Activities calendar

10 June 2018

21:52 - June 10, 2018

ఢిల్లీ : వారిద్దరిదీ విచిత్రమైన మనస్థత్వమే. తెంపరితనం, మొండి వైఖరి ఇద్దరికీ ఎక్కువే. ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగించిన దేశాధ్యక్షులు. ఒకరు ప్రపంచాన్నే శాసించగల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అయితే మరొకరు అణు పరీక్షలతో ప్రపంచాన్నే బెంబేలెత్తిస్తున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌. అలాంటి వీరు మంగళవారం సింగపూర్‌లో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి సమావేశంపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.  

ప్రపంచాన్నే శాసించగల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.... అణు పరీక్షలతో ప్రపంచాన్నే బెంబేలెత్తిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌లు భేటీ కానున్నారు. ఇంతకు ముందు వరకు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకున్న వీరు ఇప్పుడు అణు చర్చలకు సిద్ధమయ్యారు. సింగపూర్‌ వేదికగా మంగళవారం జరగబోతున్న ఈ భేటీపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.  

అయితే ప్రపంచ శాంతి కాంక్షించడం వల్లనే ఉత్తరకొరియాతో చర్చలకు సిద్ధమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఈ విషయంలో కిమ్‌ శ్రద్ధ వహించకపోతే ఎంతకైనా వెనకాడబోమన్నారు. కిమ్‌ అంతరంగాన్ని కొంత సమయంలోనే అంచనావేస్తానన్న ట్రంప్‌....కిమ్‌ ఆలోచన ధోరణి మారకపోతే సమావేశాన్ని మధ్యలోనే బహిష్కరిస్తానని తెలిపారు. ఈ భేటీ కిమ్‌కు ఏకైక అవకాశమని....ఇలాంటి అవకాశం తిరిగి రాదన్నారు. చర్చల సందర్భంగా సింగపూర్‌ చేరుకున్న ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు సింగపూర్‌ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌ స్వాగతం పలికారు.

కెనెడాలో జీ7 దేశాల సదస్సు వాడీ వేడీగా ముగిసింది. స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై సుంకాల పెంపును వ్యతిరేకిస్తున్న తన వైఖరి మారదని ట్రంప్‌ స్పష్టం చేశారు. దీంతో అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా అమెరికా ఓ వైపు.. మిగిలిన ఆరు దేశాలు ఓ వైపు చీలిపోయినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాలతో ఇతర దేశాల వస్తువులపై సుంకాలు పెంచామన్న ట్రంప్‌ వాదనను కెనడా తోసిపుచ్చింది. వాణిజ్యం, పర్యావరణం, ఇరాన్‌ ఒప్పందం తదితర అంశాలపై ట్రంప్‌ వైఖరిని తప్పు పట్టిన యూరప్‌ దేశాలు అమెరికాపై ప్రతి చర్యలకు దిగుతామని హెచ్చరించాయి. దీంతో జీ7 దేశాల సదస్సులో ట్రంప్‌ ఏకాకి అవక తప్పలేదు. 

ఇక దౌత్య వ్యవహారాలు నడిపేందుకు పెట్టిందిపేరైన సింగపూర్‌లో అధ్యక్షుల భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు ఉత్తర కొరియాతో, ఇటు అమెరికాతోనూ సత్సంబంధాలు కలిగిన దేశం సింగపూర్‌. ఈ భేటీ సందర్భంగా ప్రపంచంలో అత్యంత పోరాట పటిమను ప్రదర్శించే గిరిజన తెగ నేపాలీ గుర్ఖాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 

21:49 - June 10, 2018

విశాఖ : అనకాపల్లిలోని గవరపాలెంలో విషాదం జరిగింది. గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు సేనాపతి శ్రీను(26), గోకాడ సత్తిబాబు(34)లుగా గుర్తించారు. 

21:46 - June 10, 2018

హైదరాబాద్ : రంజాన్‌ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్‌ ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఇఫ్తార్‌ విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు

21:45 - June 10, 2018

విజయవాడ : ఏపీలో రాజకీయం హీటెక్కింది.. టీడీపీ ప్రభుత్వంపై విపక్షనేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ, వామపక్షాలతోపాటు బీజేపీ నేతలు కూడా విమర్శల దాడి పెంచారు. ఏపీకి అన్నీ ఇచ్చామని.. అయినా  కేంద్రంపై సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  విమర్శించారు. ప్రత్యేక హోదాపై గడియకో మాటమార్చిన చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని వైసీపీ ఆరోపించింది. ఇక  బీజేపీ, టీడీపీలు రాష్ట్రానికి జాయింట్‌గా ద్రోహం చేశాయని వామపక్షాలు మండిపడ్డాయి. ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున యువతను కదిలిస్తామని వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి స్పష్టం చేశాయి. 

మిమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీ పాలిటిక్స్‌ హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. టీడీపీపై బీజేపీ, వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టగా... బీజేపీ-టీడీపీలు జాయింట్‌గా రాష్ట్రానికి ద్రోహం చేశాయని  వామపక్షాలు  ఆరోపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ అధినేత లక్షకోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి.. చంద్రబాబు ప్రజాధనాన్ని దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టున్నారని బొత్స విమర్శించారు. ఎయిర్‌ ఏషియాస్కామ్‌లో కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజుపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరే దమ్ము చంద్రబాబుకు ఉందా అని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. 

మరోవైపు ఈనెల 12 వైఎస్‌ జగన్‌ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి బ్రిడ్జిపై జగన్‌ పాదయాత్రకు షరతులు పెట్టడం ఏంటని వైవీ ప్రశ్నించారు. పాదయాత్రలో తొక్కిసలాట జరుగుతుందని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టిన చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 

తప్పుడు లెక్కలతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని  బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. నాలుగేళ్ల కాలంలో కేంద్రంలోని మోడీ సర్కార్ ఏపీకి ఎంతో సహాయం చేసిందన్నారు.  తెలుగుదేశం ప్రభుత్వం అసత్య ప్రచారాలతో బీజేపీని దోషిగా నిలిపిందని కన్నా విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో  చంద్రబాబు మాటమార్చాని బీజేపీ నేత పురందేశ్వరి విమర్శించారు. 

విభజన హామీలను 85శాతం నెరవేర్చామంటున్న బీజేపీ నేతల ప్రకటనలను ప్రత్యేకహోదా సాధన సమితి, వామపక్షాలు ఖండించాయి. విజయవాడలో సమావేశమైన నేతలు బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం విభజన హామీలు ఏ మేరకు నెరవేర్చిందో ఆ పార్టీ నాయకులు చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామ‌కృష్ణ సవాల్‌  చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజి ఇస్తామని చెప్పి... 350 కోట్లు ఇచ్చి, మళ్లీ కేంద్రం వెనక్కి తీసుకుందని రామకృష్ణ  మండిపడ్డారు. నయవంచన మాటలతో బీజేపీ ప్రజలను మోసగిస్తోందని సీపీఎం నేత, వై. వెంకటేశ్వరరావు విమర్శించారు. 
    
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని, ఉద్యమంలో కలిసి రాని వారిని రాష్ట్ర  ద్రోహులుగా ప్రకటిస్తామని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ హెచ్చరించారు. మొత్తానికి పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో ఏపీలో పాలిటిక్స్ ఆసక్తికరంగా సాగుతున్నాయి. హోదా సాధన కోసం వచ్చేనెల 15 నుంచి కార్యాచరణలోకి దిగుతామని వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి స్పష్టం చేసింది. 

21:42 - June 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు పొందిన కార్మిక సంఘం టీఎంయూతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికులు, ఉద్యోగులకు 16 శాతం మధ్యంతర భృతి చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. దీంతో సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకొన్నట్టు టీఎంయూ ప్రకటించింది. 

ఆర్టీసీలో గుర్తింపు పొందిన కార్మిక సంఘం టీఎంయూతో మంత్రుల బృందం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికులు, ఉద్యోగులకు తాత్కాలిక భృతి సహా మొత్తం 19 డిమాండ్ల సాధన కోసం ఈనెల 11 నుంచి సమ్మె చేస్తామని ఇచ్చిన నోటీసుపై మంత్రులు చర్చించారు. ప్రధానమైన ఐఆర్‌పై ప్రభుత్వం, టీఎంయూ మధ్య అవగాహన కుదిరింది. 16 శాతం తాత్కాలిక భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో సమ్మె నోటీసును టీఎంయూ వెనక్కి తీసుకొంది. వచ్చే నెల నుంచి కార్మికులకు ఐఆర్‌ చెల్లిస్తారు. 

ఆర్టీసీ ఉద్యోగులకు ఐఆర్‌ ఇవ్వడం వలన సంస్థలపై నెలకు 16 కోట్ల భారం పడుతుందని అంచనా వేశారు. ఏటా 200 కోట్ల రూపాయలు అవుతుందని లెక్క కట్టారు. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కమిటీని నియమించడానికి ప్రభుత్వం అంగీకరించింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుందని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి  హామీ ఇచ్చారు. 

పదహారు శాతం తాత్కాలిక భృతి చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో సమ్మె నిర్ణయాన్ని ఉపసంరించుకొన్నట్టు ఆర్టీసీ గుర్తింపు యూనియన్‌ టీఎంయూ నేత అశ్వథ్థామరెడ్డి ప్రకటించారు. మరోవైపు పదహారు శాతం ఐఆర్‌కు టీఎంయూ ఒప్పుకోవడంపై ఆర్టీసీలోని మిగిలిన యూనియన్లు మండిపడ్డుతున్నాయి. 25 శాతం ఐఆర్‌ డిమాండ్‌ చేసిన టీఎంయూ చివరికి 16 శాతానికి ఒప్పుకోవడం.. కార్మికులకు ద్రోహం చేసిందని ఎన్‌ఎంయూ ఆరోపించింది. టీఎంయూ నిర్ణయంపై ఎంప్లాయూస్‌ యూనియన్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఆర్టీసీ టీఎంయూతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం 

21:36 - June 10, 2018

ప్రముఖ హేతువాది బాబు గోగినేని ఫ్యామిలీతో టెన్ టివి స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. బాబు గోగినేని, ఆయన భార్య సహన, కుమారుడు అరుణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా సహన మాట్లాడారు. ఆ వివరాలను వారి మాటల్లోనే... 
సహన..
చిన్నవాటికి బాబు చాలా కోపడతారు. పెద్దవాటికి సరేలే అంటాడు. బాబు జిడ్డు. నేను బాబును మా అక్కవాళ్ల ఇంట్లో మొదటిసారి చూశా. బాబు తల్లిదండ్రులు నాకు బాగా నచ్చారు. బాబు కూడా బాగా ఉంటాడని ఇష్టపడ్డాను. నాకు తినడం అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో దేవుడి ఫోటో ఉండేది కాదు. దేవుడిని నమ్మేవాళ్లను రిస్పెక్ట్ చేస్తాను. వీలైనంత వరకు మంచిగా బతకాలి. సహన కుటుంబం కూడా తమ లాగే ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని బాబు గోగినేని అన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ నేను చూసిన లాస్ట్ సినిమా అని అన్నారు. తనకున్న రెండు పేర్లలో అరుణ్ అనే పేరు అంటే ఇష్టమని అరుణ్ అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

21:18 - June 10, 2018

'దేశ ముదుర్స్' టీమ్ తో టెన్ టివి స్పెషల్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా సీనియర్ నటుడు బెనర్జీ, డైరెక్టర్ కర్మనీ, ప్రొడ్యూసర్ కుమార్ పాల్గొని, మాట్లాడారు. సినిమా అనుభవాలు, షూటింగ్ విశేషాలు తెలిపారు. వారు తెలిపిన పలు ఆసక్తికరమైన విషయాలను వీడియోలో చూద్దాం....

 

21:11 - June 10, 2018

కర్నూలు : జిల్లాలో రిజర్వాయర్లను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పాదయాత్ర పాదయాత్ర చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు పాదయాత్ర చేపట్టారు. రైతులతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

20:59 - June 10, 2018

విజయవాడ : మోడీ ప్రభుత్వం నియంతృత్వ పద్ధతిలో పోతోందని..నిరంకుశంగా వ్యవహరిస్తోందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడలో ప్రత్యేకహోదా సాధన సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని విమర్శించారు. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పి.. రూ.350 కోట్లు ఇచ్చి మళ్లీ కేంద్రం వెనక్కి తీసుకుందన్నారు. రాష్ట్రానికి రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

19:43 - June 10, 2018

ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి చర్యలు : మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ : ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడంలో సీఎం కేసీఆర్ ముందుంటారని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిలబెట్టి, కాపాడిన సీఎం కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. ఉద్యమంలో పుట్టిన సంస్థ టీఎంయూ అని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు 16 శాతం ఐఆర్ ఇవ్వడానికి కేసీఆర్ ఒప్పుకున్నారని తెలిపారు. జులై నుంచి కార్మికులకు 16 శాతం ఐఆర్ అందించబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ఆర్టీసీలో ఉద్యోగ కార్మిక నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్టీసీలో పని చేస్తూ వయసు మీద పడిన వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు.

ఆర్టీసీ బలోపేతానికి సీఎం కేసీఆర్ నిర్ధిష్టమైన ఆలోచన : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : ఆర్టీసీ బలోపేతానికి సీఎం కేసీఆర్ నిర్ధిష్టమైన ఆలోచన విధానంతో ముందుకు పోతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్టీసీ కార్పొరేషన్ ను లాభాల బాటలో పెట్టేవిధంగా సీఎం ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. కార్మిక పక్షపాతిగా సీఎం తనదైన చరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. 16 శాతం మధ్యంతర భృతికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. 

 

ఆర్టీసీ పటిష్టతకు ప్రభుత్వం పని చేస్తుంది : మంత్రి మహేందర్ రెడ్డి

హైదరాబాద్ :  ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా సీఎం కేసీఆర్ టీఎస్ ఆర్టీసీకి డబ్బులు ఇస్తున్నారని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. గతంలో కార్మికులు 43 శాతం ఫిట్ మెంట్ అడిగితే సీఎం 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. పల్లె వెలుగు బస్సులు నష్టాల్లో ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ పటిష్టతకు ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

అందరికీ అండగా ఆర్టీసీ : మంత్రి ఈటల

హైదరాబాద్ : చదువుకునే విద్యార్థులకు, చిన్న వ్యాపారుస్తులకు, అందరికీ అండగా ఉండేది ఆర్టీసీ అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు చేసిన సకల జనుల సమ్మె తీరు భారత ప్రభుత్వానికి తెలిసి వచ్చిందన్నారు. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి సీఎం కేసీఆర్ కొనియాడారు. ఇసారి కూడా కార్మికులు 25 శాతం ఐఆర్ అడిగారు...కానీ ప్రభుత్వం 16 శాతం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. 

19:13 - June 10, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మిక సంఘం టీఎంయూ నేతలతో కేబినెట్‌ సబ్‌కమిటీ చర్చలు ముగిశాయి. ఈ చర్చల్లో మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, ఈటల, జగదీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రుల కమిటీ ప్రగతి భనవ్ కు వెళ్లి..చర్చల సారాంశాన్ని సీఎం కేసీఆర్ కు వివరించారు. ఆర్టీసీ కార్మికులకు 16 శాతం మధ్యంతర భృతి (ఐఆర్ ) ఇచ్చేందుకు టీప్రభుత్వం అంగీకరించింది. ఈమేరకు కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ చదువుకునే విద్యార్థులకు, చిన్న వ్యాపారుస్తులకు అండగా ఉండేది ఆర్టీసీ అని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు చేసిన సకల జనుల సమ్మె తీరు భారత ప్రభుత్వానికి తెలిసి వచ్చిందన్నారు. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి సీఎం కేసీఆర్ కొనియాడారు. ఇసారి కూడా కార్మికులు 25 శాతం ఐఆర్ అడిగారు...కానీ ప్రభుత్వం 16 శాతం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. 
మంత్రి మహేందర్ రెడ్డి....
ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా సీఎం కేసీఆర్ టీఎస్ ఆర్టీసీకి డబ్బులు ఇస్తున్నారని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. గతంలో కార్మికులు 43 శాతం ఫిట్ మెంట్ అడిగితే సీఎం 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. తెలిపారు. పల్లె వెలుగు బస్సులు నష్టాల్లో ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ పటిష్టతకు ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
మంత్రి కేటీఆర్..
ఆర్టీసీ బలోపేతానికి సీఎం కేసీఆర్ నిర్ధిష్టమైన ఆలోచన విధానంతో ముందుకు పోతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్టీసీ కార్పొరేషన్ ను లాభాల బాటలో పెట్టేవిధంగా సీఎం ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. కార్మిక పక్షపాతిగా సీఎం తనదైన చరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. 16 శాతం మధ్యంతర భృతికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. 
మంత్రి హరీష్ రావు..
ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడంలో సీఎం కేసీఆర్ ముందుంటారని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిలబెట్టి, కాపాడిన సీఎం కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. ఉద్యమంలో పుట్టిన సంస్థ టీఎంయూ అని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు 16 శాతం ఐఆర్ ఇవ్వడానికి కేసీఆర్ ఒప్పుకున్నారని తెలిపారు. జులై నుంచి కార్మికులకు 16 శాతం ఐఆర్ అందించబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ఆర్టీసీలో ఉద్యోగ కార్మిక నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్టీసీలో పని చేస్తూ వయసు మీద పడిన వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. ఆర్టీసీని బలోపేతం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు సకల జనుల సమ్మె కాలం నాటి వేతనాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. నగదు రూపేన అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఆర్టీసీ, కార్మికులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
 

 

18:03 - June 10, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా ఉద్యమం పడిపోలేదని, ప్రజల గుండెల్లో సజీవంగా ఉందని హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్‌ అన్నారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు పోరాడుతున్నాయని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీ ఆంధ్రా ద్రోహుల పార్టీ అని చలసాని శ్రీనివాస్‌ అన్నారు.  ప్రజలు తమకు జరిగిన అన్యాయన్ని మరిచిపోలేక పోతున్నారని అన్నారు. జూలై నుంచి రాష్ట్రవాప్తంగా పోరాటానికి ప్రణాళికలు సిద్దం చేశామంటున్న చలసాని శ్రీనివాస్‌తో టెన్ టివి ఫేస్ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

17:58 - June 10, 2018

ప్రకాశం : జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. మామిడిపాలెంలోని కొప్పోలు తిరుపతి రావు ఇంట్లో చొరబడి... 24 తులాల బంగారు ఆభరణాలు, 50 వేల రూపాయల నగదు, కొన్ని పట్టుచీరలు చోరీ చేశారు. విహార యాత్రకి వెళ్లి వచ్చే సరికి ఇళ్లుగుల్ల చేశారని బాధితులు వాపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. 

 

సీఎంకు చర్చల సారాంశాన్ని వివరించిన కేబినెట్ సబ్ కమిటీ

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మిక సంఘం టీఎంయూ నేతలతో కేబినెట్‌ సబ్‌కమిటీ చర్చలు ముగిశాయి. ఈ చర్చల్లో మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, ఈటల, జగదీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రుల కమిటీ ప్రగతి భనవ్ కు వెళ్లి..చర్చల సారాంశాన్ని సీఎం కేసీఆర్ కు వివరించారు. 

17:19 - June 10, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మిక సంఘం టీఎంయూ నేతలతో కేబినెట్‌ సబ్‌కమిటీ చర్చలు ముగిశాయి. ఈ చర్చల్లో మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, ఈటల, జగదీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రుల కమిటీ ప్రగతి భనవ్ కు వెళ్లి..చర్చల సారాంశాన్ని సీఎం కేసీఆర్ కు వివరించారు. సీఎం ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోమారు టీఎంయూ నేతలతో మంత్రుల కమిటీ సమావేశం కానుంది. అంతకమందు మూడు గంటలపాటు చర్చలు జరిగాయి. మధ్యంతర భృతికి టీఎంయూ నేతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఐఆర్ కు ఒప్పుకున్న టీఎంయూపై ఇతర కార్మిక సంఘాలు మండుతున్నాయి. ఐఆర్ కు అంగీకరించడమంటే కార్మిక సంఘాలను మోసం చేయడమేనని కార్మిక సంఘాలు అంటున్నాయి. 

17:05 - June 10, 2018

అనంతపురం : విత్తనాల కోనుగోలుకు రైతుల వద్ద డబ్బు లేదని ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేస్తే ప్రతి రైతుకు 75వేల రూపాయలు అందుతాయన్నారు. రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. రేపు, ఎల్లుండి జిల్లా కలెక్టరేట్‌ వద్ద రైతు సత్యాగ్రహం చేపట్టనున్నట్లు రాంభూపాల్ తెలిపారు. 

17:02 - June 10, 2018

విజయవాడ : చంద్రబాబు బీజేపీపై విషప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సంస్కార హీనుడు అని వ్యాఖ్యానించారు. బాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని విజయవాడలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ శ్రేణులను కోరారు. ఈ నెల 12 నుంచి వచ్చేనెల 6 వరకు నిర్వహించనున్న గ్రామగ్రామన బీజేపీ కార్యక్రమానికి అందరి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలను కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.  

 

16:58 - June 10, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మిక సంఘం టీఎంయూ నేతలతో కేబినెట్‌ సబ్‌కమిటీ చర్చలు ముగిశాయి. ఈ చర్చల్లో మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, ఈటల, జగదీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. చర్చల సారాంశాన్ని సీఎంకు నివేదిస్తామని మంత్రుల కమిటీ ప్రగతిభవన్‌కు బయలుదేరింది. మూడు గంటలపాటు చర్చలు జరిగాయి. 16 శాతం మధ్యంతర భృతికి టీఎంయూ నేతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. 16 శాతం ఐఆర్ కు ఒప్పుకున్న టీఎంయూపై ఇతర కార్మిక సంఘాలు మండుతున్నాయి. 16 శాతం ఐఆర్ కు అంగీకరించడమంటే కార్మిక సంఘాలను మోసం చేయడమేనని కార్మిక సంఘాలు అంటున్నాయి. 25 శాతం ఐఆర్ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎం ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

టీఎంయూ నేతలతో ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ చర్చలు

హైదరాబాద్ : టీఎంయూ నేతలతో కేబినెట్ సబ్ కమిటీ చర్చలు ముగిశాయి. ఈ చర్చల్లో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఈటల, జగదీశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. చర్చల సారాంశాన్ని సీఎం కేసీఆర్ కు నివేదించేందుకు మంత్రులు ప్రగతి భవన్ కు బయల్దేరారు. 

16:29 - June 10, 2018

హైదరాబాద్ : నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏపీ, తెలంగాణకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సీఐటీయూ, ఎఐటీయూసీ, ఐఎఎన్‌టీయూసీ  నేతలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు. దేశంలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని....వాటిని భర్తీ చేయని మూలంగా తమపై పని భారం పెరిగిందన్నారు. కేంద్రం తమ సమస్యలు పరిష్కరించకుంటే నవంబర్‌ 15న దేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తామని కార్మిసంఘాలు హెచ్చరించాయి.  

ప్రపంచీకరణతో దేశం చిన్నాభిన్నం : ఆర్.నారాయణ మూర్తి

విశాఖ : భాష మీద ప్రపంచీకరణ దాడి చేస్తోందని హీరో నారాయణ మూర్తి అన్నారు. ప్రపంచీకరణతో భారతదేశం చిన్నాభిన్నమైందన్నారు. విశాఖలో నిర్వహించిన దళిత ఆదివాసీ సమతా జాతరలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 200సంవత్సరం ముందు నుంచే భాషపై దాడి జరుగుతుందన్నారు. దేశంలో 1100లకు పైగా భాషలున్నాయని..కానీ ఇప్పుడు 850 భాషలకు వచ్చిందన్నారు. మన కల్చర్ నిర్వీర్యం అవుతుందన్నారు. పాశ్చాత్య కల్చర్ మనదేశాన్ని చుట్టేసిందని తెలిపారు. 

దళిత ఆదివాసీ సమతా జాతరలో వంగపండు ఆటా పాట

విశాఖ : దళిత ఆదివాసీ సమతా జాతరలో గాయకుడు వంగపండు ఆట..పాటతో అలరించారు. కార్మికులు, శ్రామికులపై పాట పాడారు. 

16:15 - June 10, 2018

విశాఖ : భాష మీద ప్రపంచీకరణ దాడి చేస్తోందని హీరో నారాయణ మూర్తి అన్నారు. ప్రపంచీకరణతో భారతదేశం చిన్నాభిన్నమైందన్నారు. విశాఖలో నిర్వహించిన దళిత ఆదివాసీ సమతా జాతరలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 200సంవత్సరం ముందు నుంచే భాషపై దాడి జరుగుతుందన్నారు. దేశంలో 1100లకు పైగా భాషలున్నాయని..కానీ ఇప్పుడు 850 భాషలకు వచ్చిందన్నారు. మన కల్చర్ నిర్వీర్యం అవుతుందన్నారు. పాశ్చాత్య కల్చర్ మనదేశాన్ని చుట్టేసిందని తెలిపారు. అమ్మ, తల్లి అనడం పోయాయని... మధర్, మమ్మీ రాజ్యమేలుతున్నాయన్నారు. 'ప్రపంచ కార్మికులారా ఏకంకండి..పోరాడితే పోయేదేమీ లేదు..బానిస సంకెళ్లు తప్ప'...అని కారల్ మార్క్స్.. చెప్పినట్లు భారతదేశంలోని పీడిత, తాడితులు, దళితులు, కార్మికులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.  

 

16:13 - June 10, 2018

విశాఖ : దళిత ఆదివాసీ సమతా జాతరలో గాయకుడు వంగపండు ఆట..పాటతో అలరించారు.  కార్మికులు, శ్రామికులపై పాట పాడారు. పూర్తి పాటను వీడియోలో చూద్దాం.. 

16:01 - June 10, 2018

చిత్తూరు : పుత్తూరులో ఇంజినీరింగ్‌ విద్యార్థి శ్రీకాంత్‌నాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు.  సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న శ్రీకాంత్‌నాయుడు పుత్తూరులోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్నాడు. ఒంగోలుకు చెందిన శ్రీకాంత్‌నాయుడు పుత్తూరులో తాను ఉంటున్న హాస్టల్‌లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే శ్రీకాంత్‌నాయుడు హాస్టల్‌లో భోజనం మాత్రమే చేస్తూ.. బయట రూములో ఉంటున్నాడని హాస్టల్‌ వార్డెన్‌ ప్రియ తెలిపారు. ఫ్రెండ్స్‌తో కలిసి చదువుకునేందుకు వచ్చి ఉరేసుకుని ఆత్మహత్య చేసున్నాడని చెప్పారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

15:59 - June 10, 2018

ప్రకాశం : జిల్లాలో మిల్క్‌ట్యాంకర్‌ బోల్తా పడింది. యర్రగొండపాలెం  మండలం బోయలపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్తూరుజిల్లా కలికిరి నుంచి నల్లగొండజిల్లా  చిట్యాలకు వెళ్లుతున్న వాహనం అదుపుతప్పి నడిరోడ్డుపై పడిపోయింది. ట్యాంకర్‌ నుంచి కారిపోతున్న పాలను పట్టుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. బిందెలు, బక్కెట్లతో పాలను తీసుకెళ్లుతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. వేల లీటర్లపాలు నేలపాలయ్యాయి. జేసీబీ సహాయంతో ట్యాంకర్‌ను పైకి లేపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

15:55 - June 10, 2018

విశాఖ : ఫోక్స్‌ వ్యాగన్‌ కంపెనీ నుంచి  ముడుపులు  తీసుకున్నట్టుగా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటాని వైసీపీ ప్రధాన కార్యదర్శి బొత్స సత్యనారాయణ సవాల్‌ విసిరారు. ఫోక్స్‌ వ్యాగన్‌ ముడుపులు తీసుకొన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలపు బొత్స తోసిపుచ్చారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలన అంతా అవినీతిమయమని ఆరోపించారు. 

 

15:18 - June 10, 2018

ఢిల్లీ : దేశంలో  మోదీ మాయాజాలానికి తిరుగులేదని భావిస్తున్న బీజేపీకి...  గడ్డు కాలం రానుంది. దేశంలో విజయ ఢంకా మోగించిన బీజేపీకి  152 చోట్ల  వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.. ఇదేదో ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం కాదు... సాక్ష్యాత్తూ బీజేపీ జరిపిన అంతర్గత సర్వేలో వెల్లడైన పచ్చినిజం. ఈ సర్వే ఫలితాలతో కమలనాథుల్లో గుబులు పుట్టిస్తోంది. 
కమలనాథుల్లో కలవరం 
గత ఎన్నికల్లో విజయఢంకా మోగించిన బీజేపీకి.. ఈ సారి పరిస్థితి తలకిందులయ్యే అవకాశం కనిపిస్తోంది.. దేశంలో 282 లోక్‌సభ స్థానాల్లో సునాయాసంగా గెలుపు సాధించిన  బీజేపీకి.. ఇప్పుడు అందులో 152 స్థానాల్లో ఎదురీత తప్పేటుగా లేదు. ఈ విషయం సాక్ష్యాత్తూ బీజేపీ నిర్వహించిన అంతర్గత సర్వేలోనే తేలింది. దీంతో కమలనాథుల్లో కలవరం వ్యక్తమవుతోంది. 
బీజేపీ గతంలో గెలుపొందిన స్థానాల్లోనే సర్వే 
బీజేపీ గతంలో గెలుపొందిన స్థానాల్లోనే ఈ సర్వే చేసింది. గత ఏడాది గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందే జరిగిన ఈ సర్వే నివేదిక హిందీ దినపత్రిక దైనిక్‌ భాస్కర్‌ చేతికి చిక్కింది. ఈ సర్వే ఆధారంగా నష్టనివారణ చర్యలకు బీజేపీ నడుం బిగించింది. రానున్న ఎన్నికల్లో  బీజేపీ సారథి అమిత్‌ షా, ప్రధాని మోదీ నవ భారతం యువ భారతం నినాదంతో ముందుకెళ్ళాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇలాంటి వ్యూహంతోనే ఢిల్లీ నగరపాలిక ఎన్నికల్లోను ప్రయోగించారు. వ్యతిరేక పవనాలు వీస్తున్న స్థానాల్లో అభ్యర్థుల్నే మార్చేశారు. ఇదే ఫార్ములాను కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించి ఫలితం సాధించారు.      
రాబోయే ఎన్నికల్లో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం 
బీజేపీలో మూడో స్థాయి నాయకత్వం అభివృద్ధిపై పార్టీ అధిష్ఠానంతోపాటు.. సంఘ్‌ పరివార్‌ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇటీవల ఉజ్జయినిలో సమావేశమైన అమిత్‌ షా, మోహన్‌ భగవత్‌, భయ్యాజీ జోషి చర్చించినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. టికెట్ల కేటాయింపుతో పాటు.. 75 ఏళ్లు పైబడినవారి విషయంలోనూ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
వ్యతిరేకత పెరిగిన స్థానాలపైనే బీజేపీ దృష్టి 
ప్రస్తుతం బీజేపీకీ వ్యతిరేకత పెరిగిన స్థానాలపైనే ఆ పార్టీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌లలో ఉన్న 105 లోక్‌సభ స్థానాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. బీజేపీకి ఎదురులేదు అనుకున్న సమయంలోనూ.. ఈ 105 స్థానాలకుగాను. ఆరు చోట్ల మాత్రమే  గెలిచింది.  కాబట్టి...  మిగతా చోట్ల వాటిల్లే నష్టం భర్తికావాలంటే.. వీటిలో కనీసం 80 స్థానాలను చేజిక్కించుకోవాలన్న వ్యూహంలో ఉన్నారు కమలనాథులు. ఒడిశా మినహా..  మిగతా రాష్ట్రాల్లో సంస్థాగతంగా   పార్టీ నిర్మాణం బలహీనంగానే ఉంది.  దీంతో మోదీ ప్రజాదరణను సొమ్ము చేసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ నష్టాన్ని పూడ్చుకునేందుకు.. మోదీని వారణాసి, పూరీ నుంచి పోటీకి దింపేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఏపీ, తెలంగాణ, బెంగాల్‌లపై కూడా బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 

 

15:02 - June 10, 2018

నెల్లూరు : వేదాయపాలెంలో పోలీసుల ఓవరాక్షన్‌ వెలుగుచూసింది. వేధింపుల కేసులో బీజేపీ నేత విజయ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చి చితకబాదారు. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. విజయ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసిన ఎస్సైతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కౌన్సిలింగ్‌ చేయాల్సింది పోయి తీవ్రంగా కొట్టడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. విజయ్‌కుమార్‌ను తీవ్రంగా గాయపరిచిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నగర డీఎస్పీ మురళీ కృష్ణ రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. విజయ్‌కుమార్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని చెప్పడంతో బీజేపీ నేతలు వెనుదిరిగారు.  
 

 

14:59 - June 10, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. నిన్న జరిగిన చర్చలలో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో.. మరోసారి కార్మిక సంఘాల నేతలు మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వం నుంచి సరైన నిర్ణయం రాకపోతే సమ్మె చేస్తామని కార్మిక సంఘ నేతలంటున్నారు. ప్రభుత్వం నిర్ణయంపై కార్మిక సంఘాల సమ్మె నిర్ణయం ఆధారపడి ఉంది. నిన్న అర్ధరాత్రి వరకు కేబినెట్‌ సబ్‌కమిటీతో ఆర్టీసీ కార్మిక సంఘాలు చర్చలు జరిపారు. ప్రభుత్వం వేతనాల పెంపుపై ఎటూ తేల్చలేదు. కార్మిక సంఘాల ప్రతిపాదనలను మంత్రులు కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ మరోసారి మంత్రివర్గ ఉపసంఘం కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. 25% ఐఆర్‌ ఇస్తే రూ.900 కోట్లు భారమని మంత్రులు అంటున్నారు. ఆర్టీసీపై పన్నులు ఎత్తివేస్తే పన్నుల నుంచి గట్టెక్కుతామని టీఎంయూ నేతలు అంటున్నారు. పన్నుల రద్దుపై మంత్రులు స్పందించలేదు. మ.ఒంటిగంట వరకు ప్రభుత్వానికి టీఎంయూ డెడ్‌లైన్‌ విధించింది. ఇవాళ ప్రభుత్వం ఇచ్చే క్లారిటీ ప్రకారం సమ్మెపై నిర్ణయం ప్రకటిస్తామని కార్మిక సంఘాలు
అంటున్నాయి. 

ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న సస్పెన్షన్

హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై సస్పెన్షన్ కొనసాగుతోంది. మరోసారి మంత్రివర్గ ఉపసంఘంతో కార్మిక సంఘాల నేతలు భేటీ అయ్యారు. ప్రభుత్వం నిర్ణయంపై కార్మిక సంఘాల సమ్మె నిర్ణయం ఆధారపడింది.

రాజీనామాలు ఎన్నికల కోణంలో చూస్తారా - ధర్మాన...

విజయవాడ : ఎంపీల రాజీనామాలను కూడా ఎన్నికల కోణంలో చూస్తున్న అధికార పార్టీని ఏమనాలో తెలియడం లేదన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకే.. నాలుగేళ్ళ తర్వాత సీఎం నవనిర్మాణ దీక్ష చేపట్టారని ఎద్దేవా చేశారు ధర్మాన.

 

టిడిపివి డ్రామాలు - వైసీపీ ఎంపీ వైవి...

విజయవాడ : తమ తప్పులు కప్పి పుచ్చుకునేందుకే టీడీపీ తమపై బుదజల్లుతోందని వైసీపీ నేతలు మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం తాము చిత్తశుద్దితో రాజీనామాలు చేస్తే.. టీడీపీ డ్రామాలు ఆడుతోందన్నారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. 

దళిత ఆదివాసీ సమత జాతర...

విశాఖపట్టణం : ఆధునిక కాలంలోనూ నికృష్టమైన సఫాయి వ్యవస్థ కొనసాగడం సిగ్గుచేటంటూ.. మండిపడ్డారు రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్‌. సఫాయి వ్యవస్థపై అన్నిదళిత, బహుజన సంఘాలు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. 

ఐక్యతతో బహుజనులకు రాజ్యాధికారం - తమ్మినేని...

విశాఖపట్టణం : బహుజనుల ఐక్యతతోనే.. బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు.. తెలంగాణ రాష్ర్ట బహుజన ఫ్రంట్‌ కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో రెండో రోజు జరిగిన దళిత ఆధివాసీ సమత జాతరలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

నిలిచిన గూడ్స్ ట్రైన్...

నిజామాబాద్‌ : జిల్లా ఇందల్వాయి అటవీ ప్రాంతంలో సాంకేతిక లోపంతో గూడ్స్‌ ట్రైన్‌ నిలిచిపోయింది. సికింద్రాబాద్‌-నాందేడ్‌ మధ్య పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

కర్నూలులో రైతు సంఘాల పాదయాత్ర...

కర్నూలు : పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కర్నూలు జిల్లాలో రైతు సంఘాల ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న పాదయాత్ర 6వ రోజుకు చేరుకుంది. మంత్రాలయం నియోజకవర్గం కోస్గి మండలం అగసానురు నుంచి ఈరోజు పాదయాత్ర మొదలైంది. 

13:32 - June 10, 2018

కర్నూలు : పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కర్నూలు జిల్లాలో రైతు సంఘాల ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న పాదయాత్ర 6వ రోజుకు చేరుకుంది. మంత్రాలయం నియోజకవర్గం కోస్గి మండలం అగసానురు నుంచి ఈరోజు పాదయాత్ర మొదలైంది. పాదయాత్ర గురించి మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:30 - June 10, 2018

యాదాద్రి భువనగిరి : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌కు అవమానం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అంబేద్కర్‌ విగ్రహానికి నల్లరంగు టీషర్ట్‌ను చుట్టారు. దీంతో దళిత, గిరిజన ప్రజాసంఘాలు ఘటనాస్థలంలో ఆందోళనకు దిగారు. సీసీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి.. అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 12 గంటల్లో నిందితులను అరెస్ట్‌ చేస్తామని ఏసీపీ హామీ ఇవ్వడంతో ప్రజా సంఘాల నేతలు ఆందోళన విరమించారు.

13:29 - June 10, 2018

విశాఖపట్టణం : ఆధునిక కాలంలోనూ నికృష్టమైన సఫాయి వ్యవస్థ కొనసాగడం సిగ్గుచేటంటూ.. మండిపడ్డారు రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్‌. సఫాయి వ్యవస్థపై అన్నిదళిత, బహుజన సంఘాలు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో అన్ని రంగాల్లోనూ కుల వ్యవస్థ వేళ్ళూనుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు విల్సన్‌. 

13:28 - June 10, 2018

విశాఖపట్టణం : బహుజనుల ఐక్యతతోనే.. బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు.. తెలంగాణ రాష్ర్ట బహుజన ఫ్రంట్‌ కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో రెండో రోజు జరిగిన దళిత ఆధివాసీ సమత జాతరలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఒకే కులంలోని తెగల మధ్య గొడవల వల్ల నష్టం జరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తమ్మినేని వీరభద్రం. అన్ని తెగల వారు అన్నదమ్ముల్లాగా ఒకరి ఆకాంక్షలు, అవసరాలను మరొకరు గుర్తిస్తేనే గౌరవప్రదంగా ఉంటుందన్నారు తమ్మినేని వీరభద్రం.

13:27 - June 10, 2018

విజయవాడ : తమ తప్పులు కప్పి పుచ్చుకునేందుకే టీడీపీ తమపై బుదజల్లుతోందని వైసీపీ నేతలు మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం తాము చిత్తశుద్దితో రాజీనామాలు చేస్తే.. టీడీపీ డ్రామాలు ఆడుతోందన్నారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. రాజమహేంద్రవరం రివర్ బే హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో.. తూర్పు గోదావరి జిల్లా పాదయాత్ర వివరాలను వెల్లడించారు. కావాలనే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై పాదయాత్రపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎంపీల రాజీనామాలను కూడా ఎన్నికల కోణంలో చూస్తున్న అధికార పార్టీని ఏమనాలో తెలియడం లేదన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకే.. నాలుగేళ్ళ తర్వాత సీఎం నవనిర్మాణ దీక్ష చేపట్టారని ఎద్దేవా చేశారు ధర్మాన.

13:08 - June 10, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై టి.సర్కార్ ఎలా స్పందిస్తుంది ? కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందా ? లేక మొండి పట్టు పడుతుందా ? అనేది కొద్దిసేపట్లో తేలనుంది. వేతన సవరణపై ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ టీఎంయూ, ఇతర సంఘాల నేతలు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనితో సంఘం నేతలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు చేపట్టింది. కానీ ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం 1గంట వరకు ప్రభుత్వం స్పందించాలని టీఎంయూ డెడ్ లైన్ విధించింది. దీనితో ఆఘమేఘాల మీద ఆదివారం మధ్యాహ్నం పిలిపించిన మంత్రివర్గ ఉప సంఘం చర్చలు చేపట్టింది. ప్రభుత్వం నుండి సరైన స్పందన లేకపోతే సమ్మె చేపడుతామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. 

12:30 - June 10, 2018

 

విశాఖపట్టణం : జస్టిస్ అనే పదం అంబేద్కర్ వాడారని, ఇందుకు మూడు న్యాయాలు కావాలని చెప్పారని బిఎల్ ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఆదివాసీ బహుజనుల ఐక్యత, భిన్న ధృక్పథాలపై సమావేశం జరిగింది. సఫాయి కర్మచారి ఆందోళన జాతీయ కన్వీనర్ బెజవాడ విల్సన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న తమ్మినేని మాట్లాడుతూ...రిజర్వేషన్లు కొన్ని హక్కులకు మాత్రమే పరిమితమయ్యాయని తెలిపారు. ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం కావాలని అంబేద్కర్ చెప్పడం జరిగిందన్నారు. కానీ ఇవన్నీ ఏం జరుగలేదన్నారు. రాజకీయ స్వాతంత్రం ఓటు హక్కు ద్వారా వచ్చిందని, ఓటు విలువలో మాత్రం సమానమని..ఆస్తి విలువలో తేడా ఉంటుందని అంబేద్కర్ పేర్కొన్నారని తెలిపారుర. సామాజిక హోదాలో ఆ తేడా ఉందని..ఆర్థిక అంతస్తులో తేడా ఉంటుందని...సామాజిక, ఆర్థిక న్యాయాన్ని సాధించుకోలేకపోతే రాజకీయ హక్కు కూడా పోతుందని అంబేద్కర్ హెచ్చరించారని గుర్తు చేశారు. 

పట్టాలు తప్పిన ముంబై - హౌరా మెయిల్ రైలు...

ఢిల్లీ : ముంబై-హౌరా మెయిల్ రైలు పట్టాలు తప్పింది. మహారాష్ట్రలోని ఇగత్ పురి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులకు గాయపడినట్టు సమాచారం లేదు. 

11:11 - June 10, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై ప్రతిష్టంభన నెలకొంది. వేతన సవరణ జరుపాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ నుండి స్పందన లేకపోయే సరికి 11వ తేదీన సమ్మెలోకి వెళుతున్నట్లు గుర్తింపు పొందిన సంఘం టీఎంయూ, ఇతర సంఘాలు ప్రకటించాయి. దీనితో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపింది. కానీ ఈ చర్చల్లో ఎలాంటి ఫలితం కానరాలేదు. శనివారం అర్ధరాత్రి వరకు కేబినెట్ సబ్ కమిటీతో ఆర్టీసీ కార్మిక సంఘాలు చర్చలు జరిపింది. వేతనాల పెంపుపై ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు.

ఆర్టీసీపై పన్నులు ఎత్తివేస్తే పన్నుల నుండి గట్టెక్కుతామని టీఎంయూ నేతలు పేర్కొంటున్నారు. కానీ పన్నుల రద్దుపై మంత్రులు స్పందించలేదు. 25 శాతం ఐఆర్ ఇస్తే రూ. 900 కోట్లు భారమవుతుందని మంత్రులు పేర్కొంటున్నారు. కార్మిక సంఘాల ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ దృష్టికి మంత్రులు తీసుకెళ్లారు. మరోసారి మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరుపనుంది. ఆదివారం ప్రభుత్వం ఇచ్చే క్లారిటీ ప్రకారం సమ్మెపై నిర్ణయం ప్రకటిస్తామని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. 

నేడు ఆర్టీసీ సమ్మెపై కీలక నిర్ణయం...

హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై ప్రతిష్టంభవ నెలకొంది. శనివారం అర్ధరాత్రి వరకు కేబినెట్ సబ్ కమిటీతో ఆర్టీసీ కార్మిక సంఘాలు చర్చలు జరిపింది. కార్మిక సంఘాల ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ దృష్టికి మంత్రులు తీసుకెళ్లారు. మరోసారి మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరుపనుంది. ఆర్టీసీపై పన్నులు ఎత్తివేస్తే పన్నుల నుండి గట్టెక్కుతామని టీఎంయూ నేతలు పేర్కొంటున్నారు. కానీ పన్నుల రద్దుపై మంత్రులు స్పందించలేదు. ఆదివారం ప్రభుత్వం ఇచ్చే క్లారిటీ ప్రకారం సమ్మెపై నిర్ణయం ప్రకటిస్తామని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. 

జేఈఈ అడ్వాన్డ్ ఫలితాల విడుదల...

హైదరాబాద్ : జేఈఈ అడ్వాన్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ర్యాంకులు వెబ్ సైట్ లో లభ్యం కానున్నాయి. విశాఖకు చెందిన విద్యార్థి హేమంత్ కుమార్ కు ఏడో ర్యాంకు లభించింది. 

10:52 - June 10, 2018
10:06 - June 10, 2018

శ్రీకాకుళం : చనిపోతున్నారు..స్పందించండి..వైద్యం అందించండి..అంటున్న ఎవరూ స్పందించలేదని ఓ వ్యక్తి మీడియా ఎదుట వాపోయాడు. శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం ఎర్రముక్కాంలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఊర్మిళ అనే మహిళ మృతి చెందగా 8మందికి తీవ్రగాయాలయ్యాయి. పలాసలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లగా ఎవరూ స్పందించలేదని..ఓ వ్యక్తి పేర్కొన్నారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

09:21 - June 10, 2018

విజయనగరం : వైజాగ్ నుండి వెళుతున్న హెచ్ పీఎల్ పెట్రోల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. బీభత్సానికి పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. పెట్రోల్ తో ఓ వాహనం వెళుతోంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో లారీ అదుపు తప్పింది. రామభద్రపురం దగ్గర ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడం..అక్కడనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ పేలిపోయింది. మంటలు ట్యాంకర్ కు అంటుకున్నాయి. దీనితో సమీపంలో ఉన్న పూరి గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు బయటకు పరుగులు తీశారు. నివాసంలో ఉన్న సామాగ్రీ...సరుకులు కాపాడుకొనేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ప్రాణ నష్టం మాత్రం కలుగలేకున్నా ఆస్తి నష్టం భారీగానే స్తంభించింది. సర్వం కోల్పోయి రోడ్డున పడిన తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 

హెచ్ పీసీఎల్ పెట్రోల్ ట్యాంకర్ బీభత్సం...

విజయనగరం : హెచ్ పీసీఎల్ పెట్రోల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. మంటలు చెలరేగి సమీపంలోని పూరిగుడిసెలు దగ్ధమయ్యాయి. 

సోమవారం భువనగిరి బంద్...

యాదాద్రి : భువనగిరిలో అంబేద్కర్ విగ్రహ ముఖానికి గుర్తు తెలియని వ్యక్తులు నల్లబట్టను కప్పారు. దీనిపై దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ ఘటనను నిరసిస్తూ సోమవారం భువనగిరి బంద్ కు పిలుపునిచ్చాయి. 

09:14 - June 10, 2018

శ్రీకాకుళం : ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. జనాలపైకి దాడికి పాల్పడింది. ఒక్కసారిగా హఠాత్ పరిణామంతో జనాలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీశారు. ఘటనలో మహిళ మృతి చెందింది. సోంపేట మండలం ఎర్రముక్కాంలో ఆదివారం ఉదయం చెత్త వేయడానికని కొంతమంది మహిళలు బయటకొచ్చారు. ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఓ ఎలుగుబంటి వీరిపై దాడికి పాల్పడింది. ప్రాణాలు రక్షించుకోవడానికి తలో దిక్కుకు పరుగులు తీశారు. ఊర్మిళ అనే మహిళపై దాడికి పాల్పడుతుండగా అక్కడనే ఉన్న కొంతమంది రక్షించడానికని ప్రయత్నించారు. కానీ వారిపై కూడా ఎలుగుబంటి దాడి చేసింది. దీనితో పలువురికి గాయాలయ్యాయి. వీరిని పలాసాలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకొచ్చారు. ఆ సమయంలో డ్యూటి డాక్టర్ లేకపోవడంతో వైద్య చికిత్స అందడం ఆలస్యమైంది. చివరకు డ్యూటి డాక్టర్ రావడం..పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే ఊర్మిళ మృతి చెందింది. గాయపడిన 8మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

ఎలుగుబంటి బీభత్సం..మహిళ మృతి...

శ్రీకాకుళం : సోంపేట మండలం ఎర్రముక్కాంలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఎలుగుబంటి దాడిలో మహిళ మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

08:25 - June 10, 2018

కొమరం భీం : 70 ఏళ్ల స్వతంత్ర భారతంలోనూ చీకటి బతుకులు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ అక్కడ కరెంటు లేదు. కొమరం భీం జిల్లాలో చిమ్మచీకట్లో బతుకులీడుస్తున్న ఆదివాసీల గోస బాహ్యప్రపంచానికి తెలియచేసేందుకు టెన్ టివి నడుం బిగించింది. నేరుగా అక్కడి వారితో మాట్లాడింది. వారి గూడాల్లో చిమ్మచీకటి నెలకొంది. ఆదివాసీ గ్రామాల్లో ఇప్పటికీ కరెంటు లేదు. చిమ్మచీకట్లో ఆదివాసీలు బతుకులీడుస్తున్నారు. దేశం వెలిగిపోతుందనే నేతలకు సిగ్గు చేటైన విషయం. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:14 - June 10, 2018

హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ఎదుట ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు చెప్పేందుకు భారీగా తరలివచ్చారు. అక్కడే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బాలయ్య సీఎం అంటూ పెద్ద ఎత్తు నినాదాలు చేశారు. 

పోలీసుల కార్డన్ సెర్చ్,

సైబరాబాద్ : రామ చంద్రాపురం పీఎస్ పరిధిలోని బొంబాయి కాలనీలో నిర్భంద తనిఖీలు నిర్వహించారు. అడిషనల్ డీసీపీ, ఏసీపీ, పది మంది సీఐలు, 30 మంది ఎస్ ఐలు, 300 మంది సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. 

08:02 - June 10, 2018
08:00 - June 10, 2018

గవర్నర్ ఇఫ్తార్ విందు...

హైదరాబాద్ : నేడు గవర్నర్ నరసింహర్ ఇప్తార్ విందు ఇవ్వనున్నారు. సాయంత్రం 6గంటల నుండి రాత్రి 8గంటల వరకు రాజ్ భవన్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్...120 మంది అరెస్టు...

హైదరాబాద్ : జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 120 మందిని అరెస్టు చేశారు. 70 బైక్ లు, 50కార్లను సీజ్ చేశారు. 

కొనసాగుతున్న అల్పపీడనం...

విశాఖపట్టణం : బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రుతు పవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. 

ఇంటర్ కాంటి నెంటర్ కప్ ఫైనల్ మ్యాచ్...

ముంబై : నేడు ఇంటర్ కాంటి నెంటర్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఫైనల్ లో కెన్యాతో భారత ఫుట్ బాల్ జట్టు తలపడనుంది. రాత్రి 8గంటలకు ప్రారంభం కానుంది. కెప్టెన్ సునీల్ ఛెత్రిపైనే మరోసారి భారత్ ఆశలు పెట్టుకుంది. 

06:54 - June 10, 2018

ఢిల్లీ : దక్షిణ ఢిల్లీలోని ఛత్తార్‌పూర్‌ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నేరస్థులు హతమయ్యారు. మరొకరు గాయపడ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో కరడుగట్టిన నేరస్థుడు రాజేశ్‌ భారతితో పాటు అతని అనుచరులు ముగ్గురు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఓ కేసులో హరియాణాలో అరెస్టయిన రాజేష్‌ ఇటీవలే పోలీసు కస్టడీ నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. 12 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడి తలపై పోలీసులు లక్ష రూపాయల రివార్డు ప్రకటించారు.

06:53 - June 10, 2018

హైదరాబాద్ : గులాబీపార్టీ మరోసారి ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలు పెట్టిందా..? 2019ఎన్నికలే టార్గెట్‌గా కీలక నేతల కోసం పావులు కదుపుతోందా..? పార్టీ బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణ జిల్లాలపై గులాబీదళపతి ప్రధానంగా ఫోకస్‌ పెట్టారా..? కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపు రాజకీయాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు టీఆర్‌ఎస్‌ అధినేత వ్యూహాలు రూపొందించారా..? వాచ్‌ దిస్‌ స్టోరీ..

దక్షిణ తెలంగాణా జిల్లాలో అధికార పార్టీ పట్టు ఇంకా సాధించలేకపోతుందన్న విమర్శలకు పుల్ స్టాప్ పెట్టే పనిలో పడ్డట్లు కనిపిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గత నాలుగేళ్లుగా ఆశించిన స్థాయిలో పార్టీ బలోపేతం కాకపోవడంపై గులాబీపార్టీ అధినాయకత్వం ఆందోళన చెందుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి పట్టున్న మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలపై గులాబి దళపతి దృష్టిసారించారు. గ్రూపు రాజకీయాలకు మారుపేరైన కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోటు పాట్లను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కేసీఆర్‌ పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది.

ఇటీవల పాలమూరు జిల్లా కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో లబ్ది పొందేందుకు తమ అధినేత పక్కా స్కెచ్ వేసినట్టు అధికార పార్టీలో చెప్పుకుంటున్నారు. నాగం జనార్ధన్ రెడ్డి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరుకోవడాన్ని మాజీ మంత్రి డీకే అరుణ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అధికార పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. నాగం జనార్ధన్ రెడ్డికి రాజకీయ శత్రువుగా ఉన్న కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కారెక్కడం ఖాయమైపోయినట్టు సమాచారం. దాంతో పాటు జిల్లాకు చెందిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు గులాబి తీర్థం పుచ్చుకోడానికి సిద్ధం అయ్యారనే ప్రచారంకూడా జరుగుతోంది. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కు చెక్ పెట్టేందుకు గులాబి పార్టీ అదే సామాజిక వర్గానికి చెందిన అబ్రహాంను తమపార్టీలోకి ఆకర్షిస్తున్నట్టు తెలుస్తోంది. అటు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అధికార పార్టీలో చేరడం ఖాయమైనట్టు పొలిటిక్‌ టాక్‌ వినిపిస్తోంది. మరో ఏడాదిలోపుగానే సాధారణ ఎన్నికలను ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో . దక్షిణ తెలంగాణా జిల్లాల్లో బలం పెంచుకునేందుకు కేసీఆర్‌ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు ఉత్తర తెలంగాణాలో కొన్ని చోట్ల పార్టీ ఎమ్మెల్యేలకు ఎదురీత తప్పదన్న సంకేతాలతో గులాబి పార్టీ ఆ లోటు పూడ్చుకునేందుకు మరోసారి ఆకర్ష్‌ ఆపరేషన్‌ మొదలు పెట్టిందని రాజకీయవర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. 

06:49 - June 10, 2018

సూర్యాపేట : పోలీసులకే చేతివాటం చూపించాడు ఓ దొంగ.. సూర్యాపేట సీఐ ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి అధికారిక వాహనం చోరీ చేశాడు. సీఐ జిమ్‌కు వెళ్ళిన సమయాన్నే అదునుగా తీసుకున్న ఆగంతకుడు.. సీఐ రమ్మంటున్నాడంటూ డ్రైవర్‌ను తప్పు దోవ పట్టించి.. వాహనంతో పరారయ్యాడు. జిల్లా ఎస్పీ, డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

06:48 - June 10, 2018

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో టీజేఎస్‌తో కలిసి సాగేందుకు సీపీఐ ప్రయత్నిస్తోంది. ఉద్యమ సమయంలో తెలంగాణ జేఏసీతో ఉన్న దోస్తీని.. ఇప్పుడు ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది కాలముంది. అయితే.. రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. వివిధ పార్టీలు పొత్తులపై కసరత్తులు ప్రారంభించాయి. ఇందులో.. సీపీఐ తెలంగాణ శాఖ కొంత ముందుంది. ఉద్యమ కాలంలో తెలంగాణ జేఏసీ ద్వారా.. ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన కోదండరామ్‌తో వచ్చే ఎన్నికల్లో కలసి సాగాలని కంకి కొడవలి పార్టీ యోచిస్తోంది.

కోదండరామ్‌ కొత్తగా స్థాపించిన తెలంగాణ జనసమితి పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవాలని.. సీపీఐ తెలంగాణ నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి.. ఇటీవల తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి ఆపార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు కోదండరామ్ తో భేటి అయ్యారు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి అనుభూతులను గుర్తు చేసుకున్నారు..

తెలంగాణ ఉద్యమ సమయంలో... అప్పటి టీజేఏసీతో కలిసి.. సీపీఐ.. పోరాటాల్లో పాల్గొంది. ప్రతి కార్యక్రమంలోనూ టీజేఏసీతో వెన్నుదన్నుగా నిలిచింది... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనపై ఇరు పక్షాల నేతలు చాలాసార్లు గళమెత్తారు. రైతుల రుణమాఫీ, రైతు ఆత్మహత్యలు.. ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలు తదితర అంశాలపై కలిసి పోరాడారు. రైతుబంధు పథకం అమలులో కౌలు రైతుల సమస్యలపై సడక్‌ బంద్‌ వంటి కార్యక్రమాలూ నిర్వహించాయి.

తెలంగాణలో సీపీఐ ఈసారి పొత్తులతో ముందుకు సాగాలని భావిస్తోంది. ఇప్పటికైతే.. టీజేఎస్‌తో కలిసి సాగే విషయంలో ఓ క్లారిటీ రాకున్నా.. ఆపార్టీతో పొత్తు పెట్టుకునేందుకే సీపీఐ శ్రేణులు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ దిశగా.. టీజేఎస్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు పార్టీ నాయకత్వం కూడా అడుగులు వేస్తోంది. మొత్తానికి, ఎన్నికల సమయానికి దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

06:46 - June 10, 2018

మహబూబ్ నగర్ : పాలమూరు ప్రాంతాన్ని పచ్చగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వలసల జిల్లాగా ఉన్న పాలమూరును పచ్చగా మార్చింది కేసీఆరే అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎడ్మ కిష్టారెడ్డి, వీఎం అబ్రహాంలు టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో మంత్రులు ఈటల రాజేందర్‌, హరీష్‌రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌...పాలమూరు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. మండుటెండల్లో కూడా పాలమూరు చెరువులు మత్తడి దుంకుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ జిల్లాలో 14 సీట్లు గెలుస్తామని హరీశ్‌ ధీమా వ్యక్తం చేశారు.

06:45 - June 10, 2018

హైదరాబాద్ : తాము ఎదుర్కొంటున్నసమస్యలపై దేశవ్యాప్తంగా న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేతన సవరణలతో పాటు బ్రిటీష్ కాలం నాటి విధివిధానాలతో నడుస్తున్న న్యాయవ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేలా సంస్కరణలు చేయాలంటున్నారు. అందుకోసం హైదరాబాద్‌లో జరిగిన ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ సమావేశంలో పలు తీర్మానాలు చేసి సుప్రీంకోర్టుకు అందజేయనున్నారు.

న్యాయవ్యస్థలో కీలక పాత్ర పోషిస్తున్న జడ్జీలు తమ సమస్యల పరిష్కారానికై సుప్రీంకోర్టు మెట్లక్కనున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణపై అత్యున్నత న్యాయస్థానానికి చెప్పుకోనున్నారు. ఇందుకు దేశ వ్యాప్తంగా ఉన్న జడ్జీలంతా ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ జోన్ల వారిగా సమావేశాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జడ్జిల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 25 మందికి పైగా జడ్జీలు పాల్గొని తమ సమస్యలపై చర్చించారు.

మొట్టమొదటి సారిగా హైదరాబాద్ లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల న్యాయాధికారుల సమావేశంలో జడ్జీలు పలుతీర్మానాలు చేశారు. జిల్లా కోర్టుల నుంచి సుప్రీం కోర్టు వరకు కేసుల జాప్యంపై సమవేశంలో చర్చించారు. 1976 నుండి ఇప్పటి వరకు న్యాయవ్యవస్థలో జరగని మార్పుల అంశాన్ని లెవనేత్తారు. ఇందుకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా జ్యుడీషియరీలో అమలు చేస్తున్న బ్రిటీష్ చట్టాలే కారణమని అన్నారు ఆల్ ఇండియా జడ్జీల అసోసియేషన్ అధ్యక్షుడు జస్టిస్ రాజేంద్ర ప్రసాద్. ఇలాంటి చట్టాల వల్ల జిల్లా కోర్టులపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలోని జ్యుడిషియరీలో కొందరు జడ్జీలపై వివక్ష కొనసాగుతోందని మక్కా మజీద్ బాంబ్ బ్లాస్ట్‌ కేసు తీర్పునిచ్చిన జడ్జి రవీందర్ రెడ్డి అన్నారు. ఇద్దరు జడ్జీలపై వచ్చిన అవినీతి ఆరోపణలతో ఏసీబీ రైడ్స్ జరిపించడం న్యాయవ్యవస్థకే అవమానం అన్నారు. ఇలాంటి చర్యలతో తాను అసహనానికి గురి అయ్యానని రవీందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మక్కా మజీద్ బాంబ్ బ్లాస్ట్ కేసు తీర్పులో తనపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. ఇద్దరు జడ్జీలపై జరిగిన ఏసీబీ దాడులవల్ల మనస్థాపానికి గురై తాను రాజీనామా చేశానన్నారు. సమావేశంలో తమ సమస్యలను చర్చించిన న్యాయమూర్తులు.... తాము సిద్దం చేసుకున్న వేతనాల నివేధికలు సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకుంటామని అన్నారు.

06:42 - June 10, 2018

విజయవాడ : బీజేపీతోపాటు.. కాంగ్రెస్‌, వైసీపీపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. బీజేపీకీ, ఆ పార్టీతో కుమ్మక్కైన పార్టీలకు కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు సీఎం. అక్రమంగా సంపాదించిన జగన్‌ ఆస్తులను ఎందుకు వేలం వెయ్యకూడదంటూ ప్రశ్నించారు. పౌర సేవలను ఎలా సులభతరం చేయాలో ఆలోచిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

06:40 - June 10, 2018

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌లో వెంటనే హిందూ ధార్మిక మండలి ఏర్పాటు చేయాలని పీఠాధిపతులు డిమాండ్‌ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులు తిరుపతిలో సమావేశమయ్యారు. టీటీడీ వ్యవహారాలపై రాజకీయ నేతలు స్పందించడం మానేయాలని సూచించారు. తిరుమల దేవస్థానంలో కొన్ని రోజులుగా కొనసాగుతోన్న వివాదంపై మఠాధిపతులు, పీఠాధిపతులు స్పందించారు. ఈ మేరకు తిరుపతిలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో పీఠాధిపతులు సమావేశం నిర్వహించారు. హంపి పీఠాధిపతి విద్యారణ్య స్వామి, పరిపూర్ణానంద స్వామి, శివ స్వామి, కమలానంద భారతి తదితర పీఠాధితులు, మఠాధిపతులు ఈ సదస్సుకు హాజరై టీటీడీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు.

టీటీడీలో ధార్మిక మండలి ఏర్పాటు చేయాలని స్వామీజీలు ముక్తకంఠంతో నినదించారు. ఈ మండలిలో మఠాధిపతులు, పీఠాధిపతులను నియమించాలని డిమాండ్‌ చేశారు. టీటీడీలో పారదర్శకత లోపించిందని, పాలక మండలి సభ్యులు అన్యమతస్తుల కార్యక్రమాలకు హాజరు కావడమేంటని ప్రశ్నించారు. రమణ దీక్షితులు వ్యవహారంపై స్వామీజిలు ఆచితూచి వ్యవహరించారు. రమణ దీక్షితులు ఆరోపణలు చేయడం తప్పేనని అభిప్రాయ పడ్డ నేతలు....ఆయనను లక్ష్యంగా చేసుకొని రాజకీయ నేతలు విమర్శలు, ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అనువంశిక అర్చకులకు పదవీ విరమణ విధించడం సరికాదన్నారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసే వారెవరినీ సమర్ధించబోమని స్పష్టం చేశారు.

సరైన పద్దతిలో దేవాలయాలు ఉండాలన్న ఉద్దేశంతోనే సమావేశం నిర్వహించినట్లు స్వామీజీలు చెప్పారు. ధార్మిక పరిషత్‌ ఏర్పాటు చేసి సభ్యుల సలహాలను టీటీడీ ఉన్నతాధికారులు స్వీకరించాలని కోరారు. శ్రీవారి ఆభరణాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. టీటీడీలో ఉన్న అన్యమతస్తులను ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని కోరారు. టీటీడీ నిధులు ధార్మిక సంస్థలకే కేటాయించాలని, ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించరాదని డిమాండ్‌ చేశారు. తమ నిర్ణయాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని స్వామీజీలు తెలిపారు. ధార్మిక మండలి ఏర్పాటు అయితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. 

పవన్ పోరాట యాత్రకు విరామం...

విశాఖపట్టణం : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోరాట యాత్రకు విరామం ప్రకటించారు. రంజాన్ పండుగ సందర్భంగా యాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించినట్లు జనసేన పేర్కొంది. సోమవారం సాయంత్రం విశాఖ నుండి హైదరాబాద్ కు పయనం కానున్నారు. 

10-19 వరకు టెట్ పరీక్షలు...

విజయవాడ : ఈ నెల 10వ తేదీ నుంచి 19 వరకు ఆన్‌లైన్‌ విధానంలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ పరీక్షలు రెండు సెషన్స్‌లో జరుగుతాయని వెల్లడించారు. మొత్తం 3.97 లక్షల మంది టెట్‌ పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు.

ఎన్ కౌంటర్ లో నలుగురు నేరస్తుల హతం...

ఢిల్లీ : దక్షిణ ఢిల్లీలోని ఛత్తార్‌పూర్‌ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నేరస్థులు హతమయ్యారు. మరొకరు గాయపడ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో కరడుగట్టిన నేరస్థుడు రాజేశ్‌ భారతితో పాటు అతని అనుచరులు ముగ్గురు హతమయ్యారు. 

ముంబైలో స్తంభించిన జనజీవనం...

ఢిల్లీ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై మోకాళ్ల లోతువరకు నీరు నిలిచి ఉండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 

గ్యాంగ్ స్టర్ రవి పూజారీపై ఫిర్యాదు...

ఢిల్లీ : జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి ఉమర్‌ ఖాలీద్‌కు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఉమర్‌ ఖాలీద్‌ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్యాంగ్‌స్టర్‌ రవి పూజారి తనని బెదిరిస్తున్నట్లు ఉమర్‌ ఖాలీద్‌ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

కానిస్టేబుల్ ను చితకబాదిన ఎమ్మెల్యే...

మధ్యప్రదేశ్ : చట్టాన్ని కాపాడవలసిన ఓ బిజెపి ఎమ్మెల్యే పోలీస్‌స్టేషన్‌లోనే ఓ కానిస్టేబుల్‌ను చితకబాదాడు. మధ్యప్రదేశ్‌లోని ఉదయ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్‌ సిసిటీవీలో రికార్డ్‌ అయ్యాయి.

చైనా అధ్యక్షుడితో మోడి...

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోది కింగ్‌డావో నగరంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. భద్రత, ఉగ్రవాదంపై పోరాటంలో సహకారం, సాంస్కృతిక సంబంధాలపై ఇరు దేశాల నేతలు చర్చలు జరిపారు.

Don't Miss