Activities calendar

12 June 2018

21:42 - June 12, 2018

హైద‌రాబాద్‌ : పనులు జ‌రుగుతున్న తీరుపై మంత్రి కేటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లను ఇష్టానుసారంగా త‌వ్వేస్తూ దిద్దుబాటు చర్యలు తీసుకోవ‌డం లేదని మండిపడ్డారు. నాలాల పూడిక‌తీత‌లో పురోగతి లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వ‌ర్షాకాలంలో వ‌చ్చే ఇబ్బందుల‌ను ఎలా ఎదుర్కోవాల‌నే అంశంపై సమీక్షించిన మంత్రి..

ఇష్టం లేని అధికారులు సెలవుపై వెళ్లిపోవాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది.

జీహెచ్ఎంసి అధికారుల‌పై మండిప‌డ్డ మంత్రి కేటీఆర్‌
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో వ‌ర్షాకాలం ఇబ్బందుల‌ను అధిగ‌మించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామ‌ని అధికారులు చెబుతున్నప్పటికీ అందుకు విరుద్ధమైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. వర్షాకాలంలో నగర పరిస్థితిపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. వ‌ర్షాకాలంలో చేయాల్సిన ప‌నులు ఇప్పటికీ పూర్తి చేయ‌క‌పోవ‌డంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా నాలాల పూడిక‌తీత ప‌నులు ఇప్పటికీ ఎందుకు పూర్తి కాలేదని అసహనం వ్యక్తం చేశారు. గ‌త ఏడాది వ‌రద‌ల కార‌ణంగా వ‌చ్చిన ఇబ్బందుల‌ను ఇప్పటికీ ప‌రిష్కరించ‌క‌పోవ‌డంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్‌.. ఇష్టం లేని అధికారులు, సిబ్బంది శెల‌వుపై వెళ్ళాల‌ని హెచ్చరించారు.

త‌వ్వకాలు ఎందుకు జ‌రుగుతున్నాయని ప్రశ్నించిన కేటీఆర్‌
మరోవైపు న‌గ‌రంలో రోడ్ల త‌వ్వకాలు ఎందుకు జ‌రుగుతున్నాయంటూ అధికారుల‌ను నిల‌దీశారు కేటిఆర్. న‌గ‌రంలోని రోడ్ల త‌వ్వకాల‌కు సంబంధించి వ‌స్తున్న ఫిర్యాదుల‌కు స‌మాధానం చెప్పాలంటే ఇబ్బందిగా ఉంద‌న్నారు మంత్రి. ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా రోడ్ల ప‌రిస్థితి మాత్రం మార‌డం లేదని,... గుంత‌లు ఎందుకు ఉన్నాయంటూ అధికారుల‌ను ప్రశ్నించారు. వ‌ర్షాకాలం నేప‌థ్యంలో పురాత‌న నిర్మాణాల విష‌యంలో జాగ్రత్త వ‌హించాల‌ని.. పురాత‌న‌ భ‌వ‌నాల‌ను త‌క్షణ‌మే కూల్చివేయాల‌ని టౌన్ ప్లానింగ్ అధికారుల‌కు కేటీఆర్‌ ఆదేశించారు.

సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన కేటీఆర్‌
ఇక నాలాల‌పై ఉన్న అక్రమ నిర్మాణాల‌ను తొల‌గించే విష‌యంలో ఎలాంటి వారినైనా వ‌దిలేది లేద‌ని కేటీఆర్‌ హెచ్చరిచారు. మరోవైపు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌.. సమావేశం మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.

21:34 - June 12, 2018

అమరావతి : ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని టీడీపీ సమన్వయ కమిటీ ఆరోపించింది. వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయంటూ.. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించింది. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏపీ అభివృద్ధికి చారిత్రక అవసరమని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చిన చంద్రబాబు... ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులను ఆదేశించారు.

నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం..
అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల ఏడాదిలో పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలతోపాటు జాతీయ రాజకీయ పరిణామాలపై చర్చించారు.

ఆధారాలు లేకుండా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్న టీడీపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తోపాటు తెలుగుదేశం ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై ప్రధానంగా చర్చించారు. ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పన్నుతున్న కుట్ర రాజకీయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ సమన్వయ కమిటీలో నిర్ణయించారు. ప్రపంచంలో రెండు భిన్నధృవాలైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ శాంతి కోసం సింగపూర్‌లో కలిసిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. అలాంటి సింగపూర్‌ ప్రభుత్వం.. ఏపీని నమ్మి సహకరిస్తుంటే విపక్షాలు విమర్శలు చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు. వైపీసీ ప్రయోజనాలు కాపాడేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత వపన్‌ కల్యాణ్‌ పనిచేస్తున్నారంటూ... దీనిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ సమన్వయ కమిటీ నిర్ణయించింది.

సరిగా పనిచేయకపోయినా బహిరంగ విమర్శలు చేస్తున్న నాయకులు
మరోవైపు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించిన చంద్రబాబు.. కొన్ని జిల్లాల్లో టీడీపీ నేతల మధ్య ముదురుతున్న అంతర్గత కలహాలను ప్రస్తావించారు. పరోక్షంగా కడప టీడీపీ నేతలు వరదరాజులురెడ్డి, సీఎం రమేశ్‌ వ్యవహారాన్ని గుర్తు చేశారు. కొందరు నేతలు సరిగా పనిచేయకపోయినా... బహిరంగ విమర్శలకు దిగుతున్న అంశాన్ని ప్రస్తావించారు. పనిచేయకపోయినా మారతారన్న ఉద్దేశంతో ఇంతకాలం చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అధినేత ఏమీ పట్టించుకోవడం లేదంటూ.. ఏదైనా చేయొచ్చనుకుంటే పొరపాటని హెచ్చరించినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రోజు ఎవరేం చేస్తున్నారో అన్ని నివేదికలు తన వద్ద ఉన్నాయని, తాను తీసుకునే చర్యలకు నాయకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు సమాచారం. నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించేబోనని తేల్చిచెప్పారని పార్టీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై కూడా చంద్రబాబు మండిపడ్డినట్టు సమాచారం. ఎన్నికల సమయంలో చాలా జాగ్రత్తగా పని చేయాలని సూచించారు.చంద్రబాబు సూచనలను తెలుగుదేశం నాయకులు ఎంతవరకు వంటపట్టించుకుంటారో, హెచ్చరికలను ఎంతవరకు ఖాతరు చేస్తారో, పద్ధతులు ఎంతవరకు మార్చుకుంటారో చూడాలి. 

21:26 - June 12, 2018

తూర్పుగోదావరి : ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో అవినీతి, అధర్మపాలన సాగుతోందని వైసీపీ అధినేత జగన్‌ ఆరోపించారు. చంద్రబాబు పాలనకు చరమగీతం పాడకపోతే రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత వెనుకుబడిపోయే ప్రమాదం ఉందని జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే నీతి, నిజాయితీ పాలన అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని, పెదబాబు, చినబాబు సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు అధికారులు కూడా దోచుకుతింటున్నారని తూర్పుగోదావరి ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ ఆరోపించారు.

తూర్పుగోదావరికి జగన్ యాత్ర..
వైసీపీ అధినేత జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో యాత్ర పూర్తి చేసుకుని రైల్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జి మీదుగా చారిత్రక రాజమహేంద్రవరంలోకి ప్రవేశించారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశిస్తున్న జగన్‌కు వైసీపీ శ్రేణులు భారీ స్వాగతం పలికాయి. గోదావరి నదిలో కూడా పడవలతో జగన్‌కు స్వాగతం ప్రజలు పలికారు. 2003లో వైఎస్‌ఆర్‌ పాదయాత్రను తలపించే రీతిలో వంతెన పొడవునా ప్రజలు, పార్టీ శ్రేణులు బారులు తీరారు. రైల్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జి పొడవునా వైసీపీ జెండాలు రెపరెపలాడాయి. గుమ్మడికాయ హారతులతో మహిళలు, వేదపండితులు జగన్‌కు స్వాగతం పలికారు.

మాఫియా రాజ్యమేలుతోంది : జగన్
రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన జగన్‌... ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని ఆరోపించారు. దీనిలో పెదబాబు, చినబాబుకు వాటాలున్నాయన్నారు. రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి, ఎంపీ ముళీమోహన్‌...ఇసుకు మాఫియాగామారి పెదబాబు, చినబాబుకు ముడుపులు చెల్లిస్తున్నారని జగన్‌ ఆరోపించారు. చంద్రబాబు రాక్షస, దుర్మార్గ పాలన సాగిస్తున్నారని ఆరోపించిన జగన్‌.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే మూడు లక్షల రూపాయల వరకు గృహ రుణాలు మాఫీ చేస్తుందని జగన్‌ హామీ ఇచ్చారు. 

అధికారులపై కేటీఆర్ ఆగ్రహం..

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ పనితీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్‌లో సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడుతూ.. నగరంలో రోడ్లు తవ్వకూడదని చెబుతున్నప్పటికీ, అదే పని చేస్తున్నారని అన్నారు. గతంలో ఇచ్చిన అనుమ‌తుల‌ను చూపించి ఇప్పుడు కూడా వాటిని కొన‌సాగిస్తున్నారని మండిపడ్డారు. రోడ్ల త‌వ్వకాల‌కు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని, వాటికి స‌మాధానం చెప్పాలంటే ఇబ్బందిగా ఉంద‌ని అన్నారు.

అగ్రిగోల్డ్ నిందితులకు బెయిల్ మంజూరు..

కృష్ణా : అగ్రిగోల్డ్ చైర్మన్ సహా ఆరుగురు డైరెక్టర్లకు బెయిల్ మంజూరయ్యింది. మచిలీపట్నం జిల్లా కోర్టు వీరికి బెయిల్ ను మంజూరు చేసింది. చార్జ్ షీట్ దాఖలు చేయటంలో సీఐబీ విఫలయ్యిందని కోర్టు అభిప్రాయపడింది.ఈ నేపథ్యలోనే వీరికి బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో అగ్రిగోల్డ్ చైర్మన్ సహా ఆరుగురు డైరెక్టర్లు జైలు నుండి విడుదల కానున్నారు. 

20:46 - June 12, 2018

ఎస్పీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం నిర్వీర్యమైపోతోందని ఇటీవల ఆందోళన పెరుగుతోంది. ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లోకి చేర్చాలనే డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఈ చట్టాన్ని బలోపేతం చేసి అమలు చేయాలని దళిత, ప్రజాసంఘాలు కోరుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టటంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయా? ఈ చట్టాన్ని 9వ షెడ్యూల్ లోకి చేర్చినంత మాత్రాల దాడులకు అడ్డుకట్ట పడుతుందా? వంటి అంశాలపై దళిత ఏక్టివిస్ట్ జే.బి.రాజు విశ్లేషణ..

20:29 - June 12, 2018

ఏ ధమ్ముందా సూస్కుందామంటె సూస్కుందాం నువ్వెంత నీ బతుకెంత..? ఏయ్ అమెరికోడా..? ఇగో ఈ కట్క ఒత్తితే నీ అమెరికా మొత్తం కుప్పగూలిపోతది..? ఏయ్ ఉత్తర కొరియా తమాష జేస్తున్నవా..? మమ్ములను తక్వంచనేస్తున్నవా..? అమెరికా సత్తా ఏందో సూపెడ్త..? ఇట్ల పాము ముంగీస లెక్క కీసులాడుకున్న ఇద్దరు దేశాధినేతలు.. ఇయ్యాళ కల్చుకోని కావలిచ్చుకున్నరు.. ముద్దుగ..

అయ్యో పోసాని క్రిష్ణ మురళి సారు చంద్రబాబు మైలపోలు బాగనే దీస్తున్నట్టుండుగదా..? చంద్రబాబుకు నీతి జాతి ఏముండది.. తన అధికారం కోసం ఎవ్వలినైనా రాజకీయంగ సంపెతందుకు ఎన్కకు వొయ్యెమన్షిగాదు చంద్రబాబును నమ్మొద్దు అని గంటల కమానం ప్రెస్ మీటింగు వెట్టి మరీ చెప్పిండు.. ఇగ ఆ ప్రెస్ మీటింగుల బ్యాగ్ రౌండు జూస్తరా సూడుండ్రి..

యాడంగ దాపురమైతర్రా వారీ మీరంత ఈ దొంగలు లంగలు అంత ఎమ్మెల్యేలు అయ్యితుంటే ఇది ప్రజాస్వామ్యమేనా అన్న అనుమానం రావట్టే.. మాల్కజ్ గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి.. నువ్వు ఎమ్మెల్యే పోస్టుకు గాదు.. కనీసం వార్డు కౌన్సిలర్ పోస్టుగూడ అర్హునువి గాదన్న ముచ్చట నీ చేతలతోనే బైటవడ్డది.. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే కనకారెడ్డికి ఓట్లేశిన ప్రజలరా.?. ఇది జూడుండ్రి మీ ఎమ్మెల్యేగారి పనితనం ఎట్లున్నదో..

రేపటి తెలంగాణ రాష్ట్రం ఇట్లుండది.. ఆంధ్రవలస పాలకులు ధ్వంసం జేశినారు.. రేపు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక ఆదిలాబాద్ ఆడ్విబిడ్డల కోసం హెలికాప్టర్ అంబులెన్సులు వెట్టుకుంటం... వాళ్లకు ఆపతొస్తె పదినిమ్షాలళ్ల దావఖానకు చేరుస్తం.. ఇది కేసీఆర్ మాట... కేసీఆర్ మాట జెప్తె ఎట్లుంటదో మీకు ఎర్కేగదా..? ఎవ్వలికన్న అనుమానం ఉంటే సూడుండ్రి..

అయ్యా సిరిసిల్లా కలెక్టర్ సారు మా భూమిని టీఆర్ఎస్ నాయకులు కబ్జావెడ్తున్నరు సారూ మీరే కాపాడాలే అని మొత్తుకున్నరు.. అయినా ఆ కలెక్టర్కు చెవ్వుమీద పేను వారలే.. ఒక్కపారి వొయ్యింది రెండు మాట్ల వొయ్యింది మూడో పారి ఏకంగ నరేంద్రమోడీ ఏశం గట్టుకోని దిగిండు బాధితుడు.. ఇట్లనన్న ఇంటడో ఏమో అని పాండ్రి పల్కరిద్దాం..

తెలంగాణ రాష్ట్రంల రెప్పపాటుగూడ.. కరెంటివోదిగ.. జనరేటర్లతోని పనే ఉండది.. నేను ఆయాళ రాష్ట్రం విడిపోయేనాడు జెప్పిన.. ఇయ్యాళ చేశి సూపెట్టిన.. ఇది ఎవ్వలు జెప్పిండ్రో నేను మళ్ల యాది జేయవల్సిన పనేం లేదుగదా..? సరే ఈ టాపిక్ ఇప్పుడెందుకంటె.. కేసీఆర్ జెప్పినట్టు రెప్పపాటు కరెంటి వోవుడుగాదు.. రెప్పపాటన్న కరెంటి వస్తె సూద్దామని సూస్తున్నది ఒక గూడెం.. ఇదే అది..

తెలంగాణ రాష్ట్రం నిజంగనే దనిక రాష్ట్రం అనుకుంటున్నరా..? తూచ్.. 2014 కేసీఆర్ ముఖ్యమంత్రిగాకముందుకు నిజంగనే దనిక రాష్ట్రం దాంట్లె ఏం డౌటు లేదు.. ఏమంట సారువారు కుర్చెక్కిండో.. తెలంగాణలున్న ఒక్కొక్క తల్కాయ మీద లక్షా యాభైవేల రూపాల అప్పుజమజేశి పెట్టిండు.. మరి ఇంత అప్పులళ్ల రాష్ట్రముంటే.. ఇగో రైతులు ధాన్యం గొంటిరి పైసలియ్యకపోతిరి అంటున్నరు..

ఉన్నది వొయ్యింది ఉంచుకున్నది వొయ్యింది చేసుకున్నది చెప్పకుంటవొయ్యిందన్నట్టు.. పాపం ఎన్కటి సర్కారు నాగార్జున సాగర్ ముంపు బాధితులకు 724 ఎక్రాల భూమిచ్చి అండ్ల పట్టాలిచ్చి వన్ బీ గూడ ఇచ్చిండ్రు.. ఇగ బంగారు తెలంగాణ సర్కారొచ్చిందిగదా..? ఇప్పుడు ఆ భూములకు పట్టాలు లేవు.. వన్ బీ లేదు.. పాసుబుక్కు లేదు చెక్కుకాయిదం లేదు.. 

20:15 - June 12, 2018

అమెరికా, ఉత్తర కొరియా దేశాధ్యక్షులు సింగపూర్ లో సమావేశమయ్యారు. ఇద్దరికిద్దరు తమ పట్టువీడని విక్కమార్కులే. 1950, 53 కొరియా యుద్ధం అనంతరం అమెరికా, ఉత్తరకొరియాలు శత్రు దేశాలుగా మారాయి. ఈ రెండు దేశాధ్యక్షుల మధ్య చర్చలు ఇంతవరకూ జరగలేదు. ఎటువంటి సందర్భంలోను ఇరు దేశాల అధ్యక్షుల మధ్య సంభాషణలు కూడా జరగలేదు. కానీ వున్నట్టుట్నుండి ఇరు దేశాధినేతలు భేటీ కావడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ సింగపూర్‌లో జరిపిన చర్చలు సఫలమయ్యాయని ఇద్దరు ప్రకటించారు. ఇరు దేశాలు స్నేహ హస్తాన్ని అందుకుంటామనని తెలిపారు. కొరియా దేశపు ప్రజలు ప్రశాంతంగా జీవించాలని ట్రంప్ ఆకాంక్షించారు. ప్రపంచ ఒక కొత్త మార్పుకు నాంది పలుకుతుందంటు దేశాధ్యక్షులిద్దరు ప్రకటించారు. ఈ ప్రటనలు దేనికి సంకేతం పలుకుతున్నాయి? ఈ భేటీతో ఇరు దేశాలు మిత్ర దేశాలుగా మారతాయా? శాంతి నెలకొల్పేందుకు వీరిద్దరు యత్నిస్తారా? ఈ అంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈచర్చలో ప్రముఖ విశ్లేషకులు నగేశ్, సీనియర్ విశ్లేషకులు కోటేశ్వరరావు, ప్రొ.బాలసుబ్రహ్మణ్యం.. 

20:03 - June 12, 2018

సింగపూర్ : అమెరికా, ఉత్తర కొరియా దేశాలు తమ మధ్య నెలకొన్న విభేదాలకు చరమగీతం పాడాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ సింగపూర్‌లో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఇరు దేశాలు స్నేహ హస్తాన్ని అందుకున్నాయి. ఉద్రిక్తతలను తగ్గించి శాంతి దిశగా అడుగు ముందుకు వేశాయి.

సింగపూర్‌ వేదికగా అమెరికా ట్రంప్‌, కిమ్‌ సమావేశం..
సింగపూర్‌ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల మధ్య జరిగిన చారిత్రక సమావేశం విజయవంతంగా ముగిసింది. తాజాగా జరిగిన సమావేశం ట్రంప్‌, కిమ్‌ల మధ్య ఉద్రిక్తతలను చల్లబరచడమే కాదు...ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా సాగాయి. ఇరు దేశాలు ఉమ్మడి తీర్మానంపై సంతకాలు చేశాయి.

ఇరు దేశాధినేతల కీలక ఒప్పందాలు..
శాంతి సౌభాగ్యాల సాధనలో ప్రజల ఆకాంక్ష మేరకు అమెరికా, ఉత్తరకొరియాలు కొత్త సంబంధాలు నెలకొల్పుకోవడం... కొరియా ద్వీపకల్పంలో సుస్థిర శాంతి స్థాపనకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. 2018, ఏప్రిల్‌ 27 నాటి పాన్‌ముంగ్‌ జోమ్‌ తీర్మానానికి అనుగుణంగా సంపూర్ణ నిరాయుధీకరణకు ఉత్తర కొరియా కట్టుబడి ఉంటుంది. యుద్ధ ఖైదీలను వెంటనే స్వదేశానికి తిప్పిపంపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

మార్పు సాధ్యమని నిరూపించాం : ట్రంప్
కిమ్‌తో సమావేశం కావడంపై ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. యుద్ధం ఎవరైనా చేయవచ్చు కానీ.. సాహసం ఉన్నవారే శాంతి ప్రక్రియ చేపడతారని, మార్పు సాధ్యమేనని తాము నిరూపించామని ఆయన చెప్పారు. అణు నిరాయుధీకరణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందన్న ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. అణు నిరాయుధీకరణ మొదలు పెట్టిన తరువాత నార్త్ కొరియాపై ఉన్న ఆంక్షలు తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కొరియా ద్వీపంలో తమ సైనిక విన్యాసాలను నిలిపివేస్తామని అమెరికా ప్రకటించింది.

ఇది చారిత్రాతమ్మక సమావేశం : కిమ్
ఇది చారిత్రక సమావేశమని, గతాన్ని వదిలి పెట్టాలని ఇరుదేశాల నేతలు నిర్ణయించినట్లు కిమ్‌ తెలిపారు. ప్రపంచం గొప్ప మార్పును చూడబోతోందని ఆయన అన్నారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు కిమ్‌ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ట్రంప్, కిమ్ ల భేటీ...
1950-53 కొరియా యుద్ధం అనంతరం అమెరికా, ఉత్తరకొరియాలు శత్రు దేశాలుగా మారాయి. ఈ రెండు దేశాధ్యక్షుల మధ్య చర్చలు ఇంతవరకూ జరగలేదు. కనీసం ఫోన్‌లో కూడా నేతలు మాట్లాడుకోలేదు. తొలిసారిగా ఇప్పుడు ఇరు దేశాధినేతలు భేటీ కావడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 

19:45 - June 12, 2018

వరంగల్ : ప్రజల నమ్మకాన్ని క్యాష్‌ చేసుకునేందుకు ఓ వ్యక్తి పథకం పన్నాడు. శివసత్తులకు తెలంగాణ ప్రభుత్వం పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తుందని మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని తొర్రూర్‌ బస్టాండ్‌ సెంటర్‌లో ఓ ఫొటో స్టూడియో ఓనర్‌ ప్రచారం చేశాడు. బోనం ఎత్తుకుని ఫొటో దిగి పంపిస్తే.. ప్రభుత్వం 15 వేల రూపాయలు ఇస్తుందని నమ్మబలికాడు. దీంతో అనేకమంది మహిళలు బోనం ఎత్తుకుని ఫొటో స్టూడియో ఎదుట క్యూ కట్టారు. ఒక్కొక్కరి వద్ద 150 రూపాయలు వసూలు చేశాడు. అయితే.. కొంతమందికి అనుమానం వచ్చి ఫొటో స్టూడియో ఓనర్‌ను నిలదీశారు. దీంతో భయాందోళనలకు గురైన ఫొటోషాపు ఓనర్‌ షాపు మూసేసి పరారయ్యేందుకు యత్నించడంతో.. ఆయనను నిర్బంధించారు. విషయం తెలుసుకుని పోలీసులు రంగ ప్రవేశం చేసి... బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పించాడు. పుకార్లను నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. 

19:43 - June 12, 2018

నిర్మల్ : తెలంగాణలో రైతులకు లబ్ది చేకూరాలనే ఉద్దేశంతో సర్కార్‌ చేపట్టిన విత్తనాల పంపిణీ పక్కదారి పడుతోంది. యదేచ్చగా సబ్సిడీ విత్తనాలు పక్కదారి పడుతున్నాయి. నిర్మల్‌ జిల్లాలోని తనూర్‌, కుబీర్‌, ముధోల్‌ మండలాల పరిధిలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 100కు పైగా సబ్సిడీ సోయా విత్తనాల బస్తాలు పట్టుబడ్డాయి. విత్తనాలను అక్రమంగా తరలిస్తున్న రెండు ఆటోలు, ఒక మోటర్‌ సైకిల్‌, ఒక బొలేరో వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు.

19:41 - June 12, 2018

ప్రకాశం : ప్రత్యేక హోదా కోసం జులై నుండి తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాసరావు తెలిపారు. 24 గంటల పాటు ఇతర రాష్ట్రాల నుండి ఏపీకి వచ్చే జాతీయ రహదారులను దిగ్బంధిస్తామన్నారు. హోదా కోసం కలిసివచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోతామన్నారు. ఈ పోరాటంలో తమిళ చిత్ర సీమ నటులు కూడా పాల్గొంటారని తెలిపారు. 

19:39 - June 12, 2018

ఆదిలాబాద్ : ఇప్పటివరకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, కబ్జాదారులు మాత్రమే భూములను ఆక్రమించుకోవడం చూశాం. కాని ఓ పేదోడి స్థలాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి కబ్జా చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోనే ఈ ఘటన జరగడం విస్మయం కలిగిస్తోంది. బాధితుడికే భూమి చెందాలన్న కోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా దర్జాగా భూమిని కబ్జా చేసేశారు. దీంతో న్యాయం చేయాలంటూ బాధితుడు కోరుతున్నాడు. దళితుడి భూమి కబ్జా విషయంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

19:34 - June 12, 2018

యాదాద్రి : తెలంగాణ పరిరక్షణ సమితి కన్వీనర్‌ కల్లూరి రాంచంద్రా రెడ్డి పాదయాత్ర చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి నుంచి మర్యాల వరకు ఉన్న బీటి రోడ్డు విస్తరణ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రోడ్డు విస్తరణ జరిగితే ఈ మూడు గ్రామాలతో పాటు ఇతర గ్రామాలకు రోడ్డు సౌకర్యం మెరుగవుతుందన్నారు. రోడ్డు గుంతలు ఉండడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. 

19:32 - June 12, 2018

అనంతపురం : రైతాంగ సమస్యలను పరిష్కారించాలని సీపీఎం ఆధ్వర్యంలో.. రెండు రోజులుగా అనంతపురం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద చేపట్టిన సత్యాగ్రహం నిరసన ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. జిల్లావ్యాప్తంగా రైతుల నుంచి సేకరించిన లక్ష సంతకాల పత్రాలను జిల్లా కలెక్టర్‌కు నేరుగా అందించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శులు రాంభూపాల్‌, ఇంతియాజ్‌ , రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పెద్దిరెడ్డిలు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన రాకపోతే జిల్లా స్తంభనకు పూనకుంటామన్నారు సీపీఎం నేతలు. 

17:40 - June 12, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ లో అసెంబ్లీ సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై కాంగ్రెస్ పలు విధాలుగా డిమాండ్ చేస్తోంది. గవర్నర్ , స్పీకర్ మధుసూధనాచారి దృష్టికి తీసుకువెళ్లారు. కానీ ఎటువంటి స్పందనా రాకపోవటంతో కాంగ్రెస్ పార్టీ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులను ఖాతరు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ మరోసారి కోర్టు ధిక్కరణ పిటీషన్ ను హైకోర్టులో దాఖలు చేసింది. దీనిపై వచ్చే శుక్రవారం నాడు కోర్టు విచారణ చేపట్టనుంది.

శాసనసభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించకుంటే భారీ ఉద్యమం : కాంగ్రెస్
హైకోర్టు తీర్పును గౌరవిస్తూ కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలని సీఎల్‌పీ డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకోకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ప్రజా ఉద్యమం నిర్మిస్తామని కాంగ్రెస్‌ నేతలు హెచ్చరించారు. ఈ విషయంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేస్తామని అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారిని కలిసిన తర్వాత కాంగ్రెస్‌ నాయకులు చెప్పారు. 

17:36 - June 12, 2018

తూర్పుగోదావరి : పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలను కలిపే గోదావరి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి మీదుగా జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో కోటిపల్లి బస్టాండ్ వద్ద భారీ బహిరంగసభలో జగన్ మాట్లాడుతు..సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయందని ఆరోపించారు. దివంగనేత రాజశేఖర్ రెడ్డి పాలన వున్న సమయంలో పోలవరం ప్రాజెక్టు 70 శాతం పూర్తయిందనీ..కానీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంచనాలను పెంచుకుంటు పోతున్నారని జగన్ విమర్శించారు. ఇప్పటి వరకూ రూ.13,500 కోట్లు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి హయాంలో ఖర్చు పెట్టారన్నారు. పోలవరం పనులు నత్తనడకన నడుస్తున్నాయని..పునాదులు కూడా దాటని పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు వుందని జగన్ ఆరోపించారు. గోదావరి పుష్కరాల పేరుతో చంద్రబాబు రూ.2వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వడ్డి వీరభద్రరావు గుండు గీయించుకుని నిరసన తెలిపారని జగన్ గుర్తు చేశారు. ప్రభుత్వం కట్టి ఇచ్చే ఇళ్లను తీసుకోమని ప్రజలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. 

ఉన్నతాధికారులతో టీటీడీ జేఈవో భేటీ..

తిరుమల : ఉన్నతాధికారులతో టీటీడీ జేఈవో భేటీ అయ్యారు. వేసవి సెలవులు ముగిసినా తిరుమలలో ఇంకా అనూహ్యమైన రద్దీ వుందని జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు సులభంగా దర్శనం కలుగుతోందన్నారు. తిరుమలలోని మ్యూజియంను ఆధునీకరించాలని నిర్ణయించినట్లుగా జేఈవో తెలిపారు. దాతల సౌకర్యార్థం అన్న ప్రసాద పథకంలో మార్పులు చేర్పులు చేశామన్నారు. ముఖ్యమైన రోజుల్లో భక్తుల పేరుమీద అన్నప్రసాద వితరణ సౌకర్యం వుంటుందన్నారు.

16:42 - June 12, 2018

అమరావతి : టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ, బీజేపీ, జనసేన చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చందబాబుపై ఈ పార్టీల నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న వాస్తవాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానించింది. చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో... ప్రతిపక్షాలది కుట్రల కూటమి అని విమర్శించారు. జగన్‌ ప్రయోజనాలను కాపాడేందుకే కమలనాథులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. రాష్ట్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు సమన్వయ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.  

16:39 - June 12, 2018

విశాఖపట్నం : రక్షణ రంగ శిక్షణను విస్తృతం చేసేందుకు విశాఖ విమానాశ్రయంపై నేవీ త్వరలో ఆంక్షలు విధించబోతోంది. నవంబర్‌ నుంచి విమానాశ్రయంలో రాకపోకలు ఆపివేయాల్సిందిగా కోరుతూ తూర్పు నావికాదళం ఏఏఐకి లేఖ పంపింది. దీంతో ఒక రోజులో ఐదు గంటలు రాకపోకలు నిలిచిపోనున్నాయి. అయితే నిషేధం ఏప్పటివరకు అనేది మాత్రం తూర్పు నావికాదళం లేఖలో స్పష్టం చేయలేదు.

విశాఖ విమానాశ్రయంపై నేవీ ఆంక్షలు
విశాఖ విమానాశ్రయం రక్షణశాఖ పరిధిలో ఉండటంతో తూర్పునావికాదళం త్వరలో ఆంక్షలు విధించబోతుంది. నవంబర్‌ నుంచి ఈ ఆంక్షలను అమలులోకి తేనుంది. రక్షణ రంగ శిక్షణను విస్తృతం చేసేందుకు... సైనికుల శిక్షణ బహిర్గతం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో నేవీ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఆంక్షలు విధించబోతోంది. అలాగే ప్రతీ మంగళ, బుధవారం రాత్రి 7 నుంచి 9 వరకు... శని, ఆది వారాల్లో 9 నుంచి 11 వరకు ఆంక్షలు ఉండనున్నాయి. ఒక రోజులో ఐదు గంటల పాటు పౌర విమానాలను నిషేధించనున్నారు.

రాకపోకలు సాగించిన 1836 దేశీయ విమానాలు, 155 విదేశీ సర్వీసులు
అభివృద్ధిలో దూసుకుపోతున్న విశాఖ నగరానికి నేవీ ఆంక్షలు ఆటకంగా మారనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేవీ నిర్ణయంతో పర్యాటక రంగానికి పెద్దదెబ్బ తగులుతుందని ఎయిర్‌ట్రావెల్స్‌ అభిప్రాయ పడింది. విశాఖకు వచ్చే పర్యాటకులు ఎక్కువగా విమానాలనే ఆశ్రయిస్తుంటారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 1836 దేశీయ విమానాలు, 155 విదేశీ సర్వీసులు విమానాశ్రయానికి రాకపోకలు సాగించాయి. స్మార్ట్‌సిటీ జాబితాలో విశాఖ ఉండటంతో పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఏటా 24 లక్షల మంది పర్యాటకులు విశాఖకు వస్తున్నారు. దీంతో రోజుకు 15 లక్షల ఆదాయం టూరిజం శాఖకు వస్తోంది.

విశాఖకు నెలకు 2500 మంది దేశీయ పర్యాటకులు
పర్యాటకులు ఎక్కువగా దేశీయ విమానాల ద్వారా వస్తుండటంతో వీరిపైనే అధిక ప్రభావం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నెలకు 2500 మంది దేశీయ పర్యాటకులు విశాఖకు వస్తున్నారు. వీరు ఎయిర్ ఇండియా, రిలయన్స్ ఎయిర్‌, ఎయిర్‌ ఏషియా, ఇండిగో, ఎయిర్‌ ఇండియా, స్పైట్‌ జెట్‌లాంటి మొత్తం 16 సర్వీసుల ద్వారా విశాఖకు చేరుకుంటున్నారు. ఇక విదేశీ పర్యాటకులు ఎక్కువగా శ్రీలంక నుంచి వస్తున్నారు. విశాఖ - కొలంబో మధ్య శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రతీ మంగళ, గురు, శని, ఆదివారాల్లో నడుస్తున్నాయి. అయితే ఆంక్షలు ఉండే సమయంలోనే ఎక్కువగా దేశీ, విదేశీ సర్వీసులు నడుస్తున్నాయి.

ఆంక్షలు ఉండే సమయంలోనే ఎక్కువగా నడుస్తున్న విమాన సర్వీసులు
దేశ రక్షణ ఎంత అవసరమో అంతే స్థాయిలో ఆర్థిక అభివృద్ధి కీలకమని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల టూరిజం, ఐటీ, ఫార్మా రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. ఐటీ కంపెనీలు వేరే చోటకి తరలివెలితే ఉద్యోగులు నష్టపోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఎయిర్‌లైన్స్ మాత్రం నేవీ నిర్ణయంపై ఇంకా స్పందించలేదు. ఏఏఐకి లేఖ వెళ్లినప్పటికీ అధికారిక నిర్ణయం వెలువడకపోవటంతో ఎయర్‌లైన్స్ కూడా వేచి చూస్తోంది. ఒకవేల ఎయిర్‌లైన్స్‌ సమయాల్ని మారుస్తే, అంతర్జాతీయ సర్వీసులను విశాఖ విమానాశ్రయం వదుకోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. మొత్తానికి నేవీ నిర్ణయం విశాఖ నగర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడబోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

16:34 - June 12, 2018

సింగపూర్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోన్‌ ఉంగ్‌ల మధ్య సింగపూర్‌లో జరిగిన చారిత్రక సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం పలు కీలక పత్రాలపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. ఎఎఫ్‌పి న్యూస్‌ ఏజెన్సీ ప్రకారం అణునిరాయుధీకరణకు కిమ్‌ కట్టుబడి ఉన్నారని...ప్యోగ్యాంగ్‌ భద్రతకు అమెరికా పూర్తి హామీ ఇచ్చిందని పేర్కొంది.దీంతో అమెరికా-ఉత్తరకొరియాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యయనం ప్రారంభం కానుంది. కిమ్‌తో సమావేశం కావడంపై ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర కొరియాతో సంబంధాలు గతంలో కంటే భిన్నంగా ఉండబోతున్నాయని ట్రంప్‌ అన్నారు. అణు నిరాయుధీకరణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. కిమ్‌ చాలా స్మార్ట్‌....విలువైన వ్యక్తి అని ట్రంప్‌ కొనియాడారు. ఇది చారిత్రక సమావేశమని, గతాన్ని వదిలి పెట్టాలని ఇరుదేశాల నేతలు నిర్ణయించినట్లు కిమ్‌ తెలిపారు. ప్రపంచం గొప్ప మార్పును చూడబోతోందని ఆయన అన్నారు. 

రానివారికి పదవులెందుకు : చంద్రబాబు

అమరావతి : టీడీపీ సమన్వయ కమిటీలో సీఎం చంద్రబాబు సమావేశానికి హాజరుకాని నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ జిల్లా ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదనీ జిల్లా అధ్యక్షులను చంద్రబాబు ప్రశ్నించారు. నాకు సెక్రటేరియట్ ఎన్నో అర్జంట్ పనులు వున్నాయనీ..ఏపనీ లేక ఈ సమావేశానికి వచ్చానా? మీ నేతలు అంత బిజీగా వున్నారా? సమావేశానికి రాని వారికి పదవులు అవసరమా? అని అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేల పట్ల అధ్యక్షులు గట్టిగా వ్యవహరించాలని సూచించారు. 

మాజీ ప్రధాని వాజ్ పేయ్ ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా..

అమరావతి : అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజపేయి ఆరోగ్యం గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఢిల్లీలోని ఉన్నతాధికారులతో తాను మాట్లాడానని ట్విట్టర్ ద్వారా చంద్రబాబు తెలిపారు. వాజపేయి తొందరగా కోలుకోవాలని, కుటుంబసభ్యులతో కలసి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. సోమవారం ఉదయం వాజపేయిని హుటాహుటిన ఎయిమ్స్ కు తరలించారు. మూత్రపిండాల సమస్య, శ్వాసకోశ సంబంధ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. రెండు ఊపిరితిత్తుల్లో ఒకటి పని చేయడం లేదు.

16:18 - June 12, 2018

అనంతపురం : కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతు సమస్యలపై కలెక్టరేట్ కు చేరుకున్న రైతులు, వామపక్ష నేతలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వినతిపత్రం ఇచ్చేందుకే వచ్చామని వారు చెబుతున్నా పోలీసులు వారిని లోపలికి అనుమతించకపోవటంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం ఆధ్వర్యంలో రైతులు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాత్రయాత్రకు ఏపీ సీపీఎం పార్టీ మద్ధతునిచ్చింది. ఈ పాదయాత్రలో దాదాపు 5 వేల మంది రైతులు పాల్గొన్నారు.

16:17 - June 12, 2018

అమరావతి : రాజధాని అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నేతలకు దిశా నిర్ధేశం చేశారు. జిల్లాల ఇన్ చార్జ్ మంత్రులుగా వున్నవారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సీఎం సూచించారు. మీడియాలో వచ్చే ప్రతీ విషయానికి నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనీ..ఎక్కువగా స్పందించవద్దని చంద్రబాబు క్లాస పీకారు. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతికి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ఆదేశించారు. అలాగే ఎన్నికల సమయంలో ఈవీఎంల దుర్వినియోగంపై నేతలంతా అప్రమత్తంగా వుండాలని మంత్రి యవనమల సూచించారు. కాగా ఈ సమావేశానికి పలువురి మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. పలువురు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరుకాకపోవటంతో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యాయవాది నాగజ్యోతి హంతకులు అరెస్ట్..

చిత్తూరు : మహిళా న్యాయవాది నాగజ్యోతి హత్యకేసులో ఆరుగురు కిరాయి హంతకులకు పోలీసులు అరెస్ట్ చేశారు. నాగజ్యోతి భర్తతో రూ.20 లక్షలకు నాగజ్యోతి భర్త నుండి సుపారీ తీసుకుని నాగజ్యోతిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. నిందితులు పలు హత్యకేసుల్లో నిందితులుగా వున్నట్లుగా కూడా తెలుస్తోంది. కాగా మహిళా న్యాయవాది నాగజ్యోతి మోటర్ సైకిల్ పై వెళ్తుండగా కొందరు దుండగులు కత్తులతో దాడి చేసిన హత్య చేసిన విషయం తెలిసిందే. 

కేంద్రం ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తోంది: కాల్వ

అమరావతి : అమరావతిలో మీడియాతో కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని, ప్రజాస్వామ్య శక్తుల్ని బలహీన పరుస్తోందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నికల కమిషన్‌ వద్దకు వెళ్లి ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్‌ చేయొచ్చనే విషయాన్ని ఆధారాలతో పాటు నిరూపించారని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని కాల్వ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. రకరకాల అనుమానాలు దేశ వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయన్నారు. 

కేంద్రంపై క్షేత్రస్థాయిలో పోరాడాలి : చంద్రబాబు

అమరావతి : విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చకపోవడంపై టీడీపీ ఎంపీలు క్షేత్ర స్థాయిలో పోరాడాలని నేతలకు సీఎం టీడీపీ సమన్వయం కమిటీలో చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రతి 15 రోజులకు ఒక కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో నిర్వహించాలని చెప్పారు. విశాఖ రైల్వే జోన్, పెట్రో కాంప్లెక్స్, దుగరాజపట్నం పోర్టు, కడపలో స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై పోరాడాలని తెలిపారు. ఢిల్లీలో ఆందోళనలు కూడా చేపట్టాలని సూచించారు. 

భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన చంద్రబాబు..

అమరావతి : ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో, చంద్రబాబు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. అమరావతిలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతు..రానున్న 6 నెలల కాలంలో 75 కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన తెలిపారు. యూనివర్శిటీల్లో ఉన్న 13 జిల్లాల విద్యార్థులతో భేటీ అవుతానని చెప్పారు. సేవా మిత్రలు, సాధికార మిత్రలతో ముఖాముఖి మాట్లాడతానని తెలిపారు. నాయకులపై కార్యకర్తలకు ఉన్న అభిప్రాయాన్ని ప్రతి 45 రోజులకు ఒకసారి సేకరిస్తామని చెప్పారు. ప్రతి నాయకుడు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరితో సత్సంబంధాలను కొనసాగించాలని ఆదేశించారు. 

న్యాయవాది నాగజ్యోతి హంతకులు అరెస్ట్..

చిత్తూరు : మహిళా న్యాయవాది నాగజ్యోతి హత్యకేసులో ఆరుగురు కిరాయి హంతకులకు పోలీసులు అరెస్ట్ చేశారు. నాగజ్యోతి భర్తతో రూ.20 లక్షలకు నాగజ్యోతి భర్త నుండి సుపారీ తీసుకుని నాగజ్యోతిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. నిందితులు పలు హత్యకేసుల్లో నిందితులుగా వున్నట్లుగా కూడా తెలుస్తోంది. కాగా మహిళా న్యాయవాది నాగజ్యోతి మోటర్ సైకిల్ పై వెళ్తుండగా కొందరు దుండగులు కత్తులతో దాడి చేసిన హత్య చేసిన విషయం తెలిసిందే. 

న్యాయవాది నాగజ్యోతి హంతకులు అరెస్ట్..

చిత్తూరు : మహిళా న్యాయవాది నాగజ్యోతి హత్యకేసులో ఆరుగురు కిరాయి హంతకులకు పోలీసులు అరెస్ట్ చేశారు. నాగజ్యోతి భర్తతో రూ.20 లక్షలకు నాగజ్యోతి భర్త నుండి సుపారీ తీసుకుని నాగజ్యోతిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. నిందితులు పలు హత్యకేసుల్లో నిందితులుగా వున్నట్లుగా కూడా తెలుస్తోంది. కాగా మహిళా న్యాయవాది నాగజ్యోతి మోటర్ సైకిల్ పై వెళ్తుండగా కొందరు దుండగులు కత్తులతో దాడి చేసిన హత్య చేసిన విషయం తెలిసిందే. 

15:00 - June 12, 2018

సింగపూర్ : మార్పు సాధ్యమేనని మేం ఇద్దరం నిరూపించాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఇదొక చారిత్రాత్మక సమావేశమని..దీనికి కిమ్ , నేను ఓ చారిత్రాత్మక ఒప్పందానికి తెరలేపామన్నారు. సాహసం ఉన్నవారే శాంతి ప్రక్రియ చేపడతారన్నారు. త్వరలోనే అణునిరాయుధీకరణ జరుగుతుందని ట్రంప్ తెలిపారు. క్షిపణి ప్రయోగ కేంద్రాలనీన ధ్వంసం చేస్తామని కిమ్ హామీ ఇచ్చారన్నారు. ఉత్తర కొరియా ప్రజలు ప్రశాంతంగా జీవించాలని ఈ సందర్భంగా ట్రంప్ అకాంక్షించారు. యుద్ధం ఎవరైనా చేయవచ్చు..కానీ సాహసం ఉన్నవారే శాంతి ప్రక్రియ దిశగా ఆలోచిస్తారని ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్, కిమ్ ఒప్పందాలు..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఈ రోజు సింగపూర్ లో సమావేశం అనంతరం చేసుకున్న సమగ్ర ఒప్పందాలు చేసుకున్నారు. మొదటిది రెండు దేశాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, శాంతి, సౌభాగ్యం కోసం నూతన అమెరికా-ఉత్తరకొరియా సంబంధాల ఏర్పాటుకు ఇరు దేశాలు కృషి చేయడం, కొరియా ద్వీపకల్పంలో సుస్ధిర శాతం కోసం రెండు దేశాలు తమ ప్రయత్నాలను ప్రారంభించడం, 2018 ఏప్రిల్ 27నాటి పన్ ముంజోన్ డిక్లరేషన్ ప్రకారం ఉత్తరకొరియా సంపూర్ణ అణు నిరాయుధీకరణ కోసం కట్టుబడి ఉండడం, వియత్నాం యుద్ద ఖైదీలను గుర్తించి స్వదేశాలకు పంపేందుకు చర్యలు తీసుకోవడం వంటి పలు కీలక ఒప్పందాలకు ఇద్దరు సమ్మతించినట్లుగా సమాచారం.

ట్రంప్, కిమ్ ఒప్పందాలు?!..

సింగపూర్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఈ రోజు సింగపూర్ లో సమావేశం అనంతరం చేసుకున్న సమగ్ర ఒప్పందాలు చేసుకున్నారు.

ఇదొక చారిత్రాత్మక సమావేశం..

సింగపూర్ : మార్పు సాధ్యమేనని మేం ఇద్దరం నిరూపించాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఇదొక చారిత్రాత్మక సమావేశమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. సాహసం ఉన్నవారే శాంతి ప్రక్రియ చేపడతారన్నారు. త్వరలోనే అణునిరాయుధీకరణ జరుగుతుందని ట్రంప్ తెలిపారు. క్షిపణి ప్రయోగ కేంద్రాలనీన ధ్వంసం చేస్తామని కిమ్ హామీ ఇచ్చారన్నారు. ఉత్తర కొరియా ప్రజలు ప్రశాంతంగా జీవించాలని ట్రంప్ అకాంక్షించారు. 

14:06 - June 12, 2018

విశాఖ : ప్రశ్నించడం మొదలు ప్రారంభించినప్పుడే రాజకీయాల్లోకి వచ్చానని ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ లేదన్నారు సినీ నటుడు విశాల్. ఈ సందర్భంగా విశాఖలోని అచ్యుతాపురం బ్రాండెక్స్‌ కంపెనీలో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ పేరుతో వికలాంగులకు ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను విశాల్‌ ప్రారంభించారు. కావేరీ జల వివాదంలో ఇరు రాష్ట్రాలు సుప్రీం తీర్పును గౌరవించాలని సూచించారు. ఏపీలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు విశాల్‌ స్పష్టం చేశారు. 

13:49 - June 12, 2018

సింగపూర్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోన్‌ ఉంగ్‌ల మధ్య సింగపూర్‌లో జరిగిన చారిత్రక సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం పలు కీలక పత్రాలపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. ఎఎఫ్‌పి న్యూస్‌ ఏజెన్సీ ప్రకారం అణునిరాయుధీకరణకు కిమ్‌ కట్టుబడి ఉన్నారని...ప్యోగ్యాంగ్‌ భద్రతకు అమెరికా పూర్తి హామీ ఇచ్చిందని పేర్కొంది.దీంతో అమెరికా-ఉత్తరకొరియాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యయనం ప్రారంభం కానుంది. కిమ్‌తో సమావేశం కావడంపై ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర కొరియాతో సంబంధాలు గతంలో కంటే భిన్నంగా ఉండబోతున్నాయని ట్రంప్‌ అన్నారు. అణు నిరాయుధీకరణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. కిమ్‌ చాలా స్మార్ట్‌....విలువైన వ్యక్తి అని ట్రంప్‌ కొనియాడారు. ఇది చారిత్రక సమావేశమని, గతాన్ని వదిలి పెట్టాలని ఇరుదేశాల నేతలు నిర్ణయించినట్లు కిమ్‌ తెలిపారు. ప్రపంచం గొప్ప మార్పును చూడబోతోందని ఆయన అన్నారు. 

 

13:42 - June 12, 2018

ఢిల్లీ : భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఢిల్లీ ఎయిమ్స్ లో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. కొంతకాలంగా శ్వాస, మూత్రనాళ ఇన్ ఫెక్షన్ తో వాజ్ పాయి బాధపడుతున్నారు. ఈమేరకు వాజ్ పాయి ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆరోగ్యం మెరుపడే వరకు ఆస్పత్రిలో వాజ్ పాయి ఉంటారని వైద్యులు తెలిపారు.

13:26 - June 12, 2018

మహారాష్ట్ర : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముంబైలోని  భీవండీ కోర్టుకు హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వేసిన పరవునష్టం కేసులో రాహుల్  కోర్టుకు హాజరయ్యారు. మహాత్మా గాంధీ హత్యవెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తం ఉందంటూ గతంలో రాహుల్ చేసిన  వ్యాఖ్య లపై కేసు నమోదు కావడంతో రాహుల్‌ కోర్టుకు హాజరయ్యారు. 

 

ముంబై భీవండీ కోర్టుకు రాహుల్‌ గాంధీ హాజరు

మహారాష్ట్ర : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముంబైలోని  భీవండీ కోర్టుకు హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వేసిన పరవునష్టం కేసులో రాహుల్  కోర్టుకు హాజరయ్యారు. మహాత్మా గాంధీ హత్యవెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తం ఉందంటూ గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు కావడంతో రాహుల్‌ కోర్టుకు హాజరయ్యారు. 

 

చీటింగ్‌ చేశారంటూ ఇద్దరు బంగారం వ్యాపారుల నిర్బంధం

నెల్లూరు : నగరంలో సంతపేటలో సీఐ పాపారావు అత్యుత్సాహం ప్రదర్శించాడు. గత నెల 24న చీటింగ్‌ చేశారంటూ ఇద్దరు బంగారం వ్యాపారులను నిర్బంధంలోకి తీసుకున్నారు. 19 రోజులు గడిచినా ఇంతవరకు అరెస్టుచేసినట్టు చూపలేదు. 

13:08 - June 12, 2018

నెల్లూరు : నగరంలో సంతపేటలో సీఐ పాపారావు అత్యుత్సాహం ప్రదర్శించాడు. గత నెల 24న చీటింగ్‌ చేశారంటూ  ఇద్దరు బంగారం వ్యాపారులను నిర్బంధంలోకి తీసుకున్నారు. 19 రోజులు గడిచినా ఇంతవరకు అరెస్టుచేసినట్టు చూపలేదు. తన సోదరులను పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని బాధితుల తమ్ముడు స్టేషన్‌ ముందే ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో విషయం బయటికి వచ్చింది. పోలీసుల తీరుపై నెల్లూరువాసులు మండిపడుతున్నారు. 

వివేక్‌కి ఎదురుదెబ్బ...

హైదరాబాద్ : హెచ్‌సిఏ ప్రెసిడెంట్‌ వివేక్‌కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ తీర్పును నిలిపివేస్తూ డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారిచేసింది. అయితే మరోసారి పూర్తి విచారణ చేపట్టాలని డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. అప్పటి వరకు హెచ్‌సిఏ పదవిలో కొనసాగొద్దని ఆదేశాలు జారీ చేసింది.

13:04 - June 12, 2018

హైదరాబాద్ : హెచ్‌సిఏ ప్రెసిడెంట్‌ వివేక్‌కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ తీర్పును నిలిపివేస్తూ డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారిచేసింది. అయితే మరోసారి పూర్తి విచారణ చేపట్టాలని డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. అప్పటి వరకు హెచ్‌సిఏ పదవిలో కొనసాగొద్దని ఆదేశాలు జారీ చేసింది.

12:56 - June 12, 2018

సింగపూర్ : అంతర్జాతీయ సమాజం దృష్టి సింగపూర్‌వైపు మళ్లింది. అమెరికా, ఉత్తరకొరియా దేశాధినేతల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం ఆరున్నరకు సెంటోసాదీవిలో కెపెల్లా హోటల్లో భేటీ అయిన ట్రంప్‌, కిమ్‌ 4 నిముషాల పాటు  ఏకాంతంగా సమాలోచనలు జరిపారు. అనంతరం ఇరుదేశాల అధికారులతో రెండున్నర గంటలకు పైగా చర్చలు జరిపారు. సమావేశం అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేస్తున్న అంశాలను అధిగమించాల్సిన అవసరం ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా కిమ్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించినట్టు అమెరికా అధ్యక్షుడు తెలిపారు. శాంతి దిశగా ఓ పెద్ద ముందడుగు పడిందన్నారు. రెండు దేశాల మధ్య  ఉన్న అవరోధాలను  అధిగమిస్తామని ఉత్తరకొరియా అధినేత తెలిపారు. సమస్యల పరిష్కారానికి రెండు దేశాలు కృషి చేస్తాయని చెప్పారు. కాగా ఈ మధ్యాహ్నం ఇద్దరు నేతలు వర్కింగ్‌లంచ్‌లో పాల్గొంటారు. అయితే న్యూక్లియర్‌ వెపన్స్‌తో భయపెడుతున్న ఉత్తర కొరియాను దారిలోకి తెచ్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తమ దేశ మనుగడకు హామీ ఇవ్వడంతోపాటు ... వాణిజ్య ఆంక్షలను కూడా పూర్తిగా ఎత్తివేయాలని ఉత్తరకొరియా దేశాధినేత పట్టుబడుతున్నారు. కొరియాలో శాంతిస్థాపనే లక్ష్యంగా సాగుతున్న ఈ చర్చలు ఫలించాలని ప్రపంచదేశాలు గట్టిగా కోరకుంటున్నాయి. 

 

కొనసాగుతున్న టీడీపీ సమన్వయ కమిటీ భేటీ

గుంటూరు : చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా పార్టీల అధ్యక్షులు పాల్గొంటున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాల్లో జరగాల్సిన ధర్మ పోరాట సభలపై చర్చిస్తున్నారు.

 

12:44 - June 12, 2018

గుంటూరు : చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా పార్టీల అధ్యక్షులు పాల్గొంటున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాల్లో జరగాల్సిన ధర్మ పోరాట సభలపై చర్చిస్తున్నారు.

 

12:13 - June 12, 2018

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూమి వివాదంలో తండ్రీ కొడుకులను ప్రత్యర్థులు నరికి చంపేశారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌ గ్రామ పరిధిలోని కృష్ణారావుపల్లిలో ఈఘటన జరిగింది. గ్రామానికి చెందిన సవనపల్లి ఎల్లయ్య సోదరుడి నుంచి వ్యవసాయ భూమిని మామిండ్ల దేవయ్య, స్వామిలు కొనుగోలు చేశారు. 15ఏళ్ల క్రితమే సవనపల్లి యల్లయ్య సోదరుడు తన వ్యవసాయ భూమిని మామిండ్ల దేవయ్య, స్వామిలకు అమ్మాడు. అయితే అన్న మరణించడంతో అమ్మిన భూమి తనదేనని ఎల్లయ్య ఎదురు తిరిగాడు. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున ఎల్లయ్య ఆయన కుమారుడు శేఖర్‌ ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నడానికి వెళ్లారు. ఇదే అదనుగా దేవయ్య, స్వామి దాడి చేశారు. గొడ్డళ్లతో ఎల్లయ్య, శేఖర్‌లను నరికి చంపేశారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే ఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసునమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

 

12:01 - June 12, 2018

సింగపూర్ : అంతర్జాతీయ సమాజం దృష్టి సింగపూర్‌వైపు మళ్లింది. అమెరికా, ఉత్తరకొరియా దేశాధినేతల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం ఆరున్నరకు సెంటోసాదీవిలో కెపెల్లా హోటల్లో డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జోంగ్‌ఉన్‌ సమావేశం అయ్యారు. మొదట ఇద్దరు నేతలే ఏకాంతంగా మట్లాడుకున్నారు. మరికొద్ద సేపట్లో రెండు దేశాలకు చెందిన అధికారుల సమక్షంలో చర్చలు జరుపుతారు. తర్వాత మధ్యాహ్నం ఇద్దరు నేతలు వర్కింగ్‌లంచ్‌లో పాల్గొంటారు. కాగా న్యూక్లియర్‌ వెపన్స్‌తో భయపెడుతున్న ఉత్తర కొరియాను దారిలోకి తెచ్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తమ దేశ మనుగడకు హామీ ఇవ్వడంతోపాటు ... వాణిజ్య ఆంక్షలను కూడా పూర్తిగా ఎత్తివేయాలని ఉత్తరకొరియా దేశాధినేత పట్టుబడుతున్నారు. కొరియాలో శాంతిస్థాపనే లక్ష్యంగా సాగుతున్న ఈ చర్చలు ఫలించాలని ప్రపంచదేశాలు గట్టిగా కోరకుంటున్నాయి. కాగా ట్రంప్‌, కిమ్‌ భేటీ అయిన కెపెల్లా హోటల్‌తోపాటు సెంటొసా దీవిలో కనీవినీ ఎరుగని స్థాయిలో భత్రను కల్పించారు. 
 

11:50 - June 12, 2018

గుంటూరు : కాసేపట్లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. చంద్రబాబు నివాసంలో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. జిల్లాల అధ్యక్షులు చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. 

 

ప్రారంభమైన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

గుంటూరు : టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం అయింది. చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. జిల్లాల అధ్యక్షులు చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు.  

 

తూ.గో జిల్లాలో అగ్నిప్రమాదం..

తూర్పుగోదావరి : అంబాజీపేట మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఏవి ఆర్ కొబ్బరి గోడౌన్ లో మంటలు చెలరేగాయి. మంటల్లో కొబ్బరి నిల్వలు కాలిపోయాయి. 

10:40 - June 12, 2018

తూర్పుగోదావరి : అంబాజీపేట మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఏవి ఆర్ కొబ్బరి గోడౌన్ లో మంటలు చెలరేగాయి. మంటల్లో కొబ్బరి నిల్వలు కాలిపోయాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

10:22 - June 12, 2018

సింగపూర్ : అంతర్జాతీయ సమాజం దృష్టి సింగపూర్‌వైపు మళ్లింది. అమెరికా, ఉత్తరకొరియా దేశాధినేతల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం ఆరున్నరకు సెంటోసాదీవిలో కెపెల్లా హోటల్లో డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జోంగ్‌ఉన్‌ సమావేశం అయ్యారు. మొదట ఇద్దరు నేతలే ఏకాంతంగా మట్లాడుకున్నారు. మరికొద్ద సేపట్లో రెండు దేశాలకు చెందిన అధికారుల సమక్షంలో చర్చలు జరుపుతారు. తర్వాత మధ్యాహ్నం ఇద్దరు నేతలు వర్కింగ్‌లంచ్‌లో పాల్గొంటారు. కాగా న్యూక్లియర్‌ వెపన్స్‌తో భయపెడుతున్న ఉత్తర కొరియాను దారిలోకి తెచ్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తమ దేశ మనుగడకు హామీ ఇవ్వడంతోపాటు ... వాణిజ్య ఆంక్షలను కూడా పూర్తిగా ఎత్తివేయాలని ఉత్తరకొరియా దేశాధినేత పట్టుబడుతున్నారు. కొరియాలో శాంతిస్థాపనే లక్ష్యంగా సాగుతున్న ఈ చర్చలు ఫలించాలని ప్రపంచదేశాలు గట్టిగా కోరకుంటున్నాయి. కాగా ట్రంప్‌, కిమ్‌ భేటీ అయిన కెపెల్లా హోటల్‌తోపాటు సెంటొసా దీవిలో కనీవినీ ఎరుగని స్థాయిలో భత్రను కల్పించారు.

 

09:53 - June 12, 2018

చిత్తూరు : జిల్లాలో అధికార టీడీపీ రాజకీయం రసకందాయంలో పడింది. ప్రత్యేకించి చంద్రగిరి నియోజకవర్గంలో ఆపార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. ఇప్పటి వరకు నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న గల్లా అరుణకుమారి పార్టీకి అంటీముట్టనట్టుగా ఉండడంతో... అటు పార్టీలోనూ... ఇటు క్యాడర్‌లోనూ అయోమయం నెలకొంది. ఇంతకీ చంద్రగిరి టీడీపీలో ఏం జరుగుతోంది? గల్లా అరుణకుమారి టీడీపీలో కొనసాగుతారా? లేక ఇతర పార్టీలో చేరుతారా? చంద్రగిరి రాజకీయంపై 10టీవీ కథనం....
రోజుకో మలుపుతు తిరుగుతున్న పాలిటిక్స్‌
చిత్తూరు అంటేనే సీఎం చంద్రబాబు సొంత జిల్లా. అందులోనూ చంద్రగిరి అంటే చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లె కొలువైన నియోజకవర్గం. అలాంటి చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 
టీడీపీ దూరంగా ఉంటోన్న గల్లా అరుణ
గడిచిన మూడు ఎన్నికల్లోనూ చంద్రగిరిలో టీడీపీ ఓటమినే చవి చూసింది. చంద్రగిరిపై పసుపు జెండా ఎగిరి పదిహేనేళ్లు కావొస్తోంది. కాంగ్రెస్‌ నుంచి గల్లా అరుణకుమారి వరుసగా ఇక్కడ విజయం సాధిస్తూ వచ్చారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత సీన్‌ రివర్స్‌ అయ్యింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ దెబ్బతినడంతో... గల్లా అరుణకుమారి టీడీపీ కండువా కప్పుకున్నారు.  2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగగా... ఆమె వైసీపీ చేతిలో ఓడిపోయారు. తన రాకను జీర్ణించుకోలేని టీడీపీలోని ఓ వర్గం తన ఓటమికి కృషి చేసిందని ఆమె మనస్తాపం చెందారు. అంతేకాదు.. కనీసం తనకు ఎమ్మెల్సీ అయినా దక్కుతుందని కొంతకాలంగా ఆమె ఎదురు చూశారు. కానీ అదికూడా దక్కదని తేలడంతో ఆమె టీడీపీకి దూరంగా ఉంటున్నారు. పైకి ఆమె చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్నా... పార్టీ కార్యక్రమాలకు అంతంత మాత్రంగానే హాజరయ్యేవారు. ఈ పరిణామాలు అధిష్టానం దృష్టికి కూడా వెళ్లాయి.
రాజకీయాలకే గుడ్‌బై చెప్తానన్న గల్లా
అసలే టీడీపీలో అసంతృప్తిగా ఉన్న గల్లా అరుణకుమారికి.. పార్టీ వదిలిన ఓ లీక్‌ మరింత కోపాన్ని తెచ్చిపెట్టింది. గల్లా అరుణ ఈ దఫా చంద్రగిరి నుంచి కాకుండా పలమనేరు నుంచి పోటీ చేస్తారన్నది ఆ లీక్‌ సారాంశం.  పలమనేరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి అమర్‌నాథ్‌రెడ్డిని పుంగనూరుకు పంపాలని పార్టీ యోచిస్తోంది. ఈ పరిణామాలు అరుణకు స్వతహాగానే కోపం తెప్పించాయి. దీంతో చంద్రగిరి స్థానానికే కాదు... అసలు రాజకీయాలకే గుడ్‌పై బెప్పాలని ఆమె ఆ మధ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చంద్రబాబుకు కూడా చెప్పి... అదేరోజు అమెరికాకు వెళ్లారు. అయితే ఈ సమస్య అంతటితో ముగియలేదు. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్‌ తమకే కావాలంటూ ఆమె.. నియోజకవర్గం అంతటా సమావేశాలు పెట్టారు.  అరుణకుమారే ఈ మీటింగ్‌లు పెట్టిస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది.  ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన ఆమె... పార్టీ కేడర్‌తో సమావేశమయ్యారు. పార్టీలో కొంతమంది తనకు ద్రోహం చేస్తున్నారని చెప్తూనే... టీడీపీని వీడబోనని స్పష్టం చేశారు. నియోజకవర్గ ఇంచార్జీగా కూడా తనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. 
గల్లా అరుణపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం
చంద్రగిరి నియోజకవర్గంలోని మరోవర్గం ఆమె నిర్ణయంపై గుర్రుగా ఉంది. పార్టీ కోసం పనిచేయరుకానీ... పార్టీ టికెట్‌ తనకే కావాలంటే ఎలా అని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఊహించని పరిణామాలతో చంద్రబాబు అయోమయంలోపడ్డారు. చంద్రగిరి రాజకీయాలు ఆయనకు తలనొప్పి వ్యవహారంగా మారింది. అయితే 2019 ఎన్నికల్లో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది... అంతిమంగా అక్కడ నుంచి పోటీ చేసేది ఎవరన్నది చివరకు ఎలా ముగుస్తుందోన్న ఆసక్తి జిల్లా అంతగా నెలకొంది. 

 

పీఎన్ బీ మొండి బకాయిల వ్యవహారంపై కమిటీ

ఢిల్లీ : పీఎన్ బీ మొండి బకాయిల వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేశారు. పీఎన్ బీ మొండి బకాయిల వ్యవహారంపై కమిటీ ప్రశ్నించనుంది. ఈ కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్ సహా ఇతర పార్టీల ఎంంపీలు ఉన్నారు.

నేడు ఎంపీ అవంతి శ్రీనివాస్ ఒక రోజు నిరాహార దీక్ష

హైదరాబాద్ : నేడు ఎంపీ అవంతి శ్రీనివాస్ ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని అవంతి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఉదయం 10 గంటలకు టీడీపీ సమన్వయ కమిటీ భేటీ

అమరావతి : ఉదయం 10 గంటలకు టీడీపీ సమన్వయ కమిటీ భేటీ జరుగనుంది. మంత్రులు, జిల్లాల పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు.

09:25 - June 12, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్ పాయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్ లో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. గత కొంతకాలంగా వాజ్ పాయి శ్వాస సంబంధ, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మరికొద్ది సేపట్లో ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. 

 

09:24 - June 12, 2018

సింగపూర్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ భేటీ అయ్యారు. ఉదయం 6.30 గంటలకు సింగపూర్ లోని కెపెల్లా హోటల్ లో సమావేశం అయ్యారు. ట్రంప్, కిమ్ ఏకాంతంగా చర్చలు జరుపుతున్నారు. ఏకాంత భేటీ అనంతరం ఇరు దేశాల అధికారుల సమక్షంలో చర్చలు జరుపనున్నారు. మధ్యాహ్నం ట్రంప్, కిమ్ వర్కింగ్ లంచ్ భేటీ అవ్వనున్నారు. అణు నిరాయుధీకరణకు అమెరికా పట్టుబడుతోంది. మనుగడకు హామీ ఇచ్చి ఆంక్షలు ఎత్తివేయాలని ఉత్తర కొరియా డిమాండ్ చేస్తోంది. సింగపూర్ లోని సెంటోసా దీవి భద్రతా వలయంలో ఉంది. ఇంతకాలం వాగ్యుద్ధంతో.. ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించిన ఈ ఇద్దరు నేతలు.. సామరస్యపూర్వక భేటీకి హాజరు కానుండడంతో.. సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

 

కొనసాగుతన్న కిమ్, ట్రంప్ భేటీ

సింగపూర్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ భేటీ కొనసాగుతోంది. ఉదయం 6.30 గంటలకు సింగపూర్ లోని కెపెల్లా హోటల్ లో సమావేశం అయ్యారు. ట్రంప్, కిమ్ ఏకాంతంగా చర్చలు జరుపుతున్నారు. ఏకాంత భేటీ అనంతరం ఇరు దేశాల అధికారుల సమక్షంలో చర్చలు జరుపనున్నారు. మధ్యాహ్నం ట్రంప్, కిమ్ వర్కింగ్ లంచ్ భేటీ అవ్వనున్నారు. 

నిలకడగా వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి

ఢిల్లీ : వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఉదయం 9 గంటలకు ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. 

ట్రాక్టర్, కారు ఢీ

అనంతపురం : తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో ట్రాక్టర్, కారు ఢీకొన్నాయి. కారులో తరలిస్తున్న 31 ఎర్రచందనం దుంగలు లభ్యం అయ్యాయి. దుండగులు పరారయ్యారు. ఎర్రచందనం దుంగలు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

 

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

నెల్లూరు : కొండవలూరు మండలం బొడ్డుపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. డ్రైవర్ మృతి చెందారు. మరో 26 మందికి గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

08:26 - June 12, 2018

సింగపూర్ : అంతర్జాతీయ సమాజం దృష్టి సింగపూర్‌వైపు మళ్లింది. అమెరికా, ఉత్తరకొరియా దేశాధినేతల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం ఆరున్నరకు సెంటోసాదీవిలో కెపెల్లా హోటల్లో డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జోంగ్‌ఉన్‌ సమావేశం అయ్యారు. మొదట ఇద్దరు నేతలే ఏకాంతంగా మట్లాడుకున్నారు. మరికొద్ద సేపట్లో రెండు దేశాలకు చెందిన అధికారుల సమక్షంలో చర్చలు జరుపుతారు. తర్వాత మధ్యాహ్నం ఇద్దరు నేతలు వర్కింగ్‌లంచ్‌లో పాల్గొంటారు. కాగా న్యూక్లియర్‌ వెపన్స్‌తో భయపెడుతున్న ఉత్తర కొరియాను దారిలోకి తెచ్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తమ దేశ మనుగడకు హామీ ఇవ్వడంతోపాటు ... వాణిజ్య ఆంక్షలను కూడా పూర్తిగా ఎత్తివేయాలని ఉత్తరకొరియా దేశాధినేత పట్టుబడుతున్నారు. కొరియాలో శాంతిస్థాపనే లక్ష్యంగా సాగుతున్న ఈ చర్చలు ఫలించాలని ప్రపంచదేశాలు గట్టిగా కోరకుంటున్నాయి. కాగా ట్రంప్‌, కిమ్‌ భేటీ అయిన కెపెల్లా హోటల్‌తోపాటు సెంటొసా దీవిలో కనీవినీ ఎరుగని స్థాయిలో భత్రను కల్పించారు. 

 

08:18 - June 12, 2018

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను మోసగించాయని వక్తలు అన్నారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి, టీడీపీ నేత నాగుల మీరా, సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.నర్సింగరావు, బీజేపీ ఏపీ నేత ఆర్ డీ విల్సన్ పాల్గొని, మాట్లాడారు. బీజేపీ, టీడీపీ డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. కేంద్రం ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తానని చెప్పి.. మాట తప్పారని పేర్కొన్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

సిరిసిల్ల జిల్లాలో దారుణం

రాజన్న సిరిసిల్ల : ఇల్లంతకుంట మండలం కృష్ణారావుపల్లిలో దారుణం జరిగింది. తండ్రీకొడుకులను గుర్తు తెలియన వ్యక్తులు నరికి చంపారు. భూతగాదాలే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నేడు విజయవాడలో కాంగ్రెస్ ఇంచార్జీ ఉమెన్ ఛాందీ పర్యటన

కృష్ణా : నేడు విజయవాడలో కాంగ్రెస్ ఇంచార్జీ ఉమెన్ ఛాందీ పర్యటించనున్నారు. 13 జిల్లాల డీసీసీలతో సమావేశం కానున్నారు. 

ట్రంప్, కిమ్ జంగ్ భేటీ

సింగపూర్ : అమెరికా, ఉత్తర కొరియా మధ్య కీలక సమావేశం జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ భేటీ అయ్యారు. సింగపూర్ లోని కేపెల్లా వేదికగా ఇరువురు సమావేశం అయ్యారు. 

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి

జమ్మూకాశ్మీర్ : పుల్వామాలో ఉగ్రవాదులు గ్రేనేడ్ దాడికి పాల్పడ్డారు. కోర్డు కాంప్లెక్స్ వద్ద ఉగ్రవాదులు గ్రెనేడ్ పేల్చారు. ఇద్దరు పోలీసులు మృతి చెందారు.  

నేడు కర్నాకటకు మంత్రి పోచారం నేతృత్వంలోని మంత్రి బృందం

హైదరాబాద్ : నేడు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని మంత్రి బృందం కర్నాకటకు వెళ్లనుంది. ప్రాసెసింగ్ యూనిట్లపై బృందం అధ్యయనం చేయనుంది.

07:40 - June 12, 2018

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంతో పేరు ప్రాఖ్యాతాలు ఉన్నా ప్రభుత్వ రంగ సంస్థ, అత్యంత క్వాలీటీతో స్టీల్ అందించే పరిశ్రమ. కానీ దీనికి సొంత గనులు లేవు. దీని వల్ల ఎంతో భారం ఈ ప్రభుత్వరంగ సంస్థపైన పడుతోంది. దీనికి సొంత గనులు కేటాయించాలని వామపక్ష కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్న...పాలకుల్లో ఆశించే స్పందన రావడం లేదు. ఇదే అంశంపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శవర్గసభ్యులు సీహెచ్ నర్సింగ్ రావు మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

07:35 - June 12, 2018

హైదరాబాద్ : గులాబీపార్టీ ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికలు సవాల్‌ విసురుతున్నాయి. సాధారణ ఎన్నికలకు ముందుగా వస్తున్న ఎన్నికలు కావడంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎక్కువ పంచాయతీల్లో గెలిస్తేనే ఎమ్మెల్యే టిక్కెట్‌ పదిలంగా ఉంటుందన్న భయం వెంటాడుతోంది. మరోవైపు గులాబీబాస్‌ పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో పట్టు సాధించాలని ఎమ్మెల్యేలకు ఆదేశించినట్టు తెలుస్తోంది.
పంచాయతీ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ నేతలకు కత్తిమీద సామే
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు దడ పుట్టిస్తున్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికలపై గులాబీపార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఇప్పటి నుంచే దృష్టి సారించారు.  గ్రామాల్లో ఓటుబ్యాంకు సాధించేందుకు ఈ ఎన్నికలే కీలకం కావడంతో... ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలోనూ పర్యటించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతోపాటు.. వ్యక్తిగతంగా తాము చేసిన అభివృద్దే ఆయుధంగా ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారు. అయితే పంచాయతీ ఎన్నికలు ఎదుర్కొనేందుకు గులాబీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నా.. వారిని ఓటమి భయం వెంటాడుతూనే ఉంది.  అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికలు పూర్తయ్యేవరకు  గ్రామాల్లోని గ్రూపులను ఏకం చేయడం.. అభ్యర్థులను గెలిపించుకోవడం వారికి కత్తిమీద సామే. సాధారణ ఎన్నికలకు ముందు పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో అన్ని పార్టీలు వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దీంతో అభ్యర్థులను గెలుపించుకునేందుకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వ్యూహాలు రచిస్తున్నారు.
గ్రామాల్లో ఓటుబ్యాంకు పెంచుకోవడంపై టీఆర్‌ఎస్‌ దృష్టి
గ్రామాల్లో ఓటు బ్యాంకు పెంచుకోవడంపై టీఆర్‌ఎస్‌ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అత్యధిక పంచాయతీలు గెల్చుకోవాలని పథకాలు రూపొందిస్తున్నారు. లేకపోతే ఎమ్మెల్యే టికెట్‌కే ఎసరువస్తుందన్న భయం వారిని వెంటాడుతోంది. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి చెప్పేందుకు వారు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో పల్లెల్లో టీఆర్‌ఎస్‌కు ఒక రకంగా అనుకూల వాతావరణమే ఏర్పడింది. ఓటర్లను సులువుగా తమవైపు తిప్పుకోవచ్చన్న ధీమాలో టీఆర్‌ఎస్‌ బాస్‌ ఉన్నారు. నియోజకవర్గాల్లో మెజార్టీ సర్పంచ్‌ స్థానాలను దక్కించుకోవాలన్న సీఎం సూచనలతో గులాబీనేతలు.. పంచాయతీ ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. విజయం సాధించే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. అన్ని వర్గాలను సమన్వయం పర్చడం... వారికి ఒకతాటిపైకి తీసుకురావడానికి ప్రత్యేకప్లాన్స్‌ సిద్ధం చేసుకుంటున్నారు. అసంతృప్తులను ఎలా దారికి తెచ్చుకోవాలన్న దానిపైనా దృష్టిసారించారు. పంచాయతీల్లో విజయమే లక్ష్యంగా.. అన్ని శక్తులను, గ్రూపులను ఏకం చేసేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గులాబీ నేతలు యోచిస్తున్నారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు గులాబీ నేతలకు కొత్త సవాల్‌ను విసురుతున్నాయి. మరి ఎన్నికలను ఎదుర్కొని .. మెజార్టీ గ్రామాలు దక్కించుకోవడానికి ఎలా ముందుకు వెళ్తారో వేచి చూడాలి.
 

07:31 - June 12, 2018

విజయవాడ : నవ్యాంధ్ర రాజధానికి భవిష్యత్‌లో తాగునీటి కష్టాలు ఎదురుకాకుండా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. కృష్ణానది చెంతనేగల వైకుంఠపురం దగ్గర..  బ్యారేజ్‌ నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులకు ఆమోదం తెలిపింది. త్వరలోనే వాటర్‌ స్టోరేజ్‌ వంతెన నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
నీటి సమస్య ఎదురుకాకుండా ఉండేలా ప్రణాళికలు సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు నగర ప్రజలకు రాబోయే రోజుల్లో దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మున్ముందు అక్కడ నీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా.. కృష్ణానదిపై నూతన బ్యారేజ్‌ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.  ఇందుకోసం 2,169 కోట్ల మేర అనుమతులు కూడా జారీ చేసింది. రవాణాపరంగా ఈ ప్రాంతం కీలకం కావడం.. బ్యారేజ్‌ నిర్మాణానికి సహజసిద్ధంగా అనుకూలంగా ఉండడంతో కొత్త బ్యారేజీ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. బ్యారేజీ ఆకృతులు రూపొందించి... పనులకు టెండర్లు పిలవడానికి జలవనరులశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ బ్యారేజీ నిర్మాణమైతే... దాదాపు 10 టీఎంసీల నీరు నిల్వ ఉంచేందుకు అవకాశం ఉంటుంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన 23 కిలోమీటర్ల దూరంలో వైకుంఠపురం దగ్గర బ్యారేజీ నిర్మిస్తే కొన్ని కిలోమీటర్ల మేర నీరు పుష్కలంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
గని ఆత్కూరు, వైకుంఠపురం గ్రామాల మధ్య బ్యారేజీ నిర్మాణం
కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ కంచికచర్ల మండలం గనిఆత్కూరు, గుంటూరు జిల్లాలో వైకుంఠపురం గ్రామాల మధ్య కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి గతంలోనే ప్రాథమిక సర్వే పూర్తి చేశారు. ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర విభజనతో నీటి అవసరాల కోసం ఈప్రాంతంలో బ్రిడ్జి కమ్‌ బ్యారేజీ నిర్మాణానికి డిమాండ్‌ ఏర్పడింది.  ప్రస్తుతం రాజధానిలో నీటి అవసరాలు ఆశించినంతగా లేకపోవడంతో ప్రకాశం బ్యారేజీలో రాజధాని అవసరాలకు తగ్గట్టుగా వాటర్‌ స్టోరేజీకి మరో బ్యారేజీ నిర్మాణ అవసరం ఏర్పడింది. వర్షాకాలంలో దిగువ ప్రాంతంతోపాటు మున్నేరు నుంచి వచ్చే వరద నీటి ఆధారంగా ఈ బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 10 టీఎంసీల నీటినిల్వ, 50 లక్షలమందికి తాగునీరు, రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లక్ష్యంగా ఈ బ్యారేజీకి ప్రభుత్వం రూపకల్పన చేసింది.
బ్యారేజీ నిర్మాణానికి రూ. 2,169 కోట్లు ఖర్చు
బ్యారేజీ నిర్మాణానికి  దాదాపు 2,169 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో భూసేకరణకు 771 కోట్లు కేటాయించారు. బ్యారేజీ నిర్మాణ పనులకు 1088 కోట్లు, నావిగేషన్‌ పనులకు 88 కోట్లు, భవనాల నిర్మాణానికి మరో 11 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు.  నూతన బ్యారేజీ నిర్మాణం జరిగిన వెంటనే 10 టీఎంసీల నీటిని అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోవచ్చు.

 

07:26 - June 12, 2018

తూర్పుగోదావరి : ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మత్స్యకారులు సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం మత్స్య పరిశ్రమను పట్టించుకోకపోవటంతో పాటు ఇచ్చిన హామీలను నెరవేర్చనందునే సమ్మెకు దిగాల్సి వస్తోందని మత్స్యకారులు చెబుతున్నారు. 
మత్స్య వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మె
తూర్పుగోదావరి జిల్లాలో మత్స్యకారులు సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. మత్స్య వ్యతిరేక విధానాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నందున సమ్మెకు దిగుతున్నట్లు మత్స్యకారులు ప్రకటించారు. అలాగే పెరుగుతున్న డీజిల్‌ భారం, తగ్గిపోతున్న మత్స్య సంపద, మార్కెట్ మాయజాలంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. అందుకే ఈ నెల 14 తర్వాత ఈ సమ్మెను చేపట్టబోతున్నామని తెలిపారు. ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్ర మత్స్య సంపద అభివృద్ది కోసం ప్రభుత్వం వేటను నిషేధిస్తోందన్నారు.  తమకు  తగిన పరిహారం ఇవ్వకపోవటంతో  తీవ్రంగా నష్టపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
వేటకు వెళ్లకుండ వినూత్న నిరసనలు చేసే యోచన 
క్రాప్‌ హాలిడే స్ఫూర్తితో ఈ సమ్మెకు దిగుతున్నట్లు మత్స్యకారులు తెలిపారు. నిషేధం తర్వాత వేటకు వెళ్లకుండా వినూత్న నిరసనలతో సమ్మె చేస్తామన్నారు. బోట్లకు రాయితీలపై అందిస్తున్న డీజిల్ సక్రమంగా అందకపోవటమే కాకుండా అనేక ఇతర సమస్యలతో బాధపడుతున్నందునే సమ్మెకు దిగుతున్నామని బోటు యజమానులు చెబుతున్నారు. 
చేపల ధరలు పెరిగే అవకాశం 
మరోవైపు మత్స్యకారుల సమ్మెతో మార్కెట్లో చేపల ధరలు పెరిగే అవకాశం ఉంది. చెరువు చేపలు కనిపిస్తున్నప్పటికి కాలుష్య కారణంగా వాటిని కొనుగోలు చేయడానికి ఎవ్వరూ సిద్దపడటం లేదు. సముద్ర చేపలకు గిరాకీ ఉండటంతో ధరలు పెరుగనున్నట్లు తెలుస్తోంది. 

 

నేడు 187వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర

తూ.గో : నేడు 187వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర కొనసాగనుంది. ప.గో జిల్లా నుంచి తూ.గో జిల్లాల్లోకి పాదయాత్ర ప్రవేశించనుంది. 

నల్గొండ జిల్లాలో రోడ్డుప్రమాదం

నల్గొండ : నకిరేకల్ మండలం చందంపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. విజయవాడ..హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగివున్న ఆర్టీసీ బస్సును కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

 

07:15 - June 12, 2018

హైదరాబాద్ : హైకోర్టు తీర్పును గౌరవిస్తూ కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలని సీఎల్‌పీ డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకోకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ప్రజా ఉద్యమం నిర్మిస్తామని కాంగ్రెస్‌ నేతలు హెచ్చరించారు. ఈ విషయంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేస్తామని అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారిని కలిసిన  తర్వాత  కాంగ్రెస్‌ నాయకులు చెప్పారు. 
స్పీకర్‌ మధుసూదనాచారిని కలిసిన కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ్యత్వాలను పునరుద్ధిరించాలని కోరుతూ.. సీఎల్‌పీ నాయకులు అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారిని కలిసి విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ వీరిద్దర్నీ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ వెంటనే అన్ని సౌకర్యలు కల్పించాలని వినతిపత్రం అందజేశారు. కోమటిరెడ్డి, సంపత్‌ శాసనభ్యత్వాలను పునరుద్ధరిస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌తోపాటు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును స్పీకర్‌ దృష్టికి తెచ్చారు. కాంగ్రెస్‌ నేతల నుంచి వినతిపత్రం తీసుకున్న స్పీకర్‌ మధుసూదనాచారి... అన్ని అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారే కానీ.. ఎప్పుడు పునరుద్ధరిస్తారన్న అంశంపై నిర్ధిష్టమైన నిర్ణయం తీసుకోలేదు. 
కోర్టు తీర్పును గౌరవించాలి..
కోర్టు తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ఇటు స్పీకర్‌తోపాటు అటు ప్రభుత్వంపైనా ఉందని సీఎల్‌పీ నేత జానారెడ్డి స్పీకర్‌ మధుసూదనాచారి దృష్టికి తెచ్చారు. కోమటిరెడ్డి, సంపత్‌ శాసనసభ్యత్వాల పునరుద్ధరణపై వారంలో నిర్ణయం తీసుకోపోతే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. హైకోర్టు తీర్పును అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని  ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ  అన్నారు. సభ్యత్వాలు పునరుద్ధరించే వరకు పోరాటం కొనసాగుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 
రేవంత్‌రెడ్డి, మధుసూదనాచారికి మధ్య వాగ్వాదం
మరోవైపు సీఎల్‌పీ నాయకులు స్పీకర్‌ని కలిసిన సమయంలో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, మధుసూదనాచారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. న్యాయస్థానం తీర్పును ఎందుకు అమలు చేయడంలేదని రేవంత్‌రెడ్డి నిలదీశారు. పెన్ను దొంగిలిస్తే ఉరిశిక్ష వేసినట్టుగా స్పీకర్‌ వైఖరి ఉందంటూ రేవంత్‌రెడ్డి గట్టిగా వ్యాఖ్యానించడంతో మధుసూదనాచారి మనస్తాపానికి గురయ్యారు. రేవంత్‌రెడ్డి వైఖరితో చిన్నబుచ్చుకున్న స్పీకర్‌... ఇలా మాట్లాడితే వెళ్లిపోతానని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు చెప్పారు. దీంతో  సీఎల్‌పీ నేత జానారెడ్డి జోక్యం చేసుకుని రేవంత్‌రెడ్డిని వారించడంతో  వివాదం సద్దుమణిగింది.

 

07:06 - June 12, 2018

సింగపూర్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ల భేటీకి సింగపూర్‌ సిద్ధమయింది. భేటీ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేసింది సింగపూర్‌ ప్రభుత్వం. ఇంతకాలం వాగ్యుద్ధంతో.. ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించిన ఈ ఇద్దరు నేతలు.. సామరస్యపూర్వక భేటీకి హాజరు కానుండడంతో.. సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
భారీ భద్రత నడుమ సింగపూర్‌ చేరుకున్న ట్రంప్‌, కిమ్‌
సింగపూర్‌ వేదికగా ట్రంప్, కిమ్‌ జాంగ్‌ ఉన్‌ల భేటీ జరగబోతోంది. దీనికోసం ఇరు దేశాధ్యక్షులు ఇప్పటికే భారీ భద్రత నడుమ సింగపూర్‌ చేరుకున్నారు. ఆదివారం సింగపూర్‌ చేరుకున్న కిమ్‌ ఆ దేశ ప్రధానితో భేటీ అయ్యారు. రెండు దేశాల భేటీని ఏర్పాటు చేసిందుకు సింగపూర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 
లూంగ్‌తో భేటీ అయిన ట్రంప్‌
సింగపూర్‌ చేరుకున్న ట్రంప్‌ ఆ దేశ ప్రధాని లూంగ్‌తో భేటీ అయ్యారు. మంగళవారం జరగబోయే సదస్సు ఏర్పాట్లు, ద్వైపాక్షిక అంశాల గురించి చర్చించుకున్నారు. సమావేశాల మధ్యలోనే లూంగ్‌...ట్రంప్‌ పుట్టిన రోజు వేడుకలు జరిపారు. అనంతరం ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 
రహస్యంగా కిమ్‌ సింగపూర్‌ ప్రయాణం
కిమ్‌ సింగపూర్‌ ప్రయాణం అంతా రహస్యంగా సాగింది. గమ్యానికి చేరేవరకు ఆవిమానం ఎక్కడికి వెళ్తుందో ఫ్లైట్‌ రాడార్లకు కూడా అర్ధం కానివ్వలేదు. గాల్లోకి ఎగిరే ప్రతి అంతర్జాతీయ విమానాన్ని ట్రాక్‌ చేసే ఫ్లైట్‌ రాడార్‌ 24 కూడా ఈ విషయంలో గందరగోళానికి గురైంది. దీన్నిబట్టి కిమ్‌ తన భద్రత విషయంలో ఎంత గోప్యంగా ఉన్నారో అర్థమవుతోంది. కిమ్‌పై పలుమార్లు హత్యాయత్నం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కిమ్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. అమెరికా అధ్యక్షుడి రక్షణకు సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెన్సీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో కిమ్ రక్షణకు కూడా ఉత్తర కొరియా అదే పద్దతి పాటించింది. 
ఎవ్వరికీ తెలియని కిమ్‌ ప్రయాణ సమయాలు
కిమ్‌ ప్రయాణ సమయాలు ఎవరికీ ముందుగా తెలియదు. సింగపూర్‌లోని కొన్ని ప్రభుత్వ వర్గాలకు మాత్రమే ఈ సమాచారం అత్యంత రహస్యంగా అందుబాటులో ఉంచారు. కిమ్‌ పర్యటన కోసం ప్యాంగ్‌ యాంగ్‌ నుండి సింగపూర్‌కు మూడు విమానాలు వచ్చాయి. ఇందులో రెండు విమానాల్లో కిమ్‌ రక్షణ, సహాయ సిబ్బంది ఉన్నారు. కిమ్‌ సింగపూర్‌లో తినే ఆహారాన్ని భద్రతా సిబ్బంది ముందే పరీక్షిస్తుంది. ఈ సందర్భంగా కిమ్‌ వాడే ఫోన్లను రహస్యంగా ఉంచే ఓ టెక్నికల్‌ బృందం కూడా సింగపూర్‌ చేరుకుంది. ట్రంప్‌ కాన్వాయ్‌కు తీసిపోని విధంగా కిమ్‌ కూడా 20 కాన్వాయ్‌లను తీసుకువచ్చారు. 
నేపాలీ గూర్ఖాలతో భద్రతా ఏర్పాట్లు 
భేటీ సందర్భంగా గిరిజన తెగ నేపాలీ గూర్ఖాలతో భద్రతా ఏర్పాట్లు చేసింది సింగపూర్‌ ప్రభుత్వం. మొత్తానికి ఉప్పు నిప్పులా ఉండే ఇరు దేశాధ్యక్షుల భేటీకి సింగపూర్‌ సిద్ధమైంది. ఈ భేటీ ఫలితం ఎలా ఉండబోతోందోనన్న ఆసక్తి ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది. 

నేడు సింగపూర్ లో ట్రంప్..కిమ్ చారిత్రాత్మక భేటీ

ఢిల్లీ : నేడు సింగపూర్ లో ట్రంప్..కిమ్ చారిత్రాత్మక భేటీ జరుగనుంది. పలు అంశాలపై ఇరువురు చర్చించనున్నారు.

 

నేడు ప్రపంచ బాల కార్మిక నిరోధక దినం

హైదరాబాద్ : నేడు ప్రపంచ బాల కార్మిక నిరోధక దినం. బాల కార్మిక నిరోధక దినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

 

నేడు ఏపీ ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల

విశాఖ : నేడు ఏపీ ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను విడుదల చేయనున్న మంత్రి గంటా శ్రీనివాస్ విడుదల చేయనున్నారు.

Don't Miss