Activities calendar

27 May 2018

22:03 - May 27, 2018

టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తో టెన్ టివి  ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. టీటీడీ ఛైర్మన్ పదవికంటే మైదుకూరు ఎమ్మెల్యే పదమే ముఖ్యమా ? యనమల చెప్పినందుకే పదవి వచ్చిందా..? రమణదీక్షితులు వాదనలో కొన్ని వాస్తవాలున్నాయా ? యాదవులకు పదవులు రావడం కొన్ని కులాలకు ఇష్టం లేదా ? ఈ అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

21:40 - May 27, 2018

అభ్యుదయ సినీనటుడు, రెడ్‌స్టార్‌ మాదాల రంగారావు కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మాదాల రంగారావు మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఏపీ ప్రజానాట్య మండలి నాయకులు, రచయిత కందిమల్ల ప్రతాప్ రెడ్డి, ఫిల్మ్ డైరెక్టర్ బాబ్జి, డైరెక్టర్, ప్రొడ్యూసర్ దవల సత్యం పాల్గొని, మాట్లాడారు. మాదాల రంగారావు మృతి బాధాకరమన్నారు. భౌతికంగా ఆయన దూరమైనా.. ప్రజల్లో చిరస్థాయిగా నిలివుంటారని అన్నారు. మాదాల రంగారావుతో ఉన్న అనుబంధాన్ని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

అనంతపురంలో జూనియర్ కాలేజీలో విషాదం

 అనంతపురం : నగరంలోని జూనియర్ కాలేజీలో విషాదం నెలకొంది. ఎగ్జిబిషన్ లో జెయింట్ వీల్ విరిగి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ విజయలక్ష్యం 179 పరుగులు

ఐపీఎల్ 11 : చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత వోవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ విజయలక్ష్యం 179 పరుగులు. 

ఆక్వా పార్కును సముద్ర తీరప్రాంతానికి మారుస్తాం : జగన్

ప.గో : జిల్లాలో వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. భీమవరంలో వైఎస్ జగన్ బహిరంగ సభ నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే ఆక్వా పార్కును సముద్ర తీరప్రాంతానికి మారుస్తామని జగన్ చెప్పారు. ఆక్వా పార్క్ వద్దని తుందుర్రు వాసులు నినదిస్తున్నారని పేర్కొన్నారు.
 

20:28 - May 27, 2018

మహానటి సినిమాలో తన మాటలతో ప్రాణం పోసిన డైలాగ్ రైటర్ బుర్రా సాయిమాధవ్ టెన్ టివి స్పెషల్ షో నిర్వహిచింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన సినిమా అనుభవాలను తెలిపారు. మహానటి సినిమాకు డైలాగ్స్ రాసేందుకు ఒప్పుకోవడం సాహసమే అన్నారు. డైలాగ్ లు రాస్తున్నప్పుడు క్యారెక్టర్ లోకి వెళ్లాలన్నారు. కిర్తీ సురేష్ ను చూసినప్పుడు అచ్చం సావిత్రలాగే ఉన్నది... అప్పుడు భావోద్వేగానికి లోనయ్యాయని తెలిపారు. సావిత్రి మద్యం తాగుతుందని ఎలా చూసిస్తారని ఓ కాలర్ ప్రశ్నించారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

18:54 - May 27, 2018

ఢిల్లీ : పథకాల ప్రచారంతో ప్రభుత్వం కోట్ల రూపాయలను వృథా చేస్తోందని కాంగ్రెస్ నీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రైతుబంధు పథకం ప్రచారం కోసం ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. రైతు బంధు పథకం సామాన్య, కౌలు రైతులకు ఉపయోగపడటం లేదని తెలిపారు. ప్రభుత్వం ఫీజు రియింబర్స్ మెంట్, డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి పథకాలను అమలు చేయటం లేదని విమర్శించారు. 

 

ప్రారంభమైన తెలంగాణ కేబినెట్‌ సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంత్రిమండలి సమావేశం జరుగుతోంది. మంత్రిమండలి సమావేశానికి మొత్తం 15 అంశాలతో అజెండాను రూపొందించారు. కొత్త జోనల్ విధానం, రైతుల జీవిత బీమా పథకం, కాళేశ్వరానికి అదనపు కేటాయింపులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన : సీఎం చంద్రబాబు

విజయవాడ : హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించారని సీఎం చంద్రబాబు విమర్శించారు. టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ లో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదన్నారు. తనపై నమ్మకంతోనే గత ఎన్నికల్లో ప్రజలు ఆదరించారని తెలిపారు. కష్టాలు తాత్కాలికమే అని అన్నారు. సమస్యలను అవకాశంగా మలుచుకున్నామని తెలిపారు. 

పదేళ్ల కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయం : సీఎం చంద్రబాబు

విజయవాడ : పదేళ్ల కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయం అని సీఎం చంద్రబాబు విమర్శించారు. టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడారు. వైఎస్ హయాంలో రాష్ట్రం అప్రతిష్టపాలైందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ప్రతి అరగంటకు రైతు ఆత్మహత్య జరిగిందన్నారు. 

15:36 - May 27, 2018

విజయవాడ : మహానాడు సభలో సీఎం చంద్రబాబు భావోద్వేగంగా ప్రసంగిచారు. భారతదేశంలో అభివృద్ధి పతంలో ఉన్న రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్‌ అనే అందుకు గర్విస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. విజయవాడలో మహానాడును విజయవంతం చేసిన కార్యకర్తలకు చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో క్రమశిక్షణ కల్గిన కార్యకర్తల కృషి వల్లే టీడీపీ పాలన సాగిస్తున్నదన్నారు. వెనుకబడిన తెలంగాణ నుంచి నేడు ప్రపంచ దేశాల్లో యువత ఉద్యోగాలు చేస్తున్నారంటే అది తమ కృషేనన్నారు. 

 

15:26 - May 27, 2018

హైదరాబాద్ : మాదాల రంగారావు భౌతికకాయానికి ప్రముఖ సినీ నటుడు చిరంజివి నివాళులర్పించారు. పరిశ్రమకు వచ్చిన కొత్తలో తనను ఎంతగానో ప్రోత్సహించారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. మాదాల రంగారావు మన మధ్య లేకోవడం చాలా తీవ్రమైన లోటు అన్నారు. మాదాల రంగారావు ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

15:24 - May 27, 2018

హైదరాబాద్ : ప్రముఖ నటుడు, విప్లవ సినిమాల నిర్మాత మాదాల రంగారావు కన్నుమూశారు.  కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న మాదాల రంగారావు... హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ మృతి చెందారు. విప్లవ భావాలున్న సినిమాలు తీసిన మాదాల రంగారావు... విప్లవ శంఖం, యువతరం కదిలింది, రెడ్‌స్టార్‌, మహాప్రస్థానం, ఎర్రమల్లెలు సినిమాలు తీశారు. మాదాల రంగారావు భౌతికకాయాన్ని ఫిలింనగర్‌లోని మాదాల రవి ఇంటికి తరలించారు. మాదాల భౌతికకాయాన్ని సందర్శించి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. 

 

15:13 - May 27, 2018

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ కేబినెట్‌ భేటీ జరుగనుంది. స్థానిక ఎన్నికలే లక్ష్యంగా కేబినెట్ సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం చూస్తోంది. స్థానిక ఎన్నికలను.. సార్వత్రిక ఎన్నికలకు రెఫరెండంగా ప్రభుత్వం భావిస్తోంది. సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని సీఎం నమ్ముతున్నారు. ఈ సమావేశంలో 7 జోన్లు,  రెండు మల్టీ జోన్లపై చర్చ జరుగనుంది. 

 

నవ్యాంధ్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం : సీఎం చంద్రబాబు

విజయవాడ : నవ్యాంధ్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడారు. తెలంగాణలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ఐటీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. 

 

మహానాడు తెలుగుజాతికే పండుగ : సీఎం చంద్రబాబు

విజయవాడ : మహానాడు తెలుగుజాతికే పండుగ అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ విజయానికి నాంది అన్నారు. రాబోయే రోజుల్లో అన్నింటా విజయం మనదే అని తెలిపారు. మహానాడుకు గతంలో ఎన్నడూ లేనంత స్పందన ఉందన్నారు. 70 లక్షల కార్యకర్తలు ఉన్న పార్టీ టీడీపీనే అని తెలిపారు. 

బీజేపీకి అదే గతి - బాబు...

విజయవాడ : హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన పాపం కాంగ్రెస్ దని అందుకే అధికారానికి ప్రజలు దూరం చేశారని టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మహానాడులో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆపై రాష్ట్రానికి చేస్తానన్న సాయం చేయకుండా అన్యాయం చేసిన బీజేపీకి అదే గతి పట్టనుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

కార్యకర్తలు లేకుంటే పార్టీ లేదు - బాబు...

విజయవాడ : 70 లక్షల మంది కార్యకర్తలున్న ఏకైక పార్టీ టీడీపీయేనని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మహానాడులో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఎంతో మంది కార్యకర్తల కష్ట ఫలితంగానే రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి పథంలో పయనిస్తోందని, కార్యకర్తలు లేకుంటే పార్టీయే లేదని అన్నారు. 

శ్రీవారి పోటు తవ్వకాలపై విచారణ అవసరం - ఐవైఆర్...

చిత్తూరు : శ్రీవారి ఆలయ పోటు తవ్వకాలపై విచారణ అవసరమని, అర్చకులపై కేసులు పెట్టాలనడం తెలివిలేని పని అని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. పాలకమండలి సభ్యులుగా అనిత నియామకంలో టిటిడి ప్రతిష్ట మంటగలిపారన్నారు. 

టిడిపిపై ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి అసంతృప్తి...

కర్నూలు : బనగాపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి టిడిపి అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. మహానాడుకు ఇతను దూరంగా ఉన్నాడు. టిడిపి కార్యక్రమాలను పూర్తిగా బహిష్కరించారు. 

12:17 - May 27, 2018

విజయవాడ : టిడిపి మహానాడు విజయవాడలో అట్టహాసంగా ప్రారంభమైంది. సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ ఆవరణలో మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్వి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుల్లెట్ ర్యాలీతో మహాసభ ప్రాంగణానికి చేరుకున్నారు. సమావేశం ప్రారంభంలో మరణించిన కార్యకర్తలు..నేతలకు సంతాపం తెలియచేస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా తెలంగాణ నివేదికను మహాసభలో పార్టీ నేల బుచ్చిలింగం ప్రవేశ పెట్టారు.

చలన చిత్ర వినీలకాశంలో వెలుగొందిన నందమూరి తారకరామారావు ఆధ్వర్యంలో టిడిపి పార్టీ ఆవిర్భవించిందన్నారు. పేద, బడగులు, బలహీన వర్గాల్లో వెలుగులు నింపిందని, 1987లో ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు మేలు కొల్పోవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారని తెలిపారు. అనంతరం సీఎం పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నో కార్యక్రమాలు చేశారని, దీని ఫలితంగా రాష్ట్ర ఖజానాకు ఎంతో డబ్బు వచ్చిందన్నారు. హైటెక్ సిటీ తదితర నిర్మాణాలకు పూనుకోవడం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగిందన్నారు. యునెటైడ్ ఫ్రంట్ లో భాగస్వామ్యంగా ఉన్న బాబు పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారన్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వేలాది మంది కార్యకర్తలతో మహానాడు నిర్వహించడం జరిగిందన్నారు. ఇటీవలే కార్యకర్తల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. 76 నియోజకవర్గాల్లో పల్లె పల్లెకు టిడిపి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా 841 కేంద్రాల్లో అన్నదానాలు, రక్తదానాలు నిర్వహించడం జరిగిందని, బాబు జన్మదినాన 640 కేంద్రాలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్ర పూర్వ వైభవం కోసం కార్యకర్తలు, నేతలు కృషి చేస్తున్నారని, టీఆర్ఎస్ పాలన వైఫల్యాలను ప్రజల సమయంలో ఎండగట్టడం జరిగిందన్నారు. మిర్చి, కందుల పంటలకు మద్దతు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు..ఆందోళనలు నిర్వహించడం జరిగిందన్నారు. చింతమడకలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని సందర్శించడం జరిగిందన్నారు. 

తిరుమల కొండపై రద్దీ...

చిత్తూరు : తిరుమల కొండపై ఆదివారం రద్దీ కనిపిస్తోంది. ఆదివారం ఉదయం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించిన వారికి 36 గంటల తరువాత మాత్రమే స్వామి దర్శనం లభిస్తుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. 

11:54 - May 27, 2018

హైదరాబాద్ : విప్లవ నటుడు మాదాల రంగారావు మృతి చాలా బాధాకరమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మాదాల రంగారావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ...గొప్ప కళాకారుడని, సినిమాలకే పరిమతం కాకుండా వాస్తవ జీవితంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఎంతో సహాయం చేశారని గుర్తు చేశారు. సీపీఎం పార్టీకి, ప్రజా సంఘాలకు ఎంతో అండగా ఉన్నారని, జబ్బు చేసిన సమయంలో ఆయన్ను పరామర్శించడం జరిగిందన్నారు. తెలంగాణలో సీపీఎం పార్టీ ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తోందని, జబ్బు తగ్గిన అనంతరం ఉద్యమానికి సహకరిస్తానని ఆత్మీయంగా చెప్పారని తెలిపారు. ఆయన మృతికి తెలంగాణ సీపీఎం పార్టీ సంతాపం తెలియచేస్తోందన్నారు. 

11:24 - May 27, 2018

విజయవాడ : ఏపీ టిడిపి మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. మహాసభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుల్లెట్ ర్యాలీతో వచ్చారు. మహాసభ ప్రాంగణంలో మతాల పెద్దలు ఆశ్వీరచనాలు అందచేశారు. ఈ సందర్భంగా బాబుకు నేతలు భారీ పూలదండంతో సన్మానం చేశారు. ఇటీవలి కాలంలో చనిపోయిన టిడిపి నేతలు, కార్యకర్తలకు మహానాడు సంతాపం తెలియచేసింది. టిడిపి తెలంగాణ నేత మల్లేశ్, ఏపీ టిడిపి నేత సంతాప తీర్మానాలను ప్రవేశ పెట్టారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

టిడిపి మహానాడు ప్రారంభం..సంతాప తీర్మానం...

విజయవాడ : టిడిపి మహానాడు ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో చనిపోయిన టిడిపి నేతలు, కార్యకర్తలకు మహానాడు సంతాపం తెలియచేసింది. ఈ సందర్భంగా టిడిపి తెలంగాణ నేత మల్లేశ్ దీనికి సంబంధించిన సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. 

మాదాల రంగారావు మృతిపై బాబు స్పందన...

విజయవాడ : విప్లవ నటుడు మాదాల రంగారావు మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలియచేశారు. మాదాల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. అవినీతి, అక్రమాలపై, సామాజిక దురన్యాయాలపై సినిమాల ద్వారా పోరాడి ప్రజల హృదయాలను చూరగొన్నారని, 1980ల్లో ప్రజలు బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నప్పుడు మాదాల అభ్యుదయ చిత్రాలు నాడు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాయన్నారు. 

'మహానాడు' ప్రాంగణంలో బాబు...

విజయవాడ : మహానాడు ప్రాంగణానికి టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను, రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. 

మోడీ రోడ్ షో...

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఢిల్లీ - మీరట్ ఎక్స్ ప్రెస్ హైవేను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రజలకు అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారు. 

10:47 - May 27, 2018

కరీంనగర్ : జిల్లాలోని పలు గ్రామాలు గజ..గజ వణుకుతున్నాయి. ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దీనికంతటికి కారణం దొంగల భయం. మే మాసంలో దొంగలు తమ చోరకళని ప్రదర్శిస్తుంటారు. దీనితో దొంగల నుండి రక్షించుకోవడానికి ఆయా గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో గస్తీలు కాస్తున్నారు. వీరికి పోలీసులు సహకారం అందిస్తున్నారు. జిల్లాలోని వీణవంక మండలంలోని ప్రజలు వంతుల వారీగా గస్తీలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితిని తెలుసుకొనేందుకు టెన్ టివి ఆయా గ్రామల ప్రజలతో ముచ్చటించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

బుల్లెట్ ర్యాలీతో మహానాడుకు బాబు..

విజయవాడ : టిడిపి మహానాడు కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుల్లెట్ ర్యాలీతో మహాసభ ప్రాంగణానికి చేరుకోనున్నారు. 

10:16 - May 27, 2018
10:15 - May 27, 2018

విజయవాడ : 2019 ఎన్నికల్లో మరలా టిడిపి అధికారంలోకి వస్తుందని మంత్రి దేవినేని ఉమ అప్పుడే చెప్పేశారు. టిడిపి మహానాడుకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఆదివారం నుండి మహానాడు సమావేశాలు జరుగనున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మహానాడు ప్రాంగణం నుండి టెన్ టివితో మంత్రి దేవినేని ఉమ మాట్లాడారు. మహానాడులో 2019 కురుక్షేత్ర సంగ్రామానికి బాబు దిశా..నిర్ధేశం చేస్తారని తెలిపారు. అభివృద్ధి..సంక్షేమ కార్యక్రమాలపై చర్చ ఉంటుందన్నారు. మహానాడు పార్టీ శ్రేణులకు స్పూర్తినిస్తుందని, రామారావు ఇచ్చిన స్పూర్తి..బాబు కష్టంతో ఏపీ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకపోతుందన్నారు. వైసిపి..జనసేన, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాని, ఎట్టి పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తుందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:28 - May 27, 2018

హైదరాబాద్ : వదంతులు..పుకార్లు ప్రాణాలు తీస్తున్నాయి. చాంద్రాయణగుట్టలోని బాబానగర్ లో ముగ్గురు హిజ్రాలపైకి దాడులకు పాల్పడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు హిజ్రాలు బాబానగర్ లో సంచరిస్తున్నారు. పిల్లలు ఎత్తుకెళ్లే వారిగా భావించిన స్థానికులు వారిపై దాడికి దిగారు. బండరాళ్లతో దాడులు చేశారు. దీనితో ఓ హిజ్రా అక్కడికక్కడనే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆందోళనకారులను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. కానీ స్థానికులు పోలీసులపైకి కూడా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పెట్రోలింగ్ వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు. వదంతులు..పుకార్లు నమ్మవద్దని ఇలాంటి చర్యలకు పూనుకొంటే కఠిన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఘటనాస్థలిని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ పరిశీలించారు.  

09:14 - May 27, 2018

హైదరాబాద్ : విప్లవ నటుడు మాదాల రంగారావు మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాదాల రంగారావు ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిల్మ్ నగర్ లోని మాదాల రవి ఇంటికి తరలించారు. అక్కడ సినీ నటుడు హరికృష్ణ, సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్ రెడ్డిలు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ప్రజా కళాకారులకు మరణం అంటూ ఉండదని..నిరంతరం ప్రజల మధ్యలో ఉంటారని మాదాల రంగారావు తనయుడు మాదాల రవి తెలిపారు. సినీ ఇండ్రస్ట్రీ ఒకవైపు వెళుతుంటే మొదటిసారిగా ఎర్రజెండాను మొదటిసారిగా వెండితెరపై చూపించిన విప్లవ యోధుడన్నారు.

విప్లవ నటుడు మాదాల రంగారావు పట్టుదల కమ్యూనిస్టు అభిమాని అని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. సమసమాజం రావాలని, దోపిడి వ్యవస్థ పోవాలని ఆయన ఆకాంక్షించారని తెలిపారు. ప్రజలను కదలించే విధంగా..యువత ఆకట్టుకొనే విధంగా సినిమాలు తీశారని..నటించారని తెలిపారు. సినిమా రంగంలో ఎర్రజెండాల ప్రాముఖ్యత..సిద్ధాంతం వెలుగులోకి వచ్చిందన్నారు. ఎర్రజెండాల ఐక్యత కావాలని ఆయన యోచించారని తెలిపారు.

ప్రజా జీవితం నుండి సినీ రంగానికి వచ్చి తనదైన శైలిలో మహానటునిగా రాణించారని హరికృష్ణ తెలిపారు. నందమూరి ఎన్టీఆర్ కి మాదాల రంగారావు ప్రీతిపాత్రుడన్నారు. మాదాల రంగారావు మృతి సినీ రంగానికి లోటు అని పేర్కొన్నారు. పేదవారు బాగుండాలని..వారి పైకి రావాలని..బానిసత్వం నిర్మూలించాలని అనే దారిలో వెళ్లారని, ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు తెలిపారు.

మాదాల రంగారావు లేకపోవడం దురదృష్టకరమని సినీ నటుడు తెలిపారు. విప్లవ భావాల సినిమాలు తీసిన మాదాల రంగారావు 70 సినిమాల్లో నటించడమే కాకుండా 15 సినిమాలను ఆయన నిర్మించారన్నారు.

నెహ్రూ సమాధికి పలువురు నివాళులు...

ఢిల్లీ : జవహార్ లాల్ నెహ్రూ వర్థంతి సందర్భంగా ఆయన సమాధికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు నివాళులర్పించారు. 

08:21 - May 27, 2018

విజయవాడ : 'మహానాడు'ను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు సన్నద్ధమైంది టీడీపీ. ఇందుకోసం సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టీడీపీ భవిష్యత్‌ వ్యూహాన్ని మహానాడు వేదికగా నిర్ణయించుకోనుంది. గత నాలుగేళ్ళ కాలంలో చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించుకుని... భవిష్యత్తుకు దిశానిర్దేశం చూపేలా.. పలు అంశాలపై చర్చించనుంది. ఏపీ, తెలంగాణా రాష్ర్టాల్లో పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మహానాడును నిర్వహించనున్నారు. భవిష్యత్తులో మరింత ప్రజాదరణ పొందేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోనున్నారు. టిడిపి ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, సత్యనారాయణలతో టెన్ టివి ముచ్చటించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

08:20 - May 27, 2018
08:12 - May 27, 2018

హైదరాబాద్ : ప్రముఖ నటుడు, విప్లవ సినిమాల నిర్మాత మాదాల రంగారావు భౌతికకాయాన్ని పలువురు సందర్శించి నివాళులర్పిస్తున్నారు. శ్వాస కోశ వ్యాధితో స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని కుమారుడు మాదాల రవి నివాసానికి తరలించారు. ఫిలిమ్‌ నగర్‌ లోని మాదాల రవి ఇంటికి భౌతికకాయాన్ని తరలించారు.

మాదాల రంగారావు మృతికి సీపీఎం, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, రామకృష్ణలు సంతాపం వ్యక్తం చేశారు. రంగారావు అంత్యక్రియల్లో రామకృష్ణ పాల్గొననున్నారు. సినీ నటుడు మాదాల రంగారావు భౌతికకాయాన్ని సీపీఐ నేత నారాయణ, సినీ నటుడు హరికృష్ణలు సందర్శించి నివాళులర్పించారు. మాదాల రంగారావు సినీ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించారని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు. కళ ప్రజల కోసం అని నమ్మిన వ్యక్తి అని తెలిపారు. మాదాల రంగారావు చివరి శ్వాస వరకు కమ్యూనిస్టుగానే బతికారని మాదాల రవి పేర్కొన్నారు. ప్రజల కోసమే నిస్వార్థంగా సినిమాలు నిర్మించారని, ప్రజా కళాకారులకు మరణం లేదన్నారు.

‘యువతరం కదిలింది’తో ఆయన విప్లవ చిత్రాల ప్రస్థానం మొదలైందని చెప్పవచ్చు. 'ఎర్ర పావురాలు' సినిమా వరకు సాగింది. ఒంగోలు జిల్లాలో ఓ సంపన్న కుటుంబంలో జన్మించారు మాదాల రంగారావు. కమ్యూనిస్టు భావాలతో వీరి కుటుంబం మమేకమైంది. ప్రజానాట్య మండలితోనూ అనుబంధం కలిగి ఉన్నారు. ఆరంభంలో కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు..విలన్ గా వేషాలు వేసిన మాదాల.. తర్వాత ‘నవతరం పిక్చర్స్ పతాకం’పై పలు చిత్రాలు నిర్మించి, నటించారు. అన్ని చిత్రాల్లోనూ కమ్యూనిస్టుగా కనిపించారు. విప్లవ శంఖం, యువతరం కదిలింది. రెడ్‌ స్టార్‌, మహాప్రస్థానం, ఎర్రమల్లెలు సినిమాలకు నిర్మాత వ్యవహరించారు.

07:58 - May 27, 2018

తెలుగు దేశం పార్టీ పండగ... మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీకి మంచి మైలేజీ తీసుకురావాలని ఆ పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తోంది. మరోవైపు ఉద్దానం సమస్యపై ఏపీ సర్కార్ పై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు విమర్శలు గుప్పించారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిస్పందించారు. ఈ అంశాలపై టెన్ టివి విజయవాడ స్టూడియలో జరిగిన చర్చా వేదికలో రామకృష్ణ ప్రసాద్ (టిడిపి), బాబురావు (సీపీఎం), రోశయ్య (వైసీపీ) పాల్గొని విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

హిజ్రాలపై దాడులు..చాంద్రాయణగుట్టలో ఉద్రిక్తత...

హైదరాబాద్ : చాంద్రాయణగుట్టలో ముగ్గురు హిజ్రాలపై స్థానికులు రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమించారు. స్థానికులను అడ్డుకొనేందుకు పోలీసులు యత్నించారు. దీనితో స్థానికులు పోలీసులపైన దాడికి యత్నించి పెట్రోలింగ్ వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. దీనితో పరిస్థితిని సద్దుమణిగేందుకు స్థానికులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఘటనాస్థలిని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ పరిశీలించారు.  

హిజ్రాలపై దాడులు..చాంద్రాయణగుట్టలో ఉద్రిక్తత...

హైదరాబాద్ : చాంద్రాయణగుట్టలో ముగ్గురు హిజ్రాలపై స్థానికులు రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమించారు. స్థానికులను అడ్డుకొనేందుకు పోలీసులు యత్నించారు. దీనితో స్థానికులు పోలీసులపైన దాడికి యత్నించి పెట్రోలింగ్ వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. దీనితో పరిస్థితిని సద్దుమణిగేందుకు స్థానికులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఘటనాస్థలిని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ పరిశీలించారు.  

నగరానికి పాకిన 'వదంతుల' దాడులు...

హైదరాబాద్ : పాతబస్తీలో ఉద్రిక్తత ఏర్పడింది. పిల్లలను ఎత్తుకెళుతున్నారంటూ వదంతులు వ్యాపించాయి. మాదన్నపేటలో ముగుర్గు బీహార్ వాసులపై స్థానికులు దాడి చేశారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. 

కమ్యూనిస్టుగా బతికిన మాదాల రంగారావు - మాదాల రవి...

హైదరాబాద్ : మాదాల రంగారావు చివరి శ్వాస వరకు కమ్యూనిస్టుగానే బతికారని మాదాల రవి పేర్కొన్నారు. స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాదాల రంగారావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రజల కోసమే నిస్వార్థంగా సినిమాలు నిర్మించారని, ప్రజా కళాకారులకు మరణం లేదన్నారు. 

కొత్త ఒరవడిని సృష్టించిన మాదాల రంగారావు - నారాయణ...

హైదరాబాద్ : మాదాల రంగారావు సినీ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించారని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు. కళ ప్రజల కోసం అని నమ్మిన వ్యక్తి అని తెలిపారు. చివరి వరకు ప్రజల కోసమే సినిమాలు నిర్మించారన్నారు. 

స్టార్ ఆసుపత్రికి నారాయణ..హరికృష్ణ...

హైదరాబాద్ : సినీ నటుడు మాదాల రంగారావు భౌతికకాయాన్ని సీపీఐ నేత నారాయణ, సినీ నటుడు హరికృష్ణలు సందర్శించి నివాళులర్పించారు. స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రంగారావు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 

మాదాల రంగారావు మృతికి వామపక్షాల సంతాపం...

హైదరాబాద్ : విప్లవ నటుడు మాదాల రంగారావు మృతికి సీపీఎం, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, రామకృష్ణలు సంతాపం వ్యక్తం చేశారు. రంగారావు అంత్యక్రియల్లో రామకృష్ణ పాల్గొననున్నారు. 

మాదాల రవి ఇంటికి మాదాల రంగారావు భౌతికకాయం.

హైదరాబాద్ : సినీ నటుడు మాదాల రంగారావు కన్నుమూశారు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా మైనంపాడు. అభిమానుల సందర్శనార్థం రంగారావు భౌతికకాయాన్ని ఫిల్మ్ నగర్ లోని ఆయన కుమారుడు మాదాల రవి ఇంటికి తరలించారు. 

ఢిల్లీకి కేసీఆర్...నాలుగు రోజులు అక్కడే ?

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి పయనం కానున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన హస్తినలో మకాం వేయనున్నట్లు సమాచారం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..ఇతర మంత్రులతో ఆయన కలియనున్నారు. 

టీ 20 లీగ్ ఫైనల్...

హైదరాబాద్ : టీ20 లీగ్-11 ఫైనల్‌ నేడు జరుగనుంది. వాంఖడేలో ఆదివారం జరిగే ఫైనల్లో రెండు సార్లు ఛాంపియన్‌ చెన్నై 2016 ఛాంపియన్‌ హైదరాబాద్‌ను ఢీకొట్టనుంది. 

06:53 - May 27, 2018

హైదరాబాద్ : కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ఆర్టీసీతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు భ్రష్టుపట్టి పోయాయని వివిధ రాజకీయ పార్టీల నేతలు మండిపడ్డారు. కేసీఆర్‌కు ఆర్టీసీ మీద ఉన్నంత చిన్న చూపు మరేసంస్థ మీద లేదని వారు ఆరోపించారు. సమ్మె దిశగా సాగుతున్న ఆర్టీసీ యూనియన్లకు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం తక్షణమే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పార్టీల నేతలు డిమాండ్‌ చేశాయి. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల రౌడ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల వేతన ఒప్పందం, ప్రభుత్వ వైఖరి అంశంపై చర్చ జరిపారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ జనసమితి ఆధ్యక్షులు కోదండరామ్, బీజేపీ నేత సాంబమూర్తి, కాంగ్రెస్‌ నేత సుధీర్ రెడ్డితో పాటు ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.

కేసీఆర్ ప్రభుత్వంలో ఆటు ఆర్టీసీ, ఇటు సింగరేణి సంస్థలు భ్రష్టు పట్టి పోయాయని సీపీఐ నేత చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పోషించిన పాత్ర మరువలేనిదన్నారు. న్యాయంగా ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన రాయితీలను ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటుందని చాడ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని సీపీఎం కార్యదర్శివర్గసభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం అవసరం లేని హామీలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని ఆరోపించారు. ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని మాట తప్పారని జూలకంటి రంగారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రైవేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తూ.. కార్పొరేట్‌ రంగాలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తానని ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదని జూలకంటి రంగారెడ్డి మండిపడ్డారు.

2వేల కోట్ల ఆర్టీసీ నష్టానికి కార్మికులే కారణం అన్నట్లు సీఎం కేసీఆర్‌ మాట్లాడటం సరికాదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. ఆర్టీసీ నష్టానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ఆర్టీసీ నష్టానికి కార్మికులు కారణమనడం సరికాదని కోదండరామ్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల వేతనాల పెంపు అంశాన్ని ప్రభుత్వం పరిగణంలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించక పోతే సమ్మె ఉధృతం చేస్తామని కోదండరామ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇప్పటికే జాతీయ కార్మిక సంఘాల మద్దతు పొందిన ఆర్టీసీ జేఏసీకి రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. అందుకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికుల పోరాటానికి మద్దతు ప్రకటిస్తూ చేసిన తీర్మానాన్ని రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఆమోదించింది. 

06:49 - May 27, 2018

శ్రీకాకుళం : జనసేన దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా జనసేన కార్యకర్తలు సంఘీభావ దీక్షలు చేపట్టారు. ఉద్దానం బాధితులను ప్రభుత్వం ఆదుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టారు. మరోవైపు శ్రీకాకుళంలో దీక్ష చేస్తున్న పవన్‌కు వామపక్షాలు, ప్రజాసంఘాలు మద్దతిచ్చాయి. పవన్‌ ఏ పోరాటం చేసినా అండగా ఉంటామని స్పష్టం చేశాయి. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ చేసిన దీక్షకు వామపక్ష నేతలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. దీక్ష చేపట్టిన పవన్‌కు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణలు సంఘీభావం తెలిపారు. ర్యాలీగా దీక్ష శిబిరానికి చేరుకున్న మధు, రామకృష్ణలు... పవన్‌ పోరాటానికి తమ మద్దతు ఎల్లప్పుడు ఉంటుందన్నారు. పవన్‌ దీక్ష రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అన్నారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనసేన కార్యకర్తలు పవన్‌ దీక్షకు మద్దతుగా దీక్షలు చేపట్టారు. రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య లక్ష్మీ పద్మావతి జనసేన కార్యకర్తలతో దీక్షకు కూర్చున్నారు. ఉద్దానం బాధితుల సమస్యలపై జనసేన తరుపున పోరాటం చేస్తానని ఆమె తెలిపారు. ఇక విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జనసేన నేతలు నిరహార దీక్ష చేపట్టారు. కిడ్నీ సమస్య పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తామని జనసేన నేతలన్నారు.

అలాగే ఒంగోలు కలెక్టరేట్ వద్ద ప్రకాశం జిల్లా జనసేన నాయకులు సంఘీభావ దీక్ష చేపట్టారు. సంఘీభావ దీక్షలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక పవన్‌ దీక్షకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన నాయకులు నిరహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. అనంతపురం ఆర్డీవో కార్యాలయం వద్ద జనసేన నేతలు సంఘీభావ దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ప్రజారోగ్యంపై బాధ్యతగా వ్యవహరించపోవడం వల్లే పవన్‌ కల్యాణ దీక్షకు దిగాల్సి వచ్చిందని జనసేన నేతలు అన్నారు. మొత్తానికి ప్రభుత్వ తీరుకు నిరసనగా పవన్‌ చేపట్టిన దీక్షకు మద్దతుగా భారీ ఎత్తున స్పందించిన జనసేన కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ దీక్షలు చేపట్టారు. 

06:45 - May 27, 2018

శ్రీకాకుళం : పుష్కరాల కోసం 2 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. ఉద్దాన బాధితులను ఆదుకునేందుకు ఎందుకు నిధులు కేటాయించడం లేదన్నారు పవన్‌కల్యాణ్‌. కిడ్నీ బాధితుల కోసం 24 గంటలపాటు దీక్ష చేసిన జనసేనాని.. సాయంత్రం దీక్ష విరమించారు. రాజకీయ లబ్ది కోసమే దీక్ష చేయాలనుకుంటే... 2014లో టీడీపీకి మద్దతిచ్చేవాడినే కాదన్నారు పవన్‌. 2019లో జనసేన అధికారంలో రాకపోయినా... ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటామని పవన్‌ హామీ ఇచ్చారు.

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం వెనుకబడ్డ ప్రాంతం కాదని.. వెనక్కి నెట్టబడిన ప్రాంతమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సాయంత్రం నుంచి దీక్ష చేపట్టిన జనసేనాని... శనివారం సాయంత్రం ఐదు గంటలకు దీక్ష విరమించారు. కిడ్నీ బాధిత కుటుంబానికి చెందిన చిన్నారి నిమ్మరసం ఇచ్చి పవన్‌తో దీక్ష విరమింపజేశారు.

తాను రాజకీయ లబ్ధి కోసం దీక్ష చేయలేదని పవన్‌కల్యాణ్‌ అన్నారు. తనకు రాజకీయ లబ్ధి కావాలనుకుంటే చంద్రబాబుకు మద్దతు ఇచ్చేవాడిని కాదన్నారు. పుష్కరాల కోసం రెండు వేల కోట్లు ఖర్చు చేసిన సర్కార్‌... 20 వేల మంది చనిపోయినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని రోజులైనా పాలకులు అభివృద్ధి చెందుతున్నారే గానీ... ప్రజల జిందగీలు మారడం లేదన్నారు. రాష్ట్రాన్ని మోసం చేసిన కేంద్రం, ఆ కేంద్రానికి మద్దతిచ్చిన తెలుగుదేశంపై నిరసనగానే తాను ఆందోళన చేసినట్లు పవన్‌కల్యాణ్‌ తెలిపారు.

సామాజిక రాజకీయ చైతన్యం కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందని పవన్‌ అన్నారు. మనం ఏం చేసినా ప్రజలు పడి ఉంటారని పాలకులు అనుకోవద్దన్నారు పవన్‌. అన్యాయం పెరిగినప్పుడు తిరుగుబాటు తప్పదన్నారు. అభివృద్ధి రెండు కులాల గుప్పిట్లోనే ఉందని... అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నారు. కేంద్ర, రాష్ట్రాల కుమ్ములాటల్లో ప్రజలను ఇబ్బందిపాలు చేయొద్దన్నారు.

రెండు దశాబ్ధాలుగా 20 వేల మంది బాధితులు చనిపోయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ ఆస్పత్రులు ఉన్నా కనీసం ఉద్దానం బాధితులను పట్టించుకోవడం లేదన్నారు. కనీసం వారికి రెస్పాన్స్‌బులిటీ లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తలుచుకుంటే బాధితులను ఆదుకోవచ్చని... కానీ.. టీడీపీ ఆ దిశగా ఎందుకు ప్రయత్నించడం లేదన్నారు. అయితే.. ఉద్దానం బాధితులకు సాయం చేసేందుకు కొన్ని స్వచ్చంధ సంఘాలు ముందుకు వస్తున్నాయని... వారే నిజమైన హీరోలన్నారు పవన్‌.

బాధితుల సమస్యలు వినేందుకు రాష్ట్రంలో ఆరోగ్యశాఖ మంత్రి లేరన్నారు పవన్‌. బాధ్యతలన్నీ తన దగ్గరే ఉన్నాయని సీఎం అంటారు.. సీఎం దగ్గరకు ఎవరు వస్తారన్నారు. సీఎం ఓవైపు ధర్మపోరాటం చేస్తారా ? ఉద్దానం వస్తారా ? అని పవన్‌ ప్రశ్నించారు. ముందు కౌగిలించుకుని వెనక బాకులతో పొడిచే పద్దతి చంద్రబాబు మార్చుకోవాలన్నారు జనసేనాని. చంద్రబాబు ఇప్పటికైనా స్పందించి.. ఉద్దానం బాధితులను ఆదుకోవాలన్నారు. బాధితులందరికీ పెన్షన్‌ అందించాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.

కిడ్నీ బాధితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ అంశాన్ని ప్రజా క్షేత్రంలోకి తీసుకువెళ్తామన్నారు. జనం బాగే జనసేన లక్ష్యమని... వారిని కష్టాల నుంచి బయటపడేసేందుకు జనసేన అండగా ఉంటుందని పవన్‌కల్యాణ్‌ అన్నారు. 

06:42 - May 27, 2018

ఢిల్లీ : కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్‌జవదేకర్‌ను మంత్రి కేటీఆర్‌ కోరారు. త్వరలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో... ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించేలా వీలైనంత త్వరగా మంజూరు చేయాలని కోరారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటుపై గతంలో ప్రధానమంత్రి, హెచ్‌ఆర్డీ మంత్రికి కేసీఆర్‌ రాసిన లేఖలను మరోసారి జవదేకర్‌కు ఆయన అందజేశారు. కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి ఆయన జవదేకర్‌ను కలిశారు.

06:40 - May 27, 2018

హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ప్రగతి భవన్‌లో సీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సంక్షేమ అభివృద్ధి పథకాలపై చర్చించనున్నారు. త్వరలో రానున్న గ్రామ పంచాయితీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం. రాబోయే స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేయడమే లక్ష్యంగా నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం కాబోతోంది. వచ్చే జూన్ చివర్లో మూడు విడతలుగా స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించే దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులేస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికలను 2019లో జరగబోయే సాధారాణ ఎన్నికలకు రెఫరెండంగా బావిస్తోంది అధికార టీఆర్ఎస్.

అనేక సంక్షేమ పథకాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్ధానంలో ఉందని.. ఇవే తమను గట్టెక్కిస్తాయని సీఎం కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. రెండు రోజుల పాటు సాగిన కలెక్టర్ల మీటింగ్‌లో.. పంట పెట్టుబడి సాయం, పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీపై ప్రజల స్పందన గురించి తెలుసుకున్న సీఎం.. కొత్తగా అమల్లోకి తీసుకురానున్న రైతు బీమా పథకం విధి విధానాలపై చర్చించనున్నారు. వీటిని కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ప్రకటించాలని బావిస్తోంది ప్రభుత్వం. మరోవైపు కొత్తగా ఏర్పడిన 31 జిల్లాలను దృష్టిలో పెట్టుకుని.. ప్రస్తుతం ఉన్న రెండు జోన్ల స్ధానంలో మొత్తం 7 జోన్లు, రెండు మల్టీ జోన్లు తీసుకురావాలని చూస్తుంది ప్రభుత్వం. జోనల్ ప్రతిపాదనల పై ఉద్యోగ సంఘాలు సైతం చర్చించి సానుకూల నిర్ణయం తీసుకున్నాయి. దీనికి నేటి క్యాబినెట్‌లో ఆమోద ముద్ర పడనుంది.. ఆ తర్వాత రాష్ట్రపతి అమోదం కోసం ఫైలును కేంద్రానికి పంపనుంది రాష్ర్ట ప్రభుత్వం. పలు కీలక అంశాలతో పాటు.. రాష్ట్ర అవతరణ దినోత్సవం, హరిత హారం, విద్యా సంవత్సరం ప్రారంభంలో తీసుకోవాల్సిన చర్యలపై క్యాబినెట్ చర్చించనుంది. 

06:36 - May 27, 2018

సిద్దిపేట : జిల్లా ప్రజ్ఞాపూర్‌లో ఓ లారీ సృష్టించిన బీభత్సంలో 12 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిశాయి. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల్లో నవతెలంగాణ రిపోర్టర్‌ లక్ష్మణ్‌ ఉన్నారు. అతని కుటుంబానికి చెందిన 8 మంది మృతిచెందడంతో పెద్దమ్మగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బస్సులో ప్రయాణిస్తున్న మరో నలుగురూ మృతి చెందారు. సురభి దయాకర్‌రావుఫార్మసీ కళాశాల దగ్గర జరిగిన ఈ ప్రమాదం.. 12 నిండు ప్రాణాలను బలితీసుకుంది. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఉండటం ఒక విషాదమైతే... నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉండటం మరో విషాదం.

వేసవి సెలవులు ముగుస్తుండడంతో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కేంద్రంలోని పెద్దమ్మగూడేనికి చెందిన గొర్ల మల్లేశం కుటుంబం వేములవాడ రాజన్నను, కొమురెల్లి మల్లన్నను దర్శించుకోవాలని భావించింది. క్వాలిస్‌ వాహనంలో 18 మంది కుటుంబ సభ్యుల బృందం శుక్రవారం ఉదయం బయలుదేరింది. రాజన్నను.. అక్కడి నుంచి కొమురెల్లి మల్లన్నను దర్శనం చేసుకుంది. సంతోషంగా రాజీవ్‌ రహదారిపై ఇంటికి తిరుగుపయనమైంది. మరో 5 నిమిషాల్లో ఆ రహదారిని వదిలి గజ్వేల్‌ మీదుగా తూప్రాన్‌కు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ప్రజ్ఞాపూర్‌లోని సురభి దయాకర్‌రావు కళాశాల సమీపంలో హైదరాబాద్‌ నుంచి మంచిర్యాల వైపునకు 44 మందితో వెళ్తున్న బస్సును.. వెనుక నుంచి వచ్చిన లారీ ఓవర్‌ టేక్‌ చేసింది. అదే సమయంలో బస్సు లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఆ వేగానికి బస్సు అదుపుతప్పి ఎడమవైపునకు బోల్తా పడింది. బస్సు వెనక నుంచి ఢీకొట్టడంతో లారీ కూడా అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. డివైడర్‌ను దాటి దూసుకొచ్చిన లారీ తొలుత కంటెయినర్‌ను.. అదే ఊపులో క్వాలిస్‌ను బలంగా ఢీకొట్టింది.

మృతుల్లో పెద్దమ్మగూడేనికి చెందిన గొర్ల మల్లయ్య, గొర్ల గండమ్మ, వారి కొడుకు గొర్ల లక్ష్మణ్‌యాదవ్‌, వియ్యంకురాలు ఇల్టం సత్తమ్మ, శ్రీనివాస్‌, మనువరాలు నీహారిక, గుజ్జల సుశీల చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓంకార్‌ అనే బాలుడు మరణించాడు. గొర్ల లక్ష్మణ్‌యాదవ్‌ నవ తెలంగాణ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న ఆసిఫాబాద్‌కు చెందిన పందారి రాహుల్‌, నిఖిల్‌, హైదరాబాద్‌కు చెందిన సింధూజ అక్కడికక్కడే చనిపోయారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం చాకుంటకు చెందిన రాజిరెడ్డి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. బస్సులోని మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీలో మొత్తం 17 మందికి చికిత్స అందిస్తున్నారు.

ప్రజ్ఞాపూర్‌ ప్రమాదం తెలిసిన వెంటనే మంత్రి హరీశ్‌రావు హుటాహుటిన ఆయన ఘటనాస్థలికి చేరుకున్నారు. అదనపు డీసీపీ నర్సింహ్మారెడ్డిని అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి గజ్వేల్‌ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి.. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిని ఓదార్చారు. ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. చికిత్స పొందుతున్న పదినెలల పసిపాప శ్రీవల్లిని చూసి మంత్రి కంటనీరు పెట్టుకున్నారు. క్వాలీస్‌లో ప్రయాణించిన ఆమెను మృత్యుంజయురాలిగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రజ్ఞాపూర్‌ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 

06:34 - May 27, 2018

హైదరాబాద్ : ప్రముఖ నటుడు, విప్లవ సినిమాల నిర్మాత మాదాల రంగారావు కన్నుమూశారు. కొంత కాలంగా శ్వాస కోశ వ్యాధితో మాదాల రంగారావు బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అరవై తొమ్మిదేళ్ళ వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. మాదాల రంగారావు విప్లవ భావాలున్న సినిమాలు తీశారు. విప్లవ శంఖం, యువతరం కదిలింది. రెడ్‌ స్టార్‌, మహాప్రస్థానం, ఎర్రమల్లెలు సినిమాలకు నిర్మాత వ్యవహరించారు. ఫిలిమ్‌ నగర్‌ లోని మాదాల రవి ఇంటికి భౌతికకాయాన్ని తరలించారు. 

కేరళ తీరాన్ని దాటనున్న రుతుపవనాలు...

ఢిల్లీ : మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం నాటికి రుతుపవనాలు ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంతో పాటు అండమాన్ నికోబార్ దీవుల వరకు విస్తరించాయి. 

కేరళ తీరాన్ని దాటనున్న రుతుపవనాలు...

ఢిల్లీ : మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం నాటికి రుతుపవనాలు ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంతో పాటు అండమాన్ నికోబార్ దీవుల వరకు విస్తరించాయి. 

సోమవారం నుండి ఎంసెట్ కౌన్సెలింగ్...

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం సోమవారం నుండి ఎంసెట్ -2018 కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అదే రోజు వెబ్ కౌన్సెలింగ్ లో పాల్గొనాల్సి ఉంటుందని అడ్మిషన్ కన్వీనర్ వెల్లడించారు. 

సిర్పూరు పేపర్ మిల్లుకు జేకే ప్రతినిధులు...

కాగజ్ నగర్ : పట్టణంలోని సిర్పూరు పేపరు మిల్లును ఆదివారం జేకే ప్రతినిధుల బృందం సభ్యులు సందర్శించనున్నారు. ఇప్పటికే పేపరు మిల్లును తీసుకునేందుకు ఒడిశాలోని జేకే పేపరు మిల్లు ప్రతినిధులు, లీగల్ అధికారులు సందర్శించిన విషయం తెలిసిందే.

సిద్ధిపేట ప్రమాదంలో మరొకరు మృతి...

ఆసిఫాబాద్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆసిఫాబాద్‌కు చెందిన ఆచార్య పంకజ్ (35) మృతి చెందాడు.

తెలంగాణ కేబినెట్ సమావేశం...

హైదరాబాద్ : నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరుగనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలనే దానిపై సీఎం కేసీఆర్ దిశ..నిర్దేశం చేయనున్నారు. 

డా.మాదాల రంగారావు కన్నుమూత...

హైదరాబాద్ : విప్లవ నటుడు డా. మాదాల రంగారావు కన్నుమూశారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 15 సినిమాలను ఆయన నిర్మించారు. 

Don't Miss