Activities calendar

08 June 2018

21:54 - June 8, 2018

గుంటూరు : తెలుగుదేశం ప్రభుత్వం నాలుగేళ్ల పాలనపై.. విపక్షాలు మండిపడ్డాయి. వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చార్జిషీట్లు విడుదల చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీనీ చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదని విపక్ష నేతలు విమర్శించారు. తమ చార్జిషీట్‌లోని అంశాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. 

చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై.. వైసీపీ నాయకులు విజయవాడలో చార్జిషీట్‌ను విడుదల చేశారు. చంద్రబాబు తన తొలిసంతకం విలువను నీరుగార్చేశారని వైసీపీ నాయకులు ఈ సందర్భంగా విమర్శించారు. రైతు, డ్వాక్రా రుణ మాఫీ విషయంలో మాట తప్పారని, నాలుగేళ్లుగా నిరుద్యోగులనూ మోసం చేశారని.. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు నిధులను స్వాహా చేశారని వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. చంద్రబాబు అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారని ఆరోపించారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

అటు కాంగ్రెస్‌ పార్టీ కూడా.. నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై బెజవాడ లెనిన్‌ సెంటర్‌లో చార్జ్‌షీట్‌ విడుదల చేసింది. నాలుగేళ్ల టీడీపీ పాలనలో దగా తప్ప ఏమీ లేదని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఇసుకను దోచుకుంటున్నారని, రాజధాని పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరుగుతోందని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. 

అటు బీజేపీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వారం రోజులుగా పాలన పడకేసిందని విమర్శించారు. చంద్రబాబు భయంతో జనాన్ని రక్షణ వలయంగా నిలిచి కాపాడాలని కోరుతున్నారని బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణంలో అవినీతి తాండవిస్తోందని విమర్శించారు. చంద్రబాబు కేంద్ర పథకాలను తనవిగా ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. విభజనచట్టంలోని హామీలను సాధించడంలో ప్రభుత్వం విఫలమైందని భావిస్తోన్న కాంగ్రెస్‌ పార్టీ.. వచ్చే ఏడు రోజులూ... ప్రజా వంచన వారంగా పాటించాలని నిర్ణయించింది.  

21:48 - June 8, 2018

గుంటూరు : రాష్ట్రంలో ప్రజలంతా సంతృప్తిగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని.. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. గడచిన నాలుగేళ్లలో ఐదు లక్షల 20వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని చెప్పారు. బడ్జెట్‌ కేటాయింపుల కంటే కూడా.. ఎక్కువే ఖర్చు చేశామని యనమల వెల్లడించారు. 

నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో.. రాష్ట్రం పురోభివృద్ధిలో సాగుతోందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శుక్రవారం, నాలుగేళ్ల పాలనపై మాట్లాడారు. కేంద్రం నుంచి ఆశించిన రీతిలో స్పందన లేదని, చట్టప్రకారం రావాల్సినవి కూడా ఇవ్వడం లేదని యనమల రామకృష్ణుడు తెలిపారు. నాలుగేళ్లలో కేంద్రం ఇచ్చింది పన్నెండు వేల 879 కోట్లు మాత్రమేనని, రెవెన్యూ లోటు మరో 12వేల కోట్ల రూపాయలకు పైగానే రావాల్సి ఉందని యనమల చెప్పారు. అయినప్పటికీ, నాలుగేళ్ళలో రాష్ట్ర సగటు వృద్ధి రేటు 10.5 శాతంగా ఉందన్నారు.  

తమ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల కంటే కూడా ఎక్కువే ఖర్చు చేసిందని యనమల రామకృష్ణుడు వివరించారు. రాష్ట్రంలో ప్రజలందరూ సంతృప్తిగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని యనమల స్పష్టం చేశారు. టీడీపీ పాలనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలకు కనిపిస్తోన్న అభివృద్ధి విపక్షాలకు కనిపించక పోవడం దురదృష్టకరమని అన్నారు. 

రాష్ట్రాభివృద్ది, హామీల అమలు కోసం రుణాలు కూడా తీసుకున్నామన్న యనమల రామకృష్ణుడు, మేనిఫెస్టోలో ప్రకటించిన వాటి కంటే అదనంగా.. 103కు పైగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని వివరించారు.  ఉద్యోగులు, ఇతర సంఘాలు ఏది అడిగినా అభ్యంతరం తెల్పలేదని చెప్పారు. 

 

21:44 - June 8, 2018

నెల్లూరు : అమరావతిని అభివృద్ధి చేయడమే మన ముందున్న లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ పరిస్థితుల్లో కష్టపడే వారు లేకుంటే.. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారవుతుందని హెచ్చరించారు. కేంద్రం సహకరించక పోయినా.. నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేశానన్నారు. 

నవ నిర్మాణ దీక్షలో భాగంగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. అమరావతి నిర్మాణం శుక్రవారం ప్రారంభమైందన్న ముఖ్యమంత్రి.. రాజధానిని అభివృద్ధి చేయడమే మనముందున్న మరో లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఏదైనా సాధించే దీక్ష, పట్టుదల తెలుగువారి సొంతమని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా మారుస్తానన్నారు. రాష్ట్రం అభివృద్ధి అయ్యే వరకూ నవనిర్మాణ దీక్ష ఆగదన్నారు. 

కృష్ణా గోదావరి-పెన్నా నదుల అనుసంధానంతో రాష్ట్రం నుంచి కరవును తరిమి కొడతామని చంద్రబాబు చెప్పారు. కేంద్రం సహకరించకున్నా.. పోలవరం పనులు 55శాతం మేర పూర్తి చేశామని, ఏడాదిలోగా గ్రావిటీ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. ఈనెల 11నాటికి డయా ఫ్రమ్‌ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. 
    
రాష్ట్రంలో ప్రజల మధ్య కులం, మతం, ప్రాంతం పేరిట చిచ్చు పెట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని... నెల్లూరు నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్‌ ఆరోపించారు. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. 

జిల్లాలోని పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ పక్కాగృహాలు పొందిన గిరిజనులతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అమలు తీరు, విద్యార్థులకు వసతుల వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. కల్యాణలక్ష్మి, నిరుద్యోగ భృతి, ఒంటరి మహిళలకు పింఛన్‌ వంటి పథకాల గురించి ముఖ్యమంత్రి స్థానికులకు వివరించారు. 

21:39 - June 8, 2018

వెయ్యిరూపాలకు జేరిన కిల చాపలు..మృగశీర కార్తికి విపరీతంగ పెర్గిన ధరలు, అక్కెరొచ్చినప్పుడు ఆర్టీసీ గావాలె..అక్కెర దీరినంక మీరెంతాని బెదిరియ్యాలే, నవనిర్మాణ దీక్షలా విమర్శల దీక్షాలా..?...పద్దతి దప్పి మాట్లాడుతున్న లోకేశం, తూట్ల గుడిశెకు ఐదువందల ఇంటిపన్ను...బంగారు తెలంగాణల బడుగు జీవి కష్టం, ఆదివాసీల గుండెల మీద సింగరేణి బాంబు..కొమురం భీం గడ్డమీద జనం ఆర్థనాదాలు, సర్కారు భూమి పట్టజేస్కున్న వీఆర్యే..టెన్ టీవీ దెబ్బకు సస్పెండ్ జేశ్న ఎమ్మార్వో.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

21:37 - June 8, 2018

హైదరాబాద్ : రాణిగంజ్ లోని ఏషియన్ పెయింట్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెయింట్స్ గోడౌన్ లో గ్యాస్ సిలిండర్ పేలి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీ శబ్ధాలతో పెయింట్ డబ్బాలు పేలుతున్నాయి. పక్కనున్న భవనాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు గంటలుగా మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపులోకి రావడం లేదు. ప్రాణ నష్టం జరగలేదు..ఆస్తినష్టం జరిగిందన్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న జీహెచ్ ఎంసీ కమిషనర్, డీసీపీ సుమతి పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా బిల్డింగ్ నిర్మించారని తెలుస్తోంది.

20:54 - June 8, 2018

హైదరాబాద్ లో బత్తిని సోదరుల చేప మందు ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. దీంతో ఎలాంటి ఆస్తమా తగ్గని వైద్యులు అంటున్నారు. ఈ కార్యక్రమాన్ని జనవిజ్ఞాన వేదిక వ్యతిరేకిస్తోంది. ప్రజల నమ్మకాలతో బత్తిని సోదరులు ఆడుకుంటున్నారని పేర్కొన్నారు. చేప మందేనా ? అనే అంశంపై జనవిజ్ఞాన వేదిక నాయకురాలు రమాదేవి విశ్లేషణ అందించారు. ఆ వివరాలను ఆమె మాటల్లోనే.. 
ఆస్తమా దీర్గకాలిక సమస్య. దీనికి క్యూర్ అనేది లేదు. జెనెటిక్, వాతావరణం మార్పులు వల్ల ఆస్తమా వస్తుంది.. ఊపిరి ఆడక చాలా ఇబ్బంది పడతారు. చేప మందులో ఎలాంటి శాస్త్రీయత లేదు. చేపలో మెడిసిన్ లేదని..ల్యాబ్స్ తేల్చాయి అని తెలిపారు. చేప మందులో ఎలాంటి శాస్త్రీయత లేదని కోర్టు తెలిపింది. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

20:13 - June 8, 2018

సమ్మె విరమించకపోతే ఆర్టీసీని మూసివేస్తాం, సంస్థలో ఎన్నికల గెలుపు కోసమే యూనియన్లు సమ్మె బాట పట్టారన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికాదని వక్తలు అన్నారు. సీఎం వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఎన్ ఎంయూ ఉప ప్రధాన కార్యదర్శి అశోక్, ఎస్ డబ్ల్యుఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు, టీఆర్ ఎస్ నేత శేఖర్ రెడ్డి, టీఎంయూ స్టేట్ సెక్రటరీ కమలాకర్ గౌడ్ పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వం చొరవ తీసుకుని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

19:57 - June 8, 2018

హైదరాబాద్ : ఆర్టీసీని కార్మికులకు అప్పగిస్తే.. నాలుగేళ్లలో లాభాల పట్టిస్తామని.. టీఎస్ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ప్రభుత్వానికి సవాల్‌ విసిరింది. సంస్థలో ఎన్నికల గెలుపు కోసమే యూనియన్లు సమ్మె బాట పట్టారన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై టీఎంయూ తీవ్ర ఆక్షేపణ తెలిపింది. దీనికి వ్యతిరేకంగా.. శనివారం నాడు.. అన్ని డిపోల ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలపాలని నిర్ణయించింది. 

టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారంలో చిక్కుముడి ఇంకా వీడలేదు. ఈనెల 11నుంచి సమ్మెకు వెళుతున్నట్లు గుర్తింపు కార్మిక సంఘం.. ఇప్పటికే నోటీసు ఇచ్చింది. శుక్రవారం ఉదయం.. రవాణా మంత్రి పి.మహేందర్‌రెడ్డితో కార్మిక సంఘాల నాయకులు చర్చలు జరిపారు. 

ఆర్టీసీ నష్టాల్లో ఉంది.. సమ్మె ఆలోచనను విరమించండి అన్న ఏక వాక్య ప్రతిపాదనతోనే ప్రభుత్వం సాగినట్లు తెలుస్తోంది. అయితే సంస్థను తమకు అప్పగిస్తే నాలుగేళ్లలో లాభాల పట్టిస్తామని కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. 

ఆర్టీసీ ఎన్నికల్లో గెలుపు కోసమే కార్మిక సంఘం సమ్మె బాట పట్టిందని.. మొండిగా సమ్మెకే వెళితే.. సంస్థను ప్రైవేటు పరం చేయడం అనివార్యం అంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహంగా ఉన్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ.. శనివారం అన్ని డిపోల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరనస తెలపాలని యూనియన్లు నిర్ణయించాయి. 

మరోవైపు.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై పలు జిల్లాల్లో కార్మికులు శుక్రవారం నిరసనలు తెలిపారు. కరీంనగర్‌లో కార్మికులు రిలే నిరాహార దీక్షలు మొదలు పెట్టారు. మారిన ముఖ్యమంత్రి తీరుపై వారు మండిపడుతున్నారు. 

సమ్మె విరమించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిపై.. రాష్ట్ర కమిటీలో సమావేశమై.. శనివారం నిర్ణయాన్ని వెల్లడిస్తామని టీఎంయూఐ నేతలు తెలిపారు. ఆర్టీసీకి సక్రమంగా నిధులు ఇవ్వాలని, డీజిల్‌ పెరుగుదల భారాన్ని ప్రభుత్వమే భరించాలని, ఆర్టీసీ నష్టాలను ప్రభుత్వమే భరించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

19:51 - June 8, 2018

రాజన్నసిరిసిల్ల : ఇల్లంతకుంటలో విషాదం చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్ లో ఈతకు వెళ్లిన శివ అనే 9 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.  స్థానికులు బాలున్ని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే నీళ్లు మింగి ఊపిరిరాడక చనిపోయాడు. బాలుడి మృతితో ఇల్లంతకుంటలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

19:42 - June 8, 2018

విశాఖ : ఒకప్పుడు అన్నీ సక్రమమే అంటూ అనుమతులిచ్చిన రెవెన్యూ శాఖ ఇప్పుడు మాట మార్చింది. రిజిస్ట్రేషన్‌ చేయమని అడిగిన వారికి అది ప్రభుత్వ భూమి అమ్మడానికి కొనడానికి వీల్లేదంటూ తేల్చేసింది. దీంతో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు తీసుకున్నవారంతా అయోమయంలో పడ్డారు. ఇదీ విశాఖలోని శ్రీకృష్ణ కోపరేటివ్‌ సొసైటీలో స్థలాలను కొనుగోలు చేసిన వారి పరిస్థితి. 

జీవితంలో ఎన్నో అష్టకష్టాలు పడ్డారు.. పైసాపైసా కూడబెట్టారు.. ఓ గూడు కావాలనుకున్నారు.. రెవెన్యూ, వుడా, జీవీఎంసీ అనుమతులు తీసుకున్నారు.. రిజిస్ట్రేషన్లశాఖ అభ్యంతరం పెట్టలేదు.. అన్నీ సక్రమంగా ఉన్నాయన్న ధైర్యంతో పీఎంపాలెంలో సర్వే నెంబరు 329లో శ్రీకృష్ణ కోపరేటివ్‌ సొసైటీలో స్థలాలను కొనుగోలు చేశారు. కొంతమంది ఇళ్లు నిర్మించుకున్నారు. మరికొంతమంది ఇళ్ల నిర్మాణానికి, ఇంకొంతమంది డబ్బు అవసరమై స్థలాల విక్రయానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతా సక్రమంగా ఉందనుకున్న సమయంలో కథ అడ్డం తిరిగింది. అది ప్రభుత్వ భూమి అని.. అమ్మకానికిగానీ, ఇళ్ల నిర్మాణానికిగాని అనుమతులివ్వకూడదని రెవెన్యూ యంత్రాంగం నోటీసులిచ్చింది. అప్పుడు అన్నీ సక్రమమే అన్న రెవెన్యూ మాట మార్చింది. దీంతో మోసపోయామని భావించిన సామాన్య జనం దిక్కు తోచని స్థితిలో పడ్డారు.  

కిర్లం పూడి ప్రాంతానికి చెందిన కాజా చిన్నారావు విశ్రాంత పోలీసు ఉద్యోగి. రైల్వే న్యూ కాలనీలో సొంతిల్లు అమ్మేసి పీఎంపాలెం క్రికెట్‌ స్టేడియం ప్రధాన గేటుకు ఎదురుగా సర్వే నంబర్ 329లో ప్లాట్లు కొన్నారు. ఇందుకోసం 15 లక్షలు కేటాయించారు. ఆ స్థలం అమ్మడానికి మధురవాడలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్తే ఈ భూములపై రిజిస్ట్రేషన్లను నిషేధిస్తూ రెవెన్యూ నుంచి ఆదేశాలున్నాయని అధికారులు సెలవిచ్చారు. అధికారుల మాటలకు ఖంగుతిన్న చిన్నారెడ్డి సొంత ఇల్లును కోల్పోయి భూమి చేతులు మారాక ఇప్పుడు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. ఒకప్పుడు వాటిని ప్రభుత్వ భూములు కావని నిర్థారించిన అధికారులే నేడు అవి ప్రభుత్వ భూములంటూ రిజిస్ట్రేషన్స్‌కు మోకాలడ్డడంపై ఆయన న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.

రెవెన్యూ చట్టం 22 ఎ 1/ డి కింద ఆ సర్వే నెంబరులో రిజిస్ట్రేషన్లు నిలిపేయాలంటూ మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి రెవెన్యూ శాఖ 2016 నవంబరులో ఉత్తర్వులు పంపింది. ఈ సర్వే నెంబరులో 9.18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని.. అందుకే రిజిస్ట్రేషన్లు నిలిపి వేయాలన్నది ఆ ఆదేశాల సారాంశం. దీనిపై  విశ్రాంత ఏఎస్సై కాజా చిన్నారావు పోరాటం మెుదలు పెట్టారు. సూర్య శక్తి నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్సర్ అసోసియెషన్‌గా అక్కడ ఉన్న సభ్యులు అందరూ కలిసి పోరాటం ప్రారంభించారు. అసలు ఈ భూమిపై ఉన్న వాస్తవాలను తెలుసుకున్నారు. జిల్లా మంత్రులను, మంత్రి లోకేష్‌ను, ముఖ్యమంత్రికి తమ గోడు విన్నవించుకున్నారు. 9.18 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అయితే స్వాధీనం చేసుకోవాలని కోరారు. సిట్‌కు కూడా దీనిపై ఫిర్యాదు చేశారు. ఫలితంగా పోరాటం ఫలించి 2017 డిసెంబర్‌ 11న ఆ భూములు ప్రభుత్వ భూములకు కావు, ప్రైవేటువే అని తేలింది. దీంతో సంతోషించిన బాధితులకు మూడు నెలల వ్యవధిలోనే అంటే 2018 మార్చి 7న అవి ప్రభుత్వ భూములు అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అధికారులతో పాటు బాధితులూ ఖంగుతిన్నారు. 

ప్రభుత్వ భూములు కాకపోయినప్పటికీ 22 ఎ 1/ డి కింద చేర్చడంతో ఈ విషయంలో జిల్లా మంత్రి హస్తం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. మంత్రి ఒత్తిడి కారణంగానే ఈ భూములను డీనోటిఫై చేయడంలేదని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ సమస్య ఉంది అంటూ రిజిస్ట్రేషన్లు కాకుండా తక్కువ ధరకే భూములను కాజేసేందుకు వీటిని 22 ఎ 1/ డి కింద చేర్చారని అంటున్నారు. దీనిపై ఏసీబీతో విచారణ చేయించాలని కోరుతున్నారు. ఇక ఈ భూముల కోసం రోజూ దస్తా వేజులు పట్టుకొని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు బాధితులు. దాదాపు 200 మంది బాధితులు ఈ సొసైటీ ఆధ్వర్యంలో భూములు కొనుగోలు చేశారు. ఈ విషయంపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. 

టీఆర్టీ స్కూల్ అసిస్టెంట్ ర్యాంకుల ప్రకటన

హైదరాబాద్ : టీఎస్ పీఎస్సీ టీఆర్టీ స్కూల్ అసిస్టెంట్ ర్యాంకులను ప్రకటించింది. 1,17,410 మంది అభ్యర్థులకు ర్యాంకులు కేటాయించింది. 

అవినీతిని నిలదీసే ప్రతి ఒక్కరికీ నమస్కారం : పవన్ కళ్యాణ్

విశాఖ : అవినీతిని నిలదీసే ప్రతి ఒక్కరికీ నమస్కారమని పవన్ కళ్యాణ్ అన్నారు. దోపిడీని నియంత్రించడానికే మీ దగ్గరికి వచ్చానని తెలిపారు. జాతీయ జెండా పట్టుకున్న జన సైనికుల్ని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. నాయకులకు అక్రమ క్వారీలను నడపడంపై ఉన్న ఆసక్తి యువతకు ఉపాధి కల్పించడంలో లేదని విమర్శించారు. యలమంచలి యువతకు ఉపాధి కల్పిస్తారని టీడీపీకి మద్దతిచ్చా...అక్రమ క్వారీ ద్వారా రోజకు రూ.6 లక్షలు సంపాదిస్తారని కాదన్నారు. 

 

ఎల్ బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు

హైదరాబాద్ : ఎల్ బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు.

 

రాణిగంజ్ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : రాణిగంజ్ ఓ పెయింట్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటుల ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

19:15 - June 8, 2018

విశాఖ : దగాకోరు, దోపిడీ వ్యవస్థ మీద పోరాటం చేయాలన్నదే తన కోరిక అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దోపిడీ వ్యవస్థ రాకూడదనే టీడీపీతో మద్దతు వదలుకున్నామని తెలిపారు. ఈ మేరకు విశాఖ జిల్లా పాయకరావు పేటలో పర్యటించిన పవన్‌..  అభివృద్ధి అంటే కేవలం అమరావతి కాదని, పాయకరావు పేటలో కూడా అభివృద్ధి అవసరమన్నారు. యువతకు ఉపాధి కల్పించడంలో జనసేన ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. 

 

19:06 - June 8, 2018

కరీంనగర్ : ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ చిన్నారులకు విద్యను అందించాలన్న సంకల్పంతో ముందుకెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం. వినూత్న ప్రయోగంతో ఈ విద్యాసంవత్సరంలో సరికొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ ప్రయోగంతో చిన్నారులు ఆధునికతను అందిపుచ్చుకోవడంతో పాటు శ్రమనూ తగ్గించుకోనున్నారు. 

తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు విద్య మరింత చేరువ కానుంది. చిన్నారుల్లో విద్య పట్ల ఆసక్తి పెంచాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యునిసెఫ్‌ సహకారంతో పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించబోతోంది. ఈ ప్రాజెక్టు విధానంతో విద్యార్థులు.... నోటితో చదువుతూ విద్యనభ్యసించాల్సిన పరిస్థితికి చెక్ పడబోతోంది. వారు చదవాలనుకున్నది వారి చేతిలోని డివైజర్‌ చకచకా చదివేస్తుంది. 

ఇదిగో దీనిపేరే డాల్ఫియో డివైజర్‌..... ఈ వినూత్న ప్రయోగాన్ని ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 64 పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నారు. డాల్ఫియో డివైజర్ సిస్టం ద్వారా పుస్తకాల్లోని పాఠాలను వినే విధానం అమలు చేస్తున్నారు. ఇందుకోసం వంద తెలుగు, ఆంగ్ల పుస్తకాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. దీంతో  రైటింగ్ ఆర్థోమెటిక్ విధానం అమలు చేస్తున్నారు. చదువులో వెనకబడిన చిన్నారులు ఈ విధానంతో మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నారు ఉపాధ్యాయులు. 

డాల్ఫియో డివైజర్‌ను ఛార్జ్ చేసిన తరువాత ప్రతి బుక్‌పై గెట్ స్టార్టెడ్ పేరుతో ప్రత్యేకంగా చిప్ ను ఏర్పాటు చేశారు. ఆ చిప్ వద్ద డివైజర్ ఉంచి స్కాన్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసిన డివైజర్‌ను పాఠ్యాంశంపై ఉంచితే డివైజర్‌ చక చకా చదివేస్తుంది. అయితే ఈ ఆదునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. డాల్ఫియో డివైజర్ విధానం వల్ల చిన్నారులకు భాషపై పట్టు... స్పష్టమైన ఉచ్ఛరణ కూడా వస్తుందని వారు ఆశిస్తున్నారు. ఈ విధానంపై విద్యార్థులూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సరికొత్త విధానంతో చిన్నారులు చదువుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని చేపడుతోన్న ఈ పద్దతిలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా బుక్‌పై చిప్‌ను ఏర్పాటు చేసినప్పుడు పేపర్‌ చినిగితే బుక్‌ను చదివే అవకాశం లేకుండా పోతుంది. ఈ సమస్యను అధిగమించ గలిగితే ఈ నూతన విధానం చిన్నారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నిరక్షరాస్యత నిర్మూలన... డ్రాప్ అవుట్స్ ను బడికి రప్పించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి. 

 

18:58 - June 8, 2018

వరంగల్ : ప్రకృతి అందాలు చూస్తూ వాటి మధ్య సేదతీరాలనుకుంటున్నారా? అడవుల్లో రాత్రిళ్లు విడిది చేయాలనుకుంటున్నారా? అయితే ఇలాంటి ఆలోచనలు మీకు ఉంటే వరంగల్‌ వెళ్లాల్సిందే. అక్కడి ఇనుపరాతి గుట్టల్లో ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్‌, నైట్‌ క్యాంపింగ్‌ సౌకర్యాలను చూడాల్సిందే. రోజు రోజుకూ పెరుగుతున్న సాంకేతికాభివృద్ధి.. తరిగిపోతున్న అటవీ సంపద.. పెరుగుతున్న కలుషిత వాతవరణం... ఇలాంటి పరిస్థితుల్లో కాస్త సమయం దొరికితే చాలు అడవుల్లో వాలిపోతారు ప్రకృతి ప్రేమికులు. ఇలాంటి వారికోసం మరిన్ని సౌకర్యాలతో స్వాగతం పలుకుతున్నాయి వరంగల్‌ ఫారెస్ట్‌, టూరిజం శాఖలు. ధర్మసాగర్‌ మండలం దేవునూర్‌లోని ఇనుపరాతి గుట్టల్లో ట్రెక్కింగ్‌, నైట్‌ క్యాంపింగ్‌ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చాయి. 

కొద్దిరోజులుగా ఫారెస్ట్‌ టూరిజంపై దృష్టిపెట్టిన వరంగల్‌ టూరిజం డిపార్ట్‌మెంట్‌.. నగరానికి అత్యంత సమీపంలో ఉన్న ఇనుపతిరాతి గుట్టల్లోని అడవులను గుర్తించింది. వీటిపై మొదట ట్రెక్కింగ్‌ను తరుచుగా నిర్వహించారు. నగరవాసులు భారీగా తరలి వస్తుండటంతో మరిన్ని సౌకర్యాలను కల్పించాలని అధికారులు భావించారు. ఇందులో భాగంగా నైట్‌ క్యాంపింగ్‌ ఏర్పాటు చేశారు. నైట్‌ క్యాంపింగ్ ద్వారా సందర్శకులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించేందుకు ఈ సౌకర్యాన్ని కల్పించారు.  రాత్రిళ్లు అడవుల్లో నిద్రించేందుకు ప్రత్యేకమైన టెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి వర్షాన్ని, చలిని తట్టుకునేలా రూపొందించారు అధికారులు. రాత్రి సమయంలో క్యాంప్‌ ఫైర్‌ ఎంజాయ్‌ చేసిన తర్వాత సందర్శకులు నిద్రపోయే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ సౌకర్యాలను పొందడానికి వెయ్యి రూపాయలను టికెట్‌ ధరగా నిర్ణయించారు. 

ప్రస్తుతం వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిందన్నారు కలెక్టర్‌ ఆమ్రాపాలి. అడవుల సంరక్షణను బాధ్యతగా భావించి.. ఇనుపరాతి గుట్టల్లో ఏకో టూరిజం డెవలప్‌ చేశామన్నారు. ఇందులో భాగంగా ట్రెక్కింగ్‌, నైట్ క్యాంపింగ్‌,  క్యాంప్‌ ఫైర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సౌకర్యాలను ఎంజాయ్‌ చేయాలనుకుంటే నేరుగానే కాకుండా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఆన్‌లైన్‌ పే ద్వారా టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చని ఆమ్రాపాలి అన్నారు. 

వివిధ శాఖల అధికారులు ఉత్సాహంగా ట్రెక్కింగ్‌లో పాల్గొన్నారు. క్యాప్‌ ఫైర్‌లో విద్యార్థుల నృత్యాలు చూపరులను ఆకట్టకున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడ లేని సౌకర్యాలను వరంగల్‌ నగరంలో కల్పించటంతో నగర్‌ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చూశారుగా.. ఇలాంటి సౌకర్యాలను  మీరు ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఇనుపరాతి గుట్టలు మీ కోసం స్వాగతం పలుకుతున్నాయి. 

18:54 - June 8, 2018

హైదరాబాద్‌ : నగరంలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో చేపమందు ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. నూటా డెబ్బై మూడు సంవత్సరాలుగా వంశపారపర్యంగా బత్తిని కుటుంబం దీన్ని పంపిణీ చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వ ఏర్పాట్లు, సహకారంపై బత్తిని హరినాథ్‌ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఉబ్బసం వ్యాధి గ్రస్తులు చేపమందుకోసం దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. వీరికోసం 16 క్యూలైన్లు, 34 కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీనికోసం మత్స్యశాఖ 1లక్షా 25వేల చేపపిల్లను అందించినట్లు తెలుస్తోంది.  చేపమందు ప్రసాదం ఫలితం  శాస్ర్తీయంగా నిరూపితం కాకున్నా.. ప్రజలు మాత్రం అమితమైన విశ్వాసాన్ని కనబరుస్తున్నారు.

 

18:52 - June 8, 2018

కర్నూలు : తెలంగాణ ఎస్సై ఏపీలో గన్‌తో హల్‌చల్‌ చేశారు. సరిహద్దు ఇసుక వివాదంలో ఉండవల్లి ఎస్సై గడ్డం కాశీ  ఓవర్‌ యాక్షన్‌ చేశారు. ఈ వ్యవహారం ఆలస్యంగా  వెలుగులోకి వచ్చింది. తుంగభద్రలో తెలుగు రాష్ర్టాల మధ్య ఇసుక వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో  కర్నూల్‌ జిల్లాలోని నిర్జుర్‌ గ్రామంలో  తెలంగాణ పోలీసులకు పనేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత రెండు రోజులుగా స్థానికంగా ఘర్షణ వాతావరణం నెలకొన్నా రెవెన్యూ అధికారులు స్పందించలేదని విమర్శిస్తున్నారు. చివరికి ఇరు రాష్ర్టాల పోలీసులు జోక్యంతో ప్రజలు శాంతించారు. 

 

18:49 - June 8, 2018

హైదరాబాద్ : హైకోర్టులో అగ్రిగోల్డ్‌ కేసు విచారణ జరిగింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు హైకోర్టు ఆమోదించింది. త్రిసభ్య కమిటీలో జిల్లా కలెక్టర్‌, జిల్లా రిజిష్ట్రార్‌, జిల్లా లీగల్‌ సర్వీస్‌ సెక్రటరీ ఉన్నారు. సీఐడీతో కలిసి త్రిసభ్య కమిటీ ఆస్తులు వేలం వేయాలని హైకోర్టు సూచించింది. అన్ని జిల్లాల్లో వేలం ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. మొదట గుర్తించిన 10 ఆస్తులలో ఐదు ఆస్తులను ప్రకటన ఇచ్చిన 6 వారాల్లో పూర్తి చేయాలని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 25కు వాయిదాకు వాయిదా పడింది.

18:33 - June 8, 2018

పశ్చిమగోదావరి : ఏలూరు కలెక్టరేట్‌ వద్ద సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.. కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఆందోళన చేశారు. సీపీఎస్‌ విధానం ద్వారా ఉద్యోగులకు నష్టమని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. 

18:30 - June 8, 2018

తూర్పుగోదావరి : కాకినాడలో  ఉద్యోగులు, ఉపాధ్యాయులు కదం తొక్కారు. సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని ఆందోళన చేపట్టారు. కాకినాడ కలెక్టరేట్‌ ముందు భారీ ధర్నా నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

18:28 - June 8, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని అశ్వారావు పేట మండల వ్యాప్తంగా చేపట్టిన బంద్‌ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ ద్వారం, రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న ఈ గ్రామంలో... నూతనంగా ఏర్పడబోయే హైవే కారణంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మారడంతో పాటు.... అశ్వరావు పేట కనుమరుగయ్యే అవకాశం ఉంది. దీంతో తమ గ్రామాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆ గ్రామ ప్రజలు నాలుగు రోజుల నుండి ఉద్యమం ప్రారంభించారు. జాతీయ రహదారి అశ్వారావు పేట మీదుగా రాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాజకీయ పార్టీలు హెచ్చరించాయి. 

 

18:23 - June 8, 2018

చిత్తూరు : రమణ దీక్షితులకు నిజంగా అన్యాయం జరిగి ఉంటే తిరుమలకు వచ్చి మాట్లడాలని టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అన్నారు. రమణ దీక్షితులు భక్తుల మనోభావాలు దెబ్బతిసేలా ప్రవర్తించవద్దని సూచించారు. స్వామివారికి ఇంకా సేవ చేసుకోవాలని ఉంటే తిరుమలకు వచ్చి తమతో మాట్లాడాలన్నారు.  రమణ దీక్షతుల చేష్టలను భక్తులు గమనిస్తున్నారన్నారు. ఓ అర్చకుడిగా రమణ దీక్షితులు అమిత్‌ షా, జగన్‌లను కలవడం మంచిది కాదన్నారు.

 

18:21 - June 8, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ పాలనలో కోర్టు తీర్పుకు గౌరవం లేదా అని జనారెడ్డి ప్రశ్నించారు. కోర్టు తీర్పును గౌరవించని కేసీఆర్‌ సీఎం పదవిలో  కొనసాగే నైతికత లేదన్నారు.  కేసీఆర్‌ నిరంకుశ పాలనపై కరపత్రాన్ని ముద్రించి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తామన్నారు. ఖమ్మం, అలంపూర్‌లో సభలు, 24 గంటల నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు.

18:17 - June 8, 2018

హైదరాబాద్ : నాలుగేళ్ళ టీడీపీ పాలనపై వైసీపీ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. చంద్రబాబు హామీలపై వీడియోను కూడా విడుదల చేశారు. నాలుగేళ్ళ పాలనలో చంద్రబాబు చేసింది శూన్యమంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు పాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్న చందంగా ఉందని సీనియర్‌ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. రాష్ర్టంలోని అన్ని వ్యవస్థలనూ సీఎం భ్రష్టు పట్టించారంటూ టీడీపీపై తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఆర్టీసీ డిమాండ్స్ న్యాయమైనవి : కోదంరాం

కరీంనగర్ : ఈనెల 11 నుంచి సమ్మెకు దిగాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తీసుకున్న నిర్ణయంపై సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. సమ్మె విరమించకుంటే ఆర్టీసీని మూసేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై టీ.జనసమితి అధ్యక్షులు కోదండరాం మాట్లాడుతు..ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌లు సరైనవేననీ..వారిపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయకూడదనీ..ప్రభుత్వమే కొనసాగించాలని కోదండరాం సూచించారు. ఆర్టీసీ సంఘాలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. కార్మికులు సమ్మెకు దిగితే ప్రభుత్వానిదే బాధ్యతని అన్నారు.

ఆర్టీసీ నష్టాలకు కేసీఆరే కారణం : జీవన్ రెడ్డి

హైదరాబాద్ : ఈనెల 11 నుంచి సమ్మెకు దిగాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తీసుకున్న నిర్ణయంపై సీఎం కేసీఆర్‌ మండిపడి హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీపీసీసీ నేతలు విమర్శలు గుప్పించారు. లాభాల్లో ఉన్న ఆర్టీసీని ముఖ్యమంత్రి కేసీఆరే నష్టాల బాట పట్టించారనీ..తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీని బెదిరించడం సరికాదని కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి అన్నారు. వారు న్యాయమైన కోరికలే అడిగారని, ఆ సంస్థ నష్టాలకు ఆర్టీసీ ఛైర్మన్‌, మంత్రి మహేందర్‌రెడ్డిని బాధ్యులని అన్నారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీలను తెలంగాణ సర్కారు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

17:39 - June 8, 2018

నెల్లూరు : రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 2019 నాటికి గ్రావిటితో నీళ్లు తీసుకొస్తామని చెప్పారు. ఏడు రోజు నవ నిర్మాణ దీక్షలో ఆయన పాల్గొని, మాట్లాడారు. పోలవరం జీవనాడని.. రాష్ట్రానికి వెలుగు రేఖ అన్నారు. నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రానికి కరువు రాదన్నారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామన్నారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామని తెలిపారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు తీసుకొచ్చామన్నారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు 140 టీఎంసీ నీటిని తీసుకొచ్చామని తెలిపారు. గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని, ఐదు నదులను అనుసందానం చేస్తామన్నారు. నాగావళి, వంశధార నదులను అనుసంధానం చేయాలని చెప్పారు. మహా సంగ్రామానికి శ్రీకారం చుట్టామన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధార నదులను అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామాన్ని వెలుగుల గ్రామంగా తయారు చేస్తామన్నారు. అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులు చాలా ముఖ్యమైనవని...వాటిని పూర్తి చేస్తామన్నారు. అమరావతిని ప్రపంచ పటంలో పెట్టాలన్నారు. అమరావతిని ప్రజా రాజధానిగా తయారు చేస్తామని పేర్కొన్నారు. పోలవరానికి రావాల్సిన నిధులు కేంద్రం ఇవ్వ లేదన్నారు. కేంద్రం 3500 కోట్లు ఇవ్వాలన్నారు. భూసేకరణ, ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ కేంద్రం ఇవ్వాలని తెలిపారు. ఏ రాష్ట్రం చేయని పనులు, విజయాలు మనం సాధించామన్నారు. రాష్ట్ర విభజన రోజున చాలా సమస్యలు వచ్చాయన్నారు. హైదరాబాద్ లో అందరూ ఉండిపోయారని... ఇక్కడికి వచ్చేవారితోనే పనులు ప్రారంభించామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏడు నెలల్లోనే సచివాలయాన్ని నిర్మించామని తెలిపారు. అన్ని ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేశామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో 1.2లక్షల ఎకరాలకు అదనంగా నీళ్లిచ్చామన్నారు. పౌరసేవలను సులభతరం చేశామన్నారు. రాష్ట్రంలో కరెంట్ కొరత లేదన్నారు.

 

అగ్రిగోల్డ్ కేసులో త్రిసభ్య కమిటీ ఏర్పాటు..

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసు విషయంలో హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం నిర్వహించేందుకు హైకోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్,జిల్లా లీగల్ సర్వీస్ సెక్రటరీలతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. మొదటగా గుర్తించిన 10 ఆస్తుల్లో 5 ఆస్తులు 6 వారాల్లో వేలం వేయాలని హైకోర్టు త్రిసభ్య కమిటీకి ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 25వ తేదీకి వాయిదా వేసింది. 

17:30 - June 8, 2018

అదొక అందాల నెలవు..అద్భుతాలకు ఆలవాలం..ప్రకృతి అందాలన్ని ఒకచోట కుప్పగా పోస్తే..దాని పేరు 'ఫెర్నాడో డి నోరాన్హా'. అదొక ద్వీపం..మామూలు ద్వీపం కాదు..అద్బుతాల ద్వీపం. జల ప్రకృతికి కేరాఫ్ అడ్రస్ ఈ ఫెర్నాడో డి నోరాన్హా ద్వీపం. ప్రకృతి అందాలన్నీ ఒకేచోట కలబోసుకున్న ద్వీపం. అండమాన్‌లోని హావ్‌లాక్‌ దీవిలోని రాధానగర్‌ బీచ్‌ ట్రిప్‌ అడ్వైజర్స్‌ ప్రపంచంలోని అత్యుత్తమ బీచ్‌లలో 8వ ర్యాంకులో నిలించి ఆసియాలో ప్రథమ స్థానం కైవసం చేసుకొంది. బ్రెజిల్‌లోని ద బయియా డు సాంచో ఫెర్నాండో డి నొరోన్హా ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది. అంతటి ప్రత్యేక ఈ దీవి సొంతం. అలాగే ఇక్కడ నివశించే ప్రాణులను స్థానికులు కూడా ప్రాణంగా కాపాడుకుంటారు. అందుకే ఎక్కడా లేని విధంగా ఇక్కడ నిర్భంగా ఒక విధానం కొనసాగుతోంది. ఇక్కడి స్థానికులు పిల్లల్ని కనకూడదనే నిర్భంధం అమలులో వుంది. ఒకవేళ కంటే దాన్ని నేరం కూడా. అందుకే సుమారుగా పన్నెండేళ్లుగా ఫెర్నాండో డి నొరోన్హా ద్వీపంలో ఒక్క నవజాత శిశువు కూడా జన్మించలేదు. బ్రెజిల్‌ పరిధిలోని ఈ ద్వీపంలో ఉన్న నిషేధాజ్ఞల కారణంగా ఇక్కడ ఎవ్వరూ పిల్లల్ని కనడం లేదు.

సుదీర్ఘ కాలం అనంతరం పుట్టిన అరుదైన బిడ్డ..
నాటల్‌ నగరానికి 370 కి.మీ. దూరంలో వున్న ఫెర్నాండో డి నొరోన్హా.లో సుమారు మూడువేల మంది జనాభా నివశిస్తున్నారు. కాని అక్కడ ఒక్కటంటే ఒక్క ప్రసూతి కేంద్రం కూడా లేదు. అనుకోకుండా ఇటీవల ఈ ద్వీపంలో ఒక ఆడశిశువు జన్మించింది.

బిడ్డ పుట్టటంపై సర్వత్రా ఉత్కంఠ..
సాధారణంగా మహిళలు గర్భం ధరిస్తే అది వారికి తెలియకపోవటం అంటు వుండదు. ప్రారంభంలో తెలియకపోయానా..నెలలు నిండే కొద్దీ తెలుస్తుంది. కానీ ఫెర్నాండో డి నొరోన్హా. ద్వీపంలో బిడ్డను కన్న తల్లి మాత్రం తాను గర్భవతిననే విషయం బిడ్డ పుట్టేంత వరకూ తనకు తెలిదనటం ఓ వింతగా వుంది. తాను గర్భవతిని అని కూడా తనకు తెలీదనీ..బిడ్డ పుట్టేసరికి అవాక్కయ్యాను’ అంటోంది ఆ బిడ్డను కన్నతల్లి!. ఆమె వయస్సు 22 సంవత్సరాలు.ఓ రాత్రి సమయంలో కడుపులో నొప్పులు రావటంతో బాత్‌రూమ్‌కి వెళ్లగా అక్కడ డెలివరీ అయ్యేంత వరకూ తాను గర్భవతిని అనే విషయం తనకు తెలీదంటోంది. బిడ్డ పుట్టగానే ఒక్కసారిగా అచేతనురాలినయ్యాననీ..ఆశ్చర్యపోయాననీ అంటోంది ఈ అరుదైన బిడ్డకు జన్మనించ్చిన యువతి. సృష్టిలో ఏ స్త్రీ అయినా తాను తల్లి కావాలని కలలు కంటుంది. కానీ నేను తల్లిని కాకూడదు అని మా ప్రాంతం చెబుతోంది’ అంటోంది తల్లి.

నిరంకుశంగా జనాభా నియంత్రణ నియమం..
ఈ విషయం తెలిసిన వెంటనే బిడ్డను వెంటనే ఆ ద్వీపానికి బయట ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కాగా ఆమె గర్భవతి అనే సంగతే తమకు తెలీదంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు కూడా. ఫెర్నాండో డి నొరోన్హా వన్యప్రాణి జీవనానికి ప్రసిద్ధి. ఇక్కడ అభయారణ్యాలు ఉన్నాయి. సముద్రపు తిమింగలాలు, డాల్ఫిన్లు, అరుదైన పక్షులు ఉన్నాయి ఈ కారణంగానే.. వాటికి హాని కలగకూడదనీ, అవి స్వేచ్ఛగా ఎదగాలనీ మానవ జనాభా నియంత్రణను నిరంకుశంగా పాటిస్తున్నారు.

అరుదైన పుట్టుకను ఆస్వాదిస్తున్న ద్వీపవాసులు..
ఈ అరుదైన పుట్టుకను ఆ కుటుంబ సభ్యులే కాదు, ఆ ద్వీపవాసులంతా పండుగ చేసుకుంటున్నారు. ఇరుగుపొరుగు వారంతా చంటిపాపకు బట్టలు, విలువైన బహుమతులు తీసుకువస్తున్నారు. కాగా ఒక స్త్రీకి తను గర్భిణి అని తెలీకుండా ఉంటుందా? ద్వీపంలోనే బిడ్డ పుట్టటానికి గల బలమైన కారణాలపై దర్యాప్తు కూడా మొదలైంది. 

17:03 - June 8, 2018

నెల్లూరు : ఏపీకి కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. కేంద్రం వెన్నుపోటు పొడిచిందన్నారు. ప్రధాని మోడీ ఏనాడు ఏపీని పట్టించుకోలేదని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చి... ఏపీకి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు. నెల్లూరులో ఏడో జరిగిన నవ నిర్మాణదీక్షలో ఆయన పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తుపెట్టుకున్నట్లు తెలిపారు. ప్రత్యేకహోదా ఇచ్చేది... ఇవ్వాల్సింది.. కేంద్రమైతే.. జగన్, పవన్ కళ్యాణ్ చంద్రబాబును తిడుతున్నారని.. ఇది ఎంతవరకు న్యాయమన్నారు. వైకాపా డ్రామా కంపెనీ....నిర్మాత అమిత్ షా, డైరెక్షన్ మోడీ,..కమెడియన్ జగన్ అని ఎద్దేవా చేశారు. మన మధ్యలో చిచ్చుపెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. 
వెయ్యి రూపాయల పెంచన్..  
2014 కు ముందు రెండు వందలు ఉన్న పించన్ ను ఐదురెట్లు చేస్తూ వెయ్యి రూపాయలకు పెంచామని తెలిపారు. వికలాంగులకు 15 వందల రూపాయల పించన్ ఇస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటి వంద రోజుల్లోనే 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. చంద్రన్న బీమా ప్రవేశపెట్టామన్నారు. ప్రపంచంలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలనేదే చంద్రబాబు ఆలోచన అన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం 12 శాతం పెరుగిందన్నారు. 
కాంగ్రెస్ హయాంలో దెయ్యాలకు పించన్లు... 
కాంగ్రెస్ హయాంలో దెయ్యాలు పించన్లు తీసుకునేవి..స్మశానాలకు వెళ్లేవని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని.. వేలి ముద్రలు తీసుకొని అందరికీ పించన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో 35 వేల ఐటీ ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఐటీ రంగంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం ఆలోచన అని తెలిపారు. నిరుద్యోగ భృతి కింద వెయ్యి రూపాయలు ఇస్తున్నామని చెప్పారు.

 

నెల్లూరు జిల్లాలో 1.2 లక్షలకు సారునీరు : చంద్రబాబు

నెల్లూరు : నవ నిర్మాణ దీక్ష లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలోని నాయుడుపేటలో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు..ఎన్ని ఇబ్బదులున్నా ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేశామనీ.. నెల్లూరు జిల్లాలో అదనంగా 1.2 లక్షల ఎకరాలను నీరందించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజా రాజధానికిగా అమరావతిని నిర్మిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నుండి అమరావతికి వచ్చి 7 నెలల్లో తాత్కాలిక రాజధాని నిర్మించి సొంత గడ్డపై నుండే పరిపాలన కొనసాగించామన్నారు. అమరావతిలో రూ.24వేల కోట్లతో మౌలిక వసతులను ప్రారంభించామని తెలిపారు.

16:48 - June 8, 2018

పెద్దపల్లి : దాదాపు 7 కోట్ల రూపాయలతో ఆర్భాటంగా దుకాణాల సముదాయాన్ని నిర్మించారు రామగుండం మున్సిపల్‌ అధికారులు. నిర్మాణమైతే పూర్తి చేశారు కానీ నిర్వహణను గాలికొదిలేశారు. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగ మారింది. మందుబాబులకు నిలయంగా, పేకాటరాయుళ్లకు స్థావరంగా మారింది.  

పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ.. నగరం నడిబొడ్డున నిర్మించిన మున్సిపల్‌ దుకాణాల సముదాయం గత ఐదు సంవత్సరాలుగా నిరపయోగంగా పడిఉంది. మున్సిపల్‌ సాధారణ నిధులు 6 కోట్ల 84 లక్షల రూపాయలతో  నగరం నడిబొడ్దున నిర్మించిన ఈ భవనాన్ని.. 2013 ఆగస్టులో ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకు ఒక్కరు కూడా దుకాణ సముదాయంలోని షాపులను అద్దెకు తీసుకోలేదు. అద్దెరేటు పెద్ద మొత్తంలో ఉండటం, సౌకర్యాలు కూడా అంతంత మాత్రాన ఉండటంతో భవనంలో వ్యాపారం చేయాటానికి ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. దీంతో భవనం నిరుపయోగంగా పడి ఉంది. ఇదే అదునుగా అసాంఘిక శక్తులు చెలరేగిపోయాయి. మందుబాబులు, పేకాటరాయుళ్లు తమ స్థావరంగా మార్చుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 

2009లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఈ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. 2013లో భవన నిర్మాణం పూర్తి కాగానే.. ఓ భూస్వామి ఈ స్థలం తమదంటూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు భూస్వామికి అనుకూలంగా తీర్పు ఇవ్వటంతో భవన స్థలాన్ని కొనుగోలు చేసి ఆర్భాటంగా ప్రారంభం చేశారు. అనంతరం వేలంపాట నిర్వహించి.. అద్దెలు స్వీకరించారు. అయితే డిపాజిట్లు పెద్ద మొత్తంలో ఉండటం, సౌకర్యాల కొరత ఉండటంతో కాంప్లెక్స్‌లో వ్యాపారం చేయాడానికి ఎవరూ ముందుకు రాలేదు. డిపాజిట్లు ఇచ్చిన వారు సైతం వారి డిపాజిట్లను వదులుకున్నారు. 

మరోవైపు ప్రజా ధనాన్ని వృథా చేశారని మున్సిపల్‌ అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు. భవన నిర్మాణం పూర్తి చేసి మందుబాబులకు, పేకాటరాయుళ్లకు అడ్డంగా మార్చారని.. అటువైపు వెళ్లాలంటే భయం ఉందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవనాన్ని కనీసం చిరు వ్యాపారులకు ఇచ్చైన అసాంఘిక శక్తులను నిలవరించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రజల డిమాండ్‌పై మున్సిపల్ అధికారులు స్పందించారు. దుకాణ సముదాయం నిరుపయోగంగా ఉందన్న మాట వాస్తవమేనని మున్సిపల్ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. గతంలో టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదని.. వచ్చిన వారు వ్యాపారం నిర్వహించటం లేదని తెలిపారు. త్వరలో టెండర్లు వేసిన వారితో పాటు.. కొత్తవారిని కూడా టెండర్లు వేయటకు ఆహ్వానిస్తామన్నారు. టెండర్ల ప్రక్రియ ప్రణాళిక పద్ధతిన జరుగుతుందని.. అందుకే ఆలస్యమవుతుందని కమిషనర్‌ చెప్పారు. ఇప్పటికైన అధికారులు తీరును మార్చుకుని ప్రజల ఇబ్బందులను తొలగిస్తారో చూడాలి.

16:44 - June 8, 2018

కరీంనగర్ : తెలంగాణ పోలీసు శాఖను ఒక్క సారిగా కుదిపిసేందా లేఖ... రాష్ట్ర పోలీసు బాస్ పేరిట విడుదలైన ఓ పీడీఎఫ్ ఫైల్ ఖాకీలను అంతర్మథనంలో పడేసింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో చర్చనీయాంశం అయింది. అవీనతిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఖాకీలు అగ్ర స్థానంలో నిలిచారన్నది ఆ లేఖ సారాంశం. ఇంతకీ అవినీతి పరుల లిస్టు బయటపెట్టి ఖాకీల పరువు బజారున పడేసిన ఆ ఠాగుర్ ఎవరు..? ఇపుడు ఇదే పనిలో కరీంనగర్‌ కాప్‌లో బీజీ అయ్యారు. నిశ్శబ్దం ఒక్కసారిగా బద్దలైంది... రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుని ముచ్చటగా మూడు రోజులు కాకముందే తెలంగాణ వ్యాప్తంగా ఖాకీల అవినీతిపై చరచలు జోరందుకున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ పీడీఎఫ్‌ ఫైల్‌  కాప్‌లను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. 

రాష్ట్ర వ్యాప్తంగా 391 మంది పోలీసు అధికారులు జాబితా ఈ ఫైల్ లో ఉంది. కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు పేర్లు పెట్టి మరీ జాబితాలో ప్రకటించడం కలకలంగా మారింది. మరోవిశేషం ఏంటంటే అవినీతికి పాల్పడుతున్న పోలీసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని  ఏకంగా డీజీపీనే డిపార్ట్‌మెంటును ఆదేశించినట్టు ఆ ఫైల్లో ఉండటం ప్రకంపనలు సృష్టిస్తోంది. పోలీస్‌శాఖలో అవినీతిని సహించలేని  ఓ హానెస్ట్‌ అధికారే అవినీతిపరులు జాబితా విడుదల చేశారన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ పీడీఎఫ్ ఫైల్ తమ అధికారులు విడుదల చేసింది కాదని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి వివరణ ఇవ్వడం విశేషం. 

అయితే  31 జిల్లాలను ఆధారం చేసుకుని విడుదల అయిన ఈ జాబితాపై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇసుక రవాణాకు వేదికగా ఉన్న జయశంకర్ జిల్లా, భూ దందాలకు కేరాఫ్ అయిన జనగామ జిల్లాలో మాత్రం అవినీతి పోలీసులే లేరని క్లీన్ చిట్ ఇవ్వడం వెనక మతలబు ఎంటో అర్థం కాని పరిస్థితి తయారైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏకంగా 39 మంది పోలీసులు పేర్లు ఈ జాబితాలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అయితే పోస్టింగ్ ల కోసం వెంపార్లాడే పరిస్థితి లేక... మామూళ్లు ఇచ్చుకోలేక... మంచి పోస్టింగ్ రాని వారు విసిగివేసారి పోయి ఈ తంతు నడిపి ఉంటారేమోనని సామాన్యులు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా పోలీసుల్లో అవినీతి పరుల జాబితా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది.  ఠాగూరు సినిమాను మరిపించే విధంగా ఆమ్యామ్యా అధికారుల  జాబితా ప్రకటించడంపై ప్రజల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.

16:38 - June 8, 2018

కొమురం భీం : సోనాపూర్‌లో ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి ఉనికిని ప్రమాదంలోకి నెడుతుంది సింగరేణి సంస్థ. నష్ట పరిహారం ఇవ్వకుండా ఆదివాసీల భూములను ప్రజాప్రతినిధులు, అధికారులు సింగరేణి సంస్థకు దౌర్జన్యంగా కట్టబెట్టారు. ఆదివాసీలకు వచ్చిన నష్టపరిహారాన్ని తమ బ్యాంక్ అకౌంట్లలో వేసుకున్న ప్రజాప్రతినిధులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని ఎవ్వరి దగ్గరికి వెళ్ళిన పట్టించుకోవటం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

కృష్ణమ్మపై మరో బ్యారేజ్ కు ఉత్తర్వులు..

అమరావతి : ఏపీ రాజధాని ప్రాంతంలో కృష్ణా నదిపై మరో బ్యారేజీ నిర్మాణం జరగబోతోంది. నిర్మాణానికి సంబంధించి రూ. 2,169 కోట్ల పాలనా పరమైన అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజీకి పైన 23 కిలోమీటర్ల దూరంలో వైకుంఠపురం వద్ద ఈ బ్యారేజీని నిర్మించబోతున్నారు. 10 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని నిర్మించనున్నారు. నూతన రాజధాని అమరావతికి నీటి సరఫరా కోసం ఈ బ్యారేజీని నిర్మించాలని నిర్ణయించారు.

16:22 - June 8, 2018

గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ బకాయిలు చెల్లించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. మొత్తం 3,919 కోట్ల పీఆర్‌సీ బకాయిల్లో మొదటి విడత 1070 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. రెగ్యులర్‌ ఉద్యోగులకు మొదటి విడతగా 260 కోట్ల రూపాయలను నగదు రూపంలో ఇస్తుంది. మిగిలిన మొత్తాన్ని జీపీఎఫ్‌ ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. పెన్షనర్లకు మొత్తం 715 కోట్ల రూపాయలు నగదుగా చెల్లిస్తారు. సీపీఎస్‌ ఉద్యోగులకు 10 శాతం కాంట్రిబ్యూటరీ పెన్షన్‌కు వెళ్తుంది. మిగిలిన 90 శాతం ఉద్యోగులకు చెల్లిస్తారు. సీపీఎస్‌ ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం రూ.734 కోట్లు అన్నారు.

టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి..

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో దామోదర్ రెడ్డి చేరనున్నారు. కాగా నాగర్‌కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నాగంకు హామీ ఇచ్చినట్టు వార్తలు రావడం, ఇదే విషయాన్ని నాగం కూడా ప్రచారం చేసుకోవడంతో కూచికుళ్ల దామోదర్‌రెడ్డి అసహనంగా వున్నారు. తనతో పాటు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై కూడా కూచికూళ్ల ఆందోళన పడుతున్న నేపథ్యంలో దీంతో దామోదర్ రెడ్డి పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టు గత కొన్ని వారాలుగా ప్రచారం జరిగింది.

సీఎం కుమారుడుకే ఉద్యోగం సామాన్యులకు కాదు : వవన్

విశాఖపట్నం : పాయకరావుపేటలో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా పనవ్ మాట్లాడుతు.. ప్రభుత్వం వేలాది ఎకరాలు దోపిడీ చేస్తోంది తప్ప ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వటంలేదని పవన్ విమర్శించారు. సీఎం కుమారుడికి మంత్రి ఉద్యోగం వచ్చింది తప్ప సామాన్యులకు కాదని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. జనసేన ఫ్లెక్సీలు కడుతు మృతి చెందిన ఇద్దరు యువకుల కుటుంబానికి జనసేన పార్టీ అండగా వుంటుందనీ..వారి పిల్లల చదువు బాధ్యతవారి కుటుంబాలకు అండగా కూడా జనసేన పార్టీ వుంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.

 

గురజాడ పుట్టిన గడ్డపై కాలేజీలు లేకపోవటం దారుణం : పవన్

విశాఖపట్నం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర ఉత్తరాంధ్రలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ పాయకరావుపేటలో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా పనవ్ మాట్లాడుతు..గురజాడ పుట్టిన గడ్డపై ప్రభుత్వ కాలేజీలు లేకపోవటం దారుణమన్నారు. తాండవ నది ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నా అడిగే నాధుడే లేడనీ..అవినీతి ఎక్కడ? అని ప్రభుత్వం ప్రశ్నిస్తుంటే ఇంకేమని చెప్పాలని పవన్ ప్రశ్నించారు.

15:58 - June 8, 2018

గుంటూరు : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగేళ్లుగా రాష్ట్రానికి మొండిచేయి చూపించిందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. విభజన హామీలు అమలు చేయలేదన్నారు. న్యాయ, చట్టబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. నాలుగేళ్లలో కేవలం 12,879 కోట్ల సాయం మాత్రమే అందించిదని చెప్పారు. రూ.12 వేల కోట్ల లోటు బడ్జెట్‌ను ఇంకా పూడ్చలేదన్నారు.

 

సందిగ్థంలో వైసీపీ రాజీనామాలు..స్పీకర్ విదేశీ పర్యటన..

ఢిల్లీ : వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించే ప్రక్రియలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంతవరకు రాజీనామాలు ఆమోదం పొందలేదు. రాజీనామా లేఖల ఫైల్ ఇంకా లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పరిశీలనలోనే ఉంది. మరోవైపు, మధ్యాహ్నం 2 గంటలకు ఆమె విదేశీ పర్యటనకు బయల్దేరుతున్నారు. 10 రోజుల పాటు బెలారస్, లాత్వియాలలో ఆమె పర్యటించనున్నారు. ఈ నేపథ్ంయలో విమానాశ్రయానికి చేరుకున్నారు. మళ్లీ 19వ తేదీన ఆమె తిరిగి వస్తారు. ఈ నేపథ్యంలో, రాజీనామాలపై ఉత్కంఠ నెలకొంది. 

హర్యానా సర్కార్ సంచలన సర్క్యులర్..

ఢిల్లీ : హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్రీడాకారులు సంపాదించిన మొత్తంలో 33.3 శాతాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ కౌన్సిల్ కి చెల్లించాలంటూ సర్క్యులర్ జారీ చేసింది. ప్రొఫెషనల్ స్పోర్ట్స్, వాణిజ్య ఒప్పందాల ద్వారా వచ్చే ఆదాయంలో మూడింట ఒక వంతు మొత్తాన్ని హర్యానా స్టేట్ స్పోర్ట్స్ కౌన్సిల్ కు చెల్లించాలంటూ ఆ రాష్ట్ర క్రీడల శాఖ ఆదేశాల్ని తీసుకొచ్చిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నిర్ణయం చాలా మంది క్రీడాకారులను రాష్ట్రం వీడేలా చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. దీనిని హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారిణి గీత ఫోగట్ తప్పుబట్టారు.

15:37 - June 8, 2018

హైదరాబాద్ : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ల శాసనసభ సభ్యత్వాన్ని ప్రభుత్వం పునరుద్ధరించేంత వరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. . టీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందన్నారు. ప్రజాస్వామ్య హక్కులను ఏ విధంగా కాలరాస్తోందో అనే విషయాన్ని ఫాం ప్లేట్ల ద్వారా ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తామన్నారు. త్వరలో నిరహార దీక్షను చేపడతామని నేతలు చెప్పారు. 

 

లక్ష ఉద్యోగాల కల్పన సీఎం చంద్రబాబు లక్ష్యం : లోకేశ్

నెల్లూరు : నవ నిర్మాణ దీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతు.. ఐదు సంవత్సరాలలోనే లక్ష ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారు. ప్రజల సమస్యలను టెక్నాలజీతో తెలుసుకునే ఏకైక ప్రభుత్వం టీడీపీది మాత్రమేనన్నారు. టెక్నాలజీతోనే సచివాలంలో కూర్చునే సమస్యలను తెలుసుకుని పరిష్కరించుకుంటున్నామన్నారు. 2029 నాటి దేశంలోనే ఏపీ అగ్రభాగాన నిలపాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ముందుకు పోతున్నారనీ..2050 ప్రపంచంలోనే ఏపీ అగ్రభాగాన నిలబడాలనేది సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని లోకేశ్ పేర్కొన్నారు.

బీజేపీ సినిమాలో జగన్ ఒక కమేడియన్ : లోకేశ్

నెల్లూరు : నవ నిర్మాణ దీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతు..లోటు బడ్జెట్ తో వున్నాగానీ..సీఎం చంద్రబాబు అభివృద్ధి దిశగా పయనిస్తున్నారన్నారు. ఇంత అభివృద్ధి చేస్తున్నా ప్రతిపక్ష నాయుడు జగన్ కు కనిపించటలేదనీ..ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని వదిలేసి చంద్రబాబుని విమర్శించటమే పనిగా పెట్టుకున్నారన్నారు. బీజేపీ రాసిన స్క్రిప్టుకి..ప్రధాని నరేంద్రమోదీ డైరెక్షన్ చేస్తున్నారనీ..ఆ సినిమాలో జగన్ ఒక కమేడియన్ అని మంత్రి లోకేశ్ ఎద్దేవా చేశారు. 

జగన్ ఎక్కడున్నాడో చెప్పుకోండి అంటున్న లోకేశ్..

అమరావతి : వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ చురకలంటించారు. తాజాగా లోకేశ్‌ ట్వీట్‌ చేస్తూ... ఈరోజు శుక్రవారమని.. మన ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎక్కడ ఉంటారో చెప్పుకోండని ప్రశ్నించారు. అందుకోసం మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఈ కింది వాటిలో ఏదైనా ఒకటి ఎంచుకోండి అంటూ 1.నాంపల్లి కోర్టు... 2.లోటస్‌ పాండ్‌ మహల్‌.. 3.బెంగళూరు మహల్‌ అని పేర్కొన్నారు. కాగా..ఈరోజు అక్రమాస్తుల కుంభకోణం కేసులో భాగంగా నాంపల్లి కోర్టుకు హాజరు కావడానికి నిన్న జగన్‌ తన పాదయాత్రకు బ్రేక్‌ ఇచ్చి కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే. 

శివ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసిన పవన్..

విశాఖపట్నం : ఇటీవల విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా హైటెన్షన్‌ లైన్‌కు తగిలి విద్యుదాఘాతంతో ఆయన అభిమాని భీమవరపు శివ అనే 31 సంవత్సరాల యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన కుటుంబ సభ్యులను పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. శివ కుటంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేసి, ఆయన కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. కాగా, పవన్ చేస్తోన్న జన పోరాట యాత్ర కొనసాగుతోంది.  

గ్రామదర్శిని కార్యక్రమంలో చంద్రబాబు..

నెల్లూరు : జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పెళ్లకూరు మండలం తల్వాయిపాడులో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ గృహాలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ కూడా పాల్గొన్నారు. 

నాలుగేళ్ల పాలన..ఏపీ అభివృద్ధిపై మంత్రి యనమల..

అమరావతి : తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేని దుస్థితిలో ప్రతిపక్షాలు వున్నాయని విమర్శించారు. ప్రజలకు కనిపిస్తున్న అభివృద్ధి ప్రతిపక్షానికి కనింపిచటంలేదని ఎద్దేవా చేశారు. ఈ నాలుగేళ్లలో రూ.5,20,237 కోట్లు ఖర్చుచేశామనీ..గతంలో ఏ ప్రభుత్వమూ బడ్జెట్ లో కేటాయించిన నిధులను ఖర్చు చేయలేదనీ..కానీ బడ్జెట్ కేటాయింపుల కంటే అధికంగానే నిధులను ఖర్చు చేశామని యనమల తెలిపారు. ప్రభుత్వ హామీలు నిలబెట్టేందుకే అప్పులు చేశామని తెలిపారు.

చంద్రబాబు పాలనపై వైసీపీ చార్జ్ షీట్..

అమరావతి : సీఎం చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై వైసీపీ ఛార్జిషీట్ విడుదల చేసింది. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతు..ఈ సమావేశంలో పాల్గొన్న వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వైసీపీ విడుదల చేసిన ఛార్జిషీట్, టీడీపీ మ్యానిఫెస్టోలను దగ్గర పెట్టుకుని సరిచూసుకోవాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమని, అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ ఫైల్ పైనే తొలి సంతకం చేస్తానని బాబు ఊదరగొట్టారని విమర్శించారు.

నాలుగేళ్లుగా పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నాం : యనమల

విజయవాడ : నాలుగేళ్లుగా పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నామని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ప్రభుత్వ హామీలు నిలబెట్టుకునేందుకే అప్పులు చేశామని తెలిపారు.

 

నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

నెల్లూరు : జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పెళ్లకూడు మండలం తాడ్వాయిపల్లిలో గ్రామ దర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

13:50 - June 8, 2018

ఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇంతకాలం ఆపార్టీకి మిత్రులుగా ఉన్నవారు పరమ శత్రువులుగా మారి పోతున్నారు. మిత్ర పక్షాలన్నీ ఎన్డీయేని వదిలిపెట్టే క్రమంలో సాగుతుండడంతో.. బీజేపీ ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అమిత్‌షా రాజీ ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి. దీంతో బీజేపీ అధినాయకత్వం కింకర్తవ్యం అంటూ.. మల్లగుల్లాలు పడుతోంది.

బీజేపీకి షాక్‌ మీద షాక్‌..ఉద్ధవ్‌తో అమిత్‌షా మంతనాలు విఫలం
భారతీయ జనతాపార్టీ ఇప్పుడు తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి షాక్‌ మీద షాక్‌ తగులుతోంది. మహారాష్ట్రలో శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వీరిద్దరి మధ్య దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిగాయి. అయితే.. అమిత్‌షా రాజీ యత్నాలపై సేన తీవ్రంగానే మండిపడింది. వరుస ఓటముల నేపథ్యంలో ఈ భేటీలు ఎందుకంటూ ఎద్దేవా చేసింది. ఉద్ధవ్‌తో అమిత్‌షా చర్చలు ముగియగానే.. వచ్చే ఎన్నికల్లోనే కాదు.. ఇకపై ప్రతి ఎన్నికల్లోనూ తాము ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు శివసేన ప్రకటించింది. ఎవరు చెప్పినా నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.

ఎన్డీయే కూటమి నుంచి వైదొలగుతున్నట్లు ఆర్‌ఎల్‌ఎస్పీ ప్రకటన
మహారాష్ట్రలో శివసేన ఇచ్చిన షాక్‌నుంచి అమిత్‌షా కోలుకోక ముందే.. ఇప్పుడు బిహార్‌లో బీజేపీకి మరో షాక్‌ తగిలింది. స్థానిక రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ.. ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. 2019లో బిహార్‌ ఎన్నికల సారథ్యం విషయంలో.. ఆర్‌ఎల్‌ఎస్పీ ఆగ్రహంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో బిహార్‌ ఎన్డీయే సారథి తానేనంటూ నితిశ్‌కుమార్‌ ప్రకటించుకున్నారు. ఇది ఆర్‌ఎల్ఎస్పీ చీప్‌ కుష్వాహాను తీవ్రంగా కలతపరిచినట్లు చెబుతున్నారు. అందుకే.. ఎన్డీయేకి గుడ్‌బై చెప్పి బీహార్‌ మహాకూటమిలో చేరేందుకు ఆర్జేడీని సంప్రదించినట్లు సమాచారం.

బిహార్‌లో బీజేపీకి షాక్‌ ఇచ్చిన జెడియు
ఆర్‌ఎల్‌ఎస్పీ లాంటి చిన్నపార్టీ వైదొలగినా పరవాలేదు అనుకునేలోపే.. బిహార్‌లో బీజేపీకి జెడియు కూడా షాక్‌ ఇచ్చింది. మోదీ కాదు.. నితీశ్‌ ఫేస్‌తోనే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేస్తున్న జెడియు.. ఏకంగా పాతిక లోక్‌సభ స్థానాలు తమకు ఇవ్వాలని ఖరాకండిగా చెప్పింది. 2014 ఎన్నికల్లో బీజేపీకి 22 స్థానాలు, జెడియుకి రెండు స్థానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. బిహార్‌లో ఎన్డీయే కూటమిలో రగిలిన వివాదాన్ని ఎలా పరిష్కరించాలా అని బీజేపీ అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది.

ఎన్డీయే నుంచి వైదొలగిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్‌లో కీలక భాగస్వామి తెలుగుదేశం ఎన్డీయే నుంచి వైదొలగింది. ఇప్పుడు బిహార్‌లో ఆర్‌ఎల్ఎస్పీ బైబై చెప్పింది. ఈ రాష్ట్రంలో జెడియూ కూడా ముందరికాళ్లకు బంధాలు వేస్తోంది. మహారాష్ట్రలో శివసేనతో రాజీ యత్నం బెడిసికొట్టింది. ఈ పరిస్థితుల్లో ఉన్న మిత్ర పక్షాలనైనా కాపాడుకునేందుకు అమిత్‌షా ప్రయత్నిస్తున్నారు. అయితే.. బీజేపీపై తీవ్రంగా రగిలిపోతున్న ఎన్డీయే కూటమిలోని పక్షాలను అమిత్‌షా ఏమేరకు శాంతిప చేస్తారో వేచి చూడాలి.

 

13:46 - June 8, 2018

హైదరాబాద్ : అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త భ‌యం ప‌ట్టుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల గురించి గులాబీబాస్‌నుంచి వార్నింగ్‌లు రావడం సిట్టింగ్ ఎమ్మెల్యేల‌్లో గుబులు రేపుతోంది. నిన్న మొన్నటి వ‌ర‌కు అంద‌రికీ టికెట్లు ఖాయ‌మ‌న్న కేసిఆర్.. ఇప్పుడు టికెట్లు ద‌క్కని వారి జాబితా సిద్ధం చేశార‌న్న ప్రచారంతో నేత‌ల్లో ఆందోళన మొద‌లైంది.

గులాబి ద‌ళ‌ప‌తి హెచ్చరిక‌ల‌తో పార్టీ నేత‌ల్లో క‌ల‌క‌లం..
ఆట ఆగిందా ..సీటు గోవింద అన్నట్టుగా ఉంది.. గులాబీపార్టీలో కొందరు సిట్టింగ్‌ల పరిస్థితి. నిన్నటిదాకా సిట్టింగ్‌లు అందరికీ టెక్కెట్లు అని చెప్పిన కేసీఆర్.. ఇపుడు కత్తెరింపులు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. నోటికెట్‌ లిస్టులో తమపేరు ఉందేమో అని కొందరు గులాబీనేతలు టెన్షన్‌ పడుతున్నారు.

కేసిఆర్ వార్నింగ్ లతో వారికి టికెట్లు డౌటే అంటున్న నేత‌లు
నాలుగేళ్ల క్రితం సాధార‌ణ మెజార్టీతో అధికార ప‌గ్గాలు ద‌క్కించుకున్న గులాబి పార్టీ.. ఆతర్వాత మైండ్ గేమ్‌ మొదలుపెట్టి విప‌క్షాల‌ను తీవ్రంగా దెబ్బ తీసింది. టీడీపీ, కాంగ్రెస్, వైసిపి, బీఎస్పీ నుంచి విజ‌యం సాధించిన 25 మంది ఎమ్మెల్యేల‌ను కారెక్కించుకుంది. మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో 90 శాస‌న‌సభ్యులుగా త‌మ బ‌లాన్ని పెంచుకుంది. తెలంగాణాలో రాజ‌కీయపున‌రేకీక‌ర‌ణ పేరుతో పొలిటికల్‌గా బ‌ల‌ప‌డేందుకు పావులు క‌దిపింది. ఇంత చేసినా 40కిపైగా నియోజకవర్గాల్లో పార్టీకి ఓటమితప్పదన్న సమాచారంతో కారుపార్టీ అధినేత గేర్‌మార్చారు.

అంద‌రికీ టికెట్లు ఇవ్వడం ఖాయ‌మన్న ధీమా..
కాని ఆరు నెల‌ల క్రితం వ‌ర‌కు నిర్వహించిన స‌ర్వే వివ‌రాల‌ను సంబంధిత శాస‌న‌స‌భ్యుల‌కు అందిస్తూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా అంద‌రికీ టికెట్లు ఇవ్వడం ఖాయ‌మన్న ధీమా క‌ల్పించారు. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఒక్కరిద్దరు మిన‌హా....అంద‌రూ వ‌జ్రాలాంటి నేత‌లే అని ఇటీవ‌లే కితాబునిచ్చిన కేసిఆర్..... అంత‌లోనే హెచ్చరిక‌లు చేయ‌డం దేనికి సంకేతాలో అన్న ప్రశ్నలు గులాబీ నేత‌ల‌ను వెంటాడుతున్నాయి. ఇటీవ‌ల నిర్వహించిన ప‌లు స‌ర్వేల్లో దాదాపు 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని తేలడంతో... గులాబీదళపతి యాక్షన్‌లోకి దిగినట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే టిక్కెట్టు దక్కని వారికి ఒకేసారి మొఖంమీదనే విషయం చెబితే వారిస్థాయిలో పార్టీకి చేటుతెచ్చే ప్రమాదం ఉందని గులాబీస్‌ జాగ్రత్తపడ్డట్టు తెలుస్తోంది. అందుకే మెల్లగా అసలు విషయం తెలిసేలా నోటికెట్‌ లిస్టులో పేర్లను ఒక్కొక్కటిగా లీకుచేస్తున్నారని పార్టీలో చెప్పుకుంటున్నారు.  

13:42 - June 8, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా టీఎంయూ అధ్యక్షులు అశ్వత్థామ మాట్లాడుతు..ఆర్టీసీ సంస్థను అధికారులకు, బోర్డు మెంబర్లకు అప్పగిస్తే నాలుగేళ్లలో లాభాల బాట పట్టిస్తాం’ అని టీఎస్ ఆర్టీసీ టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. 11నుంచి జరిగే సమ్మెను వాయిదా వేయాలని రవాణా మంత్రి కోరారనీ..రాష్ట్ర కమిటీ సమావేశమై నిర్ణయం ప్రకటిస్తామని అశ్వత్థామ స్పష్టం చేశారు. ఆర్టీసీ నష్టాల్లో నడిచే సంస్థ కాదనీ..ఆ రకంగా చెప్పాలంటే లాభనష్టాలకు వ్యతిరేకంగా ఆర్టీసీని నడిపించాలని అశ్వత్థామ డిమాంబడ్ చేశారు. మాఈ సమ్మె చివరి సమ్మె కావాలని, అన్ని సమస్యలు ఈ సమ్మెతోనే పరిష్కారం కావాలనే ఉద్దేశ్యంతోనే ఈ సమ్మె ప్రారంభించామని అశ్వత్థామ స్పష్టంచేశారు.

ప్రభుత్వంతో ముగిసిన ఆర్టీసీ కార్మికుల చర్చలు..
ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ముగిశాయి. రవాణ మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ చర్చల్లో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో సంస్థ చైర్మన్‌ సత్యనారాయణ, ఎండీ రమణారావు, రవాణ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు. వేతన సవరణను అమలు చేయడంతోపాటు 19 డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ టీఎంయూ సమ్మె నోటీసు ఇచ్చింది. తమ డిమాండ్లను ఆమోదించకపోతే ఈనెల 11 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరించాయి. సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరింది. దీనికి కార్మిక సంఘాలు ఒప్పుకోలేదు. అందర్నితో చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పి చర్చల నుంచి బయటకు వచ్చాయి. 

13:30 - June 8, 2018

హైదరాబాద్ : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. 100 మసీదుల్లో సీఎం కేసీఆర్ భారీగా ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు ప్రభుత్వం రూ.66 కోట్లను కేటాయించింది. కాగా ఈ ఇఫ్తార్ విందును నిలిపివేయాలంటు హైకోర్టులో ప్రజాప్రయోజనాల పిటీషన్ దాఖలయ్యింది. ఇఫ్తార్ విందు పేరుతో పేద ముస్లింలకు ఏమాత్రం విలువలేదనీ..ధని ముస్లింలకు మాత్రమే ఈ విందుకు ఆహ్వానిస్తున్నారనీ..ఆరోపిస్తు..దీంతో ప్రజా ధనం వృథా అవుతోందని కాబట్టి ఈ విందును నిలిపివేయాలని పిటీషన్ లో పేర్కొన్నారు. కాగా ఈ పిటీషన్ ను కోర్టు తోసిపిచ్చింది. కాగా గతంలో కూడా ఇటువంటి పిటీషన్ కోర్టులో దాఖలైన నేపథ్యంలో కూడా కోర్టు కొట్టివేసిన సంగతి కూడా తెలిసిందే..

10లక్ష కరపత్రాలతో ప్రజల్లోకి : ఉత్తమ్

హైదరాబాద్ : జానారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశం ముగిసింది. అనంతరం కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతు..నాలుగేళ్ళ కేసీఆర్ పరిపాలనలో ప్రజాస్వామ్య హక్కులు కాలరాయబడతున్నాయని ఉత్తమ్ కుమార్ విమర్శించారు. అలాగే కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, సంపత్ ల శాసన సభ సభ్వత్వాలను పునరుద్ధరించాలనే డిమాండ్ తో 10లక్షలు పాంప్ లెట్స్ తయారు చేసి ప్రజలకు పంచుతామని ఉత్తమ్ తెలిపారు. ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని పునరుద్దరించాలని కోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా కోర్టు తీర్పును కూడా ఖాతరు చేయటంలేదని ఉత్తమ్ విమర్శించారు.

పాక్ ఎన్నికల్లో 'బాద్ షా' సోదరి పోటీ..

పాకిస్థాన్ : బాలీవుడ్ బాద్ షా షారూఖ్‌ఖాన్ సోదరి నూర్జహాన్ పాక్ ఎన్నికల్లో పోటీ చేయనుంది. పాకిస్థాన్ లో వచ్చే నెల 25వతేదీన జరగనున్న సాధారణ ఎన్నికల్లో షారూఖ్ సోదరి అయిన నూర్జహాన్ ఖైబర్ ఫక్తూన్ ఖవా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనుందని అంతర్జాతీయ పత్రికలు వెల్లడించాయి. షారూఖ్ సోదరి అయిన నూర్జహాన్ తన కుటుంబంతో కలిసి షావాలి ఖతాల్ ప్రాంతంలో నివాసముంటోంది. రాజకీయ కుటుంబానికి చెందిన నూర్జహాన్ గతంలో కౌన్సిలరుగా కూడా సేవలందించింది.

కేసీఆర్ వ్యాఖ్యలకు ఆర్టీసీ రేపు నల్లబ్యాడ్జీల నిరసన..

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అగౌరవంగా మాట్లాడుతున్నారని, సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ రేపు ఆర్టీసీ డిపోల ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతామని ఆర్టీసీ జేఏసీ నేతలు రాజిరెడ్డి, వీఎస్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారని, అలాగే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే డీజిల్ ధరల పెరుగుదల భారాన్ని ప్రభుత్వమే భరించాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని, బెదిరింపులకు భయపడేది లేదని వారు స్పష్టం చేశారు. 

కోతుల కోసం పండ్ల చెట్లు గుర్తింపు..

హైదరాబాద్ : కోతులు వాపస్ పోవాలి.. వానలు వాపస్ రావాలి ఉద్యమకాలంలో సీఎం కేసీఆర్ చెప్పిన మాట వాస్తవరూపం దాల్చనున్నది. కోతులను అడవులకే పరిమితం చేయాలన్న సదుద్దేశంతో ప్రత్యేక హరితహారం నిర్వహించేందుకు అటవీశాఖ సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా కోతులకు ఆహారం కోసం 24 రకాల పండ్ల మొక్కలను గుర్తించింది. ఈ స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా వన్ చైల్డ్ టూ ట్రీస్ అనే నినాదాంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆ శాఖ అధికారులు ప్రణాళికలు రచించారు. మూడేండ్లలో కోతులకు సరిపడా ఆహారం దొరికేలా పండ్లమొక్కలను నాటడానికి సిద్ధమవుతున్నారు.

ఇష్టారాజ్యంగా స్కూల్ ఫీజులు..కేంద్రం చెక్..

ఢిల్లీ : ప్రైవేటు పాఠశాలలు ఏటా ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రులను బాదేస్తుండడంతో, వీటికి ముకుతాడు వేయాలని కేంద్రం భావిస్తోంది. ఏటా పద్ధతి లేని పెంపును నియంత్రించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ సీనియర్ అధికారి మీడియాకు వివరాలు తెలిపారు. దీన్ని అమలు చేసే ముందు ఏకాభిప్రాయం కోసం అన్ని వర్గాలతో సంప్రదింపులు జరపనున్నట్టు ఆ అధికారి చెప్పారు. ఇటీవలే యూపీ ప్రభుత్వం పాఠశాలల ఫీజుల పెంపును కట్టడి చేస్తూ ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గుజరాత్, మహారాష్ట్ర సైతం ఇదే విధమైన చర్యలు తీసుకున్నాయి.

రమణదీక్షితులకు లీగల్ నోటీసులు : టీటీడీ చైర్మన్

తిరుమల : తిరుమలలో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తనిఖీలు చేపట్టారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సర్వదర్శనం క్యూలైన్లు, బూందీపోటు, లడ్డూ కౌంటర్ లను సుధాకర్ పరిశీలించారు. ఈ సంర్భంగా సుధాకర్ యాదవ్ మాట్లాడుతు..టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారనీ..కాబట్టి రమణదీక్షితులకు చట్టపరంగా లీగల్ నోటీసులిస్తామని తెలిపారు. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ లో విమర్శలు చేయటం సబబు కాదనీ..ఆయనకు నిజంగా అన్యాయం జరిగితే..తిరుమలలలో మాట్లాడితే న్యాయం చేసేందుకు టీటీడీ సిద్ధంగా వుందని సుధాకర్ యాదవ్ తెలిపారు. 

పెట్రోల్ 21,డీజిల్ పై 15 పైసలు తగ్గింపు..

ఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు క్షీణించడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు కొంత చొప్పున తగ్గిస్తూ వస్తున్నాయి. ధరల పెంపు విషయంలో వడ్డింపు ఎక్కువగా ఉంటే, తగ్గింపు మాత్రం పది పైసల లోపే ఉంటోంది. కాకపోతే ఈ రోజు మాత్రం తగ్గింపు రెండంకెలకు చేరింది. పెట్రోల్ పై 21 పైసలు, డీజిల్ పై 15 పైసలు మేర తగ్గించడం జరిగింది. దేశవ్యాప్తంగా రవాణా దూరాన్ని బట్టి, పన్నులను బట్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో వ్యత్యాసాలుంటాయని తెలిసిందే.

12:23 - June 8, 2018

హైదరాబాద్ : తెలంగాణ సీఎల్పీ భేటీ కొనసాగుతోంది. జానారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ లపై కోర్టు తీర్పు..ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై చర్చించనున్నారు. అనంతరం కోమటిరెడ్డి లేవనెత్తిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. మూకుమ్మడి రాజీనామాలు చేయాలా ? వద్దా ? అనే దానిపై చర్చించనున్నారు. దీనిపై కేంద్రానికి సమాచారం అందించిన తరువాత హై కమాండ్ చెప్పిన దానిబట్టి అనుసరించాల్సి ఉంటుందని భేటీలో ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం.

ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళుతారనే జరుగుతున్న ప్రచారంపై హాట్ హాట్ చర్చ జరిగే అవకాశం ఉంది. పార్టీని వీడకుండా ప్రయత్నాలు చేయాలని సమావేశంలో నేతలు అభిప్రాయాలు వ్యక్తపరిచినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టబోయే సమ్మెపై రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరికల వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఉచిత గ్రహణమొర్రి ఆపరేష్ కోసం ఈ నంబర్ ..

హైదరాబాద్ : గ్రహణమొర్రితో బాధపడువారికి ఎఫ్‌సీఎస్ ఆధ్వర్యంలో ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని సంస్థ ప్రతినిధి ఎ.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం ఎర్రగడ్డలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ర్టాల్లో 20 నుంచి 30 ఏండ్ల వయసుగల వారు గ్రహణమొర్రితో బాధపడుతున్నారని, గ్రహణమొర్రి అనేది అనారోగ్య సమస్యని , శస్త్ర చికిత్స చేయిచుకోవడం ద్వారా వ్యక్తి తిరిగి పూర్తిగా అందంతో పాటు ఆరోగ్యంగా కనిపిస్తారని వెల్లడించారు. డాక్టర్ గీతా, టామ్‌ల ఆధ్వర్యంలో ఇప్పటి వరకూ 450 మందికి గ్రహణమొర్రి చికిత్సలు నిర్వహించామని తెలిపారు.

మోదీని హతమారుస్తామంటున్న పాక్ ఉగ్రసంస్థ...

ఢిల్లీ : పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా మితిమీరుతున్నది. నిషేధిత ఉగ్ర సంస్థకు చెందిన సభ్యులు భారత్ గురించి దారుణంగా మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీని హతమారుస్తామని, భారత్‌ను విచ్చిన్నం చేస్తామని జమాత్ ఉద్ దవా సభ్యుడు మౌలానా బాషిర్ అహ్మద్ ఖాకి పేర్కొన్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు చెందిన జమాత్ సంస్థ పాక్ కేంద్రంగా పనిచేస్తున్నది. పవిత్ర రంజాన్ మాసంలో.. జిహాదీ యుద్ధాన్ని ప్రకటించాలని మౌలానా బాషర్ పిలుపునిచ్చాడు. జిహాద్‌కు రంజాన్ మంచి సమయం అని, జీహాదీలో ప్రాణాలు కోల్పోతే, స్వర్గానికి వెళ్తారని అన్నాడు.

12:11 - June 8, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో సమ్మె జరుగుతుందా ? లేదా ? అనేది శనివారంకు తెలియనుంది. శుక్రవారం మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్, ఇతర ఉన్నతాధికారులతో గుర్తింపు సంఘం టీఎంయూ, ఇతర సంఘాల నేతలతో సమావేశమయ్యారు. కాసేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది. సమ్మెపై శనివారం తుది నిర్ణయాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి.

సమావేశంలో సమ్మెను విరమించుకోవాలని మంత్రి సూచించారని టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. సాయంత్రం మరోసారి టీఎంయూ కార్యవర్గం అత్యవసరంగా భేటీ అవుతుందని, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు చర్చించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదని, సమ్మెను వాయిదా వేయడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం నుండే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిందని, రాజకీయ అవసరాలకై ఆర్టీసీని చిందరవందర చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీలో ఎలాంటి ఎన్నికలు లేవని పేర్కొన్నారు. చివరి సమ్మె కావాలని..కేసీఆర్ పేర్కొన్నారని...అన్ని సమస్యలు ఈ సమ్మె ద్వారా పరిష్కారం కావాలని కోరుకుంటున్నట్లు తెలియచేశారు. 

జీతాలు పెంచితే రూ.1400కోట్ల నష్టం: మహేందర్ రెడ్డి

హైదరాబాద్ : ఆర్టీసీ నష్టాల్లో వుందని..రూ.3వేల కోట్ల అప్పులున్నాయని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో సమ్మె నిర్ణయాన్ని పురాలోచించుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాలకు మంత్రి సూచించారు. 97 డిపోలలలో 11 డిపోలు మాత్రమే లాభాల్లో వున్నాయని తెలిపారు. ఏటా రూ.250 కోట్లు వడ్డీ కడుతున్నామని..ఈ క్రమంలో ఏటా ఆర్టీసీకి రూ.700 కోట్లు నష్టం వాటిల్లితోందని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. వేతన సవరణ చేస్తే సంస్థపై రూ.1400ల కోట్ల భారం పడుతుందన్నారు. 

ఆర్టీసీ చైర్మన్,ఎండీలతో మహేందర్ రెడ్డి భేటీ..

హైదరాబాద్ : సచివాలంలోని తన ఛాంబర్ లో ఆర్టీసీ ఛైర్మన్,ఎండీలతో మంత్రి మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. టీఎంయూ సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో వారితో చర్చిస్తున్నారు. అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాలతో కూడా మహేందర్ రెడ్డి భేటీ కానున్నారు. కాగా మంత్రి మహేందర్ రెడ్డితో ఆర్టీసీ యూనియన్ల చర్చలు ముగిసాయి. ఆర్టీసీ సమ్మెను వాయిదా వేయటంలేదని టీఎంయూ అధ్యక్షులు అశ్వద్థామ రెడ్డి స్పష్టంచేశారు. ప్రభుత్వంతో చర్చలు జరిపామని కాగా తమ నిర్ణయాన్ని మాత్రం రేపు మధ్యహ్నాం వరకూ తెలుపుతామని అశ్వత్థామ తెలిపారు.

సీబీఐ, ఈడీ కోర్టుకు వైసీపీ నేతలు..

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ, ఈడీ కోర్టుకు హాజరయ్యారు. అలాగే ఓఎంసీ కేసులో గాఇ జనార్థన్ రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. 

ఆర్టీసీ సమ్మెను వాయిదా వేయం : అశ్వత్థామ

హైదరాబాద్ : మంత్రి మహేందర్ రెడ్డితో ఆర్టీసీ యూనియన్ల చర్చలు ముగిసాయి. ఆర్టీసీ సమ్మెను వాయిదా వేయటంలేదని టీఎంయూ అధ్యక్షులు అశ్వద్థామ రెడ్డి స్పష్టంచేశారు. ప్రభుత్వంతో చర్చలు జరిపామని కాగా తమ నిర్ణయాన్ని మాత్రం రేపు మధ్యహ్నాం వరకూ తెలుపుతామని అశ్వత్థామ తెలిపారు. తెలంగాణ ఉద్యమం నుండే ఆర్టీసీ నష్టాల బాటలో నడుస్తోందనీ అశ్వత్థామ పేర్కొన్నారు. ఆర్టీసీలో ఎటువంటి ఎన్నికలు లేవనీ..రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వం ఆర్టీసీని చిందరవందర చేస్తోందనీ టీఎంయూ అధ్యక్షులు అశ్వత్థామ విమర్శించారు. 

11:23 - June 8, 2018

సమంత సినిమాలో వుంది అంటే అది హిట్ అనే స్థాయికి చేరుకుంది ఈ అక్కినేనివారి కోడలు. అభినయానికే ఎక్కువ ప్రాధాన్యత వుండే పాత్రలు చేసే సమంత హిట్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. తన పాత్రల ఎంపికవిషయంలో కీలక నిర్ణయాలతో విజయాలను అందుకుంటున్న సమంతా వివాహానికి ముందుగా చేపట్టిన సినిమాలు వివాహం తరువాత రిలీజ్ అయి హిట్స్ సాధించింది. అంతేకాదు వివాహం తరువాత కూడా సమంతకు ఆఫర్లు తగ్గలేదు. ఈ క్రమంలోనే సమంతా ఇప్పుడు మూడు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది.

మూడు హిట్స్ అందుకుని జోరుమీదున్న సమంతా..
ఈ ఏడాది ఇప్పటికే 'రంగస్థలం', 'మహానటి', 'అభిమన్యుడు' రాజుగారి గది వంటి హిట్లతో మంచి ఊపు మీదున్న కథానాయిక సమంత, ప్రస్తుతం మరో మూడు సినిమాలతో బిజీగా వుంది. సీమరాజా, యూ టర్న్, సూపర్ డీలక్స్ చిత్రాలతో ఆమె బిజీగా వుంది. 'ఈ ఏడాది ఫస్టాఫ్ అద్భుతంగా గడచిపోయింది. సెకండాఫ్ కి రెడీ అవుతున్నాను' అంటూ సమంతా తాజాగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రాలకు డబ్బింగ్ మొదలెట్టింది.

వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు..
ప్రస్తుతం వంశీ పైడిపల్లితో ఓ చిత్రాన్ని చేస్తున్న మహేశ్ బాబు, దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పనిచేయనున్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రిప్టును సుకుమార్ సిద్ధం చేసి, మహేశ్ కి వినిపించాడని, మహేష్ సంతృప్తి వ్యక్తం చేశాడని తెలుస్తోంది.

11:20 - June 8, 2018

ఢిల్లీ : వైసీపీ ఎంపీల రాజీనామాల సందిగ్ధం ఇంకా కొనసాగుతోంది. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ దీనిపై శుక్రవారం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. సాయంత్రం జెనీవా పర్యటన నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. లేనిపక్షంలో విదేశీ పర్యటన అనంతరం నిర్ణయం తీసుకుంటారా ? అనేది తెలియరావడం లేదు.

ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ఏప్రిల్ ఆరో తేదీన వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్ సుమిత్రా మహజన్ ను ఎంపీలు కోరారు. రెండు సార్లు జరిగిన సమావేశాల్లో రాజీనామాలపై పునరాలోచించుకోవాలని స్పీకర్ సుమిత్రా మహజన్ సూచించడం..తాము రాజీనామాలకే కట్టుబడినట్లు ఎంపీలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజీనామాలు ఆమోదిస్తారా ? అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయా ? అనే చర్చ జరుగుతోంది. కానీ ఎన్నికలు జరిగే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

సమ్మె విరమించకుంటే ఆర్టీసీ మూసేస్తా : కేసీఆర్

హైదరాబాద్ : ఈ నెల 11 నుండి సమ్మెకు దిగుతున్నట్లుగా టీఎంయూ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో రవాణశాఖ మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో ఆర్టీసీ సంఘాలు చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. సమ్మె విరమించకుంటే ఆర్టీసీని మూసివేస్తానని టీఎంయూకి కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. వేతన సవరణ అమలు చేయమని కోరితే ఈ బెదిరింపులేమిటని కేసీఆర్ హెచ్చరికలపై టీఎంయూ యూనియన్లు మండిపడుతున్నాయి.  

పాన్ లో మత్తు కలిపి అత్యాచారం..

హైదరాబాద్ : సోసల్ మీడియాలో ఫేస్ బుక్ ప్రత్యేకత వేరు. వయసుతో తారతమ్యం లేకుండా వినియోగించుకునే ఈ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా పలు మోసాలు జరుగతున్నాయి. ప్రేమపేరుతో అమ్మాయిలు, అబ్బాయిలు ఈ మోసాలలో చిక్కుకుంటున్నారు. మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ లో పరిచయమైన సాఫ్ట్ వేర్ యువతిని మోసం చేశాడు ఓ ప్రబుద్ధుడు. మూర్ పాస్ హౌస్ పేరుతో పాస్ హౌస్ నడుపుతున్న ఉపేందర్ అనే వ్యక్తి ఓ మహిళా సాఫ్ట్ వేర్ అమ్మాయిని మోసం చేశారు. స్వీట్ పాన్ లో మత్తు పదార్ధం కలిపి సాఫ్ట్ వేర్ యువతిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ముస్లిం సోదరులకు గవర్న్ ఇఫ్తార్ విందు..

హైదరాబాద్ : రాష్ట్ర ముస్లింలకు రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఈ నెల 10వ తేదీ ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. గవర్నర్ కార్యాలయం ఈ విందుకు సంబంధించి ఆహ్వానకార్డులను పంపించింది. ప్రతి ఏడాది రంజాన్ నెలలో గవర్నర్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేయడం సంప్రదాయంగా వస్తున్నది.

10:39 - June 8, 2018

హైదరాబాద్ : మయూర్ పాన్ హౌస్ ఓనర్ ఉపేందర్ నయవంచకుడని తేలింది. ప్రేమ, పెళ్లి పేరిట అమ్మాయిలను లోబర్చుకొనేవాడు. ఇతని భాగోతాన్ని ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి బయటపెట్టింది. ప్రేమ..పెళ్లి పేరిట ఈమెను ట్రాప్ చేశాడు.

ఫేస్ బుక్ రిక్వెస్టు పంపి అమ్మాయిలను ఇతను ట్రాప్ చేస్తున్నాడు. స్వీట్ పాన్ లో మత్తు పదార్థాలు కలిపి ఇచ్చి అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడేవాడు. న్యాయం కోసం ఇతని బారిన పడి మోసపోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి కాచిగూడ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు ఉపేంద్ర వర్మపై రేప్ కేసుతో పాటు పలు కేసులు నమోదు చేశారు. ఉపేంద్ర వర్మను అరెస్టు చేయగా అతని స్నేహితులు పరారీలో ఉన్నారు. ఉపేందర్ కు హిమాయత్ నగర్ తో పాటు సిటీలో పలు చోట్ల పాన్ హౌస్ లున్నట్లు సమాచారం. 

వైసీపీ ఎంపీల రాజీనామాలకు ఆమోదావకాశం..

ఢిల్లీ : రెండు రోజుల క్రితం లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించాల్సిందిగా వైసీపీ ఎంపీలు కోరిన సంగతి తెలిసిందే. ఇంతవరకు వారి రాజీనామాలకు ఆమోద ముద్ర పడలేదు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంటరీ బృందంతో కలిసి 10 రోజుల బెలారస్, లాత్వియాల పర్యటనకు సుమిత్ర వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీల రాజీనామాలకు నేడు ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని లోక్ సభ సచివాలయ సిబ్బంది తెలిపారు.

10:32 - June 8, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన గడువు ముంచుకొస్తోంది. ఈనెల 11వ తేదీ నుండి సమ్మెలోకి వెళుతున్నట్లు గుర్తింపు సంఘం టీఎంయూ, ఇతర సంఘాల నేతలు సమ్మె నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆర్టీసీలో సమ్మె నిషేధం ఉందని...ఆర్టీసీ తీవ్ర నష్టాల్లోకి వెళుతుందని ప్రభుత్వం, యాజమాన్యం పేర్కొంటోంది. తాజాగా సీఎం కేసీఆర్ సమ్మెపై హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలు చేశారు. సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఆర్టీసీని మూసివేస్తామని హెచ్చరికలపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కార్మికుల సంఘాలతో రవాణ మంత్రి మహేందర్ రెడ్డి భేటీ కానున్నారు. కానీ సీఎం కేసీఆర్ హెచ్చరికల నేపథ్యంలో సమావేశానికి హాజరు కాబోబమని సంఘాలు ప్రకటించాయి. దీనితో మహేందర్ రెడ్డి కార్యాలయం నుండి ఆహ్వానాలు అందాయి. సమావేశానికి హాజరు కావాలని..చర్చించకుందామని చెప్పడంతో పలు కార్మిక సంఘాల నేతలు సచివాలయానికి చేరుకున్నారు. సమ్మె అనేది కార్మికుడి హక్కు అని, తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే సమ్మెలోకి వెళుతున్నట్లు కార్మిక సంఘాలు వెల్లడిస్తున్నాయి. వేతన సవరణ సంఘం అమలు చేయాలని కోరుతూ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

మహాసంకల్ప బహిరంగసభ...

నెల్లూరు : ఏడు రోజుల పాటు జరిగిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాలు ముగింపుకు చేరుకున్నాయి. నాయుడు పేట కేంద్రంగా శుక్రవారం ఏర్పాటు చేస్తున్న మహాసంకల్ప బహిరంగసభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. 

కొండెక్కిన చేపల ధరలు...

హైదరాబాద్ : మృగ శిర కార్తె ఎఫెక్ట్ చేపలపై పడింది. ఈ రోజున చేపలు తింటే రోగాలు నయమవుతాయని ప్రజలు విశ్వసిస్తుంటారు. దీనిని క్యాష్ చేసుకొనే చేపల వ్యాపారులు చేపల ధరలను ఒక్కసారిగా పెంచుతుంటారు. కొర్రమీను కిలో రూ. 700-800 పలుకుతున్నట్లు తెలుస్తోంది. 

09:14 - June 8, 2018

చిత్తూరు : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రామ్ బగీచా ప్రాంతంలోని పార్కింగ్ ఏరియాలో నిలిచి ఉన్న హుందాయ్ కారులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గురైన కారు తిరుపతిలోని విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న అధికారిదని తెలుస్తోంది. ఈ పార్కింగ్ ప్రాంతంలో టిటిడిలో పనిచేస్తున్న వారి వాహనాలు తప్ప ఇతర వాహనాలకు అనుమతి లేదు. దూర ప్రాంతాల నుండి వచ్చిన కొంతమంది భక్తులు తమ పరపతిని ఉపయోగించి వాహనాలను పార్కింగ్ చేస్తుంటారు. 

రామ్ బగీచా పార్కింగ్ లో కారుకు ప్రమాదం...

చిత్తూరు : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రామ్ బగీచా ప్రాంతంలోని పార్కింగ్ ఏరియాలో నిలిచి ఉన్న హుందాయ్ కారులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. 

09:09 - June 8, 2018

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబీషన్ గ్రౌండ్ కు ప్రజలు బారులు తీరారు. గత కొన్ని సంవత్సరాలుగా బత్తిని సోదరులు చేప మందును పంపిణీ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఉబ్బసం వ్యాధి గ్రస్తులు ఈ మందును తీసుకుంటుంటారు. తెలుగు రాష్ట్రాలనుండే కాకుండా ఇతర రాష్ట్రాలు..విదేశాల నుండి తరలివచ్చారు. వీరందరూ క్యూ లైన్ లో వేచి ఉన్నారు. రూ. 20 టికెట్ గా విధించారు. పరిగడుపున చేప మందు మింగాల్సి ఉంటుంది. శనివారం ఉదయం 9గంటల వరకు చేప మందు పంపిణీ చేయనున్నారు. ఎగ్జిబీషన్ మైదానం వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. 

బారులు తీరిన ఉబ్బసం వ్యాధి గ్రస్తులు...

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబీషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 9గంటల వరకు చేప మందు పంపిణీ చేయనున్నారు. ఎగ్జిబీషన్ మైదానం వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. చేప మందు కోసం ఉబ్బసం వ్యాధి గ్రస్తులు బారులు తీరారు. 

08:28 - June 8, 2018

కాసేపట్లో చేప ప్రసాదం...

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబీష్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. భారీ సంఖ్యలో ఉబ్బసం వ్యాధి గ్రస్తులు చేరుకున్నారు. నేడు చేప మందు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 

08:26 - June 8, 2018

పెద్దపల్లి : జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధుడిని దారుణంగా చంపేశారు. భార్యే చంపేసిందని పోలీసులు భావించి ఆమెను విచారించగా హత్య విషయం చెప్పినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...అప్పన్నపేట పంచాయతీ పరిధిలో కొప్పులు ఓదేలు (65) భార్యతో నివాసం ఉంటున్నాడు. సింగరేణిలో పనిచేసి రిటైర్ అయిన ఓదేలు ఎప్పటిలాగానే గురువారం రాత్రి ఆరుబయట నిద్రించాడు. తెల్లారేసరికి రక్తపుమడుగులో విగతజీవిగా కనిపించాడు. గుర్తు తెలియని దుండగులు వచ్చి గొడ్డలితో నరికి చంపేశారని హతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పొంతన లేకుండా చెబుతుండడంతో ఆమెపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో తానే హత్య చేసినట్లు వెల్లడించినట్లు సమాచారం. మద్యానికి బానిసైన ఓదేలు నిత్యం ఇంట్లో ఘర్షణ పడుతుండే వాడని..అందుకే హత్య చేసినట్లు పేర్కొందని సమాచారం. 

పెద్దపల్లిలో వృద్ధుడు దారుణ హత్య...

పెద్దపల్లి : జిల్లాలోని అప్పన్నపేట పంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో వృద్ధుడు హత్యకు గురయ్యాడు. ఆరు బయట నిద్రిస్తున్న కొప్పుల ఓదేలును గొడ్డలితో నరికి చంపారు. హతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య చంపేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

08:10 - June 8, 2018

హైదరాబాద్ : ఓ వివాహిత విమానం దిగి కుటుంబసభ్యులకు కలువకుండానే ఎటో వెళ్లిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఏమై ఉంటుందా ? అని కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. జైపూర్ లో సాయి ప్రసన్న విమానం ఎక్కి హైదరాబాద్ విమానాశ్రయంలో దిగింది. అప్పటికే ఆమె కోసం తండ్రి, సోదరుడు వేచి చూస్తున్నారు. కానీ వీరితో ఆమె కలువకుండానే క్యాబ్ మాట్లాడుకుని వెళ్లిపోయింది. క్యాబ్ దిగాలని సోదరుడు కోరినా సాయి ప్రసన్న వినిపించుకోలేదు. పలు మార్లు ఫోన్ చేసినా పనిచేయకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమానాశ్రయ పరిసరాల సీసీ టీవీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

వివాహిత అదృశ్యం...

హైదరాబాద్ : ఓ వివాహిత అదృశ్యం కలకలం రేపుతోంది. జైపూర్ లో విమానం ఎక్కిన సాయి ప్రసన్న హైదరాబాద్ విమానాశ్రయంలో దిగింది. కానీ కుటుంబసభ్యులతో కలువకుండా నేరుగా క్యాబ్ లో వెళ్లిపోయింది. క్యాబ్ దిగాలని సోదరుడు కోరినా ఆమె వినిపించుకోలేదు. వెంటనే ఆర్జీఐ పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. 

07:48 - June 8, 2018
07:12 - June 8, 2018

ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎస్‌ రద్దు చేయాలని, అలాగే కాంట్రక్టు ఔట్‌ సోర్సింగ్‌ విధానం పర్మినెంట్‌గా తీసివేయాలని డిమాండ్‌ చేస్తూ... ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘలు ఫ్యాప్టో ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, లేకుంటే భవిష్యత్‌లో తీవ్ర ఆందోళనలు ఎదురుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. ఈ ఆందోళలనకు దారి తీసిన కారణాలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై టెన్ టివి జనపథంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మాణ్‌ రావు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:10 - June 8, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంద్ర వరకు విస్తరించాయి. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉన్నదని ఐఎండీ తెలిపింది. మరోవైపు పశ్చిమ,మధ్య బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో గత రెండురోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కాగా ఈ నెల 9 నుండి 11 వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 

07:05 - June 8, 2018

ఢిల్లీ : అసహనం, ద్వేషం.. జాతీయ భావనను దెబ్బతీస్తాయని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. నాగపూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షావర్గ్‌ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశభక్తి, జాతీయభావన అనేది ఒక కులానికో, వర్గానికో సంబంధించినవి కావన్నారు. మన రాజ్యాంగం 134 కోట్లమంది భారతీయల ఆకాంక్షలకు ప్రతిరూపం అన్నారు. దేశంలో శాంతి, సామర్యాలకోసం పౌరులందరూ కృషిచేయాలన్నారు. ప్రణబ్‌ వ్యాఖ్యలను ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్‌ భగవత్‌ సమర్థించారు.

మహారాష్ట్ర నాగపూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షావర్గ్‌ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.. దేశభక్తి, జాతీయత, మతం అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశభక్తి, జాతీయతకు..కులం, మతం కొలబద్దలు కావన్నారు. జాతీ, జాతీయవాదం, దేశభక్తి లాంటి అంశాలపై తనకున్న భావాలను పంచుకోవడానకే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమానికి వచ్చానన్నారు ప్రణబ్‌ ముఖర్జీ.

ఇటీవల కాలంలో దేశంలో హింస పెరిగిపోవడంపై ప్రణబ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. దేశపౌరులంతా శాంతి సామరస్యాల కోసం పని చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలనుద్దేశించి అన్నారు. మతం, ద్వేషం, అసహనం పేర్లతో భారత్‌ను నిర్వచించాలని చూస్తే అది దేశసమగ్రతకే ప్రమాదమని ప్రణబ్‌ హెచ్చరించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని దేశప్రజలందరూ సంతోషంగా స్వీకరించాలన్నారు. అనేక మతాలు, కులాలు, భాషలు ఒకే రాజ్యాంగం కింద ఒదిగి ఉండటం అద్భుతమన్నారు ప్రణబ్‌ముఖర్జీ. హిందూ,మస్లీం, సిఖ్‌, క్రిస్టియన్‌..ఇలా అన్ని మతాల వారు కలిస్తేనే భారతజాతి అన్నారు.

సంక్లిష్టమైన అంశాలు ఏవైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలేగాని... హింసద్వారా ఏదీ సాధ్యపడదని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాకర్తనుద్దేశించి మాజీ రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. దేశం ప్రస్తుతం శాంతి, సామరస్యంకోసం పరితపిస్తోందని అదిశగా కృషిచేయాల్సిన బాధ్యత పౌరులందరిపై ఉందన్నారు.

కాగా మాజీ రాష్ట్రపతి ప్రసంగం రుచించని కొందరు సంఘ్‌నేతలు ఆయనపై విమర్శలు చేయడాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఖండించారు. కార్యక్రమానికి ప్రణబ్‌ను ఎందుకు పిలిచారు' అనే అంశం పై చర్చ ప్రయోజనం లేదని భగవత్‌ అన్నారు. సంఘ్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలంటే భారత పౌరులు అయితే చాలని భగవత్‌ క్లారిటీ ఇచ్చారు. రాజకీయ సిద్ధాంతాల్లో వైరుధ్యం ఉన్నంతమాత్రాన ఉన్నతవ్యక్తులను వ్యతిరేకించలేమన్నారు. ఒకే లక్ష్యం కోసం వివిధ మార్గాల్లో ప్రయత్నించేవారిని ఆయా మార్గాల్లోనే వెళ్లనివ్వాలని కూడా భగవత్‌ వ్యాఖ్యానించడం విశేషం. కాగా ప్రణబ్‌ముఖర్జీ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకమ్రంలో పాల్గొనడం చర్చనీయాంశం అయింది. పలువురు కాంగ్రెస్‌ నేతలతోపాటు ప్రణబ్‌ కుమార్తె శర్మిష్ఠకూడా విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రణబ్‌వ్యక్తి త్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు తమ రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుంటాయని ట్విటర్‌లో ఆందోళన వ్యక్తం చేశారు.

07:04 - June 8, 2018

హైదరాబాద్ : తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు పోటీ పడుతున్న వారికి పోలీస్‌శాఖ శుభవార్త చెప్పింది. పోలీసు నియామకాలకు మూడేళ్ల గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఆరేళ్లు వయసును సడలించాలని గత కొన్ని రోజులుగా నిరుద్యోగులుగా ఆందోళనలు చేస్తుండగా... మూడేళ్లు పెంచుతూ పోలీస్‌శాఖ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల వయస్సు సడలింపుతో అనేకమందికి పోలీసు ఉద్యోగ రాతపరీక్షకు అర్హత పొందనున్నారు. 

07:01 - June 8, 2018

సంగారెడ్డి : రసాయన పరిశ్రమల కాలుష్యంతో సంగారెడ్డి జిల్లాలో సగం జనాభా అతలాకుతలం అవుతోంది. పరిశ్రమలు వెదజల్లే జాల వాయువు కాలుష్యంతో ప్రజలు రోగాల భారిన పడుతున్నారు. వీటికి తోడు మరో పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిపై సంగారెడ్డి జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే మూడు పరిశ్రమలు వచ్చిపడ్డాయి. వీటి వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుయ్యాయా అంటే పెద్దగా ఏమీ ఒరగలేదు. పైగా ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చిన అధికారులు మాత్రం చేతులు దులుపేసుకుంటున్నారు. కనీసం నిఘా లేక పోవడంతో పరిశ్రమ యాజమాన్యం అడిందే ఆటాగా పాడిందే పాటగా కొండాపూర్ మండలం మాల్కాపూర్ లో పాత టైర్ల కంపెనీలు వెదజల్లే కాలుష్యంతో ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది. పంటలు కూడ పండని పరిస్థితి ఏర్పండి. ఇప్పుడు వీటికి తోడు పక్కనే ఉన్న సదాశివపేట మండలం మద్ధికుంటలో AVR రసాయన పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండటంతో ఇక్కడ ప్రజలు హడలిపోతున్నారు.

ఈ పరిశ్రమ ఏర్పాటుకు మార్చి 28న ప్రజాభిప్రాయ సేకరణకు పూనుకున్నారు. అయితే అనివార్యకారనలతో వాయిదా పడింది. ఈ నెల 8న కలెక్టర్ అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమౌతున్నారు అధికారులు. రూ.250 కోట్ల వ్యయంతో 112 ఎకరాల్లో AVR రసాయన పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఈ రసాయన పరిశ్రమ వార్షిక ఉత్పత్తి లక్ష్యం 1528 మెట్రిక్ టన్నులు. ఈ ఫార్మా కంపెనీలను ఒకచోటు నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తుంటే... ఈ కంపెనీ యాజమానులు పట్టుబట్టి ఇక్కడే ఎందుకు నెలకొల్పుతున్నారు? అన్నది ఇక్కడి ప్రజల ప్రశ్న. ఎట్టి పరిస్థితిల్లో ఇక్కడ కంపెనీ ఏర్పాటుకు ఒప్పుకోబోమని స్థానికులు తేల్చి బెబుతున్నారు. పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాలు మెరుగువ్వాలనే ఎవరైనా కోరుకుంటారు...కానీ కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు వద్దంటే వద్దంటున్నారు సంగారెడ్డి జిల్లా ప్రజలు. ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని స్పష్టం చేప్తున్నారు.

06:46 - June 8, 2018

విశాఖపట్టణం : మన్యంలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సరదా కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎంతటివారినైనా నిలదీస్తానన్నారు. డెబ్భై సంవత్సరాల స్వాతంత్ర్య భారతంలో గిరిజనులు కనీస మౌలిక వసతులకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపార్టీ అధికారంలోకి వస్తే సుపరిపాలన అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారు జనసేనాని.

తన ప్రజాపోరు అవినీతి వ్యవస్థ మీదేనన్నారు జనసేన అధినేత. ఈ దోపిడి వ్యవస్థ మీద పోరాటం చేయాలని తాను చిన్ననాడే నిర్ణయించుకున్నానని తెలిపారు. దొపిడీ చేసేవాళ్లకే రాజ్యం భోజ్యంగా మారిందన్నారు. ఉత్తరాంధ్రలో గిరిజనులకు ఉపాధి అవకాశాలు లేక గంజాయి రవాణాకు కూడా సిద్ధపడుతున్నారని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా లేదంటూనే అక్రమ ఇసుక రవాణాను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. పాలకులకు కోట్లాది రూపాయాల్ని దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ గిరిజనుల బాధలను తీర్చడంలో లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబడిన ప్రాంతాలుగా మిగిలిపోయాయ్నారు.

టీడీపీ, బీజేపీలకు ప్రజల బాధలు పడ్డడం లేదన్నారు పవన్‌ కల్యాణ్‌. గత నాలుగేళ్లలో గిరిజనులకు ప్రభుత్వం చేసిన మేలు ఏదైనా ఉందా అని జనసేనాని ప్రశ్నించారు. బాక్సైట్‌ ఖనిజాన్ని గిరిజనుల అనుమతితోనే తీయాలని... లేకుంటే వారి తరపున తాను పోరాటం చేస్తానంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో తాను టీడీపీకి ప్రచారం చేసినప్పటికి ఎటువంటి మంత్రి పదవి అశించలేదని, కాంట్రాక్టులు కోరలేదన్నారు. రాష్ట్రంలో మంచి నీళ్ల కంటే మద్యమే సులభంగా దొరుకుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధికారంలోకి వస్తే... సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు పవన్‌కల్యాణ్‌.

ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా టీడీపీ, బీజేపీ, వైసీపీలపై తీవ్రస్థాయిలో విమర్శల దాడి పెంచారు పవన్‌కల్యాణ్‌. ప్రజలను దోచుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే ఆ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని... రాబోయే ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓటును సరైన రీతిలో ఉపయోగించి దోపిడీ దారుకలు గుణపాఠం చెప్పాలని పిలుపు నిస్తున్నారు. పవన్‌ వెంట యువత పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో పోరాట యాత్ర కోలాహలంగా సాగుతోంది. 

06:43 - June 8, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసులపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌గా స్పందించారు. ఉద్యోగాలు పోగొట్టు కోవాలనుకుంటే సమ్మెకు వెళ్లాలని ఘాటుగా హెచ్చరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టీఎస్‌ఆర్టీసీ కార్మికులకు 44శాతం జీతాలు పెంచామన్నారు. అయినా సమ్మెకు వెళ్లతామంటున్నారని సీఎం మండిపడ్డారు. ఆర్టీసీలో సమ్మెలను నిషేధించామని.. అనవసరంగా సమస్యల్లో చిక్కుకోవద్దని కార్మకులకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు సీఎం కేసీఆర్.

ప్రభుత్వ రంగ సంస్ధలను కాపాడటమే ధ్యేయంగా పెట్టుకుని రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందన్న కేసీఆర్‌.. ఆర్టీసీని కాపాడ్డానికి పలు ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు. టీఎస్‌ఆర్టీసీ దాదాపు 3వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయి ఉందన్నారు. అప్పులపై ఏటా 250 కోట్ల రూపాయలు వడ్డీనే చెల్లిస్తున్నామన్నారు. అయినా సాలీనా రూ.700 కోట్ల నష్టాలను సంస్థ మూటగట్టుకుంటోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇపుడు సమ్మెకు వెళితే సంస్థపై మరో 1400 కోట్ల భారం పడుతుందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. 25శాతం ఆర్‌ఐ, 50శాతం ఫిట్‌మెంట్‌ అంటూ కార్మిక సంఘాలు అసంబద్ధమైన డిమాండ్లు చేస్తున్నాయని కేసీఆర్‌ మండిపడ్డారు. సంస్థల నష్టాల్లో ఉండగా సమ్మెకు పోయి కార్మికుల గొంతుకోసేకంటే సంస్థను ఎలా బాగుచేసుకోవాలో యూనియన్లు ఆలోచించాలన్నారు.

అసలు దేశవ్యాప్తంగా ఏరాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెరిగాయన్నారు. రెండేళ్ల కిందట 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన సందర్భంగా సంస్థను లాభాలలో నడిపించాలని యూనియన్లకు చెప్పినా.. ఫలితం కనిపించలేదన్నారు. రెండు సంవత్సరాల క్రితం ఆర్టీసీ ఉద్యోగులతో విస్తృత స్థాయి సమావేశం జరినగిపుడు మొత్తం 96 డిపోల్లో 9 మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయని... ఇప్పటికీ ఆ పరిస్థితిలో మార్పు లేదన్నారు. తమిళనాడులో 10 ఆర్టీసీలు, కర్నాటకలో 4, మహారాష్ట్రలో 7, ఇలా ప్రతి రాష్ట్రంలో ఆర్టీసీని విభజించారని, ఇదే పద్దతి తెలంగాణలో కూడా అవలంబిస్తే పరిస్థితుల్లో మార్పు రావచ్చని సీఎం అభిప్రాయపడ్డారు.

ఆర్టీసీలో సమ్మె చేయడాన్ని నిషేధించినా ..కొందరు తమ స్వలాభం కోసం సమ్మె నోటీసు ఇవ్వడంలోని ఔచిత్యాన్ని ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలన్నారు సీఎం కేసీఆర్‌. సమ్మెలో పాల్గోంటే తక్షణమే ఉద్యోగాలనుంచి తొలగించాల్సి వస్తుందని సీఎం హెచ్చరించడంపై ఇపుడు కార్మికుల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. కష్టాల్లో ఉన్నాం ఆదుకోవాలని కోరితే సిఎం ఇలా ఉద్యోగానికే ఎసరు పెడుతున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

టుడే పవన్ షెడ్యూల్...

విశాఖపట్టణం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 11గంటలకు పాయకరావుపేటలో ఇటీవలే మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబీకులను పరామర్శించనున్నారు. అనంతరం పాయకరావుపేటలో నిర్వహించే బహిరంగబసభలో ప్రసంగించనున్నారు. యలమంచిలి సాయంత్రం మూడు గంటలకు బస్టాండు సెంటర్ వద్ద సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. 

భారత బలగాలపై ఉగ్ర దాడి...

జమ్మూ కాశ్మీర్ : కుప్వార జిల్లాలోని హర్లీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భారత బలగాలపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

కార్మిక సంఘాలతో మంత్రి మహేందర్ రెడ్డి సమావేశం...

హైదరాబాద్ : నేడు ఆర్టీసీ యాజమాన్యం..కార్మిక సంఘాలతో మంత్రి మహేందర్ రెడ్డి సమావేశం జరుగనుంది. ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాల నేతలతో చర్చించనున్నారు.

 

ఆగస్టు 15న జనసేన మేనిఫెస్టో...

విజయవాడ : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌... పార్టీ మేనిఫెస్టోపై కసరత్తు స్టార్ట్ చేశారు. యాత్రలో తన దృష్టికి వచ్చిన అంశాలను ఒక్కొక్కటిగా నోట్ చేసుకుంటున్న పవన్ వాటినే ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టనున్నారు. స్థూలంగా జనసేన మేనిఫెస్టోలో ఏ కీలకాంశాలు ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. పార్టీ మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టి సారించారు. ఆగస్టు 15 నాటికి మేనిఫెస్టో రిలీజ్‌ చేస్తానన్న పవన్‌.. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. 

పోలీసు నియామకాలకు గడువు పెంపు...

హైదరాబాద్ : తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు పోటీ పడుతున్న వారికి పోలీస్‌శాఖ శుభవార్త చెప్పింది. పోలీసు నియామకాలకు మూడేళ్ల గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఆరేళ్లు వయసును సడలించాలని గత కొన్ని రోజులుగా నిరుద్యోగులుగా ఆందోళనలు చేస్తుండగా... మూడేళ్లు పెంచుతూ పోలీస్‌శాఖ నిర్ణయం తీసుకుంది. 

బీజేపీ గడ్డు పరిస్థితులు...

ఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇంతకాలం ఆపార్టీకి మిత్రులుగా ఉన్నవారు పరమ శత్రువులుగా మారి పోతున్నారు. మిత్ర పక్షాలన్నీ ఎన్డీయేని వదిలిపెట్టే క్రమంలో సాగుతుండడంతో.. బీజేపీ ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అమిత్‌షా రాజీ ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి. దీంతో బీజేపీ అధినాయకత్వం కింకర్తవ్యం అంటూ.. మల్లగుల్లాలు పడుతోంది. 

సుప్రీంలో శరద్ యాదవ్ కు ఎదురు దెబ్బ...

ఢిల్లీ : జెడియూ మాజీ నేత శరద్‌యాదవ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ నుంచి అనర్హత వేటుకు గురైన ఆయనకు ప్రస్తుతం లభిస్తున్న వేతనం, అలవెన్స్‌లు, ఇతర సదుపాయాలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ ఈ తీర్పు చెప్పింది. 

విస్తరించిన నైరుతి రుతుపవనాలు...

ఢిల్లీ : నైరుతి రుతుపవనాలు దక్షిణాదిన మరింత విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే రెండు రోజుల్లో ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.

పాక్ ను హెచ్చరించిన అమెరికా...

ఢిల్లీ : ఉగ్రవాదంపై చర్యలు చేపట్టాలని పాకిస్తాన్‌ను అమెరికా మరోసారి హెచ్చరించింది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపివో పాకిస్తాన్‌ సైన్యాధ్యక్షుడు జనరల్‌ కమర్‌ బాజ్వాతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Don't Miss