Activities calendar

02 June 2018

21:08 - June 2, 2018
21:06 - June 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల వేళ టీఎస్‌పీఎస్సీ 2,786 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీచేసింది. గ్రూప్‌-4, వీఆర్వో, ఆర్టీసీ, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌, హోం, రెవెన్యూ శాఖలో స్టెనో ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొత్తం 5 నోటిఫికేషన్లు జారీ చేసింది. గ్రూప్‌-4లో 1421, ఆర్టీసీలో 31 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నెల 7 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు నిర్ణయించారు. వీటన్నింటికీ అక్టోబర్‌ 7న పరీక్ష నిర్వహిస్తారు. అయితే, ఈ పరీక్షలను ఆన్‌లైన్లో నిర్వహించాలా? లేదంటే ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలా ? అనేది దరఖాస్తులు సంఖ్యను బట్టి నిర్ణయించాలని భావిస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌లో కీలకమైన వీఆర్వో ఉద్యోగాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. దీనికి ఈ నెల 8 నుంచి జులై 2 వరకు దరఖాస్తులు స్వీకరించి... సెప్టెంబర్‌ 16న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. వీఆర్వో ఉద్యోగాలకు ఇంటర్‌ కనీస విద్యార్హతగా నిర్ణయించారు. మిగతా ఉద్యోగాలకు మాత్రం సాధారణ డిగ్రీ ఉండాలి. స్టెనో, టైపిస్ట్‌ ఉద్యోగాలకు టైపింగ్‌ అర్హత ఉండాలని, అలాగే ఏఎస్‌వో ఉద్యోగాలకు డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

21:05 - June 2, 2018

హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల ఉద్యమం. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలు. ఉమ్మడి పోరాటాలు. ఉక్కు సంకల్పం. మొక్కవోని ఆత్మస్థైర్యంతో సాధించుకున్న తెలంగాణకు నాలుగేళ్లు నిండాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కలెక్టర్‌ ఆమ్రపాళి పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కడియం, అనంతరం కార్యక్రమంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అలాగే పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన అధికారులను మంత్రి అవార్డులతో సత్కరించారు.

కరీంనగర్‌ జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించిన ఈటెల.. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రభుత్వం తరుపున ప్రతిభ పురస్కారాలు అందించారు. రామగుండం సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికులు ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గనులపై త్రివర్ణ పతకాన్ని ఎగరవేసి మిఠాయిలు పంచుకున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ పాల్గొన్నారు.

మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అలాగే అమరుల కుటుంబాలకు, ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు అవార్డులను బహుకరించారు. మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో డీప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి పాల్గొన్నారు. అమరులకు నివాళులర్పించి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు.

నిజామాబాద్‌ జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు. వినాయక్‌ నగర్‌లో గల అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్‌తో కలిసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదాన్‌ జరిగిన వేడుకల్లో ఆబ్కారిశాఖ మంత్రి పద్మారావు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులర్పించారు. అనంతర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే సింగరేణి గనుల సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం గ్రౌండ్‌లో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగరేణి డైరెక్టర్‌ పవిత్రన్‌ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.

నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సూర్యాపేట జిల్లాలో జరిగిన వేడుకల్లో విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నల్లగొండలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో మండలి డిప్యూటీ చైర్మన్‌ విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ జెండా ఆవిష్కరించారు.

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వికారాబాద్‌ పోలీసు గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో జాతీయ జెండా ఎగరవేసిన మంత్రి, అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు.

అలాగే హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్ రంగనాథన్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యలయంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ జెండా ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉస్మానియా యూనివర్శిటీలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా వర్శిటీ వీసీ ఆర్ట్స్ కళాశాల భవనంపై జెండా ఆవిష్కరించారు. 

21:01 - June 2, 2018

విజయవాడ : రెండు జాతీయ పార్టీలు తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని కాంగ్రెస్‌ ద్రోహం చేస్తే బీజేపీ నమ్మకం ద్రోహం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. విజయవాడలో నవ నిర్మాణ దీక్షను ప్రారంభించిన ఆయన.. కేంద్రం ఏపీపై సవతితల్లి ప్రేమ చూపుతుందన్నారు. ఏపీని నెంబర్‌వన్‌ రాష్ట్రంగా తీర్చిదిత్తే సత్తా తెలుగువారికి ఉందన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు.

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్షను ప్రారంభించారు. ఏపీలో ఏడు రోజుల పాటు ఒక్కో రోజు ఓక్కో అంశంపై దీక్ష చేయనున్నారు టీడీపీ నేతలు. ఈ సందర్భంగా డీవీ మ్యానర్‌ నుంచి బెంజ్‌సర్కిల్‌ వరకు ర్యాలీ చేశారు సీఎం. ప్రతిన బూనుదాం, ప్రగతి సాధిద్దాం నినాదంతో ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నవనిర్మాణ దీక్ష వేదికగా చంద్రబాబు నినదించారు.

ఒంటెద్దు పోకడలతో రాష్ట్రాన్ని విభజిస్తే.... మొదటి సంవత్సరం 16 వేల కోట్ల లోటుబడ్జెట్‌తో ప్రారంభించామని సీఎం అన్నారు. అన్ని రాష్ట్రాలు అవతరణ దినోత్సవాలను జరుపుకుంటున్నాయని, ఏం ఇచ్చారని ఏపీలో అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాలను అవకాశాలుగా మలచుకొని ముందుకెళ్తున్నామన్నారు. దేశంలోనే ఏపీని నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తయారు చేసే శక్తి సామర్థ్యాలు తెలుగు వారికి ఉన్నాయని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని చంద్రబాబు విమర్శించారు. అడుగడుగునా ఏపీని అవమానిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి ఎలాంటి ఫలితాలు వచ్చాయో ఏపీలో కూడా అవే పునరావృతం అవుతాయన్నారు. రాష్ట్ర విభజన నాడు ఇచ్చిన హామీని మరచిపోయి గుజరాత్‌లో దోలేరో నగరాన్ని నిర్మిస్తున్నారన్నారు. నష్టపోయింది గుజరాత్‌ కాదు... ఆంధ్రప్రదేశ్‌ అని మోదీ గుర్తుంచుకోవాలని అన్నారు. తెలుగుజాతికి రాజధాని నిర్మించాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు. తక్కువ సమయంలోనే గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేసిన ఘనత టీడీపీదే అని గుర్తు చేశారు సీఎం. పట్టిసీమతో కృష్ణా డెల్టాకు జూన్‌లోనే నీళ్లు ఇచ్చామన్నారు. 5 నదులను అనుసంధానం చేసి మహా సంగమం చేయనున్నట్లు తెలిపారు.

విభజన గాయాల నుండి రాష్ట్రం ఇంకా తేరుకోక ముందే ప్రజలకు మళ్లీ కుట్ర రాజకీయాలు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకు ధర్మపోరాట దీక్ష చేస్తుంటే వైసీపీ జగన్‌, జనసేన అధ్యక్షులు పవన్‌, మరోవైపు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కుట్రలు చేసుకోవాలంటే మరెక్కడైనా చేసుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. తెలుగు వారి జోలికి వస్తే ఉపేక్షించేదిలేదన్నారు.

20:59 - June 2, 2018

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు పనుల్ని తక్షణమే నిలిపివేయాలని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కేంద్రాన్ని కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒడిశా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు పనులు ఆపాలని కేంద్ర పర్యావరణ శాఖమంత్రి హర్షవర్దన్‌కు లేఖ రాశారు. సమస్యలు పరిష్కారం కాకుండా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఒడిశా ప్రజలు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశంపై గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి రెండుసార్లు లేఖలు రాశామని, శబరి, సీలేరు నదీ జలాల విషయం పూర్తిగా తేలకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం గోదావరి నదీ జలాల ట్రైబ్యునల్‌ నిబంధనల్ని అతిక్రమించడమేనని లేఖలో అభిప్రాయపడ్డారు. ముంపు , పునరావాసం అంశాలు కూడా ఇంకా తేలలేదని, అవి పరిష్కారమయ్యే వరకు పనులు ఆపాలని నవీన్‌పట్నాయక్‌ కేంద్ర పర్యావరణ శాఖను కోరారు.

సామర్ల కోటలో ఘోర ప్రమాదం...

తూర్పు గోదావరి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సామర్లకోట మండలం ఉండూరు వంతెన వద్ద లారీ అదుపు తప్పి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు.

20:41 - June 2, 2018

11 మంది ఉపాధ్యాయుల సస్పెండ్...

మహబూబ్ నగర్ : టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తక్కువగా వచ్చిందని 11 మంది ఉపాధ్యాయులపై ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఏడుగురు మ్యాథ్స్ టీచర్లు ఉన్నారు. 

పోలవరం పనులు ఆపాలంటే ఒడిశా సీఎం లేఖ...

ఢిల్లీ : పోలవరం పనులు ఆపాలని కేంద్రానికి ఒడిశా సీఎం లేఖ రాశారు. ముందు తమ రాష్ట్ర సమస్యలు పరిష్కరించాలని, గోదావరి ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 2005లో ఇచ్చిన పర్యావరణ అనుమతి చెల్లదన్నారు. 

ఏపీ ప్రభుత్వంపై పవన్ ఆగ్రహం...

విజయనగరం : తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక మాఫియా, భూ కబ్జాల్లో మునిగిపోయిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ ఖజానాకి నష్టం... టీడీపీ నాయకులకి లాభం కలుగుతోందని, ప్రతి సమస్యనీ అర్థం చేసుకుంటున్నామని...ఈ సమస్యలకి పరిష్కారం దొరికే వరకూ జనసేన పోరాడుతుందన్నారు. 

20:11 - June 2, 2018

తెలంగాణ ప్రజలారా..? తెలంగాణ రాష్ట్రం వచ్చిందనుకుంటున్నరా మీరు..పేదోడు ఏడున్నా పేదోడే.. మోసం ఏడైనా ఒక్కటే తీర్గుంటది.. కాకపోతె మోసం జేశేటోళ్లే వేరుగుంటరు.. ఒకవేళ ఆంధ్రరాష్ట్రంల జనసేనా పార్టీ గన్కలేకపోయినుంటే.. విదేశాలళ్ల మనదేశమోళ్లు దాశిపెట్టిన నల్లధనం జాడ జెప్తెనట చెప్పినోళ్లకు ఐదు కోట్ల రూపాల బహుమతి ఇస్తరట.. ఇప్పుడు ఒక వార్త చెక్కర్లు గొడ్తున్నది సోషల్ మీడియాల...పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే మాధవ నాయుడు.. నువ్వు ఏడనన్న నీళ్లు లేని బాయి జూశి దుంకుపో...ఒక్క తెలంగాణలనే గాదు ఆంధ్రల గూడ ఉశ్కెదంద జోరుగైతున్నది..పాపం కూలినాలి జేస్కోని బత్కెటోళ్లు రోజు వొయ్యినట్టే ఇయ్యాళ గూడ ఇంటికి తాళమేశి కూలికి వొయ్యిండ్రట..గీ గరం గరం ముచ్చట్లు కోసం చూడాలంటే వీడియో క్లిక్ చేయండి...

20:08 - June 2, 2018

షిల్లాంగ్ లో తీవ్ర ఉద్రిక్తత...

మేఘాలయ : షిల్లాంగ్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ మహిళ, బస్ కండక్టర్ మధ్య వివాదం చెలరేగింది. ఇరువర్గాలు రాళ్ల దాడికి పాల్పడడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనితో ఆ ప్రాంతంలో కర్ఫ్యూని విధించారు. 

కుండలను పగులగొట్టిన గుజరాత్ మహిళలు...

గుజరాత్ : రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో మహిళలు నీటి సరఫరాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుండలను పగులగొట్టి తమ నిరసన తెలిపారు. 

ఇండియాకు చేరుకున్న మోడీ...

ఢిల్లీ : భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇండియాకు చేరుకున్నారు. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ దేశాల్లో ఆయన పర్యటించిన సంగతి తెలిసిందే. 

వ్యవసాయ శాఖపై కేసీఆర్ సమీక్ష...

హైదరాబాద్ : రాష్ట్రంలోని రైతుల సంక్షేమానికి చేయాల్సిందంతా చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ ఇవాళ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. పంటకాలనీల ఏర్పాటు, వ్యవసాయ సంపూర్ణ యాంత్రీకరణ, ఆహార శుద్ధి కర్మాగారాల ఏర్పాటు దిశగా రాష్ర్టాన్ని తీసుకుపోవడంపై సీఎం భేటీలో చర్చించారు.

18:30 - June 2, 2018

విజయనగరం : నేతి బీరకాయ చందంగా రైతు రుణమాఫీ ఉందన్నారు పవన్‌కల్యాణ్‌. విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న జనసేనాని... టీడీపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే.. మారుమూల దేశాలకు ఎందుకు వలసపోతారని ప్రశ్నించారు. చంద్రబాబుకు శక్తి లేక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నారని.. ఆ అవకాశం జనసేనకు ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు పవన్‌కల్యాణ్‌.

 

18:28 - June 2, 2018

ఇస్ట అంటే ఒక ప్రకాశవంతమైన బంగారు భవిష్యత్తు. బంగారు భవిష్యత్తు అంటే ఇస్ట" మన తెలుగు రాష్ట్రాలకు ఇస్ట కాలేజ్‌ సుపరిచితమే. హోటల్‌ మేనేజ్‌మేంట్‌ రంగంలో దేశ విదేశాలలో ఎయిర్‌లైన్స్‌, పర్యాటక రంగంలో అనేక విద్యార్ధులను ఉద్యోగాల్లో సెటిల్‌ చేసి గత యునైటెడ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంచే "ద బెస్ట్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్‌" పొందిన ఇస్ట కాలేజ్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ నెహ్రూ యువ కేంద్ర ద యంగ్‌ ఎంటర్‌ప్రీనియర్‌ అవార్డ్స్‌ విద్యాదికులు అనేకమంది యువతి, యువకులను, లీడర్‌షిప్‌ ట్రేనింగ్స్‌ ద్వారా భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దుతున్న శ్రీ. శ్యాంసుకుమార్‌ బరిగల టెన్ టివితో ముచ్చటించారు. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:26 - June 2, 2018

హైదరాబాద్ : యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ అభివృద్ధి చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్‌ పార్క్‌ వద్ద అమరులకు నివాళులు అర్పించారు సీఎం కేసీఆర్. అనంతరం పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రసంగించిన సీఎం రాష్ట్ర ఆవిర్భావం నుండి జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. సమైక్య రాష్ట్రంలో అణచివేతకు, దోపిడికి గురైన తెలంగాణలో ఉవ్వెత్తున ఉద్యమించి స్వరాష్ట్రం సాధించుకున్నాని తెలిపారు. తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను అర్థం చేసుకొని వాటి ఆలోచనల పునాదుల మీద మానిఫెస్టో రూపొందించామన్నారు. నిరంతర ప్రగతి శీల రాష్ట్రంగా.... తెలంగాణ యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని సవరించి... గోదావరి, కృష్ణ నదీజలాలను తెలంగాణ పొలాలకు తరలించే విధంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందన్నారు సీఎం. రైతులు కన్న కలలను సాకారం చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నడుం బిగిందిందన్నారు. గోదావరి జలాల సమగ్ర వినియోగం కోసం తెలంగాణ ప్రభుత్వం... మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం 70 సంత్సరాలలో ఏ ప్రభుత్వమూ చేయలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీందించాలన్న దృఢ సంకల్పంతో ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్లో ఏటా 25 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు.

విద్యారంగంలోనూ తెలంగాణ ముందడుగు వేస్తుందన్నారు సీఎం. కేజీ టు పీజి ఉచిత విద్యావిధానం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెసిడెన్షియల్‌ స్కూళ్లు, కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 542 కొత్త గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం బలీయమైన శక్తిగా ఎదిగిందన్నారు సీఎం కేసీఆర్. ప్రపంచంలోనే హైదరాబాద్‌ ప్రముఖ ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిందన్నారు. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన టీ హబ్‌ ఎందరో ఔత్సాహికులకు ప్రేరణగా నిలిస్తుందన్నారు. కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అన్ని అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 7వేల 155 పరిశ్రమలు అనుమతి పొందాయన్నారు. లక్షా 29 వేల పెట్టుబడులు, 5 లక్షల 74 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించాయని గుర్తు చేశారు కేసీఆర్‌. సుదీర్ఘ పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సఫల రాష్ట్రంగా స్థిరపడిందన్నారు సీఎం. సంకల్పం గట్టిదైతే ఎన్ని అవరోధాలనైనా అవలీలగా అధిగమించవచ్చని తెలంగాణ ప్రభుత్వం రుజువు చేసిందని చెప్పారు. రాబోయే రోజుల్లోనూ ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామన్నారు. అవిశ్రాంతంగా శ్రమించి బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడి...యావత్‌భారతావనికి దిక్సూచిగా నిలుద్దామన్నారు కేసీఆర్‌. 

18:24 - June 2, 2018

చిత్తూరు : జిల్లా మదన పల్లెలో సంచలనం సృష్టించిన మహిళా న్యాయవాది హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్త జితేంద్రే ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడ్డట్టు పోలీసులు తేల్చారు. కిరాయి రౌడీలతో మే 30వ తేదీన బైక్‌పై వెళ్తున్న నాగజ్యోతిని కత్తితో దాడి చేయించాడు జితేంద్ర. దీంతో నాగజ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త జితేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు రౌడీ హంతకుల కోసం గాలిస్తున్నారు. 

18:12 - June 2, 2018
18:11 - June 2, 2018

కరీంనగర్ : ఇద్దరు ఆడపిల్లలు పుట్టడమే ఆమే చేసిన నేరం..దీనికి తోడు వరకట్న వేధింపులు...దీనితో ఆ మహిళ బతుకుపై విరక్తి చెందింది. బలవన్మరణానికి పాల్పడింది. అత్తింటివారి వేధింపుల వల్లే స్వప్న మృతి చెందిందని, ఇద్దరు పిల్లలకు న్యాయం చేయాలని గుండ్లపల్లి వాసులు, కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన పోలీసులు 24గంటల్లోగా భర్త శ్రీపాల్ రెడ్డి, అత్త, మామలను అరెస్టు చేస్తామని చెప్పారు. కానీ రోజులు గడుస్తున్నా న్యాయం జరగకపోయేసరికి స్వప్న బంధువులు అత్తింటి ముందు ఆందోళన చేపట్టారు. పరారీలో ఉన్న అత్తింటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారా ? పిల్లలకు ఏ విధంగా న్యాయం చేస్తారో చూడాలి. 

స్వప్న మృతదేహంతో బంధువుల ఆందోళన...

కరీంనగర్ : జిల్లాలో మహిళ మృతదేహంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు న్యాయపోరాటం చేపడుతున్నారు. ఇద్దరు పిల్లలకు న్యాయం చేయాలని స్వప్న మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. గత మూడు రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. అత్తింటివారు పరారీలో ఉన్నారు. 

ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షం...

విజయవాడ : శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. శ్రీకాకుళంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. 

17:20 - June 2, 2018

దంపతులపై పిడుగు..ఇద్దరు మృతి..

నల్లగొండ : మిర్యాలగూడ మండలం అలగడపలో విషాదం చోటుచేసుకుంది. గొర్రెలను మోపుకుంటు జీవనం సాగిస్తున్న క్రమంలో గొర్రెల మేత కోసం దంపతులు ఎల్లావుల వెంకయ్య, నర్సమ్మ అనే దంపతులపై పిడుగు పడింది. దీంతో వారిద్దరూ ఒకేసారి మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలోవిషాదం చోటుచేసుకుంది. 

17:17 - June 2, 2018

నల్గొండ : పిడుగుపాటులు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. పిడుగులు పడుతుండడంతో ప్రాణనష్టం సంభవిస్తోంది. తాజాగా నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ అలగడపలో పిడుగు పడింది. గొర్రెల మేత కోసం వెళ్లిన దంపతులు ఎల్లావుల వెంకయ్య, నర్సమ్మలపై ఈ పిడుగు పడడంతో అక్కడికక్కడనే మృతి చెందారు. దంపతులిద్దరూ మృతి చెందడంతో అలగడపలో విషాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి దంపతుల కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

17:16 - June 2, 2018

చిత్తూరు : ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన చంద్రగిరి కోటలోని రాజమహల్ బీటలు వారింది. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి సమీపంలో ఈ కోట ఉంది. 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోటలో రాజమహల్, రాణిమహల్ అనే రెండు ప్రధాన రాజప్రాసాదాలు ఉన్నాయి. చంద్రగిరి కోట పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఏటా వందల సంఖ్యలో చంద్రగిరి కోటకు వచ్చి రాజమహల్ ను సందరిస్తుంటారు. కానీ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించారు.

జిల్లాలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. పిడుగుపాటుకు రాజమహల్ మొత్తం బీటలు వారింది. రాజగోపురం ధ్వంసమైంది. పిడుగుపాటు నుండి కాపాడుకోవడానికి ఉపయోగించుకోవాల్సిన అత్యాధునిక పరికరాలను ఉపయోగించుకోలేదు. ఇప్పటికైనా పురావస్తు శాఖ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

చంద్రగిరి కోటపై పడిన పిడుగు

చిత్తూరు : చంద్రగిరి కోటలోని రాజమహల్ పై పిడుగు పడింది. దీంతో రాజ్ మహల్ గోపురం పగుళ్లుబారింది. ఎతయిన రాజగోపురంపై పిడుగులు పడకుండా పురావస్తు శాఖ అధికారులు తగిన శ్రద్ధ తీసుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గతంలో ఈ మహల్ లో శ్రీకృష్ణ దేవరాయలు నివాసం వుండేవారట. 

చంద్రగిరి కోటపై పడిన పిడుగు

చిత్తూరు : చంద్రగిరి కోటలోని రాజమహల్ పై పిడుగు పడింది. దీంతో రాజ్ మహల్ గోపురం పగుళ్లుబారింది. ఎతయిన రాజగోపురంపై పిడుగులు పడకుండా పురావస్తు శాఖ అధికారులు తగిన శ్రద్ధ తీసుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గతంలో ఈ మహల్ లో శ్రీకృష్ణ దేవరాయలు నివాసం వుండేవారట. 

రాసిస్తే చదవటానికి వ్యక్తిత్వం లేని వాడిని కాదు : పవన్

విజయనగరం : బీజేపీ స్క్రిప్టు రాసిస్తే తాను చదువుతున్నానని కొందరు చేస్తోన్న ఆరోపణలపై పవన్‌ మాట్లాడుతూ.. వారు రాసిస్తే చదవడానికి తాను వ్యక్తిత్వం లేని వ్యక్తిని కాదని అన్నారు. అలాగే తాను మాటలు మార్చే వ్యక్తిని కాదని, ఎప్పుడూ ఒకే మాటపై ఉంటానని అన్నారు. తనకూ బీజేపీకి సంబంధమే లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

రెచ్చగొట్టేవాడిని కాదు నిజాలు చెప్పేవాడిని : పవన్

విజయనగరం : తాను ప్రజలను రెచ్చగొడుతున్నానని, బీజేపీ రాసిచ్చిన స్క్రిప్టు చదువుతున్నానని టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఈరోజు విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... తాను ప్రజలను రెచ్చగొట్టేవాడిని కాదని, నిజాలు చెప్పేవాడినని అన్నారు. అలాగే, దోపిడీ చేస్తూ ప్రజలకు నష్టపర్చే విధానాలను అవలంబిస్తే తాను చేతులు కట్టుకుని కూర్చునేవాడిని కాదని అన్నారు. టీడీపీ నేతలు ఇలాగే దోపిడీని కొనసాగిస్తే తాను నిజంగానే రెచ్చగొడతానని, టీడీపీ నేతలు దోపిడీ ఎలా చేస్తారో చూస్తానని పవన్‌ సవాల్ విసిరారు.

వేదనకు గురయిన శ్రీకాంతాచారి తల్లి..

భువనగిరి : తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి.. తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో మొదట తనకు తాను నిప్పటించుకొని ఆత్మత్యాగం చేసుకున్న అమరుడు శ్రీకాంతాచారి. ఆత్మత్యాగం నిరూపయోగమైపోయిందని ఆయన తల్లి శంకరమ్మ శనివారం తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా తనను మొదట వేదిక మీదకు పిలువకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు శ్రీకాంతాచారి త్యాగాన్ని మరిచిపోయి.. తన కొడుకును అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

బెట్టింగ్ కాసానని ఒప్పుకున్న అర్బాజ్ ఖాన్..

ముంబై : ఐపీఎల్‌ బెట్టింగ్‌ కేసులో హీరో అర్బాజ్‌ఖాన్‌ పోలీసుల ముందు హాజరయ్యారు. ఐపీఎల్‌లో బెట్టింగ్‌ చేసినట్టు అంగీకరించారు. అయితే ఈ ఏడాది బెట్టింగ్ చేయలేదని గత సీజన్‌లో చేసినట్లు అంగీకరించారు. గత సీజన్‌లో రూ. 3 కోట్లు నష్టపోయానని పోలీసులకు చెప్పారు. బుకీ సోనుజలాన్‌ ఆరేళ్లుగా తెలుసుని అర్బాజ్‌ఖాన్‌ తెలిపారు. అర్బాజ్‌ సమాధానాలను పోలీసులు రికార్డ్‌ చేశారు. అర్బాజ్‌తో పాటు బుకీ సోనుజలాన్‌ను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరిని ఓకే సారి ప్రశ్నించే అవకాశం ఉంది.

16:09 - June 2, 2018

ఢిల్లీ : ఐపీఎల్ ఫిక్సింగ్ లో సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఉన్నారనే ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు జారీ చేసిన సమన్ల నేపథ్యంలో అర్బాజ్ ఖాన్ థానే పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. బుకీ సోను తనను బ్లాక్ మెయిల్ చేశారని, దీనితో గత ఏడాది ఐపీఎల్ రూ. 2.75 కోట్ల నగదును పొగొట్టుకున్నట్లు అర్బాజ్ పేర్కొన్నట్లు సమాచారం. బుకీ సోనుతో ఆరేళ్లుగా పరిచయం ఉన్నట్లు సమాచారం. అనేక మంది బుకీలతో పరిచయాలు, ఫొటోలను పోలీసులు సేకరించారు. బుకీ సోనీ డైరీలో అనేక ఆసక్తికర విషయాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ డైరీలో వందకు పైగా ఫొన్ నెంబర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 

15:36 - June 2, 2018

హైదరాబాద్ : వర్షాకాలం తరుమకొస్తోంది. వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులు..కష్టాలు ముందే తెలిసినా జీహెచ్ఎంసీ మాత్రం ఇంకా మేలుకోలేదు. చిన్నపాటి వర్షానికే రహదారులు జలమయం కావడం..నాలాలు పొంగి పొర్లుతుండడం తెలిసిందే. దీనితో మే చివరి నాటికి నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ జూన్ మాసం మొదలైనా..కొద్ది రోజుల్లో రుతుపవనాలు తెలంగాన రాష్ట్రాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ పేర్కొన్నా నాలాల పూడికతీత పనులు ఇంకా సగం కూడా పూర్తికాలేదు. చాలాచోట్ల విస్తరణకు కూడా నోచుకోలేదని సమాచారం. గంట వ్యవధిలో రెండు సెం.మీటర్ల వర్షం పడితే డ్రైనేజీలు పొంగిపొర్లే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనితో ఇప్పటి నుండే పలు బస్తీ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. 

హడలిపోతున్న బస్తీ వాసులు..

హైదరాబాద్ : వానాకాలం ముంచుకొస్తోంది. అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో నగరంలోని బస్తీవాసులు హడలిపోతున్నారు. కానీ ఇంతవరకూ జీహెచ్ఎంసీ అధికారులు మేల్కొనలేదు. ఇంకా నిద్రమత్తు వీడటంలేదు. నాలాల పూడికలు ఇంకా పూర్తి కానేలేదు. మేనెల చివరినాటికే పూర్తికావాల్సిన నాలాల పూడిక తీత పనులు ఇంకా కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాలలో నాలాలు ఇంకా ప్రారంభం కూడా కాలేదు. ఒక గంట వ్యవధిలో 2 సెం.మీ వర్షం పడితే చాలు డ్రైనేజీలు పొంగిపొర్లే పరిస్థితి నెలకొంది. దీంతో నగరంలోని బస్తీవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. 

15:31 - June 2, 2018

విశాఖపట్టణం : రోజు రోజుకు పెరుగుతున్న పెట్రో ధరలపై సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లాలో శనివారం ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. ఈసందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. పన్నుల పేరిట ప్రజలపై భారాలు ప్రభుత్వాలు మోపుతున్నాయని, జీఎస్టీతో పన్నులు వేస్తూ కార్పొరేట్ సంస్థలకు రాయితీలిస్తున్నారని తెలిపారు. పెంచిన ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. 

15:30 - June 2, 2018

నెల్లూరు : జిల్లాలోని వీఆర్ సీ గ్రౌండ్ లో వైసీపీ చేపట్టిన వంచనపై గర్జన కార్యక్రమంలో కొంత కలకలం రేగింది. ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమ వేదికపై కూర్చొనేందుకు ఉమ్మారెడ్డి వచ్చారు. ఒక్కసారిగా ఆయన సృహ తప్పిపడిపోయారు. అక్కడనే ఉన్న నాయకులు, కార్యకర్తలు స్పందించి కారులో ఉమ్మారెడ్డిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 

వీడిన న్యాయవాది నాగజ్యోతి హత్య మిస్టరీ..

గుంటూరు : మదనపల్లెలో కొన్ని రోజుల క్రితం జరిగిన న్యాయవాది నాగజ్యోతి హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. మృతురాలి భర్త జితేంద్రను పోలీసులు నిందితుడిగా తేల్చారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త జితేంద్ర భార్య నాగజ్యోతిని హత్య చేయించినట్లుగా పోలీసులు కనుగొన్నారు. కాగా కొన్నిరోజుల క్రితం స్వంత పనులపై వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న నాగజ్యోతి మోటర్ సైకిల్ పై వస్తుండగా దారి కాసిన దుండగులు కత్తితో నాగజ్యోతిపై దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలతో నాగజ్యోతి అక్కడిక్కడే మృతి చెందింది. 

15:14 - June 2, 2018

మనం రోజు తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని కాపాడటంలోను..మన శరీరానికి శక్తినివ్వటంలోను ఎంతవరకూ ఉపయోగపడుతుందనే విషయంపై చాలామందికి పెద్దగా అవగాహన వుండదు. శ్రద్ధ కూడా వుండదు. ఒక రకంగా చెప్పాలంటే అసలు ఆసక్తి కూడా వుండదు. ఆరోగ్యం వుంటేనే ఆనందం వుంటుంది. శరీరం ఆరోగ్యంగా వుంటేనే ఏదైనా చేయగలం. కాబట్టి ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. కొద్దిపాటి శ్రద్ధ..మరికొంత సమయం కేటాయింపుతో మనం ఆరోగ్యంగా వుండటమేకాక..భావి తరాలకు కూడా ఆరోగ్యాన్ని వారసత్వంగా ఇవ్వవచ్చు. ఆరోగ్యకరమైన వారసత్వం సమాజానికి చాలా అవసరం. దేశప్రగతిలో ముందుకు సాగాలంటే ఆరోగ్యకరమైన మనుషులు దేశానికి వెన్నెముకలాంటివారు అనటంలో ఎటువంటి సందేహం లేదు..

బరువు బ్యాలెన్స్ కోసం మొలకలు..
బరువు తగ్గాలను కొన్న లేదా బరువు పెరగ కుండా బాలెన్స్‌ చేసుకోవాలన్న క్యాలరీలతో సంబంధం లేకుండా పనికొచ్చే ఆహారం మెలకలు . అందుకే మొలకల్లి సూపర్‌ ఫుడ్‌ అంటారు . క్రమం తప్పకుండా మొలకలు తింటే జీవన శైలిలో ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి.

మొలకల్లో వుండే విటమిన్స్, మినరల్స్..
విటమిన్ సి, కె , లు వుండే ఈ పెసలు శిరోజాల ఎదుగుదలకు సహకరిస్తాయి. బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. కాబూలీ శెనగలు స్త్రీ పురుషులు ఇద్దరికి మంచి ఆహారం కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది . పుష్కలంగా పీచు పదార్ధం ఉంటుంది . డైటింగ్‌ చేసేవాళ్లు కూడా తినవచ్చు. నల్ల శనగలు కూడా బరువును తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్‌ ఉండదు. చర్మసమస్యలకు,డయాబెటీస్‌ నియంత్రణకు ఉపకరిస్తాయి. బీన్స్‌ మొలకల్లో ఎమినోయాసిడ్స్‌, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ప్రోటీన్లు,విటమిన్లు జింక్‌ ఉంటాయి కనుక మంచి పోషకాహారం.

మొలకలు ప్రత్యామ్నాయం..
ఇవి తిన లేమనుకొంటే రుబ్బేసి ఏ దోసల్లాగో లేదా పరోటాల్లోనో కలుపుకుని గానీ కూరల్లో వేసి గాని ఎలాగోలా తినవలసిన అవసరం ఎంతోవుంది. మెలకలకు మించిన ఆహారం ఇంకోటి లేదంటే అతిశయోక్తి కాదు. మనం రోజు వారి తినే ఆహారంలో మెులకలను చేర్చుకోవటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. ఇవి వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసులవారు తినవచ్చు. వీటిలో విటమిన్లు, ఖనిజలవణాలు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని శుధ్ది చేస్తాయి. వీటిని ప్రతిరోజు తీసుకోవటం వల్ల శరీరం చైతన్యమై నిత్యయవ్వనంగా కనిపిస్తారు. దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

గింజలుగా వున్నప్పుడు కంటే మొలకెత్తిన తరువాత పెరిగే శక్తి..
గింజలను మెులకెత్తించినుపుడు వాటిలో పోషక స్థాయి పెరుగుతుంది. ముఖ్యంగా పెసలు, మినుములు, శనగలు, బొబ్బర్లు, గోధుమలు, వేరుశనగ, బఠానీలు వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

జీర్ణక్రియను పెంచే మొలకలు..
పోషకాల నిధి మెులకెత్తిన గింజలలో జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైములు ఉంటాయి. మెులకెత్తిన గింజలు త్వరగా జీర్ణమవుతాయి. ఆరోగ్యానికి హానికరమైన కొవ్వు, కొలెస్ట్రాల్ వంటివి మొలకల్లో అస్సలు ఉండవు.

ఆరోగ్యవంతమైన బిడ్డలు..
మెులక ధాన్యాలలో ఎ, బి కాంప్లెక్స్, సి విటమిన్లు అత్యధికంగా కనిపిస్తాయి. మెులకలలో క్షార గుణం ఉంటుంది. మెులకలను గర్భిణీ స్త్రీలు తింటే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. మెులకలలో పీచు పదార్ధం ఎక్కువుగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. మెులకెత్తేటప్పుడు విటమిన్ ఎ రెండు రెట్లు, విటమిన్ బి,సిలు ఐదు రెట్లు అధికంగా లభ్యమవుతాయి. ఖనిజ లవణాలు అయిన ఇనుము, ఐరన్, ఫాస్పరస్, జింక్ శరీరానికి సులభంగా అందుబాటులో ఉండేలా తయారవుతాయి. పళ్లు, ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి. రక్తహీనత కూడా దరిచేరదు.

ప్రకృతి వ్యవసాయంలోకి 60లక్షలమంది రైతులు : చంద్రబాబు

గుంటూరు : 2024 నాటికి ఏపీని ప్రకృతి వ్యవసాయ రాష్ట్రంగా ప్రకటించాలనే సంకల్పంతో కృషి చేస్తున్నామని ఏఎన్ యూ వద్ద పెట్టుబడి రహిత,ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్ర స్థాయి సదస్సు పాల్గొన్న సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 60 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం పరిధిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రభుత్వం సస్టెనబుల్ ఇండియా ఫైనాన్స్ ఫెసిలిటీతో ఒప్పందం కుదుర్చుకుందని సీఎ చంద్రబాబు పేర్కొన్నారు. ఏఎన్ యూ వద్ద పెట్టుబడి రహిత,ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతోంది.

14:29 - June 2, 2018
14:27 - June 2, 2018

యాదాద్రి భువనగిరి : ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంత చారి తల్లి అవమానం ఎదురైంది. శనివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో జరుగుతున్న ఆవతరణ దినోత్సవాలపై శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తొలి అమరుడి తల్లి అయినప్పటికీతనకు సరైన గౌరవం ఇవ్వలేదని..కనీసం వేదికపైకి కూడా ఆహ్వానించలేదన్నారు. ఒక సమావేశంలో అమరులను కనీసం గుర్తించడం లేదని..వేరే వారిని పిలుస్తున్నారంటూ సన్మానాన్ని తిరస్కరించారు. నిర్వాహకులు ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. 

మంత్రి అఖిలప్రియ వివాదాస్పద వ్యాఖ్యలు..

కర్నూలు : ఏపీ వ్యాప్తంగా నవ నిర్మాణ దీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలో నవ నిర్మాణ దీక్షలో మంత్రి అఖిల ప్రియ పొల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో మహిళలు బాగుండాలనీ, అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తుంటే కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం మహిళలపై అత్యాచారాలను ప్రేరేపిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

14:11 - June 2, 2018

హైదరాబాద్ : రక్షణ రంగం పురుషుల ఆధిపత్యానికి పట్టుగొమ్మ. అందులోనూ క్షిపణుల విభాగంలో మహిళలు కాలిడటమంటే మాటలు కాదు. ఇంచుమించు అది అసాధ్యమే. కానీ అడుగు మోపడమే కాదు..తనతోపాటుగా దేశాన్ని, దేశ ప్రతిష్టను, సత్తాను మరో నాలుగడుగులు ముందుకు నడిపించిందో మహిళ. 'మిస్సైల్ ఉమెన్'గా అంతర్జాతీయ ఖ్యాతినందుకున్నారామె. ఆమే అగ్నిపుత్రటెస్సీ థామస్‌! అంతేకాదు..ఆమె అంతటితో ఆగిపోలేదు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వైమానిక విభాగం డైరెక్టర్‌ జనరల్‌ గా నియమితులయ్యారు.

నూతన బాధ్యతలను చేపట్టిన టెస్సీ..
విరమణ చేయనున్న డాక్టర్‌ సి.పి.రామనారాయణన్‌ స్థానంలో జూన్ 1వతేదీన డైరెక్టర్ జన్ రల్ గా నూతన బాధ్యతల్ని చేపట్టారు. టెస్సి థామస్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లాబరేటరీస్‌ సంచాలకురాలుగా సేవలందిస్తున్నారు. క్షిపణుల తయారీ పథకాలకు సారథ్యం వహించిన తొలి మహిళ శాస్త్రవేత్తగా ఇప్పటికే ఖ్యాతి గడించారు. సాంకేతిక స్థాయిలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ స్థాయికి ఎదిగిన మహిళల్లో మూడోవారు. కాగా డీఆర్‌డీవోలో ఒక విభాగానికి డైరెక్టర్‌ జనరల్‌ స్థాయికి ఎదిగిన తొలి మహిళ.. జె.మంజుల. 2015లో ఆమె ఎలట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్‌ టెక్నికల్‌ క్లస్టర్‌కు డీజీ అయ్యారు. ఆమె తర్వాత.. శశిబాల సింగ్‌, చిత్ర రాజగోపాల్‌, హీనా గోఖలే డైరెక్టర్‌ జనరల్‌ హోదా పొందారు. ఆ హోదా అందుకోనున్న ఐదో మహిళ టెస్సీ. శుక్రవారం నుంచి ఆమె కార్యక్షేత్రం హైదరాబాదులోని క్షిపణి సముదాయం నుంచి బెంగళూరులోని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థసముదాయంలోకి మారనుంది. డీఆర్‌డీవో తనకు కొత్త బాధ్యతను అప్పగించినందుకు ఆనందంగా ఉందని.. అందులో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలననే విశ్వాసం తనకుందని ఆమె పేర్కొన్నారు.

అంతరిక్ష పరిశోధనలంటే ప్రాణంపెట్టే టెస్సీ..
టెస్సీ 1963లో కేరళలోని అలెప్పీ అనే పట్టణంలో జన్మించిన టెస్సీ ఓ ప్రభుత్వోద్యోగి కుమార్తె. చిన్ననాటి నుండే చదువుల రాణిగా, బాడ్మింటన్‌ విజేతగా పేరు తెచ్చుకున్నారు. త్రిసూర్‌లో బీటెక్‌, పుణెలో ఎంటెక్ పూర్తిచేశారు. ఆమెకి చిన్నప్పటి నుంచి అంతరిక్ష పరిశోధనలంటే మహా ఆసక్తిగా ఉండేది. అందుకే ఆమె ఎంటెక్‌లో ‘గైడెడ్‌ మిసైల్‌ టెక్నాలజీ’ ఎంచుకున్నారు. 1988లో భారతీయ రక్షణ పరిశోధనా సంస్థ అయిన డీఆర్ డీఓ శాస్త్రవేత్తగా కాలుమోపారు.

టెస్సీ ప్రతిభను గుర్తించిన అబ్దుల్ కలాం..
టెస్సీ పనితీరుని గమనించిన అబ్దుల్‌ కలాం ఆమెను ‘అగ్ని’ క్షిపణులకి సంబంధించిన ప్రాజెక్టులోకి తీసుకున్నారు. అలా భారతీయ క్షిపణిరంగంలోకి ప్రవేశించిన తొలి మహిళా శాస్త్రవేత్తగా టెస్సీ రికార్డు సాధించారు. అయితే టెస్సీ ఆ ప్రాజెక్టులో ఒక సాధారణ శాస్త్రవేత్తగా మిగిలిపోలేదు. 2006లో ఎన్నో అంచనాలతో ప్రయోగించిన అగ్ని-III మిసైల్ వైఫల్యం చెందడంతో, మన రక్షణ రంగపు సామర్థ్యం మీద సందేహాలు తలెత్తాయి. కానీ పది నెలలు తిరగకుండానే అదే అగ్ని-III మిసైల్‌ను విజయవంతంగా ప్రయోగించగలిగారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగంలో టెస్సీ కీలకపాత్ర పోషించారు. దీంతో అగ్ని-IVకు ఆమెనే ప్రాజెక్టు డైరక్టరుగా నియమించింది ప్రభుత్వం. దీంతో మరింతగా కృషి చేసిన అగ్ని-IVనీ ఆ తరువాత అగ్ని-Vనీ విజయవంతంగా పూర్తిచేశారు. అగ్ని క్షిపణి ఎనిమిది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల ఒక దివ్యాస్త్రం. ఖండాలను దాటుకుని అణ్వాయుధాలను మోసుకువెళ్లగల సామర్థ్యం అగ్ని సొంతమయ్యింది.

ఇంటి బాధ్యత..దేశ రక్షణ విధుల్లో టెస్సీ..
టెస్సీ పుణెలో చదివే రోజుల్లో తన తోటి విద్యార్థి సరోజ్‌కుమార్‌తో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సరోజ్‌కుమార్‌ భారతీయ నౌకాదళంలో ఉన్నతశ్రేణి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ రీత్యా ఆయన ఇంటికి దూరంగా ఉండటంతో కుమారుడు తేజస్‌ పూర్తి బాధ్యతను కూడా టెస్సీ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఒక పక్క ఒత్తిడితో కూడిన ఉద్యోగం, మరో పక్క తల్లిగా విస్మరించలేని బాధ్యత. ఈ రెండు పాత్రలనూ సమర్థవంతంగా నిర్వహించారు టెస్సీ.

ఎన్నో అవార్డులు, రివార్డులు టెస్సీ ఖాతాలో..
క్షిపణి రంగంలో టెస్సీ కృషికిగాను ఆమెకు ఎన్నో అవార్డులు, రివార్డులూ దక్కాయి. లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అవార్డు, నాయుడమ్మ అవార్డు, గ్వాలియర్‌ ఐటీఎం విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ వంటి ఎన్నో అవార్డులు, రివార్డులు ఆమెను వరించాయి. అంత గొప్ప వ్యక్తి అయిన, సమర్థవంతమై టెస్సీ థామస్ సాంకేతిక స్థాయిలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ గా నియమితులవ్వటం దేశానికి, మహిళా లోకానికి గర్వకారణం.

 

14:10 - June 2, 2018

కర్నూలు : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఏపీ మంత్రి అఖిల ప్రియ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆళ్లగడ్డలో నవ నిర్మాణ దీక్షల కార్యక్రమంలో అఖిల ప్రియ పాల్గొని ప్రసంగించారు. ఏపీలో మహిళల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని..వారి అభివృద్దికి కృషి చేస్తున్నారని తెలిపారు. బాబు ఇలా చేస్తుంటే భారత ప్రధాని మోడీ మాత్రం మహిళలపై ఎక్కడ పడితే అక్కడ అత్యాచారాలు చేయాలని..దాడులు చేయాలని రెచ్చగొట్టి ముందుకు పంపించడం జరుగుతోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

14:10 - June 2, 2018

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రెండు రోజుల క్రితం 42-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి తెలిసిందే. కానీ శనివారం వాతావరణం చల్లదనంగా మారడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మేఘాలు దట్టంగా అలుముకోవడం..భారీ వర్షాలు పడుతాయనే సూచనలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. పిడుగులు పడుతాయనే హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్ర విపత్తు నిర్వాహణ సంస్థ మరింత అప్రమత్తంగా ఉండాలని, కలెక్టర్లు కిందిస్థాయి అధికారులతో సమన్వయం చూసుకోవాలని సూచించారు.

 

13:48 - June 2, 2018
13:44 - June 2, 2018

ఢిల్లీ : రేపటి నుంచి 8 వరకు తెలుగు రాష్ర్టాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 15 రోజుల్లో రుతుపవనాలు విస్తరించనున్నట్లు చెప్పింది. ఏపీ, తెలంగాణతోపాటు.. ఉత్తర భారతం సహా పశ్చిమ బెంగాల్ వరకు రుతుపవనాల ప్రభావం ఉంటుందన్నారు. ఈ సారి దక్షిణ భారత్‌లో వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆధునిక టెక్నాలజీతో వాతావరణ అంచనా మరింత మెరుగవుతుందన్నారు అధికారులు. ఇకపై 12 కిమీ వ్యాసార్థంలో 5 రోజులు ముందుగానే వాతావరణ పరిస్థితులు తెలుస్తాయి. ఏయే జిల్లాలో ఎంత వర్షం  పడుతుందో అంచనా కట్టి.. జిల్లా స్థాయి అధికారులను కనీసం వారం రోజుల ముందే అప్రమత్తం చేయనున్నారు. 

 

13:41 - June 2, 2018

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందంటూ వైసీపీ పోరుబాట పట్టింది. ఈ  సందర్భంగా నెల్లూరులో వంచనపై గర్జన పేరుతో దీక్ష చేపట్టింది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. ఏపీని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వంచించాయని వైసీపీ ఆరోపించింది. చంద్రబాబు, మంత్రులు వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్నారు. 

 

13:39 - June 2, 2018

హైదరాబాద్ : పెరిగిన వంట గ్యాస్‌ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ నేతలు గాంధీ భవన్‌లో వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరిగిన వంట గ్యాస్‌ ధరలకు వ్యతిరేకంగా, మోదీ పాలనకు వ్యతిరేక నినాదాలు చేశారు. కేంద్రం పెంచిన ధరలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరోక్షంగా మద్దతిస్తోందంటున్నఅంటున్న కాంగ్రెస్ నేతలతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. కేంద్రం పెంచిన ధరలకు టీఆర్ఎస్ పరోక్ష మద్దతు ఇస్తుందని కాంగ్రెస్‌ నేతలు అన్నారు. 

13:36 - June 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరులకు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర బిల్లును ఆమోదించిన సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌, రాహుల్‌ గాంధీలకు ఉత్తమ్‌ కృతజ్ఞతలు తెలిపారు.  తెలంగాణ ఉద్యమం కోసం జీవితాలను అర్పించిన దళితులు, బీసీలకు, మైనార్టీలకు కేసీఆర్‌ పాలనలో అన్యాయం జరుగుతోందని అన్నారు. 

 

సెక్రటేరియట్ కు రాని సీఎం పరిపాలన : చాడ

హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీపీఐ కార్యాలయంలో జాతీయ జెండాను, సీపీఐ జెండాను రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకట రెడ్డి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు..సీఎం సచివాలయానికి రాని అప్రజాస్వామిక పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఏక వ్యక్తి నియంతృత్వ పరిపాలన సాగుతోందని విమర్శించారు. భూ సమస్యలను తప్పుదారి పట్టించే భూ ప్రక్షాళన అని ఎద్దేవా చేశారు. రుణమాఫీ వడ్డీ బకాయిలను ప్రభుత్వం ఎగవేసిందనీ..రుణ విమోచన కమిషణ్ మరిచారన్నారు. 2019 ఎన్నికల నాటికి బలమైన ప్రత్యామ్నాయానికి సీపీఐ కృషి చేస్తుందని చాడ తెలిపారు.

ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు : చాడ

హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీపీఐ కార్యాలయంలో జాతీయ జెండాను, సీపీఐ జెండాను రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకట రెడ్డి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు..రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన అమరులు, ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదన్నారు. హక్కుల కోసం ప్రజలు ప్రశ్నిస్తే గొంతులను నొక్కుతున్నారనీ చాడ విమర్శించారు ..మిగులు బడ్జెట్ నిధులు ఏమయ్యాయని చాడ ప్రశ్నించారు. బంగారు తెలంగాణ కాదు అప్పుల తెలంగాణగా పాలకులు మార్చివేశారని విమర్శించారు. 

ఒక్క పైసా తగ్గింపు ప్రజలను అవమానించటమే: మధు

విజయవాడ : సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ ధరల పెంపుపై ర్యాలి చేపట్టారు. ఈ ర్యాలీలో రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా మధు, నర్శింగరావు గ్యాస్ సిలిండర్లను మోసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతు.. పెట్రోల్ లీటరుకి ఒక్క లీటరుకు ఒక్క పైసా తగ్గించటం ప్రజలను అవమానించటమేనన్నారు. కేరళ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలని మధు డిమాండ్ చేశారు. రేపు విజయవాడలో అన్ని పార్టీలతో సమావేశమై.. పెట్రోల్ ధరల పెంపుపై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని మధు తెలిపారు. 

13:01 - June 2, 2018

హైదరాబాద్ : సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్ సభలో రాష్ట్ర విభజన బిల్ పాస్ అయినప్పుడు టీఆర్ఎస్ నుంచి ఎంపీ కేసీఆర్ ఒక్కరే అని.. రాజ్యసభలో వారి బలం  శూన్యం...తెలిపారు. వారి వల్ల తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమయ్యేదికాదన్నారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభంచింది... ఇచ్చింది...తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని అని స్పష్టం చేశారు. టీఆర్ ఎస్ పార్టీ పుట్టకముందే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కాంగ్రెస్ పోరాడిందని..తనతో సహా తమ పలువురు ఉద్యమించారని పేర్కొన్నారు. ఆనాడు తెలంగాణ కోసం జరిగిన పోరాట చరిత్రను మరిపించే ప్రయత్నం, తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలపై టీసర్కార్ అమానవీయ ప్రవర్తనను ప్రజల్లోకి తీసుకెళ్లామని తెలిపారు. ఫీజురియింబర్స్ మెంట్ కోసం అంసెబ్లీలో బయట కొట్లాడామని..చెప్పారు. రైతు రుణమాఫీకై అసెంబ్లీ, మండలిలో, బయట పోరాటం చేశామని తెలిపారు. తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. కేసీఆర్ పరిపాలన వైఫల్యాల కారణంగానే నాలుగేళ్లలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు.  

 

సమిష్టి ఉద్యమాల వల్లనే తెలంగాణ : కోదండరాం

హైదరాబాద్ : హైకోర్టులో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్బంగా..తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యాలయంలో జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతు.. సమిష్టి ఉద్యమాల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. రాష్ట్ర అవతరణ అనంతరం ఏర్పడిన ప్రభుత్వ కేబినెట్ లో ఉన్నవాళ్లంతా..తెలంగాణ వస్తదా అని వెనక్కి వెళ్లినవారేనని కోదండరాం ఎద్దేవా చేశారు. 1000మంది విద్యార్ధులు రాష్ట్రం కోసం అమరులయ్యారన్నారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మనకు, మన ప్రజలకు హక్కు వుందన్నారు.

12:53 - June 2, 2018

హైదరాబాద్ : గన్‌పార్క్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించడానికి వచ్చిన విద్యార్థులను పోలీసులు అక్కడే అరెస్టు చేశారు. జెండా అవిష్కరించడానికి వచ్చామని చెబుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులు కేసీఆర్‌కు వ్యతికేకంగా నినాదాలు చేశారు.

 

కృష్ణా జిల్లాకు పిడుగు హెచ్చరికలు!!

కృష్ణా : జిల్లాకు పిడుగు హెచ్చరిక జారీ అయ్యాయి. చాట్రాయి, విస్సన్నపేట, తిరువూరు, ఎ.కొండూరు, వత్సవాయి, ఆగింప్లి, విజయవాడ రూరల్ మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం వుందని..దీంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.   

12:50 - June 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ వేడుకల్లో భాగంగా అసెంబ్లీ, మండలి స్పీకర్లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.  తెలంగాణ అభివృద్ధికి అందరూ చేయిచేయి కలపాలని స్పీకర్‌ అన్నారు.
జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో.. 
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ వేడుకల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. నాలుగేళ్ల కాలంలో తెలంగాణ గణనీయంగా అభివృద్ధి చెందిందన్నారు. మహాత్మగాంధీ, నెల్సన్ మండేలా తర్వాత అహింసా పద్దతిలో ఉద్యమించి విజయం సాధించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు.

 

12:44 - June 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోతవ్స వేడుకల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర నిర్మాణ అభివృద్ధి దిశగా బలమైన అడుగులు తెలంగాణ రాష్ట్ర వేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన రాతలు మారతాయని నమ్మి పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలను అమలు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. అనే ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని పెంచుతూనే..సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామన్నారు. 
రాష్ట్ర ప్రజలకు శుభకాంక్షలు తెలిపిన సీఎం 
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభకాంక్షలు సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరులకు నివాళులు అర్పించారు. సమైక్య రాష్ట్రంలో అణచివేతకు, దోపిడికి గురైన తెలంగాణలో ఉవ్వెత్తున ఉద్యమించి స్వరాష్ట్రం సాధించుకున్నామన్నారు సీఎం. ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను అర్థం చేసుకొని వాటి ఆలోచనల పునాదుల మీద మానిఫెస్టోని రూపొందించామన్నారు. నిరంతర ప్రగతి శీల రాష్ట్రంగా.... తెలంగాణ యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న విజయాలు మనందరికీ గర్వకారణమని కొనియాడారు.
బలీయమైన శక్తిగా ఐటీ రంగం  
తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం బలీయమైన శక్తిగా ఎదిగిందన్నారు సీఎం కేసీఆర్. ప్రపంచంలోనే హైదరాబాద్‌ ప్రముఖ ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిందన్నారు. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన టీ హబ్‌ ఎందరో ఔత్సాహికులకు ప్రేరణగా నిలిస్తుందన్నారు. కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అన్ని అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 7వేల 155 పరిశ్రమలు అనుమతి పొందాయన్నారు. లక్షా 29 వేల పెట్టుబడులు, 5 లక్షల 74 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించాయని గుర్తు చేశారు. 
అనతికాలంలో అద్భుతంగా అభివృద్ధి 
తెలంగాణ ప్రజల ఆలోచన పునాదులతో మ్యానిఫెస్టోను తయారు చేశామని చెప్పారు. అనతికాలంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం రోల్ మాడల్ గా నిలిచిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం కుదేలైందన్నారు. తమ పాలనలో వ్యవసాయ రంగానికి కొత్త ఉత్తేజం అందించామన్నారు. 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ రైతులకు కన్న కళల నిజం చేసేందుకు నడుం బిగించామని తెలిపారు. సమైక్య పాలకులు తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొట్టారని పేర్కొన్నారు. శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. కోటి ఎకరాలకు నీరు అందించే విధంగా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు.

 

3నుండి 8 వరకూ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..

హైదరాబాద్ : రేపటి నుంచి 8 వరకు తెలుగు రాష్ర్టాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 15 రోజుల్లో రుతుపవనాలు విస్తరించనున్నట్లు చెప్పింది. ఏపీ, తెలంగాణతోపాటు.. ఉత్తర భారతం సహా పశ్చిమ బెంగాల్ వరకు రుతుపవనాల ప్రభావం ఉంటుందన్నారు. ఈ సారి దక్షిణ భారత్‌లో వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆధునిక టెక్నాలజీతో వాతావరణ అంచనా మరింత మెరుగవుతుందన్నారు అధికారులు. ఇకపై 12 కిమీ వ్యాసార్థంలో 5 రోజులు ముందుగానే వాతావరణ పరిస్థితులు తెలుస్తాయి. ఏయే జిల్లాలో ఎంత వర్షం పడుతుందో అంచనా కట్టి..

ఒకచేత్తో డ్రైవింగ్..మరో చేత్తో సెల్ ఫోన్ ..ప్రమాదాలు..

కరీంనగర్‌ : వరుస ప్రమాదాలు జరుగుతున్నా ఆర్టీసీ బస్సు డ్రైవర్‌లు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ నుండి జమ్మికుంట వెళ్తున్న ఆర్టీసీలో..డ్రైవర్‌ సెల్‌ ఫోన్‌ ఆపరేట్‌ చేస్తూ కంటపడ్డాడు. డ్రైవింగ్‌ చేస్తూ సోషల్‌ మీడియా వాడటం విస్మయానికి గురిచేస్తోంది. దీనిపై స్పందించిన ఆర్టీసీ యజమాన్యం డ్రైవర్‌ను సస్పెండ్‌ చేసింది. బస్సు నడుపుతూ సెల్‌ ఫోన్‌ వాడిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుంది.

తెలంగాణ ఇచ్చింది..తెచ్చింది కాంగ్రెసే : ఉత్తమ్

హైదరాబాద్ : సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని..తెలంగాణ సమాజం గుర్తించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన గురించి పోరాటం ప్రారంభించిందీ..ఇచ్చింది. తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేననే విషయాన్ని అందరు గుర్తించాల్సిన అవుసరముందని ఉత్తమ్ పేర్కొన్నారు. కానీ తమ పోరాటం వల్లనే రాష్ట్రం ఏర్పడిందని సీఎం కేసీఆర్ గప్పాలు కొట్టుకోవటం దారుణమన్నారు.

ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు..

హైదరాబాద్ : గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకులకు హాజరైన విద్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా విద్యార్ధులు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పీఎస్ కు తరలించారు. దీంతోవిద్యార్దులకు , పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

రైతన్నల కష్టాలకు చరమగీతం : కేసీఆర్

హైదరాబాద్ : రైతు రుణాల మాఫీ, సకాలంలో ఎరువులు-విత్తనాల సరఫరా, ఐదువేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి నియామకం వంటి పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్ తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ కు– పాలీ హౌజ్ లకు, యంత్ర పరికరాలకు భారీ సబ్సిడీలు ఇవ్వడం, పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం, రైతన్నలు చెల్సించాల్సిన నీటితీరువా బకాయిలు..వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణాపన్ను రద్దు, తదితర కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగానికి కొత్త ఉత్తేజాన్ని కలిగించాం.

12:02 - June 2, 2018

విజయవాడ : కేంద్రప్రభుత్వంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. బీజేపీ మహా కుట్ర పన్నిందని విమర్శించారు. నవ నిర్మాణ దీక్షలో ఆయన ప్రసంగించారు. ఆపరేషన్ గరుడతో మహా కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఏపీకి మోసం చేసిన బీజేపీపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. తెలుగు జాతికి జోలికొస్తే ఖబడ్దార్ వదలిపెట్టబోమని హెచ్చరించారు.
మోడీ పాలనలో దేశం ఆధోగతి
మోడీ పాలనలో దేశం ఆధోగతి పాలైందన్నారు. నోట్లరద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. మోడీ అధికారంలోస్తే విదేశాల నుంచి నల్లధనం తెప్పించి..దేశంలోని ప్రతి పౌరుడి అకౌంట్ లో డబ్బులు వేస్తామని చెప్పారు...కానీ ఎవరి డబ్బులు వేయలేదన్నారు. బ్యాంకు వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిందన్నారు. జీఎస్ టీతో ప్రజలపై అధిక భారాలు పడ్డాయని.. ఇండ్లి తింటే దానిపై పన్ను వేస్తున్నారని తెలిపారు. కర్నాటక ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదని...ఎన్నికలు అయిపోగానే ధరలు పెంచారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు రూపాయి పెంచి..పైసా తగ్గించడం ఒక జోక్ అని అన్నారు. దేశంలో ఎగుమతులు, దిగుమతులకు హేతుబద్ధత లేదన్నారు. కేంద్రానికి ఎన్నికలు వస్తే రైతులు గుర్తుకు వస్తారని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని తెలిపారు. కనిష్ట మద్దతు ధర ఇవ్వడం లేదని విమర్శించారు. రైతులకు రాయితీలు ఇవ్వడం లేదని చెప్పారు. పది రాష్ట్రాల్లో రైతులు ఆందోళన చేపట్టారు. రైతులు అభద్రతా భావంలో ఉన్నారని పేర్కొన్నారు.
కన్నా.. బీజేపీకి అద్దె మైకు...వైసీపీకి స్వంత మైకు 
కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి అద్దె మైకు...వైసీపీకి స్వంత మైకు అని ఎద్దేవా చేశారు. బీజేపీ.. జగన్ మోహన్ తో కుట్రలు చేస్తున్నారని...పవన్ కళ్యాణ్ తో తిట్టిస్తున్నారని మండిపడ్డారు. తాను పవన్ కళ్యాణ్ ను విమర్శించడం లేదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని మనమే చేసుకున్నామని తెలిపారు. 'వెంకటేశ్వరుడు నా ప్రాణాలు కాపాడాడని...ప్రాణ భిక్ష పెట్టాడు...నా ద్వారా కొన్ని పనులు చేయించాలని నన్ను బతికించాడు' అని పేర్కొన్నారు. పవిత్ర భావంతో వెంకటేశ్వరస్వామికి దగ్గరకు వెళ్తానని అన్నారు. వారణాసి, తిరుమలకు పోలిక ఉందా...అన్నారు. వారణాసి అపరిశుభ్ర ప్రదేశమని తెలిపారు. తిరుమలలో ఉన్న నగలు పోయాయని అంటారు.. లేని వజ్రం ఉందంటారు అని చెప్పారు. వెంకటేశ్వరస్వామి జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టడని...ఇప్పుడే శిక్షిస్తాడని హెచ్చరించారు. వెంకటేశ్వర దేవుడితో పెట్టుకుంటే నాశనం అవుతారని పేర్కొన్నారు. 24 వేల కోట్ల రూపాయల రుణ విముక్తి కల్పించామని తెలిపారు. అశోక్ బాబును ప్రజా సేవకు రావాలన్నారు. 

 

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం : కేసీఆర్

హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతు..ఉమ్మడి రాష్ర్టంలో కుదేలైన వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థ బాగుంటేనే వివిధ వృత్తులను నమ్ముకొని జీవించే ప్రజానీకానికి చేతినిండాపని, కడుపునిండా అన్నం దొరుకుతుంది. వ్యవసాయ రంగం, వృత్తి పనులు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని నా ప్రగాఢ విశ్వాసం. ఉమ్మడి రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయరంగాన్ని, వృత్తి పనులను తిరిగి నిలబెట్టేందుకు ప్రభుత్వం సమగ్ర దృక్పథంతో ప్రణాళికలు రచించి, అమలు చేస్తున్నది.

కోటి ఎకరాలకు నీరు అందించే లక్ష్యం : కేసీఆర్

హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతు.. తెలంగాణ వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరాలనే దృఢ సంకల్పంతో ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. సమైక్య రాష్ట్ర పాలకులకు తెలంగాణా ప్రజలను భ్రమ పెట్టి పబ్బం గడుపుకోవాలనే దురాలోచననే తప్ప, నిజంగా తెలంగాణకు ప్రాజెక్టులు నిర్మించాలనే ఉద్దేశ్యమెన్నడూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని కేసీఆర్ తెలిపారు. అంతర్రాష్ట్ర వివాదాలకు ఆస్కారం కల్పించే విధంగా డిజైన్ చేసి, తర్వాత ఆ వివాదలనే సాకుగా చూపించి ప్రాజెక్టులు నిర్మించలేదు.

నాలుగేళ్లలో తెలంగాణ అభివృద్ధి : మేయర్ బొంతు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు నగరంలో అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆసెంబ్లీ, శాసన మండలి ప్రాంగణలో స్పీకర్లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మరోపక్క జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ జీహెచ్ఎంసీ కార్యాయలంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..నాలుగేళ్లలో తెలంగాణ గణనీయంగా అభివృద్ధి సాధించిందన్నారు. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ రూపాంతరం చెందుతోందని మేయర్ బొంతు రామ్మెహన్ పేర్కొన్నారు. 

పెట్రోలు ధరలపై కేంద్రమంతి సంచలన వ్యాఖ్యలు..

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెట్రోలు ధరలు ఆకాశాన్నంటున్నాయి. దీంతో వాహనదారులు త్రీవంగా మండిపడుతున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్రంగా నిరసనలు మిన్నంటుతున్నాయి.దీనిపై స్పందించిన మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోలు పెరిగింది పెరిగింది అంటు గగ్గోలు పెట్టేకంటే వేరేదారి చూసుకోవాలని దేశ ప్రజలకు ఉచితన సలహాలిచ్చారు. ఇంథనాన్ని పొదుపుగా వాడుకోవాలనీ..ప్రత్యామ్నాయ రవాణా సాధనాలను చూసుకోవాలని సలహాలిచ్చారు. ఇంధన ధరలు అనేవి దీర్ఘ కాలంగా వుండే సమస్యలనీ..దీనికి పరిష్కారం చాలా కష్టమన్నారు.

పంక్షేమ పథకాలను వివరించిన సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతు..రాష్ట్ర ఆవిర్భావం అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథాకాలను వివరించారు. పేదింటి ఆడబ్డిల కోసం కళ్యాణ్ లక్ష్మీ, షాదీ ముబారక్ పేరుమీద నగదును అందించి వారి ఆర్థికంగా అండగా వుంటున్నామన్నారు. హాస్టల్ విద్యార్ధులకు సన్నబియ్యంతో భోజనం, రైతులకు రుణామాఫీ, వ్యవసాయానికి రైతుబంధు పథకం, వ్యవసాయ పరికరాలకు రాయితీలు, పెడింగ్ ప్రాజెక్టుల పూర్తితో 12 లక్షల కొత్త ఆయకట్టు వచ్చిందన్నారు.

అభివృద్ధి దిశగా బలమైన అడుగులు : కేసీఆర్

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ దినోతవ్స వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ వేడులకల్లో పొల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతు..రాష్ట్ర నిర్మాణ అభివృద్ధి దిశగా బలమైన అడుగులు తెలంగాణ రాష్ట్ర వేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన రాతలు మారతాయని నమ్మి పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలను అమలు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. అనే ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

11:16 - June 2, 2018

హైదరాబాద్ : ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. పరేడ్ గ్రౌండ్ లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. 

 

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకుముందు గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. 

మోదీ, సింగపూర్ ప్రధాని మధ్య అమరావతి ప్రస్తావన..

ఢిల్లీ : భారత ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో సింగపూర్ ప్రధాని లీ హసీన్ లూంగ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి ప్రస్తావించారు. మోదీతో భేటీ అనంతరం లీ లూంగ్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని అన్నారు. లాజిస్టిక్ సహకారంపైనా ఇరు దేశాల నేవీల మధ్య ఒప్పందం కుదిరినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతి గురించి మాట్లాడుతూ.. సింగపూర్ కన్సార్టియం ఆధ్వర్యంలో అమరావతి ప్రాజెక్టు పురోగతి బ్రహ్మాండంగా ఉందన్నారు. పూణెలోని విమానాశ్రయ అభివృద్ధికి మహారాష్ట్ర-సింగపూర్ సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తామని లీ పేర్కొన్నారు.

టీఆర్ఎస్ మరో పథకం..

హైదరాబాద్ : పలు సంక్షేమ పథకాలతో ప్రజలను మెప్పించేందుకు, నమ్మకాన్ని పెంచుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగా తాపత్రాయపడుతోంది. ఈ నేపథ్యంలోనే రైతుబంధు, ఉచిత జీవిత బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టింది. ఇప్పుడు తాజాగా మరో ఆకర్షణీయ పథకానికి రూపకల్పన చేసింది. 52 రకాల పరీక్షలను ఉచితంగా జరిపే 'తెలంగాణ నిర్ధారణ పరీక్షల పథకం'అధికారికంగా ఈనెల 8న ప్రారంభం కానుంది. నిరుపేదలకు అవసరమైన వైద్య పరీక్షల విషయంలో, వారిపై పడే అదనపు ఆర్థిక భారాన్ని తప్పించేందుకే ఈ పథకాన్ని తెస్తున్నట్టు ఇప్పటికే కేసీఆర్ తెలిపిన సంగతి తెలిసిందే.

10:58 - June 2, 2018

విజయవాడ : కేంద్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నవ నిర్మాణ దీక్ష ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రం ఏపీ ప్రజల పొట్ట కొడుతుందన్నారు. రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అవమానించారని పేర్కొన్నారు. ఒంటెత్తు పోకడలతో రాష్ట్ర విభజన చేశారని... పెత్తందారితనాన్ని ప్రదర్శించారని అన్నారు. రెండు జాతీయ పార్టీలు తెలుగు ప్రజల మనోధైర్యాన్ని, భావాలలను దెబ్బ తీశారని చెప్పారు. కాంగ్రెస్ ద్రోహం చేస్తే, బీజేపీ నమ్మకం ద్రోహం చేసిందని విమర్శించారు.
వెంకటేశ్వరస్వామి సమక్షంలో ఇచ్చిన హామీకి దిక్కులేదు...
వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రత్యేకహోదా ఇస్తామని మోడీ హామీ ఇచ్చి...విస్మరించారని అన్నారు. వెంకటేశ్వరస్వామి సమక్షంలో ఇచ్చిన హామీకి దిక్కులేదన్నారు. ప్రత్యేకహోదా ఇస్తారనే బీజేపీకి మద్దతు ఇచ్చానని తెలిపారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లానని తెలిపారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అన్నారు. కేంద్రం అన్ని విధాలుగా ఏపీని ఇబ్బందులు పెడుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇవ్వడం ఆపేసిందన్నారు. పోలవరం ఏపీకి జీవనాడి అన్నారు. పోలవరం పూర్తి చేయడం చాలా అవసరమన్నారు. కేంద్రం సహకరించకపోయినా, డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టినా... పోలవరం ప్రాజెక్టు 55 శాతం పనులను పూర్తి చేశామని చెప్పారు. పోలవరం తెలుగు జాతికి జీవనాడి అన్నారు.  పోలవరానికి నిధులు ఇచ్చి కేంద్రం సహకరించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు 33 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారని తెలిపారు. 
నదుల అనుసంధానం 
నదులను అనుసంధానం చేయాలన్నారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తయారు చేయాలనేది లక్ష్యమన్నారు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా ఐదు నదులను అనుసంధానం చేసి మహా సంగమానికి శ్రీకారం చుడతామని చెప్పారు. గోదావరి నీళ్లు సముద్రంలోకి వెళ్తాయన్నారు. కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చామని తెలిపారు. రాయలసీమను రతనాల సీమగా తయారు చేయడానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రైతుల దుస్థితికి నీళ్లు లేకపోవడం కూడా కారణమని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. కుట్ర రాజకీయాలతో రాష్ట్రాన్ని అణగదొక్కారని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీకి ఇవ్వకుంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనని చెప్పానని అప్పుడు ఏపీలో కలిపారని తెలిపారు. 
సుందర నగరంగా అమరావతి
అమరావతిని సుందర నగరంగా తయారు చేస్తామని చెప్పారు. ప్రపంచం మెచ్చే నగరంగా నిర్మిస్తామన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకున్నామని తెలిపారు. విశాఖ నగరాన్ని సుందరంగా తయారు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి మొదటి విడతలో పది వేల కోట్ల రూపాయలను ఇస్తున్నామని చెప్పారు. 24 వేల కోట్ల రుణ విముక్తి చేశామని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో అశోక్ బాబు నాయకత్వంలో ఎన్ జీవో నాయకులు అద్భుతంగా పని చేశారని కొనియాడారు. రాష్ట్రానికి నాయకత్వం ఇచ్చి...పోరాటానికి సిద్ధం చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో  ఇష్టానుసారంగా వ్యవహరించారని వాపోయారు. పూర్తిగా ఏపీ ప్రజల పొట్టకొట్టారని, అన్యాయం చేశారని అన్నారు. 60 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నామని... పెట్టుబడులన్నీ అక్కడే పెట్టామని తెలిపారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని.. ప్రపంచ పటంలో హైదరాబాద్ ను నిలిపామని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రజలు అభద్రతా భావంతో కొట్టుమిట్టాడరారని, తీవ్ర అవమానం జరిగిందని తెలిపారు. 

 

రాష్ట్ర అవతరణ..శోభాయమానంగా నగరం..

హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్ర నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భాగ్యనగరి సహా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలు పల్లెలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఎక్కడ చూసినా విద్యుద్దీప కాంతులు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన వివిధ రకాల ఆకృతులు చూడగానే ఆకర్షించేలా ఉన్నాయి. హైదరాబాద్ లోని వీధుల్లో చెట్లకు రంగురంగుల విద్యుత్ బల్బులను అలంకరించగా, రాత్రి సమయంలో మరింత శోభాయమానంగా నగరం కనువిందు చేస్తోంది. ఈ లైట్ల వద్ద యువత సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు.

ప్రజలపైకి దూసుకెళ్లిన జవాన్ల వాహనం..ఒకరు మృతి..

జమ్ము కశ్మీర్ : హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శ్రీనగర్ కు రానున్న నేపథ్యంలో ఈనెల 29న అమర్ నాథ్ యాత్రకు జరుగుతున్న సన్నాహకాలను పరీక్షించేందుకు రాజ్ నాథ్ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనగర్ లోని నౌహట్టా ప్రాంతంలో ఓ సీఆర్పీఎఫ్ వాహనంపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. వారి దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ఓ సీఆర్పీఎఫ్ వాహనం ముగ్గురి పైకి దూసుకెళ్లింది. దీంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం యువకుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తుండగా మరణించాడు. దీంతో కాశ్మీరు లోయలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం : బాబు

అమరావతి : అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన, ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందామని సీఎం చంద్రబాబు రాష్ట్ర నవనిర్మాణ దీక్షా వేదికనుండి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాము. ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్షను ఈ క్షణంలో మనమందరం చేపడుతున్నాం. జై హింద్... జై ఆంధ్రప్రదేశ్... జైజై ఆంధ్రప్రదేశ్" అని ప్రతిజ్ఞ చేయించారు.

సంక్షోభాన్నీ అవకాశంగా మలచుకుందాం : చంద్రబాబు

అమరావతి : స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో మనం అలుపెరగని శ్రమజీవులమనీ..ప్రతి సంక్షోభాన్నీ ఒక అవకాశంగా మలచుకుందామని నవ నిర్మాణ దీక్ష వేదిక నుండి రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశభక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమ శిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం మనమందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం. 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకున్నాము.

బీజేపీ, కాంగ్రెస్ లకు బుద్ధి చెప్పాలి : చంద్రబాబు

అమరావతి : రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అవమానించిన బీజేపీ, కాంగ్రెస్ లకు బుద్ధి చెప్పాలని విజయవాడ బెంజ్ సర్కిల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్ష వేదికపై నుండి సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. నగర నిర్మాణానికి రూ. 1,500 కోట్లు ఇచ్చి రూ. 2,500 కోట్లు ఇచ్చామని చెప్పుకుంటున్న ఘనులు నరేంద్ర మోదీ, అమిత్ షాలని దుయ్యబట్టిన ఆయన, ఇచ్చిన డబ్బుకు ఎప్పటికప్పుడు లెక్కలు చెబుతున్నా, లెక్కలు చెప్పడం లేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మాట తప్పిన మోదీ సంగతి వెంకన్న చూసుకుంటాడు : బాబు

అమరావతి : తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సన్నిధి సాక్షిగా రాష్ట్రానికి చేస్తానన్న సాయం చేయని ప్రధాని నరేంద్ర మోదీని ఆ స్వామే చూసుకుంటారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విజయవాడ బెంజ్ సర్కిల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్ష వేదికపై నుంచి ప్రసంగించిన ఆయన, మోదీపై నిప్పులు చెరిగారు. వెంకటేశ్వర స్వామి అపార శక్తులున్న దైవమని, తెలుగు ప్రజలకు అన్యాయం చేసేవారి అంతు చూస్తాడని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టిన గతే 2019 ఎన్నికల్లో బీజేపీకి పట్టనుందని విమర్శించారు.

నదుల అనుసంధానం ఘనత టీడీపీదే : చంద్రబాబు

అమరావతి : గోదావరి, కృష్టా నదుల అనుసంధానం చేసిన ఘనత టీడీపీదేనని సీఎం చంద్రబాబు రాష్ట్ర నవ నిర్మాణ దీక్ష సభలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా అభివృద్ధి పనులను మాత్రం ఆపేది లేదన్నారు. విశాఖను సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతున్నామనీ..ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కావాలనే కొందరు అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారనీ చంద్రబాబు తెలిపారు. ఏపీకి మెట్రో ప్రాజెక్టు అడగితే ఆర్థిక గిట్టుబాటు వుండదని కేంద్రం మెట్రోకు అనుమతి నివ్వలేదని చంద్రబాబు పేర్కొన్నారు. 

కాంగ్రెస్ ద్రోహం చేస్తే..బీజేపీ నమ్మక ద్రోహం : చంద్రబాబు

అమరావతి : ఏపీలో నవ నిర్మాణ దీక్ష ప్రారంభమయ్యింది. బెజవాడ బెంజ్ సర్కిల్ దగ్గర నవ నిర్మాణ దీక్షలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నవ నిర్మాణ దీక్షలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో చంద్రబాబు ప్రతిజ్న చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..రోజుకో అంశంపై నవ నిర్మాణ దీక్షలో చర్చలు కొనసాగిస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, కేంద్రం చేసిన ద్రోహంపై ఈరోజు చర్చిస్తామన్నారు.

నమ్మించి మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం : సీఎం చంద్రబాబు

విజయవాడ : కేంద్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. నవ నిర్మాణ దీక్ష ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రం ఏపీ ప్రజల పొట్ట కొడుతుందన్నారు. రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అవమానించారని పేర్కొన్నారు. 

ఒంటెత్తు పోకడలతో రాష్ట్ర విభజన : సీఎం చంద్రబాబు

విజయవాడ : ఏకపక్షంగా ఒంటెత్తు పోకడలతో రాష్ట్ర విభజన చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. నవ నిర్మాణ దీక్ష ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రం ఏపీకి కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. 

నవ నిర్మాణ దీక్ష ప్రారంభం

కృష్ణా : విజయవాడలో సీఎం చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష ప్రారంభం అయింది. బెంజ్ సర్కిల్ లో జ్యోతి ప్రజ్వలన చేసి చంద్రబాబు దీక్షను ప్రారంభించారు. రెండు గంటలపాటు దీక్ష కొనసాగనుంది. ఈనెల 8 వరకు అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు కొనసాగనున్నాయి. చంద్రబాబు సహా అందరూ ప్రతిజ్ఞ చేశారు. నవ నిర్మాణ దీక్ష సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ అంక్షలు విధించారు.  

09:15 - June 2, 2018

కృష్ణా : విజయవాడలో నవ నిర్మాణ దీక్ష ప్రారంభం అయింది. బెంజ్ సర్కిల్ లో జ్యోతి ప్రజ్వలన చేసి చంద్రబాబు దీక్షను ప్రారంభించారు. రెండు గంటలపాటు దీక్ష కొనసాగనుంది. ఈనెల 8 వరకు అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు కొనసాగనున్నాయి. చంద్రబాబు సహా అందరూ ప్రతిజ్ఞ చేశారు. నవ నిర్మాణ దీక్ష సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ అంక్షలు విధించారు. 

జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను మేయర్ బొంతు రామ్మోహన్ ఆవిష్కరించారు. డిప్యూటీ మేయర్, కమిషనర్ జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు.  

నేడు ప.గో జిల్లాలో జగన్ ప్రజా సంకల్పయాత్ర

ప.గో : జిల్లాలో నేడు 178వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర కొనసాగనుంది. పాలకొల్లు నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.

నేడు వీఆర్సీ గ్రౌండ్ లో వంచనపై గర్జన దీక్ష

నెల్లూరు : నేడు వీఆర్సీ గ్రౌండ్ లో వంచనపై గర్జన దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు దీక్ష కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొనున్నారు. 

ఢిల్లీ బయల్దేరిన గరవ్నర్ నరసింహన్

హైదరాబాద్ : గరవ్నర్ నరసింహన్ ఢిల్లీ బయల్దేరారు. రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. గవర్నర్ల సదస్సుకు నరసింహన్ హాజరుకానున్నారు. 

08:26 - June 2, 2018

విజయవాడ : ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. బెంజ్‌ సర్కిల్‌లో ఉదయం 9 నుంచి రెండు గంటల పాటు నవ నిర్మాణ దీక్షను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా  దేవినేని మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా ఎందుకివ్వరని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా ఇస్తామని పార్లమెంట్, రాజ్యసభలో చెప్పి...ఇప్పుడు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వడకుండా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదన్నారు. బెంజిసర్కిల్ పోరాటాల గడ్డ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మోసాలు, నాలుగేళ్లలో ఏపీ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని నవ నిర్మాణ దీక్షలో వివరిస్తామని చెప్పారు.

 

నేడు గ్రూప్ 4, వీఆర్వో, ఏఎస్ వో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. గ్రూప్ 4, వీఆర్వో, ఏఎస్ వో పోస్టులకు నేడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

08:20 - June 2, 2018

టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టీఆర్ ఎస్ నేత రాజమోహన్, కాంగ్రెస్ నేత రామ్మోహన్ పాల్గొని, మాట్లాడారు. నాలుగేళ్ల పాలనలో కేసీఆర్ సాధించిందేమీ లేదన్నారు. గత ప్రభుత్వాల విధానాలకు, టీఆర్ ఎస్ ప్రభుత్వ విధానాలు, పాలనలో తేడా లేదని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

నేటి నుంచి ఏపీలో నవనిర్మాణ దీక్షలు

విజయవాడ : ఏపీలో నేటి నుంచి నవనిర్మాణ దీక్షలు జరుగనున్నాయి. విజయవాడ వేదికగా సాగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారు. బెంజ్‌ సర్కిల్‌లో ఉదయం 9 నుంచి రెండు గంటల పాటు దీక్షను నిర్వహిస్తారు. అదే సమయంలో.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు.. ప్రజలను కలుపుకు పోతూ.. నవనిర్మాణ దీక్షను చేపడతారు. 

07:59 - June 2, 2018

ఢిల్లీ : రుణమాఫి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ అన్నదాతలు ఆందోళన బాట పట్టారు.  దేశ వ్యాప్తంగా 10 రోజుల సమ్మెకు రైతులు శ్రీకారం చుట్టారు. పాలు, కూరగాయలను రోడ్డుపై పారేసి తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రీయ కిసాన్‌ మహాసంఘ్‌తో పాటు 130 రైతులు సంఘాలు ఈ సమ్మెలో పాల్గోనున్నాయి. 
పాలు రోడ్డుపైన పారబోసి అన్నదాతలు ఆగ్రహం 
వేలాది లీటర్ల పాలను రోడ్డుపై పారబోయడం ద్వారా రైతులు తమ నిరసన తెలుపుతున్న దృశ్యమది. తాము పండించిన కూరగాయలను మార్కెట్లకు తరలించకుండా రోడ్డుపైనే పార వేసి అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల రైతులు ఆందోళన చేపట్టారు. పాలు, కూరగాయలను రోడ్డుపై పారేసి నిరసన తెలిపారు.
10 రోజుల పాటు సమ్మె 
దేశవ్యాప్తంగా రైతులు 10 రోజుల పాటు నిర్వహించే ఈ సమ్మెను శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్రీయ కిసాన్‌ మహాసంఘ్‌తో సహా 130 రైతు సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. 'గావ్‌ బంద్‌' పేరిట రైతులు నిరసనకు దిగారు. సమ్మె సందర్భంగా 10 రోజుల పాటు గ్రామాల నుంచి పాలు, పళ్లు, కూరగాయలు నగరాలకు సరఫరా చేసేది లేదని రైతులు ప్రకటించారు. దీంతో నిత్యావసర వస్తువులైన పాలు, కూరగాయలు, పళ్ల కోసం నగరవాసులకు నానా అగచాట్లు తప్పవు.
దేశ వ్యాప్తంగా 30 జాతీయ రహదారులపై ధర్నా 
దేశ వ్యాప్తంగా 30 జాతీయ రహదారులపై ధర్నా చేపట్టనున్నట్లు రైతు సంఘాలు పేర్కొన్నాయి. సమ్మె సందర్భంగా తాము రోడ్లను దిగ్బంధం చేయమని ప్రకటించాయి. స్వామినాథన్‌ సిఫారసులను అమలు చేయాలని, ఎరువులపై ధరలు నియంత్రించాలని, గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిశీలించకపోతే జూన్‌ 10 భారత్‌ బంద్‌కు పిలుపునిస్తామని రాష్ట్రీయ కిసాన్‌ మహాసంఘ్‌ అధ్యక్షుడు శివకుమార్‌ శర్మ హెచ్చరించారు.
హింసాత్మకంగా మారిన ఆందోళన  
గత ఏడాది గిట్టుబాటు ధర కోసం వందలాది మంది రైతులు చేసిన ఆందోళన హింసాత్మకంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని మాంద్‌సోర్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు మృతి చెందారు. ఈ ఘటనకు నిరసనగా జూన్‌ 6 న రైతులు బ్లాక్‌ డే నిర్వహించనున్నారు. ఎంపీ ప్రభుత్వం మాందసోర్‌లో  భారీ భద్రతా చర్యలు చేపట్టింది.

 

07:54 - June 2, 2018

ఆదిలాబాద్ : తెలంగాణలో ఆదివాసీలు సమర శంఖం పూరిస్తున్నారు.. రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా.. స్వయం పాలన ప్రకటించుకోవాలని  నిర్ణయించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేవరకు ఉధృతంగా ఉద్యమిస్తామంటూ.. ఆదీవాసీలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల ఏజెన్సీ గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆదివాసీల నిరసన గళం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామ ఆదివాసీలు ఉద్యమ బాట పట్టారు. ప్రభుత్వం తమను చిన్న చూపుచూస్తోందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మా ఊర్లో.. మా రాజ్యం అంటూ గళమెత్తారు. దోపిడీ నుంచి తమను తాము రక్షించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు  ఆదివాసీలు. అందుకోసం చదువుకున్న ఆదివాసీలు సాటివారిని మేల్కొల్పేందుకు నడుం బిగించారు. తరతరాలుగా తమకు జరుగుతున్న అన్యాయాలపై పోరుబాట పట్టారు. 
ఆదివాసీలు అస్థిత్వం కోసం పోరాటం 
గత ఏడు నెలల నుంచి ఆదివాసీలు అస్థిత్వం కోసం పోరాటం చేస్తున్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ ఉద్యమ బాట పట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేస్తున్న లంబాడీ ఉపాద్యాయులను ఆదివాసీలు బహిష్కరించారు. పీసా చట్టం మేరకు గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసి లంబాడీ ఉపాధ్యాయులు తమ గ్రామాల్లోకి రావద్దంటూ హుకుం జారీ చేశారు. దీంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
ఏజెన్సీ ప్రాంతాల్లో స్వయం పాలన ప్రకటించాలని నిర్ణయం 
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏజెన్సీ ప్రాంతాల్లో స్వయం పాలనను ప్రకటించాలని నిర్ణయించారు ఆదివాసీలు.  మాఊళ్ళో మారాజ్యం అన్న నినాదంతో రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా నల్ల జెండాలు ఎగరేసి.. స్వయం పాలనను ప్రకటించాలని ఆదివాసీలు నిర్ణయించాయి.  పీసా చట్టం ప్రకారమే తమ గ్రామాల్లో స్వయం పాలన సాగిస్తామంటున్నారు. నేటి నుంచి లంబాడీ తెగకు చెందిన ఉద్యోగులను ఏజెన్సీ గ్రామాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పాత 44 మండలాల్లో ఆదివాసీలు 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పాత 44 మండలాల్లో ఆదివాసీలు విస్తరించి ఉన్నారు. ఉట్నూర్, నార్నూర్, జైనూర్, సిర్పూర్‌ యు, ఇంద్రవెల్లితోపాటు పలు మండలాల్లో పూర్తిగా షెడ్యూల్డ్‌ గ్రామాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో 844 గ్రామాల్లో ఆదివాసీలు మనుగడ సాగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్‌లో 8 మండలాలు పూర్తిగా షెడ్యూల్‌ ప్రాంతాలే. పాల్వంచ, కొత్తగూడెం, డివిజన్‌లలోనూ ఆదివాసీలు విస్తరించి ఉన్నారు. వరంగల్‌ జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలోనూ ఉన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో గోండ్‌, కొలాం, తోటి, ప్రదాన్, నాయక్‌ఫోడ్‌, కోయ ఆదివాసీ తెగలుండగా.. ఖమ్మం జిల్లాలో కొండరెడ్డి, కోయ, ఎర్కల, యానాది, ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలో చెంచు, కొండరెడ్డి, నాయక్‌పోడ్‌లు మనుగడ సాగిస్తున్నారు. 
లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల మాకు నష్టం..
లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల.. తమ హక్కులు, ఉద్యోగాలు, భూములు కోల్పోతున్నామంటూ ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు స్వయం పాలన ప్రకటిస్తే.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారతాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది.

 

07:48 - June 2, 2018

విజయవాడ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో..  నాయకులు పాదయాత్రల బాటపడుతున్నారు. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్‌ ముందు వరసలో ఉండగా.. నేను సైతం అంటూ జనసేనాని పవన్‌ కళ్యాణ్‌  రోడ్డెక్కారు.. ప్రశ్నించేందుకే పార్టీ స్థాపించానన్న పవన్‌.. జనం మధ్యలోనుంచే.. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోరు యాత్ర సాగిస్తున్న జనసేనాని.. ఉత్తరాంధ్రలో ప్రజలతో మమేకం అవుతూనే... పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు. 

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. రాజకీయ నేతలు పాదయాత్రల బాట పట్టారు. ప్రజలతో మమేకం అవుతూనే.. తమ పార్టీనీ బలోపేతం చేసే పనిలో పడ్డారు నాయకులు. ఇప్పటికే ప్రజాసంకల్ప యాత్ర పేరుతో వైసీపీ అధినేత  జగన్ ముందు వరుసలో ఉండగా... నేను సైతం అంటూ జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ కూడా అదే దారిలో పయనిస్తున్నారు. కానీ పవన్‌ అందరిలా కాకుండా కాస్త ప్రత్యేకంగా అడుగులేస్తున్నారు. ఒకేసారి రాష్ర్ట వ్యాప్తంగా కాకుండా.. ప్రాంతాల వారీగా పర్యటించేందుకు నిర్ణయం తీసుకున్న పవన్‌..  శ్రీకాకుళం నుంచి పోరు యాత్రకు శ్రీకారం చుట్టారు.

శ్రీకాకుళం జిల్లాలో ఉద్ధానం కిడ్నీ వ్యాధి బాధితుల పక్షాన సమర శంఖాన్నే పూరించారు పవన్‌. ఏపీలో అభివృద్ధిని ఒకే ప్రాంతంలోనే  కేంద్రీకృతం చేసి సిక్కోలు ప్రజల సమస్యలను గాలికి వదిలేశారంటూ అధికార పార్టీపై మండిపడ్డారు.  స్థానిక సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. ఉత్తరాంధ్ర ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పవన్‌ రాజకీయ నిర్ణయంపై రకరకాల వాదనలు వినిపించాయి. ఇప్పట్లో పవన్‌ రాజకీయ పర్యటనలు చేయరన్న అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తం చేశారు. మాటలు చెప్పే నేతగా మిగిలిపోతారని ప్రజలు భావిస్తున్న తరుణంలో... ఉత్తరాంధ్ర పర్యటనతో వారందరి అభిప్రాయాన్ని మార్చేశారు.  ఎన్నికల నాటికంతా జనాల్లోనే  ఉండాలని భావించారు జనసేనాని. ఉత్తరాంధ్రలో స్ధానిక సమస్యలు తెలుసుకుంటూ.. ముందుకు సాగుతున్న పవన్‌ యాత్రకు ప్రజల్లో మంచి స్పందన లభిస్తోంది. జనసేన కార్యకర్తలు, నాయకులతో చర్చిస్తూ.. వారిలో ఉత్సాహం నింపుతున్నారు. మొత్తానికి ఓ వైపు జనంతో ఉంటూనే.. మరో వైపు పార్టీ క్యాడర్‌ను చక్కబెట్టుకునే పనిలో పడ్డారు జనసేనాని. పవన్ సెక్యూరిటీ కూడా అభిమానులు,కార్యకర్తలతో అచితూచి వ్యవహారిస్తోంది. 

07:42 - June 2, 2018

సిద్ధిపేట : మల్లన్న సాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఇళ్ళు కోల్పోయితున్నందుకు బాధపడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి హరీష్‌రావు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ళు తీసుకున్నాకే.. ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని భూ నిర్వాసితులకు మంత్రి సూచించారు. కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు మంత్రి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవనంలో..  మల్లన్న సాగర్‌ ప్రాజెక్ట్‌  భూ నిర్వాసితులకు మంత్రి హరీష్‌ రావు నష్టపరిహారం కింద చెక్కులు పంపిణీ చేశారు. ఏడు గ్రామాల్లో భూసేకరణ వంద శాతం పూర్తయింది మంత్రి తెలిపారు.

 

వోల్వోబస్సు బోల్తా

వపపర్తి : పెద్దమందడి మండలం వెల్దూరు వద్ద వోల్వోబస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 
 

07:34 - June 2, 2018

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఐఆర్‌పై తెలంగాణ సర్కార్‌ వెనకడుగు వేసింది. ఆవిర్భావ దినోత్సవం నాడు ఐఆర్‌ ప్రకటిస్తానన్న సీఎం కేసీఆర్‌.. తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఐఆర్‌ ప్రకటనను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేశారు. దీంతో ఇన్ని రోజులు ఐఆర్‌ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల్లో నిరాశ నెలకొంది.
ఐఆర్‌ ప్రకటన చేయడం లేదన్న కేసీఆర్ 
ముందే చెప్పినట్టు రాష్ర్ట అవతరణం రోజున.. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటన చేయడం లేదన్నారు సీఎం కేసీఆర్‌. ప్రస్తుతానికి ఈ ప్రకటన వాయిదా వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఐఆర్‌పై కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐఆర్‌ సాధ్యాసాధ్యాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. 
ఐఆర్‌ ప్రకటన వాయిదా
పీఆర్సీ కమిషన్‌ వేసి కొద్దిరోజులే అయింది. ఈ కమిషన్‌ నివేదిక ఇవ్వడానికి ఇంకా సమయం పడుతుంది.  కమిషన్‌ నివేదిక అందకముందే ఐఆర్‌  ప్రకటన చేయడం సరైంది కాదన్నఅభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు. కనీసం మధ్యంతర నివేదిక వచ్చే వరకైనా ఆగడం మంచిదని సూచించారు. అధికారుల అభిప్రాయంతో ఏకీభవించిన సీఎం ఐఆర్‌  ప్రకటన వాయిదా వేశారు.
ఐఆర్‌ చెల్లింపులో సాధ్యాసాధ్యాలపై చర్చ  
ఐఆర్‌ చెల్లింపులో సాధ్యాసాధ్యాలపై సమావేశంలో చర్చించారు. గతంలో ఉద్యోగుల జీతాలు, ఫిట్మెంట్ భారీగా పెంచడం వల్ల..  అదే స్థాయిలో ఐఆర్‌ వ్యయం కూడా వుంటుందన్నారు అధికారులు. ఒక శాతం  ఐఆర్‌ ఇస్తే సంవత్సరానికి  మూడు వందల కోట్లు, పది శాతం ఇస్తే మూడు వేల కోట్లు,  ఇరవై శాతం ఇస్తే ఆరు వేల కోట్లు వ్యయం అవుతుందని వివరించారు. దీంతో ఎంత ఇవ్వాలన్నదానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. 
ఉద్యోగుల్లో సీఎం ప్రకటన నిరాశ 
వీలైనంత త్వరగా పీఆర్సీ నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను సీఎం కోరారు. కాగా.. మరో సభ్యుడు ఉమామహేశ్వర్ రావు ఇంకా చార్జ్ తీసుకోలేదని.. ఆయన చేరిన తరువాత పని ప్రారంభిస్తామన్నారు పీఆర్సీ  చైర్మన్ బిస్వాల్. నివేదిక రాకుండా ఐఆర్‌ ఇస్తే కాగ్ కూడా అభ్యంతరం పెట్టొచ్చన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. మొత్తానికి రాష్ట్ర అవతరన దినోత్సవం నాడు ఐఆర్‌ ఎంతో తెలుస్తుందని ఎదురు చూసిన ఉద్యోగుల్లో సీఎం ప్రకటనతో నిరాశ నెలకొంది.

 

07:28 - June 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం... ఆవిర్భావ వేడుకలకు సిద్ధం అయ్యింది. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ..... నాలుగవ వార్షికోత్సవ సంబరాలు జరుపుకుంటోంది. ఇందుకోసం సికింద్రాబాద్‌లోని పెరేడ్‌ గ్రౌండ్‌ అందంగా ముస్తాబైంది. అయితే నాటి ఉద్యమ పార్టీ .... నేటి పాలక పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ తన నాలుగేళ్ల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ను  ప్రజల ముందు పెట్టనున్నారు సీఎం కేసీఆర్‌.
పరేడ్‌ గ్రౌండ్స్‌లో అవతరణ వేడుకలు
ఎన్నో ఏళ్ల ఉద్యమాలు. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలు. ఉమ్మడి పోరాటాలు. ఉక్కు సంకల్పం. మొక్కవోని ఆత్మస్థైర్యం. అన్నిటికి  మించి ప్రజల్లో నానాటికీ పెరిగిన స్వరాష్ట్ర కాంక్ష. వెరసి 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రజల ఎన్నోఏళ్ల కాంక్ష ఫలించింది. నేటితో తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. 5వ వసంతంలోకి అడుగిడబోతోంది. దీంతో అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సర్కార్‌ సిద్ధమైంది. నాటి ఉద్యమపార్టీ అయిన టీఆర్‌ఎస్‌... నేడు పాలక పార్టీగా కూడా ఉంది. 
ప్రజల్లో నిరాశ, నిస్పృహలు
టీఆర్‌ఎస్‌ అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాలన సాగిస్తోంది. అయితే ప్రజల ఆశలు, ఆకాంక్షలను అనుకున్న స్థాయిలో నెరవేర్చలేకపోతోంది. దీంతో ప్రజల్లో నిరాశా నిస్పృహలు నెలకొన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే భేటీ అయిన కేబినెట్‌లో 47 అంశాలకు ఆమోద ముద్ర వేశారు. కానీ అందులో చాలా అంశాలు ఆచరణకు నోచుకోలేదు.  అంతేకాదు.. ప్రత్యేక రాష్ట్ర సాధనలో అడుగులో అడుగేసిన కోదండరామ్‌ లాంటి వాళ్లను... దూరంపెట్టి.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని , స్వరాష్ట్ర ఆకాంక్షను అవహేళన చేసిన వారికి పదవులు ఇచ్చారన్న అపప్రద కేసీఆర్‌పై ఉంది. 
క్షత్రస్థాయిలో అమలుకు నోచుకోని పథకాలు
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ..అభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలోనే అదర్శవంతంగా ఉందని టీఆర్‌ఎస్‌ నేతలు పదేపదే చెప్తున్నారు. అయితే ఆ పథకాలు క్షేతస్థాయిలో అమలు సరిగా లేదన్న వాదన వినిపిస్తోంది. అనర్హులు లబ్ది పొందుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాదు... కులాల వారీగా పథకాలు ప్రవేశపెట్టి.. ప్రజలను విడొగొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం గొర్రెలు, చేపలు, కమ్యూనిటీ హాలులు, కులాల వారీగా రాజ్యసభ, ఎమ్మెల్సీ వంటి పదవులు ఇచ్చి టీఆర్‌ఎస్‌ ప్రజల్లో అభాసుపాలైంది. కేసీఆర్‌ కిట్లు, కల్యాణలక్ష్మీ, కేజీ టూ పీజీ లాంటి పథకాలు అంతో ఇంతో అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ... దళితులకు మూడెకరాల భూపంపిణీ పట్టించుకునే పరిస్థితి లేదు. నిరుద్యోగ సమస్యలు అంతకంతకు  తీవ్ర అవుతున్నాయి. విడుదల చేసిన నోటిఫికేషన్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్య అటకెక్కింది.
వేల కోట్లతో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం
ఇక కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రాజెక్టుల రీ-డిజూన్‌ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. నిలదీసిన పార్టీలను .. ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరుతో వలసలను ప్రోత్సహించారు. మాట వినని ఎమ్మెల్యేలను ఎక్స్‌ఫెల్‌ చేశారు. అంతేకాదు... ప్రతిపక్షాలకు కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా నాలుగేల్లు గడిపిన ఏకైక సీఎంగా కేసీఆర్‌ రికార్డుకెక్కారు. అంతేకాదు... సచివాలయంలో అడుగు పెట్టకుండా పాలన చేసిన చరిత్ర కూడా కేసీఆర్‌కే దక్కుతుంది.
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత 
రోజురోజుకు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీన్ని గమనించిన ప్రభుత్వం... రైతుబంధు పథకంతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. రైతులకు బీమా కల్పించే యోచనలో ఉన్నది. కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులను శాంతింపచేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. మొత్తానికి టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది.

నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఈ వేడుకల్లో ప్రముఖులు, నేతలు పాల్గొననున్నారు. 

Don't Miss