Activities calendar

04 June 2018

అరకులో పవన్...

విశాఖపట్టణం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్టణంకు చేరుకున్నారు. అరకులో గిరిజనులతో పవన్ సమావేశమయ్యారు. ప్రకృతి..అడవులు ఇంకా మిగిలి ఉన్నాయంటే కారణం గిరిజనులేనని వ్యాఖ్యానించారు. 

20:44 - June 4, 2018
19:59 - June 4, 2018
19:50 - June 4, 2018

నాకు తెల్సిన కాడికి హైకోర్టు తోని సుప్రీం కోర్టుతోని అత్యధిక సార్లు తిట్టువడ్డ సర్కారు ఏదన్న ఉన్నదాంటే...చెర్వులు కుంటలు .. నదులు వంకలు అన్ని ఎండిపోయినా సరే.. కాళేశ్వరం నీళ్లు దెస్తం.. జేసీ దివాకర్ రెడ్డి జర్ర నువ్వు బాగ ఓవరాక్షన్ జేస్తున్నవ్..: ఆడోటి ఆడోటి గట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు గూడ అసలైన అర్హులకు ఇస్తలేరు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ల జోకుడుగాళ్లకే ఇస్తున్నరు..ఆ యవ్వారం జూస్తుంటె మిషన్ భగీరథ పనులళ్ల పావుల పనికి.. అంగిలాగిప్పేశి సర్కారు ముండ్ల కంపమీద బొర్రితె కోరికలు నెరవేర్తుండొచ్చునా..? నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్స ఊరు సర్పంజిని నిజంగనే ఉశ్కెలారి గుద్ది సంపిందా..? ఊరంతొకటుంటే ఊసుగండ్లోనికి ఇంకోటన్నట్టు.. గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

దోస్త్ తొలి దశ పూర్తి...

హైదరాబాద్ : డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ దోస్త్ తొలి దశ పూర్తయ్యింది. 84, 800 మంది విద్యార్థులకు ఫస్ట్ ఆప్షన్ లోనే సీట్లు కల్పించారు. మంగళవారం రెండో విడత డిగ్రీ ఆన్ లైన్ లో అడ్మిషన్లు కేటాయించనున్నారు. 

48గంటల్లో వర్షాలు...

హైదరాబాద్ : రానున్న 48 గంటల్లో తెలంగాణలో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో స్వల్ప స్థాయి నుంచి ఓ మోస్తారు స్థాయిలో వానలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు తెలంగాణ దిశగా ముందుకు సాగుతున్నాయి. 

కర్ణాటక సీఎంతో కమల్...

బెంగళూరు: కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామిని ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ చీఫ్ కమల్‌హాసన్ కలిశారు. కావేరి నదీ జలాల పంపిణీ అంశంపై కమల్ చర్చించినట్లు సమాచారం. 

దీక్షల పేరిట కోట్ల రూపాయలు వృధా - రఘువీరా...

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్షల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని టీడీపీ ప్రచారానికి వాడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు.

తెలంగాణ ఆర్టీసీ సమ్మె సైరన్...

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ త్వరలోనే మోగనుంది. ఇందుకు ముహూర్తం ఖరారు చేశారు. సమ్మె తేదీని ఆర్టీసీ గుర్తింపు సంఘమైన టీఎంయూ ఖరారు చేసింది. ఈనెల 11 నుండి ఉదయం మొదటి సర్వీసు నుండి సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించింది.

18:29 - June 4, 2018
18:08 - June 4, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ త్వరలోనే మోగనుంది. ఇందుకు ముహూర్తం ఖరారు చేశారు. సమ్మె తేదీని ఆర్టీసీ గుర్తింపు సంఘమైన టీఎంయూ ఖరారు చేసింది. ఈనెల 11 నుండి ఉదయం మొదటి సర్వీసు నుండి సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ పరిరక్షణే ధ్యేయమని, ఇతర సంఘాలతోనూ సమావేశమౌతామని అశ్వత్థామ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ పరిరక్షణ..వేతన సవరణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీఎంయూ నేతలు పేర్కొంటున్నారు. 7వ తేదీ నుండి సమ్మె సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:58 - June 4, 2018

మిర్యాలగూడ : వీటి థియేటర్ సమీపంలో ఓ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో బ్రిడ్జి పనులు నిలిచిపోయాయి. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజుల్లో పనులు చేపట్టాలని, లేనిపక్షంలో నిరహార దీక్ష చేపడుతానని జూలకంటి హెచ్చరించారు. 

17:57 - June 4, 2018

తూర్పుగోదావరి : బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమాన పరిచిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశారు. సోమవారం బొమ్మరు హైవేపై దళిత నేతలు భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు. గత నెల 14వ తేదీన అంబేద్కర్ విగ్రహంపై బుచ్చయ్య చౌదరి చేయి వేసుకుని నిల్చొవడం...తమను బాధించిందని తెలిపారు. ధవళేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా బాధిత వర్గాలపైనే కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. వెంటనే ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున్న ఆందోళన చేస్తామన్నారు. 

కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా జగన్ : లోకేశ్

అమరావతి : ప్రతిపక్ష నేత జగన్ ఒక కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా పేరు తెచ్చుకున్న వ్యక్తి జగన్ అనీ.. 13 కేసుల్లో ఏ1గా వుండి కండిషనల్ బెయిల్ పై బైటకు వచ్చిన జగన్ రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై మాట్లాడటం విడ్డూరంగా వుందని లోకేశ్ ఎద్దేవా చేశారఅని మంత్రి లోకేశ్ ట్విట్టర్ వేదికగా జగన్ కు కౌంటరిచ్చారు. భూ కబ్జాదారులు, అత్యాచారాలకు పాల్పడే వ్యక్తులు ఉన్ పార్టీకి జగన్ అధినేత అనే విషయం మర్చిపోవద్దన్నారు. వైసార్ హయాంలో రాష్ట్రంలో జరిగిన నేరాల గురించి కూడా మరచిపోవద్దన్నారు.

పచ్చదనం పెంచడమే లక్ష్యం : మంత్రి జోగు

ఢిల్లీ : జూన్ 5న పర్యావరణ దినోతవ్సం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై నాలుగు రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుండి మంత్రి జోగు రామన్న, అజయ్ మిశ్రా, అశోక్ కుమార్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను మంత్రి జోగు రామన్న వివరించారు. అ సందర్భంగా ఆయన మాట్లాడుతు..రాష్ట్రంలో పచ్చదనం కోసం మే 23 నుంచి 33 శాతానికి పెంచడమే లక్ష్యం అని తెలిపారు. కాలుష్య పరిశ్రమలపై తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధిక వ్యర్థాలు విడుదల అవుతున్న పరిశ్రమలను మూసివేస్తున్నమన్నారు.

17:46 - June 4, 2018

సామాజికాంశాలను తన చిత్రాల ద్వారా చూపించే కొరటాల శివ ఇప్పుడు మెగాస్టార్ కి కట్ చెప్పనున్నాడా? సైరాతో బిజీగా వున్న మెగాస్టార్ కొరటాల శివతో కమిట్ అవ్వనున్నాడా? భరత్ అను నేను సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కొరటాల శివ దర్శకత్వంలో చేసేందుకు చిరంజీవి సై అన్నట్లుగా సమాచారం. రీ ఎంట్రీనిచ్చి ఖైదీనంబర్ 150తో మెగా హిట్ ను అందుకున్న చిరంజీవి ఒక వైపున సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమాను చేస్తూనే, మరో వైపున కొరటాల శివతో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. కొరటాల వినిపించిన కథకి చిరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే విషయం తెలిసిన దగ్గర నుంచి అందరిలో ఆసక్తి పెరిగిపోతోంది. ఈ సినిమా నేపథ్యం ఎలా ఉండనుంది? చిరంజీవి పాత్ర తీరుతెన్నులు ఎలా వుండనున్నాయి? అనే ఆసక్తి అందరిలోనూ రేకెత్తుతోంది.

ద్విపాత్రాభియంలో చిరంజీవి మరోసారి అలరించనున్నాడా?..
ఈ సినిమాలో బిలియనీర్ అయిన ఎన్నారై గాను .. ఓ మారుమూల గ్రామంలోని రైతుగాను రెండు విభిన్నమైన పాత్రల్లో చిరంజీవి కనిపించనున్నారనేది తాజా సమాచారం. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ రెండు పాత్రలను కూడా కొరటాల అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమై వున్నాడని అంటున్నారు. కొరటాల వరుసగా ఘన విజయాలను అందుకుంటూ వస్తుండటంతో, ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో కథానాయికలుగా ఎవరికి ఛాన్స్ దక్కనుందో చూడాలి.

 

17:26 - June 4, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనను కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ ఆరోపించారు. బెంజ్ సర్కిల్ లోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంవత్సరన్నర కాలం పాటు కేసు కొనసాగుతోందని..ఈ కేసులో ఏసీబీ విచారణకు పిలిచిందన్నారు. సాక్ష్యం చెప్పాలని అడిగితే తాను వెళ్లడం జరిగిందని, తన కంటికి ఆపరేషన్ జరిగిందని అధికారులకు తెలియచేయడం జరిగిందన్నారు. తనకు విరామం కావాలని చెబితే ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక సమాచారం వెల్లడించారని సోషల్ మాధ్యమాల్లో ఓ వార్త వచ్చిందన్నారు. కీలక సమాచారం వారి దగ్గర ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దోపిడికి..అవినీతికి వ్యతిరేకంగా తాను పోరాటంచ చేస్తున్నానని కానీ తనను అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రైతు..కూలి పొట్ట కొట్టి వేలాది..లక్షలాది ఎకరాల భూములను సీఎం చంద్రబాబు నాయుడు ఆక్రమించుకుంటున్నాడని..ఈ విషయంపై తాను కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. దీనితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనపై కక్ష పెట్టుకున్నారని...

డిసెంబర్ 2017లో ఓటుకు నోటు కేసులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని, దీనిని న్యాయస్థానం స్వీకరించిందన్నారు. ఏసీబీ తెలంగాణ సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని సీబీఐకి అప్పచెప్పాలని తాను కోరడం జరిగిందన్నారు. ఆనాటి నుండి చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదన్నారు. 

17:22 - June 4, 2018

విజయనగరం : ఏపీ రాష్ట్రంలో నవ నిర్మాణ దీక్షలు కొనసాగుతున్నాయి. ఆయా జిల్లాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. అవినీతి పరులకు సహకరించే పరిస్థితులు వచ్చాయని, గాలి జనార్ధన్ రె డ్డి...జగన్ లకు సహకారం ఇచ్చింది బీజేపీ అని..అగ్రిగోల్డ్ విషయంలో పేదలకు న్యాయం జరిగేంతవరకు కృషి చేస్తానని తెలిపారు. ఎర్రచందనం దొంగల గుండెల్లో రైలు పరుగెత్తించానని..ఇసుకను ఉచితంగా తీసుకెళ్లాలనని చెప్పడం జరిగిందని..కానీ అవినీతి ఆరోపణలు చేస్తుండడం బాధేస్తుందన్నారు. పద్దతి ప్రకారం రాజకీయాలు నడిపి భావి తరాలకు మార్గదర్శకంగా నిలవాలని అనుకున్నట్లు తెలిపారు.

ప్రతిపక్షాలు తనను దూషించే పద్ధతిని గమనించాలని..ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం తప్పా ? అని ప్రశ్నించారు. ఏదో చేస్తారని ఆశించి మోస పోయామని, దేశం మొత్తం మోసపోయిందని పరోక్షంగా బీజేపీని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. ఏటీఎం..బ్యాంకుల్లో డబ్బులు దొరకని పరిస్థితి నెలకొందని, పెట్రోల్..డీజిల్ ధరలు ఒక పైసా తగ్గించడం ఒక జోక్ అని అభివర్ణించారు.

వ్యవసాయం కుదేలు అయ్యిందని..ఉద్యోగాలు లేవని ఇదంతా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే జరిగిందన్నారు. రాష్ట్ర విభజన..కేంద్ర సహాయం లేకపోవడం..కేంద్ర పరిపాలనలో లోటుపాట్లు వల్ల ఏపీ నష్టపోయిందన్నారు. విజయనగరం జిల్లాను ఎంతో అభివృద్ధి సాధించాలని, ఇందుకు అన్ని విధాల సహకరిస్తానని బాబు చెప్పారు. 

చెరువులు నిండటంతో మనసు నిండింది : చంద్రబాబు

విజయనగరం : పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలలో చెరువులు నీళ్లులేక ఎండిపోగా..రూ.280 కోట్లు ఖర్చుచేసి హంద్రీ-నీవా ద్వారా చెరువులను నీటితో నింపాం. 68 చెరువులను నిండటంతో మనసు కూడా నిండి సంతృప్తినిచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మనం చేసిన పనులు ప్రజల కళ్లముందే ఉన్నాయి. వాటి ఫలితాలు అందరికీ కనబడుతున్నాయి. అందుకే ప్రజల్లో సంతృప్త స్థాయి 78% వచ్చింది. నవ నిర్మాణ దీక్షలతో సంతృప్తి మరింత పెరగాలి. నాలుగేళ్లలో చేసిన పనులు చెప్పండి. ప్రజల్లో మరింత సంతృప్తి పెంచండి’’ అని చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.

16:35 - June 4, 2018

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు రీమేక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరూ వరుసగా రీమేక్ సినిమాల మీదే దృష్టి పెడుతున్నారు. రిస్క్ ఉండదన్న నమ్మకంతోనే స్టార్లు రీమేక్ ల వైపు మొగ్గుచూపుతున్నారు. స్టార్ హీరో నమ్మకాన్ని నిజం చేస్తూ రీమేక్ సినిమాలు మంచి విజయాలను అందిస్తున్నాయి.

కొత్త కథలకు కొత్త ఆలోచనలకు ఎప్పుడు పెద్దపీట వేసే అక్కినేని హీరోలు మంచి కథ దొరికితే రీమేక్ చేయడానికి కూడా ముందే ఉన్నారు. నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా రీమేక్ సినిమాతో అలరించాడు.. సక్సెస్ సాధించాడు.

ఇటీవల కాలంలో రీమేక్ సినిమాలకు టాప్ క్రేజ్ తీసుకువచ్చారు మెగా హీరోలు.. వరుసగా మెగా హీరోలు ముగ్గురు రీమేక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా చిరు రీ ఎంట్రీ కోసం కూడా రీమేక్ నే ఎంచుకోవటం కాస్త ఆశ్చర్యపరిచిన తరువాత ఆ నిర్ణయం కరెక్టే అని ప్రూవ్ అయ్యింది.

 

16:35 - June 4, 2018

విజయనగరం : ఏపీ రాష్ట్రంలో నవ నిర్మాణ దీక్షలు కొనసాగుతున్నాయి. ఆయా జిల్లాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. ప్రభుత్వం వస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు..కేంద్రంపై కౌంటర్ లు ఇస్తున్నారు. సోమవారం విజయనగరం జిల్లాలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో ఆయన పాల్గొని ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.

నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు అమ్మినా ఎవరిని వదిలి పెట్టేది లేదని, కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. రైతుకు సంఘీభావం తెలియచేయాలని, వారితో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. దేశంలో ఎంతో మంది రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్ర మంత్రులు స్పందించడం లేదని, స్వామి నాథన్ కమిషన్ ప్రకారం గిట్టుబాటు ధర ఇస్తామని..50 శాతం లాభం ఇస్తామని చెప్పి ప్రస్తుతం ముందుకు రావడం లేదని విమర్శించారు. రైతు దగ్గర పంట ఎక్కువగా ఉంటే ఎగుమతులకు అనుమతులివ్వాల్సి ఉంటుందన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:35 - June 4, 2018

భరత్‌ అనే నేను సినిమాతో సూపర్‌ హిట్ సాధించిన సూపర్ స్టార్ మహేష్ బాబును ఓ టెన్షన్‌ వెంటాడుతోంది. త్వరలో తన సిల్వర్‌ జూబ్లీ సినిమాకు రెడీ అవుతున్న మహేష్ తెగ వర్రీ అయిపోతున్నాడు. ఎందుకా వర్రీ అనుకుంటున్నారా..? ఈ జనరేషన్‌ హీరోల్లో ఏ హీరోకు కూడా 25వ సినిమా పెద్దగా కలిసి రాలేదు. అందుకే మహేష్ కూడా తన 25వ ఫిలిం విషయంలో టెన్షన్‌ పడుతున్నాడట.

లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చిన మిడియం రేంజ్ హీరోలు మాత్రం ఫుల్ ఫాంలో దూసుకుపోతున్నారు. ఫ్లాప్ లు అప్పుడప్పుడూ బ్రేక్ వేస్తున్నా.. హిట్ జోష్ ను క్యాష్ చేసుకొని వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. అందుకే మీడియం రేంజ్ హీరోలు తక్కువ సమయంలోనే సిల్వర్ జూబ్లీ స్టార్స్ గా మారుతున్నారు. అయితే ఇలాంటి స్టార్స్‌కు కూడా 25వ సినిమా చేదు అనుభవాన్నే మిగిల్చింది.

యంగ్ హీరోలకు మాత్రమే కాదు సూపర్‌ స్టార్‌లకు కూడా 25వ సినిమా చేదు అనుభవాన్నే మిగిల్చింది. భారీ మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న స్టార్లు కూడా ఈ సెంటిమెంట్‌తో కష్టాల్లో పడ్డారు.

16:33 - June 4, 2018

'ఘాజీ' సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయి సంచలనం సృష్టించింది. 'ఘాజీ' సినిమాను మొదటి షార్ట్ ఫిలింగ్ తీద్దామనుకున్న యువకుడు సంకల్ప రెడ్డి వెండితెరకు దర్శకుడుగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో టెక్నికల్ గా వుండే విశ్లేషణ అతని దర్శకత్వ ప్రతిభకు ఓ మచ్చు తునకలా కనిపిస్తుంది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ ఊపిరి తీసుకోనివ్వకుండా ఆద్యంత ఆసక్తిని రేకెత్తించాడు దర్శకుడు సంకల్ప రెడ్డి. ఇప్పుడు తాజాగా ఈ యువ దర్శకత్వంలో వరుణ్ తేజ్ మరో టెక్నికల్ మూవీ రాబోతోంది.

వరణ్ తో జత కట్టనున్న అదితీరావు హైదరీ..
అందంతో పాటు నటన కూడా తన స్వంతం అనిపించుకున్న నటి అదితీరావు హైదరీ..ఈమె బాలివుడ్ నటి పేరు తెచ్చుకున్నా..అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయి. గద్వాల్ సంస్థానాదీశుల వారసురాలు అదితీరావు హైదరీ..నానమ్మ, అమ్మమ్మ కుటంబీకులిద్దరు రాజవంశీకులే కావటం మరో విశేషం. బాహ్య సౌందర్యం కంటే అత:సౌందర్యమే మనిషికి ముఖ్య అంటున్న అదితీరావు వరుణ్ తేజ్ సరన నటించనుంది. సమ్మోహనంతో తెలుగు తెరకు పరిచయమైన అదితీ రెండో సినిమాతో వరుణ్ సరన నటించనుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ అందాల రాక్షసితో విమర్శకులు ప్రసంశలు అందుకున్న లావణ్యా త్రిపాఠి.

ఘాజీ’తో దర్శకుడిగా పరిచయమైన సంకల్పరెడ్డి..
‘ఘాజీ’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు సంకల్ప్‌రెడ్డి. ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠీ కథా నాయికలు. రాజీవ్‌ రెడ్డి నిర్మాత. అంతరిక్షం నేపథ్యంలో సాగే కథ ఇది. వరుణ్‌ వ్యోమగామిగా కనిపించనున్నాడు. ఇందుకోసం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేకమైన సెట్‌ తీర్చిదిద్దారు. అంతరిక్షాన్ని పోలిన ఈ సెట్‌లో యాక్షన్‌ దృశ్యాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశంలో పాల్గొంటున్న వరుణ్‌, అదితిరావు తదితరులకు త్రీడీ స్కానింగ్‌ చేయిస్తున్నారు. 

పరిశీలనలో వున్న ‘వ్యోమగామి’, ‘అంతరిక్షం’పేర్లు..
నిర్మాత రాజీవ్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘హాలీవుడ్‌ సాంకేతిక నిపుణుల సహకారంతో ఈ సన్నివేశాల్ని రూపొందించాలనుకుంటున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరిగేటప్పుడు ఈ టెక్నీషియన్లు అందుబాటులో ఉండరు. ఈ సెట్‌ కూడా ఉండదు. అప్పుడు ప్యాచ్‌వర్క్‌ ఏమైనా మిగిలిపోతే... త్రీడీ స్కానింగ్‌ ఉపయోగపడుతుంద’’న్నారు. ఈ చిత్రం కోసం ‘వ్యోమగామి’, ‘అంతరిక్షం’ అనే పేర్లు పరిశీలిస్తున్నారు.

16:32 - June 4, 2018
16:31 - June 4, 2018
16:30 - June 4, 2018

విజయవాడ : మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. మోడీ ఎన్నికల్లో ఇచ్చిన హామలు నెరవేర్చలేదని, పెట్రోల్, డీజీల్ ధరలు పెంచి ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తొందన్నారు. ప్రభుత్వ డబ్బు సీఎం చంద్రబాబు సభలు పెడుతూ రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. 

16:29 - June 4, 2018

ఢిల్లీ : వైసీపీ ఎంపీల రాజీనామాల విషయంలో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇటీవలే వీరి రాజీనామాల విషయంలో కదలిక వచ్చిన సంగతి తెలిసిందే. స్పీకర్ ను కలవాలని లోక్ సభ స్పీకర్ కార్యాలయం నుండి వైసీపీ ఎంపీలకు ఆదేశాలు అందాయి. దీనితో 29వ తేదీన ఎంపీలు భేటీ అయ్యారు. రాజీనామాలు ఎందుకు చేయాల్సి వచ్చింది ? తదితర విషయాలపై స్పీకర్ ఆరా తీశారు. కానీ రాజీనామాల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం వైసీపీ ఎంపీలు హస్తినకు పయనం కానున్నారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ తో బుధవారం భేటీ కానున్నారు. తమ రాజీనామాలను ఆమోదించాలని వారు కోరననున్నారు. మరి రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయా ? అనేది చూడాలి. 

15:24 - June 4, 2018

హైదరాబాద్ : ఆబిడ్స్ లో ఉద్రిక్తత నెలకొంది. కమలేశ్ కమిటీని అమలు చేయాలంటూ తపాల ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. డాక్ సదన్ కార్యాలయం ఎదుట రెండు వేల మంది గ్రామీణ తపాల ఉద్యోగులు ధర్నా చేపట్టారు. వేతన సవరణ సంఘం అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులకు వినతిపత్రం అందచేసి సమస్యలను తెలియచేస్తామని, లోనికి అనుమతించాలని పోలీసులను ఉద్యోగులు కోరారు. కానీ పోలీసులు అంగీకరించకపోవడంతో రహదారిపైనే బైఠాయించారు. ఒక్కసారిగా ఆందోళన చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమలేశ్‌ చంద్ర కమిటీ నివేదిక సమర్పించి నాలుగు నెలలైందన్నారు. ఈ నివేదికను వెంటనే ఆమోదించి ఇంప్లిమెంట్‌ చేయాలని కోరారు. 

15:20 - June 4, 2018

విజయవాడ : ఏపీ ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం నూతన సిలబస్ రిలీజ్ అయ్యింది. అమరావతిలోని సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో బోర్డు కమిషనర్ ఉదయ లక్ష్మీ పుస్తకాలను రిలీజ్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...ఈ అకాడమిక్ ఇయర్ నుండి న్యూ సిలబస్ అందుబాటులోకి వస్తుందని, మొదటిగా 10 లక్షల పుస్తకాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. లాంగ్వేజ్ పుస్తకాల వరకు నూతన సిలబస్ ను ప్రవేశ పెట్టడం జరిగిందని ఉదయ లక్ష్మీ తెలిపారు. మిగిలిన సబ్జెక్స్ లో నూతన చాప్టర్ లను పొందుపరిచడం జరిగిందన్నారు. 

తపాలా ఉద్యోగుల ర్యాలీ..ఉద్రిక్తత..

హైదరాబాద్ : అబిడ్స్ సెంటర్ లో ఉద్రిక్తత నెలకొంది. కమలేశ్ కమిటీని అమలు చేయాలని డిమాండ్ చేస్తు తపాలా ఉద్యోగులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. డాక్ సదన్ కార్యాలయం ముందు తపాలా ఉద్యోగులు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. 

14:45 - June 4, 2018

నీట్ పరీక్ష ఫలితాలు విడుదల..

హైదరాబాద్‌ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో వైద్య, విద్య ప్వఏశాల కోసం నిర్వహించని నీట్ 2018 పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. మే 6న నిర్వహించిన ఈ ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ లో తేడా వుందని విద్యార్ధులు ఆరోపించటంతో ఈ పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని కొందరు విద్యార్దులు డిమాండ్ చేశారు. దీంతో గత నెలలో మద్రాసు హైకోర్టును విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు కోర్టులో పిటీషన్ కూడా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రిజల్స్ విడుదలపై స్టే విధించింది. దీనిపై సీబీఎస్ ఈ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

14:13 - June 4, 2018

రాజన్నసిరిసిల్ల : జిల్లాలో ఓ సామాన్యుడు ప్రధాని మోడీకి చెక్ ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను తొమ్మిది పైసలు తగ్గించినందుకు చందుగౌడ్ అనే వ్యక్తి వినూత్న నిరసన తెలిపారు. ప్రధాని రిలీఫ్ ఫండ్ కు ఆ తొమ్మిది పైసల చెక్ ను విరాళంగా జమ చేశారు. ఈ చెక్ ను సిరిసిల్ల ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ కు అందజేశాడు...ధనవంతులుగా ఉన్నపేదవారికి తొమ్మిది పైసలు అందజేయాలని సూచించారు.

14:00 - June 4, 2018

హైదరాబాద్ : రైతులను ఆదుకోవడం కోసమే రైతు బంధు పథకం తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతు బీమాపై ఎల్ ఐసీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆగస్టు 15 నుంచి రైతు బీమా అమలు కానుంది. రైతు మరణిస్తే రూ.5 లక్షల రూపాయలు వస్తాయన్నారు. రైతు బీమా పథకం తన జీవితంలోనే గొప్ప పని అన్నారు. రైతు క్షేమంగా ఉంటే..దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయితే రోహినికి ముందే నాట్లు వేస్తారని చెప్పారు. తెలంగాణలో ఇక జనరేటర్లు అవసరం లేదన్నారు. 365 రోజులు చెరువులు నిండే ఉంటాయన్నారు. రాష్ట్రంలో 89 శాతం మంది రైతులు రైతు బంధు పథకంతో సంతృప్తిగా ఉన్నారని హిందూ పత్రిక రిపోర్టు ఇచ్చిందన్నారు. తెలంగాణలో 57 లక్షల మంది రైతులు ఉన్నారని పేర్కొన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. తాను రైతు బంధు పథకం తీసుకోనని..రైతు బీమా పథకం తీసుకుంటాని తెలిపారు. రైతు బతుకు దారుణంగా ఉందన్నారు. ఎన్నో గండాలు ఎదుర్కొంటున్నారని వాపోయారు. రైతులు అప్పుల్లో ఉన్నారని..రైతు పెట్టుబడి కోసం వెతకని రోజు రావాలని ఆకాంక్షించారు. మద్దతు ధ ర ఇస్తే..రైతుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రైతు లోకం క్షేమంగా ఉంటే దేశం క్షేమంగా ఉంటుందన్నారు. 18 లక్షల మంది ఒక ఎకరం ఉన్న రైతులు ఉన్నారని పేర్కొన్నారు. రైతు బంధం పథకంలో  4956 కోట్లు చిన్నసన్నకారు రైతులకు పోతుందన్నారు. రైతు బీమా పథకం అమలు, నిర్వహణలో మండల సమన్వయకర్తలు, ఏఈవోల పాత్ర కీలకమన్నారు. రైతు బీమా నిర్వహణ రెవెన్యు శాఖది కాదని... అగ్రికల్చర్ శాఖది అన్నారు. రైతు తర్వాత...నామినీ పేరు రాయాలన్నారు. ఆగస్టు 15 తర్వాత చనిపోయే రైతులకు ఐదు లక్షల బీమా వస్తుందన్నారు. మద్దతు ధర నిర్ణయించే అధికారం కేంద్రం ప్రభుత్వం చేతుల్లో ఉందన్నారు. పంటకు మద్దతు ధర రాబట్టాలన్నారు. 

 

13:49 - June 4, 2018

హైదరాబాద్ : హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సింగిల్ జడ్డ్ ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ కోసమే అసెంబ్లీలో పోరాటం చేశామని తెలిపారు. సీఎల్పీ నేతగా జానారెడ్డికి ఎమ్మెల్యేలుగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తొలి తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యమన్నారు. కేసీఆర్.. న్యాయ వ్యవస్థను మోసం చేస్తూ..నాటకాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. న్యాయస్థానాలతో పెట్టకుంటే నీ చరిత్ర బయటపడుతుందని కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఇంతటి నియంత కేసీఆర్ కు తమ పార్టీ నాయకులు ఎందుకు భయపడుతున్నారో అర్ధకం కావడం లేదన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే... జానారెడ్డికి ఎలా నిద్ర పడుతుందని ప్రశ్నించారు. సింగిల్ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయకపోతే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసి...ఉప ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. డిక్టేటర్లకు ఎన్నికల్లో స్థానం ఉండదన్నారు. 

 

13:31 - June 4, 2018

హైదరాబాద్ : హైకోర్టులో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగిలింది. సింగిల్ బెంచ్ తీర్పును బెంచ్ డివిజన్ సమర్థించింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ లు ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మోల్యేల సభ్వత్యంపై రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాస్ చేస్తూ టీఆర్ ఎస్ పిటిషన్ వేసింది. 

13:29 - June 4, 2018
13:27 - June 4, 2018

హైదరాబాద్ : జూన్ 10 నుంచి బిగ్ బాస్ 2 షో ప్రారంభం కానుంది. బిగ్ బాస్ 2 హోస్ట్ గా హీరో నాని వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఎన్ని సినిమాలు తీసినా.. దాహం తీరలేదని.. బీగ్ బాస్ తో నా దాహం తీరుబోతుందని అన్నారు. బిగ్ బాస్ షో గురించి తెలుసుకున్నాక...బిగ్ బాస్ షోకు హోస్ట్ గా చేయాలనుకున్నానని తెలిపారు.

13:24 - June 4, 2018

కడప : జిల్లా జమ్మలమడుగు పరిధిలో పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. ఘర్షణ నేపథ్యంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. నిన్న వైసీపీలో చేరేందుకు యత్నించిన ముగ్గురి ఇళ్లపై మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆనుచరులు దాడికి యత్నించారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని మేరవ సంజీవరెడ్డి ఆహ్వానించారు. అవినాష్ రెడ్డి వస్తున్నారని తెలుసుకుని మంత్రి అనుచరులు డాడికి పాల్పడ్డారు. ఎంపీ అవినాష్ రెడ్డితోపాటు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ నేతలను పలకరించేందుకు వెళ్తే అరెస్టు చేయడం దారుణమని వైసీపీ నేతలు అంటున్నారు. ఈనెల 6వ తేదీన జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం చంద్రబాబును అడ్డుకుంటామని వైసీపీ నేతలు పేర్కొన్నారు. 

కన్నడ కాంగ్రెస్ లో అలకలు..పాటిల్ రాజీనామా..

కర్ణాటక : కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్ఆర్ పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేసినట్టు ఆయన చెబుతున్నారు. కాగా అసలు కారణం అదికాదని సమాచారం. కాగా జేడీఎస్‌తో పొత్తుపై తనకు మాటమాత్రమైనా చెప్పకపోవడం, లింగాయత్ కోటాలో డిప్యూటీ సీఎం పదవిని ఆశించి భంగపడడం వంటి కారణాలతో ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం. గత నెల 25 న రాజీనామా లేఖను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి పంపించారు.

13:11 - June 4, 2018

హైదరాబాద్ : హైకోర్టులో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగిలింది. సింగిల్ బెంచ్ తీర్పును బెంచ్ డివిజన్ సమర్థించింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ లు ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మోల్యేల సభ్వత్యంపై రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాస్ చేస్తూ టీఆర్ ఎస్ పిటిషన్ వేసింది. 

 

13:00 - June 4, 2018

హైదరాబాద్ : బిగ్ బాస్ 2 హోస్ట్ గా హీరో నాని ఉండనున్నారు. జూన్ 10 నుంచి బిగ్ బాస్ 2 షో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఎన్ని సినిమాలు తీసినా.. దాహం తీరలేదని.. బీగ్ బాస్ 2తో నా దాహం తీరుబోతుందని అన్నారు. బిగ్ బాస్ షో 2 గురించి తెలుసుకున్నాక...బిగ్ బాస్ 2 షోకు హోస్ట్ గా చేయాలనకున్నానని తెలిపారు.

రైతుబంధుతో రైతులు ఆనందంగా వున్నారు : కేసీఆర్

హైదరాబాద్ : రైతుబంధుతో రైతులు ఆనందంగా వున్నారని హెచ్ఐసీసీలో జరుగుతున్న రైతుబంధు జీవిత బీహా పథకం అవగాహన సదస్సులో పాల్గొన్న సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 57 లక్షలమంది రైతులు వున్నారనీ..వారందరికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. 18 నుండి 60 సంవత్సరాలు వున్న రైతులు ఏ కారణంగా మృతి చెందినా ఈ రైతు బీమా పథకం వర్తిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులను అదుకోవటం కోసం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రతీ రైతు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

12:49 - June 4, 2018

హైదరాబాద్ : బిగ్ బాస్ 2 హోస్ట్ గా హీరో నాని ఉండనున్నారు. జూన్ 10 నుంచి బిగ్ బాస్ 2 షో ప్రారంభం కానుంది. 

రైతు బీమా నా జీవితంలోనే గొప్ప పని : కేసీఆర్

హైదరాబాద్ : రైతు బీమా పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతు బీమా పథకం విషయంలో ఎల్ఐసీ తో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం కేసీఆర్ సమక్షంలో ఎల్ఐసీ బీమా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రతీ రైతు కుటుంబానికి రూ.5లక్షల బీమాను ప్రభుత్వం వర్తింపజేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఆగస్టు 15 నుండి ఈ పథకం అమలులోకి రానుంది. దీనికి సంబంధించిన పేపర్ వర్క్ అంతా వీఆర్వోలే దగ్గరుండి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతు బీమా పథకం నా జీవితంలోనే గొప్ప పని అని కేసీఆర్ ఆనందం వ్యక్తంచేశారు.

కోర్టు తీర్పును ఇప్పటికైనా గౌరవించాలి : కోమటిరెడ్డి

హైదరాబాద్ : తమను ఎమ్మెల్యేలుగా ఏక్సప్ చేయాలని కాంగ్రెస్ నేత కోమట్టిరెడ్డి, సంపత్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. న్యాయవ్యవస్థపై తమకున్న నమ్మకంతోనే తాము సభ్యత్వ రద్దుతో అన్యాయానికి గురైనా కోర్టుకు వెళ్లి విజయం సాధించామనీ..కోర్టు ఇచ్చిన తీర్పుతో న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం పెరిగిందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో మాపై పిటీషన్ వేయిస్తారా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

12:19 - June 4, 2018

ప్రకాశం : జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడులో అతిసారం ప్రబలింది. అతిసారం వ్యాధి బారిన పడిన నాగమ్మ అనే వృద్ధురాలు వాంతులు, విరేచనాలు ఎక్కువ అవడంతో మరణించింది. ఈ వ్యాధితో గ్రామంలో మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరికి వైద్యాశాఖాధికారులు చికిత్స అందిస్తున్నారు. గ్రామానికి వచ్చే తాగునీటి పైప్‌లైన్‌లో నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల అతిసారం ప్రబలినట్లు వైద్యులు గుర్తించారు. 

 

అన్యాయం చేసి..ఇప్పుడు శుభాకాంక్షలా : లోకేశ్

అమరావతి: జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసిన ప్రధాని స్పందనకు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతి స్పందించారు. ‘విభజనకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరసన గళం వినిపిస్తుంటుంటే.. రాష్ట్రానికి అన్యాయం చేసి ఇప్పుడు శుభాకాంక్షలు చెబుతారా?. కేంద్రం హోదాతో సహా విభజన హామీలు నెరవేర్చలేదని, ప్రజలంతా తీవ్ర ఆవేదనలో ఉంటే ట్వీట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలను సంతృప్తి పరచాలని మీరు అనుకుంటున్నారా?. ప్రజల ఆవేదన ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలి’ అంటూ నెటిజన్లు చేసిన కామెంట్లను జతపరచి ప్రధాని మోదీకు ట్వీట్‌ చేశారు.

మరో ఎయిర్ హోస్టెస్ కు లైంగిక వేధింపులు..

ఢిల్లీ : విమానం ప్రయాణంలో ప్రయాణీకులకు అంత్యంత వినమ్రంగా సేవలు చేసే ఎయిర్ హోసెస్ లకు గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురవుతున్న ఘటనలో వెలుగులోకి వస్తున్నాయి. తమకు జరిగిన వేధింపులపై ఫిర్యాదులు చేసేందుకు ఎయిర్ హోస్టెస్ లు ముందుకొస్తున్నారు. గతంలో కొంతమంది తాము వేధింపులకు గురవుతున్నామంటు ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు తాజాగా మరో ఎయిర్ హోస్టెర్ అధికారులు తనను లైంగికంగా వేధిస్తున్నారంటు ఓ ఎయిర్ హోస్టెస్ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి మేనకాగాంధీకి ఫిర్యాదు చేసింది.  

12:02 - June 4, 2018

నెల్లూరు : మర్రిపాడు మండలం తిమ్మానాయుడు పేటలో వింత ఆచారం కొనసాగుతోంది. ఈ గ్రామంలో ఎవరైనా అమ్మవారి ఎదుట మొక్కులు తీర్చుకోవాలంటే ముళ్లకంప మీద దొర్లాల్సిందే. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ ముళ్లకంపపై దొర్లుతారు. ఇలా చేస్తే కోరికలు నెరవేరతాయని ఆగ్రామస్తుల నమ్మకం. మూడేళ్లకోసారి జరిగే ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకుంటారు. అయితే ఆరోగ్యంపై ప్రభావం చూపే ఇలాంటి మూఢ నమ్మకాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 

 

11:57 - June 4, 2018

పశ్చిమగోదావరి : కొయ్యలగూడెం మండలం గవరవరం పంచాయితీ పరిధిలో విషాదం జరిగింది. చొప్పరామన్న గూడెంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి 12 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులైన తగరం విజయరాజు, ప్రియాంకలు మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

11:54 - June 4, 2018

రంగారెడ్డి : నందిగామ మండలం బైపాస్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉల్లిగడ్డ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వీరిని షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమిగనూరు నుండి హైదరాబాద్‌కు ఉల్లిగడ్డ లోడ్‌తో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు రామలక్ష్మి(50), లారీ క్లీనర్‌ నాగరాజులుగా గుర్తించారు. 

11:51 - June 4, 2018

కడప : జమ్మలమడుగు పరిధిలోని పెద్ద దండ్లూరులో టీడీపీ... వైసీపీ వర్గాల మధ్య ఆదివారం ఘర్షణ తలెత్తింది. వైసీపీ వర్గీయుల ఇళ్లపై మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. వైసీపీకి చెందిన  ఎరవ సంజీవరెడ్డి ఇంటిని కూల్చివేశారు. సంజీవరెడ్డి తన కుమారుడి వివాహానికి వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిని ఆహ్వానించారు. అయితే ఆయన పెళ్లికి హాజరుకానందున... ఆదివారం నూతన వధూవరులను అభినందించాలని నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు సంజీవరెడ్డి ఇంటిపై దాడిచేసి కూల్చివేశారు. ఎంపీ అవినాష్‌రెడ్డి అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అధికార పార్టీనేతలకే వత్తాసు పలుకుతున్నారని అవినాశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా నిరసనకు దిగిన అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేశారు. 

 

11:47 - June 4, 2018

బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి, సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు డివి.కృష్ణ, బీజేపీ నాయకురాలు కవిత పాల్గొని, మాట్లాడారు. మతోన్మాదాన్ని బీజేపీ పెంచిపోషిస్తోందని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా లౌలిక పార్టీలు ఏకమవుతున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

11:46 - June 4, 2018

తెలుగులో 'బిగ్ బాస్' సాధించిన విజయంతో మరో బిగ్ బాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ ముహూర్తం కూడా ఆసన్నమైంది. మొదటి బిగ్ బాస్ కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా అదరగొట్టాడు..కామెడీ, సమయస్ఫూర్తి..వీటి తోటు ఎన్టీఆర్ వాక్చాతుర్యం వెరసి 'బిగ్ బాస్ ' సూపర్ హిట్ అయ్యింది.ఈ నేపథ్యంలో 'బిగ్ బాస్ '2 లో మరింత జోష్ తో..మరింత హాట్ హాట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. అసలే జోష్ కు మారుపేరుగా వుండే నాని ఈ షోలో మరింత జోష్ పుట్టించనున్నాడు. ఇప్పటికే ప్రోమోలతో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్న ఈ నాచ్యురల్ స్టార్ యాంకరింగ్ కోసం..ఈ షోలో పాల్గొనే సెలబ్రిటిలు ఎవరా? అనే ఉత్కంఠతతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ముహూర్తం దగ్గరపడుతున్న 'బిగ్‌బాస్' సీజన్ 2..
తెలుగు 'బిగ్‌బాస్' సీజన్ 2 ప్రసారానికి ముహూర్తం దగ్గరపడుతోంది. ఈ షోకు వ్యాఖ్యాతగా నేచురల్ స్టార్ నాని ఈల వేస్తూ సీజన్‌-2కు వచ్చేస్తున్నాడు. 'జూన్ 10.. 100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు.. 1 బిగ్ హౌస్.. బిగ్ బాస్ 2'తో నాచురల్ స్టార్ రాబోతున్నాడు. 'ఏదైనా జరగొచ్చు' రెడీగా ఉండడంటూ నాని తన అభిమానుల్లో, ఔత్సాహికుల్లో మరింత ఆసక్తి పెంచుతున్నాడు. ఈ షో స్టార్ మాలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు, శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఇప్పటికే పలు షోలలో అలరించిన నాని ఈ బిగ్ బాస్ 2లో ఏవిధంగా ప్రేక్షకులను, పాల్గొన్నవారిని ఎలా ఆకట్టుకోనున్నాడో చూడాలి..

11:43 - June 4, 2018

ఉపాధి హామీ పథకం.. ఎంతో మందికి ఉపాధి కల్పించింది .కార్మికులతో పాటు.. రైతులకూ ఈ పథకం జీవనాధారం. కానీ.. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ పథకం నీరుగారిపోతోందని, ఈ పథకం యొక్క నిధులు దారి మల్లుతున్నాయని, ప్రజా సంఘాలు  ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం నిధులను గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి దారి మళ్ళిస్తూ.. తీసుకొచ్చిన జీవోపై ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇదే విషయంపై వ్యవసాయ కార్మిక సంఘం ఆల్‌ ఇండియా కమిటీ సభ్యులు ఐలయ్య మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

11:39 - June 4, 2018

ఒడిశా : భారత్‌ తన అస్త్ర సామర్థ్యాన్ని  మరోసారి ప్రపంచానికి చాటింది. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని ఒడిశాలోని అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి ఆదివారం ఉదయం 9గంటల 48 నిమిషాలకు ప్రయోగించారు. ఒకటిన్నర టన్నుల అణ్వాస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగివున్న ఈ క్షిపణిని ఉపరితలం నుంచి ఉపరితలంపై 5 వేల కి.మీ. దూరంలోని  లక్ష్యాలను ఛేదించేలా అభివృద్ధి చేశారు. అగ్ని-5 పరీక్షలు చేపట్టడం ఇది ఆరోసారి. 2012 ఏప్రిల్‌ 19న మొదటిసారి పరీక్షించారు. ఈ ఏడాది జనవరి 18న ఐదోసారి ప్రయోగించారు. తాగా పరీక్షతో మిసైల్‌ సామర్థ్యంలో ఆగ్రరాజ్యాల సరసన ఇండియా నిలిచింది. 

 

11:35 - June 4, 2018

ఢిల్లీ : సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానానికి 14 నిమిషాల పాటు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ నుంచి సంబంధాలు తెగిపోయాయి. దీంతో అధికారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయిదు రోజుల పర్యటన నిమిత్తం సుష్మాస్వరాజ్‌ దక్షిణాఫ్రికాలో జరగనున్న బ్రిక్స్‌ సదస్సుకు బయలు దేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రయాణిస్తున్న విమానం పైలెట్‌ మారిషస్‌ ఏటీసీని సంప్రదించలేకపోయాడు. అదే సమయంలో మారిషస్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ కూడా సుష్మ విమాన గమనాన్ని గుర్తించలేకపోయింది. దీంతో మారిషస్‌ ఏటీసీ ఒక్కసారిగా ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మారిషస్‌ ఏటీసీకి సిగ్నల్స్‌ అందడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సుష్మా సేఫ్‌గా మారిషస్‌లో ల్యాండ్‌ అయ్యారు. 

 

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో తెలంగాణ ప్రథమం : కేటీఆర్

హైదరాబాద్ : తెలంగాణ పారిశ్రామికరంగ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. 2017,18లో 10.4 శాతం ప్రారిశ్రామిక వృద్ధి పెరిగిందని కేటీఆర్ తెలిపారు. టీ ఐ పాస్ ద్వారా రూ.లక్షా 23వేల 478 కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా 5.27లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో తెలంగాణ తొలిరాష్ట్రంగా వుందన్నారు. తెలంగాన తలసరి ఆదాయం రూ. లక్ష ఆ 75 వేల 534 గా వుందన్నారు. ఇది దేశ తలసిర ఆదాయం కంటే 55 శాతం అధికంగా వుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

11:32 - June 4, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ఈ నెల 7 వరకు వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారు తెలిపారు. ఇప్పటికే  తమిళనాడులో చాలా ప్రాంతాలకు విస్తరించాయి. ఈనెల 5,6 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలను రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం తెలంగాణ విదర్భ ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభాంతో  తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం పడుతున్న వర్షాలు రుతుపవనాల వల్ల కాదని వాతావరణ అధికారులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలున్న చోట క్యుములోనింబస్ మేఘాలేర్పడి వర్షాలు కురుస్తున్నాయన్నారు. 

 

11:27 - June 4, 2018

హైదరాబాద్ : లలిత కళాస్రవంతి సాంస్కృతి సేవా సంస్థ 75వ వార్షిక అవార్డుల ప్రదానోత్సవం గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్‌ మీడియాలో న్యూస్‌రీడర్స్‌గా పనిచేస్తున్న పలువురిని నిర్వాహకులు ఘనంగా సస్మానించారు. 10టీవీ  న్యూస్‌ రీడర్‌ హరీశను ఈవీ రాజయ్య అండ్‌ సన్స్‌ ప్రతినిధులు శాలువా, మెమెంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మానవ హక్కుల కమిషన్‌ సెక్రెటరీ డి. సుబ్రహ్మణ్యం.... మీడియారంగం నిరంతరం కష్టంతో కూడుకున్నపని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా వారధిగా పనిచేస్తోందన్నారు.   అనంతరం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. 

 

11:23 - June 4, 2018

కడప : ఓవైపు నిఫా వైరస్‌ భయంతో జనం ఆందోళన పడుతుంటే..  వారేమో ఏకంగా గబ్బిలాలతోనే సహజీవనం చేస్తున్నారు. కబోది పక్షులను దేవతలకు ప్రతిరూపంగా నమ్ముతున్నారు. గబ్బిలాల మలంతో చిన్న పిల్లలకు స్నానం  చేయించి... మెడలో గబ్బిలాల కళేబరాలు, ఎముకలు  వేస్తున్నారు. కడప జిల్లాలోని ఓ గ్రామంలో ఈ  వింత ఆచారం పాటిస్తున్నారు. 

గబ్బిలం పేరెత్తితేనే ఇపుడు ఇండియా జనం వణికిపోతున్నారు. గబ్బిలం నుంచి నిఫావైరస్‌ వ్యాపిస్తోందని ప్రచారం హోరెత్తుతోంది. అలాంటింది ఈ గ్రామంలో మాత్రం ఇలా గబ్బిలాలను దేవతా పక్షులుగా కొలుస్తున్నారు. అంతేకాదు.. గబ్బిలాలమలాన్ని  చిన్నపిల్లల ఒంటికి పూస్తే రోగాలు నయం అవుతాయని ఈ గ్రామస్తులు నమ్ముతున్నారు. 

కడప జిల్లాలోని రైల్వేకోడూరుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాధవరంపోడు గ్రామం. 35 ఏళ్ల క్రితం కక్షలతో, కొట్లాటలతో ఈ గ్రామంలో అట్టుడికేది. నిత్యం ఘర్షణలతో  ప్రశాంతత అనేది లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి అనుకోని అతిథుల్లా వచ్చి చేరాయి ఈ గబ్బిలాలు. ఊరి చివర ఉన్న అమ్మదేవత చెట్టుపైకి గబ్బిలాలు వచ్చి చేరాయి. క్రమేణా ఊర్లోని చింత, కొబ్బరి, రావి, తదితర చెట్లపై కీ చేరి అక్కడే నివాసం ఏర్పురచుకున్నాయి.  ఏమయిందో ఏమోగాని గబ్బిలాలు గ్రామంలోకి వచ్చినప్పటి నుంచి ఊరిలో కక్షలు  తొలిగిపోయి శాంతి ఏర్పడిందని మధవరంపోడు గ్రామస్తులు అంటున్నారు. 

అనారోగ్యానికి గురైన పిల్లలను ఆదివారం రోజున ఈ చెట్టు వద్దకు తీసుకొచ్చి గబ్బిలాల మలంను ఒళ్లంతా పూసి అక్కడే స్నానాలు చేయించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అంతేకాదు  బలహీనంగా ఉన్న చిన్నారులకు  ఇలా గబ్బిలాల కళేబరాలను , ఎముకలను   మెడలో తగిలిస్తున్నారు. అలా చేస్తే పిల్లల రోగాలు నయం అవుతున్నాయని మాధవరంపోడు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా నమ్ముతున్నారు.

నిపా వైరస్ కారణంగా కేరళలో 15 వరకు మృతి చేందడంతో గబ్బిలం అన్న పేరు వింటేనే ప్రజలు భయపడుతున్నారు. కానీ ఈ మాధవరంపోడు గ్రామస్తుల్లో మాత్రం నిపా వైరస్ గురించి ఆందోళన కనిపించడం లేదు. అయితే నిపుణులు మాత్రం నిపా వైరస్ వస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక్కడి ప్రజలకు ప్రభుత్వం  నిఫావైరస్‌ వ్యాప్తిపై అవగహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది.   


 

'ఏరువాక'ను విజయవంతం చేయాలి :చంద్రబాబు

అమరావతి : సేద్యపు పనులకు రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని, ఏరువాక కార్యక్రమం విజయవంతం చేయాలని నీరు-ప్రగతి, వ్యవసాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్ లో అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. జల సంరక్షణ చర్యలు ముమ్మరం చేయాలన్నారు. మైక్రో ఇరిగేషన్ మరో నాలుగు రెట్లు పెరగాలని సీఎం అన్నారు. కోటి ఎకరాల్లో పండ్లతోటల సాగును ప్రోత్సహించాలని చెప్పారు. ఉపరితల నీటి వినియోగంపై అధ్యయనం చేయాలని, కృష్ణా ఆయకట్టుకు ముందస్తుగా సాగునీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

రైతుల్లో భరోసా పెంచాలి : చంద్రబాబు

అమరావతి: నీరు-ప్రగతి, వ్యవసాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి చేరిక ఎంత ముఖ్యమో, జలాశయాల నిర్వహణ అంతకన్నా ప్రధానమన్నారు. సీజన్‌లో సాగునీటి విడుదలపై రైతుల్లో భరోసా పెంచాలని అధికారులకు సూచించారు. సాగునీటి విడుదల తేదీలను ముందే ప్రకటించాలన్నారు. పంటకాలువలు, చెరువులు నీటినిల్వకు సంసిద్ధం చేయాలని తెలిపారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. రిజర్వాయర్లు, చెరువులకున్న గేట్లను తనిఖీ చేయాలని, పకడ్బందీగా గేట్ల నిర్వహణ ఉండేలా శ్రద్ధపెట్టాలని అధికారులకు తెలిపారు.

బద్దలైన వాల్కెనో..25మంది సజీవదహనం..

అమెరికా : గ్వాటెమాలాలో ఘోర ప్రమాదం సంభవించింది. అగ్నిపర్వతం బద్దలవడంతో ఆ లావాలో చిక్కుకుని 25 మంది సజీవదహనమయ్యారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. సెంట్రల్‌ అమెరికా ప్రాంతంలోని అతిపెద్ద అగ్నిపర్వతాల్లో ఒకటైన ఫ్యూగో అగ్నిపర్వతం ఆదివారం బద్దలైంది. దీంతో పెద్ద పెద్ద రాళ్లు ఎగిరి పడుతున్నాయి. దట్టమైన పొగ వ్యాపించింది. అగ్నిపర్వతం నుంచి లావా ఎగసిపడి సమీపంలోని గ్రామాల వరకు వ్యాపించింది. ఈ లావాలో పలువురు స్థానికులు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 25 మంది మృతిచెందగా.. మరో 20మందికి పైగా గాయపడినట్లు వెల్లడించారు.

ఏపీకి రుతుపవనాలు..

అమరావతి : నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. సోమవారం అనంతపురం జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడులోని చాలా ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు.. రెండ్రోజుల్లో రాయలసీమ, మహారాష్ట్ర ప్రాంతాలకు పూర్తిగా విస్తరిస్తాయని తెలిపింది. ఏపీలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్‌ మేఘాల వల్ల ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. గత రెండ్రోజులుగా కోస్తాలో మినహా మిగిలిన చోట్ల ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గాయి. ఎక్కడా 40 డిగ్రీలు దాటలేదు.

ఎమ్మెల్యేలుగా కొనసాగనున్న కోమటిరెడ్డి, సంపత్..

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ లు శాసనసభలో కొనసాగనున్నారు. వారి శాసనసభ సభ్వత్వాన్ని రద్దు చేస్తు టీఆర్ఎస్ ప్రభుత్వం వారిని శాసనసభ నుండి రద్దు చేసింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి కారణాలు తెలపాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించటం వంటి పలు కీలక పరిణామాల మధ్య కోర్టు కోమట్టిరెడ్డి, సంపత్ ల సభ్వత్వం కొనసాగుతుందని సింగిల్ బెంచ తీర్పునిచ్చింది. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేశారు.

11:07 - June 4, 2018

విజయనగరం : ఓ వైపువర్షం.. మరోవైపు జనప్రవాహం... పవర్‌ పంచ్‌లకు యూత్‌ కేరింతలు...  టీడీపీ వైసీపీలపై వపన్‌ ఘాటు విమర్శలు...  ఉత్తరాంధ్రలో జనపోరాట యాత్ర జోరుగా సాగుతోంది. విజయనగరంలో జనసేనాని ప్రత్యర్థిపార్టీలపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఉత్తరాంధ్రలో జనసేనాని పవన్‌కల్యాణ్‌ జనపోరాటయాత్ర జోరుగా సాగుంతోంది.. వెనుకబాటు తనం పోవాలంటే జనసేన అధికారంలోకి రావాలని పవన్‌ పిలుపునిస్తున్నారు. పవన్‌ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 

విజయనగరం జిల్లాలో దశాబ్దాలపాటు కొన్ని కుటుంబాలే పెత్తనం చేస్తున్నాయని.. నేతల స్వార్థంతో  జిల్లాలో అభివృద్ధి జాడలే లేకుండా పోయాయని పవన్‌ విమర్శలు ఎక్కుపెట్టారు. విజయనగరాన్ని స్మార్ట్‌సిటీ అని చెబుతున్న పాలకులకు ఇక్కడ మంచినీటి కష్టాలు కనిపించడం లేదా అని జనసేనాని ప్రశ్నించారు. అభివృద్ధి అమరావతిలోనే కాదు ఉత్తరాంధ్రలోకూడా కావాలని ముఖ్యమంత్రికి చంద్రబాబుకు వినిపించేలా యువత గర్జించాలనన్నారు జనసేన అధినేత. 

మరోవైపు జనసేన ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు తమ  కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల వెనుక టీడీపీ, వైసీపీ నేతలు ఉన్నారని కూడా ఆరోపించారు. తమ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని పవన్‌ హెచ్చరించారు. 2019లో అవినీతి నేతలకు ఉత్తరాంధ్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. 

ఉత్తరాంధ్రలో యుత కదిలితే మంచిమార్పు సాధ్యం అవుతుందన్నారు. అభివృద్ధిని కాంక్షించే ప్రతివారు జనసైన్యంతో కలిసిరావాలని వపన్‌  పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతంపాడి సమయం వచ్చిందని.. 2019 ఎన్నిల్లో జనసేన సత్తాచాటుతుందంటున్న పవన్‌.. ప్రత్యర్థి పార్టీలపై  హైరేంజ్‌లో విమర్శలు చేస్తుంటంతో ఏపీ రాజకీయాల్లో హీట్‌ పెరిగింది.    

11:04 - June 4, 2018

జగిత్యాల : తెలంగాణ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి మండిపడ్డారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందంటూ విమర్శించారు. యాభై ఎనిమిదేళ్ళ కాంగ్రెస్‌ పాలనలో యాభైఆరు వేల కోట్లు అప్పుచేస్తే.. కేవలం నాలుగేళ్ళలోనే 1లక్షా 40వేల కోట్లు అప్పు చేసిన ఘనత టీఆర్ఎస్‌ ప్రభుత్వానిదని మండిపడ్డారు. మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనుల్లో కమీషన్‌ కోసం కక్కుర్తి పడి రాష్ర్టాన్ని తాకట్టుపెడుతున్నారని జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు.

 

11:02 - June 4, 2018

పశ్చిమగోదావరి : జిల్లా పర్యటనలో జగన్‌ సీఎం చంద్రబాబను టార్గెట్‌ చేశారు. గత నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు  రాష్ట్రాన్ని అవినీతిలో నంబర్‌వన్‌గా మార్చారని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను చంద్రబాబు కేంద్రం వద్ద  అమ్ముకున్నారని జగన్‌ అన్నారు. 

పశ్చిమగోదావరి జిల్లాలో  వైసీపీ అధినేత పాదయాత్ర కొనసాగుతోంది. ఆదివారం ఉదయం జగన్నాథపురం నుంచి యాత్ర ప్రారంభమయింది. యాత్రలో టీడీపీ ప్రభుత్వంపై జగన్‌ విమర్శల దాడి మరింత పెంచారు. ఆచంట నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీలో జగన్  టీడీపీని టార్గెట్‌ చేశారు.చంద్రబాబు అసరమర్థ పాలన వల్లే రాష్ట్రం అథోగతి పాలయిందన్నారు. 

నిద్ర లేచింది మొదలు చంద్రబాబు అమరావతి జపం చేస్తున్న చంద్రబాబు.. రాజధాని నిర్మాణాన్ని ఇంకా పునాధుల వద్దే ఉంచారని జగన్‌ విమర్శించారు. పెనుగొండలో జరిగిన సభలో చంద్రబాబుపై ఘాటువిమర్శలు చేశారు. 2050లో అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని చెబుతున్నారని జగన్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమే చంద్రబాబు నిత్యం ఆలోచిస్తారని జగన్‌ అన్నారు. ఏపీని దేశంలోనే నంబర్‌వన్‌ రాష్ట్రంగా మారుస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిలో నంబర్‌వన్‌గా నిలిపారని విమర్శించారు. 

గత నాలుగేళ్ల చంద్రబాబు పాలన అంతా ప్రజలను మోసం చేయడం, మభ్యపెట్టడంతోనే సరిపోయిదని జగన్‌ అన్నారు. మాట్లాడుతూ...  2050లో ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని అంటున్నారని జగన్‌ ఎద్దేవా చేశారు. 2050వరకు రాష్ట్రాన్ని దోచుకోవాలన్నదే చంద్రబాబు ఉద్దేశమా అని జగన్‌ ప్రశ్నించారు. దనార్జనే ధ్యేయంగా చంద్రబాబుపాలన కొనసాగుతోందని జగన్‌ ఆరోపించారు. 

10:58 - June 4, 2018

విజయభాస్కర్ దర్శకత్వంలో వెంకటేశ్ నటించిన సినిమా నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు మాటల రచయితగా పనిచేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేశ్ కాంబినేషన్ లో తొలి సినిమా రాబోతోంది. మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్ డైలాగ్స్ ఎంతటి ప్రాచుర్యం పొందాయో చెప్పనక్కరలేదు. ఇక వెంకీ కుటుంబ కథా సినిమాల హీరో. వెంకటేశ్ కామెడీ టైమింగ్ గురించి హిట్ అయిన వెంకీ సినిమాలు చెప్తాయి. ఈ క్రమంలో వీరిద్దరి కాంబినేషన్ అంటే సినిమా పరిశ్రమలోను, ఇటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. పంచ్ డైలాగ్స్ తో త్రివిక్రమ్..టైమింగ్ తో వెంకీ నటనలతో ఇటు అభిమానులకు, ప్రేక్షకులకు నయనానందం..శ్రవణానందం కూడా కలుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో 'అరవింద సమేత..' చిత్రాన్ని చేస్తున్న త్రివిక్రమ్ ఆ తర్వాత వచ్చే జనవరి నుంచి వెంకీతో చిత్రాన్ని చేస్తాడట.

మరోసారి వాయిదా పడనున్న 'టాక్సీవాలా' ?
విజయ్ దేవరకొండ నటిస్తున్న 'టాక్సీవాలా' చిత్రం మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. గత నెలలో విడుదల కావలసిన ఈ చిత్రాన్ని ఇప్పటికే ఈ నెలకు వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ మరికొంత కాలం వాయిదా పడచ్చని అంటున్నారు. సినిమాకు మరిన్ని మెరుగులు దిద్దవలసి రావడం వల్ల ఆలస్యం అవుతోందట.  

10:51 - June 4, 2018

ప.గో : కొయ్యలగూడెం మండలంలో విషాదం నెలకొంది. పెళ్లైన మూడు నెలలకే దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప.గో జిల్లా కొయ్యలగూడెం మండలం చొప్పరామన్నగూడెంకు చెందిన విజయరాజు, హైదరాబాద్ కు చెందిన ప్రియాంకలు మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. చొప్పరామన్నగూడెంలోనే ఉందామని విజయరాజు అనగా... హైదరాబాద్ లో ఉందామని ప్రియాంక అంటుంది. ఇదే విషయంపై ఇరువురి మధ్య గొడవ జరుగుతుండేదని స్థానికులు అంటున్నారు. అయితే కాపురం ఎక్కడ పెట్టాలన్న విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఇంట్లోని ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 

 

జంప్ జిలానీల నేపథ్యంలో 144 సెక్షన్ ..

కడప : వైసీపీలో గెలిచి..టీడీపీలో కొనసాగుతున్న ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరుల్లోని ముగ్గురు వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారు. దీంతో మరో వర్గం వారు దాడికి దిగడంతో పెద్దదండ్లూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన ముగ్గురు స్థానిక నేతలు గతంలో ఆదినారాయణరెడ్డితో కలసి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. తాజా వారు తిరిగి వైసీపీలోకి వెళ్లాలనుకున్నారు. విషయం తెలుసుకున్న ఆదినారాయణరెడ్డి వర్గం వారిపై దాడికి దిగింది. సమచారం అందుకున్న పోలీసులుసంఘటనాస్థలికి చేరుకుని రెండు వర్గాలనూ చెదరగొట్టారు.

10:37 - June 4, 2018

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్ లో నేడు, రేపు అన్ని రాష్ట్రాల గవర్నర్ల సదస్సు జరుగనుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఈ సదస్సు జరుగనుది. లెఫ్ట్ నెంట్ గవర్నర్లు కూడా సదస్సులో పాల్గొననున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ హాజరుకానున్నారు. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ లు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీ చేరుకున్నారు. దేశ అభివృద్ధి, పథకాలు, విద్యా ప్రమాణాలు, అంతర్గత భద్రతా
విషయాలపై చర్చించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే..వర్షాలట..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 7వ తేదీ వరకూ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నామని, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో పిడుగులు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలియజేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, పిడుగులు పడే అవకాశాలు కూడా వున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

15 పైసలు తగ్గిన పెట్రోల్ ధర..

ఢిల్లీ : 'పెట్రో' ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో తగ్గుముఖం పట్టాయి. నేడు వరుసగా ఆరో రోజూ పెట్రోలు ధర తగ్గింది. పెట్రోలు ధరను 15 పైసలు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. నిన్న డీజెల్ ధరను సవరించని ఓఎంసీలు, నేడు మాత్రం డీజెల్ ధరను 14 పైసల మేరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. తాజా ధరల వివరాలు పరిశీలిస్తే, పెట్రోలు ధర లీటరుకు ఢిల్లీలో రూ. 77.96, కోల్ కతాలో రూ. 80.60, ముంబైలో రూ. 85.77, చెన్నైలో రూ. 80.94గా ఉండగా, హైదరాబాద్ లో రూ. 82.59గా ఉంది. ఇదే సమయంలో డీజెల్ ధర ఢిల్లీలో రూ. 68.97, కోల్ కతాలో రూ.

మూడు నెలలకే నవ దంపతుల ఆత్మహత్య..

పశ్చిమగోదావరి : కొయ్యలగూడెంలో మండలంలో ఓ నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించి వివాహం చేసుకున్న యువతీ యువకులు ఆవేశంతోను, అవగాహన లోపంతోను ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న విజయరాజు, ప్రియాంకలిద్దరు అతికొద్ది కాలంలోను ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడు నెలల క్రితం వివాహం చేసుకున్న వీరిద్దరు కొత్త కాపురం ఎక్కడ పెట్టాలనే అనే విషయంపై ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఆత్మహత్యకు దారి తీసింది.

నేడు రాంవిలాస్ పాశ్వాన్ తో మంత్రి ఈటల సమావేశం

ఢిల్లీ : నేడు కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తో మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి బకాయిలను విడుదల చేయాలని ఈటల కోరనున్నారు. 

 

పద్దదండ్లూరులో ఉద్రిక్తత..144 సెక్షన్..

కడప : జమ్మలమడుగు మండంలం పద్దదండ్లూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జమ్మలమడుగు పరిసర ప్రాంతాలలో ఈ నెల 6వ తేదీ వరకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. జమ్మలమడుగు, సుగుమంచిపల్లె, పెద్దదండ్లూరులో పోలీసులు భారీగా మోహరించారు. నిన్న పెద్ద దండ్లూరులో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ ను విధించారు. ఎంపీ అవినాష్ రెడ్డిని ఇంటికి ఆహ్వానించిన సంజీవరెడ్డి అనే వ్యక్తి ఇంటిని మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు ధ్వంసం చేశారు. టిడిపి నేత రామ సుబ్బారెడ్డి వర్గీయుల ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. 

సికింద్రాబాద్ వినాయకుడి ఆలయంలో ఆన్ లైన్ సేవలు

హైదరాబాద్ : సికింద్రాబాద్ వినాయకుడి ఆలయంలో ఆన్ లైన్ సేవలు అందనున్నాయి. ఆన్ లైన్ విధానాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆన్ లైన్ విధానాన్ని ప్రారంభించారు. 

 

నేడు రైతుబీమా పథకంపై ఎల్ ఐసీతో ప్రభుత్వం ఒప్పందం

హైదరాబాద్ : రైతు బీమా పథకంపై నేడు ఎల్ ఐసీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. కేసీఆర్ సమక్షంలో వ్యవసాయశాఖ ఒప్పందం చేసుకోనుంది. 

నేడు అన్ని రాష్ట్రాల అటవీశాఖ మంత్రుల సదస్సు

ఢిల్లీ : ఉదయం 10 గంటలకు విజ్ఞాన్ భవన్ లో అన్ని రాష్ట్రాల అటవీశాఖ మంత్రుల సదస్సు ప్రారంభం కానుంది. ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి హర్షవర్ధన్ హాజరుకానున్నారు. తెలంగాణ, ఏపీ మంత్రులు జోగు, శిద్ధా హాజరవ్వనున్నారు.

15 పైసలు తగ్గిన పెట్రోల్ ధర..

ఢిల్లీ : 'పెట్రో' ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో తగ్గుముఖం పట్టాయి. నేడు వరుసగా ఆరో రోజూ పెట్రోలు ధర తగ్గింది. పెట్రోలు ధరను 15 పైసలు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. నిన్న డీజెల్ ధరను సవరించని ఓఎంసీలు, నేడు మాత్రం డీజెల్ ధరను 14 పైసల మేరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. తాజా ధరల వివరాలు పరిశీలిస్తే, పెట్రోలు ధర లీటరుకు ఢిల్లీలో రూ. 77.96, కోల్ కతాలో రూ. 80.60, ముంబైలో రూ. 85.77, చెన్నైలో రూ. 80.94గా ఉండగా, హైదరాబాద్ లో రూ. 82.59గా ఉంది. ఇదే సమయంలో డీజెల్ ధర ఢిల్లీలో రూ. 68.97, కోల్ కతాలో రూ.

నేడు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

విజయనగరం : నేడు సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్నారు. నేడు లక్కవరపుకోట మండలం జమ్మాదేవపేట ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. 

 

తెలంగాణలో నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లమెంటరీ పరీక్షలు

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి ఈనెల 19 వరకు టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. 

 

వివాహం జరిగిన మూడు నెలలకే దంపతుల ఆత్మహత్య..

పశ్చిమగోదావరి : కొయ్యలగూడెంలో మండలంలో ఓ నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించి వివాహం చేసుకున్న యువతీ యువకులు ఆవేశంతోను, అవగాహన లోపంతోను ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న విజయరాజు, ప్రియాంకలిద్దరు అతికొద్ది కాలంలోను ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడు నెలల క్రితం వివాహం చేసుకున్న వీరిద్దరు కొత్త కాపురం ఎక్కడ పెట్టాలనే అనే విషయంపై ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఆత్మహత్యకు దారి తీసింది.

10:17 - June 4, 2018

సూర్యపేట : కోదాడ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భార్య సౌజన్య, మరదలు మాధురితో కలిసి సత్యనారాయణ కారులో హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వెళ్తున్నారు. మార్గంమధ్యలో సూర్యపేట జిల్లా కోదాడ జాతీయ రహదారిపై వేగంగా వె ళ్తున్న కారు ఆగివున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ, మాధురి అక్కడికక్కడే మృతి చెందారు. సౌజన్య, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

Don't Miss