Activities calendar

29 May 2018

21:43 - May 29, 2018

విజయవాడ : జన్మభూమి కమిటీలు ప్రజా ప్రతినిధుల కొంపముంచుతున్నాయని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఈ కమిటీలతో ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు తెలుగుదేశం పరువుపోతోందని మహానాడు వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లతో అధికారులు పనిచేయడం మానుకున్నారంటూ.. ముఖ్యమంత్రికి సుతిమెత్తగా చురకలు అంటించారు. వైసీపీ అధినేత జగన్‌కు అన్నీ తన తాత రాజరెడ్డి బుద్ధులే వచ్చాయని జేసీ మండిపడ్డారు.

జగన్‌... 1500 కోట్లు తెచ్చుకొంటున్నాడు..
టీడీపీ మహానాడులో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. తనదైన శైలిలో ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే.. ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారులోని లోపాలను వేలెత్తిచూపారు. జన్మభూమి కమిటీలు, చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లపై జేసీ దివాకర్‌రెడ్డి తనదైన రీతిలో చురకలు అంటించారు. వైసీపీ అధినేత జగన్‌కు అన్నీ వాళ్ల తాత రాజారెడ్డి బుద్ధులే వచ్చాయని దివాకర్‌రెడ్డి ఆరోపించారు. జగన్‌కు డబ్బుమీద ధ్యాస మినహా ప్రజాసేవపై శ్రద్ధలేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల కోసం ప్రధాని మోదీ నుంచి జగన్‌... 1500 కోట్లు తెచ్చుకొంటున్నారని దివాకర్‌రెడ్డి ఆరోపించారు.

మోదీకి బాబు గుడ్డిగా నమ్మారు :జేసీ
మరోవైపు మోదీ ప్రత్యేక హోదా ఇవ్వరన్న విషయం చంద్రబాబుకు తెలిసినా గుడ్డిగా నమ్మారంటూ అటు ప్రధాని, ఇటు ముఖ్యమంత్రిని వేలెత్తి చూపారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీకి ఏ గతిపట్టిందో.. 2019 ఎన్నికల్లో కూడా మోదీకి అదే గతి పడుతుందని దివాకర్‌రెడ్డి హెచ్చరించారు. దేశం, రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు దేశానికి ప్రధాని, లోకేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని దివాకర్‌రెడ్డి ఆకాంక్షించారు.

21:38 - May 29, 2018

హైదరాబాద్ : టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఏనాడు పదవులు ఆశించని తనను.. పదవి కోసమే ఆరోపణలు చేస్తున్నానని విమర్శలు చేయడం సరికాదన్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన జెండా కోసమే ఇన్నాళ్లు చంద్రబాబు పక్కన ఉన్నానని.. కానీ తనను వాడుకొని వదిలేశారన్నారు. ఎన్టీఆర్‌ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న చంద్రబాబుకు ప్రజలే బుద్ది చెప్పాలన్నారు మోత్కుపల్లి.

ఏనాడూ పదవులు ఆశించలేదు : మోత్కుపల్లి
ఎన్టీఆర్‌కు భక్తుడిగా ఆయన పెట్టిన జెండా కోసం పరితపించానే తప్ప ఏనాడూ పదవులు ఆశించలేదన్నారు టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు. పదవులు ఇవ్వనందుకే విమర్శలు చేస్తున్నాడంటూ చంద్రబాబు చేయిస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. నేను పదవులు అడిగిన మాట నిజమైతే... నీ కొడుకు లోకేశ్‌పై ప్రమాణం చేస్తావా ? అని హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోత్కుపల్లి చంద్రబాబుకు సవాల్‌ విసిరారు.

చంద్రబాబు విశ్వాస ఘాతకుడని ఎన్టీఆరే చెప్పారు : మోత్కుపల్లి

చంద్రబాబు విశ్వాస ఘాతకుడని ఎన్టీఆరే చెప్పారన్నారు మోత్కుపల్లి. కాంగ్రెస్‌లో ఓడిపోయి, శరణుశరణంటూ టీడీపీలోకి వచ్చి, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన నరహంతకుడు అన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు అంత నీతిమాలిన వ్యక్తి లేడన్నారు. సీనియారిటీకి విలువ ఇవ్వకపోవడంతోనే గాలి ముద్దకృష్ణమలాంటి 20 మంది నేతలు చనిపోయారన్నారు మోత్కుపల్లి

దొంగలను పార్టీలో చేర్చుకున్న చరిత్ర చంద్రబాబుది : మోత్కుపల్లి
పార్టీ జెండాను నమ్ముకున్న వాళ్లను కాదని... దొంగలను పార్టీలో చేర్చుకున్న చరిత్ర చంద్రబాబుది అన్నారు మోత్కుపల్లి. చంద్రబాబు ఎన్ని దుర్మార్గాలు చేసినా జెండా కోసం పార్టీలో ఉన్నానే తప్ప,.. పదవుల కోసం కాదన్నారు. 2009-12 మధ్య కాలంలో చంద్రబాబు దగ్గరకు ఎవరూ రాకపోతే... నేనే పక్కనున్నానని... కానీ ఇప్పుడు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు తనకెప్పుడూ సాయం చేయకపోగా... పనికి రాని మనుషుల చేత నన్ను తిట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు మోత్కుపల్లి. గవర్నర్‌ పదవి ఇస్తానని చెప్పి.. ప్రత్యేక హోదా కారణంతో దానిని అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబే అని అన్నారు మోత్కుపల్లి. ప్రత్యేక హోదా కోసం 29 సార్లు ఢిల్లీ వెళ్లానని చెప్పుకుంటున్న చంద్రబాబు... ఢిల్లీ వెళ్లింది హోదా కోసం కాదని... ఓటుకు నోటు కేసు మాఫీ కోసమేనన్నారు. కేసీఆర్‌ సీఎం అయితే ఓర్వలేక.. ప్రభుత్వాన్ని కూలగొట్టి రేవంత్‌ను సీఎం చేసేందుకు కుట్రలు చేయలేదా ? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ధైర్యముంటే ఆ ఆడియోలో ఉన్న వాయిస్‌ తనది కాదని నిరూపించుకోవలన్నారు మోత్కుపల్లి.

మోత్కుపల్లిపై టీడీపీ నేతల మండిపాటు
ఇదిలావుంటే మోత్కుపల్లి వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. పదవి ఇవ్వలేదనే కారణంతోనే ఆరోపణలు చేస్తున్నారన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. పార్టీలో మోత్కుపల్లికి ఇచ్చిన గౌరవం మరేవరికి ఇవ్వలేదని... మోత్కుపల్లి వ్యాఖ్యల వెనక బీజేపీ, వైసీపీలున్నాయన్నారు. అదేవిధంగా మంత్రి జవహర్‌ కూడా మోత్కుపల్లిపై మండిపడ్డారు. గవర్నరో, రాజ్యసభ పదవో ఇవ్వకపోవడం వల్లే దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. దళితుల కోసం ఏనాడూ ఏమీ చేయని మోత్కుపల్లి... ఈనాడు దళితులను ప్రోత్సహిస్తున్న టీడీపీ విమర్శలు చేయడం సరికాదన్నారు. మొత్తానికి ఒకప్పుడు ఒకే పార్టీలో ఉండి.. కలిసిమెలిసి పని చేసిన నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మరీ ఈ పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి. 

21:33 - May 29, 2018

విజయవాడ : మూడు రోజుల పాటు జరిగిన టీడీపీ మహానాడు ముగిసింది. చివరిరోజు రాజకీయ తీర్మానంపై ప్రసగించిన చంద్రబాబు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి అధికారం కల్ల అన్నారు. మోదీ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.

ప్రధాన మంత్రి పదవిపై ఆశ లేదు : చంద్రబాబు
ప్రధాన మంత్రి పదవిపై తనకు ఆశలేదని, రాష్ట్రాభివృద్ధే ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల ఏడాదితో తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ విజయం కోసం అవిశ్రాంతంగా కృషి చేయాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు విభేదాలను విస్మరించి, విపక్షాలపై ఐక్యంగా పోరాడాలిని మహానాడు ముగింపు సభలో చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

అమవరావతి నిర్మాణాన్ని అడ్డుకుంటే సహించబోం : చంద్రబాబు

ఏపీ రాజధాని అమవరావతి నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం సహా ఎవరు అడ్డుకున్నా రాష్ట్ర ప్రజలు సహించబోరని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. కుట్రలు, కుతంత్రాలతో అమరావతికి అవరోధాలు కల్పిస్తే తెలుగు ప్రజలు తిరగబడతారని చంద్రబాబు వార్నింగ్‌ ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే.. తాము పన్నులు ఎందుకు తెలుగుదేశం మహానాడులో చివరి రోజు ప్రజా రాజధాని - మన అమరావతి -ఆనంద నగరం.. అన్న తీర్మానంపై జరిగిన చర్చలో పలువురు నేతలు పాల్గొన్నారు. చర్చకు సమాధానం ఇచ్చిన చంద్రబాబు.. అమరావతిపై కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వకపోతే కేంద్రానికి పన్నులు ఎందుకు చెల్లించాలని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి నెపాలు వెతుకున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని చంద్రబాబు తప్పుపట్టారు. గుజరాత్‌ పూర్వపు రాజధాని అహ్మదాబాద్‌కు 80 కిలో మీటర్ల దూరంలో నిర్మించ తలపెట్టిన డొలెరా నగరంపై ప్రధాని మోదీ చేసిన ప్రకటన వీడియోను మహానాడులో ప్రదర్శించారు. ఢిల్లీ కంటే రెండు రెట్లు, షాంఘై కంటే ఆరు రెట్టు పెద్ద నగరంగా డొలెరా నిర్మాణం చేపడుతున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అవినీతి, కుంభకోణాల ఊబిలో కూరుకుపోయిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రధాని మోదీ ఏపీకి చేసిన మోసాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా ప్రజలు గుణపాఠం చెప్పాలని చంద్రబాబు మహానాడులో పిలుపు ఇచ్చారు. 

21:31 - May 29, 2018

హైదరాబాద్ : రైతుబంధు పథకం ద్వారా రైతులందరికీ కొత్త పట్టాదారు పుస్తకాలు అందజేయడం, పంట పెట్టుబడి సాయం పంపిణీ, రైతులకు జీవిత బీమా పథకం అమలులో రైతు సమన్వయ సమితి అత్యంత కీలకపాత్ర పోషించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. రైతుబంధు పథకంపై రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్లతో సమావేశమైన కేసీఆర్‌... రైతులంతా ఒకే రకమైన పంట వేసి నష్టపోకుండా.. డిమాండ్‌కు తగినట్లు పంటలు పండించాలన్నారు. ఉత్పాదకత పెంచే నైపుణ్యం రైతులకు కలిగించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. రాష్ట్రంలో రైతులందరికీ 5 లక్షల జీవిత బీమా చేస్తున్నామని... కొద్ది రోజుల్లోనే దరఖాస్తు ఫారాలు అందజేస్తామని.. ఆగస్టు 15 నుంచి పథకం అమలు చేస్తామన్నారు. రైతుల కోసం ప్రభుత్వం ఎంతో చేస్తుంటే... కాంగ్రెస్‌ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు కేసీఆర్‌. రైతులు అప్పులు పాలు కావద్దనే పెట్టుబడి సాయం అందిస్తున్నామే తప్ప... ఓట్ల కోసం కాదన్నారు. కాంగ్రెస్‌ చెబుతున్నట్లు రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం కష్టమన్నారు కేసీఆర్‌. 

20:42 - May 29, 2018

తమిళనాడు ప్రజల పోరాటం ఫలించింది. ప్రజా ఉద్యమానికి పళనిస్వామి ప్రభుత్వం తలవంచింది. తూత్తుకూడిలోని కాపర్ స్టెరిలైట్ ప్లాంట్ ను శాశ్వతంగా మూసివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. స్టెరిలైట్ ప్లాంట్ మూసివేతకు పళనిస్వామి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్లాంట్ మూసివేయాలంటూ ఇటీవల స్థానికులు ఆందోళన చేపట్టారు. పోలీసుల కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. ప్రజా సంఘాలు, విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తమిళనాడు ప్రభుత్వం దిగివచ్చింది. ఈ క్రమంలో తూత్తుకుడి స్టెరిలైజ్ ఫ్యాక్టరీని మూసివేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ప్రజల విజయమేనా? లేదా దీంతో రాజకీయం దాగుందా? తిరిగి మరోసారి ఫ్యాక్టరీని తెరిచే అవకాశాలున్నాయా? అనే అంశంపై ప్రముఖ పర్యావరణ వేత్త బాబురావు గారి విశ్లేషణ ఏమిటో చూద్దాం.. 

20:27 - May 29, 2018

అనుకుంటనే ఉన్న మోత్కుపల్లి నర్సింహులు ఫ్లేటు ఫిరాయిస్తడు ఫిరాయిస్తడని.. అన్నట్టే జేశిండు.? చంద్రబాబు అంత మోసకాడు ఏడలేడు.. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు వొడ్సిన మన్షి.. ఆయనకు ఓటేయకుండ్రి అని పిల్పునిస్తున్నడు.. ఇగ కేసీఆర్ అంతటి శిపాయిలేడు.. కేసీఆర్ల ఒక దేవుడు గనవడ్తున్నడు నాకు అన్నట్టు జెప్పుకొచ్చిండు సారు ముచ్చట..

మహానాడుకు విచ్చేసిన తెల్గుదేశం పార్టీ నాయకులందరికి పేరుపేరునా ధన్యవాదాలు.. తమ్ముళ్లు.. ఇయ్యాళ పొద్దుగాళ్ల మీరు జేశ్న టిఫిని బాగున్నదా..? బాగుంటే సప్పట్లు గొట్టుండ్రి.. ఇయ్యాళ మీరు తింటున్న తిండి బాగున్నదా..? మహానాడులో ఉంటే ఇంటిని మర్శిపోతున్నరా..? ఇగో ఇసొంటి అతికష్టమైన ప్రశ్నలు అడ్గి వివరాలు తెల్సుకుంటున్నడు చంద్రాలు సారు..

ఎక్కడెక్కడి మన్సుల చరిత్రను పిల్లగాళ్లు సద్వుకునే పాఠ్యాంశాలళ్ల వెట్టిండ్రు మహానాయకుడు నందమూరి తారక రామారావుగారి జీవిత చరిత్రను గూడ పాఠ్యాంశాలళ్ల జేరిస్తె ఏమైతది అంటున్నడు ఆయన ముద్దుల కొడ్కు.. హరిక్రిష్ణ.. ఇయ్యాళ వాళ్ల నాయిన జన్మదినంగదా ఇయ్యాళ.. ఆయన గోరి కాడికి వొయ్యి నివాళులర్పించిండ్రు ఇంటోళ్లంత..

వారెవ్వ సూస్తిరా మోడీగారి లళిత కళలు..? నన్ను జూడు నా అందం సూడు.. ఏసుకున్న కోటును సూడు అన్నట్టు.. ఢిల్లీ మేరఠ్ ఎక్స్ ప్రెస్ హైవే మీద కారెక్కిపోతున్నడు.. మీడియా కెమేరాలు కవర్ జేస్తుంటే కనిపించని జనానికి చేయి ఊపి చమత్కారం జూపెడ్తున్నడు..? మంచి ఏదన్న జర్గితే వచ్చి వాలిపోతడు.. చెడు ఏమన్న అయితే.. అటెంకాళ్ల గనిపియ్యడు...

వార్నీ నీ నోట్లె మన్నుగదరా..? అగ్గి సాక్షిగ పెండ్లి జేస్కుంటివి..? నల్పై లచ్చల రూపాల కట్నం జేవులేస్కుంటివి..? పెండ్లయ్యి ఐదేండ్లాయే.. ఇప్పటికి పిల్లను తీస్కపోతలేవంటే..? నువ్వు మన్షివా..? డబుల్ బెడ్రూం ఇల్లువురా..? గింత అన్నాలమా నుల్లా..? అత్తగారింట్ల కుడికాలు వెట్టక ఐదేండ్ల సంది ఎదురుసూస్తున్న ఒక కొత్తపెండ్లి పిల్ల కథ జూడుండ్రి..

బోధన్ ఎమ్మెల్యే షకీల్ గారు.. జర్ర మీరు మీ కుడి భుజాలు ఎడ్మభుజాలు హద్దు అదుపుల ఉండుండ్రి.. ఎట్లైనా మేమేగదా ఎమ్మెల్యేలం.. మాదే గదా ప్రభుత్వం ఉన్నదని..? విర్రవీగితిరాంటే.. ఇంకో యాడాదే ఉంటయ్ మళ్ల ఎన్నికలు.. జనం తమాష జూపెప్తడు అప్పుడు.. ఓడిపోయినవంటే ఎన్క గన్ మెన్ ఉండడు.. ఎంట ఏ మెన్ తిర్గడు.. ఎందుకంటున్నరంటే జర్ర మీ ఓవరాక్షన్ ఎక్వైందట..

ఓ మెదక్ జిల్లా అడ్వి అధికారులో..? ఉన్నరా..? మిమ్ములను పెద్దపులిగూడ ఎత్కపోయిందా..? నెలల జీతాలు దీస్కునెనాడు గనవడ్తరు మళ్ల పత్తకు దొర్కరు.. అరరరే చిర్తపులులు ఊర్లమీద వడి పశువులను గోదాలను సంపుతాఉంటే.. మూడు నెలల సంది మీకు పట్టింపే లేదాయే.. ? గీదానికే మీకు వేలకు వేల జీతాలా ఏంది..?

ఈ గలీజు గాలివానలు యాడంగ దాపురమైనయోగదా.. అరరరే ఏమున్నది..? ఒక ఊర్లె గాలి దూమారం గట్టిగ లేశి ఇండ్ల మీద రేకులు.. చెట్లు చెదలు అన్ని గొట్కపోయినయ్.. బాన్సువాడ నియోజకవర్గంలున్న కొన్ని ఊర్లళ్ల నిన్నరాత్రి అడ్డమైన గాలిదుమారం లేశి తంబాలు గూడ కూలిపోయిన్.. జనం పాణాలమీదికొచ్చింది.. దుమారం..

ప్రాంతీయ పార్టీలదే అధికారం : చంద్రబాబు

విజయవాడ : నాలుగు సంవత్సరాల నుండి ఏపీ విభజన హామీల విషయంలో రాష్ట్రానికి కేంద్రం తీవ్రంగా అన్యాయం చేసిందని విమర్శించారు. దీంతో భవిష్యత్తులో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాదుగాక రాదని చంద్రబాబు నొక్కి వక్కాణించారు. రాష్ట్రాలను భయపెట్టి..సమాజాన్ని కలుషితం చేసేలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందనీ..సమాజానికి కేంద్ర ప్రభుత్వం తప్పుడు సంకేతాలిస్తోందని చంద్రబాబు విమర్శించారు. కేంద్రం అవలంభిస్తున్న విధానాలకు ప్రజలంతా సిద్ధపడి ఎదుర్కోవాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే అధికారమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపీలో బీజేపీకి డిపాజిట్లు కూడా రాదని స్పష్టంచేశారు.

19:53 - May 29, 2018

విజయవాడ : నాలుగు సంవత్సరాల నుండి ఏపీ విభజన హామీల విషయంలో రాష్ట్రానికి కేంద్రం తీవ్రంగా అన్యాయం చేసిందని మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రాలను భయపెట్టి..సమాజాన్ని కలుషితం చేసేలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందనీ..సమాజానికి కేంద్ర ప్రభుత్వం తప్పుడు సంకేతాలిస్తోందని చంద్రబాబు విమర్శించారు. కేంద్రం అవలంభిస్తున్న విధానాలకు ప్రజలంతా సిద్ధపడి ఎదుర్కోవాలని నేతలకు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాదుగాక రాదని చంద్రబాబు నొక్కి వక్కాణించారు.  రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే అధికారమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపీలో బీజేపీకి డిపాజిట్లు కూడా రాదని స్పష్టంచేశారు. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ చెప్పినట్లుగానే వ్యవహరిస్తు విమర్శనలు చేస్తున్నారన్నారు. ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత పెరుగతోందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాల్సిన అవుసనముందన్నారు.ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. కులం, మతం కంటే భారతీయమే ప్రధానమన్నారు. కానీ అన్ని మతాలవారికీ..కులాలవారికి అభివృద్ధి చేయాలన్నారు.

అవినీతి పరుల ఆస్తులు ఎందుకు జప్తు చేయరు : చంద్రబాబు
విజయవాడ
: కేంద్రం వ్యవహారం దేశాన్ని..దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేస్తోందనీ..రాష్ట్రాల పాలనపై కేంద్రం ఆధిపత్యం చేసే యత్నాలు చేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.ఈ క్రమంలోనే విభజన హామీలు అమలు చేయకుండా..వివక్షా ధోరణిని అవలంభిస్తోందని విమర్శించారు. గాలి జనార్థన్ రెడ్డి, జగన్ వంటివారితో కేంద్ర ప్రభుత్వం చేతులు కలిపి అరాచకాలకు పాల్పడుతోందని విమర్శించారు. అవినీతిపరులైన వీరి ఆస్తుల్ని ఎందుకు జప్తు చేయరని చంద్రబాబు ప్రశ్నించారు.

ఇదేనా అచ్చేదిన్ : చంద్రబాబు
విజయవాడ
: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజల్ని నానా ఇబ్బందులకు కేంద్ర ప్రభుత్వం గురిచేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. మేకిన్ ఇండియా అని మేకింగ్ ని నిలిపివేసే పరిస్థితికి తీసుకొచ్చారని..ఎవరన్నా ప్రశ్నిస్తే..వారిపై దాడికి దిగుతున్నారని ఇటువంటి దుర్మార్గపరమైన పనులకు కేంద్రప్రభుత్వం పూనుకుంటోందనీ..అన్నింటికి ధరలు పెంచేసి సామాన్యులను ఇక్కట్ల పాలు చేయటమేనా అచ్చేదిన్ అని చంద్రబాబు ప్రశ్నించారు. నల్లధనాన్ని ఇండియాకు తెచ్చి అందరికీ పంచుతామన్న మోదీ వాగ్ధానం ఏమైందని ప్రశ్నించారు. పలు అంశాలపై, పలు సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడిన చంద్రబాబు మహానాడు ముగింపు సందర్భంగా టీడీపీ నేతలంతా నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై పోరాడతామని సీఎం చంద్రబాబు అందరితోను ప్రమాణం చేయించారు. 

ఇదేనా అచ్చేదిన్ : చంద్రబాబు

విజయవాడ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజల్ని నానా ఇబ్బందులకు కేంద్ర ప్రభుత్వం గురిచేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. మేకిన్ ఇండియా అని మేకింగ్ ని నిలిపివేసే పరిస్థితికి తీసుకొచ్చారని..ఎవరన్నా ప్రశ్నిస్తే..వారిపై దాడికి దిగుతున్నారని ఇటువంటి దుర్మార్గపరమైన పనులకు కేంద్రప్రభుత్వం పూనుకుంటోందనీ..అన్నింటికి ధరలు పెంచేసి సామాన్యులను ఇక్కట్ల పాలు చేయటమేనా అచ్చేదిన్ అని చంద్రబాబు ప్రశ్నించారు. నల్లధనాన్ని ఇండియాకు తెచ్చి అందరికీ పంచుతామన్న మోదీ వాగ్ధానం ఏమైందని ప్రశ్నించారు.

అవినీతి పరుల ఆస్తులు ఎందుకు జప్తు చేయరు : చంద్రబాబు

విజయవాడ : కేంద్రం వ్యవహారం దేశాన్ని..దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేస్తోందనీ..రాష్ట్రాల పాలనపై కేంద్రం ఆధిపత్యం చేసే యత్నాలు చేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.ఈ క్రమంలోనే విభజన హామీలు అమలు చేయకుండా..వివక్షా ధోరణిని అవలంభిస్తోందని విమర్శించారు. గాలి జనార్థన్ రెడ్డి, జగన్ వంటివారితో కేంద్ర ప్రభుత్వం చేతులు కలిపి అరాచకాలకు పాల్పడుతోందని విమర్శించారు. అవినీతిపరులైన వీరి ఆస్తుల్ని ఎందుకు జప్తు చేయరని చంద్రబాబు ప్రశ్నించారు. 

ఏటా ఆస్తులు ప్రకటించే నాపై ఆవినీతి ఆరోపణలా : చంద్రబాబు

విజయవాడ : ఏటా ఆస్తులు ప్రకటించే నాపై ఆవినీతి ఆరోపణలు చేస్తున్నారనీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ మహానాడులో మాట్లాడుతు..9ఏళ్ళ నుండి వ్యక్తిగత ఆస్తులు ప్కటించే ఏకైన నాయకుడిని నేనేనని చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. అటువంటిది తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారనీ..తమ ఆస్తుల వివరాలు చెప్పుకోలేననీ వ్యక్తులు, నాయకులు హెరిటేజ్ కంపెనీ పబ్లిక్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ అని చంద్రబాబు పేర్కొన్నారు.

18:47 - May 29, 2018

విజయవాడ : కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న క్రమంలో తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ ఉద్భవించిందని సీఎం చంద్రబాబు మహానాడులో పేర్కొన్నారు. పదవులు ముఖ్యం కాదనీ..దేశ ప్రయోజనాల కోసం పనిచేసిన పార్టీ అని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. కానీ ఎన్డీయే ప్రభుత్వంలో కూడా ఏపీకి న్యాయం చేస్తుందనే ఉద్ధేశ్యంతో కాదనీ చంద్రబాబు మరోసారి స్ఫష్టం చేశారు. టీడీపీకి దెబ్బకొడదామనుకున్న కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా కనుమరుగైపోయిందని..అటువంటి టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. అవినీతికి పాల్పడుతున్నారనీ మాపై అవినీతి అరోపణలు చేస్తున్నారనీ...అందుకే ప్రతీ సంవత్సరం మా ఆస్తులను ప్రకటిస్తున్నామనీ...9ఏళ్ళ నుండి వ్యక్తిగత ఆస్తులు ప్కటించే ఏకైన నాయకుడిని నేనేనని చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. అటువంటిది తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారనీ..తమ ఆస్తుల వివరాలు చెప్పుకోలేననీ వ్యక్తులు, నాయకులు హెరిటేజ్ కంపెనీ పబ్లిక్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ అని చంద్రబాబు పేర్కొన్నారు. కుటుంబ పాలన గురించి ఆరోపణలు వస్తున్నాయనీ..సమర్ధత వుంటేనే నాయకులవుతారనీ..నాయకుల కుటుంబంల పుట్టినంత మాత్రాన నాయకులవ్వరన్నారు. నారా లోకేశ్ కు తాను ఎప్పుడు తనను సమర్థించననీ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆనాడు విజన్ 20/20 పెట్టుకున్నామనీ..ఇప్పుడు 20/29 అని విజన్ ని టార్గెట్ గా పెట్టుకుని ముందుకు కొనసాగుతున్నామని చంద్రబాబు తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా..ఎవరు సమస్యలు సృష్టించినా అభివృద్ధిలో ఏమాత్రం రాజీ పడకుండా కొనసాగిపోతున్నామనీ..ఈ క్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇదే మార్గాన్ని అవలంభించాలని సూచించారు. అందుకే టెలీ కాన్ఫరెన్స్ ల ద్వారా కలెక్టర్లకు, అధికారులకు దశాదిశా నిర్ధేశ్యం చేస్తున్నామన్నారు. టీడీపీ బలం 70లక్షల మంది కార్యకర్తలేననీ..ఏ దేశం బాగుపడాలన్నా యువతే ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు అధ్యయనాలు, సమీక్షలు చేస్తున్నామన్నారు. 

జగన్ వన్నీ తాత బుద్ధులే : జేసీ

విజయవాడ: వైకాపా అధినేత జగన్‌కు తన తాత రాజారెడ్డి లక్షణాలే వచ్చాయని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. విజయవాడలో జరుగుతున్న మహానాడులో ఆయన మాట్లాడుతూ.. జగన్‌ తీరు పట్ల ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎంతగానో బాధపడేవారు. ఎవరి మాటా వినని తత్వం జగన్‌ది. వైకాపాలో చేరాలని నాకు జగన్‌ రాయబారం పంపాడు. నీకు ఎన్ని సీట్లు కావాలన్నా ఇస్తామని విజయసాయిరెడ్డి నా వద్దకు వచ్చారు. కానీ జగన్‌ సంగతి తెలిసిన నేను దాన్ని తిరస్కరించాను. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ భూస్థాపితం అయింది. చంద్రబాబుకు ఉన్నంత దూరదృష్టి మరెవరికీ లేదు. 

దేశం బాగుండాలంట బాబు ప్రధాని కావాలి : జేసీ

విజయవాడ : దేశం బాగుపడాలంటే సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి కావాలి. రాష్ట్రానికి ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా చేశారు... ఆయన సేవలు దేశానికి అవసరం. నరేంద్రమోదీ ప్రధానిగా ఉన్నంతవరకు ఏపీకి ప్రత్యేక హోదా రాదు. ఈ విషయం నాలుగేళ్ల క్రితమే నేను చెప్పానన్నారు. చంద్రబాబు దయతోనే ఏపీలో భాజపాకు కొన్ని సీట్లయినా వచ్చాయి. కియా పరిశ్రమ అనంతపురం జిల్లాకు రావడానికి కారణం చంద్రబాబే. మోదీ కియా ప్రతినిధులకు ఐదుసార్లు ఫోన్‌ చేసి గుజరాత్‌లో ప్లాంట్‌ పెట్టాలని ఒత్తిడి చేసినట్లు వారే చెప్పారు. దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాను చంద్రబాబు సస్యశ్యామలం చేస్తున్నారు.

రక్తదానం చేసిన మంత్రి లోకేశ్..

విజయవాడ : మహానాడు శిబిరంలో నారా లోకేశ్‌ రక్తదానం చేశారు. వివిధ స్టాళ్లను పరిశీలించిన ఆయన రక్తదానం చేసిన కార్యకర్తలను స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా నెలరోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయల ఉపాధి హామీ పనులు పూర్తి చేస్తున్నామని వివరించారు. అనుకున్న లక్ష్యానికి వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. జనవరి కల్లా కొత్త తెదేపా రాష్ట్ర కార్యాలయం సిద్దమవుతుందని.. ఆగస్టు కల్లా కొత్త పార్టీ కార్యాలయానికి ఒక రూపు వస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. 

ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టీడీపీ సిద్ధం : లోకేశ్

అమరావతి : రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి లోకేశ్ మరోమారు స్పష్టం చేశారు. నంద్యాల, కాకినాడల్లో ఏం జరిగిందో అంతా చూశారని గుర్తుచేశారు. ఏనాడూ ఆస్తులు ప్రకటించని వాళ్ళు మా పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఏపీ మంత్రి నారాలోకేశ్‌ విపక్ష నేతలపై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఉందని లోకేశ్ తెలిపారు. 

జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి : పవన్

శ్రీకాకుళం : జన్మభూమి కమిటీల్లో అన్ని అవకతవకలేననీ..ఖచ్చితంగా జన్మభూమి కమిటీలను రద్దు చేయాల్సిన అవుసముందని పోరాటయాత్రలో భాగంగా మాట్లాడుతు..పవన్ పేర్కొన్నారు. సహాయం చేసిన వారి చేతులు నరికేయటం టీడీపీకి అలవాటనీ..అందుకే 2014లో తాను టీడీపీ మద్దతునిస్తే ఇప్పుడు తనను పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారనీ పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్ని జిల్లాలను సమానంగా చూడాలని..కానీ వెనుకబడిన జిల్లాలను ఎందుకు పట్టించుకోవటంలేదని పవన్ ప్రశ్నించారు.

టీడీపీ నేతలకు ఇసుకంటే చాలా ఇష్టం : పవన్

శ్రీకాకుళం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాలో తన పోరాట యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వపన్ మాట్లాడుతు..ఏ ప్రాంతానికి వెళ్లినా టీడీపీ నేతలు భూకబ్జాలు..ఇసుక మాఫీలకు పాల్పడతున్నారనే ఫిర్యాదులే వస్తున్నారనీ..తెలుగుదేశం నాయకులకు ఇసుకంటే చాలా ఇష్టమనీ కాబట్టే ఇసుక మాఫియాలకు పాల్పడుతున్నారనీ పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం నుండి మాట్లాడితే ప్రభుత్వానికి వినిపించదనీ..కాబట్టి అమరావతికి వెళ్లి శ్రీకాకుళం వెనుకబాటు గురించి చెబుతానన్నారు.

17:33 - May 29, 2018

శ్రీకాకుళం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాలో తన పోరాట యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతు..ఏ ప్రాంతానికి వెళ్లినా టీడీపీ నేతలు భూకబ్జాలు..ఇసుక మాఫీలకు పాల్పడతున్నారనే ఫిర్యాదులే వస్తున్నారనీ..తెలుగుదేశం నాయకులకు ఇసుకంటే చాలా ఇష్టమనీ కాబట్టే ఇసుక మాఫియాలకు పాల్పడుతున్నారనీ పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం నుండి మాట్లాడితే ప్రభుత్వానికి వినిపించదనీ..కాబట్టి అమరావతికి వెళ్లి శ్రీకాకుళం వెనుకబాటు గురించి చెబుతానన్నారు. జన్మభూమి కమిటీల్లో అన్ని అవకతవకలేననీ..ఖచ్చితంగా జన్మభూమి కమిటీలను రద్దు చేయాల్సిన అవుసముందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సహాయం చేసిన వారి చేతులు నరికేయటం టీడీపీకి అలవాటనీ..అందుకే 2014లో తాను టీడీపీ మద్దతునిస్తే ఇప్పుడు తనను పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారనీ పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్ని జిల్లాలను సమానంగా చూడాలని..కానీ వెనుకబడిన జిల్లాలను ఎందుకు పట్టించుకోవటంలేదని పవన్ ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలను పట్టించుకోకుండా రాజధాని కేంద్రంగా అభివృద్ధిని విస్తరిస్తున్నారనీ..అమరావతి వంటి ప్రదేశం పెద్ద పెద్ద నాయకులకే గానీ సామాన్యులకు కాదన్నారు. ప్రతీ జిల్లాలోను అభివృద్ధిని, ఉపాధిని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేన్నారు. బీడు భూముల్లో నిర్మించాల్సిన పరిశ్రమలు పచ్చని పొల్లాల్లో నిర్మిస్తున్నారనీ దీంతో ఆ ప్రాంతంలోని పొలాలలే కాకుండా..నీరు కూడా కలుషితమైపోయి వివిధ రకాల రోగాలబారిన ప్రజలు పడుతున్నారనీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 

17:05 - May 29, 2018

రంగారెడ్డి : యాచారం మండలం చింతుల్ల గ్రామంలో దారుణం జరిగింది. మూడు రోజుల క్రితం తప్పిపోయిన ఉర్మిళ అనే ఏడేళ్ల బాలిక శవం ఇటుక బట్టిలో దొరికింది. ఉర్మిళ తల్లిదండ్రులు చింతుల సమీపంలో గల BNC ఇటుక బట్టిలో కూలీలుగా పని చేస్తున్నారు. అయితే మూడు రోజుల క్రితం ఉర్మిళ తప్పిపోయిందని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు.ఇటుక బట్టీలోనే బాలిక శవాన్ని కనుగొన్న పోలీసులు ఆమె తల్లిదండ్రులపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలికకు మూగ, చెవిటి సమస్య ఉండటంతో తల్లిదండ్రులే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

17:02 - May 29, 2018

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా వెనుకబడినది కాదు వెనక్కి నెట్టివేయబడిన ప్రాంతం అని పోరాటాల పురిటిగడ్డ శ్రీకాకులం జిల్లా నుండే తన పోరాటయాత్రను చేపట్టాననన్నారు. వెనుకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లా నుండి ప్రజలే వలసలు వెళుతున్నారు తప్ప నాయకులు మాత్రం కాదన్నారు. ఎవరితో పొత్తు పెట్టుకుంటామనేది ఎన్నికలకు మూడు నెలల ముందు వెళ్లడిస్తామన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌. ఉద్దానం కిడ్నీ సమస్యను పరిష్కరించామని చెబుతున్న చంద్రబాబు...వారి కుటుంబసభ్యులనే కమిటీగా వేసి పంపితే ఉద్దానం వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్నారు. వామపక్షాలతో ఉన్న బలమైన బంధాన్ని కొనసాగిస్తామంటున్న పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

ప్రజాసమస్యలపై శ్రద్ధ లేదు : పవన్
ఇసుక దందాల మీద వున్న శ్రద్ధ ప్రజాసమస్యలపై నాయకులకు లేదనీ..నాయకులు పాతుకుపోయి వున్నారు తప్ప పాతుకుపోయిన ప్రజాసమస్యలపై మాత్రం పాలకులకు చిత్రశుద్ధి లేదన్నారు. తోటపల్లి రిజర్వాయర్ పనులతో వేలాది ఎకరాలకు సాగునీటి అందించవచ్చని ఈ రిజర్వాయర్ పై శ్రద్ధలేదన్నారు. పుష్కరాల కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారనీ..సాగునీటి ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం చేయబడినందువల్లనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చిందనీ..ఇదే ఉత్తరాంధ్రలో తలెత్తే అవకాశాలను నిర్లక్ష్యంతో కల్పించవద్దని..అటువంటి పరిస్థితులతో మరోసారి తెలుగు రాష్ట్రంలో విభేదాలు తలెత్తకూడదనీ..అందుకే అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా అందాలని జనసేనా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

16:57 - May 29, 2018

ఉత్తరప్రదేశ్ : ఈవీఎంల ద్వారా ఓటు వేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్ అన్నారు. కైరానాలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాట్‌లు భారీ స్థాయిలో మొరాయించినట్లు ఆరోపించారు. దీంతో చాలామంది తమ ఓటు హక్కు వినియోగించుకోలేదని, వీటిపై ప్రజలకు నమ్మకం పోయిందని ఆయన తెలిపారు. ఈవీఎంలను తాను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నానని... రానున్న ఎన్నికల్లో అంతటా బ్యాలెట్ పేపర్లను వాడాలని అఖిలేష్ డిమాండ్ చేశారు. బ్యాలెట్ ద్వారా ఓటు వేయడం వల్ల ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు. ఈవీఎంలు మొరాయించిన ప్రాంతాల్లో మళ్లీ ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేయనున్నట్లు అఖిలేశ్ యాదవ్ తెలిపారు. 

16:55 - May 29, 2018

కృష్ణా : ఎ కొండూరు మండలం దిప్లానగర్‌ తండాలో కిడ్నీ వ్యాధితో మరొకరు చనిపోయారు. చికిత్స చేయించుకునేందుకు డబ్బు లేకపోవడంతో రెండు మాసాలుగా మంచానికే పరమితమైన బానావత్‌ నాగేశ్వరరావు మృతి చెందారు. చివరి సారిగా ఆయన టెన్‌ టీవీతో మాట్లాడుతూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాగేశ్వరరావు టెన్‌ టీవీతో మాట్లాడిన చివరి మాటలు ఏవిటో ఈ వీడియోలో చూడండి..

16:50 - May 29, 2018

విజయవాడ : జన్మభూమి కమిటీలు టీడీపీ ప్రజా ప్రతినిధులు కొంపముంచుతున్నాయని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కమిటీలతో పార్టీ పరువుపోతోందని విజయవాడలో జరుగుతున్న మహానాడులో ఆవేదన వెలిబుచ్చారు. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లను ఆసరాగా చేసుకుని అధికారులు పనిచేయడం మానుకొన్నారని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఈ రెండు విషయాల్లో చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ సుతిమెత్తగా చురకలు అంటించారు. 

సోనియా గతే మోదీకి: జేసీ
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాకు ఏ గతి పట్టిందో... వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీకి కూడా అదేగతి పడుతుందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఏపీకి హోదా ఇవ్వకుండా మోసం చేసిన మోదీని ఇక మర్చిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు జేసీ సూచించారు. విజయవాడలో జరుగుతున్న మహానాడులో ప్రసంగించిన జేసీ దివాకర్‌రెడ్డి.. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. 

16:49 - May 29, 2018

ఉత్తరప్రదేశ్ : ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. గత రాత్రి ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలో పిడుగులు పడి 40 మంది మృతి చెందారు. మరో 28 మంది గాయపడ్డారు. బిహార్‌లో 19 మంది, జార్ఖండ్‌లో 12 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. యూపీలోని ఉన్నావ్‌ జిల్లాలో ఐదుగురు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. కాన్పూర్‌, రాయబరేలీలో ఇద్దరు చొప్పున పిడుగుపాటుకు మృతి చెందారు. గాయపడ్డవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో 24 గంటల పాటు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురియనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

16:46 - May 29, 2018

విజయవాడ : అమరావతి నిర్మాణానికి నిధులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను మంత్రి నారాయణ ఖండించారు. కనిసీ అవగాహన లేకుండా అమిత్‌షా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. కేంద్రం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చినట్టు నితి అయోగ్‌ ఎపుడో చెప్పిందనీ.. అమరావతి నిర్మాణంపై వైసీపీ అధ్యక్షుడు అవాస్తవాలు ప్రచారం చేస్తురని విమర్శించారు. మరో రెండు నెలల్లో అమరావతిలో ప్రతిపక్షనేత ఏసీకార్లలో తిరగొచ్చు మంత్రి నారాయణ తెలిపారు.

16:44 - May 29, 2018

విజయవాడ : పదవి ఇవ్వలేదని మోత్కూపల్లి నీచమైన వ్యాఖ్యాలు చేస్తున్నారని మంత్రి అచ్చెనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో మోత్కూపల్లికి ఇచ్చిన గౌవరం మరే ఇతర నాయకులకు ఇవ్వలేదన్నారు. మోత్కూపల్లి చేసే వాఖ్యాల వెనుక బీజేపీ, వైసీపీలు ఉన్నాయని అచ్చెనాయుడు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిందనీ..పదవి ఇవ్వలేదనే మోత్కుపల్లి చంద్రబాబుపై నోరుపారేసుకుంటున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మహానాడు వేదికగా మాట్లాడుతు మోత్కుపల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు ఇక జాతీయరాజకీయాల టైమ్ వచ్చింది : కేశినేని

విజయవాడ : జాతీయ రాజకీయాల్లో ఏపీ ముఖ్యమంత్రి, తమ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించాల్సిన సమయం ఇక ఆసన్నమైందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈరోజు విజయవాడలో జరుగుతోన్న తెలుగుదేశం మహానాడులో ఆయన మాట్లాడుతూ... గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాల హక్కుల కోసం మోదీ పోరాటం చేశారని, ఇప్పుడు రాష్ట్రాల హక్కులను కాలరాసేలా కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎంపీ కేశినేని నాని అన్నారు.

జగన్ నాతో పెట్టుకుంటే చరిత్ర మొత్తం బైటపెడతా : జేసీ

విజయవాడ: మూడోవ రోజు మహానాడులో జేసీ మాట్లాడుతూ విజయసాయి రెడ్డి ద్వారా రాయబారం పంపి తనను వైసీపీలోకి ఆహ్వానించారని, కానీ తనకు జగన్ దగ్గర ఊడిగం చేయడం నచ్చక వెళ్లలేదని జేసీ అన్నారు. టికెట్ ఇస్తాం.. వైసీపీలోకి రావాలని జగన్‌ కోరారని, పార్టీలోకి వస్తే ఎన్ని డబ్బులు ఇస్తావని విజయసాయిరెడ్డి అడిగారని..మీకు కప్పం చెల్లించాలా నేను అని తాను ప్రశ్నించానని జేసీ తెలిపారు. తనతో పెట్టుకుంటే జగన్‌ చరిత్ర మొత్తం బయటపెడతానంటూ.. 40 ఏళ్ల చరిత్రను జేసీ చెప్పుకొచ్చారు. జగన్‌లో రాజారెడ్డి క్రూరత్వం ఉందని ఆయన అన్నారు.

రాజధాని నిర్మానానికి చిన్నారుల స్ఫూర్తి : చంద్రబాబు

విజయవాడ : రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం చిన్నారులు చూపుతున్న అంకిత భావం స్ఫూర్తిదాయకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులను చిన్నారులు.. విదేశాల్లో ఆర్జించిన సంపాదనలో కొంత మొత్తాని ఎన్నారైలు సైతం విరాళాలుగా రాజధాని నిర్మాణం కోసం ఇస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు రూ.75 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్లు తెలిపారు.

ఓ విగ్రహానికి ఇచ్చినన్ని నిధులు కూడా అమరావతికి ఇవ్వరా?

విజయవాడ : ఓ విగ్రహానికి ఇచ్చినన్ని నిధులు కూడా అమరావతికి ఇవ్వరా? అని కేంద్రప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. మహానాడులో సీఎం చంద్రబాబు మాట్లాడుతు..రూ.95 వేల కోట్లతో గుజరాత్‌లో డోలేరో నగరాన్ని నిర్మించుకుంటున్న భాజపా నేతలు.. ఓ విగ్రహానికి ఇచ్చినన్ని నిధులు కూడా అమరావతికి ఇవ్వరా? అని ప్రశ్నించారు. సమాఖ్య స్పూర్తి అంటే ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో 22 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని.. ప్రజల భాగస్వామ్యంతో.. తక్కువ వ్యయంతో నాణ్యమైన నిర్మాణాలే లక్ష్యంగా రాజధాని నిర్మిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 

నిధులివ్వకుంటే పన్నులెందుకు కట్టాలి : చంద్రబాబు

విజయవాడ: అమరావతి నగర నిర్మాణానికి నిధులు ఇవ్వకుంటే తాము పన్నులెందుకు కట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ప్రశ్నించారు. అమరావతికి రూ.2,500కోట్లు ఇచ్చామని అసత్యాలు చెబుతున్న అమిత్ షా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ ఎద్దేవా చేశారు. మహానాడు మూడో రోజున అమరావతి నిర్మాణంపై పెట్టిన తీర్మానంపై చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. 

జేడీఎస్, కాంగ్రెస్ ల మధ్య కుదరని పదవుల కేటాయింపు..

కర్ణాటక: రాష్ట్రంలో జరగవలసిన జేడీఎస్-కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమవుతోంది. ముఖ్యమంత్రి కుమార స్వామి, కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. దీంతో మంత్రివర్గ విస్తరణ మళ్ళీ వాయిదా పడింది. ఆర్థిక మంత్రిత్వ శాఖపై జేడీఎస్, కాంగ్రెస్ పంతం పడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ త్వరలోనే రాష్ట్రానికి వస్తారని సమాచారం. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే నెల 1న తిరిగి స్వదేశానికి వస్తారని, ఆ తర్వాత మాత్రమే కచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.

బీజేపీకి అద్దె మైకులా వైసీపీకి సొంతమైకు కన్నా : చంద్రబాబు

విజయవాడ : బీజేపీ పార్టీకి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఉద్శేశించి సీఎం చంద్రబాబు విమర్శనాత్మకంగా మాట్లాడారు. వైసీపీలోకి పోవాలని ప్లెక్సీలు, కార్లు అన్నీ రెడీ చేసుకుని, ఆఖరి నిమిషంలో హాస్పిటల్ లో అడ్మిట్ అయి.. ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ అయిన ఓ పెద్దమనిషి బీజేపీకి అద్దె మైకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంత మైకులా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆటువంటి వ్యక్తులా మనల్ని గురించి విమర్శివచేది అని ఎద్దేవా చేశారు.

14:05 - May 29, 2018
14:04 - May 29, 2018

విజయవాడ : ఏపీకి బీజేపీ, కాంగ్రెస్ అన్యాయం చేశాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మహానాడులో యాన మాట్లాడారు. కన్నా లక్ష్మీనారాయణపై ఆయన మండిపడ్డారు. పదవి రాలేదని మోత్కుపల్లి నీచంగా మాట్లాడుతున్నారని అన్నారు. మోత్కుపల్లి వెనుక బీజేపీ, వైసీపీ కుట్ర ఉందన్న అనుమానం కలుగుతుందన్నారు. ఇలాంటి వారి పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

 

13:58 - May 29, 2018

సంగారెడ్డి : కాంగ్రెస్ మాజీ ఎమ్మేల్యే జగ్గారెడ్డి దీక్షకు దిగారు. మూడు రోజులపాటు దీక్ష చేయనున్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తేనే దీక్ష విరమిస్తానని చెప్పారు. గీతారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ..అందుకు పోరాటం చేస్తామని తెలిపారు. 

13:53 - May 29, 2018

హైదరాబాద్ : ఏసీ సీఎం చంద్రబాబుపై మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ను కుట్ర చేసి గద్దె దించారని అన్నారు. ఎన్టీఆర్ గొంతు కోసినట్టే బాబు తన గొంతుకోస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నీచుడని..బాబు లాంటి నీచపు నాయకుడు ప్రపంచంలో లేరని పేర్కొన్నారు. చంద్రబాబు నీకు సిగ్గులేదా అని అన్నారు. ఆత్మను అమ్ముకొని బతికే నీచుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. నమ్మక ద్రోహి అన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉంటే నన్ను వదిలిపెట్టేవాడివా...అని అన్నారు. పది సంవత్సరాలు నీపక్కన నిలబడి నీకోసం ఉన్నానని అన్నారు. నిన్ను నేను గవర్నర్ పదవి అడిగానా..నీవేమైనా ప్రధానివా అన్నారు. అవసరం అనుకుంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానని అన్నారు. 

 

13:44 - May 29, 2018

కరీంనగర్‌ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మానకొండూరు మండలం చెంజర్ల వద్ద ఆర్డీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి, ఈప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో  15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగురైన అందించాలని ఆదేశించారు.
మృతులు కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు.

 

13:40 - May 29, 2018

హైదరాబాద్ : ఉద్యోగరంగంలోని అసమానతలను రూపు మాపేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ఇందుకోసం స్థానికతే కీలక అంశంగా జోనల్ వ్యవస్థను తెరపైకి తెచ్చింది. రాష్ట్రపతి అమోదిస్తే.. ఓ చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచిపోనున్న జోనల్ వ్యవస్ధపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం.

అరవై ఏళ్ళ ప్రత్యేక రాష్ర్ట నినాదంలో అత్యంత కీలకమైన అంశాల్లో ఉద్యోగ రంగం అతి ప్రధానమైంది. ఉమ్మడి రాష్ట్రంలో  నియమాకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై  పెద్ద ఎత్తున అందోళనలు సాగాయి.  హైద్రాబాద్ ఫ్రీజోన్ కాదనే అంశం పై  సిద్దిపేటలో ఉద్యోగులు నిర్వహించిన గర్జనే రెండో దశ పోరాటాన్ని మలుపు తిప్పింది. ముల్కి నిబంధనలు, ఆరు సూత్రాల పథకం, పెద్దమనుషుల ఒప్పందం, రాష్టప్రతి ఉత్తర్వులు, 610 ఉత్తర్వులు, గిర్‌గ్లానీ నివేదికలు జరిగిన నష్టాన్ని పూడ్చలేదు. నిజాం పాలన నుంచి   స్ధానికేతరులకే ఉద్యోగాలు అధికంగా దక్కాయి.,   మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1919లో ప్రవేశ పెట్టిన ముల్కీ నిబంధనల ప్రకారం ఉద్యోగాలన్నీ స్థానికులకే చెందాలి.

ఎక్కడ వరుసగా  15 సంవత్సరాలు నివాసం ఉంటారో వారికే స్ధానికులుగా గుర్తింపు ఇచ్చారు. విరమణ తర్వాత కూడా తెలంగాణలోనే ఉండాలనే షరతులు కూడా విధించారు.  1975 అక్టోబర్ 18న రాష్టప్రతి ఉత్తర్వులు 674  జారీ అయ్యాయి. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ జోన్లుగా విభజించారు.  రిజర్వు చేయబడినవి పోగా, మిగిలినవి ఓపెన్ కాంపిటీషన్ ద్వారా భర్తీ చేయాలి. వాటిని స్థానికేతరులకు రిజర్వు చేయరాదని ఉత్తర్వులు స్పష్టంగా పేర్కొన్నాయి. అప్పటి  ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నియమించిన జయభారత్ రెడ్డి, కమలనాథన్, ఉమాపతిలతో సీనియర్ ఐఎఎస్ అధికారుల త్రిసభ్య కమిటీని వేశారు. ఆ కమిటీ నివేదికను పరిశీలించిన ఎన్టీఆర్ 1985 డిసెంబర్ 30న 610 జీవోను జారీ చేశారు.  చంద్రబాబు పాలనలో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి గిర్‌గ్లానీ ఏకసభ్య కమిషన్‌ను మళ్ళీ పరిశీలించేందుకు  నియమించారు.    ఉద్యోగ నియామకాలన్నీ జోనల్ నిబంధనలను అనుసరించి జరగాల్సి ఉండగా, జోనల్ ఆఫీసులను రాష్టస్థ్రాయి కార్యాలయాలుగా మార్చి ఇష్టారాజ్యంగా బదిలీలు చేయడం జరిగిందని, ఈబదిలీలు తప్పని కమిషన్ అభిప్రాయపడింది. గిర్‌గ్లానీ నివేదిక ప్రకారం సగంమంది స్థానికేతరులు ఉన్నారన్నది స్పష్టమైంది.

ఈనేపథ్యంలో కొత్త జోన్ల ప్రతిపాదనలపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది..  ఉపముఖ్యమంత్రి కడియం కమిటీ సూచించిన విధంగా 1నుంపి 7వ తరగతి వరకు పరిగణలోనికి తీసుకోకుండా, రాష్ట్రంలో 4నుండి 12వ తరగతి వరకు వరుసగా 7ఏళ్ళ పాటు చదివిన వారినే స్థానికులుగా గుర్తించాలని నిర్ణయించారు. జిల్లా, జోనల్, రాష్ట్ర కేడర్లకు   స్థానిక, స్థానికేతరులకు వర్తింప చేయాలని, కొత్త నియామకాలలో 70శాతం పదోన్నతుల ద్వారా, 30శాతం నేరుగా చేపట్టాలని నిర్ణయించారు. సీఎం  నిర్ణయం ప్రకారం 7జోన్లు, 2మల్టీజోన్లను ఏర్పాటు చేస్తే... కోరి, కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని ప్రజానీకం కోరుతోంది.
 

13:36 - May 29, 2018

నెల్లూరు : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడు జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన నెల్లూరుకు చేరుకున్నారు. పర్యటనలోభాగంగా  తొలుత నెల్లూరులోని రంగనాథస్వామి దర్శంచుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రానికి చేనేత కార్మికులు, ఆక్వా రైతులతో పాటు మైకామైనింగ్‌ కార్మికులతో భేటీ అవుతారు.  వారి సమస్యలను అడిగి తెలుకొంటారు. 

 

13:34 - May 29, 2018

చెన్నై : మండుతున్న వేసవికి చరమగీతం పాడుతూ రుతుపవనం రాబోతోంది. ఇప్పటికే కేరళ, తమిళనాడుల్లోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్‌ నికోబార్‌ దీవులను పూర్తిగా ఆవరించినట్లు తెలిపింది. 24 గంటల్లో కేరళలోని మిగిలిన ప్రాంతాలు, కర్ణాటకలోని పలు ప్రాంతాలకూ రుతు పవనాలు వ్యాపించే అవకాశం ఉంది. ఇదే అనుకూల వాతావరణం కొనసాగితే సకాంలోనే తెలంగాణకు రుతుపనాలు వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా జూన్‌ మొదటి వారంనాటికి దేశంలో చాలా ప్రాంతాల్లో మాన్‌సూన్స్‌ విస్తరిస్తాయని ఐఎండీ ప్రకటించింది. 

 

13:32 - May 29, 2018

విజయవాడ : ఎక్కడ టీడీపీ ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పదవుల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ పోరాడుతోందన్నారు. విజయవాడలో జరుగుతున్న  మహానాడులో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఏపీ విభజన తర్వాత ఒక్క విగ్రహానికి కూడా నిధులు ఇవ్వని కేంద్రం.. గుజరాత్‌లో నిర్మిస్తున్న ఓ నిర్మాణానికి భారీగా నిధులు సమకూరుస్తోందని బాబు మండిపడ్డారు. ఎవరు రాష్ట్రానికి అన్యాయం చేసినా టీడీపీ వదిలిపెట్టదన్నారు. 5 కోట్లమంది  ప్రజల సంఘీభావంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.  

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి : జిల్లాలో రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను తీసింది. షాద్‌నగర్‌ టోల్‌ప్లాజా వద్ద బైక్‌ను లారీ  ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్‌ నుంచి జడ్చెర్ల వెళుతుండగా ఈప్రమాం జరిగింది. మృతులు మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులుగా ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు మృతుల వివరాలను సేకరిస్తున్నారు.  

13:22 - May 29, 2018

కరీంనగర్‌ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  మానకొండూరు మండలం చెంజర్ల వద్ద ఆర్డీసీ -లారీ ఢీకొన్నాయి, ఈప్రమాదంలో  7గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో  15 మంది తీవ్రంగా గాయపడ్డారు.  వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ప్రమాదంపై మంత్రి ఈటల రాజేందర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన ప్రమాద స్థలానికి మంత్రి  బయలు దేరివెళ్లారు. మృతులు కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు.  

 

13:17 - May 29, 2018

విజయవాడ : బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చెల్లవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడారు. బీజేపీ, అమిష్ షా ఆటలు చెల్లవు అని అన్నారు. బీజేపీ నేతలు చాలా దుర్మార్గమైన పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. బురదజల్లాని, అడ్డుపడాలని చూస్తున్నారని అన్నారు. 
అన్నారు. అమరావతికి 15 వందల కోట్లు ఇచ్చి...2 వేల కోట్లు ఇచ్చామని అమిత్ షా చెబుతున్నారని తెలిపారు. 'మాకు నిధులు ఇయ్యకుంటే...మేము ఎందుకు మీకు పన్నులు కట్టాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మా పొట్ట కొట్టవద్దు అన్నారు. తప్పు వార్తలు రాసే సాక్షిని ఏమనాలి...అని అన్నారు. బీజేపీ, వైసీపీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 5 వంతెనలు, ఐకానిక్ బ్రిడ్జీలు వస్తున్నాయన్నారు. 22,165 కోట్ల రూపాయలకు టెండర్లకు పిలిచామని చెప్పారు. అమరావతికి ప్రజలు 75 కోట్ల రూపాయలు విరాళులు ఇచ్చారని తెలిపారు. కృష్ణా జిల్లాలో ఓ అమ్మాయి దాచుకున్న చిట్టి డబ్బులు లక్ష రూపాయలు రాజధానికి విరాళంగా ఇచ్చింది...ఆమెను అందరూ అభినందించాలన్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి అద్దె మైకు.. వైసీపీకి సొంత మైకు' అని ఎద్దేవా చేశారు. పదవులకు కక్కుర్తి పడి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టారని మండిపడ్డారు.

 

సీపీఎం నేత జక్కా వెంకయ్య కన్నుమూత

నెల్లూరు : సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు..జక్కా వెంకయ్య కన్నుమూశారు. కొద్ది రోజులగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకయ్య సింహపురి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ వెంకయ్య మృతి చెందారు. 1930 నవంబర్‌ 3న జక్కా వెంకయ్య జన్మించారు. 1951లో కమ్యునిస్టు పార్టీ సభ్యునిగా చేరి 1957లో దామరమడుగులో సర్పంచ్‌గా ఎన్నికైయ్యారు. 

12:59 - May 29, 2018

నెల్లూరు : సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు..జక్కా వెంకయ్య కన్నుమూశారు. కొద్ది రోజులగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకయ్య సింహపురి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ వెంకయ్య మృతి చెందారు. 1930 నవంబర్‌ 3న జక్కా వెంకయ్య జన్మించారు. 1951లో కమ్యునిస్టు పార్టీ సభ్యునిగా చేరి 1957లో దామరమడుగులో సర్పంచ్‌గా ఎన్నికైయ్యారు. ఆ తరువాత 1985, 1994 అల్లూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా  జక్కా వెంకయ్య గెలిచారు. 1974లో వ్యవసాయ కూలీల వేతనాల కోసం జరిగిన పోరాటానికి నాయకత్వం  వహించారు.  1994 నుంచి నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో  జక్కా వెంకయ్య పాల్గొన్నారు.  వెంకయ్య మృతికి పలువురు వామపక్షనేతలు సంతాపం ప్రకటించారు. రేపు అంత్యక్రియాలు నిర్వహించనున్నారు. 

 

12:58 - May 29, 2018

కరీంనగర్‌ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మానకొండూరు మండలం చెంజర్ల వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో  15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ప్రమాదంపై మంత్రి ఈటల రాజేందర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన ప్రమాద స్థలానికి మంత్రి బయలు దేరివెళ్లారు.  

12:50 - May 29, 2018

తమిళనాడు : ప్రజా ఉద్యమానికి తమిళనాడు ప్రభుత్వం తలవంచింది. తూత్తుకూడిలోని కాపర్‌  స్టెరిలైట్‌ ప్లాంట్‌ను పూర్తిగా మూసివేయాలని పళనిస్వామి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తూత్తుకూడిలో కాలుష్యం వెదజల్లుతున్న  స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ విస్తరణకు వ్యతిరేకంగా స్థానికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. 70 మంది గాయపడ్డారు. కాల్పుల ఘటనపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వేదాంత్‌ గ్రూప్‌కు చెందిన స్టెరిలైట్‌ కంపెనీ 1996లో తూత్తుకూడీలో ప్రారంభమైంది. ప్లాంట్‌లో ప్రతి ఏటా 4 లక్షల టన్నుల రాగి ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ మైనింగ్‌తో భూగర్భ జలాలు తగ్గుతాయని, ఉద్గారాలు పర్యావరణాన్ని కలుషితం చేస్తాయని, క్యాన్సర్‌వంటి రోగాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

 

12:48 - May 29, 2018

కర్నాటక : కాంగ్రెస్‌ పార్టీ దయ వల్లే తాను సిఎం అయినట్లు కుమారస్వామి తెలిపారు. కాంగ్రెస్‌ అనుమతి లేకుండా తాను ఏమి చేయలేనని చెప్పారు. కర్ణాటక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తన బాధ్యతగా పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు గడుస్తున్నా ఇంతవరకు తన క్యాబినెట్‌ను విస్తరించలేదు. మంత్రివర్గ విస్తరణపై కర్ణాటక కాంగ్రెస్‌ నేతలు శని, ఆదివారం ఢిల్లీలో తమ అధిష్టానంతో సమావేశమైనప్పటికీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తల్లి సోనియాతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లడంతో మంత్రివర్గ విస్తరణకు మరో నాలుగైదు రోజులు జాప్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. రాహుల్‌, సోనియా వచ్చాకే పోర్ట్‌ ఫోలియోల కేటాయింపుపై ఓ క్లారిటీ రానుందని సిద్ధరామయ్య తెలిపారు. ఆర్థిక శాఖపై కాంగ్రెస్‌-జెడిఎస్‌ల మధ్య విభేదాలు నెలకొన్నాయి. మొత్తం 34 మంత్రి పదవులకు గాను కాంగ్రెస్‌కు 22 బెర్త్‌లు దక్కనున్నాయి.

12:46 - May 29, 2018

ఢిల్లీ : పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని వీడే వరకు ఆ దేశంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ స్పష్టం చేశారు. తాము పాకిస్తాన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగానే ఉన్నామని... ఉగ్రవాదం, చర్చలు ఒకే ఒరలో ఇమడవని తేల్చి చెప్పారు. పాకిస్తాన్‌ సార్వత్రిక ఎన్నికల తర్వాత చర్చలు జరగాలన్నా ఉగ్రవాదాన్ని వీడాల్సిందేనని సుష్మా పేర్కొన్నారు. గిల్గిట్‌-బాల్టిస్టాన్‌ 2018 ఆర్డర్‌పై ఆమె మాట్లాడుతూ...పాకిస్తాన్‌ చరిత్రను వక్రీకరిస్తోందని...చట్టం మీద వారికి నమ్మకం లేదని మండిపడ్డారు. మోది నాలుగేళ్ల పాలనలో విదేశాంగ శాఖ సాధించిన విజయాలను సుష్మా ప్రస్తుతించారు.

 

నేడు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో వైసీపీ ఎంపీల భేటీ

ఢిల్లీ  : ఇవాళ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో వైసీపీ ఎంపీలు  సమావేశం అవుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఏప్రిల్‌6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. స్పీకర్‌ఫార్మాట్‌లో రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలను వివరణ ఇవ్వాల్సిందిగా స్పీకర్‌ లేఖరాశారు. 

12:13 - May 29, 2018

ఢిల్లీ : ఇవాళ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో వైసీపీ ఎంపీలు  సమావేశం అవుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఏప్రిల్‌6న వైసీపీ ఎంపీలు రాజీనా చేశారు. స్పీకర్‌ఫార్మాట్‌లో రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలను వివరణ ఇవ్వాల్సిందిగా స్పీకర్‌ లేఖరాశారు. సాయంత్రం 5 గంటలకు స్పీకర్‌ చాంబర్‌లో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీసుబ్బారెడ్డి, వరప్రసాద్‌, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిఎంపీల  వివరణ అనంతరం రాజీనామాలపై స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నిర్ణయం తీసుకోనున్నారు. 

 

12:09 - May 29, 2018

హైదరాబాద్ : మండుతున్న వేసవికి చరమగీతం పాడుతూ రుతుపవనం రాబోతోంది. మరి కొద్ది గంటల్లో రుతుపవనాలు కేరళతీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ సంస్థ ..ఐఎండి ప్రకటించింది. అయితే ఇప్పటికే కేరళలో రుతుపవన పరిస్థితులు గుర్తించామని స్కైమేట్‌ అనే వాతవరణ పరిశోధన సంస్థ ప్రకటించింది. కాగా జూన్‌ మొదటి వారంనాటికి దేశంలో చాలా ప్రాంతాల్లో మాన్‌సూన్స్‌ విస్తరిస్తాయని ఐఎండీ ప్రకటించింది. 

 

12:07 - May 29, 2018

కరీంనగర్‌ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్డీసీ బస్సు ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మృత దేహాలు నుజ్జు నుజ్జయ్యాయి. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై మంత్రి ఈటల రాజేందర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలానికి బయలు దేరారు.

 

12:00 - May 29, 2018

హైదరాబాద్‌ : యూసుఫ్‌గూడలో యువతిని దారుణంగా హత్య చేసిన ప్రేమోన్మాది సాగర్‌ పోలీసుల ముందు లొంగిపోయాడు. వెంకటలక్ష్మీ తన ప్రేమను నిరాకరించిందని ఓ గోల్డ్‌షాప్‌లో ఆమె గొంతు కోసి చున్నీ భిగించి అతి దారుణంగా చంపేశాడు. తన ప్రేమను నిరాకరించిందని యువతిని హత్య చేశాడు. 

 

అనంతపురం జిల్లాలో విషాదం

అనంతపురం : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బుక్కపట్నం చెరువులో దూకి ఇద్దరు కొడుకులతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అంటున్నారు.

 

నేటితో ముగియనున్న టీడీపీ మహానాడు

విజయవాడ : టీడీపీ మహానాడు చివరి అంకానికి చేరుకుంది. నేటితో మహానాడు ముగియనుంది. ఇవాళ మహానాడులో 13 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. 2019 ఎన్నికలకు ముందు జరుగుతున్న మహానాడు కావడంతో పార్టీ నేతలకు, కార్యకర్తలకు మంచి ఉత్తేజాన్నిచ్చింది. మరోవైపు సభకు భారీ ఎత్తున కార్యకర్తలు తరలిరావడంతో పార్టీ కేడర్ కూడా ఆనందం వ్యక్తం చేస్తోంది. మహానాడు ముగింపులో ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడనున్నారు. ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని సభావేదికగా చంద్రబాబు పిలుపునివ్వనున్నారు.

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...

కరీంనగర్ : మానుకొండూరు మండలం చెంజర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడు మంది మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీనంగర్ ఆస్పత్రికి తరలించారు. 

నిరవధిక వాయిదా పడిన ఏయూ స్నాతకోత్సవం

విశాఖ : ఆంధ్రా యూనివర్సిటీ స్నాతకోత్సవం నిరవధికంగా వాయిదా పడింది. నితి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ కు ఆహ్వానంపై వివాదం నెలకొంది. అధికారుల ఏకపక్ష నిర్ణయాలతో వివాదాలు తలెత్తాయి. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలంటూ వీసీ రాజీవ్ కుమార్ కు ఆహ్వానం పంపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని రాజీవ్ కుమార్ కేంద్రానికి సిఫార్సు చేశారు. రాజీవ్ కుమార్ కు వ్యతిరేకంగా ఏయూలో నిరసనలు వెల్లువెత్తాయి. ఏయూ వివాదాలపై సీఎంకు ఫిర్యాదులు వెళ్లాయి.

 

08:47 - May 29, 2018

తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ పై వక్తలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య, వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, టీఆర్ ఎస్ నేత రాకేష్ , టీడీపీ నేత దుర్గాప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. మోత్కుపల్లి నర్సింహులు ప్రస్టేషన్ నుంచి వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోందన్నారు. టీడీపీ మహానాడు, ఏపీలో చంద్రబాబు పాలన, తెలంగాణలో కేసీఆర్ పాలనపై చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:22 - May 29, 2018

జూన్‌ 1 నుంచి తెలంగాణలో స్కూల్స్ ప్రారంభం కాబోతున్నాయి. అయితే విద్యా సంవత్సరానికి పిల్లలు, తల్లిదండ్రులు సిద్ధమైన ప్రభుత్వం పెద్దగా సిద్ధం కాలేదని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రయివేటు స్కూల్స్‌ అధిక ఫీజులతో విద్యా సంవత్సరానికి స్వాగతం పలుతుండగా.. అందరికీ ఉచిత విద్యను అందించాల్సిన ప్రభుత్వ స్కూల్స్‌ వివిధ రకాల సమస్యలతో విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాయని విద్యార్థి సంఘం నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశంపై ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట రమేష్‌ మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగంపై దృష్టి పెట్టాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:01 - May 29, 2018

హైదరాబాద్ : అనగనగా ముగ్గురు మిత్రులు.. అవసరానికి కావాల్సినంత డబ్బు కోసం అక్రమ మార్గం పట్టారు. అప్పు చేస్తారు..  డబ్బుతిరిగి ఇమ్మంటే గన్‌ తీస్తారు..అడగ్గానే  డ‌బ్బు ఇవ్వక‌ుంటే  బుల్లెట్ దింపుతారు. ఇలా బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాకు చెక్‌ పెట్టారు రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు. తీగలాగితే డొంక కదిలిన చందంగా.. పదిహేను సంవత్సరాల నాటి మర్డర్‌ కేసు ఇప్పుడు బయటపడింది. 
నేరబాట పట్టిన ముగ్గురు మిత్రులు
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకున్నారు ముగ్గురు స్నేహితులు. అందుకోసం నేరాల బాట పట్టారు. అందినంత అప్పు చేయడం... తిరిగి ఇమ్మంటే జేబులోనుంచి గన్‌ తీసి బెదిరించడం. అడగ్గానే డబ్బివ్వకపోయినా అంతే.. ఇలా బెదిరింపులు.. మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో రంగంలోకి దిగిన రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు.
తపంచా, 22 ఎంఎం పిస్తోల్‌ తెప్పించుకుని నేరాలు
చుంచు మ‌ల్లికార్జున్, మిట్ట ఆంజ‌నేయులు, ప్రకాశ్ కుమార్.. ఈ ముగ్గురూ స్నేహితులు. చుంచు మ‌ల్లీకార్జున్ కిరాణా స్టోర్ న‌డుపుతుంటే... మిట్ట ఆంజ‌నేయులు ఎల‌క్ర్టానిక్ స‌ర్వీస్‌లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు.. ఇక ప్రకాశ్ కుమార్ ఓ ప్రైవేట్ కొరియర్ కంపెనీలో పని చేస్తున్నాడు. వీరు ఎలాగైనా డబ్బు సంపాదించాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా కోల్‌కతా నుంచి ఒక తపంచా, 22 ఎంఎం పిస్తోల్‌ తెప్పించుకుని నేరాలకు తెరతీశారు. చుంచు మ‌ల్లికార్జున్ 2003లో త‌న భార్య అనుసూయను చంపిన కేసు ఇప్పుడు పోలీస్‌ విచారణలో వెలుగు చూడడం కొసమెరుపు. నిద్రపోతున్న అనసూయను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. 

 

07:53 - May 29, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్‌ కొత్తపుంతలు తొక్కుతోంది. చిన్నచిన్న గొడవలకే మనుషులను చంపేస్తున్నారు. భర్త నచ్చలేదని ఒకరు... భార్యపై అనుమానంతో మరొకరు... ఇలా తమవారినే హత్యలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ చోట్ల జరిగిన మర్డర్‌లు మానవ సంబంధాలను ప్రశ్నిస్తున్నాయి.
భర్తను హత్యచేయబోయిన భార్య
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. సంతబొమ్మాలిలో ఓ భార్య తన భర్తనే మర్డర్‌ చేసేందుకు యత్నించింది. ఈనెల 9న  నవీన్‌కుమార్‌కు నీలిమతో వివాహమైంది. అయితే నీలిమకు నవీన్‌తో పెళ్లి ఇష్టం లేదు.  నీలిమ తన భర్తను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకుంది.  బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి కత్తితో మెడపై పొడిచింది. తీవ్రగాయం కావడంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. నిందితురాలు నీలిమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
నిజామాబాద్‌ జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి వేధింపులు భరించలేక బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.  బీటెక్‌ విద్యార్థిని రమ్యకు మక్లూర్‌కు చెందిన ప్రసాద్‌తో గతంలో పరిచయం ఉంది. ఇద్దరూ సానిహిత్యంగా మెలిగారు.  ప్రసాద్‌కు పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఉపాధి కోసం కువైట్‌ వెళ్లాడు. ఇంతలో రమ్యకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇది తెలుసుకున్న ప్రసాద్‌.. రమ్యను బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. పట్టించుకోకపోవడంతో ఇద్దరూ సానిహిత్యంగా ఉన్న ఫోటోలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తూ... రమ్యతోపాటు ఆమె ఫ్రెండ్స్‌ ఫోటోలు ఆ సైట్‌లో పెట్టాడు. దీంతో రమ్యను ఆమె ఫ్రెండ్స్‌ నిలదీశారు. మనస్తాపం చెందిన రమ్య కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం నిజామాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
కట్టుకున్న భార్యను కడతేర్చిన కసాయి
నెల్లూరు జిల్లాలో ఓ కాలాంతకుడు కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో అత్యంత దారుణంగా హతమార్చాడు.  ఏయస్‌పేట మండలం శ్రీకొలనుకు చెందిన చెంచు కృష్ణయ్య, పుష్ప భార్యాభర్తలు. పుష్ప ఎవరితోనే వివాహేతర సంబంధం నెరపుతోందని కృష్ణయ్య అనుమానించాడు. ఎలాగైనా ఆమెను హతమార్చాలని డిసైడ్‌ అయ్యాడు. 10 రోజుల కిందట పాలడైరీలో చెట్లు నాటుదామంటూ భార్యను తీసుకెళ్లి హత్య చేశాడు. అక్కడే గుంతతవ్వి పూడ్చేశాడు. అనంతరం ఏమీతెలియనట్టు పీయస్‌పేట పోలీస్‌స్టేషన్‌లో భార్య అదృశ్యమైందంటూ ఫిర్యాదు చేశాడు. పుష్ప బంధువులు కృష్ణయ్యపై అనుమానం వ్యక్తం చేస్తూ దేహశుద్ధి చేయగా... అసలు నిజం బయటపెట్టాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కృష్ణయ్యను అదుపులోకి తీసుకున్నారు.
యువతి దారుణ హత్య
ఇక హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ గోల్డ్‌షాప్‌లో లక్ష్మీ అనే యువతి దారుణ హత్యకుగురైంది. దుండగులు ఆమె గొంతుకోసి హత్య చేశారు. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

 

నేడు సీబీఎస్ ఈ టెన్త్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ : నేడు సీబీఎస్ ఈ టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నారు.

నేడు తెలంగాణలో రెండోరోజు ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్

హైదరాబాద్ : నేడు తెలంగాణలో రెండో రోజు ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 10 వేల నుంచి 25 వేల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నారు. 

నేడు 175 వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర

ప.గో : నేడు 175 వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర చేయనున్నారు. నేడు నర్సాపురం, భీమవరం నియోజకవర్గంలో జగన్ యాత్ర చేయనున్నారు.

నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన

ఢిల్లీ : నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన చేయనున్నారు. ఇండోనేషియా, సింగపూర్, మలేషియాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. వివిధ ద్వైపాక్షిక అంశాలపై మోడీ చర్చించనున్నారు.

Don't Miss