Activities calendar

31 May 2018

పాల్ ఘర్ లోక్ సభ ఓట్లు మళ్లీ లెక్కించాలి : శివసేన

ముంబై : పాల్ ఘర్ లోక్ సభ స్థానం ఫలితాన్ని ప్రకటించవద్దని ఈసీకి శివసేన విజ్నప్తి చేసింది. పాల్ ఘర్ లోక్ సభ స్థానానికి సంబంధించిన ఓట్లను మరోసారి లెక్కించాలని ఈసీకి శివసేన డిమాండ్ చేసింది. పాల్ ఘర్ ఓట్ల లెక్కింపులో తమకు వ్యత్యాసాలు కనిపించాయని శివసేన పేర్కొంది. ఉప ఎన్నికల ఫలితాలు 2 చోట్ల మాత్రమే బీజేపీని గెలిపించాయనీ..ఈ సందర్భంగా పాల్ ఘర్ అభ్యర్తికి శివసేన అభినందనలు తెలిపింది. 

ఈసీలో అవినీతి..కోర్టులో ఫిర్యాదు చేయాలి : ఉద్ధవ్ ఠాక్రే

ముంబై : ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘానికి నియంత్రణ లేకుండా పోయిందని శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు.దీంతో ఎన్నికల కమిషన్ లో అవినీతిమయంగా మారిపోయిందనీ..కాబట్టి పార్టీలన్నీ ఏకమయి ఈసీకి వ్యతిరేకంగా కోర్టులో ఫిర్యాదు చేయాలని..పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలలని ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. బీజేపీకి పార్లమెంట్ లో మెజార్టీ తగ్గిందనీ..యోగి ఆదిత్య నాథ్ సొంత రాష్ట్రంలోనే ఓడిపోయారని శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రంలో ఓడిపోయిన యోగీ మహారాష్ట్రంలో ప్రచారంచేపట్టారనీ..యోగి ప్రచారం వల్ల బీజేపీకి మహారాష్ట్రలో ఒరిగిందేమీ లేదనీ ఎద్దేవా చేశారు.

19:23 - May 31, 2018

అమరావతి : ఏపీలో విద్యుత్‌ ఉద్యోగులకు పీఆర్‌సీ వర్తింప చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 25 శాతం ఫిట్‌మెంట్‌తో ఉద్యోగ సంఘాలో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీనివలన ప్రభుత్వంపై ఏటా 860 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. పదిహేనేళ్ల కంటే తక్కువ సర్వీసు ఉన్న ఉద్యోగులకు రెండు, అంతకు ఎక్కువ సర్వీను ఉన్న ఉద్యోగులకు మూడు ఇంక్రిమెంట్లు ఇస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో 31,543 మంది ద్యోగులు, 26,493 మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని విద్యుత్‌ శాఖ మంత్రి కిమిడి కళావెంకట్రావు చెప్పారు. 

19:22 - May 31, 2018

విజయనగరం : పవన్‌ కల్యాణ్‌ ఎవరో తెలియదంటూ టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజు చేసిన వ్యాఖ్యలను జనసేనాని తప్పుపట్టారు. గత ఎన్నికల్లో జనసేన ఓట్లతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం నేతలు ఇప్పుడు విమర్శలు చేయడాన్ని పవన్‌ తప్పుపట్టారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగిన జనసేన పోరాట యాత్రలో అశోక్‌గజపతిరాజుపై పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు టీడీపీయే కారణమని పవన్‌ ఆరోపించారు. 

19:21 - May 31, 2018

హైదరాబాద్‌ : నగరంలో 826 చోట్ల అత్యాధునిక టెక్నాలజీతో నూతన బస్‌షెల్టర్లను నిర్మిస్తున్నామని మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో నిర్మిస్తున్న బస్‌షెల్టర్లను కేటీఆర్‌ ప్రారంభించారు. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకునే ప్రజలందరికీ ఆధునిక సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రపంచస్థాయి బస్‌షెల్టర్లను నెలకొల్పుతున్నామని కేటీఆర్‌ తెలిపారు. త్వరలో 3 వేల 8 వందల బస్సుల స్థానంలో దశల వారిగా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ను ప్రవేశపెడతామని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రజా రవాణాను మెరుగు పరుస్తూ.. కాలుష్య రహిత నగరంగా తయారు చేయుటకు ప్రభుత్వ కృషి చేస్తుందని అన్నారు.

18:22 - May 31, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్తనందించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం, పోలీసు శాఖ శుభవార్తను ప్రకటించింది. భారీగా పోలీసు నియామకాలకు ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. భారీ స్థాయిలో పోలీస్ నియామకాలను ప్రభుత్వం చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి పోలీస్ శాఖ నాలుగు నోటిఫికేషన్స్ ను విడుదల చేసింది. మొత్తం 18,428 పోలీస్ పోస్ట్ లకు నోటిఫికేషన్ ను జారీచేసింది. 739 ఎస్ఐ పోస్టులు, 16727 కానిస్టేబుల్, ఏఎస్ ఐలు 26, ఫైర్ విభాగంలో 168, వార్డెన్స్ 221, ఆర్ఎస్ ఐలు 471, డిప్యూటీ జైలర్స్ 15, స్టేషన్ ఆఫీసర్స్ 19 వంటి పలు విభాగాలలో మొత్తం 18,428 పోలీస్ పోస్ట్ లకు పోలీస్ శాఖ నోటిఫికేషన్ ను జారీచేసింది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి వివరాలను పోలీస్ వెబ్ సైట్ లో పొందుపరిచారు.

మనోహర్ థియేటర్ వద్ద అగ్ని ప్రమాదం..

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని మనోహర్ థియేటర్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ట్రాన్స్ ఫార్మర్ వద్ద మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు సమచారం మేరకు ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణం తెలియాల్సివుంది. 

ఓట్ల కోసం పార్టీలు పాకులాడుతున్నాయి : పవన్

విజయనగరం : ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం.. ఏపీని విస్మరించిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఓట్ల కోసం మాత్రమే రాజకీయ పార్టీలు పాకులాడుతున్నాయని విమర్శించారు. విజయనగరం జిల్లా కురుపాంలో ఆయన పర్యటించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ... గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకు తాను వచ్చానని, వారి ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని అన్నారు. గిరిజనులు, సామాన్యుల సమస్యలను టీడీపీ సర్కారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

ఇఫ్తార్ విందు కోసం టీ.సర్కార్ 33 కోట్లు కేటాయింపు..

హైదరాబాద్ : రంజాన్ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం 33 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఇందులో 15 కోట్ల రూపాయలు ఇఫ్తార్ విందు కోసం ఖర్చు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా వచ్చేనెల 8న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చే ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఎ.కె.ఖాన్, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ మహ్మద్ సలీం, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి దాన కిషోర్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

17:50 - May 31, 2018

కర్ణాటక : ఉప ఎన్నికల్లో విపక్షాల ఐక్యతతో కమలం విలవిలలాడింది. ఫలితాల్లో విపక్షాలు కళకళలాడాయి. బీజేపీకి ఉప ఎన్నికల ఫలితాలలో ఎదురుగాలి వీచింది. నాలుగు లోక్ సభ స్థానాలు, 11 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో 11 స్థానాల్లో కేవలం ఒకే ఒక్క స్థానంలో బీజేపీ విజయానికి పరిమితమైపోయింది. ముఖ్యంగా జార్ఖండ్, యూపీ, మహారాష్ట్రలలో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నాలు చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల జెఎంఎం అభ్యర్ధులు విజయకేతనాలకు ఎగురువేశారు. ఒకే ఒక్క స్థానాలకు టీఎంసీ, ఎస్పీ,ఆర్జేడీ, బీజేపీలు పరిమితమయ్యాయి. కేరళ చెంగనూరులో సీపీఎం అభ్యర్థి సాజి చెరియన్ విజయం సాధించారు. మేఘాలయాలోని అంపతిలో కాంగ్రెస్ అభ్యర్థి మియాని డి శిరా గెలుపొందారు. మహారాష్ట్రలోని కాడేగావ్, పంజాబ్ లోని షాకోట్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. బీహార్ లోని జోకీహాట్ లో ఆర్జేడీ అభ్యర్థి గెలుపొందారు. యూపీలోని కైరానా స్థానంలో ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హాసన్జయకేతనం ఎగురవేశారు. నాగాలాండ్ లో సోనె లోక్ సభ స్థానంలో ఎన్డీపీపీ ఆభ్యర్థి ముందంజలోవున్నారు. మహారాష్ట్రలోని పాల్గడ్ లోక్ సభ స్థానంలో శివసేన అభ్యర్థిని ఓడించి బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. భండారా,గోండియా స్థానంలో ఎన్సీపీ, బీజేపీ మధ్య హోరా హోరీగా పోటీ కొనసాగుతోంది. కాగా నాలుగు లోక్ సభ స్థానాల్లోని మూడు సిట్టింగ్ స్థానాల్లో ఒకే ఒక్కచోట బీజేపీ గెలుపొందింది. ఉత్తరాఖండ్ లోని తరాలీలో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. జార్ఖండ్, యూపీ, మహారాష్ట్రలలో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బెంబగాల్ లోని మహేస్తలలో 62వేల ఓట్ల ఆధిక్యంలో తృణముల్ కాంగ్రెస్ అభ్యర్తి గెలుపు సాధించారు. కేరళలోని చెంగనూర్ లో సీపీఎం అభ్యర్థి సాజి చెరియన్ విజయకేతనం ఎగురవేశారు. యూపీలోని నూర్ పూర్ లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి నయీముల్ హాసన్,. జార్ఖండ్ లోని గోమియా, సిల్లీలలో జేఎంఎం అభ్యర్థులు విజయం సాధించారు.సిల్లీలో 13,500ఓట్ల మెజారిటీతో జేఎంఎం అభ్యర్థి సీమాగదేవి మహాతో గెలుపొందారు. గోమియాలో 1344 ఓట్ల తేడాతో జెంఎఎం అభ్యర్థి బబితాదేవి విజయం సాధించారు.  

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్తనందించింది. భారీగా పోలీసు నియామకాలకు ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పోలీసు నియామకాలకు సర్వం సిద్ధమయ్యింది. భారీ స్థాయిలో ఎస్ఐ, కానిస్టేబుల్స్ నియామకాలను ప్రభుత్వం చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి పోలీస్ శాఖ ప్రకటించనుంది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి వివరాలను పోలీస్ వెబ్ సైట్ లో పొందుపరచనున్నారు. 

17:19 - May 31, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్తనందించింది. భారీగా పోలీసు నియామకాలకు ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పోలీసు నియామకాలకు సర్వం సిద్ధమయ్యింది. భారీ స్థాయిలో ఎస్ఐ, కానిస్టేబుల్స్ నియామకాలను ప్రభుత్వం చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి పోలీస్ శాఖ ప్రకటించనుంది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి వివరాలను పోలీస్ వెబ్ సైట్ లో పొందుపరచనున్నారు. 

17:12 - May 31, 2018

హైదరాబాద్ : దేశంలో నాలుగు లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో కౌంటింగ్ లో బీజీపీకి ఎదురు దెబ్బ తగిలింది. మన్సూర్ లో సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. 11 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ ఒకే ఒక చోట విజయానికి పరిమితమయ్యింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగలటానికి కారణమేమిటి? 2019 ఎన్నికల్లో ఇదే సీన్ రిపీట్ కానుందా? ఈ ఉప ఎన్నికల ఫలితాలు దేనికి సంకేతం? వంటి పలు అంశాలపై ప్రొ.నాగేశ్వర్ గారి విశ్లేషణలో తెలుసుకుందాం..

16:57 - May 31, 2018

ఢిల్లీ : తెలంగాణ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన లాడ్‌ బజార్‌ను ప్రారంభించారు టీఆర్‌ఎస్‌ నేతలు. తెలంగాణ వంటలు, పుస్తకాలు, పోచంపల్లి దుస్తులు వంటి స్టాల్స్‌లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు రేపు ఉదయం 6 గంటలకు తెలంగాణ భవన్‌ నుండి ఇండియా గేట్‌ వరకు 3 కిలోమీటర్ల వరకు మారథాన్‌ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ మారథాన్‌కు ముఖ్య అతిథిగా బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లల గోపీచంద్‌ హాజరుకానున్నారు. 

16:56 - May 31, 2018

అమరావతి : ఏపీ కేబినేట్‌ సమావేశం పదవ పీఆర్‌సీ బకాయిల చెల్లింపులపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి సహకరించామన్నారు ఉద్యోగులు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సమస్యల నేపథ్యంలో గత నాలుగు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నామనీ..పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నామని ఉద్యోగులు పేర్కొన్నారు. క్యాబినేట్‌ సమావేశంలో ఒక నిర్ణయం తప్పకుండా వస్తుందని ఎదురు చూస్తున్నామంటున్న ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుతో తెలిపారు.

16:55 - May 31, 2018

కృష్ణా : గుడివాడలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగులు బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. నగదు మార్పిడి సేవాలను సరైన సమయంలో చేస్తున్నందుకు గానూ పెంచవలసిన జీతాలను వెంటనే పెంచాలని డిమాండ్‌ చేశారు. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న.. ప్రభుత్వం మాత్రం తమ వేతన సవరణ విషయాన్ని పట్టించుకోవటం లేదని ఉద్యోగులు అన్నారు. ప్రభుత్వం తమ వేతనాలను పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని బ్యాంకు ఉద్యోగులు స్పష్టం చేశారు.

16:54 - May 31, 2018

విజయవాడ : బహిరంగ ప్రదేశాలలో ధూమపానంను నిషేదించామని విజయవాడ సీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రకటించారు. నో టొబాకో డే సందర్భంగా విజయవాడలోని తన కార్యాలయంలో నో టొబాకో పోస్టర్‌ను విడుదల చేశారు. ధూమపానం చేస్తూ చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. కాగా పొగాకుతో నేడు ఎన్నో అనారోగ్యాలు సంభవిస్తున్నాయి. సిగరెట్‌ తాగడం వల్ల గుండె, ఊపిరతిత్తులకు సంబంధించిన వ్యాధులతో పాటు క్యాన్సర్‌, డయాబెటిస్‌, ఆస్టియోపొరోసిస్‌ వంటి వ్యాధులు వస్తున్నాయి. ఆస్తమా రావడానికి సిగరెట్‌ తాగడం కూడా ఓ కారణమే. పొగ తాగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి 13 సెకండ్లకు ఒక వ్యక్తి మరణిస్తే ప్రతి ఏడాది మిలియన్‌ మంది ప్రజలు దీంతో మృతిచెందుతున్నారు. దీంతో పాటు పొగాకుతో కూడిన గుట్కా కూడా మనిషికి ప్రాణాంతకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పొగాకు మూలంగా సంభవించే వ్యాధులపట్ల చైతన్యం కలిగించేందుకు ప్రతి ఏటా మే 31న ‘వరల్డ్‌ నో టొబాకో డే’ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

16:53 - May 31, 2018

అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీకి గుజరాత్‌లో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహ నిర్మాణంపై ఉన్న ఆసక్తి అమరావతిపై లేదని ఏపీ ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కుటుంబరావు విమర్శించారు. ఈ విగ్రహం నిర్మాణానికి వివిధ రూపాయల్లో కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకొంటున్నారని ఆరోపించారు. గుజరాత్‌లో ధొలేరా నగర నిర్మాణానికి భారీగా నిధులు ఇస్తున్న కేంద్రం.. ఏపీని ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు. 

16:52 - May 31, 2018

అమారవతి : మద్యం బెల్టు షాపుల నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటోందని ఏపీ ఎక్సైజ్‌ శాఖ మంత్రి జవహర్‌ చెప్పారు. ఇందుకు సంబంధించి 7,700 కేసులు పెట్టామన్నారు. బెల్టు షాపుల నియంత్రణలో కొన్ని లోపాలున్నా.. వాటిని సరిదిద్దుకొంటూ చిత్తశుద్ధితో చర్యలు తీసుకొంటున్నామని మంత్రి జవహర్‌ తెలిపారు.  

16:51 - May 31, 2018

ఖమ్మం : రాపర్తిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతాంగ సమస్యలపై తెలంగాణలో వివిధ రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా ఖమ్మం నుండి కరీంనగర్ వరకు సడక్ బంద్‌ చేపట్టారు. కరీంనగర్‌ జిల్లా ఎల్కతుర్తి వద్ద టీజేఎస్‌ అధ్యక్షులు కోదండరామ్‌, టీజేఎస్‌ నేతలు ఈ బంద్‌లో పాల్గొన్నారు. బంద్‌లో పాల్గొన్న పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి హసన్‌పర్తి జైలుకు తరలించారు. 

పంజాబ్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం..

ఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హర్‌దేవ్ సింగ్ లాడి విజయం సాధించారు. షాకోట్ నియోజకవర్గానికి గానూ ఇవాళ వెలువడిన ఎన్నికల ఫలితాల్లో... శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి నయీబ్ సింగ్ కోహార్‌పై 38,802 ఓట్ల తేడాతో హర్‌దేవ్ గెలుపొందారు. కాగా ఇక్కడ పెద్ద ఎత్తున ఈవీఎంల రిగ్గింగ్ జరిగిందనీ... మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ నయీబ్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు. అకాలీదళ్ ఎమ్మెల్యే అజిత్ సింగ్ కోహార్ మృతిచెందడంతో షాకోట్‌లో ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 1.72 లక్షల ఓటర్లు ఉండగా...

అసెంబ్లీ ఉపఎన్నికల్లో సీపీఎం జయకేతనం..

కేరళ : దేశంలో నాలుగు లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల్లో అధికార పార్టీ సీపీఎం జయకేతనం ఎగరేసింది. చెంగన్నూర్ నియోజకవర్గంలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అభ్యర్థి సాజి చెరియన్ 20,956 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. సీపీఎం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కేకే రామచంద్రన్ ఈ ఏడాది జనవరిలో అనారోగ్యం కారణంగా మృతి చెందారు. దీంతో ఖాళీ అయిన చెంగన్నూర్ స్థానంలో ఉపఎన్నికలు జరిగాయి.

బీజేపీ పతనం కొనసాగుతోంది : యనమల

అమరావతి : దేశవ్యాప్తంగా ఈరోజు వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలతో బీజేపీకి షాక్ తగిలిందని యనమల పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా మోదీ వ్యతిరేక గాలి వీస్తోందని... కర్ణాటకతో ప్రారంభమైన బీజేపీ పతనం ఉప ఎన్నికల్లో కూడా కొనసాగుతోందనీ..ఈ పతనం 2019 ఎన్నికలతో పరిపూర్ణమవుతుందని అన్నారు. వరుసగా ఓటములు ఎదురవుతున్నా... బీజేపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను మహానాడులో వివరించేసరికి... బీజేపీ నేతలకు దిమ్మతిరిగిందని యనమల ఎద్దేవా చేశారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత... ఏపీపై బీజేపీ కక్ష పెట్టుకుందని అన్నారు.

ఆపరేషన్ 'గరుడ'నిజమేననిపిస్తోంది : యనమల

అమరావతి : బీజేపీపై ఏపీ ఆర్థికమంత్రి యనమల నిప్పులు చెరిగారు. ఓవైపు వైసీపీ అధినేత జగన్ తో లాలూచీ రాజకీయాలు చేస్తూనే, మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో టీడీపీపై విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఐవైఆర్ కృష్ణారావుతో పుస్తకాలు రాయించడం, రమణ దీక్షితులతో ఆరోపణలు చేయించడం... ఇవన్నీ చూస్తుంటే ఆపరేషన్ గరుడ నిజమే అనే అనుమానం కలుగుతోందని చెప్పారు. బీజేపీ ఇలాగే ప్రవర్తిస్తే... వారి వ్యూహం బెడిసికొట్టే అవకాశం ఉందని... కన్నడిగుల మాదిరే ఏపీ ప్రజలు కూడా ఆ పార్టీకి గడ్డి పెడతారని అన్నారు.

బీజేపీలో చేరికపై లక్ష్మీనారాయణ స్పందన..

హైదరాబాద్ : ప్రజాసేవ చేయాలన్న తపనతో అత్యున్నతమైన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి... ఏపీలో పల్లెబాట పట్టారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. అయితే, బీజేపీలో ఆయన చేరబోతున్నారని, 2019 ఎన్నికల్లో బీజేపీ ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అనే ప్రచారం ఓవైపు జరుగుతోంది. దీనిపై స్పందించిన లక్ష్మీనారాయణ ఆ వార్తల్లో వాస్తవం లేదని స్ఫష్టం చేశారు. జిల్లాల పర్యటన పూర్తయిన తర్వాత రాజకీయపరంగా ఓ నిర్ణయం తీసుకుంటానని లక్ష్మీనారాయణ తెలిపారు. 

సమ్మె విరమించిన గాంధీ వైద్యులు..

హైదరాబాద్ : ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో గాంధీ ఆసుపత్రి వైద్యులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో గాంధీ ఆసుపత్రిలోని మెడికల్ అసిస్టెంట్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు సమ్మెను విరమించారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంపుపై పునరాలోచిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి వైద్యులకు హామీ ఇవ్వటంతో వారు సమ్మెను విరమించి విధుల్లోకి చేరతామని తెలిపారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో వున్న సీఎం కేసీఆర్ చిత్రపటానికి వైద్యులు క్షీరాభిషేకం చేశారు. కాగా ఇచ్చిన మాట తప్పితే మరోసారి సమ్మెబాట పడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

15:46 - May 31, 2018

హైదరాబాద్ : ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో గాంధీ ఆసుపత్రి వైద్యులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో గాంధీ ఆసుపత్రిలోని మెడికల్ అసిస్టెంట్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు సమ్మెను విరమించారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంపుపై పునరాలోచిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి వైద్యులకు హామీ ఇవ్వటంతో వారు సమ్మెను విరమించి విధుల్లోకి చేరతామని తెలిపారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో వున్న సీఎం కేసీఆర్ చిత్రపటానికి వైద్యులు క్షీరాభిషేకం చేశారు. కాగా ఇచ్చిన మాట తప్పితే మరోసారి సమ్మెబాట పడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 68 సంవత్సరాలకు పెంచుతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించటంతో ఆగ్రహించిన అసోసియేట్ ప్రొఫెసర్లు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. 

అన్నపూర్ణ స్టూడియోలో వ్యక్తి అనుమానాస్పద మృతి?..

హైదరాబాద్ : అన్నపూర్ణ స్టూడియోలో పని చేస్తున్న నారాయణరెడ్డి అనే 55 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సదరు వ్యక్తి మృతదేహాన్ని స్టూడియో సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బంధువులకు సైతం సమాచారం ఇవ్వకుండా డెడ్ బాడీని తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. నారాయణరెడ్డిని ఎవరైనా హత్య చేసి ఉంటారనే అనుమానాన్ని ఆయన బంధువులు వ్యక్తపరుస్తున్నారు. దీంతో ఉస్మానియా ఆసుపత్రి ఎదుట వారు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లుగా సమాచారం. 

హస్తినలో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు..

ఢిల్లీ : నగరంలోని తెలంగాణ భవన్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్రావతరణ ప్రారంభమయ్యింది. నేడి నుండి నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రతినిథిగా రామంచంద్రఉ నాయక్, వేణుగోపాచారి, రెసిబెంట్కమిషనర్ అశోక్ కుమార్ పాల్గొన్నారు. రేపు తెలంగాణ భవన్ నుండి ఇండియా గేట్ వరకు టీఆర్ఎస్ మారథాన్ నిర్వహించనుంది. ఈ మారథాన్ లో పుల్లెల గోపీచంద్, అధికారులు పాల్గొననున్నారు. 

15:33 - May 31, 2018

కర్ణాటక : దేశంలో నాలుగు లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రాజేశ్వరి నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి మునిరతన్ విజయం సాధించారు. మేఘాలయాలోని అంపతిలో కాంగ్రెస్ అభ్యర్థి మియాని డి శిరా గెలుపొందారు. మహారాష్ట్రలోని కాడేగావ్, పంజాబ్ లోని షాకోట్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. బీహార్ లోని జోకీహాట్ లో ఆర్జేడీ అభ్యర్థి గెలుపొందారు. యూపీలోని కైరానా స్థానంలో ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హాసన్జయకేతనం ఎగురవేశారు. నాగాలాండ్ లో సోనె లోక్ సభ స్థానంలో ఎన్డీపీపీ ఆభ్యర్థి ముందంజలోవున్నారు. మహారాష్ట్రలోని పాల్గడ్ లోక్ సభ స్థానంలో శివసేన అభ్యర్థిని ఓడించి బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. భండారా,గోండియా స్థానంలో ఎన్సీపీ, బీజేపీ మధ్య హోరా హోరీగా పోటీ కొనసాగుతోంది. కాగా నాలుగు లోక్ సభ స్థానాల్లోని మూడు సిట్టింగ్ స్థానాల్లో ఒకే ఒక్కచోట బీజేపీ గెలుపొందింది. ఉత్తరాఖండ్ లోని తరాలీలో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. జార్ఖండ్, యూపీ, మహారాష్ట్రలలో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బెంబగాల్ లోని మహేస్తలలో 62వేల ఓట్ల ఆధిక్యంలో తృణముల్ కాంగ్రెస్ అభ్యర్తి గెలుపు సాధించారు. కేరళలోని చెంగనూర్ లో సీపీఎం అభ్యర్థి సాజి చెరియన్ విజయకేతనం ఎగురవేశారు. యూపీలోని నూర్ పూర్ లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి నయీముల్ హాసన్,. జార్ఖండ్ లోని గోమియా, సిల్లీలలో జేఎంఎం అభ్యర్థులు విజయం సాధించారు.సిల్లీలో 13,500ఓట్ల మెజారిటీతో జేఎంఎం అభ్యర్థి సీమాగదేవి మహాతో గెలుపొందారు. గోమియాలో 1344 ఓట్ల తేడాతో జెంఎఎం అభ్యర్థి బబితాదేవి విజయం సాధించారు.  

14:45 - May 31, 2018

హైదరాబాద్‌ : దేశంలో నాలుగు లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన అనంతరం ఈరోజు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాలలలోను బీజేపీకి ఎదురు గాలి వీస్తోంది. లోక్ సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. మన్సూర్ లో సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. కేరళ చెంగన్నూర్ అసెంబ్లీ స్థానంలో 21వేల ఓట్లతో సీపీఎం అభ్యర్థి విజయం సాధించారు. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. మేఘాలయ అంపటి అసెంబ్లీ స్థానంలో 3,191 ఓట్లతో కాంగ్రెస్ గెలుపొందింది. కర్ణాటక ఆర్ఆర్ నగర్ అసెంబ్లీ స్థానంలో 44,100 ఓట్లతో కాంగ్రెస్ గెలుపొందింది. మహారాష్ట్ర పాలస్ కడేగావ్ లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. జార్ఖండ్ సిల్లీలో 13వేల ఓట్లతో జేఎంఎం గెలుపొందింది. మరోపక్క బండారి, గోండియా లోక్ సభ స్థానంలోఎన్సఈపీ లీడింగ్ లో వుంది. ఏ విధంగా చూసినా ప్రతీ ప్రాంతంలోను బీజేపీ ఎదురుగాలి వీస్తోంది. 

13:31 - May 31, 2018

ప.గో : భీమవరం మండలం జొన్నలగురువులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోదావరి ఆక్వా ఫుడ్ పార్క్ ఫ్యాక్టరీకి మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు  మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. గ్రామస్తులు ఆగ్రహంతో ఆక్వా ఫుడ్ ప్యాక్టరీ సిబ్బందిపై  దాడికి దిగారు. 

 

13:07 - May 31, 2018

కృష్ణా : ఏ.కొండూరు గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ప్రాణాలు వదులుతున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వసంతరావు ఇవాళ మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మృతుని కుటుంబాన్ని సీపీఎం నాయకులు పరామర్శించారు.

13:04 - May 31, 2018

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వైద్యుల వివాదంపై ఇంకా కొలిక్కి రాలేదు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో సమావేశమైన మంత్రి లక్ష్మారెడ్డి.. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళతానన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడిన అనంతరం  టీచింగ్‌ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపుపై మరోసారి ప్రకటన చేస్తామన్నారు. అయితే ఆందోళన విరమించాలా..లేదా అనే అంశంపై అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల సంఘంనేతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. సమ్మెను విరమించాలా లేదా అనే దానిపై ప్రస్తుతం తర్జనభర్జనలు పడుతున్నారు. 

 

12:59 - May 31, 2018

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 4లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. పలుచోట్ల బీజేపీ అభ్యర్థులు వెనుకబడ్డారు. విపక్షాల ఉమ్మడి పోరాటంతో పలుచోట్ల కమలదళానికి షాక్‌ తగిలింది. లోక్‌సభ, అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. 4లోక్‌సభ స్థానాల్లో ఒక్కచోట మాత్రమే బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. మూడు లోక్‌సభ స్థానాల్లో ఆర్‌ఎల్‌డీ, ఎన్సీపీ, ఎన్డీపీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 11 అసెంబ్లీ సెగ్మెంట్లలో 9చోట్ల విపక్ష అభ్యర్థులే గెలుపు బాటలో ఉన్నారు. 3చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్‌ మరోస్థానంలో ఆధికంలో కొనసాగుతోంది. మేఘాలయ అంపటి అసెంబ్లీస్థానంలో 3,191ఓట్లతో కాంగ్రెస్‌ గెలుపొందింది. కర్నాటక ఆర్‌ఆర్‌నగర్‌ అసెంబ్లీ స్థానంలో 44,100 ఓట్లతో కాంగ్రెస్‌ విజయం సాధించింది. పాలస్‌ కడేగావ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించారు. అటు కేరళలోని చెంగనూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో సీపీఎం అభ్యర్థి ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. బీహార్‌ జోకీపేట్‌ అసెంబ్లీ స్థానంలో జేడీయూ అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు. నూర్పూర్లో ఎస్పీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. మహేష్తల అసెంబ్లీ సెగ్మెంట్‌లో తృణమూల్‌ అభ్యర్థికి ఆధిక్యం లభించింది. జోకీహట్‌లో జేడీయూ ముందంజలో ఉంది. నాగాలాండ్‌ లోక్‌సభ స్థానంలో ఎన్డీపీపీ లీడింగ్‌ లో ఉంది. కైరానా లోక్‌సభ స్థానంలో 75వేల ఓట్ల ఆధిక్యంలో ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి తబుస్సుమ్‌ ఉన్నారు. జార్ఖండ్‌ సిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో లీడింగ్‌లో బీజేపీ అభ్యర్థి ఉన్నారు. 

బీజేపికి ఎదురుగాలి

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 4లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. పలుచోట్ల బీజేపీ అభ్యర్థులు వెనుకబడ్డారు. మశ్చిమబెంగాల్‌ మహేష్తల స్థానంలో  తృణమూల్‌ కాంగ్రెస్‌ లీడింగ్‌లో కొనసాగుతోంది.  యూపీలోని  నూర్పూర్‌లో ఎస్‌పీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అటు మహారాష్ట్ర పాల్ఘర్‌ లోక్‌సభస్థానంలో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. 

అసిస్టెంట్ ప్రొఫెసర్లతో మంత్రి లక్ష్మారెడ్డి చర్చలు

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వైద్యుల మధ్య వివాదంపై ప్రభుత్వం స్పందించింది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెస్లర్లు మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి రంగంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో భేటీ అయ్యారు. సమస్య పరిష్కారానికి చర్చలు జరుపుతున్నారు. ఆందోళన విరమించాలని అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు మంత్రి సూచించారు. ఉద్యోగ వయోపరిమితి పెంపుపై అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

12:03 - May 31, 2018

 ఢిల్లీ : దేశవ్యాప్తంగా 4లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. పలుచోట్ల బీజేపీ అభ్యర్థులు వెనుకబడ్డారు. మశ్చిమబెంగాల్‌ మహేష్తల స్థానంలో  తృణమూల్‌ కాంగ్రెస్‌ లీడింగ్‌లో కొనసాగుతోంది.  యూపీలోని  నూర్పూర్‌లో ఎస్‌పీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అటు మహారాష్ట్ర పాల్ఘర్‌ లోక్‌సభస్థానంలో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. బీహార్‌ జోకీహత్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో జేడీయూ లీడింగ్‌లో ఉండగా కర్నాటక ఆర్‌ఆర్‌నగర్‌ అసెంబ్లీ స్థానంలో 6వ రౌండ్‌ ముగిసేసరికి కాంగ్రెస్‌ అభ్యర్థి 42వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు  ఉత్తపప్రదేశ్‌  కైరానాలో ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి లీడింగ్‌లో ఉన్నారు. మహారాష్ట్రలోని ఫలూస్‌ కడేగాంవ్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించారు. ఇక పంజాబ్‌ షాకోట్‌ అసెంబ్లీస్థానంలో కాంగ్రెస్‌ లీడింగ్‌లో కొనసాగుతోంది. కేరళ చెంగనూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో సీపీఎం ముందంజ ఉంది. జార్ఖండ్‌ సిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో లీడింగ్‌లో కాంగ్రెస్‌, బీహార్‌ జోకీపేట్‌ అసెంబ్లీస్థానంలో జేడీయూ అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు. 

 

11:58 - May 31, 2018

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వైద్యుల మధ్య వివాదంపై ప్రభుత్వం స్పందించింది. ప్రొఫెసర్లు , అసిస్టెంట్‌ ప్రొఫెస్లర్లు మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి రంగంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో భేటీ అయ్యారు. సమస్య పరిష్కారానికి చర్చలు జరుపుతున్నారు. ఆందోళన విరమించాలని అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు మంత్రి సూచించారు. ఉద్యోగ వయోపరిమితి పెంపుపై అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీచింగ్‌ ప్రొఫెసర్ల పదవీ విరమణ పెంపుతో నూతన నియామకాలు, ప్రమోషన్లకు గండిపడుతుందని ఆందోళన చెందుతున్నారు. పదవీ విరమణ పెంపుపై ప్రభుత్వం పునరాలోచించాలని అసెస్టెంట్‌ ప్రొఫెసర్లు అంటున్నారు.

 

11:55 - May 31, 2018

కృష్ణా : ఏ.కొండూరు గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ప్రాణాలు వదులుతున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వసంతరావు ఇవాళ మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మృతుని కుటుంబాన్ని సీపీఎం నాయకులు పరామర్శించారు.

 

మధ్యాహ్నం 3 గం.లకు ఏపీ కేబినెట్ భేటీ

గుంటూరు : నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈసమావేశంలో 10వ పీఆర్ సీ కేటాయింపులపై చర్చించనున్నారు. అగ్రిగోల్డు బాధితుల సమస్యలపైనా చర్చ జరుపనున్నారు. దీంతో రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చలు జరుపనున్నారు. 

11:33 - May 31, 2018

గుంటూరు : నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈసమావేశంలో 10వ పీఆర్ సీ కేటాయింపులపై చర్చించనున్నారు. అగ్రిగోల్డు బాధితుల సమస్యలపైనా చర్చ జరుపనున్నారు. దీంతో రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చలు జరుపనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

11:17 - May 31, 2018

విశాఖ : దశాబ్దాల ఘన చరిత్రగల ఆంధ్రా విశ్వవిద్యాలయం.. వివాదాల నిలయంగా మారింది. అధికారుల ఏకపక్ష నిర్ణయాలతో అబాసుపాలవుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా వద్దన్న వ్యక్తిని.. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఎంపిక చేయడంపై తీవ్ర దుమారమే రేగింది. వ్యవహారం సీఎం దాకా వెళ్ళడంతో..  ఈ రోజు జరిగాల్సిన స్నాతకోత్సవం ఆగిపోయింది.
వివాదాలకు నిలయంగా ఏయూ 
లక్షలాది మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన  సరస్వతీ నిలయం ఏయూ.. నేడు వివాదాలకు నియంగా మారింది. పాలకుల ఏకపక్ష నిర్ణయాలు విశిష్ట విశ్వవిద్యాలయ కీర్తి మసకబారుతోంది. ప్రధానంగా 85వ స్నాతకోత్సవానికి  ఎంతో ప్రాముఖ్యం గల వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి ముఖ్య అతిథి వ్యవహారంతోనే ఏయూలో దుమారం రేగింది.
రాజీవ్‌ కుమార్‌ను ఆహ్వానించడంపై తీవ్ర వ్యతిరేకత 
నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ను స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని ఏయూ ఉపకులపతి నిర్ణయించారు. దీనికి కొందరు సభ్యులనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని కేంద్రానికి సిఫార్సు చేసిన రాజీవ్‌ కుమార్‌కు ఏయూలో ఎర్ర తివాచీ వేయడంపై నిరసన వ్యక్తం చేశారు. 
స్నాతకోత్సవ వేదిక మార్పు వివాదాస్పదం 
మరోవైపు స్నాతకోత్సవ వేదిక మార్పు సైతం వివాదాస్పదంగా మారింది. దశాబ్దాల క్రితం నిర్మించిన కట్టమంచి రామలింగారెడ్డి స్నాతకోత్సవ మందిరాన్ని కాదని.. బీచ్‌రోడ్డులోని కన్వెన్షన్‌ కేంద్రంలో స్నాతకోత్సవం నిర్వహించాలన్న  అధికారుల నిర్ణయం కూడా వివాదాస్పదంగా మారింది. పాలకమండలి  సభ్యులు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
కళాప్రపూర్ణకు ముగ్గురి పేర్లు, క్రీడా ప్రపూర్ణకు ఒకరి పేరు ప్రతిపాదన
కళాప్రపూర్ణకు ముగ్గురి పేర్లు, క్రీడా ప్రపూర్ణకు ఒకరి పేరును ప్రతిపాదించి.. గవర్నర్‌ ఆమోదానికి పంపనున్నారు సభ్యులు..కళాప్రపూర్ణకు మ్యాజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా, ప్రఖ్యాత గాయని రావు బాలసరస్వతి, సినీ గేయ రచయిత చంద్రబోస్‌, క్రీడా ప్రపూర్ణకు క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ల పేర్లను ఖరారు చేశారు. వారితో పాటు యార్లగడ్డ లక్ష్మీనారయణకు, ఎంపీ మురళీ మోహన్‌కు అవార్డులు ప్రదానం చేస్తామనడంపై అధ్యాపకులు మండిపడుతున్నారు.
కళాప్రపూర్ణల ఎంపికలో అధికారుల ఇష్టారాజ్యం
కళాప్రపూర్ణల ఎంపికలో వర్సిటీ అధికారులు ఇష్టారాజ్యంగా, హడావుడిగా నిర్ణయాలు తీసుకున్నారని పలువురు మేధావులు విమర్శిస్తున్నారు. ఈ విషయంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖులు, సాహితీవేత్తలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
కులాలు, పార్టీల వారీగా విడిపోతున్న అధికారులు 
వర్సిటీ అధికారులే.. కులాలు, పార్టీల వారీగా విడిపోతుంటే.. విద్యార్థులకు ఎలాంటి విద్యాబుద్ధులు నేర్పుతారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వివాదాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. దీంతో ఈనెల 31న జరగాల్సిన 85వ స్నాతకోత్సవం నిరవధికంగా వాయిదా పడింది.

 

10:49 - May 31, 2018

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వైద్యుల మధ్య వివాదం  మరింత ముదిరింది. ప్రొఫెసర్లు , అసిస్టెంట్‌ ప్రొఫెస్లర్లు మధ్య వయోపరిమితి పెంపుపై రగిలిన వివాదం  సమ్మెదిశగా పయనిస్తోంది. టీచింగ్‌ ప్రొఫెసర్ల పదవీ విరమణ పెంపుతో నూతన నియామకాలు, ప్రమోషన్లకు గండిపడుతుందని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే జూన్‌రెండున గాంధీ ఆస్పత్రిలో ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇవాళ చర్చలకు రావాల్సిందిగా గాంధీ ఆస్పత్రి అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను మంత్రి లక్ష్మారెడ్డి ఆహ్వానించారు. 

 

అగ్రిగోల్డు బాధితులతో మంత్రి నక్కా ఆనందబాబు చర్చలు సఫలం

గుంటూరు : ఏపీలో అగ్రీగోల్డ్‌ బాధితుల ఆందోళన విరమించారు. బాధితులతో మంత్రి నక్కా ఆనందబాబు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమిస్తున్నట్టు అగ్రీగోల్డ్‌ బాధితుల సంఘం ప్రకటించింది. త్వరలో బాధితులతో సీఎం చంద్రబాబుమాట్లాడుతారని మంత్రి హామీ ఇచ్చారు.దీంతో ఆత్మఘోష పాదయాత్రను రద్దు చేసుకున్నట్టు బాధితుల సంఘం ప్రకటించింది. అయితే బాధిత సంఘం నాయకులు అధికారపార్టీ నేతలకు అమ్ముడు పోయారని బాధితుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.  

10:46 - May 31, 2018

గుంటూరు : ఏపీలో అగ్రీగోల్డ్‌ బాధితుల ఆందోళన విరమించారు. బాధితులతో మంత్రి నక్కా ఆనందబాబు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమిస్తున్నట్టు అగ్రీగోల్డ్‌ బాధితుల సంఘం ప్రకటించింది. త్వరలో బాధితులతో సీఎం చంద్రబాబుమాట్లాడుతారని మంత్రి హామీ ఇచ్చారు.దీంతో ఆత్మఘోష పాదయాత్రను రద్దు చేసుకున్నట్టు బాధితుల సంఘం ప్రకటించింది.  అయితే బాధిత సంఘం నాయకులు అధికారపార్టీ నేతలకు అమ్ముడు పోయారని బాధితుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.  

 

10:42 - May 31, 2018

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 4లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. పలుచోట్ల బీజేపీ అభ్యర్థులు వెనుకబడ్డారు. మశ్చిమబెంగాల్‌ మహేష్తల అసెంబ్లీ స్థానంలో  తృణమూల్‌ కాంగ్రెస్‌ లీడింగ్‌లో కొనసాగుతోంది.  యూపీలోని  నూర్పూర్‌లో ఎస్‌పీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అటు మహారాష్ట్ర పాల్ఘర్‌ లోక్‌సభస్థానంలో బీజేపీ-శివసేన మధ్య నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి.  బీహార్‌ జోకీహత్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో జేడీయూ లీడింగ్‌లో ఉండగా..  కర్నాటక ఆర్‌ఆర్‌నగర్‌ అసెంబ్లీ స్థానంలో 4వ రౌండ్‌ ముగిసేసరికి కాంగ్రెస్‌ అభ్యర్థి 18,713 ఓట్ల  ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు ఉత్తరప్రదేశ్‌  కైరానాలో 13,351 ఓట్ల లీడింగ్‌లో ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి ఉన్నారు. మహారాష్ట్రలోని  ఫలూస్‌ కడేగాంవ్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించారు. ఇక  పంజాబ్‌ షాకోట్‌ అసెంబ్లీస్థానంలో కాంగ్రెస్‌ లీడింగ్‌లో కొనసాగుతోంది.  కేరళ చెంగనూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో సీపీఎం ముందంజ ఉంది. జార్ఖండ్‌ సిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో లీడింగ్‌లో  కాంగ్రెస్‌,  బీహార్‌ జోకీపేట్‌ అసెంబ్లీస్థానంలో జేడీయూ అభ్యర్థులు ముందజంలో కొనసాగుతున్నారు.  

 

10:40 - May 31, 2018

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా రెండో రోజు బ్యాంకుల సమ్మె కొనసాగుతోంది. నిన్నటి నుంచి బ్యాంకింగ్ సేవలు పూర్తిగా నిలిచి పోయాయి. వేతన సవరణపై కేంద్ర ప్రభుత్వ దిగిరాకుంటే ఉద్యమాన్ని ఉధృం చేస్తామని బ్యాంకు ఉద్యోగులు యూనియన్లు హెచ్చరించాయి. కాగా  రెండు రోజుల సమ్మె ప్రభావంతో 24 వేల కోట్ల లాభాదేవీలపై ప్రభావం పడనుందని బ్యాంకు యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

 

10:38 - May 31, 2018

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వైద్యుల మధ్య వివాదం మరింత ముదిరింది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెస్లర్లు మధ్య వయోపరిమితి పెంపుపై రగిలిన వివాదం సమ్మెదిశగా పయనిస్తోంది. టీచింగ్‌ ప్రొఫెసర్ల పదవీ విరమణ పెంపుతో నూతన నియామకాలు, ప్రమోషన్లకు గండిపడుతుందని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే జూన్‌రెండున గాంధీ ఆస్పత్రిలో ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇవాళ చర్చలకు రావాల్సిందిగా గాంధీ ఆస్పత్రి అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను మంత్రి లక్ష్మారెడ్డి ఆహ్వానించారు. 

 

ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఢిల్లీ : ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 4 లోక్ సభ స్థానాలకు,11 అసెంబ్లీ స్ధానాలకు ఉప ఎన్నికలకు కౌంటింగ్ జరుగుతోంది. 18 రౌండ్లలో కౌంటింగ్ కొనసాగనుంది. 

10:34 - May 31, 2018

ఢిల్లీ : ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 4 లోక్ సభ స్థానాలకు,11 అసెంబ్లీ స్ధానాలకు ఉప ఎన్నికలకు కౌంటింగ్ జరుగుతోంది. 18 రౌండ్లలో కౌంటింగ్ కొనసాగనుంది. కర్నాటక ఆర్‌.ఆర్‌ నగర్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌కు 4,122 ఓట్ల ఆధిక్యం ఉంది. మహారాష్ట్ర పాల్ఘర్‌ లోక్‌సభ స్థానంలో, యూపీ కైరానాలో బీజేపీ వెనుకంజ, ఆర్‌ఎల్డీ ముందంజలో ఉంది. పంజాబ్‌ షాకోట్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ లీడింగ్‌ లో ఉంది. పశ్చిమబెంగాల్‌ మహేష్తలా అసెంబ్లీ స్థానంలో తృణమూల్‌ లీడింగ్‌ లో ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

10:29 - May 31, 2018

గుంటూరు : ఏపీలో అగ్రీగోల్డ్‌ బాధితుల ఆందోళన రెండోరోజు కొనసాగుతోంది. బాధితులతో మంత్రి నక్కా ఆనందబాబు సమావేశం అయ్యారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి అన్నారు. ఆందోళన విరమించాలని మంత్రి ఆనంద్‌బాబు సూచించారు. సమస్య పరిష్కారం కావడం విపక్షాలకు ఇష్టంలేదని.. ఆస్తుల వేలంలో మోసం జరుగుతోందని ఆరోపిస్తూ.. అడ్డంకులు సృష్టిస్తున్నారని మంత్రి విమర్శించారు. అయితే ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

10:24 - May 31, 2018

గుంటూరు : పట్టణంలో భారీ అగ్నిప్రమాం సంభవించింది. మిర్చి యార్డు సమీపంలోని విజీటి కోల్డ్‌ స్టోరేజ్‌లోమంటలు ఎగిసిపడ్డాయి. ఐదంతస్తుల  బిల్డింగ్‌ నుంచి భారీగా పొగలు వస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్‌ ఇంజన్‌లతో మంటల్ని అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. గోడౌన్‌లో  నిల్వ ఉంచిన మిర్చి బస్తాలను బయటికి తరలిస్తున్నారు. మంటలు అదుపులోకి రావడానికి మరో 24 గంటల సమయం పడుతుందంటున్నారు. 

10:20 - May 31, 2018

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వైద్యుల మధ్య వివాదం  మరింత ముదిరింది. ప్రొఫెసర్లు , అసిస్టెంట్‌ ప్రొఫెస్లర్లు మధ్య వయోపరిమితి పెంపుపై రగిలిన వివాదం  సమ్మెదిశగా పయనిస్తోంది. టీచింగ్‌ ప్రొఫెసర్ల పదవీ విరమణ పెంపుతో నూతన నియామకాలు, ప్రమోషన్లకు గండిపడుతుందని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే జూన్‌రెండున గాంధీ ఆస్పత్రిలో ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇవాళ చర్చలకు రావాల్సిందిగా గాంధీ ఆస్పత్రి అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను మంత్రి లక్ష్మారెడ్డి ఆహ్వానించారు. 

రెండో రోజు బ్యాంకుల సమ్మె

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా రెండో రోజు బ్యాంకుల సమ్మె కొనసాగుతోంది. నిన్నటి నుంచి బ్యాంకింగ్ సేవలు పూర్తిగా నిలిచి పోయాయి. వేతన సవరణపై కేంద్ర ప్రభుత్వ దిగిరాకుంటే ఉద్యమాన్ని ఉధృం చేస్తామని బ్యాంకు ఉద్యోగులు యూనియన్లు హెచ్చరించాయి. కాగా  రెండు రోజుల సమ్మె ప్రభావంతో 24 వేల కోట్ల లాభాదేవీలపై ప్రభావం పడనుందని బ్యాంకు యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

రెండో రోజు బ్యాంకుల సమ్మె

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా రెండో రోజు బ్యాంకుల సమ్మె కొనసాగుతోంది. నిన్నటి నుంచి బ్యాంకింగ్ సేవలు పూర్తిగా నిలిచి పోయాయి. వేతన సవరణపై కేంద్ర ప్రభుత్వ దిగిరాకుంటే ఉద్యమాన్ని ఉధృం చేస్తామని బ్యాంకు ఉద్యోగులు యూనియన్లు హెచ్చరించాయి. కాగా  రెండు రోజుల సమ్మె ప్రభావంతో 24 వేల కోట్ల లాభాదేవీలపై ప్రభావం పడనుందని బ్యాంకు యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

10:02 - May 31, 2018

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా రెండో రోజు బ్యాంకుల సమ్మె కొనసాగుతోంది. నిన్నటి నుంచి బ్యాంకింగ్ సేవలు పూర్తిగా నిలిచి పోయాయి. వేతన సవరణపై కేంద్ర ప్రభుత్వ దిగిరాకుంటే ఉద్యమాన్ని ఉధృం చేస్తామని బ్యాంకు ఉద్యోగులు యూనియన్లు హెచ్చరించాయి. కాగా  రెండు రోజుల సమ్మె ప్రభావంతో 24 వేల కోట్ల లాభాదేవీలపై ప్రభావం పడనుందని బ్యాంకు యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

 

09:56 - May 31, 2018

పెట్రోల్, డీజిల్ ధరలపై పైసా తగ్గించడం అపహాస్యంగా ఉందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు వినయ్ కుమార్, బీజేపీ నేత విష్ణు, టీడీపీ నేత రాజామాస్టర్ పాల్గొని, మాట్లాడారు. కేంద్రప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

09:47 - May 31, 2018

తెలంగాణలో రైతాంగం పోరుబాట పట్టింది. ఖమ్మం నుంచి కరీంనగర్‌ వరకు తెలంగాణ రైతుల సంఘం ఆధ్వర్యంలో సడక్‌ బంద్‌ జరగనుంది. కౌలు రైతులకు కూడా రైతు బంధు పథకం అమలు చేయాలని.. పండిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని.. ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌ వెంటనే రూపొందిచాలని డిమాండ్‌ చేస్తూ వారు ఆందోళన బాట పట్టారు. వారి ఆందోళనకు గల కారణాలు.. ప్రభుత్వ పాలసీలపై తెలంగాణ రైతు సంఘం నాయకులు హరిబండి ప్రసాద్‌రావు మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

09:41 - May 31, 2018

ఢిల్లీ : పైసా తగ్గించాం...పండగ చేస్కోండి...అన్నట్లుంది ఆయిల్‌ కంపెనీల తీరు. లీటర్‌ పెట్రోల్‌ డీజిల్‌పై ఒక్క పైసను తగ్గించడం ద్వారా తామేదో మేలు చేశామన్నట్లు ఫోజు కొట్టాయి. ఈ చర్యతో ఆయిల్‌ కంపెనీలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అభాసుపాలైంది. ఆయిల్‌ కంపెనీల తీరుపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు మజాక్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేరళ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ ధరలపై ఒక రూపాయి తగ్గించింది.

గత 16 రోజులుగా పెట్రోల్‌ డీజిల్‌ ధరల పెంపుతో పరేషాన్‌ అవుతున్న ప్రజలకు ఆయిల్‌ కంపెనీలు కొంత ఊరట కలిగించే ప్రకటన చేశాయి. లీటర్‌ పెట్రోల్‌ ధరపై 60 పైసలు, లీటర్‌ డీజిల్‌ ధరపై 56 పైసలు తగ్గించినట్లు  ప్రకటించాయి. ఈ ప్రకటనతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎంతో కొంత తగ్గాయని వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారో లేదో...ఇంతలోనే కేవలం ఒక్క పైసా మాత్రమే తగ్గించామని... ఆయిల్‌ కంపెనీల ద్వారా మరో ప్రకటన వెలువడింది. తమ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని... పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పునఃసమీక్షిస్తున్నమంటూ పేర్కొన్నాయి.

ఆయిల్‌ కంపెనీల ప్రకటనపై ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఒక్క పైస తగ్గించడం ద్వారా ప్రధాని వేళాకోళం చేస్తున్నారని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. తాను చేసిన ఫ్యూయల్‌ ఛాలేంజ్‌పై మోది సరైన రీతిలో స్పందించలేదన్నారు.
 
పైసా తగ్గించడంతో దేశ ప్రజలు ఆనందంతో డాన్స్‌ చేస్తున్నారని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అనుకుంటున్నారని కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారీ ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు. పైసా తగ్గింపుతో బడ్జెట్‌లో తామెంతో ఆదా చేశామని మరో కాంగ్రెస్‌ నేత ప్రియాంకా చతుర్వేది ట్వీట్‌ చేశారు.

పైసా తగ్గింపుతో తామేదో గొప్ప ఔనత్యాన్ని చాటుకున్నట్లు ఆయిల్‌ కంపెనీలు ఫోజు కొట్టాయి. పెంచేటపుడు మాత్రం రూపాయాల్లో బాదేసి...తగ్గించేటపుడు పైసల్లో తగ్గించడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పైసా తగ్గింపుతో తామేమి పండగ చేసుకోవాలంటూ సోషల్‌ మీడియాలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెంచని కేంద్ర ప్రభుత్వం..ఎన్నికలు ముగియగానే ప్రజలకు చుక్కలు చూపించింది. లీటర్‌కు రూ.3.80 పైసలు, డీజిల్‌పై రూ.3.38 పైసలు పెరిగాయి. ఇదిలా ఉంటే కేరళ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ ధరలపై ఒక రూపాయి తగ్గించింది.

08:47 - May 31, 2018

హైదరాబాద్ : అధికారుల నిర్లక్ష్యం ఇద్దరు కార్మికుల ప్రాణాలను బలిగొంది. జలమండలి వాటర్‌ పైప్‌లైన్‌ నిర్మాణం పనుల్లో భాగంగా... ఇద్దరు కార్మికులు మ్యాన్‌ హోల్‌లోకి దిగి సెంట్రింగ్‌ కర్రలు తీస్తుండగా విషవాయువులు వెలువడ్డాయి. దీంతో కార్మికులు మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  
మ్యాన్‌ హోల్‌లోకి దిగిన ఇద్దరు కార్మికులు మృతి 
హైదరాబాద్‌ ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం వద్ద విషాదం నెలకొంది. జల మండలి వాటర్‌పైప్‌లైన్‌ నిర్మాణ పనుల్లో భాగంగా మ్యాన్‌ హోల్‌లోకి దిగిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సెంట్రింగ్‌ కర్రలు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
విషవాయువుల కారణంగా ఊపిరి ఆడక మృతి 
ఉప్పల్‌ స్టేడియం రోడ్డులో రెండు భారీ పైపులైన్‌లను వేరు చేస్తూ ఇన్స్‌పెక్షన్‌ ఛాంబర్ నిర్మించారు. అయితే ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగడంతో ఆ ఛాంబర్‌ కోసం ఏర్పాటు చేసిన సెంట్రింగ్‌ కర్రలు తొలగించలేదు. ఇటీవలే మ్యాచ్‌లు పూర్తి కావడంతో ఎల్‌ అండ్‌ టీకి నిర్మాణ సంస్థ అధికారులు అక్కడ పనులు మొదలు పెట్టారు. అయితే ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా చాంబర్‌లో ఉన్న సెంట్రింగ్‌ను తొలగించాలని కార్మికులను ఆదేశించారు అధికారులు. దీంతో మ్యాన్‌హోల్‌లోకి దిగిన కార్మికులు విషవాయువుల కారణంగా ఊపిరి ఆడక చనిపోయారు. వీరిద్దరూ ఒరిస్సాకు చెందిన సంతోష్‌,విజయ్‌లుగా గుర్తించారు. 
ఘటనపై పూర్తి స్థాయి విచారణ 
ఘటనా స్థలాన్ని జలమండలి అధికారులు పరిశీలించారు. కార్మికుల మృతితో ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇచ్చి, బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామన్నారు. చనిపోయిన వారి కుటుంబీకులకు 10 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. అయితే ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కొన్ని నిర్మాణ సంస్థలు తమ తీరు మార్చుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే మరిన్ని ప్రాణాలు బలి కావాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు.
 

 

08:38 - May 31, 2018

కరీంనగర్ : కరీంనగర్...వరంగల్ ప్రధాన రహదారి మృత్యు మార్గాన్ని తలపిస్తోంది. తరుచుగా జరుగుతున్న ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోగా.. మరెందరో క్షతగాత్రులవుతున్నారు.  రెండేళ్ల క్రితమే జాతీయ రహదారి పరిధిలోకి వెళ్లినా.. రోడ్డు విస్తరణ జరగక పోవడం ప్రజల పాలిట శాపంగా మారింది. నెత్తురోడుతున్నరహదారి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. 
అతివేగంతో నిత్యం వందలాది వాహనాలు 
ఇది కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారి. ఇక్కడ నిత్యం వందలాది వాహనాలు అతివేగంతో దూసుకెళ్తుంటాయి.  దీంతో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు పై నెత్తురు చిందుతూనే ఉంటుంది. మానకొండూర్ చెరువు మూల మలుపు, శంషాబాద్, చెంజర్ల మూల మలుపు, తాడికల్ మూల మలుపు, కొత్తగట్టు, ఎరుకల గూడెం క్రాసింగ్, ఈదల గట్టెపల్లి, సింగాపురం, తుమ్మనపల్లి వంతెన, పెంచికల్ పేట, కోతుల నడుమ క్రాసింగ్ వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి.  డేంజర్‌ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో  హెచ్చరికల బోర్డులు పెట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది.
చెంజర్ల వద్ద రోడ్డు ప్రమాదం
మానకోండుర్ మండలం చెంజర్ల వద్ద మంగళ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగంతో దూసుకొచ్చిన లారీ.. ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో.. బస్సు ఒక వైపు నుజ్జు నుజ్జయింది. నేతలు, అధికారులు పరామర్శలకు పరిమితం కావడం తప్ప.. నివారణ చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
గంటకు సుమారుగా 300 నుంచి 500 వరకు వాహనాలు  
ఈ రహదారిలో గంటకు సుమారుగా 300 నుంచి 500 వరకు వాహనాలు వెళ్తున్నట్లు అధికారులే చెప్తున్నారు. 30 టన్నుల సామర్థ్యం ఉన్నవాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. కానీ చాలా వాహనాలు ఓవర్ లోడ్‌తో వెళ్తున్నా పోలీసు, రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేశవ పట్నం, హుజురాబాద్, ఎల్కతుర్తి వరకు ప్రధాన రహదారి పక్కనే పోలీసు స్టేషన్లు ఉన్నా వాహనదారులు లెక్కచేయడంలేదు.
2015లో మంత్రి ఈటెల వాహనం బోల్తా
2015లో హుజురాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న మంత్రి ఈటెల రాజేందర్ వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఇంత వరకూ ఆ ప్రదేశంలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. ఈ నెల 10న సీఎం సభకు బందోబస్తుకు వెళ్లి వస్తుండగా చెంజర్ల వద్ద పోలీస్ వాహనం-కారు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 20 రోజుల క్రితం శంషాబాద్ వద్ద  ఒకరు, తాడికల్ ఐదుగురు, కొత్తగట్టు వద్ద ముగ్గురు, సింగాపురం వద్ద ఇద్దరు, మృత్యువాత పడ్డారు. ఏడాదిన్నర వ్యవధిలో తాడికల్, హుజురాబాద్ మధ్య జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 54 మంది వరకు మృతి చెందారు. 36 మంది గాయపడ్డారు.
130 కి.మీ మేర జా.రహదారిగా మార్చాలని నిర్ణయం
జగిత్యాల నుంచి వరంగల్ వరకు 130 కిలో మీటర్ల మేర జాతీయ రహదారిగా మార్చాలని రెండేళ్ల క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి మూడు వేల కోట్ల నిధులు, ఐదువందలా నలభై హెక్టార్లకు పైగా భూ సేకరణ చేయాలని అధికారులు నిర్ణయించారు. జగిత్యాల, వరంగల్ మధ్య ఐదు బైపాస్ రోడ్లు నిర్మాణానికి  332.92 హెక్టార్ల భూమి అవసరమని డిపిఆర్ రూపొంచారు. కానీ... భూ సేకరణకు ఆదిలోనే సమస్యలు తలెత్తాయి. పరిసర గ్రామాల ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో పనులు నిలిచి పోయాయి. మంత్రి ఈటెల రాజేందర్  చొరవ చూపినా ఫలితం లేకుండా పోతోంది.
రెండేళ్ల క్రితమే నేషనల్ హైవే పరిధిలోకి 
ఆర్ అండ్ బీ పరిధిలోని ఈ రహదారి రెండేళ్ల క్రితమే నేషనల్ హైవే పరిధిలోకి వెళ్లింది. దీంతో స్థానిక అధికారులు దాన్ని పట్టించుకోవడం మానేశారు.  తరుచు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై నిపుణుల కమిటి వేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదు. కనీసం వాహనాల వేగాన్ని నియంత్రించినా...  కొంత మేరకు ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. ప్రాణాలు పోయాక పరిహారం ఇచ్చినంత మాత్రాన పోయినోళ్ళు తిరిగిరారు. అధికారుల దృష్టిలో ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి ప్రాణ నష్టాన్ని అరికట్టాలని కోరుతున్నారు. 

 

08:32 - May 31, 2018

సంగారెడ్డి : సంగారెడ్డి బంద్ కొనసాగుతోంది. బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ నేడు కాంగ్రెస్ బంద్ కు పిలుపునిచ్చింది. ఇదే డిమాండ్ పై కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జంగ్గారెడ్డి మూడు రోజుల పాటు చేసిన నిరాహార దీక్ష ముగిసింది. నిరసన దీక్ష ముగిసినా.. మెడికల్‌ కాలేజీ సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ ఇవ్వకపోతే... 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఇస్తుందని.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. 

08:23 - May 31, 2018

సంగారెడ్డి : జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న డిమాండులో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జంగ్గారెడ్డి  మూడు రోజుల పాటు చేసిన నిరాహార దీక్ష ముగిసింది. నిరసన దీక్ష ముగిసినా.. మెడికల్‌ కాలేజీ సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ ఇవ్వకపోతే... 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఇస్తుందని.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని దీక్ష 
జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేపట్టిన మూడు రోజుల దీక్ష ముగిసింది. రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి జగ్గారెడ్డి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. చివరి రోజు దీక్ష ముగింపు కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎమ్మెల్యే గీతారెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. 
సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ ఇవ్వాలి : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
సంగారెడ్డిలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి స్థాయి పెంచి మెడికల్‌ కాలేజీగా మార్పుచేస్తే సరిపోతుందని  తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. సంగారెడ్డికి మంజూరు చేసిన మెడికల్‌ కాలేజీని మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటకు తరలించుకుపోయారన్నది జగ్గారెడ్డి వాదన. సూర్యాపేటకు కొత్తగా మెడికల్‌ కాలేజీ మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సంగారెడ్డికి ఎందుకు ఇవ్వరని టీపీసీసీ నాయకులు ప్రశ్నించారు. సంగారెడ్డికి వెంటనే మెడికల్‌ కాలేజీ ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. లేకపోతే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ మంజూరు చేస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. 
పోరాటం కొనసాగుతుందన్న జగ్గారెడ్డి  
దీక్ష విరమించినా... ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సంగారెడ్డికి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ అవసరమని జగ్గారెడ్డి దీక్ష ముగింపు కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్‌ నాయకులు చెప్పారు. 
 

08:16 - May 31, 2018

హైదరాబాద్ : ఆర్టీసీని మూసేసి కార్పొరేట్‌ శక్తులకు అప్పనంగా కట్టబెట్టేందుకు సీఎం కేసీఆర్‌ యత్నిస్తున్నారని తెలంగాణ ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కన్వీనర్‌ కె. రాజిరెడ్డి విమర్శించారు.  కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని అడిగితే... కార్మికుల వల్లే ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  హైదరాబాద్‌లోని సీబీఎస్‌ దగ్గర.. ఆర్టీసీ పరిరక్షణ - కార్మికుల వేతన ఒప్పందం - ప్రభుత్వ వైఖరి అనే అంశంపై బహిరంగ నిర్వహించారు.  కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులు, యూనియన్లపట్ల వివక్ష చూపుతున్నారని అన్నారు. తమ డిమాండ్లపై స్పందించకుంటే.... సమ్మెతో సహా ఎలాంటి పోరాటానికైనా సిద్దంగా ఉండాలని కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు.  ఆర్టీసీ చెట్టును సీఎం కేసీఆర్‌ నరికివేసేందుకు  కుట్రలు చేస్తున్నారని కో- కన్వీనర్‌ వీఎస్‌ రావు అన్నారు. 

 

08:14 - May 31, 2018

హైదరాబాద్ : కిన్నెరసాని ప్రాజెక్టు కింద వచ్చే ఖరీఫ్‌కు పదివేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.  ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని సూచించారు.  సచివాలయంలో ఆయన మిషన్‌ కాకతీయ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.  మిషన్‌ కాకతీయ పనులు పూర్తైన వెంటనే... వాటిని ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. చెరువుల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. పనులు మందగించేచోట్ల సీఈలు వెళ్లి పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు.

 

08:11 - May 31, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ కంటూ ప్రత్యేక చిహ్నాలు లేకపోవడంతో.. ఈ మేరకు వాటిని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వేప చెట్టును రాష్ట్ర వృక్షంగా... కృష్ణ జింకను రాష్ట్ర జంతువుగా ఖరారు చేసింది. రామ చిలుకను రాష్ట్ర పక్షిగా.... మల్లెపువ్వును రాష్ట్ర పుష్పంగా గుర్తిస్తూ అటవీశాఖ ముఖ్యకార్యదర్శి అనంతరాము జీవోను విడుదల చేశారు. తాజా చిహ్నాలు జూన్‌ 6 నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి.

 

08:03 - May 31, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై చంద్రబాబు, మోదీ కలిసి రాష్ట్రాన్ని మోసం చేశారని వైసీపీ ఆరోపించింది. ఇద్దరి మోసంతో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. విభజన హామీల అమలుపై బాబు, మోదీ ద్రోహం చేశారని విమర్శించారు.

 

07:49 - May 31, 2018

గుంటూరు : మారుమూల ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం రెండు ఆరోగ్య రథాలను ప్రవేశపెట్టింది. వీటిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలో ప్రారంభించారు. సీలేరు, కడప జిల్లాల్లో ఈ ఆరోగ్యరథాలు ప్రజలకు వైద్యసేవలు అందించనున్నాయి. ఇందులో ఉచితంగానే రోగులకు మందులు, వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.
రెండు ఆరోగ్య రథాలను ప్రారంభించిన సీఎం
మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.  రెండు ఆరోగ్య రథాలను సిద్ధం చేసింది. 90 లక్షల విలువైన ఈ రెండు ఆరోగ్య రథాలను సీఎం చంద్రబాబు తన నివాసమైన ఉండవల్లిలో  ప్రారంభించారు. జెండా ఊపి ఆరోగ్య రథాలను ప్రారంభించారు. 
ఆరోగ్య రథాలకు డబ్బును సమకూర్చిన ఏపీ జెన్‌కో
కార్పొరేట్‌ సర్వీసు రెస్పాన్స్‌బిలిటీ నిబంధన కింది ఏపీ జెన్‌కో 90లక్షలు సమకూర్చింది.  ఈ రెండు ఆరోగ్య రథాలలో ఒక వాహనాన్ని సీలేరు.. మరో వాహనాన్ని కడప జిల్లాకు కేటాయించారు. ఈ  ఆరోగ్య రథాలతో వివిధ రోగాలకు సంబంధించిన 150 వైద్య పరీక్షలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఈసీజీ, రక్తపరీక్షలు, ఐదు పెరామీటర్‌ మానిటరింగ్‌ సిస్టం, నీరుడు పరీక్ష, నెబురైజర్, హార్ట్‌ఎటాక్‌ వచ్చిన రోగికి వైద్య సేవలు అందించి.. ప్రమాదం నుంచి రక్షించుటకు తగిన సౌకర్యాలు ఈ ఆరోగ్య రథాలలో ఏర్పాటు చేశారు. 
ఉచితంగా రోగులకు మందులు
ఆరోగ్య రథాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఆయా గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందిస్తాయి. ఈ రథాలలో ఒక మెడికల్‌ ఆఫీసరు, ఫార్మాసిస్ట్‌ స్టాఫ్‌నర్సు, టెక్నీషియన్‌ ఉంటారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగానే అందజేయనున్నారు. మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూలాంటి వ్యాధులకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. కేన్సర్‌లాంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించి.. ఎన్టీఆర్‌ వైద్యసేవ ఆసుపత్రులకు పంపిస్తారు. రోగులకు సంబంధించిన వివరాలను ఎలక్ట్రానిక్‌ మెడిక్‌ రికార్డులో అప్లోడ్‌ చేసి రోగి ఆధార్‌కార్డును అనుసంధానం చేస్తారు.  ఆరోగ్య రథాలకు ఒక్కోదానికి అదనంగా 3 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతాల ప్రజలు ఎవరైనా పీహెచ్‌సీకి రాలేనివారు ఉంటే..ఈ అంబులెన్స్‌లు ఆయా గ్రామాలకు పంపి ఇంటి వద్దనే ఉచిత సేవలు అందిస్తుంది.

 

07:46 - May 31, 2018

హైదరాబాద్ : ఉద్యోగుల పదవీకాలం పొడిగిస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.. కానీ గాంధీ ఆసుపత్రిలో వైద్య యూనిట్ మాత్రం వద్దు మొర్రో అంటోంది. వైద్య రంగంలో పదవీ విరమణ వయస్సును 65ఏళ్ళకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. దీన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు గాంధీ వైద్యులు. అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షకు సైతం సిద్ధం అంటున్నారు. ఇంతకీ వీళ్ల  డిమాండ్ ఏంటి..? ఎందుకింత తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. 
రిటైర్మెంట్‌ వయోపరిమితి పెంపుపై మిశ్రమ స్పందన
వైద్యరంగంలో పదవీ విరమణ వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం జారీచేసిన జీవోపట్ల కొందరు వైద్యులు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైద్యుల పదవీ విరమణ వయసును 57 ఏళ్ళ నుంచి 65కు  పెంచుతూ జీవో నెంబర్ 86ని అధికారికంగా జారీ చేసింది ప్రభుత్వం. కానీ.. దీనివల్ల టీచింగ్ ఉద్యోగులకు మాత్రమే న్యాయం జరిగేలా ఉందని.. కొందరు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో సివిల్ సర్జన్లు మాత్రమే లాభ పడుతారంటున్న కొందరు వైద్యులు 
రిటైర్మెంట్‌ వయోపరిమితి పెంచడం వల్ల ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తున్న సివిల్ సర్జన్లు మాత్రమే లాభ పడుతారని కొందరు వైద్యులు ఆరోపిస్తున్నారు. ఏళ్ళ తరబడి మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు. నియామకాలు, పదోన్నతులు రావంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాంధీ వైద్య యూనిట్.. ఛలో రాజ్‌భవన్‌
జీవో 86ను వ్యతిరేకిస్తూ.. గాంధీ వైద్య యూనిట్ ఛలో రాజ్‌భవన్‌ కార్యక్రమం చేపట్టింది. ఏడుగురు సభ్యుల వైద్య బృందం గవర్నర్‌ను కలిసి నివేదిక ఇచ్చింది. దీని పై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే జూన్ 2నుంచి కేసీఆర్ ఆదర్శంగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని గాంధీ వైద్యుల బృందం హెచ్చరిస్తోంది.
రెండు మూడు గ్రూపులుగా వైద్యులు  
ప్రభుత్వం ఇప్పటికే వైద్యులకు చాలా చేసిందని.. ఇకపై వారు చెప్పినట్లు చేసేందుకు వైద్య శాఖ సిద్ధంగా లేదంటున్నారు ఉన్నతాధికారులు. దీనికి తోడు వైద్యులు రెండు మూడు గ్రూపులుగా విడిపోయారు. సమన్వయం, ఐక్యత లేకపోవడంతో వారి నిరసన గళంలో తీవ్రత తగ్గిపోయింది. 
 

 

నేడు జగన్ ప్రజా సంకల్పయాత్రకు విరామం

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్రకు నేడు విరామం ప్రకటించారు. తీవ్ర జ్వరం, జలుబుతో జగన్ బాధపడుతున్నారు. వైద్యుల సూచన మేరకు పాదయాత్రకు ఆయన విరామం ప్రకటించారు.

 

నేడు ఉప ఎన్నికల ఫలితాలు విడుదల

ఢిల్లీ : నేడు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 4 లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 

 

నేడు విజయనగరం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

విజయనగరం : నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటించనున్నారు. కురుపాం, పార్వీతీపురం, బొబ్బిలి నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. 

వీజీటీ కోల్డ్ స్టోరేజీలో అగ్నిప్రమాదం

గుంటూరు : మిర్చియార్డు సమీపంలోని వీజీటీ కోల్డ్ స్టోరేజీలో అగ్నిప్రమాదం జరిగింది. ఐదో అంతస్తు నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.

Don't Miss