Activities calendar

28 May 2018

22:02 - May 28, 2018

హైదరాబాద్  : రెడ్‌స్టార్‌ మాదాల రంగారావుకు.. కుటుంబసభ్యులు, అభిమానులు విప్లవాభివందనాలతో.. తుది వీడ్కోలు పలికారు. తుదిశ్వాస వరకూ వామపక్ష భావజాలంతో గడిపిన మాదాల భౌతిక కాయానికి సాంప్రదాయిక పూజాధికాలేవీ లేకుండానే దహనసంస్కారాలు నిర్వహించారు. 

తెలుగు సినీ చరిత్రలో రెడ్‌స్టార్‌గా తనదైన ముద్ర వేసుకున్న.. నటుడు మాదాల రంగారావు భౌతిక కాయానికి అంత్యక్రియలు ముగిశాయి. శ్వాసకోశ సంబంధ వ్యాధికి చికిత్స పొందుతూ మాదాల రంగారావు.. ఆదివారం తెల్లవారుజామున మరణించారు. సోమవారం ఉదయం.. ఆయన ఇంటి నుంచి.. సీపీఐ కార్యాలయం మగ్దుమ్‌ భవన్‌కు  మాదాల రంగారావు భౌతిక కాయాన్ని తరలించారు.

సీపీఐ కార్యాలయంలో.. పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం ఏపీ కార్యదర్శి మధు, డైరెక్టర్‌ పోకూరి బాబూరావు, రమేశ్‌, వందేమాతరం శ్రీనివాస్‌ తదితరులు మాదాల రంగారావు పార్థివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. 

సీపీఐ కార్యాలయం నుంచి.. మాదాల రంగారావు పార్థివ దేహాన్ని.. రెడ్‌ షర్ట్‌ కవాతుతో.. ప్రజల సందర్శనార్థం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గరకు తీసుకు వెళ్లారు. అక్కడ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీరాఘవులు, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు నివాళులు అర్పించారు. 

పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు, మాదాల రంగారావు పార్థివదేహాన్ని కడసారి దర్శించి నివాళులు అర్పించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి.. మాదాల రంగారావు పార్థివదేహాన్ని.. ర్యాలీగా మహాప్రస్థానానికి తీసుకు వెళ్లారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. తుదిశ్వాస వరకూ వామపక్ష భావజాలంతో గడిపిన మాదాల రంగారావుకు.. ఎలాంటి పూజలు నిర్వహించకుండానే.. అంత్యక్రియలు జరిపారు. 

21:58 - May 28, 2018

హైదరాబాద్ : తెలుగుదేశం సీనియర్‌ నేత మోత్కుపల్లి నరసింహులుపై వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందున మోత్కుపల్లిని సస్పెండ్‌ చేయాలని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ.. చంద్రబాబుకు లేఖ రాయగా.. అందుకనుగుణంగా మోత్కుపల్లిపై వేటు వేస్తూ చంద్రబాబు ప్రకటించారు. గవర్నర్‌ పదవి రాదని తెలిసి మోత్కుపల్లి గొడవ మొదలు పెట్టారని రమణ ఆరోపించారు. ఇటీవల మోత్కుపల్లి విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ఎన్టీఆర్‌కు ప్రతిరూపం అని ఆయన ఎలా చెబుతారని ప్రశ్నించారు. మోత్కుపల్లి ద్రోహానికి క్షమాపణ లేదని రమణ అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎవరిపైనైనా చర్యలు తప్పవన్నారు ఎల్‌ రమణ. 

 

21:44 - May 28, 2018

విజయవాడ : బీజేపీతో చేతులు కలిపి వైసీపీ ఊరసరవెల్లి రాజకీయాలు చేస్తోందని మహానాడు వేదికగా టీడీపీ నేతలు మండిపడ్డారు. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో శృంగభంగం తప్పదని  హెచ్చరించారు. రంగులు మార్చే జగన్‌ వంటి రాజకీయ నేతలతో రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్న వాస్తావాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజయవాడలో జరుగుతున్న టీడీపీ మహానాడులో నిర్ణయించారు. 

రెండో రోజు మహానాడులో టీడీపీ నేతలు వైసీపీ అధినేత జగన్‌ను టార్గెట్‌ చేశారు. మహానాడు తీర్మానాలపై జరిగిన చర్చలో పాల్గొన్న నేతలు వైసీపీ కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆచరణ సాధ్యంకాని హామీలతో జగన్‌  ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనిత ఆరోపించారు. జగన్‌ హామీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనిత కోరారు. 

జగన్‌కు ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న ఆసక్తి ప్రజా సమస్యలపై లేదని తెలంగాణ టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి వ్యగ్యోక్తులు విసిరారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతోపాటు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న వైసీపీ పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని టీడీపీ కార్యకర్తలకు మహానాడు పిలుపు ఇచ్చింది. 

21:40 - May 28, 2018

విజయవాడ : బీజీపీ అధ్యక్షుడు అమిత్‌ షా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటూ.. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం అమిత్‌ షాకు ఎక్కడుందని ప్రశ్నించారు. కేంద్రం నిధులిచ్చినా అమరావతిలో ఒక్క నిర్మాణం కూడా ప్రారంభం కాలేదంటూ అమిత్‌ షా చేసిన విమర్శలను విజయవాడలో జరుగుతున్న మహానాడు వేదికగా చంద్రబాబు తోసిపుచ్చారు. 

విజయవాడలో జరుగుతున్న టీడీపీ మహానాడులో మొదటి రోజు ప్రధాని మోదీని టార్గెట్‌ చేసిన చంద్రబాబు.. సోమవారం రెండో రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను లక్ష్యంగా చేసుకుని విమర్శల వర్షం కురిపించారు. కేంద్రం నిధులిచ్చినా.. ఏపీ రాజధాని అమరావతి పనులే ప్రారంభంకాలేదని... నిధులు వినియోగ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదని అమిత్‌ షా చేసిన ఆరోపణలను చంద్రబాబు తప్పుపట్టారు. ఏపీ ప్రభుత్వం పంపిన యూసీలు నిజమైనవికావని, అమవరాతి ప్రణాళికలు ఇంకా సింగపూర్‌లోనే ఉన్నాయంటూ అమిత్‌ షా వ్యాఖ్యానించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్‌ షా ఇస్టానుసారంగా మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు. 

ప్రభుత్వ వ్యవహారాల్లో అమిత్‌ షా జోక్యం పెరిగిపోయిందనడానికి అమరావతిపై అమిత్‌ షా చేసిన ఆరోపణలు, విమర్శలే నిదర్శనమన్నారు చంద్రబాబు. ప్రధాని మోదీ చెప్పాల్సిన విషయాలను అమిత్‌ షా ఎందుకు ప్రస్తావించాల్సి వస్తోందని ప్రశ్నించారు. 

వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని అమిత్‌ షా చేసిన ప్రకటనపై చంద్రబాబు స్పందించారు. బీజేపీ ఒక్క శాతం ఓట్లు కూడా రావని మండిపడ్డారు. 

ఏపీ, తెలంగాణకు నిధులు ఇవ్వని ప్రధాని మోదీ... గుజరాత్‌కు వేలాది కోట్లు ఎలా ఇస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. 93 వేల కోట్లతో గుజరాత్‌లో డొలేరా నగరాన్ని ఎలా నిర్మిస్తున్నారని నిలదీశారు. వీటన్నింటిపై శ్వేతపత్రం ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అమిత్‌ షా ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని చంద్రబాబు హితవు పలికారు. అమరావతిపై అబద్ధాలు మాట్లాడితే ప్రజలు రాష్ట్ర సహించరని  హెచ్చరించారు. 
 

21:05 - May 28, 2018

హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు తనను దగా చేశారని... తెలంగాణ తెలుగుదేశం సీనియర్‌ నేత మోత్కుపల్లి నరసింహులు ఆరోపించారు. గవర్నర్‌గిరీ ఇస్తానని.. ఆ తర్వాత రాజ్యసభకు పంపిస్తానని చెప్పి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తనను పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. అయితే.. మోత్కుపల్లి వ్యాఖ్యలను టీటీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. టీడీపీని టీఆర్ఎస్‌లో కలపాలన్న మోత్కుపల్లిని మహానాడుకు ఎలా పిలుస్తామంటూ మండిపడ్డారు.
  
తెలంగాణ తెలుగుదేశంలో.. తమ్ముళ్ల లొల్లి రచ్చకెక్కింది. పార్టీ కీలక భేటీ మహానాడు జరుగుతున్న తరుణంలో... ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా.. టీటీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నరసింహులు.. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. నందమూరి తారకరాముడి సమాధివద్ద.. నివాళులు అర్పించిన మోత్కుపల్లి.. మీడియాతో మాట్లాడుతూ..  చంద్రబాబు తనను వంచించాడని మోత్కుపల్లి ఆరోపించారు. చంద్రబాబు మాటమీద నిలబడరని, తనను గవర్నర్‌ చేస్తానని, రాజ్యసభకు పంపుతానని చెప్పి మోసం చేశారని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. రాజ్యసభ సీటును చంద్రబాబు కోటీశ్వరులకు అమ్ముకున్నారని ఆరోపించారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలోను, ఇతర సందర్భాల్లోనూ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబుకు అండగా ఉన్న తనను.. మహానాడుకు పిలవకుండా అవమానించారని విలపించారు. టీడీపీ బాగుండాలంటే నందమూరి వారసులకు అప్పగించాలని మోత్కుపల్లి డిమాండ్‌ చేశారు. బడుగులకు అండగా నిలిచిన పార్టీలో.. నేడు బడుగులను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని.. తనను పార్టీ నుంచి దూరంచేసే ప్రయత్నం  జరుగుతోందని కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్టీఆర్‌ను క్షోభపెట్టి చంపేశారని ఆరోపించారు. 

చంద్రబాబుకు నైతిక విలువలు లేవని,  తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రచేశారని మోత్కుపల్లి నరసింహులు ఆరోపించారు. ప్రత్యేక హోదా కావాలో ప్యాకేజీ కావాలో నాలుగేళ్లుగా చంద్రబాబు తేల్చుకోలేక పోయారని, పెద్ద నోట్ల రద్దు సలహా ఇచ్చిన వ్యక్తే.. ఇప్పుడు బ్యాంకుల్లో డబ్బు లేదంటున్నారని మోత్కుపల్లి మండిపడ్డారు. ఏపీలో పవన్‌, జగన్‌ ఏకమైతే టీడీపీకి డిపాజిట్‌ కూడా రాదని అన్నారు. అంబేడ్కర్‌ ఆశయ సాధనకు త్వరలోనే ఏపీలో రథయాత్ర చేస్తానని మోత్కుపల్లి ప్రకటించారు. 

మోత్కుపల్లి వ్యాఖ్యలపై తెలంగాణ టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థుల చేతిలో మోత్కుపల్లి కీలుబొమ్మగా మారారని, చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత మోత్కుపల్లికి లేదని అన్నారు. గవర్నర్‌ పదవి కోసం బీజేపీ నేతల దగ్గరకు మోత్కుపల్లిని తీసుకెళ్లి మాట్లాడించలేదా అని ప్రశ్నించారు.

గవర్నర్‌ పదవి..బీజేపీ ఇవ్వకపోతే చంద్రబాబు ఏం చేస్తారని సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పవన్‌, జగన్‌ను పొగుడుతున్న మోత్కుపల్లిని.. మహానాడు సమయంలోనే ఎవరు ఆడిస్తున్నారో అందరికీ అర్థమవుతోందని అన్నారు. మోత్కుపల్లిని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదని.. ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయిందని వ్యాఖ్యానించారు. టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలన్న మోత్కుపల్లిని మహానాడుకు ఎలా పిలుస్తామని ఎమ్మెల్యే సండ్ర అన్నారు.

స్టెరిలైట్ ప్లాంట్ మూసివేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆదేశం

తమిళనాడు : తూత్తుకూడిలోని కాపర్ స్టెరిలైట్ ప్లాంట్ ను శాశ్వతంగా మూసివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. స్టెరిలైట్ ప్లాంట్ మూసివేతకు పళనిస్వామి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్లాంట్ మూసివేయాలంటూ ఇటీవల స్థానికులు ఆందోళన చేపట్టారు. పోలీసుల కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. ప్రజా సంఘాలు, విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. 

 

రోడ్డుప్రమాదంలో ముగ్గురికి గాయాలు

కృష్ణా : పోలీసు జీపు ఢీకొని ముగ్గురికి గాయాలయ్యాయి. ఇద్దరు పిల్లలను బైక్ పై బాబాయి బాలశంకర్ కనకదుర్గ ఆలయానికి తీసుకువెళ్తుండగా పెనమలూరు మండలం కానూరు వద్ద బైక్ ను పోలీసు జీపు ఢీకొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. జీపు డ్రైవర్.. గాయపడ్డ వారిని జీపులో ఎక్కించుకుని ఆస్పత్రి వద్ద రోడ్డుపై వదిలి వెళ్లారు. పోలీసులు తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయపడినవారు కంకిపాడుకు చెందినవారిగా గుర్తించారు.

 

గిట్టని వారిని దూర ప్రాంతాలకు బదిలీ

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. అవకాశాన్ని ఓ ఉన్నతాధికారి అందిపుచ్చుకున్నారు. తన అనుయాయులకు సముచిత స్థానం కల్పించారు. గిట్టని వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేశారు. ర్యాండమైజేషన్ చేశామంటూ బర్త్ ఆండ్ డెత్ విభాగం అధికారి ఉన్నతాధికారులను పక్కదారి పట్టించారు. కమిషనర్ అక్రమ బదిలీలను నిలిపివేశారు. యథాతథ స్థానాల్లో పని చేయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. బదిలీలపై పూర్తి విచారణకు ఆదేశించారు. 

 

18:44 - May 28, 2018

చెన్నై : తమిళనాడు ప్రజల పోరాటం ఫలించింది. ప్రజా ఉద్యమానికి పళనిస్వామి ప్రభుత్వం తలవంచింది. తూత్తుకూడిలోని కాపర్ స్టెరిలైట్ ప్లాంట్ ను శాశ్వతంగా మూసివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. స్టెరిలైట్ ప్లాంట్ మూసివేతకు పళనిస్వామి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్లాంట్ మూసివేయాలంటూ ఇటీవల స్థానికులు ఆందోళన చేపట్టారు. పోలీసుల కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. ప్రజా సంఘాలు, విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. 
 

18:43 - May 28, 2018

విజయవాడ : సీఎం కేసీఆర్ త్యాగాల తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చిండని తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి విమర్శించారు. విజయవాడలో జరిగిన మహానాడులో ఆయన మాట్లాడారు. తెలంగాణలో పరిస్థితి జూస్తే..ఎక్సైజ్ వాళ్లేమో తాగమంటుర్రు...పోలీసోళ్లేమో ఊదమంటుర్రు.. తాగినందుకు పన్ను కట్టాలే..ఊదినందుకు ఫైన్ కట్టాలి.. అని అన్నారు. మొగళ్లనేమో సీసాలకు అలవాటు చేసిండు..ఆడోళ్లనేమో సీరియళ్లకు అలవాటు చేసిండ... ఇదేందిరా బై అంటే..గిదే బంగారు తెలంగాణ అంటున్నడు...సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. సీఎం బాత్ రూమ్ ల బుల్లెట్ ఫ్రూప్ అద్దాలుపెట్టుకుంటున్నాడంట.. రిటైర్ అయిన డీజీపీని ఇంటర్నర్ అడ్వయిజరీ సెక్రటరీగా పెట్టుకున్నాడని చెప్పారు. ఇంట్లకెళ్లని సీఎంకు ఇంటర్నల్ సెక్యూరిటీ ఎందుకంటే... ఇంట్ల నల్గురు గ్రూపులగా తయారైండంట..అందుకు ఇంట్ల ఏం జరుగుతుందో అని ఇంటర్నల్ సెక్యూరిటీ అంట..అన్నారు. 

 

18:18 - May 28, 2018

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. అవకాశాన్ని ఓ ఉన్నతాధికారి అందిపుచ్చుకున్నారు. తన అనుయాయులకు సముచిత స్థానం కల్పించారు. గిట్టని వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేశారు. ర్యాండమైజేషన్ చేశామంటూ బర్త్ ఆండ్ డెత్ విభాగం అధికారి ఉన్నతాధికారులను పక్కదారి పట్టించారు. కమిషనర్ అక్రమ బదిలీలను నిలిపివేశారు. యథాతథ స్థానాల్లో పని చేయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. బదిలీలపై పూర్తి విచారణకు ఆదేశించారు. 

 

18:03 - May 28, 2018

ఢిల్లీ : కేంద్రహోం మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హోంశాఖ కార్యాలయంలో కలిశారు. తెలంగాణలో నూతన జోనల్‌ వ్యవస్థకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని సీఎం కేసీఆర్‌ రాజ్‌నాధ్‌సింగ్‌ను కోరారు. జోన్ల వ్యవస్థ ఏర్పాటుకై.. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ కోసం ప్రధానమంత్రిని కలవడానికి ఆదివారం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లారు. అయితే ప్రధాని అపాయింట్మెంట్‌ ఖరారు కాకపోవడంతో కేసీఆర్‌ రాజ్‌నాధ్‌ను కలిశారు. కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ పై మోడీ గుర్రుగా ఉన్నారని.. అందుకే అపాయింట్మెంట్‌ ఖరారు కాలేదని ప్రధాని కార్యాలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

 

17:57 - May 28, 2018

విజయవాడ : మోత్కుపల్లి నర్సింహులు ద్రోహి అని..తెలంగాణ సమాజం ఇలాంటి ద్రోహిని గమనించాలని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీపై కుట్ర రాజకీయాలు, కుతంత్రాలు జరుగుతున్నాయన్నారు. పార్టీపై విద్రోహ చర్యలు జరుగుతున్నాయని.. ఆ విద్రోహ చర్యల్లో మోత్కుపల్లి ఒక భాగం అన్నారు. రాజకీయంగా మోత్కుపల్లి పతనానికి ఆయనే పునాది వేసుకున్నారని పేర్కొన్నారు. టీడీపీ సగటు కార్యకర్తల హృదయాల్లో మోత్కుపల్లి లేరన్నారు. దుర్మార్గకరంగా ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. గతంలో పార్టీ మారిన వారు పార్టీని, అధినేతను తిట్టలేదని...కానీ మోత్కుపల్లి తిట్టారని తెలిపారు. పార్టీపై మోత్కుపల్లి ప్రభావం జీరోలో జీరో పర్సెంట్ కూడా ఉండదన్నారు. గతంలో కేసీఆర్ దయ్యం అయినప్పుడు ఇప్పుడు దేవుడు ఎలా అయ్యాడో మోత్కుపల్లి చెప్పాలని ప్రశ్నించారు. 

17:09 - May 28, 2018

హైదరాబాద్ : మహా ప్రస్థానంలో రెడ్ స్టార్ మాదాల రంగారావు అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. అంత్యక్రియలకు గద్దర్, డా.మిత్ర, చలసాని, సీపీఐ, సీపీఎం కార్యకర్తలు హాజరయ్యారు.

17:02 - May 28, 2018

విజయవాడ : పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేయడం తన జీవిత లక్ష్యమని అన్నారు. టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకున్నారని..కోర్టుల్లో కేసులో వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల దగ్గర నిద్రపోయామని.. మనం అనుకున్న ప్రగతిని సాధించామన్నారు. 7 లక్షల పంట కుంటలను రెడీ చేశామని తెలిపారు. చెక్ డ్యామ్ లు కడతామని చెప్పారు. భూగర్భజాలాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కృష్ణా, పెన్నాలో నీళ్లు రావడం లేదన్నారు. 

 

16:57 - May 28, 2018

సంగారెడ్డి : సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ్మా అన్నారు. జగ్గారెడ్డి దీక్షకు ఆయన సంఘీభావం తెలపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిద్దిపేటలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంలో అభ్యంతరం లేదన్నారు. కానీ సంగారెడ్డికి రావాల్సిన మెడికల్ కాలేజీని సిద్దిపేటకు తీసుకపోవడం బాధాకరమన్నారు. సంగారెడ్డిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇవ్వడంలో సీఎం కేసీఆర్ జాప్యం చేస్తున్నారని అన్నారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ సాధిస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే మొదటి ప్రయారిటీ సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఉంటుందన్నారు.

 

16:50 - May 28, 2018

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 4 లోక్‌సభ స్థానాలు, 10 అసెంబ్లీ ఎన్నికల స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. యూపీలోని కైరానా, మహారాష్ట్రలోని పాల్‌ఘర్, భాంద్రా గోండియా నియోజకవర్గాలకు, నాగాలాండ్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికలు జరుగుతున్నాయి. 175 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎం-వీవీప్యాట్‌లు మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. కైరానాలో పలుచోట్లు ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు గంటల తరబడి ఓటు కోసం వేచి చూడాల్సి వచ్చింది. దీంతో ఓటర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కైరానాలో ఉదయం 11 గంటల వరకు 21.34 శాతం పోలింగ్‌ నమోదైంది. బిజెపి ఎంపి హుకుమ్‌సింగ్‌ మృతితో కైరానాలో ఉపఎన్నిక జరుగుతోంది. బిజెపి తరపున హుకుమ్‌ సింగ్‌ కుమార్తె మ్రిగాంకా సింగ్‌ పోటీలో ఉండగా... ఎస్పీ, కాంగ్రెస్, బిఎస్పీ మద్దతుతో ఆర్‌ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్‌ హసన్‌ బరిలో ఉన్నారు. పాల్‌ఘర్, భాంద్రా గోండియాలో బిజెపి, శివసేన పోటీ పడుతున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు మే 31న వెల్లడి కానున్నాయి.

 

 

16:47 - May 28, 2018

ఢిల్లీ : కొన్ని రోజుల కోసం విదేశీ పర్యటనకు వెళ్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. సోనియా గాంధీ వార్షిక మెడికల్‌ చెకప్‌ కోసం ఆమెను తీసుకుని విదేశాలకు వెళ్తున్నాను...కొద్ది రోజులు అందుబాటులో ఉండనని ట్వీట్‌ చేశారు. బిజెపి సోషల్‌ మీడియా ట్రోల్‌ ఆర్మీకి నాదొక సూచన...నన్ను విమర్శించడానికి అంతగా కసరత్తు చేయాల్సిన అవసరం లేదు...త్వరలోనే తిరిగొస్తానని రాహల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాహుల్‌ ట్వీట్‌పై బిజెపి స్పందించింది. సోనియా ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూనే రాహుల్‌పై సెటైర్‌ వేసింది. కర్ణాటకలో మహిళలు కాబినెట్‌ ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్నారని, మంత్రివర్గం తమకు సేవలు అందిస్తుందని ఆశతో ఉన్నారని బిజెపి పేర్కొంది. మీరు వెళ్లేముందు కర్ణాటకలో పనిచేసే ప్రభుత్వం ఏర్పడుతుందా? అని ప్రశ్నించింది. మీరు ఇలాగే ఎంటర్‌టైన్‌ చేయాలని సోషల్‌ మీడియా యూజర్స్‌ కోరుకుంటున్నట్లు బిజెపి ట్వీట్‌ చేసింది.

 

16:45 - May 28, 2018

హైదరాబాద్ : టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ చావుకు చంద్రబాబే కారణమని ఆరోపించారు.  హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌వద్ద నివాళు లర్పించిన ఆయన చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజకీయలబ్ది కోసం మాల, మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టి ట్టారని విమర్శించారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చంద్రబాబు కుట్రచేశారని కూడా మోత్కుపల్లి ఆరోపించారు. తనకు రాజ్యసభస్థానం   లేదా గవర్నర్‌ పదవి ఇస్తానని చెప్పి చివరికి మొండిచేయి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు.  డబ్బులున్న వారికే  చంద్రబాబు పదవులు ఇస్తున్నారని ఆరోపించారు.  పెద్దనోట్లను రద్దు చేయాలని చంద్రబాబే మోదీకి సలహా ఇచ్చారు మోత్కుపల్లి అన్నారు. టీడీపీకి ద్రోహం చేసిన చంద్రబాబు తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

 

16:41 - May 28, 2018

విజయవాడ : రాష్ట్రాన్ని అవినీతి రహితంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు 2019 ఎన్నికల్లో టీడీపీ గెలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. జగన్‌ వ్యవహారంతో పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడు రెండో రోజు పలు తీర్మానాలపై స్పందించిన చంద్రబాబు.. టీడీపీ హయాంలో అవినీతిని సహించబోమన్నారు. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందని తాను భరోసా ఇచ్చిన తర్వాతే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. 

 

16:39 - May 28, 2018

విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ప్రకటించిన కేంద్రం.. నిధుల విడుదలలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది.  2019 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు హామీనిచ్చినా... అందుకనుగుణంగా పనులు వేగవంతంగా జరగడం లేదు. పోలవరం నిర్మాణం పూర్తికి రాజకీయ కారణాలతో మోకాలడ్డుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పోలవరం ప్రాజెక్ట్‌ను 2005లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం అంకురార్పణ చేసింది. విభజన అనంతరం విభజన చట్టంలో భాగంగా పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించింది. దేశంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్ట్‌ కూడా పోలవరమే. ఏపీలోని 13 జిల్లాలకు ఈ ప్రాజెక్ట్‌ జీవనాడిగా రైతాంగం భావిస్తోంది.  2018-19 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేస్తామని.. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ వాస్తవంగా పనులు మాత్రం మందకొడిగా సాగుతున్నాయి.  ప్రభుత్వాలు చెబుతున్న మాటలకు... పోలవరం పనులు జరుగుతున్న తీరుకు ఎక్కడా పొంతన లేదు.

పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు విషయంలో కేంద్రం మోకాలడ్డుతోంది.  కేంద్రం నిధులు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.  కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం చేకూరదన్న భావనతో నిధుల విడుదలకు కేంద్రం ఆలస్యం చేస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన నిధులను రీయింబర్స్‌మెంట్‌ చేయడంలో కేంద్రం మెలికలు పెడుతోందని, దీంతో ప్రాజెక్ట్‌ పనులకు సవాలక్ష అడ్డంకులు ఎదురవుతున్నాయని ఏపీ జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. 

పోలవరం ప్రాజెక్ట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 1089 కోట్లను రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నట్టుగా మార్చి 2018లో పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీకి కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ద్వారా కేంద్ర ఆర్థికశాఖ లిఖిత పూర్వకంగా పేర్కొంది. అయితే 1089 కోట్లకు సంబంధించిన నిధులు మాత్రం విడుదల కాలేదు. కేంద్ర ఆర్థికశాఖ నుంచి రావాల్సిన నిధుల విడుదలపై సరైన స్పష్టత రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమస్య ఎదుర్కొంటోంది. మరోవైపు పోలవరం 2013-14 తుది అంచనాలు 58,319.06 కోట్లకు కేంద్ర జలసంఘం ఆమోదం తెలపాల్సి ఉంది. కానీ నేటివరకు ఈ తుది అంచనాలపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.  ఫలితంగా పోలవరం ప్రాజెక్ట్‌ తుది అంచనాలు ఎప్పటికీ గ్రీన్‌సిగ్నల్‌ లభిస్తోందోనన్న సందేహాలు నెలకొన్నాయి. పోలవరం ప్రాజెక్ట్‌ నిధుల విడుదలలో రాజకీయ కారణాలు బలంగా పనిచేస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో నిర్దేశిత సమయంలో పోలవరం పూర్తవుతుందా అన్న సందేహాలు నెలకొన్నాయి.

మాదాల రంగారావు అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్ : మహా ప్రస్థానంలో రెడ్ స్టార్ మాదాల రంగారావు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. అంత్యక్రియలకు గద్దర్, డా.మిత్ర, చలసాని, సీపీఐ, సీపీఎం కార్యకర్తలు హాజరయ్యారు.

16:16 - May 28, 2018

హైదరాబాద్ : మాదాల రంగారావు విప్లవాత్మకమైన సినిమాలు తీసి తన ప్రత్యేకతను చాటుకున్నారని సీపీఐ నారాయణ అన్నారు. సినీరంగంలో ఎర్ర చొక్కలు వేయించి, ఎర్ర జెండా పట్టించిన ఘనత మాదాల రంగారావుకే దక్కుతుందని  అన్నారు. మాదాల రంగారావు మరణం సంస్కృత ఉద్యమానికి తీరని లోటని సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి  మధు అన్నారు. సంస్కృత కళాకారులు రంగారావుకి ఎప్పుడూ రుణపడి ఉంటారని అన్నారు. కమ్యునిస్టుల ఐక్యతను కోరుకున్న వ్యక్తి  రంగారావని చాడా వెంకట రెడ్డి అన్నారు.

 

16:13 - May 28, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని సీం చంద్రబాబు అన్నారు. విజయవాడలో జరుగుతున్న టీడీపీ మహానాడు రెండో రోజు కార్యక్రమంలో బీజేపీపై బాబు ఘాటుగా విమర్శలు చేశారు. రాజధాని నిధుల విషయంలో  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకు ఎప్పటికపుడు లెక్కలన్నీ అప్పజెప్పామన్నారు.  టీడీపీని దెబ్బతీయడానికే బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు విమర్శంచారు. 

16:07 - May 28, 2018

హైదరాబాద్ : మోత్కుపల్లి నర్సింహులుపై టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఫైర్‌ అయ్యారు. మోత్కుపల్లి  తులసి వనంలో గంజాయి మెక్కలా తయారయ్యారని విమర్శించారు. చంద్రబాబుపై విమర్శల చేయడంతోనే మోత్కుపల్లి రాజకీయ పతనం ప్రారంభమైందన్నారు. సొంత జిల్లాలోనే నేతల్ని ఎదగనివ్వని చరిత్ర మోత్కుపల్లిదని సండ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోత్కుపల్లికి కేసీఆర్‌ దైవం ఎలా ఆయ్యారో  చెప్పాలని సండ్ర డిమాండ్‌ చేశారు. టీడీపీని టీఆర్‌ఎస్‌లో వీలినం చెయాలన్నపుడే మోత్కుపల్లి చచ్చిపోయిట్లని సండ్ర వ్యాఖ్యానించారు. మోత్కుపల్లి అతి నీచుడు అన్నారు.

15:54 - May 28, 2018

నానాటికి గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. అనేక పోరాటాల ఫలితంగా గృహ హింస చట్టం వచ్చింది. అమలులో గృహ హింస చట్టం అనేక అవరోధాలు ఎదుర్కొంటోంది. అమలు తీరును బలోపేతం చేయాలని మహిళ సంఘాలు అంటున్నారు. ఇదే అంశంపై మానవి నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దేవి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

చంద్రబాబుపై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ : మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని, జెండాను చంద్రబాబు పెత్తందార్లకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు పార్టీని నందమూరి కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. 

ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి - లోకేష్...

విజయవాడ : ప్రతిపక్షాలు చేసిన తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినవసరం ఉందని ఏపీ మంత్రి నారా లోకేష్ టిడిపి మహానాడులో పిలుపునిచ్చారు. మహానాడు రెండో రోజు ఆయన మాట్లాడారు గ్రామాల్లో ఎక్కడ తిరిగినా టిడిపి అభివృద్ధే కనిపిస్తుందన్నారు. గ్రామీణాభివృద్ధి కోసం రూ. 24వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. రూ. 16వేల లోటు బడ్జెట్ ఉన్నా ప్రజలకు మాత్రం ఎలాంటి లోటు లేకుండా బాబు చూస్తున్నారన్నారు. 

తండ్రి స్పీడ్ ని అందుకోలేకపోతున్నానన్న లోకేష్...

విజయవాడ : టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వయస్సు ఎంతో తెలుసా ? అని ఏపీ మంత్రి నారా లోకేష్ టిడిపి మహానాడులో ప్రశ్నించారు. మహానాడు రెండో రోజు ఆయన మాట్లాడారు. తన తాత..తన తండ్రికి చెడ్డపేరు తీసుకరానన్నారు. తన తండ్రి వయస్సు 68 సంవత్సరాలని, ఈ వయస్సులో కూడా 24 సంవత్సరాల యువకుడిగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. 

13:30 - May 28, 2018

విజయవాడ : టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వయస్సు ఎంతో తెలుసా ? అని ఏపీ మంత్రి నారా లోకేష్ టిడిపి మహానాడులో ప్రశ్నించారు. మహానాడు రెండో రోజు ఆయన మాట్లాడారు. తన తాత..తన తండ్రికి చెడ్డపేరు తీసుకరానన్నారు. తన తండ్రి వయస్సు 68 సంవత్సరాలని, ఈ వయస్సులో కూడా 24 సంవత్సరాల యువకుడిగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. తాను ముఖ్యమంత్రి స్పీడ్ ను అందుకోలేకపోతున్నానని, సోమవారం ఉదయమే మంత్రులు..అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఉపాధి పనులపై బాబు సమీక్షించారని..ఇదంతా కేవలం ఏపీ ప్రజల కోసమేనన్నారు.

ప్రతిపక్షాలు చేసిన తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినవసరం ఉందని, గ్రామాల్లో ఎక్కడ తిరిగినా టిడిపి అభివృద్ధే కనిపిస్తుందన్నారు. గ్రామీణాభివృద్ధి కోసం రూ. 24వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. రూ. 16వేల లోటు బడ్జెట్ ఉన్నా ప్రజలకు మాత్రం ఎలాంటి లోటు లేకుండా బాబు చూస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో టిడిపిని గెలిపించి చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలన్నారు. కులాలు..ప్రాంతీయ..మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, వెంకన్న జోలికి వస్తే ఎవరూ బతికింది లేదన్నారు. 

13:18 - May 28, 2018

మోత్కుపల్లిపై సండ్ర విమర్శలు...

హైదరాబాద్ : మోత్కుపల్లి రాజకీయ పతనం ప్రారంభమైందని టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఆయకు గవర్నర్ కోసం సీఎం చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేశారని, అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరైందని కాదన్నారు. మోత్కుపల్లి ఎన్టీఆర్ అభిమాని కాదని..ఆయన ఆశయాలను మోసం చేసిన వ్యక్తి అని విమర్శించారు. సడన్ గా కేసీఆర్ ఎలా దైవం అయ్యాడో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఎస్వీకేలో మాదాల రంగారావు భౌతికకాయం...

హైదరాబాద్ : సినీ నటుడు, విప్లవ నటుడు మాదాల రంగారావు భౌతికకాయాన్ని ఎస్వీకే కు తరలించారు. అక్కడ సీపీఎం, సీపీఐ సీనియర్ నేతలు, ఇతరులు నివాళులర్పించారు. 

12:33 - May 28, 2018
12:32 - May 28, 2018

సంగారెడ్డి : జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని జిల్లా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన నిరహార దీక్షకు కూర్చొన్నారు. దీక్ష ప్రాంగణానికి భారీగా కార్యకర్తలు..తరలి వచ్చారు. మూడు రోజుల పాటు రిలే నిరహార దీక్ష చేయనున్నారు. గతంలో తాను మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో స్పందించాలని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు దీక్ష అనంతరం నాలుగో రోజు సంగారెడ్డి జిల్లా బంద్ కు పిలుపునిస్తామన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని, భవిష్యత్ లో మంత్రులను నిలదీస్తామని హెచ్చరించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:27 - May 28, 2018

ఖమ్మం : ట్రావెల్ ఏజెంట్ మోసానికి ఖమ్మం జిల్లా ఓ కుటుంబం ఇబ్బందులు పడుతోంది. ఖాట్మండులో పడుతున్న ఇబ్బందులను ఓ వ్యక్తి వీడియో ద్వారా బాహ్యా ప్రపంచానికి తెలియచేశాడు. ఒక్కోక్కరి నుండి లక్షా పది వేల రూపాయలను వసూలు చేశారని పేర్కొన్నాడు. గోరఖ్ పూర్ కు చెందిన స్టార్ ట్రావెల్ ఏజెన్సీ మోసం చేయడంతో మానససరోవర్ లో ఎదురు చూపులు చూస్తున్నారు. వీరు పడుతున్న బాధలపై ప్రభుత్వం స్పందిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

12:20 - May 28, 2018

బాబు రాజీనామా చేయాలన్న మోత్కుపల్లి...

హైదరాబాద్ : టి.టిడిపి నేత మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎకంగా చంద్రబాబు నాయుడిని ఓడించాలని పిలుపునివ్వడం గమనార్హం. ఎన్టీఆర్ పెత్తందారుల కోసం పార్టీ పెట్టలేదని, పేదవారి కోసం పార్టీ పెట్టారన్నారు. ఎన్టీఆర్ పేరును రాజకీయాల కోసం వాడుకుంటున్నారని, చంద్రబాబుకు కేవలం అధికారం కావాలన్నారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేశారని తెలిపారు. కేసీఆర్ ను బలి చేసేందుకు రేవంత్..చంద్రబాబులు యత్నిస్తున్నారని, కులాల మధ్యన బాబు చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని..జెండాను లాక్కుని పెత్తందారులకు చంద్రబాబు అమ్ముకున్నారని విమర్శించారు.

12:05 - May 28, 2018

విజయవాడ : బీజేపీ పార్టీపై టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వరం మరింత పెంచారు. మొన్నటి వరకు సున్నిత విమర్శలు చేస్తూ వచ్చన బాబు ప్రస్తుతం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. టిడిపి మహానాడులో కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధాని నిర్మాణ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పలు వ్యాఖ్యలు చేశారని, రాజధాని భవనాలకు టెండర్లు పిలవడం జరిగిందని, పనులు జరుగుతున్నాయని వివరించారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్చందంగా భూములిచ్చారని, టిడిపిని దెబ్బతీయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. యూసీలు పంపితే నిజమైనవి కావని అంటున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని, హోదా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. హోదా ఇవ్వడానికి ఏ యూసీ కావాలని ప్రశ్నించారు. నమ్మకం ద్రోహం చేసిన బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏపీలో బీజేపీకి ఒక్క శాతం కూడా ఓట్లు రావని జోస్యం చెప్పారు. జాతీయ స్థాయి నాయకులు మాట్లాడే తీరు ఇదేనా అంటూ మండిపడ్డారు.

గోదావరిలో దూకిన ప్రేమజంట ఆత్మహత్యాయత్నం...

తూర్పుగోదావరి : యానాం - వెదురులంక వంతెన పై నుండి గోదావరిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇందులో యువతి గల్లంతు కాగా యువకుడిని మత్స్యకారులు రక్షించారు. 

11:30 - May 28, 2018

శ్రీకాకుళం : జిల్లా ఉద్దానం వ్యాధిగ్రస్థులకు.. గతంలో ఎవరూ చేయని రీతిలో.. తెలుగుదేశం ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కునే దిశగా.. రకరకాల కార్యక్రమాలు చేపడుతోందని వెల్లడించింది. ఉద్దానం నుంచి శాశ్వతంగా కిడ్నీ వ్యాధిని తరిమేసేవరకూ తమ ప్రయత్నాలు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది.

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత కిడ్నీ వ్యాధి సమస్య పరిష్కారానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళం రిమ్స్‌లో డయాలసిస్‌ యూనిట్లను ప్రారంభించడం ద్వారా తొలి అడుగు వేసినట్లు వెల్లడించింది. దీని వల్ల.. ఉద్దానం ప్రాంత రైతులు.. విశాఖపట్టణం దాకా రెండేసి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఇబ్బంది తప్పిందని వెల్లడించింది. ఆ తర్వాత.. టెక్కలిలో 8, పలాసలో 8, సోంపేటలో 12, పాలకొండలో ఐదు చొప్పున డయాలసిస్‌ మిషన్‌లను ఏర్పాటు చేసి.. రోగులకు వైద్య సేవలను చేరువ చేశామని తెలిపింది. ఇవికాక శ్రీకాకుళం రిమ్స్‌లో 16 డయాలసిస్‌ మిషన్లతో ఉద్దానం కిడ్నీ రోగులకు సేవలందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

కిడ్నీ వ్యాధులకు మూల కారణం ఇంత వరకూ తేలనప్పటికి... తాగు నీరే కొంత మేర కారణం కావచ్చని భావించినందు వల్ల.. శుద్ధ జలాలను అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏడు మదర్‌ ఆర్‌ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఏడు మండలాల్లో 128 గ్రామాలకు చెందిన లక్షా 89వేల మందికి స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నామని, ఏడు మదర్‌ ప్లాంట్ల పని పూర్తయిందని, 135కు గాను 109 పంపిణీ యూనిట్ల ద్వారా ఇప్పటికే క్యాన్ల ద్వారా నీటిని అందిస్తున్నామని ప్రభుత్వం వివరించింది. ఈ ప్రాంత ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని.. కుప్పంలో నెలకొల్పాల్సిన ఎన్టీఆర్‌ సుజల స్రవంతిని.. సిక్కోలుకు తరలించినట్లు వెల్లడించింది.

డయాలసిస్‌ చేయించుకునేందుకు ఒక్కొక్కరికి పాతిక నుంచి 30 వేల ఖర్చవుతుందని.. వారానికి ఎన్నిసార్లయినా.. ఉచితంగానే డయాలసిస్‌ సేవలు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో ఆసుపత్రిలో రోజూ 25 నుంచి 27 సెషన్స్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అదే విధంగా ఉద్దానం కిడ్నీ వ్యాధి గ్రస్తులు 363 మందికి.. ప్రతినెలా రెండున్నర వేల రూపాయల పింఛన్‌ ఇస్తున్నామని వెల్లడించింది. డయాలసిస్‌ చేయించుకుంటున్న వారు.. కొన్ని చోట్ల నెఫ్రాలజిస్టును నియమించాలని కోరుతున్నారని, త్వరలోనే దీన్ని నెరవేరుస్తామని హామీ ఇచ్చింది.

కిడ్నీ వ్యాధులపై పరిశీలనకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ బృందాన్ని రప్పించామని, ఈ బృందం.. విశాఖలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌-విమ్స్‌ కేంద్రంగా, జార్జి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ హెల్త్‌ సీనియర్‌ నెఫ్రాలజిస్ట్‌ డా.వివేకానంద ఝా నేతృత్వంలో పని చేస్తోందని ప్రభుత్వం గుర్తు చేసింది. ఉద్దానం కిడ్నీ వ్యాధుల మూలాలను కనుగొనే పరిశోధన ప్రారంభమైందని వివరించింది. నిరుడు జనవరి నుంచి ఏప్రిల్‌ వరకూ ఉద్దానం మండలంలో ప్రత్యేక స్క్రీనింగ్‌ కూడా నిర్వహించామని ప్రభుత్వం తెలిపింది. డా.వివేకానంద ఝా నేతృత్వంలో ఉద్దానం ప్రాంతంలోని 18 ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులకు సంబంధిత శిక్షణను అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జూన్ మొదటి వారం నుండి సంబంధిత మందులను రోగులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

11:27 - May 28, 2018

ఏపీలో బీజేపీకి ఒక్క శాతం ఓట్లు రావు - బాబు...

విజయవాడ :  నమ్మకం ద్రోహం చేసిన బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని భవనాలకు టెండర్లు పిలవడం జరిగిందని, పనులు జరుగుతున్నాయని వివరించారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని, హోదా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. హోదా ఇవ్వడానికి ఏ యూసీ కావాలని ప్రశ్నించారు. ఏపీలో బీజేపీకి ఒక్క శాతం కూడా ఓట్లు రావని జోస్యం చెప్పారు. 

జాతీయస్థాయి నాయకులు మాట్లాడే మాటలేనా - బాబు..

విజయవాడ : రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్చందంగా భూములిచ్చారని, అమరావతిలో పనులు జరగడం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొంటున్నారని టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యూసీలు పంపితే నిజమైనవి కావని అంటున్నారని తెలిపారు. జాతీయ స్థాయి నాయకులు మాట్లాడే తీరు ఇదేనా అంటూ మండిపడ్డారు.

జగన్ 174వ రోజు...

పశ్చిమగోదావరి : వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 174వ రోజు జిల్లాలోని విస్సాకోడేరు నుంచి ప్రారంభమైంది. గోరనమూడి, పెన్నాడ, శృంగవృక్షం, నందమూరు గరువుల, తలతాడి తిప్ప, బొబ్బనపల్లి, మత్స్యపురి వరకూ పాదయాత్ర కొనసాగనుంది.

అమిత్ షా మాటలు అవాస్తవాలు - బాబు...

విజయవాడ : అమరావతిలో పనులు కాలేదని..బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొంటున్నారని టిడిపి జాతీయ అధ్యక్షుడు తెలిపారు. కానీ రూ. 15,009 కోట్ల పనుల బిల్లులు పంపించడం జరిగిందని, ఇవన్నీ నిజం కాదని షా పేర్కొంటున్నారని తెలిపారు. కేంద్రానికి రాష్ట్రాలు బానిసలు కాదన్నారు. 

10:53 - May 28, 2018

విజయవాడ : స్వర్గీయ ఎన్టీరామారావుకు భారతరత్న ఎందుకివ్వరు ? ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టిడిపిలో ఉన్న ప్రతి కార్యకర్త స్వర్గీయ ఎన్టీ రామారావులాగా తయారు కావాలని పిలుపునిచ్చారు. మహానాడులో భాగంగా రెండో రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేతలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ...ఎన్టీఆర్ ఇచ్చిన స్పూర్తితో ముందుకెళుతున్నామని..తాను రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు.

ఎన్టీఆర్ హాయంలో ఎన్నో సంక్షేమ పథకాలు..సంస్కరణలు జరిగాయన్నారు. రెండు రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చారని, పక్కా ఇళ్లు ఉండాలనే ఉద్ధేశ్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా పక్కా ఇళ్లకు శ్రీకారం చుట్టారన్నారు. ఏ కార్యక్రమం తీసుకున్నా వినూత్నంగా ముందుకెళ్లారని, అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందన్నారు. మహిళల విద్య కోసం పద్మావతి యూనివర్సిటీ, ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఎన్టీఆర్ అన్నారు.

కమ్యూనిజం..సోషలిజం..ఇవన్నీ తెలియవని..తన ఆలోచన అనేది పేదవాడికి పట్టెడన్నం అందించాలని తెలుసని ఎన్టీఆర్ పేర్కొన్నారని, సమాజమే దేవాలయం..పేదవాడు దేవుడు అని అంటుండే వారన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ శాశ్వతంగా గుర్తిండిపోయే విధంగా ఎన్టీఆర్ విగ్రహం..మెమోరియల్ లను త్వరలో ప్రారంభించనున్నామని, ఎన్టీఆర్ జీవిత చరిత్ర పాఠ్యాంశాల్లో ఉండాలని పేర్కొన్నారు. 

అమరావతిలో పనులు కాలేదని..బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొంటున్నారని తెలిపారు. కానీ రూ. 15,009 కోట్ల పనుల బిల్లులు పంపించడం జరిగిందని, ఇవన్నీ నిజం కాదని షా పేర్కొంటున్నారని తెలిపారు. కేంద్రానికి రాష్ట్రాలు బానిసలు కాదన్నారు. 

ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలన్న బాబు...

విజయవాడ : తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ శాశ్వతంగా గుర్తిండిపోయే విధంగా ఎన్టీఆర్ విగ్రహం..మెమోరియల్ లను త్వరలో ప్రారంభించనున్నామన్నారు.

సీపీఐ ఆఫీసుకు మాదాల రంగారావు భౌతికకాయం...

హైదరాబాద్ : విప్లవ నటుడు మాదాల రంగారావు భౌతికకాయాన్ని ఫిల్మ్ నగర్ నుండి సీపీఐ ఆఫీసు మఖ్దూం భవన్ కు తరలించారు. అక్కడ కమ్యూనిస్టులు, మేధావులు, కళాకారులు, ఇతరులు నివాళులర్పించనున్నారు. 

10:20 - May 28, 2018

విజయవాడ : పేరు..ప్రఖ్యాతులు తీసుకొస్తారో వారే మహానుభావులని తెలిపారు. టిడిపి వ్యవస్థాపకుడు పద్మశ్రీ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నట్లు వెల్లడించారు. భావి తరాలకు గుర్తుండిపోయేలా ఎన్టీఆర్ చిత్రం తీయడం జరుగుతోందని, అందులో భాగంగా అమరావతిలో 75 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందన్నారు. ప్రజల అభివృద్ధి..సంక్షేమాన్ని కాంగ్రెస్ పక్కన పెట్టిందని, తరచూ సీఎంలను మార్చడంతో ఎన్టీఆర్ కు బాధ కలిగిందన్నారు. ఇంకా ఏమీ మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి...

ఎన్టీఆర్ కు బాలయ్య నివాళి...

విజయవాడ : పేరు..ప్రఖ్యాతులు తీసుకొస్తారో వారే మహానుభావులని తెలిపారు. టిడిపి వ్యవస్థాపకుడు పద్మశ్రీ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా బాలయ్య నివాళులర్పించారు. 

మహానాడులో ఎన్టీఆర్ కు నివాళి...

విజయవాడ : టిడిపి మహానాడు రెండో రోజు ప్రారంభమైంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేతలు ఘనంగా నివాళులర్పించారు. రెండో రోజు సినీ నటుడు, హిందూపుర ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు. 

09:35 - May 28, 2018

హైదరాబాద్ : మాదాల రంగారావు అంత్యక్రియల్లో ఎలాంటి పూజలు నిర్వహించకుండానే కార్యక్రమాన్ని జరుపనున్నట్లు ఆయన తనయుడు మాదాల రవి వెల్లడించారు. ఆదివారం చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సోమవారం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. మాదాల రంగారావు వారసుడు మాదాల రవి ఒక్కరే కాదని...ప్రజా నాట్యమండలి కళాకారులు, అభ్యదయ, ప్రగతి విప్లవ..అభ్యుదయ శక్తులు, సామాజిక చైతన్యం కోసం పనిచేసే వారందరూ ఆయన వారుసులేనన్నారు. కమ్యూనిజమే శ్వాసగా...ఆయన ఏది కోరుకున్నారో అదే విధంగా అంత్యక్రియలు జరుగుతాయని, తొలుత ఫిల్మ్ నగర్ నుండి 9.30గంటలకు సీపీఐ కార్యాలయానికి మాదాల రంగారావు భౌతికకాయాన్ని తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. అక్కడ ప్రజాకళాకారులు, అభ్యుదయ, ప్రగతి శక్తులు, ఇతరులు నివాళులర్పిస్తారని తెలిపారు. అనంతరం భారీ ర్యాలీగా సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ఒంటి గంటకు చేరుకుంటుందని, అక్కడ ఇతరులు నివాళులర్పించిన అనంతరం మహాప్రస్థానంకు ర్యాలీగా చేరుకుంటుందన్నారు. 3.30-4.00గంటల మధ్య అంత్యక్రియలు జరుగుతాయన్నారు. 

మాదాలకు పలువురు నివాళి...

హైదరాబాద్ : విప్లవ నటుడు మాదాల రంగారావు భౌతికకాయానికి పలువురు నివాళులర్పిస్తున్నారు. ఆదివారం చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సోమవారం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. 

09:18 - May 28, 2018

ఢిల్లీ : కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే దేశంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం నాడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరుతున్నారు. నాలుగు లోక్ సభ, పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మే 28న పోలింగ్‌ జరగనుండగా, 31న ఫలితాలు రానున్నాయి. ఉదయమే పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌లోని కైరానా, మహారాష్ట్రలోని పాల్ఘర్‌, భండారా-గోండియా, నాగాలాండ్‌ ఏకైక ఎంపీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది.
నూపుర్ (యూపీ), షాకోట్ (పంజాబ్), జోకిహట్ (బీహార్), పాలుస్ కడేగావ్ (మహారాష్ట్ర), అంపటి (మేఘాలయ), గొమియా, సిల్లి (జార్ఖండ్), చెంగన్నూరు (కేరళ), థరాలి (ఉత్తరాఖండ్), మహేస్థల (పశ్చిమ బెంగాల్) స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:15 - May 28, 2018

హైదరాబాద్ : ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కుట్రలను సీరియల్స్ వెల్లడిస్తానని లక్ష్మీ పార్వతి వెల్లడించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆమె ఎన్టీఆర్ ఘాట్ కు విచ్చేసి ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...గతంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ మార్గం ఎంతో కళకళలాడుతూ ఉండేదని, ప్రస్తుతం ఈ రోడ్డు అంతా బోసి పోయిందన్నారు. బ్యానర్స్..ఘనంగా స్వాగతం పలికే విధంగా చేయాల్సిన ఏర్పాట్లు టిడిపి ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. ఎన్టీఆర్ ను టిడిపి ప్రభుత్వం తక్కువగా చూపిస్తోందని, భారతరత్న రాకుండా అడ్డుకొంటోంది బాబేనని కుండబద్ధలు కొట్టారు. 

09:09 - May 28, 2018

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినకు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రితో సహా పలువురు మంత్రులను ఆయన కలువనున్నారు. కానీ సోమవారం ప్రధానితో సమావేశం ఇంకా కన్ఫామ్ కాలేదు. జోన్ల వ్యవస్థకు సంబంధించిన విషయాలు..ఇతరత్రా విషయాలను రాష్ట్రపతికి తెలియచేయనున్నారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పాలన..సంక్షేమ పథకాలు..పెండింగ్ లో ఉన్న విషయాలను ఆయన దృష్టికి తేనున్నారు. అనంతరం మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కేసీఆర్ కలువనున్నారు. ఎప్పటిలాగేనే ఈసారి కూడా కేసీఆర్ పర్యటన గోప్యతగానే కొనసాగనుందని ప్రచారం జరుగుతోంది. 

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే దుర్మరణం...

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన సిద్ధు న్యామగౌడ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. గోవా వెళ్లిన ఆయన, తిరుగు ప్రయాణంలో బాగల్ కోట్ వస్తుండగా తులసిగెరి వద్ద ఆయన కారుకు ప్రమాదం జరిగింది. 

నైరుతీ పవనాలు వచ్చేశాయి...

ఢిల్లీ : నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులను దాటాయి. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం దక్షిణ ప్రాంతం వరకూ విస్తరించిన రుతుపవనాలు మంగళవారం కేరళను తాకుతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

08:24 - May 28, 2018

హైదరాబాద్ : అభ్యుదయ సినీనటుడు, రెడ్‌స్టార్‌ మాదాల రంగారావు కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మాదాల రంగారావు మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సోమవారం సాయంత్రం మహాప్రస్థానంలో మాదాల రంగారావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాదాల రంగారావు భౌతికకాయానికి సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు నివాళులర్పించారు. చిరంజీవి మాదాల రంగారావు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

మాదాల రంగారావు మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు, విపక్ష వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంతాపం తెలిపారు. సినీ మాద్యమం ద్వారా అవినీతి అక్రమాలపై పోరాడి ప్రజల హృదయాలను చూరగొన్నారని వారు అభివర్ణించారు. మాదాల రంగారావు అంత్యక్రియలు సోమవారం సాయంత్రం మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. అంతకుముందు వామపక్షాల కార్యాలయాలలో ప్రజల సందర్శనార్ధం మాదాల రంగారావు భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అటు మాదాల రంగారావు మృతితో ప్రకాశం జిల్లాలోని ఆయన స్వగ్రామం మైనంపాడు శోకసంద్రంలో మునిగిపోయింది. సినీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుతో పాటు.. తమ గ్రామానికీ వెలుగు తెచ్చిన విప్లవతేజం ఇక లేదని తెలిసి తట్టుకోలేక పోతున్నామని గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. 

08:16 - May 28, 2018

శ్రీకాకుళం : 2019 ఎన్నికలకు సిద్ధం కావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. సామాజిక, రాజకీయ మార్పే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పోరాట యాత్రలో జనసేనాని చెప్పారు. జిల్లాలోని నర్సన్నపేట, పాతపట్నం, ఆముదాలవలసలో జరిగిన జనసేన నిరసన కవాతులో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుచేయని ప్రధాని మోదీ చర్యను తప్పుపట్టారు. వీటి సాధనలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

07:48 - May 28, 2018

టిడిపి నిర్వహిస్తున్న మహానాడు అట్టహాసంగా కొనసాగుతోంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన దానిపై పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మోడీ ప్రభుత్వంపై విరుచకపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవడం కల్ల అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో విష్ణు (బిజెపి), రాజశేఖర్ (వైసిపి), రామాంజనేయులు (టిడిపి), లక్ష్మణ్ రావు (మాజీ ఎమ్మెల్సీ, విశ్లేషకులు), శివశంకర్ (జనసేన) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు...

ఢిల్లీ : నూపుర్ (యూపీ), షాకోట్ (పంజాబ్), జోకిహట్ (బీహార్), పాలుస్ కడేగావ్ (మహారాష్ట్ర), అంపటి (మేఘాలయ), గొమియా, సిల్లి (జార్ఖండ్), చెంగన్నూరు (కేరళ), థరాలి (ఉత్తరాఖండ్), మహేస్థల (పశ్చిమ బెంగాల్) స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. 

4 లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు...

ఢిల్లీ : నేడు నాలుగు లోక్ సభ, పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మే 28న పోలింగ్‌ జరగనుండగా, 31న ఫలితాలు రానున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని కైరానా, మహారాష్ట్రలోని పాల్ఘర్‌, భండారా-గోండియా, నాగాలాండ్‌ ఏకైక ఎంపీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. 

కర్ణాటకలో పోలింగ్ ప్రారంభం...

కర్ణాటక : రాష్ట్రంలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాజరాజేశ్వరీ నగర్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. నకిలీ ఓటర్ కార్డులు బయటపడటంతో రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ ఎన్నిక వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఉప ఎన్నికలకు పోలింగ్ ఏర్పాట్లు...

ఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లోని మహెస్థల, జార్ఖండ్‌లోని గోమియా, సిల్లి, బీహార్‌లోని జోకిహట్, మేఘాలయలోని అంపతి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. నాగాలాండ్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తారు. కాసేపట్లో పోలింగ్ జరుగనుంది. 

జమ్మూ కాశ్మీర్ లో ఎల్ ఈడీ బ్లాస్ట్...

జమ్మూ కాశ్మీర్ : ఎల్ ఈ డీ పేలుడులో ముగ్గురు ఆర్మీ జవాన్లకు గాయాలయ్యాయి. షోఫాన్ జిల్లాలోని సుగాన్ - చిల్లిపురా మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా జవాన్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

కేరళలో ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్...

కేరళ : దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. చెంగనూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ లో ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు.

06:53 - May 28, 2018

కార్మికులకు సమ్మె చేసే హక్కు లేదా? సమ్మె నోటీసు ఇవ్వటం కూడా చట్ట విరుద్ధమేనా? ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల విషయంలో లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ అనుసరిస్తున్న విధానం ఈ ప్రశ్నలనే చర్చకు పెడుతుంది. తాము ఇచ్చిన సమ్మె నోటీసు పట్ల తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ వ్యవహరిస్తున్న తీరుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తమ విషయంలో చట్టాల ఉల్లంఘన జరుగుతుంటే పట్టించుకోని లేబర్‌ శాఖ తాము సమ్మె నోటీసు ఇస్తే మాత్రం యాజమాన్యంతో మాట్లాడే పరిష్కరించుకోమని చెప్పటం విడ్డురంగా ఉందని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై టెన్ టివి జనపథంలో స్టాఫ్‌ అండ్ వర్కర్స్‌ ఫ్రెడరేషన్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్‌ రావు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:51 - May 28, 2018

ఢిల్లీ : ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చమక్కుమంది. రెండేండ్ల నిషేధం తర్వాత బరిలోకి దిగిన చెన్నై... తమ పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది. మిగతా జట్లకు సాధ్యం కాని రీతిలో ఏడోసారి ఫైనల్ చేరిన ధోనీసేన కప్‌తో తమ కలను సాకారం చేసుకుంది. ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన చెన్నై.... ముచ్చటగా మూడోసారి కప్‌ను ముద్దాడింది. రెండేళ్ల నిరీక్షణ... స్పాట్‌ ఫిక్సింగ్‌తో మంటకలిసిన పరువు.. అపప్రదల మధ్య ఐపీఎల్‌లో పునరాగమనం చేసిన చెన్నై సూపర్‌కింగ్స్‌... సంచలనం సృష్టించింది. చేజారిపోయిన చరిత్రకు తిరిగి ప్రాణ ప్రతిష్ట చేస్తూ రికార్డుల రారాజులమనే పేరును సార్థకం చేసుకుంటూ వాంఖడేలో పరుగుల తుఫాన్‌ సృష్టించింది. లక్ష్యం పెద్దతే అయినా.. ఓటమి భయం వెంటాడినా...ఫేవరెట్‌ హోదాకు న్యాయం చేస్తూ మాజీ చాంపియన్‌గా తన అనుభవాన్ని రంగరించి టైటిల్‌ను ఎగరేసుకు పోయింది. చెన్నై అభిమానుల ఆశలను, ఆకాంక్షలను నెరవేరుస్తూ మహేంద్రుడు ఆడిన మహాన్నాటకంలో ముచ్చటగా మూడోసారి విజేతగా నిలిచింది.

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఐపీఎల్‌-11 సీజన్‌ విజేతగా నిలిచింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌ ఫైట్‌లో హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై కేవలం 18.3 ఓవర్లలోనే అందుకుంది. ఓపెనర్‌ వాట్సన్‌ అజేయ సెంచరీతో కదం తొక్కాడు. 57 బంతులు ఎదుర్కొన్న వాట్సన్‌.. 11పోర్లు, 8 సిక్స్‌లతో 117 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. వాట్సన్‌ విజృంభణతో హైదరాబాద్‌ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై.. 16 పరుగుల వద్ద డుప్లెసిస్‌ వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో వాట్సన్‌ - రైనాల జోడి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించింది. పవర్‌ ప్లే వరకు ఆచితూచి ఆడిన వీరిద్దరు ఆ తర్వాత రెచ్చిపోయారు. వాట్సన్‌ బౌండరీలే లక్ష్యంగా విరుచుకు పడ్డాడు. 33 బంతుల్లో హాప్‌సెంచరీ సాధించిన వాట్సన్‌.. ఆపై మరో 18 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. సందీప్‌శర్మ వేసిన 13వ ఓవర్‌లో మూడు సిక్సర్లు, రెండు పోర్లతో 27 పరుగులు రాబట్టాడు. దీంతో చెన్నై స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఇదే ఊపును కొనసాగించిన వాట్సన్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

అంతుకుముందు సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. విలియమ్సన్‌ 36 బంతుల్లో 5 పోర్లు, 2 సిక్సర్లతో 47 రన్స్‌ చేశాడు. శిఖర్‌ ధావన్‌ 25 బంతుల్లో 26రన్స్‌ సాధించాడు. షకీబుల్‌ హసన్‌ ఫర్వాలేదని పించాడు. చివర్లో యూసఫ్‌ పఠాన్‌ 25 బాల్స్‌ ఎదుర్కొని 45 రన్స్‌ చేశాడు. బ్రాత్‌వైట్‌ కూడా 11 బంతుల్లో 21 రన్స్‌ చేయడంతో హైదరాబాద్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

06:49 - May 28, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. బూత్‌ కమిటీలు ఏర్పాటు చేస్తూ రాబోయే ఎన్నికలకు సిద్ధం అవుతోంది. అన్ని నియోజకవర్గాల్లో బూత్‌ కమిటీల నియామాన్ని చురుగ్గా చేపట్టి సాధారణ ఎన్నికలు ఎదుర్కొనేందుకు గులాబి దళపతి కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు.

గులాబి దళపతి కేసీఆర్‌ మరో ఏడాదిలో ఎదుర్కోవాల్సిన ఎన్నికలకు క్షేత్ర స్థాయిలో పావులు కదుపుతున్నారు. పార్టీ నేతలను క్రియాశీలం చేసేందుకు సిద్దమవుతున్నారు. కొత్త జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీ నియమావళిని సవరించి... కమిటీల నియామకం ఉంటుందని గతంలో ప్రకటించినా... పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలతో కమిటీల నియామకంపై పెద్దగా దృష్టి పెట్టలేదు.. రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులను నియమించి నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతలను వారికి అప్పగించారు. కార్యదర్శులు మూడు నియోజకవర్గాలను పర్యవేక్షిస్తుండగా... ప్రధాన కార్యదర్శులు 10 నియోజకవర్గాలపై పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్నారు.

అయితే అప్పటికప్పుడు కమిటీలు వేస్తే పార్టీలో నేతల మధ్య మరింత ఆధిపత్య పోరు పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీ క్షేత్ర స్ధాయిలో బలోపేతం అయితే తప్ప ఎన్నికల్లో గెలవడం సాధ్యం అయేట్లు లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో బూత్‌ కమిటీలను ఏర్పాటు చేసి ఓటర్ల జాబితా ప్రకారం 20 నుంచి 30 మంది ఓటర్లకు ఓ బూత్‌ కమిటీ సభ్యుడిని నియమించాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అన్ని జిల్లాల్లో బూత్‌ కమిటీలకు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే జగిత్యాల నియోజకవర్గంలో నిర్వహించిన బూత్‌ కమిటీ సమావేశానికి ఎంపీ కవితతో పాటు కార్యదర్శులు హాజరయ్యారు. వాయిస్‌ బూత్‌ కమిటీల సమావేశాలు మొదలు పెట్టడంతో.. గులాబిపార్టీ ఎన్నికలకు క్షేత్ర స్ధాయిలో రంగం సిద్ధం చేస్తోందనే సంకేతాలు ఇస్తోంది. 

06:48 - May 28, 2018

విజయవాడ : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా టీడీపీ పోరాడుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని తెలంగాణ టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పకొట్టం ద్వారా తెలంగాణ ప్రజలకు టీడీపీని మరింత చేరువ చేస్తామని ఆ ప్రాంత నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌ అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను టీఆర్‌ఎస్‌ పతనానికి నాంది పలుకుతాయని విజయవాడలో జరుగుతున్న టీడీపీ మహానాడులో తెలంగాణ టీడీపీ నేతలు హెచ్చరించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తప్పులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.

కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో వేలాది మంది రైతులు బలవన్మరణాలు చేసుకున్నారని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం ఎన్నికల స్టంట్‌ అని తెలంగాణ టీడీపీ నేత కొత్తకోట దయాకర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అన్ని విధాలా సహకరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇకపై తరచూ తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమై పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేస్తానని భరోసా ఇచ్చారు. 

06:37 - May 28, 2018

హైదరాబాద్ : స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితంలోని ముఖ్య ఘట్టాలు...జీవిత విశేషాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నట్లు సినీ నటుడు నందమూరి హరికృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు విచ్చేసిన ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ను ఈతరం కూడా మరిచిపోలేదని, ఆయన చేసిన సేవలు అమోఘమన్నారు. ఎన్టీఆర్ ఘాట్ తనకు దేవాలయమని, సమాధి దగ్గరకు వచ్చి నివాళులర్పించడం తన బాధ్యత అన్నారు. మహానాడులో ఎందుకు పాల్గొనడం లేదని విలేకరుల ప్రశ్నకు సమాధానం దాట వేశారు. జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఇతర కుటుంబసభ్యులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. 

06:28 - May 28, 2018

ఢిల్లీ : ఢిల్లీ-మీరఠ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే మొదటి దశను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీంతో ఢిల్లీ, మీరఠ్‌ల మధ్య 14 వరుసల ఎక్స్‌ప్రెస్‌ హైవే అందుబాటులోకి వచ్చింది. ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈరోజు దేశ చరిత్రలోనే నిలిచిపోయే రోజని.. భారతీయులందరూ సగర్వంగా తలెత్తుకుంటారని అన్నారు. దేశంలోనే అతిపెద్ద ట్రాఫిక్‌ సమస్యను ఎదుర్కొంటున్న ఢిల్లీ ప్రజల కష్టాలు ఇక తీరునున్నాయని అన్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కాలుష్యం ఏ స్థాయిలో కోరలు చాస్తోందో మనకు తెలియంది కాదని.. దేశ రాజధాని ప్రాంతంలోనే ఇంత దారుణంగా ఉంటే మన దేశానికే చెడ్డపేరని చెప్పారు. ట్రాఫిక్‌ సమస్య దేశంలో తిష్ఠ వేసుకుని కూర్చుందని.. బీజేపీ ప్రభుత్వం ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చడంలో ఎనలేని కృషి చేస్తోందని తెలిపారు. 

06:26 - May 28, 2018

అనంతపురం : నగరంలోని జూనియర్‌ కాలేజీలో విషాదం జరిగింది. ఎగ్జిబిషన్‌లో జేయింట్‌వీల్‌ విరిగి ఆరేళ్ల చిన్నారి అమృత మృతి చెందింది. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు.మరోవైపు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  

06:23 - May 28, 2018

విజయవాడ : 2019 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు అధికారం కల్ల అని ఏపీ సీఎం చంద్రబాబు జోస్యం చెప్పారు. దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పుతాయన్నారు. ప్రాంతీయ పార్టీలకే సమర్థవంతమైన నాయకత్వం ఉందని చెప్పారు. మాటలతో కాలక్షేపం చేస్తున్న ప్రధాని మోదీకి పతనం తప్పదని విజయవాడలో జరుగుతున్న మహానాడులో చంద్రబాబు హెచ్చరించారు. విజయవాడలో తెలుగుదేశం మహానాడు ఘనంగా ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు ఈ మహానాడుకు హాజరవుతున్నారు. మూడు రోజుల పాటు జరిగే మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.

మోదీకి అధికారంపై ఉన్న ధ్యాస, అభివృద్ధిపై లేదని చంద్రబాబు మండిపడ్డారు. దక్షిణాదిలో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని విమర్శించారు. కర్నాటకలో జేడీఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ బేరసారాలకు యత్నించిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ప్రధాని మోదీ నీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీకి మాటలు తప్ప చేతలు తెలియవని చంద్రబాబు విమర్శించారు. ప్రచారంతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమలను కబ్జా చేసేందుకు మోదీ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వెంకటేశ్వరస్వామి జోలికి వస్తే ఎవరికైనా తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు.

ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా బీజేపీ ద్రోహం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. మహానాడులో మొదటిరోజు ఏడు తీర్మానాలపై చర్చించి ఆమోదించారు. వీటిలో ఐదు ఏపీకి సంబంధించినవి కాగా.. తెలంగాణకు చెందిన రెండు తీర్మానాలు ఉన్నాయి. 

ఎన్టీఆర్ జయంతి..

హైదరాబాద్ : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యులు..అభిమానులు ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించారు. హరికృష్ణ, జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు నివాళులర్పించారు. 

06:16 - May 28, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల వ్యవస్థలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రైతులకు జీవిత బీమా పథకానికి కూడా మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జోన్ల వ్యవస్థ, రైతులకు జీవితబీమా పథకంపై విస్తృత చర్చ జరిగింది. అనంతరం మంత్రివర్గం ఏకగ్రీవంగా ఈ రెండు అంశాలను ఆమోదించింది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జోన్ల వ్యవస్థ, రైతులకు జీవితబీమా పథకంపై విస్తృతంగా చర్చించారు. అనంతరం తెలంగాణలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో రాష్ట్రంలో భర్తీ కాబోయే ఉద్యోగాల నియమాకానికి జిల్లా, జోన్‌, మల్టీ జోన్‌, స్టేట్‌ కేడర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక మీదట అన్ని పోస్టులకు 95 శాతం లోకల్, 5 శాతం ఓపెన్ కేటగిరి ఉంటుంది. ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు విద్యాభ్యాసంలో కనీసం నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదువుతారో దాని ప్రాతిపదికనే అభ్యర్థి లోకల్‌ ఏరియాను గుర్తిస్తారు.

ఇక రైతు జీవిత బీమా పథకానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 18 నుంచి 60 ఏళ్ల వయస్సు గల ప్రతీ రైతుకు 5 లక్షల జీవిత భీమా వర్తించనుంది. ఎల్‌ఐసీ ద్వారా ఈ బీమాను ప్రభుత్వం అమలు చేయనుంది. బీమా కోసం రైతు 5 రూపాయలు చెల్లిస్తే, ప్రభుత్వం రైతు పేరున 2,271 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించనుంది. ఇప్పటికే ప్రిమియంకు సంబంధించిన నిధులను ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న రైతుల నుంచి నామినీ ప్రతిపాదన పత్రాలను అధికారులు సేకరించనున్నారు. ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా పత్రాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపునకు.. దేవాదుల, తుపాకుల గూడెం ఆనకట్ట నిర్మాణాల నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్ర రైతు సమన్వయ సమితి పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య ప్రొఫెసర్ల వయో పరిమితిని 58 నుంచి 65 ఏళ్లకు పెంచాలని కేబినెట్‌ నిర్ణయించింది. జోన్ల వ్యవస్థకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని సీఎం కేసీఆర్‌ ప్రధానమంత్రి మోదీని కోరనున్నారు. అందుకోసం మంత్రి వర్గ సమావేశం ముగియగానే కేసీఆర్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మొత్తానికి జోన్ల ఏర్పాటు, రైతుల భీమా పథకానికి కేబినేట్‌ ఆమోదం తెలపడం పట్ల ఉద్యోగ అభ్యర్థులు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఐపీఎల్ 11లో విజేత...

ఢిల్లీ : ఐపీఎల్ 11లో ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. సన్ రైజర్స్ పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. సన్ రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా చెన్నై జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 181 పరుగులు చేసింది. 

వికారాబాద్ కు కాంగ్రెస్ పిలుపు...

వికారాబాద్ : నేడు కాంగ్రెస్ వికారాబాద్ కు పిలుపునిచ్చింది. జిల్లాను ఆరో జోన్ లో కలపాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చింది. 

ముగిసిన 'మహానాడు' మొదటి రోజు...

విజయవాడ : మహానాడులో మొదటిరోజు సమావేశం ముగిసింది. ఏడు తీర్మానాలపై చర్చించి ఆమోదించారు. వీటిలో ఐదు ఏపీకి సంబంధించినవి కాగా.. తెలంగాణకు చెందిన రెండు తీర్మానాలు ఉన్నాయి.

ఎగ్జిబిషన్ లో విషాదం...

అనంతపురం : నగరంలోని జూనియర్‌ కాలేజీలో విషాదం జరిగింది. ఎగ్జిబిషన్‌లో జేయింట్‌వీల్‌ విరిగి ఆరేళ్ల చిన్నారి అమృత మృతి చెందింది. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు.మరోవైపు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  

కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి కార్యక్రమాలు...

తూర్పుగోదావరి : ప్రముఖ సంఘ సంస్కర్త.. కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ కళా, సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యంలో ఏడాది పొడవునా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో జరిగిన వర్ధంతి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో.. ప్రముఖ సాహితీవేత్త తెలకపల్లి రవి పాల్గొన్నారు. 

మాదాల రంగారావు అంత్యక్రియలు...

హైదరాబాద్ : విప్లవ నటుడు మాదాల రంగారావు అంత్యక్రియలు సోమవారం సాయంత్రం మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. అంతకుముందు వామపక్షాల కార్యాలయాలలో ప్రజల సందర్శనార్ధం మాదాల రంగారావు భౌతికకాయాన్ని ఉంచనున్నారు. 

Don't Miss