Activities calendar

06 June 2018

21:55 - June 6, 2018

హైదరాబాద్‌ : మెడికల్‌ సీట్ల స్కామ్‌లో శాట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటరమణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. స్పోర్ట్‌ కోటాలో 12 సీట్లను అమ్ముకున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. లక్షలాది రూపాయలు లంచం తీసుకున్నట్లు విచారణలో తేలింది. వెంకటరమణ ఇంటితోపాటు ఆయన బంధువుల ఇళ్ళలో సోదాలు నిర్వహించిన ఏసీబీ పలు కీలకమైన ఫైళ్ళు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.  సాట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటరణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

21:53 - June 6, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్‌... రేవంత్‌రెడ్డి జోరు... ఎందుకు తగ్గింది..? ఆయనకు పార్టీ ప‌ద‌వి ఇవ్వడంలో జాప్యం ఎందుకు జరుగుతోంది..? రేవంత్ దూకుడుకు బ్రేకులు వేస్తోంది ఎవ‌రు? అస‌లు రేవంత్ విష‌యంలో హైక‌మాండ్ మూడ్ ఎలా ఉంది? రేవంత్‌ వ్యవహారంలో క్యాడ‌ర్ లో జ‌రుగుతున్న చ‌ర్చేంటీ..?

తెలుగు రాష్ట్రాల్లో రేవంత్‌రెడ్డిది ప్రత్యేకమైన ఇమేజ్‌. ముఖ్యంగా తెలంగాణలో ఆయనది ఫైర్‌బ్రాండ్‌ ఇమేజ్‌.  కేసీఆర్‌ కుటుంబంపై విరుచుకు పడడంలో ఆయన తనదైన శైలిని క్రియేట్‌ చేసుకున్నారు. అలాంటి రేవంత్‌రెడ్డి కొంతకాలంగా ఎందుకు మౌనంగా ఉన్నారు..? 

రేవంత్‌ రెడ్డి పార్టీలోకి వచ్చే సమయంలోనే కొందరు సీనియర్లు అభ్యంతర పెట్టారు. ఆతర్వాత రేవంత్‌ స్పీడ్‌తో మరింత ఇబ్బంది పడ్డారు. ఓ దశలో రేవంత్‌ స్పీచ్‌ల కోసం ప్రజలూ విపరీతమైన ఆసక్తిని కనబరచడం.. పార్టీ సీనియర్లకు ఇబ్బంది కలిగించిందని సమాచారం. పైగా రేవంత్‌తో ముందే మాట్లాడిస్తే.. ఆ తర్వాత జనం వెళ్లిపోతున్నారని గుర్తించిన నేతలు.. ఆయనతో ఆఖరున మాట్లాడించడం ప్రారంభించారు. ఇది కూడా పార్టీ సీనియర్లకు మింగుడు పడలేదంటున్నారు. పైగా తాను సీఎం పదవిని కోరుకుంటున్నానంటూ ఆయన చేసిన ప్రకటన.. అంతర్గత శత్రువులను పెంచిందని అంటున్నారు. 

కాంగ్రెస్‌ సీనియర్లు కొందరు... రేవంత్‌ దూకుడుకు బ్రేక్‌ వేసే పనులు మొదలు పెట్టినట్లు పార్టీవర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు రేవంత్‌కు ప్రాధాన్యత కలిగిన పదవి ఇవ్వవద్దంటూ 
అధిష్ఠానానికి వరుస విజ్ఞప్తులు చేశారు. కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగా.. రేవంత్‌కు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లేదా ప్రచార కమిటీ చైర్మన్‌ పదవులు ఇస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చిందని సమాచారం. అయితే.. ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించ వద్దంటూ సీనియర్లు అభ్యంతర పెట్టడంతో.. రేవంత్‌కు పదవి విషయంలో అధిష్ఠానం జాప్యం చేస్తోందని భావిస్తున్నారు. 

కాంగ్రెస్‌ పెద్దల తీరుతో కినుక వహించిన రేవంత్‌రెడ్డి.. మూడ‌వ విడ‌త బ‌స్సు యాత్రకు దూరంగా ఉన్నారు. ఉత్తమ్ చెప్పినా కూడా.. రేవంత్ సానుకూలంగా స్పందించ లేదు. తనకు ప్రచార కమిటీ బాధ్యతలే కావాలని, తన అనుచరులకూ పదవులు కట్టబెట్టాలని రేవంత్‌ పట్టుబడుతున్నట్లు సమాచారం. ఒకవేళ తన మాట కాదంటే, నియోజకవర్గానికే పరిమితం అవుతానని అధిష్ఠానానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 

రేవంత్‌రెడ్డి లాంటి నాయకుడిని.. ఎన్నిక‌ల్లో స‌రిగ్గా వాడుకోలేకపోతే పార్టీ న‌ష్టపోతుంద‌నే భావ‌న‌లో అధిష్ఠానం పెద్దలున్నట్లు సమాచారం. ఆయ‌న‌కు ప్రచార‌ క‌మిటీ బాధ్యత‌లు ఇస్తేనే స‌రైన న్యాయం జ‌రుగుతుంద‌నే మూడ్‌లో ఢిల్లీ పెద్దలున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత రాహుల్‌ ప్రస్తుతం తెలంగాణలో పార్టీ ఎలెక్షన్‌ టీమ్‌ రూపకల్పనపైనే ఫోకస్‌ పెట్టినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ కొన్ని సర్వే నివేదికలూ తెప్పించుకున్నారని తెలుస్తోంది. 

కొంతకాలంగా రేవంత్‌ వాయిస్‌ తగ్గడంపై కాంగ్రెస్‌లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు .. రాహుల్‌ జరిపించిన సర్వేల్లో తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్‌ పెరుగుతున్న తరుణంలో రేవంత్‌లాంటి నేతలను పక్కనబెడితే పార్టీకి నష్టం తప్పదని వారు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ అధినేత రాహుల్‌.. సీనియర్ల మాటకు విలువిచ్చి రేవంత్‌ దూకుడుకు బ్రేక్‌ వేస్తారా..? లేక ఫైర్‌బ్రాండ్‌ సేవలను పార్టీకి వినియోగించుకుంటారా..? అన్న అంశం ఆసక్తిని రేపుతోంది. 

21:48 - June 6, 2018

విజయవాడ : బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుల మధ్య వాడీ వేడీ వాగ్యుద్ధం సాగుతోంది. ఏపీలో అభివృద్ధి జరగడం లేదని జీవీఎల్‌ అంటే.. వెనుకబడిన జిల్లాలకు వెళ్లి చూడాలని కుటుంబరావు కౌంటర్‌ ఇచ్చారు. అబద్ధాలు చెబితే నిధులు రావని జీవీఎల్‌ హితవు పలికితే.. దేశవ్యాప్తంగా బీజేపీకి 160 సీట్లూ రావని కుటుంబరావు జోస్యం చెప్పారు. 

ఏపీ ప్రభుత్వంపై.. బీజేపీ నాయకుల దాడి కొనసాగుతోంది. దానికి దీటుగా ప్రభుత్వ ప్రతినిధులూ స్పందిస్తున్నారు. బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు.. చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజకీయ మనుగడ కోసమే బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారని.. ఏపీ ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. అబద్ధాలు చెబితే నిధులు రావంటూ.. చెన్నై-వైజాగ్‌ కారిడార్‌ను ఉదహరించారు. 

బాబుతో జాబు రాలేదు కానీ, జబ్బులొచ్చాయని జీవీఎల్‌ ఎద్దేవా చేశారు. షేర్‌మార్కెట్‌ నిపుణుడు కుటుంబరావును ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా నియమించడాన్ని ఆయన ఆక్షేపించారు. ఎయిర్‌ ఏషియా అవినీతి ఆరోపణల్లో చంద్రబాబు ప్రస్తావనపై వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉందని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర నేతలు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. 

జీవీఎల్‌ నరసింహారావు విమర్శలకు.. రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు దీటుగా బదులిచ్చారు. ఏపీకి అన్నీ ఇస్తున్నామన్న బీజేపీ నేతల ప్రకటనల్లో వాస్తవాన్ని తేల్చేందుకు.. ఓ పదిమంది కేంద్ర, రాష్ట్ర అధికారులతో కమిటీ వేయాలని తాను సూచిస్తుంటే.. నిజనిర్ధారణ కమిటీ అంటూ జీవీఎల్‌ చెబుతున్నారని కుటుంబరావు ఎద్దేవా చేశారు. 

బెజవాడలో కూర్చుని ప్రెస్ మీట్‌లు పెట్టడం కాకుండా.. జిల్లాలకు వెళ్ళి చూడాలని జీవీఎల్‌కు కుటుంబరావు సూచించారు. జీవీఎల్‌ అసహనంతో అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయన వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఫోన్‌ ట్యాప్‌ అయినట్లు చేసిన ఆరోపణలపై ఆధారాలు బయటపెట్టాలని కుటుంబరావు సవాల్ చేశారు.  అగ్రిగోల్డ్‌ వ్యవహారంపైనా జీవీఎల్‌ నరసింహారావు, కుటుంబరావు పరస్పర విమర్శలు గుప్పించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి దేశవ్యాప్తంగా 160 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని కుటుంబరావు జోస్యం చెప్పారు.  

21:45 - June 6, 2018

ఢిల్లీ : రాజీనామాలకే కట్టుబడి ఉన్నామని వైసీపీ ఎంపీలు.. స్పీకర్‌ సుమిత్రామహాజన్‌కు స్పష్టం చేశారు. ఈమేరకు మరోమారు ధ్రువీకరణ లేఖలను సమర్పించారు. వీటిపై స్పీకర్‌ తుది నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది. ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఏప్రిల్‌ 6న రాజీనామాలు సమర్పించిన వైసీపీ ఎంపీలు.. బుధవారం మరోమారు.. లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌తో భేటీ అయ్యారు. తమ రాజీనామాలను ఆమోదించాల్సిందిగా అభ్యర్థించారు. రాజీనామాల ధ్రువీకరణ లేఖలను సమర్పించాలంటూ స్పీకర్‌ సూచించడంతో.. ఆమేరకు వైసీపీ ఎంపీలు లేఖలు అందించారు. 

నిజానికి మే 29న, స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ పిలుపు మేరకు ఆమెను కలిసిన వైసీపీ ఎంపీలు.. రాజీనామాలకే తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అయితే.. ప్రత్యేక హోదాపై భావోద్వేగ పరిస్థితుల కారణంగా రాజీనామా చేస్తున్నట్లు భావించిన స్పీకర్‌.. మరోసారి ఆలోచించుకోవాలని వారిని తిప్పి పంపారు. కానీ, అదే సమయంలో కర్నాటక ఎంపీలు యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామాలు మాత్రం అప్పటికప్పుడు ఆమోదించారు. 

మే 29న వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందుతాయని అంతా భావించారు. కానీ, స్పీకర్‌ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో వైసీపీ ఎంపీలు బుధవారం మరోమారు స్పీకర్‌ను కలిశారు. ఆమె సూచన మేరకు ధ్రువీకరణ లేఖలు కూడా అందించారు.  ఇక తాము ప్రజాక్షేత్రంలోకి వెళ్లి టీడీపీ వైఖరిని ఎండగడతామని ఎంపీలు చెప్పారు.  

వైసీపీ టికెట్‌పై గెలిచి టీడీపీలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్‌పీవైరెడ్డి, కర్నూలు ఎంపీ బుట్టారేణుకలపై అనర్హత వేటు వేయాలని కూడా.. వైసీపీ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించిన ఫిర్యాదులు తనకు అందినట్లు స్పీకర్‌ చెప్పారని, వైసీపీ నేతలు చెప్పారు. 

21:40 - June 6, 2018

కడప : కేసులు, రాజకీయం కోసం.. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇది వారికి సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ అండ చూసుకునే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం ధీమాగా చెప్పిందని ఆరోపించారు. ప్రధాని వద్దకు వెళ్లి విశ్వాసాన్ని, బయటేమో అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తారంటూ వైసీపీని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలు రావన్న ధీమాతోనే ఇప్పుడు రాజీనామా డ్రామా ఆడుతున్నారంటూ చంద్రబాబు విమర్శించారు. 

నవ నిర్మాణ దీక్షలో భాగంగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. బుధవారం, కడప జిల్లాలో పర్యటించారు. స్థానిక మున్సిపల్‌ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, వైసీపీల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్నాటకలో గాలి జనార్దనరెడ్డి లాంటి అవినీతిపరుడిని ముందుపెట్టి ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారని చంద్రబాబు విమర్శించారు. అలాంటి పార్టీ నేతలు 40ఏళ్ల రాజకీయ జీవితంలో నిప్పులా బతికిన తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్దారు. 

రాష్ట్రంలో వైసీపీ అండ చూసుకుని బీజేపీ రెచ్చిపోతోందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని బీజేపీ నేతలు ధీమాగా చెప్పడం వెనుక.. వైసీపీ భరోసాయే కారణమని అన్నారు. ఒక పార్టీ కాకపోతే మరోపార్టీతో కలిసే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పుడు రాజీనామాల వల్ల ఎన్నికలు రావు అని తెలిసీ వైసీపీ నేతలు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని, లాలూచీ రాజకీయాలకు పాల్పడిన వారిని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్న చంద్రబాబు.. ఈ ఏడాది రాష్ట్రంలో అదనంగా 50 జూనియర్‌ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. నీట్‌లో పాసైన ఫాతిమా కళాశాల విద్యార్థులకు ఇక్కడే ప్రవేశం కల్పిస్తామని, నీట్‌ రాయని ఫాతిమా కళాశాల విద్యార్థులకు డబ్బులు వెనక్కి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. 

తమ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిపైనా దృష్టిసారించిందని, వివిధ కంపెనీలతో 2,844 ఎంవోయూలు కుదుర్చుకున్నామని సీఎం వివరించారు. అవి పూర్తయితే రాష్ట్రానికి రూ.16లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు. తద్వారా 37లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇదంతా కేంద్రం సహకరించడం వల్ల కాదని, రాష్ట్ర ప్రభుత్వం కష్టార్జితంవల్లేనని చంద్రబాబు చెప్పారు. విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా.. కడప స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్రం రాకుండా చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నామని, అయితే.. నాలుగేళ్లలో కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదని చంద్రబాబు చెప్పారు. అందుకే.. ఎన్డీయే నుంచి వైదొలిగామన్నారు. 

21:32 - June 6, 2018

బాధిత మహిళలు పోలీసు స్టేషన్లు, కోర్టులకు ఎలా వెళ్లాలి ? ఎవరిని అప్రోచ్ అవ్వాలి..? బాధిత మహిళలు న్యాయం పొందడం ఎలా ? ఇదే అంశంపై మావని మైరైట్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో అడ్వకేట్ పార్వతి పాల్గొని, పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

మెడికల్ సీట్ల స్కాంలో కొత్త కోణం

హైదరాబాద్ : మెడికల్ సీట్ల స్కాంలో కొత్త కోణం వెలుగు చూసింది. స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ టోకరా వేశాడు. శాట్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణపై ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. తన కుమారుడికి కాకుండా మరొకరికి సీటు ఇచ్చారని ఏసీబీకి ఆధారాలు ఇచ్చారు. బాధితుడు సత్యనారాయణ ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగాయి. ఫిర్యాదుతో ఆరుగురు అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 12 సీట్లు అక్రమంగా అమ్ముకున్నట్లు గుర్తించారు. కేసీఆర్ ఆదేశాలతో మెడికల్ సీట్ల స్కాంపై ఏసీబీ విచారిస్తోంది.

 

ఎమ్మెల్యే గొంగిడి సునీతకు తప్పిన ప్రమాదం

హైదరాబాద్ : ఎమ్మెల్యే గొంగిడి సునీతకు ప్రమాదం తప్పింది. చిక్కడపల్లి వద్ద ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును మరోకారు ఢీకొట్టింది. స్వల్ప గాయాలతో సునీత బయటపడింది.

 

20:58 - June 6, 2018

అక్వాసాగును ఏపీ ప్రభుత్వం పెంచాలనుకుంటుంది. కంపెనీలతో ఆక్వాసాగును లింక్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఏపీలో పంట భూములకు అక్వారూపంలో ముప్పు పొంచి ఉంది. ఇదే అంశం నిర్వహించిన విశ్లేషణ కార్యక్రమంలో విశ్లేషకుడు తులసీదాస్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:49 - June 6, 2018

ప.గో : వైసీపీ ఎంపీల రాజీనామాలపై జగన్ స్పందించారు. పదవులకు ఇంకా పద్నాలుగు నెలల గుడువున్నా రాష్ట్రం కోసం ఎంపీలు ధైర్యంగా రాజీనామాలు చేశారని అన్నారు. అదే రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి ఉంటే కేంద్రంపై ఆ ప్రభావం తీవ్రంగా ఉండేదన్నారు. ఎంపీలతో రాజీనామా చేయించేందుకు చంద్రబాబు భయపడ్డారని పేర్కొన్నారు.

 

20:37 - June 6, 2018
20:18 - June 6, 2018

వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందుతాయా ? వైసీపీ ఎంపీల రాజీనామాలతో ప్రయోజనం ఉందా ? ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకులు నగేష్ కుమార్, వైసీపీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి విష్ణు, టీడీపీ ఎమ్మెల్సీ రామకృష్ణ పాల్గొని, మాట్లాడారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

20:01 - June 6, 2018

హైదరాబాద్‌ : సినీ నటుడు అక్కినేని అఖిల్‌..  హైదారాబాద్‌లో బిగ్‌సీ మొబైల్‌ షోరూమ్‌ ప్రారంభించారు. ఇ.సి.ఐ.యల్ క్రాస్ రోడ్స్‌లోని ఈ షో రూమ్‌ను ప్రాంరంభించిన అఖిల్‌ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో  మొబైల్‌ షోరూమ్‌లు ఏర్పాటు చేస్తూ.. నాణ్యమైన మొబైల్స్‌ అమ్మకాలతో దూసుకుపోతోందన్నారు. వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన ఫోన్లను అందించడమే తమ లక్ష్యామని బిగ్ సీ నిర్వాహకులు అన్నారు.

 

19:58 - June 6, 2018

హైదరాబాద్ : చిత్ర రంగంలోకి అడుగు పెట్టినా.. కమ్యూనిస్టు ఉద్యమాలను కొనసాగించిన మాదాల రంగారావు.. నేటి తరానికి ఆదర్శ ప్రాయుడని ప్రముఖ నటులు, వామపక్ష నేతలు కొనియాడారు. తుదిశ్వాస వరకూ కమ్యూనిస్టు ఉద్యమాల పునరేకత గురించే తపించారని స్మరించుకున్నారు. 
మాదాల సంస్మరణ సభ 
ప్రముఖ నటుడు, నిర్మాత మాదాల రంగారావు సంస్మరణ సభ హైదరాబాద్‌లో .... ఘనంగా జరిగింది. ప్రముఖ సినీ నటులు, రాజకీయ నాయకులు ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాదాలతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  
కమ్యూనిస్టు ఉద్యమానికే తీరని లోటు 
మాదాల మృతి కళా రంగానికే కాదు కమ్యూనిస్టు ఉద్యమానికే తీరని లోటని నేతలు అన్నారు. ఎర్ర జెండాని వెండితెరపై రెపరెపలాడించిన నాయకుడని కొనియాడారు. చివరి వరకు కమ్యూనిస్టు ఉద్యమాల పునరేకత గురించి మాదాల ఆలోచించేవారని గుర్తు చేసుకున్నారు. 
తెలుగు సినిమాల ద్వారా వామపక్ష ఉద్యమం 
అద్భుతమైన నటతో వామపక్ష ఉద్యమాన్ని తెలుగు సినిమాల ద్వారా ప్రజలకు పరిచయం చేశారని నటులు మురళి మోహన్‌, బ్రహ్మానందం అన్నారు. వామపక్ష రాజకీయాలను దేశ ప్రజలలో ప్రభావితం చేసేందుకు మాదాల కృషి చేశారన్నారు. ఈ తరం వారు స్మరించుకోదగ్గ నటుడు మాదాల రంగారావు అని కొనియాడారు. 
ఎర్రజెండా బావుటాను నింగికెగరేసిన మహానుభావుడు మాదాల 
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎర్రజెండా బావుటాను నింగికెగరేసిన మహానుభావుడు మాదాల అని కొనియాడారు నటుడు నారాయణ మూర్తి. వామపక్ష రాజకీయాలను సినీ రంగం ద్వారా ప్రజలకు తెలియజేసేందుకు ప్రయత్నం చేశారన్నారు.. 
వామపక్షపార్టీలు ఒక్కటి కావాలని ఆకాంక్షించిన మాదాల
వామపక్షపార్టీలు ఒక్కటి కావాలని మాదాల ఆకాంక్షించేవారని సీపీఐ తెలంగాణ ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.. ఆయన ఆకాంక్షకు అనుగుణంగానే తమ వైఖరి కూడా ఉందన్నారు.  మాదాల రంగారావు తన జీవితాంతం సమాజ హితం కోసం పనిచేశారని తెలంగాణ టీడీపీ నాయకులు ఎల్‌. రమణ గుర్తు చేసుకున్నారు. వామపక్ష ఉద్యమాన్ని తెలుగు చిత్రాలతో ప్రజలకు తెలిసేలా కృషి చేసి మాదాల రంగారావు ఎనలేని కృషి చేశారని స్మరించుకున్నారు నేతలు. 

 

19:51 - June 6, 2018

ఖమ్మం : సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లిలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్షుద్ర పూజలు చేసి ఓ ఇంట్లో లంకెబిందెలు తీస్తామని నమ్మించి బాలింతపై అత్యాచారం చేసాడు ఓ మంత్రగాడు... విషయం తెలుసుకున్న స్థానికులు మంత్రగాడు నక్ష్మీనర్సయ్య, అతని అనుచరున్ని కరెంట్‌ పోల్‌కు కట్టేసి దేహశుద్ది చేశారు.

19:49 - June 6, 2018

యాదాద్రి : కౌలు రైతులకు రైతుబంధు వర్తించదనడం దారుణమని టీమాస్‌ ఫోరం చైర్మన్‌ కంచ ఐలయ్య అన్నారు. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వనందున.. ప్రతి ఏడాదిలా కాకుండా ఈ ఏడాది ప్రతి ఎకరానికి నాలుగు వేల రూపాయలు తక్కువ కౌలు చెల్లించాలని కౌలు రైతులకు సూచించారు. 

 

19:46 - June 6, 2018

హైదరాబాద్ : వేతన సవరణ కమిషన్‌ చైర్మన్‌ తీరుపై.. తెలంగాణ ప్రభుత్వోద్యోగులు ఫైర్‌ అవుతున్నారు. అవగాహన లేని ఉన్నతాధికారుల వైఖరి వల్ల.. తాము మధ్యంతర భృతిని కోల్పోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. ఐఆర్‌ ఇచ్చేందుకు సీఎం రెడిగా ఉన్నా.. నివేదిక రూపొందించని.. పీఆర్సీ చైర్మన్‌ శైలిపై ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు. పీఆర్సీ చైర్మన్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు .

తమకు మధ్యంతర భృతి ఇచ్చేందుకు.. స్వయంగా ముఖ్యమంత్రే అంగీకరించినా.. ఉన్నతాధికారుల తీరుతో నష్టపోవాల్సి వచ్చిందని.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారంతా.. బుధవారం పీఆర్సీ చైర్మన్‌ను కలిశారు. జులై నెలాఖరుకు ఎలాంటి పొరపాట్లూ లేని పూర్తిస్థాయి నివేదికను.. అందించాలని.. ఆ సిఫారసులను ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి తేవాలనీ విన్నవించారు. 

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన ఐఆర్‌ ప్రకటిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, అయితే.. పీఆర్సీ నివేదిక అందని కారణంగా.. సీఎం కూడా మౌనం పాటించారని ఉద్యోగులు అంటున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక.. బిస్వాల్‌ నేతృత్వంలో ప్రభుత్వం తొలి పేరివిజన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.  ఈ కమిటీ నివేదికను సకాలంలో అందించని కారణంగా.. మధ్యంతర భృతిని పొందలేక పోయామని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 

పదోన్నతులు లేని పోస్టుల్లో.. ప్రమోషన్‌లు కల్పించేలా నివేదికను రూపొందించాలని ఉద్యోగ సంఘాల నాయకులు పీఆర్సీ చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15నాటికి పీఆర్సీ నివేదిక ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పీఆర్సీ చైర్మన్‌ వారికి హామీ ఇచ్చారు. రెండున్నర సంవత్సరాల పీఆర్సీని కోల్పోయామని, కామన్‌ కేటగిరీలకు అన్యాయం జరగకుండా చూడాలని ఉద్యోగులు కోరారు. 

19:43 - June 6, 2018

విజయవాడ : బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావుపై ఏపీ ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ కుటుంబరావు విరుచుకుపడ్డారు. ఏపీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పై అబాండాలు వేస్తున్నారని.. ట్విట్టర్‌ హీరోగా చెలామణీ అవుతున్న జీవీఎల్‌.... లోకేష్‌ ట్విట్టర్‌ పోస్టుకు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. మరోవైపు వైసీపీ నేతల వ్యాఖ్యలపై కుటుంబరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామంటున్న జగన్‌ మాటలు నమ్మొద్దన్నారు. 

19:39 - June 6, 2018

విజయవాడ : తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు చేసేవన్నీ తప్పుడు పనులేనని తీవ్రంగా విమర్శించారు. కేంద్రమంత్రిగా పనిచేసిన నాలుగేళ్ళ కాలంలో.. అశోక్‌గజపతిరాజు మూడు పెద్ద అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఎయిర్‌ ఏషియా కుంభకోణంపై ఆడియో టేపులు వెలుగు చూసిన నేపథ్యంలో.. బొత్స ఈ ఆరోపణలు చేశారు.

 

19:16 - June 6, 2018

ఢిల్లీ : కీలక వడ్డీ రేట్లను పావు శాతం పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 6 శాతం నుంచి 6.25 శాతానికి పెరిగింది. రివర్స్‌ రెపో రేటు 5.75 శాతం నుంచి 6 శాతానికి పెంచారు. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ రెపో రేటు పావుశాతం పెంచుతూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.  ద్రవ్యోల్బణ భయాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటమే రేట్ల పెంపునకు కారణమని తెలుస్తోంది. ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచడం గత నాలుగున్నరేళ్లలో ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక సంవతర్సంలో 7.4 శాతం వృద్ధిరేటు నమోదు కావచ్చని ఆర్బీఐ అంచనా వేసింది.

 

19:11 - June 6, 2018

భూపాల్ : మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే...10 రోజుల్లోపే  రైతులకు రుణమాఫీ చేస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. మందసౌర్‌లో రైతులపై పోలీసులు కాల్పులు జరిపి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన ప్రసంగించారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు 10 రోజుల్లోనే న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. మోది ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర లభించలేదని, యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించలేదని, విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. పారిశ్రామిక వేత్తలకు రెండున్నర లక్షల కోట్లు రుణాలు మాఫీ చేసిందని...రైతులకు మాత్రం మొండి చేయి చూపిందని రాహుల్‌ ధ్వజమెత్తారు. 

 

19:04 - June 6, 2018

నల్గొండ : రైతు బంధు పథకం ద్వారా రైతుల కంటే భూస్వాములకే మరింత మేలు చేస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి తహశీల్దార్‌ కార్యాలయం ముందు జరిగిన రైతుల ధర్నాలో జూలకంటి పాల్గొన్నారు. పల్లెలు వదిలి పట్టణాల్లో వ్యాపారాలు చేసుకుంటున్న వందలాది ఎకరాలు ఉన్న బడా భూస్వాములకు రైతులకు ప్రభుత్వం.. అదే గ్రామాల్లో ఉంటున్న నిరుపేద రైతులను పట్టించుకోవడం లేదని.. వెంటనే వారికి న్యాయం చేయాలని జూలకంటి డిమాండ్‌ చేశారు. 

 

పట్టుబడిన 27 లక్షలపైగా విదేశీ కరెన్సీ

హైదరాబాద్‌ : కస్టమ్స్‌ అధికారులు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ఓ ప్రయాణీకుడి నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారంతో పాటు విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అధకారుల తనిఖీల్లో ఇరవై ఏడు లక్షలపైగావిదేశీ కరెన్సీని పట్టుబడింది. సౌదీ, ఒమన్‌ దేశాలకు చెందిన డాలర్లు ఈ తనిఖీల్లో వెలుగు చూశాయి. వీటిని షార్జాలో డెలివరీ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు సమాచారం. నిందితున్ని అదుపులోకి తీసుకుని.. విచారణ చేస్తున్నారు. 

 

19:00 - June 6, 2018

హైదరాబాద్‌ : కస్టమ్స్‌ అధికారులు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ఓ ప్రయాణీకుడినుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారంతో పాటు విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అధకారుల తనిఖీల్లో ఇరవై ఏడు లక్షలపైగావిదేశీ కరెన్సీని పట్టుబడింది. సౌదీ, ఒమన్‌ దేశాలకు చెందిన డాలర్లు ఈ తనిఖీల్లో వెలుగు చూశాయి. వీటిని షార్జాలో డెలివరీ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు సమాచారం. నిందితున్ని అదుపులోకి తీసుకుని.. విచారణ చేస్తున్నారు. 

 

18:58 - June 6, 2018

కామారెడ్డి : జిల్లాలో ముగ్గురు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. తన ముగ్గురు పిల్లలకు పురుగుల మందు తాగించి.. తానూ కూడా సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది సుజాత. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన వారిని సిరిసిల్ల రాజన్న జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. 

18:51 - June 6, 2018

హైదరాబాద్ : ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభం కానున్న చేపమందు ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులతో కలిసి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ను పరిశీలించారు. గత ఏడాది జరిగిన లోటు పాట్లను సరిదిద్దుకొని, ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. 

 

18:47 - June 6, 2018

కర్నూలు : తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితులో.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోదని కర్నూలులో ఏపీ ఉప ముఖ్యమంత్రి  కేయీ కృష్ణమూర్తి  స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితులు ఎదురైతే ఉరి వేసుకుంటానన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ రెండుగా విడదీసింది..  ఏపీ ప్రజలు దీనిపై ఆగ్రహంతో ఉన్నారని అటువంటి పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. నవ్యాంధ్ర అభివృద్ధిపై సూచనలు సలహాలు ఇవ్వకుండా ప్రతిపక్ష నేత జగన్‌ నిందలు వేస్తున్నారని ఆరోపించారు.

18:39 - June 6, 2018

కడప : కేంద్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా ఇవ్వకుండా కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందన్నారు. ఐదో రోజు జరిగిన నవ నిర్మాణదీక్షలో ఆయన మాట్లాడారు. ప్రత్యేకహోదా ఇస్తామని అన్ని మీటింగ్ లలో ప్రధాని మోడీ చెప్పారని...హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. 11 రాష్ట్రాలకు హోదాతో సమానమైనవన్ని ఇచ్చారని..ఏపీకి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించానని తెలిపారు. బీజేపీపై తాను పోరాటానికి సిద్ధమయ్యానని చెప్పారు.
వైసీపీ ఎంపీలు డ్రామాలు 
వైసీపీ ఎంపీలు రాజీనామాల డ్రామాలు ఆడారని విమర్శించారు. ఎన్నికలు పెడితే వైసీపీకి భయం అన్నారు. బీజేపీతో వైసీపీ లాలూచీ పడుతూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఒకవైపు రాజీనామాలు చేస్తున్నామని చెబుతూ మరోవైపు వైసీపీ ఎంపీలు జీతాలు తీసుకున్నారని ఆరోపించారు. లాలూచీ రాజకీయాల చేసే వారిని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అన్నారు.

 

స్కూల్ లో తల్లికి వందనం కార్యక్రమం తీసుకొచ్చాం : సీఎం చంద్రబాబు

కడప : స్కూల్ లో తల్లికి వందనం కార్యక్రమం తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. బడికొస్తా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి... ఆడపిల్లలకు సైకిల్స్ ఇప్పించామని తెలిపారు. కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్లు పెట్టామన్నారు. డిజిటల్ క్లాస్ రూమ్ లు, వర్చువల్ క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. గురువు చాలా ముఖ్యమని..గురువు లేకుండా విద్య లేదన్నారు. గురువుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. టీచర్ ను విద్యార్థులు, సమాజం గౌరవించాలన్నారు. విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇస్తున్నామని.. 22 లక్షల మందికి 3582 కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 409 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని తెలిపారు.

టెక్నాలజీని ఉపయోగించుకోవాలి : సీఎం చంద్రబాబు

కడప : పుస్తకాలను బట్టిపట్టవద్దు... ఆడుకుంటూ పాడుకుంటూ చదువు కోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. జీవితంలో ఆటలు, కల్చరల్ ప్రోగామ్ లు భాగంగా కావాలని పేర్కొన్నారు. ప్రశాతంగా చదువుకోవాలని.. టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. 'మీరు చదువుకున్న నాలెడ్జ్ ను మీ ప్రాంతంలోని సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలి' అని అన్నారు. ఇప్పుడు చేసే పనిని విభిన్నంగా చేయడమే ఇన్నోవేషన్ అని అన్నారు. విద్యాలయాలు ప్రయోగశాలలుగా తయారు కావాలన్నారు. వినూత్నమైన ఆలోచనలకు చాలా అవకాశాలుంటాయని తెలిపారు. ఐటీనే కాదు..నాలెడ్జ్ ను కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే పది వేల మంది టీచర్స్ ను రిక్రూట్ చేశామని..

ఫాతిమా కాలేజీ విద్యార్థులకు ఇక్కడే అడ్మిషన్స్ ఇప్పిస్తాం : సీఎం చంద్రబాబు

కడప : నీట్ లో పాస్ అయిన ఫాతిమా కాలేజీ విద్యార్థులకు ఇక్కడే అడ్మిషన్స్ ఇప్పిస్తామని....ఫెయిల్ అయినవారికి డబ్బులు ఇప్పిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. చెప్పారు. పిల్లలను కళాశాల మేనేజ్ మెంట్ మోసం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇటీవల విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో 69 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారని తెలిపారు. జేఈఈలో 12 శాతం పాస్ అయ్యారని పేర్కొన్నారు. టాప్ పది ర్యాంకుల్లో టాప్ 3 ఏపీ నుంచి, తెలంగాణ నుంచి టాప్ 2 ర్యాంకులు వచ్చాయన్నారు. నీట్ కు 100 మంది సెలెక్ట్ అయ్యారని తెలిపారు. 

ఏపీ నాలెడ్జ్ హబ్ కావాలన్న సీఎం చంద్రబాబు

కడప : విద్యార్థులు వినూత్నంగా ముందుకు పోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ నాలెడ్జ్ హబ్ కావాలని చెప్పారు. కడపలో ఐదో రోజు నవనిర్మాణ దీక్షలో ఆయన మాట్లాడారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఇన్నోవేషన్ కు నాంది అని.. భారతదేశంలో ఇన్నోవేషన్ కు ఏపీ నాంది కావాలన్నారు. ప్రపంచం నాలెడ్జ్ వైపు ముందుకు వెళ్తుందన్నారు. ప్రపంచం మొత్తంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏపీ ముందుందని తెలిపారు. 

18:01 - June 6, 2018

కడప : విద్యార్థులు వినూత్నంగా ముందుకు పోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ నాలెడ్జ్ హబ్ కావాలని చెప్పారు. కడపలో ఐదో రోజు నవనిర్మాణ దీక్షలో ఆయన మాట్లాడారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఇన్నోవేషన్ కు నాంది అని.. భారతదేశంలో ఇన్నోవేషన్ కు ఏపీ నాంది కావాలన్నారు. ప్రపంచం నాలెడ్జ్ వైపు ముందుకు వెళ్తుందన్నారు. ప్రపంచం మొత్తంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏపీ ముందుందని తెలిపారు. నీట్ లో పాస్ అయిన ఫాతిమా కాలేజీ విద్యార్థులకు ఇక్కడే అడ్మిషన్స్ ఇప్పిస్తామని....ఫెయిల్ అయినవారికి డబ్బులు ఇప్పిస్తామని చెప్పారు. పిల్లలను కళాశాల మేనేజ్ మెంట్ మోసం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇటీవల విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో 69 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారని తెలిపారు. జేఈఈలో 12 శాతం పాస్ అయ్యారని పేర్కొన్నారు. టాప్ పది ర్యాంకుల్లో టాప్ 3 ఏపీ నుంచి, తెలంగాణ నుంచి టాప్ 2 ర్యాంకులు వచ్చాయన్నారు. నీట్ కు 100 మంది సెలెక్ట్ అయ్యారని తెలిపారు. 
టెక్నాలజీని ఉపయోగించుకోవాలి..
పుస్తకాలను బట్టిపట్టవద్దు... ఆడుకుంటూ పాడుకుంటూ చదువు కోవాలని సూచించారు. జీవితంలో ఆటలు, కల్చరల్ ప్రోగామ్ లు భాగంగా కావాలని పేర్కొన్నారు. ప్రశాతంగా చదువుకోవాలని.. టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. 'మీరు చదువుకున్న నాలెడ్జ్ ను మీ ప్రాంతంలోని సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలి' అని అన్నారు. ఇప్పుడు చేసే పనిని విభిన్నంగా చేయడమే ఇన్నోవేషన్ అని అన్నారు. విద్యాలయాలు ప్రయోగశాలలుగా తయారు కావాలన్నారు. వినూత్నమైన ఆలోచనలకు చాలా అవకాశాలుంటాయని తెలిపారు. ఐటీనే కాదు..నాలెడ్జ్ ను కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే పది వేల మంది టీచర్స్ ను రిక్రూట్ చేశామని.. మరో పది వేల మందిని రిక్రూట్ మెంట్ చేస్తామని చెప్పారు.
తల్లికి వందనం.. 
స్కూల్ లో తల్లికి వందనం కార్యక్రమం తీసుకొచ్చామని తెలిపారు. బడికొస్తా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి... ఆడపిల్లలకు సైకిల్స్ ఇప్పించామని తెలిపారు. కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్లు పెట్టామన్నారు. డిజిటల్ క్లాస్ రూమ్ లు, వర్చువల్ క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. గురువు చాలా ముఖ్యమని..గురువు లేకుండా విద్య లేదన్నారు. గురువుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. టీచర్ ను విద్యార్థులు, సమాజం గౌరవించాలన్నారు. విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇస్తున్నామని.. 22 లక్షల మందికి 3582 కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 409 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని తెలిపారు. ఓపెన్ యూనివర్సిటీల ద్వారా అందరూ చదువుకోవాలన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా నిరంతరం విద్య నేర్చుకోవాలని పేర్కొన్నారు. 
వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి 
డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 50 జూనియర్ కళాశాలలు, 15 డిగ్రీ కాళాశాలలను మంజూరు చేస్తామన్నారు. విద్యకు ఎనలేని ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. 284 ఎంవోయూలు చేశామని..వీటిని పూర్తి చేస్తే రాష్ట్రానికి 16 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 11 యూనివర్సిటీలను ఇస్తామని ప్రకటించిందని..కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నారు. 11 వేల కోట్లు విలువ చేసే భూములు ఇస్తే..యూనివర్సిటీలను మంజూరు చేయలేదని..పోరాడి యూనివర్సిటీలను సాధించుకోవాలన్నారు. 

 

17:13 - June 6, 2018

హైదరాబాద్ : ఉద్యమ ఆంకాంక్షలు నెరవేర్చుకునే లక్ష్యంతో ఏర్పడిన తెలంగాణ జనసమితిలో కొత్త నాయకులతో తలనొప్పులు మొదలయ్యాయి..వివిధ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో టి.జె.యస్ కు వలసలు వెల్లువెత్తాయి..దీంతో పాత వారికి ప్రాధాన్యత తగ్గుతుందంటూ కొందరు టి.జె.యస్ నేతలు వాపోతున్నారు...పార్టీ బలోపేతంలో బి.జీగా ఉన్న పార్టీ అధీనేత..పాత వారినికి ప్రాధాన్యత తగ్గిస్తున్నారా.. వాచ్‌ దిస్‌ స్టోరీ.. 
తెలంగాణ పుననిర్మాణ లక్ష్యంగా ఆవిర్భవించిన టీజేఎస్‌ 
తెలంగాణ పుననిర్మాణమే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ జనసమితిలో  వివిధ పార్టీల చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టి.జె.యస్ లోకి చేరుతున్నారు.  దీనితో కొత్త నేతలకు ప్రాధాన్యత క్రమంగా పెరుగుతుందని....  ఉద్యమం సమయం నుంచి  కొదండరామ్ ను నమ్ముకుని ఉన్న నేతలు దీగాలు చెందుతున్నారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటి..తెలంగాణ జనసమితిగా మారి పోవడంతో ఉద్యమ సమయంలో కొదండరామ్ తో కలిసి పని చేస్తున్న నాయకులందరు తెలంగాణ జనసమితి జెండా నిడలోకి వచ్చిచేరారు..
సభ్యత్వ నమోదులో ముందున్న జనసమితి 
తెలంగాణ జనసమితి  సభ్యత్వ నమోదులో ముందు వరుసలోఉంది..ఇంత వరకు బాగానే ఉంది..కానీ అసలు తలనొప్పి ఇక్కడే మొదలైంది..  కొత్తగా వచ్చిన నాయకులు వచ్చి రావడంతోనే సార్వత్రిక ఎన్నికల్లో  గెలుపే లక్ష్యంగా ఆయా ఆయా నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు..అయితే టి.జాక్ లో కొదండరామ్ తో కలిసి పని చేసిన నేతలకు టీజేఎస్‌పార్టీ ఆవిర్భవించిన నాటినుంచి క్రమక్రమంగా పార్టీలో స్ధానం  తగ్గుతూ వస్తుండడం..గతంలో పొల్చకుంటే తాజాగా పార్టీలో అనుకున్నంత ప్రాధాన్యత లేక పోవడంతో చాలా కీనుకుగా ఉన్నట్లు కొందరు నేతలు బాహాటంగా పెదవి విరుస్తున్నారు.. ఇప్పుడే పార్టీలో పరిస్ధితి ఇలా ఉంటే.. భవిష్యత్తులో తమ పరిస్ధితి ఏంటో అన్ని ఆవేదన లో ఉన్నారు..కొందరు నేతలు. ఉద్యమ సమయంలో టి.జాక్ ఎంతో బాగుడుందేని, కులాలుప్రాంతాలనే బేధాలు లేకుండా అందరు ఒక తాటిపై పని చేసేవారిమని..కానీ టి.జె.యస్ పార్టీగా ఆవిర్భవించిన తరువాత పరిస్ధితులు తారుమార అవుతున్నాయని వారంటున్నారు. ఉద్యమం నుంచి  కొదండరామ్‌తో తాము పని చేస్తున్నామని కానీ గత కొద్ది రోజులుగా పార్టీలో పరిస్ధితులు మారుతున్నాయని కొదండరామ్ దగ్గరగా ఉండే నేతలు కొందరు తన స్ధాయిని తగ్గిస్తున్నారని వారు వాపోతున్నారు.

 

17:10 - June 6, 2018

హైదరాబాద్ : రెడ్‌ స్టార్‌ మాదాల రంగారావు సంస్మరణ సభ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు హాజరై మాదాల రంగారావును స్మరించుకున్నారు. నేటి తరం వారికి మాదాల రంగారావు ఆదర్శ ప్రాయమని హాస్యనటుడు బ్రహ్మానందం కొనియాడారు. ఆయన మాట్లాడే ప్రతి మాట గుండెలోతుల్లోంచి మాట్లాడేవారని గుర్తు చేశారు.

 

16:13 - June 6, 2018

ఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరానికి కష్టాలు తొలగడం లేదు. ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో ఇవాళ ఆయన సిబిఐ ముందు హాజరయ్యారు. ఈ కేసులో సిబిఐ ఆయనను ప్రశ్నిస్తోంది. ఈ కేసులో చిదంబరాన్ని సిబిఐ ప్రశ్నించడం ఇదే తొలిసారి. ఎయిర్‌ సెల్‌ మ్యాక్సిస్‌ కేసులో ఈడీ నిన్న ఆరున్నర గంటల పాటు చిదంబరాన్ని ప్రశ్నించింది. చిదంబరం విచారణకు పూర్తిగా సహకరించారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో చిందబరాన్ని జులై 10 వరకు అరెస్ట్‌ చేయొద్దని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడం కొంత ఊరట కలిగించింది. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని చిదంబరానికి ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందంలో మలేషియా కంపెనీ నుంచి 1230 కోట్లు లంచం తీసుకున్నట్లు ఈడీ ఆరోపిస్తోంది.

 

16:06 - June 6, 2018

ఢిల్లీ : తమ రాజీనామాల అంశం ఇక ముగిసిన అధ్యాయమేనని వైసీపీ ఎంపీలు ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. ఉప ఎన్నికలు ఎదుర్కోడానికి సిద్ధమవుతున్నామన్నారు. టీడీపీతో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని తెలిపారు. హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 

 

15:53 - June 6, 2018

బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావుతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనపై విమర్శించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

15:39 - June 6, 2018

బెంగళూరు : కర్నాటకలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు అయింది. కాంగ్రెస్ నుంచి 14, జేడీఎస్ నుంచి ఏడుగురు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. వారిచే గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. గ్లాస్ హౌస్ లో పదవీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.

15:33 - June 6, 2018

ఆదిలాబాద్ : స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రవాణ శాఖాధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. డ్రైవర్లతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ శ్యామ్ నాయక్ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

కాంగ్రెస్ నుంచి 14, జేడీఎస్ నుంచి ఏడుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం

బెంగళూరు : కర్నాటకలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు అయింది. కాంగ్రెస్ నుంచి 14, జేడీఎస్ నుంచి ఏడుగురు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. వారిచే గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. 

15:10 - June 6, 2018

ఢిల్లీ : తమ రాజీనామాలను ఆమోదించుకునేందుకు ఢిల్లీ వెళ్లిన వైసీపీ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్ తో భేటీ అయ్యారు.తమ రాజీనామాలను ఆమోదించాల్సింది వారు స్పీకర్ కు విజ్నప్తి చేశారు. కాగా రాజీనామాలకు సంబంధించిన రీకన్ఫర్మేషన్ లేఖల్ని సమర్పించాలని స్పీకర్ కోరారు. దీంతో రీకన్ఫర్మేషన్ లేఖలు అందగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించే అవకాశం కనిపిస్తోంది.

 

15:06 - June 6, 2018

బెంగళూరు : కర్నాటకలో మంత్రివర్గ విస్తరణ కొనసాగుతోంది. గ్లాస్ హౌస్ లో పదవీ ప్రమాణ స్వీకారం జరుగుతోంది. రేవణ్ణతో మంత్రిగా గవర్నర్ ప్రమాణం స్వీకారం చేయించారు. ఆర్ వి.దేశ్ పాండేతో ప్రమాణ స్వీకారం చేశారు.

లోక్ సభ స్పీకర్ తో ముగిసిన వైసీపీ ఎంపీల సమావేశం

ఢిల్లీ : లోక్ సభ స్పీకర్ తో వైసీపీ ఎంపీల సమావేశం ముగిసింది. మేకపాటి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి హాజరయ్యారు. తమ రాజీనామాలను తక్షణం ఆమోదించాలని ఎంపీలు కోరారు. 

 

కృష్ణానది యాజమాన్యం బోర్డు సమావేశం

హైదరాబాద్ : జలసౌధలో కృష్ణానది యాజమాన్యం బోర్డు సమావేశం జరుగుతోంది. ఛైర్మన్ సాహూ అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. బోర్డు సభ్య కార్యదర్శి, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎస్, ఈఎన్ సీ నాగేందర్, ఏపీ నుంచి జలవనరుల శాఖ కార్యదర్శి, ఈఎన్ సీ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. నీటి పంపకం, టెలీమెట్రి, బోర్డు నిర్వహణ అంశాలపై చర్చించనున్నారు. 

 

కర్నాటకలో కొనసాగుతున్న మంత్రివర్గ విస్తరణ

బెంగళూరు : కర్నాటకలో మంత్రివర్గ విస్తరణ కొనసాగుతోంది. గ్లాస్ హౌస్ లో పదవీ ప్రమాణ స్వీకారం జరుగుతోంది. రేవణ్ణతో మంత్రిగా గవర్నర్ ప్రమాణం స్వీకారం చేయించారు. ఆర్ వి.దేశ్ పాండేతో ప్రమాణ స్వీకారం చేశారు.
 

13:36 - June 6, 2018
13:35 - June 6, 2018

హైదరాబాద్ : మాదాల రంగారావు సంస్మరణ సభలో పలువురు వామపక్ష నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతు..నిలువెల్లా ఉద్యమాల కోసం పనిచేసిన గొప్ప నటుడు, కళాకారుడు, గొప్ప వ్యక్తి అని తమ్మినేని కొనియాడారు. ఎర్రజెండాను వెండితెరపై వెలిగించిన నాయకుడు మాదాల రంగారావు అని తమ్మినేని పేర్కొన్నారు. వామపక్ష రాజకీయాలకు మాదాల రంగారావు మృతి తీరని లోటన్నారు. గతంలో హాస్పిటల్ లో చూసేందుకు వెళ్లిన సందర్భంగా కమ్యూనిస్టు ఉద్యమాలపై మాట్లాడారని తమ్మినేని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జాతీయ అధ్యక్షులు సురవరం సుధాకర్ రెడ్డి తో పాటు పలువురు వామపక్ష నేతలు పాల్గొన్నారు. 

13:18 - June 6, 2018
12:47 - June 6, 2018
12:21 - June 6, 2018

ఢిల్లీ : తమ రాజీనామాలను ఆమోదించుకునేందుకు ఢిల్లీ వెళ్లిన వైసీపీ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్ తో భేటీ అయ్యారు.తమ రాజీనామాలను ఆమోదించాల్సింది వారు స్పీకర్ కు విజ్నప్తి చేశారు. కాగా రాజీనామాలకు సంబంధించిన రీకన్ఫర్మేషన్ లేఖల్ని సమర్పించాలని స్పీకర్ కోరారు. దీంతో రీకన్ఫర్మేషన్ లేఖలు అందగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించే అవకాశం కనిపిస్తోంది.

స్పీకర్ తో భేటీ అయిన వైసీపీ ఎంపీలు..
తమ పదవులకు రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు కాసేపటి క్రితం లోక్ సభ స్పీకర్ సుమిత్రామహాజన్ కార్యాలయానికి చేరుకుని, ఆమెతో భేటీ అయ్యారు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని మరోసారి ఆమెను కోరారు. స్పీకర్ ను కలిసిన వారిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్ ఉన్నారు. వీరి రాజీనామాలపై స్పీకర్ ఈరోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు రాజీనామాలు..
గత పార్లమెంటు సమాశాల చివరి రోజు అయిన ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు స్పీకర్ ఫార్మాట్ లో వైసీపీ ఎంపీలు రాజీనామాలను సమర్పించారు. అయితే రాజీనామాలను సుమిత్ర పెండింగ్ లో పెట్టారు. మే 29న స్పీకర్ ను కలిసిన ఎంపీలు తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు. అయితే, ప్రత్యేక హోదాకు సంబంధించిన భావోద్వేగాలతోనే రాజీనామా చేస్తున్నట్టు తాను భావిస్తున్నానని... మరోసారి ఆలోచించుకోవాలని ఎంపీలకు సుమిత్ర చెప్పి పంపించారు. ఇప్పుడు తమ రాజీనామాలను ఆమోదించాలని ఎంపీలు పట్టుబడితే... స్పీకర్ రాజీనామాలను ఆమోదించే అవకాశమే ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

వైసీపీని రీకన్ఫర్మేషన్ కోరిన స్పీకర్..

ఢిల్లీ : తమ రాజీనామాలను ఆమోదించుకునేందుకు ఢిల్లీ వెళ్లిన వైసీపీ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్ తో భేటీ అయ్యారు.తమ రాజీనామాలను ఆమోదించాల్సింది వారు స్పీకర్ కు విజ్నప్తి చేశారు. కాగా రాజీనామాలకు సంబంధించిన రీకన్ఫర్మేషన్ లేఖల్ని సమర్పించాలని స్పీకర్ కోరారు. దీంతో రీకన్ఫర్మేషన్ లేఖలు అందగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. 

320 మంది మందుబాబులకు శిక్ష ఖరారు..

హైదరాబాద్ : పోలీసులు మందు బాబులకు మత్తు వదిలిస్తున్నారు. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, జీడిమెట్ల, బాలాపూర్, రాజేంద్రనగర్, శంషాబాద్, అల్వాల్, షాద్ నగర్ లలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 1,373 మంది మందు తాగి, వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కూకట్ పల్లి, మేడ్చల్, రాజేంద్రనగర్ న్యాయస్థానాల్లో ఛార్జిషీట్లు దాఖలు చేశారు. అయితే, కేసు నమోదైన వారిలో కేవలం 773 మంది మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. కేసులను విచారించిన న్యాయమూర్తులు 320 మందికి శిక్షను ఖరారు చేశారు.

11:58 - June 6, 2018

మాజీ ప్రపంచ సుందరి, మోడల్, బాలీవుడ్ నటి అయిన ప్రియాంక చోప్రో వివాహం గురించి ఆమె తల్లి మధు చోప్రా సంచలన నిర్ణయాన్ని తెలిపారు. తమిళ చలన చిత్రం ద్వారా నట జీవితాన్ని ప్రారంభించిన ప్రియాంకా చోప్రా అనిల్ శర్మ దర్శకత్వంలో వెలువడిన 'ది హీరో లవ్ స్టోరీ ఆఫ్ ఎస్సై మూవీతో బాలివుడ్ లో అడుగిన ప్రియాంక అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్ గా స్థాయికి ఎదిగింది. రాజ్ కన్వర్ దర్శకత్వంలో వచ్చిన 'అందాజ్' చిత్రానికి గాను ప్రియాంక ఫిలింఫేర్ ఉత్తమ మహిళా రంగ ప్రవేశ పురస్కారాన్ని గెలుచుకున్నారు. అనంతరం అబ్బాస్ మస్తాన్ ల దర్శకత్వంలో వచ్చిన 'ఐత్రాజ్' లో ఆమె కనబరిచిన నటన విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకున్నారు. ఫిలింఫేర్ ఉత్తమ మహిళా విలన్ పురస్కారం అందుకున్న రెండవ మహిళగా ప్రియాంకా చోప్రా నిలిచారు. అశోక్ చోప్రా మరియు మధు అఖౌరి వైద్య దంపతులకు జార్ఖండ్‌లోని జమ్‌షెడ్‌పూర్‌లో చోప్రా మంచి నటిగా పేరు తెచుకుంది. అటువంటి ప్రియాంకా చోప్రా వివాహ విషయంలో ఆమె తల్లి మధు చోప్రా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

హాలీవుడ్‌ నటుడు నిక్‌ జోనాస్‌తో ప్రేమలో ప్రియాంక
ప్రియాంక పెళ్ళి చేసుకోకపోయినా ఫర్వాలేదు, కానీ విదేశీ వ్యక్తిని మాత్రం నేను అల్లుడిగా ఒప్పుకోను' అని ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా స్పష్టం చేశారు. గత కొంత కాలంగా ప్రియాంక చోప్రా, హాలీవుడ్‌ నటుడు నిక్‌ జోనాస్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ప్రియాంక తల్లి మధు చోప్రా ఓ ఓ సందర్భంగా స్పందించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదు. ప్రియాంక పెళ్ళి చేసుకోకపోయినా ఫర్వాలేదు, కానీ విదేశీ వ్యక్తిని అల్లుడిగా తీసుకొస్తే ఒప్పుకోను. దంపతులు ఒకే కులానికి చెందిన వారైతేనే వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. విదేశీ వ్యక్తిని ప్రియాంక పెళ్ళి చేసుకుంటే నేను భరించలేను. ఒకవేళ ప్రియాంకకు సరైన వ్యక్తి దొరక్క పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయినా నాకెలాంటి అభ్యంతరం లేదు' అని మధు చోప్రా అన్నారు.

11:54 - June 6, 2018

ఢిల్లీ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ.. పదవులకు రాజీనామా సమర్పించిన వైసీపీ ఎంపీలు.. వాటి ఆమోదింప చేసుకునేందుకు హస్తిన చేరారు. ఏప్రిల్‌ నెల్లోనే వీరు తమ రాజీనామాలను సమర్పించారు. అయితే.. స్పీకర్‌ సుమిత్రామహాజన్‌. ఈ నేపథ్యంలో వారి రాజీనామాలను పెండింగ్‌లో పెట్టారు. ఈ నేపథ్యంలో.. వైసీపీ ఎంపీలు తమ రాజీనామాలను ఆమోదింప చేసుకునేందుకు బుధవారం స్పీకర్‌ సుమిత్రా మహాజన్ తో వైసీపీ ఎంపీలు భేటీ అయ్యారు. తమ రాజీనామాల ఆమోదంపై స్పీకర్ తో చర్చిస్తున్నారు. 

11:44 - June 6, 2018

సంగారెడ్డి : జిన్నారం మండలం గడ్డిపోతారంలోని పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాహాని జరగలేదు. కానీ కోట్ల రూపాల ఆస్తికి నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదానికి షార్ట్ సర్య్కూలే కారణంగా తెలుస్తోంది.

11:07 - June 6, 2018

చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదుల హతం..

జమ్ము కశ్మీర్ : సరిహద్దు ప్రాంతాలో చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించటంలో భారత భద్రతాదళాలు హతమార్చటం పరిపాటిగా మారిపోయింది.ఈ నేపథ్యంలో మదిల్ సెక్టార్ లో ఉగ్రవాదులు చొరబడేందుకు యత్నించారు. ఇది గమనించిన భద్రతా దళాలు ఉగ్రవాదులను హతమర్చాయి. 

గడ్డిపోతారంలో అగ్నిప్రమాదం..

సంగారెడ్డి : జిన్నారం మండలం గడ్డిపోతారంలోని పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలోని మెట్రోకెమ్ పరిశ్రమలో మంటలు ఎగసిపడుతున్నాయి. పరిశ్రమలో మంటలు ఆర్పేందుకు స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు.

బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరో ఘాటు వ్యాఖ్యలు!!

ఉత్తరప్రదేశ్ : ఎవరైనా లంచం అడిగితే పిడిగుద్దులు గుద్దండి అంటూ తన మద్దతుదారులకు వివాదాస్పద సలహాలు ఇచ్చి వార్తల్లో నిలిచిన యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్, ఈ సారి తన వాణిలో మరింత వేడిని పుట్టించారు. కాస్త ఘాటైన వ్యాఖ్యల్నే చేశారు. ప్రభుత్వ అధికారులకన్నా వ్యభిచారిణిలు నయమని అన్నారు. వారు డబ్బు తీసుకుని, కనీసం చేయాల్సిన పని చేస్తారని, అవసరమైతే డ్యాన్సులు కూడా చేస్తారని, అధికారులు మాత్రం డబ్బు తీసుకుని కూడా పని చేసి పెట్టరని, వారు పని చేస్తారన్న గ్యారెంటీ కూడా ఉండదని ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

మెడికల్ సీట్లలో కుంభకోణం..ఏసీబీ దాడులు..

హైదరాబాద్: స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశం ఇంట్లో అవినీతి నిరోదక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. వెంకటేశంతో పాటు మరో నలుగురి ఇళ్లల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. నకిలీ పత్రాలతో కొందరు స్పోర్ట్స్ కోటా కింద మెడికల్ సీట్లు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలపై గతంలో సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారు.

09:45 - June 6, 2018

హైదరాబాద్ : స్పోర్డ్స్ కోటాలో కేటాయించిన మెడికల్ సీట్లలో కుంభకోణం జరిగిందనే ఆరోపణలో వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని ఐదుచోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశం ఇంట్లో అవినీతి నిరోదక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. వెంకటేశంతో పాటు మరో నలుగురి ఇళ్లల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. నకిలీ పత్రాలతో కొందరు స్పోర్ట్స్ కోటా కింద మెడికల్ సీట్లు పొందినట్లు మీడియాలో ఆరోపణలు రావటంతో సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారు. దీంతో శాట్స్ డైరెక్టర్ వెంకటరమణ ఇంటితో సహా ఐదు ప్రాంతాలలో ఏసీబీ దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టింది. మీడియాలో వార్తల నేపథ్యంలో సీఎం ఆదేశంతో ప్రభుత్వం ద్విసభ్య కమిటీ వేసి విచారణకు ఆదేశించింది. హబ్సిగూడ, ఎల్బీస్టేడియంతో పాటు శాట్స్ కమిటీలో వున్న ఐదుగురు ఇళ్ళలో ఏసీబీ సోదాలు కొనసాగిస్తోంది. 

తిరుమలలో తమిళనాడు పోలీసుల హల్ చల్..

తిరుమల : తిరుమలలలో మరోసారి భద్రతా వైఫల్యం బైటపడింది. అర్థరాత్రి తమిళనాడు పోలీసులు హల్ చల్ చేశారు. ఓ హత్య కేసులో వున్న తమిళనాడుకు చెందిన 11మంది నిందితులను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమలకు చెందిన విజిలెన్స్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే నిందితులను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేయటంతో తిరుమలలో భద్రతాలోపం బైటపడింది. 

09:19 - June 6, 2018

ప్రకాశం: జిల్లాలోని త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కర్నూలు నుంచి విజయవాడకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలతో సహా నలుగురు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కారు, లారీ ఢీ..నలుగురు మృతి..

ప్రకాశం: జిల్లాలోని త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కర్నూలు నుంచి విజయవాడకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలతో సహా నలుగురు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కిలోన్నర బంగారం స్వాధీనం..

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో కిలోన్నర బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

విద్యుత్ ఘాతానికి ఇద్దరు మహిళలు మృతి..

తూర్పుగోదావరి : విద్యుత్ ఘాతానికి మరో ఇద్దరు బలయ్యారు. మలికిపురం పద్మజా థియేటర ఎదురుగా వున్న కుళాయిలో నీళ్లు పడుతుండగా మహిళలు విద్యుత్ ఘానికి మృతి చెందారు. మృతులు నల్లి వరలక్ష్మీ,నల్లి రత్నకుమారిలుగా స్థానికులు గుర్తించారు. 

09:04 - June 6, 2018

విశాఖపట్నం : జనసేన పవన్ కళ్యాణ్ పై వున్న అతి అభిమానం ఇద్దరి పాలిట యమపాశమైంది. జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటనను పురస్కరించుకుని అతి పెద్ద ఫ్లెక్సీలు కడుతుండగా విషాదం చోటుచేసుకుంది. ఫెక్సీ కట్టే యత్నంలో విద్యుత్ వైర్లను గమనించిన ఇద్దరు యువకులు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలయ్యారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఈ విషాదం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ ఈరోజు పాయకరావుపేట పర్యటించనున్నారు. దీంతో తమ అభిమాన హీరో రాకను పురస్కరించుకుని తునికి చెందిన తోళెం నాగరాజు, పాయకరావుపేటకు చెందిన శివ కలిసి స్థానిక సాయిమహల్ జంక్షన్ వద్ద స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనతో పాయకరావుపేటలో విషాదం నెలకొంది.

పవన్ బ్యానర్స్ కట్టబోయి..ఇద్దరు మృతి..

విశాఖపట్నం : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పర్యటనను పురస్కరించుకుని ఫ్లెక్సీలు కడుతుండగా విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై  ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఈ విషాదం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ నేడు ఇక్కడ పర్యటించనున్నారు. దీంతో తమ అభిమాన హీరో రాకను పురస్కరించుకుని తునికి చెందిన తోళెం నాగరాజు, పాయకరావుపేటకు చెందిన శివ కలిసి స్థానిక సాయిమహల్ జంక్షన్ వద్ద స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనతో పాయకరావుపేటలో విషాదం నెలకొంది.

08:46 - June 6, 2018

జగిత్యాల : అతి వేగం ప్రమాదకరమనీ..అది మీ కుటుంబాలకే కాక పలువురి కుటుంబాలలో విషాదాలను నింపుతుందనీ ఎంతగా చెప్పినా వినని వాహనదారులు వేగంగా నడిపి ప్రాణాలను కోల్పోతున్నారు. అంతేకాదు పలువురి ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నారు. అతి వేగంగా వాహనాలను నడిపి ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన కుటుంబంలో తీరని శోకం మిగిల్చింది. గొల్లపల్లి మండలం చిల్లకూడూరులో జరిగిన రోడ్డు ప్రమాదంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం బైక్ పై వెళ్తున్న ముగ్గురిని వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. స్థానికులు అందించిన సమచారంతో సంఘనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం రోడ్డు ప్రక్కల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ప్రమాదానికి గల కారాణాలను తెలుసుకునే యత్నం చేస్తున్నారు. మృతులు నిన్న అర్థరాత్రి ఓ పుట్టిన రోజు వేడుకకు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు చిప్ప రాములు, చిప్ప సందీప్, చిప్ప వినోద్ లుగా గుర్తించారు. కాగా ప్రమాదం జరిగిన తీరు చూస్తే అతి ప్రమాదమే కారణంగా స్థానికులు పేర్కొంటున్నారు.

08:36 - June 6, 2018

వైసీపీ ఎంపీల రాజీనామా అంశంపై.. పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పార్లమెంటులో డ్రామాలు ఆడింది మీరంటే మీరంటూ ఇరుపార్టీల నేతలూ ఆరోపణాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. వైసీపీ ఎంపీలు మరోమారు.. ఇవాళ ఢిల్లీలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలవనున్నారు. వైసీపీ ఎంపీల ఢిల్లీ యాత్రపై పాలక టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేతలూ ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఉప ఎన్నికలకు అవకాశం లేని రీతిలో.. వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలు ఆడుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసమైతే 2016లోనే రాజీనామా చేసి ఉండాల్సిందని ఎద్దేవా చేస్తున్నారు. రాజీనామాలు ఆమోదం పొందకుండా బీజేపీతో లోపాయకారీ వ్యవహారం నడుపుతోందని టీడీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ చర్చ. ఈ చర్చలో ఏపీ సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉమామహేశ్వర రావు, టీడీపీ నేత, ఏపీ వైసీపీ నేత రాజశేఖర్,

08:34 - June 6, 2018

గోవా : భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని గోవా, డమన్‌లకు చెందిన క్రైస్తవ మత గురువులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని, స్వేచ్ఛను కాపాడవలసిన బాధ్యత ప్రజలపై ఉందని గోవా ఆర్చ్‌బిషప్‌ ఫిలిప్‌ నేరీ ఫరారో క్రైస్తవులను ఉద్దేశించి రాసిన లేఖలో పేర్కొన్నారు. దేశంలో చాలామంది ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారని... వచ్చే సాధారణ ఎన్నికల్లో యాక్టివ్‌ రోల్‌ పోషించాల్సిన అవసరం ఉందని కాథలిక్కులకు ఫరారో సూచించారు. ప్రజాస్వామ్యంలో మానవ హక్కులకు భంగం కలుగుతోందని... ఇటీవల దేశంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఏం తినాలి....ఏ దుస్తులు వేసుకోవాలి...ఎవరిని పూజించాలి...అన్నది ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరిట పేదల భూములు, ఇళ్లను లాక్కుంటున్నారని ఫరారో లేఖలో వెల్లడించారు.

08:32 - June 6, 2018

అమెరికా : మధ్య అమెరికా దేశం గ్వాటెమాలాలో ప్యూగో అగ్నిపర్వతం బద్ధలైన ఘటనలో మృతుల సంఖ్య 69కి చేరింది. 3 వందల మందికి పైగా గాయపడ్డట్లు అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిపర్వతం బద్దలైన సమయంలో దాని చుట్ట పక్క ప్రాంతాల్లో కొందరు పొలం పనులు చేసుకుంటున్నారు. వారంతా లావాలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్యూగో నుంచి వెలువడిన లావా దాదాపు 8 కిలోమీటర్ల వరకు నది మాదిరిగా వేగంగా ప్రవహించింది. లావా ఇళ్లలోకి, రోడ్లపైకి ప్రవహించి చుట్టుపక్కల ప్రాంతాలను దహించివేసింది. ఈ క్రమంలో ఇళ్లకు మంటలు అంటుకుని కొందరు సజీవదహనమయ్యారు. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద సముద్ర మట్టానికి 12 వేల 346 అడుగుల ఎత్తువరకు ఎగిసి పడింది. 3 వేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

08:30 - June 6, 2018

గుజరాత్‌ : కచ్ జిల్లాలో భారత వాయుసేనకు చెందిన జాగ్వార్‌ ఫైటర్‌ జెట్ విమానం కూలిపోయింది. శిక్షణలో భాగంగా జామ్‌నగర్ నుంచి వెళ్లిన కాసేపటికే ముంద్రా గ్రామం వద్ద పొలాల్లో ఉదయం పదిన్నరకు విమానం కూలిపోయినట్లు డిఫెన్స్‌ అధికార ప్రతినిధి లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ మనీష్‌ ఓఝా ధృవీకరించారు. ఈ ప్రమాదంలో ఎయిర్‌ కమాండర్‌ సంజయ్ చౌహాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై భారత వాయుసేన అధికారులు విచారణకు ఆదేశించారు.

08:27 - June 6, 2018

ఢిల్లీ : సునందా పుష్కర్‌ మృతి కేసులో ఆమె భర్త, కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌పై విచారణ కొనసాగనుంది. ఈ మేరకు పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఢిల్లీ కోర్టు విచారణకు స్వీకరించింది. జులై 7న కోర్టుకు హాజరు కావాలని థరూర్‌కు సమన్లు జారీ చేసింది. సునంధ పుష్కర్‌ను థరూర్ ఆత్మహత్యకు ప్రేరేపించడం, వైవాహిక జీవితంలో ఆమె పట్ల క్రూరంగా ప్రవర్తించారని ఆరోపణలున్నాయి. ఐపీసీ సెక్షన్ 306, 498-ఎ ప్రకారం థరూర్‌ను విచారించడానికి కావలసిన ఆధారాణలున్నట్లు కోర్టు పేర్కొంది. సునంద మృతి చెందిన నాలుగేళ్ల తర్వాత ఢిల్లీ సిట్‌పోలీసులు పటియాల హౌస్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. థరూర్ సునందను వేధించినట్లు 3 వేల పేజీల చార్జిషీటులో పోలీసులు స్పష్టం చేశారు.

08:24 - June 6, 2018

ఢిల్లీ : మిత్రపక్షం శివసేనతో తిరిగి సయోధ్య కుదుర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారభించింది. 2019 ఎన్నికల్లో మద్దతు కూడగట్టేందుకు యత్నిస్తోంది. అందులో భాగంగా బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రేను బుధవారం సాయంత్రం 6 గంటలకు కలవనున్నారు. ముంబైలోని ఉద్దవ్‌ నివాసంలోనే వీరి భేటీ జరగనుందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వెల్లడించారు. నాలుగేళ్ల తర్వాత ఉద్దవ్‌ను కలవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించినట్లు ఆయన తెలిపారు. పాల్ఘర్‌ ఉప ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేశామని గుర్తు చేశారు. తాము ఓడిపోయినప్పటికీ ఈ ఎన్నికల్లో భారీగా ఓట్లు సాధించామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని శివసేన ఇటీవల ప్రకటించింది. గత కొంతకాలంగా బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడుతున్న ఉద్ధవ్‌తో అమిత్‌షా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

08:21 - June 6, 2018

అమరావతి : ఆస్తుల కొనుగోలుకు మరోసారి ముందుకొచ్చి జీఎస్‌ఎల్‌ గ్రూపు అందరినీ ఆశ్చర్య పరచగా... బాధితులకు కార్పస్‌ఫండ్‌ అందిస్తామని కోర్టు కు తెలిపిన ప్రభుత్వం.. ఎంతమేరకు ఇస్తారనేదాపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మరోసారి అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దార్లలో ఆందోళన మొదలైంది.

అగ్రిగోల్డ్‌ కేసులో మరో కొత్త మలుపు
అగ్రిగోల్డ్‌ ఆస్తుల విక్రయం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. గతంలో తాము ఆ కంపెనీ టేకోవర్‌కు వెనక్కు తగ్గిన జీఎస్ఎల్ గ్రూప్‌... తాజాగా హైకోర్టులో విచారణ సందర్భంగా... ఆస్తుల కొనుగోలుకు సిద్ధమని తెలిపింది. దాంతోపాటు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. అగ్రిగోల్డ్‌ కేసు విచారణ సందర్భంగా 10 ఆస్తులకు సంబంధించిన విలువను సీఐడీ.. కోర్టుకు సమర్పించింది. సీఐడీ సమర్పించిన ఆస్తుల విలువ చెప్పాలని అగ్రిగోల్డ్‌ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుకోసం తాము ఇచ్చిన పదికోట్ల రూపాయల డిపాజిట్లను తిరిగి ఇప్పించాలన్న అభ్యర్థనను జీఎస్‌ఎల్‌ గ్రూపు వెనక్కు తీసుకుంది. కేసు విచారణ సందర్భంగా బాధితుల తరపు న్యావాది వాదనతో ఏకీభవించిన కోర్టు జీఎస్‌ఎల్‌ గ్రూపుపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. కోర్టు సమయాన్ని వృధా చేస్తే ఊరుకోమని జీఎస్‌ఎల్‌ను హెచ్చరించింది. దీంతో పదికోట్ల రూపాయల డిపాజిట్లు వెక్కు ఇప్పించాలని వేసిన పిటిషన్‌ను జీఎస్‌ఎల్‌ గ్రూపు వెనక్కు తీసుకుంది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుకు మరోసారి అంగీకారం తెలిపింది.

అగ్రిగోల్డ్‌ కేసులు కొనుగోలు చేసేందుకు మళ్లీ ముందుకు వచ్చిన జీఎస్ఎల్ గ్రూప్‌
మరోవైపు.. అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రతిపాదనతో ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలవారీగా ఉన్నతస్థాయి కమిటీలు వేసి వాటి ద్వారా అగ్రిగోల్డ్‌ ఆస్తులను వేలం వేయాలని నిర్నయించినట్టు తెలుస్తోంది. ఇక అగ్రిగోల్డ్ బాధితులకు కార్పస్‌ఫండ్‌ ఇస్తామని కోర్టులో చెప్పిన సర్కార్‌.. ఎంతమేరకు ఫండ్‌ ఇస్తామనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో మరోసారి అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దార్లలో ఆందోళన మొదలైంది.

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం కోసం వామపక్షాలు ఉద్యమానికి సిద్ధం
ఇదిలావుంటే .. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం కోసం వామపక్షాలు ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి. 20వేల ఎకరాల అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏపీ సిపిఐనేతలు డిమాండ్ చేశారు. 2వేల కోట్ల కార్పస్ ఫండ్ ను ప్రభుత్వం అడ్వాన్స్ గా ఇవ్వాలి కోరారు. రెండు నెలల్లో బాధితులకు డబ్బులు చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. త్రిమెన్ కమిటీ ద్వారా ఇప్పటి వరకు జమైన నగదును జిల్లాల వారిగా అగ్రిగోల్డ్ భాధితులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.మొత్తానికి అగ్రిగోల్డ్‌ కేసులో కోర్టు ఆదేశాలతో అయిన సమస్య పరిష్కారం అవుతుందని బాధితులు ఆశిస్తున్నారు. అయితే ప్రభుత్వ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కార్పస్‌ఫండ్‌ ఎంతిస్తారన్న దానిపై వెంటనే వివరాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

08:16 - June 6, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ సిరిసిల్ల, సిద్ధిపేటలకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. సొంత నియోజకవర్గాలకే నిధులు గుమ్మరిస్తున్నారని మండిపడ్డారు. తనకు మంచి పేరు వస్తుందనే కేసీఆర్‌ నల్లగొండజిల్లాకు నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

పాలనలో కేసీఆర్ వివక్ష..
ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనపై కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కెసిఆర్ పాలనలో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ పక్షపాత ధోరణితో దక్షిణ తెలంగాణా అభివృద్ధిలో వెనుకబడి పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఎత్తపోతల ప్రాజెక్టుకు వేలకోట్ల రూపాయలు మంజూరుచేసిన ప్రభుత్వం.. నల్లగొండ జిల్లాకు సాగు, తాగు నీరిచ్చే ఎస్సెల్బిసి ప్రాజెక్టుకు మాత్రం ఒక్కరూపాయి కూడా విడుదల చేయడం లేదన్నారు.

పోరాడితేగాని నల్లగొండకు మెడికల్‌ కళాశాల రాలేదు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
బతుకమ్మ చీరల తయారీకి కేవలం సిరిసిల్ల జిల్లాకే 250కోట్ల ఆర్డర్లు ఇచ్చిన ముఖ్యమంత్రికి ఇతర జిల్లాల్లో చీరలు నేసే విషయం తెలియదా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఎప్పటినుంచో జిల్లాకేంద్రంగా ఉన్న నల్లగొండకు పోరాడితేకాని రాని మెడికల్ కళాశాల .. సిద్దిపేటకు మాత్రం మొదటి విడతలోనే మంజూరు చేసి 750కోట్లు నిధులు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సొంత ప్రాంతానికి ఒకరకంగా, మిగతా ప్రాంతానికి మరో రకంగా నిధులు మంజూరు చేస్తూ వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. మొత్తానికి మరోసారి తనదైన శైలిలో సీఎం కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేసిన కోమటిరెడ్డి.. వార్తల్లో నిలిచారు.

 

08:15 - June 6, 2018

నాగర్ కర్నూల్ : కాంగ్రెస్ పార్టీలో నాగం జనార్దనరెడ్డి చేరిక సెగలు ఇంకా చల్లారలేదు. ముందు నుంచి నాగంచేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్సీ కూచికూళ్ల దామోదర్‌రెడ్డి టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తనను కాదని నాగంగకు టిక్కెట్ కూడా ఖరారు చేయడంపై కూచికూళ్ల గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్‌లో తనకు భవిష్యత్తు లేదని కూచికూళ్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో నాగం జనార్దన్‌రెడ్డి చేరికతో కూచికూళ్ల దామోదర్‌రెడ్డి కినుక
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయనతో దశాబ్దాల వైరం ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం టీఆర్ఎస్‌లోకి వెళ్లే అంశంపై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్‌లోనే ఉంటూ నాగర్‌కర్నూలు రాజకీయాల్లో తలపండిన నేతగా పేరున్న దామోదర్‌రెడ్డికి సౌమ్యుడిగా పేరుంది. ఉమ్మడి జిల్లాలో జిల్లాపరిషత్‌చైర్మన్‌గా ఉన్న కూచికూళ్ల.. ప్రస్తుతం నాగర్‌కర్నూలు కాంగ్రెస్ ఇంచార్జిగా కూడా ఉన్నారు. తనకు చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన నాగంకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యత ఇవ్వాడాన్ని తమ నేత జీర్ణించుకోలేక పోతున్నారని దామోదర్‌రెడ్డి అనుచర వర్గం అంటోంది.

నాగంకే నాగర్‌కర్నూలు టికెట్‌ అనడంపై దామోదర్‌రెడ్డి అసంతృప్తి
నాగర్‌కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నాగంకు హామీ ఇచ్చినట్టు వార్తలు రావడం, ఇదే విషయాన్ని నాగం కూడా ప్రచారం చేసుకోవడంతో దామోదర్‌రెడ్డి గుర్రుగా ఉన్నారు. తనతో పాటు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై కూడా కూచికూళ్ల ఆందోళన పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇదే అవకాశంగా కూచికూళ్లను తమపార్టీలోకి ఆహ్వానించేందుకు గులాబీనేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఓ మంత్రి ద్వారా ఆయనతో మధ్యవర్తిత్వం నెరపినట్టు నాగర్‌కర్నూల్లో జోరాగ రాజకీయ చర్చలు నడుస్తున్నాయి.

దామోదర్‌రెడ్డి పార్టీ మారకుండా డీకే అరుణ మంత్రాంగం
మరోవైపు దామోదర్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకుంటారన్న సమాచారంతో కాంగ్రెస్‌ నేతలు రంగంలోకి దిగారు. కూచికూళ్ల పార్టీని వీడకుండా మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో నాగర్‌కర్నూలు సీటు తనకు లేదా తన వారసుడికి ఇస్తామని హామీ ఇస్తేనే పార్టీలో ఉంటానని... లేకపోతే తన దారి తాను చూసుకుంటానని దామోదర్‌రెడ్డి తెగేసి చెప్పినట్టు సమాచారం. కూచికూళ్ల అసంతృప్తిని చల్లార్చేందుకు నాగంతో హస్తం నేతలు ఓప్రకటన కూడా చేయించారు. అసెంబ్లీ టికెట్‌ ఎవరికి ఇచ్చినా తాను పూర్తిగా సహకరిస్తానని నాగం చెప్పడంతో దామోదర్‌రెడ్డి కొంత మెత్తబడినట్టు తెలుస్తోంది. మొత్తానికి కూచికూళ్ల - నాగం మధ్య ఆదిపత్యపోరు నాగర్‌కర్నూల్లో హస్తంపార్టీకి కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది.

07:58 - June 6, 2018

హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు హైద్రాబాద్ నగరానికి మణిహారం లాంటిది అన్నారు మంత్రి కేటీఆర్‌. హెచ్‌ఎండీకే పరిధిలోని ప్రాజెక్టులు, కార్యకలాపాలపైన మంగళవారం బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలిక వసతుల కల్పనపైన ప్రధానంగా దృష్టి సారించాలని అదేశించారు.

ఓఆర్‌ఆర్‌ చుట్టూ మౌలిక సౌకర్యాల అభివృద్ధి
అవుటర్ రింగ్ రోడ్డు నగరానికి మణిహారం లాంటిదని దీని చుట్టు సాధ్యమైనన్ని ఎక్కువ సౌకర్యాలను కల్పించాలని పురపాలక శాఖ మంత్రి కెటిఅర్ పురపాలక శాఖాధికారులను అదేశించారు. అవుటర్ చుట్టూ పెద్ద ఎత్తున గ్రీనరీ పెంచాలన్నారు. ఇంటర్ చేంజ్ ల వద్ద వే సైడ్ అమెనిటీస్ ఎర్పాటు చేయాలన్నారు. ప్రతి పది కీలోమీటర్లకు ఒక అంబులెన్సు ఉండేలా వాటి సంఖ్యను పెంచాలన్నారు. ఓఆర్‌ఆర్‌పై పూర్తి స్ధాయిలో ఏల్ ఈ డీ దీపాల ఎర్పాటు చేయాలన్నారు. అలాగే నగరానికి నలువైపులా బస్ టర్మినళ్లకు నిర్మాణానికి భూముల గుర్తించాలని అధికారులను అదేశించారు.

వేగంగా రేడియల్ రోడ్లు, గ్రిడ్ రోడ్ల నిర్మాణం
హెచ్ యండిఏ పరిధిలోని జన సమ్మర్ధ ప్రాంతాలను గుర్తించి రేడియల్ రోడ్లు, గ్రిడ్ రోడ్ల అభివృద్ది మరింత వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్‌ సూచించారు. బాటసింగారం, మంగల్‌పల్లి ప్రాంతాల్లో లాజిస్టిక్స్ పార్కుల పురోగతిని మంత్రి సమీక్షించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో చెపట్టిన చెరువుల అభివృద్ది కార్యక్రమంలో భాగంగా త్వరలోనే 40 చెరువుల్లో పనుల కోసం టెండర్లను పూర్తి చేస్తామన్నారు. అటు ఉప్పల్ ప్రాంతంలో చేపడుతున్న శిల్పరామం పనులు దసరా నాటికి పూర్తి చేస్తామని అధికారులు మంత్రికి తెలిపారు.

బాలనగర్‌ ఫ్లైఓవర్‌ పై రివ్యూ..జీహెచ్‌ఎంసీతో కలిసి ఫుట్ ఒవర్‌బ్రిడ్జిల నిర్మాణం
అటు బాలనగర్లో నిర్మాణం జరుగుతున్న ఫ్లై ఒవర్ పురోగతి పైన ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించారు. నగరంలో నిర్మిస్తున్న పుట్ ఒవర్ బ్రిడ్జిల నిర్మాణాలను జియచ్ యంసితో కలిసి పూర్తి చేస్తున్నామన్నారు. హెచ్ యండిఏ పనీతీరు, ప్రాజెక్టుల అమలుపైన అధికారులను మంత్రి అభినందించారు. విధుల్లో మంచి నైపుణ్య ప్రదర్శించిన ఉద్యోగులను గుర్తించి వారికి ప్రొత్సాహాకాలు ఇవ్వాలని హెచ్‌ఎండీఏ కమీషనర్‌కు సూచించారు. 

07:54 - June 6, 2018

విశాఖపట్నం : ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ జిల్లా అరకు లోయలో పర్యటించారు. డుంబ్రిగూడ మండలం పోతంగి గ్రామాన్ని సందర్శించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆంత్రాక్స్‌ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆ ప్రాంతంలోని తాగు నీటి సమస్య గురించి తెలుసుకొని నీటి శాంపిల్స్‌ను టెస్టింగ్‌కు పంపించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులకు అండగా ఉంటానని జనసేనాని హామీ ఇచ్చారు. 

07:49 - June 6, 2018

అమలాపురం : రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఆశించి ఎన్డీయేలో చేరితే.. కేంద్రప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించిన తరహాలోనే ప్రజలు.. బీజేపీకీ బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.

కేంద్రం నమ్మించి మోసం చేసింది -చంద్రబాబు
తూర్పుగోదావరి జిల్లా నవనిర్మాణ దీక్షలో.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. అమలాపురంలో ఏర్పాటు చేసిన దీక్ష సభలో సీఎం మాట్లాడారు. విభజిత రాష్ట్రానికి న్యాయం చేస్తారన్న ఆశతోనే.. ఎన్నికలకు ముందే.. ఎన్డీయేలో భాగస్వాములయ్యామని సీఎం చెప్పారు. అయితే.. కేంద్రం నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. కేంద్రం ద్రోహం చేసినా.. రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దే వరకూ అవిశ్రాంతంగా పాటు పడతానని అన్నారు .

విభజన తర్వాత ఏపీలో పండుగ చేసుకునే పరిస్థితి లేదు-చంద్రబాబు
రాష్ట్ర విభజన అనంతరం.. మిగిలిన రాష్ట్రాల మాదిరిగా ఏపీలో పండుగ చేసుకునే పరిస్థితుల్లో లేమని.. అందుకే ఆ రోజున నవనిర్మాణ దీక్ష చేపడుతున్నామని అన్నారు. భవానీ, అయ్యప్ప, శివదీక్షల తరహాలో.. ప్రజలందరూ ఐక్యంగా జరుపుకునే ఏకైక దీక్షగా నవనిర్మాణ దీక్షను అభివర్ణించారు. నాలుగేళ్ల కిందట చేపట్టిన ఈ దీక్ష ఇప్పటికి ఉపయోగపడిందని సీఎం అన్నారు. రాష్ట్రానికి సహకరించడం కేంద్రం బాధ్యతని.. కేంద్రం సహకరించకున్నా.. ముందుకే సాగుతామని అన్నారు.

చింతలపూడిలోనూ పర్యటించిన చంద్రబాబు
జిల్లా పర్యటనలో భాగంగా.. ముఖ్యమంత్రి వన్నె చింతలపూడిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం దళితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అక్కడి నుంచి గురుకుల పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.

గర్భంతో వున్న భార్యను,కుమారుడిని హత్య చేసిన భర్త..

కర్నూలు : కట్టుకున్న భార్యను..ఆమె గర్భంలో వున్న శిశువును, అభం శుభం తెలియని మూడేళ్ల కుమారుడిని చంపేశాడో దుర్మార్గపు భర్త. అధికంగా మద్యం తాగుతు..మరో మహిళతో చనువుగా ఉండటం గుర్తించిన భార్య ప్రశ్నించటంతో తలెత్తిన వివాదం ఈ దారుణహత్యలకు దారితీసింది. బళ్లారి చౌరస్తా సమీప సంపత్‌నగర్‌లో నివాసముంటున్న ఆనంద్ ప్రవర్తనలో గత కొంతకాంగా మార్పును గమనించిన భార్య ఉదయభానును అధిక కట్నం కోసం వేధిస్తున్నాడు. అంతేకాక మరో మహిళను ఇంటికే తీసుకురావటంతో ఉదయభాను భర్తను నిలదీసింది. దీంతో గర్భంతో వున్న భార్యను, మూడేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసిన చంపేసాడు.

ముగ్గురు అక్కచెల్లెళ్లపై 'హాత్యా'చారం!!..

బీహార్ : ఒకేసారి ముగ్గురు బాలికలు దారుణ హత్యకు గురయ్యారు. వీరు ముగ్గురు అక్కచెల్లెళ్లు కావటం మరో దారుణంగా చెప్పవచ్చు. ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు ముగ్గురూ కూడా పది నుంచి పదహారేళ్ల లోపు వారే. బాలికలపై ఆఘాయత్యం జరిగిన సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేరని స్థానికులు తెలిపారు. ఘటనాస్థలం నుంచి గొడ్డలి, పదునైన మరికొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దుర్ఘటన బీహార్ రాష్ట్రంలోని బంకాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి..

జగిత్యాల : గొల్లపల్లి మండలం చిల్లకూడూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం బైక్ ను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియరావాల్సి వుంది.

Don't Miss