Activities calendar

09 June 2018

22:00 - June 9, 2018

ఇఫ్తార్ దావతు మాలయ ముస్లీంలు..దశాబ్దాలుగా ముస్లింలకు మోసమే, బారాపర్సెంట్ రిజర్వేషనేదంటున్న ఉత్తం..మీరు ఎన్ని సీట్లిచ్చిండ్రయ్యా నాలుగేగా ??, నీరుగారి పోతున్నటీడీపీ నిర్మాణ దీక్షలు..బాబు ప్రసంగాన్ని ఎక్కిరిస్తున్న కుర్చీలు, జనంలకు వోలేకపోతున్న జన సమితి పార్టీ..దూకుడు వెంచకుంటే కష్టమే అంటున్నరు, ఆర్మూరు నియోజకవర్గంలో బీసీల గోస.. ఓట్లు బీసీలయి.. సీట్లు మాత్రం ఓసీలయి, తెల్గు రాష్ట్రాలను పల్కరిస్తున్న తొలకరి.. ఈసారి బాగ వానలు వడ్తయంటున్నరు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

21:30 - June 9, 2018

హైదరాబాద్ : పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ప్రజా సంఘాలు నిరసనతో హోరెత్తించాయి. పెరిగిన ధరలకు నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాయి. కేంద్రం ఇష్టారీతిన ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ధరలను వెంటనే తగ్గించాలని...లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడంపై ప్రజా, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించాయి. 
అనంతపురంలో 
అనంతపురంలో వామపక్షాలు రోడ్డెక్కాయి. పెట్రో మంటను తగ్గించాలంటూ నగరంలోని టవర్‌ క్లాక్‌ సమీపంలోని ఓవర్‌ బ్రిడ్జి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. వామపక్షాల నిరసనకు జనసేన, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. వామపక్షాలు పరిపాలిస్తున్న కేరళ రాష్ట్రంలో పెట్రోల్‌ ధరలపై పన్నులు మినహాయించి ప్రజలకు ఊరట కలిగించారని గుర్తు చేశారు నేతలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించాయి. 
విజయవాడలో
విజయవాడలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా వామపక్షాలు ఆందోళనకు దిగాయి. పాతబస్టాండ్ వద్ద సీపీఎం, సీపీఐ నేతలు ధర్నాకు దిగారు. పెట్రోల, డీజిల్‌ ధరలు తగ్గించేంతవరకు పోరాటం చేస్తామని సీపీఎం మధు అన్నారు. పెంచిన వంట గ్యాస్‌ ధరలు తగ్గించాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.
కడపలో 
కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు పెట్రోల్ డీజల్ ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందని వామపక్ష నేతలు మండిపడ్డారు. పెట్రోల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ కడప నగరంలోని పాతబస్టాండ్ నుండి ఏడురోడ్ల కూడలి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
విజయనగరంలో    
విజయనగరం జిల్లాలోనూ పెట్రో ధరలపై వామపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. జనసేన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు వామపక్ష నేతలు. ఆందోళన నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 
రాజమహేంద్రవరంలో 
పెంచిన పెట్రోల్‌, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ.. రాజమహేంద్రవరంలో మోటర్‌ కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో వామపక్ష నేతలతో కలిసి కార్మిక సంఘాలు రాస్తారోకో చేశాయి. 
అమలాపురంలో 
కేంద్రప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచుతోందని తూర్పుగోదావరి జిల్లా సీపీఎం నాయకులు మండిపడ్డారు. పెంచిన ధరలకు వ్యతిరేకంగా.. అమలాపురంలో వామపక్ష నేతలు, ప్రజాసంఘాలు కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 
నెల్లూరులో
పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద వామపక్షాలు రాస్తారోకో నిర్వహించాయి. ధరలు పెరగడం వల్ల సామాన్య మధ్య తరగతి ప్రజలు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. 
జగిత్యాలలో
తెలంగాణలోనూ పెట్రో ధరలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ధరలను తగ్గించి వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఈ మేరకు జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాయి. ధరలు తగ్గించాలంటూ అంబేద్కర్‌కు వినతిపత్రం అందించారు నేతలు. 
విశాఖలో 
దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ విశాఖ జిల్లా మద్దిలిపాలెం కూడలి వద్ద వామపక్షాలు రాస్తారోకో నిర్వహించాయి. సామాన్యులపై ఎనలేని భారం మోపుతున్న ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు వామపక్ష నేతలు. 
శ్రీకాకుళంలో
శ్రీకాకుళం జిల్లాలో లెఫ్ట్ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. నగరంలోని రామలక్ష్మణ కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించి ధరల పెంపుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నేతలు. అడ్డగోలుగా పెరుగుతోన్న పెట్రోల్‌ ధరలపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ధరలను తగ్గించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజా సంఘాలు హెచ్చరించాయి. 

21:18 - June 9, 2018

గుంటూరు : అగమ్యగోచరంగా ఉన్న రైతాంగానికి మేలు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. రుణమాఫీ చేశామని..ఎరువుల ఖర్చు తగ్గించామన్నారు. లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందని తెలిపారు. నవ నిర్మాణదీక్షలో భాగంగా గ్రామాల్లో పర్యటించానని.. లబ్ధిదారుల అభిప్రాయాలు అడిగి తెలుసున్నానని తెలిపారు. సంక్షేమ పథకాలపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

 

21:01 - June 9, 2018

కర్నూలు : తెలంగాణ-ఏపీ సరిహద్దులో ఇసుక వివాదానికి తెరలేచింది. కర్నూలు జిల్లాలో ఇసుక దోచుకుంటున్న అక్రమార్కులు పోలీస్ అధికారులపైకి సైతం దూసుకొచ్చారు. దీంతో ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఉద్రిక్త పరిస్థితిలు నెలకొంటున్నాయి. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం... 

 

20:55 - June 9, 2018

పశ్చిమగోదావరి : కష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఒడ్డుకు చేర్చాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని అందుకే టీడీపీలో చేరానన్ని రఘురామకృష్ణం రాజు అన్నారు. వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు తగ్గకుండా టీడీపీ సాధిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాఘురామకృష్ణం రాజు టీడీపీలో చేరిన సందర్భంగా 250కార్లతో ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాతం వద్ద పార్టీ కార్యకర్తలు రఘురామ కృష్ణంరాజుకు ఘన స్వాగతం పలికారు.  

 

20:52 - June 9, 2018

పెద్దపల్లి : సుల్తానాబాద్ మండలం.. పూసాల గ్రామంలోని రైస్‌ మిల్లులో ప్రమాదం చోటుచేసుకుంది. మహా లక్ష్మి రైస్ మిల్లులో బాయిలర్ పేలడంతో.. ఒక గోదాం నేలమట్టం అయ్యింది. దీని పక్కనే ఉన్నవరలక్ష్మి రైస్ మిల్లు కూడా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా.. ఐదు కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. పేలుడు శబ్దాలతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. రైస్‌ మిల్లు యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోనందువల్లే... ఈ ప్రమాదం జరింగిందని స్థానికులు విమర్శిస్తున్నారు.

 

20:50 - June 9, 2018

మహారాష్ట్ర : ముంబై  పోర్ట్‌ ఏరియాలోని పటేల్‌ ఛాంబర్స్‌లో ఈ తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బ్రిటిష్‌ కాలంనాటి ఐదు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. ఈ మంటలకు ఐదు అంతస్తుల భవనం ఓ వైపు కూలిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 16ఫైర్‌ ఇంజన్లు, 11 ట్యాంకర్లతో 150 మంది ఫైర్‌ సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇద్దరు ఫైర్‌ సిబ్బంది గాయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. నాలుగేళ్ల క్రితమే ఈ పురాతన భవనాన్ని ఖాళీ చేయించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

 

20:48 - June 9, 2018

భద్రాద్రి కొత్తగూడెం : ఇంటర్మీడియట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షా ఫలితాల్లో కొత్తగూడెం శ్రీ నలంద జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఎంపీసీ విభాగంలో సాజిదా, మేఘన, మేఘల ముగ్గురు విద్యార్థులు స్టేట్‌ ఫస్ట్ మార్కులతో మొదటి స్థానంలో నిలిచారు. బైపీసీ విభాగంలో 437 మార్కులతో సుహిత అనే విద్యార్ధి టాప్‌ ర్యాంకు సాధించారని.. సంస్థ చైర్మన్‌ ఎం.వీ చౌదరి తెలిపారు. 460 పైగా మార్కులు వచ్చిన వారు 23 మందికి ఉన్నారని అన్నారు. 

 

20:37 - June 9, 2018

గుంటూరు : పది సంవత్సరాలు హోదా ఇచ్చిన కోలుకోలేని పర్థితిలో రాష్ట్రంలో ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. గాడి తప్పిన పరిపాలనను గాడిలో పెట్టామని తెలిపారు. తనపై విపక్షాలు బురదజల్లు తున్నారని అన్నారు. తనను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు మీకు ఏం అనుభవం ఉంది...బడ్జెట్ అంటే మీకు తెలుసా..అని జగర్, విపక్షాలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. కష్టపడి డబ్బులు తీసుకుందామంటే బ్యాంకుల్లో డబ్బులు దొరకడం లేదన్నారు. జీఎస్టీ, పెట్రోల్ ధరలు పెరిగిపోయాయని తెలిపారు. 11 కేసులుండి..ప్రతి శుక్రవారం కోర్టు కు వెళ్లే జగన్ తనను విమర్శించడమేంటన్నారు. వీళ్లకు ఒక న్యాయం..అగ్రిగోల్డు బాధితులకు ఒక న్యాయమా..? అని అన్నారు. అగ్రిగోల్డు ఆస్తులను వేలం వేస్తున్నామని తెలిపారు. నీ ఆస్తులు అవినీతి ఆస్తులు కాదా ? దానికి ఎందుకు వర్తించవు అని ప్రశ్నించారు. అవినీతిపరులు సమాజానికి ఎంతో ప్రమాదమన్నారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి..ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఉందన్నారు. ఉన్నతి విద్యలో రాష్ట్రం నెంబర్ వన్, జేఈఈ ఎంట్రన్స్ లో నెంబర్ వన్, నీట్ లో నెంబర్ వన్, టెన్త్ మ్యాథమెటిక్స్ లో నెంబర్ వన్, ప్రాథమిక విద్యలో నెంబర్ 2 అని అన్నారు. హెల్త్ లో అన్ని రాష్ట్రాల కంటే మనమే ముందున్నామని తెలిపారు. మనం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకు పోగలిగితే.. మనం అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటామన్న నమ్మకం తనకు ఉందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం బాగా పని చేసిందని..వారిని అభినందించాలన్నారు. 

ఆర్టీసీ బస్సును ఢీకొన్న కంటైనర్..

తిరుపతి : గడ్డకిందపల్లె సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. ఇద్దరు డ్రైవర్లతోపాటు 15 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను రుయాకు తరలించారు. 

19:45 - June 9, 2018

విజయవాడ : రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అందాలని సీఎం చంద్రబాబు అన్నారు. మెరిట్ ప్రకారం సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయని చెప్పారు. వినూత్న రీతిలో గ్రామ దర్శిని, గ్రామ సభలు నిర్వహించామని...ప్రజల్లో చైతన్యం తేవడానికి ముందుకుపోయామని తెలిపారు. తాను గ్రామాల్లో తిరిగానని...అందరితో ఇంట్రాక్ట్ అయ్యానని తెలిపారు. లబ్ధిదారులతో మాట్లాడానని అన్నారు. నలబై సంవత్సరాల్లో చేసినదానకంటే..నాలుగు సంవత్సరాల్లో చేసిన పనులు పూర్తి సంతృప్తిని ఇచ్చాయని తెలిపారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు వేశామన్నారు. నెల చివరికి కల్ల స్ట్రీట్ లైట్లు అన్ని పూర్తి అవుతాయని తెలిపారు. వీధి దీపాల్లో ఎల్ ఈడీ బల్బులు అమర్చామని తెలిపారు. పేదవారి కళ్లల్లో వెలుగులు చూశానని తెలిపారు. 19 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. అన్ని ఊర్లల్లో తాగునీటి సమస్య పరిష్కరించామని తెలిపారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. అంగన్ వాడీ పిల్లలకు చదువు చెప్పిస్తున్నామని తెలిపారు. 6 వేల స్కూల్స్ లో వర్చువల్ క్లాస్ రూమ్, డిజిటల్ క్లాస్ రూమ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. 
 

మహిళ నుంచి 13 కిలోల బంగారు స్వాధీనం

చెన్నై : దుబాయ్‌ నుండి చెన్నైకు బంగారం స్మగ్లింగ్‌ చేస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కర్నాటకలోని చిక్కమంగలూరుకు చెందిన పద్మ అనే మహిళను విమానాశ్రయ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ వద్ద నుండి 4 కోట్ల విలువ చేసే 13 కిలోల బంగారు చైన్లు స్వాధీనం చేసుకున్నారు.

 

19:11 - June 9, 2018

చెన్నై : దుబాయ్‌ నుండి చెన్నైకు బంగారం స్మగ్లింగ్‌ చేస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కర్నాటకలోని చిక్కమంగలూరుకు చెందిన పద్మ అనే మహిళను విమానాశ్రయ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ వద్ద నుండి 4 కోట్ల విలువ చేసే 13 కిలోల బంగారు చైన్లు స్వాధీనం చేసుకున్నారు.

 

19:08 - June 9, 2018

కడప : టీడీపీ ఎంపీ  సీఎం రమేష్‌పై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపజిల్లాలో టీడీపీ గెలుచే చోట కూడా గెలవకుండా చేస్తున్నావంటూ వరదరాజులరెడ్డి మండిపడ్డారు. నామినేటెడ్‌ పదవులతో పబ్బం గడుపుకునే నీకు వర్గ రాజకీయాలు ఎందుకంటూ సీఎం రమేష్‌ను ప్రశ్నించారు. పంచాయతీకి ఎక్కువ- మండలానికి తక్కువ అంటూ మండిపడ్డారు. పెన్నా కాంట్రాక్ట్‌ పనుల్లో నీకు 5 శాతం కమీషన్‌ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. బ్యాంకులకు తప్పుడు పత్రాలు ఇచ్చి భారీగా రుణాలు తీసుకున్నావని విమర్శించారు. ప్రొద్దుటూరు అభివృద్ధిని దెబ్బతీశావంటూ సీఎం రమేష్‌పై వరదరాజులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

ఐనవోలు మల్లన్న ఆలయంలో సిబ్బంది చేతివాటం

వరంగల్‌ అర్బన్‌ : ఐనవోలు మల్లన్న ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. గుడిలో లైట్లు, సీసీ కెమెరాలు నిలిపేసి చోరీలకు పాల్పడ్డాడు. ఇలా దొంగతనం చేస్తూ.. ఓ పూజారి  కెమెరాకు చిక్కారు. 7న లెక్కింపు ఉండగా.. 5వ తేదీనే  చోరీకి దిగాడు. తెల్లవారుజామున 3:36కు ఒంటరిగా గర్భగుడి తలుపులు తెరిచిన అర్చకుడు.. ఏదో తీసుకెళ్తున్నట్లు కెమెరాలో రికార్డ్‌ అయ్యింది.

టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌పై మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఫైర్‌

కడప : టీడీపీ ఎంపీ  సీఎం రమేష్‌పై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపజిల్లాలో టీడీపీ గెలుచే చోట కూడా గెలవకుండా చేస్తున్నావంటూ వరదరాజులరెడ్డి మండిపడ్డారు. నామినేటెడ్‌ పదవులతో పబ్బం గడుపుకునే నీకు వర్గ రాజకీయాలు ఎందుకంటూ సీఎం రమేష్‌ను ప్రశ్నించారు. 

18:51 - June 9, 2018

జగిత్యాల : పోలీసులు అంటే జనం భయపడే రోజులు మారాయి. క్రమంగా స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతోంది. శాంతి భద్రతల పరిరక్షణలోనే కాదు ప్రజా సేవలో కూడా ముందుంటాం అంటున్నారు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి డివిజన్‌ పోలీసులు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను ఇచ్చి.. వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపుతూ... ఫ్రెండ్లి పోలీసులు అనిపించుకుంటున్నారు.

జగిత్యాల జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌, మెట్‌పల్లి డీఎస్పీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో  పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటు యువతకు ఈ ఉచిత శిక్షణ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఉద్యోగాల కోసం ప్రయత్నించే 120 మంది యువతకు మెట్‌లపల్లి పట్టణంలోని మినీ స్టేడియంలో ఐదుగురు పీఈటీలతో శిక్షణ ఇప్పిస్తున్నారు పోలీసులు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు రన్నింగ్‌, హై జంప్‌, లాంగ్‌ జంప్‌, షాట్‌పుట్‌ పోటీలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిపుణులతోప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ తీసుకునే యువతీ, యువకులకు దుస్తులు, షూతో పాటు మూడుపూటల భోజనం అందిస్తున్నారు.

కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఉచిత శిక్షణ వరంగా మారిందని యువతీ, యువకులు అంటున్నారు.  బయట ప్రైవెట్‌ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందాలంటే  సుమారుగా ఇరవై వేల నుంచి మూప్పై వేల వరకు  ఫీజులు వసూలు చేస్తున్నారని, అదనపు ఖర్చులు కూడా అధికం అని అంటున్నారు. పోలీసులు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణపై  నిరుద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. పట్టణంతో పాటు వివిద గ్రామాల నుంచి యువత తరలివచ్చి పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు.

18:50 - June 9, 2018

రంగారెడ్డి : కుత్బుల్లాపూర్‌ దుండిగల్‌ పోలీస్‌ ష్టేషన్‌ పరిధిలోని బౌరంపేట ఇందిరమ్మ గృహంలో విషాదం చోటుచేసుకుంది. సత్యవతి అనే 12 ఏళ్ల బాలిక అనుమనాస్పదంగా మృతి చెందింది. బౌరంపేట ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక ఫ్యాన్‌కు ఉరివేసిఉంది. బాలికను ఎవరైనా చంపి ఉరివేశారా.. లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సత్యవతి మరణానికి గల కారణాలను పోలీసులతో పాటు క్లూస్‌ టీం దర్యాప్తు చేస్తోంది. పోస్టుమార్టం తరువాత పూర్తి సమాచారం తెలుస్తుందని పోలీసులు అన్నారు. 

 

18:41 - June 9, 2018

గుంటూరు : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అవగాహన లేకుండా ఎవరో రాసిన స్క్రిప్ట్‌ చదువుతున్నారని టీడీపీ రూరల్‌ అధ్యక్షుడు, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు 6 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్టు తన పై చేసిన ఆరోపణలను 15 రోజులలో ఆధారాలతో సహా నిరూపించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే 15 రోజుల తర్వాత పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.  తాను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసంక్షేమం కోసమేనని అన్నారు. 

 

18:37 - June 9, 2018

విజయవాడ : అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము లేక రోడ్లపై నోటికొచ్చినట్లు అబద్ధాలు మాట్లాడుతున్నాడని జగన్‌ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పది సంవత్సరాల కాంగ్రెస్‌ పాలనలో పోలవరం ప్రాజెక్ట్ కోసం 10 గ్రామాలను ఖాళీ చేయించలేకపోయారన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై విచారణ చేయాలని జగన్‌ అనడాన్ని దేవినేని తప్పుబట్టారు.

 

18:12 - June 9, 2018

హైదరాబాద్ : ఎన్నో ఉద్యమాలు త్యాగాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు అన్నిచోట్లా నిరాశే ఎదురైందని తెలంగాణ జనసమితి వ్యవస్ధాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.. హైదారాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు,.. వయోపరిమితిపై సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ నలుమూల నుంచి భారీ సంఖ్యలో విద్యార్ధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విషయంలో ప్రభుత్వం వయోపరిమితిని పెంచితే.... పేద నిరుద్యోగులకు ఉపయోగంగా ఉంటుందని కోదండరామ్ అభిప్రాయపడ్డారు..

 

17:49 - June 9, 2018

విశాఖ : కేంద్ర ప్రభుత్వం తినే తిండిపైన కూడా ఆంక్షలు పెడుతుందని మాజీ ఎంపీ మిడియం బాబురావు మండిపడ్డారు. విశాఖలో నిర్వహించిన దళిత ఆదివాసీ సమతా జాతీయ సెమినార్ లో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఇంటికి ఒక అతిథి వస్తే మంచి పెయ్య దూడను కోసి వారికి సంతృప్తికరంగా భోజనం పెట్టమని శ్లోకం చెబుతుందన్నారు. 'ఆవు మాంసం నీవు తిన్నప్పుడేమో అది రైటా ? మేము తింటే తప్పా... ఇదెక్కడి సిద్ధాంతమని..ఇది లౌకికరాజ్యమా ? అని అన్నారు. మనం ఏం తినాలో తేల్చుకునే హక్కు మనకు లేదా..? ఏ దేవున్ని పూజించుకోవాలో మనం హక్కు లేదా.? అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు పూర్తిగా తొలగించాలని ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. దానికి ముందు షరతుగా రిజర్వేషన్లు అమలు కాకుండా చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. అర్హత లేనటువంటి బోయలను ఏ రకంగా ఎస్టీలో కలుపుతారని ప్రశ్నించారు. బోయలను ఎస్టీలో చేర్చేందుకు కావాల్సిన ఐదు అంశాల్లో ఏ ఒక్కటి బోయలకు లేదని 2010లో సుబ్రమణ్యం కమిటీ చెప్పిందని గుర్తు చేశారు. ప్రత్యేకభాష , 
పోడు వ్యవసాయం, ప్రత్యేక సంస్కృతి సంప్రాదాయాలు, ప్రాథమిక ఉత్పత్తి పద్ధతులు వాళ్ల దగ్గర లేవు, వారు నాగరిక ప్రపంచానికి దూరంగా కొండల్లో, కోనల్లో లేరు అని చెప్పిందన్నారు. ఏ క్రెడిటేరియా సరిపోని వాళ్లు బీసీ..ఏలోనే అర్హులని ఆ రోజు కమిటీ చెప్తే ఇప్పుడు నీ తొత్తుల చేత లేనిపోని ఒక నివేదిక తెచ్చి... నిండు శాసన సభను తప్పుదోవపట్టించి..తీసుకెళ్లి వారిని ఎస్టీలో చేర్చారని తెలిపారు. ఎస్టీలో చేర్చేందుకు బోయలకు ఎలాంటి అర్హత లేదన్నారు. 

 

తిరుపతిలో పీఠాధిపతులు సమావేశం..

చిత్తూరు : తిరుపతిలో పీఠాధిపతులు సమావేశమయ్యారు. తిరుమల పవిత్రతను, స్వామివారి కీర్తిని మరింత పెంచేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు పీఠాధిపతులు తెలిపారు. టీటీడీలో ధార్మిక మండలిని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అనువంశిక అర్చకులకు పదవీ విరమణ లేదన్న పీఠాధిపతులు.. రమణదీక్షితులుపై కక్షసాధింపు సరికాదన్నారు. సిట్టింగ్‌ జడ్జితో కమిటీ వేసి శ్రీవారి ఆభరణాలు లెక్కించాలని పీఠాధిపతులు డిమాండ్‌ చేశారు.

ముంబైలో భారీ వర్షాలు

ముంబై : నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై మోకాళ్ల లోతువరకు నీరు నిలిచి ఉండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాతావరణం సరిగా లేకపోవడం వల్ల విమానాలను దారి మళ్లిస్తున్నారు.  మూడు విమానాలను రద్దు చేయగా... మరో 32 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 

16:45 - June 9, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ పాలనపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ సామాజిక న్యాయాన్ని పాతరేశారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్న తెలంగాణ.. ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పాటైతే... సామాజిక న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరూ నమ్మారని ఆయన అన్నారు. మౌళిక హక్కులు గానీ.. ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. ముఖ్యంగా బీసీల పరిస్థితి రెంటికి చెడ్డ రేవుగా మారిందన్నారు. 

 

16:41 - June 9, 2018

చిత్తూరు : తిరుపతిలో పీఠాధిపతులు సమావేశమయ్యారు. తిరుమల పవిత్రతను, స్వామివారి కీర్తిని మరింత పెంచేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు పీఠాధిపతులు తెలిపారు. టీటీడీలో ధార్మిక మండలిని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అనువంశిక అర్చకులకు పదవీ విరమణ లేదన్న పీఠాధిపతులు.. రమణదీక్షితులుపై కక్షసాధింపు సరికాదన్నారు. సిట్టింగ్‌ జడ్జితో కమిటీ వేసి శ్రీవారి ఆభరణాలు లెక్కించాలని పీఠాధిపతులు డిమాండ్‌ చేశారు. టీటీడీలో జరుగుతున్న పరిణామాలు హిందువులను బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ నిధులను ధార్మిక సంస్థలకే కేటాయించాలని పీఠాధిపతులు డిమాండ్‌ చేశారు. త్వరలో అమరావతిలో పీఠాధిపతుల సమావేశం నిర్వహిస్తామన్నారు. తమ నిర్ణయాలను ప్రభుత్వాన్ని కలిసి వివరిస్తామని పీఠాధిపతులు తెలిపారు. 

 

16:33 - June 9, 2018

హైదరాబాద్ : భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలో ఉచిత డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను ప్రారంభంచామని మంత్రి కేటీఆర్ అన్నారు. మానవీయ కోణంలో తెలంగాణ వైద్య శాఖ నడుస్తుందని కొనియాడారు. ఈ మేరకు హైదరాబాద్‌లో తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. త్వరలోనే ఈ సేవలను జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న వసతులు ప్రైవేటులో కూడాలేవని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణలో వైద్య సేవలను పేదలకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. త్వరలోనే డయాగ్నోస్టిక్‌ సెంటర్లను ప్రతి జిల్లాకు విస్తరిస్తామని చెప్పారు.

 

16:32 - June 9, 2018

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోది హత్యకు మావోయిస్టులు ప్రణాళిక రచించారా? భీమా కొరెగావ్ హింస కేసులో పోలీసులు కోర్టు ప్రవేశ పెట్టిన ఓ లేఖను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు ఔననే సమాధానం వస్తోంది. అయితే పూణే పోలీసులు విడుదల చేసిన లేఖలో విరసం నేత వరవరరావు పేరు వినిపించడం కలకలం రేపుతోంది. అయితే ఈ కుట్రకు తనకు ఎలాంటి సంబంధమూ లేదంటున్నారు. ఎస్వీకేలో ప్రజాసంఘాలు, న్యాయవాదుల సంఘం సమావేశంలో ఆయన పాల్గొని,  మాట్లాడారు. మోదీపై హత్య కుట్ర పేరుతో అరెస్ట్‌ చేసిన పౌరహక్కుల సంఘం నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 

16:20 - June 9, 2018

తూర్పుగోదావరి : కేంద్రప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచుతుందని తూర్పుగోదావరి జిల్లా సీపీఎం నాయకులు మండిపడ్డారు. పెంచిన ధరలకు వ్యతిరేకంగా.. అమలాపురంలో వామపక్ష నేతలు, ప్రజాసంఘాలు కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయాంలో పెట్రోల్‌ ధరలు పెరిగితే అన్యాయమంటూ నిరసనలు చేసిన బీజేపీ నేతలు ఇప్పుడేలా ధరలు పెంచుతున్నారని ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని నాయకులు డిమాండ్‌ చేశారు. పెంచిన ధరలు తగ్గించకుంటే బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడతారని నాయకులు అన్నారు.

 

16:17 - June 9, 2018

రాజమహేంద్రవరం : పెంచిన పెట్రోల్‌, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ.. రాజమహేంద్రవరంలో మోటర్‌ కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో వామపక్ష నేతలతో కలిసి కార్మిక సంఘాలు రాస్తారోకో చేశాయి. ప్రభుత్వాలు పన్నుల భారం మోపుతూ.. సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. పెంచిన ధరలను తగ్గించకుంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

16:15 - June 9, 2018

నెల్లూరు : పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద వామపక్షాలు రాస్తారోకో నిర్వహించాయి. ధరలు పెరగడం వల్ల సామాన్య మధ్య తరగతి ప్రజలు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. వామపక్షాల రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ విషయంపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... ~

16:08 - June 9, 2018

ముంబై : నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై మోకాళ్ల లోతువరకు నీరు నిలిచి ఉండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాతావరణం సరిగా లేకపోవడం వల్ల విమానాలను దారి మళ్లిస్తున్నారు.  మూడు విమానాలను రద్దు చేయగా... మరో 32 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గత 24 గంటల్లో కొలాబాలో 38.2, శాంతాక్రూజ్‌లో 33 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబైతో పాటు పరిసర పట్టణాల్లో అధికారులు  హై అలర్ట్‌ ప్రకటించారు.  ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని సూచించారు. వాహనదారులు రోడ్లపై జాగ్రత్తగా వెళ్లాలని ముంబై పోలీసులు ప్రజలకు సూచించారు. . భారీ వర్ష సూచనతో బొంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ శని, ఆదివారాల్లో అధికారుల సెలవులను రద్దు చేసింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచింది. వచ్చే 24 గంటల్లో ముంబై తీర ప్రాంతంతో పాటు కేరళ, లక్ష్యద్వీప్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 

13:08 - June 9, 2018

విజయవాడ : పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుకు నిరసనగా ఈరోజు విజయవాడలో పాతబస్టాండ్ వద్ద సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆదాయాన్ని పెంచుకునేందుకు అదనంగా వసూలుచేస్తున్నాయని..సీపీఎం మధు విమర్శించారు. పాకిస్థాన్ లో పెట్రోలు లీటరు రూ.25 విక్రయిస్తుంటే ఇండియాలో మాత్రం రూ.84 ఏమిటనీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పోయేకాలం వచ్చిందని సీపీఎం కార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్ , వంటగ్యాస్ ధరలు తగ్గించేంత వరకూ తమ పోరాటాలను కొనసాగిస్తామని స్పష్టంచేశారు. పెంచిన ధరలు తగ్గించకుంటే ప్రతిఘటన తప్పదని వామపక్షాలు హెచ్చరించాయి. సామాన్యుల జేబులు కొల్లగొట్టి ప్రభుత్వాలు బొక్కసాలు నింపుకుంటున్నాయని విమర్శించారు. ఈ అంశంపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతు..రూపాయలు పెంచుతున్నారు. పైసలు తగ్గిస్తున్నారని ఆరోపించారు. 27వ తేదీనాడు ఈ అంశంపై పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉదృతం చేస్తామని తెలిపారు. 

కుమార్తెలతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నం..

గుంటూరు : జంగారెడ్డిపల్లె చెరువులో పెను విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమార్తెలతో సహా తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన జరిగింది. కుమార్తెలు అడయోగేశ్వరి, కుసుమిత లతో కలిసి చంద్రశేఖర్ అనే వ్యక్తి పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కుమార్తెలు ఇద్దరు మృతి చెందారు. చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా వుంది. తెల్లవారుఝామున కుమార్తెలిద్దరినీ లేపి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. 

కుమార్తెలతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నం..

గుంటూరు : జంగారెడ్డిపల్లె చెరువులో పెను విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమార్తెలతో సహా తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన జరిగింది. కుమార్తెలు అడయోగేశ్వరి, కుసుమిత లతో కలిసి చంద్రశేఖర్ అనే వ్యక్తి పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కుమార్తెలు ఇద్దరు మృతి చెందారు. చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా వుంది. తెల్లవారుఝామున కుమార్తెలిద్దరినీ లేపి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. 

కుమార్తెలతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నం..

గుంటూరు : జంగారెడ్డిపల్లె చెరువులో పెను విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమార్తెలతో సహా తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన జరిగింది. కుమార్తెలు అడయోగేశ్వరి, కుసుమిత లతో కలిసి చంద్రశేఖర్ అనే వ్యక్తి పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కుమార్తెలు ఇద్దరు మృతి చెందారు. చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా వుంది. తెల్లవారుఝామున కుమార్తెలిద్దరినీ లేపి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. 

కుమార్తెలతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నం..

గుంటూరు : జంగారెడ్డిపల్లె చెరువులో పెను విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమార్తెలతో సహా తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన జరిగింది. కుమార్తెలు అడయోగేశ్వరి, కుసుమిత లతో కలిసి చంద్రశేఖర్ అనే వ్యక్తి పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కుమార్తెలు ఇద్దరు మృతి చెందారు. చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా వుంది. తెల్లవారుఝామున కుమార్తెలిద్దరినీ లేపి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. 

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పలు వాహనాలు సీజ్..

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడిపిన 100 మందిపై కేసులు నమోదు చేశారు. 36 కార్లు, 61 బైకులు, 3 ఆటోలను సీజ్ చేశారు.  

Don't Miss