Activities calendar

26 May 2018

22:14 - May 26, 2018

హైదరాబాద్ : మే 31న తలపెట్టిన రైతు జేఏసీ సడక్ బంద్ ను జయప్రదం చేయాలని వామపక్ష నేతలు పిలుపు నిచ్చారు. కౌలు రైతులకు రైతుబంధు పథకం వర్తింపచేయాలని సీపీఎం నేత నర్సింగరావు అన్నారు. రైతుబంధు పథకంతో భూస్వాములకే మేలు జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన గందరగోళంగా ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ 
అన్నారు. 

22:01 - May 26, 2018

సిద్ధిపేట : ప్రజ్ఞాపూర్ లో రోడ్డు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 11 కు చేరింది. ఆర్టీసీ బస్సు, లారీ, క్వాలీస్ ఢీకొని 11 మంది మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో జన్నారం నవ తెలంగాణ రిపోర్టర్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ఐదు మంది మృతి చెందారు. మంత్రి హరీష్ రావు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. 

ప్రజ్ఞాపూర్ లో రోడ్డు ప్రమాద ఘటన.. 11 కు చేరిన మృతుల సంఖ్య

సిద్ధిపేట : ప్రజ్ఞాపూర్ లో రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 11 కు చేరింది. ఆర్టీసీ బస్సు...లారీ, క్వాలీస్ ఢీకొని 11 మంది మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

21:00 - May 26, 2018

అవద్దాల మోడీ పాలనకు నాల్గేండ్లు పూర్తి...విజయాలు జెప్పుకుంటే పదేండ్లు వడ్తది, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పవన్ దీక్ష..ట్విట్టర్ల చమత్కరిస్తున్న చంద్రాలు సారు, ఖమ్మం మున్సిపాలిటీల పుట్టిన కయ్యం..ముప్పై ఆరుమంది కార్పొరేటర్ల తిర్గుబాటు, ముక్కునాలకు రాస్తాంటున్న మోత్కుపల్లి...చంద్రబాబు మీద ఫైరైన ఆశావాహ గవర్నర్, పోలీసోళ్లను జూస్తె జనం భయపడాల్నంట... హోమంత్రినాయిని నర్సన్న చమక్కులు, రైతుబంధు పథకం రోడ్డెక్కింది..రైతుల ఆందోళన, పగిలిన మిషన్ భగీరథ పైపులు, బిచ్చగాన్ని లంచం అడ్గిండట గూడి ఈవో..జగిత్యాల జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు...ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం..

 

20:49 - May 26, 2018

సీనియర్ జర్నలిస్టు, రైటర్ పసుపులేటి రామారావుతో టెన్ టివి ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మహానటి సావిత్రి జీవిత విశేషాలు తెలిపారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...సావిత్రి చాలా మంచింది. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టపడే వారు కాదు..జర్నలిస్టులను కలిసే వారు కాదు... అందరూ ఆమెను మోసం చేసిన వారే. చాలా తక్కువ సమయంలో ఆమె సంతోషంగా ఉండేవారు. జెమినీ గణేష్ ను రెండో పెళ్లి చేసుకోవడమే సావిత్రి చెసిన 
తప్పు. అయితే సావిత్రి కష్టాల్లో ఉన్నప్పుడు గణేషన్ ఆమెకు దగ్గరయ్యారు. సావిత్రి ఆయనతో ప్రేమలో పడింది. కొన్ని సంవత్సరాల తర్వాత సావిత్రిని గణేషన్ పట్టించుకోలేదు. ఆమె జీవితంలో ఆయన విలన్ అయ్యారు. ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు మద్యానికి అలవాటు పడ్డారు. సావిత్రి కోమాల్లోనే మరణించారు. 'మహానటి' సినిమాలో సావిత్రి జీవిత విశేషాల్లో కొన్ని తప్పులున్నాయి. సావిత్రి జీవితంపై మరో పుస్తకం రాస్తాను అని తెలిపారు. ఆయన తెలిపిన మరిన్ని సావిత్రి జీవిత విశేషాలను వీడియోలో చూద్దాం... 

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మంత్రి జూపల్లి సమావేశం

హైదరాబాద్ : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశం అయ్యారు. గ్రామాల్లో పట్టణ సౌకర్యాల కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన రూర్బన్ కార్యక్రమాన్ని మార్చి 31 నాటికి పూర్తి చేయాలని జూపల్లి అన్నారు. 

 

వృద్ధురాలి హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్టు

హైదరాబాద్ : కార్ఖానా పిఎస్ పరిధిలో జరిగిన వృద్ధురాలి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బు కోసం వృద్ధురాలిని హత్యచేసినట్లు నిందితులు వెల్లడించారు. 60 గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

సీఎం చంద్రబాబుకు ఆక్వా రైతులు కృతజ్ఞతలు

గుంటూరు : సీఎం చంద్రబాబుకు ఆక్వా రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఆక్వాసాగుకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నందుకు, విద్యుత్ ధరలపై రాయితీ ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

 

19:13 - May 26, 2018

గుంటూరు : మూడు రోజల పాటు ఉత్సవంలా మహానాడు నిర్వహించనున్నట్లు మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. తెలుగు రాజకీయాల దశ దిశ మార్చిన నందమూరి తారకరామారావు జన్మదినం సందర్భంగా మహానాడు నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. జగన్‌, నరేంద్రమోదీ లాలూచీ రాజకీయాలతో పాటు.. ఏపీలోని బీజేపీ నాటకాలను మహానాడు ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు.

 

19:00 - May 26, 2018

గుంటూరు : తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుపై మంత్రి సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి ఆభరణాలు పోయాయని ఆరోపణలు చేసే హక్కు ఆయనకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీలు కలిసి రమణ దీక్షితులచే ఆరోపణలు చేయించాయన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే వేంకటేశ్వరస్వామిని వాడుకుంటున్నారన్నారు.

 

18:52 - May 26, 2018

సిద్దిపేట : కొమరవెళ్లి టెంపుల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా విషాదం నెలకొంది. ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. జన్నారం నవతెలంగాణ రిపోర్టర్ కుటుంబ సభ్యులు కొమరవెళ్లి టెంపుల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా గజ్వేల్ మండలం రిబ్బన్నగూడెం వద్ద వేగంగా వెళ్తున్న ఆర్టీసీ రాజధాని బస్సును వెనుకనుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. చికిత్స పొందుతూ మరో ఏడుగురు మృతి చెందారు.

 

18:39 - May 26, 2018

ఢిల్లీ : సిబిఎస్‌ఈ 12 వ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. 12 వ తరగతి పరీక్షలో 83.01 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే సత్తా చాటారు. నోయిడాకు చెందిన మేఘనా శ్రీవాత్సవ టాపర్‌గా నిలిచారు. మొత్తం 500 మార్కులకు గాను మేఘనకు 499 మార్కులు వచ్చాయి. ఎకనామిక్స్‌, భూగోళశాస్త్రం, సైకాలజీ, చరిత్రలో మేఘన వందకు వంద మార్కులు సాధించింది. ఇంగ్లీష్‌లో 99 మార్కులు వచ్చాయి. ఈ ఘనత తన కృషితో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకే దక్కుతుందని మేఘన చెప్పింది. తనకు సైకాలజీ చదవాలని ఉందని, యూనివర్సిటీ ఆఫ్‌ కొలంబియాలో చదవాలనుకుంటున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో సామాజిక సేవ చేయాలని ఉందని పేర్కొంది.

 

18:37 - May 26, 2018

చిత్తూరు : జిల్లాలోని శాంతిపురంలో దారుణం చోటు చేసుకుంది. భార్య భర్తను నరికి చంపింది. కొడుకు పుట్టలేదని, మరో పెళ్లి చేసుకుంటానని భర్త వేధిస్తుండటంతో నరికి చంపి అనంతరం పోలీసులు ముందు లొంగిపోయింది.

 

18:33 - May 26, 2018

గుంటూరు : గత నాలుగు సంవత్సరాలుగా కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల రుచులతో మహానాడులో వంటలు చేస్తున్నామని అంబికా కేటర్స్ యజమాని శివాజీ అన్నారు. మహానాడు కార్యక్రమానికి హాజరయ్యే లక్ష 50 వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 4 వందల మంది వంట వాళ్లు, 8 వందల మంది సప్లయర్స్‌తో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు. వివిధ రకాల వంటకాలతో కార్యక్రమానికి వచ్చే అతిథులను ఆకట్టుకుంటామని అంటున్న శివాజీతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..  

18:17 - May 26, 2018

హైదరాబాద్‌ : లక్డీకాపూల్‌లోని ఓ లాడ్జీలో కర్నూలు జిల్లాకు చెందిన అంబికా పవన్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం లాడ్జీకి వచ్చిన పవన్‌... ఉరేసుకున్నాడు. గది నుండి దుర్వాసన రావడంతో సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న క్లూస్‌ టీమ్‌ వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. అయితే... తన ఆత్మహత్యకు ఆర్ధిక మరియు ఆరోగ్య సమస్యలే కారణమని పవన్‌ రాసిన సూసైడ్‌నోట్‌ లభించింది. 

 

18:03 - May 26, 2018

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా కాదు... వెనక్కి నెట్టబడ్డ ప్రాంతం, నిర్లక్ష్యం చేయపడ్డ ప్రాంతమని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ దీక్ష విరమించారు. పవన్ కళ్యాణ్ కు ఉద్దానం కిడ్నీ బాధిత కుటుంబం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితులు కోసం జిల్లా కేంద్రంలో పవన్ ఒకరోజు దీక్ష చేపట్టారు. దీక్ష విరమణ అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్దానం అంటే ఉద్యానవనం, రెండో కోనసీమ అన్నారు. వెనుకబాటు ప్రజలకే కానీ పాలకులకు కాదన్నారు. ఉద్దానంలో కిడ్నీ సంబంధిత వ్యాధితో 20 వేల మంది చనిపోయారని తెలిపారు. తాను నిరసన చేసేది.. రాజకీయ గుర్తింంపుకు కాదని చెప్పారు. తనకు రాజకీయ గుర్తింపు కావాలంటే టీడీపీకి ఎందుకు మద్దతు ఇస్తానని.. రాజకీయ గుర్తింపు తానే తీసుకుంటానని తెలిపారు. 'నేను రెండు రకాలుగా నిరసన తెలిపాని.. మనల్ని దగా చేసిన కేంద్ర ప్రభుత్వానికి, వారికి మద్దతు పలికిన టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపానని చెప్పారు. ఉత్తరాంధ్రలో వలసలు ఎక్కువ, నిరుద్యోగులు ఉన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోనే భారతమాత వెలిసిందని.. అందుకే ఇక్కడి నుంచి అధిక సంఖ్యలో సైన్యంలోకి వెళతారని అన్నారు. శ్రీకాకుళం గొప్ప నేల, ఉద్యమం పుట్టిన నేల అన్నారు. ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. జనసేనకు అధికారం ముఖ్యం కాదని.... సహజంగా వస్తే కాదనం అని చెప్పారు. సామాజిక, రాజకీయ చైతన్య కోసం జనసేన పని చేస్తుందన్నారు. తాను సినిమాలు వదులుకొని రాజకీయాల్లోకి రావడం సరదాకు కాదని స్పష్టం చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు డబ్బులు దానం చేసిన వారు నిజమైన హీరోలు కొనియాడారు. రాజకీయ లబ్ధి కోసం ఉద్దానం రాలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ దృష్టిలో ఉన్నవారు...లేనివారు అనే రెండే కులాలు అని అన్నారు. మండలానికొక డయాలసిస్ కేంద్రం కావాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య సమస్యలు, బాధలు చెప్పుకునేందుకు రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి లేడని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు చేస్తుంది.. తప్పు.. మీకు మద్దతు ఇచ్చి అధికారంలోకి తెచ్చిన నాపై విమర్శలు చేయడం తగదన్నారు.
తెలుగు ప్రజలంటే కేవలం తెలుగుదేశం ప్రజలే కాదని...రాష్ట్ర ప్రజలందరనీ అన్నారు. చంద్రబాబు ముందు కౌగిలించుకుని...వెనుక నుంచి బాకులతో పొడుస్తారని విమర్శించారు. చంద్రబాబు పైకి చిరునవ్వు నవ్వుతూ...వెనుక నుంచి వెన్నుపోటు పొడుస్తారని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలంగా పోరాటం చేస్తామన్నారు. జీవిత కాలమంతా శ్రమదోపిడీకి గురికావాల్సిందేనా....? అని ప్రశ్నించారు. తమకు ఏ రోగం వచ్చింతో తెలుసుకోలేని స్థితిలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. జనసేన నిరసన కవాతు నిరంతరంగా జరుగుతుందన్నారు.

 

పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ

శ్రీకాకుళం : జనసేనాని పవన్ కళ్యాణ్ దీక్ష విరమించారు. పవన్ కళ్యాణ్ కు ఉద్దానం కిడ్నీ బాధిత కుటుంబం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితులు కోసం జిల్లా కేంద్రంలో పవన్ ఒకరోజు దీక్ష చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

సంగారెడ్డి : గజ్వేల్ మండలం రిబ్బనగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ రాజధాని..లారీ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. 

 

యువకుడు ఆత్మహత్యాయత్నం

కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం జూగుండ్లలో పోలీసులు వేధిస్తున్నారని యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పురుగులమందు తాగి సంపత్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

16:35 - May 26, 2018

తూర్పుగోదావరి : రాజమండ్రి అర్బన్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి రాజమండ్రిలో భిక్షాటన చేసుకుంటూ,  ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్న వారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో వారిని సురక్షితంగా ఉంచేందుకు ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాజమండ్రి అర్బన్ పోలీసులు. 
భిక్షగాళ్ల పాలిట శాపంగా కిడ్నాపర్స్‌ గ్యాంగ్‌ వార్తలు  
సోషల్‌ మీడియాలో కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న కిడ్నాపర్స్‌ గ్యాంగ్‌ వార్తలు భిక్షగాళ్ల పాలిట శాపంగా మారింది. పరిశుభ్రతను పాటించకుండా భయంకరంగా ఉంటున్న భిక్షగాళ్లను కిడ్నాపర్లకుగా అనుమానించి విచక్షణారహితంగా కొట్టి ప్రాణాలు తీస్తున్నారు జనాలు. దీంతో అమాయకులైన భిక్షగాళ్లను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు రాజమండ్రి అర్బన్ పోలీసులు.
బట్టలు, తినడానికి బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్ల పంపిణీ 
నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫుట్‌పాత్ లపై జీవిస్తున్న 300 మందిని అదుపులోకి తీసుకొని వారందరికి కటింగ్, షేవింగ్ చేయించారు. స్నానాలు చేసేందుకు ప్రత్యేక ఘాట్‌లను ఏర్పాటు చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ వారి సహాయంతో వారికి బట్టలు, తినడానికి బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్లను అందిస్తున్నారు. 
భిక్షగాళ్లపై స్థానికులు అనుమానం 
సోషల్ మీడియాలో పిల్లలను ఎత్తుకు పోవడం, ఒంటరిగా ఉన్న మహిళలను చంపేయడం వంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో స్థానికులు భిక్షగాళ్లపై ఎక్కువ అనుమానం వ్యక్తం చేస్తున్నారని, అమాయకులను రక్షించాలనే సదుద్ధేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఎస్పీ బి.రాజకుమారి  చెప్పారు. సోషల్‌ మీడియాలో వార్తలేమోకాని వికృతంగా రోడ్లపై సంచరిస్తున్న భిక్షగాళ్లకు మాత్రం రాజమండ్రి అర్బన్‌ పోలీసులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు.

16:00 - May 26, 2018

ఢిల్లీ : మోది నాలుగేళ్ల పాలనలో ఒక్క అవినీతి కుంభకోణం లేకుండా లక్షల కోట్ల ప్రాజెక్టులను పూర్తి చేశామని బిజెపి చీఫ్‌ అమిత్‌ షా అన్నారు. అస్థిరత యుగానికి అంతం పలికి అవినీతి రహిత పాలనను బిజెపి దేశానికి అందించిందని ఆయన చెప్పారు. 'సబ్‌ కా సాథ్‌...సబ్‌ కా వికాస్‌' సూత్రం ఆధారంగా మోది ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వంశపాలన, మత రాజకీయాలను మార్చేసి పాలిటిక్స్‌ ఆఫ్ పర్‌ఫామెన్స్‌తో బిజెపి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అమిత్‌ షా వెల్లడించారు. ప్రపంచంలో భారత్ గౌరవాన్ని ఇనుమడింప జేసిన ఘనత ప్రధాని మోదికే దక్కుతుందని అమిత్‌ షా తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పు తెచ్చేందుకే నోట్ల రద్దు, జిఎస్‌టిని అమలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. మోది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళ్టికి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమిత్‌ షా మీడియా సమావేశంలో మాట్లాడారు. మోది ప్రభుత్వం సాధించిన అభివృద్ధి పనులను ఏకరువు పెట్టారు.

 

15:54 - May 26, 2018

కామారెడ్డి : ఇన్నేళ్లు కష్టపడ్డారు... ఆ భూమి తమదేనని ఆశగా సాగు చేసుకున్నారు. కానీ రైతుబంధు పథకంతో తమ ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఎన్నోఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి తమదు కాదని అధికారులు తేల్చారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు కామారెడ్డి జిల్లా వెంకటాపూర్‌ అగ్రహారం గ్రామ ప్రజలు. 
రైతులు ఆందోళన 
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటపూర్‌ అగ్రహరం రైతులు తమకు అన్యాయం జరిగిందని ఆందోళనకు దిగారు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూమి దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తుందని తెలియడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన రైతు బంధుపథకం తమకు అందకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
11 సంవత్సరాలుగా అదే భూమిపై ఆధారపడి బతుకుతున్న రైతులు
ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్‌ అగ్రహరం గ్రామంలో 167 సర్వే నంబర్లు ఉన్నాయి. అందులో 168.18 ఎకరాల భూమి ఉంది. గతంలో కామారెడ్డి జిల్లా ఆర్డీవోగా పనిచేసిన శ్రీదేవి అనే అధికారి వెంకటపూర్ అగ్రహరం గ్రామ  రైతులకు పట్టాపాసు పుస్తకాలు అందజేశారు. అయితే ఈ స్థలం దేవాదాయ శాఖకు చెందిదని, ఆ శాఖకు సంబంధించిన అధికారులు 1997 సంవత్సరంలో కోర్టుకు వెళ్లారు. వెంకటపూర్‌ దేవాదాయ శాఖ భూములకు పాసు పుస్తకాలు ఇవ్వకూడదని 2007లో హైకోర్టు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అయితే కోర్టు తీర్పుపై గ్రామస్తులకు ఎలాంటి అవగాహన లేకపోవటంతో 11 సంవత్సరాలుగా అదే భూమిపై ఆధారపడి బతుకుతున్నారు.
రైతులు సాగు చేస్తున్న భూమి దేవాదాయ శాఖ పరిధిలో 
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో రైతులు సాగు చేస్తున్న భూమి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నట్లు తేలింది. దీంతో  అధికారులు కోర్టు ఆదేశాలకు లోబడి గ్రామస్తులకు పాస్‌పుస్తకాలు ఇవ్వలేదు. వెంకటపూర్‌ అగ్రహరం గ్రామాన్ని రెవెన్యూ అధికారులు పార్టు బీలో చేర్చారు. దీంతో వివాదంలో ఉన్న తమ భూ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధులు చోరవ చూపాలి : రైతులు
అయితే సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధులు చోరవ చూపాలని రైతులు వెడుకోగా... సమస్య కోర్టు పరిధిలో ఉండడంతో పరిష్కారానికి సమయం పడుతోందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. 

 

15:46 - May 26, 2018

చెన్నై : వేదాంత కర్మాగారానికి వ్యతిరేకంగా తమిళనాడులోని తూత్తుకుడి అట్టుడుకుతోంది. ఈ రాగి పరిశ్రమ కాలుష్యం వల్ల తమ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయంటూ స్థానికులు చాలా ఏళ్లుగా తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తున్నారు. అయితే తాము పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే.. విస్తరణ పనులు చేపడుతున్నామని వేదాంత చెబుతోంది. అయితే.. మరి స్థానికుల ఆందోళన అర్థం లేనిదా..? అసలు వాస్తవాలు తెలుసుకోకుండానే పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చేసిందా..? ఇంతకీ వేదాంత స్టెరిలైట్‌ ఫ్యాక్టరీ అనుమతుల వ్యవహారం లోగుట్టేంటి..? 
వేదాంత స్టెరిలైట్‌ ఫ్యాక్టరీపై వివాదం
వేదాంత స్టెరిలైట్‌ ఫ్యాక్టరీ...! ఈ పేరు చెప్పగానే తూత్తుకుడి.. అక్కడి కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన గుర్తుకొస్తాయి. అసలు ఈ ఫ్యాక్టరీపై ఎందుకు వివాదం చెలరేగుతోంది..? స్థానికులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..? కాలుష్యం తమను కబళిస్తోందన్న స్థానికుల వేదన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఎందుకు పట్టడం లేదు...? వేదాంత స్టెరిలైట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు పూర్వాపరాలేంటి..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా.. అందరి వేళ్లూ.. మోదీ సర్కారునే చూపుతున్నాయి. ఆయన సర్కారు ఇచ్చిన మినహాయింపే కారణమని చెబుతున్నాయి. 
ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే ప్రాజెక్టుల నిర్మాణం
ప్రాజెక్టులను నిర్మించాలంటే.. మొదట చట్ట ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిందేనంటూ 2014 మే నెలలో అప్పటి యూపీఏ సర్కారు ఆదేశాలిచ్చింది. పర్యావరణ అనుమతులున్న పారిశ్రామిక పార్కుల్లో కొత్త పరిశ్రమ ఏర్పాటు చేసేట్లయితే.. అప్పటికే అక్కడ పర్యావరణ అనుమతులు ఉంటాయి కాబట్టి.. కొత్త పరిశ్రమ ప్రత్యేకంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాల్సిన అవసరం లేదని యూపీఏ సర్కారు మినహాయింపునిచ్చింది. అయితే.. ఆ తర్వాత వచ్చిన మోదీ సర్కారు.. 2014 డిసెంబర్‌లో.. పారిశ్రామిక వేత్తలకు తలొగ్గి... మొత్తానికి మొత్తం.. ఆయా జోన్లలో ప్రజాభిప్రాయ సేకరణ అవసరమే లేకుండా మినహాయింపులు ఇచ్చేసింది. కోస్టల్‌ రెగ్యులేటరీ చట్టాన్నీ కేంద్రం నీరుగారుస్తోందన్న విమర్శలూ ఉన్నాయి. 
పర్యావరణ ఆమోద నిబంధనలు అమల్లోకి రాకముందే ఫ్యాక్టరీ ఏర్పాటు  
తూత్తుకుడిలో వేదాంత రాగి పరిశ్రమ 2006లో పర్యావరణ ఆమోద నిబంధనలు అమల్లోకి రాకముందే ఏర్పాటైంది. 2009లో ప్లాంట్‌ విస్తరణకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి కోరింది. ప్రజాభిప్రాయ అవసరం లేకుండానే విస్తరించడానికి అప్పటి యూపీఏ సర్కారు అనుమతించింది. ఈ అనుమతికి కాలం చెల్లిపోయిన తర్వాత, పొడిగింపు కోసం 2013లో వేదాంత మరోమారు కేంద్ర మంత్రిత్వశాఖ వద్దకు వెళ్లింది. ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిందేనంటూ 2014 మేలో ప్రభుత్వం తెగేసి చెప్పింది. అయితే, 2014 డిసెంబరులో ప్రజాభిప్రాయ సేకరణ ఉత్తర్వులకు ప్రభుత్వమే చెల్లుచీటీ పలకడంతో..  వేదాంతకు 2018 డిసెంబరు వరకు పర్యావరణ అనుమతుల్ని పొడిగిస్తూ 2015 మార్చిలో పర్యావరణ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఫలితంగా నిర్మాణాల్ని కొనసాగించడానికి వేదాంతకు అవకాశం వచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణపై వివిధ కోర్టుల్లో కేసులు నడుస్తున్న సమయంలోనే వేదాంతకు అనుమతి రావడం విశేషం. 

 

15:39 - May 26, 2018

హైదరాబాద్ : సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులకు చెక్‌ పెట్టెందుకు రాచకొండ పోలీస్‌ కమీషనర్‌ మహేష్‌ భగవత్‌ తాజా హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల సామాజిక మాద్యమాలలో ప్రచారం అవుతున్న దొంగల గ్రూపులు  తిరుగుతున్నాయనే వాటిపై ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఇలాంటి పోస్టులు పోస్ట్ చేయొద్దని  హెచ్చరించారు.  ఈ విషయమై  మేడిపల్లి పీఎస్‌ పరిధి బోడుప్పల్‌ మారుతి నగర్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు.  దొంగల ముఠాలు రాత్రి సమయంలో సంచరిస్తున్నట్లు ఫొటోలు, వీడియోలను కొందరు సృష్టిస్తున్నారు. వీటి పై ఎటువంటి సమాచారం గాని, ఆధారాలు కాని పోలీసుల వద్దలేవని స్పష్టం చేశారు. ఇటువంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. 

15:31 - May 26, 2018

హైదరాబాద్ : అంబర్‌పేటలోని ప్రేమ్‌నగర్‌లో ప్రమాదం జరిగింది. ఇంటి నిర్మాణం కోసం పనులు చేపడుతుండగా సెల్లార్‌ గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. గోడ కింద ఇరుక్కుపోయిన మరో కార్మికుడిని స్థానికులు కాపాడారు. మృతుల్లో ఒకరు వెంకటేష్‌గా గుర్తించారు. మరొకరి వివరాలు ఆరా తీస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సంఘటనాస్థలానికి వచ్చి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 

15:20 - May 26, 2018

శ్రీకాకుళం : ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ దీక్ష ఒక హెచ్చరిక అని చెబుతున్న మధుతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

15:12 - May 26, 2018

శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష కొనసాగనుంది. పవన్‌ దీక్షకు మద్దతుగా అన్ని జిల్లా కేంద్రాల్లో జనసేన నాయకులు కూడా దీక్షలు చేస్తున్నారు. జనసేన అధినేత దీక్షకు వామపక్షాలు సంఘీభావం ప్రకటించాయి. 

 

అంబర్ పేట ప్రేమ్ నగర్ లో ప్రమాదం

హైదరాబాద్ : అంబర్ పేటలోని ప్రేమ్ నగర్ లో ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. ఇంటి నిర్మాణం కోసం పనుల చేపడుతుండగా సెల్లార్ గోడ కూలి ఇద్దరు కార్మికుల మృతి చెందారు. మరొకరిని స్థానికులు కాపాడారు. 

13:48 - May 26, 2018

ఖమ్మం : జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ పొట్ల శశికళ భర్త పొట్ల వీరేందర్‌ ఆరాచకాలపై ఓ మహిళ తిరగబడింది. ఖానాపురం హవేలిలోని మల్సూరు అనే వ్యక్తికి చెందిన 460 గజాల ఇంటి స్థలంలో గోడ నిర్మాణం చేపట్టొద్దని కట్టిన ప్రహరీ గోడను కార్పొరేటర్‌ భర్త వీరేందర్‌ కూల్చి వేసాడు. దీంతో ఆగ్రహించిన మల్సూరు భార్య సుజాత చెప్పులతో వీరేందర్‌ను కొట్టడం కలకలం రేపింది. కాగా ఖమ్మం నగరంలో కార్పొరేట్ల అరాచకాలకు అంతులేకుండా పోతోందని ప్రజలు వాపోతున్నారు. కొన్ని రోజుల క్రితం ఓకార్పొరేటర్ భర్త రాసలీలలు కూడా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ నేతల అరాచకాలపై ప్రజలు మండిపడుతున్నారు. 

13:42 - May 26, 2018

అమరావతి : అనుకున్నదొకటి.. అవుతోంది మరొకటి.. చంద్రబాబు , కేసీఆర్‌ రాజకీయాలపై ఇపుడు ఇవే కామెంట్లు వినిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేందుకు ఇద్దరు నేతలు పావులు కదుపుతున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం గులాబీదళపతి ప్రయత్నిస్తుండగా ... బీజేపీ నిలువరించేందుకు హస్తంతో అయినా దోస్తీకి సై అనే సంకేతాలిస్తున్నారు టీడీపీ అధినేత . ఇద్దరు ముఖ్యమంత్రుల పొలిటికల్‌ వ్యూహాలు అనుకున్న ఫలితాలను ఇస్తాయా..? లక్ష్యం కోసం ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తారా..? వాచ్‌ దిస్‌స్టోరీ.

జాతీయ రాజకీయాలపై సీరియస్‌గా దృష్టిపెడుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల హస్తన పాలిటిక్స్ ప్రయత్నాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బీజేపీ,కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పడాలంటూ కేసీఆర్‌... బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న చంద్రబాబు .. ఇపుడు తెలుగు రాష్ట్ర రాజకీయాలను జాతీయ స్థాయికి చేర్చారు. ప్రధాని మోడీ హవా తగ్గుతోందని అంచనా వేస్తున్న తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్.. బిజెపి, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేస్తానంటూ హడావిడి మొదలు పెట్టారు. కర్నాటక ఎన్నికల అనంతరం ఫెడరల్‌ఫ్రంట్ పై మరింత స్పష్టత వస్తుందన్న ఊహించారు. కాని కర్నాటకలో కేసిఆర్ ఊహించిన దాని కంటే భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. జెడిఎస్ గెలిస్తే.. తాను అనుకుంటున్న ఫెడర్‌ఫ్రంట్‌ ప్రయత్నాలకు ఓ ఊపు వస్తుందని గులాబీదళపతి భావించారు. అయితే జేడీఎస్‌ గెలిచినా.. కేసీఆర్‌ అంచనాలకు తగిన వాతావరణం మాత్రం ఏర్పడలేదు. కాంగ్రెస్‌ లేకుండా ప్రాంతీయపార్టీల ఫంట్ర్‌ కోసం తాను ప్రయత్నిస్తుంటే.. జేడీఎస్‌ మాత్రం కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో తాము కాంగ్రెస్‌తోనే వెళతామని జేడీఎస్‌ అధినేత దేవేగౌడ సంకేతాలు ఇచ్చారు. ఈపరిణామం గులాబీబాస్‌కు మింగుడు పడనిదా తయారైంది.

హస్తిన రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్న తెలుగు సీఎంలు
ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై మాటతప్పిన బీజేపీని టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్‌ చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కమలంపార్టీని అధికారానికి దూరంగా ఉంచాలని బాబు పావులు కదపడం మొదలు పెట్టారు. ఇదే వ్యూహంతో కుమారస్వామి ప్రమాణస్వీకారానికి బెంగళూరు వెళ్లారు. ప్రమాణ స్వీకార వేదికపై పార్టీ ఆగర్భశత్రువు కాంగ్రెస్‌తోనూ మాటకలిపారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌తో కరాచలనం చేసి కమలదళానికి తొలి హెచ్చరిక పంపించారు టీడీపీ అధినేత. బీజేపీని అధికారపీఠానికి దూరంగా ఉంచే క్రమంలో కాంగ్రెస్‌తోనూ చేతులు కలిపేస్తామన్న సంకేతాలిచ్చారు. జాతీయ రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పడానికి తాము రెడీ అయ్యామని తెలంగాణ పార్టీ మహానాడులో కూడా చంద్రబాబు ప్రకటించి తన ఉద్దేశాన్ని వెల్లడించారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నా... ఇద్దరూ చేరో దారిలో వెళుతారా..? లేదా ఒకే గూటికి చేరుకుంటారా .. అనేదానిపై ఇపుడు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.  

13:30 - May 26, 2018

అమరావతి : ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ఈరోజు ఉదయం అధికారులతో చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ...కిడ్నీ రోగులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతీనెలా 2716 మంది కిడ్నీ రోగులకు రూ.2,500లు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. 13 వేల మందికి క్రమం తప్పకుండా చికిత్స అందిస్తున్నామని, ప్రతి 15రోజులకు నెఫ్రాలజిస్ట్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని చంద్రబాబు అన్నారు. పలాస, సోంపేట, పాలకొండ, టెక్కలిలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుచేశామని, రూ.17కోట్లతో 7 ఆర్వో సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. మరిన్ని ఆర్వో సెంటర్ల కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. అంతేగాక సీకేడీ కేసుల కోసం సోంపేటలో ప్రయోగశాల ఏర్పాటు చేశామని, పనిచేసేవాళ్లపైనే విమర్శలు చేస్తారా? అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని సేవలు ప్రజలకు అందేలా సలహాలు ఇవ్వాలి అంతే తప్ప చేసేవారిపై రాళ్లు వేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పటి వరకూ ఎవ్వరూ చేయని పని టీడీపీ ప్రభుత్వం చేస్తుంటే కనీసం అభినందించరా? గత ప్రభుత్వాలు ఈ విధంగా చేశాయా? అని సీఎ చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.

కాగా ఉద్ధానం కిడ్నీ సమ్యల విషయంలో తాను తీవ్రంగా ఆవేదన చెందాననీ..ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడుకి అమెరికా వైద్యులను పరిచయం చేశారని అయినా కిడ్నీ సమ్యలపై ప్రభుత్వం తాత్కాలిక పనులు చేసిన చేతులు దులుపుకుందని పవన్ విమర్శించారు. 48 గంటల్లో ఈ సమస్యపై స్పందించకుంటే తాను నిరాహార దీక్ష చేస్తానని పవన్ తెలిపారు. దీనిపై ప్రభుత్వ నుండి ఎటువంటి ప్రకటనా రానందున పవన్ తన దీక్షను ప్రారంభించారు.ఈ దీక్షకు వామపక్ష నేతలు, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం నేతలు వంటి పలువురు తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించి కిడ్నీ బాధితులకు పలు వైద్యసేవలు అందిస్తున్నామని మరిన్ని సేవల కోసం సలహాలు ఇవ్వటం మానివేసి చేసేవారిపై విమర్శలు చేయటం సరికాదన్నారు. 

ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యలపై చంద్రబాబు సమీక్ష..

అమరావతి: ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ... కిడ్నీ రోగులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. 13 వేల మందికి క్రమం తప్పకుండా చికిత్స అందిస్తున్నామని, ప్రతి 15రోజులకు నెఫ్రాలజిస్ట్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని చంద్రబాబు అన్నారు. పలాస, సోంపేట, పాలకొండ, టెక్కలిలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుచేశామని, రూ.17కోట్లతో 7 ఆర్వో సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

నటి కీర్తీ సురేశ్ కు సీఎం చంద్రబాబు ప్రశంసలు..

అమరావతి : 'మహానటి'టీమ్ అమరావతిలో సీఎం చంద్రబాబుని కలిసింది. ఈ సందర్భంబగా చంద్రబాబు మాట్లాడుతు..మహానటి సావిత్రిని కీర్తి సురేష్ మహానటిని కళ్లకు కట్టిందని నటి కీర్తి సురేష్ ను చంద్రబాబు ప్రశంసించారు. వయస్సులో చిన్నదైనా మహానటి వంటి సినిమాలో నటించింది అనేకంటే జీవించింది అనే సబబు అని అన్నారు. ఏదన్నా చేయాలనే పట్టుదల వుంటే సాధించి తీరతారని దానికి కీర్తీ సురేష్ నటనే తార్కాణమన్నారు. ఎన్నీఆర్,సావిత్రి వంటివారు పరిశ్రమలో రీప్లేస్ లేని వ్యక్తులన్నారు. అటువంటి పాత్రలను చేయటం ఒక సాహసమేననీ..ఆ సాహసం చేసి కీర్తి సురేష్ న్యాయం చేశారన్నారు.

సీఎం చంద్రబాబుని కలిసిన 'మహానటి'టీమ్..

అమరావతి : 'మహానటి'టీమ్ అమరావతిలో సీఎం చంద్రబాబుని కలిసింది. దర్శకుడు నాగ్ అశ్విన్, సినిమా ప్రధాన పాత్రధారి కీర్తి సురేశ్, నిర్మాత అశ్వినీదత్, సావిత్రి కుమార్తె చాముండేశ్వరి తదితరులు సీఎం చంద్రబాబుని కలిసారు. ఈ సందర్భంగా ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతు..అంత గొప్ప సినిమాకు అలనాటి మహానటి సావిత్రిని మరోసారి అందరికి ముందకు తీసుకువచ్చిన మహానటి సినిమాకు పన్ను మినహాయింపునివ్వాలని మహిళల అందరి తరపునా సీఎం చంద్రబాబుని కోరారు. 

12:37 - May 26, 2018

అమరావతి : 'మహానటి'టీమ్ అమరావతిలో సీఎం చంద్రబాబుని కలిసింది. ఈ సందర్భంబగా చంద్రబాబు మాట్లాడుతు..మహానటి సావిత్రిని కీర్తి సురేష్ మహానటిని కళ్లకు కట్టిందని నటి కీర్తి సురేష్ ను చంద్రబాబు ప్రశంసించారు. వయస్సులో చిన్నదైనా మహానటి వంటి సినిమాలో నటించింది అనేకంటే జీవించింది అనే సబబు అని అన్నారు. ఏదన్నా చేయాలనే పట్టుదల వుంటే సాధించి తీరతారని దానికి కీర్తీ సురేష్ నటనే తార్కాణమన్నారు. ఎన్నీఆర్,సావిత్రి వంటివారు పరిశ్రమలో రీప్లేస్ లేని వ్యక్తులన్నారు. అటువంటి పాత్రలను చేయటం ఒక సాహసమేననీ..ఆ సాహసం చేసి కీర్తి సురేష్ న్యాయం చేశారన్నారు. చిన్న పల్లెటూర్ లో పుట్టిన సావిత్రి మహానటి స్థాయికి చేరుకుని అనేక సమస్యలను ఎదుర్కొని ఆ స్థాయికి చేరుకోవటం ఆమె ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు తార్కారణమని చంద్రబాబు తెలిపారు. అలాగే ఆర్థికంగా అనేక ఇబ్బందులు, బాధలు పడుతున్నా ఆమె దానగుణాన్ని మాత్రం విస్మరించకుండా తన సహజమైన దాతృత్వాన్ని చాటిచెప్పారనీ..అది అందరికీ సాధ్యం కాదని..అలనాటి మహానటి, అద్భుతమైన నటి సావిత్రిని సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. 

12:19 - May 26, 2018
12:17 - May 26, 2018

శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్ష కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతు.. మే 26కు ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినరోజు అనే పవన్ కళ్యాణ్ తన దీక్షను చేపట్టారని రామకృష్ణ తెలిపారు. 2019 తరువాత సీఎంగా ముఖ్యమంత్రి వుండరనీ..అలాగే ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే 2019లో జనసేన అధికారంలోకి రావాలని..దానికి అందరు మద్దతునివ్వాలని శ్రీకాకుళంలోని పవన్ దీక్షా శిబిరంలో రామకృష్ణ పిలుపునిచ్చారు.ఇంతకాలం నుండి ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ఇంతవరకూ ఏ నాయకులు కన్నెత్తి కూడా చూడలేదనీ..2017లో వపన్ ఆ ప్రాంతంలో పర్యటించి ఆ సమస్యలను అందరికీ తెలిజేశారనీ..ఉద్దానం కిడ్నీ బాధిత సంఘ నేత ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో 12 రోజుల్లో 12 మంది చనిపోయిన రోజులు కూడా ఉద్ధానం ప్రాంతంలో చోటుచేసుకున్నాయని కిడ్నీ బాధితుల సంఘం నేత పేర్కొన్నారు. వందమంది వరకూ వచ్చి పవన్ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే సమయంలో కూడా ఇదే సమస్యతో ఇద్దరు చనిపోయారనీ అందుకే అందరం రాలేకపోయామని వారు వాపోయారు. ఈ సమస్యపై పోరాడటానికి తాము సిద్ధపడుతుంటే అధికారులతో చెప్పి ప్రభుత్వం అణవేసేందుకు ప్రేరేపిస్తున్నారని వారు తెలిపారు. 

పవన్ దీక్షకు పలువురు సంఘీభావం..

శ్రీకాకుళం : ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ బాధితుల సమస్యలకు తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్ష కు విశేషమైన మద్దతు లభిస్తోంది. దీక్షా శిబిరానాకి సీపీఎం, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శులు మధు,రామకృష్ణలు తమ సంఘీభావాన్ని తెలిపారు. అలాగే ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్స్ తరపున పవన్ దీక్షకు నల్లి ధర్మారావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు, శ్రీకాకుళం జిల్లా ఐద్వా నేత నాగమణి పవన్ కళ్యాణ్ దీక్షకు తమసంఘీభావం తెలిపారు. 

ఎన్డీయే విజయోత్సవ సభ..

గుంటూరు : సిద్ధార్థ గార్డెన్స్ లో ఎన్డీఏ నాలుగేళ్ళ విజయోత్సవ సభను బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. ఈ సభకు రాంమాధవ్,పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు, ఎమ్మల్సీలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ బాధ్యతలు స్వీకరించారు. 

11:29 - May 26, 2018
11:09 - May 26, 2018

నిజామాబాద్ : ఆర్మూరులో దళిత కుటుంబాలు బహిష్కరణకు గురయ్యాయి. భూ వివాదం నేపథ్యంలో 300ల దళిత కుటుంబాలు బహిష్కరణకు గురయ్యాయి. ఆర్మూరు గ్రామ అభివృద్ధి కమిటీ 300ల దళిత కుటుంబాలను బహిష్కరించింది. దశాబ్దాల నుండి శ్మశాన వాటికలో దహనం చేసుకుంటువుండేవారమనీ కానీ..కానీ విలేజ్ డెవలప్ మెంట్ వారు తమకు చెందిన సమాధుల్ని తొలగించారని దళితులు ఆరోపిస్తున్నారు. ఎస్సీ వర్గాల వారు విలేజ్ డెవలప్ మెంట్ లో వున్నవారిని కూడా కమిటీ మీటింగ్స్ లకు రావద్దని ఆదేశించారు. ఇది గవర్నమెంట్ స్థలం కాబట్టి మీరు ఇక్కడ అంత్యక్రియలవంటి పనులు చేయకూడదని గ్రామకమిటీ వారు ఆంక్షలు విధించారని వారు ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు గ్రామకమిటీతో పోరాడతున్నారు. జరిగిన విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటంలేదనీ దళితసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో దళితులంతా ఆందోళన చేపట్టారు. 

కేసీఆర్ ను కలిసిన ఖమ్మం కార్పొరేటర్లు..

ఖమ్మం : నగర కార్పొరేటర్లు సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఖమ్మం కార్పొరేషణ్ మేయర్ పావలాల్ ను తొలగించాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. కార్పొరేషన్ పరిధిలో పనులు జరగకుండి మేయర్ అడ్డుకుంటున్నారని కార్పొరేటర్లు ఆరోపించారు. దీంతో మేయర్ పావ్ లాల్ ను తొలగించాలనీ..లేకుంటా తామంతా రాజీనామా చేస్తామని 36మంది కార్పొరేటర్లు తమ రాజీనామా పత్రాలతో కేసీఆర్ ను కలిసి తమ ఇబ్బందులు తెలిపారు.

 

10:48 - May 26, 2018

హైదరాబాద్ : అభివృద్ధి పనులు చేయాల్సిన మేయర్ అభివృద్దిని అడ్డుకుంటే..ఆప్పుడు కార్పొరేటర్లు ఏం చేయాలి? ఆ ప్రశ్న ఖమ్మం కార్పొరేటర్లు వచ్చింది. ఈ నేపథ్యంలో వారు సీఎం కేసీఆర్ ను కలిసారు. ఈ మేయర్ మాకొద్దు అంటున్నారు. తాము చేస్తున్న అభివృద్ధి పనులను మేయర్ అడ్డుకుంటున్నాడనీ తెలిపారు. ఈ క్రమంలో ఖమ్మం కార్పొరేటర్లు సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఖమ్మం కార్పొరేషన్  మేయర్ పావలాల్ ను తొలగించాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. కార్పొరేషన్ పరిధిలో పనులు జరగకుండి మేయర్ అడ్డుకుంటున్నారని కార్పొరేటర్లు ఆరోపించారు. దీంతో మేయర్ పావ్ లాల్ ను తొలగించాలనీ..లేకుంటా తామంతా రాజీనామా చేస్తామని 36మంది కార్పొరేటర్లు తమ రాజీనామా పత్రాలతో కేసీఆర్ ను కలిసి తమ ఇబ్బందులు తెలిపారు.  

10:32 - May 26, 2018

శ్రీకాకుళం : ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జనసేనాని పవన్‌ కల్యాణ్‌ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్ర 5 గంటల నుంచి ఎచ్చెర్లలోని దాట్లా రిసార్టులో ప్రారంభించిన నిరాహార దీక్షను నేడు జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పవన్‌ కొనసాగిస్తున్నారు. ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 5 వరకు దీక్ష చేయనున్నారు. పవన్‌ దీక్షకు మద్దతుగా అన్ని జిల్లా కేంద్రాల్లో జనసేన నాయకులు కూడా దీక్షలకు దిగుతున్నారు. జనసేన అధినేత దీక్షకు వామపక్షాలు సంఘీభావం ప్రకటించాయి. ఈనేపథ్యంలో వామపక్ష నేతలు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ పవన్ కళ్యాణ్ ను కలిసి తమ సంఘీభావం ప్రకటించనున్నారు.

ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన పవన్ కళ్యాణ్ ..
ఉద్ధానం కిడ్నీ సమ్యల విషయంలో తాను తీవ్రంగా ఆవేదన చెందాననీ..ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడుకి అమెరికా వైద్యులను పరిచయం చేశారని అయినా కిడ్నీ సమ్యలపై ప్రభుత్వం తాత్కాలిక పనులు చేసిన చేతులు దులుపుకుందని పవన్ విమర్శించారు. 48 గంటల్లో ఈ సమస్యపై స్పందించకుంటే తాను నిరాహార దీక్ష చేస్తానని పవన్ తెలిపారు. దీనిపై ప్రభుత్వ నుండి ఎటువంటి ప్రకటనా రానందున పవన్ తన దీక్షను ప్రారంభించారు. మరోవైపు ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం దేశ, విదేశీ వైద్యులు, పరిశోధకులతో పరీక్షలు నిర్వహించడంతో పాటు మందుల పంపిణీ, డయాలసిస్ చేపట్టామని సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు తెలిపారు. అలాగే టీడీపీ నేతలు కూడా ఉద్దానం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొంటున్నారు.

 

నేడు సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు..

ఢిల్లీ: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. విద్యార్థులు cbseresults.nic.in, cbse.examresults.net కి లాగిన్ అయి తమ ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇటీవల సీబీఎస్‌ఈ పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకోవడంతో..ఓ పరీక్షను తిరిగి నిర్వహించాల్సి వచ్చిన విషయం తెలిసిందే.

పడవ ప్రమాదంలో తల్లీ కమార్తె మృతి..

అమరావతి : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అబ్బురాజుపాలెం వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. కృష్ణానదీలో చేపల వేటకు వెళ్లిన తల్లీకూతుళ్లు బోటు ప్రమాదంలో మృతి చెందారు. నిన్న అర్ధరాత్రి సమయంలో సైదారాజ్ అతని భార్య మాధవి, కూతురు కావ్య వేటకు వెళ్లిన పడవ ఇసుక రీచ్ ల మధ్యలో ఉన్న డ్రెజ్జర్ ను ఢీకొట్టి మునిగిపోయింది. సైరారాజు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే అతని భార్య మాధవి, కూతురు కావ్య గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు,రెస్క్యూ టీం మృతదేహాల కోసం గాలింపు కొనసాగిస్తున్నది.

09:52 - May 26, 2018
09:50 - May 26, 2018

గుంటూరు : రోడ్డుమీద వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరగటం సర్వసాధారణంగా మారిపోయింది. కానీ నీటిలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయా? అనే ప్రశ్న తలెత్తుతుంది. కానీ అటువంటి  ఘటన కృష్ణానది లో జరిగింది. రెండు పడవలు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు మృతి చెందారు. బోరుపాలెంలోని కృష్ణానదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. చేపల వేట కోసం వెళ్లిన మత్స్యకారుల పడవను ఓ ఇసుక బోటు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ, కుమార్తెలు మృతి చెందారు. దీంతో ఈదుకుంటు తండ్రి ఒడ్డుకు చేరుకోగా తల్లీ, కుమార్తెలు మాత్రం నీట మునిగి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతులిద్దరు ఇబ్రహీంపట్నంకు చెంబదిన మాధవి, కావ్యలుగా గుర్తించారు. 

09:36 - May 26, 2018

తూర్పుగోదావరి : పిఠాపురంలో కిడ్నాప్ కలకలం రేగింది. ఓ రైల్వే ఉద్యోగి కిడ్నాప్ కు గురయిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. రైల్వే ఉద్యోగి ముమ్మిడి సుబ్రమణ్యం కిడ్నాప్ కు గురయ్యాడు. కొందరు దుండగులు రాత్రి 11.00 గంటల ప్రాంతంలో గోపాలబాబా ఆశ్రమం సమీపంలో వున్న సుబ్రమణ్య ఇంటిలో ప్రవేశించి సుబ్రమణ్యాన్ని కిడ్నాప్ చేసేందుకు యత్నించగా భార్య సుబ్బలక్ష్మి అడ్డుకుంది. దీంతో దుండగులు సుబ్బలక్ష్మిపై దారుణంగా కత్తులతో దాడికి దిగారు..చేతులు, మెడ నరికేందుకు దుండగులు యత్నించి సుబ్రమణ్యాన్ని కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తోంది. ఓ వాహనంలో వచ్చిన దుండగులు సుబ్రమణ్యాన్ని సామర్లకోటవైపు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. బిలాస్ పూర్ లో సుబ్రమణ్యం విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో బిలాస్ పూర్ లో ఎవరితోనైనా వివాదాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. అలాగే బస్ స్టాప్ లో వుండే సీసీ పుటేజ్ అధారంగా ఆచూకీ కోసం పోలీసులు యత్నిస్తున్నారు. కాగా సుబ్బలక్ష్మి పరిస్థితి విషమంగా వున్నట్లుగా సమాచారం. దీంతో బాధితురాలిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ప్రశాంతంగా వుండే పిఠాపురంలో ఈ కిడ్నాప్ తో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

 

రైల్వే ఉద్యోగి కిడ్నాప్ కలకలం..

తూర్పుగోదావరి : పిఠాపురంలో కిడ్నాప్ కలకలం రేగింది. ఓ రైల్వే ఉద్యోగి కిడ్నాప్ కు గురయిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. రైల్వే ఉద్యోగి ముమ్మిడి సుబ్రమణ్యం కిడ్నాప్ కు గురయ్యాడు. కొందరు దుండగులు రాత్రి సుబ్రమణ్యం ఇంట్లోకి చొరబడి భార్యను కొట్టి సుబ్రమణ్యాన్ని అపహరించుకుని వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో బాధితురాలిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

300ల దళిత కుటుంబాలు బహిష్కరణ..

నిజామాబాద్ : ఆర్మూరులో దళిత కుటుంబాలు బహిష్కరణకు గురయ్యాయి. భూ వివాదం నేపథ్యంలో 300ల దళిత కుటుంబాలు బహిష్కరణకు గురయ్యాయి. ఆర్మూరు గ్రామ అభివృద్ధి కమిటీ 300ల దళిత కుటుంబాలను బహిష్కరించింది. దీంతో దళితులంతా ఆందోళన చేపట్టారు. 

08:57 - May 26, 2018

విజయవాడ : మూలిగే నక్కమీద తాటిపండు పడినట్టు తయారైంది ఏపీఎస్‌ ఆర్టీసీ పరిస్థితి. పెరిగిన డీజిల్‌ ధరలతో సంస్థ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. పొదుపు చర్యలతో నష్టాలను పూడ్చుకోడానికి ఆపసోపాలు పడుతున్న ఆర్టీసీకి పెట్రోధరలు శరాఘాతంగా మారాయి. పరిస్థితి ఇలాగే ఉంటే టికెట్‌ చార్జీలు పెంచక తప్పదని యాజమాన్యం అంటోంది.

పెరుగుతున్న డీజిల్ ధరలతో కుదేలవుతున్న ఏపీఎస్‌ ఆర్టీసీ..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా పెంచుతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ కుదేలవుతోంది. ఆర్టీసీ అభివృద్ధికి యాజమాన్యం తీసుకుంటున్న చర్యలకు.. డీజిల్ ధరలు తూట్లు పొడుస్తున్నాయి. గత రెండు మాసాల్లోనే డీజిల్ పై లీటరుకు ఐదు రూపాయలు పెరగడంతో ఆర్టీసీకి పెనుభారంగా మారింది. దీంతో నెలకు పండున్నర కోట్ల మేర ఆర్టీసీపై అదనపు భారం పడుతోందని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏడాది మొత్తం మీద నూటా యాభై కోట్ల మేర అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.

నాలుగు వందలా యాభై కోట్ల మేర నష్టం..
గతేడాది ఆర్టీసీకి సుమారు నాలుగు వందలా యాభై కోట్ల మేర నష్టం రాగా.. ఇందులో యాభై శాతం నష్టాలు డీజిల్ ధరలు పెరగడంతోనే వచ్చాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.. అంతర్గ సామర్థ్యాలు ఎంత పెంచుకున్నా.. విపరీతంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కలేకపోతోందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఆర్టీసీపై పడుతున్న భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ సర్కార్ ఆర్టీసీ సంస్థకు రాయితీలు కల్పించాలని కోరుతున్నారు.

డీజిల్ ధరల ఎఫెక్ట్ తో ట్రిప్స్ తగ్గించిన ఆర్టీసీ..
డీజిల్ ధరల భారాన్ని తట్టుకోలేక ఆర్టీసీ పలు రూట్లలో ట్రిప్పులు తగ్గించేసింది. ఈ లెక్కన రోజుకు 40 వేల కిలోమీటర్ల మేర బస్ లు నడపడాన్ని తగ్గించారు. లాభనష్టాలు బేరీజు వేసుకుని రూట్లలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగానే బస్ సర్వీసులను నడుపుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల లోపు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు రద్దీ సమయాల్లో మాత్రమే బస్సులు నడుపుతున్నారు. ఇలా అరకొరగా నడపడంతో బస్సులు ప్రయాణీకుల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. గంటలకొద్దీ బస్టాపుల్లో ప్రయాణీకులు పడిగాపులు పడాల్సి వస్తోంది.

డీజిల్‌ ధరలతో కుదేలవుతోందన్న ఆర్టీసీ..
ఆదాయం అంతంత మాత్రమే ఉన్న ఆర్టీసీ డీజిల్‌ ధరలతో కుదేలవుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీని బతికించాలంటే... చార్జీలు పెంచక తప్పదని అధికారులు యోచిస్తున్నారు. ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి డీజిల్ రేట్ల పుణ్యమా అని ఆర్టీసీ మరింత నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. 

08:52 - May 26, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రైతులందరికీ ఐదు లక్షల రూపాయల జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. దేశచరిత్రలోనే ఇలా అన్నదాతకోసం అద్వితీయ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత తమదేనన్నారు సీఎం కేసీఆర్.

తెలంగాణలో మరో వినూత్న పథకం
తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం మరో ముందడుగు వేస్తోందన్నారు సీఎం కేసీఆర్‌. ఖర్చు ఎక్కువైనాసరే.. సాధారణ మరణాలకు కూడా వర్తించే విధంగా జీవిత బీమా చేయాలని నిర్ణయించామని చెప్పారు. రైతన్నకు జీవిత బీమా పథకం రూపకల్పనపై ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

జీవిత బీమా పథకం ప్రారంభించి, సర్టిఫికెట్లు అందిస్తాం : కేసీఆర్
ఈ ఏడాది ఆగస్టు 15న రైతన్నలకు జీవిత బీమా పథకం ప్రారంభించి, సర్టిఫికెట్లు అందిస్తామన్నారు తెలంగాణ సీఎం. రైతుకు భారం లేకుండా ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. ఇందుకోసం బడ్జెట్లో నిధులు కేటాయించి, ప్రతీ ఏటా ఆగస్టు 1 నాడే చెల్లిస్తామని తెలిపారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ ద్వారా దీన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. రైతు సాధారణ మరణంతో సహా.. ఏ కారణంతో చనిపోయినా.. ఆయన నామినీకి పది రోజుల్లోగా ఐదు లక్షల రూపాయలు అందుతుందని స్పష్టం చేశారు.

ఆధార్ కార్డుపై ఉన్న పుట్టిన తేదీని ప్రామాణికంగా బీమా నిబంధలు..
బీమా సంస్థల నిబంధనల ప్రకారం ఈ పథకానికి 18 నుంచి 59 ఏళ్ళలోపు రైతుల పేర్లను పరిగణలోకి తీసుంటారు. ఆధార్ కార్డుపై ఉన్న పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రతీ ఏడాది కూడా ఆగస్టు 15 వ తేదీని ప్రామాణికంగా తీసుకుని పేర్లను నమోదు చేసుకుంటారు. దాని ప్రకారమే ప్రభుత్వం రైతుల జాబితాను రూపొందించి, ప్రీమియం చెల్లిస్తుంది. ప్రతీ రైతుకు ప్రభుత్వం, ఎల్ఐసీ సంయుక్తంగా బీమా సర్టిఫికెట్‌ను అందచేస్తారు. రైతు నుంచి నామినీని ప్రతిపాదించే పత్రం తీసుకుని... దాని ప్రకారమే బీమా సొమ్ము చెల్లిస్తారు. రైతు కుటుంబ సభ్యులు కేవలం మరణ ధృవీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది. పదిరోజుల్లోగా సొమ్ము చెల్లించకుంటే బీమా సంస్థకు జరిమానా విధిస్తారు.

అమలు చేస్తేనే.. ఆశయం నెరవేరుతుంది : రైతులు
దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డ్‌ అంటూ.. సీఎం కేసీఆర్‌ రైతు బీమా పథకాన్నిఅట్టహాసంగా ప్రకటించారు. కానీ... అక్రమాలకు తావు లేకుండా అమలు చేస్తేనే.. ఆశయం నెరవేరుతుందని అన్నదాతలు అంటున్నారు.

08:48 - May 26, 2018

హైదరాబాద్ : వీకెండ్‌లో హైదరాబాద్‌ రోడ్లపై మందుబాబులు రెచ్చిపోయారు. పీకలదాకా మందుకొట్టి అర్థరాత్రి దాటాక బైక్‌లపై షికార్లు చేస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌ ఏరియాలో నిర్వహించిన డ్రంక్‌అండ్‌ డ్రైవ్‌ తనిఖీలో ఏకంగా 113 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ తనిఖిల్లో 81 ద్విచక్ర వాహనాలు, 32 కార్లను సీజ్‌ చేశారు. 

08:45 - May 26, 2018

శ్రీకాకుళం : ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జనసేనాని పవన్‌ కల్యాణ్‌ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్ర 5 గంటల నుంచి ఎచ్చెర్లలోని దాట్లా రిసార్టులో ప్రారంభించిన నిరాహార దీక్షను నేడు జిల్లా కేంద్రంలో పవన్‌ కొనసాగిస్తున్నారు. ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 5 వరకు దీక్ష చేయనున్నారు. పవన్‌ దీక్షకు మద్దతుగా అన్ని జిల్లా కేంద్రాల్లో జనసేన నాయకులు కూడా దీక్షలకు దిగుతున్నారు. జనసేన అధినేత దీక్షకు వామపక్షాలు సంఘీభావం ప్రకటించాయి. 

08:43 - May 26, 2018

నెల్లూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లకూరు సమీపంలో రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. తుఫాను జీపును ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో మూడు సంవత్సరాల చిన్నారి కూడా ఉంది. గుంటూరుజిల్లా వినుకొండకు చెందిన వారు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని నాయుడు పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

08:37 - May 26, 2018

జనసేనాని పవన్‌కల్యాణ్‌ నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రానికి తక్షణమే ఆరోగ్య మంత్రిని నియమించాలన్న తన డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించక పోవడంతో.. ఆయన నిరశనకు దిగారు. ఇవాళ.. శ్రీకాకుళం ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌడ్స్‌లో దీక్షకు దిగుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంట వరకు పవన్‌ దీక్ష కొనసాగించనున్నారు. పవన్‌ దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జనసేన దీక్షలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో అసలు ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలు ఎందుకొస్తున్నాయి? పవన్ దీక్ష ప్రభుత్వాన్ని కదిలిస్తుందా? దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందా? అనే అంశాలపై 10టీవీ న్యూస్ మర్నింగ్ లోచర్చ.. ఈచర్చలో ప్రముఖ విశ్లేషకులు వినయ్ కుమార్, టీడీపీ, జనసేనత నేతలు పాల్గొన్నారు.

08:28 - May 26, 2018

పశ్చిమబెంగాల్ : ఐపీఎల్‌ ఫైనల్లోకి హైదరాబాద్‌ దూసుకెళ్లింది. శుక్రవారం రాత్రి ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో కోల్‌కతా ను మట్టికరిపించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించిన సన్‌రైజర్స్‌ గ్రాండ్‌గా ఫైనల్లోకి ఎంటర్‌ అయ్యారు. ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో హైదరాబాద్‌ తలపడనుంది.

చెలరేగిపోయిన సన్ రైజర్స్..
ఈడెన్‌గార్డెన్స్‌లో సన్‌రైజర్స్‌ చెలరేగిపోయారు. పదునైన బౌలింగ్‌తో నైట్‌రైడర్స్‌కు చుక్కలు చూపించారు. 13 పరుగుల తేడాతో విజయం సాధించిన హైదాబాద్‌ టీం.. ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఓపెనర్లు జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి 40 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే సిద్ధార్థ్‌ కౌల్ వేసిన నాలుగో ఓవర్‌లో నరైన్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి బ్రాత్‌వైట్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రషీద్ వేసిన 9వ ఓవర్ మూడో బంతికి రానా రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత రషీద్ బౌలింగ్‌లోనే ఉతప్ప్‌ 2పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

జట్టును ఆదుకునేందుకు గిల్ యత్నం..
కెప్టెన్ దినేశ్ కార్తీక్ 8 పరుగులు చేసి షకీబ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో లిన్ పట్టు వదలకుండా బ్యాటింగ్ చేశాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు కొట్టి 48 పరుగులు చేశాడు. కానీ రషీద్ వేసిన 13వ ఓవర్ 2 బంతికి ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. రషీద్ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో లిన్ స్లిప్‌లో ఉన్న ధవన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో కోల్‌కతా కష్టాల్లోపడింది. కష్టాల్లోపడ్డ జట్టును శుభ్‌మాన్ గిల్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. సన్‌రైజర్స్ బౌలింగ్‌ని ధీటుగా ఎదురుకుంటూ.. మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు. అయితే ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు కావాల్సి ఉండగా.. బ్రాత్‌వైట్ బంతులకు మావీ, గిల్‌లు వరుసగా పెవిలియన్ కు చేరారు. దీంతో సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో 13 పరుగల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. అటు బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రషీద్ ఖాన్‌కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈనెల 27న ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ తలపడనుంది. 

08:23 - May 26, 2018

నల్లగొండ : ట్రాఫిక్ సమస్యలు పాటించకపోవటంతో పలు ప్రమాదాలకు లోనవుతున్న సందర్బాలు అనేకం జరుగుతున్నాయి. రోడ్డుపై వాహనదాలరు పాటించాల్సిన నిబంధలను ఖాతరు చేయకపోవటంతోవారితో పాటు పరుల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నారు కొందరు. దీంతో చాలా సందర్భాలలో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్న దారుణమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో ప్రమాదానికి కారణమయ్యింది. కట్టంగూరు మండలం ఐటిపాముల సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. కోళ్లలోడుతో వస్తున్న వోల్వో వ్యాన్ ఇసుక లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం క్యాబిన్ లో ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోయారు. నాలుగు గంటలు శ్రమించి క్రేన్ సహాయంతో పోలీసులు బైటికి తీసారు. వీరిలో ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషయంగా వుంది. దీంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదానికి వినాయక ట్రావెల్ బస్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. 

ఇసుకలో చిక్కుకుని ఒకరు మృతి..

నల్లగొండ : కట్టంగూరు మండలం ఐటిపాముల సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. వోల్వో వ్యాన్ ఇసుక లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం క్యాబిన్ లో ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోయారు. నాలుగు గంటలు శ్రమించి క్రేన్ సహాయంతో పోలీసులు బైటికి తీసారు. వీరిలో ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషయంగా వుంది. దీంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

బావిలో ఈతకు వెళ్లి చిన్నారులు మృతి..

సూర్యాపేట : నూతలన్ కల్ మండలం తాళ్ల సింగారంలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి 12 సంవత్సరాల మధు, 13 సంవత్సరాల తరుణ్ ఇద్దరు చిన్నారులు బావిలో మృతి చెందారు. గల్లంతయ్యారు. నిన్న అర్థరాత్రి అనతరం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎట్టకేలకూ వారి మృతదేహాలను స్థానికులు బావిలోనుండి వెలికితీశారు. 

07:49 - May 26, 2018

కెనడా : దేశంలోని భారతీయ రెస్టారెంట్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. టొరంటో నగర శివారులోని మిస్సిస్వాగాలోని 'బాంబే బెల్‌' రెస్టారెంట్‌లో గురువారం రాత్రి పదిన్నరకు పేలుడు సంభవించింది. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు టోరొంటోలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్వీట్‌ చేశారు. గత నెలలో టొరంటోలో ఓ దుండగుడు వ్యాన్‌తో జనసమూహంపైకి దూసుకెళ్లిన ఘటనలో 10 మంది మృతి చెందగా.. 15 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే.

07:45 - May 26, 2018

ఉత్తరాఖండ్‌ : సిక్కు పోలీస్‌ అధికారి హిందుత్వ కార్యకర్తల మూకుమ్మడి దాడి నుంచి ఓ ముస్లింను రక్షించిన ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. రామ్‌నగర్‌ టెంపుల్‌ వద్ద ఓ ముస్లిం వ్యక్తి తన స్నేహితురాలైన హిందూ మహిళతో సన్నిహితంగా ఉండడం కొందరి కంట పడింది. అంతే... హిందుత్వ మూకలు మూకుమ్మడిగా వెళ్లి ముస్లిం వ్యక్తిపై దాడికి దిగాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీస్‌ అధికారి గగన్‌దీప్‌ సింగ్‌ వెంటనే అప్రమత్తమై ఆ సమూహం నుంచి ముస్లిం వ్యక్తిని కాపాడాడు. అతడిని దగ్గరగా తీసుకుని సురక్షితంగా బయటకు తీసుకెళ్లిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై హిందూ మూకలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముస్లిం వ్యక్తిని ధైర్యంగా కాపాడిన పోలీస్‌ అధికారిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

07:39 - May 26, 2018

ఢిల్లీ : మేజర్‌ లీతుల్‌ గొగోయ్‌ తప్పు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. గోగోయ్‌పై వచ్చిన ఆరోపణలో నేపథ్యంలో ఆర్మీలో ఎంతటి ర్యాంకు ఉన్న అధికారులైనా సరే తప్పు చేసినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని రావత్‌ హామీ ఇచ్చారు. గత ఏడాది కశ్మీర్‌లో ఉప్పఎన్నిక సందర్భంగా గొగోయ్‌ ఓ వ్యక్తిని జీపుకు కట్టేసి తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. శ్రీనగర్‌లోని ఓ హోటల్‌లో కశ్మీరీ మహిళ గొగోయ్‌ను కలిసేందుకు పోలీసులు అనుమతించకపోవడం కూడా వివాదానికి దారి తీసింది. పాకిస్తాన్‌ నిజంగా శాంతినే కోరుకుంటే సరిహద్దు నుంచి ఉగ్రవాదుల చొరబాటును ఆపాలని ఆర్మీ చీఫ్‌ అన్నారు.

07:37 - May 26, 2018

తమిళనాడు : తుత్తుకూడి కాల్పుల ఘటనపై శుక్రవారం విపక్షాలు నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్‌ కారణంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. షాపులు మూసివేశారు. స్టెరిలైట్‌ కాపర్‌ ప్లాంట్‌ను మూసివేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు.

స్టెరిలైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళనకారుల పోరాటం..
తూత్తుకుడిలో స్టెరిలైట్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ తమిళనాడులో విపక్షాలు బంద్‌ నిర్వహించాయి. డిఎంకే, కాంగ్రెస్‌, వామపక్షాలతో పాటు 11 పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. బంద్‌ సందర్భంగా దుకాణాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. బస్సులు, ప్రయివేట్‌ వాహనాలు కూడా తిరగకపోవడంతో రోడ్లు నిర్మాణుష్యంగా కనిపించాయి. ప్రయాణికులు లేక బస్టాండ్‌లు వెల వెల పోయాయి. పోలీసుల భద్రతతో కొన్ని చోట్ల బస్సులు నడిపారు. బంద్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది.నిరసనకారులు వేదాంత స్టెరిలైట్‌ కంపెనీకి వ్యతిరేకంగా పోస్టర్లను ప్రదర్శించారు.

పోలీసుల కాల్పుల్లో 13 మంది మృతి..
కాల్పుల ఘటనను నిరసిస్తూ ఆందోళనకారులు మార్చ్‌ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి వేదాంత కంపెనీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కాంచీపురంలోని మధురాంతకంలో ఆందోళనకు దిగిన డిఎంకె వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చెన్నైలోని ఎగ్మోర్‌ రైల్వే స్టేషన్‌ ఎదుట డిఎంకె ఎంపి కనిమొజితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు నేతలు ఆందోళన చేశారు. స్టెరిలైట్‌ కాపర్‌ ప్లాంట్‌ను మూసివేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. మధురైలో సిపిఎం, డివైఎఫ్‌ఐ కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు.తూత్తుకూడిలో శుక్రవారం ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోలేదు.తూత్తుకూడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ విస్తరణకు వ్యతిరేకంగా జరిపిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. మరో 70 మంది గాయపడ్డారు.

07:32 - May 26, 2018

అమరావతి : మార్వాడీలకు మంత్రి కళా వెంకటరావు క్షమాపణలు చెప్పాలన్నారు బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు. టీడీపీ అవసరాల కోసం ఎవరితోనైనా రాజకీయాలు చేస్తుందని ఆయన విమర్శించారు. తిరుమల శ్రీవారిని కూడా రాజకీయాల్లోకి లాగారని ఎద్దేవా చేశారు. బీజేపీపై విమర్మలు చేస్తున్న మంత్రి గంటా వచ్చే ఎన్నికల్లో టీడీపీలో ఉంటారా ? అని ప్రశ్నించారు. ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని గంటా శ్రీనివాసరావు బీజేపీ నేతలపై అరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు విష్ణుకుమార్‌రాజు. 

07:29 - May 26, 2018

హైదరాబాద్ : తనను పార్టీ నుంచి గెంటేసే కుట్ర జరుగుతుందన్నారు టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు గవర్నర్‌ పదవి ఇస్తానని చెప్పి.. ప్రత్యేక హోదా ఉద్యమం నడుస్తుందని ఆపించడం నిజం కాదా ? అని ప్రశ్నించారు. 30 ఏళ్లు పార్టీ కోసం నిజాయితీగా పని చేస్తే... తనకు మాట్లాడేందుకు చంద్రబాబు 5 నిమిషాలు సమయం ఇవ్వడం లేదని.. అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా అవమానపరుస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. 

07:27 - May 26, 2018

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామని... ప్రజల భాగస్వామ్యంతోనే విశ్వనగరంగా తీర్చిదిద్దగలమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని నిజాంపేటలో 'మన నగరం' కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చే నాలుగు నెలల్లో రాష్ట్రంలో 56 రిజర్వాయర్‌లు పూర్తి చేసి 150 లీటర్లు ప్రతి మనిషికి అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మూసి సుందరీకరణను యుద్ధప్రతిపాదికన చేపట్టామన్నారు. 

07:25 - May 26, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. వంద మంది నేతలు ఇవాళ రాహుల్ గాంధీ నివాసంలో ఉత్తమ్‌కుమార్‌ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాహుల్ గాంధీ. ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు మదన్ మోహన్ రావు, తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు సంగం రెడ్డి ప్రుథ్వీరాజ్, ఉపాధ్యాయ సంఘం నేత హర్షవర్దన్‌లు కాంగ్రెస్‌లో చేరారు. వీరికి సాదరంగా ఆహ్వానం పలికారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్‌ బలపడుతోందని 2019 ఎన్నికల్లో గెలిచే దిశగా కాంగ్రెస్‌ కృషి చేస్తుందని ఉత్తమ్‌కుమార్‌ తెలిపారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పలు వాహనాలు సీజ్..

హైదరాబాద్ : నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టటం..పలువురు దొరికిపోవటం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో రాత్రి కూడా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో మద్యం తాగి వాహనం నడిపిన113మందిపై కేసులు నమోదు చేశారు. అనంతరం 81 ద్విచక్ర వాహనాలను,31 కార్లను పోలీసులు సీజ్ చేశారు.  

రోడ్డు ప్రమాదంలో 4గురు మృతి..

నెల్లూరు : పెళ్లకూరు జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. తుపాను వాహనాన్ని, ఓ జీపు ఓ ప్రయివేటు బస్ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

ఆక్వా ఎగుమతుల సమస్యలపై సమీక్ష : చంద్రబాబు

అమరావతి : రాష్ట్రంలో ఆక్వా ధరల పతనం, రైతుల సమస్యలపై అధికారులతో సమీక్షించాం. ఆక్వా ఎగుమతుల వల్ల విదేశీ వాణిజ్యం పొందే కేంద్రం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ఈ నెల 26న ఆక్వా రైతులు, ఎగుమతిదారులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలని నిర్ణయించాం’ అని చంద్రబాబు తెలిపారు.

ఉద్దానం బాధితుల కోసం అన్ని వైద్యసేవలు : చంద్రబాబు

అమరావతి : శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం దేశ, విదేశీ వైద్యులు, పరిశోధకులతో పరీక్షలు నిర్వహించడంతో పాటు మందుల పంపిణీ, డయాలసిస్ చేపట్టామని చంద్రబాబు తెలిపారు.

నా తప్పేంటో చెప్పండి : మోత్కుపల్లి

హైదరాబాద్ : తాను చేసిన తప్పేంటో చెబితే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మహానాడుకు తనను ఆహ్వానించకపోవడంపై గత రెండు రోజులుగా అసంతృప్తిగా ఉన్న ఆయన శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తనను పిలిచి మాట్లాడి ఉంటే అన్నీ చెప్పే వాడినన్న ఆయన, పార్టీలో సీనియర్‌ను అయినా, దళితుడిని కాబట్టే పిలవలేదా? అని ప్రశ్నించారు. తాను ఇప్పటికీ చంద్రబాబు పక్షమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీకి జరుగుతున్న నష్టంపై మాట్లాడాలని అనుకుంటే అవకాశం ఇవ్వడం లేదని మోత్కుపల్లి వాపోయారు.  

చేతల పీఎం కాదు కూతల పీఎం: తులసిరెడ్డి

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ నేత తులసి రెడ్డి విమర్శలు సంధించారు. ప్రధాని నరేంద్రమోదీ చేతల పీఎం కాదు, కూతల పీఎం, ఇది 24 క్యారెట్ల బంగారం కాదు రోల్డ్ గోల్డ్, ఆయన ఆమ్ ఆద్మీ మ్యాన్ కాదు అంబానీ, ఆదానీ మ్యాన్ అని సామాన్యుడు అనుకుంటున్నాడు. 2014లో నరేంద్ర మోదీ పేరు వింటే చాలు, ‘నమో నమో’ అని పూనకం వచ్చేలా యువత ఊగేవారు. కానీ, ఈనాడు నరేంద్ర మోదీ పేరు వింటుంటే యువతకు కంపరం ఎత్తుతోంది. అచ్చే దిన్ వస్తాయనుకుంటే చచ్చే దిన్ వచ్చాయని ప్రజలు అనుకుంటున్నారని తులసిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Don't Miss