Activities calendar

01 June 2018

21:27 - June 1, 2018

హైదరాబాద్ : లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీలు ఉద్యమబాట పట్టనున్నారు. జూన్‌ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్వయం పాలన ప్రకటించుకొని నిరసన తెలపనున్నారు. మా ఊరిలో మా రాజ్యం నినాదంతో ఆదివాసీలు సమరశంఖం పూరించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ గ్రామాల్లోని ఆదివాసీలు ఈ నిరసనలో పాల్గొననున్నారు. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల తమ మనుగడకే ప్రమాదం ఏర్పడిందని భావించిన ఆదివాసీలు ఉద్యమ బాట పట్టారు. ఇప్పటికే గూడెంలలోని పాఠశాలలో ఉన్న లంబాడా టీచర్లను బహిష్కరించారు ఆదివాసీలు. 

శనివారం నుండి నవ నిర్మాణ దీక్షలు...

విజయవాడ : ఏపీలో శనివారం నుంచి నవనిర్మాణ దీక్షలు జరుగనున్నాయి. విజయవాడ వేదికగా సాగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారు. బెంజ్‌ సర్కిల్‌లో ఉదయం 9 నుంచి రెండు గంటల పాటు దీక్షను నిర్వహిస్తారు. 

సింగపూర్ లో మోడీ...

ఢిల్లీ : భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో విదేశీ పెట్టుబడులకు సింగపూర్‌ ప్రధాన కేంద్రంగా మారిందని ప్రధాని నరేంద్రమోది అన్నారు. సింగపూర్‌ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని లీ హసిన్‌ లూంగ్‌, అధ్యక్షురాలు హలీమా యాకోబ్‌లతో మోది సమావేశమయ్యారు. 

ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు...

బీహార్‌ : బుద్ధ గయలో 2013లో జరిగిన వరుస పేలుళ్ళ కేసులో దోషులకు ఎన్‌ఐఏ కోర్టు జీవిత ఖైదు విధించింది. నాలుగేళ్ల పది నెలల సుదీర్ఘ విచారణ తర్వాత మే 25న ఇండియన్‌ ముజాహిదీన్‌కు చెందిన ఐదుగురు నిందితులను కోర్టు దోషులుగా ఖరారు చేసింది. 

ఆదావాసీల ఉద్యమ బాట...

హైదరాబాద్ : లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీలు ఉద్యమబాట పట్టనున్నారు. జూన్‌ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్వయం పాలన ప్రకటించుకొని నిరసన తెలపనున్నారు. మా ఊరిలో మా రాజ్యం నినాదంతో ఆదివాసీలు సమరశంఖం పూరించనున్నారు. 

అన్నదాతల ఆందోళన బాట...

ఢిల్లీ : రుణమాఫి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. దేశ వ్యాప్తంగా 10 రోజుల సమ్మెకు రైతులు శ్రీకారం చుట్టారు. పాలు, కూరగాయలను రోడ్డుపై పారేసి తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రీయ కిసాన్‌ మహాసంఘ్‌తో పాటు 130 రైతులు సంఘాలు ఈ సమ్మెలో పాల్గోనున్నాయి.

21:12 - June 1, 2018

విజయవాడ : ఏపీలో శనివారం నుంచి నవనిర్మాణ దీక్షలు జరుగనున్నాయి. విజయవాడ వేదికగా సాగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారు. బెంజ్‌ సర్కిల్‌లో ఉదయం 9 నుంచి రెండు గంటల పాటు దీక్షను నిర్వహిస్తారు. అదే సమయంలో.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు.. ప్రజలను కలుపుకు పోతూ.. నవనిర్మాణ దీక్షను చేపడతారు. రాష్ట్ర విభజన తర్వాత.. ప్రతి ఏడాదీ నిర్వహిస్తున్నట్లే.. ఈసారీ జూన్‌ రెండో తేదీ నుంచి.. ఏపీలో నవనిర్మాణ దీక్షలు చేపట్టనున్నారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా విజయవాడ వేదికపై, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణ దీక్షలో పాల్గొంటారు. బందరు రోడ్డులోని బెంజ్‌ సర్కిల్‌లో ఉదయం 9 గంటల నుంచి 11 వరకూ దీక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

బెంజ్‌ సర్కిల్‌లో నవనిర్మాణ దీక్షకు దాదాపు 25 వేల మందిని సమీకరించే పనిలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఎండలను దృష్టిలో ఉంచుకుని దీక్షాస్థలి వద్ద నాలుగు వైపులా కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రాథమిక చికిత్సలు అందించేందుకు వైద్య బృందాన్నీ అందుబాటులో ఉంచుతున్నారు. దీక్షలో పాల్గొన్న వారితో సీఎం ప్రతిజ్ఞ చేయించిన అనంతరం విభజన చట్టం హామీలు, వాటి అమలు తీరుతెన్నులపై దీక్షలో సీఎం ప్రసంగించనున్నారు.

నవనిర్మాణ దీక్షలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. దీక్ష సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. జూన్‌ 1వ తేదీ రాత్రి నుంచి 2వ తేదీ మధ్యాహ్నం వరకు ట్రాఫిక్‌ మళ్లింపు అమలులో ఉటుందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

విజయవాడతో పాటు.. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 970 గ్రామ పంచాయితీలు, 275 మున్సిపల్‌ వార్డుల్లో నవనిర్మాణ దీక్షలు సజావుగా జరిగేలా నోడల్‌ ఆఫీసర్లకు, మండలస్థాయిలో స్పెషల్‌ ఆఫీసర్లకు కలెక్టర్‌ లక్ష్మీకాంతంకు బాధ్యతలు అప్పగించారు. జూన్‌ 2 నుంచి 8వ తేదీ వరకూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ నవనిర్మాణ దీక్షలు చేపడతారు. బెంజ్‌ సర్కిల్‌లో నవనిర్మాణ దీక్ష చేపట్టడం పై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కల్గించే చర్యలు ఉపసంహరించుకోవాలని వారు కోరుతున్నారు.

21:09 - June 1, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనలో ఏ వర్గానికీ ఒరిగిందేమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రచార ఆర్భాటం తప్ప కేసీఆర్ చేసింది శూన్యమని అన్నారు. గతంలో సాధ్యం కాదన్న ఉచిత విద్యుత్‌ను అమలుచేసి చూపించిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

21:08 - June 1, 2018

హైదరాబాద్ : 2022 నాటికి హైదరాబాద్‌ను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చడమే లక్ష్యమని ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అలాగే బేగంపేటలో నిర్వహించిన ఐటీ వార్షిక నివేదిక విడుదల కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టీ-వెబ్‌ను ఆవిష్కరించారు.

ప్రపంచ పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌- పీపుల్స్‌ ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో యునైటెడ్ నేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏరిక్ సోలీహితో కలిసి ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ సాలీడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్‌ను అద్భుతంగా నిర్వహిస్తుందని కేటీఆర్‌ అభినందించారు. చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కేంద్రాలను మరికొన్ని పెంచేందుకు ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయం తీసుకుందని అన్నారు. భవిష్యత్‌లో 100 మెగావాట్ల విద్యుత్‌ను చెత్త ద్వారా ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.

హైదరాబాద్‌లో వాహన కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని 3800 బస్సుల స్థానంలో దశల వారిగా ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. ఇందులో మొదటి విడతగా 5 వందల బస్సులను 6 నెలల్లో తీసుకువస్తామన్నారు. అలాగే చెత్త సేకరణకు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 3300 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ.. రాష్ట్రం దేశంలోనే నెం.1 గా ఉందని కేటీఆర్‌ అన్నారు. సోలార్ ఎనర్జీ ఉత్పత్తిలో వచ్చే రెండేళ్లలో 3300 మెగావాట్ల ఉత్పత్తి నుంచి 5000 మెగావాట్ల ఉత్పత్తికి చేరుకోవటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు.

అంతకుముందు అక్కడున్న వారిచే నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు కేటీఆర్ ప్రతిజ్ఞ చేయించారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీహెచ్‌ఎంసీ సిబ్బందికి 20 ఎలక్ట్రిక్ వాహనాలను ఆయన అందజేశారు. చెత్త తరలింపునకు స్వచ్ఛ ఆటో టిప్పర్‌లను ప్రారంభించారు. అనంతరం బేగంపేటలో ఐటీ వార్షిక నివేదిక విడుదల కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీ-వెబ్‌ను, టీ-శ్వాన్‌ రెండో దశను కేటీఆర్ ప్రారంభించారు. టీ-వెబ్ ద్వారా ప్రభుత్వ వెబ్‌సైట్లన్నీ అనుసంధానం చేయనుండగా.. టీ-శ్వాన్ ద్వారా జిల్లా, మండల కేంద్రాల్లోని కార్యాలయాలను ప్రభుత్వం అనుసంధానించనుంది. ఇక తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు కేటీఆర్‌. ప్రాజెక్టు పూర్తైతే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాలుగు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఫైబర్‌ గ్రిడ్‌ సేవలను పరిశీలించామని చెప్పారు. నగరంలో ప్రభుత్వం చేయబోయే పనులను మంత్రి కేటీఆర్‌ వివరించారు.

21:05 - June 1, 2018

విజయనగరం : రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం నాయకులు అడ్డంగా దోచుకొంటున్నారని మండిపడ్డారు. ప్రజలు ఏ పని కోసం వెళ్లినా.. ఎంత ఇస్తావనే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా సాలూరు పోరాట యాత్రలో పవన్‌ కల్యాణ్‌... టీడీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయిందని, అంగన్‌వాడీ ఆయా పోస్టుల భర్తీకి లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

తెలుగుదేశం నేతలు బాక్సైట్‌ ఖనిజాన్ని అక్రమంగా తవ్వేస్తూ, గిరిజన సంస్కృతి, సంప్రదాయలను ధ్వంసం చేస్తున్నారని జనసేనాని మండిపడ్డారు. గిరిజనుల భూములకు అందాల్సిన పెద్దగెడ్డ రిజర్వాయర్‌ నీటిని సాలూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ బంజ్‌దేవ్‌ అక్రమంగా తన చేపలు, రొయ్యల చెరువులకు తరలిస్తున్నారని పవన్‌ ఆరోపించారు. బంజ్‌ దేవ్‌ చేపల చెరువుల నుంచి విడుదలవున్న కలుషిత నీటితో పంట పొలాలు పాడైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతుల గోడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టదా అని జనసేనాని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత సాలూరు మొదటి ఎమ్మెల్యే కునిశెట్టి వెంకట దొర విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుందని పవన్‌ హామీ ఇచ్చారు. 

21:03 - June 1, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా తనకు జీవన్మరణ సమస్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో రాష్ట్రానికి మోసం చేసిన మోదీ ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తేలేదని అన్నారు. ధర్మపోరాటం కొసాగుతుందన్న చంద్రబాబు.. కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా ఏపీలో అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. అభివృద్ధిలో ప్రజలను పునరంకితులును చేసేందుకు శనివారం నుంచి వారం రోజుల పాటు ఏపీలో నవ నిర్మాణ దీక్షలు చేపడతున్నారు. అధికారులు, ప్రజలు ఈ దీక్షల్లో భాస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నవ నిర్మాణ దీక్షల్లో ఎండగట్టాలని నిర్ణయించారు. ఇది తనకు జీవన్మరణ సమస్య అని చంద్రబాబు చెప్పారు. విభజనతో ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దమని అడిగితే.. అణగదొక్కాలని చూస్తే సహించబోమని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నవ నిర్మాణ దీక్షలు జరిగే వారం రోజుల పాటు నిత్యం ఒక్కో అంశంపై సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

కిడ్నీ బాధితుల కథనాలపై స్పందన...

కృష్ణా : ఎ.కొండూరు మండల పరిధిలో కిడ్నీ బాధితుల మరణాలపై టెన్ టివి ప్రసారం చేసిన కథనాలపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ అయ్యింది. తక్షణమే పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి ఎలాంటి చర్యలు చేపట్టారో నివేదిక అందచేయాలని మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్స్ పల్ సెక్రటరీ, పంచాయతీ రాజ్ ప్రిన్స్ పల్ సెక్రటరీకి ఎస్టీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 

ఆ బస్సు డ్రైవర్ తొలగింపు...

కరీంనగర్ : సెల్ ఫోన్ లో ఛాటింగ్ చేస్తూ బస్సును నడిపిన డ్రైవర్ ను ఉన్నతాధికారులు తొలగించారు. గత నెల 29వ తేదీన జమ్మికుంట - హుజారాబాద్ బస్సును నడిపిన డ్రైవర్ చేసిన నిర్వాకం వీడియోలు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై హుజారాబాద్ డీఎం స్పందించారు. విచారణ జరిపి ఆ డ్రైవర్ ను తొలగించారు. 

20:39 - June 1, 2018

భూమి లేనోళ్లు ఎవ్వలన్న ఉన్నరా..? పవన్ కళ్యాణ్ బాగనే అర్సుకుంటున్నడుగదా.?. దంతాలు లేని సింహం గాండ్రిస్తున్నది వరంగల్ పట్నంల.. జూన్ రెండు తారీఖు నాడు విద్రోహ దినం...మ్మం కార్పొరేటర్లు కౌరవుల లెక్కనే తయ్యారైనట్టుండ్రుగదా...గుండు గొట్టినందుకు సంతోషంతోని మంగళాయినకు పదో పర్కో ఇస్తరు.. అది తీస్కుంటె తప్పా..? తల్లి భళే మోపైండ్రొసు.. సూస్తిరా రాజమండ్రి సౌత్ జోన డీఎస్పీగాని యవ్వారం.. ఈ ముచ్చట తల్లిదండ్రులు బాగినాలే.. అయ్యో ఎంతపనైపాయెరా..? పార్టీ మారినోడు మంచిగనే ఉన్నడు..గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:34 - June 1, 2018
18:59 - June 1, 2018

కింగ్ నాగార్జున - ఆర్జీవీ క్రేజీ కాంబినేషన్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'ఆఫీసర్' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దాదాపు 'శివ' చిత్రం అనంతరం నాగ్..రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో ఈ చిత్రం రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక వరుస ఫ్లాప్‌లలో ఉన్న రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని చాలా శ్రద్దగా, జాగ్రత్తగా తెరకెక్కించారని ప్రచారం జరిగింది. ఈ మూవీలో 'నాగార్జున' సరసన ముంబై మోడల్ 'మైరా సరీన్' జోడీ కట్టింది. తెలుగులో ఆమెకు తొలి చిత్రం ఇదే కావడం విశేషం. మరి చిత్రం ఎలా ఉంది ? టెన్ టివి ఇచ్చే రేటింగ్ కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:55 - June 1, 2018

హైదరాబాద్ : సినిమాలు, సీరియల్స్‌ వల్ల మహిళల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది అన్న మహిళా కమిషనర్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యలను మహిళా సంఘం నేతలు ఖండిచారు. పురుషుల కోసం కమిషన్‌ వేయాలన్న నన్నపనేని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా హక్కులు కాపాడాల్సిన వ్యక్తే బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నన్నపనేనిని చైర్‌ పర్సన్ పదవిలో ఉండే అర్హతలేదని, ఆమెను వెంటనే తొలగించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఐద్వా నేతలు డిమాండ్‌ చేశారు. 

18:53 - June 1, 2018

హైదరాబాద్ : ప్రముఖ నటుడు, నిర్మాత మాదాల రంగారావు సంతాప సభ హైదరాబాద్‌లోని ముగ్దుబ్‌ భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత ఆర్‌ నారాయణ మూర్తి, సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. మాదాల చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కళ సంపద కోసం కాదని కళ ప్రజల కోసమని చాటి చెప్పిన మహా మనిషి మాదాల రంగారావు అని ఆర్ నారాయణమూర్తి కొనియాడారు. సినిమా రంగంలోకి వచ్చినా వామపక్ష సిద్ధాంతాల కోసం మాదాల రంగారావు కృషి చేశారని సీపీఐ నేత నారాయణ గుర్తు చేశారు. 

18:52 - June 1, 2018

హైదరాబాద్ : నిజంగా వ్యవసాయం చేసేవారికి రైతు బంధు పథకం అందలేదన్నారు జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్‌. నిన్న రైతులు చేపట్టిన సడక్‌ బంద్‌ కార్యక్రమం విజయవంతం అయిందని తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ముగ్దుమ్‌ భవన్‌లో వామపక్షాలతో సమావేశమయ్యారు. రైతు బంధు పథకం రియలర్టర్‌లకు, భూస్వాములకు మేలు చేసిందన్నారు సీపీఐ కార్యదర్శి చాడ వెంకట రెడ్డి. లబ్దిదారుడితో సమానంగా కౌలు రైతులకు ఈ పథకం వర్తింప జేయాలని డిమాండ్‌ చేశారు. 

18:50 - June 1, 2018

విశాఖపట్టణం : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ మాడుగుల టీడీపీ ఇన్‌చార్జి గవిరెడ్డి రామానాయుడు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. ఐదు వేల మంది కార్యకర్తలతో 9 కిలోమీటర్లు... చౌడువాడ నుండి కె.కోటపాడు వరకు ర్యాలీ నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు తన జనదిన్మాన ధర్మపోరాట దీక్ష చేపట్టారని.. ఆయన స్ఫూర్తితోనే తాను పాదయాత్ర చేశానంటున్నారు. ప్రాణాలర్పించైనా ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌ సాధించుకుంటామన్నారు. 

'తిరుమలలో పిడుగులు పడే ప్రమాదం'...

చిత్తూరు : తిరుమల, తిరుపతిలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తిరుపతి, తిరుమల ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 

జేడీఎస్, కాంగ్రెస్ పోర్ట్ పొలియో కేటాయింపులు...

కర్ణాటక : జేడీఎస్..కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మధ్య పొర్ట్ పొలియో కేటాయింపులు జరిగాయి. కాంగ్రెస్ కు 22 మంత్రి పదవులు, జేడీఎస్ కు 12 మంత్రి పదవులు కేటాయింపులు జరిగాయి. 

తెలంగాణ ప్రజలకు జనసేన శుభాకాంక్షలు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నాలుగో ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ జనసేన శుభాకాంక్షలు తెలియచేసింది. రాష్ట్రం సుసంపన్నం కావాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఓ ప్రకటనలో జనసేన అధినేత పవన్ సూచించారు. 

యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పై బీజేపీ ఎమ్మెల్యే విమర్శలు...

న్యూఢిల్లీ : ఉప ఎన్నికల్లో బీజేపీ ఘరో పరాభవంపై ఆ పార్టీకి చెందిన సొంత నేతల నుండే విమర్శలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే శ్యాం ప్రకాష్ ఫేస్ బుక్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కవిత రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

మోడీ నాలుగేళ్ల పాలన వైఫల్యాలపై సీపీఎం పుస్తకాలు...

ఢిల్లీ : మోది ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో ప్రజల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. మోది నాలుగేళ్ల పాలన వైఫల్యాలపై 'వై ఇట్‌ హౌస్‌ టు ఎండ్‌' పేరిట సిపిఎం రూపొందించిన నాలుగు పుస్తకాలను ఆయన విడుదల చేశారు.

తననే కాదు..దేశ ప్రజలనూ మోసం చేశారు - బాబు...

విజయవాడ : ప్రధాని మోదీ తననే కాదు దేశ ప్రజలనూ మోసం చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. మోదీ నాలుగేళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో అధోగతిపాలైందని విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో వ్యవసాయం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధర్మోజీగూడెం వద్ద రోడ్డు ప్రమాదం...

యాదాద్రి : జిల్లా చౌటుప్పల్‌ మండలం ధర్మోజీగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు.. లారీని ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు కావడంతో హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. 

ఫోన్ చూస్తూ డ్రైవింగ్...

కరీంనగర్ : జిల్లాలో ఓ డ్రైవర్ స్మార్ట్ ఫోన్ చిట్ చాట్..ఆడుకుంటూ బస్సును నడుపుతున్నాడు. డ్రైవర్ చేస్తున్న నిర్వాకాన్ని ఓ ప్రయాణీకుడు సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు.

17:59 - June 1, 2018

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో బస్సు ప్రమాదాలు జరుగుతున్నా ఇతర డ్రైవర్ల తీరులో మార్పు రావడం లేదు. ప్రయాణీకులను క్షేమంగా గమ్యానికి చేర్చాల్సిన డ్రైవర్లు నిర్లక్ష్యంగా బస్సులను నడుపుతుండడంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఓ డ్రైవర్ స్మార్ట్ ఫోన్ చిట్ చాట్..ఆడుకుంటూ బస్సును నడుపుతున్నాడు. డ్రైవర్ చేస్తున్న నిర్వాకాన్ని ఓ ప్రయాణీకుడు సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బస్సు జమ్మికుంట నుండి హుజురాబాద్ కు వెళుతోంది. డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్ పై ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.  

17:56 - June 1, 2018

విజయవాడ : ప్రధాని మోదీ తననే కాదు దేశ ప్రజలనూ మోసం చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. మోదీ నాలుగేళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో అధోగతిపాలైందని విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో వ్యవసాయం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దారీతెన్నులేని లక్ష్యాలతో నిరుద్యోగం ప్రబలిందని, ప్రజలపై పన్నుల భారం పెరిగిందని మండిపడ్డారు. ప్రజల నమ్మకాన్ని మోదీ వమ్ము చేశారని అమరావతిలో జరిగిన చంద్రన్న బీమా మూడో ఏడాది ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న చంద్రన్న బీమా పథకం మూడో ఏడాదిలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా అమరావతిలో నిర్వహించిన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. 2016లో 2.13 కోట్ల మంది మొదలైన చంద్రన్న బీమా పథకంలో ఇప్పుడు 2.5 కోట్ల మందిని సభ్యులుగా చేశారు. దేశంలో అతిపెద్ద బీమా పథకంగా గుర్తింపు పొందింది. రెండేళ్లలో 1.50 లక్షల కుటుంబాలకు 2 వేల కోట్ల రూపాయల బీమా చెల్లించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు... ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విరుచుకుపడ్డారు. మోదీ మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప దాటడం లేదని విమర్శించారు. పెట్రోలుపై లీటరుకు పైసా తగ్గించారంటే... ప్రధాని మోదీ ఏరకమైన పాలన అందిస్తున్నారో అందరూ అర్థం చేసుకోవాలని చంద్రబాబు కోరారు.

ప్రధాని మోదీ తననే కాదు.. దేశ ప్రజలందర్నీ మోసం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. కరెన్సీ కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలకులు, జాతీయ నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కర్నాటకలో జేడీఎస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ నాయకులు బేరసారాలు ఆడారని బాబు ఆరోపించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వింత పోకడలను చూడలేదన్నారు.

మరోవైపు పాదయాత్రలో ప్రతిపక్ష నేత జగన్‌ ఇస్తున్న హామీలను నమ్మి మోసపోవద్దని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్‌, మోదీ మోసపూరిత హామీలు ఇస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు.. ఇలాంటి నేతల పట్ల అప్రమత్తంగా ఉంచాలని కోరారు. 

17:53 - June 1, 2018

ఢిల్లీ : మోది ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో ప్రజల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. మోది నాలుగేళ్ల పాలన వైఫల్యాలపై 'వై ఇట్‌ హౌస్‌ టు ఎండ్‌' పేరిట సిపిఎం రూపొందించిన నాలుగు పుస్తకాలను ఆయన విడుదల చేశారు. ప్రజలు పడ్డ ఇబ్బందులను ఈ పుస్తకాల్లో వివరించారు. మోది ప్రభుత్వాన్ని 'ఝూట్‌ కీ సర్కార్‌...లూట్‌ కి సర్కార్‌'గా ఏచూరి అభివర్ణించారు. గతంలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్‌, వంట గ్యాస్‌ ధరలు ఆకాశాన్నంటాయని ఆయన విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోది సర్కార్‌ 2.05 లక్షల ఉద్యోగాలు మాత్రమే కల్పించిందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వీర్యమౌతోందని, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఏచూరి తెలిపారు. మతతత్వ ఎజెండాలతో ముస్లింలు, దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని.... రాజ్యాంగ బద్ద సంస్థలు ప్రమాదంలో పడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

17:51 - June 1, 2018

న్యూఢిల్లీ : ఉప ఎన్నికల్లో బీజేపీ ఘరో పరాభవంపై ఆ పార్టీకి చెందిన సొంత నేతల నుండే విమర్శలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే శ్యాం ప్రకాష్ ఫేస్ బుక్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కవిత రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అధ్యక్షుడు..అధికారులు అవినీతి పరులు అంటూ ఘాటు విమర్శలు చేశారు. యోగి సర్కార్ అన్ని రంగాల్లో విఫలం చెందిందని కుండ బద్ధలు కొట్టారు. ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ సంఘ్ పరివార్ చేతుల్లో ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి వల్లే బీజేపీ ఓటమి చెందిందని ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సురేందర్ సింగ్ పేర్కొన్నారు. 

17:50 - June 1, 2018

ఢిల్లీ : ఐపీఎల్ బెట్టింగ్ స్కాం..సినీ పరిశ్రమకు సంబంధాలున్నాయా ? ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ కు థానే పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇటీవలే ఈ స్కాంలో ఒక బుకీని అరెస్టు చేసి అతడిని విచారించారు. దీని వెనుక అర్బాజ్ ఖాన్ ఉన్నారని తేలిందని సమాచారం. దీనితో పోలీసులు అతడికి సమన్లు జారీ చేశారని తెలుస్తోంది. బెట్టింగ్ లో వేల కోట్ల రూపాయలు మార్పులు జరిగాయని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో రాజకీయ, సినీ రంగ ప్రముఖులున్నారా ? అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు జరిపే విచారణలో అర్బాజ్ ఖాన్ ఎలాంటి అంశాలు వెల్లడిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

17:48 - June 1, 2018

రాజమండ్రి : దీక్షల పేరిట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల డబ్బులను దుర్వనియోగం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. జనసేన - బీజేపీ పొత్తుల విషయం కాలమే నిర్ణయిస్తుందని వేదాంత ధోరణిలో చెప్పారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆధ్యాత్మిక విషయాలను రాజకీయాలకు అతీతంగా ఆలోచించే వ్యవస్థను తీసుకొస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందన్నారు.

 

17:48 - June 1, 2018

హైదరాబాద్ : చెత్త నుండి వంద మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయడమే సర్కార్ లక్ష్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. శుక్రవారం పీపుల్స్ ప్లాజాలో ప్రపంచ పర్యావరణ వారోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ లో వాహన కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని, హైదరాబాద్ లోని 3200 ఆర్టీసీ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వీటికి మొదటి విడతగా ఆరు నెలల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తామన్నారు. చెత్త సేకరణకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశ పెడుతామని, సోలార్ ఎనర్జీ ఉత్పత్తిలో రాష్ట్రం, దేశంలోనే మొదటి స్థానం ఉందన్నారు. ఉప్పల్ నుండి నారపల్లి వరకు రూ. 1400 కోట్లతో స్కైవేని కేవలం 18 నెలల్లో పూర్తి చేస్తామని హామీనిచ్చారు. త్వరలో ఎంఎంటీఎస్ రైలు మార్గాన్ని యాదాద్రి వరకు విస్తరిస్తామని వెల్లడించారు. 

యోగీ సీఎం అయినా ఏమీ చేయలేరు : బీజేపీ ఎమ్మెల్యే

ఉత్తరప్రదేశ్ : యోగీ ఆదిత్యనాథ్ సీఎం అయినా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలోవున్నారని హర్దోయి నియోజక వర్గ బీజేపీ ఎమ్మెల్యే శ్యామ్ ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ వల్లే సీఎం ఆదిత్యనాథ్‌ అధికారం దక్కించుకోగలిగారని, అధికార పగ్గాలు సంఘ్‌ చేతిలో ఉన్నాయని, అందుకే ముఖ్యమంత్రి అయినప్పటికీ యోగి ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. ప్రభుత్వం గాడి తప్పిందని, విఫలమైం‍దని అన్నారు.

బీజేపీ పాలనలో అవినీతి పెరిగిపోయింది : బీజేపీ ఎమ్మెల్యే

ఉత్తరప్రదేశ్‌ : బీజేపీ ఎమ్మెల్యే శ్యామ్‌ ప్రకాశ్‌ తమ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో అవినీతి అధికంగా ఉందంటూ, అధికారులంతా అవినీతికి పాల్పడుతున్నారంటూ పేర్కొని అలజడి రేపారు. తమ ప్రభుత్వం పట్ల రైతులు వ‍్యతిరేకతతో ఉన్నారని, ఇలాంటి పలు కారణాల వల్లే తాము ఇటీవల జరిగిన కైరానా లోక్‌సభ ఉప ఎన్నికలో ఓడిపోయామని అన్నారు. అంతేగాక, గత రాష్ట్ర సర్కారుతో పోల్చి చూస్తే ప్రస్తుతం అన్ని శాఖల్లో అవినీతి పెరిగిపోయిందన్నారు.

8 రాష్ట్రాల్లో రైతన్నల వినూత్న ఆందోళనలు..

కర్ణాటక : గిట్టుబాటు ధర కోసం ఎనిమిది రాష్ట్రాలలో రైతన్నలు ఆందోళన చేపట్టారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో జాతీయ కిసాన్ మహాసంఘ ఈ ఆందోళనలను చేపట్టింది. ఈరోజు నుండి 10రోజుల పాటు మధ్యప్రదేశ్,రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, పంజాబ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో రైతన్నలు ఆందోళన చేయనున్నారు. నిరసనలో భాగంగా నగరాలకు వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాను రైతులు నిలిపివేశారు. లూథియానాలో రహదారులపై పాలను పారబోసి తమ నిరసనలను తెలియజేస్తున్నారు. నగరాలకు పాలు, కూరగాయలు,ఇతర ఉత్పత్తులను నిలిపివేశారు. 

నెల్లూరు పలు జిల్లాల్లో భారీ వర్షం..

నెల్లూరు : ఆత్మకూరు, ఏఎస్ పేట, అనంతసాగరం,మర్రిపాడు, సగం, వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాలల్లో ఈదురు గాలులతో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో వాతావరణం బీభత్సంగ సృష్టిస్తోంది. 

'పల్లెకు పోదాం' అంటున్న బీఎల్ఎఫ్

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమే ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని చేపట్టిందని బీఎల్ఎఫ్ విమర్శించింది. ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు అంటు బీఎల్ఎఫ్ జూన్ 3 నుండి 20 వరకు పల్లెకు పోదాం కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజా సమస్యలను అధ్యయనం చేసి వారిని చైతన్యం చేసేందుకు గ్రామాలకు వెళ్తున్నట్లుగా బీఎల్ఎఫ్ తెలిపింది. టీఆర్ఎస్ పాలనలో ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా నాలుగేళ్ళ పాటు పబ్బం గడిపారని బీఎల్ఎఫ్ విమర్శించింది. రైతుబంధు పథకం ద్వారా భూస్వాములకు దోచిపెడుతున్నారనీ..దీని వల్ల చిన్న సన్నకారు రైతులకు ఏమాత్రం లబ్ది దొరకటంలేదని బీఎల్ఎఫ్ అభిప్రాయపడింది. 

ఉగాది పచ్చడిలా తెలంగాణ పాలన : పొంగులేటి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఉగాది పచ్చడిలా వుందని కాంగ్రెస్ నేత పొంగులేటి ఎద్దేవా చేశారు. సీఎంగా వున్న కేసీఆర్ సచివాలయానికే రారనీ..వచ్చినా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలను అపాయింట్ మెంట్ ఇవ్వరనీ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 3,4 ఫేజ్ లలో పనులు నత్త నడకన సాగుతున్నాయని విమర్శించారు. అప్పులు చేసిన తెలంగాణను ధనిక రాష్ట్రమని మాయ చేస్తున్నారన్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనీ..కౌలు రైతులను పట్టించుకోవటంలేదని ప్రభుత్వంపై ఎమ్మెల్సీ పొంగులేటి విమర్శనాస్త్రాలు సంధించారు. 

టీ.అడ్వకేట్స్ కు హెల్త్ కార్ట్స్ జారీ..

హైదరాబాద్ : రాష్ర్ట న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి న్యాయవాదులకు హెల్త్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమం నగరంలోని రవీంద్ర భారతిలో ఇవాళ జరిగింది. ప్రమాదబీమాతో పాటు ఆర్థిక సహాయం, ఇతర పథకాలను ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ వినోద్ కలిసి ప్రారంభించారు. హెల్త్ కార్డుల జారీపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేటాయించిన రూ.100 కోట్ల నిధులతో తెలంగాణ స్టేట్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

15:13 - June 1, 2018

హైదరాబాద్ : పోలీసు నియామకాల నోటిఫికేషన్ చిచ్చు రేపుతోంది. ప్రభుత్వం విధించిన వయో పరిమితిపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల కోసం నాలుగేళ్ల నుండి చదువుతుండడం..నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశామని, కానీ పాత పద్ధతిని కొనసాగిస్తున్నట్లు పేర్కొనడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వయో పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు శుక్రవారం గన్ పార్కు వద్ద ఆందోళనలు నిర్వహించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరుద్యోగ జేఏసీ నాయకుడు మానవతా రాయ్ తో పాటు పలువురు అభ్యర్థులను అరెస్టు చేశారు. కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు.

 

పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలంటు ధర్నా..

హైదరాబాద్ : పోలీస్ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలని గన్ పార్క్ వద్ద నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. కానిస్టేబుల్,ఎస్ఐ అభ్యర్థులకు వయోపరిమితి పెంచాలని పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వయో పరిమితి పెంచకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొన్న జేఏసీ నాయకుడు మానవతారాయ్ తో పాటు పోలీసులు అరెస్ట్ చేశారు. 

జీఎస్టీ వసూళ్లు రూ.94 కోట్లపైనే..

ఢిల్లీ: దేశమంతా ఒకే పన్ను విధానం అని కేంద్ర ప్రభుత్వ అమలులోకి తీసుకొచ్చిన జీఎస్టీతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వ ఖజానాను మాత్రం జీఎస్టీ భారీగా నింపుతోంది. మే నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ. 94,016కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం నెలతో పోలిస్తే మేలో ఈ వసూళ్లు కాస్త తగ్గాయి. ఏప్రిల్‌లో గరిష్ఠంగా రూ. 1.03లక్షల కోట్లు జీఎస్‌టీ కింద వసూలైన విషయం తెలిసిందే. గతేడాది జులైలో జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక నెలలో ఇంత ఎక్కవ వసూళ్లు రావడం అదే తొలిసారి.

తూత్తుకుడి ఫ్యాక్టరీ మూసివేత..వీధినపడ్డ 3వేలమంది

తమిళనాడు : తూత్తుకుడి స్టెరిలైట్‌ రాగి కర్మాగారాన్ని మూసివేయడంతో అందులో పనిచేస్తున్న దాదాపు 3వేల మంది ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కంపెనీ మూసివేయడంతో తమకు పనిలేకుండా పోయిందని, కొంతమంది కంపెనీ గురించి అసత్య ప్రచారాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అందులో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని ఆవేదన వ్యక్తం చేసింది.

వంటగ్యాస్‌ ధర పెంపు..మండిపడుతున్న మహిళలు..

ఢిల్లీ : ఓ వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశన్నంటి వినియోగదారులకు గుదిబండలా మారగా.. తాజాగా మరో భారం పడింది. నిత్యావసర వస్తువైన వంటగ్యాస్‌ ఇప్పుడు మరింత ప్రియమైంది. సబ్సీడీ వంటగ్యాస్‌పై రూ. 2.34, సబ్సీడీయేతర గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 48 పెంచుతూ చమురు సంస్థలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. వంట గ్యాస్ ధర పెంచటంతో మహిళలు మండిపడుతున్నారు. 

14:52 - June 1, 2018

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పట్ల సుప్రీం కోర్టు నిర్ణయం దళితుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందన్నారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌. ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. ఈ విషయంపై తక్షణమే అత్యున్నత న్యాయస్థానం పునఃసమీక్ష చేయాల్సి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ దళిత, గిరిజనుల పట్ల జరిగే వివక్ష, దాడుల నుండి కాపాడేందుకు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ పని చేస్తోందన్నారు. 

చందాకొచ్చర్ ను తప్పించే ఉద్ధేశ్యంలేదు : ఐసీఐసీఐ

ముంబై : వీడియోకాన్‌ రుణ ఎగవేత వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో చందాకొచ్చర్‌పై ఆ బ్యాంకు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ దర్యాప్తు పూర్తయ్యేంత వరకు చందాకొచ్చర్ నిరవధికంగా సెలవు తీసుకోవాలని బ్యాంకు సూచించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఐసీఐసీఐ ఖండించింది. చందాకొచ్చర్‌ను విధుల నుంచి తప్పించే ఉద్ధేశ్యం లేదని ఐసీఐసీఐ స్ఫష్టం చేసింది. ఆమె సాధారణ సెలవులోనే ఉన్నారని బ్యాంకు నేడు స్పష్టం చేసింది. ఈమేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌ సందర్భంగా ఐసీఐసీఐ పేర్కొంది.

 

14:48 - June 1, 2018

ఢిల్లీ : ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సతమతమవుతున్న జనం నెత్తిన మరో భారం పడింది. సబ్సిడీ వంటగ్యాస్‌పై 2 రూపాయల 34 పైసలు పెరిగింది. సబ్సిడీయేతర గ్యాస్‌ సిలిండర్‌పై 48 రూపాయలు పెరిగింది. తాజాగా పెంచిన ధరతో ఢిల్లీలో సబ్సీడీ వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 493.55 పై...సబ్సీడీయేతర సిలిండర్‌ ధర రూ. 698.50కి చేరుకుంది. ఇక సబ్సీడీ వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర కోల్‌కతాలో రూ. 496.65, ముంబయిలో రూ. 491.31, చెన్నైలో రూ. 481.84గా ఉంది. సబ్సీడీయేతర వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర కోల్‌కతాలో రూ. 723.50, ముంబయిలో రూ. 671.50, చెన్నైలో రూ. 712.50 పైసలకు చేరుకుంది.

14:46 - June 1, 2018

మహబూబ్‌ నగర్‌ : జిల్లా భూత్‌పూర్‌ మండలం దివిటిపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పనులు చేస్తున్న ఎల్‌ఎన్టీ కార్మికులు ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డిసియం అదుపు తప్పి ఎల్‌ఎన్టీ వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డీసీఎం డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీశారు.

14:45 - June 1, 2018

విజయవాడ : అగ్రీగోల్డ్‌ బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అగ్రీగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. అగ్రీగోల్డ్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. న్యాయం చేయాలని శాంతియుతంగా బాధితులు కోరితే ప్రభుత్వం, పోలీసులు వారిపట్ల నిరంకుశత్వంగా వ్యహరించి, 144 సెక్షన్‌ అమలు చేయడం బాధాకరమని అన్నారు.

ఘోర రోడ్డుప్రమాదం..7గురు మృతి..

హైదరాబాద్ : హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. థెయాగ్‌ వద్ద ప్రమాదవశాత్తు హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు టిక్కర్‌ ప్రాంతం నుంచి సిమ్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కొండ ప్రాంతంలో మితిమీరిన వేగంతో బస్సును నడిపాడని..

13:58 - June 1, 2018

హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో తమ బలం... బలగం నిరూపించుకునేందుకు తెలంగాణ జనసమితి సన్నద్ధం అవుతోంది. ఇందుకోసం జూన్‌లో జరిగే లోకల్‌బాడీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. తమ పార్టీ బలాన్ని చూపించేందుకు ఆ పార్టీ సిద్ధం అవుతోంది. ఇప్పటికే క్యాడర్‌ను పెంచుకునే పనిలో బిజీబిజీగా ఉన్న జేఎస్‌పీ... పంచాయతీ ఎన్నికల్లో గెలుపుగుర్రాలను బరిలో నిలబెట్టి సత్తాచాటేందుకు రెడీ అవుతోంది. 

లోకల్‌బాడీ ఎన్నికలను తెలంగాణ జన సమితి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పంచాయతీ ఎన్నికల్లో తమ క్యాడర్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఆవిర్భావ సభ నుంచే పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు తెరవెనుకు ప్రయత్నాలు షురూ చేసింది. ఓ వైపు గ్రౌండ్‌ లెవల్‌లో పార్టీ క్యాడర్‌ను సమకూర్చుకుంటూనే.... మరోవైపు పార్టీ అనుబంధ సంఘాల ఏర్పాటుపై ప్రత్యేకదృష్టి సారించింది. తెలంగాణలోని కొత్త జిల్లాల్లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడితోపాటు రాష్ట్ర నాయకత్వం విస్తృత పర్యటనలు చేస్తూ పార్టీ సభ్యత్వంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే గ్రామీణ, మండల స్థాయిల్లో క్యాడర్‌ను పార్టీకి ఆహ్వానిస్తూనే... గ్రామీణ, మండల, జిల్లా స్థాయి సారథులను నియమించుకుంటూ క్యాడర్‌ను పెంచుకునే పనిలో జనసమితి నేతలు ముమ్మరప్రయత్నాలు చేస్తున్నారు.

జూన్‌ మొదటివారంలోగానీ... రెండో వారంలోగానీ తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావొచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీంతో లోకల్‌బాడీ ఫైట్‌కు టీజేఎస్‌ కసరత్తు చేస్తోంది. ఆ బాధ్యతలను ఇప్పటికే పార్టీ నియమించిన వారికి అప్పగించినట్లు తెలుస్తోంది. పంచాయతీ పోరులో నిలబడే అభ్యర్థుల జాబితాను సైతం తయారు చేశారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఏర్పడిన అనతికాలంలోనే తమ బలం నిరూపించుకునేందుకు లోకల్‌బాడీ రూపంలో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే జనసమితిపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను ఇంటెలీజెన్స్‌ బ్యూరో ఓ రిపోర్టు తయారు చేసింది.  దీంతో ఎలాగైనా లోకల్‌బాడీ ఎన్నికల్లో అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని తమ బలాన్ని నిరూపించుకోవాలని టీజేఎస్‌ భావిస్తోంది.

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం కూడా లేదు. ఈలోపు గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుని.. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం అయ్యేందుకు ఈ లోకల్‌బాడీ ఎన్నికలు ఉపయోగపడుతాయని ఆ పార్టీనేతలు భావిస్తున్నారు. లోకల్‌బాడీ ఎన్నికల ద్వారా పార్టీ క్యాడర్‌, లీడర్‌షిప్‌ను అంచనావేయవచ్చని, పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఏది ఏమైనా లోకల్‌బాడీ ఎన్నికలతో పార్టీ బలాన్ని బేరీజు వేసుకోవచ్చని నేతలు  చూస్తున్నారు.

13:55 - June 1, 2018

హైదరాబాద్ : చిక్కడపల్లి సెంట్రల్‌ లైబ్రరీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిన్న విడుదల చేసిన పోలీస్‌ రిక్రూట్మెంట్‌లో వయోపరిమితి ఆరు సంవత్సరాలకు పెంచాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా చదువుకుంటున్నామని, వయోపరిమితి పెంచకుంటే జీవితాలను నష్టపోతామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

13:54 - June 1, 2018

హైదరాబాద్ : నాలుగేళ్ల కేసీఆర్‌ పాలన ప్రగల్భాలు, ఆర్భాటాలు, అబద్ధాలతోనే సాగిందని కాంగ్రెస్‌ నేత డీకె అరుణ విమర్శించారు. ఈమేరకు ఆమెతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. తెలంగాణ ప్రజలను మోసం చేసి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కేసీఆర్‌ పాలనలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చింది లేదని చెప్పారు. రైతు బంధు పథకంతో రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు ఓట్ల కోసం గాలం వేస్తున్నారని పేర్కొన్నారు. నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడం మరిచిపోతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని ఆమె అన్నారు.

 

13:48 - June 1, 2018

హైదరాబాద్ : మోత్కుపల్లి నర్సింహులుతో కాపు నేత ముద్రగడ పద్మనాభం మంతనాలు జరిపారు. తాజా రాజకీయాలపై చర్చించడానికి మోత్కుపల్లి నివాసంలో ఆయన భేటీ అయ్యారు. మోత్కుపల్లి నర్సింహుల్ని ఏపీకి రావాలని ముద్రగడ ఆహ్వానించారు. యాత్రకు అన్ని రకాల సహాయసహకారాలు ఉంటాయని ముద్రగడ తెలిపారు. 

13:45 - June 1, 2018

గుంటూరు : వచ్చే ఎన్నికల్లో యూపిఏ సారధ్యంలో రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ఏపి పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలే 2019ఎన్నికల అజెండగా ఉండబోతుందన్నారు. హామీలన్నీ నెరవేర్చామని మహానాడులో చంద్రబాబు చుప్పడం దౌర్భాగ్యమని, దీనిపై బాబు బహిరంగ చర్చకు రావాలని  సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే 24గంటల్లో రుణమాఫీ చేస్తామని అన్నారు.

 

13:25 - June 1, 2018

గుంటూరు : చంద్రన్న బీమా 3వ ఏడాది కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 2016లో 2.13 కోట్ల మందితో బీమా పథకం ప్రారంభమైంది. రెండేళ్లలో లక్షన్నర కుటుంబాలకు రూ.2 వేల కోట్లు బీమా చెల్లించారు. రెండున్నర కోట్ల మందితో దేశంలోనే పెద్ద బీమా పథకంగా చంద్రన్న బీమా పథకం గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పనులు సమర్థవంతంగా ఉండి పేదలకు న్యాయం చేసేవారే తన మిత్రులు సీఎం అన్నారు. సహాయం ఇన్ టైమ్ లో చేయాలన్నారు. సహాయం చేసేది బాధపెట్టే విధంగా ఉండకూడదని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. సంక్షేమ పథకాలు సజావుగా ప్రజలకు చేరాలన్నారు. గతంలో దెయ్యాలు పించన్లు తీసుకునేవని.. చనిపోయిన వారి బదులు వేలి ముద్ర వేసి పించన్లు తీసుకున్నారని విమర్శించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని...అర్హులు మాత్రమే పించన్లు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

 

పేదల డబ్బులు సక్రమంగా అందాలనే లక్ష్యం : చంద్రబాబు

అమరావతి : చంద్రన్న బీమా కార్యాక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు..రోడ్డు ప్రమాదాలలో డ్రైవర్లు చనిపోవటం బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. డ్రైవర్ చనిపోతే ఆ కుటుంబం కుప్ప కూలిపోతుందనీ..లారీ డ్రైవర్లు ఊరుకాని ఊరు వెళ్లినప్పుడు ఇంటికి ఏనాటికి చేరుకుంటోరో తెలియని పరిస్థితి వుంటుందన్నారు. ప్రభుత్వంలోని అన్ని కార్యక్రమాలకంటే బీమా మిత్ర ప్రథమ స్థానంలో వుందని చంద్రబాబు తెలిపారు. పేదవారికి ఇచ్చే డబ్బులు సక్రమంగా అందాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

12:55 - June 1, 2018

మహబూబ్‌నగర్‌ : జిల్లా ఇండస్ట్రీస్ మేనేజర్‌ ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. మియాపూర్‌ బాలాజీనగర్‌, మహబూబ్‌నగర్‌లోని సురేశ్‌కుమార్‌ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఏక కాలంలో ఐదు చోట్ల సోదాలు చేస్తున్నారు. దాడుల్లో 13 లక్షల 45 వేల నగదు, 30 తులాల బంగారం, నగరంలోని ప్లాబ్ లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్ లో 9 కోట్లు ఉంటుందని అంచనా. 

 

12:49 - June 1, 2018

కృష్ణా : విజయవాడ దుర్గ గుడిలో మరో వివాదం నెలకొంది. క్షురకుడిపై పాలకమండలి సభ్యుడు పెంచలయ్య చేయిచేసుకున్నారు. పెంచలయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ క్షురకులు ధర్నా చేపట్టారు.

12:44 - June 1, 2018

మహబూబ్‌నగర్‌ : జిల్లా ఇండస్ట్రీస్ మేనేజర్‌ ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. మియాపూర్‌ బాలాజీనగర్‌, మహబూబ్‌నగర్‌లోని సురేశ్‌కుమార్‌ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఏక కాలంలో ఐదు చోట్ల సోదాలు చేస్తున్నారు. భారీగా అక్రమాస్తులు గుర్తించినట్టు తెలుస్తోంది.

 

12:40 - June 1, 2018

ఢిల్లీ : తెలంగాణా నాల్గవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఆవిర్భావ సంబరాల్లో భాగంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ నుంచి ఇండియా గేట్ వరకు 3కే రన్‌ నిర్వహించారు. ఈ 3కే రన్‌ను బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లల గోపిచంద్‌ ప్రారంభించారు. ఇలాంటి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, యువత ఫిట్‌నెస్‌తో ఉండాలని  గోపిచంద్‌ అన్నారు. ఈ 3కే రన్‌లో ప్రత్యేక ప్రతినిధులు, తెంగాణ భవన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

 

12:38 - June 1, 2018

హైదరాబాద్ : నగరంలోని ఉప్పల్ పీఎస్ పరిధిలో పదవ తరగతి విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. నిన్న ఉదయం వాకింగ్ కోసం బయటకు వెళ్లిన అనిత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తమ కూతురుని కిడ్నాప్‌ చేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనిత జాడ దొరక్కపోవడంతో రాత్రి ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్ఎస్ గ్రామర్ స్కూల్‌లో అనిత పదవ తరగతి చదువుతోంది.

 

మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో కర్ఫ్యూ..

మేఘాలయ : రాజధాని షిల్లాంగ్‌లో ఓ బస్ కండక్టర్‌ను వేధించడంపై మొదలైన వివాదం చిలికి చిలికి రణరంగంలా మారింది. మోత్‌పురన్ ప్రాంతంలో గురువారం రాత్రి అల్లరి మూకలు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు షిల్లాంగ్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం నుంచి కర్ఫ్యూ విధించారు. ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లా డిప్యూటీ కమిషనర్ పీటర్ ఎస్ దఖర్ మాట్లాడుతూ... గురువారం రాత్రి చోటుచేసుకున్న ఘర్షణల కారణంగా షిల్లాంగ్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగింది.

12:33 - June 1, 2018

హైదరాబాద్ : లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీలు ఉద్యమబాట పట్టనున్నారు. జూన్‌ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్వయం పాలన ప్రకటించుకొని నిరసన తెలపనున్నారు. మా ఊరిలో మా రాజ్యం నినాదంతో ఆదివాసీలు సమరశంఖం పూరించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ గ్రామాల్లోని ఆదివాసీలు ఈ నిరసనలో పాల్గొననున్నారు. లంబాడీలను ఎస్టీ జాబితాలో  చేర్చడం వల్ల తమ మనుగడకే ప్రమాదం ఏర్పడిందని భావించిన ఆదివాసీలు ఉద్యమ బాట పట్టారు. ఇప్పటికే గూడెంలలోని పాఠశాలలో ఉన్న లంబాడా టీచర్లను బహిష్కరించారు. 

భార్యకు విడాకులివ్వనున్న డైరెక్టర్ క్రిష్..

హైదరాబాద్ : 2016, ఆగస్టు 7న తాను దర్శకత్వం వహిస్తున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి..పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న దర్శకుడు క్రిష్ అలియాస్ జాగర్లమూడి రాధాకృష్ణ, విడాకులకు దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. వెలగ రమ్య అనే యువతిని పెళ్లి చేసుకున్న ఆయన, రెండేళ్లలోపే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడం టాలీవుడ్ వర్గాలకు షాక్ ఇస్తోంది. క్రిష్, రమ్యలు పరస్పర అంగీకారంతోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, క్రిష్ ప్రస్తుతం 'మణికర్ణిక' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రధాని : రఘువీరా

విజయవాడ : 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమనీ..యూపీఏ ప్రభాని రాహుల్ గాంధీయేనని రఘువీరా రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రఘవీరా పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని టీడీపీ అనటం దౌర్భాగ్యమమని రఘువీరా విమర్శించారు . 

12:19 - June 1, 2018

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోకి 14 మంది జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు ప్రవేశించినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఆత్మహుతి దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. నిఘావర్గాల హెచ్చరికలతో జమ్మూకశ్మీర్‌, ఢిల్లీలో హైఅలర్ట్‌ ప్రకటించారు. కీలక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. 

 

లారీ బీభత్సం...ఇద్దరు మృతి..

మహబూబ్ నగర్ : దివిటిపల్లి సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. 44వ జాతీయ రహదారిపై పనులు చేస్తున్న కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 

బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి : చంద్రన్న బీమా కార్యాక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 2016లో 2.13 కోట్లమందితో బీమా పథకం ప్రారంభమయ్యింది. రెండేళ్లలో లక్షన్నర కుటుంబాలకు రూ.2వేల కోట్లు బీమా చెల్లింపులు జరిగాయి. 2.5 కోట్ల మందితో దేశంలోనే పెద్ద బీమా పథకంగా చంద్రన్న బీమా పథకం గుర్తింపు పొందింది. 

విజయవాడ దుర్గ గుడిలో మరో వివాదం..

విజయవాడ : కనకదుర్గ గుడిలో మరో వివాదం చోటుచేసుకుంది. ఓ క్షురకుడిపై పాలకమండలి సభ్యుడు పెంచలయ్య చేయి చేసుకున్నాడు. దీంతో వారు నిరసనకు దిగారు. పెంచలయ్యపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేస్తు డిమాండ్ చేస్తున్నారు. 

175 స్థానాల్లో బీజేపీ పోటీ: సోము

తూర్పుగోదావరి : 2019 సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లతో బీజేపీ పోటీ చేస్తుందని సోము వీర్రాజు తెలిపారు. జనసేనతో కాలమే నిర్ణయిస్తుందని సోము వీర్రాజు పేర్కొన్నారు. బీజేపీ, జనసేనలు పోటీ చేద్దామని 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను అడిగామని సోము వీర్రాజు తెలిపారు. వైఎస్ కుటుంబంతో నాకు విరోధం లేదని సోము స్పష్టంచేశారు. అనుభవమున్న చంద్రబాబుకు మద్దతునిద్దామని ఆనాడు పవన్ అన్నారని తెలిపారు. పవన్ వాస్తవాలే చెబుతున్నారనీ..ఇప్పటికీ చెప్పకపోతే ఆయన్ని ప్రజలు నమ్మరన్నారు. చంద్రబాబు దీక్షల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం మానుకోవాలని హితవు పలికారు.

 

మోత్కుపల్లితో ముద్రగడ మంతనాలు..

హైదరాబాద్ : టీడీపీ బహిషృత నేత మోత్కుపల్లి నర్శింహులుతో కాపు పోరాట సమితి అధ్యక్షుడు ముద్రగడ పద్మనాభం మంతనాలు సాగిస్తున్నారు. వీరిద్దరు చర్చలు దాదాపు రెండు గంటలపాటు కొనసాగాయి. మోత్కుపల్లిని ఏపీకి రావాలని ముద్రగడ్ ఆహ్వానించారు. 

10వ తరగతి విద్యార్థిని అదృశ్యం..

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్‌లో పదవ తరగతి విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. అనిత అనే బాలిక నిన్న ఉదయం వాకింగ్ అని ఇంట్లో నుంచి వెళ్లింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు భయపడి ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్అ చేసి వుంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనిత ఎన్‌ఎస్ గ్రామర్ స్కూల్‌లో పదవ తరగతి చదువుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వాకింగ్‌కు వెళ్ళినప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

'మా ఊరిలో మా రాజ్యం' అంటున్న ఆదివాసీలు..

హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దినోతవ్సం సందర్భంగా ప్రభుత్వం కన్నుల పండుగా వేడులకు సిద్ధం అయ్యింది. ఈ నేపథ్యం ఆదివాసీలు ఆందోళన బాట పట్టనున్నారు. రేపటి నుండి ఆదివాసీలు 'మా ఊరిలో మా రాజ్యం' అనే నిదాదంతో ఉద్యమ బాట పట్టనున్నారు. జూన్ 2 నుండి స్వయంపాలన ప్రకటించుకోవాలని ఆదివాసీలు నిర్ణయించుకున్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఆదివాసీలు డిమాండ్ చేయనున్నారు. ఆదివాసీల గూడాలలోని లంబాడా టీచర్లను ఆదివాసీలు బహిష్కరించారు. ఈ నిరసనలో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలోని ఆదివాసీలు భారీగా పాల్గొననున్నారు. 

కారు,లారీ ఢీ 10మంది మృతి..

మహారాష్ట్ర: రాష్ట్రంలోని యవాత్మాల్ జిల్లా అర్ని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు - లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను యవాత్మాల్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

డబ్బు కోసం గోల్డ్ స్మగ్లింగ్ చేయమంటున్న బీజేపీ ఎమ్మెల్యే..

రాజస్థాన్ : డబ్బు సంపాదన కోసం డ్రగ్స్ అమ్మకాల జోలికి పోరాదని, డ్రగ్స్ కేసులో చిక్కితే బెయిల్ రావడం కష్టమని, అదే బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినా వెంటనే బెయిల్ లభిస్తుందని రాజస్థాన్ కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే అర్జున్ లాల్ గార్గ్ సలహాలిస్తున్నారు. బిలారాలో దేవాసీ వర్గం వారిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. జోధ్ పూర్ జైల్లో డ్రగ్స్ కేసుల్లో ఎంతో మంది ఉన్నారని, డ్రగ్స్ అమ్మకాల్లో ఇంతవరకూ ఉన్న బిష్ణోయిల రికార్డును దేవాసీ వర్గం దాటిపోయిందని వ్యాఖ్యానించిన ఆయన, డ్రగ్స్ వ్యవసం నుంచి యువత బయటకు రావాలని సూచించారు.

ఇద్దరు చిన్నారులతో తల్లి ఆత్మహత్య..

గుంటూరు : జూపూడిలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులతో సహా తల్లి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

సల్మాన్ ను కొడితే రూ.2లక్షలట..

ముంబై : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ను కొట్టినవారికి రూ.2 లక్షల బహుమతి ఇస్తానని విశ్వహిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అనుచరుడు, హిందూ హై ఆజ్ ఆగ్రా నగర విభాగం అధ్యక్షుడు గోవింద్ పరాషర్ సంచలన ప్రకటన చేశారు. ప్రకటించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సల్మాన్ ‘లవరాత్రి’ పేరుతో సినిమా తీశారని, ఇది నవరాత్రి పండుగను అవమానించడమేనని ఆయన ఆరోపించారు.

 

11:02 - June 1, 2018

తెలుగు సినిమా పరిశ్రమకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చి పెట్టిన దర్శకుడాయన. తాను డైరెక్షన్ చేసిన సినిమాలలో అన్నీ సూపర్ హిట్సే. ఒక్కటంటే ఒక్కటి కూడా ప్లాప్ కాలేదు. అతని డైరెక్షన్ లో చేయాలని స్టార్ హీరోలు కూడా పడిగాపులు కాస్తారు. ఆయనే సినిమా పరిశ్రమలో జక్కన్నగా పేరొందిని రాజమౌళి. తన ప్రాజెక్టును ఎక్కువ కాలంగా చిత్రీకరించినా..అంతకు మించిన క్రేజ్ ను హీరోలకు అందించే ఏకైక దర్శకుడు రాజమౌళి. ఆయన డెరెక్షన్ లో వచ్చిన బాహుబలి స్వీక్వెల్స్ తెలుగు సినిమా పరిశ్రమను అంతర్జాతీయ చిత్రపటంలో నిలిపాయి. మరి ఆయన సినిమా అంటేనే భారీ బడ్జెట్టే కాదు భారీ తారాగణం కూడా వుంటారు. అటువంటి జక్కన్న భారీ మల్టీ స్టారర్ సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ విషయంపై పలు వార్తలు చక్కర్లు కొట్టినా ఆ హీరోల గురించి కూడా కొంతగా ఊహాగాలు కూడా వచ్చాయి.

చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీస్టార్ మూవీ..
మెగా పవర్ స్టార్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రాబోతోందనే విషయం పూర్తిగా కాకపోయినా సినీ అభిమానులకు అర్థం అయింది. మరి భారీ మల్టీ స్టారర్ అంటే మాటలు కాదు. ఎవరి క్రేజ్ తగ్గకుండా చూడాలి. ఇద్దరి అభిమానులను మెప్పించాలి. ఇద్దరికీ సమాన రేంజ్ ను అందించాలి. అందులోను మన తెలుగు సినిమాలో ఎవరి అభిమానుల మనోభావాలకు భంగం వాటిల్లకూడదు..అందుకు ఓ స్థాయి స్ర్కీప్లే చాలా ముఖ్యం.
పోలీస్ ఆఫీసర్ గా చరణ్..గ్యాంగ్ స్టర్ గా ఎన్టీఆర్..
రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ మల్టీ స్టారర్ రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనే టాక్ వచ్చింది. దాంతో అందరిలో ఎన్టీఆర్ పాత్ర ఎలా వుండనుందనే ఆసక్తిని తలెత్తింది.

అన్నదమ్ములుగా చరణ్, ఎన్టీఆర్..
ఈ సినిమాలో ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఇద్దరూ సోదరులే అయినప్పటికీ వాళ్లు ఎంచుకున్న మార్గాలు వేరు. ఈ పరిస్థితుల్లో చోటుచేసుకునే పరిణామాలతో కథ చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతుందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మించే ఈ సినిమా కోసం త్వరలోనే కథానాయికలను ఎంపిక చేయనున్నారు.  

10:54 - June 1, 2018

జగిత్యాల : పొరండ్ల గ్రామం దారుణం జరిగింది. మద్యానికి బానిసైన కొడుకును తండ్రి చంపాడు. రోజూ డబ్బుల కోసం తల్లిదండ్రులను కొడుకు వేధిస్తున్నాడు. రాత్రి మద్యం సేవించి వచ్చిన కొడుకు తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డారు. డబ్బుల కోసం వేధిస్తుండటంతో భరించలేక నిద్రిస్తున్న సమయంలో కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. రక్తపు మడుగులో విలవిల్లాడుతూ కొడుకు మృతి చెందారు.

 

ఐదు కార్లను ఢీకొన్న లారీ..

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని ప్యాట్నీ సెంటర్ వద్ద అర్ధరాత్రి ఓ లారీ బీభత్సం సృష్టించింది. పగలు, రాత్రి తేడాలేకుండా రద్దీగా ఉండే ఈ ప్రాంతానికి మితిమీరిన వేగంతో వచ్చిన ఓ లారీ, అదుపుతప్పి ఐదు కార్లను, పలు ద్విచక్ర వాహనాలను ఢీకొంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. లారీ డ్రైవర్ ను అరెస్ట్ చేశామని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతుందని పోలీసు అధికారులు వెల్లడించారు.

మద్యం తాగి వేధిస్తున్నాడని కుమారుడ్ని చంపేశారు..

జగిత్యాల : పండంటి కుటుంబాలలో మద్యం చిచ్చు పెడుతోంది. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన తల్లిదండ్రులు కన్న కుమారుడిని దారుణంగా నరికి చంపిన పరిస్థితులకు మద్యం కారణంగా కనిపిస్తోంది. ఇటువంటి ఘటన పారండ్లలో చోటుచేసుకుంది. మద్యం సేవించి వేధిస్తున్నాడనీ కొడుకును గొడ్డలితో నరికి తల్లి తండ్రులు నరికి చంపారు. నిద్రిస్తున్న కుమారుడిపై తల్లిదండ్రులు గొడ్డలితో దాడిచేసి హత్య చేశారు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయారు. 

10:39 - June 1, 2018

ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ కు కార్పొరేటర్లు కళంకంగా మారారు. ఖమ్మం కార్పొరేషన్ అధికార పార్టీ కార్పొరేట్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. 49 డివిజన్ కార్పొరేటర్ జంగం భాస్కర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళ ఫిర్యాదు చేసింది. రెండేళ్లుగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఖమ్మం కార్పొరేటర్ల తీరుపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

జమ్ము కశ్వీర్, ఢిల్లీలో హై అలర్ట్..

జమ్ము కశ్వీర్ : జమ్ము కశ్వీర్, ఢిల్లీలో భద్రతా దళాళు హై అలర్ట్ ను ప్రకటించాయి. భద్రతాదళాలు అప్పమత్తంగా వుండాలని నిఘావర్గాలు హెచ్చరికలు జారిచేశాయి. జమ్ము కశ్మీర్ లోకి ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతాదళాలు అప్పమత్తం అయ్యాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుండి నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాదులు ప్రవేశించారని సమాచారం అందించాయి. దీంతో సున్నిత ప్రాంతాలు, కశ్మీర్ లోయలోను అప్పమత్తంగా వుండాలని నిఘావర్గాలు హెచ్చరించాయి. 

ఇండస్ట్రీస్ మేనేజర్ ఇంటిపై ఏసీబీ దాడులు..

మహబూబ్ నగర్ : ఇండస్ట్రీస్ మేనేజర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మియాపూర్ బాలాజీ నగర్, మహబూబ్ నగర్ లోని సురేష్ కుమార్ ఇళ్లలో అధికారులు ఏకకాలంలో ఐదు ప్రాంతాలలో సోదాలను కొనసాగిస్తున్నారు. ఈ సోదాలలో భారీగా అక్రమాస్తులను గుర్తించారు. హైదరాబాద్ లో 3, మహబూబ్ నగర్, విశాఖలలో ఏకకాలంలో సోదాలకు నిర్వహిస్తున్నారు. 20 తులాల బంగారం, రూ.లక్ష నగదు, 2 బ్యాంక్ లాకర్లు వున్నట్లుగా అధికారులు గుర్తించారు.  

కొడుకును చంపిన తండ్రి

జగిత్యాల : పొరండ్లలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన కొడుకును తండ్రి చంపాడు. డబ్బుల కోసం వేధిస్తుండటంతో భరించలేక గొడ్డలితో కొడుకును తండ్రి నరికి చంపాడు. రక్తపు మడుగులో విలవిల్లాడుతూ కొడుకు మృతి చెందారు.

 

మహబూబ్ నగర్ జిల్లా ఇండస్ట్రీస్ మేనేజర్ సురేష్ కుమార్ ఇళ్లపై ఎసీబీ సోదాలు

మహబూబ్ నగర్ : జిల్లా ఇండస్ట్రీస్ మేనేజర్ సురేష్ కుమార్ ఇళ్లపై ఎసీబీ సోదాలు నిర్వహిస్తోంది. మియపూర్ బాలాజీనగర్, మహబూబ్ నగర్ లోని సురేష్ కుమార్ ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఐదో చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. 

09:45 - June 1, 2018

హైదరాబాద్ : తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులు బడిబాట బట్టారు. వారం రోజుల పాటు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఎండతీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల తరువాత పునఃప్రారంభం అవుతున్న స్కూల్స్ లో అరకొర సౌకర్యాలతో విద్యార్ధులకు స్వాగతం పలుకుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో సొంత భవనం వుంటే బెంచీలుండవు.. బెంచీలుంటే బ్లాక్ బోర్డు ఉండదు. టాయిలెట్స్ వుంటే వాటర్ వుండవు.. వాటర్ ఉంటే వాటి మెయింటెనెన్స్ వుండదు.. అన్నీ వుంటే టీచర్లు ఉండరు.. ఇది ప్రభుత్వ బడుల పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నేటి నుంచి ప్రారంభమయ్యే పాఠశాలలు విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. పాఠ్యపుస్తకాలు, స్కూల్‌ యూనిఫామ్‌లు సిద్ధమయ్యాయి. ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజులుం తల్లిదండ్రులను భయపెడుతున్నాయి. రాజ్ భవన్ ప్రభుత్వం స్కూల్ లో పిల్లలను చేర్పించేందుకు పేరెంట్స్ క్యూ కడుతున్నారు. స్కూల్ లో సౌకర్యాలు బాగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి స్కూల్స్ రాష్ట్రమంతటా ఉంటే బాగుంటుందని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. కార్పొరేట్ స్కూల్స్ లో ఫీజులను చెల్లించలేకపోతున్నామని చెబుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

నేటి నుంచి పిల్లలు బడిబాట..

హైదరాబాద్ : వేసవి సెలవులు ముగిశాయి. పిల్లలు బడిబాట పట్టారు. వేసవి సెలవుల తరువాత పునఃప్రారంభం అవుతున్న స్కూల్స్ లో అరకొర సౌకర్యాలతో విద్యార్ధులకు స్వాగతం పలుకుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో సొంత భవనం వుంటే బెంచీలుండవు.. బెంచీలుంటే బ్లాక్ బోర్డు ఉండదు. టాయిలెట్స్ 

09:14 - June 1, 2018

హైదారాబాద్ : గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీవర్షం పడింది. రాష్ట్రంలో పలు జిల్లాలో నేడు, రేపు కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశానికి ముందు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మరో వైపు ఎండల తీవ్రత ఇదే స్థాయిలో ఉంటుందని వివరించారు. రాత్రి హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏపీలో పిడుగుపాటుకు 10మంది మృతి చెందారు. గుంటూరు జిల్లాలోనే ఏడుగురు మృతి చెందారు.

 

08:45 - June 1, 2018

హైదరాబాద్ : వేసవి సెలవులు తరువాత పునఃప్రారంభం అవుతున్న స్కూల్స్ లో అరకొర సౌకర్యాలతో విద్యార్ధులకు స్వాగతం పలుకుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో సొంత భవనం వుంటే బెంచీలుండవు.. బెంచీలుంటే బ్లాక్ బోర్డు ఉండదు. టాయిలెట్స్ వుంటే వాటర్ వుండవు.. వాటర్ ఉంటే వాటి మెయింటెనెన్స్ వుండదు.. అన్నీ వుంటే టీచర్లు ఉండరు.. ఇది ప్రభుత్వ బడుల పరిస్థితి. ఈ పరిస్థితుల్లో  నేటి నుంచి ప్రారంభమయ్యే పాఠశాలలు విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. 

08:42 - June 1, 2018

హైదరాబాద్ : నగరంలోని ప్యాట్నీ సెంటర్‌ దగ్గర ఓ లారీ అర్థరాత్రి బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ఐదు కార్లను ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. 

 

08:39 - June 1, 2018

నెల్లూరు : జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చెందారు. మరో రెండు ఎద్దులు మృతి చెందాయి. గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన నవీన్, నర్సింహులు అనే ఇద్దరు వ్యక్తులు సంతలో ఎద్దులను కొనుగోలు చేసి ఆటో ట్రాలీలో ఎద్దులను తీసుకొని గ్రామానికి వస్తున్నారు. మార్గంమధ్యలో నెల్లూరు జిల్లా దుత్తలూరులో ఆటో ట్రాలీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో నవీన్, నర్సింహులు మృతి చెందారు. ఆటో ట్రాలీలో ఉన్న మరో రెండు ఎద్దులు మృతి చెందాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

08:27 - June 1, 2018

ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలిందని వక్తలు అన్నారు. దేశ వ్యాప్తంగా మోడీ పాలనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేత కైలాష్, కేఎస్.లక్ష్మణ్ రావు పాల్గొని, మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయిందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:19 - June 1, 2018

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి చేసిన వివాదస్పద కామేంట్‌లపై మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఎక్కడో ఒక చోట జరిగిన సంఘటనను ఆదారం చేసుకుని పురుష కమీషన్‌ అనటం మహిళల మీద వరుసగా జరుగుతున్న దాడులను పక్కదోవ పట్టించటమేనని వారు విమర్శిస్తున్నారు. ఒకవైపు మైనర్‌ బాలికల మీద వారుసగా ఆఘాయిత్యాలు జరుగుతుంటే వీటిని ఆపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించకుండా ఈ అనవసర వ్యాఖ్యలు చేయటమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. నానాటికి మహిళ మీద దాడులు పెరుగుతున్నాయని వీటిని ఆపేందుకు మహిళా కమిషన్‌గా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఐద్వా ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:57 - June 1, 2018

ఖమ్మం/కరీంనగర్‌ : కౌలు, పోడు రైతులకు కూడా రైతు బంధు పథకాన్ని వర్తింప చేయాలన్న డిమాండ్‌తో ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో జరిగిన సడక్‌ బంద్‌ ఉద్రిక్తతలకు దారితీసింది. రహదారులను దిగ్బంధించిన అఖిలపక్ష  రైతు సంఘాల నాయకులు, రైతులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులు, నిర్బంధాలు ఉద్యమాలను ఆపలేవంటూ.. రైతుబంధు పథకాన్ని కౌలు, పోడు రైతులకు వర్తింపచేసే వరకు పోరాటం కొనసాగిస్తామని అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రైతుబంధు పథకాన్ని కౌలు, పోడు రైతులకు కూడా వర్తింప చేయాలన్నడిమాండ్‌తో ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో జరిగిన సగడక్‌ బంద్‌ ఉద్రిక్తతలకు దారితీసింది. బంద్‌లో అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రోడ్లను దిబ్బంధించి, నిరసన తెలిపారు. 

అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ ప్రదర్శన జరిగింది. రాపర్తినగర్‌ సెంటర్‌లో రోడ్లను దిగ్బంధించారు. దీంతో వాహనాలరాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో సడక్‌ బంద్‌ చేస్తున్న అఖిలపక్ష రైతు సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న రైతుబంధు పథకం ఎన్నికల ఎత్తగడ అని వామపక్ష  రైతు సంఘాల నాయకులు విమర్శించారు. రైతుబంధు పథకం ఎన్నికల ఉద్దీపన పథకం అంటూ ప్రజా సంఘాల నాయకులు ఎద్దేవా చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కరీంనగర్‌ జిల్లా ఎల్కతుర్తిలో రహదారులను దిగ్బంధించిన టీజేఎస్‌ అధ్యక్షడు కోదండరామ్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితోపాటు రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి, హసన్‌పర్తి పోలీసు స్టేషన్‌కు తరలించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. 

రైతు సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దారుణంగా విఫలమయ్యారని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దిగొచ్చి కౌలు, పోడు రైతులకు  కూడా రైతుబంధు పథకాన్ని వర్తింపచేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. 

07:54 - June 1, 2018

 హైదరాబాద్ : ప్రస్తుత పరిస్థితుల్లో.. దేశంలో తృతీయ ఫ్రంట్‌కు అవకాశం లేదని.. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై స్థానిక పరిస్థితులు ప్రభావం చూపుతాయని.. ఇప్పుడూ అదే జరిగిందని అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమదే గెలుపని అన్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార, న్యాయ శాఖల మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌.. హైదరాబాద్‌లో పర్యటించారు. నాలుగేళ్ల మోదీ పాలన ఫలాలను వివరించేందుకు.. మీడియాతో సమావేశమయ్యారు. మోదీ నేతృత్వంలో భారత్‌ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోందని రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై స్థానిక అంశాలు ప్రభావం చూపుతాయని, 2019 ఎన్నికల్లో తమదే గెలుపని అన్నారు. దేశంలో తృతీయ ఫ్రంట్‌కు అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. 

ట్రిపుల్‌ తలాఖ్‌ మతానికి సంబంధించిన అంశం కాదని, మహిళల సమస్యగానే భావించామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణల్లో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటామన్నారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం చేసేదేమీ లేదని.. భూములకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని అన్నారు. 

హైకోర్టు విభజన అంశం సుప్రీంకోర్టులో ఉందని, అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయ్యే వరకూ కోర్టును విభజించవద్దని చంద్రబాబు లేఖ రాశారని.. ఆ తర్వాతే విభజన నోటిఫై చేస్తామని రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. గడచిన 48 నెలల తమ ప్రభుత్వ హయాంలో.. 31 కోట్ల మంది పేదలకు జన్‌ధన్‌ ఖాతాలు ఇచ్చామని రవిశంకర్‌ అన్నారు. దేశవ్యాప్తంగా 120 మొబైల్‌ తయారీ యూనిట్లను నెలకొల్పామని, సుమారు ఏడున్నర కోట్ల మరుగుదొడ్లు నిర్మించామని, మూడున్నర కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామని, ప్రపంచానికి యోగాను పరిచయం చేశామని చెప్పారు. 

07:51 - June 1, 2018


ఢిల్లీ : దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపికి భంగపాటు ఎదురైంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు విపక్షాల ఐక్యతను చాటి చెప్పాయి. అసెంబ్లీ స్థానాల్లో ఎలాంటి ప్రభావం చూపకపోగా... మూడు సిట్టింగ్‌ ఎంపీ స్థానాలకు గాను ఒక్క స్థానాన్ని మాత్రమే బిజెపి నిలుపుకోగలిగింది. 11 అసెంబ్లీ స్థానాలకు గాను  బిజెపి ఒక్క స్థానానికే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో సామాజిక న్యాయం గెలిచిందని...దేశాన్ని విభజించాలనుకునేవారికి ఇది చెంప పెట్టని విపక్షాలు అభివర్ణించాయి.

దేశ వ్యాప్తంగా 4 లోక్‌సభ స్థానాలు, 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఉప ఎన్నికల్లో బిజెపికి ఎదురుగాలి వీచింది. మూడు ఎంపీ సిట్టింగ్‌ స్థానాలకు గానూ ఒక్క స్థానాన్ని మాత్రమే బిజెపి దక్కించుకుంది. యూపీలోని కైరానా, మహారాష్ట్రలోని భండారా గోండియా స్థానాలను బిజెపి కోల్పోగా... పాల్‌ఘర్‌ స్థానాన్ని మాత్రం బిజెపి దక్కించుకుంది. నాగాలాండ్‌లో ఎన్డీపీపీ విజయం సాధించింది. 

యూపీ, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరాఖండ్‌, మేఘాలయలో11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి కేవలం ఒక్క స్థానంలోనే గెలుపొందింది. కాంగ్రెస్‌ 4, ఇతర విపక్ష పార్టీలు 6 స్థానాలను దక్కించుకున్నాయి. కైరానా లోక్‌సభ నియోజకవర్గంలో ఆర్‌ఎల్డీకి చెందిన విపక్షాల ఉమ్మడి అభ్యర్థి తబస్సుమ్‌ హసన్‌ 55 వేల ఓట్ల తేడాతో బిజెపి అభ్యర్థి మృగంకా సింగ్‌పై ఘన విజయం సాధించారు. యూపీలోని నూర్‌పుర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ 6,211 ఓట్ల తేడాతో బిజెపిని ఓడించింది. ఇది కూడా బిజెపి సిట్టింగ్‌ స్థానమే. ఈ ఎన్నికల్లో సామాజిక న్యాయం గెలిచిందని...ఇది దేశాన్ని విభజించాలనుకునేవారి ఓటమని సమాజ్‌వాదీ పార్టీ పేర్కొంది.

మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ లోక్‌సభ ఉపఎన్నికల్లో బిజెపి 29 వేల ఓట్ల తేడాతో శివసేనను ఓడించింది. భండారా గోండియా స్థానాన్ని ఎన్సీపీ దక్కించుకుంది. పాల్‌ఘర్‌ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఇక్కడ మళ్లీ రీపోలింగ్‌ జరపాలని శివసేన డిమాండ్‌ చేసింది. ఎన్నికల సంఘంలోనూ అవినీతి కనిపిస్తోందని ఆరోపించింది.

బిహార్‌లోనూ బిజెపితో జతకట్టిన నితీష్‌కుమార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జోకిహాట్‌ శాసనసభకు జరిగిన ఉపఎన్నికల్లో ఆర్జేడీ 41 వేల ఓట్ల తేడాతో జెడియుపై భారీ విజయం సాధించింది. ఇక్కడ అవకాశ వాదం ఓడిందని...లాలూ వాదమే గెలిచిందని నితీష్‌, బిజెపిపై మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌ ధ్వజమెత్తారు.
బైట్‌ తేజస్వీయాదవ్, మాజీ ఉపముఖ్యమంత్రి

కర్ణాటకలోని ఆర్‌ఆర్‌ నగర్‌, మహారాష్ట్రలోని పాలస్‌ కడేగావ్‌-, మేఘాలయలోని అంపతి, పంజాబ్‌లోని షాకోట్‌ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. తాజా గెలుపుతో మేఘాలయలో  అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌- బిజెపి అధికారానికి చెక్‌ పెట్టే యోచనలో ఉంది. కేరళలోని చెంగన్నూర్‌ అసెంబ్లీ స్థానాన్ని సిపిఎం తిరిగి నిలబెట్టుకుంది. సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ అభ్యర్థి సాజి చెరియన్ కాంగ్రెస్‌ అభ్యర్థిపై 21 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.

జార్ఖండ్‌లోని సిల్లీ, గోమియాల అసెంబ్లీ స్థానాల్లో జెఎంఎం గెలుపొందింది. బెంగాల్‌లోని మహేప్తలా అసెంబ్లీ స్థానాన్ని టిఎంసి దక్కించుకుంది. ఉత్తరాఖండ్‌లోని థరాలీ అసెంబ్లీ స్థానంలో మాత్రమే బిజెపి విజయం సాధించింది. 2019 సాధారణ ఎన్నికలకు ముందు ఉపఎన్నికల ఫలితాలు విపక్షాల్లో ఉత్సాహాన్ని నింపగా...బిజెపి శ్రేణులను నిరాశ పరిచాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

07:48 - June 1, 2018

హైదరాబాద్‌ : నగరంలో ఆధునాతన బస్‌ స్టాపులు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచస్థాయి సౌకర్యాలతో ఏసీ బస్‌స్టాప్‌లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యంతో... జీహెచ్‌ఎంసీ, నగర వ్యాప్తంగా 826 బస్‌ స్టాప్‌లను ఏర్పాటు చేయనుంది. వీటి నిర్వహణ బాధ్యతను పూర్తిగా ప్రయివేటు యాడ్‌ ఏజన్సీలకు అప్పగించారు. 

హైదరాబాద్‌ నగరంలో పదికిపైగా ఏసీ బస్‌స్టాప్‌లను మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు.  ఈ బస్‌స్టాప్‌ కాంప్లెక్స్‌లో ఏసీ సౌకర్యంతో పాటు.. వైఫై, సీసీ టీవీ, ఎల్‌ఈడీ ప్యానల్స్‌, మొబైట్‌ చార్జింగ్‌, టాయిలెట్స్‌, కాఫీ షాప్‌, బస్ రిజర్వేషన్‌ కౌంటర్లు, ఎమర్జెన్సీ అలారం లాంటి సౌకర్యాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో.. బల్దియా ఈ బస్‌స్టాప్‌లను నిర్మించింది. వీటి నిర్వహణ బాధ్యతను పూర్తిగా ప్రైవేటు యాడ్‌ ఏజెన్సీలే చేపడతాయి. ప్రతిగా.. ఈ ఏజెన్సీలు.. బల్దియాకు.. ఏటా ఎనిమిది కోట్ల రూపాయలను చెల్లిస్తాయి. 

హైదరాబాద్‌ నగరంలో.. రోజూ లక్షలాది మంది ప్రయాణికులు.. గమ్యస్థానాలు చేరేందుకు.. ఆర్టీసీ నడిపే 3800 సిటీబస్సులపైనే ఆధారపడుతున్నారు.  ప్రయాణికుల కోసం బస్‌స్టాప్‌లు నిర్మించినా.. అవి కూర్చునేందుకు కాదు కదా.. కనీసం నిలబడేందుకు కూడా వీలుకాని దుస్థితికి చేరుకున్నాయి. ఈ ఇబ్బందిని తొలగించేందుకు బల్దియా కొత్తరకం బస్‌స్టాపులకు శ్రీకారం చుట్టింది. అయితే ప్రస్తుతానికి.. కొన్ని ప్రాంతాలకే ఏసీ బస్‌స్టాపులను పరిమితం చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో.. బల్దియా సాధారణ బస్టాపులనే నిర్మించనుంది. వీటి నిర్వహణ బాధ్యతను కూడా యాడ్‌ ఏజెన్సీలకు అప్పగిస్తారు. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తోనున్నాయి. దీని వల్ల బల్దియా కోట్ల రూపాయల ఆదాయం కోల్పోనుందని.. బస్సు స్టాపుల వద్ద సౌకర్యాలు సరిగ్గా లేకపోతే ఎవరిని అడగాలని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. 

మరోవైపు 3800 బస్సుల స్థానంలోనే.. త్వరలో ఎలెక్ట్రిక్‌ వెహికిల్స్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకునే ప్రజలందరికీ ఆధునిక సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రపంచస్థాయి బస్‌షెల్టర్లను నెలకొల్పుతున్నామని కేటీఆర్‌ తెలిపారు. మొత్తానికి కొత్త బస్‌స్టాప్‌లతో తమ కష్టాలు తీరుతాయని నగర వాసులు భావిస్తున్నారు.

07:45 - June 1, 2018

విజయనగరం : ధర్మపోరాటం, నవ నిర్మాణ దీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాధనాన్ని మంచినీటి ప్రాయంగా ఖర్చు చేస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా సాధనలో విఫలమైన చంద్రబాబు.. దేనికోసం దీక్షలు చేస్తున్నారో చెప్పాలని జనసేనాని డిమాండ్‌ చేశారు. ప్రజాధనానికి ధర్మకర్తగా ఉండాల్సిన ముఖ్యమంత్రి... దీక్షల పేరుతో దుర్వినియోగం చేయడం ఏంటని... విజయనగరం జిల్లా పార్వతీపురం జనసేన పోరాట యాత్రలో చంద్రబాబును ప్రశ్నించారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజా పోరాట యాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో జరిగిన ర్యాలీల్లో జనసేనాని పాల్గొన్నారు. రెండు సభలకు భారీగా జనం తరలివచ్చారు. ప్రత్యేక హోదా సాధనలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇప్పుడు ధర్మపోరాటం, నవనిర్మాణ దీక్షలంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పవన్‌ ఆరోపించారు. 

పవన్‌ కల్యాణ్‌.. ఎవరో తెలియదంటూ విజయనగరం టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజు చేసిన వ్యాఖ్యలపై జనసేనాని తీవ్రంగా స్పదించారు. 2014 ఎన్నికల్లో జనసేన ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు.. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో జనసేనను గెలిపిస్తే బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఇస్తుందని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. 

పెద్దనోట్లు రద్దు చేయాలని ప్రధాని మోదీకి తానే సలహా ఇచ్చానని ప్రచారం చేసుకొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... పెట్రోలు, డీజిల్‌కు జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని ఎందుకు చెప్పడంలేదని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తుందని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. అభివృద్ధి ప్రణాళికల అమలును పర్యవేక్షించేందుకు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

07:42 - June 1, 2018

హైదరాబాద్ : తెలంగాణాలో స్థానిక సమరానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ ఓ అడుగుముందుకేసి గ్రామాల్లో పట్టు కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాదే మిగిలి ఉండడంతో... టీఆర్‌ఎస్‌ నేతలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
లోకల్‌బాడీ ఎన్నికలకు వెళ్లేందుకే కేసీఆర్‌ ఆసక్తి
స్థానిక సంస్థల ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది.  ప్రభుత్వ పరంగా ఎన్నికలను నిర్ణీత సమయానికే పూర్తి చేయాలన్న అభిప్రాయంతో... స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు గులాబీబాస్‌ ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్లుకావడంతో... ఈఎన్నికల ద్వారానే ప్రజల నాడిని గుర్తించవచ్చన్న అంచనాతో గులాబీ దళపతి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,  సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మద్దతును స్థానిక సంస్థల ఎన్నికల నుంచి కూడగట్టాలన్న భావనలో అధికారపార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.
కొంతమంది టీఆర్‌ఎస్‌ నేతల్లో లోకల్‌బాడీ ఫీవర్‌
కొంతమంది టీఆర్‌ఎస్‌ నేతల్లో స్థానిక సంస్థల ఎన్నికల భయం పట్టుకుంది.  స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే... గ్రామాల్లో పార్టీపరంగా ఉన్న అంతర్గత పోరు తెరపైకి వస్తుందన్న ఆందోళన కూడా వారిలో కనిపిస్తోంది. మరోఏడాదిలో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో ఇలాంటి గొడవలు ఉత్పన్నమైతే మంచిది కాదన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. మరికొంత మంది మాత్రం ఎన్నికలకు వెళ్లడమే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలే టీఆర్‌ఎస్‌కు విజయాన్ని అందిస్తాయన్న ధీమాతో ఉన్నారు.  గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం చట్ట సవరణ చేయడంతోపాటు కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు లాంటి అంశాలు తాము మద్దతునిచ్చే అభ్యర్థులకే కలిపి వస్తాయన్న అంచనాను అధికార పార్టీ నేతలు వేస్తున్నారు.  ఇటీవలే ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం కూడా ఓట్లు రాలుస్తుందన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. గ్రామాల్లో పట్టు సాధిస్తే .... సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆధిపత్యం సాధించడం సలువుగా ఉంటుందన్న అభిప్రాయం టీఆర్‌ఎస్‌ నేతల్లో కనిపిస్తోంది. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సీఎం కేసీఆర్‌.. నేతలకు సూచించినట్టు తెలుస్తోంది.

 

07:39 - June 1, 2018

సిద్ధిపేట : టీఆర్‌ఎస్‌ ముస్లీంల శ్రేయస్సు కోసం ఆలోచించే ప్రభుత్వం అన్నారు మంత్రి హరీష్‌ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండభూదేవి గార్డెన్‌లో రంజాన్‌ పండగ సందర్భంగా ఉచిత సరకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ముస్లీం మహిళలకోసం షాదీ ముబారక్‌ పథకం ద్వారా  లక్షరూపాయలు కేసీఆర్‌ ప్రభుత్వం ఇస్తోందని మంత్రి అన్నారు. సిద్దిపేటలో రెండు మైనారిటీ కళాశాలలతోపాటు.. ముస్లీంలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. 

 

07:36 - June 1, 2018

ఢిల్లీ : తెలంగాణ నాలుగో ఆవిర్భావ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ముస్తాబైంది. జాతీయ స్థాయిలో రాష్ర్ట ఘనతను చాటేలా రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి మూడు రోజులపాటు సాగే వేడుకలను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది.

అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ర్ట నాలుగో ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్న ప్రభుత్వం. ఇవాళ నుంచి మూడో వతేదీవరకూ అంబరాన్నంటేలా సంబరాలు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 6గంటలకు తెలంగాణ భవన్‌నుంచి ఇండియా గేట్‌ వరకూ మూడు కిలోమీటర్ల మారథాన్‌ నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ పాల్గొననున్నారు. తెలంగాణ ఆవిర్భావం పురస్కరించుకుని జాతీయ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. 

ఢిల్లీ వాసులకు తెలంగాణ గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్లు తెలిపేలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. రాష్ర్ట ఏర్పాటుకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు.  చార్మినార్‌ను తలపించేలా ఏర్పాటు రూపొందించిన  తోరణంతో.. హైదరాబాద్‌ లాడ్‌ బజార్‌ను మరిపించేలా స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. చేనేత, హస్తకళలు, భూదాన్‌ పోచంపల్లి చీరలు, ఛార్మినార్‌ గాజులు, ముత్యాలు, కరాచీ బిస్కెట్లు, ప్యారడైజ్‌ బిర్యానీ స్టాళ్ళు కొలువుదీరాయి. సకినాలు, సర్వాప్పలు అందుబాటులో ఉంటాయి.  

ఇవాళ సాయంత్రం ఆరుగంటలకు తెలంగాణ ప్రముఖులకు సన్మానం చేయనున్నారు. ప్రధానంగా జూన్‌ 2న యాదగిరి గుట్ట ప్రధాన అర్చకులతో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణాన్ని తెలంగాణ భవన్‌ అంబేడ్కర్‌ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. యాదాద్రి పండితులు  ఈ కళ్యాణం జరిపించనున్నారు.  మూడు రోజులపాటు వైద్య శిబిరం కూడా నిర్వహించనున్నట్లు రాష్ర్ట ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి తెలిపారు. రాష్ర్ట ఆవిర్భావ సంబరాలు అంబరాన్నంటేలా నిర్వహించేందుకు తెలంగాణ భవన్‌ను తీర్చదిద్దారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాల అలంకరణలో... సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించనున్నారు. 

07:33 - June 1, 2018

గుంటూరు : నిరుద్యోగ భృతిపై ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకంది. పదిలక్షలమంది నిరుద్యోగులకు వెయ్యి రూపాయల చొప్పున భృతి ఇవ్వాలని నిర్ణయించింది. నిరుద్యోగం రూపు మాపే వరకూ ఈ పథకం అమలవుతుందన్నారు మంత్రి లోకేష్.  

ఏపీ కేబినెట్‌ నిరుద్యోగ భృతి పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. పది లక్షల మందికి.. వెయ్యి చొప్పున భృతి ఇవ్వాలని నిర్ణయించింది. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారా లోకేష్‌ వివరించారు. డిగ్రీ లేదా డిప్లొమాను కనీస విద్యార్హతగా పరిగణిస్తామన్నారు.. ప్రభుత్వం నేరుగా బ్యాంక్‌ అకౌంట్‌లోనే నిరుద్యోగ భృతిని జమచేయనుంది. దీనికోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.  ఈ పథకానికి సంవత్సరానికి  పన్నెండు వందల   కోట్ల రూపాయలు ఖర్చవుతుందని మంత్రి లోకేష్‌ తెలిపారు..

ఒకే కుటుంబంలో ఇద్దరు అర్హులు ఉన్నా కూడా నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు మంత్రి లోకేష్‌ . ఈ పథకం అమలుపై పది రాష్ర్టాల్లో మంత్రివర్గ ఉప సంఘం అధ్యయనం చేసిందన్నారు.  ఇందులో లోటుపాట్లు తెలుసుకున్నాకే  
విధివిధానాలు రూపొందించామని మంత్రి తెలిపారు. రాష్ర్టంలో నిరుద్యోగం పోయే వరకూ ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ చేసిన ఆరోపణలై మంత్రి లోకేష్‌ స్పందించారు. ఫైబర్‌ గ్రిడ్‌ కాంట్రాక్ట్‌‌ను హెరిటేజ్ సభ్యుడికి ఇచ్చారన్న పవన్ వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు.. ఆరోపణలు చేసే ముందు  వాస్తవాలు తెలుసుకోవాలని గతంలోనే చెప్పానన్నారు.. తనపైనా, హెరిటేజ్‌పైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. నాలుగేళ్లలోనే  గ్రామాల్లో  పదిహేడు వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశామన్న లోకేష్‌..  కాంగ్రెస్‌ పార్టీ పదేళ్ళలో  పదకొండు వందల కిలోమీటర్ల సీసీ రోడ్లు మాత్రమే వేసిందన్నారు. 

07:29 - June 1, 2018

హైదరాబాద్ : యాభై రోజుల వేసవి సెలవుల తర్వాత తిరిగి స్కూళ్లు ఇవాళ పునః ప్రారంభం కాబోతున్నాయి. గతానికి భిన్నంగా ఈసారి 12 రోజుల ముందే స్కూళ్లు తెరుచుకోబోతున్నాయి. స్కూళ్లు మాత్రం అరకొర సౌకర్యాలతోనే విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల భారం...ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల లేమితో తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. స్కూళ్స్‌ రీ ఓపెనింగ్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూళ్ల పరిస్థితిపై ప్రత్యేక కథనం....
పాఠశాలలకు ముగిసిన వేసవి సెలవులు  
పాఠశాలలకు వేసవి సెలవులు ముగిశాయి. తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు తిరిగి పునః ప్రారంభం కాబోతున్నాయి.  అయితే గతానికి భిన్నంగా ఈసారి 12 రోజుల ముందే పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నుండే పాఠశాలు ప్రారంభమవుతున్నాయి. నిన్నటి వరకు ఆడి పాడిన పిల్లలు ఇక నుండి బడి బాట పట్టనున్నారు.
అరకొర సౌకర్యాలతోనే పాఠశాలలు విద్యార్థులకు స్వాగతం 
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అరకొర సౌకర్యాలతోనే పాఠశాలలు విద్యార్థులకు స్వాగతం పలుకనున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ బడుల్లో సొంత భవనాలుంటే బెంచీలుండవు...బెంచీలుంటే బ్లాక్‌ బోర్డు ఉండదు. టాయిలెట్స్‌, తాగునీటి సౌకర్యం, మెయింటెనెన్స్‌ లాంటి వసతులు ఏమీ లేకుండానే పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అయితే పాఠశాలల ప్రారంభానికి ఇంకా 12 రోజుల సమయం ఉన్నప్పటికీ ముందుగానే ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ఊష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 
పైపై మెరుగులు
ఇక సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం పైపై మెరుగులు దిద్ది సరిపెట్టుకుంటోంది. పాఠశాలల్లో సరిపడా సిబ్బందిని కూడా నియమించడంలేదు. దీంతో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు మరింత ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రభుత్వం డిజిటల్‌ విద్యపై పెడుతోన్న దృష్టి మౌలిక సదుపాయాలు కల్పించడంపై పెట్టడంలేదన్న విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ సంవత్సరం అన్ని పాఠశాలలను డిజిటల్‌ స్కూళ్లుగా మారుస్తామన్న ప్రభుత్వం చాలా పాఠశాలల్లో కనీసం కంప్యూటర్లు కూడా అమర్చలేకపోయింది.  
వేలల్లో, లక్షల్లో ఫీజులు వసూలు 
ఇక ప్రైవేటు స్కూళ్ల విషయానికి వస్తే తల్లిదండ్రులకు ఫీజులుం మాత్రం తప్పడంలేదు. వేలల్లో, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేటు స్కూల్స్‌ దండుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలలనే అభివృద్ధి చేస్తే ప్రైవేటును ఆశ్రయించాల్సిన అవసరంలేదంటున్నారు  నిపుణులు. ఇక విద్యార్థులకు ఇవ్వాల్సిన పాఠ్యపుస్తకాలు, యూనిఫారంలు సిద్ధమయ్యాయి. ఈ సారి ముందుగానే వీటిని అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

 

సికింద్రాబాద్ లో లారీ బీభత్సం

హైదరాబాద్ : సికింద్రాబాద్ లో లారీ బీభత్సం సృష్టించింది. ప్యాట్నీ సెంటర్ లో కార్లపైకి దూసుకెళ్లింది. ఐదు కార్లు ధ్వంసం అయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి.

Don't Miss