విశాఖ నగర పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలతోపాటు.. అనకాపల్లి నుంచి కూడా భారీగా జనాన్ని సమీకరించనున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి పదివేల చొప్పున... 80 వేల మందిని తరలించాలన్నది ఆలోచన. మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి కనీసం లక్ష నుంచి 1.25 లక్షల మంది సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు..

గత మూడు రోజులుగా డిఫ్యూటీ సీఎం చినరాజప్ప విశాఖలోనే మఖాం వేసి.. సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. జనసమీకరణ, వాహనాల పార్కింగ్‌ పై మూడు సార్లు ఎమ్మేల్యేలు, మంత్రులతో చర్చించారు. దాదాపు రెండు వేలకు పైగా బస్సులను ఏర్పాటు చేసి సుధూర ప్రాంతాల్లోని నియోజక వర్గాలనుంచి కూడా జనాలను రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా కర్నాటకలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని.. తెలుగువారి దెబ్బ వల్లనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయారని ఇప్పటికే మంత్రులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకు వెల్లడానికి టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. ధర్మపోరాట సభ ప్రధాన వేదికపై వందమంది నాయకులు ఆశీనులయ్యేలా ఏర్పాటు చేస్తున్నారు. సభా కార్యక్రమాలు అందరికీ కనిపించేలా ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నారు. దానితో పాటుగా ట్రాఫిక్‌ను కూడా పూర్తి స్థాయిలో మళ్లిస్తారు. మద్దిలపాలెం, సిరిపురం నుంచి వచ్చే వాహనాలను పూర్తిగా మళ్లిస్తున్నారు.

09:00 - May 22, 2018

విజయవాడ : కర్నాటకలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ నాయకులు బేరసారాలు ఆడిన వ్యవహారంపై విచారణ జరిపించాలని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బేరసారాల టేపులు బయటపడిన తర్వాత కూడా కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వైసీపీ అధ్యక్షుడు జగన్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నోరు మెదపకపోవడాన్ని యనమల తప్పుపట్టారు. 

08:59 - May 22, 2018

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి మేలు చేస్తుందని 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే... నాలుగు బడ్జెట్లలో కూడా మొండిచేయి చూపించారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి అన్యాయం చేసినందుకే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తగిన శాస్తి జరిగిందని అనంతపురం జిల్లా తురకలాపట్నం సభలో చంద్రబాబు విమర్శించారు. తురకలాపట్నం సభలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు.

ఏపీకి నమ్మకద్రోహం చేసినందుకే కర్నాటకలో బీజేపీ అధికారానికి దూరమైందని చంద్రబాబు విమర్శించారు. ప్రత్యేక హోదాపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కేసుల మాఫీ కోసం వైసీపీ నాయకులు బీజేపీతో చెట్టపట్టాలేసుకు తిరుగుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మరోవైపు అనంతపురం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 10 వేల కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. జలసంరక్షణ చర్యల ద్వారా జిల్లాను కరవు రహితంగా తీర్చిదిద్దామన్నారు. 

08:24 - May 22, 2018

శ్రీకాకుళం : అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే సహించబోమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పర్యావరణాన్ని కాపాడే అభివృద్ధే నిజమైన ప్రగతి అని చెప్పారు. చట్టాల్ని కాపాడాల్సిన పాలకులే వాటిని తుంగలో తొక్కుతూ పర్యావరణానికి హాని చేస్తున్నారని శ్రీకాకుళం జిల్లా సోంపేట సభలో పవన్‌ విమర్శించారు. సోమవారం రెండో రోజు సోంపేటలో పర్యటించారు. సోంపేట థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడి, పోలీసుల కాల్పుల్లో అసువులు భాసిన అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.

సోంపేట థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడిన కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించిన పవన్‌ కల్యాణ్‌.. అభివృద్ధి పేరుతో పాలకపక్షాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని మండిపడ్డారు. దీనికి జనసేన వ్యతిరేకమన్న విషయాన్ని స్పష్టం చేశారు. స్వచ్ఛమైన గాలి, నీటిని హరించే హక్కు ఎవరికీలేదన్నారు. ప్రజారోగ్యానికి హానికలిగించే పరిశ్రమలకు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తే జనసేన సహించబోదని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. జనసేన విద్య, వైద్యం, ఉపాధికి ప్రాధాన్యత ఇస్తుందని పవన్‌ చెప్పారు. ప్రతి గ్రామం, తండా, గూడెంలో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఉండాలన్నది జనసేన లక్ష్యమన్నారు. సోంపేట తర్వాత పవన్‌ కల్యాణ్‌ పలాసలో పర్యటించారు. పలాసలో పవన్‌ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సోమవారం ఉదయం ఇచ్ఛాపురం గ్రామ దేవత స్వేచ్ఛావతి ఆలయంలో పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక పూజలు చేశారు. 

08:23 - May 22, 2018

ఢిల్లీ : కర్ణాటక సిఎంగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న జెడిఎస్‌ నేత కుమారస్వామి ఢిల్లీలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రి పదవుల కేటాయింపు తదితర అంశాలను కర్ణాటకలోనే చర్చించుకోవాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ సూచించినట్లు కుమారస్వామి తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్‌ నేత వేణుగోపాల్‌తో కలిసి మంత్రి పదవులపై చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. 33 మంత్రి పదవులకు గాను 20 బెర్తులు కాంగ్రెస్‌ ఆశిస్తోంది. జెడిఎస్‌ 13 నుంచి 15 మంత్రి పదవులు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతకుముందు సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న కుమారస్వామి -బిఎస్‌పి చీఫ్‌ మాయావతిని కలుసుకున్నారు. కుమారస్వామికి మాయావతి అభినందనలు తెలిపారు. మాయావతిని, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని.. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కావాలని కుమారస్వామి ఆహ్వానించారు.

 

హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటన...

హైదరాబాద్ : నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 

 

ముగిసిన పాలీసెట్ కౌన్సెలింగ్...

హైదరాబాద్ : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలలో సీట్ల భర్తీ కోసం ఈనెల 15 నుండి నిర్వహిస్తున్న పాలీసెట్ - 2018 కౌన్సెలింగ్ సోమవారం ముగిసింది. ఈనెల 23న సీట్ల కేటాయింపు జరుగనుంది. 

బుధవారం, గురువారం టీఎస్ ఐసెట్...

హైదరాబాద్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ ఐసెట్)ను ఈ నెల 23, 24 తేదీల్లో ఆన్ లైన్ విధానంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 

నేడు జీవ వైవిధ్య జాతీయ సదస్సు...

హైదరాబాద్ : నేడు జీవ వైవిధ్య జాతీయ సదస్సు జరుగనుంది. ప్రత్యేక కృషి చేసిన సంస్థలకు అవార్డుల ప్రధాన కార్యక్రమం జరుగనుంది. 

బుధవారం నుండి డీఎడ్ ఫస్టియర్ పరీక్షలు...

హైదరాబాద్ : డిప్లామా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) ప్రథమ సంవత్సరం పరీక్షలను ఈ నెల 23 నుండి 29 వరకు నిర్వహించనున్నారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 57 పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

హైదరాబాద్ లో @42 డిగ్రీలు...

హైదరాబాద్ : రాష్ట్రంలో భానుడు భగభగలు కొనసాగుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జగిత్యాలలో అత్యధికంగా 44.7 డిగ్రీలు నమోదవుగా హైదరాబాద్ లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

కొనసాగుతున్న 'పవన్' పోరాట యాత్ర...

శ్రీకాకుళం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 'పోరాట యాత్ర' కొనసాగుతోంది. నేడు పలాసలో పర్యటించనున్నారు. విభజన హామీలు..ప్రత్యేక హోదా కోరుతూన 'నిరసన కవాతు' నిర్వహించనున్నారు. కసిబుగ్గ బస్టాండు నుండి ఈ కవాతు జరుగనుంది. 

Don't Miss