Activities calendar

07 June 2018

ఆర్‌ఎస్‌ఎస్‌ వర్ష్‌ వర్గ్‌ సభకు ప్రణబ్‌

మహారాష్ట్ర : జాతీయతపై తన అభిప్రాయాన్ని పంచుకోవడానికే ఆర్‌ఎస్‌ఎస్‌ వర్ష్‌ వర్గ్‌ కార్యక్రమానికి హాజరైనట్లు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ స్పష్టం చేశారు. ఎంతోమంది యాత్రికులు భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారని.. ఆర్‌ఎస్‌ఎస్‌ వర్ష్‌ వర్గ్‌ తృతీయ ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రణబ్‌ ముఖర్జీ తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు హెగ్డేవార్‌ భారత మాత కన్నా గొప్ప పుత్రుడని.. విజిటర్స్‌ బుక్‌లో అభివర్ణించారు. హెగ్డేవార్‌ జన్మస్థలాన్ని సందర్శించి ఆయనకు నివాళి అర్పించారు. 

22:13 - June 7, 2018

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌... పార్టీ మేనిఫెస్టోపై కసరత్తు స్టార్ట్ చేశారు. యాత్రలో తన దృష్టికి వచ్చిన అంశాలను ఒక్కొక్కటిగా నోట్ చేసుకుంటున్న పవన్ వాటినే ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టనున్నారు. స్థూలంగా జనసేన మేనిఫెస్టోలో ఏ కీలకాంశాలు ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. పార్టీ మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టి సారించారు. ఆగస్టు 15 నాటికి మేనిఫెస్టో రిలీజ్‌ చేస్తానన్న పవన్‌.. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే యాత్రలో తన దృష్టికి వచ్చిన అంశాలను పవన్‌ నోట్ చేసుకుంటున్నారు. ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని పవన్‌ భావిస్తున్నారు. 

యాత్రలో భాగంగానే పవన్‌, విద్యార్థులు, మహిళలు, రైతులు, మేధావులతోనూ భేటీ అవుతున్నారు. వారి సలహాలను తీసుకుంటున్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి మేనిఫెస్టోలో చేర్చేందుకు ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించాలని పవన్‌ యోచిస్తున్నారు. 

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తోన్న పవన్‌ కల్యాణ్‌.. ఉద్దానం సమస్య పరిష్కారం అంశాన్ని మేనిఫెస్టోలో ప్రధానంగా చేరుస్తారన్న భావన కూడా వ్యక్తమవుతోంది. దీంతో పాటు.. రాబోయే రోజుల్లో తన పర్యటనల్లో భాగంగా వచ్చే సమస్యలనూ మేనిఫెస్టోలో చేరుస్తారని భావిస్తున్నారు. 

22:09 - June 7, 2018

హైదరాబాద్ : టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు.. విపక్ష నేత జగన్‌తో భేటీ కావడం కలకలం సృష్టిస్తోంది. లోటస్‌పాండ్‌కు వెళ్లి జగన్‌ను కలిసిన దీక్షితులు.. తన కడుపు నింపేవారికే తన మద్దతు అని తెలిపారు. వీరి భేటీపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నాడు బీజేపీ నేతలతో.. నేడు వైసీపీ నేతలతో దీక్షితులు భేటీ కావడం.. దేనికి సంకేతమో ప్రజలకు తేలిగ్గా అర్థమవుతోందని.. టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. 

తిరుమలేశుని మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు.. విపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలలులో ప్రజా సంకల్ప యాత్రను ముగించుకుని.. జగన్‌ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌ చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో.. దీక్షితులు.. జగన్‌ నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. టీటీడీపై రమణదీక్షితులు వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

తనకు జరిగిన అన్యాయాన్ని ప్రతిపక్ష నేత జగన్‌కు వివరించానని రమణదీక్షితులు మీడియాకు తెలిపారు. టీటీడీ విషయంలో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు.  మిరాసీ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, తన పొట్టను ఎవరు నింపితే వారికే మద్దతు ఇస్తానని అన్నారు. 

రమణదీక్షితులు, జగన్‌తో భేటీ కావడంపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. దీక్షితులు వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయన్న తమ వాదనకు బలం చేకూరుతోందని, దీనిపై ఒక్కొక్క ముసుగు తొలగుతోందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. వారంతా కలిసి ప్రభుత్వంపై మహాకుట్ర చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. మొత్తానికి, తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలపై బహిరంగంగా ధ్వజమెత్తిన రమణ దీక్షితులు.. తాజాగా జగన్‌ను కలవడంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. 

22:05 - June 7, 2018

చిత్తూరు : కాంగ్రెస్‌ హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన చేస్తే...బీజేపీ నమ్మక ద్రోహం చేసిందని ఆరోపించారు సీఎం చంద్రబాబు. కేసుల కోసమే వైసీపీ ఎన్డీఏతో కలిశారన్నారు. రాష్ట్రాన్ని సాధించడానికి వైసీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ డ్రామాలాడుతున్నారన్నారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. 

 

22:03 - June 7, 2018

విజయవాడ : ఇదిలావుంటే.. రాజధాని నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌ సర్కారుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందని సీపీఎం విమర్శించింది. అమరావతిలో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు  ప్రభుత్వం సింగపూర్‌తో ఒప్పందం చేసుకోడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యలయం వద్ద ధర్నా జరిగింది సింగపూర్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. 

 

22:00 - June 7, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు.. ఇకపై జరిగే అభివృద్ధి ఒక ఎత్తు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రానున్న ఆరు నెలల్లో విస్తృత ఫలాలు రానున్నాయన్నారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా.. సింగపూర్‌ తరహా రాజధాని నిర్మాణ పనులు త్వరలోనే మొదలవుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. సింగపూర్‌-ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల ఉమ్మడి స్టీరింగ్‌ కమిటీ సమావేశం.. గురువారం విజయవాడలో జరిగింది. సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌, సింగపూర్‌ కన్సార్టియం బృందం.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి స్టార్టప్‌ ప్రాంతం 'ఫేజ్‌ జీరో' అభివృద్ధిపై ఒప్పందాలు కుదిరాయి. 

అనంతరం, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య అత్యున్నత స్థాయి జేఐఎస్‌సీ సమావేశం జరిగింది. ఇందులో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి, ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. స్నేహపూరిత సంబంధాలు, భాగస్వామ్యాలు, ఒప్పందాలపైనా ప్రధానంగా చర్చించారు. రాజధాని ప్రాంత రైతుల సింగపూర్‌ పర్యటనకు సంబంధించిన డాక్యుమెంటరీని సింగపూర్‌ ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రదర్శించారు. 

ఏపీలో పర్యటకాన్ని ఆకర్షించే చారిత్రక కట్టడాలు, సహజసిద్ధమైన ప్రకృతి వనరులు ఎన్నో ఉన్నాయని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. ఈ రంగంలో ఏపీకి సహకరించాలని సింగపూర్‌ ప్రతినిధులను కోరారు.  ఎన్నికల సమయంలోనే సింగపూర్‌ లాంటి రాజధాని నిర్మిస్తామని చెప్పామని.. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు మొదలవుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. నెల రోజుల్లో సింగపూర్‌కు నేరుగా విమాన కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామన్నారు. 
    
అమరావతి అభివృద్ధికి విస్తృత స్థాయిలో ప్రయత్నిస్తున్నామని ఈశ్వరన్‌ తెలిపారు. తమ ప్రయత్నాల ఫలితాలు మరో ఆరు నెలల్లో అందుతాయని అన్నారు. సమావేశాల అనంతరం.. ఈశ్వరన్‌ బృందం లింగాయపాలెంలోని ఫేజ్‌జీరో ప్రాంతాన్ని సందర్శించింది. 

 

21:57 - June 7, 2018

మహారాష్ట్ర : జాతీయతపై తన అభిప్రాయాన్ని పంచుకోవడానికే ఆర్‌ఎస్‌ఎస్‌ వర్ష్‌ వర్గ్‌ కార్యక్రమానికి హాజరైనట్లు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ స్పష్టం చేశారు. ఎంతోమంది యాత్రికులు భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారని.. ఆర్‌ఎస్‌ఎస్‌ వర్ష్‌ వర్గ్‌ తృతీయ ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రణబ్‌ ముఖర్జీ తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు హెగ్డేవార్‌ భారత మాత కన్నా గొప్ప పుత్రుడని.. విజిటర్స్‌ బుక్‌లో అభివర్ణించారు. హెగ్డేవార్‌ జన్మస్థలాన్ని సందర్శించి ఆయనకు నివాళి అర్పించారు ప్రణబ్‌. అంతకుముందు ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘ్‌ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనడానికి నాగ్‌పూర్‌కు చేరుకున్న ప్రణబ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్వాగతం పలికారు. 5 దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో పనిచేసిన ప్రణబ్‌ ముఖర్జీ సంఘ్‌ కార్యక్రమంలో పాల్గొనడంపై అసంతృప్తి వెల్లువెత్తుతోంది. గతంలో సంఘ్‌పై విమర్శలు చేసిన ప్రణబ్‌-ఈ కార్యక్రమానికి హాజరు కావొద్దని కాంగ్రెస్‌ నేతలు పలువురు ట్వీట్‌ చేశారు. ప్రణబ్‌ నిర్ణయాన్ని ఆయన కుమార్తె, కాంగ్రెస్‌ నేత శర్మిష్టా ముఖర్జీ కూడా తప్పు పట్టారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడం వల్ల ఎదురయ్యే తీవ్ర పరిణామాలను తన తండ్రి గుర్తిస్తారని ఆమె పేర్కొన్నారు. 

 

21:54 - June 7, 2018

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు ఉండి..ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రణబ్ ముఖర్జీ ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా కాంగ్రెస్ పార్టీలోని తన సహచరుల నుంచే కాక తన కన్న కూతురు కూడా వ్యతిరేకత, అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ప్రణబ్ ముఖర్జీ ఏం సంకేతాలు ఇస్తున్నారు..? 
ఆయన పయనమెటు ? ఇదే అంశంపై నిర్వహించిన విశ్లేషణ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక, ఆర్థిక విశ్లేషకులు ఎస్.వీరయ్య పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొనడం దేశానికి రాంగ్ సిగ్నల్ ఇచ్చినట్లే. కాంగ్రెస్ పార్టీలో పెరుగుతూ వస్తున్న అవకాశవాదంగా చెప్పవచ్చు. ఆర్ ఎస్ ఎస్ చరిత్ర ఏమాత్రం గౌరవాన్ని ఆపాదించలేని చరిత్ర. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

20:25 - June 7, 2018

నిద్రలు బంజేశి తిర్గుతున్న బాబులు..అధికారం కోసం చంద్రాలు, జగనాలు, జగన్ పాదయాత్ర మీద తేనీగెల దాడి.. కట్ చీఫ్లకు పనిజెప్పిన సెక్యూరిటోళ్లు, పార్టీ మారబోను అంటున్న గల్ల అరుణ..మారుమని చెప్పినోళ్లు ఎవ్వలమ్మా..?, కాళేశ్వరం కాల్వకు భూములు ఇయ్యం..భూమికి భూమిస్తెనే ఒప్పుకుంటం, పోడురైతులకు రైతు బంధు ఎందుకియ్యరు?..అడ్విదేవుల పల్లి కాడ జూలకంటి ధర్నా, సిరిసిల్లల కాడ మళ్ల ఇసుక అక్రమ రవాణ.. ఆగింది ఎన్నడుల్లా మళ్ల సుర్వైతందుకు..? ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

 

20:15 - June 7, 2018

నేటితో చంద్రబాబు పాలనకు నాలుగేళ్లు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో సాధించిందేంటీ ? ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్, వైసీపీ నేత మల్లాది విష్ణు, టీడీపీ రామకృష్ణ, పాల్గొని, మాట్లాడారు. నాలుగేళ్ల పాలనలో సాధించిందేమీ లేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:10 - June 7, 2018

రజనీ కాంత్ ఈ పేరుకి ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా మంచి మాస్ ఇమేజ్ ఉంది. అందుకే రజనీ సినమా అంటే కథ ఎలా ఉన్నా.. డైరక్టర్ ఎవరైనా.. రజనీ కాంత్ ను జనాలు ఎలా చూడాలి అనుకుంటారో.. అలానే చూపిస్తారు.. అది ఒక రూల్.. కాని ఫస్ట్ టైం దానికి విభిన్నంగా కబాలీ అనే సినిమా చేసి, ప్రేక్షకులను డిస్సపోయింట్ చేసి, ఆ డిస్టిబ్యూటర్స్ కి ఆ సినిమాను ఓ పీడకలలా మిగిల్చాడు పా.రంజిత్.. అయితే అదే డైరక్టర్ తో రజనీ అల్లుడు ధనుష్ మళ్ళీ ఓ సినిమా మొదలు పెట్టడం.. మళ్ళీ అందులో కూడా రజనీనే హీరోగా పెట్టడంతో అందరూ షాక్ అయ్యారు.. కాని ఈసారి పా.రంజిత్ కి రజనీ చరిష్మా మీద క్లారిటీ వచ్చింది కాబట్టి.. కొత్త స్టైల్లో సినిమా తీస్తాడు అని ఆశించారు.. అదే ఫాక్టర్ వల్ల తెలుగులో ముప్పై కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ తో కాలా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. మరి అంత భారీ హైప్ మధ్య థియేటర్స్ లోకి వచ్చిన కాలా ఎలా ఉన్నాడు.. తన కోర్ ఆడియన్స్ ను సాటిస్పై చేశాడా లేదా అన్న విషయాన్ని ఇప్పుడు చూద్దాం... 
కథ.. 
కథ విషయానికి వస్తే..  ముంబంయి లోని ధారవి అనే భారీ స్లమ్ లో ఎప్పటి నుండో కొన్ని వేల గుడిసెలలో లక్షలాది మంది జనం నివసిస్తూ ఉంటారు.. అయితే ఆ ప్రాంతానికి విపరీత మైన డిమాండ్ రావడంతో ఆ గుడిసెలను ఖాళీ చేయించి అక్కడ భారీగా కట్టడాలు నిర్మించాలి అని క్లీన్ ముంబయి అనే గవర్నమెంట్ పాలసీను బలవంతంగా అమలు చేయలి అని చూస్తాడు అక్కడ రాజకీయ నాయకుడు హరి దాదా.. అయితే దాని వెనుక దురుద్దేశ్యం అర్ధం అయిన మాస్ లీడర్ కాలా..  అతనిని అడ్డుకుంటాడు..  అలా సాగిన  హీరో విలన్ ఫేస్ టూ ఫేస్ గేమ్ లో ఎవరు గెలిచారు.. ధారవీని కాలా, హరిదాదా నుంచి ఎలా కాపాడగలిగాడు అలాంటి విషయాలు సినిమా చూసి తెలుసకోవలసిందే.. 
నటీనటులు..  
నటీనటుల విషయానికి వస్తే.. కాలా అనే మామూలు సినిమాకు ఇంత హైప్ రావడానికి కారణం అయిన రజనీకాంత్, తన ఫుల్ పొటెన్షియాలిటీతో సినిమాను నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నం చేశాడు..  తన ఇమేజ్ ను పక్కకు పెట్టి కథకు అవసరం కాబట్టి.. చాలా సాదా సీదా సీన్స్ లో కూడా దర్శకుడు చెప్పినట్టే నటించాడు.. ఇంత వయస్సులో కూడా వర్షంలో తడుస్తూ ఫైట్స్ దగ్గర నుండి ఫామిలీ..మరియూ కామెడీ  సీన్స్ వరకు వంక పెట్టే విధంగా లేదకుండా.. తన నటనలో సత్తా తగ్గిపోలేదని మరో సారి ఫ్రూ చేశాడు... రజనీ కాంత్ వరకూ కాలా కోసం ఎంత చేయగలడో అంతకు మించి చేశాడు.. రజనీ భార్యగా నటించిన ఈశ్వరి రావ్ ఒక ఢిఫ్రెంట్ అప్రోచ్ ఉన్న పాత్రలో మెప్పించింది.. ఇంత సీరియస్ సినిమాలో కూడా కాస్త నవ్వులు పూయించింది.. మరో హిరో హీరోయిన్ హ్యూమాకురేష్.. ప్రసెంస్ డిగ్నిఫైడ్ గా ఉంది..  కాకపోతే ఆ క్యారక్టర్ కి అంతగా స్కోప్ లేకపోవడంతో.. గుర్తుపెట్టుకునేలా.. ప్రజంట్ చేయలేకపోయింది.. కబాలిలో రజనీకి తమ్ముడిగా నటించిన సముద్రఖని ఈ సినిమాలో కూడా ఆల్మోస్ట్ అలాంటి క్యారక్టర్ లో కనిపించాడు.. ఇక రజనీని ఢీకొట్టే పొలిటికల్ లీడర్ హరిదాదాగా  నానా పాటేకర్  నటన సింప్లీ సూపర్.. ఇప్పటి వరకూ సౌత్ ఆడియన్స్ కి పెద్దగా కిక్ ఇవ్వని సటిల్ విలనిజంలో మజా.. ఆ పాత్ర ద్వార కన్వే చేశాడు,, రజనీ తరువాత సినిమాలో సెకండ్ టవరింగ్ పర్ఫామెన్స్ అతనిదే.. ఇక సంపత్ రాజ్, రవికాలే.. షాయాజీ షిండే లాంటి వాళ్ళు అంతా.. మూమూలుగాను గ్రేషేడ్స్ లో కనిపించారు తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేని మిగతా నటీనటులు అందరూ.. డిసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చారు.. 
టెక్నీషియన్స్.. 
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. కబాలీతో రజనీ ఫ్యాన్స్ నే కాక.. సినిమా అభిమానులను కూడా తీవ్రంగా నిరాశ పరిచిన పా. రంజిత్.. కాలా కి కూడా తనకు బాగా అచ్చోచ్చిన, హిట్స్ ఇచ్చిన స్లమ్ సమస్యలనే బ్యాక్ డ్రాప్ గా ఎంచుకున్నాడు.. అయితే బేస్ ముంబాయి కి మారడంతో కాస్త కొత్తదనం వచ్చింది..  మొదటి సినమా ఫెయిల్ అయినా.. రజనీ ఇమేజ్ ను పూర్తిగా అంచనా వేయలేకపోయిన పా.రంజిత్ మరోసారి రా ఓరియెంటెడ్ కథ తోనే కాలా ను మలిచాడు..  కబాలీతో పోలిస్తే ఇందులో హీరో ఎలివేషన్స్ ఎక్కువే ఉన్నప్పటికీ... హీరోయిజాన్ని విలన్ డామేజ్ చేయడంతో  ఆడియన్స్ నిరాశకు లోనయ్యారు.. క్లైమాక్స్ లో సైతం తన మార్క్, తన టచ్ చూపించాలి అని డిఫరెంట్ గా ప్లాన్ చేసినా.. అది ఎవరిని మెప్పిచలేదు.. తమిళ్ నెటివిటీ మోతాదు చాలా ఎక్కువగా ఉంది.. ఓవర్ ఆల్ గా రజనీ స్థాయికి, క్రేజ్ కి తగ్గ సినిమా అందించడంలో మరోసారి తడబడ్డాడు పా. రంజిత్..  అయితే ఈ సినిమాకు ప్రాధాన భాగంగా నిలిచాడు సినిమాటోగ్రాఫర్ మురళీ.. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడా.. రిలాక్స్ కాకుండా.. బ్లడ్ అండ్ హార్ట్ పెట్టి పనిచేశాడు.. ముఖ్యంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన.. ఫ్లై ఓవర్ రెయిన్ ఫైట్.. పోలీస్టెషన్ సీన్, హీరో విలన్ కాన్ ఫ్రంటేషన్ సీన్స్ లో .. మురళీ వర్క్ హ్యాట్సాఫ్ అని చెప్పాలి.. ఇక ఆల్భమ్ పరంగా మెజార్టీ ఆడియన్స్ ను డిస్సాపాయింట్ చేసిన సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్.. ఆర్ ఆర్ పరంగా మాత్రం కాస్త కష్ట పడ్డాడు.. చాలా చోట్ల సీన్స్ ఆర్ ఆర్ వల్ల ఎలివేట్ అయ్యాయ్యి.. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.. ఎడిటర్ శ్రీకర్ బాబు కాస్త లిబర్టీ తీసుకుని ఉంటే స్లో నేరేషన్ కి కాస్త సొల్యూషన్ దొరికుండేది.. 

ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే.. సూపర్ స్టార్ రజనీ కాంత్ గ్రాండ్ మార్క్ తో, భొంమ్ బోర్టింగ్ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన కాలా. కాబాలీలా మరీ డిస్స్ పాయింట్ చేయకపోయిన.. పూర్తిగా మెప్పించే లాగా కూడా లేదు.. స్లో నేరేషన్ శాపంగా మారిన ఈ మూవీలో అక్కడక్కడా వచ్చే రజనీ మార్క్ సీన్స్ మాత్రమే ఊరటను ఇస్తాయి..  అయితే ఈ సినమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి స్థాయిలో నిలబడగలుగుతుంది అనేది తెలియాలి అంటే.. వీకెండ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.. 

ప్లస్ పాయింట్స్
రజనీ పర్ఫామెన్స్
స్టార్ కాస్ట్, ఆర్ ఆర్
సినిమాటోగ్రఫీ
హీరో ఎలివేషన్ సీన్స్

మైనస్ పాయింట్స్
స్లో నేరేషన్
ఇంపాక్ట్ లేని క్లైమాక్స్
డామినేటింగ్ విలనిజం
సాంగ్స్
తమిళ్ నెటివిటీ

రేటింగ్
1.75 / 5

అవినీతిపరుల జాబితా విడుదల

హైదరాబాద్ : తెలంగాణా పోలీస్‌శాఖలో 391మంది అవినీతిపరులు తేలారు. ఈ మేరకు అవినీతిపరుల జాబితాను డీజీపీ కార్యాలయం విడుదల చేసింది. సూర్యాపేటలో అత్యధికంగా 40మంది ఉండగా... భద్రాద్రి కొత్తగూడెంలో  35, కరీంనగర్‌లో 34, వికారాబాద్‌లో 27, నిజామాబాద్‌లో 29 మంది ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారు. 

19:53 - June 7, 2018

ఢిల్లీ : జెడియూ మాజీ నేత శరద్‌యాదవ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ నుంచి అనర్హత వేటుకు గురైన ఆయనకు ప్రస్తుతం లభిస్తున్న వేతనం, అలవెన్స్‌లు, ఇతర సదుపాయాలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ ఈ తీర్పు చెప్పింది. శరద్‌ యాదవ్‌కు  రైలు, విమాన టికెట్ల వంటి ఇతర సౌకర్యాలు కూడా నిలిపివేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జులై 12 వరకూ ఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయకుండా ఆయనకు ఊరట కల్పించింది. రాజ్యసభ నుంచి తనను అనర్హుడిగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ శరద్‌ యాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టుకు సూచించింది.

 

19:52 - June 7, 2018

ఆసిఫాబాద్‌ : ఎజెన్సీ ప్రాంతాల్లో పీసా చట్టాన్ని అనుసరిస్తూ... తమ గ్రామాల్లో స్వయం పాలన సాగిస్తున్నామంటున్నారు ఆదివాసులు.  జూన్‌ 2నుంచి ఆదివాసులు లంబాడ తెగకు చెందిన ఉద్యోగులను ఏజెన్సీ గ్రామల్లో అనుమతించడంలేదు. స్వయం పాలన ప్రకటించి, లంబాడాలను అడ్డుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించామని ఆదివాసులంటున్నారు. ఊరి చివరిలో మావనాటే మావరాజ్‌, 'మావేనాటే.. మావే సర్కార్‌' అనే బోర్డులను పెట్టారని డిమాండ్‌ చేస్తున్నారు. ఆదివాసుల ఆందోళనపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

19:49 - June 7, 2018

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో  చేపమందు ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.. ఇప్పటికే  తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలనుంచి ఉబ్బసం బాధితులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

19:47 - June 7, 2018

ఆసిఫాబాద్‌ : జిల్లా రెబ్బెన మండలం కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్డులో వాటర్‌ పైప్‌లైన్‌ పగిలింది. మిషన్‌ భగీరథ పైప్‌ పగలడంతో భారీ ఎత్తున నీళ్లు ఎగిసిపడుతున్నాయి. పైప్‌లైన్‌ రోడ్డుకు పక్కనే ఉండడంతో.. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. నీరు వృధాగా పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులంటున్నారు. 

 

19:44 - June 7, 2018

హైదరాబాద్ : రైతు బాగుండాలంటే రాష్ట్రంలో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి కావాలని మంత్రి హరీష్‌రావు అన్నారు. పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను పూర్తిచేసి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 6లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామన్నారు. మిషన్‌ కాకతీయ అద్భుతమై విజయం సాధించిందని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. మనల్ని చూసి మహారాష్ట్రలో కూడా మిషన్‌ కాకతీయ కార్యక్రమం ప్రారంభించారన్నారు. ముప్పై ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న అంతరాష్ట్ర ఒప్పందాలు చేసుకొని అదిలాబాద్‌ జిల్లాకు నీళ్లు అందించామన్నారు. 19 ప్రాజెక్టుల సముహం కాళేశ్వరం ప్రాజెక్టు అని.. రెండుమూడేళ్లోనే ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీళ్లు అందిస్తామన్నారు.

 

19:41 - June 7, 2018

చిత్తూరు : రాష్ట్రం కోసం అహర్నిషలు కష్టపడుతోన్న సీఎం చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయడంపై మంత్రి నారా లోకేష్‌ ఘాటుగా స్పందించారు. సాక్ష్యాధారాలు బయట పెడితే తప్ప ఆరోపణలు చేయవద్దని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న లోకేశ్‌... వైసీపీని డ్రామా కంపెనీగా అభివర్ణించారు. ఈ డ్రామా కంపెనీకి అమిత్‌ షా ప్రొడక్షన్‌ చేస్తే....డైరెక్షన్‌ అండ్‌ స్క్రిప్ట్‌ ప్రధాని మోదీ అందిస్తున్నారన్నారు. జగన్‌ కమీడియన్‌గా వ్యవహరిస్తే క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా ఎంపీలు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.  

19:20 - June 7, 2018

హైదరాబాద్ : తెలంగాణా పోలీస్‌శాఖలో 391మంది అవినీతిపరులు తేలారు. ఈ మేరకు అవినీతిపరుల జాబితాను డీజీపీ కార్యాలయం విడుదల చేసింది. సూర్యాపేటలో అత్యధికంగా 40మంది ఉండగా... భద్రాద్రి కొత్తగూడెంలో  35, కరీంనగర్‌లో 34, వికారాబాద్‌లో 27, నిజామాబాద్‌లో 29 మంది ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారు. 

 

చిత్తూరు జిల్లాను కరువు రహితంగా తయారు చేస్తాం : సీఎం చంద్రబాబు

చిత్తూరు : జిల్లాను కరువు రహితంగా ప్రాంతంగా తయారు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. చిత్తూరు ఉద్యానవనం అన్నారు. పంటల సంజీవిని కింద పంట కుంటలు తొవ్వారని...దీంతో భూర్భజలాలు పెరిగాయి. భూమి జలాశయంగా తయారవుతుందన్నారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మదనపల్లి మార్కెట్ ను ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు. సంక్షేమ కార్యక్రమాలకుపెద్ద పీట వేశామని చెప్పారు.

 

నదుల అనుసంధానానికి శ్రీకారం : సీఎం చంద్రబాబు

చిత్తూరు : నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామని చెప్పారు. జలాలను రాయలసీమకు తీసుకొచ్చామని చెప్పారు. నవ నిర్మాణ దీక్షలో ఆయన మాట్లాడారు. రాయలసీమను రతనాల సీమగా తయారు చేయాలని కంకణం కట్టుకున్నానని అన్నారు. హంద్రీనీవా.. ఎన్ టీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టు అని అన్నారు. అన్ని చెరువులను నింపుతామని చెప్పారు. సోమశిల, స్వర్ణముఖిలను పూర్తి చేస్తామన్నారు.

 

 

18:49 - June 7, 2018

చిత్తూరు : నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామని చెప్పారు. జలాలను రాయలసీమకు తీసుకొచ్చామని చెప్పారు. నవ నిర్మాణ దీక్షలో ఆయన మాట్లాడారు. రాయలసీమను రతనాల సీమగా తయారు చేయాలని కంకణం కట్టుకున్నానని అన్నారు. హంద్రీనీవా.. ఎన్ టీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టు అని అన్నారు. అన్ని చెరువులను నింపుతామని చెప్పారు. సోమశిల, స్వర్ణముఖిలను పూర్తి చేస్తామన్నారు. 
కరువు రహిత జిల్లాగా చిత్తూరు
చిత్తూరు జిల్లాను కరువు రహితంగా ప్రాంతంగా తయారు చేస్తామన్నారు. చిత్తూరు ఉద్యానవనం అన్నారు. పంటల సంజీవిని కింద పంట కుంటలు తొవ్వారని...దీంతో భూర్భజలాలు పెరిగాయి. భూమి జలాశయంగా తయారవుతుందన్నారు. మదనపల్లి మార్కెట్ ను ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు. సంక్షేమ కార్యక్రమాలకుపెద్ద పీట వేశామని చెప్పారు. 5 కేజీల బియ్యం ఇస్తున్నామని చెప్పారు. ఎన్ టీఆర్ భరోసా కింద 50 లక్షల 50 వేల పించన్లు ఇచ్చామని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలకు రాజకీయాలు లేవన్నారు. రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలను అందజేస్తామని పేర్కొన్నారు. పెళ్లి కానుక కింద ఎస్టీలకు 50 వేలు, ఎస్సీలకు 40 వేలు, బీసీలకు 30 వేలు ఇస్తున్నామని చెప్పారు. ఎస్సీలు, ఎస్టీలకు 75 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. కరెంట్ కొరతను అధిగమించామన్నారు. కరెంట్ చార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు.

 

 

మన మధ్యలో చిచ్చుపెట్టేందుకు ప్రతిపక్షాల కుట్ర : నారా లోకేష్

చిత్తూరు : 2014లో కుట్ర రాజకీయాలతో రాష్ట్ర విభజన చేసి... మెడపట్టి బయటికి గెంటివేశారని మంత్రి నారా లోకేష్ వాపోయారు. మన మధ్యలో చిచ్చుపెట్టేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. 

 

ప్రతి నెల వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి : నారా లోకేష్

చిత్తూరు : రాష్ట్రంలో 24 వేల కోట్ల రుణమాఫీ చేశామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆరో రోజు నవ నిర్మాణదీక్షలో ఆయన మాట్లాడారు. 200 ఉన్న పించన్ ను వెయ్యి రూపాయలకు పెంచామని అన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ యువతకు ప్రతి నెల వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నామని... 17 వేల కిమీ మేర సీపీ రోడ్లు వేశామని చెప్పారు. పల్లెకు సేవ చేస్తే పరమాత్మునికి సేవ చేసినట్లేనని అన్నారు. నాలుగున్నర వేల కోట్ల రూపాయలతో మరుగుదొడ్లు నిర్మించామని తెలిపారు. దోమలపై సీఎం దండయాత్ర ప్రకటించారని చెప్పారు. 

17:49 - June 7, 2018

మహారాష్ట్ర : 2019 సార్వత్రిక ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని శివసేన మరోసారి స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లో సయోధ్య కోసం బిజెపి చీఫ్‌ అమిత్‌షా బుధవారం రాత్రి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేను కలిసారు. రెండున్నర గంటల పాటు ఇరువురు నేతలు చర్చించారు. వారేం ఏం మాట్లాడారన్నది మాత్రం వెల్లడి కాలేదు. అమిత్‌ షా ఎజెండా ఏంటో తమకు తెలుసని...వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని శివసేన ఎంపి సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు. శివసేన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని...ఈ విషయంలో వెనక్కి మళ్లే ప్రసక్తే లేదన్నారు. అమిత్‌ షా ఇవాళ పంజాబ్‌లో అకాలీదళ్‌ నేత ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌తో భేటి కానున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో అమిత్‌ షా ఎన్డీయే మిత్రపక్షాలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.

 

17:44 - June 7, 2018

మహారాష్ట్ర : ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. అరగంట పాటు కుండపోత వర్షం కురియడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా రైళ్లు ఆలస్యంగా నడిచాయి. పలు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. లండన్ నుంచి ముంబై వచ్చే జెట్‌ఎయిర్‌వేస్‌కు చెందిన విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. ఒర్లి, మాతుంగ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురియనున్నాయని దాదర్‌, పరేల్, బాంద్రా, కఫ్‌ పరేడ్, బొరివలి, అంధేరి ప్రాంత ప్రజలను వాతావరణశాఖ హెచ్చరించింది. భారీ వర్షాలతో ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌ అప్రమత్తమైంది.

17:43 - June 7, 2018

నెల్లూరు : మూడు సంవత్సరాల నుండి వైసీపీ ఎంపీలు రాజీనామాలు ఎందుకు ఆమోదించుకోలేకపోతున్నారని ప్రశ్నించారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి. బై ఎలక్షన్స్‌ అంటే భయంతోనే ఇంతకాలం రాజీనామా చేయలేదని ఆరోపించారు. ధైర్యం ఉంటే ప్రధాని, అమిత్‌ షాలను అడిగి బై ఎలక్షన్స్‌కు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు సోమిరెడ్డి. నెల్లూరు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా నాయుడు పేటలో పర్యటన ఏర్పాట్లను మంత్రి, జిల్లా కలెక్టర్‌ కలిసి పరిశీలించారు. 

 

17:39 - June 7, 2018

నిజామాబాద్ : అడవిలో చిరుతల గాండ్రిపులు కరువయ్యాయి. ఆహారం కోసం జనారణ్యంలోకి వస్తున్నచిరుత పులులు..అడవిలోకి వెళ్లే లోపే మృత్యువాత పడుతున్నాయి. ఒక్కటి కాదు ..రెండు కాదు.. ఏడాది వ్యవధిలో ఐదు చిరుతలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వన్యప్రాణుల రక్షణకోసం  ప్రత్యేక నిఘా  ఏర్పాటు చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో చిరుత పులుల మరణమృదంగం కొనసాగుతోంది. ఏడాది వ్యవధిలో ఐదు చిరుతలు మృత్యువాత పడ్డం ఆందోళ కలిగిస్తోంది. ఆహారం, నీటి కొరతతో క్రూరమృగాలు  గ్రామాల్లోకి రావడంతో స్థానికులు కంటిమీద కునుకలేకుండా గడుపుతున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాలుగు అటవీ డివిజన్లు ఉండగా..నిజామాబాద్ జిల్లాలో 85,911 హెక్టార్లలు , కామారెడ్డి జిల్లాలో 80,500 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. అందులో 4 వేల ఎకరాల్లో అభయారణ్యం  విస్తరించి ఉంది. ఇక్కడే చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులు అధికంగా ఉన్నాయంటున్నారు  అటవీశాఖ అధికారులు. అటవీ ప్రాంతంలో ఆహారం కొరత, తాగునీటి ఇబ్బందులతో చిరుతలు ఇతర జంతువులు జనారణ్యంలోకి వచ్చి మృత్యువాత పడుతున్నాయి. 

సరైన ఆహారం దొరక్క.. అనారోగ్యానికి గురై కొన్ని ,  వివిధ ప్రమాదాల్లో మరికొన్ని మృతి చెందుతున్నట్లు అటవీఅధికారులు చెబుతున్నారు.  అడవి జంతువులు జనావాసాల్లోకి వస్తుండంతో జనం భయపడుతున్నారు. జిల్లాలోని బోధన్, నవీపేట్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, ఆర్మూర్ ప్రాంతాల్లో చిరుతల సంచారం ఎక్కువగా ఉండంతో  అటవీశాఖ అధికారులు బోన్లు సైతం ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా చిరుతల మృత్యువాత పడకుండా అటవీ అధికారులు చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది. 

17:36 - June 7, 2018

విశాఖ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజా పోరాట యాత్ర విశాఖ జిల్లా పాడేరులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన రోడ్‌ షో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని...ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు వచ్చానని చెప్పారు. ఇచ్ఛాపురం నుండి పాడేరు వరకు ఉన్న ప్రజా సమస్యలన్నింటినీ చూశానన్నారు. డెబ్భై సంవత్సరాల స్వాతంత్ర్య భారతంలో గిరిజనులు కనీస మౌలిక వసతులకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

17:34 - June 7, 2018

వనపర్తి : ఆర్డీఓ కార్యాలయం ఎదుట రెవెన్యూ అధికారులు నిరసన చేపట్టారు. జిల్లాలో పని చేస్తున్న రెవిన్యూ సిబ్బందిని కలెక్టర్‌ అకారణంగా సస్సెండ్‌ చేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సస్సెండ్‌ చేసిన రెవిన్యూ అధికారులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రెవిన్యూ శాఖలో తక్కువ మంది సిబ్బంది ఉన్నా... విధులు నిర్వహిస్తుంటే కలెక్టర్‌ మాపై పని ఒత్తిడి పెంచడమే కాకుండా మానసికంగా వేధిస్తున్నాడని రెవిన్యూ అధికారులంటున్నారు. రెవెన్యూ ఉద్యోగుల ఆందోళనతో జిల్లాలోని 14 మండలాల్లో రెవెన్యూ సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

 

17:32 - June 7, 2018

హైదరాబాద్‌ : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి జహీరాబాద్‌కు తరలిస్తున్న గంజాయిని.. బీబీనగర్‌ టోల్‌ గేట్‌ వద్ద పోలీసులు తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 286 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 30 లక్షల రూపాయలు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.  

 

17:30 - June 7, 2018

సంగారెడ్డి : గులాబీ పార్టీ నేతల్లో  అంతర్గతపోరు తారా స్థాయికి చేరుకుంటోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య   సమన్వయలోపం  పలు నియోజకవర్గాల్లో  సమస్యలు సృష్టిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో కొనసాగిన నేతలకు, కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన  నాయకులకు  మధ్య  చిటపటలు తీవ్రతరం అవుతున్నాయి. సంగారెడ్డిజిల్లా నారాయణఖేడ్‌లో గులాబీనేతల అంతర్గత విభేదాలు జిల్లా పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నాయి.   

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ అధికార పార్టీ నేతలకు ఎమ్మెల్యేకు ఎక్కడా పొసగడం లేదు. పార్టీలో ఉద్యమనేతలు, కొత్త నేతలమధ్య కస్సుబుస్సుల పంచాయతీలు రక్తికడుతున్నాయి. నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వ్యవహారం అధికార పార్టీ నేతలను అయోమయానికి గురి చేస్తోంది. గతంలో  మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు 15 లక్షల రుపాయల లంచం పుచ్చుకున్నారన్న ఆరోపణలు కలకలం రేపాయి. దాంతోపాటు  ఎమ్మెల్యేగా ఎన్నికై  దాదాపు రెండేళ్లు అవుతున్నా.. నియోజకవర్గం నేతల మధ్య  సమన్వయం తీసుకురాలేకపోయారని భూపాల్‌రెడ్డిపై సొంతపార్టీ నేతలే విమర్శలకు దిగుతున్నారు. 

నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ గ్రూపుల పోటాపోటీ రాజకీయలు రంజుగా మారాయి. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో విభేదిస్తున్న నేతలు ఎమ్మెల్సీ రాములు నాయక్‌ కి మద్దుతుగా నిలుస్తున్నారు. ఎమ్మెల్సీ వర్గంగా గుర్తింపు పొందిన నేతలను ఏ అవకాశం ఉన్నా ఎమ్మెల్యేపై విమర్శలతో టార్గెట్‌ చేస్తున్నారు.    ఇటీవల  జరిగిన ఓ ఘటన నియోజకవర్గంలో మరింత కలకలం రేపింది.  ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ కంగ్ది  ఎంపీపీ రామారావ్   మండల సర్వసభ్య సమావేశంలోనే ఆత్మహత్యా యత్నానికి  ప్రయత్నించడం  అధికార పార్టీ నేతల్లో మరింత అయోమయం సృష్టిస్తోంది. 

ఎమ్మెల్యే వైఖరితో విసుగెత్తుతున్న నేతలు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ రాములు నాయక్ శిబిరానికి వెళ్లి పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే  భూపాల్ రెడ్డిని తీరుమార్చుకోవాల్సిందిగా పార్టీ పెద్దలు వార్నింగ్‌ ఇచ్చినా పరిస్థితిలో మార్పురాలేదని గులాబీపార్టీ క్యాడర్‌ అంటోంది. 

17:24 - June 7, 2018

చిత్తూరు : రాష్ట్రంలో 24 వేల కోట్ల రుణమాఫీ చేశామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆరో రోజు నవ నిర్మాణదీక్షలో ఆయన మాట్లాడారు. 200 ఉన్న పించన్ ను వెయ్యి రూపాయలకు పెంచామని అన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ యువతకు ప్రతి నెల వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నామని... 17 వేల కిమీ మేర సీపీ రోడ్లు వేశామని చెప్పారు. పల్లెకు సేవ చేస్తే పరమాత్మునికి సేవ చేసినట్లేనని అన్నారు. నాలుగున్నర వేల కోట్ల రూపాయలతో మరుగుదొడ్లు నిర్మించామని తెలిపారు. దోమలపై సీఎం దండయాత్ర ప్రకటించారని చెప్పారు. 2014లో కుట్ర రాజకీయాలతో రాష్ట్ర విభజన చేసి... మెడపట్టి బయటికి గెంటివేశారని వాపోయారు. మన మధ్యలో చిచ్చుపెట్టేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. 

17:21 - June 7, 2018

బలమైన నాయకుడంటే లావుగా వుండటం కాదు: డీకే అరుణ

హైదరాబాద్: నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో బలమైన నాయకుడు కాదంటూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ ఘాటు విమర్శలు చేశారు. ఒకవేళ నాగం టీడీపీలో బలమైన నాయకుడు కావొచ్చేమోగానీ.. కాంగ్రెస్‌లో కాదని చెప్పుకొచ్చారు. బలమైన నాయకుడు అంటే లావుగా ఉండడం కాదని వివరించారు. కాంగ్రెస్‌లో బలమైన నాయకుడు దామోదర్‌రెడ్డే అన్నారు. నాగం బలమైన నాయకుడైతే కాంగ్రెస్‌లోకి వచ్చేవారు కాదని విమర్శించారు. నాగం బలమైన నాయకుడైతే గత ఎన్నికల్లో ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు.

ప్రణబ్ పై మండిపడుతున్న సోనియా గాంధీ..

ఢిల్లీ : ఆర్ఎస్ఎస్ ఆహ్వానం మేరకు మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీపై సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రణబ్ కుమార్తె ఆయన నిర్ణయాన్ని తప్పు పట్టిన విషయం కూడా తెలిసిందే. కాగా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన ప్రణబ్ ముఖర్జీ, స్వతహాగా తన భావజాలానికి విరుద్ధమైన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో నేడు పాల్గొంటున్నారు. నాగ్ పూర్ లో జరిగే ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కీలక ప్రసంగం కూడా చేయనున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు వారించినా ప్రణబ్ ఖాతరు చేయలేదు. చివరికి కుమార్తె శర్మిష్టా ముఖర్జీ సైతం తండ్రిని ఈ విషయంలో హెచ్చరించింది.

పోలీసుల ఉద్యోగాల వయో పరిమితి పెంపు..

హైదరాబాద్ : తెలంగాణ పోలీసు రిక్రూట్ మెంట్ లో పోలీసుల ఉద్యోగాల వయో పరిమితి పెంచుతు పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. 18వేల 482 పోలీసు ఉద్యోగాలకు నోటి ఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర నిరుద్యోగులు వయో పరిమితి పెంచాలంటు ధర్నా చేపట్టిన నేపథ్యంలో పోలీసులు ఉద్యోగాలకు 3 సంవత్సరాలు వయో పరిమితి పెంచుతు జారీ చేసిన ఉత్తర్వులతో నిరుద్యోగులకు ఇదొక శుభవార్తగా చెప్పవచ్చు. అన్ని విభాగాల పోస్టులకు 3 సంవత్సరాల వయో పరిమితిని పెంచుతు పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. 

గంజాయి ముఠా గుట్టు రట్టు..

హైదరాబాద్ : బీబీ నగర్ పోలీసులు గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు. ఐదుగురు ముఠా సభ్యులుగల గంజాయి ముఠా ను బీబీ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో కిలో.గంజాయిని రూ.1000కి కొనుగోలు చేసి రూ.3 వేల నుండి 10వేలకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి భారీగా నగదును, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుండి జహీరాబాద్, మహారాష్ట్రలకు ఈ ముఠా గంజాయిని సరఫరా చేస్తోంది. నిందితులు నాగరాజు, సత్యనారాయణ, లోవరాజు, పవన్, బోబిలిలుగా పోలీసులు గుర్తించారు. కాగా వారిపై గతంలో కూడా పలు కేసులు వున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. 

కూలిన ఎస్బీఐ బ్యాంక్ పైకప్పు..

పెద్దపల్లి: బ్యాంకులో లావాదేవీలు నిర్వహించడానికి వచ్చిన ఖాతాదారులకు చేదు అనుభవం ఎదురైంది. పెద్ద‌పల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని ఎస్‌బీఐ బ్యాంకు భవనం పైకప్పు కూలింది. ఈ ఘటనలో రైతుబంధు పథకం చెక్కులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఏడుగురు రైతులకు గాయాలయ్యాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి పైకప్పు బాగా నాని గురువారం కూలింది. ఘటనలో గాయపడిన వారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.

గ్యాంగ్‌స్టర్ అబూం సలేంకు 7ఏళ్ల జైలుశిక్ష..

ఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ అబూం సలేంకు ఏడేళ్ల జైలు శిక్షను విధిస్తూ ఢిల్లీ టిస్ హజరీ కోర్టు తీర్పును వెలువరించింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తను రూ. 5 కోట్లు డిమాండ్ చేసిన కేసులో అబూం సలేం దోషిగా తేలాడు. డబ్బు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. సలేంతో పాటు కేసులో నిందితులుగా ఉన్న అతని అనుచరులు పవన్ కుమార్ మిట్టల్ అలియాస్ రాజా భాయ్, మహ్మద్ అస్రఫ్ అలియాస్ బబ్లూ, మాజిద్ ఖాన్ అలియాస్ రాజు భాయ్, చంఛల్ మెహతాలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

త్రిపుర గవర్నర్‌గా కేషరినాథ్ త్రిపాఠి..

ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేషరినాథ్ త్రిపాఠికి అదనపు బాధ్యతలు అప్పగించారు. త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ వర్గాలు ఓ ప్రకటనను విడుదల చేశాయి. త్రిపుర ప్రస్తుత గవర్నర్ తతగట రాయ్ సెలవుపై ఉన్నారు. ఎటువంటి కారణాలు తెలపకుండానే ఆయన సెలవుపై వెళ్లారు. దీంతో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ త్రిపుర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

బ్యాంకులకు టోకరా వేస్తున్న ముఠా గుట్టు రట్టు..

హైదరాబాద్ : నకిలీ పత్రాలతో పలు బ్యాంకులకు టోకరా వేసే ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పలు ప్రయివేటు బ్యాంకుల్లో రూ.70లక్షల లోన్లు తీసుకున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.8.66లక్షల నగదు, పలు నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

రాజకీయాల్లో పవన్ నూతన ఒరవడి : కేతిరెడ్డి

విశాఖపట్నం : రాజకీయాల్లో ఒక నూతన ఒరవడికి పవన్ కల్యాణ్ కారణమవుతారని ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఊకదంపుడు ఉపన్యాసాలు విని విసిగిపోయిన ప్రజలకు పవన్ మంచి నాయకత్వం అందిస్తారు. ప్రజలతో పవన్ కల్యాణ్ మమేకమవడం, సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి చూస్తుంటే ఒక ఉద్యమ నాయకుడిలా కష్టపడుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఏదో సాధించాలనే దాని కంటే..ప్రజాసేవ అనే గొప్ప కార్యక్రమంతో పవన్ ముందుకొచ్చారు... ‘నేను ముఖ్యమంత్రిని కావాలని రాజకీయాల్లోకి రాలేదు’ అనే పవన్ నినాదం ప్రజలకు నచ్చవచ్చు.  

సహజత్వానికి దగ్గరగా పవన్ ప్రసంగాలు : కేతిరెడ్డి

విశాఖపట్నం : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసే ప్రసంగాలు సహజత్వానికి దగ్గరగా ఉన్నాయని..ప్రజలను అక్కున చేర్చుకునే విధంగా పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ఉన్నాయని ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రశంసించారు. రాబోయే రోజుల్లో ఒక ప్రభంజనానికి పవన్ కారణమవుతారని గట్టిగా చెప్పేలా పవన్ తన ప్రసంగాలలో వెల్లడిస్తున్నారని కేతిరెడ్డి పేర్కొన్నారు. 

పరిశ్రమల తరలింపుకు యత్నాలు : సింగపూర్ మంత్రి ఈశ్వరన్

అమరావతి : ఏపీ అభివృద్ధికి విస్తృతస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తెలిపారు. ఈరోజు సీఎం చంద్రబాబు తో ఆయన భేటీ అయ్యారు. అమరావతి అభివృద్ధి నేపథ్యంలో సింగపూర్ తో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఈశ్వరన్ చంద్రబాబుతో పలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..రానున్న 6 నెలల్లో ఫలితాలు రాబోతున్నాయని తెలిపారు. సింగపూర్ సంస్థలను అమరావతికి తెచ్చేందుకు యత్నిస్తున్నామన్నారు. రైతుల సింగపూర్ యాత్ర వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని ఈశ్వరన్ తెలిపారు.

2020 నాటికి అసెంబ్లీ, హైకోర్టులు : చంద్రబాబు

అమరావతి : ఏపీలో సహజసిద్ధమైన వనురులు ఎన్నో వున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2020 నాటికి అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణాలను పూర్తి చేసేందుకు యత్నిస్తున్నామన్నారు. సింగపూర్ వంటి రాజధానిని నిర్మిస్తామని ఎన్నికల సమయంలో ప్రజలకు మాట ఇచ్చామన్నారు. సింగపూర్ ప్రభుత్వంతో ఏపీ అమరావతి అభివృద్ధి ఒప్పదంలో 58 శాతం సింగపూర్, 42 శాతం ఏబీసీ వాటాలు వుంటాయన్నారు. సింగపూర్ , అమరావతికి డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీ వుంటుందన్నారు. 30 రోజుల్లో నేరుగా సింగపూర్ కు ఏపీ నుండి విమాన సర్వీసులు వుంటాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

రామాయపల్లి రైతన్నలకు అండగా న్యాయస్థానం..

పెద్దపల్లి : రామగిరి మండలం రామాయపల్లి రైతులకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అండగా నిలిచింది. జీఎస్పఈఎల్ గ్యాస్ పైప్ లైన్ పనులపై హైకోర్టు స్టే విధించింది. గ్యాస్ పైప్ లైన్ల పనుల్లో పోలీసులు జోక్యం చేసుకోవద్దని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గ్యాస్ పైప్ లైన్ కంపెనీ జీఎస్పఈఎల్ కి నోటీసులు జారీ చేసింది. రైతులు తమ పిటీషన్ లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్, మంథని ఆర్డీవో, రామగిరి తహశీల్దార్, మంథని సీఐ నగేష్ లతో పాటు 9మందిని ప్రతివాదులుగా చేర్చింది. తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

15:37 - June 7, 2018

హైదరాబాద్‌ : గుంతల మయం అయిన రోడ్లు..  అంగుళం కదలని ట్రాఫిక్‌.. రోడ్లపైనే ప్రవహించిన డ్రైనేజి.. వర్షాకాలాన్ని తలచుకుంటేనే సిటీ జనం బెంబేలెత్తి పోతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రోడ్లను తీర్చిదిద్దుతామన్న పాలకులు... అందుకోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌నే ఏర్పాటు చేశారు. ఏళ్లతరబడి చెక్కుచెదరని వైట్‌వాష్‌ రోడ్లు వేస్తామన్న ప్రకటించిన అధికారులు.. చివరికి ప్యాచ్‌ వర్క్‌లతో సరిపెట్టేస్తున్నారు. 
వాహ‌న దారులను హ‌డ‌లెత్తిస్తున్న హైద‌రాబాద్ రోడ్లు 
హైద‌రాబాద్ రోడ్లు అంటేనే వాహ‌న దారులు హ‌డ‌లెత్తిపోతారు. నిత్యం ట్రాఫిక్ జాంతో ఇబ్బందులు ప‌డుతున్న సిటిజ‌నానికి  వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు ప్రతిరోజు ప్రాణగండమే.  ఎప్పుడు ఏ రోడ్డు నీటిలో నిండిపోతుందో , ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరిచి ఉంటుందో తెలియని పరిస్థితి. అర‌చెతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణించాల్సి పరిస్థితిని మార్చేస్తామని ప్రకటించిన ప్రభుత్వ పెద్దలు... సిటిలో స‌మ‌గ్ర రోడ్డు అభివృద్దికి ప్రత్యేకంగా హైద‌రాబాద్ రోడ్డు డెవ‌ల‌ప్ మెంట్ కార్పోరేష‌న్ లిమిటెడ్ ను స్థాపించారు. దీంతో రోడ్లను స‌మ‌గ్రంగా అభివృద్ది చేసి ఎళ్ల త‌ర‌బ‌డి మ‌న్నిక ఉండేలా తీర్చి దిద్దుతామన్నారు. దీనికోసం   స్పెష‌ల్ బ‌డ్టెట్ ను కూడా కేటాయించారు.
హెచ్ ఆర్ డీసీకి 306 కి.మీ.రోడ్ల అభివృద్ధి బాధ్యత 
సిటీ పరిధిలోని 306 కిలోమీట‌ర్ల రోడ్లను అభివృద్ధి చేసే బాధ్యతను  హైదరాబాద్‌  రోడ్డు డెవ‌ల‌ప్ మెంట్ కార్పోరేష‌న్ లిమిటెడ్‌కు  ప్రభుత్వం అప్పగించింది. రోడ్ల అభివృద్ధిలో వైట్ టాపింగ్‌కు ప్రాధాన్య మివ్వాల‌ని కూడా నిర్ణయించింది. దీన్లో భాగంగా ఈ ఎడాది 384కోట్ల రూపాయలతో  ప‌నులు చేపట్టారు. అయితే ప్రస్తుతం ప్రారంభించిన ప‌నుల్లో కేవ‌లం 50కిలో మీట‌ర్ల ప‌నులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 145 కిలో మీట‌ర్ల రోడ్ల ప‌నులు పూర్తి కావాల్సి ఉంది.  ఓవైపు వర్షాకాలం తరుముకొస్తున్న తరుణంలో వాహ‌నాల‌ స్మూత్ రైడ్ కోసం తాత్కాలికంగా  రికార్పెటింగ్ ప‌నులు  చేస్తున్నామంటున్నారు  కార్పొరేష‌న్  అధికారులు.  
మంత్రి కేటీఆర్‌ మళ్లీ పాతపాటే 
అధికారులు అలా చెబుతుంటే.. మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌ మళ్లీ పాతపాటే పాడుతున్నారు. హైద‌రాబాద్ రోడ్డు డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ త‌న‌కు కేటాయించిన ప‌నిని స‌మ‌క్రమంగానే నిర్వహిస్తోందనడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి మాటలకు అధికారులు చేస్తున్న పనులకు పొంతనే లేకుండా పోయింది. 
రీకార్పెటింగ్‌ తోనే సరిపెడతారా? 
ప్రభుత్వం, అధికారుల తీరుపై సిటిజన్స్‌ ఫోరం నాయకులు మండిపడుతున్నారు.  వర్షాలు జోరందుకోగానే రీకార్పెటింగ్‌ చేసిన  రోడ్లన్నీ మళ్లీ గుంతల మయంగా మారిపోతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. రోడ్లకు రికార్పెటింగ్ మాత్రమే చేసి చేతులు దులుపుకుంటున్నారని మిమర్శిస్తున్నారు. ప‌రిస్థితి ఇలానే ఉంటే ఈ ఎడాది కూడా సిటిజ‌న్స్ కు రోడ్డు క‌ష్టాలు త‌ప్పవంటున్నారు. ముందు చూపులేని పాలకులు, అధికారుల వల్లే... వందల కోట్ల ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోతోందని హైదరాబాద్‌ పబ్లిక్‌  అంటున్నారు. 

15:25 - June 7, 2018

కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం అన్నదాతలందరికీ అందడంలేదని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కౌలు, పోడు రైతులకు ఈ పథకాన్ని వర్తింపచేయకపోవడాన్ని తమ్మినేని తప్పుపట్టారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలంలోని 15 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులకు ఈ పథకం కింద సాయం అందలేదు. దీనిని నిరసిస్తూ సీపీఎం పాదయాత్ర నిర్వహించింది. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

15:22 - June 7, 2018

హైదరాబాద్ : ఉపాధ్యాయ బదిలీలపై వెబ్‌సైట్‌ను మంత్రి కడియం ప్రారంభించారు. 2018..19 విద్యా సంవత్సరంలో 475 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో 84 విద్యాలయాలను జూనియర్‌ కళాశాలలుగా మార్చబోతున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రతి జిల్లాకి మూడు కేజీబీవీలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశామని.. వాటికి ఇవాళ నోటిఫికేషన్‌ ఇచ్చామనిన్నారు. ఈ సంవత్సరం నుంచి గురుకుల పాఠశాలతో పాటు మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీ, జెడ్ పీహెచ్ ఎస్, గవర్నమెంట్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు.. 12 మాసాల పాటు హెల్త్‌ అండ్‌ హైజిన్‌ కిట్స్‌ను ఇవ్వనున్నట్లు కడియం తెలిపారు.  

ఏపీలో పార్టీ వ్యవహారాల బాధ్యత పెను సవాళ్లు : ఉమెన్ చాందీ

ఢిల్లీ : ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జిగా ఊమన్ చాందీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో పార్టీ వ్యవహారాల బాధ్యత ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని చెప్పారు. పార్టీ అధినేత రాహుల్ గాంధీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ కు ఇప్పటికీ మంచి పట్టు ఉందని, ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ తోనే ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా పని చేస్తామని తెలిపారు.

15:13 - June 7, 2018

ఢిల్లీ : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ వ్యవహారాల బాధ్యుడిగా ఉమెన్‌ చాందీ బాధ్యతలు స్వీకరించారు. ఉమెన్‌ చాందీ 21 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మాజీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన అనుభవజ్ఞుడు. ఈ నెల 12న విజయవాడలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో ఉమెన్‌ చాందీ సమావేశం కానున్నారు. 13న ఏఐసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరపాలని నిర్ణయించినట్లు ఉమెన్‌ చాందీ చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రేపటికి నాలుగేళ్లు అయిన సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 8 నుంచి15వ తేదీ వరకు ప్రజా వంచన వారంగా నిరసన చేపట్టనున్నానామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీర రెడ్డి చెప్పారు.

 

15:10 - June 7, 2018

హైదరాబాద్ : చింతల్‌ కుంట అండర్‌పాస్‌ పనుల్లో నాణ్యత లోపం బయట పడింది. రాత్రి కురిసిన రెండు సెంటిమీటర్ల వర్షాపాతాలనికే అండర్‌ పాస్‌లో భారీగా నీరు నిలిచిపోయాయి. దీంతో అధికారులు మోటర్లు పెట్టి నీటిని బయటకు పంప్‌ చేస్తున్నారు.  ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం పట్టిష్టం కాకుండానే ట్రాఫిక్‌ వలదలడంతో రోడ్డు కుంగిపోయిందని అధికారులు చెప్తున్నారు.  20 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెటక్ట్‌ను రెండు నెలల క్రితం మంత్రి కేటీఆర్‌ ప్రారంభిచారు. 

ఏపీ వ్యవహారాల బాధ్యతల్లో ఉమెన్ చాందీ..

ఢిల్లీ  : కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాంది తాజాగా ఏపీ వ్యవహారాల బాధ్యతలను స్వీకరించారు. ఈ నెల 12న విజయవాడలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో ఉమెన్ చాందీ సమావేశం కానున్నామనీ..13న ఏఐసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వుంటుందని ఉమెన్ చాందీ తెలిపారు. 8 నుండి15 వరకు ప్రజా వంచన వారంగా నిరసన ప్రకటించనున్నామని రఘువీరారెడ్డి తెలిపారు. 

15:03 - June 7, 2018

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీ జాతీయ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్న టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కన్నా ఆధ్వర్యంలో ఏపీ బీజేపీ నాయకులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌కు కలిసి వినతిపత్రం అందచేశారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు తెలుగుదేశం నాయకులుకు కొమ్ము కాస్తున్నారని ఫిర్యాదు చేశారు. మంత్రి అఖిలప్రియను కేబినెట్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.
 

ఉత్తరాంధ్ర వెనుకబాటుతో కడుపు మండి : 'జనసేనా'ని

అమరావతి : ఉత్తరాంధ్రలో గిరిజన సమస్యలతో కడుపుమండే జనసేన పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. జనపోరాట యాత్ర చేపట్టిన ఆయన ఈరోజు విశాఖపట్నం పాడేరులో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ... గిరిజనుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. గిరిజన యువతకు సరైన ఉపాధి మార్గాలు లేకే యువత పక్కదారి పడుతోందని, ఐటీడీఏ ఉపాధి మార్గాలు చూపకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. హుకుంపేట మండలం గూడలో మైనింగ్‌ అక్రమ తవ్వకాలు జరుగుతున్నా ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదని ఆరోపించారు.

13:30 - June 7, 2018

హైదరాబాద్ : శాట్స్ మెడికల్ సీట్ల కుంభకోణంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. శాట్స్ లో అక్రమాలు జరగదేఇన ఎండీ దినకర్ బాబు పేర్కొన్నారు. శాట్స్ అసోసియేషన్ లోకి వచ్చి సర్టిఫికేట్ల కోసం తనపై ఒత్తిడి తెస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అసోసియేషన్ లో ఉన్న లోపాల వలన క్రీడా విద్యార్థులకు సరైన న్యాయం జరగడం లేదని, శాట్స్ ద్వారా ఒక్క క్రీడాకారుడికి అన్యాయం జరగలేదన్నారు. ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగిందని, ఫెన్సింగ్ మిషన్ కారణంగా ఫెన్సింగ్ సర్టిఫికేట్లను పరిగణలోకి తీసుకోలేదని, ఎలాంటి ప్రాక్టిస్ లేని వారిని అసోసియేషన్ ఎంపిక చేస్తున్నారని తెలిపారు. 

13:08 - June 7, 2018

విజయవాడ : సింగపూర్ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తోందని సీపీఎం విమర్శించింది. సింగపూర్ మంత్రి..అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, సీఆర్డీఏ అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని నిరసిస్తూ సీపీఎం అధికారులు సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా సీపీఎం నేత బాబురావు, ఇతరులు టెన్ టివితో మాట్లాడారు.

సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయాలని, రాజధాని నిర్మాణం పేరిట స్థిరాస్థి వ్యాపారం చేస్తోందన్నారు. అమరావతి కేసులు లండన్ కోర్టులో పరిష్కరించుకోవాలా ? అని ప్రశ్నించారు. ప్రజా రాజధాని పేరిట విదేశీ రాజధాని నిర్మాణం చేపడుతున్నారన్నారు. సింగపూర్ కంపెనీలతో ఒప్పందం వెనుక వందల కోట్ల కుంభకోణం దాగుందన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

హెచ్‌ఎండీఏ అధికారి ఇంట్లో ఏసీబీ దాడులు..

హైదరాబాద్: హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగం అధికారి భీంరావ్ నివాసంలో అవినీతి నిరోధక విభాగం అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి శేరిలింగంపల్లిలోని భీంరావ్ నివాసంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. హెచ్‌ఎండీఏ పూర్వ ప్రణాళికా విభాగం అధికారి పురుషోత్తంరెడ్డితో కలిసి భీంరావ్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక ఆధారాల కోసం తనిఖీలు చేస్తున్నారు.

12:27 - June 7, 2018

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి కోసం సింగపూర్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని..రాజధాని నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని..ఏపీలో సహజసిద్ధమైన వనరులున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గురువారం జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (జేఐఎస్సీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సింగపూర్, ఏపీ ప్రభుత్వాలకు చెందిన మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం పలు ఒప్పందాలు జరిగాయి. అనంతరం బాబు..సింగపూర్ మంత్రి మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల సమయంలో సింగపూర్ లాంటి రాజధానిని కట్టిస్తామని చెప్పడం జరిగిందని, దీనికి ప్రజలు స్వాగతించారన్నారు. సీఎం అయిన తరువాత మంచి సిటీ కట్టించాలని సింగపూర్ కు వెళ్లి అక్కడి ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. సింగపూర్ లో ఎంతో క్రమశిక్షణ ఉంటుందని..ఎన్నో సౌకర్యాలు ఉండడంతో అక్కడకు వెళ్లాలని అందరూ అనుకుంటుంటారని తెలిపారు. మాస్టర్ ప్లాన్ కావాలని కోరగా కేవలం 15 రోజుల్లో అనుమతి తీసుకుని అనంతరం ప్లాన్స్ ఇచ్చారన్నారు. 2020 నాటికి అసెంబ్లీ..హైకోర్టు నిర్మాణాలు పూర్తవుతాయని గతంలో ఎంవోయూ చేసుకుని పలు సమావేశాలు నిర్వహించి సమీక్ష చేసుకోవడం జరుగుతోందన్నారు. ఆరు నెలలకొకసారి సింగపూర్ మంత్రి ఇక్కడకు రావడం..అనంతరం ఏపీ ప్రభుత్వం అక్కడకు వెళ్లడం జరుగుతోందన్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ లో భాగంగా పలు అంశాలు చర్చించి ఒక ఎంవోయూ చేసుకోవడం జరిగిందన్నారు. సింగపూర్ - ఆంధ్రప్రదేశ్ మధ్య విమాన సర్వీసులపై చర్చించడం జరిగిందని, అక్కడి విమాన సర్వీసులు ఇక్కడకు రావాలని ఆసక్తి చూపిస్తున్నారన్నారు. లైబ్రరీ స్టిస్టం పట్టిష్టం చేయాలని, ఈ సందర్భంగా సింగపూర్ ప్రభుత్వాన్ని..మంత్రి, అధికారులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు బాబు వెల్లడించారు. 

గవర్నర్ ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు..

హైదరాబాద్ : ఏసీ బీజేపీ నేతలు గవర్నర్ నరసింహన్ ను కలిసారు. ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రధాని నరేంద్రమోదీని దూషించటంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామాన్నారు. అలాగేఅ లిపిరి వద్ద బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై జరిగిన దాడి పై కూడా ఫిర్యాదుల్లో పేర్కొన్నామని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. 

పెట్రోలు 9 పైసలు,డీజిల్ 7పైసలు తగ్గింపు..

ఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గత నెలలో చుక్కల్ని తాకిన చమురు ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టాయి. వరుసగా తొమ్మిదో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కాస్త తగ్గాయి. గురువారం పెట్రోల్‌ ధరపై 9పైసలు, డీజిల్‌ ధరపై 7పైసలు తగ్గిస్తున్నట్లు ఆయిల్‌ కంపెనీలు ప్రకటించాయి. దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 77.63గా ఉంది. ముంబయిలో రూ. 85.45, కోల్‌కతాలో రూ. 80.28, చెన్నైలో రూ. 80.59గా ఉంది. ఇక లీటర్‌ డీజిల్‌ ధర దిల్లీలో రూ. 68.73, ముంబయిలో రూ. 73.17, కోల్‌కతాలో రూ. 71.28, చెన్నైలో రూ. 72.56గా ఉంది.

12:09 - June 7, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. 183వ రోజు నిడదవోలు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. పెరవలి మండలం కానూరు వద్దకు రాగానే తేనేటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. జగన్ పాదయాత్ర చేస్తున్న ప్రాంతంలో మామిడి తోటలు న్నాయి. ఇక్కడ తేనెతుట్టలు భారీగా ఉన్నాయి. మామిడి కాయలు కోస్తుండగా తేనెటీగలు పాదయాత్రవైపుకు వచ్చాయి. దీనితో కార్యకర్తలు..నేతలు భయాందోళనలకు గురయ్యారు. జగన్ కు తేనేటీగలు కుట్టనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ పది మంది వైసీపీ కార్యకర్తలకు, మీడియా ప్రతినిధికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం వీరిని ఆసుపత్రికి తరలించారు. ఈ చర్యతో పాదయాత్రకు కాసేపు విరామం ప్రకటించారు. కానీ ఇదిలా ఉంటే ఎవరో కావాలనే ఇలా చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు సమాచారం. 

12:03 - June 7, 2018

తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో ప్రేమ కథా చిత్రాలువచ్చాయి. కానీ వాటిన్నింటికి భిన్నంగా..బంపర్ హిట్ సాధించి..నాగచైతన్యకు, సమంతకు ట్రెంట్ సెట్టర్ గా నిలిచిన సినిమా 'ఏమాయా చేశావే'. తెలుగు తెరను పలకరించిన అందమైన ప్రేమకథా చిత్రాల సరసన 'ఏ మాయ చేసావే' కూడా కనిపిస్తుంది. నాగచైతన్య .. సమంత కాంబినేషన్లో 2010లో వచ్చిన ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. యువత హృదయాల్లో చిరస్థాయిగా ఈ సినమా నిలిచిపోయింది. అంతేకాదు భారీవసూళ్లను సాధిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటు చైతూకు .. అటు సమంతకు కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచిపోయింది. అంతేకాదు రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా వారికి ఈ సినిమా ట్రెండ్ ను సెట్ చేసేసింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి గౌతమ్ మీనన్ రెడీ అవుతున్నాడనేది తాజా సమాచారం. ఇదే సినిమాను ఆయన తమిళంలో శింబు .. త్రిష జంటగా చేశాడు. తమిళ సీక్వెల్ కి శింబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇక తెలుగు సీక్వెల్ కి చైతూ ఓకే చెప్పాల్సి ఉందని సమాచారం. ఇక కథానాయికల విషయంలోను స్పష్టత రావలసి వుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత ఈ ప్రాజెక్టు ఆలస్యమైతే, 'ఎంతవాడు' సీక్వెల్ తో రంగంలోకి దిగాలనే ఆలోచనలోను గౌతమ్ మీనన్ ఉన్నాడనేది కోలీవుడ్ టాక్. 

11:41 - June 7, 2018

అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగాస్టార్ చిరంరజీవి 150వ సినిమా విడుదల అవ్వటం..సూపర్, డూపర్ హిట్ సాధించింది. దీంతో ఇనుమడించిన ఉత్సాహంతో మెగాస్టార్ సైరాకు సై అన్నారు. ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ షూటింగ్ జరుపుకుంది. తాజా షెడ్యూల్ ఈ రోజు న హైదరాబాద్ లో మొదలైంది. 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు. మరోపక్క కొన్నిరోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ లో తాను పాల్గొన్న సన్నివేశాలకి సంబంధించిన కొన్ని ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో అమితాబ్ పోస్ట్ చేయడం వలన, చిరంజీవి లుక్ ఎలా ఉంటుందనే విషయం తెలిసిపోయింది. అయితే అధికారికంగా ఈ సినిమా నుంచి చిరంజీవి ఫస్టులుక్ ను ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 22వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ రోజున మెగా అభిమానులకి పండుగేనని చెప్పాలి. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో వున్నారు. 

ఉత్కంఠ రేపుతున్న ఆర్ఎస్ఎస్ వేదికపై ప్రణబ్ ప్రసంగం!!..

నాగ్ పూర్ : మాజీ రాష్ట్రపతి, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన ప్రణబ్ ముఖర్జీ, స్వతహాగా తన భావజాలానికి విరుద్ధమైన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో నేడు పాల్గొంటున్నారు. నాగ్ పూర్ లో జరిగే ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కీలక ప్రసంగం కూడా చేయనున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు వారించినా ప్రణబ్ ఖాతరు చేయలేదు. చివరికి కుమార్తె శర్మిష్టా ముఖర్జీ సైతం తండ్రిని ఈ విషయంలో హెచ్చరించింది. నాగ్ పూర్ వెళ్లి ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తప్పుడు కథనాల సృష్టికి, వదంతుల వ్యాప్తికి సహకరించిన వారవుతారంటూ తండ్రికి ట్వీట్ ద్వారా తెలియజేసింది.

శబ్ధ కాలుష్యంలో భాగ్యనగరం రికార్డ్..

హైదరాబాద్ : మహా నగరం వాయు కాలుష్యంలోనే కాకుండా, ధ్వని కాలుష్యంలోనూ రికార్డులకెక్కింది. ధ్వని కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా నగర ట్రాఫిక్ పోలీసు అధికారులు మాట్లాడుతూ, ధ్వని కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రచార ఉద్యమాన్ని చేపట్టామని తెలిపారు. సైలెన్సర్లను తొలగించి బైక్ లను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్లపై హరన్లను అనవసరంగా కొట్టరాదని సూచించారు. టెలికాం సంస్థలతో మాట్లాడి ధ్వని కాలుష్యాన్ని తగ్గించేలా వాహనదారుల మొబైల్ ఫోన్లకు మెసేజ్ లు పంపాలని నిర్ణయించామని తెలిపారు.

 

11:24 - June 7, 2018

అందం అభినయం కలగలిసిన నటి జ్యోతిక.పలు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జ్యోతిక 'చంద్రముఖి' పాత్రలో ఆమె అభినయాన్ని మరచిపోలేరు. దక్షిణభారతానికి చెందిన నటి జ్యోతిక తమిళ,కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలో నటించి ఆకట్టుకున్న జ్యోతిక తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె తెలుగులో నటించిన షాక్, ఠాగూర్ సినమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. డబ్బింగ్ సినిమానే అయినా..చంద్రముఖి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. తమిళ స్టార్ హీరో సూర్యను పెళ్ళి చేసుకొని కొంతకాలం నటనకు దూరంగా ఉన్న జ్యోతిక ఆ మధ్య "36 వయదినిలే"తో రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది కానీ, జ్యోతిక నటించిన తాజా చిత్రం 'నాచ్చియార్' టీజర్ లో జ్యోతిక ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు తమిళనాడును షేక్ చేసింది. ఇప్పుడు తాజాగా జ్యోతిక నాయికగా ఓ చిత్రం రూపొందుతోంది. హిందీలో విద్యాబాలన్ నటించిన 'తుమ్హారీ సులు' చిత్రం తమిళ రీమేక్ లో జ్యోతిక నటిస్తోంది. రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చెన్నయ్ లో జరుగుతోంది. దీనిని తెలుగులోకి కూడా అనువదించనున్నారట. కాగా చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యత వుందనీ..హీరోయిన్ ఓరియంటెండ్ సినిమాలు విడుదల కావటం..అవి విజయవంతం కావటం చాలా కష్టమని బహిరింగంగా చెప్పిన నటి జ్యోతిక. మహిళా సాధికారిత వుండాలని..మహిళలను తమ ప్రతిభను ఏమాత్రం మరగుపరుకోవాల్సిన పనిలేదని చెప్పే జ్యోతిక ఆత్మవిశ్వాసాన్ని సదా నిలబెట్టుకుంటున్న సందర్భాలు కూడా వున్నాయి. 

వైసీపీ ఎంపీ రాజీనామ ప్రకటన వచ్చేనా?..

ఢిల్లీ : తమ రాజీనామాలను ఆమోదింపజేసుకునేందుకు హస్తిన బాటప ట్టిన వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలపైఈ రోజు స్పీకర్ సుమిత్రా మహాజన్ తుది నిర్ణయం వెలువరించనున్నారు. రేపు సుమిత్రా మహాజన్ జెనీవా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో లోక్ సభ కార్యాలయం నుండి ఈరోజు అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం వుంది. కాగా నిన్న స్పీకర్ సుమిత్రా మహాజన్ తో భేటీ అయిన ఎంపీలతో రీ కన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వాలని స్పీకర్ కోరారు. 

11:12 - June 7, 2018

విజయవాడ : సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అమరావతికి చేరుకున్నారు. గురువారం ఉయదం గన్నవరం విమానాశ్రయంలో ఈశ్వరన్ కు మంత్రి నారాయణ ఘన స్వాగతం పలికారు. అనంతరం నేరుగా వీళ్లిద్దరూ సీఎం చంద్రబాబు నాయుడు కార్యాలయానికి వెళ్లారు. అమరావతి మాస్టర్ డెవలపర్ గా సింగపూర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (జేఐఎస్సీ) సమావేశంలో పాల్గొనేందుకు ఈశ్వరన్ ఏపీకి వచ్చారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

స్టార్టప్ ఏరియా అభివృద్ధికి జరగాల్సిన చర్యలు..ఇప్పటి వరకు జరిగిన పనులపై చర్చించనున్నారు. రాజధానిలో చేపట్టే నిర్మాణాలకు సంబంధించిన ఆకృతులను డిసైడ్ చేయనున్నారు. పలు పరిశ్రమలకు భూముల కేటాయింపు అంశం..ఇతరత్రా అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. సమావేశానికి సంబంధించిన వివరాలను ఈశ్వరన్..బాబులు మీడియాకు వెల్లడిస్తారని సమాచారం. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

11:11 - June 7, 2018

ఢిల్లీ : వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించారా ? లేదా ? అనేది తెలువాలంటే ఇంకా కొన్ని గంటలు వేచి ఉండాల్సిందే. ప్రత్యేక హోదా..విభజన హామీలు నెరవేర్చాలంటూ వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. కానీ స్పీకర్ వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహజన్ ను కలవాలని స్పీకర్ కార్యాలయం నుండి కబురు రావడంతో బుధవారం ఎంపీలు ఢిల్లీకి వెళ్లారు. రాజీనామాలకు గల కారణాలను వారు స్పీకర్ కు తెలియచేశారు. రాజీనామాల విషయంలో మరోసారి ఆలోచించుకోవాలని స్పీకర్ తెలియచేయగా వారు నిరాకరించినట్లు సమాచారం. కానీ వీరు చేసిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహజన్ ఆమోదించలేదు. ఇదిలా ఉంటే శుక్రవారం స్పీకర్ జెనీవా పర్యటనకు వెళ్లనున్నారు. దీనితో అధికారికంగా వీరి రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ కార్యాలయం వెల్లడించే అవకాశాలున్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి...

చంద్రబాబుతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ భేటీ..

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబుతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ భేటీ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో మాస్టర్ డెవలపర్ గా సింగపూర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ సందర్భంగా అమరావతిలో స్టార్టప్ ప్రాంతం 'ఫేజ్ జీరో' అభివృద్ధిపై చర్చ జరుగుతుంది. అనంతరం ఇద్దరూ కీలక ఒప్పందం చేసుకోనున్నారు. దీంతోపాటు విజయవాడ నుంచి సింగపూర్ కు విమాన సర్వీసులను నడిపే అంశంపై కూడా చర్చ జరగనుంది. ఈరోజు జరుగుతున్నది మూడో జేఐఎస్సీ సమావేశం. ఈ భేటీలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ, సింగపూర్ అధికారులు పాల్గొన్నారు. 

జగన్, జగన్ గ్యాంగ్ పై తేనెటీగల దాడి..

పశ్చిమ గోదావరి : తణుకు, నిడదవోలులో పాదయాత్ర చేసిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి ఈరోజు పెరవలి మండలం కానూరు కొండాలమ్మ గుడి వద్ద తన యాత్ర ప్రారంభిస్తున్న సంరద్భంగా తేనెటీగలు కలకలం రేపాయి. ఒక్కసారిగా అవి దాడి చేయడంతో జగన్‌ను వాటి బారి నుంచి స్థానికులు, పోలీసులు రక్షించారు. ఈ దాడితో 10 మందికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

డేంజర్ జోన్ లో గులాబీ ఎమ్మెల్యేలు..

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి చెందిన 39 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వీరిలో చాలా మందికి టికెట్ మిస్ అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరిలో పలువురికి ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సన్నిహితంగా ఉంటే ఎమ్మెల్యేలకు వారితోటే వార్నింగ్ ఇంప్పించారట. వివిధ సర్వేల ద్వారా కేసీఆర్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని సర్వేల ద్వారా తెలుసుకున్న కేసీఆర్ సదరు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారట.

పాడేరుకు బయలుదేరిన పవన్..

విశాఖపట్నం : జనసేన అధ్యక్షుడు తన ఆంధ్ర ప్రదేశ్ పర్యటనను ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. ఈ పర్యటనలో భాగంగా అరకు, పాడేరు ప్రాంతాలను సందర్శించారు.. అరకు రిసార్ట్స్ లో విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాన్.. అరకు. ప్రాంతలోని పలు గ్రామాలను సందర్శించి.. అక్కడ వారితో సరదాగా గడిపారు. కాగాఈ రోజు పాడేరు పర్యటన సందర్భంగా పాడేరులో బహరంగ సభలో జనసేనాని ప్రసంగించనున్నారు. 

తెలంగాణకు రుతుపవనాలు..

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు ఈరోజు తెలంగాణలోకి ప్రవేశించబోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే ముందస్తు నైరుతి వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. రాయలసీమలో ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు.

పులికాట్ సరస్సులో తప్పిన ఘోర ప్రమాదం..

నెల్లూరు : ఏపీలో వరుసగా పడవ ప్రమాదాలు సంభవిస్తు పలువురి ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పులికాట్ సరస్సులో పెను ప్రమాదం తప్పింది. ఇరకం దీవిలో జరుగుతోన్న పొన్నియమ్మ రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇరకం-భీములవారిపాలెం మధ్య భక్తులను తరలించేందుకు మత్స్యకారులు పడవలను నడుపుతున్న పడవ భీములపాలెం రేవుకు 30 మంది భక్తులతో తిరిగి వస్తున్న ఓ పడవ ప్రమాదానికి గురైంది. చిన్న పడవలోకి భారీ సంఖ్యలో భక్తులు ఎక్కడంతో ఈ ప్రమాదానికి గురయినట్లుగా తెలుస్తోంది. రేవు సమీపంలోకి వచ్చేసరికి పడవ ఒక్కసారిగా మునిగిపోయింది.

సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కు ఘన స్వాగతం..

అమరావతి : సింగపూర్ మంత్రి ఈశ్వరన్ విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ఈశ్వరన్ కు మంత్రి నారాయణ ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఇద్దరూ విజయవాడకు చేరుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈశ్వరన్ ల మధ్య జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా అమరావతిలో స్టార్టప్ ప్రాంతం 'ఫేజ్ జీరో' అభివృద్ధిపై చర్చ జరుగుతుంది. అనంతరం ఇద్దరూ కీలక ఒప్పందం చేసుకోనున్నారు. దీంతోపాటు విజయవాడ నుంచి సింగపూర్ కు విమాన సర్వీసులను నడిపే అంశంపై కూడా చర్చ జరగనుంది. ఈరోజు జరుగుతున్నది మూడో జేఐఎస్సీ సమావేశం.

10:28 - June 7, 2018

కర్నూలు : ఇలాంటి మొగుడు కూడా ఉంటారా ? అని ఈ ఘటన చూసిన అనంతరం అంటారు. పెళ్లైన పది హేను రోజులకే తనలో ఉన్న శాడిస్టుతనాన్ని భార్యకు చూపించాడు. శరీరంపై ఎక్కడపడితే అక్కడ కత్తులతో కోయడం..అగ్గికొక్కాలతో వాతలు పెట్టడం..ఆ మహిళ తీరని బాధను అనుభవించింది. ఈ ఘటన కృష్ణగిరి మండలం పెనుమాడలో చోటు చేసుకుంది. రాజు అనే వ్యక్తి లక్ష్మీదేవిని 15 రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. అనుమానంతో రాజు పాశవికంగా లక్ష్మీదేవిపై దాడికి పాల్పడ్డాడు. కోయడం..వాతలు పెడుతుండడం చేసేవాడు. శారీరకంగా..మానసికంగా బాధ పడుతూ ఉంది. తన కుటుంబం పరువు బయటపడుతుందనే ఉద్ధేశ్యంతో ఎవరికీ చెప్పుకోలేదు. చివరకు ఓ ప్రజా సంఘం ద్వారా లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనే రాజుకు వివాహం జరిగందని తెలిసిందని బాధిత కుటుంబం పేర్కొంటోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

భార్యపై భర్త పైశాచికం..

కర్నూలు : మరో వివాహిత భర్త చేతిలో హింసలకు లోనయింది. భార్యపై వుండే అనుమానంతో భర్త పలు హింసకు పాల్పడిన ఘటన కృష్టగిరి మండలం పెనుమాడలో చోటుచేసుకుంది. వివాహం అయిన కేవలం 15 రోజులకే భర్త భార్యపై హింసాత్మక చర్యలకు పాల్పడ్డాడు. భార్య లక్ష్మీదేవి శరీరంపై భర్త రాజు అగ్గి ఇనుప కొక్కాలను కాల్చి వాతలు పెట్టాడు. కత్తితో దాడికి దిగి శరీరం నిండా గాయపరిచాడు. దీంతో భర్త పెట్టే హింసలు తట్టుకోలేని సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త మీద వుంటే అనుమానంతోనే ఇటువంటి దారుణానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది.  

శాట్స్ మెడికల్ సీట్ల కుంభకోణంలో దర్యాప్తు ముమ్మరం..

కర్నూలు : శాట్స్ మెడికల్ సీట్ల కుంభకోణంలో ఏసీబీ అధికారులు తమ దర్యాప్తు ముమ్మరం చేశారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ అధికారుల చుట్టు ఉచ్చు బిగుస్తోంది. మెడికల్ సీట్ల భర్తీలో అంతర్జాతీయ క్రీడాకారులను పక్కన పెట్టిన శాట్స్ అధికారులు లక్షలు తీసుకుని రాష్ట్ర క్రీడాకారులకు మెడికల్ సీట్లను కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే శాట్స్ డైరెక్టర్ వెంకటమరణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మరో అధికారి విజయకుమార్ పై ఏసీబీ దృష్టి పెట్టింది. దర్యాప్తును ముమ్మరం చేసిన ఏసీబీ శాట్స్ కంప్యూటర్స్, హార్డ్ డిస్క్ లు, ప్రింటర్లు, స్కానర్లను స్వాధీనం చేసుకున్నారు. 

10:05 - June 7, 2018

విజయవాడలో సింగపూర్ మంత్రి...

విజయవాడ : సింగపూర్ మంత్రి ఈశ్వరన్ విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఈశ్వరన్ కు మంత్రి నారాయణ ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈశ్వరన్ ల మధ్య జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (జేఐఎస్సీ) సమావేశం జరగనుంది. 

09:06 - June 7, 2018

విజయవాడ : నూతన పోలీస్‌బాస్‌ను నియమించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న మాలకొండయ్య ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. కొత్త డీజీపీ ఎవరన్నది ఆసక్తిగా మారింది. వాస్తవానికి 2017 వరకు డీజీపీ పదవి ఎంపిక ప్రక్రియ యూపీఎస్సీతో ముడిపడి ఉంది. కాగా రాష్ట్ర పోలీస్ చట్టానికి సమరణలు చేసిన ఏపీ ప్రభుత్వం.. కొత్త డీజీపీ నియామకాన్ని సొంతంగానే చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీగా మాలకొండయ్య పదవి కాలం ఈ నెల 30న ముగుస్తున్న నేపథ్యంలో.. నూతన డీజీపీ నియామకంపై సర్కార్‌ దృష్టి సారించింది. డీజీపీగా ఎన్నికయ్యెందుకు అర్హత కల్గిన వారిలో ఎన్‌.వి సురేంద్రబాబు, గౌతమ్‌ సవాంగ్‌ ఉన్నారు. వీరిలో ఆర్టీసీ ఎండీగా సురేంద్రబాబు విధులు నిర్వహిస్తుండగా.. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా గౌతం సవాంగ్‌ కొనసాగుతున్నారు.

అయితే 2017 వరకు డీజీపీ ఎంపిక ప్రక్రియ యూపీఎస్సీతో ముడిపడి ఉండేది. కాని 2017 ఏడాది చివర్లో ఏపీ పోలీస్ చట్టానికి పలు సమరణలు చేయడంతో.. సొంతంగా రాష్ట్రమే డీజీపీని నియమించుకునే వీలు కలిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధికారుల జాబితాను సిద్దం చేసిన అనంతరం డీజీపీ ఎంపీకపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

ఈ సారి రాష్ట్రంలో 1986-1987 బ్యాచ్‌కి చెందిన మొత్తం ఏడుగురిలో మాలకొండయ్యను మినహాయిస్తే ఆరుగురు ఐపీఎస్‌ అధికారులు డీజీపీ హోదా కల్గి ఉన్నారు. 2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో డీజీపీ ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అటు విధుల్లో, ఇటు శాఖలోని సిబ్బందిని, అధికారులను గాడినపెట్టడంతో పాటు .. ప్రజలతో మమేకమై సమర్ధుడైన వ్యక్తినే డీజీపీగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే సీఎం చంద్రబాబు గౌతం సవాంగ్‌ లేదంటే సురేంద్రబాబును నియమించే ఆస్కారం ఉంది. వీరిద్దరూ గతంలో తమ దైన శైలిలో ప్రజలలో మంచి పేరుతెచ్చుకుని చెరగని ముద్రవేసుకున్నారు. మరి ఏపీ పోలీస్‌ పట్టాభిషేకం డీజీపీ పోస్ట్‌ ఎవరిని వరిస్తుందో చూడాల్సి ఉంది. 

09:04 - June 7, 2018

హైదరాబాద్ : ఫెడరల్‌ ఫ్రంట్‌... జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు అంటూ హడావిడి చేసిన గులాబీదళపతి ఇపుడు సైలెంట్‌ అయ్యారు. కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం ఫ్రంట్ కార్యాచరణ స్పీడప్ అవుతుందని భావిస్తే.. పరిస్థితి కాస్తా చల్లబడింది. కర్నాటక ఎన్నికల సమయంలో రోజుకో స్టేట్‌మెంట్‌ ఇచ్చిన గులాబీ నేతలు ఇపుడు ఆ ఊసే ఎత్తడం లేదు. కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు సిద్ధమన్న ముఖ్యమంత్రి కేసిఆర్... ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు. సుమారు రెండు నెలల క్రితం వరకు ఎంతో ఉత్సాహంగా జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిన గులాబీదళపతి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కర్నాటక ఎన్నికలకు ముందు జెడిఎస్‌కు మద్దతు తెలిపిన కేసీఆర్‌.. కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా కూటమి కడతామంటూ ప్రకటనలు చేశారు. అనుకున్నట్లుగానే ప్రాంతీయ పార్టీగా జెఎడిఎస్ కర్నాటక ఎన్నికల్లో కీలకంగా మారింది. కాని గులాబీబాస్‌ ఆశించిన దానికి భిన్నంగా పరిస్థితి మారింది. కాంగ్రెస్‌తో కలిసి జేడీఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఫెడరల్‌ ఫ్రంట్‌లో కీలకం అవుతుదందనుకున్న జేడీఎస్‌ కాస్తా హస్తంపార్టీ వైపు జారిపోయింది.

కర్నాటక ముఖ్యమంత్రిగా కుమార స్వామి ప్రమాణస్వీకారానికి సీఎంలు చంద్రబాబు, మమత బెనర్జీ, కేజ్రీవాల్ తోపాటు కాంగ్రెస్, వామపక్షాల జాతీయ నేతలు హాజరు కావడంతో కొత్త కూటమికి ఈ పరిస్థితులు దారి తీస్తాయన్న ప్రచారం జోరందుకుంది. సీఎం కుమారస్వామి తాజా వ్యాఖ్యలు కేసీఆర్‌ ప్రయత్నాలకు మరోసారి గండికొట్టాయి. బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలన్న సూచనలు అన్ని పార్టీల అగ్రనేతల నుంచి అందాయని కర్నాటక సిఎం అనడంతో ఇక ఫెడరల్‌ ఫ్రంట్‌ వైపు జేడీఎస్‌ రానట్టేనన్న అభిప్రాయాలు వస్తున్నాయి. మొత్తానికి 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం అయితే బీజేపీ, లేదా కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పడే కూటములదే అధికారం అనేది స్పష్టం అవుతున్న పరిస్థితుల్లో ... జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తేవాలన్న కేసీఆర్‌ ఏంచేస్తారనేది ఇపుడు ఆసక్తిగా మారింది. 

08:08 - June 7, 2018

హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీంపలోని ఎన్ సీసీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున హనుమంతు అనే వ్యక్తి బైక్ పై వెళుతున్నాడు. విద్యానగర్ బ్రిడ్జిపై బైక్ పై వెళుతుండగా వర్షం కారణంగా బైక్ అదుపుతప్పింది. బ్రిడ్జిని ఢీకొనడంతో తలకు తీవ్రగాయాలయి అక్కడికక్కడనే మృతి చెందాడు. హెల్మెట్ పెట్టుకొంటే ప్రాణాలు నిలిచేవని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

విద్యానగర్ లో ప్రమాదం...

హైదరాబాద్ : విద్యానగర్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వర్షంలో అదుపు తప్పిన బైక్ విద్యానగర్ బ్రిడ్జిని ఢీకొంది. ఈ ఘటనలో హనుమంతు అక్కడికక్కడనే మృతి చెందాడు. 

07:32 - June 7, 2018

ఆర్ఎస్ఎస్ శిక్షణా కార్యక్రమానికి ప్రణబ్...

నాగపూర్ : నేడు ఆర్ఎస్ఎస్ మూడో వార్షిక శిక్షణా కార్యక్రమాలు జరుగనున్నాయి. ముఖ్యఅతిథిగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరు కానున్నారు. 

నేడు చిత్తూరుకు బాబు...

చిత్తూరు : నేడు పుంగనూరు, మదనపల్లి నియోజకవర్గాల్లో సీఎం చంద్రబాబాబు నాయుడు పర్యటించనున్నారు. చౌడేపల్లి (మం) చండ్రమాకుల పల్లిలో గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. 

విశాఖలో జనసేనానీ...

విశాఖపట్టణం : సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ పర్యటన కొనసాగుతోంది. నేడు విశాఖలో ఉదయం 11గంటలకు పాడేరు అంబద్కేర్ సెంటర్ లో పవన్ సభ నిర్వహించనున్నారు. 

నేడు ప్రేక్షకుల ముందుకు 'కాలా'

హైదరాబాద్ : సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కాలా' నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈసందర్భంగా పలు థియేటర్ల వద్ద రజనీ అభిమానులు టికెట్ల కోసం బారులు తీరారు. 

06:54 - June 7, 2018

కర్ణాటక : ఎట్టకేలకు రెండు వారాల అనంతరం కర్ణాటకలో కుమారస్వామి మంత్రివర్గం కొలువుదీరింది. కాంగ్రెస్‌, జెడిఎస్‌కు చెందిన 24 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్థిక శాఖ జెడిఎస్‌కు, హోంశాఖ కాంగ్రెస్‌కు దక్కాయి. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. జేడీఎస్‌ నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు వారాలు గడిచిన అనంతరం మంత్రి పదవుల కేటాయింపుపై స్పష్టత రావడంతో మంత్రివర్గ విస్తరణ జరిగింది. రాజ్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్‌ వజుభాయి వాలా కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు, జెడిఎస్‌ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఒక ఎమ్మెల్సీకి కూడా మంత్రి పదవి దక్కింది.

అందరికంటే ముందుగా సిఎం కుమారస్వామి సోదరుడు, జెడిఎస్‌ నేత హెచ్‌డి రేవణ్ణ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ నేత డి.కె.శివకుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. రేవణ్ణకు రోడ్లు భవనాలు శాఖ కేటాయించగా...శివకుమార్‌కు నీటిపారుదల‌, వైద్యవిద్య మంత్రిత్వ శాఖలు అప్పగించారు.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి మంత్రి పదవులు దక్కిన వారిలో శివకుమార్‌తో పాటు ఆర్‌ వీ దేశ్‌పాండే, హెచ్‌కే పాటిల్‌, శమనూరు శివశంకరప్ప, కేజే జార్జ్‌, కృష్ణ బైర్‌ గౌడ, రాజశేఖర్‌ పాటిల్‌, ప్రియాంక ఖర్గే, శివానంద్‌ పాటిల్‌, యూటీ ఖడార్‌, జమైర్‌ అహ్మద్‌ ఖాన్‌, పుట్టరంగ శెట్టి, శివశంకర రెడ్డి, జయమాల ఉన్నారు.

జేడీఎస్‌ పార్టీ నుంచి మంత్రి పదవులు దక్కిన వారిలో రేవణ్ణతో పాటు జీటీ దేవెగౌడ, బండప్ప కశంపుర్‌, సీఎస్‌ పుట్టరాజు, వెంకటరావ్‌ నాదగౌడ, హెచ్‌కే కుమారస్వామి, బిఎస్పీ ఎమ్మెల్యే ఎస్‌ఏ ఆర్ఏ మహేశ్‌ ఉన్నారు.

మే 23న కర్ణాటకలో కాంగ్రెస్‌-జెడిఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా జెడిఎస్‌ నేత కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత జి.పరమేశ్వర ప్రమాణస్వీకారం చేశారు. మంత్రి పదవులను 2:1 నిష్పత్తిలో కాంగ్రెస్‌, జెడిఎస్‌లు పంచుకున్నాయి. కర్ణాటకలో మొత్తం 34 మంత్రి పదవులకు గాను కాంగ్రెస్‌కు 22, జెడిఎస్‌కు 12 కేటాయించారు. సిఎం, డిప్యూటి సిఎంతో కలిపి మంత్రివర్గం సంఖ్య 27కి చేరింది.

06:53 - June 7, 2018

హైదరాబాద్ : తెలంగాణను గురువారం నైరుతి పలకరించ నుంది. ఇప్పటికే రాయలసీమలో ప్రవేశించిన రుతుపవనాలు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మీదుగా దక్షిణ కోస్తాంధ్ర మొత్తం విస్తరించాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇవాళ సాయంత్రానికి తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మరోవైపు పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల తేమగాలులు విస్తున్నాయన్నారు. గత రెండు రోజులుగా తెలంగాణలోని 87 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని చెప్పారు. అత్యధికంగా కొడంగల్‌లో 5సెంటీమీటర్లు, పెద్దేముల్లో 4, యాచారం, సరూర్‌నగర్లలో 3సెంటీ మీటర్ల చొప్పున వర్షం కురిసింది. రుతుపవనాల కారణంగా రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 డిగ్రీల వరకు తగ్గుతున్నాయని వాతరవరణశాఖ ప్రకటించింది.

06:52 - June 7, 2018

విజయవాడ : వైసీపీ ఎంపీల రాజీనామాలపై జగన్‌ స్పందించారు. రాష్ట్రం కోసం ఎంపీలు ధైర్యంగా రాజీనామాలు చేశారన్నారు. రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేసి ఉంటే కేంద్రంపై ఆ ప్రభావం తీవ్రంగా ఉండేదన్నారు. టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించేందుకు చంద్రబాబు భయపడ్డారని జగన్‌ విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామన్నారు. 

కామారెడ్డిలో తమ్మినేని పాదయాత్ర...

కామారెడ్డి : నేడు జక్కల్ మండలం రైతు సమస్యలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర చేయనున్నారు. 

తెలంగాణకు నైరుతి పవనాలు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నేడు నైరుతి పవనాలు ప్రవేశించనున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో బుధవారం రాత్రి వర్షం కురిసింది. 

8న చేప మందు పంపిణీ...

హైదరాబాద్ : ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభం కానున్న చేపమందు ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులతో కలిసి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ను పరిశీలించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే...

ఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే...10 రోజుల్లోపే రైతులకు రుణమాఫీ చేస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. మందసౌర్‌లో రైతులపై పోలీసులు కాల్పులు జరిపి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన ప్రసంగించారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు 10 రోజుల్లోనే న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ల

కీలక వడ్డీ రేట్లు పెంపు...

ఢిల్లీ : కీలక వడ్డీ రేట్లను పావు శాతం పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 6 శాతం నుంచి 6.25 శాతానికి పెరిగింది. రివర్స్‌ రెపో రేటు 5.75 శాతం నుంచి 6 శాతానికి పెంచారు. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ రెపో రేటు పావుశాతం పెంచుతూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.  

చిదంబరంకు కష్టాలు...

ఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరానికి కష్టాలు తొలగడం లేదు. INX మీడియా కేసులో ఇవాళ ఆయన సిబిఐ ముందు హాజరయ్యారు. ఈ కేసులో సిబిఐ ఆయనను ప్రశ్నిస్తోంది. ఈ కేసులో చిదంబరాన్ని సిబిఐ ప్రశ్నించడం ఇదే తొలిసారి. ఎయిర్‌ సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో ఈడీ నిన్న ఆరున్నర గంటల పాటు చిదంబరాన్ని ప్రశ్నించింది.

Don't Miss