Activities calendar

14 June 2018

ఢిల్లీకి కేసీఆర్...

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్  బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. నాలుగు రోజులు అక్కడే ఉండనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారు. 

టిడిపిపై అంబటి ఫైర్...

విజయవాడ : టీడీపీపై వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ మొన్నటి వరకు ఎన్డీయేతో కలిసి రాష్ట్రాని దెబ్బతీసిందన్నారు. ఇందులో భాగంగానే కడప ఉక్కు కర్మాగారాన్ని తుక్కుతుక్కు చేయాలనే పధకం వేశారని విమర్శించారు.

ఎర్రగడ్డలో దారుణం...

హైదరాబాద్ : ఎస్ ఆర్ నగర్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళ కాళ్లు నరికి దారుణంగా చంపేశారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

మోత్కుపల్లితో ఎంపీ విజయసాయి భేటీ...

హైదరాబాద్ : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి...మోత్కుపల్లితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాదయాత్రకు మద్దతిచ్చినట్లు తెలుస్తోంది. 

తిరుమలలో రోడ్డు ప్రమాదం...

చిత్తూరు : తిరుమలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకటో మలుపు వద్ద టెంపో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక అశ్విని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

కేంద్రం...ఏపీ ప్రభుత్వంపై గల్లా విమర్శలు...

ఢిల్లీ : కేంద్రం చేసే పనులకు బీజేపీ నేతలు చెప్పే మాటలకు పొంతనే లేదన్నారు ఎంపీ గల్లా జయదేవ్‌. విభజన హామీలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారో లేదో అన్న అనుమానం కలుగుతోందన్నారు. 

ప్రకాష్ గౌడ్ పై రౌడీషీట్ ఓపెన్ చేయాలి - కార్తీక్ రెడ్డి

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో భూకబ్జాలు తగ్గాలంటే ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌పై పీడి యాక్టు మరియు రౌడిషీట్‌ ఓపెన్‌ చేయాలని చేవెళ్ళ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జీ కార్తీక్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. 

18:52 - June 14, 2018

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో భూకబ్జాలు తగ్గాలంటే ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌పై పీడి యాక్టు మరియు రౌడిషీట్‌ ఓపెన్‌ చేయాలని చేవెళ్ళ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జీ కార్తీక్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రకాష్‌గౌడ్‌ అవుల మహదేవ్‌ అనే వ్యక్తికి 1995లో ప్లాట్‌ అమ్మి... ఇప్పుడు నకిలీ డ్యాక్యుమెంట్‌లు సృష్టించి.. అక్కడ నిర్మాణాలు చేపట్టాడని కార్తీక్‌ రెడ్డి ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. కార్తీక్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేను అరెస్టు చేయకపోతే.. బాధితులకు మద్దతుగా ధర్నా చేస్తామని కార్తీక్‌ రెడ్డి హెచ్చరించారు. 

18:49 - June 14, 2018

విజయవాడ : టీడీపీపై వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ మొన్నటి వరకు ఎన్డీయేతో కలిసి రాష్ట్రాని దెబ్బతీసిందన్నారు. ఇందులో భాగంగానే కడప ఉక్కు కర్మాగారాన్ని తుక్కుతుక్కు చేయాలనే పధకం వేశారని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలని మభ్యపెట్టి.. ఓట్లు సాధించుకునేందుకు కొత్త పథకం వేశారన్నారు అంబటి. 

18:48 - June 14, 2018

మహబూబ్ నగర్ : కాంగ్రెస్‌లో వర్గ విబేధాలు తార స్థాయికి చేరాయి. పార్టీ బలోపేతానికి అధినాయకత్వం చేరికల్ని ప్రోత్సహిస్తుంటే.. స్థానిక నేతలు మోకాలడ్డుతున్నారు. ఈ వర్గపోరుకు పార్టీలోని సీనియర్‌ నేతలే సారథ్యం వహించడం చర్చనీయాంశంగా మారింది. నిన్న నాగర్ కర్నూలు.. నేడు నారాయణపేట.. ఇలా నియోజకవర్గం ఏదైనా డీకే వర్సెస్ జైపాల్ అన్నట్టుగా సాగుతోంది మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌లో వర్గ పోరు.

ఎన్నికలు సమీపీస్తున్నా... కాంగ్రెన్‌ నేతల్లో మార్పు రాలేదు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో అంతర్గత కుమ్ములాటలతో పార్టీ పరువు బజారున పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌లో చేరుతున్న ఇతర నాయకులను నియోజకవర్గ నేతలు అడ్డుకుంటున్నారు. బలమైన నేతలు పార్టీలో చేరితే తమ భవిష్యత్‌ ప్రశ్నార్థకం అవుతుందన్న భయంతోనే చేరికలకు మోకాలడ్డుతున్నట్లు తెలుస్తోంది. ఈ వర్గ పోరు మొత్తం డీకే అరుణ వర్సెస్‌ జైపాల్‌ రెడ్డి గ్రూపులుగా సాగుతోంది.

నారాయణ పేటలోనూ కాంగ్రెస్‌లో వర్గపోరు భగ్గుమంటోంది. అధికార పార్టీ నుంచి శివకుమార్‌ రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకోవడంతో.. అక్కడి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నేతలు శివకుమార్‌ రాకను అడ్డుకునేందుకు పావులు క‌దుపుతున్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరుపున పోటీ చేసి ఓడిపోయిన శివకుమార్‌.. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణకు దగ్గరి బంధువు కావడంతో.. ఆయన్ను పార్టీలోకి తెచ్చేందుకు అరుణ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే ఎస్‌. రాజేందర్‌ రెడ్డికే ఈ సారి టికెట్ అని పార్టీ పెద్దలు స్పష్టం చేయడంతో.. శివకుమార్‌ పార్టీ వీడే యోచనలో ఉన్నారు. రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం సాగింది. దీంతో కొందరు కాంగ్రెస్‌ నేతలు శివకుమార్‌ రెడ్డిని పార్టీలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని కలిసి విన్నవించినట్లు సమాచారం. ఈ తతంగమంతా కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు సమాచారం.

నియోజకవర్గ పార్టీ బాధ్యుడు షరాబు కృష్ణ, డీసీసీబీ ఛైర్మన్‌ వీరారెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, సీనియర్‌ నేత రవీందర్‌ రెడ్డి నారాయణపేట నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కృష్ణ మళ్లీ తనకే టికెట్‌ రావాలని పట్టుబడుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మద్ధతు కూడా ఉండటంతో.. టికెట్‌ తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. మిగిలిన ఇద్దరు నేతలు కూడా టికెట్ దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గమేదైనా.. మహబూబ్‌ నగర్‌జిల్లాలో మాత్రం డీకే వర్సెస్ జైపాల్‌గా నడుస్తోంది కాంగ్రెస్‌ వర్గపోరు.. కాంగ్రెస్‌ నేతలు వర్గాలుగా విడిపోయి కుమ్ములాడుకుంటూ ఉంటే మరో సారి ప్రతిపక్ష పాత్ర పోషించక తప్పదన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. 

18:25 - June 14, 2018

న్యూఢిల్లీ : ప్రజలను ఫూల్స్ చేయడానికి బీజేపీ, స్టీల్ ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారని ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. కడప స్టీల్ ప్లాంట్ పై రగడ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే పాత విషయాలనే ఎందుకు ప్రస్తావించాలని ప్రశ్నించారు. ఉక్కు పరిశ్రమపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రకటన చేసిందని, సుప్రీంకోర్టులో ఒకలా...మరోవైపు ఇలాంటి ప్రకటనలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అంతే గాకుండా కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతుందని ఏ అభయంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెబుతున్నారని ప్రశ్నించారు. ఇటీవలే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కన్నా లక్ష్మీనారాయణ ఓ లేఖ రాశారని, అందులో 12 అంశాలు ప్రస్తావించారని తెలిపారు. ఇందులో కాపు రిజర్వేషన్, ప్రత్యేక హోదా అంశాలను ప్రస్తావించడం లేదని, ఇవి వారికి ఇంపార్టెంట్ కాదేమోనన్నారు. 

18:19 - June 14, 2018

హైదరాబాద్ : ఎస్ ఆర్ నగర్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళ కాళ్లు నరికి దారుణంగా చంపేశారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి ఆవరణలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురికాబడిన మహిళ...హత్య చేసిన వారు ఎవరో తెలియడం లేదు. 

18:06 - June 14, 2018

కడప : స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం నిరాకరించడంతో కడప నగరంలో ఉక్కు పోరాటం ఉధృతం చేస్తామన్నారు సీపీఎం నేతలు. నగరంలోని సీపీఎం కార్యాలయం నుండి ప్రధాని మోదీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి అనంతరం బుగ్గవంకలోని వాగులో మోదీ దిష్టిబొమ్మను పడేసి నిరసన తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా నెరవేర్చడంలో విఫలమైందని... ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని వెంటనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని... లేనిపక్షంలో అందరితో కలిసి ఉద్యమాల బాట పడుతామని సీపీఎం నేతలు హెచ్చరించారు.

చంబాలో భూకంపం..

హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్రంలోని చంబా ప్రాంతంలో భూకంపం సంభవించింది.రిక్కర్ స్కేల్ పై 4.5గా నమోదయ్యింది. కాగా మే నెలలో కూడా భూకంపం సంభవించగా రెక్టరు స్కేలుపై 4.2తీవ్రతతో ఈ భూకంపం చోటు చేసుకుంది. కిన్నౌర్ జిల్లా, దాని పరిసర ప్రాంతాల్లో పలు సెకన్లపాటు భూమి కంపించింది. భూకంప కేంద్రం హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర రాజధాని షిమ్లా పరిసరాల్లో ఉందని గుర్తించారు. భూమి కంపించడంతో ఇళ్లలోని ప్రజలు ఒక్కసారిగా బయటపికి పరుగులు తీశారు. కాగా మంచు ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ లో భూ ప్రకంపనలు సాధారంగా జరుగుతుంటాయి. 

మహిళ కాళ్లు నరికి దారుణ హత్య!!

హైదరాబాద్ : ఎర్రగడ్డ మెంట్ ఆసుపత్రి ఆవరణలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ కాళ్లను దుండగులు నరికి దారుణంగా హత్యకు పాల్పడ్డారు. సమచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ సంఘనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. 

తిరుమల ఘాట్ రోడ్ లో టెంపో బోల్తా..

తిరుమల : ఓకటవ మలుపు వద్ద టెంపో ట్రావెలర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. 

గడువులోగా పంచాయితీ ఎన్నికలు : మంత్రి జూపూడి

హైదరాబాద్ : పంచాయితీ ఎన్నికల కోసమే బీసీ జనగణన పూర్తి చేశామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గడువులోగా పంచాయితీ ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు. బీసీలకు 34,ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్లను పంచాయితీ ఎన్నికల్లో ఇస్తున్నామని తెలిపారు. ఈనెల 25లోపు పంచాయితీలు, వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. లాటరీ ద్వారా సర్పంచ్, వార్డు సభ్యుల కేటాయింపులు చేస్తామనీ..ఎన్నికలకు ప్రబుత్వపరంగా అన్ని ప్రక్రియలు పూర్తి చేస్తున్నామనీ..ఎన్నికైనవారికి కొత్త చట్టంపై మూడు నెలలపాటు శిక్షణనిస్తామన్నారు. 

నగరంలో 10లక్షల సీసీ కెమెరాలు : కేటీఆర్

హైదరాబాద్ : నాగోల్ లో మన నగరం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతు..హైదరబాద్ నగరమంతటా 10లక్షల సీసీ కెమెరాలు పెడడుతున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రజల కట్టే టాక్స్ కు ప్రభుత్వం ధర్మకర్తగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజలకు పాలన సరిగా అందాలంటే వికేంద్రీకరణ జరగాలన్నారు. హరిత హారం కార్యక్రమంలో అందరు పాలు పంచుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 

చెడ్డీ గ్యాంగ్ గురించి భయపడొద్దు : ఎమ్మెల్యే చింతా

సంగారెడ్డి : జిల్లా కేంద్రంలో చడ్డీ గ్యాంగ్‌ కదలికలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కు బిక్కు మంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదంటున్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌. చడ్డీ గ్యాంగ్‌ ఎలాంటి అరాచకాలకు పాల్పడకుండా పోలీసులతో నిఘా కట్టుదిట్టం చేస్తామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ పేర్కొన్నారు. 

సీఎం క్లాస్ పీకినా వైఖరి మార్చుకోని తమ్ముళ్లు..

కడప : జిల్లాలో రచ్చకెక్కిన రాజకీయాలకు సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలే రాష్ట్రం సమస్యల్లో వుంటే పార్టీలో నేతల మధ్య తలెత్తుతున్న విభేధాలతో విసిగిపోయిన చంద్రబాబు కడప జిల్లా నేతలను అమరావతికి రప్పించుకుని అందరికీ క్లాస్ పీకారు. అందరం కలిసి మెలిసి వుంటామని మాట ఇచ్చారు. కానీ వారి వైఖరిని మాత్రం మార్చుకోవటం లేదు.ఈ నేపథ్యంలో జమ్మలమడుగు, ప్రొద్దటూరు, బద్వేలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతల విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి. అధినేత చంద్రబాబు మందలించినా నాయకుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు.

బుగ్గవంక వాగులో మోదీ దిష్టిబొమ్మ..

కడప : స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం నిరాకరించడంతో కడప నగరంలో ఉక్కు పోరాటం ఉధృతం చేస్తామన్నారు సీపీఎం నేతలు. నగరంలోని సీపీఎం కార్యాలయం నుండి ప్రధాని మోదీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి అనంతరం బుగ్గవంకలోని వాగులో మోదీ దిష్టిబొమ్మను పడేసి నిరసన తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా నెరవేర్చడంలో విఫలమైందని... ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని వెంటనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని... లేనిపక్షంలో అందరితో కలిసి ఉద్యమాల బాట పడుతామని సీపీఎం నేతలు హెచ్చరించారు.

కేరళలో భారీ వర్షాలు..27మంది మృతి..

కేరళ : నైరుతి రుతు పవనాల ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 27 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. కోజికోడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడడంతో 9 ఏళ్ల బాలికతో పాటు ముగ్గురు మృతిచెందారు. మరో 9 మంది గల్లంతయ్యారు. ఇడుకి, వేనాడ్, కోజికోడ్ జిల్లాల్లో వర్షాలకు కొండ చరియలు విరిగి పడి రోడ్లు ధ్వంసమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. కేరళలో మే 29వ తేదీన రుతుపవనాలు ప్రవేశించాయి.

16:52 - June 14, 2018

రాజమండ్రి : పుట్టిన రోజున దీక్ష. నెలకో దీక్ష. అంతేనా... ఏదైనా స్పెషల్‌ డే ఉంటే.. ఆరోజూ దీక్ష. ఇలా పొలిటికల్‌ దీక్షలతో అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు ప్రజలముందు ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ప్రజాక్షేత్రంలో ఓటు బ్యాంకును పెంచుకునేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు అవంతి దీక్షలను విపక్షాలు పబ్లిసిటీ స్టంట్‌గా కొట్టిపారేస్తున్నాయి. ప్రత్యేకహోదా కోసం ఏనాడు పార్లమెంట్‌లో మాట్లాడని ఆయన... ఇప్పుడు రోజుకో పేరుతో దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేస్తున్నాయి.
ముత్తంసెట్టి శ్రీనివాసరావు. ఈ పేరు చెబితే ఆయన ఎవరికీ తెలియదు. కాని అవంతి శ్రీనివాస్‌ అని చెప్తే ఏమాత్రం రాజకీయ అవగాహన ఉన్నవారైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. అవంతి గ్రూప్‌ ఆఫ్‌ కాలేజస్‌ వ్యవస్థాపకుడిగా.. విద్యావేత్తగా ఉన్న అవంతి శ్రీనివాసరావు...2009 ఎన్నికల్లో భీమిలి నుంచి ప్రజారాజ్యంపార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆరంభం నుంచీ ఆయన గంటా శ్రీనివాసరావుకు అనుంగు అనుచరుడిగా ఉంటూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో తన రాజకీయ గురువు గంటా శ్రీనివాసరావుకు భీమిలి నియోజకవర్గం అప్పగించి... ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. పేరుకు అనకాపల్లి ఎంపీ అయినా... ఆయన మకాం మాత్రం విశాఖలోనే.

గెలిచినప్పటి నుంచి ఆయన పెద్దగా జనంలో తిరిగింది లేదు. క్షేత్రస్థాయిలో పెద్దగా కార్యక్రమాలు చేపట్టింది కూడా అంతంతమాత్రమే. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇక సార్వత్రిక ఎన్నికలకు ఎంతో సమయం లేదు. దీంతో మళ్లీ గెలవాలన్న తపనతో ఆయన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగానే దీక్షా అస్త్రాన్ని ఎంచుకున్నారు. ఆయన కొద్ది రోజులుగా.. ఒక్క రోజు దీక్ష పేరుతో కేంద్రంపై నిరసనకు దిగుతున్నారు. ప్రతిపక్షాలు ఏ డిమాండ్‌తో దీక్షలు చేస్తున్నాయో... ఆయన కూడా అదే డిమాండ్‌ను ఎత్తుకున్నారు. విశాఖకు రైల్వేజోన్‌ కావాలంటూ 2016లోనే ఆయన జీవీఎంసీ ఎదుట ఒక్కరోజు నిరాహార దీక్షకు కూర్చున్నారు. అంతటితో ఆగలేదు.. ఏడాదిలోగా విశాఖకు రైల్వేజోన్‌ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని శపథం కూడా చేశారు. రెండు సంవత్సరాలు గడిచింది... విశాఖకు రైల్వేజోన్‌ రాలేదు. మరి ఎంపీగారి శపథం కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ మళ్లీ ప్రత్యేకహోదా గురించి మాట్లాడలేదు. కానీ గతనెల 6న విశాఖ రైల్వేస్టేషన్‌ దగ్గర ఒక్కరోజు నిరాహార దీక్ష చేశారు. ఈనెల 12న తన పుట్టినరోజు సందర్భంగా అనకాపల్లిలో ఒక్కరోజు నిరాహారదీక్ష చేశారు. ఈ దీక్షల్లో ఆయన చేసిన డిమాండ్స్‌ కూడా పెద్దగా లేవు.

అవంతి చేస్తున్న ఒక్కరోజు దీక్షలపై విపక్షపార్టీల నేతలు మండిపడుతున్నారు. అవంతి చేసే దీక్షలన్నీ పబ్లిసిటీ స్టంట్‌గా కొట్టిపారేస్తున్నాయి. నాలుగేళ్లుగా ప్రత్యేకహోదా, విశాఖరైల్వే జోన్‌,తోపాటు ప్రజాసమస్యలపై ఏనాడు మాట్లాడని అవంతి శ్రీనివాస్‌కు... ఇప్పుడు హఠాత్తుగా గుర్తుకొచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో లబ్దిపొందేందుకే ఆయన దీక్షలు చేస్తున్నాని ధ్వజమెత్తారు. మొత్తానికి అవంతి చేస్తున్న దీక్షలను విపక్షాలన్నీ తప్పుపడుతున్నాయి. పబ్లిసిటీ స్టంట్‌గా కాకుండా... ప్రజాసమస్యల పరిష్కారం దిశగా దీక్షలు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని సలహా ఇస్తున్నాయి. మరి ప్రతిపక్షాల సలహాలపై అవంతి ఎలా రియాక్ట్‌ అవుతారో వేచి చూడాలి.

28నుండి అమర్ నాథ్ యాత్ర..

ఢిల్లీ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరానాథ్ యాత్రపై కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పమీక్షించారు. ఈ నెల 28 నుండి యాత్ర ప్రారంభం అవుతుందని రాజ్ నాథ్ తెలిపారు. 

16:49 - June 14, 2018

అనంతపురం : జీవో 151ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల నాయకులు అనంతపురం కార్పొరేట్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం అనేక హామీలను విస్మరించిందని సీపీఎం నాయకులు మండిపడ్డారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల లాఠీచార్జీలో ఇద్దరు మహిళలు అసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులపై దాడి చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

వినియోదారుల కోసం ప్రత్యేక వెబ్ సైట్‌ : అకున్న సబర్వాల్

హైదరాబాద్ : వినియోగదారుల సమస్యల పరిష్కారంలో సివిల్ సప్లై ఎప్పుడు ముందుంటుందని.. సివిల్ సప్లై కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. పౌర సరఫరాలు, ఇతర విభాగాల్లో వినియోగదారులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని.. ఏ విభాగంలోనైనా వినియోగదారులను మోసం చేస్తే పిర్యాదు చేయవచ్చన్నారు. వినియోదారుల కోసం ప్రత్యేక వెబ్ సైట్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. స్కానింగ్ సెంటర్‌లో మోసపోయిన ఓ చిన్నారికి కన్స్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా న్యాయం చేసి 2లక్షల చెక్‌ను అందజేశారు. 

ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్ల పెంపుకు ఆమోదం తేవాలి : షబ్బీర్‌

ఢిల్లీ : పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌... ప్రధాని మోదీతో మాట్లాడి ముస్లింలు, గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లులకు ఆమోదం సాధించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. లేకపోతే ఢిల్లీ నుంచి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. మరోవైపు ప్రతిపాదిత బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంపై కేంద్రం వెనక్క తగ్గడంపై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఈ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రధాని మోదీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారేమోన్న అనుమాన్ని పొంగులేటి వ్యక్తం చేశారు. 

16:43 - June 14, 2018

హైదరాబాద్ : వినియోగదారుల సమస్యల పరిష్కారంలో సివిల్ సప్లై ఎప్పుడు ముందుంటుందని.. సివిల్ సప్లై కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. పౌర సరఫరాలు, ఇతర విభాగాల్లో వినియోగదారులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని.. ఏ విభాగంలోనైనా వినియోగదారులను మోసం చేస్తే పిర్యాదు చేయవచ్చన్నారు. వినియోదారుల కోసం ప్రత్యేక వెబ్ సైట్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. స్కానింగ్ సెంటర్‌లో మోసపోయిన ఓ చిన్నారికి కన్స్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా న్యాయం చేసి 2లక్షల చెక్‌ను అందజేశారు. 

16:42 - June 14, 2018

హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌... ప్రధాని మోదీతో మాట్లాడి ముస్లింలు, గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లులకు ఆమోదం సాధించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. లేకపోతే ఢిల్లీ నుంచి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. మరోవైపు ప్రతిపాదిత బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంపై కేంద్రం వెనక్క తగ్గడంపై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఈ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రధాని మోదీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారేమోన్న అనుమాన్ని పొంగులేటి వ్యక్తం చేశారు. 

నీతి అయోగ్ సమావేశంపై చంద్రబాబు సమీక్ష..

అమరావతి : ఢిల్లీలోని నీతి అయోగ్ సమావేశంపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్షించారు. కేంద్ర సహకారం లేకున్నా నాలుగేళ్లలో 10.5 శాతం వృద్ధి రేటు సాధించామని తెలిపారు. మూడేళ్ల నుండి రెండంకెల వృద్ధి రేటు నమోదుచేసుకున్నామన్నారు. అభివృద్ధికి సహకరించకుండే అడ్డుకోవటం సరికాదని చంద్రబాబు సూచించారు. ఏపీ కేంద్రానికి పన్నులు చెల్లిస్తున్నాగానీ..రాష్ట్రానికి ఇవ్వాల్సినంత రావాల్సినంతగా కేంద్రం ఇవ్వటంలేదన్నారు. పోలవరం పనులకు డబ్బులు లేకున్నా పనులను మాత్రం ఇపకుండా కొనసాగిస్తున్నామనీ..ఈ క్రమంలోనే పోలవరం డయాఫ్రం వాల్ ను విజయవంతంగా పూర్తి చేశామని చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు.

విజయ్ సెంచరీ..రాహుల్ హాఫ్ సెంచరీ..

కర్ణాటక : బెంగళూరులో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో పసికూన ఆఫ్ఘనిస్థాన్ పై ఇండియన్ బ్యాట్స్ మెన్ విరుచుకుపడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా అలవోకగా పరుగులు సాధిస్తోంది. ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు సాధించారు. శిఖర్ ధావన్ 107 పరుగులకు ఔట్ కాగా... మురళీ విజయ్ 1 సిక్స్, 15 ఫోర్లులతో 105 పరుగులకు ఔట్ అయ్యాడు.వఫాదార్ బౌలింగ్ లో మురళీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో టెస్టుల్లో తన 12 శతకాన్ని సాధించాడు.

కేసీఆర్ ది శిఖండి పాత్ర : నారాయణ

హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాల్లో శిఖండి పాత్రను పోషిస్తున్నారని సీపీఐ నారాయణ దుయ్యబట్టారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది ఎన్డీయేకు బీ-ఫ్రంట్ లాంటిదని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని... కేసీఆర్ కు దమ్ముంటే కేంద్రంపై పోరాడాలని సవాల్ విసిరారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ కాళ్ల వద్ద కేసీఆర్ మోకరిల్లుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని... తెలంగాణను వ్యతిరేకించిన వారంతా ఇప్పుడు కేబినెట్ లో ఉన్నారని విమర్శించారు.  

టీవీ సీరియల్స్ పై నన్నపనేని మరోసారి వ్యాఖ్యలు..

అమరావతి : టీవీ సీరియల్స్ వల్ల ఆడవారిలో హింసాత్మక ధోరణి పెరుగుతోందనీ..ఈ సీరియల్స్ తో సమాజంలో హింస పెరుగుతోందని వ్యాఖ్యానించిన ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి మారోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హింసాత్మక దృశ్యాలు ఎక్కువగా ఉండే టీవీ సీరియల్స్ ను నిషేధించాలని కోరుతూ కోర్టుకు వెళతానని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

కడప స్టీల్ ప్లాంట్ విషయంపై జగన్ ఎందుకు మాట్లాడరు? : జూపూడి

అమరావతి : కడపకు స్టీల్ ప్లాంట్ ఇవ్వటం సాధ్యపడదని కేంద్రం స్ఫష్టం చేసింది. వైసీపీ అధినేత జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ విషయంపై జగన్ ఎందుకు మాట్లాడటంలేదని జూపూడి ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టులను ‘సినిమాలు’ అంటూ పోల్చడం తగదని, జగన్ కు నిజమైన సినిమాను వచ్చే ఎన్నికల్లో ప్రజలు చూపిస్తారని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కన్నా పేరుకే బీజేపీ అధ్యక్షుడు..వాస్తవానికి జగన్ కు ఏజెంట్ అని జూపూడి ఆరోపించారు.

మోదీజీ! పెంచాల్సింది బాడీ కాదు బుర్ర..

అమరావతి : ప్రధాని మోదీ చేసిన ఫిట్ నెస్ ఛాలెంజ్ పై ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ విమర్శలు చేశారు. నాయకులు పెంచాల్సింది బాడీ కాదు.. బుర్ర అని సెటైర్లు విసిరారు. ప్రధాని పదవి అంటే కుస్తీ పోటీ కాదనే విషయం తెలుసుకోవాలని, బ్యాంకులను దోచుకున్న వారిని మోదీ కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కడపకు స్టీల్ ప్లాంట్ రాకపోవడంపై ఇస్తానని వాగ్ధానం చేసినవీ ఇవ్వలేదు..ఇక విభజన చట్టంలో వున్నవాటిని కూడా ఇవ్వకుండా వుండేందుకు కుంటిసాకులు చెబుతోందని జూపూడి ప్రభాకర్ విమర్శించారు. 

జిల్లాలో నేరాల సంఖ్య తగ్గింది : ఎస్పీ త్రివిక్రమవర్మ

శ్రీకాకుళం : ఎల్.ఎన్.పేటలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం డీజీపీ, డీఐజీల ద్వారా నివేదిక పంపించామని జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ 10టీవీకి తెలిపారు. టెక్కలి సబ్ డివిజన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఉన్నతాధికారులకు పంపించామన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు చర్యలు పక్కాగా చేపట్టి సత్ఫలితాలను సాధించామని ఎస్పీ త్రివిక్రమవర్మ తెలిపారు. 

కాచిగూడ టెక్కీ హత్య కేసులో కొత్త మలుపు..

హైదరాబాద్ : కాచిగూడ టెక్కీ హత్య కేసులో మరో మలుపు తిరిగింది. మయూర్ పాన్ షాప్ యజమాని కుమారుడు సోను ఉసేంద్రవర్మను బెదిరించి రూ.లక్షలు కాజేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన బ్యాంక్ స్టేట్ మెంట్ ను ఉసేందర్ కుటుంబ సభ్యులు పోలీసులకు అందజేశారు. కాగా ఉపేందర్, స్నేహితులు ఇప్పటికే పోలీసులు రిమాండ్ లో వున్న విషయం తెలిసిందే. 

లోయలో పడ్డ బస్..15మంది మృతి..

తమిళనాడు: నీలగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఊటీ సమీపంలోని కూనూరు వద్ద ఓ ఆర్టీసీ బస్ లోయలో పడిపోయింది.ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 15మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్ లో 50మంది ప్రయాణీకులు వున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఆర్టీసీ బస్ ఊటి నుండి కూనూరుకు వెళ్తుండగా బస్ లోయలో పడిపోయింది. 

వినియోగదారుల సమస్యలకు టోల్ ఫ్రీ నం..

హైదరాబాద్ : వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం కొత్త విభాగంపై ఏర్పడింది. సమస్యల వినియోగదారులు టోల్ ఫ్రీ నెం: 180042500333 ద్వారా ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదే చేయవచ్చని సివిల్ సప్లై కమిషనర్  సబర్వాల్ తెలిపారు. సీనియర్ తహశీల్దార్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ పనిచేస్తుంది. కాగా కార్పొరేషన్ నిధుల సమస్య లేదని ఐసీపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ తెలిపారు. రూ.5,490 కోట్లతో 35.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని..అన్ని జిల్లాలలకు రూ.290 కోట్లు పంపిణీ చేశామన్నారు. 1,2 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు.

అనర్హత ఎమ్మెల్యేలపై ఇద్దరు జడ్జిల విరుద్ధ తీర్పు..

తమిళనాడు : దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై స్పీకర్ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి సమర్థించారు. మరో న్యాయమూర్తి సుందర్ మాత్రం స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఎమ్మల్యేల అనర్హతపై ఇద్దరు న్యాయమూర్తులు పరస్పర విరుద్ధ తీర్పులను వెలువరించారు. ఈ నేపథ్యంలో ఈ కేసును మద్రాస్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం మూడో న్యాయమూర్తికి బదిలీ చేశారు. మూడవ న్యాయమూర్తి తన తీర్పును వెలురించేంత వరకూ ఎమ్మెల్యేల అనర్హతపై స్టే కొనసాగనుంది. కాగా దినకర్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ గతంలో అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. 

నాగవైష్ణవి హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు..

విజయవాడ : నాగవైష్ణవి హత్య కేసులో తీర్పు వెలువడింది. విజయవాడలో సంచలనం కలిగించిన నాగవైష్ణవి హత్య కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు జీవితఖైదు శిక్ష విధిస్తు మహిళా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. 2010 జనవరి 3న చిన్నారి నాగవైష్ణవిని అత్యంత పాశవికంగా హత్య చేసిన బాయిలర్ వేసిన కేసులో ఎట్టకేలకు ఎనిమిది సంవత్సరాల తరువాత మహిళా సెషన్ కోర్టు న్యాయమూర్తి బబిత తీర్పు నిచ్చారు. మద్యం వ్యాపారి ప్రభాకర్ రెండ భార్య కుమార్తె అయిన నాగవైష్ణవిని మొదటి భార్య సోదరుడు కిడ్నాప్ చేయించి హత్య చేయించినట్లుగా కేసు నమోదు అయ్యింది.

15:54 - June 14, 2018

చిత్తూరు : కూనూరు జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సు లోయలో పడిపోయిన ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఓ బస్సు ఊటీ నుండి కూనూరు మీదుగా కోయంబత్తురూకు వెళ్లాల్సి ఉంది. మరికాసేపట్లో కూనూరు స్టేషన్ చేరుకుంటుందనగా బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. సుమారు వంద అ అడుగుల లోతులో పడిపోవడంతో ఏడుగురు అక్కడికక్కడనే మృతి చెందారు. సుమారు 15 మందికి గాయాలయ్యాయి. మలుపులు తిరుగుతూ ఉండే ఈ రహదారిపై జాగ్రత్తగా ప్రయాణించాల్సి ఉంటుంది. బాగా నిపుణులైన..సుశిక్షితులైన డ్రైవర్లు మాత్రమే వాహనాలు నడుపుతుంటారు. మరి ఈ బస్సు ఎలా ప్రమాదానికి గురైంది ? అనేది తెలియరావడం లేదు. గత మూడు రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు పడడంతో బస్సు అదుపుతప్పినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

15:52 - June 14, 2018

విజయవాడ : చిన్నారి నాగ వైష్ణవి హత్య కేసు...సుమారు ఎనిమిదేళ్ల అనంతరం తీర్పు వెలువడింది. ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తున్న మహిళా సెషన్ కోర్టు న్యాయమూర్తి బబిత వెల్లడించారు.

2010 జనవరి 30న కారులో స్కూల్ కి వెళ్తున్న చిన్నారి నాగ వైష్ణవిని కిడ్నాప్ చేసి... గొంతు నులిమి హత్య చేసిన అనంతరం బాయిలర్‌లో వేసి దహనం చేసిన ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేకెత్తిన సంగతి తెలిసిందే. నాగవైష్ణవి హత్యతో పాటు అడ్డువచ్చిన డ్రైవర్ లక్ష్మణ రావును కూడా దారుణంగా కత్తులో పొడిచి హత్య చేశారు. తన ముద్దుల కూతురు హత్య వార్త విన్న తండ్రి పలగాని ప్రభాకర్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ హత్యలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనలు..నిరసనలు కొనసాగాయి. అందర్నీ కన్నీరు కార్చేలా ఈ కేసులో విచారణ జాప్యం జరుగుతుండడంతో తీవ్రంగా కలత చెందిన వైష్ణవి తల్లి కూడా కన్నుమూసింది.

ఈ కేసులో అరెస్ట్ అయిన ఏ1 మొర్ల శ్రీనివాసరావు, ఏ2 వెంపరాల జగదీష్, ఏ3 పంది వెంకట్రావ్ గత ఏడేళ్లుగా జైలులో ఉన్నారు. నిందితులకు బెయిల్ మంజూరు కాకుండానే కేసు విచారణ పూర్తి కాగా... గురువారం తుది తీర్పు వెలువడింది. ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు తీర్పును వెలువరించింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

15:51 - June 14, 2018

చెన్నై : తమిళనాడు రాష్ట్ర హైకోర్టు విభిన్నమైన తీర్పు వెలువరించింది. ఇద్దరితో కూడిన ధర్మాసనం ఒకరికి భిన్నంగా మరొకరు తీర్పులు వెలువరించడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదంతా శాసనసభ్యుల అనర్హత కేసులో నెలకొంది. అన్నాడీఎంకే అసమ్మతి వర్గ నేత దినకరన్ వర్గానికి చెందిన 18 మంది శాసనసభ్యుల అనర్హత కేసులో గురువారం హైకోర్టు తీర్పును వెలువరించింది. ముఖ్య మంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించిన 18 మంది ఎమ్మెల్యేలను స్పీకర్‌ ధన్‌పాల్‌ పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించడం...ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 18 మంది సభ్యులు హై కోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే.

ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి సుందర్ లతో కూడిన ధర్మాసనం వెలువరించింది. స్పీకర్ నిర్ణయాన్ని సుందర్ వ్యతిరేకంగా ప్రధాన న్యాయమూర్తి ఇందిరా సమర్థించడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనితో విస్తృత ధర్మాసనానికి బదలాయించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

వైష్ణవి కేసులో తుది తీర్పు...

విజయవాడ : చిన్నారి నాగ వైష్ణవి హత్య కేసులో తుది తీర్పు వెలువడింది. ముగ్గురు నిందితులకు జీవిత ఖైదును విధిస్తున్నట్లు మహిళా సెషన్ కోర్టు న్యాయమూర్తి బబిత వెల్లడించారు. 

దినకరన్ వర్గానికి షాక్...

చెన్నై : దినకరన్ వర్గానికి షాక్ తగిలింది. 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును హైకోర్టు సమర్థించింది. గతంలో 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టు వెలువరించిన తీర్పు గందరగోళ పరిచింది. ఇద్దరితో కూడితో ధర్మాసనం విరుద్ధంగా తీర్పులు వెలువరించడం విశేషం. ఒకరు సమర్థించగా మరొకరు తిరస్కరించారు. దీనితో విస్తృత ధర్మాసనానికి బదలాయించారు. 

సాధారణ రైల్వే టిక్కెట్ల కోసం యాప్..

ఢిల్లీ : ఇప్పటివరకూ రిజర్వేషన్ టికెట్లను మాత్రమే ఆన్ లైన్, స్మార్ట్ ఫోన్ యాప్స్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం ఉండగా, ఇప్పుడు రిజర్వేషన్ అవసరం లేని సాధారణ టికెట్లను విక్రయించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ ను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. అన్ రిజర్వ్ డ్ టికెట్ కొనుగోలును మరింత సులభతరం చేస్తూ, రద్దీ సమయాల్లో వేగంగా టికెట్ ను ఎక్కడినుంచైనా పొందేలా రైల్వే సమాచార వ్యవస్థ కేంద్రం ఈ యాప్ ను తయారు చేసింది.

నీతి అయోగ్ సమావేశానికి తెలుగు సీఎంలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, హస్తిన బాట పట్టనున్నారు. ఢిల్లీలో 17వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేసీఆర్, చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. తొలుత 16వ తేదీన నీతి ఆయోగ్ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ రోజున రంజాన్ పర్వదినం రానుండటంతో, వాయిదా వేయాలని పలు రాష్ట్రాల సీఎంలు కోరినందున సమావేశాన్ని ఒక రోజు పోస్ట్ పోన్ చేశారు.

నటుడు గిరీష్ కర్నాడ్, పలువురు ప్రముఖుల హత్యలకు ప్లాన్!!..

ముంబై : ప్రముఖ సీనియర్ నటుడు గిరీష్ కర్నాడ్ ను హత్య చేయాలని జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ను హత్య చేసిన నిందితులు ప్లాన్ చేశారు. గౌరీ లంకేష్ కేసులో ప్రధాన నిందితుడు పరశురామ్ వాగ్మోర్‌ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని విచారించగా, హిట్ లిస్టులో నెక్ట్స్ టార్గెట్ గా గిరీష్ కర్నాడ్ ఉన్నట్టు తెలిసింది. సమయం చూసి గిరీష్ ను హత్య చేయాలని తాము ప్లాన్ చేశామని కూడా నిందితుడు వెల్లడించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

బైక్ రేసులతో రెచ్చిపోతున్న యువత..

విజయవాడ : యువతకు బైక్స్ అన్నా..రేస్ లన్నా మహా మోజు. ఈ నేథ్యంలో విజయవాడ నగరంలో బైక్ రేసులతో యువత రెచ్చిపోతున్నారు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. బైక్ లతో విచిత్రమైన విన్యాసాలు చేస్తు భయాందోళనలకు గురిచేస్తున్నారు. పోలీసులు పర్యవేక్షణ కరవవటంతోనే ఈ రేసులు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.  

రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమారుడు మృతి..

చిత్తూరు : తిరుపతి రూరల్  మండలం ఓటేరు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన ఓ బస్ బైక్ ను ఢీకొంది. ఈ ఘటనలో తల్లీ, కుమారుడు మృతి చెందారు.  

దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై కోర్టు వేటు..

తమిళనాడు : రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. దినకరన్ వర్గంలోని 18మంది ఎమ్మెల్యేలపై అన్హత వేటును వేస్తు కోర్టు తీర్పునిచ్చింది. జనవరిలో తీర్పును రిజర్వ్ లో పెట్టిన కోర్టు నేడు తీర్పుని వెల్లడించింది. ఈ తీర్పు దినకర్ ను అనుకూలంగా వస్తే ఏఐడీఎంకే ప్రభుత్వం ఇరకాటంలో పడే పరిస్థితి నెలకొనేది. కానీ తీర్పు దినకరన్ కు వ్యతిరేకంగా వచ్చి ఆ వర్గంలోని 18మంది ఎమ్మెల్యేలపై వేటును వేసింది. దీంతో ఏఐడీఎంకే ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. కాగా దివంగనేత, మాజీ ముఖ్యమంత్రి జయలలిత అకాల మరణంతో తమిళనాట రాజకీయాలు పలు మలుపులు తిరిగాయి.

ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం..

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కాసారంగా మారిపోతోంది. దిర్ మార్గ్, ఆర్కేపురం, ద్వారక, పంజాబి బాగ్, సెంట్రల్ వర్శిటీలో కాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగిపోతోంది. రాజస్థాన్ నుంచి వీస్తున్న గాలుల ధాటికి ఈ కాలుష్య పెరిగిపోతున్నట్లుగా తెలుస్తోంది. కళ్ల మంటలు, శ్వాస కోశ వ్యాధులతో ఢిల్లీ వాసులు పలు ఇబ్బందులకే కాక ఆరోగ్యం సమస్యలకు గురవుతున్నారు. ఈ కాలుష్యం మరో రెండురోజుల పాటు వుంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎన్సీఆర్ పరిధిలో మరో 48 గంటల పాటు నిర్మాణాలు చేపట్టవద్దని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది.  

కిడ్నాప్ అయిన రిషిక సురక్షితం..

మేడ్చల్ : ఉప్పల్ బ్యాంక్ కాలనీలో కిడ్నాప్ కలకలం రేగింది. నిన్న సాయంత్రం రిషిక అనే ఆరేళ్ల బాలిక కిడ్నాప్ అవ్వటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. నిన్న సాయంత్రం నుండి బాలిక ఆచూకి దొరకకపోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దార్యప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో కిడ్నాపర్ ను కుషాయిగూడలో పట్టుకున్నారు. అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతం రిషిక మాత్రమేనా..లేదా ఇంకా ఎవరినైనా నిందితుడు కిడ్నాప్ చేశాడా? లేదా ఇంకా ఎవరైనా ముఠాగా చేరి ఈ కిడ్నాప్ లకు యత్నిస్తున్నారా?

పేదలకు ఇళ్లు,పట్టాల కోసం సీపీఎం మహాధర్నా..

విజయవాడ : పేదలకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తు..కార్పొరేషన్ కార్యాలయం వద్ద సీపీఎం మహాధర్నా చేపట్టింది. పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తానన్న ప్రభుత్వం నాలుగేళ్లయినా ఆ దిశగా పనులను చేయటంలేదని విమర్శిస్తు సీపీఎం పార్టీ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మహాధర్నా చేపట్టింది. పేదలు అద్దె కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం కార్యదర్శి మధు ఆవేదన వ్యక్తంచేశారు. సీపీఎం చేపట్టిన ఈ ధర్నాకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.

అమరవతిని భ్రమరావతి అనటమేంటి : దేవినేని

అమరావతి : ఆంధ్రుల రాజధాని అమరావతిని భ్రమరావతి అని జగన్ హేళన చేయటం ఎంత వరకూ సమంజసమని మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. వైసీపీ, బీజేపీ పార్టీలు కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని దేవినేని ఆరోపించారు. జగన్, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకే యాత్రలు చేస్తున్నారు తప్ప ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కాదన్నారు. 

షా డైరెక్షన్ లో జగన్, పవన్ : దేవినేని

విజయవాడ : 419 రోజులు కష్టపడి..డయాప్రాం వాల్ యజ్నంలా పూర్తి చేశామని మంత్రి దేవినేని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుని పోలవరాన్ని సినిమా అంటు జగన్ బాద్యతాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్, పవన్, కన్నా లక్ష్మీనారాయణ, అమిత్ షా డైరెక్షన్ లో పనిచేస్తున్నారని దేవినేని ఎద్దేవా చేశారు. పోలవరం పనుల్ని విమర్శిస్తున్న జగన్ డ్యామ్ వద్ద జరుగుతున్న పనులను చూసి మాట్లాడడాలని సూచించారు. వేలాది మంది కార్మికులు, ఇంజనీర్లు కష్టపడి పనిచేస్తుంటే జగన్ కు కనిపించటంలేదా? అని మంత్రి దేవినేని ప్రశ్నించారు.

హీరోయిన్లను కాల్‌ గాళ్స్‌గా ట్యాగ్ చేస్తూ ఆన్‌లైన్ మోసం..

హైదరాబాద్ : టాలీవుడ్‌కు చెందిన పలువురు టాప్ హీరోయిన్ల ఫొటోలను వాడుకుని అమాయకుల నుంచి డబ్బులు గుంజుతున్న మాజీ ప్రిన్సిపాల్ బండారం బయటపడింది. హీరోయిన్లను కాల్‌ గాళ్స్‌గా ట్యాగ్ చేస్తూ ఆన్‌లైన్ క్లాసిఫైడ్ నెట్‌వర్క్‌లో ప్రకటన ఇచ్చాడు. అలాగే, ధరలు కూడా ముందే నిర్ణయించాడు. రూ.40 వేల నుంచి రూ. 60 వేల ధర నిర్ణయించిన ప్రిన్సిపాల్ అతడి మొబైల్ నంబరు కూడా ఇచ్చాడు.

బోయ్ ఫ్రెండ్స్ వుంటే వేధింపులుండవన్న బీజేపీ నేత...

మధ్య ప్రదేశ్ : కుసంస్కారులను కనడకం కంటే గొడ్రాళ్లుగా మిగిలిపోతే మంచిదని కాంగ్రెస్ నేతల తల్లులపై విరుచుకుపడిన బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్యా గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తలనొప్పి తెచ్చుకున్నారు. శాక్యా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారేమీ కాదు. గతంలో గుణ ప్రభుత్వ కాలేజీలో బాలికలకు సేఫ్టీ టిప్స్ ఇస్తూ, బాయ్ ఫ్రెండ్స్ ను తయారు చేసుకోకుంటే, ఎవరికీ ఎటువంటి వేధింపులు, అత్యాచారాలు ఎదురు కాబోవని వ్యాఖ్యానించి విమర్శలు కొని తెచ్చుకున్నారు. 

మాతృమూర్తులపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

మధ్యప్రదేశ్ : బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ఇప్పటి వరకూ మహిళలపైనా, వారి స్వేచ్ఛ పైనా..వారి వస్త్రధారణపైనా, పోలీస్ అధికారులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు తాజాగా మాతృమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా..మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్యా, కాంగ్రెస్ నేతల తల్లులను ఉద్దేశించి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

సంగారెడ్డిలో చెడ్డీగ్యాంగ్ కదలికలు!!..

సంగారెడ్డి : సంగారెడ్డి వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హడలిపోతున్నారు. క్షణక్షణం భయం భయంగా గడుపుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. చెడ్డి గ్యాంగ్ ముఠా సంగారెడ్డి అపార్ట్ మెంట్స్ లో సంచరిస్తున్నట్లుగా పలు ఆధారాలు వెల్లడవుతున్నాయి. అపార్ట్ మెంట్స్ లో చెడ్డిగ్యాంగ్ ముఠా సంచరిస్తున్నట్లుగా సీసీ కెమెరాల్లో బయటపడింది. దీంతో హడలిపోతున్న సంగారెడ్డి వాసులు నిద్రాహారాలు మాని కర్రలతో కాపలా కాస్తున్నారు. 

నాగవైష్ణవి హత్య కేసులో నేడే తీర్పు..

విజయవాడ : సంచలనం కలిగించిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో నేడు తీర్పు వెలువడనుంది. 2010 జనవరిలో ఆస్థితగాదాల నేపథ్యంలో పలగాని నాగవైష్ణవి హత్య కేసు పలు సంచలనం కలిగించింది. వైష్ణవిని కిడ్నాప్ చేసిన దుండగులు హత్య చేసి మృతదేహాన్ని బాయిలర్ లో వేసి దుండగులు బూడిద చేశారు. చిన్నారి వైష్ణవి బీసీ సంఘం నేత, మద్యం వ్యాపారి అయిన ప్రభాకర్ రెండవ భార్య కుమార్తె. దీంతో మొదటి భార్య సోదరుడు వెంకటరావుపై ఆరోపణల అభియోగం మోపబడింది. కోటి రూపాయల ఒప్పందంతో వైష్ణవిని హత్య చేశారు. కాగా నాగవైష్ణవి హత్యను తట్టుకోలేని తండ్రి ప్రభాకర్ కు గుండెనొప్పి వచ్చి మృతి చెందిన విషయం తెలసిందే.

10:22 - June 14, 2018

లెఫ్ట్ నెంట్ గవర్నర్ భవన్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆందోళన కొనసాగుతోంది. మూడురోజుల నుంచి మెరుపు ధర్నా చేస్తున్నారు. విధులకు హాజరుకాని ఐఏఎస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ పట్టుపడుతున్నారు. అలాగే పలు ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు సంబంధించి ఆమోదం ఇవ్వాలని లెఫ్ట్ గవర్నర్ ఆనిల్ బైజాల్ ను కేజ్రీవాల్ కలిశారు. కానీ ఆయన సరిగ్గా స్పందించిన కారణంగా కేజ్రీవాల్ తన కేబినెట్ మంత్రులతో సహా మెరుపు ధర్నా చేస్తున్నారు. ప్రజల ఓట్లతో ఎలక్ట్ అయినా కానీ అధికారులు గుర్తించడడంలేదంటూ ఆందోళన చేపట్టారు. ఢిల్లీ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై నిర్వహించిన విశ్లేషణ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వినయ్ కుమార్ పాల్గొని, మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం...

 

కాసేపట్లో భారత్, ఆఫ్గనిస్తాన్ మధ్య టెస్టు మ్యాచ్

బెంగళూరు : కాసేపట్లో భారత్, ఆఫ్గనిస్తాన్ మధ్య టెస్టు మ్యాచ్ జరుగనుంది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.

08:49 - June 14, 2018

సంగారెడ్డి : పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ కదలికలను గుర్తించారు. రాత్రిపూట అపార్ట్ మెంట్లలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతోంది. సీసీ కెమెరాల్లో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. నిద్రహారాలుమాని ప్రజలు కాపలా కాస్తున్నారు. కర్రలు పట్టుకుని కాలనీల్లో గస్తీ తిరుగుతున్నారు.  

08:44 - June 14, 2018

విజయవాడ : చిన్నారి నాగవైష్ణవి హత్యకేసులో నేడు తుదితీర్పు వెలువడనుంది. చిన్నారి నాగవైష్ణవి హత్య సంచలనం కలిగించింది. 2010 జనవరి 30న పలగాని నాగవైష్ణవి కిడ్నాప్ గురై, హత్య గావించబడింది. ఆస్తితగాదాల నేపథ్యంలో చిన్నారిని హత్య చేశారు. కిడ్నాప్ చేసి దుండగులు హత్య చేశారు. శవాన్ని బాయిలర్ లో వేసి దహనం దహనం చేశారు. మృతురాలు బీసీ సంఘం నేత, మద్యం వ్యాపారి ప్రభాకర్ కుమార్తె. చిటితల్లి మరణవార్తతో గుండె ఆగి కన్నతండ్రి మృతి చెందారు. ప్రభాకర్ మొదటి భార్య సోదరుడు వెంకటరావుపై అభియోగం ఉంది. కోటి రూపాయలకు ఒప్పందంతో చిన్నారి హత్య జరిగింది. 

 

దినకరన్ ఎమ్మెల్యేల అనర్హత వేటుపై నేడు మద్రాస్ హైకోర్టు తీర్పు

చెన్నై : దినకరన్ ఎమ్మెల్యేల అనర్హత వేటుపై నేడు మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 

 

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్

జమ్మూకాశ్మీర్ : బందిపారా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. పనార్ అటవీప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదరుకాల్పుల్లో జవాను మృతి చెందారు.      

నేడు చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో తుది తీర్పు

విజయవాడ : నేడు చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో తుది తీర్పు వెలువడనుంది. 2010జనవరి 30న నాగవైష్ణవి కిడ్నాప్, హత్యగావించబడింది. నాగవైష్ణవిని బాయిలర్ లో వేసి దహనం బంధువులు దహనం చేశారు. 

08:28 - June 14, 2018

రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి నేత రామ్ చంద్రారెడ్డి, టీఆర్ ఎస్ సీనియర్ నేత సత్యనారాయణ గుప్తా, బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల కోసం కాదని..స్వంత పనుల కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

08:17 - June 14, 2018

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో పేదలు ఇండ్లు, ఇళ్ల స్థలాలకోసం ఆందోళన బాటపట్టారు. ఎన్నికల ముందు అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్లు ఇస్తామని అందరి సొంతింటి కళ నిజం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీ నాయకులు ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ నిలబెట్టుకోకపోవడంపై అక్కడి ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. తాము అద్దెలు భరించలేక పోతున్నామని ఎన్నికల మ్యానిఫెట్సొలో చెప్పినట్టు ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈ రోజు విజయవాడ కార్పొరేషన్‌ ఆఫీసు ముందు సీపీఎం ఆధ్వర్యంలో మహా ధర్నాకు సిద్ధమయ్యారు. ఈ మహా ధర్నాకు దారితీసిన పరిస్థితులు దీనిపై ప్రభుత్వ విధానంపై సీపీఎం నాయకులు సిహెచ్‌ బాబురావు మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:13 - June 14, 2018

రష్యా : ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు సర్వం సిద్ధమైంది. ఈసారి ఫిఫా వరల్డ్‌ కప్‌కు రష్యా ఆతిథ్యమిస్తోంది. ఇవాళ మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగే ఆరంభ వేడుకలతో టోర్నీ ఆరంభమవుతుంది. అక్కడే తొలి మ్యాచ్‌ జరుగనుంది. మొదటి మ్యాచ్‌లో రష్యాతో సౌదీ అరేబియా తలపడనుంది. వచ్చేనెల 15న ఇదే స్టేడియంలో జరిగే ఫైనల్‌తో ఫిఫా ప్రపంచకప్‌ ముగియనుంది. ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. ఇందుకోసం 11 నగరాల్లో 12వేదికలు సిద్ధం చేశారు. మొత్తం 64 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక 2026లో ఫిఫా ప్రపంచకప్‌ ఉత్తర అమెరికాలో జరుగనుంది.

 

రాజ్ భవన్ లో ఉదయం 8 గంటల రక్త దాన శిబిరం ఏర్పాటు

హైదరాబాద్ : రాజ్ భవన్ లో ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల వరకు రక్తధానం శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. 

07:55 - June 14, 2018

విశాఖ : ప్రభుత్వ ఉద్యోగం వచ్చిదంటే చాలు ఆత్మస్థైర్యంతో జీవించవచ్చు అనుకుంటారు చాలా మంది ఉద్యోగులు. ప్రభుత్వం ఇచ్చే జీతంతో పాటు ఇతరత్రా సంపాదించుకోవచ్చని చాలా మందే భావిస్తుంటారు.  అలాంటి వారి ఆశలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెక్‌పెట్టనుంది. స్పెషల్‌ కోర్ట్‌ యాక్ట్‌ - 2016ను అమల్లోకి తేనుంది. దీంతో ఉద్యోగి అవినీతికి పాల్పడితే... అతని ఆస్తులను జప్తు చేయనుంది ఏసీబీ. ఏడాదిలోనే కోర్టులో విచారణ పూర్తై శిక్ష కూడా పడనుంది.  
అవినీతి అధికారుల కోసం.. స్పెషల్‌ కోర్ట్‌ 2016 యాక్ట్‌ 
ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే చాలు ఉద్యోగికి తిరుగులేని భరోసా. ప్రభుత్వం ఇచ్చే జీతంతో పాటు మాముళ్లు కూడా సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశ్యంతోనే  చాలా మంది ఉద్యోగులు ఉంటారు. అయితే ఇలాంటి వారి ఆశలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  చెక్‌పెట్టనుంది. స్పెషల్‌ కోర్ట్‌ యాక్ట్‌ 2016ను అమల్లోకి తేనుంది. దీంతో ఉద్యోగి అవినీతికి పాల్పడితే కేసు పెట్టగానే ఆస్తులను జప్తు చేయనుంది ఏసీబీ. ఆరు నెలల్లో చార్జిషీట్‌ దాఖలు చేసి.. ఏడాదిలోనే కోర్టు విచారణ పూర్తయ్యే విధంగా చూడనుంచి. 
బీహర్, ఒడిస్సాలో అమలవుతున్న స్పెషల్‌ కోర్ట్‌ యాక్ట్‌ 2016 
ఇప్పటివరకు బీహర్‌, ఒడిస్సా రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న స్పెషల్‌ కోర్ట్‌ యాక్ట్‌ 2016 ఇక నుంచి ఏపీలోనూ అమలుకానుంది. ఇప్పటికే ఈ చట్టం కింద ఏసీబీ అధికారులు ఒక కేసును నమోదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న విజయనగరం ఎస్‌ఐ గణేశ్వరరావు కేసును ప్రత్యేక కోర్ట్ ఫైల్ నమోదు చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసు కావటంతో దీనినే తొలి కేసుగా ఎంపిక చేసుకున్నారు అధికారులు.గణేశ్వరరావుపై 11 సివిల్‌ కేసులు ఉన్నాయని.. 4 సార్లు ఉద్యోగం నుంచి సస్పెండ్‌ అయ్యారని ఏసీబీ అధికారులు తెలిపారు. 
నేరం రుజువైతే ఆస్తులు శాశ్వతంగా ప్రభుత్వం ఆధీనంలోకి
ఇప్పటివరకు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తున్నారు ఏసీబీ అధికారులు. తర్వాత దీనిపై దర్యాప్తు జరిపి ఆధారాలతో చార్జిషిట్‌ దాఖలు చేస్తున్నారు. అయితే కోర్టు తీర్పు వెలువడేంత వరకు ఏసీబీ అటాచ్‌ చేసిన ఆస్తులను విక్రయించకునేందుకు వీలు లేకపోయినా నిందితులు, వారి కుటుంబాలే అనుభవిస్తున్నాయి. మరోవైపు కోర్టులో శిక్ష ఖరారైనా గరిష్టంగా మూడేళ్ల శిక్ష, కొద్ది మొత్తం జరిమానా విధించటంతో అవినీతి అధికారుల్లో భయం ఉండటం లేదు. దీంతో అధికారులు తమ అవినీతి పరంపరను అలాగే కొనసాగిస్తున్నారు. అయితే ఇలాంటివి ఇక మీదట చెల్లుబాటు కాబోవని ఏసీబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అక్రమాస్తుల కేసు నమోదు చేసిన నెల రోజుల్లోగా.. వారి ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనున్నాయని అంటున్నారు. నేరం రుజువైతే ఆస్తులు శాశ్వతంగా ప్రభుత్వం ఖజానాకే పరిమితం కానున్నాయి. ఒకవేళ నేరం రుజువు కాకపోతే ఐదుశాతం వడ్డీతో ఆస్తులను బాధితులకు అందించనుంది ప్రభుత్వం. స్పెషల్‌ కోర్ట్‌ యాక్ట్‌ 2016 అమల్లోకి రానుడటంతో ఇక మీదటనైనా అవినీతి అధికారుల్లో మార్పు వస్తుందేమో చూడాలి. 

 

07:49 - June 14, 2018

చిత్తూరు : టీటీడీ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా ఆరోపణలు చేసిన తిరుమల శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. శ్రీవారి ఆభరణాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఉన్నాయంటూ విజయసాయిరెడ్డి, శ్రీవారి పోటులో తవ్వకాలు జరిపి విలువైన సంపద దోచుకున్నారంటూ రమణదీక్షితులు ఆరోపించారు.ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన టీటీడీ పాలక మండలి వీరిద్దరిపై చట్టపరమైన చర్యలకు నోటీసులు జారీ చేసింది. టీటీడీ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
రమణదీక్షితులు, విజయసాయిరెడ్డికి టీటీడీ నోటీసులు 
తిరుమల తిరుపతి దేవస్థానాలపై ఆరోపణలు చేసిన శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారంపై  టీటీడీ పాలక మండలి తీవ్రంగా స్పందించింది. శ్రీవారి ఆరభరణాలు దోచుకున్నారని, విలువైన వజ్రాలు విదేశాలకు తరలిపోయాయని, స్వామికి నిత్యం జరిగే కైంకర్యాల్లో లోపాలున్నాయని విజయసాయిరెడ్డి, రమణదీక్షితులు చేసిన ఆరోపణలతో టీటీడీ పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగిందని భావించిన పాలక మండలి వీరికి నోటీసులు జారీ చేసింది. 
టీటీడీపై రమణదీక్షితులు ఆరోపణలు 
టీటీడీ ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణదీక్షితులకు 65 ఏళ్ల వయసు నిండటంతో పదవీ విరమణ కల్పించారు. ఆ తర్వాత నుంచి రమణదీక్షితులు టీటీడీపై ఆరోపణలు చేయడం ప్రారంభించారు. చెన్నైలో మొదలుపెట్టి తిరుమల, తిరుపతి, హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వరకు పాలక మండలి సభ్యులతోపాటు అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు. శ్రీవారి పోటులో తవ్వకాలు జరిపి విలువైన సంపద దోచుకున్నారని ఆరోపణలు చేశారు. శ్రీవారి సొమ్ములకు  లెక్కలులేవని, మణులు, మాణిక్యాలు, రవ్వలు, రత్నాలు, వజ్రాలు పొదిగిన విలువైన ఆభరణాలు మాయమయ్యాయన్న వాదాన్ని లేవనెత్తారు. వజ్రాలు విదేశాలకు తరలిపోయాయని ఆరోపించారు. దీనిపై టీటీడీ వివరణ  ఇచ్చినా.. తన ఆరోపణల పర్వాన్ని ఆపకపోగా,...మరింత విస్తృతం చేశారు. ప్రధాన అర్చకుడి పదవిలో ఉన్న సమయంలో ఈ అంశాలపై నోరు మెదపని రమణదీక్షితులు.. పదవి నుంచి తొలగించిన తర్వాతే మాట్లాడటంలోని ఔచిత్యాన్ని చాలామంది ప్రశ్నించారు. అయినా రమణదీక్షితుల్లో మార్పు రాకపోవడంతో ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఆ ప్రకారం ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. 
దీక్షితులను వెనకేసుకొచ్చిన వైసీపీ 
మరోవైపు కారణాలు ఏవైనా కానీ... రమణదీక్షితులు వివాదాన్ని వైసీపీ అందిపుచ్చుకొంది.  దీక్షితులు తరుపున వకాల్తా పుచ్చుకొన్నట్టు ఆయన్న వెనకేసుకు రావాడంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై ఆరోపణలు చేశారు. శ్రీవారి ఆభరణాలు చంద్రబాబు నివాసంలో ఉన్నాయని, కొన్నింటిని విదేశాలకు తరలించి సొమ్ము చేసుకొన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నం, ఢిల్లీలో ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం ప్రభుత్వం వరకు వెళ్లింది. దీక్షితులు, విజయసాయిరెడ్డి వ్యవహారంపై టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, ఈవో అశోక్‌ కుమార్‌ సింఘాల్‌తో సమీక్షించి.. దేవస్థానాల పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్యలకు తీర్మానించి... ఇప్పుడు విజయసాయిరెడ్డి, రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేసింది. టీటీడీ పరువు, ప్రతిష్ఠతలకు భంగం కలిగించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చింది. 
టీటీడీ నుంచి నోటీసులు అందలేదన్న విజయసాయిరెడ్డి 
టీటీడీ జారీ చేసిన నోటీసులపై విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. నోటీసులు ఇంతవరకు  తనకు అందలేదన్నారు. సమాధానం ఇవ్వాలా... లేదా.. అన్న అంశాన్ని నోటీసులు అందిన తర్వాత పరిశీలిస్తానని చెప్పారు. ఏపీ  దేవాదాయ, ధర్మాదాయ చట్టం పరిధిలోకి వచ్చే టీటీడీకి నోటీసులు ఇచ్చే అధికారం లేదన్న వాదాన్ని వినిపించారు. సీఆర్‌పీసీ కింది దర్యాప్తు అధికారికే నోటీసులు ఇచ్చే అధికారం ఉంటుందున్నారు. శ్రీవారి ఆభరణాలు దోపిడీకి గురయ్యాయన్న తన ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని మరోసారి డిమాండ్‌ చేశారు. నోటీసులకు విజయసాయిరెడ్డి, రమణదీక్షితులు ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని టీటీడీ పాలక మండలి ప్రతిపాదించింది. 
 

 

07:39 - June 14, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణి స్టీల్స్‌.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ఇక కలేనా..? దీనికి అవుననే సమాధానమే వస్తోంది. ఈ రెండు కర్మాగారాలు ఏర్పాటు చేయడం అసాధ్యమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఇదేదో నోటిమాటగా కాకుండా.. ఏకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ రూపంలో వెల్లడించింది. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లో.. నేతలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు 
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి
కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపిస్తూనే ఉంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నిరుద్యోగులకు వరం కాగల.. బ్రాహ్మణి స్టీల్స్‌, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఇంతకాలం తాత్సారం చేస్తూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడిక ఆ కర్మాగారాలను ఏర్పాటు చేయలేమని తెగేసి చెప్పింది. ఈ అంశంపై.. తెలంగాణ కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకరరెడ్డి పిటిషన్‌ వేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. అందులో ఏపీ, తెలంగాణల్లో స్టీల్‌ ఫ్యాక్టరీల నిర్మాణం సాధ్యం కాదనే నివేదికలు వచ్చాయని వెల్లడించింది. కడపలో బ్రాహ్మణి స్టీల్స్‌ సాధ్యాసాధ్యాలపై మెకాన్‌ సంస్థ పరిశీలిస్తోందని, నివేదిక అందాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడించింది. కడపతో పాటు, బయ్యారం వ్యవహారం కూడా టాస్క్‌ ఫోర్స్‌ పరిధిలో ఉందని.. ఈ సమయంలో విభజన హామీలపై పిటిషన్‌ విచారణకు అర్హం కాదంటూ కేంద్రం అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. 
ఢిల్లీలో టాస్క్‌ఫోర్స్‌ భేటీ 
నిజానికి కేంద్ర ఉక్కు గనుల శాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో టాస్క్‌ఫోర్స్‌ భేటీ జరిగింది. బ్రాహ్మణి, బయ్యారం వ్యవహారాన్ని ఇందులో ఓ కొలిక్కి తెస్తారని... భేటీకి హాజరైన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు భావించారు. అయితే.. తాను కొత్తగా బాధ్యతలు స్వీకరించినందున.. స్టీల్‌ ప్లాంట్‌లకు చెందిన సమగ్ర సమాచారం కోసమే సమావేశం నిర్వహించానని, కేంద్ర గనుల శాఖ సంయుక్త కార్యదర్శి చెప్పడంతో.. అధికారులు విస్తుపోయారు. దీనిపై తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. బ్రాహ్మణి స్టీల్స్‌ విషయంలో.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ, సీఎంరమేశ్‌.. ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. 
బ్రాహ్మణి స్టీల్స్‌ ఏర్పాటు విషయంలో కేంద్రం ఉదాసీనత 
విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. ఇతర వివిధ అంశాల తరహాలోనే.. కేంద్ర ప్రభుత్వం బ్రాహ్మణి స్టీల్స్‌ ఏర్పాటు విషయంలోనూ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఈ ప్రాంత నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణను రూపొందించకుండా.. సమావేశాల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడుతున్నారు. ఈనేపథ్యంలోనే.. స్థానిక అన్ని పక్షాలను కలుపుకుని ఉద్యమాన్ని నిర్మించాలని పాలక పక్షం నాయకులు యోచిస్తున్నారు. 

 

07:32 - June 14, 2018

సంగారెడ్డి : మిషన్‌ భగీరథలో భాగంగా ఇంటింటికీ తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో మిషన్‌ భగీరథ రిజర్వాయర్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.  
39 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం 
సంగారెడ్డి జిల్లాలో నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. రామచంద్రాపురం, పఠాన్‌చెరు, బొల్లారం ప్రాంతాల్లో దాదాపు 39 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 
రూ.2 కోట్లతో చేపట్టిన 33/11కేవీ సబ్‌ స్టేషన్‌ ప్రారంభించిన మంత్రి
రామచంద్రాపురం కొల్లూరులో సుమారు 2 కోట్లతో చేపట్టిన 33/11కేవీ సబ్‌ స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు. అలాగే 2.75 కోట్లతో చేపట్టిన సర్వీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కృష్ణారెడ్డిపేటలో 2.75  కోట్లతో చేపట్టిన సబ్‌ స్టేషన్‌ ప్రారంభించారు. జిన్నారం మండలం బొల్లారంలో మిషన్ భగీరథ రిజర్వాయర్‌తో పాటు బొల్లారంలో 18 కోట్లతో చేపట్టిన సర్వీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు మంత్రి హరీశ్‌రావు. తెలంగాణలో 60 ఏళ్లుగా మంచినీటి కోసం బాధ పడ్డామని... మిషన్‌ భగీరథతో ఆ బాధ తీరిపోతుందన్నారు. మిషన్‌ భగీరథలో భాగంగా ప్రతి ఇంటికీ తాగునీరందిస్తామన్నారు.  
విద్యుత్‌ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ : హరీష్ రావు 
విద్యుత్‌ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే ప్రథమ రాష్ట్రంగా నిలిచిందన్నారు మంత్రి హరీశ్‌రావు. ఎన్నడూ లేని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తోందని తెలిపారు. వచ్చే నెల నుండి గ్రామాల్లో కంటి పరీక్షలు నిర్వహించబోతున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కోటి మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తామన్నారు.

 

07:26 - June 14, 2018

రాజన్న సిరిసిల్ల : సమగ్ర సాగునీటి విధానం, రైతుబంధు, రైతు బీమా పథకాల అమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మారుస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చర్యలు తీసుకొంటున్నామని అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా సర్దార్‌పూర్‌లో వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌.. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని హామీ ఇచ్చారు. 
సర్దార్‌పూర్‌లో వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన 
రాజన్నసిరిసిల్ల జిల్లా సర్దార్‌పూర్‌లో వ్యవసాయ కళాశాలకు మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
శరవేగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు : కేటీఆర్ 
వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన అనంతరం సర్దార్‌పూర్‌ బహిరంగ సభలో ప్రసంగించిన మంత్రి కేటీఆర్... రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను వివరించారు. తెలంగాణలో ప్రతి ఎకరం భూమికి సాగునీరు అందించేందుకు సమగ్ర సాగునీటిపారుదల విధానాన్ని తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఆరు నెలల్లో రాజన్నసిరిసిల్ల జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతు బీమా పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమలు చేబోతున్నామని చెప్పారు. 
ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు : పోచారం 
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. ప్రతి నియోజకవర్గంలో ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. రైతు బీమా పథకంపై అన్నదాతలందరికీ అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రులు ఆదేశించారు. 

 

07:18 - June 14, 2018

గుంటూరు : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు మంత్రి నారాలోకేష్‌. రాష్ట్రంలో 58 లక్షల మందికి  పెన్షన్లను ఇస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన వల్ల అప్పులపాలైనా రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని లోకేశ్‌ అన్నారు. అనంతపురం జిల్లా మడకశిరలో జరిగిన టీడీపీ సభలో ఆయన మాట్లాడారు. దాదాపు 25వేల కోట్లతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యంత్రి అమలు చేస్తున్నారని లోకేశ్‌ తెలిపారు. 

 

07:16 - June 14, 2018

గుంటూరు : వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన ఐదు స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే  టీడీపీయే గెలుస్తుందన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో తిరుపతి పార్లమెంట్ స్థాయి నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చర్చించారు. కార్యకర్తలను సంతృప్తి పరిచే విధంగా కార్యక్రమాలను నిర్వహించాలని నేతలను ఆదేశించారు. గ్రామ దర్శిని, గ్రామ సభలలో ఎంపీలు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్‌చార్జీలు పాల్గొనాలని సూచించారు. రాజీనామాలపై వైసీపీ ఎంపీలు బీజేపీతో కలిసి డ్రామాలు ఆడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఓడిపోతామనే భయంతోనే రాజీనామాలు ఆమోదింప చేసుకోవట్లేదన్నారు. 

 

07:13 - June 14, 2018

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో కేసీఆర్‌ హస్తినబాట సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అధికారిక పర్యటనే అయినా... రాజకీయంగా కూడా ఈ పర్యటనకు ప్రాధాన్యత ఉంటుందన్న సంకేతాలను పార్టీ వర్గాలు ఇస్తున్నాయి. నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనేందుకు కేసీఆర్‌ వెళ్తున్నా... ఫెడరల్‌ ఫ్రంట్‌పై కూడా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రేపు ప్రధానితో కేసీఆర్‌ భేటీ ఏం చర్చిస్తారన్న ఉత్కంఠకు గురిచేస్తోంది.
బీజేపీ, కాంగ్రెస్‌ యేతర సీఎంతో కేసీఆర్‌ భేటీ
తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన  రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.  ఇవాళ ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఆయన తిరుగుపయనం కానున్నారు. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేందుకు సిద్ధ మవుతున్న కేసీఆర్‌... హస్తినకు వెళ్తుండడం ఆసక్తి రేపుతోంది. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో ఇప్పటికే పలువురు ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుసుకున్న కేసీఆర్‌.... ఈ  విడత ఢిల్లీ టూర్‌లో కూడా ఫ్రంట్‌పై చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. నీతి అయోగ్‌ సమావేశానికి అన్నిరాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉండడంతో.... కాంగ్రెస్‌, బీజేపీ యేతర రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ చర్చలు జరిపే అవకాశముంది. కర్నాటక ఎన్నికల తర్వాత కాస్త సైలెంట్‌గా ఉన్నా... ఈ విడత ఢిల్లీ పర్యటనతో మరోసారి జాతీయ రాజకీయాల్లో వేడి పుట్టించే చాన్స్‌ ఉంది.
రక్షణశాఖ తీరుపై కేసీఆర్‌ గుర్రు
ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రకటన తర్వాత కేసీఆర్‌ ఇటీవలే ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ప్రధాని మాత్రం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో... కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీకావాల్సి వచ్చింది. పునర్విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో... ఆ హామీల కోసం కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు గులాబీ దళపతి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఎయిమ్స్‌ లాంటి సంస్థల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా.. అది ఆచరణకు నోచుకోకపోవడంతో... సీఎం కేంద్రంపై గుర్రుగా ఉన్నారు.  కొత్త సచివాలయ నిర్మాణానికి రక్షణశాఖ నుంచి భూ కేటాయింపు జరపాలని కోరినా కేంద్రం స్పందించకపోవడంపై సీరియస్‌గా ఉన్నారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అమలు చేసిన రైతుబంధు, రైతు బీమాలాంటి పథకాలను జాతీయ స్థాయిలో అమలు చేయాలన్న డిమాండ్‌ను కేసీఆర్‌ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
కేంద్రాన్ని ఇరకాటంలో పడవేసేందుకు కేసీఆర్‌ ప్లాన్‌
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలను తెరపైకి తీసుకొచ్చి.. కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ స్థాయిలో ఇరకాటంలో పడవేసేందుకు కేసీఆర్‌ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. రిజర్వేషన్లపై రాష్ట్రాలకే హక్కులు ఉండాలనన డిమాండ్‌ను ఆయన వినిపించే అవకాశముంది. మిషన్‌భగీరథతోపాటు సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని  మరోసారి కేంద్రంముందు తమ డిమాండ్‌ను ఉంచనున్నట్టు తెలుస్తోంది.

 

07:06 - June 14, 2018

సంగారెడ్డి : తెలంగాణలో సంచలనం కలగిస్తున్న చెడ్డీగ్యాంగ్‌ కదలికలు ఇప్పుడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కనిపిస్తున్నాయి.  రాత్రి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో పలు అపార్ట్‌మెంట్లలో చెడ్డీగ్యాంగ్‌ సంచరించిన ఆధారాలు లభించాయి. చెడ్డీగ్యాంగ్‌కు సంబంధించిన దృశ్యాలు అపార్ట్‌మెంట్లలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చెడ్డీగ్యాంగ్‌ సంచరిస్తోందన్న భయంతో... జనాలు నిద్రహారాలుమాని కాపలా కాస్తున్నారు. కర్రలు పట్టుకుని కాలనీవాసులు జాగారం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

Don't Miss