Activities calendar

11 June 2018

21:45 - June 11, 2018

హైదరాబాద్ : సోషల్‌ మీడియాలో తనపై కొంత కాలంగా ఆరోపణలు చేస్తున్న నటి శ్రీరెడ్డిపై న్యాయపరమైన చర్యలకు దిగుతున్నట్లు సినీ హీరో నాని తెలిపారు. అనవసర ఆరోపణలతో శ్రీరెడ్డి తన పరువుకు భంగం కలిగిస్తోందంటూ లాయర్‌ ద్వారా నోటీసులు ఇచ్చారు. ఏడు రోజుల్లోగా సిటీ సివిల్‌ కోర్టుకు సమాధానం ఇవ్వాలని నాని లాయర్‌ చెప్పారు. ట్విటర్‌లో ఈ నోట్‌ను నాని తన అభిమానులతో పంచుకున్నారు. దీనిపై స్పందించిన శ్రీరెడ్డి న్యాయపరంగానే పోరాడుదాం అని ట్వీట్‌ చేశారు. 

21:42 - June 11, 2018

అమరావతి : పీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. రెండు పార్టీ నేతల పరస్పర ఆరోపణలు, విమర్శలతో రాష్ట్రం హోరెత్తుతోంది. పోటాపోటీ ధర్నాలు, నిరసనలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని బీజేపీ ఆరోపిస్తుంటే... అవినీతి, అసమర్థతకు మారుపేరు బీజేపీ అంటూ టీడీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు.

ఏపీలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య ముదిరిన మాటల యుద్ధం
ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్రం దుర్వినియోగం చేస్తోందన్నది బీజేపీ నాయకుల ఆరోపణ. కమలనాథుల ఆరోపణలను టీడీపీ నేతలు తోసిపుచ్చుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం దగా చేసిందన్నది టీడీపీ నాయకుల వాదన. ఈ విషయాలపై రెండు పార్టీ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకొంటున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయింది -కన్నా
రాష్ట్ర ప్రభుత్వ అవినీతి వ్యవహారాలు, కేంద్రం ఇస్తున్న నిధుల దుర్వినియోగంపై విచారణ జరించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు విజయవాడలో ధర్నా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో... చంద్రబాబు ప్రభుత్వ తీరుపై కమలనాథులు విరుచుకుపడ్డారు. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టడం చంద్రబాబుకు నైజమంటూ బీజేపీ నాయకులు మండిపడ్డారు. మొదట్లో కాంగ్రెస్‌, ఆ తర్వాత ఎన్టీఆర్‌, ఇప్పుడు ప్రధాని మోదీని చంద్రబాబు మోసం చేశారని కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు అర్థరహితం -బుద్దా వెంకన్న
రాష్ట్రంలో ఇసుకు మాఫియా రాజ్యమేలుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు. బీజేపీ ధర్నాకు పోటీగా టీడీపీ నాయకులు కూడా నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నఆధ్వర్యంలో ధర్నా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు టీడీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను బుద్దా వెంకన్న తిప్పికొట్టారు. బీజేపీ, టీడీపీ నేతల పోటాపోటీ నిరసనలతో విజయవాడ ధర్నా స్థలంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

21:37 - June 11, 2018

అమరావతి : జిల్లాలో వుండే టీడీపీ నేతలు చాలా కష్టపడి పనిచేస్తున్నారనీ..కానీ తమలో వున్న చిన్న చిన్న కారణాలతో చిన్న చిన్న బేదాభిప్రాయాలు తలెత్తటంతో కొంచెం ఇబ్బందులు వున్నాగానీ..పార్టీకోసం పనిచేస్తామని కడప జిల్లా నేతలు పేర్కొన్నారు. అందరం ఒకే మాట, ఒకేబాట, ఒకే అభిప్రాయంతో వున్నామనీ మంత్రి సోమిరెడ్డి స్పష్టం చేశారు. గుండెల మీద చేయి వేసుకుని ఈ మాట చెబుతున్నామని టీడీపీ నేతలు స్పష్టంచేశారు. కడప జిల్లా టీడీపీ నేతలలో వచ్చిన బేదాభిప్రాయాల నేపథ్యంలో కడప జిల్లా నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో సమావేశమయ్యారు. వారికి దిశా నిర్ధేశం చేశారు. కడప జిల్లాలో పార్టీ పరిస్థితి, నేతల మధ్య విభేదాలు వంటి పలు అంశాలపై చంద్రబాబు నాయుడు సమావేశంలో మాట్లాడారు. అనంతరం కడప జిల్లా నేతలు మీడియాతో సమావేశమయ్యి తమలో బేదాభిప్రాయాలు లేవనీ..తమ మాట, ఆలోచన, బాట ఒకటేనని వారు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు, సీఎం రమేశ్, ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

వాజ్ పేయ్ ఆరోగ్యంపై ఎయిమ్స్ ప్రకటన..

ఢిల్లీ : భారత మాజీ ప్రధాని వాజ్‌పేయి రెగ్యులర్ వైద్య పరీక్షల్లో భాగంగా ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఈ ఉదయం అడ్మిట్ అయ్యారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అంటూ యావత్ దేశం ఆందోళనకు గురవుతోంది. ఈ నేపథ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు ఓ స్టేట్ మెంట్ ను విడుదల చేశారు. "వాజ్‌పేయి ఆరోగ్యం స్థిరంగానే ఉంది. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా నేతృత్వంలోని ఓ వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. అవసరమైన అన్ని టెస్టులు నిర్వహించారు" అని స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. ఎయిమ్స్ ఛైర్ పర్సన్ పేరిట ఈ స్టేట్ మెంట్ ను విడుదల చేశారు.

21:05 - June 11, 2018

వారిద్దరిదీ విచిత్రమైన మనస్థత్వమే. తెంపరితనం, మొండి వైఖరి ఇద్దరికీ ఎక్కువే. ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగించిన దేశాధ్యక్షులు. ఒకరు ప్రపంచాన్నే శాసించగల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అయితే మరొకరు అణు పరీక్షలతో ప్రపంచాన్నే బెంబేలెత్తిస్తున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌. అలాంటి వీరు సింగపూర్‌లో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి సమావేశంపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రపంచాన్నే శాసించగల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.... అణు పరీక్షలతో ప్రపంచాన్నే బెంబేలెత్తిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌లు భేటీ కానున్నారు. ఇంతకు ముందు వరకు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకున్న వీరు ఇప్పుడు అణు చర్చలకు సిద్ధమయ్యారు. సింగపూర్‌ వేదికగా జరగబోతున్న ఈ భేటీపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ అంశంపై ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు విశ్లేషణ..

21:04 - June 11, 2018

హైదరాబాద్ : వరల్డ్ ఎల్డర్స్‌ ఎబ్యూస్‌ అవెర్నస్‌ డే సందర్భంగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో పెద్దల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఎలర్డ్ క్లబ్ ఇంటర్నెషనల్ పౌండేషన్ చైర్మన్ సి.ఎన్‌ గోపినాథ్‌ రెడ్డి తెలిపారు. 50 నుండి 100ఏళ్ల వయస్సు వారందరికీ ఎల్డర్స్‌ మేళా కార్యక్రమానికి ఆహ్వానించారు. 40 ఏళ్ల వయస్సు పైబడిన వారు వారి పిల్లల నుంచి సరైన ఆదరణలేక ఇబ్బందులు పడుతున్నారని.. వీరిని ద్రుష్టిలో పెట్టుకుని ఈ ఎల్డర్స్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పెద్ద సంఖ్యలో వృద్ధులు తరలిరావాలని గోపినాధ్‌ కోరారు. ఈ నెల 15న నక్లెస్‌ రోడ్డులో వృద్ధుల మౌన ప్రదర్శన ఉంటుందని.. ప్రదర్శనలో పాల్గొనే వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు.

21:02 - June 11, 2018

హైదరాబాద్ : సింగరేణి సంస్థ ఛైర్మన్‌, ఎండీ ఎన్‌. శ్రీధర్‌కు మరో అంతర్జాతీయ స్థాయి పురస్కారం దక్కింది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ స్టడీస్‌ వారి అవుట్‌ స్టాండింగ్‌ లీడర్‌షిప్‌ అవార్డుకు ఎంపికయ్యారు. సింగరేణి సంస్థను గత నాలుగేళ్ల కాలంలో అభివృద్ధిదాయక సంస్థగా రూపుదిద్దడంలో శ్రీధర్‌ ఎంతగానో కృషి చేశారు. జూన్‌ 28న దుబాయిలో జరగనున్న గ్లోబల్‌ ఎకనామిక్‌ సమిట్‌లో ఈ అవార్డును శ్రీధర్‌ అందుకోనున్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ స్టడీస్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ సంగీతాసింగ్‌ లేఖ ద్వారా శ్రీధర్‌ను ఆహ్వానించారు. ఏప్రిల్‌ 13న న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఎంటర్‌ ప్రైజ్‌ ఏషియా అనే అంతర్జాతీయ సంస్థ 'ఆసియా పసిఫిక్‌ ఎంటర్‌ ప్రెన్యూర్ షిప్‌ 2018' అవార్డును శ్రీధర్‌కు బహుకరించారు.

21:00 - June 11, 2018

ఢిల్లీ : దేశంలో ఎస్సీ, ఎస్టీ చట్టం నిర్వీర్యమవుతోందని ఏపీ టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ ప్రతినిధుల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ను కలిశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ను కలిసిన ఏపీ మంత్రులు
దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఏపీ టీడీపీ నేతలు ఆరోపించారు. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ను కలిసిన ఏపీ మంత్రులు ఎస్సీఎస్టీ వేధింపుల నిరోదక చట్టాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బీజేపీ పాలనలో దళితులపై దాడులు : టీడీపీ
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయని టీడీపీ ఎస్సీ,ఎస్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దళిత, ఆదివాసీ వర్గాలకు రక్షణగా ఉన్న అట్రాసిటీ నిరోదక చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలో పాలకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై జ్యుడీషియరీ... జడ్జిమెంట్‌ ఇచ్చేప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని టీడీపీ నేతలు కోరారు.

దళితులపై దాడులు పెరుగుతున్నాయి : వైసీపీ
మరోవైపు టీడీపీ పాలనలోనే రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని వైసీపీ ఆరోపించింది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని నీరు కార్చింది టీడీపీ పాలకులేనని వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్‌ విమర్శించారు. దళితులపై దాడులు అరికట్టడంలో విఫలమైన టీడీపీ మంత్రులు, నాయకులు... రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ని కలవడంలో అర్థంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మారెప్ప ఆగ్రహం..
దేశంలో దళితులపై దాడులు పెరిగిపోతుండగా బీజేపీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం నీరుగారుస్తున్నారని మాజీ మంత్రి మారెప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై రాష్ట్రపతి స్పందించాలని కోరారు.

ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించిన దత్తాత్రేయ
బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఖండించారు. బీజేపీపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మోదీకి ఉన్న ప్రజాదరణను ఓర్చుకోలేక ప్రతిపక్షాలు కేంద్రంపై కుట్ర పన్నాయని ఆరోపించారు. దళితుల అభివృద్ధికి బీజేపీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని దత్తాత్రేయ తెలిపారు. మరోవైపు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేయాలన్న టీడీపీ నేతల విజ్ఞప్తిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సానుకూలంగా స్పందించినట్లు టీడీపీ నేతలు తెలిపారు. 

20:55 - June 11, 2018

పశ్చిమగోదావరి : నదుల అనుసంధానంలో ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేయాలన్నదే తన కృతనిశ్చయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మెట్ట, మాగాణి అన్న తేడా లేకుండా ప్రతి ఎకరం భూమికి సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు బాబు చెప్పారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు తీసుకొంటున్నామన్నారు. 
డయాఫ్రం వాల్‌ను జాతికి అంకితం చేసిన చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తైన సందర్భంగా.. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం డయాఫ్రం వాల్‌ను జాతికి అంకితం ఇచ్చారు. రికార్డు సమయంలో డయాఫ్రం వాల్‌ను పూర్తి చేసిన ఇంజినీర్లు, సిబ్బంది, కాంట్రాక్టర్లను చంద్రబాబు అభినందించారు.

ప్రాజెక్టును చంద్రబాబు 63 వారాలు వర్చువల్‌గా తనిఖీలు
పోలవరం నిర్మాణ పురోగతిపై సమీక్షించిన చంద్రబాబు.. ప్రాజెక్టును 63 వారాలు వర్చువల్‌గా తనిఖీ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం చేసిన విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. రాష్ట్రంలోని అన్ని నదులను అనుసంధానం చేసి.. మహాసంగమం నిర్మిస్తామని చెప్పారు. పోలవరంతో నిర్వాసితులయ్యే లక్ష కుటుంబాల పునరావాసానికి 21 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉందన్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇంతవరకు చేసిన ఖర్చులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి 29 ప్రాజెక్టులను పూర్తిచేస్తామని చెప్పిన చంద్రబాబు.. ప్రతిపక్ష వైసీపీ సాగునీటి పథకాల నిర్మాణానికి అవరోధాలు కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంతోపాటు మట్టి తవ్వకం పనులు కూడా సాధ్యమైనంత తర్వగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. 

టీఆర్టీ ర్యాంకుల్లో తప్పులపై టీఎస్ పీఎస్సీ స్పందన..

హైదరాబాద్ : టీఆర్టీ ర్యాంకుల్లో టీఎస్ ఈఎస్సీ స్పందించింది. పొరపాట్లు సరిదిద్దేందుకు టీఎస్ పీఎస్సీ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసింది. ఈనెల 13 లోగా హాల్ టికెట్ సీడీ3ఎఫ్ ప్రకతితో హెల్ప్ డెస్క్ లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. వీఆర్వో, గ్రూప్ 4 ఆన్ లైన్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలతో మూడు రోజులుగా అభ్యర్థులు ఫీజులు చెల్లించలేకపోతున్నారు. దీంతో ఫీజుల చెల్లింపు గేట్ వేలో సమస్యలను సరిదిద్దామని టీఎస్ పీఎస్సీ తెలిపింది. 

మాజీ ప్రధానికి ప్రధాని మోదీ పరామర్శ..

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయ్ అస్వస్థతకు గురై ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి వాజ్ పేయ్ ను పరామర్శించారు. వాజ్ పేయ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

20:02 - June 11, 2018

దేశంలో మోదీ మాయాజాలానికి తిరుగులేదని భావిస్తున్న బీజేపీకి...గడ్డు కాలం రానుంది. దేశంలో విజయ ఢంకా మోగించిన బీజేపీకి 152 చోట్ల వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.. ఇదేదో ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం కాదు... సాక్ష్యాత్తూ బీజేపీ జరిపిన అంతర్గత సర్వేలో వెల్లడైన పచ్చినిజం. ఈ సర్వే ఫలితాలతో కమలనాథుల్లో గుబులు పుట్టిస్తోంది. బీజేపీలో మూడో స్థాయి నాయకత్వం అభివృద్ధిపై పార్టీ అధిష్ఠానంతోపాటు.. సంఘ్‌ పరివార్‌ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇటీవల ఉజ్జయినిలో సమావేశమైన అమిత్‌ షా, మోహన్‌ భగవత్‌, భయ్యాజీ జోషి చర్చించినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. టికెట్ల కేటాయింపుతో పాటు.. 75 ఏళ్లు పైబడినవారి విషయంలోనూ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై చర్చ. ఈ చర్చలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నంద్యాల నరసింహారెడ్డి బీజేపీ అధికార ప్రతినిథి కుమార్, కాంగ్రెస్ అధికార ప్రతినిథి మహేశ్ పాల్గొన్నారు.

నీరవ్ మోదీ ఆచూకీ తెలిస్తే చర్యలు : సీబీఐ

ఢిల్లీ : నీరవ్‌ మోదీ ఎక్కడున్నారన్న దానిపై ఎలాంటి ధ్రువీకరణ లేదని సీబీఐ అధికారులు ఈరోజు తేల్చి చెప్పారు. ఆయన ఎక్కడున్నాడన్న విషయం తెలిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీరవ్‌ మోదీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి పారిపోయిన విషయం తెలిసిందే. ఆయన విజయ్‌ మాల్యాలాగే లండన్‌లో తలదాచుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ ఇలా స్పందించి వివరణ ఇచ్చింది. కాగా నీరవ్ మోదీ లండన్ లోనే వున్నాడని బ్రిటన్ అధికారులు ధృవీకరించారు. బ్రిటన్ లో రాజకీయ ఆశ్రయం కోసం నీవర్ మోదీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు.

వాజ్ పేయ్ ఆరోగ్య పరిస్థితిపై అమిత్ షా ఆరా..

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయ్ అస్వస్థతకు గురై ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వాజ్ పేయ్ ఆరోగ్య విషయం తెలుసుకునేందుకు ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. వాజ్ పేయ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

ఆర్టీసీ వేతన బకాయిల విడుదల..

విజయవాడ : ఆర్టీసీ కార్మికుల వేతన సమరణ బకాయిలను యాజమాన్యం విడుదల చేసింది. 2013లో వేతన సమరణ సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ యాజమాన్యం రూ.120 కోట్ల బకాయిలను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని కార్మికుల ఖాతాల్లో జమ చేసింది. 51 వేలమంది ఆర్టీసీ కార్మికులకు ఈ బకాయిల విడుదల ద్వారా లబ్ది పొందనున్నారని ఆర్టీసీ ఎండీ సురేశ్ బాబు తెలిపారు. 

లండన్ లో వున్న నీరవ్ మోదీ..

ఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ కుంభకోణం చోటుచేసుకున్నట్టు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈకుంభకోణంలో దాదాపు రూ.11,346 కోట్ల మేరకు కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీరవ్ మోదీ లండన్ లోనే వున్నాడని బ్రిటన్ అధికారులు ధృవీకరించారు. బ్రిటన్ లో రాజకీయ ఆశ్రయం కోసం నీవర్ మోదీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. కాగా నాలుగు నెలల క్రితం నీవర్ మోదీ పాస్ పోర్టును భారత ప్రభుత్వం రద్దు చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో నీరవ్ మోదీ బ్రిటన్ లోనే వున్నట్లుగా అధికారులు ధృవీకరించారు. 

ప్రధాని భద్రతపై రాజ్ నాథ్ సమీక్ష..

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ భద్రతపై హోంమంత్రి రాజ్ నాథ్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఏ, ఐబీ చీఫ్ పాల్గొన్నారు. కాగా గత కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారనే విషయంపై కలకలం కేరిగి విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రధాని మోదీ భద్రత విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సమీక్షిస్తున్నారు. 

కడప జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశం..

అమరావతి : కడప జిల్లా నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. కడప జిల్లాలో పార్టీ పరిస్థితి, నేతల మధ్య విభేదాలు వంటి పలు అంశాలపై చంద్రబాబు నాయుడు సమావేశంలో మాట్లాడారు. ఈసమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు, సీఎం రమేశ్, ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

19:27 - June 11, 2018

విజయవాడ : పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు అని ఈ ప్రాజెక్టులో జాతీయ స్కామ్ లా తయారయ్యిందని వైసీపీ నేత ఎస్సార్కే విమర్శించారు. 2014లో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి ఒక ప్రయివేటు కాంట్రాక్టర్ లాగా ఒక పథకం ప్రకారంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని..పోలవరం ప్రాజెక్టును అక్రమార్జనకు సంజీవనిలా చంద్రబాబు వినియోగించుకుంటున్నాని విమర్శలు సంధించారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగనేత రాజశేఖర్ గారి పాలనలో పోలవరం 35 శాతం పనులు పూర్తయ్యాయనీ..ఇప్పుడు టీడీపీ హయాంలో కేవలం 15 శాతం మాత్రమేనన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు బంగారు గుడ్లు పెట్టే బాతులా ఉపయోగించుకుంటున్నారన్నారు. 

18:59 - June 11, 2018

వనపర్తి : రాష్ర్టంలో జిల్లాలు, మండలాలతోపాటు.. ప్రభుత్వ పథకాలూ పెరిగాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులపై పని ఒత్తిడీ పెరిగింది. ఇవి చాలవన్నట్లు ఆరు నెలలుగా.. ఉన్నతాధికారుల ఒత్తిళ్తూ మితిమీరాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెవెన్యూ ఉద్యోగులు. ఈ భారం ఇక భరించలేమంటూ.. వనపర్తి జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు..

ఉద్యోగుల భర్తీని పట్టించుకోని ప్రభుత్వం
తెలంగాణ రాష్ర్టం ఏర్పాటై నాలుగేళ్ళు గడుస్తున్నా.. ఉద్యోగుల భర్తీ గురించి ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న ప్రభుత్వం.. వాటిని ప్రజలకు అందించాల్సిన అధికారుల భర్తీ గురించి ఆలోచించడం లేదని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

6 మంది రెవెన్యూ అధికారులను సస్పెండ్‌ చేసిన కలెక్టర్
ఓవైపు సిబ్బంది కొరత వేధిస్తుంటే.. మరోవైపు ఉన్నత అధికారులు బెదిరిస్తున్నారు. గడువులోపు పనులు పూర్తి చేయకుంటే సస్సెండ్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో.. దాదాపు 6 మంది రెవెన్యూ అధికారులను కలెక్టర్ శ్వేత మహంతి సస్సెండ్ చేశారు. దీంతో వ్యవహారం కలెక్టర్‌ వర్సెస్‌ రెవెన్యూ ఎంప్లాయిస్‌గా మారింది.

565 రెవెన్యూ గ్రామాలకు 225 మంది వీఆర్వోలు
జోగులాంబ గద్వాల జిల్లాలో కలెక్టర్‌ స్థాయినుంచి అన్ని శాఖల్లోనూ ఇంచార్జీ అధికారులే వున్నారు. చిన్న జిల్లాలతోనే అభివృధ్ది సాధ్యమన్న సీఎం కేసిఆర్.. ఉద్యోగుల నియామకంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాలమూరు జిల్లాలో 565 రెవెన్యూ గ్రామాలకు గాను 225 మంది మాత్రమే వీఆర్వోలు ఉన్నారు. వీరు రోజువారి కార్యక్రమాలతో పాటు.. మరో 65 రకాల సేవలు అందించాల్సి ఉంటుంది.ఒక్కో వీఆర్వోకు 2 నుంచి 5 గ్రామాల బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.

జిల్లాలో మొత్తం 1483 మంది వీఆర్‌ఏలకు గాను 1342 మంది
మహబూబ్‌నగర్ డివిజన్ కోయిల్‌కొండ మండలంలో 36 రెవెన్యూ గ్రామాలకు.. 11మంది వీఆర్వోలు, నవాబ్‌పేటలో 32 గ్రామాలకు.. 15 మంది, రాజాపూర్ మండలంలో 16 గ్రామాలకు.. ముగ్గురు, నారాయణపేట రెవెన్యూ డివిజన్ మద్దూర్ మండలంలో 30 గ్రామాలకు.. 15మంది, దన్వాడలో 27 గ్రామాలకు.. 10మంది, నర్వ లో 20 గ్రామాలకు.. నలుగురు, ఉట్కూర్‌లో 27గ్రామాలకు.. 11మంది వీఆర్వోలు మాత్రమే ఉన్నారు. ఆలాగే 38మంది తహశిల్దార్లకు గాను 34మందే ఉన్నారు. రెవెన్యూ శాఖలో 101 మంది సీనియర్ అసిస్టెంట్లకు గాను 78 మంది మాత్రమే పని చేస్తున్నారు. 112మంది సబార్డినేటర్లకు గాను 66 మంది మాత్రమే ఉన్నారు. జిల్లాలో మొత్తం 14 వందలా 83 మంది వీఆర్‌ఏలకుగాను 13 వందలా 42 మంది మాత్రమే పని చేస్తున్నారు. తమకు భారమైనా కూడా.. జిల్లాకు మంచి పేరు తేవాలన్న లక్ష్యంతో.. పని చేస్తున్నామని రెవెన్యూ ఉద్యోగులు అంటున్నారు. వాస్తవాన్ని గమనించి.. చిరుద్యోగులను సస్పెండ్‌ చేయకుండా.. పనులు చేయించుకోవాలంటున్నారు రెవెన్యూ ఉద్యోగ సంఘ నేతలు.

18:56 - June 11, 2018

సంగారెడ్డి : జిల్లా రామచంద్రాపురంలోని మార్గదర్శిని ఎడ్యుకేషనల్‌ సొసైటీలో స్థల వివాదం నెలకొంది. ఈ విషయమై సొసైటీ సభ్యులకు, స్కూల్‌ యాజమాన్యానికి మధ్య వివాదం చోటుచేసుకుంది. సొసైటీ ప్రెసిడెంట్ బాలయ్య స్థలం విషయమై యాజమాన్యాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ లక్ష రూపాయలు డిమాండ్‌ చేశాడు. అందుకు అంగీకరించకపోవడంతో స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. దీనికి మద్దతుగా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, తెల్లాపూర్‌ గ్రామ పంచాయితీ సర్పంచ్‌ సోమిరెడ్డి, ఎమ్మెల్యే అనుచరులు స్కూల్‌కి వచ్చి యాజమాన్యాన్ని బెదిరించారు. ఈ తతంగాన్ని వీడియో తీస్తున్న స్కూల్‌ జాయింట్‌ సెక్రటరీ విజయలక్ష్మి ఫోన్‌ను...ఎమ్మెల్యే అనుచరులు బలవంతంగా లాక్కొని వీడియోను డెలీట్‌ చేశారు. తమపై దౌర్జాన్యానికి దిగిన వారిపై చర్యలు తీసుకొని స్కూల్‌కి న్యాయం చేయాలంటూ స్కూల్‌ యాజమాన్యం కోరుతోంది. 

18:53 - June 11, 2018

కర్నూలు : జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులపై రైతుసంఘం చేపట్టిన ఆందోళనకు సీపీఎం పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్‌ తెలిపారు. జిల్లాలో తాగు, సాగునీరు అందించేవరకు రైతులు దశలవారిగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు రైతాంగం పోరాటాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీలను నెరవేర్చేంత వరకు రైతుల పోరాటం ఆగదని గఫూర్ పేర్కొన్నారు.

18:48 - June 11, 2018

అదిలాబాద్‌ : జిల్లాలోని పలు ప్రాంతాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. సుశ్మీర్‌ గ్రామం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చుట్టుపక్కల ఆరు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మావల, గుడిహత్నూర్‌, తలమడుగు, తాంసి మండలాల్లో ఈదురు గాలులతో కూడిన ఈ భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పలు కేంద్రలో రోడ్లు జలమాయం అవగా..... ఈదులు గాలులకు పూరి గుడిసెల పైకప్పులు ఎగిరిపోయ్యాయి. మరి కొన్ని చోట్ల గోడలు నేలకూలయి.

18:47 - June 11, 2018

నిజామాబాద్ : తొలకరి కురవడంతో.. అన్నదాతలు సాగుకు సమాయత్తమవుతున్నారు. అయితే దుక్కి దున్నడానికి కాడెద్దుల కొరత రైతన్నలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎడ్లను అద్దెకు తెచ్చుకుని మరీ సాగు చేస్తున్నారు. ఎడ్లను అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకుని .. నెలకు 15 వేల రూపాయలు చెల్లిస్తున్నారు. ఎన్ని యంత్రాలు వచ్చినా..కొన్ని సందర్భాల్లో ఎడ్ల అవసరాన్ని మాత్రం తీర్చలేకపోతోంది. దీంతో అన్నదాతలు అద్దె ఎడ్ల కోసం క్యూ కడుతున్నారు.

అద్దె ఎడ్ల కోసం క్యూ కడుతున్న రైతులు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని పశువుల సంతలో చాలా మంది రైతులు అద్దె ఎడ్ల కోసం క్యూ కడుతున్నారు. మరికొందరు అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకుంటున్నారు.

పసుపు పంటకు కిరాయి ఎడ్లు ..అద్దె ఎడ్ల కోసం నెలకు రూ.15 వేలు చెల్లిస్తున్న రైతులు
ఖరీఫ్‌ సాగుకు అన్నదాతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ప్రధాన పంట పసుపు కావడంతో నాగలి సాలు తప్పనిసరి. ఇందు కోసం రైతులు అద్దె ఎడ్లను సమకూర్చుకుంటున్నారు. అద్దె ఎడ్ల కోసం నెలకు 15 వేల రూపాయల కిరాయి చెల్లించడానికి కూడా వెనకాడడంలేదు. అద్దె ఎడ్ల కోసం రైతులు ముందస్తుగానే డబ్బులు చెల్లించి ఎడ్లను బుక్‌ చేసుకుంటున్నారు.

ఎడ్లకు బదులు యంత్రాలు వాడుతున్న రైతులు
కాలం కలిసిరాకపోవడం.. కరువుతో పాటు వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రావడంతో ఎడ్లకు బదులు యంత్రాల వాడకం పెరిగిపోయింది. అయితే పసుపు వంటి పంటలకు నాగలి సాలు అవసరం కావడంతో ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి జత ఎడ్లను నెల రోజులకు అద్దెకు తీసుకుంటున్నారు. అందుకు ఎడ్ల వ్యాపారి వద్ద ముందుగానే 15 వేలు డిపాజిట్‌ చేసుకుంటున్నారు. ఇలా అద్దెకు తీసుకున్న ఎడ్ల పోషణ రైతులే చూసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని యంత్రాలు వచ్చినా.. పంటలో కలుపు తొలగించేందుకు గుంటుక, నాగటి సాలుకు మాత్రం ఎడ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇది పశువులను సాకుతున్న వారికి లాభసాటిగా మారుతోంది. 

16:59 - June 11, 2018

మేడ్చల్ : ఆర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని లేకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. డబుల్ బెడ్‌రూంలలో అవకతవకలు జరిగాయని.. ఎమ్మెల్యేల కోటాలో పంచుకుంటున్నారని టీడీపీ నేత పెద్దిరెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని వారు హెచ్చరించారు. మేడ్చల్ కలెక్టరేట్ వద్ద వామపక్షాల మహాధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీడీపీ నేత పెద్దిరెడ్డి తదితురులు పాల్గొన్నారు.

16:57 - June 11, 2018

విజయవాడ : ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు అవినీతి ఆరోపణలు చేయడాన్ని నిరసిస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి జరగలేదని..బీజేపీ నేతలు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. అమిత్‌ షా పై దాడికి చంద్రబాబుకు సంబంధం లేదన్నారు. బిజెపి నేతలు టిడిపిపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కన్నా లక్ష్మీనారాయణకు 2019 ఎన్నికల్లో డిపాజిట్స్ వస్తే తాను గుండు కొట్టించుకుంటానని బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. అక్రమాస్తులకు కాపాడుకునేందుకే కన్నా బీజేపీలో చేరారనీ..కన్నా ఆస్తులపై సీబీఐ ఎంక్వయిరీ వేయించుకునే దమ్ము కన్నాకు వుందా? అని బుద్దా ప్రశ్నించారు.

16:54 - June 11, 2018

గుంటూరు : దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రధాని నరేంద్రమోదీ తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, జగన్‌లతో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. చంద్రబాబుతో ఎవరు పొత్తు పెట్టుకున్నా మట్టికరవక తప్పదని మధు జోస్యం చెప్పారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో సీపీఎం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన మధు.. రాబోయే రోజుల్లో ప్రజాస్వామికవాదులను కలుపుకొని వెళ్లనున్నట్లు తెలిపారు. 

తెలంగాణలో దళితులకు పాలించే హక్కు లేదా?: మీరాకుమార్

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలపై లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దళితుడిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను ఆ పదవి నుంచి తొలగించారని అన్నారు. దళిత ఎమ్మెల్యే సంపత్ ను శాసనసభ నుంచి బహిష్కరించారని విమర్శించారు. తెలంగాణలో దళితులకు పాలించే హక్కు లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో స్వేచ్ఛను హరించే యత్నం జరుగుతోందని... ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని మండిపడ్డారు.

16:15 - June 11, 2018

రంగారెడ్డి : మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. తన పుట్టినరోజు వేడుకలకు సొంత కాలేజ్ స్టాఫ్ నుండి డబ్బు వసూలు చేసేందుకు సిద్ధపడ్డారు. దీనికి సంబంధించి స్టాఫ్ కు ఓ సర్క్యేలర్ కూడా జారీ చేశారు. కాలేజ్ ఉద్యోగులంతా తమ జీతాలలో నుండి సగం డబ్బులు ఇవ్వాలంటు కాలేజ్ ప్రిన్సిపల్ పేరిట సర్క్యులర్ ను విడుదల చేశారు. దీంతో ఈ సర్క్యులర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

15:50 - June 11, 2018

కర్నూలు : జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం ఆధ్వర్యంలో రైతులు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో దాదాపు 5 వేల మంది రైతులు పాల్గొని కలెక్టరేట్‌ ముందు ఆందోళన చేపట్టారు.. ఈ నెల 5 నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని 25 మండలాల్లో పాదయాత్రలు నిర్వహించారు. పచ్చగా ఉన్న జిల్లా ఎడారిగా మారుతోందని రైతులు వాపోతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

15:48 - June 11, 2018

పశ్చిమగోదావరి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం డ్యాం సైట్‌ను సందర్శించారు. పనులు జరుగుతున్న తీరును పరిశీలించి.....పనులను రికార్డు స్థాయిలో పూర్తిచేశారని ఇంజనీర్‌లను అభినందించారు. రాష్ట్రంలో నీటి కరువు లేకుండ చేస్తామని బాబు అన్నారు. పోలవరం ‌ప్రాజెక్టు పూర్తిచేసి ఓ చరిత్ర సృష్టంచబోతున్నమని తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా భూ సేకరణ చేసి, అందరికి న్యాయం చేశామన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు.

15:45 - June 11, 2018

ఢిల్లీ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయని టీడీపీ ఎస్సీ,ఎస్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దళిత, ఆదివాసీ వర్గాలకు రక్షణగా ఉన్న అట్రాసిటీ నిరోదక చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలో పాలకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ను కలిసిన టీడీపీ నేతలు ఎస్సీఎస్టీ అట్రాసిటీ నిరోదక చట్టాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

ప్రణబ్ కు ఝలక్ ఇచ్చిన కాంగ్రెస్..

ఢిల్లీ : పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరుకలు ఈ నెల 13న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ విందుకు ఆహ్వానించే జాబితాలో హై-ప్రొఫైల్ నేతల పేర్లు ఉన్నట్టు సమాచారం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఇఫ్తార్ విందు ఆహ్వానం అందలేదని సమాచారం. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఢిల్లీలో ని తాజ్ ప్యాలెస్ హోటల్ లో ఈ విందు ఏర్పాటు చేసింది.

మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..

హైదరాబాద్ : మరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడింది. మియాపూర్ లో కీర్తన అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉన్న ఆల్విన్ కాలనీలోని నివాసంలో ఆమె తొమ్మిదేళ్ల క్రితం శ్రీధర్ తో కీర్తనకు వివాహం జరిగింది. కీర్తన ఆత్మహత్య సమాచారం అందుకు న్న పోలీసులు సంఘటనాస్థతికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి కీర్తన ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఇతర కారణం ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

15:19 - June 11, 2018

సీఎం చంద్రబాబును 'మగ వగలాడి' : పోసాని

హైదరాబాద్ : సంచల వ్యాఖ్యలు చేస్తు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా వుండే నటుడు పోసాని కృష్ణమురళి సీఎం చంద్రబాబుపై నటుడు సంచల వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు మగ వగలాడి అనీ...వేరే పార్టీలో నెగ్గిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కోవటమా ఏపీ అభివృద్ధి అంటే అని నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఓటు వేస్తే..బీజేపీకి ఓటు వేసినట్లేనని చంద్రబాబు అన్నారనీ.. చంద్రబాబుకు ఓటు వేస్తే కమ్మకులానికి ఓటు వేసినట్లేనని సోసాని ఎద్దేవా చేశారు.

15:16 - June 11, 2018

హైదరాబాద్ : సంచల వ్యాఖ్యలు చేస్తు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా వుండే నటుడు పోసాని కృష్ణమురళి సీఎం చంద్రబాబుపై నటుడు సంచల వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు మగ వగలాడి అనీ...వేరే పార్టీలో నెగ్గిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కోవటమా ఏపీ అభివృద్ధి అంటే అని నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఓటు వేస్తే..బీజేపీకి ఓటు వేసినట్లేనని చంద్రబాబు అన్నారనీ.. చంద్రబాబుకు ఓటు వేస్తే కమ్మకులానికి ఓటు వేసినట్లేనని సోసాని ఎద్దేవా చేశారు. బీజేపీతో పెత్తు పెట్టుకుని ఏపీకి చంద్రబాబు తీవ్రంగా ద్రోహం చేశారనీ..సీఎం పదవి కోసం చంద్రబాబు ఎంతటి దారుణానికైనా దిగజారారన్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ కు విలువల్లేవన్న చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ లో ఆయన విగ్రహాన్ని ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. చంద్రబాబుతో కలిసి వున్నవారంతా ఎన్టీఆర్ కు విలువలు లేవని ఒప్పుకున్నట్లేనన్నారు.

15:00 - June 11, 2018

విజయవాడ : ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తున్న విజయవాడ ధర్నా చౌక్ వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. తాము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే టీడీపీ నేతలు రెచ్చగొంటేందుకు యత్నిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినా..నేతలు ఇసుకమాఫియా దందాలు మనటంలేదని విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అవినీతిని బైటపెడతామని..ఇసుక మాఫీయాలకు అలవాటు పడ్డ టీడీపీ నేతలు లంచాలు ఇవ్వకుండా ఒక్క ట్రక్ ఇసుకను కూడా ఇవ్వటంలేదని ఆరోపించారు. 2019 ఎన్నికల కోసం అవినీతి సొమ్మును ప్రోగు చేసుకుంటున్నారన్నారు. శాంతియుతంగా తాము ధర్నా చేస్తుంటే..తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనీ..తమపై దెబ్బవేసే దమ్ము టీడీపీ లేదనీ..ఒకవేళ వుంటే ఒంటిపై దెబ్బ వేసి చూడాలని ప్రభుత్వానికి బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సవాల్ విసిరారు. 

బీజేపీ, టీడీపీ పోటా పోటీ..ఉద్రిక్తత..

విజయవాడ : ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ ధర్నాకు కౌంటర్ గా టీడీపీ నేతలు కూడా నిరసన తెలిపారు. టీడీపీ పాలనలో రాష్ట్రంలో అవినీతి పేరుకుపోతోందని బీజేపీ ధర్నా చేపట్టింది. దీంతో టీడీపీ బీజేపీ పార్టీ ఏపీకి ఇచ్చిన హామీలన అమలు చేయాలని నిరదిస్తున బీజేపీ ధర్నాకు కౌంటర్ గా నిరసన చేపట్టింది. ఇరు పార్టీల నేతలు పోటీపోటీగా నినాదాలు చేస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తతంగా మరింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. 

పోలవరం పూర్తి చేయటం నా జీవితాశయం : చంద్రబాబు

పశ్చిమగోదావరి : ఇంజనీర్లను, గుత్తేదార్లను అభినందించారు. అనంతరం, స్పిల్ ఛానెల్ వద్ద పదమూడు జిల్లాల రైతులతో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, పోలవరంలో డయాఫ్రం వాల్ పూర్తి చేయడం ఒక చరిత్ర అని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడు లక్షల ఎకరాలకు నీరందుతుందని అన్నారు. నదుల అనుసంధానంతో నీటి కరవును పారద్రోలుతామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం తన జీవితాశయమని అన్నారు. రెండు నదులు అనుసంధానం చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, వంశధార, నాగావళి, పెన్నా, గోదావరి నదుల అనుసంధానం కూడా చేస్తామని, వర్షపు నీటిని భూగర్భజలాలుగా మార్చుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు

నాకు సోమవారమంటే 'పోల'వారమే : చంద్రబాబు

పశ్చిమగోదావరి : ‘పోలవరం’ పూర్తయ్యే వరకూ తనకు సోమవారం పోలవారమేనని, 2019 డిసెంబర్ నాటికి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని, ఎన్ని అడ్డంకులు పెట్టినా సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని సీఎ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పూర్తి అయిన సందర్భంగా పైలాన్ ను ఆవిష్కరించారు.డయా ఫ్రం వాల్ ను జాతికి అంకితం చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా డయాఫ్రం వాల్ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. 

14:32 - June 11, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత, బీజేపీ కురువృద్ధుడు.. అటల్ బిహారీ వాజ్ పేయ్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా రొటీన్ చెకప్, పరీక్షల నిమిత్తం ఆయన ఆసుపత్రిలో చేరినట్లుగా బీజేపీ అధికారికంగా ప్రకటించింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 93 సంవత్సరాల వాజ్ పేయి బయటకు రావడం లేదు. 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా 1924లో వాజ్ పేయి జన్మించిన వాజ్ పేయ్ వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగానే వుండిపోయారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. లక్నో లోక్ సభ స్థానం నుంచి 1991,1996,1998,1999, 2004 సంవత్సరాల్లో పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు.2015లోభారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ఆయనకు లభించింది.

మాజీ ప్రధాని వాజ్ పేయ్ కు అస్వస్థత ..

ఢిల్లీ : మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్ పేయ్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా గత కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు కూడా హాజరుకాని విషయం తెలిసిందే. కాగా సాధారణ చెకప్ కోసమే ఎయిమ్స్ లో వాజ్ పేయ్ అడ్మిట్ అయ్యారని బీజేపీ అధికారికంగా ప్రకటించింది. 

13:33 - June 11, 2018
13:31 - June 11, 2018

ఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం ఇచ్చిన తీర్పు..దళితులు జరుగుతున్న దాడులపై ప్రతిపక్ష నేత జగన్ ఎందుకు స్పందించరని టిడిపి నేత, ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం నిర్వీర్యమౌతుందని రాష్ట్రపతికి టిడిపి బృందం ఫిర్యాదు చేసింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని చేర్చాలని రాష్ట్రపతిని కోరింది. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి 15 నిమిషాలకి ఒక దళితుడిపై దాడి జరగుతోందని...ఆరుగురు దళితులు అత్యాచారానికి గురవుతున్నారన్నారు. దేశంలో దళిత వర్గాలపై జరిగిన దాడులు 66 శాతానికి పెరిగాయన్నారు. దీనితో దళితులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారని, ఎస్సీ, ఎస్టీ చట్టం నిర్వీర్యం అవడానికి వీలు లేదని...చట్టంలో మార్పు చేయవద్దని ఏపీ సీఎం బాబు కేంద్రానికి లేఖ రాయడం జరిగిందన్నారు. ఈ విషయంలో జగన్ ఎందుకు స్పందించడం లేదని, కేవలం బిజెపితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దేశ వ్యాపితంగా బిజెపికి ఎదురుగాలి వీస్తుందని టివి ఛానళ్లు, పత్రికల్లో ప్రముఖంగా వార్తలు వచ్చాయని, కానీ సాక్షి పేపర్, సాక్షి ఛానెల్ లో రాలేదన్నారు. 

13:27 - June 11, 2018

ఢిల్లీ : ఏపీ రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి జవహార్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం నిర్వీర్యమౌతుందని రాష్ట్రపతికి టిడిపి బృందం ఫిర్యాదు చేసింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని చేర్చాలని రాష్ట్రపతిని కోరింది. అనంతరం మంత్రి జవహార్ మాట్లాడారు. ఈ విషయంలో ప్రతిపక్షం కూడా స్పందించకపోవడం దారుణమన్నారు. దళితులుకున్న ఆహార అలవాట్లు..ఆచార వ్యవహారాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. దళితుల యొక్క ఆత్మగౌరవం..సంక్షేమం కోసం ఏపీ రాష్ట్రంలో కృషి జరుగుతోందన్నారు. బడుగు, బలహీన వర్గాల రక్షణ ప్రభుత్వాలు చూసుకోవాల్సి ఉందని, ఏపీ రాష్ట్రంలో దళితులు అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేస్తుండడంతో దళితులు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. కానీ సుప్రీం తీర్పుతో దళితులపై దాడులు జరుగుతాయనే భావన నెలకొందన్నారు. 

13:12 - June 11, 2018

పశ్చిమగోదావరి : జీవితంలో ఒక్కసారైనా పోలవరాన్ని సందర్శించి ఇతరులకు వాస్తవ సమాచారం ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. డయాఫ్రం వాల్ పైలాన్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. డయాఫ్రం వాల్ ను జాతికి అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు. పోలవరం డ్యాం సెట్ ను బాబు సందర్శించారు. కాంక్రీట్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాబు మాట్లాడారు. 2019 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని మరోమారు స్పష్టం చేశారు.

రికార్డు సమయంలో డయాఫ్రం వాల్ ను పూర్తి చేయడం జరిగిందని, ఇదే ఉత్సాహంతో ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాంను పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. జెట్ గ్రౌండ్ విధానంలో కాపర్ డ్యాం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. భూమిని జలాశయంగా మార్చాలనే చర్యలు జరుగుతున్నాయని, రెండు కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి పనికొస్తుందన్నారు. ప్రతి ఎకరానికి నీరు కావాలంటే భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని సూచించారు. 

బాబ్లీ ప్రాజెక్టుకు వరద నీరు...

నిర్మల్ : మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో బాబ్లీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద నీరు అధికంగా రావడం వల్ల బాబ్లీ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటి విడుదలకు అధికారులు నిర్ణయించారు.

12:20 - June 11, 2018

ఢిల్లీ :పలువురు పేర్కొంటున్నా ఎస్సీ, ఎస్టీ చట్టం నిర్వీర్యమౌతోందంటూ పలు పార్టీలు ఇటీవలే సుప్రీంకోర్టు దీనిపై తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. మార్చి 21న ధర్మాసనం వెలువరించిన తీర్పుపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెలజల్లాయి. అనంతరం నిర్వహించిన బంద్ హింసాత్మకంగా మారింది. పలువురు దళితులు మృతి చెందారు. సుప్రీం తీర్పు ఎంతో మంది దళితులపై ప్రభావం చూపుతుందని రు. ఈ నేపథ్యంలో టిడిపి నేతలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ కావాలని నిర్ణయించారు. అందులో భాగంగా సోమవారం ఉదయం ఏపీ భవన్ నుండి టిడిపి నేతలు రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం నిర్వీర్యమౌతుందని రాష్ట్రపతికి టిడిపి బృందం ఫిర్యాదు చేయనుంది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని చేర్చాలని రాష్ట్రపతిని కోరనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:07 - June 11, 2018

హైదరాబాద్ : ఎమ్మెల్యేల సభ్యత పునరుద్ధరణ కోసం టి.కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. అందులో భాగంగా సోమవారం ఉదయం స్పీకర్ మధుసూధనాచారిని టి.కాంగ్రెస్ నేతలు కలిశారు. జానారెడ్డి ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఇటీవలే నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో కోమటరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ లపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా అలాంటి 

డయాఫ్రం పైలాన్ ఆవిష్కరణ...

పశ్చిమగోదావరి : డయాఫ్రం వాల్ పైలాన్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. డయాఫ్రం వాల్ ను జాతికి అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం నిర్వహించిన శాంతిహోమంలో బాబు పాల్గొన్నారు. 

ధర్నా చౌక్ లో బీజేపీ ధర్నా...

విజయవాడ : ధర్నా చౌక్ లో బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రధానిపై టిడిపి నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ ధర్నా చేపట్టారు. ధర్నాలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు పాల్గొన్నారు. 

రాష్ట్రపతితో భేటీ కానున్న టిడిపి నేతలు...

ఢిల్లీ : కాసేపట్లో రాష్ట్రపతి కోవింద్ తో టిడిపి నేతలు భేటీ కానున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం నిర్వీర్యమౌతుందని రాష్ట్రపతికి టిడిపి బృందం ఫిర్యాదు చేయనుంది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని చేర్చాలని రాష్ట్రపతిని కోరనుంది. 

తాలిబన్ల దాడి..15 మంది సైనికుల వీరమరణం...

అప్ఘనిస్తాన్ : కుందుజ్ ప్రాంతంలో తాలిబన్లు దాడికి తెగబడ్డారు. 15 మంది అప్ఘనిస్తాన్ సైనికులు వీరమరణం చెందారు. 

11:29 - June 11, 2018
11:24 - June 11, 2018

శ్రీకాకుళం : ఏపీ రాష్ట్రంలో అవినీతి జరగడం లేదని..ఎక్కడ అవినీతి ఉందో చూపెట్టాలని పాలకులు సవాల్ విసురుతున్నారు. అధికారులు లంచాలకు మరిగి అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. వీరి భరతం పడుతున్న ఏసీబీ మరో లంచగొండిని పట్టుకుంది. సిక్కోలు నగర కార్పొరేషన్ డీఈఈ శ్రీనివాసరాజు నివాసం..కార్యాలయంపై సోమవారం ఉదయం దాడులకు దిగింది. ఏలూరు, భీమవరం, నిడదవోలు, విశాఖపట్టణం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో కోటిన్నరకు పైగా ఆస్తులున్నట్లు గుర్తించినట్లు సమాచారం. అవినీతికి పాల్పడుతూ భారీగా ఆస్తులు సమకూర్చుకున్నట్లు ఏసీబీకి విశ్వసనీయ సమాచారం అందినట్లు, ఈ నేపథ్యంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోందని తెలుస్తోంది. 

11:21 - June 11, 2018
11:20 - June 11, 2018

హైదరాబాద్ : మరో సాఫ్ట్ వేర్ ఉద్యోగి బలవన్మరణం చేసుకుంది. పని ఒత్తిడి..కుటుంబ కలహాలు..ఆర్థిక సమస్యలు..ఇతరత్రా కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతూ ఇతరులకు శోకాన్ని మిగిలిస్తున్నారు. మియాపూర్ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడింది. కారణాలు మాత్రం తెలియరావడం లేదు. వరంగల్ పట్టణానికి చెందిన కీర్తనకు శ్రీధర్ తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల బాలుడున్నాడు. పూణేలో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ లో కీర్తన పనిచేస్తోంది. ఇంటి నుండే పని చేసే కీర్తన సోమవారం ఉదయం విగతజీవిగా కనిపించింది. ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎందుకు బలవన్మరణానికి పాల్పడిందో తెలియరావడం లేదు. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమె ఎవరితో మాట్లాడింది..మెయిల్స్ ఇతరత్రా వాటిని తనిఖీ చేస్తున్నారు. 

మున్సిపల్ కార్పొరేషన్ డీఈఈ నివాసంపై ఏసీబీ దాడి...

శ్రీకాకుళం : మున్సిపల్ కార్పొరేషన్ డీఈఈ శ్రీనివాసరాజు నివాసం..కార్యాలయాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. విశాఖపట్టణం, భీమవరం, నిడదవోలు, ఏలూరులో తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణలున్నాయి. రూ. 12.25 లక్షలు, 150 గ్రాముల బంగారం, 2 బ్యాంకు లాకర్లను గుర్తించారు. 

నీరు ప్రగతిపై బాబు టెలీకాన్ఫరెన్స్...

విజయవాడ : నీరు ప్రగతి పై సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దేశం మొత్తం పోలవరం ప్రాజెక్టు వైపు చూస్తోందని, ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకమైన మైలురాళ్లను అధిగమిస్తున్నామని బాబు తెలిపారు.

 

దొంగలుగా భావించి...

మహారాష్ట్ర : ఔరంగాబాద్ జిల్లా చందగావ్ లో దారుణం చోటు చేసుకుంది. దొంగలుగా అనుమానించి ఎనిమిది మందిపై గ్రామస్తులు దాడి చేశారు. ఇద్దరు మృతి చెందగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై 300 మందిపై కేసు నమోదు చేశారు. 

మియాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సూసైడ్...

హైదరాబాద్ : మియాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 

దూసుకెళ్లిన బస్సు..ఆరుగురు స్టూడెంట్స్ మృతి...

ఉత్తర్ ప్రదేశ్ : కన్నౌజ్ వద్ద ఆగ్రా - లఖ్ నవూ ఎక్స్ ప్రెస్ పై ప్రమాదం చోటు చేసుకుంది. 9మంది విద్యార్థులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

09:36 - June 11, 2018

పెద్దపల్లి : సామాజిక సేవే లక్ష్యంగా పేదలు..దివ్యాంగులకు సాయం చేస్తామని హైకోర్టు న్యాయవాదులు గట్టు నాగమణి..గట్టు వామన్ రావు దంపతులు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం మహదేవ్ పూర్ లో రంజాన్ పండుగ సందర్భంగా 'గట్టు లా ఛాంబర్స్' ఆధ్వర్యంలో 300 ముస్లిం కుటుంబాలకు ఇఫ్తార్ విందు..దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...న్యాయ సహాయం కోసం వచ్చే పేదలకు ఉచితంగా సేవలందిస్తామని, మంథని నియోజకవర్గంలో దివ్యాంగులకు ఉచితంగా పరికరాలను అందిస్తామని పేర్కొన్నారు. 

09:31 - June 11, 2018

వరంగల్ : ప్రాణాలు నిలపాల్సిన వైద్యులు ప్రాణాలు తీస్తున్నారు. జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలింత మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందంటూ మృతురాలి కుటుంబసభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. జనగామలోని బొమ్మెర గ్రామానికి చెందిన మానస అనే గర్భిణీ డెలివరీ నిమిత్తం క్యూర్ వెల్ ఆసుపత్రికి వచ్చింది. ఆదివారం ఆడశిశువుకు జన్మనిచ్చింది. కానీ డెలివరీ సమయంలో అధిక రక్తస్రావం కావడంతో ఆసుపత్రి వైద్యులు రెండు దఫాలుగా రక్తం ఎక్కించారు. రెండో యూనిట్ రక్తం గ్రూపు తారుమారు కావడంతో మానస అపస్మారక స్థితికి చేరుకుంది. విషయం బయటకు పొక్కకుండా హన్మకొండలోని మరో ఆసుపత్రికి తరలించారు. కానీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మానస మృతి చెందింది. దీనిపై కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

09:25 - June 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర స్పీకర్ మధుసూధనాచారితో టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. జానారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం స్పీకర్ తో సమవేశం కానున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ సభ్యత్వ రద్దుపై కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని, తీర్పును అమలు చేయాలని కోరనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కోమటిరెడ్డి, సంపత్ లు వ్యవహరించిన తీరును టి.సర్కార్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. వారిద్దరీ శాసనసభ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చివరకు ఎమ్మెల్యేలకు అనుకూలంగా తీర్పును చెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టి.కాంగ్రెస్ పేర్కొంటోంది. మరి స్పీకర్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

పోలవరం పనుల్లో రికార్డు - దేవినేని ఉమ...

విజయవాడ : పోలవరం పనుల్లో రికార్డు సృష్టించామని మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఒక్క రోజులోనే 11,158 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయడం జరిగిందని, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఒక్క రోజులో ఈ స్థాయిలో పనులు జరగడం ప్రథమమని తెలిపారు. రోజుకు సరాసరి 10వేల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు లక్ష్యంగా పనులు సాగుతున్నట్లు వెల్లడించారు. 

09:12 - June 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల్లో ముసలం పుట్టింది. సమ్మెపై టీఎంయూ అవలంబించిన వైఖరిని ఇతర కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. వేతన సవరణ కోరుతూ టీఎంయూ, ఇతర సంఘాలు ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసు అందచేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం కేసీఆర్ ఘాటు హెచ్చరికలు..చేయడం..11వ తేదీ నుండి సమ్మె చేపడుతామని కార్మిక సంఘాలు స్పష్టం చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చి చర్చలు ప్రారంభించింది. గత రెండు..మూడు రోజులుగా ఉత్కంఠ రేపిన చర్చలు ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా సమసిపోయాయి. 16 శాతం ఐఆర్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడం..సమ్మె విరమిస్తున్నట్లు టీఎంయూ ప్రకటించడంతో ఇతర కార్మిక సంఘాలు ఆశ్చర్యపోయాయి. టీఎంయూ వైఖరిపై ఎన్ఎంయూ మండిపడుతోంది. ఏకపక్షంగా సమ్మె నోటీసును ఉపసంహరించుకున్నారని, 16 శాతం ఐఆర్ కు ఒప్పుకోవడంపై ఎన్ఎంయూ అభ్యంతరం వ్యక్తం చస్తోంది. వేతన సవరణ కోసం పోరాడకుండా ఐఆర్ కు ఒప్పుకోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. దీనితో సోమవారం ఉదయం అన్ని డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత...

హైదరాబాద్ : మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థుల సమస్యలు, అధిక ఫీజు జులుంపై ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సోమవారం ఉదయం మినిస్టర్ క్వార్టర్స్ కు ముట్టడికి ప్రయత్నించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. 

08:00 - June 11, 2018
07:00 - June 11, 2018

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రకటనపై ప్రభుత్వం ఎట్టకేలకు కొంతమేర స్పందించింది. 16 శాతం ఐఆర్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కానీ మంత్రులు చేసిన ప్రకటనపై ఆర్టీసీ కార్మికుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాము న్యాయబద్ధమైన కోరికలు అడిగిన ప్రతిసారి.. ప్రభుత్వం ఆర్టీసీ నష్టాల గురించి చెప్పటం ఏంటి? అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. గత సమ్మెనాడు ఇచ్చిన హామీలనే ప్రభుత్వం ఇంతవరకు సరిగ్గా అమలు చేయలేదని కార్మికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ లాభాల్లోకి రావాలంటే ప్రభుత్వ విధానాల్లో, చర్యల్లో మార్పు రావాలని చెబుతున్నారు. కార్మికుల విషయంలో ప్రభుత్వం, యాజమాన్యం తీరు మార్చుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ అంశంపై స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీయస్‌రావు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

వాతావరణ సమాచారం...

హైదరాబాద్ : ఒడిశా నుండి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నేడు, రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. 

పోలవరానికి బాబు..

పశ్చిమగోదావరి : నేడు పోలవరంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం 3గంటల వరకు పోలవరంలో ఆయన పర్యటించనున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి కావడంతో పైలాన్ ఆవిష్కరించనున్నారు. 

రాష్ట్రపతిని కలువనున్న దళిత నేతలు...

ఢిల్లీ : నేడు మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను దళిత నేతలు కలువనున్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పును పున:సమీక్షించాలని నేతలు కోరనున్నారు. 

స్పీకర్ ను కలువనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు...

హైదరాబాద్ : నేడు జానారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలువనున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని కోరుతున్నారు. 

నల్లబ్యాడ్జీలతో ఎన్ఎంయూ నిరసన...

హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో ఎన్ఎంయూ నిరసన చేపట్టనుంది. సమ్మె యోచన ఉప సంహరణపై టీఎంయూ నిర్ణయాన్ని ఎన్ఎంయూ తప్పుబడుతోంది. 

06:48 - June 11, 2018

ఢిల్లీ : ఆసియాకప్‌ ఫైనల్లో భారత మహిళల టీమ్‌ ఓటమిపాలైంది. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను ఓడించిన బంగ్లాదేశ్‌ ఆసియాకప్‌ను కైవసం చేసుకుంది. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 112పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 42బంతుల్లో 56 పరుగులు చేయగా మిగతా వాళ్లు బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. అనంతరం 113 పరుగుల టార్గెట్‌ను బంగ్లాదేశ్‌కు ఓపెనర్‌ బ్యాట్స్‌ఉమెన్‌ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే భారత బౌలర్లు విజృంభించడంతో పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. కానీ రుమానా అహ్మద్‌ 22బంతుల్లో 23 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. 

06:46 - June 11, 2018

ఢిల్లీ : ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో స్పెయిన్‌ బుల్‌ రాఫెల్‌ నాదల్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. రికార్డు స్థాయిలో 11వ సారి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా తన కెరీర్‌లో 17వ టైటిల్‌తో గ్రాండ్‌గా సలామ్‌ చేసిన నాదల్‌... మట్టి కోటలో విజయాల సంఖ్యనూ 86కు పెంచుకుని మరో చరిత్రకు శ్రీకారం చుట్టాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ నాదల్ 6-4, 6-3, 6-2తో ఏడోసీడ్ డోమ్నిక్ థీమ్‌పై విజయం సాధించాడు. తద్వారా మార్గరెట్ కోర్టు రికార్డును నాదల్‌ సమం చేశాడు. మరోవైపు తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడిన థీమ్‌... తొలి టైటిల్‌ కలను నెరవేర్చుకోలేకపోయాడు.

06:45 - June 11, 2018

సిరిసిల్ల : ఆయనో ప్రజాప్రతినిధి. ప్రజలకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించాల్సిన నేత. ప్రజల కష్టాలు అలా ఉంచితే.. ఆయనే పెద్ద సమస్యగా మారాడు. అధికారమే అండగా పేదలకు చెందిన భూములను కబ్జా చేసేస్తున్నాడు. ఇదేంటని నిలదీస్తే దిక్కున్నచోట చెప్పుకోండని బెదిరింపులకు పాల్పడుతున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కబ్జాలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అక్రమాలపై స్పెషల్‌ స్టోరీ.. రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ నేతల ఆగడాలు శృతిమించుతున్నాయి. పేదల భూములు కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. బీవై నగర్‌లో బీద మహిళకు చెందిన స్థలాన్ని టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌, సిరిసిల్ల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కబ్జా చేసినట్టు ఆరోణలు వినిపిస్తున్నాయి.

బీవై నగర్‌లో సువర్ణ అనే మహిళ నివాసముంటోంది. తల్లి నుంచి సంక్రమించిన స్థలంలో పూరిగుడిసె వేసుకుని.... భర్త, కొడుకుతో బీడీలు చుట్టుకుంటూ బ్రతుకుతోంది. అనుకోకుండా ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కొడుకు కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కొడుకును బ్రతికించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. గత వర్షాకాలంలో పూరిగుడిసె కూడా కూలిపోవడంతో.... సిరిసిల్లలోనే మరోచోట ఓ చిన్నరూమ్‌ తీసుకుని ఉంటోంది.

బీవై నగర్‌లోని సువర్ణకు చెందిన స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. మంత్రితోపాటు అధికారుల అండదండలు ఉన్న స్థానిక టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అయిన తవుటు కనకయ్య ఆ భూమిని కబ్జా చేసేశాడు. దొంగ పత్రాలు సృష్టించి ఓ నిరుపేద మహిళను రోడ్డున పడేశాడు. తన స్థలంలోకి వెళ్తామని వచ్చిన ఆ మహిళను కౌన్సిలర్‌ అనుచరులు అడ్డుకున్నారు. ఆ స్థలం తనదేనని చెప్పినా వినిపించుకోకుండా ఆమెను గెంటి వేశారు. దొంగపత్రాలు చూపించి తన స్థలాన్ని కబ్జా చేశారంటూ ఆ మహిళ ఆరోపిస్తోంది. కౌన్సిలర్‌నే నిలదీస్తే దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ప్రజలకు సేవ చేయాల్సిన నేతలే వారి స్థలాలను కబ్జా చేస్తుండడంపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు స్పందించి పేద మహిళకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. తనకు న్యాయం చేయకుంటే కలెక్టరేట్‌ ముందే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు హెచ్చరిస్తోంది.

06:41 - June 11, 2018

చెన్నై : నిర్బంధంతో తెలుగు భాషను రాష్ట్రం నుంచి తరిమేస్తుంటే.. తెలుగు నేర్చుకోండంటూ ఓ ప్రధానోపాధ్యాయుడు ఇంటింటికి తిరుగుతున్నాడు. అవగాహన కల్పిస్తూ.. ఆఫర్లు కూడ ఇస్తున్నాడు. మాతృభాషను విద్యార్థులకు అందజేయాలని ఆ ప్రధానోపాధ్యాయుడు చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు తమిళనాడులోని తెలుగువారిలో ఆశలు రేకిత్తిస్తోంది. ఇది తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు మండలంలోని వడకుప్పం ప్రభుత్వ పాఠశాల. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దు గ్రామం కావటంతో ఈ పాఠశాలలో తెలుగు భాష నేర్చుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే తమిళనాడులో నిర్భంద తమిళం అమల్లోకి రావటంతో రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో తెలుగు పాఠ్యాంశాలు తొలగించటమే కాకుండా తెలుగు విద్యాభ్యాసాన్ని మూసివేస్తున్నారు. దీంతో తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేటు స్కూళ్లలోని ఇంగ్లీష్ మీడియంలో చేర్పిస్తున్నారు. అయితే తెలుగు పాఠశాలలు మూతపడే ప్రమాదం నుంచి ఎలాగైనా రక్షించాలని భావించిన వడకుప్పం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూపతి ... వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.

వడకుప్పంతో పాటు మిగతా సరిహద్దు గ్రామాల్లో తిరుగుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని భూపతి కోరుతున్నారు. ఫస్ట్‌ క్లాస్‌తో పిల్లలను చేర్పిస్తే... గ్రాము బంగారు కాయిన్‌ అందజేస్తానని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాల్లో పిల్లలను చదివిస్తే ఎలాంటి లాభాలు ఉంటాయనే విషయాన్ని ఇంటింటికి తిరిగి చెబుతూ.. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

భాష కోసం ప్రాణాలిచ్చే తమిళుల నడుమ తెలుగు భాషను కాపాడుకోవటానికి ప్రధానోపాధ్యాయుడు భూపతి చేస్తున్న ప్రయత్నాన్ని తమిళనాడులోని తెలుగు వారందరూ అభినందిస్తున్నారు. మరోవైపు సరిహద్దు పాఠశాల విద్యార్థుల జీవితాలను ప్రభుత్వం నాశనం చేస్తుందని మండిపడుతున్నారు. అవసరం లేదని తమిళ ప్రభుత్వం, పట్టించుకోని తెలుగు ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన తెలుగు ప్రభుత్వాలు తమిళ ప్రభుత్వంతో చర్చలు జరిపి సరిహద్దు తెలుగు విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని తమిళనాడులోని తెలుగువారు డిమాండ్‌ చేస్తున్నారు. 

06:38 - June 11, 2018

ఆసిఫాబాద్ : కొమురం భీం అసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ మండలం శివపూర్‌లో వర్షాల కోసం గ్రామదేవతకు గ్రామస్థులు మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు విస్తారంగ కురిసి, పాడిపంటలు సంమృద్ధిగా పండాలని కోరతూ.. బోనాలు సమర్పించారు. ఇలా ప్రతి సంవత్సరం వర్షాలు కురువాలని, పంటలు బాగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనాలు సమర్పించడం తమ ఆనవాయితీ అని గ్రామస్థులు అన్నారు.

06:36 - June 11, 2018

సూర్యాపేట : జిల్లా మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లిలో.. లలిత సిమెంట్‌ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని గ్రామస్థులు నిర్భందించారు. సిమెంట్‌ కంపెనీ ఏర్పాటు చేసి, ఉద్యోగాలు కల్పిస్తామంటూ 50 కోట్ల రూపాయలను యాజయాన్యం తీసుకుని మొహం చాటేసిందని రైతులు మండిపడ్డారు. ప్లాంట్‌ ప్రారంభం చేయపోవటం, ఇచ్చిన నగదు తిరిగి ఇవ్వకపోవటంతో.. ప్లాంట్‌ యాజమాన్యం వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామస్థులు వారిని ముట్టడించారు. ఫ్యాక్టరీ కార్యాలయంలో నిర్భందించారు. సుమారు ఐదు వందల మంది దగ్గర 50 కోట్ల రూపాయలను, మూడు వందల ఎకరాల భూమిని తక్కువ ధరకు కొనుగోలు చేశారని గ్రామస్థులు వాపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సమస్యను పట్టించుకుని న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

06:34 - June 11, 2018

విశాఖపట్టణం : రాజ్యాధికారం కోసం బహుజనులంతా ఏకం కావాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, బీఎల్‌ఎఫ్‌ కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఐక్యతతోనే బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందన్న విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. రాజ్యాధికారం ఎప్పుడూ ఏదో ఒక అగ్రకులానికే పరిమితం కారాదని విశాఖలో జరిగిన దళిత, ఆదివాసీ సమతా జాతర జాతీయ సదస్సులో చెప్పారు. విశాఖలో రెండో రోజు దళిత, ఆదివాసీల సమతా జాతర జాతీయ సదస్సు ఘనంగా జరిగింది. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు సామాజికవేత్త, రామన్‌ మెగసేసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్‌, సామాజిక చిత్రాల దర్శకుడు, సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి, ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు తదితరులు హాజరయ్యారు.

దేశంలో దళితులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించారు. రాజ్యాధికారంతోనే దళితులు, ఆదివాసీలు, ఇతర బహుజనుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఇందుకోసం దళిత-ఆదివాసీ వర్గాలు ఐక్యం కావాలని తమ్మినేని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడుల వెనుక పాలకులు, అధికార పార్టీ నేతల హస్తం ఉందని సామాజికవేత్త, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్‌ మండిపడ్డారు.

సరళీకృత ఆర్థిక విధానాల అమలు తర్వాత దేశంలో పేదల బతుకులు ఛిద్రమైపోతున్నాయని సామాజిక చిత్రాల దర్శకుడు, నటుడు ఆర్‌.నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. భాష, సంస్కృతిపై పాశ్యాత్య దేశాల దాడి పెరిగిందని ఆవేదన వెలిబుచ్చారు. సదస్సుకు హాజరైన ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు సామాజిక సమస్యలపై పాడిన పాటలు అందర్నీ ఆకట్టుకొన్నాయి. సదస్సుకు భారీగా దళితులు, ఆదివాసీలు తరలివచ్చారు. ప్రజలను కులాలు, మతాలవారీగా విభజించి పాలిస్తున్న పాలకుల చర్యలను తిప్పికొట్టేందుకు బహుజనులంతా సమాయత్తం కావాలని సదస్సులో తీర్మానించారు. 

06:31 - June 11, 2018

వరంగల్ : దళితులు తమ హక్కులను కాపాడుకునేందుకు చట్ట సభలకంటే ప్రజా బాహుళ్యంలోనే బలమైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని హన్మకొండలో జరిగిన దళితుల సింహగర్జన సభ పిలుపునిచ్చింది. దళితుల సమస్యలపై పార్లమెంట్‌ బయటా, వెలుపలా మద్దతు లభించడం లేదని నేతలు తెలిపారు. ఎస్సీ,ఎస్టీల అత్యాచారాల చట్టంలో అక్షరం మార్చినా ఊరుకోబోమని దళితనాయకులు హెచ్చరించారు.

ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలను నిరిసిస్తూ... ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో హన్మకొండలో సింహగర్జన పేరుతో బహిరంగ సభ జరిగింది. ఈ సభకు వివిధ పార్టీలకు, ప్రజాసంఘాలకు చెందిన దళిత నాయకులు హాజరయ్యారు. లోక్‌సభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గేత, లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌, సీపీఐ నేతలు సురవరంతోపాలు ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై అత్యాచారాలు 60శాతం పెరిగాయని నేతలు ఆరోపించారు. దేశవ్యాప్తంగా రోజూ 11 మంది దళితులు హత్యలకు, ఆరుగురు మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంఘటితంగా పోరాడినప్పుడే దళితులపై అత్యాచారాలు ఆగిపోతాయన్నారు. ఇందుకు వరంగల్‌ సింహగర్జన శ్రీకారం చుట్టిందన్నారు. తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ పిలుపునిచ్చారు. సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవడం ద్వారానే దళితులు తమ హక్కులను సాధించుకోగలరని ప్రకాశ్‌ అంబేద్కర్‌ చెప్పారు.

ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో ఒక అక్షరం మార్చినా ఊరుకునేది లేదని మందకృష్ణ ప్రకటించారు. చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పికొట్టాలని, అందుకోసం బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. జనాభాలో ఒకశాతం ఉన్నవాళ్లు పాలకులవుతుంటే... 30శాతం ఉన్న దళితులు బానిసలుగానే ఎందుకు బతకాలని ఆయన ప్రశ్నించారు. దళిత, గిరిజనుల రక్షణ వృక్షాన్నే మోదీ పెకలిస్తున్నారని... దళితులు సంఘటితమై మోదీపై యుద్దం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని మార్చితే ఊరుకునే ప్రసక్తేలేదని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌ బాబు తేల్చి చెప్పారు. సభలో జోరు వర్షం కురిసినా సభికులు వర్షంలో తడుస్తూనే నాయకుల ప్రసంగాలు విన్నారు. నాయకులు సైతం జోరు వర్షంలోనూ ప్రసంగాలు చేశారు. మొత్తానికి దళితుల ఐక్యతోనే హక్కులు సాధించుకోగలమని నాయకులు వారికి పిలుపునిచ్చారు. 

టీఎంయూపై మండిపడుతున్న ఇతర యూనియన్లు...

హైదరాబాద్ : పదహారు శాతం ఐఆర్‌కు టీఎంయూ ఒప్పుకోవడంపై ఆర్టీసీలోని మిగిలిన యూనియన్లు మండిపడ్డుతున్నాయి. 25 శాతం ఐఆర్‌ డిమాండ్‌ చేసిన టీఎంయూ చివరికి 16 శాతానికి ఒప్పుకోవడం.. కార్మికులకు ద్రోహం చేసిందని ఎన్‌ఎంయూ ఆరోపించింది. టీఎంయూ నిర్ణయంపై ఎంప్లాయూస్‌ యూనియన్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది.

 

జగన్ పాదయాత్ర...టిడిపి కుట్రలు - వైసీపీ...

విజయవాడ : ఈనెల 12 వైఎస్‌ జగన్‌ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి బ్రిడ్జిపై జగన్‌ పాదయాత్రకు షరతులు పెట్టడం ఏంటని వైవీ ప్రశ్నించారు. 

కిమ్ జాంగ్ ఉన్ - ట్రంప్ భేటీపై ఉత్కంఠ...

ఢిల్లీ : వారిద్దరిదీ విచిత్రమైన మనస్థత్వమే. తెంపరితనం, మొండి వైఖరి ఇద్దరికీ ఎక్కువే. ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగించిన దేశాధ్యక్షులు. ఒకరు ప్రపంచాన్నే శాసించగల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అయితే మరొకరు అణు పరీక్షలతో ప్రపంచాన్నే బెంబేలెత్తిస్తున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌. అలాంటి వీరు మంగళవారం సింగపూర్‌లో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి సమావేశంపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.  

ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఓటమి...

ఢిల్లీ : ఆసియాకప్‌ ఫైనల్లో భారత మహిళల టీమ్‌ ఓటమిపాలైంది. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను ఓడించిన బంగ్లాదేశ్‌ ఆసియాకప్‌ను కైవసం చేసుకుంది. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 112పరుగులు చేసింది. 113 పరుగుల టార్గెట్‌ను ఛేదించి కప్‌ను బంగ్లా అమ్మాయిలు ఎగురేసుకపోయింది. 

Don't Miss