Activities calendar

24 May 2018

21:23 - May 24, 2018

తమిళనాడులో స్టెరిలైడ్ రాగి కర్మాగార విస్తరణ పనులతో తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయి. దాని విస్తరణ పనులు ఆపాలి..తమ ప్రాణాలకు ముప్పుగా ఉందని అక్కడి ప్రజలంత ఏకంగా పోరాటం చేస్తున్నారు. వారిపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. కాల్పులు జరిపారు. కాల్పుల్లో 13 మంది చనిపోయారు. విస్తరణ పనులు ఆపాలి.. మా ప్రాణాలు నిలబెట్టాలనే పోరాటం అక్కడ జరుగుతుంది. తూత్తుకూడిలో ఏం జరుగుతోంది..? 
అనే అంశంపై నిర్వహించిన విశ్లేషణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణ్ రావు పాల్గొని, మాట్లాడారు.
ఆయన మాటల్లోనే..
'కాల్చిపోరేయండి..ఒక్కరైనా చచ్చిపోవాలి.'. అని ఒక పోలీస్ అధికారి అన్న మాటలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తమిళనాడులో రాగి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పనులు ఆపాలని కోరుతూ ప్రజలు పోరాటం చేస్తున్నారు. అయితే పోలీసులు ప్రీప్లాన్డ్ గా కాల్పులు జరిపారు. తూత్తుకూడిలో ప్రజలు హత్య చేయబడ్డారు. ట్యూటీకోరన్ జిల్లాలో తూత్తుకూడి అనే ప్రాంతం ఉంది. పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పరిశ్రమలు కావాలి... పర్యావరణం కావాలి'. అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...  

20:54 - May 24, 2018

నాకు ఏపదవొద్దంటున్న కోమటిరెడ్డి...పదవొద్దన్నంక రాజకీయాలెందుకు..?, రెవెన్యూ రికార్డుల శుద్ది ఆగమాగం.. లక్షల రికార్డులకు కొత్త సమస్యలు, మున్సిపల్ చెర్మన్ కొడ్కును తిట్టిన జేసీ..ఎందుకో సారుకు  బీసీలంటే అంతకశి, ఊర్లపొంటి కొనసాగుతున్నదాడులు..సుట్టాలను కొట్టి సంపుతున్నజనాలు, రాజకీయ రంగుగ మారిన టీటీడీ పంచాది.. వైసీపీ, టీడీపీల నడ్మ రాజుకున్నది, సాకలోళ్లకు ఇస్తీరి మంగలోళ్లకు కత్తెర్లు.. మరి అగ్రవర్ణాల పనిముట్లేవి సారు..? ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

మియాపూర్ లో అపార్ట్ మెంట్ పై పిడుగుపాటు

హైదరాబాద్ : మియాపూర్ లో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పారు.

 

20:47 - May 24, 2018

బీజేపీ వ్యతిరేకపార్టీలు ఏకతాటిపైకి రానున్నాయా..? 2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారనున్నాయా..? కూటములు..రాజకీయ పార్టీలు..అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీఆర్ ఎస్ నేత వేణుగోపాలాచారి, ఏపీ బీజేపీ నేత రఘునాథ్, టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. 
దేశ, రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది టీడీపీయే : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం నమ్మకం ద్రోహం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో తెలంగాణ టీడీపీ మహానాడులో ఆయన ప్రసంగించారు. ఏపీ, తెలంగాణ ప్రజలను కేంద్రం మోసం చేసిందన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. కర్నాటకలో బీజేపీకి గాలి జనార్థన్ రెడ్డి మద్దతు తెలిపారని పేర్కొన్నారు. అవినీతి పార్టీ వైసీపీతో బీజేపీ చేతులు కలిపిందన్నారు. 'నేను ప్రజల కోసం పని చేస్తాను.... వారు కేసుల కోసం పని చేస్తారు'...అని విమర్శించారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది టీడీపీనేనని అన్నారు. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు.

20:37 - May 24, 2018

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం నమ్మకం ద్రోహం చేసిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో తెలంగాణ టీడీపీ మహానాడులో ఆయన ప్రసంగించారు. ఏపీ, తెలంగాణ ప్రజలను కేంద్రం మోసం చేసిందన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. కర్నాటకలో బీజేపీకి గాలి జనార్థన్ రెడ్డి మద్దతు తెలిపారని పేర్కొన్నారు. అవినీతి పార్టీ వైసీపీతో బీజేపీ చేతులు కలిపిందన్నారు. 'నేను ప్రజల కోసం పని చేస్తాను.... వారు కేసుల కోసం పని చేస్తారు'...అని విమర్శించారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది టీడీపీనేనని అన్నారు. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు.. ప్రపంచంలో నెంబర్ వన్ ఎయిర్ పోర్టు అని అన్నారు. ఉమ్మడి ఏపీలో రాష్ట్రమంతా రోడ్లను వెడెల్పు చేశామని గుర్తు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు, ఎనిమిదిల లైన్ల రోడ్డు వేశామని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ 200 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయన్నారు. సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదేనని తెలిపారు. కృష్ణా జలాలను హైదరాబాద్ కు తీసుకొచ్చామని.. కరెంట్ కొరత లేకుండా చేశామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో టీడీపీ ముద్ర ప్రగాఢంగా ఉందన్నారు. అవినీతికి పాల్పడి మెట్రో రాకుండా చేశారని మండిపడ్డారు. మన ఆత్మస్థైర్యం ముందు ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. తెలంగాణలో తిరుగులేని శక్తిగా టీడీపీ తయారవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

20:14 - May 24, 2018

హైదరాబాద్ : ఓ పేద కుటుంబంతో మలక్‌పేట యశోద ఆసుపత్రి వైద్యులు చెలగాటం ఆడుతున్నారు. దేవరకొండకు చెందిన లాలయ్య, బుజ్జమ్మల కూతురు భాగ్యలక్ష్మికి ఆరు రోజుల క్రితం గుండెనొప్పి రావడంతో మలక్‌ పేట యశోద ఆసుపత్రికి తీసుకువచ్చారు. హాస్పటల్‌ యజమాన్యం లక్ష రూపాయలు కట్టించుకుంది. ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్స చేయాలని కుటుంబ సభ్యులు కోరగా... గుండెనొప్పి చికిత్సకు ఆరోగ్య శ్రీ లేదని చెప్పారు. దీంతో బాధితులు డబ్బులు కట్టకపోయేసరికి ఒక రోజు చికిత్స ఆపేశారు. ఇంతలో భాగ్యలక్ష్మి పరిస్థితి విషమంగా మారింది. వైద్యులు మిగితా డబ్బులు కట్టి భాగ్యలక్ష్మిని తీసుకెళ్లమంటున్నారని.. బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 

 

17:43 - May 24, 2018

హైదరాబాద్ : హైకోర్టు తీర్పు ప్రకారం తమ శాసనసభ్యత్వాలను పునరుద్ధరించడంతోపాటు భద్రత కల్పించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటున్న సంపత్ కుమార్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేకపోతే డీజీపీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. రాహుల్‌ అనుమతిలో టీఆర్‌ఎస్‌ అరాచకాలపై ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పారు.

 

17:39 - May 24, 2018

హైదరాబాద్ : జనసేనాని ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. తన పర్యటనకు ప్రభుత్వం ఎలాంటి భద్రత కల్పించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కొన్ని రోజులుగా సెక్యూరిటీ కల్పించాలని జనసేన కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఫైర్‌ అవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జనసేనాని సొంత భద్రతా సిబ్బందితోనే పర్యటన చేస్తున్నారు. అయితే తన భద్రతా బృందంలోని 11 మంది సిబ్బందికి గాయాలయ్యాయి.  వారిని స్వస్థలాలకు పంపారు. దీంతో సెక్యూరిటీ లేకపోవడంతో ఇవాళ ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు.  ప్రభుత్వ తీరుకు నిరసనగానే తన పర్యటన వాయిదా వేసుకున్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. 

 

17:37 - May 24, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీని కాంగ్రెస్‌కు తాకట్టు పెడుతున్నారని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి విమర్శించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీని ఎన్టీఆర్‌ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తించాలని ఆమె కోరారు. టీడీపీ పేరు మార్చుకోవాలని సూచించారు. టీడీపీని కాంగ్రెస్‌కు తాకట్టుపెడుతున్న చంద్రబాబు... ఎన్టీఆర్‌ ఫోటోను ఉపయోగించుకునే నైతిక హక్కులేదని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. 
 

పంచాయ‌తీ ఎన్నిక‌ల రిజ‌ర్వేష‌న్ల‌పై సమీక్ష..

హైదరాబాద్ : పంచాయ‌తీ ఎన్నిక‌ల రిజ‌ర్వేష‌న్ల‌ను ప్ర‌క‌టించేందుకు తెలంగాణ పంచాయ‌తీరాజ్ శాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌, హ‌రిత‌హారం, ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు త‌దిత‌ర అంశాల‌పై తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, క‌మిష‌న‌ర్ నీతూ ప్ర‌సాద్‌, ఇత‌ర అధికారులతో తెలంగాణ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఈ రోజు స‌మీక్ష నిర్వ‌హించారు. వచ్చేనెల 10 నాటికి పంచాయ‌తీ ఎన్నిక‌ల రిజ‌ర్వేష‌న్ల‌ను ప్ర‌క‌టించేందుకు తెలంగాణ పంచాయ‌తీరాజ్ శాఖ సిద్ధమవుతోంది. ఈ నెలాఖ‌రులోగా బీసీ ఓట‌ర్ల గ‌ణ‌న‌ను పూర్తి చేసి...

రైతుబంధులో లోపాలను సవరించాలి : తమ్మినేని

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంలో లోపాలున్నాయనీ..వాటిని సవరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పేర్కొన్నారు. ఎంబీ భవన్ లో సీపీఎం స్టేట్ కమిటీ సమావేశం సందర్భంగా తమ్మినేని మీడియాతో మాట్లాడుతు..టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంలో వున్న లోపాలను సవరించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ వైఫల్యాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాటిపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. రైతుబంధు పథకంతో చిన్న, సన్నకారు రైతులకు కాకుండా భూస్వాములకే లబ్ది కలుగుతోందని తమ్మినేని విమర్శించారు. 

అక్కడ రారు..ఇక్కడ రానీయరు : నర్శిరెడ్డి

హైదరాబాద్ : మహానాడు కార్యక్రమంలో టీడీపీ నేత నర్శిరెడ్డి తనదైన శైలిలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి వాటిని ఫుల్ ఫిల్ చేయమని ఎలక్షన్ కమిషన్ కు కేసీఆర్ ప్రతిపాదించారనీ..ఈ నేపథ్యంలో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ ఒకటే తేడా అని ఆంధ్రాలో ప్రతిపక్షాలు చంద్రబాబేమో అసెంబ్లీకి పోవనీ..తెలంగాణలో ప్రతిపక్షాలను కేసీఆర్ అసెంబడ్లీకి రానీడనీ సెటైర్లు వేశారు. 

గవర్నమెంట్ లో శుంఠలు..నిరుద్యోగుల మంటలు:నర్శిరెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల కోసం నోటిఫికేషన్లు పత్తా లేవనీ..టీడీపీ నేత నర్శిరెడ్డి తనదైన శైలిలో సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక లక్ష ఉద్యోగాలిస్తామనికేసీఆర్ 72 సార్లు ప్రకటించాడనీ అయినా ఎటువంటి ఉద్యోగాలు యువతకు రావటలేదన్నారు. ఏపీపీఎస్ లో గంట వున్నడు..గవర్నమెంట్ లో శుంఠలున్నరు..నిరుద్యోగుల మంట ఎలా తీరుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి వాటిని ఫుల్ ఫిల్ చేయమని ఎలక్షన్ కమిషన్ కు కేసీఆర్ ప్రతిపాదించారనీ..మరి నిరుద్యోగుల ఖాళీలను ఎప్పుడు ఫుల్ చేస్తవని నర్శిరెడ్డి తనదైన శైలిలో ప్రశ్నించారు.

 

మహానాడులో నర్శిరెడ్డి సెటైర్లే సెటైర్లు..

హైదరాబాద్ : టీడీపీ మహానాడులో టీడీపీ నేత నర్శిరెడ్డి సీఎం కేసీఆర్ పై సెటైర్లపై సెటైర్లు వేసి అందరినీ ఉత్సాహపరిచారు. మోదీ తెలంగాణ వచ్చినప్పుడు క్యా చాయీయే అంటే కేసీఆర్ ప్యార్ చాయియే అంటాడనీ..మోడీ వెళ్ళగానే మోడీయా, బీడీయా అంటాడనీ..ఈవెనింగ్ డార్లింగ్ అని మార్నింగ్ డైవర్స్ అనే పరిస్థితిలో కేసీఆర్ వుంటాడని హేళన చేశారు. టెంటే లేని కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అని తిరుగుతావున్నాడని..కేసీఆర్ మత్తులో వుండి నిద్రమత్తులో వున్న దేవగౌడ కాడికి పొయ్యి..థర్డ్ ఫ్రంట్ అంటున్నాడనీ..ఇద్దరు కలిసి కరుణానిధి కాడికిపోయి ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడిండని టీటీడీ నేత ఎద్దేవా చేశారు.

16:19 - May 24, 2018

చిత్తూరు : భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి మూడు రోజుల పాటు భక్తులు తిరుమలలో వేచిఉండాల్సి వస్తోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకదారుల్లో భక్తులకు జారీ చేసే 20 వేల దివ్యదర్శనం టోకెన్లు ఉదయం 10 గంటలకే పూర్తి అవుతున్నాయి. దీంతో మిగిలిన భక్తులు సర్వదర్శనం కోసం ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో భక్తులకు వసతిగదులు సైతం దొరకడంలేదు. తిరుమలలో భక్తుల రద్దీ గురించి మరింత సమాచారం వీడియోలో చూడండి.. 

తూత్తుకుడి కాల్పులు..కలెక్టర్ పై వేటు..

తమిళనాడు : తూత్తుకుడిలో ఆందోళనలు తీవ్ర తరమైన విషయం తెలిసిందే. స్టెరిలైట్‌ కాపర్‌ తయారీ ప్లాంటుకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనల్లో పోలీసుల చేతిలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. జిల్లా కలెక్టర్‌ ఎన్‌ వెంకటేశన్‌తో పాటు ఎస్పీపీ మహేంద్రన్‌లను బదిలీ చేసింది. దీంతో ఆ జిల్లా కలెక్టర్‌గా తెలుగు వ్యక్తి నండూరి సందీప్‌ను నియమించారు. ఈ రోజు ఆయన బాధ్యతలు స్వీకరించి విధులు నిర్వర్తిస్తున్నారు. తూత్తుకుడిలో ఆందోళనలు చెలరేగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తూత్తుకుడి కాపర్‌ ప్లాంట్‌ విస్తరణను నిలిపేయాని మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

కాళేశ్వరం పనులపై మంత్రి సమీక్ష..

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. చొప్పదొండి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ అధికారులు, గుత్తేదారులు హాజరయ్యారు. 

టీ.ఉద్యోగులకు ప్రయోజనం కోసం సర్కార్ నిర్ణయం..

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా గతంలో జరిగిన అన్యాయాలు పునరావృతం కాకుండా జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామనీ సీఎం కేసీఆర్ తెలపారు. మొత్తం రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లుగా కేసీఆర్ తెలిపారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నందున ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ పేర్కొన్నారు. 

నవనిర్మాణ దీక్షపై చంద్రబాబు సమీక్ష..

అమరావతి : నవనిర్మాణ దీక్ష 2018పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈసారి కూడా విజయవాడ బెంజ్ సర్కిల్ వద్దే నవనిర్మాణ దీక్ష చేయాలని చంద్రబాబు సమీక్షలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది. కాగా రాష్ట్ర అవతరణ దినోత్సం రోజునే దీక్ష చేయటం సమంజసం కాదనీ..రాష్ట్రానికి అన్యాయం జరిగింది..కానీ ఏవిధంగా వేడుకలు జరుపుకుంటామని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నాలుగేళ్లు గడిచినా రాష్ట్రానికి న్యాయం జరగలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తలసరి ఆదాయంలో మనం ఇంకా వెనుకబడే వున్నామన్నారు. కేంద్రం సహకరించి వుంటే మరింతగా మెరుగైన ఫలితాలను సాధించేవారమన్నారు.

జియాపల్లి దాడి..8మంది అరెస్ట్..

యాదాద్రి : జియాపల్లిలో బాలకృష్ణపై దాడి చేసిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగ అనే నెపంతో బాలకృష్ణపై జియాపల్లి వాసులు దాడికి యత్నించారు. ఈ ఘటనలో దెబ్బలకుతాళలేక బాలకృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన వందంతులు నేపథ్యంలో పలు ప్రాంతాలలో పలువురిపై దాడికి పాల్పడుతున్న ఘటనలో ఇటీవల పెరిగిపోయాయి. జియాపల్లి తండాలోని ఓ దేవాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 

గాంధీ ఆసుపత్రిలో నకిలీ డాక్టర్ల హల్ చల్..

సికింద్రాబాద్ : గాంధీ ఆసుపత్రిలో నకిలీ డాక్టర్లు హల్ చల్ చేశారు. డాక్టర్ డ్రెస్ లో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ప్రసూతి వార్డులోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో సెక్యూరిటీ వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. దీనిపై వారిని పోలీసులు విచారరిస్తున్నారు. కాగా డాక్టర్ డ్రెస్ తో వచ్చిన అనుమానాస్పద వ్యక్తుల్లో ఒక మహిళ, ఇద్దరు పురుషులు వున్నారు. 

టీటీడీ ఉద్యోగుల మరో కీలక నిర్ణయం..

తిరుమల : టీటీడీ ఉద్యోగులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితుల తీరుకి నిరసనగా ఇప్పటికే వారు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతోన్న విషయం తెలిసిందే. ఈ రోజు తిరుమల పరిపాలన భవనంలో అన్ని ఉద్యోగ సంఘాలు సమావేశమై కాసేపు చర్చించాయి. రేపు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు విధులు బహిష్కరించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకుని తీర్మానం చేశాయి.

బ్యాంకు రుణాలు ఎగవేస్తున్నారని..బ్యాంకులు సమ్మె..

ఢిల్లీ : బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేస్తున్న అవినీతిపరుల తీరుపై యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నాయకులు మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల కారణంగా బ్యాంకులు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టే అవినీతిపరుల తీరును నిరసిస్తూ ఈ నెల 30, 31 తేదీల్లో దేశంలోని అన్ని బ్యాంకుల ఉద్యోగ సంఘాలు 48 గంటలపాటు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు చెప్పారు. 

జడ్పీ సమావేశంలో తిట్ల పురాణం..

తూర్పుగోదావరి : జడ్పీ సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. ఇసుక రవాణాపై వైసీపీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుమ్రహ్మణ్యం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో జడ్పీ సమావేశంలో రసాభాస తయారయ్యింది. ఇద్దరు ఒకరిపై మరొకరు పరస్పరం అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. దీంతో వారి వర్గాలు కూడా ఒకరిపై ఒకరు దూషించుకోవటంతో జడ్పీ సమావేశంలో రసాభాస మారిపోయింది. 

యువతి ప్రేమించలేదని తల్లిదండ్రులపై దాడి..

హైదరాబాద్ : నేరేడ్ మెట్ పరిధిలోని వినాయక్ నగర్ లో ప్రేమోన్నామది ఘాతుకానికి ఒడిగట్టాడు. తాను ప్రేమించిన యువతి తనను కాదన్నదనే కోపంతో యువతి తల్లిదండ్రులపై శ్రావణ్ అనే యువకుడు దాడికి పాల్పడ్డాడు. అనంతరం పరారయ్యాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రావణ్ కోసం గాలిస్తున్నారు.

తూత్తుకుడి ఘటనపై స్పందించిన సీఎం పళనిస్వామి..

తమిళనాడు : తూత్తుకూడి ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందించారు. ఈ ఘటన వెనుక రాజకీయ పార్టీలు, సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, ఆందోళనకారులను తప్పుదోవ పట్టించాయని..ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారని సీఎం పళనిస్వామి సమర్థించుకున్నారు. తూత్తుకుడిలో స్టెరిలైట్‌ కాపర్‌ తయారీ ప్లాంటును మూసివేయాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో 13 మంది మృతి చెందారని సీఎం పళనిస్వామి అధికారికంగా ప్రకటించారు.

స్టాలిన్ అరెస్ట్..తమిళనాడు బంద్ కు డీఎంకే పిలుపు ..

తమిళనాడు : తూత్తుకుడిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అధికారపక్షంపై డీఎంకే సహా విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ నాయకత్వంలో ఆ పార్టీ శ్రేణులు ఈరోజు అసెంబ్లీ వద్ద మెరుపు ధర్నాకు దిగాయి. తూత్తుకుడి స్టెరిలైట్ ప్రాజెక్టును మూసివేయాలంటూ ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో డీఎంకే శ్రేణులు అసెంబ్లీ వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తభరిత వాతావరణం నెలకొంది. దీంతో..స్టాలిన్ సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి, అక్కడి నుంచి తరలించారు. మరోవైపు, రేపు తమిళనాడు బంద్ కు డీఎంకే పిలుపునిచ్చింది. 

13:36 - May 24, 2018

తూర్పుగోదావరి : కాకినాడ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. అధికారపక్ష..ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వ్యక్తిగత దూషణలకు దిగడంతో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇసుక మాఫియా వ్యవహారంపై ఈ రగడ చెలరేగింది. నది సంపదను దోచేస్తున్నారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం ధీటుగా స్పందించారు. అదుపు తప్పి వ్యక్తితగత దూషణలకు దిగారు. పేపర్లు..వాటర్ బాటిళ్లను విసురుకున్నారు. 

13:33 - May 24, 2018

అనంతపురం : పుట్టపర్తిలో టిడిపి నిర్వహించిన మహానాడుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ సమావేశంలో పనులు చేయించేందుకు మున్సిపల్ కార్మికులను టిడిపి నేతలు ఉపయోగించుకంటున్నారనే విమర్శలున్నాయి. పనులకు సంబంధించి వీడియోలు మీడియాలో దర్శనమిచ్చాయి. దీనితో పలువురు టిడిపి నేతల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాము ప్రశ్నిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయోనని ప్రశ్నించడం లేదని మున్సిపల్ కార్మికులు పేర్కొంటున్నారు. 

ఆగని వదంతులు..దొంగగా భావించి మరో వ్యక్తిపై దాడి..

నిజామాబాద్ : సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతున్న మెసేజ్ లు మనుష్యుల ప్రాణాలను హరించివేస్తున్నాయి. యాద్రాద్రి భువనగిరి జిల్లాలో మరో దాడి జరిగింది. బోధన్ తల్లి కోర్ట ఏరాయాలో బాలరాజు అనే మూగ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. బంధువుల ఇంటికి వెళ్తున్న మూగవ్యక్తి బాలరాజును దొంగగా భావించి గ్రామస్థులు చితకబాదారు. దీంతో బాలరాజు పరిస్థితి విషయంగా తయారయ్యింది. కాగా ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడితే సమాచారం ఇవ్వాలి తప్ప చట్టాన్ని చేతుల్లో తీసుకుని దాడికి పాల్పడవద్దని పోలీసు యంత్రాంగం ప్రకటిస్తున్నా ఈ దాడులకు ఫుల్ స్టాప్ పడటంలేదు.

దేవరపల్లిలో దాచేపల్లి ఘటన ..

పశ్చిమగోదావరి : ఐదేళ్ళ బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతునే వున్నాయి. దాచేపల్లి ఘటన, ఉన్నావో, కథువా, విశాఖపట్నం వంటి పలు ప్రాంతాలలో బాలికలపై లైంగిక దాడులు కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో దేవరపల్లిలో 5 ఏళ్ళ చిన్నారిపై 56ఏళ్ళ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ఇంటికి పిలిచి గురుస్వామి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈవిషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలిపగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాలికలపై కొనసాగుతున్న అత్యాచారాలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. 

13:13 - May 24, 2018

నిజామాబాద్ : సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు ప్రాణాలు తీస్తున్నాయి. అమాయకులను పట్టుకుని గ్రామస్తులు..స్థానికులు చితకబాదుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ దాడులపై పోలీసు శాఖ స్పందించింది. అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని..చట్టం చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. అయినా కూడా వారు మారడం లేదు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులను గ్రామస్తులు చితకబాదారు. బోధన్ తట్టి కోర్టు ఏరియాలో బాలరాజునే మూగ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. దొంగగా భావించిన స్థానికులు చితకబాదడంతో బాలరాజుకు తీవ్రగాయాలయ్యాయి. ఎడపల్లి మండలం బాపునగర్ లో కూడ ఇద్దరిని గ్రామస్తులు చితకబాదారు. ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. 

13:09 - May 24, 2018

పశ్చిమగోదావరి : మరో ఘోరం...ఎన్ని చట్టాలు..తీసుకొచ్చిన కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. మైనర్ బాలికలు..మహిళలు..చిన్నారులపై దారుణాలకు తెగబడుతున్నారు. వృద్ధులు కూడా ఇలాంటి ఘాతుకాలకు తెగబడుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలోచిన్నారిపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దేవరపల్లిలో శివనాగరాజు (52) నివాసం ఉంటున్నాడు. అయ్యప్ప మాల వేస్తుండడంతో ఇతడిని గురుస్వామి అని పిలుస్తుంటారు. ఇతను అగరబత్తుల వ్యాపారం చేస్తుంటాడు. ఇతని ఇంటి పక్కనే మరోకొ నివాసం ఉంది. అందులో ఉన్న ఐదేళ్ల చిన్నారిని ఇంటికి పిలిపించుకుని అత్యాచారం చేశాడు. కడుపులో నొప్పిగా ఉండడంతో అసలు విషయం చిన్నారి తల్లిదండ్రులకు తెలియచేసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. చిన్నారి తల్లిదండ్రులు మాత్రం తీవ్ర మనోవేదనకు..ఆందోళనలకు గురయ్యారు. 

13:05 - May 24, 2018

స్లైల్ అంటే రజనీ..రజనీ అంటే స్లైల్. స్లైల్ కు కేరాఫ్ అడ్రస్ రజనీకాంత్. ఆయన సిగరెట్ నోట్లో పెట్టుకునే స్లైల్ కు అభిమానులు పొంగిపోతారు. అప్పుడు వారికే కాదు ఎవరికీ రూల్స్ గుర్తుకు రావు..రజనీ మెట్లు దిగే విధానం చూస్తే అభిమానులు ఈలలే ఈలలు. నోట్లో బబుల్ గమ్ వేసుకునే విధానాన్ని అందరు అనుకరించాలని యత్నిస్తుంటారు. అటువంటి రజనీ 'కాలా'తో అభిమానుల ముందుకు వస్తున్నారు. 'పా రంజిత్' దర్శకత్వంలో 'కాలా' సినిమా రూపొందింది. ధనుష్ నిర్మించిన ఈ సినిమాలో రజనీ మాఫియా డాన్ గా కనిపించనున్నారు. తెలుగు ..తమిళ భాషల్లో జూన్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

చెన్నై లో ఘనంగా జరిగిన కాలా రిలీజ్ ఈవెంట్ 
ఇటీవల ఈ సినిమా ఆడియో వేడుకను చెన్నై లో ఘనంగా నిర్వహించారు.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో జరపాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం హైదరాబాద్ 'నోవాటెల్' హోటల్లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకను జరపనున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ స్థాయిలో విడుదల చేస్తోన్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా నానా పటేకర్ కనిపించనుండటం విశేషం. 'కబాలి' తరువాత అదే కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో అందరిలోను అంచనాలు వున్నాయి. ఈ సినిమాతో రజనీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరినట్టేనని అభిమానులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.

12:35 - May 24, 2018

హైదరాబాద్ : బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో అడ్వాన్స్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అవసరమైన వారు దీనిని ఉపగించుకోవచ్చన్నారు. ట్రాన్స్ ప్లాంటేషన్ కు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు అభినందనలు తెలియచేస్తున్నట్లు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

12:32 - May 24, 2018

హాలీవుడ్ రేంజ్ పర్సనాలిటీ తో యాక్షన్ సినిమా తో రాబోతున్నాడు ఈ యంగ్ హీరో . తన ప్రీవియస్ సినిమా సూపర్ హిట్ తో జోరు మీద ఉన్న ఈ హీరో తన ప్రెజెంట్ ఫిలిం ని ఇంటర్నేషనల్ లెవెల్ టెక్నీషియన్స్ తో ప్లాన్ చేసాడు .. ఎవరా హీరో ఏంటా స్టోరీ హవె ఏ లుక్

తెలుగు ఇండస్ట్రీ నుండి ఒకే సారి వరల్డ్ వైడ్ స్టార్ గ గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాలో సూపర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట . తన ప్రీవియస్ ఫిలిమ్స్ బాహుబలి బిగినింగ్ , బాహుబలి కంక్లూజన్ తో ఒక్క సారిగా కలక్షన్స్ ప్రభంజనం క్రియేట్ చేసిన ప్రభాస్ సినిమా సినిమాకి మాత్రం చాల గాప్ తీసుకుంటున్నాడు .బాహుబలి సీరీస్ తరువాత వరల్డ్ వైడ్ గ గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో ప్రభాస్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఫాన్స్

ప్రభాస్ మరో సూపర్ ప్రాజెక్ట్ సాహో తో రాబోతున్నాడు .దర్శకుడు సుజిత్ - హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్ని బేట్స్ యాక్షన్ సీన్స్ కోసం చాలా ప్లాన్స్ వేసుకున్నారు. . సిజి వర్క్ అవసరం లేకుండా రియాలిస్టిక్ గా ఉండాలని నిజమైన కార్లతో ట్రక్కులతో ఛేజింగ్ సీన్స్ ను చిత్రీకరించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో సినిమా ఎలా ఉంటుందా అని చాలా వరకు టాలీవుడ్ మీడియాపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. హిందీలో కూడా ఆ సినిమా రూపొందుతుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. 

12:29 - May 24, 2018

నెల్లూరు : ఏపీ రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతునే ఉన్నాయి..కన్నుమిన్ను అని చూడకుండా దాష్టీకాలకు తెగబడుతున్నారు. ఎన్ని చర్యలు, చట్టాలు చేసినా మహిళలపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. ఇంట్లో ఉన్నా..రోడ్ మీద వెళ్తున్నా.. ఆఫీస్ లలో, బస్ స్టాప్ లలో, కాలేజీలలో, క్యాబ్ లలో… ఎక్కడైనా సరే మహిళలపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి.

బాలికలు..మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా తడ మండలంలో ఓ మహిళపై యువకుడు అత్యాచారయత్నం చేయబోయాడు. రైలు దిగుతున్న ఆమెపై ఈ ఘాతుకానికి తెగబడే ప్రయత్నం చేశాడు. ఆమెతో ఉన్న మహేష్ పై కత్తితో దాడికి దిగాడు. వెంటనే ఆమె కేకలు వేయడంతో స్థానికులు ఆ దుండగుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. రంగంలోకి దగిన పోలీసులు అతడిని పట్టుకున్నారు. అనంతరం బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

12:18 - May 24, 2018

తెలుగు సినిమా రేంజ్ పెరిగింది . ఎమోషన్స్ తో స్టోరీ లు తెరకెక్కించి కోట్లు కలెక్ట్ చేస్తుంది. బాగున్నా సినిమాలకి సూపర్ రెస్పాన్స్ వస్తుంది . రీసెంట్ టైమ్స్ లో రిలీజైన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాయి..ఇక్కడే కాదు అటు అబ్రాడ్ లో కూడా కలక్షన్స్ కురిపిస్తున్నాయి..

మన తెలుగు సినిమాల్లో చేంజెస్ వచ్చాయి రెగ్యులర్ మాస్ మసాలా ఊర రోడ్డ కొట్టుడు సినిమాలు కొట్టుకుపోతున్నాయి. డిఫెరెంట్ సినిమాలు కొత్త డైరెక్టర్స్ కొత్త థాట్స్ తో సినిమాలు వచ్చి హిట్ టాక్ ని తెచ్చుకుంటున్నాయి .మహానటి.. ఈ బిరుదుకు అర్హత ఉన్న ఒకే ఒక నటీమని సావిత్రి అని చాటి చెప్పేలా... ఓ సినిమా టీమ్ అంతా కలిసి కన్న ఓ కల, చేసిన ఓ నిజాయితీ గల ప్రయత్నం తెర మీదకు వచ్చింది.. ఆ సినమానే మహానటి. తాజాగా ‘మహానటి’ సినిమా యు ఎస్ మార్కెట్ లో 2 మిలియన్ మార్కును దాటి దూసుకెళ్తోంది అట .

రెగ్యులర్ సినిమాలు చేస్తున్న రోజుల్లో హీరో రాంచరణ్ తేజ్ కి ఇంత క్రేజ్ రాలేదు ఎప్పుడైతే డిఫెరెంట్ సినిమాలు చెయ్యడం స్టార్ట్ చేసాడో సూపర్ హిట్ సినిమా రంగస్థలం తో గట్టిగ బాక్స్ ఆఫీస్ ని కొట్టాడు అలానే కలక్షన్స్ కూడా ఇప్పటికి తగ్గకుండా నాన్ బాహుబలి రికార్డు ని సొంతం చేసుకున్నాడు.సమ్మర్ సీజన్లో రిలీజైన ‘రంగస్థలం’ అంచనాల్ని మించిపోయి ఏకంగా యు ఎస్ మార్కెట్ లో 3.5 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది అట . 

12:07 - May 24, 2018

సీనియర్ హీరో తో యంగ్ హీరో స్క్రీన్ ని పంచుకోబోతున్నాడు . వరుస హిట్ సినిమాలతో స్పీడ్ లో ఉన్న ఈ యంగ్ హీరో తన నెక్స్ట్ సినిమాని మల్టి స్టారర్ గా చేస్తున్నాడు . కంటెంట్ ఉన్న కథలతో హిట్ ట్రాక్ లో ఉన్న యంగ్ డైరెక్టర్ తో చేస్తున్న ఈ సినిమా గురించి తెలుసుకుందాం..

ప్రెజెంట్ రామ్ గోపాల్ వర్మ ఆఫీసర్ సినిమాలో బిజీ గా ఉన్నాడు నాగార్జున .తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మల్టి స్టారర్ సినిమాలు తక్కువే అని చెప్పాలి . ఇప్పుడు ట్రెండ్ మారింది స్టార్ హీరో ఐన సరే సబ్జెక్టు డిమాండ్ చేస్తే మల్టి స్టారర్ చెయ్యక తప్పదు అదే ట్రెండ్ ని ఫాలో అవుతూ ఇప్పుడు నాగార్జున అండ్ నాని కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే .ఆర్ జి వి సినిమా తరువాత నాగ్ మల్టి స్టారర్ రిలీజ్ అవుతుంది .

వరుస హిట్ సినిమాలతో జోష్ లో ఉన్న మినిమమ్ గ్యారంటీ హీరో నాని ఈ మధ్య రెగ్యులర్ సినిమాలు చేస్తున్నాడు అనే టాక్ తెచ్చుకున్నాడు .అందుకే నాని ఇప్పుడు ట్రాక్ మార్చాడు. తాను ఎంచుకునే సబ్జక్ట్స్ లో వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు . రీసెంట్ గ రిలీజైన కృష్ణార్జున యుద్ధం సినిమాలో నాని డ్యూయెల్ రోల్ చేసిన విషయం తెలిసిందే .

నానీ నాగార్జునని ఒకే స్క్రీన్ పైన చూసే టైం దగ్గరలోనే ఉంది .దాదాపు సగభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రీమేక్ అని తెలుస్తోంది. ఓ హిందీ సినిమాను ఇన్ స్పిరేషన్ గా తీసుకుని మూవీ చేస్తున్నాడట దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. 2007లో వచ్చిన బాలీవుడ్ మూవీ జానీ గద్దర్ కు రీమేక్ గానే.. నాగ్-నాని మల్టీస్టారర్ కథ సిద్ధమైందట. ఈ రీమేక్ అంశాన్ని త్వరలోనే పబ్లిక్ గా అనౌన్స్ మెంట్ కూడా చేయాలని ఫిక్స్ అయ్యారట. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ప్రీవియస్ సినిమా శమంతకమని మంచి టాక్ తెచ్చుకుంది .

11:57 - May 24, 2018

సెలెక్టివ్ గ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు ఈ యంగ్ హీరో . ఒక దశలో రెగ్యులర్ సినిమాలు తీసి బోర్ కొట్టించిన ఈ హీరో ఇప్పుడు డిఫెరెంట్ సినిమాలతో హిట్ ట్రాక్ ఎక్కాడు . రీసెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ హీరో సినిమాలో ఒక ఇంటరెస్టింగ్ పాయింట్ మీకోసం .

అక్కినేని వారసుల్లో హిట్ ట్రాక్ లో ఉన్నాడు నాగచైతన్య . తన మొదటి సినిమా ఏం మాయ చేసావే సూపర్ హిట్ అవ్వడం తో ఆ తరువాత వరుస సినిమాలు చేసాడు కానీ ఆ సినిమాలు అన్ని రెగ్యులర్ ఫార్ములాతో ఉండటం తో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి .నాగచైతన్య ట్రాక్ మార్చి డిఫెరెంట్ సినిమాలు చేస్తూ హిట్స్ ని కంటిన్యూ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు తన ప్రీవియస్ సినిమా రారండోయ్ వేడుక చూద్దాం ఆడియన్స్ ని ఆకట్టుకుంది .

ప్రేమమ్ సినిమా తో నాగ చైతన్య కి తిరుగులేని హిట్ ఇచ్చిన డైరెక్టర్ చందు మొండేటి .చందు మొండేటి లవ్ స్టోరీ ని బాగా హ్యాండిల్ చేసాడు అనే టాక్ వచ్చింది .చైతు- చందూ కాంబినేషన్ లో వచ్చిన ప్రేమమ్ మంచి సక్సెస్ సాధించింది.మలయాళం సినిమా రీమేక్ అవ్వడం తో పెద్దగా అంచనాలు ఏమి లేకుండా చెందుమొండేటి డైరెక్షన్ లో వచ్చిన ప్రేమమ్ సినిమా నాగచైతన్యకు హిట్ ఇచ్చింది . ఇప్పడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవుతోంది.

సవ్యసాచి అంటూ చందూ మొండేటి దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న మూవీలో "నిన్ను రోడ్డు మీద' పాటను రీమిక్స్ చేయబోతున్నారు. ఒరిజినల్ ను కంపోజ్ చేసిన ఎంఎం కీరవాణి.. ఈ రీమిక్స్ వెర్షన్ కు కూడా సంగీతం అందిస్తుండం విశేషం. ఈ పాటలో చైతుతో కలిసి డ్యాన్స్ చేసేందుకు.. స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నాను సెలెక్ట్ చేసారు . ఆల్రెడీ తమన్నా జై లవ కుశ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది .

11:50 - May 24, 2018

సినిమా పరిశ్రమలో కష్టపడి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన నటులలో నాని ఒకరు. విభిన్నమైన నటలన, న్యాచ్చురాలిటీని ప్రదర్శించే నాని ఇప్పటికే నాచ్యురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. వరుస హిట్స్ సాధిస్తు..విభిన్నమైన నటనను ప్రదర్శిస్తూ నాని విజయాలతో దూసుకుపోతున్నాడు. గతంలో ఒక తమిళ సినిమా చేసిన ఆయన, ఇప్పుడు మరో తమిళ సినిమా చేస్తున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో 'వేలన్ ఎట్టుత్తిక్కుమ్' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో నాని సరసన కథానాయికగా అమలా పాల్ నటిస్తోంది. అవినీతి .. అక్రమాలపై పోరాడే ఒక యువకుడిగా ఈ సినిమాలో నాని కనిపించనున్నాడు. సామాజిక సందేశంతో కూడిన యాక్షన్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాతో నానికి తమిళనాట కూడా క్రేజ్ పెరిగే అవకాశం ఉందనే వార్తలు సినిమా పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి. 

జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు బాబు వ్యూహాలు..

అమరావతి : దేశరాజ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారు. బుధవారం నాడు కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లిన చంద్రబాబు హోటల్ లో విపక్ష నేతలతో మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. విందు సమయంలో కేంద్రం తీరు, ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే బీజేపీ విధానలపై పలువురు నేతలతోను, సీఎంలతోను చంద్రబాబు చర్చలు జరిపారు. మరోసారి ఢిల్లీ వేదికగా విపక్ష పార్టీలతో సమావేశానికి చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ కూటమికోసం చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు.

11:33 - May 24, 2018

గుంటూరు : సోషల్ మీడియా వదంతులతో తెలుగు రాష్ట్రాల్లో హత్యలు జరుగుతున్నాయి. అనుమానం వచ్చిన వారిని చితకబాది చంపేస్తుండడం కలకలం సృష్టిస్తోంది. దీనిపై పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. తాజాగా రేపల్లె రైల్వే స్టేషన్ లో ఓ మహిళపై యువకులు దాడి చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ మహిళకు మతిస్థిమితం లేనట్టుగా తెలుస్తోంది. రేపల్లే రైల్వే స్టేషన్ లో జీన్స్ ప్యాంట్ ధరించిన ఈ మహిళ పిల్లలను ఎతుకెళ్లే అవకాశం ఉందని భావించిన యువకులు కర్రలతో విచాక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మహిళ సృహ కోల్పోయింది. స్థానికులు అందించిన సమాచారంతో ఆమెను ఒంగోలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆరోగ్యం విషమించడంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

జంటపై దాడి..భార్యపై అత్యాచార యత్నం..

నెల్లూరు : తడ మండలం అక్యంపేట రైల్వే స్టేషన్ లో దారుణం చోటుచేసుకుంది. యూపీకి చెందిన అజయ్ కుమార్ అనే వ్యక్తి ఓ జంటపై దాడికి పాల్పడ్డాడు. భర్తపై కర్రతో దాడిచేసి భార్యపై అత్యాచారానికి యత్నించాడు. సదరు మహిళ కేకలు వేయటంతో నిందితుడిని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. 

నిపా వైరస్ లక్షణాలు ఇలా వుంటాయ్..

శ్రీకాకుళం: నిపా వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డా.సనపల తిరుపతిరావు జిల్లా ప్రజలకు సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుందని, ప్రధానంగా గబ్బిలాల్లో, వాటిలో ప్రధానంగా పండ్లుతినే గబ్బిలాల్లో అంటే ఫ్రూట్‌బ్యాట్స్‌లో వైరస్‌ ఎక్కువగా ఉంటుందని, అందుకే వీటిని ఎగిరే నక్కలని అని అంటారన్నారు. ఈ వైరస్‌ బారిన పడితే వణుకుతో కూడిన జ్వరం, వాంతులు, వికారం, తలనొప్పి, ఫిట్స్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు.

11:23 - May 24, 2018

విశాఖపట్టణం : కాసుల కోసం ఏమైనా చేసేస్తారా ? డబ్బులే పరమావధిగా వ్యవహరిస్తున్న పలు ఆసుపత్రులు రోగుల పట్ల అనాగకరింగా ప్రవరిస్తున్నారు. ఇటీవలే కొన్ని ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఆసుపత్రి యాజమాన్యం తనపట్ల దుస్సాహాసినికి ఒడిగట్టినట్లు, తన అనుమతి లేకుండానే కడుపులో పిండాలు అమర్చినట్లు దళిత మహిళ పేర్కొంటోంది. కానీ ఆసుపత్రి యాజమాన్యం దీనిని ఖండిస్తోంది. అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే ఈ చర్యకు పూనుకున్నామని యాజమాన్యం పేర్కొంటోంది.

బాపూజీ కాలనీకి చెందిన ఓ మహిళ ఉద్యోగం ఇప్పిస్తానంటూ తనను ఆసుపత్రికి తీసుకొచ్చిందని దళిత మహిళ పేర్కొంది. పద్మ శ్రీ ఆసుపత్రికి తీసుకొచ్చిందని, అనంతరం కొన్ని ఇంజెక్షన్ లు ఇచ్చారని దీనివల్ల నరకం చూశానని తెలిపింది. అనంతరం ఓ రోజు ఆపరషన్ థియేటర్ కు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చారని వెల్లడించింది. కడుపులో రెండు పిండాలు పెట్టినట్లు డాక్టర్ పేర్కొన్నారని, దీనితో తాను హతాశురాలయ్యానని పేర్కొంది. ఇందుకు డబ్బులు కూడా చెల్లిస్తామని యాజమాన్యం తెలిపిందని, ఈ విషయం తన భర్తకు తెలియచేసినట్లు తెలిపింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

సరోగసీ పేరుతో ప్రయివేటు ఆసుపత్రి దారుణం..

విశాఖపట్నం : కాసుల కోసం కక్కుర్తి పడి ఓ ఆసుపత్రి నిర్వకం బైటపడింది. నాగలక్ష్మీ అనే మహిళకు ఆమె అనుమతి లేకుండానే అద్దెగర్భాన్ని అమర్చారు. పద్మశ్రీ ఆసుపత్రి ఈ దారుణానికి వేదికయ్యింది. మూడు లక్షలు ఇస్తామని ఆశచూపిన ఆసుపత్రి యాజమాన్యం ఈ దారుణానికి పూనుకుంది. దీంతో బాధితురాలు మహిళా సంఘాలతో పోలీసులకు బాధితురాలు ఫిర్యాదుచేసింది. 

11:12 - May 24, 2018

చిత్తూరు : 12ఏళ్ల బాలికపై ఐదుగురు మైనర్ బాలలు అత్యాచారం జరిపారన్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పుంగనూరులోని భగత్ సింగ్ కాలనీలో జరిగిన ఈ ఘటనపై డీఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. 12ఏళ్ల బాలికపై మైనర్ బాలలు గత మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారని తెలుస్తోంది. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని బాలిక తల్లిదండ్రులకు తెలియచేసింది. ఈ విషయాన్ని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఐదుగురు మైనర్ బాలలు  బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. స్థానికులు గమనించి వారిని పట్టుకున్నారు. ఇద్దరు పట్టుబడగా ముగ్గురు పారిపోయారు. స్థానికంగా ఉన్న ప్రార్థనా మందిరంలోకి తీసుకెళ్లి చితకబాదారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. దాడికి పాల్పడుతున్న వారిని సముదాయించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు ఇద్దరిని పీఎస్ కు తరలించారు. కానీ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

దీనిపై డీఎస్పీ స్పందించారు. బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురు ఉన్నట్లు గుర్తించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. తిరుపతిలో జువైనల్ హోం ఎదుట హాజరు పరుస్తామని తెలిపారు. బాలికపై అత్యాచారం జరిగిందా ? అత్యాచార ప్రయత్నం జరిగిందా ? అనే విషయాలు తెలియాల్సి ఉంది. 

ప్లాస్టిక్ పై జీహెచ్‌ఎంసీ ఉక్కుపాదం?..

హైదరాబాద్‌: నగరాన్ని కాలుష్య కాసారంలా మారుస్తోన్న ప్లాస్టిక్‌ కవర్లపై ఉక్కుపాదం మోపేందుకు హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ సిద్ధమైంది. కవర్లపై సంపూర్ణ నిషేధం విధించాలనే తీర్మానానికి బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పాలకమండలి ఆమోదం తెలిపింది. ప్రతిపాదనను రాష్ట్ర సర్కారుకు పంపాలని నిర్ణయించింది. నూతన విధానం అమల్లోకి వస్తే గ్రేటర్‌లో ప్లాస్టిక్‌ కవర్ల ఉత్పత్తి, సరఫరా, వినియోగాన్ని పూర్తిగా అడ్డుకోవచ్చని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఎన్నడూ లేనంతగా తిరుమలలో భక్తుల రద్దీ..

తిరుమల : వేసవి సెలవులు మరో వారంలో ముగియనుండటంతో తిరుమల గిరులు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత రద్దీతో నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గత మూడు రోజులుగా పూర్తిగా నిండివుండగా, స్వామి దర్శనార్థం వస్తున్న భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతూ ఉండటంతో నారాయణగిరి ఉద్యానవనం దాటి క్యూలైన్ కిలోమీటర్ల పొడవుసాగింది. ఈ ఉదయం స్వామి దర్శనానికి వచ్చే వారికి 48 గంటల తరువాతే దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా ఈ విషయంపై మీడియాలో వస్తున్న వార్తలపై సీఎం చంద్రబాబు స్పందించి టీటీడీ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించి సూచనలు, ఆదేశాలు జారీచేశారు.

రద్దీని ముందుగా ఊహించి ఏర్పాటు చేయాలి : చంద్రబాబు

తిరుమల : తిరుమల గాలిగోపురం వద్ద భక్తుల రద్దీ విషయంలో సీఎం చంద్రబాబు స్పందించారు. భక్తుల రద్దీ పెరిగిందనే విషయం మీడియాలో వస్తున్న వార్తలపై చంద్రబాబు స్పందించారు. టీటీడీ అధికారులు, సీఎంవోతో సీఎం సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసిన తగిన ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు సూచించారు.భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యల్ని వెంటనే తీసుకోవాలని ఆదేశించారు. భక్తుల సేవే శ్రీవారి సేవగా అధికారులు, సిబ్బందు భావించాలని దిశానిర్ధేశం చేశారు. దీనికి ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని తెలిపారు.

కిడ్నాప్ గ్యాంగ్ అనే అనుమానంతో మహిళపై దాడి..

గుంటూరు : పలు ప్రాంతాలలో అపరిచిత వ్యక్తులపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కిడ్నాప్, దోపిడీ లకు పాల్పడుతున్నారనే అనుమానంతో పలువురిపై దాడులకు పాల్పడి చంపివేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రేపల్లె రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని మహిళపై యువకులు దాడికి పాల్పడ్డారు. పిల్లలను అపహరించే ముఠాగా భావించిన యువకులు మహిళపై దాడికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో మహిళ పరిస్థితి విషమంగా తయారయ్యింది. దీంతో తెనాలి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

కేంద్రంలో రాబోయేది బీజేపీయేతర సర్కారే: యనమల

అమరావతి : రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఏపీ మంత్రి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జోస్యం చెప్పారు. జేడీఎస్ ఆహ్వానం మేరకే సీఎం చంద్రబాబు నాయుడు కర్ణాటక వెళ్లారనీ..బెంగళూరులో ప్రాంతీయ పార్టీలు, వామపక్షాల నేతలతోభేటీ అయ్యారన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై వారితో చంద్రబాబు చర్చించారన్నారు. ఈ చర్చల్లో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు మినహాయించారనే విషయాన్ని గుర్తించాలన్నారు.

అన్ని పార్టీలు కలవాల్సిన సమయం : లోకేశ్

విజయవాడ : ఏపీ రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం చేసిన బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీతో అయినా కలసి పనిచేసేందుకు సిద్ధమేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఇకపై బీజేపీ ఏ రాష్ట్రంలోనూ గెలిచే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. బీజేపీపై పోరాడేందుకు అన్ని పార్టీలూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని అన్నారు. అన్ని పార్టీల నేతలనూ ఆహ్వానించే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని తెలిపారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారని, ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తేనే బీజేపీకి బుద్ధి చెప్పేందుకు వీలవుతుందని అన్నారు.

10:31 - May 24, 2018

చిత్తూరు : 'కతుఫా' తరహా ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. పుంగనూరు భగత్ సింగ్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. 11 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మూడు నెలల నుండి బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. తల్లికి తెలియడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు స్పందించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఆ చిన్నారి మరోసారి లొంగపరచుకొనేందుకు ఇద్దరు ప్రయత్నించారు. ఇది చూసిన స్థానికులు వారిద్దరినీ ప్రార్థనా మందిరంలోకి తీసుకెళ్లి చితకబాదారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు.
అనంతరం ఆ వర్గానికి చెందిన పీఎస్ ఎదుట బైఠాయించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని..వారిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని వారికి హామీనిచ్చారు. కానీ వారు మైనర్లు కావడంతో ఎలాంటి శిక్ష పడుతుందనేది తెలియరావడం లేదు. 

రమణదీక్షితుల తీరుపై టీటీడీ ఉద్యోగులు నల్ల బ్యాడ్సీల నిరసన..

తిరుమల : తిరుమల కొండపై వివాదం రోజు రోజుకు ముదురుతోంది. టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితుల తీరుపై టీటీడీ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోవారు నల్ల బ్యాడ్జ్ లు కట్టుకుని విధుల్లోకి హాజరయ్యారు. మూడు రోజులపాటు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. కాగా శ్రీవారి ఆభరణాలు,ఆస్తులు వంటి పలు విషయాలపై రమణదీక్షితులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పలు పరిణామాలకు దారితీస్తోంది. ఈ క్రమంలో రమణదీక్షితులు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

తూత్తుకుడిలో ఇంటర్నెట్ నిలిపివేత...

చెన్నై : తూత్తుకుడిలో ఐదు రోజుల ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. స్టెరిలైట్ రాగి కర్మాగార విస్తరణ వ్యతిరేక ఆందోళనలో మృతుల సంఖ్య 13కి చేరింది. ఇప్పటి వరకు 67 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్లాంట్ కు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది. 

బీజేపీ..వైసీపీలపై యనమల ధ్వజం...

విజయవాడ : బీజేపీ, వైసీపీ పార్టీలపై ఏపీ మంత్రి యనమల ధ్వజమెత్తారు. బెంగళూరులో ప్రాంతీయ పార్టీలు, వామపక్షాల నేతలతో బాబు సమావేశమయ్యారని, ఏపీకి జరిగిన అన్యాయంపై వారితో చర్చించడం జరిగిందన్నారు. ఈ చర్చల్లో కాంగ్రెస్ పార్టీ లేదనేది గుర్తించుకోవాలని, జేడీఎస్ ఆహ్వానం మేరకు బాబు ప్రమాణ స్వీకారినికి వెళ్లారన్నారు. 

బాలికపై మూడు నెలల పాటు అత్యాచారం...

చిత్తూరు : పుంగనూరు భగత్ సింగ్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. 11 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మూడు నెలల నుండి బాలికపై ఆరుగురు యువకులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకుని చితకబాదారు. 

శుక్రవారం కర్ణాటక అసెంబ్లీ...

బెంగళూరు : శుక్రవారం మధ్యాహ్నం 12.15గంటలకు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ సమావేశం జరుగనుంది. స్పీకర్, డిప్యూటి స్పీకర్ లను సభ ఎన్నుకోనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ ను స్పీకర్ గా ఎన్నుకోనున్నట్లు సమాచారం. 

భారత్ లో నెదర్లాండ్స్ ప్రధాని...

ఢిల్లీ : భారత్ లో నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే పర్యటించనున్నారు. భారతీయ వ్యాపార ప్రతినిధులతోనూ భేటీ కానున్న మార్క్ గంగానది ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొంటారు. 

09:20 - May 24, 2018

హైదరాబాద్ : తెలంగాణ టిడిపి మహానాడు గురువారం జరగనుంది. నాంపల్లి ఎగ్జిబీషన్ గ్రౌండ్ లో జరిగే మహానాడుకు నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్టీఆర్ ఘాట్ లో నేతలు నివాళులర్పించి మహానాడుకు హాజరు కానున్నారు. ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ మహానాడుపై అందరి దృష్టి నెలకొంది. తెలంగాణలో పార్టీ బలపడేందుకు ఎలాంటి వ్యూహాలు..ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై చర్చించే అవకాశం ఉంది. ఏపీ, జాతీయ పార్టీలకు సంబంధించి ఐదు, మొత్తంగా 13 తీర్మానాలు ఆమోదించనున్నారు. మధ్యాహ్నం తరువాత పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమావేశంలో పాల్గొనన్నారు. ఇక ఈ సమావేశంలో పొత్తుల గురించి చర్చిస్తారా ? లేదా ? అనేది తెలియరాలేదు. 

అంగడి బజార్ లో పోలీసుల కార్డన్ సెర్చ్...

యాదాద్రి : యాదగిరిగుట్ట బీసీ కాలనీలోని అంగడి బజార్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 32 బైక్ లు, 4 ఆటోలు, కారు, ట్రాక్టర్ లను సీజ్ చేశారు. నలుగురు అనుమానితులు, ఆరుగురు రౌడీషీటర్లు, ఐదుగురు బెల్ట్ షాపు, ముగ్గురు లాడ్జీ యజమానులు, గుట్కా విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

విద్యుత్ తీగలు తెగి పడి చిన్నారి మృతి...

జనగామ : గుండాల మండలం తుర్కలషాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఆరు బయట నిద్రిస్తున్న వారిపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి నైతి మృతి చెందగా వృద్ధ దంపతులకు తీవ్రగాయాలయ్యాయి.

 

నేడు ఓయూ డిగ్రీ ఫలితాలు...

హైదరాబాద్ : నేడు ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

09:05 - May 24, 2018

నల్గొండ : జిల్లాలో కొత్తరకం మోసం వెలుగుచూసింది. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయని.. ఆ డబ్బు రావాలంటే 47 వేల రూపాయలు SBIలో డిపాజిట్‌ చేయాలని పలువురికి లేఖలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కార్యాలయం పేరుతో లేఖలను రావడం కలకలం రేపుతోంది. దీనిని నమ్మిన అమాయక గిరిజనులు పోస్టాఫీస్ కు వెళ్లారు. దీనిపై పోస్టాఫీస్ సిబ్బంది పలు అనుమానాలు వచ్చాయి. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి దృష్టికి గిరిజనులు తీసుకెళ్లారు. పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన జూలకంటి ఇవి ఫేక్ అని నిర్ధారించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పత్రాలు ఎలా వచ్చాయి ? దీనిని నమ్మి డబ్బులు ఎంతమంది డిపాజిట్ చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

09:04 - May 24, 2018

చిత్తూరు : టిటిడిలో రమణ దీక్షితులు రగడ ఇంకా చల్లారడం లేదు. ప్రభుత్వం..టిటిడిపై రమణ దీక్షితులు తీవ్ర ఆరోపణలు..విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి సమస్యపై చర్చించారు. ఇదిలా ఉంటే టిటిడిలో ఉన్న ఉద్యోగ సంఘాలు ఎటువైపు ఉన్నారనేది చర్చ జరుగుతోంది. దీనిపై గత పది రోజులుగా ఉద్యోగ సంఘాలు సీరియస్ గా దృష్టి పెట్టారు. టిటిడిలో పది వేల మంది శాశ్వత ఉద్యోగులు, 6-7 వేల మంది తాత్కాలిక ఉద్యోగులున్నారు. మొత్తం ఈ వ్యవహారాన్ని వీరు ఎలా చూస్తున్నారనేది ఉత్కంఠ నెలకొంది.

రమణ దీక్షితులకు వ్యతిరేకంగా..అనుకూలంగా మాట్లాడేవారున్నారు. రమణ దీక్షితులకు మద్దతుగా నిలిస్తే తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని కొందరు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పరిపాలన భవనంలో గురువారం అన్ని ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి. రమణ దీక్షితులు ఆరోపిస్తున్న అంశాలపై వీరు క్షుణ్ణంగా చర్చించనున్నారు. ఈ వ్యవహారంలో ఎలా ముందుకెళ్లాలి ? రమణ దీక్షితులకు మద్దతుగా నిలవాలా ? ప్రభుత్వానికి మద్దతు తెలియచేయాలా ? అనే దానిపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

వీఐపీల సేవలో టిటిడి అధికారులు తరించడం..సుప్రభాత సేవలతో సహా ఇతర సేవలను ఇష్టానుసారంగా నిర్వహించడం..శ్రీవారికి విరామ సమయం తగ్గించడం..తదితర అంశాలపై కొంతమంది ఉద్యోగ సంఘాలు ఏకీభవిస్తున్నట్లు సమాచారం. శ్రీవారి నగలు ప్రదర్శించాలని రమణ దీక్షితులు చేస్తున్న విమర్శలపై కూడా కొంతమంది సానుకూలంగా స్పందిస్తున్నట్ల తెలుస్తోంది. నగలు ప్రదర్శిస్తే తప్పేంటనీ, విమర్శలకు సమాధానం చెప్పే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఉద్యోగ సంఘాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.

పవన్ యాత్రకు బ్రేక్...

శ్రీకాకుళం : జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన పోరాట యాత్రకు రేపు విరామం ప్రకటించారని ప్రచారం జరుగుతోంది. పవన్ కు కనీస పోలీస్ భద్రత కల్పించడం లేదని, సొంత భద్రతా సిబ్బందితోనే ఆయన తన పర్యటన కొనసాగిస్తున్నారని జనసేన పేర్కొంటోంది.

 

పవన్ యాత్రకు బ్రేక్...

శ్రీకాకుళం : జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన పోరాట యాత్రకు రేపు విరామం ప్రకటించారని ప్రచారం జరుగుతోంది. పవన్ కు కనీస పోలీస్ భద్రత కల్పించడం లేదని, సొంత భద్రతా సిబ్బందితోనే ఆయన తన పర్యటన కొనసాగిస్తున్నారని జనసేన పేర్కొంటోంది. 

08:59 - May 24, 2018

ఢిల్లీ : ఐపీఎల్ ఎలిమినేట్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘనవిజయం సాధించింది. రాజస్థాన్‌పై 25 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తుచేసింది. అద్భుతమైన బౌలింగ్‌తో రాజస్థాన్ జట్టును కట్టడిచేసి కోల్‌కతా క్వాలిఫైర్-2 మ్యాచ్‌కు దూసుకెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్‌జట్టు ఆరంభంలో దూకుడుగా ఆడింది. కెప్టెన్ అజింక్యా రహనే 46, సంజూ శాంసన్ 50పరుగులతో రాణించారు. దీంతో ఓ దశలో రాజస్థాన్ గెలుపు ఖాయమని భావించారు. కానీ కోల్‌కతా బౌలర్లు సరైన సమయానికి వికెట్లు పడగొట్టడంతో .. రాజస్థాన్‌ కష్టాల్లో పడింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కేవలం 144 పరుగులను మాత్రమే చేసింది. కోల్‌కతా బౌలర్లలో చావ్లాకు-2, ప్రసిద్ధ్, కులదీప్ యాదవ్‌లకు చెరో వికెట్ దక్కింది. కాగా ఈ మ్యాచ్‌లో గెలుపుతో కోల్‌కతా ఈ నెల 25న పూణెలో జరగనున్న క్వాలిఫైర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది

08:58 - May 24, 2018

చెన్నై : తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ కాపర్‌ ప్లాంట్ విస్తరణకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. విస్తరణ పనులు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు కాపర్‌ ప్లాంట్ విస్తరణకు వ్యతిరేకంగా బుధవారం కూడా హింసాత్మక ఘటనలు జరిగాయి. దీంతో రెండురోజుల్లో జరిగిన ఘటనల్లో మృతుల సంఖ్య 12కి పెరిగింది. పోలీస్‌ చర్యను నిరసిస్తూ తుత్తుకూడిలో బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ విస్తరణకు వ్యతిరేకంగా బుధవారం కూడా ఆందోళన కొనసాగింది. 144 సెక్షన్‌ అమలులో ఉన్నప్పటికీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు రెండు బస్సులకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 12కి పెరిగింది. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఎస్పీ గాయపడ్డారు.

మంగళవారం జరిగిన హింసాకాండను నిరసిస్తూ తూత్తుకుడిలో బంద్‌ జరిగింది. బుధవారం జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు రద్దు చేశారు. తూత్తుకుడిలో స్టెరిలైట్‌ ఫ్యాక్టరీ విస్తరణ పనులను తక్షణమే నిలిపివేయాలంటూ.. మద్రాస్‌ హైకోర్టు వేదాంత్‌ గ్రూప్‌ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే విస్తరణకు పర్యావరణ అనుమతులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. నాలుగు నెలలోపు ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. పోలీసుల కాల్పుల్లో మృతుల కుటుంబ సభ్యుల ఆందోళనతో.. తూత్తుకుడి ప్రభుత్వాసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంఎన్‌ఎం పార్టీ అధినేత కమలహాసన్‌ క్షతగాత్రులను పరామర్శించారు. వెనక్కి వెళ్లిపోవాలంటూ కమల్‌ను బాధితులు అడ్డుకున్నారు.

ఆందోళనకారులపై కాల్పులు జరపడం అమానుషమని డిఎంకే పేర్కొంది. ఈ ఘటనను జలియన్‌ వాలాబాగ్‌ ఉదంతంతో పోల్చింది. తూత్తుకుడి ఘటనకు నిరసనగా ఈనెల 25న అఖిలపక్షం ఆధ్వర్యంలో డిఎంకె ఆందోళనకు పిలుపునిచ్చింది. తూత్తుకుడిలో పోలీస్‌ కాల్పుల ఘటనను 'కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డర్‌' అని పీఎంకే చీఫ్‌ అన్బుమణి రామదాస్‌‌ ఆరోపించారు. పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలన్నారు. నైతిక బాధ్యత వహించి సిఎం పళనిస్వామి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తూత్తుకూడిలో పోలీసుల కాల్పుల ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. మృతులకు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ ఘటన నేపథ్యంలో 40 మంది పోలీసు అధికారులను బదిలీ చేసింది. చెన్నైలోని మెరీనాలో 2వేల మందితో భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసు కాల్పుల ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఈ ఘటనపై నివేదిక కోరింది.

తూత్తుకూడి స్టెరిలైట్‌ ప్లాంట్‌లో ప్రతి ఏటా 4 లక్షల టన్నుల రాగి ఉత్పత్తి అవుతుంది. ఈ కంపెనీని 8 లక్షల టన్నులకు విస్తరించాలని చూస్తోంది. ఇప్పటికే కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు పరిశ్రమ విస్తరణను వ్యతిరేకిస్తున్నారు. స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ విస్తరణకు వ్యతిరేకంగా గత 100 రోజులుగా కొనసాగుతున్న నిరసన ప్రదర్శన మంగళవారం హింసాత్మకంగా మారింది. పోలీసుల కాల్పుల్లో 11 మృతి చెందగా 65 మంది గాయపడ్డారు.

08:57 - May 24, 2018

శ్రీకాకుళం : ఎన్నికలప్పుడు హామీలిచ్చి.. పదవిలోకి రాగానే వాటిని తుంగలో తొక్కే నేతలు ఎందరినో చూస్తుంటాం.. కానీ పదవులతో, ప్రచారంతో నిమిత్తం లేకుండా.. శ్రీకాకుళం జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే నిస్వార్థ సేవ చేస్తున్నారు. ఉద్దానం ఫౌండేషన్ పేరుతో సేవాకార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మన నేతలకు ఎన్నికలప్పుడు తప్ప మిగతా సమయాల్లో ప్రజలు గుర్తుకు రారు. ఎన్నికల్లో ఇచ్చే హామీలు సైతం పదవిలోకి రాగానే గుర్తుండవు. ఇలాంటి ప్రజా ప్రతినిధులు ఉన్న నేటి కాలంలోనూ... నిస్వార్థంగా.. ఏలాంటి పదవీ ఆశించకుండా ప్రజాసేవకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు.. మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌..

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉద్దానం ఫౌండేషన్ ను స్థాపించి పేదప్రజలకు సేవలు అందిస్తున్నారు పియారా సాయిరాజ్‌ . రాజకీయ నేతగా పరిచయమైన ఓ యువకుడు అతి చిన్న వయస్సులోనే ఎమ్మెల్యే అయ్యాడు. ఆ నాడు చేసిన వాగ్ధానం నేటికీ అమలు పరుస్తూనే ఉన్నాడు. అనుక్షణం ఉద్దానం ప్రాంత ప్రజానీకానికి అండగా నిలుస్తున్నాడు. తన ఒంట్లో ఓపిక.. గొంతులో ఊపిరి ఉన్నంత వరకూ ప్రజా సేవ చేస్తానన్న వాగ్ధానం నేటికీ అమలు చేస్తూనే ఉన్నారు పిరియా సాయిరాజ్‌.

ఉద్దానం ఫౌండేషన్ ద్వారా శ్రీకాకుళం జిల్లా కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం మండలాల్లో మినరల్ వాటర్ ప్లాంటులు ఏర్పాటు చేశారు. ఉచిత అంబులెన్సులను ఏర్పాటు చేశారు. ఉద్దానం కిడ్నీ రోగులకు నెలవారీ ఫించను అందించి ఆదర్శంగా నిలుస్తున్నారు. టెలీమెడిసిన్ ద్వారా రోగులకు సేవ చేస్తున్నారు. సోంపేట నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య నిపుణుల సూచనలు అందేలా చేస్తున్నారు. డ్రోన్ సహాయంతో మందుల సరఫరా, డయాలసిస్ మిషనరీ ఏర్పాటు లాంటి సేవా కార్యక్రమాలు విస్తృతపరిచారు. తన తండ్రి రాజారావు స్ఫూర్తి, భార్య విజయ తోడ్పాటుతోపాటు.. ఉద్దానం ప్రాంతీయుల నమ్మకాలే.. దశాబ్ద కాలంగా సేవా మార్గంలో నడిపిస్తున్నాయని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌. ప్రజాసేవే పరమార్ధంగా నిస్వార్థ సేవలందిస్తున్న సాయిరాజ్‌ పై ఉద్దానం ప్రజలు అభినందనలు కురిపిస్తున్నారు. ఉద్దానం ఫౌండేషన్‌ ద్వారా మరిన్ని సేవలకు ప్రభుత్వం కూడా తోడ్పాటు అందించాలని స్థానికులు కోరుతున్నారు.

08:56 - May 24, 2018

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ మీటింగ్‌లో ప్రజా ప్రతినిధులు, అధికారుల మ‌ధ్య వాడివేడిగా సాగింది. పారిశుధ్య నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని కార్పొరేటర్లు ఆరోపించారు. రంజ‌ాన్ పండుగ సందర్భంగా చేపట్టిన పనులను ఇంతవరు పూర్తిచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎనిమిదో జ‌నరల్ బాడీ స‌మావేశంలో అధికారులు, కార్పొరేట‌ర్ల మ‌ధ్య మాట‌ల యుద్దం న‌డిచింది. ఘ‌న‌వ్యర్థాల నిర్వహ‌ణ‌లో మొద‌టి స్థానం ద‌క్కించుకున్న నగరంలో.. వాస్తవ ప‌రిస్థితి అందుకు విరుద్ధంగా ఉందంటూ కార్పొరేటర్లు మండిపడ్డారు. చెత్తను త‌ర‌లించడంలో సిబ్బంది అల‌స‌త్వం వహిస్తున్నారని.. ఫలితంగా చెత్త పేరుకుపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న‌గ‌రంలో వెలుగుల‌ు నింపేందుకు చేపట్టిన ఎల్ఈడీ లైట్ల పథకం పూర్తిస్థాయిలో ప‌ట్టాలెక్కలేదు. టైమ‌ర్లు, సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ సిష్టమ్ ఏర్పాటు ఇంకా పూర్తి కాలేదని పెదవి విరిచారు కార్పొరేటర్లు. రంజాన్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక లైట్ల విష‌యంలోనూ అధికారులు అల‌స‌త్వంగా ఉన్నారని మండి ప‌డ్డారు. రానున్న వ‌ర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని.. నాలాల వెడల్పు, డిసిల్టింగ్ అంశాల‌పై చ‌ర్చించారు. వానల గండం గ‌ట్టెక్కాలంటే అధికారులు వెంటనే ప‌నులు ప్రారంభించాలన్నారు. ప్రజలపై దండయాత్ర చేస్తున్న దోమలను అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారంటూ కార్పొరేటర్లు గళమెత్తారు . దోమల గురించి ఎన్ని సార్లు చెప్పినా అధికారులు స్పందిండం లేదన్నారు. నగరంలో మరో పెద్ద స‌మ‌స్యగా మారిన ప్లాస్టిక్‌పై చ‌ర్చించారు. ప్లాస్టిక్ నిషేధంపై తీర్మాణం చేసి ప్రభుత్వానికి పంపారు. నాలాల నిర్వహణపై దృష్టి పెట్టాలని కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయించారు.

ఇటీవ‌ల బదిలీ అయిన శానిట‌రీ ఫీల్డ్ అసిస్టెంట్లపై కార్పొరేట‌ర్ల అభ్యంతారాల‌ను కొట్టిపారేశారు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్. నగరంలో ఎప్పుడూ ఎదో ఒక ప‌ని ఉంటుంద‌న్నారు. నాలాల వెడ‌ల్పు, పున‌రుద్ధరణ పనుల్లో ఎలాంటి ఒత్తిడికి త‌లొగ్గే ప్రస‌క్తే లేద‌న్నారు. బ‌ల్దియా కౌన్సిల్‌ మీటింగ్‌పై సభ్యులు శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు నాలుగు నెల‌లకు ఓసారి జరిగే పాల‌క‌ మండలి సమావేశం.. నాలుగు గంట‌ల‌కు మించి కూడా జ‌రగ‌డం లేదు. అలాంటి సమావేశానికి గైర్హాజరు కావడం, సమయపాలన పాటించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

08:56 - May 24, 2018

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం పక్కదారి పడుతోంది. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలను లబ్దిదారులు విక్రయానికి తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో గొర్రెకాపరులు ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలను సంతకు తరలించారు. వాటిని అమ్మకానికి పెట్టారు.

08:55 - May 24, 2018

నిజామాబాద్ : ఆంచూర్‌ రైతును.. ఈసారీ దళారీలు నిలువు దోపిడీ చేస్తున్నారు. గిట్టుబాటు ధర దొరక్క.. వ్యాపారుల సిండికేట్‌ దగాకు.. ఆంచూర్‌ రైతులు విలవిల్లాడుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో వ్యాపారుల సిండికేట్‌ ఆడింది ఆట.. పాడింది పాటగా తయారైంది. దగాకు గురవుతున్న రైతన్నను ఆదుకోవాల్సిన అధికారులు ఎప్పట్లాగానే ఉదాశీన పాత్రకే పరిమితమవుతున్నారు. ఆంచూర్‌ పంటకు తెలంగాణ రాష్ట్రం పెట్టింది పేరు. హైదరాబాద్‌, నిజామాబాద్‌ మార్కెట్లలో ఆంచూర్‌ క్రయవిక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ఆంచూర్‌ రైతులు తమ ఉత్పాదనలను ఈ మార్కెట్లకే తీసుకు వస్తుంటారు. హైదరాబాద్‌ సంగతేమో కానీ.. నిజామాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌లో.. వ్యాపారులు.. ఆంచూర్‌ రైతును నిలువునా ముంచేస్తున్నారు.

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు నెల రోజులుగా ఆంచూర్ పంటను తీసుకు వస్తున్నారు. కొనుగోలుదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా తాము నిర్ణయించుకున్న ధరకే కొనుగోళ్లు జరుపుతున్నారు. గతంలో ఆంచూర్ క్వింటాలు ధర 26 నుండి 28 వేల రూపాయలు పలికేది. దీంతో ఈ ఏడాది కూడా మంచి ధర వస్తుందని రైతులు.. పెద్ద మొత్తంలో మామిడి కాయలను ఆంచూర్ గా మార్చి మార్కెట్ కు తీసుకు వస్తున్నారు. అయితే వ్యాపారులు మాత్రం క్వింటాకు 13 నుండి 17 వేల రూపాయాలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో గిట్టుబాటు ధర మాట అటుంచి.. కనీసం పెట్టుబడులూ తిరిగి రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ధరలు తగ్గించి కొనడంలోనే కాదు.. మరో రూపంలోనూ వ్యాపారులు.. రైతులను దగా చేస్తున్నారు. సాధారణంగా ఆంచూర్‌లో తరుగు తీయడమన్న ప్రస్తావన ఉండదు. కానీ నిజామాబాద్‌ మార్కెట్‌యార్డ్‌ వ్యాపారులు.. ఇతర పంటల మాదిరిగానే ఆంచూర్ పంటకూ...క్వింటాకు నాలుగు కిలోలు తగ్గిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు వ్యాపారులు లక్షలాది రూపాయల వరకు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు.

వారం రోజులుగా మార్కెట్ కు పలు ప్రాంతాల నుండి భారీగా ఆంచూర్ ను రైతులు తీసుకొని వస్తున్నారు. కాని ఆశించే స్థాయిలో ధర రాకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. క్వింటాకు కనీసం 30 వేల రూపాయలు ఇస్తేనే గిట్టుబాటు అవుతుందని.. పంటను మార్కెట్‌కు తరలించాక.. ఇక్కడి వ్యాపారుల తీరుతో అమ్ముకోలేక.. తెచ్చిన పంటను తిరిగి ఇంటికి తరలించలేక రైతులు కలవర పడుతున్నారు. వీరిని ఆదుకోవాల్సిన అధికారులు ఎప్పట్లాగానే మౌనపాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వమే నేరుగా జోక్యం చేసుకుని తమ కష్టాలు తీర్చాలని, ఆంచూర్‌ రైతులు కోరుతున్నారు.

08:53 - May 24, 2018

పెద్దపల్లి : జిల్లా మంథనిలో దొంగతనానికి వచ్చి గొంతు కోసిన సంఘటన సంచలనం సృష్టిచింది. మంథనిలోని ఓ రెస్టారెంట్లో పనిచేసే రవి తెల్లవారు జామున రెస్టారెంట్‌ టెర్రస్‌ పై పడుకున్నాడు. ఇతని వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్స్‌ దొంగిలించడానికి ఓ దొంగ ప్రయత్నించారు. రవి ప్రతిఘటించగా ఆ దొంగ రవి గొంతుకోసి పరారయ్యాడు. గాయాలపాలైన బాధితున్ని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. రెస్టారెంట్‌లో 10 మంది కార్మికులు ఉండటంతో కార్మికుల మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

08:52 - May 24, 2018

హైదరాబాద్ : సోషల్‌ మీడియాలోని వదంతులు.. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఊరి శివార్లలోకి వచ్చే వారిని ఎవరూ... ఏంటి అని కనీసం విచారించకుండానే కర్రలతో చితకబాదేస్తున్నారు. తెలంగాణలో... గడచిన 24 గంటల వ్యవధిలోనే ఇద్దరిని ఇలాగే కొట్టి చంపేశారు. సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలన్నీ వదంతులే అని పోలీసులు ఎంతగా చెబుతున్నా.. ప్రజలు పట్టించుకోవడం లేదు. యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం జియాపల్లి వాసులు.. మంగళవారం రాత్రి ఇలాగే ఓ వ్యక్తిపై దాడి చేసి హతమార్చారు. సమీపంలోని కొర్రెముళ్ల గ్రామానికి చెందిన బాలకృష్ణ.. జియాపల్లిలోని బంధువు రామస్వామి ఇంటికి వెళ్లాడు. రాత్రి తిరిగి వస్తున్న క్రమంలో కొందరు యువకులు అతడిపై కర్రలతో దాడి చేశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా బాలకృష్ణ మార్గమధ్యలో మరణించాడు. ఈ ఘటనపై ఆగ్రహించిన కొర్రెముళ్ల గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు గ్రామంలో భారీ పికెట్‌ను ఏర్పాటు చేశారు.

అటు నిజామాబాద్‌ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. భీమ్‌గల్‌ మండలం చెంగల్‌లో బావ, బావమరిదులిద్దరినీ.. స్థానికులు చావబాదారు. దాడిలో గాయపడ్డ మాల్యావత్‌ దేవ్యా హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతడి బావ దేవాగత్‌ లాలూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మామిడికాయల కోసం వచ్చిన బావాబామ్మర్దులిద్దరినీ కిడ్నాప్‌ ముఠా అని భావించి గ్రామస్థులు చితకబాదారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. నందిగామ, మచిలీపట్నం, తదితర ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగినా... హిందీలో మాట్లాడినా.. పట్టుకుని చితక్కొడుతున్నారు. ఈడపల్లిలో పిల్లలను ఎత్తుకు పోయేవాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని చితకబాదారు. పోలీసు వచ్చిన.. బాధితుడిని చిలకలపూడి ఆసుపత్రికి తరలించారు. సోషల్‌మీడియా వదంతులను నమ్మవద్దంటూ పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. వీటిని వ్యాపింప చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరిస్తున్నారు.

బీహార్‌ ముఠా తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తోందని.. పిల్లలు, వృద్ధులను కిడ్నాప్‌ చేసి వారి గుండె, మెదళ్లను తీసుకుని తినేస్తున్నారంటూ.. సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో.. ఆత్మరక్షణ కోసమంటూ.. స్థానికులు సొంతంగానే.. విడతలవారీగా గ్రామంలో పహారా కాస్తున్నారు. ఏ మాత్రం అనుమానం కలిగినా వారిని వదిలిపెట్టడం లేదు. చెట్లకు, విద్యుత్ స్తంభాలకు కట్టేసి మరీ కొడుతున్నారు. ఆ తర్వాత ఎప్పుడో పోలీసులకు సమాచారం అందిస్తున్నారు.

మొన్నటివరకూ.. హిందీ మాట్లాడుతూ కనిపించిన అపరిచితులపై అనుమానం రాగానే గ్రామస్థులు దాడి చేసేవారు. కానీ ఇప్పుడు.. తెలుగు మాట్లాడుతున్నా.. తమది పక్క గ్రామమేనని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. రాత్రిపూట గ్రామశివార్లలో కనిపిస్తే చాలు.. ఎవరో ఏంటో అని ఆరా కూడా తీయకుండా కడతేర్చే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో అత్యవసరమైన పని ఉన్నా.. పక్క గ్రామానికి వెళ్లేందుకూ.. పల్లెప్రజలు భయపడిపోతున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియా పుణ్యాన.. గ్రామస్థులు దాడులు చేస్తూ.. అమాయకులను హతమారుస్తూ.. అనవసరంగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. గ్రామస్థుల్లో భయం పోగొట్టేందుకు.. వారిలో చైతన్యం నింపేందుకు.. పోలీసు శాఖ.. పల్లెనిద్ర తరహా కార్యక్రమాన్ని రూపొందించుకుని.. అమలు చేస్తే బాగుంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. 

08:50 - May 24, 2018

విశాఖపట్టణం : జిల్లా రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. టీడీపీపై ప్రధాన ప్రతిపక్షం విమర్శలదాడి పెంచింది. ముఖ్యమంత్రిపైనే తీవ్ర స్థాయిలో అరోపణలు ఎక్కుపెడుతోంది. దాంతోపాటు మంత్రి లోకేష్‌ సవాల్‌కు ప్రతి సవాల్ విసరడం జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. టీడీపీపై వైసీపీ ఆరోపణలు తీవ్రస్థాయికి చేరాయి. తిరుమల శ్రీవారి నగలు, సంపద మాయం కావడంలో సీఎం చంద్రబాబు హస్తముందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించడం సంచలనంగా మారింది. ధర్మపోరాట సభలో మంత్రి లోకేషన్‌ చేసిన సవాల్‌కు వైసీపీ నేతలు ప్రతిసవాళ్లు విసరడం విశాఖ జిల్లా రాజకీయాలను రసకందాయంలో పడవేశాయి.

టీడీపీ విశాఖ అంధ్రా యూనివర్సిటీలో ధర్మపోరాట దీక్ష సందర్భంగా టీడీపీ నేతలు చేసిన ఆరోపణలకు దీటుగా వైసీపీ ప్రత్యారోపణలు మొదలు పెట్టింది. మంత్రి నారా లోకేష్ ఎంపీ విజయసాయిరెడ్డిపై విమర్శలతో విరుచుకుపడ్డారు. విజయసాయి రెడ్డి ప్రత్యేక హోదా అంటూ హడావిడి చేస్తూనే.. డిల్లీలో ప్రధాని కార్యాలయంలో తిరుగుతారని ఎద్దేవా చేయడం.. టీడీపీ - వైసీపీల మధ్య మాటయుద్ధానికి దారి తీసింది. తనపై వైసీపీ నేతలు చెస్తున్న అవినీతి అరోపణలను దమ్ముంటే నిరూపించాలని లోకేష్‌ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని ప్రకటించిన ఎంపీ విజయసాయిరెడ్డి.. చంద్రబాబు, లోకేష్‌లపై పలు ఆరోపణలు చేశారు. కనిపించకుండా పోయిన తిరుమల శ్రీవారి నగలు సీఎం చంద్రబాబు ఇళ్లలో ఉన్నాయని ఆరోపించడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇళ్లలో తెలంగాణ పోలీసుసోదాలు చేస్తే.. నగలు బయటపడతాయని విజయసాయి రెడ్డి అనడం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. వైసీపీ నేతలు సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం...టీడీపీ నాయకులు కుతకుతా ఉడికి పోతున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు పలువురు టీడీపీ లీడర్లు వైసీపీపై విమర్శల దాడి పెంచారు. నిన్నటిదాకా టీడీపీ దూకుడును అడ్డుకోవడంలో తమపార్టీ నేతలు వెనుకంజలో ఉన్నారని భావిస్తున్న వైసీపీ కేడర్‌.. ఇపుడు ఫుల్‌ జోష్‌లోకి వచ్చేశారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి దూకుడుగా ఆరోపణలు చేయడంతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోందని వైసీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

08:49 - May 24, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. జూన్‌ 2న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే వేడుకలకు పకడ్భందిగా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఉన్నతాధికారులను ఆదేశించారు. సచివాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చేపట్టే కార్యక్రమాలపై అధికారులతో సమన్యయ సమావేశం నిర్వహించారు. జూన్ 2న నిర్వహించే రాష్ర్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ముందుగా గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం... పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించ నున్నారు. పలు రంగాల్లో ప్రతిభ కనబరచిన వారికి సాంస్కృతిక శాఖ ద్వారా అవార్డులు ప్రదానం చేయనున్నారు.

రాష్ర్ట అవతరణ దినోత్సవ వేడుకలను సమాచార శాఖ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్ ఈడి టీవీ, పీఏ సిస్టమ్‌, కామెంటేటర్లు, మీడియా కవరేజి తదితర పనులు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. ట్రాఫిక్ రెగ్యులేషన్‌పై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. వేడుకలు ముగిశాక వాహనాలు క్రమపద్ధతిలో వెళ్లే విధంగా చర్యలు తీసుకోనున్నారు. అలైటింగ్, పికప్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. రాజ్ భవన్, అంసెబ్లీ, సచివాలయం, హైకోర్టు, చార్మినార్ తదితర ప్రాంతాల్లో విద్యుద్ధీకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎస్. పరేడ్ గ్రౌండ్స్ లో మొబైల్ టాయ్‌లెట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, నిరంతర విద్యుత్, మంచినీటి సరఫరా, అంబులెన్సులు, వైద్యనిపుణుల టీమ్‌లు, బారికేడింగ్, అగ్నిమాపక యంత్రాల ఏర్పాట్లకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలు ప్రతింబింబించే విధంగా రవీంద్రభారతి పీపుల్స్ ప్లాజాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేయనున్నట్లు టూరిజం, సాంస్కృతిక శాఖ కార్యదర్శి తెలిపారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల నుంచి వెయ్యి మంది విద్యార్ధులు పాల్గొంటారని అధికారులు తెలిపారు. 

08:49 - May 24, 2018

హైదరాబాద్ : కోదండరాం పార్టీపై అధికార పార్టీ నజర్‌ పెట్టిందా..? వచ్చే ఎన్నికల్లో టీజేఎస్‌ ప్రభావంపై గులాబీదళం సర్వేచేసిందా..? పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టిన టీజేఎస్‌కు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందా..? దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి ఇంటలిజెన్స్‌ వర్గాలు రిపోర్టుకూడా ఇచ్చాయా..? ఈప్రశ్నలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వర్గాల్లో అవుననే చర్చలు నడుస్తున్నాయి.

ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణ జన సమితి వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందనే అంశంపై అంచనా వేసేందుకు ప్రభుత్వ ఇంటెలిజెన్స్‌ బృందాలు రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతోంది. కోదండరాం పార్టీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటి..? జేఏసీ నుంచి ఆవిర్భవించిన టీజేఎస్‌... రాజకీయంగా నిల దొక్కుకుంటుందా.. ? అధికార టీఆర్‌ఎస్‌కు దీటుగా ఎదిగేందుకు ఆ పార్టీ వద్ద వ్యూహాలు న్నాయా అనే విషయాలపై రహస్య సర్వే నిర్వహించినట్టు తెలుస్తోంది. గత నెల 29న హైదరాబాద్‌లో తెలంగాణ జన సమితి బహిరంగ సభ నిర్వహించి రాజకీయ పార్టీని ఆవిష్కరించుకుంది. అదే రోజు నుంచి రాష్ట్ర ఇంటలిజెన్స్‌ వర్గాలు పొలిటికల్‌ అనాలసిస్‌ జాబితాలో టీజేఎస్‌ను చేర్చినట్టు అధికారపార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

రాజకీయ పార్టీలు, వాటి బలాలు, బలహీనతలపై అధ్యయనం చేయడంతోపాటు సర్వేలు, ప్రజల మనోగతాన్ని ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్‌ వర్గాలు అధికారపార్టీకి చేరవేస్తుంటాయి. దీనిలో భాగంగానే టీజేఎస్‌పై ఐదు ప్రశ్నలతో ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ సర్వే పూర్తి చేసినట్టు సమాచారం. ఉద్యోగ, నిరుద్యోగ, రైతు, యువత, మైనారిటీ వర్గాల్లో కోదండరాం పార్టీ ప్రభావాన్ని అంచానా వేసినట్టు సమాచారం. ప్రతి నియోజకవర్గం నుంచి 500 నుంచి 1,000 మందితో ఈ సర్వే నిర్వహించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలంగాణ జన సమితి ఉద్యోగ వర్గాలపై భారీగా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. కేవలం కొంత మంది ఉద్యోగ నేతలకే అధికార పార్టీ గుర్తింపు ఇవ్వడం మిగతా సంఘాల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైనట్లు ఇంటెలిజెన్స్‌ గుర్తించింది. ఇప్పుడు ఆ వ్యతిరేకతను కోదండరాం పార్టీ అందిపుచ్చుకునేందుకు అవకాశాలున్నాయని నిఘా వర్గాలు సర్వేలో పొందుపరిచినట్లు సమాచారం. దాంతో పాటు వచ్చే ఎన్నికల్లో అత్యధిక శాతం ఎమ్మెల్యే సీట్లను ఉద్యోగ సంఘ నేతలు ఆశించేలా పరిస్థితులున్నాయని నివేదికలో ఇంటలిజెన్స్‌ అధికారులు పొందుపరిచినట్లు ప్రభుత్వ వర్గాలనుంచి సమాచారం వస్తోంది.

ఇంటిజెన్స్‌ సర్వేలో టీజేఎస్‌కు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు, టీఆర్‌ఎస్‌పై ప్రభావం చూపే ప్రాంతాలను ఇంటెలిజెన్స్‌ వర్గాలు స్పష్టంగా గుర్తించినట్లు తెలిసింది. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల పరిధిలో 10 నియోజకవర్గాలు, దక్షిణ తెలంగాణలో 16 నియోజకవర్గాలపై ఓ మేర టీజేఎస్‌ ప్రభావం కనిపిస్తోందని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఆర్థిక పరిపుష్టి, అంగబలం, బూత్‌ మేనేజ్‌మెంట్‌లో టీజేఎస్‌ బలహీనంగా ఉందని, ఈ విషయాల్లో పార్టీకి కొందరు ఎన్‌ఆర్‌ఐలు ఆర్థిక సహాయ సహకారాలు అందించే అవకాశం ఉన్నట్లు కూడా ఇంటెలిజెన్స్‌ తన నివేదికలో పొందుపరిచిందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. మొత్తానికి కోదండరాం పార్టీ ప్రకటన చేసిన క్షణం నుంచే అధికార గులాబీ పార్టీలో కలవరం మొదలైందని రాజకీయవర్గాల్లో అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

నేడు టి.టిడిపి మహానాడు...

హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం మహానాడు గురువారం హైదరాబాద్‌లో జరుగనుంది. ఎగ్జిబిషన్‌ మైదానంలో జరిగే మహానాడుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడుకు హాజరవుతారు. ఎనిమిది తీర్మానాలను ఆమోదించనున్నారు. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. 

లినీ కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం...

ఢిల్లీ : కేరళలో నిఫా వైరస్‌ సోకిన రోగులకు చికిత్స చేస్తూ ఆ వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోయిన నర్స్‌ లినీ కుటుంబానికి కేరళ ప్రభుత్వం అండగా నిలిచింది. లినీ కుటుంబానికి 20 లక్షల పరిహారాన్ని ప్రకటించడమే కాకుండా ఆమె భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. 

రెచ్చిపోతున్న పాక్...

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌ సరిహద్దులో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. జమ్మూ ప్రాంతంలోని సరిహద్దు గ్రామాలపై మోర్టార్లతో పాకిస్థాన్ రేంజర్లు దాడులకు పాల్పడుతున్నారు. ఆర్‌ఎస్ పురా, కథువాలోని హిరానగర్ సెక్టార్లలో భారత సైనిక శిబిరాలు, జనావాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్ దళాలు కాల్పులు జరుపుతున్నాయి.

Don't Miss