Activities calendar

03 June 2018

21:19 - June 3, 2018

హైదరాబాద్ : నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఏ ఒక్క హమీ కూడా నెరవేర్చలేదని... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. బహుజనులకు రాజ్యాధికారం సాధించే దిశగా బీఎల్‌ఎఫ్‌ కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఇందుకోసం నేటి నుండి ఈ నెల 20వ తేదీ వరకు పల్లెకు పోదాం కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ ఎస్వీకేలో బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో తెలంగాణలో బహుజన రాజకీయాధికారం అనే అంశంపై మేధావులతో సమాలోచన నిర్వహించారు. 

21:18 - June 3, 2018

హైదరాబాద్ : 2019 ఎన్నికల్లో తెలంగాణతోపాటు కేంద్రంలోనూ తమదే విజయమని కాంగ్రెస్‌ నేతలు ధీమావ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ సర్కార్‌ దిగిపోక తప్పదన్నారు. కేసీఆర్‌ .. మోదీతో అంటకాగుతున్నారని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గాంధీ భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జైపాల్‌రెడ్డి...తెలంగాణలో ఎక్సైజ్‌ సుంకం పెరిగితే ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. ఇందులో కేసీఆర్‌ స్వలాభాలు దాగున్నాయని ఆరోపించారు. 

రాష్ట్రంలో, కేంద్రంలో తమదే విజయం - టి.కాంగ్రెస్...

హైదరాబాద్ : 2019 ఎన్నికల్లో తెలంగాణతో పాటు కేంద్రంలోనూ తమదే విజయమని కాంగ్రెస్‌ నేతలు ధీమావ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ సర్కార్‌ దిగిపోక తప్పదన్నారు. కేసీఆర్‌ .. మోదీతో అంటకాగుతున్నారని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. 

బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యం - తమ్మినేని...

హైదరాబాద్ : నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఏ ఒక్క హమీ కూడా నెరవేర్చలేదని... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. బహుజనులకు రాజ్యాధికారం సాధించే దిశగా బీఎల్‌ఎఫ్‌ కృషి చేస్తుందని ఆయన అన్నారు.

తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ ఓడిపోయిందన్న రఘువీరా...

హైదరాబాద్ : గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఓడిపోయిందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. 

ఎస్పీ ఆఫీసు ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం...

వికారాబాద్ : జిల్లా ఎస్పీ ఆఫీసు ఎదుట పెట్రోల్ పోసుకుని గోపాల్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ చర్యను పోలీసులు అడ్డుకున్నారు. ఇసుక వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులు బెదిరిస్తున్నారని యాలాల్ మండలం అగ్గనూర్ కు చెందిన గోపాల్ ఆరోపించాడు. 

21:00 - June 3, 2018

కర్నూలు : కాంగ్రెస్‌, బీజేపీలు ఏపీకి తీరని అన్యాయం చేశాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్‌ను బీజేపీ నమ్మించి నట్టేటముంచిందని ధ్వజమెత్తారు. బీజేపీతో ప్రత్యక్షంగా... పరోక్షంగా పొత్తుపెట్టుకున్న వారిని చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న చంద్రబాబు... 2019లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయని జోస్యం చెప్పారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. విజయవాడ నుంచి చంద్రబాబు నేరుగా కర్నూలు జిల్లాలోని జొన్నగిరి చేరుకున్నారు. అక్కడ చెరువుకు జలహారతి ఇచ్చారు. అనంతరం గ్రామానికి చెందిన మహిళలు, రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. గ్రామాల్లోని వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకే గ్రామదర్శిని, గ్రామసభలకు శ్రీకారం చుట్టామన్నారు.

అనంతరం జొన్నగిరిలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు పాల్గొన్నారు. బీజేపీపై చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. బీజేపీ ఏపీకి నమ్మక ద్రోహం చేసి...రాష్ట్రాన్ని నట్టేట ముంచిందని ఫైర్‌ అయ్యారు. రెండు జాతీయ పార్టీలు ఏపీకి అన్యాయం చేశాయని దుయ్యబట్టారు. వైసీపీపైనా చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. వైసీపీ నేతలు నవ నిర్మాణ దీక్ష రోజున వంచన దీక్ష చేపట్టమేంటని ప్రశ్నించారు. బీజేపీతో ప్రత్యక్షంగా... పరోక్షంగా పొత్తుపెట్టుకున్న వారిని వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ గెలిచేలా కృషి చేయాలన్నారు. ఈ సారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాదని ఆయన జోస్యం చెప్పారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో 68 చెరువులు నింపేందుకు కృషి చేస్తున్నామన్నారు. నీరు - చెట్టు కార్యక్రమంతో పెద్ద ఎత్తున పనులు చేపట్టామన్నారు. సాగునీటి కోసం 52వేల కోట్లు ఖర్చుపెట్టామన్నారు. పోలవరం ఏపీకి జీవనాడి అన్న చంద్రబాబు... సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఎవరు అడ్డుపడినా ప్రజలు క్షమించబోరని ఆయన హెచ్చరించారు. 

వైసీపీ ఎంపీ అవినాశ్ ని అడ్డుకున్న పోలీసులు...

కడప : జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరులో ఉద్రిక్త చోటు చేసుకుంది. వైసీపీ నేతల సమావేశాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానిక వైసీపీ నాయకుడు సంజీవరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి పెద్దదండ్లూరుకి వెళ్తుండగా ఆ గ్రామ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. 

20:18 - June 3, 2018

దివ్యవాణి. బాపుగారి బొమ్మగా తెలుగు ప్రేక్షకులలో తనదైన ముద్రవేసుకున్న నటి. 'పెళ్లి పుస్తకం'తో తన సినీ పుస్తకం తెరిచి పలు సినిమాల్లో నటించారు. తన సహజ నటనతో అలరించిన అలనాటి నటి దివ్యవాణి ప్రస్తుతం.. బుల్లితెరపై నటిస్తోంది. తాజాగా ఇటీవలే విడుదలైన 'మహానటి' సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన 'మహానటి' చిత్రంలో 'సావిత్రి' తల్లి పాత్రలో దివ్యవాణి నటించి మెప్పించారు. ఈ సందర్భంగా ఆమెతో టెన్ టివి ముచ్చటించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

మాల్స్ లో తూనికలు కొలతల శాఖ దాడులు..

హైదరాబాద్ : తూనికలు కొలతల శాఖ అధికారులు ఆదివారం ప్రసాద్‌ ఐమ్యాక్స్‌, జీవీకే మాల్‌, పీవీఆర్‌ సెంట్రల్‌, ఇన్‌ఆర్బిట్‌ మాల్‌, పీవీఆర్‌ కాంప్లెక్స్‌, మీరజ్‌ షాపింగ్‌ మాల్స్‌, లియెనియో కార్నివాల్‌ తో పాటు పలు షాపింగ్ మాల్స్‌లో సోదాలు నిర్వహించారు. 

18:51 - June 3, 2018

కడప : పెద్ద దండ్లూరులో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ, టిడిపి నేతల మధ్య ఘర్షణ నెలకొంది. ఎంపీ అవినాష్ రెడ్డిని ఇంటికి ఆహ్వానించిన సంజీవరెడ్డి అనే వ్యక్తి ఇంటిని మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు ధ్వంసం చేశారు. టిడిపి నేత రామ సుబ్బారెడ్డి వర్గీయుల ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. 

పెద్ద దండ్లూరులో ఉద్రిక్తత

కడప : పెద్ద దండ్లూరులో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ, టిడిపి నేతల మధ్య ఘర్షణ నెలకొంది. ఎంపీ అవినాష్ రెడ్డిని ఇంటికి ఆహ్వానించిన సంజీవరెడ్డి అనే వ్యక్తి ఇంటిని మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు ధ్వంసం చేశారు. టిడిపి నేత రామ సుబ్బారెడ్డి వర్గీయుల ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. 

కేంద్రం..ప్రధానిపై పోరాడాలన్న బాబు...

కర్నూలు : వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రం, ప్రధానిపై పోరాడాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కుట్ర రాజకీయాలను ప్రజలు చిత్తుగా ఓడింఆచలని, ఇసుక విషయంలో రాజకీయాలు చేయవద్దన్నారు. 

తూత్తుకుడిలో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు...

తమిళనాడు : తూత్తుకుడిలో చెలరేగిన హింసపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. నిరసనలో 13మంది మృతికి దారి తీసిన పరిస్థితులపై విచారిస్తున్నారు. ఆదివారం ఉదయం ఢిల్లీ నుండి చెన్నై కి కమిషన్ సభ్యులు చేరుకున్నారు.

మోడీ మీడియాతో ఎందుకు మాట్లాడడం లేదు - రాజ్ దీప్...

హైదరాబాద్ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ పేర్కొన్నారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ ఫౌండేషన్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని 'మీడియా ఇన్ బ్రేకింగ్ న్యూస్ ఎరా' అనే అంశంపై మాట్లాడారు. న్యూస్ రూంలో ఎన్నడూ లేని విధంగా కులం..మతం..దేశభక్తి పేరిట చర్చలు జరుగుతున్నాయని విమర్శించారు.

17:35 - June 3, 2018
17:34 - June 3, 2018

తమిళనాడు : తూత్తుకుడిలో చెలరేగిన హింసపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. నిరసనలో 13మంది మృతికి దారి తీసిన పరిస్థితులపై విచారిస్తున్నారు. ఆదివారం ఉదయం ఢిల్లీ నుండి చెన్నై కి కమిషన్ సభ్యులు చేరుకున్నారు. అనంతరం మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి వారిని అడిగి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్లతో కూడిన భేటీ అయిన కమిటీ సభ్యులు కాల్పుల ఘటనపై ఆరా తీశారు. అసలు ఎవరు ఆదేశాలిచ్చారు ? ఎవరు కాల్పులు జరిపారనే దానిపై ప్రశ్నించారు. రెండు రోజుల పాటు విచారణ జరుగనుందని అనంతరం నివేదిక రూపొందిస్తారని సమాచారం. 

17:28 - June 3, 2018

హైదరాబాద్ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ పేర్కొన్నారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ ఫౌండేషన్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని 'మీడియా ఇన్ బ్రేకింగ్ న్యూస్ ఎరా' అనే అంశంపై మాట్లాడారు. న్యూస్ రూంలో ఎన్నడూ లేని విధంగా కులం..మతం..దేశభక్తి పేరిట చర్చలు జరుగుతున్నాయని విమర్శించారు. అనుకూలంగా వార్తలు రాసే వారికి నేతలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని, వ్యతిరేకంగా రాస్తే మీడియా మీడియా..కేబుల్ వ్యవస్థ తన చెప్పు చేతల్లో పెట్టుకుని నియంత్రిస్తున్నారని తెలిపారు. రాబోయే కాలంలో మీడియా ముందు అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. 

అంజన్ ప్రమాణ స్వీకారం...

హైదరాబాద్ : నగర సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా అంజన్ కుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారంచేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవంలో పలువురు సీనియర్, ఇతర నేతలు పాల్గొన్నారు. 

16:13 - June 3, 2018

విజయవాడ : ప్రభుత్వ సాయం అందక రైతులు అల్లాడుతున్నారని..మరికొంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఏపీ సర్కార్ పై వైసీపీ నేత తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఇంత జరుగుతున్నా ఏపీ సీఎం బాబు మాత్రం నవ నిర్మాణ దీక్ష అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పారని, ఎన్నికల్లో ఈ హామీని ప్రకటించే నాటికి కోటి 70 లక్షల మంది వారే చెప్పారని గుర్తు చేశారు. కానీ నాలుగేళ్ల అనంతరం నిరుద్యోగ భృతి ప్రకటించారని కేవలం పది లక్షల మందికి మాత్రమే ఈ భృతి ఇస్తామని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమన్నారు. గతంలో చిదంబరంతో రహస్య మంతనాలు జరుపలేదా ? అని ప్రశ్నించారు. 

16:06 - June 3, 2018

రంగారెడ్డి : జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొత్తగూడెంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. హత్యకు గురైన వ్యక్తికి సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ఆర్థిక లావాదేవీల కారణంమా ? లేక పాతకక్షలా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఘటనా స్థలంలో ఎలాంటి క్లూస్ లభించలేదని తెలుస్తోంది. 

అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం...

రంగారెడ్డి : జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొత్తగూడెంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపేశారు.

15:52 - June 3, 2018
15:51 - June 3, 2018

విజయవాడ : పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై వామపక్షాలు, జనసేన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొని మీడియాతో మాట్లాడారు. ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని, ప్రభుత్వాలు విధించే పన్నులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 9వ తేదీన ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

జలహారతి కార్యక్రమంలో బాబు...

కర్నూలు : జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలోని చెరువులో 'జలహారతి' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. చెక్ డ్యామ్ ను పరిశీలించి, ఉపాధి హామీ కూలీల సమస్యలను తెలుసుకున్నారు. రైతులు, మహిళలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. 

నిఫా వైరస్ బాబు ఆరా...

కర్నూలు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిఫా వైరస్ పై ఆరా తీశారు. తిరుపతిలో నిఫా వైరస్ ఓ మహిళకు సోకిందనే వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. నిజ నిజాలు విచారించాలని చిత్తూరు కలెక్టర్ కు బాబు ఆదేశించారు. 

జొన్నగిరిలో బాబు...

కర్నూలు : తుగ్గలి మండలం జొన్నగిరిలో గ్రామ సభ, గ్రామదర్శినిలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. జొన్నగిరిలో ఎస్సీ, బీసీ కాలనీ వాసులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

13:55 - June 3, 2018

చిత్తూరు : జిల్లా మర్రిగుంటలో దారుణం జరిగింది. మహిళతో పాటు ఆమె కుమారున్ని ఓ వ్యక్తి హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. వనిత అనే మహిళతో పాటు ఆమె ఆరేళ్ల కుమారున్ని భరత్ కుమార్ అనే వ్యక్తి కత్తులతో నరికి చంపాడు. అనంతరం ఘటనాస్థలిలోనే భరత్ కుమార్ ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. వివాహేతర సంబంధమే కారమణి పోలీసులు అనుమానిస్తున్నారు. 

 

చిత్తూరు జిల్లాలో దారుణం

చిత్తూరు : జిల్లా మర్రిగుంటలో దారుణం జరిగింది. వనిత అనే మహిళతో పాటు ఆమె ఆరేళ్ల కుమారున్ని భరత్ కుమార్ అనే యువకుడు కత్తులతో నరికి చంపాడు. అనంతరం ఘటనాస్థలిలోనే భరత్ కుమార్ ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. వివాహేతర సంబంధమే కారమణని పోలీసులు అనుమానిస్తున్నారు. 

13:42 - June 3, 2018

కృష్ణా : బెజవాడ నాన్ వెజ్ వంటకాలతో ఘుమఘుమలాడుతోంది. ఒకప్పుడు  హైదరాబాద్‌ కే పరిమితమైన హలీమ్ ఇప్పుడు విజయవాడ వాసులనూ నోరూరిస్తోంది. రంజాన్‌ మాసం కావడంతో హలీమ్‌కు డిమాండ్‌ ఏర్పడింది.  సాయంత్రం వేళలో  అలా బయటికి వెళ్లి హలీమ్‌ రుచులను ఆస్వాదిస్తున్నారు బెజవాడవాసులు.  

ముస్లీంల పవిత్ర రంజాన్ నెల ప్రారంభమైందంటే..  వెంటనే గుర్తొచ్చే నాన్‌ వెజ్‌ వంటకం హలీమ్‌...  ఇది కేవలం ఈ మాసంలో మాత్రమే లభించే ప్రత్యేక వంటకం. దీన్ని రుచి చూసేందుకు ఎందరో భోజన ప్రియులు  ఎదురు చూస్తుంటారు..  అరబ్ దేశాల నుంచి మన దేశానికి దిగుమతి అయిన హలీమ్..  ఐదారేళ్ళ  క్రితం వరకూ కేవలం హైదరాబాద్‌లో మాత్రమే  దొరికేది. కానీ ఇప్పుడు విజయవాడ వాసులు కూడా హలీమ్‌ రుచులను ఆస్వాదిస్తున్నారు. 

హలీమ్ తయారీలో హైదరాబాద్‌లోని పాతబస్తీకి ఎంత పేరుందో.. నవ్యాంధ్ర రాజధాని విజయవాడలోని పంజా సెంటర్ కూడా అంతే ఫేమస్. వించీ పేట,  భవానీపురం,  అరండల్ పేట, లబ్బీపేట, పటమట, బెంజ్ సర్కిల్ తోపాటు నగరమంతా హలీమ్‌ ఘుమఘుమలే. పంజా సెంటర్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు ప్రధాన రహదారిపై రోడ్డుకిరువైపులా అనేక దుకాణాల్లో నాన్ వెజ్ వంటకాలు నోరూరిస్తున్నాయి. 

గతంలో  ఇక్కడ ఒకటీ  రెండు హలీమ్‌ దుకాణాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 35కు పైగా సెంటర్లు ఏర్పాటు చేశారు. భాషి హలీమ్, సలీం హలీమ్‌, మెహివిష్ లాంటి దుకాణాలు ఇక్కడ ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఇక్కడ ప్రతి రోజూ మొత్తం 40 నుంచి 45 లక్షల రూపాయలకు పైబడి వ్యాపారం జరుగుతుందని అంచనా. వించిపేట, ఇస్లాంపేట తదితర ప్రాంతాల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 12 గంటల వరకు  వ్యాపారం జోరుగా సాగుతోంది. హలీమ్‌తోపాటు చికెన్ తందూరి, చికెన్ టిక్కా, దమ్ చికెన్, చికెన్ రోల్స్, లాలిపాప్స్, చికెన్ స్టిక్స్, రుమాల్ రోటీ వంటి వంటకాలతోపాటు పాయా, తలకాయ మాంసం రంజాన్ స్పెషల్.. నిపుణులైన పనివారితో వీటిని తయారు చేయిస్తున్నాని యజమానులు అంటున్నారు. పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లీం సోదరులతోపాటు తామూ పండుగ రుచులను ఆస్వాధిస్తున్నామని అంటున్న  బెజవాడ వాసులు.. హలీమ్‌ సెంటర్ల నిర్వహాకులకు థ్యాంక్స్‌ చెబుతున్నారు.

13:37 - June 3, 2018

హైదరాబాద్‌ : కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బుద్ది చెప్పాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. 40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ చేయలేని అభివృద్ధిని మోదీ సర్కార్‌ నాలుగేళ్లలో చేసిందన్నారు. 'సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌' అనే నినాదంతో ముందుకువెళ్తున్నామన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కార్‌ ఏర్పడడంతో... ప్రజలు అవినీతి పాలన నుంచి విముక్తి పొందారన్నారు. కేంద్రం నుంచి విడుదలయ్యే ప్రతి పైసా ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లోకే చేరుతుందన్నారు. 

 

13:28 - June 3, 2018

కరీంనగర్‌ : జిల్లాలోని గన్నెరువరం మండలం గుండ్లవల్లిలో స్వప్న బంధువుల ఆందోళన నాలుగో రోజుకు చేరింది. అత్తింటివారి వేధింపులు తాళలేక స్వప్న ఆత్మహత్య చేసుకుంది. స్వప్న మృతికి కారణమైన భర్త, అత్తామామలను అరెస్ట్‌ చేయాలని.. పిల్లలకు న్యాయం చేయాలంటూ స్వప్న బంధువులు ఆమె మృతదేహంతో నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. పోలీసులు హామీ ఇచ్చి నెరవేర్చుకోలేదని.. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్‌ అందిస్తారు. 

 

13:23 - June 3, 2018

చిత్తూరు : జిల్లాలో నిఫా వైరస్‌ కలకం సృష్టిస్తోంది. మదనపల్లికి చెందిన మహిళా డాక్టర్‌కు నిఫా వైరస్‌ సోకినట్టు అనుమానిస్తున్నారు. కేరళలో నిఫా రోగులకు  వైద్య సేవలు అందించి వచ్చిన డాక్టర్‌కు ఈ వైరస్‌ సోకివుండొచ్చని  ఆ రాష్ట్రం... మన  ప్రభుత్వం అప్రమత్తం చేసింది. దీంతో  ఆమెను తిరుపతిలోని రూయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిఫా వైరస్‌ సోకినందన్న అనుమానంతో రూపా ఆస్పత్రిలో చికిత్సపొందున్న మహిళా డాక్టర్‌ను చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న పరామర్శించారు. ఆమెను నిఫా సోకలేదని కలెక్టర్‌ చెప్పారు. అయినా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యుల పరిశీలనలో ఉంచామన్నారు. 

 

నేడు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష

హైదరాబాద్ : నేడు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష జరుగనుంది. ఉదయం 9.30 నుంచి ఉదయం 11.30 వరకు పేపర్ 1 పరీక్ష జరిగింది. మ.2.30 గంటల నుంచి సాయంత్రం 4.30  వరకు పేపర్ 2 పరీక్ష జరుగనుంది. 

 

12:50 - June 3, 2018

విజయవాడ : బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ కు అద్దెమైకుగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. నవ నిర్మాణ దీక్షల పేరుతో నయవంచన దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం కుంభకోణాల ఊబిలో కూరుకుపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎంతో సాయం చేసిందని తెలిపారు.

జొన్నగిరికి చేరుకున్న సీఎం చంద్రబాబు

కర్నూలు : తుగ్గని మండలం జొన్నగిరికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. 

12:25 - June 3, 2018

చిత్తూరు : మదనపల్లెలో సంచలనం సృష్టించిన మహిళా న్యాయవాది హత్య కేసులో మిస్టరీ వీడింది. లాయర్‌ నాగజ్యోతి మర్డర్‌ కేసులో ఆమె భర్తే హంతకుడని తేలింది.   కుటుంబ కలహాలే ఈ హత్యకు దారితీశాయని పోలీసులు తెలిపారు.  

చిత్తూరు జిల్లా మదనపల్లిలో  సంచలనం సృష్టించిన లాయర్‌ నాగజ్యోతి హత్య కేసు మిస్టరీ వీడింది. గత నెల 30న బైక్ పై ఇంటికి వెళుతున్న నాగజ్యోతిని ఆగంతకులు అటకాయించి.. నడిరోడ్డుపైనే గొంతు కోసి చంపేశారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారం లభించక పోయినా.. మిస్టరీని ఛేదించారు పోలీసులు.

మృతురాలు నాగజ్యోతి భర్త జితేంద్ర కూడా న్యాయవాదిగా పనిచేస్తున్నారు.. భార్యాభర్తల మధ్య చాలా కాలంగా గొడవలున్నాయి. రెండేళ్ల క్రితం నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. గొడవలు తారస్థాయికి చేరడంతో...తన భార్యను చంపాలని నిర్ణయిం చుకున్నాడు  జితేంద్ర. ఓ కేసులో ముద్దాయిగా ఉన్న తన క్లైంటుతో ఒప్పందం కుదుర్చుకుని హత్యకు  ప్లాన్‌ చేశారు. మొత్తానికి నిందితుడు జితేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కిరాయి హంతకుల కోసం గాలిస్తున్నారు.

12:21 - June 3, 2018

ప.గో : భీమవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద అతివేగంగా వస్తున్న లారీ.. బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలవరం కుడి కాలువ నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు

పశ్చిమగోదావరి : జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. నిన్నటి వరకు గోదావరి నుంచి ఇసుకను అక్రమంగా తరలించిన టీడీపీ నేతలు... తాజాగా కాలువలపై దృష్టి సారించారు. పోలవరం కుడి కాలువ నుంచి భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రాత్రిపూట భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా అధికారుల అండతో ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతుంది. 

10:54 - June 3, 2018

రంగారెడ్డి : రాజ్యాధికారం కోసం బహుజనులంతా ఏకం కావాలని బీఎల్‌ఎఫ్‌ నాయకులు పిలుపు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్‌ చౌరాస్తాలో బీఎల్‌ఎఫ్‌ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బీఎల్‌ఎఫ్‌ నియోజకవర్గ  కన్వీనర్‌ అరుణ్‌కుమార్‌ పార్టీ జెండా ఎగురవేశారు. నాలుగేళ్ల కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని ఈ సందర్భంగా అరుణ్‌కుమార్‌ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బహుజనులంతా ఏకమై బీఎల్‌ఎఫ్‌ను బలపరచాలని కోరారు. 
 

10:52 - June 3, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. నిన్నటి వరకు గోదావరి నుంచి ఇసుకను అక్రమంగా తరలించిన టీడీపీ నేతలు... తాజాగా కాలువలపై దృష్టి సారించారు. పోలవరం కుడి కాలువ నుంచి భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రాత్రిపూట భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా అధికారుల అండతో ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతుంది. 

 

10:50 - June 3, 2018

చిత్తూరు : తిరుపతిలో 'నిఫా' వైరస్‌ కలకలం నెలకొంది. కేరళ నుంచి వచ్చిన మహిళా డాక్టర్‌కు నిఫా వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఇటీవలే కేరళలో నిఫా రోగికి చికిత్స అందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిఫా వైరస్‌ దేశంలో తొలిసారి కేరళలో గుర్తించగా... ఆంధ్రప్రదేశ్‌లో తొలి కేసుగా తెలుస్తోంది. కేరళలో నిఫా వైరస్‌తో ఇప్పటివరకు 16 మంది చనిపోయినట్లు సమాచారం. 

 

10:48 - June 3, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో క్రీడలకు, క్రీడాకారులకు ఆదరణ శూన్యంగా మారింది. తాము అధికారంలోకి వస్తే క్రీడా రంగానికి స్వర్ణయుగమే అంటూ.. ప్రచారంతో హోరెత్తించిన టీడీపీ.. క్రీడాకారుల ఉత్సాహంపై నీళ్ళు చల్లింది. టీడీపీ హయాంలో క్రీడలకు ప్రోత్సాహం అందని ద్రాక్షగా మారిందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 

నవ్యాంధ్ర రాజధానిలో క్రీడాకారులకు  అంతర్జాతీయ స్థాయి స్టేడియం ఒక్కటి కూడా ఏర్పాటుకాలేదు. గత నాలుగేళ్లుగా క్రీడా స్టేడియాల అభివృద్ధి, నూతన స్టేడియాల నిర్మాణాల వంటి ఊసే లేదు. క్రీడాకారుల విషయంలో టీడీపీ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

గుంటూరు జిల్లా మంగళగిరిలోని స్టేడియం మినహా..  నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో సరైన స్టేడియం ఒక్కటీ లేదు.. అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామంటూ అధికారంలోకి వచ్చిన మొదట్లో  సీఎం గొప్పగా చెప్పుకున్నారు. ఒలింపిక్స్‌ సంగతి అలా ఉంచితే.. ఉన్న క్రీడా మైదానాలకే ఆదరణ కరువైందని క్రీడాకారులు వాపోతున్నారు. 

రాజధాని అమరావతిలో క్రీడా రంగానికి 1,200 ఎకరాలు కేటాయించామని చెబుతన్న ప్రభుత్వం.. ఉన్న స్టేడియాలనే  నిర్వీర్యం చేసిందని క్రీడాభిమానులు విమర్శిస్తున్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియాన్ని అధికార పార్టీ కార్యకలాపాలకు వేదిక చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.  ఇక్కడ క్రీడా స్థలాన్ని హెలిప్యాడ్ కోసం వినియోగించడంతో స్టేడియం చాలా వరకూ ధ్వంసమైంది.

2017 బడ్జెట్‌లో క్రీడలకు కేటాయించిన రెండు వందల కోట్లు ఏమయ్యాయో అర్థం కావడం లేదని క్రీడాభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  క్రీడాపాలసీ పేరుతో  పాలకులు కాలక్షేపం చేయడం తప్ప.. క్రీడల అభివృద్ధికి ఒరిగిందేమీ లేదన్న విమర్శలు వస్తున్నాయి.  ఇంకోవైపు శాప్‌ కోచ్ ల నియామకం తెలంగాణలో నిర్వహించారు. అవి కూడా అవుట్ సోర్సింగ్ నియామకాలే. క్రీడా సంఘాలను సంప్రదించకుండా.. కనీసం క్రీడలపై అవగాహన కూడా లేనివారిని, సర్టిఫికెట్లు కొనుక్కున్నవారికి కోచ్‌ల పోస్టులు కట్టబెట్టారన్న ఆరోపణలు సర్వత్రా  వ్యక్తం అవుతున్నాయి. 

క్రీడా రంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా అభివృద్ధి చర్యలు చేపట్టి చేయూతనివ్వాలని క్రీడాకారులు కోరుతున్నారు. అలాగే బడ్జెట్‌లో  క్రీడారంగానికి కేటాయించిన రెండు వందల కోట్ల నిధులపై  శ్వేతపత్రం విడుదల చేయాలని క్రీడా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

10:45 - June 3, 2018

విజయవాడ : వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందితే ఉప ఎన్నిక‌లు వ‌స్తాయా..? ఒక‌వేళ ఆ ఐదు పార్లమెంట్ స్థానాల‌కు ఉపఎన్నికలు జ‌రిగితే అధికార టిడిపి అభ్యర్థులు ఎవ‌రు..? మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉపఎన్నిక‌లు జ‌రిగితే చంద్రబాబు ఎటువంటి వ్యూహాలు అమలుచేస్తారు...? ఇపుడు ఏపీ టీడీపీలో ఇదే చర్చ నడుస్తోంది. 
వైసీపీ ఎంపీల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదిస్తారా..? 
వైసీపీ ఎంపీల రాజీనామాల‌పై ఇప్పుడు ఏపీ పోలిటిక‌ల్ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చసాగుతోంది. ఎంపీల రాజీనామాలపై లోక్‌సభా స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌  ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో రెండు రోజుల్లో స్పీక‌ర్ ఎదోఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలకు రెడీగా ఉండాలని అధికాపార్టీ క్యాడర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు సంకేతాలు ఇచ్చారన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.   
ఒంగోలు బరిలో మాగుంట లేదా బీద !
తెలుగు తమ్ముళ్లలో ఉప ఎన్నికల మానియా ఎందాకా పోయిందంటే... ఆ అయిదు స్థానాల్లో  అభ్యర్థులు ఎవరనేదానిపై కూడా  జోరుగా చర్చలు సాగుతున్నాయి.  ఒంగోలు పార్లమెంట్ స్దానానికి ప్రస్తుత ఎమ్మెల్సీ మాగుంట శ్రీ‌నివాసుల రెడ్డి పేరు వినిపిస్తుండగా... నెల్లూరు స్థానానికి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, బీదమస్తాన్‌రావు పోటీలో ఉంటారనే చర్చలు నడుస్తున్నాయి. అయితే ఉప ఎన్నికల్లో పోటీకి ఆదాల ప్రకార్‌రెడ్డి అయిష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై  జిల్లా మహానాడువేదికా తన అభిప్రాయాన్ని ఆయన బయటపెట్టారు. ఉపఎన్నికలు వస్తే నెల్లూరు పార్లమెంటు స్థానానికి  మంత్రులు నారాయణరెడ్డి, లేదా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోటీపడతారని  ప్రకటించిన ఆదాల నత అయిష్టతను చెప్పకనే చెప్పేశారని పార్టీలో చెప్పుకుంటున్నారు.  
తిరుపతి పార్లమెంటు ఉపపోరులో వర్ల రామయ్య!
ఇక తిరుపతి పార్లమెంట్ స్దానానికి వ‌ర్ల రామ‌య్య పేరు తెర‌పైకి రావ‌చ్చని తెలుస్తోంది. అటు క‌డ‌ప పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగేందుకు  జిల్లా అధ్యక్షుడు శ్రీ‌నివాసులురెడ్డి  రెడీ అంటున్నారు. అధిష్ఠానం కూడా శ్రీ‌నివాసులురెడ్డి  వైపే ముగ్గుచూపే అవ‌కాశాలున్నాయి. ఇక   రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి  ఇటీవ‌ల పార్టీలో చేరిన మాజీముఖ్యమంత్రి కిరణకుమార్‌రెడ్డి  సొద‌రుడు న‌ల్లారి కిషోర్ రెడ్డి పోటీ చేస్తార‌నే ప్రచారం సాగుతోంది. 
మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు 
ఇదిలావుంటే  మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న సందర్భం.. ఈ సమయంలో  వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందినా.. ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదని రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వస్తున్నాయి.  సాధార‌ణ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు,  ఉపఎన్నిక‌లు జ‌ర‌గ‌డానికి మధ్య  క‌నీసం ఒక ఎడాది అయినా గ్యాప్ ఉండాల్సిన అవసంర ఉందని  ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు.  ఏదిఏమైన ఉప ఎన్నికలు వస్తే మాత్రం సత్తాచాటి ప్రతిపక్ష వైసీపీకి  సాధారణ ఎన్నికల కంటే ముందుగానే చెక్‌పెట్టాలని టీడీపీ అధినేత వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. 

 

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కన్నా లక్ష్మీనారాయణ

విజయవాడ : బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ బాధ్యతలు చేపట్టారు.  

 

టీడీపీ నేతలు, కో ఆర్డినేటర్లతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

అమరావతి : టీడీపీ నేతలు, కో ఆర్డినేటర్లతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలిరోజు నవ నిర్మాణ దీక్షలో పాల్గొనని శ్రేణులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 

రుయా ఆస్పత్రిలో నిఫా వైరస్ ?

తిరుపతి : రుయా ఆస్పత్రిలో నిఫా వైరస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఓ మహిళ వైద్యురాలికి వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల కేరళలో ఓ నిఫా రోగికి బాధిత వైద్యురాలు చికిత్స అందించారు. నిర్ధారణ కోసం రక్త పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రిలోకి మీడియాను వైద్యాధికారులు అనుమతించలేదు. 
 

నేడు జొన్నగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన

కర్నూలు : నేడు జిల్లా తుగ్గని మండలం జొన్నగిరిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 10.40 గంటలకు సీఎం జొన్నగిరి చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు వివిధా కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. జొన్నగిరిలోని ఎస్సీ, బీసీ కాలనీలను సీఎం సందర్శించనున్నారు. జొన్నగిరిలో గ్రామ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. నీరు..చెట్టు, ఉపాధి హామీ పనులను సీఎం పరిశీలించనున్నారు. 

08:20 - June 3, 2018

ఏపీ రాష్ట్ర వెనుకబాటుకు బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలే కారణమని వక్తలు అన్నారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో ఏపీ రాజకీయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన అనే అంశాలపై నిర్వహించిన కార్యక్రమంలో సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్, టీడీపీ నేత నాగుల్ మీరా, బీజేపీ నేత బాజీ పాల్గొని, మాట్లాడారు. చంద్రబాబు ప్రజలకు దూరం అయ్యారని పేర్కొన్నారు. చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. చంద్రబాబు నవ నిర్మాణ దీక్షపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నేడు నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన

నిర్మల్ : నేడు నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి  పాల్గొనున్నారు. 

07:35 - June 3, 2018

తూర్పుగోదావరి : జిల్లాలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఓ కాలంలో యనమలకే పట్టం కట్టిన తుని నియోజకవర్గంలో మళ్లీ సైకిల్‌ హవా సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్‌ సీటుగా ఉన్నందున మళ్లీ ఆ పార్టీ ఆశలు ఏమేరకు నెరవేరుతాయన్నది అందరినీ ఆలోచింపజేస్తోంది. మారుతున్న తుని నియోజకవర్గ రాజకీయాలపై 10 టీవీ ప్రత్యేక కథనం
వచ్చే ఎన్నికలకు ప్రధాన పార్టీల కరసత్తు
తూర్పు గోదావరి జిల్లాకు తూర్పున ఉన్న తుని నియోజకవర్గంలో తమ సత్తా చాటాలని ప్రధాన పార్టీలన్నీ కార్యచరణ ముమ్మరం చేశాయి. వైసీపీ తమ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అనేక వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాని మరోసారి బరిలోకి దింపేందుకే కసరత్తు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు కూడా బరిలోకి దిగడానికి సిద్దమయ్యారు.. దీంతో తునిలో నెలకొంటున్న రాజకీయా పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్న అశోక్‌బాబు
అయితే గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యేగా  ఉన్న దాడిశెట్టి రాజా పెద్దగా ప్రజలకు అందుబాటులో లేడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా టీడీపీ నేతలకు ఎదురొడ్డి నిలవడంలో తటపటాయిస్తున్నారని... ఇది పార్టీకి నష్టం చేకూర్చేలా ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు గతంలో యనమలను ఓడించిన కాంగ్రెస్‌ అభ్యర్థి అశోక్‌బాబు వైసీపీకి ప్రత్యామ్నాయం కావచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. 
జనసేన రాకతో టీడీపీ, వైసీపీలో కలవరం
ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి తునిలో యనమల రామకృష్ణుడిదే హవా నడిచింది. ఈ నియోజకవర్గం నుంచి యనమల వరుసగా ఆరు ఎన్నికల్లో విజయకేతనం ఎగురేశారు. అయితే.. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థి అశోక్‌బాబు చేతిలో ఓటమి తర్వాత..  రెండోసారి పోటీ చేయలేదు. యనమల సోదరుడు ఒకసారి బరిలో దిగి ఖంగుతిన్నాడు. అయితే... ఈసారి యనమల కుటుంబ  ఆడపడుచూ పోటీ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా యనమల కుమార్తె పోటీలో ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆమె పోటీ చేయకపోతే.. యనమల తనయుడు రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు జనసేన రాకతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. కాపు ఓట్లు చీలిపోతే.. జనసేనకు ప్లస్‌ అవుతుందని భయపడుతున్నారు. అయితే... జనసేన నుంచి ఎవరు పోటీ చేస్తారు ? రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం ఎలా ఉంటుందోననే టెన్షన్‌లో టీడీపీ నేతలున్నారు. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. నేతలంతా 2019లో గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నారు. 

 

నేటితో ముగియనున్న ఎంసెట్ కౌన్సెలింగ్

హైదరాబాద్ : నేటితో ఎంసెట్ కౌన్సెలింగ్ ముగియనుంది. ఇప్పటివరకు 82 వేల ర్యాంక్ లోపు అభ్యర్థుల కౌన్సిలింగ్ పూర్తి అయింది. కౌన్సెలింగ్ పరిశీలనకు 52,089 మంది విద్యార్థులు పరిశీలనకు హాజరయ్యారు. 

జగన్నాదపురం శివారు నుంచి జగన్ పాదయాత్ర

ప.గో : జగన్నాదపురం శివారు నుంచి జగన్ పాదయాత్ర చేయనున్నారు. నెగ్గిపూడి మీదుగా పెనుగొండ వరకు పాదయాత్ర సాగనుంది. సాయంత్రం పెనుగొండలో జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

అఖ్నూర్ సెక్టార్ లో పాక్ రేంజర్లు కాల్పులు

జమ్మూకాశ్మీర్ : అఖ్నూర్ సెక్టార్ లో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు.

 

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ల్లో డ్రంకన్ ఆండ్ డ్రైవ్

హైదరాబాద్ : జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ల్లో పోలీసులు డ్రంకన్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 94 మందిపై కేసులు నమోదు చేశారు. 42 కార్లు, 52 బైకులను సీజ్ చేశారు. 

 

Don't Miss