Activities calendar

23 May 2018

విజయవాడ పరిసరాల్లో భారీ వర్షం..

కృష్ణా : విజయవాడ పరిసర ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. హనుమాన్ జంక్షన్, ఇబ్రహీంపట్నంలలో భారీ వర్షం ధాటికి, ఈదురు గాలుల ధాటికి చెట్లు విరిగిపడ్డాయి. 

జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుది కీలకపాత్ర..

అమరావతి : మహానాడు ఏర్పాట్లును మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు. దేశ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు చక్రం తిప్పటం కొత్తకాదనీ..గతంలో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర వహించారని లోకేశ్ పేర్కొన్నారు. అన్ని పార్టీలను, పార్టీ నేతలను కలిసి ఎలాగైనా రాష్ట్రానికి న్యాయం జరిగేలా చేసి తీరతామని ధీమా వ్యక్తంచేశారు. నేరాల్లో ఏ1,ఏ2 నిందితులకు సమాధానం చెప్పాల్సిన పనిలేదని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను పవన్ కళ్యాణ్ సీఎం దృష్టికి తీసుకురాగానే చర్యల్ని వెంటనే ప్రారంభించామని లోకేష్ తెలిపారు.

కుమారస్వామికి మోదీ అభినందనలు..

ఢిల్లీ : కర్ణాటక రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి కుమారస్వామిగౌడను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈరోజు సాయంత్రం కుమారస్వామిగౌడకు మోదీ ఫోన్ చేశారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా అభినందనలు తెలుపుతున్నానని, కర్ణాటక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నివేళలా మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వరను కూడా మోదీ అభినందించారు. కాగా, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వారిని అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు.

లాయర్ల సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయం : ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్ : లాయర్ల సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. లాయర్ల కుటుంబానికి రూ.2లక్షల ఆరోగ్య బీమా, ప్రమాద బీమా పథకం కింద రూ.10లక్షల బీమా ప్రభుత్వం కల్పిస్తున్నట్లుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 

వైసీపీ క్విడ్ ప్రోకో రాజకీయాలు చేస్తోంది : లోకేశ్

అమరావతి : తిరుమల వివాదంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. గుడిని, గుడిలోలింగాన్ని మింగే చరిత్ర వున్న నేతలు తిరుమల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా వుందంటు ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. తిరుమలలో విలువైన ఆభరణాలను, విలువైన సంపదను ఇడుపులపాయ, లోటస్ పాండ్ నుండి సీబీఐ తప్పకుండా వెలికి తీస్తుందని ఎద్దేవా చేశారు. హోదాపై మోదీని, బీజేపీని నిలదీసే దమ్ములేని వాళ్లు, బీజేపీతో కలిసి టీడీపీపై క్విడ్ ప్రోకో రాజకీయాలకు తెరతీశారని లోకేశ్ విమర్శించారు. 

బాబుగారి నివాసంలో సోదాలు చేసుకోవచ్చు : బోండా

అమరావతి : తిరుమల పోటు నేలమాళిగలోని విలువైన ఆభరణాలను ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్, అమరావతిలలో ఉన్న తన నివాసాలకు తరలించారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై టీటీడీ బోర్డు సభ్యుడు, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ మీడియాతో మాట్లాడుతూ, విజయసాయిరెడ్డి సవాల్ కు మేము సిద్ధంగా ఉన్నాం. వైసీపీ మిత్రపక్షమైన బీజేపీని ఒప్పించి చంద్రబాబు ఇంట్లో సోదాలు నిర్వహించుకోవచ్చు. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఒకవేళ చంద్రబాబు ఇంట్లో నగలు దొరక్కపోతే 13 గంటల్లోగా విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలి.

సొరంగంలో పేలుడు..4గురు మృతి..

నాగర్ కర్నూలు : కొల్లాపూర్ మండలం ఏలూరులో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సొరంగంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందారు. మరో 12మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా వుంది. కాగా పేలుడుకు సంబంధించిన కారణాలు తెలియాల్సివుంది. 

ఏసీబీ వలలో ఫైర్ ఆఫీసర్..

విజయవాడ : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. రూ.లక్ష లంచం తీసుకుంటు ఓ అధికారి ఏసీబీకి చిక్కాడు. ఫైర్ స్టేషన్ లో ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు రూ.లక్ష లంచం తీసుకుంటు ఓ అధికారి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. దీంతో శ్రీనివాసరావు నివాసంలో అధికారలు తనిఖీలను ముమ్మరం చేశారు.  

భారీ వర్షం..కూలిన చెట్లు..

పశ్చిమగోదావరి : చింతలపూడి, జంగారెడ్డిగూడెంలలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కువటంతో పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. ట్రాఫిక్ భారీగా స్థంభించిపోయింది.

కొత్తరకం మోసం..

నల్లగొండ : జిల్లాలో కొత్తరకం మోసం బైటపడింది. సీఎంఆర్ఎఫ్ కింద రూ.5లక్షలు మంజూరయ్యాయని..ఆ నగదు మీకు రావాలంటే రూ.47వేలు ఎస్బీఐలో డిపాజిట్ చేయాలని పలువురికి లేఖలు అందాయి. తెలంగణ ప్రభుత్వం, సీఎం పేరుతో పలువురి లేఖలు అందినట్లుగా తెలుస్తోంది. దీంతో ఐదుగురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు.  

కింగ్ మేకర్ ని కాదు 'కింగ్' నే..

హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో తాను కింగ్‌ మేకర్ కాదని, కింగ్‌గానే నిలుస్తానని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ అన్నారు. తమ పార్టీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని, తాము పూర్తి మెజార్టీతో గెలుస్తామని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు వెయ్యి ధరఖాస్తులు అందాయని, దరఖాస్తుదారులందరికి ఈ నెల 27న అవగాహన సదస్సులు నిర్వహిస్తామని మీడియా సమావేశంలో కోదండరాం తెలిపారు.

అగ్రిగోల్డ్ పై శ్వేతపత్రం విడుదల చేయాలి : వపన్

శ్రీకాకుళం : 2019లో అన్ని స్థానాల్లో పోటీచేస్తామని..అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని జనసేన యాత్ర సందర్భంగా టెక్కలి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కోట్లాది రూపాలయ సంపాదనను వదిలి జరిగే అన్యాయాలపై కడపు మండి ప్రజాసేవలోకి వచ్చానని పవన్ మరోసారి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుపై పరిశోధనలు చేస్తున్నామనీ..సమస్యల పరిష్కారానికి జనసేన కృషి చేస్తుందని పవన్ టెక్కలి బహిరంగ సభలో హామీ ఇచ్చారు.  

నిరుద్యోగ భృతి భిక్షం కాదు..అది వారి హక్కు : పవన్

శ్రీకాకుళం : జనసేన యాత్ర సందర్భంగా టెక్కలి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతు..ఉప్పు తయారీకి పేరుగాంచిన ఈ ప్రాంతంలో ఉప్పు పరిశ్రమను తీసుకొస్తే ఆ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం చూపించవచ్చన్నారు. చదువులు అనంతరం ఉపాధి కోసం, ఉద్యోగం కోసం విదేశాలు వెళ్లకుండా జన్మభూమిలోనే వుంటు..పుట్టిన ప్రాంతంలోనే ఉపాధి, ఉద్యోగాలు సాధించుకుని అభివృద్ధి సాధించవచ్చన్నారు. నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చేది భిక్షం కాదనీ అది వారి హక్కన్నారు.

మత్య్స కార్మికులకు వవన్ భరోసా..

శ్రీకాకుళం : జనసేన యాత్ర సందర్భంగా టెక్కలి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మత్య్స కార్మికులకు పవన్ భరోసానిచ్చారు. వారి సమస్యలు తీరుస్తానని వాగ్ధానం చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి పార్టీ పనులు చేపడితే తెలంగాణలో టీడీపీకి పట్టిన గతే ఆంధ్రాలో కూడా పడుతుందని హెచ్చరించారు. 

కుమార ప్రమాణస్వీకారంలో అరుదైన దృశ్యాలు..

కర్ణాటక : ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం వేదిక పలు సంచలనాలకు వేదిగా మారింది. ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరికొకరు కరచలానాలు చేసుకుని స్నేహపూరిత వాతావరణాన్ని సృష్టించారు.ఇంతలోనే చంద్రబాబు వద్దకు రాహుల్ గాంధీ వచ్చి, షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత రాహుల్ భుజంపై చంద్రబాబు చేయి వేసి, అభినందించారు. కొన్ని క్షణాలపాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఎప్పుడూ ఉప్పు, నిప్పులా ఉండే కాంగ్రెస్, టీడీపీ అధినేతలు ఆప్యాయంగా పలకరించుకోవడం, మాట్లాడటం... ఊహించనటువంటి ఒక కొత్త సన్నివేశాన్ని ఆవిష్కరించింది.

17:35 - May 23, 2018

శ్రీకాకుళం : జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర మూడవరోజు కొనసాగుతోంది. ఈ క్రమంలో టెక్కలిలో జనసేన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఉద్ధానం కిడ్నీ సమ్యల విషయంలో తాను తీవ్రంగా ఆవేదన చెందాననీ..ఈ క్రమంలోనే కడుపు మండి సీఎం చంద్రబాబు నాయుడుకి అమెరికా వైద్యులను పరిచయం చేశారని అయినా కిడ్నీ సమ్యలపై ప్రభుత్వం తాత్కాలిక పనులు చేసిన చేతులు దులుపుకుందని పవన్ విమర్శించారు. 48 గంటల్లో ఈ సమస్యపై స్పందించకుంటే తాను నిరాహార దీక్ష చేస్తానని పవన్ తెలిపారు.

అగ్రిగోల్డ్ పై శ్వేతపత్రం విడుదల చేయాలి : వపన్
2019లో అన్ని స్థానాల్లో పోటీచేస్తామని..అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కోట్లాది రూపాలయ సంపాదనను వదిలి జరిగే అన్యాయాలపై కడపు మండి ప్రజాసేవలోకి వచ్చానని పవన్ మరోసారి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుపై పరిశోధనలు చేస్తున్నామనీ..సమస్యల పరిష్కారానికి జనసేన కృషి చేస్తుందని పవన్ టెక్కలి బహిరంగ సభలో హామీ ఇచ్చారు.

నిరుద్యోగ భృతి భిక్షం కాదు..అది వారి హక్కు : పవన్
ఉప్పు తయారీకి పేరుగాంచిన ఈ ప్రాంతంలో ఉప్పు పరిశ్రమను తీసుకొస్తే ఆ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం చూపించవచ్చన్నారు. చదువులు అనంతరం ఉపాధి కోసం, ఉద్యోగం కోసం విదేశాలు వెళ్లకుండా జన్మభూమిలోనే వుంటు..పుట్టిన ప్రాంతంలోనే ఉపాధి, ఉద్యోగాలు సాధించుకుని అభివృద్ధి సాధించవచ్చన్నారు. నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చేది భిక్షం కాదనీ అది వారి హక్కన్నారు. ఒక్కగంట ప్రజాప్రతినిధిగా వుంటేనే వారికి వేలల్లో, లక్షల్లో పెన్షన్ వస్తోందనీ..గానీ రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ కూడా రావటంలేదని విమర్శించారు.

మత్య్స కార్మికులకు వవన్ భరోసా..
మత్య్స కార్మికులకు వవన్ భరోసానిచ్చారు. వారి సమస్యలు తీరుస్తానని వాగ్ధానం చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి పార్టీ పనులు చేపడితే తెలంగాణలో టీడీపీకి పట్టిన గతే ఆంధ్రాలో కూడా పడుతుందని హెచ్చరించారు.

పరిశ్రమల ఏర్పాటులో బాధితుల కష్టాలు పరిగణలోకి తీసుకోవాలి : పవన్
అభివృద్ధి సాధించే క్రమంలో ఏర్పరిచే పరిశ్రమల నేపథ్యంలో బాధితుల కష్టనష్టాలను కూడా పరిగణలోకి తీసుకుని అభివృద్ధి దిశగా పయనించాలని పవన్ సూచించారు. ధర్మపోరాట దీక్ష పేరుతో కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఒక్కశాతం ఉద్దానం బాధితుల కోసం ఖర్చు పెట్టవచ్చన్నారు. ఉద్ధానం సమస్యపై కేంద్రంతో అనుసంధానం చేసిన సమస్య పరిష్కారం దిశగా అమలు చేయాలన్నారు. ప్రజా సమస్యలను ఎత్తి చూపితే తమపై దాడి యత్నిస్తున్నారని కానీ తాను దేనికీ భయపడమన్నారు. దాడికి పాల్పడితే గూండాలను, మిమ్మల్ని బట్టలూడదీసి కొట్టి తరిమి తరిమి కొడతామని పవన్ ఆగ్రహావేశాలతో హెచ్చరించారు. శ్రీకాకుళం నేల సైనికులు పుట్టిన నేల శ్రీకాకుళమనీ..భరతమాతకు గుడి కట్టిన నేల శ్రీకాకుళం నేల అని ప్రజలకు ఉత్సాహపరిచారు పవన్ కళ్యాణ్. 

అంగరంగ వైభవంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం..

కర్ణాటక : బెంగళూరులోని విధానసౌధలో జేడీఎస్ అధినేత కుమారస్వామి ప్రమాణస్వీకారం కార్యక్రమం అతిరధుల మహారథుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. కుమారస్వామి అను నేను అంటు గవర్నర్ వాజూభాయి వాలా చెప్పిన ప్రకారంగా కుమారస్వామి కర్ణాటక 24వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్ నేత పరమేశ్వర్ ప్రమాణస్వీకారం చేశారు.

16:40 - May 23, 2018

కర్ణాటక : బెంగళూరులోని విధానసౌధలో జేడీఎస్ అధినేత కుమారస్వామి ప్రమాణస్వీకారం కార్యక్రమం అతిరధుల మహారథుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. కుమారస్వామి అను నేను అంటు గవర్నర్ వాజూభాయి వాలా చెప్పిన ప్రకారంగా కుమారస్వామి కర్ణాటక 24వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్ నేత పరమేశ్వర్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షలు రాహుల్ గాంధీ, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, ఏపీ సీఎం, చంద్రబాబునాయుడు, బీఎస్పీ నేత మాయావతి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, స్టాలిన్, శరత్ యాదవ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వంటి అతిరథ మహారథులు పాల్గొన్నారు.  

ఒకే వేదికపై విభిన్న పార్టీల నేతలు, సీఎంలు..
కుమారస్వామి ప్రమాణస్వీకారం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా బీజేపీ ఏతర సీఎంలు, పార్టీల అధినేతలు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు విధానసౌధ ప్రాంతంలో కొలువుదీరారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, జాతీయ పార్టీ అధినేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, గులాంనబీ అజాద్ వంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు, జేడీఎస్ నేతలు, తమిళనాడుకు చెందిన స్టాలిన్ వంటి అతిరథ మహారధులు వేదికపై కొలువుదీరి ఆహుతులను అలరించారు. బహుశా ఇటువంటి సందర్భాలకు కుమారస్వామి ప్రమాణస్వీకారం వేదికగా నిలిచింది.  

సీపీఎస్ ఉద్యోగులకు గ్రాడ్యుటీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు..

హైదరాబాద్ : సీపీఎస్ ఉద్యోగులకు గ్రాడ్యుటీ వర్తింపజేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్, మరణించిన ఉద్యోగులకు డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాడ్యుటీ వర్తింపజేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులలో పేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1.26 లక్షల సీపీఎస్ ఉద్యోగులతో పాటు రిటైరైన 998 మంది ఉద్యోగులకు, మరణించిన 490 మంది ఉద్యోగుల కుటుంబాలు లబ్ది పొందనున్నాయి.

16:16 - May 23, 2018

యాదాద్రి : బీబీ నగర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంధువ ఇంటికి వచ్చిన బాలకృష్ణ అనే వ్యక్తిపై గ్రామస్థులు తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలయిన బాలకృష్ణను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేసరికే మృతి చెందాడు. ఈ ఘటన జియాపల్లిలో చోటుచేసుకుంది. ఘట్ కేసర్ మండలం కొర్రెముల గ్రామానికి చెందిన బాలకృష్ణ జియాపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్తున్న సమయంలో గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయలకు తాళలేక బాలకృష్ణ మృతి చెందాడు. బాలకృష్ణ మృతిపై కొర్రెముల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బాలకృష్ణ మృతదేహంతో బీబీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు యత్నించారు. దీంతో పీఎస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో రెండు గ్రామాల మధ్య సోషల్ మీడియా వార్తలు చిచ్చురేపాయి. ఈ క్రమంలో దాడిని జియాపల్లి వాసులు సమర్ధించుకుంటున్నారు. కాగా ఇటీవల సోషల్ మీడియాలో పలు ప్రాంతాలలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారనీ..పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారనీ మెసేజ్ లతో పలు ప్రాంతాలలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలలోకొత్తగా వ్యక్తులెవరైనా కనిపిస్తే దాడికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే బంధువుల ఇంటికి వచ్చిన బాలకృష్ణపై గ్రామస్థులు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. గాయాలకుతాళలేక బాలకృష్ణ మృతి చెందారు. కాగా ఇటువంటి మెసేజ్ లను, వదంతులను నమ్మవద్దని పోలీసులు ఎంతగా చెప్పినా ఈ దాడులు మాత్రం ఆగటంలేదు. కాగా ఇటువంటి ఘటనలు తెంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు జరిగినట్లుగా సమాచారం. 

పెట్రోల్ ధరలపై చిదంబరం కీలక వ్యాఖ్యలు..

తమిళనాడు : పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడి సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తామంటు కాలయాపన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆకాశాన్నంటుతున్న పెట్రోల్ ధరలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలను రూ. 25 వరకు తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 1 లేదా 2 తగ్గించి ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. ఖజానాను నింపుకునేందుకు సామాన్యులపై భారం మోపుతోందని అన్నారు. కాగా ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 80 దాటిన విషయం తెలిసిందే. 

కుమార కూటమి కూలిపోతుందంటున్న యడ్డీ..

కర్ణాటక : రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్, జనతాదళ్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఈ రోజును ‘ప్రజా తీర్పు వ్యతిరేక దినం’గా బీజేపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పాటిస్తున్నాయి. దీనిపై మాజీ సీఎం, బీజేపీ శాసనసభాపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప మాట్లాడుతు..ఆకలి, దురాశ, అధికారం అన్నవి జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి మూలకాలనీ.. సంకీర్ణం మూడు నెలలు కూడా కొనసాగదని శాపం పెట్టారు. అని అన్నారు.

చంద్రబాబు సర్కార్ కు జనసేనాని డెడ్ లైన్..

శ్రీకాకుళం : సీఎం చంద్రబాబునాయుడుకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డెడ్ లైన్ విధించారు. 48 గంటల గడువునిచ్చారు. లేకుంటే నిరాహారదీక్షకు దిగుతారని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న ఏడు మండలాల్లో వెంటనే ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించాలని, వెంటనే వైద్య ఆరోగ్య శాఖా మంత్రిని ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కొత్త మంత్రిని పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి తాను 48 గంటల గడువును ఇస్తున్నానని, ఈలోగా చంద్రబాబు కిడ్నీ వ్యాధిగ్రస్తుల విషయంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బెంగుళూరులో చంద్రబాబు మంత్రాంగం..

కర్ణాటక : ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ నేత కుమారస్వామి ప్రమాణం స్వీకారం చేస్తున్న నేపథ్యంలో బెంగళూరుకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ప్రాంతీయ పార్టీల బలోపేతంపై భేటీలో చర్చించారు. ఏపీలో పరిణామాలు, బీజేపీ చేస్తోన్న రాజకీయాలను కేజ్రీవాల్‌కి చంద్రబాబు నాయుడు వివరించారు. ఏపీ హక్కులను కేంద్ర ప్రభుత్వం ఎలా కాలరాస్తోందనే విషయాన్ని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. దేశాభివృద్ధి కోసం ప్రాంతీయ పార్టీలన్ని కలిసి పని చేయాలని ఇరు నేతలు అభిప్రాయపడ్డారు.

తూత్తుకుడిలో కమల్ కు చేదు అనుభవం..

తమిళనాడు : మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు కమలహాసన్‌కు చేదు అనుభవం ఎదురైంది. నిన్న తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంతకు చెందిన స్టెరిలైట్‌ కాపర్‌ తయారీ ప్లాంటును మూసివేయాలంటూ స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టగా పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకి తూత్తుకుడిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిని పరామర్శించడానికి వెళ్లిన కమలహాసన్‌పై బాధితుల బంధువులు మండిపడ్డారు.

14:51 - May 23, 2018

భారత రాజ్యాంగా జీవించే హక్కును అందరికి ఇచ్చింది. దీంట్లో ఎవ్వరికి మినహాయింపు లేదు. పిల్లలను కని,పెంచి, పెద్ద చేసి, విద్యాబుద్ధులు చెప్పించి, వారి భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడిన తల్లిదండ్రులను, వృద్దులను బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిది.  జీవితంలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని జీవితపు మలిసంధ్యలో వారు కోరుకునేవి ప్రేమ,ఆత్మీయత. అంతే వారు ఇంకేమీ ఆశించరు. కానీ ఆస్తుల కోసం, వారి బాధ్యత తీసుకోవాల్సి వస్తుందనే దురాచనతో వారిని నిరాశ్రయులను చేస్తున్న సందర్బాలు ఎన్నో, ఎన్నెన్నో. కానీ వారికి కూడా హక్కులున్నాయి. చట్టాలున్నాయి. వృద్ధులు వారికి ఉండే హక్కులు ఏమిటో ఈరోజు మైరైట్ లో తెలుసుకుందాం. తల్లిదండ్రుల పోషణను విస్మరిస్తే వారిని శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయి. వృద్ధులను పట్టించుకోకుంటే వారికి చట్టం అండగా ఉంటుంది. చట్టం పరిధిలో వారికి ఎటువంటి హక్కులుంటాయి? ఎటువంటి చట్టాలుంటాయి అనే అంశంపై ఎడ్వకేటే పార్వతిగారి సలహాలు, సూచనల కోసం చూడండి..మైరైట్..

 

 

 

వృద్ధుల్లో 50 శాతానికిపైగా వేధింపులకు గురి అవుతున్నట్టుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం వృద్ధుల కోసం పలు చట్టాలను రూపొందించింది. కుమారులు , కోడళ్లు ఇతర బంధువుల ధూషణలు , చిత్ర హింసలతో ఇబ్బంది పడేవారి కోసం జాతీయ వయోశ్రీ యోజన పేరిట నూతన పథకాన్ని ప్రవేశ పెట్టింది. వృద్ధుల్లో అధిక శాతం వైకల్యాలు , వ్యాధులతో పాటు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారే ఉన్నారు. మలిదశలో ఆ సరాగా నిలివాల్సిన పిల్లలు కన్న వారిని ఆశ్రమాలు ఇతర చోట్ల చేరుస్తున్న ఘటనలో కోకొల ్లలు దీంతో వృద్ధులకు ఒటరితనం శాపంగా మారింది. సామాజిక భద్రత పథకాలు వారికి అంతగా ఉపయోగపడడం లేదు. అందుకే మన దేశంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు సంరక్షన కోసం 2007లో కేంద్ర ప్రభుత్వం తల్లిదండ్రులు , పెద్దల పోషణ సంక్షేమ చట్టం పేరిట తెచ్చిన దీనిని అమలు చేయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంది. 

 

కాసేపట్లో కుమారస్వామి ప్రమాణస్వీకారం..

కర్ణాటక : రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువుదీరనుంది. జేడీఎస్ అధినేత కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమయ్యింది.కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య ఎట్టకేలకు కొలువుల పంపకాల ఒప్పందాలు కుదిరాయి. కాంగ్రెస్ కు 22, జేడీఎస్ కు 12 పదవులకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. సీఎంగా కుమారస్వామి,డిప్యూటీ సీఎంగా జి.పరమేశ్వర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో బల నిరూపణ తర్వాతనే శాఖల కేటాయింపు వుంటుంది. మే 25న స్వీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా వుంటుంది. స్పీకర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.రమేశ్ కుమార్, డిప్యూటీ స్పీకర్ పదవి జేడీఎస్ కు దక్కనుంది.

14:30 - May 23, 2018

కర్ణాటక : రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువుదీరనుంది. జేడీఎస్ అధినేత కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమయ్యింది.కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య ఎట్టకేలకు కొలువుల పంపకాల ఒప్పందాలు కుదిరాయి. కాంగ్రెస్ కు 22, జేడీఎస్ కు 12 పదవులకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. సీఎంగా కుమారస్వామి,డిప్యూటీ సీఎంగా జి.పరమేశ్వర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో బల నిరూపణ తర్వాతనే శాఖల కేటాయింపు వుంటుంది. మే 25న స్వీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా వుంటుంది. స్పీకర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.రమేశ్ కుమార్, డిప్యూటీ స్పీకర్ పదవి జేడీఎస్ కు దక్కనుంది. ఈ క్రమంలో కుమారస్వామి ప్రమాణస్వీకారానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. తాను సీఎం అయ్యేందుకు కారణమయిన కాంగ్రెస్ అధినేతలు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ,ఉపాధ్యక్షురాలు సోనియాగాంధీలను కుమారస్వామీ స్వయంగా ఢిల్లీ వెళ్లిన ఆహ్వానించారు. కుమరస్వామి ఆహ్వానాన్ని మన్నించిన రాహుల్, సోనియాలు ఇప్పటకే బెంగళూరు చేరుకోనున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బెంగళూరు చేరుకున్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం పినరాయి విజయన్, యూపీ మాజీ సీఎం మాయావతి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వంటి బీజేపీ ఏతర సీఎంలు, పార్టీ అధినేతలతోపాటు ప్రముఖులంతా కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు.

13:11 - May 23, 2018

చిత్తూరు : తూత్తుకూడి బంద్ కొనసాగుతోంది. ఒక్క వాహనం కూడా బయటకు రావడం..వెళ్లడం లేదు. ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. స్టెరిలైట్ కర్మాగారం మూసివేయాలంటూ గ్రామస్తులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన తెలిసిందే. పోలీసులు జరిపిన కాల్పుల్లో 12 మంది మృతి చెందారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా విస్మయం వ్యక్తమౌతోంది. వేదాంత గ్రూపునకు చెందిన స్టెరిలైట్ కంపెనీ విస్తరణపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. నాలుగు నెలల పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, నీరు..వాయు కాలుష్యం ఎలా అవుతుందో తెలుసుకోవాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏడాదికి 4.34 లక్షల కాపర్ ను వేదాంత గ్రూప్ ఉత్పత్తిని చేస్తోంది. ఈ ఉత్పత్తిని అధికం చేయాలనే ఉద్ధేశ్యంతో కంపెనీని విస్తరించాలని యాజమాన్యం నిర్ణయించింది. కానీ ఇప్పటికే ఉన్న కంపెనీతో ప్రాణనష్టం సంభవిస్తోందని..మరింత విస్తరిస్తే ఇంకా ప్రాణనష్టం అధికంగా ఉంటుందని...పేర్కొంటూ మద్రాసు హైకోర్టులో ఫాతిమా బాబు పిటిషన్ దాఖలు చేశారు.

మరోవైపు తూత్తుకూడి ఘటనలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు నేతలు క్యూ కడుతున్నారు. సినీ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. కానీ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. కమల్ వెనక్కి వెళ్లిపోవాలని, రెండు దశాబ్దాలుగా ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోని నేతలు ఇప్పుడొస్తారా ? అంటూ మండిపడుతున్నారు. 

బాబుపై విజయసాయి తీవ్ర ఆరోపణలు...

విశాఖపట్టణం : తిరుమల శ్రీవారి గుప్త నిధులు సీఎం దోచుకున్నారని, 12గంటల్లో బాబు నివాసంలో సోదాలు నిర్వహించాలని ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆలస్యం చేస్తే చంద్రబాబు ఆ నగలను విదేశాలకు తరలిస్తారని ఆరోపించారు. సోదాల్లో స్వామి వారి ఆభరణాలు లభించకపోతే వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 

యాదాద్రిలో మంత్రి ఇంద్రకిరణ్...

యాదాద్రి : శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ పునర్ నిర్మాణ పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. 

ఏసీబీకి చిక్కిన ఏఈ...

ఏసీబీకి చిక్కిన ఏఈ... జిల్లా పరిషత్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. కాంట్రాక్టర్ నుండి రూ. 14వేలు లంచం తీసుకుంటున్న ఏఈ రహమతుల్లాను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

12:42 - May 23, 2018

హైదరాబాద్ : మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయ నివాసంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తనయుడు వైష్ణవ్ (21) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీనితో దత్తాత్రేయ భోరున విలపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆయన నివాసానికి చేరుకుని ప్రగాఢ సానుభూతిని వ్యక్తం దత్తాత్రేయను పరామర్శించారు. ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదని తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.డ 

12:33 - May 23, 2018

ఖమ్మం : అధికార ప్రజాప్రతినిధి..అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన నేత...అతనే దారి తప్పాడు. కట్టుకున్న భార్య కాదని..వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య అతడిని రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. టీఆర్ఎస్ కార్పొరేటర్ నరేందర్ గుర్రాలపాడుకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కుటుంబాన్ని పట్టించుకోకపోవడం..తరచూ ఫ్యామిలీలో తగాదాలు వస్తుండడంతో భార్యకు అనుమానం వచ్చింది. భర్త ప్రతి కదలికలను గమనించిన భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నాడని గ్రహించింది. దీనితో మంగళవారం సాయంత్రం భార్య బుధవారం రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుంది. అనంతరం నరేందర్ ను పీఎస్ కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. 

టీఆర్ఎస్ కార్పొరేటర్ రాసలీలలు...

ఖమ్మం : టీఆర్ఎస్ కార్పొరేటర్ నరేందర్ రాసలీలలు బయటపడ్డాయి. గుర్రాలపాడుకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నరేందర్ భార్య రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుంది. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లింది. 

12:23 - May 23, 2018

రంగారెడ్డి : తెలుగు రాష్ట్రాలను సోషల్ మీడియా పోస్టులు వణికిస్తున్నాయి. హంతక ముఠా సంచారంపై సోషల్ మీడియాలో విచ్చవిడిగా పోస్టులు దర్శనమిస్తున్నాయి. పలు పల్లెలు భయంతో రాత్రుళ్లు నిద్రకు దూరమౌతున్నాయి. సొంతంగా వంతుల వారీగా గ్రామీణులు పహారా కాస్తున్నారు. అపరిచితులపై అనుమానంతో దాడులకు గ్రామస్తులు తెగబడుతున్నారు. భయంతో చట్టాన్ని గ్రామీణులు చేతుల్లోకి తీసుకుంటున్నారు. అమాయకంగా దాడులు..హత్య కేసుల్లో ప్రజలు ఇరుక్కుంటున్నారు. దాడులకు దిగే వారిపై కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.పోలీసు ప్రకటనలు ప్రజల భయాన్ని పారదోలడం లేదు. ఇబ్రహింపట్నంలోని కానాపూర్ లో పరిస్థితులు తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. అక్కడి గ్రామస్తులు ఏమనుకుంటున్నారో తెలుసుకొనేందుకు వీడియో క్లిక్ చేయండి. 

12:11 - May 23, 2018

శ్రీకాకుళం : 'ఏపీ సర్కార్ మీకేమన్నా సిగ్గుందా ? సమస్యలు కనబడడం లేదా ? పరిష్కరించలేని ప్రభుత్వం ఉండడం నిజంగా సిగ్గు చేటు' అంటూ జనసేనానీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచకపడ్డారు. శ్రీకాకుళంలోని ఉద్దానం కిడ్నీ వ్యాధి గ్రస్తులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ రాష్ట్రానికి ఆరోగ్య మంత్రి నియమించడం...వెంటనే సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపుతారో చెప్పాలని..ఇందుకు 48గంటల సమయం ఇస్తున్నట్లు..లేనిపక్షంలో తాను నిరహార దీక్షకు కూర్చొంటానని హెచ్చరించారు.

గత మూడు రోజులుగా సిక్కోలులో ఆయన పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగో రోజు ఉద్దానం కిడ్నీ వ్యాధుల గ్రస్తులతో మాట్లాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వారితో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడారు..ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడ బాధాకరమని తెలిపారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన వైద్యులు సహకరిస్తామని పేర్కొనడం జరిగిందని..కేవలం మూడు డయాలిసిస్ కేంద్రాలు పెట్టి సరిపెట్టుకోవాలని ఏపీ ప్రభుత్వం చూస్తోందని పవన్ పేర్కొన్నారు. కానీ ఇక్కడ కావాల్సింది బ్లడ్ బ్యాంక్ అని, సమస్యలు చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలని...కనీసం ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడం సిగ్గు చేటన్నారు. ఇంత దయనీయ పరిస్థితులున్నా..కనీసం మంచినీళ్లు ఇవ్వడం లేదని, ఏడు మండలాల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మంత్రులు..ఎమ్మెల్యేలున్నా ఎలాంటి పనులు చేయకపోతుండడం విచారకరమని, ఇదే ఘటన ఏపీ మంత్రులు..సీఎం ఇంట్లో జరిగితే ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలు వాటికి ఖర్చు పెడుతున్నారని, కానీ ఇక్కడ ఖర్చు పెట్టి వారి బాధలను తీర్చడం లేదని..ప్రభుత్వానికి ఎందుకు బాధ లేదని నిలదీశారు. ప్రభుత్వం ఓట్ల మీద చూపిస్తున్న ప్రేమ సమస్యలపై దృష్టి పెట్టడం లేదన్నారు. మనుషులు చనిపోతున్నా..ప్రభుత్వం చలించడం లేదని విమర్శించారు. ఏపీ ఆరోగ్య మంత్రిని వెంటనే నియమించాలని, స్పెషల్ టీం ఏర్పాటు చేయాలని...48గంటల్లోపు స్పందించకపోతే నిరహార దీక్షకు కూర్చొంటానని పవన్ ఆల్టిమేటం జారీ చేశారు. మరి పవన్ విధించిన ఈ ఆల్టిమేటంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

11:59 - May 23, 2018

శ్రీకాకుళం : సిక్కోలులో కిడ్నీ వ్యాధులు..బాధితులపై అందాల్సిన సహాయంపై వైద్యులు..బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దాన్న కిడ్నీ బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొన్న వాటిపై వైద్యులు..బాధితులు మాట్లాడారు. ఏపీ ప్రభుత్వంతో తాము పలుమార్లు చర్చించడం జరిగిందని, కానీ తాము అనుకున్న స్థాయిలో ఎలాంటివి జరగలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు ఎలాంటి సహాయం చేయడం లేదని బాధితులు తెలిపారు. ఈ పని చేసినా అలసట ఎదురవుతోందని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. బ్లడ్ బ్యాంకు లేకపోవడం..శుద్ధ జల ప్లాంట్ లేకపోవడం దారుణమన్నారు. ఏ గ్రామంలో నీటి సరఫరా జరగడం లేదని, ఉద్దాన్నంలో 250 మందికి మాత్రమే పెన్షన్ అందిస్తున్నారని ఇతరులకు ఇవ్వడం లేదన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

దత్తన్నకు పలువురు పరామర్శ...

హైదరాబాద్ : మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మృతి చెందడంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు లక్ష్మణ్, చింత రామ చంద్రరావు, మేయర్ బొంతు రామ్మోహన్ రావులు దత్తన్నను పరామర్శించారు. 

పవన్ ఆల్టిమేటం...

శ్రీకాకుళం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఉద్దాన్నం కిడ్నీ బాధితులు, వ్యాధుల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తాము నిరహార దీక్షకు కూర్చొంటారని, ఇందుకు 48గంటల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. 

గ్రౌండ్ శుద్ధి చేసేందుకు వెళ్లిన వైసీపీ నేతలు...

విశాఖపట్టణం : ఏయూ గ్రౌండ్ ను శుద్ధి చేస్తామని వైసీపీ నేతలు వెల్లడించారు. గ్రౌండ్ లో మంగళవారం సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేసిన సంగతి తె లిసిందే. ఏయూకు ర్యాలీగా బయలుదేరిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. 

10:55 - May 23, 2018

కర్నూలు : జిల్లాలోని చెన్నంపల్లి కోటలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఎనిమిది చోట్ల అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. నెలలు దాటినా కోటలో గుప్త నిధుల ఆనవాళ్లు దొరకడం లేదు. కోట ప్రమాద అంచుకు చేరుకుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుప్త నిధులంటూ చరిత్రను కనుమరుగయ్యేలా చేస్తున్నారని, 700 సంవత్సరాల చరిత్ర కలిగిన కోటను ఆనవాళ్లు లేకుండా అధికారులు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరింత సమాచారం కోసం వీడియోని క్లిక్ చేయండి. 

10:48 - May 23, 2018

హైదరాబాద్ : వదంతులు..పుకార్లు ఎవరూ నమ్మవద్దని రాచకొండ కమిషనర్ సూచించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మేసేజ్ లు వస్తున్న సంగతి తెలిసిందే. చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని..చంపేస్తున్నారంటూ వదంతులు వస్తున్నాయి. దీనితో అనుమానం వచ్చిన వ్యక్తులపై దాడులు చేస్తుండడంతో ప్రాణనష్టం సంభవిస్తోంది. దీనిపై టెన్ టివి రాచకొండ కమిషన ర్ తో ముచ్చటించింది.

పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని..చంపేస్తారని మేసేజ్ లు వస్తున్నాయని..ఇవన్నీ ఎవరూ నమ్మవద్దని సూచించారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలియచేయాలని, ఎవరినీ కొట్టవద్దన్నారు.

 

మళ్లీ పాక్ కాల్పులు..వృద్ధుడు మృతి...

జమ్మూ కాశ్మీర్ : పాక్ మళ్లీ కాల్పులకు తెగబడుతోంది. అమాయకులపై కాల్పులు జరుపుతుండడంతో పలువురు మృతి చెందుతున్నారు. హీరానగర్ లో కాల్పులకు ఒక వృద్ధుడు చనిపోగా నలుగురికి గాయాలయ్యాయి. 

తూత్తుకూడికి వైగో...

 

తమిళనాడు : ఎండీఎంకే చీఫ్ వైగో తూత్తుకూడికి చేరుకున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. స్టెరిలైట్ కంపెనీ మూసివేయాలంటూ గ్రామస్తులు జరిపిన ఆందోళనపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. 

 

బీబీనగర్ మండలంలో దారుణం...

యాదాద్రి : జిల్లా బీబీనగర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. దొంగగా భావించిన స్థానికులు దాడి చేయడంతో తీవ్రగాయాలు కావడంతో బాలకృష్ణ మృతి చెందాడు. 

09:49 - May 23, 2018

యాదాద్రి : సోషల్ మీడియా మేసేజ్ లు ప్రాణాలు తీస్తున్నాయి. దొంగలు బీభత్సం సృషిస్టున్నారని..ప్రాణాలు సైతం తీస్తున్నారంటూ భయంకరమైన మేసేజ్ లు వెళుతున్నాయి. దీనితో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అనుమానం వచ్చిన వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. ఏకంగా దాడులు చేస్తుండడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదైనా అనుమానం వస్తే 100 డయల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. తాజాగా మరొక ప్రాణం పోయింది.

ఘట్ కేసర్ మండలం కొర్రెముల గ్రామానికి చెందిన బాలకృష్ణ బంధువుల నివాసానికి వెళ్లేందుకు జియాపల్లికి వెళుతున్నాడు. అనుమానం వచ్చిన గ్రామస్తులు దొంగగా భావించి దాడి చేయడంతో బాలకృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. దీనితో అతను మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

09:43 - May 23, 2018

తమిళనాడు : తూత్తుకూడిలో అత్యంత విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మృతి చెందారు. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిరసనపై తూటా పేలుస్తారా ? అంటూ పలు ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా స్టెరిలైట్ కర్మాగానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వంలో మాత్రం ఏ చలనం లేకుండా పోయింది. చివరకు మంగళవారం సుమారు 20 వేల మంది తూత్తుకూడి కలెక్టరేట్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడం..ఇరు వర్గాల మధ్య తోపులాట..ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మృతి చెందగా 60 మందికి తీవ్రగాయాలయ్యాయి. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. అనంతరం అక్కడి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. పదిలక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఇదిలా ఉంటే చెన్నై మెరీనా బీచ్ లో రెండు వేల మందితో భద్రత ఏర్పాటు చేశారు. ఐదుగురు ఐపీఎస్ నేతృత్వంలో భారీగా పోలీసులు బలగాలు మోహరించాయి. తూత్తుకూడి ఘటనపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్, ఇతర నేతలు ఘటనాస్థలికి రానున్నారు. 

09:24 - May 23, 2018

శ్రీకాకుళం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిక్కోలు పర్యటన కొనసాగుతోంది. మూడు రోజులుగా ఆయన జిల్లాలో పర్యటిస్తూ వివిధ సమస్యలను తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. సమస్యలు తెలియచేసేందుకు వస్తున్న వారి బాధలను వింటూ పలు హామీలిస్తున్నారు. అంతేగాకుండా ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ నిరసన కవాతు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం నాలుగ రోజు పలాలసలో పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు ఉద్దాన్నం కిడ్నీ బాధితులతో ఆయన మాట్లాడనున్నారు. గతంలో పర్యటించిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే దానిపై బాధితులతో ఆయన చర్చించనున్నారు. సాయంత్రం టెక్కలిలో నిరసన కవాతు నిర్వహించనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగసభలో పవన్ ప్రసంగించనున్నారు. 

09:23 - May 23, 2018

కర్ణాటక : రాష్ట్రంలో జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సమయం దగ్గర పడుతోంది. రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్ శాసనసభాపక్ష నేత కుమార స్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విధాన సభ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు హాజరవుతున్నారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఓటరు ఏ పార్టీకి స్ఫష్టమైన మెజార్టీ ఇవ్వలేదనే సంగతి తెలిసిందే. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీజేపీ 104 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌(79), జేడీఎస్‌(38) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక బీఎస్పీ(1), ఇండిపెండెంట్లు(2) సీట్లను గెలుచుకున్నారు. దీనితో కాంగ్రెస్ - జేడీఎస్ కూటముల కలిశాయి.

మంత్రివర్గ కూర్పు, ప్రమాణ స్వీకారాత్సోవానికి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్, సోనియా గాంధీలను కలిసి కుమార స్వామి ఆహ్వానించారు. అనంతరం మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. దీనిపై రాష్ట్ర నేతలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అనంతరం జేడీఎస్ -కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన చర్చలో ఒప్పందాలు కుదిరాయి. 22 మంత్రి పదవులు జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవితో కలిపి 12 పదవులు దక్కాయి. డిప్యూటీ సీఎంగా కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌కు స్పీకర్, జేడీఎస్‌కు డిప్యూటీ స్పీకర్‌ పదవులు దక్కాయి. స్పీకర్‌గా కాంగ్రెస్‌ నేత కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ను ఈ నెల 25న ఎన్నుకోనున్నారు. బల నిరూపణ తరువాతే మంత్రి పదవుల అంశంలో శాఖల కేటాయింపుల ప్రక్రియ ఉంటుందని కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. కాగా, కుమారస్వామి ఈ నెల 24న బలపరీక్ష ఎదుర్కోనున్నారు.

యాదాద్రికి లక్ష్మారెడ్డి...

యాదాద్రి : తెలంగాణ రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష చేయనున్నారు. 

08:53 - May 23, 2018

ఢిల్లీ : చెన్నై సూపర్‌ కింగ్స్‌ సూపర్‌ విక్టరీ కొట్టింది. ఐపీఎల్‌ 11 సీజన్‌లో ఫైనల్‌కు చేరుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఫస్ట్‌క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో దోనీగ్యాంగ్‌ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ పరుగుల వేటలో తడబడ్డారు. నిర్దేశిత 20ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేయగలిగారు. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై పైచేయి సాధించింది. దీంతో తొలి ఫైనల్‌ బెర్తును చెన్నై సూపర్ కింగ్స్ ఖరారు చేసుకుంది. చెన్నై ఆటగాడు డుప్లెసిస్‌ 42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67పరులు చేసి చెన్నైని ఫైనల్‌కు చేర్చాడు. 

08:13 - May 23, 2018

హైదరాబాద్ : రాంనగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ తనయుడు వైష్ణవ్ (21) హఠాన్మరణం చెందాడు. దీనితో రాంనగర్ లో నివాసం ఉంటున్న దత్తన్న నివాసానికి నేతలు చేరుకుంటున్నారు. కుమారుడు మృతి చెందడంతో దత్తాత్రేయ భోరున విలపిస్తున్నారు. ఆయన్ను ఓదారించడం ఎవరి తరం కావడం లేదు. విషయం తెలుసుకున్న పలువురు సంతాపం ప్రకటించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్ లో పరామర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, పలువురు నేతలు దత్తాత్రేయ నివాసానికి చేరుకుని వౌష్ణవ్ భౌతికకాయానికి నివాళలర్పించారు. తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం పరామర్శించారు.

మంగళవారం రాత్రి 10.45 ప్రాంతంలో దత్తాత్రేయ కొడుకు వైష్ణవ్‌ భోజనం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ముషిరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స జరుగుతుండగానే రాత్రి 12.30కి వైష్ణవ్‌ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. వైష్ణవ్‌ ఎంబీబీఎస్‌ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. 

07:31 - May 23, 2018

తమిళనాడులోని తూత్తుకుడిలో నిరసననకారుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళన కారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 9మంది ఆందోళనకారులు మృతి చెందారు. స్టెరిలైట్ కర్మాగారం మూసివేయాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. సీఎంగా కుమార స్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో క్రిషాంక్ (టి.కాంగ్రెస్), మాధవి (బిజెపి), బండారు రవి కుమార్ (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఏఆర్ ఎస్ఐ మృతి...

ప్రకాశం : ఉలవపాడు బైపాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు ప్రయాణిస్తున్న లారీ ముందున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఏఆర్ ఎస్ఐ శ్రీనివాస్ మృతి చెందాడు. 

06:49 - May 23, 2018

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు, గ్రామఢాక్‌ సేవకులు మంగళవారం నుండి సమ్మెకు దిగారు. పోస్టల్‌ సంఘలు అన్నీ జేఏసీగా ఏర్పడి సమ్మెను నడిపిస్తున్నాయి. 2016 నవంబర్‌లో తపాలశాఖ వేతన సవరణ కమిటీ ఇచ్చిన సిఫార్సులను GDSలకు అమలు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జీడీఎస్‌ల సమ్మె కొనసాగుతోంది. దీనికి దారి తీసిన కారణాలు.. ప్రభుత్వ విధానాలపై టెన్ టివి జనపథంలో ఏపీ పోస్టల్‌ జేఏసీ కన్వీనర్‌ ప్రసాద్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:43 - May 23, 2018

కర్నూలు : ప్రభుత్వం పెట్రోల్‌ ధరలు పెంచడంపై కర్నూల్‌ ప్రజలు మండిపడుతున్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా కర్నూల్‌లోనే ధరలు మండిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధరలు పెంచి, సామాన్యుని నడ్డివిరుస్తుందంటున్నారు. కర్నూలు పెట్రోల్‌ ధరలకు సంబంధించి మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:38 - May 23, 2018

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలను దాదాపుగా పరిష్కరించామన్నారు మంత్రి కేటీఆర్‌. శేరిలింగంపల్లి జోన్‌లో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. తాగునీటి రిజర్వాయర్లను ప్రారంభించారు. గ్రేట‌ర్‌ హైదరాబాద్‌ ప‌రిధిలో త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చేయడంలో మంచి ఫ‌లితాలు సాధించామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. శేరిలింగం ప‌ల్లి ప‌రిధిలోని వివిధ ప్రాంతాల్లో హైద‌రాబాద్ జ‌ల‌మండ‌లి నిర్మించిన నీటి రిజ‌ర్వాయ‌ర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంబించారు. దీంతో గ్రేటర్ శివారు మున్సిపాలిటిల్లో తాగునీటి ఇబ్బందులు త‌గ్గుతాయ‌న్నారు. రెండేళ్ల క్రితం 1900కోట్ల రూపాయల హాడ్కో రుణంతో పారంభ‌మైన ప‌నులు చాలా వ‌ర‌కు తుదిదశ‌కు చేరుకున్నాయ‌న్నారు. గ్రేట‌ర్ ప‌రిధిలో రాబోయే రోజుల్లో ఎమాత్రం తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చేయడాని కేశ‌వ‌పూర్ వ‌ద్ద భారీ రిజ‌ర్వాయ‌ర్ నిర్మించేందుకు ప్రణాళిక‌లు త‌యారవుతున్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

జిహెచ్ఎంసి అధ్వర్యంలో నిర్మాణం అవుతున్న ప‌లు రోడ్దు ప‌నుల‌కు శంకు స్థాప‌న చేయడంతో పాటు శిల్పారామం వ‌ద్ద నిర్మించిన ఎసి బ‌స్ స్టాప్ ను మంత్రికేటీర్‌ ప్రారంభించారు. సిటి ప్రయాణికుల‌కు సుఖ‌వంత‌మైన ప్రయాణం క‌ల్పిండమే త‌మ ఉద్యేశ‌మన్నారు మంత్రులు. అందులో భాగంగానే గ్రేట‌ర్ ప‌రిధిలో ఈఎడాది 1120కోట్ల రోడ్లను అభివృద్ది చేశామన్నారు. గ్రేటర్‌లో ఉన్న పార్కులు, చెరువుల ప‌రిర‌క్షణ‌లో ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. నగరపరిధిలో 541కోట్లతో 40చెరువుల‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. శివారు ప్రాంతాల్లో మురుగునీటి పారుద‌ల‌కోసం 3200కోట్లతో ప్రణాళికను త‌యారు చేశామ‌ని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తాము చేపట్టిన పథకాల వల్ల గ్రేటర్‌ హైదరాబాద్‌లో పరిధిలో 95శాతం నీటికష్టాలు తొలిగిపోయయని మంత్రి కేటీఆర్‌ చెప్పడంపై నగర ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాటర్‌ క్యాన్లు కొనుక్కుని రోజులు గడుపుకుంటున్న పరిస్థితులు ఉంటే.. తాగునీటి కష్టాలే లేవనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

06:35 - May 23, 2018

బెంగళూరు : కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామికి ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. మంగళవారం బెంగళూరులోని మాజీప్రధాని దేవేగౌడ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌కు సాదర స్వాగతం లభించింది. కుమారస్వామికి పుష్పగుచ్ఛం అందజేసిన తెలంగాణ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. కుమారస్వామిని శాలువాతో సత్కరించారు. బుధవారం అత్యవసర సమావేశాలకు హాజరు కావాల్సి ఉన్నందున ఒకరోజు ముందుగానే బెంగళూరుకు వెళ్లిన కేసీఆర్‌ కుమారస్వామికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ వెంట స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు కేకే సంతోష్ కుమార్, వినోద్, మిషన్ భగీరథ ఛైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎండీసీ ఛైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

06:32 - May 23, 2018

హైదరాబాద్ : బీజేపీ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంట్లో విషాదం నెలకొంది. దత్తాత్రేయ కొడుకు వైష్ణవ్‌ గుండెపోటుతో మృతి చెందాడు. మంగళవారం రాత్రి 10.45 ప్రాంతంలో భోజనం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ముషిరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స జరుగుతుండగానే రాత్రి 12.30కి వైష్ణవ్‌ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. వైష్ణవ్‌ వయసు 21 సంవత్సరాలు. ప్రస్తుతం ఎంబీబీఎస్‌ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు కన్నుమూయడంతో దత్తాత్రేయ గుండలవిసేలా విలపిస్తున్నారు. 

06:30 - May 23, 2018

బెంగళూరు : కర్నాటకలో కొత్త సర్కార్‌ కొలువుదీరనుంది. జేడీఎస్‌ నేత కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు మూహూర్తం నిర్ణయించారు. ఈమేరకు బెంగళూరులోని విధానసౌధాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎంగా కుమారస్వామి. డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్‌ నేత పరమేశ్వరన్‌ ప్రమాణం చేయనున్నారు.

కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రిగా హెచ్‌డీ కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత జి. పరమేశ్వర్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని కర్నాటక విధాన సౌధలో తూర్పు ద్వారం మెట్లపై ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్ఠానంతోనూ, రాష్ట్రంలో కేపీసీసీ నేతలతోనూ జరిపిన చర్చల్లో మంత్రి వర్గ కూర్పుపై కుమారస్వామి ఓ నిర్ణయానికి వచ్చారు. ఇరుపార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మొత్తంగా 34 మంత్రిత్వ శాఖల్లో కాంగ్రెస్‌కు 22, జేడీఎస్‌కు 12 మంత్రి పదవులు కేటాయించాలని నిర్ణయించారు. కాగా ఈ నెల 25న స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. శాసన సభాపతిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ రమేశ్ కుమార్‌, జేడీఎస్‌కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది.

ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి పలువురు జాతీయనేతలు హాజరవుతున్నారు. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతోపాటు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా కార్యక్రమానికి రానున్నారు. వీరితో పాటు బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేరళ సీఎం పినరయి విజయన్‌, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌ తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది.

కాగా ఇతర మంత్రి పదవులు, శాఖలను సభలో ప్రభుత్వ బలనిరూపణ తర్వాత చేపడతామని జేడీఎస్‌-కాంగ్రెస్‌ సమన్వయకర్తలు వెల్లడించారు. రెండు పార్టీల మధ్య మంత్రిపదవులు, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ల పదవుల పంపకాలు కూడా జరిగిపోవడంతో తమ కూటమిలో ఇక ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని కాంగ్రెస్-జేడీఎస్‌ నేతలు అంటున్నారు. మొత్తానికి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించిన కర్నాటక ఎన్నికల ఎపిసోడ్‌కు... కుమారస్వామి ప్రభుత్వ ఏర్పాటుతో ముగింపు పలికినట్టేనని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

మరో రెండు రోజులు ఎండలు...

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మరో రెండు రోజులు కూడా ఎండలు మండుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం అత్యధికంగా ఆదిలాబాద్ లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 

టీఎస్ ఐసెట్...

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ బుధ, గురువారాల్లో ఆన్ లైన్ విధానంలో జరుగనుంది. 

బీర్ల ధర ప్రియం...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగాయి. ఒక్కో బీరు సీసాపై రూ.10 చొప్పున పెంచుతూ ఎక్సైజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త స్టాక్ విక్రయానికే పెరిగిన ధరలు వర్తించనున్నాయి. 

పలాసలో కొనసాగుతున్న పవన్ పర్యటన...

శ్రీకాకుళం : ఉదయం 10గంటలకు పలాసలోని పీకేఆర్ కళ్యాణ మండపంలో కిడ్నీ బాధితులతో నేడు భేటీ కానున్నారు. సాయంత్రం 4గంటలకు టెక్కలిలో ప్రత్యేక హోదా నిరసన కవాతు నిర్వహించనున్నారు. 

నేడు కర్ణాటక సీఎంగా కుమార స్వామి ప్రమాణ స్వీకారం...

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుంది. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు బెంగళూరులోని విధానసౌధ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమానికి పలువురు పార్టీల నేతలు హాజరయ్యే అవకాశముంది.

కర్ణాటక డిప్యూటి సీఎంగా...

బెంగళూరు : కర్ణాటకలో నూతన సర్కార్ కొలువుదీరనుంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సీఎంగా జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్ నేత జి. పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

 

 

దత్తాత్రేయ కుమారుడు మృతి...

హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ నివాసంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన కుమారుడు వైష్ణవ్ (21) హఠాన్మరణం చెందారు. మంగళవారం రాత్రి 10గంటలకు భోజనం చేస్తుండగా గుండెపోటుతో వైష్ణవ్ కుప్పకూలిపోయాడు. వెంటనే ముషిరాబాద్ లోని కేర్ ఆసుపత్రికి తరలించాగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

Don't Miss