Activities calendar

05 June 2018

21:46 - June 5, 2018

హైదరాబాద్ : భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యంగా పెరిగే వాతావరణాన్ని సమకూర్చడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. హరితహారం కార్యక్రమం ఇందులో భాగంగా చేపట్టిందేనని అన్నారు. కార్బన్‌ ఉద్గారాల తగ్గింపు కోసం.. దశలవారీగా ఎలెక్ట్రికల్‌ వాహనాలు ప్రవేశపెడుతున్నామని తెలిపారు. 

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పర్యావరణ ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు. పౌరులందరూ పర్యావరణ ప్రాధాన్యతను గుర్తించాలని.. వీలైనంత వరకు కాలుష్య కారకాల వినియోగాన్ని నిలిపివేయాలని సూచించారు. ఈ సంవత్సరం.. ప్లాస్టిక్‌ వినియోగం వల్ల పొంచివున్న ముప్పును గురించి ఐక్యరాజ్యసమితి ప్రచారం చేస్తోందని, ప్లాస్టిక్‌ వినియోగం ద్వారా తలెత్తే దుష్పరిణామాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తొలి నాళ్లలోనే పచ్చదనం, పరిశుభ్రత ప్రాధాన్యతలను తమ ప్రభుత్వం గుర్తించిందనీ.. అందులో భాగంగానే... హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిందనీ ముఖ్యమంత్రి గుర్తు చేశారు. దాని ఫలితాలు ఇప్పుడు ప్రజలకు అందుతున్నాయని సీఎం చెప్పారు. వచ్చే జులైలో నాలుగో విడత హరితహారంలో ప్రతిఒక్కరూ పాల్గొని, నాటిన ప్రతి మొక్కా బతికేలా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
కాలుష్యరహిత వాతావరణం కల్పిస్తామన్న సీఎం

ప్రతి ఒక్కరికీ కాలుష్యరహిత వాతావరణ, స్వచ్ఛమైన నీరు, ఆహారం అందించే కర్తవ్యంతో పనిచేస్తున్నామని కేసీఆర్‌ తెలిపారు. పర్యావరణం కోసం అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు, రహదారి వనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్బన్‌ ఉద్గారాలను తగ్గించేందుకు దశలవారీగా ఎలెక్ట్రికల్‌ వాహనాలను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. 

బాలికా విద్యను ఎలా ప్రోత్సహించాలనే అంశాన్ని పరిశీలించాం : కడియం

ఢిల్లీ : భారతదేశంలో బాలికా విద్యను ఎలా ప్రోత్సహించాలనే అంశాన్ని పరిశీలించామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టడానికి విద్యావకాశాలు ఎలా తోడ్పడుతాయనే అంశాలు కేంద్రమంత్రి జవదేకర్ కు వివరించామని తెలిపారు. 

20:41 - June 5, 2018

అగ్రిగోల్డ్‌ కేసులో మరో కొత్త మలుపు తిరిగింది. హైకోర్టులో అగ్రిగోల్డ్‌ కేసుపై విచారణ జరిగింది. ఆస్తులను కొనుగోలు చేసేందుకు జీఎస్ ఎల్ గ్రూప్ మళ్లీ ముందుకొచ్చింది. గతంలో కొనుగోలు చేయలేమని దాఖలు చేసిన పిటిషన్ ను జీఎస్ ఎల్ గ్రూప్ వెనక్కి తీసుకుంది. ఇదే అంశంపై నిర్వహించిన విశ్లేషణ కార్యక్రమంలో ముప్పాల నాగేశ్వర్ పాల్గొని, మాట్లాడారు. లక్షల కుటుంబాలు ఆర్తనాదాలతో ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

20:28 - June 5, 2018

రైతు బీమా పత్కం ఎన్క కొన్ని నిజాలు..అక్కెరకొస్తదా..? జీవి దీస్తదా తెల్వదాయే, తెలంగాణ కాంగ్రెస్ల పుట్టిన రెడ్ల పంచాది..పదవుల కోసం మళ్లొక డ్రామాలెక్కుంది, పవన్ కళ్యాణ్ ఎందుకు తిడ్తుండో తెల్వది..తిట్టకపోతె మెచ్చుకుంటరా చంద్రాలు నిన్ను, ఆర్టీసీ సమ్మె అసలైన న్యాయం కోసమేనా?..టీఆర్ఎస్ సంఘం మీద కొందరి అనుమానం, అంబేద్కర్ను అవమానించిన చౌదరి గారు..అరెస్టు జేయాలని బహుజనుల డిమాండ్, ఐటీఐ సద్విండు తుపాకి తయ్యారు జేశిండు.. టెస్టు జేశిండని పోలీసోళ్లు అరెస్టు జేశిండ్రు..ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

ప్రకాశ్ జవడేకర్ ను కలిసిన కడియం శ్రీహరి, టీఆర్ ఎస్ ఎంపీలు

ఢిల్లీ : కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఆర్ ఎస్ ఎంపీలు కలిశారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ చైర్మన్ గా కడియం శ్రీహరిని నియమించారు. దేశవ్యాప్తంగా బాలికల విద్యను ప్రోత్సహించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కమిటీని నియమించారు.

20:05 - June 5, 2018

ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ, వైసీపీ మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నేతలు సరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. స్పీకర్ కు వైపీపీ ఎంపీలు రాజీనామాలు ఇచ్చారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ నేత లంక దినకర్, వైసీపీ నేత కిలారి రోశయ్య పాల్గొని, మాట్లాడారు. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం మానుకోవాలన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వంపై ఐక్యంగా పోరాడాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

19:54 - June 5, 2018

ప.గో : ఇంజనీరింగ్ ఫీజు లక్షకు పైగా ఉందని... ప్రభుత్వమిచ్చే ఫీజు రియింబర్స్ మెంట్ 30 నుంచి 35 వేల రూపాయలని..విద్యార్థులు చదువులను ఎలా కొనసాగిస్తారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా తణుకులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్ ఫీజు లక్షకు పైగా ఉంది...కానీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం 30 నుంచి 35 వేల రూపాయలని... మిగిలిన 65 వేలను తల్లిదండ్రులు కట్టాల్సివస్తుందన్నారు. ఇంజనీరింగ్ అయ్యేలోపు మూడు లక్షలు చెల్లించాల్సివస్తుందన్నారు. లక్షల్లో ఫీజులు కట్టలేక మధ్యలోనే విద్యార్థులు చదువులు మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

19:20 - June 5, 2018

కర్నూలు : ఆలూరు నియోజకవర్గంలోని చింతకుంట గ్రామలో మంచినీటి ఎద్దడి తీవ్రమైంది. గ్రామంలో నీరు నిల్వ చేసేందుకు చెరువు ఉన్నా తాగడానికి  గుక్కెడు నీళ్లు అందడంలేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా అధికారులు పట్టించుకోవడంలేదంటున్నారు. చింతకుంటలో మంచినీటి సమస్యలపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

19:14 - June 5, 2018

విజయవాడ : ఆరోగ్యం కాపాడుకోవాలంటే నేటి సమాజంలో ప్రతిఒక్కరికి ఈత ఎంతో అవసరమని సోనోవిజన్ ప్రొప్రైటర్ మూర్తి అన్నారు. ఈ మేరకు ప్రకాశం బ్యారేజి సమీపంలోని కృష్ణానదిలో ఆక్వా డెవిల్స్ ఆధ్వర్యంలో ఈతల పోటీలు నిర్వహించారు. ఉదయం 6 గంటలనుంచి 9 గంటల వరకు దాదాపు నాలుగు గంటల పాటు నీటిలో తేలియాడుతూ ఈత కొడుతూ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో యువకుల నుంచి వృద్ధులు కూడా పెద్ద ఎత్తున  పాల్గొన్నారు.

 

19:11 - June 5, 2018

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను సొంత నియోజకవర్గంలో చుక్కెదురైంది. ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు వచ్చిన రసమయి బాలకిషన్‌ను మహిళలు ఖాళీ బిందెలతో అడ్డుకున్నారు. తమ ప్రాంతంలో తాగునీరు సమస్యను పరిష్కరించాలని మహిళలు, యువకులు ఎమ్మెల్యేను నిలదీశారు. దాదాపు 40 నిమిషాలపాటు ఎమ్మెల్యేను కదలనీయకుండా అడ్డుకున్నారు. ఇదిలావుంటే... ఈ ఘటనను సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన స్థానిక వార్డు మెంబర్‌ను ఎమ్మెల్యే అనుచరులు బెదిరించడమే కాకుండా.. బలవంతంగా డిలీట్‌ చేయించారు. 

 

19:08 - June 5, 2018

ఢిల్లీ : పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు వ్యతిరేకంగా ఈ నెల 20న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి తెలిపారు. నాలుగు సంవత్సరాల మోదీ దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా ఆగష్టు 1 నుండి 14వ వరకు ప్రచారం ప్రచారం నిర్వహిస్తామన్నారు. మోదీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక ప్రభుత్వమని, రైతులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్నారని విమర్శించారు. 

 

19:02 - June 5, 2018

విశాఖ : ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ జిల్లా అరకు లోయలో పర్యటించారు. డుంబ్రిగుడా మండలం పోతంగి గ్రామాన్ని సందర్శించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆంత్రాక్స్‌ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆ ప్రాంతంలోని తాగు నీటి సమస్య గురించి తెలుసుకొని నీటి శాంపిల్స్‌ను టెస్టింగ్‌కు పంపించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

 

18:59 - June 5, 2018

చదువుల ఒత్తిడి మరో విద్యార్థిని చిదిమేసింది. నీట్‌లో మార్కులు తక్కువ వచ్చాయన్న వేదనతో.. ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఏడంతస్తుల భవంతిపైనుంచి దూకి.. ఆత్మహత్య చేసుకుంది. ఇదే అంశంపై నిర్వహించిన విశ్లేషణ కార్యక్రమంలో బాబు గోగినేని పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:51 - June 5, 2018

హైదరాబాద్ : చదువుల ఒత్తిడి మరో విద్యార్థిని చిదిమేసింది. నీట్‌లో మార్కులు తక్కువ వచ్చాయన్న వేదనతో.. ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఏడంతస్తుల భవంతిపైనుంచి దూకి.. ఆత్మహత్య చేసుకుంది. 

హైదరాబాద్‌లో.. మరో విద్యాకుసుమం రాలిపోయింది. ర్యాంకుల వేటలో వెనుకబడి.. అర్ధంతరంగా తనువును ముగించేసింది. బర్కత్‌పురకు చెందిన పద్దెనిమిదేళ్ల యువతి జస్లిన్‌కౌర్‌.. ఆబిడ్స్‌లోని ఏడంతస్తుల భవనంపై నుంచి దూకి.. బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. 

వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌లో.. అర్హత సాధించక పోవడంతో.. జస్లిన్‌కౌర్‌ తీవ్ర మనస్తాపానికి గురైంది. సోమవారం మొత్తం ముభావంగానే ఉండిపోయింది. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను సముదాయించారు. అయితే.. వేదన నుంచి బయటపడలేక.. జస్లిన్‌.. మంగళవారం ఉదయం.. హోండా యాక్టివాపై ఆబిడ్స్‌కు చేరుకుంది.  అక్కడి మయూరి కాంప్లెక్స్‌ చేరుకుని.. మెట్లు ఎక్కుతూ భవనం పైభాగానికి చేరుకుంది. 

భవనం పైఅంతస్తుపై నిలిచిన జస్లిస్‌కౌర్‌ని చూసి.. పరిసరాల్లోని వారు గట్టిగా కేకలు వేస్తూ.. ఆమెను ఆపే ప్రయత్నం చేశారు. అయితే.. అవేవీ పట్టించుకోకుండా.. జస్లిన్‌కౌర్‌.. పైనుంచి ఒక్క ఉదుటన దూకేసింది. శరీరం నేలను తాకడంతోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. 

ఘటన గురించి తెలియగానే.. పోలీస్‌, క్లూస్‌ టీమ్‌ అక్కడికి చేరుకుని.. దర్యాప్తు ప్రారంభించారు. హోండా యాక్టివా నెంబర్‌ ఆధారంగా.. మృతి మిస్టరీని ఛేదించారు.  మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మొత్తానికి చదువుల ఒత్తిళ్లకు మరో అమ్మాయి బలికావడం విషాదకరం. 

18:44 - June 5, 2018

కర్నూలు : ప్రాజెక్టుల ఏర్పాటు కోసం కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఈనెల 11న కలెక్టరేట్‌ ముట్టడిస్తామని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి.. వలసలను నివారించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ.. రైతులు నాలుగు ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

18:39 - June 5, 2018

జయశంకర్‌ భూపాలపల్లి : పోడు భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అమాయక గిరిజనుల పై అటవీశాఖ అధికారులు దాడిచేసి చితక బాదిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. మహాముత్తారం మండలం రెడ్డిపల్లిలో గర్బిణీలు, చిన్నారులు అని చూడకుండా ఫారెస్ట్‌ అధికారులు దాడులు చేశారు. అటవీశాఖ అధికారుల తీరును గిరిజన సంఘాలు ఖండించాయి. మరోవైపు న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే తమనే నిర్బంధించారని గిరిజనులు వాపోతున్నారు. న్యాయపోరాటం చేస్తున్న గిరిజనులు తమకు ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళనలో ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

18:36 - June 5, 2018

హైదరాబాద్ : ఈనెల 11 నుంచి తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలకు సమ్మెకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో... కార్మికశాఖ కార్మికసంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఈనెల 8న చర్చలకు రావాలని ఆహ్వానించింది. ఇదిలావుంటే సమ్మెను విచ్చిన్నం చేసేందుకు ప్రభుత్వం చర్చల పేరుతో కుట్ర పన్నుతుందని కార్మిక సంఘ నేతలంటున్నారు. సమ్మె ఆగాలంటే వెంటనే వేతన సవరణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

18:31 - June 5, 2018

హైదరాబాద్ : అగ్రిగోల్డ్‌ కేసులో మరో కొత్త మలుపు తిరిగింది. హైకోర్టులో అగ్రిగోల్డ్‌ కేసుపై విచారణ జరిగింది. ఆస్తులను కొనుగోలు చేసేందుకు జీఎస్ ఎల్ గ్రూప్ మళ్లీ ముందుకొచ్చింది. గతంలో కొనుగోలు చేయలేమని దాఖలు చేసిన పిటిషన్ ను జీఎస్ ఎల్ గ్రూప్ వెనక్కి తీసుకుంది. రూ.10 కోట్ల డిపాజిట్‌ను వెనక్కి ఇవ్వాలన్న అభ్యర్థనను జీఎస్ ఎల్ గ్రూప్ వెనక్కి తీసుకుంది. కోర్టు సమయాన్ని వృధా చేసిన జీఎస్‌ఎల్‌పై చర్య తీసుకోవాలని పిటిషనర్‌ కోరారు. జీఎస్‌ఎల్‌పై చర్యలు తీసుకుంటామని కోర్టు తెలిపింది. 10 ఆస్తుల వివరాలను ఏపీ సీఐడీ కోర్టుకు సమర్పించింది. 10 ఆస్తుల విలువ ఎంతో చెప్పాలని అగ్రిగోల్డ్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆస్తుల విక్రయానికి జిల్లాల వారీగా త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు హైకోర్టు ఆమోదం తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 8కి వాయిదా పడింది.

 

18:02 - June 5, 2018

తూ.గో : కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం రాదని...భవిష్యత్ లో గెలవదని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్రంలో టీడీపీ చక్రం తిప్పుతుందని...మనకు కావాల్సిన వారు ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అమలాపురంలో నిర్వహించిన నవ నిర్మాణదీక్షలో బాబు పాల్గొని, మాట్లాడారు. మనకున్న 25 ఎంపీలను గెలిపించి రాష్ట్రానికి జరిగిన అన్యాయం సరిదిద్దుకుని.. న్యాయం చేసుకోవాలన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అడుగడుగునా అడ్డుపడుతుతూ.. కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం భయపెడితే...భయపడేందుకు సిద్ధంగా లేమన్నారు. పోలవరానికి ఇంకా 3500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సివుందని..ఇవ్వడం లేదని వాపోయారు. విశాఖ రైల్వే జోన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. విశాఖలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్న హామీని కేంద్రం విస్మరించిందన్నారు. ఏపీకి 16 వేల కోట్ల లోట్ బడ్జెట్ ఉండగా కేంద్రం 3900 కోట్లు మాత్రమే ఇచ్చిందని పేర్కొన్నారు. డిమానిటైజేషన్ తో ప్రజలను ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఇప్పటికీ బ్యాంకుల్లో, ఏటీఎంల్లో డబ్బులు లేవన్నారు. జీఎస్టీ ఒక పద్ధతి ప్రకారం అమలు చేయలేదని చెప్పారు. పెట్రోల్, డీజీల్ ధరలను రకరకాలుగా పెంచారని మండిపడ్డారు. ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. మనకు అన్యాయం చేసినవారికి గుణపాఠం చెప్పాలని తెలుగువారందరికీ పిలుపునిచ్చానని తెలిపారు. కర్నాటకలో తెలుగువారు స్పదించారని.. అందుకే అక్కడ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందన్నారు. ఏపీకి అన్యాయం చేసినవారి తరపున వైసీపీ ప్రచారం చేసిందన్నారు. బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కలిసిపోయారని చెప్పారు. తనపై ఇష్టనుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను బీజేపీతో విభేదించిన తర్వాత తనపై, పార్టీపై, ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కుట్రలు, కుతంత్రాలు పరాకాష్టకు చేరుకున్నాయన్నారు. రైతులకు గిట్టుబాట ధర లేదని...మరోవైపు ఇండస్ట్రీ దెబ్బతింటుందని వాపోయారు. పిల్లలకు ఉద్యోగాలేవన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశామన్నారు. అన్నా క్యాంటీను ద్వారా సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామన్నారు. వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ చేశామని..రాష్ట్రంలో ఓడీఎఫ్ ను సాధించామన్నారు. తనపై నక్సలైట్లు మైనింగ్ పేల్చి హత్యా ప్రయత్నం చేస్తే వెంకటేశ్వరస్వామి కాపాడారని తెలిపారు.  

 

అవినీతిని నిరూపిస్తే ప్రాణత్యాగానికి సిద్ధం : టీటీడీ మాజీ జేఈవో

అమరావతి : తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని టీటీడీ మాజీ జేఈవో బాలసుబ్రహ్మణ్యం అన్నారు. నెల్లూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తొమ్మిదిన్నరేళ్లు టీటీడీ జేఈవోగా పని చేశానని, పదిహేనేళ్ల పాటు దైవ సేవలో ఉన్నానని, రూపాయి ఆశించకుండా స్వామి వారి సేవ చేశానని అన్నారు. రాజకీయ, వ్యక్తిగత లబ్ది కోసం దేవుడి పేరును వినియోగించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మిరాశీ వ్యవస్థ రాజ్యాంగానికి వ్యతిరేకమని, వెయ్యికాళ్ల మండపాన్ని తొలగించవద్దని అప్పట్లో అధికారులకు తాను చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.

అగ్రిగోల్డ్ కేసులో మరో మలుపు..

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసులో మరో మలుపు తిరిగింది. ఈ కేసుపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుకు జీఎస్ఎల్ గ్రూప్ ముందుకొచ్చింది. గతంలో దాఖలు చేసిన పిటీషన్ ను జీఎస్ఎల్ గ్రూప్ ఉపసంహరించుకుంది. దీంతో 10 ఆస్తుల వివరాలను ఏసీ సీఐడీ హైకోర్టుకు సమర్పించింది. ఆస్తుల విలువ చెప్పాలని అగ్రిగోల్డ్ కు హైకోర్టు ఆదేశించింది. అనంతరం తరుపరి విచారణను ఈ నెల 8కి వాయిదావేసింది. 

16:50 - June 5, 2018

తూ.గో : ఒకప్పుడు కాంగ్రెస్ దెయ్యాలు ఫించన్ తీసుకునేవని సీఎం చంద్రబాబు విమర్శించారు. పింఛన్ తీసుకుని కాంగ్రెస్ దెయ్యాలు స్మశానానికి వెళ్లేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ దెయ్యాలు రావని... మళ్లీ కాంగ్రెస్ రూపంలో వైసీపీ దెయ్యాలు రావాలని చూస్తున్నాయిని విమర్శించారు. వాటిని రానివ్వమని తెలిపారు. అమలాపురంలో నిర్వహించిన నవ నిర్మాణదీక్షలో పాల్గొని, సీఎం మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో 14 లక్షల ఇళ్లు కట్టిచ్చినట్లు చూపి.. 4 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. పేదవారి పొట్ట కొట్టారని విమర్శించారు.
రైతులను పూర్తిగా ఆదుకోవాలి..
నీళ్లు ఉన్నాయి... కానీ గిట్టుబాటు ధర లేదన్నారు. రైతులను పూర్తిగా ఆదుకోవాలని.. అండగా ఉండాలన్నారు. లక్షా 50 వేల వరకు రుణమాఫీ చేశామని చెప్పారు. రైతు రుణమాఫీ చేసి.. రైతు రుణం తీర్చకున్నానని అన్నారు. డ్వాక్రా సంఘాలు నా మానసిక పుత్రికలు అని కొనియాడారు. డ్వాక్రా సంఘాలు తాను ఏర్పాటు చేసినవని తెలిపారు. అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికామని చెప్పారు. వెయ్యి రూపాయల పించన్ ఇచ్చిన ఘనత టీడీపీదే అని అన్నారు. వికలాంగులకు 1500 రూపాయాలు ఇస్తున్నామమని చెప్పారు. రాజకీయాలకతీతంగా అర్హులందరికీ పించన్, రేషన్ కార్డులు ఇవ్వాలని ఆదేశాలిచ్చినట్టు పేర్కొన్నారు. 50లక్షల 50 మందికి పించన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టిడిపి అని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఇవ్వలేదన్నారు. పేదవారి కోసం ఐదు కేజీల బియ్యం, చక్కెర, పప్పు పంపిణీ చేశామని తెలిపారు. ముస్లీంలకు రంజాన్ తోఫా ఇస్తున్నామని చెప్పారు. మళ్లీ సంక్రాంతి కానుక ఇస్తామన్నారు. పేదవాడు ఆనందంగా పండుగ చేసుకోవాలని తెలిపారు. పేదవారి ఖర్చులు తగ్గించాలి....ఆదాయం పెంచాలన్నారు. పెళ్లి కానుకకు శ్రీకారం చుట్టామని తెలిపారు. 
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత కరెంట్ 
జగ్జీవన్ జ్యోతి కింద ఎస్సీ, ఎస్టీలకు 75 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. పిల్లల చదువుల కోసం వినూత్నంగా పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలు పెంచామని తెలిపారు. పేదపిల్లలు బాగా చదువుకోవాలని... ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం ఇవ్వాలని ముందుకు పోతున్నామని తెలిపారు. ఎవరెస్టు శిఖరం ఎక్కితే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ సం.5 మంది ఎవరెస్టు శిఖరం ఎక్కారని...వారికి ఒక్కొక్కరికి పది లక్షలు ఇచ్చామని తెలిపారు. పేద పిల్లలు మట్టిలో మాణిక్యాలని.. ప్రపంచాన్ని జయించే శక్తి పేద పిల్లలకు ఉందన్నారు. ప్రతి పేదవారికి సొంతిళ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. 

 

16:32 - June 5, 2018

విజయవాడ : అవినీతిలో ఏపీ రాష్ట్రం ముందుందని ఉందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. ఏ సంస్థ సర్వే చేసినా అవినీతిలో ఏపీ ముందంజలో ఉందని..ఇది లోకేష్, చంద్రబాబు ఘనతేనని ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. నీతి నిజాయితీ గురించి మాట్లాడే లోకేష్, చంద్రబాబు తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ఏ విధంగా కొనుక్కున్నారని నిలదీశారు. ఎమ్మెల్యేల చేత రిజైన్ చేయించకుండా... వారికి మంత్రి పదువులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఓటుకునోటు కేసులో డబ్బు సూట్ కేసుతో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని..చంద్రబాబు వాయిస్ రికార్డు ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరి కడుపుకొట్టి ఆ డబ్బులు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. 'మా గురించి మాట్లాడే ముందు మీ పరిస్థితి చూసుకోవాలి' అని అన్నారు. చీప్ పబ్లిసిటీ స్టంట్స్ మానుకోవాలని హితవు పలికారు. ప్రత్యేకహోదా సాధనకు జగన్ శక్తి వంచన లేకుండా చిత్తశుద్ధితో పని చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఎంపీ పదవులకు రాజీమానాలు చేశామని చెప్పారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా పత్రాలను ఇచ్చామన్నారు. తమకు తెలుగుదేశం సర్టిఫికేట్లు అవసరం లేదని..ప్రజల సర్టిఫికేట్లు అవసరమన్నారు. పదువులున్నా.. లేకున్నా ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తామని చెప్పారు. 

 

రేపు కన్నడ కేబినెట్ విస్తరణ..

కర్ణాటక : ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు కుమారస్వామి మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ విస్తరించనున్నారు. జూన్ 1న జరిగిన ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ కు 22, జేడీఎస్ కు 12 మంత్రి పదవులు దక్కనున్నాయి. హోమ్, ఇరిగేషన్, హెల్త్, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖలు కాంగ్రెస్ కు దక్కనున్నాయి. ఫైనాన్స్, ఎక్సైజ్, పబ్లిక్ వర్క్, విద్య, టూరిజం, రవాణా శాఖలను తీసుకోవడానికి జేడీఎస్ సమ్మతించింది.

 

పేదవాడికి స్వంత ఇల్లు వుండాలి : చంద్రబాబు

తూర్పుగోదావరి : అమలాపురంలో ఏర్పాటు చేసిన నవ నిర్మాణదీక్షలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతు..ప్రతీ పేదవాడికి  స్వంత ఇల్లు వుండాలనే ఉద్ధేశ్యంతో ఇల్లు కట్టించే బాధ్యత తీసుకున్నామనీ..ఇప్పటికే 19లక్షల నిర్మాణం చేపట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. తెలిపారు. వికలాంగులకు రూ.1500 ఫించనుగా ఇస్తున్నామనీ..రాజకీయాలకు అతీతంగా అర్హులకు పింఛన్లు, రేషన్ కార్డులను పంపిణీ చేశామన్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులకు పెట్టుబడి నిధి కింద రూ.10వేలు ఇచ్చి మహిళా సాధికారతకు పోత్సాహకాలు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 

15:59 - June 5, 2018

హైదరాబాద్ : నీట్ ఎగ్జామ్ లో అర్హత సాధించనందుకు మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. అబిడ్స్‌లోని మయూరి కాంప్లెక్స్‌ పై నుండి దూకి యువతి ఆత్మహత్యకు చేసుకుంది. కాచిగూడకు చెందిన జెస్లీస్ కౌర్ అనే యువతి ఇటీవల నీట్ ఎగ్జామ్ రాసింది. అయితే ఎగ్జామ్ లో యువతి అర్హత సాధించలేదు. దీంతో మనస్తాపం చెందిన జెస్లీస్ కౌర్ స్క్రూటీపై ఆబిడ్స్ కు వెళ్లింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో అబిడ్స్‌లోని మయూరి కాంప్లెక్స్‌ పదో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు యువతిది ఆత్మహత్యాగా తేల్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

భార్య కేసులో శశీ థరూర్ కు సమన్లు..

ముంబై : సునంధ పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటును విచారణకు స్వీకరించిన ఢిల్లీ కోర్టు.. జులై 7న కోర్టుకు రావాల్సిందిగా థరూర్‌కు సమన్లు జారీ చేసింది. అనారోగ్యంతో ఉన్న భార్య పట్ల అమానుషంగా వ్యవహరించినట్లు థరూర్‌పై ఆరోపణలు ఉన్నాయి. చార్జిషీటును మొత్తం పరిశీలించాను. పోలీసులు పెట్టిన ఐపీసీ సెక్షన్ 306, 498 ఎ కేసుల ప్రకారం సునంధ పుష్కర్‌ను థరూర్ ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధించిన నేరాల కింద ఆయనను విచారించాలని నిర్ణయించినట్లు జడ్జి చెప్పారు.

15:49 - June 5, 2018

విశాఖ : నగరంలోని జీవీఎంసీ కార్యాలయం వద్ద సీఐటీయు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు ఆందోళన చేపట్టారు. జీవో నెంబర్‌ 279ను రద్దు చేసి 151 జీవోను అమలు చేయాలంటూ.. ఆందోళన నిర్వహించారు... జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడించిన ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

15:46 - June 5, 2018

అనంతపురం : జిల్లా హిందూపురం మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. జీవో నంబర్‌ 279 ను రద్దు చేసి 151 జీవోను వెంటనే అమలు చేయాలని డిమండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కార్మికులు యత్నించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో పోలీసులకు ఆందోళన కారులకు మధ్య తోపులాట జరిగింది. కొంత మంది ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ సీఐటీయూ నేతలు పోలీస్‌స్టేషన్‌ ముందు ధర్నాకు దిగారు. 

 

ఎన్ని కష్టాలున్నా సంక్షేమ పథాకాలు అమలు : చంద్రబాబు

తూర్పుగోదావరి : జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా అమలాపురంలో ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు మాట్లాడుతు.. విభజన నేపథ్యంలో రాష్ట్రంలో అనేక సమస్యలున్నాగానీ..రైతులకు రుణమాఫీని చేశామన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా సంక్షేమపథకాలను కొనసాగిస్తున్నామన్నారు. రూ.లక్షన్నర వరకు రైతుల రుణమాఫీ చేసి రైతుల రుణం తీసుకున్నానన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా..గానీ తెలుగింటి ఆడబిడ్డలకు పెళ్లికానుక కింద ఆడపిల్లల తల్లిదండ్రులకు అండగా నిలిచామన్నారు. వేల కోట్ల రూపాయలకు ఖర్చు చేసి 'పోస్ట్ మెట్రిక్ ఉపకార' వేతనాన్ని ప్రారంభించనున్నామని చంద్రబాబు తెలిపారు.

15:42 - June 5, 2018

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. సిట్‌ బృందానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్‌ వేసే అర్హతలేదని అనుమానితుల తరపు న్యాయవాది పేర్కొన్నారు. కేసులో అనుమానితులను గతంలోనే నిర్దోషులుగా ప్రకటించిన సిట్‌ వారిపై నార్కో ఎనాలసిస్‌ టెస్ట్‌ చట్ట వ్యతిరేకమని వాదించారు. సిట్‌ వేసిన పిటిషన్‌ చట్టబద్ధం కాదన్న న్యాయవాది వెంకటేశ్వర శర్మ ఈ పిటిషన్‌పై కోర్టులో బలంగా వాదనలు వినిపిస్తామన్నారు. ఈ విషయంపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం.. 

నీట్ పరీక్షలో అర్హత సాధించలేదని ఆత్మహత్య..

హైదరాబాద్ : అబిడ్స్ లో వున్న మయూరి కాంప్లెక్స్ 5వ అంతస్థు పైనుండి దూకి మృతి చెందిన యువతిది ఆత్మహత్య అని పోలీసులు దృవీకరించారు. నీట్ పరీక్షలో అర్హత సాధించలేదనే మనస్తాపంతో యువతి పేరు జెస్లీస్ కౌర్ అని ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ధృవీకరించారు. కాగా జెస్లీస్ కాచిగూడ వాసిగా కూడా గుర్తించారు. మయూరి కాంప్లెక్స్ పై నుండి ఓ యువతి దూకి మృతి చెందిందనే సమాచారంతో సంఘనాస్థలికి చేరుకున్న పోలీసులు మొదట అనుమానాస్పందగా కేసు నమోదు చేసుకున్నారు.

14:59 - June 5, 2018

హైదరాబాద్‌ : అబిడ్స్‌లోని మయూరి కాంప్లెక్స్‌ పై నుండి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కాంప్లెక్స్‌ పదో అంతస్థు పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యువతిది ఆత్మహత్యా..? లేక హత్యా..? అనే కోణంలో దర్యాప్తు
చేస్తున్నారు. 

'కాలా' విషయంలో జోక్యం చేసుకోం : హైకోర్టు

కర్ణాటక : విడుదలకు సిద్ధమైన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 'కాలా' సినిమాకు కర్ణాటకలో కష్టాలు తప్పేలా లేవు. ఆ రాష్ట్రంలో 'కాలా' విడుదలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ సినిమా యూనిట్‌ కర్ణాటక హై కోర్టును ఆశ్రయించింది. ఈరోజు వారి పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు 'కాలా' సినిమా నిషేధంపై తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. కాగా ఈ సినిమా ప్రదర్శనలకు భద్రత కల్పించాలని కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. 

వైసీపీ ఎంపీలకు 'భాస్కర్'అవార్డులివ్వాలి : లోకేశ్

అమరావతి : వైసీపీ ఎంపీల రాజీనామాలపై మంత్రి నారా లోకేశ్‌ ట్విట్టర్ ద్వారా స్పందించారు. రాజీనామాల విషయంలో వైసీపీ ఎంపీలు ఆడుతున్న నాటకానికి భాస్కర్ అవార్డ్స్ ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్‌ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. వారెవ్వా.. బీజేపీతో కుమ్మక్కై ప్రజలను తప్పుదోవ పట్టించి గొప్ప నటన కనబర్చారని, వారి రాజీనామా డ్రామా కథతో "ఏ1 మరియు అర డజన్ దొంగలు" సినిమా తీస్తే బాగుంటుందని మంత్రి లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

14:47 - June 5, 2018

విజయవాడ : వైసీపీ ఎంపీల రాజీనామాలు ఓ డ్రామా అంటూ టిడిపి ఎంపీ కొనకళ్ల నారాయణ కొట్టిపారేశారు. విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఎంపీల రాజీనామాలపై రెండేళ్లుగా జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇదంతా ఓ నాటకమన్నారు. బీజేపితో కుమ్మక్కైన జగన్ ఇమేజ్ పెంచుకోవడానికి పోరాడుతున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. రాజీనామాలు ఆమోదించరని, సంవత్సరం గడుపు దాటిపోయిందో..ఎన్నికలు జరగవని మోడీకి..జగన్ కి..స్పీకర్ కు తెలుసన్నారు. ప్రజలను వంచించే రాజకీయాలు మానుకోవాలన్నారు.

విరిగిపడ్డ కొండ చరియలు,10మంది మృతి..

హైదరాబాద్ : వర్షాకాలం వచ్చిందంటే చాలు కొంతప్రాంతాలలో నివసించేవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుంటారు. లేదా కొండ ప్రాంతాల గుండా ప్రయాణాలు చేయాల్సిన వచ్చినా అదే పరస్థితి వుంటుంది. కుండపోత వర్షాలు భారీగా కురుస్తున్న మిజోరాంలోని లంగ్లి పట్టణంలో కొండచరియలు విరిగిపడి 10మంది ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు అమాంతం ఓ భవనంపై పడడంతో అందులోని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందగానే లంగ్లీ జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌తో పాటు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

వైట్ హౌస్ లో ఇఫ్తార్ విందు..

అమెరికా : ముస్లింలకు పవిత్రమైన రంజాన్‌ మాసం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇఫ్తార్‌ విందు ఇవ్వనున్నారని అధ్యక్ష నివాసం వైట్‌హౌస్‌ వెల్లడించింది. సంప్రదాయాన్ని పక్కనపెట్టి గత ఏడాది ఇఫ్తార్‌ విందు ఇచ్చేందుకు ట్రంప్‌ నిరాకరించారు. అయితే ఈ ఏడాది ఆయన విందు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈరోజు అధ్యక్షుడు ఇఫ్తార్‌ విందు ఇస్తారని వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి లిండ్సే వాల్టర్‌ వెల్లడించారు.

కారు, బస్ ఢీ..ముగ్గురు మృతి..

కడప : బద్వేలు-మైదుకూరు ప్రధాన రహదారిలోని నందిపల్లె వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. గుంటూరు జిల్లా తెనాలి పుడివాడకు చెందిన ముగ్గురు కారులో తిరుపతికి బయలుదేరిన నేపథ్యంలో నందిపల్లె వద్ద రోడ్డు మలుపు వద్ద కారు, ప్రైవేటు బస్సు పరస్పరం ఢీకొన్నాయి. మృతుల్లో ఒకరిని గుంటూరు జిల్లా పుడివాడకు చెందిన కారు డ్రైవర్‌ సాలెం రాజుగా గుర్తించారు. మిగిలిన ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. 

అడవి బిడ్డలతో జనసేనాని..

విశాఖపట్నం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ ఏజెన్సీలోని అరకు, పాడేరు చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాలను సందర్శించారు. డుండ్రిగూడ మండలం పనసపొట్టు గ్రామంలోని గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ కష్టనష్టాలను పవన్ తో గిరిజనులు చెప్పుకున్నారు. కలుషిత నీరు వల్ల తాము జబ్బులపాలు అవుతున్నామని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై వెంటనే స్పందించిన పవన్... నీటి నమూనాలను తీసి, పరీక్షలు చేయించాలని పార్టీ నేతలకు సూచించారు. 

అయేషా మీరా కేసులో మరో ట్విస్ట్..

విజయవాడ : 2007లో జరిగిన అయేషా మీరా హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఆయేషా మీరా హత్య కేసులో పలు కీలక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో మరో మలుపు తిరిగింది. ఈ కేసుపై సిట్ బృందం కోర్టులో పిటీషన్ వేసింది. ఈ నేపథ్యంలో సిట్ బృందానికి చట్టపరంగా కోర్టులో పిటీషన్ వేసే అర్హత లేదంటు అనుమానితుల తరపు న్యాయవాది వెంకటేశ్వర శర్మ వాదిస్తున్నారు. అనుమానితులుగా వున్న వారిపై నార్కో ఎనాలసిస్ టెస్ట్ చట్ట వ్యతిరేకమని అనుమానితుల తరపు న్యాయవాది వాదిస్తున్నారు. కాగా అనుమానితులుగా వున్నవారిని నిర్ధోషులుగా ప్రకటించింది.

యువతి అనుమానాస్పద మృతి..

హైదరాబాద్ : పలు కారణాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో నగరంలోని అబిడ్స్ లో వున్న మయూరి కాంప్లెక్స్ 5వ అంతస్థు పైనుండి ఓ యువతి దూకి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటానా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం యువతి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. 

ఓయూలో అగ్నిప్రమాదం..ఆన్సర్ షీట్స్ దగ్థం..

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో అగ్నిప్రమాదం జరుగగా, పలు పరీక్షల్లో విద్యార్థులు రాసిన ఆన్సర్ షీట్స్ దగ్ధమయ్యాయి. వర్శిటీ పరిధిలోని మానేరు హాస్టల్ వెనుకవైపు ఉన్న పేపర్ స్టోర్ రూమ్ లో 3ఈ ప్రమాదం సంభవించింది. దీంతో పరీక్షల్లో విద్యార్ధులు రాసిన ఆన్సర్ షీట్స్ గద్థమైపోయాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..ఫలితం లేకపోయింది. కాగా ఏ పరీక్షలకు సంబంధించిన పేపర్స్ కాలిపోయాయనే విషయం ఇంకా తెలియరాలేదు. దీంతో పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల్లో ఆందోళన పడుతున్నారు. 

14:32 - June 5, 2018

విజయవాడ : 2007లో జరిగిన అయేషా మీరా హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఆయేషా మీరా హత్య కేసులో పలు కీలక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో మరో మలుపు తిరిగింది. ఈ కేసుపై సిట్ బృందం కోర్టులో పిటీషన్ వేసింది. ఈ నేపథ్యంలో సిట్ బృందానికి చట్టపరంగా కోర్టులో పిటీషన్ వేసే అర్హత లేదంటు అనుమానితుల తరపు న్యాయవాది వెంకటేశ్వర శర్మ వాదిస్తున్నారు. అనుమానితులుగా వున్న వారిపై నార్కో ఎనాలసిస్ టెస్ట్ చట్ట వ్యతిరేకమని అనుమానితుల తరపు న్యాయవాది వాదిస్తున్నారు. కాగా అనుమానితులుగా వున్నవారిని నిర్ధోషులుగా ప్రకటించింది. కాగా సిట్ పిటీషన్ పై కోర్టులో బలంగా తమ వాదనలను వినిపిస్తామని వెంకటేశ్వర శర్మ తెలిపారు. కాగా 2007లో జరిగిన బి.పార్మసి విద్యార్థిని హత్యాచారం కేసు పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

14:30 - June 5, 2018

హైదరాబాద్ : పలు కారణాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో నగరంలోని అబిడ్స్ లో వున్న మయూరి కాంప్లెక్స్ 5వ అంతస్థు పైనుండి ఓ యువతి దూకి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటానా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం యువతి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతం కేసు నమోదు చేసుకుని యువతి ఆత్మహత్యా? లేక హత్యా? అనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు కొంత సమయానికి ముందు..స్కూటీమీద మయూరి కాంప్లెక్స్ కు వచ్చి భవనంలోకి వెళ్లిన సదరు యువతి కొంతసమయానికే ఈ ఘటన జరగటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

14:29 - June 5, 2018

కొమరం భీం : జిల్లాలో ఆదివాసీల ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ కల్మేశ్వర్ నేతృత్వంలో శాంతిభద్రతలను పర్యవేక్షణ కొనసాగుతోంది. రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా.. స్వయం పాలన ప్రకటించుకోవాలని నిర్ణయిస్తూ ఉద్యమం ప్రారంభించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేవరకు ఉధృతంగా ఉద్యమిస్తామంటూ ఆదీవాసీలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల ఏజెన్సీ గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొమరం భీం జిల్లా ఎస్పీ కల్మేశ్వర్ తో టెన్ టివి ముచ్చటించింది. ఆదివాసీల డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళుతామని, జిల్లా స్థాయిలో కొన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతోందన్నారు. 

11:10 - June 5, 2018

చిత్తూరు : మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై చర్యలుంటాయా ? తీసుకుంటే ఎలాంటి చర్యలుంటాయి ? అనే ఉత్కంఠ నెలకొంది. నూతన పాలక మండలి ఏర్పడిన తరువాత రెండో సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మాత్రం ప్రాధాన్యత ఏర్పడింది. గత కొన్ని రోజులుగా మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టిటిడిపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రిటైర్ తరువాత టిటిడి..ప్రభుత్వం గుప్పించిన విమర్శలు తీవ్ర దుమారం రేగాయి. ఆయన చేసిన ఆరోపణలను టిటిడి కొట్టిపారేసింది. తాజాగా మంగళవారం జరుగుతున్న పాలక మండలి భేటీలో రమణ దీక్షితుల వ్యవహారంపై ప్రధానంగా చర్చించనుంది. దీక్షితులపై చర్యలు తీసుకోవాలంటే ఎలా వ్యవహరించాలనే దానిపై కూలకంషంగా చర్చించనున్నట్లు సమాచారం. అంతేగాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు పాలక మండలి ఆమోద ముద్ర వేయనుంది. 

టీటీడీ పాలకమండలి భేటీ..కీలక నిర్ణయాలు?..

తిరుమల : తిరుమల పాలకమండలి భేటీ కానుంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా సమాచారం. మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు వ్యవహారంపై పాలకమండలి చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. రిటైర్ అయిన అనంతరం రమణదీక్షితులు టీటీడీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రమణదీక్షితులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇంతే కాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాకలు కూడా పాలకమండలి ఆమోదం తెలపనుంది.

10:50 - June 5, 2018

విభిన్నమైన కథలను..విలక్షణమైన పాత్రలను ఎంచుకోటంలో రానా స్లైలే వేరు. రానాకు వివిధ భాషల్లో మంచి క్రేజ్ కూడా వుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రానా తన ఇమేజ్ ను నిలబెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటాడు. అటు దర్శక నిర్మాతలకు కూడా రానా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని బహుభాషా చిత్రాలను రూపొందించడానికే ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఇప్పుడు తాజాగా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రానా చిత్రంగా 'హాథీ మేరే సాథీ' చిత్రం రూపొందుతోంది. హిందీతో పాటు తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం రానా బరువు కూడా తగ్గానని ట్విట్టర్ లో చెప్పారు. కాగా ఈ చిత్రం వన్యప్రాణి సంరక్షణ కథాశంగా రూపొందుతున్నట్లుగా సమాచారం. దీంట్లో గజరాజులదే ప్రధాన పాత్రగా కూడా తెలుస్తోంది. దీని కోసం రానా దాదాపు 18 రోజుల పాటు ఏనుగుల మధ్య గడిపాడని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి.

మూడు భాషలకు గాను తెలుగు టైటిల్ 'అరణ్య'..
తెలుగులో ఈ సినిమాకి 'అరణ్య' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో రానా సరసన కథానాయికగా బాలీవుడ్ నటి 'కల్కి కొచ్లిన్' నటిస్తోంది. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను ఆగస్టు నుంచి ప్లాన్ చేశారు. అడవుల్లో ఎక్కువభాగం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా, థియేటర్లకు ఎప్పుడు వస్తుందా అని రానా అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.    

విద్యుత్ ఘాతానికి మరొక రైతు మృతి..

ఖమ్మం : కామేపల్లి మండలం నెమలిపురిలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ ఘాతానికి మరొక రైతు మృతి చెందిన ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. వరి పొలంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీనిని గమనించిని రైతు విద్యుత్ తీగలకు తగలగా విద్యుత్ ఘాతానికి రైతు మృతి చెందాడు. రైతును రక్షించబోయిన మరొకరి పరిస్థితి విషయంగా వున్నట్లుగా తెలుస్తోంది. 

బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్య హౌస్ అరెస్ట్..

తూర్పుగోదావరి : బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇల్లు దాటేందుకు వీల్లేదని చెబుతూ, ఇంటిముందు భారీ ఎత్తున పోలీసులు మోహరించాదరు. దీంతో ఆయన పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించారు. మాలకొండయ్య గృహ నిర్బంధం గురించి తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున ఆయన ఇంటికి వస్తుండటంతో ఈ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మాలకొండయ్యతో పాటు మరికొందరు బీజేపీ నేతలనూ ముందస్తు అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. తెలుస్తోంది.

ముందుస్తు జాగ్రత్తగా బీజేపీ నేతల అరెస్ట్..

తూర్పుగోదావరి : చంద్రబాబు పర్యటన సజావుగా సాగేలా చూసేందుకు భారీ ఎత్తున రంగంలోకి దిగారు. ముందు జాగ్రత్త చర్యగా బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పర్యటించనుండగా, అక్కడి బీజేపీ నేతలు అడ్డుకనేందుకు చూస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీజేపీ ముఖ్య నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 

10:09 - June 5, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసిలో సమ్మె నగారా మోగింది. ఈనెల 11 నుంచి సమ్మె చేసేందుకు గుర్తింపు కార్మిక సంఘం ఆర్టీసీ యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేసింది. ఇతర కార్మిక సంఘాలనూ కలుపుకుని వెళతామని తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ నేతలు ప్రకటించారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సై అంటున్నారు. ఈనెల పదకొండో తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు.. సంస్థ యాజమాన్యానికి నోటీసు అందించారు. సంస్థ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వాల తీరే తమ సమ్మె నిర్ణయానికి కారణమని, గుర్తింపు కార్మిక సంఘం.. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ గడువు ముగిసి 14నెలలు గడిచాయని, ఈ డిమాండ్‌ నెరవేర్చమని కోరితే.. సీఎం స్థాయి వ్యక్తీ హేళనగా, బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారని సమ్మెకు సిద్ధమైన కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వేతన సవరణకు చర్యలు చేపట్టకుండా.. తాము సమ్మెకు వెళ్లేలా ప్రభుత్వమే ఉసిగొల్పిందన్నది కార్మిక సంఘాల ఆరోపణ. మంత్రివర్గ ఉపసంఘంతో పదిమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయిందని వారు చెబుతున్నారు. ఆర్టీసీలో నష్టాలే లేవని, చూపుతున్న నష్టాలకు డీజిల్‌ భారమే కారణమని అంటున్నారు కార్మికులు అదనపు పని చేస్తున్నారని, అన్ని స్థాయుల్లోనూ ఉత్పత్తి పెరగడమే దీనికి నిదర్శనమని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు.

ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ వల్ల.. రాష్ట్ర ఖజానాకు పెద్దగా భారం పడదని, ఇతర రంగాల వారికి ఇస్తున్న వేల కోట్ల సబ్సిడీలో తమకు ఇచ్చేది నామమాత్రమేనని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. అధికారులు సిఎంకు తప్పుడు లెక్కలు చెప్పారని, కార్మిక శాఖ తీరూ దారుణమని వారు ఆరోపిస్తున్నారు. తమ సమ్మెకు ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.

అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని సమ్మెకు వెళతామని టిఎంయూ నేతలు ప్రకటించారు. ఇప్పటికే జెఎసి పేరుతో ప్రధాన కార్మిక సంఘాలు సమ్మెకు సిధ్దమని ప్రకటించిన నేపథ్యంలో గుర్తింపు సంఘం కూడా సమ్మె తేదీని ప్రకటించడంతో ఆర్టీసిలో సమ్మె ఖాయమైంది. ఈనెల పదకొండు వరకు గడువు ఉన్నందున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.

ఢిల్లీకి వైసీపీ ఎంపీలు...

ఢిల్లీ : వైసీపీ ఎంపీలు నేడు హస్తినకు వెళ్లనున్నారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ను కలువనున్నారు. తాము చేసిన రాజీనామాలను ఆమోదించాలని వారు కోరనున్నారు. 

10:06 - June 5, 2018

హైదరాబాద్ : ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అశం... పాలక టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టాల్సింది పోయి.. విపక్ష కాంగ్రెస్‌లోనే కుంపట్లు రాజేస్తోంది. సర్కారుపై బాణాలు ఎక్కుపెట్టాల్సిన నేతలు.. సొంత పార్టీ సీనియర్లపైనే విరుచుకు పడుతున్నారు. పైగా మూకుమ్మడి రాజీనామాలు చేయాలంటూ ఉసిగొల్పుతున్నారు. తాజా పరిస్థితులతో.. కాంగ్రెస్‌ సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వ రద్దు అంశం.. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలోనే కాక రేపుతోంది. పాలకపక్షంపై ఎక్కుపెట్టాల్సిన ఈ అస్త్రం ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీనే ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

తమ శాసనసభ్యత్వాల రద్దు వ్యవహారంలో.. కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు సరిగా స్పందించలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్రుగా ఉన్నారు. సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు డివిజన్‌బెంచ్‌కు అప్పీలుకు వెళ్లినప్పుడు కానీ.. తాజాగా డివిజన్‌బెంచ్‌ తీర్పు సందర్భంలో కానీ.. కాంగ్రెస్‌ పెద్దలు పట్టనట్లే వ్యవహరిస్తున్నారన్నది కోమటిరెడ్డి అభియోగం. ఇప్పటికైనా సీనియర్లు తీరు మార్చుకోవాలని.. కోర్టు తీర్పుపై ప్రభుత్వం, స్పీకర్‌ సరిగా స్పందించకుంటే.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడి రాజీనామా చేయాలని కోమటిరెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్‌పై సీనియర్లు మండిపడుతున్నారు. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు విషయంలో చేయగలిగినంతా చేసినా.. ఈ అభియోగాలేంటని సీఎల్పీ నేత జానారెడ్డి అగ్గిమీద గుగ్గిలమే అయ్యారు. మూకుమ్మడి రాజీనామాలపై నిర్ణయం పార్టీదేనంటూ.. బంతిని ఉత్తమ్‌ కోర్టులో వేశారు. పార్టీలోని లొల్లిపై ఉత్తమ్‌ ఆచితూచి స్పందించారు. మూకుమ్మడి రాజీనామాలపై పార్టీలో చర్చించి.. హైకమాండ్‌ దృష్టికి తీసుకు వెళతానని అన్నారు.

మొత్తమ్మీద శాసన సభ్యత్వం కోల్పోయి.. కోర్టు తీర్పుతో ఊరట పొందిన ఎమ్మెల్యేలు ఇద్దరూ.. పార్టీ సీనియర్ల తీరుపై ముందునుంచీ గుర్రుగానే ఉన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా.. పార్టీ కోసమే తాము ఆందోళన చేస్తే.. సీనియర్లు అదేదో తమ వ్యక్తిగతమన్న భావనలో ఉన్నారంటూ వీరు మండిపడుతున్నారు. గతంలో కూడా ఓసారి సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ఇదే అంశాన్ని ప్రస్తావించి వేడి రగిలించారు. దాంతో.. కాంగ్రెస్‌ పెద్దలు కదిలి.. రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. మరి కోమటిరెడ్డి తాజా డిమాండ్‌ రగిల్చిన వేడిని... పార్టీ అధిష్ఠానం ఎలా చల్లబరుస్తుందో చూడాలి. 

09:37 - June 5, 2018

విజయవాడ : బినామీ ఆస్తుల కేసులో.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ఎదుట హాజరయ్యారు. ఆయన్ను ఏసీబీ సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసుకు సంబంధించి.. ఆళ్ల రామకృష్ణారెడ్డి నుంచి ఏసీబీ కీలక సమాచారాన్ని రాబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇదంతా చంద్రబాబు, లోకేశ్‌ల కుట్రగా ఆర్కే అభివర్ణించారు. బినామీ ఆస్తుల కేసులో.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని.. ఏసీబీ సుదీర్ఘంగా విచారించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసిన డిఎస్పీ దుర్గాప్రసాద్‌కు.. ఆళ్ల రామకృష్ణారెడ్డి బినామీ అన్న ఆరోపణలున్నాయి. ఏసీబీ తనిఖీల్లో పట్టుబడిన డిఎస్పీ దుర్గాప్రసాద్‌ ఇంట్లో ఆర్కే భార్య ఆస్తి పత్రాలు లభించినట్లు సమాచారం. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కొన్ని స్థిరాస్తి పత్రాలు ఆళ్ల కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి.. సోమవారం ఉదయం.. విజయవాడలోని ఏసీబీ కార్యాలయంలో.. అధికారులు సుమారు మూడు గంటలకుపైగా ఆర్కేని విచారించారు. చంద్రబాబు, లోకేశ్‌లు కావాలనే తననీ కేసులో ఇరికిస్తున్నారని ఆర్కే ఆరోపించారు. ఆర్కే, మే22నే ఏసీబీ విచారణకు హాజరు కావలసి ఉంది. అయితే, అనారోగ్య కారణాల వల్ల.. ఆయన రెండు వాయిదాలకు తన న్యాయవాదులను పంపారు. వ్యక్తిగతంగా హాజరై తీరాలన్న సమన్ల మేరకు.. ఆర్కే సోమవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు.

09:36 - June 5, 2018

ఢిల్లీ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అంతర్జాతీయ పర్యావరణ సదస్సు జరుగుతోంది. గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ సమావేశాల్లో మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ప్లాస్టిక్ వినియోగ నియంత్రణపై చర్చించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి పది లక్షల ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం జరుగుతోందని అంచనా. ఏటా సముద్రంలో 13 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు కలుస్తున్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. 

ప్రపంచ పర్యావరణ దినోత్సవం...

ఢిల్లీ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అంతర్జాతీయ పర్యావరణ సదస్సు జరుగుతోంది. పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ప్లాస్టిక్ వినియోగ నియంత్రణపై చర్చించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి పది లక్షల ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం జరుగుతోందని అంచనా. ఏటా సముద్రంలో 13 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు కలుస్తున్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. 

08:06 - June 5, 2018

వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించాలని.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఎన్నికలు రాని సమయం చూసి.. వైఎస్సార్సీపీ రాజీనామా డ్రామాలు ఆడుతోందని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. విపక్షాలపై చేస్తున్న విమర్శలపై టెన్ టివిలో జరిగిన చర్చలో అద్దెపల్లి శ్రీధర్ (జనసేన), చందూ సాంబశివరావు (టిడిపి), కొండా రాఘవరెడ్డి (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:03 - June 5, 2018

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం... మనకు శ్వాస నందింస్తున్న పర్యావరణం నేడు ప్రమాద కోరల్లో చిక్కుకుంది. మన స్వయం కృత అపరాధాలు పాలకుల విధానాలు నయాఅభివృద్ధి నమూనా పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయి. ప్రపంచంలో పర్యావరణ కాలుష్య కోర్రల్లో చిక్కుకున్న నగరాల్లో మన హైదరాబాద్‌ కూడా ఒకటి పర్యావరణ పరిరక్షణకోసం ఎన్ని పాలసీలు తీసుకున్న ఎన్ని ప్రతిజ్ఞలు తీసుకున్న అవి ఆచరణలో మాత్రం కనపడటం లేదు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా జనపథం ఈ అంశంపై ప్రత్యేక చర్చను చేపట్టింది. దీనిపై టెన్ టివి జనపథంలో హైదరాబాద్‌ జిందాబాద్‌ నాయకులు శ్రీనివాస్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:01 - June 5, 2018

బీహార్ : 2019 లోక్‌సభ్‌ ఎన్నికల కోసం రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. బీహార్‌లో ఎన్డీయో కూటమికి సిఎం నితీష్‌ కుమార్‌ నేతృత్వం వహించాలని జెడియు నిర్ణయించింది. ఎన్డీయే కూటమిలోని బిజెపి, ఎల్‌జెపి, ఆర్‌ఎస్‌ఎల్‌పి ఇందుకు సమ్మతించాలని జెడియు నేతలు కెసి త్యాగి, పవన్‌ వర్మలు పేర్కొన్నారు. బిహార్‌ సిఎం అభ్యర్థిగా... ప్రధాన నేతగా నితీష్‌ కుమార్‌ను ఎంపిక చేయాలని, ఆయన కరిష్మా ఏమాత్రం తగ్గలేదని ఆ పార్టీ సీనియర్‌ నేత కె.సి.త్యాగి స్పష్టం చేశారు. ఎన్డీయో కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు కూడా త్వరలోనే జరపాలని జెడియు సూచించింది. దీనిపై బిజెపితో ఇంకా ఎలాంటి చర్చలు జరపలేదని వర్మ తెలిపారు. జూన్‌ 7న ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు బిజెపి, జెడియు, ఎల్‌జెపి, ఆర్‌ఎస్‌ఎల్‌పి పట్నాలో సమావేశం కానున్నాయి. బిహార్‌లో 40 లోక్‌సభ స్థానాలకు గాను బిజెపికి 22 స్థానాలున్నాయి.

06:58 - June 5, 2018

చెన్నై : తమిళ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌ హసన్‌- కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటి అయ్యారు. కావేరి నదీ జలాల వివాదంపై సిఎంతో చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న రైతుల సమస్యలపై చర్చించామని సిఎం కుమారస్వామి చెప్పారు. కావేరీ జలాలపై చర్చలు జరిపేందుకు తమిళనాడు సిద్ధంగా ఉంటే తాను అందుకు సుముఖమేనని కుమారస్వామి తెలిపారు. కావేరి జల వివాదం పరిష్కారానికి రెండు రాష్ట్రాల మధ్య వారధిగా నిలిచేందుకు తాను సిద్ధమేనని కమల్‌హసన్‌ అన్నారు. కర్ణాటకలో రజనీకాంత్‌ 'కాలా' సినిమా విడుదలపై తాను సిఎంతో మాట్లాడలేదని కమల్‌ స్పష్టం చేశారు.

06:57 - June 5, 2018

మేఘాలయ : షిల్లాంగ్‌లో రెండు వర్గాల మధ్య చెలరేగిన హింస ఇంకా చల్లారకపోవడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు 11 కంపెనీల పారా మిలటరీ దళాలను షిల్లాంగ్‌కు పంపినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఖాసీ హిల్స్‌ ప్రాంతంలో సెల్‌ ఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ఆదివారం రాత్రి ఆందోళనకారులు షిల్లాంగ్‌లోని సిఆర్‌పిఎఫ్‌ క్యాంపుపై దాడి చేశారు. గత నాలుగు రోజులుగా షిల్లాంగ్‌లోని పంజాబీ లైన్‌ ప్రాంతంలో గిరిజనులకు...పంజాబీలకు మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఓ పోలీస్‌ అధికారితో పాటు10 మంది గాయపడ్డారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. 2 వందల ఏళ్ల క్రితమే షిల్లాంగ్‌కు వచ్చామని, తమని స్థానికులుగానే గుర్తించాలని, సెటిలర్స్‌ అని పిలవకూడదని పంజాబీలు అంటున్నారు. ఇవి స్పాన్సార్డ్‌ అల్లర్లని... కొందరు డబ్బులిచ్చి ఆందోళన చేయిస్తున్నారని మేఘాలయ సిఎం కాన్రాడ్‌ సంగ్మా అన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 

06:33 - June 5, 2018

కడప : జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్‌ విష సంస్కృతి ఊపిరి పోసుకుంటోంది. గ్రామాలు ఉద్రిక్తమవుతున్నాయి. జమ్మలమడుగు మండలం... పెద్ద దండ్లూరు గ్రామం ఇరువర్గాల ఘర్షణలతో అట్టుడికి పోతోంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. ఎన్నికల ముంగిట్లో.. కడప జిల్లాలో.. ఫ్యాక్షన్‌ విషసర్పం బుసలు కొడుతోంది. వైసీపీ, తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు.. గ్రామాలను ఉద్రిక్త వాతావరణంలోకి నెడుతోంది. జిల్లాలోని జమ్మలమడుగు మండలం.. పెద్ద దండ్లూరు గ్రామం.. దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.

పెద్ద దండ్లూరుకు చెందిన సంపత్‌ అనే వ్యక్తికి ఈ మధ్యే పెళ్లయింది. కార్యక్రమానికి హాజరు కాలేక పోయిన వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి, కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపేందుకు.. ఆదివారం పెద్దదండ్లూరు వెళ్లాలని భావించారు. అటు గ్రామంలో కూడా దీనికి సంబంధించిన సన్నాహాలు జరిగిపోయాయి. ఇంతలో.. దేవగుడి గ్రామానికి చెందిన సుమారు 250 మంది.. మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు.. గ్రామంలోకి వచ్చి వైసీపీకి చెందిన గోకుల అజరయ్య, అయ్యవార్‌రెడ్డి, కుళ్లాయిరెడ్డి తదితరుల ఇళ్లపై దాడి చేశారు.

మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులపై.. స్థానికులు ప్రతిదాడికి పాల్పడ్డారు. మంత్రి ఆదినారాయణరెడ్డికి చెందిన ఎస్కార్ట్‌ వాహనం దెబ్బతింది. ఇదే క్రమంలో.. శాసనమండలి విప్‌ రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన కొందరు స్థానికులకూ గాయాలయ్యాయి. దాడుల గురించి తెలియగానే.. జమ్మలమడుగు డిఎస్పీ.. సిబ్బందితో గ్రామానికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. గ్రామంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన ఎంపీ అవినాశ్‌రెడ్డి సహా.. మండలి విప్‌ రామసుబ్బారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వైఖరిపై.. వైసీపీ, టీడీపీ నేతలిద్దరూ మండిపడ్డారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్గీయుల చేతుల్లో గాయపడ్డ తన అనుచరులను రామసుబ్బారెడ్డి, జమ్మలమడుగు ఆసుపత్రిలో పరామర్శించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పెద్ద దండ్లూరులో పోలీసులు భారీగా మోహరించారు. గ్రామంలో 144వ సెక్షన్‌ విధించారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలతో గ్రామంలో ఎప్పుడేమి జరుగుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది. 

06:31 - June 5, 2018

విజయవాడ : వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు వీడటం లేదు. దుర్గగుడి, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్లు నిర్మాణ దశలోనే ఉండటంతో ప్రజలు గంటలకొద్దీ ట్రాఫిక్ పద్మవ్యూహంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. నెలలు గడుస్తున్నా దుర్గగుడి ఫ్లై ఓవర్ పూర్తి కాకపోవడంతో బెజవాడ వాసుల్లో అసహనం వ్యక్తమవుతోంది. బెజవాడ ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లై ఓవర్ పనులు నత్తడకన సాగుతున్నాయి. ఫ్లై ఓవర్ ఎప్పటికీ పూర్తవతుందనేది అధికార యంత్రాంగం కూడా స్పష్టంగా చెప్పలేకపోతోంది. పనులు ఆలస్యం అవుతుండటంతో వాహనదారులకు ట్రాఫిక్‌లో చుక్కలు కనిపిస్తున్నాయి.

2015 డిసెంబర్ 27న ఫ్లైఓవర్‌ నిర్మాణ పనలు ప్రారంభమయ్యాయి. ''సోమా కన్ స్ట్రక్షన్స్ సంస్థ'' ఎంతో ఆర్భాటంగా ప్రారంభించింది. 2.5 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల వంతెన, నాలుగు వరుసల రహదారి నిర్మాణంకోసం పనలు జరుగుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా ఎంతకీ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో బెజవాడ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇటు దుర్గగుడి ఫ్లైవోర్‌తోపాటు అటు బెంజిసర్కిల్‌ వద్ద నిర్మిస్తున్న వంతనెన పనులు కూడా రెండడుగులు ముందుకు మూడడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతున్నాయి. దీంతో ప్రజలు నాన అగచాట్లు పడుతున్నారు. ప్రధానంగా దుర్గగుడి ఫ్లైఓవర్‌ వద్ద రద్దీ ఎక్కువగా ఉంటోంది.

హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు ఈ మార్గం నుంచే విజయవాడలోకి ప్రవేశిస్తాయి. అటు చెన్నై వెళ్లాలన్నా, ఇటు కోల్ కతా వైపు వెళ్లాలన్నా ఈ దారిగుండానే ప్రయాణించాల్సిఉంది. ఈ ఇబ్బందులను తొలగించడానికే 2015లో చేపట్టిన దుర్గగుడి ఫ్లైఓవర్‌ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెకొంది. గత మూడేళ్లలో నాలుగు దఫాలుగా గడువులు పొడిగించారు. అయినా ఫ్లై ఓవర్ పూర్తికాలేదు. దుర్గగుడి వద్ద జరుగుతున్న పనుల నిమిత్తం మూడేళ్లుగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. దాదాపు ఏడాదిన్నరపాటు ఎలాంటి వాహనాలను దుర్గగుడి వైపు అనుమతించలేదు. కీలకమైన నెహ్రూ బస్ స్టేషన్ కు చేరుకోవాలంటే ట్రాఫిక్ లోనే గంటల కొద్ది సమయం సరిపోతోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని బెజవాడ వాసులు కోరుతున్నారు.

06:29 - June 5, 2018

హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని లో నిర్మించే డబుల్ బెడ్ రూమ్ కాలనీల్లో మౌలిక సదుపాయాలపై సీఎస్ ఎస్ కె జోషి అధికారులతో సమీక్షించారు. నిర్మాణాలు జరుగుతున్న చోట ఎటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారనే దాని పై ఖఛ్చితమైన ప్రతిపాదనలు సిద్దం చేసి సర్కార్ అందించాలని అధికారులను అదేశించారు.

జి.హెచ్.యం.సి ద్వారా 109 ప్రదేశాలలో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి. ఇళ్ల నిర్మాణ ప్రాంతాలలో మౌలిక సౌకర్యాలపై సంబంధిత శాఖలు అంచనాలు తయారుచేసి సమర్పించాలని ఆదేశించారు. కొత్త కాలనీలలో టౌన్ ప్లానింగ్ నిబంధనల మేరకు ప్రతిపాదనలు ఉండాలన్నారు. హైదరాబాద్, సైబారాబాద్, పోలీసు కమిషనరేట్ పరిధిలోని ముఖ్యప్రాంతాలలో ఏర్పాటు చేయవలసిన పోలీసు స్టేషన్లపై ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలన్నారు సీఎస్‌ ఎస్‌కే జోషి

కొత్తకాలనీల్లో ఇండ్లకు మంచినీరు, డ్రైనేజి, విద్యుత్, పోలీస్ స్టేషన్లు, ఫైర్ స్టేషన్లు, మార్కెట్స్, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణంపై దృష్టిపెట్టానలి అధికారులకు సీఎస్‌ అదేశాలు జారీచేశారు. అలాగే బ్యాంకులు, ఏటియంలు, హెల్త్ సెంటర్లు, విద్యాసంస్ధలు, ఇంటర్ నెట్ కనెక్టివిటి, క్రీడా సౌకర్యాలు, అంగన్ వాడి సెంటర్లు, క్రియేషన్ సెంటర్లు తదితర సౌకర్యాల కోసం సంబంధిత శాఖలు నిబంధనల ప్రకారం అవసరమైన ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల పూర్తికి షెడ్యూల్‌ను అనుసరించి సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యాలమేరకు ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సి.యస్ ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలపై అధికారుల్లో విస్మయం వ్యక్తం అవతోంది. ఇంత వరకు చాల చోట్లా నిర్మాణాలే ప్రారంభం కాలేదని.. వాటికి ప్రతిపాదనలు ఏంటని చర్చించుకుంటున్నారు. 

06:20 - June 5, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసిలో సమ్మె నగారా మోగింది. ఈనెల 11 నుంచి సమ్మె చేసేందుకు గుర్తింపు కార్మిక సంఘం ఆర్టీసీ యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేసింది. ఇతర కార్మిక సంఘాలనూ కలుపుకుని వెళతామని తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డితో టెన్ టివి ముచ్చటించింది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:17 - June 5, 2018

హైదరాబాద్ : ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో.. పాలక పక్షానికి మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వం రద్దు చెల్లదని.. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తుది తీర్పునిచ్చింది. 12 మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు వేసిన అప్పీల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. తీర్పును స్వాగతించిన కోమటిరెడ్డి.. ఎమ్మెల్యేగా తనకు దక్కాల్సిన గౌరవాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసన సభ్యత్వాల రద్దు వ్యవహారంలో.... టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు సరికాదంటూ.. గతంలో సింగిల్‌బెంచ్‌ తీర్పునిచ్చింది. దీనిపై పన్నెండు మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేశారు. వీరి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌.. సింగిల్‌ బెంచ్‌ తీర్పును సమర్థించింది. ఎమ్మెల్యేల రద్దు అంశంపై పిటిషన్‌ వేసే అర్హత, స్పీకర్‌ లేదా శాసనసభ కార్యదర్శికి మాత్రమే ఉంటుందన్న అభిషేక్‌ మనుసింగ్‌ వాదనతో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఏకీభవించింది. పైగా.. పిటిషన్‌ వేసిన పన్నెండు మందిలో.. ఎక్కువ మంది పార్టీ ఫిరాయింపు దారులేనని, వారి సభ్యత్వం రద్దు అశంపై స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉందన్న విషయాన్నీ కోర్టు పరిగణలోకి తీసుకుందని కాంగ్రెస్‌ తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ తెలిపారు. తాజా తీర్పు నేపథ్యంలో.. సింగిల్‌బెంచ్‌ గతంలో ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని చెప్పారు.

మరోవైపు.. కోర్టు తీర్పును కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వాగతించారు. ఎమ్మెల్యేగా తమకు రావాల్సిన గౌరవాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజున మొదలైన వివాదం.. మొత్తానికి.. కోర్టు జోక్యంతో తెరపడినట్లే భావిస్తున్నారు. అయితే.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని స్పీకర్‌ పునరుద్ధరిస్తారో..? లేక సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేస్తారో వేచి చూడాలి. 

06:16 - June 5, 2018

హైదరాబాద్ : తమది పక్కా రైతు పక్షపాత ప్రభుత్వమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే రైతుబంధు ద్వారా పెట్టుబడి సమకూర్చిన తన ప్రభుత్వం.. పంద్రాగస్టు నుంచి రైతు బీమాను అమల్లోకి తెస్తుందని అన్నారు. సహజ మరణాలకు కూడా బీమా వర్తించేలా నిబంధనలను సరళీకరించినట్లు కేసీఆర్‌ వెల్లడించారు. రైతులకు మద్దతు ధర విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రైతు సంక్షేమం దిశగా.. తెలంగాణ ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రైతాంగానికి బీమా కల్పించే పథకానికి సంబంధించి.. ఎల్‌ఐసీతో కీలక అగ్రిమెంటు కుదుర్చుకుంది. హెచ్‌ఐసీసీ వేదికగా రైతుబీమాపై.. ప్రభుత్వం-ఎల్‌ఐసీ మధ్య కుదిరిన ఎంఓయూ పత్రాలను.. ముఖ్యమత్రి కేసీఆర్‌ సమక్షంలో.. ప్రభుత్వ, బీమా సంస్థల అధికారులు పరస్పరం మార్చుకున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీతో రైతుబీమా పథకం కోసం ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈఏడాది ఆగస్టు 15 నుంచి రైతుబీమాను వర్తింప చేస్తామన్నారు. 18 ఏళ్ల నుంచి 60 సంవత్సరాలలోపు వయసున్న రైతులందరికీ ఈ బీమా పథకం వర్తిస్తుందన్నారు. ప్రమాదవశాత్తు సంభవించే మరణాలతో పాటు.. సహజ మరణాలకూ పథకాన్ని వర్తింప చేస్తామని, పది రోజుల్లోనే పాలసీ క్లెయిం అవుతుందని సీఎం వెల్లడించారు.

రైతుబీమా పథకం అమల్లో వ్యవసాయాధికారులది కీలక పాత్ర అని.. వారికి అవసరమైన ఐప్యాడ్‌లను ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. ఈ సంరద్భంగా.. డిమాండ్‌ ఉన్న పంటలనే పండించాలని రైతులకు సూచించిన కేసీఆర్‌, వరినాటే యంత్రాలనూ సబ్సిడిపై అందిస్తామని ప్రకటించారు. నాణ్యమైన కరెంటు సరఫరా, సమృద్ధిగా సాగునీరు, మద్దతు ధర ఉంటే రైతులకు ఎలాంటి కష్టాలు రావని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. అయితే.. పంటకు మద్దతు ధర నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని సీఎం చెప్పారు. రైతుల కోసం బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిధులను వారికే ఖర్చు చేస్తామని చెప్పారు. రైతుబంధు పథకం వల్ల రాష్ట్రంలో 89శాతం మంది రైతులు సంతోషంగా ఉన్నారని సీఎం చెప్పారు. ఈ పథకంతో కొన్ని పార్టీలు దివాళా తీశాయని ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపుతామని, వచ్చే సంవత్సరం జూన్‌ తర్వాత రైతులు ఆకాశం వైపు ముఖం పెట్టి చూసే అవసరం రాదని సీఎం అన్నారు.

06:14 - June 5, 2018

విజయనగరం : వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించాలని.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఎన్నికలు రాని సమయం చూసి.. వైఎస్సార్సీపీ రాజీనామా డ్రామాలు ఆడుతోందని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. విపక్ష వైసీపీ నేతలకు ధైర్యముంటే.. మోదీపైన, బీజేపీపైనా పోరాడాలని సవాల్‌ విసిరారు. మోదీ ప్రభుత్వం ఏపీపై కుట్ర చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. సోమవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. శృంగవరపు కోటలో చేపట్టిన నవనిర్మాణ దీక్షలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, అయితే.. నాలుగేళ్లు సహనంతో వేచి చూసినా.. రాష్ట్రానికి న్యాయం జరగక పోవడం వల్లే.. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చినట్లు.. చంద్రబాబు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని, దానితో పొత్తుపెట్టుకునే పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై మోదీ కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇందులో భాగంగానే వైసీపీ నేతలు, పవన్‌ కల్యాణ్‌ తనపై ఆరోపణలు చేస్తున్నారని, రాష్ట్రాన్ని బలహీన పరిచేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీటీడీని కూడా అపవిత్రం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజీనామా డ్రామాలు ఆడుతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆపార్టీ నేతలకు ధైర్యముంటే.. మోదీపైన, బీజేపీపైన పోరాడాలని సవాల్‌ విసిరారు. ఆర్‌బీఐ ఒప్పుకోకున్నా రుణమాఫీ అమలు చేశామని, మహిళా సంఘాల రుణాలు రద్దు చేశౄమని, సాగునీటి పథకాలకు ప్రాధాన్యతనిచ్చామని చంద్రబాబు చెప్పారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించేందుకు శ్రీకారం చుట్టామని, పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యతను తీసుకున్నామని చెప్పారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా.. ముఖ్యమంత్రి జమ్మాదేవిపేట వీధుల్లో పర్యటించారు. అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే రచ్చబండ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసి... గ్రామ ప్రజల ఆదాయం పెంచడానికి కృషి చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ప్రతి కుటుంబానికి నె లకు రూ. 10వేలు ఆదాయం రావాలన్నదే తన ఆశయమని అన్నారు. అనంతరం ఎస్‌.కోట గ్రామస్థులతోనూ చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

ఎన్డీయే కూటమికి నితీష్ నేతృత్వం...

ఢిల్లీ : 2019 లోక్‌సభ్‌ ఎన్నికల కోసం రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి.  బిహార్‌లో ఎన్డీయో కూటమికి సిఎం నితీష్‌ కుమార్‌ నేతృత్వం వహించాలని జెడియు నిర్ణయించింది. ఎన్డీయే కూటమిలోని బిజెపి, ఎల్‌జెపి, ఆర్‌ఎస్‌ఎల్‌పి ఇందుకు సమ్మతించాలని జెడియు నేతలు కెసి త్యాగి, పవన్‌ వర్మలు పేర్కొన్నారు.

షోపెయిన్ లో ఉగ్ర దాడి...

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌ షోపెయిన్‌ జిల్లాలో ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో 14 మంది పౌరులు, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బటపోరా చౌక్‌లో పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనేడ్‌ దాడి జరిపినప్పటికీ తృటిలో ప్రమాదం తప్పింది. 

నటి సంగీత బాలన్ అరెస్టు...

చెన్నై : వ్యభిచారం కేసులో తమిళ నటి సంగీత బాలన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చెన్నైలోని ఓ రిసార్ట్‌లో సంగీత వ్యభిచార గృహం నడుపుతున్నట్లు సమాచారం మేరకు పోలీసులు రిసార్ట్‌పై దాడి చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులకు పోలీసులు విముక్తి చేశారు.

బద్ధలైన అగ్నిపర్వతం...

ఢిల్లీ : గ్వాటెమాలాలో ప్యూగో అగ్నిపర్వతం బద్ధలైంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో లావాలో చిక్కుకుని 25 మంది సజీవ దహనమయ్యారు. 20 మందికి పైగా గాయపడ్డారు.  లావా ఇళ్లలోకి, రోడ్లపైకి నదిలా ప్రవహించి చుట్టుపక్కల ప్రాంతాలను దహించివేసింది. ఆకాశంలో 10 కిలోమీటర్ల ఎత్తున దట్టమైన పొగ కమ్ముకుంది.

Don't Miss