Activities calendar

30 May 2018

21:53 - May 30, 2018

అమరావతి : టీటీడీ ఎమ్మెల్యే బోండా ఉమా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడి భూమిని కబ్జా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. ఆ భూమిని మరొకరి పేరుతో ఇతర వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారంటూ బాధితులు బోండాపై విజయవాడ సిపీకి బాధితులు ఫిర్యాదు చేశారు. జగ్గయ్యపేటకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు సుబ్రహ్మణ్యం విజయవాడలోని సుబ్బారాయ నగరంలో భూమి కొనుగోలు చేశాడు. 2009లో బోండా ఉమా అనుచరిడికి సుబ్రహ్మణ్యం కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బును తిరిగి చెల్లించమంటే..సమాధానం దాటవేస్తూ వచ్చాడు. అదే సమయంలో విజయవాడలోని సుబ్రహ్మణ్యం భూమిపై కన్నేశాడు. దీనికి ఓ పధకం రచించాడు. ఎమ్మెల్యే బొండా ఉమా సహాయంతో భూ యాజమాని తమ్ముళ్ల పేరుతో మాగంటి బాబు అనే మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయించే ప్రయత్నం చేశాడు. స్ధల యాజమాని తమ్ముడు రామకోటేశ్వరరావు సంతకం లేకుండానే దొంగ రిజిస్ట్రేషన్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భూ రిజిస్ట్రేషన్ విషయంలో పలు మార్లు ఎమ్మెల్యేనే తనకు ఫోన్ చేశారని బాధితుడు సుబ్రహ్మణ్యం చెప్పాడు. 

21:41 - May 30, 2018

ఢిల్లీ : గుజరాత్‌లో ధొలెరా సిటీ నిర్మాణం కోసం కేంద్రం 98 వేల కోట్లు కేటాయిస్తుందన్న సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు ఖండించారు. దేశంలో ఉన్న అన్ని ఇండస్ట్రియల్‌ సిటీస్‌ నిర్మాణానికి కేంద్రం ఒకే విధంగా సాయం చేస్తుందన్నారు. ధొలెరా సిటీ నిర్మాణానికి కేవలం 2నుండి 3 వేల కోట్లు మాత్రమే కేటాయిస్తున్నామని తెలిపారు. దేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ఇండస్ట్రియల్‌ సిటీ ఏర్పాటు చేస్తే ఏపీలో మాత్రం 3 సిటీస్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం తాను చేసిన అబద్ధపు వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని నరసింహారావు డిమాండ్‌ చేశారు. 

21:33 - May 30, 2018

విజయవాడ : మూడు రోజుల పాటు జరిగిన టీడీపీ మహానాడు పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపిందని మంత్రులు కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమ చెప్పారు. ఈ ఉత్సాహంతో 2019 ఎన్నికల్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 

21:31 - May 30, 2018

అమరావతి : ప్రభుత్వ వైద్యశాలతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్‌ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మూత్ర పిండాల వ్యాధి గ్రస్థులందరికీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో కిడ్నీ రోగులున్నా... నూరు శాతం వైద్య పరీక్షలు నిర్విహించాలని ఈ సమస్యపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏపీలో కిడ్నీ రోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, ప్రకాశం జిల్లా కనిగిరి, కృష్ణా జిల్లా ఎ.కొండూరు ప్రాంతాల్లో మూత్ర పిండాల వ్యాధి మరింత విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

కిడ్నీ వ్యాధి బాధిత ప్రాంతాల్లో ఆర్వో ప్లాంట్లు..
కిడ్నీ వ్యాధి నివారణకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని చంద్రబాబు... అధికారుల దృష్టికి తెచ్చారు. వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించేందుకు ఆర్వో ప్లాంటులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రక్తపోటు నివారణకు మోతాదుకు మించి మందులు వాడకం, విచక్షణారహితంగా నొప్పి నివారణ మెడిసిన్స్‌ తీసుకోవడం వలన ఈ వ్యాధి ప్రబలుతోందన్న అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఇప్పటికే ఉన్న డయాలసిస్‌ కేంద్రాలకు అదనంగా మరో 14 సెంటర్లు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని అధికారులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. పాడేరు, రంపచోడవరం, తుని, అమలాపురం, జంగారెడ్డిగూడెం, నూజివీడు, నరసరావుపేట, మాచర్ల, ఆత్మకూరు, మదనపల్లి, కుప్పం, కదిరి, రాయచోటి, ఆదోనిలో వీటిని ఏర్పాటు చేస్తారు. జూన్‌ 3వ తేదీ నుంచి ఇవి పనిచేసే విధంగా చర్యలు తీసుకొంటున్న విషయాన్ని అధికారులు వివరించారు.

.కొండూరు మండలంలోని 19 గ్రామాల్లో కిడ్నీ వ్యాధి బాధితులు
కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలంలోని కిడ్నీ బాధితుల సమస్యలపై చంద్రబాబు ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ ప్రాంతంలోని 19 గ్రామాల్లో ప్రబలిన కిడ్నీ వ్యాధిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. బాధితులందరికీ ఉచిత మందులతోపాటు పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. జూన్‌ 1 నుంచి బాధితులకు అటుకుల లడ్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకొంటున్న విషయాన్ని అధికారులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు.

 

21:27 - May 30, 2018

ఢిల్లీ : వేతన సవరణ కోరుతూ ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు.. రెండు రోజుల సమ్మెను ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పెద్దనోట్ల రద్దును విజయవంతం చేసిన తమపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా బ్యాంకు కార్యాలయాల ఎదుట ధర్నాల ద్వారా నిరసన తెలిపారు.

రెండు రోజు లసమ్మె
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు రెండు రోజుల సమ్మెకు దిగారు. యుఎఫ్‌బియూ ఆధ్వర్యంలో.. పది లక్షల మంది ఉద్యోగులు సమ్మెబాటలో సాగుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా.. తమ వేతనాలు పెంచాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. కమలేచాంద్ర కమిటీ సిఫారసులను తక్షణమే అమలు చేయాలనీ కోరుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ బ్యాంకులు మూతబడ్డంతో.. వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

బ్యాంకు కార్యాలయాల ఎదుట.. ఉద్యోగులు నిరసన
హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకు కార్యాలయాల ఎదుట.. ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రెండు రోజుల సమ్మెలో భాగంగా.. కోఠిలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంతో పాటు.. అసెంబ్లీ దగ్గరున్న ఆంధ్రాబ్యాంకు వద్ద ఉద్యోగులు నిరసన చేపట్టారు. బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని.. వీరికి మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. రుణాలు ఎగ్గొట్టినవారి పేర్లను బయటపెట్టాలని, బడా పారశ్రామిక వేత్తలు, కార్పొరేట్లకు రుణాలిస్తూ.. పది లక్షల మంది బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పట్టించుకోక పోవడం దారుణమని అన్నారు.

వివిధ జిల్లాల్లో బ్యాంకు ఉద్యోగుల ఆందోళన..
కృష్ణాజిల్లా అంతటా.. ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. డీమానిటైజేషన్‌ లాంటి ప్రభుత్వ నిర్ణయాల వల్ల.. బ్యాంకు ఉద్యోగులకు పని ఒత్తిడి బాగా పెరిగిందని, అయినా తమకు తగిన వేతనాలు అందించే విషయంలో ఎందుకు నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారంటూ.. ఉద్యోగ సంఘాల నాయకులు ఆక్షేపించారు. ప్రకాశం జిల్లావ్యాప్తంగానూ బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే.. నిరవధిక సమ్మెకు దిగుతామని బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వేతన సవరణ అంశంపై ప్రభుత్వం మొండివైఖరిని అనుసరిస్తే.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కడప జిల్లాలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. న్యాయమైన తమ కోర్కెలు తీర్చకుంటే.. నిరవధిక సమ్మెకు దిగుతామని కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. కర్నూలు జిల్లాలోనూ ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ మొండివైఖరిపై ఉద్యోగులు మండిపడ్డారు. తిరుపతిలోనూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. వేతన సవరణ అమలు చేయకుంటే.. తమ ఆందోళనను నిరవధికం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు.

ఏపీలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె
విశాఖ జిల్లాలో బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. పనిభారంతో నలిగిపోతున్న ఉద్యోగులకు వేతనాలు పెంచకపోవడం దారుణమని.. బ్యాంకుల నష్టాలకు ఉద్యోగులను బాధ్యులను చేయడం ఏమేరకు సమంజసమని వారు ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలోనూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కోట వద్ద.. స్టేట్‌బ్యాంకు కార్యాలయం నుంచి ఉద్యోగులు ర్యాలీ చేశారు. నోట్లరద్దు, జీరో బ్యాలెన్స్‌ అకౌంట్ల ప్రారంభం లాంటి విధులను విజయవంతంగా పూర్తిచేసిన తమపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. జిల్లాలో గ్రామీణ వికాస బ్యాంక్‌, డిసీసీబీ మినహా అన్ని జాతీయ వాణిజ్యబ్యాంకుల శాఖలు మూతబడ్డాయి. ఏటీఎం సేవలు కూడా స్తంభించాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ మద్దతునిచ్చింది.

తెలంగాణలో సమ్మె
ఖమ్మం జిల్లాలో బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఖమ్మంలోని జెడ్‌పీ సెంటర్‌లో 9 యూనియన్ల బ్యాంకు ఉద్యోగులు నిరసన చేపట్టారు. 15శాతానికి బదులు రెండు శాతమే జీతాలు పెంచుతామని అనడంపై ఆందోళన వ్యక్తం చేశారు వేతన సవరణ కోరుతూ.. బ్యాంకు ఉద్యోగులు కరీంనగర్‌ జిల్లాలోనూ సమ్మెబాట పట్టారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా బ్యాంకులు మూతబడ్డాయి. ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో.. ప్రజలు నగదు కోసం అవస్థలు పడ్డారు. ఆన్‌లైన్‌ సేవలు మినహా ఆర్థిక లావాదేవీలు స్తంభించాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో బ్యాంకు ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోరుతూ రెండు రోజుల సమ్మెకు దిగారు. వేతనాలు పెంచేవరకూ దశలవారీ పోరాటం కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. నల్లగొండ జిల్లాలోని సుమారు పదివేల మంది బ్యాంకు సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. గతంలోకంటే బ్యాంకు సేవలు విస్తృతమైనా.. ప్రభుత్వం రెండు శాతం వేతనాలే పెంచుతామనడం ఉద్యోగులను అవమానించడమేనని వారు ఆక్షేపించారు. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా కూడా బ్యాంకులు మూతబడ్డాయి. ఉద్యోగులంతా సమ్మెకు దిగి కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేతన సవరణను త్వరితగతిన అమలు చేయాలని, సర్వీసు నిబంధనలను సరళతరం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఏటీఎంలలో నగదుకు కొరత
బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా.. అన్ని చోట్లా.. ఏటీఎంలలో నగదుకు కొరత ఏర్పడింది. ప్రైవేటు రంగ బ్యాంకులు మాత్రం యథావిధిగా పనిచేశాయి. అయితే.. ఆయా బ్యాంకుల ఏటీఎంలలో కూడా నగదు లేకపోవడంతో.. వినియోగదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే.. ఆన్‌లైన్‌ సేవలను కొనసాగించడంతో.. ఆ సేవలను వినియోగించుకునే వారు కొంత ఊపిరి పీల్చుకున్నారు.

21:16 - May 30, 2018

హైదరాబాద్ : జూన్‌ ఒకటి నుంచి తెలంగాణలో పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉన్నందున వేడుకలు జరిపేందుకు ముందే పాఠశాలలను ప్రారంభిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎండల తీవ్రతతో మొదటి వారం ఒంటి పూట బడులు నడుపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. జూన్‌ 8 వరకు హాఫ్‌ డే స్కూల్‌ నడపనున్నారు. తర్వాత యథావిథిగా పాఠశాలలు నడుస్తాయి. 

21:03 - May 30, 2018

నెల్లూరు : కమ్యూనిస్టు యోధుడు జక్కా వెంకయ్య అంత్యక్రియలు ముగిశాయి. నెల్లూరులోని బీజీ తోటలోని శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో వెంకయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. వెంకయ్యను కడసారి చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు.

ముగిసిన వెంకయ్య అంత్యక్రియలు..
కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం సీనియర్‌ నాయకులు జక్కా వెంకయ్య అంత్యక్రియలు ముగిశాయి. ఉదయం 11 గంటలకు నెల్లూరు జిల్లా బాలాజీనగర్‌లోని పార్టీ కార్యాలయం నుండి ఆయన అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఈ అంతిమ యాత్రలో సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, మంత్రి నారాయణ, తెలుగు రాష్ట్రాలకు చెందిన సీపీఎం నేతలు పాల్గొన్నారు. చివరి సారిగా వెంకయ్యను చూసేందుకు ప్రజానీకం పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతిమ యాత్ర అనంతరం పెన్నా నదీ తీరంలోని బోడిగాడితోటలోని శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో వెంకయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి.

వెంకయ్య మరణం తీరని లోటు : రాఘవులు
వెంకయ్య మరణం ప్రజాస్వామ్యానికే తీరని లోటన్నారు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వెంకయ్యను కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.

జక్కా వెంకయ్యకు పలువురి సంతాపం..
మహిళా ఉద్యమాన్ని దగ్గరుండి నడిపించిన వెంకయ్యను కోల్పోవడం చాలా బాధాకరమన్నారు మల్లు స్వరాజ్యం. ఆయన మార్గాన్ని అనుసరించి విప్లవ ఉద్యమాన్ని జయప్రదం చేసి సమాజాన్ని మార్చడమే వెంకయ్యకు ఘన నివాళి అన్నారు. భూస్వామి కుటుంబంలో పుట్టినప్పటికీ నిరాడంబర జీవితాన్ని గడపడం వెంకయ్యకే సాధ్యమైందన్నారు సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి మధు. ఆయన ఆశయాల్ని సంప్రదాయాల్ని కొనసాగిస్తూ.. ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు.

తోటలోని శ్మశానవాటికలో జక్కా వెంకయ్య సంతాప సభ
బీజీ తోటలోని శ్మశానవాటికలో జక్కా వెంకయ్య సంతాప సభను నిర్వహించారు. ఈ సభలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు వెంకయ్యతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. వెంకయ్య అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. జీవిత కాలమంతా ప్రజల కోసమే ఉద్యమాలు చేసిన గొప్ప వ్యక్తి మృతి దురదృష్టకరమన్నారు మంత్రి నారాయణ. వెంకయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

21:00 - May 30, 2018

హైదరాబాద్ : రెండు రోజుల క్రితం యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌లో సంచలనం రేపిన వెంకటలక్ష్మి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు సంబంధించిన వివరాలను వెస్ట్‌ జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు. మృతురాలు వెంకటలక్ష్మీ జవనగర్ జోడీ జ్యూవెలరీ షాప్‌లో పనిచేస్తుందని.. అదే ప్రాంతంలో నిందితుడు సాగర్ హోంగార్డుగా పని చేస్తున్నాడని తెలిపారు. వీళ్లిద్దరికి రెండేళ్ల కిందట మధురానగర్‌లో పరిచయం ఏర్పడిందని చెప్పారు. పరిచయం కావటంతో తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని సాగర్ వెంకటలక్ష్మీని వేధించేవాడని తెలిపారు. ఈ నెల 28న మధ్యాహ్నం వెంకటలక్ష్మి పనిచేస్తున్న నగల దుకాణంలోకి వెళ్లిన సాగర్‌ ఆమెతో పెళ్లి చేసుకోవాలని ఘర్షనకు దిగడాని చెప్పారు. బయటికి వెళ్లి బ్లేడు తీసుకోని వచ్చి గొంతుకోసి ఆ తర్వాత చున్నీ బిగించి దారుణంగా హత్యచేశాడని డీసీపీ వివరించారు. 

జూన్ 1 నుండే స్కూల్స్ ఓపెన్..

హైదరాబాద్ : షెడ్యూల్ ప్రకారంగా జూన్ 1 నుండే స్కూల్స్ పున:ప్రారంభం అవుతాయనీ..జూన్ 4 నుండి 8 వరకూ ఒంటిపూట బడులు వుంటాయనీ..ఉదయం 7 నుండి 11 గంటల వరకూ బడిబాట కార్యక్రమం కొనసాగుతుందని విద్యాశాఖ వెల్లడించింది. కాగా ఎండల తీవ్రత కారణంగా విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. 

20:40 - May 30, 2018

వేతన సవరణ చేపట్టాలంటూ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఎస్‌బీఐ తోపాటు ప్రభుత్వరంగ, కొన్ని ప్రైవేటు బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్‌ బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందిన సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఉద్యోగుల సమ్మెతో ఆన్‌లైన్‌ లావాదేవీలు మినహా ఎలాంటి సేవలు లభించవు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80వేల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నట్లు బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. బ్యాంకులతో పాటు ఏటీఎం సేవలు కూడా నిలిచిపోయాయి. సోమవారం కార్మిక విభాగం ప్రధాన కమిషనర్‌తో జరిగిన చర్చలు ఫలించక పోవడంతో బ్యాంకు ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక సమ్మెకు వెళ్లింది. బ్యాంకుల పట్ల కేంద్రప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, కేవలం 2 శాతం వేతన పెంపు ప్రకటించి ఉద్యోగులను అవమానించిందని యూనియన్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ జన్ రల్ సెక్రటరి వెంకట్రామయ్య గారి విశ్లేషణ ఏమిటో చూద్దాం..

మిషన్ కాకతీయపై హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్..

హైదరాబాద్: మిషన్ కాకతీయపై మంత్రి హరీశ్‌రావు సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో 31 జిల్లాల ఎస్‌ఈలు, ఈఈలు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మిషన్ కాకతీయ పనుల పురోగతిపై అధికారులతో ఆరాతీశారు. చెరువుల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.

ఏపీ రాష్ట్ర చిహ్నాలివే..

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చిహ్నాలు ఖరారయ్యాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేశారు. ఈ చిహ్నాలు వచ్చే నెల 6 నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి. రాష్ట్ర పక్షిగా -రామ చిలుక,రాష్ట్ర చెట్టుగా వేపచెట్టు,రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక,రాష్ట్ర పువ్వు- మల్లెపువ్వును ఏపీ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేశారు. 

19:17 - May 30, 2018

సిద్దిపేట జిల్లా ప్రజ్నాపూర్, కరీంనగర్ జిల్లా మానుకొండూరు ప్రాంతమేదైనా, కారణమేదైనా రహదారులు మాత్రం రక్తాన్ని చిందిస్తున్నాయి. ప్రజ్నాపూర్ లో 13 మంది మరణించగా..మానుకొండూరులో ఏడుగురు మృతి చెందారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలను నడపటం..రహదారుల రూల్స్ పాటించకపోవటం వంటి పలు కారణాలు రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఇటువంటి ఘటనల్లో అమాయకులు కూడా ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. దీనికి కారణాలేమిటి? కారకులు ఎవరు? బాధ్యులెవరు? రోడ్డుప్రమాదాలపై అవగాహనా సదస్సులు, రహదారుల భద్రతా వారోత్సవాలు వంటివి కేవలం ప్రచార్భాటాలేనా?..వంటి అంశాలపై చర్చ. ఈచర్చలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సెక్రటరీ వి.ఎస్.రావు, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నిపుణులు హనుమంతరావు, రవాణాశాకలో అడిషనల్ కమిషనర్ గా పనిచేసిన గాంధీ పాల్గొన్నారు. 

18:12 - May 30, 2018

తూర్పుగోదావరి : 2019 ఎన్నికల కోసం ప్రధాని మోదీ నుంచి జగన్‌ 1500 కోట్లు తెచుకొంటున్నారంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు... ప్రధాని మోదీపై శాపనార్థాలు మానుకొని, హోదా పోరాటాన్ని చేతల్లో చూపాలని ఉండవల్లి కోరారు. ప్రత్యేక హోదా ఎలా సాధిస్తారో.. సీఎం చంద్రబాబు.. ప్రతిపక్ష నేత జగన్‌ చెప్పాలని అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

18:04 - May 30, 2018

హైదరాబాద్ : కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలని టీపీసీసీ డిమాండ్‌ చేసింది. శాసనసభ్యులకు ఇచ్చే అన్ని సౌకర్యాలను వారికి కల్పించాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శికి వినతిపత్రం అందచేశారు. కోమటిరెడ్డి, సంపత్‌ శాసనసభ్వత్వాల పునరుద్ధరణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలంటున్న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు.

18:00 - May 30, 2018

ఇండోనేషియా : భారత్‌-ఇండోనేషియా దేశాల మధ్య 15 అంశాలపై ఒప్పందం కుదిరింది. రక్షణ, సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లో పరస్పర సహకారం, తదితర అంశాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విదోదోను కలుసుకున్న మోది- సముద్రమార్గం, టూరిజం, పెట్టుబడులు తదితర ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారి. అనంతరం ఇరుదేశాల నేతలు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇండోనేషియాలో ఉగ్రదాడిని ఖండించిన మోది- ఉగ్రవాదంపై పోరుకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యాపారాన్ని 2025 నాటికి ద్విగుణీకృతం చేయనున్నట్లు మోది పేర్కొన్నారు అంతకుముందు ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఇండోనేషియా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదికి మరడెకా ప్యాలెస్‌లో ఘనస్వాగతం లభించింది. ఇండోనేషియాలో స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు మోది శ్రద్ధాంజలి ఘటించారు. 

అనంత క్లాక్ టవర్ వద్ద ఉద్రిక్తత..

అనంతపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసేందుకు వైసీపీ ఎస్‌సీ సెల్‌ నాయకులు చేసిన ప్రయత్నం అనంతపురంలో ఉద్రిక్తతలకు దారితీసింది. విజయవాడలో జరిగిన టీడీపీ మహానాడులో వైసీపీ అధినేత జగన్‌పై... దివాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ క్లాక్‌ టవర్‌ వద్ద జేసీ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు వైసీపీ నాయకులు యత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకుకోవడంతో ఇరువర్గాలకు మధ్య వాగ్వాదం జరిగి అరెస్టులకు దారితీసింది. కాగా నిన్న మహానాడు వేదికపై నుండి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జగన్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

17:53 - May 30, 2018

అనంతపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసేందుకు వైసీపీ ఎస్‌సీ సెల్‌ నాయకులు చేసిన ప్రయత్నం అనంతపురంలో ఉద్రిక్తతలకు దారితీసింది. విజయవాడలో జరిగిన టీడీపీ మహానాడులో వైసీపీ అధినేత జగన్‌పై... దివాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ క్లాక్‌ టవర్‌ వద్ద జేసీ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు వైసీపీ నాయకులు యత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకుకోవడంతో ఇరువర్గాలకు మధ్య వాగ్వాదం జరిగి అరెస్టులకు దారితీసింది. కాగా నిన్న మహానాడు వేదికపై నుండి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జగన్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వైసీపీ భగ్గుమంది. జేసీ దివాకర్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసేందుకు వైసీపీ ఎస్‌సీ సెల్‌ నాయకులు చేసిన ప్రయత్నం అనంతపురంలో ఉద్రిక్తతలకు దారితీసింది. 

17:47 - May 30, 2018

రంగారెడ్డి : కన్న కుమార్తెను దారుణంగా చంపిన ఘటన మానవత్వానికి, మాతృత్వానికి మాయని మచ్చగా మిగిలిపోయింది. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే కడతేర్చిన దారుణ ఘటన యాచారం మండలం చింతుల్ల గ్రామంలో చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం తప్పిపోయిన ఉర్మిళ అనే ఏడేళ్ల బాలిక శవం ఇటుక బట్టిలో దొరికింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. కాగా చిన్నారి ఆచూకీ గురించి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి మొదట్లో వారు నిరాకరించటం..ఆపై ఫిర్యాదు చేయటంతో ఊర్తిళ తల్లిదండ్రులైన హేతురాం, ఛత్రియలపై పోలీసులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు విచారిండంతో చిన్నారిని చంపినట్లు తల్లి దండ్రులు హేతురాం, ఛత్రియ అంగీకరించారు.  ఈనెల 26వ తేదీన ఊర్మిళ మిస్సింగ్ కేసు నమోదయ్యింది. ఈ కేసును ఏసీపీ మల్లారెడ్డి లోతుగా విచారణ చేపట్టగా అసలు విషయం బైటపడింది. కన్న కుమార్తెను తల్లిదండ్రులే చంపినట్లుగా మల్లారెడ్డి విచారణలో వెల్లడయ్యింది. బీఎన్ సీ ఇటుకల బట్టీలో కూలీలుగా పనిచేస్తున్న హేతురాం, ఛత్రియలలకు ఊర్మిళతో పాటు మరో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. ఈ నేపథ్యంలో మానసిక, శారీరక వికలాంగురాలైన కుమార్తెను వదిలించుకునేందుకు కన్నవారే కాలయముడిలా మారి ఊర్మిళను హతమార్చారు. చెవిటి, మూగగా వుండే ఊర్మిళను తల్లిదండ్రులే చంపి ఇటుకల బట్టీలోని బూడిదలో పాతిపెట్టారు.

పోలీసులకు ఫిర్యాదు..
కన్న కుమార్తెను చంపి ఏమీ తెలియనట్లుగా తాము పనిలోకి వెళ్లి వచ్చేసరికి ఊర్మిళ అనే తమకుమార్తె కనిపించటంలేదనీ హేతురాం, ఛత్రియలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు  పనిచేసే ఇటుకల బట్టీలో పనిచేసే తోటి కూలీలను విచారించారు. ఊర్మిళ మానసిక, శారీరక వికలాంగురాలని తెలిపారు. దీంతో ఊర్మిళ తల్లిదండ్రుల్ని అనుమానించిన ఏసీపీ మల్లారెడ్డి తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని వారు అంగీకరించారు. దీంతో వారే ఊర్మిళను చంపినట్లుగా వెల్లడయ్యింది. 

మహిళా న్యాయవాది దారుణ హత్య..

గుంటూరు : మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు..నడిరోడ్డుపై ఓ మహిళా న్యాయవాదిని దారుణంగా హత్య చేసిన ఘటన మదనపల్లెలో తీవ్ర కలకలం సృష్టించింది. స్వంత పనుల నిమిత్తం మోటర్ సైకిల్ పై వెళ్తున్న నాగజ్యోతి అనే ప్రముఖ మహిళా న్యాయవాదిపై కొందరు దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. నాగజ్యోతి మెడపై కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో నాగజ్యోతి అక్కడిక్కడే మృతి చెందారు. 

17:16 - May 30, 2018

గుంటూరు : మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు..నడిరోడ్డుపై ఓ మహిళా న్యాయవాదిని దారుణంగా హత్య చేసిన ఘటన మదనపల్లెలో తీవ్ర కలకలం సృష్టించింది. స్వంత పనుల నిమిత్తం మోటర్ సైకిల్ పై వెళ్తున్న నాగజ్యోతి అనే ప్రముఖ మహిళా న్యాయవాదిపై కొందరు దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. నాగజ్యోతి మెడపై కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో నాగజ్యోతి అక్కడిక్కడే కుప్పకూలి మృతి చెందారు. ఈ ఘటన ఎస్బీఐ కాలనీలో జరిగింది. కాగా ప్రముఖ న్యాయవాది జితేంద్ర భార్య అయిన నాగజ్యోతి గత కొంతకాలంగా భర్తతో విభేదాలు తలెత్తటంతో విడిగా వుంటున్నారు. ఈ క్రమంలో పలు కేసులను కూడా నాగజ్యోతి వాదించేవారు. ఈ నేపథ్యంలో పనుల నిమిత్తం బైటకు వెళ్లి వస్తున్న నాగజ్యోతిపై ఈ దాడి జరగటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోపక్క నాగజ్యోతి వాదించిన కేసుల ప్రత్యర్ధులు ఈ దాడికి పాల్పడ్డారా? లేక కుటుంబ కలహాల వల్ల ఈ దాడి జరిగిందా? అనే కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆ పరిసరాల్లో వున్న సీసీ కెమెరాల అధారంగా వివరాలను పోలీసులు సేకరించనున్నారు. కాగా ఇప్పటికే రెండు పోలీస్ టీమ్ లు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. 

16:58 - May 30, 2018

అఘోరా సినిమా ప్రేక్షకులకు భయపెట్టనుందా? శ్రీమతి దుర్గావతి సమర్పణలో వచ్చిన అఘోర సినిమాకు రావు దుర్గా దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా కండ్రేగుల ఆదినారాయణ రాజు, హీరోగా యువరాజ్, ఇంకా నాగబాబు, పొన్నాంబళం వంటి సీనియర్ నటులు నటించిన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలో అఘోరా సినిమా టీమ్ తో 10టీవీ స్పెషల్ షో..

ఏసీబీ వలలో సీఐ,హెడ్ కానిస్టేబుల్..

కర్నూలు : తాలుకా పీఎస్ పై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఈ దాడిలో రూ.20వేలు లంచం తీసుకుంటు సీఐ ఇస్మాయిల్, హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.  

పెట్రోల్, డీజిల్ ఒక్క పైసాపై రాహుల్ వ్యాఖ్యలు..

ఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్ ధరలు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయంటూ దేశ వ్యాప్తంగా వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తోన్న వేళ.. మరోవైపు వాటి ధరను ఒక్క పైసా చొప్పున తగ్గిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో ఒక్క పైసా తగ్గిస్తే లాభం ఏంటంటూ మరిన్ని విమర్శలు వస్తున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ విషయంపై స్పందిస్తూ.. డియర్‌ మోదీ అంటూ ఓ ట్వీట్ చేసి ప్రధానిపై విమర్శలు గుప్పించారు. 'ఈరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఒక్క పైసా తగ్గించారు.

ఎవ్వరికోసం చూడొద్దు..ఆయుధంతో దాడి చేయండి..

విజయవాడ : ఆత్మ, ప్రాణ, మాన రక్షణ కోసం మహిళలు పోలీసులు వచ్చే వరకు ఎదురు చూడకుండా తనను తాను రక్షించుకోవడం కోసం.. లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తిపై ఎదురుదాడి చేయాలని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అమ్మాయిలకు, మహిళలకు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఆయుధం తీసుకుని తిరగబడాల్సిందేనని నన్నపనేని అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను నన్నపనేని వివరించారు.

16:26 - May 30, 2018

విజయవాడ : వేతన సవరణ చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడలో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. కేవలం రెండు శాతం వేతన సవరణ చేయడం తమను అవమానించినట్లే అని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నప్పటికీ ప్రభుత్వం తమను పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. కేంద్రం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు ఉద్యోగులు. తన సవరణ చేపట్టాలంటూ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఎస్‌బీఐ తోపాటు ప్రభుత్వరంగ, కొన్ని ప్రైవేటు బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్‌ బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందిన సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఉద్యోగుల సమ్మెతో ఆన్‌లైన్‌ లావాదేవీలు మినహా ఎలాంటి సేవలు లభించవు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80వేల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నట్లు బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. బ్యాంకులతో పాటు ఏటీఎం సేవలు కూడా నిలిచిపోయాయి. 

16:24 - May 30, 2018

నల్లగొండ : న్యాయ బద్ధంగా వేతన సవరణ చేయాలంటూ దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన రెండు రోజుల సమ్మె కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభుత్వరంగ బ్యాంకు సిబ్బంది సమ్మె చేస్తున్నారు. మొత్తం 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన సుమారు 10 వేల మంది సిబ్బంది సమ్మె చేయడంతో బ్యాంకు సేవలు నిలిచిపోయాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మెను బ్యాంక్ ఉద్యోగులు కొనసాగిస్తున్నారు. 

16:23 - May 30, 2018

మహబూబ్‌నగర్‌ : వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు సమ్మెకు దిగారు. దేశవ్యాప్తంగా మొత్తం 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. తమ వేతనాలు పెంచేంత వరకూ దశలవారీగా పోరాటం కొనసాగుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. మహబుబ్ నగర్ జిల్లా కేంద్రంలో బ్యాంక్ ఉద్యోగుల సమ్మెను బ్యాంక్ ఉద్యోగులు కొనసాగిస్తున్నారు.

16:21 - May 30, 2018

విజయనగరం : వేతన సవరణ చేయాంటూ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. పట్టణంలో ర్యాలీ చేస్తూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తూ మెరుగైన సేవలందించినా కేంద్రం గుర్తించడంలేదని ఉద్యోగులు వాపోతున్నారు. నిత్యం వినియోగదారులకు సేవలందిస్తున్న తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతున్నారు. 

16:20 - May 30, 2018

సూర్యాపేట : మేళ్లచెర్వు తహశీల్దారు కార్యాలయానికి మహిళ రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. రైతుబంధు పథకంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.... పట్టాదారు పాసు పుస్తకాలు, చెక్కులపంపిణీలో జాప్యం చేస్తున్నారని మహిళ రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. 

16:18 - May 30, 2018

తమిళనాడు : రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే కాల్పుల ఘటన జరిగిందని రజనీకాంత్ విమర్శించారు. తమిళనాడు తూత్తుకుడిలో జరిగిన కాల్పుల ఘటనపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్పందించారు. ప్రభుత్వ అసవర్థత వల్లే కాల్పుల ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వసుప్రతిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి మృతుల కుటుంబాలను ఓదార్చారు.  

16:17 - May 30, 2018

సంగారెడ్డి : సంగారెడ్డికి వెంటనే ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ మంజూరు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నెలలోనే మెడికల్‌ కాలేజీ ఇస్తుందని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. సంగారెడ్డిలో ప్రభుత్వం మెడికల్‌ కాలేజీ కోసం మూడు రోజులుగా దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. 

16:04 - May 30, 2018

ఖమ్మం : బ్యాంకుల్లోనే సామాన్యుల డబ్బులకు రక్షణ లేకుండా పోతోంది. కష్టపడి సంపాదించుకున్న డబ్బులు బ్యాంకులో దాచుకుంటే.. వాటినే లూటీ చేస్తున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడన్న చందంగా... బ్యాంకు సిబ్బంది... మరో వ్యక్తి కలిసి నిరుపేద మహిళ దాచుకున్న డబ్బులు కాజేశారు. కూతుళ్ల పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బు మాయమవడంతో బాధితురాలు లబోదిబో మంటోంది. ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలోని ఎస్‌బీఐలో డబ్బుల అదృశ్యంపై కథనం...

బ్యాంకుల్లో పేదవారి డబ్బుకు లేని రక్షణ
బ్యాంకుల్లోనే పేదవారి డబ్బుకు రక్షణ లేకుండా పోతోంది. పైసాపైసా కూడబెట్టి దాచుకున్న డబ్బును మాయం చేస్తున్నారు అక్రమార్కులు. ఇక్కడ కనిపిస్తున్న వీరీ అఫ్జల్‌ పాషా, షాహీన్‌బేగం. వీరిది నిరుపేద కుటుంబం. వీరికి నలుగురు ఆడపిల్లలు. చిన్న వ్యాపారంతో రూపాయి రూపాయి కూడబెట్టారు. కష్టపడి సంపాదించిన డబ్బు భద్రంగా ఉండాలంటే బ్యాంకులో వేయాలనుకున్నారు. దీంతో ఖమ్మం జిల్లా అశ్వరావుపేట బీసీఎం రోడ్డులోని స్టేట్‌ బ్యాంక్‌లో షాహీన్‌బేగం పేరుతో అకౌంట్‌ ఓపెన్‌ చేశారు. లక్షన్నర రూపాయలకు పైగా అందులో జమ చేశారు.

రూ. 80వేల వరకు డ్రా చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. కూతురికి పెళ్లి కుదరడంతో డబ్బుకోసం షాహీన్‌బేగం బ్యాంకు వెళ్లింది. తన ఖాతాలోని నగదు డ్రా చేసి ఇవ్వాలని కోరింది. కానీ ఆమె అకౌంట్‌లో దాచుకున్న నగదు మాయమైంది. పైసాపైసా కూడబెట్టి దాచుకున్న డబ్బును ఎవరో కాజేశారు. దాదాపు తన ఖాతా నుంచి 80వేల వరకు డ్రా చేశారు. దీంతో ఆమె బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేయగా... ఏటీఎం అప్లికేషన్‌ను కూడా తీసుకోవాలని బ్యాంక్‌ సిబ్బంది చెబుతున్నారని వాపోయింది. చివరికి తన ఖాతాలోని డబ్బును ఏటీఎం ద్వారా డ్రా చేసినట్టు తేలింది. అసలు తాను ఏటీఎం తీసుకోలేదని.... తన ఖాతాలోని డబ్బును ఏటీఎంతో ఎలా డ్రా చేస్తారని బాధితురాలు వాపోయింది. అకౌంట్‌లోని డబ్బుల మాయంపై బ్యాంక్‌ మేనేజర్‌ను బాధితురాలు నిలదీసింది. దీంతో బ్యాంక్‌ మేనేజర్‌ పోలీస్‌ స్టేషన్‌ను వెళ్లవద్దని.... తగిన న్యాయం చేస్తానని చెప్పినట్టు బాధితురాలు చెబుతోంది.

ఖాతాదారుకి తెలియకుండా ఏటీఎం తీసుకున్న
నగదు మాయం వెనుకు నయీమ్‌ అనే యువకుడి హస్తం ఉన్నట్టు తెలస్తోంది. అతడే ఏటీఎం తీసుకుని డబ్బులు డ్రా చేసినట్టు తెలుస్తోంది. దీనికి బ్యాంక్‌ సిబ్బంది అండదండలు ఇచ్చినట్టు సమాచారం. ఖాతాదారుకే ఇవ్వాల్సిన ఏటీఎంను సంబంధంలేని వ్యక్తికి ఇచ్చి... అక్రమాలకు బ్యాంక్‌ సిబ్బందే ప్రోత్సహించారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. లేకుండా న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తామని చెబుతున్నారు.

డైలీ సీరియల్స్ పై నన్నపనేని సంచలన వ్యాఖ్యలు..

విజయవాడ: ఏపీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. డైలీ సీరియల్ ప్రభావంతో మహిళల్లో క్రూరత్వం పెరిగిపోతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే పురుష కమిషన్ ఏర్పాటు చేయాల్సి వస్తుందోమేనని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలపై జరుగుతున్నదాడులు, డైలీ సీరియల్ ప్రభావంపై స్పందించిన ఆమె మాట్లాడుతూ ఇలాంటి వాటిపై సమాజం పట్టించుకోవాలని, చట్టాలు గట్టిగా ఉండాలని ఆకాంక్షించారు. ఇరుగు పొరుగువారు కూడా ఏం జరుగుతుందో గమనించాలని అన్నారు. 

బోర్డు తిప్పేసిన మరో ఐటీ కంపెనీ..

హైదరాబాద్: నిరుద్యోగుల జీవితాలలో పలు కంపెనీలు ఆటలాడుకుంటున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేయటం అనంతరం మోసం చేయటం పరిపాటిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీ నిరుద్యోగులకు శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పిస్తామని రూ. లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు మాదాపూర్‌ పోలీసులను ఆశ్రయించారు. మాదాపూర్‌లో పోర్డ్‌ల్యాబ్‌ ఇంటర్నేషనల్‌ సర్వీసెస్‌ పేరిట సతీష్‌ అనే వ్యక్తి గత డిసెంబర్‌లో ఐటీ కంపెనీ ప్రారంభించాడు. నిరుద్యోగులకు శిక్షణతో పాటు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒకోక్కరి వద్ద నుంచి సుమారు రూ.1 లక్ష నుంచి రూ.

మ్యాన్ హోల్ లో దిగి ఇద్దరు మృతి..

హైదరాబాద్‌ : ఉప్పల్ ప్రాంతంలో వున్న క్రికెట్ స్టేడియం వద్ద విషాదం చోటుచేసుకుంది. మ్యాన్ హోల్లోకి దిగిన ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. ఎల్ అండ్ టీ కంపెనీ జలమండలి వాటర్ పైప్ లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా మ్యాన్ హోల్ లో పనులు చేసేందుకు దిగిన కొద్ది సేపటికే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. 

14:51 - May 30, 2018

హైదరాబాద్‌ : ఉప్పల్ ప్రాంతంలో వున్న క్రికెట్ స్టేడియం వద్ద విషాదం చోటుచేసుకుంది. మ్యాన్ హోల్లోకి దిగిన ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. ఎల్ అండ్ టీ కంపెనీ జలమండలి వాటర్ పైప్ లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా మ్యాన్ హోల్ లో పనులు చేసేందుకు దిగిన కొద్ది సేపటికే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులు ఒడిశాకు చెందిన సంతోష్ 28 సంవత్సరాల యువకుడు, విజయ్ అనే 25 సంవత్సరాల యువకుడు మృతి చెందారు. కాగా మ్యాన్ హోల్స్ లో వివిధ రకాల విషవాయువుల ప్రభావంతోనే వారు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కాగా మ్యాన్ హోల్స్ నుంచి కార్మికుల ప్రాణాలు కాపాడేందుకు దేశంలోనే తొలిసారిగా జెట్టింగ్ మెషీన్లను టీ సర్కార్ తెరపైకి తీసుకువచ్చింది. అయినా దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎల్ అండ్ టీ కంపెనీ నిర్వహిస్తున్న ఈ పనులలో ఇద్దరు కార్మికులు మృతి చెందటం ఆ కంపెనీ నిర్లక్ష్యంగా భావించవచ్చు. మ్యాన్ హోల్స్, డ్రైనేజీల శుభ్రంపై వాటర్ బోర్డు అవలంబిస్తున్న విధానాలను మార్చాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ జలమండలి అధికారులను ఆదేశించిన విషయంగా గమనార్హం.

కిడ్నీ వ్యాధుల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశం

కృష్ణా : జిల్లాలో కిడ్నీవ్యాధుల పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.  ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రిమూడు జిల్లాల్లో కిడ్నీ వ్యాధుల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్న ఆదేశించారు.  కృష్ణాజిల్లా ఎ.కొండూరు మండలం లోని 19 గ్రామాల్లో పరిస్థితిపై అధికారులతో సమీక్ష జరిపారు. నూజివీడు ఏరియా ఆస్పత్రిలో తక్షణమే డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని  ఆదేశంచారు. దాంతోపాటు  కిడ్నీ వ్యాధి పీడితులకు ఉచితంగా మందులు, ప్రతినెలా  పింఛన్లు ఇవ్వాలని అధికారులకు సూచించారు.  

13:58 - May 30, 2018

కృష్ణా : జిల్లాలో కిడ్నీవ్యాధుల పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.  ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రిమూడు జిల్లాల్లో కిడ్నీ వ్యాధుల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్న ఆదేశించారు.  కృష్ణాజిల్లా ఎ.కొండూరు మండలం లోని 19 గ్రామాల్లో పరిస్థితిపై అధికారులతో సమీక్ష జరిపారు. నూజివీడు ఏరియా ఆస్పత్రిలో తక్షణమే డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని  ఆదేశంచారు. దాంతోపాటు  కిడ్నీ వ్యాధి పీడితులకు ఉచితంగా మందులు, ప్రతినెలా  పింఛన్లు ఇవ్వాలని అధికారులకు సూచించారు.  

 

13:57 - May 30, 2018

గుంటూరు : నగర మున్సిపాలిటీ బిల్ కలెక్టర్ ముద్రబోయిన మాధవ్  ఇళ్లపై ఏసీబీ దాడులు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో  ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మాధవ్ కు సంబంధించిన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏకాలంలో 9 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో జీ ప్లస్ 2 భవనాలు రెండు , 20 ఇళ్ల స్థలాలు, 7లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

13:54 - May 30, 2018

హైదరాబాద్ : వేతన సవరణ చేపట్టాలంటూ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఎస్‌బీఐ తోపాటు  ప్రభుత్వరంగ, కొన్ని ప్రైవేటు బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్‌ బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందిన సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఉద్యోగుల సమ్మెతో ఆన్‌లైన్‌ లావాదేవీలు మినహా ఎలాంటి సేవలు లభించవు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80వేల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నట్లు బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. బ్యాంకులతో పాటు ఏటీఎం సేవలు కూడా  నిలిచిపోయాయి. సోమవారం కార్మిక విభాగం ప్రధాన కమిషనర్‌తో జరిగిన చర్చలు ఫలించక పోవడంతో బ్యాంకు ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక సమ్మెకు వెళ్లింది.  బ్యాంకుల పట్ల కేంద్రప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, కేవలం 2 శాతం వేతన పెంపు ప్రకటించి ఉద్యోగులను అవమానించిందని యూనియన్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఆందోళన చేస్తున్న బ్యాంకు ఉద్యోగులకు ప్నొ.నాగేశ్వర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల సమస్యలు  పరిష్కరించాలన్నారు.
విశాఖలో 
 దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మెలో భాగంగా  జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నారు.
కరీంనగర్ లో 
వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్ధిక లావాదేవీలు నిలిచి పోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు ఎటిఎమ్‌లలో డబ్బులు లేక పోవడంతో ప్రజలకు నగదు కష్టాలు తప్పడం లేదు. 

13:35 - May 30, 2018

సంగారెడ్డి : కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీక్ష మూడో రోజుకు చేరుకుంది. సంగారెడ్డిలో మొన్న జగ్గారెడ్డి దీక్షకు దిగారు. జిల్లా కేంద్రంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

13:28 - May 30, 2018

ఢిల్లీ : వేతన సవరణ వివక్షపై బ్యాంకు ఎంప్లాయిస్‌ కదం తొక్కారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో 25 శాతం వరకు వేతనసవరణ ఉంటుంటే.. తమకు మాత్రం 2శాతం ఇస్తామనడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరస ఢిల్లీలో భారీస్థాయిలో ఆందోళకు దిగారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ఆల్‌ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ ఎస్‌ఎస్‌ సిసోడియా హెచ్చరించారు. 

 

13:03 - May 30, 2018

హైదరాబాద్ : వేతన సవరణ చేపట్టాలంటూ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఎస్‌బీఐ తోపాటు  ప్రభుత్వరంగ, కొన్ని ప్రైవేటు బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్‌ బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందిన సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఉద్యోగుల సమ్మెతో ఆన్‌లైన్‌ లావాదేవీలు మినహా ఎలాంటి సేవలు లభించవు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80వేల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నట్లు బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. బ్యాంకులతో పాటు ఏటీఎం సేవలు కూడా  నిలిచిపోయాయి. సోమవారం కార్మిక విభాగం ప్రధాన కమిషనర్‌తో జరిగిన చర్చలు ఫలించక పోవడంతో బ్యాంకు ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక సమ్మెకు వెళ్లింది.  బ్యాంకుల పట్ల కేంద్రప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, కేవలం 2 శాతం వేతన పెంపు ప్రకటించి ఉద్యోగులను అవమానించిందని యూనియన్‌ నాయకులు  ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా హైదరాబాద్‌లో బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

12:54 - May 30, 2018

కృష్ణా : ఏ.కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధులతో జనం పిట్టల్లా రాలుతున్నారు. మండలంలోని 19 గ్రామాల్లో 600కి పైగా కిడ్నీ బాధితులు ఉన్నారు. సంవత్సరాల తరబడి మంచం మీదే నలిగి పోతున్నారు. వారిలో ఒకరైన కిడ్నీ బాధితుడు బానోతు నాగేశ్వరరావు మృతి చెందాడు. ఇటీవలే అతన్ని 10 టీవీ పలకరించగా.. తనకు బతకాలని ఉందని .. తనకు పాలకులు ఎవరూ సాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టెన్‌ టీవీ వెలుగులోకి తెచ్చినా.. పాలకులు పట్టించుకోకపోవడంతోనే నాగేశ్వరరావు మృతిచెందాడని బాధితుడి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. 
కిడ్నీ బాధితుడు నాగేశ్వరరావు మృతి
కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలం దీపంనగర్లో  కిడ్నీ బాధితులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి పిట్టల్లా రాలిపోతున్నారు. కనీసం ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకొనే స్తోమత లేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. రెండు కిడ్నీలు పాడై తీవ్ర అనారోగ్యానికి గురైన బానోతు నాగేశ్వరరావు మృతి చెందారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బానోతు నాగేశ్వరరావును ఇటీవలే 10 టీవీ పలకరించింది. చివరి సారిగా ఆయన టెన్‌ టీవీతో మాట్లాడుతూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాగేశ్వరరావు టెన్‌ టీవీతో మాట్లాడిన చివరి మాటలు హృదయాన్ని కలచి వేశాయి.                            
డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయాలి : బాధిత కుటుంబాలు
ప్రభుత్వం స్పందించకపోవడంతోనే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బానవతు నాగేశ్వరరావు  మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ప్రాంతంలో కిడ్నీ సమస్య గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం  చేశారు. కిడ్నీ బాధితులకు డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని బాధిత కుటుంబాలు డిమాండ్‌ చేశారు                                  
బానోతు నాగేశ్వరరావు కుంటుంబానికి బాబురావు పరామర్శ
బానోతు నాగేశ్వరరావు కుంటుంబాన్ని సీపీఎం రాష్ట్ర నాయకుడు బాబురావు పరామర్శించారు. తండాలో రాలిపోతున్న కిడ్నీ బాధితులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే కిడ్నీ బాధితులు మృత్యవాత పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం కిడ్నీ బాధితులకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పార్టీ సభలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
గిరిజన తండాలో జిల్లా కలెక్టర్‌ పర్యటన 
బానోతు నాగేశ్వరరావు మృతి విషయాన్ని తెలుసుకున్న కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఏ.కొండూరు మండల పరిధిలోని గిరిజన తండాలో పర్యటించారు. కిడ్నీ బాధితుల ఆహార అలవాట్లను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా మృతి చెందినప్పుడు మాత్రమే అధికారులు కంటితుడుపు చర్యలా గ్రామాల్లోకి వస్తున్నారని కిడ్నీ బాధితులు వాపోతున్నారు. కిడ్నీ బాధితుల ఆరోగ్యానికి శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. 

 

12:00 - May 30, 2018

ఢిల్లీ : ఉత్తరాధి రాష్ట్రాల్లో పిడుగుల బీభత్సం సృష్టించాయి. 60 మందికి పైగా మృతి చెందారు. ఐదు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. యూపీ, బీహార్ లపై ఆధిక ప్రభావం ఉంది. ఇటు దక్షిణాదిలో కర్నాటకను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. మంగళూరు, ఉడిపి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు.

11:58 - May 30, 2018

ఢిల్లీ : దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. వేతన సవరణ కోరుతూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. రెండు రోజులపాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇవాళ, రేపు బ్యాంకులు, ఏటీఎం సేవలు బంద్ కానున్నాయి. ఆన్ లైన్ సేవలు మినహా అన్ని సేవలు బంద్ అవ్వనున్నాయి. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు ఎంప్లాయిస్ సమ్మెకు దిగాయి. 2శాతం వేతన పెంపు ప్రకటించి కేంద్రం అవమానించిందని బ్యాంకు ఉద్యోగ సంఘాలు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

11:55 - May 30, 2018

హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యుల వివాదం ముదిరింది. వైద్యులు రెండువర్గాలుగా చీలారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మధ్య వివాదం నెలకొంది. వయోపరిమితి పెంపుపై వివాదం రగిలింది. విధుల బహిష్కరణకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు  సిద్ధమయ్యారు. డీఎంఈతో చర్చలు జరుపుతున్నారు. మంత్రి లక్ష్మారెడ్డితో చర్చలకు వెళ్లనున్నారు. 

 

ఎయిర్ సెల్...మ్యాక్సిస్ కేసులో చిదంబరానికి తాత్కాలిక ఊరట

ఢిల్లీ : ఎయిర్ సెల్...మ్యాక్సిస్ కేసులో చిదంబరానికి తాత్కాలిక ఊరట లభించింది. పాటియాల హౌస్ కోర్టు ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. వచ్చేనెల 5 వరకు చిదంబరాన్ని అరెస్టు చేయవద్దని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

రెండువర్గాలుగా చీలిన గాంధీ ఆస్పత్రి వైద్యులు

హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యుల వివాదం ముదిరింది. వైద్యులు రెండువర్గాలుగా చీలారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మధ్య వివాదం నెలకొంది. వయోపరిమితి పెంపుపై వివాదం రగిలింది. విధుల బహిష్కరణకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు  సిద్ధమయ్యారు.

 

10:50 - May 30, 2018

హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యుల వివాదం ముదిరింది. వైద్యులు రెండువర్గాలుగా చీలారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మధ్య వివాదం నెలకొంది. వయోపరిమితి పెంపుపై వివాదం రగిలింది. విధుల బహిష్కరణకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు  సిద్ధమయ్యారు.

10:48 - May 30, 2018

నిజామాబాద్ : జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు దారుణ హత్య గావించబడ్డారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అత్తిలి రమేష్, కోశాధికారి ముద్దం రాములు దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

 

10:46 - May 30, 2018

ఢిల్లీ : దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. వేతన సవరణ కోరుతూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. రెండు రోజులపాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇవాళ, రేపు బ్యాంకులు, ఏటీఎం సేవలు బంద్ కానున్నాయి. ఆన్ లైన్ సేవలు మినహా అన్ని సేవలు బంద్ అవ్వనున్నాయి. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు ఎంప్లాయిస్ సమ్మెకు దిగాయి. 2శాతం వేతన పెంపు ప్రకటించి కేంద్రం అవమానించిందని బ్యాంకు ఉద్యోగ సంఘాలు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ ఇంట్లో సీబీఐ సోదాలు

ఢిల్లీ : ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రజాపనుల విభాగంలో కన్సల్టెంట్ల నియామకంలో నిబంధనలు ఉల్లంఘించారని సత్యేంద్రజైన్ పై ఆరోపణ ఉంది. 

 

10:05 - May 30, 2018

నిజామాబాద్ : జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు దారుణ హత్య గావించబడ్డారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అత్తిలి రమేష్, కోశాధికారి ముద్దం రాములు దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

 

09:41 - May 30, 2018

ఢిల్లీ : దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. వేతన సవరణ కోరుతూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. రెండు రోజులపాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇవాళ, రేపు బ్యాంకులు, ఏటీఎం సేవలు బంద్ కానున్నాయి. ఆన్ లైన్ సేవలు మినహా అన్ని సేవలు బంద్ అవ్వనున్నాయి. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు ఎంప్లాయిస్ సమ్మెకు దిగాయి. 2శాతం వేతన పెంపు ప్రకటించి కేంద్రం అవమానించిందని బ్యాంకు ఉద్యోగ సంఘాలు అంటున్నారు. 

 

09:40 - May 30, 2018

నెల్లూరు : కమ్యూనిస్టు ఉద్యమ నేత జక్కా వెంకయ్య కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వెంకయ్య మృతితో నెల్లూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన భౌతికకాయాన్ని కమ్యూనిస్టు నేతలు, కార్యకర్తలు సందర్శించి నివాళులు అర్పించారు. నేడు ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.
1930 నవంబర్‌ 3న జన్మించిన జక్కా వెంకయ్య
కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, సీపీఎం సీనియర్‌ నాయకులు జక్కా వెంకయ్య కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన నెల్లూరు జిల్లా సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన కేంద్రబిందువుగా నిలిచారు. 1930 నవంబర్‌ 3న బుచ్చిరెడ్డి పాలెం మండలం, దామరమడుగు గ్రామంలో జక్కా వెంకయ్య జన్మించారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన జక్కా వెంకయ్య.... పీడిత ప్రజల అభ్యున్నతికై ఎంతగానో పాటు పడ్డారు. 
1951లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన జక్కా
చిన్నప్పటి నుండే కమ్యూనిస్టు భావజాలాలు కలిగిన జక్కా వెంకయ్య....1951లో భూమి కోసం, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో డా.జెట్టి శేషారెడ్డి ప్రోత్సాహంతో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1956 కమ్యూనిస్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికై అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర, కేంద్ర కమిటీ సభ్యులుగా పనిచేశారు. 1957లో దామరమడుగు గ్రామ పంచాయితీ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.  అలాగే 1994లో అల్లూరు నియోజకవర్గం నుండి వెంకయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. గతితార్కిక చారిత్రక భౌతిక వాదం, రాజకీయ అర్థశాస్త్రం వంటి పుస్తకాలను ఆయన రాశారు.
నెల్లూరు జిల్లాలో విషాదఛాయలు 
ఉద్యమ నేత వెంకయ్య మృతితో నెల్లూరు జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. వెంకయ్య మృతి వార్త తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన భౌతిక కాయానికి వివాళులు అర్పించారు. 
హైదరాబాద్ ఎస్వీకేలో సంతాప సభ 
జక్కా రామయ్య మృతికి నివాళిగా.. హైదరాబాద్ ఎస్వీకేలో ఆయన సంతాప సభను ఏర్పాటు చేశారు. వెంకయ్య చిత్రపటానికి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, పార్టీ నేతలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. జక్కా వెంకయ్య మృతి పార్టీకి తీరని లోటన్నారు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన చివరి వరకు పని చేశారని గుర్తు చేసుకున్నారు. బుధవారం ఉదయం జక్కా వెంకయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో సీపీఎం కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. 

09:28 - May 30, 2018

తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడిందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి, ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుందర్ రామశర్మ, టీడీపీ నేత లాల్ వజీర్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కామారెడ్డి జిల్లాలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్య

కామారెడ్డి : బిక్కనూరు మండలం జంగంపల్లిలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. మృతులు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రమేశ్, కోశాధికారి రాములు.

గాంధీ ఆస్పత్రి, డాక్టర్స్ అసోసియేషన్ యూనిట్ ప్రెసిడెంట్ ఇంటి వద్ద పోలీసులు మోహరింపు

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రి డాక్టర్స్ అసోసియేషన్ యూనిట్ ప్రెసిడెంట్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. డాక్టర్ల పదవీ విరమణ వయోపరిమితి పెంపును వ్యతిరేకిస్తూ చలో రాజ్ భవన్ కు గాంధీ ఆస్పత్రి వైద్యులు పిలుపునిచ్చారు. నేటి నుంచి 5 రోజుల పాటు వైద్యులు రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ దీక్ష చేపడతామని వైద్యులు హెచ్చరించారు. 

కొనసాగుతున్న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

ఢిల్లీ : దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. వేతన సవరణ కోరుతూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. రెండు రోజులపాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇవాళ, రేపు బ్యాంకులు, ఏటీఎం సేవలు బంద్ కానున్నాయి. ఆన్ లైన్ సేవలు మినహా అన్ని సేవలు బంద్ అవ్వనున్నాయి. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. 

09:09 - May 30, 2018

నెల్లూరు : కమ్యూనిస్టు ఉద్యమనేత, సీపీఎం సీనియర్ నాయకులు నిన్న కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జక్కా చికిత్స పొందుతూ మృతి చెందారు. జిల్లాలో ఇవాళ జక్కా వెంకయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా జక్కాతో ఉన్న అనుబంధాన్ని వామపక్షాలు నేతలు గుర్తు చేసుకున్నారు. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ 1967 జనవరిలో జక్కా వెంకయ్యతో తనకు పరిచయం ఏర్పడిందన్నారు. అంతకముందు నెల్లూరు పట్టణంలో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమంలో, స్టీలో ప్లాంట్ ఆందోళనలో జక్కాను తాను చూశానని తెలిపారు. పెద్ద భూస్వామ్య కుటుంబంలో పుట్టిన జక్కా.. నిరాడంబర జీవితం గడిపారని తెలిపారు. ఆస్తులు అమ్మి ప్రజా ఉద్యమాలకు వెచ్చించిన మహానుభావుడు జక్కా వెంకయ్య అని కొనియాడారు. స్వంత మానుకుని ప్రజలకు తన జీవితాన్ని ధార పోశారని తెలిపారు. ఆయన కొన్ని మంచి సంప్రదాయాలను జిల్లాలో ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం వారికి రుణపడి ఉందన్నారు. ఇప్పుడున్న నాయకత్వం ఆయన ఆశయాలు, సంప్రాయాదాలను అమలు చేసి ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కృష్టి చేస్తారని నమ్ముతున్నానని తెలిపారు. జక్కా వెంకయ్య విప్లవ సంప్రదాయాల అడుగుజాడల్లో నడుస్తామని శపథం చేస్తున్నట్లు ప్రకటించారు. అంతిమయాత్రలో పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులందరూ పాల్గొంటారని తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బృందాకరత్ లు జక్కా వెంకయ్యకు సంతాపం తెలుపుతూ సందేశాలు పంపారని తెలిపారు. 

 

08:51 - May 30, 2018

ఢిల్లీ : దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. వేతన సవరణ కోరుతూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. రెండు రోజులపాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇవాళ, రేపు బ్యాంకులు, ఏటీఎం సేవలు బంద్ కానున్నాయి. ఆన్ లైన్ సేవలు మినహా అన్ని సేవలు బంద్ అవ్వనున్నాయి. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు ఎంప్లాయిస్ సమ్మెకు దిగాయి. 2శాతం వేతన పెంపు ప్రకటించి కేంద్రం అవమానించిందని బ్యాంకు ఉద్యోగ సంఘాలు అంటున్నారు. 

నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన

ఢిల్లీ : నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన చేయనున్నారు. ఇండోనేషియా, సింగపూర్ లో మూడురోజుల పాటు పర్యటించనున్నారు.

 

నేటి నుంచి విజయనగరం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

విజయనగరం : నేటి నుంచి రెండు రోజులపాటు పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. బొబ్బిలిలో పార్టీ కీలక నేతలు, కార్యకర్తలతో అంతర్గత సమావేశం కానున్నారు.

 

రెండు రోజులపాటు బ్యాంకు ఉద్యోగులు సమ్మె

ఢిల్లీ : దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. వేతన సవరణ కోరుతూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. రెండు రోజులపాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇవాళ, రేపు బ్యాంకులు, ఏటీఎం సేవలు బంద్ కానున్నాయి. ఆన్ లైన్ సేవలు మినహా అన్ని సేవలు బంద్ అవ్వనున్నాయి. 

07:49 - May 30, 2018

నిన్నటివరకు ఉద్దానం కిడ్నీ సమస్య గురించి విన్నాం. కానీ ఈ సమస్య ఆ ఒక్క చోటే కాదు... రాజధానికి కూతవేటు దూరంలో కృష్ణాజిల్లా ఎ-కొండూరు మండలంలోని గ్రామాల్లో కూడా ఇదే సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. వాటర్‌ ప్రాబ్లమ్‌ వల్ల ఈ సమస్య తీవ్రంగా పెరుగుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. ఈ సమస్యతో చనిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ తమను ఆదుకునే విషయంలో గానీ... తమ సమస్య పరిష్కరించే విషయంలో గానీ కనీసం గోడును వినే విషయంలో గానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై సీపీఎం కృష్ణా జిల్లా నాయకులు డి.వి.కృష్ణ మాట్లాడారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

07:47 - May 30, 2018

ఢిల్లీ : సిబిఎస్‌ఈ పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. ఈ సంవత్సరం 86.7 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. నలుగురు విద్యార్థులు టాప్‌ ర్యాంకర్లుగా నిలిచారు. గురుగావ్‌కు చెందిన డిపిఎస్‌ విద్యార్థి ప్రఖర్‌ మిత్తల్...బిజ్నోర్‌ ఆర్‌ కె పబ్లిక్‌ స్కూలు విద్యార్థి రిమ్‌జిమ్‌ అగర్వాల్... షామ్లి స్కాటిష్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థి నందిని గార్గ్‌... కొచ్చిన్‌ భవన్‌ విద్యాలయానికి చెందిన జి.శ్రీలక్ష్మి టాపర్లుగా నిలిచారు. వీరు మొత్తం 500 మార్కులకు గాను 499 మార్కులు సాధించారు. అబ్బాయిల కన్నా అమ్మాయిలదే ఉత్తీర్ణతా శాతం అధికంగా ఉంది. 88.67 శాతం అమ్మాయిలు, 85.32 శాతం అబ్బాయిలు పాసయ్యారు. 99.60 శాతం ఉత్తీర్ణతతో తిరువనంతపురం టాప్‌గా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నయ్‌ 97.37 శాతం అజ్మేర్ 91.86 శాతంతో నిలిచాయి. మొత్త 16 లక్షల 38 వేల 428 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాశారు.

 

07:46 - May 30, 2018

లక్నో : ఉత్తరప్రదేశ్‌ సీనియర్‌ పోలీస్‌ అధికారి రాజేష్‌ సాహ్ని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. సెలవుల్లో ఉన్న రాజేష్‌ ఇవాళ ఆఫీస్‌కు వచ్చారు. తన కారులో ఉన్న పిస్టల్‌ను సిబ్బందితో తెప్పించుకున్నారు. సర్వీస్‌ రివాల్వర్‌తో తనని తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో సిబ్బంది కంగుతిన్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఎలాంటి సుసైడ్‌ నోట్‌ కూడా రాయలేదు. 1992 బ్యాచ్‌ ప్రొవెన్షియల్ పోలీస్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ రాజేష్‌ సాహ్ని యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌లో ఎఎస్‌పిగా ఉన్నారు. ఉగ్రవాదానికి సంబంధించిన కేసుల్లో రాజేష్‌ కీలక పాత్ర పోషించారు. రాజేష్‌ సాహ్ని నిబద్ధత గల అధికారని యూపీ డిజిపి ఓమ్‌ ప్రకాశ్‌సింగ్ ట్వీట్‌ చేశారు. అతని ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదన్నారు.

 

నేడు సీపీఎం నేత జక్కా వెంకయ్య అంత్యక్రియలు

నెల్లూరు : నేడు సీపీఎం నేత జక్కా వెంకయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి. ఉదయం 11 గంటలకు బాలాజీనగర్ లోని సీపీఎం జిల్లా ఆఫీస్ నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభం కానుంది. బోడిగాడితోట శ్మశాన వాటికలో వెంకయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు పాల్గొననున్నారు.  

 

07:39 - May 30, 2018

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. వరుసగా 7 రోజులుగా మున్సిపల్‌ వాటర్‌ రాకపోవడంతో స్థానికులు నీటి కోసం నానా అగచాట్లు పడుతున్నారు. వాటర్‌ ట్యాంకర్ల వద్ద జనం క్యూ కడుతున్నారు. నీటి కోసం స్థానికులు షిమ్లా-కల్కా రోడ్డులో ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూల్‌ ఇంటిముందు ధర్నా చేశారు.  సిమ్లాలో వేసవిలో టూరిస్టుల తాకిడి ఎక్కువ ఉంటుంది. నీటి కొరత కారణంగా తమ ఊరికి రావద్దంటూ స్థానికులు టూరిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పలు హోటళ్లు టూరిస్టుల బుకింగ్‌లను కూడా రద్దు చేసుకుంటున్నాయి. నీటికొరతపై హిమాచల్‌ హైకోర్టు సీరియస్‌ అయింది. దీన్ని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మున్సిపల్‌ అధికారులు 14 వాటర్‌ ట్యాంకర్లు, 8 పికప్‌ వెహికల్స్‌ ద్వారా నీటిని సప్లయ్‌ చేస్తున్నారు. షిమ్లాకు ప్రతిరోజు 42 మిలియన్‌ లీటర్ల నీరు అవసరం ఉండగా...సప్లయ్ సగానికి సగం పడిపోయింది. విఐపిలకు, పెద్ద పెద్ద హోటళ్లకే నీటిని సప్లయ్‌ చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

07:36 - May 30, 2018

కరీంనగర్ : ఓ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఏడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. అతి వేగంతో వెళ్తున్న లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం చంజర్ల వద్ద లారీ-బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు చనిపోగా, 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. 
అతి వేగమే ప్రమాదానికి కారణం
కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం చంజర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో... కరీంనగర్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. రెండు లారీలు ఒకదానికి ఒకటి ఓవర్‌ టేక్‌ చేసుకుంటూ రావడంతో అదుపుతప్పి బస్సును మధ్య భాగంలో ఢీ కొంది. దీంతో బస్సులో ఉన్న ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. 
ప్రమాదంపై సీఎం కేసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి 
చెంజర్ల వద్ద జరిగిన ప్రమాదం పై సీఎం కేసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. మంత్రి ఈటల రాజేందర్‌ ఘటనా స్థలానికి చేరుకుని.. ప్రమాదానికి గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు ఈటల తెలిపారు. వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇలాంటి ఘటనలు  పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఈటల అన్నారు. కరీంనగర్‌-వరంగల్‌ ప్రధాన రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లాలోనూ రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్‌నగర్‌ టోల్‌ప్లాజా వద్ద బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్‌ నుండి జడ్చర్ల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

07:31 - May 30, 2018

హైదరాబాద్ : మధ్యంతర భృతి, పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను సర్కార్‌ ఎంత ప్రకటిస్తుందనే చర్చ ఉద్యోగుల్లో జోరుగా సాగుతోంది. అయితే ఉద్యోగులు మాత్రం మధ్యంతర భృతిని 43శాతం ప్రకటించాలని కోరుతున్నారు. పీఆర్సీ, ఫిట్‌మెంట్‌ను 63శాతం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలం
సాధారణ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ సర్కార్‌ సానుకూలంగానే ఉంది. ఇప్పటికే పలు డిమాండ్లను పరిష్కరించిన సర్కార్‌... మిగతా డిమాండ్లపైనా దృష్టి సారించింది.  త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు త్వరలోనే తీపి కబురు అందించనుంది. కొత్త వేతన సవరణ సంఘం చేసే సిఫారసులతో సంబంధం లేకుండా రానున్న జూన్‌ నెల నుంచే వర్తించే విధంగా 30శాతం  మధ్యంతర భృతిని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. జూన్‌ 2న కేసీఆర్‌ మధ్యంతర భృతిని ప్రకటిస్తామని ఈ మధ్యనే తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 27శాతం మధ్యంతర భృతిని ప్రకటించారు. అయితే ఈసారి కేసీఆర్‌ 30శాతం వరకు  మధ్యంతర భృతి ప్రకటించే అవకాశముంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం 43శాతం మధ్యంతర భృతిని ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి.
పీఆర్సీపై కమిటీ నియమించిన సర్కార్‌
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పీఆర్సీపై కమిటీని నియమించింది. ఆగస్టు 15లోపే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పంద్రాగస్టును కేసీఆర్‌.... ఫిట్‌మెంట్‌ ప్రకటిస్తానని చెప్పారు. ఉద్యోగస్తులు మాత్రం 63శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. నిత్యావసర ధరలు బాగా పెరిగాయని... అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగానే ఉంది. ఎన్నికల ఏడాది కావడంతో ఉద్యోగులను ఖుషీ చేసే విధంగానే మధ్యంతర భృతి, పీఆర్సీ ఉంటుందని అంతా భావిస్తున్నారు.  మరి తెలంగాణ ప్రభుత్వం ఐఆర్‌ ఎంత ప్రకటిస్తుందో తెలియాలంటే జూన్‌ 2 వరకు వేచి చూడాలి.
 

07:24 - May 30, 2018

హైదరాబాద్ : రైతుబంధు పథకం ద్వారా రైతులందరికీ కొత్త  పాసుపుస్తకాలు అందజేయడం, పంట పెట్టుబడి సాయం పంపిణీ, రైతులకు జీవితబీమా పథకం అమలు విషయంలో రైతు సమన్వయ సమితే కీలకపాత్ర పోషించాలని కేసీఆర్‌ అన్నారు. రైతులు అప్పులపాలు కాకుండా ఉండేందుకు ప్రభుత్వమే పెట్టుబడిసాయం అందిస్తుందన్నారు.  ఈ పథకం ఎన్నికల్లో ఓట్ల కోసం అస్సలు కాదని స్పష్టం చేశారు. రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేయడం కాంగ్రెస్‌కు సాధ్యంకాదని.... అది కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసం ఆపదమొక్కులు  మొక్కినట్లు ఆ పార్టీ హామీ ఉందని విమర్శించారు.
జిల్లా  కో..ఆర్డినేటర్లతో కేసీఆర్‌ సమావేశం
రైతుబంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. తాము ఎన్నికల్లో ప్రజలకు చెప్పిన ప్రతీపని చేశామని.. రైతుల సంక్షేమం కోసం మానిఫెస్టోలో చెప్పని పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పంటపెట్టుబడి సాయం రెండోవిడత సాయాన్ని నవంబర్‌ నెలలో అందజేస్తామని సీఎం ప్రకటించారు. సమైక్య రాష్ట్రంలో అవలంభించిన విధానాల వల్ల వ్యవసాయ రంగం దెబ్బతిన్నదని.. రైతులు అన్నివిధాలా నష్టపోయారని ఈ సందర్భంగా కేసీఆర్‌ అన్నారు.
వ్యవసాయరంగాభివృద్ధి కోసం అనేక చర్యలు : కేసీఆర్‌
తెలంగాణ వచ్చినాక రైతుల పరిస్థితి మారాలని అనుకున్నామని.. అందుకే  వ్యవసాయరంగాభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.  రైతులకు రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టిపెట్టామన్నారు.  వచ్చే జూన్‌ నుంచి ప్రాజెక్టుల ద్వారా నీరు పుష్కలంగా వస్తుందని.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. రైతులు పెట్టుబడి కోసం అప్పు చేయకుండా ప్రభుత్వమే పెట్టుబడి ఇస్తోందన్నారు.  అందుకోసమే ఎకరాకు 8వేలు ఇస్తున్నామన్నారు. రైతులకు జీవిత బీమా కూడా చేయించాలని నిర్ణయించామని....దీన్ని విజయవంతం చేయడానికి రైతు సమన్వయ సమితిలు కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.రైతు సమన్వయ సమితుల జిల్లా కో-ఆర్డినేటర్లు ఇజ్రాయిల్‌ సందర్శించాలని.. అక్కడి వ్యవసాయ పద్దతులను చూసి నేర్చుకుని రావాలన్నారు. ఇజ్రాయిల్‌ పర్యటనను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు.
అది ఆచరణ సాధ్యంకాని హామీ: కేసీఆర్‌
ఎన్నికల్లో ఓట్ల కోసమే కాంగ్రెస్‌ 2లక్షల రుణమాఫీ నినాదం ఎత్తుకుందన్నారు. కాంగ్రెస్‌ది ఆచరణ సాధ్యంకాని హామీఅని కొట్టిపారేశారు. ఎన్నికల్లో ఓట్లకోసం ఆపద మొక్కులు మొక్కిన మాదిరిగానే కాంగ్రెస్‌ రుణమాఫీ అంటోందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని వివరించారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితుల కో-ఆర్డినేటర్లకు ఆయన పలుసూచనలు చేశారు.

 

ఏపీలో నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ లో ఆప్షన్ల నమోదు

గుంటూరు : ఏపీలో నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ లో ఆప్షన్ల నమోదు ప్రారంభం కానుంది.

Don't Miss