Activities calendar

25 May 2018

22:01 - May 25, 2018

ఢిల్లీ : పర్యావరణ అంశాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. అదే విధంగా పెట్రోలు ఉత్పత్తులను జిఎస్‌టీలో చేర్చకుండా..  కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చి ప్రజలపై భారాన్ని తగ్గించాలని సూచించారు. 

ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో అంతర్రాష్ట్ర మండలి 13వ స్టాండింగ్‌ కమిటీ సమావేశమైంది.  కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితా అంశాలు, పూంఛ్‌ కమిషన్‌ సిఫారసులపై చర్చ జరిగింది. పర్యావరణం అంశాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలని, ఆఫ్‌షోర్‌లోని 12 నాటికల్‌ మైళ్లలోపు సహజ వనరులపై.. రాష్ట్రాలకే రాయల్టీ చెల్లించాలని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. 

ఆఫ్‌షోర్‌ నిక్షేపాల వెలికితీత అంశాన్ని అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో చర్చిద్దామని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. పెట్రోల్‌ ఉత్పత్తులను జిఎస్‌టీ పరిధిలోకి తెస్తే రాష్ట్రాల ఆదాయం గణనీయంగా తగ్గుతుందని, కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తూ ప్రజలకు భారాన్ని తగ్గించాలని యనమల రామకృష్ణుడు సూచించారు. 

సమావేశపు అజెండాలో లేకున్నా.. యనమల రామకృష్ణుడు..  15వ ఆర్థిక సంఘం విధివిధానాల అంశాన్నీ లేవనెత్తారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి మాత్రం డివల్యూషన్‌ 42 శాతం చేశాక.. అన్ని రాష్ట్రాలకూ నిధులు బాగా పెరిగాయని అభిప్రాయపడ్డారు. అయితే.. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కోతలు విధిస్తున్నారని యనమల అభ్యంతర పెట్టారు. డివల్యూషన్‌ను 42 నుంచి 37 శాతానికి తగ్గిస్తున్నారని వస్తున్న వార్తలనూ ఆయన ప్రస్తావించారు. 
    

21:59 - May 25, 2018

శ్రీకాకుళం : జనసేనాని పవన్‌కల్యాణ్‌ నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రానికి తక్షణమే ఆరోగ్య మంత్రిని నియమించాలన్న తన డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించక పోవడంతో.. ఆయన నిరశనకు దిగారు. శనివారం నాడు.. శ్రీకాకుళంలో బహిరంగంగా దీక్షలో పాల్గొనాలని యోచిస్తున్నారు. 

ఉద్దానం రోగుల విషయంలో.. ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. నిరాహార దీక్ష చేపట్టారు.  ఉద్దానం కిడ్నీ రోగుల సమస్య పరిష్కారానికి 48 గంటల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని నియమించాలని పవన్‌.. బుధవారం నాడు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఆగడువు పూర్తయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో.. పవన్‌ కల్యాణ్‌ నిరాహార దీక్షకు దిగారు. శుక్రవారం సాయంత్రంతో తానిచ్చిన గడువు ముగియడంతో.. బసచేసిన దాట్ల రిసార్ట్‌లోనే దీక్ష ప్రారంభించారు. 

భద్రత కారణాల దృష్ట్యా.. రెండు రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో కవాతుకు పవన్‌ విరామం ప్రకటించారు. ప్రభుత్వానికి తానిచ్చిన అల్టిమేటం గడువు కూడా పూర్తి కావడంతో.. శుక్రవారం సాయంత్రం నుంచి ఆయన నిరాహారిగా ఉంటున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే.. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు.. శ్రీకాకుళంలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ మైదానంలో దీక్ష చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. బహిరంగంగా కుదరకపోయినా.. సాయంత్రం ఐదు గంటల వరకూ నిరాహార దీక్షను పవన్‌ కొనసాగిస్తారు. కిడ్నీ బాధితులను ఆదుకోవడంతో ప్రభుత్వం విఫలమైందని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ఆరోపించారు.

21:57 - May 25, 2018

బెంగళూరు : కర్నాటక స్పీకర్‌గా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రమేశ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ ఎన్నిక.. ఏకపక్షం కావడంతో.. జెడిఎస్‌ కాంగ్రెస్‌ శిబిరం ఊపిరి పీల్చుకుంది. రమేశ్‌కుమార్‌ స్పీకర్‌గా ఎన్నిక కావడం ఇది రెండోసారి. 

తీవ్ర ఉత్కంఠను.. కుమారస్వామి బలనిరూపణపై నీలినీడలను కమ్మిన కర్నాటక శాసనసభ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. జెడిఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కారు బలనిరూపణ వేళ.. స్పీకర్‌ ఎన్నిక అత్యంత కీలకంగా మారింది. బీజేపీ అభ్యర్థి సురేశ్‌కుమార్‌ కూడా స్పీకర్‌ పదవికి నామినేషన్‌ వేయడంతో.. ఉత్కంఠ నెలకొంది అయితే.. శుక్రవారం అసెంబ్లీ సమావేశమయ్యే సమయానికి.. బీజేపీ తమ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకుంది. 

బీజేపీ నిర్ణయంతో.. కాంగ్రెస్‌కు చెందిన రమేశ్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్‌ బోపయ్య.. ఆయన్ను స్పీకర్‌ స్థానంలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా.. వివిధ పక్షాల నాయకులు.. స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ను అభినందిస్తూ.. గతంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. 

స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం కావడంతో.. జెడిఎస్‌-కాంగ్రెస్‌ సర్కారు బలనిరూపణ  అప్పటికే దాదాపు ఖరారైపోయింది. ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాసతీర్మాన ప్రతిపాదన చేయడం.. బీజేపీ వాకౌట్‌ చేయడంతో.. ఊహించినట్లే జెడిఎస్‌-కాంగ్రెస్‌ సర్కారు విజయం సాధించింది. దీంతో.. మూడు రోజులుగా కర్నాటకలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. 

కేకేఆర్ విజయ లక్ష్యం 175 పరుగులు

పూణె : ఐపీఎల్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ నిర్ణీత 20వోవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేకేఆర్ విజయ లక్ష్యం 175 పరుగులుగా ఉంది. 

 

21:20 - May 25, 2018

అంతర్జాతీయ ఒప్పందాలకు అమెరికా తూట్లు పొడుస్తూ...మాట తప్పుతోంది అమెరికా.. తాజాగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ తో భేటీని రద్దు చేసుకుని మరోసారి మాట తప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలి. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాలపై నిర్వహించిన విశ్లేషణ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పాల్గొని, మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం...

20:57 - May 25, 2018

చంద్రబాబు ఎంట్రీతో టీటీడీపీలో జోష్...కేసీఆర్కు చెక్ వెట్టెతందుకు ప్లాన్..?, ఇంకా కొనసాగుతున్న జనం దాడులు..రేపల్లెకాడ మహిళన కొట్టిన మూర్ఖులు, తెలంగాణలో అగ్రవర్ణ రాజకీయాలు..బహుజన ఎమ్మెల్యేలే బలిపశువులు.?, ఇండ్లు గట్టిస్తవా మేము గట్టుకోవాల్నా?..సర్కారు భూమిల దిగిన ఎర్రజెండాలు, రైతులను మోసం జేశిన ఊరి దేవుడు..రైతు బంధు చెక్కులు రానియ్యలేదు, పోలీసోళ్లను గొట్టిన తాగువోతులు..తాగినోని తెర్వువోతె కొట్టడా మరి..?
ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం..

20:49 - May 25, 2018

రేపటికి మోడీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతుంది. ఈ నాలుగేళ్ల పాలనలో మోడీ సాధించిందేంటీ ?  ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు వెంకట్, బీజేపీ నేత రాకేష్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ నేత సుందర్ రామశర్మ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

ఏడో వికెట్ కోల్పోయిన హైదరాబాద్ సన్ రైజర్స్

కోల్ కతా : ఐపీఎల్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ ఏడో వికెట్ కోల్పోయింది. 138 పరుగుల వద్ద యూసుఫ్ పఠాన్ ఔట్ అయ్యారు.

 

ఆరో వికెట్ కోల్పోయిన హైదరాబాద్ సన్ రైజర్స్

కోల్ కతా : ఐపీఎల్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 134 పరుగుల వద్ద బ్రాత్ వైట్ ఔట్ అయ్యారు.

 

రైతు బీమా పథకంపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : రైతు బీమా పథకంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15న రైతులకు రైతు బీమా పథకం ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రైతు బీమాకు సంబంధించి మొత్తం ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఎల్ ఐసీ తో ఒప్పందం ద్వారా రైతు బీమా పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు. 

 

19:46 - May 25, 2018

ఒకప్పుడు తన బాడీ లాంగ్వేజ్ తో, వెరైటీ డైలాగ్ డెలివరీతో ఈజీగా నవ్వులుపూయించి అలవోకగా సినిమాను పాస్ చేయించి, మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్నాడు రవితేజ. ఇప్పుడు మారిన ట్రెండ్ లో కూడా.. పాత ఫార్ములా ఫాలో అవుతూ రొటీన్ అయిపోయాడు. టచ్ చేసి చూడు అంటూ..ఒక డిజాస్టర్ ని గట్టిగా టచ్ చేసిన రవితేజ..ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని  మాస్ ని టార్గెట్ చేసి నేల టికెట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.  దర్శకుడిగా మంచి మార్కులు వేయించుకున్న కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్ కావడం .. ట్రైలర్ అంతా కూడా రవితేజ తరహాలో ఎంటర్ టైనింగ్ అనిపించడం..పవన్ కళ్యాణ్..ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా రావడం వంటి విషయాలతో ఓ మోస్తర్ బజ్ క్రియేట్ చేసుకుని థియేటర్స్ లోకి వచ్చింది ఈసినిమా. మరి ఈసినిమాకు అనుకున్నట్టు..నేలటికెట్ ఆడియన్స్ నుంచి విజిల్స్ వచ్చాయా..? మాస్ ఈ సినిమాను మెచ్చారా..? ఓవరాల్ గా ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో ఇప్పుడు చూద్దాం.
కథ..
కథ విషయానికొస్తే..చిన్న తనంలోనే అనాథగా మారిన రవితేజ.. చుట్టూ జనం, మధ్యలో మనం అనే కాన్సెప్ట్ తో అందరితో కలిసిమెలిసి ఉంటాడు. కోర్టులో దొంగ సాక్ష్యాలు చెపుతూ జీవితాన్ని అలా అలా గడిపేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా విశాఖపట్నంలో ఓ పోలీస్ తో వచ్చిన గొడవవల్ల హైదరాబాద్ కి వస్తాడు. అయితే..ఇక్కడ కూడా  అనుకోకుండా హోమ్ మినిస్టర్ తో రవితేజ కు క్లాష్ వస్తుంది. అది ఊహించని మలుపులు తిరిగి అనేక ట్విస్ట్ లు రివీల్ అవుతాయి. అసలు రవితేజ హైదరాబాద్ కు ఎందుకొచ్చాడు..? హోమ్ మినిస్టర్ కి అతనికి ఉన్న సంబందం ఏ:టి..? తను  అనుకున్న ఎయిమ్ ని రీచ్ అయ్యాడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 
నటీనటులు..
నటీనటుల విషయానికొస్తే..ఒకప్పుడు మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న రవితేజలో మునుపటి ఛార్మ్, ఎనర్జీ లెవల్స్ తగ్గాయి. స్క్రీన్ ప్రజెన్స్ కూడా కాస్త ఆడ్ గా అనిపిస్తుంది. అయితే ఈ సినిమా వరకూ లుక్స్ విషయంలో కేర్ తీసుకున్న రవితేజ..తనవరకూ తాను అలా అలా చేసుకుంటూ వెళ్లిపోయాడు. అియతే మిగతా వాళ్ల క్యారెక్టరైజేషన్స్ సరిగా కుదరకపోవడంతో..వాళ్ల నటన కూడా అలాగే సాగిపోయింది. ఉన్నంతలో జయప్రకాష్ రెడ్డి, అలీ , పృధ్వీ , ప్రవీణ్ లు కలిసి చేసిన  కామెడీ  కాస్త ఊరటనిస్తుంది. పవర్ ఫుల్ విలన్ రోల్ లో ఎంట్రీ ఇఛ్చిన జగపతిబాబు ఆ తర్వాత మాత్రం రొటీన్ విలన్ గా పాసివ్ క్యారెక్టర్ ని పాస్ చేయించడానికి మ్యాగ్జిమమ్ ట్రై చేశాడు.  కొత్త హీరోయిన్ మాళవిక శర్మ..గ్లామర్ విషయంలో ఏమాత్రం డిసప్పాయింట్ చెయ్యలేదు. నటనలో ఒఖ మామూలు హీరోయిన్  పరిథి ఎలా ఉంటుందో ..అలాంటి పాత్రే దక్కింది. ఆమె యాక్టింగ్ కూడా సో..సో గానే ఉంది.  తనకామెడీతో  సినిమాను నిలబెట్టే బ్రహ్మానందాన్ని చిన్నపాత్రలో చూపించి  నవ్వులు బదులు చిరాకు తెప్పించాడు డైరెక్టర్. ఇక సీనియర్ నటులు, సంపత్ , అజయ్, సురేఖావాణి, శరత్ బాబు సినిమాలో కనిపించడం వల్ల సినిమాకు రిచ్ నెస్ వచ్చింది.
టెక్నీషియన్స్.. 
టెక్నీషియన్స్ విషయానికొస్తే..ఈ సినిమా కథ, డైలాగ్స్ , డైరెక్షన్ లాంటి కీలక విభాగాలను డీల్ చేసిన కళ్యాణ్ కృష్ణ అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమయ్యాడు. మొదటి 2 సినిమాలకు చూపించిన పట్టు..ఈ సినిమాలో  ఓ ఒక్క దశలో కనిపించలేదు.  అస్తవ్యస్తమైన కథకు  అతుకుల స్క్రీన్ ప్లే యాడ్ చేసి , మాటలతో మేనేజ్ చేసేద్దాం  అన్న ధోరణి అడుగడుగునా.. కనిపించింది.  డైరెక్టర్ గా కూడా  చాల ప్లేస్ మెంట్స్ లో  క్లూ లెస్ గా కనిపించాడు కళ్యాణ్ కృష్ణ.  సినిమా సాగుతున్న కొద్దీ.. అన్నివిదాలుగా సినిమా గ్రాఫ్ పడుతూ వచ్చింది. దాన్ని ఏ దశలో కూడా తిరిగి నిలబెట్టలేకపోయాడు డైరెక్టర్.  ఇక నేల టికెట్ కు కష్టపడి వర్క్  చేసి తన క్రాఫ్ట్ వరకూ పూర్తి న్యాయం చెయ్యగలిగాడు కెమెరామెన్ ముఖేష్. ఏరియల్ షాట్స్, టాప్ యాంగిల్ షాట్స్, హఈరో ఎలివేషన్ సీన్స్ బాగా వచ్చాయి. ఇక ఫిదా ని తన మ్యూజిక్ తో హిట్ కు 10 మెట్లు పైన నిలబెట్టిన శక్తికాంత్ కార్తీక్.. ఈ రొటీన్ సినిమాకు తగ్గట్టు గానే .. పరమ రొటీన్ సంగీతం అందించాడు.  సినిమా మొత్తం మీద  ఒకే ఒక్క పాట జస్ట్ ఓకే అనిపించింది. అంటే మ్యూజిక్ ఎంత దారుణంగా ఉ:దో అర్ధం చేసుకోవచ్చు. కొత్త నిర్మాత రామ్ తాళ్లూరి సినిమాకు పెట్టాల్సిన దానికంటే రెట్టింపు బడ్జెట్ కేటాయించాడు.  అయితే..  ఆ రిచ్ నెస్ సినిమకు ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు కాదుకదా.. సినిమాను ఏమాత్రం  కాపాడలేకపోయింది. రొటీన్ అండ్ ఎంటర్ టైనింగ్ మూవీస్ తో మాస్ మహారాజ హోదా దక్కించుకున్న రవితేజ.. టచ్ చేసి చూడు తర్వాత మళ్లీ అదే స్తాయి రిజల్ట్ ని అందుకునే లా ఉన్నాడు. నేలటికెట్ అంటూ కనీసం వాళ్ల అభిమానాన్ని కూడా అందుకోలేని స్తాయి సినిమాతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ సాధించడం కష్టమే.
ప్లస్ ..
సినిమాటోగ్రఫీ
ప్రొడక్షన్ వాల్యూస్
డైలాగ్స్
..
మైనస్
రొటీన్ కథ
ఫ్లో లేని స్క్రీన్ ప్లే
మ్యూజిక్
క్లైమాక్స్ కామెడీ

రేటింగ్..  1/5

13 జిల్లాలకు డీసీసీలను ప్రకటించిన రాహుల్‌గాంధీ

హైదరాబాద్ : తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులు జరిగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ 13 జిల్లాలకు డీసీసీలను ప్రకటించారు. 

19:36 - May 25, 2018

బీహార్ : 2013 బుద్ధ గయ వరుస పేలుళ్ల కేసులో ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను దోషులుగా తేల్చింది. హైదర్ అలీ వురపు బ్లాక్ బ్యూటీ, ఇంతియాజ్ అన్సారీ, ఉమర్ సిద్ధికి, అజారుద్దీన్ ఖురేషీ, ముజిబుల్లా అన్సారీ నేరం చేసినట్లు కోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 31న కోర్టు వీరికి శిక్షను ఖరారు చేయనుంది. 2013 జూలై 7న పవిత్ర బోధి వృక్షం వద్ద ప్రార్థనలు చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు చేరిన సమయంలో వరుసగా 9 సార్లు  పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఓ టిబెటన్‌ సాధువు, భక్తుడు గాయపడ్డారు. సిమి ఉగ్రవాదులే పేలుళ్లకు పాల్పడ్డారని జాతీయ దర్యాప్తు సంస్థ ఆరోపించింది. మయన్మార్ సైన్యం రొహింగ్యా ముస్లింలను హత్య చేసినందుకు ప్రతీకారంగా సిమి బౌద్ధుల పవిత్ర క్షేత్రంపై దాడి చేసినట్లు పేర్కొంది. ఈ కేసులో ఎన్‌ఐఏ 90 మంది సాక్షులను ప్రవేశపెట్టింది.

 

19:32 - May 25, 2018

కోల్ కతా : పశ్చిమ బెంగాల్‌ శాంతినికేతన్‌ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోది, బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేకర్‌ హసీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని తన ప్రసంగం ప్రారంభానికి ముందు విశ్వభారతి విశ్వవిద్యాలయం ఛాన్సలర్ హోదాలో విద్యార్థులకు  క్షమాపణ చెప్పారు.  తమకు తాగునీటి ఏర్పాట్లు చేయలేదని...కొందరు విద్యార్థులు సైగ చేయడంతో... మీకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్తున్నానని మోది అన్నారు. పట్టా పొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఓ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఇరు దేశాల ప్రధానులు పాల్గొనడం బహుషా ఇదే మొదటిసారని మోది తెలిపారు. ఇరుదేశాల ప్రధానులు బంగ్లాదేశ్‌ భవన్‌ను ప్రారంభించారు. భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య సాంస్కృతిక సంబంధాలకు ప్రతీకగా ఈ భవన్‌ నిలవనుంది. అంతకుముందు కోల్‌కతాకు చేరుకున్న ప్రధాని మోదికి పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ కేసరీనాథ్‌ త్రిపాఠి, సిఎం మమతా బెనర్జీ స్వాగతం పలికారు. 

19:29 - May 25, 2018

ఢిల్లీ : దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేకత పెరుగుతోందా..? 2019 ఎన్నికల్లో బీజేపీకి ఆశాభంగం తప్పదా? తాజాగా ఓ సంస్థ చేసిన సర్వే.. అవుననే అంటోంది. మోదీ గ్రాఫ్‌ గణనీయంగా పడిపోతోందని.. నెల నెలా.. ఆయన కరిష్మా తగ్గుతూ వస్తోందని సర్వే తేల్చింది. ఇది విపక్షాల్లో ఆనందాన్ని నింపుతుంటే.. బీజేపీ శిబిరాన్ని అంతర్మథనానికి గురి చేస్తోంది. 
ప్రధాని మోదీపై వ్యతిరేకత.. 
ప్రధాని మోదీపై వ్యతిరేకత.. ఇంతలింతలుగా పెరిగిపోతోంది. ఆయన్ను మళ్లీ ప్రధాని చేయరాదన్న భావన ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది. నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా.. ఏబీపీ న్యూస్‌-సీఎస్‌డిఎస్‌ సంస్థలు నిర్వహించిన సర్వేలో ఈ వాస్తవాలు బహిర్గతమయ్యాయి. ఈ ఏడాది మొదట్లో మోదీకి ఓటేస్తామని 34శాతం మంది చెబితే.. నాలుగంటే నాలుగు నెలల్లో అది 32 శాతానికి పడిపోయింది. ఈ తీరు మోదీకి తగ్గుతోన్న జనాదరణను సూచిస్తోంది.
మోదీ మళ్లీ ప్రధాని కారాదన్న 47శాతం మంది
సర్వేలో భాగంగా.. మొత్తం 19 రాష్ట్రాల్లో 15,859 మంది నుంచి  అభిప్రాయాలను సేకరించారు. అందులో 47 శాతం మంది మోదీ సర్కారుకు రెండో సారి గద్దెనెక్కే అర్హత లేదని తేల్చి చెప్పారు. 39శాతం మంది మాత్రమే ఫరవాలేదు మరో చాన్స్‌ ఇవ్వొచ్చు అన్నారు. 2013లో కూడా యూపీఏ సర్కారుపై ఇలాంటి సర్వేనే నిర్వహించినప్పుడు కూడా 39శాతం మంది మాత్రమే మరో చాన్స్‌ ఇవ్వొచ్చన్నారు. మెజారిటీ ప్రజలు యూపీఏ సర్కారుకు నో చాన్స్‌ అన్నారు. దీనికి తగ్గట్లే 2014 ఎన్నికల్లో యూపీఏ సర్కారు ఓటమిపాలైంది.
దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక గాలి
ప్రభుత్వ వ్యతిరేకతే ఏకైక అస్త్రంగా పీఠాన్నెక్కిన మోదీ.. తన హయాంలో తీసుకున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదం అయ్యాయి.  ప్రస్తుతం దేశంలో మోదీ వ్యతిరేక గాలి బలంగా వీస్తోందని, ఇది మైనారిటీల్లో మరింత ఎక్కువగా ఉందని ఏబీపీ సర్వే వెల్లడించింది. నిజానికి మధ్యతరగతి ఓట్లే బీజేపీకి పెద్ద ఓటు బ్యాంకు. అయితే..  పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టీ, పెట్రో ధరలు, నిత్యావసరాల పెరుగుదల, సామాజిక అశాంతి లాంటివి సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో అసహనాన్ని నింపాయన్న భావన వ్యక్తమవుతోంది.
మోదీకి వ్యతిరేకంగా 42శాతం హిందువులు
మతాల వారీగా చూస్తే.. మోదీకి అనుకూల వాతావరణమేమీ కనిపించడం లేదు. హిందూ ఓటర్లలో 44శాతం మంది అనుకూలంగా ఉంటే 42 శాతం మంది మోదీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు మీద మోదీ సర్కారు సరిగా స్పందించలేదని భావిస్తోన్న దళితుల్లో 55శాతం మంది మోదీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక, గిరిజనుల్లో 43శాతం, ఓబీసీల్లో 42శాతం మంది మోదీ పాలనను వ్యతిరేకిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. ఇక గోరక్షకుల అరాచకాలు, ఉత్తర భారతావనిలో విద్వేషాలు, హత్యలు, తక్షణ తలాఖ్‌ వ్యవహారాన్ని రాజకీయాలకు వాడుకోవడం, కశ్మీర్‌లో హింస ఇవన్నీ దేశ ప్రజల్లో.. ముఖ్యంగా ముస్లింలలో అభద్రతను పెంచుతూ.. మోదీ పాలనపై అసంతృప్తిని ఎగదోశాయని సర్వే నిర్వహించిన సంస్థ విశ్లేషించింది. మొత్తానికి, కర్నాటకలో అధికారాన్ని కోల్పోవడమే కాకుండా, అక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాల ద్వారా మచ్చ తెచ్చుకున్న బీజేపీ నాయకులను.. తాజాగా ఏబీపీ-సీఎస్‌డిఎస్‌ సంస్థల సర్వే అంతర్మథనానికి గురి చేస్తోంది. 

 

19:24 - May 25, 2018

పశ్చిమ గోదావరి : పెనుమంట్ర మండలం నెగ్గిపూడి వద్ద ఉద్రికత్త నెలకొంది. నెగ్గిపూడి వద్ద చించినాడ ఛానల్‌ కాల్వపై వంతెన నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఈ వంతెన నిర్మాణం వల్ల సుమారు 7000 ఎకరాలకు నీరు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే... వంతెన పనులు నిలిపివేయడం కుదరదని గ్రామస్తులు చెప్పడంతో.. గ్రామస్తులు, రైతులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల రంగప్రవేశం చేసి పరిస్థితి అదుపుచేశారు. ఇప్పటికైనా అధికారులు న్యాయం చేయకపోతే ధర్నా మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. 

 

19:22 - May 25, 2018

కర్నాటక : ఉత్కంఠ వీడింది. కర్నాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి కుమారస్వామి బలాన్ని నిరూపించుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్‌ చేయడంతో 117 మంది ఎమ్మెల్యేలు మూజువాణి ఓటుతో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ మద్దతిచ్చారు. బలపరీక్ష సందర్బంగా అసెంబ్లీలో ప్రసంగించిన కుమారస్వామి, యడ్యూరప్పల మధ్య మాటల యుద్దం కొనసాగింది. గతంలో బీజేపీతో జతకట్టి తప్పుచేశానన్న కుమారస్వామి... తాను ఈసారి అలాంటి తప్పు చేస్తే తన తండ్రి ఇంటి నుంచి గెంటి వేస్తానన్నారన్నారు. దక్షిణాదికి బీజేపీ రావడంలో తన పాత్ర ఉందని... అందుకే ఈసారి ఆ పార్టీ రాకుండా కాంగ్రెస్‌తో కలిసి అడ్డుకున్నామన్నారు. అయితే అనంతరం ప్రసగించిన యడ్యూరప్ప కూడా కుమారస్వామికి ధీటుగా సమాధానం చెప్పారు. గతంలో కుమారస్వామికి మద్దతిచ్చి తప్పు చేశానన్నారు. కుమారస్వామి నమ్మవద్దని... మద్దతిచ్చిన కాంగ్రెస్‌ను ఆయన మోసం చేస్తారన్నారు యడ్యూరప్ప. 

 

19:19 - May 25, 2018

హైదరాబాద్ : తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులు జరిగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ 13 జిల్లాలకు డీసీసీలను ప్రకటించారు. హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా అంజన్‌కుమార్‌యాదవ్‌ను నియమించారు. అలాగే నిజామాబాద్ డీసీసీగా తాహెర్ బిన్ హమ్దాన్, కరీంనగర్ డీసీసీగా కటకం మృత్యుంజయం, ఆదిలాబాద్ డీసీసీగా మహేశ్వర్‌రెడ్డి, మెదక్ డీసీసీగా సునీతా లక్ష్మారెడ్డి, రంగారెడ్డి డీసీసీగా క్యామ మల్లేశ్, మహబూబ్‌నగర్ డీసీసీగా ఓబేదుల్లా కొత్వాల్, నల్లగొండ డీసీసీగా బిక్షమయ్య గౌడ్, వరంగల్ డీసీసీగా నాయిని రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ సిటీ డీసీసీగా కేశ వేణు, కరీంనగర్ సిటీ డీసీసీగా కర్రా రాజశేఖర్, వరంగల్ సిటీ డీసీసీగా కేదారి శ్రీనివాసరావు, రామగుండం సిటీ డీసీసీగా కే. లింగస్వామి యాదవ్‌లను నియమించారు. 

 

19:14 - May 25, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఇవాళ రాహుల్‌ గాంధీ నివాసంలో ఉత్తమ్‌కుమార్‌ నాయకత్వంలో ఆ పార్టీలో చేరారు..... తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు సంగం రెడ్డి ప్రుథ్వీరాజ్, ఉపాధ్యాయ సంఘం నాయకులు హర్షవర్దన్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు అన్యాయం జరుగుతోందంటున్న కాంగ్రెస్‌ నేతలతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

 

19:12 - May 25, 2018

కృష్ణా : ఎ.కొండూరు మండలంలోని 19 గ్రామాలకు చెందిన కిడ్నీ వ్యాధి బాధితులు ఆందోళనకు దిగారు. సీపీఎం ఆధ్వర్యంలో ఎ. కొండూర్‌ తహశీల్దార్ కార్యాలయం ముందు బాధితులు ధర్నా నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సమస్యను పట్టించుకోకపోతే జూన్‌ 1వ తేదీన సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. కిడ్నీ బాధితుల ఆందోళనపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

 

19:10 - May 25, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ను ప్రతి గ్రామంలో విస్తృతంగా తీసుకెళ్తామని బీఎల్‌ఎఫ్‌ కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌ ఎస్వీకెలో జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జులై నెలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10వేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ పరిపాలనా విధానంలో మార్పు రావాలంటే బీఎల్‌ఎఫ్‌తోనే సాధ్యమన్నారు. 

19:02 - May 25, 2018

విశాఖ : తిరుమలలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేయడం దారుణమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ అన్నారు. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. రమణ దీక్షితుల వెనుక బీజేపీ ఉందని టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. శ్రీవారి అలయ తవ్వకాలపై విచారణ చేయాలని మాధవ్‌ డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని మాధవ్‌ ఆరోపించారు. 

 

18:59 - May 25, 2018

విశాఖ : నగరంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు ఎలాంటి ఇబ్బందిలేదని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు గనుల కేటాయింపు సాధ్యంకాదని తెలిపారు. రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని...అలాగే హోదా వల్ల వచ్చే అన్ని సౌకర్యాలు రాష్ట్రానికి కల్పించనుందన్నారు. కేంద్రం ఇచ్చే ప్రయోజనాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు బీజేపీపై వచ్చిన ఆరోపణలను హరిబాబు ఖండించారు. 

 

18:57 - May 25, 2018

జయశంకర్‌ భూపాలపల్లి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని రెవెన్యూ అధికారులు నీరుగార్చారు. ములుగు గణపురం మండలంలో రైతుబంధు పథకం సక్రమంగా అమలు కావడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. గత మూడు రోజులుగా తహశీల్దార్‌ ఆఫీస్‌కు రావడం లేదని ఆరోపిస్తున్నారు. తాము ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామంటున్నారు. కార్యాలయం వద్ద ఉదయం నుంచి పడిగాపులు గాస్తున్నామని వాపోయారు. రెవెన్యూ అధికారుల వైఖరిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

18:13 - May 25, 2018

శ్రీకాకుళం : ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ దీక్ష చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు దీక్ష ప్రారంభించనున్నారు. రేపు సాయంత్రం 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది. రేపు ప్రజల మధ్య జనసేన దీక్ష చేయనున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్దానం సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వానికి పవన్ డెడ్ లైన్ పెట్టారు. గడువు ముగియడంతో పవన్ దీక్షకు సిద్ధమయ్యారు. దీక్షకు అనుమతించాలని పోలీసులను జనసేన కోరింది. 

18:04 - May 25, 2018

బెంగళూరు : కుమారస్వామి బల పరీక్షలో నెగ్గారు. కర్నాటక అసెంబ్లీలో కుమారస్వామి బలం నిరూపించుకున్నారు. మూజువాణీ ఓటుతో సభ ఆమోదం తెలిపింది. బీజేపీ లేకుండానే కుమారస్వామి విశ్వాస పరీక్ష నెగ్గారు. కుమారస్వామికి 116 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సభ నుంచి బీజేపీ వాకౌట్ చేసింది. కర్నాటక అసెంబ్లీ మూడున్నర గంటల పాటు సమావేశం అయింది. బల నిరూపణ పూర్తికాగానే సభను వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. 

 

18:02 - May 25, 2018

బెంగళూరు : కుమారస్వామి బల పరీక్షలో నెగ్గారు. కర్నాటక అసెంబ్లీలో కుమారస్వామి బలం నిరూపించుకున్నారు. మూజువాణీ ఓటుతో సభ ఆమోదం తెలిపింది. బీజేపీ లేకుండానే కుమారస్వామి విశ్వాస పరీక్ష నెగ్గారు. కుమారస్వామికి 116 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సభ నుంచి బీజేపీ వాకౌట్ చేసింది. కర్నాటక అసెంబ్లీ మూడున్నర గంటల పాటు సమావేశం అయింది. బల నిరూపణ పూర్తికాగానే సభను వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. 

 

17:59 - May 25, 2018

బెంగళూరు : యడ్యూరప్ప ఆరోపణలపై కుమారస్వామి వివరణ ఇచ్చారు. తాము ఎవరినీ ముంచలేదని కుమారస్వామి  అన్నారు. ఇలాంటి పలాయనవాద నేతను తన రాజకీయ జీవితంలో చూడలేదని తెలిపారు. నాటకాలు ఆడేందుకు ఇక్కడ రీహార్సల్ చేసినట్లు ఉందన్నారు. 'నా కుటుంబంపైనా..నా తండ్రిపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు బాధాకరం' అని అన్నారు. ఆయన తరహాలో తాను దిగజారనని తెలిపారు. బహుశా యడ్యూరప్పను బీజేపీ నాయకత్వం పట్టించుకున్నట్లు లేదని పేర్కొన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని అధికారంలోకి రానివ్వరాదు అని భావించామని చెప్పారు. తాను మలేసియాలో ఆస్తిని కూడబెట్టినట్లు అప్పుడే దుష్ర్పచారం ప్రారంభించారని వాపోయారు. 

17:55 - May 25, 2018

కర్ణాటక : బెంగళూరు భారతదేశపు ఉద్యానవనాల నగరంగా ప్రసిద్ధి గాంచింది. ఎటు చూసినా కనిపించే పచ్చదనం, ఉద్యానవనాలు సందర్శకులకు నేత్రానందం కలిగిస్తాయి. లాల్ బాగ్, కబ్బన్ పార్క్ లు ప్రముఖ ఉద్యానవనాలు. బెంగళూరులో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అటువంటి బెంగళూరు కర్ణాటక రాష్ట్రానికి రాజధాని. ఈ రాష్ట్ర చట్టసభ అయిన అసెంబ్లీని 'విధానసౌధ' అని పిలుస్తారు. మరి ఆ విధానసౌధ వేదికగా ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సీఎంలు పూర్తికాలం పదవులలో వుండరనే సెంట్ మెంట్ కూడ వుంది. యడ్యూరప్ప కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగదని ఆక్రోశం వెళ్లగక్కిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంగా విధానసౌధ వేదికగా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి భవితవ్యాన్ని, విధానసౌధ సెంటిమెంట్ వెంటాడుతుందా? అన్నింటిని దాటుకుని ఎట్టకేలకు సీఎం అయిన కుమారస్వామి విధానసౌధ చరిత్రను మార్చి రాస్తారా? 

అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి..

రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతిరథ మహారధులు సమక్షంలో రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా కుమారస్వామితో మే 23 బుధవారం నాడు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఆ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశంలోని హేమాహేమీలందరూ హాజరయ్యారు. ఇంతవరకు బాగానేవుంది.. ఇప్పుడు మరో ప్రశ్న రాజకీయ పండితులను కుదురుగా ఉండనివ్వడం లేదు. సీఎం అయిన కుమారస్వామి ఐదేళ్లూ ఆ పదవిలో ఉంటారా? లేదా అనేదే ఆ ప్రశ్న. ఎందుకంటే.. విధానసౌధ వేదికగా ప్రమాణస్వీకారం చేసిన సీఎంలు పూర్తిస్థాయిగా అంటే ఐదేళ్లు పదవిలో వుండరనే సెంట్ మెంట్ వుంది. ఈ నేపథ్యంలో కుమారస్వామి పదవిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.

అనూహ్య పరిణామాల మధ్య కుమారస్వామి ప్రమాణస్వీకారం..
కర్ణాటక విధాన సౌథ ముందు ప్రమాణ స్వీకారం చేసిన ఏ ఒక్క ముఖ్యమంత్రీ పూర్తికాలం కుర్చీలో కొనసాగలేదు. ఈ విషయాన్ని చరిత్ర చెబుతోంది. ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామాల మధ్య కుమారస్వామి ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల అనంతరం ఫలితాలు వెలువడిన తరువాత 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. కాంగ్రెస్ కు 78,జేడీఎస్ 38 సీట్లతో ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ అభ్యర్థి యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు గవర్నర్ వాజుభాయి వాలా ఆహ్వానించారు. ఈ క్రమంలో యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ కాంగ్రెస్, జేడీఎస్ కూటమిగా అతిపెద్ద మెజారిటీ వుందనీ..కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు తామే అర్హత కలిగి వున్నామనీ..యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చెల్లదనీ..నిలిపివేయాలని కాంగ్రెస్, జేడీఎస్ కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.దీంతో సుప్రీంకోర్టు కాంగ్రెస్, జేడీఎస్ కూటమి బలపరీక్ష నిరూపించుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. దీంతో అనూహ్యపరిణామాల మధ్య యడ్యూరప్ప బలపరీక్షకు గవరన్నర్ వారంరోజులు గడువిచ్చినా...బలపరీక్ష నిరూపించుకోకుండానే సీఎం పదవికి రాజీనామా చేయటం కాంగ్రెస్, జేడీఎస్ లు తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటు ఎట్టకేలకు విధానసౌధ వేదికగా కుమారస్వామి ప్రమాణస్వీకారంచేశారు. అనంతరం ఈరోజు అంటే మే 25న స్పీకర్ ఎన్నిక అనంతం తన బలపరీక్షలో నెగ్గారు.

ఏడాది లోపే పదవి నుండి దిగిపోయిన రామకృష్ణ హెగ్డే ..
గతంలో రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో సాదాసీదాగా ప్రమాణ స్వీకారం నిర్వహించేవారు. కానీ, 1993లో అప్పటి జనతాదళ్ నేత రామకృష్ణ హెగ్డే తొలిసారి విధాన సౌథ ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. మద్యం కాంట్రాక్టుల ఆరోపణలతో యేడాదిలోపే పదవిని కోల్పోయారు. అదే యేడాది మరోమారు ముఖ్యమంత్రి అయినా ఈసారి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో పదవి చేజార్చుకున్నారు.

రెండేళ్లలోనే దిగిపోయిన బంగారప్ప..
అంతకంటే ముందు 1990లో బంగారప్ప కూడా ఇలాగే విధాన సౌథ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. కావేరీ నదీ జలాల విషయంలో అల్లర్లు చెలరేగడంతో రెండేళ్లలోనే పదవి నుంచి తప్పుకున్నారు. 2006లో కుమారస్వామి కూడా ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేసి 20 నెలలకే పదవిని కోల్పోయారు. 2008లో యడ్యూరప్పకూ ఇదే అనుభవం ఎదురైంది. అవినీతి ఆరోపణలతో మూడేళ్లకే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు కుమారస్వామి విధాన సౌథ ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. మరి గత చరిత్రను ఆయన మారుస్తారో.. లేదో వేచి చూడాల్సిందే.    

17:36 - May 25, 2018

బెంగళూరు : బల పరీక్షకు ముందే కర్నాటక అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్ చేసింది. కుమారస్వామి బల పరీక్ష ఇక లాంఛనం అయింది. సోమవారం కర్నాటక బంద్ కు పిలుపునిస్తునట్లు అసెంబ్లీలో బీజేపీ ప్రతిపక్ష నేత యడ్యూరప్ప ప్రకటించారు. సాయంత్రం లోగా రైతు రుణాలు మాఫీ చేయకుంటే సోమవారం బంద్ చేస్తామని చెప్పారు.

 

జోరుమీదున్ 'స్టాక్'మార్కెట్లు..

ముంబై : భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో కూడా జోరును కొనసాగించాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు ఉండటంతో పాటు... ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ఈరోజు ఆద్యంతం సూచీలు లాభాల్లోనే కొనసాగాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 262 పాయింట్లు పుంజుకుని 34,925కు చేరుకుంది. నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 10,605కి ఎగబాకింది.

16:33 - May 25, 2018

హైదరాబాద్ :    కేరళ రాష్ట్రాన్ని వణికిస్తున్న నిపా వైరస్.. ఇపుడు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా విస్తరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో ఇద్దరిలో నిపా వైరస్ లక్షణాలను గుర్తించారు. అలాగే, మహారాష్ట్ర, గోవాలలో ఈ వైరస్ వ్యాపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఈక్రమంలో కేరళ నుండి నిపా వైరస్ హైదరాబాద్ కు చేరుకున్నట్లుగా సమాచారం.

మలేషియాలో 'నిపా'వైరస్ మూలాలు..
ప్రాణాంతకమైన వైరస్ వ్యాధి. గబ్బిలాలు, పందులు, మనుషులలో ఎవరి నుంచి ఎవరికైనా ఈ వైరస్‌ సోకుతుంది. 1998లో మలేషియాలో మొదటిసారిగా వైరస్‌ కనుగొనబడింది, అటుతర్వాత 2004లో బంగ్లాదేశ్ లోకి వచ్చింది, ప్రస్తుతం ఈ వైరస్‌ కేరళలోకి ప్రవేశించింది.

సుంగాయ్ నిపా గ్రామంలో పుట్టి అదేపేరుతో ప్రాచుర్యం..
మలేసియాలోని సుంగాయ్ నిపా అనే గ్రామంలోని రోగుల నుంచి తొలిసారిగా ఈ వైరస్ ను కనుగొన్నారు కాబట్టి, దీనిని నిపా వైరస్‌ గా నామకరణం చేశారు. ఈ వ్యాధితో మలేషియా 105 మంది మృతి చెందగా, సింగపూర్‌లో పందులను పెంచే పశుపోషకులు మృతి చెందారు.

కేరళలో నిపా ముప్పేట దాడి..
నిపా వైర్‌స కేరళపై ముప్పేట దాడి చేస్తోంది. అంతుచిక్కని ఈ వైరస్‌ బారిన పడి కేరళలో ఇప్పటికే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. ఇదే కుటుంబంలోని మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులందరికీ ఐసీయూల్లో చికిత్సలు అందిస్తున్నారు. నిపా వైరస్‌ దక్షిణ భారత దేశంలో కనిపించడం ఇదే తొలిసారి. దీంతో ఈ ప్రాణాంతక వైరస్‌ పట్ల కేరళతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కేరళలోని కోజికోడ్‌ తదితర ప్రాంతాల్లో 23 మంది నిపా వైరస్‌ బాధితులు వివిధ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. కొద్దిరోజుల కిందట వీరంతా జ్వరం, తలనొప్పి, శ్వాస సంబంధమైన సమస్యలతో ఆస్పత్రులకు వచ్చారు. కొందరిలో మెదడువాపు లక్షణాలు కనిపించాయి. వ్యాధి లక్షణాలు వైద్యులకు అంతుపట్టకపోవంతో రోగుల నుంచి రక్తనమూనాలు సేకరించి వ్యాధినిర్ధారణ కోసం పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపారు. అక్కడ జరిపిన పరీక్షల్లో నిపా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారించారు.

నిపా వైరస్‌ లక్షణాలు..
నిపా వైరస్‌ తో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుందని, ప్రధానంగా గబ్బిలాల్లో, వాటిలో ప్రధానంగా పండ్లుతినే గబ్బిలాల్లో అంటే ఫ్రూట్‌బ్యాట్స్‌లో వైరస్‌ ఎక్కువగా ఉంటుందని, అందుకే వీటిని ఎగిరే నక్కలని అని అంటారన్నారు. ఈ వైరస్‌ బారిన పడితే వణుకుతో కూడిన జ్వరం, వాంతులు, వికారం, తలనొప్పి, ఫిట్స్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. ముఖ్యంగా గబ్బిలాలు కొరికిన పండ్లు తినడం వలన వైరస్‌ వస్తుందని, రెండోది ఈ పండ్లుతిన్న పందుల ద్వారా కూడా వస్తుందన్నారు. ప్రజలు ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణమే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్యం పొందాలన్నారు.

కేరళ టూ హైదరాబాద్ కు నిపా?!..
ఇటీవల కేరళకు వెళ్లి వచ్చిన ఓ హైదరాబాదీకి, మరో వ్యక్తికి ప్రాణాంతక నిపా వైరస్ సోకినట్టు డాక్టర్లు అనుమానిస్తున్నారు. వీరి రక్త నమూనాలను నిపా వైరస్ నిర్ధారణ కోసం పుణెలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించినట్టు తెలంగాణ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కే రమేష్‌ రెడ్డి కొద్దిసేపటి క్రితం వెల్లడించారు.

నిపా రోగులకు చికిత్సందిస్తున్న ఎన్సీడీసీ..
తాము ఇప్పటికే కేరళలో నిపా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న ఎన్సీడీసీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అధికారులతో చర్చించామని తెలిపారు. నిపా వైరస్ సోకినట్టు అనుమానిస్తున్న వ్యక్తి కేరళకు వెళ్లి వచ్చాడని, అయితే, వైరస్ ఉన్న ప్రాంతానికి ఆయన చాలా దూరంలోనే ఉన్నారని, వ్యాధి నిర్ధారణకే రక్త నమూనాలు తీసుకున్నామని, పాజిటివ్ గా తేలే అవకాశం తక్కువేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. హాస్పిటల్స్ లో డాక్టర్ల కోసం ప్రొటెక్టివ్ సూట్లను సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడితే, ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఈ వైరస్ పై అవగాహన పెంచేందుకు ఎన్జీవో సంస్థలు ప్రచారం చేయాలని సూచించారు. చెట్ల నుంచి రాలిపడిన, పక్షులు కొరికిన పండ్లను తినకుండా ఉండాలని కోరారు. కాగా, నిపా బారినపడి ఇప్పటివరకూ 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. నిపా వైరస్ హైదరాబాద్ కు వచ్చిందని సోషల్ మీడియాల్లో ప్రచారం ప్రారంభం కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


 

16:27 - May 25, 2018

బెంగళూరు : కుమారస్వామిపై యడ్యూరప్ప విసుర్లు విసిరారు. కుమారస్వామి విశ్వాస తీర్మానంపై యడ్యూరప్ప మాట్లాడారు. మా సంకీర్ణంలో కుమారస్వామి 20 నెలలు ముఖ్యమంత్రి అని అన్నారు. ఆ 20 నెలలు అన్నీ సహించుకుని కుమారస్వామికి మద్దతిచ్చానని తెలిపారు. 'కుమారస్వామితో చేతులు కలపడం నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అని అన్నారు. మేము ఆరోజు మీతో చేతులు కలవకుంటే మీరు ఎక్కడుండేవారు..? అధికార పంపకం గురించి మా ఇంట్లో అందరం మాట్లాడుకోలేదా..?  ప్రజలు ఎవరిని తిరస్కరించారు. మాకు ఓ పది సీట్లు తక్కువ వచ్చి ఉండవచ్చు.. కాంగ్రెస్ వారు 128 నుంచి 78 స్థానాలకు పడిపోయారు' అని తెలిపారు.

జనసేనాని 'దీక్ష'డిమాండ్స్ ఇవే..

శ్రీకాకుళం : ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ అల్టిమేటం జారీ చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరించాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 గంటల పాటు నిరాహారదీక్షకు దిగుతాని డిమాండ్ చేసినట్లుగా దీక్షకు దిగనున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ముందు జనసేన పలు డిమాండ్లు పెట్టింది. ఆ డిమాండ్స్ ఏవంటే..

16:04 - May 25, 2018

అటు ఫామిలీ హీరోగా ఇటు యాక్షన్ హీరోగా తెరపైన కనిపిస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకునే ఈ హీరో ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాతో రాబోతున్నాడు . విక్టరీ వెంకటేష్ వివాదాలకు దూరంగా ఉంటూ తన ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకునే నటుడు. సెట్ లో కూఆ కూల్ కూల్ గా వుంటాడు. టాలీవుడ్ లో మల్టీస్టారర్ అంటే చాల కంఫర్ట్ గ ఫీల్ అయ్యే ఈ హీరో ఇంతకు ముందు చాల మల్టి స్టార్ర్స్ చేసాడు ..

రీసెంట్ టైంలో హీరోగానే కాక సపోర్టింగ్ రోల్స్ తో అదరగొడుతున్నాడు ఈ సీనియర్ హీరో .ఈ మధ్య చాల సీరియస్ సబ్జక్ట్స్ చేస్తూ ఉన్న వెంకటేష్ సోలో హీరోగా తన ప్రీవియస్ ఫిలిం బాబు బంగారంలో కూడా తన వంతు కామెడీ ని బాగానే పండించాడు . ఆ తరువాత వచ్చిన గురు సినిమాలో సీరియస్ రోల్ తో ఆకట్టుకున్న వెంకీ ప్రీవియస్ సినిమాలు ఆల్మోస్ట్ కామెడీని టచ్ చేసినవే. వెంకీతో మల్టి స్టారర్ అంటే డైరెక్టర్స్ కూడా కంఫర్ట్ గా ఫీల్ అవుతారంట.

సెలెక్టివ్ గ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు యంగ్ హీరో నాగచైతన్య . ఒక దశలో రెగ్యులర్ సినిమాలు తీసి బోర్ కొట్టించిన ఈ హీరో ఇప్పుడు డిఫెరెంట్ సినిమాలతో హిట్ ట్రాక్ ఎక్కాడు .ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేసుకుంటే ప్రేమమ్ సినిమా తో నాగ చైతన్య కి తిరుగులేని హిట్ ఇచ్చిన డైరెక్టర్ చందు మొండేటి ఇప్పుడు సవ్య సాచి సినిమా చేస్తున్నాడు . ఆ తరువాత యుద్ధ శరణం అంటూ మల్లి ఫ్లాప్ ని అందుకున్నాడు నాగచైతన్య .

ప్రెసెంట్ మరో మల్టి స్టారర్ తో బిజీ గ ఉన్నాడు వెంకటేష్ .మల్టీస్టారర్ అనగానే మొదటగా ఒక పాత్ర కోసం వెంకటేష్ పేరు పరిశీలనలోకి వస్తుండడం గమనించాలి. రైటర్ గా డైరెక్టర్ గా జనార్ధన మహర్షికి మంచి గుర్తింపు ఉంది. దేవస్థానం.. పవిత్ర వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. రీసెంట్ గా ఈయన ఓ కథ ప్రిపేర్ చేశాడుఅట . ఇది వెంకటేష్ కు మొదటగా వినిపించగా.. ఆయనకు బాగా నచ్చేసింది. రెండో పాత్ర కోసం నాగచైతన్య అయితే బాగుంటుందని వెంకీ సజెస్ట్ చేసాడట .అంత ఒకే అయితే మరో సారి వెంకీ ని నాగచైతన్యని ఒకే స్క్రీన్ మీద చూడొచ్చు .

16:00 - May 25, 2018

చిత్తూరు : తిరుపతిలో టీటీడీ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. టీటీడీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. రమణ దీక్షితులకు వ్యతరేకంగా నినాదాలు చేశారు. టీటీడీ ప్రతిష్టను మంటకలుపుతున్నారంటూ విమర్శలు చేశారు. 

 

చంద్రబాబు చాలా అమాయకులు : బీజేపీ ఎమ్మెల్యే

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా అమాయకుడని... అందరినీ గుడ్డిగా నమ్మేస్తారని ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ, వైసీపీలు కలసిపోతాయని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొంతమంది టీడీపీ నేతలే ఆ పార్టీని వదిలి వెళ్లిపోతారని చెప్పారు. అందుకే టీడీపీలో ఉంటామని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. మార్వాడీలపై కళా వెంకట్రావు చేసిన వ్యాఖ్యలు దారుణమని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. మార్వాడీలకు కళా వెంకట్రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కుమార(బల)స్వామి నెగ్గాడు..

కర్ణాటక : ఎట్టకేలకు జేడీఎస్ అధినేత కుమారస్వామి అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకున్నారు. స్పీకర్ ఎన్నిక అనంతరం కొనసాగిన అసెంబ్లీ సమావేశం మూడు గంటలపాటు కొనసాగిన నేథ్యంలో మూజువాణి ఓటుతో కుమారస్వామి బలపరీక్షలో నెగ్గారు. కుమారస్వామికి మద్దతుగా 116మంది ఎమ్మెల్యేలు మూజువాణి ఓటులో మద్దతు తెలిపారు. బలపరీక్షకు ముందే బీజేపీ వాకౌట్ చేసింది. దీంతో బీజేపీ సభలో లేకుండానే కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకున్నారు. కాగా పలు రాజకీయ పరిణామాల మధ్య సీఎంగా ప్రమాణస్వీకారం చేసని కుమారస్వామి తన బలపరీక్షను నిరూపించుకున్నారు. దీంతో కన్నడ రాజకీయాలకు తెరపడినట్లే.

15:37 - May 25, 2018

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీలో కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోజు బీజేపీతో కలిసింది.. పదవీకాంక్షతో కాదని కుమారస్వామి అన్నారు. తమ పార్టీని పరిరక్షించుకోవడం కోసమే ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తన నిర్ణయం వల్ల తన తండ్రి దేవెగౌడను చాలా బాధించానని అన్నారు. 60 ఏళ్ల రాజకీయ జీవితంలో తనదైన సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ వచ్చారని పేర్కొన్నారు. సిద్ధరామయ్య, పరమేశ్వర, గులాం నబీ ఆజాద్ లకు కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు. అధికారం కోసం తాను వెంపర్లాడలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విచిత్రమైన సన్నివేశంలో ఉన్నానని తెలిపారు. పదవీకాంక్షతో సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు మరోపార్టీకి అవకాశమివ్వనని ప్రధాని అన్నారని.... దేశ ప్రధాని వ్యాఖ్యలను ఆయన వివేచనకే వదిలేస్తున్నానని అన్నారు. మేము సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని చెప్పారు. 

15:35 - May 25, 2018

శ్రీకాకుళం : రేపు శ్రీకాకుళం జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టనున్నారు. దీక్షకు అనుమతించాలని జనసేన పోలీసులకు కోరింది. ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వానికి పవన్ డెడ్ లైన్ విధించారు. గడువు ముగియడంతో పవన్ దీక్షకు సిద్ధమయ్యారు. 

 

కుమారస్వామిది నాగుపాము పగ : యడ్యూరప్ప

కర్ణాటక : కాంగ్రెస్‌-జేడీఎస్‌లది అపవిత్ర పొత్తని కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప అన్నారు. అసెంబ్లీలో కర్ణాటక సీఎం కుమారస్వామి బలపరీక్ష ఎదుర్కుంటోన్న నేపథ్యంలో యడ్యూరప్ప ఉద్వేగభరితంగా మాట్లాడారు. కాంగ్రెస్, జేడీఎస్ అవిత్ర కలయిను నిరోధించేందుకు మీ ఎమ్మెల్యేలతో మంతాలు జరిపానని స్పష్టంచేశారు. కుమారస్వామి పగ నాగుపాము పగలాంటిదని అటువంటి కుమారస్వామితో మీరు పొత్తు పెట్టుకున్నందుకు ప్రజలు బాధపడుతున్నారని యడ్యూరప్ప పేర్కొన్నారు. 37 సీట్లు సాధించిన జేడీఎస్‌ ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు.

నన్ను యడ్యూరప్ప అనొద్దు : యడ్యూరప్ప

కర్ణాటక : అసెంబ్లీలో యడ్యూరప్ప కమారస్వామిపై విమర్శల విసుర్లు విసురుతున్నారు. బీజేపీ, జేడీఎస్ సంకీర్ణంలో కుమారస్వామి 20 నెలలు ముఖ్యమంత్రి గా చేసేరనీ..ఆ సమయంలో అన్ని విషయాలలోను సర్ధుకుని కుమారస్వామికి మద్దతునిచ్చాననీ యడ్యూరప్ప కుమరాస్వామిపై విమర్శలు సంధిస్తున్నారు. మునిగిపోయే పడవలో కాంగ్రెస్ వారు పయనిస్తున్నారనీ..దానికి మాకేమీ అభ్యంతరం లేదన్నారు. సిద్ధరామయ్యను పొగడాల్సిన పనిలేదనీ..మీకు ప్రజల్లో మంచి అభిమానం వుందనీ..కానీ జేడీఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారనీ దానికి మీరు పశ్చాత్తాపడే రోజు వస్తుందని ఆక్రోశం వ్యక్తంచేశారు.

యడ్యూరప్పకు కష్టం కలిగించం : కుమారస్వామి

కర్ణాటక : అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతు.. రైతు రుణమాఫీకి మా ప్రభుత్వం కట్టుబడి వుందని కుమారస్వామి స్పష్టం చేశారు రైతుల రుణమాఫీ గురించి బీజేపి నుండి నేర్చుకోవాల్సిన అవసరంలేదన్నారు. దీనిపై యడ్యూరప్పగారు కష్టపడాల్సిన అవుసరం లేదని.. ఆ కష్టం యడ్యూరప్పకు తమ ప్రభుత్వం ఇవ్వబోదన్నారు. ఆయన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. 2008లో బీజేపీ అధికారంలో వున్నప్పుడు అప్పుడు రైతుల కోసం ఏం చేశారని కుమారస్వామి ప్రశ్నించారు. 

కన్నడలో బీజేపీ ఎంట్రీకి నేనే కారణం : కుమారస్వామి

కర్ణాటక : అసెంబ్లీలో సీఎం కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు... బీజేపీ కర్ణాటకలోకి అడుగు పెట్టటానికి ఆనాడు తాను కూడా ఓ కారణంగా నిలిచారని కుమారస్వామి స్పష్టం చేశారు. బీజేపీ పాలనకాలంలోనే పర్సెంటేజీ విధానం పుట్టిందని విమర్శించారు. తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిన సిద్ధరామయ్యకు, గులాంనబీ ఆజాద్ లకు కుమారస్వామి ఈ సందర్భంగా కృతజ్నతలు తెలిపారు. 

బీజేపీలోకి వెళితే ఇంటినుండి గెంటేస్తానన్నారు : కుమారస్వామి

కర్ణాటక : అసెంబ్లీలో సీఎం కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..నా తండ్రిని బాధపెట్టిన బీజేపీతో వెళ్లాననీ..అయితే అది పదవీ కాంక్షతో కాదని..మా పార్టీని పరిరక్షించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని కుమారస్వామి స్పష్టంచేశారు. ఆప్పుడు తన తండ్రి దేవగౌడ చాలా బాధపడ్డారనీ..తాను బీజేపీలోకి వెళితే ఇంటి నుండి, పార్టీ నుండి తనను బైటకు గెంటేస్తానన్నారని అంసెబ్లీలో కుమరస్వామి తెలిపారు.

14:51 - May 25, 2018

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీలో కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోజు బీజేపీతో కలిసింది.. పదవీకాంక్షతో కాదని కుమారస్వామి అన్నారు. తమ పార్టీని పరిరక్షించుకోవడం కోసమే ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తన నిర్ణయం వల్ల తన తండ్రి దేవెగౌడను చాలా బాధించానని అన్నారు. 60 ఏళ్ల రాజకీయ జీవితంలో తనదైన సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ వచ్చారని పేర్కొన్నారు. సిద్ధరామయ్య, పరమేశ్వర, గులాం నబీ ఆజాద్ లకు కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు. అధికారం కోసం తాను వెంపర్లాడలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విచిత్రమైన సన్నివేశంలో ఉన్నానని తెలిపారు. పదవీకాంక్షతో సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు మరోపార్టీకి అవకాశమివ్వనని ప్రధాని అన్నారని.... దేశ ప్రధాని వ్యాఖ్యలను ఆయన వివేచనకే వదిలేస్తున్నానని అన్నారు. మేము సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని చెప్పారు. 

 

బుద్ధగయ పేలుళ్ల కేసులో నిందితులు గుర్తింపు..

బీహార్ : రాష్ట్రంలోని బుద్దగయ క్షేత్రంలో 2013లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులను దోషులుగా పాట్నాలోని ప్రత్యేక కోర్టు ఈ రోజు ప్రకటించింది. ఈ ఐదుగురు దోషులూ ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ సభ్యులు. 2013 జూలై 7న మహాబోధి ఆలయం, పరిసర ప్రాంతాల్లో పది బాంబు పేలుళ్లు జరిగాయి. నాటి ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు బౌద్ధ సన్యాసులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం చోటు చేసుకోలేదు. దీనిపై పాట్నాలోని ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. నిందారోపణలను ఎదుర్కొంటున్న హైదర్ అలి, మరో నలుగుర్ని దోషులుగా నిర్దారించింది.

నా తండ్రి దేవెగౌడను చాలా బాధించాను : కుమారస్వామి

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీలో కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఆరోజు బీజేపీతో కలిసింది... పదవీకాంక్షతో కాదని కుమారస్వామి అన్నారు. తమ పార్టీని పరిరక్షించుకోవడం కోసమే ఆనాడు ఆ నిర్ణయం తీసుకన్నానని తెలిపారు. తన నిర్ణయం వల్ల తన తండ్రి దేవెగౌడను చాలా బాధించానని అన్నారు. 60 ఏళ్ల రాజకీయ జీవితంలో తనదైన సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ వచ్చారని పేర్కొన్నారు. సిద్ధరామయ్య, పరమేశ్వర, గులాం నబీ ఆజాద్ లకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అధికారం కోసం తాను వెంపర్లాడలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విచిత్రమైన సన్నివేశంలో ఉన్నానని తెలిపారు. 

అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన కుమారస్వామి

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీలో కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఆ రోజు బీజేపీతో కలిసినప్పుడూ పదవీకాంక్షతో కాదని కుమారస్వామి అన్నారు. 

13:29 - May 25, 2018

నల్గొండ : రైతు బంధు పథకంలో పొరపాట్లు జరిగినట్లు తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అంగీకరించారు. నల్గొండలో ఆయన టెన్ టివితో మాట్లాడారు. రైతు బంధు పథకంలో సాంకేతిక లోపం వల్లే పొరబాటు జరిగిందని, రైతులకు అన్యాయం జరగుకుండా పాస్ బుక్ లు, చెక్ ల పంపిణీ చేస్తున్నామన్నారు. పాస్ బుక్, చెక్కువల పంపిణీ వచ్చే నెల 25 నాటికి పూర్తి చేస్తామన్నారు. 

రేపే పవన్ దీక్ష!!

శ్రీకాకుళం : జనసేన అధినేత శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా దీక్షకు దిగుతున్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్వవహరిస్తోందనీ..తన డిమాండ్ అనంతరం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని ఇప్పుడు దానిపై శ్రద్ధ పెట్టటం లేదని ఆరోపిస్తు..25 తేదీ వరకూ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నుండి ఏ స్పందనా రాకపోవటంతో పవన్ దీక్షకు దిగారు. కాగా ఉద్ధానం కిడ్నీ బాధితుల విషయంలో ఆరోగ్యశాఖ మంత్రిని నియమించి తగిన చర్యలు తీసుకోవాలని లేకుండా తాను దీక్షకుదిగుతానని పవన్ ప్రకటించిన విషయం తెలిసందే.

13:22 - May 25, 2018

శ్రీకాకుళం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోరును మరింత పెంచారు. సిక్కోలులో ఆయన పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. భద్రత కల్పించడం లేదని..దీనివల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పవన్ పేర్కొంటూ యాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు. టూర్ లో భాగంగా ఉద్దానం బాధితులతో పవన్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్దానం సమస్యకు పరిష్కరించే విధంగా చూడాలని..ఆరోగ్య శాఖకు మంత్రిని కేటాయించాలని..ప్రత్యేక వైద్య బృందాలను పంపి వారిని ఆదుకోవాలని..పవన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు 48గంటల డెడ్ లైన్ కూడా విధించారు. కానీ గడువు ముగిసినా ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంతో దీక్ష చేయాలని పవన్ నిర్ణయించారు. తాను దీక్ష చేసేందుకు అనుమతినివ్వాలని సిక్కోలు పోలీసులను కోరారు. 

బంగ్లా ప్రధానికి భారత్ ప్రధాని ఘన స్వాగతం..

ఢిల్లీ : బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా రెండు రోజుల భారత పర్యటనను ఈ రోజు మొదలైంది. ప్రధాని మోదీ రెండు రోజల పాటు పశ్చిమబెంగాల్లో పర్యటించనుండగా, ఆయన ఆహ్వానం మేరకు హసీనా పశ్చిమబెంగాల్ కు విచ్చేశారు. హసీనాకు రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్వాగతం పలికారు. రెండు దేశాధినేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ, హసీనా విశ్వభారతి యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం బంగ్లాదేవ్ భవన్ ను ప్రారంభించారు. మధ్యాహ్నం విందు కార్యక్రమం కూడా ఉంటుంది. అనంతరం ఇరువురి మధ్య ద్వైపాక్షిక అంశాలపై భేటీ ఉంటుందని సమాచారం

13:14 - May 25, 2018

కర్ణాటక : ఉత్కంఠ రేపిన స్పీకర్ ఎన్నిక సమాప్తమయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ కుమార్ స్పీకర్ గా ఎన్నికయ్యారు. కాసేపటి క్రితం కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ సమావేశమైంది. స్పీకర్ పదవికి బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు రమేశ్ కుమార్, బీజేపీ అభ్యర్థి సురేష్ పోటీ చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చివరి నిమిషంలో బీజేపీ తన అభ్యర్థిని ఉపసంహరించుకుంది. స్పీకర్ గా రమేశ్ పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించారు. దీనితో స్పీకర్ గా రమేశ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రొటెం స్పీకర్ తెలిపారు. అనంతరం స్పీకర్ స్థానంలో ఆయన ఆశీసులయ్యారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి రమేశ్ కుమార్ పనిచేశారు. శ్రీనివాసపురం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు.

ప్రతిపక్షాలకు కృతజ్ఞతలు - కుమార స్వామి...
ఈ సందర్భంగా సీఎం కుమార స్వామి మాట్లాడారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావడంలో సహకరించిన ప్రతిపక్షాలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ప్రజా జీవితంలో రమేశ్ కు అపార అనుభవం ఉందని, రమేశ్ అనుభవం శాసనసభ గౌరవాన్ని మరింత పెంచుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సభ గౌరవాన్ని సంప్రదాయాన్ని పరిరక్షించడం తమ విధి అన్నారు.

సభకు సహకరిస్తాం - యడ్యూరప్ప...
ప్రతిపక్ష సభ్యులకు స్పీకర్ తగిన ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నట్లు, సభ సజావుగా జరిగేందుకు సహకరిస్తామని ప్రతిపక్ష నేత బీజేపీ సభ్యుడు యడ్యూరప్ప పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు తగిన అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నట్లు, తమ్ముడు కుమార స్వామి తనను గౌరవిస్తూ మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. గతంలో స్పీకర్ గా అనుభవం ఉన్న రమేశ్ కుమార్ మళ్లీ స్పీకర్ గా కావడం సంతోషమన్నారు.

రమేశ్ ఎన్నిక కావడం సంతోషం - సిద్ధరామయ్య..,
చిన్న వయస్సులోనే రమేశ్ అసెంబ్లీకి ఎన్నిక కావడం జరిగిందని, గతంలోనూ స్పీకర్ గా రమేశ్ చాలా బాగా పనిచేశారని..చాలా అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్ కావడం సంతోషకరమని కాంగ్రెస్ సభ్యుడు సిద్ధరామయ్య తెలిపారు. అసెంబ్లీ విధి విధానాలు, చర్చలపై పరిపూర్ణమైన అనుభవం ఉందన్నారు. 1994 వరకు స్పీకర్ గా పని చేసిన అనుభవం ఆయన సొంతమని, సభాధ్యక్షతలో ప్రజాస్వామ్యం శోభిల్లుతుందని తెలిపారు. ఐదేళ్ల పాటు అసెంబ్లీని అత్యుత్తమంగా నిర్వహించారని, న్యాయవ్యవస్థపైనా మంచి పట్టుందన్నారు.

స్పీకర్ రమేశ్ ఈ సభకే ఆదర్శప్రాయుడని డిప్యూటి సీఎం పరమేశ్వర తెలిపారు. 

25, 26 తేదీల్లో నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు..

హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి వెంక్యనాయుడు నగరంలో రెండురోజుల పర్యటన సందర్భంగా ఈనెల 25, 26 తేదీల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసుకమిషనర్‌ అంజనీకుమార్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉపరాష్ట్రపతి ప్రయాణించే దారుల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా ఆపడం లేదా మళ్లింపులు ఉంటాయని, ఆయా సమయాల్లో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు.

మాకు ఎక్కువ అవకాశాలిస్తారని ఆశ : యడ్యూరప్ప

కర్ణాటక : అసెంబ్లీ కొత్త స్పీకర్ గా రమేశ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నియ్యారు.ఈ సందర్భంగా యడ్యూరప్ప స్పీకర్ ను ఉద్ధేశించి మాట్లాడుతు..గతంలో స్పీకర్ గా మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించారనీ..మీ మీద మాకున్న గౌరవంతోనే మా అభ్యర్థిని స్పీకర్ అభ్యర్ధిగా ఉపసంహరించుకున్నామనీ బీజేపీ నేత యడ్యూరప్ప తెలిపారు. భవిష్యత్తులో జరిగే సమస్యల కోసం చర్చలకు మాకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. మీకు ప్రజాసమస్యల పట్ల చక్కటి అవగాహన వుందనీ..అటువంటి మీరు స్పీకర్ గా ఎన్నిక కావటం మాకు అనందంగా వుందనీ యడ్యూరప్ప పేర్కొన్నారు. 

స్పీకర్ కు 40ఏళ్ల అనుభవం: సిద్ధరామయ్య

కర్ణాటక : అసెంబ్లీ స్పీకర్ గా రమేశ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య స్పీకర్ రమేశ్ కుమార్ కు అభినందలను తెలిపారు. అనంతరం స్పీకర్ ను ఉద్ధేశించి 1994 వరకు స్పీకర్ గా పనిచేసిన మీకు అసెంబ్లీ విధి విధానాలు, చర్చలపై మీకు పరిపూర్ణమైన అనుభవం వుందనీ ఆ అనుభవంతోనే ఐదేళ్లపాటు అసెంబ్లీని సమర్ధవంతంగా నడిపించారని..మీ సభాధ్యక్షతలతో ప్రజాస్వామ్యం శోభిల్లుతుందనీ సిద్ధరామయ్య ప్రశంసించారు. 40ఏళ్ళ రాజకీయ అనుభవముందనీ..న్యాయవ్యవస్థపై మీకు మంచి పట్టుకూడా వుందన్నారు.

కొత్త స్పీకర్ కు కుమారస్వామి అభినందనలు..

కర్ణాటక : స్పీకర్ గా రమేశ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రమేశ్ కుమార్ ను స్పీకర్ అభ్యర్ధిగా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అయిన సిద్ధరామయ్య ప్రతిపాదించారు. అందరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో రమేశ్ కుమార్ ఎన్నికకు సహకరించిన అందరికీ సీఎం కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్పీకర్ కు అభినందనలు తెలిపారు. తరువత స్పీకర్ ను ఉద్ధేశించి మీకున్న అనుభవం మాకు మార్గదర్శకం కావాలని కుమారస్వామి కోరారు. 

తప్పుకున్న బీజేపీ..స్పీకర్ గా రమేశ్ కుమార్..

కర్ణాటక : అసెంబ్లీలో సీఎం కుమారస్వామి విశ్వాసపరీక్షలో విజయం సాధించినట్టే. విశ్వాస పరీక్షకు ముందు స్పీకర్ ఎన్నిక జరగాల్సి వుండగా, బీజేపీ వెనక్కు తగ్గింది. ఆ పార్టీ తరఫున నామినేషన్ వేసిన సురేష్ కుమార్ తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ కుమార్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కానుండటంతో, ఆపై జరిగే విశ్వాస పరీక్ష లాంఛనమే. తమ స్పీకర్ అభ్యర్థిని గెలిపించుకునేంత సంఖ్యా బలం తమ వద్ద లేదని భావించడంతోనే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

స్పీకర్ గా రమేశ్ కుమార్ ఏకగ్రీవం..

కర్ణాటక : అసెంబ్లీ స్పీకర్ గా రమేశ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ అభ్యర్ధిగా బీజేపీ నేత సురేశ్ కుమార్ ఆఖరి నిమిషంలో తప్పుకున్నారు. దీంతో స్పీకర్ స్థానాన్ని రమేశ్ కుమార్ కు దక్కటంతో స్పీకర్ పీఠాన్ని రమేశ్ కుమార్ అధిష్టించారు. కొత్త స్పీకర్ గా సీఎం కుమారస్వామి, యడ్యూరప్ప అభినందనలు తెలిపారు. కాగా స్పీకర్ గా రమేశ్ కుమార్ రెండసారి ఎన్నుకోబడ్డారు. 

12:38 - May 25, 2018

కెరీర్ ప్రారంభంలో తన నటనకు మెరుగులు దిద్దుకుంటునే అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటు హీరోస్థాయికి ఎదిగాడు శ్రీకాంత్. స్వతహాగా మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన శ్రీకాంత్ సినిమా కెరీర్ లో చిరంజీవి నోట అభినందనలను కూడా అందుకున్నాడు. హీరోగా రాణిస్తామని అన్న చిరంజీవి మాటలు నిజమయ్యాయి. హీరోగా వున్న సమయంలో లవర్ బోయ్ గా పేరొందిన శ్రీకాంత్ తన కుమారుడిని కూడా పరిశ్రమకు పరిచయం చేశారు. ఒకపక్క హీరోగా చేస్తునే మరోపక్క క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగు అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా రానున్న శ్రీకాంత్ 'ఆపరేషన్ 2019'పేరుతో వస్తున్నాడు. ఈసిమాకు ట్యాగ్ లౌన్ గా 'బివేర్ ఆఫ్ పబ్లిక్' గా పెట్టుకున్నాడు.

అలరించిననున్న డైలాగ్స్..
రాజకీయ వ్యూహాలకి సంబంధించిన సన్నివేశాలు .. తాడో పేడో తేల్చుకునే సన్నివేశాల పైనే ట్రైలర్ ను కట్ చేశారు. తన కాలు నుంచి జారిన చెప్పును ఓ పోలీస్ ఆఫీసర్ తొడగబోగా ఆయన చెంపను శ్రీకాంత్ పగలగొట్టడం ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. "గాంధీ కడుపున గాంధీ పుట్టడు .. ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు .. మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు .. ఎవరైనా ప్రజల్లో నుంచి పుట్టుకు రావలసిందే" అంటూ శ్రీకాంత్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

12:23 - May 25, 2018

తెలుగు సినిమా పరిశ్రమలో కష్టపడి పైకి వచ్చిన హీరోలలో శ్రీకాంత్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో విలన్ వేషాలు వేస్తు..క్రమేపీ హీరోగా స్థిరపడ్డారు. కొంతకాలంగా యువనటుల హవా పెరటంతో తనవయసుకు తగిన క్యారక్లరు వేస్తున అభిమానులకు, ప్రేక్షకులకు దగ్గరగానే వుంటున్నాడు. వందకు పైగా చిత్రాల్లో నటించాడు. ఎలాంటి పాత్రలోనైనా ఎంతో సహజంగా ఒదిగిపోతాడనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఖడ్గం, ఆపరేషన్ ధుర్యోధన సినిమాల్లో ఆయన పోషించిన పాత్రకు పలువురి విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇప్పుడు తాజాగా అలాంటి శ్రీకాంత్ తాజా చిత్రంగా 'ఆపరేషన్ 2019' సినిమా రూపొందుతోంది. 'బివేర్ ఆఫ్ పబ్లిక్' అనేది ట్యాగ్ లైన్. 'ఆపరేషన్ దుర్యోధన' మాదిరిగానే ఈ సినిమా కూడా పోలిటికల్ డ్రామా నేపథ్యంలో కొనసాగుతుంది. తాజాగా ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో పోలీస్ ఆఫీసర్ కు..శ్రీకాంత్ కు మధ్య మంచి రసవత్తర సీన్స్, కొన్ని డైలాగ్స్ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సినిమా పరిశ్రమ సమాచారం.

12:09 - May 25, 2018

సినిమా పరిశ్రమలో చిరంజీవి మెగాస్టార్. అలాగే పలు సేవాకార్యక్రమాలలో కూడా తన పెద్దమనస్సును చాటుకుంటుంటారు. ఎన్నో గుప్తదానాలు చేస్తుంటారని సన్నిహితులు చెబుతుంటారు. అంతేకాదు పేదల కోసం చిరంజీవి ''చిరంజీవి ఫౌండేషన్ ను స్థాపించిన మెగాస్టార్ పలు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుని విభిన్నమైన సినిమాలతో అభిమాలను మెప్పిస్తున్న చరణ్ ఇప్పుడు తండ్రి చిరంజీవి బాటలోనే అడుగులు వేయబోతున్నారు. త్వరలోనే తాను కూడా పేదలకు ఉపయోగపడే ఓ ఫౌండేషన్ ను స్థాపించనున్నట్టు చరణ్ ఇటీవల తెలిపాడు. తనకు వచ్చే పారితోషికంలో 15శాతం వరకు ఈ ట్రస్ట్ కు ఇస్తానని ప్రకటించాడు. ఈ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి సేవ చేసే అవకాశం ఉంటుందని చరణ్ తెలిపాడు.

బైటవారి నుండి ఎటువంటి ఫండ్ తీసుకోవటం లేదు : చరణ్
గత దశాబ్దకాలంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు సేవ చేస్తున్నామని... తమకు వస్తున్న పారితోషికంలో కొంత మొత్తాన్ని ఆ ట్రస్ట్ కు కేటాయిస్తున్నామని రామ్ చరణ్ చెప్పాడు. ఇప్పటి వరకు ఆ ట్రస్ట్ కు బయటవారి నుంచి ఎలాంటి ఫండ్స్ తీసుకోలేదని చరణ్ తెలిపాడు. ఈ సేవలు మరింత ఎక్కువ మందికి చేరాలనే సదుద్దేశంతోనే మరో ఫౌండేషన్ ను స్థాపించబోతున్నట్టు..ఈ ఫౌండేషన్ ను అభిమానులకు అంకితం చేస్తామని అన్నాడు. కొత్త ఫౌండేషన్ ను స్థాపించాలనే ఆలోచన తన తండ్రిదేనని చెప్పాడు. 

స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం..

చెన్నై : తమిళనాడులోని తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ మొదటి విభాగాన్ని మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్టెరిలైట్ యాజమాన్యానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసివేయాలని స్థానికులు గత 22 ఏళ్ళనుండి పోరాడుతున్నారు. కానీ ప్రభుత్వంలో మాత్రం ఏ చలనం లేకుండా పోయింది. చివరకు మంగళవారం సుమారు 20 వేల మంది తూత్తుకూడి కలెక్టరేట్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడం..ఇరు వర్గాల మధ్య తోపులాట..ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మృతి చెందగా 60 మందికి తీవ్రగాయాలయ్యాయి.

స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం..

చెన్నై : తమిళనాడులోని తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ మొదటి విభాగాన్ని మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్టెరిలైట్ యాజమాన్యానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసివేయాలని స్థానికులు గత 22 ఏళ్ళనుండి పోరాడుతున్నారు. కానీ ప్రభుత్వంలో మాత్రం ఏ చలనం లేకుండా పోయింది. చివరకు మంగళవారం సుమారు 20 వేల మంది తూత్తుకూడి కలెక్టరేట్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడం..ఇరు వర్గాల మధ్య తోపులాట..ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మృతి చెందగా 60 మందికి తీవ్రగాయాలయ్యాయి.

11:46 - May 25, 2018

ఆశయ సాధనకోసం అననుకూల ప్రరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకునే నేర్పరితనం తెగువ మహిళల సొంతం. అనుకున్నది సాధించేంతవరకూ విశ్రమించిన గుణం వారి పట్టుదలకు నిదర్శనంగా నిలస్తుంది. వీరేం చేస్తార్లే అనుకునేవారికి విజయపతాకాన్ని అందుకుని నిలువెత్తు విజయపతాకలా నిలిచి, గెలిచి చూపించే సత్తా వారికి వెన్నతో పెట్టిన విద్య. ఆడవారు వంటికే పరిమితం అయిన రోజుల నుండి సాహసాలు చేసే స్థాయికి..కంపెనీల ఆదాయాలను రికార్డుల స్థాయికి చేర్చేస్థాయికి చేరారు. ఇదంతా రాత్రికి రాత్రి వచ్చిన విజయాలు కాదు..అందులో వారి పోరాటం..పట్టుదల..సమర్ధత..చాతుర్యం ఇమిడివున్నాయి. ఈ నేపథ్యంలో భారతమహిళాశక్తిని చాటి చెప్పిన సాహస యాత్రకు నాంది పలికింది.

సెప్టెంబరు 10న గోవా నుంచి ప్రారంభమైన భారతమహిళా శక్తి సాహస యాత్ర..

సెప్టెంబరు 10న గోవాలో భారతమహిళా శక్తి సాహసయాత్రకు నాంది పలికింది. ‘నావికా సాగర్‌ పరిక్రమ’ సాహసయాత్రకు ప్రారంభించిన రక్షణశాఖా మంత్రి కూడా మహిళే కావటం మరో విశేషం. ఆరుగురు సాహస అతివలు ఈ యాత్రకు నాంది పలికారు. వారిలో ఇద్దరు తెలుగువారు కావటం మరో విశేషం. విభిన్నవాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటు వారి యాత్రను కొనసాగించారు.

ఆరుగురు మహిళా లెఫ్టినెంట్ కమాండర్ల సాహస యాత్ర..
విశాఖకు చెందిన లెఫ్ట్టినెంట్‌ కమాండర్‌ పాతర్లపల్లి స్వాతితో పాటు లెఫ్ట్టినెంట్‌ కమాండర్లు వర్తికాజోషి, ప్రతిభా జాంవాల్‌, లెఫ్ట్‌నెంట్లు ఐశ్వర్యా బొడ్డపాటి, ఎస్‌.విజయదేవి, పాయల్‌గుప్తా ‘నావికా సాగర్‌ పరిక్రమ’ సాహసయాత్రలో పాల్గొన్నారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‘నావికా సాగర్‌ పరిక్రమ’ సాహసయాత్రను ప్రారంభించారు. ఐ.ఎన్‌.ఎస్‌.వి.తరిణి తెరచాప పడవపై గోవా నుంచి 5,500నాటికల్‌ మైళ్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియాలోని ఫ్రీమాంటెల్‌ పోర్టుకి చేరుకోవాలనే లక్ష్యంతో మేం ప్రయాణం మొదలుపెట్టారు. మొత్తం ఎనిమిది నెలల పదిరోజులలో మూడు కాలాలను వారు సాహసయాత్రలో పలకరించాయి. అంటే వేసవి, శీతలం, వర్షాకాలలు వారికి స్వాగతం చెప్పాయి. ఆయా వాతావరణ పరిస్థితుల్లో ఎదురైన పెనుసవాళ్లనూ ఆ ఆరుగురు సాహసవనితలు అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఎటువంటి పరిస్థితులకు భయపడకుండా తమ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించారు. ఈ ప్రయాణంలో ఎదురయ్యే కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు వారు ముందుగానే సిద్ధపడ్డారు. దానికి అనుగుణంగానే వారు తగిన శిక్షణ తీసుకున్నారు. గోవా నుంచి 5,500నాటికల్‌ మైళ్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియాలోని ఫ్రీమాంటెల్‌ పోర్టుకు వెళ్లడానికి అరేబియా సముద్రం, హిందూ మహా సముద్రాల మీదుగా ప్రయాణించారు. మొదట ఫ్రీమాంటెల్‌ చేరుకుని ఆపై న్యూజిల్యాండ్‌లోని లిటిల్‌టన్‌, ఫాక్‌ల్యాండ్స్‌లోని పోర్ట్‌ స్టాన్లీ, దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌, మారిషస్‌ పోర్టుల్లో ఆగి..అనతరం భూమధ్యరేఖను రెండుసార్లు దాటారు.

ఫాక్‌ల్యాండ్‌ దీవిచేరే క్రమంలో చుట్టుముట్టిన మంచు తుఫాలు..
25 రోజులపాటు 3,600 నాటికల్‌ మైళ్లు ప్రయాణించి న్యూజిల్యాండ్‌లోని లిటిల్‌టన్‌కు చేరుకున్న అనతరం ఆరువేల నాటికల్‌ మైళ్ల దూరంలో ఉన్న ఫాక్‌ల్యాండ్‌ దీవి చేరుకునే సమయంలో పలు మాత్రం సవాళ్లను ఎదుర్కొన్నారు. ఫాక్‌ల్యాండ్‌ దీవి చేరుకోవడానికి దక్షిణ పసిఫిక్‌, దక్షిణ అట్లాంటిక్‌ మహాసముద్రాల మీదుగా ప్రయాణించాల్సి వుంది. అక్కడ చలి తీవ్రత పెరిగింది. మంచు తుపానులు చుట్టుముట్టాయి. ఒక్కో తుఫాను రెండురోజుల పాటుకొనసాగేది. ఎముకలు గడ్డకట్టే చలిలో తమను తాము రక్షించుకోవడమే కాదు పడవనీ సురక్షితంగా కాపాడుకోవాలి. తెరచాపను ఒడుపుగా తిప్పుతూ ఉండాలి. కొన్నిసార్లు వాటి తాళ్లూ తెగిపోయే సందర్భాలు. కానీ చేయితిరిగినపనివారిలాగా సమర్థవంతగా ఎదుర్కొనేవారు. ఆ వాతావరణానికి జనరేటర్‌ పాడైపోయింది... మంచు తుఫానులయ్యాక భారీ వర్షాలు భయపెట్టాయి. రోజంతా వర్షం ఆగకుండా కురవంటం సముద్రం అల్లకల్లోలంగా మారి పడవ బొల్తా పడిపోతుందేమోననని పరిస్థితికి చేరుకున్నా అన్నింటికి సిద్ధపడిన సందర్భంలో కూడా వారి ఆత్మవిశ్వాసం అదరక బెదరకు నిలబడ్డారు. ఇక ముందుకు వెళ్లడం కష్టం అనుకున్న తరుణంలో అధైర్యాన్ని దరిచేరనీయకుండా ముందుకే కొనసాగారు. మరోసారి జనరేటర్‌ పాడైపోయింది. దీంతో ప్రత్యామ్నాయంగా ఉంచుకున్న సౌర విద్యుత్తుపై ఆధారపడ్డారు. అలా ఎన్నో ఆటంకాల తరువాత చివరకు ఫాక్‌ల్యాండ్‌ దీవికి చేరుకోగలిగారు.

కేప్‌టౌన్‌పోర్టుకి చేరుకున్న సాహసవనితలు..
ఫాక్‌ల్యాండ్‌ దీవి నుండి మరో ఇరవై ఎనిమిది రోజుల తరువాత కేప్‌టౌన్‌పోర్టుకి చేరుకున్నారు. మధ్యలో మారిషస్‌ దగ్గరకు వచ్చేసరికి పడవ స్టీరింగ్‌ విరిగిపోయింది. వాస్తవానికి ఈనెల 19వ తేదీకే గోవా చేరుకోవాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో రెండు రోజులు ఆలస్యంగా కేప్ టౌన్ పోర్టుకు చేరుకున్నారు. గాలి తీవ్రతకు అనుగుణంగా పలుసార్లు వేరే దిక్కులకు వెళ్లిపోయి తిరిగి వారి మార్గంలోకి వచ్చేవారు. ఈ క్రమంలో అనారోగ్యాలూ ఎదుర్కొన్నారు. పోర్టుకి చేరుకున్న అనంతరం వైద్య పరీక్షలు చేయించుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారు. అలా ప్రపంచదేశాలకు భారతశక్తి చాటి చెప్పారు ఈ సాహసవనితలు పాతర్లపల్లి స్వాతితో పాటు లెఫ్ట్టినెంట్‌ కమాండర్లు వర్తికాజోషి, ప్రతిభా జాంవాల్‌, లెఫ్ట్‌నెంట్లు ఐశ్వర్యా బొడ్డపాటి, ఎస్‌.విజయదేవి, పాయల్‌గుప్తా లు. మరి వారికి భారతనారీ లోకం నుండే కాదు యావద్భారతావని నుండి సాహస సెల్యూట్ ను చేస్తున్నాం. అననుకూల పరిస్థితులను,అననుకూల కాలాలను, వాతావారణాలను, విపత్కర పరిస్థితులను సాహసంగా అధిగమించి కన్నవారిని, కట్టుకున్నవారిని, కుటుంబాలను వదలి నెలలపాటు సాగరంలో సాగర కన్యల్లా..అత్యంత సాహసాలు చేసిన ఈ వీరవనితలకు రెడ్ సెల్యూట్..

11:27 - May 25, 2018

బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార స్వామి అసలు సిసలైన పరీక్ష ఎదుర్కోబోతున్నారు. బలపరీక్షతో పాటు స్పీకర్, డిప్యూటి స్పీకర్ ఎన్నిక జరుగనుంది. తాము కూడా ఇందులో గెలుస్తామని కాంగ్రెస్ - జేడీఎస్ పేర్కొంటుండగా బీజేపీ పోటీలో నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగినా కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలు హోటల్స్ లోనే బస చేశారు. శుక్రవారం ఉదయం హోటల్స్ లో బస చేసిన జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బస్సులో బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు, డిప్యూటి సీఎం పదవిపై ఆశ పెట్టుకుని నిరాశ పడిన వారు తమకు మద్దతు తెలియచేస్తారని బీజేపీ ధీమాతో ఉంది. బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ విఫలం కానుందని జేడీఎస్ పేర్కొంటోంది. మరి ఎవరు విఫలం కానున్నారనేది కొద్ది గంటల్లో తెలియనుంది. 

టీటీడీ ఉద్యోగుల 'నల్ల బ్యాడ్జీ'నిరసనలు..

తిరుమల : టీటీడీలో ప్రధానార్చకుడిగా రమణ దీక్షితులు తీరుకు నిరసనగా టీటీడీ ఉద్యోగులు నేడు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారు. అయితే, భక్తుల నుంచి వచ్చిన విమర్శలతో ఈ నిరసనలు తిరుపతికి మాత్రమే పరిమితం అయ్యాయి. తిరుపతిలోని వివిధ టీటీడీ అనుబంధ సంస్థలు, కార్యాలయాల్లో పనిచేస్తున్న వారు మాత్రమే నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. కాగా అందరూ గంటసేపు విధులను బహిష్కరించి నిరసనలు తెలపాలని కూడా వారు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 

ప్రధాన అర్చక పదవికోసం పోటా పోటీ..

తిరుమల : టీటీడీలో ప్రధానార్చకుడిగా రమణ దీక్షితులును తొలగించిన తరువాత ఏర్పడిన వివాదం ఇంకా సద్దుమణగనేలేదు. స్వామివారికి ప్రధానార్చకులుగా తమనే నియమించాలని గొల్లపల్లి, తిరుపతమ్మ వంశీయులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానార్చక హోదా కోసం ఈఓ అనిల్ కుమార్ గొల్లపల్లి, తిరుపతమ్మ వంశీయులు సింఘాలకు లేఖలు పంపారు. కాగా అర్చకుల లేఖలపై టీటీడీ అధికారుల నుండి ఎటువంటి స్పందనా లేదు. దీంతో ప్రధానార్చక పదవి ఎవరికి దక్కనుందో అనేఅంశంపై ఉత్కంఠ నెలకొంది. 

కాసేపట్లో అంతరాష్ట్ర మండలి సమావేశం..

ఢిల్లీ : మరికాసేపట్లో హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అంతరాష్ట్ర మండలి సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఏపీ తరపున మంత్రి యనమల రామకృష్ణుడు హాజరుకానున్నారు. పూంచీ కమిషన్ లో 6,7 వాల్యూమ్ లో విషయాలను ఏపీకి అనుకూలంగా చేయలని యనమల కోరనున్నారు. 

11:11 - May 25, 2018

ఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ అధ్యక్షతన అంతరాష్ట్ర మండలి సమావేశం జరుగనుంది. విజ్ఞాన్ భవన్ లో ఈ సమావేశం జరుగనుంది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు హాజరువుతున్నారు. ఏపీ నుండి సీఎం చంద్రబాబు నాయుడు తరపున రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల హాజరౌతున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను సమావేశ దృష్టికి తేనున్నారు. నదీ జలాల పంపకం, కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాల నివేదిక, పూంఛి కమిషన్‌ సిఫార్సులను అమలుచేయాలని కోరనున్నారు. పూంచీ కమిషన్ లో 6, 7 వాల్యూమ్ లోని విషయాలను ఏపీకి అనుకూలంగా చేయాలని కోరనున్నారు. పర్యావరణానికి సంబంధించిన అంశాలు, పరిపాలనకు సంబంధించిన దానిపై చర్చించనున్నారు. 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడంపై తెలుగు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పన్నుల్లో రాష్ట్రాల వాటాపై కూడా చర్చించే అవకాశం ఉంది. 

క్రికెటర్ తండ్రి దారుణ హత్య..క్రికెటర్ పర్యటన రద్దు..

శ్రీలంక : క్రికెటర్‌ ధనుంజయ డిసిల్వా తండ్రి రంజన్‌ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి గురువారం అర్ధరాత్రి రంజన్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రంజన్‌ ప్రాణాలు కోల్పోయారు. దీంతో శుక్రవారం ఉదయం వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లాల్సిన లంక జట్టు నుంచి ధనుంజయ తప్పుకున్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం శ్రీలంక జట్టు వెస్టిండీస్‌కు బయల్దేరాల్సి ఉంది. స్థానిక రాజకీయవేత్త అయిన రంజన్‌పై కొలంబో శివారు ప్రాంతంలోని రత్మలానా వద్ద దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో రంజన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

కెనాడాలో పేలుడు..20మందికి గాయాలు..

ఢిల్లీ : కెనడాలోని టొరంటోలో పేలుడు సంభవించింది. దీంతో రెస్టారెంట్‌లో ఉన్నవారంతా భయాందోళనలతో కకావికలమై, చెల్లా చెదురుగా పరుగులు తీశారు.ఈ ఘటనలో 20మందికి గాయాలయ్యాయి. టొరంటోలోని భారతీయ రెస్టారెంట్‌ బోంబే భెల్‌లో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. కాగా గాయపడినవారిలో వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

షార్ కేంద్రంలో ఇళ్లను నిప్పంటించిన అగంతకుడు..

నెల్లూరు : శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ఓ కాలనీలోకి ఓ అగంతకుడు ప్రవేశించాడు. అంతేకాదు. కొన్ని ఇళ్ళకు నిప్పంటించాడు. డిఆర్డియల్ కాలనీలోని నాగులు ఇళ్లకు నిప్పంటించిన ఓ దుండగుడు నగదును ఎత్తుకెళ్లాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. సీపీ పుటేజ్ ద్వారా ఆగంతకుడి ఆచూకీని కనిపెట్టేందుకు షార్ సెక్యూరీటీ, అధికారులు యత్నిస్తున్నారు. కాగా ఆ అగంతకుడు కేవలం దొంగతనానికే వచ్చాడా? లేదా మరేదన్నా కారణమందా? అనే విషయంపై విచారణ అనంతరం విషయాలు తెలియాల్సివుంది. 

శవానికి వైద్యం చేస్తు..ఠాగూర్ సినిమాను తలపించిన వైద్యులు..

కర్నూలు : సూపర్ హిట్ అయిన చిరంజీవి ఠాగూర్ సినిమాను ఓ ప్రయివేటు ఆసుపత్రులు వాస్తవ జీవితంలో కళ్ళకు కట్టినట్లుగా చూపించాయి. శవానికి వైద్యం చేస్తున్నట్లుగా నాటకమాడి రోగి బంధువుల వద్ద డబ్బులు గుంజేయందుకు నాటకాలాడారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. మైక్యూర్, ఆపిల్ ఆసుపత్రుల నిర్లక్ష్యానికి రోగి కర్రి బసవయ్య మృతి చెందాడు. కానీ అతను బతికే వున్నట్లుగా రోగి బంధువులను నమ్మించి వైద్యం చేస్తున్నట్లుగా నాటకమాడారు. విషయం బైటపడటంతో బంధువులు మైక్యూర్, ఆపిల్ ఆసుపత్రుతలపై పోలీసులను ఫిర్యాదు చేసారు. 

10:29 - May 25, 2018

కర్నూలు : 'ఠాగూర్' సినిమా గుర్తుందా ? గుర్తుండే ఉంటుంది. అందులో కొంతమంది డాక్టర్లు డబ్బు కోసం శవానికి వైద్యం చేస్తారు. కేవలం సినిమాల్లోనే అలా చేస్తారనుకుంటే పొరపాటే. అచ్చం అలాంటి సంఘటనే ఒక హాస్పిటల్ లో జరిగింది. కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రెండు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యుల కారణంగా తండ్రి కర్రి బసయ్య చనిపోయాడని కూతుళ్లు..కుమారులు పేర్కొంటున్నారు. శవానికి గంట సేపు వైద్యం చేశారని, మృతి చెందినా వైద్యం చేస్తున్నట్లు వైద్యులు డ్రామా నడిపారని పేర్కొన్నారు. మైక్యూర్ ఆసుపత్రి ఎదుట అర్ధరాత్రి వరకు నిరసన వ్యక్తం చేశారు. మైక్యూరు, ఆపిల్ ఆసుపత్రులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

కన్నడలో కొనసాగుతున్న ఎమ్మెల్యేల బేరసారాలు..

కర్ణాటక : ఇక కన్నడనాట క్యాంపు రాజకీయాలు ఇంకా సాగుతున్నాయి. కుమారస్వామి బలపరీక్ష ముగిసేంత వరకూ బీజేపీ బేరసారాలు కొనసాగుతూనే ఉంటాయని భావిస్తున్న కుమారస్వామి, సిద్ధరామయ్యలు, తమ ఎమ్మెల్యేలు అందర్నీ ఇంకా హోటళ్లలోనే ఉంచారు. వీరంతా ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి రానుండగా, ఆపై తొలుత స్పీకర్ ఎన్నిక, ఆపై విశ్వాస పరీక్ష జరుగుతుంది. కాగా, ఉప ముఖ్యమంత్రి పదవి దక్కలేదని లింగాయత్ లు, మంత్రి పదవులను ఖరారు చేయలేదని పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉండటం, కూటమిలో ఆందోళనను పెంచుతోంది.

నేడే కుమారస్వామి బల(అగ్ని)పరీక్ష..

కర్ణాటక : నేడు జేడీఎస్ అధినేత, రెండు రోజుల క్రితం కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి, అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనున్నారు. కమారస్వామి బలపరీక్ష నెగ్గటానికి 111 మ్యాజిక్ ఫిగర్ కావాల్సివుంది. కాంగ్రెస్, జేడీఎస్ లకు మొత్తం 115 మంది ఎమ్మెల్యేల బలం వుండగా..బీఎస్పీ కుమారస్వామికే తన మద్దతును ప్రకటించింది. మరో ఇద్దరు ఇండిపెంటెంట్ ల మద్దతు కూడా తమకే వుందని కుమారస్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకీ ప్రభుత్వానికి 104 ఎమ్మెల్యేల బలం వుండగా..కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుండి అసలు సిసలైన సవాల్ ఎదురుకానుంది.

కన్నడ స్పీకర్ పీఠం ఎవరికో..

కర్ణాటక : నేడు జేడీఎస్ అధినేత, రెండు రోజుల క్రితం కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి, అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనున్నారు. అసెంబ్లీ సమావేశం కాగానే, స్పీకర్ ఎన్నిక సాగనుండగా, తమ తరఫున స్పీకర్ పదవికి పోటీగా   ఓ అభ్యర్థిని రంగంలో నిలుపుతామని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున నిలబడే స్పీకర్ అభ్యర్థి గెలుపు అంత సులభమేమీ కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో స్పీకర్ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. మరోపక్క స్పీకర్ పోస్టుపై కాంగ్రెస్, జేడీఎస్ లు ధీమా వ్యక్తంచేస్తున్నాయి. 

10:15 - May 25, 2018

బెంగళూరు : కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన కుమార స్వామి నేడు పరీక్షను ఎదుర్కోబోతున్నారు. అసెంబ్లీలో ఆయన బలపరీక్షకు సిద్ధమౌతున్నారు. బలపరీక్ష ముగిసేంత వరకు ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు కాంగ్రెస్ - జేడీఎస్ ప్రయత్నాలు..వారిని ఆకర్షించేందుకు ఇంకా బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. 224 స్థానాల్లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగలేదనే సంగతి తెలిసిందే. 222 మంది సభ్యులున్న శాసనసభలో విశ్వాస పరీక్షలో గట్టెక్కాలంటే స్పీకర్ మినహా 111 మంది మద్దతుండాలి. బీజేపీకి 104 మంది సభ్యుల బలం ఉంది. మెజార్టీకి కేవలం ఏడుగురు సభ్యుల దూరం మాత్రమే ఉండడంతో జేడీఎస్ - కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

అసెంబ్లీ సమావేశం కాగానే స్పీకర్ ఎన్నిక జరుగనుంది. ఈ పదవి దక్కించుకోవడం బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతోంది. కాంగ్రెస్ తరపున శ్రీనివాసపురం విధానసభ సభ్యుడు కె.ఆర్.రమేశ్ కుమార్, బీజేపీ తరపున రాజాజీనగర సభ్యుడు ఎస్.సురేశ్ కుమార్ గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. సభాపతి ఎన్నికల్లో రమేశ్ కుమార్, విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి కుమార స్వామికి ఓట్లు వేయాలని జేడీఎస్, కాంగ్రెస్ పక్షాలు ఆయా సభ్యులకు విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

సభలో బలబలాలు...

మొత్తం స్థానాలు  224
ఎన్నికలు జరిగిన స్థానాలు  222
కాంగ్రెస్ 78
జేడీఎస్  36
స్వతంత్ర  1
బీఎస్పీ  1
కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ 1
బీజేపీ  104
ప్రభుత్వ స్థాపనకు కావాల్సిన స్థానాలు 113
కాంగ్రెస్ జేడీఎస్ ఇతరుల  117

ఖమ్మం కార్పొరేటర్లు రాజీనామా ?

ఖమ్మం : జిల్లా కార్పొరేషన్ లోని 36 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కాంట్రాక్టులు ఇవ్వకపోతే తాము రాజీనామా చేస్తామని కార్పొరేటర్లు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ను కలవాలని కార్పొరేటర్లు యోచిస్తున్నారు. మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే పువ్వాడకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. డివిజన్ లో కాంట్రాక్టు పనులు అప్పగించడం లేదని కినుక వ్యవహరిస్తున్నారు.

09:07 - May 25, 2018

ఖమ్మం : వారంతా ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారు. ప్రజా సమస్యలు పరిష్కరించి..నియోజకవర్గాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాల్సిన నాయకులు కాంట్రాక్ట్ ల కోసం పరితపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కాంట్రాక్టులు ఇవ్వకపోతే తాము రాజీనామా చేస్తామని కార్పొరేటర్లు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం కార్పొరేషన్ ఏర్పడిన అనంతరం జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి 36 మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. కాంట్రాక్టు పనులు ఇప్పించాలని వీరు పట్టుబడుతున్నట్లు, మేయరును మార్చాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలతో పాటు ఇతర విషయాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ను కలవాలని కార్పొరేటర్లు యోచిస్తున్నారు.

మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే పువ్వాడకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. డివిజన్ లో కాంట్రాక్టు పనులు అప్పగించడం లేదని కినుక వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

09:01 - May 25, 2018

తమిళనాడు : తూత్తుకుడిలో నిరసనపై తూట..పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి...దేశ వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దీనిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందులో భాగంగా శుక్రవారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. దీనితో ఉదయం నుండే బంద్ ప్రభావం కనిపిస్తోంది. స్టెరిలైట్‌ యూనిట్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన అనంతరం ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు స్టెరిలైట్‌ కర్మాగారానికి విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు.

మరోవైపు కాల్పులపై డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌తో చర్చించేందుకు సీఎం పళనిస్వామి నిరాకరించడంతో డీఎంకే, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సచివాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. సీఎం పళనీ స్వామి రాజీనామా చేయాలని, డీజీపీని పదవి నుండి తొలగించాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది. 

06:54 - May 25, 2018

ఢిల్లీ : ఐపీఎల్‌లో ఆసక్తికర సమరానికి తెరలేచింది. రెండు సార్లు చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌, 2016 విజేత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ శుక్రవారం ఈడెన్‌ గార్డెన్స్‌లో తలపడబోతున్నాయి. సాయంత్రం 7గంటలకు ప్రారంభం కానున్న రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు రెండు జట్లు సిద్ధమయ్యాయి. గత నాలుగు మ్యాచ్‌ల్లో విజేతగా నిలిచిన రైడర్స్‌ అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్నారు. వరుస విజయాలతో ఆ జట్టు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. మరోవైపు లీగ్‌ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన సన్‌రైజర్స్‌.. చివరి దశలో అనూహ్యంగా డీలా పడింది. హైదరాబాద్‌తో పోలిస్తే కోల్‌కతానే ఇవాళ్టి మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. మిడిలార్డర్‌ వైఫల్యంతో సన్‌రైజర్స్‌ గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. ప్రయోగాలు కూడా ఆ జట్టును దెబ్బతీశాయి. క్వాలిఫయర్‌-1లో చెన్నైపై గెలిచినంత పని చేసినా.. చివరికి ఓటమితో సరిపెట్టుకుంది. ఫైనల్‌ చేరేందుకు ఇదే చివరి అవకాశమవడంతో గత మ్యాచ్‌ల్లో బయటపడ్డ బలహీనతలను అధిగమించడానికి కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఏం చేస్తాడన్నది అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తోంది. బౌలింగ్‌కు అనుకూలించే ఈడెన్‌ గార్డెన్స్‌లో భువనేశ్వర్‌, సిద్దార్థ్‌ కౌల్‌, సందీప్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌ల బౌలింగ్‌దళం కీలకం కానుంది. గత మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌటైన శిఖర్‌ధవన్‌ ఈ మ్యాచ్‌లో అయినా పుంజుకోవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. దాంతోపాటు మిడిలార్డర్‌లో మనీష్‌ పాం డే, యూసుఫ్‌ పఠాన్‌ రాణిస్తే హైదరాబాద్‌ రైజింగ్‌ గ్యారెంటీ అంటున్నారు ఫ్యాన్స్‌.. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఈ నెల 27న ముంబైలోని వాంఖడేలో జరిగే తుదిపోరులో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఢీకొంటుంది. 

06:52 - May 25, 2018

ఢిల్లీ : ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఉత్తర కొరియా ముందడుగు వేసింది. అంతర్జాతీయ జర్నలిస్టుల సమక్షంలో పంగీరీ సైట్‌ వద్ద అణు పరీక్ష కేంద్రాన్ని పేల్చేసింది. సుమారు 500 మీటర్ల దూరం నుంచి న్యూక్లియర్‌ సైట్‌ పేల్చివేతను వీక్షించినట్లు విదేశీ జర్నలిస్టులు తెలిపారు. ఉత్తర కొరియా కొన్ని రోజుల క్రితం న్యూక్లియర్‌ టెస్ట్‌ సైట్‌లను ధ్వంసం చేస్తానని విదేశీ మీడియా ముందు పేర్కొన్న విషయం తెలిసిందే. వచ్చే నెల ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో చారిత్రక సమావేశం జరపనున్నారు. ఈ భేటికి ముందు ఉత్తర కొరియా అణు పరీక్షలను నిర్వహించే టన్నల్స్‌ను ధ్వంసం చేయడంతో అమెరికాతో దౌత్యపరమైన సంబంధాలకు లైన్‌ క్లియర్‌ అయినట్లేనని భావిస్తున్నారు. 2017లో జరిగిన అణుపరీక్ష సమయంలో ఈ సైట్‌ పనికి రాకుండా పోయిందని...అందుకే దీన్ని ధ్వంసం చేసినట్లు కొందరు సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.

06:51 - May 25, 2018

ఢిల్లీ : ప్రపంచంలోని ప్రజాదరణ పొందిన కట్టడాల్లో తాజ్‌ మహల్‌ ఆరవస్థానం పొందింది. ఆగ్రాలోని ఈ చారిత్రాత్మక కట్టడం ఆసియాలో రెండోస్థానంలో నిలిచింది. మొగలుల శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచిన తాజ్‌మహల్‌ యాత్రపై ట్రిప్‌ అడ్వయిజరీ సంస్థ ఆన్‌లైన్‌లో సలహాలు ఇస్తోంది. ట్రావెలర్స్‌ ఛాయిస్‌ అవార్డ్‌ 2018కి గాను ఈ సంస్థ ఎంపికైంది. అద్భుత పాలరాతి కట్టడాన్ని వర్ణిస్తూ గత 12 నెలల్లో ప్రజలు ఈ కంపెనీ సైట్‌లో ఎన్నో సమీక్షలు, మరెన్నో లేఖలు రాయడం ద్వారా రేటింగ్‌ ఇచ్చారు. ఈ రేటింగ్‌ ఆధారంగా తాజ్‌మహల్‌కు ఈ సంవత్సరం సూచిలో చోటు దక్కింది. ఈ పురస్కారం కోసం 68 దేశాల నుంచి 759 స్మారక చిహ్నాలు వచ్చాయి. వీటిలో 10 స్మారక చిహ్నాలను ఎంపిక చేయగా....అందులో కంబోడియాకు చెందిన అంకోర్‌వాట్‌ మందిరం ప్రథమ స్థానంలో నిలిచింది. జయపూర్‌కు చెందిన ఆమెర్‌ కోట, అమృత్‌సర్‌లోని స్వర్ణ మందిరానికి కూడా చోటు దక్కింది. 

06:50 - May 25, 2018

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ తాను ఎంతగానో ఇష్టపడే నటుడని తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్టీఆర్‌పై అభిమానంతోనే తన తండ్రి కేసీఆర్‌ తనకు తారక రామారావు అని పేరు పెట్టారని తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రిలో క్యాన్సర్‌ యూనిట్‌ను నటుడు బాలకృష్ణతో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. క్యాన్సర్‌ను అవగాహనతోనే నిర్మూలించవచ్చని.. ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. తారకరామారావు పేరును నిలబెట్టేలా పని చేస్తానని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ తన కొడుకుకి ఎన్టీఆర్ పేరు పెట్టడం సంతోషకరమని బాలకృష్ణ అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో క్యాన్సర్‌కు చికిత్స అందిస్తున్నామని బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో బసవతారకం హాస్పిటల్‌ గురించి ఉంటుందని బాలకృష్ణ చెప్పారు.

06:48 - May 25, 2018

హైదరాబాద్ : సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులతో అమాయకులపై దాడులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో దొంగగా భావించి ముగ్గురిని చితకబాదారు గ్రామస్థులు. అటు గుంటూరు జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని మహిళపై యువకుల దాడి చేశారు. పిల్లలను అపహరించే ముఠాగా భావించి దాడికి పాల్పడ్డారు. మరోవైపు చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని అమాయకులపై దాడులకు దిగితే చర్యలు తప్పవని ఇరు రాష్ట్రాల పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంతో ప్రజలు ఇంకా భయభ్రాంతులకు గురవుతూనే ఉన్నారు. పోలీసులు భరోసా ఇచ్చినా ఇంకా రాత్రిళ్లు జాగారం చేస్తూ.. అనుమానం వచ్చిన వ్యక్తులపై దాడులకు దిగుతున్నారు. అయితే ఈ దాడులల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని తట్టి కోర్టు ఏరియాలో బాలరాజు అనే మూగ వ్యక్తిపై గ్రామస్థులు దాడి చేశారు. దొంగగా భావించి స్తంభానికి కట్టేసి చితకబాదారు. దీంతో బాలరాజు పరిస్థితి విషమంగా మారింది. ఎడపల్లి మండలం బాపు నగర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దొంగలుగా భావించి ఇద్దరు వ్యక్తులను కాలనీ వాసులు చితకబాదారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జియపల్లిలో బాలకృష్ణ అనే వ్యక్తిపై గ్రామస్థులు దాడి చేసి చంపారు. ఘట్కేసర్‌ మండలం కొర్రెములకు చెందిన బాలకృష్ణ జియపల్లిలోని బంధువుల ఇంటికి వెళుతుండగా దొంగ అనే నెపంతో అతనిపై దాడి చేశారు. దీంతో బాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. దాడికి పాల్పడిన ఎనిమిది మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇలాంటి ఘటనలు అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని మహిళపై యువకుల దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీన్స్‌ ప్యాంట్‌ ధరించి ఉన్న మహిళను... పిల్లలను అపహరించే ముఠాగా భావించి యువకులు దాడికి దిగారు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించటంతో వైద్యులు గుంటూరు ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితురాలికి మతిస్థిమితం సరిగా లేనట్టు వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఇలాంటి సంఘటనలు జరగడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజల్లో అవగాహన కల్పించి.. దాడుల జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఘటనలపై పోలీస్‌శాఖ స్పందించింది. ఎలాంటి గ్యాంగ్‌లు రాష్ట్రంలోకి రాలేదని, అనవసరంగా అమాయకులపై దాడులకు పాల్పడితే తీవ్రమైన చర్యలు ఉంటాయని ఇరు రాష్ట్రాల పోలీసులు హెచ్చరించారు. అయితే అధికారులు, పోలీసులు ఎంత ప్రచారం కల్పించినా ప్రజల్లో మాత్రం భయం పోవట్లేదు. 

06:44 - May 25, 2018

సంగారెడ్డి : అందోల్‌ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు చేదు అనుభవం ఎదురైంది. సంగారెడ్డి జిల్లాలోని అందోల్‌లో సబ్‌స్టేషన్‌కు భూమిపూజ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేను కాంగ్రెస్‌ కార్యకర్తలు, స్థానికులు అడ్డుకున్నారు. గతంలో ఓ సంఘానికి కేటాయించిన స్థలంలో సబ్‌స్టేషన్‌ ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు.

06:42 - May 25, 2018

హైదరాబాద్ : రైతు బంధు పథకంతో నిజమైన సన్న, చిన్నకారు రైతుల కంటే భూస్వాములకే ఎక్కువ మేలు జరుగుతుందన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్‌ అమలు చేయాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. 

06:40 - May 25, 2018

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని టాలీవుడ్‌ హీరో రామ్‌ చరణ్‌ ప్రకటించారు. 'ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే ప్రచారం చేద్దామనుకున్నానని.. కానీ అప్పుడు బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ ఒప్పుకోలేదన్నారు చెర్రీ. బాబాయ్‌ చాలా కష్టపడుతున్నారని.. అనుమతిస్తే జనసేన తరపున ప్రచారం చేస్తానని చరణ్‌ ఓ కార్యక్రమంలో ప్రకటించారు. చెర్రీ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. చెర్రీ తాజా వ్యాఖ్యలపై పవన్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

06:35 - May 25, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జోనల్‌ వ్యవస్థ అమలు కానుంది. 31 జిల్లాలను 7 జోన్లు, 2 మల్టీజోన్లుగా ఏర్పాటు చేసేందుకు కేసీఆర్‌ ఆమోదముద్ర వేశారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయాల సేకరణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. జోనల్‌ వ్యవస్థను ఫైనల్‌ చేసేందుకు శుక్రవారం ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమై.. వారి అభిప్రాయాలు సీఎస్‌కు నివేదించనున్నారు. అనంతరం కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి.. అనుమతి కోసం రాష్ట్రపతికి పంపించనున్నారు.

తెలంగాణలో కొత్త జోనల్‌ విధానాన్ని సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. రాష్ట్ర ఆవిర్భావంతో పాటు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో జోనల్‌ వ్యవస్థను పూర్తిస్థాయిలో పునర్విభజించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్రంలో 31 జిల్లాలను 7 జోన్లు, రెండు మల్టీ జోన్లుగా ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విదంగా.. గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా ఈ జోనల్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు కేసీఆర్‌ తెలిపారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నందున ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

జోనల్‌ వ్యవస్థపై గతంలోనే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌కమిటీతో పాటు.. ఐఏఎస్‌ అధికారుల కమిటీ కూడా దీనిపై కసరత్తు చేసింది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమావేశంలోనూ జోనల్‌ విధానంపై చర్చించారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. వీటన్నింటి ఆధారంగా.. జోనల్‌ వ్యవస్థపై సమీక్షించిన నిర్వహించిన కేసీఆర్‌ కొత్త జోన్లు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. వీటిలో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్‌, జోగులాంబ జోన్లు ఉన్నాయి. 28.29 లక్షల జనాభాకు కాళేశ్వరం జోన్‌ ఏర్పాటు చేయనున్నారు.

వీటిలో భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి జిల్లాలు రానున్నాయి. అలాగే 39.74 లక్షల జనాభా ఉన్న ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలను బాసర జోన్‌గా ఏర్పాటు చేయనున్నారు. ఇక కరీంనగర్‌, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్‌ జిల్లాలను రాజన్న జోన్‌గా ఏర్పాటు చేయనున్నారు. అలాగే కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ , వరంగల్‌ రూరల్‌, అర్బన్‌లను కలుపుతూ భద్రాద్రి జోన్‌గా ఏర్పాటు చేయనున్నారు. ఇక సూర్యపేట, నల్గొండ, భువనగిరి, జనగామలతో యాదాద్రి జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలను కలుపుతూ చార్మినార్‌ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇక మహబూబ్‌నగర్‌, వనపర్లి, గద్వాల, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌ జిల్లాలతో జోగులాంబ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇవి కాకుండా... కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రిలతో ఒక మల్టీజోన్‌,... యాదాద్రి, చార్మినార్‌, జోగులాంబను కలుపుతూ మరో మల్టీజోన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఇక జోనల్‌ వ్యవస్థపై చర్చించేందుకు శుక్రవారం ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం కానున్నారు. అనంతరం వారి అభిప్రాయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. దీని ఆధారంగా సీఎస్‌ ప్రభుత్వానికి నోట్‌ పంపిస్తారు. జోనల్‌, మల్టీ జోనల్‌ వ్యవస్థకు కేబినెట్‌ ఆమోదం తెలిపిన తర్వాత.. రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపనున్నారు. ఈ మొత్తాన్ని తానే స్వయంగా పర్యవేక్షించి తెలంగాణలో కొత్త జోనల్‌, మల్టీ జోనల్‌ వ్యవస్థలో అమలులోకి వచ్చేలా చూస్తానని కేసీఆర్‌ స్పష్టం చేశారు. కేసీఆరే స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో రాష్ట్రంలో త్వరలోనే కొత్త జోనల్‌ వ్యవస్థ రానుంది. 

06:32 - May 25, 2018

హైదరాబాద్ : జాతీయ రాజకీయాల్లో టీడీపీ మళ్లీ చక్రం తిప్పుతుందని ఆపార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2019 ఎన్నికల తర్వాత ప్రధాన మంత్రి ఎంపికలో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ప్రధాని పదవిపై తనకు ఆశలేదని, తెలుగుజాతికి సేవ చేయడమే ముఖ్యమని హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ టీడీపీ మహానాడులో తేల్చి చెప్పారు. హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ మైదానంలో జరిగిన తెలంగాణ టీడీపీ మహానాడుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చంద్రబాబు రాకతో టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. తెలంగాణ టీడీపీ మహానాడులో చంద్రబాబు... పలు అంశాలపై మాట్లాడారు.

గతంలో తెలంగాణతో పాటు హైదరాబాద్‌ను అభివృద్ధికి చేసిన కృషిని చంద్రబాబు వివరించారు. శంషాబాద్‌ విమానాశ్రయం, హైటెక్‌ సిటీ, అవుటర్‌ రింగ్‌రోడ్డు వంటి పలు నిర్మాణాలకు బాటలు వేసిన విషయాన్ని ప్రస్తావించారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ లేకుండా కేంద్రంలో ఎవరూ ఏమీ చేయలేరని చంద్రబాబు అన్నారు. 1996లో ప్రాంతీయ పార్టీలను ఏకంచేసి, ఇద్దరు ప్రధానులను నియమించిన విషయాన్ని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా జాతీయ రాజకీయాల్లో టీడీపీయే కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

ప్రధాని పదవిపై ఆశలేదని చంద్రబాబు చెప్పారు. తెలుగు ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమన్నారు. ప్రధాని అయ్యే అవకాశం రెండుసార్లు వచ్చినా.. వదులుకున్న విషయాన్ని గుర్తు చేశారు. టీటీడీ పరిణామాలపై చంద్రబాబు స్పందించారు. వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఎవరైనా మసైపోతారని హెచ్చరించిన చంద్రబాబు, తిరుమలపై బీజేపీ నాటకాలు ఆడుతోందని విమర్శించారు. పదిహేనవ ఆర్థిక సంఘం నియమ నిబంధనలు ప్రగతి సాధించే రాష్ట్రాలకు నష్టం కలిగించేలా ఉన్నాయని చంద్రబాబు మండిపడ్డారు.

టీటీడీపీ మహానాడులో అమలుకు నోచుకోని టీఆర్‌ఎస్‌ హామీలు సహా ఎనిమిది తీర్మాలను ఆమోదించారు. టీటీడీపీ మహానాడులో ప్రసంగించిన నేతలంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడితే... చంద్రబాబు మాత్రం... ఈ విషయాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు కార్మోన్ముఖులు కావాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

06:28 - May 25, 2018

తమిళనాడు : తూత్తుకుడిలో స్టెరిలైట్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడంపై నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిఎంకె డిమాండ్‌ చేసింది. ప్రతిపక్షాల కారణంగానే ఆందోళన హింసాత్మకంగా మారిందని పళని ప్రభుత్వం ఎదురు దాడికి దిగింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ తమిళనాడు బంద్‌కు ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ కాల్పులకు ఆదేశాలు జారీ చేసింది ఎవరని విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. తూత్తుకూడి ఘటనపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్ష డిఎంకె సెక్రటేరియట్‌ ముందు ఆందోళన చేపట్టింది. డిఎంకె వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ సెక్రటేరియట్‌లోకి దూసుకెళ్లడంతో ఉద్రిక్తతకు దారితీసింది. స్టాలిన్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, డిఎంకె కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి తన పదవికి రాజీనామా చేయాలని డిఎంకె నేతలు డిమాండ్‌ చేశారు.

విపక్షాల ఆరోపణలను పళని ప్రభుత్వం తిప్పికొట్టింది. ఆందోళనకారులను విపక్షాలు తప్పుదోవ పట్టించాయని విమర్శించింది. తూత్తుకూడిలో ఆందోళన ప్రతిపక్షాల కారణంగానే హింసాత్మకంగా మారిందని ఆరోపించింది. ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారని ముఖ్యమంత్రి పళనిస్వామి పరోక్షంగా సమర్థించారు. ఆందోళనల్లో 13 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.

తుత్తుకూడిలో ఆందోళనకారుల పట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం నాటి కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్‌ రక్తపు మడుగులో కుప్పకూలాడు. ఓ పోలీస్‌ అధికారి బాధితుడిని ఆసుపత్రికి తరలించకుండా...'నటించింది చాలు ఇక వెళ్లు' అంటూ కసురుకున్నాడు. ఓ రిపోర్టర్‌ తీసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కలియప్పన్‌ను సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

పోలీసు కాల్పులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రజలపై కాల్పులు జరిపినందుకు గానూ తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌, పోలీసు అధికారిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఇంటర్నెట్‌ సేవలను ఐదు రోజుల పాటు నిలిపి వేశారు. ఆందోళనల దృష్ట్యా స్టెరిలైట్‌ పరిశ్రమలో ఉత్పత్తిని నిలిపివేయాలని తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది. దీంతో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ప్లాంట్‌కు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. తుత్తుకూడి కాల్పుల ఘటనలో మృతు సంఖ్య 13కి పెరిగింది. మరో 70 మంది గాయపడ్డారు.

06:26 - May 25, 2018

బెంగళూరు : కర్నాటక ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధం అవుతోంది. సీఎం కుమారస్వామి అసలు సిసలైన పరీక్ష ఎదుర్కోబోతున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు అసెంబ్లీ సమావేశం జరగనుంది. బలపరీక్ష సజావుగా జరుగుతుందా ? కుమారస్వామి గండం గట్టెక్కుతారా? ఇపుడు దీనిపైనే కర్నాటకతోపాటు దేశ వ్యాప్తంగా రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో నెగ్గటం.. కాంగ్రెస్‌తో పొత్తు లాంటి సమస్యలను అధిగమించి సీఎం పీఠాన్ని సాధించిన కుమారస్వామి.. ఇపుడు అసలు సిసలు పరీక్షను ఎదుర్కోబోతున్నారు. కర్నాటక శాసనసభలో ఇవాళ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధం అయింది.

బలపరీక్షను నెగ్గడానికి 111 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా.. కాంగ్రెస్‌- జేడీఎస్‌ కూటమికి సొంతంగానే 115 మంది సభ్యులు ఉన్నారు. బీఎస్సీ ఎమ్మెల్యేకూడా కుమారస్వామికి మద్దతు ప్రకటించారు. ఇక మిగిలిన ఇద్దరు ఇండిపెండెంట్‌లు కూడా తమకే మద్దతు ఇస్తారని సీఎం కుమారస్వామి భావిస్తున్నారు. దీంతో మద్దతు కాస్తా 117కు చేరిందని జేడీఎస్‌-కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. అయితే అసలు సవాలు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురవనుంది. డిప్యూటీ సీఎం ఎంపికలో ముఖ్యమంత్రి కుమారస్వామి తీరుపై కాంగ్రెస్‌లోని లింగాయత్‌ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించడం నుంచి బలపరీక్షవరకూ అన్నీ తానై.. ఒక్క ఎమ్మెల్యే కూడా జారిపోకుండా అన్ని విధాలా చర్యలు తీసుకున్న డీకే శివకుమార్‌‌ను డిప్యూటీ సీఎం పదవి వరిస్తుందని అందరూ భావించారు. అయితే అందుకు కుమారస్వామి మాత్రం ససేమీరా అనడంతో జి. పరమేశ్వరను ఉపముఖ్యమంత్రి పదవి వరించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన డీకే శివకుమార్‌.. ఇవాళ్టి పరీక్షలో కుమారస్వామికి తన మద్దతు కొనసాగిస్తారా.. లేదా అనేది దానిపై కర్నాటక రాజకీయాల్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. అయితే పార్టీ అధిష్ఠానం శివకుమార్‌ను బుజ్జగించిందని.. బలపరీక్షలో ప్రభుత్వం గెలుస్తుందని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి.

అంతా సాఫిగానే జరుగుతుందని పైకి చెబుతున్నా.. తీరా బలపరీక్ష సమాయానికి శివకుమార్‌ తిరుగుబాటు చేస్తారేమో అనే అనుమానం కూడా కాంగ్రెస్‌ పెద్దల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ సభలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవచ్చని ప్రతిక్ష బీజేపీ కూడా భావిస్తోంది. మొత్తానికి బలపరీక్షలో కుమారస్వామి నెగ్గుతారో లేదో అనే దానిపై ఇపుడు కన్నడనాట జోరుగా చర్చలు నడుస్తున్నాయి. 

జోనల్ వ్యవస్థపై ఉద్యోగ సంఘాల నేతల సమావేశం...

హైదరాబాద్ : జోనల్‌ వ్యవస్థపై చర్చించేందుకు శుక్రవారం ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం కానున్నారు. అనంతరం వారి అభిప్రాయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. దీని ఆధారంగా సీఎస్‌ ప్రభుత్వానికి నోట్‌ పంపిస్తారు. జోనల్‌, మల్టీ జోనల్‌ వ్యవస్థకు కేబినెట్‌ ఆమోదం తెలిపిన తర్వాత.. రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపనున్నారు. 

'జనసేన' తరపున ప్రచారం - చెర్రీ...

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని టాలీవుడ్‌ హీరో రామ్‌ చరణ్‌ ప్రకటించారు. 'ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే ప్రచారం చేద్దామనుకున్నానని.. కానీ అప్పుడు బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ ఒప్పుకోలేదన్నారు చెర్రీ. పవన్‌కల్యాణ్‌ బాబాయ్‌ చాలా కష్టపడుతున్నారని.. అనుమతిస్తే జనసేన తరపున ప్రచారం చేస్తానని చరణ్‌ ఓ కార్యక్రమంలో ప్రకటించారు. 

కొనసాగుతున్న తిరుమల వివాదం...

చిత్తూరు : తిరుమల కొండపై వివాదం ముదురుతోంది. రమణ దీక్షితుల తీరుపై టీటీడీ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీక్షితుల తీరుకు వ్యతిరేకంగా ఇవాళ నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు ఉద్యోగులు. మూడు రోజుల పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు. 

నేడు కుమార స్వామి బలపరీక్ష...

బెంగళూరు : కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం శుక్రవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక కూడా జరుగుతుంది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు అసెంబ్లీలో సమావేశమవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. కాంగ్రెస్‌కు చెందిన రమేశ్‌ కుమార్‌ పేరును స్పీకర్‌ పదవికి ఇప్పటికే ఖరారు చేయగా, డిప్యూటీ స్పీకర్‌గా జేడీఎస్‌ ఎమ్మెల్యేల్లో ఒకరికి అవకాశం దక్కనుంది. 

సునంద పుష్కర్ కేసు..మే28న విచారణ...

ఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసును పటియాల హౌస్‌ కోర్టు నుంచి స్పెషల్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకు బదిలీ చేశారు. దీనిపై తదుపరి విచారణ మే 28న జరగనుంది. 

వైష్ణోదేవి యాత్ర నిలిపివేత...

ఢిల్లీ : వైష్ణోదేవి యాత్రను అధికారులు వరుసగా రెండోరోజు కూడా నిలిపి వేశారు. రహదారిలోని త్రికుటా అటవీ ప్రాంతంలో భీకర మంటలు చెలరేగడంతో యాత్రను రద్దు చేశారు. యాత్రీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే రహదారిని మూసివేశారు.

తాజ్ మహల్ కు ఆరో స్థానం...

ఢిల్లీ : ప్రపంచంలోని ప్రజాదరణ పొందిన కట్టడాల్లో తాజ్‌ మహల్‌ ఆరవస్థానం పొందింది. ఆగ్రాలోని ఈ చారిత్రాత్మక కట్టడం ఆసియాలో రెండోదిగా నిలిచింది. మొగలుల శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచిన తాజ్‌మహల్‌ యాత్రపై ట్రిప్‌ అడ్వయిజరీ సంస్థ ఆన్‌లైన్‌లో సలహాలు ఇస్తోంది. 

న్యూక్లియర్ సైట్ పేల్చివేత...

ఢిల్లీ : ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఉత్తర కొరియా ముందడుగు వేసింది. అంతర్జాతీయ జర్నలిస్టుల సమక్షంలో పంగీ రీ సైట్‌ వద్ద అణు పరీక్ష కేంద్రాన్ని పేల్చేసింది. సుమారు 500 మీటర్ల దూరం నుంచి న్యూక్లియర్‌ సైట్‌ పేల్చివేతను వీక్షించినట్లు విదేశీ జర్నలిస్టులు తెలిపారు.

Don't Miss