Activities calendar

13 June 2018

19:23 - June 13, 2018

టీటీడీ వివాదం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ప్రస్తుత టిటిడి ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో కేవియెట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. రమణ దీక్షితులు కంటే ముందే ప్రధాన అర్చకులు కోర్టును ఆశ్రయించారు. అక్రమంగా తనను ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించారని, స్వామి వారి ఆభరణాలు కనబడటం లేదని, ఈ విషయంపై వచ్చే నెల మొదటివారంలో సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తానని రమణదీక్షితులు అన్న నేపథ్యంలో టీటీడీ కేవియెట్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీని ప్రకారం రమణ దీక్షితులు పిటిషన్‌ వేసినా తాము చెప్పేది కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోవాలన్న విన్నపంతోనే కేవియెట్‌ పిటిషన్‌ను వేశామని వేణుగోపాల దీక్షితులు తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈఅంశంపై చర్చను చేపట్టింది 10టీవీ. ఈ చర్చలో ప్రముఖ విశ్లేకులు తెలకపల్లి రవి పాల్గొన్నారు. 

18:55 - June 13, 2018

హైదరాబాద్ : నిన్న విడుదలైన జెఈఈ మెయిన్స్ 2018 పరీక్ష ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించిందని వెలాసిటీ విద్యాసంస్థల డైరెక్టర్ రాధాకృష్ణ తెలిపారు. వెలాసిటీ విద్యాసంస్థల నుండి జెఈఈ పరీక్షకు 159 మంది విద్యార్ధులు అర్హత సాధించారు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో పి. పవన్ కుమార్ రెడ్డి 28వ ర్యాంకు, బి. వరుణ్ తేజ్ ఎస్టీ కేటగిరిలో 6వ ర్యాంకు, డి. శ్రేయా రెడ్డి బాలికల విభాగం సౌత్ జోన్ లో 2వ ర్యాంకు సాధించారన్నారు. విద్యార్ధులకు, వారి తల్లీదండ్రులకు, అధ్యాపకులకు వెలాసిటీ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

18:51 - June 13, 2018

ఢిల్లీ : టీటీడీ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. ప్రస్తుత టిటిడి ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో కేవియెట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. రమణ దీక్షితులు కంటే ముందే ప్రధాన అర్చకులు కోర్టును ఆశ్రయించారు. అక్రమంగా తనను ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించారని, స్వామి వారి ఆభరణాలు కనబడటం లేదని, ఈ విషయంపై వచ్చే నెల మొదటివారంలో సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తానని రమణదీక్షితులు అన్న నేపథ్యంలో టీటీడీ కేవియెట్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీని ప్రకారం రమణ దీక్షితులు పిటిషన్‌ వేసినా తాము చెప్పేది కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోవాలన్న విన్నపంతోనే కేవియెట్‌ పిటిషన్‌ను వేశామని వేణుగోపాల దీక్షితులు తరపు న్యాయవాది పేర్కొన్నారు.

18:47 - June 13, 2018

ఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి, బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజపేయి ఆరోగ్యం నిలకడగానే ఉందని...ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. మరికొన్ని రోజుల్లో వాజపేయి పూర్తిస్థాయిలో కోలుకుంటారని వైద్యులు పేర్కొన్నారు. కిడ్ని పనితీరు తిరిగి మామూలు స్థితికి చేరుకుందని.... గుండె పనితీరు, రక్తపోటు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని.. ఎటువంటి లైఫ్ సపోర్ట్ లేకుండా పనిచేస్తున్నాయని చెప్పారు. కిడ్ని సమస్యతో బాధపడుతున్న వాజ్‌పేయి ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 

18:34 - June 13, 2018

ఉత్తరప్రదేశ్ : ప్రభుత్వ భవనంలో నుంచి మార్బుల్స్‌ లాంటి విలువైన వస్తువులు తీసుకెళ్లారని నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఉత్తరప్రదేశ్‌ మాజీ సిఎం, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ స్పందించారు. భవనం లోపల తానేమి విధ్వంసానికి పాల్పడలేదని, ఎలాంటి నష్టం కలిగించలేదని చెప్పుకొచ్చారు. భవనంలో సొంత ఖర్చుతో తాను స్వయంగా తెప్పించిన వస్తువులను మాత్రమే తీసుకెళ్లినట్లు అఖిలేష్‌ చెప్పారు. వీటిని తిరిగి ఇవ్వడానికి సిద్ధమేనన్నారు. యోగి ప్రభుత్వానిది చాలా చిన్న మనసని ధ్వజమెత్తారు. ఉపఎన్నికల్లో ఓటమితో కృంగిపోయిన బిజెపి ఇలాంటి పనులు చేస్తోందని అఖిలేష్‌ మండిపడ్డారు. ఎస్పీ-బిఎస్పీ కూటమితో బిజెపికి భయం పట్టుకుందన్నారు. యూపీ గవర్నర్‌ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని...ఆయన లోపల ఆర్‌ఎస్‌ఎస్‌ ఆత్మ ఉందని విమర్శించారు.

18:32 - June 13, 2018

ఢిల్లీ : మహాకూటమిని నేతలే కాదు... ప్రజలు కూడా కోరుకుంటున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, ప్రధాని నరేంద్ర మోదీ ఎదుర్కొనేందుకు మహా కూటమే సరైనదని ప్రజలు భావిస్తున్నట్లు రాహుల్‌ తెలిపారు. ప్రధాని మోది, బిజెపి రాజ్యాంగ సంస్థలపై దాడులు చేస్తోందని ఆయన విమర్శించారు. వీటిని ఎలా ఆపాలని ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పారు. మోది ప్రభుత్వం పేదలకు వ్యతిరేకమని, కొంతమంది పెద్దల కోసం పనిచేస్తోందని రాహుల్‌ ఆరోపించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను జిఎస్‌టి పరిధిలోకి తెచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు.

మాజీ ప్రధాని వాజ్ పేయ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్..

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. గత 48 గంటల్లో వాజ్ పేయి ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడిందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా తెలిపారు. మూత్రపిండం పనితీరు బాగుందని చెప్పారు. మూత్రవిసర్జన సాధారణ స్థాయికి చేరుకుందని తెలిపారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిందని, శ్వాస మంచిగా తీసుకుంటున్నారని చెప్పారు. బీపీ, హార్ట్ బీట్ సాధారణంగా ఉన్నాయని తెలిపారు. ఇతర సపోర్ట్ లేకుండానే ఇవన్నీ సాధారణంగా ఉన్నాయని చెప్పారు. మరి కొన్ని రోజుల్లో వాజ్ పేయి పూర్తిగా కోలుకుంటారని, ఆ తర్వాత ఆయనను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. 

 

17:36 - June 13, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నేతలు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసారు. తెలంగాణలో మూడు లక్షలకు పైగా వున్న అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఇటీవల బెయిల్ పై విడుదల అయిన అగ్రిగోల్డ్ డైరెక్టర్లను వెంటనే అరెస్ట్ చేయాలని ఆలిండియా అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షులు రమేశ్ బాబు డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు వీల్లేదని..బైట వున్న మిగతా డైరెక్టర్లను కూడా అరెసట్ చేయాలని రమేశ్ బాబు డిమాండ్ చేశారు. కర్ణాటకలో కూడా పలు కేసులు పెండింగ్ లోవున్నాయన్నారు. కాగా అగ్రిగోల్డ్ చైర్మన్ సహా ఆరుగురు డైరెక్టర్లకు బెయిల్ మచిలీపట్నం జిల్లా కోర్టు మంజూరు చేసింది. చార్జ్ షీట్ దాఖలు చేయటంలో సీఐబీ విఫలయ్యిందని కోర్టు అభిప్రాయపడింది.ఈ నేపథ్యలోనే వీరికి బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో అగ్రిగోల్డ్ చైర్మన్ సహా ఆరుగురు డైరెక్టర్లు జైలు నుండి విడుదల కానున్నారు. 

17:27 - June 13, 2018

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాతో పాటు తెలంగాణలోని బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్ల ఏర్పాటు ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మాత్రమే సూచనలు ఉన్నాయని సుప్రీంకోర్టుకు చెబుతూ అఫిడవిట్‌ దాఖలు చేసింది. తాము అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే స్పష్టమైన నివేదిక ఇచ్చామని, ఆ ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారాలు సాధ్యం కావని చెప్పామని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న ఉక్కు పరిశ్రమలు నష్టాల్లో ఉన్నాయని చెప్పుకొచ్చింది. గతంలోనే ఈ విషయంపై తాము స్పష్టమైన ప్రకటన చేశామని కేంద్ర ప్రమభుత్వం పేర్కొంది. సాధ్యాసాధ్యాలపై టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని..మెకాన్ సంస్థ కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరుపుతున్నామనీ కేంద్రం దాటవేత ధోరణిని అవలంభించింది. 

రాజకీయ లబ్ది కోసమే రాహుల్ ఇఫ్తార్ విందు : నఖ్వీ

ఢిల్లీ : రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్ గాంధీ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్నారని కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ రాహుల్‌ గాంధీని విమర్శించారు. ఈ విషయంలో తాము మాత్రం ఏ విధంగానూ కాంగ్రెస్‌తో పోటీ పడటం లేదని, తాను ట్రిపుల్‌ తలాక్‌ బాధితుల కోసం ఇఫ్లార్‌ విందు ఇస్తున్నానని నఖ్వీ అన్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతోన్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్‌ ఇఫ్తార్‌ విందు ఇస్తోందని భావిస్తోన్న బీజేపీ ఆ పార్టీకి పోటీగానే ఇఫ్తార్‌ విందు ఇస్తోందని కాంగ్రెస్‌ నేతలు కూడా విమర్శిస్తున్నారు.       

తెలుగు రాష్ట్రాల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాతో పాటు తెలంగాణలోని బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్ల ఏర్పాటు ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మాత్రమే సూచనలు ఉన్నాయని సుప్రీంకోర్టుకు చెబుతూ అఫిడవిట్‌ దాఖలు చేసింది. తాము అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే స్పష్టమైన నివేదిక ఇచ్చామని, ఆ ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారాలు సాధ్యం కావని చెప్పామని తెలిపింది. ఇప్పటికే ఉన్న ఉక్కు పరిశ్రమలు నష్టాల్లో ఉన్నాయని చెప్పుకొచ్చింది.

వర్లీ భీవండీ టవర్స్ లో భారీ అగ్నిప్రమాదం..

ముంబై : వర్లీ భీవండీ కమర్షియల్ టవర్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 33 అంతస్తుల కమిర్షియల్ బిల్డింగ్ లో మంటలు చెలరేగాలయి. 25వ అంతస్థు నుండి వ్యాపించిన మంటలు బిల్డింగ్ మొత్తంగా వ్యాపించినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. వర్లీ టవర్స్ లోనే ప్రముఖ బాలివుడ్ నటి దిపికా పదుకొనే నివాసం వుంటున్నారు. ఫోర్ల వారీగా ఫైర్ బృందం మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. భవనం లోపల వున్నవారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చేసేందుకు భద్రతాబలగాలను, రెస్క్యూ టీమ్ లను రంగంలోకి దించారు. 

మాకు ప్రజలతోనే పొత్తు : ఉమెన్ చాంది

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీతోనూ తమకు పొత్తులుండవని, ప్రజలతోనే తమ పొత్తు అని కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి ఊమెన్ చాందీ స్పష్టం చేశారు. ఏపీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఊమెన్ చాందీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఏపీ అనుకూలమైన రాష్ట్రమని, బూత్ లెవెల్ వరకు పార్టీ నిర్మాణమే లక్ష్యంగా త్వరలోనే ఇంటింటికి ప్రచారం ప్రారంభించనున్నట్టు చెప్పారు.

కాచిగూడ, కరీంనగర్ కు కొత్తరైలు..

హైదరాబాద్ : కాచిగూడ నుంచి జగిత్యాల మీదుగా కరీంనగర్ కు కొత్త రైలు ప్రారంభం కానుంది. ఈ నెల 15న రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాచిగూడ నుంచి నిజామాబాద్, మెట్ పల్లి, కోరుట్ల, జగిత్యాల మీదుగా కరీంనగర్ ప్రతిరోజు ఈ రైలు నడవనుంది. ఈ రైలు తిరిగి ఇదే మార్గంలో కాచిగూడకు చేరుకుంటుందని రైల్వే శాఖాధికారులు చెప్పారు. కాగా, నిజామాబాద్ ఎంపీ కవిత గతంలో రైల్వే శాఖ మంత్రితో పాటు దక్షిణ మధ్య రైల్వే జీఎంకు ఈ మేరకు ఓ లేఖ రాశారు.

16:41 - June 13, 2018

అనతంపురం : జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో మంత్రి లోకేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..రైతన్నలకు బీమా కల్పించిన ఘనత టీడీపీదేనని లోకేశ్ తెలిపారు. 16వేల కోట్ల లోటు బడ్జెట్ తో ఏపీని విభజించారని లోకేశ్ పేర్కొన్నారు. ఇంత లోటులో వున్నాగానీ రుణమాఫీని చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడిగారిదేనన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పెన్షన్లను కూడా రూ.200ల నుండి రూ.1000కి పెంచామన్నారు. పెట్టుబడి సాగుచేస్తే..ఎకరానికి మిగిలేంత నగదును పెన్షన్ రూపంలో టీడీపీ ప్రభుత్వం ఇస్తోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత లేని విధంగా పంచాయితీరాజ్ వ్యవస్థ ద్వారా అభివృద్ది చేశామని మంత్రి లోకేశ్ తెలిపారు.  

16:37 - June 13, 2018

విజయవాడ : ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేశారాని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఉమెన్‌ చాందీ విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని మోదీ అమలు చేయకపోవడాన్ని చాందీ తప్పుపట్టారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి కూడా హోదా సాధించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని మండిపడ్డారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. 

అడ్వయిజరీ కమిటీలో దొంగలు : లక్ష్మీపార్వతి

హైదరాబాద్ : ఈవీఎం టాంపరింగ్ చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు అడ్వయిజరీ కమిటీలో నియమించారని వైసీపీ నేత లక్ష్మీపార్వతి విమర్శించారు. దొంగల్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అడ్వయిజరీ కమిటీలో పెట్టుకోవటం ఏమిటని లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తున్నారన్నారు. ఎన్నికలు రాకుండానే ఈవీఎం లాంపరింగ్ గురించి మాట్లాడటంతో మాకు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని లక్ష్మీపార్వతి విమర్శించారు.

16:13 - June 13, 2018

విజయనగరం : ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కాశీ యాత్రకు వెళ్లి వస్తున్న భక్తులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు మృతి చెందారు. భోగాపురం మండలం పాలపల్లి వద్ద ట్రావెల్స్ బస్ ను ఎదురుగా వస్తున్న ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో కాశీకి వెళ్లి తిరిగు ప్రయాణమైన భక్తులు మరికొద్ది సేపట్లో విశాఖ చేరుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలవగా పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమాదం సయమంలో బస్ లో చిక్కుకున్న 20మంది ప్రయాణీకులను రక్షించేందుకు స్థానికులు యత్నిస్తున్నారు. మృతులు విశాఖ వాసులుగా తెలుస్తోంది. 

16:00 - June 13, 2018

రాజన్న సిరిసిల్ల : రైతన్న, నేతన్నలతోపాటు ప్రతి ఒక్కరూ సంతోషించే విధంగా కేసీఆర్‌ పాలన సాగుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాజన్న సిరిసిల్లలో వ్యవసాయ కళాశాల శంకు స్థాపన కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు మంత్రి కేటీఆర్. కరవుకు కేరాఫ్‌గా ఉన్న ప్రాంతంలో కాలువల నిర్మాణం అద్భుతంగా సాగుతోందని చెప్పారు మంత్రి. కేసీఆర్‌ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు కాలంతో పోటీ పడుతూ ముందుకు సాగిందన్నారు. ఈ ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి 38 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని కేటీఆర్‌ అన్నారు.

15:52 - June 13, 2018

కడప : జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మాణంతోపాటు.. స్థానిక సమస్యలపై నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌. ప్రధానిని కలిసి జిల్లా సమస్యలపై వినతిపత్రం ఇవ్వనున్నట్లు సీఎం రమేష్‌ తెలిపారు. అప్పటికీ కేంద్రం స్పందింకుంటే.. కడప జిల్లా జిల్లా వాసిగా... జిల్లా సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉధృతంగా ఉద్యమిస్తానని తెలిపారు.

15:49 - June 13, 2018

భద్రాద్రి : తెలంగాణాలో కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెంజిల్లా గుండాల..శాయనపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని ఏడు మెలికల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆదివాసి పల్లెలకు మండల కేంద్రం గుండాలతో సంబంధాలు తెగిపోయాయి. నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని గ్రామస్తులు వాగుదాటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కనీస సౌకర్యాలు లేక గుండాల మండలవాసులు, ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. తెలంగాణా రాష్ర్టంలో బ్యాంకు, ఏటీఎం, పెట్రోల్‌బంకు లేని మండల కేంద్రం కూడా గుండాలనే. 

15:39 - June 13, 2018

అమరావతి : టీటీడీ బోర్టు తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలకు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై విజయసాయిరెడ్డి స్పందించారు. తాను నిప్పుని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడని, మంత్రి లోకేశ్ లను పప్పు నాయుడు అనీ..అటువంటివారు ఇప్పించిన నోటీసులకు తాము భయపడేది లేదని ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవాచేశారు. చంద్రబాబు నాయుడు ఇప్పించిన నోటీసులకు తాము భయపడేది లేదన్నారు. టీటీడీ జారీ చేసిన నోటీసులను నోటీసులు అనటానికి వీల్లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు దొంగతనం, దోపిడీ చేసి..అతని కుమారుడు టీటీడీ ఆస్తులను విదేశాలను తరలించారని విజయసాయిరెడ్డి మరోసారి ఆరోపించారు. తాను చంద్రబాబు పై చేసిన ఆరోపణలకు కట్టుబడి వుంటారని..తాను ఇచ్చిన 13 గంటల సమయంలో స్పందించకుండా వారాలు గడిచిపోయిన తరువాత స్పందించి నోటీసులిప్పిస్తే తాము భయపడేది లేదని విజయసాయరెడ్డి పేర్కొన్నారు. అటువంటివారు ఇచ్చిన నోటీసులకు ఏమాత్రం భయపడేది లేదని ధీమా వ్యక్తంచేశారు. కాగా టీటీడీ ఆస్తులు, విలువైన ఆభరణాలు చంద్రబాబు నాయుడు కాజేశారనీ గతంలో విజయసాయిరెడ్డి చంద్రబాబుపై ఆరోపణలు చేసిన విషయం తెలిసందే. అలాగే తిరుమల శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణదీక్షితులకు కూడా టీటీడీ నోటీసులు జారీ చేసిన విషయం కూడా తెలిసిందే.తాము చేసిన ఆరోపణలపై నోటీసులు ఇచ్చే అధికారం టీటీడీకి లేదన్నారు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. నోటీసులు ఇచ్చే అధికారం సీఆర్‌పీసీ నిబంధలన ప్రకారం ఇన్వెస్టిగేషన్‌ అధికారులకు మాత్రమే ఉంటుందన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు టీటీడీ సంపదను దోచుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరగాల్సిందిపోయి.. తమనే ముద్దాయిలుగా చూడటం సరికాదన్నారు. 2019లో జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు, లోకేష్‌ల ఇళ్లలో దాచిన టీడీపీ సంపదను వెలికి తీస్తామన్నారు విజయసాయిరెడ్డి. 

 

15:15 - June 13, 2018

ముంబై : వర్లీ భీవండీ కమర్షియల్ టవర్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 33 అంతస్తుల కమిర్షియల్ బిల్డింగ్ లో మంటలు చెలరేగాలయి. 25వ అంతస్థు నుండి వ్యాపించిన మంటలు బిల్డింగ్ మొత్తంగా వ్యాపించినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. వర్లీ టవర్స్ లోనే ప్రముఖ బాలివుడ్ నటి దిపికా పదుకొనే నివాసం వుంటున్నారు. ఫోర్ల వారీగా ఫైర్ బృందం మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. భవనం లోపల వున్నవారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చేసేందుకు భద్రతాబలగాలను, రెస్క్యూ టీమ్ లను రంగంలోకి దించారు. 

15:11 - June 13, 2018

మంచిర్యాల : మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అనుభవజ్నులు చెప్పిన మాటకు నిదర్శనంగా కనిపిస్తోంది వెన్నల మండలంలో చోటుచేసుకుంది. తోడబుట్టిన అన్న కృష్ణారెడ్డిపై తమ్ముడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. తహశీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా వుండటంతో ఆసుపత్రికి తరలించారు.

14:08 - June 13, 2018

ప్రకాశం : పొదిలిలో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కారు. ఒంగోలు కర్నూలు జిల్లా రహదారిపై ధర్నా నిర్వహించారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 

14:02 - June 13, 2018

రాజన్నసిరిసిల్ల : మంత్రి కేటీఆర్ కృషి వల్లే సిరిసిల్లకు పాలిటెక్నిక్, అగ్రికల్చర్ కాలేజీలు వచ్చాయని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.   
వ్యవసాయ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇది ఒక చక్కటి కార్యక్రమం అన్నారు. కేటీఆర్ కృషి వల్ల పాలిటెక్నిక్ కళాశాలను బిల్డింగ్ తో సహా ప్రారంభించుకున్నామని తెలిపారు. ఒక్క సిరిసిల్లకు పాలిటెక్నిక్ కళాశాల, వ్యవసాయ కళాశాల వచ్చాయని..అది కేటీఆర్ చొరవ వల్లే అని పేర్కొన్నారు. బోధించే సిబ్బందితో ప్రారంభించామని తెలిపారు. ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభం అవుతాయని చెప్పారు. 60 మంది విద్యార్థులతో కాలేజీ ప్రారంభం చేయాలని వీసీ ప్రవీణ్ రావుకు సూచించారు. 

 

13:52 - June 13, 2018

ఢిల్లీ : టీటీడీ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. రమణదీక్షితులకంటే ముందే టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వేణుగోపాల దీక్షితుల తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో కేవియెట్ పిటిషన్ దాఖలు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

13:50 - June 13, 2018

బెంగళూరు : కర్నాటక జయనగర ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ సౌమ్యారెడ్డి విజయం సాధించారు. మే 12 న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే జయనగర బీజేపీ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందగా ఎన్నిక వాయిదా పడింది. దీంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. జూన్ 11 న జయనగర అసెంబ్లీ స్ధానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలుపొందారు. ఈ గెలుపుతో కాంగ్రెస్ కు అదనంగా రెండు సీట్ల బలం వచ్చింది. కాగా బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. 

 

13:23 - June 13, 2018
13:03 - June 13, 2018

హైదరాబాద్ : అందరూ ఆత్మగౌరవంతో బ్రతకాలి. అందుకే  డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మిస్తున్నాం. మీరున్న స్థలాలు ఖాళీ చెయండి. 14 నెలల్లో ఇళ్లు కట్టిస్తాం.. ఇది గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం సమయంలో ప్రభుత్వం పెద్దలు అధికారులు చెప్పిన మాటలు. కానీ ఇళ్ల నిర్మాణ పనుల్లో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. గ్రేటర్‌ పరిధిలో స్లమ్స్‌ను తొలగించి, ఇళ్లు నిర్మిస్తామన్నా పనులు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

హైదరాబాద్‌ నగరంలో లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం చేపడుతామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఖాళీ స్థలాలతో పాటు మురికి వాడలు... బస్తీల్లో కూడా రెండు పడక గదులను నిర్మిస్తామన్నారు. అయితే మురికి వాడల్లో ఇళ్ల నిర్మాణం పెద్ద సమస్యగా మారింది. అక్కడున్న కుటుంబాలను ఒప్పించి, భూవివాదాలను చక్కబెట్టడం అధికారులకు తలనొప్పిగా మారింది. మరో వైపు లబ్ధిదారులు ఒప్పుకున్న ప్రాంతాల్లో కూడా నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో చర్చనీయాంశంగా మారింది.

ఇక కార్వాన్‌ నియోజకవర్గంలో గుడిమల్కాపూర్‌ బోజగుట్ట వద్ద ఉన్న మురికివాడలో 1800 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ స్లమ్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 14 నెలల్లో నిర్మాణ పనులు పూర్తిచేస్తామని, అప్పటి వరకు పక్కనే ఉన్న ఖాళీ స్థలాల్లో గుడిసెలు ఏర్పాటు చేసుకోవచ్చంటూ అంధికారులు సెలవిచ్చారు. దీంతో కొంతమంది అక్కడే గుడిసెలు వేసుకోగా మరి కొందరు... ఇతర ప్రాంతాల్లోకి వెళ్లారు. ఇప్పటికి 7 నెలలు గడుస్తున్నా పనుల్లో పురోగతి కనిపించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పనుల్లో తీవ్రజాప్యం చేస్తున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు.

మొత్తం 68బ్లాకుల్లో  1800 కుపైగా ఇళ్లు నిర్మించాల్సి ఉంటే 5,6 బ్లాకులకు మించి పనులు కాలేదు. టెండర్‌ అగ్రిమెంట్‌ పూర్తయ్యి 7 నెలలు అయినా.. పనుల్లో మాత్రం వేగం లేదని బోజగుట్ట వాసులు అంటున్నారు. పక్కనే చిన్న అవాసాలు ఏర్పాటు చేసుకొని  అనేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు. పనులు త్వరగా పూర్తిచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

జిహెచ్‌ఎంసీ సీటీ పరిధిలోని మురికి వాడల్లో 10వేల ఇళ్ల వరకు నిర్మిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి కోర్టు కేసులు, భూవివాదాలు వెంటాడుతున్నాయి. వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసిప్పుడు మాత్రమే ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని లేదంటే సామన్యూలకు కష్టాలు తప్పవని స్థానికులు అంటున్నారు.  

12:58 - June 13, 2018

విజయనగరం : సార్వత్రిక ఎన్నికల్లు సమీపిస్తుండటంతో విజయనగరం జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు యాక్టివ్‌ అవుతున్నారు. నాలుగేళ్లలో కేవలం అధికార పార్టీపై విమర్శలకే పరిమితమైన వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే  ప్రభుత్వ పథకాల్లో చోటు చేసుకుంటున్న అవినీతి, అక్రమాలపై క్షేత్రస్థాయిలో పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

2014 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చతికిలపడింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఆ పార్టీ నేతలు శాయశక్తులా కృషి చేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో తొమ్మిది సీట్లకు గాను కేవలం మూడు సీట్లతో సరిపెట్టుకున్న ఆ పార్టీ.. వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2014 ఎన్నికల్లో వైసీపీ మూడు సీట్లను గెలుచుకున్నప్పటికీ... బొబ్బిలిరాజు సుజయకృష్ణ రంగారావు టీడీపీకి వెళ్లిపోవడంతో ప్రస్తుతం కేవలం రెండు స్థానాల్లో మాత్రమే వైసీపీ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే  మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వర్గం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోవటంతో...  రంగారావు టీడీపీలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో సుజయకృష్ణ రంగారావు కొనసాగుతున్నారు. బొత్స వైసీపీలో చేరిన తర్వాత పార్టీ కొంత బలోపేతమయ్యింది. కానీ పార్టీ కేడర్‌లో మాత్రం చురుకుదనం కనిపించడం లేదు. 

ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్త ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామికి, బొత్సకు మధ్య ఉన్న వర్గ విభేదాలు మొదట్లో పార్టీ కేడర్‌ను గందరగోళానికి గురి చేసినా..  ఇటీవల కాలంలో ఈ రెండు వర్గాల మధ్య కొంత సమన్వయం రావడంతో పార్టీ ఇప్పుడిప్పుడే గాడిలో పడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టిని బలోపేతం చేసేందుకు నేతలు ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న బొత్స మేనల్లుడు చిన్న శ్రీను పార్టీని పటిష్టం చేసే పనిలో పడ్డారు. ప్రభుత్వ పథకాల్లో చోటు చేసుకుంటున్న అవినీతి, అక్రమాలు వెలికి తీయడం, అధికార పార్టీ నేతల అక్రమాలను ఎండగడుతూ క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

అధికార పార్టీ టీడీపీలో ఉన్న వర్గ విభేదాలను కూడా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల బొబ్బిలి నియోజకవర్గంలో సీనియర్‌ టీడీపీ నేత శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడును వైసీపీలో చేరే విధంగా ప్రయత్నించి విజయం సాధించారు... జగన్‌ సమక్షంలో శంబంగి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అధికార పార్టీలో ఉన్న అసంతృప్తులను కూడగట్టడం, వారిని తమ పార్టీలోకి ఆహ్వానించడం వంటి చర్యలతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా సాలూరు, బొబ్బొలి, గజపతినగరం, చీపురుపల్లి  నియోజకవర్గాల్లో అధికార తెలుగుదేశం పార్టీని బలహీనపర్చే విధంగా చిన్న శ్రీను పావులు కదుపుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సైతం తనదైన శైలిలో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. పార్టీ కార్యకర్తలు, మహిళా సంఘాలతో నిత్యం ఆయన సమావేశాలను నిర్వహిస్తూ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. 

మొత్తానికి 2014 ఎన్నికల్లో అపజయాలపై వైసీపీ నేతలు తీవ్రంగానే దృష్టి సారించారనే విషయం స్పష్టమవుతోంది. ఇందుకోసమే వైసీపీ శ్రేణులు కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతూ... పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పుడిప్పుడే కార్యకలాపాలను విస్తృతం చేస్తున్నారు.. మరి వైసీపీ నేతలు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు విజయమంతమవుతాయో వేచి చూడాలి

జయనగర్ లో సౌమ్యారెడ్డి విజయం..

కర్ణాటక : జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ పడ్డ మాజీ హోమ్ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. తొలుత 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలోకి వెళ్లిన సౌమ్యారెడ్డికి, ఆపై రౌండ్లలో మెజారిటీ తగ్గుతూ రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన కనిపించింది. చివరకు ఏమవుతుందా? అన్న టెన్షన్ నెలకొనగా, ఇంటికి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి బీఎన్ ప్రహ్లాద్ తిరిగి కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు కూడా. చివరకు సుమారు 4 వేల ఓట్ల మెజారిటీతో సౌమ్యా రెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

12:53 - June 13, 2018

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో తండ్రీ కొడుకుల మృతదేహాలతో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి..  ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో భూ తగాదాలతో.. మంగళవారం ఎల్లయ్య, రాజశేఖర్‌ను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. గత కొంతకాలంగా 39 గుంటల భూమి కోసం ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోంది.  నిందితులు దేవయ్య, స్వామి, పద్మ వెంకటేష్‌ను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్‌ చేశాయి. 

 

12:49 - June 13, 2018

మేడ్చల్‌ : జిల్లా రిజిష్టర్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎన్‌. కిషన్‌ ప్రసాద్‌ ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. అక్రమ ఆస్తులు ఉన్నాయన్న సమాచారం మేరకు ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎల్బీనగర్‌లోని కిషన్‌ ఇంటితోపాటు.. మేడ్చల్‌ జిల్లా రిజిష్టర్‌ కార్యాలయంలోని ఆయన క్యాబిన్‌లోనూ  సోదాలు చేపట్టారు. 

 

12:45 - June 13, 2018

ఢిల్లీ : ఆరోగ్యంగా ఉండాలంటే మీరు కూడా వ్యాయామం చేస్తూ ఫొటోలు, వీడియోలను హమ్‌ ఫిట్‌తో ఇండియాఫిట్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌మీడియాలో మీ సన్నిహితులతో పంచుకోండి అంటూ కేంద్ర క్రీడలశాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలని విరాట్‌ కోహ్లీ విసిరిన సవాల్‌ను ఇప్పుడు ప్రధాని మోది స్వీకరించారు. తాజాగా మోదీ యోగాతో పాటు పలు శారీరక వ్యాయమాలు చేసిన 2 నిమిషాల నిడివిగల వీడియోను సోషల్ మీడియాలో మోదీ అప్‌లోడ్‌ చేశారు. అంతే కాదు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ విసిరారు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగతంగా అత్యధిక మెడల్స్ సాధించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రాతో పాటు ప్రత్యేకించి 40ఏళ్లు పైబడిన ధైర్యవంతులైన ఐపీఎస్ అధికారులందరికీ మోదీ సవాల్ విసిరారు. 

 

సుప్రీంకోర్టుకు చేరిన టీటీడీ వివాదం..

తిరుమల : టీటీడీ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. టీటీడీ వివాదంపై మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు సుప్రీంకోర్టుకు వెళతానని పేర్కొన్న నేపథ్యంలో రమణదీక్షితుల కంటే ముందుగానే సుప్రీంకోర్టులో వేణుగోపాలాచారి దీక్షితుల తరపు న్యాయవాది కేవియెట్ పిటీషన్ దాఖరు చేసారు. 

12:40 - June 13, 2018

ఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌  గవర్నర్‌ నివాసంలోనే మూడు రోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు. ఐఏఎస్‌ అధికారులు నాలుగు నెలలుగా విదులకు రావడం లేదని, ప్రభుత్వానికి సహకరించడం లేదని అంటున్న కేజ్రీవాల్ ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా సోమవారం సాయంత్రం గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ను కలిశారు. అయితే గవర్నర్‌ నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో సమస్యను పరిష్కరించేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ రాజ్‌భవన్‌ వెయిటింగ్‌ హాల్‌లోనే బైటాయించి నిరసన తెలుపుతున్నారు.

 

12:35 - June 13, 2018

ఉదయం లేచినప్పటి నుండి వివిధ రకాల ఆహారాలను మనం తింటుంటాం. ద్రవపదార్ధాలతో పాటు ఘన పదార్ధాలను తింటుంటాం. అవి జీర్ణం కాకపోవచ్చు. కడుపులో మంటలు రావచ్చు. ఎందుకొస్తుందో తెలీదు. కొందరికి కడుపు ఖాళీ అయితే నొప్పి మొదలవుతుంది. మరి కొందరికి కడుపు నిండితే నొప్పి ప్రారంభమవుతుంది. ఒక్కొక్కరిని ఒక్కోలా కడుపులో నొప్పులు వస్తుంటాయి. 'అల్సర్' వల్ల ఇటువంటి నొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి. దీనికి కారణం మారిన జీవనశైలి విధానాలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కాలంతో పరుగులు, వేళకు తీసుకోని ఆహారం, ఒకవేళ తీసుకున్నా హడావిడిగా..గబగబా తినేయటం..చీటికి మాటికి చిరాకు, అకారణం లేకుండానే కోపం, టెన్షన్, వీటితోపాటు నిత్యం ఎదుర్కొనే రకరకాల మానసిక ఒత్తిళ్ళు తోడుకావడంతో జీర్ణకోశంలో అల్సర్ సమస్యలను పెంచుతున్నాయి.

నిర్లక్ష్యం చేస్తే..దీర్ఘకాలిక సమస్యగా..

పోనీ అల్సర్‌ ఎప్పటికీ అల్సర్‌గానే ఉండిపోతుందా అంటే అదీ లేదు. కాలం గడిచే కొద్దీ అసైటిస్‌, పర్‌ఫొరేషన్‌, కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు గురిచేస్తుంది. అల్సర్లు రావడానికి హెచ్‌.పైలోరి అనే బ్యాక్టీరియా వల్ల అల్సర్ వస్తుంది. ఈ బ్యాక్టీరియా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మనిషి ఆరోగ్యంగా ఉన్నంత కాలం అది ఏమీ చేయదు. కానీ జీర్ణాశయం, పేగుల్లో పల్చగా ఉండే పొర దెబ్బతిన్నప్పుడు మనిషిపై ఈ బ్యాక్టీరియా ఎటాక్ చేస్తుంది. జీర్ణాశయంలో ఉత్పన్నమయ్యే జీర్ణరసాల్లో హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం ప్రధానమైనది. ఈ హైడ్రోక్లోరిక్‌ ఆమ్లాన్ని తట్టుకునే శక్తి జీర్ణాశయ గోడలకు అంటే శ్లేష్మపొర అంటే మ్యూకస్‌ మెంబ్రేన్‌ కు సహజసిద్ధంగానే ఉంటుంది. కాకపోతే మన జీవన శైలిలో మార్పులు, తీసుకునే ఆహారం ప్రభావం వల్ల ఈ శ్లేష్మపొర దెబ్బ తింటుందని నిపుణులు చెబుతుంటారు. దీంతో జీర్ణాశయ గోడల మీద పుండ్లు ఏర్పడతాయి.

అల్సర్ ఎలా తయారవుతుంది?..

మనం రోజూ ఆహారం తీసుకునే నిర్ణీత వేళల్లో కడుపులో జీర్ణరసాలు ఉత్పన్నమవుతాయి. సమస్య ఏమిటంటే సరైన సమయానికి ఉత్పన్నమయ్యేఈ జీర్ణరసాలు మనం భోజనం చేసినా చేయకపోయినా వాటి పని అవి చూసుకుంటుంటాయి. సరైన సయమానికి భోజనం చేయకుండా వుంటంటతో ఈ జీర్ణరసాల్లో ఉండే హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం జీర్ణాశయ గోడలు లేదా శ్లేష్మపొర మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఫలితంగా ఆ భాగాల్లో పుండ్లు ఏర్పడి అదే అల్సర్‌గా మారుతుంది.

అల్సర్ లక్షణాలు..
ఆహార నియమాలు పాటించకపోవటం, మసాలాలు, కారం వుండే ఆహారం తీసుకోవటం, ఒత్తిడి, ఆందోళన, పెయిన్‌ కిల్లర్స్‌, విచక్షణారహితంగా యాంటీ బయోటిక్‌ మందుల్ని వినయోగం, మద్యపానం, ధూమపానం,కాఫీలు,టీలు ఎక్కువగా సేవించటం, హెచ్‌.పైలోరీ బ్యాక్టీరియా జీర్ణాశయంలోకి చేరటం, క్యాన్సర్‌ మొదలైన అనేక‌ కారణాల వల్ల జీర్ణాశయంలో అల్సర్లు తయారవుతాయి. అల్సర్ వ‌స్తే ఛాతిలో మంట‌, నొప్పి, గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, వికారం వంటి స‌మ‌స్య‌లు ఉంటాయి.

అల్సర్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
నిత్యం తీసుకునే ఆహారం క‌చ్చితంగా ఒకే సమయానికి తీసుకోవాలి. మసాలాలు, కారం, కొవ్వు పదార్ధాలు, పుల్లటి పదార్థాలు వంటి ఆహారాలలలో వల్ల మంట తలెత్తుతుందో కనిపెట్టి వాటికి దూరంగా ఉండాలి. ప‌రిశుభ్రంగా ఉన్న నీటినే తాగాలి. పెయిన్‌ కిల్లర్స్‌ వినియోగం సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవాలి. డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు వాడుకోవాలి. ఒత్తిడి, ఆందోళ‌న‌ తగ్గించుకోవాలి. ధూమ, మద్యపానాలకు దూరంగా వుండాలి. కాఫీలు, టీలు వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోకూడదు.

అల్సర్ అణచేందుకు ఇంటి చిట్కాలు...
అల్సర్‌తో బాధపడుతున్న వారికి తేనెను ప్రతి రోజూ పొద్దున్నే అల్పాహారంతో పాటు ఒక చెంచా తేనె తీసుకోవాలి. అలాగే అరటి పండ్లలో వుండే యాంటీ బ్యాక్టీరియల్ పదార్థం కడుపులో వచ్చే పుండ్లు పెరగకుండా చేస్తుంది. విటమిన్ 'ఇ ' ఎక్కువగా ఉండే బాదం, చేపలు వంటివి కూడా అల్సర్లను అణచివేస్తాయి. సంత్రా, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్ల రసాలను తాగడం ద్వారా అల్సర్ల నొప్పి నుంచి బయటపడొచ్చు. ఇవి పుల్ల‌ని పండ్లే అయిన‌ప్ప‌టికీ శ‌రీరంలోకి వీటి ర‌సం చేరాక ఆల్క‌లైన్ స్వ‌భావాన్ని కలిగి అల్సర్ ను రానీయవు. అలాగే వెల్లుల్లికి కడుపు మంటని తగ్గించే గుణం ఉంటుంది. భోజన సమయంలో కొంచెం వెల్లుల్లి తింటే కూడా అల్సర్ తగ్గుతుంది. లేదంటే రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు, మూడు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తిని ఒక టీస్పూన్ తేనె తాగాలి. దీంతో కూడా అల్స‌ర్లు త‌గ్గుముఖం పడతాయి.

ఏది ఏమైనా తినే ఆహారం..తినే సమయం వంటి విషయాలలో నియమాలు పాటించాలి. అనారోగ్యం కలిగించే ఆహారాలకు దూరంగా వుండాలి. తప్పనిసరి పరిస్థితులలో వీటిని అనుసరించకుంటే..అల్సర్ దాడి చేస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగు సూచనలు పాటించాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహా భాగ్యం కదా? ..

12:31 - June 13, 2018

ప్రకాశం : టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాస్‌ రెడ్డి పార్టీని వీడనున్నారా? పార్టీలో తనకు గుర్తింపు దక్కడం లేదని మహానాడు వేదికపై అసమ్మతి తెలిపిన మాగుంట అసలు ఎటు వెళ్లనున్నారు. తిరిగి సొంత గూటికి వెళతారా? లేక వైసీపీ, జనసేన పార్టీలవైపు చూస్తున్నారా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ప్రకాశం జిల్లా టీడీపీ నేతల్లో ఆసక్తి రేకిస్తున్నాయి. మాగుంట శ్రీనివాస్‌ రెడ్డి టీడీపీని వీడి వేరే పార్టీలోకి వెలుతున్నాడనే ప్రచారం ప్రకాశం జిల్లా టీడీపీ కార్యకర్తల్లో జోరుగా సాగుతుంది. 
ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి టీడీపీ విడతున్నారనే ప్రచారం
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మాగుంట శ్రీనివాస్‌రెడ్డికి ఉన్న గుర్తింపు అంత ఇంతకాదు. అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాగుంట ఇప్పుడు టీడీపీలో ఇమడలేని పరిస్థితులు ఏర్పాడ్డాయని పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. ఏకంగా తనకు అన్యాయం జరిగిందని మహానాడు వేదికపైనే గళం విప్పాడు మాగుంట శ్రీనివాస్‌రెడ్డి. అప్పటి వరకు అనుచరుల నోట వినబడ్డా  అసంతృప్తి మాట.. మహానాడు వేదికపై శ్రీనివాస్‌రెడ్డి అనటంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పెను దూమారం రేగుతుంది. ఈ మాటలు పార్టీలో కలకలం సృష్టించాయి. దీంతో మాగుంట పార్టీని విడతారనే ప్రచారం జోరుగా నేతల్లో జోరుగా సాగుతుంది. 
మాగుంట అనుచరుల అసంతృప్తి
తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న టీడీపీ జిల్లా నేతలు మాగుంటకు పెద్దగా విలవనివ్వటం లేదని ప్రధానంగా ఆయన అనుచరుల్లో వినిపిస్తున్న మాట. ఎమ్మెల్సీగా ఉన్న మాగుంటకు మంత్రి పదవి ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి దానిని వెనక్కు తీసుకోవటంపై కూడా అనుచరులు మండిపడుతున్నారు. మంత్రి పదవి రాకపోవటానికి టీడీపీ జిల్లా నేతల కారణమని మాగుంటతో పాటు అనుచరులు బహిరంగగానే చెబుతున్నారు. పార్టీ సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు జరిగిన మొక్కుబడిగా పిలుస్తున్నారే తప్ప తనని పట్టించుకోవటం లేదని గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అధికారులు కూడ తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని మాగుంట వాపోతున్నారు. 
నన్ను బలిపశువును చేసేందుకే పోటీలో నిలుతున్నారంటున్న మాగుంట
మరోవైపు వైసీపీ నేతలు రాజీనామా చేయటంతో ఉప ఎన్నికలు వస్తే ఒంగోలు నుంచి పోటీలో నిలబడలని మాగుంట శ్రీనివాస్‌రెడ్డిని చంద్రబాబు కోరారు. అయితే తనని మరోసారి బలిపశువు చేసేందుకు టీటీపీ నాయకత్వం ఆలోచిస్తుందని మాగుంట అంటున్నారు. ఉప ఎన్నికలు వస్తే టీడీపీ తరుపున ఎవ్వరూ పోటీ చేసిన సహకరిస్తానని అంటున్నారు. ఏదీ ఏమైనా పార్టీలో నుంచి వెళ్లేపోవాలని మాగుంట శ్రీనివాస్‌రెడ్డి డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. తనకు తన కార్యకర్తలకు అధికారులు, నాయకులు విలువ ఇవ్వకపోవటం వల్లే మాగుంట విడుతున్నారనే ప్రచారం సాగుతుంది. 

 

12:20 - June 13, 2018

చిత్తూరు : తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీటీడీ నోటీసులు జారీ చేసింది.  టీటీడీపై చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలని దేవస్థానం బోర్డు కోరింది. టీటీడీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ నోటీసులో పేర్కొంది. గత నెల 15న చెన్నై వేదికగా రమణదీక్షితులు టీటీడీతో పాటు ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయగా, కొద్దిరోజులకే ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. టీటీడీ పోటులో తవ్వకాలు జరిగాయని, నేలమాలిగలను తరలించి సీఎం నివాసంలో దాచారని ఆరోపించారు. ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని తెలంగాణ పోలీసులు గానీ, సీబీఐ గానీ చంద్రబాబు ఇంటిపై దాడులు నిర్వహిస్తే నగలు బయట పడతాయంటూ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 

 

విషమంగా మాజీ ప్రధాని వాజ్ పేయ్ ఆరోగ్యం?..

ఢిల్లీ : మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం మరింత విషమించింది. ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయనకు యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్టు వైద్యులు తెలిపారు. చికిత్సకు స్పందిస్తున్నారని ఎయిమ్స్ మీడియా అధికారి చెప్పినప్పటికీ, వాస్తవానికి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లుగా సమాచారం. కాగా మంగళవారం సాయంత్రం ఎయిమ్స్ నుంచి ఎటువంటి బులెటిన్ విడుదల కాకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.

12:17 - June 13, 2018

చిత్తూరు : జిల్లాలోని రూరల్‌ మండలం పెయనకండ్రిగలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు బిడ్డలతో సహా బావిలో దూకి గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. అత్తారింటి వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులు అంటున్నారు. మృతులు: సరళ(29), దేవిశ్రీ(2), జ్యోత్స్న(4)గా గుర్తించారు. భర్త గురునాథం పరారీలో ఉన్నాడు.

 

12:16 - June 13, 2018

కొందరు హీరోలు కేవలం రీల్ లో మాత్రమే హీరోలు..రియల్ లైఫ్ లో వారు జీరోలే కాదు..విలన్ ల కంటే దారుణంగా ప్రవర్తిస్తుంటారు. సినిమా డైలాగుల్లో సూక్తులు చెబుతుంటారు. నిజజీవితంలో రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు అనే దానికి ఈ హీరోనే నిదర్శనం.

ఆర్మాన్ కోహ్లీ అరెస్ట్..
తన భార్య, ఫ్యాషన్ స్టయిలిస్ట్ నీరూ రంధావాను దారుణంగా హింసించిన కేసులో బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారంలో నీరూ ఫిర్యాదు మేరకు అర్మాన్ పై కేసును రిజిస్టర్ చేసిన శాంతాక్రజ్ పోలీసులు, అప్పటి నుంచి ఆయన కోసం గాలిస్తున్నారు.

నీరు తలను నేలకేసి బాదిన కోహ్లీ..
ఈ నెల 3వ తేదీన ఆర్థిక వివాదంలో అర్మాన్, నీరూల మధ్య వాగ్వాదం జరుగగా, నీరూ తలను అర్మాన్ నేలకేసి బలంగా కొట్టాడన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఘటనలో నీరూ రంధావాకు బలమైన గాయాలు కాగా, కోకిలాబెన్ దీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స చేశారు. తన తలకు 15 కుట్లు పడ్డాయని, తలపై మచ్చ జీవితాంతం ఉంటుందని డాక్టర్ చెప్పిన మాటలు విని తానెంతో ఆందోళన చెందుతున్నానని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం నీరూ వ్యాఖ్యానించారు. కాగా, నిందితుడు అర్మాన్ ను న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్టు శాంతాక్రజ్ పోలీసులు తెలిపారు.

12:06 - June 13, 2018

ఇటీవల 'మహానటి' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన దుల్కర్ సల్మాన్ 'అతడే' చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన 'సోలో' చిత్రాన్ని 'అతడే' పేరిట తెలుగులోకి అనువదిస్తున్నారు. దీనిని ఈ నెల 22న రిలీజ్ చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ మలయాళ నటుడు ముమ్ముట్టి వారసుడిగా వచ్చినా..అనతికాలంలోనే తనకంటు ఓ ముద్ర వేసుకున్న యువ నటుడు. నటుడు అనే పదానికి మారుపేరుగా పేరు తెచ్చుకున్నాడు దుల్కర్. సెకండ్ షో అనే మలయాళ చిత్రంతో ఆయన తెరంగేట్రం చేసిన దల్కర్ ఈ సినిమా విజయవంతమై 100 రోజులు ఆడింది. అంతేకాదు ఈ సినిమాకి ఉత్తమ తొలిచిత్ర నటునిగా పురస్కారాన్ని పొంది, ఫిల్మ్ ఫేర్ ఉత్తమ చిత్రానికి నామినేట్ కూడా అయ్యారు.

దుల్కర్ అవార్డులు..
బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన 'వాయై మూడి పేశవుం' అనే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో కూడా దుల్కర్ ప్రవేశించారు. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ తొలిచిత్ర నటుడు పురస్కారాన్ని రెండుసార్లు 2012లో సెకండ్ షో సినిమాకి మలయాళంలోనూ, 2014లో వాయై మూడి పేశవం సినిమాకి తమిళంలోనూ దుల్కర్ సల్మాన్ అందుకున్నారు. 

11:52 - June 13, 2018

ఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెలలో మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఈనెల 16 నుంచి ఏడు రోజుల పాటు రాష్ర్టపతి విదేశాల్లో పర్యటించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది..  ఐరోపా, లాటిన్‌ అమెరికా దేశాల్లో రాష్ర్టపతి తొలిసారిగా పర్యటించనున్నారు.  ఈనెల 16, 19తేదీల్లో గ్రీస్‌ పర్యటనలో.. అక్కడి చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. 18న గ్రీస్‌ అధ్యక్షుడు ప్రొకోపిస్‌ పావ్‌లోపోలోస్‌తో సమావేశం కానున్నారు.. 19న అక్కడి భారత-గ్రీస్‌ సీఈవోలతో  బ్రేక్‌ ఫాస్ట్‌ విందులో పాల్గొంటారు. ఈ పర్యటనలో  మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయని విదేశాంగ శాఖ...  మధ్య ఐరోపా వ్యవహారాల సంయుక్త కార్యదర్శి సుబ్రత భట్టాచార్జి తెలిపారు.

 

11:49 - June 13, 2018

హైదరాబాద్‌ : హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వివేక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వివేక్‌ ఎన్నిక చెల్లదంటూ అంబుడ్స్‌మన్‌ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జ్‌ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను... ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా పునర్విచారణ జరపాలని సింగిల్‌ జడ్జిని ధర్మాసనం ఆదేశించింది. కోర్టు తాజా ఉత్తర్వులతో  వివేక్ మరోసారి హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోల్పోనున్నారు. 
అంబుడ్స్‌మన్‌ తీర్పును సమర్ధించిన హైకోర్టు
హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. హెచ్‌సీఏ పదవికి వివేక్‌ అనర్హుడన్న అంబుడ్స్‌మన్ తీర్పును హైకోర్టు సమర్థించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై మరోసారి పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించింది. అయితే తాజా ఉత్తర్వులతో వివేక్‌ ప్రత్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులూ వివేక్‌ అడ్డదారిలో హెచ్‌సీఏలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. 
వివేక్‌ ఎన్నిక చెల్లదన్న అంబుడ్స్‌మన్‌ 
హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం ఎన్నికల్లో వివేక్‌పై పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్‌... వివేక్‌ ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ హెచ్‌సీఏ పదవిలో కొనసాగడం లోధా కమిటీ సిఫార్సులకు, చట్టానికి విరుద్ధమంటూ అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అంబుడ్స్‌మన్‌ లోదా సంస్కరణలకు అనుగుణంగా వివేక్ ఎన్నిక చెల్లదని తేల్చిచెప్పింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ వివేక్‌ హై కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జ్‌ అంబుడ్స్‌మన్‌ తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సింగిల్‌ జడ్జ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ అజారుద్దీన్‌ ధర్మాసనంకు అప్పీలు చేశారు. అయితే తాజాగా అంబుడ్స్‌మన్‌ తీర్పునే తాజాగా ధర్మాసనం సమర్ధించింది. అయితే 2017లో హెచ్‌సీఏకు ఎన్నికలు జరిగినప్పటి నుండి అధ్యక్ష, కార్యదర్శులు ఈ ఎన్నికను తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా వివేక్‌ను ఎన్నిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అంబుడ్స్‌మన్‌కు వేలాదిగా ఫిర్యాదులు చేరాయి. 
వివేక్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు
వివేక్‌ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారు....ఇది కేబినేట్‌ మంత్రి స్థాయి పోస్టు. జస్టిస్‌ లోదా సిఫార్సుల ప్రకారం వివేకానంద హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అనర్హుడు. అయినప్పటికీ స్టేడియం స్పాన్సర్‌షిప్‌ కోసం హెచ్‌సీఏపై కోర్టులో పోరాటం చేస్తున్నారు. గతంలో హెచ్‌సీఏ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేసేందుకు వచ్చిన రోజునే వివేక్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రత్యర్థులు ఆయన విషయాన్ని ఎన్నికల అధికారి రాజీవ్‌రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన వాటిని ఖాతరు చేయకుండా పక్కన పెట్టారు. 
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానన్న అజారుద్దీన్‌
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు భారత మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ తెలిపారు. వివేక్‌పై అంబుడ్స్‌మెన్‌ తీసుకున్న నిర్ణయమే సరైందన్నారు. మొదటి నుండి తాము వివేక్‌ ప్యానల్‌పై పోరాటం చేస్తున్నామని చివరకు న్యాయమే గెలిచిందన్నారు. ఇక హెచ్‌సీఏలో ఏం జరగాలన్న దానిపై జనరల్‌ బాడీ మీటింగ్‌లో నిర్ణయిస్తామన్నారు. 

 

11:49 - June 13, 2018

గురు చిత్రంలో తన నటనతో విమర్శకులు ప్రశంసల్ని అందుకున్న నటి రితికాసింగ్. చిత్రం ప్రారంభంలో అల్లరి, ఆకతాయి పిల్లగా..తరువాత పరిణితి సాధించిన యువతిగా రితికాసింగ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. వెంకటేశ్ పై కోపం, అసహనం అనంతరం ప్రేమ వంటి పలు కోణాల్లో రితికా సింగ్ చక్కగా నటించింది. అంతేకాదు అచ్చమైన బస్తీ అమ్మాయిగా రితికా నటన, బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకుంది. అక్కను బాక్సర్ ను చేసేందుకు శ్రమించిన యువతిగా..తరువాత తానే బాక్సర్ అయిన నేపథ్యంలో రితికా నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో 'గురు' చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన రితికా సింగ్ త్వరలో సాయి ధరం తేజ్ సరసన నటించనుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరంతేజ్ నటించే చిత్రంలో నాయికగా రితికాను తీసుకున్నట్టు సమాచారం. ఈ చిత్రం కామెడీ మరియు ఎమోషన్స్ తో కూడుకున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని సినిమా పరిశ్రమ వర్గాల సమాచారం. 

జయనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి విజయం..

కర్ణాటక : బీజేపీ అభ్యర్థి మరణంతో ఉప ఎన్నిక జరిగిన బెంగళూరు పరిధిలోని జయనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిని, మాజీ హోమ్ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి తన విజయాన్ని దాదాపు ఖాయం చేసుకున్నారు. ఈ ఉదయం నుంచి కౌంటింగ్ జరుగుతుండగా, 8వ రౌండ్ లెక్కింపు ముగిసేసరికి ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ తరఫున పోటీ చేసిన దివంగత బిఎన్‌ విజయ్‌ కుమార్‌ సోదరుడు బిఎన్‌ ప్రహ్లాద్‌ కన్నా 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో దూసుకెళుతున్నారు. 8వ రౌండ్ తరువాత కాంగ్రెస్ అభ్యర్థినికి 31,642, బీజేపీఅభ్యర్థికి 21,437 ఓట్లు రాగా, నోటాకు 361 ఓట్లు వచ్చాయి.

టీటీడీ వివాదంపై రమణాచారి కీలక వ్యాఖ్యలు..

తిరుమల : టీటీడీలో నెలకొన్న వివాదం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సృష్టేనని, ఆయనే ఏ కారణం చేతనో ఈ వివాదాన్ని సృష్టించారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, టీటీడీ మాజీ కార్యనిర్వహణాధికారి కేవీ రమణాచారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, తిరుమల కొండపై ఏదో మార్పును స్వామివారు కోరుకుంటున్నారని, అందుకే ఈ వివాదం వచ్చిందని అభిప్రాయపడ్డ ఆయన, స్వామివారి ప్రతిష్ఠకు భంగం కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు.

సబ్ రిజిస్ట్రార్ కిషన్ ఆఫీస్ లో ఏసీబీ తనిఖీలు..

మేడ్చల్ : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే సమాచారంతో ఏసీబీ అధికారులు మేడ్చల్ రిజిస్ట్రార్ కిషన్ ఇంట్లో కూడా తనఖీలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సబ్ రిజిస్ట్రార్ కిషన్ క్యాబిన్ లో కూడా సోదాలను కొనసాగిస్తున్నారు. 

మోదీ సవాల్ ను స్వీకరించిన కుమారస్వామి..

ఢిల్లీ : హామ్ ఫిట్ తో ఇండియా ఫిట్ అనే హ్యాష్ ట్యాగ్ కు విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ప్రధాని మోదీకి ఫిట్ నెస్ ఛాలెంజ్ ను విసిరారు. దీన్ని స్వీకరించిన మోదీ..యోగా, వ్యాయామాలు చేసిన వీడియోను అప్ లోడ్ చేశారు. ఈ క్రమంలోనే మోదీ కర్ణాటక సీఎం కుమారస్వామికి ఫిట్ నెట్ సవాల్ ను విసిరారు. ఈ సవాల్ ను కుమారస్వామి స్వీకరించారు. ‘’ప్రియమైన నరేంద్రమోదీ..నా ఆరోగ్యంపై మాకున్న శ్రద్ధకు కృతజ్నతలని తెలిపారు. శారీరక ఫిట్ నెస్ ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమనీ..ఫిట్ నెస్ ఛాలెంజ్ కు తాను మద్దతు తెలుపుతున్నానన్నారు.

గవర్నర్ నివాసంలో సీఎం కేజ్రీవాల్ ధర్నా..

ఢిల్లీ : లెఫ్ట్ నెంట్ గవర్నర్ నివాసంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి ఐఏఎస్ అధికారులు సహకరించటంలేదని ఆరోపిస్తు కేజ్రీవాల్ గవర్నర్ కు విన్నవించారు. ఐఏఎస్ అధికారుల వ్యవహారపై సోమవారం నాడు గవర్నర్ అనిల్ బైజాల్ ను కలిస పరిస్థితి విన్నవించారు. కానీ కేజ్రీవాల్ గవర్నర్ నుండి సంతృప్తికర సమాధానం రాకపోవటంతో కేజ్రీవాల్, ఆయన మంత్రులతో సహా రాజ్ భవన్ వెయిటింగ్ హాల్లోనే గత మూడు రోజులుగా గవర్నర్ నివాసంలోధర్నా చేపట్టారు. ఢిల్లీ ప్రజలు హక్కుల సాధన కోసం ఎంతవరకూ నైనా వెళతానని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

 

జైనథ్ లో మంత్రి జోగు రామన్న పర్యటన..

ఆదిలాబాద్: మంత్రి జోగు రామన్న ఇవాళ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జైనథ్ మండలంలో ఆయన పర్యటించారు. మండలంలోని తరోడ గ్రామంలో 15 లక్షలతో నిర్మించే కళ్యాణ మండపానికి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం సావాపూర్ గ్రామంలో 13 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, పాఠశాల భవనాలను మంత్రి ప్రారంభించారు.

రమణ దీక్షితులు,విజయసాయిరెడ్డిలకు టీటీడీ నోటీసులు..

తిరుమల : టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు తిరుమల ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలకు టీటీడీ బోర్డు నోటీసులు జారీ చేసింది. వీరు చేసిన వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొంది. టీటీడీపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని తెలిపింది. గత నెల 15వ తేదీన చెన్నైలో రమణ దీక్షితులు మాట్లాడుతూ... టీటీడీ, ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే విజయసాయి రెడ్డి కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు.

10:55 - June 13, 2018

యూపీ : యూపీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లివస్తుండగా విషాదం నెలకొంది. మెయిన్‌పురిలో డివైడర్‌ను ఢీకొట్టి బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. టూర్స్ ఆండ్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సులో 45 మందికిపైగా ప్రయాణికులు విహారయాత్రకు వెళ్లారు. రాజస్థాన్ లోని టూరిజం ప్రాంతాలకు వెళ్లివస్తున్నారు. జైపూర్ నుంచి ఫరక్కాబాద్ కు వెళ్తున్నారు. కిరాట్ పూర్ కు ఐదు కిలో మీటర్ల దూరంలో మెయిన్ పురిలో ఉదయం 5 గంటల సమయంలో డివైడర్ ను ఢీకొట్టి బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 35 మందికి గాయాలయ్యాయి. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ మితిమీరిన వేగంతో బస్సు అదుపు తప్పి డివైడర్ ను కొట్టి బోల్తా పడినట్లు తెలుస్తోంది. డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద ఘటన పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మెయిన్ పురి కలెక్టర్, పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని, పరిశీలిస్తున్నారు. ఘటన ఏవిధంగా జరిగిందో రికార్డు చేసుకునేందుకు యూపీ పోలీసులు ఆస్పత్రి వద్ద వెయిట్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులుగా గుర్తించారు. సమాచారాన్ని వారి కుటుంబసభ్యులకు తెలిపే పనిలో పోలీసులు ఉన్నారు. 

ఇద్దరు చిన్నారులతో సహా బావిలో దూకిన తల్లి..

చిత్తూరు : ఇద్దరు చిన్నారులతో సహా ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సరళ అనే మహిళ తన పిల్లలు రెండేళ్ల దేవిశ్రీ, జోత్స్న అనే నాలుగేళ్ల చిన్నారులతో సహా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పేయనకండ్రిగలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా వీరి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.  

10:44 - June 13, 2018

జమ్మూకాశ్మీర్ : పాకిస్తాన్ పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సాంబా జిల్లా చంబ్లియాల్ సెక్టార్‌లో పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ఐదుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. క్షతగాత్రులు జమ్మూకాశ్మీర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. కాల్పులను సహించేదిలేదని..ధీటైన సమాధానం చెబుతామని బీఎస్ ఎఫ్ అధికారులు నుంచి 
సమాచారం వస్తోంది. రాత్రి పదిన్నర నుంచి తెల్లవారుజామున 4.30 గంటల వరకు కాల్పులు కొనసాగినట్లు తెలుస్తోంది. 

 

జమ్మూకాశ్మీర్ లో పాక్ బలగాలు కాల్పులు

జమ్మూకాశ్మీర్ : పాకిస్తాన్ పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సాంబా జిల్లా చంబ్లియాల్ సెక్టార్‌లో పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ఐదుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. 

09:23 - June 13, 2018

ఢిల్లీ : ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ను పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఉక్కిరి బిక్కిరి చేసింది. వీరప్పమొయిలీ నేతృత్వంలోని ఆర్థిక విభాగానికి చెందిన కమిటీ ముందు ఆయన హాజరయ్యారు. బ్యాంక్‌ మోసాలు, మొండి బకాయిలు, ఎటిఎంలలో నగదు కొరత తదితర సమస్యలపై కమిటీ సభ్యులు పటేల్‌ను ప్రశ్నించారు. నీరవ్‌మోదీ స్కాంపై ఆయన కఠిన ప్రశ్నలు ఎదుర్కొన్నట్లు సమాచారం. బ్యాంకింగ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కమిటీకి ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. నగదు కొరత తదితర సమస్యల నుంచి బయటపడగలమనే విశ్వాసాన్ని పటేల్‌ వ్యక్తం చేశారు. ఈ కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్‌తో పాటు వివిధ పార్టీల నేతలు ఉన్నారు.

 

09:13 - June 13, 2018

భూపాల్ : మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహారాజ్‌ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భయ్యూజీ మహారాజ్‌ను హుటాహుటిన ఇండోర్‌లోని ముంబై ఆసుపత్రిలో చేర్చగా... చికిత్స పొందుతూనే ఆయన కన్ను మూశారు. ఆయన ఇంట్లో సూసైడ్‌ నోట్‌ లభించింది. జీవితంపై విరక్తి చెందడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని సుసైడ్‌ నోట్‌లో ఉంది. సుసైడ్‌ నోట్‌తో పాటు పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు భయ్యూజీ మరణంపై  దర్యాప్తు చేపట్టారు. భయ్యూజీ తుపాకితో తనని తాను తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.  ఫోరెన్సిక్‌ బృందం సుసైడ్‌ నోట్‌పై దర్యాప్తు జరుపుతోంది.  భయ్యూజీ మహారాజ్‌కి రాజకీయాలతోనూ సంబంధాలున్నాయి. శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వం ఇటీవల ఆయనకు కెబినెట్‌ మంత్రి హోదా పదవిని ఆఫర్‌ చేయగా ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. భయ్యూజీ మొదటి భార్య చనిపోవడంతో ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నారు.

 

08:59 - June 13, 2018

జమ్మూకాశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సాంబా జిల్లా చంబ్లియాల్ సెక్టార్ లో పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో నలుగురు బీఎస్ ఎఫ్ జవాన్లు మృతి చెందారు, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

 

08:43 - June 13, 2018

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల సస్పెన్షన్ సరికాదని...వారి శాసన సభ్యత్వాలను పునరుద్ధరించాలని వక్తలు సూచించారు. టీప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, టీఆర్ ఎస్ నేత రాజమోహన్, కాంగ్రెస్ నేత రామ్మోహన్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

08:37 - June 13, 2018

తెలంగాణలో గ్రామ పంచాయితీ ఉద్యోగులు కార్మికులు ఆందోళన బాటపట్టారు. కాంట్రక్టు ఎంప్లాయీస్‌ అందరిని పర్మినెంట్‌ చేయాలని, మున్సిపల్‌ ఉద్యోగుల మాదిరిగా జీతాలు పెంచాలని, జీతాలను ప్రభుత్వమే చెల్లించాలనే డిమాండ్‌లతో వారు పోరుకు సిద్దమైయ్యారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో సమ్మెకైన సిద్దమని వారు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై గ్రామ పంచాయితీ ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు పాలడుగు బాస్కర్‌ మాట్లాడారు.  పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:34 - June 13, 2018

ఢిల్లీ : ఆప్‌ ప్రభుత్వం డిమాండ్లను లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ అనిల్‌ బైజాల్‌ తోసిపుచ్చడాన్ని నిరసిస్తూ సిఎం కేజ్రీవాల్‌తో పాటు మంత్రులంతా నిరసన చేపట్టారు. గత 18 గంటలకు పైగా ఎల్జీ వెయిటింగ్‌ రూములోనే బైఠాయించారు. నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఐఏఎస్‌ అధికారుల సమ్మెను ఎల్జీ విరమింపజేయకపోవడంతో ఢిల్లీలో పాలన స్తంభించిందని కేజ్రీవాల్‌ ఆరోపిస్తున్నారు. ఐఏఎస్‌ అధికారులపై విచారణతో పాటు మూడు ప్రతిపాదనలను ఎల్జీ తిరస్కరించడంతో వేరే మార్గం లేక ఆందోళన బాట పట్టామని డిప్యూటి సిఎం మనీష్‌ సిసోడియా ట్వీట్‌ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం మంత్రి సత్యేంద్ర జైన్‌ నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారని ఆయన  పేర్కొన్నారు. మరోవైపు ఎల్జీకి వ్యతిరేకంగా సిఎం కేజ్రీవాల్‌ ఇంటి ఎదుట ధర్నాకు రంగం సిద్ధం చేశారు. ఎల్జీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 

08:30 - June 13, 2018

నిర్మల్ : ఆ నియోజకవర్గంలో దళిత, బహుజన, మైనారిటీ ఓటర్లే అధికం. కానీ పాలకులందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప మరెప్పుడు ఆ నాయకులు గ్రామాల్లో పర్యటించిన దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. అగ్రకులాలు ఆధిపత్యం చెలాయిస్తున్న ముథోల్‌ నియోజకవర్గంపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ.
ముథోల్‌ నియోజకవర్గంలో దళిత, బహుజన, మైనరిటీ ప్రజలే అధికం
నిర్మల్‌ జిల్లా ముథోల్‌ నియోజకవర్గంలో దళిత, బహుజన, మైనరిటీ ప్రజలే అధికంగా ఉన్నారు. కానీ ఇక్కడ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అగ్రకులాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దీంతో దళిత, బహుజన, మైనారిటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో బహుజనులకు అధికారాన్ని కట్టబెట్టాలనే యోచనలో నియోజకవర్గ  ప్రజలు ఉన్నారు. 
ముథోల్‌.. 117 గ్రామాలు, 49 తాండాలు 
ముథోల్‌ నియోజకవర్గంలో ముథోల్‌తో పాటు కుంటాల, కుబీర్, లోకేశ్వరం, తానూర్, భైంసా మండలాలున్నాయి. ఈ మండలాల్లో 117 గ్రామాలు, 49 తాండాలు ఉన్నాయి. గత ఎన్నికల ప్రకారం మొత్తం 2,06,230 మంది ఓటర్లు ఉన్నారు. వీరీలో ఎస్సీ ఓటర్లు 20 శాతం, ఎస్టీ ఓట్లరు 9 శాతం, బీసీలు 31 శాతం, మైనారిటీలు  14 శాతం ఉండగా..  ఇతర ఓటర్లు 24 శాతం ఉన్నారు. 
రెడ్డి, రావు సామాజికవర్గం ఆధిపత్యం 
ఎక్కువ శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీటీలు ఉన్నా ముథోల్‌ నియోజకవర్గంలో రెడ్డి, రావు సామాజిక వర్గాలు మాత్రమే పాలన సాగిస్తున్నాయి. 1957 ఎన్నికల్లో గోపిడి గంగిరెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 1962లో కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 1967లో గడ్డన్నరెడ్డి ముథోల్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన వరుసగా 1972, 1978,1983 ఎన్నికల్లో గెలిచారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో గడ్డన్నపై టీడీపీ అభ్యర్థి హన్మంత్‌రెడ్డి విజయం సాధించారు. తిరిగి 1989 ఎన్నికల్లో గడ్డన్న తన పదవిని చేజిక్కించుకున్నారు. 1994 ఎన్నికల్లో గడ్డన్న మరోసారి ఓటమిపాలయ్యారు. టీడీపీ అభ్యర్థి నారాయణరావు పటేల్‌ ఆయనపై విజయం సాధించారు. మళ్లీ 1999లో గడ్డన్న గెలవగా.. 2004 ఎన్నికల్లో నారాయణరావు పటేల్‌ని ప్రజలు గెలిపించారు. 2009 సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేణుగోపాలచారి అనూహ్య విజయం సాధించారు. ఇక 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి విఠల్‌రెడ్డి బీజేపీ అభ్యర్థి రమాదేవీపై 14,837 ఓట్లతో విజయం సాధించారు. 
బహుజనులకు టిక్కెట్లు కేటాయిస్తారా ? 
ఇప్పటి వరకు ఏ పార్టీ చూసినా రెడ్డి, రావు సామాజిక వర్గానికి తప్ప ఇతర సామాజిక వర్గానికి టికెట్‌ ఇచ్చిన దాఖలు లేవు. దీంతో తమ సమస్యలు పరిష్కారం అవ్వటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత, బహుజనుల కేంద్రం అయినప్పటికీ....  రెడ్డి, రావు సామాజిక వర్గాలకు చెందినవారు ఎమ్మెల్యేలుగా ఉండటంతో అభివృద్ధిలో ముథోల్‌ నియోజకవర్గం వెనుకపడిపోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో ముథోల్‌ నియోజకవర్గం ముందు వరుసలో ఉంది. గోదావరి నది పక్కనే ప్రవహిస్తున్నా... వ్యవసాయానికి చుక్కనీరు అందటం లేదని రైతులు వాపోతున్నారు. ఉపాధి కరువై దుబాయ్‌, ముంబై లాంటి ప్రాంతాలకు వలస వెళ్లేవాళ్లే ఎక్కువగా ఉన్నారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే.. వచ్చే ఎన్నికల్లో బహుజనులనే ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటామని నియోజకవర్గ ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఇన్నాళ్లు అగ్రకులాలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న పార్టీలు ఈ సారి కూడా ఆ సామాజిక వర్గాలకే టికెట్‌ ఇస్తాయో... ప్రజలు కోరుతున్నట్టు బహుజనులకు టిక్కెట్లు కేటాయిస్తాయో వేచి చూడాలి.

08:21 - June 13, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో ఖాకీల నెలవారీ వసూళ్ల వ్యవహారం పోలీస్‌శాఖనే నివ్వెరపరుస్తోంది. ప్రతి అక్రమ దందాలో పోలీసుల సహకారం ఉన్నట్టు తెలుస్తోంది. ఖాకీల మామూళ్ల వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ కూడా సీరియస్‌ అయ్యారు. రహస్య విచారణ సాగించి పలువురిని సస్పెండ్‌ కూడా చేశారు. అయినా అక్రమ వసూళ్ల రుచి మరిగిన ఖాకీలు తమ పద్దతి మార్చుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారి పేర్లతో డీజీపీ కార్యాలయం జాబితాను విడుదల చేయడం సంచలనం రేపుతోంది.
పోలీస్‌శాఖలో నెలనెల మామూళ్ల వ్యవహారం
నిజామాబాద్‌ జిల్లా పోలీస్‌శాఖలో సిబ్బంది నెలనెల మామూళ్ల వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. ఖాకీల నెలవారీ మామూళ్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గుట్కా, మట్కా, గంజాయి, ఇసుక మాఫియా , బెట్టింగ్‌ మాఫియా.... ఇలా ప్రతి అక్రమ దందాలో పోలీసులు నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు... సమస్యలపై పీఎస్‌కు వచ్చిన వారి నుంచి సైతం డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఆర్మూరు, బోధన్‌ డివిజన్స్‌లో అక్రమ వసూళ్లు
ఆర్మూరు, బోధన్‌ డివిజన్‌ పరిధిలో కొందరు ఎస్సైలు, ఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు  అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఏకంగా రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఉన్నతాధికారులు రహస్య విచారణ చేపట్టారు.  బోధన్‌ ఏరియాలో ఇసుకదందాలో నెలనెలా మామూళ్లు తీసుకున్నారని బోధన్‌ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌తోపాటు రెంజల్‌ ఎస్సై రవికుమార్‌ను సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత మామూళ్ల దందాకు చెక్‌ పడుతుందని భావించారు. కానీ అది జరుగకపోగా... మరింత ఎక్కువైంది. 
నెలవారీ వసూళ్ల వ్యవహారంపై డీజీపీ సీరియస్‌
నెలవారీ మామూళ్ల వ్యవహారాన్ని డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా సీరియస్‌గా తీసుకున్నారు. నిజామాబాద్‌ జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి లిస్ట్‌ను తెప్పించుకున్నారు. అందులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న 350 మంది పేర్లతో కూడిన జాబితాను డీజీపీ కార్యాలయం విడుదల చేసింది. ఇందులో కామారెడ్డి , నిజామాబాద్‌ జిల్లాలో పరిధిలోని 45 మంది ఖాకీలు ఉన్నారు.   దీంతో ఖాకీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎప్పుడు ఏ చర్యలు తీసుకుంటారోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.
 

 

08:16 - June 13, 2018

మంచిర్యాల : కేసీఆర్ కిట్టు వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రిల్లో అన్ని రకాల చికిత్సాలను ఉచితంగా అందించేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో మాతా శిశు నూతన విభాగాన్ని ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపడ్డాయన్నారు. మంచిర్యాల ఆస్పత్రిని 2 వందల 50 పడకల ఆస్పత్రిగా ఏర్పాటు చేయాడానికి ప్రభుత్వం 20 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. ఆస్పత్రిలో ఆత్యాధునికి టెక్నాలజీతో డయాలసిస్‌ సెంటర్‌, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు.

 

ఉత్తరప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం

ఉత్తరప్రదేశ్ : మొయిన్ పురిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు.

08:11 - June 13, 2018

యాదాద్రి : తుర్కపల్లి మండలం ముల్కలపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయులు పాఠాలు బోధించకుండా.. ఇష్టానుసారం వచ్చి వెళుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.. విషయం తెలుసుకున్న కలెక్టర్ అనిత రామచంద్రన్‌ పాఠశాలకు చేరుకున్నారు. కలెక్టర్‌కు విద్యార్థులు తమ గోడును వెళ్లబోసుకోవటంతో.. సరిగ్గా బోధించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యాశాఖ అధికారిని రోహిణిని ఆదేశించారు. 

 

08:03 - June 13, 2018

హైదరాబాద్ : అల్వాల్‌లో నవీన్‌ అనే రౌడీషీటర్‌ అరాచకం సృష్టించాడు. నెలకు 10 వేల రూపాయల మాముళ్లు ఇవ్వాలంటూ ఓ షాపు యజమానిని బెదిరించాడు. డబ్బులు ఇవ్వకపోవటంతో.. షాపులో ఎవ్వరూ లేని సమయం చూసి పెట్రోల్‌ పోసి తగులబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నంలో నవీన్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో నవీన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. నిప్పంటించే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 

 

08:01 - June 13, 2018

హైదరాబాద్‌ : బ్యాంకులు రైతులుకు ఇస్తున్న రుణ పరిమితిని పెంచాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఒక్కో పంట సాగుకు అయ్యే ఖర్చును పరిగణలోకి తీసుకుని రుణాలు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని కలిసి వినతిపత్రం అందజేసింది. రుణ పరిమితి  పెంపుపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోపోతే రైతు ఉద్యమం నిర్మిస్తామని హెచ్చరించింది. 
 

07:59 - June 13, 2018

కరీంనగర్ : కన్నెపల్లి పంప్‌హౌస్‌ పనులను జూలై 15లోగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. 4పంప్‌హౌస్‌లు పూర్తి చేయాలని సూచించారు. మోటార్ల బిగింపు పనులూ వేగవంతం చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గుత్తేదారులు, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించిన హరీశ్‌...పనులన్నీ పూర్తయ్యే వరకు ఇంజనీర్లు సైట్‌లోనే ఉండాలని ఆదేశించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు గుత్తేదార్లు, ఇంజనీర్లతో హరీష్‌ సమీక్ష
తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టు గుత్తేదారులు, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ పనులకు సంబంధించిన గుత్తేదారులను జూలై 15లోగా 4 పంప్‌హౌస్‌లు పూర్తి చేయాలని ఆదేశించారు. వీటికి సంబంధించిన మోటార్ల బిగింపు పనులు వేగవంతం చేయాలన్నారు. మోటార్లకు రూఫ్‌షెడ్‌ నిర్మించాలని సూచించారు.
హెడ్‌ రెగ్యులేటర్ల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశం
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల హెడ్‌ రెగ్యులేటర్ల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని హరీశ్‌ అధికారులను ఆదేశించారు. డ్రాఫ్ట్‌ ట్యూబ్‌ గేట్లు, ట్రాన్సిట్‌ గేట్ల పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అండర్‌ స్లూయిజ్‌ గేట్‌లను ముందుగా పూర్తి చేయాలని సూచించారు.  పనులన్నీ పూర్తయ్యే వరకు ఇంజనీర్లు ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉండాలని ఆదేశించారు. పనులు నిర్వహిస్తోన్న ఏజెన్సీ ఎండీలతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. యంత్ర సామాగ్రి సంఖ్యపెంచి పనులను వేగవంతం చేయాలని కోరారు. 
ప్యాకేజీ -6 టన్నెల్‌లోని సర్జ్‌పూల్‌ పనులను పరిశీలించిన హరీష్‌
ధర్మారం మండలం మేడారం గ్రామంలోని ప్యాకేజీ -6 టన్నెల్‌లోని సర్జ్‌పూల్‌ పనులను మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. సర్జ్‌పూల్‌ దగ్గర అమర్చిన ఏడు గేట్ల అమరిక పనులను పరిశీలించిన తర్వాత రెండు పైపులను జూలై చివరి నాటికి పూర్తిస్థాయిలో వినియోగంలోకి  తేవాలన్నారు. ఒక్కోపంప్‌ ద్వారా రోజుకు 0.27 టీఎంసీ నీటిని పంప్‌ చేయవచ్చని.. దాదాపు 0.54 టీఎంసీని రెండుగేట్ల ద్వారా పంప్‌ చేయవచ్చన్నారు.  విద్యుత్‌ సరఫరా చేసి డ్రైరన్ నిర్వహించాలని ఆదేశించారు. గ్యాస్‌ ఇన్సులేషన్‌ విద్యుత్‌ ఉప కేంద్రాన్ని జూన్‌ చివరి నాటికి పూర్తి చేయాలని సీమన్స్‌ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.
 

 

నేడు సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

రాజన్నసిరిసిల్ల : జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఉ.11 గం.లకు అమిత్ షాతో ఏపీ బీజేపీ నేతలు సమావేశం

ఢిల్లీ : ఉదయం 11 గంటలకు అమిత్ షాతో ఏపీ బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. పలు అంశాలపై వారు చర్చించనున్నారు. 

 

సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం

ఢిల్లీ : సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. పలు అంశాలపై చర్చించనున్నారు.

 

Don't Miss